ప్రేమకు సహాయం...( పూర్తి నవల)

 

                                                                   ప్రేమకు సహాయం                                                                                                                                                       (పూర్తి నవల)

ప్రేమనేది పెళ్ళి తరువాత భార్య దగ్గరే జరగాలి.

పెళ్ళికి ముందు ఒకరికి ఏర్పడితే...అది పాపం తోనే చేరుతుంది! పాపాత్ములకు మాత్రమే ప్రేమ వస్తుంది. వాళ్ళు…వాళ్ళు కష్టపడుతూ, తమ కుటుంబాన్ని కష్టపెట్టి, తమ పిల్లలనూ కష్టపెడతారు. కని-పెంచి మనల్ని మనిషిగా తీర్చి దిద్దిన వాళ్ళకు ఎదురుగా పెళ్ళి విషయంలో నిర్ణయం తీసుకోవటం తప్పే. పెళ్ళి అనేది మాత్రం అందరికీ ఇష్టంగానే జరగాలి.

“అలాగైతే ప్రేమ గురించిన మీ ఫైనల్ సలహా?”

“పెళ్ళి తరువాత వస్తే అది తేనె. పెళ్ళికి ముందు వస్తే అది సందేహం  లేదు...విషం”

‘ప్రేమించారు కాబట్టి, మా ప్రేమకు మీ సహాయం దొరుకుతుందా సార్...?”

“ఖచ్చితంగా...! ప్రపంచంలో పలు జాతులు ఉన్నట్టుగానే -- ప్రేమించుకుంటున్న వారు, ప్రేమించుకున్న వారూ ఒక జాతి. మనమందరం ఒక జాతి. ఎలా సహాయం చేయకుండా ఉంటాను?”

ఆమె అడిగినట్లే అతను ఆమె ప్రేమకు సహాయం చేశాడా? ఎటువంటి సహాయం చేశాడు? ప్రేమించి పెళ్ళి చేసుకున్న అతను ప్రేమ గురించి అంత ద్వేషంగా ఎందుకు మాట్లాడాదు? అలాంటి అతను ఆమెకు సహాయం చేయటం!......జరిగింది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ నవల చదవండి. నిజంగానే ప్రేమ పెళ్ళి తరువాత వస్తే తేనె, పెళ్ళికి ముందు వస్తే అది విషం...దీనితో మీరు ఏకీభవిస్తారా? 

*************************************************************************************************

దర్షిణి స్కూలుకు బయలుదేరటానికి రెడీ అయ్యింది. ఐదేళ్ళ వయసుతో ఒక పూల మొక్కకు కాళ్ళూ, చేతులూ పెరిగినట్లు ఉన్నది. తనకు తెలిసినట్లు దానికి తల దువ్వి, మొహానికి పౌడర్ అద్ది, ఎర్రటి తిలకం దిద్ది, తరువాత స్కూల్ యూనీఫారం వేసి రెండడుగులు వెనక్కు వెళ్ళి నిలబడి కూతురి అందం చూశాడు ముకుంద రావ్.

చాలు డాడీ, రోజూ నన్ను చూస్తూనే ఉన్నావు కదా అంటూ ముద్దుగా వెక్కిరించింది దర్షిణి.

బొట్టు సరిగ్గా ఉందా నని చూసానమ్మా. తరువాత తల పాపిడి నేరుగా ఉందా నని చూశాను...

నువ్వు చూసి చూసి జాగ్రత్తగా తల దువ్వినా, నీకు వంకరగానే వస్తుంది...అంటూ ఒకలాగా చెయ్యి ఆడించి ఆమె చెప్పినప్పుడు, అది అతనికి చాలా ఇష్టంగా ఉన్నది.

ఎందుకమ్మా అలా?”

నువ్వు మగాడివి. అందుకని అలాగే వస్తుంది...మా క్లాస్ టీచర్ చెప్పింది...

అబ్బో! అవును, నువ్వు నీ టీచర్ దగ్గర, నేను తలంతా దువ్వుతున్నానని చెప్తావా ఏమిటి?”

అవును. ఎందుకు నీ తల పాపిడి మాత్రం వంకరగా ఉంది? బొట్టు నుదుటి మీద ఎక్కడో ఉంది?’ అని టీచర్ అడిగినప్పుడు, నేను చెప్పకుండా ఏం చేయను?”

దర్షిణి మళ్ళీ ఒకలాగా చెయ్యి ఊపుతూ అడిగేటప్పటికి, అతనికి దాన్ని ఎంజాయ్ చేయాలనే ఉన్నది. అదే సమయం రెండు కళ్ళూ నీటితో తడిసాయి. బయట ఆటో అతను వచ్చి నిలబడి శబ్ధం చేస్తున్నాడు.

డాడీ...టాటా అని వీపుకు పుస్తకాల మూటను ఎక్కించుకుని పరిగెత్తింది దర్షిణి.

ఆటోలో ఇంతకు ముందే ఐదారుగురు పిల్లలు. దాంటోకి తోసుకుంటూ లోపలకు దూరింది.

దృశ్యం ముకుంద రావ్ ను చికాకు పరిచింది.

రేపట్నుంచి మనమే దర్షిణిని స్కూలుకు తీసుకు వెళ్ళి వదిలిపెట్టి రావాలిఅనే ఒక ఆలొచన అతి వేగంగా అతని లోపల లేచింది. 

జాగ్రత్తయ్యా...మెళ్ళగా వెళ్ళు. అందులోనూ అందరూ పిల్లలు... అతను చెప్ప చెప్ప, ఆటో వెళ్ళిపోయింది.

చూసుకుంటూ వచ్చింది మీనాక్షి.

ఆమె ముకుంద రావ్ ఇంటి వంట మనిషి. ప్రొద్దున తొమ్మిదింటికి వచ్చి, వంట చేసి పెట్టి, ఇంటిని శుభ్రపరిచి, పెన్నెండు గంటల సమయంలో ఇంటికి తాళం వేసి,  తాళం చెవి తీసుకు వెళ్ళిపోతుంది. ఆఫీసుకు వెళ్ళే ముకుంద రావ్ ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చి భోజనం చేసి, రెండింటికి తిరిగి ఆఫీసుకు వెళ్ళిపోతాడు.

సాయంత్రం ఆరుగంటలకు అతను మళ్ళీ ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి వాకిట్లో కూర్చుని హోమ్ వర్క్ చేస్తూ కూర్చోనుంటుంది దర్షిణి. తండ్రిని చూసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చి అతని గొంతుకను చుట్టుకుని కావలించుకుంటుంది.

ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అది చూసి ఒక నిట్టూర్పు వచ్చి ఆగిపోతుంది. మీనాక్షి కి మాత్రం నిట్టూర్పు ఒక తుఫాన గాలిలా వీస్తుంది.

ఏం తమ్ముడూ...ఎందుకింత పట్టుదల? మీకేమన్నా వయసైపోయిందా. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటే దర్షిణికి అమ్మ దొరికినట్లు అవుతుంది, నా వంట నుండి మీకు విముక్తి కలుగుతుంది?” అని చాలాసార్లు అడిగింది.

