ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల)
ప్రేమ ఎంత
కఠినమో! (పూర్తి నవల)
PART-1
తపస్సు చేస్తున్న ఆ
అమ్మవారి పాదాలను తన అలల పూవులతో సముద్ర తల్లి అభిషేకం చేస్తుంటే,
ఆకాశ దేవత పౌర్ణమి వెన్నెలను చేతులలోకి తీసుకుని దీపారాజన
చూపిస్తుంటే, చుట్టూ
ఉన్న పూల చెట్లు తమ సుగంధ వాసనలను వెదజల్లుతుంటే, ఆ సాయంత్ర సమయం అమ్మవారి చిరునవ్వులో ఆ సముద్రతీరమే పుణ్యభూమిలాగా
దర్శనమిచ్చింది.
గాంధీ పార్కు ఎదుట
కొత్తగా డెవలప్ చేయబడ్డ కాలనీలోకి ప్రవేశించింది లత. నాలుగు సంవత్సరాల క్రితం
అక్కడక్కడ చిన్న చిన్న పెంకుటిళ్ళు, గుడిసెలు మాత్రమే ఉన్న ఆ ప్రాంతం పలురెట్లు మారిపోయింది.
'ఈ
ఇల్లే'
అనే ఒక లెక్కతో 'గేటు’ను తెరిచింది లత. సిట్ ఔట్లొ కూర్చోనున్న కుమారి గేటు శబ్ధం విని తొంగి
చూసింది. ఎవరో లోపలకు వస్తున్నది కనబడటంతో దీర్ఘంగా చూసింది. చిరు చీకట్లో
వస్తున్నదెవరో గబుక్కున గుర్తుకు రాలేదు. కొద్ది క్షణాల తరువాత లోపలకు వస్తున్న
మనిషి ఆకారం తెలిసిన మనిషిలాగా అనిపించడంతో సందేహంతో......
"మీరు...?"
అన్నది.
"ఏమిటి కుమారి!
నన్ను మర్చిపోయావా?”
"నువ్వా లతా?
నమ్మలేకపోతున్నాను" అన్నది ఉత్సాహంతో.
"నేనే నే"
అని నవ్వింది లత.
అంతసేపు కట్ అయిన
కరెంటు రావడంతో - కాంతివంతమైన వెలుతురులో కుమారి తన స్నేహితురాలుని బాగా చూడ
గలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం చూసిన లతేనా ఈమె? ఈమె జీవితంతో విధి ఇలాగా ఆడుకోవాలి?
రెండు జడలు,
తుంటరి తనం, పరువాల వయసు, వర్ణించలేనంత అందం...ఆమె ఊరిలో ఆమెకు ఫ్యాన్స్ అషోషియేషనే
ఉండేది. కానీ, ఇప్పుడు
ఆకులు రాలిన, ఎండిపోయిన
చెట్టులాగా ఉన్నది. నల్లబడి, బుగ్గలు లోపలకు పోయి, డ్రస్సు సెన్స్ లో పట్టులేక...చూసిన వెంటనే కుమారికి ఆమె
పరిస్థితి అర్ధమయ్యింది--కాలం ఈమె గాయాలను గుణపరచ లేకపోయింది. మరచిపోనివ్వనూ లేదు
అని!
ఈజీగా మర్చిపోయి,
మనసును చల్లార్చుకోగలిగే నష్టమా ఆమెకు జరిగింది?
'హు...'
అంటూ పెద్దగా శ్వాశ పీల్చుకుని.
"రా... లతా " అంటూ ఆమె చేతిలో ఉన్న సంచిని తీసుకుంది.
లత ఆ ఊరు వదిలి
వెళ్ళేటప్పుడు అక్కడున్న పెంకుటిల్లు ఇప్పుడు రెండంతస్తుల మేడ ఇల్లుగా మారి
ఉన్నది.
"కుమారీ! ఇళ్లు
సూపర్ గా ఉన్నదే" అన్నది.
"అన్నయ్య
కువైత్ లో ఉన్నాడు కదా. పోయిన సంవత్సరం పాత ఇంటిని పడగొట్టి ఇది కట్టాము"
స్నేహితురాళ్ళిద్దరూ
మాట్లాడుకుంటూ మెట్లు ఎక్కుతుంటే, ఆ మాటలు విని వచ్చిన సుందరి--లతను చూసి ఆశ్చర్యంతో,
"ఎలా ఉన్నావు లతా?"
అని సంతోషంగా అడిగింది.
ఆ పిలుపుతో
అనిగిపోయున్న భావాలన్నీ కరిగి, ధైర్యం పారిపోయింది. కానీ, ఒక చిరు నవ్వు వెనుక తన భావాల ప్రవాహాన్నంతా
అనిచిపెట్టుకుని నిలబడ్డ లత ఇంతకాలంలో చాలా నేర్చుకుంది.
"బాగున్నారా
అమ్మా?"
"నాకేమే?
అవును...నువ్వెందుకు ఇలా ఉన్నావు?
నీ అందమంతా ఎక్కడే? ఏమైపోయిందే?"
ఆవేదనతొ అడిగిన
ఆమెకు,
ఒక విరక్తి నవ్వును సమాధానంగా ఇచ్చింది లత.
"ఎలా ఉండే
అమ్మాయివి, ఆ నీచుడి వలన..." అని మొదలుపెట్టి,
"అంతా విధే...అది ఎవర్నీ వదిలిపెట్టదు"
స్నేహితురాలి మొహంలో
మార్పు కనబడటంతో "అమ్మా! లతని నా గదికి తీసుకు వెడుతున్నాను. మీరు భోజనం రెడీ
చేయండి" అని తల్లికి చెప్పి, లతను తన గదికి తీసుకు వెళ్ళింది కుమారి.
"వెళ్ళమ్మా"
అని లతకు చెప్పిన సుందరి “వెళ్ళి
స్నానం చేసి, డ్రస్సు మార్చుకురా. వేడిగా ఇడ్లీ ఇస్తాను" అని చెప్పింది.
స్నానం ముగించుకుని,
డ్రస్సు మార్చుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది లత.
ఆ రోజుల్లో
పెంకుటిళ్ళు, గుడిసెలు
ఉండే ఆ కాలనీలో ఇప్పుడు గుడిసెలు అసలు లేవు. పెంకుటిళ్ళు మాత్రం నాలుగో,
ఐదో ఉన్నాయి. మిగిలినవన్నీ మేడలుగా మారిపోయి నిలబడ్డాయి.
ఒకప్పటి పచ్చటి చెట్లన్నీ మేడలకు అడ్డు ఉండకూడదని మాయమైపోయేయి.
తెలిసిన చోటు,
తెలిసిన ముఖాలు...పలు పాత ఆలొచనలను జ్ఞాపకపరచి - లత మనసును అలజడికి గురిచేసింది.
ఎంతోమంది ప్రశాంతతను
వెతుక్కుంటూ, దానికోసం
పంటకాలువ దగ్గరగా నివాశం ఏర్పరచుకుని ఆనందంగా నివసిస్తున్నారు. లతకు మాత్రం
ప్రశాంతతకు బదులు కష్టాలను మూటలుమూటలుగా అందించింది ఆ పంటకాలవ నివాశం.
లత ఆలొచనలు ఆమెను
మరింత పీడించే లోపు కుమారి అక్కడకు వచ్చింది.
"రా లతా.
డిన్నర్ చేద్దాం"
"వద్దు కుమారి.
నాకు ఆకలిగా లేదు"
"ఏమిటీ,
ఆకలిగా లేదా? అంత దూరం నుండి వచ్చావు?"
"లేదు
కుమారి. నేను విజయవాడ నుండి వచ్చి మూడు రోజులు అయ్యింది"
లత చెప్పింది నమ్మనట్లు
చూసింది కుమారి.
"ఈ మూడు రోజులు
ఎక్కడున్నను అనుకుంటున్నావా? నూజివీడు వెళ్ళాను"
"ఏమిటీ?
మీ నాన్న ఊరికా?"
"అవును"
"ఏమిటి అంత
సడన్ గా! నేరుగా ఇక్కడకు వచ్చుంటే మా నాన్న నీకు తోడుగా వచ్చుంటారుగా?" అన్నది కుమారి.
"తెలుసు.
అందుకే రాలేదు. నా సమస్య నాతోనే పోనీ. మీ నాన్నకు వాళ్ళు మర్యాద ఇవ్వకుండా
మాట్లాడితే అది చూసి నేను తట్టుకోలేను. అంతే కాదు. ఇప్పటికే నేను మీ కుటుంబానికి
ఎంతో రుణపడి ఉన్నాను. మళ్ళీ మళ్ళీ మీ కుటుంబాన్ని నేను కష్టపెట్ట దలుచుకోలేదు కుమారీ
" బాధ నిండిన గొంతుతో చెప్పింది.
'ఏమిటి లతా! అలా
మాట్లాడుతున్నావ్? నీకు మేము తప్ప ఇంకెవరున్నారు చెప్పు
చూద్దాం?"
"అందుకోసమే
కదా ప్రశాంతత కోసం రెండు రోజులు మీ ఇంట్లో ఉండి వెడదామని వచ్చాను" అన్నది లత.
అంతకంటే ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.
స్నేహితురాలిని
సమాధానపరిచే విధంగా కౌగలించుకుంది కుమారి.
డిన్నర్ ముగించుకుని, 'సిట్ అవుట్' లో
కూర్చోనుండగా కుమారి నాన్న వెంకట్ వచ్చి చేరారు. కుశల ప్రశ్నల తరువాత ఆయన అడిగిన
మొదటి ప్రశ్న.
"సంతకం చేసే
ముందు నన్ను ఒక్కసారి అడిగి ఉండొచ్చు కదా?"
'ఈయనకెలా
తెలిసింది?'--ఆశ్చర్యంతో తల ఎత్తిన లత "సారీ అంకుల్.
వాళ్ళ గుణం మీకు తెలుసుకదా! మర్యాద ఇవ్వకుండా మాట్లాడతారు. నా వల్ల మీ గౌరవం
తగ్గిపోకూడదు కదా? అందుకే? నన్ను
తప్పుగా అనుకోకండి" అన్నది క్షమించమన్న దోరణితో.
"తప్పు
చేశావమ్మా. మీ చిన్నాన్నలు ఇంత స్వార్ధ పరులా? తల్లి, తండ్రిలేని పిల్లకు మనం తప్ప ఇంకెవరున్నారు
అనే ఆలొచన రావద్దా? ఆస్తికొసం ఇలాగా మానవత్వాన్ని
వదిలేసుకుంటారు?....ఆ ఆస్తంతా వాళ్ళు సంపాదించిందా? మీ తాత ముత్తాతల నాటి ఆస్తి. ఈ రోజు రేటుకు కనీసం ఐదు కోట్లు దాటుతుంది.
నీ షేర్ గా కోటి రూపాయలన్నా దొరికుంటుంది. ఆ రోజుల్లోనే మీ అత్తయ్యలిద్దరికీ ఎటువంటి తక్కువ చేయకుండా
పెళ్ళిళ్ళు చేశాడు మీ నాన్న విశ్వం. కానీ ఇప్పుడు
అతను ప్రాణాలతో లేడనే కారణం పెట్టుకుని అందరూ కలిసి నీమీద పగ తీర్చుకున్నారు. ఆ
కుటుంబంలో ఒక్కరికి కూడానా నీ మీద ప్రేమ లేదు? ఏం మనుష్యులమ్మా వాళ్ళు! ఛీ, ఛీ"
వెంకట్ బాధతోనూ,
కోపంతోనూ మాట్లాడాడు.
"పరవాలేదు
అంకుల్. వెళ్ళేటప్పుడు నెత్తి మీదా పెట్టుకుపోతాం. బంధువులే లేరని అనుకున్న తరువాత,
వాళ్ళ ఆస్తి మాత్రం నాకెందుకు?"
అన్నది లత విరక్తిగా.
లత తండ్రి విశ్వనాధ్
షీలాను ప్రేమించి పెళ్ళిచేసుకుని పక్క ఊర్లో కాపురం పెట్టాడు. కుటుంబానికి
పెద్దకొడుకైన అతను కులం కాని కులంలోని అమ్మాయిని పెళ్ళి చేసుకోవటంతో,కుటుంబమే అతన్ని బహిష్కరించటం మొదలుపెట్టింది. తరిమి తరిమి
కొడుతున్నా, గౌరవం
చూడకుండా వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళాడు విశ్వం. రోజులు గడుస్తున్న కొద్ది వాళ్ళ
కోపం తగ్గుతుందనే నమ్మకంతో--ఆ నమ్మకాన్ని అతను చచ్చి పోయేంతవరకూ విడిచిపెట్టలేదు.
ఒక ప్రమాదంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను పోగొట్టుకున్న అతను,
తన కూతురు లత కోసం జీవించాడు.
తండ్రికి తండ్రిగా,
తల్లికి తల్లిగా తనను ప్రేమతో పెంచిన తండ్రిని యముడికి
అప్పగించటానికి లతానే కారణం అయ్యింది. పిల్లలు, కన్నవారికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టకపోయినా,
ప్రశాంతతనైనా ఇవ్వాలి.
కానీ,
లత తండ్రిని చంపిన పాతకి అయిపోయింది.
***********************************************************PART-2***************************************************
ఆ నేర భావన ఆమె
మనసును పేడపురుగు లాగా హోరెత్తిస్తోంది.
చలాసేపు దొర్లి
దొర్లి పడుకున్న లతకు నిద్ర రానని మొండికేసింది.
"ఏం లతా! నిద్ర
పట్టటం లేదా?"
"ఊహూ.
నువ్వు పడుకోలేదా?"
"ప్చ్.
నిద్ర రాలా. అందులోనూ నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నువ్వు..."......ఆమె
మొదలుపెట్టగా.
"సారీ కుమారి.
ఏదీ జ్ఞాపకం చేయద్దు ప్లీజ్" అన్నది.
బ్రతిమిలాడే లాగా
మాట్లాడిన స్నేహితురాలిని లోతుగా చూసింది కుమారి.
లత యొక్క మనసు
దేనినో తప్పించుకోవటానికి ముడుచుకుని పడుకుంది.
"లేదు లతా.
నేను నీకు దేనినీ జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మనసు దేనినీ మర్చిపోలేదు.
నువ్వు ఆ దివాకర్ని ఇంకా మర్చి పోలేదు. నీ మనసులో అతని గురించిన జ్ఞాపకాలు లోతుగా
కూరుకుపోయాయి. నువ్వింకా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రానందువలనే నీ మనసు భారంగా ఉంది.
అది అనవసరమైన భారం లతా. అన్ని జ్ఞాపకాలనూ తుడిచేసి నువ్వు కొత్త మనిషి అవ్వాలి. నీకు
జీవితం ఇంకా ఎంతో ఉంది. నిన్ను చులకన చేసిన వారి మధ్య నువ్వు వెలిగిపోవాలి. ఈ రోజు
పెరిగి,
రేపు ఊడిపోయే గడ్డిలాంటిది కాదు మనిషి జీవితం. దీన్ని
నువ్వు మొదట అర్ధం చేసుకో"
"లేదు కుమారీ.
నా వల్ల కావటం లేదు. నా స్వార్ధం కోసం నా తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ నేర భావన
పగలూ, రాత్రి విశ్రాంతి అనేది ఇవ్వకండా నన్ను తరుముతోంది.
దాంట్లోంచి నేను తప్పించుకోలేకపోతున్నాను కుమారీ"
లత వెక్కి వెక్కి
ఏడుస్తుంటే, కుమారి కళ్ళల్లో
కూడా కన్నీరు పొంగింది. సమదాయింపుగా స్నేహితురాలిని కౌగలించుకుంది.
ఇన్ని రోజులు అణిచి
పెట్టుకున్న దుఃఖం కన్నీరుగా కరుగుతున్నట్టు గట్టిగా ఏడ్చింది లత.
"భగవంతుడా! ఇదే
ఈమె చివరి ఏడుపు కావాలి. జీవితంలో సంతోష తరుణాలను తొంగి చూడలేకపోయిన ఈమె ఇక మీదట
సంతోషాలను మాత్రమే అనిభవించాలి"---మనసారా కోరుకుంది కుమారి.
రాత్రంతా ఏడుపు, కన్నీరుతో గడిపినా --మరుసటి రోజు వెలుతురు
ఆమెను కొంచం కొత్త ఉత్సాహంతో గది బయటకు పంపింది.
టీ తీసుకు వచ్చిన కుమారి, స్నేహితురాలి ముఖంలో శోకం, ఆవేదన ఛాయలు పోయి చిన్న నవ్వు కనబడటంతో తృప్తి చెందింది.
"నేను నీకు
శ్రమ ఇస్తున్నాను కదా కుమారీ?" అంటూ కుమారి చేతులోని టీ కప్పును అందుకుంది.
"ఏమే! ఎప్పుడు
చూసినా ఎందుకే ఇలా శోక గీతం పాడతావు? ఆపవే బాబూ" అని చెప్పి "నాకు కాలేజీకి టైము అవుతోంది. నేను
బయలుదేరతాను. సాయంత్రం కలుసుకుందాం" అన్నది.
కుమారి ఇంజనీరింగ్
చివరి సంవత్సరం చదువుతోంది.
"నేను సాయంత్రం
బయకుదేరుతాను కుమారి "
"ఏమిటంత
అర్జెంటు?
రెండు రోజులైనా నువ్వు నా దగ్గర ఉండాలి"
"కుదరదమ్మాయ్.
లీవు లేదు. ఈ లీవు తీసుకోవటానికే నేను చాలా కష్టపడ్డాను"
"అవును. పెద్ద
కలెక్టర్ ఉద్యోగం చూడూ"
"నువ్వు
చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగం కంటే
పెద్దది. ఎవరికైనా మామూలు 'డిగ్రీ' పూర్తి
చేసిన వెంటనే మంచి ఉద్యోగం దొరుకుతుందా?" అన్నది లత.
“అది నీ
తెలివితేటలకు దొరికిన బహుమతి. సహాయాలతో చదువుకుంటూ,
పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ - దాంతో పాటూ అవసరమైన అన్ని
ట్రైనింగ్స్ తీసుకున్న నీ పట్టుదల, తెలివి ఎవరికి వస్తుంది?"
"ఎక్కువగా
పొగడకు. నేనేమీ అంత గొప్పదాన్ని కాదు?"
“మేధావులందరూ
స్వీయ క్రమశిక్షణతోనే మాట్లాడతారు"
"ఏది ఏమైనా నీ ఇంజనీరింగ్
చదువు ముందు ఇది..."
"నీకూ అవకాశం
దొరికుంటే నువ్వు కూడా నాతో పాటూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేదానివి. అంతెందుకు మీ
నాన్న బ్రతికుంటే కూడా నువ్వూ ఇంజనీరింగ్ చేసేదానివి" అని కుమారి యధార్ధంగా
మాట్లాడినా, తాను
అన్న ఆ మాటకు స్నేహితురాలి ముఖంలో మార్పు
చూడగానే.
"సారీ లతా "
"అరే!
ఇప్పుడెందుకు సారీ చెబుతున్నావు? నువ్వు నిజమే కదా చెప్పావు. దానికెందుకు సారీ?"
ఈజీగా తీసుకున్న
స్నేహితురాలు లతతో, ఇదే మంచి సమయం అనుకున్నది కుమారి.
"నేనొకటి
చెబితే కోపగించుకోవుగా?"
"చెప్పు"
"ఏమీ
లేదు...మనసులో అనిపించింది. మీ నాన్న సమాధికి నువ్వు ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా?
ఒక సారి వెళ్ళిరా"
“వద్దు కుమారీ.
నాన్న సమాధి దగ్గర ఈ పాపాత్మురాలి కాలు పడకూడదు"
"నీ ఆలొచన
తప్పు లతా. ఆయన ఆత్మ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆయన ఆశీర్వాదం
లేకపోతే...నువ్వు ఈ రోజు నీ సొంత కాళ్ళ మీద నిలబడ గలిగేదానివా చెప్పు. అందుకని ఆయన
దగ్గరకు వెళ్ళి ఏడు. నీ బాధలన్నిటినీ చెప్పావనుకో నీ మనసులోని భారం
తగ్గుతుంది. నీ గిల్టీ ఫీలింగ్ నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అలా కాదని అంటూ
నీ గిల్టీ ఫీలింగుతోనే ఉన్నావనుకో...అదే నిన్ను కొంచం కొంచంగా తినేస్తుంది"
కుమారి చెప్పింది
న్యాయం అనిపించినా, "నేను ఎలా ఆ ఊరికి..." బాధగా అన్నది లత.
అమె ఎవర్ని
చూడటానికి భయపడుతోందో అర్ధమయ్యి......
"నువ్వు
ఖచ్చితంగా వెడుతున్నావు. నేను నిన్ను వెళ్ళమన్నది మీ నాన్న సమాధి దగ్గరకు.
ఇంకెక్కడికీ కాదు. నువ్వు ఎవరినీ చూసి భయపడక్కర్లేదు.
లోకంలో ఎవరూ చేయని
తప్పును నువ్వేమీ చేయలేదు. అందువలన మనసును దృఢంగా ఉంచుకో. మొదట ఆ గిల్టీ ఫీలింగును
వదిలిపెట్టు. తప్పు చేసిన దానివిలాగా తల వంచుకుని నడవకు. తల ఎత్తుకుని నడు. ఎవరూ
నీ మీద నేరం మోపరు. ఎందుకంటే, ఇక్కడ నువ్వు ఎవరికీ కట్టుబడి ఉండక్కరలేదు. అర్ధమైందా?" అన్నది ఆవేశంగా.
స్నేహితురాలు కుమారి
కాలేజీకి వెళ్ళిన తరువాత, ఒక విధంగా ధైర్యం తెచ్చుకుని--తాను పుట్టి, పెరిగి, చెడిపోయి, అన్నీవదిలేసి, ఊరే వెలివేసి, ఏకాకిని చేసి--ఒక చీడ పురుగును చూడటం
కంటే హీనంగా చూసిన పరిస్థితిలో నాలుగు సంవత్సరాల క్రితం వదిలి వెళ్ళిన ఊరి
సరిహద్దుకు వచ్చి నిలబడింది లత.
తనను దింపి వెళ్ళిన
బస్సు చక్రాల గుర్తులు ఆ రోడ్డు మీద పడ్డ క్షణం,
ఆమె జీవించిన రోజుల గుర్తులు ఆమె కళ్ళ ముందు నిలబడ్డాయి.
ఇన్ని సంవత్సరాలలో ఆ ఊర్లో ఎన్నో మార్పులు. కాంక్రీట్ రోడ్లు,
మేడ ఇల్లు-కొత్త మెరుగులతో ఉన్నది ఊరు. పాత జ్ఞాపకాలు ఆమెను
చుట్టు ముట్ట, తన
ఇల్లు ఉండే రోడ్డును చేరింది లత.
రోడ్డు చివర ఉన్న
చెట్లు ఆమె లేని కొరతను చెప్పుకున్నాయి.
అందరి ఇళ్ళల్లోనూ
టీవీ పెట్టే శబ్ధాలు. వెక్కి వెక్కి ఏడుస్తున్న గొంతుకలు. విల్లన్/విల్లి మాటలు
కలిపి వినబడుతున్నాయి. లత ఆ ఇంటిని చేరుకుంది.
మూగగా ఏడుస్తున్న
మనసు 'ఓ' అని గట్టిగా ఏడ్చింది. తండ్రి చెమటోడ్చి కట్టిన ఇల్లు. ఆయన శ్వాశ గాలి,
చెమట, రక్తం కలిసి గంభీరంగా నిలబడ్డ ఇల్లు,
ఇప్పుడు రూపురేకలు మారి కనబడుతోంది. ఎప్పుడూ అందంగా కనబడే ఆ
ఇల్లు,
ఇప్పుడు వాస్తు రంగుతో కళ్ళను చెదిరిస్తోంది.
తనూ,
తండ్రీ కలిసి నడిచిన ఆ ఇల్లు ఆమెను పూర్తిగా పాత రోజుల్లోకి
తీసుకు వెళ్ళింది. ఆశ ఆశగా పెంచిన చెట్లు పెద్దవై ఈమెను గుర్తుపట్టినట్లు కొమ్మలను
బలంగా ఊపి ఆమెకు స్వాగతం పలికినై. ఆ రోజు జరిగిన దృశ్యాలు ఈ రోజు జరుగుతున్నట్టు
బ్రమలో పడిపోయి నిలబడింది.
"నా కొడుకును
చంపిన దానిని వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపొమ్మనండి. అది ముట్టుకుంటే వాడి ఆత్మ
శాంతించదు" అంటూ నాన్న తల్లి, బామ్మ కొడుకు దేహం దగ్గర
కూర్చుని గగ్గోలు పెడుతోంది.
ఏడ్చి ఏడ్చి
నీరసించిన లతను అత్తయ్యలు లాగి ఒక మూలకు తోస్తుంటే, వాళ్ళను ఎదిరించే ధైర్యం లేక ఆ ఊరే వేడుక చూసింది. శోకంతో
నిండిన ఇంట్లో గొడవ పడకూడదని మౌనంగా నిలబడున్న వెంకట్ ముందుకు తూలి పడబోయిన లతను వెంకట్
పట్టుకుని, లతను ఆమె బాబాయ్ దగ్గరకు తీసుకు వెళ్ళి "ఈ
పిల్లే బాగా డీలా పడిపోయుంది. కార్యం
అయ్యేంత వరకు గొడవ చేయకండి" అని అన్నప్పుడు ‘నువ్వెవరయ్యా పంచాయతీ చేయటానికి? మాతో పుట్టిన వాడివా? లేక మా బంధువా?' అంటూ దబాయింపుగా మాట్లాడటంతో---'వద్దు అంకుల్’ అంటూ చేతులెత్తి నమస్కరించి ఆయన్ని సమాధాన పరిచింది లత.
ఎన్ని నష్టాలు!
ఎన్ని అవమానాలు!
అన్నీ ఎవరి వలన?
అన్నీ తన
స్వార్ధంతోనూ...మూఢ నమ్మకంతొనూనేగా! తనని తాను మరిచిపోయిన పరిస్థితిలో గేటు ముందు
నిలబడి, తండ్రిని చూస్తున్నట్టుగా బ్రమ పడుతూ ఇంటి
గుమ్మం వైపే చూస్తోంది. అప్పుడు ఒక పెద్ద హారన్ శబ్ధంతో మామూలు స్థితికి
వచ్చింది...గబుక్కున వెనక్కు తిరిగింది.
ఒక కొత్త కారు
ఉరుముకుంటూ వచ్చి ఆగింది. లత చూపు కారు అద్దాలలో నుంచి కారులోపలకు వెళ్ళింది.
అతనే! వెంటనే గుర్తు
పట్టింది మనసు.
లత పడుతున్న బాధలకూ,
నష్టపోయిన నష్టాలకు కారణమైన వాడు అతనే!
ఒక టైములో ఈమె కలలను
తీరుస్తూ,
రోజులను ఆనందం చేసినవాడు.
మాటలతో నమ్మించి,
నడు రోడ్డు మీద నిలబెట్టి అవమాన పరచిన వాడు.
కొన్ని కష్టాలలో
అతనికి తోడుగా ఉన్నప్పుడు - కాలితో తన్ని, తోసి, అన్ని నేరాలనూ ఆమె మీద వేసి, ఊరే ఉమ్మేస్తుంటే చేతులు కట్టుకుని నిలబడినతను -- ఈ రోజూ
అదే పొగరుతో కూర్చోనున్నాడు దివాకర్.
అతనిపై నుండి తన
చూపును తిప్పుకోలేక నిలబడిపోయిన ఆమె, మళ్ళీ మోగిన హారన్ మోత విని పక్కకు జరిగింది.
ఆమెను దాటి వెళ్ళిన
కారులో అతన్ని ఆమె బాగా చూడగలిగింది.
ఎత్తు,
రంగు ఎక్కువై -- ఎర్రటి బుగ్గలతో అందంగా ఉన్నాడు అతను.
దగ్గర దగ్గర ఒక
బిచ్చెగత్తెను చూసినట్లు, నిర్లక్ష్యంగా ఆమెను అతను చూసిన చూపు....!
అబ్బబ్బా! ఇంకొక
అమ్మాయైతే ఖచ్చితంగా ఉరేసుకుని చచ్చుంటుంది.
ఎన్నో దెబ్బలను తిని
మొద్దుబారి పోయిన లత మనసు అతని ఆ నిర్లక్ష్య చూపులో కాలిపోలేదు. కారుని స్టైలుగా
నడుపుకుంటూ ఆ ఇంటి వసారాలో కారు ఆపేడు దివాకర్.
ఆ తరువాత కూడా అక్కడ
ఎవరి వలన నిలబడటం కుదురుతుంది?
భారమైన మనసుతో సమాధి
తోట వైపుకు నడిచింది లత.
కాలువ అవతల వైపు,
ఊరందరికీ సొంతమైన తోట మధ్యలో, లేవలేని నిద్రలో ఉన్న తన తండ్రితో కన్నీళ్ళు ఎండిపోయేంత
వరకు ఏడుస్తూ తన పాపాలను క్షమించమని వేడుకుంది లత. అన్ని కన్నీటి బొట్లు ధారగా
కారిపోయిన తరువాత ఆమె మనసు తెలిక పడింది.
కాలువు చుట్టూ ఉన్న
పూల చెట్లలో పూసిన పువ్వులు తండ్రి ప్రేమతో తనని కౌగలించుకున్నట్టు ఆమెను
రాసుకుంటున్నాయి.
"వస్తాను
నాన్నా" అని మానసికంగా తండ్రి దగ్గర వీడ్కోలు చెప్పి వెనక్కు తిరిగింది.
మనసు ఏ రోజూ లేనంత
తేలికపడి ప్రశాంతత పొందింది.
***********************************************************PART-3***************************************************
తోట నుండి బయటకు వచ్చినప్పుడు,
ఎదురింట్లో నుండి వచ్చింది ఒక బామ్మ.
"ఎవరమ్మా అది?"
అని విచారించింది.
నేనే బామా. విశ్వనాధ్
గారి కూతురు లత " అన్నది.
"అరె నువ్వా!
ఎలా ఉన్నావమ్మా? చూసి
మూడు,
నాలుగేళ్ళు అయ్యుంటుందే! ఈ తోటలోకి ఒంటరిగా వెళ్ళిందే అని
చూస్తున్నాను" అన్నది.
"నేను బాగున్నా
బామ్మా...నువ్వెలాగున్నావు?"
"నాకేమమ్మా...ఏ
లోటూ లేకుండా బాగానే ఉన్నాను? ఇప్పుడు ఏ ఊర్లో ఉంటున్నావు తల్లీ?"
"విజయవాడ"
"ప్చ్...ఎలా
బ్రతికిన కుటుంబం అమ్మా మీది! శని దూరినట్లు దూరి మీ జీవితాన్నే పాడు చేశాడు!
పాపాత్ముడు, బాగుంటాడా
వాడు?
పాపాలన్నీ వాడి లెక్కలో చేర్చుకుంటున్నాడు" అన్నది
బామ్మ ఆవేశంగా.
లత కళ్ళల్లో నుండి
కన్నీరు ధారగా కారుతూనే ఉన్నది.
