తొలిచూపు...(పూర్తి నవల)
తొలిచూపు (పూర్తి
నవల)
లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా? ఒకరిని చూడగానే.. వీళ్లు మన జీవితంలో లేకుంటే అసలు బతకడమే వృథా అనిపించేస్తుంది. తొలి చూపుకే జీవితమంతా చేయాల్సిన ప్లానింగ్ గురించి మనసులో అలజడి మొదలవుతుంది. ఎవరి ముఖమైనా ఒకసారి చూడగానే, వారిపై ఒక అభిప్రాయానికి రావడానికి మెదడుకు సెకనులో పదో వంతు సమయం పడుతుంది.
ఫస్ట్ ఇంప్రెషన్‌లో కేవలం ఆ వ్యక్తిలో ఆకర్షణ కోణాన్ని అంచనా వేయడమే కాదు, వారి వ్యక్తిత్వం గురించి చాలా కోణాలు ముందుకు వస్తాయి. అలాంటిదే ఈ నవలలోని హీరోకు జరుగుతుంది. కానీ హీరోయిన్ కు అలాంటిది ఒకటి జరిగిందనేదే తెలియదు(తనని ఎవరో ఒకరు చూశారని). హీరోయిన్ను తప్పుగా అర్ధం చేసుకున్న ఆమె తల్లి, తాను చూసిన అబ్బయినే పెళ్ళిచేసుకోవాలని క్షోబ పెడుతుంది. ఆమె చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంటానని తల్లికి ప్రమాణం చేసిస్తుంది. ఈలోపు కుటుంబంలో ఎన్నో సంఘటనలు. ఆ సంఘటనలు హీరోయిన్ని భాధ్యతలకు దగ్గర చేస్తుంది.
మరి తొలిచూపులోనే హీరోయిన్ని చూసిన హీరో ఆమెను పెళ్ళిచేసుకో గలిగాడా? హీరోయిన్ ఎలాంటి సంఘటనలను ఎదుర్కొంది? చివరికి ఏం జరిగింది?
PART-1
సూర్యుడనే
ప్రేమికుడు తన వెలుతురనే చేతులతో భూమి అనే ప్రేమికురాలుని ముట్టుకున్న సమయం....
మేలుకున్నది మానవ జాతి. బద్దకాన్ని వదలి, తమ లక్ష్య సాధన కోసం యత్రంలాగా పనిచేయడం ప్రారంభించింది.
సరే రండి...మనమూ
వాళ్ళతో ప్రయాణం చేద్దాం!
మనం ఇప్పుడు
నిలబడున్నది హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఒక ముఖ్యమైన వీధిలో!
మీ 'కెమేరా' కళ్ళను
రెడీగా ఉంచుకుని నన్ను అనుసరించి రండి.
చూశారా...! పెద్ద
పెద్ద గాజు పెట్టెలను ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టినట్టున్న భవనాలు, ఆకాశాన్ని తాకేటట్లున్న వాటి గంభీరమైన ఎత్తు. ఉన్న వెలుతురు
చాలదని రాత్రి నక్షత్రాలను చెబదులు తీసుకుని వెదజల్లిన కాంతివంతమైన షాపులు.
ప్రొద్దుటి పూట కూడా తమ 'పవర్ను’
చూపిస్తున్నారట. హూ...
హైదరాబాద్ లో ప్రతి
రోజూ పండుగ వాతావరణమే. నగరంలో ఎటు చూసినా ఉచితంగా కనబడే జిగేలు మనిపించే వేలకొలది
అందాలు. రాత్రి అయితే ఇంద్రలోకంలో ఉండేటట్లే అనిపిస్తుంది.
అరెరే! అలా నోరు
వెళ్ళబెట్టుకుని ఆగిపోయారేం? ఆగకుండా
నాతో రండి. జనం'పల్లెటూరి
గబ్బిలాయి’ గాళ్ళు అనే పేరు పెట్టి మిమ్మలని పక్కకు తోసేలోపు నడవటం మొదలుపెట్టండి.
ఇదిగో...మనం వెతుక్కుంటూ
వచ్చిన ప్రదేశం వచ్చేసింది.
ఆకాశాన్ని అంటుకునే
ఎత్తులో ఉన్న భవనాలకు మధ్య, ఎదుగుతున్న
పిల్లలాగా నిలబడున్న చిన్న భవనం. భవన ముఖ
ద్వారంలో 'నన్ను గమనించిన
తరువాతే లోపలకు వెళ్ళాలి’ అని చిన్న గర్వంతో గంభీరంగా ఉంచబడ్డ ఆ భవనం యొక్క నేమ్
బోర్డ్.
‘గాయత్రి
నర్సింగ్ హోమ్’
చెమటతో కుంకుమ
బోట్టు చెరిగిపోవచ్చు. కుంభవృష్టి వర్షం కురిసినా మేము చెరిగిపోమని నేమ్ బోర్డ్ లోని
ఒక్కొక్క అక్షరమూ రక్తం లాంటి ఎర్ర రంగులో వాగ్దానం చేస్తున్నట్లున్నాయి. వాచ్
మ్యాన్ ఎప్పుడూ చేసే సెల్యూట్ ను అంగీకరించి ఒకటి రెండు నిమిషాలు లోపలకు నడిస్తే ఆ
భవనాన్ని చేరుకోగలం. కాంపౌండ్ గేటుకూ, భవనానికి ఉన్న మధ్య దూరంలో నిలబడున్నది ఒక మహిళ శిల. ఆ శిల
జోడించిన చేతులలో నుండి వెలువడుతున్న నీరు ప్రవహించటానికి ఒక కారు వెళ్ళ గలిగేంత
దారి వదలబడ్డది. మిగిలిన ప్రదేశమంతా పచ్చటి తివాచి పరిచినట్టు గడ్డి పెరిగున్నది.
'రంగులలో ఎన్ని
రంగులున్నాయో తెలియనివారైతే! మమ్మల్ని చూడటానికి రండి!' అని పువ్వులు తమ భాషలో ఆహ్వానం అందిస్తున్నాయి...చల్లటి
గాలి ఆ పువ్వుల ఆహ్వాన్నాన్ని ఆమొదించినట్లు క్రిందకు వచ్చి ఆ పువ్వులను పలకరించి
వెడుతోంది. మొత్తానికి ఆ భవనం ప్రకృతి మరియు కృత్రిమమైన వాతావరణంతో చుట్టుముట్టి
ఉన్నది. 'ఇది నర్సింగ్ హోమా? లేక నర్సరీ గార్డనా?'...మనలాగ బయట నుండి వచ్చేవాళ్ళు ఒక్క నిమిషం నిలబడి ఈ
రెండురకాల వాతావరణాన్ని ఆస్వాదిస్తే వాళ్లకు ఇలాంటి ప్రశ్నే తలెత్తుతుంది.
'సరే...ఒక్క నిమిషం.
హు...హూ...'
ఏమిటి చూస్తున్నారు? ఎడతెరిపిలేకుండా మాట్లాడుతున్నాను కదా, గొంతుకలో కిచ,కిచ.
సరే...లోపలకు
వెళ్దామా...?
ఇది 'రిసెప్షన్'. ఇక్కడ
వయసు ఊయల ఊగుతోంది. అక్కడున్న ఆ అమ్మాయలందరికీ సుమారు ఇరవై ఏళ్ళు ఉంటాయా? పమిటచెంగు జారిపోతున్నా కూడా గ్రహించకుండా దేనికోసమో
వెతుకుతున్నారు. ఎంత నిజాయతీ?
అరే భగవంతుడా! దయచేసి మీ చూపులను కొంచంగా మార్చుకుని నా
వెంబడి రండి.
ఇదిగో...ఇలాగే నడిచి
వెడితే, 'జాగ్రత్తగా రండి...ఎదురుగా తెల్ల దుస్తులు వేసుకుని
వస్తున్న ఆమె ఈ నర్సింగ్ హొమ్ నర్స్. మనసులో సినిమా హీరో అనుకుంటూ చిన్నగా రాసుకు,పూసుకుని వెల్దామనుకుంటున్నారేమో. తిరిగి వెళ్ళేటప్పుడు మీ
వీపు విమానం మోత మోగుతుంది...జాగ్రత్త.
ఇంకో విషయం
చెబుతాను...వినండి. ఇక్కడ చీఫ్ డాక్టర్ గాయత్రి మొదలు పనిమనిషి ఎల్లమ్మ వరకు అంతా
ఆడవాళ్ళ రాజ్యమే. ఒక్క వాచ్ మ్యాన్ తప్ప. మగవాళ్ళకు ఎక్కువగా అనుమతి లేని అన్య
ప్రదేశం ఇది. ఇవన్నీ చీఫ్ డాక్టర్ గాయత్రీ యొక్క ఏర్పాట్లే. గర్భిణీ స్త్రీల యొక్క
భర్తలైతే తప్ప మిగిలిన మగవాళ్ళకు అనుమతిలేదు. చీఫ్ డాక్టర్ గాయత్రీ గురించి
ఇప్పుడు మీకు కొంచం అర్ధమై వుంటుంది అనుకుంటున్నాను.
ఇలాగే రెండు వైపులా
నెంబర్లు వేసున్న రూములను దాటుకుంటూ వెళ్ళి కుడివైపుకు తిరిగి మరో ఇరవై అడుగులు
నడిస్తే...అదిగో, డాక్టర్ గాయత్రి
బాపిరాజు, గైనకాలజిస్ట్(స్త్రీ మరియూ శిశు సంరక్షణ నిపుణులు). 'బాధ్యత, కర్తవ్యము... ఇవి రెండూ, రెండు కళ్ళు లాంటివి’ అనేది మనకు జ్ఞాపకం చేసే విధంగా గాయత్రి యొక్క
ప్రొద్దుటి పూట ఆమెలో ఉండే చురుకుదనం ఆమె పెట్టుకున్న కళ్ళద్దాలలో నుండి కూడా
కనబడుతుంది.
అంతస్తు, పెద్ద గుర్తింపు వచ్చిందనే గర్వం కొంచం కూడా అమెలో కనబడదు.
వైద్యసేవలకు తనని పూర్తిగా అర్పించుకున్న మరొక మదర్ తెరేసా అని ఆమెను చెప్పొచ్చు.
జరిగి ముగిసిన కాలంలో ఆమె పడ్డ కష్టాలను, ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఆమె అనుభవిస్తున్న సంతోషాలతో
పూడ్చి పెట్టింది డాక్టర్ గాయత్రి .
సరే...సరే...చాలు.
మన కథలోని హీరోయిన్ ని మీకు పరిచేయం చేశేశాను. ఇక మీరుగా ఆమె కథను తెలుసుకోండి.
నేను సెలవు తీసుకుంటాను.
PART-2
హైదరాబాద్ కోటి
బస్ స్టేషన్. ఆ బస్ స్టేషన్లో నిలబడి అప్పుడప్పుడు మనికట్టు ఎత్తి ఎత్తి చూస్తూ
విసుగును బయటపెడుతోంది ఆ అందమైన అమ్మాయి.
దూరాన పొగ
కక్కుకుంటూ దూసుకు వస్తున్న బస్సులు, పది నెలల బిడ్డను కడుపులో మోస్తున్నట్టు...'ఎప్పుడురా ప్రశవం?' అనే వేదనతో
నిలబడటానికి కూడా సమయం లేనట్లు ఒక్క క్షణం ఆగి వెళ్ళిపోతున్నాయి.
విసుగుతో
నిలబడున్న ప్రయాణీకులను మరింత విసుగుకు గురిచేయకుండా, గంటకొక బస్సు ఉన్న ఆ రూటులో వెళ్ళే ఆ బస్సు ఆ రోజు ఎందుకనో
పావుగంట ఆలశ్యంగా వచ్చింది. చేయెత్తి ఆపమని అడిగిన ప్రయాణీకులను నిరుశ్చాహ పరచటం
ఇష్టం లేక,
అక్కడ ఆగి వాళ్లను ఎక్కించుకుని వేగంగా బయలుదేరింది.
ఆరోజు ఆ రూటులో
బస్సులు తక్కువగా ఉండటంతో, బస్సులో
ప్రయాణీకులు ఎక్కువగా ఉన్నారు. ఒకరినొకరు రాసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ముందూకూ,వెనకకూ తోసుకుంటున్నారు. ఆ బాధను ఏలాగో ఒర్చుకున్న ఆ
అమ్మాయి తన స్టాపింగ్ రావటంతో వేగంగా బస్సు దిగి, మరింత వేగంగా నడవసాగింది. పూర్తిగా పది నిమిషాలను
పోగొట్టుకుని ఆ అమ్మాయి ఆ 'నర్సింగ్ హోమ్' ఎంట్రన్స్ చేరుకుంది. ఆదుర్దా పడుతూ తన మనికట్టును ఎత్తి టైము చూసుకుని మరింత ఆదుర్దా పడింది.
'ఈ రోజు ఆ ఆడ హిట్లర్ దగ్గర బాగా 'తిట్లు తినాల్సిందే. భగవంతుడా...నువ్వే నన్ను కాపాడాలి. అర్జంటు మెసేజ్ ను దేవుడుకి పంపించేసి లోపలకు
పరిగెత్తింది. ఎదురుపడ్డ సహ ఉద్యోగి నర్స్ పద్మ దగ్గర విచారించింది.
"పద్మా...మన హిట్లర్ నా గురించి అడిగిందా?"
"అడగకుండానా ఉంటుంది! అవును...ఎందుకు ఆలశ్యం అయ్యింది జానకీ?"
"బస్సు దొరకలేదు"
"ఇలాంటి సాకులన్నీ అ హిట్లర్ మహాతల్లి దగ్గర పనికిరావని నీకు
తెలుసుగా...?"
"ఇప్పుడు నేనేం చేయను"
"హు...మాట్లాడకుండా ఒకపని చెయ్యి. ఇలాగే తిరిగి ఇంటికి
వెళ్ళిపో. నువ్వు 'లీవు’ అని
చెప్పేస్తాను"
"నీకు ఆటగా ఉందా? మన ఇష్టానికి ‘లీవు’ పెట్టలేమని తెలిసే మాట్లాడుతున్నావా?"
"సరే తల్లీ, లోపలకు వెళ్ళు. ఆ
దెయ్యం నీకోసమే కాచుకుని కూర్చోనుంటుంది. వెళ్ళి చివాట్లు తిను"--అంటూ
వెక్కిరించిన పద్మా నర్స్ ను ఒకసారి కోపంగా చూసి మెల్లగా నడవటం మొదలుపెట్టింది
జానకి.
"బెస్ట్ ఆఫ్ లక్ జానకీ. హిట్లర్ను చూశేసి తిన్నగా 'స్టాఫ్స్’ రూము కు వచ్చాయి. అక్కడ నీకోసం నేను 'కర్చీఫ్' తో వైట్ చేస్తూ
ఉంటాను"
జానకి పడుతున్న
అవస్తను వేలాకోలం చేసే విధంగా పద్మా నర్స్ తన వంతుకు జానకిని భయపెట్టి వెళ్ళింది.
చీఫ్ డాక్టర్ గాయత్రి రూము వైపుకు వణుకుతూ నడవటం మొదలుపెట్టింది జానకి.
ఆక్కడున్న నర్సులు
మరియూ స్టాఫ్ ‘ఆడ హిట్లర్/ దెయ్యం’ అని పిలువబడే ఆమె సాక్షాత్ ఆ గాయత్రి నర్సింగ్
హోమ్ చీఫ్ డాక్టర్ గాయత్రినే. నర్స్ ట్రైనింగ్ ముగిసిన వెంటనే జానకికి మొదటి
ఉద్యోగం గాయత్రి నర్సింగ్ హోమ్ లో దొరికింది. నర్స్ ట్రైనింగ్ కోర్సులో ఎంతబాగా
మార్కులు తెచ్చుకున్నా మొట్టమొదటి ఉద్యోగం, కొత్త చోటు,
కొత్త బాస్ అనగానే ఏదో తెలియని భయం...ఇది మొదటిసారి
ఉద్యోగానికి వెళ్లే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కదా.
అలాగే డ్యూటీలో
చేరిన మొదటి రోజు రాత్రి, ప్రశవించిన ఒక ఆమెకోసం ఉంచబడ్డ ఒక
సూదిమందు బాటిల్ ను ఆదుర్దాలో జార విడిచింది జానకి. అప్పుడు అక్కడున్న అందరి ముందూ
గాయత్రి దగ్గర బాగా చివాట్లు తిన్నది
జానకి.
ఆ రోజు నుండి
గాయత్రికి కొంచం దూరంగా ఉండటానికే ఇష్టపడింది జానకి. వైద్యానికి కావలసిన ఉపకరణాలను
దగ్గరుండి గాయత్రికి అందివ్వాల్సి వచ్చినప్పుడల్లా 'ఆపరేషన్’ ఎప్పుడవుతుందో నని బయట నిలబడి టెన్షన్ పడుతున్న పేషంట్ బంధువులకంటే...
జానకి ఎక్కువగా టెన్షన్ పడుతుంది.
ఇదిగో...ఈ రోజు
కొంచం ఎక్కువసేపు తన నర్స్ అలంకరణ కోసం టైము స్పెండ్ చేయటం, జానకి రెగులర్
బస్సు మిస్ అవటానికి ఒక కారణం. గాయత్రిని ఒకసారి అద్దాల తలుపులులలో నుండి చూసిన
జానకి, 'ఏం చివాట్లు పెడుతుందో?' అనే భయంతో తలుపు తట్టింది.
ఏదో రాసుకుంటున్న
గాయత్రి, తలపైకెత్తి చూసి తల ఊపి జానకిని లోపలకు రమ్మంది. కుర్చీలో బాగా వెనకకు వాలి కూర్చున్న గాయత్రి, తన ముందు వచ్చి నిలబడ్డ జానకిని క్రింద నుండి పైకి ఒకసారి
క్షుణ్ణముగా చూసింది. గాయత్రి చూపులకే ఎదురుగా నిలబడున్న జానకికి వణుకు మొదలైంది!
"సా...సారీ డాక్టర్. అదొచ్చి..."
"ఎటువంటి వ్యాఖ్యానమూ అవసరంలేదు. ఇక్కడ నీకేం పనో నీ మనసులో
జ్ఞాపకము ఉంచుకునే ఇంట్లో నుంచి బయలుదేరతావు కదా? ఆలశ్యంగా వస్తే నాకు నచ్చదని తెలిసి ఇలా నా ఎదురుకుండా
వచ్చి నిలబడటానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి?"
"లేదు డాక్టర్...అదొచ్చి..."
"ఇది నా చోటు. ఇక్కడ అంతా నేను చెప్పినట్టే జరగాలి. నా
కట్టుబాటులో ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు.
నెల అయ్యేటప్పటికి చెయ్యి చాచి జీతం తీసుకోవటం తెలుసు కదా? ఉద్యోగానికి సిన్సియర్ గా ఉండాలని అనిపించొద్దా? ఓ.కే.! అవసరంలేకుండా నీతో మాట్లాడి నా టైమును వేస్టు
చేసుకోవటం నాకు ఇష్టంలేదు. నువ్వు వెళ్ళొచ్చు. నీకు రావలసిన 'సెటిల్ మెంట్' నీ ఇంటికే వెతుక్కుంటూ వస్తుంది"
గాయత్రి చెప్పింది
విని ఒక్క నిమిషం ఏమీ అర్ధంకాక నిలబడింది జానకి.
'ఏం చెబుతోంది ఈవిడ? నన్ను ఉద్యొగం వదిలి వెళ్ళిపొమ్మని చెబుతోందా...అరె భగవంతుడా!'--అదిరిపడ్డ జానకి ఆ తరువాత కొంచం కూడా ఆలొచించ లేదు. గాయత్రి
కాళ్ళమీద పడ్డట్టు ప్రాధేయ పడటం మొదలు పెట్టింది.
"నన్ను క్షమించండి డాక్టర్. లేటుగా రావటం నా తప్పే. దానికొసం
మీరు ఎటువంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. దయచేసి ఉద్యోగం నుండి మాత్రం
వెళ్ళిపొమ్మని చెప్పకండి..."--- ఏడవటం మొదలుపెట్టింది.
"సరే...నేను ఈరోజు నీకు వేయబోయే శిక్ష, ఇకమీదట లేటుగా వచ్చే ఒక్కొక్కరికీ పాఠంగా ఉండాలి. నేను
చెప్పేంత వరకు నువ్వెళ్ళి బయట... అంటే ఎండలో నిలబడాలి. నీకు ఇష్టం లేకపోతే, ఉద్యోగం మానేసి వెళ్ళిపోవచ్చు"-- చెప్పేసి తన పని
చూసుకోవటం మొదలు పెట్టింది గాయత్రి.
మండుటెండలో
నిలబడుంది జానకి. 'ఈమెకు ఏమైంది?'--అని వినోదంగా చూస్తూ చాలామంది ఆమెను దాటుకుని వెళ్ళారు. దాని గురించి ఆమె కలత
చెందలేదు. సూర్య కిరణాలు ఒకటిగా కలిసి ఎందుకో ఆమె నడి నెత్తిన మాత్రమే
కేంద్రీకృతమైనట్లు శరీరమూ, మనసూ వేడితో
ఉడికిపోతున్నాయి. పూర్తి కోపమూ గాయత్రి పైన ఉండిపోయింది. కళ్ళు అగ్ని కణాలుగా
దహిస్తుంటే,
డాక్టర్ మాటలు జానకి మనసును సూదులతో చిల్లులు చేసింది.
'పోవే... నువ్వూ, నీ ఉద్యోగమూ' అని రాజీనామా
లేఖను డాక్టర్ ముఖం మీద విసిరి పారేసి వెళ్ళిపోవచ్చు! కానీ, ఒకటో తారీఖు వచ్చిందంటే పైసా కూడా కట్ చేయకుండా ఇరవైవేలు
ఎవరు ఇస్తారు? ఉద్యోగం దొరకటమే కష్టంగా ఉన్న ఈరోజుల్లో, ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని నిలబడితే ఆ తరువాత...?
అర్ధీక సమస్యలు
భూతంలాగా ఆమె కళ్ళ ముందుకు వచ్చి నిలబడటంతో, మనసులో రేగిన ఆలొచనను మరు క్షణమే మర్చిపోయింది.
'ఇప్పుడొస్తున్న జీతం కంటే ఎక్కువ జీతంతో వేరే ఉద్యోగం
దొరికేంత వరకు పొగరుతో విర్రవీగుతున్న ఈ దెయ్యంతోనే కాలం గడపాలి’ --తనలో తానే
నొచ్చుకుంది. అదే సమయం,
"హలో!" అని వెనుకవైపు ఎవరిదో గొంతు వినబడి తిరిగి చూసేలోపు
"ఎండలో నిలబడాలని ఏదైనా మొక్కా?"--అడిగేసి మెరుపులా మాయమయ్యాడు అతను.
ఒకసారే చూసింది
అతన్ని. కానీ,
ఆ నిమిషం ప్రేమ అనే మంచుగడ్డ ఒకటి ఆమెలో కరిగి
ప్రవహించింది.
PART-3
మెడికల్ రిపోర్ట్
ఒకటి తీసుకుని తన కుర్చీలో నుండి లేస్తున్నప్పుడు, "లోపలకు రావచ్చా... డాక్టర్ గాయత్రీ బాపిరాజు?" అని చాలా క్లియర్ గా వచ్చిన మాటలు వినబడి తలెత్తి చూసింది.
తలను మాత్రమే
లోపలకు పెట్టి,
నవ్వు మొహంతో సమాధానం కోసం ఎదురుచూశాడు అతను.
"ఎస్...కమిన్" అని పిలిచి, తన కళ్ళద్దాలను తీసి టేబుల్ మీద పెట్టింది డాక్టర్ గాయత్రీ
బాపిరాజు.
"థాంక్యూ" అంటూ లోపలకు వచ్చి చొరవుగా కుర్చీ లాక్కుని
కూర్చున్న అతని చర్య కంటే, అతను తనను పిలిచిన
విధమే ఆమెను కొంచం ఆశ్చర్యానికి గురిచేసింది.
"నాపేరు రమేష్"
"ఏం కావాలి?"
"చెబుతాను డాక్టర్. చాలా సంవత్సరాలుగా నాలో ఒక వ్యాధి ఉంది.
అందువల్ల..."
"క్షమించాలి మిస్టర్ రమేష్. మీరు చోటు మారి వచ్చారనుకుంటా.
నేనొక గైనకాలజీ డాక్టర్ను..."
"తెలుసు డాక్టర్. ఈ ఊరుకు నేను కొత్తగా వచ్చాను. కానీ నేను
ఇప్పుడొచ్చింది సరైన చోటుకే"
"అర్ధం కాలేదు"
"నాకోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించగలరా?"
"హూ...ఓ.కే"
"థాంక్యూ డాక్టర్. హూ. ఏం చెబుతున్నాను? ఆ, నా వ్యాధికి
కావలసిన మందుకోసం నేను పలు సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగాను. ఫలితమే దొరకలేదు.
ఇకమీదట దొరకదని ఆశ వదులుకుని నీరశంగా కూర్చునప్పుడు ఆ మందు నా కళ్ళకు కనబడింది. ఈ
మధ్యే, అందులోనూ ఈ ఊర్లో"--ఏదో ఒక అర్ధంతో తనని లోతుగా చూస్తూ
చెప్పిన అతన్ని చూస్తుంటే గాయత్రికి ఒళ్ళు మండింది
"మిస్టర్ రమేష్, మీ సమస్య ఏమిటో నాకు అర్ధం కాలేదు. అయినా కానీ... రాజేశ్వరి అనే ఒక డాక్టరమ్మ, అమీర్ పేటలో ఉన్నది. నేను అడ్రెస్స్ ఇస్తాను. ఆమెను చూస్తేనే
మంచిది"
"అవసరం లేదు గాయత్రీ. సా...సారీ...డాక్టర్. నేను అక్కడ్నుంచే
వస్తున్నాను"
"ఏమిటీ?" అని ఆశ్చర్యంతో
అన్న డాక్టర్.గాయత్రి, "సరే...ఇక్కడికి
ఎందుకు వచ్చారు?"
వొంట్లో మంట తెచ్చుకుని, మండిపడ్డది.
"చెబుతాను. నేను వెతికిన ఆ మందు..." అని చెప్పటం ఆపి కొంటె
చూపుతో ఆమె కళ్ళల్లోకి చూశాడు. 'అతను తనను చూసిన ఆ
చూపులలో ఆమెకు ఏదో అర్ధమయ్యింది…'
గబుక్కున
అతను...."మీరే" అన్నాడు.
కుర్చీలో నుండి
లేచింది గాయత్రి.
అతనూ లేచాడు.
"ఎస్. ఐ లవ్ యూ గాయత్రీ" అన్నాడు నిదానంగా.
"బయటకు వెళ్ళండి మొదట..." కోపంగా అరిచింది. ఆమె వొంట్లో
ఒక విధమైన వణుకు మొదలయ్యింది, పడిపోకుండా టేబుల్
ను పట్టుకుంది.
"గాయత్రీ...ప్లీజ్ రిలాక్స్"
“ఇంకేమీ మాట్లాడకండి. మొదట బయటకు వెళ్ళండి”.--అతని మొహం కూడా
చూడకుండా గుమ్మం వైపు చేతులు చాపి ఉగ్రముగా అరిచింది.
"గాయత్రీ...నేను..." అతను ముగించేలోపు ఎక్కడ్నుంచొచ్చిందో
ఆమెకు అంత కోపం…
"నీకు ఒకసారి చెబితే అర్ధంకాదా? పోరా బయటకు"
ఆ రూమే
అధిరిపోయేలా అరిచిన గాయత్రిని చూసి ఒక్క క్షణం వణికిపోయాడు రమేష్.
"ఓ.కే. గాయత్రీ. నేను వేళతాను. కానీ, రేపు మళ్ళీ వస్తాను. ఇది మనయొక్క మొదటి పర్సనల్ మీటింగ్
మాత్రమే కాదు. నా యొక్క మొదటి ఓటమి కూడా
ఇదే! ఇక జరగబోయే యుద్దంలో రక్తం వచ్చినా దాని గురించి పట్టించుకోను. మీరు నాకు
దొరికేంత వరకు నా ప్రయత్నం ఆగదు. ఇష్టపడినది చేజిక్కించుకోకుండా నేను
వదిలిపెట్టను. గుడ్ బై"---దగ్గర దగ్గర సవాలు విసిరి వెళ్ళాడు.
తన గంభీరం
సడిలినట్లు అవడంతో ఒళ్ళు తూలి కుర్చీలో పడింది గాయత్రి.
ఎప్పుడూ
తేటతెల్లగా నిర్మలంగా ఉండే ఆమె మనసు ఇప్పుడు కెలికిపడేసిన చెత్త కుప్ప తొట్టిలాగా
అయిపోయింది.
మూసుకున్న కళ్ళను
దాటి కన్నీటి వరద...చెంపలమీద పడుతుంటే, రమేష్ మాటలు అమె చుట్టూ చక్రంలా తిరుగుతున్నాయి.
చాలాసేపు ఎండలో
నిలబడే ఉన్న జానకి ఇక ఆ ఎండను తట్టుకోలేక అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది.
అదే సమయంలో బయటకు
వచ్చిన రమేష్,
జానకి పడిపోవటం చూసి అమె దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు.
గబుక్కున ఆమెను ఎత్తుకుని మళ్ళీ లోపలకు పరిగెత్తాడు.