రోజూ అదే ప్రశ్నను కళ్ళల్లో వేసుకుంటూ అతన్ని చూసింది. అతనికా తెలియదు...?

ఆమె చూపులను తప్పించుకున్న వాడిలాగా ఇంటిలోపలకు వెళ్లాడు. ఆఫీసుకు వెళ్లడానికి తయారవటం మొదలుపెట్టాడు.

మగవారి ప్రతి రోజు అవస్త, గడ్డం గీసుకోవడం. స్వయంగా చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె ఫ్రిజ్ తెరిచి కూరగాయలను తీసి కడిగి - తరగటం ప్రారంభించింది. మధ్య మధ్య అతన్ని గమనించింది. అలాగే గోడకు ఫోటోలాగా వేలాడుతున్న సంధ్యని చూసింది.

సంధ్య ఫోటోకి  'ప్లాస్టిక్' పూలమాల వేయబడి ఉంది. చిన్న బల్బు ఒకటి ఆగకుండా వెలుగుతూనే ఉంది. చాలా రోజులుగానే మీనాక్షికి సంధ్య ఎలా చనిపోయిందో అనేది తెలుసుకోవాలని ఆశ.

రోజు అడిగేయాలనే నిర్ణయానికి వచ్చి, అడిగేసింది. అతనూ గడ్డం గీసుకోవటం పూర్తి చేసుకున్నాడు.

టవల్ తో మొహాన్ని తుడుచుకుంటూనే మీనాక్షి ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీని కొంచం లాగి వేసుకుని కూర్చున్నాడు. అతనేదో పెద్దగా చెప్పబోతాడని ఆమె దగ్గర ఒక ఆరాటం ఏర్పడింది.

జాండీస్...అదే పచ్చ కామెర్లు వచ్చింది మీనాక్షక్కా. సంధ్యను కాపాడలేక పోయాము. అప్పుడు దర్షిణికి రెండేళ్ళు అని క్లుప్తంగా చెప్పాడు.

కామెర్లు అనేది సీరియస్ అయిన వ్యాధే. కానీ, వ్యాధి నుండి కాపాడటానికి ఇప్పుడు ఎన్నో రకాల మందులు వచ్చాయే తమ్ముడూ

కథ ముగియాలని విధి ఉంటే....ఎన్ని రకాల మందులు వాడినా ప్రయోజనం లేదు. సంధ్య విషయంలోనూ అంతే. కామెర్లకు వేసిన టీకా మారిపోయింది. ఎక్కడ చెప్పుకుని ఏడవను? ఏడ్చినా వెళ్ళిపోయింది తిరిగి వస్తుందా ఏమిటి...?”   

అరె భగవంతుడా...సరే తమ్ముడూ మీ నాన్నా-అమ్మ, ఆవిడ నాన్నా-అమ్మ ఎవరూ లేరా? ఎందుకు ఇలా ఒంటరిగా పిల్లతో కష్టపడుతూ...?”

నేను ప్రేమ వివాహం చేసుకున్నానక్కా. పెద్దవాళ్ళను ఎదిరించి పెళ్ళిచేసుకున్నాం

అనుకున్నా...అలాగే ఉంటుందని. పోనివ్వండి. దర్షిణిని చూస్తే ఎటువంటి కోతి మనసు ఉన్న వాళ్ళ పోకడ కూడా మారుతుందే...మీ అమ్మా-నాన్నా మాత్రం మారలేదా?”

ప్రశ్నకు చిన్న నవ్వును సమాధానంగా ఉంచేసి ఇంతవరకు మారలేదు. ఇక మారుతారా తెలియదు. సరి. నేను స్నానం చేసి బయలుదేరతాను. మీరు వంట ముగించుకుని వెళ్ళండి. వెళ్ళే దారిలో మర్చిపోకుండా దర్షిణికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళండి అన్నాడు.

తరువాతి పది నిమిషాలలో గబగబ స్నానం చేసి, డ్రస్సుమార్చుకుని...గొంతుకు ఒక టైతగిలించుకుని, ఒక బ్రీఫ్ కేసుతో అతను బయలుదేరిన విధం ఆమెను ఆశ్చర్యపరిచింది.

వయసుకు వయసు, సంపదకు సంపద. జీవితాన్ని దాని దారిలొనే అంగీకరించే పురుషత్వం

అమ్మాయికి ఇలాంటి ఒకడ్ని ఇష్టం లేకుండా పోతుంది.

తమ్ముడూ... అని పిలిచింది. తిరిగాడు.

ఆశగా పెళ్ళి చేసుకున్నది అర్ధాయుస్సు తో వెళ్ళిపోతే ఏం తమ్ముడూ! మంచి అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చే?”

ఎందుకు... జీవితంలో నాకేం కష్టం?”

కష్టం మీకు లేకుండా ఉండొచ్చు. దర్షిణికి ఒక అమ్మ ఉంటే ఇంకా చాలా బాగుంటుందే!

దాని గురించి దర్షిణినే బాధ పడటం లేదు మీనాక్షక్కా. పెళ్ళాం చచ్చిపోతే...కొత్త పెళ్ళి కొడుకుఅనే సామెతను మార్చాలనుకుంటున్నాను. నా సంధ్య శరీరకంగా నాతో లేదు. కానీ, ఆమె గాలిగా నన్నే చుట్టి చుట్టి వస్తోంది. నా కూతురుకీ అండగా ఉంది. అది చాలు. దయచేసి ఇకమీదట దీని గురించి మాట్లాడకండి. మాట్లాడేటట్లైతే ఇక పనిలోకి రాకండిఅని కొంచం కఠువుగా చెప్పేసి, ఉద్యోగానికి బయలుదేరి వెళ్లాడు.

మీనాక్షికి అతని మీద గౌరవం ఎక్కువయ్యింది!

**********************************************PART-2********************************************

క్లాసు మొదలైయ్యింది. పాఠం చెప్పటం ప్రారంభించింది నందిని.

పిల్లలను గమనించేటట్టు చేసి పాఠం చెప్పటం అంత సులభమైన పనికాదు. కానీ, నందినికి అది  చాలా ఈజీగా ఉన్నది. కొత్తగా వచ్చింది.

ముందు వరుసలోనే కూర్చోనుంది దర్షిణి. నందిని పాఠం చెప్పటాన్ని ఎక్కువగా  ఇష్టపడుతుంది. ఆమె అడిగే ప్రశ్నలన్నిటికీ టక్, టక్ మని జవాబిచ్చి, నందినిని ఆశ్చర్యపరిచింది.

దర్షిణి! నువ్వొక బ్రిల్లియంట్ స్టూడెంట్’. మొత్త హోమ్ వర్కునూ కరెక్టుగా చేస్తున్నావు. నీకు నేను రోజు బహుమతి ఇవ్వబోతున్నా... అని ఒక స్కెచ్ పెన్నును బహుమతిగా ఇచ్చింది. అలాగే దర్షిణి నుదుటి మీద ముద్దు పెట్టింది.

దర్షిణికి ఆమె ముద్దు  ఆనందానిచ్చింది.