"కానీ చూడు
తల్లీ...వాడిని దేవుడు బాగానే ఉంచాడు. కారు...ఇళ్ళు! మీ ఇంటిని కూడా మాయ చేసి
లాక్కుని మేడ మీద మేడ కట్టాడు. ఇప్పుడు మన సుశీలా లేదు...ఆమె అల్లుడితో కలిసి
వ్యాపారం చేస్తానని చెప్పి, వాళ్ళ దగ్గర లక్షలు కాజేశాడట. ఎంత పొగరుతో ఉన్నారో తెలుసా?
నీతి--న్యాయం అనుకుంటూ వెళ్ళే వాళ్ళకే కష్టాలకు పైన
కష్టాలు! నేను వస్తాను తల్లీ" --బామ్మ వెళ్ళిన తరువాత,
దగ్గరున్న గుడిలోకి వెళ్ళింది లత.
ప్రశాంతంగా,
లోతు చూపులతో చేతులెత్తి ఆశీర్వదిస్తున్నట్టు నిలబడున్న
దేవుడి దగ్గర "నన్ను ఇలా అనాధగా చేశేవే దేవుడా! రాత్రి-పగలు విరామం లేకుండా
నిన్నే తలచుకున్నందుకు నువ్విచ్చే బహుమతి ఇదేనా? నేను చేసిన తప్పుకు ఇంతపెద్ద శిక్ష వేసి నన్ను దండించేవే?
నేను పెరిగిన ఊర్లోనే నన్ను ఒక నేరస్తురాలిగా నిలబడేటట్టు
చేసేవే?"
అంటూ హక్కుగా అడిగి తన మనసును తేలిక చేసుకుంది.
తండ్రి పెంపకంలో
పిచ్చుకలా ఎగురుతూ తిరుగుతున్న కాలం...కాలం మారిపోయినట్టు ఆకులు రాలిపోయిన శోకం.
ఎందుకు కింత కష్టం?
లేదు లేదు...విధి వంచన వలనే కదా ఆ కష్టం...వయసు పరువం వలన
ఏర్పడిన కొవ్వు వలన తానే తెచ్చుకున్న కష్టం కదా అది!
స్కూల్ చదువు
ముగించిన పరువ వయసులో లత, విశ్వం ఇంటి మహారాణిలాగా తిరుగుతూ ఉండేది.
బంగారు రంగుతో
అందంగా నిలబడున్న కూతుర్ని చూస్తుంటే ఆయనకు చాలా ఆనందం! ఆమె నడక,
దుస్తులు, ముఖ భావనలను చూస్తుంటే లత గొప్పింటి పిల్లలాగా ఉంటుంది.
చూసి,
చూసి పెంచాడు.
డబ్బులు పోసి
పట్నంలో చదివించాడు. 'ఆడపిల్ల చదువుకు ఎందుకయ్యా ఇంత డబ్బు ఖర్చు పెడతావు అని ఎవరైనా అడిగితే
"ఆడపిల్లలకు చదువే ఆధారం” అంటాడు. 'ప్లస్ టూ' లో 98 శాతం తెచ్చుకుని తండ్రిని ఉక్కిరిబిక్కిరి చేసింది లత.
చదువుల సరస్వతి అని
పేరు తెచ్చుకున్న కూతురు కల్లా కపటం లేని పువ్వు లాంటి దని అనుకుంటూ వచ్చిన ఆయన,
కూతురు పక్కింటి దివాకర్ను సుమారు మూడు సంవత్సరాలుగా
ప్రేమిస్తోంది అనే వార్త విని విలవిల లాడిపోయారు. ఊరు ఊరంతా తెలిసిపోయిన ఈ విషయం
ఆయన చెవికి చేరుకునేటప్పటికి బాగా ముదిరిపోయింది.
అందులోనూ పిల్ల
చేష్టలు మారని మొహంతో, 'నాన్నా...నాన్నా' అంటూ తన కాళ్ళ చుట్టూ తిరిగే కూతురు,
పక్క ఊరి గుడిలో పెళ్ళి బట్టలతో,
పూలమాలతో నిలబడి ఉండటంతో ఆయనకు సగం ప్రాణం పోయింది.
"నువ్వా?...నువ్వా?" అని తిరిగి తిరిగి ఆయన మనసు కూతుర్ని చూసి అడిగింది.
లతను వెంటాడి
వెంటాడి ప్రేమించాడు దివాకర్. ఉడుకు వయసు! అతని అందంలోనూ,
మాటలలోనూ తన మనసును పారేసుకుంది లత. అతన్ని ప్రేమించటం కూడా
ఒక విధంగా బెదిరంపు వలనే. తెలిసిన వాడు
అవటంతో మొదట్లో అతనితో సహజంగా స్నేహంగా ఉన్నది. స్నేహితులు వారి స్నేహాన్ని హేళన
చేయటం వలన, అతనిలో
ప్రేమ అనే మంట ఎగిసిపడింది. ఒక రోజు స్కూలుకు వెడుతున్న ఆమెకు అందమైన ఒక పసుపు
రంగు రోజా పువ్వు ఇచ్చాడు. అమాయకంగా అది తీసుకుని, ఆనందంగా తన జడలో పెట్టుకుంది లత.
పసుపు రోజా పువ్వును
తలలో పెట్టుకున్న లతను చూసిన దివాకర్ స్నేహితులు తమ విషపూరిత నవ్వులను ఒకరికొకరు
చూపించుకున్నారు.
'రేయ్!
వాడు చెప్పింది నిజమేరా' అన్నాడు సునీల్.
'ఎలారా
పడగొట్టావు?' అని
'టిప్స్’ అడిగాడు నవీన్.
"బస్సు
వస్తోందా?"
అంటూ రోడ్డుకు కుడివైపుకు చూసిన లత,
తన గురించి ఒక చర్చావేదిక సమావేశం జరుగుతున్నదనే విషయం
తెలియక,
ఆ సమావేశ గుంపులో ఉన్న దివాకర్ని చూసి స్నేహపూర్వకంగా
నవ్వింది.
ఫ్రెండ్స్ గుంపులో
గుసగుసలు ఎక్కువయ్యాయి.
వాళ్ళు పెద్దగా ఒక
పాట అందుకునే లోపు బస్సు వచ్చింది.
ఆ రోజు నుండి బస్సు
స్టాపింగులో, వెడుతున్న
బస్సులో,
ఇంటి మేడ మీద, గుడి అంటూ పలు చోట్ల అనుకోకుండా పడుతున్న లత చూపులను దివాకర్
యొక్క ఆశ చూపులు ఎదుర్కొన్నాయి.
ప్రారంభ రోజుల్లో
ఎటువంటి ఆలొచనా లేకుండా, చిన్న నవ్వుతో తల తిప్పుకునే ఆమెలో
కొన్ని రోజులలోనే మార్పు వచ్చింది.
వినోద భావంతో
ఏర్పడిన స్వారస్యం, ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు, అతని ఆశ చూపులను వెతకటం మొదలుపెట్టింది. కొన్ని రోజులలో
ఓరకంటి చూపులు, దివాకర్ని
చూడగానే సిగ్గు పడుతున్న చూపులుగా మారినై.
ఏదో సాధించినట్లు
తృప్తిగా,
అదోరకమైన స్టైలుతో ఒక నవ్వును విసిరేడు దివాకర్.
'ఏయ్!
నీ లవ్ బాయ్ వస్తున్నాడు’ అని
స్నేహితురాలు మధుమిత లత చెవిలో గొణిగినప్పుడు ఎంతో శ్రద్దగా చేసుకున్న అలంకారంతో
ఒక దేవతలాగా నవ్వింది లత.
ఆ సమయంలో వర్షం
మొదలైయ్యింది. కాలువకు గండి పడింది. పెద్ద నష్టంతో ఊరు ముక్కలయ్యింది.
బస్సు రాకపోకలకు
అంతరాయం కలిగింది.
స్కూలు,
కాలేజీ విధార్ధినీ-విధ్యార్ధులు,
ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అంటూ అందరూ సుమారు ఐదు
కిలోమీటర్లు చుట్టూ తిరిగి నడిచి మైన్ రోడ్డుకు వెళ్ళి బస్సు ఎక్కాల్సి వచ్చింది.
పది,
పదిహేను మంది కలిసి గుంపు గుంపుగా వెళ్ళటం యువకులకు మహా
ఆనందంగా ఉంది.
అక్కడ వంతెన రెడీ
అయ్యి,
ఆ రూటులో బస్సులు వెళ్ళటం మొదలయ్యేటప్పటికి గుంపులో ఎన్నో
ప్రేమ కథలు మొదలయ్యాయి.
ఎప్పటిలాగా ఆ రోజు
కూడా చుట్టూ తిరిగి వెడుతున్న ఆడవాళ్ళ వెనుక -- సునీల్,
దివాకర్ వచ్చారు.
అప్పుడు మధుమిత,
తనకు కొంత దూరంలో వెడుతున్న సుధాను కేక వేసి పిలిచి
"ఏయ్ సుధా! లత లంచ్ బాక్సును ఇంట్లోనే మరిచిపోయి వచ్చిందట. నిజాం బాయ్ కొట్లో
నాలుగు ఇడ్లీలు కొనుక్కుని వెడదాం" కావాలనే గట్టిగా అరిచింది.
“ఉష్...ఎందుకే
అలా అరుస్తావు?" అంటూ
మధుమితను కసురుకుంది లత.
"ఉండు...ఉండు. 'రియాక్షన్’ ఏమిటో చూద్దాం" అంటూ గొణిగింది మధుమిత.
నాలుగడుగులు వేసేరో
లేదో "ఇదిగో" అంటూ తన లంచ్ బాక్సును చాచాడు దివాకర్.
"వద్దు"
అని నిరాకరించినా పట్టించుకోకుండా లంచ్ బాక్స్ జాపి అలాగే నిలబడ్డాడు.
"ఏయ్ లతా!
చూశావా. నా ప్లాన్ ఎంత బాగా 'వర్క్ అవుట్' అవుతోందో?" అంటూ మధుమిత లత నడుం మీద గిల్లగా-- లతసిగ్గు పడుతూ,
ఎర్ర బడిన ముఖంతో-- దివాకర్
అందించిన లంచ్ బాక్స్ తీసుకుంది.
ప్లస్ టూ పరీక్షలో 'బార్డర్’ మార్కులు తెచ్చుకుని కిందా మీదా పడుతూ పాసయ్యాడు దివాకర్.
తండ్రి దగ్గర వెయ్యి
తిట్లు తిని చివరికి కాలేజీలో చేరాడు.
ఎప్పటిలాగానే అదే
బస్సు. దివాకర్ - లతల ప్రేమ, రోజు రోజుకూ మూడు పువ్వులూ, ఆరు కాయలుగా అభివృద్ది చెందింది. మనసును ప్రేమకు అంకిత మిచ్చినా,
చదువును మాత్రం గట్టిగా పట్టుకుంది లత. లత ప్లస్ టూ ముగించినప్పుడు చేతి నిండా అరియర్స్
తో కాలేజీలో మూడో సంవత్సరంలో ఉన్నాడు దివాకర్.
ఎప్పుడూ లాగానే
టెలిఫోన్ లో మాట్లాడినతను, అలాంటి బాంబు తన నెత్తిన పడేస్తాడని లత కలలో కూడా అనుకోలేదు.
"ఏమిటి దివాకర్!
మీరేం మట్లాడుతున్నారో మీకు అర్ధమయ్యే మాట్లాడుతున్నారా?"
అన్నది లత. వణుకుతున్న గొంతుతో.
"నేను నీ దగ్గర
అడ్వైజ్ అడగటం లేదు. నీ డిషెషన్ ఏమిటి? చెప్పు" అన్నాడు.
"నా వల్ల
కాదు"
"ఇప్పుడే
అర్ధమయ్యింది. నేనొకడినే నిన్ను నిజంగా ప్రేమించానని" అన్నాడు.
"ఏం
మాట్లాడుతున్నావ్ దివాకర్? నా ప్రేమను సందేహిస్తున్నావా?"
"నీ
ప్రేమ నిజమైనదయితే, నేను చెప్పేది విను"
"ఇప్పుడెందుకంత
తొందర?
మనం ఊరు వదిలి పారిపోయి ఏం సాధించబోతాం?"
"అదంతా
తరువాత నేను నీకు చెబుతాను. రేపు రాత్రి రెండింటికి మన ఊరి సరిహద్దులో ఉన్న బస్సు
స్టాపింగులో వచ్చి నిలబడు. నేను బండితో కాచుకోనుంటాను. నేరుగా శాంతిపురం వెళదాం.
ప్రొద్దున కొండమీదున్న గుడిలో మన పెళ్ళి. ఇదే ప్లాను. నువ్వు నీ బట్టలూ,
నగలూ తీసుకునిరా. ఒక బ్యాగు చాలు" అన్నాడు.
ఆమె మౌనంగా వింటూ
ఉన్నది.
"ఏమిటీ!
వింటున్నావా ...లేదా? నీ దగ్గర నుండి సమాధానమే లేదు. నగలు ఎందుకు తెమ్మంటున్నానా అనేగా నీకు సందేహం?
పెళ్ళి ముగించుకుని మా నాన్న ముందు నగలన్నీ వేసుకుని
నిలబడితే మర్యాదగా ఉంటుంది కదా! అందుకునే..." అని చాకచక్యంగా మాట్లాడాడు.
"వద్దు"
అని ఎంతగానో చెప్పిన ఆమెను, చివరగా
విషం బాటిల్ చూపి లొంగదీసుకున్నాడు.
బుర్రకెక్కని
చదువుతో తనకు తోచినట్లు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న అతన్ని, అతని తల్లి-తండ్రులు అసహ్యమైన ప్రశ్నలతో
అవమానించడంతో -- వాళ్ళ మీద పగతీర్చుకోవటానికి తన ప్రేమను వాడుకున్నాడు దివాకర్.
అతని తండ్రి కిషోర్
అత్యాశ కలిగినవాడు.
కొడుకుపై పెళ్ళి అనే
వల విసిరి, డబ్బుగల
తిమింగలాన్ని పట్టుకోవాలని కాచుకోనున్న అతనికి, కొడుకుకు
చదువు ఎక్కక పోగా 'పిల్ల జమీందారు’
లాగా తిరుగుతూంటే కడుపు మండిపోయింది. ఆ రోజు దివాకర్ని ఎక్కువగా అవమానపరిచాడు.
కిషోర్ ను చూస్తేనే
అతని ఎదురుగా వచ్చేవాళ్ళు తప్పించుకు పారిపోతారు. నయవంచకంగా మాట్లాడి అప్పు అనే
పేరుతో డబ్బు వసూలించి, మోసం
చేసే మనుషులలో దిట్ట. తన సొంత కారూ, సొంత ఇల్లు అనే కలను
రాబోవు కోడలు ద్వారా నెరవేర్చుకోవాలి అనే కాంక్షతో ఉన్న అతను -- కొడుకు ప్రేమ
గురించి తెలుసుకున్నప్పుడు తట్టుకోలేకపోయాడు.
ఒక సాధరణ గుమాస్తా
కూతురు తనకి కోడలా? అతను
తట్టుకోలేకపోయాడు, తోక తెగిన బల్లి లాగా గిలగిలా
కొట్టుకున్నాడు.
అతని అన్ని కలలనూ
పాడుచేసే విధంగా కొడుకు ప్లాన్ చేశాడు.
గొడవ చేయటానికి
కొంచం కూడా ఇష్టం లేక, ప్రేమికుడి చేయి పట్టుకోవటానికి బయలుదేరింది లత.
అతను విషం అనే ఆయుధం
చూపి బెదిరించగానే చీమలాగా అయిపోయింది.
ప్రాణంగా చూసుకునే
తండ్రి కంటే, ప్రేమికుడి
ప్రాణమే ముఖ్యం అనుకుని నిర్ణయించుకుంది.
విషయం విన్న వెంటనే
ఆగ్రహించాడు కిషోర్.
నలుగురైదుగురితో
కలిసి గుడికి వెళ్ళినప్పుడు, పూలమాల వేసుకుని, చేతిలో తాలిబొట్టుతో నిలబడున్న కొడుకును చూడగానే ఆగ్రహం
తలకెక్కింది. కొడుకుకు నాలుగు తగిలించాడు. తడిసిన కోడిపిల్ల వణుకుతున్నట్టు
వణుకుతూ నిలబడ్డ లతను చూసి అనరాని మాటలతో తిట్టిపోసి చెల్లె...చెల్లు మని లత చంపల
మీద రెండు దెబ్బలు వేశాడు.
కిషోర్ తన కొడుకుతో
వెళ్ళిపోయిన తరువాత విశ్వం అక్కడికి వచ్చాడు.
తల మీద బండరాయి వేసిన
కూతురి వాలకం చూసాడు!
కన్నీళ్ళూ,
వాచిన చెంపలతో, నెత్తుటి పెదవులతో
అవమాన దుప్పటి క్రింద చుట్టుకుని పడుంది లత.
లాలించి,
బుజ్జగించి, ముద్దులాడి పెంచిన కూతుర్ని చూడకూడని వాలకంలో చూడగానే - ఆ
తండ్రి మనసు ఎంత కొట్టుకుందో వర్ణించలేము.
ఆడపిల్లను కన్న
తండ్రిగా,
కిషోర్ మాట్లాడిన అవమాన పరిచే మాటలు మరిచిపోలేని
పరిస్థితిలో మనసు విరిగిపోయి రాయిలాగా అయిపొయాడు విశ్వం.
పెళ్ళి అలంకరణతో
తనమీద కూతురు విసిరిన బురదను మనసులోనే అనుచుకున్నా డు
ఆయన.
***********************************************************PART-4***************************************************
కూతుర్ని కాలేజీ
హాస్టల్లో జేర్చి దుబాయ్ దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు విశ్వం.
దానికోసం ఉన్న
పొలాన్ని అమ్మి, దాంట్లో
దొరికిన డబ్బును, ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న డబ్బును పెట్టుకుని,
లతకు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు,
తాను దుబాయ్ వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాడు.
లతకు కాలేజీ తెరవక
ముందే,
విశ్వం దుబాయ్ వెళ్ళాల్సిన సమచారం వచ్చింది.
కూతురు చేసిన పనికి
బంధువుల మధ్య, ఊరి
ప్రజల మధ్య అవమానపడి నిలబడ్డ ఆయనకు కూతుర్ని ఒంటరిగా విడిచి వెళ్ళటానికి మనసు
రాలేదు. ఆమె కాలేజీ తెరవటానికి ఇంకా రెండువారాలు ఉంది.
తండ్రి తరపు
బంధువులు ఉన్నా, వాళ్ళ
దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. తల్లి తరపు సొంతం అని చెప్పుకునే పిన్ని లత
పుట్టటానికి ముందే, ఎవరో ఒక సగం ముసలివాడ్ని పెళ్ళిచేసుకుని నార్త్ ఇండియా వైపు వెళ్ళిపోయిందని
విన్నది.
కూతుర్ని
ఆదరించటానికి ఎవరూ లేని స్థితిలో, ఆమెను ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్ళిపోయాడు తండ్రి విశ్వం.
ఆయన వెళ్ళిన ఇరవైయవ రోజు ఒక ఫోన్ వచ్చింది లత కు.
అందులో వచ్చిన
వార్త!
"ఓ"...అని
గట్టిగా ఏడవాలని అనిపించక అలాగే నిలబడింది.
వార్తలోని పూర్తి
వివరాలు విన్నదో ఏమో! షాక్ లో శిలలాగా నిలబడిపోయిన లతను,
ఫోనులో అవతలవైపు మాట్లాడుతున్నవారు చాలా సార్లు పిలిచినా
ప్రయోజనం లేకపోయింది.
చాలాసేపు తరువాత,
షాకుతో మొద్దుబారిపోయిన లత హృదయం చిన్నగా తెలివిలోకి రావటంతో
----జారవిడిచిన టెలిఫోన్ రీసీవర్ను తీసింది.
ఫోన్ కట్ అయ్యింది
కూడా గ్రహించలేక "హలో! నాన్నా...నాన్నా..." అంటూ అరిచింది.
‘ఏం చేయాలి?
ఎలా చేయాలి?’ అనేది అర్ధంకాక--ఇంటి బయటకు పరిగెత్తింది.
అప్పుడు ఆ
అమాయకురాలి కళ్ళల్లో కనబడింది దివాకర్ ఇల్లు మాత్రమే.
మెరుపులాగా
పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తట్టింది.
"మామయ్యా...మామయ్యా...తలుపులు
తెరవండి"
తలుపులు తీసాడు కిషోర్.
"మామయ్యా"
అరుస్తూ క్రింద పడిపోయింది.
ఏదో చూడకూడనిది
చూసినట్టు అతనిలో ఒక విరక్తి భావం.
"ఏయ్! ఏమిటి
ఇది?
ఎందుకు ఇక్కడకొచ్చి గొడవ చేస్తున్నావు?"
అన్నాడు విరక్తిగా.
"మామయ్యా!"
అంటున్న లత దగ్గరకు దివాకర్ రావడంతో, ఆమెలో కొంత ధైర్యం వచ్చింది.
తనకొక తోడు
దొరికిందనే నమ్మకం.
"ఓ" అంటూ
అణుచుకున్న ఏడుపు బయటకు వచ్చింది.
"ఏయ్! ఇక్కడొక
పక్క అడుగుతుంటే శొకాలు తీస్తూ రాగాలు పెడుతున్నావు" అన్నాడు కిషోర్
కొట్టబోయే దోరణిలో.
"మామయ్యా!
ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏమిటేమిటో చెబుతున్నారు. నాన్న చనిపోయారట. చాలా భయంగా ఉంది
మామయ్యా. ఏమిటని వచ్చి అడగండి మామయ్యా" అన్నది ఏడుస్తూ.
చిన్నగా షాకుకు
గురైనా,
రాయిలాగా నిలబడ్డాడు ఆ పాపాత్ముడు.
"నాకు వేరే
పనిలేదా?"
"అయ్యో!
ప్లీజ్,
అలా చెప్పకండి. నాకు ఎవరూ లేరు. నాకు కాళ్ళూ,
చేతులూ వణుకుతున్నాయి. మీ కాళ్ళ మీద పడతాను. జరిగిందేదీ
మనసులో పెట్టుకోకండి" అంటూ కిషోర్ కాళ్ళ మీద పడ్డది.
అతను "ఏయ్! ఛీ
ఛీ...వదులు" అని వెనక్కి జరిగాడు. అతని చుట్టూ నిలబడ్డ అతని భార్య,
పిల్లలు ఏమిటి? ఏం జరిగింది? అని ఒక్క మాట కూడా అడగలేదు.
దివాకర్ మొహంలో ఈమె
ఎవరో?
ఎక్కడిదో? అనే నిర్లక్ష్య దోరణి. తన ప్రేమ పావురం ఏడుస్తూ నిలబడిందే నన్న తపన కొంచం కూడా లేదు.
"మీ నాన్న
చనిపోతే నాకేంటి? బ్రతుకుంటే నాకేంటి? ఏడుపు ఆపి ఇక్కడ్నుంచి పో. ఎవరింటి చావుకో నా ఇంట్లో ఎందుకు శోకాలు?"
అంటూ తలుపులను దబేలుమని వేసాడు.
"మామయ్య...అలా
చెప్పకండి. మీరు తప్ప నాకు ఇంకేవరున్నారు" అంటూ తలుపు తట్టింది.
ఆమె కన్నీళ్ళు,
ఆవేదన ఆ తలుపులకున్న ఇనుప గొళ్ళాలను కూడా కరిగించి ఉంటాయి.
కానీ ఆ రాతి గుండె కలిగిన కిషోర్ను కరిగించలేదు!
కుదిరినంత వరకు
బ్రతిమిలాడినా ఏమీ ప్రయోజనం లేదని తెలుసుకుని, తూలుతూ రెండడుగులు వేసిన లతకు - అనాధగా అన్య దేశంలో పడున్న
తండ్రి జ్ఞాపకమే వచ్చింది.
'నాన్నా నావల్లే
కదా...! నా జ్ఞాపకాలే కదా మీ గుండెను కరిగించి, కరిగించి
గుండెపోటును తెప్పించింది. ఎలా బాధపడుంటారు? నన్ను
క్షమిస్తారా నాన్నా? అయ్యో! నేను మిమ్మల్ని
చంపేసానే...నాన్నా!' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటి ముందు
పడిపోయిన లతను అనుకోకుండా చూసిన పక్కింటాయన--వివరాలు అడిగి తెలుసుకుని ఊరి
పెద్దలను సమావేశపరిచాడు. అప్పుడు విషయం తెలుసుకున్న వెంకట్, తన
కుటుంబాంతో సహా వచ్చాడు. ఆ విషయంలో వాళ్ళ
తోడు లేకుండా పోయుంటే, తండ్రితో పాటూ లత కూడా పైలోకాలకు
వెళ్ళుంటుంది.
విశ్వనాద్ బంధువులు
రాత్రే వివరాలు తెలుసుకున్నా, సావకాశంగా ప్రొద్దున్నే వచ్చి జేరారు. ఒక వారం తరువాత విశ్వం ఒక మూటలాగా వచ్చి జేరాడు. చావు ఇంట్లో విశ్వనాద్
చావు గురించి కంటే లత యొక్క శీలం గురించే
ఎక్కువగా చర్చించుకున్నారు.
విశ్వనాద్ తల్లి
దీపను చూసి "శనేశ్వరం లాగా నా కొడుకును పీడించుకు తిన్నారు కదవే! మీ అమ్మ నా
కొడుకును నా దగ్గర నుండి వేరు చేసింది. నువ్వు వాడిని ఈ లోకం నుంచే వేరు చేశావే!
నువ్వు బాగుంటావా? కొవ్వెక్కిపోయి
ఊరంతా మేసి నా కొడుకును చంపేసేవే" అంటూ ఏడుస్తూ అరవటంతో ముట్టుకోకూడని
పురుగును చూసినట్లు, ఊరు, బంధువులు
వెలివేయ-- వెంకట్ భార్య సుందరీనే తల్లిలాగా ఆదుకుంది. బంధువులు
శ్మశానం నుండి తిన్నగా వెళ్ళిపోగా, వెంకట్టే అన్ని కార్యాలూ చూసుకున్నాడు. కష్టాలలో స్నేహితులే సహాయ పడతారని
నిరూపించాడు.
కిషోర్ యొక్క
అవకతవకల పనుల వలన…నలుగురైదుగురు
అప్పు పత్రాలతో వచ్చారు. ఇళ్ళు అమ్మి అన్ని అప్పులూ తీర్చారు. లత ఇష్టపడినట్లు
ఆమెను హైదరాబాద్ పంపి చదువుకోవటానికి సహాయపడ్డాడు. ఆమె చదవాలని ఆశ పడిన ఇంజనీరింగ్
చదువు తండ్రితో పాటూ సమాధి అయ్యింది.
"ఆడపిల్లండి.
అమ్మాయికి పెళ్ళి జరిగేంత వరకు మీ గార్డియన్ బాధ్యతలో ఉంచుకోండి" అన్నారు
ఒకరు.
"మా ఇంట్లోనూ
ఆడపిల్లలు ఉన్నారండి. దీని బుద్దులు వాళ్ళకు వస్తాయేమో" అంటూ
తప్పించుకున్నాడు బాబాయ్.
"మా అన్నయ్యనే
చంపిన ఒక హంతకురాలు. ఇది ఎలా పోతే మాకేంటి?" అంటూ అత్తయ్యలు తప్పుకున్నారు. "వీళ్ళు చెప్పే దాంట్లో
కూడా న్యాయం ఉంది" అంటూ మరొకరు చెప్పారు.
అన్ని అవమానాలనూ తట్టుకుని,
అన్నీ వేదనలనూ మనసున అణిచి, ఈ రోజు యుక్త వయసు అమ్మాయికి ఉండాల్సిన భావాలే లేకుండా
జీవిస్తోంది లత.
***********************************************************PART-5***************************************************
"అరే
దుర్మారుగుడు! నిన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయాడు" మూడవసారి అడిగింది కుమారి.
"హు..."
అనే నవ్వు మోనాలీసా ఛాయతో లత దగ్గర నుండి వచ్చింది.
ఎదురుగా ఉన్న నిండు
కుండ లాంటి సముద్రం లాగా ఆమె మనసు కూడా పలువిధ ఆలొచనలతో నిండుగా ఉంది. ఆమె
తండ్రిని పోగొట్టుకుని బాధపడుతున్నప్పుడు కూడా మాట వరసకు ఒక ఓదార్పు మాట మాట్లాడని
వాడిని గురించి, ఆమె ప్రేమతో
కరిగిపోయినా...ఆ నిర్లక్ష్య చూపు...ఆమె హృదయాన్ని బలంగా దెబ్బకొట్టింది.
మనల్ని
నిరాకరించినతని ముందు మనం అతని కంటే గొప్పగా నిలబడితేనే గొప్ప. కానీ, లత అలా లేదే! అతని కంటే పలు విషయాలలో
తక్కువగానే కదా నిలబడింది. ఓడిపోయిన వాళ్ళు గెలవటం, గెలిచినవారు
ఓడిపోవటం ప్రకృతి.
మంచి దారిలో
తెచ్చుకున్న పేరు, ప్రతిష్ట,
అంతస్తు ఎలాంటి నష్టాన్నైనా తట్టుకునే మందు అనేది ఆమెకు తెలియక కాదు.
నిజాయితీగా సంపాదించుకున్న సంపాదనే నిలబడింది.
అది మంచి కుటుంబం
కాదు లతా. వాడి అక్కయ్య వాళ్ళ గురించిన వార్తలు ఈ చుట్టు పక్కల బాగా వ్యాపించి
ఉంది. కావాలంటే మన మధు దగ్గర అడిగి చూడు...ఏం మధూ" అన్నది సుందరి, మధుమితను చూసి.
"అవును లతా. ఆ
ఆడవాళ్ళు బాగా రంగుగా ఉంటారు. కానీ, ఏ మగాడ్నీ విడిచిపెట్టరు.
ప్రేమిస్తున్నామని మోసం చేసి డబ్బు, నగలూ లాకుంటారు. మీ
ఇంటిని కూడా ఆ మనిషి ఏదో అవకతవక చేసి అపహరించాడని ఊరు చెబుతోంది" అన్నది
మధుమిత.
"ఒక ప్రాణాన్ని
బలి తీసుకుని ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉండ గలుగుతున్నారో! వాళ్ళకు మంచి చావే రాదు?"అన్నది సుందరి ఆవేశంగా.
“అక్కడ ఇప్పుడు
ఎవరూ నిన్ను తప్పుగా మాట్లాడటం లేదు లతా. వాళ్ళనే నీచంగా మాట్లాడుతున్నారు. విశ్వనాద్
గారి కుటుంబాన్ని నాశనం చేసిన పాపాత్ముడు అనే చెబుతున్నారు"
"వాళ్ళు బాగానే
కదా ఉంటున్నారు. 'రియల్
ఎస్టేట్' బిజినస్ చేస్తున్నారట. డబ్బు బాగా
సంపాదిస్తున్నారట. నాన్న చెబుతూ ఉండేవారు"
"ఎందుకు
సంపాదించకుండా ఉంటారు? అడ్డ
దారిలో వెడితే డబ్బు గడించడం పెద్ద కష్టం కాదు. ఒకే స్థలాన్ని నలుగురికి
బేరమాడుతారట. వీళ్ళ బుద్ది తెలిసి కూడా మా నాన్నే రెండు లక్షలు ఇచ్చి మోసపోయారంటే
చూసుకో" అన్నది మధుమిత ఆవేదనతో.
"నిజంగానా? నా దగ్గర చెప్పనే లేదు" అన్నది సుందరి.