పద్మా నర్స్ వచ్చి
మొహం మీద నీళ్ళు జల్లిన తరువాత స్పృహలోకి వచ్చింది.
పద్మా నర్స్
ఫోనులో చెప్పింది విని ఆందోళనతో లేచి జానకిని చూడటానికి
పరిగెత్తింది గాయత్రి. జానకిని 'అడ్మిట్' చేసిన రూముకు గాయత్రి చేరుకున్నప్పుడు...జానకి బెడ్ మీద
కూర్చుని, దగ్గరే నిలబడున్న రమేష్ తో ఉత్సాహంగా కబుర్లు
చెబుతోంది......గాయత్రి జానకి దగ్గరకు వెళ్ళినప్పుడు,
"ఏం డాక్టర్...? 'మెడికల్ సీటు దొరికేవరకు ఎక్కడైనా టీచర్ ఉద్యోగం చేశేవారా...? స్కూల్ స్టూడెంట్ కు దండన ఇచ్చినట్టు..." రమేష్
ముగించేలోపు,
"ఈమె మీకు బంధువా?" అడిగింది గాయత్రి.
"లేదు...లేదు..."
"అలాగైతే నీకు ఇక్కడేం పని...బయటకు పో"
ఇంకేం మాట్లాడాలో
తెలియక బయటకు వెళ్ళాడు రమేష్.
అతన్ని మళ్ళీ
చూడటం జరిగినందువలన గాయత్రిలో చేదు అనుభవం తలెత్తింది. అదే సమయం జానకి మనసో అతన్ని
తలచుకుని తీపి పాకంలాగా తియ్యగా మారింది.
PART-4
చెప్పినట్లే
మరుసటి రోజు కూడా వచ్చి నిలబడ్డాడు రమేష్. ఎరుపెక్కిన కళ్ళతో అతన్ని కోపంగా
చూసింది గాయత్రి.
"ఏమిటి మేడమ్,
రాత్రంతా నిద్ర పోకుండా నా గురించే ఆలొచిస్తూ ఉండిపోయారా? కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి?"
"నిన్ను ఎవరు లోపలకు పంపించారు? గొంతు పట్టుకుని బయటకు తోసేయండి అని చెప్పేలోపు...మర్యాదగా ఇక్కడ్నుంచి
వెళ్ళిపో. లేకపోతే..."
"ఆహ...బయటకు వెళ్ళను అని చెబితే ఏం చేస్తారు...?"
ఆ ప్రశ్నలో
నిర్లక్ష్యం కనబడింది.
"పోలీసులకు ఫోన్ చేస్తాను"
"ఎవరు...మీరు?
గుడ్ జోక్"--అని చెప్పి గలగలా నవ్వాడు.
"ఎవరు నువ్వు...సంబంధమే లేకుండా ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? వెళ్ళిపో. దయచేసి
ఇక్కడ్నుంచి వెళ్ళిపో. నా గురించి నీకు తెలియదు"
"తెలుసు" అక్కడ ఇంకెవరూ లేరని గ్రహించి అన్నాడు.
చటుక్కున తలెత్తి
అతన్ని చూసింది.
'ఏమిటి వాగుతున్నాడు ఇతను? నా గురించి ఇతనికి
ఏం తెలుసు? ఇంకొకరి దయతో చావు నుండి తప్పించుకున్నానే…ఆ విషయం తెలుసా?
జీవితమనే చదరంగంలో జీవితాన్నే పోగొట్టుకున్నానే అది తెలుసా? కాలిపోయిన తరువాత బూడిదను విధిలించుకుని పైకిలేచి నిలబడుతుందే ఫీనిక్స్
పక్షి...అదేలాగా నేనూ కూడా లేచి నిలబడి తిరిగి వచ్చిన దానినని తెలుసా? మూర్ఖుడా! నీకు ఏమీ తెలియదురా. జీవితమనే నాటక వేదికపై ముఖానికి రంగు పూసుకుని
నిలబడున్నానని తెలుసా నీకు!
వెతుకుతున్న
గుప్తనిధి దొరికినట్టు మురిసిపోయి గంతులేయకు! నేను నా పవిత్రతను కోల్పోయిన దానినని
తెలిస్తే కళ్ళు తిరిగి క్రింద పడిపోతావు. చెప్పులు వదిలిపెడుతున్నాము అనుకుని నీ
ప్రేమను కూడా వదిలి విసిరేయ్. నా శ్వాశ
గాలి నీమీద పడేలోపు కనిపించకుండా పో'---ఆలొచనలతో
సతమతమవుతున్న గాయత్రిని ఆమె బల్ల గుద్ది శబ్ధం చేసి ఈలోకానికి తీసుకు
వచ్చాడు.
"హలో! ఎమిటి మేడమ్...మేలుకునే నిద్రపోతున్నారు?" కొంటెగా అడిగాడు రమేష్.
ఆమె ఏమీ
మాట్లాడలేదు. 'స్టెతస్కోప్'
ను తీసుకుని లేచింది.
అతనూ లేచాడు.
ఆమె ముఖంలో కనబడ్డ
విసుగు 'ఇక నీతో మాట్లాడటానికి తయారుగా లేను’ అన్నది అతనికి అర్ధమైయ్యింది.
"ఒక్క నిమిషం గాయత్రీ...ఇదికూడా విని వెళ్ళండి. మిమ్మల్ని
కనిపెట్టటానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా?
పోయిన వారం జరిగిన మెడికల్ సదస్సు లో మొదటిసారిగా మిమ్మల్ని
నేరుగా చూశాను. ఆ క్షణంలోనే నేను ఇరవై సంవత్సరాలుగా పోగొట్టుకున్న నా ప్రాణం మళ్ళీ
దొరికినట్లు అనిపించింది నాకు. ఆ క్షణం నాలో కలిగిన భావాలను నా జీవితం చివరి
క్షణాలవరకూ మరిచిపోలేను. నేను మిమ్మల్ని మనస్పూర్తిగా
ప్రేమిస్తున్నాను...ఐ.లవ్.యు"
చివరగా అతను
చెప్పిన మాటలు చెవిలో పడటం ఇష్టంలేక 'ఛీ' అని ఛీదరించుకుని నిలబడ్డ చోటు నుండి వేగంగా బయలుదేరింది.
"ఆగండి గాయత్రీ...మనసు నిండా ప్రేమను నింపుకుని మిమ్మల్ని
వెతుక్కుని వచ్చాను. నాకు మీ సమాధానం చెప్పి వెళ్ళండి..."--అతను అరిచి
చెప్పింది చెవులో పడనట్లు...తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయింది గాయత్రి.
ఇది అతనికి రెండో
ఓటమి. అతని హృదయం బరువెక్కింది. నడవలేక నడిచాడు.
'పో గాయత్రీ...పో. ఎక్కడికి పోతావు? ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనుకే వస్తాను.
చాలు....నిన్ను ఒకసారి పోగొట్టుకున్నది చాలు. 'పోగొట్టుకున్న నిన్ను వెతుకుతున్నాను’ అనుకుంటూ నా
జీవితాన్ని పోగొట్టుకున్నది ఇక చాలు. మిగిలిన జీవితాన్నైనా నీతో గడవనీ. నా ఈ
ఓటములను నిచ్చెన అనుకుని, దానిని విడువకుండా ఎక్కుతూ ఏదైనా ఒకరోజు నీ హృదయ సింహాసనం మీద
కూర్చుంటాను’----ఆలొచనలతో వెడుతున్న అతన్ని…"హలో రమేష్" అనే పిలుపు
అడ్డుకుంది.
ఆలొచనలను చుట్ట
చుట్టి బుర్ర లోపలకు తోసి, ప్రస్థుత పరిస్థితికి వచ్చిన అతని ముందు తామర పువ్వులాగా
నిలబడున్నది జానకి.
"ఆశ్చర్యంగా ఉన్నది. మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కొంచం కూడా
అనుకోలేదు. అవును....ఏమిటి ఇలా వచ్చారు?"
అని అడిగి సమాధానం కోసం అతని మొహంలో వెతికింది జానకి.
"ఓ...అదా.ఏమీ లేదు. అదొచ్చి...నా స్నేహితుడి భార్య ఇక్కడే 'అడ్మిట్' అయ్యుంది. అందుకే...."---అన్న అబద్దం అతని నోట తడబడుతూ
వచ్చింది.
"సరే రండి...క్యాంటీన్ వరకు రండి. ఒక కాఫీ తాగి
వెల్దాం" అన్నది, అతని మనసు అర్ధంకాక.
"వద్దు జానకీ. నేను కొంచం అవసరంగా వెళ్ళాలి"
అతను
కాదనేటప్పటికి ఆమె మనసు బాధపడింది.
నీరశంగా
"ఓ.కే" అన్నది.
అతను వెళ్ళిన
చాలాసేపటి వరకు అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డది.
PART-5
తెల్లవారు జాము
ఐదు గంటలు.
నిద్రకు బై చెప్పి, దుప్పటిని విధిలించి మడతపెట్టిన బాలాజీ, బద్దకాన్ని పోగొట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి కిటికీలు
తెరిచాడు. రాత్రి మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నది.
కిటికీ ద్వారా
వర్షం నీళ్ళు జల్లులా లోపలకు పడుతుంటే కిటికీ తలుపులు మూయటానికి వెళ్ళిన అతనికి
ఇంటి గేటు ముందు ఒక బైకు వచ్చి ఆగటం కనిపించింది.'ఎవరై ఉంటారు?' అనే ఆలొచనతో
వెళ్ళి తలుపు తెరిచాడు.
బైకు నుండి దిగిన
రమేష్, బాగా అలవాటైన మనిషిలాగా అ ఇంట్లోకి చొరబడ్డాడు.
'ఎవరితను...? ఇంతకు ముందు మనం ఇతన్ని చూడనేలేదే! ఈ సమయంలో ఇక్కడకొచ్చి నిలబడటానికి కారణం ఏమిటో?'---మనసులో అనిపించిన ప్రశ్నలను అడగాలనుకున్నప్పుడు రమేషే నోరు
తెరిచాడు.
"గాయత్రీ ఇంకా నిద్రలో నుంచి లేవలేదా బాలాజీ?"
'ఓ...అక్కను వెతుక్కుంటూ వచ్చాడా ఈయన? ఇలా హక్కుతో ఇళ్లు వెతుక్కుంటూ వచ్చేంత సన్నిహిత మగ
స్నేహితులు అక్కకు ఎవరూ లేరే! నా పేరు కూడా తెలిసి పెట్టుకున్నాడే? నేను తప్ప ఇంకో మగ మనిషికి తెలియని ఇళ్లు కదా ఇది...!'
"మీరు ఎవరని...?"
"నా పేరు రమేష్. మన ప్రభుత్వానికి బంధువును. నా గురించి
చెప్పటానికి ఇప్పటికి ఇది చాలనుకుంటా . తరువాత...గాయత్రిని
ప్రేమిస్తున్నాను..." అని మొదలుపెట్టిన అతను ఏదేదో చెబుతూ వెడుతుంటే
ఆశ్చర్యంతో అతన్నే చూస్తూ నిలబడ్డాడు బాలాజీ.
'ఐ లవ్ గాయత్రీ'--రమేష్ యొక్క ఈ మాటలు మాత్రమే ఆ ఇంటి మొత్తం మారు మోగుతున్నట్టు అనిపించింది
బాలాజీకి.
'ఈయన చెప్పేది నిజమేనా? గాయత్రి అక్కయ్యను ఇష్టపడుతున్నట్టు చెబుతున్నాడు? అలాగైతే నా అక్కయ్య జీవితంలో ఈరోజుతో ఆకులురాలేకాలం
ముగిసిందా?
నా తోడపుట్టని సహోదరి జీవితంలో వసంతం వచ్చేసింది. నన్ను జీవింప
చేస్తున్న దేవత చేతులు పట్టుకోవాటానికి ఆ దేవుడు పంపిన దేవదూత ఇతనేనా? 'ప్రేమ’ అనే మాటను తిరస్కరించే అక్కయ్య?'---గబుక్కున అతని ఆలొచనా తెర తెగిపోయింది.
'గాయత్రీ అక్కయ్యను వేలమంది ఇష్టపడవచ్చు. ఆమె ఇష్టపడుతోందా
అనేదే ముఖ్యం!'
అనే ఆలొచన తాకగానే ఆనంద ఆకాశంలో ఎగురుతున్న అతను అధఃపాతాళం
వైపు వెళ్ళాడు.
"హలో బాలాజీ...ఏమైంది? అప్పుడప్పుడు మౌనంగా ఉంటున్నారు?"
"సార్, నిజంగానే మీరు
అక్కయ్యను ఇష్టపడుతున్నారా?" అడిగాడు.
"ఎందుకు ఆ డౌట్? 'నేను చెప్పేదంతా నిజం. నిజం తప్ప ఇంకేది లేదు అని భగవద్గీత మీద సత్యం
చేయమంటావా?".
"ప్లీజ్ సార్"
"ఓ.కే! నా జీవితమే నీ అక్కయ్యే. చాలా...?
గబుక్కున రమేష్
కాళ్ళు పట్టుకున్నాడు బాలాజీ. "చాలా సంతోషం సార్" అన్నాడు కళ్ళల్లో
వస్తున్న నీటిని తుడుచుకుని.
"హయ్...బాలాజీ, ఏమిటిది?
లే మొదట"
"సార్, అక్కయ్య యొక్క
జీవితం ఎండిపోయిన చెట్టులాగా అయిపోతుందని బాధపడుతూ ఉండేవాన్ని. ఇప్పుడే నాలో
నమ్మకమనే వేరు ఒకటి మొలిచింది. అనాధగా పుట్టి, అనాధ శరణాలయంలో పెరిగి, ప్రభుత్వ బడిలో
చదువుకుని,
స్కాలర్ షిప్ తో డిగ్రీ పూర్తి చేసి, చివరగా ఒక హోటల్లో నాకు పని దొరికింది. దానికి కూడా లంచం
అడిగారు.తరువాత...లంచం కొంచమా? డబ్బుకు దారిలేనివాడు
కల కూడా కనకూడదే! మెడ పుచ్చుకుని బయటకు తోశారు.
కానీ, ఆ రోజు నాకు ఏర్పడ్డ అవమామానానికి దేవుడికే కృతజ్ఞత
చెప్పాలి. హోటల్ యజమాని నన్ను మెడు పుచ్చుకుని రోడ్డు మీదకు తోసినప్పుడు ఆ కారు
ముందు నేను పడి ఉండకపోతే, నాకు గాయత్రీ
అక్కయ్య ఎలా దొరికుంటుంది?
ఒక అనాధకేగా ఇంకొక
అనాధ యొక్క మనసు అర్ధమవుతుంది.ఆ విధంగా చూస్తే నేను అదృష్టవంతుడినే సార్. ఆ తరువాత
తమ్ముడు అనే బంధుత్వ పోస్టు తానుగా దొరికింది. ఆ హక్కుతో ఒకరోజు అక్కయ్యతో అమె
పెళ్ళి గురించి మాట్లాడాను.
'నేను ప్రశాంతంగా జీవించాలని నీకు అనిపిస్తే... దయచేసి నా
పెళ్ళి గురించి మళ్ళీ మాట్లాడొద్దు అని చెప్పేశారు. ఇక మీదట పెళ్ళి మాట ఎత్తి
అక్కయ్య మనసు కష్టపెట్టకూడదని ఆ విషయాన్ని వదిలేశాను. కానీ...నా మనసులో అక్కయ్య
పెళ్ళి గురించిన బెంగ ఉంటూనే ఉన్నది"---రమేష్ చేతులు పుచ్చుకుని మళ్ళీ
చెప్పటం మొదలుపెట్టాడు బాలాజీ.
"అక్కయ్యకు మొండితనం ఎక్కువ సార్. మాటల్లో కఠినత్వం
కనబడుతుందే తప్ప...ఆమెకు పసిపిల్లల మనసు. అందరికీ అది పొగురుబోతు తనంగా
కనబడుతుంది. అర్ధం చేసుకున్న వాళ్ళు మాత్రమే అమెతో సన్నిహితంగా ఉండగలరు.
ముట్టుకునే స్పర్ష గ్రహించుకుని నత్తగుల్ల పెంకులోపలకు ఎలా ముడుచుకుపోతుందో
అక్కయ్య కూడా అలాంటిదే. నత్తగుల్ల మీద ఉన్న ఆ పెంకును పగలకొట్టి ఆమెను బయటకు
తీసుకురావటం ఇకపై మీ బాధ్యత. అది కష్టమే...కానీ మీరు చేయగలరని నమ్ముతున్నాను. నాకు
చేతనైన సహాయం నేను చేస్తాను. నా నమ్మకం వ్యర్ధం కాదుగా?"
కన్నీటితో
అడుగుతున్న అతన్ని దగ్గరకు తీసుకుని అక్కన చేర్చుకున్నాడు రమేష్.
"బాధపడకు బాలాజీ, మంచే జరుగుతుంది" అన్నాడు.
"సారీ సార్, మర్చేపోయాను.
మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు. ఉండండి కాఫీ తీసుకువస్తాను" అంటూ ఉత్సాహాంగా
లోపలకు పరిగెత్తాడు. పదే నిమిషాలలో కాఫీ రెడీచేసి తీసుకు వచ్చి అతని చేతికి ఇచ్చాడు.
కాఫీ కప్పును తీసుకున్న రమేష్ కాఫీ తాగడం మొదలుపెట్టాడు...అదే సమయం బెడ్ రూములో
నుండి గాయత్రి గొంతు వినబడ్డది.
"బాలా...కాఫీ రెడీనా?"
"ఇదిగో తీసుకొస్తానక్కా" అన్నాడు.
ఫ్లాస్కులో ఉన్న
కాఫీని ఒక కప్పులో పోసుకుని "ఇదిగో...ఇప్పుడే వచ్చేస్తాను సార్" అని
రమేష్ కు చెప్పి వెళ్ళబోయిన బాలాజీని చెయ్యి పుచ్చుకుని ఆపాడు రమేష్.
"ఈ కాఫీని నేను తీసుకువెళ్ళి ఇచ్చిరానా? సర్ ప్రైజ్ గా ఉంటుంది కదా?"
"అది బాగుంటుందా సార్?" తడబడ్డాడు బాలాజీ.
"సింహాన్ని దాని గుహలోనే కలవాలని నిర్ణయమైపోయింది. దానికి
మంచి రోజు,
మంచి టైము చూసుకుంటూ కూర్చుంటే ఎలా?" అన్నాడు రమేష్.
నవ్వుతూ కాఫీ
కప్పును రమేష్ చేతికి ఇచ్చి బొటనువేలు పైకెత్తి 'బెస్ట్ ఆఫ్ లక్' అన్నాడు బాలాజీ.
గాయత్రీ గది
దగ్గరకు వెళ్ళేలోపు, రమేష్ మెదడులో
అనేకరకాల ఆలొచనలు వచ్చి వెళ్ళాయి.
'హటాత్తుగా ఇంత ప్రొద్దునే నన్ను కలుసుకుంటే గాయత్రి ఏం
చేస్తుంది?
అమెతో 'గుడ్ మార్నింగ్ మై
స్వీట్ హార్ట్'
అని చెబుదామా?'
తనలో ఒకసారి
చెప్పుకుని నవ్వుకుంటూ గాయత్రి గది తలుపుపై చెయ్యి పెట్టాడు. అదే సమయం సెల్ ఫోన్
లో మాట్లాడుతూ గాయత్రి హడావిడిగా తలుపులు తెరుచుకుని బయటకు రావటం ఒకేసారి
జరగటంతో...ఒకరినొకరు ఢీకొనకూడదని ఇద్దరూ అనుకునేలోపు అది జరిగిపోయింది.
కాఫీ కప్పు క్రింద
పడే శబ్ధం విని పరిగెత్తుకొచ్చాడు బాలాజి .
వెంటనే ఏం
జరిగిందో గ్రహించిన గాయత్రి తనపై పడున్న రమేష్ ను పక్కకుతోసి లేచి నిలబడింది.
పరిస్థితిని అర్ధం చేసుకున్న రమేష్ గబగబ లేచి నిలబడ్డాడు. అప్పుడు తన బలాన్నంతా
చేతులుకు తెచ్చుకుని వేగంగా అతని చెంప మీద గట్టిగా కొట్టింది.
ఆ దెబ్బకు రమేష్
తడబడ్డాడు.
"బయటకు పోరా ఊర కుక్కా" అని ఉగ్రంగా అరిచిన గాయ్త్రీని
తలెత్తి ఆశ్చర్యంతో చూశాడు రమేష్. గాయత్రి
వొళ్లంతా వణుకుతూ కనబడింది. టెన్షన్ తో తూలి పడబోయిన గాయత్రీని పట్టుకుందామని
ముందుకు వచ్చాడు రమేష్. అతని దగ్గర నుండి ఆమె తప్పించుకుంది.
"వదిలేయ్...నన్ను వదిలేయ్...వెళ్ళిపో...దయచేసి ఇక్కడ్నుంచి
వెళ్ళిపో....వెళ్ళిపో"
ఆవేశం కనబడిన
గొంతుకలో ఇప్పుడు వణుకు చొరబడింది. మెళ్ళ మెళ్ళగా వెనక్కు వెళ్ళి గోడకు
అతుక్కుంది. భయంతో అటూ ఇటూ చూసింది.
ఆ నిమిషం ఆమెను
ఒంటరిగా విడిచిపెట్టటమే మంచిది అనుకుని ఆమె గదిలో నుండి బయటకు వచ్చాడు రమేష్.
PART-6
గోడ గడియారంలోని
రెండు ముళ్ళు ఒకదాని మీద ఒకటి తలపెట్టి పడుకోనున్నాయి. తన పరిస్థితిని-డాక్టర్
బాధ్యతను మరచిపోయి తన మనసులో జరుగుతున్న పోరాటం నుండి బయటపడలేక కొట్టుకుంటోంది గాయత్రి.
'ఎలా బయటపడగలను?
త్వరగా మరిచిపోగల విషయమా అది? ఆ సంఘటనను ఇప్పుడు
తలుచుకున్నా ఒళ్ళు గగుర్పు పుడుతోందే! నా రెక్కలు పీకి పారేసి, నా భవిష్యత్తులో చీకటి నింపిని ఆరోజు,
భూదేవి తల్లి ఒడిలో ఆనందంగా విరబూసి పరిమలం విదజల్లుతున్న
పువ్వుల మధ్యలో విరబూసిన రాత్రే వాడిపోయిన పువ్వులా నిలబడ్డ ఆ రోజు.
'అయ్యో! వద్దు. మనసా ఆ రోజును జ్ఞాపకం చేయకు! మర్చిపో.
దేన్నీ జ్ఞాపకం పెట్టుకోకుండా మర్చిపో! చీకటినిండిపోయిన నా జీవితంలో వెలుతురును
వెతుక్కుంటూ వచ్చి నిలబడ్డాడే ఒకడు.
ఎవరతను? ఎంతో కొంత నాలో మిగిలున్న ప్రాణాన్ని తీసుకువెళ్ళటానికి
వచ్చాడా? దేవుడా! ఎవరైనా అతనికి అర్ధం అయ్యేటట్టు చెప్పండి. ప్రాణం, శరీరం మాత్రమే ఉన్న నేను ఎటువంటి భావాలూ లేని రాయిలాగ తిరుగుతున్నాను. నా
జీవితంలో వసంతం పోగొట్టుకుని చాలా సంవత్సరాలు అయ్యింది!
పాపం! ఏమీ అర్ధం
చేసుకోలేని వయసులో ఏర్పడింది అతని ప్రేమ. అర్ధమయ్యేట్టట్టు చెబితే అర్ధం
చేసుకోగలడు. నా గురించి మర్చిపోతాడు’ లేచి అద్దం ముందు
వెళ్ళి నిలబడింది. మనిషంత ఎత్తు అద్దం. అద్దంలోని
ఆమె ప్రతిబింబం నిర్భయంగా ఆమెలోని శోకాన్ని కలిపి చెప్పింది. 'నేను ఇంకా అలసిపోలేదు’ అనేలాగా తొంగి చూసిన కన్నీటిని తుడుచుకుని స్నానల
గదిలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకుని చాలాసేపు నిలబడింది. కళ్ళముందుకు వచ్చి
నిలబడింది రమేష్ యొక్క శోకమైన ముఖం.
'అతన్నికొట్టుండ కూడదో?'--అని ఒక్క క్షణం ఆలొచించినప్పుడు మరు క్షణమే ఎదిరించింది ఆమె మనసు. 'నదిలో వరద పొంగుకు వచ్చేటప్పుడు అనకట్టు కట్టి వరదను
ఆపటంలేదా? అదేలాగనే ఇది కూడా. నీ మీద అతను పెట్టుకున్న ప్రేమ ఇప్పుడు అతన్ని నిదానంలో ఉంచుతుంది. నువ్వు కొట్టిన చెంప దెబ్బ అతను
నీకొసం మరుసటి అడుగు వేయటానికి ముందు అతన్ని ఒకసారి
ఆలొచింప చేస్తుంది. కన్ ఫ్యూజ్ అవకు..క్లియర్ గా ఉండు! ప్రేమలో పడ్డ అతన్ని ఒడ్డుకు తీసుకురా! నువ్వు
చేయాల్సిన బాధ్యతలకోసం ఒక ప్రపంచమే నీకొసం కాచుకోనుంది.
ఉత్సాహం పొందిన
శరీరంతో స్నానాల గదిలో నుండి బయటకు వచ్చింది గాయత్రి. అదే సమయం మొదటి తుమ్ము ఆమెలో తన ప్రారంభోత్సవాన్ని మొదలుపెట్టింది.
అప్పటికి ఇరవై
సార్లు తొంగి చూశాడు బాలాజి. ఆమె తుమ్మటం తెలుసుకుని పరిగెత్తుకెళ్ళి మాత్ర
తీసుకువచ్చి ఇచ్చాడు.
"టిఫెన్
తినడానికి రా అక్కా. ప్రొద్దుట్నుంచి నువ్వు ఏమీ తినలేదు"
"వద్దు
బాలాజీ. అకాలిగా లేదు. కొంచంగా తల నొప్పి. నేను కొంచం 'రెస్టు తీసుకుంటాను. రాజేశ్వరి మేడమ్ దగ్గర ఈ విషయాన్ని చెప్పి హాస్పిటల్ను ఒకసారి చూసేసి వెళ్ళమని చెప్పు"
'సరే' అనేలాగా తల ఊపి వెళ్ళిపోయాడు బాలాజి.
ఆమె పరుపు మీద పడి
కళ్ళు మూసుకుంది.
హడావిడిపడుతూ
వచ్చాడు రమేష్.
అతనికోసం
కాచుకున్నవాడిలా తలుపు తెరిచాడు బాలాజి.
"ఏమైంది...నా
గాయత్రికి ఏమైంది...చెప్పు?"
తన భుజాలను
పట్టుకుని ఊపుతూ అడిగిన రమేష్ ని తీసుకుని గాయత్రి రూముకు వెళ్ళాడు బాలాజీ.
శబ్ధం విని, వాడిపోయిన పువ్వులాగా ఒదిగి దుప్పట్లో ముడుచుకుపోయి పడుకుంది. జ్వరం క్షణ
క్షణానికీ పెరుగుతూ ఆమెను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది.
"తలనొప్పిగా
ఉన్నదని చెప్పి పడుకున్నారు సార్. చాలాసేపటి నుండి పడుకునే ఉన్నారు.
ప్రొద్దుట్నుంచి ఏమీ తినలేదని, టిఫిన్ తినడానికి రమ్మని పిలవటానికి వచ్చి చూస్తే ఇలా...”
మాట్లాడలేక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు బాలాజి.
గాయత్రికి దగ్గరగా
కూర్చున్నాడు రమేష్. ప్రేమ నిండిన అతని మనసు ప్రేమికురాలి పరిస్థితి చూసి
తల్లడిల్లింది. తన కుడి చేతితో ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు. ఏడ్చిన కళ్ళతో అమె
మొహాన్ని చూశాడు.
'నన్ను ఎందుకు ఇలా ఆందోళనకు గురిచేస్తావు గాయత్రీ? నేను నీ వాడినని ఎప్పుడు అర్ధం చేసుకోబోతావు? నిజంగా చెప్పు.
నేనెవరో తెలియటంలేదా నీకు? నీకోసం జీవించటం మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలయ్యిందే? ఇంకా ఎంత కాలం నన్ను కాచుకోమని చెబుతావు?
నీ సంకెళ్ళను పగలకొట్టుకుని నువ్వు బయటకు ఎప్పుడు రాబోతావు?
చాలు గాయత్రీ,
ఇక నాకు ఓపికలేదు! నీ జీవితాన్ని ఎప్పుడో నా దగ్గర అప్పజెప్పారు.
జీవితాన్ని పారేసుకున్నాను అని బాధ పడకు. నిన్ను కాపాడలేకపోయినందుకు...నిజానికి
బాధ పడాల్సింది నేను...! దానికొసం నన్ను క్షమించు. లేచి నాతో పోట్లాడు. దయచేసి
కళ్ళు తెరు గాయత్రీ!’
తల వంచుకుని
ఏడుస్తున్న రమేష్ వీపును తడుతూ సముదాయించాడు బాలాజి. అదే సమయం గాయత్రిలో చిన్న
కదలిక కనబడింది. వెంటనే నిటారుగా కూర్చున్నాడు రమేష్.