దర్షిణి...వచ్చే పేరంట్స్ మీటింగ్అప్పుడు, మీ అమ్మ దగ్గర నీ గురించి ఒక రహస్యం చెప్పబోతాను అన్నది.

నాకు అమ్మ లేదు మిస్! నాన్న మాత్రమే... అన్నది దర్షిణి.

...వెరి సారీ అనూ...అవును మీ నాన్న ఏం చేస్తారు?”

మా నాన్న బ్యాంకులో ఆఫీసర్ గా ఉన్నారు మిస్

పేరంట్స్ మీటింగుకు ఆయన మాత్రమే వస్తారా? లేక నీ బామ్మ-తాత అంటూ ఎవరైనా వస్తారా?”

నాన్న మాత్రమే వస్తారు. బామ్మా-తాతయ్యలను నేను ఇంతవరకు చూడ లేదు

! అయితే ఇంట్లో ఎవరు వంట చేస్తారు?”

మీనాక్షి అని ఒక ఆంటీ

--- దర్షిణి చెప్పేటప్పుడే, ‘టిఫెన్ బాక్స్తో క్లాసు వాకిట్లోకి వచ్చి నిలబడింది మీనాక్షి.

అదిగో ఆంటీవచ్చేసింది... దర్షిణి చెయ్యి చూపించగా, నందిని కూడా చూసింది.

మీనాక్షి కూడా నవ్వుతూనే మిగల్చ కుండా తినేయాలి అని చెబుతూ టిఫెన్ బాక్స్ ను పెట్టి వెళ్ళిపోయింది. 

అవును, ఆంటీమీకు బంధువా?”

అదంతా నాకు తెలియదు. కానీ శని, ఆదివారాలలో పని లోకి రాదు

! అప్పుడైతే ఈమె వంటమనిషే అయ్యుంటుంది

---అంటూ దర్షిణి బుగ్గలపై ముద్దుగా కొట్టింది. లంచ్ బెల్లూ కొట్టింది.

గూడు తెరిచిన పక్షులలాగా, పిల్లలు కూర్చున్న చోటు నుండి పరిగెత్తటం మొదలుపెట్టారు. కానీ, దర్షిణి దగ్గర అలాంటి పరుగు లేదు. చాలా నిదానంగా, “మిస్! నేను లంచ్ కు వెళ్ళనా?” అని అడిగింది.

దర్షిణి వెళ్ళిన వెంటనే నందిని మనసు బాధతో ఒక విధమైన తిప్పలు పడ్డది. 

నందిని మ్యాడం...లంచ్ కు వెళ్ళలేదా?” అంటూ ఒక గొంతు వినబడింది. తిరిగి చూసింది. పక్క క్లాసు టీచర్ లయా నే అడిగింది.

నందిని తన లంచ్ కవరుతో లయా తో కలిసి వెళ్ళటం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె దగ్గర లోతైన మౌనం.

ఏం నందిని...ఏమీ మాట్లాడ కుండా వస్తున్నారు?”

నా స్టూడెంట్ దర్షిణిని తలుచుకున్నాను. మనసుకు చాలా భారంగా ఉంది...

దర్షిణి నా! చాలా తెలివిగలదే పిల్ల...

నాకు రోజే తెలిసింది. తల్లి లేని పిల్ల అని. వెంటనే మనసులో ఏదో తెలియని ఆవేదన. వాళ్ళతో తాత-బామ్మా అని ఎవరూ లేరని చెప్పింది

అవును నందిని! దర్షిణి తండ్రి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అందువలన వీళ్ళు ఇరు కుటుంబీకులూ పగవాళ్ళు అయిపోయారు. అందులో పచ్చ కామెర్లకు భార్య పోయినప్పుడు దర్షిణి చాలా చిన్న పిల్ల 

! వినటానికే చాలా కష్టంగా ఉంది. అవును దర్షిణి నాన్న వేరే పెళ్ళి చేసుకోలేదా?”

లేదు. ఎందుకనో నాకు తెలియదు. చేసుకోనుంటే అప్పుడే చేసుకోనుండాలి. ఇక మీదట చేసుకుంటారని నాకు అనిపంచటంలేదు. ఎందుకంటే మా ఆయనకు తెలిసిన వాళ్ళు అడిగితే తాను ఇక పెళ్ళే చేసుకోను అని చెప్పారట

ఇద్దరూ ఒకటిగా స్టాఫ్  డైనింగ్ రూములో భోజనం చేయడానికి రెడీ అయినప్పుడు దర్షిణి తండ్రి గురించే మాట్లాడింది నందిని.

రోజుల్లో కూడా ఇలాంటి మనుష్యులున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది లయా...

మాటలు పెరుగుతూ వెళ్తున్నప్పుడు, నందిని యొక్క సెల్ ఫోన్ మోగింది.

వెంటనే మొబైల్ తీసి చూసింది.

సునీల్అనే అక్షరాలు కనపడ్డాయ్. అక్షరాలను చూసిన వెంటనే ఆమె మొహంలో ఒక కాంతి.

సునీల్...

సునీల్ నే నందిని

ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు?”

మీ విజయవాడ నుంచే...

పాపాత్ముడా! నువ్వెప్పుడు విజయవాడ వచ్చావు?”

ప్రొద్దున్నే. విజయవాడ ఎక్స్ ప్రెస్ లో

ఏమయ్యా...విజయవాడలో ఏదైనా ఆఫీసు మీటింగా?”

ఆఫీసు మీటింగా? ఏం...నేను నిన్ను మీట్చేయటానికి వచ్చానంటే నమ్మవా?”

నిజంగానా?”

నమ్మవా! వాడు వాడు ప్రేమకొసం ఏమిటేమిటో చేస్తున్నాడు. నేను నిన్ను చూడటానికి విజయవాడ రాకూడదా?”

రాకూడదని చెప్పటానికి నేనెవరు? కానీ, నువ్వు తీవ్రమైన తల్లి జపం చేసేవాడివే. ఆమెను వదిలి పెట్టి ఎలా వచ్చావానని...!

తల్లి జపస్తుడుని అని నన్ను నువ్వు ఏద్దేవా చెయ్యకపోతే నీకు నిద్ర రాదా నందిని...? నేను తల్లి జపస్తుడిని మాత్రమే కాదు, నందిని యొక్క సునీల్ ని కూడా

ఏది ఏమైనా మదట అమ్మ జపస్తుడివే కదా?”

నందిని! నిన్ను చూడాలని ఆశగా వచ్చాను, ఫోన్ చేశాను, ఎందుకు ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడి మూడ్ అవుట్ చేస్తావు?”

సారీరా...వెరి సారీ!

నీ సారీనూ, ‘దుప్పటానూ ఎవడికి కావాలి? నేను ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి. ఎక్కడున్నవ్ నువ్వు? మొదట అది చెప్పు

నా స్కూల్లో భోజనం చేస్తూ నీతో మాట్లాడుతున్నాను

! నువ్వు టీచర్ ఉద్యోగంలో చేరిపోయావా?”

అవును. ఒక వారం అయ్యింది

నందిని, నేను నీ దగ్గర ఏం చెప్పానో...మర్చిపోయావా?”