"ఎలా చెప్పగలం? ఎవరితోనైనా చెబితే మాకే అవమానం. ఇచ్చిన
డబ్బుల్ని అడిగితే తల్లి, తండ్రి, పిల్లలూ
కర్రలు తీసుకుని కొట్టటానికి వస్తున్నారట. వాళ్ళ వీధి కుక్కలు కూడా వాళ్ళకు మర్యాద
ఇవ్వటం లేదు.
ఆ దివాకర్ 'హీరో' లాగా కారులోనూ,
మోటార్ సైకిల్ మీద వెలుతున్నా కూడా ---బిచ్చగత్తె కూడా తిరిగి చూడటం
లేదు" అన్నది మధుమిత.
"ఛ ఛ...వాళ్ళ
గురించి మాట్లాడి ఎందుకు టైము వేస్టు చేసుకోవాలి" అని సుందరి చెప్పినప్పుడు, ఇద్దరు స్నేహితురాళ్ళూ తాము ప్లాన్
చేసుకున్నట్టు లతను ఉత్సాహ పరిచే విధంగా దివాకర్ కుటుంబ వివరాలు చెప్పామని తృప్తి
చెందారు.
తమ ప్రాణ
స్నేహితురాలిని ఈ పరిస్థితికి తోసిన అతని మీద పగ తీర్చుకున్న తృప్తి వాళ్ళకు.
"నీ మీద నాకు
కోపం లతా. అక్కడికి వచ్చిన నువ్వు మా ఇంటికి రాకుండానే పోయేవే! ఒక విసిట్
వచ్చుండచ్చు కదా? మన టీ కొట్టు నాయర్ నువ్వు వచ్చింది, ఇక్కడున్నావనే వివరం నాన్న దగ్గర చెప్పాడు! నిన్ను చూసి
రమ్మని నాన్నే మమ్మల్ని పంపించాడు" అన్నది మధుమిత.
"నా వలన
మీరెందుకు అవమానపడాలి అని అనుకునే రాలేదు" తలవంచుకుని చెప్పింది లత.
“ఇలా చూడూ.
ఇంకోసారి అలా మాట్లాడకు. నాకు పిచ్చి కోపం వస్తోంది. నువ్వేం అంత పెద్ద తప్పు
చేసావు? ఈ
ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేదు చూడు. ఆ ఏమీ అర్ధంకాని వయసులో
మంచేది...చెడేది...అనేది తెలుస్తుందా? తెలిస్తే చేసేదానివా?" అని అడిగిన మధు "నీ ఈ పరిస్థితికి నీ స్నేహుతురాలమైన
మేమూ ఒక కారణమే! నిన్ను ఖండించి వద్దని చెప్పకుండా, ప్రేమించమని ఉత్సాహ పరిచామే" అన్నది.
లత మనసులో
నిర్లక్ష్య వైకరి.
ఎవరు చెప్పినా వినే
స్థితిలోనా ఆమె ఉన్నది?
ప్రేమ మత్తు
తలకెక్కి పిచ్చి పట్టినట్టు కదా ఆమె ఉన్నది.
ప్రాణంగా
ప్రేమిస్తున్న తండ్రి కూడా జ్ఞాపకం రాలేదే?
"లతా!
ఎలాగూ ఇంత దూరం వచ్చావు. ఇంకో రెండే రెండు రోజులు మాతో పాటూ ఇక్కడే ఉండు. అమ్మ
నిన్ను పిలుచుకు రమ్మంది" చెప్పింది మధుమిత.
"ఏయ్ మధూ!
నువ్వు చెప్పినా, చెప్పకపోయినా ఇది ఇక్కడే ఇంకా మూడు రోజులు ఉంటుంది. నాన్న ఆదివారానికే దీనికి
రైలు టికెట్టు కొన్నారు" అన్నది సుందరి.
ముగ్గురూ నడుచు
కుంటూ ఆ సముద్ర తీరంలో నడుస్తున్నారు. సాయంత్రం మెల్లగా జారుకుంటోంది. పిలిచేంత
దూరంలో సుందరి ఇల్లు.
"చీకటి
పడుతోంది...ఇక నేను బయలుదేరతాను" అంటూ మధుమిత బయలుదేరటానికి రెడీ అయ్యింది.
ముగ్గురూ కలిసి రోడ్డు దగ్గరకు వచ్చారు.
తన స్కూటిని
స్టార్ట్ చేసిన మధుమితతో "చూసి, జాగ్రత్తగా వెళ్ళు" అన్నది లత.
"సరే...రేపుప్రొద్దున్నే
తొమ్మిదింటికి రెడిగా ఉండండి. నేను వచ్చేస్తాను" అని చెప్పి వెళ్ళిపోయింది
మధుమిత. మంచికాలం, ఏదో పండగ అంటూ శుక్రవారంతో కలిపి మూడు రోజులు కలిసొచ్చింది.
మరుసటిరోజు
ఫ్రెండ్స్ ముగ్గురూ బయటకు వెళ్ళారు. షాపింగ్, పార్క్, హోటల్, సినిమా అని తిరగటంతో మనసు సంతోషంగా ఉంది. దగ్గర దగ్గర
నాలుగు సంవత్సరాలు ఎవరితోనూ కలవక ఒంటరి తనానికి అలవాటుపడిన లత మనసులో పిల్లతనం
తిరిగి వచ్చింది. మనసు ఆట పాటతో టయర్డ్ అయ్యింది.
మరుసటి రోజు
ముగ్గురూ గుంటూరు వెళ్ళారు. సుందరి బండిలో వెనుక లత కూర్చుంది. ప్రయాణం
కొనసాగింది. వాళ్ళు వెళ్ళి చేరుకునేటప్పటికి సమయం పన్నెండు అయ్యింది.
తిన్నగా కనబడ్డ హై
క్లాస్ వెజిటేరియన్ హోటల్ కు వెళ్లారు. తృప్తిగా భోజనం చేసారు.
రిసెప్చన్ బెంచిలో
మధుమిత,
లత కూర్చున్నారు... సుందరి బిల్లు
కట్టింది.
"రండి
వెళదాం" అని పిలవగా -- ముగ్గురూ హోటల్ బయటకు వచ్చిన సమయంలో ఎదురుగా ఒక అందమైన
అమ్మాయితో వచ్చేడు దివాకర్. లతను చూసిన వెంటనే కావాలని ఆ అమ్మయి భుజం మీద చేయి
వేశాడు. లతను చూసి వెక్కిరింపుగా నవ్వాడు. అతన్ని చూసి మధుమిత ఆవేశంగా
మాట్లాడింది.
"ఎంత
వెక్కిరింపుగా చూస్తున్నాడో చూడు! అంత అంద వికారంగానా ఉన్నాము. వాడి కళ్ళు
పీకేయాలి. వాడికనే దొరుకుతున్నారు చూడు" అని కచ్చెగా చెప్పిన మధుమితతో
"అతనిపైన తప్పులేదు. లతను చూడు ఎలా ఉందో. ఆడ స్వామీజీలాగా లూజులూజుగా ఉండే ఒక
చుడీదార్, గట్టిగా, ఒత్తుగా
వేసుకున్న జడ. నుదుటి పైనున్న జుట్టునైనా అలంకరించుకోనుండాలి. సిటీలో ఉన్నదన్న
మాటే గానీ మనిషిలో ఏమీలేదు" అన్నది సుందరి .
"అవును లతా
నువ్వు మారాలి. మనిషి సగం, అలంకారం
సగం అంటారు. మన గ్రామంలో చూసావా? అమ్మాయులు ఎంత నాగరీకంగా
ఉన్నారో. మనల్ని మనమే అందంగా చూపించుకోవటంలో తప్పు లేదే! మన పురాణాలు కూడా స్త్రీ
అలంకరణ గురించి చెప్పింది. ఒక స్త్రీకి బలమే ఆమె స్వయం మర్యాద, అలంకరణ టాలెంటేనట. నువ్వెందుకు నత్తలాగా చుట్టుకున్నావు? మంచిగా డ్రస్సు చేసుకో, ఇప్పుడున్న ఆడపిల్లల లాగా
నాగరీకంగా ఉండు. నిన్ను నువ్వే ఎందుకు ఇంత కించ పరుచుకుంటున్నావు? నిన్ను మేము వదిలిపెట్టం. ఏమంటావ్ సుందరీ?" అన్నది
మధుమిత.
ఇద్దరూ వెంటనే
రంగంలోకి దిగారు. వద్దు వద్దు అంటున్నా లతను బ్యూటీ పార్లర్ కు తీసుకు వెళ్ళారు.
ఫేషియల్,
బ్లీచింగ్ అనే పేరుతో ఆమె ముఖ చర్మం ఊడిపోయేలాగా మొహాన్ని
అందంగా తీర్చి దిద్దారు. నడుం వరకు వేసుకున్న జుట్టును నాగరీకంగా కత్తిరించారు.
రెండు గంటల తరువాత, తాళం వేసున్న గది తెరుచుకుని బయటకు వచ్చిన ఆమెను చూసి స్థంభించిపోయారు.
నిలువెత్తు అద్దం ముందు ఆమెను నిలబెట్టి "చూడు! ఎంత అందంగా ఉన్నావో. ఇక మీదట
ఒత్తుగా,
పొడుగ్గా దువ్వుకోకు.ఇదేలాగా రెండు వైపులా లూజుగా వదిలి
క్లిప్స్ పెట్టుకో. అందంగానూ, నాగరీకంగానూ ఉంటుంది." అన్నది మధుమిత.
అంతటితో ఆగలేదు.
కొన్ని చుడీదార్లు, బట్టలు కొని పడాసారు.
లత డబ్బు ఇచ్చినా
తీసుకోలేదు.
"ఇది నాన్నగారు
ఇచ్చిన డబ్బు" అన్నది మధుమిత.
"మా అన్నయ్య
పోయిన సారి క్రిస్మస్ కు ఇచ్చిన డబ్బు ఇది" అన్నది సుందరి.
“మొదట ఈ లూజు,
లూజుగా ఉన్న బట్టలను టైట్ చేయించుకో. ప్రతి అమ్మాయిలోనూ
అందం దాగుంటుంది లతా. కరెక్ట్ అయిన దుస్తులు వేసుకుని,
జుట్టు అలంకార స్టైలును మారుస్తే చాలు 'లుక్కు’ వచ్చేస్తుంది. దుప్పటాని ఇలా దుప్పటిలాగా వేసుకోకూడదు. కాస్త స్టైలుగా
ఇలా వేసుకోవాలి. ఇలా అందంగా వేసుకుంటే నీ శీలం ఏమీ ఎగిరిపోదు" అన్నది.
ఇంటికి వచ్చిన
తరువాత కొత్త దుస్తులు ధరించి తన ప్రతిభింబాన్ని తానే చూసుకున్నప్పుడు లతకి
ఆత్మవిశ్వాసం అనే విత్తనం మొలకెత్తింది. దాక్కున్న అందం బయటపడటంతో మనసు తేలిక
అయిపోయిన భావం. 'నీతీ,
న్యాయం, ధర్మం --ఈ ముగ్గురుకీ తప్ప ఇంకెవరికి నేను బానిస?
ఎందుకు భయపడాలి? అనే ప్రశ్నలు తల ఎత్తగానే--కొంచం కొంచంగా ఆమెను లోబరచుకున్న
నేర భావన,
ఆత్మ విశ్వాసం, నమ్మకం లేకపోవటం లాంటి మాటలు ఊడి పడిపోయినై.
దగ్గర దగ్గర నాలుగు
సంవత్సరాల తరువాత సొంత ఊరినే తడబాటుతోనూ , నేర భావనతోనూ తొక్కినా --- ఈ రోజు పూర్తి ఆత్మవిశ్వాసంతో
హైదరబాద్ కు బయలుదేరింది.
రైల్వే స్టేషన్ లో లతకు
వీడ్కోలు చెప్పటానికి వచ్చిన వాళ్ళకు కన్నీటితో బై చెప్పిన లత "నాకు ఎంతో ఆదరణగా
ఉన్న మిమ్మల్ని నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోను" అంటూ ఆవేశంగా చెప్పింది.
స్నేహితులు కౌగలించుకుని
వీడ్కోలు చెప్పారు.
"పాపం కదా.
చాలా కష్టపడింది. ఇక మీదట బాగుంటుంది" అని మాట్లాడుకుంటూ ఇంటికి తిరిగి
వెళ్ళారు మధుమిత, సుందరి.
***********************************************************PART-6***************************************************
లత హైదరాబాదుకు వచ్చి
నాలుగైదు నెలలు అయ్యింది.
అప్పుడప్పుడు
మధుమితను, సుందరిని ఫోను మూలం కలిసి యోగక్షేమాలు విచారించింది.
ఎప్పుడైనా బాగా ఒంటరిగా ఉన్న భావన వస్తే వెంటనే స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది
లత.
ఇప్పుడంతా లతకు
ఒంటిరిగా ఉంటున్నామన్న ఫీలింగ్ దూరమయ్యింది.
రూమ్ మేట్స్ తో
కలిసి అప్పుడప్పుడు గుడి, ట్యాంక్ బండ్, షాపింగ్ అని చుట్టొచ్చేది. బయట మనుషులను చూడటం, గలగలమని మాట్లాడటంతో ఆమెకు బాగానే పొద్దు పోతోంది.
ప్రొద్దున
ఎనిమిదింటికి బయలుదేరితే, సాయంత్రం ఏడు గంటల
సమయంలో తిరిగొస్తుంది. ఆ రోజు జీతాలు ఇచ్చిన రోజు కాబట్టి గుడికి వెళ్ళి తిరిగి
వచ్చేటప్పటికి టైము ఎనిమిది దాటింది.
లత అంటే హాస్టల్
వార్డన్ కు మంచి అభిప్రాయం ఉంది.
కొంతమంది
అమ్మాయలలాగా రోజుకు ఒకడితో వచ్చి దిగకుండా, 'తానూ-తన పని’ అని మాత్రమే ఉండే లత అంటే ఆమెకు ఇష్టం.
వార్డన్ గది
దాటేటప్పుడు, ఎప్పుడూ చెప్పే 'గుడ్ ఈవెనింగ్' విష్ ను ఆ రోజు కూడా చెప్పినప్పుడు " లతా ఒక్క
నిమిషం" అన్నది.
"ఏమిటి ఆంటీ?"
"నిన్ను
వెతుక్కుని ఒకరు వచ్చారు"
అన్న వార్డన్ "మామూలు టైము కంటే నువ్వు ఒక గంట ఆలశ్యంగా వస్తావు కదా, అందుకని ఆయన్ని అరగంట తరువాత రమ్మన్నాను. మన హాస్టల్ రూల్స్
ప్రకారం ఈ సమయంలో ఆయన్ని అనుమతించకూడదు. కానీ, ఆయన చెప్పిన విషయం...అదిగో ఆయనే వచ్చారు. మాట్లాడు"
అని చెప్పి తన పనిలో లీనమయ్యింది.
ఏమీ అర్ధం కాని లత--
వచ్చినాయన్ని తలెత్తి ఒకసారి దీర్ఘంగా చూసింది.
" లతా?"
"అవును...మీరు?"
"చెప్తాను.
విజిటర్స్ రూముకు వెల్దామా?"
అతని అధికార దోరణి 'కంగు’ అంటున్నా, అందరినీ గౌరవించే అలవాటు ఉండటం వలన "అదిగో ఆ గదే" అని చూపించి,
ముందు నడిచిన అతని వెనుక నడిచింది లత.
ఆ రెండు నిమిషాల
నడకలో ఆమెకు పలు ఆలొచనలు.
'ఎవరితను?
ఎందుకంత అధికార దోరణి?'
'ఇంతకు
ముందు ఇతన్ని ఎక్కడైనా చూసామా?'
ఆలొచిస్తూ
నడుస్తున్న ఆమె - గదిలోకి వచ్చినట్టు గమనించలేదు.
ఎదురుకుండా నిలబడ్డ
అతను దీర్ఘంగా ఆమెనే చూస్తూ ఉండటంతో ఒక్క క్షణం తికమక పడుతూ -- ఏదో ఆ గదిని
కొత్తగా చూస్తున్నట్టు ఆశ్చర్యపడి నిలబడ్డది.
"కూర్చో"
అదే అధికారం.
కూర్చుంది.
"నా పేరు విశాల్
"
"ఏమిటి విషయం?"
అతను తన వీపు వైపుగా
వేలాడుతున్న సంచిని లాగి -- అందులోంచి ఒక కవరు బయటకు తీసాడు.
లోపలున్నది ఒక ఫోటో.
తీసి ఆమె ముందు జాపిన అతని దగ్గర నుండి బిడియంతో దాన్ని తీసుకుంది.
గందరగోళంతో చూసిన
ఆమె చూపులు మరు క్షణం ఆనందంతో వెలిగింది. ఆమె తల్లి, పిన్ని కలిసున్న ఫోటో అది.
ఆమె ఇంట్లో కూడా
ఇలాంటి ఫోటో ఒకటి ఉండేది. ఆ ఫోటో గురించి ఒక రోజు తండ్రిని అడిగినప్పుడు.
"అవునమ్మా,
ఇద్దరూ కవల పిల్లలు. మా పెళ్ళికి ముందే తనకంటే ఇరవై
సంవత్సరాలు వయసు ఎక్కువ ఉన్న ఒకర్ని పెళ్ళి చేసుకుని నార్త ఇండియా వైపు
వెళ్ళిపోయారని మీ అమ్మ చెప్పేది. పెళ్ళి చేసుకు వచ్చిన వాళ్ళను మీ అమ్మమ్మా,
తాతయ్య గడప తొక్కనివ్వలేదట. ఆ తరువాత ఇంతవరకు ఇటు పక్కకే
రాలేదు"
ఎక్కడున్నారో,
ఎలా ఉన్నారో? ఏదీ తెలియదు. నువ్వు కూడా అసలు మీ అమ్మలాగానే ఉంటావు. మీ
ముగ్గురునీ చూస్తే ఇట్టే గుర్తు పట్టేయచ్చు" అని చెప్పిన జ్ఞాపకం. కొన్ని
సంవత్సరాల తరువాత ఒక బంధువును కలుసుకున్న ఆనందం...ఆ ఫోటోను చూసిన వెంటనే కలిగింది.
ప్రేమ భావనతో ఫోటోను
మళ్ళీ మళ్ళీ చూసింది.
ఎదురుకుండా ఉండే
అతను లత కళ్ళల్లోని భావాలను గమనించాడు.
చిన్న పిల్లలాగా ఆ
ముఖంలో ఏర్పడిన సంతోషాన్నీ, ఆనందాన్నీ...వాటితో పాటు కొన్ని విషాద ఛాయ లను
గమనించాడు...!
మొదట్లో భయపడ్డ ఆమె
కనురెప్పలు కొద్ది క్షణాల తరువాత మెల్లగా పైకి వెళ్ళి అతని ముఖంలోకి దీర్ఘంగా
చూసినై. అతనికి తెలియకుండానే అతనిలో సంతోషం ఏర్పడింది.
"ఎవరని
తెలుస్తోందా?"
"ఊ... గౌరి పిన్ని. కానీ చూడలేదు"
"ఆమె నా
అత్తయ్య"
"ఓ!...పిన్ని
ఎలా ఉంది?
అప్పుడు నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళని"
"అవును... సిమ్లా-అత్తయ్యకు నిన్ను చూడాలని ఆశ"
"నేను
ఇక్కడున్నానని మీకు ఎలా?"
ఆమె అడిగిన ప్రశ్నను
అతను లెక్క చేయలేదు.
"ఎల్లుండి
ప్రొద్దున విమానం. నువ్వు రెడీ అవాలి"
"నేనా? నావల్ల ఇప్పుడు రావటం కుదరదు. సెలవులు
లేవు. సెలవు దొరికినప్పుడు వస్తాను"
"ప్రేమతో
వెతుకుతున్న పిన్ని ముఖ్యం కాదా?"
"అయ్యో! నేను
అలా చెప్పలేదు. నా పరిస్థితి వివరించాను"
"నాకు తెలుసు.
ఇలా హాస్టల్లో స్వతంత్రంగా ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళి వచ్చే అమ్మాయి, కుటుంబం అనే కట్టుబాటులో ఒదిగి ఉండలేదు
అని" అన్నాడు. ఆమె ఆ రోజు హాస్టల్ కు
లేటుగా రావటం నేరం అనే అర్ధంతో చెప్పాడు.
‘ఏమిటితను?
ఏం మాట్లాడుతున్నాడు?’
"నేను
ఎప్పుడూ ఏడు గంటలకే వచ్చేస్తాను. వార్డన్ కు తెలుసు. ఈ రోజు..."
"నువ్వెందుకు
లేటుగా వచ్చావు, దానికి
కారణమేమిటనేది తెలుసుకోవటానికి రాలేదు నేను. అత్తయ్య కోరిక కోసం నువ్వు సిమ్లా
రావాలి. నిన్ను పిలుచుకు వెళ్ళటానికే నేను వచ్చాను" అన్నాడు గంభీరమైన
గొంతుకతో.
లతకు అతని అధికార
దోరణి, అతని వాలకం చిరాకు తెప్పిచ్చింది. “మీరు ఎవరనేదే నాకు తెలియదు. ఏ నమ్మకంతో నేను మీతో రాగలను? ఒక ఫోటో అధారంగా చేసుకుని మీ వెనుక రావటానికి నేను మూర్ఖురాలుని
కాదు" అన్నది గబుక్కున.
"ఇంత
తెలివిగలదానిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి అతి ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకోవలసిన
అవసరం నాకు లేదు" అన్నాడు అతను, అదే కంఠ స్వరంతో.
అతను మాట్లాడిన
దోరణితో ఆమెకు తెలియకుండానే నవ్వేసింది.
విప్పారిన ముఖంతో, ఆమె ముఖాన్ని క్షుణ్ణంగా చూసాడు విశాల్.
ముక్కూ మొహం తెలియని
ఒకనితో సహజంగా మాట్లాడి పళ్ళు ఇకిలిస్తూ నవ్వటం అతిపెద్ద తప్పుగా భవించింది లత.
వెంటనే మనసు మార్చుకుంది.
"ఇలా చూడండి
మిస్టర్..."
" విశాల్ "
“మిమ్మల్ని
నమ్మాలా వద్దా అనేది ఇప్పుడు సమస్య కాదు. ఆఫీసుకు ఎప్పుడు పడితే అప్పుడు లీవు
పెట్టలేం. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితికి నాలాంటి కొత్త వాళ్ళకు పొజిషన్ ఏమిటో
తెలియదు. అందువలన నేను..."
“ఇలా చూడండి మిస్ లతా.
ఒకే ఒక ఫోటోను ఆధారంగా చూపించి మిమ్మల్ని నేను ఆహ్వానించటం -- మీ వరకు న్యాయమైన
పని కాదు. కాబట్టి ఇంకొన్ని ఆధారాలతో రేపు సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను" అని
చెప్పాడు విశాల్.
ఆ తరువాత అన్నీ
హడావిడిగా జరిగిపోవటంతో, ఢిల్లీ విమానాశ్రయంలో దిగినా కూడా లతకు నమ్మకం రాలేదు.
ఏది నమ్మాలి?
అనాధ నంటూ ఒంటరిగా
ఉండిపోయిన ఆమెకు, ఒక బంధుత్వం ఉన్నదా? ఫోనులో విన్న పిన్ని గొంతు, అన్ని ఆశలను రేకెత్తించిందా? జ్ఞాపకాలలో మసకగా కనబడే తల్లి ముఖమూ,
చెవులలో దూరంగా కోయల కూస్తున్న గొంతు -- తల్లి రూపం
మొత్తంగా పిన్ని రూపంలో ఉన్నట్టు అనిపించడమా -- ఏదీ అర్ధం కాలేదు ఆమెకు!
ఏ నమ్మకంతో ఒక
మగాడితో కొన్ని వందల మైళ్ళు దాటి వచ్చింది.
ఢిల్లీ
విమానాశ్రయంలో వైటింగ్ సమయంలో ఆమెను చుట్టుముట్టిన ఆలొచనలు ఆమెను అయోమయంలోకి
తోసినై.
ఆనందం,
భయం, కన్ ఫ్యూజన్, ఆత్రుత అని పలు రకాల భావాల కలయుకలో సిమ్లా లోయ ప్రాంతంలో ఉన్న ఆ అందమైన భవనం
ముందుకు వచ్చి నిలబడింది లత.
***********************************************************PART-7***************************************************
తెల్లటి మంచు కొండలు
గంభీరంగా నిలబడున్నాయ్. సూది ఆకుల చెట్లు గుంపుగా పచ్చని పట్టు వస్త్రం
విరిచినట్లు నిలబడున్నాయి. పచ్చటి గడ్డి తివాచీ మీద మెల్లగా కాలు పెట్టింది లత.
ఒక జలదరింపు
వొళ్ళంతా పాకగా, లోయ
యొక్క అందం ఆమెకు పరవశాన్ని ఇచ్చింది. అందానికి అందం చేర్చినట్టు ఆ రాజ భవనం అక్కడ
రోడ్డుకు దగ్గరగానే ఉంది!
‘ఈ రాజ భవనంలోనా
పిన్ని జీవిస్తోంది?’
ఆ డబ్బు గల తనాన్ని
చూస్తే ఎందుకనో లతలో ఒక జంకును ఏర్పరచింది.
ఆమె మనసుకు ఏమీ
అర్ధం కాక ఆశ్చర్యంతో నిలబడిపోయిన ఆమె చెవిలో ద్రావకం పోయటానికి ప్రయత్నించాడు విశాల్.
"ఏమిటీ! అలా
భ్రమించిపోయి నిలబడ్డావు? బంగళా ఎంత ఖరీదు చేస్తుందని ఆలొచిస్తున్నావా?"
రకరకాల గందరగోళంతోనూ,
బిడియంతోనూ వచ్చిన లత, విశాల్ వేసిన ఆ ప్రశ్నతో స్థంభించి పోయింది.
"లేదు...నేను..."
అని మాట్లాడటానికి తటపటాయిస్తున్న లత, దగ్గరగా నిలబడున్న అతన్ని తల ఎత్తి చూసింది.
ఇంతసేపు చూసిన అతను
ఇప్పుడు కొత్తగా కనబడుతున్నాడు.
ఆమె యొక్క మొదటి
విమాన ప్రయాణం కాబట్టీ, పిన్నికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికీ, ఆమెను చాలా అభిమానంగా చూసిన అతను,
ఇప్పుడు ఒక విలన్ లాగా మాట్లాడటంతో లత భయపడిపోయింది.
అతని ముఖంలో కొత్తగా
కనబడిన నిర్లక్ష్య వైఖరి, వెక్కిరింపు చూపులు ఆమెకు దివాకర్ను గుర్తు చేసాయి.
ఆ రోజు తన సొంత ఇంటి
ముందు సిగ్గుతో కృంగి క్రుషించి తల వంచుకుని నిలబడ్డ అదే పరిస్థి తితో, ఈ రోజు పిన్ని ఇంటి ముందు నిలబడింది.
కానీ కొద్ది
నిమిషాలలో ఏదో నిర్ణయించుకున్న దానిలా ఆమెలో ఒక ధైర్యం.
"ఎవరితను?
ఇతని ముందు నేనెందుకు తలవంచుకోవాలి?"
ఒక విధమైన గర్వంతో
అతన్ని ధైర్యంగా చూసింది.
నేనేమన్నా తిండికి
గతిలేక వచ్చానా?
బంధుత్వాన్ని కదా
వెతుక్కుంటూ వచ్చాను...అది కూడా వాళ్ళు బలవంతం చేస్తేనే!
ఇతని దగ్గర
నేనెందుకు తలవంచుకునుండాలి?
“చాలా ధ్యాంక్స్
మిస్టర్ విశాల్. మీరు చెయ్యాల్సిన పని పూర్తి అయ్యిందనుకుంటా. నా పిన్ని ఉండే
చోటుకు నన్ను తీసుకు వచ్చి చేర్చారు అనుకుంటా" అని నిర్లక్ష్య వైఖరితో చెప్పి
'ఇక నువ్వు వెల్ల వచ్చు’ అనేలాగా ఒక చూపు చూసింది.
ఆమె కూడా తనని నిర్లక్ష్య
పరచటానికే అలా మాట్లాడిందని గ్రహించిన విశాల్ -- కళ్ళల్లో విషం పాకినట్టు,
ఒక విధమైన రొమాంటిక్ నవ్వు నవ్వాడు.
అత్తయ్య పోలికలలో
ఎన్నో పోలికలను తన ముఖ భావనలో చూపుతున్న ఆ అమ్మాయిపై స్వారస్యం ఎక్కువైంది విశాల్
కు. కానీ ఆమెను చూడటానికి ముందు అతనిలో ఆమె మీద ఏర్పడ్డ విసుగు,
కోపం ఇప్పుడు రసమయంగా పరిణామం చెందింది. కానీ దాన్ని అతను
బలవంతంగా మనసులో నొక్కి పెట్టాడు.
పిన్నిని
చూడబోతున్నామనే ఆశను ఆణుచుకోలేని లత, విశాల్ చూపులోని వెకిలి తనానికి అర్ధంకాక కురువాలను చిట్లించుకుంటూ తన
ముఖాన్ని మరో పక్కకు తిప్పుకుంది.
అప్పుడు ఇంట్లో నుంచి
ఒక ఆడ మనిషి వచ్చింది.
" వందనా! అత్తయ్య ఎక్కడుంది?"
"ఆమె
గదిలో ఉంది సార్"
"ఈమెను అత్తయ్య
దగ్గరకు తీసుకు వెళ్ళు"
"రండమ్మా"
లత చేతిలోని
పెట్టెను ఆమె తీసుకోగా, హ్యాండ్ బ్యాగుతో ఆమె వెనుకే వెళ్ళింది లత.
మేడ ఎక్కి,
వరాండాలో కొద్ది నిమిషాలు నడిచిన తరువాత -- "ఇదిగో ఈ
గదే" అన్నది వందనా. "మీ హ్యాండ్ బ్యాగు ఇవ్వండి. ఎదురుగా ఉన్నదే అదే మీ
గది" అని చెప్పి హ్యాండ్ బ్యాగు తీసుకుని ఆ గదిలోకి వెళ్ళింది.
పిన్ని గది దగ్గరకు
వెళ్ళింది లత.
తలుపు తిట్టింది.
"రావచ్చు"
పాటలా వినబడింది గొంతు.
బిడియంతో తలుపు
తెరుచుకుని వెళ్ళి, తనకు వీపు చూపిస్తున్నట్టు నిలబడ్డ ఆవిడ్ని ముట్టుకుంది.
తనవైపుకు తిరిగిన
ఆవిడ్ని చూసి, ఆశ్చర్యంతో
నిలబడ్డది.
"పిన్నీ!"
" లతా! నా తల్లీ!"
కౌగలించుకుంది గౌరి.
ముప్పై ఐదు ఏళ్ళున్న
అమ్మాయిలాగా సాల్వార్ కమీజ్ వేసుకోనుంది. ఒక గొప్ప జాతి ఆడదానిలాగా నిలబడ్డ ఆమె -
తల్లి పోలికలతో ఆమె లేకపోతే ఆమె తన పిన్ని అని నమ్మేది కాదు లత.
