మృత్యుదూత...(పూర్తి నవల)
మృత్యుదూత ( పూర్తి నవల ) దశరథమూర్తి తన పరిశోధనా కేంద్రంలో పైజమా-బనియన్ తో కూర్చుని తన ముందున్న టేబుల్ పైన వరుసగా ఉంచబడిన పురాతన చెక్కబద్దలను ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకుని , చేతిలోని భూతద్దం ద్వారా ఆ చెక్క బద్దలపైన రాసున్న వాక్యాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ చదువుతున్నప్పుడు---- ఆయన దగ్గరున్న ‘ వాకీ టాకీ ’ పిలిచింది. దాన్ని తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నారు. అవతల పక్క ఆయన సెక్రెటరీ పల్లవి మాట్లాడింది . “ సార్...జూపిటర్ టీవీ నుండి బృందం వచ్చింది ” “ టీ.వీ బృందమా.... ? వాళ్లెందుకు వచ్చారు ?” “ ఏమిటి సార్...మర్చిపోయారా ? జూపిటర్ టీవీకి మీరు ఈ రోజు ఒక స్పేషల్ ఇంటర్ వ్యూ ఇవ్వవలసిన రోజు ” “ అలాగా ?” “ ఏమిటి సార్...అలాగా అని సావకాశంగా అడుగుతున్నారు ? ఇది క్రితం నెలే ఫిక్స్ చేసిన విషయం. ప్రొద్దున కూడా నేను మీకు జ్ఞాపకం చేశేనే ?” “ ఓ! సారీ... పల్లవి...మర