నేను ఉద్యోగానికీ వెళ్ళకూడదనేది నీ ఆశ. కానీ, మనకు పెళ్ళి జరిగేంతవరకు ఉద్యోగానికి వెళ్ళటంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను

పెళ్ళి జరిగేంతవరకు అని మాటలాగుతున్నావే నందిని....దానికేమన్నా, చాలా సంవత్సరాలు టైముందా ఏమిటి?”

అయితే తరువాతి ముహూర్తంలోనేనా మన పెళ్ళి?”

ఫోనులో నీతో యుద్దం చేయటానికి నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు లీవు పెట్టేసి వెంటనే రా. మనం మధ్యాహన్నం మాట్నీ షోకి సినిమాకు వెడదాం. అలాగే రాత్రి హోటల్లో విందు చేద్దాం

సారీ సునీల్! ఇప్పుడే కదా నేను ఉద్యోగంలో చేరింది. లీవడిగితే కొడతారు

అయితే ఉద్యోగం వద్దు...వదిలేయ్

ఇది బాగుందే! నీతో ఊరు తిరగడానికి ఒక మంచి ఉద్యోగాన్ని వదిలేయమంటున్నావే...నువ్వు ఉత్త స్వార్ధ పరుడువి

వద్దు నందిని...నా నోరు కెలకకు! లోకంలో స్వార్ధం లేని ఒక మనిషిని కళ్ళకు చూపించు చూద్దాం

సునీల్! వూరికే డాబరికం కోసం మాట్లాడే మాటలన్నీ నా దగ్గర వద్దు. మనం ఊహించలేనంత విధంగా లోకంలో మనుషులు ఉన్నారు...

రకంగా?”

ఇదేం ప్రశ్న? అన్ని రకాలుగానూ సునీల్

నందిని! ఎందుకిప్పుడు నస పెడుతున్నావు! నేను నీకొసమే ఆఫీసుకు సెలవు పెట్టి, హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాను. నా దగ్గర ప్రేమ భావన చూపకుండా, బాధ్యత  భావనను గుర్తు చేస్తునట్టు మాట్లాడు తున్నావు....ఇది న్యాయమా?” --- సునీల్ మాట మార్చాడు. నందిని కి కూడా పాపం అంపించింది.

సరే బాబూ, నాకు భయంకరమైన కడుపునొప్పి అని చెప్పి, లీవు పెట్టి వస్తాను. నువ్వు నా హాస్టల్ ఎదురుగా ఉన్న జ్యూస్ షాప్ వాకిట్లో వచ్చి నిలబడు. నేను ఒక అరగంటలో ఆటో వేసుకుని అక్కడికి వచ్చేస్తాను. అదే ఆటోలో వేగంగా నువ్వు ఎక్కేయాలి. నీతో కలిసి నేను తిరిగుతున్నది, నా స్కూలుకు చెందిన వారు ఎవరూ చూడకూడదు. జాగ్రత్త... అన్నది నందిని.

అమె మాటల్లో అంత హెచ్చరిక -- అంత భయం!

అతనికి అప్పటికే ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్ కలిగింది.

**********************************************PART-3********************************************

విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నది నందిని ఉండే హాస్టల్.

బయట ప్లాట్ ఫారం మీద ఒక కొబ్బరి బోండాలు అమ్మే కొట్టు. దానికి కొంచం దూరంలో ఒక జ్యూస్ కొట్టు. కొట్టును గుర్తుపట్టి అక్కడకొచ్చి నిలబడ్డాడు సునీల్.

నీలి రంగు జీన్స్ ప్యాంటు, పసుపురంగు టీ షర్ట్ వేసుకుని కొట్టొచ్చినట్టు ప్రకాశవంతంగా కనబడ్డాడు. నడి నెత్తి మీద కూలింగ్ గ్లాస్, ఆకాశాన్ని చూసుకుంటూ ఉన్నది.

కొట్టు ముందు ఇద్దరు స్ట్రా వేసుకుని జ్యూస్ తాగుతున్నారు. విపరీతమైన ఈగలు ఎగురుతున్నాయి. కొట్టతను సునీల్ ను చూసాడు.

అతనికీ  జ్యూస్ తాగాలనే ఆశ పుట్టింది . కానీ ఈగల గుంపు అతని ఆశను అనిచిపారేసింది. కాబట్టి కొట్టతనికి వీపు చూపించి నిలబడ్డాడు.

నందిని కోసం తపన పడుతున్నాడు.

జీవితంలో యుక్త వయసనేది ఒక సారే వస్తున్నది. యుక్త వయసు పలువురి వరకు పోరాటంలోనే ముగిస్తోంది. ఇంకొందరికి అది హాస్టల్లో చదువులోనే ముగిసిపోతోంది. అపూర్వంగా కొంతమంది ప్రేమలో పడి ఒక అందమైన అమ్మాయి కోసం తపించిపోతారు. సునీల్ కూడా వాళ్ళల్లో ఒకడు. ప్రేమకు కొంత వంకర బుద్దులు ఉంటాయి.

తన ప్రేమికురాలుని తప్ప వేరే అమ్మయిని చూసినా ప్రేమికురాలితో కంపార్ చేయటం మొదలవుతుంది.

జడ ఎంత పొడుగు, రంగు ఎరుపా-చామన చాయా? ఎత్తు ఎంత? నడక ఎలాంటిది? నవ్వుతున్నప్పుడు బుగ్గలపై చిల్లిలాగా పడుతుందా?--ఇలా అది పరిశోధనలోకి దిగుతుంది.

ఒకవేల భూలోక రంభే ఎదురుగా వచ్చినా, తన ప్రేమికురాలు కంటే ఆమె పలురెట్లు తక్కువే అన్న ఆలొచన వస్తుంది.

సునీల్ దగ్గర కూడా అలాంటి పరిశోధనా బుద్దులు ప్రారంభమైనై. అతని ఎదురుగా ఒక అమ్మాయి లంగా-వోణీలో ఎదుటి సైడు ప్లాట్ ఫారంలో నడుస్తూ ఉంది. హైదరాబాద్ లో చూడలేని విషయం అది. అక్కడ ఆడపిల్లలు లంగా-వోణీలు మర్చిపోయి పలు సంవత్సరాలు అయిపోయింది. చుఢిదార్, మిడీ, బెర్ముడాస్ నిక్కర్లు చోటును పట్టుకున్నాయి...వాళ్ళందరినీ జుట్టును బట్టి మాత్రమే వేరు చేసేటట్టు చేసేసినై.

అందుకని సునీల్ అమ్మాయిని చూసి ఆనందించాడు. ఖచ్చితంగా అమ్మయి అందం చూసి కూడా. అమ్మాయిలకు నిజంగానే...యుక్త వయసులో లంగా-వోణీనూ, పెళ్ళి తరువాత చీర అందం అంటారు. అదే చాలా నిజం అనేటట్టు, అమ్మాయినే చూస్తూ గోళ్ళు కొరుక్కోవడం మొదలు పెట్టాడు.