మొదటి రోజు లతాను
హాస్టల్లో కలుసుకున్న విశాల్, మరుసటి రోజు తన 'లాప్ టాప్' ను తీసుకు వచ్చాడు. అందులో లతకు ఆమె పిన్నిని,
తన అత్తయ్యను, ఆమె పిన్ని ఉన్న మరికొన్ని ఫోటోలను చూపించాడు. ఆ
ఫోటోలన్నిటిలోనూ లత పిన్ని స్వటర్ వేసుకుని చీర కట్టులో ఉన్నది. అచ్చం తను తండ్రి
దగ్గర చూసిన తన తల్లి ఫోటోలో, తల్లి పోలికలతో
ఉన్నది గౌరి.
కానీ,
ఈ రోజు ఒక సామ్రాజ్యానికే మహారాణిలాగా గంభీరంగా తెలుస్తోంది
పిన్ని.
"నన్ను
క్షమించు కన్నా, నీ
పరిస్థితి ఇలా ఉంటుందని నేను ఎదురు చూడలేదు. ఇన్ని రోజులు నిన్ను ఒంటరిగా ఉండేట్టు
కష్టపెట్టాను" కన్నీటితో తన బాధను తెలిపింది.
భావాద్వేగంతో
పెద్దగా ఏడ్చింది లత.
పట్టు విడువకుండా
చోటు వెతుకుతున్న తనకు, తన సొంత గూడే దొరికినంత సంతోషం కలిగింది!
కన్నీటితో ఒకరినొకరు
పలుకరించుకుని తమ ప్రేమను వెలిబుచ్చుకున్నారు.
"అత్తయ్యా! 'ప్రేమ గూడు సినిమా మీ
ముందు బలాదూర్" -- వెక్కిరింపు గొంతుక కంగుమని వినిపించడంతో ఇద్దరాడవాళ్ళూ మామూలు
స్థితికి వచ్చారు.
"రా... విశాల్" -- కాంతివంతమైన కళ్ళతో మేనల్లుడ్ని
ఆహ్వానించింది పిన్ని. గౌరి దగ్గరకు వచ్చాడు విశాల్ --' అత్తయ్య నాకు మాత్రమే సొంతం ' అనే లాగా, ఆప్యాయంగా, హక్కుతో ఆమెకు దగ్గరగా నిలబడ్డాడు.
అతని కళ్ళు నేరుగా లతను
చూసి 'ఈమె నా అత్తయ్య’ అని
మొండిగా చెప్పినట్టు అనిపించడంతో, లత ఒక్క క్షణంలో తన చూపును
మార్చుకుంది.
'ఇతనికీ, మనకూ ఏమిటి సమబంధం?' అన్నట్టు చూసింది.
"ఆ గది నీ గది లతా.
వెళ్ళి కాళ్ళూ, చేతులూ కడుక్కుని
రా. భోజనం చేద్దాం" అన్నది గౌరి.
"సరే...పిన్నీ"
– ‘హమ్మయ్య’ అనుకుంటూ అక్కడ్నుంచి
కదిలింది లత.
గౌరి యొక్క చూపులు
పలు భావల కలయుకతో లతను వెన్నంటినై.
"లతా పాపం
కదా... విశాల్. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలో!"
"తానుగా
తెచ్చుకున్న బాధలను అనుభవించాల్సిందే కదా అత్తయ్యా" అన్నాడు అతను యింకిపోయిన
స్వరంతో.
అతన్ని ఒక మారు తల
ఎత్తి చూసింది గౌరి.
అతని ముఖంలో
కనిపించిన కఠినం, కళ్ళ
చివర్లలొ మడతలూ అతను చాలా విరక్తితొతో ఉన్నది తెలుపటంతో ఆమె అర్ధం కాని భావనతో
నుదురు చిట్లించింది.
"విధి ఆడిన
ఆట గురించి చెప్పాను" గబుక్కున మాట మార్చుకుని చెప్పాడు.
గదిలోకి వచ్చి మంచం
మీద కూర్చుంది లత. తెల్లవారు జామున విమానం ఎక్కి, పలు మైళ్ళు దాటి సిమ్లా కు రావడానికి ఇదిగో మిట్ట మధ్యాహ్నం
అయ్యింది.
కొంచం కూడా టయర్డ్
అనిపించకపోయినా, ఎప్పుడూ తనతోనే
ఉన్న విశాల్ వలనే కొంచం శ్రమ అనిపించింది.
ఎవరూ లేరని అనాధగా
విరక్తితో జీవితం గడుపుతున్న ఆమెకు 'నేనున్నాను’ అన్నది పిన్ని.
తండ్రి తరపు బంధువుల
వలన ఎటువంటి అభిమాన సహాయాన్ని అందుకోలేని లత, గుప్త నిధిలాగా దొరికిన పిన్ని బంధుత్వాన్ని ఎంతో ఇష్టపడింది.
కానీ, ఆ విశాల్!
‘గడ్డి పరకలాంటి
వాడే!’ ….ఇంత నీచంగా ఎవరినీ విమర్శించ
కూడదు అని తన మనసులోనే మొట్టికాయలు వేసుకుంది లత.
పలురకాల ఆలొచనలతో
స్నానం పూర్తి చేసి, డ్రస్సు
మార్చుకుని సింపుల్ గా తయారైయ్యింది.
స్నేహితురాళ్ళు
బలవంతంగా కొనిపెట్టిన బట్టలు, కచ్చితంగా తనకు సరిపోగా, ఆమె మనసు, వొళ్ళు కొత్త ఉత్సాహం పొందింది.
గదిలోపల ఉన్న
అనవసరమైన వస్తువులను సాధ్యమైనంత వరకు పక్కకు పెట్టింది. ఇక...ఈ కొండ ప్రాంతం
అందాన్ని ఆశ్వాదిస్తూ, పిన్ని
యొక్క ప్రేమను అనువనువు అనుభవిస్తూ, జీవితాన్ని ఆనందమైన
జీవితంగా మార్చుకోవాలి.
దృఢంగా అనుకున్న లత, సంతోషంగా మేడ మీద నుండి కిందకు దిగింది.
కానీ, డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఎవర్నో వెతుకుతున్న విశాల్
ను చూసిన తరువాత ఆమె ఉత్సాహం కొంచం తగ్గింది.
"రా...అమ్మాయ్!"
గౌరి ప్రేమగా పిలవగానే ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది లత. సింపులా గా రెడీ అయి
వచ్చిన లత ఆందాన్ని గర్వంగా చూసింది గౌరి.
చపాతి, పప్పు, పరవాన్నం,
కూరగాయలూ అంటూ అమృతంలాగా రుచిగా ఉన్నది వంట.
"వస్తాను లతా.
షాపు నుండి సాయంత్రం వస్తాను" అని చెప్పి గౌరి వెళ్ళిపోయింది.
ఏమీ అర్ధం కాకపోయినా, నవ్వుతూ తల ఊపింది లత.
వందనాను భోజనం
చెయ్యమని చెప్పి, గిన్నెలను
కడిగి తుడిచిన ఆమె -- హాలులో కూర్చుని టీవీ ఆన్ చేసింది.
కొంతసేపైన తరువాత ఒక
సంచీతో వచ్చిన వందనా, "మార్కెట్టు వరకు వెళ్ళొస్తాను" అన్నది.
"నేనూ
వస్తాను..." అని ఆమెతో బయలుదేరింది లత.
కొండలోయల అందాలను
ఆశ్వాదిస్తూ నడుస్తున్న లతకు అరగంట టైము ఎలా గడించిందో తెలియలేదు. అందులోనూ
ఎస్టేట్ ప్రదేశం అవటంతో సైలంటుగా ఉన్న ఆ చోటు ఎంతో అందంగా కనబడింది.
భూమాదేవికి
పింపుల్స్ వచ్చినట్టు అక్కడక్కడ నిలబడున్న కొండరాళ్ళని నిర్లక్ష్యంగా దాటుకుంటూ
వేగంగా ప్రవహిస్తోంది నది.
ప్రొద్దుటి వేలలో
నదీ తీరాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమెకు అప్పుడు కలిసారు....ఆ వృద్ద దంపతులు.
మేజర్ ఫిలిప్స్, ఆయన భార్య డైనా. వాళ్ళకు డెబ్బై ఏళ్ళు
ఉంటాయి. వాళ్ళ కారు దారిలో పాడైపోయి ఆగిపోవటంతో, కారును
డ్రైవర్ కు అప్పగించి చేతి నిండా సంచులతో నడిచి వస్తున్న వాళ్ళను దాటి వెళ్ళిన లత,
వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటం విని ఆనందంతో....
"ఆంటీ! తెలుగు
మాట్లాడుతున్నారు?" అన్నది. ఏదో వింతను చూసినట్టు.
ఒకసారి లతను కిందకూ
పైకీ చూసిన మేజర్, "ఏంటమ్మా! అందమైన తెలుగు భాష మాట్లాడటం తప్పా?"
అన్నారు.
ఆయన మిలటరీ మీసాల
మధ్య దాగి ఉన్న వెక్కిరింపు లతకు అర్ధమయ్యింది.
"లేదు...ఈ
హిమాచల ప్రదేశ్ లో తెలుగు భాషను వినడం వలన ఏర్పడిన ఆనంద షాక్" అన్నది.
"నీ ఇల్లు
ఎక్కడుందమ్మాయ్?"
"సియాన్
ఎస్టేట్"
"మిసస్ గౌరీ...?"
"మా
పిన్ని. మా ఊరు విజయవాడ దగ్గర కంకిపాడు"
"మేము
గుడివాడ"
"ఇక్కడకొచ్చి
చాలా సంవత్సరాలు అయ్యింది"
"ఇవ్వండి ఆంటీ.
నేను తీసుకు వస్తాను" అంటూ వాళ్ళ దగ్గరున్న కొన్నిసంచీలు తీసుకున్న లత
"మీ ఇల్లు ఎక్కడ?" అని అడిగింది.
"గ్రీన్ ఆపిల్
ఎస్టేట్"
"చుట్టూ ఆపిల్
చెట్లతో...నదికి అవతలవైపు"
"అవును"
"అద్భుతమైన
చోటు"---మాట్లాడుకుంటూనే వంతెన దాటారు. టీ రెడీ చేయటానికి లోపలకు వెళ్ళిన డైనా
ఆంటీని కూర్చొమని చెప్పి "నేను టీ బాగా పెడతాను ఆంటీ" అంటూ వంట గదిలోకి వెళ్ళింది లత.
చాలా అందంగా, శుభ్రంగా ఉంది వంట గది.
టీ కప్పుతో వచ్చిన
ఆమెతో, " మంగమ్మ, భోపాల్ కు వెళ్ళిపోతే రావటానికి పది పదిహేను రోజులు అవుతుంది" అని
పనిమనిషి గురించి చెప్పింది ఆంటీ.
"ఇల్లు ఇంత
శుభ్రంగా ఉందే?"
"ఒక రోజుకు
నాలుగుసార్లు ఊడుస్తానమ్మా. బయట మాత్రమే పులి, ఇంట్లో
ఎలుక" అన్నారు మేజర్.
ఆ వయసులోనూ గంభీరం
తగ్గలేదు. అదే సమయం పిల్లలలాగా ఉత్సాహంగా ఉన్న ఆయన్ను చూసి లత బాగా ఇష్టపడింది.
మరికొన్నిసార్లు కలుసుకోవటంతో అంకుల్, ఆంటీలు--తాతా, అమ్మమ్మలు అయినట్లు సన్నిహితాన్ని
ఏర్పరిచింది.
***********************************************************PART-8***************************************************
ఏప్రిల్ నుండి జూన్
నెలవరకు సీజన్ సమయం కాబట్టి గౌరి చాలా బిజీ అయిపోయింది.
రాత్రి పూట డిన్నర్
టైములో మాత్రమే లత ఆమెను చూడగలిగేది.
అలసిపోయి వచ్చే
పిన్నిని తల్లిలాగా చూసుకుంది లత. ఆవిడకు ఇష్టమైన వంటలు చేసిపెట్టేది. ఇన్నిరోజులు
అలసటతో తానే వడ్డించుకుంటూ -- ఏదో తినాలని తింటున్న గౌరికి ఇప్పుడు రుచిగా,
రుచితో పాటూ ప్రేమను కలిపి వడ్డన చేయటంతో కరిగిపోయింది.
ఆడపిల్ల లేని ఇల్లు ఇన్ని రోజులు దుమ్ముతో ఉండగా---దాన్ని శుభ్రంగా,
అందంగా మార్చింది లత.
రాత్రి డిన్నర్ అయిన
తరువాత ఇద్దరూ హాలులో కూర్చుని కుటుంబ విషయాలు మాట్లాడుకునే అలవాటు.
"మీ బాబాయ్ నా
కంటే ఇరవై ఏళ్ళు పెద్దవారు లతా. వయసు వ్యత్యాసం ఉన్నదే తప్ప,
మా ఇద్దరి మధ్య ఒక్కరోజు కూడా అభిప్రాయ బేధాలు వచ్చింది
లేదు. మిలటరీ కర్నల్ గా దేశానికి సేవ చూశారు. ఆయన. ఆయన కోసం ఆలోచించింది నన్ను చూసిన తరువాతే. అప్పుడు నాకు ఆయన
ప్రేమ మాత్రమే కనబడింది. నా తల్లి-తండ్రులు మమ్మల్ని కొట్టి,
తరిమినంత పని చేసారు. ఆ అవమానం మమ్మల్ని ఎక్కువ గాయ
పరిచింది. అప్పుడున్న మనోభావల వలన వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్ పెట్టుకోలేదు. కానీ,
అది ఎంత పెద్ద తప్పో, బంధువులందరినీ పోగొట్టుకున్నాక అర్ధమయ్యింది" అన్నది
ఒక విధమైన వేదనతో.
“తాతయ్య,
అమ్మమ్మ మీ కాంటాక్ట్ లేని తరువాత చాలా బాధ పడ్డారని నాన్న
చెప్పేవారు పిన్నీ. మిమ్మల్ని దూరం చెసుకున్నట్టు అమ్మని దూరం చేసుకోకూడదని వాళ్ళ
ప్రేమను అంగీకరించారట”
"ఎలాగో మనం
ఇద్దరం అనాధలుగా ఉండి ఇలా కలుసుకోవాలని విధి ఉన్నది కాబోలు. ఇన్ని సంవత్సరాలుగా
నిన్ను ఒంటరిగా వదిలేసి, కష్టాలకు గురిచేసేనే అన్న బాధ నన్ను ఎక్కువగా పీడిస్తోంది లతా. దేవుడు
నాకిచ్చిన వరాలు నువ్వూ, మీ బాబాయి" -- గౌరి ఆవేశపడింది.
పిన్ని,
ఆమె యొక్క అభిమానం లతకు పెద్ద వరప్రశాదం లాగా అనిపించింది.
ఇన్ని రోజులు ఆమె అనుభవించిన కష్టాలు, వేదనలు అన్నీ మాయమై కొత్త జీవితం ఎత్తిన అనుభూతి కలిగింది. పిన్ని యొక్క
అభిమానాన్ని మాత్రమే సిమ్లా వచ్చిన ఇన్ని రోజులు అనుభవిస్తూ వచ్చిన లత,
దాన్ని దూరం చేసుకునే సమయం వచ్చినట్టు,
మరుసటి రోజు పొద్దున షాపుకు బయలుదేరి వెళ్ళటానికి సిద్ద
పడిన పిన్నితో "నేనూ వస్తాను" అన్నది.
లత ఎదురు చూసిన
దానికంటే షాపు పెద్దదిగా ఉన్నది. దుస్తులు, బ్యూటీ ప్రాడక్ట్స్, ప్రొవిషన్స్ అని ప్రతిదానికీ ప్రత్యేక హాలు కేటాయించి ఉండటం
చాలా అందం తెచ్చింది.
షాపు యొక్క ఆఫీసు
గదిలోని కుర్చీలో గౌరీ కూర్చుంది. లత విక్రయ విభాగానికి వచ్చింది.
మహిళల దుస్తుల
విభాగంలో నలుగురైదుగురు మగవారితో దుస్తుల గురించి వివరణ చెబుతున్నది ఒక మహిళా
సేల్స్ గర్ల్.
ఆమె ఏదో చెప్పగా,
వచ్చిన వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఆ
డ్రామాను చూస్తూ వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నది తెలుసుకుంది.
లత వాళ్ళతో మాట్లాడి,
వాళ్ళకు సెలెక్ట్ చేసుకోవడానికి సహాయపడటంతో పాటూ -- రెండుకు
మూడుగా వ్యాపారాన్ని పెంచింది. వచ్చిన వాళ్ళు చేతి నిండా సంచులతో వెళ్ళగా...తన
సామర్ధ్యాన్ని తానే మెచ్చుకుంటూ నవ్వుతూ నిలబడ్డ ఆమె చెవులకు బాగా కాచిన తారు
పోశాడు విశాల్.
వెన్నులో కత్తి
దిగిన అవమానం ఏర్పడింది లతకు. "అక్కడ పెద్ద ఖరీదులో డ్రైవర్ కొడుకు దగ్గర
చూపించిన కైంకర్యం ఇక్కడ కస్టమర్స్ దగ్గర చూపించే ప్రయత్నమా ఇది?"
అని అడిగిన అతన్ని వెనక్కి తిరిగి చూసింది.
అతని చూపుల్లో కనబడిన
ఆగ్రహం ఆమెను ఒక అడుగు వెనక్కు వేయించింది.
మనోభావాలను దెబ్బ
తీసి,
కంటి నిండా నీరు తెప్పించిన అతనితో ఏమీ మాట్లాడక,
ఆడవారి రెస్ట్ రూములోకి వెళ్ళింది లత.
చాలా సేపు మనసును శాంతింప
చేసుకోలేక కష్టపడింది.
‘ఎంత మాట
మాట్లాడాడు!
ఏది మరిచిపోవాలని
అనుకున్నానో, అదే
ఎప్పుడూ కళ్ళ ముందు కనబడేటట్టు ఏమిటీ పరీక్ష!
తెలియని వయసులో
చేసిన తప్పుకు క్షమాపణే లేదా?
ఎందుకు ఈ లోకం
పుండుపై కారం జల్లుతోంది. చేసిన తప్పుకు ఎన్నిసార్లు అగ్నిప్రవేశం చేయాలి?
ఉదాసీనం,
గేలి, అవమాన మాటలు అని పలురకాల కొరడా దెబ్బలు తిని ప్రశాంతంగా
ఉన్న వేలలో...ఎవరీ విశాల్? ఇతనికీ నాకూ ఏమిటి బంధుత్వం? ఎందుకిల కాకిలా పొడుచుకు
తింటున్నాడు?’
చాలాసేపు వెక్కి
వెక్కి ఏడ్చింది.
తరువాత
ఏమనుకుందో...మొహం కడుక్కుని, హ్యాండ్ బ్యాగులో ఉన్న పౌడర్ అద్దుకుని కొంచం తేరుకుని,
తాను బయటకు వెళ్ళివస్తానని పిన్ని దగ్గర చెప్పింది.
తూర్పు వైపు పది
నిమిషాలు నడిచిన తరువాత పైకెక్కిన రోడ్డు చివర్లో గంభీరంగా నిలబడున్నది ఆ 'మేరీ మాత’ గుడి. ఆ ప్రశాంతమైన ప్రదేశంలో,
మనసుకు ప్రశాంతత దొరుకుతుందనే నమ్మకంతో లోపలకు వెళ్ళింది.
ప్రొద్దుటి పూట
ప్రార్ధన జరుగుతున్నది.
ఆ రోజు బైబుల్
పంక్తులు ఆమె ఉన్న మనోస్థితికి సరిపోయుండటం ఆశ్చర్యమే.
పాప కార్యాలలో
ఈడుపడ్డ మహిళను రాళ్ళతో కొట్టి చంపే అలవాటు యూదులకు అలవాటు. అలా దొరికిన ఒక మహిళను
ఏసుక్రీస్తు దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు -- గుంపును చూసిన ఆయన కళ్ళకు,
తన తప్పు తెలుసుకుని బాధపడుతున్న ఆ మహిళ యొక్క మనసే
తెలిసింది.
"మీలో పాపం
చేయని వారు మాత్రమే ఆమె పైన రాళ్ళు వెయ్యవచ్చు"
ఒక్కసారిగా మారు
మాట్లాడకుండా ఆ గుంపు కదిలి వెళ్ళిపోయింది.
'ఎవరైతే
తాము చేసిన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాప పడతారో వాళ్ళే నిజమైన మనిషి అన్న వాఖ్య
లత మనసులో లోతుగా నమోదు అయ్యింది.
మరో గంటసేపు ప్రశాంతంలో
గడిపిన మనసు మంచులో తడిసిన రోజా పువ్వులాగా కొత్త ఉత్సాహం పొందింది.
అదే కొత్త ఉత్సాహంతో
గుడి నుండి బయటకు వచ్చింది.
మేఘాలు తొలగిన
సూర్యుడు ప్రకాశవంతంగా నవ్వుతూ ఉన్నట్టు కనబడ్డాడు.
స్వటర్ను ఎడం చేత్తో
పుచ్చుకుని కొత్త ఉత్సాహంతో షాపుకు వెళ్ళింది.
"ఎక్కడికెళ్ళావమ్మా?
రా, భోజనం చేద్దాం" అంటూ షాపు ఎంట్రన్స్ దగ్గరికే వచ్చి లతను లోపలకు తీసుకు
వెళ్ళింది గౌరి.
భోజనం టేబుల్ దగ్గర
కూర్చోనున్న విశాల్ ను చేసిన లత కొంచం తడబడింది. "నేను తరువాత తింటాను
పిన్నీ. మీరు తినండి" అంటూ దూరంగా జరిగింది.
"ఏమైంది...ఎందుకు?
అంటూ లత ముఖాన్నే అన్వేషించిన గౌరి "ఎందుకు అదొలా
ఉన్నావు?
మొహమంతా ఎర్ర బడుందే?" అని అనుమానంగా అడిగింది.
"ఏమీ
లేదు" అంటూ సనుగుతూ విశాల్ కూ, గౌరికి వడ్డన చేసి -- అంతకు మించి పిన్ని అనుమానానికి చోటివ్వటం ఇష్టం లేక తానూ ఒక
కంచం పెట్టుకుని కూర్చుంది.
***********************************************************PART-9***************************************************
షాపుకు రోజూ ఒక మెస్
నుండి భోజనం రావటం తెలుసుకుని "నేను భోజనం వండి తీసుకు వస్తాను పిన్ని"
అని రకరకాల వంటలుచేసి పంపించేది.
ఆ రోజు,
ఆదివారం, షాపుకు సెలవు రోజు. పిన్నితో మార్కెట్టుకు వెళ్ళిన సమయంలో,
తాను హైదరాబాద్ తిరిగి వెల్తున్నట్టు చెప్పింది లత.
కొన్ని క్షణాలు
ఆమెను లోతుగా చూసిన గౌరి “నన్నూ
ఇక్కడ అనాధగా వదిలిపెట్టి, నువ్వూ అక్కడ ఎవరూ లేకుండా ఏం సాధిస్తావు?"
అని అడిగింది.
“లేదు పిన్నీ.
అప్పుడప్పుడు సెలవు రోజుల్లో వచ్చి చూసి వెడతాను"
"అప్పుడప్పుడు
వచ్చి వెల్తావా? ఈ
ఆస్తి,
నేను సంపాదిస్తున్న డబ్బు ఇదంతా ఎవరికి?
నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు?
నా ఒకే ఒక వారసురాలివి నువ్వే కదా?"
పిన్నిని ఆశ్చర్యంగా
చూసింది లత.
నేను ఆస్తి కోసం
వచ్చిన దానిని అని ఆ విశాల్ అనుకుంటున్నది పిన్ని నిజం చేస్తోందే!
"లేదు
పిన్నీ...నేను ఆస్తికోసం రాలేదు. నాకు మీరు మాత్రం చాలు"
"ఉన్న ఆస్తిని
సరిసగం పంచేసి, ఒక
భాగం విశాల్ కు, ఒక
భాగం నాకూ రాసారు...అందులో పది శాతం దానాలకు ఉపయోగించాలని రాసారు. నువ్వు ఆ రోజు
వెళ్లేనని చెప్పావే ఆ చర్చ్ కు ఎదురుగా ఉన్న ప్రయాణీకుల విడిది మనదే. దాన్ని చర్చ్
కు ఇచ్చాశాము. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన కుటుంబానికి ఉన్న వారసురాలివి
నువ్వు ఒక్క దానివే. నాకు నువ్వూ, నీకు నేనూ అని ఉండటాన్ని వదిలి ఎందుకు విడిపోవాలి?
నువ్వు ఈ పిన్నిని పూర్తిగా ప్రేమించటం లేదా" అని
అడిగింది గౌరి.
"పిన్నీ...!
నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది మిమ్మల్ని చూసిన తరువాతే"
“మరైతే ఎందుకు
నన్ను వదిలి వెళ్ళాలని ఆరాటపడుతున్నావు? నా ప్రశాంతతను తీసుకుని
వెళ్ళాలంటే వెళ్ళు"
పిన్ని యొక్క ఆవేదన, తపన లతకు అర్ధంకాక కాదు.
కానీ....ఆ విశాల్.
నన్ను ప్రశాంతంగా
ఉండనివ్వడే.
కానీ, పిన్ని నేను లేకుండా ఉండలేదు!
దగ్గర కూర్చున్న
పిన్నిని కౌగలించుకుని "నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లను" అన్నది లత.
సుమారుగా రెండు
వారాల తరువాత ఒక రోజు ఆమె మధ్యాహ్నం భోజనం తీసుకుని షాపుకు వెళ్ళటానికి రెడీ
అవుతున్న సమయం...టెలిఫోన్ మోగింది.
అవతల వైపు
"మిస్ లత?" అంటూ ఒక గొంతు.
"అవును...మీరు?"
"నేను కిరణ్.
గ్రీన్ ఆపిల్ ఎస్టేట్ నుండి"
"ఓ! తాతయ్యా, అమ్మమ్మా ఎలా ఉన్నారు. చర్చ్ లో చూసాను.
మోకాళ్ళ నొప్పులని అమ్మమ్మ చెప్పింది"
"అవును...మీ
దగ్గర ఒక సహాయం. గౌరి ఆంటీ మొబైల్ కు ట్రై చేశాను. లైను దొరకలేదు"
"చెప్పండి"
"బామ్మకు
బాగోలేదు"
"అయ్యో! ఏమైంది?"
“ఎక్కువగా
భయపడకండి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనై. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలట. కావాలని
మొండికేస్తున్నారు. మీరు వస్తే...సహాయంగా ఉంటుంది"
"వెంటనే
వస్తాను...ఇంతకీ...మీరెవరో...?"
"ఇప్పుడైనా
అడిగారే! ఆవిడ మనవుడ్ని. ఢిల్లీలో..."
"తెలుసు.
ప్రసిద్ది చెందిన పైలట్" నవ్వుతూ చెప్పింది.
ఇరవయ్యవ నిమిషంలో
అమ్మమ్మ దగ్గర ఉన్నది లత.
"తాతయ్యా,
మనవుడు కలిసి ఎక్కువ బిల్డ్ అప్ చేస్తున్నారమ్మా. పాపం
నిన్ను కష్ట పెడుతున్నారు చూడు"
"నాకే కష్టమూ
లేదు అమ్మమ్మా. పిన్నికి డ్రైవర్ తో భోజనం ఇచ్చి పంపించాను. వివరాలు ఈ పాటికి
వెళ్ళుంటాయి. మనం నెమ్మదిగా డాక్టర్ను చూసి వద్దాం" అన్నది లత.
బామ్మను కిరణే
చూసుకునే వాడు.
" లతా! మిమ్మల్ని చూసిన తరువాతే బామ్మ బాగా మాట్లాడుతోంది.
నిన్న మధ్యాహ్నం నుంచి 'అయ్యో! అమ్మా! నావల్ల కావటం లేదు’ ఇది తప్ప వేరే మాటే లేదు"
“డాక్టర్ ఇచ్చిన
మందులను తీసి పెట్టింది లత. టీ కప్పుతో వచ్చి తాతయ్యను చూసి "ఇంకానా మీ మంగమ్మ
రాలేదు?" అన్నది.
"అది అదృష్టం
చేసుకుంది. మీ అమ్మమ్మ యొక్క సనుగుడు భరించలేక పారిపోయింది. నేనూ యాబై సంవత్సరాలుగా
ప్రయత్నం చేస్తున్నాను. గుమ్మం కూడా దాట లేక పోతున్నానే" అన్నారు శోకంగా.
"ఆయన చెప్పేది
నమ్మకమ్మా. కిరణ్ కొత్త చోటు కొన్న వెంటనే, నాతో ఒక వారం రోజులు ఉండి వెళ్ళు తాతయ్యా అని తీసుకు
వెళ్ళాడు. ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని నేనూ వెళ్ళమన్నాను " అని చెప్పిన
అమ్మమ్మ,
తాతయ్యను చూసి వెక్కిరింపుగా నవ్వింది.
"ఏమైంది
అమ్మమ్మా?
మరునాడే తాతయ్య వచ్చేసారా?" అని లత అడగటంతో...
"మరునాడా?
మరుసటి విమానాంలోనే వచ్చేసారమ్మా"
"నిజమే
నమ్మా...అమ్మమ్మ లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను" అన్నారు తాతయ్య
బొంగురు కఠంతో.
తాతయ్యా,
అమ్మమ్మల ప్రేమ చూసి లత కళ్ళల్లో నీళ్ళు పొంగినై.
‘తన తల్లీ-తండ్రీ
ప్రాణాలతో ఉండుంటే వీళ్ళలాగే ఇలాగే పరశ్పర అభిమానాన్ని పంచుకోనుంటారో!
అమ్మ మీద ఎంత
ప్రేముంటే తండ్రి మరో పెళ్ళికి నిరాకరించాడు’
"ఏమ్మా...మౌనం
అయిపోయావు?"
"ఏమీ
లేదు అమ్మమ్మా"
“వచ్చే పదిహేనో
తేదీ తాతయ్య డెబ్బై ఐదవ పుట్టిన రోజు పండుగ. దాన్ని గ్రాండుగా జరపాలని కిరణ్
చెబుతున్నాడు. కుటుంబ శభ్యులందరూ ఒకటిగా కలుసుకోవటానికి ఇది ఒక సంధర్భంగా ఉంటుందని
మేము కూడా సరేనని చెప్పాము"
“రెండు నెలలకు
ముందే కిరణ్ నాన్నకూ, బాబాయికీ, అన్నయ్యా, తమ్ముళ్ళకూ సమాచారం వెళ్ళింది. వచ్చేవారం అందరూ కువైత్
నుండి వచ్చేస్తారు" అన్నది అమ్మమ్మ.
"మీకు ఎంతమంది
పిల్లలు అమ్మమ్మా?"
“నాకు
ముగ్గురు మగ పిల్లలు. వాళ్ళకు ఇద్దరిద్దరు మగ పిల్లలు. వీడు నా రెండో వాడి కొడుకు.
మా ఇంట్లో ఆడపిల్లలే లేరమ్మా. ఆ తపన నిన్ను చూడంగానే ఎక్కువ అయ్యింది. ముగ్గురు కొడుకులూ కువైత్ లో వ్యాపారం
చేస్తున్నారు. కోడళ్ళు, ఇప్పుడొచ్చిన మనవళ్ళూ మాతో కలవరు. వీడే మా మీద ప్రాణం పెట్టుకున్నాడు. ఒక్క
నెల కూడా మానేయకుండా మమ్మల్ని చూడటానికి వస్తాడు. ఢిల్లీలో పనిచేస్తున్నాడు.
