పోస్ట్‌లు

అక్టోబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

కళ్ళల్లో ఒక వెన్నెల....(పూర్తి నవల)

                                                                             కళ్ళల్లో ఒక వెన్నెల                                                                                                                                                       (పూర్తి నవల) నీ భర్త గురించి ఏదైనా తెలిసిందా ?” -- జాలిగా అడిగిన ప్రభుత్వ ఆసుపత్రి నర్స్ వైష్ణవీను చూసి విరక్తిగా నవ్వింది స్వేతా . “ ఆయనేమన్నా తప్పి పోయారా ఏమిటి ? వదిలేసి పారిపోయినతను ... ఎలాగమ్మా కనబడతాడు ” “ ఏమిటీ ?” “ అతను రాడమ్మా . రానే రాడు . వెనకబడి , వెనకబడి ఇష్టపడ్డాడమ్మా . నేనొక పిచ్చిదాన్ని ! వాడు ఇష్టపడింది ఈ శరీరాన్ని అని అర్ధం చేసుకోక ... నన్ను కన్నవారిని -- తోడబుట్టిన వాళ్ళనూ ఏడిపించి ... అతన్ని నమ్మి వచ్చాసాను ” “ ఏమిటి స్వేతా ! నీలాంటి అమ్మాయలు తెలిసే ఇలాంటి తప్పు చెయొచ్చా ?” “ తప్పేనమ్మా ! అతని మీదున్న గుడ్డి నమ్మకం , మిగిలిన వాటిని మరిచిపోయేటట్టు   చేసింది . అతనికి నేను విసుగెత్తిపోయాను . వాడుకుని పారేసి వెళ్ళిపోయాడు . నేనిలా కడుపులో భారంతో ... జీవించటానికీ దారి