శ్రమ పడుతూ కళ్ళు
తెరిచింది గాయత్రి. కనీటితో దగ్గర కూర్చున్న రమేష్ ను చూసి అధిరిపడ్డది. తన చెతిని
పట్టుకోనున్న అతని చేతిని విధిలించి విడిపించుకుంది. ఆమె శరీరంలోని వేడి మొత్తం
ఆమె కళ్ళల్లోకి వచ్చి చేరినట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి...ఆమె చూపులోని వెడిని
తట్టుకోలేక తల దించుకున్నాడు రమేష్.
కోపంతో లేచి ఏదో
చెప్పాలనుకుని నోరు తెరిచిన గాయత్రికికి మాటలు రాలేదు. దానికి బదులు ఆమె నోటి
నుండి వేగంగా వచ్చిన వాంతి, ఎదురుగా కూర్చున్న రమేష్ ని అభిషేకం చేసింది.
కల్లి తిరిగి
పడిపోయింది గాయత్రి. రమేష్ ఆందోళనతో లేచాడు. పరిగెత్తుకుని వెళ్ళి నీళ్ళు
పట్టుకొచ్చి తన ప్రేయసి మొహం కడిగాడు. బాలాజీ సహాయంతో ఆ చోటును క్లీన్ చేసి, అన్నింటినీ మార్చి 'హమ్మయ్య' అనుకుని వెనక్కి తిరిగాడు. ఎదురుగా డాక్టర్ రాజేశ్వరి.
"రమేష్"
"రండి
డాక్టర్, కూర్చోండి" అంటూ సోఫా చూపించాడు.
"నువ్వు
ఇక్కడేం చేస్తున్నావ్?" అడుగుతూ సోఫాలొ కూర్చుంది.
తన మనసు విప్పి
చెప్పాడు.
"ఆమె నువ్వు
అనుకునే విధంగా లేదు రమేష్. ప్రేమ,
పెళ్ళి అనే మాటలు వింటేనే అరవటం మొదలుపెడుతుంది. నేను
ఇదివరకే ఈ విషయంగా గాయత్రితో మాట్లాడి,
పోరాడి ఓడిపోయాను. మాట్లాడకుండా తిరిగి ఊరు వెళ్ళిపో. వేరే
ఒక అమ్మాయిని చూసి పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అవటానికి ప్రయత్నం చెయ్యి"
"నేను మా
ఊరికి తిరిగ వెళ్ళిపోతాను డాక్టర్...అయితే ఒక్కడ్నీగా కాదు, గాయత్రిని తీసుకుని"
అతన్ని లోతుగా
చూసింది. “నేను చెప్పలనుకున్నది చెప్పాను...తరువాత నీ ఈష్టం. నేను
బయలుదేరతాను" అంటూ లేచింది డాక్టర్ రాజేశ్వరి.
"ఇంజెక్షన్ చేశాను...తగ్గిపోతుంది" అని చెప్పి గుమ్మం వైపు నడవటం మొదలుపెట్టిన డాక్టర్ రాజేశ్వరి వెనక్కి తిరిగి ఒక్కసారి రమేష్ ను చూసి అతని దగ్గరకు వచ్చింది. "గాడ్ బ్లెస్ యు" అని చెప్పి వెళ్ళిపోయింది.
PART-7
అది అమ్మవారి
గుడి.
గాయత్రి పేరు మీద
అర్చన చేయంచి బయటకు వచ్చాడు రమేష్. చెప్పులు వెతికి వేసుకుని తల ఎత్తినప్పుడు
అదిరిపడ్డాడు.
అంత పక్కనే జానకి
నిలబడుంటుందని అతను ఎదురుచూడలేదు.
"గుడికి వచ్చే అలవాటు ఉందా?" అడిగింది.
"ఏం...ఉండకూడదా?" - చిన్నగా నవ్వాడు.
"అయ్యో! నేనేదో సరదాకి అడిగాను" - ఆమె కూడా నవ్వింది.
"అది సరే...ఈ రోజు మీకు పనిలేదా?"
"ప్రొద్దున డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే
వస్తున్నాను. విషయం తెలుసా మీకు? ఈ రోజు మా
హాస్పిటల్ స్టాఫ్ అందరూ జాలీగా 'ఎంజాయ్' చేశాము"
"అలాగా...అంత ఎంజాయ్ చేయటానికి కారణమేమిటో?"
"ఆ కారణాన్ని ఇలా రోడ్డు మీద నిలబడి చెప్పదలుచుకోలేదు...నాతో
రండి" అంటూ ముందుకు నడిచింది.
వేరే దారి లేక ఆమె
వెనుకే నడిచాడు రమేష్.
దగ్గరున్న
పార్కులోకి వెళ్ళింది. ఒక బెంచ్ మీద కూర్చుంది. రమేష్ అమె పక్కనే కూర్చున్నాడు. అప్పుడే అక్కడకొచ్చిన అబ్బాయి దగ్గర రెండు బఠానీల పొట్లాలు
కొని ఒకటి రమేష్ చేతికి ఇచ్చింది జానకి. మొహమాట పడుతూనే ఆ కాగితం పొట్లంను
తీసుకున్నాడు రమేష్.
'చెప్పేయ్. దొరికిన సంధర్బాన్ని జారిపోనివ్వకు. బహిరంగంగా నీ
ప్రేమను ఇప్పుడే అతనితో చెప్పేయ్. నిన్ను చూసిన రోజు నుండి 'నో వేకన్ సీ బోర్డ్' బయట వెలాడదీసినట్టు చెప్పేయ్' - మనసు చెప్పే
అదేశంకోసం ఆమె వేచి ఉన్నప్పుడు.
"ఏమండి... ఏదో చెప్తానని చెప్పి ఇక్కడకు తీసుకు వచ్చి
కూర్చోని ఇలా నేలనే వేడుకగా చూస్తే అర్ధమేమిటి?" అన్నాడు.
"ఈ రోజు నాకు రెండు సంతోషాలు"
"అదే అడుగుతున్నా. ఏమిటవి?"
"ఒకటి... ఇలా మీతో పార్కులో కూర్చుని మాట్లాడే అవకాశం
దొరికినందుకు. ఇంకొకటి...మా ఆడ హిట్లర్ దయ్యం దగ్గర నుంచి మాకు ఒక రోజు విడుదల దొరికినందుకు"
"మీరు ఎవరి గురించి చెబుతున్నారో తెలియటం లేదు!"
అన్నాడు అర్ధంకాక.
"ఏమిటి రమేష్ మీరు? నేను ఆ రోజే చెప్పానే...అంతలోనే మర్చిపోయారా? ఆ డాక్టర్...అదే గాయత్రీ. ఆమె గురించే చెబుతున్నాను"
అతని చేతులో ఉన్న
కాగితం గాలికి ఎగిరిపోయింది.
"ఏదో ఒంట్లో బాగుండలేదుట. శనేశ్వరం...మా ప్రాణం తీయటానికి
మళ్ళీ లేచి రాకుండా, అలాగే పోయి పైకి
జేరిపోతే చాలా బాగుంటుంది" అన్నది.
ఆమె కొనిచ్చిన
బటానీలు అతని గొంతు దాటటానికి మొరాయించినై. గబగబా లేచాడు.
"ఏమైంది... ఎందుకు హఠాత్తుగా లేచారు?" అన్నది కొంచం ఆందోళనతో.
"ఏమీ లేదు. నేను బయలుదేరతాను" అన్నాడు...ఆమె మొహం
చూడకుండా.
"అర్జెంటుగా వెళ్ళాలా?"
"అవును" అంటూ నడవటం మొదలుపెట్టాడు.
తన ప్రేమను
బహిరంగంగా అతనితో చెప్పేయాలని అనుకున్న ఆమె, అతని ఒకే మాటతో కొంచం జంకి వెనక్కు తగ్గింది. తన మోటార్ సైకిల్ వైపు వెడుతున్న
అతని దగ్గరకు పరిగెత్తింది.
"నన్ను కొంచం 'బస్ స్టాపింగు లో దింపగలరా? ప్లీజ్..."
'నో' అని చెప్పటం
కరెక్టు కాదు. అందులోనూ రాత్రి సమయం కాబట్టీ "సరే" అన్నాడు.
బైకులో అతనితో
ప్రయాణిస్తున్నప్పుడు గాలిలో ఎగురుతున్నట్లు అనిపించింది జానకికి. నాగరీకంగా
అతనికి, తనకూ మధ్య గ్యాపు వదిలి కూర్చోనున్నా మనసులో అతనితో ఆనుకుని
హాయిగా మాట్లాడుతూ వెడుతున్నట్లు
ఊహించుకున్నది. ముందు కూర్చున్న అతని మొహం కనపడకపోయినా, అతని శ్వాశ గాలి తాకుతుంటే కళ్ళు మూసుకున్న ఆమెకు ఏవేవో
కవితలు గుర్తుకు వచ్చాయి.
'ఎప్పుడు బైకు నుండి దిగింది...బస్సు ఎలా ఎక్కింది, ఎలా ఇళ్ళు జేరింది?' - అనేది ఏదీ ఆమెకు జ్ఞాపకం లేదు. భోజనం చెయడానికి పిలిచిన తల్లి పిలుపుకు 'ఆకలిగాలేదు’ అని చెప్పి మంచం మీద పడుకున్న ఆమెను వదలకుండా
అల్లరి చేస్తున్నాడు రమేష్.
PART-8
ఇరవై సంవత్సరాలు
కనబడకుండాపోయిన గాయత్రిని, ఇంకా ఎన్నిరోజులకు
చూస్తామో నన్న ఆవేదనలో ఉండే రమేష్, గాయత్రి కనబడిన తరువాత నాలుగైదు
రోజులు గాయత్రిని చూడకపోటం వలన పిచ్చి పట్టినవాడిలాగా అయ్యాడు. తన ఊరి నుండి
తిరిగి వచ్చీ రాగానే గాయత్రిని చూడటానికి బయలుదేరాడు. గుమ్మం దాటుతున్నప్పుడు 'సెల్ ఫోన్ మోగింది. తీసి "హలో" అన్నాడు.
"హలో రమేష్. నేను జానకి మాట్లాడుతున్నాను" అన్నది అవతలి
గొంతు.
"చెప్పండి" అన్నాడు ఆ రోజు ఆమె మీద ఏర్పడ్డ కోపాన్ని
మర్చిపోయి.
"హమ్మయ్య....అవును ఎక్కడికి వెళ్ళిపోయారు రమేష్? ఫోన్ చేస్తే 'నాట్ రీచబుల్’ అని వస్తూనే ఉంది"
"మా ఊరు వెళ్ళాను...అందుకే! సరే. ఏమిటి విషయం...చెప్పండి?"
"ఏమీలేదు...నేను మీతో కొంచం మాట్లాడాలి"
"నేను కూడా నీతో మీతో కొంచం మాట్లాడాలి. ఎక్కడ...ఎప్పుడు 'మీట్' చేద్దాం?" రమేష్ అలా అడగటంతో ఏం
మాట్లాడాలో తెలియక మౌనం వహించింది జానకి.
"..............................."
"హలో జానకీ, 'లైన్ లో ఉన్నారా?"
"ఆ, చె...చెప్పండి"
"ఎందుకు తడబడతున్నారు?"
"ఏమీ లేదు"
"సరే, నేనే చెబుతాను.
సాయంత్రం ఐదు గంటలకు గుడి పక్కనున్న
పార్కులో వైట్ చేస్తాను...వచ్చేయండి"
అవతలి వైపు జానకి
స్థంభించి నిలబడున్నది తెలియక బయలుదేరాడు రమేష్.
'చెప్పేయాలి. నా గాయత్రిని గురించి ఆడ హిట్లర్/దయ్యం అంటూ
మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడ వద్దని చెప్పేయాలి. లేకపోతే ఇక్కడితో మన స్నేహం
ముగించుకుందాం అని చెప్పేద్దాం'--మనసులో అనుకున్నాడు.
బైకులో ప్రయాణం
చేస్తున్నప్పుడు తన తల్లి అడిగింది జ్ఞాపకమొచ్చింది అతనికి.
"నా కోడల్ని ఎప్పుడ్రా తీసుకు వస్తావు?" --ఇప్పుడు కూడా తన తల్లి అతని ఎదురుగా నిలబడి అడుగుతున్నట్లు
ఉన్నది అతనికి.
'అతి త్వరలోనే అమ్మా' తనలో అనుకున్నాడు. కళ్ళెదుట గాయత్రి కనిపించి నవ్వింది. గబుక్కున ఉత్సాహం
వచ్చి బైకు వేగాన్ని పెంచాడు.
హాస్పిటల్ ను
చేరుకున్నప్పుడు అక్కడ పెద్దగా జనం లేరు.
'గుడ్ మార్నింగ్' అన్న కఠం విని ఒక 'స్కాన్ రిపోర్ట్' చూస్తున్న గాయత్రి 'ఎవరా?' అని తలెత్తి చూసింది. రమేష్ నిలబడున్నాడు.
'మళ్ళీ ఇతను ఎందుకు వచ్చాడు?'-అనిపించింది. లోపల చెలరేగిన కోపం మొహానికి చేరేటప్పటికి, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రమేష్.
"ప్రొద్దున పూట మీరు చాలా అందంగా ఉన్నారు" అన్నాడు.
తన కోపాన్ని
అనుచుకోవటానికి చాలా శ్రమ పడింది గాయత్రి. అతను దాని గురించి పట్టించుకోలేదు.
"ఇప్పుడు ఆరొగ్యం బాగుందా గాయత్రీ? ఆ రోజు మీరున్న పరిస్థితి చూసి చాలా భయపడిపోయాను తెలుసా?" అన్నాడు గబుక్కున శోఖంగా ముఖం పెట్టుకుని.
“కానీ, ఆ రోజు ఎందుకురా
బ్రతికేము అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇలా నీ మొహాన్ని చూసే అవకాశమే ఉండకుండా
పోయేది చూడు"
నిదానంగా చెప్పిన
గాయత్రిని ఆశ్చర్యంతో చూశాడు.
"ఎందుకు గాయత్రీ అలా మాట్లాడుతున్నారు?"
"ఇంకెలా మాట్లాడమంటావు? చెప్పు! ఒకటి...నన్ను ప్రశాంతంగా ఉండనీ.లేదా...నా కళ్ళకు కనబడకుండా ఎక్కడికైనా
వెళ్ళిపో"-- తలమీద చేతులుపెట్టుకుని తల వంచుకున్న
ఆమెను బాధతో చూశాడు.
"ఓ.కే. గాయత్రీ. నేను వెళ్ళిపోతాను. కానీ, ఒక విషయం మాత్రం
చెప్పండి. మీ మనసులో నేను ఉన్నానా....లేనా? దయచేసి నిజం చెప్పండి"
"లేరు...చాలా! అసలు ఎవరు నువ్వు? నువ్వుగా వచ్చావు...ఏదేదో వాగావు. ఇప్పుడు నిజం చెప్పండి
అంటే ఏమిటి అర్ధం? నాకు అర్ధం కాలేదు?"
"నాతో ఆడుకోకండి గాయత్రీ. మీరు మాత్రం నాకు దొరకకపోతే
నేను...." అతను ముగించేలోపు....
"చచ్చిపొండి" అని గట్టిగా అరిచిన ఆమె "నువ్వు
చచ్చిపోయినందు వలన ఈ లోకమేమీ పనిచేయకుండా ఆగిపోదు. ఇక్కడకొచ్చి నా ప్రాణం తీయకుండా
ఎక్కడికైనా వెళ్ళి తగలడు. నీ వళ్ల నా ప్రశాంతతే పోయింది. నీ మొహం చూస్తేనే నాకు
ఒళ్ళు మండిపోతోంది. ఇక్కడ్నుంచి వెళ్ళిపో"
మాటలతో తన మనసును
విరిచేసిన ఆమెను బాధగా చూస్తున్న రమేష్ ఇక మాట్లాడటం ఇష్టంలేక లేచి నడవటం
మొదలుపెట్టాడు.
"ఒక్క నిమిషం" - తెరవటానికి తలుపును ముట్టుకున్న అతన్ని
గాయత్రి గొంతు ఆపింది.
"నువ్వు నన్ను కలవటానికి రావటం ఇదే చివరి సారిగా
ఉండాలి"- అని చెప్పి తన పని చేసుకోవటం మొదలుపెట్టింది.
అదేసమయం బస్సు దిగిన జానకి, బైకును తోసుకుంటూ వస్తున్న రమేష్ ను చూసి నడకలో వేగం
పెంచింది.
'ఈ టైములో ఈయన ఎందుకు హాస్పిటల్ కు వచ్చి వెల్తున్నాడు? నన్ను వెతుక్కుంటూ వచ్చాడో? సాయంత్రం వరకు వైట్ చేయలేడా? ఏమిటంత అర్జెంటు? ఒకవేల నాలాగానే నువ్వు కూడా ప్రేమను
చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావా? కానీ ఇదేమిటి...రమేష్ ఏం చేస్తున్నారు? త్వరగా రోడ్డు క్రాస్ చెయ్యండి. అయ్యో...' ఆమె అరుపు గాలిలో కలిసిన సమయం 'ఢాం' అని ఆ శబ్ధం వినబడింది.
నిమిషంలో
గుమికూడిన గుంపును తోసుకుంటూ ముందుకు వచ్చింది జానకి. చొక్కా అంతా రక్తంతో, బోర్ల పడున్న రమేష్ ని చూసిన ఆమెకు హృదయం పనిచేయటం మానేసింది.
తర్వాతి పది
నిమిషాలలో...రమేష్ ప్రమాదానికి గురి అయ్యి తన హాస్పిటల్లో 'అడ్మిట్' అయిన న్యూస్
గాయత్రికి తెలుపబడింది. బలమైన దెబ్బలు తగలటం వలన స్పృహ కోల్పోయున్నాడు. దగ్గరే
ఉండి అతన్ని చూసుకుంటోంది జానకి.
అయ్యింది.
నాలుగైదు రోజుల గడిచిన అతరువాత ఆ రోజు అతను స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరవటానికి
అతను శ్రమ పడుతున్నప్పుడు దగ్గరలో మాటలు వినబడి కదలకుండా అలాగే పడుకున్నాడు.
"చూడు జానకీ. నువ్విలా మొండి పట్టు పడితే ఎలా? దయచేసి బయలుదేరు. నేను చూసుకుంటాను"
"లేదు పద్మా...ఈ పరిస్థితిలో ఈయన్ను వదిలిపెట్టి"
"అరే భగవంతుడా! నేను
చూసుకుంటానని చెబుతున్నాను కదా? నన్ను కూడా ఆ
హిట్లర్ గాయత్రీ లాగా రాతి గుండె దాన్ని అని అనుకుంటున్నావా? ఒక ప్రాణం యముడితో పోరాడుతోందని తెలిసిన తరువాత కూడా
పరిగెత్తుకు వస్తుందని అనుకుంటే...వేరే డాక్టరుకు ఫోన్ చేస్తోంది. ఇన్ని రోజులలో
ఒకసారైనా ఈ గదివైపు వచ్చిందా చూశావా? ఆక్సిడెంటు కేసులను 'హిట్లర్ గారు
అటెండ్ చేయరట. ఏం మనిషి?...మనస్సాక్షి లేని
మృగం"
"వదిలేయ్ పద్మా. ఇప్పుడు నా బాధంతా రమేష్ గురించే. ఇలా కళ్ళు
తెరవకుండా పడున్నారే! అది తలచుకుంటేనే భయంగా ఉంది"
"ఇలా చూడు జానకీ. రాజేశ్వరి డాక్టర్ చెప్పింది నువ్వు నమ్మటం
లేదా? నీ రమేష్ కి ఏమీ అవదు. చాలా? అనవసరమైన ఆలొచనలు పెట్టుకుని మనసు పాడుచేసుకోకుండా
ఇంటికెళ్ళి 'రెస్టు’ తీసుకో. ఈ నాలుగైదు రోజులుగా నువ్వు సరిగ్గా తినను
కూడా లేదు. దయచేసి బయలుదేరు. నేను చూసుకుంటా" అని స్నేహితురాలు బలవంతం
చేయటంతో మనసులేకపోయినా బయలుదేరి వెళ్ళింది జానకి.
తన గదిలోనే ఉండి
అక్కడ జరిగినదంతా 'సెక్యూరిటీ కెమేరా' రికార్డింగ్ ద్వారా చూస్తున్న గాయత్రి, కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది.
అదే సమయం కళ్ళు
తెరిచి మెల్లగా లేచిన రమేష్- తూలుకుంటూ నడిచి, ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళాడు.
PART-9
ఆ ఇంటి ముందు కారు
వచ్చి ఆగిన వెంటనే, అందులో నుండి
దిగింది గాయత్రి. అ ఇంటి తలుపు తట్టి కాచుకోనున్న రెండు నిమిషాల తరువాత ఒక మధ్య
వయస్కురాలు తొంగి చూసింది.
"ఎవరు కావాలి?"
"ఇది జానకి ఇల్లేనా?"
"అవును. మీరు?"
"నా పేరు గాయత్రి. మీ అమ్మాయి నా దగ్గరే పనిచేస్తోంది"
"అరెరే! మీరా? లోపలకు రండి" అంటూ తలుపును పూర్తిగా తెరిచింది, జానకి తల్లి విశాలాక్షి.
"జానకి లేదా?"
"గుడికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీనా లేక టీనా?"
"నో ధ్యాంక్స్. నేను వచ్చిన కారణం చెప్పేస్తాను. మీ అమ్మాయి
రమేష్ అనే ఒకతన్ని ఇష్టపడుతోంది. దాని గురించి మీదగ్గర ఏదైనా చెప్పిందా?"
"ఏం చెబుతున్నారు మ్యాడమ్? నా దగ్గర తను ఏమీ చెప్పలేదే?" అన్నది ఆందోళనతో.
"భయపడకండి. మీ అమ్మాయి ఒక మంచి వాడ్నే ఎన్నుకుంది. ఇప్పుడు
నేను ఇక్కడికి రావటానికి కారణం వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయటానికి మీ అనుమతి
అడగటానికి వచ్చాను"
"సరే నండి. కానీ, అబ్బాయి గురించి"
"దాని గురించిన భయమే మీకొద్దు. మీ అమ్మాయిని సంతోషంగా
చూసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాల్సిన పూర్తి బాధ్యత నాది. మీరు 'ఓ.కే' అంటే చాలు. ఏమంటారు?"
"తానుగా వచ్చే మంచిని ఎవరు కాదంటారు? మగవాళ్ళు లేని ఇళ్లు. నా బాధ్యతను మీరు తీసుకుంటానని చెబుతుంటే
నేను వద్దనా అంటాను? దీంట్లో నాకు
పరిపూర్ణ సమ్మతం"
"నన్ను నమ్మి బాధ్యతను అప్పగించి నందుకు కృతజ్ఞతలు. అతి
త్వరలో రమేష్ ఇంట్లో నుండి అమ్మాయిని చూసుకోవటానికి వస్తారు. జానకి రాగానే ఈ విషయం
గురించి చెప్పండి. నేను బయలుదేరుతాను"
"కొంచం ఉండండి... అంతలోపే బయలుదేరితే ఎట్లా? సంతోషమైన విషయం చెప్పారు. ఇప్పుడే వస్తాను" అని లోపలకు
పరిగెత్తింది విశాలాక్షి.
ఒంటరిగా
వదిలిపెట్టబడ్డ గాయత్రి ఏం చేయాలో తెలియక అక్కడున్న ఫోటోల వైపు చూసింది. ఆమె చూపు
ఇక చిన్న పిల్ల ఫోటోను చూడంగానే అక్కడే ఆగిపోయింది. సడన్ గా ఏదో అనిపించటంతో ఆ
ఫోటో దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, ఆ ఫోటోను
చేతుల్లోకి తీసుకుని క్షుణ్ణంగా గమనించింది.
'ఇది...ఇది...'- అనుకుంటూ ఆలొచనలో ఆమె పడ్డప్పుడు.
"జానకినే" వెనుక నుండి గొంతు వినబడింది. చేతిలో స్వీటు
తో నిలబడున్నది విశాలాక్షి.
'నిజంగానే ఇది జానకీయేనా? నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా ఏమిటి? గుండెల్లో ముద్ర వేసుకున్న ఆ పసి మొహాన్ని ఎలా మరిచిపోగలదు? కానీ నా సందేహాన్ని ఎలా తీర్చుకోను? ఈమె దగ్గర ఏమని అడగను? ఎం చెయ్యబోతాను?'-- అనుకుంటూ దీర్గ
ఆలొచనలో పడిపోయిన గాయత్రిని చూసిన తరువాత విశాలాక్షే నోరు తెరిచింది.
"మీ దగ్గర ఒక నిజాన్ని చెప్పాలి డాక్టర్. జానకి నేను కన్న
బిడ్డ కాదు" అని చెప్పటం ఆపిన విశాలాక్షిని ఆశ్చర్యంగా చూసింది గాయత్రి.
'అలాగైతే నా సందేహం కరెక్టేనా?' --ఏడుపు, సంతోషం కలిసిన ఒక
విధమైన భావనతో విశాలాక్షిని చూసింది.
"మా ఆయన స్టేషన్ మాస్టర్ గా ఉండేవారు. మాటి మాటికీ ట్రాన్స్
ఫర్ పేరుతో చాలా ఊర్లకు వెళ్ళిపోయేవారు. అలా ఒకసారి రామాపురం అనే ఊర్లో ఆయన
ఉద్యోగంలో ఉన్నప్పుడే జానకిని పసిబిడ్డగా ఆ ఊరి నుండి ఎత్తుకొచ్చారు. పిల్లలు
పుట్టే భాగ్యమే లేదని తెలుసుకుని తీవ్ర మనొవేధనకు గురైన మాకు దేవుడే కరునించి మాకు
ఈ బిడ్డను ఇచ్చాడనుకుని ఆ బిడ్డను మేము పెంచుకుందామని నిర్ణయించుకున్నాము. జానకి
అని పేరు పెట్టుకుని మురిపంగా పెంచుకున్నాము. దానికి ఆరేళ్ళు ఉన్నప్పుడు ఆయన
చనిపోయారు" అని చెప్పటం ఆపింది విశాలాక్షి.
అక్కడ గాయత్రికని
ఉంచిన మంచి నీళ్ళ గ్లాసు తీసుకుని గబగబా తాగేసి మళ్ళీ మొదలుపెట్టింది విశాలాక్షి.
"తాను ఎవరు అనే విషయం జానకికి ఈ నిమిషం వరకు తెలియదు
మ్యాడమ్. ఈ రహస్యాన్ని మీ దగ్గర చెప్పటానికి కారణం, ఒకవేల పెళ్ళి తరువాత పెళ్ళికొడుకు తరఫు వాళ్ళకు ఈ విషయం
తెలియవస్తే...తరువాత సమస్య ఏదీ రాకుండా ఉండాలనే. ఇక మీరే చూసుకోవాలి "
మాట్లాడటానికి
మాటలు లేక అలాగే కూర్చుండిపోయింది గాయత్రి.
"కావ్యా..."--శబ్ధం రాకుండా పెదవులు ఒకసారి ఉచ్చరించు
కున్నప్పుడు లోపలకు వచ్చింది జానకి. గాయత్రిని తన ఇంట్లో ఎదురుచూడని జానకి
నిర్ఘాంతపోయి నిలబడ్డప్పుడు కళ్ళార్పకుండా జానకినే చూసింది గాయత్రి.
'పసి బిడ్డా ఈమె? యుక్త వయసులో, యౌవనదశలో సీతాకోక
చిలుకలా ఎగురుతున్నదే! ఇన్ని రోజులు నా పక్కనే ఉన్న జానకిని నేను ఎందుకు
గుర్తుపట్టలేకపోయాను?'
'మోడు బారిన నా జీవితంలో నేను ఒంటరిగా లేనని అభయం ఇచ్చావే
జానకీ! ఎలా ఉన్నావే? రాలిపోయిన నా
బంధువా?' - గబుక్కున జానకి మొహాన్ని తన చేతులలోకి తీసుకుని అమె
కళ్ళల్లోకి సూటిగా చూసి ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుంది.
వేనక్కు జరిగింది, బయటకు వచ్చింది. కారు ఎక్కింది. తిరిగి వెళ్ళింది.
గుమ్మం వైపే
చూసింది జానకి. 'నేను చూసేది కల
కాదు కదా?' అనుకున్నది.
"హిట్లరా...లే...లేదులేదు. గాయత్రీనా ఈమె? నమ్మలేకపోతున్నాను. ఇదేమిటి...నామీద హఠాత్తుగా ఇలాంటొక
ప్రేమ? దీనికి కారణం?"
కూతురి యొక్క
మనొభవాన్ని అర్ధం చేసుకున్న దానిలాగా...గాయత్రి వచ్చి వెళ్ళిన కారణాన్ని కూతురుకు
చెప్పింది విశాలాక్షి.
"రమేష్ గురించి నీ దగ్గర చెప్పనందుకు సారీమ్మా"
"అమ్మ దగ్గర చెప్పటానికి ఎందుకురా అంత సంశయం? సరే...పోనీ. అంతా మంచిగా జరిగితే సరి. ఒకత్తిగా ఉండి నీ
పెళ్ళి ఎలా చేయాగలను అని భయపడ్డాను. ఇక నాకు ఆ భయం- లేదు. ఎవరు కన్న బిడ్డో ఆ గాయత్రీ, జీవితంలో బాగుండాలి"
గాయత్రిని
అభినందించి లోపలకు వెళ్ళింది విశాలాక్షి.
