పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవన పోరాటం…(పూర్తి నవల)

                                                                                                జీవన పోరాటం         జీవితంలో తప్పే చేయని వారు ఎవరూ ఉండుండరు . అలా తప్పు చేసిన వాళ్ళను ఒకటి చట్టం దండిస్తుంది లేకపోతే దేవుడు దండిస్తాడు . కానీ , చేసిన తప్పును అర్ధం చేసుకుని తమకు తామే దండన వేసుకుని జీవించే వారూ ఉన్నారు . కొన్ని సమయాలలో వీళ్ళు చేసే తప్పులవలన తప్పు చేసిన వాళ్ళూ , వాళ్ళకు సంబంధించిన వారూ బాధించపడినప్పుడు జీవితమే పోరాటంగా మారుతుంది . కానీ , ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని నిదానంతోనూ , వివేకంగానూ ఎదుర్కోంటే ఆ సమస్యల నుండి బయటపడొచ్చు అనేది నా నమ్మకం . ఈ సీరియల్ లోని పాత్రలు అలాంటి ఒక జీవిత పోరాటంలోనే చిక్కుకుంటారు . వాళ్ళ చిక్కులకు పరిష్కారం దొరికిందా ?..... ఈ సీరియల్ చదివి తెలుసుకోండి .                           *********************************PART-1*********************************** కలకత్తా లోని హౌరా రైల్వే స్టేషన్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది . లోపలకు వెళ్ళాలన్నా సరే , బయటకు వెళ్ళాలన్నా సరే ..