ఆమె ఒక సంధులోకి తిరిగి కనిపించకుండా పోయింది. తరువాత నందిని జ్ఞాపకం వచ్చింది. అప్పుడే ఒక నిజం అర్ధమవటం మొదలయ్యింది. అందంగా కనిపించే అందరు అమ్మాయలనూ చూసి ఆనందించటానికి రెడీగా ఉన్నాడు అతను. ఆడపిల్లల అందాలను చూసి ఆనందించటంలో వెజిటేరియన్ ఆనందం అంతా ఎక్కడుంది? అంతా నాన్ వెజ్ ఆనందమే!

నందిని కి సమంగానో, లేక నందిని కంటే ఒక రెట్టు ఎక్కువగానో, ఒక అమ్మాయిని అతను ఇష్టపడితే, నందిని ని మెల్లగా వదిలేస్తాడు అనేదే నిదర్శనమా?

ప్రశ్న అతనిలోనూ తలెత్తింది.

కారణం చేత అతనికి ఒక చిన్న అయోమయం ఏర్పడ్డది. ఎందుకు మనసు, అందమైన అమ్మాయులను చూసినప్పుడు ఇలా వంకర్లు తిరుగుతోంది?’ అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. అతని అయోమయాన్ని పెంచే విధంగా కొత్తగా ఒకమ్మాయి, అతని దగ్గర కంటూ వచ్చి నిలబడింది. చాలా రంగుగా, అందంగా ఉన్నది. కానీ, చీర కట్టి, తల దువ్వుకుని ఉన్నది. అందులో మల్లె పువ్వులు పెట్టుకోనుంది. చేతిలో ఒక పెద్ద సంచి. సంచీ నిండుగా అగరువత్తి కట్టలు మరియూ విదేశీ సోపులు.

సునీల్ ను చూసి అదోలా నవ్వింది. సార్! మంచి హై క్వాలిటీ అగరువత్తులు, సోపులూ ఉన్నాయి...కొనుక్కుంటారా?” అని మొదలు పెట్టింది.

ఆమె వలన సునీల్ చాలా రకాలుగా వంకర్లు పొయాడు. ఆమె గనుక అందంగా ఉండి ఉండకపోతే పోమ్మా, పో. ట్రబుల్ చేయకుఅని చెప్పుండేవాడు.

ఆమె అందం అతన్ని అడ్డుపడి ఆపింది.

అగరొత్తులా...ఏం అగరొత్తులూ?” -- అతను అడుగ, ఆమె తీసి చూపించ, అక్కడ వ్యాపారంకంటే సునీల్ యొక్క ఆనందం అధికరించి వచ్చింది. చివరకు ఆమె అతని నెత్తి మీద రెండు వందల రూపాయల విలువైన ఏవేవో అమ్మి ముగించింది. స్ప్రే బాటిల్ ఒకటి అమ్మటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కొంచం కూడా సంసయించకుండా అతని చెయ్యి పుచ్చుకుని , స్ప్రే చేసింది. అతనిలో ఒక విధమైన గిలిగింతలు మొదలైనై.

సునీల్ ఆమె దగ్గర నుండి అది కూడా కొనుకున్నాడు. ఆమెకు మంచి వ్యాపారం.

సార్! ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా?” అంటూ నెమ్మదిగా విచారించింది.

నేను...నేను విజయవాడ కాదు...హైదరాబాద్!

హైదరాబాదా! అప్పుడే అనుకున్నా. విజయవాడలో ఇంత అందంగా, స్టయులుగా ఉండరే అని...

మీరూ బాగా అందంగా ఉన్నారు

థ్యాంక్స్. అందంలో ఏముంది సార్? మనసు పరిశుభ్రంగా ఉండాలి. అదే ముఖ్యం

ఆమె ఎగతాలిగా మాట్లాడిందా, లేక నిజంగానే మనస్పూర్తిగా మాట్లాడిందా తెలియటం లేదు.

అతను తడబడుతూ ఉన్నప్పుడు, ఆటోలో నందిని వచ్చి చేరింది.

ఆటోలో కూర్చునే సునీల్ అంటూ పిలిచింది. అతనూ చూసాడు. తన దగ్గరున్న అగరొత్తులూ, సోపూ, స్ప్రే బాటిలూ తో నందిని ఉన్న ఆటోలోకి ఎక్కాడు. ఆటో బయలుదేరింది.

ఏమిటి ఇవన్నీ?”

అగరొత్తులూ, విదేశీ స్ప్రే, సోపు...

నా బొంద! అంతా డూప్లికేట్

డూప్లికేటా...నీకెలా తెలుసు?”

ఇవీ తెలుసు. ఇవి అమ్మిన అమ్మాయినీ తెలుసు. మా హాస్టలుకూ వచ్చి అమ్ముదామని ప్లాన్ వేసింది. అమ్మాయ్ పప్పులేమీ హాస్టల్ అమ్మాయల దగ్గర ఉడకలా. కానీ, నువ్వు ఆమె వలలో చిక్కు కున్నావని తెలుస్తోంది...

సునీల్ కు ఒక పదిహేను నిమిషాల్లో తానొక పెద్ద మూర్ఖుడ్ని అయిపోయేనే అనేది అర్ధమయ్యింది. సిగ్గుగానూ అనిపించింది.

కొంచం వంపు సొంపులతో ఒక అమ్మాయి వచ్చి పల్లు ఇకిలిస్తే, వెంటనే అందరి మగాళ్ళలాగా నువ్వుకూడా కరిగిపోయే జాతివాడివే కదా?”

ఆమె దగ్గర కోపమైన ప్రశ్నలు పుట్టటం మొదలయ్యింది.

లేదు నందిని....ఒక అమ్మాయి మంటెక్కుతున్న ఎండలో చెమటలు కక్కుకుంటూ తిరుగుతుంటే జాలి పడ్డాను

నిజంగానా?”

నిజం నందిని

ప్రామిస్?”

దీనికంతానా ప్రామిస్ చేయమంటున్నావు?”

జాలి, దయ, కరుణ ఒక వృద్దురలి దగ్గరో, లేదు ఒక మగాడి దగ్గరో అయ్యుంటే నాకేం సమస్య లేదు. వయసులో ఉన్న ఆడపిల్ల అని వచ్చేటప్పుడే అనుమానంగా ఉంది...

"అయ్యో! ఎవరై ఉన్నా నేను జాలి పడుంటాను నందిని...!

చూసిరా. నేను నిన్నే నమ్ముకున్న ఒకత్తిని. నాకు ద్రోహం చేయకు!

ఛఛ! ద్రోహం చేసేవాడినైతే, చూస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి, రైలెక్కి నిన్ను వెతుక్కుంటూ వస్తానా...?”

అదే... అభిమానమే నన్ను రోజు సెలవు పెట్టేట్టు చేసింది...అంటూ అతని భుజాల మీద వాలింది.

అతనికి అలాగే ఆకాశంలో దూదిలాగా ఎగురుతున్నట్టు ఉన్నది.