ఇంకా కూడా ఆలొచనా
గుప్పెట్లో చిక్కుకునే ఉన్నది జానకి.
PART-10
రాత్రి పన్నెడు
గంటలు అవుతున్నా నిద్రరాక అటూ ఇటూ దొర్లుతోంది గాయత్రి. నిద్ర ఎలా వస్తుంది.
ఒకటా...రెండా?
ఇరవై సంవత్సరాలు తరువాత కదా వదిలి వెళ్ళిన రక్త సంబంధం
మళ్ళీ వచ్చి అతుక్కుంది. ఈ విషయాన్ని ఎలా-ఎవరితో చెబుతుంది? తడిసిన దిండు హాయిని ఇవటం దిక్కరించినప్పుడు లేచి
కూర్చుంది. ఏడుపు ఆపేసినా ఆమె కళ్ళల్లో శోకం ఇంకా కనబడుతూనే ఉన్నది.
'కావ్యా! అప్పుడే
పూసిన పువ్వుకు నేను పెట్టిన పేరు కదా ఇది. ఎలా మరిచిపోతాను. నిన్ను నా హృదయానికి
హత్తుకుని లాలించిన రోజులను ఎలా మర్చిపోతాను? నా చిట్టి తల్లీ! బంధువులే లేకుండా ఏకాకిగా తిరుగుతున్న నాకు 'బంధువు నేనున్నాను’ అని చెప్పటానికి వచ్చావా? నల్లటి మేఘాలన్నీ ఒకచోట జేరి వర్షం కురుస్తున్నట్లు, నీ జ్ఞాపకాలు మాత్రమే నా మనసంతా నిండి సంతోష జల్లు
పడుతున్నట్టు ఉన్నది. ఇక నేను అనాధను కాను...అనాధను కాను.
కావ్యా! నా
ప్రియమైన చెల్లీ...ఈ ప్రపంచంలో అందరికీ వినబడేటట్టు అరిచి చెబుతాను, 'ఈమె నా రక్త సంబంధం' అని! చాలు. మనిషికోపక్క అనాధగా మనం జీవించింది చాలు. నా దగ్గరకు వచ్చేయి. నీకు
నేనున్నానే చిట్టి తల్లీ! కానీ...కానీ...నా చెల్లీ నన్ను క్షమిస్తావా? నీ పేగు బంధాన్ని గుంట తవ్వి పూడ్చిపెట్టిన దాన్ని నేనే అని తెలిస్తే నన్ను
అక్కయ్యగా ఆదరిస్తావా?
అయ్యో! వద్దు.
నువ్వు బలహీనమైన గుండెను మోసుకుంటూ తిరుగుతున్నావు. నిజాన్ని తట్టుకునే శక్తి నీకు
లేదు. నాతోనే అన్నీ సమాధి అయిపోనీ. దూరంగా ఉండైనా నా ప్రేమను నువ్వు అర్ధం
చేసుకోవాలి. నాకు అది చాలు. నేను పోగొట్టుకున్న సంతోషాలను నీకైనా వెతికి ఇస్తాను.
ఇది సత్యం!'
లేచి వెళ్ళి మంచి
నీళ్ళు తాగింది. తిరిగి వచ్చి గడియారం చూసింది. తెల్లారే వరకు మేలుకునే ఉన్నది.
********************
"నిజంగానా చెబుతున్నావా" పద్మా నర్స్ ఇలా అడగటం అది
పదోసారి.
"ఇంకా నువ్వు నన్ను నమ్మటం లేదా?" - విసుగ్గా అన్నది జానకి.
"అదికాదే. గాయత్రి మ్యాడమ్ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. కారణం లేకుండా గాయత్రి మ్యాడమ్ ఏ విషయంలోనూ కలుగజేసుకోదు. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు"
"నీకు అన్నిటికీ అనుమానమే"
"సడన్ గా నీ మీద ఆమెకు ఎందుకు అంత ప్రేమ? నాకెందుకో డౌట్ గా ఉంది"
"అదే నాకూ అర్ధం కాలేదు"
ఇద్దరూ ఆలొచనలో
ఉన్నప్పుడు నర్స్ కల్యాణి లోపలకు వచ్చింది.
"జానకీ, నిన్ను మ్యాడమ్ పిలుస్తోంది"
"ఎందుకు?"
"నాకేం తెలుసు. రమ్మని చెప్పారు"-- అని చెప్పి
వెళ్ళిపోయింది.
"సరే...నాకు డ్యూటీ ముగిసింది. నేను బయలుదేరుతాను జానకీ.
నువ్వెళ్ళి ఏమిటో చూడు" అని చెప్పి నర్స్ పద్మ కూడా బయలుదేరింది.
'ఏమై ఉంటుంది?' - అనే ఆలొచనతో గాయత్రి యొక్క గది వైపు నడవటం మొదలుపెట్టింది జానకి.
తలుపు మీద తట్టి
లోపలకు వచ్చిన జానకిని చూసి... 'వచ్చేసిందా నా చిట్టి తల్లి?'….ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లు కుర్చీలో నుండి లేచి వెళ్ళి
స్వాగతించి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది గాయత్రి.
తన చెల్లిని
చూడాలనిపించిందే తప్ప, ఆమెతో ఏం
మాట్లాడాలో తెలియక భాష మరిచి మౌనంగా నిలబడ్డ గాయత్రిని చూసి......
'ఈమెకు బుర్ర ఏమైనా చెడిపోయిందా ఏమిటి?' అనేలాగా గాయత్రినిని చూస్తూ ఉండిపోయింది జానకి. తరువాత
ఓర్పు కోల్పోయింది. "మ్యాడమ్...రమ్మని చెప్పారట?" అన్నది.
"ఏమిటీ?... ఏమీలేదు.
వచ్చి...అదే...రమేష్ దగ్గర నుండి ఫోన్ ఏదైనా వచ్చిందా?"
‘లేదు’ అనేలాగా జానకి తల
ఊపేటప్పుడు జానకి మొహంలో కనబడ్డ శోకం గాయత్రినిని కాల్చింది. దాన్ని చూడలేక,....
"సరే...నువ్వెళ్ళు" అన్నది. జానకి వెళ్ళిన కొన్ని
నిమిషాల వరకు ఆలొచనలో కూరుకుపోయింది.
'కావ్యా...నా చిట్టి తల్లీ! నీలో ఏర్పడే చిన్న శోకాన్ని కూడా
నా హృదయం తట్టుకోలేకపోతోంది. ఏం చేయను? నీ శోకానికి కారణం తెలియని దానినా నేను? కొంచం వైట్
చెయ్యి. నీకైన సంతోషం నీ ఇళ్ళు వెతుక్కుంటూ వచ్చేటట్టు చేస్తాను’
తన కుర్చీలో
కూర్చుని బాలాజీకి ఫోన్ చేసింది గాయత్రి.
"ఏమైంది...అడ్రస్ దొరికిందా?"
"మీ ‘సెల్’ ఫోన్ కట్ చేసి గుమ్మంవైపు ఒకసారి చూడండి"
ఆమె తలెత్తి
గుమ్మం వైపు చూసినప్పుడు అద్దాల తలుపు తోసుకుంటూ లోపలకు వచ్చాడు బాలాజీ.
"ఇదిగోండి" అంటూ ఒక కాగితం ముక్కను అమె ముందు జాపాడు.
"వద్దు...నీ దగ్గరే ఉంచుకో. రా...వెళదాం" అంటూ లేచి బయలుదేరింది. గాయత్రి వెనుకే నడిచాడు బాలాజీ.
PART-11
ఆ ఎర్ర రంగు కారు వీధి పక్కగా తన శ్వాసను ఆపుకుంది. బాలాజీ, గాయత్రి అందులోంచి దిగి నడిచి-రోడ్డు దాటి ఎదురుగా ఉన్న కాంపౌండ్ గేటును
తెరుచుకుని లోపలకు దూరి, కాలింగ్ బెల్ కొట్టి వైట్ చేశారు.
ఒక తలుపు మాత్రం
తెరిచిన ఒక ఆవిడ తొంగి చూసి గాయత్రిని చూడటంతో గబుక్కున నవ్వుతూ హడావిడిగా ఆమె
దగ్గరకు వెళ్ళింది.
"రామ్మా గాయత్రీ. ఏదో ఒక రోజు నువ్వు ఇలా వచ్చి నిలబడతావని
తెలుసు. భార్యా-భర్తల మధ్య వెయ్యి గొడవలు ఉండొచ్చు. అందుకోసం కోపం తెచ్చుకుని
పెట్టె పుచ్చుకుని పుట్టింటికి వెళిపోతే అన్నీ సర్దుకుంటాయా? ఈ నాటి ఆడ పిల్లలకు ఓర్పు అనేది లేనే లేదు. పాపం రమేష్ తమ్ముడు, నువ్వు లేకుండా ఎంత కష్ట పడ్డాడో
తెలుసా నీకు?"
"ఈమె ఏం మాట్లాడుతోంది?"--అన్న కన్ ఫ్యూజన్ లో ఇద్దరూ నిలబడిపోయారు. ఆమె మాట్లాడుతూ
పోతూంటే....గాయత్రికి వొళ్ళు మండుతోంది.
"నిన్ను నా కూతురు అనుకునే చెబుతున్నా గాయత్రీ. అడ్జెస్టు
చేసుకోమ్మా...నీ జీవితం బాగుంటుందమ్మా. రమేష్ తమ్ముడికి మంచి మనసమ్మా. అర్ధం
చేసుకుంటావనుకుంటా. ఇక నీ ఇష్టం. మేడమెట్లు ఎక్కి వెళ్ళండి" అని చెప్పి తన
పని ముగిసినట్లు చటుక్కున వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.
గాయత్రి ఎక్కడ
చూస్తుందోనని వస్తున్న నవ్వును ఆపుకుంటూ మెట్లు ఎక్కటం మొదలుపెట్టాడు బాలాజీ.
వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ బాలాజీ వెనుకే గాయత్రి కూడా మెట్లు ఎక్కటం మొదలు
పెట్టింది.
రమేష్
నివసిస్తున్న ఆ చోటును ఇళ్లు అనడం కంటే కొంచం పెద్ద గది అని చెప్పొచ్చు. ఒక అలమరా
తప్పా ఇంకేమీలేదు. ఒక మధ్య గోడ కూడా లేదు. రూములోని ఒక చివర్లో ఒక చెక్క బల్ల, బల్ల మీద ఒక స్యూట్ కేసు, స్యూట్ కేసు పక్కన కొన్ని కెమేరాలు, ఫోటోగ్రాఫీకి సంబంధించిన పుస్తకాలు,
కొన్ని ఫోటోలు కలిసి పడున్నాయి...వీటన్నిటికంటే గాయత్రి ఫోటోలు
చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని అక్కడి గోడలకు అతికించబడి ఉన్నాయి.
అవి చూసి ఒక్క
నిమిషం స్థభించి తేరుకుంది గాయత్రి.
ఇంటి యజమానురాలు
మాటలకు అర్ధమేమిటో అప్పుడు అర్ధమైయ్యింది ఇద్దరికీ. అదే సమయం.
"వెల్ కమ్ గాయత్రీ" అని వెనుక నుండి గొంతు వినబడింది.
గడ్డాలు, మీసాలు మధ్య కనబడకుండా పోయిన పెదవులను ఒకసారి చూపిస్తూ నవ్వుతూ కనబడ్డాడు
రమేష్.
"ఏమిటిదంతా?" అంటూ గోడలకు అతికించిన తన ఫోటోలను చూపిస్తూ అడిగింది.
"నా యొక్క సంతోషం"
"పిచ్చి పట్టిందా నీకు?
నా అభిప్రాయాన్ని ఆ రోజే చెప్పేశాను. ఆ తరువాత
కూడా...మర్యాదగా ఇవన్నీ తీసి చెత్తలో పడేయ్. అనవసరంగా ప్రాబ్లం చేస్తూ ఉండకు"
"ముగించారా? ఇక్కడకు మీరు ఎందుకు వచ్చారో దానికి కారణం నేను
తెలుసుకోవచ్చా?"
"జీవితంలో మళ్ళీ నీ మొహాన్నే చూడకూడదని అనుకున్నాను. కానీ ఏం
చేయను? నిన్ను వెతుక్కుంటూ రావలసి వచ్చిందే! అంతా నా కావ్...లేదు లేదు...నా స్టాఫ్
జానకి కోసం?"
"జానకి కోసమా...ఆమెకు ఏమిటి సమస్య?"
"నువ్వే సమస్య"
"నాకు అర్ధం కాలేదు"
"ఆహా...మంచి నటన"
"ప్లీజ్ గాయత్రి. నిజంగానే అర్ధం కాలేదు"
“నీకు అర్ధం అయ్యేటట్టు చెప్పేంత ఓపికి నాకు లేదు. జానకి
గురించి మీ ఇంట్లో మాట్లాడావా...లేదా?
ఎప్పుడు పెళ్ళి పెట్టుకుందాం? త్వరగా సమాధానం
చెప్పు"
"గాయత్రీ మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకుని
మాట్లాడుతున్నారు. జానికి నా స్నేహితురాలు...అంతే"
"నీ యొక్క వివాదం నాకు అక్కర్లేదు. నువ్వు జానకిని
ఇస్టపడుతున్నావా...లేదా అనేది కూడా నాకు ముఖ్యం కాదు. ఆమెకు నువ్వు నచ్చావు. నిన్ను
పెళ్ళిచేసుకోవటానికి ఆశపడుతోంది. ఆమె సంతోషమే నాకు ముఖ్యం"
"అరె...నిన్నటి వరకు పిల్లీ-ఎలుకలాగా ఉన్న మీ ఇద్దరి మధ్య
ఇదేమిటి కొత్తగా?"
"అది నీకు అనవసరమైన విషయం. జానకి వ్యవహారానికి మొదట నీ
సమాధానం చెప్పు"
"సారీ గాయత్రీ! నేను ఇంతకు ముందు చెప్పిందే. జానకి నా
స్నేహితురాలుగా ఉండటం వరకే ఆమెకు హక్కు ఉంది"
"యూ రాస్కేల్. ఆమెతో సన్నిహితంగా ఉండి, ఆమె మనసును పాడు చేసి, ఇప్పుడు ఏమీ తెలియనివాడిలాగా మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావ్ నీ మనసులో? మర్యాదగా ఆమె మెడలో తాళి కట్టి కాపురం చేయటానికి దారి చూడు.
లేకపోతే..."
"గాయత్రీ...ప్లీజ్. మీరు బయలుదేరండి. నేను జానకి దగ్గర
మాట్లాడతాను"
"ఏం మాట్లాడతావు?
నీకు యాక్సిడెంట్ జరిగి,
హాస్పిటల్ బెడ్డులో పడుకున్నప్పుడు తిండి, నిద్ర మర్చిపోయి నీ పక్కనే ఉండి నిన్ను చూసుకుంది. మనసు నిండా నీమీద ప్రేమను
నింపుకున్న ఆమె దగ్గరకు వెళ్ళి...నేను నిన్ను ‘ప్రేమించటం లేదు’ అని చెబితే, జానకి తట్టుకోలేదు. ఆమెకు ఏదైన జరిగితే ఆ తరువాత నిన్ను వూరికే
విడిచిపెట్టను...ఇప్పుడే చెబుతున్నాను"
హెచ్చరిస్తున్నట్టు
చెప్పేసి వేగంగా బయలుదేరిన గాయత్రి వెనుకే బాలాజీ కూడా వెళ్ళాడు.
"ప్లీజ్ గాయత్రీ,
నేను చెప్పేది కొంచం వినండి" అంటూ వెనుకే పరిగెత్తుకు
వచ్చాడు రమేష్.
అమె ఆగలేదు. ఆమె
వెళ్ళిన వైపే కదలకుండా చూస్తూ ఉండిపోయాడు రమేష్.
PART-12
ప్రొద్దున్నే సెల్
ఫోన్ మోగటంతో నిద్ర మత్తులో నుండి బయటపడి, సెల్ ఫోన్ ఆన్ చేసి "హలో!" అన్నాడు రమేష్. అవతల ఎవరిదో తడబడుతున్న
గొంతు.
"అదొచ్చి...గాయత్రికి సడన్ గా"
"గాయత్రికి ఏమైయ్యింది?...హలో!" గాబరాగా అడిగాడు రమేష్.
అంతే. అవతల వైపు
మౌనం.
"హలో...హలో" అరిచాడు రమేష్
ఫోన్ కట్ అయ్యింది.
వెంటనే బయటకు
వచ్చి మెట్ల క్రింద ఉన్న బైకు తీశాడు రమేష్.
గాయత్రి ఇంటికి
చేరుకోవటమే ఆలశ్యం, బైకు స్టాండు కూడా
సరిగ్గా వేయకుండా బైకును క్రిందపడేసి లోపలకు పరిగెత్తాడు.
అదే సమయం రోడ్డుకు
అవతలివైపు ఉన్న చెట్టు వెనుక నుండి జానకీనూ, పద్మానూ బయటకు వచ్చారు.
"నేను చెప్పినట్లే జరిగింది చూశావా? ఇప్పుడేమంటావ్ జానకీ?" - అంటూ మాటలు కొనసాగించింది పద్మ. పద్మ మాట్లాడేదేదీ జానకికి వినబడలేదు. కారణం జానకి గాయత్రి ఇంటివైపే
కళ్ళార్పకుండా,
కన్నీటితో చూస్తూ నిలబడింది.
'ఇలా కూడానా నమ్మించి మోసం చేస్తారు? వీళ్ళ ప్రేమ కోసం నన్ను ఒక కవచంలాగా ఉపయోగించుకున్నారా? నాది చెప్పనటువంటి ప్రేమే! చెప్పకుండానే ఉంటాను. పరవాలేదు.
కానీ, గాయత్రి... నువ్వు నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా హృదయాన్ని
కదిలించావే! నాకూ- రమేష్ కు పెళ్ళి చేయాల్సిన పూర్తి బాధ్యత నాది అని మా
అమ్మతో చెప్పావే? నేను నీకు ఏం పాపం చేశాను? నా ఇళ్లు వెతుక్కుంటూ వచ్చావు కదా అని నిన్ను నేను ఏంతో
నమ్మాను. ప్రేమ మాత్రమే గుడ్డిదా? కాదు...అభిమానమూ, వాత్సల్యము కూడా గుడ్దివే! అది నీవలనే నాకు అర్ధమయ్యింది.
సరే...పోనీ. నమ్మించి మోసం చేసినందుకు ధ్యాంక్స్. కపటం కలిసిన నీ కళ్ళను చూడటానికి
నాకు ఇష్టం లేదు. నేను వెళుతున్నాను’
ధారగా కారుతున్న
కన్నీటిని తుడుచుకుని బయలుదేరబోయిన జానకి చేతులు పుచ్చుకుని ఆపింది పద్మ.
"ఎక్కడికే వెడుతున్నావు?"
"ఇంటికి?"
"నీకేమన్నా పిచ్చా? ఇంతసేపు నేను చెబుతున్నదేమిటి? నీకు ద్రోహం చేశేసి ఇద్దరూ సంతోషంగా ఉండాలని చూస్తున్నారు. నువ్వు...నాకేమిటని? వెడుతున్నావు! వదలకూడదు జానకీ. రెడ్ హ్యాండడ్ గా
దొరికిపోయారు. ఈ చాన్స్ ను నువ్వు వదిలి పెడతావేమోగానీ నేను వదిలిపెట్ట
దలుచుకోలేదు. నీకు నమ్మక ద్రోహం చేసిన ఆ గాయత్రిని బాగా కడిగేసి వస్తాను. నాతో రా
చెబుతాను" అన్న పద్మ జానకి వద్దంటున్నా అమె చేతులు పుచ్చుకుని గాయత్రి
ఇంటివైపుకు నడిచింది.
అదే సమయం...ఇంట్లో
గాయత్రి, రమేష్ మీద అరుస్తోంది.
"నేను చచ్చేపోయినా దాని గురించి బాధ పడటానికి నువ్వెవరు? ఎవరో ఏదో చెప్పారనే కారణం చెబుతూ ఇలా ప్రొద్దున్నే వచ్చి నా
ప్రాణం ఎందుకు తీస్తున్నావు"
"అదొచ్చి...గాయత్రి. మీకేమైందో నన్న భయంతోనే"
"చాలు...నీ పిచ్చి డైలాగులు! నీకొసం ఒకత్తి
కాచుకోనుందే...ఆమె దగ్గరకు వెళ్ళి చెప్పు. మొదట ఇక్కడ్నుంచి బయలుదేరు"
కోపంగా చెప్పిన
గాయత్రిని సూటిగా చూశాడు.
'నన్ను అర్ధం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించవు గాయత్రీ? ఇంకా ఎన్ని రోజులు మన పోరాటం కొనసాగుతుంది? నీ వలన నా హృదయం మాత్రమే బలహీనం అయ్యింది. నా నమ్మకం ఇంకా
చచ్చిపోలేదు. ఇప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోతున్నాను. ఓటమిలు నిరంతరం కావు’ మనసులో అనుకుంటూ, చిన్నగా నవ్వుతూ వేనక్కి తిరిగి నడిచాడు రమేష్.
"ఒక్క నిమిషం. జానకి విషయం ఏమైంది?"
"మైగాడ్...ప్లీజ్ గాయత్రీ. నా మనసంతా మీరు నిండిపోయి
ఉన్నప్పుడు నేనెలా?"
"ఆపు. జానకిని ఎప్పుడు పెళ్ళిచేసుకోబోతావు? దానికి మాత్రం జవాబు చెప్పు"
"జానకీ...జానకీ...జానకీ...ఎవరండీ ఈ జానకీ? నిన్నటి వరకు ఆ అమ్మాయి మీద మీకు రాని ఇంటరెస్టు ఈ రోజు ఎందుకు హఠాత్తుగా వచ్చింది? నేను మిమ్మల్ని 'లవ్' చేస్తున్నాను. మిమ్మల్నే చుటి చుట్టి వస్తున్నాను. అలా
ఉన్నా నా మనోభావాలను కొంచం కూడా అర్ధం చేసుకోకుండా మీరు ఎవత్తో ఒకత్తి కోసం"
"ఆపు" అని గట్టిగా అరిచిన గాయత్రి కొద్దిసేపు తరువాత…..
"జానకి ఎవత్తో ఒకత్తి కాదు"----కొంచంసేపు మౌనంగా ఉండి, ఆ తరువాత మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది."అమె...ఆమె నా
చెల్లెలు"
అది విన్న రమేష్, బాలాజీ మాత్రమే కాదు...బయట నిలబడి రమేష్-గాయత్రీ మాటలను
వింటున్న జానకీ,
పద్మ కూడా ఆశ్చర్యపోయారు.
"అవును..నేను
చెప్పేది నిజం. జానకీ నా చెల్లెలు. అది నేను రుజువు చేయాలంటే నా చిన్న నాటి జీవితం గురించి మీరు తెలుసుకోవాలి"
అని చెబుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తన చిన్ననాటి జీవితం గురించి వాళ్ళకు
చెప్పటం మొదలుపెట్టింది.
PART-13
లక్ష్మీపురం గ్రామమంతా
ఆ రోజు పండుగ వాతావరణం నెలకొన్నది. పంచాయితీ ప్రెశిడెంట్ బాపిరాజు గారి ఇళ్లు జన
సందడితో కోలాహలంగా ఉన్నది. అందరి మొహాలలోనూ సంతోషం వెల్లివిరిసి ఆడుతూంటే, ఆ ఆనందానికి కారణమైన గాయత్రి మొహంలో మాత్రం శొక రేఖలు
కనబడ్డాయి.
ఎందుకు కనబడవు....
నిన్నటి దాకా సీతాకోక చిలుక లాగా ఎగురుతున్న ఆమెను పట్టుకొచ్చి బోనులో అనగదొక్కితే
ఆమెకు సంతోషం ఎలా వస్తుంది? అక్కడికి
వెళ్ళద్దు,
ఇక్కడికి వెళ్ళద్దు, అది ముట్టుకోవద్దు, ఇది
ముట్టుకోవద్దు!'
అని అమ్మ శకుంతలాదేవి ఆజ్ఞలు ఒకపక్క, ఏదో మరోలోకం నుండి వచ్చిన జీవరాసిని వినోదంకోసం చూడటానికి
వచ్చే లాగా ఊరి ప్రజలందరూ ఒక్కొక్కరూ ఆమెను చూసి వెడుతుంటే అది ఆమెలో కోపాన్ని, విసుగుని, శోకాన్నీ ఎక్కువ
చేసింది.
ప్రొద్దున ఇచ్చిన
భోజనం, ఆమె వేళ్ళు ఇక తాకవని తెలిసి మూలగా ఉండిపోయింది. ఒంటరిగా
కూర్చుని ఏవేవో ఆలొచించి చివరికి నీరసంతో సొమ్మసిల్లి నిద్రలోకి వెళ్ళిపోయింది
గాయత్రి.
సాయంత్రం. ఎవరేవరో
వచ్చి లేపారు. నీళ్ళు నిండిని బిందెల మధ్య నిలబెట్టి స్నానం చేయించారు. కొత్త బట్టలు వేయించారు. పూల జడ వేసి
సంతోషించారు. ఆనంద పాటలు పాడారు. తాంబూళం తీసుకుని వెళ్ళిపోయారు.
'ఏం జరుగుతోంది ఇక్కడ?' అని ఆలొచించేలోపు తిరిగి బోనులో బంధీని చేశారు గాయత్రిని. పొడవైన అరుగుకు
చివరగా కొబ్బరి ఆకుల గుడార పందిరిలో కూర్చుని మళ్ళీ ఆలొచనలలో మునిగింది గాయత్రి.
అన్ని పనులూ
ముగించుకుని అలసిపోయి వచ్చిన బాపిరాజు-శకుంతలాదేవి దంపతులు అరుగుకు మరో చివర
కూర్చున్నారు.
"అమ్మాయ్ భొజనం చేసిందా శకుంతలా?" భార్యను అడిగాడు బాపిరాజు.
"భోజనం ఎప్పుడో ఇచ్చేము. భోజనం చేసిందా అనేది
తెలియదు"
అరుగుకు చివరగా
జరిగి కొబ్బరి ఆకుల గుడారం వైపు చూస్తూ "అమ్మా గాయత్రీ " అన్నాడు
బాపిరాజు.
తండ్రి అలా
పిలవంగానే 'ఓ' అని ఏడవటం
మొదలుపెట్టింది గాయత్రి. ఏమైందో, ఏమిటో అనుకుని
గుడారం తడిక తలుపు తెరుచుకుని తొంగి చూశాడు తండ్రి బాపిరాజు. పెద్ద మనిషి
అయితే
"ఏమిట్రా...ఏమైందిరా?"
"నన్ను ఎందుకు నాన్నా ఇక్కడ కూర్చోబెట్టారు? నాకు ఇక్కడ భయంగా ఉన్నది"
"అదా విషయం" అని గట్టిగా నవ్వి, "నేనుండుంగా ఎందుకురా భయపడతావు? ఇదంతా ఒక రెండు రోజులే. ఆ తరువాత...."
"ఏం చెప్పారు?" భర్త మాటలకు అడ్డుపడింది భార్య శకుంతలాదేవి.
"ఐదో రోజు సంబరం ముగిసేంతవరకు అది ఇక్కడే ఉండాలి"
"ఏమిటి శకుంతలా...నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉన్నావు! ఈ
రోజుల్లో ఎవరు ఇలా చేస్తున్నారు?"
"మిగిలిన వాళ్ళ సంగతి గురించి నాకు అనవసరం. నేను మన
సంప్రదాయాలను గౌరవించి నడుచుకునే దానిని. మీ చూపులకు నేను పాత పంచాంగంలాగే
ఉండిపోతాను. కానీ, ఈ ఇంటి వరకు నేను
చెప్పేదే వేదవాక్కు. నేను చెప్పింది వినితీరాల్సిందే. చెప్పేశాను"
"ప్లీజ్ అమ్మా. ఈ రోజు స్కూలుకు లీవు పెట్టాను. ఇంకా అన్ని రోజులు
సెలవు పెడితే నా చదువు పాడైపోతుంది"
"అవును. నీది పెద్ద ఐ.ఏ ఎస్ చదువు చూడు. ఆ కాలంలో నేను
వయసుకు వచ్చిన తరువాత స్కూలు పక్కకే వెళ్లలేదు తెలుసా? ఏడో క్లాసు వరకు నువ్వు చదువుకున్నది చాలు. త్వరగా నీకు
పెళ్ళి చేసి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది"
"ఏయ్! శకుంతలా, కూతురు దగ్గర ఎప్పుడు, ఏం మాట్లాడాలో
నీకు జ్ఞానం లేదా? పాపం...చిన్న
పిల్లనే అది. ఈ వయసులోనే అది పెద్ద మనిషి అయ్యిందే నని నేను భాదపడుతూ
కూర్చున్నాను. దాని దగ్గర పోయి పెళ్ళి అది,ఇదీ అని మాట్లాడుతున్నావు? నా కూతుర్ను నేను
డాక్టర్ కి చదివించబోతాను. దాని తరువాతే పెళ్ళి. ఏమ్మా తల్లీ...నాన్న చెప్పేది
కరెక్టే కదా?"
