వర్షంలో వెన్నెల...(పూర్తి నవల)
వర్షంలో వెన్నెల ( పూర్తి నవల ) అనాధ పిల్లల మరియు వృద్దుల ఆశ్రమాలకు నా పత్రికా విలేఖరి స్నేహితుడితో ఇంటర్ వ్యూ కోసం వెళ్ళాను . అక్కడున్న పిల్లలతోనూ , వృద్దులతోనూ మాట్లాడినప్పుడు ... అక్కడ వాళ్ళ ప్రాధమిక అవసరాలు పూర్తి అవుతున్నా , వాళ్ళ కళ్ళల్లో , వాళ్ళు ప్రేమ కొసం తపన పడుతున్నది నా మనసును చాలా బాధపెట్టింది . కన్నవారి ప్రేమను వెతుకుతున్న ప్రయాణంలో ఉన్న శైలజాకి వర్షంలో వెన్నెలలాగా సంతోషమైన జీవితం దొరికితే , మన మనసులోనూ ఆనంద గాలి వీస్తుందని నాకు అనిపించింది . ఈ నవలలోని నాయకి పాఠకులందరి మనసులలోనూ లోతుగా పాతుకుపోయి అందరినీ సంతోషపరుస్తుందని నమ్ముతున్నాను . ********************************* ******************* PART-1 ************** **************************** హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఇరుకులో చిక్కుకుని , మెల్లగా ద