**********************************************PART-4********************************************

తన గంభీరమైన బైకులో ఇంటి వాకిటికి వచ్చాడు ముకుంద రావ్. వాకిట్లో ఆడుకుంటున్న దర్షిణి వెనక్కి తిరిగి చూసింది.

బైకుశబ్ధం ఆమె వరకు సంగీతం. పరిగెత్తుకు వచ్చి కావలించుకుంది. అలాగే, “నాన్నా! అక్కడ చూడండి. ఎవరో మిమ్మల్ని చూడటానికి వచ్చారు... అంటూ చై చూపించింది.

ఆమె చూపించిన దిక్కులో మేనమామ పరమేశం. అతనికే ఆయన్ని చూడంగానే ఆశ్చర్యమూ, షాకూ తగిలినట్టు అయ్యింది.

మావయ్యా.... అన్నాడు పరవసంతో.

ముకుందం...

రండి మామయ్యా...ఎప్పుడు వచ్చారు?”

నేనొచ్చి చాలా సేపు అయ్యింది. నీ ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టం అనిపించలేదు. వీధిలో నీ పేరు చెప్పిన మరు క్షణం ఇల్లు చూపించారు...

ఆయన చెబుతున్నప్పుడే తాళం వేసున్న తలుపులను తెరిచాడు ముకుంద రావ్. పుస్తకాల సంచితో ఉర్...ఉర్.. అంటూ నోటితో బైకునడుపుకుంటూ ఇంటిలోపలకు వచ్చింది దర్షిణి.

రండి మావయ్యా కూర్చోండి -- అతను సోఫాను చూపించాడు. ఆయనా కూర్చున్నాడు. కూర్చునే ముందు ఇంటినో లుక్కు వేశాడు.

ముఖ్యంగా ఫోటోలో తెలుస్తున్న ముకుంద రావ్ ప్రేమ భార్య ముఖాన్ని చూశారు. ఒక నిట్టూర్పు విడిచారు.

ఉండండి మావయ్యా! కాఫీ వేసి తీసుకు వస్తాను అని లోపలకు వెళ్లాడు. టై విప్పి టేబుల్ మీద పడేశాడు.

డాడీ! నాకు పాలు అంటూనే టీ.వీ పెట్టి అందులో మునగడం మొదలుపెట్టింది దర్షిణి.

ష్యూర్ డార్లింగ్...అన్నాడు.

పరమేశానికి కూడా కూర్చోవటం ఇష్టంలేక, లేచి వంట గదిలోకి అతని వెనుకే వెళ్ళాడు.

ఏమిటి మావయ్యా! కూర్చోండి... వచ్చేస్తాను

ఉండనీరా ముకుందం! అవును, ఇంట్లో వంటంతా నువ్వేనా?”

అవును మావయ్యా.ప్రొద్దున మాత్రం మీనాక్షి అని ఒకామె వచ్చి, వంట చేసిపెట్టి వెళ్ళిపోతుంది...

ఏమిట్రా కర్మ? ఎందుకురా నీకు కష్టాలన్నీ?”

కష్టమా?”--స్టవ్ మీద వేడి నీళ్ళు పెడుతూ వెనక్కి తిరిగి అడిగాడు.

కాదా మరి...! నీ కూతురు అనాధలాగా ఇంటి అరుగు మీద కూర్చోనుంది. నువ్వేమో పని పూర్తి అయితే గాని రాలేవు...కదా?”

వదిలేయండి మావయ్యా! ఇదే నా జీవితమని అయిపోయింది. కానివ్వండి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా...?” ముకుంద రావ్ ఆయన్ని రెచ్చగొట్టాడు.

తెలుసయ్యా. ఇన్ని సంవత్సరాలు రాని నేను, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాను అనే కదా?”

లేదు మావయ్యా... అతను వేగంగా కాదన్నాడు.

లేదా?”

అవును. నేను నా తల్లి-తండ్రులు ఎలా ఉన్నారని అడిగేందుకే అలా ఒక ప్రశ్న వేశాను

! వాళ్ళ గురించి అడుగుతున్నావా? ...బాగున్నారు ముకుందం

నా మీద ఇంకా అదే కోపంతో ఉన్నారా?”

అవున్రా. అది మాత్రం తగ్గలేదు

మీరు కూడా వాళ్ళతో కలిసి నా మీద కోపంగానే ఉండేవారు. ఇప్పుడెందుకు మావయ్యా సడన్ గా మీ మనసు మారింది?”

మరుగుతున్న వేడి నీళ్ళల్లో కాఫీపొడి వేసి, ఫిల్టర్ లో పోస్తూ ఆయన్ని చూసి అతను అడిగినప్పుడు, ఆయన ముఖంలో ఒక చలనం వ్యాప్తి చెందటం మొదలుపెట్టింది.

సారీ మావయ్యా! మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా అడగలా...

లేదు ముకుందం! నువ్వు అలా అడిగినదాంట్లో తప్పు లేదు. నీ ప్రేమ వ్యవహారానికి మేమందరం శత్రువులమే కదా

ఇప్పుడు మారిపోయారా? అదే నా ప్రశ్న

మారుండకపోతే వచ్చుండే వాడినా?”

సంతోషం మావయ్యా! అవును....మీరొక్కరే వచ్చారు? మీతొ పాటూ అత్తయ్యా, ఉమ వాళ్ళు రాలేదే...?”

ముకుంద రావ్ వాళ్ళిద్దరి పేర్లు చెప్పిన వెంటనే, ఆయన మొహంలో వేగమైన మార్పులు.

ఏమిటి మావయ్యా మౌనంగా ఉన్నారు? అత్తయ్యా, ఉమ బాగున్నారు కదా?”

అది...

ఏమిటి మావయ్యా?”

ఉమకి పెళ్లైంది నీకు తెలుసు కదా?”

ఏమిటీ... ఉమకి పెళ్ళి అయ్యిందా...ఎప్పుడు మావయ్యా? నాకు తెలియదే

అరె దేవుడా! నీకు తెలుసని మేము అనుకుంటున్నాము. దొంగతనంగా మీ అత్తయ్య నీకు పెళ్ళి పత్రిక పంపించానని చెప్పింది

అయితే అది నా గుంటూరు అడ్రస్సుకు అయ్యుంటుంది. నేను అక్కడ్నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యి, ఇక్కడకొచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది మావయ్యా. అది సరే పోనివ్వండి. ఉమకి ఎప్పుడు పెళ్ళి జరిగింది?”

అదొక ఆరు నెలలు అయ్యుంటుంది...

...ఇప్పుడేనా! అల్లుడు ఏం చేస్తున్నారు?”

ముకుంద రావ్ ఉత్సాహంగానే అడిగాడు. కానీ, పరమేశం కళ్ళల్లో నీళ్ళు పొంగుకు రావటం ప్రారంభమయ్యింది. అది ముకుంద రావ్ ను ఆశ్చర్యంలో ముంచింది.

మావయ్యా! ఎందుకు ఏడుస్తున్నారు? నేనేదైనా తప్పుగా అడిగానా?”

అదంతా ఏమీ లేదు ముకుందం! నువ్వు అల్లుడు అనగానే, ఉమను ఒంటరి దానిని చేసి వెళ్ళిపోయిన ఆయన గుర్తుకు వచ్చారు...