ఇప్పుడు తాతయ్య పుట్టిన రోజును గ్రాండుగా జరపటానికి అన్ని పనులూ
చూస్తున్నాడు"
వాళ్ళతో కుటుంబ
విషయాలు మాట్లాడుతూ సాయంత్రం స్నాక్స్ చేసింది లత.
చీకటి పడటంతో "
కిరణ్! పిల్లను తీసుకు వెళ్ళి దింపి రారా" అన్నది బామ్మా.
"ఏ పిల్లను?"
అంటూ అటూ ఇటూ వెతికేడు కిరణ్.
మనవడు అటూ ఇటూ చూడటం
చూసి "ఏమిట్రా వెతుకుతున్నావు? కారు కీసేనే? ఇదిగో ఇక్కడుంది" అన్నది బామ్మ.
అది కాదు బామ్మా
"ఏదో పిల్ల అని చెప్పావే! ఆ పిల్లనే వెతుకుతున్నా?"
అన్నాడు కిరణ్.
“ఓవర్ గా ఆక్టింగ్
చేయకురా...చూడలేకపోతున్నా" అన్న తాతయ్య లతను చూసి “విందుకు
పిలవటానికి రేపు మీ ఇంటికి వస్తామమ్మా"
"సరే తాతయ్యా"
అదే ఉత్సాహంతో
కారులో ప్రయాణం చేసిన ఆమె, కిరణ్ ను లోపలకు రమ్మని ఆహ్వానించింది -- చురుకుగా మాట్లాడుతూ ఇంట్లోకి
వెళ్ళాడు.
హాలులో కూర్చున్న విశాల్
కు లత కిరణ్ తొ మాట్లాడిన ఆ మాటలు,
ఆ నవ్వు అతనిలోని కోపాన్ని రెచ్చగొట్టింది.
'నన్ను
చూసిన వెంటనే పగవాడిని చూసినట్టు ఎగిసిపడింది. లేకపోతే -- ఎవరో ఇతను?
అని నన్ను చిన్న చూపు చూస్తుందా?
కానీ, తెలియని ఒకతని దగ్గర సంతోషంగా మాట్లాడుతోందే!'
అతని మనసు
వేడెక్కింది.
నాగరికతను గుర్తుకు
తెచ్చుకుని మాట వరసకి విశాల్ వైపు చూడకుండానే "హాయ్" అంటూ అతన్ని
పలకరించింది.
లోపలకు వచ్చిన లత,
" కిరణ్! వేడిగా ఒక టీ?"
అని అడగంగానే "అయ్యో...నన్ను వదిలేయమ్మా నువ్వు ఇందాక
మా ఇంట్లో ఇచ్చిన 'అరిస’ గొంతులోనే ఉంది. విశాల్! మీరు లత వంట రుచి
చూసే ఉంటారే! నిజంగానే మీరు అదృష్టవంతులు" అన్నాడు కిరణ్.
"నిజమే.
నాలిక...రుచికి కట్టుబడి ఉన్నందువలన, 'జిమ్' లో కూడా ఒక గంటసేపు ఎక్ససైజ్
చేయాల్సి వస్తోంది. అప్పుడు అదృష్టం నాకా? 'జిమ్' మాస్టర్ కా?" అని అడిగి విశాల్ నవ్వగా, కిరణ్ కూడా నవ్వాడు.
విశాల్ మొహం
వికసించి వికసించి అతని మొహంలోని సహజ అందం బయట పడింది. అది చూసి ఒక్క క్షణం
మైమరిచిపోయింది లత. కిరణ్ యొక్క వెక్కిరింత, వేళాకోలం ఆమె అమయకత్వానికి తెరవేయడంతో -- విశాల్
తింటున్న ఆహారం గొంతులో ఇరుక్కుని పొలమారింది. అతనికి ఎక్కిళ్ళు వచ్చినై.
ఇన్ని రోజులు లేని
ఒక తేజస్సు లత వదనంలో వ్యాపించి ఉండటాన్ని చూశాడు విశాల్. ఎవరో మరొకరి వలన ఏర్పడిన
తేజస్సు అది అని అనుకున్నప్పుడు అతను తట్టుకోలేకపోయాడు. అది కోపంగా మారింది.
ఆ కోపం అతని సొంత
బుద్దిని అనగదొక్కి, అతనిలోని
కృర గుణాన్ని మెల్లగా పెంచింది. లతను దెబ్బతీయటానికి సమయంకోసం ఎదురు చూస్తున్నాడు.
ఆ సందర్భం -- అప్పుడే...ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే దొరికింది అతనికి.
లతను చూస్తుంటే
అతనికి తెలియకుండానే అతనిలో ఒక సంతోష ఊట ఏర్పడుతోంది. ఏ అమ్మాయి దగ్గర లేని ఒక శక్తి
ఆమెలో ఉండటం గమనించాడు. కానీ, ఆమె గురించి విన్న విషయాలు రాతి గోడలాగా పైకి లేచి అతని భావల ఊటకు
అడ్డుపడుతున్నాయి.
**********************************************************PART-10***************************************************
"లతా!"
పిన్ని పిలవటంతో
"ఏమిటి పిన్నీ?" అని మినపట్టును ఆమె ప్లేటులో పెట్టింది.
"ఆ...చాలు"
అన్న ఆవిడ "ఎల్లుండి విశాల్ కు ఆగ్రాలో మీటింగ్ ఉంది. నువ్వూ అతనితో
వెళ్ళిరా" అన్నది.
"నేనా? ఎందుకు?"
"ఏమిటి! ఇలా
అడుగుతున్నావు? నువ్వే కదా ఆశపడ్డావు?"
పిన్ని చెప్పేది
అర్ధం కాక లత కన్ ఫ్యూజ్ అయ్యింది.
"నువ్వే కదా చెప్పావు.
తాజ్ మహాల్ చూడాలని ఆశగా ఉన్నదని. నువ్వెల్తే చూసి రావచ్చు" అన్నది గౌరి.
‘అతనితో తాజ్ మహాలుకా?’
తలచుకుంటేనే లతకి
నవ్వు వచ్చింది.
‘మామూలుగానే
పొడిచి పొడిచి మాట్లాడతాడే? అలాంటప్పుడు ఆ ప్రేమ చిహ్నాన్ని
ప్రశాంతమైన మనసుతో చూడనిస్తాడా? పాపాత్ముడు!
అసలు నన్ను అక్కడకు
పిలుచుకు వెడతాడా?
పిన్ని అతని గుణం
అర్ధం కాక నా అభిప్రాయం అడుగుతోందే!’
"ఏంటమ్మా? టికెట్టుకు చెప్పేయొచ్చు కదా?"
"వద్దు
పిన్నీ...అది..." ఆమె దగ్గర ఏం చెప్పాలి?
ఆమెకు ఏం చెప్పాలో
తెలియక ఆగిపోతే.
"చెప్పు...!"
"అదొచ్చి...అది
ప్రేమ చిహ్నం...మొట్టమొదటిసారిగా చూడటానికి వెళ్ళేటప్పుడు"
"అవును...తెలిసిందే
కదా!" అని చెప్పిన గౌరి "చూసావా విశాల్! అమ్మాయలు మామూలు విషయాలను కూడా
ఎంత భావనా అనుభూతితో ఆలొచిస్తున్నారో. ప్రేమ చిహ్నాన్ని వేరే ఎవరితోనూ వెళ్ళి
చూడకూడదట. భర్త తోడుతోనే అహ్లాదపడాలట. బాగుంది కదా. నేను మొదటి సారి నా
స్నేహితులతో వెళ్ళాను. ఇది ఆలొచించలేదు" అని చెప్పి లతను చూసి నవ్వింది.
పిన్ని వివరణ లతను
ఆశ్చర్యంలో ముంచింది.
మనం
ఒకటనుకుంటే...పిన్ని ఇంకొకటి అనుకుంటోందే!
పిన్ని కంటే ఆ
పాపాత్ముడు ఏమనుకున్నాడో! అన్న ఆలొచన
రాగానే,
మెల్లగా తలెత్తి విశాల్ ను చూసింది.
అతని మొహంలో
అంతులేని ఆగ్రహం. ఆమెలో చిన్న భయాన్ని ఏర్పరిచింది.
‘అరిచి
గోడవపెడతాడో!’
పిన్ని చెప్పిన
కారణం ఆమె కొంచం కూడా ఆలొచించి చూడలేదే!
లతానా...ఒక తోడును
వెతుక్కోవటమా. అలా జరగనే జరగదు.
క్లియర్ ఆలొచనతో
"పిన్నీ" అని పిలిచింది. "నేను... విశాల్
తో వెళ్ళకపోవటానికి కారణం... కిరణ్ తాతయ్య డెబ్బై ఐదవ పుట్టిన రోజు ఫంక్షన్. ఫంక్షన్ కు
ఇంకా కొద్ది రోజులే ఉంది. ఆ ఫంక్షన్ కు చేయాల్సిన ఏర్పాట్లు కిరణ్ ఒక్కడే
చూసుకుంటున్నాడు. కొంచం సహాయం చేస్తావా అని నన్ను అడిగారు. చేస్తానని మాట ఇచ్చాను.
రేపు,
ఎల్లుండి వస్తువులు కొనడానికి అటూ,
ఇటూ వెళ్ళాల్సి ఉంది. అందుకే రేపా అని అడిగాను... సహాయానికి
వస్తానని చెప్పి వెళ్ళకుండా ఉంటే బాగుండదు కదా!"
గౌరీ పిన్ని లతను
ఏదో ఆలొచనతో చూసింది.
"మీ దగ్గర కూడా
చెప్పాను కదా పిన్నీ" అన్నది లత.
"సరేరా...నీ
ఇష్టం. తాజ్ మహాల్ ను ఇంకోసారి చూసుకోవచ్చు" అని చెప్పి వెళ్ళిపోయింది.
ఏమీ మాట్లాడకుండా
తింటున్న విశాల్, గౌరీ తల కనుమరుగైన తరువాత, దోస తీసుకు వచ్చిన లతను చూస్తూ వెక్కిరింపుగా కొంచం గట్టిగా
నవ్వాడు.
'ఎందుకా
నవ్వు?'
అన్నట్టు చూసింది లత.
"నిన్ను పోయి ఆ
ప్రేమ చిహ్నాన్ని చూడమని అత్తయ్య బలవంతం చేస్తోందే! అది తలచుకున్నాను"
అన్నాడు.
అతని నిర్లక్ష్య
ధొరణి,
లత మనసును గాయపరిచింది.
ఒక్కసారి ఆగి అతన్ని
చూసింది. అతను లతను మరింత పొడిచాడు.
"నీ ప్రేమ
నాటకం కంకిపాడు నుండి ఈ సిమ్లా వరకు...దక్షిణం నుండి ఉత్తరం వరకు ఇంకా
వ్యాపిస్తూనే ఉంది. పాపం ఆ కిరణ్ నీ నిజ స్వరూపం తెలియని పిచ్చి జీవి"
అతని ప్రతి మాటా
ముల్లులా హృదయాన్ని గుచ్చగా,
"ఇలా
చూడండి మిస్టర్. విశాల్ నన్ను విమర్శించటానికి మీకు ఎలాంటి హక్కూ లేదు. నా
నడవడికలను గమనించటానికి మీరేమైనా నా సెక్యూరిటీ గార్డా ఏమిటి?"
అని అడిగింది లత.
"మంచికాలం...అలాంటి
హీన స్థితి నాకు రాలేదు. లేకపోతే నీ ప్రేమికుల జాబితాను..."
అతను మాట్లాడుతూ
వెలుతుంటే.
"కొంచం ఆపుతారా?
ఇంత నీచంగా మీవల్ల ఎలా మాట్లాడటం కుదురుతోంది?
మంచివాళ్ళు అవతలవారిని మంచివారుగా చూస్తారు. కానీ మీరు ఛీ
ఛీ..."
వేగంగా ఆక్కడ్నుంచి
జరిగింది లత.
"అమ్మమ్మ
చెప్పినట్లే చేసేద్దాం లతా " అన్నాడు కిరణ్.
"అలాగే
చేసేద్దాం. కానీ, ఇంటి ఆడవాళ్ళకు పట్టు చీరలూ, బంధువులకు గ్రేప్, సిల్క్, కాటన్
రకాలు ఇద్దాం. ఏం బామ్మా నేను చెప్పేది కరెక్టే కదా!"
"నువ్వు చెబితే
కరక్టుగానే ఉంటుందిరా" అన్నది బామ్మ.
" కానీ కిరణ్, పట్టు రకాలకు ముందే ఆర్డర్ పెట్టాలి! మీ షాపులో ఆ వసతి ఉందా లతా " అడిగాడు కిరణ్.
"ఉంది...ఈ
మధ్యే పట్టుచీరల డివిజన్ తెరిచాము. ఇంకో రెండు మూడు రోజులలో కొత్త స్టాక్
వస్తుందని పిన్ని చెప్పిన జ్ఞాపకం. అందువలన మనకు కావలసిన చీరలు దొరుకుతాయి. ఎందుకైనా మంచిది
పిన్ని దగ్గర అడుగుదాం"
"అయితే వెంటనే
బయలుదేరు" చెప్పాడు కిరణ్.
షాపును
చేరుకున్నప్పుడు 'కౌంటర్’ దగ్గర నిలబడున్నాడు విశాల్.
మర్యాదకోసం అతనితో
మాట్లాడాడు కిరణ్.
ఆ సమయంలో బయటకు
వెడుతున్నట్టు ఒక సంచీతో వచ్చింది గౌరి.
పిన్నిని చూసిన
క్షణంలో లత, కిరణ్ చెయ్యి
పుచ్చుకుని.
"రండి. పిన్ని
ఎక్కడికో వెళ్ళటానికి బయలుదేరింది" ఆల్ మోస్ట్ అతన్ని లాక్కుని వెళ్ళింది.
అతను, "ఏ! లతా..." అంటూ ఆమె లాక్కు వెడుతున్న
చోటుకు వెళ్ళాడు.
కిరణ్ తనతో
మాట్లాడుతున్నప్పుడు అతన్ని లత లాకెళ్ళటం, ఆమె తనని ఉదాసీన పరిచినట్టు ఫీలయ్యాడు విశాల్.
అందులోనూ ఆమె కిరణ్
చేతులు పుచ్చుకున్న దృశ్యం అతనిలో అగ్నిపర్వతాన్ని పేలేటట్టు చేసింది.
అతనితో ఇంత క్లోజుగా
ఉంటున్న లత ఎందుకని తనని చూసిన వెంటనే తప్పుకుంటోంది. ధైర్యంగా నా ఎదురుగా
నిలబడచ్చు కదా? శత్రువులాగా
తన చూపులతో నన్ను పొడవటానికి కారణమేమిటి?
తెలిసిన ఒక అమ్మాయి
నిర్లక్ష్యం చేస్తే కలిగే నొప్పిని, అనువనువూ అనుభవించాడు కిరణ్.
తనకొసం తన ఎదురుగా
వచ్చిన వారిని స్వాగతించి తన క్యాబిన్ లోకి తీసుకు వెళ్ళింది గౌరి.
క్యాబిన్ కర్టన్స్
దాటి వెడుతున్న తన చూపులను కట్టుపరచలేకపోయాడు విశాల్. కొంచం కొంచంగా లత రూపం అతని
మనసులో వెలుగు తేవటం మొదలుపెట్టింది.
ఆ రోజు సాయంత్రమే గౌరీను,
లతనూ హోటల్ కు తీసుకు వెళ్ళాడు విశాల్. తందూరి రకాలు అతను
ఆనందంగా తినగా, 'బరువు’ పెరుగుతామేమో నని మామూలు తిండి తిన్నది గౌరి.
అక్కడొక ప్రశాంత వాతావరణం నెలకొనడంతో మీకూ, నాకూ అంటూ ఫుడ్డును షేర్ చేసుకుంటున్నప్పుడు -- మొదటిసారిగా
లతను చూసి నవ్వాడు విశాల్.
అతని నవ్వు లత
మనసులో ఆనందాన్ని పురికొల్పింది.
ఆమె మనసులో ఏర్పడ్డ
ఆనందం,
ఆమె ముఖంలో ప్రతిభింప, ఆ సన్నని వెలుతురులో, హాయిగా వినిపిస్తున్న సంగీతంలో కొత్తదైన,
అవస్త పెట్టే ఒక భావనలోకి నెట్టబడ్డాడు విశాల్.
సిగ్గుతో తలవంచుకునే
తింటున్న లతను " లతా " అని పిల్చాడు.
ఆ పిలుపులో ఉన్నది
వ్యామోహమా? ఆరాటమా?
ప్రేమా?
ఏదో మంత్రానికి
కట్టుబడ్డ దానికి మల్లే "హు" అన్న గొణుగుతో ఆమె తలెత్తి చూడగా,
ఆరాటాన్ని మోస్తున్న ఆ మగ మనిషి చూపులోని వ్యామోహమో, ఆరాటమో, ప్రేమో... ఏదీ ఆమె కళ్ళకు కనబడలేదు.
ఎదురుకుండా పిన్నితో
మాట్లాడుతూ నిలబడ్డ కిరణే కనబడ్డాడు. మెరుపులా మెరిసిన కళ్ళు,
తన కళ్ళను కలుసుకోకుండానే దాటి వెళ్ళటం గ్రహించిన విశాల్ లత
కళ్ళల్లోని మెరుపుకు కారణం తెలుసుకుని నలిగిపోయాడు. అంతసేపు విశాల్ లో ఏర్పడ్డ
సంతోష మబ్బులు, ఆమె
దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడిన వెచ్చదనం, ప్రేమ మత్తు, అతనిలో మెల్లగా ఏర్పడ్డ సలతరింపు…వీటన్నిటినీ
ఒక్కసారిగా పీకి పారేసిన నిరాశా భావనలో కొట్టుకున్నాడు.
కొద్ది నిమిషాల
తరువాత వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని కిరణ్ వెళ్ళిన పిదప -- పిన్నీ,
కూతుర్లు మేజర్ కుటుంబం గురించి స్వారస్యంగా
మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలు విశాల్ యొక్క రెండు చెవులనూ గాయపరచటమే కాకుండా
అతని హృదయాన్ని గాయపరిచిందనేదే వాళ్ళకు తెలియదు.
ఇప్పుడంతా ఇంతకు
ముందులా విశాల్ – లత,
పిల్లీ -- ఎలుకల్లా పోట్లాడుకోవటం లేదు. అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు నవ్వులతో
పలకరించుకుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి ఎదురుచూస్తున్నట్టు వాళ్ళ వాళ్ళ సమయాన్ని
ఆనందపరచుకున్నారు.
లత యొక్క ఒక్కొక్క
కదలికలోనూ నిజాయతీ, బాధ్యత కలిసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన విశాల్ లత గురించి విన్న విషయం పైన
చిన్నగా అనుమానం మొదలైయ్యింది.
లత కూడా తనలో మార్పు
రావటాన్ని తాను అర్ధం చేసుకున్నప్పుడు తనని
తాను నమ్మలేకపోయింది.
విశాల్ యొక్క చూపుల
కలయిక! దాని వలన ఏర్పడిన సలపరింపు, దాని వలన హృదయాన్ని తాకి వెడుతున్న ఆనంద తరంగాలు!
ఇదంతా ఎలా?
పాలూ పండు వెతుకుతున్న విశాల్ హృదయం ఎలా పండును
మరిచిపోయింది? దివాకర్ను
ప్రేమించిన నా వల్ల ఎలా విశాల్ ను ప్రేమించ గలను?
పలుసార్లు కన్
ఫ్యూజ్ అయిన మనసుకు యుక్త వయసులో ఏర్పడే వ్యామోహమూ, తగిన వయసులో పూచే ప్రేమకూ మధ్య ఉండే తేడా స్పష్టంగా
కనబడింది.
'కళ్ళు
పలువుర్ని చూసినా, మనసు మాత్రం ఒకర్ని మాత్రమే ప్రేమించగలదు అని దేంట్లోనో చదివింది ఎంత నిజమో!’
“అప్పుడు ఏర్పడింది
ఇరు హృదయాలూ ఒకదానికొకటి అర్ధం చేసుకోలేని పర్వంలో వచ్చిన ఆకర్షణ. ఇప్పుడు
ఏర్పడిందే ప్రేమా?" చాలా సార్లు ఆలొచించింది.
హృదయం సతమతమైయ్యి,
పిడుగుపడి నరకయాతన అనుభవించి నీరసపడ్డ తరువాత 'ఎవరి మీదా ప్రేమ పెట్టుకోవాలనే మనోభావంలో నేను లేను’ అంటూ తన చుట్టూ ఒక గోడ కట్టుకుని తనిని
తాను కఠిన పరచుకుంది లత.
విశాల్ వైపు మాటి
మాటికీ ఈడుస్తున్న మనసును నియంత్రించుకునే తీరాలని కంకణం కట్టుకుంది ఆమె.
ఇంతకు ముందు కూడా
ఆమె ప్రవర్తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాడి మీద ప్రేమ పెంచుకోవటంలో
ఏమిటి లాభం?
ఆ ఆలొచనతోనే విశాల్
ను కలుసుకోవటాన్ని చాలా వరకు అవాయిడ్ చేసి,
మేజర్ యొక్క పుట్టిన రోజు వేడుకలో తనని బిజీ చేసుకోవటమో --
నదీ తీర అందాలను ఆశ్వాదిస్తూనో తన మనసును నియంత్రణ చేసుకుంది లత.
అలా ఒక రోజు నదీ
తీరంలో తనని మరిచిపోయి అందాలను ఆశ్వాదిస్తూ నిలబడి ఉన్నప్పుడు -- ఏదో వ్యత్యాసంగా
అనిపించింది. ఆమె వెనుక కొంచం దూరంలో ఇద్దరు మనుషులు నిలబడి కళ్ళార్పకుండా ఆమెనే
చూస్తున్నారు.
వాళ్ళను చూసిన
వెంటనే ఆమెలో భయం చోటుచేసుకుంది. ఆ భయం ఆమె పొత్తి కడుపును కదిలించింది. మాసిపోయిన
స్వటర్,
బట్ట తలతో నిలబడున్న వాళ్ళ మీద నుండి వీచిన పొగాకు వాసన,
ఆమె నశాలాన్ని తాకి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె
మెల్లగా తన చూపులను రోడ్డు మీదకూ, చెవులను వాళ్ళ మీదా పెట్టుకుని జరిగింది.
చెప్పుల పాదాల
మధ్యలో తీరంలోని గుండ్రని రాళ్ళు ఆమె నడకను తూలేటట్టు చేసినై -- వణుకుతున్న
హృదయంతోనూ, భయంతో
తడిసిన శరీరంతోనూ వెళ్ళింది. ఆ ఇద్దరు రౌడీలూ తనకు దగ్గరగా రావటం గ్రహించిన ఆమె,
ఇక ఆలశ్యం చేస్తే ఆపద అని అనుకుని చెప్పులను దూరంగా పారేసి
-- రాళ్ళూ, ముళ్ళూ
అని కూడా చూడకుండా పరిగెత్తటం మొదలుపెట్టింది. ఎదురుగా ఉన్న సూది ఆకుల చెట్ల
గుంపును చేరుకోక ముందే టయర్డ్ అయిపోయిన ఆమె కాళ్ళ వేళ్ళు బురదతో తడిసున్నాయి.
కళ్ళుమూసుకుని ఎటువెళ్ళాలో తెలియక పరిగెత్తుతున్న ఆమె ఎదురుగా దేనిమీదో
గుద్దుకుంది.
తను గుద్దుకుంది ఒక
మనిషిమీదే అని తెలుసుకునే లోపు -- "ఆ...అమ్మా!"....అని అరచిన లత,
ఎదురుగా నిలబడ్డది ఎవరు అనేది తెలుసుకోకుండానే దొర్లుకుంటూ
పడిపోయింది.
తన మీద పూలమాలలాగా
పడ్డ ఆమెను పట్టుకున్నాడు విశాల్. అతన్ని చూడగానే లతను తరుముకు వచ్చిన గూండాలు
వెనక్కి తిరిగి పారిపోయి దాక్కున్నారు.
సగం స్పృహలో ఉన్న లత
యొక్క భావనలు, దేనినో
గట్టిగా పట్టుకున్నాం అన్న ధైర్యంతో, ప్రశాంతంగా పూర్తి స్పృహ కోల్పోయింది.
శ్వాశ గాలితో కలిసిన
ఆ మగ వాసన, గట్టిగా
పట్టుకున్న చేతుల ఇచ్చిన హామీ, గట్టిగా పట్టుకున్న చేతులలో దాగి ఉన్న హక్కు -- ఇవన్నీ ఆమె
శరీరంలోని ప్రతి అణువు లోనూ ప్రాణవాయువులా పాకింది.
అతను తనకు తగినవాడే
నన్న క్లియర్ నెస్ తో, విశాల్ యొక్క విశాలమైన ఛాతి మీద పూర్తిగా ఒరిగిపోయింది లత.
ప్రొద్దుటి తేట
తెలుపు వెలుతురులో, బండ రాళ్ళపై పడున్న మంచులో తన ముఖ ప్రతిబింబం చూసి ఆనందించి,
వసంతకాల పువ్వులు రంగుల దుప్పటిలాగా పూచి వాసన వెదజల్ల,
పక్షులు కుతూహలంగా పాటలు పాడగా,
ఆ స్వర్గ భూమిలో ఒక దేవతలా చుట్టివస్తున్న లత -- ఎదురుగా
గంభీరంగానూ, నవ్వుతూనూ
తన రాజకుమారుడుని చూడగానే కొంచం తడబడింది.
ముఖంలో జ్ఞాన
ఎరుపుతో సౌందర్యం చేర, ఆశగా రెండు చేతులూ జాపినతని పట్టులో దొరకకుండా జారి సీతాకోకచిలుకలాగా
ఎగిరిపోయింది. వేగంగా పరిగెత్తిన కాళ్ళల్లో నొప్పి పుట్టడంతో "అమ్మా"
అని అరిచిన ఆమెకు అప్పుడే మెల్లగా స్ప్రుహ రావటం మొదలుపెట్టింది. అంతవరకు
కనిపించిన దృశ్యాలు కరెంటు కట్ అయినట్లు మాయమైనై. సడన్ గా పాకిన మెరుపులో కలలో
నుండి తన ప్రస్తుత స్థితికి వచ్చింది లత. గదిలో వ్యాపించిన సన్నటి వెలుతురు --
తాను పడుకున్నది తన గదేనని అర్ధమయ్యి లేవటానికి ప్రయత్నించినప్పుడు,
రెండు కాళ్ళ వేళ్ళలోనూ నొప్పి.
కంకర రాళ్ళతో దెబ్బ
తగిలిన కాలి వెళ్ళకు కట్టు కట్టబడి ఉంది.జ్ఞాపక పుస్తకంలోని పేజీలోని లైన్లు
గుర్తుకు వస్తున్నాయి.
గూండాలకు భయపడి
పరిగెత్తుతున్నప్పుడు దేనినో ఢీ కొని....లేదు లేదు...ఎవరది?
నేనెలా ఇక్కడ?
అని అనుకుంటే, హృదయానికి చివర గుసగుసగా, 'అది ఎవరనేది నిజంగానే తెలియదా?'
తెలియకనా హక్కుగా
ఒరిగి నిలబడ్డావు? దాంతో పాటు ఆ మగాడి కౌగిలిలో నిన్ను మర్చిపోయి ఉండిపోలా?--చెప్పు...చెప్పు...’ అని ఒక గొంతు వినబడగా, సిగ్గుతెరలు లత మొహంలో కనబడ్డాయి.
ఆ సమయంలో వాకిలిలో
నీడ కనబడగా, వచ్చింది
ఎవరనేది అర్ధం చేసుకుని -- తన ముఖంలో ప్రతిబింబిస్తున్న సిగ్గుతెరలను కప్పి
పుచ్చుకోవటానికి చాలా కష్టపడ్డది లత.
తెల్లటి కాంతి
కిరణాల కాంతిలో కళ్ళు కూస్తుంటే, తలెత్తి చూసింది. ఆదుర్దాగా విశాల్ కళ్ళల్లో తనపై ఇష్టాన్ని
వెతుక,
అతని ముఖంలోని భావాలు అర్ధం చేసుకోవటానికి ముందే అతని ప్రేమ
మనసు ఆమె చుట్టూ తిరుగుతోంది. మొట్ట మొదటిసారిగా మగ వాసన పీల్చిన ఆమె శ్వాశ --
సిగ్గుతో చెక్కిలిగింతలు పెట్టటంతో లోతైన శ్వాస మొదలయ్యింది.
అతని స్పర్శతో
ఏర్పడ్డ దిగ్భ్రాంతి, మత్తు నుండి స్ప్రుహలోకి వచ్చినట్టు శరీరమంతా అలలాగా పాకింది. చెవులు అతని ప్రేమ
మాటలకు ఎదురు చూస్తున్నట్టు రెడీగా ఉన్నాయి.
ఆమెలోని అన్ని
భావాలు ఆమె వేసుకున్న కట్టుబాటును దాటి ప్రేమ యుద్దానికి తయారవగా,
"నీ ప్రేమికుడి జ్ఞాపకాలతో
నిలబడటానికి వేరే చోటే దొరకలేదా నీకు? చుట్టూ నిలబడ్డ ఆపదను గమనించలేనంతగా నిలబడటానికి ఏం మాయ
చేసాడో ఆ ప్రేమికుడు?" అని అడిగి లత హృదయంలో బుట్టలు బుట్టలుగా అగ్ని తుంపరలను
ఎత్తి పోశాడు విశాల్.
సడన్ గా వేసిన
పిచ్చి గాలికి ఆకులురాలిన మొక్కలాగా నిలబడ్డది లత.
**********************************************************PART-11***************************************************
మేజర్ పుట్టిన రోజు
వేడుకకు పిన్ని, కూతురూ
రెడీ అవుతున్నారు.
ఇంటి ఆడవారికని
కొన్న పట్టు చీరలలో ఒకటి లతకి ఇవ్వబడింది. పట్టు చీరలో తలతల మెరిసిపోతున్న కూతుర్ని
ప్రేమగా చూసింది గౌరి. హైదరాబాద్ నుండి వచ్చిన లత మోహంలో ఒక విధమైన కాంతి, శరీరంలో
సౌందర్యం చేరటం ఆమెకు సంతోషంగానే ఉంది.
ఎండి పోయున్న ఆమె
హృదయంలో కొత్తగా ఒక పూవు వికసించినట్లు పెద్దామెకు అర్ధం కాక కాదు. దానికి కారణం
మేజర్ కుటుంబమే నన్న డౌట్ ధ్రువీకరించ బడటానికి పలు కారణ కార్యాలున్నాయి. గౌరి
దగ్గర అంటీ అంటనట్టు ఒక విషయాన్ని చెప్పి ఉంచింది
మేజర్ భార్య. ఆ విషయంలో గౌరికి పూర్తి
సమ్మతం అనేదీ ఇద్దరి ఆడవాళ్ళకూ ఊరటగానూ, ఆనందంగానూ ఉన్నది.
ఆదివారం ప్రార్ధన
తరువాత ఆలయ ప్రహారంలో ఉన్న తోటలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొవటం అప్పుడప్పుడు
జరిగేదే.
