పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

విచిత్ర మనుషులు…(పూర్తి నవల)

                                                                        విచిత్ర మనుషులు                                                                                                                                         (పూర్తి నవల) ఒక నిజమైన సంఘటనే ఈ నవలకు పునాది. నాగరాజు లాంటి స్వార్ధపరుడైన మగవాడి దగ్గర తెలిసో , తెలియకో పెళ్ళి బంధం ద్వారా చిక్కుకున్న ఒక స్త్రీ కథ ఇది. నిజానికి అతను ఆమెను కూడా తన జీవితం నుండి తరిమేశాడు. కానీ , కధలో ముగింపును కొంచంగా మార్చి , నేను వాడి కథను ముగించాను. పెళ్ళి జీవితం అనేది కొందరికి రెడ్ కార్పెట్ పరచి స్వాగతించే బృందావనం. కొందరికి బురద నీటి ఊబిలో కాలు పెట్టిన పరిస్థితి. ********************************* **************** PART-1 ********** ******************************** కొట్టి పడేసినట్లు నిద్రపోతోంది మహేశ్వరి. చుట్టూ వస్తువులు , కట్టి పడేసిన సంచులు , చుట్టిపెట్టిన కొత్త పరుపులు. చుట్టూ తిరుగుతున్న బంధువుల గుంపు , ఇన్నిటికి మధ్యలో అలసిపోయి నిద్రపోతున్న ఆమెను చూసి కొందరు బంధువులు వెక్కిరింపు నవ్వుతో ఆమెను చూశారు. ఒక ముసలి అత్త ఆమెను చిన్నగా చేత్తో