పోస్ట్‌లు

ఆగస్టు, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మారని రాగాలు...(పూర్తి నవల)

                                                                       మారని రాగాలు                                                                                                                                                             ( పూర్తి నవల )   రచన అనేది వరమో ... తపమో మాత్రమే కాదు ! అదొక ఎండిపోని జీవనది . చల్ల చల్లగా రాసుకుని వెళ్ళే ఈదురుగాలి . ఒంటి మీద పడి జలదరింపు పెట్టే వానజల్లు . ఇంటి నిండా గుమగుమలాడే సన్నజాజి వాసన . ఎప్పుడూ కొత్తగా వాసన ఇచ్చే వాడిపోని మల్లె . రచనకు మాత్రమే ఇవి సొంతం కాదు ... ప్రేమకు కూడా ! ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేమ ... ప్రేమే . వయసైతే చల్లగాలి గిలిగింత పెట్టదా ఏమిటి ? వర్షపు జల్లు జలదరింపు తీసుకురాదా ? మత్తు ఎక్కించదా ? సన్నజాజి వాసన ముక్కును తాకదా ? వాడిపోని మల్లె మత్తు ఎక్కించదా ? వయసవుతున్న కొద్దీ నిజమైన ప్రేమకు బలం ఎక్కువ అవుతుంది . శరీరాన్ని ముట్టుకోవటం ప్రేమ కాదు . మనసును తాకి లోతుగా చెక్క బడుతుందే ... దాని పేరే ప్రేమ ! ముందురోజు మొగ్గలను మాలకట్టి , రాత్రంతా గిన్నె కిందపెట