అన్నాడు కూతురు వైపు తిరిగి.
"అవును నాన్నా. నేను డాక్టర్కు చదివి మన పేరయ్య తాతకు డబ్బులు తీసుకోకుండా సూది మందు వేయాలి"
ఆమె చెప్పింది
విని తల్లితండ్రులిద్దరూ నవ్వారు. వాళ్ళ నవ్వులతో గాయత్రి నవ్వు కూడా కలిసిన సమయం, వాకిట్లో ఎవరో పిలుస్తున్న పిలుపు విని ముగ్గురూ తిరిగి
చూశారు.
వీళ్ళ గుమాస్తా
ఈషారాం నిలబడున్నాడు. అతనితో పాటు ఒక అమ్మాయి తడబడుతూ వచ్చి నిలబడటం చూసి
బాపిరాజు-శకుంతలాదేవి అరుగు మీద నుండి లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు.
"ఎవరు ఈషారాం...ఈ అమ్మాయి ఎవరు?"
"తెలియదయ్య గారూ. మన మామిడి తోటలో ఒక చివర ఏడుస్తూ ఒంటరిగా
నిలబడుంది. 'ఎవరమ్మా?' అని అడిగితే నోరు
తెరవటంలేదు. రాత్రి సమయం అవుతోంది...అందుకని ఇక్కడికి తీసుకు వచ్చాను"
"ఏమిటి, ఎందుకు అని
విచారించి అలాగే పంపించకుండా ఎందుకురా ఇక్కడికి తీసుకు వచ్చావు?" అన్నది శకుంతలాదేవి. చూసిన వెంటనే ఆ అమ్మాయి నచ్చకపోవటంతో
ఆమె మాటలలో కఠినత్వం కనబడింది.
"కాసేపు మాట్లాడకుండా ఉంటావా శకుంతలా. పాపం ఆ అమ్మాయి.
రాత్రి సమయం,
దారి తెలియక దారి తప్పి వచ్చుంటుంది...మనం విచారించి
చూద్దాం" అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగారు బాపిరాజు.
"ఏమ్మా...నీ పేరేమిటి?"
"ప్రమీల"
"ఇక్కడికి ఎలా వచ్చావు? నీ సొంత ఊరు ఏది?"
ఆయన అడిగిన వెంటనే
ఆలశ్యం చేయకుండా...గబుక్కున కాళ్ల మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి చేసిన
హడావిడికి బాపిరాజు గారు వెనక్కు వెళ్ళారు.
"మొదట లేవమ్మా...ఏమైందో చెప్పు"
"అయ్యగారూ! మా నాన్న ఒక తాగుబోతు. మా అమ్మను వదిలేసి ఇంకో
పెళ్ళి చేసుకోని వెళ్ళిపోయారు. పొట్టకూటి కోసం నేనూ, మా అమ్మా దొరికిన పనిని చేస్తూ కాలం గడుపుతున్నాము. పోయిన
నెల ఆరోగ్యం బాగుండక అమ్మ చనిపోయంది. పక్క ఉరిలో కట్టడాల కూలి పని చేసుకుంటున్న
నాతో కొంతమంది తప్పుగా ప్రవర్తించారు. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతూ
దారి తెలియక ఈ ఊరికి వచ్చి జేరాను. అయ్యాగారూ, మిమ్మల్ని చూస్తే మంచివారిలాగా కనబడుతున్నారు. నన్ను ఇక్కడ్నుంచి పంపించకుండా
ఏదైనా పని ఇచ్చి కాపాడండయ్యా. మీకు పుణ్యం వస్తుంది" అని బ్రతిమిలాడింది.
"ఇలా చూడు. ఇక్కడ పనిచేయటానికి చాలా మంది ఉన్నారు. నువ్వు
మొదట ఇక్కడ్నుంచి బయలుదేరు" అన్నది శకుంతలాదేవి.
"అది కాదు...నేను" అంటూ ఏదో చెప్పబోయిన భర్తను
అడ్డుకుంది శకుంతలాదేవి.
"మీరు ఏమీ చెప్పొద్దు. ఆకతాయి పిల్లలు ఏ ఊర్లో లేరు? ఈమెకు ఈ ఊర్లో ఆశ్రయం కలిపించి, ఈమెకు ఏదైనా జరిగితే మనమే ఊర్లో అందరికీ జవాబు చెప్పాలి.
అదే ఈమె పెళ్ళి చేసుకుని భార్య-భర్తలుగా వచ్చి సహాయం అడిగుంటే దారాలంగా చేయచ్చు.
మాట్లాడకుండా నేను చెప్పేది చెయ్యండి. ఖర్చులకు కొంచం డబ్బులిచ్చి ఈమెను పంపించి
మీ పని చూసుకోండి" చెప్పింది శకుంతలాదేవి.
భార్య చెప్పేది
సబబే నని అనిపించినా బాపిరాజు గారికి మనసు అంగీకరించలేదు. ఆయన ఆలొచిస్తూ నిలబడటం
చూసిన ప్రమీల ఆయన డబుల్ మైండులో ఉన్నాడని అర్ధం చేసుకుంది.
"నాకు డబ్బులంతా వద్దయ్యగారు. నేను వెళ్తాను”--కళ్ళల్లో
వస్తున్న నీటిని తుడుచుకుంటూ వెనక్కు తిరిగింది ప్రమీల.
"ఈషారాం, ఈమెను తీసుకు వెళ్ళి
బస్సు ఎక్కించి రారా" అన్నది శకుంతలాదేవి.
"సరేనమ్మగారు" అని చెప్పి ప్రమీలతో పాటూ బయలుదేరాడు
ఈషారాం.
ఇద్దరూ ఇంటి గేటు
ముట్టుకున్నప్పుడు గట్టిగా అరిచాడు బాపిరాజు.
"ఒక్క నిమిషం ఆగు ఈషారాం. ఇద్దరూ ఇక్కడికి రండి"
ఇద్దరూ
వచ్చారు...అర్ధంకాక చూశారు.
"నేనొకటి చెబితే చేస్తావారా ఈషా?"
"ఏమిటయ్యగారు ఈ ప్రశ్న? మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాను. ఏం చేయాలో ఆజ్ఞ వేయండి"
"అయితే సరే. ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకో"
"అయ్యగారూ...నేను"
"ఆలొచించకురా. నా మాట మీద నీకు నమ్మకం లేదా?"
"సరే అయ్యగారూ. మీ ఇష్టం"
"నువేమ్మా చెబుతావు?"
ఆమె సమాధానం ఏమీ
చెప్పకుండా ఈషారాం దగ్గరగా వెళ్ళి నిలబడింది.
బాపిరాజు గారి
మనసులో ప్రశాంతత ఏర్పడింది. ఎందుకు ఏర్పడదు...సహాయం అని ఎవరైనా అడిగి వస్తే ఉత్త
చేతులతో పంపే అలవాటులేని మనిషాయే!.
మరుసటి రోజు ఊరి
జనం ముందు ఈషారం భార్య అయ్యింది ప్రమీల. బాపిరాజు గారు తన మామిడి తోటలో ఈషారం కోసం
ఏర్పాటు చేసి ఇచ్చిన ఆ చిన్న గుడిసె ఇప్పుడు ఇంకొక జీవిని స్వాగతించేందుకు
కాచుకోనుంది.
PART-14
చివరికి
శకుంతలాదేవి పట్టుదలే గెలిచింది!
ఐదో రోజు సంబరం
అత్యంత విషేషంగా జరిగి ముగిసింది. ఆ తరువాత ఇదిగో ఈ రోజు స్కూలుకు బయలుదేరింది
గాయత్రి.
లంగా-వోణి, రెండు జడలతో తన ముందుకు వచ్చి నిలబడ్డ గాయత్రిని చూసి మైమరిచి కళ్ళార్పకుండా
చూసింది శకుంతలాదేవి.
'నిజమే. లోకంలోని అందం మొత్తాన్నీ ఒకటిగా చేర్చి దేవుడు గాయత్రిని
మాత్రమే పుట్టించాడు. ఏడో క్లాసు చదువుతున్న గాయత్రికి వయసుకు మీరిన ఎదుగుదల.
పక్వం లేని పరువము. కానీ గాయత్రి పాపం! పసిపిల్ల మనసున్న గాయత్రిని తొందరపడి పదేళ్లకే పెద్ద మనిషిని చేయడం
అవసరమేనా....ఏం చేయగలం? ప్రకృతి యొక్క చేష్ట ఇది!’
"ఏమిటే...నా కూతుర్ని కళ్ళార్పకుండా చూస్తూ నిలబడ్డావు?" అంటూ వచ్చాడు బాపిరాజు.
"ఏమండి...ఎంత అందంగా ఉందో చూశారా? నా దిష్టే తగిలేటట్టుంది. మీరు కావాలంటే చూడండి...మన అమ్మాయి మహారాణిలాగా
జీవిస్తుంది" అన్న తల్లి శకుంతలాదేవి,
గాయత్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుని కూతుర్ను తన చెంతకు
లాక్కుని గుండెలకు హత్తుకుంది.
తల్లి శ్వాశగాలి
తగిలి పులకరించిపోయింది గాయత్రి.
"మరి నీ కూతురు నీ లాగానే కదా ఉంటుంది" అంటూ ఓర చూపుతో
భార్య అందాన్ని ఆరాధిస్తున్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి.
గబుక్కున తల
తిప్పుకుని "వెళ్దామా గాయత్రి?" అంటూ బయటకు వచ్చి తన బండిని తీస్తున్నప్పుడు, వెనుక నుండి
వినబడ్డ పిలుపు విని వెనక్కి తిరిగారు బాపిరాజు గారు.
"ఏమిటి మామయ్యా. బయలుదేరారా? ఎరువు కొనడానికి నేను కూడా టౌనుకే వెలుతున్నాను. కావాలంటే
గాయత్రిని నేను స్కూల్లో దింపనా?" అడుగుతూ గాయత్రి వైపే చూశాడు వెంకన్న.
వెంకన్న గాయత్రిని
చూసే చూపులో ఆకలి, కసి కనబడింది. ఆ చూపులోని భావన అర్ధంకాక స్నేహంగా నవ్వింది
గాయత్రి. అదే సమయం మధ్యాహ్నం లంచ్ బాక్స్ ను తీసుకుని బయటకు వచ్చిన శకుంతలాదేవిని
చూసి వెంకన్న జారుకున్నాడు. ఊరి ప్రజలకు బాపిరాజు గారి మీద ఎంత మర్యాద
ఉన్నదో....శకుంతలాదేవి మీద అంతకన్న ఎక్కువ భయం ఉన్నది. కానీ అందరూ అహంకారం లేని
ఆమె అధికారానికి కట్టుబడి ఉంటారు.
దూరంగా వెడుతున్న
వెంకన్ననే కోపంగా చూస్తూ ఉండిపోయిన శకుంతలాదేవి గాయత్రి వైపు తిరిగింది.
"ఇలా చూడు గాయత్రీ. నేను చెప్పిందంతా జ్ఞాపకముంచుకో. ఏ
మగాడితోనూ నిలబడి మాట్లాడటమో- నవ్వనో కూడదు. ఇళ్లు వదిలితే స్కూలు, స్కూలు వదిలితే ఇళ్లు అనే ఉండాలి...అర్ధమైందా?"
సరి అనేలాగా తల
ఊపింది గాయత్రి.
"అబ్బా! మళ్ళీ మొదలు పెట్టిందా? నువ్వు రారా...మనం వెళ్దాం" అన్న బాపిరాజు, గాయత్రిని బండిలో
ఎక్కించుకుని బయకుదేరారు.
వాళ్ళిద్దరూ
కళ్ళకు కనబడేంత దూరం వరకు చూసి ఇంటిలోపలకు వెళ్ళింది శకుంతలాదేవి.
క్లాస్ రూముకు
గాయత్రి కొత్తగా వచ్చిందా...గాయత్రి వచ్చినందువలన క్లాస్ రూము కొత్తగా ఉన్నదా? అనే కన్ ఫ్యూజన్ లోనే ఆ రోజు గడిచిపోయింది. సహ విధ్యార్దుల ఎగతాలి, నవ్వులాటలు గాయత్రిని మరింత
సిగ్గులోకి తీసుకు వెళ్ళింది. స్కూలు టైము ముగిసిందో లేదో...సీతాకోక చిలుకులాగా
ఎగురుకుంటూ వచ్చి నిలబడున్న తండ్రి బండిపై ఎక్కి కూర్చుంది. బండి ఇంటివైపుకు
వెళ్ళింది.
సాయంత్రం టిఫిన్
తో కూతురుకి స్వాగతం పలికి, ఆశతో ప్రేమను కురిపించి తన పనికొసం లోపలకు వెళ్ళింది
శకుంతలాదేవి. తల్లి ప్రేమలో తనని తానే మరిచిపోయింది గాయత్రి. కానీ ఆ తల్లి స్పర్ష, ప్రేమ ఇక తనకు దొరకదని అప్పుడు ఆమె తెలుసుకోలేకపోయింది.
హోమ్ వర్క
చేయటానికని పుస్తకం తీసినప్పుడు అందులో నుండి ఒక కాగితం బయట పడటంతో...తీసి
కాగితాన్ని మడత విప్పింది గాయత్రి. చదివింది. నవ్వు కుంటూ మళ్ళీ మళ్ళీ
చదివింది....చివరగా ముఖమంతా చెమట పట్టగా చదివిన కాగితాన్ని మడతపెట్టి, ముఖం తుడుచుకుని తలెత్తింది. ఎదురుగా తల్లి శకుంతలాదేవి. కూతురు ముఖం చూసిన
వెంటనే ఏదో తప్పు జరిగిందని అమెకు అర్ధమయ్యింది.
గాయత్రి చేతిలో ఉన్న కాగితాన్ని లాక్కుని చదవటం మొదలుపెట్టింది.
‘ప్రియమైన గాయత్రికి,
రెండు వారాలు
చనిపోయిన తరువాత ఈ రోజే నిన్ను కలుసుకుంటున్నా. చూసిన క్షణం నుంచి నీతో
మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాను. కుదరలేదు. అందుకే ఈ లేఖను రాస్తున్నాను. నీతో ఒక
విషయం చెప్పాలి. మన స్నేహ వలయం దాటి నేను నిన్ను ఇష్టపడి చాలా రోజులు అయ్యింది. ఇక
నాకు ఓర్పు లేదు. ప్రేమ నిండిన హృదయాన్ని మోస్తూ నీకొసం వైట్ చేసింది చాలు. 'ఐ లవ్ యూ గాయత్రీ. నా స్నేహాన్ని ఆమొదించినట్లే నా ప్రేమనూ అమొదిస్తావనే
నమ్మకంతో కాచుకోనుంటాను. రేపు కలుద్దాం'
ఇట్లు
నీ మోహన్.
వెలుతురు లేక
చీకటిగా ఉన్న ఇల్లు.
'తల్లీ-కూతుర్లు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు?' అన్న ఆలొచనతో లోపలకు వచ్చారు బాపిరాజు. 'స్విచ్' వేసి ఇంట్లో వెలుతురును తీసుకువచ్చారు. ఇంట్లోని పరిస్థితి
వెలుతురులో తెలిసిపోయింది. రూమంతా విరిగి పడిన వస్తువులు. మధ్యలో ఒక మూల
పిచ్చిదానిలాగా కూర్చున్న శకుంతలాదేవి. ఆమె కాళ్ళ దగ్గర చుట్ట చుట్టుకుని పడున్న గాయత్రి.
పరిగెత్తుకెళ్ళి
కూతుర్ని ఎత్తి తన ఒడిలో వేసుకున్నారు. ఆమె పరిస్థితి చూసి ఆందోళన చెందారు. వాతల
లాంటి ఎర్రటి నెత్తుటి గీతల శరీరంతో,
నొప్పులు భరించలేక గొణుగుతూ పడున్న గాయత్రి తండ్రిని చూసిన
వెంటనే మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది.
"నాన్నా...ప్లీజ్ నాన్నా. మీరైనా అమ్మ దగ్గర చెప్పండి. మోహన్
నా స్నేహితుడు మాత్రమే. సైన్స్ పాఠాలలో ఏదైనా సందేహాలోస్తే అతనే నాన్నా నాకు
చెప్పిస్తాడు. అంతకంటే ఈ 'లెటర్’ కు నాకూ ఎటువంటి సంబంధమూ లేదు నాన్నా. మీరైనా నన్ను
నమ్మండి"
ఏడుస్తూ
బ్రతిమిలాడుతున్న కూతుర్ను లేపి తన భుజాలపై అనించుకుని నిదానంగా నడిపించుకుంటూ
తీసుకు వెళ్ళి గదిలో పడుకోబెట్టిన తరువాత భార్య శకుంతలాదేవి దగ్గరకు వచ్చారు.
"ఏమే...మనిషేనా నువ్వు?
గాయత్రి పాపమే. పసిపిల్ల వొళ్ళు, పసిపిల్ల మెదడు. గొడ్దును బాదినట్లు బాది దాన్ని నెత్తుటి గుల్ల చేశావు కదే! మనస్సాక్షి అనేది
ఉందా...లేదా నీకు?"
ఆయన అడిగిన వెంటనే
పొంగుకు వస్తున్న ఏడుపును ఆపుకోలేక గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది శకుంతలాదేవి.
"ఏమండీ... గాయత్రి మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్ళదు కదా!
ఊరులో, బయట జరుగుతున్నట్లు మనింట్లో ఏ తప్పూ జరగదు కదా? నాకు నా కూతురు
కావాలి. గాయత్రి మనకు మాత్రమే సొంతం?
నేను చూసే అబ్బాయినే అది పెళ్ళి చేసుకోవాలి. కాదూ కూడదు
అంటూ ఇంకేదైనా చేస్తే...దాని తరువాత నేను ప్రాణాలతో ఉండను"
"ఏమిటే ఆలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? గాయత్రి మన కూతురే. అది ఏ తప్పూ చేయదు. నీ అనుమానాన్ని తీసుకెళ్లి చెత్త
కుండీలో పడేయ్"
సమాధాన పరచిన భర్త
గుండెల మీద ఆనుకుని తన ఆవేశాన్ని తగ్గించు కుంటున్న శకుంతలాదేవి హడావిడిగా
లేచింది.
"భగవంతుడా... నా కూతుర్ని గొడ్డును బాదినట్లు బాదేనే! అది
నొప్పి తట్టుకోలేదే. అమ్మా తల్లీ" అంటూ గాయత్రి గదివైపు పరిగెత్తింది
శకుంతలాదేవి.
ఏడ్చి ఏడ్చి
అలసిపోయి పడుకున్న గాయత్రిని చూసిన వెంటనే తల్లికి గుండె తరుక్కు పోయింది. గబ గబా
వంట గదిలోకి వెళ్ళి పసుపు తీసుకుని,
అందులో వేడి వేడి నెయ్యిని కలిపి ఉడకబెట్టి పేస్టులాగా
చేసుకుని తీసుకు వచ్చింది. గాయత్రిని తన ఒడిలే పడుకోబెట్టుకుని దెబ్బల గాయాలకు రాసింది.
తల్లి కళ్ల నుండి వెలువడిన కన్నీరు బొట్లు బొట్లుగా తన మీద పడ్డా తెలియకుండా
పడుకుంది గాయత్రి.
PART-15
స్కూల్ హెడ్
మాస్టర్ ముందు నిలబడున్నారు బాపిరాజు, శకుంతలాదేవి. ఎదురుగా చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడున్నాడు మోహన్.
అప్పుడే హడావిడిగా
లోపలకు వచ్చాడు వెంకన్న. అతనితో పాటు అతని అక్కయ్య. బాపిరాజు గారిని అక్కడ ఎదురు
చూడని వెంకన్న,
బాపిరాజు గారి దగ్గరకు వెళ్ళాడు.
"మామయ్యా...మీరెందుకు ఇక్కడ ఉన్నారు?" అని అతను అడిగి ముగించేలోపు,
"అదే నేనూ అడుగుతున్నాను. ఈ అబ్బయి మీకేమవుతాడు?" వెంకన్నను అడిగాడు హెడ్ మాస్టర్.
"వీడు నా అక్కయ్య కొడుకు. ఈమే మొహన్ తల్లి. నాకు
అక్కయ్య"
"ఓహో, ఏమ్మా మీ అబ్బాయి
ఏం చేశాడో మీకు తెలుసా? సార్ ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మాయినే! ఊహూ...మీ దగ్గర మాట్లాడి లాభం లేదు.
ఇప్పుడే టి.సి ఇచ్చేస్తాను. తీసుకుని వెళ్ళిపొండి"
"సార్...దయచేసి ఈ ఒక్కసారికి వాడ్ని క్షమించండి. ఇక మీదట ఇలా
జరగ కుండా చూసుకుంటాను" అంటూ కాళ్ళ మీద పడినట్లే బ్రతిమిలాడింది మొహన్ తల్లి.
"అవును మామయ్యా...మీరు కొంచం చెప్పండి. ఇక మీదట ఇలా జరగదు.
దానికి నేను బాధ్యుడ్ని" అంటూ బాపిరాజు గారి దగ్గర బ్రతిమిలాడాడు వెంకన్న.
"అదంతా కుదరదు. ఈ విషయం బయటకు తెలిస్తే మా స్కూలుకే
చెడ్డపేరు వస్తుంది. ఏదో సారు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా నా ముందుకు తీసుకు వచ్చారు
కాబట్టి నేను తప్పించుకున్నాను. అది జరిగే పనికాదు. నేను ఒకసారి డిసైడ్ చేసింది
చేసిందే"
పట్టుదలతో
మాట్లాడుతునే ఉన్నారు హెడ్ మాస్టర్.
బాపిరాజు గారికి
జాలి గుణం ఎక్కువ. అది ఆయన్ని మౌనంగా ఉంచలేకపోయింది.
"సరే...వదిలేయండి సార్. అబ్బాయి చదువు విషయం కూడా ఇందులో
పొదిగి ఉంది. చిన్న పిల్లాడు. ఖండించి, వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం" అన్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి.
"సరే...సార్ చెప్పినందువలన విడిచిపెడుతున్నాను. అబ్బాయికి
మంచి బుద్దులు నేర్పి పంపండి" అని చివరగా దిగివచ్చారు హెడ్ మాస్టర్.
"చాలా ధ్యాంక్స్ అండి. ధ్యాంక్స్ మామయ్యా" అని చెప్పిని
వెంకన్నతో,
"ఈ విషయం మన ఊర్లో ఎవరికీ తెలియకూడదు
వెంకన్నా...జాగ్రత్త" అని చెప్పిన బాపిరాజు గారితో 'సరే' అంటూ తల ఊపి మోహన్ని, తన సహోదరిని పిలుచుకుని బయటకు వెళ్ళాడు వెంకన్న.
"అయితే మేము కూడా బయలుదేరతాం సార్" అని హెడ్ మాస్టర్ కి
చెప్పి బయలుదేరబోయిన బాపిరాజు గారితో,
"సార్, ఇది కారణంగా
తీసుకుని మీ అమ్మాయిని స్కూలుకు పంపకుండా ఉండకండి. గాయత్రి బాగా చదువుకునే
పిల్ల" అన్నాడు హెడ్ మాస్టర్.
"ఛ...ఛ! మా అమ్మాయి తప్పకుండా స్కూలుకు వస్తుంది" అని చెప్పి భార్యను తీసుకుని బాపిరాజు గారు
కూడా బయలుదేరారు.
మరుసటి రోజు నుండి
గాయత్రి స్కూలుకు వెళ్లటం మొదలుపెట్టింది. కానీ, శకుంతలాదేవికి అది కొంచం కూడా ఇష్టం లేదు. కూతుర్ని కారణంగా
పెట్టుకుని దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అది రోజు రోజుకూ పెరిగి పెద్దదవుతోంది.
ప్రతి రోజూ గాయత్రి స్కూల్ నుండి వచ్చిన వెంటనే గాయత్రి పుస్తకాల సంచిని వెతికి
చూడటం రోజువారి పనులలో ఒకటిగా పెట్టుకుంది శకుంతలాదేవి. దాని గురించి బాపిరాజు గారు ఏదైనా అడిగితే
మళ్ళీ ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలవుతుంది. ఈ సమస్యకు మాత్రమే
కాకుండా...తల్లి-తండ్రులు మధ్య గొడవలకు తానే కారణం అనే భావన గాయత్రిని పట్టి
పీడించడం మొదలుపెట్టింది. తన కుటుంబం కొంచం కొంచంగా సంతోషానికి దూరమవుతుండటం
గ్రహించి తట్టుకోలేక తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది.తనతో మాట్లాడమని
బ్రతిమిలాడింది.
శకుంతలాదేవి ఏమో
కూతుర్ను బద్రకాళి లాగా చూసింది. కావాలని కూతురుకు దూరంగా జరిగింది.
"నేను ఏం తప్పు చేశాను నాన్నా? అమ్మ నాతో మాట్లాడటమే లేదు? నాకు కొంచంగా జలుబు చేసినా తట్టుకోలేదే? అలాంటి అమ్మ ఇలా మారిపోయిందే?"
తన ఒడిలో ముఖం
చాటుగా పెట్టుకుని ఏడుస్తున్న కూతురి తల నిమురుతున్న బాపిరాజు మనసు లోలోపల
ఏడ్చింది.
"ఏడవకురా తల్లీ. అమ్మకు నీమీద అనుమానం ఏమీ లేదమ్మా. నాకంటే
మీ అమ్మకేరా నీమీద ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమను ఆవిడ నాజూకుగా చూపలేక పోతోంది...అంతే.
అదికూడ ఒక విధంగా మూర్ఖంగా చూపించే తల్లి ప్రేమే. తన కూతురుకి ఏమీ తప్పుగా
జరగకూడదనే భయం...అంతే తల్లీ. నిజానికి మీ అమ్మ తన ప్రాణం అంతా నీమీదే పెట్టుకుంది తెలుసా? నువ్వు కొంచం నిదానంగా ఉండు. అంతా తానుగా సర్దుకుంటుంది"-
-అని కూతుర్ని సమాధాన పరిచే ప్రయత్నంలో మునిగిపోయారు బాపిరాజు.
తండ్రి యొక్క
మాటలు గాయత్రికి కొంత ఊరట కలిగించటంతో కళ్ళు తుడుచుకుని ఉత్సాహంతో తండ్రి ముఖంలోకి
చూసింది.
"అమ్మకు నా మీద నమ్మకం రావాలంటే నేనేం చేయాలి నాన్నా?"
"త్వరగా పెళ్ళి చేసుకోవాలి" వెనుక నుండి వినబడ్డ మాటలు
విని ఆశ్చర్యంతో వెనక్కు తిరిగారు ఇద్దరూ.
శకుంతలాదేవి
నిలబడుంది.
"ఏమిటే వాగుతున్నావు? చిన్న పిల్లనే అది"
"నేను మాత్రం కాదనా చెప్పాను! అది వయసుకు వచ్చింది కదా...ఇంకేమిటి? నాకు నా పరువు-మర్యాద ముఖ్యం"
"శకుంతలా...నువ్వు చేసేది చాలా అన్యాయం"
"ఏది న్యాయం-ఏది అన్యాయం అనేది నాకు బాగా తెలుసు. అది మీరు
నాకు నేర్పించాల్సిన అవసరం లేదు"
"ఏమిటే వాగుతున్నావు?" -- అని భార్యను కొట్టటానికి చెయ్యి ఎత్తిని తండ్రిని అడ్డుకుని
ఆపింది గాయత్రి.
"ప్లీజ్...వద్దు నాన్నా. అమ్మను కొట్టద్దు"-
బ్రతిమిలాడింది.
"చూడు ఎంత అహంకారంగా మాట్లాడుతోందో...నువ్వే చూశావుగా?"
తండ్రిని సమాధాన
పరిచి, తల్లి వైపు తిరిగింది గాయత్రి.
"అమ్మా...నేను పెళ్ళిచేసుకుంటేనే మీకు సంతోషం, ప్రశాంతత దొరుకుతుందంటే మీ ఇష్టం వచ్చినట్లే చేయండి" అన్న గాయత్రి, కళ్ళల్లో నీరుతో లోపలకు పరిగెత్తింది.
PART-16
ఆ రోజు గాయత్రిని
స్కూలుకు తీసుకువెళ్ళి దింపి ఇంటికి వచ్చిన బాపిరాజు గారికి, భార్య పెళ్ళిళ్ల బ్రోకర్ తో మాట్లాడటం వినబడగానే అలాగే
అరుగు మీద కూర్చుండిపోయాడు.
"అదంతా తరువాత మాట్లాడుకుందాం బ్రోకర్! నా కూతుర్ని
పెళ్ళికొడుకు వాళ్ళింట్లో అందరూ నచ్చిందని చెప్పేరా...లేదా? ఆది చెప్పండి మొదట"
"నచ్చిందా అని అడుగుతున్నారా...? భలే అడిగేరు పొండి. మీ అమ్మాయే వాళ్ళింటి కోడలని
వాళ్ళింట్లో వాల్లందరూ తీర్మానమే చేసుకున్నారు. మీ సమాధానం కోసం మాత్రమే వాళ్ళు
కాచుకోనున్నారు. ఒకవేల మీకు వాళ్ళ సంబంధం నచ్చింది అంటే, తాంబూళాలు మార్చుకున్న వెంటనే పెళ్ళి కూడా పెట్టుకోవాలని
అనుకుంటున్నారు. వాళ్ళు అలా తొందరపడుతున్నందుకు ఒక కారణం ఉంది. వాళ్ళింట్లో వయసైన
ఒకావిడ ఉన్నది. నాలుగు వంశాలను చూసింది. ఆవిడ తన చేతులతో తాళి తీసిచ్చే
వాళ్ళింట్లో అన్ని పెళ్ళిల్లూ జరిగినైయట. ఆ వయసైన ఆవిడ ఇప్పుడు సీరియస్ గా ఉన్నదట.