"కిరణ్ కీ,
వరుణ్ కి పది నెలలే
తేడా గౌరీ. పెద్దవాడికి వాళ్ళ అమ్మ తరపు అమ్మాయి ఉంది. వరుణ్ కెనడాలో
ఇంజనీరుగా ఉంటున్నాడు. వాడికీ అమ్మాయి దొరికితే ఇద్దరికీ ఒకే సారి ఒకటిగా పెళ్ళి
చేయాలనేది అందరికీ ఆశ. పెద్దాయన మన లతను చూసిన రోజే చెప్పేసారు. ఆయనకు ఒక కోడలైనా
మన ఊరివైపు నుండి ఉండాలని ఆశ"--ఆతురతతో చెప్పిన అమ్మమ్మ, ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్న
గౌరి వైపు చూసింది.
లత విషయంలో తనకు
బాధ్యత ఎక్కువ అవుతోందని అమ్మమ్మ మూలం గ్రహించిన గౌరికి కొంచం ఆశ్చర్యంగా ఉన్నది.
పెళ్ళి విషయం గనుక ఆలొచించకుండా ఏమీ చెప్పకూడదు అనే భావనతో "నేను దాని
గురించి ఇంకా ఆలొచించలేదు ఆంటీ, దేవుని ఆశీర్వాదం ఉంటే మీ ఇష్టం నెరవేరనీ" అని మాత్రం
చెప్పింది.
గౌరికి కూడా అందులో
ఇష్టం ఉన్నదని గ్రహించిన అమ్మమ్మ సంతోష పడింది.
కెనడా నుంచి వరుణ్ ఈ
రోజు ప్రొద్దున వస్తున్నట్టు చెప్పారు. కనుక, మొట్టమొదటిసారిగా తన కూతుర్ను చూస్తున్న అతని కళ్ళకు లత
దేవతలాగా కనిపించాలని, చీరను నాగరీకంగానూ అదే సమయం గౌరవము తగ్గకుండా చీరను కట్టి,
తన భర్త ఇచ్చిన నగలను వేసింది. ఆల్రెడీ స్నేహితురాలు కుమారి
పుణ్యమా అని తన ధోరణిలో ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్న లత,
తన మనసును వసపరుచుకుంటున్న విశాల్ ముందు అందంగా కనిపించాలని
మెకప్ పై శ్రద్ద వహించి అందమైన బొమ్మలా దర్శన మిచ్చింది.
మధ్యాహ్నం విందు
భోజనం కాబట్టి ఇద్దరూ కొంత ముందుగానే బయలుదేరారు. ఎస్టేట్ నుంచి నేరుగా తాతయ్య
ఇంటికి వస్తానని చెప్పి విశాల్ ఎస్టేటుకు వెళ్ళిపోయాడు. మేజర్ కుటుంబ శభ్యులు
వాళ్ళను ఆనందంగా స్వాగతించారు. ఆడవాళ్ళు లతను చూసి ఆశ్చర్యపోవటం చూసిని గౌరికి
గర్వంగా ఉన్నది. తన ఇంట్లోనే ఉంటూ వాళ్ళతో అలవాటుపడిన లతను కుటుంబం మొత్తం
ఉత్సాహంగానూ, ప్రేమగానూ
ఉండటం చూసిన పిన్ని, తన లత వాళ్ళతో కలిసిపోవాలనే ఆశ పెరిగింది. ఆమె కళ్ళు వరుణ్ ని వెతకటం
మొదలుపెట్టినై. పిన్నిని హాలులో కూర్చోబెట్టి, ఆ ఇంటి అమ్మాయిలాగా హక్కుతో లోపలకు వెళ్ళిన లత,
కొంతసేపైన తరువాత కిరణ్ తో తిరిగి వచ్చింది.
"పిన్నీ! మన
చర్చ్ వరకు వెళ్ళి వస్తాం. అక్కడ వృద్దాశ్రామానికి భోజనం తీసుకు వెళ్ళాలి. ఒక
గంటలో వచ్చేస్తాను" అని చెప్పి బయలుదేరింది.
ఇద్దరూ తిరిగి వచ్చే
సమయంలో విందు భోజనం మొదలయ్యింది. జతగా వచ్చిన వాళ్ళను చూసిన కళ్ళు ఆశ్చర్యంలో
పెద్దవైనై.
గౌరితో నిలబడున్న విశాల్
కళ్ళకు ఆ దృశ్యం నచ్చకపోవటం వలన, కొంచం కోపంగా చూశాడు.
అతని మనోభావాలు
అర్ధంకాక, "హలో! వెల్కం" అంటూ షేక్ హ్యాండ్
ఇచ్చాడు కిరణ్.
పిన్ని కనబడగానే ఆమె
దగ్గరకు వచ్చిన లతను చూసి "నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ చీర నీకు కరెక్టుగా
సరిపోయింది" అన్నది అక్కడున్న ఒక గెస్ట్. "ద్యాంక్స్ ఆంటీ" అంటూ
నవ్వింది లత. "ఎవరి సెలెక్షన్? నేనే కదా?" అంటూ గొప్పగా చెప్పాడు కిరణ్.
"మీరు కూడా
గంభీరంగానే ఉన్నారు" అదే గెస్టు కిరణ్ ను చూసి చెప్పింది. "నిజమే. ఈ లేత
రంగు నీకు చాలా మ్యాచ్ అయ్యింది కిరణ్ " అన్నది అక్కడే ఉన్న పిన్ని గౌరి.
"పిన్నీ!
దానికి కారణం నేనే. వాళ్ళ, అన్నయ్యలకూ,
తమ్ముళ్ళకూ బట్టలు సెలెక్ట్ చేసింది నేనే" చెప్పింది లత.
"అంటే వాళ్ళ
కుటుంబంలో ఐక్యమైపోయావు.అంతే కదా కిరణ్!" అంటూ ఆ గెస్టు వాదించ, "అందులో సందేహమేముంది ఆంటీ?"
అన్న కిరణ్, ఎవరినో చూసి సారీ చెబుతూ
అక్కడ్నుంచి కదిలాడు. వాళ్ళ ముగ్గురూ ఆ గెస్టు దగ్గర నుండి కదిలారు.
"చాలా మంచివాడు
కదా?" అన్నది కిరణ్ ను చూపి.
"అవును
పిన్నీ...అందరి దగ్గరా చాలా ప్రేమగా మాట్లాడతారు. మనకి ఏం కావాలో మన ముఖం చూసి
కనుక్కుంటాడు. అన్నిటి కంటే ఆడవాళ్ళంటే అమిత గౌరవం. ఎవర్నీ కించ పరిచి మాట్లాడే అలవాటు
లేదు" అని చెప్పి విశాల్ ను ధైర్యంగా ఒక చూపు చూసింది.
లత తననే పొడుస్తోందని అతనికి తెలియదా ఏమిటి? వూరుకుంటాడా?
"అవును!
అమ్మాయలకు ఎప్పుడూ ఎవరో ఒకరు తమల్ని పొగడతూ ఉండాలి. పొగడు తేనే గౌరవం అని అనుకుంటారు"
అన్నాడు నిర్లక్ష్యంగా.
"ఆడవాళ్ళను
గౌరవించటం తెలిసిన వాళ్ళకే, వాళ్ళను
పొగడే అలవాటూ ఉంటుంది. దానికి పెద్ద మనసు కావాలి"
"అంటే నిన్ను
మాటి మాటికీ పొగడను కనుక నేను పెద్ద మనసు లేని వాడిని అని అంటున్నావా?"
"నేనేమీ
మిమ్మల్ని చెప్పలేదు"
"నువ్వు నన్నే
అన్నావు. నిన్ను పొగడేంత గొప్ప దానివి..." అంటూ ఆమెను పై నుండి క్రింద దాకా
నిర్లక్ష్యంగా చూశాడు. "నన్ను ఆకర్షించలేదే!" అన్నాడు వేలాకొలంగా.
లతకి అతని చూపులూ, మాటలూ కోపం తెప్పించింది. అతన్ని కోపంగా
చూసింది. "మీలాంటి ఒకర్ని ఆకర్షించాలనే అవసరం నాకు లేదు" అని చెప్పి,
ఇద్దరి మాటలనూ వేడుక చూస్తున్న పిన్ని గౌరిని కూడా లక్ష్యం చేయకుండా గబగబా తోటకు ఉన్న వేరే దారివైపుకు వెళ్ళింది లత.
మనోబాధను తట్టుకోలేక
ఎదురుగా ఎవరు వస్తున్నారని కూడా చూసుకోకుండా వెడుతున్న ఆమెను కిరణ్ అడ్డుపడి
ఆపాడు.
"ఏ! లతా ఏమైంది?
చూడనట్టు వెళ్ళిపోతున్నావు?"
"ప్చ్...ఏమీలేదు..."
విరక్తిగా చెప్పిన ఆమెను చూసిన అతను.
"ఎందుకు
కళ్ళు తడిసున్నాయి? నీ అందంలో సగం కనిపించకుండా పోయిందే" అంటూ రెచ్చగొడుతూ -- "ఏం? నీ బాయ్ ఫ్రెండు ఏదైనా అన్నాడా?
మనం వచ్చేటప్పుడు అతని మొహం సరిలేదు" అన్నాడు
గుసగుసగా.
"ఆ! ఎవరు...?
మీరేం చెబుతున్నారు?" -- ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది లత.
"ఏమిటీ...అర్ధం
కానట్టు అడుగుతున్నావు? ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ గురించి నోరు తెలుపకపోయినా, కళ్ళు తెలుపుతాయ్" అన్నాడు అతను.
"నిజంగానే
అర్ధం కాలేదు. అర్ధం అయ్యేటట్టు చెప్పండి"
"అదిగో! ఆ
ఆపిల్ చెట్టు కింద ఒక హీరో, కళ్ళల్లో
ప్రేమ కెమేరా తగిలించుకుని..." అతను చెబుతున్నప్పుడే, "ఎవరు?" అని అడుగుతూ ఆమె తిరిగి చూడ,
"ఆగు...! అలా
వెంటనే తిరిగి చూసేస్తావా?" అని కిరణ్ ఆమె తల మీద
మొట్టికాయ వేసినట్టు కొట్టగా -- లత ఆ ఆపిల్ చెట్టు కింద నిలబడున్న విశాల్ ని చూసింది. ఆదుర్దాగా వెతికి కలుసుకున్న ఆమె
కళ్ళను ఎదుర్కొన్న అతను ఆమె లోతైన చూపులలో పూర్తిగా మునిగిపోయాడు. తిరిగి లేవ
లేనివ్వకుండా కట్టిపడేసిన చూపుల బాణాలు మళ్ళీ తాము ఎక్కడ్నుంచి వచ్చినాయో అక్కడికి
తిరిగి వెళ్ళటానికి కొద్ది నిమిషాలు పట్టింది.
తనని వెతికి
అలసిపోయి కనిపెట్టిన ఆమెను చూసి 'నన్నే కదా వెతికావు?' అని అడిగేటట్టు అహంకారంగా
నిలబడ్డ అతని దోరణి -- లతకు చిరాకు తెప్పించింది.
"ఛఛ! ఇతన్ని
పోయి చూశామే?" అని
గొణుక్కుంటూ తిరిగిన ఆమెతో "అబ్బబ్బ! చూశావా నీ వాడు. ఏమిటా చూపు అది! నా
వొళ్ళంతా జలదరిస్తోంది" అన్నాడు కిరణ్.
" విశాల్ నా
చెప్పారు?"
"మరి వేరే
ఎవర్ని?"
"హు...అతను
పోయి నన్ను...? మొదట మీ కళ్ళకు కళ్ళద్దాలు వేసుకోండి. అప్పుడు
అతని చూపుల్లో ఉన్నది ప్రేమా? విసుగా? అనేది
మీ కళ్ళకు బాగా తెలుస్తుంది. ఇన్ని రోజులలో అతను నన్ను చూసి నవ్వింది ఒక రోజు కూడా
నేను చుడలేదు. ఈ ప్రపంచంలో నీకు ఇష్టంలేని ఒకే ఒకరు ఎవరు అని అతన్ని ఎవరైనా అడిగితే
అతను నన్ను చూపుతాడు. మా ఇద్దరికీ అంత అన్యోన్యత”
"అప్పుడు నేను
అనుకున్నది నిజమే . ఎదురెదురు దృవాలు ఆకర్షించుకుంటాయి. మీ ఇద్దరికీ అలాంటి
కెమిస్ట్రీ ఉంది. నీరు-నిప్పూ లాగా...స్వీటూ-హాటూ, రాత్రి-పగలు...."
"అయ్యో! చాలు
స్వామీ. నన్ను వదిలిపెట్టండి. మీ ఆటలకూ, ఊహలకూ నేను బలి
అవలేను" అంటూ ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్న లత 'మంచి
అతన్నే చెప్పాడు’ అని అనుకున్నప్పుడు విశాల్ చూపుల కిరణాలు
తన హృదయాన్ని చొచ్చుకుని వెళ్ళి సుఖ ప్రకంపనలు, అలలుగా
తాకటాన్ని ఆమె నిరాకరించలేక పోయింది.
అతని చూపుల్లో
ఉన్నది ఏమిటి?
అతనిలోనూ ఏదో ఒక
చలనం...?
చాలా సార్లు ఈ ప్రశ్నే
లత మదిలో మెదలి ఆమె ప్రశాంతతను పాడుచేసేది.
**********************************************************PART-12***************************************************
విందు ముగిసిన
తరువాత ముగ్గురూ ఒకే కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. లత పలు ఆలొచనలతో చికాకుగా
ఉన్నది.
"ఏమిటి అదొలా
ఉన్నావు?
కొంచం నవ్వుతూ రావచ్చు కదా?" అన్నది గౌరి.
ఆమెను చూసి చిన్నగా
నవ్వింది లత.
"ఏంటమ్మా,
టయర్డుగా ఉందా? లేక...బలమైన ఆలొచనలో ఉన్నావా?" అని విచారించింది.
"పిన్నీ! మేజర్
కుటుంబం అద్భుతమైనది. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ,
గేలి చేసుకుంటూ ఎంత ప్రేమగా ఉన్నారో! ఒక గుడి లాగా.
హు...మనకి ఆ భాగ్యం దొరకలేదు. తండ్రి కుటుంబంతో మనంగా వెళ్ళి కలిసినా,
వాళ్ళు మనతో కలిసిపోవటానికి రెడీగా లేరు. అమ్మమ్మకు
మీరిద్దరే. మీరు కూడా ఎప్పుడో వేరుగా వెళ్ళిపోయారా? బంధువులని ఎవరూ లేకుండానే ఉండిపోయేం నేను,
నాన్న"
"నా
సుఖదుఃఖాలన్నీ నాన్న తోటే, నవ్వినా ఆయనతోటే. ఏడ్చినా ఆయనతోటే. అప్పుడు ప్రేమకోసం ఎంత పరితపించేదానినో
తెలుసా?
ఎవరైనా ప్రేమాగా, అభిమానంగా మాట్లాడరా? అని ఉండేది. నా స్నేహితురాలింట్లో ఎప్పుడూ సంబరమే. పండగ వస్తే చాలు వాళ్ళ
ఇల్లు బంధువులతో నిండిపోతుంది తెలుసా? నేను ఎదురు చూసిన ప్రేమాభిమానాల పరిస్థితి అక్కడ చూసాను
పిన్నీ. వాళ్ళందరూ అదృష్టవంతులు కదూ. మనకే ఆ అదృష్టం లేదు. మీ మొహాన్ని నేను
చూస్తూ...నా మొహాన్ని మీరు చూస్తూ...ఎందుకు పిన్నీ. మన బాబాయి కుటుంబంలో ఎవరెవరు
ఉన్నారు?
విశాల్ ని తప్ప వేరే ఎవర్నీ చూడలేదే" అని అడిగింది లత.
"ఊహూ...వేరే
ఎవరూ లేరు. నేనూ లత మాత్రమే" అని చెప్పిన పిన్ని -- అంతకు మించి చెప్పటానికి
ఏమీ లేదని అటువైపు తిరిగింది.
లతకు ఆమె మౌనం ఎదో
తెలుప, అంతకు మించి ఆమె దగ్గర ఇంకేమీ అడగలేదు.
గౌరి లో లత బాధతో మాట్లాడిన
మాటలు ఊయలలాగా ఊగుతున్నాయి.
అక్కయ్యా, నేనూ గడిపిన రోజులు, గొడవలూ,
ఆటలుగా గడిచిన రోజులు, ఒకరికోసం ఒకరు
పరితపించిన తరునాలు, గుప్తనిధి లాగా మనసులో పదిలంగా
దాచుకున్న జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు మనసులో ఏదో తెలియని ఆనందం, దిగులు.
కానీ, అలా కూడా అనుభవించలేక, ఒంటరిగా తపించిన అక్క కూతురు మీద ప్రేమ మంచు వర్షం లాగా కురిసింది. తన
భుజం మీద ఆనుకున్న లతను గట్టిగా కౌగలించుకుంది.
డ్రైవింగ్ సీటులో
కూర్చున్న విశాల్ వెనుక సీటులో జరిగిన సంభాషనను గమనించినా, లత మాటలలోని బాధ అతనిలో నిర్లక్ష్య వైకరినే
తెప్పించింది. ‘సొంత ఊరిలో ప్రేమ కలాపాలు నడిపిన
ఆమె....బంధుప్రీతి, అభిమానం అనటమేమిటి!’
గౌరి కొన్ని
సంవత్సరాల క్రితం వదిలి వెళ్ళిన తన కుటుంబాన్ని గురించి, వాళ్ళను చూడాలని తాను పడ్డ తపన గురించి ఒక
రోజు వివరించగా -- అతనిలోనూ ఒక ఆత్రుత
పెరిగింది. ప్రాణంగా అభిమానించిన మేనమామ విమల్ రాజ్, తన
భార్య గౌరిని అతని దగ్గర అప్పజెప్పకుండా, ‘విశాల్! నా చేతిని
పుచ్చుకున్న రోజు నుంచి మనకోసమే జీవించిందిరా మీ అత్తయ్య. ఆమెకు ఏ రోజు ఏది
కావాలన్నా వెంటనే చేసి పెట్టాల్సిన బాధ్యత నీదీ’ అన్నారు.
అందుకని,
ఒక డిటెక్టివ్ ఏజన్సీ మూలంగా అత్తయ్య కుటుంబాన్ని గురించి
తెలుసుకుంటున్నప్పుడు, చితికిపోయి చిన్నాబిన్నమైన లత కుటుంబ కధ అతనికి దొరికింది. ఊరి పుణ్యమా అంటూ లత
వలన ఏర్పడిన సంఘటనలు అతనికి చేదు అనిపించింది. ఇష్టం లేకుండానే లతను వెతికేడు.
ముఖం తెలియని ఆమెపై
టన్నుల లెక్కలో అసహ్యాన్ని మోసుకుని -- తెలిసిన వార్తలను పెట్టుకుని ఆమె నడతను,
గుణాన్నీ తీర్మానించి, కల్పనతో కనబడ్డ ఒక రూపాన్ని లత అని అనుమానించి
పెట్టుకున్నాడు.
అతని మనో భావాలకూ
కారణం ఉంది.
గౌరీ యొక్క భర్త విమల్
రాజ్ యొక్క ఒకే ఒక చెల్లెలు కమల. అందానికి పేరుపోయింది. ఆమె కంటే సుమారుగా ఉండే గణపతి
గుణంలోనూ,
చదువులోనూ పలురెట్లు ఎక్కువగా నిలబడ్డాడు. ఇష్టంలేకపోయినా
తాలి కట్టించుకున్న కమల, విశాల్ ను కని వదిలేసి డ్రైవర్ తో లేచిపోయింది. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య
చేసుకున్నాడు గణపతి.
పసిపాపతో ఏం చేయాలో
తెలియక నిలబడిపోయిన అత్తగారి దగ్గర నుంచి వాడ్ని తీసుకున్న గౌరి,
తన ప్రేమను తల్లి పాలుగా పట్టింది. ఆనందంగా అత్త ఒడిలో
పెరిగి పెద్దవాడై అర్ధం చేసుకునే వయసు వచ్చినప్పుడు తన పుటుక,
దానితో సంబంధించిన అవమానాలు అతని మనసులో లోతుగా
నాటుకుపోయాయి.
చెడిపోయిన దాని
కొడుకు అనే నిజం రాత్రి-పగలూ అతన్ని వేధించింది. గొప్ప స్కూల్లో చదువుకున్నప్పటికీ,
భూమి క్రింద అణిగి ఉన్న అగ్నిపర్వతం లాగా అతనిలో క్రోధమూ,
ఈర్ష్య లోపల అణిగి ఉన్నాయి. కాలేజీ చదువుకునే రోజుల్లో కొంతమంది అమ్మాయల వలన
పొందిన అనుభవాలు, ఆడవారి మీద ఉన్న విరక్తిని ఎక్కువ చేసింది. మంచి గుణాలూ,
మంచి బుద్దులు చెప్పి పెంచే తల్లి అనే బంధమే అబద్దమై
వదిలివేయబడ్డ బిడ్డే విశాల్. విశాల్ తన
అత్త తరువాత బంధువుగా అనుకుని చూసేది లతను మాత్రమే. ఆమె తనుకు మాత్రమే అన్న భావన
అతనిలో ఏర్పడింది.
తన తల్లి వలన
ఏర్పడ్డ అవమానం తన భార్య ప్రవర్తనతో తీరిపోవాలి అన్న వెర్రి అతనికి ఏర్పడిన కాలంలో,
కల్పితంతో అతని ఒడిలో దాగి ఉన్న రూపాన్ని తన అత్త కూతురుగా
కలుసుకుంటాడని అతను ఎదురు చూసే ఉండడు.
తన తండ్రిని చంపిన
హంతకురాలు అనే అపవాదుతో ఊరే వదిలి వెళ్ళిన లత --
నిర్లక్ష్య
చూపులతోనూ, అహంకార
నడవడికతోనూ, ఎదిరించి
మాట్లాడే స్వభావంతోనూ పట్నంలో ఒంటరిగా తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది అన్న ఎదురు
చూపుతో కాచుకోనున్న అతనికి, అత్తయ్య పోలికలతో, ఆమాయక చూపులతో, శాంతమైన ముఖంలో,
కాలం ఏర్పరిచిన ఆవేదన మడతలతో అందంగా నిలబడ్డ ఆమెను చూసినప్పుడు అతనిలో చిన్న చలనం ఏర్పడింది.
వెలుతురును వెతికే మొక్కలాగా అతని హృదయం ఆమె వైపే వంగింది. ఆమెను చూసినప్పుడల్లా ఒక ఆనంద జలదరింపు హాయిగా
వొళ్లంతా పాకినట్టు భావిస్తాడు.
ఈమె తనకే అన్న ఆలొచన
అతనిలో లోతుగా పడిపోవడంతో, ఆమె ఇంకో మగాడితో స్నేహం చేస్తున్నప్పుడు అతనికి ఏర్పడే అసూయని మాటల్లో
వొలికిస్తాడు. దానికి కారణం అతనికి ఏర్పడ్డ అనుభవాలే. "సీసర్ యొక్క భార్య సందేహానికి
ఊహాతీతమై ఉండాలి" అనే మాటల్లాగా తనకు మాత్రమే పరిశుద్దంగా ఉండాలి అని
అనుకున్నాడు. లత పైన అతనికి లెక్కచేయ్యలేనంత ప్రేమ ఉంది. దాన్ని బయటపెట్టలేని
విధంగా ఒక కారణం ఉన్నది. దివాకర్ పైన లతకి ఏర్పడిన ప్రేమ గురించి ఒక క్లియర్
పిక్చర్ తెలుసుకోకుండా తన ప్రేమను చెప్పటం
మంచిది కాదని ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఆ రోజు విందులో
కోపగించుకుని వెళ్ళిన ఆమె, తనని అత్రుతతో వెతికి కలుసుకున్న తరుణంలో -- కళ్ళు జ్యోతుల్లా ప్రకాశించి,
ఒక బొమ్మలాగ దర్శన మిచ్చిన ఆమె రూపం అతని మనసులో లోతుగా
పాతుకుపోయింది. కాపాడుకోవలసిన గుప్త నిధిలా హృదయ పెట్టెలో జాగ్రత్తగా బద్ర
పరుచుకున్నాడు విశాల్. ఇంటి నిర్వహణలో బాధ్యతతోనూ, ప్రేమగా చూసుకోవలసిన చోట ఒక తల్లి లాగానూ,
ఈ రోజు విందులో తన ఇంటి పనులులాగా అటూ ఇటూ తిరిగిన ఆమె --
అతని హృదయ సింహాసనం మీద పర్మనెంట్ హీరోయిన్ గా కూర్చుండిపోయింది.
**********************************************************PART-13***************************************************
సాయంత్రం అత్తయ్య,
అల్లుడుగా ఇల్లు చేరుకున్న సమయంలో " విశాల్! నీ దగ్గర
ఒక విషయం మాట్లాడాలి" అన్నది గౌరి.
"ఏమిటత్తయ్యా!
పిడి బలంగా ఉంది. విషయం చాలా సీరియసా ఏమిటి?"
“లత గురించి నువ్వేమనుకుంటున్నావు?"
సడన్ గా ఆమె అలా
అడిగేసరికి వెనక్కి తిరిగిన అతను "ఎందుకు సడన్ గా ఇలాంటి ఒక ప్రశ్న ?"
అన్నాడు.
"నువ్వు మొదట
సమాధానం చెప్పు"
కారును పక్కగా ఆపాడు
అతను.
"మనింటి
అమ్మాయి గురించి నేనేం చెప్పను?"
"చాలా
ధ్యాంక్స్ రా. నీ గుణం నాకు తెలుసు. ఆ గీతా ఎంత ధైర్యంగా చెప్పింది...?"
"ఎవరు?
ఆ ప్రొఫసర్ భార్యనా?"
"అవును.
ఆస్తి కోసం నువ్వు లతను అసహ్యగించు కుంటావని...అంటూ ఇంకా ఏవేవో చెప్పింది"
"నువ్వు
భయపడ్డావ్...అంతేనా!"
ప్రేమ
ఎక్కువైనప్పుడు విశాల్ ఆమెను నువ్వూ అని సంభోదిస్తాడు.
"లేదురా"
"నేను
పెరిగింది నీ దగ్గర. నాకు ఈ ఆస్తి, డబ్బూ ఏదీ వద్దు. నువ్వు మాత్రం చాలు. అందువల్ల ఎవరేం
చెప్పినా మనసును పాడుచేసుకోకు. తెలిసిందా? ఇప్పుడు చెప్పు, ఎందుకు లత గురించి అడిగావు...నా తల మీద కట్టేద్దం అని ఆశగా
ఉందా?"
సరదాగా, అత్రుతతో అడిగాడు విశాల్.
"పోరా. నీకూ
దాన్ని చూస్తేనే పడదు. లతకూ అంతే. మీ ఇద్దర్నీ చేర్చిపెట్టి ఏమిటి లాభం?
నేను చెప్పబోయేది వేరే విషయం" అన్న గౌరి -- చిన్న
పిల్ల కుతూహలంతో - "మేజర్ మనవడు వరుణ్ లేడు...అతనికీ,
లతకు ఈడుజోడు ఎలా ఉంటుంది? ఆ
రోజు విందులో మనమిద్దరం భోజనం చేస్తున్నప్పుడు కలిసి నిలబడ్డాడు చూడు అతనే. మనసు, కడుపు నిండిపోయింది తెలుసా? ఇంకా ఒక నెల వాడు మేజర్ ఇంట్లోనే ఉంటాడు. సంబంధం ఎస్
అనుకుంటే వెంటనే పెళ్ళిపెట్టుకోవాలని ఆంటీ చెబుతోంది. లత కూడా వాళ్ళతో బాగా
కలిసిపోతోంది. ఇద్దరికీ నచ్చాలి. నువ్వేమంటావ్?" అన్నది.
విశాల్ హృదయం బలంగా
ఊగిపోగా "ఇప్పుడు ఏమిటి అవసరం? ఇంకో రెండు సంవత్సరాలు పోనీ" అన్నాడు.
“ఇప్పుడే ఇరవై
రెండు జరుగుతోంది. దానికి ఒక మంచి జీవితం కుదిర్చిపెడితే మనం ప్రశాంతంగా
ఉండొచ్చు"
"చూద్దాం
కానీ"
"ఎందుకురా అలా
అతికీ అతకనట్టు మాట్లాడుతావు?"
గౌరి యొక్క విపరీత
ఆసక్తి అతన్ని నీరస పరిచింది.
"అత్తయ్యా...దానికని
ఒక సమయం వస్తుంది. అప్పుడు మంచిగా చేద్దాం"
"ఈ పెళ్ళి
జరిగేంత వరకు నువ్వు నా దగ్గరే ఉంటావుగా?"
"మరి?
మనింటి పెళ్ళికి నేను లేకుండా ఏట్లా?"
అన్నవాడు, అంతకంటే దాని గురించి ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేక బండి
తీసాడు.
తన ప్రేమ కన్యను
ఇంకెవరితోనో జతచేసి చూడటం ఇష్టం లేక మనసు కొట్టుకుంది -- ఆ బాధతోనే ఇళ్ళు జేరేడు.
తోటలోని గడ్డి
తివాచి మీద కూర్చుని కిరణ్ తో నవ్వుతూ మాట్లాడుతూ నిలబడింది లత.
కారు దగ్గరకు రావటం
చూసిన ఇద్దరూ, కారు
దగ్గరకు రాగా, పలకరింపు
తరువాత -- గౌరి లోపలకు వెళ్ళింది. టీ రెడీ చేయటానికి వెళ్ళిన లతతో పాటూ కిరణ్
వెళ్ళటం విశాల్ కు కోపం తెప్పించింది.
" లతా! నీ బాయ్ ఫ్రెండ్ కళ్ళు చూశావా?
వాటిలో ఎంత ఈర్ష్య సెగ ఉందో. నన్ను అలాగే కాల్చిపారేసేలాగా.
దాన్ని బట్టే తెలియటం లేదు...అతని మనసు నిండుగా నువ్వే ఉన్నావని" అన్నాడు కిరణ్.
"అబద్దంగా
మాట్లాడకండి. ఆ మనిషికి దయ, జాలి,
కరుణ, ప్రేమ, బంధం ఏదీ
లేదు. ప్రేమంటే ఏమిటని అడిగే జాతి. అతను మాట్లాడే ఒక్కొక్క మాటా తేలు కుట్టినట్టు
ఉంటుంది. ఆయనకు నా మీద ప్రేమ రావటమేమిటి? ఒక వేల అతన్ని
ప్రేమించాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది అనుకోండి, నేను
ఆత్మహత్య చేసుకుంటాను. ప్రేమ రావటానికి ఒక ముఖం కావాలి?"
లత వేళాకోళంగా, నవ్వుతూ చెప్పగా -----
"అంటే నిజంగానే
నీకు అతను నచ్చలేదా?"
"చచ! మళ్ళీ
మళ్ళీ అదే అడుగుతున్నారు. అతన్ని తలచుకుంటేనే విరక్తి పుడుతోంది. పేర్లలోనే విశాల్
అనే పేరునే నేను ఈ ప్రపంచంలో ఎక్కువగా చీదరించుకునేది" అన్నది, విసుగ్గా.
అనుకోకుండా
అక్కడకొచ్చిన విశాల్ చెవులకు అన్నీ వినపడటంతో -- ఫీలింగ్స్ లోనూ, మనసులోనూ బలమైన దెబ్బ తిన్నాడు.
టీ కప్పుతో వచ్చిన లత, కారులో కూర్చున్న విశాల్ దగ్గర ట్రే ను
జాపింది.
