తొలిచూపు...(పూర్తి నవల)
తొలిచూపు (పూర్తి నవల) లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా? ఒకరిని చూడగానే.. వీళ్లు మన జీవితంలో లేకుంటే అసలు బతకడమే వృథా అనిపించేస్తుంది. తొలి చూపుకే జీవితమంతా చేయాల్సిన ప్లానింగ్ గురించి మనసులో అలజడి మొదలవుతుంది. ఎవరి ముఖమైనా ఒకసారి చూడగానే, వారిపై ఒక అభిప్రాయానికి రావడానికి మెదడుకు సెకనులో పదో వంతు సమయం పడుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్‌లో కేవలం ఆ వ్యక్తిలో ఆకర్షణ కోణాన్ని అంచనా వేయడమే కాదు, వారి వ్యక్తిత్వం గురించి చాలా కోణాలు ముందుకు వస్తాయి. అలాంటిదే ఈ నవలలోని హీరోకు జరుగుతుంది. కానీ హీరోయిన్ కు అలాంటిది ఒకటి జరిగిందనేదే తెలియదు(తనని ఎవరో ఒకరు చూశారని). హీరోయిన్ను తప్పుగా అర్ధం చేసుకున్న ఆమె తల్లి, తాను చూసిన అబ్బయినే పెళ్ళిచేసుకోవాలని క్షోబ పెడుతుంది. ఆమె చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంటానని తల్లికి ప్రమాణం చేసిస్తుంది. ఈలోపు కుటుంబంలో ఎన్నో సంఘటనలు. ఆ సంఘటనలు హీరోయిన్ని