కళ్ళు మూసేలోపల చివరి మనవడి పెళ్ళి కూడా చూడాలని ఆశపడుతోందట. అందుకనే ఇలా ఒక
ఏర్పాటు.
మీరు దేని గురించి
భయపడక్కర్లేదు. చాలా మంచి మనుషులు. ఆ ఇంటి సంబంధం దొరకటానికి మీకు అదృష్టం ఉండాలి.
నా కమీషన్ ఎదురు చూసి నేను ఈ మాట చెప్పటం లేదు. ఆ తరువాత మీ ఇష్టం. వాళ్ళకు ఏం
సమాధానం చెప్పాలో చెప్పారంటే నేను బయలుదేరతాను" అన్నాడు పెళ్ళిళ్ళ బ్రొకర్.
"ఈ రోజే తాంబూళాలు పుచ్చుకుందామని చెప్పేయండి" అన్నది శకుంతలాదేవి.
"నిజంగానే చెబుతున్నారా?" అన్నాడు పెళ్ళి బ్రోకర్, నమ్మలేక.
"అవును...మీరు వెంటనే అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళి విషయం
చెప్పి వాళ్ళింట్లో ఏర్పాట్లు చేయమనండి. మేము వెనకాలే వస్తాం"
"మంచిదండి. అయితే బయలుదేరతాను" అని ఉత్సాహంగా బయలుదేరి
వెళ్ళాడు పెళ్ళిళ్ళ బ్రోకర్.
బ్రోకర్ వెళ్ళిన
తరువాత లోపలకు వెడుతున్న శకుంతలాదేవిని ఆగమని చెప్పి ఆపారు బాపిరాజు గారు.
"నీకేమన్నా పిచ్చి పట్టిందా?
ఆ రోజు ఏదో కోపంలో
చెప్పావనుకున్నాను. కానీ, ఇప్పుడు
నిజంగానే...! వద్దు శకుంతలా, నేను చెప్పేది
కొంచం విను"
"అక్కర్లేదు! టైమవుతోంది...బయలుదేరండి"
“నేను రాను”
"అయితే సరి, నేనే అన్నీ ఖాయం
చేసుకుని వస్తాను"
"వాళ్ళెవరు....ఎలాంటి కుటుంబం. ఇవన్నీ
కనుక్కోకుండనే..."
"నాకు నమ్మకం ఉంది. నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా
జీవిస్తుంది"
"శకుంతలా...నేను..."
"నిర్ణయం తీసుకున్నది తీసుకున్నదే. దాన్ని మార్చటం ఇక ఎవరి
వల్లా కాదు"
నిక్కచ్చిగా
చెప్పి, చివరగా బయలుదేరింది శకుంతలాదేవి.
బస్సు దిగి మట్టి
రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది గాయత్రి. 'నాన్నకు ఏమైంది? ఎందుకు ఈరోజు
నన్ను ఇంటికి తీసుకు వెళ్ళటానికి రాలేదు?-- అన్న ఆలొచనతో వస్తుంటే...ఎవరో తనను పిలవటంతో, నిలబడి వెనక్కి తిరిగింది. ఆయసపడుతూ పరిగెత్తుకుంటూ
వస్తున్నాడు మోహన్.
'అరె భగవంతుడా! వీడు ఎందుకు ఇక్కడకు వచ్చాడు?' -- ఆమె ఆలొచించిన క్షణంలో అతను ఆమె దగ్గరకు వచ్చాడు.
"ఒక్క నిమిషం ఆగు గాయత్రీ. నేను నీతో కొంచం మాట్లాడాలి"
"నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో మోహన్. మా ఊరి వాళ్ళు ఎవరైనా
చూస్తే గొడవ అవుతుంది"
"మాట్లాడి వెళ్ళిపోతాను. ప్లీజ్ గాయత్రీ"
“ఏది మాట్లాడాలనుకున్నా రేపు స్కూల్లో మాట్లాడుకుందాం. మొదట
బయలుదేరు"
"కుదరదు గాయత్రీ. నిన్ను ఒంటరిగా కలుసుకోవటం నాకు ఈ రోజే
కుదిరింది"
"దేవుడా!...సరే, ఏమిటో త్వరగా చెప్పు"
"మొదట నన్ను క్షమించు గాయత్రీ. బుద్ది లేకుండా నేను ఆ రోజు
చేసిన తప్పుకు. పవిత్రమైన మన స్నేహాన్ని అపవిత్రం చేసినందుకు"
"వదిలేయిరా. అదంతా నేను ఆ రోజే మరిచిపోయాను. నువ్వు ఎప్పుడూ
నా స్నేహితుడివే...చాలా?"
"నువ్వు అబద్దం చెబుతున్నావు. నేను నీ స్నేహితుడనేది నిజమైతే
నాతో ఎందుకు మాట్లాడనంటున్నావు?"
"............................"
"నువ్వు మౌనంగా ఉంటేనే అర్ధమవుతోంది. నువ్వు ఇంకా నన్ను
క్షమించలేదని"
"నువ్వు అనుకుంటున్నది నిజం కాదురా"
"అయితే నాకు ప్రామిస్ చెయ్యి.ఇక మీదట మాట్లాడతాను. అంతకు
ముందులాగానే మన స్నేహం కొనసాగుతుంది అని చెప్పు. అప్పుడే నమ్ముతాను"
తన ముందు జాపిన
అతని చేతినే చూస్తూ నిలబడ్డది గాయత్రి.
'శ్రద్దగా చదువుకోవటానికి వెళ్ళామా...వచ్చామా అని ఉండాలి. ఏ
మగడితో పడితే ఆ మగాడితో నిలబడి మాట్లాడటమో, నవ్వనో చెయ్యకూడదు. జ్ఞాపకమున్నదా?'---తల్లి శకుంతలాదేవి , కళ్ళ ముందు కనబడి
కళ్ళు పెద్దవి చేసుకుని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది గాయత్రికి.
అప్పుడు...తాంబూళాల
కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తోంది శకుంతలాదేవి. దూరం
నుండి వస్తున్నప్పుడే మోహన్ తో కూతురు మాట్లాడుతున్నది చూశేసింది. ఆవేశంతో వేగంగా
నడిచి కూతుర్ని చేరుకుంది. పాపం...ఇద్దరూ ఇది గమనించలేదు.
"ఏం గాయత్రీ ఇంకా ఆలొచిస్తున్నావు? నా మీద నీకు నమ్మకం లేదు...అంతే కదా?"--అంటున్నప్పుడే అతని కళ్ళల్లో నీళ్ళు ఉబికి వస్తున్నాయి.
"హాయ్! మోహన్. ఏమిట్రా ఇది? సరే...ప్రామిస్" అంటూ అతని చేతిలో చేయివేసిన ఆ క్షణం, హఠాత్తుగా ఎవరో వాళ్ళ చేతులను తోశేసినట్లు అనిపించి ఇద్దరూ
తిరిగారు.
ఆవేశం చివరి దసలో
నిలబడుంది శకుంతలాదేవి. ఆ సమయంలో తల్లిని అక్కడ ఎదురుచూడని గాయత్రిలో వణుకు
మొదలైయ్యింది.
"నేను వచ్చి..." అన్న మొహను కు ఎదురుగా నిలబడి……
"నీకు ఎంత ధర్యం ఉంటే దీన్ని వెతుక్కుని ఉర్లోకే వచ్చుంటావు? నీ ప్రేమ నీ కళ్ళు కప్పి ఇక్కడి దాకా తీసుకువచ్చిందా...థూ… నువ్వొక…." అంటూ, ఇంకా ఏదేదే మాటలతో
తన ఆవేశం తీరే వరకు తిట్టి ముగించింది శకుంతలాదేవి.
ఊరే గుమికూడింది.
అవమానంతో కుంగి కృషించి నిలబడ్డాడు మోహన్. వాడ్ని చూడటానికే 'అయ్యో పాపం' అనిపించిది గాయత్రికి. వివరం తెలుసుకుని క్రిందా మీదా పడుతూ పరిగెత్తుకు
వచ్చాడు వెంకన్న. శకుంతలాదేవి దగ్గర క్షమాపణ కోరి మేనల్లుడ్ని తీసుకుని వెళ్ళాడు.
మరోపక్క గాయత్రిని చెతులు పుచ్చుకుని లాక్కుని వెడుతున్నట్టు నడిచింది
శకుంతలాదేవి.
ఇంటి లోపలకు
వెళ్ళటం ఆలశ్యం...తలుపులు మూసుకుంది. టేబుల్ మీదున్న పెద్ద స్కేల్ తీసుకుని
కూతుర్ని పిచ్చి పిచ్చిగా కొట్టింది. నొప్పి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది
గాయత్రి.
బయట తలుపును
విరకొడుతున్నట్టు గట్టిగా తలుపు తడుతున్నారు బాపిరాజు గారు.
ఆవేశం తగ్గిన
తరువాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది శకుంతలాదేవి. ఆమెను కోపంగా చూసుకుంటూ
లోపలకు వెళ్ళి భయంతో వణుకుతున్న కూతుర్ని చూసిన వెంటనే ఆయన కళ్ళల్లో నెత్తుటి
కన్నీరు వచ్చింది.
మరో అరగంటలో ఆ
వార్త ఊరు ఊరంతా పాకిపోయింది. 'వెంకన్న్ అక్క కొడుకు మోహన్, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని!
PART-17
రాత్రి. మామిడి
తోటలో నులక మంచం మీద కుర్చోనున్నారు బాపిరాజు గారు. తాగిన మత్తు ఆయన తలకు
ఎక్కింది. లాంతర్ వెలుతురులో మందు బాటిల్స్ మెరుస్తున్నాయి. ఎదురుకుండా నేల మీద
ఈషారం కూర్చోనున్నాడు. వాడూ తాగున్నాడు.
"చాలు అయ్యగారూ. ఇదేమిటీ కొత్త అలవాటు? నన్ను తాగొద్దని నాకు బుద్ది చెప్పే మీరు , మీరే ఇలా...! మొదట మీరు ఇంటికి వెళ్ళండి. అమ్మగారు
వెతకబోతారు" అన్నాడు.
"అరే పోరా. ఆవిడ పాత శకుంతల లాగా లేదురా. దయ్యం పట్టింది
దానికి. అనుమానం దయ్యం. పాపంరా నా కూతురు. లోకం తెలియని పసిపిల్ల. దానికి
పెళ్ళిచేయాలని మొండి పట్టుదల పడుతోంది. కన్న కూతురు మీదే అనుమాన పడుతోంది. ఆమె
సందేహం వలన ఈ రోజు ఒక ప్రాణం పోయింది. ఇదంతా చూస్తుంటే నా గుండె పగిలిపోతోందిరా.
మనసు నొప్పి పుడుతోంది. ఆ నొప్పి తెలియకుండా ఉండటం కోసమే తాగాను..." అంటూ ఒక బాటిల్ తీసుకుని గొంతులో పోసుకున్నారు
బాపిరాజు గారు.
సమయం అర్ధరాత్రి
దాటింది. ఈషారాం ను పిలిచారు. అతని దగ్గర నుండి సమాధనం లేదు. తూలుతూ లేచి
నిలబడటానికి ప్రయత్నించారు....నిలబడలేక మంచం మీద పడిపోయారు.
"నీకు...ఏమైంది..శా..కూ? ఎందుకు.ఇ..లా..." అంటూ ఏదేదో గొణుగుతున్న బాపిరాజు గారి నోటిని మూసింది
ఒక చేయి. ఆ చేతిని గట్టిగా పుచ్చుకుని "శకుంతలా" అన్నారు.
వీచిన గాలితో
లాంతర్ వెలుగు ఆరిపోయింది. చలనం లేకుండా నిలబడున్నది రాత్రి. ఆ నిశ్శాబ్ధాన్ని
చేధిస్తూ దూరంగా ఒక కుక్క ఏడుపు వినబడింది.
తెల్లారింది.
ఈశాన్య దిక్కులో
ఉదయిస్తున్న సూర్యుడ్ని స్వాగతిసున్నట్టు పక్షులు హడావిడిగా అరుస్తున్నాయి. పక్షుల
అరుపుల శబ్ధాన్ని విని కళ్ళు తెరిచారు బాపిరాజు గారు. గబుక్కున ఏదో గుర్తుకు
వచ్చినట్లు మంచం మీద నుండి క్రిందకు దిగారు. దగ్గరగా కూర్చోనున్న ప్రమీల మంచం
ఊపుకు నిద్ర నుండి మేల్కుని బాపిరాజు గారిని చూసి నవ్వింది.
"ఏమే...రాక్షసీ" - అని తల కొట్టుకుంటూ గోలచేశారు
బాపిరాజు గారు.
"ఎందుకిలా చేశావు? నేను నీకు ఏమి అపకారం చేశాను?"
ఆవేదనతో అడిగిన
బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూసి మంచం మీద నుండి క్రిందకు దిగింది. చెరిగిపోయిన
జుట్టును ఒకటిగా చేర్చి గుండ్రంగా చుట్టుకుని బాపిరాజు గారి దగ్గరగా వచ్చింది.
"నువ్వు మంచే చేసేవయ్యా!
నేను లేదని చెప్పటం లేదు? కానీ, అది నీకే తెలియకుండా నీకు పాపంగా మారిపోయింది?"
అర్ధం కాక ఆమెనే
చూశాడు బాపిరాజు గారు.
"అర్ధం కాలేదు కదా...దాంపత్య జీవితానికే పనికిరాని ఒకడ్ని
నాకు కట్టబెట్టి నా జీవితాన్నే నాశనం చేశారే! అదేనయ్యా మీరు చేసిన పాపం. ఆ రోజే నా
దారిలో నేను వెళ్ళి వుండేదాన్ని. కానీ, ‘పెళ్ళి’ అనే ఆశ చూపి మోసం చేశారు. నా
భవిష్యత్తే మీ వల్ల ప్రశ్నార్ధకం అయిపోయింది. అతను తాగుబోతుగా ఉన్నా పరవలేదు.
సంసారం చేయటానికి యోగ్యతే లేని ఒకడితో ఎలా జీవించగలను? జీవితం వృధా అయిపోయిందే అని అనుకుని ఎన్ని రోజులు ఏడ్చానో
తెలుసా? ఆ టైములో నన్ను ఈ స్థితికి తీసుకు వచ్చిన మీమీద ఎలాగైనా పగ
తీర్చుకోవాలని అనిపించేది. చివరగా మీరే వచ్చి నా వలలో చిక్కుకున్నారు. నిజంగా
చెబుతున్నాను. మగాడంటే నువ్వే నయ్యా. నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా?" -- మెల్లగా బాపిరాజు గారి దగ్గరకు చేరి ఆయన ఛాతీ మీద చెయ్యి
పెట్టింది.
"ఛీ...ఛీ. చెయ్యి తీయ్. నువ్వు ఇంత నీచమైన మనిషిగా ఉంటావని
నేను కొంచం కూడా ఎదురుచూడలేదు. ఇప్పుడే ఈషారం దగ్గర చెప్పి, నిన్ను ఈ ఊరు నుంచి తరిమేసిన తరువాతే నేను ఇంకో
పనిచేస్తాను"
ఆవేశంతో చెప్పిన
బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూస్తూ గట్టిగా నవ్వింది ప్రమీల.
"అతను ఇక్కడుంటేగా?" అన్నది.
"ఏం చెబుతున్నావు...ఈషారాం ఎక్కడ? వాడ్ని ఏం చేశావు? ఇప్పుడు చెబుతావా...లేదా?"
"నిజంగా అతన్ని నేనేమీ చెయ్యలేదు. తానుగానే పారిపోయాడు.
ఇంకేం చేస్తాడు,
తన పెళ్ళాం ఇంకొక మగాడితో ఉండటం చూస్తే ఏ మొగుడు చూస్తూ
నిలబడుతాడు?
రోషం ఉన్న మనిషి....అందుకనే చెప్పా పెట్టకుండా
వెళ్ళిపోయాడు" -- చెప్పేసి గల గలమని నవ్వింది ప్రమీల.
భూమి వెనక్కు
తిరిగుతున్నట్లు అనిపించింది బాపిరాజు గారికి.
ఇంతకాలంగా తాను చేర్చి పెట్టుకున్న గౌరవం, మర్యాద అన్నీ ఒకే రోజు రాత్రి గాలిలో కలిసిపోయినట్లు
అనుకుని లోలోపల తపించిపోయాడు. 'ఆ రోజే శకుంతల
మాటలు వినుంటే నాకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడేదా? వినకుండా పోయావే పాపాత్ముడా'
తల కొట్టుకుంటూ
ఏడుస్తూ నిందించుకున్నాడు. తరువాత, కన్నీళ్ళు చూపును అడ్డుకుంటుంటే...తూలుతూ ఇంటివైపుకు నడవటం మొదలుపెట్టారు.
ఇల్లంతా
సాంబ్రాణి పొగ అలుముకుంది. శకుంతలాదేవి, పూజ గదిలో ఉన్నట్లు చెప్పకుండా చెబుతోంది అది. గాయత్రి ఇంకా
లేవలేదు. ముందు రోజు తిన్న దెబ్బల వలన వొళ్లంతా వాపెక్కటంతో లేవడానికి కూడా ఓపిక
లేక పడుంది.
"భగవంతుడా! ఏ సమస్య రాకుండా నా కుటుంబాన్ని నువ్వే
కాపాడాలి"--ప్రార్ధించుకుని పూజ గదిలో నుండి బయటకు వచ్చిన శకుంతలాదేవి, భర్త రావటం గమనించి వంట గదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని
తీసుకు వచ్చింది. అది కూడా గమనించ కుండా ఎక్కడో చూసుకుంటూ కూర్చున్నారు బాపిరాజు
గారు.
"కాఫీ పెట్టాను" భర్త మొహం చూడకుండా చెప్పి
వెళ్ళబోయింది...కానీ, భర్త చలనం లేకుండా
కూర్చోనుండటం గమనించి,
"మిమ్మల్నే" అన్నది, కొంచం గట్టిగా.....ఆప్పుడు మామూలు స్థితికి వచ్చిన బాపిరాజు గారు, తన భార్యను చూసీ చూడంగానే...గబుక్కున ఎగిరి ఆమె కాళ్ళు
పట్టుకుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు.
"నన్ను క్షమించు శకుంతలా. నేను పెద్ద తప్పు చేశానే"
అంటూ జరిగిందంతా చెబుతుంటే శకుంతలాదేవి మనసు లోలోపల కొంచం కొంచంగా విరిగి ముక్కలు
అవుతోంది.
తండ్రి ఏడుపు విని
గాయత్రి లేచి పరిగెత్తుకుని వచ్చింది. తన ముందు వచ్చి నిలబడ్డ కూతురి రెండు చేతులు
పుచ్చుకుని తన చెంపలమీద మార్చి మార్చి కొట్టుకున్నారు. తండ్రి అలా ఎందుకు
చేస్తున్నారో అర్ధం కాక పోయినా, గాయత్రి తండ్రిని
సమాధన పరిచే పనిలో ఈడుపడింది.
చాలసేపు అయిన తరువాతే తండ్రీ, కూతుర్లు ఇద్దరూ అది గమనించారు. ఏదో కాలుతున్న వాసన. మొదట్లో బాపిరాజు గారి బుర్రకు తట్టలేదు.
తరువాత బుర్రలో ఎదో ఒక రవ్వ ఏర్పడటంతో సడన్ గా లేచి పరిగెత్తారు. ఏమైందో తెలియక
తండ్రి వెనుకే పరిగెత్తింది గాయత్రి. ఇంట్లోని ఏ గదిలనూ శకుంతలాదేవి కనిపించలేదు.
వెనుక గుమ్మం తెరిచి ఉండటంతో అటు వెళ్లారు...స్నానాల గది మొత్తం పొగ
కమ్ముకోనుంది.
"శకుంతలా" అంటూ బాపిరాజు గారు పెద్దగా కేకలు వేయడంతో
జనం గుమికూడారు. కొంతమంది కలిసి పోరాడిన తరువాత తలుపు పగలకొట్టబడింది. లోపల కనబడిన
దృశ్యం చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు బాపిరాజు గారు. శిలలాగా అయిపోయింది
గాయత్రి.
అవును! తన భర్త...మరో పురుషుని భార్యను ముట్టుకున్నందుకోసం...ఇక అయన వేలు కూడా తన మీద పడకూడదని నిర్ణయించుకుని మంటల ఆకలికి తనని ఆహారంగా ఇచ్చుకుంది ఆ పతివ్రత శకుంతలాదేవి.
PART-18
భార్య మరణం
బాపిరాజు గారిని నడిచే శవంలాగా తయారుచేసింది. అంచెలంచెలుగా సమస్యలు. కొలవటం
వీలుకాని శోకం అంటూ ఆ ఇల్లే విధి ఆడిన ఆటవలన చిన్నాభిన్నం అయ్యింది. ఇదేమీ
చాలదన్నట్లు శకుంతలాదేవి చనిపోయిన పదమూడో రోజు కార్యం ఎప్పుడు పూర్తి అవుతుందా అని
కాచుకోనున్నట్లు, బాపిరాజు గారి
ఇల్లు వెతుక్కుంటూ ప్రమీల పెట్టెతో వచ్చింది. ఊరి ప్రజలను పిలిచి శోకాలు
పెట్టింది. బాపిరాజు గారు ప్రమీలను ఏలుకోవాలని పంచాయతి తీర్పు ఇచ్చింది.
ఇష్టంలేకపోయినా ప్రమీల మెడలో తాళి కట్టారు బాపిరాజు గారు.
ఒక పక్క కూతురు
మొహాన్ని చూడటానికి శక్తి లేక, మరో పక్క ప్రమీల
ముఖం చూడటానికి ఇష్టంలేక రోజులో ఎక్కువ సమయం గుడిలోనే గడుపుతున్నారు బాపిరాజు
గారు. ప్రెశిడెంట్ పోస్టు తానుగా ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. ఊరు వేసే నిందలను
పట్టించుకోకుండా...ప్రియమైన భార్యకు తాను చేసిన ద్రోహాన్ని తలచుకుని లోలోపల
ఏడుస్తూ రోజులు గడుపుతున్నారు. తండ్రిని మామూలు స్థితికి తీసుకురావటానికి తాను
చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఒటమినే చవిచూసింది గాయత్రి. వీటి గురించి ఎటువంటి బాధ
పడకుండా రోజులను ఆనందంగా గడుపుతోంది ప్రమీల. తాను అనుకున్నది సాధించినట్లు
సంతోషంతో ఆమె గర్వంగా ఫీలవుతోంది. ఏదో ఆ ఉరికే మహారాణి అయిపోయినట్లు దర్జాగా
రోజుకో పట్టుచీరతో తిరుగుతోంది.
రాత్రి-పగలు మారి
మారి దోబూచులాడటంతో రోజులు ఒక్కొక్కటీ జరిగిపోతున్నదే తెలియలేదు.
అందమైన ఆడపిల్లకు
తల్లి అయ్యింది ప్రమీల.
ఆ తరువాతే ఆమెలో
చాలా మార్పులు కనబడ్డాయి.
శకుంతలాదేవి
ఉన్నప్పుడు వాకిటి వరకే వచ్చి, అట్నుంచే తిరిగి
వెళ్ళే వెంకన్న,
ఇప్పుడు ఇంటిలోపలకు వచ్చేంత సన్నిహితుడయ్యాడు. పిల్ల
ఏడుపును కూడా పట్టించుకోకుండా వాడితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ప్రమీల. అలాంటి
సమయాలలో గాయత్రినే పరిగెత్తుకు వెళ్ళి ఏడుస్తున్న పిల్లను ఎత్తుకుని సమాధాన
పరుస్తుంది. ఒక తల్లి ప్రేమనూ, స్పర్షనూ గాయత్రి
దగ్గర నుండి గ్రహించగలిగింది ఆ పసిపిల్ల. ఆ పసిపిల్ల ఆటలతో తన శోకాన్ని మరిచింది
గాయత్రి. ఇంట్లో పనులు ముగించుకుని, మిగిలిన సమయాన్నంతా చెల్లితో గడిపేది గాయత్రి.
చివరగా అన్నిటికీ
కలిపి ఒక ముగింపు వచ్చే విధంగా అలాంటి ఒక సంఘటన జరుగుతుందని ఎవరూ ఎదురు చూడలేదు.
ఆ తెల్లవారు జామున
నిద్ర గాయత్రీని వదిలి వెళ్ళిపోయింది. లేవటం ఇష్టం లేక దుప్పట్లోనే ముడుచుకుపోయిన
ఆమెకు ఎవరివో మాటలు వినబడటంతో గబుక్కున లేచి మాటలు వినబడ్డ వైపు నడవటం
మొదలుపెట్టింది. పక్క గది నుండి గొళ్ళేం వేయబడ్డ తలుపుల వెనుక మాట్లాడుకుంటున్న
మాటలు కొనసాగుతున్నాయి.
"చాలు...వదులు వెంకన్నా, తెల్లారబోతోంది. త్వరగా ఇక్కడ్నుంచి బయలుదేరు"
బ్రతిమిలాడుతున్న
ప్రమీల గొంతు క్లియర్ గా వినబడింది.
"ఏం...నీ మొగుడు వచ్చేస్తాడని భయంగా ఉన్నదా?"
"ఛఛ...ఆయన దగ్గర నాకెందుకు భయం? ఎప్పుడూ చనిపోయిన వాళ్ళావిడ గురించే అలొచిస్తూ ఏదో ఒక మూల
ముడుచుకుని పడుంటాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే, మన ప్లాన్ విజయవంతంగా ముగిసేంత వరకైనా కొంచం జాగ్రత్తగా
ఉండొద్దా?"
"నేనుండగా నువ్వెందుకు గాబరాపడతావు? నీ భర్త ఒక చచ్చిన పాము. దాన్ని చంపడానికి నాకు ఎంత సమయం
పడుతుందో చెప్పు?"
"నీకు అన్నిట్లోనూ ఆటలే వెంకన్నా. త్వరగా ఆతని కథ ముగించే
దారి చూడు. మిగిలింది గాయత్రి మాత్రమే. ఈ ఊరి నుంచే దాన్ని తరిమేద్దాం.
మొండికేసిందనుకో దాన్ని కూడా చంపేద్దాం. ఆస్తంతా తానుగా నా చేతికి వచ్చేస్తుంది. ఆ
తరువాత అంతా మన ఇష్టం. కానీ, అంతవరకు ఎవరి
కళ్ళల్లోనూ మనం పడకూడదు కదా?"
"నువ్వు చెప్పేది కరక్టే. అయితే సరి...నేను
బయలుదేరుతాను"
ఆ తరువాత మాటలు
ఆగిపోయి ఆ గదిలో నిశ్శబ్ధం అలుముకుంది.
వస్తున్న ఏడుపును
ఆపుకోవటానికి నోరు మూసుకుని, తాను వచ్చింది
ఎవరూ గమనించకూడదని మెల్లగా తిరిగి వెళ్ళింది గాయత్రి. మళ్ళీ దుప్పటిలోకి దూరింది
గాయత్రి. కన్నీరు...చెవి చివర నుండి కారి దిండును తడిపింది.
తెల్లారింది.
ప్రమీల తన
కళ్లల్లో పడినప్పుడంతా తనలో ఎగిసిపడుతున్న ఆవేశాన్ని కష్టపడి అనుచుకుంటోంది
గాయత్రి.
రాత్రి పొద్దు
తనతో పాటూ వర్షాన్ని తెచ్చుకుంది. ఆ కారణం చేత ఊరి ప్రజలంతా ఇళ్ళల్లోనే
ఉండిపోయారు.
అలవాటుకు
విరుద్దంగా ఆ రోజు తొందరగా నిద్ర పోయింది ప్రమీల. గాయత్రి తనలో తానే నవ్వుకుంది. ఒకటా...రెండా? పాలల్లో వేసింది పది నిద్ర మాత్రలు కదా!
మెల్లగా ప్రమీల
దగ్గరకు వెళ్ళి ఆమెను క్షుణ్ణంగా గమనించింది గాయత్రి. ఊహూ...చలనం లేదు. పూర్తిగా
తృప్తి ఏర్పడకపోవటంతో దిండును ఆమె మొహం
మీద పెట్టి బలం ఉన్నంత వరకు నొక్కింది గాయత్రి. శబ్ధమే లేకుండా చనిపోయింది
ప్రమీల.
‘హమ్మయ్య’ అనుకుంటూ ఆనందంతో వెనక్కు తిరిగిన గాయత్రికి తన
వెనుక నుండి "శభాష్" అంటూ ఒక గొంతు వినబడింది.
వెనక్కు
తిరిగింది.
వెంకన్న
నిలబడున్నాడు. వెకిలిగా నవ్వాడు.