చదువుతున్న పత్రికలో
నుండి కళ్ళను తిప్పకుండా శ్రద్దగా చదువుతున్న కుర్రాడిలా ఫోజు పెట్టాడు విశాల్.
"టీ"
"వద్దు"
"రోజూ తాగుతారు
కదా!".
“వద్దంటే అర్ధం కాలేదా..."
కోపంగా అరవడంతో.
'ఎందుకింత కోపం'
అనేది అర్ధం కాకా ఒక్క క్షణం ఆశ్చర్యపోయి నిలబడ్డ ఆమె, విశాల్ వెనకాల నిలబడున్న కిరణ్ తో,
‘చూశావా వాడి
నిర్లక్ష్యం' అంటూ నవ్వుతూ కళ్ళతో సైగ చేసింది.
ఏదో స్వారస్యమైన
విషయం జరగబోతోందని ఎదురు చూసిన కిరణ్ -- 'ఛ!' అని విసుక్కోని నిలబడ్డడు. అతని నిలబడ్డ దోరణి చూసి పగలబడి నవ్వబోయిన లత, నవ్వును ఆపుకోవటానికి గబుక్కున నోరు నొక్కు కుంది.
ఆపుకోలేని నవ్వుతో
నిలబడున్న లతను ఓరకంటితో చూసిన విశాల్ 'నన్ను చూస్తే నీకు వేళాకోళంగా ఉందా?
ఉండు. నాకూ ఒక సమయం వస్తుంది. అప్పుడు నీ పని పడతా'
అని మనసులొనే ఆమెను
హెచ్చరించాడు అతను.
అరగంట తరువాత కిరణ్
తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఉత్సాహంగా తనలో తానే పాటలు పాడుకుంటూ తోటలోకి
అడుగుపెట్టిన లత ముందు విలన్ లాగా వచ్చి నిలబడ్డాడు విశాల్.
అతన్ని
నిర్లక్ష్యంగా చూసి, గబుక్కున వెనక్కు తిరిగిన ఆమెను చూసి "పరవాలేదే. ఊరు వదిలి ఊరు వచ్చినా
కూడా నీ వలలో మగ జింకలు ఈజీగా పడుతున్నాయే" అన్నాడు.
అతని గుణమూ,
ఈటెలు లాగా గుచ్చుకునే అతని మాటలూ గురించి తెలిసిన లత -- 'ఓ.కే'...అంటూ నవ్వుతూ అతని దగ్గర నుండి జరగటానికి ప్రయత్నించింది.
'నీ
మీద ఒకడు రాయి విసిరితే, అతని మీద నువ్వు రోజా పువ్వును విసురు’ అని చదివింది గుర్తుకు వచ్చింది.
ఆమె యొక్క
నిర్లక్ష్య వైకరి అతన్ని కవ్వించింది. ఆమెను అలాగే వదలటానికి అతనికి మనసురాలేదు.
"ఈ
కుటుంబానికని ఒక మర్యాద ఉంది" అన్నాడు.
"ఓ"
"నీ వలన అది
చెడిపోవటం నేను అనుమతించలేను"
అతను మళ్ళీ ఆమె మీద
రాయి వెయ్యగా -- గాయపడ్డ మనసులో ఏర్పడ్డ కోపాన్ని అనుచుకుని,
నవ్వు అనే రోజా పువ్వును చూపింది.
“మేజర్
కుటుంబానికి నీ పాత జీవితం, అందులో నువ్వు నడిపిన నాటకాలూ తెలిసే ఛాన్స్ లేదు"
మళ్ళీ మళ్ళీ
దెబ్బతిన్న నొప్పిని భరించలేని ఆమె హృదయం, కన్నీటి చుక్కలను కళ్ల చివరుకు తోయగా,
ఆ కన్నీటిని తుడుచుకుని ----
"ఇప్పుడేమంటారు?"
అని అడిగింది.
"నీలాంటి
ఒకత్తి వలన ఈ ఇల్లు, కుటుంబం, దాని
గౌరవం దెబ్బతింటున్నాయని నేను అనుకుంటున్నా. నీ ప్రవర్తన మంచి కుటుంబ
ఆడవాళ్ళ..."
అతను మాట్లాడుతుంటే
నొక్కి పెట్టుకున్న ఓర్పుతో--
"అంటే నేను
చెడిపోయిన దానిని అని చెబుతున్నారా?"
"అది నేను
వేరుగా చెప్పాలా? మీ ఊర్లో అడిగి చూడు. నీ పేరుకున్న గొప్పతనం
తెలుస్తుంది" అన్నాడు.
ఇకపైన ఓర్పుగా
ఉండలేకపోయింది. 'మళ్ళీ
మళ్ళీ రాయి విసురుతున్న అతని మీద రోజా తొట్టెను విసురు. చావనీ...'-- చదివిన లైన్లు చెవుల్లో గింగుర్లు తిరుగగా, అతని
వైపు ధైర్యంగా తిరిగింది.
అతని కళ్ళల్లోకి
తధేకంగా చూసింది "బైబుల్ లో ఒక మాట ఉంది తెలుసా?" అని అడిగిన ఆమె, తన ముఖ బావాలలో ఒక మెట్టు దిగిన అతని మనో బావాన్ని అర్ధం చేసుకోకుండా
"తన కంటి చూపును అడ్డుకుంటున్న మురికిని పట్టించుకోకుండా, ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఉన్న దుమ్మును తీసేయటానికి ప్రయత్నిస్తున్న అతన్ని 'అత్యంత మూర్కుడు’ అంటారు అని అందులో క్లియర్ గా
రాసుంది. దానికి అర్ధమేమిటో నేను విడమర్చి చెప్పాలా ఏమిటి?" అన్నది నిర్లక్ష్యంగా.
ఆమె చూపే నిర్లక్ష్యం, దోరణి కొత్తగా ఉండటంతో ----
"ఏమిటి...ఏం
చెప్పటానికి ప్రయత్నిస్తున్నావు?" అన్నాడు.
"అర్ధం కాలేదా?" --వెళాకోళాన్ని సాగదీసిన ఆమె
"ఎందుకు అంత వింతగా చూస్తున్నావు? నీ పుటుక...దానికి
సంబంధించిన సంఘటనలు అన్నీ మర్చి పోయావా ఏమిటి?" అన్నది.
అధిరిపడ్డాడు విశాల్.
అతని మనసులో
పూడుకుపోయిన అవమానాలను గుంట తవ్వి బయటకు తీసి దీపం వెలుతురులోకి తీసుకు వచ్చిన
ఆమెను షాక్ తగిలినవాడిలాగా చూశాడు.
"నేను ఒకడ్నే
ప్రేమించాను. మీ అమ్మలాగా కన్నబిడ్డనూ, కట్టుకున్న మొగుడ్ని వదిలేసి ఇంకొకడితో పారిపోలేదు. మీ మీద
ఇంత మురికి పెట్టుకుని..." విసుగు, కోపం తలకు ఎక్కగా, ఏం మాట్లాడుతున్నామో తెలియక, అనాగరీకంగా ఆమె మాట్లాడుతుంటే ---
" లతా!" అని
అరిచినతను, ఫడేల్
మని లత చెంప మీద ఒకటిచ్చాడు.
"ఏయ్!"
అని అహంకారంతో, దెబ్బ
తగిలిన షాక్ నుండి తేరుకోలేక నిలబడ్డ లత గొంతు పట్టుకుని -- "ఇంకోసారి ఆమె
గురించి మాట్లాడావో, నిన్ని చంపేస్తాను" అన్నాడు.
కోపం ఎక్కువ అయ్యి,
కృరంగా కనబడ్డ అతని మొహం ఆమెలో భయం పుట్టించ ---
"సారీ..."
అన్నది. గుండె దఢ తగ్గకుండానే.
"వెళ్ళిపో...నా
ముందర నిలబడకు" అంటూ గుమ్మం వైపు చెయ్యి చూపించాడు.
ఆమె కోపము,
గొంతును గట్టిగా పట్టుకున్నందువలన ఏర్పడిన నొప్పి,
దెబ్బ తిన్న అవమానం ఒక్కసారిగా ఆమెను తాకగా ---
వెక్కి వెక్కి ఏడుస్తూ
తన గదిలోకి పరిగెత్తుకు వెళ్ళి మంచం పైన పడింది.
**********************************************************PART-14***************************************************
లత మనసు చాలాసేపటి
వరకు ప్రశాంతత చెందలేదు. 'ఎవరితను? నా
మీద చెయ్యి చేసుకోవటానికి అతనికి హక్కు ఎక్కడిది? నన్ను అవమాన పరిచినందువలనే కదా నేను సమాధానం చెప్పాను.
ఇతనితో నరక వేదనను అనుభవించటానికి కంటే నేను హైదరబాద్ వెళ్ళిపోవచ్చు. కానీ,
పిన్నిని ఎలా ఒప్పించేది?' పలు ఆలొచనలతో నిద్రలోకి వెళ్ళిపోయింది లత.
మెలుకువ వచ్చిన
తరువాత కూడా లేవటానికి మనసు రానట్లు మనసు, శరీరం నీరసంగా పడిపోయింది. ఆమెలో ఆలొచనలు మారినై.
తన మీద పడ్డ దెబ్బ
కంటే,
తన వలన విశాల్ కు తగిలిన దెబ్బే పెద్దదిగా అనిపించింది.
అవమానంతో కృంగిపోయిన
అతని మొహం ఆమె కళ్ళ నుండి వెళ్ళకుండా నిలబడిపోయింది. ఈ రోజు వరకు ఆమె ఎవరినీ గాయపరిచిందే
లేదు. తన మాటో, చేస్టో
ఎవర్నీ కొంచం కూడా బాధ పెట్ట కూడదు అనే భావంతో నడుచుకోవాలి అనే విషయంలో ఆమె
ఖచ్చితంగా ఉండేది. అలాంటిది తన మాటలతో ఒకడి ప్రాణం గిలగిలా కొట్టుకోవటాన్ని
తట్టుకోలేకపోయింది. మనసులో ఎంత బాధ పుట్టుంటే అలా కోపగించుకోనుంటాడు. పితికిన పాలు
కంటే కూడా తల్లి పవిత్రత చాలా గొప్పదని, అటువంటి ఒక తల్లి అపవిత్రరాలు అనేది ఒక బిడ్డ తెలుసుకుంటే,
ఆ బిడ్డ అనుభవించే బాధ, వేదన మాటలతో వివరించగలమా?
అతను ఆమెను
అప్పుడప్పుడు మాటలతో గుచ్చిన కారణమూ ఆమెకు అర్ధమయ్యింది. అతని హృదయం చిన్న
వయసులోనే అవమానకరమైన మాటలతో నిండిపోయింది. మెల్లగా మెల్లగా మంచి గుణాలను కోల్పోవటం
వలనే అతను అలా ఉన్నాడని అర్ధం చేసుకుంది. విశాల్ అనే మంచి ముత్యాన్ని అభిమానంతో,
ఆదరిస్తే మాత్రమే ప్రకాసవంతంగా ఉంటుంది. స్నేహం అనే విత్తనం
అతని మనసులో పడి, మొలకెత్తి వందరెట్ల ఫలితం ఇవ్వాలంటే, చుట్టూ ఉన్న కొమ్మలను పీకి వేయటానికి తన ప్రేమ ఎంత అవసరమో
అర్ధం చేసుకుంది లత.
'మనం ఎవర్ని
ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళ వలన మాత్రమే సుఖాన్ని, దుఃఖాన్ని
ఎక్కువగా ఇవ్వగలరూ అనే అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని మేడ మీద నుండి దిగింది.
కళ్ళు నాలుగు వైపులా వెతికి మోసపోయినై.
డైనింగ్ హాలులో గౌరి
మాత్రమే ఉంది.
"ఏరా, వొంట్లో బాగాలేదా? వచ్చి
చూసినప్పుడు బాగా నిద్రపోతున్నావు?"
"అవును...ఒకటే
తలనొప్పి. అందుకనే పడుకుండిపోయాను. అలాగే నిద్రపోయాను”
అన్నది లత. ఎర్రటి కళ్ళు...వాచిన చెంపలు. అనుమానం రాకూడదనే ఆదుర్ధాతో వంటింట్లోకి
దూరింది.
అదంతా గమనించిన గౌరి
వంటింటి గుమ్మంలో నిలబడి--
"విశాల్
ప్రొద్దున్నే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. మొబైల్ ఫోన్ రీచ్
అవటం లేదు. వస్తే భోజనం పెట్టు" అని చెప్పి వెళ్ళిపోయింది.
అతను ఎక్కడికి
వెళ్ళుంటాడు? అతన్ని వేధనకు
గురిచేసిన తనని తానే తిట్టుకుంది.
మౌనమూ, చిరునవ్వు పలు సమస్యలను పరిష్కరించడానికి,
తప్పించుకోవటానికి సాయపడుతుంది అని ఆమె ఎందుకు భావించలేదు?
వందనాను 'ఔట్ హౌస్’ కు పంపి హాలులో కూర్చుంది.
సుమారు ఒక గంట తరువాత
వచ్చాడు విశాల్.
ముఖంలో ఏదో మార్పు.
తడబడుతూ అతను మేడ ఎక్కాడు.
కిందకు వస్తాడేమోనని కాచుకోనుంది లత.
అరగంట అయినా అతను
రాలేదు. మేడ ఎక్కి ధైర్యంగా గది తలుపులను తోసింది.
ఎదురుగా చూసిన
దృశ్యం!
చేతిలో మందు
గ్లాసుతో ఈజీ చైర్లో పడుకోనున్నాడు విశాల్.
కాళ్ళు తారుమారుగా
ఉన్నాయి.
దగ్గరకు వెళ్ళి
" విశాల్" అని పిలిచింది.
అతను తలెత్తి
చూడలేదు.
" విశాల్ " అంటూ పిలుస్తూ అతని భుజాన్ని చేత్తో కదిలించింది.
మెల్లగా తలెత్తి
చూసిన విశాల్, కళ్ళు పెద్దవి
చేసి "నువ్వా? ఎందుకొచ్చావు? చెడిపోయిన దాని కొడుకుని చూడటానికి వచ్చావా?" అన్నాడు.
" సారీ విశాల్! ఏదో
కోపంలో మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు" అన్నది.
"ఏయ్! ఆపు!"
అంటూ నిర్లక్ష్యంగా చేయెత్తి సైగ చేసాడు. "మనసులో ఉన్నదే బయటకు వస్తుంది...ఏం
మాట అనేశావు? ప్రతి
రోజూ పురుగులా కొట్టుకుంటున్నాను తెలుసా? అది ఎంత పెద్ద నొప్పో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
ఎవరైనా మామూలుగా చూస్తేనే, ఎగతాలిగా చూస్తున్నట్టే అనిపిస్తొంది. అవమానపడి గాయపడిన నా మనసులో నేను
అనుభవించిన ఒకే ఒక సంతోషం నువ్వే. నా మీద పడ్డ మరకలను తుడవటానికి వచ్చిన దేవతగానే
నేను నిన్ను అనుకుంటున్నాను. కానీ, నువ్వు నన్ను నీచుడుగానే చూస్తున్నావని ఇప్పుడే అర్ధం
చేసుకున్నాను" అన్నాడు.
అతని మొహంలో కనబడ్డ
అవేదన -- లతను వేదనకు గురిచేసింది.
నా మాటలు అతన్ని తాగుబోతుగా
మార్చేసినయే!
కుర్చీలోనే
కుచించుకు పోయిన అతని మొహాన్ని పైకి ఎత్తి "రండి భోజనం చేద్దాం" అన్నది.
"ఏయ్!
వెళ్ళు..." అతను గొణగ, బలం పుంజుకుని అతన్ని లేపి పరుపు మీద పడేసింది. పడినవాడు ఆమెనూ లాగి తనపై
పడేటట్టు చేశాడు. నొప్పి పుడుతున్న గుండెల మీద ఆమె మెత్తగా పడటంతో ఆమెను తన
చేతులతో బంధించాడు. ఆమె గింజుకుంది. మొహాలు రాసుకోగా -- గుప్పుమని వెలిగిన మంటలాగా
వేడెక్కిన నరాలు తమ కట్టుబాటును సడలించుకున్నాయి.
" లతా"
తాపంతో గొణిగిన
పెదవులు,
ఆమె హృదయాన్ని అలలలాగా తాకగా జరగబోయేది గ్రహించిన ఆమె కళ్ళు
మత్తులోకి వెళ్ళ -- ఆమె స్పృహ, భావాలను అనిచివేసినై.
అనుభవ స్పర్ష
కొత్తదైనా లత యొక్క ఆడ గుణం మేల్కొన్నది. మధ్యం మత్తులో తన స్వీయ నిలకడను
మరిచిపోయిన అతనితో...ఛఛ!
అతని పిడినుండి
వెంటనే వేగంగా బయట పడాలని ప్రయత్నించింది.
మత్తులో ఉన్న అతని
బలం ఆమెను కదలనివ్వలేదు.
తన బలమంతా ఉపయోగించి,
మెలికలు తిరిగి, జారుకుంటూ అతని బంధం నుండి బయటపడింది.
అతని శరీరానికి కింద
పడిన తన దుప్పటాను లాగింది.
దుప్పట్టా మరో
చివర్ను పట్టుకున్న అతని కళ్ళు చూసినప్పుడు ---
అందులో ఉన్న ఐస్కాంత
శక్తి!.
మోసపోవటంతో,
తాపంతో అతను ఆమె
దుప్పటాను లాగుతూ "లతా" అతని బిజ్జగింపు పిలుపు -- ఆమె మనసును మంచు ముక్కలాగా కరిగించింది.
తనకు తెలియకుండానే
అతని వైపు అడుగులు వేయగా -- మంచు గడ్డలు కరగటం ప్రపంచానికి ఎంత చేటో,
అదే చేటు తనకు రాకూడదని --
గబుక్కున దుప్పటాను
లాక్కుని పరిగెత్తింది లత.
**********************************************************PART-15***************************************************
మరుసటి రోజు
తెల్లారినప్పుడు లతాకు కొత్తగా అనిపించింది. సూర్యోదయ తొలి లేత కిరణాలు కొండ
శిఖరాన్ని తాకుతున్నప్పుడు పరవసించిపోయింది.
లోతైన మనసులో
దాగున్న రహస్యాన్ని మనసు విప్పి చెప్పుకోవాలని అనిపించింది. కానీ,
ఇంతకు ముందే కాల్చుకున్న అనుభవం,
ఆరని గాయం ఆమె మనసును అడ్డుకున్నాయి.
ఎప్పుడూ విశాల్
రూముకు వెళ్లని లత ఆ రోజు టీ తీసుకుని విశాల్ రూముకు వెళ్ళింది. టీ కప్పు
తీసుకున్న అతనిలో ఏ మాత్రం బిడియం కనబడలేదు. లత మనసు మాత్రం క్రితం రోజు రాత్రి
జరిగిన సంఘటనల బాధింపు తగ్గక ఆమెను భయంతో నిలబెట్టింది. ఓర చూపుతో కొన్నిసార్లు
అతని మొహంలోకి చూసింది. కానీ, అతను అవేమీ పట్టించుకున్నట్లు కనబడలేదు. కొన్ని రోజులు
రహస్యంగా చూసుకోవటం, కలల్లో తేలియాడటం చేస్తున్న లత ఒక రోజు అతను ఆఫీసుకు వెళ్ళిన తరువాత అతని
రూముకు వెళ్ళింది---- అన్వేషించే భావంతోనూ, ఏదో దొంగతనం చేయటానికి దూరినట్లు ఆమె హృదయం వేగంగా
కొట్టుకుంది.
పరిశుభ్రంగానూ,
అందంగానూ ఉన్న ఆ గదిని చూసిన తరువాత లత మనసు అతని గుణం
ఎలాంటిదో అర్ధం చేసుకుంది. గోడకు అతని బట్టలు వేలాడదీసి ఉన్నాయి. ఆ రోజు నదీ తీరాన
వచ్చిన అదే వశీకరణ వాసన ఆ బట్టల నుండి రావడంతో ఆమె కలవరపడ్డది.
"హు...అతను
ఉపయోగిస్తున్న వస్తువలకే ఇంత వశీకరణ శక్తి ఉందంటే, అతని స్నేహానికి....?
దేనికోసం
వెతుకుతున్నమో తెలియకనే ఒక్కొక్క అలమరానూ వెతికింది. విసుగుతో వెనుతిరిగిన లతకు ఒక
అలమరా లోపలి భాగంలో లోతుగా ఒక అర కనిపించటంతో, ఏదో ఒక రహస్యం దాగున్నదనే అనుమానం కలిగింది. మెల్లగా
అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. బ్యాంకులో బద్రంగా దాచుకోవటానికి ఉండే లాకర్ లాగా
ఉన్న అలమరాను ఎంత నిర్లక్ష్యంగా తెరిచి ఉంచారు? అనేది ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. చాలా అలమరాలు తాళం
వేసున్నట్లు మూసుండగా సగం తెరుచుకున్న ఆ అలమరాను పట్టుకు లాగింది. ముఖ్యమైన
డాక్యూమెంట్స్ పెట్టుకునే ఆ అలమరాలో ఆమె చేతికి దొరికింది ఒక ఫోటో కట్ట.
'ప్రకృతి
యొక్క ప్రతి యొక్క చలనాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ ఫోటోలలో అవి ఎలా దాగున్నాయో నన్న
ఆశ్చర్యం వేసింది లతకు. ఒక్కొక్క ఫోటోనూ చూస్తూ వస్తోంది. అప్పుడు గౌరి పిన్ని చెప్పింది లతకు గుర్తుకు
వచ్చింది.
'వాడి
మనసులో ఏర్పడిన గాయాలకు మందు అతను ఫోటోలు తీసే కెమేరానే. చాలా బహుమతులు
గెలుచుకున్నాడు’
ఆ రోజు అలా ఫోటోలు
తీయటానికి వచ్చినప్పుడే నన్ను ఆ గూండాల దగ్గర నుండి కాపాడాడు?
మంచం మీద కూర్చుని
ఫోటోను చూసుకుంటూ వచ్చిన లత చివరగా ఆ ఆల్బం ను తీసింది.
విధ విధమైన ఫోజులలో
ఆ ఫోటోలలో నిలబడున్నది లతనే. తోటలోని పచ్చటి గడ్డి తివాచి మీద,
రోజా చెట్ల దగ్గర, నదీ తీరానా – అంటూ,
ముందు రోజు అతను
నడుచుకున్న తీరుకు కారణం -- చెడు ఆలొచన కాదనేది ఆమెకు అర్ధమవటంతో -- ఆమె
వెతకటానికి వచ్చిన ఆలొచన ముగింపుకు వచ్చింది.
ఇన్ని కోణాలలో అతను
తనని ఫోటోలు తీసేడంటే, దానికి కారణం అతనికి నామీదున్న లోతైన స్నేహమే!
అనుకుంటుండ గానే ఆమె
మదిలో తియ్యని హాయి!
అనువనువునా ఆనంద
కితకితలు!
కిరణ్ చెప్పినట్టు
ఎదురు బొదురు దృవాల ఐస్కాంత శక్తి!
కొన్ని ఫోటోలతో తన
గదిలోకి వెళ్ళిన లత అక్కడ ఉండలేకపోయి అల్లల్లాడింది.
ఆ తరువాత రోజులలో విశాల్
ఇంటికి వచ్చే సమయంలో అందంగా అలంకరించుకుని నిలబడటం అలవాటయ్యింది.
అలా ఒకరోజు సాయంత్రం
ఆఫీసు నుండి ఇంటికి వచ్చి డ్రస్సు మార్చుకుని రిలాక్స్ గా సిట్ ఔట్ లో కూర్చున్న విశాల్
దగ్గరకు టీ కప్పుతో వచ్చింది లత. తన తల కనబడితేనే పరిగెత్తే లత,
తానుగా దగ్గరకు వచ్చి నిలబడటంతో తలెత్తి చూశాడు.
"ఏమిటి?" అని అడిగాడు.
సౌమ్యంగా వచ్చిన
అతని మాటతో, అయోమయంలో పడ్డ లతకు
ఏం మాట్లాడాలో తెలియలేదు. "పిన్నీ..." అన్నది.
"పిన్ని..."
అని ప్రశ్నార్ధకంగా చూసిన అతను “ఆమె మనాలి దాకా వెళ్ళింది కదా!"
"ఉష్...!"
అని నాలిక కరుచుకున్న లత ఆలొచించింది. 'ఓవర్ గా వాగేనో?'
'ఏయ్' లతా, అనవసరంగా అతన్ని కెలికి తిట్లు తినకు...ఏదో
ఒకటి చెప్పి తప్పించుకో...' అని తనని తాను సరిచేసుకుంది.
"అది కాదు...పిన్ని
ఫోన్ చేసింది"
"హు..."
అన్న అతను పేపర్ను మరో పక్కకు తిప్పి అందులో దృష్టి పెట్టాడు.
'పొగురుబోతు! ఎలా
కూర్చున్నాడో చూడు. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా?" -- విసుగుతో ఆమె మనసు గొణిగింది.
"అదొచ్చి...ఆమె
ఏం చెప్పిందంటే..."
"ఊ..."
అంటూ తలెత్తి లతను చూశాడు. అతని కళ్ళల్లో నుండి ఒక శక్తి మెరుపులా ఆమె శరీరంలోకి
దూరింది. అతని మొహంలోకి చూస్తున్న తన చూపును అలాగే ఉంచి నిలబడింది లత.
ఆమె కళ్ళల్లో
పొంగుకొస్తున్న ప్రేమ, ఆమె
మొహంలో కనబడ్డ సిగ్గు ను చూసి తనని తాను మరిచిపోయాడు విశాల్.
ఆమె అందచెందాలనూ, అనుకువనూ చూసి అమాంతం ఆమెను తన కౌగిలిలో
బంధించాలనే తన ఆశను ఎలాగో అణుచుకుని "ఏం చెప్పింది?" అని అడిగాడు.
"ఏమీ లేదు"
అంటూ కదిలింది లత.
రోజులు వారాలుగా
గడిచిపోగా, వరుణ్
బయలుదేరవలసిన రోజు వచ్చింది. ఇన్ని రోజులుగా సంతోష రేఖలుతో వెలిగిపోయిన అమ్మమ్మ
ముఖంలో మాత్రం వాడిపోయిన విచారం మిగిలింది.
"ఏమిటమ్ముమ్మా!
పోయిన సారి సెలవులకు వచ్చినప్పుడే ఒక మాట చెప్ప కూడదా. మీరు ఇష్టపడినట్లే మన ఊరి
అమ్మాయినే చూసి పెళ్ళి చేసుకోనుండే వాడిని" అన్నాడు వరుణ్.
"పోరా! బాగా
తియ్యగా మాట్లాడి ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. ఆ ఇటలీ అమ్మాయి మైకంలో పడిపోయావు.
ఇప్పుడు నా దగ్గర కబుర్లు చెబుతున్నావు" అన్నది కోపంగా.
"అమ్మమ్మా!
సెల్షియాను చూస్తే మీరు కూడా మైమరచిపోతారు. ఆ నీలి కళ్ళు, పసిపిల్ల మొహం..." అంటూ అతను కలలో
విహరించ,
"అయ్యో
అమ్మమ్మా! మళ్ళీ మొదలు పెట్టకు" అన్నాడు కిరణ్ బెదిరిపోయి.
"ఈ విషయంలో
మాత్రం వరుణ్ నా వారసుడే" అని తాతయ్య తన ప్రేమ కధను వివరించ,
"అయ్యో...సెల్షియా
కూడా అమ్మమ్మ లాగానే తాతయ్య. నన్ను చూడకుండా ఒక్క నిమిషం ఉండలేదు" అని
అమ్మమ్మ పైన ఐస్ గడ్డలు పెట్టాడు వరుణ్.
అమ్మమ్మ కళ్ళలోని
వెలుగు వరుణ్ ని శాంత పరిచింది.
"అమ్మమ్మా!"
అంటూ అతను ఆమె రెండు చేతులూ పుచ్చుకుని "మీరే నాకు సహాయం చేయాలి. మిమ్మల్నే
నమ్ముకున్నాను" అంటూ బ్రతిమిలాడాడు. "నీ సంతోషమేరా నాకు ముఖ్యం. మీ
నాన్నా, అమ్మా ముంబై నుండి రానీ. మేము మాట్లాడతాం.
వాళ్ళు విదేశాలకు వెళ్ళక ముందే నీకు మంచి నిర్ణయం చెప్తాము...చాలా?" అన్నది.
కానీ వెంటనే
"నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా?"
అంటూ పెద్ద శ్వాశ విడిచి "పాపం! ఆ గౌరి దగ్గర నీ గురించి
చెప్పి వాళ్ళ ఆశలను రేకెత్తించాను. నువ్వు ఈ ఇటలీ అమ్మాయి దగ్గర ఇరుక్కుపోయావని
ఇప్పుడు ఎలా చెప్పను" అన్నది కాస్త చిరాకుగా.
"అమ్మమ్మా!
దాని గురించిన బాధ మీకు అవసరం లేదు"
"లతకు మంచి
సంబందం రాబోతోంది. వీడికంటే సూపర్ అల్లుడు వస్తాడు" అన్నాడు కిరణ్.
"ఏమిట్రా
చెబుతున్నావు?" అని
అమ్మమ్మ అడిగింది.
"అబ్బాయికి ఏదో
దీర్గ దర్శనం దొరికినట్లు మాట్లాడుతున్నాడు" అన్నాడు తాతయ్య.
"నిజమే
తాతయ్యా. నా మాట నిజమవుతుందా... లేదా అనేది మీరే చూడండి" అన్నాడు కిరణ్ వికారంగా
నవ్వుతూ.
"రేయ్ ఎందుకురా
నీ మాటలూ, నవ్వూ వికారంగా ఉన్నాయి. ఏదైనా చిలిపి పని
చేసావా...నీ మామయ్య వదిలి పెట్టడు. జాగ్రత్త!" అన్నారు తాతయ్య హెచ్చరిక
బానిలో.
"తాతయ్యా! ఇంత
వయసైనా మీ వేళాకోళం తగ్గలేదు చూశారా?"
అన్నాడు మనవుడు.
అమ్మమ్మా, తాతయ్యలతో మనవళ్ళు పిచ్చాపాటి మాట్లాడుతున్న
సమయంలో వచ్చింది లత.
"లతా! నీకు నూరేళ్ళు"
అన్నాడు కిరణ్.
"ఏం? ఎందుకని మీకు నా మీద అంత పగ? వంద సంవత్సరాల వరకు ఇప్పటిలాగా కష్టలు పడాలా? నేను
సంతోషంగా, హాయిగా వెళ్ళి చేరటం మీకు ఇష్టం లేదా?"
అన్నది లత విరక్తితో.
ఎప్పుడూ ఉత్సాహంగా, గలగలమని ఉండే, లత
అదొలా మాట్లాడటంతో -- తాతయ్య, అమ్మమ్మ ఒక లాగా చూశారు. కిరణ్
ఆమె మనోబావాన్ని అర్ధం చేసుకున్నవాడిలా సర్దుబాటు చేశాడు.
"ఏం లత! టీ.వీ
లో ఏదైనా సీరియల్ చూసేసి, అదే
మనోభావంతో వస్తున్నావా?"
సంబందమే లేకుండా
అతను అలా అడిగేటప్పటికి అతన్ని ప్రశ్నార్ధకంగా చూసిన లత తో -- తాతయ్య, అమ్మమ్మ ఇద్దర్నీ కంటి చూపుతో సైగ చేసి
చూపాడు కిరణ్.