ఎక్కడి మావయ్యా వెళ్ళారు? ఆమె నచ్చక ఎక్కడికైనా వెళ్ళిపోయారో?”

అయ్యో ముకుందం! అలా వెళ్ళుంటే నేను ఆయన  ప్రపంచంలో మూలలో ఉన్నా పట్టుకుని లాకొచ్చే వాడినే! కానీ, లోకం నుండే వెళ్ళిపోయిన ఆయన్ని నేను ఎలా లాక్కు రాగలను?”

మావయ్య ఏడుపు ఎక్కువయ్యింది. ముకుంద రావ్ కూ షాక్ తగిలినట్లు అయ్యింది.  మావయ్య ఏడుపు తగ్గలేదు. గదిలోనే కూర్చోనున్న దర్షిణి కూడా ఆయన ఏడవటం చూసి ఆశ్చర్యపోయింది.

సారీ మావయ్యా! ఇలాంటి శోకం, ఉమ జీవితంలో ఉంటుందని నేను ఎదురుచూడలేదు

శోకమే ముకుందం, నీ శోకాన్ని నాకు అర్ధమయ్యేటట్టు చేసింది. అదే మీ తల్లి-తండ్రులతో కలిసి నీ ప్రేమనూ, నీ పెళ్ళినీ ఎదిరించిన నన్ను మార్చింది

ఆయన కన్నీరును తుడుచుకున్నాడు. అతను పాలలో డికాషన్కలిపి కాఫీ ఆయన ముందుంచాడు.

ఆయన అది తీసుకుని తాగారు. దర్షిణి పాలను ఉత్సాహంగా తాగింది.

హాలులోని సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నారు.

మావయ్య కాఫీ తాగి ముగించి...డ్రస్సు మార్చుకురా ముకుందం. నిన్ను ఇలా చూస్తుంటే నువ్వు ఆఫీసులో ఉన్నట్టే ఉంది...

ఉండనీ మావయ్యా! అమ్మా-నాన్నా ఇప్పుడు బాగున్నారు కదా?”

ఎలా బాగుండగలరు. నువ్వు ఇక్కడ కష్టపడుతుంటే, వాళ్ళు అక్కడ ఎలా బాగుండ గలరు?”

వాళ్ళే కదా మావయ్యా నన్ను కత్తిరించి వేసారు... తరువాత ఎందుకు నా గురించి బాధపడటం

ముకుందం! కన్నవారు -- పిల్లలూ మధ్యా ఉన్న బంధుత్వాన్ని ఎవరైనా కత్తిరించగలుగుతారా?”

నేనెక్కడ మావయ్యా తుంచుకున్నాను? సంధ్యని పెళ్ళి చేసుకుని వచ్చినప్పుడు...మా మాట వినని నువ్వు, మా అబ్బాయివే కాదుఅని వాళ్ళే కదా చెప్పారు

అది కోపంతో చెప్పింది ముకుందం...నువ్వు చేసింది మాత్రం కరెక్టా చెప్పు?”

వద్దు మావయ్యా! నన్ను ప్రశ్న అడిగి, నన్ను మీతో గొడవ పడేటట్టు చేయకండి. ఎందుకంటే, చాలా రోజుల తరువాత మీరు వచ్చారు

నేను చాలా రోజుల తరువాతే వచ్చుండచ్చు. కానీ, మంచి నిర్ణయంతో వచ్చాను...

అదేంటి మావయ్యా మంచి నిర్ణయం?”

నువ్వు ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు?”

ఇదేం ప్రశ్న మావయ్యా! ఇప్పుడు నాకేం తక్కువ?”

ఏం తక్కువా అని అడుగుతున్నావా...సరిపోయింది! పగలు ఆఫీసులో ఆఫీసర్, రాత్రి ఇంట్లో వంటవాడివి. ఇదేం కర్మ ముకుందం?”

మావయ్యా! మీరేం చెప్పొస్తున్నారు...?”

నీకేం వయసైందయ్యా! నువ్వు ఎందుకు ఇంకో పెళ్ళి చేసుకోకూడదు?”

! ఇదేనా మీ ప్రశ్న? నా ఆఫీసులో నా చుట్టూ ఉన్నవారు, వీధిలో ఉన్నవారు, అంతెందుకు - ఇంట్లోని పని మనిషి కూడా ప్రశ్నను నన్ను అడిగాసారు. బంధువులలో ఎవరూ అడగలేదేమిటని ఒక భావం ఉండేది. అది మీరోచ్చి తీర్చేసారు

ఇంతమంది అడిగినా, నువ్వెందుకు ఇలాగే ఉన్నావు?”

ఆయన అడిగిన వెంటనే, అతని చూపు...ఇంట్లో ఉన్న సంధ్య ఫోటో వైపుకు వెళ్ళింది.

ఆమెతో ఒక రోజు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఏర్పడిన సంభవం ఒకటి మనసులో అలలాగా తగలటం మొదలయ్యింది.

**********************************************PART-5********************************************

సినిమా పూర్తి అయిన తరువాత, అది ఎందుకు పూర్తి అయ్యింది అనే అనిపించింది సునీల్ కు.

చీకటిపోయి వెళుతురు వచ్చినప్పుడు, అంతవరకు నందిని చుట్టూ ఉన్న చేతులు వేరైనాయి. ఆమెకు ఏదో ఒక సుఖంలో తేలుతున్నట్టు ఉంది.

అందరూ లేచి బయటకు వెళుతుంటే, ఇద్దరూ లేచి నిలబడ్డారు.

అతని బుగ్గల మీద అక్కడక్కడ నందిని యొక్క పెదాల ముద్దుతో ఏర్పడున్నది లిప్ స్టిక్మరకలు. బయటకు వచ్చిన తరువాత వెళుతురులో దాన్ని గమనించినప్పుడు, అతి వేగంగా తన దుప్పటాతో తుడిచింది.

అది కొందరు చూసి ముసి ముసి నవ్వు నవ్వుకున్నారు. ఒకరు వాళ్ళకు వినబడేటట్టు రాను రాను సినిమాహాళ్ళు కూడా లాడ్జీలలాగా మారటం మొదలు పెట్టినై అన్నాడు.

నందినికి మాటలు నొప్పి కలిగించింది.

అంతవరకు ఏర్పడిన సంతోషం అంతా మాటలతో దూరమయ్యింది . ఆమె స్వీయ గౌరవం తప్పు చేసినట్లు భావించింది.

సునీల్ కూడా గమనించాడు.

ఏమిటి నందిని...ఏదో ఒక కుక్క మొరిగిందని నువ్వెందుకు బాధపడతావు

అందులో కొంచం నిజం కూడా ఉందిగా సునీల్...!

పిచ్చిదానా! అందులో ఎటువంటి నిజమూ లేదు. అతను ఈర్ష్యతో మాట్లాడాడు. అతని తలను చూసావా. ఒక్క వెంట్రుక కూడా లేదు. వీడ్ని అమ్మాయి ఇష్టపడుతుంది? దగ్గరకు వెడితేనే పోరా చపాతి తలగాడాఅని చెప్పి ఎగతాలి చేస్తుంది. వాడికి అదే కోపం...

