ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల)
ప్రేమ ఎంత కఠినమో ! ( పూర్తి నవల ) PART-1 తపస్సు చేస్తున్న ఆ అమ్మవారి పాదాలను తన అలల పూవులతో సముద్ర తల్లి అభిషేకం చేస్తుంటే , ఆకాశ దేవత పౌర్ణమి వెన్నెలను చేతులలోకి తీసుకుని దీపారాజన చూపిస్తుంటే , చుట్టూ ఉన్న పూల చెట్లు తమ సుగంధ వాసనలను వెదజల్లుతుంటే , ఆ సాయంత్ర సమయం అమ్మవారి చిరునవ్వులో ఆ సముద్రతీరమే పుణ్యభూమిలాగా దర్శనమిచ్చింది. గాంధీ పార్కు ఎదుట కొత్తగా డెవలప్ చేయబడ్డ కాలనీలోకి ప్రవేశించింది లత. నాలుగు సంవత్సరాల క్రితం అక్కడక్కడ చిన్న చిన్న పెంకుటిళ్ళు , గుడిసెలు మాత్రమే ఉన్న ఆ ప్రాంతం పలురెట్లు మారిపోయింది. ' ఈ ఇల్లే ' అనే ఒక లెక్కతో ' గేటు ’ ను తెరిచింది లత. సిట్ ఔట్లొ కూర్చోనున్న కుమారి గేటు శబ్ధం విని తొంగి చూసింది. ఎవరో లోపలకు వస్తున్నది కనబడటంతో దీర్ఘంగా చూసింది. చిరు