పోస్ట్‌లు

ఏప్రిల్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎక్కడ నా ప్రాణం...(నవల)

                                                                             ఎక్కడ నా ప్రాణం                                                                                                                                                                 (నవల) దివ్యాకి రాత్రంతా నిద్ర పట్టలేదు . ఆందోళన ఆమె మనసును చెదలా తింటున్నది . దొర్లి దొర్లి పడుకుంటూ , ఆలొచిస్తూ ఉన్నది . రేపు ఆమె ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్జున్ అమెరికా నుండి వచ్చేస్తాడు . అతను వస్తున్నాడన్న సంతోషం కూడా ఆమె మనసులో ఇమడటం లేదు ? దీనికి కారణం ఎవరో కాదు ? ఆమె తండ్రి డాక్టర్ . విఠల్ రావ్ ! ఆయన క్రితం రాత్రి నుండి కనబడటం లేదు . ఏం చేయాలో తెలియని దివ్యాకి తండ్రి ముందు రొజు కారణమే లేకుండా చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి .   “ చెడిపోయే వాడే చెడు ఆలొచిస్తాడు . అపూర్వమైన విషయాలన్నీ అపూర్వమైన మనుష్యులకే దొరుకుతుంది . అందరికీ దొరకదు . దొరికితే దాన్ని తప్పైన విషయంకోసం వాడటం మొదలుపెడతారు . కొన్ని రహస్యాలు రహస్యాలుగానే ఉండాలి . అలా జరగలేదనుకో -- దాని వలన ఊర