అర్ధంచేసుకున్న లత
"మన తాతయ్య -- అమ్మమ్మలాగా ఒక అద్భుతమైన జీవితం అందరికీ దొరుకుతుందా...ఏమిటి?
దాని గురించి చెప్పాను" అన్నది.
"సరి,
సరి...ఎక్కువగా ఐస్ పెట్టకు. నేనొక కొత్త వంటకం చేశాను. ఈ పాటికి
రెడీ అయి ఉంటుంది" అంటూ వంట గదిలోకి తీసుకు వెళ్ళాడు కిరణ్.
అతను జీడిపప్పు
కట్లెట్ ను పళ్ళేంలో వరుసుగా పెట్టగా, లత టీ గిన్నెను స్టౌవ్ మీద పెట్టింది. తోటలోని బెంచి మీద
శోఖమైన ముఖంతో కూర్చున్న లత దగ్గరకు వచ్చిన కిరణ్ "ఏమిటి నీ సమస్య?
ఎందుకు నీ మొహం డల్ గా ఉంది?" అని విచారించాడు.
"ప్చ్...ఏమీ
లేదు"
"చెబితేనే కదా
దానికి ఒక పరిహారం దొరుకుతుంది"
"అది తీరని
సమస్య"
"నువ్వు విశాల్
దగ్గర మాట్లాడలేదా?"
"ఎలా
కిరణ్?
నేనుగా వెళ్ళి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పేది?"
"నీకొసం
నేను మాట్లాడనా?"
"వద్దు...వద్దు"
అర్జెంటుగా నిరాకరించింది. ఇతనితో మాట్లాడినందుకే ఆ పరిస్థితుల్లో నిలబడ్డాడు.
ఇతన్ని అవమాన పరిస్తే...?
"కరెక్టే.
ఇది మనసుకు సంబంధించిన విషయం. సరిగ్గా చెప్పలేకపోతే అంతా వేస్టే అయిపోతుంది"
అన్న అతను "ఆలొచిద్దాం లతా. నువ్వు దేని గురించి బాధ పడకు. ప్రేమ ఎంత
కఠినమైందో అనేది నిన్ను చూసిన తరువాతే అర్ధమైంది" అని చెప్పి --ఆమెను సమాధాన
పరచటానికి ప్రయత్నించాడు.
"అలాగా?"
అన్న లత, "లేదు...ఎవరో తన ప్రేమికురాలు
కోసం నాలుగు గంటలు మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్ధన చేసినట్టు విన్నాను"
అన్నది.
"వదులు...వదులు.
ఇది అంత గట్టిగా మాట్లాడుకునే సమాచారమా? ప్రేమలో ఇదంతా సహజం అమ్మా" అన్నాడు
కిరణ్ నవ్వుతూ.
"వరుణ్ ఎప్పుడు
బయలుదేరుతున్నాడు?"
లత అడగంగానే
"ఒక మంచి ఆలొచన" అన్న కిరణ్ " వరుణ్ ఇంకో నాలుగు రోజుల్లో
బయలుదేరుతా నన్నాడు. ఆ రోజు పెట్టుకుందాం క్లైమాక్స్"
"ఏం చెబుతున్నారు?"
"నీ
ప్రేమికుడు నీ మీద పెట్టుకున్న ప్రేమ గురించి అతని నోటి వెంటే చెప్పటానికి ఒక
పధకం"
"అర్ధం
కాలేదు"
"అంతా
అర్ధమవుతుంది. నేను చెప్పినట్టు నడుచుకుంటే చాలు" అన్నవాడు, లత చూసిన చూపుకు "మరీ చండాలంగా
ఉందో...ఏం చేయను? జీవితమంటే నాలుగూ ఉంటాయి కదా. వాటిని
అనుసరించే వెళ్ళాలి" అన్నాడు పెద్ద జ్ఞానిలాగా.
"జాగ్రత్తగా
వెళ్ళిరామ్మా" అన్నది గౌరి, చేతిలో ట్రావల్ బ్యాగుతో
నిలబడున్న లతతో.
బట్టలు
సర్దుకుంటున్న లత "నేనేమన్నా చిన్న పిల్లనా పిన్నీ? కిరణ్, వరుణ్ తోడు
ఉన్నారుగా! వాళ్ళ పెద్దవాళ్ళు ఆల్రెడీ ఢిల్లీ వచ్చాశారు. తాజ్ మహాల్, రెడ్ ఫోర్ట్ అంటూ రెండు రోజులు ఊరంతా తిరిగి చూసి, వరుణ్
కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి తిరిగి రాబోతాను" అన్నది.
ఉత్సాహంగా
బయలుదేరుతున్న లతను కోపంగా చూస్తూ నిలబడ్డాడు విశాల్.
'ఆ రోజు నాతో
రావటానికి నిరాకరించిన లత, ఈ రోజు ఇంత హుషారుగా
బయలుదేరుతోందే!' కోపం
తలకెక్కింది.
కన్న తల్లి దగ్గర
దొరకని ప్రేమను, అభిమానాన్ని తన
మనసుకు నచ్చిన లత దగ్గర పొందవచ్చునని ఆశపడ్డ అతనికి లత తనని ఉదాసీన పరచటం బలమైన
దెబ్బగా అయ్యింది. ఆ నొప్పిలో అతనిలో ఉన్న మంచి గుణాలు అనిగిపోయి, చెడ్డ గుణాలైన పగ, కసి, కోపం
చోటు చేసుకున్నాయి.
అతనికే తెలియని
కొత్త విశాల్ ఉదయించాడు.
“వెళ్ళి త్వరగా పడుకో
లతా. ప్రొద్దున్నే బయలుదేరాలి" అన్నది గౌరి.
"అలాగే
పిన్నీ"
"విమానాశ్రయం
వరకు విశాల్ ని రమ్మననా?"
"వద్దు.
పిలుచుకు వెళ్ళటానికి కిరణ్ వస్తున్నాడు"
"సరే".....
గౌరి తన గదిలోకి వెళ్ళింది.
లత వంటింట్లోకి
వెళ్ళి పాల గ్లాసు తీసుకుని విశాల్ గదికి వెళ్ళింది.
మంటెక్కుతున్న
మనసును చల్లార్చటానికి తన ల్యాప్ టాప్ లో మునిగిపోయున్న అతనితో "పాలు"
అన్నది.
"పెట్టెళ్ళు"
ఉంచింది. అక్కడి
నుండి వెళ్ళటానికి మనసు రాక అక్కడే నిలబడ్డ లతకు అతనితో మాట్లాడాలని ఆశగా ఉంది.
మాటలు మొదలుపెట్టింది.
“అదొచ్చి...నేను”
అతను కళ్ళు పైకెత్తి
చూశాడు.
ఏం మాట్లాడాలో తెలియక
పోవటంతో మాటలు తడబడ్డాయి “ప్రొద్దున్నే
విమానం...మీకు ముఖ్యమైన పనులేమన్నా ఉన్నయ్యా?” అని అడిగింది.
“ఏం ఎందుకని?
నీకు బాడీ గార్డుగా రావాలా?”
మాటలు కఠినంగా
రావడంతో, లత కళ్ళల్లో నీళ్ళు తిరిగినై.
"నీకు ఏం
కావాలి?" అన్నాడు...మరింత కఠినమైన స్వరంతో.
ఆ కఠిన స్వరాన్ని
అర్ధం చేసుకున్న లత ‘నువ్వేరా
కావాలి. నా మనసు నీ కోసం తపించటం, నీ అభిమానం కోసం
ఎదురుచూడటం అర్ధం కాలేదా? ఎన్ని రోజులు నన్ను గుచ్చి గుచ్చి
పొడుస్తావ్. వర్షం జల్లు కోసం ఎదురు చూసే ఎడారి స్థలంలో కొట్టుకుంటున్న నా మనసు
నీకు అర్ధం కాలేదా?’ అని మనసు నలిగిపోగా -- హృదయం ప్రేమను
యాచించ -- అతని హృదయ గూడులో దాక్కున్న కుందేలు లాగా పనితనమూ, మంచి గుణమూ మెల్లగా లేపబడింది. ఆదరణ దొరికిన తల్లి ఒడిలా అతని ప్రేమ మనసు,
"ఎందుకు విడిపోవాలనుకుంటున్నావే నా ప్రాణమే?" అని శోక గీతం పాడగా, హృదయ నరాలను మీటిన స్పర్షతో విసిగిపోయి
నిలబడింది లత.
అప్పుడే అతనిలో ఉన్న
మృగం అతని స్వీయ బుద్దిని తినడం మొదలు
పెట్టింది. విపరీత డిషేషన్ తీసుకున్నాడు విశాల్.
**********************************************************PART-16***************************************************
మరుసటి రోజు
ప్రొద్దున లతను పిలవటానికి వెళ్ళిన కిరణ్ కు, వందన ద్వారా తనకి ఒంట్లో బాగుండలేదని కబురు పంపింది. అతను
ఎంత ప్రయత్నించినా చూడటానికి వొప్పుకోలేదు.
కిరణ్ ప్లాను
ఏమిటంటే మొదట లతను విమానాశ్రయం తీసుకు వెళ్ళి వదిలిపెట్టి,
తరువాత ఫోన్ చేసి విశాల్ ను రమ్మని చెప్పి, ఇద్దర్నీ తాజ్ మహాల్ కు తీసుకు వెళ్ళి ప్రేమను వాళ్ళు
ఇద్దరూ ఒకరితో ఒకరు చెప్పుకోవటం అనేది ఏర్పాటు. ఖచ్చితంగా మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో
ఒక మొగాడితో ఉరు తిరగటం ఏ ప్రేమికుడూ ఒప్పుకోడు అనే 'సెంటి మెంటు’ ను నమ్మే ఈ ఏర్పాటు చేశాడు కిరణ్. కానీ,
లతనే ఇలా ప్లానును పాడుచేస్తుందని అతను ఎదురు చూడలేదు.
దగ్గర దగ్గర అరగంట కాచుకున్న కిరణ్, ఆమె పట్టుదలను తలుచుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు.
ఆమె యొక్క నడవడిక
అతనికి పొడుపు కథలా ఉంది -- ఆ పొడుపు కథకు కారణమైన అతనో స్వీయ పరిస్థితిని కోల్పోయి,
వెర్రి చూపులతో పడుకోనున్నాడు. ముందు రోజు రాత్రి జరిగిన
సంఘటనలు కళ్ళ ముందుకు వచ్చి, నేర భావనను ఎక్కువ చేసింది. ఎలా ధైర్యం చేశాడు అలాంటి చేష్టకు?
ఎప్పుడు చూడూ తన శీలాన్ని విమర్శించే అతని దగ్గరే పూర్తిగా
తనని కోల్పోయిన పరిస్థితి! ఇక ఎక్కడికెళ్ళి నిరూపిస్తుంది...తన దయనీయ పరిస్థితిని?
అతని చూపులలోనే కరిగిపోయి తన చూపులలో స్వాగతించింది ఈమే కదా?
ఆ తరువాత తన పరిస్థితిని తెలుసుకుని,
ఎంతో బలంగా పోరాడింది. అన్నీ సుడిగుండలో చిక్కుకున్న పడవలాగా అయిపోయిందే!
మొదట్లో ప్రేమ కోసం
పరితపించి నిలబడ్డది ఈమె తప్పు అయితే, తరువాత జరిగిన దానికంతా బాధ్యుడు అతనే కదా?
ఎన్నో ప్రశ్నలు
ఆమెను వేదించగా...ఆమె కృంగిపోయింది.
లత ఢిల్లీకి వెళ్లక
పోవటానికి కారణం వందన ద్వారా గౌరికి చెప్పబడింది.
ఎదురు చూడకుండా
ఏర్పడిన అనుభవం, చాలా
సేపు షవర్ కింద నిలబడటం కలిపి లత
శరీరాన్ని వేడితే కాలుతున్నట్టు చేసింది. ఆమె ఢిల్లీ వెళ్ళలేదని తెలుసుకున్న
తరువాత ఏ ఆఫీసుకూ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాడు విశాల్. మృగంలాగా నడుచుకున్న తన
పైశాచిక ప్రవర్తనకు పరివర్తనగా లత ఏదైనా విపరీత నిర్ణయం తీసుకుంటుందేమో అన్న
ఆందోళన అతని ప్రశాంతతను కోల్పొయేటట్టు చేసింది.
"లతకి విపరీతమైన
జ్వరం" అని వందన సమాచారం ఇవ్వగానే, ఆమె గదిలోకి వెళ్ళిన
విశాల్ -- దుప్పట్లో దూరి ముడుచుకుని పడుకున్న లతను చూసి అల్లాడిపోయాడు. నేర
భావనతో వణుకుతున్న చేతులతో ఆమెను ముట్టుకుని చూసి, పరిస్థితి
యొక్క తీవ్రతను గ్రహించి ఆమెను హాస్పిటల్ కు ఎత్తుకుని పరిగెత్తేడు. ఆ రోజు నదీ
తీరంలో మైకంలో తన కౌగిలిలో సురక్షితంగా
ఉండిపోయిన ఆమె, ఈ రోజు తన స్ప్రుహనే కోల్పోయిన పరిస్థితుల్లో
కూడా తన దగ్గర నుండి తొలగిపోవాలని కృంగి ముడుచుకున్న లత మనసును అర్ధం చేసుకుని,
హాస్పిటల్ కు తీసుకు వెళ్ళకుండా, గౌరి దగ్గర
ఆమెను అప్పగించటానికి విశాల్ వెళుతున్నప్పుడు, ఆమె మెరుగు
పడి -- మనసులో కొంచం బలం పుంజుకుని, అతని దగ్గర నుండి
జారుకుని నడిచి వెళ్ళిపోయింది. తరువాత ఆమె కనబడలేదు.
చాలాసేపు ఆమెనే వెతికిన విశాల్ కళ్ళు, చివరకు ఆమెకొసం తపించాయి.
రోజులు గడిచిన
కొద్ది -- బాధల యొక్క ఆవేదన, అతని మీద ఏర్పడ్డ విరక్తి కొబ్బరి పీచులాగా ఊడిపోగా మొక్క పోచలో దాగున్న కొత్త పువ్వు వికసించినట్టు లతకు విశాల్ మీద ప్రేమ పుట్టటం
మొదలుపెట్టింది. విశాల్ కోసం లత ఇల్లు మొత్తం వెతికింది. అతని గురించిన ఎటువంటి సమాచారం దొరకక నీరసపడిపోయిన ఆమె మనసు -- నీటి
పారుదలకొసం ఎదురుచూసే చెట్టులాగా అభిమానం, స్పర్శ అంటూ ప్రేమ
ఇచ్చే అన్నీ సుఖాల కోసమూ పరితపించింది.
దగ్గర దగ్గర మూడు
నెలలైనా విశాల్ గురించిన సమాచారం లతకు దొరకలేదు. గౌరి దగ్గర చూచాయగా విచారించినా
ఆమె పట్టించుకున్నట్టు కనబడటం లేదు. ఇంటికి రాని విశాల్,
వాళ్ల షాపుకైనా ఖచ్చితంగా వచ్చి వెడతాడనే నమ్మకంతో సుమారు
రెండు నెలలుగా ప్రొద్దున నుండి సాయంత్రం వరకు తపస్సు చేస్తున్నట్టు రోజూ అక్కడికి వెళ్ళింది. ఒక్క రోజు కాదు కదా,
ఒక్క పూటైనా విశాల్ అక్కడికీ రాలేదు. అన్ని దార్లూ
మూసుకుపోవటంతో విశాల్ ఏదైనా బయటి దేశానికి వెళ్ళుంటాడేమో అనుకున్నది.
ఇంట్లోని ప్రతి చోట,
ప్రతి వస్తువు లోనూ అతని రూపమే కనిపిస్తుంటే --- లతకు
పిచ్చి పట్టినట్టు అనిపించింది. జ్ఞాపకాల
అలలు రోజు ఆమెను చుట్టుముట్టి బలంగా తాకుతుండగా, ఆమె చిక్కి శల్యమైంది.
ఆమె పరిస్థితి యుక్త
వయసులో ఉన్న వందనకు అర్ధమయ్యింది.
"మీ దగ్గర ఒక
విషయం చెప్పాలే లతా”
అన్నది వందన.
"ఏమిటీ?"
అన్నట్టు చూసింది లత.
"సార్,
ఎక్కడున్నారని..." అన్నది.
"నీకు తెలుసా?"
ఆందోళన పడుతూ హడావిడిగా అడిగిన లతను చూడటానికే పాపం అనిపించింది.
"ఒక...ఊహే"
"పరవాలేదు. చెప్పు
వందనా --- ప్లీజ్..."
"టీ
ఎస్టేట్"
"నిజంగానా?
అది ఎక్కడుంది?"
"కొండ
అడవి. ఇక్కడ్నుంచి ఐదు గంటలు ప్రయాణం"
"ఎలా వెళ్ళాలి?"
"సరిగ్గా
తెలియదు....కానీ, అక్కడికి తోడు లేకుండా వెళ్లలేరు అనేది తెలుసు. ఒంటరిగా వెళ్లటం ప్రమాదం.
ఒకవేల అతను బయట దేశాలకు వెళ్ళుండొచ్చు కదా?" అని అన్నది.
ఆ ప్రశ్న లతను అయోమయ
స్థితిలోకి తోసింది. 'అతను సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోతే...?'
"నువ్వు
బాధ పడకు లతా. నాకెందుకో ఆయన ఎస్టేట్ బంగళాలో ఉండుంటాడనే అనిపిస్తోంది.
నువ్వెందుకైనా మీ పిన్ని దగ్గర అడిగి చూడు.
"ఊహూ...పిన్ని
నాతో మాట్లాడటం లేదు"
"సారుకూ, మీకూ ఏదైనా సమస్యా?"
"హూ...! ఏ
రోజు అతను నాతో మొహం చూపించి మంచిగా మాట్లాడాడు...ఒక్క మాటైనా? ప్రేమగా, ఆదరణగా మాట్లాడిందే లేదు!"
ఎప్పుడు చూడూ ఆమె
మీద ద్వేషంతో మాట్లాడే వాడి చుట్టూతానే ఎందుకు ఆమె మనసు చుట్టిందనే రహస్యం ఆమెకే
అర్ధం కాలేదు.
తనని మళ్ళీ మళ్ళీ
అవమానపరచి పోవటానికే ఆ రాత్రి అలా నడుచుకున్నాడో అని కూడా ఆమెకు అనిపించి
ఉండవచ్చు.
"ఒకే ఒక దారి
ఉంది లతా "
"చెప్పు"
"నువ్వు నీ
స్నేహితుడు కిరణ్ దగ్గర సహాయం అడగటం మంచిది"
"అతను ఇక్కడికి
రావటానికి ఇంకా ఒక వారం ఉందే?"
"ఆరునెలలు
కాచుకున్న మీరు ఇంకొక వారం ఓర్పుగా ఉండలేరా ఏమిటి?"
ఆ వారం రోజూలూ, లత ఇరవై నాలుగు గంటలూ ఎదురు చూపుతోనే
గడిపింది.
కిరణ్ వచ్చే రోజును
లెక్క వేసుకుని, వేసుకుని
నీరసపడిన ఆమె, అతను కాలు మోపగానే అతని కాళ్ళను చుట్టేసింది.
"ఉండు...ఎందుకంత
ఆందోళన పడతావు? అతను పోతే పోనీ!
నీకు అతని కంటే మంచివాడు దొరుకుతాడు" అన్నాడు.
అతను పలుసార్లు విశాల్
ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు, ఒక్క రోజు కూడా విశాల్ అతనితో నవ్వుతూ సహజంగా మాట్లాడలేదు. ఎప్పుడూ
చిటపటలాడే మొహంతో ఉండే విశాల్ మీద అతనికి మంచి అభిప్రాయం లేదు.
అలాంటి ఒక జీవి కోసం
ఈమె తాపత్రయ పడటం అతనిలో విసుగు తెప్పించింది.
"ఏం
మాట్లాడుతున్నారు?" కన్నీరుతో అడిగింది.
"అర్ధం చేసుకో లతా.
నేను చెబుతున్నానని కోపగించుకోకు . అతను అందరిలాగా మామూలు మనిషి కాదు"
"కిరణ్"
"అతను
ఎవరితోనైనా సరదాగా మాట్లాడటం ఎప్పుడైనా చూసావా? ఇల్లు, ఆఫీసు, నీ పిన్నీ --
ఇదే అతని ప్రపంచం. ఒక కుటుంబం, దాని అందాలు ఇవన్నీ అతనికి
తెలియదు. నిన్ను పూర్తిగా ఇష్టపడుతుంటే ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళుండేవాడా?
అతన్ని మరిచిపోవటమే మంచిది. ఖచ్చితంగా అతని వలన నిన్ను సంతోషంగా
ఉంచుకోవటం కుదరదు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం గలవారికి, ఆత్మగౌరవాన్ని
తక్కువ అంచనా వేసుకోవటం, మూర్ఖత్వం, అనుమానం
లాంటి చెడ్డ గుణాలు ఉంటాయి. వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటూనే వాళ్ళ నిజ స్వరూపం
తెలుస్తుంది"
"చాలు కిరణ్"
"నిదానంగా
ఆలొచించు. నేను చెప్పేది నిజమని నీకు అర్ధమవుతుంది"
కోపమూ, ఆవేదన ఒకటిగా చేరటంతో సమాధానం చెప్పకుండా
గబగబా వెళ్ళిపోయింది లత.
'ఛ...మూర్ఖురాలు.
అర్ధం చేసుకోదూ, పెట్టదూ' అని విసుగుతో
గొణుకున్న అతను, మనసు అంగీకరించక గౌరిని వెళ్ళి కలిశాడు.
"నేను ఏం
చెప్పను కిరణ్? విశాల్ -
లత ఇద్దరూ నా రెండు కళ్ళు లాంటి వారు. చిన్న వయసులోనే అతనికి ఏర్పడ్డ అనుభవాల వలన ఒకవేల అలా
అయ్యాడో, ఏమో? ఇన్ని రోజులలో అతని
దగ్గర నుండి అభిమానాన్ని తప్ప నేను ఇంకేమీ చూడలేదు. అతనిలో దాగున్న గుణాలను అతను
ఎలా తెలుసుకున్నాడో? ఏమీ అర్ధం కావటం లేదు. ఒక రోజు నా
ఎదురుగా వచ్చి ఏదో పోగొట్టుకున్న వాడిలా నిలబడ్డాడు. అతను అంతలా బాధపడుతూ కృంగిపోయి నిలబడటం నేనెప్పుడూ
చూడలేదు" అన్న గౌరి, పాత రోజులలోని విశాల్ ను కళ్ళ
ముందుకు తెచ్చుకుంది.
"అత్తయ్యా! నేను
లతను ఎంత లోతుగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. కాలమంతా నేను తపస్సు చేసి పొందిన వరం
ఆమె. ఆమెను నేను ఒక పువ్వులాగా చూసుకోవాలి. ఇన్ని రోజులూ ముళ్ళ పొదలాగానే ఉన్నాను.
నాలో ఏదో ఉంది. అన్ని కళలూ పీకిపారేసిన
నేను పూర్తిగా మనిషిని కావాలి. నా మనసులో లోతుగా ఏర్పడిన గాయాలు ఆరాలి. దానికి కొంతకాలం డాక్టర్.రుబాస్ దగ్గర ట్రీట్ మెంట్
తీసుకోవాలి. ఆయన ప్రసిద్ది చెందిన మనోతత్వ నిపుణుడు. నా గురించిన వివరాలేవీ లతకు
తెలియనివ్వకండి. మన ఎస్టేట్ బంగళాలో
ఉంటాను. అమె వలన నేను లేకుండా పోవటం తట్టుకోలేదు. ఆమె పడే వేదనను మీరు నా
కోసం ఒర్చుకోండి! అన్న అతను, నా లతను బాగా చూసుకోండి అత్తయ్యా. నేను కొత్త మనిషిగా...నా లతకు
సరిపోయేవాడిలాగా తిరిగి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
పోయిన వారం అతన్ని
వెళ్ళి చూశాను. యోగా, ద్యానం అంటూ చురుకుగా ఉన్నాడు. కానీ, లత పడుతున్న వేదనను నేను చూడలేక పోతున్నాను. కిరణ్,
'ఇంకా ఒక వారం పోనీ అత్తయ్యా'
అని వాడు చెప్పటం వలన మౌనంగా ఉన్నాను" ఆమె మాట్లాడ,
కిరణ్ మనసులో విశాల్ గొప్ప స్థానం సంపాదించుకున్నాడు.
ఇంతకుపైన ఆమెను
వేధించకూడదు అని అనుకుని, మరుసటి రోజు లతను తీసుకుని, ఎస్టేట్ వాకిట్లో వదిలేసి వచ్చాడు కిరణ్.
**********************************************************PART-17***************************************************
ఉదృతంగా పారుతున్న
ప్రేమతో,
పనివాడు చూపిన గదిలోకి వెళ్ళింది లత. ఎదురుచూసిన అతని
ముఖంలో ఎప్పుడూ అనుచుకోలేని భావనలు. తన ముందు నిలబడ్డ ఆమె చూపులు చూస్తున్నంతసేపూ,
చూస్తూనే ఉన్నాడు విశాల్. మాటల మౌనంతో పోరాటం చేస్తూండగా
కుమిలిపోతున్న ఆమెను ఆదరణగా కౌగిలిలోకి తీసుకున్నాడు. కౌగిలిని సడలించకుండానే
ఆమెను కూర్చోబెట్టాడు.
"ఇక మీదట
నువ్వు ఏడవనే కూడదు లతా" అంటూ ఆమె నుదిటి మీద ముద్దుపెట్టుకున్నాడు.
కన్నీళ్ళూ తడుచుకుని
అతని ముఖాన్ని చూస్తూ "నేనేం పాపం చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేశారు?"
అని అడిగింది.
ఆమెను ప్రేమగా
ఒకసారి చూసి "శిక్ష నీకొక్క దానికే అనుకున్నావా లతా"
"కాదని
తెలుసు...కానీ ఎందుకు...?"
"అంతా
నీ మంచికే...మన భవిష్యత్ జీవితానికే"
"అర్ధం
కాలేదు"
"ఇన్ని రోజులు
నిన్ను పొడుచుకు తిన్నవాడిని ఇలా శాంతంగా ఉన్నానే...అర్ధం కాలేదా"
"ఊ...నమ్మలేకపోతున్నాను.
ఎక్కడ తిట్టి తరిమేస్తారో నని భయపడుతూ వచ్చాను. ఈ మార్పు ఎలా?"
"అంతా
నీ ప్రేమ చేసిన మాయే. జరిగిపోయినవి, జరిగిపోయినట్లుగానే ఉండనీ. ఇక మీదట చేతిలో ఉన్న సుఖాన్ని,
రాబోవు ఆనందాలనూ గురించి మాత్రమే ఆలొచిద్దాం"
అతని మాటలు ఆమె
హృదయానికి హాయిని ఇవ్వగా -- ఇంకా ఎక్కువగా ఆనందపడింది లత.
"ఏయ్! ఇక మీదట
ఏం జరిగినా తప్పు నాది కాదు" అంటూ ఆమె చెవుల దగ్గర గుస గుసలాడ -- చెవి చివర
తగిలిన స్పర్షలో జ్ఞాన రేఖలు ఆమె ముహంలో పోటీ పడటం మొదలు పెట్టినై. అందులో
కరిగిపోయిన విశాల్ "ఇన్ని రోజులు ఎక్కడున్నావే నా ప్రాణమా! నాలో ఉన్న ప్రేమను
నాకు చూపించావే! నేను చూసిన మొదటి స్పర్ష నువ్వు! నీ ప్రేమతో నా భావనలకు ప్రాణం
పోసావు నువ్వు! నా ప్రాణ పుష్పాన్ని మోస్తున్న దానివి నువ్వు!" అన్నాడు
భావావేశంగా.
ఆ రోజు ఒక రోజు
ఒంటరిగా తన గదిలోకి వచ్చినామెను లొంగదీసుకోవటానికి కారణం వుత్త కాంక్షా భావన కాదు,
తనకి దొరకని ఆమె ఇంకెవరికీ దొరక కూడదనే కృర బుద్దితోనే.
అతనిలో దాగున్న వక్ర
బుద్ది,
ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా ముట్టుకునేంత దూరం తీసుకు వచ్చి
వదిలిందే అని తలచుకుని సిగ్గూ, వేదన పడుతూ, బలంగా ఎదిరించి పోరాడినా -- ఆమె తప్పించుకోవటానికి చేసిన
ప్రయత్నం,
దాన్ని జయించలేక లొంగిపోవటాన్ని తలచుకుని ఆశ్చర్యమూ,
వేదనా పడ్డాడు. తీవ్రంగా ప్రేమిస్తున్న ఒక ఆమె వలనే అలాంటి
లొంగుబాటు పరిస్థితిని అంగీకరించగలదు అనేది అతనికి అర్ధం కాక కాదు! మొట్టమొదటి
సారిగా స్త్రీ యొక్క ప్రేమ, స్నేహ సముద్రంలో మునిగిపోయిన అతను తనని తాను అర్ధం చేసుకున్నది అప్పుడే.
తన మనసు పరిపూర్ణత
చెందాలనేది గ్రహించి దాని కోసం చేస్తున్న ప్రయత్నమే -- ఇదిగో ఒక అద్భుతమైన మనిషిగా,
మంచి ప్రేమికుడిగా నిలబడున్నాడు విశాల్.
"విశాల్!... విశాల్!..." ఆమె కూడా కరిగిపోగా -- "నువ్వు ఎలా
ఇక్కడికి వచ్చావు లతా" అని అడిగాడు.
ఎలా చెబుతుంది?
కిరణ్ తో వచ్చేనని
చెబితే కోపగించుకుంటాడే! మంచి భావనలో ఉన్న అతన్ని మళ్ళీ పాత విశాల్ గా మార్చటం
తగునా?......సమాధానమే చెప్పకుండా నిలబడ్డ ఆమె కళ్ళళ్ళో కనబడ్డ భయం....?
జరిగింది అతనికి
చెప్పగా ---
"లతా! నువ్వు
మొదట నన్ను నమ్మాలి. నువ్వు నా దానివేనన్నది తెలుసుకున్న తరువాత నేను నిన్ను ఏ
విధంగానూ నొప్పించను. నా మీద కంటే, నీ మీదే నాకు నమ్మకం ఎక్కువ. పాత విశాల్ ని నువ్వు మర్చిపో"
అన్నాడు సున్నితంగా.
అతను తనకోసం బాధ
పడుతున్నది అర్ధమవగా,
"నా
వల్ల కావటం లేదే! ఏ పరిస్థితిలోనూ నా విశాల్ ని నేను మరిచిపోలేకపోతున్నానే!"
అన్నది బొంగురు పోయిన స్వరంతో.
"నేను మొట్ట
మొదటగా ప్రేమించింది, నన్నే ప్రేమలో కోల్పోయింది అంతా..." అంటూ అంతకుపైన చెప్పలేక తడబడుతూ
నిలబడ్డది లత.
ఒకసారి తన పూవుల బాణం వేసి, నాటకాన్ని ప్రారంభించిన మన్మధుడు మళ్ళీ ఇద్దరి మనసులలోనూ, అదే నాటకాన్ని వేయలేకపోయాడు....భావాలను పెంచే ఆమె స్వాశ గాలిలో తననే మరిచిపోయిన లత, ద