ఐదు నిమిషాల
తరువాత ఇల్లంతా చిందర వందరగా పడున్న వస్తువుల మధ్యలొ, ఆయసపడుతూ వంకర టింకరగా పరిగెత్తుతోంది గాయత్రి. పిచ్చి
పట్టిన కుక్కలాగా వదలకుండా ఆమెను తరుముతున్నాడు వెంకన్న.
తన శక్తి అంతా
కరిగిపోయి ఒడిపోయింది గాయత్రి.
విజయోత్సాహంతో
బలవంతంగా ఆమెను పూర్తిగా అనగదొక్కాడు. వసపరుచుకున్నాడు. ఆమె యౌవనాన్ని
జుర్రుకున్నాడు. కన్యత్వాన్ని దొచుకున్నాడు.
బయట వర్షం
కుంభవృష్టిగా కురుస్తోంది.
లేవటానికి కూడా
ఓపిక లేక గొడను ఆనుకుని ఒక మూలలో ముడుచుకు పడుంది నందిని.
ఆమెకు మరింత
చేరువకు వెళ్ళి ఆమెను ముట్టుకున్నాడు.
"వదిలేయ్... నన్ను వదిలేయ్...వెళ్ళిపో...ఇక్కడ్నుంచి
వెళ్ళిపో"--అంటున్న ఆమె వొళ్ళంతా వణుకు. మరింతగా ముడుచుకుపోయింది.
"నిన్ను చూడటానికి నాకే పాపం అనిపిస్తోంది. కానీ ఏం చేయను? ఎన్నో రోజుల నా తపస్సు ఈ రోజు పూర్తి అవబోతోంది తెలుసా? నీ మీద నాకున్న ఆశ, నీ వల్ల నా అక్క కొడుకు మొహన్ చచ్చిపోయినప్పుడు వెర్రిగా మారింది. ఎక్కడ
నిన్ను ముట్టుకోకుండానే వెళ్ళిపోతానో అనుకున్నాను. పరవలేదు...ఆ భగవంతుడే నా వైపు
ఉన్నాడు. లేకపోతే ఇలాంటి ఒక సందర్భాన్ని
నాకు ఏర్పరచి ఇస్తాడా?"--అని చెప్పి
సిగిరెట్టు ఒకటి ముట్టించుకున్నాడు.
"ఇలా చూడు గాయత్రీ...ఒకవేల నాకూ, ప్రమీలకూ ఉన్న సంబంధం నీకు తెలిసిపోయి అది ఇష్టంలేకనే
నువ్వు దాన్ని చంపేసేవోమో నన్న సందేహం నాకుంది. ఏది ఎలా ఉన్నా సరే...నీ భవిష్యత్తు
ఇప్పుడు నా చేతుల్లో. భయపడకు. నేనే నిన్ను పెళ్ళి చేసుకుంటాను. ఇది సత్యం. కన్న
తల్లీ చనిపోయింది. తండ్రి సగం పిచ్చోడిగా తిరిగుతున్నాడు. నీకు ఎవరున్నారు? నీ మంచికే చెబుతున్నాను. మీ నాన్న దగ్గర చెప్పి ఆస్తంతా నా
పేరు మీద రాసిమ్మని చెప్పు. నాకు అది చాలు. నిన్ను చివరి వరకు కష్టమనేది
తెలియకుండా చూసుకునే బాధ్యత నాది.
తరువాత ప్రమీల
గురించి నువ్వు భయపడకు! అనాధగా ఈ ఊరికి వచ్చిందేగా? అనాధ శవంగా నది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దానికి నేను
బాధ్యుడ్ని. కానీ, ఇదంతా ఇబ్బంది
లేకుండా జరగాలంటే మన పెళ్ళికి నువ్వు అంగీకరించాలి. ఏమంటావ్? చెడిపోయిన దాన్ని పెళ్ళి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు
బంగారం. ఆలొచించి మంచి సమాధానం చెప్పు"
వెంకన్న లేచి
నిలబడ్డాడు. గాయత్రి ఆలొచనలో మునిగింది. నిమిషాల తరువాత "సరే" నని తన
అంగీకారం తెలిపింది.
ఉత్సాహంతో ఈల
వేసుకుంటూ ప్రమీల గదిలోకి చొరబడ్డాడు వెంకన్న. చలనం లేకుండా పడున్న ప్రమీలని ఆశగా
ముట్టుకున్నాడు.
"ప్చ్... ఏం చేయగలం? నువ్వు అనుభవించాల్సింది ఇంతే నని నీ మొహాన రాసుంది! సంతోషంగా వెళ్ళి రా"
అంటూ ఆమెను ఎత్తుకోవటానికి వంగినప్పుడు వెంకన్న నెత్తి మీద పడ్డదెబ్బకు
"ఆ" అంటూ గిలగిలా కొట్టుకుంటూ బోర్ల పడ్డాడు. కొంచం తేరుకుని లేవటానికి
లేచినప్పుడు మళ్ళీ ఒక దెబ్బ పడింది. "అయ్యో" అంటూ పడిపోతూ వెనక్కు
తిరిగి చూశాడు. చేతిలో ఇనుప కడ్డీతో
జుట్టు విరబూసుకుని నిలబడుంది గాయత్రి.
"ఏయ్..." అంటూ లేవటానికి ప్రయత్నించాడు...కుదరలేదు.
మెల్ల మెల్లగా కళ్ళు బైర్లు కమ్మాయి. కంటి చూపుకు గాయత్రి సరిగ్గా కనబడలేదు. ఆ
తరువాత కొంచం కొంచంగా తన స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడిపోయాడు. పూర్తిగా
కోపం తగ్గించుకోలేని గాయత్రి చనిపోయిన వెంకన్నని ఇంకా కొడుతూనే ఉన్నది.
ఆవేశం తగ్గని
గాయత్రి అక్కడే కూర్చుంది. తలుపు తడుతున్న శబ్ధం ఆమెను ఈలోకంలోకి తీసుకు వచ్చింది.
పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తెరిచింది. బాపిరాజు గారు నిలబడున్నారు. తండ్రిని
చూసిన వెంటనే "ఓ" అంటూ ఏడవటం మొదలుపెట్టింది. కూతురి వాలకం, ఇళ్లున్న పరిస్థితి చూసి జరగ కూడనిది ఏదో జరిగిందని ఆయనకు
అర్ధమయ్యింది...గబుక్కున లోపలకు దూరి గొళ్లెం పెట్టాడు.
"గాయత్రీ...ఏం జరిగిందమ్మా? చెప్పరా?" అంటూ గాబరా పడుతూ
కూతురి భుజాలు పట్టుకుని ఊపాడు.
మళ్ళీ మళ్ళీ ఆయన
వొత్తిడి చేస్తూ అడిగాడు.
తడబడుతూ
జరిగిందంతా పూర్తిగా చెప్పి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి.
వేగంగా లోపలకు
పరిగెత్తారు బాపిరాజు గారు. వెంకన్నా, ప్రమీలా శవాలుగా పడుండడం చూసి అధిరిపడుతూ కొంచం వెనక్కు వెళ్ళారు. గుండెను
పట్టుకుని గోడనానుకుని జారి పడిపోయారు.
పరిగెత్తుకుంటూ
వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంది గాయత్రి.
“నన్ను క్షమించండి నాన్నా. ఆవేశంలో ఏం చేస్తున్నానో
ఆలొచించకుండా తప్పు చేసేశాను. మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చాను. దయచేసి
నన్ను క్షమించండి నాన్నా"అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురితో ఏమీ
మాట్లాడటానికి తోచక కన్నీటితో కూతుర్ని తన గుండెకు హత్తుకున్నారు.
"అమ్మ మనతో ఉండుంటే ఇలా జరిగేదా నాన్నా? అమ్మ ఎందుకు మనల్ని వదిలి వెళ్ళిపోయింది?"
కూతురు ప్రశ్నలకు
సమాధానం చెప్పలేక శిలలాగా కూర్చున్నాడు.
'మన అమ్మాయి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను? చెప్పు శకుంతలా. నీకు మాత్రమే కాదు...మన అమ్మాయికి కూడా
బాధ్యత లేని తండ్రిగా నడుచుకోలేదే! అయ్యో...ఎందుకు ఈ చేతగాని వాడిని నమ్మి దాన్ని
వదిలి వెళ్ళావు?
నేను పాపాత్ముడ్ని. నిన్ను ప్రాణాలతో చంపిన ద్రోహిని. మన
కూతుర్ని కాపాడలేని దౌర్భాగ్యుడిని"
హఠాత్తుగా తలమీద
కొట్టుకుంటూ ఏడుస్తున్న తండ్రి చేతులను పట్టుకుని ఆపింది గాయత్రి.
"ప్లీజ్...ఏడవకండి నాన్నా. మిమ్మల్ని ఇలా చూడటానికి నాకు
కష్టంగా ఉంది" ఏడుస్తూ చెబుతున్న కూతుర్ని దగ్గరకు లాక్కుని మళ్ళీ గుండెలకు
హత్తుకున్నారు బాపిరాజు గారు.
నిమిషాలు మౌనంగా
గడిచిన తరువాత,
మెల్లగా కూతురు మొహాన్ని తన చేతిల్లోకి తీసుకుని చెప్పటం
మొదలు పెట్టారు.
"గాయత్రీ, నాన్న ఏం చెప్పినా
వింటావు కదురా?"
అన్నారు మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్లు.
"చెప్పండి నాన్నా. నేను ఏం చేయాలి?" అన్నది కూతురు తండ్రి మొహం చూస్తూ.
తన ఒడిలో నుండి
గాయత్రిని లేపి,
ఆయనా లేచారు. ఆమె చేతులను గట్టిగా పుచ్చుకుని ఇంటి వాకిలి
గుమ్మం వైపు నడిచారు. తరువాత గాయత్రి చేతులు విడిచిపెట్టారు.
"నువ్వు...ఈ ఇళ్లు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా"
"నాన్నా... మీరేం చెబుతున్నారు?" - అన్నది ఆశ్చర్యపోతూ.
"ఇది చెప్పటానికి నాకూ కష్టంగానే ఉందిరా. కన్న తండ్రిగా ఉంటూ
నేను ఇలా చెప్పకూడదు. కానీ, నాకు వేరే దారి
తెలియటంలేదే! మీ అమ్మను పోగొట్టుకున్నాను. నిన్ను కూడా పోగొట్టుకోవటానికి నేను
తయారుగా లేను. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు అదే చాలు.
దయచేసి నీకు జరిగిన ఘోరాన్ని మరిచిపో. నువ్వు జీవించాల్సిన అమ్మయివిరా. డాక్టర్
అవ్వాలనేది నీ లక్ష్యం. ఇక నీ ఆలొచన అంతా
నీ లక్ష్యాన్ని చేరుకునే వైపే ఉండాలి. ఆ లక్ష్యం నేరవేరాలంటే నువ్వు ఈ ఇంటి నుండే
కాదు...ఊరు వదిలి వెళ్ళే కావాలి. బయలుదేరు"
"నాన్నా...నేను..."
"నువ్వు ఏమీ మాట్లాడకు గాయత్రీ. దయచేసి నాన్న చెప్పింది
విను. ఈ ప్రపంచం ఒక సముద్రం. మానమే దాన్ని ఈదటం అలవాటు చేసుకోవాలి. జరిగిందంతా
మరిచిపోయి ధైర్యంగా వెళ్ళు. నిన్ను కన్నవారి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది.
త్వరగా ఇక్కడ్నుంచి బయలుదేరు" అన్నారు, కళ్ళల్లో నీళ్లతో.
'ఏం చేయాలి...ఎక్కడికి వెళ్లాలి?' అని ఏమీ తోచలేదు గాయత్రికి. కళ్ళ నిండా నీళ్ళతో నిలబడున్న
గాయత్రి సడన్ గా ఏదో జ్ఞాపకం వచ్చి లోపలకు పరిగెత్తింది. బాధలే తెలియని ఆ జీవి, ఊయాలలో నిద్రపోతున్న పసిపిల్ల, కావ్యా దగ్గరకు వెళ్ళి నుదిటి మీద ముద్దుపెట్టుకుంది. తన
వేళ్ళతో కావ్యా శరీరాన్ని తడిమింది. గాయత్రి స్పర్షను నిద్రలోనూ గుర్తుపట్టిన
కావ్యా నవ్వింది. తరువాత గబుక్కున వెనక్కు తిరిగి వాకిటికి వచ్చింది.
చివరిసారిగా
కూతుర్ని కౌగలించుకుని వీడ్కోలు చెప్పారు బాపిరాజు గారు.
గట్టిగా కళ్ళు
మూసుకుని తన తల్లిని ఒకసారి మనసులో తలుచుకుంది గాయత్రి. ధైర్యం తానుగా తనలో
ఏర్పడుతున్న భావన కలిగింది. తరువాత దూరంగా కనబడుతున్న వెలుతురును చూసి ఆ చీకట్లో
నడిచింది.
మరుసటి రోజు
పేపర్లలో అలాంటి న్యూస్ రావటం గాయత్రికి తెలిసే అవకాశమే లేదు.
'భార్య - మాజీ ప్రేమికుడు హత్య: భర్త వెర్రి పని!'
PART-19
చేదైన తన పాత
జీవితం గురించి గాయత్రి చెప్పి ముగించినప్పుడు అది వింటున్న హృదయాలన్నీ శోక మయం
అయినై.
తన ఆవేదనలో నుండి
బయటపడలేక తల వంచుకుని కూర్చోనున్న ఆమె దగ్గరకు చేరుకుని ఓదార్పుగా ఆమె భుజం మీద
చెయ్యివేశాడు రమేష్.
ఆ స్పర్శ గ్రహించి
గబుక్కున తలపైకెత్తింది. చటుక్కున ఆ చేతిని తోసి పారేసింది. కోపంతో లేచి అతని
మొహంలోకి చూసి అతని మొహానికి ఎదురుగా వేలు జాపి హెచ్చరిస్తున్నట్టు చెప్పింది.
"మిస్టర్ రమేష్. మీరు జాలి పడాలని ఎదురుచూసి నేను ఇవన్నీ
చెప్పలేదు. ఒకవేల నా గురించిన నిజాలు మీకు తెలిస్తే, నా దారికి మీరు అడ్డు రారనే నమ్మకంతోనూ, ఇకనైనా జానకి మీ మీద పెట్టుకున్న ప్రేమను మీరు అర్ధం
చేసుకుని ఆమె ప్రేమను అంగీకరిస్తారనే నమ్మకంతో నా గురించి అంతా చెప్పాను"
బయట నిలబడి
గాయత్రి చెప్పిందంతా విన్న జానకి ఏడుస్తూ, తూలి పడబోతూ గోడకు అతుక్కుపోయింది.
లోపల గాయత్రి
మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది.
"మీకు ఒకటి తెలుసా రమేష్? జానకి ఎవరనేది వాళ్ళింటికి నేను వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. అమే నా
చెల్లెలు అని తెలిసినప్పుడు అలాగే ఆమెను కౌగలించుకోవాలని అనిపించింది. ఈ
ప్రపంచానికే వినబడేటట్టు...నేను అనాధను కాను అని గట్టిగా అరవాలనిపించింది. దాన్ని
మా ఇంటికి పిలుచుకు వచ్చి నాతో పాటూ ఉంచుకుందామని అనుకున్నాను.
కానీ...ఏం చెప్పి
నేను నన్ను జానకి దగ్గర పరిచయం చేసుకోను? చెప్పండి? ఇదిగో ఇదే చేతులతో
ఆమె తల్లిని చంపాను. ఆమె తల్లి యొక్క పేగు బంధం అనుబంధాన్ని తెంపి ఆమెను అనాధను
చేసిన పాపిని నేను. ఇవన్నీ జానకికి తెలిస్తే ఆమె నన్ను ఎలా క్షమిస్తుంది? వద్దు రమేష్. నేను ఎవరనే నిజం ఎప్పటికీ ఆమెకు తెలియకూడదు.
ఎందుకంటే ఆమెను మరొసారి పోగొట్టుకొటానికి నేను రెడిగా లేను. నాకు ఆమె కావాలి. ఈ
ప్రపంచంలో నాకు సొంతం అని చెప్పుకోవటానికి ఆమె ఒకత్తైనా కావాలి.
జానకిని పెళ్ళి
చేసుకోమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయటానికి కారణం ఉంది. మీ గురించి నాకు ఏమీ
తెలియదు. కానీ,
మీరు మంచివారని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు. నా
చెల్లెల్ను సంతోషంగా చూసుకుంటారని అర్ధమవుతోంది. ఇది మాత్రమే కాదు...అది ఎవరినో
పెళ్ళిచేసుకుని...ఎక్కడికో వెళ్ళటం కంటే...ఆమె ప్రేమిస్తున్న మిమ్మల్నే
పెళ్ళిచేసుకుంటే, దూరం నుండైనా
ఆమెను రోజూ చూస్తూ రోజులు గడుపుతూ ఉండిపోతాను.
నా ఆస్తి మొత్తం
మీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను. జానకి మెడలొ మీరు తాళి కడితే చాలు. ఆమె మీ మీద, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.
ప్లీజ్...నన్ను అర్ధం చేసుకోండి. నా చెల్లెల్ను పెళ్ళి చేసుకుంటానని
చెప్పండి"
చెల్లెలు కోసం తన
దగ్గర బ్రతిమిలాడిన గాయత్రి దగ్గర నుండి దూరంగా జరిగి గాయత్రిని చూసి విరక్తిగా
నవ్వాడు రమేష్.
"గాయత్రీ, నువ్వు ఎంత పెద్ద
మేధావివో అంత పెద్ద తెలివితక్కువ దానివి కూడా!"- అన్న రమేష్ ని ఆశ్చర్యంతో
చూసింది.
"లేకపోతే ఏమిటి...? ఇంతకు ముందే పెళ్ళైన ఒకడికి మీ చెల్లెల్ను ఇచ్చి పెళ్ళిచేస్తానని ఇలా మొండికేస్తున్నారే! దీన్ని తెలివితక్కువ తనం అని చెప్పకుండా ఇంకేమని
చెపాలి? నువ్వు నన్ను చూడటానికి నా గదికి వచ్చినప్పుడే నా భార్యను
నీకు పరిచయం చేసానే...మరిచిపోయావా గాయత్రీ?"
"నేను ఇంత దూరం చెబుతున్నా నువ్వు నా మాట వినటం లేదు
కదూ...అయితే సరే. నేను ప్రాణాలతో ఉంటేకదా సమస్య! ఇప్పుడే దీనికి ఒక ముగింపు
పెడతాను" అంటూ జరిగింది గాయత్రి.
గాయత్రి అన్న
చివరి మాటకు ఆందోళన చెందిన జానకి లోపలకు వెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు రమేష్
నోటి నుండి వచ్చిన మాటలు విని అలాగే నిలబడిపోయింది. అక్కడే ఉన్న బాలాజీ కూడా అదే
పరిస్థితిలో ఉన్నాడు.
"ఒక్క నిమిషం గాయత్రీ. జీవితంలో మనం ఒకటిగా చేరలేకపోతే
ఏం...చావు మనల్ని చేర్చనీ! రా... ఇద్దరం
కలిసే చచ్చిపోదాం" అన్నాడు ఆమె దగ్గరకు జరిగి.
గబుక్కున అతని
చొక్కా కాలర్ పుచ్చుకుంది గాయత్రి.
"ఎవరురా నువ్వు? నిజం చెప్పు. ఎందుకు నన్ను వెంబడిస్తూ వచ్చి ఇలా గొడవ పెడుతున్నావు? నీకూ, నాకూ సంబంధమే
లేనప్పుడు చావు గురించి మాట్లాడుతున్నావు... నీ మూర్ఖత్వానికి హద్దే లేకుండా
పోయింది "
"నీకూ, నాకూ సంబంధం ఉంది
గాయత్రీ" అన్నాడు, ఆమె కళ్ళల్లోకి
నేరుగా చూస్తూ.
తన పట్టుదలని
సడలించుకుని వేనక్కు జరిగి అతన్ని అర్ధంకానట్లు చూసింది గాయత్రి.
"దేవుడు మన ఇద్దరికీ భార్యా-భర్త అనే ముడివేసి ఇరవై
సంవత్సరాలు ముగిసిపోయింది. మన ఇంటి పెద్దలు కలుసుకుని, మాట్లాడుకుని, నిర్ణయించుకుని మన ఇద్దరికీ ఇలాంటి బంధుత్వాన్ని ఏర్పరచి వెళ్ళింది నువ్వు
మరిచిపోయుండవని అనుకుంటాను"
'కొవ్వు ఏక్కిన కుక్కా! ఇద్దరూ కలిసి పారిపోదామని పధకం
వేస్తున్నారా?
నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అలా జరగనివ్వనే. నీకొసం నేను
నిశ్చయం చేసిన పెళ్ళికొడుకుకే నువ్వు తల వంచాలి. కాదు- కూడదూ అంటూ ఇంకేదైనా
జరిగితే...?'తల్లి శకుంతలాదేవి మాటలు. 'అలాగైతే ఇతను?'...కళ్ళు గట్టిగా
మూసుకుంది గాయత్రి.
ఆమె ఆలొచనలను
చెదరగొట్టే విధంగా తన మాటలను పొడిగించాడు రమేష్.
"మొదట్లో మన పెళ్ళి నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను కాలేజీ
మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నా
భవిష్యత్తు గురించో, నా సొంత ఇష్టాల
గురించో ఆలొచించని నా కుటుంబం అంటే నాకు కోపం వచ్చింది. 'కొన్ని రోజులలో చావబోయే బామ్మకొసం నా కలలను గొయ్యి తవ్వి
పూడ్చిపెట్టకండి’ అని ఎంతో చెప్పి చూశాను. ఊహూ...చివరకు బామ్మ మొండితనమే
గెలిచింది. మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నిశ్చయతార్దం ముగించుకుని వెళ్ళిన మీ అమ్మ
మీద కోపం వచ్చింది.
ఆ తరువాత, మన ఇద్దరికీ జరగబోయే పెళ్ళిని ఎలా ఆపాలా అని నేను
ఆలొచిస్తున్నప్పుడు, మీ అమ్మగారు
చనిపోయారనే వార్త 'బ్రోకర్’ ద్వారా
మాకు తెలిసింది. నిశ్చయతార్దం ముగిసిన వెంటనే ఇలాంటి శోకం చోటుచేసుకుందే, అనే బాధతో...అదే వారంలో మా బామ్మ కూడా చనిపోయింది.
జరిగిన సంఘటనలకు
ఒక వైపు బాధపడుతున్నా, ఇంకో వైపు పెద్ద
ఇబ్బంది నుండి తప్పించుకున్నాను అని సంతోష పడ్డాను. పెళ్ళి గురించిన విషయాలు
మాట్లాడటానికి మీ ఇంటి నుండి ఎవరూ రాకపోవటంతో నేను ప్రశాంతంగా ఉన్నాను.
చదువు ముగించాను.
నేను ఆశ పడినట్లే పోలీసు అధికారి అయ్యాను. మా ఇంట్లో నాకు మళ్ళీ పెళ్ళి ఏర్పాట్లు
మొదలు పెట్టారు. కానీ, నాకు దాంట్లో
పెద్దగా ఇష్టం లేదు. కారణం ఇదే" అంటూ తన పర్స్ లోని ఒక ఫోటోను తీసి గాయత్రి
ముందు జాపాడు.
ఆ ఫోటో తీసుకుని
చూసి ఆశ్చర్యపోయింది. రెండు జడలతో, లంగా వోణి తో, నవ్వుతూ ఉన్నది
చిన్న వయసు గాయత్రి. మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు రమేష్.
"ఎందుకో తెలియలేదు గాయత్రీ...మా ఇంట్లో నా పెళ్ళి మాటలు
ఎత్తినప్పుడు నాకు నిన్నే చూడాలని అనిపించింది. మీ గురించి తెలుసుకుందామని మీ ఊరు
వెళ్ళాను. మీ నాన్నను పోలీసులు ఖైదు చేసి తీసుకు వెళ్ళేరని చెప్పేరే గానీ నీ
గురించి ఎవరి దగ్గరా సరైన వివరం దొరకలేదు. ఏదో పోగొట్టుకుని తిరిగి వచ్చినట్లు
అనిపించింది.
నాకు ఒక విషయం
మాత్రం అర్ధం కాలేదు. పెళ్ళి వద్దని చెప్పిన నేను, నీ ఫోటోను మాత్రం ఎందుకు బద్రపరుచుకున్నాను? ఎంతో మంది ఆడపిల్లలు నన్ను చేసుకోవాలని ముందుకు వస్తున్నా
వాళ్ళల్లో ఎవరూ ఎందుకు నాకు నచ్చ లేదు. నా భార్య అనే చోట్లో మిమ్మల్ని తప్ప ఎవర్నీ
ఊహించుకోలేక పోయాను...ఎందుకో? నువ్వు ఎక్కడికి
వెళ్ళావు? ఏమయ్యావు? నీకు పెళ్ళి
అయ్యిందా? బ్రతికే వున్నావా?...అలా మీ గురించి ఏమీ తెలియకపోయినా ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో మిమ్మల్ని వెతకటం నేను మొదలు పెట్టేను?
ఈ ప్రశ్నలన్నిటికీ
నాకు సమాధానం తెలియదు గాయత్రి. కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా తెలుసు. నాకు నువ్వే, నీకు నేనే అని ఆ దేవుడు వేసిన మూడు ముళ్లనూ ఎవరూ
విడదీయలేరు. మనం ఒకటిగా చేరటమనేదే విధి. లేకపోతే, నాకు పెళ్ళి చేసి చూడాలని ఎందుకు నా బామ్మకు అనిపించింది? మా ఇళ్లు వెతుక్కుని మీ అమ్మ ఎందుకు వచ్చింది? చెప్పండి.
ప్లీజ్...గాయత్రీ!
నన్ను అర్ధం చేసుకోండి. మనం ఒకర్ని ఒకరు చూసుకున్న తరువాత కూడా ఒకటవలేదంటే మీ
అమ్మగారి కొరిక మాత్రమే కాదు...మీ నాన్నకు నేను చేసిచ్చిన ప్రామిస్ కు అర్ధం
లేకుండా పోతుంది"
"ఏ..ఏం...చెప్పారు? మా నాన్నను చూశారా? ఎక్కడ చూశారు...
ఎప్పుడు చూశారు?
చెప్పండి రమేష్"
"సారీ గాయత్రీ. అది నా దురదృష్టం అనే చెప్పాలి. ఒక కేసు
విషయంగా రాజమండ్రి వెళ్ళినప్పుడు...మీ నాన్న యొక్క కేసు ఫైలు అనుకోకుండా నా
కళ్ళల్లో పడ్డది. విచారణ చేసినప్పుడు...తెల్లారితే ఆయనకు ఉరి శిక్ష అమలు. నేరుగా
వెళ్ళి ఆయన్ని కలిసి వివరాలు చెప్పాను. నా చేతులు పుచ్చుకుని ఏడ్చారు. దయా బిక్ష
పెట్టమని అర్జీ పెడదామని చెప్పాను. వద్దని చెప్పేశారు.
కానీ ఎందుకో
తెలియదు. మిమ్మల్ని గురించి అన్ని వివరాలూ చెప్పిన ఆయన జానకి గురించి ఒక మాట కూడా
చెప్పలేదు. మీ గురించే ఎక్కువ బాధపడ్డారు. 'ఈ ఊరి శిక్ష...నా భార్యకు నేను చేసిన ద్రోహానికి పరిహారం. దీన్ని సంతోషంగా
అంగీకరిస్తున్నాను. నా బాధ అంతా నా కూతురు గాయత్రి గురించే. అది ఎక్కడుంది... ఏం
చేస్తోంది అనేది తెలుసుకోలేని పాపిని అయ్యాను’ అని చెప్పి ఏడ్చారు.
నా శకుంతల
తీసుకున్న నిర్ణయం సరిగ్గానే ఉంటుంది. గాయత్రి మీకొసమే పుట్టింది. మీ ఇంటి
కోడలు...కచ్చితంగా మీకొసమే కాచుకోనుంటుంది. ఆమెను వెతికి పట్టుకునే బాధ్యతను మీ
దగ్గర అప్పజెప్పి వెడుతున్నాను. దేవుడు
మనిద్దరినీ కలుసుకునేటట్టు చేసినట్లే, మీ ఇద్దర్నీ కూడా కచ్చితంగా ఏదో ఒకరోజు కలుసుకునేటట్టు చేస్తాడని చెప్పారు.
ఒక కొడుకుగా ఉండి
మీ నాన్నకు చేయాల్సిన చివరి కార్యాలన్నీ
ముగించిన తరువాత, అస్తికలు తీసుకు
వెళ్ళి గొదావరి నదిలో కలిపి...పరిపూర్ణ మనసుతో మిమ్మల్ని వెతకటం మొదలు
పెట్టాను"
చివరిగా అతను
చెప్పింది విని సోఫాలో జారి పడిన గాయత్రి "నాన్నా" అంటూ ఏడవటం
మొదలుపెట్టింది. ఆమె బాగా ఏడ్చి ముగంచని అని మౌనంగా నిలబడున్న రమేష్, కొంతసేపు అయిన తరువాత ఆమె పక్కన కూర్చుని ఆమె తల నిమురుతూ
ఆమెను ఓదార్చాడు. ఆ సమయంలో అతని ఓదార్పును అంగీకరించిన దానికి మల్లే తనని తాను
మరిచిపోయి అతని భుజం మీద వాలిపోయి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి.
