ప్రేమకు సహాయం...( పూర్తి నవల)
ప్రేమకు సహాయం ( పూర్తి నవల ) ప్రేమనేది పెళ్ళి తరువాత భార్య దగ్గరే జరగాలి. పెళ్ళికి ముందు ఒకరికి ఏర్పడితే...అది పాపం తోనే చేరుతుంది! పాపాత్ములకు మాత్రమే ప్రేమ వస్తుంది. వాళ్ళు…వాళ్ళు కష్టపడుతూ, తమ కుటుంబాన్ని కష్టపెట్టి, తమ పిల్లలనూ కష్టపెడతారు. కని-పెంచి మనల్ని మనిషిగా తీర్చి దిద్దిన వాళ్ళకు ఎదురుగా పెళ్ళి విషయంలో నిర్ణయం తీసుకోవటం తప్పే. పెళ్ళి అనేది మాత్రం అందరికీ ఇష్టంగానే జరగాలి. “అలాగైతే ప్రేమ గురించిన మీ ఫైనల్ సలహా?” “పెళ్ళి తరువాత వస్తే అది తేనె. పెళ్ళికి ముందు వస్తే అది సందేహం లేదు...విషం” ‘ప్రేమించారు కాబట్టి, మా ప్రేమకు మీ సహాయం దొరుకుతుందా సార్...?” “ఖచ్చితంగా...! ప్రపంచంలో పలు జాతులు ఉన్నట్టుగానే -- ప్రేమించుకుంటున్న వారు, ప్రేమించుకున్న వారూ ఒక జాతి. మనమందరం ఒక జాతి. ఎలా సహాయం చేయకుండా ఉంటాను?” ఆమె అడిగినట్లే అతను ఆమె ప్రేమకు సహాయం చేశాడా? ఎటువంటి సహాయం