కళ్ళల్లో ఒక వెన్నెల....(పూర్తి నవల)

 

                                                                           కళ్ళల్లో ఒక వెన్నెల                                                                                                                                                      (పూర్తి నవల)

నీ భర్త గురించి ఏదైనా తెలిసిందా?” -- జాలిగా అడిగిన ప్రభుత్వ ఆసుపత్రి నర్స్ వైష్ణవీను చూసి విరక్తిగా నవ్వింది స్వేతా.

ఆయనేమన్నా తప్పి పోయారా ఏమిటి? వదిలేసి పారిపోయినతను...ఎలాగమ్మా కనబడతాడు

ఏమిటీ?”

అతను రాడమ్మా. రానే రాడు. వెనకబడి, వెనకబడి ఇష్టపడ్డాడమ్మా. నేనొక పిచ్చిదాన్ని! వాడు ఇష్టపడింది శరీరాన్ని అని అర్ధం చేసుకోక...నన్ను కన్నవారిని -- తోడబుట్టిన వాళ్ళనూ ఏడిపించి...అతన్ని నమ్మి వచ్చాసాను

ఏమిటి స్వేతా! నీలాంటి అమ్మాయలు తెలిసే ఇలాంటి తప్పు చెయొచ్చా?”

తప్పేనమ్మా! అతని మీదున్న గుడ్డి నమ్మకం, మిగిలిన వాటిని మరిచిపోయేటట్టు  చేసింది. అతనికి నేను విసుగెత్తిపోయాను. వాడుకుని పారేసి వెళ్ళిపోయాడు. నేనిలా కడుపులో భారంతో...జీవించటానికీ దారి తెలియక...చనిపోనూ లేక...మధ్య రోడ్డులో నిలబడున్నాను” -- ఆమె మొహాన్ని మూసుకుని ఏడవటంతో, వైష్ణవీ కళ్ళు చెమ్మగిల్లినై.

నీ భర్తా, నువ్వూ తీసుకున్న ఫోటో ఏదైనా ఉందా?”

పెళ్ళికి ముందు తీసుకున్న ఫోటో ఉన్నదమ్మా

అది కూడా తీసుకురా

ఫోటో అడిగేరేమ్మా. తీసుకు వచ్చాను

ఫోటో...! నీ భర్త ఫోటోనా? ఇవ్వు...చూద్దాం

నాకు తెలిసిన ఒకాయన పోలీసుగా ఉన్నారు. ఆయన దగ్గర ఫోటో ఇచ్చి వెతికించమని చెబుతాను. ఎలాగూ దొరుకుతాడు...భయపడకు

స్వేతాను మొసగించి పారిపోయిన ఆమె భర్తను కనుగొన్నారా? కనుగోనుంటే ఎలా కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు?  ఎందుకు నర్స్ వైష్ణవి స్వేతా భర్తను పట్టుకోవాలని పట్టుబట్టింది? వీటన్నిటికీ సమాధానం నవల సమాధానం ఇస్తుంది.

*****************************************************************************************************

                                                                                             PART-1

మంచి నిద్రలో ఉన్నది వైష్ణవి. తెల్లారటానికి ఇంకా సమయం ఉంది -- పరుపు మీద సుఖంగా నిద్రపోతూ ఉంది. చిన్న చంద్రుడి లాంటి ముఖం. నిద్రలోనూ నవ్వుతూ ఉండి మెరిసే అందమైన ముఖం. నుదుటి వరకు వచ్చున్న తల వెంట్రుకలు గాలికి నాట్యమాడుతూంటే ఆమె మంచం చుట్టూ వాళ్ళంతా నిలబడున్నారు.

ఆమె తోబుట్టువులైన సరోజా, మురళీ, శృతి. వాళ్ళ చేతుల్లో కొన్ని వస్తువులు!

నైట్ లాంప్ ఆఫ్ చేయటం వలన...గది మొత్తం కటిక చీకటి.                     

సరోజా మెల్లగా సనిగింది.

మురళీ! టైమెంత?”

మూడు గంటల పద్నాలుగు నిమిషాలు

రేడియం ముల్లు కలిగిన తన గడియారాన్నే చూస్తూ అతను చెప్పగా, శృతి తొందరపెట్టింది.

లేపేద్దామా?”

ఇంకా రెండు నిమిషాలు ఉంది. ఆగు అన్న అతను, పూర్తిగా రెండు నిమిషాలు అవటంతో గుసగుసమని స్వరం ఇచ్చాడు.

...ఇప్పుడు లేపు! అన్న వెంటనే శృతి ఉత్సహాంతో చీకట్లో తడుముకుంటూ... వైష్ణవి చెవిదగ్గర చేరి రహస్యంగా పిలిచింది.

అక్కా! అక్కా -- చెవిపక్కగా వినబడ్డ సన్నని ధ్వని వలన వైష్ణవి యొక్క నిద్ర చిన్నగా చెదిరింది. చిన్న గొణుగుడితో పక్కకు తిరిగి పడుకుంది. ఇప్పుడు ముగ్గురూ కలిసి పిలవగా గబుక్కున లేచింది.

గది మొత్తం చీకటిగా ఉండగా -- కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. కరెంటు పోయిందా? ఎవరో పిలిచారే!

సరోజా... మురళీ...ఎవర్రా నన్ను లేపింది మెల్లగా పిలుస్తూనే చేతులు చాచి తడమ, తనకు అతి దగ్గరే అగ్గిపుల్ల గీస్తున్న శబ్ధం వినబడింది. ఆశ్చర్యపడుతూ లేచి కూర్చుంది.

చిన్న వెలుతురులో ముగ్గురూ కనబడ, ప్రశాంతంగా తల ఎత్తిన ఆమె మొహం వికసించింది. మురళీ కొవ్వత్తి వెలిగించ...దాన్ని తీసుకుని గుండ్రని ఆకారంలో ఉన్న కేకుమీద గుచ్చింది సరోజా.

హ్యాపీ బర్త్ డే టు యూ. హ్యాపీ బర్త్ డే టు అక్కయ్యా. హ్యాపీ బర్త్ డే టు యూ -- ముగ్గురూ ఒకేసారి పాడగా, నిద్రమత్తు నుండి పూర్తిగా తేరుకుని ఉత్సాహంగా నవ్వింది వైష్ణవి. ఆమె మనసూ జలదరించింది.

ఏమిట్రా ఇదంతా?”

మా అక్కయ్యకు రోజుతో ఇరవై నాలుగు ఏళ్ళ వయసు ముగిసి, ఇరవై ఐదు పుట్టటంతో, మంచి రోజున మేము మా అక్కయ్యను విష్ చేస్తున్నాము -- అని ఒళ్ళు వంచి భవ్యంగా చెప్పిన శృతిని కావలించుకుంది వైష్ణవి.

థ్యాంక్యూ రా. నేను కూడా మరిచిపోయాను... మురళీ లైటు వేయరా

 వేసేసాను అంటూనే స్విచ్ నొక్కాడు మురళీ...గది మొత్తం వెలుతురు వ్యాపించింది. గోడ గడియారాన్ని చూసిన ఆమె విస్తుపోయింది.

ఏమిట్రా ఇది? టైము మూడున్నరే అవుతోంది. అప్పుడే కేకుతో వచ్చారు?”

అక్కా! మూడు గంటల పదహారో నిమిషంలోనే నువ్వు పుట్టావట. అందుకే అదే టైములోనే తీసుకువచ్చాము. ఎలా ఉంది?”

ఇదంతా బాగానే ఉంది. రాత్రి మొత్తం మేలుకుని తెల్లవారింతరువాత కాలేజీకి వెళ్ళి నిద్రపోతావా? ఏయ్! శృతీ! నువ్వూ వీళ్ళతో కలిసి గెంతులేస్తున్నావా? స్కూల్లో నిద్ర వస్తే ఏం చేస్తావే?”

అక్కా! మనందరికీ సెలవు అక్కా!

సెలవా ఎందుకు? రోజు శుక్రవారమే కదా? రోజు ఎందుకు సెలవు?”

మనమే సెలవు పెట్టబోతాము

ఎందుకు?”

నీ పుట్టిన రోజును సరదాగా గడపబోతాము

దెబ్బలు పడతాయి! ఇదేమిటి కొత్త అలవాటు?”

పో అక్కా! ఇన్ని సంవత్సరాలూ నువ్వొకదానివే పనికి వెళ్లావు? అందుకని బర్త్ డే లనుపొదుపుగా ఒక పాయసంతో సెలెబ్రేట్ చేసి ఆనందించాము. ఇప్పుడు నేను కూడా పనికి వెళ్తున్నా కదా -- అన్న సరోజాని కోపంగా చూసింది వైష్ణవి.

దానికి?”

అందుకే...కాస్త పెద్దగా సెలెబ్రేట్ చేద్దామని ఐడియావేశాము

తప్పు! చిన్న విషయానికి సెలవు పెట్టి, చదువు వేస్టు చేయకూడదు. మొదట చదువు. తరువాతే ఇదంతా. సరేనా...

ఏంటక్కా నువ్వు! రోజు లెక్కల పరీక్ష ఉందక్కా. దాన్నుంచి తప్పించుకుందామని చూస్తే... -- అని ముద్దుగా సనిగిన శృతీ యొక్క చెవ్వును నొప్పి పుట్టకుండా మెలేసింది వైష్ణవి.

అల్లరి పిల్లా! లెక్కల్లో వీక్గా ఉన్నావని నిన్ను ట్యూషన్కి కూడా పంపుతుంటే...నువ్వు లేక్కల పరీక్ష రోజే డిమికీకొడుతున్నావా? ముక్కలు చేస్తా

పో అక్కా! నువ్వెప్పుడూ ఇంతే. సరోజక్కా! వచ్చే నెల నీ పుట్టిన రోజు వస్తోంది కదా. అప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాం. సరేనా...?”

దాని గురించి అప్పుడు చూద్దాం. ఇప్పుడు నువ్వు పరీక్షకు చదువు. ...త్వరగా వెళ్ళు...!

మొదట కేకు కట్ చేయక్కా. కొవ్వొత్తి కరిగిపోతోంది

అమ్మా-నాన్నా అందరూ లేవనీరా

రోజు ఎక్కువ పని ఉన్నదని, రాత్రికి ఇంటికి రానని నాన్న ఫోన్ చేసి నిన్న సాయంత్రమే చెప్పేసారు. అమ్మను మేమే లేపాము. బ్రష్ చేసుకుని ఇప్పుడు వచ్చేస్తుంది

ఏమిటి మురళీ! అమ్మనెందుకు ఇలా అర్ధరాత్రి లేపారు? పాపం రా!

అలా బాగా గడ్డిపెట్టమ్మా! గాడిదలు. పెరుగుతున్న కొద్దీ చిన్న పిల్లలు అవుతూ వెళుతున్నారు -- అంటూ చీర కొంగుతో ముఖం అద్దుకుంటూ లోపలకు వచ్చింది తల్లి మేనకా.

ఎంతోకొంత పోయే నిద్రను కూడా భంగం కలిపించిన పరిస్థితిలోనూ ఆమె ముఖం అందంగానూ, కళాకాంతులతోనూ ఉన్నది. చురుకుదనం, వాత్సల్యము నెలకొని ఉన్న నడిచే దేవత. కుటుంబం లోని మొత్త మెంబర్స్ కు, తండ్రి చక్రవర్తి తో కలిపి మేనకా మాత్రమే ఆధారం.

మేనకాకు భర్త, పిల్లలే లోకం. వాళ్ళకు మేనకా మాత్రమే లోకం! తల్లిని చూసిన  వెంటనే మంచం దిగి, పాదాలకు మొక్కింది వైష్ణవి.

ఆశీర్వాదం చెయ్యండమ్మా

మహారాణిగా ఉండరా. పుట్టిన రోజు నువ్వు సంతోషంగా ఉండాలి -- అని కూతురి నుదుటి మీద ముద్దు పెట్టి విష్ చేసింది.

సరి...సరి. త్వరగా వచ్చి కేకు కట్ చేయక్కా

నేనింకా బ్రష్ కూడా చేయలేదే!

నువ్వు బర్త్ డే బేబీవి. బ్రష్ చేసుకోకపోతే తప్పులేదు. రా అక్కా

నాన్న?”

నాన్న రావటానికి రేపు రాత్రి అవుతుంది. లోపు నీ పుట్టిన రోజు అయిపోతుంది

అవునమ్మా! నాన్నకు రెండు రోజులు పూర్తిగా పని ఉందట. నువ్వు కేకు కట్ చేయ్యి. పాపం! ఇంతసేపు మేలుకునే ఉన్నారే. ఆకలేస్తుంది

చూసావా! అమ్మ అంటే అమ్మే. మన ఆకలిని కరెక్టుగా కనిపెట్టేశారు చూడు -- సరోజా తల్లిని మెచ్చుకుంది.

సరి...సరి. అక్కయ్య కేకు కట్ చేయబోతోంది! అందరూ బర్త్ డే పాట పాడండి -- అనగానే, అందరూ చప్పట్లు కొట్టి విష్ చేయ ప్లాస్టిక్కత్తితో కేకు కట్ చేసింది వైష్ణవి.

మురళీ దేన్నో ఒకటి పేల్చ, జిగినా ముక్కలు పూవుల చినుకుల్లాగా ఎగురుతూ గదంతా తేలుతుంటే  -- వైష్ణవి హృదయం జలదరించింది. అందరికీ కేకు  తినిపించ, వాళ్ళూ ఆమెకు తినిపించ--ఆకాశం వెలుతురవటం మొదలుపెట్టింది.

చాలు ఆటలాడింది. వెళ్ళి మీ పనులు చూసుకోండి. అమ్మకు చాలా పనున్నది. వైషూ! నువ్వెళ్ళి మొదట స్నానం చేసిరా! శృతీ! నువెళ్ళి చదువుకో! సరోజా నువ్వు అమ్మకు కొంచం అంట్లు కడిగిపెట్టమ్మా -- అని అందరికీ తలో పని ఇచ్చింది తల్లి మేనకా.

అంటే అన్నయ్యకు మాత్రం పనిలేదా? వాడు మాత్రం మీ ముద్దు బిడ్డా?” -- శృతీ అబద్దమైన కోపంతో అడిగింది.

ఎవరు చెప్పారు? వాడికీ పని ఉన్నది

అమ్మా! -- సనిగాడు మురళీ.

గదిని చెత్త కాగితాలతో నింపింది నువ్వే కదా? నువ్వే గదిని శుభ్రం చెయ్యాలి

హు...మంచి పని అన్న చెల్లి తల మీద చురుక్కున ఒక మొట్టికాయ వేశాడు.

వాగుడుకాయా! నన్ను తగిలించకపోతే నీకు నిద్ర రాదే?”

మురళీ! ఏమిట్రా అక్కడ శబ్ధం?”

ఏం లేదమ్మా! శృతీని...చదువుకోమన్నాను

వైష్ణవీ నవ్వుతూ స్నానాలగదిలోకి వెళ్ళింది. బట్టలు ఉతుక్కుని స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు, నెయ్యి వాసన గుమగుమలాడ, కేసరి తయారవుతూ ఉన్నది.

అమ్మా! కేసరి వాసన నోరూరిస్తోంది

వచ్చాసావా! ఉండు...వస్తున్నా అన్న తల్లి, చెక్క అలమరా తెరిచి ఒక లావుపాటి కవరు తీసి ఇచ్చింది.

ఏంటమ్మా ఇది?”

కొత్త చీర! జాకెట్టు కూడా కుట్టించి ఉంచాను. సరిగ్గా ఉన్నదా...చూడు. చీర కట్టుకుని దీపం వెలిగించి దేవుడుకి దన్నం పెట్టుకో"

థ్యాంక్స్ అమ్మా

అక్కా...ఒక్క నిమిషం అంటూ పరిగెత్తుకు వచ్చింది సరోజా.

ఏమిటే?”

ఇదిగో! ఇది నా బహుమతి  -- అని పార్సల్జాపింది.

ఏమిటే కొన్నావు?” -- ఆత్రంగా అడిగింది.

నీ యూనీఫారం చాలా పాతబడిపోయింది! అందుకే కొత్తది కొన్నాను

ఎందుకే ఇంత ఖర్చు పెడుతున్నావు?”

నాన్న దగ్గర డబ్బు పిండే కొన్నాను

అక్కా! ఇది నా యొక్క చిన్న బహుమతి -- అంటూ ఒక తెల్ల సాక్స్ ను బహుమతిగా ఇచ్చాడు మురళీ. వైష్ణవీ కళ్ళు చెమ్మగిల్లాయి.

నా పాకెట్ మనీతో ఇదే కొనగలిగాను. నాకు ఉద్యోగం దొరికిన తరువాత, నీకు పెద్ద బహుమతి కొనిస్తానక్కా

చాలురా! నువ్వు చెప్పిందే చాలు

అందరూ జరగండి. నేను మా అక్కయ్యకి గిఫ్ట్ ఇవ్వద్దా?” -- అంటూ మిగిలిన వారిని పక్కకు తోస్తూ ముందుకు వచ్చిన శృతీని చూసి ఎగతాలిగా నవ్వాడు మురళీ.

అబ్బో! పెద్ద బహుమతా... సంవత్సరం ఏమిటో? రబ్బర్...చేతి రుమాలా?”

నేనేమీ నీలాగా పిసినారి కాదు. నా అక్కయ్యకు కొత్త లంచ్ బాక్స్కొన్నాను. ఇందాక్కా...నచ్చిందా?” అంటూ ఆమె జాపిన బాక్సును ఆతృతతో తీసుకున్నది వైష్ణవీ.

వావ్! నేనే కొత్తగా ఒకటి కొనుక్కోవాలనుకున్నాను. పాత దాంట్లో గిన్నెల మధ్య రబ్బర్ తెగిపోయింది

అందుకేక్కా. అమ్మా, నేనూ వెళ్ళి కొనుకొచ్చాము

సరేమ్మా! పనికి టైమవుతోంది. అందరూ త్వరగా టిఫిన్ తినడానికి రండి. వైషూ...!

ఏంటమ్మా?”

నువ్వు తినేసి, వెళ్ళే దోవలో నాన్నకు భోజనం క్యారియర్ ఇచ్చేస్తావా?”

సరేమ్మా!

త్వరగా తల దువ్వుకుని రా! నేను క్యారేజీ రెడీ చేస్తాను

సరేమ్మా!

అలాగే ఫ్రిడ్జ్ లో పువ్వులు ఉన్నాయి. అందరూ పెట్టుకోండి. లంచ్ కిపెరుగన్నం పెట్టేయనా?”

సరేమ్మా అని అందరి దగ్గర నుండి ఒకేసారి జవాబు రాగానే, మేనకా వంట గదిలోకి వెళ్ళింది -- నలుగురూ హడావిడిగా తమ పనులకు బయలుదేరారు.

డ్రస్సు మార్చుకుని, తల దువ్వుకుని, అమ్మ ఇచ్చిన పువ్వులు పెట్టుకొని నాలుగు ఇడ్లీలు తినేసి శృతీ, మురళీ సైకిల్ వెనుక సీటులో కూర్చోగా ఇద్దరూ స్కూలుకు బయలుదేరారు. సరోజా తొందరపడుతూ, తన టీచర్ పనికి బయలుదేరి వెళ్ళింది. చివరగా వైష్ణవీ రెడీ అయ్యింది.

వైషూ! ఇది నీ లంచ్ బాక్స్. క్యారియర్ నాన్నకు. మర్చిపోకుండా తినమని చెప్పు

సరేమ్మా

బస్సుకు చిల్లర ఉందా?”

ఉందమ్మా. వెళ్ళొస్తా అంటూ తన హ్యాండ్ బ్యాగులో లంచ్ బాక్స్ ను పెట్టుకుని, హ్యాండు బ్యాగును భుజాలకు తగిలించుకుని, తండ్రి క్యారేజీ బుట్టను చేతిలోకి తీసుకుని బస్ స్టాండ్ వైపుకు నడవటం మొదలుపెట్టింది.

తండ్రి ఉండుంటే ఆయన తన టూ వీలర్ వాహనం మీద నన్ను తీసుకు వెళ్ళి వదిలిపెట్టి, తరువాత తన ఆఫీసుకు వెళ్తారు. రోజు తండ్రి .టీ చేస్తునందువలన, తనకు ఈ రోజు బస్సు ప్రయాణం

ఆమె బస్ స్టాండు కు వంద మీటర్ల దూరంలో వస్తున్నప్పుడు, ఎక్కువ గుంపుతో వస్తోంది ఆ బస్సు…వచ్చే బస్సు, బస్ స్టాండులో ఆగలేదు!... తరువాతి బస్సునైనా పట్టుకోవాలి.

 వెళ్ళే దోవలో ఒక స్టాపింగ్ ముందే దిగి, తండ్రికి క్యారేజీ ఇచ్చేసి, తొమ్మిది గంటలలోపు హాస్పిటల్లోకి వెళ్ళిపోవాలి. నడక వేగం పెంచింది.

నడుస్తున్నప్పుడే తన చుట్టూ ఏదో హడావిడి కనబడ, చూపులను తిప్పింది. తన ఎదురుగా వస్తున్న వారి చూపులో భయం కనబడ, తానూ అయొమయంలో వెనక్కి తిరిగింది.

దబదబమనే శబ్ధంతో ఆయస పడుతూ ఒకడు పరిగెత్తుకు వస్తుండగా -- నలుగురైదుగురు మగవాళ్ళు అతన్ని తరుముకుంటూ వస్తున్నారు.

ఏదైనా పోట్లాటా?’ -- వైష్ణవీ ఒళ్ళు వణకటం మొదలయ్యింది.   

***************************************************PART-2******************************************

బరువైన దేహంతో, గుండు కొట్టించుకున్న తలతో ఎత్తుగా పరిగెత్తుకు వస్తున్న అతన్ని -- తరుముకొస్తున్న వాళ్ళలోని ఒకడు వైష్ణవీని చూసి అరిచాడు.

మ్యాడం! వాడ్ని పట్టుకోండి...వాడ్ని పట్టుకోండి! హలో...బ్లూ చీరా! అతన్ని పట్టుకోండి -- గంభీరమైన స్వరంతో అతను అరుస్తూ పరిగెత్తి వస్తుంటే, ఆమె ఎక్కువ ఆశ్చర్యపోయింది.

బ్లూ చీరా? నాకే చెబుతున్నాడా? ఎవరతను? ఎందుకని వీడ్ని తరుముతున్నారు? రౌడీ గుంపుతో నన్నూ కలిపేస్తారు లాగుందే!

హలో...మిమ్మల్నే. పట్టుకోండి! లేకపోతే అతన్ని కిందకు తొసేయండి...ప్లీజ్!

వైష్ణవీ భయంతో -- ముందు పరిగెత్తుకొస్తున్న అతన్ని చూసింది. అత్యంత వేగంగా పరిగెడుతున్నాడు అతను. జింకను తరుముతున్న చిరుతపులి పరుగు కాదు అది. చిరుతపులి దగ్గర నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి భయంతో పరిగెడుతున్న జింక పరుగు.

వీడ్ని పట్టుకోవాలా? ఒకవేల వీడ్ని చంపటానికి తరుముతున్నారా? ఒక ప్రాణం పోవటానికి మనమెందుకు కారణంగా ఉండాలి? మాట్లాడకుండా వెళ్ళిపోదాం’ -- అనుకుని తిరిగిన క్షణంలో అది జరిగింది.

దొమ్అంటూ ఆమె కుడి భుజంపై బలంగా డాష్ కొట్టాడు అతను. డాష్ కొట్టిన వేగంలో వైష్ణవీ కుడి చేతిలో ఉన్న క్యారేజీ బుట్ట దూరంగా వెళ్ళి పడిపోయి చెల్లా చెదురయ్యింది. హఠాత్తుగా డాష్ కొట్టిన షాక్ లో - వేగంలో బ్యాలన్స్ తప్పింది.

బొంగరంలాగా ఒక చుట్టు చుట్టి, బ్యాలన్స్ పోయి, కింద పడిపోతున్నప్పుడు, ఒక మగవాడి బలమైన చెయ్యి ఆమెను పట్టుకుని ఆపింది.

ఏం జరిగిందని ఆమె తెలుసుకునే లోపు, అదే గంభీర స్వరం మళ్ళీ వినబడింది.

హలో! మీకు ఏం కాలేదే...?”

స్వరానికి సొంతమైన అతని ఇనుములాంటి చేయి తనని పట్టుకున్నదని తెలుసుకుని బెదిరి, అతని దగ్గర నుండి తన చేతిని విడిపించుకుని నిలబడ్డది. అతన్ని చూసింది.

తనని డాష్ కొట్టినతను చాలా దూరం వెళ్ళిపోయున్నాడు. అతన్ని ఇప్పుడు ఏడెనిమిది మందున్న గుంపు తరుముతోంది. తన దగ్గర నిలబడున్న అతను కూడా అతన్ని పట్టుకోవాలనే పరుగుకు రెడీ అవుతూనే అడిగాడు.

మ్యామ్! మీకేం కాలేదే!

లేదు

సరే...మీ వస్తువులన్నీ కింద పడున్నాయి చూడండి. అవి తీసుకోండి -- అంటూనే అతను వదిలిపెట్టిన పరుగును మొదలుపెట్టాడు. వైష్ణవీ కోపంతో అతన్ని తిట్టింది.

రౌడీ వెధవలు. వీళ్ళ రౌడీ తనానికి హద్దే లేకుండా పోయింది. పోలీసు వాళ్ళంతా ఏం చేస్తున్నారో -- ఆమె పెద్ద స్వరంతో తిట్టగా, పరిగెత్తిన అతను ఆయాసంతో నిలబడి తిరిగాడు.

వైష్ణవీ ఒళ్ళు బలంగా వణికింది. భయంతో ఎంగిలి మింగుతూనే అతన్ని చూసింది.

ఒక్క క్షణం...ఒకే క్షణం...ఆమెను చూసేసి, అతి చిన్న నవ్వు పారేసి, తన బలాన్నంత కూడగట్టుకుని మళ్ళీ పరిగెత్తటం మొదలు పెట్టడు.

అతడు తన కళ్ల నుండి తప్పి పోగా, కొంచం ప్రశాంతతో కిందకు చూసింది. పొద్దున తల్లి తొందరపడి -- ఆశగా వండిన కేసరీ, ఇడ్లీలూ, అన్నమూ చిందరవందరగా పడున్నాయి. కళ్ళల్లో నీరు నిండింది.

ఇది నాన్న కోసం ఇచ్చిన లంచ్ అయ్యిందే!బయట తింటే ఒంటికి పడదనే కారణంగా, ఆయన ఎక్కువ సమయం పనిచేయవలసిన రోజులలో లంచ్, టిఫిన్ తానే తీసుకువెళ్ళి ఇస్తుంది వైష్ణవీ.

మనసు మండుతుంటే, వొంగుని పాత్రలు సేకరిస్తుంటే కుడి భుజం బాగా నొప్పి పుట్టింది. ఇనుములాగా ఢీ కొట్టాడే...ఆంబోతు! పక్కనుండి వెళ్ళుండచ్చు కదా?’ మనసులో శపించుకుంటూ ఎడం చేత్తో -- నొప్పి పుడుతున్న చోటును నొక్కుకుంది.

అరెరే...భోజనమంతా చిందిపోయిందే! ఏమ్మా, ఇది లంచ్ భోజనమా?” -- రోడ్డు మీద నిలబడ్డవారు అడగ, తల ఊపింది. అవును.

మీ ఇల్లు ఎక్కడమ్మా?”

ఇక్కడే పక్కనే...

అయితే ఇంటికి వెళ్ళి వేరే భోజనం తీసుకు వెళ్ళమ్మా అన్నారు ఒకరు.  

కాలం చెడిపోయిందమ్మా! రోజుల్లో ఆడవాళ్ళు పట్టపగలు కూడా తిరగలేకపోతున్నారు

కరెక్టే! బండ వెధవ ఎలా ఢీ కొట్టి వెళ్తున్నాడో చూశారా?”

మంచి కాలం...ఇంకో రౌడీ వెధవ పట్టుకున్నాడు. లేకపోతే అమ్మాయి రోడ్డు మీద పడుండేది

భోజనం పోతేపోయింది...వదులమ్మా. నీకేం జరగలేదు కదా! అంతవరకు సంతోషం -- ఒక్కొక్కరూగా వోదార్పు మాటలు చెప్పగా, మౌనంగా ఇంటివైపు నడవటం మొదలుపెట్టింది.

మంచికాలం... బండోడు పడిపోకుండా పట్టుకున్నాడు

అతను పట్టుకున్న ఎడం చేయి చురుక్కు, చురుక్కు మంటోంది. చూపులు న్యాచురల్ గా చోటికి వెళ్ళగా, ఎడం మోచేతికి కొంచం కింద అతను పట్టుకున్న చోటు కొంచంగా కందిపోయుంది.

మూర్ఖపు పట్టు...ఇనుప చేతులు! ఖచ్చితంగా అతనొక రౌడీనే. ఛఛ! పుట్టిన రోజు నాడు రౌడీ ముఖాన్ని చూడవలసి వచ్చిందే!’ -- మనసులో అతన్ని తిట్టుకుంటూ ఇల్లు చేరుకుంది.

తల్లి దగ్గర పూర్తి వివరం చెబితే భయపడుతుందని కాలు స్లిప్ అవటం వలన భోజనం బుట్ట కిందపడిందీ అని చెప్పి అమ్మను నమ్మించింది.

మేనకా ఆందోళనచెంది కూతురి నుదుటి మీద కొంచంగా విభూది రాసి -- తలమీద కూడా కొంచం జల్లింది. క్యారేజీ గిన్నెలు తోమి, మళ్ళీ భోజనం నింపి, సాగనంప...

పరుగులాంటి నడకతో బస్సు ఎక్కి - జనం గుంపులో చిక్కుకుని  - నలిగి కంపెనీకి వెళ్ళి భోజనం క్యారేజీ ఇచ్చింది.

తండ్రి దగ్గర నిలబడి మాట్లాడే సమయంలేక ఆయసపడుతూ పరిగెత్తి, పరిగెత్తి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి లోపలకు వెళ్ళినప్పుడు టైము పదిన్నర అయిపొయింది.

ఆగకుండా పరిగెత్తి, తాము దుస్తులు మార్చుకునే గదికి చేరుకుని, అలమారులో ఉన్న తన తెల్ల దుస్తులను తీసుకుని, తన వస్తువులను అందులో పెట్టి తాళం వేసి, తెల్ల దుస్తుల నర్స్ డ్రస్సుతో, జడను గుండ్రంగా చుట్టుకుంటున్నప్పుడు ఆమె సహ ఉద్యోగి సంధ్యా నర్స్ వచ్చింది.

ఏమిటి సిస్టర్...ఇంత ఆలస్యం చేశారు?”

సారీ సంధ్యా! వచ్చే దారిలో ఒక చిన్న ప్రమాదం...అందుకే ఆలస్యమైపోయింది -- మాట్లాడుతూ వార్డులోకి వచ్చింది.

ప్రమాదమా...దెబ్బ తగిలిందా?”

లేదు. చిన్నగా తగిలింది. చీఫ్ డాక్టర్ వచ్చారా?”

మీకు మంచి టైము. ఇంకా రాలేదు. రిజిస్టర్ లో సంతకంపెట్టండి

థ్యాంక్యూ సంధ్యా! నావల్ల నీకే శ్రమ. నేను తొమ్మిదింటికి రావలసింది అంటూ డాక్టర్ రూములోకి వెళ్ళి అటెండన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టింది.

సరే, సంధ్యా! ఇక నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు

సరే సిస్టర్! పేషంట్ల పేర్లు ఇందులో రాసుంచాను

సరే

సిస్టర్! లోపల డ్రస్సింగ్ రూములో ఒక పేషెంటు ఉన్నాడు. కాలుకి దెబ్బ తగిలింది. కట్టు వేయండి. ఇంజెక్షన్ వేసేసాను

సరే, నేను చూసుకుంటా. నువ్వెళ్ళిరా. నా వలనే నీకు ఆలస్యమయ్యింది. సారీమ్మా

పరవాలేదు సిస్టర్! రోజు పుట్టిన రోజు అని చెప్పారే! గుడికి వెళ్ళొచ్చారా?”

లేదు. సాయంకాలం వెళతా. నేను ఎప్పుడూలాగానే కరెక్టు టైముకు ఇంట్లొంచి బయలుదేరాను. వచ్చే దారిలో కొంతమంది రౌడీలు, రోడ్డు మీద గొడవపడ్డారు. ఒకడ్ని ఏడెనిమిదిమంది తరుముకు వెళ్ళారు. అందులో ఒకడు నన్ను ఢీకొట్టి తొసేసి వెళ్ళిపోయాడు

అయ్యో! తరువాత...?”

భోజనం అంతా రోడ్డు మీద పడిపోయి వేస్ట్ అయిపోయింది. తిరిగి ఇంటికి వెళ్ళి భోజనం కట్టించుకుని, నాన్న దగ్గర ఇచ్చేసి రావటానికి ఆలస్యమయ్యింది

పరవాలేదు సిస్టర్! ఎప్పుడూ పావుతక్కువ తొమ్మిదింటికల్లా వచ్చేస్తారు. రోజు రాకపోయేసరికి లీవుతీసుకున్నారేమో అనుకున్నా

లేదు...లేదు. చెప్పకుండా ఎప్పుడూ లీవు తీసుకోను

హ్యాపీ బర్త్ డే సిస్టర్ -- సంధ్య, వైష్ణవీ చేతులు పుచ్చుకుని షేక్ హ్యాండ్ ఇస్తే...నవ్వుతూ చిన్నగా మొహాన్ని చిన్న బుచ్చుకుంది వైష్ణవీ.

థాంక్యూ...సిస్టర్!

ఒక ఆంబోతు వచ్చి డాష్ ఇవ్వటంతో భుజం దగ్గర చాలా నొప్పిగా ఉంది. ఇంకో ఆంబోతు నన్ను కింద పడకుండా పట్టుకున్న చోట కూడా నొప్పి పుడుతోంది.

నొప్పి ఇంజేక్షన్ వేయనా సిస్టర్?”

వద్దు. నువ్వు బయలుదేరు. నేను ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటా. అవును! పేషెంట్ ఎక్కడున్నారు?”

ఇదిగో...ఇక్కడే -- గదికి మధ్యగా వేయబడున్న పచ్చ రంగు తెరను చూపించింది సంధ్యా.

అయ్యయ్యో! పేషెంటును ఉంచుకునే ఇంతసేపు మాట్లాడుతున్నామా? నువెళ్ళు. నేను చూసుకుంటాను అంటూ ఆమెను బయటకు పంపించి, మందులున్న ట్రే తో తెరను పక్కకులాగి లోపలకు వెళ్ళిన ఆమె బలంగా అదిరిపడ్డది.

ఆసుపత్రిలో పేషెంట్లను పరీక్షించే బెడ్ మీద కూర్చుని, కుడి కాలును మాత్రం జాపుకోనున్నాడు అతను. అతను -- పొద్దున ఆమె చేతిని పుచ్చుకుని ఆమెను కింద పడకుండా ఆపినతను.

వైష్ణవీకి ఒళ్ళు చెమటలు పట్టింది. అయ్యో! ఇతనా? వీడ్నిపెట్టుకునా వీడి గురించి మాట్లాడాము? ఏం చెబుతాడో? భగవంతుడా! డాక్టర్ కూడా ఇంకా రాలేదే! వీడి దగ్గర ఒంటరిగా వచ్చి చిక్కుకుపోయామే!

అశ్విన్ యొక్క మొహమే వికసించింది. పొద్దున చూసిన బూరగదూది చేతులకు సొంతమైనదా ఈమె? ఎంత మెత్తన? చిన్న పిల్ల యొక్క లేత చేతులను ముట్టుకున్నట్టు జలదరించిందే!

మళ్ళీ ఆమెను చూడటంతో అతని మనసు కుతూహలం చెందింది. చేతిలో మందులతో ఆమె భయపడుతూ నిలబడున్న అవతారం, మరింత ఎక్కువ నవ్వును తెప్పించ...చిన్నగా నవ్వాడు.

హలో! నన్ను చూస్తే, రౌడీలాగానా ఉన్నాను?” -- అతను అదే గంభీర స్వరంతో అడగ, ఆందోళనతో కాదన్నది.

లే...లేదే!

మరి? ఇప్పుడు సిస్టర్ దగ్గర ఏం చెప్పారు?”

పొంచి వినటం తప్పు

అది అవతలి వారు మాట్లాడే రహస్యమైతేనే! మీరు లౌడ్ స్పీకర్ లేకుండానే లౌడ్ స్పీకర్ లాగా ప్రచారం చేసారే! దీన్ని దాక్కుని దొంగతనంగా వినాలా?”

అది...నేను మీ గురించి మాట్లాడలేదు

వేరే ఎవరి గురించి? ! మీ మీద డాష్ కొట్టిన  -- ఆంబోతు గురించి మాట్లాడారా?”

....

దెబ్బ బాగా తగిలిందో?” -- అన్న అతన్ని కోపంగా చూసింది.

అదంతా ఏమీ లేదు. మీకు ఎక్కడ గాయం?”

అతని బరువు నూట ఇరవై కిలోలు. అతను డాష్ కొడితే నొప్పి పుట్టకుండానా ఉంటుంది? మర్చిపోకుండా మందు వేసుకోండి -- అతను సహజంగా మాట్లాడ...భయమూ, తడబాటూ తగ్గిపోగా...మందుతో వెళ్ళింది.

ఏం గాయం సార్...చూపించండి... -- మందులను టేబుల్ మీద ఉంచి, దూది ముక్కతో అతని దగ్గరకు జరగ, కుడి కాలు జాపాడు. ప్యాంటును కొంచంగా మడతపెట్టుకుని...మొకాలుకు దగ్గరగా చర్మం గోక్కు పోయి ఉండగా, నెత్తురు గడ్డకట్టింది.

అరె...ఎలా ఏర్పడింది?” -- ఆమె ఆందోళన చెందటం ఎంజాయ్ చేసాడు.

రోడ్డు మీద పడటంతో దెబ్బ తగిలింది

పడిపోయారా? అరెరె! గాయం బాగా లోతుగా ఉండేట్టు ఉందే! అంటూ ఒక చేతితో అతని కాలు పుచ్చుకుని, దూదితో గాయాన్ని శుభ్ర పరిచింది

ష్...

కాలును కదపకండి. కొంచం నొప్పిగానే ఉంటుంది. ఓర్చుకోండి

... -- నవ్వుతూ తల ఊపాడు.

ఇప్పుడు మందు రాయబోతాను. మంటపుడుతుంది. ఇక్కడ చూడకండి

సరి అన్న అతను, ఆమె ముఖాన్నే చూసాడు. లేతగానూ, దయతో కలిపిన  తెల్లటి ముఖం. ఆమె ట్రీట్ మెంట్ చేసిన విధమూ, మాట్లాడిన విధమూ చూసి ఆనందించాడు.

నెమలి ఈకతో రాస్తున్నట్టు...మంచు బిందువులు జల్లుతున్నట్టు ఉండటంతో...అతను మైమరచి ఆనందసాగరంలోకి వెళ్ళిపోయుండటంతో... వైష్ణవీ మందురాసి, గాయానికి కట్టుకడుతూ అడిగింది.

ఏం సార్...ఎవరతను?”

ఎవరు?”

అతనే...ఒకడ్ని తరుముకుంటూ వెళ్ళేరే?”

అతనా? అతను ఒక హంతకుడు, దొంగ

దొంగా? అలాగైతే మీరు పోలీసా --- దొంగా--పోలీసూ ఆట ఆడుతున్నారా?”

ఏమిటి ఎగతాళా?”

మరి? మీరు చెప్పేది అలాగే ఉంది?”

ఎందుకని? నన్ను చూస్తే పొలీసు లాగా తెలియటం లేదా?” -- అతను అడగ, ఎగతాళిగా నవ్వింది.

తెల్ల చొక్కా, నీలి రంగు జీన్స్ మీ పోలీసు యూనీఫారమా?”

హలో! పోలీసులంటే ఎప్పుడూ కాకీ డ్రస్సు వేసుకునే ఉండాలా! మేమంతా కలర్డ్రస్సు వేసుకోకూడదా?” -- అశ్విన్ సీరియస్ గా అడగ, అప్పుడే అమె అతన్ని నెమ్మదిగా చూసింది.

మిలటరీ పోలీసు కట్టింగ్ క్రాఫు’, లిమిట్ గా కత్తిరించుకున్న మీసాలూ. క్లీన్ సేవ్ తో ముఖం తలతలలాడుతోంది. దృఢమైన శరీరం. కూర్చున్న పొజిషన్ లోనూ నిటారు రూపం. గట్టి కండరాలు. సరాసరి మనిషి కంటే కొంచం ఎక్కువ ఎత్తు. కళ్ళల్లో షార్ప్ నెస్.

భయంగా లేచింది. ఆమె కళ్ళల్లో కనబడ్డ బెరుకుతనం చూసి కళ్ళు పెద్దవి చేసి అడిగాడు అశ్విన్.

నమ్మకం వచ్చిందా?”

సార్...! మీరు...నిజంగానే పోలీసా?”

ఇంకా నమ్మలేదా?”

లేదు సార్! నేను...నిజమైన పోలీసుని...ఇంతవరకు ఇంత దగ్గరగా చూడలేదు. సినిమాలోనే చూసాను. అదే...

సరే! నన్ను బాగా చూసుకోండి

ఏమిటీ?”

దగ్గరగా చూడలేదన్నారుగా...?”

ఎక్స్ క్యూజ్ మి సార్ అనే భవ్యమైన స్వరం వినబడటంతో ఆమె వెనక్కి తిరిగింది. కాకీ దుస్తుల్లో కొంచం పెద్ద మీసాలతో కానిస్టేబుల్ ఒకరు నిలబడున్నారు.

చెప్పండి రమణా! వాడేం చెబుతున్నాడు?”   

ఆడమనిషి తాళి చైన్ వాడి దగ్గరే ఉన్నది సార్. తీసుకున్నాము. వాడిప్పుడు లాక్-అప్ లోనే ఉన్నాడు

ఆడమనిషి దగ్గర చైన్ ఇచ్చేసారా?”

ఇంకా లేదు సార్! మీరు వస్తే స్టేట్ మెంట్ రాసేసి...

ఇదిగో వస్తున్నా అంటూనే ప్యాంటుతో గాయాన్ని మూసి అశ్విన్ కిందకు దిగాడు. హడావిడిపడుతూ ఆయన్ని ఆపింది వైష్ణవీ.

అయ్యో! కాలు కిందపెట్టకండిఇప్పుడే కదా కట్టువేసింది. డాక్టర్ వచ్చిన తరువాత చూపించి...

ఏమండీ! ఇది ఒక మామూలు గాయం. దీనికి ట్రీట్ మెంటే ఎక్కువ. నాకు చాలా పనుంది. వెళ్ళిరానా...?”

జాగ్రత్తగా చూసి వెళ్ళండి అంటూ ఆయనతోనే వెళ్ళింది. పోలీసతను వేగంగా బయటకు వెళ్ళి పోలీసు వాహనంలో ఎక్కి బండిని తీయ, వాకిటి వరకు వెళ్ళినతను వెనక్కి తిరిగాడు. నిలబడి సంకోచంతో ఆమెను చూసాడు.

హలో మ్యాడం

చెప్పండి సార్

ఇప్పుడు నేను పోలీసని...

నమ్ముతున్నా సార్

మంచిది. నా పేరు అశ్విన్. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్

...

మీ పేరు ఏమిటని చెప్పనే లేదు!

నా పేరు... వైష్ణవీ

వావ్...బాగా సూటైన పేరు. మీ అభిమానమైన చికిత్సకు థ్యాంక్స్... తరువాత మీకు నా బర్త్ డే గ్రీటింగ్స్

... ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది.

చాన్స్ దొరికితే మళ్ళీ కలుసుకుందాం. బై...బై అంటూ అతను వ్యానులోకి ఎక్కి, కూర్చుని, చెయ్యూప -- వాహనం బయలుదేరింది.

వైష్ణవీ వాకిలిలోనే కదలకుండా నిలబడింది.  

***************************************************PART-3******************************************

పెద్ద పొట్టతో తన ముందు కూర్చోనున్న ఆమెకు బ్లడ్ ప్రషర్ పరీక్షిస్తోంది వైష్ణవీ. ఏటో చూస్తూ కూర్చోనుంది ఆమె. కళ్ళు నీరసించి పోయుండగా  -- ఎండిపోయిన దేహమూ, విచారంతో ఉన్న ఆమె ముఖంఆమెను చూడటానికి మనసు బాధపడింది.

స్వేతా!

అమ్మా...

నీ భర్త గురించి ఏదైనా తెలిసిందా?” -- జాలిగా అడిగిన వైష్ణవీను చూసి విరక్తిగా నవ్వింది ఆమె.

ఆయనేమన్నా తప్పి పోయారా ఏమిటి? వదిలేసి పారిపోయినతను...ఎలాగమ్మా కనబడతాడు

ఏమిటీ?”

అతను రాడమ్మా. రానే రాడు. వెనకబడి, వెనకబడి ఇష్టపడ్డాడమ్మా. నేనొక పిచ్చిదాన్ని! వాడు ఇష్టపడింది శరీరాన్ని అని అర్ధం చేసుకోక...నన్ను కన్నవారిని -- తోడబుట్టిన వాళ్ళనూ ఏడిపించి...అతన్ని నమ్మి వచ్చాసాను

ఏమిటి స్వేతా! నీలాంటి అమ్మాయలు తెలిసే ఇలాంటి తప్పు చెయొచ్చా?”

తప్పేనమ్మా! అతని మీదున్న గుడ్డి నమ్మకం, మిగిలిన వాటిని మరిచిపోయేటట్టు  చేసింది. అతనికి నేను విసుగెత్తిపోయాను. వాడుకుని పారేసి వెళ్ళిపోయాడు. నేనిలా కడుపులో భారంతో...జీవించటానికీ దారి తెలియక...చనిపోనూ లేక...మధ్య రోడ్డులో నిలబడున్నాను -- ఆమె మొహాన్ని మూసుకుని ఏడవటంతో, వైష్ణవీ కళ్ళు చెమ్మగిల్లినై.

స్వేతా ముఖాన్ని జాలిగా ముట్టుకుంది. షు! ఏడవకూడదు. ఇలా నువ్వు ఏడిస్తే...అది నీ బిడ్డనే బాధపెడుతుంది. ఏడవకమ్మా

నర్సమ్మా! నాకు...ఒక సహాయం చేస్తారా?”

ఏం చేయాలి...చెప్పు!

దీన్ని ఇకపై...ఏం చేయలేమా అమ్మా?” -- తన కడుపు ముట్టుకుని చూపించి ఆమె అడగ -- తల్లడిల్లిపోయింది వైష్ణవీ.

ఏయ్! ఏమిటా మాటలు?”

నాకు ఇది వద్దమ్మా. ఇది వద్దు

అయ్యో! ఏమిటిది? ఇన్ని రోజులు లేనిది...ఇప్పుడేమిటి...?”

నేను రోజు వస్తాడు...రేపొస్తాడు అని ఏదో నమ్మకంతో కాచుకోనున్నాను.  కానీ... అతను ఇక రాడు

ఏం?”

వాడు...ఇంకో పెళ్ళి చేసుకున్నాడట -- స్వేతా వెక్కి వెక్కి ఏడవగా, ఆశ్చర్యపోయింది వైష్ణవీ.

స్వేతా! ఏం చెబుతున్నావు?”

అవునమ్మా! ఇక మీదట వాడ్ని వెతక కూడదట. పెళ్ళి చేసుకుని, కొత్త భార్యతో వేరే ఊరికి వెళ్ళిపోయాడట

ఇదంతా నీకు చెప్పింది ఎవరు?”

అతని స్నేహితుడు. నా పెళ్ళప్పుడు కూడా అతను ఉన్నాడు

అవునూ! మీ పెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో జరిగింది?”

అక్కడకంతా పిలుచుకు వెళ్లలేదమ్మా. రోడ్డు అంచులో ఉన్న వినాయకుడి గుడిలోకి తీసుకు వెళ్ళి తాళి కట్టాడు

ఏమిటి స్వేతా...ఇలానా మోసపోయేది?”

లేదమ్మా! నేనూ అడిగాను. దానికి అతను చెప్పాడు ఇంట్లో అన్నయ్యను ఉంచుకుని నేను పెళ్ళి చేసుకుని వెళ్ళి నిలబడితే మనల్ని ఎలా ఇంట్లో చేరుస్తారు? అందుకని అన్నయ్యకు పెళ్ళి జరిగేంతవరకు ఓర్చుకో. తరువాత ఇంట్లో చెప్పి, ఊరంతా పిలిచి గొప్పగా పెళ్ళి చేసుకుందాంఅని చెప్పాడు

ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకు పెళ్ళి జరిగిందా?”

తెలీదమ్మా! ఇతను వెళ్ళిపోయి నాలుగు నెలలు దాటిందమ్మా

నర్సమ్మా! చాలా సేపటి నుంచి కూర్చోనున్నాం? సూది వేసి పంపమ్మా -- గదికి బయట నుండి మాట వినబడ, స్వేతాకి వేయాల్సిన టీకాను తీసింది వైష్ణవీ.

చీరను కిందకు దించు స్వేతా! సూదివేయాలి అంటూ మందు నింపుకుని దూదితో వచ్చింది. సూది వేసి దూదితో నొక్కింది.

ఇలా చూడు స్వేతా! అనవసరమైన ఆలొచనలతో నీ మనసును పాడుచేసుకోకు. ఇప్పుడు మాట్లాడటానికి నాకు టైము లేదు. వచ్చే బుధవారం మళ్ళీ చెక్ అప్ కు రా. మాట్లాడదాం...సరేనా?”

దీన్ని ఏమీ చేయలేమామ్మా?”

ఇప్పుడు ఏడోనెల. బిడ్డ పూర్తి రూపం వచ్చేసింది. ఇప్పుడుపోయి...ఇలా అడగొచ్చా? ఇది నీ బిడ్డ స్వేతా

చండాలుడి విత్తనమేమ్మా

నీ రక్తం, ప్రాణం కలిపి పుట్టబోయే బిడ్డ! నీకు లాగానే ఉంటుంది

వద్దమ్మా! నాకులాగా మోసపోయే గుణంతో పుట్టి, కష్టపడకూడదు. నా కష్టం నాతోనే పోనీ. ఇది నాకు వద్దు

సరే...సరే. ఏడవకు. ఇప్పుడింటికెళ్ళు. వచ్చేవారం ఒక పన్నెండు గంటలకు రా. సావకాసంగా మాట్లాడుకుందాం

సరేనమ్మా

తరువాత....నీ భర్తా, నువ్వూ తీసుకున్న ఫోటో ఏదైనా ఉందా?”

పెళ్ళికి ముందు తీసుకున్న ఫోటో ఉన్నదమ్మా

అది కూడా తీసుకురా

దేనికమ్మా?”

నేనూ తెలిసిన చోట వెతుకుతాను

ఇక ఇప్పుడు వెతికి ప్రయోజనం ఏంటమ్మా?”

మొదట వాడు దొరకనీ. తరువాత ఏం చేయాలని ఆలొచిద్దాం. మర్చిపోకుండా ఫోటో తీసుకురా

సరేనమ్మా -- చీరను సరిచేసుకుంటూ స్వేతా బయటకు వెళ్ళిపోగా తన పనిలో లీనమైపోయింది వైష్ణవీ. లంచ్ టైము వరకు కూర్చోటానికి కూడా  సమయంలేనంతగా పని.

ఎంతోమంది పేషెంట్లు...రకరకాల వ్యాధులు! పిల్లలూ, పెద్దవాళ్ళూ, మగవాళ్ళూ, ఆడవాళ్ళూ అంటూ ఎవరినీ వదిలిపెట్టని వ్యాధులు.

పేషంట్లతోనూ, మందు -- మాత్రలతోనూ పొర్లి, మధ్యాహ్నం రెండు గంటలకు పైన రెస్టు దొరికింది...కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కుని లంచ్ బాక్స్ తీసుకున్నప్పుడు, మేడ మీద నుండి ఇద్దరు నర్సులు పరిగెత్తుకు వచ్చారు.

సిస్టర్! డాక్టర్  వెళ్ళిపోయారా?”

ఇప్పుడే వెళ్ళారు. ఏమైంది?”

నిన్న సాయంత్రం ఒకమ్మాయికి బిడ్డ పుట్టిందే. పేషంట్ పేరు కూడా  కామాక్షి

అవును! ఆమెకేమిటిప్పుడు?”

బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది

ఏమిటీ?” -- హడావిడిగా లేచింది వైష్ణవీ.

అవును సిస్టర్! బాత్ రూముకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళి, రెండు గంటలయ్యింది. తిరిగి రాలేదు. బిడ్డ బాగా ఏడుస్తోంది సిస్టర్

భగవంతుడా -- లంచ్ ను అలాగే పెట్టేసి, మేడపైకి పరిగెత్తింది. మొదటి అంతస్తు పూర్తిగా ప్రసూతి వార్డు. కొత్తగా భూమి మీదకు వచ్చి దిగిన చిన్న జీవులు తల్లి ఒడులలోనూ, చేతులలోనూ సుఖంగా ఒదిగుంటే... ఒక్క బిడ్డ మాత్రం కొట్టుకుంటోంది. ఏడ్చి, ఏడ్చి గొంతు ఎండిపోవటం వలన స్వరం పూర్తిగా సన్నబోయింది.

ఒళ్ళూ, మనసూ కంపించ పరిగెత్తుకు వెళ్ళి బిడ్డను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుంది వైష్ణవీ. పుట్టి ఒకరోజు కూడా అవని లేత బిడ్డ. బరువు చాలా తక్కువగా ఉన్న బిడ్డ కొమ్మలు, కొమ్మలుగా ఉన్న కాళ్ళనూ, చేతులనూ ఆడిస్తూ అది ఏడుస్తున్న విధం గుండెను పిండేసింది.

ఏమ్మా! అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది? ఏదైనా చెప్పి వెళ్ళిందా?” -- దగ్గరున్న మహిళ దగ్గర అడిగింది.

బాత్ రూమ్వెళ్తున్నానమ్మా అని చెప్పింది. రానేలేదు. పాపం! బిడ్డ ఒక గంటసేపటి నుండి ఏడుస్తోంది

ఏమిటీ...ఒక గంటసేపటి నుంచా? అయ్యో! గొంతు ఎండి పోయుంటుందే...ఏమ్మా! ఎవరైనా ఒకళ్ళు బిడ్డకు పాలివ్వండమ్మా -- అన్న వెంటనే వార్డు మొత్తం గప్ చిప్.

ఒకళ్ళ దగ్గర నుండీ సమాధానం లేదు

ముప్పై తల్లులు ఉండీ, ఒక్కరూ పాలు ఇవ్వాటానికి ముందుకు రాలేదు. బిడ్డ అరుపులు మాత్రం వినబడుతూ ఉండటంతో, బాధగా లేచింది.

దగ్గర నిలబడ్డ మరో నర్సును పిలిచింది. గాయిత్రీ సిస్టర్! మెడికల్స్ కు వెళ్ళి ఒక పాల డబ్బా కొనుక్కురండి...త్వరగా

నర్సమ్మా! బిడ్డను ఇలా ఇవ్వండి అన్న స్వరం వచ్చిన దిక్కు వైపు తిరిగింది. నేల తుడిచే పనిమనిషి నిలబడుంది.

మంగమ్మా...

పాల డబ్బా కొనుకొచ్చి, అది కలిపి ఇచ్చేలోపు, బిడ్డకు శ్వాస అడ్డుపడుతుంది. ఇవ్వండమ్మా! నేనూ బిడ్డను కన్న దానినేగా?” -- అన్న మనిషి దగ్గర నీరు నిండిన కళ్ళతో బిడ్డను జాపింది.

మంగమ్మ నేలమీద కూర్చుని బిడ్డ ఆకలితీర్చ, ఖాలీగా ఉన్న మంచం మీద కూర్చుని నెత్తిమీద చేతులు పెట్టుకుంది వైష్ణవీ. కళ్ళవెంట ధారగా కన్నీరు.

గత రెండేళ్ళలో ఇది పదిహేడో బిడ్డ. అదెలా? పదినెలలు మోసి, విపరీతమైన నెప్పులు భరిస్తూ కని, ఇలా అనాధలాగా పడేసి వెళ్ళిపోతున్నారు? ఎలా కుదురుతోంది వీళ్ళ వల్ల..?’

బిడ్డ భాగ్యం లేదేనని బాధపడి, వ్రతాలు ఉండి గుడులూ, గోపురాలు చుట్టూ తిరుగుతున్న వాళ్ళ కడుపును పండించటం లేదు దేవుడు!

కానీ, కన్న బిడ్డలనే చెత్త కుప్పలాగా ఎత్తి పారేస్తున్న వారికేమో అడగకుండానే ఇస్తున్నాడే! ఇది ఏం న్యాయం?

కొద్ది క్షణాల సుఖానికి బానిసైపోయి, తప్పు దోవలో వెళ్ళి దానికైన గుర్తును అనాధలాగా ఏడిపించి వదిలేసి వెళ్ళిపోతున్నారే! పుట్టింది ఆడపిల్ల అని వెళ్ళిపోయిందా? లేక ఆమె చేసిన తప్పుకు సాక్ష్యం దొరకకూడదని తప్పించుకు పోతున్నారా?

ఎందుకని పారిపోయావు అమ్మాయ్! మీలాంటి అమ్మాయల వలన మహిళా జాతే తల వంచుకుంటోందే!

ఆడవారే దేవుడంటూ, ఓర్పులో భూదేవి అంటూ చెబుతారే! మరి రోజు ఎందుకింత దుఃఖము, వ్యథ? ఇక బిడ్డ గతి? ఎప్పుడూ లాగానే ఆశ్రమంలో అప్పగించబడుతుంది.

స్వయం కట్టుబాటు లేని ఆడదానికీ, నయవంచక మగవాడికి పుట్టిందనే ఒక కారణం కోసం...జీవితాంతం బిడ్డ అనాధ అనే బిరుదు మోసుకుంటూ జీవించే కావాలి.

దీనివల్ల మనసుగాయపడ్డ ఎందరు బిడ్డలు నేరస్తులుగా మారారో? వాళ్ళ మనో పరిస్థితి చెడిపోతుందే? దీన్నెందుకు ఎవరూ ఆలొచించరు?’

నర్సమ్మా! ఇదిగోండి -- మంగమ్మ జాపిన బిడ్డను చేతులు వణక తీసుకుంది. ఎక్కువసేపు ఏడ్చిన అలసటతో - కడుపు నిండిన తృప్తితో -- బద్రతైన చేతొల్లో ఉన్నామనే నమ్మకంతో -- బిడ్డ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది.

మధ్య మధ్య బిడ్డ ఎద చిన్నగా వెక్కటంతో, అది ఎంతసేపు ఏడ్చిందో నన్నది గుర్తుకు వచ్చి మళ్ళీ కన్నీళ్ళూ పెట్టుకుంది వైష్ణవీ.

ఇంతలో ఛీఫ్ డాక్టర్ కు సమాచారం అందింది. ఆయన ద్వారా మామూలుగా వచ్చే పోలీసు శాఖ, అనాధ ఆశ్రమ నిర్వాహి వచ్చే చేరినా, బిడ్డను తన ఒడిలో నుండి దింపనే లేదు వైష్ణవీ.  

ఎప్పుడూ చేసే విచారణ పూర్తి చేసారు. కొన్ని కాగితాలలో సంతకం పెట్టి -- పోలీసు అధికారితో, అనాధ ఆశ్రమం యొక్క మహిళ వైష్ణవీ దగ్గరగా వచ్చారు.

ఎక్స్ క్యూజ్ మి సిస్టర్!

... -- చటుక్కున తల ఎత్తింది. కళ్ళల్లో నీళ్ళతో నిలబడ్డ ఆమెను ఆశ్చర్యంగా చూసాడు ఇన్స్పెక్టర్ అశ్విన్.

అతన్ని మళ్ళీ చూడటంతో తుల్లిపడి మంచం నుండి కిందకు దిగింది వైష్ణవీ.

ఏమైంది? ఎందుకు ఇంత కన్నీరు?” -- సన్నటి స్వరంతో అతను అడగ, జవాబు చెప్పలేక చేతిలో ఉన్న బిడ్డను చూపింది.

పుట్టిన కొద్ది నిమిషాలే అయిన బిడ్డను చూసి అతని మొహమూ వాడిపోయింది. తాను అనాధ అయిపోయాను అనేది తెలియక...చేతులను గట్టిగా మూసుకుని బిడ్డ నిద్రపోతున్న విధం అతని గుండెను అదిమింది.

గబుక్కున నిట్టూర్పు విడుస్తూనే కళ్ళతో సైగ చేసాడు.

మ్యేడం! బిడ్డను తీసుకోండి

ఎస్ సార్! ఇవ్వండి సిస్టర్ -- మహిళ చేతులు జాప, నిరాకరించు మనసుతో చేతిలో ఉన్న బిడ్డను చూసింది. కళ్ళల్లో నీళ్ళు తిరగ పెదాలను కరుచుకుంటూ తనని తాను కట్టుబరచుకుంది.

నుదిటి మీద మెల్లగా ఒక ముద్దు పెట్టి, బిడ్డను ఇచ్చింది. మనసు నొప్పి పుట్టింది. గట్టిగా ఏడవాలనిపించింది.

ఎవరినీ తలెత్తి చూడకుండా వేగంగా బయటకు వచ్చి బయటవైపున్న రెస్ట్ రూముకు వెళ్ళి తలుపు వేసుకుంది.

ఆమె చేష్టలను చూసీ చూడనట్లు మామూలు ఫార్మాలిటీస్ ముగించుకుని, డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని, బయటకు వచ్చాడు అశ్విన్.

బయటకు వస్తున్నప్పుడు రెస్టు రూములో నుండి వైష్ణవీ ఏడుపు వినబడింది.

శబ్ధంలో అతని మనసు కూడా నొప్పి పుట్టింది.

***************************************************PART-4******************************************

తల్లి ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తున్నది వైష్ణవీ. కూతురి తల మీద చేయిపెట్టి ఓదారుస్తోంది తల్లి మేనకా.

వైష్ణవీ! ఏమిటమ్మా ఇది...పసిపిల్లలాగా?”

కుదరటంలేదమ్మా! పసిబిడ్డ ఏడుపును నేను మరిచిపోలేకపోతున్నాను. ఇంకా నా చెవిలో ఏడుపు శబ్ధం వినబడుతూనే ఉంది

బిడ్డకు అలా రాసిపెట్టాడు దేవుడు. మనం ఏం చేయగలం?”

అవన్నీ మనుషులు చేసిన తప్పమ్మా. దీన్ని దేవుడి మీద నెపంగా వేయకూడదు

సరే, అమ్మాయికి ఏం కష్టమో? ఎలాంటి పరిస్థితిలో కన్నదో...?”

ఎలాంటి పరిస్థితి అయితే ఏంటమ్మా? కన్న బిడ్డను ఇలా అనాధలాగ పడేసి వెళ్ళటానికి ఆమెకు మనసెలా వచ్చింది...ఇది పాపం కాదా?”

వైష్ణవీ పక్కనే కూర్చున్న సరోజా అందుకుంది.

పాపమే అక్కా! రోజూ ఇలాంటి పాప కార్యాలు జరుగుతున్నాయి కాబట్టే అక్కడక్కడ సునామీలూ, భూకంపాలూ వస్తున్నాయి. దీనికంతా ఏడిస్తే రోజూ ఏడుస్తూ ఉండాల్సిందే

నా మనసు చల్లబడలేదు సరోజా! ఇప్పుడు తలచుకుంటే కూడా...

తలచుకోకు అక్కా! హాస్పిటల్ సమస్యను అక్కడే వదిలేసి ఇంటికి రా. లేకపోతే ప్రశాంతత పోతుంది

ఇందుకే నర్స్ ఉద్యోగమే వద్దని చెప్పాను. నువ్వే సేవ చేసే పని. ఇందులో దొరికే హాయి, మనశ్శాంతీ వెరే దేంట్లోనూ దొరకదుఅని చెప్పి, పట్టుబట్టి చేరావు

ఇప్పుడు చూడు! నెలలో పదిరోజులు ఇలా ఏదో ఒక కేసు గురించి ఏడుస్తూ, తినకుండా పస్తుంటావు. వైషూ! మెత్తని మనసు ఉండొచ్చు. ఇలా అన్నిటికీ ఏడవకూడదురా

సారీమ్మా! నేనూ ధైర్యంగానే ఉన్నాను. కొన్ని సమయాలలో నాకే తెలియకుండా...

ఏమక్కా! నర్సు ఉద్యోగానికే నువ్వు ఇలా అయితే, నువ్వొక డాక్టర్ గానో...పోలీసుగానో అయ్యుంటే ఏం జరుగుంటుందో?” సరోజా ఎగతాలిగా అడగగా, గబుక్కున లేచి కూర్చుంది వైష్ణవీ.

ఏం?”

ఎందుకా? ప్రతి రోజూ ఎన్నో ప్రమాదాలూ, హత్యలూ, దోపిడీలూ అంటూ ఎంతో రక్తం చూడవలసి వస్తుంది? దానికంతా ఎంత మనోబలం కావాలో తెలుసా?”

వైష్ణవీకి అనుకోకుండా అశ్విన్ జ్ఞాపకం వచ్చింది. అతనూ బిడ్డను చూసి బాధపడ్డాడు. అది అతని మొహంలో క్లియర్ గా కనబడింది. కానీ, అతను తనలాగా ఏడవలేదే! అతి సులభంగా మనసును దృఢ పరుచుకుని, డ్యూటీ బాధ్యతలో దిగిపోయాడే...

అదేనా ధైర్యం? అది నా దగ్గర లేదా? అతనికి ఇలాంటి కన్నీరు, నష్టము అలవాటు అయిపోయుండచ్చు. నేనూ అలవాటు చేసుకోవలసిందే!

దీనికొసం భయపడి నేను ఏడ్చి -- అమ్మను బాధపెట్టించవచ్చా? అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవద్దా?’ -- కళ్ళు తుడుచుకుంది.

ఏమ్మా...డిన్నర్ కు వస్తావా?”

నువెళ్ళమ్మా! నేను మొహం కడుక్కుని వస్తాను

సరోజా...నువ్వురా! అందరూ తినేస్తే, నా పని పూర్తవుతుంది

ఇదిగో వస్తున్నానమ్మా అన్న వెంటనే, కూతురి గదిలో నుండి బయటకు వచ్చింది మేనకా. హాలులో కూర్చుని టీవీలో న్యూస్ చూస్తున్న చక్రవర్తి, భార్యను చూసిన వెంటనే సౌండ్ తగ్గించారు.

ఏం చెబుతోంది నీ కూతురు?”

ఎప్పుడూ జరిగేదే. ఎవత్తో ఒకత్తి ఆడపిల్లను కని అలాగే పడేసి వెళ్ళిపోయిందట. అది తలుచుకుని ఇది ఒకటే ఏడుపు

హు! దీనికి ఎప్పుడు మనసు దృఢ పడుతుందో?”

నేనొకటి చెబితే వింటారా?”

ఏమిటి?”

దానికి ఒక వరుడ్ని చూడండి

ఏమిటి...పెళ్ళి చేసేద్దాం అంటావా?”

అవును...దానికి వయసు ఇరవై ఐదు అవుతోందే! ఇప్పుడు చూస్తేనే కదా సరిగ్గా ఉంటుంది. దాని తరువాత సరోజా పెళ్ళీడుకు వస్తుంది. ఎన్ని రోజులు ఆడపిల్లలను ఇంట్లోనే పెట్టుకోగలం

సరే చూద్దాం

త్వరగా చూడండి! లేకపోతే ఇది ప్రతి విషయాన్నీ చూసి, బాధపడి, ఒళ్ళు పాడుచేసుకుంటుంది. ఇప్పటికే మనసులోనూ, శరీరంలోనూ బలం లేదు. పిరికి పిల్లలా తయారయ్యింది

సరి, సరి! నేను, నాకు తెలిసిన చోట్లలో చెప్పి ఉంచుతాను. దానికి నువ్వు కొంచం బలమైన ఆహారం పెట్టి ఒళ్ళు సరిచెయ్యి

సరేనండీ! టీ.వీ ఆపేసి రండి. డిన్నర్ చేద్దురుగాని

తీసిపెట్టు. వస్తాను" అన్నప్పుడు ముఖం తుడుచుకుంటూ వచ్చింది వైష్ణవీ.

వైషూ! ఇలారా అమ్మాయ్

ఏం నాన్నా?”

ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా ప్రతి విషయానికీ బాధపడుతూ నీ ఒళ్ళు పాడుచేసుకుంటున్నావు?”

సారీ నాన్నా

మనసు ధైర్యంగా పెట్టుకోమ్మా. జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి! వాటన్నిటినీ ఎదుర్కోవద్దా?”

సరే నాన్నా

నీకు ఉద్యోగం నచ్చలేదామ్మా?”

అయ్యో! నచ్చింది నాన్నా. పూర్తి మనసుతోనే ఇది చేస్తున్నాను

మరెందుకు ఇంతలా క్షోబపడుతున్నావు?”

నేనూ మనిషే కదా నాన్నా! ఎంతోమంది పేషంట్లను చూస్తున్నాను. వాళ్ళు నొప్పితో కష్టపడుతున్నప్పుడు, నా మనసు బాధపడుతోంది. కానీ, పసిపాప గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు...నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను

దాని ఏడుపును దాంతో మాట్లాడి సరిచేశాము కదా. మీరెందుకు మళ్ళీ  ప్రారంభిస్తున్నారు?” -- భర్తను మేనకా ముద్దుగా ఖండించటంతో మాటలు ముగింపుకు వచ్చినై.

మరుసటి రోజు పొద్దున ఉత్సాహంగా తయారై, తండ్రి యొక్క టీ వీలర్లో వెళ్ళి ఆసుపత్రి వాకిట్లో దిగినప్పుడు...పోలీసు వాహనం నిలబడుంది.

మనసులో అలజడి మొదలవగా, నాన్నకు చెయ్యి ఊపి బైచెప్పి లోపలకు వస్తున్నప్పుడు...ఎదురుగా యూనీఫారంలో గంభీరంగా వచ్చాడు  అశ్విన్.

డ్రస్సు ఖచ్చితంగా అతనికి సూటయ్యింది. అది అతన్ని ఇంకొంచం గంభీరంగా చూపించింది. అతను తిన్నగా తనవైపు రావడంతో అయిష్టంగానే నవ్వింది.

గుడ్ మార్నింగ్ సార్

వెరి గుడ్ మార్నింగ్ --అతను నవ్వాడు.

ఏమిటి సార్...పొద్దున్నే ఇంత దూరం?”

ఒక చిన్న ఎంక్వయరీ

దేని గురించి?”

నిన్న జరిగిన సంఘటన గురించి...

సార్! అమ్మాయిని కనిపెట్టేసారా?”

లేదు! ఆసుపత్రిలో అమ్మాయి ఇచ్చిన అడ్రస్సు ఫేక్. పేరుకూడా నిజమైన పేరుగా ఉంటుందని నమ్మకం లేదు

అప్పుడు బిడ్డ?”

అది జాగ్రత్తగా ఉంది. ఏమీ సమస్య లేదు

ఆమె మౌనం అయ్యింది.

మిస్. వైష్ణవీ!

సార్

మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది

ఎందుకు సార్?”

ఇంకొకరి కోసం కన్నీరు చిందటం పెద్ద విషయం. అపూర్వం కూడా. కానీ...!

కానీ...

మనసును ఇంత మెత్తగా పెట్టుకోకండి. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మీలాంటి ఆడవాళ్ళు మరికొంచం ఎక్కువ ధైర్యంగా ఉండాలి

...

ఇది సలహా అని అనుకోండి. మీ మీద శ్రద్ధగా తీసుకోండి -- అన్న అతన్ని ఆశ్చర్యంతోనూ, బిడియంతోనూ చూసింది.

తప్పుగా అర్ధం చేసుకోకండి. నిన్న మీరు అంతగా ఏడవటం కష్టం అనిపించింది

అది...నేను...

సరి. నాకు అర్ధమవుతోంది. మీ ఉద్యోగానికి దయాగుణం, జాలిగుణం అవసరమే. అదేలాగా మనో దృఢం కూడా కావాలి

సరే సార్...నాకు పనికి టైమవుతోంది

.కే. వెళ్ళిరండి...నేనూ బయలుదేరతాను -- అతను బయటకు వెళ్ళగా, సన్నటి నవ్వుతో ఆసుపత్రి లోపలకు వెళ్ళింది.

ఎప్పుడూ చేసే పనే. అయినప్పటికీ ఒళ్ళూ, మనసూ బాగా ఉత్సాహంగా వుంది. ఉత్సాహం ముఖంలో కనబడ, సంధ్యా నవ్వుతూ అడిగింది.

ఏం సిస్టర్ చాలా సంతోషంగా ఉన్నారు లాగింది?”

లే...లేదే!

ముఖమంతా ఇంత ప్రకాశవంతంగా ఉందే?”

అలాగా?”

ఎవరు మ్యాడం ఆయన?”

...ఎవరు?”

అదే...మిలటరీ స్టిఫ్ నెస్ తో ఒకాయన వచ్చి వెళ్ళేరే! ఏరియా  ఇన్స్పెక్టరట

అలాగా...నేను చూడలేదే! నాకు తెలియదు

కానీ, ఆయన మీ గురించి అడిగారే?” అన్న ఆమెను ఆశ్చర్యంతో చూసింది.

నన్ను...నా గురించి అడిగారా?”

ఏమడిగారు?”

వైష్ణవీ రాలేదా అని హక్కుగా అడిగారు సిస్టర్

అదా! అది... నిన్న ఒక పేషంటు, బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయిందిగా. దాని గురించి ఎంక్వయరీకి వచ్చుంటారు

దాని గురించి కూడా విచారించారు. కానీ మిమ్మల్నే ఎక్కువసేపు వెతికారు. నేను కూడా మీకు తెలిసినాయన అని అనుకున్నాను

అదంతా ఏమీ లేదు

మనిషి...హీరోలాగా సూపర్ గా ఉన్నారు సిస్టర్...మీరు కూడా చూసారు

నేనా. ఎప్పుడు?”

బయట నిలబడి మాట్లాడటాన్నిచూసుంటుందో?’

అదే...పోయిన వారం మీ పుట్టిన రోజున ఆలస్యంగా వచ్చారు! నేను కూడా, ‘ఆయన కాలుకు గాయం ఏర్పడ్డది. కట్టు వేయండీ అని చెప్పను?”

ప్రశాంతంగా శ్వాస వదిలింది. ! ఆయనా?”

ఆయనే! రోజు మఫ్టీలో వచ్చారు. రోజు కాకీ బట్టలతో టిప్ టాపుగా ఉన్నారు

సరి...సరి! నువ్వు ఇంటికి వెళ్ళద్దూ? ఛీఫ్ డాక్టర్ వస్తే నైట్ డ్యూటీచూసేవాళ్ళకు ఇంకా ఇక్కడ ఏమిటి పని అని అడుగుతారు. బయలుదేరు

అవును! ఆయన వచ్చేలోపు వెళ్ళిపోవాలి. లేకపోతే...అప్పడంలా వేయించేస్తారు. బై...సిస్టర్

బై -- నవ్వుతో వైష్ణవీ తల ఊప, సంధ్యా తన బ్యాగును తీసుకుని బయలుదేరింది.

ఒంటరిగా విడిచి పెట్టటంతో, అశ్విన్ జ్ఞాపకం వచ్చింది. మిమ్మల్నే ఎక్కువసేపు వెతికారు అనే మాటలు చెవులో ఎకోలాగా వినిపించగా, తనలో తాను నవ్వుకుంది.

***************************************************PART-5******************************************

రక్త పరిశోధన కోసం ఒక పేషంటు చేతి నరంలోకి సూది గుచ్చి రక్తం తీస్తునప్పుడు, స్వేతా యొక్క బిడియమైన స్వరం వినబడింది.

నర్సమ్మా! లోపలకు రావచ్చా?”

రా స్వేతా! అన్న వైష్ణవీ, ఇంజెక్షన్ లోకి తగినంత రక్తం వచ్చిన వెంటనే, సూదిని లాగేసి, దూదిపెట్టి నెత్తురు తీసిన చోట నొక్కింది.

దూదిని కొంచంసేపు అలాగే నొక్కి ఉంచుకోండి. మీరెళ్ళి డాక్టర్ను చూడండి. రిపోర్ట్’...డాక్టర్ దగ్గరకు వెడుతుంది

సరేనమ్మా అని ఆయన బయటకు వెళ్ళగా, ఇంజెక్షన్ను జాగ్రత్తగా ఉంచుతూనే పిలిచింది.

రా స్వేతా! కూర్చో. డాక్టర్ను చూసావా?”

ఇప్పుడే వస్తున్నా. తిన్నగా మీ దగ్గరకే వచ్చాను

చెప్పు

ఫోటో అడిగేరేమ్మా. తీసుకు వచ్చాను

ఫోటో...! నీ భర్త ఫోటోనా? ఇవ్వు...చూద్దాం

స్వేతా తన చేతిలో ఉన్న పసుపురంగు సంచి తెరిచి, మందు చీటీతో పెట్టున్న ఫోటొ తీసి జాపింది.

ఇదిగోమ్మా

తీసుకుని చూసింది వైష్ణవీ. సముద్రపు అలల వెనుక కనబడ, చుఢీదారులో ఉన్న స్వేతా భుజం మీద చేతులు వేసుకుని ఫోజు ఇచ్చున్నాడు అతను.

ఎత్తుగా -- నాగరికత దుస్తులతో డబ్బుగల ధోరణితో చాలా నిర్లక్ష్యంగా నిలబడు న్నాడు అతను. ఎటువంటి అలంకారమూ లేకుండా చాలా సింపుల్ గా -- సహజంగా నిలబడున్నది స్వేతా...ఎంత అందం!

ఇది ఎప్పుడు తీసింది?”

ఏడెనిమిది నెలలు ఉంటుందమ్మా అన్న స్వేతాని ఆశ్చర్యంగా చూసింది.

ఒక సంవత్సరం కూడా అవలేదా?” -- ఫోటోను మరొసారి చూసి, ఎదురుగా నిలబడ్డ ఆమెను చూసింది.

కొద్ది నెలలోనె ఎలా మారిపొయిందీ స్వేతా? లావు లావు బుగ్గలు లోపలకు పోయి, ఎముకలు బయటకు వచ్చి, మొహం పీక్కుపోయింది. యుక్త వయసు సొంపులు పలు రోజులు ఏడవటం వలన వాడిపోయున్నాయి. 

నవ్వు కనబడకుండా పారిపోయింది. భవిష్యత్తు గురించిన భయమో, జరుగుతున్న కాలఘట్ట బెదిరింపో ఆమెను నిద్ర పోనివ్వకుండా చెయ్యటం వలన కళ్ళు ప్రకాశవంతం కోల్పోయి లోపలకు పోయున్నాయి.

ఏమిటి స్వేతా? ఇలా గుర్తు తెలియనంతగా మారిపోయావు?”

అందమూ, యౌవనము ఉన్నప్పుడు ఇంకేదీ పెద్దగా తెలియలేదమ్మా. పెళ్ళి అయిన తరువాతే పేదరికం కనబడింది. పస్తులు ఉండి కడుపు మాడినప్పుడు భోజనం యొక్క విలువ తెలిసింది

అంటే...నీ మొగుడు పనికీ వెళ్ళలేదా?”

లేదమ్మా! నా చెవులకున్నవి, మెడలో ఉన్నవి అమ్మి, అద్దె కుంటున్న ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాము. మిగిలిన డబ్బు ఖర్చు అయ్యేంత వరకు కష్టం తెలియలేదు. తరువాత అతని స్నేహితుడు కొన్ని సమయాలలో సహాయం చేశారు

అతని స్నేహితుడు పేరు ఏమిటి?”

పూర్తి పేరు తెలియదమ్మా. కానీ, ఇతను రాధా అని పిలుస్తాడు. మా పెళ్ళికి కూడా ఆయన మాత్రమే వచ్చారు

రాధాకృష్ణ... రాధాకిషన్...ఇలా ఏదైనా ఉంటుందో?”

తెలియదమ్మా

సరి! ఇప్పుడు రాధా ఎక్కడున్నారు? ఆయన ఇల్లు తెలుసా?”

ఇల్లు తెలియదమ్మా. పోయిన వారం ఒకరోజు వచ్చారు. అప్పుడే, ‘నీ భర్తకి పెళ్ళి  అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకా వాడ్ని నమ్ముకుని ఉండకు. కడుపులో బిడ్డతో ఒంటరిగా ఉండి కష్టపడకు. నీ పుట్టింటికి వెళ్ళిపోఅంటూ చెప్పారమ్మా

నువ్వు వెళ్ళావా?”

--- స్వేతా సమాధానం చెప్పకుండా తలవంచుకుంది.

చెప్పు స్వేతా! వెళ్ళావా...లేదా?”

లేదమ్మా

ఎందుకని?”

ఒక నెల రోజులుగా భర్త రాకపోయేటప్పటికి నేను మోసపోయాను అని నాకు తెలిసిపోయిందమ్మా. కడుపులో బిడ్డతో ఎలా వెళ్లాను? కానీ, చుట్టు పక్కలున్న వాళ్ల మాటలు వినలేక మా అమ్మా వాళ్ళింటికి వెళ్ళానమ్మా

ఏం చెప్పారు? నిన్ను చూసిన వెంటనే తిట్టారా? ప్రేమగా మాట్లాడారా?”

లేదమ్మా! మా ఇంట్లో ఎవరూ లేరమ్మా అంటూ ఏడుపు మొదలు పెట్టింది.

ఏం...ఎక్కడకెళ్ళారు?”

నేను పారిపోయిన దుఃఖంతో నాన్న ఉరి వెసుకుని చనిపోయారట

అయ్యో

తరువాత మా అమ్మ, నా తమ్ముడూ--చెల్లెల్ని పిలుచుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారట. ఇప్పుడు ఎక్కడున్నారనేది తెలియదమ్మా -- స్వేతా ఏడుస్తూనే ఉండటంతో, కరిగిపోయింది వైష్ణవీ.

పోయింది! నా యొక్క చెడు పని వల్ల  కుటుంబమే చెదిరిపోయింది -- తల బాదుకుంటూ ఏడ్చింది.

ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? వయసులో మనసును అనిచిపెట్టుకుని జీవించాల్సింది! మనల్ని కన్నవారు మనకు తగిన వాడిని వెతికి తెస్తారని నమ్మి ఓపికగా ఉండుండాలి.

నీ వయసుకు కనబడిన వాళ్ళందరూ సినిమా హీరోలాగానే తెలిసుంటారు. ఇతని మొహం చూస్తేనే తెలుస్తోందే! కలరు కలరుడ్రస్సు వేసుకుని, నీ వెనుక తిరిగేటప్పటికి మోసపోయావు కదూ?”

ఇప్పుడు తెలుస్తోంది. అప్పుడు తెలియలేదమ్మా

కన్నవాళ్ళు కార్చిన కన్నీరే నిన్ను ఇలా కష్టపెడుతోంది స్వేతా! సరే...ఏడవకు. పోతే పోనీ. ఇక జరగటం గురించి చూద్దాం. మొదట ఇతని పేరేమిటి? అది చెప్పు

నాగరాజ్

ఇల్లు ఎక్కడుంది?”

 తెలియదమ్మా

ఏమిటీ...ఇల్లే తెలియదా?”

తెలియదమ్మా. చెప్పిందే లేదు

మరెలా ఇష్టపడ్డావు?”

మా ఇంటి పక్కన ఇతని స్నేహితులు నలుగురైదుగురు ఉంటున్నారు. వాళ్ళతో పాటూ ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. అప్పుడే చూసుకున్నాము, పరిచయం చేసుకున్నాము, స్నేహంగా ఉన్నాము... తరువాత ఒకరోజు పెళ్ళి చేసుకుందాం అనుకున్నాము

పిచ్చిదానా. ఒకడ్ని ఇష్టపడి, ప్రేమించి--వాడి చేతులతో తాళి కూడా కట్టించుకుని -- ఇదిగో ఇప్పుడు...బిడ్డను కూడా మోస్తున్నావు. కానీ వాడి ఇల్లు ఎక్కడో తెలియదు అంటున్నావు! నీలాంటి ఒక మూర్ఖురాలిని ఎవడే మోసం చేయకుండా ఉంటాడు?”

నేను అడిగినప్పుడంతా మాట మార్చేస్తాడు. వాళ్ల తల్లి-తండ్రులు, ఇల్లు -- ఊరు ఏదీ తెలియదమ్మా. ఒక మోటారు సైకిల్ లోనే వస్తాడు. అందులో కూడా ఎర్ర రంగులో కపాల ముఖం వేసుంటాడు

నగరంలో ఎన్నో లక్షల మంది బైకు పెట్టుకున్నారు. గుర్తు పెట్టుకుని ఎలా కనుక్కోగలం?”

ఇంకేదీ నాకు తెలియదమ్మా

అతను నిన్ను తెలివిగా మోసం చేసాడు. నువ్వే మూర్ఖంగా ఇలా వచ్చి నిలబడ్డావు...అమ్మాయలకే ఉండే శాపం. రేపు నీకు బిడ్డపుట్టి నాన్నను అడుగుతుందే! దానికేం సమాధానం చెబుతావు?”

అది అడిగేటప్పుడు నేను ప్రాణాలతో ఉండను

స్వేతా!

ఎప్పుడో చనిపోయుండాలి. కడుపులో బిడ్డను మోస్తూ చావడానికి మనసు రావటం లేదు. అదే...ఇది పుట్టటానికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నాను

ఏయ్! ఏం వాగుతున్నావు?”

ఇప్పుడే ఊరు ఊరంతా చెడుగా మాట్లాడుతున్నారు. ఇది పుట్టిన తరువాత దానికీ అదే అవమానమే కదా జరుగుతుంది?”

అందుకని...?”

నేను కళ్ళు మూసేస్తే, నా బిడ్డ అనాధ అయిపోతుంది. తరువాత అది కాలుజారిన దాని బిడ్డ అని ఎవరూ చెప్పరు. తండ్రి పేరు తెలియని బిడ్డ అని ఎగతాలి చేయరు. అనాధ అనే ఒకే ఒక పేరే...

స్వేతా -- కోపంగా అరిచింది వైష్ణవీ. ఆమె ముఖం కోపంతో ఎర్ర బడింది. స్వేతా కొంచంగా బెదిరిపోయింది.

స్వేతా చూసినంతవరకు వైష్ణవీ నర్సమ్మ ఇలా కోపగించుకున్నదే లేదు. అంతెందుకు...? గట్టిగా కూడా మాట్లాడింది లేదు!

అందువలనే వైష్ణవీ నర్స్ పనిలో ఉన్నప్పుడే చెకింగుకు వస్తుంది స్వేతా. కానీ, రోజు నర్సమ్మ దగ్గర ఇంత కోపం రావటం చూసి వణికిపోయింది.

నర్సమ్మా

నోరు ముయ్యి! నువ్వు చేసిన తెలివితక్కువ పనికి నీ బిడ్డ నేరం మోయాలా?”

“...................”

నువ్వు బుద్ది చెడిపోయి -- నమ్మకూడని వాడ్ని నమ్మి మోసపోయింది తప్పు. దానికి నీ బిడ్డ శిక్ష అనుభవించాలా? కన్నతల్లి లేకుండా ఒక బిడ్డ జీవించటం ఎంత కష్టమో తెలుసా? దీనికి బదులు... బిడ్డ కడుపులో పడిన రోజే చంపేసుండచ్చే?”

అమ్మా! నన్ను మాటలతో చంపకండి. నాకు మాత్రం బిడ్డను అనాధను చేసి వెళ్ళాలని ఆశగా ఉందనుకుంటున్నారా

మరెందుకు నీ నోటి వెంట మాట ఎందుకొచ్చింది?”

నేనేం చేయను? ఇంటి యజమాని ఇల్లు ఎప్పుడు ఖాలీ చేస్తావని అడుగుతున్నారు

ఎందుకు?”

అద్దె ఇవ్వాలే! అతను వెళ్ళిన తరువాత నాకు రాబడి ఎక్కడుందమ్మా? ఇంతవరకు అడ్వాన్స్ డబ్బులో తగ్గించుకుంటూ వచ్చారు. నెల నుండి దానికి కూడా దారిలేదు.

లక్షణంలో నేను బిడ్డను కని ఎక్కడికి వెళ్తాను... బిడ్డ ఆకలికి ఎవరి దగ్గర  చెయ్యి జాపను? నా కానుపును చూడటానికి కూడా ఎవరూ లేరే. నేనేం చేయగలను?” -- స్వేతా గుండెలమీద కొట్టుకుంటూ ఏడవటంతో బెదిరిపోయింది వైష్ణవీ.

ఇదంతా ఎలా ఆలొచించకుండా వదిలేసాను? ఈమె ఆకలికే ఆహారంలేక ఎండిపోతుంటే, తరువాత బిడ్డనెలా పెంచగలదు? ప్రసవం అప్పుడే కదా తల్లి తోడు ఎంత ముఖ్యమనేది తెలుస్తుంది!

ఎవరూ లేకుండా ఈమె ఎలా బిడ్డను కని...భగవంతుడా! ప్రసవంలో ఈమెకు ఏమీ కాకూడదే, ప్రాణాలతో బయటపడాలి! అవసరమైన ఆహారం లేక శరీరం ఎండిపోయి -- అవసరమైనంత ఉదరం లేకుండా ఉందే! మొదట ఈమె ప్రాణాలతో బయటపడాలి.

తరువాత మంచిగా బిడ్డను పెంచాలి. దానికి వీడిని కనిబెట్టాలి. ఇతను ఏలుకోవటానికి ఒప్పుకోకపోతే ఇతని కుటుంబీకుల దగ్గరకు వెళ్ళి వాదించాలి. ఏమైనా సరే! ఇంకొక బిడ్డను మన కళ్ళెదుటే అనాధ అవనివ్వకూడదు

ఖచ్చితమైన నిర్ణయంతో తన హ్యాండ్ బ్యాగు తెరిచింది. జీతం తీసుకున్న డబ్బు కట్టగా ఉంది. అందులో నుండి ఆరు ఐదువందల రూపాయి నోట్లు తీసింది. ఇంకా ఏడుస్తున్న స్వేతా ముఖాన్ని తుడిచింది.

ఏడవకు! పోయిన దాని గురించి ఏడవటం కంటే, ఇక జరగాల్సిన దాని గురించి మాట్లాడదాం

నర్సమ్మా!

నీ ఇంటికి అద్దె ఎంత?”

రెండువేలమ్మా

ఇదిగో! ఇందులో మూడు వేలు ఉంది. మొదట అద్దె ఇచ్చేసి. మిగతా డబ్బుతో  పచారీ సరకులు కొనుక్కో

లేదమ్మా! నాకెందుకు...?”

ఇది నీకు కాదు...నీ బిడ్డకు. ఇక నువ్వు బిడ్డకోసం జీవించే కావాలి

నర్సమ్మా

ఆల్రెడీ ఒళ్ళు బలహీనంగా ఉంది. టైము టైముకూ కరెక్టుగా భోజనం చేస్తేనే డెలివరీసులభంగా అవుతుంది...అర్ధమవుతోందా?”

సరేనమ్మా

ఇక దేని గురించీ బాధపడకు! ఇది నీకు ఏడోనెల. తొమ్మిదో నెల శ్రీమంతం చేయటానికి నీ అత్తగారింట్లో నిన్ను చేర్చటం నాదీ బాధ్యత

అమ్మా! ఇదంతా జరుగుతుందా?”

జరుగుతుంది...జరిపిస్తాను. బిడ్డ పుట్టేటప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవు! నీ చుట్టూ నీ కుటుంబం ఉంటుంది

అమ్మా! అతనికి ఇంకో పెళ్ళి జరిగి...

ఉష్! అది నిజమో...అబద్దమో! నిజంగానే ఉన్నా నీకు వాళ్ళు ఒక దారి చూపే కావాలి కదా! మాట్లాడి చూద్దాం. ఒప్పుకుంటే సరి. లేకపోతే పోలీసుల మూలంగా వెళ్దాం

అయ్యో...పోలీసులా?”

ఎందుకు భయపడతావు? నాకు తెలిసిన ఒకాయన పోలీసుగా ఉన్నారు. ఆయన దగ్గర ఫోటో ఇచ్చి వెతికించమని చెబుతాను. ఎలాగూ దొరుకుతాడు...భయపడకు

ఇదంతా జరుగుతోందో, లేదో! కానీ, మీరు చెప్పేటప్పుడు చాలా ధైర్యంగా ఉందమ్మా

ఇదే ధైర్యంతో ఇంటికి వెళ్ళు. నీ భర్త గురించి ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్పు...ఉద్యోగరీత్యా బయట ఊరు వెళ్ళారని. ఎవరి ముందు పిరికి దానిలా ఏడవకు!

సరేనమ్మా

మనలాంటి అమ్మాయలకు మనోబలం కావాలి. అది ఉంటే దేనినైనా ఎదుర్కోవచ్చు

సరేమ్మా

ఇక మీదట పిచ్చితనంగా నీ జీవితం గురించి ఆలోచించకు, మాట్లాడకు. కరెక్టుగా తిను. మందు--మాత్రలు వేసుకుని రెస్టు తీసుకో. ఎలాంటి సహాయం కావాలన్నా జంకు లేకుండా నన్ను అడుగు

అడుగుతాను నర్సమ్మా. మీరు నా దేవత...కుల దేవత

పెద్ద మాటలు ఎందుకు...పొద్దున తిన్నావా?”

ఇంకా లేదమ్మా

టైము ఒంటిగంట అవుతోంది. ఇలా తినకుండా ఉంటే ఒళ్ళు ఏంకాను? ఒక్క నిమిషం ఉండు -- అన్న వైష్ణవీ, టేబుల్ మీదున్న తన లంచ్ బాక్సును తీసుకు వచ్చింది.

స్వేతా! ఇందులో వెజిటబుల్ పులావ్ ఉంది. మా అమ్మ చేసింది. చాలా రుచిగా ఉంటుంది. తిను

వద్దమ్మా...ఇది మీ భోజనం

ప్చ్...తిను! నేను క్యాంటీన్ లో తింటాను

ఏంటమ్మా మీరు...చెబితే వినండమ్మా

అదుగో కిటికీ దగ్గర కూర్చో. మాట్లాడకుండా తిను. నేను ల్యాబ్ వరకు వెళ్ళొస్తాను

సరేమ్మా సంకోచిస్తూనే తీసుకుంది స్వేతా. ల్యాబుకు తీసుకు వెళ్ళాల్సిన బాటిల్స్ ను సేకరించి బయలుదేరుతున్నప్పుడు, టేబుల్ మీదున్న ఫోటో కంటికి కనబడింది.

మొదట దీన్ని జాగ్రత్త చేయాలి. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు దీన్ని నాలుగైదు ప్రింటులు వేసుకుని వెళ్ళాలి. అప్పుడే మనిషికొకటి ఇవ్వచ్చు

ఫోటోను చూసింది. చాలా నిర్లక్ష్యంగా, నవ్వుతూ ఉన్న నాగరాజ్ ను చూస్తున్నప్పుడు రక్తం వేడెక్కుతోంది. పళ్ళు కొరుక్కుంటూ అతన్ని కోపంగా చూసింది.

***************************************************PART-6******************************************

మేనకా, కూతురు ఇచ్చిన జీతం డబ్బును మళ్ళీ లెక్కపెట్టింది. అయోమయంతో కూతుర్ని చూసింది.

వైషూ

ఏంటమ్మా?”

జీతం తీసుకుంటున్నప్పుడు లెక్కపెట్టి తీసుకున్నావా?”

...మరిచిపోయానమ్మా. నేను కొంచం డబ్బు తీసేనమ్మా

ఏమిటి ఖర్చూ?”

అమ్మా! స్వేతా అని ఒక అమ్మాయి గురించి చెప్పానే. దానికి ఇచ్చానమ్మా. పాపం! ఇంటి అద్దె ఇవ్వలేక...తిండికి కూడా గతిలేక కష్టపడుతున్నదమ్మా

అందుకని మూడువేల రూపాయలా తీసావు?”

పాపం అమ్మా! కడుపుతో ఉంది. ఆకలితో కష్టపడుతోంది. మన వల్ల అయిన సహాయం చెయ్యద్దా?”

అది సరేనక్కా. కానీ... డబ్బు నీ పెళ్ళికొసం చేర్చి పెడుతున్న చీటీ డబ్బులయ్యిందే -- రాత్రి డిన్నర్ కోసం చపాతీలు రెడీ చేస్తున్న చెల్లి సరొజా అడిగింది.

ఎప్పుడో జరగబోయే పెళ్ళికొసం సేవింగ్ చేయటం కంటే, కళ్ళ ఎదుట కష్టపడుతున్న ఒక గర్భవతికి సహాయం చేయటం పెద్ద విషయం కాదా?”

నిజమే. అయినా కానీ...

అమ్మా! ఆమె పాపమమ్మా. ఆమెకు ఎవరూ లేరు. నాతో చాలా ప్రేమగా ఉంటుంది. నాకు ఆమె మీద చాలా అభిమానం

సరే వదులు...నేను సర్దు కుంటాను

నాన్నా! ఒక్క నిమిషం టీవీ ఆఫ్ చేసి ఇటు వస్తావా? మురళీ నువ్వు కూడా

ఏంటక్కా?” -- చదువుకుంటున్న పుస్తకాన్ని మూసేసి వచ్చాడు. చక్రవర్తినూ లేచి రావడంతో అలమారిలో ఉన్న తన హ్యాండ్ బ్యాగును తెరిచి, ఫోటో ఉంచిన కవర్ జిప్పును తీసింది వైష్ణవీ.

ఏంటక్కా ఇది?”

చెప్తాను! నాన్నా ఇదే స్వేతా యొక్క భర్త అంటూ ఆయనకు ఒక ఫోటో ఇచ్చింది. తల్లి దగ్గర, చెల్లి దగ్గర, తమ్ముడి దగ్గర తలా ఒక ఫోటో ఇవ్వగా, అందరూ అయోమయంతో తీసుకున్నారు.

ఎందుకమ్మా మాకు ఇది?”

నాన్నా! ఫోటోలో ఉన్న అతన్ని బాగా చూడండి. ఎక్కడన్నా చూసారా?” -- వైష్ణవీ ఆతురతతో అడగ, ఫోటోను చూసి పెదవులు విరిచాడు చక్రవర్తి.

లేదమ్మా

ఫోటో నీ దగ్గర ఉండనీ నాన్నా. ఒకవేళ వీడ్ని ఎక్కడైనా చూస్తే...మెల్లగా మాటలు కలిపి మీతో ఉంచుకుని నాకు ఫోన్ చేయండి నాన్నా

నీకా...దేనికమ్మా?”

ఇతన్ని ఎలాగైనా కనిబెట్టి స్వేతా దగ్గరకు చేర్చాలి

ఏయ్! ఏమిటే ఇదంతా...నీకెందుకు పనంతా” -- మేనకా కొంచం ఆందోళన పడింది.

పాపం అమ్మా స్వేతా! వీడ్ని నమ్మి, వీడితో వచ్చేసి, జీవితాన్నే పోగొట్టుకుని నిలబడింది. మన వల్ల అయిన సహాయం...

అది ఆమె తలరాత. దానికి మనం ఏం చేయగలం?”

అమ్మా!

నీకు ఆమె మీద జాలి ఎక్కువగా ఉంటే ఇప్పుడు చేసినట్టు డబ్బో-వస్తువో ఇచ్చి  సహాయం చేయి. అది వదిలేసి ఎవడ్నో ఒకడ్ని వెతికి పట్టుకోవాలని తిరగకు

అమ్మా! ఇప్పుడు ఆమె గర్భంతో ఒంటరిగా నిలబడింది. ఇలా వదిలేసి వెళ్ళిన వాడిన వదిలిపెట్టచ్చా?”

ఏమండీ...ఇది ఏదేదో వాగుతోంది?”

అదేకదా! వైషూ, మనకెందుకమ్మా పని?”

ఏమిటి నాన్నా మీరు? ఆమె దగ్గర నేను ఎంతో నమ్మకంగా చెప్పి వచ్చాను. వీడ్ని కనిబెట్టి ఇవ్వకపోతే ఆమె జీవించటానికి దారిలేక చచ్చిపోతుంది

అయ్యో

తరువాత బిడ్డ అనాధ అయిపోతుంది నాన్నా. అలా ఏదీ జరగకూడదు. తప్పు చేసింది అతను కూడా కదా? వాడు మాత్రం తప్పించుకోవచ్చా?”

ఏయ్! ఇదంతా దాని సమస్య...ఇందులో నువ్వెందుకు తల దూర్చటం?”

ఇలా అవతలి వాళ్ళు ఎలా పోతే మనకేంటీ అంటూ జీవించటం ఒక జీవితమామ్మా? కళ్ళెదురుగా ఒక ఆడది కష్టపడటం చూస్తూ, వుండమని చెబుతున్నారా?”

వైషూ! నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. ఒకవేల అతను మన కళ్ళల్లో పడినా, ఎలా అమ్మాయితో కలపగలం?”

మాట్లాడాలమ్మా...ఆమె పరిస్థితిని ఎత్తి చెప్పాలి...

మెంటల్ లాగా మాట్లాడకు. అతని పేరు తప్ప ఇంకేదీ అమ్మాయికి తెలియదని చెబుతున్నావు. పెళ్ళికూడా ఎదో రోడ్డు సైడు గుడిలో -- ఎవరికీ తెలియకుండా చేసుకున్నారు. అలాంటి కేడీ వెధవ, నువ్వు మాట్లాడిన వెంటనే మనసు మార్చుకుని ఆమెతో కాపురం చేయడానికి వచ్చేస్తాడా?” కొంచం కోపంతో చెప్పింది.

అమ్మా?”

ఆమెను వద్దని వదిలేసి వెళ్ళినవాడిని, ఆమె ఎవరో తనకు తెలియదని చెబితే ఏం చేస్తావు? అమ్మాయి దగ్గర ఆధారమూ లేదే?”

అవును

మరెట్లాగే ఇది సరి చేయగలం? అనవసరంగా ఊరి సమస్యలో తలదూర్చి తగులుకోకు. చెప్పేది విను

అయితే... స్వేతా యొక్క పరిస్థితి?” -- వైష్ణవీకి గొంతు అడ్డుపడింది.

మనం ఏం చేయగలం? కన్నవారిని ఏడిపించి వచ్చేసిందే! అది ఎంత పెద్ద పాపం? చేసిన పాపానికి అనుభవించనీ

వద్దమ్మా! పాపం అమ్మా ఆమె. ఇంతవరకు చాలా కష్టాన్ని అనిభవించింది. ఇప్పుడు...తన ప్రాణం తీసుకోవాలనుకునేంత వరకు వెళ్ళింది

అదే ఆమె విధి అయితే మనం ఏం చేయగలం?”

లేదమ్మా. అలా వదిలిపెట్టకూడదు. మనం ఏదైనా చేసే తీరాలి

ఏయ్! నేను చెబుతూనే ఉన్నాను

అమ్మా! -- మురళీ అడ్డుపడ్డాడు.

ఏమిట్రా?”

అక్కయ్య చెప్పటంలో ఏం తప్పు?”

ఏమిట్రా చెబుతున్నావు?”

అవునమ్మా! మన కుటుంబం -- మన ఇల్లుఅంటూ అందరూ స్వార్ధంగా ఉంటే ఎలాగమ్మా? మనవల్ల చేయగలిగిన సహాయమే కదా చెయ్యమంటోంది అక్కయ్య. చేద్దామే?”

మురళీ! ఏమిట్రా నువ్వూ అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావు...అతనెవరో, ఎక్కడి వాడో, ఎటువంటి వాడో...ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్ళి చేసుకుని వదిలేసి వెళ్ళిన వాడు ఎలారా మంచి వాడుగా ఉంటాడు? ఇదేమో పెద్ద సాహసురాలు లాగా వాడ్ని వెతికి కనిబెడతాను అంటూ బయలుదేరి ఏదైనా సమస్యను తీసుకు రాబోతోంది

అమ్మా! ఇది సాధారణ విషయం. దీనికి పోయి ఎందుకు ఇంత ఊహించుకుంటున్నావు?”

రేయ్! నేను...

థ్యాంక్యూ మురళీ -- అన్న వైష్ణవీని, నవ్వుతూ చూసాడు.

నాకెందుకక్కా థ్యాంక్స్ అంతా!

నువ్వైనా నన్ను అర్ధం చేసుకున్నావే! స్వేతా చాలా పాపం రా. ఎలా ఏడ్చిందో తెలుసా? ఆమెకు సహాయం చేయటానికి ఎవరూ లేరురా

అదే మనం ఉన్నం కదక్కా. నువ్వేమీ భయపడకు. నేను ఫోటోను నా స్నేహితులందరి దగ్గర చూపిస్తాను. సరొజా! నువ్వు నీ స్కూలు టీచర్ దగ్గర చూపించు.

అమ్మా! నువ్వు కూడా బయట మార్కెట్టు, గుడి అని వెళ్ళే చోట ఇతన్ని చూస్తే చెప్పమ్మా. మనవల్ల ఒక అమ్మాయి యొక్క జీవితం తిరిగి దొరుకుతుందంటే సంతోషమే కదా?”

మీరంతా ఎవరో ఒక అమ్మాయి యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నారు. నేను నా కూతురి యొక్క జీవితం తలుచుకుని భయపడుతున్నా

అక్కయ్యకు ఏమీ అవదమ్మా? నేనున్నానుగా?”

నువ్వు చిన్న పిల్లాడివిరా. నీకేం తెలుసు? మేము దానికి వరుడ్ని చూస్తున్నాము. టైములో అవసరంలేని సమస్యను లాకొచ్చి నిలబడుతోందే! ఇది... -- మేనకా ఆదుర్దాగా చెప్పగా, ఆశ్చర్యపోయింది వైష్ణవీ.

ఏమిటీ...వరుడ్నా? ఎవరికి?”

ఇదేం ప్రశ్న...నీకేనే?”

నాకెందుకమ్మా అంత తొందర పడతావు? ఇంకా కొన్ని రోజులు పోనీ

ఇంకా ఎన్ని సంవత్సరాలే ఇలా చెబుతావు? నీ చెల్లికి కూడా పెళ్ళీడు వచ్చింది

అమ్మా

ఇదిగో చూడూ. ఇక మీదట నీ మాట వినదలుచుకోలేదు. నోరు మూసుకుని మేము చూసే వరుడితో తాళి కట్టించుకో

ఏమ్మా! నేనేమన్నా పెళ్ళే వద్దని చెప్పానా? కొన్ని రోజులు పోనీ...?”

చాలు...చాలు. ఇన్ని రోజులు పోతే పోనీ. ఇకమీదటైనా మేము చెప్పేది విని నడుచుకో -- మేనకా గట్టిగా చెప్పింది.

సరేమ్మా! నాకు రెండు నెలలు అవకాసం ఇవ్వండి

దేనికి?”

స్వేతా యొక్క భర్తను కనిబెట్టి ఆమె దగ్గర చేర్చిన తరువాత, మీరు ఏం చెప్పినా వింటాను. అంతవరకు నన్ను ట్రబుల్ చెయ్యద్దు

చూసారా...? నేను ఇంత చెప్పినా, ఇది చెప్పిందే చెబుతోంది చూడండి. దాని మనసులో పెద్ద సమాజిక సేవకురాలు అని అనుకుంటోందా?”

మేనకా...కోపగించుకోకు! అది ఇంత దూరం దిగిరావటమే పెద్ద విషయం

ఏమిటండీ...మీరూ...

ప్రశాంతంగా ఉండు! మనమేమన్నా వరుడ్ని చేతిలోనా పెట్టుకున్నాం? నిదానంగా/ ఓర్పుగా వెతికి--అన్నీ తెలుసుకుని మనం ఒక పక్క వరుడ్ని వెతుకుదాం. ఇంతలోపు అది అమ్మాయి భర్తను కనిబెట్టనీ -- అన్న తండ్రిని కృతజ్ఞతతో చూసింది వైష్ణవీ.

థ్యాంక్స్ నాన్నా...చాలా థ్యాంక్స్

కానీ ఒక విషయం వైష్ణవీ! అతను ఒకవేల దొరకకపోతే...నువ్వు దాన్ని కారణం చూపి నీ పెళ్ళికి అడ్డం తెలుపకూడదు

తెలుపను నాన్నా. అతన్ని వెతికేది నా తృప్తి కోసం. నా కళ్లెదుట ఒక గర్భిణీ కష్టపడటం చూసి ఆమెకు ఏదైనా సహాయం చేయాలి. ఆమె బిడ్డ అనాధ అవకూడదని ఇంత ప్రయత్నం చేస్తున్నా.

ప్రయత్నంలో జయం కలగవచ్చు, ఓటమి కలగవచ్చు. కానీ దానికోసం మిమ్మల్ని కష్టపెట్టను. నాకు నా కుటుంబమే ముఖ్యం నాన్నా. అంతకన్నా ముఖ్యం అమ్మను ఒక్కరోజు కూడా బాధపడనివ్వను

కూతురి మాటలతో అంతవరకు అయోమయంలో ఉన్న మేనకా మొహం కొంచంగా వికసించింది. వైష్ణవీ, తల్లి దగ్గరకు వెళ్ళి, ఆమె మొహాన్ని పట్టుకుని తనవైపు తిప్పుకుంది.

నేను చెప్పింది మీకు ఓకేనా అమ్మా?”

ఇలా అంటే ఎలా? ‘సరేనేఅని సంతోషంగా చెప్పు.

సరేనే -- అన్నది మేనకా నవ్వుతూ.

అమ్మంటే అమ్మే! నా ముద్దుల అమ్మ

హలో! ఇదేమిటి ఇల్లా -- లేక చేపల మార్కెట్టా?’ ఇలా గోల చేస్తుంటే ఎలా  చదువుకోను?” -- లోపలి రూములో నుండి చేతిలో పుస్తకంతో బయటకు వచ్చింది శృతి.

ఏయ్! నువ్వేమిటి ఇంతసేపు చదువుతూనా ఉన్నావు? మేము మాట్లాడుతున్నదంతా కూర్చుని వింటున్నావే?” -- అన్నాడు మురళీ.

ఇలా గట్టిగా మాట్లాడుకుంటే...చెవిలో పడదా? వచ్చే వారం నాకు పరీక్షలున్నాయి. నన్ను చదువుకోనివ్వండి

సరేనే చదువుల తల్లి. చదువు. స్టేట్ ఫస్ట్వస్తావా చూద్దాం

అదంతా నాలుగు వందల మార్కులు కూడా తీయలేని నువ్వు చెప్పకూడదు. నువ్వే ఒక మొద్దు మొహానివి

వాగుడుకాయ గాడిదా. ఎవర్నే మొద్దు అంటున్నావు?” -- మురళీకృష్ణ కొట్టటానికి చెయ్యెత్త, శృతి తల్లి వెనుకకు వెళ్ళి దాక్కుంది.

మొదలుపెట్టారా? రేయ్! నువ్వేంటి చిన్న పిల్లాడిలాగా ఆటలు. పో...వెళ్ళి చదువుకో -- కసురుకున్న మేనకాను కోపంగా చూస్తూ వైష్ణవీ ఇచ్చిన ఫోటోను తీసుకుని వెళ్ళాడు మురళీ.

వైష్ణవీ నవ్వుకుంటూ మిగిలి ఉన్న ఫోటోలను తీసుకుని లేచినప్పుడు, ఆమె ఫోన్ మోగింది. టైములో ఎవరు ఫోను చేస్తున్నారు?’ -- ఆలొచిస్తూ టేబుల్ మీదున్న మొబైల్ తీసింది.

హలో

వైష్ణవీ సిస్టర్! నేను సంధ్యా మాట్లాడుతున్నాను

ఏమిటి సంధ్యా... టైములో ఫోను చేసావు?”

సిస్టర్! మీరు కొంచం వెంటనే బయలుదేరి ఆసుపత్రికి రాగలరా?” -- సంధ్యా స్వరంలో కనబడిన ఆందోళన, వైష్ణవీ మనసులో కలత ఏర్పరచింది.

ఏంటి సంధ్యా? ఏదైనా అర్జెంటా?”

అవును సిస్టర్! స్వేతా అనే పేషంటు ఇక్కడ అడ్మిట్ అయ్యింది. మిమ్మల్ని వెంటనే చూడాలని ఏడుస్తోంది

. మి.టి?” -- వైష్ణవీ చేతిలో ఉన్న ఫోటో కిందకు జారిపోయింది.

ఏం చెబుతున్నావు సంధ్యా...? స్వేతాకి ఏమైంది? రోజు మధ్యాహ్నం కూడా చూసేనే

ప్రసవ నొప్పులు లాగుంది సిస్టర్

లేదు...ఇది ఏడోనెలే కదా?”

ఏమిటనేది తెలియటం లేదు. బ్లీడింగ్ అవుతోంది. క్రిటికల్ పొజిషన్ అని డాక్టర్ చెప్పారు. ఆమె ఏమో మిమ్మల్నే చూడాలని ఎక్కువగా ఏడుస్తోంది. మీరు...

ఇదిగో...ఇప్పుడే వస్తున్న అని ఫోన్ కట్ చేసి, లోపల గదిలోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగు తీసుకుని పరిగెత్తింది.

ఫోనులో ఎవరమ్మా -- అడిగింది తల్లి.

అమ్మా! నేను వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. అన్నీ వచ్చి చెబుతాను. ఆలస్యమైతే వెతకకండి

ఏయ్! ఏమిటే ఇది? టైము పది అవుతోంది?”

అమ్మా...ప్లీజ్. అక్కడ స్వేతా చాలా సీరియస్ కండిషన్ లో ఉందట. నన్ను చూడాలని చెబుతోందట. నేను వెంటనే వెళ్ళాలి. నాన్నా! కాస్త, బండి తీస్తారా?” -- అర్జెంటుగా అడుగుతూనే చెప్పులు వేసుకుంది.

అరెరె! బండి పంచర్ అయ్యింది. పంచర్ అతికించటానికి ఇచ్చానమ్మా. అతికించాడా అనేది చూసొస్తానమ్మా

వద్దు నాన్నా. టైము అవుతోంది. నేను ఆటో పుచ్చుకుని వెళ్ళిపోతాను

అక్కా! టైములో ఒంటరిగా ఎలా వెళతావు? ఉండు...నేనూ వస్తాను -- అంటూ మురళీ చొక్కా తొడుక్కుని బయలుదేర, ఆందోళన చెందుతున్న మనసుతో రోడ్డు మీదకు వచ్చి నడవసాగింది వైష్ణవీ.

వైషూ! ఏదైనా అవసరమైతే ఫోను చెయమ్మా. మురళీ చూసుకోరా -- మేనకా వాకిట్లో నిలబడి గట్టిగా అరిచి చెప్పగా, వైష్ణవీ చెవిలో అది పడలేదు.

మనసంతా స్వేతా జ్ఞాపకం ఆక్రమించుకోనున్నది.

ఏమైందో! అంత నమ్మకంగా మాట్లాడేసి వెళ్ళిందే! ఇంతలో ఏం జరిగుంటుంది! ఆమె గర్భ సంచీ బలహీనంగా ఉన్నదని డాక్టర్ చెప్పారే? ఒక వేల...ప్రీ మెచ్యూర్ డెలివరి ఏదైనా అయిపోతుందా? ఆమె ప్రాణానికి...’-- వైష్ణవీ ఒళ్ళు జలదరించింది.

***************************************************PART-7******************************************

ఆటో పుచ్చుకుని ఆసుపత్రికి చేరుకున్నప్పుడు టైము పదిన్నర అయ్యింది. మురళీ దగ్గర డబ్బులిచ్చి ఆటోవాడ్ని పంపించమని చెప్పి ఆందోళన పడుతూ, ఆట్లు పోట్లుగా పరిగెత్తినప్పుడు వార్డ్ బాయ్ఎదురు పడ్డాడు.

ఏమిటి సిస్టర్! ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు?”

ముత్తూ! స్వేతా అనే పేషంట్...

డెలివరీ వార్డుకు తీసుకు వెళ్ళారు... -- అతను చెప్పి ముగించే లోపు మెట్లు ఎక్కటం మొదలుపెట్టింది. గబగబమని ఎక్కి  ఆయసపడుతూ, వరాండా చివరగా ఉన్న ప్రసవ గదికి దగ్గరైనప్పుడు గుండె దఢ ఇంకా ఎక్కువ అయ్యింది.

ప్రసూతి వార్డు వాకిట్లో కాకీ యూనీఫారం వేసుకున్న పోలీసులు నిలబడ, ఆందోళనగా వాళ్ళ దగ్గరకు చేరుకుంది. ఆమె ఆయసపడుతూ వచ్చి నిలబడటంతో, సెల్ ఫోనులో మాట్లాడుతున్న ఇన్‌స్పెక్టర్ అశ్విన్ వెనక్కి తిరిగాడు.

నేను! తరువాత మాట్లాడుతాను అంటూనే సెల్ ఫోనును ఆఫ్ చేసి వైష్ణవీ దగ్గరకు వచ్చాడు.

రండి! మిమ్మల్ని చూడాలనే అమ్మాయి గొడవపెడుతోంది

సార్! మీరంతా...ఇక్కడ...

ఇది ఆత్మహత్య కేసు

ఆత్మహత్యా?” -- బలమైన షాక్ తో తూలిపోతూ గోడను ఆనుకుంది.

ప్లీజ్! శాంతంగా ఉండండి. మొదట అమ్మాయిని వెళ్ళి చూడండి. మిగతా విషయాలన్నీ తరువాత మాట్లాడుకుందాం... అతను తొందర చేయ, ప్రసవ గది తలుపు కొట్టింది.

వెంటనే తెరవబడి--సంధ్యా తల బయటపెట్టి -- వైష్ణవీని చూడగానే, ఆమె దూరగలిగేంత మేరకు తలుపు తెరిచింది.

లోపల స్వేతా కేకలు వినబడ, గుండె దఢ మరింత ఎక్కువ అవగా ఆమె దగ్గరకు పరిగెత్తింది. ఇనుప మంచం చుట్టూ ఏడెనిమిది మంది నర్సులూ, ఇద్దరు మహిళా డాక్టర్లు అయోమయంలో ఉన్నారు.

డాక్టర్ -- వైష్ణవీ యొక్క సన్నటి స్వరంతో అందరూ తిరగగా, స్వేతా కేకలు గబుక్కున ఆగినై. ఒళ్ళు మొత్తం చెమటతో తడిసిపోయుంది. నొప్పితో చిన్నదైన మొహంతో ఉన్న ఆమె దగ్గర ఒక సైలెన్స్ వచ్చింది. 

నర్సమ్మా! వచ్చాసారా...వచ్చేసారా?”

మిగిలిన వాళ్ళను పక్కకు నెట్టుకుంటూ ముందుకు వెళ్ళింది వైష్ణవీ. స్వేతా ముఖం మీద వరదలా కారుతున్న చెమటను తన చీర కొంగుతో అద్దుతూ, కన్నీటితో అడిగింది.

స్వేతా! ఏమయ్యింది?”

అమ్మా...నేను...అతన్ని... పాపిని...చూసానమ్మా -- స్వేతా ఎక్కువ ఆయసపడుతూ మాట్లాడ, అరిచింది డాక్టరమ్మ.

ఎయ్! ఆక్సిజన్ ఇవ్వాలి...తరువాత మాట్లాడు

వద్దు! నేను మాట్లాడాలి. నర్సమ్మ దగ్గర మాట్లాడాలి

వైష్ణవీ! ఏమిటిది?” డాక్టర్ అమ్మ రుసరుసలాడింది.

సారీ డాక్టర్! ఒక్క నిమిషం. స్వేతా మొదట నీకు ట్రీట్ మెంట్ చేయనీ. తరువాత మాట్లాడదాం

లేదమ్మా! నేను బ్రతకను. ఇంతలో మీ దగ్గర అతని గురించి మాట్లాడాలి. మాట్లాడే తీరాలి

ఇలా చూడూ! బిడ్డను కనీ పూర్తిగా బ్రతకాలనే కోరిక ఉందా...లేదా?”

డాక్టర్?”

స్వేతా...ఈమె ఇలాగే మాట్లాడుతూ ఉంటే మేము ఏమీ చేయలేం. మొదట ఆమె పడుతున్న నొప్పిని ఆపాలి. లేకపోతే తల్లీ-బిడ్డలను ఇద్దరినీ కాపాడటం కుదరదు

నో...నో! అలా జరగకూడదు డాక్టర్ -- అరిచింది వైష్ణవీ.

సంధ్యా! ఇంజెక్షన్ వెయ్యి. అప్పుడే ఆమె సైలెంటుగా ఉంటుంది -- డాక్టర్ చెప్పగా, సంధ్యా యెల్లో రంగు ద్రవాన్ని సూదిలోకి ఎక్కించి, స్వేతా నరం ఉన్న చేతిలో గ్రీన్ కలర్ నరాన్ని వెతికి సూదిని దూర్చగా, నొప్పితో కళ్ళు మూసుకుంది స్వేతా.

కొద్ది క్షణాలలో చుట్టూ నిలబడున్న బింబాలు పొగలాగా దృశ్యం చూప, తన దగ్గరే నిలబడ్డ వైష్ణవీ చేతిని గట్టిగా పుచ్చుకుంది స్వేతా. 

అతన్ని చూసాను...నర్సమ్మా. అతను...నన్ను చూసి పరిగెత్తాడు. నేనూ...అతని...వెనుకే...పరిగెత్తి...ఒక కారుకు గుద్దుకుని...కింద పడి... అంతకంటే మాట్లాడలేక స్వేతా కళ్ళు కూరుకుపోయినై. గది నిశ్శబ్ధంతో నిండింది.

డాక్టర్ మరో రెండు మందులు ఇంజెక్షన్ ద్వారా డ్రిప్స్ ఎక్కిస్తున్న ట్యూబులో దూర్చ, చూస్తూ మౌనంగా నిలబడింది వైష్ణవీ.

స్వేతా మొహంపైన ఉంచిన మాస్కును తీసేసి, రెగులర్ ఆక్సిజన్ ఇవ్వబడింది.

ఆమె నాడి కొట్టుకోవటాన్ని పరిశోధించి, పొట్టను ముట్టుకుని పరీక్షించి నర్స్ వైపుకు తిరిగింది మహిళా డాక్టర్.

నర్స్! ఇంకో అరగంట లోపు మందు ఇచ్చేయి. ఆమె మైకములోనే ఉండనీ. లేస్తే నన్ను పిలు

సరే డాక్టర్

వైష్ణవీ

డాక్టర్?”

ఈమె...నీ బంధువా?”

లేదు డాక్టర్. మన దగ్గరకు వచ్చే రెగులర్ పేషంట్

! నిన్ను చూడాలని అరుస్తూ ఉంది. ఆమె నాడి కొట్టుకోవటం తగ్గుతూ ఉండటంతో మాట్లాడనివ్వలా

అర్ధమయ్యింది డాక్టర్

ఈమె రాత్రంతా రెస్టు తీసుకోనీ. నువ్వు కావాలంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి పొద్దున్నే రా

సరే డాక్టర్! డాక్టర్...

చెప్పు వైష్ణవీ

స్వేతా ఆరొగ్యానికి ఏమిటి ప్రాబ్లం?”

అసలే బాగా నీరసంగా ఉంది. ఆమె గర్బ సంచీ కూడా బాగా బలహీనంగా ఉంది. పూర్తిగా బెడ్ రెస్టు కావాలని చెప్పుంచాను

.....................”

ఈమేమో మెయిన్ రోడ్డులో, ట్రాఫిక్ మధ్యలో పరిగెత్తి పోలీసుల జీపుపై ఢీకొంది

అయ్యో...

వాళ్ళే తీసుకు వచ్చి అడ్మిట్ చేసారు. రోడ్డులో పడినందువలన డెలివరీ మూమెంట్స్ ప్రారంభమైంది. టైములో బిడ్డ పుడితే...రెండు ప్రాణాలకూ గ్యారంటీ లేదు

డాక్టర్

ఇప్పుడు డెలివరీ మూమెంట్స్ తగ్గటానికి ఇంజెక్షన్ వేసాము. ఈమె ఒళ్ళు కదపకుండా చూసుకోండి. బాత్రూమ్ వెళ్ళటానికి కూడా అనుమతించకండి. కాదని నడిచిందో మళ్ళీ నొప్పులు వచ్చేస్తాయి...అప్పుడు ఏమీ  చెయ్యలేము

సిస్టర్స్! ఈమెకు బెడ్ ఏర్పాటు చేయండి. ఒక పదిరోజులు అసుపత్రిలోనే ఉండాలి. సరేనా...?”

సరే డాక్టర్

వైష్ణవీ! నువ్వు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళచ్చు అని చెప్పి ఇద్దరు డాక్టర్లూ బయటకు వెళ్ళిపోగా, ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు.

వైష్ణవీ అలసిపోయిన దానిలాగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది. కళ్ళు లోపలకు పోయి, స్వేతాని చూస్తూ ఉన్నది. సంధ్యా చిన్నటి స్వరంతో పిలిచింది.

సిస్టర్

మీరు కావాలంటే ఇంటికి...

లేదు...పరవాలేదు సంధ్యా! స్వేతా ఇంకేమైనా చెప్పిందా

మిమ్మల్ని చూడాలని చెప్పింది సిస్టర్! ఒకవేల ప్రసవంలో నేను చచ్చిపోతే...నా బిడ్డను వైష్ణవీ నర్సమ్మ దగ్గర ఇచ్చేయండి. ఆమె బిడ్డను వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తుంది అని చెప్పింది సిస్టర్

వైష్ణవీ ఆవేదనతో కళ్ళు మూసుకుంది.

నా మీద నీకు ఇంత నమ్మకమా? మరెందుకు అవసరపడ్డావు స్వేతా? ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేదు...ఈమె ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు....... మోసగాడ్ని చూసి వాడి వెనుక పరిగెత్తింది స్వేతా? అప్పుడు ఎదురు చూడని విధంగా పోలీసు జీపును ఢీకొన్నది...అవును! స్వేతా అలాగే కదా చెప్పింది? అవును! ఇది వెంటనే చెప్పాలి’ -- ఆందోళనతో లేచి గది తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది.  

ఆమె రాకకొసమే కాచుకోనున్న ఇన్స్పెక్టర్ అశ్విన్, వేగంగా ఆమెను చేరుకున్నాడు.

అమ్మాయికి ఏమీ కాలేదే...?”

లేదు. మయకంలో ఉంది

భయపడేలాగా ఏదీ...

లేదని డాక్టర్ చెప్పింది

! థ్యాంక్ గాడ్ -- గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా శ్వాస విడిచాడు అశ్వినీకుమార్.

హో! ఎన్నో ప్రమాదాలు చూసాను...హత్య కేసులను నేరుగా చూసాను. కానీ, అమ్మాయి -- కడుపులో బిడ్డతో వచ్చి జీపును ఢీ కొని పడిపోవటం....ఒక్క నిమిషం  కళ్ళు బైర్లు కమ్మాయి

సార్

చెప్పండి...

ఆమె ఆత్మహత్య చేసుకోవాలని మీ జీపును ఢీ కొనలేదు!

మరి!

అవును సార్! ఆమెను మోసం చేసి పారిపోయిన భర్తను చూసింది. ఈమెను చూడగానే అతను తప్పించుకుని పారిపోయాడు. అతన్ని పట్టుకోవాలని అతని వెనుకే పరిగెత్తి మీ జీపును ఢీకొంది

అంటే... అమ్మాయి భర్త?”

ప్చ్! వయసు కోలారు వల్ల ఎవడ్నో నమ్మి ఇంటి నుండి వచ్చేసింది. వాడు ఆమెను తన ఆశకు వాడుకుని, ఎత్తి బయట పడేసాడు -- వైష్ణవీ చెప్పగా, అశ్విన్ ముఖం మారింది.

ఏం చెబుతున్నారు మీరు?”

అవును సార్! అమ్మాయి పేరు స్వేతా అంటూ మొదలుపెట్టి, ఆమె గురించిన పూర్తి వివరాలు చెప్పగా...అడ్డుపడకుండా మౌనంగా మొత్తం విన్నాడు.

రోజు మధ్యాహ్నమే, బాగా ధైర్యం చెప్పి పంపించాను. ఇంతలో ఇలా...ప్చ! కష్టంగా ఉంది

ఇప్పుడు అమ్మాయి ఆరొగ్యం ఎలా ఉంది?”

ఖచ్చితంగా పూర్తి రెస్టు తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. మళ్ళీ నొప్పులు రాకుండా ఉంటే భయంలేదు

సరే, మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. అతన్ని నేను కనిబెడతాను

సార్?” -- వైష్ణవీ ముఖం వికసించింది.

అమ్మాయి చెప్పింది బట్టి చూస్తే వాడు ఏరియాలోనే ఎక్కడో ఉన్నాడని తెలుస్తోంది. అలాంటప్పుడు అతన్ని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు

...థ్యాంక్యూ సార్! విషయంగా నేనే మిమ్మల్ని కలిసి సహాయం అడగాలని ఉన్నాను. మంచికాలం...మిమ్మల్ని నేరుగా కలిసే సంధర్భం దొరికింది -- అన్న వైష్ణవీని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసాడు.

ఆశ్చర్యంగా ఉంది 

ఏది సార్?”

మీరు నా దగ్గర సహాయం కోరాలని అనుకున్నది

అది...మిమ్మల్ని నేరుగా చూస్తే అడుగుదామని...

పరవాలేదు. ఎలా చేసున్నా థ్యాంక్స్. ఇప్పుడు అతని ఫోటో మీ దగ్గరుందా?”

ఉంది సార్

నాకు ఒకటి ఇవ్వండి. అది నేను అన్ని స్టేషన్లకూ పంపి, అతన్ని వెంటనే వెతికే ఏర్పాట్లు చేస్తాను

చాలా థ్యాంక్స్ సార్ అంటూనే భుజాన తగిలించుకున్న హ్యాండ్ బ్యాగును అర్జెంటుగా తెరిచింది. డీలా పడిపోయింది.

ఏమైంది?”

సారీ సార్. ఇంట్లో వాళ్ళందరికీ ఫోటో చూపిస్తున్నప్పుడే, అసుపత్రి నుండి ఫోను వచ్చింది. హడావిడిలో...ఇంట్లోనే పెట్టేసి వచ్చాను

అయ్యో. సరే మీకెప్పుడు మళ్ళీ డ్యూటీ?”

"రేపు పొద్దున సార్

సరే. ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. రేపు వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఫోటో తీసుకు రండి

వచ్చి...మిమ్మల్ని ఎక్కడ చూసేది?”

స్టేషన్లో చూడండి

అమ్మో -- ఆందోళనతో రాను అన్నది.

ఎందుకని...స్టేషన్ అంటే భయమా?”

సారీ సార్. నాకు అక్కడకు వచ్చిన అలవాటు లేదు. అంతే కాదు నేను  స్వేతా కోసం రిస్క్తీసుకోవటం అమ్మకు ఇష్టం లేదు. అందులో ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వస్తే...అంతే -- భయపడుతూ కళ్ళు పెద్దవిగా చేసుకుని చెప్పిన ఆమెను మెల్లగా నవ్వుతూ చూసాడు.

సరే...సరే. టెన్షన్ పడకండి. నేనే ఆసుపత్రికి వచ్చి తీసుకుంటాను. సరేనా?”

ఇక్కడికా?”

అవును. అమ్మాయి దగ్గర కూడా కొంచం వివరాలు అడగాలి. అందువల్ల పది పదిన్నర కల్లా వచ్చేస్తాను

సరే సార్ ఉత్సాహంగా తల ఊపింది.

సరే. చాలా రాత్రి అయ్యింది. ఇప్పుడు ఇంటికి ఎలా వెళతారు?”

ఆటోలోనే

ఆటోలోనా...ఒంటరిగానా?”

లేదండీ! నా తమ్ముడు వచ్చాడు అన్న ఆమెకు అప్పుడే మురళీ యొక్క జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతనికి దూరంగా జరిగి, నలువైపులా వెతికింది. ఇన్స్పెక్టర్ అశ్విన్ ఆమెతో పాటూ వచ్చాడు.

ఏమైంది...ఎవర్ని వెతుకుతున్నారు?”

అదేనండీ. నాతో పాటూ నా తమ్ముడు వచ్చాడు. ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించమని చెప్పి నేను తిన్నగా లోపలకు వచ్చాను. అదే... అంటూ మెట్లు దిగగా, అశ్విన్ కూడా ఆమెతో పాటూ దిగాడు.

తమ్ముడంటే...ఒక పదేళ్ళ వయసు ఉంటుందా?” అని అడిగిన అతన్ని కోపంగా చూసింది.

ఏమిటీ ఎగతాలా? వాడు కాలేజీ చదువుతున్నాడు

అయితే భయపడక్కర్లేదు. ఎక్కడైనా కూర్చోని మీకొసం కాచుకోనుంటాడు

ఛఛ! నన్ను వెతుక్కుంటూ ఎక్కడంతా తిరుగుతున్నాడో...తెలియటం లేదే. మురళీ... మురళీ! అంటూ కేక వేసుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ అంతా  వెతికింది.

వైష్ణవీ! మీ ఇంట్లో మొత్తం ఎంత మంది?”

ఏం సార్! ఇప్పుడు వివరాలు అవసరమా?”

లేదు...చాలా టెన్షన్ గా ఉన్నారే! మిమ్మల్ని కొంచం రిలాక్స్  చేయాలని...

వద్దు. మీరు బయలుదేరండి. నేను మా తమ్ముడ్ని తీసుకుని ఇంటికి వెడతాను

మీ తమ్ముడు ఎలా ఉంటాడు?”

ఎందుకు అడుగుతున్నారు?”

మీ సహాయానికి చాలా థ్యాంక్స్ సార్. మీకు ఎన్నో పనులు ఉంటాయి. మీరు బయలుదేరండి

కనబడకుండా పోయిన వాళ్ళను వెతకటం కూడా మా పనే

ఏమిటీ?”

మీ తమ్ముడు కొంచం సన్నగా--ఎత్తుగా, కలరుగా ఉంటాడా?”

అవును -- అయోమయంగా తల ఊపింది.

నీలి రంగు షర్టు వేసుకోనున్నాడా?”

అదిగో సిమెంటు బెంచి మీద కూర్చోనున్నాడు చూడండి... అంటూ అతను చై చూప, ఆశ్చర్యంతో వైష్ణవీ ముఖం వికసించింది.

***************************************************PART-8******************************************

ఇన్‌స్పెక్టర్ అశ్విన్ చేయి చూపిన దిక్కు వైపు తిరిగింది వైష్ణవీ. ఆసుపత్రి బయటి భాగంలో వేయబడున్న సిమెంటు బెంచి ఒక దాని మీద చేతులు కట్టుకుని, ఒరిగి కూర్చోనున్నాడు మురళీ.

గోడ అంచుల్లో నిలబడున్న కరెంటు స్థంభాల పైనున్న లైట్ల వెలుతురు పడుతున్న చోటు తప్ప, మిగిలిన ప్రదేశమంతా చీకటి కమ్ముకోనుంది. మనుషుల హడావిడి లేక నిశ్శబ్ధంగా ఉంది.

మురళీఅని పిలుస్తూ తమ్ముడు దగ్గరకు వెళ్లగా అతను లేచాడు.

రాక్కా! పేషంటుఎలా ఉంది?”

ట్రీట్ మెంట్ ఇచ్చిన తరువాత కొంచం పరవాలేదు. సారీరా? నేను నిన్ను పిలవకుండా పైకి వెళ్ళిపోయాను

పరవాలేదక్కా...పనే కదా ముఖ్యం

అవున్రా! అప్పుడున్న టెన్షన్లో...

హలో! మధ్యరాత్రి అయిపోయింది. ఇద్దరూ ఇలాగే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారా...ఇంటికి వెళ్ళక్కర్లేదా?” -- ఇన్స్పెక్టర్ అశ్విన్ కొంచం గట్టిగా అడగగా, ఇద్దరూ తిరిగారు.

పోలీసు డ్రస్సులో ఉన్న ఆయన్ని చూసి, మురళీకి మొహం మారింది.

అక్కా! ఈయన...ఎవరు?” -- మెల్లగా అడిగాడు.

అయినా కాకీ చెవిలో పడకుండానా ఉంటుంది.

హలో మురళీ! నేను అశ్విన్. ఇన్స్పెక్టర్ అంటూ అతని చెయ్యి పుచ్చుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మురళీ మొహం ప్రకాశవంతమైంది.

సార్...మీరా? ఏమిటీ ఆశ్చర్యం? అయ్యో! మిమ్మల్ని ఇలా ఇంత పక్కగా చూస్తాను అని అనుకోలేదు. థ్యాంక్యూ సార్ అంటూ ఆయన చేతులను గట్టిగా నొక్కాడు.

నన్ను తెలుసా నీకు?”

ఏమిటి సార్ అలా అడుగుతున్నారు? నేను మీ ఫ్యానును...తీవ్ర ఫ్యానును

ఏయ్...ఏంటయ్యా! నేనేమీ సినిమా స్టారును కాదే

మీరు నిజమైన స్టార్ సార్. మీ ధైర్యాన్ని చూసి. మా స్నేహితులందరూ మీ ఫ్యాన్స్ అయిపోయాము

నన్ను ఎక్కడ చూశారు?”

సార్! పోయిన నెల మా కాలేజీ రోడ్డులో ఒక గొడవ జరిగిందే! ఏదో పోరాటం అంటూ మందు కొట్టి కొట్టుకుంటూ ఉన్నారే!

! కెనాల్ రోడ్లో...

అవును సార్! అప్పుడొచ్చి అందరినీ పిచ్చ కొట్టుడు కొట్టారు చూడండి. సూపర్ సార్. అంతవరకు నేను వకీలు అవాలి అని ఆశపడ్డాను. మిమ్మల్ని చూసిన తరువాత పోలీసుగానే అవాలని నిర్ణయం తీసుకున్నాను

మురళీ! రోజు నువ్వు చెప్పిన 'హీరో' ఈయనేనా?”

అవునక్కా! నేనూ ఈయనలాగా పోలీసు అవాలని ఆశ పడుతున్నాను

అంటే నాకు పోటీగా ఇంకొక అధికారి రెడీ అవుతున్నాడు

ఛఛ! పోటీగా కాదుసార్. మీ జెరాక్స్గా డెవెలప్ అవాలి

గుడ్...నీ ఎత్తు .కే!  ఒళ్ళు ఇంకొంచం డెవెలప్ చేసుకోవాలి. కోడిగుడ్లు, చేపలూ తిను. పొద్దున్నే లేచి వ్యాయామం చేయి. జాగింగ్ వెళ్ళు. చదువుతో పాటు శరీర ధారుఢ్యం కూడా ఉండాలి

ఖచ్చితంగా సార్

తరువాత

మమ్మల్ని అనేసి ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుతూ నిలబడ్డారు?  ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని మీ ఉద్దేశం?” -- వైష్ణవీ నడుం మీద చెయ్యి పెట్టుకుంటూ బెదిరించ, ఇద్దరూ ఫేక్ నవ్వు నవ్వారు.

మురళీ...రా! మిగిలిన విషయాలు ఆటొలో వెళుతున్నప్పుడు మాట్లాడుకుందాం

సార్ మీరు కూడా మాతో పాటూ వస్తున్నారా?”

అవును! మిమ్మల్ని ఎలా ఒంటరిగా పంపగలను. కమాన్ -- లెట్స్ గోఅని  ముందు నడవగా, ఆయన వెనుకే వెళ్తూ తడబడుతూ అడిగింది.

మీకెందుకు సార్ అనవసరమైన శ్రమ? మేము...

నేను శ్రమ అని చెప్పనే లేదే!

దానిక్కాదు. అయినా...

వైష్ణవీ! మీరెందుకు భయపడుతున్నారు? మనమేమీ జీపులో వెళ్ళటం లేదే. ఆటోలోనే కదా వెళ్తున్నాము. అందువలన ఎవరూ, ఏమీ అనుకోరు

అప్పుడు మీ జీపు?”

దాన్ని పంపి చాలాసేపు అయ్యిందే! నాతో పాటూ వచ్చిన వాళ్ళు తీసుకు వెళ్ళారు అంటూనే ఆసుపత్రి బయటకు వచ్చి వరుసగా నిలబడ్డ ఆటోల దగ్గరకు వెళ్లారు.

మురళీ

సార్

మీ ఇల్లు ఎక్కడుంది?”

టి.వి.ఎస్. నగర్, సెకెండ్ స్ట్రీట్

.కే అంటూనే ఆటోల దగ్గరకు వెళ్లారు. ఆటోలో పడుకుని నిద్రపోతున్న డ్రైవర్ను పిలిచారు. అతను గబుక్కున లేచాడు. పోలీసు డ్రస్సు చూసిన వెంటనే భవ్యంగా కిందకు దిగాడు.

సార్

టి.వీ.ఏస్. నగర్ వెళ్లాలి. ఆటో వస్తుందా?”

వెళ్దాం సార్. కూర్చోండి -- అని ఆటో డ్రైవర్ చెప్పగానే వైష్ణవీని, మురళీనీ  వెనుక సీట్లో ఎక్కమని, తాను ఆటో డ్రైవర్ సీటులో చివరగా కూర్చున్నారు.

ఆటో వేగంగా బయలుదేర... ఇన్‌స్పెక్టర్ అశ్విన్, మురళీనూ ఆపేసిన వాళ్ళ మాటలను మళ్ళీ మొదలుపెట్టారు. తమ్ముడి ఇంటెరెస్ట్ ప్రశ్నలకు కొంచం కూడా విసుగు చూపించకుండా సమాధానాలు చెబుతూ వస్తున్న ఇన్‌స్పెక్టర్ అశ్విన్ ను ఆశ్చర్యంగా చూసింది వైష్ణవీ.

రోడ్డు మీద దాటి వెళుతున్న వాహనాలు, వీధి చివర్లలో రోడ్డు లైట్ల స్తంభాల నుండి మారి మారి వెలుతురు పడుతుంటే, అతని ముఖం రంగుల జాలంగా తెలిసింది. మురళీ దగ్గర మాట్లాడటం కొసం ఆటోలో తిరిగి కూర్చున్నారు ఇన్‌స్పెక్టర్ అశ్విన్. వైష్ణవీ సీటులో వాలిపోయి వాళ్ళ మాటలు వింటూ ఆనందించింది. 

అతని మాటలు వింటూనే ఉండాలని...అతన్ని చూస్తూనే ఉండాలని అనిపించింది వైష్ణవీకి. రెప్ప వాల్చకుండా ఆమె తనని చూస్తూ ఉండటం గమనించిన ఇన్‌స్పెక్టర్ అశ్విన్, మురళీతో మాట్లాడుతూ అప్పుడప్పుడు నవ్వుతున్నాడు.

తమ ఇల్లు వచ్చి ఆటో ఆగిన తరువాత కూడా వైష్ణవీ కదలకుండా కూర్చునే ఉండటంతో, ఆమె మొహం ముందు చిటిక వేసాడు. చటుక్కున లేచింది. మురళీ అంతకుముందే ఆటో దిగేసి ఉన్నాడు.

హలో! ఏమిటీ...నిద్రా?”

లేదు

మీ ఇల్లు వచ్చేసింది?”

ఓ...సారీ! ఏదో...ధ్యాసలో...

నా ధ్యాసలోనా?” అతను చిన్నటి స్వరంతో అడగ గబుక్కున తలెత్తింది.

ఏమన్నారు?”

పోలీసు వాళ్ళకు వీపున కూడా కళ్ళు ఉంటుంది

ఏమంటున్నారు...?” -- తడబడింది.

ఆటోలో ఎక్కినప్పటి నుండి మీరు ఏదో చూస్తున్నారు...ఏమీ ఆలొచించారో చెప్పనా?”

అక్కయ్యా! ఇంకా ఏం చేస్తున్నావు?” తమ్ముడు అడ్డుపడ్డాడు.

ఇదిగో...వచ్చాసా

ఓ.కే.బాయ్. రేపు పొద్దున్నే చూద్దాం. అప్పుడు దీని గురించి మాట్లాడదాం -- అతను అదే చిన్న స్వరంతో చెప్పగా, సమాధానం చెప్పలేక సిగ్గు పడుతూ దిగింది.

సార్! ఇంత దూరం వచ్చారు. ఇంట్లోకి వచ్చి వెళ్ళండి మురళీ బిడియంగా అడిగాడు.

లేదు మురళీ! ఇలా వేల కాని వేల రావటం బాగుండదు. ఇంకో రోజు పగటి పూట వస్తాను

వస్తారా సార్?”

ఖచ్చితంగా. మీ అక్కయ్య ఓ.కే. చెబితే వస్తాను

ఏమిటీ?” -- గబుక్కున అడిగింది వైష్ణవీ.

మీరు పిలిస్తే వస్తానని చెప్పాను

అక్కా! నువ్వు పిలువక్కా

ఉరికే ఉండరా. టైము అవుతోంది. ఆయన వెళ్ళనీ! నువెళ్ళి గేటు తెరు

పో అక్కా! నీకు మ్యానర్స్తెలియదు. సార్! మా ఇంటికి ఖచ్చితంగా రావాలి

ఖచ్చితంగా వస్తాను. బై

బై సార్

వైష్ణవీ! మరిచిపోకండి

ఏమిటి?”

అదే...ఆ ఫోటోని...రేపొద్దున వస్తాను

సరి...సరి

వస్తాను

కొంచం నవ్వుతో చెప్పచ్చే. బై. గుడ్ నైట్ అన్నతను, డ్రైవర్ దగ్గర తల ఊప...ఆటో బయలుదేరి వెళ్ళింది. అది యూ టర్న్ చేసి తిరిగేంత వరకు నిలబడిన వైష్ణవీ, అతను నవ్వుతూ చెయ్యి ఊప, ఆమె కూడా నవ్వింది.

ఆటో కళ్ళను వదిలి కనబడనంత వరకు నిలబడిన ఆమె, తల్లి స్వరం విన్న తరువాత మామూలు స్థితికి వచ్చింది. అందరూ మేలుకునే ఉండి, వైష్ణవీ వచ్చిన వెంటనే ఆమెను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేసి...తన గదిలోకి దూరి పడక మీద వాలిపోయింది.

కళ్ళు మూసుకోవటానికి ఇష్టపడలేదు. ఒళ్ళంతా అలసి పోయున్నా, నిద్ర పోవాలనిపించలేదు. కళ్ళల్లో అశ్విన్ రూపం ఫోటోలా ఉండిపోయింది.

అర్ధం కాని భావన ఆమెను ఆట ఆడించటం మొదలుపెట్టింది. అతని నవ్వు ఆమెను వదలకుండా హింసిస్తోంది. అతని సన్నటి స్వరం చెవిలో వినబడి ఒళ్ళు జలదరింపచేసింది.

రేపు చూద్దాంఅనేమాట తేనెలాగా దూకింది. నిద్ర పోవటానికి మనసురాక లేచి కాళ్ళను చేతులతో చుట్టుకుని పరుపు మీద కూర్చుంది.

తెల్లవారేంత వరకు మేల్కొని...తెల్ల వారిన తరువాత మొదటి వ్యక్తిగా లేచి స్నానం చేసి -- పనులను ముగించి, --ఏడు గంటలకే తయారైన కూతుర్ని ఆశ్చర్యంతో చూసింది తల్లి మేనకా.

ఏంటమ్మా! తొమ్మిదింటికి వెళ్లాల్సిన నువ్వు ఇప్పుడే రెడీ అయి నిలబడ్డావు?”

లేదమ్మా! ఈ రోజు త్వరగా వెళ్ళాలి

ఎందుకు?”

అదొచ్చి...నిన్న స్వేతా దగ్గర మాట్లాడలేక పోయాను. ఇప్పుడు స్ప్రుహలోకి వచ్చుంటుంది. మొదట ఆమెను చూసి మాట్లాడి, మిగిలిన పనులను గమనించాలి! అందుకే

సరే! తినేసి వెళ్ళు. అట్టు వేసివ్వనా?”

వద్దమ్మా! తినడానికి టైము లేదు. నేను బయలుదేరతాను

ఏయ్! నాన్న రెడీ అవద్దా? ఇప్పుడే స్నానానికి వెళ్ళారు

పరవాలేదమ్మా. ఈ రోజు బస్సులో వెళ్తాను

సరే! కాస్త తిని వెళ్ళమ్మా

క్యాంటీన్ లో తింటాను. ఇప్పుడు వెళితేనే బస్సులో గుంపు లేకుండా ఉంటుంది. నాన్న దగ్గర చెప్పు. బై అన్న ఆమె మర్చిపోకుండా ఫోటోను జాగ్రత్త చేసుకుని, తల్లికి వెళ్తున్నట్టు చేతితో సైగ చేసి బయటకు వచ్చింది.

స్వేతా మొహం కొంచం తేటగా కనబడింది. వైష్ణవీ చెప్పిందంతా విని చేతులెత్తి నమస్కరించింది.

థ్యాంక్స్ నర్సమ్మా. నా కోసం మీరు చాలా శ్రమ పడుతున్నారు! దీనికంతా నేనెలా రుణం తీర్చుకోగలనో?”

ఇందులో ఏముంది స్వేతా? ఎలాగైనా నవ్వు నీ భర్తతో కలిసి జీవిస్తే చాలు

ఏమ్మా! నన్ను చూసిన వెంటనే నిలబడి ఒకమాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడే...అతనెలా నన్ను ఏలుకుంటాడు?”

ఏలుకునే కావాలి. నిన్ను మోసం చేసి, వాడు తప్పించుకోవచ్చా? చివరిదాకా నీతో కాపురం చేసి తీరాల్సిందే. నీ బిడ్డకు తండ్రిగా ఉండాలి

ఆ పోలీసాయన ఎలాగైనా కనిపెట్టేస్తారా అమ్మా?”

ఖచ్చితంగా! ఫోటో అడిగారు. తీసుకు వచ్చాను. ఇంకొంచం సేపట్లో ఆయన వస్తారు. నీ దగ్గర కూడా ఏదో విచారించాలి అని కూడా చెప్పారు.....వచ్చి అడిగితే అతని గురించి నీకేమేమి తెలుసో...అన్నీ చెప్పు. అప్పుడే కనిబెట్టటానికి  సులభంగా ఉంటుంది

సరేనమ్మా

నువ్వు బాగా రెస్టు తీసుకో. బెడ్ నుంచి కదలకు! పేషంట్లురావటం మొదలయి ఉంటుంది. నేను వెళ్ళిరానా?”

సరేనమ్మా

తరువాత వచ్చి చూస్తాను అంటూనే తన విభాగానికి వెళ్ళింది. పొద్దున్నే చాలా మంది రోగులు వచ్చి వరుసగా కూర్చోనున్నారు.

డాక్టర్ గదిని చేరుకుని -- చూడాల్సిన రోగుల మెడికల్ రికార్డులు తీసుకుని కాచుకోనుంది. డాక్టర్ వచ్చిన వెంటనే పని మొదలయ్యింది.

వస్తున్న రోగుల దగ్గరున్న మందుల చీటీని తీసుకుని, అందులో గిరికున్న మాత్రలను వెతికి ఇవ్వటం, ఇంజెక్షన్ చేయటం, మందు పెట్టి కట్లు వేయడం లాంటి పనులతో రెస్టు లేకుండా పనిచేస్తున్నా కళ్ళు అప్పుడప్పుడు వాకిలివైపు చూసినై.

టైము పది గంటలై, పదకొండు గంటలై...మధ్యాహ్నం లంచ్ టైమును చేరుకున్న తరువాత కూడా అతను రాలేదు. ఏమై ఉంటుంది...?’

ఎందుకు రాలేదు? ఏదైనా పనులలో ఉన్నారో. సాయంత్రం లోపల వచ్చేస్తారు అని తనని తాను సమాధాన పరచుకున్నా మనసు మోసపోయి కుచించుకుపోయింది.

సాయంత్రం కూడా కళ్ళు అతన్నే వెతికి వాడిపోగా, చీకటి పడిన తరువాత కూడా అతను రాలేదు. రాత్రి డ్యూటీకి వచ్చిన నర్స్ దగ్గర బాధ్యతలన్నిటినీ నిదానంగా అప్పగించి, మామూలుగా వెళ్ళే టైముకంటే ఆలస్యంగా ఆసుపత్రి నుండి ఆమె బయటకు వచ్చినా -- చివరి వరకు అతను రానేలేదు!

***************************************************PART-9******************************************

పూర్తిగా రెండు రోజులు ఎదురుచూసి, అతను కనబడకపోయేసరికి నిరాశపడింది వైష్ణవీ. కొన్ని సార్లే చూసిన ఒకడ్ని తలచుకుని ఇలా పిచ్చి దానిలాగా అయిపోవటం తలచుకుని తనని తానే తిట్టుకుంది.

కళ్ళ ముందు ఒకత్తి పాఠంలాగా ఉన్నా, ఈ పాడు మనసు నిదానం కోల్పోయిందే! ఇక అతన్ని చూడనే కూడదుఅని దృఢంగా నిర్ణయం తీసుకుని, ఆ రోజుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నది వైష్ణవీ.

మేనకా చేతిలో డబ్బు పెట్టుకుని కూతుర్ని చేరుకుంది.

వైష్ణవీ! ఏదైనా పని మీద ఉన్నావా?”

లేదమ్మా! చెప్పండి

లేదూ! పక్కింటి ఉమా కూతురికి ఈ రోజు పుట్టిన రోజట. సాయంత్రం పార్టీపెడుతున్నారట.

సరే

దానికి వెళ్ళాలి. ఏదైనా చిన్న సింపుల్ గిఫ్టుకొనుకొస్తావా?”

ఎంత ఖరీదులోనమ్మా?”

ఒక రెండు వందల రూపాయలలో చూడు

సరేనమ్మా! అంటూనే చదువుతున్న వార పత్రికను మూసేసి లేచింది. వెంటనే తన గదిలోకి వెళ్ళి వేసుకున్న నైటీని తీసేసి, చీర కట్టుకుని బయలుదేరింది.

నాలుగు కొట్లు తిరిగినా పరవాలేదు. మైన్ రోడ్డుకు వెళ్ళిమంచి గిఫ్ట్ వెతికి కొనుక్కురా

సరేనమ్మా! అంటూ ఇంటి నుండి బయటకు వచ్చి మెల్లగా నడవటం మొదలుపెట్టింది. పది నిమిషాల నడక తరువాత మైన్ రోడ్డును చేరుకుని, ఒక పర్టికులర్ షాపు వైపుకు వెళ్తునప్పుడు కనబడ్డాడు అతను.

వైష్ణవీ ఒక్క క్షణం తన కళ్ళను నమ్మలేక మళ్ళీ చూసింది. ఇన్‌స్పెక్టర్ అశ్వినే! మఫ్టీలో నిలబడున్నాడు. ఈమె వెళ్ళాల్సిన షాపు ముందు బైకు ఆపి, దాని ముందు ఆనుకున్నాడు.

అతన్ని చూసిన వెంటనే తుళ్ళిన మనసును కొట్టి అనిచింది. అతన్ని చూడనట్లు కళ్ళను వేరేవైపు తిప్పుకుని నడుస్తుంటే, అశ్విన్ ఆమెను గమనించాడు.

హలో నర్సమ్మా! ఇటు... చప్పట్లు కొట్టి పిలిచినతన్ని కోపంగా చూసింది.

నేనేమన్నా ఆటోనా? చప్పట్లు కొట్టి పిలుస్తున్నారు...?”

సారీ నర్సమ్మా. అవును. ఉద్యోగం టైములో ఏమిటి ఇంత దూరం?”

"ఏం...మీరు మాత్రం ఉద్యోగం సమయంలో షాపింగుకు వచ్చినప్పుడు, నేను రాకూడదా?"

"నేను ఈ రోజు లీవు" అన్నాడు నవ్వుతూ.

"నేను కూడా" విసుగ్గా చెప్పిన ఆమెను చూసి ఆపుకోలేనంతగా నవ్వాడు.

"ఏమిటీ? ఎప్పుడూ నిదానంగా ఉండే నర్సమ్మ, ఈ రోజు చాలా వేడిగా మాట్లాడుతున్నారు? ఎవరి మీద కోపం? ఎందుకు ఇంత వేగం?"

"ఇది అడగటానికే పిలిచారా? నాకు పనుంది" అంటూ నడవ ప్రయత్నించిన ఆమెను పిలిచి ఆపాడు"

ఒక్క నిమిషం!

"ఏమిటి?"

"పొద్దున వస్తానని చెప్పినతను రెండు రోజులు రాలేదే! ఏమిటి...ఎందుకు అని అడగాలని అనిపించటం లేదా?"

"ఎందుకు...ఎందుకు అడగాలి? మీరొక పెద్ద పోలీసు ఆఫీసర్ కదా! మీకు వెయ్యి పనులుంటాయి. ఇందులో మా జ్ఞాపకం వస్తుందా?"

"వచ్చింది"

"ఏ.మి.టీ?"

"రెండు రోజులుగా మీ జ్ఞాపకం మాత్రమే వచ్చింది. కానీ, మాట్లాడటమే కుదరలేదు" -- చేతులు కట్టుకుని అతను మర్యాదగా చెప్పగా...ఆమె ఆశ్చర్యపోయింది.

"ఏం...ఏమైంది?" -- అతన్ని తిన్నగా చూడలేక తడబడింది.

"ఒక కేసు విషయంగా బయట ఊరు వెళ్ళి, ఈ రోజు పొద్దున్నే వచ్చాను. వచ్చిన వెంటనే నిన్ను చూడటానికే ఆసుపత్రికి వెళ్ళాను. నువ్వు 'లీవుఅని చెప్పారు. అందుకని ఆ అమ్మాయిని మాత్రం చూసి వచ్చాను"

"ఎవర్ని... స్వేతానా?"

"ఊ"

"సారీ"

"ఎందుకు?"

"మీరు రాకపోవటంతో కొంచం కోపంగా మాట్లాడాను"

"కొంచం కాదు. ఎక్కువే. అబ్బబ్బ! కోపం వచ్చి నప్పుడు మీ మొహం చూడాలే! ఎంత చిటపటలు"

"అందుకే సారీ చెప్పానుగా"

"సరి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?"

"మా పక్కింటి పిల్లకు ఈ రోజు బర్త్ డే. గిఫ్టు కొందామని వచ్చాను"

"చాలా మంచిదయ్యింది. లేకపోతే నాకు పిచ్చి ఎక్కేది"

"ఎందుకు?"

"బయట ఊరిలో ఉన్నప్పుడే మిమ్మల్ని చూడలేక పోవటాన్ని తట్టుకోలేకపోయాను. ఇప్పుడు పక్కనే ఉండి చూడకపోతే పిచ్చి పట్టదా?"

"ఎవర్ని?"

"ఊ...మా బామ్మను"

"మీ బామ్మ మీద మీకు అంత ప్రేమా?"

"నేను ప్రేమ పెట్టి ఏం ప్రయోజనం? మా బామ్మకు నా మనసు అర్ధం కాలేదే!"

అతను కోపంతో చెప్పగా. ఆమె గలగలమని నవ్వింది. ఆ నవ్వును ఇష్టంతో చూసాడు.

"థ్యాంక్స్"

"దేనికీ?"

"నవ్వినందుకు. నవ్వుతున్నప్పుడు నువ్వు...మీరు చాలా అందంగా ఉన్నారు"

అతని పొగడ్తలతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. మాట మార్చాలనే ఉద్దేశంతో అడిగింది.

"అవును. మీరేమిటి ఇక్కడ?"

"షాపింగుకు వచ్చాము"

"మరెందుకు బయటే నిలబడ్డారు?"

"నేనూ, నా తమ్ముడూ వచ్చాము. తమ్ముడు పర్చేస్ చేస్తున్నాడు. నాకు షాపింగ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే బయట నిలబడి వేడుకు చూస్తున్నాను"

"అవునూ...మీరెందుకు ఈ రోజు లీవు పెట్టారు?"

"అదా...మా ఇంట్లో విశేషం"

"ఏమిటి విషేషం?"

"పెళ్ళి చూపులకు వెళుతున్నాం. ఈ రోజు సాయంత్రం"

వైష్ణవీ మొహం మారింది. "పెళ్ళి చూపులకా?"

"అవునండీ! నేనూ రావాలని ఇంట్లో అందరూ పట్టుబట్టారు. అందుకే..."

"ఓహో! పెళ్ళి కొడుకూ వెళ్ళాలిగా. అదే కదా పద్దతి"-- నిరాశ,నిరుత్సాహంతో చెప్పిన వైష్ణవీని చూసి పెద్దగా నవ్వాడు.

"తమ్ముడు వెళుతున్నాడుగా!"

"ఏమిటీ?"  

వాడే కదా పెళ్ళికొడుకు?” అన్న అశ్విన్ సమాధానంతో మరింత అధిరిపడ్డది. అయ్యో! ఇతను పెళ్ళి అయిన వ్యక్తా? ఇతని మీదా ఆశపడ్డాను...భగవంతుడా!

ఏమిటి వైష్ణవీ? నీ ముఖం మాటిమాటికీ పలువిధాలుగా మారుతోంది?”

మీ తమ్ముడికా పిల్లను చూడబోతున్నారు?”

అవును

అప్పుడు...మీకు...పెళ్ళి...

నాకు పెళ్ళి విషయంలో పెద్దగా తాపత్రయం లేదు. నేను పరిశుద్ద బ్రహ్మచారిని -- అతని మాటలతో పాలులాగా వేడెక్కిన మనసు, మంచులా కరిగింది. చిన్న కన్నీటి బోట్లుతో నవ్వింది.

ఏమిటి సార్ చెబుతున్నారు?”

అవును! నాకు నా ఉద్యోగమే మొదటి భార్య’. దాంతో కాపురం చేయటానికే సమయం చాలటం లేదు. అందులో ఇంకో పెళ్ళి అవసరమా అని దాని గురించి ఆలొచించటం లేదు. అందుకని నాకోసం మాట్లాడి పెట్టుకున్న నా మావయ్య కూతుర్ని...ఇప్పుడు మా తమ్ముడికి ఫైనల్ చేసాము

! అంటే...మీరు...పెళ్ళే చేసుకోబోయేదే లేదా?”

అలాంటి నిర్ణయమే తీసుకున్నాను. కానీ ఇప్పుడు నిర్ణయం వెనక్కి వెళ్ళిపోతోంది

అలాగంటే?”

అంత గొప్ప విశ్వామిత్రుడినే మేనక మత్తులో పడేయలేదూ? అదేలాగా ఒక మేనక, నా తపస్సును బంగం చేసింది

ఎవరూ?”

నీకు తెలియదా?”

మీరు...చెబితేనే కదా తెలిసేది అన్నది గుండె దఢతో.

నిజంగానే తెలియదా?”

ఊహూ

సరే! తెలియకుండానే ఉండనీ అన్నాడు కోపంగా.

కోపమా?”

మీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు తెలియనీ. మేము రోజు పెళ్ళి చూపులకు వెళ్ళి వచ్చిన తరువాత, ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాను

అర్ధం కాలేదే!

కొన్ని విషయాలు అర్ధమవకుండా ఉండటం కూడా ఒకందుకు మంచిదే అన్నాడు మర్మంగా.

సరి! నేను బయలుదేరనా?”

ఒక విషయం మరిచిపోయారే!

ఏమిటి?”

...ఫోటో...

! సారీ సార్. మీ దగ్గర ఇవ్వాలనే నా హ్యాండ్ బ్యాగులోనే పెట్టుకున్నా...ఒక్క నిమిషం అంటూ హ్యాండ్ బ్యాగు తెరవటానికి ప్రయత్నిస్తున్న ఆమె చూపులు, అతను ఆనుకుని నిలబడ్డ బైకు మీద పడగా...ఒక్క సారిగా అధిరిపడ్డది.

బైకుకు ముందు ఎర్ర రంగులో కపాలం బొమ్మ అతికించబడి ఉంది.

ఆయన బైకు మీద ఎర్ర రంగు కపాలం స్టిక్కర్ అతికించి ఉంటుంది’ -- స్వేతా స్వరం వినబడ -- ఆశ్చర్యంతో అతన్ని సూటిగా చూసింది.

సార్... బైకు?”

మాదే

మీదా?” -- మనసు మంటలలో కాలుతున్నట్లుంది.

అవును! నా తమ్ముడి బైకు...ఎందుకు అడుగుతున్నావు?”

అదొచ్చి...మీ తమ్ముడి...పేరు...ఏమిటో తెలుసుకోవచ్చా?”

ఖచ్చితంగా. తమ్ముడి పేరు ప్రతాప్ -- అతను సహజంగా చెప్పటంతో, మనసులో ఎగిసి పడుతున్న మంటలు అగ్ని పర్వతంలా పేలింది. నిదానంగా శ్వాస పిలుస్తూ నవ్వింది.

ఏమైందీ? ఎందుకు నీ మొహంలో అంత గందరగోళం?”

అది...అదొచ్చి సార్... స్వేతా భర్త బైకు మీద కూడా ఇదేలాగా ఎర్రటి కపాలం స్టిక్కర్ ఉందని స్వేతా నాతో చెప్పింది

ఓహో! అందువల్ల...మా తమ్ముడేమోనన్న...

అనుమానపడలేదు. అడిగిపెట్టుకుందామని...

తప్పులేదు. అవునూ! స్వేతా భర్త పేరేమిటి?”

నాగరాజ్

ఫోటో ఇవ్వండి చూద్దాం అతను అడిగిన వెంటనే ఫోటో తీసి ఆయనకు ఇవ్వబోతున్నఅదే సమయం --

హలో అశ్విన్...ఎంత ఆశ్చర్యం? నిన్ను చూడటమే చాలా కష్టంగా ఉందే -- ఆనందంగా అశ్విన్ వీపు మీద చిన్నగా దెబ్బవేసాడు.

హాయ్ రా! ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులయ్యింది

ఇద్దరూ ఒకర్ని ఒకరు హత్తుకున్నారు.

తరువాత...ఎలా ఉన్నావు?”

బాగున్నాను. ఏమిట్రా ఇది...ఏమిటింత పెద్ద పొట్ట పెంచావు?”

రేయ్, అది వదలరా! మనం ఒకటిగా చదువుకున్నాము. నేనిప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రిని. నువ్వు ఇంకా యూత్ గానే ఉన్నావు. ఎప్పుడ్రా పెళ్ళి భోజనం పెట్టబోతావు?”

పెట్టాలి. త్వరగా పెడతాను -- అశ్విన్ సిగ్గు పడుతూ వైష్ణవీని చూస్తూ చెప్పగా, ఆమె అవస్తతో వంకర్లు పోయింది.

సార్...నేను బయలుదేరతాను!

యా! స్యూర్. మనం తరువాత కలుసుకుందాం

ఫోటో?”

ఇవ్వండి తీసుకున్నాడు. దాన్ని చూసేలోపు రాజేష్ మాట్లాడాడు.

రేయ్! ఎవర్రా అది? కొత్తగా ఉంది!

అదా...తెలిసిన వాళ్ళు

తెలిసినవాళ్ళంటే?”

తెలిసినవాళ్ళు...కెలకకు! సరే...ఏదైనా తిందామా?”

లేదురా. భార్యతో వచ్చాను. ఆమె కారులో కాచుకోనుంది. నిన్ను చూసిన వెంటనే వచ్చాసాను

సరే! నువెళ్ళు. నేనూ బయలుదేరతాను

సరేరా అతను బై చెప్పి బయలుదేర, అశ్విన్ కళ్ళు వైష్ణవీని వెతికినై. ఆమె వెళ్ళిపోయింది.

విసుగ్గా వెనక్కి తిరిగిన అతనికి, తన చేతిలో ఉన్న ఫోటో జ్ఞాపకం రావటంతో...అర్జెంటుగా దాన్ని చూసాడు. చటుక్కున హృదయం అధిరింది.

షాక్ తగిలినట్లు అయిన అశ్విన్ తేరుకుని, నిటారుగా నిలబడి మళ్ళీ చూసాడు. పొద్దున ఆసుపత్రిలో చూసిన అదే అమ్మాయి. చాలా అందంగా ఉంది. అమెతో పాటూ ఆమె భుజం మీద చేయి వేసుకుని నిలబడున్నది అతని తమ్ముడు   ప్రతాప్.

చేతులు వణకటంతో, చేతిలో ఉన్న ఫోటో ఆడింది. వీడు నా తమ్ముడేనా? నాగరాజ్ అన్నదే?  ఒకవేళ ఒకే రూపం ఉన్న వాళ్ళా? ఛఛ...అదంతా సినిమాలో మాత్రమే సాధ్యం. ఇది ప్రతాపే.

డ్రస్సు కూడా అతనిదే? అలాగైతే నేరస్తుడు నా తమ్ముడే. తన పేరు కూడా మార్చి -- ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసాడు అంటే వాడు ఎంతో పెద్ద మోసగాడు అయ్యుండాలి?

పోలీసోడి ఇంట్లోనే దొంగా? నీకు పెళ్ళి చెయ్యాలనుకున్నానే! రా...అన్నిటికీ కలిపి విందు పెడతా. తాలికట్టిన భార్య, కడుపులో బిడ్డతో ఆసుపత్రిలో ప్రాణం కోసం పోరాడుతున్నదే. నీకు ఇంకో పెళ్ళా? రారా...రా!పళ్ళు కొరుక్కుంటూ తమ్ముడి రాక కోసం కోపంతో కాచుకోనున్నాడు.

***************************************************PART-10*****************************************

రెండు చేతులతోనూ పెద్ద పెద్ద పాలితిన్సంచీతో బయటకు వచ్చాడు ప్రతాప్. బైకుతో నిలబడున్న అశ్విన్ దగ్గరకు వచ్చి నవ్వుతూ అడిగాడు.

ఎవరన్నాయ్యా అది?”

ఎవరు?”

కొంచంసేపటికి ముందు ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావే?” ప్రతాప్ ఆత్రుతగా అడగ, ఆలొచిస్తూ అతన్ని చూసాడు.

నువ్వెప్పుడు చూసావు?”

మొదటి ఫ్లోరులో నిలబడి కొంటునప్పుడు చూసాను

షాపింగ్ అయిపోయిందా? బండి ఎక్కు

లేదన్నయ్యా! ఇంకా షూకొనలేదు. షాపులో ఏదీ నచ్చలేదు

అయితే తరువాత కొనుక్కుందాం. బండి ఎక్కు అని చెబుతూ మోటారు సైకిల్ను స్టార్ట్ చేసాడు.

ఒక పది నిమిషాలు వెయిట్చెయన్నయ్యా. ఇదిగో షాపుకు వెళ్ళి కొనుక్కుని...

ఎక్కు అని చెప్పాను -- అశ్విన్ స్వరంలో కఠినం కనబడింది. ప్రతాప్ ముఖం మారింది. అయోమయంతో సీటు మీద ఎక్కి కూర్చున్న తరువాత, బండి వేగం పుంజుకుంది.

అన్నయ్యా...

...

ఏదైనా ప్రాబ్లమా?”

ఎందుకు అడుగుతున్నావు?”

లేదు...నీ మొహమే సరిలేదు! ఎవరది? నీ దగ్గర ఏం మాట్లాడారు?”

చాలా మాట్లాడింది. ఇంటికిరా. అన్నీ వివరంగా చెబుతా -- దాంతో మాటలను ఆపి, మామూలు కంటే వేగంగా బైకును నడిపాడు.... ప్రతాప్ కు ఏదో  భయం.

ఎవరామె...ఏం మాట్లాడుంటుంది? అన్నయ్య మొహమూ...మాటలూ సరిలేవే! ఏం జరిగుంటుంది? ఒకవేళ వచ్చినామె...తన గురించి ఏదైనా చెప్పుంటుందో? ఛఛ! ఆమె ముఖం కూడా సరిగ్గా కనబడలేదే...

దిగు -- అశ్విన్ బెదిరింపు దోరణిలో చెప్పాడు.

అరె...ఇల్లు వచ్చేసిందా?’

చేతిలో వస్తువులతో ప్రతాప్ ఇంట్లోకి వెళ్ళ -- బైకును నిలిపి తాళం వేసి లోపలకు  వెళ్ళిన వెంటనే, మొదటి పనిగా తలుపు మూసి గొళ్ళేం పెట్టాడు అశ్విన్.

కొడుకులు ఇంట్లోకి రావటాన్ని తెలుసుకుని బయటకు వచ్చిన మీనాక్షీ, పెద్ద కొడుకు చేష్టతో ఆందోళన చెందింది.

ఎందుకురా! తలుపు మూసి గొళ్లెం ఎందుకు వేసావు?”

కారణం ఉందమ్మా. నాన్న ఎక్కడ?”

మీ మావయ్య దగ్గర ఫోనులో మాట్లాడుతున్నారు. సాయంత్రం పెళ్ళి చూపులకు వస్తున్న సంగతి గురించి...

నాన్నా...నాన్నా! -- కొడుకు అరుపు విని సెల్ ఫోనుతో ముందు గదిలోకి వచ్చిన గంగాధరం దగ్గరున్న సెల్ ఫోన్ను లాక్కుని, ఫోనును కట్ చేసాడు.

రేయ్! మావయ్య లైన్లో ఉన్నారురా

ఇక్కడ దాని కంటే ముఖ్యమైన విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతాప్! బయటకు రా - ప్రతాప్ గది దగ్గరకు వెళ్ళి అరిచాడు.

కొడుకు చేష్టలను చూసి అయోమయంలో పడ్డ తల్లి-తండ్రులు ఒకరినొకరు చూసుకున్నారు.

అశ్విన్! ఏమిట్రా...ఏదైనా సమస్యా?”

ఒక్క నిమిషం నాన్నా! ప్రతాప్ వస్తున్నావా...లేదా?”

ఇదిగో వస్తున్నా. నన్ను బాత్ రూముకు కూడా వెళ్ళనివ్వవా? ఏమిటంత తలపోయే అవసరం?”

చొక్కా విప్పేసి, బనియన్ తో బయటకు వచ్చాడు ప్రతాప్.

ప్రతాప్! నీకు స్వేతా అని ఎవరినైనా తెలుసా?” ముక్కు సూటిగా అడిగిన ప్రశ్నతో ప్రతాప్ మొహం వాడిపోయింది. విరుచుకున్న కళ్ళల్లో భయం కనబడ, అశ్విన్ నరాలు గట్టిబడ్డాయి. 

ఒక్క క్షణమే...మరు క్షణమే మామూలు పరిస్థితికి వచ్చాడు ప్రతాప్. నిర్లక్ష్యంగా భుజాలు ఎగరేసాడు.

స్వేతానా? పేరుతో...ఎవర్నీ తెలియదే!

అలాగా? అయితే నాగరాజ్ అని ఎవరి నైనా తెలుసా?”

ప్రశ్నతో పొత్తి కడుపు తిప్పింది. అన్నయ్యకు ఏదో తెలిసింది. ఇక జాగ్రత్తగా ఉండాలి’ -- తనలోనే తను స్థిరపరచుకుంటుంటే మళ్ళీ అశ్విన్ అడిగాడు.

చెప్పరా! నాగరాజ్ అని ఎవరినైనా తెలుసా?”

అన్నయ్యా...నీకేమయ్యింది. ముఖం కడుక్కుంటున్న వాడ్ని పిలిచి సంబంధమే లేని ప్రశ్నలు అడుగుతున్నావు?”

ప్రతాప్! అడిగినదానికి కరెక్టుగా జవాబు చెప్పు

నువ్వు చెప్పే పేరును నేను ఇంతవరకు వినలేదు

అబద్దం చెప్పటం నాకు నచ్చదు

నాయనా అశ్విన్! ఏమయిందయ్యా నీకు? ఒకటే అయోమయంగా ఉందే?”

ఇంకాసేపట్లో అంతా క్లియర్ అయిపోతుంది నాన్నా అన్న అతను తన చొక్కా జేబులో నుండి ఫోటోను తీసి తమ్ముడి మొహం ముందు చూపించాడు.

ఇప్పుడు స్వేతా ఎవరో తెలిసుండాలే?”....తన ముందు జాపిన ఫోటోను చూసి అతని మొహం పాలిపోయింది.

ఇదెలా మర్చిపోయాను?’ -- అర్జెంటుగా బుర్రను కెలికి ఆలొచిస్తున్న అతని చొక్కాను గట్టిగా పుచ్చుకుని తనవైపు లాగాడు అశ్విన్.

ఏమిట్రా తెల్లబోతున్నావు? ఇది నేను కాదు. ఎవరో గ్రాఫిక్స్ చేసి ఉంటారని మూర్ఖంగా వాదించావా...పళ్ళు మొత్తం ఊడిపోతాయి. రాస్కెల్

మీనాక్షీ ఆందోళన చెందింది. అయ్యో! ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రతాప్...ఏం తప్పు చేసావురా?”

నేను ఏం తప్పు చేయలేదమ్మా. అన్నయ్య నన్ను అనవసరంగా బెదిరిస్తున్నాడు -- చెప్పి ముగించేలోపు ఛల్లుమని కొట్టాడు ప్రతాప్ చెంప మీద. ముగ్గురూ ఆశ్చర్యపోగా, తమ్ముడ్ని లాగాడు.

నువ్వు ఏం తప్పూ చేయలేదూ?”

లేదు...లేదు

అప్పుడు ఈమె ఎవరు?”

నన్నడిగితే...? నేను ఈమెను చూసింది కూడా లేదు అన్న తమ్ముడ్ని మళ్ళీ కొట్టాడు.

ఇప్పుడెందుకు నన్ను అనవసరంగా కొడుతున్నావు?” అని ఆవేశంగా ఎదురుతిరిగిన తమ్ముడి మీద మరో దెబ్బ పడింది.

చేసిన తప్పంతా చేసేసి...నన్నే ఎదిరిస్తావా? నా దగ్గరే మోరాయింపా? చర్మం వొలుస్తా రాస్కెల్ అన్న అన్నయ్య దగ్గర నుండి తనని విడిపించుకుని తల్లి వెనుకకు వెళ్ళి దాక్కున్నాడు ప్రతాప్.

అమ్మా! నీ పెద్ద కొడుకు పోలీసు అయితే...అతని అధికారాన్ని స్టేషన్ వరకు చూపించమని చెప్పు. నా దగ్గర వద్దు

ఏమిట్రా చెబుతున్నావు?” -- అంటూ వేగంగా తమ్ముడి వైపు వచ్చిన అతన్ని తల్లి మీనాక్షీ ఆపింది.

అశ్విన్! ఏమిటయ్యా ఇది? భుజాల పైకి ఎదిగిన తమ్ముడ్ని కొట్టేంత తప్పు ఏం జరిగిందయ్యా?”

అమ్మా! వీడు ఏం కార్యం చేసేడో తెలుసా?”

ఏం చేసేడు?”

ఒకమ్మాయిని మోసం చేసి, పెళ్ళి చేసుకుని, ఆమెను గర్భవతి చేసాడు

ఏమిటీ?” -- కన్నవాళ్ళు షాకై చిన్న కొడుకును చూశారు. వాడు నిర్లక్ష్యంగా మాట్లాడాడు.

నువ్వు చూసావా? నేను ఆమెను మోసం చేసేననటానికి ఏమిటి సాక్ష్యం?”

చేతులో ఉంచుకున్నానే ఫోటోనే. దీనికంటే వేరే ఏం సాక్ష్యం కావాలి?”

ఫోటోలో నేనేమన్నా ఆమెకు తాళి కడుతున్నట్టు ఉన్నాన్నా...లేదు కుటుంబం నడుపుతున్నట్టు ఉన్నానా? ఏది చూసి ఆమెను మోసం చేసేనని నేరం మోపుతున్నావు?”

రేయ్! తెలివిగా మాట్లాడుతున్నట్టు అనుకుని తప్పు మీద తప్పు చేయకు! నిజం వొప్పుకో. అమ్మాయి ఆరొగ్యం బాగాలేక ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది.

రా! నేరుగా చూసి, చేసిన తప్పుకు క్షమాణలు అడిగి ఆమెను ఏలుకో. అదే నీకూ, మన కుటుంబానికీ మంచిది

తప్పే చేయలేదని చెబుతున్నాను. నేనెందుకు క్షమాపణ అడగాలి? అమెకూ, నాకూ సంబంధమే లేదు

సంబంధం లేకుండానా ఆమె భుజాలపై చెయ్యి వేసి ఫోజుఇస్తున్నావు?” -- అశ్విన్ ఆవేశంగా అడుగ, ప్రతాప్ చప్పట్లు కొడుతూ నవ్వాడు.

శభాష్! నేను అనుకున్నది కరెక్ట్ అయ్యింది. ఇదంతా నీ పనా? నువ్వు తెలివిగల వాడివి అన్నయ్యా. నాన్నా! నీ పెద్ద కొడుకు కేడీలతో గడిపి గడిపి క్రిమినల్గానే అయిపోయాడు

ఏమిట్రా వాగుతున్నావు?" అంటూనే తమ్ముడి చొక్కా పట్టుకుని లాగ, అన్నయ్యను నిర్లక్ష్యంగా తొసేడు ప్రతాప్.

నాన్నా! నీ పెద్ద కొడుకు చేసిన క్రిమినల్ పనేమిటో నేను చెబుతాను! నాకు డ్యూటీ, నిజాయతీ, నా కాకీ యూనీఫారం...ఇవి మాత్రమే ముఖ్యం. పెళ్ళి జీవితం మీద ఇంటరెస్టు లేదుఅని వీడు చెప్పిందంతా అబద్దం

రేయ్. నీ ఇష్టం వచ్చినట్టు వాగకు. మాటమార్చి తప్పించుకుందామని చూస్తున్నావా?”

నేనేమీ తప్పే చేయలేదని చెబుతున్నానే? మరెందుకు తప్పించుకోవటానికి ప్రయత్నించాలి? నువ్వు చేస్తున్న పనులన్నీ అమ్మా-నాన్నలకు తెలియదు?”

నేనేం చేసాను?”

అన్నీ నువ్వే చేసావు! నాన్న, ఫోటో...నా స్నేహుతుడు రాధాతో నేను బీచ్ లో తీసుకున్నది. ఇందులో నేను, అతని భుజాల మీదే చెయ్యి వేసుకున్నాను. దీన్ని ఏదో ఒక ట్రిక్కు చేసి అన్నయ్యే మార్చాడు

యూఇడియట్! నేనెందుకురా మార్చాలి?”

ఉండు...చెప్తాను. ఎవత్తో ఒకత్తితో ఫోటోను సెట్ చేసి -- దాన్ని మీరందరూ నమ్మేటట్టు చేసి -- నాకు జరగబోయే పెళ్ళిని ఆపాలనే మీ పెద్ద కొడుకు ఇంత క్రిమినల్ పని చేసాడు

ప్రతాప్ నేరంపై నేరాన్ని తనపై మోపటంతో అశ్విన్ కొంచం తడబడ్డాడు. ఎప్పుడూ సరదాగా, సంతోషంగా తిరుగుతున్న ప్లే బాయ్ కుర్రాడు వీడు అనుకున్నామే? తనపైన ఉండే తప్పును దాచటానికి, కొంచం కూడా సంసయం లేకుండా అవతలి వారి మీద ఇన్ని నెపాలు భయం లేకుండా మోపుతున్నాడు అంటే, వీడికి అబద్దం చెప్పటం కొత్తేమీ కాదేమో?

సర్వ సాధారణంగా అబద్దం -- నేరం చేసే వాడి వలన మాత్రమే ఇది సాధ్యం? కొంచం కూడా తడబడకుండా ఇన్ని అబద్దాలను చెబుతున్నాడే?’ - అనుకుంటూ స్టన్ అయ్యి మౌనంగా నిలబడ్డ అన్నయ్య పరిస్థితిని ఫేవర్ గా చేసుకున్నాడు తమ్ముడు

ఇలా అన్ని తప్పులూ వాడు చేసేసి, పెద్ద యోగ్యుడిలాగా నన్నుకొడుతున్నాడు

ప్రతాప్! వాడే కదా మీ మావయ్య దగ్గర మాట్లాడి కమలాను నీకు ఇచ్చి పెళ్ళి చేయటానికి ఒప్పించాడు. వాడెలా నీ పెళ్ళిని ఆపుతాడు

అంతా నటనమ్మా! అప్పుడే కదా వాడి మీద మీకు నమ్మకం కలుగుతుంది.   మావయ్య ఒత్తిడి తట్టుకోలేక నాకు కమలాను వదిలిపెట్టటానికి ఒప్పుకున్నట్టు చేసాడు.

నా పెళ్ళి విషయం వాడి ప్రేమికురాలికి తెలిసుంటుంది. ఇంట్లో అన్నయ్యను ఉంచుకుని తమ్ముడికి పెళ్ళి చేయటం, వీడికి అవమానమే కదా? రేపు వీడికి పిల్లనిచ్చేవాళ్ళు ఆలొచిస్తారు కదా?

విషయం అమ్మాయి చెప్పుంటుంది. వెంటనే నా దగ్గరకు వచ్చి పూనకం వచ్చినట్టు ఆడుతున్నాడు. తమ్ముడూఇప్పుడు పెళ్ళి వద్దు. నా పెళ్ళి అయిన తరువాత, నువ్వు చేసుకోరా అని చెప్పుంటే నేను చేతులు కట్టుకుని సరి అని చెప్పే వాడిని. ఇంత గందరగోలం చేసి నన్ను అవమాన పరచక్కర్లేదే. మావయ్య ఇంటికి తెలిస్తే ఏమవుతుంది? నన్ను ఎవరైనా గౌరవిస్తారా?

వాడి బుద్ది ఎందుకమ్మా ఇలా పోతోంది? నేను వాడి తోడబుట్టిన తమ్ముడ్నే కదా? నన్నెందుకు ఇంత నీచంగా అనుకుంటున్నాడు?”

చాలురా -- గంగాధరం పెద్ద స్వరంతో ప్రతాప్ ను ఆపాడు. ప్రతాప్ బెదిరిపోయాడు.

నానాన్నా

నాకు నా పెద్ద కొడుకు గురించి తెలుసురా. వాడ్ని నువ్వేమీ వేలెత్తి చూపకు? అబద్దం ఆడటం నీకేమన్నా కొత్తా?”

లేదు నాన్నా! వాడు చెప్పింది నిజం -- అశ్విన్ జవాబు విని కన్నవారు మాత్రమే కాదు, ప్రతాప్ కూడా ఆశ్చర్యపోయాడు.

అశ్విన్! ఏమిటయ్యా...చెబుతున్నావు?”

అవును నాన్నా! నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. రోజు ప్రతాప్, నాతో పాటూ  చూసిన అమ్మాయి ఆమే -- ఖచ్చితమైన స్వరంతో అశ్విన్ చెప్ప, తమ్ముడి బుర్రలో మెరుపు మెరిసింది.

అరే! మనం కథలాగా ఏదో ఒకటి మాట్లాడితే...అది కూడా వర్క్ అవుట్అవుతోందే ప్రతాప్! నిన్నెవరూ ఇక ఏమీ చెయ్య లేరురాతనని తానే మెచ్చు కుంటునప్పుడు, అశ్విన్ అతన్ని వదిలి నడిచాడు.   

కానీ, ప్రతాప్ చెప్పిందాంట్లో ఇదొక్కటే నాన్నా నిజం. నేనే దీని గురించి మీతో మాట్లాడాలని అనుకున్నా. అంతలోపు మావయ్య వచ్చి పెళ్ళి చూపులకు మంచి రోజు చూసేసారు.

సరె! మంచి కార్యం...మనవల్ల చెడిపోకూడదు. మొదట అమ్మాయిని చూడనీ. తరువాత, మీ దగ్గర చెప్పి మా ఇద్దరి పెళ్ళిళ్ళూ ఒకే వేదికలో చేయండని చెప్పాలనుకున్నా.

కానీ, తమ్ముడే చెప్పేసేడు. సరే! నా విషయాన్ని తరువాత మాట్లాడుకుందాం. మొదట మావయ్య కు ఫోను చేసి, జరగబోతున్న పెళ్ళి చూపుల ప్రొగ్రామ్ను క్యాన్సిల్ చేయమని చెప్పు అంటూనే గోడ మీద తాళం చెవితో వెలాడుతున్న ఇత్తడి తాళం ను చేతిలోకి తీసుకున్నాడు.

మీనాక్షీ ఆందోళన పడింది. ఎందుకబ్బాయ్ పెళ్ళి చూపులు ఆపడం? నువ్వే కదా...ఒకే వేదిక మీద రెండు పెళ్ళిళ్ళూ జరుపుదామని చెప్పావు?”

అమ్మా! నీ చిన్న కొడుక్కి ఇదివరకే పెళ్ళి అయిపోయింది. కోడలు ఇప్పుడు ఏడు నెలల గర్భిణి. మనం శ్రీమంతమే చేయాలి

ఏయ్! ఏమిటి మళ్ళీ ఏదేదో వాగుతున్నావు?”  అని బెదిరిన ప్రతాప్ గొంతు పుచ్చుకుని లాగి, తన గదిలోకి తోసి, తలుపులకు తాళం వేసి, తాళం చెవిని తన ప్యాంటు జేబులో  వేసుకున్నాడు.

ఏయ్! తలుపు తెరవరా. నన్నెందుకు గదిలొ పెట్టి తాళం వేసావు? మర్యాదగా తలుపు తెరు

అశ్విన్! ఏమిటయ్యా ఇది? వాడ్ని ఎందుకు బంధించి ఉంచావు?”

బంధించకపోతే తప్పించుకు పారిపోతాడమ్మా

అశ్విన్?”

మనమేనమ్మా వాడ్ని ఇంకా పిల్లాడిగానే అనుకుంటున్నాము. కానీ, వాడు పెద్ద పెద్ద కార్యాలన్నీ చేసాడు. అవి తెలిసి కూడా వదిలేస్తే...వీడు ఇంతకంటే పెద్ద మోసగాడు అయిపోతాడు

అశ్విన్! ఏంటయ్యా చెబుతున్నావు?”

నాన్నా...నా మీద మీకు నమ్మకం ఉంది కదా?”

ఉందయ్యా...చాలా ఉంది

అయితే నాకోసం కొంచం సేపు వీడి అరుపులను ఓర్చుకోండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను

ఎక్కడికయ్యా వెడుతున్నావు?”

వాడు చేసిన తప్పుకు సాక్ష్యం అడిగేడే! దాన్ని తీసుకు రాబోతాను. దయచేసి నేను తిరిగి వచ్చేంతవరకు తలుపులను తెరవటానికి ఎవరూ ప్రయత్నించకండి. మీమీద నాకు గొప్ప నమ్మకం ఉంది. అందుకే దీని డూప్లికేట్ కీతీసుకు వెళ్లకుండా వెడుతున్నాను. పుత్ర ప్రేమకు లొంగిపోకండి. లేకపోతే ఆమయకురాలి శాపం మన వంశాన్నే నాశనం చేస్తుంది

అన్నయ్యా! నీకు నా గురించి తెలియదు. మర్యాదగా తలుపులు తెరిచేయి

లోపు ఇంకేం అబద్దం చెప్పి తప్పించుకోవాలో ఆలొచించుకో ప్రతాప్. నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూనే మోటర్ సైకిల్ తాళం చెవిని తీసుకుని బయటకు వెళ్ళాడు.

ప్రతాప్ అరుపులు ఆగకుండా వినబడుతూనే ఉండగా, మీనాక్షీ కళ్ళల్లో నీరుతో నేలమీద కూర్చుంది.

ఇద్దరూ నేను కన్న పిల్లలే! ఇందులో పిల్లాడు చెప్పేది నిజం...ఎవరు చెప్పేది నమ్మాలి?’ -- అయోమయంతో తల పుచ్చుకున్నారు గంగాధరం.

***************************************************PART-11*****************************************

మధ్యాహ్నం భోజనంలో చేయి పెట్టిన సమయం, వైష్ణవీని ఫోను పిలిచింది. మేనకా విసుక్కుంది.

ఛీఛీ! ఇదొకటి...ఎప్పుడు చూడూ మోగుతూనే ఉంటుంది. వైషూ! భోజనంలో చెయ్యి పెట్టిన తరువాత లేవకు. నేను తీసుకు వస్తాను

త్వరగా తీసుకురా...కట్ అయిపోతుంది

అయితే అవనీ...వదులు. నువ్వు సెలవు పెట్టటమే ఒక పెద్ద ఆశ్చర్యం. సెలవు రోజైనా ఒక గుప్పెడు భోజనం ప్రశాంతంగా తినగలుగుతున్నావా?” అంటూనే తరుముతున్న ఫోనును తీసి కూతురికి ఇచ్చింది.

హలో

వైష్ణవీ సిస్టరే కదా?”

అవును...చెప్పు గాయిత్రీ

సిస్టర్! స్వేతా అనే పేషంట్ ఉంది కదా...

అవును! ఏమయ్యింది? ఏదైనా సమస్యా?”

లేదు. ఆమె దగ్గర ఏదో విచారణ చేయాలని ఇన్స్పెక్టర్... -- గాయిత్రీ మాట్లాడుతున్నప్పుడే ఫోన్ చేతులు మారింది.

గాయత్రీ?”

వైష్ణవీ! నేను ఇన్స్పెక్టర్ అశ్విన్ అన్న స్వరంతో నరాలు జివ్వుమన్నాయి. మనసు తుళ్ళిపడింది.

సార్! మీ...రా?”

వైష్ణవీ! కొంచం ఆసుపత్రి వరకు రాగలరా?”

ఏమిటి సార్...ఏదైనా సమస్యా?”

అవును! మీరొస్తే కొంత బాగుంటుంది. అమ్మాయి నన్ను చూస్తేనే భయపడుతోంది

స్వేతానా?”

అవును...ఆమె దగ్గర కొంచం విచారణ చేయాలి. కానీ, ఏదడిగినా భయపడుతోంది, బెదిరిపోతోంది

దేని గురించి సార్ విచారణ?”

ఆమె పెళ్ళి గురించి... నాగరాజ్ గురించి

అది నేనే మొత్తం చెప్పాను కదా?”

లేదు. నాకు దానికంటే చాలా వివరాలు కావాలి. ఏదైనా ఆధారాలు కావాలి. అప్పుడే...

సార్...ఒక్క నిమిషం!

ఏమిటి?”

మీరు మాట్లాడేది చూస్తే...అతన్ని కనిబెట్టాసారా? ఎవరు సార్? ఇప్పుడు మీతో  ఉన్నాడా?”

లేదు. ఇంట్లో బంధించి ఉంచాను

ఏమిటీ?”

మనకి భయం అక్కర్లేదు వైష్ణవీ. మీరొస్తేనే కేసులో మనం ముందుకు వెళ్ళగలం

ఇదిగో బయలుదేరుతున్నా. ఒక్క పది నిమిషాల్లో అక్కడుంటాను. పెట్టేస్తాను -- అంటూనే ఫోన్ కట్ చేసి, పరిగెత్తుకు వెళ్ళి చేతులు కడుక్కుంది.

ఏయ్ వైషూ! ఏం చేస్తున్నావు?”

అమ్మా! స్వేతా భర్త దొరికినట్లు తెలుస్తున్నది. అశ్విన్ సార్ ఇప్పుడే ఫోన్ చేసారు!

అది ఎవరే?”

అదే... రోజు మురళీ చెప్పాడే

ఎవరు! పోలీసతనా? అతనెందుకే నీకు ఫోన్ చేస్తున్నాడు?”

అమ్మా! ఎందుకు కంగారు పడతావు? ఆసుపత్రికి వెళ్ళొచ్చి అంతా వివరంగా చెబుతాను. బై...మ్మా -- గబగబమని తన హ్యాండ్ బ్యాగును తీసుకుని బయలుదేరింది.

హూ! ఏం ఉద్యోగం ఇది? ఇలా తినకుండా పరిగెత్తితే ఆరొగ్యం పాడైపోతుంది. మొదట ఉద్యోగం మానేయ్ -- తల్లి మాటలు గాలిలో కలిసినై.

అంతలో మైన్ రోడ్డుకు వచ్చేసింది. బస్సుకోసం కాచుకుంటే టైము అయిపోతుంది అని డిసైడ్  చేసుకుని రోడ్డు మీద ఖాలీగా వెడుతున్న ఆటోను ఆపి, అందులో ఎక్కింది వైష్ణవీ.

ఆమె మనసు బాగా కంగారుపడింది. అతను ఎవరై ఉంటాడు? ఫోటో ఇచ్చిన కాసేపట్లోనే కనిబెట్టేసారే! మురళీ చెప్పినట్టు ఈయన బాగా తెలివిగల వ్యక్తే. ఎలాగైతే ఏం, స్వేతాకి జీవితం తిరిగి దొరికితే చాలు.

అతన్ని గనుక నేరుగా కలిస్తే, నాలుగు మాటలు బాగా అడగాలి. ఆడవాళ్లంటే ఆడుకునే వస్తువులు అనుకుంటున్నాడా? కుదిరితే అశ్విన్ తో చెప్పి, నాలుగు లాఠీ దెబ్బలు వేయమని చెప్పాలి.

అప్పుడే భయం అనేది ఉంటుంది. ఇంకోసారి ఆమెను వదిలేసి పారిపోదాం అనుకోడు. ఒక వేల... స్వేతా చెప్పినట్టు వాడికి ఇంకో పెళ్ళి జరిగుంటే...?’

అమ్మగారూ! ఆసుపత్రి వచ్చింది -- ఆటో అతను చెప్పగా ఆలొచనల నుండి బయటకు వచ్చింది. డబ్బులు ఇచ్చేసి, గాలివానంత వేగంతో స్వేతా ఉన్న వార్డు వైపు నడవ...ఆమె బెడ్ దగ్గర నిలబడి ఏదో అడుగుతున్నాడు అశ్విన్.

ఆయసపడుతూ లోపలకు వెళ్ళింది. ఎక్స్ క్యూజ్ మి సార్

హలో...రండి వైష్ణవీ. సారీ! మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను

లేదు...లేదు. స్వేతా విషయంలో మంచి జరిగితే నాకు అదే చాలు. చెప్పండి సార్...అతన్ని కనిబెట్టేసారా?”

దగ్గర దగ్గర

అలాగంటే?”

మీరిచ్చిన ఫోటో, చెప్పిన గుర్తులు అన్నీ పెట్టుకుని ఒకడ్ని పట్టుకుని ఉంచాను. కానీ...పేరు మాత్రం తేడాగా కనబడుతోంది

ఏమిటి సార్?”

నేను పట్టుకున్న అతని పేరు నాగరాజ్ కాదు

మరి?”

అతని పేరు... ప్రతాప్

ఏమిటీ? ప్రతాపా... అన్న ఆమె, కొంచం కంగారు పడి అతని మొహంలోకి చూసి అడిగింది.

అది...మీ...తమ్ముడు

అవును మౌనంగా తల ఊపాడు.

అలాగా! ఇది...ఎలా? నేను నమ్మలేకపోతున్నా

నేను కూడా నమ్మలేకపోతున్నా! అమ్మాయితో నాలుగు నెలలు కాపురం చేసాడు. కానీ, మా ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు. ఎప్పుడూ లాగా వస్తాడు...వెళ్తాడు.

సగం రోజులు నైట్ డ్యూటీఅని చెబుతాడు. .టీలో పనిచేస్తునందువలన వాడి మీద మా కుటుంబంలోని వారు అనుమాన పడలేదు. అది వాడికి చాలా సౌకర్యం అయిపోయింది. ప్చ్! అమ్మా-నాన్నా కుంగిపోయారు

బాధపడుతున్న మొహంతో చెప్పినతన్ని చూసి బెడ్ మీద పడుకున్న స్వేతా మరింత  భయపడింది.

ఎమిటీ...ఈయన తమ్ముడా అతను? పేరుకూడా మార్చి చెప్పాడా? ఎంత వెర్రిబాగులదానిగా ఉండిపోయాను. 

ఇప్పుడు మీ తమ్ముడు ఏం చెబుతున్నాడు?”

ఏమిటేమిటో చెబుతున్నాడు. ఫోటోనే నిజం కాదు అంటున్నాడు. ఆమెను మోసం చేసేననడానికీ--పెళ్ళి చేసుకున్నాననడానికీ ఏమిటి సాక్ష్యం? అని అడుగుతున్నాడు...

సాక్ష్యం...సాక్ష్యానికి ఇప్పుడు ఏం చేయాలి?” -- వైష్ణవీ అయోమయంలో పడగా, స్వేతా వైపు తిరిగాడు.

ఏమ్మా! అతన్ని నమ్మి వెళ్లేవే! రిజిస్టర్ -- ఆఫీసులోనైనా పెళ్ళి చేసుకుందామని చెప్పుండాలి?”

చెప్పాను సార్! ఆయనే, అన్నయ్యను ఇంట్లో పెట్టుకుని ఇలా పెళ్ళి చేసుకుంటే...మర్యాద పోతుందని చెప్పారు

అతను చెబితే నువ్వు ఓకే అని చెప్పేయటమేనా? నమ్మకంతో వాడి వెనుక వెళ్లావు? మీరు పెళ్ళి చేసుకున్నందుకు కూడా సాక్ష్యం లేదే! ఇప్పుడెలా మిమ్మల్ని కలిపేది?”

సార్! స్వేతా తానుగా వెళ్ళి మీ అమ్మా...నాన్న దగ్గర చెబితే?” -- వైష్ణవీ ఆతృతగా అడగగా...వేస్ట్అన్నట్టు తల ఊపాడు. 

నేను కూడా అదే ఆలొచనకి వచ్చాను. కానీ, అమ్మాయి బెడ్ మీద నుండి  లేవకూడదని డాక్టర్ స్ట్రిక్టుగా చెప్పిందే

అవును. ఆమె ఆరొగ్య పరిస్థితి అలా ఉంది. ఏం సార్? అతన్నే ఇక్కడికి పిలుచుకు వస్తే ఏం?”

ఏమిటి వైష్ణవీ మీరు? ఇక్కడ ఎంతో మంది పేషంట్లు ఉన్నారు. వాళ్ళ  ముందు కోర్టులో విచారణ చేసినట్టు విచారించ మంటారా? అది స్వేతాకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మా కన్నవాళ్లకు బాధగా ఉంటుంది.

అంతే కాదు. అమ్మా-నాన్నలను నమ్మించటానికి నేను సాక్ష్యం అడగటంలేదు. నేనేం తప్పు చేయలేదని మొరాయిస్తున్న వాడి గుట్టును రట్టు చేయాలనే నేను కష్ట పడుతున్నా.

ఖచ్చితంగా ఏదైనా ఒక క్లూవదిలిపెట్టుండాడు. అది మాత్రం దొరికితే చాలు. స్వేతా! బాగా ఆలోచించి చూడండి. మీ పెళ్ళి జరగటాన్ని ఎవరైనా కళ్ళారా చూసారా? అంటే... గుడిలో ఉన్న పూజారి...లేదు...ఇంకెవరైనా...ప్లీజ్! కొంచం ఆలొచించి చూడండి

లేదు సార్! అదొక చాలా చిన్న గుడి. రోడ్డు పక్కగా ఉన్న వినాయకుడి గుడి. మేళ తాళాలూ, అక్షింతలూ, బంధు-మిత్రులూ ఏదీ లేకుండానే పెళ్ళి జరిగింది. పెళ్ళికి వినాయకుడే సాక్షి --కన్నీటితో స్వేతా చెప్పగా, ఎందుకనో వైష్ణవీ మొహం వికసించింది.

ఏయ్ స్వేతా! మర్చిపోయావా? నీ పెళ్ళికి అతని ఫ్రెండు ఒకతను నిలబడ్డారని చెప్పావే?”

అరే! అవును నర్సమ్మా! సార్! ఒకరే ఒకరు ఉన్నారు సార్. ఆయనే పసుపుతాడును కొనుక్కొచ్చారు అన్న వెంటనే ఉత్సాహపడ్డాడు అశ్విన్.

అలాగా? వాడి పేరేమిటో తెలుసా?”

పేరు...ఏం సార్? ఈయన పేరే నిజం కాదు! అతని ఫ్రెండు పేరు మాత్రం నిజమై ఉంటుందా?”

ఉండచ్చు. ఎందుకంటే...ఎంత తెలివిగా ఒక నేరాన్ని చేసినా, ఎలాగూ కొన్ని తప్పులు ఉంటాయి. చెప్పు...అతని పేరేమిటి?”

రాధా అని పిలిచారు సార్. కానీ పూర్తి పేరు తెలియదు

రాధా... -- ఆలొచనతో ముఖం వికసించింది.

పేరును మధ్యే విన్నాను. ఎక్కడ...ఎవరు చెప్పారు?” నెత్తి మీద వేళ్ళతో గోక్కున్నాడు.

ఫోటోను నా స్నేహితుడు రాధాతో బీచ్ లో తీసిందీ -- ప్రతాప్ చెప్పింది చటుక్కున గుర్తుకు వచ్చింది.

అవును...అతను వాడి స్నేహితుడే

సార్

వైష్ణవీ! ఇది చాలు. రాధా మాత్రం దొరికితే చాలు. అన్ని సమస్యలూ మంచిగా పరిష్కారమైపోతాయి

సార్! రాధాను ఎలా సార్ కనిబెడతారు?”

అదేమంత శ్రమ కాదు. ప్రతాప్ సెల్ ఫోనులో వాడి నెంబర్ ఉంటుంది. వాడి సెల్ నుండే ఫోన్ చేసి, వాడిని మా ఇంటికి రప్పించ గలను

కానీ, లోపే మీ తమ్ముడు చెప్పేసేరంటే?”

నో ఛాన్స్! ప్రతాప్ ని  ఇప్పుడు నా గదిలోనే ఉంచి బంధించాను.  నా గదిలో ల్యాండ్ లైను లేదు. సెల్ ఫోను ఖచ్చితంగా వాడి గదిలోనే ఉంటుంది. వాడు వేసుకున్న చొక్కాలోనో, ప్యాంటులోనో  లేక వాడి గదిలో మరెక్కడైనా  పెట్టుంటాడు

అయితే వెంటనే బయలుదేరండి సార్

బయలుదేరుదాం...మనిద్దరం

నేను కూడానా...నేనెందుకు?” -- తడబడ్డది వైష్ణవీ.

ప్లీజ్ వైష్ణవీ. ఇది కాదని చెప్పే సమయం కాదు. స్వేతాని మీకు నాలుగైదు నెలలుగా తెలుసు. ఆమె ఎన్ని కష్టాలు అనుభవించిందో అర్ధమైయుంటుంది.

ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు. అందువలన ఆమె గురించి నేను చెప్పటం కంటే, ఆమె తరఫున మీరు మాట్లాడితే బాగుంటుంది. నా మాటలకంటే కూడా, స్వేతాని చూసుకుంటున్న ఒక నర్స్ యొక్క మాటలను మా ఇంట్లో అందరూ నమ్ముతారు.

ముఖ్యంగా, మా తమ్ముడు ఆడుతున్న నాటకానికి తెరవేయటానికి మీరు వచ్చే తీరాలి. ప్లీజ్! నా కోసం కాకపోయినా, మీ పేషంటు కోసం...ప్లీజ్ వైష్ణవీ -- అతని ప్రాధేయతను తిరస్కరించలేక చూపులను తిప్పుకుంది.

స్వేతా యొక్క శొకమైన ముఖం, దాంట్లో కనబడ్డ చింత మనసును కాల్చ, అయిష్టంగానే సమ్మతించింది. వెళ్దాం

అశ్విన్ ముఖం వికసించింది. థ్యాంక్యూ సో మచ్. ప్లీజ్ కమ్అని నడవసాగాడు. మనసులో ఏర్పడ్డ కలతతో అతని వెనుక నడిచింది.

వేగంగా కిందకు వచ్చిన అతను తన బైకు దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలాగా, వైష్ణవీని ఆసుపత్రి బయటకు తీసుకు వచ్చి ఆటో ఎక్కించాడు.

వైష్ణవీ! మీరు ఆటోలో వెళ్ళండి...నేను నా బండిలో వస్తాను అన్నప్పుడు, వైష్ణవీ మనసులో అశ్విన్ పైన ఆమె ఉంచిన నమ్మకం, గౌరవం మరింత ఎత్తుకు ఎదిగింది. తృప్తిగా నవ్వింది. 

ఇద్దరూ ఇల్లు చేరుకున్నప్పుడు, ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దిగాడు ఒక యువకుడు. అశ్విన్ ను చూసిన వెంటనే అతని దగ్గరకు వచ్చాడు.

హలో! అన్నా...ఎలా ఉన్నారు?”

బాగున్నాను. మీరెవరో...తెలియటంలేదే ఆలోచిస్తూ బండి ఆపి కిందకు దిగాడు.

నేను రాధాను. ప్రతాప్ స్నేహితుడ్ని

! రాధా అంటే మీరేనా? మిమ్మల్నే వెతుకుతున్నాం -- రండి...రండి అంటూనే వైష్ణవీని చూసాడు.

ప్రతాప్ రెడీ అయ్యాడా అన్నా? ఫోను చేస్తే తీయటం లేదు

వాడు కొంచం బిజీగా ఉన్నాడు! అవును, ఎక్కడికి వెళ్ళబోతున్నారు?”

ఏంటన్నా అలా అడుగుతున్నారు! రోజు వాడు పెళ్ళి చూపులకు వెళ్తున్నారు కదా...దానికి నన్ను తోడు రమ్మన్నాడు. అందుకే వచ్చాను

ఓహో! వాడికి అమ్మాయలను చూడటం...పెళ్ళి చేయటం...ఇదంతా మీ పనేనా?” -- అశ్విన్ కఠినమైన స్వరంతో అడుగగా, రాధా ముఖం మారింది. 

***************************************************PART-12******************************************

రాధా చెంపలు వాచి పోయున్నాయి. దాంట్లో అశ్విన్ చేతి వేలు ముద్రలు కనబడుతున్నాయి. తల వంచుకునే అతను చెప్పిన నిజాలు విని శిలలాగా అయిపోయింది మీనాక్షీ. 

రాధా ఇంకా అదే భావనతో మాట్లాడుతున్నాడు.

తప్పే. ప్రతాప్ చేసిన పనులన్నిటికీ వాడికి సహాయపడటం తప్పే! వాడు నిజంగానే స్వేతాని ఇష్టపడుతున్నాడు అనుకునే వాళ్ల పెళ్ళి చేసాను. కానీ, ఇలా మధ్యలో ఆమెను వదిలేసి వచ్చేస్తాడని నేను అనుకోలేదు.

స్వేతా వాడ్ని నమ్మే వచ్చింది. ఆమె ఎక్కువ చదువుకోలేదు. కొంచం కష్టపడిన కుటుంబం. ఎవరి దగ్గరా ఎక్కువగా మాట్లాడదు. అందువల్ల ప్రతాప్ చెప్పినదంతా అలాగే నమ్మింది.

కానీ, ప్రామిస్ గా చెబుతున్నా అన్నా. వీడు పేరు మార్చి చెప్పిన విషయం నాకు తెలియనే తెలియదు. ఒక నాలుగు నెలలకు ముందే స్వేతా ఇంటికి వీడు వెళ్ళటం లేదని తెలిసింది.

ఎందుకుఅని అడిగాను. నాకూ, తనకూ పడటం లేదు. వాళ్ళింటికి వెళ్ళిపోయిందని చెప్పాడు. నేనూ అది నిజమా--అబద్దమా అని అన్వేషించలేదు. నా పని చూసుకుంటూ ఉండిపోయాను

అమ్మాయి అదే ఇంట్లో ఉంటోందా...లేదా అనేది వెళ్ళి చూడలేదు?”

లేదన్నా! ప్రతాప్ మీద నాకెప్పుడూ అనుమానం వచ్చిందే లేదు. కానీ, పోయిన నెల ఆమె గవర్నమెంట్ ఆసుపత్రి నుండి బయటకు వస్తున్నప్పుడు చూసాను. గుర్తు తెలియకుండా మారిపోయింది. గర్భంగానూ ఉన్నది

అశ్విన్ చూపులు తన తమ్ముడ్ని కాల్చింది. అవమానంతో తలవంచుకున్నాడు ప్రతాప్. 

అప్పుడు నాకు ప్రతాప్ మీద అనుమానం వచ్చింది. అదే సమయం వాడికి మీ ఇంట్లో పిల్లను వెతుకుతున్నారని తెలిసింది. అందువలన ప్రతాప్ దగ్గర కూడా చెప్పకుండా స్వేతాని వెళ్ళి కలిసాను.

ఆమె చెప్పిన తరువాతే, వీడు ఆమెను వదిలేసి వచ్చాడని తెలిసింది. తిండికి కూడా దారిలేని పరిస్థితిలో -- కడుపులో బిడ్డతో ఆమె నిలబడ్డ అవతారం చాలా బాధ పుట్టించింది. చేతి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి వచ్చాను

వీడి దగ్గర అడిగావా?”

అడిగాను....ఏమిట్రా ఇలా చేసావు?’ అని అడిగాను. పదిపైసలు కూడా లేనిదాన్ని పెళ్ళి చేసుకుని ఏం చేయమంటావు? మా మావయ్య వారసుడే లేని కోటీశ్వరుడు. ఆయన కూతుర్ని పెళ్ళి చేసుకుని ఆయన మొత్త ఆస్తికి వారసుడవబోతాను. ఇలాంటి సమయంలో ఆమె గురించి మాట్లాడి కోపం తెప్పించకుఅని తిట్టాడు.

డబ్బు ఆశ ప్రతాప్ కళ్ళను మూసేసింది. ఇక ఖచ్చితంగా స్వేతాతో చేరడని  తెలిసింది. అందువల్ల పోయిన నెల ఒకరోజు...మళ్ళీ స్వేతా వాళ్ళింటికి వెళ్ళాను

వెళ్ళి...నీ భర్తకు ఇంకొక చోట పెళ్ళి అయిపోయింది. నువ్వు సైలెంటుగా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు?” -- వైష్ణవీ కోపంగా అడగగా...మౌనంగా తల ఆడించాడు.

ఏమయ్యా...ఆమె మీద అంత అక్కర పెట్టుకున్నావే! ఆమె ఇలా కష్టపడటాన్ని చూసి, వీళ్ళింటికి వచ్చి పెద్దవాళ్ళతో చెప్పుండచ్చు కదా?”

అయ్యో! ప్రతాప్ నన్ను చంపేస్తాడు

నా దగ్గరైనా చెప్పుండచ్చు కదరా -- అశ్విన్ అడగ, అతను అవస్తపడ్డాడు.

లేదన్నా! మిమ్మల్ని చూస్తేనే మాకందరికీ చాలా భయం. దాంతోపాటూ మిమ్మల్ని ఒక కఠినమైన పోలీసనే ప్రతాప్ చెబుతాడు

చెప్పుంటాడు. ఐదు నిమిషాల్లో నా పెద్ద కొడుకుపై వెయ్యి నేరాలు మోపినవాడే?  నోరంతా విషం? ఎంత స్వార్ధం. మీనాక్షీ! నీ ప్రియమైన కొడుకు చేసిన కార్యాలను చెవి చెమ్మగా విన్నావా?

అన్ని తప్పులనూ కుక్క చేసేసి, ఎంత సులభంగా పెద్దవాడి  మీద నెపం వేసాడు? చెప్పు! వీడిని ఏం చేద్దాం? పెద్దవాడి  దగ్గర చెప్పి జైల్లో పెట్టిద్దామా...జీవితాంతం జైలు కూడు తిననీ" -- గంగాధరం కోపంగా చెప్పగా, మీనాక్షీ దగ్గర కొంచం కూడా కదలిక లేదు.

కళ్ళల్లో మాత్రం నీరు నిలబడలేక ధారగా బయటకు వచ్చింది. వైష్ణవీ గొంతు సవరించుకుంది.

సార్! ఇతన్ని జైల్లో పెట్టిచ్చినందువల్ల ఎవరికి లాభం?”

ఏంటమ్మా చెబుతున్నావు?”

ఈయన బిడ్డకు -- మీ వారాసుడ్ని మోస్తూ ఒకత్తి అనాధగా నిలబడుందే! ఆమెకు ఏం చెయ్యబోతారు?”

మీనాక్షీ మెల్లగా తలెత్తింది.

మీ అబ్బాయికి ఆమెతో కలిసి జీవించటం ఇష్టమా...లేదా అనేది ముఖ్యం కాదు. మీ ఇంటి వారసుడు అనాధ అవకూడదు

ఏమిటీ?”

స్వేతా చెప్పిందే చెబుతున్నా. పాపమూ, నేరమూ ఆడవాళ్ళ నెత్తిమీదే కదా పడుతోంది! తనకేమీ తెలియనట్లు మీ అబ్బాయి వేరుగా వచ్చాసారు. కానీ, ఆమె కడుపులో బరువుతో -- ఊళ్ళో వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక, జీవించటానికి దారి తెలియక ఆత్మహత్య చేసుకుంటా నంటోంది

వద్దు! వద్దు -- మీనాక్షీ అరిచింది.

..............................”

అలా జరగకూడదు. అయ్యో! పాపం మనల్ని ఊరికే వదలుతుందా?”

ఇక అంతా మీ చేతుల్లోనేనమ్మా ఉంది

ఏంటమ్మా చెప్పటానికి ప్రయత్నిస్తున్నావు?” -- మీనాక్షీ చేతులు వైష్ణవీని పట్టుకున్నాయి.

స్వేతా యొక్క ఆరొగ్యం ఇప్పుడు అసలు బాగలేదు. చాలా క్రిటికల్ గా ఉంది. ఆమెకు--ఆమె బిడ్డకూ, మీరూ, మీ ఆదరణే అవసరం. మీ కోడలుగా ఆమెను ఓకే అనుకుని, ఆమెకు ఇకమీదైనా ప్రశాంతమైన జీవితాన్నిఇవ్వండి

ఖచ్చితంగా! నా కోడల్ని నేను పిలుచుకు వస్తాను. ఇక మీదట ఆమె ఇంటి అమ్మాయి

అమ్మా... -- కొపంగా అరిచాడు ప్రతాప్.

అరవకు. అరిచే అర్హత కూడా నీకు లేదు. నిన్ను నా కొడుకుగా, అంతెందుకు ఒక మనిషిగా కూడా నేను గుర్తించటం లేదు. ఎందుకో తెలుసా? నిన్ను అమితంగా ప్రేమిస్తున్న నా నమ్మకాన్ని మాత్రమే కాదు...నిన్నే ప్రేమిస్తూ, నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి నమ్మకాన్ని వమ్ము చేసేసావు. ఇక జీవితంలో నువ్వు నాతో మాట్లాడకూడదు -- ఖచ్చితమైన స్వరంతో చెప్పిన తల్లిని చూసి బెదిరిపోయాడు ప్రతాప్.

అశ్విన్ తల్లిని కావలించుకున్నాడు. ఏంటమ్మా ఇది? ఎందుకిలా మాట్లాడుతున్నావు?”

అశ్విన్! నేను నా కోడల్ని చూడాలి. నన్ను తీసుకు వెల్తావా?”

ఖచ్చితంగా! వెళ్దామమ్మా...

వెళ్దామయ్యా. ఏయ్! నువ్వెందుకురా ఇంకా ఇక్కడే నిలబడున్నావు? పోరా?” అన్న వెంటనే, భయంతో బిక్క చచ్చిపోయున్న రాధా, వదిలిందే చాలని పరిగెత్తాడు.

అందరూ బయటకు వచ్చి కారెక్క, అంతవరకు కోపంతోనూ, అవమానంతో ముఖాన్ని తిప్పుకుని నిలబడ్డ ప్రతాప్ తటపటాయిస్తూ కారులో ఎక్కాడు. కారు బయలుదేరింది.

మీనాక్షీ, తన పక్కనే కూర్చున్న వైష్ణవీని అప్పుడే ప్రశాంతంగా చూసింది. కారు నడుపుతున్న పెద్ద కొడుకుని పిలిచింది.

అశ్విన్!

అమ్మా

అమ్మాయి ఎవరని నువ్వు ఇంతవరకు చెప్పలేదే

ఆమెనా? ఆమె ఒక దేవత అమ్మా అన్నాడు నవ్వుతూ.

ఏమిటి...దేవతనా?”

అవునమ్మా! అవతలివారి కోసం శ్రమ పడుతున్న...అవతలి వారి మంచినే ఆలొచిస్తున్న దేవత. కష్టపడే ప్రాణులను చూసి కన్నీరు చిందే ఒక అద్భుతమైన మనసు కలిగిన దేవత...నేను చెప్పానే నా వ్రతాన్ని ఒక అమ్మాయి భంగం చేసిందని...!

వైష్ణవీ మొహం ఎర్రగా మారింది. గంగాధరం కొడుకును పిలిచారు.

రేయ్! నువ్వు మాట్లాడేదీ, అమ్మాయి సిగ్గుపడటమూ చూస్తే...ఇది ఇంకోలాగా కనబడుతోందే. నువ్వు కూడా తమ్ముడిలాగా

ఛఛ! ఈమె మీ పెద్ద కోడలు నాన్నా. మీ అంగీకారంతోనే పెళ్ళి చేసుకోవాలని నా మనసును ఆమె దగ్గర ఇంకా చెప్పలేదు

సంతోషంగా పెళ్ళి చేసుకోరా. అమ్మాయి మహాలక్ష్మి లాగా ఉంది. అమ్మాయి మనసు ఎంత సున్నితమో నేరుగానే చూసాము -- అంటూ మీనాక్షీ వైష్ణవీని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకుంది. వైష్ణవీ సంతోషంలో మునిగి తేలింది. అశ్విన్ యొక్క గెలుపు నవ్వు ఆమె మీద పువ్వుల వర్షాన్ని కురిపించింది

***************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

నిద్రలేని రాత్రులు…(పూర్తి నవల)

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)