సునీల్ చెప్పింది హాస్యంగా నవ్వించే విధంగా ఉన్నది. ఆమెకు నవ్వు వచ్చింది. వచ్చిన నవ్వు వచ్చిన వేగంతోనే చెదిరిపోయింది.

ఏమిటి నందిని...ఇంకా ఎందుకు బాధ?”

సునీల్! ఇలాగే ఇంకా ఎన్నాళ్ళు?”

హోటల్ కు వెళ్ళి టిఫిన్ తింటూ మాట్లాడుకుందామే...?”

మాట్లాడటానికే నేను ఇప్పుడు హోటల్ కు వస్తున్నాను...తినడానికి కాదు...

తినడానికే వెడుతున్నాము. అలాగే వెళ్ళిన చోట మాట్లాడబోతాము. ఇప్పుడేంటి?”

ఎదురుగానే ఒక హోటల్ కనబడ్డది.

ఇద్దరూ లోపలకు వెళ్ళారు. ఏసి రూము ఎక్కడ అని అడిగారు. అక్కడ ఒక మూలగా కూర్చున్నారు.

ఇలా వచ్చే వారి దగ్గర నుండి ఎక్కువ డబ్బు టిప్స్ గా దొరుకుతుందని హోటల్ సిబ్బంది ఆశగా వస్తారు.

ఒక సర్వర్ వచ్చాడు.

రెండు మినపట్లు... అని అతన్ని కట్ చేసిన సునీల్, నందినిని చూసాడు.

...ఇప్పుడు చెప్పు...

ఏమిటి చెప్పేది. నీతో పాటూ ఊరు తిరగటం నా వల్ల కాదు.  ఎవరైనా చూస్తారేమోనన్న భయం నన్ను చంపుతోంది

ఇదిగో చూడు! నీకూ ఊరు కొత్త. నాకూ కొత్త. ఎందుకు భయపడి చావటం?”

ఊర్లోనూ నాకు బంధువులు ఉన్నారు...తెలుసుకోండి

సరే నందిని! ఎందుకు నీలో ఇంత భయం? నా మీద నీకు నమ్మకం లేదా?”

నమ్మకం లేకేనా చీకట్లో ముద్దు ఇచ్చాను...నిన్నూ వద్దన్నానా?”

నువ్వెక్కడ ఒప్పుకున్నావు! నేనే లాగి పట్టుకుని ఇచ్చాను

మాట మార్చకు సునీల్....త్వరగా పెళ్ళికి ముహూర్తం చూడు...

నేను ఇప్పుడే...ఇక్కడే రెడీ. కానీ, నాకు ఒక అక్కయ్య ఉన్నదని, ఆమె పోలియో పేషంట్ అనేది నీకు బాగా తెలిసుండి, నువ్వు అవసర పడితే ఎలా నందిని

సునీల్! మాటే ఎన్ని రోజులు చెబుతావు? మీ అక్కయ్యకు త్వరగా పెళ్ళి ఏర్పాటు చెయొచ్చు కదా?”

చెయ్యకుండానా ఉన్నాము? కానీ, అక్కయ్యకు ఒక కాలు పోలియో వలన పనిచేయటం లేదని తెలుసుకుని, అలాగే వెనక్కి వెళ్ళిపోతున్నారు...

అయితే మీ అక్కయ్య పెళ్ళి ముగిసేంత వరకు, ఇలా మనం కలుసుకోవద్దు

నందిని! ప్రేమలో కొంచం చిలిపి చేష్టలకు చోటుందని గ్రహించు. అది ప్రేమించేటప్పుడే చెయ్యటం కుదురుతుంది

అతని సలహాలో బాగా ఉద్రేకం. చెప్పే విధంలోనూ ఉద్రేకం. మధ్యలో అట్టు వచ్చింది.

తిను! నీకు అనవసరమైన నేర భావన. నువ్వు చాలా భయపడుతున్నావు...

నిజంగా లేదు. నేనేమన్నా మట్టి బుర్రనా. నాకూ భావోద్వేగాలు  ఉన్నాయి

అలాగైతే ఎందుకు కలుసుకోవటాన్ని ఒక తప్పుగా అనుకుని, ఇక వద్దంటున్నావు

కలుద్దాం...మాట్లాడదాం. సినిమాలకూ, పార్కులకూ వద్దు. పెళ్ళి తరువాత నువ్వు నన్ను ఏమైనా చేసుకో

...! నువ్వొక తెలుగు అమ్మాయివని చెప్పకుండా చెబుతున్నావు...అంతే కదా?”

నువ్వు ఎలాగైనా తీసుకో

సరే మాడం! నేను ఇక సెలవులన్నీ పెట్టి హైదరబాద్ నుండి విజయవాడకు రాను. ఫోనులోనే మాట్లాడుకుందాం. తరువాత అక్కయ్యకు పెళ్ళే జరగకుండా పోతే ఏం చేద్దాం?”

సునీల్! ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు?”

లేదు. నీ దగ్గర అడిగి చూద్దామని. ఎందుకంటె, దానికీ చాన్స్ ఉంది

అలా అయినా నువ్వే కదా నిర్ణయం తీసుకోవాలి?”

నేనేం నిర్ణయం తీసుకోవాలి. నువ్వే చెప్పు?”

నువ్వు మాట్లాడేది చూస్తే మీ అక్కయ్యకు పెళ్ళి జరగకపోతే, నీకు పెళ్ళి వద్దని ఒక నిర్ణయానికి వచ్చేటట్టు తెలుస్తోందే...

అది నువ్వు తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది

నేనేమిట్రా నిర్ణయం తీసుకునేది? నాకు ఎప్పుడూ ఒకటే నిర్ణయం. అది మన పెళ్ళే

సరే, నేను ఎలాగైనా అక్కయ్యను తోసేయటానికి ప్రయత్నిస్తాను

తోసేస్తావా...ఆమె నీ అక్కరా. బ్రేక్ డౌన్ అయిపోయిన నీ డొక్కు స్కూటర్ కాదు. ఆలొచించి మాట్లాడు

ఆలొచించే మాట్లాడుతున్నాను. సరి, సరి. తిను

అత్యంత సంతోషంతోనూ, ఉత్సాహంతోనూ ప్రారంభమైన వాళ్ళ మీటింగు...పెళ్ళి అనగానే అవి తగ్గిపోయి, అందులో మెల్లగా చేదు విస్తరించడం  ప్రారంభమయ్యింది.

నందిని కూడా తొందర తొందరగా తినింది. చేతి గడియారం చూసుకుంది.

టైము ఎనిమిది!

భగవంతుడా...నేను హాస్టల్ కు వెళ్ళాలి. లేటుగా వెడితే లోపలకు పంపరే...

సరే...బయలుదేరు

నువ్వెప్పుడు హైదరబాద్ వెళ్ళబోతావు?”

ఇలాగే బస్ స్టేషన్ కు వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోవటమే</