వర్షంలో వెన్నెల...(పూర్తి నవల)


                                                                   వర్షంలో వెన్నెల                                                                                                                                                       (పూర్తి నవల) 

అనాధ పిల్లల మరియు వృద్దుల ఆశ్రమాలకు నా పత్రికా విలేఖరి స్నేహితుడితో ఇంటర్ వ్యూ కోసం వెళ్ళాను. అక్కడున్న పిల్లలతోనూ, వృద్దులతోనూ మాట్లాడినప్పుడు...అక్కడ వాళ్ళ ప్రాధమిక అవసరాలు పూర్తి అవుతున్నా, వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళు ప్రేమ కొసం తపన పడుతున్నది నా మనసును చాలా బాధపెట్టింది.

కన్నవారి ప్రేమను వెతుకుతున్న ప్రయాణంలో ఉన్న శైలజాకి వర్షంలో వెన్నెలలాగా సంతోషమైన జీవితం దొరికితే, మన మనసులోనూ ఆనంద గాలి వీస్తుందని నాకు అనిపించింది.   నవలలోని నాయకి పాఠకులందరి మనసులలోనూ లోతుగా పాతుకుపోయి అందరినీ సంతోషపరుస్తుందని నమ్ముతున్నాను.

****************************************************PART-1******************************************

హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఇరుకులో చిక్కుకుని, మెల్లగా దానిని దాటుకుని, బైపాస్ రోడ్డులో జారిపోతున్నట్టు వెడుతున్న విశాలమైన కారులోని .సి చల్లదనంలోనూ చెమటలు పడుతున్నాయి శైలజాకి! వినాయకుడిని మనసులో   తలుచుకుని అంతా నీ దయేఅంటూ ధైర్యం తెచ్చుకున్నా, కడుపులో భయం ఫీలింగ్ మాత్రం ఉంటూనే ఉంది. తన చూపులను కారు అద్దాలలో నుండి బయటకు పరిగెత్తించింది. బయట కొంచం మంచు పొగ మిగిలున్నది.

ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చోనున్న మేనేజర్ సుందరం లక్ష్మీ అమ్మగారిని చూస్తేనే అయ్యగారికి ఆరొగ్యం బాగుపడుతుందమ్మా. ఆమె వెళ్ళిపోయిన దగ్గర నుంచి అయ్యగారు మనసు విరిగిపోయి, సరిగ్గా నిద్రపోక, సరిగ్గా తిండి తినక ఆరొగ్యం పాడుచేసుకున్నారు. ఏదో ఆయన చెల్లి, పిల్లలూ ఉన్నందువలన కొంచం తట్టుకుంటున్నారు అన్నారు, పెద్ద నిట్టూర్పుతో!

మీలాగానే చాలా అందంగా ఉంటారమ్మా. ఆవిడ లేకుండా ఇల్లే చీకటి గుహలాగా బోసిపోతోందమ్మా అని ఆయన మాట్లాడుతూ వెళ్ళ, మాట మార్చటం కొసం, “నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు సార్?” అని తడబడుతూ అడిగింది శైలజా.

ఏంటమ్మా ఇది? నన్ను పోయి సార్ అంటున్నావు! అంకుల్ అనే పిలువమ్మా. నీ చిన్న వయసులో నన్ను అలాగే పిలిచేదానివి అని వెనక్కి తిరిగి వెనుక సీటులో కూర్చోనున్న శైలజాను చూసి నవ్వారు పెద్దాయన. మాటలు కంటిన్యూ చేస్తూ ఒక వారం రోజులుగా .సి.యూలోనే ఉన్నారు. కొంచం స్పృహలోకి  వచ్చినప్పుడు...మీ పేరు, అమ్మ పేరు చెప్పి అడుగుతున్నారు. వచ్చేనెల ఆపరేషన్ చేద్దాం అంటున్నారు డాక్టర్. అంతలోపు అమ్మగారు కూడా వచ్చేస్తే ఊరటగా ఉంటుందమ్మా అన్నారు.

అమ్మనా? ఆవిడ ఎక్కడ వచ్చేది? కూతురే రాలేదే...అంటూ మనసులో అనుకుని మళ్ళి బయటకు చూడసాగింది శైలజా.

వినోధినీ, శైలజా కాలేజీ యొక్క అందాల దేవతలు. చదువులో ఒకరికొకరు పోటీ పడతారు. కానీ, ప్రాణ స్నేహితులు. ఇద్దరినీ స్నేహితులుగా చేసింది ఇద్దరి యొక్క శొకమే!

చాలా సేపటి నుండి పోతూనే ఉన్నామే?’ అని శైలజాకి అనిపించగానే హాస్పిటల్, నగరం దాటి చాలా దూరమా అంకుల్?” అని అడిగింది.

హాస్పిటల్ వెళ్ళిపోయిందమ్మా. మొదట ఇంటికి వెళ్ళి, మీరు స్నానం చేసి--డ్రస్సు మార్చుకుని తరువాత నాన్నగారిని వెళ్ళి చూద్దామమ్మా. ఎందుకంటే...తొమ్మిదింటి తరువాతే మనల్ని లోపలకు వెళ్ళనిస్తారు అన్నారు.

పెద్ద బంగళా కాంపౌండ్లోకి వెళ్ళి, బంగళా వాకిలి ముందు  నిలబడ్డది కారు. కారు లోపలకు రావటం చూసిన గూర్కా గబగబా వచ్చి కారు డోరు తెరిచాడు. కారులో నుంచి దిగిన శైలజా బంగళాను చూసి నిర్ఘాంతపోయింది. బెంగళూరులో అప్పుడప్పుడు తన ప్రాణ స్నేహితురాలు వినోధినీ ఇంటికి  వెళ్ళటం శైలజాకు అలవాటు. అదికూడా పెద్ద బంగళానే. కానీ, దానికంటే నాలుగింతలు పెద్దదిగా ఉన్నది బంగళా.

రండమ్మా అని చెప్పి, “తాయారూ! పాప వచ్చేసింది. హారతీ తీసుకురా అని గట్టిగా అరుస్తూ, బంగళా యొక్క వాకిలి మెట్లను ఎక్కి లోపలకు వెళ్ళారు మేనేజర్. ఇద్దరు స్త్రీలు వచ్చి హారతీ తీసి బొట్టుపెట్టారు. ఇంటిలోపలకు వెళ్లబోతున్న ఆమె, వేగంగా వచ్చి నిలబడ్డ ఎర్ర రంగు కారు వైపు తిరిగింది.

కారు నిలబడిన తరువాత, కారులో నుండి వేగంగా దిగి వచ్చిన యువకుడు ఆమెను చూసిన చూపులు, అన్యగ్రహం మనిషిని చూసినట్టు విరుచుకున్నాయి. ఆమెనే విరక్తితోనూ, కోపంతోనూ చూస్తూ మెట్లెక్కిన అతన్ని చూసి ఆశ్చర్యపోయి నిలబడ్డది శైలజా.

యువకుడు మంచి ఎత్తు, ఎత్తుకు తగిన శరీర అమరిక, మ్యాచింగ్ డ్రస్సు, అందంగా దువ్వుకున్న తలజుట్టు తో అందంగానూ, గంభీరం కలిసిన ముఖము కలిగి ఉన్నాడు. షార్పుగా ఉన్న కళ్ళల్లో మాత్రం కోపం. జీవితంలో మొదటిసారిగా ఒక మగాడి రూపాన్ని పరిశోధించిన ఆశ్చర్యం, కళ్ళల్లోని కోపం పొత్తి కడుపులో నుండి వెలువడిన వేడి వలన వచ్చిన ఆశ్చర్యం ఒకటికొకటి పోటీపడ...తత్తరపాటుతో, అతన్ని చూస్తూ నిలబడ్డది బెంగళూరు.

దగ్గరకు వచ్చిన అతని చూపులో కొంత మార్పు వచ్చి పోయింది. ఒకరికొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ నిలబడ్డ, మేనేజర్ సుందరం మధ్యలో వచ్చి, “తమ్ముడూ...మన వినోధినీ. గుర్తు పట్టనంతగా ఎదిగిపోయింది పాప అన్నారు.

ఆమె దగ్గర ఇది మీ అత్తయ్య కొడుకు కిషోర్ తమ్ముడమ్మా అని పరిచయం చేశారు. అందమైన చేతులతో నమస్కరించిన ఆమె, చిన్న నవ్వు ఒకటి చిందించింది. అతని దగ్గర నుండి జవాబు నమస్కారమో, నవ్వో రాలేదు.

దాంతో కోపం తెచ్చుకున్న ఆమె ఎర్రబడ్డ కళ్లతో మేనేజర్ వైపుకు తిరిగి అంకుల్! నేను త్వరగా హాస్పిటల్ కు వెళ్ళి, వెంటనే బెంగళూరు బయలుదేరాలి అన్నది శైలజా.

మాత్రానికే ఎందుకు రావాలి? నువ్వు రాకుండానే ఉండి ఉండొచ్చు. ఎందుకు వచ్చావు?” కోపమైన స్వరంతో అడిగిన అతన్ని భయంతో చూసిన ఆమెకు నేను వినోధినీ కాదు. వచ్చింది తప్పే. వెళ్ళిపోతానుఅని అరిచి పరిగెత్తి వెళ్ళిపోదామా? అని అనిపించింది. ఇతనేమో ఇంటి యజమాని కాడే. ఇతనికి నేనెందుకు భయపడాలి?’ అంటూ ఆమె లోపలి మనసు ఆమెకు ధైర్యం ఇచ్చింది. 

పనిపిల్ల చూపిన గదిలోకి వెళ్ళి గొళ్ళేం పెట్టుకుంది. స్నేహితురాలిని సెల్ ఫోనులో పిలిచింది. ఏయ్ వినోధినీ! మీ ఇంట్లో సింహం, పులి అన్నీ ఉన్నాయని  చెప్పలేదేం...చాలా భయపడిపోయాను. మీ అత్త కొడుకుటగా, పేరు కిషోరట. నన్ను ఎంత కోపంగా చూసాడో తెలుసా...నన్ను వదలరా బాబూ అని పరిగెత్తుకు వచ్చాను అని గ్యాప్ ఇవ్వకుండా చెప్పింది.

నువ్వే భయపడ్డావు అంటే అది ఖచ్చితంగా సింహమో...పులోనే అయ్యుంటుంది. త్వరగా అక్కడ్నుంచి బయలుదేరి వచ్చాయి...పట్టుబడిపోకు ఆందోళన  చెందింది వినోధినీ.

అది నేను చూసుకుంటా వినోధినీ... నువ్వు ఇది విను. మీ ఇల్లు చాలా సూపర్ ' గా, అద్దాలమేడలాగా ఉన్నది. నువ్వు తప్పక రావాలి...నీ గది గురించి చెప్పనే అక్కర్లేదు అని వర్ణించుకుంటూ  వెళ్ళింది.

చాలు...చాలు. నేను అక్కడికంతా రాను. నువ్వు ఇంకో గంటలో బయలుదేరు. ఎక్కువసేపు అక్కడే ఉంటే పట్టుబడిపోతావు--హెచ్చరించి ఫోనును పెట్టేసింది వినోధినీ.

ఊహ తెలిసిన రోజు మొదలు అనాధ ఆశ్రమంలోనే పెరిగింది శైలజా. ఆశ్రమంలోని మిగిలిన పిల్లల దగ్గరలేని అందం, తెలివి, అల్లరి శైలజా దగ్గర ఉన్నందువలన...ఆశ్రమం యొక్క వార్డన్ భువనేశ్వరి శైలజా పైన కొంచం ఎక్కువ ప్రేమ వొలకబోసి పెంచింది. స్కూలు చదువును విజయవంతంగా ముగించటంతో, బెంగళూరులోని ఒక కాలేజీలో బి.ఏస్.సికంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకుని చదువుతోంది శైలజా. 

చదువుకు కావలసిన డబ్బును కాలేజీ ఆఫీసులోనే సాయంత్రం పూట పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ సంపాదించి, అక్కడే హాస్టల్లో ఉన్నది. ఆమె పనిచేస్తూ చదువుకుంటున్నందు వలనే శైలజాకు సపరేట్ గది ఇవ్వబడింది. వినోధినీ వచ్చి చేరిన తరువాతే రెండున్నర సంవత్సరం జీవితం ఆనందంగా గడిచింది. గత పదిహేను రోజులుగా మనశ్శాంతి పోయి, ఏదో తెలిసినంత వరకు పరీక్ష రాసిన  వినోధినీ నిజానికి అయోమయంలో ఉన్నది. కారణం, తండ్రి దగ్గర నుండి వచ్చిన అర్జెంట్ ఆహ్వానం. 

వినోధినీకి మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు...తండ్రి మోహన్ కుమార్, తల్లి యొక్క నడవడిక మీద ఏదో ఒక సంధర్భంలో అనుమానించటంతో -- కూతురు వినోధినీను తీసుకుని బెంగళూరులో ఉన్న తల్లి ఇంటికి వచ్చేసిన లక్ష్మీ తిరిగి భర్త దగ్గరకు వెళ్ళనే లేదు. తండ్రి మోహన్ కుమార్ తన తప్పును త్వరలోనే తెలుసుకుని ఎంత బ్రతిమిలాడినా, ప్రయత్నం చేసినా, వినోధినీ యొక్క తల్లి  మనసు మారలేదు. 

బంధువులు యొక్క ఎగతాలి మాటలూ, తోడబుట్టిన వారి విసుగు వినోధినీను ఎక్కువగా బాధ పెట్టింది. కన్నవారు చేసిన తప్పుకు తాను బలి అయిన ఫీలింగ్ వలన తల్లి--తండ్రినీ ప్రేమించటం కుదరలేదు!

కానీ, ఇప్పుడు తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి...సీరియస్ కండిషన్లో ఉన్నట్టు, చివరిసారిగా ఒకసారైనా కూతురు మొహాన్ని చూడాలని వినోధినీకు కబురు వచ్చింది. కబురు తీసుకువచ్చిన వ్యక్తిని కూడా చూడటానికి వినోధినీ ఒప్పుకోలేదు. కానీ, కన్నవారి ప్రేమకోసం తపన పడుతున్న శైలజా వల్ల అలా ఉండటం కుదరలేదు!  

దయచేసి నేను చెప్పేది విను వినోధినీ. ఒకసారి వెళ్ళి మీ నాన్నను చూసిరా. ఉరిశిక్ష పడిన నేరస్తుడికి కూడా చివరి ఆశ నెరవేర్చుకోవటానికి సందర్భం ఇస్తున్నారు. ప్రేమకోసం కాకపోయినా, సేవా మానవత్వంతోనైనా నువ్వెళ్ళి ఆయన్ని చూడు వినోధినీ. ఇప్పుడు సెమిస్టర్కూడా అయిపోయిందే  -- బ్రతిమిలాడింది శైలజా.  

అదంతా కుదరదు శైలూ. నాకు ఇద్దరి మీదా ప్రేమ లేకపోయినా, నన్ను  వదిలేయకుండా పెంచి మనిషిని చేసింది అమ్మ. ఆమెకు నచ్చనిది ఏదీ నేను చెయ్యలేను. విషయంలో నన్ను బలవంత పెట్టకు శైలూ. ప్లీజ్ అని ముగింపు పెట్టింది.

కానీ, ఆరోజు నుండి వినోధినీ ప్రశాంతంగా లేదు అనేది మాత్రం అర్ధమయ్యింది. సెమిస్టర్పరీక్షలు అయిపోయి కాలేజీకి సెలవులు ఇచ్చినా కూడా బెంగళూరు అవుటర్ లో ఉన్న ఇంటికి వెళ్ళలేదు.  ఎప్పుడు చూడూ ఆలొచనలలోనే ఉండటం గమనించి చూడు వినోధినీ, నువ్వు ఇలాగే ఉంటే, నీకు పిచ్చి  పడుతుంది. ఎవరో ఒక అనాధ అయిన నామీదే ఎంతో ప్రేమ, ఆదరణ చూపుతున్నావు. ఆయన నిన్ను కన్న తండ్రి. నువ్వెళ్ళి  చూడకుండానే ఆయనకేదైనా...సారీ వినోధినీ, ఒక మాటకు చెప్పాను. ఏదైనా జరగకూడనిది జరిగితే...నీకు నేర భావన ఏర్పడి, జీవితాంతం ప్రశాంతత లేకుండా పోతుంది

నువ్వు చెప్పినట్లే నేనూ అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే, తరువాత... అని చెప్పిన ఆమెతో, అదే మంచి తరుణం అనుకుని మరింత బలవంతపెట్టింది శైలజా.

చివరిగా వినోధినీ చెప్పిన నిర్ణయం, శైలజాను షాకుకు గురిచేసింది. .కే. శైలజా!  నువ్వు చెప్పినట్టు ఆయన చివరి కోరికను నెరవేరుద్దాం. కానీ, మా అమ్మను నేను  మోసం చేయదలుచుకోలేదు. అదేలాగా నేను ఇక్కడ లేనని నా మావయ్యకు   తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు. అందుకని మనకు ఇప్పుడు ఒకే ఒక దారి ఉంది. నా బదులు నువ్వు వెళ్ళిరా అన్నది.

వ్యక్తి మార్పిడా...? ఏం, నన్ను జైలు కూడు తినిపించాలని నీకు ఆశగా ఉన్నదా?” అని వెక్కిరింతగా అడిగిన శైలజా, “నువ్వూ...నీ కుటుంబం సమస్యను తీర్చుకోండి. నన్నెందుకు ఇందులోకి లాగుతావు?” అని కోపంగా అడిగింది.

కానీ, వినోధినీ కళ్ళల్లో కనిపించిన కన్నీరు చూసి కొంచం శాంతించింది శైలజా. ఏయ్...ఏదో ఒక కోపంలో చెప్పాను. సారీ వినోధినీ...సారీ అని ఆమె భుజాలను పట్టుకుంది.

లేదు శైలజా. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నేనేం చేయను? మా మామయ్యతో చూచాయిగా చెప్పి చూశాను. నేను నీతో చెప్పినట్లే ఆయన, నేను వెళ్ళినట్లు తెలిస్తే చంపేస్తానని నన్ను బెదిరించారు అని ఏడ్చింది.

స్నేహితురాలు ఏడవటం తట్టుకోలేని శైలజా .కే. వినోధినీ. నీకొసం, నీ బదులు నేను వెళ్ళి మీ నాన్నను చూసొస్తాను. చూసేసి వెంటనే తిరిగి వచ్చేస్తాను. భగవంతుడు అలా రాసుంటే...దాన్ని మనం మార్చలేము అని చెప్పి అంగీకరించింది శైలజా. 

శైలజా చేతులను పుచ్చుకున్న వినోధినీ చాలా చాలా థ్యాంక్స్. నువ్వు  ఒప్పుకుంటావని నాకు నమ్మకం ఉంది! అక్కడ ఏదైనా సమస్య వస్తే, నేనే దానికి కారణమని నేరుగా వచ్చి చెబుతాను. అక్కడ నా మాటకు ఖచ్చితంగా ముఖ్యత్వం ఉంటుంది. నువ్వు భయపడకుండా వెళ్ళిరా అని చెప్పి ఆమెను సాగనంపింది.

బెంగళూరు నుండి బయలుదేరుతున్నప్పుడు, మనసులో ఒక మొండి ధైర్యం ఉంది. కానీ, తెల్లవారు జామున హైదరాబాదు చేరుకుని -- బస్సు నుండి దిగినప్పుడు, తెలియని ఊర్లో -- తెలియని మనుషుల దగ్గరకు వెళ్తున్నామే అన్న భయం ఏర్పడింది. వినోధినీ యొక్క తండ్రి ఇంటికి టెలిఫోన్ చేసి కాంటాక్ట్ చేసి --  ఆమె వచ్చిన విషయాన్ని తెలియపరచ, తరువాతి అరగంటలో మధ్య వయసు మనిషి ఒకరు ఆమె దగ్గరకు వచ్చి, “వినోధినీ?” అని అడిగారు. అవునుఅని తల ఊపింది శైలజా.

నేను, మీ నాన్నగారి ఇంట్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా మేనేజర్ గా ఉంటున్న సుందరం. మీరు చిన్న పిల్లగా ఉన్నప్పుడు చూసాను. ఇప్పుడు మహాలక్ష్మి లాగా ఉన్నారు. సార్ చూస్తే పొంగిపోతారు. రండమ్మా...వెళ్దాం అని చెప్పి ఆమెను పిలుచుకుని వెళ్ళి కారులో ఎక్కించారు.  

****************************************************PART-2******************************************

రోజాపువ్వు రంగు, తెలుపురంగు కలిసి ఉన్న గోడలతో మెరిసిపోతున్న అందాల స్నానాల గదిలోనే కాపురం ఉండొచ్చుఅనే విధంగా అనిపించింది. అంత బ్రహ్మాండంగా ఉన్నది స్నానాల గది. స్నానం చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని  కిందకు దిగి వచ్చింది. భవనం యొక్క ఒక్కొక్క చోటూ ఒక్కో అందంతో ప్రకాశిస్తోంది.

చిన్న యజమాని గారు మిమ్మల్ని బ్రేక్ ఫాస్ట్ చేయటానికి రమ్మని చెప్పారమ్మా ఎదురుగా వచ్చిన పనిమనిషి చెప్పి ఆమెను పిలుచుకు వెళ్ళింది. చిన్న యజమాని...? వినోధినీ రానేరాదని నమ్మి, ఇతను తనకు తానే బిరుదు  పెట్టుకున్నాడో? అందువలనే నన్ను చూసి ఎందుకు వచ్చావు?’ అని అడిగాడా? ఎలాగైనా వినోధినీను ఇక్కడికి రప్పిస్తాను. తరువాత ఎలా చిన్న యజమానిగా పిలిపించుకుంటాడని చూస్తాను’ -- మనసు రగిలిపోయింది.

కిషోర్ తో పాటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోనున్న మేనేజర్--ఆమె నిలబడి ఉండటాన్ని చూసి, తడబడుతూ తింటున్న చోటు నుండి లేచి రామ్మా...కూర్చోమ్మా అంటూ  తన పక్కనున్న కుర్చీని చూపించారు.

తినేటప్పుడు ఎందుకు లేస్తారు...మీరు కూర్చోండి అని ఆయనతో చెప్పి, తనని కూర్చోమని చెప్పిన కుర్చీ కిషోర్ కి తిన్నగా ఎదురుగా ఉండటంతో, ఆమెకు కొంచం భయం అనిపించింది. దాన్ని దాస్తూ కూర్చుని తినడం మొదలుపెట్టిన ఆమె, “అంకుల్, పన్నెండు గంటలకు బస్సు బుక్చేసుకున్నాను. అంతలో బయలుదేరవచ్చు కదా?” అన్నది.

అందుకే ఎందుకొచ్చావు?’ అని నేనడిగింది. ఏమొటో మామయ్య మీద ప్రేమ ఉన్నట్టు నటించి వస్తే...మేము అది నిజమని నమ్మేస్తామా? నిన్ను చూస్తేనే ఆయనకు మళ్ళీ సమస్య వస్తుంది! ఇప్పుడే బయలుదేరు

మాటలను అగ్నిలాగా కక్కినతన్ని కోపంగా చూసింది. రెండు కళ్ళూ నిప్పులు కక్కుతుండ, నిప్పుతో కాలిపోతున్నట్టు ఆమెలో ఫీలింగ్ కలిగింది.

వదలండి బ్రదర్! పాపకు అమ్మంటే భయం ఉంటుంది కదా. నాన్నను చూడాలని మనసులో అనిపించుంటుంది. వచ్చింది. ఎంతైనా ఒకరి నీడలో బ్రతికే ప్రాణం. ఆమె వాలకం చూస్తుంటే వాళ్ళకు తెలియకుండా వచ్చినట్టు అనిపిస్తోంది. ఏం చేస్తుంది. మనం ఏమన్నా చెయ్యగలమా అని చూద్దాం అని జవాబు చెప్పిన స్వరం ఎక్కడ్నుంచో వినిపిస్తునట్టు ఉన్నది.

అవమాన పడినట్టు ఫీలింగుతో తలవంచుకుని ప్లేటులో చెయ్యి పెట్టింది శైలజా. ఎందుకనో ఏడుపు వస్తున్నట్టు ఉన్నది. ఇతనెందుకు నన్ను ఇలా శత్రువులాగా చూస్తున్నాడు?’ అని పరితపించింది మనసు.

లేదు! మనపని, వినోధినీ యొక్క నాన్నని చూడటం మాత్రమే. అంతేగానీ ఎవరు కోపగించుకున్నా, ద్వేషించినా బాధపడకూడదు!అని తనలో తానే చెప్పుకున్న ఆమె, గబగబా రెండు ఇడ్లీలు తిని ముగించింది.

చేతులు కడుక్కుని ముగించగానే, “.కే. అంకుల్! నేను బయలుదేరతాను అని కిషోర్ చెప్పటం విని మనసులో కాస్త ప్రశాంతత అనిపించింది.

కానీ మరుక్షణమే, “సరే...మీరు బయలుదేరండి అన్న ఆయన శైలజాను చూసి నువ్వూ ఆయనతో వెళ్ళి మీ నాన్నను చూసి ధైర్యం చెప్పి, లక్ష్మీ అమ్మగారిని పిలుచుకు వస్తానని చెప్పమ్మా. అప్పుడే ఆయన కొంచమైనా ప్రశాంతత పొందుతారు అని చెప్పగా, ఆమె షాకయ్యింది.

ఇప్పుడు అతనితో వెళ్ళాలా?’

మీరు కూడా రండి అంకుల్. నాకు కొంచం ధైర్యంగా ఉంటుంది అన్న ఆమెను కోపంగా చూస్తూ, “ఎందుకని...నేనేమన్నా సింహమా, పులా...నిన్ను కరిచి తింటానికి? ఆయనకు వేరే పనుంది. వస్తే రా, లేకపోతే పో అన్నాడు.

సంకోచిస్తూ వెళ్ళింది. డ్రైవింగ్ సీటులో అతను కూర్చోగా, వెనుక సీటులో కూర్చుందామనుకుని వెనకు డోర్ తీసింది.

నేను నీకు డ్రైవర్ కాదు. యజమాని అమ్మగారు...వెనకాలే కూర్చుంటారో? అమ్మ ఇంటి పొగరు అలాగే ఉంది. పద్దతిగా ముందు కూర్చో అని వొంగుని కారు డోర్ తెరిచాడు.

వేరు దారిలేక అతని పక్కనే కూర్చున్నప్పుడు భయం వేసింది. తెలియని మొగాడితో మొట్టమొదటిసారిగా కారులో ప్రయాణం. కాళ్ళూ--చేతులూ వణికినై. హలో ఎఫ్.ఎం రేడియోలో పాటలు వినిపించ, శైలజా హృదయంలో పందెం గుర్రం పరిగెత్తింది. అర్ధ యుగంలాగా గడిపిన ప్రయాణానికి తరువాత, పెద్ద హాస్పిటల్లో కారు ఆపిన అతను--ఆమె దిగిన తరువాత కారును లాక్ చేసి ముందుకు నడిచాడు. 

వాకిలి దగ్గరకు వెళ్ళంగానే, “ఇదిగో చూడు! నువ్వు ఉద్దేశంతో వచ్చున్నా నాకు బాధలేదు. కానీ, మామయ్య దగ్గర మాత్రం సక్రమంగా మాట్లాడు. ఏడ్చి, గోలచేసి నటించక్కర్లేదు అని ఆమెను చూస్తూ  నిర్లక్ష్య చూపుతో చెప్పాడు.

చురుక్కుమని కోపం తలకెక్కగా, “హలో! ఆయనేదో మీ నాన్నలాగా చాలా కరుగుతున్నారు? నేనెలా నటించాలో నాకు తెలుసు. దానికి ఎవరి సలహానూ నాకు అక్కర్లేదు అని చిన్న స్వరంతో ఆమె మెల్లగా అతన్ని కసురుకుంది.

కోపంగా ఆమె వైపుకు ఒక అడుగు వేశాడు.

గుడ్ మార్నింగ్ కిషోర్ అన్న గొంతు విని వెనక్కి తిరిగాడు. ఈయన మన ఫ్యామిలీ డాక్టర్! ఈమె వినోధినీ. మామయ్య యొక్క ఒకత్తే కూతురు అని పరిచయం చేసిన అతన్ని విచిత్రంగా చూసేసి, డాక్టర్ కు నమస్తేచెప్పింది. కారణం, అతని ముఖంలో కనబడిన చిన్న నవ్వు. ఇతనికి అందంగా నవ్వటం కూడా తెలుసా?’

ఆమెను చూసి ఆశ్చర్యంతో నవ్వారు ఆయన రామ్మా, లోపలకు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు. నువ్వు వచ్చాసావు కదా...ఇక ఆందోళన పడటానికి ఏమీలేదు... -- ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసిన డాక్టర్ ధైర్యం చెప్పాడు. దగ్గర ఉన్న కిషోర్ ఆమెను చూసి ఎగతాలిగా నవ్వగా, ముగ్గురూ లోపలకు వెళ్ళారు.

మోహన్ సార్...గుడ్మార్నింగ్. కొంచం కళ్ళు తెరిచి చూసారంటే ఎవరోచ్చారో తెలుస్తుంది అంటూ మోహన్ కుమార్ గారిని లేపారు డాక్టర్.

మెల్లగా కళ్ళు తెరిచిన ఆయన చుట్టూ అణ్వేషించ, ఆయన చూపులు కొత్తగా వచ్చిన శైలజా మీద పడింది.

వినోధినీ మామయ్యా! అని కిషోర్ చెప్పగా, క్షణంలో తాను ఎవరు?’ అనేది మరిచింది శైలజా.

హృదయం కరిగి, కన్నీళ్ళు చేరుకున్న కళ్ళతో ఆయన్ని చూసింది. ప్రేమ, అభిమానం, బంధం అనే మాటల బాధింపును క్షణంలో ఫీలయ్యింది. కళ్ళు నీటితో నిండ, నోట మాటలురాక వెనక్కి తిరిగి కిషోర్ ను చూసింది.

చూపుల్లో అతనికి ఏం తెలిసిందో, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన భుజాలమీద  చేతులు వేసి, “ఏమిటి మామయ్యా మీరు...చిన్న పిల్లాడిలాగా వినోధినీను ఏడిపిస్తున్నారు. మీరేమీ బాధపడకండి. ఆమె ఇకమీదట మీ దగ్గరే ఉండబోతుంది. ఇంకో గంటలో మిమ్మల్ని గదికి మారుస్తారు. అప్పుడు ఎక్కువగా మాట్లాడొచ్చు. ఇప్పుడు పల్స్ రేటు, గుండే రేటు చెక్చేసే సమయం కదా డాక్టర్?” అని డాక్టర్ను చూసాడు.

యస్...యస్! దీంతో మీరు వార్డుకు వెళ్ళి, రెండు రోజులు అక్కడ ఉన్న తరువాత ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు డాక్టర్.

అప్పుడు నేను ఇంటికి వెళ్ళి అమ్మనూ, వినోధినీనూ పంపిస్తాను మామయ్యా.  ఈలోపు మీరు కొంచం రిలాక్స్ అవండి అన్న కిషోర్, శైలజా చేతిని గట్టిగా నొక్కి పుచ్చుకున్నాడు.

అప్పుడు స్వీయ జ్ఞాపకానికి వచ్చిన శైలజా, తలపైకెత్తి కిషోర్ ను చూసింది.  వెళ్దామా?” అని పిలిచినతను, ఆమె చేతులను విడిచి పెట్టకుండా బయటకు లాక్కొచ్చాడు. కొంచం దూరం వచ్చిన తరువాత, ముట్టుకోకూడనిది దేన్నో ముట్టుకున్న వాడిలాగా శైలజా చేతిని చటుక్కునవదిలేసి ఎందుకు ఏడుపు  నాటకాలు?” అని విసుక్కున్నాడు.

! ఏమిటితను ఇలా ఉన్నాడు? మంచిదే అనుకోవటం తెలియదు లాగుందిఅని అనుకున్న ఆమె మీకు సమస్య ఏమిటో నాకు అర్ధం కావటం లేదు! నేను  రావటం మీకు నచ్చలేదని మాత్రం తెలుస్తున్నది. దాని గురించి నాకు బాధలేదు. .కే., ఆయన్ని చూసేశాను. బయలుదేరతాను అని చెప్పి వేగంగా నడవటం ప్రారంభించింది.

అన్నయ్యా! వినోధినీ వచ్చిందా? అమ్మ -- పిలుచుకురమ్మని చెప్పింది -- గొంతు విని తిరిగి చూసిన ఆమె, కిషోర్ పోలికతో, అతనికంటే కొంచం ఎత్తు తక్కువగా -- గోధుమ రంగు కలరులో ఒక యువకుడు నిలబడున్నాడు.

ఎందుకలా అరుస్తావు శంకర్? ఇది హాస్పిటల్ అని తెలియదా...ఈమే వినోధినీ అని ఆమెను పరిచయం చేసాడు.

శంకర్ కళ్ళు పెద్దవవగా, “అయ్యో! ఎంత అందం! ఫోటోలో చూసినట్లు లేదే అని ఆశ్చర్యపోయాడు.

వినోధినీ...ఇతను నా తమ్ముడు శంకర్. బి.. కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్సరం అని చెప్పగా, చెయ్యి జాపి, “హలో! ఎలా ఉన్నారు?” అని నవ్వాడు శంకర్.  

అతని కళ్ళల్లోని పిల్లతనము, కుతూహలము శైలజాను ఆకర్షించ హాయ్! మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంగ్లీష్ లో చెప్పి షేక్ హ్యాండ్ చేసింది.

కిషోర్ యొక్క విసుగు కలిసిన స్వరం అడ్డుపడ్డది. నువ్వు బయలుదేరు శంకర్! కాలేజీకి టైము అవటంలేదా?” అని అడగ, “ఉండండన్నయ్యా. అందమైన దేవతతో రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాను. నేను బైకుమీద ఇంటికి తీసుకు వెళ్తాను. మాట్లాడుతూ వెళ్ళొచ్చు! అని ఆమెకు ఆలొచన అందించాడు.  

అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు అని తమ్ముడ్ని తరిమాడు.

.కే.. ఏంజల్! నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. బై...బై అని చెప్పేసి నవ్వుతూ, చెయ్యి ఊపుతూ బయలుదేరాడు శంకర్.

రా...వెళ్దాం అని ఆమెతో చెప్పి, కారువైపుకు కిషోర్ నడవగా ఒక్క నిమిషం అంటూ అతన్ని పిలిచి నేను ఎక్కడికీ రాలేను. బయలుదేరతాను. బై... అని చెప్పి, హ్యాండ్ బ్యాగును భుజాలకు తగిలించుకుని వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టింది.

వేగంగా వచ్చి ఆమె భుజాలను లాగి పట్టుకున్న కిషోర్ ఇందుకే నువ్వు  రాకుండానే ఉండి ఉండవచ్చు అని చెప్పాను. మామయ్య పరిస్థితి చూసిన తరువాత కూడా, నీకు జాలి రాలేదంటే నువ్వు ఆయన కూతురుగా ఉండే ఛాన్స్ లేదు -- కోపంగా మాట్లాడాడు.

నిజం చెప్పేద్దామా?’ అని ఒక్క క్షణం అనుకున్న ఆమె, వినోధినీను తలుచుకుని మౌనం పాటించింది.

నో! నాకు కోపం తెప్పించకు వినోధినీ. మామయ్య ఇంకా నీతో మాట్లాడలేదు. మా  అమ్మ కూడా నిన్ను చూడాలని కాచుకోనుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు నాతో వచ్చే తీరాలి. లేకపోతే...నిన్ను ఎత్తి కారులో పడేస్తాను. డీసెంటుగా నువ్వుగా వచ్చేస్తే మర్యాదగా ఉంటుంది అని బెదిరించాడు. అతని ఖచ్చితమైన స్వరం, సవాలు వదిలే చూపులను చూసి ఏం చెయ్యాలో తెలియక నిలబడిపోయింది.

ఎక్కడో చిక్కుకుపోయినట్టు దిగులు పడింది. అడ్జెస్ట్ చేద్దాం అని ధైర్యం చెప్పిన మనసు, ఇప్పుడు తడబడి స్తంభించి నిలబడింది. అతని చేతిని మెల్లిగా జరిపి అడ్డుతొలగించుకున్న ఆమె, ఎడం చేతిని తిప్పి--టైము చూసింది. నేను ఆల్రెడీ టికెట్టు బుకు చేసుకున్నాను. వెళ్ళేసి మళ్ళీ వస్తాను. ప్లీజ్...అర్ధం చేసుకోండి, మిస్టర్ కిషోర్

 సంసయిస్తూ ఆమె చెప్పగా ఆశ్చర్యంతో ఆమెను చూశాడు.

వాట్...మిస్టరా? వెరీగుడ్ వినోధినీ, మనం వెళ్దామా? లేక...నిన్ను ఎత్తుకునే వెళ్ళాలనుకుంటే నేను రెడీ -- ఎగతాలి నవ్వుతో అడిగాడు.

ఇతని దగ్గర నుంచి తప్పించుకోలేమూ అనేది అర్ధమైపోయింది. ఆలొచిస్తూ అతని కారు ఉన్న వైపుకు నడిచింది. మళ్ళీ అతనితో కారులో ఒంటరి ప్రయాణం. కానీ, ఈసారి మనసులో భయం మాత్రమే ఉంది. దీంట్లోంచి ఎలా తప్పించుకోబోతాం అన్న భయం.

వినోధినీ యొక్క తండ్రి ఇంటిని కంపార్ చేస్తే కిషోర్ ఇల్లు చాలా చిన్నది. చిన్న ఇంటి ముందు కారు ఆపాడు. మెల్లగా దిగి నిలబడ్డ ఆమె అటూ--ఇటూ చూస్తుంటే ఏంటమ్మా...అక్కడే నిలబడిపోయావు? రామ్మా...ఇదికూడా నీ ఇల్లే. నేనెవరో తెలుస్తోందా? నేను నీ అత్తయ్య ప్రభావతి అని మర్యాదగా మాట్లాడిన స్త్రీ ఆమెకు బాగా నచ్చింది. శైలజా పెరిగిన అనాధ ఆశ్రమ హెడ్ భువనేశ్వరి యొక్క దయనీయ చూపు స్త్రీ దగ్గర కనబడటంతో ఆమె మనసు తేలిక పడింది.

ఆమెను చూస్తూ నమస్తే చెప్పింది. దగ్గరగా ఒక యువతి నవ్వుతూ వచ్చి నిలబడ, “ఇది నా పెద్ద కూతురు పద్మ. చిన్నది ప్రమీలా, స్కూలుకు వెళ్ళింది. వీలిద్దరికీ మధ్యలోనే శంకర్. పెద్దవాడు కిషోర్

హాయ్ అంటూ యువతిని చూసి నవ్వినప్పుడు, శైలజా చేతులను ఆమె పుచ్చుకుంది. నిన్ను చూడాలని ఎంత ఆశగా ఉన్నామో తెలుసా? ప్రమీలా, శంకర్ లీవు పెడతామన్నారు. సాయంత్రం వచ్చిన తరువాత చూడచ్చు అని పంపించాము. అయినా కానీ, శంకర్, ఆసుపత్రికి వచ్చి నిన్ను చూసే కాలేజీకి వెళ్తానని మొండికేసి వచ్చాడు. వినోధినీ మంచి అందం కదమ్మా?” 

మీరూ చాలా అందంగా ఉన్నారు అని వినోధినీ చెప్పగా, “ఏమిటీ మీరూనా? మనలో అవన్నీ ఎందుకు? నువ్వు...పో...రా...అనే పిలు నవ్వుతూ చెప్పింది పద్మ.

అలాగంతా మర్యాద ఇవ్వకుండా పిలవకు పద్మా. మేడమ్, మిస్ అనే ఆమెను అందరూ పిలవాలి. ఎందుకంటే మేడమ్ బెంగళూరులో పెరిగింది అని వెక్కిరింతగా చెప్పాడు కిషోర్.

ఏం నాయనా...వచ్చీ రావటంతోనే పిల్లతో గొడవపడాలని ఆశపడుతున్నావా?  అలాగంతా చెప్పకురా అని చెప్పిన తల్లితో నేనా గొడవపడాలని అనుకుంటున్నా? నన్ను మిస్టర్అని పిలిస్తే నాకెలా ఉంటుంది అంటూ ఆమెను కోపంగా చూశాడు.

అరెరె...బావాఅని కదా పిలిచుండాలి? కనీసం మావయ్యాఅని అన్నా పిలవచ్చు వినోధినీ -- కళ్ళల్లో అల్లరితో చెప్పింది పద్మ. 

నువ్వు దెబ్బ తినబోతావు చూడు...నేను అలాగా చెప్పాను? ‘కిషోర్అని పేరుపెట్టి  పిలిస్తే చాలు. మర్యాదలన్నీ అవసరమా అని అడుగుతున్నా అంటూ జేబుల్లో చెయ్యి పెట్టుకుంటూ స్టైలుగా చెప్పాడు.

మొదటి సారిగా ఇంటికి వచ్చిన పిల్లను ఎంతసేపు బయటే నిలబెడతారు? ప్రభావతీ, వెళ్ళి హారతీ తీసుకురా అన్న స్వరం వచ్చిన వైపు అందరూ తిరిగారు. అక్కడ పెద్దాయన ఒకరు నిలబడున్నారు.

ఈయనే నీ మావయ్యమ్మా?” అని చెప్పేసి వేగంగా ఇంటిలోపలకు వెళ్ళింది ప్రభావతీ. హారతీ తీసి ఆమెను లోపలకు పిలుచుకు వచ్చిన తరువాత, “నేను చంద్రశేఖరం. నా చెల్లెలు లక్ష్మీ ఎలా ఉన్నది?” అని అడిగారు.

కిషోర్ లాగా కాకుండా ప్రియంగా మాట్లాడిన కుటుంబీకులతో కలిసిపోవటానికి సంసయించలేదు శైలజా. ఆయనకు నమస్కరించిన ఆమె బాగుంది మావయ్యా. మిమ్మల్నందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మనసారా చెప్పింది.

అబద్దం చెప్పకు! అలాగే పారిపోదామనుకున్న నిన్ను బెదిరించి పిలుచుకు వచ్చాను. అమ్మా, ఇదిగో నీ తమ్ముడి కూతురు. ఇప్పుడే వెళ్ళిపోవాలని పట్టుదలతో ఉంది. మీకు కావాలంటే ఏదైనా చెప్పి ఆపి ఉంచుకోండి. తరువాత, మావయ్యను ఇంకో గంటలో గదికి మారుస్తారు. ఇంకో పది నిమిషాలలో బయలుదేరదాం అని చెప్పి అక్కడ్నుంచి కదిలాడు.

ఇక నా తమ్ముడు బ్రతుకుతాడు. నిన్ను చూసిన తరువాత సగం ప్రాణం వచ్చుంటుంది. లక్ష్మీ కూడా వచ్చేస్తే, బాధేలేదు. కానీ, అది ఎలా అనేదే అర్ధం కావటం లేదు. మొండిగా ఉండి మీ ముగ్గురి జీవితాలూ పాడు చేసిందమ్మా అని కళ్ల నీళ్ళు పెట్టుకుంది ప్రభావతీ.

అలాగంతా కళ్ల నీరు పెట్టుకోకూడదు ప్రభా. నువ్వు కూర్చోమ్మా. నువ్వొచ్చింది లక్ష్మీకి తెలుసా?” అని అడిగాడు చంద్రశేఖరం.

దాన్నే మంచి సందర్భంగా తీసుకున్న ఆమె తెలియదు అంకుల్! నేను వచ్చి వెంటనే తిరిగి వెళ్ళిపోదామని రిటర్న్ టికెట్టుకూడా బుక్ చేసుకున్నా. ప్లీజ్...మీరైనా చెప్పండి, నేను బయలుదేరతాను అని ఆయనతో చెప్పింది.

లేదమ్మా...నువ్వు ఒక్కరోజైనా ఉండాలి. తమ్ముడితో ఉండి మాట్లాడి వెళ్ళిపోతే, అతడి మనసు కాస్త ధైర్య పడుతుంది. ఆపరేషన్ చేసుకోనని మొండికేస్తున్నాడు. ఎవరికొసం ఇక జీవించాలి?’ అని విరక్తిగా మాట్లాడుతున్నాడమ్మా. మందులూ--చికిత్సా తీసుకోనని చెబుతున్నాడు. నువ్వొచ్చి మాట్లాడి అమ్మ కూడా వస్తుందని ధైర్యం చెబితే మంచిది.అందుకే చెబుతున్నాఅని కన్నీటితో చెప్పింది ప్రభావతీ.

గొంతు ఎండిపోయి -- పెదాలు అతుకున్నట్టు అయిపోయి మాటలు బయటకు రావటానికి నిరాకరిస్తున్నాయి. కిషోర్ యొక్క కఠినత్వాని ఎదుర్కొన్న ఆమె, ప్రేమ పూర్వక మాటలను నిర్లక్ష్యం చెయ్యలేకపోయింది. నిజం చెప్పేద్దాం అంటే... వినోధినీను పట్టించాల్సి వస్తుంది. ఆలొచిస్తున్న ఆమె దగ్గరకు ఒక పనిమనిషి వచ్చి జ్యూస్ ఇచ్చింది.

అప్పుడు అక్కడికి వచ్చిన కిషోర్, మావయ్యను గదికి మార్చిన విషయాన్ని  చెప్పటమే కాకుండా, అనాధ ఆశ్రమానికి వెళ్ళి హాస్పిటల్ కు వస్తానని చెప్పాడు.

ఉండయ్యా, వినోధినీను కూడా తీసుకువెళ్ళు...తమ్ముడు నడుపుతున్న అనాధ  మరియు వృద్దుల ఆశ్రమంలో ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులుపుట్టిన రోజు కారణంగా విశేష లంచ్ ఏర్పటు చేసున్నాం. నువ్వెళ్ళి చూసిరామ్మా -- అన్నది ప్రభావతీ.

సారీ ఆంటీ, నేను ఇప్పుడే బయలుదేరాలి. భయంగా ఉంది...నేనొచ్చింది అమ్మకు తెలిసిపోతుందేమోనని అన్నది!

వదిలేయమ్మా. కొంచమైనా మావయ్య గుణ లక్షణాలు ఉంటే, ఆయన మనసు వచ్చేది. దీనికి పూర్తిగా, ఒళ్ళంతా బెంగళూరు పొగరు. ఇదిగో చూడు, నువ్వు మేజర్’. నీ మీద ఎటువంటి యాక్షనూ తీసుకోలేరు. నేనే వచ్చేవారం కోర్టు ద్వారా మీ అమ్మను మీట్ అవ్వాలని ఉన్నాను. విడాకులు తీసుకోలేదు కనుక నీమీద మావయ్యకు హక్కు ఉంది. కానీ, నీకే నాన్న మీద ప్రేమ, దయ, జాలి, గౌరవం కొంచం కూడా లేనప్పుడు, మేము ఏం చేయగలం అని కోపంగా అరిచాడు.

సంకటముతో నిలబడున్న ఆమె భుజాల మీద చెయ్యి వేసిన ప్రభావతీ, “ఇంతకాలం మీకొసం తపించి, తపించి...అదే వాడి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. నిన్ను చూడలని ఎంత పరితపించి పొయాడో తెలుసా? చివరిగా నీకొసం స్కూలు వాకిట్లో నిలబడిన మీ నాన్నను అవమానించటమే కాకుండా...ఇంకోసారి వచ్చి నిన్ను చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది మీ అమ్మ లక్ష్మీ. మనసును విరకొట్టిన మాటలనూ, బాధనూ తన మనసులోనే పూడ్చిపెట్టుకుని, నడుస్తున్న శవంలాగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు... -- చీర కొంగుతో కళ్ళు  తుడుచుకుంది ప్రభావతీ.

ప్రేమ, అభిమానం, బంధం అనేవి ఇంత నొప్పి కలిగించేవా?’ అని ఆలొచించింది శైలజా. ఆమెకు ఇవన్నీ తెలియకుండానే పోయిందే!

ప్రభా! దాని ముందు ఏడవద్దని ఇప్పుడే కదా చెప్పాను. పాపం వినోధినీ. తను ఏం చేయగలదు?” అన్నారు పెద్దాయన.

ఇన్ని రోజులు మీ అమ్మకోసం ఉన్నది చాలు. మావయ్య కోసం రెండు రోజులు గడుపు. నాతో వచ్చి చూడు. ఎంతమంది పిల్లలు కన్నవాళ్ళు లేక అవస్త పడుతున్నారో అర్ధమవుతుంది. ఇప్పుడు...ఉన్న ఆయనకోసం నువ్వు ఏం చెయ్యబోతావో అప్పుడు నిర్ణయించుకో -- గంభీర స్వరంతో కిషోర్ చెప్ప, అతన్ని చూసి నవ్వాలని అనిపించింది. ఆమెకా తెలియదు?  కన్నవారు లేక ఒక్కొక్క స్టేజీలోనూ ఆమె పడ్డ అవస్తలు ఎన్నో చెప్పలేము!

ఒకపక్క భయంగా ఉన్నా ఏం జరుగుతుందో...చూద్దాం!' అన్న మొండి ధైర్యం వచ్చింది.

కిషోర్ తో బయలుదేరింది.

****************************************************PART-3******************************************

కారు జరగటం మొదలై ఐదు నిమిషాల వరకు ఇద్దరి మధ్యా మౌనం ప్రధానమైన భాషగా ఉన్నది. కారులో పాటలు కూడా పెట్టుకోలేదు కిషోర్.

ఇదిగో చూడు వినోధినీ! మనం గొడవపడే మనుషులం కాదు. ఇంకా చెప్పాలంటే కలిసి ఒకటిగా పెరిగాం. పెద్దవాళ్ళు చేసిన నేరం కోసం... మనమెందుకు ఒకరికొకరు శత్రువులుగా ఉండాలి? మనం సహజంగా ఉండొచ్చు కదా... అని స్వరం తగ్గించి చెప్పాడు.

ఆ స్వరం ఆమెలో ఒక గిలిగింత కల్పించింది. ఇతనితో సహజంగా ఉండటం కంటే, గొడవపడటమే మేలు అనుకున్న ఆమె...మౌనంగా కారు అద్దాల ద్వారా బయటకు చూస్తూ కూర్చున్నది.

సహనం కోల్పోయిన అతను,  ఇప్పుడు మావయ్య మీద జాలి పడో, ప్రేమ ఉండో వచ్చినట్టు నాకు అనిపించటం లేదు. నువ్వు రాకుండా ఉండుంటే...నేనే సర్ది  చెప్పేవాడిని. ఇప్పుడు చూడు. నిన్ను ఒక రెండు రోజులు ఇక్కడే ఉంచాలనుకుని...అందరూ నీ కాళ్ళ మీద పడాలని ఎదురు చూస్తున్నావు. మీ అమ్మకున్న పొగరే నీకూ ఉంది! అని మళ్ళీ కఠిన స్వరంతో మాట్లాడాడు.

నేను వచ్చింది మీకు నచ్చలేదని నేను మొదట్లోనే అర్ధం చేసుకున్నాను.  ఇక్కడున్న ఆస్తికి ఆశపడి నేను రాలేదు. ఇదంతా మీరే పెట్టుకుని, చిన్న యజమానిగానే ఉండండి. ఎక్కడ మీ ఆ పదవికి, ఆస్తికి ఆటంకం వస్తుందోనన్న భయమే కదా? నేను...

హఠాత్తుగా కారు సడన్ బ్రేకుతో ఆగిన వేగంలో ముందుకు పడుంటుంది. సీటుబెల్టు వలన తప్పించుకుంది. తిరిగి అతన్ని చూసింది. కోపంతో మొహం ఎర్రబడుంది. చేతులు స్టీరింగ్పైన ఉన్నాయి.

మంచి పెంపకం! ఎందుకిప్పుడు సంబంధమే లేకుండా ఆస్తి గురించి  మాట్లాడుతున్నావు?--వెర్రి కోపంతో అడిగాడు.

అతని కోపం వలన ఏర్పడ్డ భయాన్ని కప్పి పుచ్చుకుని, "మరి! నేను వచ్చిన దగ్గర నుండీ విసుగు, కోపంతో మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? నేనే ఎన్ని సమస్యలతో వచ్చానో తెలుసుకోకుండానే మాట్లాడుతున్నావు? మిగిలిన వారి గురించి మీకు ఎటువంటి పట్టింపూ లేదు. ఎంతసేపూ మీరు, మా నాన్న ఎన్ని బాధల్లో ఉన్నారో అనేదే మీకు ముఖ్యం. ఎందుకంటే మీ ఆలొచనలో మాకేమీ సమస్యలు ఉండవు? నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చాను...నేనొచ్చింది వాళ్ళకు తెలిస్తే నన్ను చంపేస్తారు. అందుకనే వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని 'టికెట్టు బుక్' చేసుకున్నాను" అని తానూ కోపంగానే మాట్లాడింది.

కొద్ది సేపటి వరకు అతని దగ్గర నుండి సమాధానం లేదు. తరువాత "నాకు మావయ్య మీద ప్రేమ-అభిమానం కంటే, అంతకంటే ఎక్కువ మర్యాద ఉంది. దాన్ని నీ దగ్గర నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. కానీ, మావయ్య కోసం చెబుతున్నా...విను. ఆల్రెడీ--అంటే ఎప్పుడో ఆయన ఆస్తిలో డెబ్బై ఐదు శాతం నీ పేరుకూ, పాతిక శాతం ఆయన నడుపుతున్న అనాధ ఆశ్రమానికీ రాయించేసేను. ఇకమీదట ఇలా అసహ్యంగా మాట్లాడకు!" -- ఎమోషనల్ స్వరంతో గట్టిగా చెప్పాడు.

కొద్ది క్షణాలు మౌనంగా ఉన్న ఆమె, “సారీ. నేను మిమ్మల్ని అలా మాట్లాడి ఉండకూడదు." అని క్షమాపణలు కోరింది.

అతను కూడా చూపల నుండి కఠినత్వాన్ని దాచి, "పరవాలేదు...నేనూ నిన్ను అంత కఠినంగా మాట్లాడుండకూడదు" అని కారును కదిపాడు.

మావయ్య అనుభవించిన బాధలను, ఆయనతో ఉంటూ చూసినందువలన నాకు  మీ ఇద్దరి మీద కోపం. అత్తయ్య ఆయన మీద కోపంతో రాలేదు. నువ్వు ఒకసారైనా వచ్చి చూసుండొచ్చే? కనీసం ఫోనులోనైనా ఆయనతో మాట్లాడుండొచ్చే? నీకు ఆయన మీద ప్రేమే లేదనేదే నాకు మంట" అని కారణం చెప్పాడు.

'ఇతనికి వినోధినీ రాలేదన్నదే కోపమే తప్ప, నా మీద ఏమీ లేదు ' అని ఒకసారి బుర్రలో అనిపించ, మనసు కొంచం ప్రశాంతత చెందింది.

"అది పదిహేడు సంవత్సరాలకు ముందు, మనసు మొద్దుబారి పోవటం వలన ఏర్పడింది. పెద్దల చేష్టల వలన పిల్లలు అనుభవించే అవమానాలు, వేదనలు జీవితం మీద ఎంత విరక్తిని ఏర్పరుస్తుందని అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్ధమవుతుంది" అన్నది శైలజా.

"ఇప్పుడు మనం వెళ్ళబోయేది 'దయా' అనాధ--వృద్దాశ్రమం. మావయ్య ఇది ప్రారంభించి పది సంవత్సరాలు అవుతోంది. పండుగ రోజుల్లో మావయ్య ఇక్కడకు వస్తారు. పిల్లలకూ, వృద్దులకూ రకరకాల పలహారాలు, భోజనం పెట్టించి, వాళ్ళతోనే పండుగ జరుపుకుంటారు. మేము పిలిస్తే కూతుర్నీ, భార్యను విడిపోయిన దుఃఖము -- వాళ్ళతో ఉన్నప్పుడు తెలియటం లేదుఅని చెప్తారు. మనుషులు తప్పు చేయటం సహజం. తప్పు చేసిన వాళ్ళు. దేవుడిలాగా గుడిలోనే ఉండాలి. ఏం మీ అమ్మ తప్పే చేయని మనిషా?" అని తిరిగి చూసి ఆమెను అడిగాడు.

"ఎవరు తప్పు చేసారు అనే అన్వేషణ అవసరంలేని విషయం.కానీ, కన్నవారు స్వార్ధపరులుగా ఉంటే, పిల్లల జీవితం ఎప్పుడూ ప్రశ్నార్ధకమే" అన్న ఆమె, మాట మార్చాలనే ఉద్దేశంతో "మీరు ఏం చదువుకున్నారు?" అని విచారించింది.

ఆమెను ఆశ్చర్యంగా చూసిన అతను, "నేను బి.కాం. తరువాత ఎం.బి..  సొంతంగా 'కంప్యూటర్--లాప్ టాప్' బిజినెస్. మావయ్య ఆరొగ్యం బాగుండలేకపోవటంతో గత ఆరు నెలలుగా ఆయన్ హోటల్ ను కూడా చూసుకోవలసి వచ్చింది. నువ్వు వచ్చేస్తే, నీకు అన్నీ నేర్పించి నా పనులు చూసుకుంటాను.  లేక--లక్ష్మీ అత్తయ్య వచ్చినా ఆవిడే చూసుకుంటుంది. అంతకు ముందు ఆవిడే చూసుకునేది" అని సృష్టం చేశాడు.

"అది జరుగుతుందనేది అనుమానమే" అన్నది ఆలొచనతో.

"జరుగుతుంది! నా తర్వాతి పని అదే. నేనూ బెంగళూరు వచ్చి, అత్తయ్యను తీసుకు వస్తాను చూడు" -- ఛాలెంజ్ చేశాడు.

నిజం తెలిసేటప్పుడు, నా గతి ఏమిటీ?’ అని ఆలొచించిన ఆమెకు శరీరమంతా వణికింది. ఆమె దగ్గర కదలిక చూసిన అతను ఏమిటీ....సి. చలిగా ఉందా వినోధినీ?” అని అడిగాడు.

శైలజా అని పిలిస్తే ఎలా ఉంటుంది?’ అని అనుకోవటంతో మళ్ళీ వణుకు ఏర్పడింది. .సి. తగ్గించాడు. వేస్తున్న ఎండకు, అందులోనూ ఒక బెంగళూరు నివాసికి, చలి వేస్తోందంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఎగతాలి నవ్వుతో.

అతని నవ్వు వెచ్చదనం ఇచ్చినట్టుగా ఉన్నది. జవాబుగా నవ్వుదాం అని తుళ్ళిపడుతున్న మనసును అనిచి, చూపులను తిప్పి మౌనంగా బయటకు చూసింది.

ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నప్పుడు కారు ఒక గేటు ముందు ఆగింది.

దయా నిలయంఅన్న నేమ్ బోర్డు ఉన్న పెద్ద స్థలంలోకి కారువెళ్ళి ఒక బిల్డింగ్ ముందు ఆగింది. నిశ్శబ్దంతో మునిగిపోయున్న నిలయం. కుమారి ఇసబిల్లాఅని పరిచయం చేయబడ్డ వృద్దురాలిని ఆశ్చర్యంతో నమస్కరించింది శైలజా.

ఏమిటమ్మా అంత ఆశ్చర్యం? నేనెలా ఇక్కడ అనేగా? ఒక కాన్వెంటులోనే బాధ్యత స్వీకరించాను. కానీ అక్కడకొచ్చి సహాయం చేయమని మోహన్ గారు వెడుకున్నారు కాబట్టి వచ్చాను. మోహన్ గారికి ఉన్న దయా గుణం, ప్రపంచంలో చాలా కొద్దిమందికే ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రోజూ ప్రార్ధన చేస్తున్నారు. ఇక్కడ జాతీ--మతం భేదం లేదు. అన్ని పండుగలను జరుపుకుంటాం అని గబగబా చెప్పేసి, లంచ్ గురించి కిషోర్ దగ్గర చెప్పింది.

ఈరోజు స్పేషల్ గా పాయసం చేయమని చెప్పాను! అదికూడా రెడీ అయ్యింది. బ్రదర్’--అని చెప్పి, మళ్ళీ శైలజా వైపుకు తిరిగి బ్రదర్ తనని సార్ అని పిలవకూడదని చెప్పారుఅందువలనే నేను అలా పిలుస్తున్నాను అని  వివరించింది.

కొనసాగిస్తూ నేనొక వాగుడుకాయిని, మాట్లాడుతూనే ఉంటాను. మీరు ఆశ్రమం  మొత్తం ఆమెకు చూపించండి బ్రదర్. నేనొచ్చి జాయిన్అవుతాను అని చెప్పి, టెలిఫోన్ పిలుపుకు జవాబు చెప్పటం మొదలుపెట్టింది.

రా వినోధినీ! వెళ్ళి పిల్లలనూ, పెద్దలనూ చూద్దాం అమెను పిలుచుకు వెళ్ళాడు. బిల్దింగులో నుండి తిన్నగా ఒకదారి వెళ్లగా, రెండు వైపులా రంగుల మయంగా పలురకాల పూల మొక్కలు. అక్కడక్కడ అలాంకార లైట్లు.

ఆమె చుట్టు పక్కలను ఆసక్తిగా చూడటాన్ని గమనించిన కిషోర్ ఎడం వైపు విశాలమైన ప్లే గ్రౌండ్, కుడివైపు కలామండపం. తన యొక్క రిసార్టుకు సరిసమంగా ఆశ్రమం ఉండాలని మావయ్య ఆశపడ్డారు. డబ్బులు ఉన్నవారు మాత్రమే జీవితాన్ని అనుభవించలా? ఇక్కడున్న ఇరవై ఐదు మంది అనాధ పిల్లలూ, ఇరవై మంది వృద్దులూ కూడా అనుభవించనీఅనేది ఆయన ఆలొచన. అందువలన పూర్తిగా అనాధలుగా ఉన్నవారిని ఎంపిక చేసి, వాళ్ళకు పరిపూర్ణ జీవితాన్ని ఇస్తున్నారు అంటూ ఆమెను పిలుచుకు వెళ్ళిన చోటు ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్.

ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ నుండి మొదలుపెట్టి, కంప్యూటర్ వరకు రకరకాల ప్రొఫషనల్ ట్రైనింగ్ వరకు ఇవ్వబడుతుంది. పిల్లలు కాకుండా మావయ్య దగ్గర పనిచేసే పనివాళ్ల వారసులు కూడా నేర్చుకుంటున్నారు -- చెబుతూ వచ్చిన అతను, ఆమె చేత్తో నోటిని మూసుకోవటం చూసి ఏమిటీ?” అన్నాడు.

సారీ! వసతులు చేసిస్తే పిల్లలు బద్దకస్తులుగా పెరుగుతారు అని నిర్లక్ష్యంగా అనుకున్నాను. దానికొసం బాధపడుతున్నాను అన్నది నిజమైన బాధతో.

మెల్లగా నవ్వినతను కానీ, నిన్ను తప్పు పట్టకూడదు. మావయ్య గురించి నీకు తెలిసే అవకాశమే లేదే! ఆయన్ని నువ్వు తండ్రిగా పొందటానికి నువ్వు ఎప్పుడో పుణ్యం చేసుకోనుండాలి వినోధినీ అన్నాడు ఎమోషనల్ గా.

నేర భావనతో తలవంచుకుంది శైలజా. అక్కడ ఒకరిద్దరు పనివాళ్ళను పరిచయం చేసిన అతను, కళామందిరం లోకి వెళ్ళినప్పుడు వెల్కం...వెల్కం... వినోధినీ అక్కయ్యా అని కోరస్ స్వరం వినిపించింది. వరుసగా వేసున్న కుర్చీలలో  ఒకవైపు, మరోవైపు పెద్దవాళ్ళూ నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ముందున్న స్పీకర్ దగ్గర నిలబడ్డ ఇద్దరు పిల్లల స్వరం పెద్దగా వినబడ, మందిరం మొత్తం కోలాహళంగా ఉన్నది.

పూలగుత్తి ఒకటి ఒక పిల్ల తీసుకువచ్చి ఇచ్చి వెల్కం అక్కా! వెల్కం అంకుల్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. దగ్గర నిలబడ్డ పిల్ల పిల్ల పేరు కావ్యా. పదో తరగతి చదువుతోంది. పూలగుత్తిని అరగంటలో మీకొసం రెడీ చేసింది అని గర్వంగా చెప్పినప్పుడు, ఇసబెల్లా వచ్చింది.

రోజు టంగుటూరి ప్రకాశం పంతులుగారి పుట్తిన రోజు వేడుక సాయంత్రం నాలుగింటికి ఏర్పాటు చేసుంచాము. మీరు వస్తున్నట్టు బ్రదర్ అప్పుడు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే సాయంత్రం చేయాలనుకున్న కార్యక్రమాలను ఇప్పుడే జరిపేద్దామని మార్చాము. పిల్లలు కూడా రెడీగా ఉండటంతో ఈజీ అయిపోయింది. రండి...ముందు వరుసలో కూర్చోండి అంటూ వాళ్ళను పిలుచుకు వెళ్ళింది.

ఏం మాట్లాడాలో తెలియని పరవశంతో నిలబడింది శైలజా. అందరినీ చూస్తూ నమస్కరిస్తూ వెళ్ళి కూర్చుంది. పక్కన కిషోర్ కూర్చున్నాడు.

హలో! ఏమైంది? ఒకేసారి షాకయ్యావా? రిలాక్స్! ఇంకా పిల్లల తెలివిని చూడు అంటూ ఆమె చెవి దగ్గర గుసగుస లాడాడు. అంత పక్కగా వచ్చిన అతని మొహం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. తరువాతి అరగంట ఎలా గడిచిందో తెలియనంతగా...ఆటా, పాట, కామెడీ, చిన్న నాటకం, మిమిక్రీ అంటూ ఆశ్చర్య పరిచారు పిల్లలు.

తిరిగి చూసింది. ఒకవైపుగా కూర్చోనున్న పెద్దవాళ్ళు మొహాలలో ఆనందం. మరోవైపున ఉన్న పిల్లల దగ్గర కుతూహలం. ఇది, ఎక్కడా చూడని వింతలాగా అనిపించింది శైలజాకి.

పిల్లలూ, పెద్దలూ కలిసున్న కొత్త లోకం. ఎలాగైనా సరే వినోధినీను ఇక్కడికి తీసుకువచ్చి చూపించాలిఅని మనసులో అనుకుంది. తరువాత ఆశ్రమంలో ఉన్న నవీన వసతులతో కూడిన శుభ్రమైన గదులు, చిన్న క్లీనిక్, లైబ్రరీ, పెద్ద వంట గది, డైనింగ్ హాలు అంటూ అన్నిటినీ చుట్టి చూపించాడు కిషోర్.

ఆశ్రమంపైన అతనికి చాలా శ్రద్ద ఉండటాన్నీ...పిల్లల దగ్గరా, పెద్దల దగ్గరా అతను అభిమానంతో మాట్లాడిన విధం చూసి ఆశ్చర్యపడింది. రాతిలో కూడా తడి ఉంటుందిఅని అనుకుంది.

అక్కడ్నుంచి బయలుదేరినప్పుడు, మధ్యాహ్నం ఒంటిగంట అయిపోయింది. అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది శైలజా. అందరూ 'అప్పుడప్పుడు రావాలి '  అని అన్నారు. పెద్దవాళ్ళు రాణిలాగా బ్రతకాలమ్మాఅని ఆశీర్వదించారు.

ఐదేళ్ళ పిల్ల వచ్చింది. అక్కా, మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా రానేలేదక్కా. నన్ను ఆవిడ దగ్గరకు తీసుకు వెళతావా అక్కా అని ఆశగా అడిగింది.

మోకాళ్ళ మీద కూర్చున్న పిల్లను ఎత్తుకుని, గుండెలకు హత్తుకుని, లేచి కారు దగ్గరకు పరిగెత్తింది.

****************************************************PART-4******************************************

దుఃఖం గొంతుకకు అడ్డుపడి, ఏడుపు బయటకు రాలేక కొట్టుకుంది. వెనుక వేగంగా వచ్చిన కిషోర్,  ఏమైంది వినోధినీ?” అంటూ అడుగుతూ కారు డోరు తెరిచాడు...లోపల కూర్చున్న శైలజా, వేగంగా శ్వాశ తీసుకుంటూ తనని శాంత పరుచుకోవటానికి ప్రయత్నించింది. ఆమెను ఒకసారి చూసేసి కారు తీసినతను, కొంత దూరం వెళ్ళిన తరువాత...శరీరం అడుతూ, మొహాన్ని మూసుకుని ఆమె ఏడుస్తున్నది చూసి కొద్దిగా కంగారు పడ్డాడు. ఏయ్ వినోధినీ! నిన్ను ధైర్యమున్న  అమ్మాయి అని అనుకున్నాను...ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగి కారును ఒక పక్కగా ఆపాడు.

రుమాల తీసి ఆమెవైపుకు జాపి, “కమాన్ వినోధినీ. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని  చెప్పినా...గడిచిన కాలం, జరుగుతున్న కాలం, భవిష్యత్ కాలం అన్నిటికీ కలిపి ఏడుస్తున్నట్టు కాలం కాలంగా అనిచిపెట్టుకున్న కన్నీరు జలపాతంలా కారింది. కొద్దిసేపు ఆమెనే చూసిన అతను, ఆమె భుజం పట్టుకుని ఆమె తలను తనమీద వంచుకుని ఓదార్చాడు.

అడవి--ఎడారి అంతా తిరిగి చివరకు తన చోటును చేరుకున్నట్టు ఒక ప్రశాంతత ఏర్పడింది శైలజాకి! దాంతో ఏడుపు యొక్క వేగం తగ్గింది. కళ్ళను తుడుచుకుంటున్నట్టు అతనికి దూరంగా జరగటానికి ప్రయత్నించింది. కానీ అతని చేతులు గట్టిగా పట్టుకోటాన్ని చూసి తలెత్తి అతన్ని చూసింది.

ఏమిటీ ఏడుపు? నీకు మావయ్య మీద ప్రేమే లేదని అనుకున్నా. కానీ, నువ్వు  కూడా చాలా కష్టపడ్డట్లు ఉన్నావు...! ఇక మీదట మీ ముగ్గురినీ కలపటమే నా మొదట పని అని గట్టిగా చెప్పి -- నవ్వాడు.

అతని దగ్గర నుండి విడిపించుకున్న ఆమె, మొహాన్ని బయటకు తిప్పుకుని, “సారీ! కొంచం ఎక్కువగా ఎమొషనల్ అయిపోయాను అన్నది.

కారు తీస్తూ, “అలాగంటే, నువ్వు ఇంకా నన్ను బంధువుగా అంగీకరించలేదు అని ఎగతాలిగా అడిగాడు.

ఏం సమాధానం చెప్పగలదు? బంధువు అంటే కూడా ఓర్చుకో వచ్చు. ఛఛ! అతనిమీద ఆనుకుని ఏడ్చి...

వినోధినీ చెప్పింది కదా అని నేను ఇక్కడికి వచ్చుండకూడదు. అతన్ని చూడటానికే అవమానంగా ఉందికొద్దిసేపు అక్కడ మౌనం చోటుచేసుకుంది. ట్రాఫిక్ శబ్ధం మాత్రం ఆగకుండా వినబడ, చేతులతో కళ్ళు మూసుకుని తల వొంచుకుని కూర్చుంది.

కొంచం దూరం వెళ్ళిన తరువాత, గొంతు సరిచేసుకుంది. కొందర్ని మాత్రం అనాధలను చేసి చిత్రవధ చేయటంలో భగవంతుడికి ఆనందం అనుకుంటా. పిల్ల ఎంత ఆశతో, ఏంత అమాయకంగా అమ్మను అడిగింది. మనసుకు కష్టంగా ఉన్నది. అందుకనే...-- మన్నించమనే భావనతో అతన్ని చూసింది.

తలవొంచి కళ్ళతో నవ్వాడు కిషోర్. ఆశ్చర్యంతో చూసిని ఆమె హృదయం కొత్తగా వేగంగా కొట్టుకుంటున్న శబ్ధం చెవుల వరకు వినిపించింది. హృదయం కొట్టుకోవటం అనేది రోజే తెలిసింది.

చిన్న వయసులో నీకూ, శంకర్ కు పెద్దగా గొడవ వస్తుంది. నువ్వు నడుస్తూ నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తావు! నేను నిన్ను ఎత్తుకుని ఓదారుస్తాను. ఇప్పుడు నిన్ను ఎత్తుకుని ఓదార్చలేను అని కొంటెగా చెప్ప, అవమానంతో ఎర్రబడ్డ మొహాన్ని తిప్పుకుంది శైలజా.

ఎర్రబడిన ఆమె మొహాన్ని చూసిన అతను, మాట మార్చాడు. మావయ్యకు రెండు రిసార్టులు ఉన్నాయి వినోధినీ. హైదరాబాద్ అవుటర్ లో ఉన్నది మా నాన్న చూసుకుంటాడు. ఒకప్పుడు మా నాన్న సొంతంగా ఫైనాన్స్ కంపెనీ నడిపేవాడు. హఠాత్తుగా సమస్యలు తలెత్తడంతో -- ఉన్న ఆస్తినంతా అమ్మేసి -- కంపెనీలో డబ్బు డిపాజిట్ చేసున్న వాళ్ళందరికీ వాళ్ళ డబ్బును తిరిగి ఇచ్చేసి పైసా కూడా లేకుండా నిలబడప్పుడు... మావయ్యే కొత్తగా స్టార్ట్ చేసిన రిసార్టును చూసుకునే బాధ్యత నాన్న చేతికి ఇచ్చారు.

మావయ్యకు నేను చాలా రుణపడున్నాను. ఎలాగైనా నిన్నూ, అత్తయ్యనూ తీసుకువస్తానని మాటిచ్చాను. దానికైన ప్రయత్నంలో ఉన్నప్పుడే...నువ్వే  వచ్చావు. ఇక అత్తయ్యను ఈజీగా తీసుకురావచ్చు అని ఉత్సాహంగా చెప్పుకుంటూ వెళ్లాడు.

అతని మాటలకు అడ్దుపడుతూ...అది అంత సులభం కాదు అన్న ఆమెను ప్రశ్నార్ధకంగా చూసేడే తప్ప ఏమీ మాట్లాడలేదు.

శైలజాకి మనసంతా శూన్యంగా ఉన్నట్టు అనిపించింది.  అనిపిస్తున్నట్టు ఉన్నది. సంబంధమే లేకుండా ఒక చోటికి వచ్చి ఇరుక్కుని, ఇంకా కొద్ది గంటలలో విడిపోతాం. నాకెప్పుడూ పిల్ల గతే కదా?’

భువనామ్మా! అమ్మ ఎప్పుడు వస్తుంది?” అని కన్నీటితో అనాధ ఆశ్రమంలో వార్డన్ దగ్గర అడిగిన వెంటనే, ఆమె దగ్గరున్న ఒక కుర్చీలో నన్ను కూర్చోబెట్టి దేవుడు నీకు తప్పుగా ఒక అమ్మను ఇచ్చాడు శైలజా. ఆవిడ నిన్ను సరిగ్గా చూసుకోదనే నిన్ను నా దగ్గరకు పంపాడు. నాతో ఉండటం నచ్చలేదా పాపా?” అని ప్రేమతో అడిగిన వార్డన్ దగ్గర తన బాధ చెప్పటం తెలియక ఒంటారిగా ఏడ్చింది.

రోజు నుండి మనసులో కలతలనూ, బాధలనూ ఒంటరిగా అనిభవించటం ఎలా అని తెలుసుకున్నది శైలజా. అయినా కానీ ఏదైనా ఒకరోజు తన తల్లీ--తండ్రీ  వచ్చి తనని తీసుకు వెళ్తారు అనే నమ్మకంతో రోజూ ఆశ్రమంలోని ఆఫీసు రూములో వార్డన్ కు సహాయం చేస్తూ వాకిలి వైపు చూస్తూ ఉండేది శైలజా.

పిల్లలను దత్తతు తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళ తల్లి-తండ్రులు వచ్చారు అనుకునేది. వచ్చిన వాళ్ళు పసిబిడ్డలనూ, మగపిల్లలనూ మాత్రమే తీసుకు వెళ్ళేవారు. పదేళ్ల వయసు తరువాత మెల్లమెల్లగా తానొక అనాధ, తనని తీసుకు వెళ్లటానికి ఎవరూ రారు అని అర్ధం చేసుకుంది. కొంతమంది తమ ఇంటి పనులకు తనని పనిపిల్లగా తీసుకు వెళ్తామని అడిగారని, వాళ్ళకు, ‘కుదరదుఅని చెప్పి పంపినట్టు తరువాత ఒకసారి చెప్పారు.

తన జీవితం నాశనమైపోకుండా డిసిప్లిన్, మంచి లక్షణాలూ, నేర్పించి రోజు ఆమెను ఒక మంచి వ్యక్తిగా తీర్చి దిద్దిన వార్డన్ రుణం ఎలా తీర్చుకోబోతుంది?

ఆగిపోయిన కన్నీరు మళ్ళీ కారటాన్ని గ్రహించి అతనికి తెలియకుండా తుడుచుకోవటానికి ప్రయత్నించ...అతనో, “మళ్ళీ ఏమైంది...ఏడుస్తున్నావా? కారును పక్కగా ఆపేయనా?” అని అడిగాడు.

వద్దు...వద్దు. ఏడవటం లేదు అని ఆమె ఆదుర్దా పడుతూ చెప్ప, నోరారా నవ్వాడు అతను. అతని నవ్వు పరవశం ఇవ్వగా -- చూపులను బయటకు తిప్పుకున్నప్పుడు హాస్పిటల్ వచ్చేసినట్లు తెలిసి ఆందోళన చెందింది. ఇప్పుడు వినోధినీ నాన్నను కలిసి మాట్లాడాలే!

ఆనుకుని కూర్చున్న మోహన్ కుమార్ -- వీళ్ళను చూసిన వెంటనే రామ్మా! రారా కిషోర్ అని మెల్లగా పిలిచారు.

ఎలా ఉన్నారు మావయ్యా? మీ అమ్మాయి వచ్చింది. తరువాత అత్తయ్యను తీసుకురావలసింది మా డ్యూటీ -- కదా వినోధినీ?” అని అమెకు షాక్ ఇచ్చాడు.

ప్రయత్నించి నవ్వును తెప్పించుకున్న ఆమె, మాట్లాడకుండా నిలబడింది.

.కే. మావయ్యా నేను డాక్టర్ను చూసొస్తాను. మీ అమ్మయితో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి వెళ్ళాడు. తడబడుతూ నిలబడిన ఆమెను, నవ్వుతూ దగ్గరకు పిలిచారు మోహన్ కుమార్ గారు. 

దగ్గరకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న ఆమె -- ఒక పెద్ద నిట్టూర్పు వదిలి నన్ను మన్నించండి అంకుల్! నేను వినోధినీ కాదు. ఆమె స్నేహితురాలు శైలజా.  వినోధినీకి మిమ్మల్ని చూడాలని చాలా ఆశ. కానీ, వాళ్ళ మావయ్యా చాలా స్ట్రిక్టుగా  ఉంటూ ఆమె కదలికలను గమనిస్తూ ఉంటారు. అందువలనే నన్ను పంపింది. మీ దగ్గర నేను నటించలేకపోతున్నా అంకుల్! చెప్పి ముగించేటప్పటికి ఆమెకు ముచ్చెమటలు పట్టినై.

ఆమె చేతులు పుచ్చుకుని నాకు తెలుసమ్మా. నేను వినోధినీను ఇదివరకే చూసున్నాను. దానికేంటమ్మా ఇప్పుడు -- నువ్వూ నా కూతురివే అన్న ఆయన్ని ఆశ్చర్యంతో చూసింది.

మీరెప్పుడు... వినోధినీను చూశారు అంకుల్?” -- ఆతురతగా అడిగింది.

బెంగళూరులో వాళ్ళింటి పక్కన ఒక రోజంతా కారులో దాక్కుని, ఆమె బయటకు వచ్చినప్పుడు చూసానమ్మా. నాలాంటి ఒక పరిస్థితి, తండ్రికీ రాకూడదమ్మా అంటూ బాధపడుతున్న ఆయన్ని ఎలాగైనా ఓదార్చాలని మనసు గింజుకుంది.

కొంచంసేపు ఆలోచించి. నా పరిస్థితి ఇంకా చాలా బ్యాడ్అంకుల్. అక్కర్లేని బిడ్డలను ప్రపంచంలో భగవంతుడు ఎందుకు పుట్టించాలి? పిల్లలకు అనాధ అనే ఒక బిరుదు వేరే ఎందుకివ్వాలి అని బాధపడింది.

ఇంకోసారి మాట చెప్పకమ్మా. నేను ఉన్నంత వరకు నువ్వు అనాధవు కావు, నీకు ఏదీ తక్కువ  కానివ్వను. నేను లేకపోయినా సరే... అన్న మాటకు అడ్డుపడి ప్లీజ్...అలా మాట్లాడకండి అంటూ కన్నీరు పెట్టుకుంది.

చెప్పమ్మా! నా కూతురి గురించి చెప్పమ్మా. చాలా అల్లరి పిల్లా...? బాగా చదువుతోందా? చదువు ముగిసిన తరువాత ఏం చెయ్యబోతోంది? అంతా చెప్పమ్మా. వింటాను అంటూ ఆతురతతో ఆయన అడగ, తరువాత అరగంట సేపటి వరకు వినోధినీ గురించిన గొప్పతనాన్ని వివరించి చెప్పింది.

ఆయన మొహాన నవ్వు, తృప్తి ఏర్పడటాన్ని చూసి ఆమె మనసు బాగా ప్రశాంతత చెందింది. నిన్ను చూస్తేనే నా కూతుర్ని చూసినట్లు ఉన్నదమ్మా. నువ్వు వినోధినీ  కాదన్న విషయం కిషోర్ కు తెలియనివ్వకు. తరువాత కోపంతో వెంటనే బెంగళూరు వెళ్ళి, గొడవ చేస్తాడు అన్నారు.

సరే అంకుల్! కానీ, ఎలాగైనా వినోధినీని పిలుచుకు రావటం నా బాధ్యత. అంతవరకు మీరు జాగ్రత్తగా మీ ఆరొగ్యాన్ని చూసుకోండి. సరేనా?” అని చెప్పినప్పుడు, కిషోర్ లోపలకు వచ్చాడు.

"ఏమిటీ...తండ్రీ--కూతుర్లు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారా? చాలు. ఇంతకంటే మీరు ఎక్కువ శ్రమ పడకూడదు మావయ్యా. రెస్టు తీసుకోండి. నేను మళ్ళీ సాయంత్రం వినోధినీను తీసుకుని వస్తాను అన్నాడు.

సరే కిషోర్! డాక్టర్ కంటే కూడా వీడంటేనే నాకు భయమమ్మా. నాకు మాత్రమే కాదు...అందరికీనూ. కిషోర్ అంటే భయం కలిసిన మర్యాద. అతని మాటకు తిరుగే లేదు అని చెప్పుకుంటూ వెడుతుంటే, “ఒక విధంగా నా ఇమేజ్ ను పాడు చేసేరే? ఇప్పుడే కాస్త భయం పోయి నాతో సహజంగా ఉండటం మొదలుపెట్టింది మీ అమ్మాయి. అది కూడా మీకు నచ్చలేదా?” అని శోకంగా అడగ, “నాకు భయమంతా లేదే అని నవ్వుతూ స్పీడుగా చెప్పేసి నాలిక కరుచుకుంది.

ఆమెను ఆశ్చర్యంగా చూసిన అతను, ఆయన మంచంపై పడుకోటానికి సహాయపడి -- నర్స్ దగ్గర చెప్పి -- శైలజాతో కలిసి బయటకు వచ్చాడు.

కారులో బయలుదేరిన వెంటనే చూశావా... మావయ్య మొహంలో ఎంత ఆనందమో? నువ్వు కూడా వచ్చినప్పటి నుండి నవ్వలేదే! నీ అందమైన నవ్వును కూడా ఇప్పుడే చూసాను అని చెప్పగానే అతని ఆశ్చర్యానికి అర్ధం తెలిసింది.

వినోధినీ యొక్క నాన్నతో నిజం చెప్పేయటంతో, మనోభారం తగ్గిపోయి, ఆమె  అలా నవ్వి ఉండొచ్చు. కానీ, అందమైన నవ్వుట? చిన్నగా గుండే తుళ్ళింది. ఇంకా కొంచం నవ్వి చూపించాలని లేచిన ఆశను అనుచుకోవటానికి ప్రయత్నించినప్పుడు, మంచికాలం వచ్చినట్టు అతని సెల్ ఫోను మోగటంతో -- తనని అనుచుకుంది శైలజా.

****************************************************PART-5******************************************

ఏదో శబ్దంతో కళ్ళు తెరిచిన ఆమెకు, కొద్దిసేపటి తరువాతే...తాను పడుకున్నది వినోధినీ మావయ్య ఇంట్లో అని అర్ధమయ్యింది. మధ్యాహ్నం కిషోర్ తో వచ్చి లంచ్ చేసింది గుర్తుకు వచ్చింది. ప్రేమ, అభిమానంతో లంచ్ వడ్డించిన తల్లిని రోజు మొదటిసారి చూసింది శైలజా. 

వినోధినీ ఇంట్లో ఒకటి,రెండు సార్లు ఉన్నప్పుడు, ఒక యంత్రంలాగా ఉండటం  గుర్తుకు వచ్చింది శైలజాకి. ఎవరూ అక్కడ ఒకరినొకరు చూసుకుని తిన్నగా  మాట్లాడుకోరు. ఒకటిగా కూర్చుని భోజనం తినేవారు కాదు. తమ గదిలో తప్ప మిగిలిన చోట్ల మాట్లాడుకోవటమే తప్పుఅనేలాగా నడుచుకునే వారు! కానీ, ఇక్కడ కిషోర్, అతని తల్లీ ఏవేవో విషయాలు మాట్లాడారు. అందులో ఆమెను కూడా కలుసుకునేటట్టు చేయటమే కాకుండా కంచంలో ఏదో ఒకటి వడ్డిస్తూనే ఉంది ప్రభావతి. కిషోర్ యొక్క చూపులు అప్పుడప్పుడు ఆమె మీద ఆతురుతతో పడిలేచింది.

కడుపు నిండుగా తిన్నది తెలియక ఆమె భుక్తాయాసంతో శ్వాస వదిలినప్పుడు, “అమ్మ యొక్క వంటను మనం తినకుండా ఉండలేము. కానీ, తిన్నదానికి తగినంతగా వ్యాయామం చెయ్యకపోతే ఇంతే సంగతులు అని చెప్పినప్పుడే, అంత తిన్నా అతను ఎలా అంత శరీర దారుఢ్యంతో ఉండగలుగుతున్నాడు అనేది అర్ధమయ్యింది.

ఇలాంటి రుచికరమైన భోజనం నేను ఇంతకు ముందు తిన్నదే లేదు. చాలా థ్యాంక్స్ ఆంటీ అని ఆమె అనగా అలాగే ఒక దెబ్బవేస్తాను చూడు అంటూ కోపంగా చూశాడు.

శైలజా అర్ధంకాక చూడటంతో, “వదులయ్యా...ఏదో చెప్పాలని థ్యాంక్స్ చెప్పింది. అందుకని ఇలాగా కోపగించుకునేది? నువెళ్ళమ్మా, వెళ్ళి కాసేపు నిద్రపోయి రెస్టు తీసుకో అంటూ ఆమెకు సపోర్టు చేసి మాట్లాడింది.

అతను కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడతాడు. హఠాత్తుగా కోపగించుకుంటాడు. అర్ధం చేసుకోవటమే కుదరటంలేదు! కానీ, కోపం శైలజాను బాధించిందనేది నిజం.

ఆమెను పిలుచుకుని ఒక గదికి వచ్చిన ప్రభావతి, “అతి త్వరలో లక్ష్మీ రావాలని వేడుకుంటున్నానమ్మా. ఆమె చాలా మంచిది. తమ్ముడి మీదే తప్పంతా ఉన్నా, అతన్ని క్షమించి ఉండొచ్చు అని నిట్టూర్పు విడిచింది.

"ఆంటీ! వాళ్ళిద్దరికీ మధ్య ఏమిటి నిజమైన సమస్య?  కొంచం చెప్పగలరా? నాకు పూర్తిగా తెలియదు. ప్లీజ్ ఆంటీ" అని అడిగింది.

ఆమెతో పాటూ మంచం మీద కూర్చున్న ప్రభావతి, “ప్రారంభంలో వాళ్ళ లాంటి  భార్య-భర్తలు లేరని చెప్పేంత దంపతులుగా ఉండేవారు. మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోవటంతో, ఆస్తులను జాగ్రత్తగా చూసుకుంటూ, నాకూ పెళ్ళి చేశాడు నా తమ్ముడు. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్డులోనూ, ముంబై వెళ్ళే రోడ్డులోనూ రెండు రెస్టు హౌసులు నిర్మించి -- యంత్రంలాగానూ, ఒత్తిడితోనూ జీవించే ప్రజలకు రెస్టు తీసుకునే నీడలాగా ఉంచాడు.

లక్ష్మీను మేమే చూసి పెళ్ళి చేశాము. నీకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్యా ఏదో సమస్య ఉన్నది అనేది మాకు అర్ధమయ్యింది. మొదట్లో మా దగ్గర మా తమ్ముడు ఏమీ చెప్పలేదు. మేమూ, మామూలు గొడవ అని అనుకుని వాళ్ళ సమస్యను పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాము. కానీ, తన వలన సరిచేసుకోలేనే నన్న పరిస్థితిలో...మీ మావయ్యతో వివరాలు తెలిపాడు తమ్ముడు.

మూడు నెలల ఇంటీరియర్ డెకోరేషన్ చదువు మరియూ ట్రైనింగుకు విదేశాలకు వెళ్ళాడు తమ్ముడు. అప్పుడు వ్యాపారాన్ని లక్ష్మీనే చూసుకుంది. కొత్తగా చేరిన మేనేజర్ ఏదో అవకతవకులు చెయ్యటంతో అతన్ని పిలిచి హెచ్చరించటమే కాకుండా అతను చేసే ముఖ్యమైన బ్యాంకు, పేమెంట్ పనులను కట్ చేసి తానే చూసుకోవటం మొదలుపెట్టింది. దాంతో కోపం తెచ్చుకున్న అతను లక్ష్మీ మీద పగతీర్చుకోవాలని ఆమె మీద ఒక అపవాదు ప్లాన్ చేశాడు పాపిష్టి  వెధవ...ఆడీటర్ రాం కుమార్ కీ, లక్ష్మీకీ అక్రమ సంబంధం ఉన్నట్టు పుకారు పుట్టించాడు.

వ్యాపారం అంటే ఆడీటర్ను కలుసుకుని ఆలొచన చెయ్యకుండా ఎలా ఉండగలం? వాళ్ళు మాటి మాటికీ కలుసుకున్న విషయాన్ని వేరే విధంగా ప్రచారం చేశాడు. మూడు నెలల తరువాత తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు, వాడి చెవులారా ప్రచారాన్ని పనివాళ్ళు కథలు కథలుగా మాట్లాడుకునేటట్టు డబ్బులిచ్చి సెటప్'’చేశాడు. మొదట్లో తమ్ముడు విషయాన్ని పెద్దగా తీసుకోలేదు. కానీ, పనివాళ్ళు అక్కడక్కడా నిలబడి మాట్లాడుకోవటం...మేనేజర్ యొక్క తంత్రమైన మాటలు అతని మనసులో సంచలనం లేపింది.

తన ప్రాణానికి ప్రాణమైన భార్య తనని వదిలి వెళ్ళిపోతుందో నన్న భయం అతని బుర్రను కన్ ఫ్యూజ్ చేసింది. ఆలొచించకుండా తప్పు చేశాడు. ఇంట్లోని పని మనుషుల దగ్గర విచారించాడు. లక్ష్మీకీ విషయం తెలిసిపోవటంతో ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేసినా నన్ను అర్ధం చేసుకోకపోవటం మొదటి తప్పు. దాని కంటే...నన్ను విచారించకుండా...ఇంట్లోని పనిమనుషుల దగ్గర విచారించేరే! సిగ్గుగా లేదా? ఇక మీదట మనం భార్యా--భర్తలుగా ఉండటం వేస్టుఅన్న ఆమె, నిన్ను పిలుచుకుని బయలుదేరింది -- కళ్ళు తుడుచుకుంటూ కొనసాగించింది ప్రభావతి.

తరువాత మా తమ్ముడు బెంగళూరు వెళ్ళి ఎంతో మాట్లాడి -- క్షమించమని బ్రతిమిలాడినా, లక్ష్మీ క్షమించలేదు. ఒక స్త్రీగా నేనూ ఆమె భావాలను గౌరవిస్తాను. కానీ, దానికోసం ముగ్గురికీ శిక్ష ఇవ్వటం న్యాయం కాదు. నీకు ఎంత కష్టమో చూడు?" అంటూ ఆమె బుగ్గలను ముట్టుకుంది ప్రభావతి.

...........................”

తరువాతే మాకు విషయం తెలిసింది. మేమూ వెళ్ళి మాట్లాడి చూశాము. కానీ,  లక్ష్మీ ఏమందో తెలుసా ఇక ఆమెను వెతుక్కుని వస్తే బెంగళూరు వదిలి  వెళ్ళిపోతానని బెదిరించింది. మనసు విరిగిపోయిన మీ నాన్నకు అప్పుడే మొదటి అటాక్ వచ్చింది. లక్ష్మీకీ కబురు పెట్టాము. ఆమె రాలేదు. తన మనసు చచ్చిపోయిందని జాలి అనేదే లేకుండా చెప్పిందమ్మా. 

ఎలాగో అందులో నుండి తమ్ముడ్ని లాగి, వ్యాపారంలో మనసు పెట్టేట్టట్టు చేసాము. కానీ తనతో పాటూ తన కుటుంబం లేదన్న బాధ ఎలా వదిలి వెల్తుంది? ఇప్పుడు నువ్వైనా వచ్చావే, అదే ఓదార్పుగా ఉందమ్మా అని చెప్పి ముగించింది ప్రభావతి.

పెద్దవాళ్ళు కలిసి ఇంకా కొంచం ప్రయత్నించి ఉంటే, అన్నీ సర్ధుకునేవేమో అని అనిపిస్తోంది ఆంటీ! అన్నది శైలజా. 

లేదమ్మా. ఇక జీవితంలో మోహన్ కుమార్ మొహం చూస్తే, అదే తనకి చివరి రోజుగా ఉంటుందని రాత పూర్వంగా మాకు తెలియపరచి భర్తను మరింత గాయపరిచింది అన్నది కోపంగా.

అప్పుడు అక్కడకు వచ్చిన చద్రశేఖరం ఏమిటీ, అత్తా--కోడళ్ళు కలిసి టీవీ  సీరియల్లో నటిస్తున్నారా? నేలంతా ఒకటే వరదగా ఉంది. నేను ఈత కొట్టుకుంటూ వచ్చాను తెలుసా అని ఎగతాలి చేసి భార్య వైపు తిరిగాడు.

ప్రభావతీ! పిల్ల కాసేపు రెస్టు తీసుకోనివ్వు. ఆమెనూ ఏడిపించావే! నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దమ్మా. అన్నీ త్వరలోనే సర్దుకుంటాయి అని చెప్పి భార్యను చెయ్యి పుచ్చుకుని పిలుచుకు వెళ్ళాడు.

కుటుంబం అంటే ఇలాగే ఉంటుందనుకుంటా. వినోధినీకి కూడా చెప్పాలిఅని ఆలోచన తిరుగుతున్నప్పుడు వినోధినీనూ చాలాసేపటి నుండి కాంటాక్ట్ చెయ్యలేదు అని గుర్తుకు వచ్చి, సెల్ ఫోనును తీసింది. అందులో పది మిస్స్ కాల్స్. అన్నీ వినోధినీ నెంబర్ నుండే.

వినోధినీకు ఫోను చేసింది. ఆమె తీయనే లేదు.

ఆలొచనతో పడుకున్న ఆమె, తనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకుంది.

సాయంత్రం డైనింగ్ టేబుల్ మీద అందరూ కలిసారు. శంకర్ యొక్క చిన్న చెల్లెలు ప్రమీలా పరిగెత్తుకు వచ్చి శైలజాతో మాట్లాడింది.

రండక్కా. మీరు చాలా అందంగా ఉంటారని అందరూ చెప్పారు. నేనొక్క దానినే  మిమ్మల్ని చూడలేదు. అందుకే చాలాసేపటి నుండి మీకొసం కాచుకోనున్నాను. మిమ్మల్ని చూడాలని అప్పుడే వచ్చేశాను. కానీ, మీరు గాఢ నిద్రలో ఉన్నారు.... అన్నది.

గాఢ నిద్ర అంటే...కుంభకర్ణుడిలాగానా నిద్రపోయాను?” అని అడిగింది శైలజా, వాళ్ళ దగ్గరగా కూర్చుంటూ!

అరె...అక్కయ్య కూడా మన గ్రూపే’. సరదాగా మాట్లాడుతున్నారు. కానీ, మీరు చాలా అందం వినోధినీక్కా అంటూ సంతోషంతో అరిచింది.

అరవకు ప్రమీలా. వాళ్ళ గ్రూపులో మనల్నీ చేర్చేస్తారు అని శంకర్ చెప్ప, అతన్ని ప్రశ్నార్ధకంగా చూసింది. అదే చెప్పిందే కుంభకర్ణుడినా అని. గ్రూపును చెప్పాను. నువ్వు నిద్రపోతున్నది చూస్తే, కుంభకర్ణీ అని పేరు పెట్టచ్చు -- కళ్ళల్లో అల్లరి కనబడింది.

పోరా, నువ్వే కుంభకర్ణుడివి...ఈవిడ ఎంత అందంగా ఉంది! ఈవిడ్ని పోయి... అన్నది ప్రమీలా.

క్లాసులో నిద్రపోయి, వదిలేసిన పాఠాలను ఎవరినైనా పిలిచి అడిగి రాస్తావే! పని రోజు లేదా?” అని ప్రమీలాను చూసి అడిగాడు శంకర్.

నువ్వు చాలా పర్ ఫెక్టా? చూడండి వినోధినీక్కా. వీడి తొమ్మిదో క్లాసు పరీక్షకు,   తెలియక ఎనిమిదో క్లాసు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అది తెలియక అదే క్వశ్చన్లకు జవాబురాసి తక్కువ మార్కుతెచ్చుకున్నాడు అని చెప్పిన వెంటనే అందరూ నవ్వారు.

అదేదీ పట్టించుకోక శంకర్ పద్మని గేలిచేశాడు. ఏమిటి... మిస్ కాల్ఇచ్చి ఎవరితోనైనా బాతాకానీ కొడతావే! ఈరోజు నీకు ఎవరూ దొరకలేదా? దీని వలన ఇంకా కొన్ని రోజుల్లో మిస్ కాల్స్కు కూడా డబ్బులు తీసుకోవటం మొదలుపెట్టేస్తారు. సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళకు దీనిలాంటి వారి వలన పిచ్చి లాభాలు వస్తాయి అంటూ ధీర్ఘం తీయ...వదుల్తుందా పద్మ?

చిన్న వయసులో వీడు డబ్బులడిగి ఏడుస్తాడు చూడు. యాభై పైసలు కాయిన్ తప్ప ఏదిచ్చినా కిందపడి దొర్లుతూ ఏడుస్తాడు. వందరూపాయలు ఇచ్చినా కూడా ఒప్పుకోడు. అప్పట్నుంచి వీడికి యాభైపైసలు అనే పేరు కూడా ఉండేది తెలుసా?” రహస్యంగా చెప్పి నవ్వింది.

అప్పుడు వినోధినీకి టిఫిన్ తీసుకు వచ్చిన ప్రభావతీ చాలు...చాలు. ఒకరికొకరు ఇలా పోటీపడి కొట్టుకుంటే వినోధినీ మిమ్మల్ని సరైన గొడవ కోళ్ళు అని అనుకుంటుంది. వెళ్ళి చదువుకునే పని చూడండి అంటూనే దోస, మశాలా పెట్టింది.

అదంతా కుదరదమ్మా! రోజు పూర్తిగా వినోధినీ అక్కతోనే ఉంటాను.  మాట్లాడాల్సింది చాలా ఉందే అన్నది ప్రమీలా, పెద్ద మనిషిలాగా.

అలాగంటారా...అలా ఏం మాట్లాడబోతారండీ?” అని ఆమె స్టయిలులో అడిగింది పద్మ.

అంతా రాత్రి డిన్నర్ టైములో మాట్లాడుకోవచ్చు...మీరిద్దరూ వెళ్ళి చదువుకోండి. పద్మా నువెళ్ళి వినోధినీకి ఫ్యామిలీ ఆల్బం తీసుకువచ్చి చూపించు అని ఆర్డర్ వేయ, చిన్నవాల్లిద్దరూ మొహం చిట్లించుకుని జరిగారు.

పద్మా, శైలజాను లోపలకు తీసుకువెళ్ళింది. వినోధినీ యొక్క బంగళా అంత  గ్రాండుగా లేకపోయినా, చక్కగా ఉంది ఇల్లు. పెద్ద హాలు, డైనింగ్ హాలు, మిగిలిన గదులు చక్కగా ఉన్నాయి. ఒక గదికి తీసుకువెళ్ళి, అలమారులో ఉన్న ఆల్బంలను తీసింది పద్మ.

మీ ఇల్లు ఎప్పుడూ ఇంత కోలాహాళంగానే ఉంటుందా అక్కా?” అని అడిగింది శైలజా. 

అవును. మేము ముగ్గురం ఉన్నామంటే గోలగోలే! అన్నయ్య ఉంటే గోల తక్కువగా ఉంటుంది. ఎక్కువగా గోల చేస్తే అన్నయ్యకు నచ్చదు. అని చెప్పిన ఆమె, మొదటగా వినోధినీ యొక్క కుటుంబ ఆల్బంను చూపింది.

ఎంత సరదాగా జీవిస్తున్నారు! ఆశ్చర్యంగా చూసింది శైలజా.

జీవిస్తున్నామా? జీవించేమని చెప్పు. ఏం చేయను వినోధినీ? అర్ధం చేసుకునే  విధమే  మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ప్రశాంతమైన జీవితమే ముఖ్యం అనుకుంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండే తీరాలి. ఒక గీత గీసి, అందులోనే వెళ్తాను అని మొండికేస్తే...సరిగ్గా రాదు. పట్టించుకుంటే జీవితమే వేస్టు కదా అని సిద్ధాంతము మాట్లాడిన ఆమెను ఎగతాలిగా చూసిన శైలజా,  అబ్బబ్బా! ఎంత  పెద్ద సిద్ధాంతం! ...సిద్ధాంత జ్ఞానిని పెళ్ళి చేసుకునే అదృష్టవంతుడు ఎవరో?” అంటూ ఆలొచనతో పైకి చూసింది.

నేను నీకంటే రెండేళ్ళు పెద్ద. ఇలాగంతా గేలి చేయకూడదు అంటూ సిగ్గు పడుతూ నవ్వుతూ చెప్పింది పద్మా.

తరువాత, వినోధినీ యొక్క అత్తయ్య కుటుంబం ఆల్బం చూసింది. పిల్లలను ఒక్కొక్క వయసులోనూ చాలా ఫోటోలు తీసుండటం చూసి లోలోపల తపన పుట్టింది శైలజాకి.

చాలా వరకు ప్రారంభకాలంలో అన్ని ఫోటోలలోనూ వినోధినీ కుటుంబం ఉంది. అందులో ఒకటి కిషోర్ ఏడేళ్ళ వయసు పిల్లాడు, ఊయలలో కూర్చుని...రెండువైపులా శంకర్ ను, వినోధినీనూ పట్టుకుని నవ్వుతూ ఉన్నాడు.

అప్పుడంతా అన్నయ్యే పిల్లలను బాగా చూసుకునేవాడట. ఇప్పుడు బాధ్యత అంటూ అప్పగిస్తె, చాలా బాగా చేసి ముగించేవాళ్ళు అన్నయ్యకు సమంగా ఎవరూ లేరు తెలుసా?” అన్నది పద్మ గర్వంగా.

...అందుకనే ఎక్కువ కోపగించుకుంటున్నారా, కొంచం విశ్వామిత్రుడి లాగా... అంటూ సాగదీస్తూ నాలికను కరుచుకుంటూ భయంగా పద్మని చూసింది శైలజా.  

ఎవరుకిషోర్ అన్నయ్యనా విశ్వామిత్రుడు అంటున్నావు? ఉండు.  అన్నయ్యరానీ చెబుతాను. బాధ్యత, డ్యూటీ అంటూ వచ్చినప్పుడు ఆయన స్ట్రిక్టు. కానీ, మిగతా సమయంలో ఆయనా ఒక సరదా మనిషే. అది సరి...? విశ్వామిత్రుడ్ని ఒక మేనకా మత్తు ఎక్కించిందని చదివాను. అలా ఏదైనా...?” అంటూ శైలజాను కెలక ఛఛ...అదంతా ఏమీ లేదు. ఊరుకో తల్లీ...అనవసరమైన రూమర్ లేపకు?” అన్న ఆమె ముఖం ఎర్రగా మారటం చూసి ఆశ్చర్యపడింది పద్మ.

ఓయమ్మో...సిగ్గుతో ముఖం ఎర్రబడింది అంటారే! అది ఇదేనా? ఎంత అందంగా ఉన్నావో?” అంటూ మరింత ఆశ్చర్యపడింది పద్మ.

ఏమిటీ పద్మా...అయ్యిందా? సుత్తి వేసి వేసి వినోధినీ బుర్రను తింటున్నావని అనుకున్నాను. కానీ, నువ్వు ఆమె మొహాన్ని గాయపరిచినట్టు ఉన్నావే? ఇలా ఎర్రబడిందే! అంటూ ఆశ్చర్యపోయాడు అక్కడకొచ్చిన కిషోర్.

పద్మ నీ బుర్రను సుత్తివేసి తినేసే ముందే, నిన్ను కాపాడాలని పరిగెత్తుకువచ్చాను వినోధినీ. ఏదైనా సహాయం కావాలా?” అని ఆమెను చూస్తూ అడిగాడు. కళ్లల్లో రసికత్వం కనబడింది. 

ఇంతవరకు బుర్ర మీద గాయం ఏర్పడలేదు. ఇప్పుడే కొంచంగా రక్తం వచ్చేటట్టు అనిపించింది అని తలమీద చేతితో రుద్దుకుంటూ చెప్పింది శైలజా. వెంటనే పద్మ చప్పట్లు కొట్టి, “వెరి గుడ్...వెరీ గుడ్ వినోధినీ! అన్నయ్యనే బుర్రతినకండి అని తోసేస్తున్నావే...నువ్వు కూడా మా గ్రూపే అంటూ కుతూహలంగా చెప్పింది.

అమ్మో! నువ్వు కూడా అల్లరి మూకలో చేరిపోయావా? నేను ఆటకు రాను అంటూ చేతులెత్తి దన్నం పెడుతూ నవ్వాడు.

మొట్ట మొదటిసారిగా అతను గలగల మంటూ నవ్వటాన్ని ఆశ్చర్యంగా చూసింది శైలజా. ఆమె చూపులు అతనిపై నుండి మారనంటున్నాయి.

****************************************************PART-6******************************************

మధ్యాహ్నం చూసిన దానికంటే కొంచం తేటగానే ఉన్నారు మోహన్ కుమార్. కిషోర్ తన తల్లిని, శైలజానీ, హాస్పిటల్ కు రమ్మని పిలిచినప్పుడు...నేనూ వస్తానంటూ చెప్పి బయలుదేరింది పద్మ.

వాళ్ళను చూసి నవ్విన మోహన్ కుమార్, “అమ్మాయిని కుటుంబంలో ఒకత్తిగా చేసినట్లున్నారే! అని అడిగారు.

ఏమిట్రా తమ్ముడూ...అలా మాట్లాడుతున్నావు? ఆమె ఎప్పుడూ మన కుటుంబంలోని ఒకతే కదా! చాలా బాగా పెంచిందిరా లక్ష్మీ. ఎలాగూ అది కూడా వచ్చేస్తుంది అని ఓదార్పుగా చెప్పింది ప్రభావతి.

ఏమ్మా అత్తయ్య ఫ్యామిలీ నచ్చిందా?” అని శైలజాను చూసి అడిగారు.

బాగా నచ్చింది. ఇంత అభిమానమున్న, యధార్ధమైన కుటుంబాన్ని నేను చూసిందే లేదు అంటూ నవ్వింది శైలజా.

మావయ్యా, సారి మీ పుట్టినరోజును మనందరం కలిసి జరుపుకోవాలి. ఇప్పుడు వినోధినీ పిలిచిన వెంటనే వస్తుంది కదా... అన్నది పద్మ.

వద్దమ్మా. మనం ఎప్పుడూ లాగానే ఇంట్లోనే సెలెబ్రేట్ చేద్దాం అంటున్న మోహన్ కుమార్ గారి మాటలకు కిషోర్ అడ్డుపడి, “అత్తయ్యను పిలుచుకు రావటమే నాకూ, వినోధినీకి ఉన్న ముఖ్యమైన తరువాతి ప్రోగ్రాం. మీరు  ఆరొగ్యాన్ని బాగా చూసుకుంటే చాలు అని చెప్పి, శైలజావైపుకు తిరిగి ప్రశ్నార్ధకంగా చూశాడు. అతన్ని చూడనట్టు పక్కకు తిరిగింది ఆమె. వీళ్ళిద్దరి నాటకాన్నీ చూసిన మోహన్ కుమార్ మొహంలో నవ్వు వికసించింది.  

సరి...సరి...బయలుదేరదాం. ఎల్లుండి మావయ్యను డిస్చార్జ్చేస్తామని చెప్పారు. ఆయన బాగా రెస్టు తీసుకుని, లక్ష్మీ అత్తయ్య వచ్చేలోపు ఆయన బాగా కోలుకోవాలి అని అందరినీ కదిపేడు కిషోర్.

అలాగైతే ఆయనతో ఇక్కడ ఉండేది ఎవరు?’ అనే ప్రశ్న తలెత్తింది శైలజాకి. నేను కావాలంటే రాత్రికి ఇక్కడే ఉంటా... తడబడుతూ చెప్పింది.

నీకు విషయం తెలియదా? తన వల్ల ఎవరూ కష్టపడకూడదట. మేనేజర్ను మాత్రమే రాత్రి పూట తనతో ఉండటానికి అనుమతిస్తారు మావయ్య. మేనేజర్ పెళ్ళికాని వ్యక్తి. మావయ్యతోనే ఉంటూ అలవాటుపడ్డారు. అందువలన ఆయన్ని మాత్రమే తనతో ఉంచుకుంటారు. ఆయన యొక్క కఠినమైన రూల్స్ లో ఇదీ ఒకటి అని వివరించాడు కిషోర్. 

బయలుదేరుతున్నాం తమ్ముడూ. ప్రశాంతంగా రెస్టు తీసుకో. ఇప్పుడు నీ మొహం ఎంతో తేటగా ఉంది అన్నది ప్రభావతి.

అవును...ఏమిటో జీవితం మీద ఒక నమ్మకం వచ్చినట్టు ఉంది కిషోర్! తరువాత  ఒక విషయం. రేపు వినోధినీ బెంగళూరు తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాటు చెయ్యి. పాపం...నాకోసం పరిగెత్తుకు వచ్చింది. సమస్యలో చిక్కుకో కూడదు అన్నారు బ్రతిమిలాడే విధంగా.

ఓకే మావయ్యా. టికెట్టు బుక్ చేయటానికి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్ప, అందరూ ఆయన దగ్గర వీడ్కోలు తీసుకున్నారు.

ఆందరూ బయటకు వచ్చినప్పుడు శైలజా, “ఇదిగో వస్తున్నా అని చెప్పి, మళ్ళీ మోహన్ కుమార్ దగ్గరకు వెళ్ళింది. ఆయన దగ్గరగా కూర్చున్న ఆమె సారీ  అంకుల్...నేనొచ్చి మీ నమ్మకాన్ని పాడు చేసాను? మీరేమో ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నారు?” అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. 

లేదమ్మా! నిన్ను పంపించటం ద్వారానే నా కూతురికి నా మీద ప్రేమ, అక్కర ఉన్నదని అర్ధం చేసుకున్నాను. ఎలాగూ నన్ను చూడటానికి త్వరలోనే వస్తుంది. అప్పుడు నువ్వు కూడా దాంతో రావాలమ్మా. ఎప్పుడూ నువ్వు నన్ను మీ నాన్నగా అనుకుని నన్ను చూడటానికి వచ్చావో, నువ్వూ నా కూతురివేనమ్మా అన్న ఆయన కళ్ళల్లో నుండి కూడా నీరు కారింది. చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ బయటకు వచ్చింది. మనసులో  భారం వచ్చి ఒత్తిడి చేస్తునట్టు ఉన్నది.

ఇంటికి తిరిగి వచ్చిన తరువాత అందరినీ భొజనానికి పిలిచింది ప్రభావతి. అంతే! దానికోసమే కాచుకున్న వారిలాగా పరిగెత్తుకు వచ్చారు శంకర్, ప్రమీలా.

మావయ్య ఎలా ఉన్నారమ్మా? ఎప్పుడు డిస్చార్జ్ చేస్తారు?” అంటూ అక్కరతో విచారించాడు శంకర్.

ఇప్పుడు ఆయన మొహం క్లియర్ గా ఉందిరా. అంతా మన వినోధినీ వలనే. భగవంతుడా! వాళ్ళ ముగ్గురినీ ఒకటిగా చేర్చేయి అని వేడుకుంటూ ముగించింది  ప్రభావతి.

అమ్మా...నాకొక డౌట్! భగవంతుడా అని పిలిచి ఏదైనా కోరుకుంటే ఇచ్చేలాగా ఆయన ఇక్కడే తిరుగుతుంటారా? అలాగైతే అన్ని చోట్లా ఆయన ఎలా ఉండగలడు అని అడిగింది ప్రమీలా.

అయ్యో...దేవుడి గురించి ఏమీ మాట్లాడకు ప్రమీలా. అమ్మకు కోపం వస్తుంది.అవన్నీ వదులు. వినోధినీ దగ్గర మనం మాట్లాడవలసింది చాలా ఉందే అన్నాడు శంకర్.  

బాగుందిరా...ఇద్దరూ మాట్లాడి, దేవుడి గురించి మాట్లాడేంత పెద్ద మనుషులం కాదు మనం. నమ్మకం పెట్టాలి...అంతే. తరువాత అయ్యయ్యోఅని చెప్పకూడదని ఎన్నిసార్లు చెప్పాను?” అని కొంచం కోపంగా ఖండించిది ప్రభావతి.

ఓకే.ఓకే! సరేనమ్మా...ఇకమీదట మాట్లాడను అన్న శంకర్, “నువ్వు చెప్పు వినోధినీ...సినిమాలు ఎక్కువగా చూస్తావా? హీరో అంటే ఎక్కువ ఇష్టం? హిందీ సినిమాలు చూస్తుంటావా? లేక తెలుగు సినిమాలేనా? క్రికెట్టులో ఎవరు నచ్చుతారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే హలో సార్! ఇన్ని ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పేది? ఒక్కొక్క ప్రశ్నగా అడిగితేనే కదా కాస్త గాలి పీల్చుకోగలను?” అంటూ గేలి చేసింది శైలజా. హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత మనసులో కాస్తో కూస్తో ఉన్న బిడియం కనబడకుండా పోయినట్లు అనిపించింది.

వావ్...సూపర్ అక్కా అన్నది ప్రమీలా.

ఏయ్ ప్రమీలా! ఎందుకలా అరుస్తావు? రాత్రిపూట అక్కడక్కడ తిరుగుతున్న దయ్యం - భూతాలు అన్నీ, తమ బంధువులేవరో పిలుస్తున్నారే అనుకుని పరిగెత్తుకు వచ్చేస్తాయి. భయంగా ఉంది!

హెచ్చరిస్తున్నట్టు రహస్య స్వరంతో చెప్పింది పద్మ.

సెల్ ఫోనులో మాట్లాడేసి అప్పుడు అక్కడకు వచ్చిన కిషోర్, “అయితే వినోధినీను కూడా మీ గ్రూపులో చేర్చేశారా?” అని అడిగి శైలజాను చూడ నవ్వుల అలలు విస్తరించాయి. అతని చూపులను తప్పించుకోవటానికి తల తిప్పుకుంది.

అన్నయ్యా, వినోధినీను పోయి దయ్యం--భూతాల గుంపులో చేరుస్తున్నారే?  ఇంకొక  అడుగు పైకెళ్ళి మోహినీ దయ్యం అని కావాలంటే చెప్పచ్చు అన్నాడు శంకర్ నవ్వుతూ.

శైలజా వెంటనే ఆంటీ! వచ్చి నన్ను కాపాడండి. ఇక్కడొక భయంకరమైన చోట నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారే! అని భయపడుతున్నట్టు కళ్ళు పెద్దవి చేసి నవ్వింది..

ఒక విధంగా నవ్వులు తగ్గిన తరువాత ప్రమీలా, “వినోధినీక్కా! మీ నవ్వు కూడా అందంగా ఉంది అన్నది.

అవును...అవును...మోహినీ దయ్యం నవ్వినా కూడా చాలా బాగుంటుంది అన్నాడు శంకర్.

మాకు తెలియదయ్య. నువ్వే వాటితో స్నేహం పెట్టుకున్నావు లాగుంది అన్నది వదలకుండా శైలజా. 

చాలు...చాలు. ఏం మాటలు అవి? రాత్రిపూట ఇలా మాట్లాడితే, నిద్రలో భయంకరమైన కలలు వచ్చి భయపడతారు. ఇంకేదైనా మాట్లాడుకోండి అంటూ డిన్నర్ వడ్డించింది ప్రభావతి.

మధ్యాహ్నం లంచ్ లాగా కాకుండా, డిన్నర్ లైటుగా ఉన్నది. చపాతీ- కూర్మా, ఇడ్లీ-పచ్చడి. రుచి చాలా బాగుంది.

నవ్వుతూ తింటున్న కిషోర్, “ఇలా ఒకరికొకరు పోట్లాడుకుంటే వినోధినీ ఇప్పుడే ఊరికి వెళ్ళిపోతానని పట్టుబడుతుంది. తరువాత రాత్రికే కారులో తీసుకు వెళ్ళి దింపాల్సిందే! నాకే కష్టం అని శోకంగా చెప్పాడు.

దానికి కూడా శంకర్ మౌనంగా ఉండకుండా ఇంతవరకు వినోధినీకు అలా అనిపించలేదు అనుకుంటా అన్నయ్యా. మీరు మొదలుపెట్టేసేరే...ఇక అంతే. చూడండి...మొహమే ఎంత సీరియస్ గా మారిపోయిందో! అని చెప్ప, అందరూ వినోధినీను చూశారు.

నిజంగానా వినోధినీ? వీళ్ళందరి కంటే ఎక్కువ టార్చర్ పెట్టే వాడినా నేను? రోజు పూర్తిగా నాతో ఉన్నావే! కానీ, ఖచ్చితంగా పోటీలో నిన్ను మించలేను  అనుకుంటున్నా... అంటూ ఆమెను కెలికాడు. కళ్ళల్లో అల్లరి కనబడింది.

ఇంతకాలం మీతోనే ఉంటున్న శంకర్ చెబితే నమ్మే కదా తీరాలి అని అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పింది. అందరూ గొల్లుమని నవ్వారు.

నవ్విన ప్రభావతి కూడా చాలా ఆనందంగా ఉందమ్మా...నువ్విలా అందరితో కలిసిపోయి, కుతూహలంగా మాట్లాడటం చూస్తుంటే, ఎక్కడ మా అందరినీ ద్వేషించుకోనుంటావో అని అనుకున్న నా ఆలోచనను తునాతునకలు చేసింది అని చెప్పటంతో అందరూ మౌనం వహించారు.

మౌనాన్ని సహించలేని ప్రమీలా ఇప్పుడు నేనడిగే ప్రశ్నకు కరెక్టుగా సమాధానం చెప్పాలి. నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది?” అని అడిగింది.

ఇది తెలియదా? ఫిబ్రవరీ! అని హడావిడిగా చెప్పాడు శంకర్. లేదు...లేదు!  అన్ని నెలలలోనూ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది అని శైలజా చెప్పగా, సిగ్గుతో అవును కదా?” అన్నాడు.

ఏయ్...బాగా మోసపోయావా? వినోధినీ అక్క మాత్రమే నా అంత తెలివిగలది  అంటూ కాలర్ పైకెత్త అవునవును...అదే నేనూ చెప్పాను అని కిషోర్ చెప్పగా, “అవును! మీ చెల్లెలు మీలాగానే కదా ఉంటుంది అని వదలకుండా శైలజా గేలి చెయ్య, అందరూ పెద్దగా నవ్వారు. శబ్ధంతో చంద్రశేఖరం గది నుండి బయటకు వచ్చారు.

ఏమిటీ ఒకటే ఆర్భాటం? వార్తలు కూడా వినలేకపోయాను. కానీ, ఆ వార్తల శోకం వినటం కంటే, ఇక్కడైనా చేరిపోదామని వచ్చాశాను అన్న ఆయన, ఒక కుర్చీలో కూర్చున్నారు. ఆయనకు డిన్నర్ వడ్డించింది ప్రభావతి.

అబ్బబ్బా...జీవితంలో ఇంత సంతోషంగా ఉన్నామా?’ అనే ఆలొచన శైలజాకు వచ్చింది. తనూ, వినోధినీ ఏన్నో అల్లరి పనులు చేసే ఆనందించేవారు. మిగిలిన వారిని కూడా సంతోషంగా ఉంచుకుంటారు. కానీ, రోజు సంతోషం తేడాగా ఉన్నది.

చంద్రశేఖరం వాళ్ళతో కలిసి డిన్నర్ చేయటం మొదలుపెట్ట, ఆమె చదువు, బెంగళూరు గురించి మాటలు దిక్కుగా తిరిగినై. మళ్ళీ మనసు నత్తగుల్ల లోపల అట్టలాగా ముడుచుకుంది. ఏదైనా వాగేస్తే?’ అనే భయంతో హెచ్చరికతో సమాధానం చెప్పింది.

ఇప్పుడెందుకు వాళ్ళ ఇంటి గురించి అడిగారు నాన్న? చూడండి... వినోధినీ ఎంత సీరియస్ గా మారిందో?” అని పద్మ గొణిగింది.

అలాగంతా ఏం లేదే! అంటూ మామూలుగా మాట్లాడ ప్రయత్నించి ఓడిపోయింది శైలజా.

ప్రభావతీనే ఆమెకు చేయూత నిచ్చింది. చాలు...బూర్ర కథ కచేరీ. వెళ్ళి పడుకునే  ప్రయత్నం చూడండి. రోజు ఎక్కువగానే నవ్వాము. ఇంతకు పైన కుతూహలం మంచిది కాదు అని చెప్ప, ఒక్కొక్కరుగా లేచి చేతులు కడుక్కున్నారు.

నేను రోజు వినోధినీ అక్కతోనే నిద్రపోతాను అన్నది ప్రమీలా.

వెంటనే అడ్డుపడింది పద్మ అదంతా అక్కర్లేదు. అనవసరమైన మాటలతో బోరు కొట్టిస్తావు! నేనే వినోధినీతో పడుకుంటాను

వద్దు వినోధినీ. నేను చెప్పేది విను. ఒంటరిగా పడుకున్నా కూడా సమస్యలేదు. ఇది  కథలు చెప్పి చెప్పి నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది అని హెచ్చరించాడు శంకర్.

అప్పుడు ప్రభావతీ కలుగజేసుకుని వినోధినీకి తోడుగా నేనే ఉంటాను...సరేనా?” అని అడిగింది.

పరవాలేదు ఆంటీ. నేను ఒంటరిగానే పడుకుంటాను

అందరూ ఆమెకు గుడ్ నైట్ చెప్ప, ప్రభావతీనూ, పద్మానూ ఆమెను గదికి తీసుకు వెళ్ళారు. ప్రభావతీ ఆమె దగ్గరకు వచ్చీ, “నువ్వూ, నాకు ఒక కూతురివే కదమ్మా. నీకేదైనా కావాలంటే ప్రమీలా, పద్మా పక్క రూములోనే ఉంటారు అన్న ఆమె, ఆమె చెంపలను తడిమి...బాగా నిద్రపోమ్మా అని చెప్పగా పద్మా కూడా నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళింది.

తలుపుకు గొళ్ళెం పెట్టుకుని మంచం మీద కూర్చున్న శైలజాకు మనసంతా ఒక విధమైన పరవశంతో ఉన్నది. కుటుంబం అంటే ఇలాగే ఉంటుందో?’ కుటుంబమే తనకు సొంతమైనట్లు ఆనందంతో తడిసిన ఆమె, సెల్ ఫోన్ తీసి వినోధినీకి ఫోను చేసింది.

వినోధినీ ఫోన్ ఆన్ చేసిన వెంటనే, “బయలుదేరావా? పొద్దున ఎన్నింటికి వస్తావు?” అని అడగ, ఒక్క క్షణం తడబడి...ఇదిగో చూడు వినోధినీ! తెలిసో తెలియకో మనం ఒక నాటకం ప్రారంభించాము. దాన్ని కరెక్టుగా ముగించాలి. అందువల్ల నేను రోజు ఇక్కడ్నుంచి బయలుదేరలేకపోయాను. కానీ, మన నాటకం మీ నాన్నకు తెలిసిపోయింది అన్న వెంటనే కంగారుపడింది వినోధినీ.

ఎలా? ఆయన ఏం చెప్పారు? అయ్యో...పాడుచేశామా?” అని ఆందోళన చెంద, “అమ్మా తల్లీ...నేనేమీ పాడుచేయలేదు. ఆయన ఇదివరకే నిన్ను చూసున్నారట.  నన్ను చూసిన వెంటనే చాలా సంతోష పడ్డారు తెలుసా? నన్ను నువ్వు పంపించినందు వలనే నీకు ఆయనపై ప్రేమ ఉన్నట్టు, ఖచ్చితంగా త్వరలోనే నువ్వు వచ్చి ఆయన్ని చూస్తావని చెప్పారు. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలసింది చాలా ఉంది వినోధినీ.

ఆయన దయ నిలయంఅని ఒక ఆశ్రమం నడుపుతున్నారు. అనాధ పిల్లలకు, ఎవరూ చూడని వృద్దులకు ఆయన ఇచ్చే ఆస్రయం చూసావంటే...ఆయన్ని వదిలి నువ్వే రావు! అంతా నిన్ను కలుసుకున్నప్పుడు చెబుతా. రేపు ఎలాగూ వచ్చేస్తాను. ఒకటే ప్రేమ వర్షం. నేను నిజంగానే నువ్వు అయ్యుండాలని ఆశగా ఉంది తెలుసా?” అని అభిలాషతో చెపింది.

అరెరె...పొద్దునేమో పులి, సింహం అని చెప్పావే! ఇప్పుడు పూర్తిగా మారిపోయావు. నాకు వాళ్ళందరినీ చూడాలని ఉంది అన్నది వినోధినీ.

చూడచ్చు. నువ్వు ఇక్కడకు వచ్చే తీరాలి అని నొక్కి చెప్పింది.

వినోధినీ మౌనంగా ఉండటంతో . కే. వినోధినీ...రేపు ఖచ్చితంగా బయలుదేరతాను. గుడ్ నైట్ అని చెప్పి ఫోను పెట్టేసింది శైలజా. నిద్రపోవాలని పరుపు మీద వాలింది. కానీ నిద్రపట్టలేదు.

మనసు రోజు సంఘటనలను గుర్తుకు తీసుకు వచ్చింది. ఒకే రోజు ఎన్ని సంఘటనలు. అందులో వినోధినీ తండ్రి తనని గుర్తు పట్టింది, ఆయన  ఇల్లు...ఇవన్నీ నమ్మలేకపోయినట్లు ఉన్నది. ఇలాంటి ఒకే ఒక కుటుంబంతో కలిసి ఉండటానికి ఛాన్స్ ఇచ్చినందుకు వినోధినీకి కృతజ్ఞతలు తెలపాలి అని అనుకున్నది.

తరువాత కిషోర్ తో వెళ్ళింది గుర్తుకు రాగా...దాంతో పాటూ, అతని మీద వాలిపోయి ఏడవటం -- అతను దగ్గరకు చేర్చుకుని ఓదార్పు మాటలు చెప్పటం సినిమాలాగా మనసు యొక్క కళ్ళ ముందు రన్ అయ్యింది. ! కొంచం కూడా సిగ్గూ -- బిడయం లేకుండా...ఆమె తన మామయ్య కూతురు కాదు అనే నిజం తెలిసినప్పుడు, ఎంత విసుగుతో చూస్తాడు అనేది తలుచుకుంటేనే భయంగా ఉన్నది. శ్వాశ అడ్డుపడుతున్నట్టు అనిపించింది...లేచి బాల్కనీతలుపు తీసింది.

పౌర్ణమి రాత్రి చంద్రుడు ఆమెను రాఅని పిలుస్తున్నట్టు అనిపించ, ఎవరూ లేరని గ్రహించి మెల్లగా ముందుకు వెళ్ళింది. చల్లటి గాలి మొహాన పడటంతో ఒళ్ళు జలదరించింది.

తనని మరచి నిలబడున్నప్పుడు గొంతు వినబడింది.

****************************************************PART-7******************************************

...నువ్వేనా గుంపుకు నాయకత్వం వహిస్తున్నావు?” అని అడుగుతూ వస్తున్నాడు శంకర్.

గుంపా...ఏం గుంపు?” అంటూ చేతులు కట్టుకుంటూ అడిగింది శైలజా.

అది...చంద్రుడు, నక్షత్రాలు, మేఘాల గుంపు, తరువాత రాత్రి పూటా సంచరించే దయ్యాలు--భూతాలు... అని చెబుతూ వెళుతుంటే, “...అప్పుడు సంచరించే గుంపులో నువూ ఉన్నావా?” అని అడ్డుపడింది శైలజా.

ఛఛ! పెద్ద దెబ్బ తిన్నానే అని అన్న తరువాత...మాటలు చదువు వైపు మల్లింది. తాను బయటదేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడే ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పాడు శంకర్.

అంటే నీ అందమైన కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాలనే నిర్ణయంతో ఉన్నావు...అంతే కదా?” అని అడిగింది.

అదంతా లేదు...కొన్ని రోజులే! అది సరే...నువ్వేం చెయ్యబోతావు?  పెళ్ళి చేసుకుని ఇల్లాలు అవబోతావా? ...నువ్వు ఇంత అందంగా ఉండటంతో చాలామంది నీ వెనుకే తిరుగుతారే? నిజం చెప్పు... అని ఎగతాలిగా అడిగాడు.

అయ్యయ్యో! ఆటకు నేను రాను బాబూ. నువ్వు చెప్పేలాగా ఆడాలంటే, ఒక బానిస కోతిగా ఉండాలి. నేను ఉండలేను. అవి...జూరోడ్డులో చాలానే ఉంటాయి. కావాలంటే వెళ్ళి సెలెక్టుచేసి వద్దామా?” అని అడిగి నవ్వగా, శంకర్ కూడా కలిసి నవ్వాడు.

ప్రశాంతమైన రాత్రి నవ్వు సంగీతంలా వినబడింది. అప్పుడు పక్కవైపు నుండి ఇంకొక తలుపు తెరుచుకుని కిషోర్ బయటకు వచ్చాడు.

ఏమిటి శంకర్...ఇంకా నిద్రపోలేదా? రేపు కాలేజీ లేదూ?” అని అడగ, ఇద్దరికీ గుడ్ నైట్ చెప్పి మెట్లు దిగి వెళ్లాడు శంకర్.  

అక్కడ్నుంచి పరిగెత్తాలని తపించింది శైలజా మనసు. కానీ, కాళ్ళు జరగటానికి ఒప్పుకోవటం లేదే! నిలబడున్న చోట్లోనే శిలలాగా నిలబడిపోయున్న ఆమె దగ్గరకు వచ్చాడు కిషోర్! 

నువ్వు బెంగళూరులో పెరిగినా...దేని గురించి -- ఎవరి గురించీ బాధపడని గుంపుతో కలిసి పెరిగుండొచ్చు. అందుకని ఇలా మధ్య రాత్రి మేడమీద నిలబడి సుత్తివేసుకోవాలా? కుటుంబానికి ఒక గౌరవం ఉంది. అది జ్ఞాపకం పెట్టుకో...వెళ్ళు...వెళ్ళి నిద్ర పోవటానికి ప్రయత్నించు అని తరిమాడు.

చురుక్కున కోపం తలకెక్కింది శైలజాకి. నేను విధంగా ఇంటి గౌరవం పోయేటట్టు నడుచుకున్నాను? “నాగరీకం, గౌరవం మాకూ ఉంది. అనవసరంగా నా విషయంలో తల దూర్చకండి. అలాంటి హక్కు మీకు ఎవరూ ఇవ్వలేదు అన్నది గట్టిగా.

పొగరు...పొగరు. కుటుంబంలో పెరిగినదానివేగా? మంచి చెబితే తలకెక్కదు. ఎలాగైనా పో. ఇక్కడున్నంత వరకు మంచిగా నడుచుకో అని చెప్పినతను తన గదివైపు నడవటానికి తిరిగాడు.

ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు? పొగరు నాకా...అతనికా? లేదు...ఇతన్ని ఇలాగే వదల కూడదుఅని ఆలొచించిన ఆమె నేను విధంగా మీ గౌరవానికి  బంగం కలిగేటట్టు నడుచుకున్నానో చెప్పగలరా? తమ మనసులో మురికి ఉన్నవాళ్ళకు చూసేదంతా మురికిగానే కనబడుతుందని విని ఉన్నాను. ఇప్పుడు తిన్నగా చూస్తున్నాను అని చెప్పి నడవటం మొదలుపెట్టింది.

ఏయ్...నిన్ను... అంటూ ఆమె చెయ్యి పుచ్చుకుని కొట్టటానికి చెయ్యి ఎత్తినవాడు -- చటుక్కున స్పృహలోకి వచ్చిన వాడిలాగా ఛఛ! నిన్ను పోయి మంచిదానివనుకున్నానే?” అని వేగంగా ఆమెను విధిలించుకున్నాడు.

అతని దగ్గర నుండి తనని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్న ఆమె, ఎదురు చూడని విధిలింపు వలన బ్యాలన్స్ తప్పి కింద పడబోయింది. క్షణంలో విషయం అర్ధం చేసుకున్న అతను, ఆమెను తన రెండు చేతులతో పట్టుకున్నాడు.

మరుక్షణం ఆమెను తనతో చేర్చి కావలించుకున్నాడు.మొదట ఆశ్చర్యంతో చూసిన ఆమె -- అతని కావలింత బిగియ బిగియ తనను మరచి, ఆలోచించటం గుర్తురాక నిలబడిపోయింది.

తనని తాను మరచి ఎంతసేపు నిలబడిందో, ఆమె నున్నటి బుగ్గల మీద అతను గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె ఒళ్ళు జలదరించ -- హృదయం వేగంగా కొట్టుకోవటంతో రెండవసారిగా మనసు తుళ్ళింది. గబుక్కున అతని దగ్గర నుండి తప్పించుకుని గదికి పరిగెత్తిన ఆమె, తలుపుకు గొళ్లెం పెట్టి మంచం మీద కూర్చుంది. వణుకు తగ్గలేదు. అనవసరంగా, సంబంధమే లేకుండా ఏడుపు వచ్చింది.

ఎక్కడకొచ్చి ఏం కార్యం చేస్తున్నాను? ఏమైంది నాకు? ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వచ్చిన నా క్రమశిక్షణ ఒక్క క్షణంలో గాలికి ఎగరేసేనే? అతనికి నేను మావయ్య కూతురు అన్న ఆలొచన వచ్చి ఉండొచ్చు. నాకు కదా బుర్ర పనిచేయంది? రేపు తెల్లారుతుందే...ఎలా అతని మొహాన్ని చూసేది? ఇప్పుడు ఇక్కడ్నుంచి పారిపోదాం అనుకున్నా అదీ కుదరదు’ -- ఏమిటేమిటో తలుచుకుని మనసు కుంగిపోయింది. మొహం కడుక్కుని వచ్చి మంచం మీద వాలిపోయిన ఆమె, ‘భగవంతుడా! నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు?’ అని వాపోయింది.

భువనేశ్వరీ అమ్మగారు ఆమెకు ఒక్కొక్క వయసులోనూ క్రమశిక్షణ యొక్క ముఖ్యత్వం గురించి చెప్పి పెంచారు. పెరిగిన తరువాత ఎన్నో పరీక్షలు ఎదురైనా, ఆవిడ బోధనలు ఆమెను కాపాడినై. పదోక్లాసు ముగించి, కంప్యూటర్ క్లాసుకు వెళ్ళినప్పుడు, కొంతమంది యువకులు ఆమెను గొడవ చేశారు. కొంతమంది ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించారు. వాళ్ళందరినీ ఒక హద్దులో ఉంచింది. ఆందులో ప్రేమ్ కుమార్, ప్రేమించమని ఆమెను వదలకుండా ఒత్తిడి చేస్తూ వచ్చాడు.

భువనేశ్వరీ అమ్మగారి దగ్గర విషయం గురించి చెప్పినప్పుడు ఇదంతా వయసులో సహజమమ్మా! కానీ, నువ్వే మనసును కట్టుబాటులో ఉంచుకోవాలి. ఎందుకంటే, ఆశ్రమంలోని పిల్లలలో చాలామంది ఆశ చూపించి మోసం చేసిన మగవాళ్ళ దగ్గర ఓడిపోయిన ఆడవాళ్ళ పిల్లలుగానే ఉంటారు. కన్నవారు లేకుండా జీవించటం ఎంత ఘోరమో అనేది నీకే తెలుసు. పట్టుదలగా -- క్లియర్ మనసుతో నడుచుకో -- అని సలహా ఇచ్చేది. దాంతో పాటూ ఆమెను సెల్ఫ్ - డిఫెన్స్ కోసం ఆమెకు కరాతే కూడా నేర్పించింది.

తరువాత మహిళా కళాశాల అయినా హాస్టల్లోఉండి బయటకు వెళ్ళేటప్పుడు ట్రబుల్స్ ఉంటూనే ఉండేవి. ప్రేమ్ కుమార్ ఆమెను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. కాలేజీ దగ్గరే ఒక ఇంటర్ నెట్ కఫేఒపన్ చేసారు. తన తల్లి-తండ్రుల చేత ఆశ్రమ వార్డన్ కు ఫోను చేయించాడు. ఆమెకు ఆలొచనే లేదు అని తెలుసుకున్న వార్డన్, ‘తరువాత చూద్దాంఅని చెప్పి పంపినట్ట తరువాత తెలిసింది.     

నిన్ను ఒక మంచి చోట అప్పగించాలని నాకు ఆశ అమ్మాయి! కానీ ఇప్పుడు కొంతమంది అయోగ్యులు, అనాధ ఆడపిల్లలను ప్రేమ చూపించి పెళ్ళి చేసుకుని...తరువాత ముంబై, కలకత్తా మరియూ విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందువలనే తొందరపడకూడదు అని అనుకుంటున్నా. నువ్వు బాగా చదువుకుని నీ కాళ్ళపై నువ్వు నిలబడితేనే సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది. అప్పుడు మంచి జీవితం అమర్చుకోవాలనే క్లారిటీ డెవెలప్  అవుతుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండమ్మా. దేవుడు నీకిచ్చిన అందం...ప్రమాదకరమైనది. నువ్వే హెచ్చరికతో ఉండాలీ -- అలా ఆవిడ సలహాలు ఇచ్చిన తరువాత కూడా నేనెందుకు ఇలా నడుచుకున్నాను? రోజు నాకేమైంది?.

పెళ్ళి చేసుకుని ఇలాంటి ఒక మంచి కుటుంబంలో జీవితం దొరకటం ఆమె కొంచం కూడా ఎదురు చూడలేని విషయం. మూగవాడు ఒకడు, పెద్ద గాయకుడై గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకుంటే జరిగే విషయమా’. జరగదని తెలిసిన ఒక విషయం గురించి ఇలా ఆశపడటం మూర్ఖత్వం. మనో వేదనే మిగులుతుంది. మనసులో కన్ ఫ్యూజన్ తో నిద్ర రాక దొర్లిన ఆమె, ఏప్పుడో నిద్రపోయింది.

శైలజా కిందకు వచ్చినప్పుడు, టైము ఎనిమిదయ్యింది. కిషోర్ కంట్లో పడకుండా ఉండాలని వేడుకుంది. అందరూ బయలుదేరే తొందరలో ఉన్నారు. ప్రమీలా, భుజాలపై సంచీతో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి అక్కా...నాకు రోజు స్కూలుకు వెళ్ళటానికే మనసు రావటం లేదు. కానీ, ఏం చేయను? ప్లీజ్...ఇంకా ఒక్కరోజైనా మాతో ఉండండి అక్కా అని బ్రతిమిలాడింది.

ఏం చెప్పాలే తెలియక చిన్నగా నవ్వింది శైలజా. పద్మ కూడా అదే చెప్పటంతో అదేముంది? త్వరగానే వినోధినీనూ, లక్ష్మీనూ ఇక్కడికే రాబోతారు. తరువాత అంతా హ్యాపీయే కదా?” అని వాళ్ళను సమాధానపరిచింది ప్రభావతి.

వాళ్ళిద్దరూ సగం మనసుతో వెళ్ళగా, శైలజాకు కాఫీ ఇచ్చింది. ఇంతలో శంకర్ వచ్చాడు. ప్రభావతి వంటగదిలోకి వెళ్ళిన సమయం చూసి శైలజాతో అన్నయ్య తిట్టారా వినోధినీ? మొహమంతా వాడిపోయి, ఏడ్చినట్లు ఉంది. నావల్లే కదా...సారీ వినోధినీ అని నొచ్చుకున్నాడు. 

కిషోర్ గురించి మాట్లాడిన వెంటనే మొహం ఎరుపెక్కటం గ్రహించిన ఆమె అడ్జెస్టు చేసుకుని తెచ్చుకున్న ఎగతాలి చూపులతో, “హలో! మనమేమన్నా ఆయనకు ఎదురుగా కుట్ర చేస్తున్నామా? ఆయన ఎందుకు తిడతాడు?” -- అని అడగ, మొహం వికసించిన శంకర్... రొజే బయలుదేరాలా అని తరువాతి ప్రశ్నను అడిగాడు.

ఒక కుటుంబంతో చాలా సంవత్సరాలు కలిసి ఉన్నట్టు అనిపించింది శైలజాకు. వీళ్ళను ఇక చూడబోయేది లేదు అనే ఆలొచన వచ్చిన తరువాత మనసు నొప్పి పుట్టింది. వెంటనే కానీ, నాకు ఏం హక్కుంది వీళ్ళదగ్గర?’ అనే మరో ఆలొచన రాగా మనసు కాస్త ప్రశాంతత చెందింది. ఆల్ బెస్ట్ శంకర్ అన్నది. గుమ్మం  వరకు అతనితో వెళ్ళి అతనికి బై చెప్పి తిరిగినప్పుడు, “హలో, మేడమ్...గుడ్ మార్నింగ్ -- ఉత్సాహంగా చెవి దగ్గర గొంతు వినబడ ఉలిక్కిపడి జరిగింది. కిషోర్ మొహంలో కొంటరి చూపు చూసిన తరువాత, అవమానంతో మనసు సిగ్గు పడింది. వేగంగా నడిచి ప్రభావతిని చూడటానికి వెళ్ళింది.

పరిస్థితి తెలియని ప్రభావతి, “రామ్మా...టిఫిన్ తిందాం అంటూ కిషోర్ ఉన్న చోటుకే తీసుకు వచ్చింది. తలవంచుకునే తినడం మొదలుపెట్టింది శైలజా. ప్రభావతి కూడా వాళ్ళతో పాటూ కూర్చుంది.

నాన్న గారు పొద్దున్నే హాస్పిటల్ కు వెళ్ళిపోయారు. రేపే డిస్ చార్జ్చేస్తున్నారటగా. అంతవరకు వినోధినీ ఉండలేదే అని బాధపడుతూ చెప్పింది.

అవునమ్మా...ప్రస్తుతానికి పెద్ద సమస్య ఏమీ లేదు. కొంచం జాగ్రత్తగా ఉంటే, ఒక నెల తరువాత కూడా ఆపరేషన్ పెట్టుకోవచ్చని డాక్టర్ చెప్పారు. అంతలొ అత్తయ్యను పిలుచుకు వచ్చేయాలి అన్నాడు. అతని చూపులు అప్పుడప్పుడు ఎదురుగా ఉన్న తన మీద పడుతున్నట్టు గ్రహించింది శైలజా. అతని కళ్ళను కలుసుకోవటం అవాయిడ్ చేసింది.

లంచ్ తరువాతే కదా వినోధినీ బయలుదేరబోతోంది?” అని అడిగింది ప్రభావతి.

అవునమ్మా. ఇప్పుడు నేను రిసార్టుకూ, మావయ్య ఇంటికీ తీసుకువెళ్ళి చూపించి...అలాగే మావయ్యను చూసి వచ్చేస్తాను. తిన్న వెంటనే బయలుదేరటమే. సరే కదా వినోధినీ ?” అని ఆమెను అడుగుతూ అతను చూపులను  సున్నితంగా ఆమె మీద పెట్టాడు.

అతని చూపులు ఆమెను ఏదో చేసింది. మళ్ళీ అతనితో బయటకు వెళ్ళటమా? అయ్యో...వద్దనే వద్దు

సారీ! రోజు ఎక్కడికీ వెళ్ళొద్దు. హాస్పిటల్ కు కావాలంటే వెళ్దాం అన్నది.

వెళ్దాం! కానీ మిగిలిన రెండు చోట్లూ నువ్వు చూడాల్సినవే! అందువలన ఎలాంటి వాదనా వద్దు. ఓకేనా?”  అని కళ్ళు పెద్దవి చేస్తూ అడగ, అతన్ని కోపంగా చూసింది శైలజా. 

అతని చూపు ఆమెను అయిస్కాంతాం లాగా లాగింది. గబుక్కున కళ్ళను తిప్పిన ఆమెకు కోపం వచ్చింది. నిన్న అలా జరిగినందువలన, దాన్నే మనసులో పెట్టుకుని చూస్తున్నాడే!

 నేను ఇక్కడే మీతో మాట్లాడుతూ ఉంటాను ఆంటీ!అన్నది ప్రభావతిని చూసి బ్రతిమిలాడే ధోరణితో.

కిషోర్ తో వెళ్ళి ఒకసారి చూసిరామ్మా అంటూ ప్రభావతి కూడా ప్రేమతో చెప్ప వేరేదారిలేక అతనితో వెళ్ళింది.

కారు బయలుదేరిన తరువాత, “నాతో రావటం నీకు భయంగా ఉందా వినోధినీ?” అని అడిగి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అవును...భయమేఅన్నది ఆమె మనసు.

భయమంతా లేదు. మీరేమన్నా సింహమా...పులా? అక్కర్లేదు అనుకున్నాను అని బయటకు చూస్తూ చెప్పింది.

వెనక్కి తిరిగి ఆమెనొకసారి చూసి అక్కడ...సెలవు రోజుల్లో బయటకు వెళ్తావా? సినిమా, షాపింగ్ లాంటివాటికి?” అంటూ మాట మార్చాడు.

...ఎప్పుడైనా అన్నది సంగ్రహముగా!

నీకు చాలా మంది స్నేహితులు ఉన్నారా వినోధినీ?” అంటూ మరో ప్రశ్న అడిగాడు. ఒళ్ళు మండిది ఆమెకు. ఇతను నన్నెందుకు ఇంటర్ వ్యూ  చేస్తున్నాడు?’ 

జవాబు చెప్పకుండా బయటకే చూస్తోంది.

ఆమె వైపుకు చూపులను తిప్పి నీకు నా మీద ఏమిటి కోపం? నాతో ఉంటేనే అంటీ అంటనట్టు ఉంటావు. నేనూ శంకర్, పద్మ లాగానే?” అని అడిగినతనికి ఏం జవాబు చెప్పాలి అని ఆలొచించింది.

వాళ్ళూ, మీరూ ఒకటి కాదే!అని అతనితో చెప్పగలదా ఏమిటి?

****************************************************PART-8******************************************

రెండు పక్కలా బాగా పెంచబడుతున్నహై క్వాలిటీ చెట్లు -- పూవులతో స్వాగతించ... బాట వాళ్ళను పెద్ద బంగళాలోకి తీసుకువెళ్ళింది. అక్కడక్కడా చిన్న చిన్న ఫౌంటన్లు, శిలలు. ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ సెల్యూటీ కొట్ట, ఆమెవైపు తిరిగినతను ఆమె బిడియం చూసి ఏమిటి విషయం?” అని ఆడిగాడు.

ఇలాంటి చోటుకు తగినట్టు డ్రస్సు వేసుకోలేదే. అదే... అన్నది. అతను కళ్ళు ఆమె డ్రస్సును అన్వేసించ, సిగ్గుతో మొహం ఎరుపెక్కింది. ఆమె మొహంలో కనబడ్డ చూపులను చూసినతను, “ఇదీ అందంగానే ఉన్నది. అంతే కాదు నువ్వు మావయ్య యొక్క కూతురు అనే మాటే చాలే! డ్రస్సా ముఖ్యం?” అన్నాడు మెలిక పెడుతూ.

ఒక చిన్న కోరిక... చిన్న తడబాటతో అడిగింది.

ఏమిటీ?” అన్నట్టు కనుబొమ్మ పెంచినతని దగ్గర, “నేను...నేను వినోధినీ అని  ఇక్కడ చెప్పకండి. మరోసారి వచ్చినప్పుడు కావాలంటే చెప్పండి...ప్లీజ్... అన్నది బ్రతిమిలాడుతున్న చూపులతో.

అయితే నా కసిన్అని చెప్పనా?” అన్నాడు మందహాస నవ్వుతో.

వినోధినీ యొక్క స్నేహితురాలునని చెప్పండి అన్నది ఆమె.

అది కరెక్టు అవదే అన్న అతను కిందకు దిగ, వేరే దారిలేక ఆమె కూడా కిందకు దిగింది.

అక్కడ అందమైన స్వాగతం కనబడింది.

వాళ్ళను చూసిన వెంటనే కోటూ-సూటూతో గంభీరంగా నిలబడున్న ఒకరిద్దరు మగవాళ్ళు, ఆడవాళ్ళు వేగంగా దగ్గరకు వచ్చారు.

వాళ్ళ నమస్తేని అంగీకరించిన అతను, వాళ్ళ ప్రశ్నార్ధకమైన చూపుల వలన, “ఈవిడ మావయ్యకు దగ్గర బంధువు.పేరు... అని సాగదీస్తుంటే--ఆమె అడ్డుకుని శైలజా అన్నది.

ఆమెకూ నమస్తే చెప్పారు. మహిళలు ఆమె దగ్గర "మీరు చాలా అందంగా ఉన్నారు" అని చెప్ప...సిగ్గుతో నవ్వుకుంది. మగవాళ్ళల్లో ఒకడు, “నిజమే సార్. చూడండి! ఆడవాళ్ళే చెప్పుకునేంత గొప్ప అందమే ఆవిడకు...?” అన్నవాడు నాలిక కరుచుకున్నాడు.

అంతకు ముందే వాళ్ళ చురచుర చూపులు ఆమెకూ, కిషోర్ కు ఉన్న బంధుత్వం గురించి అనుమానం తెలిపింది. చుట్టువైపుల చూస్తున్న సాకుతో చూపులను తిప్పుకున్న ఆమె మాట విన్న తరువాత కిషోర్ ను చూసి విస్మయించ...అతను ఉల్లాసమైన నవ్వుతో ఆమె చెయ్యిపుచ్చుకుని లోపలకు పిలుచుకు వెళ్ళాడు.

నిర్ఘాంతతో జరిగింది శైలజా. వెనుక వాళ్ళ సెలెబ్రేషన్ నవ్వు శబ్ధం వినబడటంతో, తన చేతిని అతని చేతిలో నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నించింది. కుదరకపోవటంతో, “వదలండి...నా చేతిని అన్నది కోపంగా.

ఎందుకని?” అని అడిగాడు ఒక్క మాటలో.

నొప్పి పుడుతోంది --గొణిగింది.

అలాంటప్పుడు చేతిని లాక్కోకుండా రావచ్చుగా?” అంటూ వెళ్తూనే ఉన్నాడు.

ఇతనితో మాట్లాడి ప్రయోజనం లేదుఅని అనుకున్న ఆమె మౌనంగా అతనితో నడిచింది.

అందమైన స్విమ్మింగ్ పూల్. విదేశీయులు కొంతమంది ఈత కొడుతున్నారు. ఇంకో కొంతమంది దగ్గరలో ఉన్న బల్లలపై రెస్టు తీసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ ఎండ వాళ్ళపై బాగా పడుతున్నది. సినిమాలలో మాత్రమే చూసున్న స్విమ్మింగ్ పూల్ యొక్క పొడవు అందాన్ని చూసి తనని తాను మరిచి నిలబడ్డది. ఆకాశం యొక్క పసిబిడ్డలాగ నీలి రంగులో గలగలమన్నది స్విమ్మింగ్ పూల్.

మనవాళ్ళకు ఎండే పడదు! వాళ్ళు పొద్దున, సాయంత్రం ఈత కొడతారు అన్న కిషోర్, “నీకు ఈత వచ్చా వినోధినీ?” అని అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు.

ఎదుటివైపుకు వెళ్ళినప్పుడు, పిల్లలు ఆడుకునే చోటు. దగ్గరగానే పెద్ద డైనింగ్ హాల్. వినోధినీ యొక్క భవనం లాగానే, ఇళ్ళు కట్టే కళా నిపుణుల కల్పనా శక్తి అన్ని చోట్లా కనిపించింది.

కొంచం దూరం వెళ్ళిన తరువాత అన్ని వసతులతో ఇండిపెండెంట్ గదులు ఉన్న ఇళ్ళు. అక్కడున్న వాళ్ళు నిజంగానే ప్రశాంతంగా మంచి నీడలో ఉన్నట్టు అనిపించింది. అది కాకుండా వేరుగా జిమ్, బార్ లాంటివి ఉన్నాయి.

మళ్ళీ రెస్టారెంటుకు వచ్చినప్పుడు, ఒకరు పళ్ళరసం ఇచ్చారు. ఈయనే మా చీఫ్ కుక్ ఆనంద్. ఆయన భోజనం రుచికోసమే చాలామంది ఇక్కడకు వస్తారు...” “ఆనంద్, ఈవిడ శైలజా! మా బంధువు అని అతనికి పరిచయం చేశాడు. అతను ఆమెకు నమస్తే చెప్పాడు. రోజు లంచ్ ఖచ్చితంగా ఇక్కడే చేయాలండీ అన్నాడు.

జవాబుగా నవ్వుతూ నమస్తే చెప్పింది శైలజా.

స్వర్గలోకంలో తిరుగుతున్నట్టు భ్రమలో ఉన్న ఆమెకు ఒకటి అనిపించింది. ఇంత వసతి ఉన్న వినోధినీ తండ్రి, నన్ను అర్ధం చేసుకున్నది పెద్ద విషయమే. కొంచం కూడా గర్వం అనేదే లేదే! ఆయన ఎంత గొప్ప మనిషి?’ అనుకున్న  ఆమెలో ఆయన మీద ఉన్న మర్యాద ఇంకా పెరిగింది.     

విరుచుకున్న కళ్ళను మూయలేక, నోరు మాట్లాడలేక, ఆశ్చర్యంతో ఆమె నడవ... కిషోర్ సాధారణంగా చోటు గురించి, లెక్కల గురించి చెప్పుకుంటూ వచ్చాడు.

మావయ్య ఆరొగ్యం చక్కబడి -- నువ్వూ, అత్తయ్య వచ్చేస్తే...నేను ప్రశాంతంగా నా వ్యాపారం చూసుకోవటానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నా పార్ట్నర్చూసుకుంటున్నాడు. బిజినస్ కొంచం మందంగానే పోతోంది. ఎలాగైనా అత్తయ్యను తీసుకురావాలి. దానికి నువ్వే సహాయం చేయాలి వినోధినీ అని మాటల్లో మాటగా ఒక బాణం వదిలాడు.

మళ్ళీ కారులో ఎక్కి కూర్చునప్పుడు కిషోర్ తో నిజం చెప్పేద్దామా?’ అన్న ఆలోచన వచ్చింది. పక్కకు తిరిగి అతన్ని ఒకసారి చూసింది. అదే సమయం అతనూ ఆమెను చూడ...కనుబొమ్మ పైకెత్తి ఏమిటి?’ అనేలాగా నవ్వాడు.

చెబితే హీనంగా తిడతాడా? లేక...విరక్తితో మాట్లాడతాడా? ఎంతైనా నవ్వును ఎదురు చూడటం కుదరదు. ఆనందమైన సమయాన్ని ఎందుకు పాడు చేయటం?’ అని అనుకున్న ఆమె మౌనం వహించింది.

నువ్వు ఎక్కువ మాట్లాడేదానివి. అందులోనూ సరదా రకం. కానీ నా దగ్గర మాత్రం ఎందుకని మాట్లాడనంటున్నావు! భయమా? లేక...సిగ్గా?” అని అడిగాడు.

రెండూ కాదు. మాట్లాడటానికి ఏమీ లేదు...అంతే అన్నది గబుక్కున.

...ఐసీ! అంటూ పాటలు పెట్టాడు.

నీ పేరే చెప్పాలని ఆశ. మనసు కరిగే ఆశ. నీ ప్రాణంతో కలవాలని ఆశ...అనే పాట ఇంపుగా వినిపించింది.

నిజమా?’ అని అడిగింది శైలజా మనసు. కిషోర్అని పిలవ -- అతని భుజం మీద వాలి కరిగిపోవాలని ఆశ. ప్రాణంలో కలిసిపోవాలని ఆశ...!

! ఏమిటింత మూర్ఖత్వంగా ఆలొచిస్తున్నాను -- తలను ఊపుకుంటూ బయటకు చూసింది.

వినోధినీ ఇంట్లోని పనిమనుషులు భవ్యంగా ఆమెను స్వాగతించారు. హేయ్ మేడమ్! వెల్ కమ్! అన్న మహిళను చూసింది. జీన్స్, కుర్తా వేసుకోనున్నది. చూడటానికి అందంగా ఉన్నది. కానీ, మేకప్ సాధనాల సహాయం వలన మరింత అందంగా అనిపించింది. జవాబుగా నమస్తే చెప్పింది శైలజా.

నలినీ! ఈమెకు ఇల్లు చూపించు. వినోధినీ! నాకు కొంచం పనుంది. పూర్తి చేసుకుని త్వరగా వచ్చేస్తాను అంటూ ఎడం చేతివైపు నడిచాడు. అతను వెళ్ళటాన్ని చూస్తున్న ఆమెతో అటే ఆఫీసు. చివరగా చూద్దాం. లోపలకు రండి మేడమ్ అని చెప్పి ముందుకు నడిచింది. 

హాలు. మధ్యలో రెండుగా విడిపోయిన మెట్లను నిన్నే చూసిందే! కానీ దాని అందాన్ని ఎంజాయ్ చెయ్య నివ్వకుండా కిషోర్ పై మనసు కోపంతో ఉన్నది జ్ఞాపకానికి వచ్చింది. రోజు కూడా కోపమే. కానీ కారణం వేరు. ఒక్క రోజులో ఎన్ని మార్పులు?

ఒక్కొక్క చోటునూ చూస్తున్నప్పుడు నిర్ఘాంతపోయింది. లేత ఆకు పచ్చ రంగులో -- దైవీక సువాసన రాగా, పూజ గది ఎవరు ఎన్ని బాధలతో వచ్చినా ఓదార్చే విధంలో ఉన్నది. ఎదుటివైపు ఒక బెడ్ రూమ్. అదే నాన్నగారి గదిఅన్నది నలినీ. గదిలో, కంప్యూటర్, పుస్తకాలూ ఒకవైపు ఉండగా...మంచానికి ఎదురుగా పెద్ద సైజులో వినోధినీ, తల్లి--తండ్రులతో ఉన్న ఫోటో ఒకటి అతికించబడి ఉంది. రోజూ దాన్ని చూస్తే మనసులో ఆవేదన, భారం, నొప్పి కదా వస్తాయి?

తరువాత ఒక లైబ్రరీలో చాలా పుస్తకాలు. బిలియర్డ్స్ టేబుల్తో ఒక గది. తరువాత ఆడంబరమైన విజిటర్స్ గది. దాని బయట గడ్డినేల దాటి స్విమ్మింగ్ పూల్ కనబడ్డది. చుట్టూ చెట్లూ, మొక్కలూ. స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడింది. దారాంలాగా సముద్రం కనబడింది. అక్కడే బెంచీ మీద కూర్చుండిపోయింది. ఒక్కొక చోటునూ చూపిస్తూ, వివరిస్తూ వచ్చిన నలినీ, ఆమెనే కళ్ళార్పకుండా చూసింది. ఆమెను శైలజా ఏమిటన్నట్టు చూసింది.

మీ చిన్న వయసు ఫోటోకూ, మీకూ సంబంధమే లేదు మేడమ్. ఎంత మార్పు?” అని అడిగింది.

ఆమెకు నవ్వును సమాధానంగా ఇచ్చిన శైలజా, “మీ ఊరు ఏదీ? ఎన్ని  సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు?” అడిగింది.  

మా సొంత ఊరు కాకినాడ. మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. ఎం.బి..  చదవటానికే ఊరు వచ్చాను. పూర్తి చేసిన వెంటనే తెలిసినాయన ఒకరి సహాయంతో, కిషోర్ గారే ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు అని వివరించింది. ఆమె తిరిగి మళ్ళీ ప్రశ్నా వేయకపోవటంతో హ్యాపీగా ఉన్నది.

ఇప్పుడు దూరంగా కిషోర్ రావటం కనబడింది. నలినీనూ అతన్ని చూడ, శైలజా మనసులో ప్రశ్న మొలకెత్తింది. నలినీకీ, కిషోర్ కూ ఎంతవరకు పరిచయమో?’

ఎలా ఉంటే నాకేంటి? ఇలా అనవసరమైన వాటి గురించి తలుచుకుని, పిచ్చిపట్టి, జుట్టు పీక్కోవటం దేనికీ’ -- సముద్రాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఎదురుగా చూసింది.

అన్ని చోట్లూ చూశావా వినోధినీ?” అని అడుగుతూ వచ్చినతను నలినీ దగ్గర ఏదో ఒక పని చెప్పి పంపించి దగ్గర కూర్చోగా, హృదయం పందెం గుర్రంలాగా వేగంగా పరిగెత్తింది.

నాకు కూడా చోట కూర్చుని సముద్రాన్నీ, స్విమ్మింగ్ పూల్ ను, ప్రకృతిని ఎంజాయ్ చేయటం నచ్చుతుంది. మేము అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి ఈత కొడతాము అని చెప్పుకుంటూ వెళ్ళ శైలజా లేచింది.

బయలుదేరదామా? ఎన్నింటికి బస్సు?” అని అడిగింది.

ఏమిటి నువ్వూ? ఒక ఉత్సాహమే లేదే! ఇంకా మేడ మీద ఏమీ చూడలేదట అన్నాడు.

చాలు. ఈసారి వచ్చినప్పుడు చూస్తాను అన్న ఆమెను చెయ్యి పుచ్చుకుని ఆపాడు.

మనం బయలుదేరటానికి ఇంకా చాలా టైము ఉంది వినోధినీ. ఎందుకు అర్జెంటు పడతావు?” అన్న అతనితో, “మనమంటే...ఎవరంతా? ఎవరూ నాతో రావద్దు. నేను మాత్రం వెళ్ళి అమ్మతో మాట్లాడతాను -- చేతిని విధిలించుకోవటానికి  ప్రయత్నిస్తూ చెప్పింది ఆదుర్ధాతో.

మనం కారులోనే వెళ్ళబోతాం. తిన్నగా మీ ఇంటికి వెళ్ళి, అత్తయ్యను చూసి మాట్లాడబోతాం అని చెప్పాడు ఆమె చెయ్యిని విడిచిపెట్టకుండా.

అపాయ సైరన్ మెదడులో వినిపించ -- అతని చేతిని కోపంగానూ, వేగంగానూ  విధిలించుకున్న ఆమె మీకు చెబితే అర్ధం కాదా? నేను మాత్రమే వెళ్తున్నా. వెళ్ళి మాట్లాడి  -- కుదర లేదంటే మీకు చెబుతాను. అప్పుడు రండి -- గట్టిగా చెప్పింది.

అతను నవ్వుతూ తల ఊప, ఏం చేయాలో తెలియక నిలబడింది. భయమూ, కలత చేరుకోగా...ప్లీజ్... అన్నది బ్రతిమిలాడుతూ. సారి పెదాలను లోపలకు తిప్పుకుని, భుజాలు ఎగరేస్తూ, “నో ఛాన్స్ డియర్ అని అతను కూడా గట్టిగా చెప్పి నడవటం మొదలుపెట్టాడు కిషోర్.  

****************************************************PART-9******************************************

కలలో జరుగుతున్నట్లు ఉన్న శైలజా, కిషోర్ ఇంట్లో మంచం మీద కళ్ళు తుడుచుకుంటూ కూర్చోనుంది. నిన్నటి రోజున ఒక్కొక్క పువ్వుగా వికసించిన బంధుత్వాలు, రోజు మధ్యాహ్నం లోపల వాడిపోయి ముగిసిపోయింది అంటే కలే కదా అది!

కొంత సేపటికి ముందు కిషోర్ దగ్గర బ్రతిమిలాడుతూ అతని వెనుకే పరిగెత్తినది, అతనో నిర్లక్ష్యంగా ప్యాంటు జేబులోచేతులు పెట్టుకుని ఆగకుండా నడుస్తూ ఉండటం గుర్తుకు వచ్చింది.

మేడ మెట్లు ఎక్కినతను -- మొదట ఉన్న గదిలోకి వెళ్ళి గది ఇకమీదట నీ గది అన్నాడు. వినోధినీ యొక్క అందమైన ఫోటోలు అక్కడక్కడ నవ్వుతూ, ఆమె ఉపయోగించిన బొమ్మలు అందంగా సర్ది పెట్టున్నాయి. ఏనుగు దంతం రంగు గోడ, మధ్యలో అందమైన మంచంతో ప్రకాశవంతంగా వెలుగుతున్న గది యొక్క అందాన్ని ఎంజాయ్ చేయలేక శైలజా మనసు తపించింది.

నేను చెప్పేది దయచేసి వినండి. మీరు మాత్రం ఇంటికి వెళ్ళి ఆంటీ...అమ్మను చూడండి. నేనొస్తే పెద్ద సమస్య అయిపోతుంది అంటూ మళ్ళీ మళ్ళీ బ్రతిమిలాడింది.

అలాగంతా జరగదు వినోధినీ. నేను నీతోనే ఉంటాను కదా అన్నాడు కొంత విసుగుతో.

ఇంత కంటే ఎలా చెప్పేది?’ అని అర్ధంకాక కొట్టుకుని ఫైనల్ గా చెబుతున్నా. నేను మీతో బెంగళూరు రాను అన్నది ఖచ్చితంగా.

అలాగైతే కాళ్ళూ -- చేతులూ కట్టేసి, కారులో పడేసి తీసుకు పోతాను -- నవ్వాడు.

భగవంతుడా! అనుకుంటూ రెండు చేతులతోనూ మొహం మూసుకుని, అక్కడున్న కుర్చీలో కూర్చుంది.

హై...ఏమైంది?” అంటూ అతను దగ్గరకు రావటం చూసి లేచి జరిగిన ఆమె -- ఒక నిర్ణయంతో, “ఒకే.ఒకే! నేను నిజం చెప్పేస్తాను. నేను...నేను వినోధినీనే కాదు అన్నది.

గబుక్కున ఆగినతను, ఒక్క క్షణం కళ్ళు చిట్లించి ఆమె చెప్పేది నమ్మని వాడిలాగా చూశాడు.

అవును. నేను వినోధినీ కాదు. ఆమె స్నేహితురాలు శైలజా. ఆమె వలన రావటం కుదరలేదు కాబట్టి నన్ను పంపింది. విషయం వాళ్ళ నాన్నకు తెలుసు. మీ దగ్గర విషయాన్ని చెప్పవద్దని ఆయనే...ఆయనే చెప్పారు. అందుకే...

అతని మొహమంతా ఎర్రబడి కోపంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న అతన్ని భయంతో చూసింది.

అప్పుడు నిన్న పొద్దుటి నుంచి నా దగ్గర వినోధినీ లాగా నటించావు?” గట్టిగా  అరిచాడు. అవునుఅని తల ఊపుతూ అదే భయంతో అతన్ని చూసింది.

అంటే వ్యక్తి మార్పిడి చేసి మొసం చేశావు! -- కళ్ళల్లో కోపం ఉడికిపోతోంది.

లేదు...అలాకాదు. వినోధినీ యొక్క నాన్న కోసం, ఆమె చాలా ఒత్తిడి చేసి చెప్పినందువలనే వచ్చాను అన్నది గబగబా.

...ఎవరైనా నటించమని చెబితే నటిచ్చేస్తావా? అసహ్యంగా లేదూ...? నువ్వు కూలీకి నటించే కోవకు చెందిన దానివా?” -- మాటలు నిప్పు కణాలలాగా ఒలికినై.

ఎంత బాగా నటించి...! తలుచుకుంటేనే ఛీదరగా ఉంది. ఏదీ పిలు...నీ తెలివిగల స్నేహితురాలుని -- ఉరిమాడు.

సెల్ ఫోను తీసి వొణుకుతున్న వెళ్ళతో వినోధినీ కు ఫోన్ చేసింది. హలోచెప్పేలోపే ఆమె దగ్గర నుండి ఫోను లాక్కుని హలో! నీ స్నేహితురాలుని జైలుకు పంపనా? లేదు...తోడుకు నువ్వూ వెళ్తావా?” కోపంగా అడిగాడు. 

..........................”

నేను ఎవరైతే నీకేంటి? నిన్ను...తిన్నగా వచ్చి పట్టుకుంటాను అని అతను కోపంగా మాట్లాడ, అవతలివైపు ఏదో చెప్పింది వినోధినీ.

కొద్ది క్షణాలు ఓర్పుగా విన్న అతను నేను రోజు సాయంత్రమే అక్కడికి వస్తున్నా. నా కంటే ముందే నువ్వు బయలుదేరి వెళ్ళి, నీ ఇంట్లో ఉండు. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఫోను ఆఫ్ చేసి బయలుదేరుఅని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు.  

ఇంటికి వచ్చి చేరేంత వరకు ఆమెనొక  వస్తువుగా కూడా చూడలేదు, పట్టించుకోలేదు. చిట్లించుకున్న మొహంతోనే కారును నడిపిన అతను, కారు నిలబడగానే డోర్ ను ఒక తోపు తోసి మూసి లోపలకు వెళ్ళిపోయాడు. అది ఆమెను కొట్టినట్టు ఉన్నది. అతని యొక్క విసుగు, కోపమూ ఆమెను ఎక్కువగా బాధ పెట్టింది. మేడమీద గదిలోకి వెళ్ళి కూర్చున్న ఆమె తన మనసులో ఏర్పడుతున్న ఆందోళనను అనుచుకోలేకపోయింది! బంధుత్వాల వలన వచ్చే ఫీలింగ్స్, ఇంత బాధ ఇస్తాయంటే...బంధుత్వాలే అక్కర్లేదు అనిపించింది.

మందు రోజు కుటుంబం ఆమెతో ఎంత సహజంగా, సరదాగా గడిపింది! రోజు బంధమూ లేకుండా, అందరూ ఆమెను మొసగత్తెలాగా చూస్తున్నది తలుచుకుని ఒక్క క్షణం మనసు చివుక్కుమన్నది. ఆంటీ, అంకుల్ విసుక్కోరు. అని ఆమె మనసు చిన్నగా ఆశపడింది. కానీ పిల్లలు విసుక్కుంటే సన్నిహితంగా ఉండరు. కిషోర్ గురించి చెప్పనే అక్కర్లేదు. ఆల్రెడీ ఆమెను ఉపయోగం లేని వస్తువులాగానే కదా తీసుకు వచ్చి చేర్చాడు?

మనసులోని నొప్పి పెద్ద నిట్టూర్పుగా బయటపడ్డప్పుడు శైలజా! అన్న పిలుపుతో ఉలిక్కిపడి లేచి చూసింది.

లోపలకు వచ్చిన ప్రభావతి చూపుల్లో కోపమో, విసుగో లేదు. అభిమానం మాత్రమే ఉంది. బాధపడకు అమ్మాయ్. నువ్వు ఎవరినా సరే నా తమ్ముడి కోసం ఇంత దూరం వచ్చావే! ఖచ్చితంగా మనమధ్య ఏదో ఒక బంధం ఉంది అంటూ శైలజా చెయ్యి పుచ్చుకుని, ధైర్యం చెబుతుంటే, శైలజా కరిగిపోయింది.

కన్నీళ్ళను తుడుచుకుని తన గురించి పూర్తిగా చెప్పిన శైలజా వినోధినికి రావాలనే  ఆశ. కానీ, వాళ్ళ మావయ్య అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తారు. ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్ళారు. అందుకని వినోధినిని కనిపెట్టుకుని ఉండటానికి  బయట ఒకడ్ని కాపలాకు ఉంచారు. అందువలనే అది భయపడి రాలేదు అని చెప్పి, “కానీ, దాంతో నాకే మంచి జరిగింది. బంధువులు, బంధుత్వాలతో అలవాటు లేని నాకు ఇక్కడున్న ఈ రెండు రోజులూ స్వర్గంలో గడిపినట్లు ఉన్నది. జ్ఞాపకాలే నాకు చాలు అంటూ మళ్ళీ కన్నీరు పెట్టుకుంది.

నిన్నే మేము మొదటగా వినోధినిగా చూశాము. అందువలన వినోధిని, నువ్వూ మాకు ఒకటే. అందువలన వినోధినితో పాటూ నువ్వు కూడా వచ్చేయాలి అంటూ ప్రేమగా ఆర్డర్ వేసింది. అది కూడా శైలజాకు బాధగానే ఉంది. కానీ, మీ అబ్బాయి నన్ను క్షమించరు ఆంటీ. ఒక రోజంతా ఆయనతో ఉండి నిజం చెప్పకపోవటం నా తప్పే?” అని బాధపడింది. 

ప్రేమ చూపించటంలోనైనా సరే, కోపించుకోవటంలోనైనా సరే...అతన్ని మించలేమమ్మా. కోపంగానే ఉన్నాడు. పోను పోను సరిపోతాడు అని సమాధానపరిచింది.

కోపమైతే సరిపోతుంది. కానీ, అతనిలో ఇప్పుడు ఉన్నది విరక్తి. ఆమెను ఎంత గగుర్పాటుగా చూశాడు. తలుచుకుంటేనే వణుకు వచ్చింది ఆమె.

అమ్మా! మూడు గంటలకు విమానం. రెడీ అవమనండి. నేను మరో గంటలో వచ్చేస్తాను అని తల్లి దగ్గర చెప్పేసి వెళ్ళాడు కిషోర్.

దాని తరువాత వినోధినిను బలవంతపెట్టి భోజనం తినిపించింది ప్రభావతి. చంద్రశేఖరం, ప్రభావతి ఆమెను ఆశీర్వదించి మళ్ళీ రావాలని ప్రామిస్ చేయించుకుని పంపించారు. ప్రమీలా, పద్మ, శంకర్ దగ్గర తాను క్షమాపణలు అడిగానని చెప్పి సెలవు తీసుకుంది.

అతని దగ్గరగా కారులో కూర్చునప్పుడు మనసు ఖాలీగా ఉంది. మొదటిసారి ఎక్కినప్పుడు ఉక్కిరిబిక్కిరి అవటం జ్ఞాపకం వచ్చింది. డోరును ఆనుకున్నట్టు కూర్చుంది.

వర్షం అందమా...ఎండ అందమా? బుజ్జగించేటప్పుడు వర్షం అందం. కర్ణా నువ్వు కోపగించుకునేటప్పుడు ఎండ అందం!పాట వినిపించింది.

ఇతను కోపగించుకుంటే లోపల నిప్పులాగా సెగగా ఉందే!అని అరవాలన్నట్టు ఉన్నది శైలజాకి. మాట్లాడు...మాట్లాడుఅన్న అతను మాట్లాడితే కొట్టేవాడిలాగా కనిపిస్తున్నాడు.

మొదటి విమాన ప్రయాణం. విమానంలో అతని దగ్గరగా ఉన్నప్పుడు, ఇదంతా కలే అన్నట్టు అనుకున్నది. విమాన ఉద్యోగి వచ్చి సీటు బెల్టువేసుకోమని చెప్పిన తరువాత, కొంచం కష్టపడింది. నిర్లక్ష్యంగా ఆమె నడుంపై సీటు బెల్టుతగిలించిన అతను, ఆమె ముఖ కవలికలను కొద్ది క్షణాలు చూసేసి కళ్ళను తిప్పుకున్నాడు. అతని మొహాన కఠినత్వం ఇంకా కొంచం పెరిగున్నది. ఆమెకో అతని చేయి తగలినందువలన గుండె కొట్టుకుంటున్న వేగం పెరిగింది.

పని ముగిసిందని కళ్ళు మూసుకుని ఆనుకున్నాడు కిషోర్. ఆమెకు మాత్రం ఏం చేయాలో అర్ధం కాలేదు. ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే మనో పరిస్థితిలో ఆమె లేదు. చెవ్వు మూసుకు పోయింది. బయటకు చూసింది. మేఘాల మధ్యలో దూరి దాగుడుమూతలు ఆడేసి, బయటకు వచ్చినప్పుడు చల్లటి మంచు పొగలాంటి మేఘాలపైన ఎగురుతున్నట్టు అనిపించింది.

చుట్టూ ఏమీ లేనట్టు ఖాలీ. తరువాత ఎక్కడికీ అనేది అర్ధం కాక, యంత్రం చూపించే దారిలో ప్రయాణం. జీవితమూ అలాగే వెళ్తున్నది. ప్రమాదం జరగకుండా వెళ్ళి చేరాలి అనేది భగవంతుడి చేతిలో కదా ఉన్నాది? నీ జీవితం దిక్కు తెలియకుండా వెళుతోంది’ -- అర్ధం కాని దుఃఖం ఆమె మనసును  చుట్టుకుంది.

మళ్ళీ కారులో ప్రయాణం చేస్తుంటే టెక్నాలజీ మహిమ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇరవై నిమిషాలకంటే తక్కువ సమయ విమాన ప్రయాణం. బెంగళూరు నగరం ఎప్పటిలాగానే నిర్మలంగా చిక్కులాగా ఉన్నది. దారిలో ఒక పెద్ద హోటల్ ముందు కారు ఆపాడు.

హైదరాబాద్ నుండి ఇప్పటివరకు, ‘రా...పో...ఉండుఅనేది తప్ప అతను ఇంకేదీ మాట్లాడలేదు అనేది ఆమెకు బాధ కలిగించింది.

ఇక మాట్లాడకుండా ఉండలేము అని అనుకున్న ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చాము?” అని అడిగింది.

నాకు ఆకలిగా ఉంది. నీకూ కావాలంటే తిను. లేకపోతే వేడుక చూడచ్చు. దిగు అంటూ దిగాడు.

స్టార్ హోటల్ చాలా ఆడంబరంగా ఉన్నది. చుట్టుపక్కల చేసున్న అలంకారాన్ని ఎంజాయ్ చేస్తూ అతని ఎదురుగా కూర్చుంది. ఏవేవో ఆర్డర్చేశాడు. అంతా టిఫినే’. రిలాక్స్ గా వెనక్కు వాలి కూర్చున్న అతను అమ్మ నీ గురించి అన్ని విషయాలూ చెప్పింది. నిన్ను పెంచి పెద్ద చేసిన చోట నీకు నటించటం కూడా నేర్పించారా ఏమిటీ? అనుమానమే రాలేదే! లేక నటించటం ఎలా అనేదానికి ఏదైనా స్పేషల్ ట్రైయినింగా?” -- అన్నాడు. అతని మాటల్లో ఎగతాలి తెలిసింది.

మీరు నమ్మినా, నమ్మకపోయినా పరవాలేదు. వినోధిని మరీ బలవంతం పెట్టింది కాబట్టే వచ్చాను. అప్పుడుకూడా వాళ్ళ నాన్న దగ్గర, మీ అందరి దగ్గర నిజం చెప్పి బయలుదేరతాను అని చెప్పాను. ఆయనే...నువ్వు చాలా కోపగించు కుంటావని చెబుతూ అడ్డుపడ్డారు. ఆయనే చెప్పుకుంటానని చెప్పారు. అందువలనే... అని వివరించింది.

అదంతా సరే...కానీ, ఎలా సహజంగా నటించ గలిగావు?” అంటూ పెద్దగా ఆశ్చర్యపడుతున్నట్టు అడిగాడు.

రక రకాల టిఫెన్లు రావటంతో, ఆమెకూ ఒక ప్లేటు పెట్టబడి వడ్డించబడింది. కానీ, టిఫిను ఆమె గొంతుకలోకి దిగితేనే కదా!

ఆమె ఏం చేస్తున్నది అనేది కూడా గమనించకుండా, టిఫిన్ తిని ముగించినతను ఇప్పుడు గుట్టు బయటపడింది కదా! ఇంకా ఎందుకు నటించటం? నటించేటప్పుడు బాగా తిన్నావు! ఇప్పుడు కుదరటం లేదా? డిఫెరెంట్ మనిషివే నువ్వు అంటూ గుండెల్లోకి బాణాన్ని దించాడు.

ఇతనికి నా మీద ఉన్న కోపం తగ్గదా? నేను ఇక్కడికి వినోధిని పేరుతో ఎందుకు రావలసి వచ్చిందో చెప్పాను కదా. అయినా అర్ధం చేసుకోడెందుకు. ఇంతక ముందు లాగా మాట్లాడడా?’--మనసు పరితపించింది.

అదే ఆలొచనతో నడుస్తున్న ఆమె, ఎదురుగా వచ్చి, “హలో శైలజా అంటున్న ప్రేమ్ కుమార్ ను  గమనించలేదు. ఆమె భుజాన్ని ముట్టుకుని శైలజా! ఇక్కడ... అని చెప్పగా,ఉలిక్కిపడి తల ఎత్తింది. ఆమె మొహంలో కోపం, విసుగు, విరక్తి కనబడింది. ఎంత ధైర్యం ఉంటే భుజం ముట్టుకుని పిలుస్తాడు?’

ఆమె జవాబు చెప్పే లోపల, ముందుగా వెళుతున్న కిషోర్ వెనక్కి తిరిగి ఇద్దర్నీ ప్రశ్నార్ధంకంగా చూశాడు.

ఆశ్చర్యంగా ఉంది! నువ్వు ఇక్కడకు వచ్చావేమిటి? ...ఈయనతో వచ్చావా? సార్...నేను ప్రేమ్ కుమార్! ఈమెను మూడు సంవత్సరాలుగా లవ్ చేస్తున్నాను. డిగ్రీ పూర్తి చేసి పెళ్ళి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాము అన్నాడు ప్రేమ్ కుమార్. 

శైలజాకి మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపించింది. కిషోర్ ను చూసింది. ఎటువంటి ఎమోషనూ లేకుండా కొత్త మనిషిని చూసి హలో అన్న అతను, “వెళ్దామా?” అంటూ ఆమె దగ్గర కూడా అడిగాడు.

మీరు ఎవరనేది తెలియలేదే సార్?” అని ఇంకితం తెలియక అడిగాడు మూర్ఖుడు.

నేను శైలజాకి గార్డియన్’”. సంసయమే లేకుండా జవాబు వచ్చిన వెంటనే....కే...! బై. మిమ్మల్ని తరువాత కలుస్తాను అని చెప్పి ఆమెను పిలుచుకుని వెళ్ళాడు కిషోర్.

కారు ప్రయాణంలో అతను ఏమీ అడగనందున ఆమే తానుగా, “నేను కంప్యూటర్ క్లాసు చదువుతున్నప్పుడు, నాతో పాటు చదువుకున్నాడు. అప్పట్నుంచే నన్ను ట్రబుల్ చేసేవాడు. తరువాత పెద్దవాళ్ళను పిలుచుకు వచ్చి మా ఆశ్రమం వార్డన్ దగ్గర మాట్లాడాడు. అమెకూ నచ్చలేదు కాబట్టి డిగ్రీ ముగించాలి అని చెప్పి పంపింది.

తరువాత, కాలేజీకి పక్కనే ఒక ఇంటర్నెట్ సెంటర్ ప్రారంభించారు. సెలవు రోజుల్లో బయటకు వెళ్ళేటప్పుడు వచ్చి మాట్లాడతాడు. అతన్ని ఎలా విడిపించుకోవాలో, నా వెనుక పడకుండా ఎలా తరమాలో తెలియటం లేదు. ఇష్టం లేదని చెబితే వేరే విధంగా అల్లరి చేస్తాడు అని చెప్పి వార్డన్ ఓర్పుగా  ఉండమంది. ఇప్పుడు కొంచం కూడా బుద్దే లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో మీరే చూశారుగా?” అంటూ విసుగును కక్కింది. ఏదైనా సమాధానం చెబుతాడేమో నని తపనతో ఎదురుచూసింది.

ఆమెను నిర్లక్ష్యంగా చూసిన కిషోర్, “స్త్రీల కొసమే ఎన్నో స్వీయ రక్షణ కళలు అందుబాటులో ఉన్నాయి కదా! అందులో ఒకటి నేర్చుకోనుండచ్చు కదా! అంతెందుకు ఈవ్ టీజింగ్ అని చెబితే, పోలీసులు తీసుకుపోయి కీళ్ళు విరుస్తారు. ఇంతదాకా వదిలిపెట్టిసి, ఇప్పుడు ఏడిస్తే ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు ఆరితేరిన నటివే కదా! ఎలాగైనా అతన్ని మాయ చేసి తరిమేసుండచ్చే?” అంటూ మళ్ళీ పాత చోటుకు వచ్చి నిలబడ్డాడు. ఇతనితో చెప్పటమే తప్పుఅని అనుకున్నది శైలజా.

లేదు. వాడు చాలా డబ్బుగలవాడు. తప్పుకుని వెడితేనే మంచిది అన్నది, తన పరిస్థితిని అతనికి తెలియజేయాలనుకునే వేగంతో.

! అలాగంటే నీ మత్తులో పడిన వాళ్ళ లిస్టులో ఎందుకైనా ఉండనీ అనుకుని అతన్ని ఉంచుకున్నావా?” అని అడిగాడు కొంచం కూడా కనికరం అనేది లేకుండా.

ఛీ! మీరు మనిషే కాదు. మీ దగ్గర వివరణ ఇవ్వటమే తప్పు. మీలాగానే నన్నూ అనుకోకూడదు. నలినీని పనిలోకి చేర్చుకుని తయ్యతక్క లాడుతున్న వారే కదా మీరు? నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు -- అని ఆయసపడుతూ చెప్పింది.

వినోధిని యొక్క ఇల్లు -- నగరం దాటి ఉండటం వలన ఒక గంటకు పైనే పట్టింది. అప్పుడప్పుడు శైలజా వినోధినితో వెళుతుంది.  వినోధిని తల్లి, ప్రేమ  చూపించకపోయినా... శైలజాను డిఫెరెంటుగా చూసేది కాదు. వినోధిని యొక్క ఒత్తిడివలనే వినోధినితో పాటూ వాళ్ళింటికి వెళ్ళేది. రోజు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం ఇప్పుడు ఆమెను చుట్టుకుంది.

ఆమె దగ్గర దారి అడిగి -- ఇంటి దగ్గరకు వెళ్ళగానే, “నీ స్నేహితురాలి దగ్గర మనం వచ్చేమనేది తెలియపరచు అని ఆర్డర్ వేశాడు కిషోర్.

ఇంటి యొక్క పెద్ద గేటు తెరవబడి, దగ్గరే నిలబడింది వినోధినీ. కారులో నుండి ఇద్దరూ దిగిన వెంటనే శైలజా చేతులు పుచ్చుకుని, “రండి -- అమ్మతో నేనేమీ చెప్పలేదు. మీరు ఊంటే ధైర్యంగా చెప్పవచ్చు అనుకుని ఆగాను. లోపలకు రండి. అమ్మ ఉన్నది. అని పిలుచుకు వెళ్ళింది.

హాలులో ఉన్న లక్ష్మీ తిరిగి చూసి -- శైలజాను గుర్తించి నవ్వుతూ లేచి, కిషోర్ ను ప్రశ్నార్ధకంగా చూసింది. రా శైలజా, రా తమ్ముడూ...?” అంటూ వినోధినీను కూడా చూసింది.   

నేను కిషోర్. హైదాబాద్ నుండి వస్తున్నా అత్తయ్యా అంటూ తనని పరిచయం చేసుకుంటూ కూర్చిలో కూర్చున్నాడు. అర్ధం చేసుకున్నట్టు ఆమె మొహంలో పలు భావాలు.

జరిగిన విషయాలను కిషోర్ బ్రీఫ్ గా చెప్పగా, లక్ష్మీ మొహమో కోపంతో ఎర్రబడింది. వినోధినీను కోపంగా చూసింది. వినోధినీ నేమో క్షమించమన్న భావనతో తల వంచుకుని కూర్చోగా, కిషోర్ యొక్క గొంతు మాత్రమే వినబడింది. 

వ్యక్తులు నేరస్తులుగా మారటం లేదు...మార్చబడుతున్నారు అనేది ఎక్కడో చదివున్నాను. మీరూ, మావయ్యా చేరి రోజు నేరస్తులను తయారు చేశారు. వ్యక్తి మార్పిడి ఎంత పెద్ద నేరమో మీకు తెలిసుంటుంది అన్నాడు.

గొంతును సరిచేసుకుని మాట్లాడటం మొదలుపెట్టింది లక్ష్మీ.

నాకు తెలియకుండా వినోధినీను కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకు వెళ్ళాలని   ప్రయత్నించారు. అది మొదటి తప్పు. తరువాత వినోధినీ అనే పేరుతో ఎవరో వస్తే, వచ్చింది వినోధినినేనా, కాదా అనేది కూడా తెలుసుకోకుండా, వచ్చింది వినోధినినే నని మూర్ఖత్వంగా నమ్మి అనుమతించింది రెండో తప్పు. దానికీ, మాకూ సంబంధం లేదు...అది సరే ఇక్కడకొచ్చి పిల్లలను నేను నేరస్తులుగా మార్చానని వాగుతున్నావే, ఇదే మాట అక్కడ ఆయన్ని అడిగావా...అడిగుండవు, అడగలేవు అన్నది ఎమోషన్స్ నిండిన స్వరంతో.

కొంచం ఎదురు దెబ్బ తగిలినా, దానిని ఎవరికీ కనిపించనివ్వకుండా నిర్లక్ష్యంగా  నవ్వాడు కిషోర్. మేము చేసిన తప్పుకు శిక్ష ఉండదు. కారణం వినోధినీ వయసులో  మేజర్. కానీ, అమ్మాయి చేసిన మనిషి మార్పిడి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం మీరు ముగ్గురూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చే శిక్ష అయినా దొరుకుతుంది...తెలుసుకోండి అత్తయ్యా. తన తండ్రిని చూసే హక్కు వినోధినీకి ఉన్నది అన్నాడు నొక్కి చెబుతూ.

హత్యా నేరం చేసినవాడిని కూడా సంధార్భానుసారం మన్నించి  విడిచిపెట్టవచ్చు. నమ్మిన వాళ్ళను అనుమానించి మొసం చేసిన ఆయన నీడకూడా నా కూతురు మీద పడటం నాకు ఇష్టం లేదు. నన్ను బెదిరించి ఒప్పుకునేటట్టు చెయ్యాలనే ఆలొచన ఉంటే అది జరగదు బాబూ. చనిపోయిన దాన్ని ప్రాణాలతో తీసుకురావటం మన సైన్స్ ప్రతిభలో కూడా ఇంకా సాధ్యం కాలేదు అనేది నీకు తెలుసు కదా అన్నది ఖచ్చితంగా.

వినోధినీ, శైలజానూ కలత పడుతున్న మొహంతో ఒకర్ని ఒకరు చూసుకున్నారు.

అలాగైతే మావయ్య కట్టిన తాలి, ఆయన గుర్తుగా ఇవ్వబడ్డ బహుమతి వినోధినీ ను ఎందుకు మీతో ఉంచుకున్నారు? తప్పు చేసింది మావయ్యే కదా? వినోధినీకి ఎందుకు శిక్ష వేశారు? ఆమెకు న్యాచురల్ గా దొరకవలసిన తండ్రి ప్రేమను, ఆమెకు దొరకకుండా చేసిన మిమ్మల్ని శిక్షించేది ఎవరు? మీ స్వార్ధం వలన ఆమె పడిన మనో వేదనకు ఏం సమాధానం చెప్పబోతారు? ఇందాక చెప్పేరే హత్యా నేరం చేసినవాడిని కూడా సంధార్భానుసారం మన్నించి విడిచిపెట్టవచ్చు అని. పని మీరెందుకు చేయలేదు. తన తప్పు తెలుసుకుని ఎన్నిసార్లు తనని మన్నించమని మా మావయ్య మిమ్మల్ని బ్రతిమిలాడుంటారు. మీకొక నీతి, ఆయనకొక నీతా?" - కోపము, విరక్తి, విసుగు కలిసిన స్వరంతో అతను చెప్పగా...షాక్ తో వినోధినీను చూసింది లక్ష్మీ.

అది కిషోర్ ను ఉత్సాహపరచటంతో...మాటలు కొనసాగించాడు. మీరు మావయ్య ను శిక్షించాలని అనుకోనున్నా, ఆయనతో పాటూ ఒకే ఇంట్లో ఉండి మీ విరక్తిని, చూపి ఆయనకు పాఠం నేర్పించి ఉండాలి. అది వదిలేసి ఇలా ముగ్గురి జీవితాలనూ వేస్టు చేసుండక్కర్లేదు. కొంచం ఓర్పుగా ఆలొచించి చూస్తే, ఆయనకు మీ మీదున్న విపరీతమైన ప్రేమే మావయ్యను తప్పుగా మాట్లాడించిందని అర్ధమవుతోంది.

దానికి ఇంతవరకు వేసిన శిక్ష చాలు. ఆయన ఇంకా ఎక్కువ రోజులు బ్రతకరు. మీ క్షమింపు కొసమే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. చాలు...అత్తయ్యా! ఇకమీదట అయినా వినోధినీ మీ ఇద్దరి ప్రేమనూ ఒకటిగా  అనుభవించనివ్వండి. కాదూ, కూడదూ అంటే పాపం మిమ్మల్ని మరో జన్మలో కూడా తరుముతుంది అంటూ లేచినతను, “నేను బయలుదేరతాను. రేపు పొద్దుటి దాకా ఆలొచించండి. మీ మనసులో కొంచమైనా జాలి, దయ, తడి, మానవత్వం ఉంటే...నాతో రేపు బయలుదేరండి అని చెప్పి బయటకు వచ్చాశాడు.

అతని వెనుకే వినోధినీ వెళ్ల, శైలజా కూడా ఆమెతో వెళ్ళవలసి వచ్చింది. అతను కారు దగ్గరకు చేరుకున్నప్పుడు ఒక్క నిమిషం బావా...  అని వినోధినీ పిలవటంతో, ఆగాడు.

మమ్మల్ని క్షమించండి. నాన్న కొసమే ఇలా చెయ్యాల్సి వచ్చింది అన్నది బ్రతిమిలాడే ధోరణితో!

అతను తన సెల్ ఫోన్ నెంబర్ను చెప్పాడు. రేపు పొద్దుటి వరకే అవకాశం. తరువాత పోలీసు స్టేషన్లో కలుసుకోవలసి వస్తుంది అని ఇద్దరూ అత్తయ్యకు ఎత్తి చూపండి అంటూ కారులోకి ఎక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కిషోర్.

రోజు వరకూ తనతోనే ఉండే శరీర భాగం ఒకటి తెగి పడిపోతే ఇంత నొప్పి పుడుతుందా?’ -- అన్న ఆలొచన వచ్చి శైలజాను ఆశ్చర్యపరచింది. స్థంభించి నిలబడ్డ ఆమెను వినోధినీ పిలుపు ఊపింది.

ఏయ్! ఎన్నిసార్లు పిలవాలమ్మా? ఎందుకు అక్కడే నిలబడ్డావు? లోపలకు వెళ్దాం...రా అని కేక వేసి చెప్పింది.

నిదానంగా లోపలకు వెళ్ళిన శైలజా షాకుతో కళ్ళు మూసుకుని కూర్చోనున్న వినోధినీ తల్లి లక్ష్మీను మామూలు లోకంలోకి తీసుకు వచ్చింది.  అప్పటికప్పుడు, వెనువెంటనే చేయవలసిన పని ఆమెను ఒప్పించి హైదరాబాదుకు పంపించటం. తరువాత తన సమస్య గురించి ఆలోచించవచ్చు. అని నిర్ణయం తీసుకున్నట్టు వినోధినీతో పాటూ వెళ్ళి లక్ష్మీ కాళ్ళ దగ్గర కూర్చున్నారు.

అమ్మా! సారీమ్మా...నాన్న చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పారు. అప్పుడు కూడా వెళ్ళకపోతే నేర భావన నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదనే ఇలా చేశాను. రియల్లీ...సారీమ్మా అని కన్నీరు కార్చింది.

కళ్ళు తెరిచిన లక్ష్మీ...కూతుర్నీ, శైలజానీ దగ్గరకు తీసుకుని, హత్తుకుని లేచింది.

****************************************************PART-10***************************************

కూతురి రెండు చేతులూ పట్టుకుని, వినోనన్ను క్షమించి వదిలేస్తావా? నా గురించి మాత్రమే ఆలొచించి, నీ హక్కులను నీ దగ్గర నుండి తీసేసుకున్నానే! కిషోర్ తమ్ముడు చెప్పిన తరువాతే నేను నీకు ఎంత పాపం చేసేనో నాకు అర్ధమయ్యింది. చెప్పమ్మా...నువ్వు ఎన్ని రకాలుగా బాధలు పడ్డావో చెప్పు. చెబితేనే కదా మూర్ఖపు తల్లికి అర్ధమవుతుంది?” అన్నది కన్నీటితో.

అలాగంతా మాట్లాడదమ్మా. నన్ను ప్రేమతోనే కదా పెంచారు. ఇక్కడ కూర్చీండి. నేను చెబుతాను. ఖచ్చితంగా చెప్పే తీరాలి అని చెప్పి తల్లిని కూర్చోబెట్టి, మంచంపై శైలజాతో కలిసి కూర్చుంది.

మొదట్లో నాకు నాన్నను చూడాలని ఆశగానే ఉండేది. కానీ, నువ్వు ఎప్పుడూ ఏడుస్తూ ఉండటంతో అడగటానికి భయం వేసింది. రేపు వచ్చేస్తారు...ఎల్లుండి వచ్చేస్తారుఅనుకుని నన్ను నేనే సమాధాన పరుచుకున్నాను. కొంచం పెద్ద దాన్ని అయిన తరువాత, నాన్న మాట ఎత్తితేనే నువ్వు కోపగించుకునే దానివి. ఐదో క్లాసు చదువుతున్నప్పుడు నాన్న నన్ను చూడటానికి స్కూలుకు వచ్చారు. ఆయన నన్ను కౌగలించుకుని ఏడ్చింది ఇంకా జ్ఞాపకానికి వస్తోంది.

మాతో వచ్చేయండి నాన్నాఅన్నందుకు అమ్మ కోపంగా ఉంది. తగ్గిన తరువాత వస్తానుఅని చెప్పి వెళ్ళారు. తరువాత రెండు మూడుసార్లు నాన్నను చూశాను. అంతలో మామయ్య వచ్చి, నన్ను వేరే స్కూలుకు మార్చేశారు!

నాన్న మీద అందరూ కోపంగా ఉన్నారని నాకు అర్ధమయ్యింది. ఒకసారి మన కదిర్, నా పెన్ను తీసేసుకున్నాడమ్మా. నేను ఇవ్వుఅని అడిగినప్పుడు...అత్తయ్య, ‘మీ నాన్నకు ఉన్న అదే అనుమాన బుద్దే నీకూ వచ్చిందా?’ అని కొట్టింది. వాళ్ళబ్బాయి దగ్గర పెన్ను తీసావా?’ అని కూడా అడగలేదమ్మా? స్కూల్లో సహ విధ్యార్ధినులతో ఏదైనా సమస్య వస్తే మీ నాన్నే నిన్ను వద్దని చెప్పేసేరేఅంటూ గేలి చేసేవారు. ఒంటరిగా ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా?” అని కళ్ళు తుడుచుకున్న కూతురితో నువ్వు ఒక్కసారైనా నాతో చెప్పుండచ్చు కదమ్మా?”  అని కూతురి చేతులు పుచ్చుకుని ఏడ్చింది లక్ష్మీ.

మీరూ సంతోషంగా లేరమ్మా. నేను చెబితే ఇంకా ఏడుస్తారని చెప్పలేదు. స్కూల్లో ఫంక్షనో, మీటింగో జరిగితే...అందరి తల్లి-తండ్రులూ వస్తారు. నేను ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటాను. కష్టానికంతా నాన్నే కారణం అని నాకు అర్ధమయ్యింది. అందువలన ఆయన్ని విసుక్కోవటం ప్రారంభించాను.

ఒక సన్యాసిని లాగా జీవిస్తున్న నా తల్లిని ఆయన అనుమానించింది తప్పుఅని నాకు తరువాతే అర్ధమయ్యింది. ఆయన్ని మీరు క్షమించకపోవటం కరెక్టేఅని సమాధనపరుచుకున్నాను. కానీ అమ్మా...ఆయన చివరి సారిగా ఒకసారి నన్ను చూడాలని ఆశపడుతున్నారు అనే వార్త విన్న తరువాత నా మనసు ప్రశాంతత  కోల్పోయింది. ఇప్పుడు కూడా మిమ్మల్ని గాయపరచ కూడదు అన్న ఒకే ఆలొచనతో నేను వెళ్ళకుండా శైలజాను పంపించాను. అది కూడా ఆయన మీద జాలితో, ఆయన తన జీవిత చివరి దశలో ఉన్నారని అని చెప్ప, ఇద్దరూ కొద్దిసేపు కళ్ళు నలుపుకుంటూ ఏడవ... శైలజాకీ ఏడుపు వచ్చింది. 

అయినా ఓర్చుకుని, “ఇలా ఇద్దరూ ఏడుస్తూ ఉంటే ఎలా? గడిచి పోయిన కాలం ఏదో పీడ కల అనుకుని మరిచిపొండి ఆంటీ. దేవుడు ఇప్పుడొక సంధర్భం ఇచ్చాడు. మనం ఎన్ని తప్పులు చేసున్నా మనల్ని చీదరించుకోవటం లేదు ఎదుటి వాళ్ళు. కానీ, ఎదుటి వాళ్ళ తప్పులను క్షమించకుండా, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాముఅని ఎందులోనో చదివాను అని చెప్పిన ఆమె, హైదరబాదులో మొహన్ కుమార్ గారు నడుపుతున్న దయానిలయం గురించి, రెండు రోజులూ ఆమె చూసిన వాటి గురించి చెప్పింది.

కొంతసేపటి మౌనం తరువాత, “నాకు క్షమాబిక్ష ఉన్నదా, లేదా అనేది తెలియదు.  ఆయన చేసిన తప్పుకు నిన్నూ చేర్చి కదా శిక్షించాను! దాని వలన ఎవరికీ, ఏం లాభం అని నేను ఆలొచించనే లేదు. చాలు...ఇంకా నేను ఆలస్యం చేయదలుచుకోలేదు. రా...మనం హైదరాబాదుకు వెళ్ళి ఆయన్ని...మీ నాన్నను చూద్దాం. తమ్ముడు, అతని పేరు కిషోర్ కదా? అతనితో చెప్పమ్మా అని హడావిడి చేసింది లక్ష్మీ.

అది చూసి చిన్నవాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అందువలన అవమానంతో ఎక్కడో చూస్తున్నట్టు, “ వయసులోనైనా నాకు మెచ్యూరిటీ రాలేదనుకో, పైలోకంలో కూడా నాకు చోటు దొరకదు. భూమి మీద నేను పడ్డ కష్టం చాలదా?” అంటూ మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఆందోళన పడింది వినోధినీ. ఇక మీదట మీరు ఏడవనే కూడదమ్మా. ఇదిగో నేను ఇప్పుడే బావకు ఫోను చేస్తాను  అన్న ఆమె సెల్ ఫోనులో కిషోర్ ను కలుసుకుంది. అతని స్వరం వినలేకపోయేనని తపించింది శైలజా.

తాను హైదరాబాదు వెళ్ళటాన్ని మానుకోవడానికి ప్రయత్నించింది శైలజా. కానీ, వినోధినీ యొక్క మొండితనం గెలిచింది.

విమానాశ్రయంలో ఆమెను పట్టించుకోకుండా మిగిలిన ఇద్దర్నీ చూసి నవ్వుతూ స్వాగతించాడు కిషోర్. నవ్వు మత్తులో ఉండిపోయి నిలబడ్డ శైలజాను వినోధినీనే చెయ్యి పుచ్చుకుని తీసుకువెళ్ళింది.

మీ ఇంట్లో ఎటువంటి సమస్యా రాలేదుగా అత్తయ్యా?” అని లక్ష్మీ దగ్గర అడిగాడు.

లేదయ్యా. అందరూ విదేశాలకు వెళ్ళున్నారు. ఫోనులో విషయం చెప్పాను. నా తమ్ముడు కొంచం కోపగించుకున్నాడు. సమాధానపరిచాను. నువ్వు మాతోనే ఉండి ఉండచ్చు కదా?” బాధతో చెప్పింది లక్ష్మీ.

బావా, నీ దగ్గర ఒకటి అడగాలి. శైలజాను తిట్టారా? ఆమె ఎంత ఉత్సాహంతో  ఉండే మనిషి. హైదరాబాదు నుండి వచ్చిన దగ్గర నుండి సరిగ్గానే మాట్లాడటం లేదు. ఏం చేశారు నా స్నేహితురాలిని?” అని అతనిపై నేరం మోపింది.

నా దగ్గర దెబ్బలు తినకుండా తప్పించుకోవటమే పెద్ద విషయం. నీ స్నేహితురాలు ఎలా నటించిందో నీకు తెలియదు వినోధినీ. సినిమాలో చేరితే,  ఖచ్చితంగా బహుమతులు వచ్చి చేరుతాయి అన్నాడు గేలి చేస్తూ.

నవ్వటానికి ప్రయత్నించి ఓడిపోయింది శైలజా. విమానంలో కిషోర్ పక్కన లక్ష్మీ కూర్చుని, మొహన్ కుమార్ గారి గురించి వివరాలు సేకరించటంలో మునిగిపోయింది.

వినోధినీ కూడా ఏదో ఆలొచనలో ఉండ, కళ్ళు మూసుకుంది శైలజా. సముద్ర తీర ఒడ్డులో ఉత్సాహంతో గంతులేస్తోంది ఆమె. ఒక పెద్ద సునామీ అల ఒకటి ఆమెను లాక్కుని వెళుతోంది. ఉలిక్కిపడి లేచిన ఆమెకు తనను లాక్కెడుతున్న సునామీ ఏదీ అనేది అర్ధమయ్యింది. కిషోర్ మీద ఉన్న ప్రేమా? లేక...అతనే ఆమెను లాక్కుని వెళుతున్నాడా? 

భయంతో తిరిగి చూసింది. విండో దగ్గరగా కూర్చుని లక్ష్మీతో మాట్లాడుతున్నా, అతని చూపులు శైలజా పైనే ఉండటంతో తల వంచుకుంది.

ఎందుకలా చూస్తున్నాడు...కోపమా?’ -- ఇంకోసారి తిరిగి చూడాలని తుళ్ళిన మనసును అనచటానికి ఎంతో కష్టపడింది. మేనేజర్ సుందరం కారుతో కాచుకోనున్నారు. లక్ష్మీని, కూతుర్నీ చూసిన ఆయన కళ్ళు కన్నీరు పెట్టుకుంది. రండమ్మా! అన్నారు.

బాగున్నారా అన్నయ్యగారూ?” -- లక్ష్మీ స్వరం నీరసంగా ఉన్నది. పెద్ద కారు యొక్క ముందు వైపు సుందరం కూర్చోగా -- మధ్య సీటులో కిషోర్, లక్ష్మీ  కూర్చున్నారు. వినోధినీ, శైలజా వెనుక కూర్చున్నారు. శైలజా చేతిని వినోధినీ విడిచిపెట్టలేదు. ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఆత్రుత తెలిసింది.

మీరు వస్తున్న విషయం తెలుసుకున్న మావయ్య రోజు పొద్దున్నే డిస్చార్జ్చెయ్యమని చెప్పేశారు. హాస్పిటల్లో దాన్ని అనుమతించరు. డాక్టర్ రాస్తేనే డిస్చార్జ్చేస్తారు. కానీ, మావయ్యకు ఉన్న పలుకుబడి వలన ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళారట. అందుకని మనం ఇంటికే వెళ్ళిపోదాం

చాలా కాలంగా విడిపోయి, కలుసుకుంటున్న తన భార్య - కూతురు హాస్పిటల్లో కలుసుకోవటానికి ఆయనకు మనసు రాలేదు అనేది అర్ధమయ్యింది.

కిషోర్, లక్ష్మీ దగ్గర తన కుటుంబం గురించి చెబుతున్నాడు. శైలజా ముందు అందంగా దువ్వుకున్న కిషోర్ యొక్క తలజుట్టు. ముట్టుకునేంత దూరంలో ఉన్న కేశాలను ముట్టుకోవాలనే ఆశపడుతున్న చేతిని మడతపెట్టి ఒడిలో పెట్టుకుంది. కానీ, చూపులను మరల్చుకోలేకపోయింది.

అతను ముద్దుపెట్టుకున్నది గబుక్కున జ్ఞాపకానికి రాగా, ఆందోళనతో తన ఆలొచనల పరుగుకు నిషేధచట్టం వేసింది. ఛీ! నాకు పిచ్చి పట్టినట్టుందిఅని తనని తానే తిట్టుకుంది.

****************************************************PART-11******************************************

మొహన్ కుమార్ ఇంట్లో ఇద్దరు నర్సులు మానీటరింగ్ లో ఉన్నారు. ప్రభావతి, చంద్రశేఖరం కుటుంబ శభ్యులంతా తెల్లవారు జామునే అక్కడ హాజరు అయ్యున్నారు. వీళ్ళు లోపలకు వెళ్ళిన వెంటనే, కొంతసేపు మౌనం చోటు చేసుకుంది. కిషోరే మొదటగా మాట్లాడాడు.

చూశారా మావయ్య...నేను చెప్పినట్లే అత్తయ్యనూ, వినోధినీనూ మీ దగ్గరకు తీసుకువచ్చి వదిలాను అన్నాడు గర్వంగా.

ప్రభావతి, లక్ష్మీ చెయ్యి పుచ్చుకుని తమ్ముడి దగ్గరకు పిలుచుకు వెళ్ళింది. దగ్గరకు వెళ్ళిన మరుక్షణమే విరిగిపోయింది లక్ష్మీ.

తన ముందు మోకాళ్ళపై కూర్చుని తల వంచుకుని ఏడుస్తున్న భార్యను మొహన్ కుమార్ చేతులు ఓదార్పుగా ముట్టుకున్నాయి.

మీ దగ్గర క్షమాణలు అడిగే అర్హత కూడా లేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను క్షమిస్తారా?” అన్నది ఏడుస్తూ. ముందుకు వచ్చిన కిషోర్ అత్తయ్యా! ఆయన మిమ్మల్ని చూడటమే ఆనందం అంటున్నారు. ఆయనకు మిగిలినవన్నీ గుర్తుండవు. వినోధినీ...ఏమిటి అలా చూస్తూ ఉండిపోయావు? మీ నాన్న దగ్గర ఏమీ అడగవా?” అంటూ పరిస్థితిని మెరుగు పరిచే విధంగా మాట్లాడాడు. 

తండ్రికి ఎడం వైపుకు వెళ్ళిన కూతురు ఆయన చేతులు పట్టుకుని మిమ్మల్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది నాన్నా అని చెప్పగా, కళ్ళల్లో నీరుతో తల ఊపిన ఆయన ఆమె నుదిటి మీద ముద్దుపెట్టాడు.

ఓకే! ఇప్పుడు మనమందరం బయటకు వెళదాం. మావయ్య -- అత్తయ్యా మీకు పది నిమిషాలే అవకాశం. అంతలోపల మాట్లాడి ముగించండి. కానీ, ఏడవకూడదు! వినోధినీ నువ్వూ రా అంటూ అందరినీ బయటకు వచ్చేటట్టు చేశాడు కిషోర్. 

మరుక్షణం, వినోధినీను కౌగలించుకుంది ప్రభావతి. నమస్తే మావయ్యా అంటూ చంద్రశేఖరానికి నమస్కరించింది. సొంత మనిషి కాబట్టి ఎటువంటి సంకోచమూ లేకుండా పిలుస్తున్నారు అనేది అర్ధం చేసుకుంది శైలజా. శంకర్, పద్మ, ప్రమీలా లను వినోధినీకు పరిచయం చేశాడు కిషోర్.

మీ అందరి గురించి నోరు నొప్పి పుట్టేంతగా మాట్లాడేసింది శైలజా. అది చెప్పినట్టి నుండి మిమ్మల్నందరినీ ఎప్పుడు చూడబోతానా అని ఆశగా ఉండేది అన్నది వినోధినీ.  

సరి...అందరూ వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేయండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి నడిచాడు కిషోర్.

నలినీని చూడకుండా ఉండలేక పోతున్నట్టున్నాడూ అని నిర్లక్ష్యంగా అనుకుంటూ అతను వెళ్ళినవైపే చూసింది శైలజా.

అందరితోనూ సహజంగా కలిసిపోతోంది వినోధినీ. ఆనందంగా తరువాతి నాలుగు  రోజులు మంచు ముక్కలాగా కరిగిపోయినై. వినోధినీకి కొత్త లోకానికి వచ్చినట్టు అనిపించింది. తల్లి--తండ్రుల నీడలో--బంధువుల సెలెబ్రేషన్ లో--స్నేహితురాలితో కలిసి ఆనంద సముద్రంలో మునిగింది. ఆమె యొక్క ఉత్సాహం శైలజాకు అంటుకున్నా...హృదయానికి అంచుల్లో ఏదో ఒక అర్ధం కాని బాధ మాత్రం లేకుండా పోతే బాగుండేది అనిపించింది.

కిషోర్ బయటి ఊరుకు వెళ్ళాడు. దయానిలయానికి వెళ్ళి పిల్లలతోనూ, పెద్దలతోనూ ఒకరోజంతా హాయిగా గడిపింది. ఇంకొక సాయం సమయం పద్మ, శంకర్ తో రిసార్టుకు వెళ్ళారు. ఛీఫ్ కుక్ ఆనంద్ వాళ్ళను స్వాగతించి రోజు స్పేషల్ లంచ్ పెట్టాడు. 

మేము నెలకు ఒకసారైనా ఇక్కడికి రావాలనేది మావయ్యా ప్రేమపూర్వక ఆర్డర్. అమ్మ ఎప్పుడూ వచ్చేది కాదు. నాన్న ఎప్పుడైనా వస్తారు. అన్నయ్యతోనే వస్తాము అన్నాడు శంకర్.

అన్నయ్యఅనే మాటతో శైలజా హృదయం తుల్లిపడటం ఎవరూ తెలుసుకోలేదు!

ప్రమీలా కూడా వచ్చుండచ్చు. కానీ పాపం ఇంటర్ సెకెండ్ ఇయర్ అంటే చదువుకోవలసిందే కదా. ఏప్రిల్ నెలలో మాకు సెలవులు ఇచ్చినప్పుడు మనం మజా చేద్దాం. నీకు అప్పుడు కుదురుతుంది కదా శంకర్?” అని అడిగింది వినోధినీ.

అప్పుడు ఊటీ, కులూమనాలి లాంటి చలి ప్రదేశాలకు వెళ్దాం. కానీ, అంతలోపు పద్మ పెళ్ళి వచ్చేస్తే?” ప్రశ్నను ముందుంచాడు శంకర్.

పద్మ కోపంతో పోరా! నన్ను ఎలాగైనా ఇంటి నుండి పంపించేయాలని చూస్తున్నావా? అదంతా ఇంకా రెండు మూడు సంవత్సరాల తరువాత. నీకు కావలంటే చెప్పు. నేను అమ్మా-నాన్నలతో మాట్లాడతాను అన్నది.

అయ్యో...దయచేసి అలాంటిదంతా ఏదీ చెయ్యద్దే తల్లీ! నేను జీవితంలో హాయిగా ఉన్నాను. సరే...నీతో గొడవకు రాను అని వెనక్కి తగ్గాడు.

అనవసరంగా నోరు పారేసుకోవటమే నువ్వు పనిగా పెట్టుకున్నావు శంకర్ అన్నది శైలజా.

ఎం చేయను. మహిళల గుంపు ఒకటిగా కలిసిపోయారు. మావయ్య ఒక కొడుకును కనుంటే నాకు సపోర్టుగా ఉండేది అని పెద్ద నిట్టూర్పుతో చెప్పాడు.

తననీ కుటుంబంలో ఒకత్తిగా వాళ్ళు అనుకుని మాట్లాడింది ఆమెకు సంతోషాన్ని ఇచ్చింది. కానీ, అది నిలకడ కాదే! ముఖ్యమైన ఒకడు ఇష్టపడనప్పుడు ఏం చెయ్యగలం?’

రోజు నిద్రపట్టక దొర్లుతున్నది శైలజా. తోటలో తిరుగుదామా?’ అనుకుని బయటకు వచ్చినప్పుడు, తోటమాలి ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చి ఏం కావాలని అడిగాడు.

సరదాగా కాసేపు అలా తిరుగుదామని వచ్చాను!అన్నది. పనివాళ్ళు వినోధినీ ను  చూసుకున్నంతగా తనని కూడా చూస్తున్నారని ఆమె ఆనందపడ్డది.

చూసి వెళ్ళండమ్మా. చాలా దూరంగా వెళ్ళకండి. ఏదైనా అవసరమైతే ఒక కేక వెయ్యండి! అని చెప్పి పంపించాడు.

ఎంత శ్రద్ధ చూపే మనిషి?’ అని అనుకుంటూ వెన్నెల చలిలో వీస్తున్న చల్లగాలి హాయిగా తాకి ఆడుకోగా, ఆనందిస్తూ నడిచింది. కొద్దిసేపట్లోనే మనసు తేలిక పడటంతో, తిరిగి వచ్చిన ఆమె, ఆఫీసు గది యొక్క వెనుకవైపు గుమ్మం తలుపు తీసుండటం చూసి ఆశ్చర్యపోయింది.

సమయంలో ఎవరు పని చేస్తున్నారు? కిషోర్ ఊర్లో లేడు కదా. అయితే మేనేజరా? లేక నలినీనా? ఎవరై ఉన్నా సరే చూశేసి వాద్దామే?’ అనుకుని లోపలకు వెళ్ళింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. కంప్యూటర్ ఆన్ చేయబడి ఉంది. అటూ, ఇటూ చూసేసి వెనక్కి తిరిగి వెళ్దామనుకున్న ఆమెకు, “హలో...ఏమిటి సమయంలో?” అంటూ కిషోర్ స్వరం వినబడటంతో ఉలిక్కిపడింది.

దొంగతనం చేసేటప్పుడు దొరికిపోయినట్లు దొంగచూపులు చూస్తున్నావు...ఏమైంది?” అని తలవంచి అడిగాడు. చాలా రోజుల తరువాత అతన్ని చూస్తున్నట్టు అనిపించింది. కళ్లను రుద్దుకుని చూడ, మనసు అతని మాటలవలన గాయపడింది.

నలినీ ఉంటుంది కదా అనుకుని వచ్చాను. ! మీరు అని తెలిసుంటే వైపుకే వచ్చుండను అని విసుగుని మొహంలో చూపిస్తూ వాకిలి వైపుకు నడిచింది.

ఒకే జంపుతో వాకిలిని అడ్దుకుని నిలబడిన అతను, “హలో! ఏందుకు...అంత విసుగు? నేనా నటించి మోసం చేశాను? రెండు రోజులు పూర్తిగా నన్ను ఎలా మూర్ఖుడ్ని చేసావు? దానికి నేను చూపించాలి విసుగు. సరే...పోతే పోనీ. వెళ్ళి అక్కడ కూర్చో. నీ దగ్గర మాట్లాడాలి ఆర్డర్ వేసాడు.

ఇతని ఆర్డర్ కు తలవంచాల్సిన అవసరం నాకు ఏమీ లేదుఅని అనుకున్నా ఆమె కాళ్ళు తానుగా వెళ్ళి కూర్చున్నాయి.

అవతలివైపుగా కూర్చున్న అతను నెమ్మదిగా ఆమెను అన్వేషించాడు. ఆమె తల వంచుకుని, చేతి వేళ్లను చూసుకుంటున్నది. గొంతు సరిచేసుకుని పరీక్షలు పూర్తి అవగానే నీకు ఇక్కడే ఒక ఉద్యోగం ఏర్పాటు చేయమన్నారు మావయ్య. దాని గురించి మాట్లాడాలి అన్నాడు.

ఉద్యోగమా...నాకా? ఛాన్సే లేదు. నేను ఇక్కడ ఉండను అన్నది ఖచ్చితమైన స్వరంతో.

ఎందుకని?” -- ఎగతాలిగా అడిగాడు. అతను అడిగిన విధం ఆమెకు నచ్చలేదు.

నేను ఎక్కడ పనిచేయాలి అనేది నా ఇష్టం. ఎవరికీ కారణం చెప్పక్కర్లేదు అన్నది కోపంగా.

కానీ ఏం చేసేది...నా మావయ్యకు నీ గురించి తెలియక ఇలా నాకు ఆర్డర్ వేశారు. నీకొసం మీ ఊర్లో కొతమంది మూర్ఖులు నీ ప్రేమకోసం కాచుకోనున్నారు అనేది...పాపం ఆయనకు ఎలా తెలుస్తుంది? మొసపోయినవాడిని నాకు కదా నీ గురించి పూర్తిగా తెలుసు

సరే! నేను దీని గురించి అంకుల్ దగ్గరే మాట్లాడుకుంటాను అని చెప్పి, వేగంగా తిరిగి నడిచిన ఆమె సరైన అరిగిపోయిన రికార్డు--హింస తట్టుకోలేకపోతున్నానుఅని  గొణుక్కుంది.

మరుక్షణం ఆమె చేతులు అతని పిడికిలిలో! ఏమిటీ...నేను నీకు హింసనా? హింస చేసి చూపించనా? తట్టుకోలేవు?”--ఉరిమాడు.

చెయ్యి వదలండి. నొప్పి పుడుతోంది. నేను అరుస్తాను అన్నది చేతులు లాక్కోవటానికి ప్రయత్నిస్తూ.

అప్పుడైతే చేతులు లాక్కోకు. నొప్పి పుట్టదు. నువ్వు కరాటే నేర్చుకున్న దానివి! మర్చిపోయావా?  మామూలు అమ్మాయిలలాగా అరుస్తానంటున్నావు అంటూ చేతిని వదిలాడు.

నొప్పి పుడుతున్న చేతిని రుద్దుకుంటూ అతన్ని కోపంగా చూసింది. మాటలు ఏమీ రాలేదు. అతనూ నిర్లక్ష్యంగా చూస్తూ నీ భవిష్యత్తు ప్రణాళిక గురించి నాకు తెలుసు. రోజు వచ్చాడే, పిచ్చోడు, నిన్ను వదలనే వదలడు. అతన్ని పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు. నాకు కనిపించకు. పో...వెళ్ళు అని తరిమాడు.

అవును, అతను నీ కంటే ఎంతో మంచివాడు. పొగురుబోతు కాదు అంటూ విసుగ్గా చెప్పటమే కాకుండా, ‘సరైన...కృర జంతువువి!అని మనసులో తిట్టుకుని వేగంగా వెళ్ళిపోయింది.

గదికి వచ్చిన తరువాతే కళ్ళ వెంట నీళ్ళు రావటం గమనించి, మంచం మీద పడుకుని తనివితీరా ఏడ్చింది. తరువాత, మొహం కడుక్కుని ప్రశాంతంగా ఆలొచించినప్పుడు ఒక నిజం అర్ధమయ్యింది.

కిషోర్ ఉన్నా అవస్తగానే ఉంది. అతను లేకపోయినా మనసు తపిస్తోంది. మిగతావాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రాని తడబాటు, అతని పేరు విన్నా, అతని గురించి విన్నా వస్తోంది

ప్రేమ్ కుమార్ దగ్గర లోటూ లేదు. కానీ, మూడు సంవత్సరాలుగా అతను అవస్తపెడుతున్నా విసుగు వచ్చిందే తప్ప...దేనికీ చలించని ఈ మనసు ఇప్పుడు ఎందుకిలా మారిపోయింది. లేక...ఇదేదో వయస్సుతో వచ్చిన ఆకర్షణా, లేక దీనినే ప్రేమ అంటారా? దీనిలో నుండి బయటకు రావాలంటే ఇక్కడుంచి వెళ్ళిపోవాలి.

లేకపోతే రోజు అతన్ని చూసిన వెంటనే మనసు మొదట్లో ఎలా ఆలొచించింది అనుకుంటే సిగ్గు చేటు. మంచి కాలం...అతను విసిగించాడు కాబట్టి మనసు తప్పించుకుంది. ఇక ఒక్క రోజు కూడా అతను ఉన్న చోట నేను ఉండకూడదూ అని నిర్ణయించుకున్న ఆమె బరువైన హృదయం ఆమెకు తోడుగా రాత్రికి మేలుకునున్నది.

పొద్దున వినోధినీతో తాను వెళుతున్నట్టు చెప్పినప్పుడు, ఆమె చెవులు మూసుకుని, “నాకు చెవ్వు వినబడదు అని చెప్పింది. లక్ష్మీ, మొహన్ కుమార్ గారి గదిలో ఉన్నదని తెలుసుకుని అక్కడికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి కుశలం అడిగి, మెల్లగా మొదలు పెట్టింది.

అంకుల్ -- ఆంటీ! మీరిద్దరూ నన్ను క్షమించాలి. నేను నన్ను పెంచిన భువనేశవరి అమ్మగారితో కొద్ది రోజులు గడపాలని ఆశపడుతున్నా. ఆమెను చూసి ఆరు నెలలు అయ్యింది. దాంతో పాటూ కాలేజీలోనూ కొంచం పని బాకీ పడింది. కాబట్టి దయచేసి నేను వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అంటూ బ్రతిమిలాడే ధోరణిలో వేడుకుంది.

పెద్దలిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మోహన్ కుమార్ గారే మాట్లాడారు నువ్వు మాతో ఉండటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తోందమ్మా. ఏదో పోయిన జన్మలో మాకు కూతురుగానో...తల్లిగానో ఉండుంటావు. నువ్వు మాకు చేసిన సహాయం చాలా పుణ్యమైనది. సరే...వెళ్ళాలని నిర్ణయించుకున్నావు అని తెలుస్తోంది. కానీ, కన్నవారిని మర్చిపోకుండా తిరిగొస్తావా?” అని అడుగ, దుఃఖం గొంతుకకు అడ్డుపడింది.

అనాధ నని అనుకున్న నాకు, కన్నవారు మాత్రమే కాకుండా అన్ని బంధుత్వాలూ దొరకటం నా బాగ్యం అని అనుకుంటున్నా. మిమ్మల్నందరినీ మర్చిపోలేను అంటూ వాళ్ళ పాదాలకు నమస్కరించి సెలవు తీసుకుంది శైలజా.

వినోధినీ కళ్ళల్లో పడకముందే ప్యాక్చేసుకుని ఉంచుకున్న బ్యాగుతో బయలుదేరి బయటకు వస్తే, మేనేజర్, ఎదురుగా కారులో వచ్చి దిగారు.

ఏమ్మా...బయలుదేరేరా? ఎప్పుడు తిరిగొస్తారు?” అంటూ ఎంక్వయిరీ చేశారు.

నేనొక అర్జంటు పనికోసం బయలుదేరుతున్నా అంకుల్. త్వరగా వచ్చేస్తాను. డ్రైవర్ తో చెప్పి నన్ను బస్ స్టేషన్ దగ్గర దింపమని చెప్తారా?” అని అడిగింది.

ఏంటమ్మా అలా అడుగుతున్నావు? ఇదిగోమ్మా డ్రైవర్ దగ్గర చెప్పి ఆమెను పంపించారు.

కారులో ఎక్కి కూర్చున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంది. వినోధినీకి తెలిసినప్పుడు ఎలా కోపగించుకుంటుంది?’ అని అనుకున్న వెంటనే బాధ కలిగింది. పరవాలేదు...సమాధానపరుద్దాం. కానీ, ఆమె అత్తయ్య ఇంట్లో ఎవరి దగ్గరా చెప్పకుండా వెళ్తున్నామే!అనేది ఆమెకు ఎక్కువ వేదన కలిగించింది.

తనని కృతజ్ఞత లేని దానిని అనే కదా అనుకుంటారు. పరవాలేదు...అదీ మంచికే. నా మీద అభిమానం చూపటంకంటే విరక్తి చూపటమే ప్రశాంతం అని మనసును దృడ పరుచుకుంది. కారు బస్సు స్టేషన్ కి వచ్చి చేరింది.

****************************************************PART-12***************************************

అదే సమయం వినోధినీ, కిషోర్ ను పట్టుకుని  ఊపుతున్నది. బావా ప్లీజ్...చెప్పండి. మీకూ, శైలజాకీ ఏమిటి సమస్య? నిన్న రాత్రి నిద్రపోవటానికి వెళ్ళేముందు, వచ్చే వారం రోజులకు ప్రోగ్రాంవేసిన తరువాతే గుడ్ నైట్చెప్పుకుని నిద్రపోవటానికి వెళ్లాము. పొద్దున్నే అంతా మారిపోయిందే. ఖచ్చితంగా ఏదో జరిగుంటుంది. మీరు చెబితేనే కదా నేనేమన్నా చెయ్యగలను?”

నేను ఏమీ చెయ్యలేదు. నీ స్నేహితురలు ప్రేమ్ను వెతుక్కుని వెళ్ళింది. నువ్వు వెళ్ళి దానే అడుగు -- నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు.

ఎవరు... సగం పిచ్చోడు ప్రేమ్ కుమారా? ఛాన్సే లేదు. భూమి తలకిందలుగా చుడుతోంది అని చెప్పినా నేను అలాగా?’ అని అడుగుతాను. కానీ, శైలజా పోయి... ప్రేమ్ ను... -- పడీపడీ నవ్వింది వినోధినీ.

ఆమె అలా నవ్వటాన్ని చూసి కిషోర్ కూడా నవ్వుతూ స్నేహితురాలు మీద నీకు అపరిమిత నమ్మకం. కానీ, నాకు లేదు అంటూ భుజాలు ఎగరేశాడు. 

నవ్వటం ఆపి, అతన్ని తల వొంచి చూసిన ఆమె సరే నీ ఊహను కరెక్టే అని పెట్టుకుందాం...మీరన్నట్టే ఆమె ప్రేమ్ ను నే వెతుక్కుని వెళ్ళున్నా, అందువల్ల మీకెందుకు కోపం?” అని కళ్ళు పెద్దవి చేసుకుని అడిగింది.

నాకేం కోపం? నువ్వు అడిగావని చెప్పాను అన్నాడు తడబడుతూ.

...విషయం అలా పోతోందా? అదెలా రెండు రోజుల్లో మీకు అంత...?” -- అంటూ ఆశ్చర్యపడింది వినోధినీ.

ఆమె అర్ధం చేసుకున్నది కాదనక, “మొదట్లో కోపమే! మావయ్యను చూడటానికి నువ్వు రాలేదు అనే కోపంతో విసుగ్గా నడుచుకున్నాను. కానీ, ‘దయానిలయంలో ఒక పిల్ల నెను మీ దగరకు వస్తే...అమ్మ దగ్గరకు తీసుకు వెళతారా? అని అడిగింది. దానికి నీ స్నేహితురాలు ఏడ్చిన ఏడుపు...అబ్బో -- అక్కడే నేను కొంచం... అంటూ తల ఊపాడు. బావ యొక్క గంభీరమైన ముఖంలో కూడా చిరు సిగ్గు రేఖలు చూసి కళ్ళు పెద్దవి చేసింది వినోధినీ.

శైలజా రోజూ కూడా ఏడ్చింది లేదు. అందర్నీ సంతోషంగా ఉండేలా ఉంచుకోవాలని సీతాకోక చిలుకలాగ తిరుగుతూ వస్తుంది. అలాంటి ఆమె మీ ముందు ఏడ్చింది అంటే నిజంగానే బావా, ఆమె మనసులో మీరు ఒక ముఖ్యమైన చోటు పట్టుకున్నారు అనేదే అర్ధం. వెంటనే వెళ్ళి పిలుచుకు రండి బావా. ప్లీజ్...ఆమె ఎంత మంచిదో అనేది ఆమెతో సన్నిహితంగా ఉన్న నాకు తెలుసు. ఇక మీరు పిలుస్తేనే వస్తుంది. చేస్తారా బావా...నాకోసం ప్లీజ్ అని అడిగింది.

అప్పుడు అక్కడికి పద్మ, శంకర్, ప్రమీలా ముగ్గురూ వచ్చారు. ప్రమీలా, కిషోర్ దగ్గరకు వచ్చి అతని భుజాలు పట్టుకుని వదినని చూడాలని ఆశగా ఉన్నది. త్వరగా బయలుదేరు అన్నయ్యా అన్నది ఆదుర్దాగా.

ఏమిటీ...వదినా? మీరే నిర్ణయం తీసేసుకున్నారా?”—అంటూ మనసు లోపల లేచిన ఆనందాన్ని అనుచుకుని అడిగాడు.

నాకు మొదటే తెలుసు. మిమ్మల్ని విశ్వామిత్రుడు అన్నది. వెంటనే నేను విశ్వామిత్రుడా...మేనక అందానికి లొంగిపోయాడే. అతనా...అని చెప్పినప్పుడు ఆమె మొహం ఎర్రబడటం చూడాలి! అనుమానమే లేదు... శైలజానే మాకు వదిన. మేము నిర్ణయించేశాము అన్నయ్యా. సరే కదా శంకర్?” అంటూ అతన్ని తోడుకు పిలిచింది పద్మ.

వదిన అంటే శైలజానే. ఇంకెవరినీ చేర్చుకోము మేము. త్వరగా రండి అన్నయ్యా, వెళ్ళి శైలజాను తీసుకు వద్దాము తొందర పెట్టాడు శంకర్. 

...సారూ కూడా వస్తారా? సరే రా...బయలుదేరు అన్నాడు కిషోర్.

పద్మ, శంకర్ చెయ్యి పుచ్చుకుని నువ్వెందుకు? వద్దు. సమస్యను పెద్దది చేయటానికా! అన్నయ్య మాత్రం వెళ్ళనీ అని ఆపింది.

ప్యాంటు జేబులో చేతులు ఉంచుకుని .కే! అయితే నేను బయలుదేరతాను. ప్రస్తుతానికి పెద్దలకు తెలియనివ్వకండి. అడిగితే నేను బెంగళూరు వెళ్ళినట్టు మాత్రం చెప్పండి. ఎందుకంటే శైలజా నిర్ణయం ఇంకా నాకు తెలియదు అన్నాడు కిషోర్ ఆలొచిస్తూ.

బావా! మీరు శైలజాతో గొడవ పడకుండా ఉంటేనే చాలు. అంతా సరైపోతుంది. చూడటానికి అనుసరించేలాగా కనబడినా, ఆమె స్వీయ గౌరవాన్ని కెలికితే మాత్రం ఇంతే సంగతులు... అంటూ పెద్ద మనిషిలాగా సలహా ఇచ్చింది వినోధినీ.

అలాగా పెద్ద మనిషీ? నేను జాగ్రత్తగా నడుచుకుంటాను. కానీ నీ స్వీయ గౌరవ  సింహం ఎక్కడ తిరుగుతోందో అని మాత్రం అడిగి చెబుతారా?” అని వింతగా అడగ...అందరూ నవ్వారు.

ఉత్సాహంతో వినోధినీ, శైలజాకు ఫోను చేసింది.

శైలజా సెల్ ఫోను ఆఫ్ చేయబడి ఉండ...దారి తోచక అయోమయంగా నిలబడింది.

చాలా శ్రమపడి కళ్ళు తెరిచింది శైలజా. తాను ఎక్కడుందో అనేదే అర్ధం కాలేదు. దగ్గరలో నవ్వుల శబ్ధం వినబడ, ఆశ్చర్యపడుతూ లేచి తిరిగి చూసింది. అక్కడ ప్రేమ్!........కారు డ్రైవింగ్ సీటులో ఉన్న అతన్ని చూసి నమ్మలేకపోయింది. అతనెందుకు ఇక్కడికి వచ్చాడు?’

ఏమిటి శైలూ డార్లింగ్! అర్ధం కాలేదా? నేను ఎంతో కష్టపడి మనుషులను ఏర్పాటు చేసి, నీ మీద గూఢాచర్యం చేసి, ఒంటరిగా బయటకు వస్తావని కాచుకోనున్నాను తెలుసా?

రోజు వ్యక్తితో నిన్ను చూసినప్పటి నుండి నాకు మనసే బాగలేదు. అందుకనే నీ ఉనికిని గమనించటానికి మనుషులను పెట్టాను. నువ్వేమిటి కుటుంబంతో వాళ్ళ మనిషిలాగా కలిసిపోయినట్లున్నావు ? నేనెలా నిన్ను వదిలేది. చెప్పు? నీ కొసం ఇన్ని రోజులు కాచుకోనున్నానే? ఎలా ఉంది నా తెలివితేటలు?

ఇకమీదట నేను వెయిట్ చెయ్యబోయేది లేదు. ఇప్పుడు తిన్నగా వెళ్ళి మనం పెళ్ళి చేసుకోబోతున్నాం. తరువాత నువ్వు నాతోనే ఉంటావు కదా?” అని వంకరగా నవ్వాడు. అతన్ని చూస్తుంటే శైలజాకి అలర్జీగా ఉన్నది. కానీ, ఎలా ఇతని దగ్గర చిక్కుకున్నాను?’ -- అని ఆలొచించింది.

ఆమెను తీసుకువచ్చిన కారు వెళ్ళిపోయిన తరువాత, రోడ్డు మీద నడుచుకుంటూ బస్సు స్టేషన్ లోపలకు నడిచి వెళ్తున్నది. అప్పుడు మెరుపు వేగంతో వచ్చి నిలబడ్డ కారు నుండి ఓతను దిగి ఆమె ముక్కు మీద ఒక గుడ్డ పెట్టి నొక్కాడు. అంతవరకే ఆమెకు గుర్తుంది.

ప్రయత్నించి శక్తి తెచ్చుకున్న ఆమె నువ్వు చేసేది అతిపెద్ద నేరమైన పని. దొరికిపోయావనకో ఎన్ని సంవత్సరాలు జైలులో ఉండాలో తెలియదనుకుంటా. మర్యాదగా నన్ను వదిలేయి. అతన్ని బెదిరిస్తూ తప్పించుకోవటానికి ఆలొచించింది.

కొంచం మెల్లగా వెల్తావా ప్రేమ్. నాకు వాంతీ వచ్చేటట్టు ఉంది. హువ్వా... అంటూ ముందువైపు వాంతీ చేసుకునేటట్టు నటించింది.

ఒక్క క్షణం ఆలొచించి కారును ఒక పక్కగా ఆపాడు. కారు అద్దాలు తెరిచాడు.

...మంచి నీళ్ళు... -- మళ్ళీ కడుపు పట్టుకుని అలాగే నటించింది. మంచినీళ్ళ బాటిల్ తీయటానికి వొంగున్నాడు ప్రేమ్. అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆమె, రెండు చేతులనూ ఒకటిగా చేర్చి గట్టిగా అతని తల మీద కొట్టింది. దెబ్బకు బ్యాలెన్స్ తప్పి తడబడుతున్న అతన్ని మళ్ళీ ఒక దెబ్బవేసి డోర్ తెరుచుకుని కిందకు దిగి వెనక్కి పరిగెత్తటం మొదలుపెట్టింది.

ఎంతసేపు పరిగెత్తిందో! అంతకుపైన పరిగెత్తలేక, ఒక చెట్టు కింద వాలిపోయింది.మత్తు మందు తాకిడి కూడా కలిసింది. అయినా కానీ స్ప్రుహ కోల్పోకుండా ఉండాలని శ్వాసను గట్టిగా పీల్చుకుని వదిలింది. చిన్న వయసులో  నేర్చుకున్న యోగా ఆమెకు చేయూతనిచ్చింది. ఇక బెంగళూరు వెళ్లలేము. భువనేశ్వరీ వార్డన్ దగ్గర ఏం చెబుతాము? కాలేజీకి వెళ్లటం ఇప్పటికి బద్రత కాదు.

మెల్లగా లేచి నడీచిన ఆమె, 'మంచి కాలం...పగటిపూట బయలుదేరానుఅని  తలుచుకుంటూ, దుప్పటాను తలమీద వేసుకుని కళ్ల వరకు మొహాన్ని కప్పుకుంది. అప్పుడు తలమీద బరువుతో ఒక మగ--ఆడ వస్తున్నారు. చినిగిపోయిన బట్టలూ -- మాసిన జుట్టుతో ఉన్న వాళ్ళను చూసి నమస్తే నండీ. నేను హైదరాబాదు నుండి వస్తున్నప్పుడు ఒక అయోగ్యుడు నన్ను కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించాడు. ఎలాగో తప్పించుకుని వచ్చేశాను. ఒక ఫోను చేసుకోవాలి. సహాయం చేస్తారా -- జాలిగా అడిగింది.

ఒడిలో నుండి సెల్ ఫోను తీసి ఇచ్చాడు మనిషి. వినోధినీకు ఫోను చేసింది.  తన పరిస్థితి గురించి వివరించిన ఆమె, తాను తిరిగి హైదరాబాద్ వస్తున్నట్టు చెప్పింది. ఆందోళన పడ్డ వినోధినీ, ఆమెను అక్కడే ఉండమని, తామే వచ్చి తీసుకు వెళ్తామని, కిషోర్ వస్తాడని చెప్పింది. అది అవసరం లేదుఅన్నది శైలజా.

ఆఫ్ చేసిన సెల్ ఫోనును తిరిగి ఇచ్చి, తన చెవులకు పెట్టుకున్న బంగారు పోగులను ఉడదీసి వాళ్ళ దగ్గర ఇచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళాలి. కొంచం డబ్బు దొరుకుతుందా?” అని అడిగింది.

కొంగు ముడిలో చుట్టి పెట్టుకున్న నలిగిపోయిన యాబహై రూపాయలు తీసి ఇచ్చిన మహిళ, “ఇవన్నీ వద్దమ్మా. మాతోపాటూరా. హైదరాబాద్ బస్సు ఎక్కిస్తాము అని చెప్ప, శైలజాకు కళ్ల నీళ్ళు వచ్చినై. మీరు ఇది తీసుకుంటేనే నా మనసు తృప్తి చెందుతుంది. దయచేసి తీసుకోండి అన్నది. మొండిగా వద్దన్నారు ఇద్దరూ.

వాళ్ళ దగ్గర పేర్లూ -- అడ్రస్సు తీసుకుని థ్యాంక్స్ చెప్పిన ఆమెను వైపుగా వస్తున్న బస్సును ఆపి పంపించారు. కన్నీటితో వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. తరువాత ఏమిటీ?’ అనే ప్రశ్న మనసులో దూరింది.

వినోధినీ కుటుంబం తనని వదలదు అనే నమ్మకం ఉన్నది. కానీ కిషోర్ ఎదురుగా నిలబడాలి! అతను హేళనతో నిర్లక్ష్యంగా చూస్తాడు. అయినా కానీ, అనాధ అయిన నాకు వేరు దారి లేదు. ఒంటరిగా సమస్యను ఎదుర్కోలేను. ప్రేమ్ నాకు ఎంత కష్టం ఇచ్చాడు? స్ప్రుహలోనే ఉన్నాడు. అతను మనుషులకు ఫోను చేసి రప్పించుకోనుంటాడుఎలాగైనా పోనీ?’

శైలజా హైదరాబాద్ వచ్చి దిగింది. నాలుగడుగులు వేసేలోపు హలో...కుశలమా?” అన్న స్వరంతో ఆశ్చర్యపడి తిరిగింది. కిషోర్. కానీ అతని కళ్ళల్లో హేళన--కోపం లేదు. చూపుల్లో ఎటువంటి ఎమోషనూ లేదు.

మౌనంగా అతనితో వెళ్ళి కారులో ఎక్కింది. ఇంటి వరకూ ఏమీ మాట్లాడకుండా కూర్చుంది...బాధగా ఉంది. అతను తిట్టుంటే కూడా బాగుండేదే?’ అని అనుకుంది.

శైలజాను కారులో నుండి బయటకు లాగిన వినోధినీ, ఆమె చేతిమీద ఒక దెబ్బ వేసింది. గొప్పగా వెళ్ళావు? దేవుడు బాగా శిక్షించాడా?” అని తిట్టింది. 

శైలజా మోహంలో సంతోషాన్ని చూసిన తరువాత, అందరి మొహాల్లోనూ ఆనందం.

ప్లేటుతో వచ్చిన ప్రభావతి, “ఉండమ్మా... ఎంత పెద్ద ఆపద నుంచి తప్పించుకున్నావు! అంటూ ఆమెకు దృష్టి తీసి లోపలకు పంపింది.

చంద్రశేఖరం, “మొదట్లో నీతో చెప్పినట్టు, నువ్వు మా ఇంటి ఆడపిల్లవు. అందులో మాకు ఎటువంటి కష్టమూ లేదమ్మా అన్నారు.

పెద్ద వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కరించిన ఆమె, “మీ అందరి ప్రేమనూ నిర్లక్ష్యం చేసి వెళ్ళినందుకు నన్ను మన్నించండి అన్నది ఏడుస్తూ.

పరవాలేదు...దానికేమైంది? ఇప్పుడైనా మా దగ్గరకు వచ్చావే...అదే సంతోషం. పద్మ, శంకర్, ప్రమీలా...టైమైంది బయలుదేరండి. సాయంత్రం వచ్చి మాట్లాడుకోవచ్చు అన్నది ప్రభావతి.

బ్రేక్ ఫాస్ట్ తింటూ జరిగింది వివరించింది శైలజా. అంతా విన్న కిషోర్ లోపలకు వెళ్ళిపోయాడు.

శంకర్, “నాన్నా! వదిన పెద్ద వీరవణితే అంటూ చెప్ప శైలజా ఆశ్చర్యపోయింది.  ప్రమీలా కూడా, “.కే.బై. వదినా! తరువాత చూద్దాం అని చెప్పి వెళ్ళింది. శైలజా అయోమయంగా వినోధినీను చూసింది.

ఏమిటి మేడమ్...గట్టిగా ఆలొచిస్తున్నారు? మళ్ళీ వెళ్ళిపోదామనా?” -- గదిలోకి వచ్చిన వెంటనే అడిగింది వినోధినీ.

నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. దాన్ని ఎలా తీర్చుకోబోతానో తెలియటం లేదు అని బొంగురుపోయిన గొంతుతో చెప్పగా, వినోధినీ లేచి ఆశ్చర్యంగా చూసింది.

ఏయ్ శైలజా! ఏమిటీ హఠాత్తుగా సెంటిమెంట్?”

అది కాదు వినోధినీ. ఇక్కడకు వచ్చేంతవరకూ ప్రేమ--అభిమానం అంటే  ఏమిటనేది తెలియకుండానే ఉన్నాను. మొదట్లో ఇలాంటి ఒక కుటుంబం మనకు లేదే నని బాధపడ్డాను. ఇప్పుడు నన్నూ మీ కుటుంబంలో చేర్చుకుంటున్నారే! దీనికి నేనెలా కృతజ్ఞత చెప్పాలి? అనాధగా -- ఒకే రోజులో మట్టిలో మట్టిగా కలిసి పోయుండాల్సిన దానిని -- రోజు ఇంతమంది బంధువులతో ఉన్నాను అంటే దానికి నువ్వే కదా కారణం. చాలా థ్యాంక్స్ వినోధినీ. ఎన్ని జన్మలు ఎత్తినా  నువ్వున్న చోటునే నేనూ ఉండాలి అంటూ ఎమోషనల్ గా మాట్లాడిన ఆమెను, కన్నీటితో చూసింది వినోధినీ.

నేనూ అలాగే వేడుకుంటున్నా శైలజా. నువ్వు నాకు నా కుటుంబాన్ని తిరిగి ఇచ్చావు. కుటుంబంలో నీకూ ఒక చోటు దొరికింది...అంతే. దాని కొసం ఇంత ఎమోషనల్ అవాలా! అదంతా సరే...మనిద్దరం ఒకే చోట ఉండాలనుకుంటే ఒకరు మనసు పెట్టాలి?” అన్నది.

ఎవరూ?” అనేలాగా అర్ధంకాక చూసిన ఆమె దగ్గర, “నువ్వు మొసం చేసేవే నన్న విపరీతమైన కోపంలో ఉన్న కిషోర్ బావ. నువ్వు ఆయన్ని సమాధానపరిస్తేనే పని జరుగుతుంది అని సలహా ఇచ్చింది వినోధినీ.

వదినాఅన్న శంకర్ మాట గుర్తుకు రాగా, ‘అతని దగ్గర అడుగుదామా?’ అని ఆలొచించింది.

పో...పో! ఆయన్ని సమాధానపరిచిరా.నువ్వు బయలుదేరిన వెంటనే ఆయనా బెంగళూరు వెళ్ళారు. నేను ఫోను చేయటంతో సగంలోనే వెనక్కి తిరిగారు. ఆయన దగ్గర మాట్లాడొచ్చి, నాతో మాట్లాడు అంటూ ఆమెను తరిమి కిందకు వెళ్ళిపోయింది వినోధినీ.

ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొద్దిసేపు నిలబడ్డ శైలజా, మెల్లగా అతని గదికి వెళ్ళింది. లోపల కంప్యూటర్ ముందు కూర్చోనున్న అతను, ప్రశ్నార్ధకంగా కనుబొమ్మలు పైకెత్తాడు.

సారీ! నేనే వినోధినీ అని చెప్పి మీతో కలిసిపోయింది తప్పే. దానికోసం శిక్ష  అయినా వేయండి. కానీ, నన్ను శత్రువుగా చూడకండి అంటూ కంప్యూటర్ చూస్తూ చెప్పింది.

లేచి శైలజా దగ్గరకు వచ్చిన అతను, “హు...నీకు కరెక్టు శిక్షే వెయ్యబోతాను అన్నాడు గట్టిగా!

ఇంకా నా మీద కోపం తీరలేదా?’ అని బాధపడింది ఆమె మనసు. అతని దగ్గరకు వచ్చిన ఆమె, “ కుటుంబంలో నేను మొదటగా చూసింది మిమ్మల్నే. అప్పుడే నిజం చెప్పాలని అనుకున్నా. కానీ, మీరు నన్ను అసహ్యంచుకుంటారని చెప్పలేదు...దానికోసం ఎన్నోసార్లు క్షమించమని అడిగినా మీరు....?” అని బాధతో మాట్లాడిన ఆమె, “నన్ను ఏం చెయ్యమంటారు? కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగనా?” అని కోపంగా అడిగింది.

రెండే రోజుల్లో ఇంతమంది హృదయాలను దొంగలించావే! దానికి శిక్ష ఏమిటో తెలుసా? నీ కాళ్ళూ--చేతులూ కట్టేసి, నా గదిలోనే బంధిస్తాను...నా భార్యగా అన్నాడు నిదానంగా. 

****************************************************PART-13***************************************

చెవులలో వినబడిన మాటలు, మెదడుకు చేరి -- దాని రియాక్షన్ గా కొద్ది క్షణాలు కదలికలను పోగొట్టుకుంది. ఆమె షాకై నిలబడటం చూసిన కిషోర్, నవ్వుతూ ఆమెను తన దగ్గరకు  లాక్కున్నాడు.

గబుక్కున స్ప్రుహలోకి వచ్చినట్టు అతని నుండి జరిగి, “కానీ ఎందుకు?” అని మాత్రమే అడిగింది. కానీ, ఇంకా షాక్ నుండి తెరుకోలేదు. గుండె కొట్టుకోవటం చెవులకు వినబడుతోంది.

అది అర్ధం చేసుకున్న అతను పెద్దగా నవ్వాడు ఇంకేం చేయాలి? నా మనసునూ కలిపి దొంగలించుకుని మాటమాటకీ బెంగళూరు వెళ్ళిపోతున్నావే! నీకు తెలుసా...ఇప్పుడంతా మేడమీద ఒంటరిగా నిలబడటానికే నచ్చటం లేదు. నిన్ను ఇలా చేతులలోకి తీసుకుని... అంటూ ఆమెను తనపై లాక్కుని గట్టిగా కౌగలించుకున్నాడు.

మనసులో ఆనందం వరదలాగా పొంగి పోతూ ఉంటే, దానికి అడ్డుకట్ట వేయటానికి లేదు...లేదు! అలా జరిగే ఛాన్సే లేదు. నాకేం అర్హత ఉంది?” అని ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

పోయిందిరా...కాలం కాలంగా జవాబు తెలియని ప్రశ్నకు నేను మాత్రం ఎలా  సమాధానం చెప్పగలను? ప్రేమమ్మా...ప్రేమ అన్న అతను, మళ్ళీ ఆమెను కౌగలిలోకి లాక్కుని నుదుటి మీద ముద్దుపెట్టాడు. ఆమె మొహాన్ని సున్నితంగా పట్టుకున్న అతని పెదాలు శైలజాఅని ఉచ్చరిస్తూ ఆమె పెదాలను ముట్టుకున్నప్పుడు ఒళ్ళు జలదరించింది. అతను తనని పూర్తిగా వసపరచుకున్నాడని తెలుసుకుంది శైలజా.

కొన్ని క్షణాలు తరువాత ఆమెను విదుదల చేసి, అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి, తానూ కూర్చుని ఆమె చేతిని హక్కుతో తన చేతిలో బంధించాడు.

సరే, నేను మొదటి నుంచే చెప్పేస్తాను. రోజు మావయ్య ఇంట్లో నిన్ను చూసినప్పుడు కోపమొచ్చి, నిన్ను తరిమికొట్టాలనే వచ్చాను. కానీ, నీ మొహమూ, కళ్ళూ నాలో దేనినో కొట్టి లేపింది. చాలా రోజులుగా విడిపోయున్న బంధుత్వాన్ని చూసిన పరవశం. అయినా కానీ, రోజు వరకూ మావయ్యను చూడటానికి  రాలేదనే కోపంతో -- కొత్త ఎమోషాన్ని పక్కకు నెట్టి కోపంగా నడుచుకున్నాను.

కానీ, ‘దయానిలయం నుండి బయలుదేరినప్పుడు ఏడ్చేవే...అప్పుడే, ‘నిన్ను ఇక ఎప్పుడూ ఏడవనివ్వకూడదుఅంటూ తీర్మానించుకున్నాను. కానీ, అప్పుడు వినోధినీగా ఉన్నావే! బంధుత్వంలో పెళ్ళి చేసుకుంటే పుట్టే పిల్లలకు సమస్యలు రావచ్చు అని ఒకటే అయోమయంగా ఉన్నది. అప్పుడు కూడా ఆలొచించి ఒక వేరేదారి కనుక్కుని సమాధానమయ్యాను అన్న అతను సిగ్గుతో ఎర్రబడిన ఆమె బుగ్గలను చిన్నగా గిల్లాడు.

పిల్లలు పుడితేనే కదా సమస్య? నువ్వు నాకు కావాలి...జీవితాంతం కావాలి. అందువలన ఒక బిడ్డను దత్తతు తీసుకుని పెంచుకుందాం అని నిర్ణయం తీసుకున్నాను అని అతను చెప్పటం ఆప, ‘నా మీద ఇంత ప్రేమా?’ అనుకుంటూ ఆశ్చర్యంతో చూసింది శైలజా.

రోజు రాత్రి -- శంకర్ తో నవ్వుతూ మాట్లాడుతున్నది నాలోని ఓర్పును కెలికింది. నాకంటే వాడే నీకు నచ్చాడో అని అనుకుని కోపగించుకున్నాను. అది నాకే పిల్లతనం అనిపించింది. కానీ, అది కూడా మంచికే, లేకపోతే ఇలాంటి ఒక అదృష్టం దొరికేదా?” అంటూ ఆమె కళ్ళల్లోకి చూడ, మొహం మరింత ఎరుపెక్కి, లాగి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.

నువ్వు వినోధినీ కాదు అన్న తరువాత, నాకు సంతోషం వేసింది అన్న వెంటనే గబుక్కున లేచిన ఆమె అబద్దం! నేను నమ్మను. వినోధినీ కాదని తెలిసిన దగ్గర నుండి మీ కళ్ళల్లో విసుగు, విరక్తి కనబడింది. నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అందరూ నాతో ప్రేమగా ఉంటే మీరు...ఎక్కడికైనా పోఅని తరిమేరే! మీ వలనే వాళ్ళను కూడా వదిలేసి వెళ్ళదలుచుకున్నాను అని చెప్పి తిరిగి నిలబడింది.

ఆమె మనసును ఎక్కువగా ప్రేమించిన అతను లేచి, ఆమెను తనతో చేర్చుకుని అది నీ దగ్గర నుండి నన్ను కాపాడుకోవటానికి నేను వేసుకున్న ముసుగు. నువ్వు నన్ను చూసి నవ్వితే నేను ఖాలీ. అది మాత్రమే కాదు... నీ మనసులో నేను ఉన్నానా లేదా అనేది నాకు తెలియదే! అందుకని అవసరపడకూడదుఅని అనుకున్నా. నువ్వు బెంగళూరు వెళ్ళాలనే ఖచ్చితమైన నిర్ణయంలో ఉండటంతో నీకు మూర్ఖుడు ప్రేమ్ మీదే ఆశేమో?’ అన్న అనుమానం నన్ను వేదించింది.

కొన్ని సమయాలలో కాస్త నమ్మకం వచ్చింది. నలినీతో నేను సన్నిహితంగా ఉండటం గురించి చెప్పావే! అప్పుడు. తరువాత, కొన్ని పనులలో నువ్వు నన్ను చూసిన చూపులు! -- ఆమె ఎర్రటి మొహాన్ని ఎంజాయ్ చేస్తూ విశ్వామిత్రుడి దగ్గర మేనక లొంగిపోయిన కథ ఏమిటో?” అంటూ అడిగాడు.

చేతి వేళ్ళను చూసుకుంటూ వినోధినీ ఇంట్లో మీరు మెట్లెక్కి వస్తున్నప్పుడే...నా మనసు మీవైపుకు జారిపోయింది. నాకు తెలియకుండానే అది నన్ను చూపిస్తుందేమో అన్న భయంతొనే బెంగళూరుకు వెళ్ళాను. మిమ్మల్ని ప్రేమించటానికి నాకు ఏముంది అర్హత? అని ఆలొచించాను. కానీ, ముందూ వెనుక తెలియనతని భుజాలపై ఆనుకుని ఏడ్చినప్పుడు నేను తెలుసుకోనుండాలి. ఒకవేల అప్పుడు అర్ధం చేసుకున్నా మిమ్మల్ని ప్రేమించటానికి నాకు అర్హత ఏముంది?” -- అని దుఃఖంతో ముగించింది.

అందమైన స్త్రీ నువ్వు. యుక్త వయసు యువకుడ్ని నేను. ఇంకే అర్హత కావాలి ప్రేమించటానికి? చూసిన వెంటనే ప్రేమే కదా?” అన్నాడు కాలరు ఎగరేసుకుంటూ.

వదినాఅని శంకర్ చెప్పటం విని ఎందుకలా చెప్పాడు అని నాకు షాకు. ఇప్పుడు కదా తెలుస్తోంది. ఇది కూడా కుట్ర అని... అన్న ఆమె వాకిలివైపు చూసింది. ఎవరైనా వస్తే ఆమెను తప్పుగా అనుకుంటారో!

మన కుటుంబంలో అందరికీ ఓకేనే. నువ్వు చదువు ముగించిన తరువాత ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. నువ్వు ఇష్టపడితే పై చదువులు చదువుకోవచ్చు. నన్ను వదిలేసి వెళ్ళి ఎంత పెద్ద ఆపదలో చిక్కుకున్నావు! అతను ఒక్కడుగా ఉన్నందువలన తప్పించుకున్నావు. లేకపోతే....? ఇక మీదట నా కళ్ళ ముందే  ఉండాలి నువ్వు  అన్నాడు అక్కరతో.

అది చాలా?” అని అడిగేసి నాలిక కరుచుకుంది.

ఏం చెయ్యను? చిన్న అమ్మాయివి. నేను కొంచం ఒర్పుగా ఉండే తీరాలి...ప్రయత్నిస్తాను. కానీ, నువ్వు ఇలా అడిగితే తట్టుకోలేను...జాగ్రత్త అని హెచ్చరించి దగ్గరకు రావటంతో...సిగ్గుతో దూరంగా జరిగింది శైలజా.

అభిమానమనే సముద్రంలో మునిగిన -- ప్రేమ వర్షంలో తడిసిన తనకు ఖరీదు కట్టలేని బంధువులను ఇచ్చిన భగవంతుడికి, స్నేహితురాలు వినోధినీకీ ఎమోషనల్ గా థ్యాంక్స్ చెప్పింది ఆమె మనసు.

****************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

నిద్రలేని రాత్రులు…(పూర్తి నవల)

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)