"రమేష్, నేను చేసిన
తప్పుకు మా నాన్నా"
"ఏడవుకు గాయత్రీ. నీ భవిష్యత్తు గురించి ఆలొచించే, తప్పును తన మీద వేసుకుని ఉండుంటారు. కన్న కూతూర్ను కాపాడే
బాధ్యత ఆయనకు ఉండటం న్యాయమే కదా? వదిలేయ్. నీకు
నేను ఉన్నాను. ఇకమీదట అన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను నందూ"
అతని మాటలు చెవులలో
నుండి వెళ్ళి లోపల ఉన్న భావాలను ముట్టుకున్న సమయం ఆమె మామూలు స్థితికి వచ్చింది.
వెంటనే రమేష్ కు దూరంగా జరిగి లేచి నిలబడింది.
"ప్లీజ్ రమేష్...నా మనసును మార్చటానికి ప్రయత్నించకండి.
కొంచం కొంచంగా నన్ను బలహీనం చేయకండి. దయచేసి ఇలాగే వదిలేయండి. ఇక్కడ్నుంచి వెళ్ళిపొండి"
- చేతులతో మొహాన్ని దాచుకుని ఏడుస్తున్న గాయత్రికి దగ్గరగా వచ్చాడు రమేష్.
"నీ తడబాటుకు కారణం ఏమిటో నాకు తెలుసు గాయత్రీ. అదే సమయం, ఇక నీ ఇష్టం లేకుండా నీ నీడను కూడా తాకను. గుడ్ బై"
అని చెప్పి అతను బయలుదేరబోతుంటే.
"నేను లోపలకు రావచ్చా?" అనే మాట వినబడటంతో ముగ్గురూ ఒక్కసారిగా తిరిగి చూశారు. జానకి నిలబడుంది. ఆమె
పక్కనే నిలబడింది పద్మా నర్స్.
'భగవంతుడా...ఈమె ఎలా ఇక్కడకు వచ్చింది?' అనే ఆందోళనతో గాయత్రి జానకికి ఎదురుగా వెళ్ళింది. కానీ
జానకి తిన్నగా వెళ్ళి రమేష్ కాళ్ళ మీద పడింది.
"నన్ను క్షమించండి...మీరు ఎవరని తెలియక"
"హాయ్ జానకీ...ఇదేమిటి? లే మొదట".
"ఊహూ. మొదట నన్ను క్షమించాను అని చెప్పండి"
"సరే...సరే...క్షమించాను. చాలా?"
"ధ్యాంక్స్ బావా"-- అన్నది జానకి. లేచి నిలబడి.
"ఏమిటి...బావ అంటున్నావు?"
"అవును...అక్క భర్తను అలాగే పిలుస్తారు...?"
ఆమె మాటలతో
నివ్వరపోయి నిలబడ్డారు రమేష్, బాలాజీ ఇద్దరూ.
గాయత్రియో ఆశ్చర్య శిఖరం అంచులకే వెళ్ళిపోయింది.
"మీరు నాకొక సహాయం చేయాలి" బాలాజీ దగ్గరగా వెళ్ళి
అడిగింది జానకి.
"చెప్పండి జానకీ" అన్నాడు బాలాజి.
"ఇంకో అరగంటలో రాజేశ్వరి మ్యాడమ్, మా అమ్మా ఇద్దరూ ఇక్కడ ఉండాలి"
"అర్ధమైయ్యింది" బయలుదేరి వెళ్లాడు బాలాజి.
ఆ తరువాతే, గాయత్రిని చూస్తూ ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడింది జానకి.
"జానకీ...నేను..." అంటూ గాయత్రి ఏదో చెప్పబోతుంటే, గబుక్కున చేయి పైకెత్తి మాట్లాడవద్దని గాయత్రికి సైగ
చేసింది.
"నేను ఎవరు అనే విషయం నాకు తెలిసిపోయింది. జరిగిపోయిన దానిని
గురించి మళ్ళీ మాట్లాడి, ఏడ్చి, పెడబొబ్బులు పెట్టి 'సీను క్రియేట్' చేద్దామని నేను
ఇక్కడకు రాలేదు. తిన్నగా విషయానికే వస్తా. మీ చెల్లేలు మీతో ఉండాలని మీకు ఆశగా
ఉందా...లేదా?"
"ఏంటమ్మా ఈ ప్రశ్న? నువ్వెవరో తెలిసిన ఆ నిమిషం నుండి అలాంటి ఒక భాగ్యం నాకు దొరకదా అని ఎంత
ఆశపడుతున్నానో తెలుసా?"
"అయితే సరి. మీకు నేను కావాలని ఆశపడితే...రమెష్ ను మీరు
పెళ్ళిచేసుకోవటానికి అంగీకరించాలి"
"ఇష్టం వచ్చినట్లు వాగకు జానకి" కోపంగా అరిచింది
గాయత్రి.
"క్షమించాలి మ్యాడమ్. మీరు సరే నని చెబితే....మిగతా విషయాలు
మాట్లాడదాం. లేదంటే...నన్ను వదిలేయండి. మీ కంటికి కనబడనంత దూరం వెళ్ళిపోతాను. ఇది
తప్ప నాకు ఇంకో దారి తెలియటం లేదు"--చెప్పి వెనక్కి తిరిగింది.
"ఆగు జానకీ. నన్ను వదిలి వెళ్ళిపోకు. మళ్ళీ నిన్ను పోగొట్టుకుని బ్రతికే శక్తి నాకు
లేదు"
తన ముందుకు వచ్చి
నిలబడి, తన చేతులు పుచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న గాయత్రిని
చూసి జానకి కళ్ళు కన్నీటితో నిండింది. ఆ కన్నీరు కనబడకుండా తల పక్కకు తప్పుకుని ,
"అప్పుడు సరేనని చెప్పండి"
"నువ్వైనా అర్ధం చేసుకో జానకీ. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను
ఎవరూ బలవంతం చేయకండి. ప్లీజ్...అది మాత్రం నావల్ల కాదు"
"గాయత్రి చెప్పటం కూడా కరక్టే జానకీ. ఆమెను బలవంత పెట్టే
మేము ఒకటవ్వాలంటే, అలా మేమిద్దరం
ఒకటవ్వటం నాకు ఇష్టం లేదు. ఆలాంటి పెళ్ళి నాకు అవసరం లేదు. గాయత్రి ఇష్టానికే
ఆమెను వదిలేద్దాం" అన్నాడు మధ్యలో అడ్డుపలికిన రమేష్.
"అంటే నిర్ణయంతీసుకునే అధికారం వాళ్ళవాళ్ళ చేతుల్లోనే కదా
ఉంది...? అయితే ఇక ఇక్కడ నాకు ఏం పనుంది? గుడ్ బై మ్యాడమ్..." -- అని చెప్పి గుమ్మం వైపు
అడుగులు వేసింది జానకీ.
"ఆగు జానకీ. నేను చెప్పేది కొంచం విను. నన్ను వదిలి
వెళ్ళిపోకు. రమేష్, జానకిని
వెళ్ళొద్దని చెప్పండి. నాకు జానకి కావలి. నా జీవితాంతం జానకి నాతోనే ఉండాలి.
మీరైనా చెప్పండి రమేష్. కావాలంటే ఆమె ఇష్టపడినట్టే మిమ్మల్ని పెళ్ళి చేసుకోవటానికి
వొప్పుకుంటున్నాను. దయచేసి ఆమెను నన్ను వదిలి వెళ్ళొద్దని మాత్రం చెప్పండి.
ప్లీజ్..."--అంటూ ఏడుస్తూ నేల మీద కూర్చుండిపోయింది గాయత్రి.
విజయం సాధించిన
సంతోషం జానకి మొహంలో కనబడింది. వెంటనే పరిగెత్తుకు వచ్చి గాయత్రి ముందు కూర్చుంది.
"మీ మనసును గాయపరిచినందుకు దయచేసి నన్ను క్షమించండి.
పెళ్ళికి మీరు వొప్పుకోవాలనే అలా బిహేవ్ చేశాను. నాకు వేరే దారి తోచలేదు. మీ ముందు
నిలబడే తాహతో,
అర్హతో నాకు కొంచం కూడా లేదు" అంటూ గాయత్రిని చూసి
చేతులెత్తి నమస్కరించింది.
"ఏం మాట్లాడుతున్నావు జానకీ...? నువ్వు నా ప్రాణం. ఇంకోసారి ఇలా మాట్లాడకు. నిజం చెప్పాలంటే
నేనే నీ దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకంటే మీ అమ్మను నీ నుండి..."
"వద్దు...ఆ మోసగత్తెను నా అమ్మ అని చెప్పకండి. నేను
శకుంతలాదేవి అమ్మగారి కడుపున పుట్టకపోయినా...ఆవిడే నా తల్లి. మీరే నా తోడ బుట్టిన
అక్కయ్య. నేను మిమ్మల్ని 'అక్కా' అని పిలవచ్చు కదా? నాకు ఆ హక్కు ఇస్తారు కదా?"
జాలితో తన మొహం
వైపి చూసి అడిగిన జానకిని ప్రేమగా చూసింది గాయత్రి.
"ఏమిట్రా అలా అడుగుతున్నావు? నీ నోటితో నన్ను 'అక్కా'
అని ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. రావే
తల్లీ" అంటూ కన్నీటితో రెండు చేతులూ జాపింది.
"అక్కా..." అంటూ పిలుస్తూ బిడ్డ తల్లిని
కౌగలించుకున్నట్లు జానకి గాయత్రిని తన కౌగిలిలో బంధించింది.
అక్కా-చెల్లెల్ల ప్రేమ వర్షంలో మునిగిపోయిన ఇద్దర్నీ చూస్తూ నిలబడిపోయాడు రమేష్.
PART-20
గాయత్రి కారును రమేష్ నడుపుతున్నాడు .
కళ్ళు మూసుకుని
అతని పక్కన కూర్చోనున్న గాయత్రి, కారు ఆగిన ఊపుతో
కళ్ళు తెరిచింది.
"దిగు గాయత్రీ" అన్నాడు.
కారు డోర్
తెరుచుకుని దిగిన గాయత్రి కదలకుండా అలాగే నిలబడింది. ఆమె కళ్ల ముందు అతిపెద్ద
ఇళ్లు. కాదు కాదు...కొన్ని ఎకరాలను మింగిన అతిపెద్ద ప్యాలస్ అనే చెప్పాలి. ఆ
ప్యాలస్ ముందున్న స్థలం పార్కు లాగా అమర్చబడింది. ఇరువైపులా ఏడెనిమిది కార్లు
చిన్నవి, పెద్దవి పలు రంగులలో వరుసగా నిలబడున్నాయి.
వెనుకే వచ్చి
నిలబడ్డ కారులోంచి దిగి, ప్యాలస్ లాంటి ఆ
బంగళాను చూసి నోరు వెళ్లబెట్టి చూస్తూ నిలబడిపోయారు రాజేశ్వరి, బాలజీ, జానకీ, విశాలాక్షి అనే ఆ నలుగురు.
"రా గాయత్రీ, ఇదే మన ఇళ్లు" అంటూ గాయత్రి పక్కన వచ్చి నిలబడ్డాడు రమేష్.
'నా ఆస్తంతా రాసిస్తాను, నా చెల్లెల్ను పెళ్ళి చెసుకోండి...అప్పుడు చెప్పింది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది
గాయత్రికి. పలుకోట్లకు అధిపతి అయిన రమేష్, హైదరాబాదులో ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో అద్దెకు...ఎందుకు? ఇదంతా దేనికోసం? భగవంతుడా!
దినీకంతా నేను
అర్హత లేని దానినని ఎందుకు అతను అర్ధం చేసుకోవటానికి నిరాకరిస్తున్నాడు?'
అని గాయత్రి
ఆలొచిస్తున్న సమయంలో.
"చిన్న యజమాని వచ్చేశారు, చిన్నమ్మ కూడా వచ్చేసింది"
ఎక్కడ్నుంచో
వినబడ్డ కంఠధ్వని తరువాత పూర్తిగా తెరుచుకున్న తలుపుల వెనుక నుంచి ఒక పెద్ద గుంపు
బయటకు వచ్చింది. రమేష్ ను కన్న తల్లి-తండ్రులు, తోడబుట్టిన వాళ్ళూ, వాళ్ళ పిల్లలూ
అంటూ వచ్చి నిలబడ్డ వాళ్ళందరి మొహాలలోనూ సంతోషం ప్రవహించటం కనబడింది.
ఎందుకనో గాయత్రి
మొహంలో మాత్రం ఆవగింజంత సంతోషం కూడా కనబడలేదు.
హారతి తీశారు.
పూవులు జల్లి స్వాగతం పలికారు. కుడి కాలు మోపి లోపలకు రమ్మని, గాయత్రిని లోపలకు తీసుకువెళ్లారు. ఆమె చేత పూజ గదిలో దీపం
వెలిగించారు. తాగమని పాలు ఇచ్చారు. ఆమె చుట్టుతా చేరి తమ అభిమానాన్ని పంచారు.
తప్పని పరిస్తితిలో రాని నవ్వును తెచ్చుకుని వాళ్ళతో మాట్లాడింది గాయత్రి.
రమేష్ తల్లి
గాయత్రి దగ్గరకు వచ్చి కూర్చుంది.
"ఎప్పుడో మా ఇంటికి రావలసిన మహాలక్ష్మివి. మేమే కొంత
నిర్లక్ష్యంగా ఉండిపోయాము. ప్చ్...ఏం చేయ్యం? అంతా ఆ భగవంతుడు ఆడుతున్న ఆట. ఎలాగో నువ్వు మాకు తిరిగి దొరికావు...అది
చాలు" అంటూ గాయత్రి బుగ్గలను ముద్దుపెట్టుకుంది.
"అచ్చు అసలు మీ అమ్మలాగానే ఉన్నావమ్మా" అన్నది.
'అమ్మా' అనే మాట చెవిన
పడగానే గాయత్రి కళ్ళల్లో నీరు పొంగింది.
"మీ అమ్మ మొదటిసారి మా ఇంటికి వచ్చేటప్పుడు భయం భయంగా
వచ్చింది. వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళింది. కానీ..."
"అమ్మా...ప్లీజ్" -- అడ్డుపడ్డాడు రమేష్.
"సారీ...పాత విషయాలను గుర్తు చేశానో?" అన్నది రమేష్ తల్లి.
పరవాలేదు అనేలాగా
తల ఊపింది గాయత్రి.
అలా పరిచయ మాటలు
ముగిసినై.
"నాతో రా గాయత్రి" అంటూ గాయత్రి ని తీసుకుని మధ్యలో
ఉన్న హాలులో ఉంచబడ్డ పెద్ద ఫోటో దగ్గరకు తీసుకువెళ్లాడు రమేష్.
"ఈమే నా బామ్మ. మన పెళ్ళి జరగాలని ఆశపడినామె"
ఫోటోను చూపించి
నమస్కారం చేసుకున్న రమేష్ తో కలిసి గాయత్రి కూడా ఆ ఫోటోకు నమస్కరించింది. హాలుకు
అవతలవైపుకు తీసుకు వెళ్ళి అక్కడ గుడ్డతో మూసున్న తెరను 'రిమోట్ కంట్రోల్’ ఒకటి ఆమె చేతికి ఇచ్చి తెరవమన్నాడు. తెర
తొలగి కళ్ళల్లో పడ్డ దృశ్యం గాయత్రిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
శకుంతలాదేవి, బాపిరాజు గారూ ఫోటోలో నవ్వుతూ ఉన్నారు.
తల్లి-తండ్రుల
మొహాలు కనబడగానే భోరున ఏడ్చింది గాయత్రి.
తన కళ్ళకు దేవతల్లా కనబడ్డ వాళ్ళకు చేతులెత్తి నమస్కరించింది జానకి. తరువాత
తన సహోదరి దగ్గరకు వెళ్ళి ఆమె చేతులు పుచ్చుకుని కళ్లకద్దుకుంది. చెల్లెల్ను తనతో
కలుపుకుని చేర్చుకుంది అక్కయ్య. కన్నవాళ్ళను తలచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న
అక్కాచెల్లెల్లను మామూలు స్థితికి తేవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అక్కడున్న
అందరూ.
రాత్రి డిన్నర్
ముగించుకుని తమకు కేటాయించిన గదులవైపుకు వెళ్లారు...గాయత్రి చెంతకు వచ్చింది
రాజేశ్వరి.
"మీ అమ్మ నీకొసం సరైన జీవితం వెతికి పట్టుకుంది గాయత్రీ.
రమేష్ కుటుంబం మొత్తం నీ మీద ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. రమేష్ లాంటి ఒకతను
నీకు భర్తగా దొరకటానికి నువ్వు ఎంతో పుణ్యం చేసుకోనుండాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను.
మీ అమ్మ స్థానంలో నిలబడి నీ పెళ్ళి జరిపించే నేను ఊరికి వెలతాను"
"మ్యాడం, అదొచ్చి..."
"ఆపు గాయత్రీ, నాకు నిన్ను బాగా తెలుసు. నీ మనసూ తెలుసు. నీ సంకోచానికి కారణం కూడా తెలుసు.
నీకు జరిగింది ఒక యాక్సిడెంట్ రా! ఇంకా నువ్వు దాని గురించే ఆలొచిస్తూ కూర్చుంటే
ఎలా? రమేష్ ఒక సరాసరి మొగాడు కాదని అతన్ని చూసిన వెంటనే
గ్రహించాను. నీ గురించిన వివరాలన్నీ చెప్పి, 'గాయత్రి నీకు దొరకదు, తిరిగి వెళ్ళిపో' అని చెప్పినందుకు అతను ఏం చెప్పాడో తెలుసా? నిశ్శ్చయతార్ధం అనే పేరుతో ఏరోజైతే మా ఇద్దరి మధ్య బంధుత్వం
ఏర్పడిందో...ఆ నిమిషం నుంచే నేను, గాయత్రి
భార్యా-భర్తలుగా ఈ లోకానికి పరిచయమైపోయాము. అలా చూస్తే జరిగిన ఆ యాక్సిడెంట్లో నా భార్యను కాపాడలేని దౌర్భాగ్యుడ్ని నేను
అని చెప్పుకుంటూ ఏడ్చాడు. నువ్వు అదృష్టవంతురాలివి గాయత్రి. ఈ కాలంలో ఇలాంటి ఒక
భర్త ఏ అమ్మాయికి దొరుకుతాడు? దయచేసి నేను
చెప్పేది విను. పాత విషయాలన్నీ ఎత్తి చెత్తలో పడేయ్. రమేష్ తో కొత్త జీవితం
మొదలుపెట్టు.
ఇది మీ అమ్మగారు
నీకోసం ఏర్పాటు చేసి ఇచ్చింది. అది ఎందుకు నువ్వు అర్ధం చేసుకోవు? రమేష్ ను ఒప్పుకో. పోగొట్టుకున్న సంతోషం, ప్రశాంతత అన్నీ అతని ద్వారానే తిరిగి దొరుకుతాయ్. నీ మీదే
తన ప్రాణం పెట్టుకున్నాడు. అంతే కాదు...నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో
తెలుసా? పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించటానికి మీ అమ్మ-నాన్నల గుర్తుగా, వాళ్ళ పేరు మీద ఈ ఊర్లో ఆసుపత్రి కట్టించాడు. నీ చేతులతో
దాన్ని తెరిపించాలని కాచుకోనున్నాడు.
ఇంకొక విషయం
చెబుతున్నాను....విను. జానకికి వరుడ్ని చూశాము. ఆ వరుడు ఇంకెవరో కాదు. మన బాలజీనే.
ఒకే వేదిక మీద రెండు పెళ్ళిల్లు పెట్టుకుందామని మేమంతా కలిసి నిర్ణయించుకున్నాము.
ఇదంతా రమేష్ ఏర్పాటే. నీకున్న బాధ్యతల్లో తనకూ భాగం ఉన్నదని అతను మనకు చెప్పకుండా
చెబుతున్నాడు. దీని తరువాత కూడ అతన్ని అర్ధం చేసుకోలేదనుకో...ఆ తరువాత నీ
ఇష్టం" అని చెప్పటం ముగించింది
రాజేశ్వరి.
"మ్యాడం చెప్పేది కరక్టే" అంటూ అక్కడికి వచ్చింది
జానకి. ఆమెతో పాటూ బాలాజీ కూడా వచ్చాడు.
"మీకు చెప్పేటంత అర్హత మాకు లేదు. కాని ఒకటి మాత్రం నిశ్చయం.
మీరు రమేష్ బావను చేసుకోనని చెప్పినా అది ఆయన్ను పెద్దగా బాధ పెట్టదు. ఎందుకంటే, మనసారా ఆయన మీతో కాపురం చేస్తున్నారు. సమస్య ఆయన గురించి
కాదు. నేను సంతోషంగా జీవించాలని మీరు ఆశపడుతున్నట్టు మీ జీవితమూ సంతోషంగా ఉండాలని
మేము ఎదురుచూడకూడదా? 'మన అమ్మాయి ఈ
ఇంట్లోనే జీవిస్తుందనే కలతో చచ్చిపోయిందే మీ అమ్మ...ఆమె నమ్మకంలో మట్టి
పోయదలుచుకున్నారా? చెప్పండక్కా.
ఏందుకని ఏమీ మాట్లాడనంటున్నారు? జవాబు
చెప్పండి"
"వదిలేయ్ జానకీ, గాయత్రి మనకు మంచి శుభవార్తే చెబుతుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. రండి మనం వెలదాం" అని ఇద్దర్నీ పిలుచుకుని అక్కడ్నుంచి కదిలింది రాజేశ్వరి.
ఆలొచనతో సొఫాలోకి ఒరిగింది గాయత్రి.
PART-21
విశాలంగా ఉన్నది
రమేష్ గది. విజయవాడలో ఆ చిన్న గదిలో చూసినట్లే, ఈ గది కూడా గాయత్రి యొక్క చిన్న, పెద్ద ఫోటోలతో నిండిపోయుంది.
హృదయం భారమైంది
గాయత్రికి. కళ్లు గట్టిగా మూసుకుంది.
"నువ్వు ఇంకా నిద్రపోలేదా గాయత్రీ?"
వెనుక నుండి మాటలు
వినబడటంతో హడావిడి పడుతూ తిరిగింది. గది ఎంట్రన్స్ లో రమేష్ నిలబడున్నాడు.
"సారీ...బయట కొంచం పనుంటే వెళ్లాను. సరే,నువ్వు పడుకో. నేను పక్క గదికి వెడతాను. ప్రొద్దున్నే
కలుసుకుందాం 'గుడ్ నైట్' " అని చెప్పి
కదిలాడు.
"ఒక్క నిమిషం, నేను మీ దగ్గర కొంచం మాట్లాడాలి" అంటూ అతని దగ్గరకు వచ్చింది.
"హు...చెప్పు. ఏం మాట్లాడాలి?" అన్నాడు.
"అదొచ్చి...నేను...హైదరాబాద్ కే పోదామనుకుంటున్నాను"
"మంచి నిర్ణయం. ఎప్పుడు వెల్తావో చెప్పు. నేనే తీసుకువెళ్ళి
దింపుతాను. ఒంటరిగా వెళ్ళద్దు"
అతను అలా
చెబుతాడని కొంచం కూడా ఎదురుచూడలేదు గాయత్రి. అయినా తన ఆశ్చర్యాన్ని
కనిపించనివ్వకుండా మాట్లాడటం కంటిన్యూ చేసింది.
"మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చి ట్రబుల్ చేయకూడదు. అలా అని
నాకు ప్రామిస్ చేసివ్వాలి"
"ఉ"
"తరువాత...దయచేసి ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి
చేసుకోవాలి"
"మీ ఆడ్వైజ్ కు థాంక్స్. కానీ, ఇంకో పెళ్ళి నాకు ఇష్టం లేదు. అంతేకాదు...ఇరవై సంవత్సరాలుగా
మనం కలిసా కాపురం చేశాము? మిగితా జీవితాన్నీ
నీ జ్ఞాపకముతో జీవించి వెళ్ళిపోతాను. నాకు అది చాలు"
"ప్లీజ్ రమేష్, నన్ను అర్ధం చేసుకోండి. ఏ విధంగానూ నేను నీకు మంచి భార్య అవను. మీ నీడను కూడా
ముట్టుకునే అర్హత నాకు లేదు. నేను పవిత్రమైన దానినని కాదని తెలిసి కూడా..."
"చాలు గాయత్రి. ఇంకేమీ చెప్పకు. ఆరోజు నువ్వు పెదవులతో నీ సమ్మతం తెలిపినప్పుడే నాకు తెలుసు...నీ నిర్ణయం
ఇలాగే ఉంటుందని. స్నేహమో...ప్రేమో...బలవంతం చేసినందువలన రాదని నాకు తెలుసు. ఏది
ఎలాగో...పెద్దవాళ్ళు ఆశపడినట్లే నువ్వు ఈ ఇంట్లోకి కొడలుగా కాలు మోపేవు. నాకు అది
చాలు. ఇక కలిసి జీవించడం...జీవించకపోవడం మన ఇష్టం. నీ మనసులో ఏమనిపిస్తే అదేలాగా చెయ్యి"
అన్నాడు ఎటో చూస్తూ.
"ఇది కోపంలో చెబుతున్న మాటలా?"
"ఛ...ఛ...నీ మీద కోపగించుకోవటానికి నేను ఎవర్ని?"
"ఎందుకు అలా మాట్లాడుతున్నారు?"
"మరి ఇంకెలా మాట్లాడమంటావు గాయత్రీ? నీ మొండితనంతో నువ్వు గెలిచావు. కానీ ఇరవై సంవత్సరాలుగా వైట్ చేసినా ఒక అమ్మాయి మనసును గెలువలేని
చవటగా నేను ఓడిపోయి నిలబడున్నానే! ఒకే ఒక రోజు ఎవడో ఒకడు నీ శరీరాన్ని గాయపరిచాడనే
ఒకే ఒక కారణం కొసం... ఇరవై సంవత్సరాలుగా నిన్నే తలుచుకుంటూ నువ్వే నా లొకం
అనుకుంటూ జీవిస్తున్న నా మనసును గాయపరచి వెళ్ళిపోవటం ఏ విధంగా న్యాయం? కేవలం...శరీర సుఖమే ముఖ్యం అనుకోనుంటే ఇన్ని సంవత్సరాలుగా
ఎందుకు నీకోసం కాచుకోనుంటాను చెప్పు? నా మనసు నిండుగా నీ శ్వాసను మాత్రమే మోస్తూ ఉన్నవాడిని నేను. అలాంటి వాడి
దగ్గర ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకోమని చెప్పటానికి నీకు మనసెలా వచ్చిందో చెప్పు?"
మనసును కదిలించిన
అతని మాటలకు కంపించిపోయింది గాయత్రి.
"సరే...చివరిసారిగా అడుగుతున్నాను. నీ మనసులో నేను లేనని నా
కళ్ళు చూసి చెప్పగలవా?"
ఆమె దగ్గరకు
వెళ్ళి-నందిని కళ్ళలోకి చూసి అడిగాడు. అతని చూపులను చూసి తట్టుకోలేక తల వంచుకుంది
ఆమె. ఎందుకనో,
కన్నీటి వరద పొంగి పొర్లింది. అతని ముందు ఆ కన్నీటి వరద కనిపించకుండా
ఉండాటానికి తడబడుతోంది.
"తెలుసు...నా గాయత్రి యొక్క మనసు అబద్దం చెప్పదు. నాకు ఇంకా
నమ్మకం ఉంది" అంటూనే ఆమెకు మరింత చేరువ అయ్యాడు.
అతని శ్వాస...ఆమె
నడి నెత్తిను ముట్టుకుంది.
ఆమె హృదయం వేగంగా
కొట్టుకుంది.
అతను కదలకుండా
అలాగే నిలబడ్డాడు.
ఆమె ఏరలో చిక్కుకున్న
పురుగులాగా వొంకర్లు పోయింది.
ఆ తరువాత కన్నీరు
కారుతూంటే తలెత్తి అతని మొహంలోకి చూసింది.
వెంటనే తన రెండు
చేతులతో ఆమె మొహాన్ని పుచ్చుకున్నాడు.
"నాకోసం ఇరవై సంవత్సరాలుగా..."
"పిచ్చిదానా...మొదట ఏడుపు ఆపు" అంటూ ఆమె కన్నీటిని
తుడిచి" నువ్వు నా భార్యవి. నీకొసం నా చివరి శ్వాస ఉన్నంతువరకు కూడా
కాచుకోనుంటాను. ఎందుకంటే ఐ.లవ్.యూ గాయత్రి" అంటూ మన్మధ మంత్రం ఊదాడు.
ఆ మాటతో గాయత్రి
ఏడుపు ఎక్కువ అయ్యింది. గబుక్కున రమేష్ కాళ్ళ మీద పడింది.
"గాయత్రీ" అంటూ గాయత్రి రెండు భుజాలను పట్టుకుని
పైకిలేపాడు.
అతని కౌగిలిలో
ఒదిగిపోయింది గాయత్రి.
ఆరోజు శ్రీరాముని
పాదాలు తగిలి శాప విమోచనం పొందింది ఆ అహల్య.
ఈ రోజు ప్రాణం
కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రమేష్ చేతులు తగిలి పవిత్రత పొందింది ఈ
గాయత్రి.
***********************************************సమాప్తం******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి