విచిత్ర మనుషులు…(పూర్తి నవల)

 

                                                                      విచిత్ర మనుషులు                                                                                                                                        (పూర్తి నవల)

ఒక నిజమైన సంఘటనే ఈ నవలకు పునాది. నాగరాజు లాంటి స్వార్ధపరుడైన మగవాడి దగ్గర తెలిసో, తెలియకో పెళ్ళి బంధం ద్వారా చిక్కుకున్న ఒక స్త్రీ కథ ఇది.

నిజానికి అతను ఆమెను కూడా తన జీవితం నుండి తరిమేశాడు. కానీ, కధలో ముగింపును కొంచంగా మార్చి, నేను వాడి కథను ముగించాను.

పెళ్ళి జీవితం అనేది కొందరికి రెడ్ కార్పెట్ పరచి స్వాగతించే బృందావనం. కొందరికి బురద నీటి ఊబిలో కాలు పెట్టిన పరిస్థితి.

*************************************************PART-1******************************************

కొట్టి పడేసినట్లు నిద్రపోతోంది మహేశ్వరి. చుట్టూ వస్తువులు, కట్టి పడేసిన సంచులు, చుట్టిపెట్టిన కొత్త పరుపులు. చుట్టూ తిరుగుతున్న బంధువుల గుంపు, ఇన్నిటికి మధ్యలో అలసిపోయి నిద్రపోతున్న ఆమెను చూసి కొందరు బంధువులు వెక్కిరింపు నవ్వుతో ఆమెను చూశారు.

ఒక ముసలి అత్త ఆమెను చిన్నగా చేత్తో తట్టిలేప, దొర్లి దొర్లి లేచిన ఆమె, చుట్టూ చూసింది.

"ఏమ్మా పండూ, అల్లుడు నిన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదని ఇలాగా ఒళ్ళు తెలియక నిద్రపోతూ అందరికీ తెలియచేయటం! రాత్రి జరిగిందా జరగలేదా అని నలుగురూ జుట్టు పీక్కోవాలే? నిద్ర వచ్చినా నిద్రపోకూడదు?" ముసల్ది పక పకా నవ్వగా, మహేశ్వరి మొహం సిగ్గుతో ఎరుపెక్కింది.

"అది సరే...అల్లుడు ప్రేమగా ఉన్నారా? లేక, అందులో మాత్రం ఆవేశంగా ఉన్నాడా...? ఏదైనా మాట్లాడేడా...?" వణుకుతున్న స్వరంతో అడిగింది ముసల్ది.

"ప్రేమగానే ఉన్నారు"

"ఏం మాట్లాడారు?"

"అదంతా నీకెందుకు?"

"ఓహో, నిన్నటివరకు ఈ ముసల్దాని దగ్గర చూసినది, చూడనిది అన్నీ చెప్పేదానివి. ఈ రోజు నీకెందుకు అని అడుగుతున్నావా...? నిన్ను అంతగా అతను తన మత్తులో పడేశాడా?"

"ఛీఛీ, పో ముసలి" - మహేశ్వరి అత్తను తోస్తూ లేచి మొహం కడుక్కోవటానికి వెళ్ళింది.

ఇంటి వెనుక విందు తయారు చేస్తున్నారు. అన్నయ్య ఎవరినో కేకలేస్తున్నాడు. మహేశ్వరిని చూసిన వెంటనే దగ్గరకు వచ్చాడు, ఆమె అలసటతో ఉండటం, నిద్రలేమి వల్ల కళ్ళు ఎర్రగా ఉండటం చూసి నవ్వుకున్నాడు.

"అల్లుడికి పొద్దు పోవటం లేదనుకుంటా, తాగటానికి ఏదైనా కావాలా అని అడిగి, తీసుకువెళ్ళి ఇవ్వు"

"నేను వెళ్ళను"

"ఏం? సిగ్గా

"మరి...?"

"ఎన్ని రోజులు సిగ్గుపడతావు?"

"సిగ్గు పోయేంత వరకు

ఆమె జవాబును విన్న ఆయన నవ్వారు. ప్రేమతో ఆమె తలమీద చేయి వేశాడు.

మంచి వర్షం కురుస్తున్న ఒక రోజు వీధి చివర్లో నిలబడ్డ వర్షపు నీటిలో తెగి పడిపోయిన కరెంటు తీగతో కరెంటు షాకు తగిలి తల్లీ-తండ్రీ ఇద్దరూ గిలగిలా కొట్టుకుని చనిపోయినప్పుడు, ఆమెకు పదమూడేళ్ళు. పెద్ద మనిషి అయ్యి చాలా రోజులయ్యింది. పట్టుచీర, వెండి కాళ్ళ గొలుసులు కొని తీసుకుని, బంధువులను పేరంటానికి ఆహ్వానించి తిరిగివచ్చేటప్పుడే ఆ కరెంట్ షాకు మరణం సంభవించింది.

అన్నయ్య రాజబాబుకి పెళ్ళి అయి ఐదునెలలు అయ్యింది. తల్లీ-తండ్రీ యొక్క ఎదురు చూడని మరణంతో మహేశ్వరి యొక్క ఫంక్షన్ సంబరాలు ఆగిపోయినై. పట్టుచీర, వెండి కాళ్ళ గొలుసు కొన్న అప్పుకు, తల్లి-తండ్రుల అంత్యక్రియల అప్పు కూడా అన్నయ్య భుజాల మీద ఎక్కి కూర్చింది. వదిన కొన్ని సంధార్భాలలో మంచిది. కొన్ని సమయాలలో అగ్ని గుండం. తగలబెట్టి బూడిద చేసేస్తుంది.

" మహేశ్వరికి ఫంక్షన్ జరపాలి"

"ఎందుకు? మనం కూడా కరెంటు షాకు తగిలి చావటానికా...? ఏమీ వద్దు. వదలండి"

వదిన మాటలకంటే కరెంటు షాకే పరవాలేదు అని అనిపిస్తుంది మహేశ్వరికి. కానీ, ఆ తరువాత వారం ఇంట్లో బెల్లం పాకం పడుతున్న వాసన వచ్చింది.

చుట్టు పక్కల ఉన్న బంధువులు ఇంటిని నింప, మహేశ్వరి ఫంక్షన్ సింపుల్ గా జరిగింది.

"ఎక్కడిదే డబ్బు?" - అని అన్నయ్య అడగ, వదిన చెవులు తాకి చూపించింది. చెవి పోగులు ప్లాస్టిక్.

"దీనికెందుకే ఆ రోజు అలా మాట్లాడావు?"

వదిన జవాబు చెప్పలేదు. ఆమె అంతే. ఎలాగో ఉరి మాటలకు చోటివ్వక ఫంక్షన్ జరిగినందుకు అన్నయ్యకు సంతోషం. ఇదేలాగా చెల్లెలుకు ఒక పెళ్ళి కూడా చేసేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుంది అని అనుకున్నాడు.

కానీ అది మాత్రం ఈజీగా జరగలేదు. తల్లి లేదు అనేది పలు విధాల పెళ్ళి మాటలకు వచ్చిన వాళ్ళను ఆలొచింప చేసింది. వదిన ఎంతవరకు పక్కబలంగా ఉంటుందో అనే అనుమానం వచ్చి కాస్త తగ్గాడు అన్నయ్య.

"వెళ్ళనీ. దానికొసం కర్పూరం వెలిగించి వాగ్ధానం చేసా ఇవ్వగలం? లేక అగ్రీమెంట్ రాసి ఇస్తారా? నమ్మకం లేని వారికి అమ్మాయిని ఇవ్వటం, బావిలో తొసేయ్యటం ఒకటే. మహారాణి భర్తను తనతో పాటూ తీసుకువెళ్ళి చేరింది. అంతా నా నెత్తి మీద పడేసి. ప్రతి ఒక్కరూ నా మెదడు తినడమే పనిగా పెట్టుకున్నారు. అవసరమా నాకు ఈ కర్మ అంతా?"

వదిన వాళ్ళ మెదడు తింటుంది.

"ఇదిగో చూడు ధనం. ఆమెకని ఒకడు పుట్టుంటాడు. అతను వచి చేరేంత వరకు ఇలాగే వచ్చిన సంబంధాలు చెడిపోతాయి. నువ్వెందుకు సనుగుతావు, చనిపోయిన వారిని తిట్టుకుంటూ...? కావాలనా చచ్చిపోయారు? ప్రమాదంలోనే కదా చనిపోయారు"

అన్నయ్య బాధపడతాడు.

"ఏమో పొండి. ఊరు, లోకం నా మెదడునే అన్నిటికీ తింటోంది. మంచి చేస్తే అభినందించేది లేదు. కసురుకుంటే మాత్రం నోరు మూసుకుని వచ్చేయటం. అంతా నా జాతక దోషం"

వదిన విసుకున్నా, మహేశ్వరికి మంచి భర్త రావాలని దన్నం పెట్టుకోని దేవుడే లేడు.

మరో రెండు సంవత్సరాలు పెరిగిన తరువాత ఎవరి ద్వారానో నాగరాజు సంబంధం వచ్చింది. నగరంలో ప్రభుత్వ ఉద్యోగం. కట్నం అడగలేదు. మిగతా పెట్టుబడులు ఏదీ అడగలేదు. ఒకే వారంలో పెళ్ళి గుడిలో చేయించాలని ఒకే ఒక కండిషన్ మాత్రం వేశాడు. చూడటానికి అతని దగ్గర ఏ లోపమూ లేదు. నుదుటి మీద విభూధీ, కుంకుమ పెట్టుకుని ప్రశాంతంగా కనబడ్డాడు.

తల్లి మంచంపైన అన్నారు. తండ్రి, పిన్ని కూతురు చెల్లి వరుస ఒకమ్మాయి అతనితో వచ్చారు. వదిన 'తృప్తి 'గా ఉందని కళ్లతో సైగ చేయ, అన్నయ్య తాంబూలాలు మార్చుకున్నారు. ఆచారం క్రింద ఒక నెక్లస్, జరీ చీర పెట్టి ఇచ్చారు.

నాగరాజు తరువాతి ముహూర్తంలోనే తాళికట్టాడు. శాంతి ముహూర్తంలో ఆమెను శరీరకంగా ఆక్రమించాడు. ఎక్కువ మాట్లాడలేదు. కానీ, ప్రేమను కళ్ళల్లోనే చూపాడు.

"నాకు మా అమ్మంటే ప్రాణం. ఆమె మంచంలో ఉంది. ఆమెను మంచిగా చూసుకోవాలి. ఆమెకోసమే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను"

"బాధ పడకండి. నాకు తల్లి-తండ్రీ లేరు. ఇక వాళ్లే నాకూ తల్లి-తండ్రీ"

"ఈ మాట చాలు నాకు" అతను ఆమెను హత్తుకున్నాడు. నిద్రలేక గడిచింది ఆ రాత్రి.

"ఇదిగో, నీ భర్తకు తీసుకువెళ్ళి ఇవ్వు" వదిన పునుగులూ, కాఫీ ఇచ్చింది.

అతను ఎవరితోనే సెల్ ఫోనులో మాట్లాడుతున్నాడు. భార్యను చూసిన వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి వచ్చాడు.

"ఇంకాసేపట్లో మనం బయలుదేరాలి. రెడీగా ఉండు. కారు వస్తుంది"

"ఇప్పుడేనా? విందు రెడీ అవుతోంది. మద్యాహ్నం తరువాతే బయలుదేరతాము అన్నారు"

"తినడానికి సమయం లేదు. అమ్మని ఆసుపత్రిలో చేర్చారట. నాన్నే మాట్లాడారు. అర్జెంటుగా వెళ్ళాలి"

"అయితే సరే. ఇప్పుడే వదినతో చెప్పి బయలుదేరతాను" ఆమె పరిగెత్తింది.

తరువాతి అరగంటలో ఆమె సూట్కేసు హాలులోకి వచ్చింది.

"ఈ టిఫెన్ క్యారేజీలో భోజనం ఉంది. వెళ్ళే దోవలోనైనా తినండి. అల్లుడిగారికి చూసి వడ్డించు" వదిన మహేశ్వరి చెవులు కొరికింది.

"అయితే మేము బయలుదేరతాము" అతను ఎక్కువ మాట్లాడలేదు. సూట్ కేసులు, క్యారియర్ కారులోకి ఎక్కించారు.

"వారం వారం మేమొచ్చి అమ్మగారిని చూసి వెడతాము"

"వద్దు. ఇప్పుడొద్దు. నేను చెప్పినప్పుడు వస్తే చాలు"-అతను చేతులెత్తి దన్నం పెడుతూ కారు ఎక్కాడు. మహేశ్వరి, వదిన భుజాల మీద కన్నీటితో తలవంచి ఏడుస్తూ సెలవు తీసుకుంది.

"మంచిగా నడుచుకో మహేశ్వరి. ఇక నీ సుఖం, దుఃఖం, సంతోషం, బాధ అంతా ఆ ఇంట్లోనే. దేనికోసమూ కళ్ళు నలుపుకుంటూ ఇక్కడికి రాకూడదు. తెలిసిందా? ఇక ప్రసవానికే రావాలి. ఉత్తరలు రాస్తూ ఉండు. మేమూ రాస్తాము"

వదిన సాగనంపింది.

*************************************************PART-2******************************************

"లోపలకురా. ఇక్కడ హారతి ఇచ్చి స్వాగతించేందుకు ఎవరూ లేరు" అతను సామాన్లను దింపి, తీసుకుని లోపలకు వెళ్ళాడు.

ఇల్లు నిశ్శబ్ధంగా ఉంది. 'పెళ్ళి ఇల్లులాగా లేదు! ఒక్క బంధువు కూడా లేడా?' ఆశ్చర్యపోతూ తానూ రెండు సంచులు పుచ్చుకుని లోపలకు వెళ్ళింది. వంటింట్లో ఏదో మాడు వాసన. వంటింటి గచ్చు మొత్తం అంట్ల గిన్నలే. అక్కడ మాత్రమే కాకుండా ఇల్లంతా, దుమ్ము, ధూళి, బూజు అతుక్కోనున్నది.

"ఆ రూములో అమ్మ ఉన్నది" అని చెబుతూ పిలుచుకు వెళ్ళాడు. మంచం మీద బరువైన శరీరంతో పడుకోనున్నది అత్తగారు. మహేశ్వరి ఆమె కాళ్ళు ముట్టుకుని నమస్కరించింది.

"నువ్వైనా సక్రమంగా కాపురం చెయ్యి!" చిట్లించిన మొహంతో చెప్పింది అత్తగారు.

"ఇల్లు శుభ్రం చేసేసి వంట వండు. నాన్న కూరగాయలూ, పచారి సరకులు కొనిస్తారు. నేను బయటకు వెళ్ళొస్తాను" నాగరాజు స్నానం చేసి హడావిడిగా ఎక్కడికో బయలుదేరి వెళ్ళాడు.

వంటగదిని శుభ్రం చేసి కుక్కర్ పెట్టేసి, ఇంట్లోని మిగిలిన ప్రదేశాలను ఊడ్చి, తుడిచింది. దేవుని పటాలను తుడిచి శుభ్రపరచి పూవులుపెట్టి దీపం వెలిగించింది.

సగం వంట పూర్తవుతున్నప్పుడు అత్తగారు పిలుస్తున్న స్వరం వినబడింది.

"ఏం కావాలి అత్తయ్య?"

"ఆ బెడ్పాన్ తీసుకురా. టూ బాత్రూం వెళ్ళాలి"

బరువైన శరీరాన్ని పైకెత్తి బెడ్పాన్ను పెట్టేసి వచ్చింది మహేశ్వరి. వాసన కడుపులో తిప్పుతోంది.

"వచ్చి తీసి, శుభ్రం చెయ్యి"

అలవాటులేని పని అని చెప్పటంతో పాటూ, కంపరమూ చేర మనసు జంకింది. ఆ ఇంటి పరిస్థితిని చూస్తే మనసును ఎందుకో భయపెడుతోంది.

ఆ తరువాత వంటచేయటం నచ్చలేదు. తినడానికి కూడా ఇష్టపడలేదు.

రాత్రి పదింటి తరువాతే భర్త వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా డిన్నర్ పూర్తిచేసిన అతను పడుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇంటి పనులు ముగించుకుని ఆమె పడుకోవటానికి వెళ్ళినప్పుడు పదకుండు గంటలు దాటింది.

నాగరాజు గురకపెట్టి నిద్రపోతుండగా, మహేశ్వరి అతన్నే చూసింది. ఏదో ఒక తప్పు ఉన్న చోటుకు వచ్చి చిక్కుకున్నట్టు అనిపించింది. మంచం మీదున్న అత్తగారు, నవ్వటం తెలియని మామగారు, మాట తోడుకు మనుషులు లేని ఇల్లు. ఫస్ట్ నైటులో చూపించిన ప్రేమ కూడా ఆ మరుసటి రోజు చూపించని భర్త...

ఈ ఇల్లు మంచి చోటా...నరకమా? తానిక్కడ సంతోషంగా జీవించగలదా. లేక యంత్రంలా పనిచేస్తూ శ్రమ పడబోతామా? బుర్రలో పలు ప్రశ్నలు లేవ, రాత్రంతా విరిగిన మనసుతో కూర్చుండిపోయింది ఆమె.

అరగంటకొకసారి మామగారు తలుపు కొట్టారు.

అత్తగారికి మూత్ర విసర్జనకు సహాయపడవలసి వచ్చింది. ఆరోగ్యం బాగుండలేదని ఫస్ట్ నైట్లోనే, భర్త చెప్పున్నా, ఇంతగా మంచానికి అతుక్కుపోయుంటుందని ఇప్పుడే అర్ధమవ, జీవితాంతం మార్చి మార్చి మలమూత్రాలు శుభ్రం చేస్తూ ఉండాల్సిందేనా అనే భయము, కలవరపాటు ఏర్పడింది.

ప్రొద్దున తండ్రికీ, కొడుక్కూ కాఫీ కలిపి ఇస్తున్నప్పుడు తండ్రి కొడుకుతో చెప్పింది విని ఆశ్చర్యపోయింది.

"ఏరా నాగరాజూ, ఎన్నిసార్లురా నేను రాత్రిపూట తలుపు కొట్టేది?"

"ఏం?"

"అలా చెయ్యటం నాకు నచ్చలేదు. రాత్రిపూట నేను నిద్రపోవాలా అక్కర్లేదా? వయసైందిరా నాకు"

"దానికి ఏం చెయ్యమంటావు?"

"ఏదో ఒకటి చెయ్యి. ఒకటి మీ అమ్మను చూసుకోవటానికి ఒక మనిషిని పెట్టు. లేకపోతే నీ భార్యను రాత్రిపూట ఆ రూములో పడుకోమని చెప్పు"

"చెప్పేసేవు కదా. వదులు. నేను చూసుకుంటాను" నాగరాజు మహేశ్వరి వైపు చూశాడు.

"ఈ రోజు నుండి నువ్వు అమ్మ రూములో పడుకో. అరగంటకొకసారి బెడ్ ప్యాన్ పెట్టేయి"

మహేశ్వరి వణికిపోయింది. దీనికొసమా ఇతను నన్ను పెళ్ళిచేసుకుని పిలుచుకు వచ్చిందిదీనికా? ఏడుపు వచ్చింది.

ఎనిమిదింటికి అతను స్నానం చేసి టిఫిన్ తినడానికి వచ్చాడు. మామగారు షాపుకు వెళ్ళుండ, మహేశ్వరి చిన్న స్వరంతో అతని దగ్గర అడిగింది.

"రాత్రిపూట నేనెలా మిమ్మల్ని వదిలి, మీ అమ్మగారి రూములో....?"

"ఏం?"

"ఏమిటండీ ఇలా అడుగుతున్నారు? మనకి పెళ్ళి జరిగి రెండు రోజులేగా అవుతున్నది. అప్పుడే వేరుగా పడుకోమంటే?"

"నీకు మాత్రమే ఒంటరితనమా? నాకు లేదా? నేనే మాట్లాడకుండా ఉన్నానే"

"అదే ఎందుకు అని అడుగుతున్నా? పగటి పూటంతా మీ అమ్మను నేనే చూసుకుంటున్నాను. రాత్రిపూట మీ నాన్న చెయచ్చు కదా...? కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళమే అని కొంచమైనా జ్ఞానం ఉండక్కర్లేదా పెద్దవాళ్ళకు?"

అతను తలెత్తి ఆగ్రహంతో ఆమెను చూశాడు. "వచ్చి రెండు రోజులు అవలేదు. అంతలోనే ఇంత పోగరుగా మాట్లాడుతున్నావు? ఏం చేయాలి, ఎలా చెయ్యాలి అని నువ్వేమీ ఎవరికీ చెప్పివ్వక్కర్లేదు. నేను చెప్పినట్టు చెయ్యి చాలు" అతని గట్టి స్వరంతో చెప్ప, ఆమె వెలవెల బోయింది.

"నేను తప్పుగా ఏం చెప్పలేదు కదండీ. సరే మీ నాన్నను శ్రమ పడనివ్వకండి. ఒక మనిషిని పెట్టి చూసుకుంటే సరిపోతుంది"

"ఆ మనిషికి జీతం ఎవరు మీ నాన్న వచ్చి ఇస్తాడా?"

ఆమె ఖంగుతిన్నది. పెళ్ళి అయిన రెండు రోజుల్లో అతను ఇలా కొంచం కూడా ప్రేమలేకుండా మాట్లాడతాడు అనేది ఎదురు చూడని ఆమె ఏడుపును అనుచుకోలేక తపించింది. కన్నీరు పొంగిపొర్లింది.

"దీనికొసమా నన్ను పెళ్ళి చేసుకుని తీసుకు వచ్చారు?" స్వరంలో వెక్కిళ్ళు.

"అవును..." అతను ఖచ్చితంగా చెప్ప, ఆశ్చర్యపోయి చూసింది ఆమె.

"ఇది న్యాయమే కాదండీ"

"ఇలా చూడూ. చెప్పింది చెయ్యి. నా పక్కన పడుకుని దొర్లటానికి ఎగబడకు. ఆడమనిషిగా అణుకువగా ఉండటానికి చూడు"

ఆమె కుచించుకుపోయింది. ఒళ్ళంతా నిప్పు కణాలు మీద పడినట్టు మండింది. ఆ మంటల వలన ఆమె కలలన్నీ తగలబడిపోయినై.

రెండే రోజుల్లో మెట్టినిల్లు నరకమయ్యింది.

ఎన్ని కష్టాలైనా ఉండనీ. మనుషులు నవ్వు మోహంతో ప్రేమాభిమానాలు చూపిస్తే అన్ని కష్టాలనూ ఓర్చుకునేందుకు ఆమె తయారుగానే ఉంది.

కానీ, అక్కడ ఎవరి మొహాలలోనూ మర్చిపోయి కూడా నవ్వు లేదు. మలం, మూత్రం ఎత్తి, ఒళ్ళు తుడిచి, డ్రస్సు మార్చి, తినటానికి ఇచ్చి, ఇన్ని చేసినా ప్రేమగా ఒక మాట కూడా మాట్లాడలేదు అత్తగారు. 'పాపం నా వల్ల నీకెంత కష్టం'అని ఒప్పుకు కూడా ఆమెను అభినందించిందిలేదు. అదేదో, చెయ్యాల్సిన బాధ్యత ఆమెకు ఉన్నది అనేలాగా ఆమె మొహం చిటపటలాడుతూ ఉంటుంది.

అత్తగారికంటే ఘోరం మామగారు. ఆయన్ని చూస్తేనే కంపరం పుడుతుంది. అలాంటి ఆకారం ఆయనది. కానీ, నాగరాజుకు ఇలాంటి మరో ముఖం ఉంటుందని ఆమె ఫస్ట్ నైట్లో నిజంగా అనుకోలేదు. తనమీద ఎటువంటి అనుమానమూ రాకుండా ప్రేమ చూపించి ఆమెను ఆక్రమించుకున్నాడు నాగరాజు. అంతటితో ఆ ప్రేమను ఆపేసి ఆ ఇంటికి ఆమెను జీతం లేని పనిమనిషిగా మార్చి మలం, మూత్రం, తీయిస్తాడని ఎదురుచూడలేదు ఆమె.

భర్త యొక్క ప్రేమ రాత్రి దొరుకుతుంది అంటే, ఎంత పనైనా చేయటానికి ఆమె రెడీ. కానీ అతను దానికే నిషేధం వేస్తున్నాడు. ఆ ప్రేమా, అనుబంధమే కదా కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఆమెకు ఇస్తుంది అనేది ఎందుకు మరిచిపోయాడు? ఈ విషయాన్ని అతనికి ఎవరు చెప్తారు?

ఆమె నీరసించిపోయింది. తల్లీ, తండ్రీ లేరు. కొంచం డబ్బు కష్టం. అప్పుడప్పుడు మెరపకాయలాగా కోపం చూపించే వదిన గుణం, అనేది తప్ప ఇంకే కష్టమూ అన్నయ్య ఇంటి దగ్గర లేదు.

అక్కడ అందరి దగ్గర హాస్య దోరణి ఉంటుంది. వదినతో సహా. కొన్ని సమయాలలో ఎందుకు నవ్వుతున్నామో అనేది అర్ధం కాకపోయినా మనిషికి మనిషి మారి మారి నవ్వుతారు. శ్రమను కూడా నవ్వుతో అంగీకరించటం వలన మోయటం అక్కడ ఈజీగా ఉండేది.

ఇక్కడ ఎవరి కళ్ళల్లోనూ జాలి లేదు. పెదాలలో నవ్వులేదు. ఇలాంటి ఒక జీవితానికోసమా నేను కాచుకోనున్నాను. వీధి చివరున్న వినాయుకుడ్ని తిరిగి తిరిగి వచ్చాను? పెదాలు కొరుక్కుని ఏడుపును మింగింది.

తొమ్మిదింటికి నాగరాజు ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిన తరువాత, మామగారు కూడా బయటకు వెళ్ళటానికి తయారయ్యారు.

"కంచి దాకా వెళ్తున్నాను. రాత్రిలోపల వచ్చేస్తాను. ఆమెను జాగ్రత్తగా చూసుకో. మందులు మర్చిపోకుండా ఇవ్వు"

కోడలు మొహంకూడా చూడకుండా చెప్పివెళ్ళారు. ఆయన వెళ్ళిన తరువాత ఇంటిని శుభ్రం చేసి ముగించి, బట్టలు ఉతకటానికి వెళ్ళింది. అత్తగారి బట్టల నుండి నీచు వాసన వచ్చింది. ఎంత డెటాల్ పోసినా నీచు వాసన పోలేదు. ఆ నీచు వాసన నిరంతరంగా ముక్కులో ఉండిపోయేటట్టు ఉన్నది. ఇల్లు మొత్తం ఆ నీచువాసన పట్టేసుంది. కొంచం కూడా తినడానికి నచ్చలేదు.

ఏడుపు వచ్చింది. ఇచ్చిన మందుతో అత్తగారు మరో రెండు గంటలు నిద్రపోతుంది. మహేశ్వరి బెడ్ రూముకు వచ్చింది. విరామం లేకుండా చేసిన ఇంటిపనితో ఒళ్ళు నొప్పులు వచ్చింది. కొంచంసేపు విరామం తీసుకుందాం అనుకుంటే, చిందర వందరగా ఉన్న బెడ్ రూము దానికి అవకాసం ఇవ్వలేదు.

ఎక్కడ చూసినా వార్తా పత్రికలు, వారపత్రికలు, బట్టలు, ఖాలీ సిగిరెట్టు పెట్టెలు - అంతా శుభ్రం చేసి కాసేపు పడుకుందాం అని దుప్పట్లు దులిపింది. పక్కన కనబడ్డ అలమరా మరింత చిరాకుగా ఉంది. లోపల బట్టలు చెత్త బుట్టలో కుక్కేసినట్టు కుక్కేసున్నాయి. వాటిని సక్రమంగా మడతపెట్టి, ఒక్కొక్క అర సద్దుకుంటూ వచ్చింది. సగం అలమరా సద్దుంటుంది, అత్తగారి పిలుపు వినబడింది. అన్నిటినీ అలాగే పడేసి పరిగెత్తింది.

"ఎక్కడ తగలడ్డావు? ఎంతసేపటి నుండి అరుస్తున్నానో తెలుసా? నీకేమన్నా చెవుడా?"

"నిజంగానే వినిపించలేదు అత్తయ్యా. ఏంకావాలి చెప్పండి"

"నువ్వు సమయానికి రాకపోవటంతో తొందరలో అలాగే యూరిన్ వెళ్ళిపోయాను. వేరే మాక్సీ తీసుకువచ్చి తొడుగు"

"బట్టలన్నిటిని ఇప్పుడే ఉతికి ఆరేశాను. బయట మాక్సీ ఏదీ లేదు. లోపల ఏదైనా ఉందా?"

"ఉంటుంది చూడు"

మహేశ్వరి అత్తయ్య బీరువా తెరిచింది. ఆశ్చర్యపోయింది. బీరువా మొత్తం రకరకాల చీరలు.

అందులో సగం కొత్తవిగా ఉన్నాయి. ఏడెనిమిది సంవత్సరాలు మంచం మీదే పడున్న ఈవిడ దగ్గర ఇన్ని చీరలా? ఆశ్చర్యపడ్డది.

చీరలను చూస్తూ మాక్సీ వెతికింది. చీరలు కొత్తగా ఉంటే ఉండనీ. కానీ, ఇవన్నీ అత్తగారు ఆమె వయసుకు కట్టేటటువంటి చీరల రకాలు లాగా తెలియటం లేదే. చిన్న వయసు పిల్లలు కట్టేవి లాగానే కదా ఉన్నాయి -- అని ఆలొచిస్తూనే అత్తగారికి డ్రస్సు మార్చింది.

"దీన్ని వెంటనే ఉతికి ఆరేసేయి..." తడిసిన డ్రస్సును చూపించి అత్తగారు చెప్ప గగుర్పాటును మొహంలో చూపించకుండా, దాన్ని తీసుకుని బయటకు వచ్చింది.

మూడు గంటలకు మళ్ళీ నాగరాజు యొక్క బీరువాను శుబ్రం చేసి బట్టలు సద్దిపెట్టి గదిని ఊడ్చింది. మంచం కిందకు చీపురును వేసి ఊడ్చటానికి ప్రయత్నించ, ఏదో అడ్డు తగులుతోంది. వంగి చూడా, లోపల కింద ఒక పెద్ద పెట్టె ఉన్నది.

దాన్ని బయటకు లాగింది. తాళం వేయనందువలన తెరిచి చూసింది. దాని నిండా పుస్తకాలు. ఇంగ్లీష్, తెలుగు అంటూ లావుపాటి చరిత్ర పుస్తకాలూ, నవలలు ఉన్నాయి. అన్నిటిపైనా మాలతీ మాలతీ అనే పేరు రాసుంది.

ఎవరీ మాలతీ? బంధువా...? ఆమె పుస్తకాలు ఎందుకు ఒక పెట్టె నిండుగా మంచం కింద పడుంది? నాగరాజు రోజు వారి న్యూస్ పేపర్ తప్ప ఇంకేదీ చదవటం చూడలేదే.

మహేశ్వరి ఆ పెట్టలోని పుస్తకాలను ఒక్కొక్కటిగా తీసి తిప్పి చూసింది. నాలుగైదు బొద్దెంకలు బయటకు వచ్చి వేగంగా వెళ్ళి దాక్కున్నాయి. పుస్తకాల కింద బూడిద రంగులో డైరీ ఒకటి కనబడ దాన్ని తెరిచి చూసింది. అందులోనూ మాలతీ అని రాసుంది. మొదటి పేజీలో అబల మాలతీ యొక్క నోట్ గుర్తింపులు అని రాసుంది.

"ఎవరీ మాలతీ...?”

కనురెప్పలు క్రుషించ తరువాత పేజీ తీసింది. నాలుగు వాక్యాలు చదివిన ఆమె షాక్ లో పడిపోయింది.

*************************************************PART-3******************************************

1994 జూలై 20.

ఇదొక బ్లాక్ రోజు అనేది అప్పుడు తెలియలేదు. అటువంటి జ్ఞాన దృష్టి ఏదీ లేకపోవటంతో చాలా సంతోషంగానే నాగరాజుకి తలవంచాను.

చాలా గ్రాండుగా జరిగింది మా పెళ్ళి. తల్లి-తండ్రులకు నేను ఒకత్తే కూతుర్ని కాబట్టి నాన్న డబ్బును లెక్కచేయకుండా ఖర్చుపెట్టారనే చెప్పాలి. మూడు రోజుల పెళ్ళి. వధువు స్వాగతం, వరుడు స్వాగతం, పెళ్ళి రిషెప్షన్, లైట్ మ్యూజిక్ అంటూ అన్ని కోలాహాలంగా ఏర్పాట్లూ చేశారు. భోజనం గురించి పొగడని మనిషేలేడు. అన్ని వైరటీలు. తినడానికి కడుపు చాలలేదు అని కొంతమంది బాధపడ్డారు.

లెక్కచూస్తే ఖచ్చితంగా పదిలక్షలు అయ్యుంటుంది పెళ్ళి ఖర్చు. తండ్రి యొక్క మొత్త ఆస్తే పదిహేడు లక్షలు, ఒక ఇల్లు, ఒక కారు. అందులో పదిలక్షలు నా పెళ్ళికే ఖర్చుపెట్టారు ఆయన. మిగిలిన ఏడు లక్షలూ, వాళ్ళకు జీవితాంతం సరిపోతుందా అని నేను బాధపడి ఆయన్ని అడగ ఆయన నవ్వారు.

"మా ఇద్దరికీ ఏముంది పెద్ద ఖర్చు? ఒక గుప్పెడు అన్నం. కొంచం టిఫిను. దానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇది కాకుండా నా రిటైర్మెంటుకు ఇంకా ఏడు సంవత్సరాలు ఉంది. అంతలో ఇంకో పదిలక్షలు సంపాదిస్తాను. నువ్వు బాధపడకు!" అని నవ్వారు. ఆయన మొహంలో చివరిసారిగా చూసిన నవ్వు అదే.

మెట్టింట్లో నన్ను వదిలిపెట్టి బయలుదేరిన ఆయన చిన్న కుర్రాడిలాగా ఏడ్చారు.

"ఇల్లు చిన్నదిగా ఉన్నదే అల్లుడూ. వేరే మంచి ఇంటికి వెళ్ళొచ్చే?" అని ఆయన దగ్గర అడిగారు.

"ఓ! వెళ్తానే. పెద్ద ఇల్లుగా చూసి మీరే కొనిపెట్టండి. లేకపోతే నెలనెలా అద్దె మీరు కడతానని చెప్పండి. వెళ్ళిపోతాం"

నా భర్త చెప్పిన సమాధానంతో తండ్రి యొక్క మొహం కొంచంగా చిన్నబోయింది. ఇలాంటి ఒక చిల్లర సమాధానం ఆయన ఎదురు చూడలేదు అనేది ఆయన మొహాన కొట్టొచ్చినట్టు కనబడింది. ఆయన మీద నేరం మోపటం న్యాయం కాదు. తన అంతస్తకు తగినట్టు, నాకంటే ఇంకా పెద్ద చదువు, పదవితో ఉండే వరుడ్ని వెతకినా ఎందుకనో పెళ్ళి కుదరలేదు.

నాలుగు సంవత్సరాలుగా నాకు వచిన జాతకాలు వంద దాటుంటాయి. నన్నూ ఒకడు మనస్పూర్తిగా ప్రేమించాడు. పలుసార్లు తన ప్రేమను తెలిపి నా ప్రేమను యాచించాడు. నేను దాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. ప్రేమ అనేది ఏర్పరచుకునేది కాదు. తానుగా ఏర్పడాలి. నాకు అలాంటి ఆలొచన అతని మీద ఎందుకు ఏర్పడలేదో నాకు తెలియదు. ఒకవేళ చదువు, చదువు అంటూ నేను పూర్తిగా నా గమనికను దానిమీదే ఉంచి, చదువును ప్రేమించటం వలన వేరే ప్రేమ ఏదీ నాకు ఏర్పడలేదేమో!

బి.ఏ. తెలుగు లిటరేచర్. ఏం.ఏ ఆంగ్ల చరిత్ర, డిప్లమో ఇన్ జర్నలిజం, జర్నలిజం లో ఎం.ఫిల్. అని నాకు తోచిందల్లా చదివాను.

"ఇంకా ఎన్ని డిగ్రీలు తీసుకోబోతావు? ఆహ్వాన పత్రికలో ఇవన్నీ ప్రింటు చేయాలంటే చోటు చాలుతుందా?" తండ్రి ఎగతాలి చేసినా, అందులో ఎగతాలి కంటే కలతే ఎక్కువగా కనబడుతుంది. తన ఒకే కూతురికి మంచి జీవితం ఏర్పాటు చేసి ఇవ్వాలనే కలతే.

నాకు నాన్న సంబంధాలు చూడటం ప్రారంభించిన తరువాతే పలు మగవాళ్ళ మనోభావాలు నాకు అర్ధమయ్యింది. చూచాయగా చూస్తే ఆడవారి నాగరికతను, చదువును ఆదరించేవారిలాగా కనబడినా, తన పెళ్ళి అని వచ్చేటప్పుడు వాళ్ళు తనకు కాబోయే భార్యకు కొన్ని హద్దులు, కట్టుబాట్లూ ఉంచుకున్నారు.

తనకంటే ఎక్కువగా చదివి ఉండకూడదు. తనకంటే ఎక్కువ జీతం సంపాదిస్తూ ఉండకూడదు. బయటిలోకంలో తనకంటే ఎక్కువ గుర్తింపు ఉండకూడదు. తనని గౌరవించేలా, తన వెనుక నిలబడేదిగా, తనకు అనిగిమనిగి నడుచుకునేదిగా, తాను చెప్పినట్టు నడుచుకునేలాగా ఉండాలి.

ఇలా చాలా రూల్స్. చాలామంది ఈ రూల్సును పెట్టుకునే పెళ్ళి చూపులకు వచ్చి, భయపడిపోయారు. కొందరు నాకంటే ఎక్కువ చదువుకున్నదే అని ఆలొచించి వద్దని చెప్ప, కొందరు నాకంటే ఎక్కువ చదువుకోనున్నా, నాకున్న ప్రతిభను చూసి భయపడి వద్దన్నారు. తప్పుకున్నారు.

సగానిపైగా సంబంధాలు జాతకాలు కలువలేదని, వద్దని చెప్పినా, సగం మంది పైన చెప్పిన కారణాల వలన వద్దనటంతో, నాన్న నా పెళ్ళి గురించి భయపడటం మొదలుపెట్టారు. ఆ భయమే నాగరాజు విషయంలో ఎక్కువ ఆలొచించనివ్వకుండా ఓకే అని చెప్పేటట్టు చేసిందని అనుకుంటా.

నాగరాజు చూడటానికి మంచి ప్రకాశవంతంగా ఉన్నాడు. తక్కువగా మాట్లాడాడు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమొషన్ కు ఎక్కువగా చాన్స్ ఉందని చెప్పాడు. ఒకడే కొడుకు. జాతకమూ బాగా కలిసింది.

నా డిగ్రీలూ, ప్రతిభ, తెలివితేటల గురించి భయపడలేదు. అలా భయపడకుండా ఉండటానికి గొప్ప మనసో, విశాలమైన మనోభావనో అనేది కాదు అనేది అప్పుడు తెలియలేదు. సర్వాధికారి దేనికీ భయపడడు అనేది తరువాతే తెలిసింది.

పలు జన్మలలో పుణ్యం చేసుకోనుంటేనే అతి గొప్ప జీవితం దొరుకుతుందని చెబుతారు. కానీ, అతి నీచమైన జీవితం దొరకటానికి నేను ఎన్ని జన్మలలో పాపం చేశానో?

మహేశ్వరి ఆశ్చర్యంతో చదవటం ఆపింది. డైరీని మాత్రం ఇంకొక చోట జాగ్రత్త చేసి, పెట్టెను మూసి మంచం కిందకు తోసింది. బయటకు వచ్చి అత్తగారి గదిలోకి తొంగి చూసింది. ఆమె గాఢ నిద్రలో ఉండ, 'హమ్మయ్య ' అనుకుని మిగిలిన పనులు త్వరగా ముగించింది.

మనసంతా గజిబిజిగా ఉంది. ఇంతకు ముందే పెళ్ళి అయిన వాడా నాగరాజు? అదెందుకు దాచాడు? ఆ మొదటి బార్య ఇప్పుడు ఎక్కడ? వదిలేశాడా?

ఈ విషయాలన్నీ ఎందుకు దాచాడు? ఈ అమ్మాయి రాసినట్టు ఇతను చాలా మోసగాడా? అదే చూస్తున్నావుగా. నీ విషయంలోనూ ఇతని మాటలు, చేష్టలూ, ఈ ఇంటి పరిస్థితి బాగానా ఉన్నది? ఆ అమ్మాయి నిజం మాత్రమే రాసింది. అది సరి, ఆమె నాగరాజును వదిలేసి వెళ్ళుంటే ఎందుకు తన పుస్తక పెట్టను తీసుకు వెళ్ళలేదు? అత్తగారి బీరువాలో ఉన్న చీరలు ఆమె చీరలే అయితే వాటిని కూడా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళింది. ఒకవేళ ఇవన్నీ తీసుకు వెళ్ళటానికి వీళ్ళు అనుమతించలేదా?

ఇంత బహిరంగంగా డైరీ రాసింది అంటే, ఆమె రాసింది నాగరాజుకు తెలుసా, తెలియదా? తెలిసుంటే ఈ టైముకు ఆ డైరీని అతను తీసి పెట్టుకోనుంటాడే. లేకపోతే తగలబెట్టేసుంటాడే. అలా చెయ్యకుండా పుస్తకాల పెట్టేతో సహా నిర్లక్ష్యంగా మంచం కిందకు తోసిపెట్టాడు అంటే ఈ డైరీ గురించి అతనికి ఏమీ తెలియదు---అనే దానికోసమే దేవుడు ఇన్నిరోజులు అతని కంటికి ఈ డైరీని చూపించక దాచి పెట్టుంచాడా?

మహేశ్వరీ ఆ రోజంతా షాక్ నుండి తేరుకోకుండానే తిరిగింది. నిజాలు దాచి  ఇంకొక అమ్మాయిని తల్లికి పనిమనిషిలాగా ఉంచటానికి నన్ను పెళ్ళి చేసుకుని తీసుకువచ్చాడు అంటే, వాడు ఎంత దుర్మార్గుడు అయ్యుంటాడు!

ఇలా రెండో పెళ్ళి చేసుకునే అమ్మాయికి, నిజం తెలియకుండా ఉండడం కోసమే మొదటి రాత్రి మాత్రం ఆ సుఖం, అన్యోన్యం చూపించాడా?

మహేశ్వరీకీ కంపరంగా ఉన్నది. మానభంగం, బలాత్కరం చేసి వదిలిపెట్టినట్టు ఆగ్రహం వచ్చింది. పోయి, పోయి ఒక అయోగ్యుడి దగ్గరా...అని కడుపులో తిప్పింది. ఏ బంధుత్వం కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి తపించిపోయిందో, ఆ బంధుత్వాన్ని పెళ్ళి అయిన ఒకే వారంలో ధూషించుకుంటామని ఆమె కలలో కూడా అనుకోలేదు.

జరిగినదంతా క్లుప్తంగా ఒక ఉత్తరంగా రాసి, వీధి చివర ఉన్న పోస్టు డబ్బాలో పడేసి వేగంగా ఇంటికి వచ్చి ఒక పెద్ద నిట్టుర్పుతో శ్వాశ తీసుకుని వదిలి, ఒక గ్లాసుడు మంచి నీళ్ళు తాగి గోడనానుకుని కూర్చుండిపోయింది.

ఆ మరుసటి వారం అన్నయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరాన్ని మామగారు వెళ్ళి తీసుకువచ్చారు. ఆందోళనతో ఆయన్ని చూసిన ఆమె ఏం చేయాలో అర్ధంకాక బిగుసుకుపోయి నిలబడింది. నీకే నంటూ నిజాయితీగా ఉత్తరాన్ని ఆమె దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతారు అనుకుని మోసపోయింది.

కొడలుకు వచ్చిన ఉత్తరం అని తెలిసిన తరువాత ఆయన దాన్ని విప్పి చదవటం మొదలుపెట్టారు. ఆమె శరీరం వణికింది.

"ఏరా నాగరాజూ, తిన్నావా?" ఎక్కడికో వెళ్ళి రాత్రి ఆలశ్యంగా వచ్చిన కొడుకును మామగారు అడిగారు.

"ఎందుకలా అడిగావు...? తిన్నాను"

"ఒక స్వారస్యమైన విషయం ఉంది. అందుకే అడిగాను"

"ఏమిటా విషయం?"

"మనింటికి ఈ రోజు ఒక ఉత్తరం వచ్చింది. స్వారస్యంగా ఉంది. చదువుతాను, వింటావా?"

"ఏమిటా ఉత్తరం? ఎవరికి వచ్చింది?"

"నేను చదువుతాను. విను"

ఆయన ఉత్తరాన్ని విప్ప, మహేశ్వరీ వణుకుతూ చూసింది. అన్నయ్య ఏం రాసుంటాడో? అది తెలిసిన తరువాత ఏం జరుగుతుందో అని కలత చెందింది.

"ప్రియమైన మహేశ్వరీ. నీ ఉత్తరం అందింది. నాకూ షాక్ గానే ఉంది. ఆయనా కానీ, మెడలో తాళి ఎక్కిన తరువాత ఎవరు ఏం చేయగలరు? అనుసరించి వెళ్ళటమే ఇప్పటికి మంచిది.

నీ పుట్టింటి వసతి నీకు తెలిసిందే. కష్టమో, నష్టమో నువ్వే అడ్జస్టు అయిపోవటానికి అలవాటుపడాలి. అదే నీకు మంచిది. ఇదొక చిన్న సమస్యే. పెద్దది చేసి నువ్వూ కష్టపడి, నాకూ కష్టమివ్వవని నమ్ముతున్నాను.

మళ్ళీ చెబుతున్నా. భర్త మనసుకు తగినట్టు నడుచుకో. సమస్య రాదు.

ఇట్లు.

అన్నయ్య.

నాగరాజు మొహం మాడింది. కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూశాడు.

"మీ అన్నయ్యకు ఏం రాసి పడేశావు?”

"అది....."

"అడుగుతున్నా కదా? మేము నిన్ను కోరంటికం పెడుతున్నామని రాశావా?"

"అదంతా లేదు"

"మరేమిటే రాశావు"

"ఇక్కడ ఎక్కువ పని అని...."

"ఏం...నువ్వేమన్నా పెద్ద మహారాణివా? గోర్లకు మురికి తగలకుండా పెరిగావా? లేదు ఈ ఇల్లు పెద్ద బంగళానా, నువ్వు బాగా తిని సుఖంగా ఉండటానికి?" అతను అడుగుతూనే ఆమెను లాగి చెంప మీద కొట్టాడు. ఆమె కళ్ళు ఒక్క క్షణం బైర్లుకమ్మ, తూలిపడబోయింది.

*************************************************PART-4******************************************

మాలతీ రాసిన డైరీ నుండి:

"మీకు పుస్తకాలు చదివే అలవాటుందా?" మొదటిరాత్రి నేను నాగరాజు దగ్గర అడిగిన మొదటి ప్రశ్న ఇదే.

"ఏం...పుస్తకాలు చదివితేనే నన్ను తెలివగలవాడని ఒప్పుకుంటావా?"

"అదంతా లేదు. చదువుతారా అని జస్ట్ అడిగాను. మనం ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోవద్దా?"

"అర్ధం చేసుకుని ఏం చెయ్యబోతావు?"

"ఏమిటలా అడుగుతున్నారు"

"ఇలాచూడు. మాట్లాడుతూనే ఈ రాత్రంతా గడిపేద్దా మనుకుంటున్నావా?"

అతను నా చీరను లాగ, ఆ మెరటు తనాన్ని కొంచం కూడా ఎదురు చూడని నేను ముఖం చిట్లించుకుని నా చీరను లాగి పట్టుకుని, అతన్ని విసుగ్గా చూశాను.

"ఇలా చూడండీ, పెళ్ళి ఓకే అనుకుని నిశ్చయం చేసేంత వరకు మీరెవరో నాకు తెలియదు. ఎంత భర్త అయినా సరే, మొదటి రాత్రి అయినా కొంచం డీసెన్సీ కావాలి. నేను వేస్యను కాదు. వెంటనే తయారవటానికి"

నేను కోపంతో చెప్పగా, అతను కోపంగా చూశాడు.

"ఓహో! నీతో పడుకోటానికి నేను రోజూ ఫైలు పంపి పర్మిషన్ తీసుకోవాలా?"

"మనం ఒకొర్నొకరు బాగా అర్ధం చేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ తరువాత ఇది పెట్టుకుందాం".

"ఇది ముగిస్తేగానీ అర్ధం చేసుకోలేమని నేను అనుకుంటున్నా"

అతను తన బలాత్కార ధోరణిని చూపటం ప్రారంభించ దగ్గర దగ్గర ఒక మానభంగమే అక్కడ జరిగింది. అతను తాళి కట్టిన భర్తగా కనబడలేదు. నీచ మనస్తత్వం కలిగిన కామకుడిగా మాత్రమే ఉన్నాడు. ఎన్నిసార్లు స్నానం చేసినా ఆ కంపరం పోలేదు.

ఒక మగవాడు అన్న అహంకారం అతనిలో పాతుకుపోయింది. నాన్న తప్పైన వ్యక్తిని నా కోసం సెలెక్టు చేశారు అనేది అర్ధమయ్యింది. నాన్న దగ్గర అన్ని విషయాలూ చెప్పలేము. ఎందుకంటే నాన్న కృంగిపోతారు.

నా ముందున్న సమస్యను ఆయన దగ్గర చెప్పకుండానే అడ్జెస్టు చేసుకోవటం మంచిది. నాగరాజు లో ఖచ్చితంగా ఒక మంచివాడూ ఉంటాడు. అతన్ని బయటకు తీసుకురావటానికి ప్రయత్నించాలి అని తీర్మానించుకున్నాను.

మొదటి రోజు ఇంత మృగంలాగా నడుచుకున్న అతన్ని మ్రుసటి రోజు పొద్దున చూసిన వెంటనే ఆశ్చర్యపోయాను. నుదిటి మీద విభూధి, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుని శివ భక్తుడిలాగా మిగిలిన వారితో కూర్చుని మాట్లాడుతున్నాడు. కాషాయ దుస్తులు ధరించిన పులిలాగా కనబడ్డాడు నా కళ్ళకు. అతని దగ్గర అతి జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరిక గంట కొట్టింది నాలో.

పగలు కరగ, కరగ, ఒక దిగులు పట్టుకుంది.

"ఏమ్మామాలతీ, ఇటురా ఒక నిమిషం" అత్తగారు పిలిచింది.

"ఏమిటత్తయ్యా?"

"నేను విన్నది నిజమా?"

"ఏమిటది?"

"చాలామంది మగవారితో మాట్లాడుతున్నావటగా నువ్వు? అవునా?"

"అర్ధం కాలేదు. మాట్లాడితే ఏం తప్పు? నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు"

"ప్రొదున నుండి ఏడెనిమిది మంది ఫోను చేసి నిన్ను అడిగారు. అందరూ మగవారే. ఎవరయ్యా మీరు అని అడిగేతే, తెలిసిన వాళ్ళం, మాలతీని పిలవండి అంటున్నారు. ఇది బాగుందా చెప్పు? ఇది కాపురం చేసే ఇల్లా లేక భోగం వాళ్ళ ఇల్లా? మా అబ్బాయికి తెలిస్తే నరికిపారేస్తాడు. పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉన్నావో. ఇకమీదట అయినా క్రమశిక్షణతో కుటుంబ స్త్రీలాగా ఉండటానికి ప్రయత్నించు"

"షటప్..." నేను ఆగ్రహంతో అరవ, అత్తగారు బెదిరిపోయి నన్ను చూసింది.

"ఇలా అసహ్యంగా నాతో ఎవరూ మాట్లాడిందిలేదు. మొదట నాగరీకంగా మాట్లాడటం నేర్చుకోండి. నేనేమీ చిన్న పిల్లను కాను. మంచి, చెడూ అంతా చెప్పే మా నాన్న నన్ను పెంచారు. ఇక మీదట ఇలా మాట్లాడటం ఆపండి మొదట"

నేను ఓర్చుకోలేనంత ఆగ్రహంతో మాట్లాడ, అత్తగారు షాక్ తిన్న వ్యక్తిలాగా నన్నే చూశారు. నేను అనుకున్న లాగానే ఆ రోజు సాయంత్రం నాగరాజు ఇంటికి వచ్చిన వెంటనే, క్లైమాక్స్ సీన్ మొదలయ్యింది. కానీ నేను అనుకున్న దానికి విరుద్దంగా జరిగింది.

నాగరాజు తల్లిని కోపంగా చూశాడు. "నీకు బుద్దుందా?" అని అరిచాడు.

"ఏమిట్రా...?"

"ఇక నా భార్య గురించి తప్పుగా మాట్లాడావంటే నేను మంచివాడిగా ఉండను. ఇప్పుడే చెబుతున్నా"

"బాగుందిరా నువ్వు మాట్లాడేది. నిమిషానికి నాలుగు ఫోనులు వస్తున్నాయి. అన్నీ మగవాళ్ళ స్వరాలే. ఏం...అమ్మాయలతో స్నేహమే పెట్టుకోకూడదా ఆమె? అది అడిగితే నేను పోట్లాడేద్దాన్ని.అంతేనా?

"ఇలా చూడు. దాని గురించి నేనే బాధపడలేదు. నీకేం వచ్చింది. నువ్వెవరు అడగటానికి?"

"నేనెవరా? ఇది నా ఇల్లురా. నా ఇంట్లో తప్పు జరిగితే నేను అడిగే తీరతాను"

"ఓహో! ఈ సాకుపెట్టుకుని ఇది నీ ఇల్లు అని చెప్పకుండా చెప్పి చూపిస్తున్నావు లాగుందే"

"చూపించకుండా ఎలా? నా ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్లు వినేవాళ్ళుగా ఉండాలి"

"వినకపోతే"

"వినకపోతే బయటకుపో..."

అతను తల్లిని విరక్తిగా చూశాడు.

"పోరా...ఎవర్ని బెదిరిస్తున్నావు? దారాళంగా వెళ్ళిపో. అందుకే కదా భార్యా-భర్త ఇద్దరూ నాటకాలాడుతున్నారు"

"గొడవ మొదలు పెట్టింది నువ్వు. నెపం నా మీదా? పరవాలేదమ్మా"

"ఇదిగో చూడు...పల్టీ కొట్టకుండా బయటకు వెళ్ళే దారి చూడరా...ఏం భయంగా ఉన్నదా!"

"నాకెందుకు భయం? ఇదిగో మాలతీ, బయలుదేరు. మన వస్తువులన్నీ తీసిపెట్టు. బండి తీసుకు వస్తాను"

"ఎక్కడికెళ్తున్నాము?"

"ఏం...మీ నాన్న ఇల్లు లేదా?"

"మా ఇంటికా...?" నేను షాక్ తో అడుగగా, అతను వెళ్ళిపోయాడు.

అరగంటలో టెంపో వచ్చింది. నాన్న నాకిచ్చిన వస్తువులు బండిలో ఎక్కించబడ్డాయి. మేమూ అందులోనే ఎక్కాము.

"హఠాత్తుగా నాన్న ఇంటికి వెళ్ళి నిలబడితే బాగుండదండి. ఆయన మనగురించి ఏమనుకుంటారు?"

"అంత భయం ఉన్నదానివి, మా అమ్మకు అనిగిమెనగి ఉండాల్సింది. మొహానికి తిన్నగా చెయ్యి చాచి మాట్లాడుండకూడదు"

"మీ అమ్మ అసహ్యంగా మాట్లాడితే, పడి ఉండమంటారా?"

"అందుకే బయలుదేరాను. నిన్ను అసహ్యంగా మాట్లాడని ఇంటికి వెళ్దాం. మీ నాన్నా వాళ్ళింట్లో ఎవరూ నిన్ను తప్పుగా మాట్లాడరుగా? ఎంతమంది మొగవారితోనైనా మాట్లాడొచ్చు, స్నేహంగా ఉండొచ్చు, బయట తిరగొచ్చు. ఎవరు అడగబోతారు"

నేను ఆశ్చర్యపోయాను. అతను నాకు సపోర్టు చేస్తున్నాడా? లేక ఎత్తి పొడుస్తున్నాడా? ఎందుకు మా నాన్న ఇంటికి నన్ను తీసుకు వెళ్తున్నారు? అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఏదీ అర్ధం కాక బలి ఇచ్చే మేకలాగా అతనితో వెళ్ళాను.

ఆ రాత్రి సమయంలో అమ్మా-నాన్నా మమ్మల్ని ఎదురుచూడ లేదు. టెంపోనూ, మమ్మల్నీ అయోమయంతో చూశారు.

"తప్పుగా అర్ధం చేసుకోకండి మామగారు. చెప్పా పెట్టకుండా మీ ఇంటికి రావలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. మా అమ్మ మాలతీని కొంచం అసహ్యంగా  మాట్లాడారు. నేను ఓర్చుకోలేకపోయాను. నేను అమ్మను తిట్టటంతో, నాకూ, ఆమెకూ కొంచం గొడవ అయ్యింది. నన్ను బయటకుపో అని తరిమింది. నాలో ఉన్న రోషం నన్ను వెంటనే బయలుదేరేటట్టు చేసింది. మీరి మమ్మల్ని రానిస్తారనే నమ్మకంతో, సామాన్లు తీసుకుని ఇక్కడికి వచ్చాము. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి. మేము వెళ్ళిపోతాం

"అరె ఏమిటిది అల్లుడుగారూ...నేనెందుకు మిమ్మల్ని వెళ్ళమంటాను. ఇల్లు చూసుకునేంతవరకూ మీరు ఇక్కడే ఉండొచ్చు. మాలతీ వెళ్ళమ్మా, అల్లుడిగారిని  లోపలకు తీసుకువెళ్ళి భోజనం పెట్టు. నేను సామాన్లను దింపి బండిని పంపించి వస్తాను"

నాన్న పాపం. ఆయనకు వేరే దారిలేదు. కన్న తండ్రి అయిపోయేడు. బరువును అంగీకరించారు.

ఏ ఒక్క మగాడూ ఇల్లరికపు అల్లుడిగా ఉండటానికి ఇష్టపడడే. ఒకవేళ మామగారింట్లో తనను మర్యాద పూర్వకంగా చూస్తే ఇల్లరికానికి ఒప్పుకోవచ్చు. నాగరాజు విషయంలో అన్నీ తారుమారుగా జరుగుతున్నాయి. సిగ్గులేకుండా అతను ఆ ఇంట్లో అల్లుడు అనే హక్కును కొనియాడాడు. నాన్నను అప్పుడప్పుడు మొహం చిట్లించుకునేలా చేశాడు.

అల్లుడనే ఒక బడాయితో ఆ ఇంట్లో టైము టైముకూ తింటున్నాడే తప్ప, అతని జీతంలో నుండి చిల్లిగవ్వ కూడా వాళ్ళ ఖర్చులకు నాన్న దగ్గర ఇవ్వలేదు. నన్ను ఇరకాటంలో పెట్టకూడదని నాన్న ఏమీ అడగకుండా, విసుగు చూపించకుండా కష్టాలను అంగీకరించాడు. కానీ నేను అలా ఉండలేకపోయాను. అతని దగ్గర అడిగాశాను.

"ఎప్పుడు మీరు ఇల్లు చూడబోతారు?"

"ఏం...?"

"ఏమిటీ ప్రశ్న? ఎన్ని రోజులు నాన్నా వాళ్ళతో ఉండాలి? ఇద్దరం సంపాదిస్తున్నాం. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోవటమే మర్యాద"

"వెళ్ళిపొమ్మని మీ బాబు ఏమైనా చెప్పాడా?"

"మర్యాదగా మాట్లాడండి. ఏదో అవసరానికి ఇక్కడికి వచ్చాము. అందుకని ఇక్కడే ఉండిపోగలమా? మీవల్ల కుదరకపోతే చెప్పండి, నేనే ఒక ఇల్లు చూస్తాను"

"మీ అమ్మా-నాన్నలకు నువ్వు ఒకే కూతిరివి కదా. వాళ్ళకు వయసు మీరిన కాలంలో వాళ్ళను మనమే కదా చూడాలి. ఆ పని ఇప్పటి నుండే చేద్దాం"

"ఇదేనా చూసుకునే లక్షణం?"

"ఏమంటున్నావు?"

"వచ్చి ఆరునెలలు అవుతోంది. ఇంతవరకు మన ఖర్చులకు చిల్లిగవ్వ కూడా నాన్న దగ్గర మీరు ఇచ్చారా?"

"అదే నువ్విస్తున్నావు కదా. చాలదా?"

"నేను ఎక్కడ ఇచ్చాను. నేను ఇస్తే నాన్న తీసుకుంటారా? మీరిస్తే అది మనకి మర్యాద. నా దగ్గర ఆయన తీసుకోరు. వచ్చేనెల నుండి జీతాన్ని ఆయన చేతికి ఇవ్వండి. లేకపోతే మర్యాద పోతుంది. లేదు అలా ఇవ్వటం ఇష్టం లేదా, గౌరవంగా బయటకు వెళ్ళిపోదాం"

అతను నన్ను కోపంగా చూశాడు. "అన్నిటికీ మీకూ సరిసమం హక్కు ఉందని మాట్లాడతారే మీ ఆడవాళ్ళందరూ. నేనొకటి అడుగుతాను. అమ్మాయిలు భర్త ఇంటికి వచ్చేలాగా, మగవాళ్ళు అమ్మాయల ఇంటికి వచ్చి ఉండకూడదా? ఎందుకు దీన్ని అసహ్యపరుస్తారు?"

"దానికి వేరేలాగా పెళ్ళి చేసుకోనుండాలి"

"ఎలా...?"

"నేను మీ మెడలో తాళి కట్టుండాలి. సారె వస్తువులు మీ నాన్న ఇక్కడికి ఇచ్చి పంపించాలి"

నేను అంత హీనంగా మాట్లాడినా అతను రోషం లేకుండా నవ్వాడు. నిజంగానే రోషం లేదా లేక రోషం లేనట్టు నటించాడా తెలియదు.

"బాగా మాట్లాడుతున్నావు!" అంటూ నవ్వుతున్న అతని మొహం సడన్ గా సీరియస్ గా మారింది.

"నేను ఇక్కడే ఉంటానే. ఇష్టం లేకపోతే మీ అమ్మా-నాన్నను బయటకు వెళ్ళమని చెప్పు"

కసురుకున్నట్టు మాట్లాడిన అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. అతన్ని కాల్చిపారేసేలాగా చూసాను.

*************************************************PART-5******************************************

ఒళ్ళు నొప్పులు. పొత్తికడుపు తిప్పింది. ఎందుకింత నీరసమనేది తెలియలేదు. పడుకునే ఉందామని అనిపిస్తోంది. అందులోనూ తెల్లవారు జాము నిద్ర నానా బాధపెడుతోంది. మహేశ్వరీ కళ్ళు తెరవలేక పడుంది.

"ఏయ్. మాహీ, మాహీ -- దున్నపోతులాగా ఏమిటా నిద్ర? లేచి పనిచూడు" నాగరాజు ఆమెను ఊపి కూర్చోబెట్టాడు.

"కుదరటం లేదండీ"

"కుదరకపోవటం ఏమిటే? వెళ్ళి అమ్మను చూసుకో"

"నిజంగానే నావల్ల కుదరటం లేదండీ"

"కుదురుతుందో, కుదరదో...వెళ్ళి పనిచూడు!"  అతను ఆమెను లేపి తోశాడు.

అత్తగారికి గదిలో నుండి వచ్చిన నీచువాసన, మరింతగా కడుపులో తిప్పటంతో బాత్రూము వైపు పరిగెత్తి వాంతి చేసుకుంది. ఆ తరువాత ఆ రోజు చాలాసార్లు వాంతీ చేసుకున్న తరువాతే ఆమెకు అర్ధమయ్యింది. అది గర్భ వాంతీ అని.

"నీ భార్య నీళ్ళోసుకోలేదనుకుంటా!" ఆ రోజు సాయంత్రమే అత్తగారు అతనితో చెప్పింది. అతని మొహం మారింది. ఆమె దగ్గరకు వచ్చాడు. "బయలుదేరు!" అన్నాడు.

"ఎక్కడికి?"

"డాక్టర్ దగ్గరకు"

'పరవాలేదే! మీకు కొంచమైనా నా మీద శ్రద్ద ఉందే' అని అనుకుంటా ఆమె అతనితో బయలుదేరి వెళ్ళింది. వెళ్ళిన తరువాతే తెలిసింది అతను అబార్షన్ చేయించటానికి తీసుకు వచ్చాడని. కంగారు పడింది.

"మీకేమన్నా పిచ్చా? నేనెందుకు అబార్షన్ చేయించుకోవాలి?"

"నాకు పిల్లలు వద్దు."

"అలాంటప్పుడు ఎందుకు పెళ్ళిచేసుకున్నారు? నాతో ఎందుకు పడుకున్నారు?".

"మాట్లాడకే కుక్కా. నోరు తెరిస్తే చంపేస్తాను. నిన్ను పెళ్ళి చేసుకున్నది నాకు పిల్లలను కనిపెట్టటనికి కాదు. మా అమ్మను చూసుకోవటానికి. నేను  ముట్టుకోకపోతే నువ్వు కన్యాత్వం పొగొట్టుకోకుండానే కాలంగడిపి మా ఇంట్లో పడుతున్న బాదలను తట్టుకోలేక పారిపోయుంటవు. అందుకనే నిన్ను బలాత్కారం చేసి, పారిపోకుండా ఇంట్లోనే పెట్టుకున్నాను. లేకపోతే నువ్వేమన్నా అందగత్తవా, నేను నీ మాయలో పడి నీ ఒడిలో దొర్లటానికి"

"థూ" అని ఉమ్మేస్తూ "నువ్వూ ఒక మనిషివేనా. కాదు మృగానివి. నీలాంటి మృగం యొక్క బిడ్డను మోయటం మహాపాపం. దానికంటే అబార్షన్ చేయించుకోవటమే మేలు"

అతని మొహం మీద ఉమ్మేసి, అబార్షన్ చేయించుకోవటానికి లోపలకు వెళ్ళింది ఆమె. ఎలాగైతే ఏం, సమస్య తీరింది అని అతను మొహం తుడుచుకుని కూర్చున్నాడు.

ఒక రోజే రెస్టు. మరుసటి రోజే వంటింట్లో నిలబెట్టబడింది. ఏడుపును అనుచుకుని మృగాలకు వంటచేసి పెట్టింది. చదువూ, ఉద్యోగం ఉండి కూడా ఆ మాలతీ వీళ్ళ దగ్గర చెప్పలేనంత బాధలు పడింది అంటే, వీళ్ళకు నేను ఎంత అని అనిపించింది.

కానీ, ఆ మాలతీ ఎలా ఇతన్ని సహించుకుంది అనేదే ఆశ్చర్యంగా ఉన్నది. ఎప్పుడు రెస్టు దొరుకుతుందో అని కాచుకుని, మామగారు ఎప్పటిలాగా బయటకు వెళ్ళిన తరువాత, బెడ్ రూముకు వచ్చి కనబడకుండా దాచిపెట్టినా డైరీని తీసి, ఆపిన చోటు నుండి చదవటం మొదలుపెట్టింది.

                                                 **********************

రోజు రోజుకూ నాగరాజు యొక్క సాధింపు ఎక్కువ అయ్యింది. నాన్న ఎదుటే మర్యాద లేకుండా నడుచుకున్నాడు.

"మీకు అసలు ఏం కావాలి? ఎందుకింత హీనంగా నడుచుకుంటున్నారు...మంచి మనిషిగా ఉండటంలో మీకేంటి కష్టం?" కోపంగా అడిగాను నేను.

"భార్య పలు మగవారితో పరిచయం పెట్టుకుని ఊరంతా తిరుగుతుంటే, భర్త ఎలా మంచివాడుగా ఉండగలడు? నా కష్టం ఏమిటో అర్ధమవుతోందా నీకు?" తండ్రి ఎదుటే అతను ఇలా అడగటంతో, తండ్రి షాకయ్యాడు. 'ఇలాంటి గుణం ఉన్నవాడినా నా కూతురుకు కట్టబెట్టాను ' అని తల్లడిల్లిపోయాడు.

"అవునండీ. నేను పదిమందితో తిరిగే వస్తున్నాను. ఇప్పుడేమంటారు?"

"మాలతీ..." తండ్రి అల్లాడిపోయాడు. తల్లి చీర కొంగును నోటికి అడ్డుపెట్టుకుని ఏడ్చింది.

"చూసారుగా మామగారు. ఎంత ధైర్యంగా ఒప్పుకుంటోందో చూడండి. దీనికోసమే మా అమ్మగారు నన్ను ఇంట్లో నుండి పోరా అన్నారు. దీని వలనే కదా నాకు ఈ పరిస్థితి. మళ్ళీ తిరిగి నేను అమ్మగారింటికి వెళితే లోపలకు అనుమతిస్తుందా? దీన్ని పెళ్ళి చేసుకున్న పాపానికి నన్ను రోడ్డు మీద నిలబడమని చెబుతారా? నేను ఒక సిగ్గులేని మగాడిని. అది ఊరంతా తిరిగొచ్చినా, దాంతో కాపురం చేస్తున్నాను"

"వద్దంటే చెప్పండి. విడాకులు తీసుకుందాం. మంచి కుటుంబ స్త్రీని చూసి మళ్ళీ పెళ్ళి చేసుకుని మీ ఇంట్లోనే ఆమెను ఉంచుకుని సంతోషంగా కాపురం చెయ్యండి. అది వదిలేసి ఎందుకు ఈ తిరుగుబోతుతో కష్టపడుతున్నారు?"

నేను ఎగతాలిగా చెప్ప, అది ఎదురుచూడని వాడిలాగా నాగరాజు మొహం నల్లబడింది. అతను వేసిన ప్లానును నేను విరిచేసి ముక్కలుగా చేసినట్లు చీకటిపడింది.

ఇంకో కొద్దిసేపట్లో అతని కపట నాటకానికి వేసున్న తెర చినిగిపోయి, ఈ సమస్యకు ఒక ముగింపు ఏర్పడుతుందని నేను అనుకుంటున్న సమయంలో, తండ్రి అడ్డుపడ్డాడు.

"మాలతీ ఏమిటా మాటలు. ఇందుకా నేను కష్టపడి నీకు పెళ్ళిచేసింది.

"మరేంటి నాన్నా..."

"నువ్వు మాట్లాడకుండా ఉండు. అల్లుడూ! మీరు లోపలకు వెళ్ళండి. అదేదో టెన్షన్ లో మాట్లాడుతోంది. మీరు ఎక్కడికీ వెళ్ళద్దు. ఇక్కడే ఉండండి. ఇది మీ  ఇల్లు. కానీ, మీ అమ్మ మాట్లాడుతోంది కదా అని, మీరుకూడా నా కూతుర్ని తప్పుగా మాట్లాడకండి. ఆమెకు స్నేహితులు ఉన్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ షిప్ అంతా పరిశుద్దమైన ఫ్రెండ్ షిప్ మాత్రమే. ఇకమీదట అయినా ఆమెను అర్ధం చేసుకుని ఆమెతో సంతోషంగా ఉండండి. నా కూతురి సంతోషమే నాకు ముఖ్యం. దానికోసం ఏం చెయ్యటానికైనా మేము రెడీగా ఉన్నాము. మేము ఏం చెయ్యాలి చెప్పండి"

"ఏదైనా చేస్తారా?"

"ఖచ్చితంగా"

"ఇంతదూరం మీ అమ్మాయి మాట్లాడిన తరువాత ఆమెను క్షమించలేను. కానీ మీరు ఇంతదూరం బ్రతిమిలాడుతున్నారు కాబట్టి నేను ఆమెను క్షమిస్తున్నాను. అది మీకొసం మాత్రమే. మీరు ఇక్కడుంటున్నారనే ధైర్యంతోనే కదా, అది నన్ను ఎదిరించే మాట్లాడుతోంది. అందువల్ల మీరు ఇక్కడ్నుంచి వెళ్ళిపొండి"

"ఆయన ఎందుకు వెళ్ళాలి? ఇది ఆయన ఇల్లు. మీరే ఇక్కడకొచ్చి అతుక్కున్నారు. ఆయన్ని వెళ్ళమని చెప్పటానికి మీరేవరు?"

"మాలతీ, నువ్వు మాట్లాడటం ఆపవా? నేను మాట్లాడుతున్నాను కదా? సరే అల్లుడూ, మేము వెళ్ళిపోతాము, చాలా?"

"నాన్నతో నేనూ వెళ్తాను"

"మాతో నువ్వు వస్తే మేము ఏదైనా తాగాసి తిన్నగా పైకెళ్ళిపొతాము"

"ఆయనతో ఎలా నాన్నా నేను..."

ప్రామిస్ చెయ్యి. మన కుటుంబ గౌరవాన్ని కాపాడతానని ప్రామిస్ చెయ్యి. నా కూతురు విడాకులు తీసుకోకూడదు. మన ఇంటి విషయం ఉర్లో వాళ్ళ నోటికి అటుకులుగా అవకూడదు. ఓర్పుగా ఉండి సమస్యలను గెలుస్తానని ప్రామిస్ చెయ్యి"

తండ్రి చేయి జాపారు. నేను కాదంటే, దేనికైనా తెగిస్తానని ఆయన చూపులు చెబుతున్నాయి. ఈ అయోగ్యుడి కోసం నేను నాన్నను వదులుకోదలుచుకోలేదు. ఆయన జాపిన చేతిలో నేను చెయ్యి ఉంచాను.

"ఇది నిజమా...నాటకమా?" తండ్రిని అడిగాడు నాగరాజు.

"నిజమే అల్లుడూ. నా కూతురు ప్రామిస్ చేసి ఇచ్చింది. మీరు చెప్పినట్టే ఇక ఆమె నడుచుకుంటుంది"

"ఎలా నమ్మేది?"

"ఎలా నమ్మించాలి అనుకుంటున్నారు?"

"ఇంటిని నా పేరుకు రాసివ్వండి. అప్పుడే ఆమె నా గుప్పెట్లో ఉంటుంది"

"నాన్నా. వద్దు నాన్నా. ఇది పక్కా బ్లాక్ మైల్. నేను దీనికి అంగీకరించను"

"ఈ ఇంటిని ఎప్పుడో నేను నా కూతురు పేరుకు మార్చి రాశాసాను అల్లుడూ. నా తదనంతరం మీకే. కానీ, మీరు ఇప్పుడే అడుగుతున్నారు. పరవాలేదు. మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండండి. మేము అడ్డుగా ఉండబోము..."

"నాన్నా! మీరు నాకు మంచి చేస్తున్నారా? లేక...నన్ను ఊబిలోకి తోసేస్తున్నారా? వద్దు నాన్నా. కలిసి ఉండటంలో లేదు గౌరవం. ఫేక్ గా కలిసి జీవించటం కంటే, గౌరవంగా  విడిపోయి ప్రశాంతంగా ఉండటం దానికంటే గౌరవం నాన్నా. మీరు ఇక్కడ్నుంచి వెళ్ళటాన్ని నేను ఒప్పుకోను"

"తండ్రి ఏదీ వినే పరిస్థితుల్లో లేడు.  దస్తావేజులను నాగరాజు దగ్గర ఇచ్చాడు. కుటుంబ గౌరవమూ, కూతురి మీద ప్రేమ ఆయన కళ్ళు కప్పి, తెలివిని మందగించేలా చేసింది. నేను బాగా జీవించాలని ఆశించి నా నాశనానికి పునాది ఏర్పరిచారు ఆయన. కన్నవాళ్ళ ఎక్కువ ప్రేమే పిల్లలను నాశనం చేస్తుంది అని చెప్పడానికి నా జీవితమే అతిగొప్ప ఉదాహరణ.

అమ్మా, నాన్నా ఇల్లు వదిలి వెళ్ళటాన్ని ఎదిరించాలనుకున్నాను, అడ్డుపడదామనుకున్నాను. చెయ్యలేక కన్నీటితో చూస్తూ ఉండటమే నా వల్ల కుదిరింది.

స్వభావంలో నేను పిరికి కాదు. అన్యాయాలను ఎదిరించి అడుగుతాను. అయినా నా జీవిత పడవ మాత్రం ఎలా నా కంట్రోల్ దాటి వంకర టింకరగా వెడుతోందనేది నాకు అర్ధంకాలేదు.

నా తెలివికో, అందానికో, అంతస్తుకో ఏ విధంగానూ సరితూగని ఒకడ్ని, విధి తన బలంతో సులభంగా నా జీవితంలోకి దూరి, కళ్ళు ఆర్పేలోపల నా కుటుంబాన్నే తలకిందలు చేసిన ఘోరం కలా, నిజమా అనేది కూడా అర్ధంకాలేదు.

నా అనుమతి లేకుండా, నా చేతులు దాటి, అన్నీ జరుగుతున్నాయి. నేను దేనికోసం, ఎవరికోసం ఈ ముసలివాడిని సహించుకుంటున్నానో అనేది కూడా అర్ధంకాలేదు. అన్నీ నాకు అయోమయంగానూ, విచిత్రంగానూ ఉన్నది. "నువ్వు ఉద్యోగానికి వెళ్ళింది చాలు. ఇక ఇంట్లోనే ఉండు" అన్నాడు ఒకరోజు.

"ఎందుకని...?"

"ప్రశ్నలడిగితే...చంపేస్తాను"

"ఉద్యోగం వదిలేయటం నావల్ల కాదు" నేను ఖచ్చితంగా చెప్పాను.

"కుటుంబ గౌరవం ముఖ్యమనే కదా మీ నాన్న ఇల్లు వదిలి వెళ్ళాడు. అదేలాగా నాకూ ఉంది కుటుంబ గౌరవం. రోజూ పదిమంది మగవాళ్ళతో మాట్లాడుతూ, నవ్వుతూ ఊరంతా తిరిగేస్తున్నావే. నా గౌరవం ఏం కాను?"

"అలాంటిది ఒకటి ఉంటే, మా నాన్నగారు చెమటతో కట్టిన ఈ ఇంటిని మీ పేరుకు రాయించుకుని ఆయన్నే తరిమేస్తారా?"

"నీలాంటి తిరుగుబోతును పెళ్ళిచేసుకుని ఏడవటానికి, మీ నాన్న కట్నం ఇచ్చే కదా తీరాలి"

"అలాగైతే మీ నాన్న దగ్గర కూడా కట్నం ఇవ్వమని చెప్పండి. మీలాంటి ఒక సాడిస్టును పెళ్ళి చేసుకుని నేను ఏడుస్తున్నాను కదా"

"ఏం చెప్పేవే...?" అతను చేయెత్తి కొట్టటానికి వచ్చినప్పుడు, నేను గబుక్కున అతని చేతిని అడ్డుకుని బలంగా తిప్పాను.

"మా నాన్నకు మాత్రమే ప్రామిస్ చేసిచ్చాను. నీకు ఎటువంటి ప్రామిస్సూ చేయలేదు. తెలిసిందా? నాగరీకంగా నా భర్తగా ఉండగలిగితే ఉండు. లేకపోతే ఇంటి నుండి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే నేను తీపి చేసుకుని తింటాను. ఏమంటావు?"

గట్టిగా నేను అడగటంతో, అతని కళ్ళల్లో ఒక విధమైన కలత కనబడి మాయమయ్యింది. ఇల్లు నా పేరుతో ఉంది. కలిసి జీవించాలనే నిర్భంధం ఉంటేనే, అతను పెట్టే కష్టాలకూ, మోపే నేరాలకూ బాధపడాలి. భయపడి వణకాలి. అలాంటి ఏ నిర్బంధమూ నాకు లేదు. నువ్వు విడిపోయి వెళ్ళిపోవటం వలన నాకు ఎటువంటి బాధా లేదు అనేది అతనికి క్లియర్ గా చెప్పటంతో భయం అతన్ని చుట్టుముట్టింది.

నా వలన అతనికి ఇంకా ఎంత ఆదాయం దొరుకుతుందో అని లెక్కవేసి ఉంచుకున్నాడో, అవి దొరికేంతవరకు అతను నన్ను అనుసరించే వెళ్ళాలి! అప్పటికి అతను అనిగిమెనిగి ఉన్నా నాకూ, అతనికీ ఏమిటి విరోధం? మా ఇద్దరి మధ్యా ఏమిటి సమస్య? అనేది అర్ధంకాలేదు. అతను గనుక మంచివాడుగా ఉండుంటే కవిత్వంలాగా ఉండేది కదా మా దాంపత్యం! కారణమే లేకుండా, మూర్ఖంగా విసుగు, విరక్తి ఎందుకు చూపాలి అతను?

కలిసి జీవించటం ఇష్టం లేకపోతే, విడిపోయి వెళ్ళుండచ్చు కదా. దానికీ సమ్మతించటం లేదంటే అతన్ని సాడిస్టూ, మృగం అనేగా చెప్పాలి. మొత్తానికి ఈ దాంపత్య జీవితం నా ముందు అతిపెద్ద చిక్కుముడిగా పడిపోయింది. ఈ చిక్కుముడి నుండి నేను విముక్తి చెందుతానా? లేక ఈ చిక్కుముడి గొంతుకు చుట్టుకుని చనిపోతానా?

*************************************************PART-6******************************************

డైరీలో ఆ తరువాత చాలా పేజీలు ఖాలీగా ఉన్నాయి. తరువాత మళ్ళీ ఏదో వాక్యాలు రాసున్నాయి.

ఈ రోజు నాన్న నా ఆఫీసుకు వచ్చారు. మనసు విరిగిపోయున్నారు. ఆయన అతిపెద్ద తప్పు చేసినట్లుగా కన్నీరు కార్చారు.

"పోనీయమ్మా. నువ్వు బయటకు వచ్చేయి. విడాకుల నోటీసు పంపుదాం. నిన్ను హింసించినందుకు పోలీసు కంప్లైంటు ఇచ్చి అతన్ని బోనులో నిలబెడదాం. నిన్ను మేము విడిచిపెట్టం. వచ్చేయి" అంటూ ధైర్యం చెప్పారు.

ఈ ధైర్యం ఆయనకు ఇంతకు ముందే వచ్చుంటే ఇల్లు చేతులు మారి ఉండేది కాదు అనేది తెలుసుకున్నారు. దీన్ని నాన్నతో చెబితే ఆయన బాధపడతారు. అందుకని చెప్పలేదు.

వాగ్ధానాన్ని కన్నవారే లెక్కచేయక పోవటంతో, నాకు విడుదల ఇప్పించినందువల్ల, నేను అతన్ని వదిలి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇంటికి వెళ్ళి నా బట్టలు తీసుకుని మరుసటిరోజు వస్తానని నాన్న దగ్గర చెప్పాను.

గాంధీనగర్, ఆంజనేయస్వామి వీధి లోని నాలుగు అంతస్తుల అపార్ట్ మెంటులో రెండవ అంతస్తులో అద్దెకు ఉంటున్నట్టు చెప్పి, ఆ అడ్రస్సు ఇచ్చి వెళ్ళారు. నేను సంతోషంగా ఇంటికి వచ్చాను.

దాంతో డైరీ ముగిసిపోయింది. మాలతీ ఇతన్ని వదిలేసి, తండ్రి ఇంటికివెళ్ళి, విడాకులు తీసుకుని ప్రశాంతంగా ఉండుంటుందనే నమ్మకం రాక, చాలా విషయాలు అయోమయంగా ఉన్నాయి.

ఆమె నిధిగా అనుకుంటున్న పుస్తకాల పెట్టెను, తన ఆలోచనలను వాక్యాలుగా రాసుకుంటున్న డైరీనీ ఎందుకని వదిలేసి వెళ్ళుంటుంది? అంతే కాకుండా ఆమె చీరలే అత్తయ్య బీరువాలో ఉన్నాయనేది డిఫినెట్.

వాటిని ఎందుకు తీసుకు వెళ్ళలేదు? ఒక వస్తువును కూడా ఆమె తీసుకు వెళ్ళకుండా ఆమెను వెళ్ళగొట్టాడా నాగరాజు?  అలాగైతే మాలతీ తన తల్లి-తండ్రులతో ఉండుంటుందా? ఎలా ఉంటుంది ఆ మాలతీ?

ఆమెను చూడాలని అనిపించింది మహేశ్వరీకి. హైదరాబాద్ కి వచ్చినప్పటి నుండి బయటకు ఎక్కడికీ తనని తీసుకు వెళ్ళలేదు నాగరాజు. భార్యను తలుచుకుంటేనే కదా ఎక్కడికైనా తీసుకు వెళ్తాడు. ఈ గాంధీనగర్ ఎక్కడుంది? అక్కడ మాలతీ అడ్రస్సు ఎక్కడుందో? మహేశ్వరీకి ఆమెను కలుసుకోగలననే నమ్మకమే లేదు.

టైము నాలుగైంది. అత్తగారు ఇంకా నిద్రపోతోంది. మేడమీద ఆరేసున్న బట్టలను ఆమె లేచేలోపల తీసుకుని వచ్చేద్దాం అని అనుకుని డైరీని బద్రపరచి, మేడపైకి వెళ్ళింది.

ఒక్కొక్క బట్ట తీసి అక్కడే మడత పెట్టి ఒక పక్కగా పెట్టింది. ఆమె బట్టలు మడతపెట్టటం పక్కింటి మేడమీద నుండి ఎవరో తొంగి చూడ, మహేశ్వరీ అదెవరని చూసింది. పక్కింటి మేడపైన ఒక వయసు మల్లిన వృద్దురాలు ఈమెను చూసి ఒక దొంగ నవ్వు నవ్వింది. మహేశ్వరీ కూడా నవ్వింది.

"పేరేమిటి?"

"మహేశ్వరీ"

"నిన్ను బాగా చూసుకుంటున్నాడా?"

"ఎందుకు అడుగుతున్నారు?"

ఆ వృద్దురాలు ఒక్క నిమిషం మౌనంగా ఉండి తరువాత పిట్టగోడకు దగ్గరగా వచ్చి, "ఇటురా!" - మహేశ్వరీని దగ్గరకు పిలిచింది.

"ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉంటున్నావా?"  

"ఎందుకమ్మా అలా అడుగుతున్నారు?"

"కారణంతోనే. చెప్పు"

"లేదమ్మా. పనిమనిషిలాగానే ఉన్నాను"

"అనుకున్నా"

"నా భర్త గురించి మీకు తెలుసా?"

"తెలుసమ్మా. ఘోరమైన మనిషమ్మా అతను. ఈ ఇల్లు కూడా అతనిది కాదు. ఆ అమ్మాయి తండ్రిని బెదిరించి రాయించి తీసుకున్న ఇల్లు. నీ భర్తకు ఇదివరకే పెళ్ళి జరిగిందనే విషయం నీకు తెలుసా?"

"విన్నాను. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా?"

"అలాగైతే నీకు ఆ విషయం తెలియదా? పరమ దరిద్రుడు. ఆ విషయం నీ దగ్గర చెప్పలేదా"

"ఏ విషయం?"

"ఆ అమ్మాయి...ఇదిగో, ఇదే మేడమీద నుండే పడిపోయి చచ్చిపోయింది..."

"భగవంతుడా..." మహేశ్వరీ ఆశ్చర్యపోయింది. ఒళ్ళంతా గుప్పుమని చెమటలు  పట్టాయి. కాళ్ళు గడగడా వణికినై.

"నిజంగానా చెబుతున్నారు?" అన్న ఆమె స్వరం బొంగురుపోయింది.

"ఈ వీధిలో ఎవరి దగ్గరకైనా వెళ్ళి అడుగు. ఇదే చెప్తారు. పాపం ఆ అమ్మాయి! ఒక హంతకుడి దగ్గర చిక్కుకుని పడకూడని కష్టాలు పడి వెళ్ళిపోయింది"

"ఆత్మహత్య చేసుకుందనా చెబుతున్నారు?"

"ఆత్మహత్యే అనే నిర్ణయించారు. కానీ, నా కూతురూ, మాలతీ క్లోజ్ ఫ్రెండ్స్. మాకు ఆమెను బాగా తెలుసు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఆ రోజు ఏం జరిగిందనేది ఈ రోజుకూ ఒక అర్ధంకాని పజిల్. తానుగానే కింద పడిందా, లేక ఆ దరిద్రుడు తోసాడా అనేది ఆ భగవంతుడికే తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నువ్వు ఆ పాపాత్ముడిని పెళ్ళి చేసుకుని వచ్చావు. మేడమీద నిన్ను చూడటంతో భయపడిపోయాను. ఎక్కడ నువ్వు కూడా ఆమెలాగా...మంచికాలం. బట్టలు తీయటానికి వచ్చావని తెలుసుకున్న తరువాత నా మనసు శాంతించింది. ఎందుకైనా మంచిది, వాడి దగ్గర కొంచం జాగ్రత్తగా ఉండు. ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఉండు. ఇది చెప్పటానికే వచ్చాను. వెళ్ళిరానా?"

"అమ్మా ఒక్క నిమిషం"

"ఏంటమ్మా?"

"ఆ అమ్మాయి తల్లి-తండ్రులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా?"

"తెలుసే. నా కూతురే అప్పుడప్పుడు వెళ్ళి ఓదార్పుగా నాలుగు మాటలు చెప్పి వస్తుంది"

"మీ కూతురితో చెప్పి ఒకసారి నన్ను కూడా తీసుకు వెళ్ళమని చెబుతారా?"

"నువ్వా..." ఆ వృద్దురాలు షాకయ్యింది. "నీ భర్తకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?"

"ఆయనకు తెలియకుండానే వెళతాను. ఏది ఏమైనా సరే నేను వాళ్ళను చూసే తీరాలి. దయచేసి మీ అమ్మాయి దగ్గర చెప్పండి"

"చెబుతాను. రేపు మేడ మీదకురా. ఏ రోజు వెళ్దామని నా కూతురు తీర్మానిస్తుందో తెలుసుకో. త్వరగా వెళ్ళు. నీ భర్త వచ్చేస్తాడు"

బామ్మ చెప్ప, మహేశ్వరీ మడతపెట్టిన బట్టలను తీసుకుని కిందకు వచ్చింది.

"ఎక్కడికి పోయి చచ్చేవే?" అత్తగారు అవస్తతో అరిచింది.

"గుడ్డలు మడతపెట్టి తీసుకు వస్తున్నా" మహేశ్వరీ బెడ్ పాన్ పెట్టేసి అత్తగారి బట్టలను బీరువాలో పెట్టటానికి బీరువా తెరిచింది. మాలతీ బట్టలను ఒకసారి జాలిగా చూసింది. ఏం అనిపించిందో అత్తగారివైపు తిరిగింది.

"ఏం అత్తయ్యా, ఎందుకు ఇన్ని చీరలు పెట్టుకున్నారు. అంతే కాకుండా చిన్న వయసు ఆడపిల్లలు కట్టే చీరలలాగా కనబడుతున్నాయి! మీరేమో ఏదీ కట్టటం లేదు. నాకిస్తే నేనైనా కట్టుకుంటా కదా?"

"కుదరదు. బీరువాను మూసేసి పనులు చూడు"

అత్తగారు అలా చెప్పినా మహేశ్వరీ ఒకచీరను దాచి, అత్తగారికి కనబడకుండా తీసుకునే బయటకు వచ్చింది.

ఆరోజు రాత్రి నాగరాజు పడుకోవటానికి వెళ్ళినప్పుడు అతని వెనుకే వెళ్ళింది.

"ఏం కావాలి? వెళ్ళి అమ్మతో పడుకో"

"నాకు జీవితమంటేనే విరక్తి పుడుతోంది"

అతను కోపంగా చూడ...ఆమె కొనసాగించింది.

"మరి. పొద్దున్నుంచి వంటచేస్తున్నాను. బట్టలు ఉతుకుతున్నా. అంట్లు తోముతున్నా. ఇల్లు ఊడ్చి శుభ్రం చేస్తున్నా, తుడుస్తున్నా. మీ అమ్మగారిని శుభ్రం చేసి, బెడ్ ప్యాన్ పెట్టి తీసి, రాత్రి వరకు రెస్టులేని పని. నేనేమన్నా మనిషా గొడ్డా? పెళ్ళాం అనే పేరుతో ఇంట్లోనే జీతం లేని పనిమనిషిగా పెట్టుకున్నారు. ఈ పనులను అన్నయ్య ఇంట్లోనే చేసుంటే వాళ్ళంతా నాతో ప్రేమగానైనా ఉన్నారు. నేను అక్కడికే వెళ్ళిపోతాను. భర్త వదిలేసిన ఆడది అని అనుకున్నా పరవాలేదు. నన్ను తీసుకువెళ్ళి దింపండి"

"ఖచ్చితంగా తీసుకువెళ్ళి దిగబెడతాను. కానీ ఇప్పుడు కాదు. మా అమ్మ చచ్చిపోనీ. ఆ తరువాత నిన్ను పంపిస్తాను"

"అలాగైతే ఆమెను చూసుకోవటానికేనా నా మెడలో తాళి కట్టి తీసుకువచ్చారు?"

"అవును. ఇప్పుడేమంటావు? పెళ్ళి చేసుకోకుండా నిన్ను తీసుకువచ్చి అమ్మను చూసుకోమని చెప్పగలనా?”

"మీకు సిగ్గుగా లేదా? మీ స్వార్ధం కోసం నా జీవితాన్నే నరకం చేస్తున్నారే. ఇది న్యాయమా?"

"ఇదిగో చూడూ, అనిగిమెనిగి ఉండు. లేకపోతే...నిన్ను పూడ్చి పెడతాను"

"ఎలా? ఆమెను పూడ్చి పెట్టేరే...అలాగా?" - నోటి చివర వరకు తృళ్ళిపడుతూ వచ్చిన మాటను శ్రమపడి మింగేసింది. 'వద్దు. ఇతని చేతులతో చనిపోవటానికి నేను రాలేదు'

ఇతనికి ఇతరుల భావాలు అర్ధంకావు. తాను మగాడు అనే అహంకారంతో కళ్ళు మూసుకుని నడిచే మృగం ఇతను. ఇతన్ని తంత్రంతోనే పడేయాలి.

అంతకు ముందు మాలతీ తల్లి-తండ్రులను ఎలాగైనా కలుసుకోవాలి. మాలతీ యొక్క వ్యవహారం నాకు తెలుసు అనే అనుమానం కొంచం కూడా నాగరాజుకు ఏర్పడకూడదు అనే దానికోసమే ఊరికి తీసుకువెళ్ళి వదిలిపెట్టమని విసుగుతోనూ, విరక్తితోనూ మాట్లాడాను. ఏ ఒక అమ్మాయికైనా ఇలా విసుగు, విరక్తి పుడుతుందని తెలుసు కాబట్టి అతనికి వేరే సందేహమేదీ ఏర్పడదు.

ఆమె మాలతీ ఇంటికి వెళ్ళే సమయంకోసం ఎదురుచూస్తూ కాచుకోనుంది. ఆ మరుసటి వారం మామగారు స్నేహితులతో కలిసి కుంబకోణం బయలుదేరి వెళ్ళటంతో, అత్తగారికి ఒకటికి, రెండు డోసులు ఎక్కువ మందు ఇచ్చి నిద్రపోనిచ్చి పక్కింటి తలుపు తట్టింది.

"ఈ రోజు మాలతీ వాళ్ళింటికి వెళ్దామాండీ?" మాలతీ యొక్క స్నేహితురాలిని అడిగింది మహేశ్వరీ.

"నాకు ఆఫీసు పనులు చాలా ఉన్నాయి. ఒక పనిచేస్తా. మిమ్మల్ని వాళ్ళింట్లో వదిలేసి వెళ్తాను. తిరిగి వచ్చేటప్పుడు మీరు ఒంటరిగా తిరిగి వచ్చేయగలరా?"

"ఎలాగైనా వచ్చేస్తాను"

"ఒక్క నిమిషం ఉండండి" ఆమె బయలుదేరి వచ్చింది. ఒక ఆటో మాట్లాడుకుని ఇద్దరూ బయలుదేరారు.

చిన్న అపార్ట్ మెంటే. ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంత వాతావరణంలో ఒక శోకం నిండిపోయుంది.

"రామ్మా స్వప్నా. మనిషే కనబడటం లేదని అనుకున్నా. ఎవరీ అమ్మాయి?"

"మాలతీ తరువాత ఈమెనే అతను..."

మాలతీ తల్లి షాకుతో మహేశ్వరీని చూసింది.

"ఈమె మిమ్మల్ని చూడాలని చెప్పింది ఆంటీ, అందుకే పిలుచుకు వచ్చాను. జాగ్రత్తగా పంపించండి. నేను తరువాత వస్తాను ఆంటీ" స్వప్నా చెప్ప లోపలకు రామ్మా అంటూ పిలుచుకు వచ్చింది. భర్త దగ్గర విషయం చెప్పి, ఆయన్ని ఆయన గదిలో నుండి రప్పించింది.

"ఏ ఊరమ్మా మీది?" ఆయన ఆమె మీద జాలిపడుతూ ఆమెను చూస్తూ అడిగాడు.

"జగ్గయ్యపేట పక్కన ఒక గ్రామం"

"అదే కదా చూసాను. ఊరు, పేరు తెలియని వారినేగా మోసం చేయవచ్చు? రెండో పెళ్ళి అని తెలిసే మెడ వంచావా అతనికి?"

"తెలియదు"

"ఆ తరువాత ఎలా తెలిసింది. చుట్టు పక్కలున్న వాళ్ళు చెప్పారా?"

"లేదు. ఇది చదివి తెలుసుకున్నాను!" ఆమె మాలతీ రాసిన డైరీని చూప, ఆయన ఆశ్చర్యంతో అది తీసుకుని పేజీలు తిప్పారు. మాలతీ ఇలా ఒక డైరీ రాసింది ఆయనకు తెలియదు. చనిపోయిన కూతురి భావాలను ఆమె చేతిరాతలో చూసినప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యాడు. కళ్ళల్లో నుండి నీటి బొట్లు కిందపడ్డాయి. ఆ డైరీని హృదయానికి హత్తుకున్నాడు.

"ఇది ఎక్కడ దొరికిందమ్మా?"

"ఆమె పుస్తకాల పెట్టెలోనే"

"ఇంకా ఏదైనా అందులో ఉందా?"

'ఇంకేముంటాయి ' అని అనుకుంటూ "ఏదైనా అంటే? పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఇంకేమిటి ఎదురు చూస్తున్నారు?"

"ఏదైనా లెటర్..."

"అలాంటిది ఏదీ లేదు. ఏం లెటర్"

"చనిపోవటానికి ముందు ఏదైనా రాసిపెట్టి ఉంచిందేమోనని"

"అలాగైతే మీ అమ్మాయి ఎలా చనిపోయుంటుంది అని మీకు సందేహం ఉందా?"

"అత్మహత్య చేసుకునేంత పిరికితనం దానికి లేదు. ఇప్పుడే వచ్చేస్తానని మాతో చెప్పి వాళ్ళింటికి వెళ్ళిన నా కూతురు మేడ మీద నుండి దూకి చచ్చిపోయిందనే వార్త వచ్చింది. నేను నమ్మలేకపోయాను. కొద్ది రోజులుగా బుద్ది స్వాధీనం లేకుండా ఉన్నదని భయంలేకుండా అబద్దం చెప్పాడు ఆ దరిద్రుడు. ఏం చేసాడో? ఎక్కడ లంచమిచ్చి నిజాన్ని నొక్కి పారేసాడో తెలియదు కానీ ఆత్మహత్యే నంటూ కేసు క్లోజ్ చేశారు. ఎదిరించి పోరాడదామనుకుంటే నాకు ఓపిక లేదు. భగవంతుడనే వాడు ఒకడుంటే వాడి దండిస్తాడని వదిలేశాను. కానీ ఎక్కడమ్మా...ఈ కలికాలంలో భగవంతుడే భూమికి రావటానికి భయపడతాడమ్మా. భూమి మీద అంత ఘోరం జరుగుతోందమ్మా. అవునూ...నువ్వెలా ఉంటున్నావు ఆ ఇంట్లో?"

"రాక్షసుడ్ని పెళ్ళి చేసుకుని సంతోషంగాన ఉండగలను?...పురుగు, పుట్రా కంటే హీనంగా ఉంటున్నాను. చదువుకున్న మీ అమ్మాయినే అంత కష్టపరచినవాడు, చదువుకోని ఈ గ్రామస్తురాలిని నన్ను మాత్రం బాగానా ఉంచుకుంటాడు?"

"అలాంటప్పుడు ఎందుకమ్మా అక్కడ ఉంటున్నావు? 'ఛీ పోరా' అని అతన్ని వదిలేసి వెళ్ళిపోయుండచ్చు కదా?"

"ఎక్కడికెళ్తాను. మా అన్నయ్యకు భారంగా మళ్ళీ అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఆయనకీ ఇద్దరు అమ్మాయులున్నారు. మొగుడ్ని వదిలేసిన అత్తయ్య ఒకత్తి ఉంటే, వాళ్ళ భవిష్యత్తు నాశనమైపోతుంది. పెళ్ళి జరగకుండా ఉంటే బాధే లేదు. కానీ పెళ్ళి అయిన తరువాత ఓడిపోయి తిరిగివెళ్తే ఊరు మెచ్చుకోదు. నాలుగు రకాలుగా మాట్లాడతారు. అన్నయ్య అవమానానికి లోనవుతాడు. అందుకనే సహించుకుని ఉంటున్నాను. ఒక వేళ వాళ్ళ అమ్మ చనిపోయి, అతను నన్ను బయటకు వెళ్ళిపొమ్మన్నా అన్నయ్య దగ్గరకు వెళ్ళను. ఏదైనా అనాధ ఆశ్రమాన్ని వెతుక్కుని వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం చెబుతానండీ...అలా వెళ్లాల్సి వస్తే అతన్ని పెద్దగా అవమానపరచే వెళ్తాను. 'ఆడవాళ్ళంటే అంత చులకనరా నీకు' అని అతని మొహం మీద ఉమ్మేసి వెళతా. మీ అమ్మాయి చావుకు అతను జవాబు చెప్పే తీరాలి. చట్టం నుండి తప్పించుకున్నానని అతను అనుకోవచ్చు. కానీ, అతనికి ఒక శిక్ష విధించే నేను అక్కడ్నుంచి బయటకు వస్తాను"

హాలులో గోడకు తగిలించున్న అందమైన మాలతీ ఫోటోను చూస్తూ చెప్పింది.

"ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. వాడు హంతక కిరాతకుడు. అదే సమయం అతను ఆఫీసులో చాలా మంచిపేరు సంపాదించుకున్నాడు. అతని గురించి ఏది చెప్పినా వాళ్ళు నమ్మటం లేదు. అంత గొప్పగా రెండు వేషాలు వేస్తూ ఊరిని మోసం చేస్తున్నాడు"

"నమ్మకం లేకుండా మాట్లాడే వాళ్ళ దగ్గర ఈ డైరీ తీసుకు వెళ్ళి చూపించండి. మీ అమ్మాయి స్వయానా తన చేతితో రాసిన విషయాలను చదవనివ్వండి"

"దీన్ని కూడా అబద్దం అని చెప్పేస్తారమ్మా. భర్త అంటే ఇష్టం లేదు కాబట్టి అతని గురించి తప్పు తప్పుగా రాసిపెట్టింది అని చెబుతారు. సరే పోనీ. ఏం చేసినా నా కూతురు తిరిగి రాదు. నువ్వక్కడ జాగ్రత్తగా ఉండు. నీ ప్రాణానికి ఆపద ఏదైనా వస్తున్నదని తెలిస్తే, ఆలస్యం చేయకుండా బయటకు వచ్చేయి. మా ఇంటికి వచ్చేయి. నీ జీవితానికి నేను దారి చూపిస్తాను. ఎవరూ లేరని బాధపడకు. మేమున్నాం. ధైర్యంగా ఉండు"

ఆయన అభిమానంతో ఆమెను సాగనంపాడు. కూతురి డైరీని కన్నీటితో చూశారు.

*************************************************PART-7******************************************

మధ్యరాత్రి మెలుకువ వచ్చింది నాగరాజుకు. ఏదో శబ్ధం వినబడటంతో చీకట్లో కళ్ళు చిట్లించుకుని చూశాడు. గది వాకిలిలో ఒక రూపం మసకమసకగా కనబడ, షాకుతో ఎవరు, ఎవరది అంటూ కేక వేశాడు. గదిలైటు వేశాడు.

గది వాకిలిలో ఒక రూపం చీరను ఎగరవేసుకుంటూ వెళ్ళటం చూసి దడుసుకున్నాడు. ఖచ్చితంగా మాలతీనే. భయంతో ఒళ్ళు వణికింది అతనికి. దయ్యం, భూతం అని చదువుకున్నాడు. పలు మంది చెప్పటం విన్నాడు. చనిపోయి రెండు సంవత్సరాలు అయినా మాలతీ దయ్యంగా తిరగటం కళ్ళతో ఇప్పుడే చూశాడు.

భయంతో గొంతుక అడ్డుపడుతున్నట్టు అనిపించింది. గుండె కొట్టుకునే వేగం పెరగటంతో చెమట పట్టింది. కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. తెల్లారేంత వరకు నిద్రపోకుండా దైవనామ స్మరణం చెప్పుకున్నాడు.

మరుసటి రోజు తెల్లవారిన వెంటనే తండ్రి దగ్గర రాత్రి జరిగిన విషయం వివరించాడు.

"భ్రమ పడుతున్నావు నువ్వు" ఆయన నవ్వారు.

"లేదు నాన్నా, బాగా చూశాను. ఎందుకైనా మంచిది. ఒక పూజ చేసేద్దామా?"

"అనవసరమైన ఖర్చు...నీ పని చూసుకో. దయ్యంట, భూతంట"

"ఇటు రండి" తల్లి ఇద్దర్నీ దగ్గరకు రమ్మన్నది.

"వాడు చెప్పేది నిజమే. నా కళ్ళకు కూడా కనిపించింది. భయంలో బెడ్ అంతా తడిపాశాను. అంతా వీడి వలనే. తండ్రి ఇంటికి వెళ్తానంటే, వెళ్ళమని చెప్పుండచ్చు. అది వదిలేసి..."

"నోరు మూస్తావా..." తండ్రి అంతకంటే ఎక్కువ మాట్లాడనివ్వకుండా అనిచినప్పుడు గంజి గిన్నెతో లోపలకు వచ్చింది మహేశ్వరీ.

మౌనంగా అత్తగారికి గంజి తాగిస్తున్న ఆమె చివరి గుక్క గంజిని చటుక్కున నాగరాజు మొహాన విసిరి పోసి అతన్ని పిచ్చిదానిలా చూసింది.

"ఏం...నన్ను చంపినట్టు, మీ అమ్మనూ చంపేయచ్చు కదా. ఎందుకీ నడవలేని శవాన్ని ముద్దాడుతున్నారు?"

మహేశ్వరీ చిన్న స్వరంతో అలా అడగటంతో, నాగరాజుకు హడలు పుట్టింది.  తండ్రినీ, తల్లినీ ఒకసారి చూసేసి, ఆమెను చూసిన అతని మొహం రక్తంలేక వాడిపోయినట్లు ఉంది.

"అన్యాయంగా నన్ను చంపేసి, మీరు మాత్రం ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు...? వదలనురా"

పళ్ళు కొరుక్కుంటూ, ఎర్రబడ్డ కళ్ళతో చెప్పిన ఆమె, మరు క్షణం కళ్ళు తిరిగి పడిపోయింది.

షాకుతో శిలలైన వాళ్ళు కొద్దిసేపు ఆయిన తరువాతే కదిలారు. కళ్ళు తిరిగి పడిపోయున్న ఆమెను భయంతో చూశారు.

"నేను చెప్పలా. అది ఇక్కడే తిరుగుతోందని. అదే ఇప్పుడు దీని శరీరంలో దూరి అరుస్తోంది. చూశారు కదా?"

"ఆశ్చర్యంగా ఉంది. ఈమెకు ఖచ్చితంగా ఏమీ తెలియదు. మరెలా ఆ రోజు జరిగింది చెప్పగలుగుతోంది"

"మీరు వెళ్ళి ఎవరైనా పూజారిని తీసుకుని రండి. ఈ దయ్యాన్ని తరిమిన తరువాతే ఇంకోపని"

"అలాగే" అంటూ ఆయన లేచారు. "ఈ రోజే వెళ్ళి చూస్తాను" అని చెబుతూ స్నానం చేయటానికి వెళ్ళారు. అతను ఆమె మొహం మీద చల్లటి నీళ్ళు కొట్టాడు. ఆమె గబుక్కున లేచి అయోమయంతో చుట్టూ చూసింది.

"క్షమించండి. ఏదో అయ్యింది. పడిపోయాను" అంటూ లేచి వెళ్ళి టిఫిన్ చేయటం మొదలుపెట్టింది. మినపట్టు వేసి, చట్నీ చేసి, వెంటనే వంట కూడా చేసి ముగించి అతని టిఫిన్ బాక్సులో పెట్టింది.

తండ్రికీ, కొడుక్కూ టిఫిన్ ఇచ్చేసి, వంట గదిని శుభ్రం చేసింది.

"నేను బయలుదేరుతున్నాను నాన్నా. వెంటనే నువ్వు మనిషిని ఏర్పాటు చేసే పని చూడు. మరిచిపోకు!" అంటూ బయలుదేరి వెళ్ళాడు నాగరాజు.

మామగారు పంచ,షర్టు మార్చుకుని బయలుదేరటానికి రెడీ అవుతున్నప్పుడు, ఆయన యొక్క గది వాకిలిలో నిలబడి ఆయన్నే చూస్తూ ఉన్నది మహేశ్వరీ. ఆయన మొహం మారింది "జరుగు" అన్నారు ఆయనలో ఏర్పడిన భయాన్ని అనిచిపెట్టుకుని.

"లోపలకు పో..." ఆమె ఉరిమింది. ఆయన హడలిపొయాడు.

"లోపలికి వెళ్ళరా అంటున్నా కదా..." ఆమె మొరటుగా ఆయన్ని వెనక్కి తోసి ఎర్రటి కళ్ళతో ఆయన్ని చూసింది.

"ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఊ...? వెళ్ళగలవా నువ్వు? ఎవరిని తరమబోతారు మీరు? నన్నా? తరమగలవా? ఏదీ తరిమి చూడు"

ఆయన భయంతో వెనక్కి తగ్గాడు.

"బయటకు వెళ్ళగలవా నువ్వు" ఆమె గబుక్కున ఆ గది తలుపులులాగి, మూసి, భయట తాళం పెట్టి అత్తగారి రూముకు వచ్చింది.

"రాస్కల్! నన్ను తరుముతాడట. అదీ చూస్తాను!" అని అరిచిన ఆమె, కోపంతో అక్కడున్న కుర్చీలో కూర్చుని అటూ, ఇటూ తిరిగి కోపంతో మొహం చిట్లించుకుని చూసిన ఆమె కొంచంసేపట్లో అలా తల వంగి కుర్చీలోనే జారిపోయింది.

మామగారు గదిలోపల నుండి దడ దడమని తలుపు మీద కొట్టాడు. అత్తగారు ఏమీ అర్ధంకాక, "ఏయ్ మహీ, లే..." అని అరిచింది. సాయంత్రం వరకు మహేశ్వరీకి స్ప్రుహ లేదు. అలాగే పడుంది.

నాగరాజు వచ్చేవరకు బాగా నిద్రపోయింది. అతను తన మొహం మీద జల్లిన నీటి వలన జలదరించి కళ్ళు తెరిచింది.

"ఏమైందే శనేస్వరం!"

"తెలియదండీ"

తండ్రి ఉన్న గదిని తెరిచాడు.

"ఇద్దరం ఈ రోజంతా తినలేదురా. ఆకలి చావులో పడేసింది రాక్షసి" - ఆకలి తట్టుకోలేక వంటగదిలోకి వెళ్ళాడు తండ్రి. అక్కడ ఏమీ లేదు.

చేసిన వంటంతా మురికి కాలవలో పడేసుంది. మహేశ్వరీ బెదిరిపోయింది. "ఏమండీ ఎవరు ఇలా పడేసింది?" అని అమాయకంగా అడిగింది. నాగరాజు తలమీద చెయ్యి పెట్టుకుని మంచంపైన కూర్చుండి పోయాడు. ఇదేంటి కొత్త తలనొప్పి అనుకుంటూ బాధపడ్డాడు.

"ఆకలేస్తోందిరా...ఇప్పుడేం చేద్దాం" అడిగాడు తండ్రి.

"వెళ్ళి హోటల్ నుండి ఏదైనా కొనుక్కురండి..." డబ్బుతీసి ఆయనకిచ్చాడు.

"మావయ్యా నాకు పూరీ-కూర్మా దొరికితే తీసుకు రండి"

మహేశ్వరీ తనకు కావలసింది చెప్ప, నాగరాజు ఆగ్రహంతో లేచొచ్చి ఆమె తలమీద మొట్టికాయ మొట్టాడు.

"శనేస్వరం...ఇంకా మమ్మల్ని ఎంత బాధపెడతావు? నీకూ ఆకలేస్తోందా. పూరీ-కూర్మా కావాలా. పచ్చి మంచి నీళ్ళు కూడా లేవు. పోవే!" మార్చి మార్చి ఆమెను కొట్టాడు.

"రేయ్ వద్దు వదిలేయరా. ఏదైనా జరగకూడనిది జరగొచ్చు. మహేశ్వరీ ఏమీ చెయ్యలేదురా. ఆమె లోపల ఉన్న దయ్యం ఆమె ద్వారా అన్ని పనులూ చేస్తోంది. ఆమెను ఆడిస్తోంది. మొదట దాన్ని తరమటానికి ఏర్పాటు చెయ్యి" అత్తగారు అరిచింది.

"అంతా నీ వలనే" నాగరాజు తల్లిని కసురుకున్నాడు.

"నేనేం చేశానురా?"

"నీకోసమే కదా నేను ఈ శనేస్వరాన్ని తాళికట్టి తీసుకువచ్చాను!"

"అదిసరే, ఎందుకు చెప్పవు...నీ వలనేరా నాకు ఇలా అయింది"

"నోరు ముయ్యమ్మా. పిచ్చిగా మాట్లాడకు!" అతను గబుక్కున తల్లిని అనిచాడు.

"నిన్ను మొదట చంపాలి. లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడి నువ్వే నన్ను పోలీసులకు అప్పగించేలాగా ఉన్నావు"

"అది చెయ్యి మొదట. ప్రశాంతంగా వెళ్ళి జేరిపోతాను. ఇలా ప్రాణమున్న శవంగా పడుండటం కంటే, అలా వెళ్ళిపోవటమే ఎంతో మంచిది"

"నోరు ముయమ్మా. ఉన్న తలనొప్పి చాలదా? నువ్వు వేరేగా సుత్తితో కొట్టాలా. నేనేదో కావాలని చేసినట్లు చెబుతున్నావు"

"తెలిసి చేశావో, తెలియక చేశేవో ఆ కర్మ ఇప్పుడు ఇంటిని చుట్టుముట్టింది కదా. ఏం చెయ్యబోతావు?"

"నోరుమూసుకుని ఈ శనేస్వరాన్ని తీసుకువెళ్ళి ఆమె ఇంట్లోనే తోసేసి రానా?"

"అది చెయ్యి"

"నిన్నెవరు చూసుకుంటారు?"

"నన్ను ఏదైనా ఒక హోం లో చేర్చేయి. నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నందుకు నేను అనుభవించ వద్దూ"

"నువ్వుగా ఎక్కడ చెప్పావు? నేను చెప్పిస్తేనే కదా నువ్వు చెప్పావు. లేకపోతే ఈ ఇల్లు మనకు దొరికుండేదా? ఈ రోజుకు దీని విలువ కోటి రూపాయలకు పైనే ఉన్నది. ఇండి పెండెంట్ ఇల్లు. ఎలాంటి ఏరియా! మనం కొనగలమా? దీనికొసమే కదా అంత నాటకం ఆడి బయటకొచ్చి ఈ ఇంట్లోకి దూరాను"

"కానీ ఈ ఇంట్లో మనం సంతోషంగానా ఉన్నాము. లేక చచ్చిపోతే ఈ ఇల్లు మనతో వస్తుందా?"

"ఓహో! పోయే సమయం వస్తున్నప్పుడు వేదాంతం మాట్లాడుతున్నావా?"

"ఎలాగైనా పెట్టుకో. నాకు ఈ జీవితం చాలురా. చచ్చిపోదాం అనిపిస్తొంది. ఉంటే బాగుండాలి. ఏదీ అనుభవించలేక ఇదేం పడక. అందుకే చెబుతున్నా నన్ను తీసుకువెళ్ళి హోం లో వదిలేయి. ఈ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వెళ్లగొట్టి ఆమెతోనైనా బాగా ఉండి జీవితాన్ని ఆనందంగా గడుపు"

"వద్దు వద్దు. నాకు ఎవరూ వద్దు. ఏ భాధ్యతా వద్దు. ఒంటరిగా నాకు ఇష్టం ఉన్నట్టు వుంటాను. రేపే దీన్ని తీసుకువెళ్ళి వదిలేసి వస్తాను. వెళ్ళి వాళ్ళ అన్నయ్యనే అతుక్కోని ఉండనీ. ఈ శనేస్వరంతో ఇక ఎవరైనా కాపురం చేస్తారా"

నాగరాజు తీర్మానంగా చెప్పాడు. దాక్కుని, వాళ్ళు మాట్లాడుకుంటున్నది విన్న మహేశ్వరీ నవ్వుకుంది.

మావగారు టిఫిన్ ప్యాకెట్లతో రావటం కనబడటంతో గబుక్కున వంటగదిలోకి దూరింది.

"దాన్ని పిలిచి పూరీ తీసుకోమను"

"ఎందుకు కొన్నారు?"

"లేకపోతే తరువాత పూరీ ఎందుకు కొనలేదని నన్ను పట్టుకుని వాయించటానికా? దేనికి గొడవ? ఇది తిన్న తరువాత అయినా దీన్ని వదిలి అది పారిపోతుందా చూద్దాం!" ఆయనే ఆమెను పిలిచి, పూరీ ప్యాకెట్టు తీసుకోమన్నారు.

"నీ బట్టలన్నీ తీసి రెడీగా పెట్టుకో. రేపు నిన్ను తీసుకువెళ్ళి మీ ఇంట్లో వదిలేస్తాను"

"ఎందుకండీ?"

"నువ్వే కదా తీసుకువెళ్ళి దిగబెట్టమన్నావు"

"నిజంగా వదిలిపెడతారా? మోసం చెయ్యరు కదా"

"చెయ్యను. ప్రొద్దున్నే బయలుదేరదాం"

"మరి అత్తయ్యను ఎవరు చూసుకుంటారు?"

"దాని గురించిన బాధ నీకెందుకు. నువ్వు రెడీగా ఉండు" అతను తన గదికి వెళ్ళాడు.

కొద్దిసేపటి తరువాత ఎవరో తలుపుతడుతున్నారు. మావగారు వెళ్ళి తలుపు తెరిచారు.

బయట అన్నయ్య నిలబడున్నారు.

అన్నయ్యను చూసిన మహేశ్వరీ నవ్వు మొహంతో పరిగెత్తింది. తొంగి చూసిన నాగరాజుకు ముఖం మారింది.

"ఎలాగమ్మా ఉన్నావు?" అరటిపండ్ల గెలను ఆమె చేతికిస్తూ అడిగాడు.

"నువ్వు రాకపోతే, మేము అక్కడికి వచ్చుంటాము అన్నయ్యా"

అలాగా. నాకు తెలియదే. చాలా రోజులు అయ్యిందిగా...ఒక ఉత్తరం కూడా రాలేదని చూసి వెళ్దామని వచ్చాను

"మంచి పనిచేశావు రాజబాబు. వచ్చింది వచ్చావు...నువ్వే నీ చెల్లెల్ని తీసుకువెళ్ళిపో. నా కొడుకుకు తిరుగుడు తగ్గుతుంది"

"ఏమిటండీ  చెబుతున్నారు?" అన్నయ్య మొహం మారింది.

"మరేమిటయ్యా. నీ చెల్లెల్ను ప్రతిరోజూ ఒక దయ్యం పుచ్చుకు ఆడిస్తోంది. దయ్యం పట్టినట్టు గొడవ చేస్తోంది. వంటా వార్పూ ఏమీలేదు. ప్రొద్దున్నుంచి నన్ను రూములో ఉంచి తాళం వేసింది తెలుసా? చేసిన వంటంతా మురికి కాలవలో పారేసి మమ్మల్ని పస్తు ఉంచింది. ఎంతవరకని ఓర్చుకుంటాము? దయ్యం పట్టిన అమ్మాయిని మా నెత్తిన కట్టి మీరు ప్రశాంతంగా ఉంటునట్లున్నారు. వద్దు స్వామీ. మీరే తోలుకుపొండి ఈ దయ్యాన్ని. మాకు వద్దు"

"ఏమిటండీ ఏమిటేమిటో మాట్లాడుతున్నారు. అన్యాయంగా ఉందే. నా చెల్లెలు బాగానే కదా ఉంది? ఎందుకు అంత ఘోరంగా నెపం మోపుతారు"

"కావాలంటే మీరే రెండు రోజులు ఇక్కడుండి చూడండి. మీకే అర్ధమవుతుంది. మేము అబద్దం చెప్పటం లేదని"

"ఇదిగో చూడండి. మీరేమీ గొప్ప హరిశ్చంద్రుడి వారసులు కాదు. పెళ్ళి విషయంలో అబద్దం చెప్పిన కుటుంబమే కదా ఇది. ఇంతకుముందే ఒక పెళ్ళి చేసుకున్నట్టు, ఆ అమ్మాయితో విడిపోయినట్టు దాచే కదా నా చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నారు. నా చెల్లెలు ఉత్తరం రాసినప్పుడు కూడా 'జరిగిందేదో జరిగిపోయింది. ఓర్పుగా ఉండు. మగవారికి ఇది సహజం' అని బుద్ది చెప్పి తిరుగు టపా రాసాను. నిజం గురించి మీ నోటితో మీరు మాట్లాడకండి. నా చెల్లెలు బాగానే ఉండేది. మా ఊరికి వచ్చి ఎవరి దగ్గరైనా అడిగిచూడండి. ఒకలోటు కూడా చెప్పరు. పెళ్ళి చేసుకున్న తరువాతే ఇలా చెబుతున్నారు. ఇక్కడికి తీసుకు వచ్చి ఆమెను ఎన్ని కష్టాలకు గురిచేసారో?"

"మేము గురిచేశామా...మీ చెల్లెలు చేస్తోందా అనేది ఇక్కడ ఉండి చూడండి. అప్పుడు అర్ధమవుతోంది"

అన్నయ్య ఉన్న రెండు రోజులూ మహేశ్వరీ సాధారణంగానే ఉంది.

"మీరు చెప్పినట్టు మా చెల్లెలికి ఏదీ లేదే. నా చెల్లెలు బాగానే ఉంది. ఆమెతో మంచిగా కాపురం చెయ్యండి"

మూడో రోజు ప్రొద్దున్నే అన్నయ్య వెళ్ళిపోగా, నాగరాజు మొహాన నెత్తురాడలేదు.

"మాట్లాడకుండా దాని అన్నయ్యను ఇక్కడే ఉంచుకోనుండవచ్చు. దయ్యమే దగ్గరకు రావటానికి భయపడుతోంది చూడు" తండ్రి హాస్యం చేయగా, ఆయన్ని కోపంగా చూశాడు నాగరాజు.

"ఏయ్ ఇటు రావే" మహేశ్వరీని పిలిచాడు.

"ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు"

"వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను?"

"ఎక్కడికైనా వెళ్ళు. మా అమ్మను నేను హోములో చేర్చి చూసుకుంటాను"

"మీకు కావాలంటే తాళి కట్టి తీసుకువస్తారు. వద్దు అనుకుంటే పో అంటారా? నేనేమన్నా బొమ్మనా, భార్యనా?"

"అదంతా నాకు తెలియదు. నువ్వు ఇక్కడ ఉండకూడదు"

"ఇక్కడే ఉంటాను. ఏం చేస్తారు?"

"ఉంటే...చంపేస్తాను"

"ఏదీ చంపండి...చూస్తాను..." అతని దగ్గరకు వచ్చి నిలబడింది.

"ఇలా చూడూ...నీకు కావాలంటే డబ్బులిస్తాను, వెళ్ళిపో"

"డబ్బులోద్దు?"

"మరేం  కావాలి?"

"ఒక వారం టైము ఇవ్వండి. ఆలొచించి చెప్తాను". ఆమె నిర్లక్ష్యంగా నడిచి వెళ్తూ నిలబడి అతన్ని విరక్తిగా చూసింది.

"నేను తాళికి మర్యాద ఇచ్చే సరాసరి ఆడదాన్నే. దానికోసం నన్ను పిరికిదాన్ని అని అనుకోకుండి 'హత్య కూడా చేస్తుంది పతివ్రత 'అనేది ఇంత వరకు వినలేదా...? జాగ్రత్త...!" ఒక వేలు ఆడించి హెచ్చరిక చేసి వెళ్ళిన ఆమెను ఆశ్చర్యపోయి చూశాడు.

"ఇదిగో చూడరా నాగరాజూ. దానికి చదువుకున్న పొగరు మాత్రమే ఉంది. శరీరంలో బలం లేదు. కానీ ఈమె గ్రామం అమ్మాయి. కత్తి తిప్పటం కూడా నేర్చుకోనుంటుంది. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. అవసరపడకు. ఆమెగా ఇక ఇక్కడ ఉండకూడదు అనుకునేలాగా చెయ్యి"

నాగరాజు ఆలొచించాడు.

*************************************************PART-8******************************************

మరుసటి రోజు తండ్రి దగ్గర ఎవరైనా మాంత్రీకుడ్ని చూసి పిలుచుకు రమ్మని రహస్యంగా చెప్పేసి ఆఫీసుకు బయలుదేరాడు. మామగారు బయటకు  వెళ్ళిపోవటంతో మహేశ్వరీ అత్తగారికి బ్రెడ్డు, పాలు తీసుకు వెళ్ళింది.

"ఆకలి లేదు. వద్దు"

"ఎందుకని..."

"ఆకలి లేదు అంటున్నా కదా"

"మీకెలా అత్తయ్యా కాళ్ళూ, చేతులూ పడిపోయినై? ఎన్ని రోజులుగా ఇలా మంచం మీదే పడున్నారు?"

అలా అడిగిన వెంటనే అత్తగారి మొహం మారింది.

"అదంతా నీకెందుకు? వెళ్ళు పనిచూడు"

"నేను చెప్పనా...ఏదో చూసి భయపడి పోయే కదా మీకు ఇలా అయ్యింది? అలా ఏం చూశారు?"

అత్తగారు కలవారపాటుతో ఆమెను చూశారు.

"దేన్నీ చూసి నేను భయపడలేదు. నువ్వెళ్తావా?"

"చెప్పండి. వెళ్తాను. మీరు దేన్నో దాస్తున్నారు. నాకు అది తెలియాలి. ఆ మాలతీని అందరూ కలిపి ఏం చేశారు? ఇప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను చంపిన తరువాతే నేను వేరే పని చేస్తాను"

అత్తగారి కళ్ళల్లో భయం చోటుచేసుకుంది. మరణ కళ మొహంలో అతుక్కుంది.

"చె...చెప్పేస్తాను"

"చెప్పండి"

నా కొడుకు ఆమెను చంపేశాడు"

"........................"

ఈ ఇంటిని తన పేరుకు రాయించుకోవాలని ఆశపడ్డాడు. అందుకోసమే నాతో పోట్లాట పెట్టుకుని భార్యతో వాడు ఇక్కడికి వచ్చాడు. ఆ తరువాత వాళ్ళ అమ్మా, నాన్నలను బయటకు తరిమాడు. ఆ పిల్ల చదువుకున్నది. ఇతన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నది. ఆ రోజే వాడు నన్నూ, తండ్రినీ ఈ ఇంటికి తీసుకువచ్చాడు. మమ్మల్ని చూసిన వెంటనే మొహం తిప్పుకుంది ఆమె. ఏ మోహం పెట్టుకుని ఈ ఇంటికి వచ్చారని అడిగింది.

"వాళ్ళు నా తల్లీ-తండ్రులు. నా ఇంటికి రావటానికి వాళ్ళు ఎవర్ని అడగాలి. ఇక వాళ్ళు ఇక్కడే ఉంటారు" అని నా కొడుకు చెప్పాడు"

"దారాళంగా ఉండనీయండి. నేను వెళ్ళిపోతాను. ఆ తరువాత అందరూ ప్రశాంతంగా ఉండండి. త్వరలోనే డైవర్స్ నోటీస్ వస్తుంది. ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. మా నాన్నను మీరు తరిమినట్టు అతి త్వరలోనే మీ అందరినీ ఇక్కడ్నుంచి తరిమి, మా అమ్మా-నాన్నలను తీసుకు వచ్చి ఉంచుకుంటానా లేదా అనేది చూడండి"

అలా ఆమె పందెం వేయటంతో నా కొడుక్కు కోపం పొంగుకు వచ్చింది. ఆగ్రహంతో ఆమెను లాగి కిందకు తోశాడు. ఆమెను పిచ్చి పిచ్చిగా కొట్టాడు. ఆమె కూడా తిరిగి కొట్టటంతో వాడు గబుక్కున ఆమె మొహాన ఒక దిండును ఉంచి వెర్రి తనంగా నొక్కాడు. హత్య చేయాలి అనే అలొచన లేకపోయినా ఆగ్రహంతో చేసిన పనివలన కొద్దిసేపట్లో ఆమె ప్రాణం పోయింది. భయపడి వాడు ఏడవటం మొదలుపెట్టాడు.

చంపాలని అనుకోలేదమ్మా అన్నాడు. ఆ సమయంలో వాడిని కాపాడి తీరాలి. మీ మామగారు ఒక ప్లాను వేశారు. బాగా చీకటిపడిన తరువాత ఇద్దరూ కలిసి శవాన్ని ఎత్తుకుని మేడపైకి వెళ్ళారు.

పిట్టగోడ పక్కగా దాన్ని నిలబెట్టి నా భర్త పట్టుకోకున్నారు.

వద్దు మాలతీ...దూకద్దు...దూకద్దే అని ఎనిమిది ఊర్లకు వినిపించేటట్టు నా కొడుకు అరిచాడు. చుట్టుపక్కలున్న వారంతా తొంగి చూడ, కనబడకుండా క్రింద కూర్చున్న ఈయన దాన్ని అలాగే కిందకు నెమ్మదిగా తోశారు. ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించాము. కేసు ఫైలును పూర్తిగా మూసెయ్యటానికి కొంచంగా డబ్బు ఖర్చుపెట్టాము. వెంటవెంటనే జరిగిన ఆ సంఘటనల వలనే నాకు బ్లడ ప్రషర్ ఎక్కువై పక్షవాతంతో పడిపోయాను. ఒక సంవత్సరం ఎలాగో చూసుకున్నారు. వారివల్ల కాలేదు. ఆ తరువాతే నన్ను చూసుకునేందుకూ, ఇంటిపనులు చేయటానికీ మనిషిని వెతికాడు. చాలా డబ్బు అడిగారు. దానికంటే ఎవరైనా అమ్మాయి దొరికితే తాళికట్టి తీసుకురా అని వాళ్ల నాన్న చెప్పటంతో, అది మంచి ఆలొచనగా అనిపించటంతో, పెళ్ళికి అమ్మాయలను చూడటం ప్రారంభించాడు. గ్రామానికి చెందిన అమ్మాయి అయితే పనులకు పనులూ చేస్తుంది, భర్త అంటూ మర్యాదతో ఎదిరించి మాట్లాడకుండా పడుంటుంది అని అనుకున్నప్పుడే నీ గురించి చెప్పారు"

అక్కడితో ఆపిన అత్తగారు దీర్ఘంగా శ్వాశ వదిలింది.

"అన్యాయంగా ఒక అమ్మాయిని ఇలా చంపేసారే. అలా ఎందుకంత డబ్బు ఆశ నీ కొడుక్కు? నువ్వూ ఒక స్త్రీవే కదా? నీలాగనే కదా వాళ్ల అమ్మ కూడా పదినెలలు మోసి కనుంటుంది. ఇదంతా చేసేసి ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారు? రాక్షస జన్మలు!"

"నావల్ల కావటంలేదమ్మా. మనసు పీకుతూనే ఉంది.అందుకే హోములోకి తీసుకువెళ్ళి చేర్చరా అని బ్రతిమిలాడాను. నీ మంచికే చెబుతున్నా, నా కొడుకు మంచివాడు కాదు. వాడితో నువ్వు ఉండకు. ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు"

"ఇప్పుడైనా నిజం చెప్పారే. చాలా థ్యాంక్స్. బాధపడకండి. మీ అబ్బాయిని నేను చూసుకుంటాను. జరిగేదంతా వేడుక చూడండి" చెప్పేసి మహేశ్వరీ లేచి బయటకు వచ్చింది.

చీకటి పడిన తరువాత తండ్రీ-కొడుకులు ఒకరి తరువాత ఒకరు ఇంటికి వచ్చారు.

"ఏరా...ఏర్పాటు చేసావా?"

"ఒకవారం అవుతుందట. వాడూ బిజీలాగుంది. దేశంలో దయ్యాలు బెడద ఎక్కువగా ఉన్నట్టుంది"

"ఒకటి చేద్దామా?"

"ఏమిటది..."

"దయ్యం పట్టి ఆడిస్తోంది. బుద్ది స్వాధీనం లేదని చెప్పి, మెంటల్ అసైలంలో తీసుకు వెళ్ళి దింపేసి రానా?"

"వాళ్ళ అన్నయ్య ఊరంతా తీసుకుని వస్తాడు"

"తెలియదని చెప్పేద్దాం. కనబడకుండా పోయిందని చెబుదాం"

"ఏదో చెయ్యి...ఏది చేసినా మనం చిక్కుకోకుండా చెయ్యి"

"అలాగంతా దొరికిపోను. మాలతీ విషయంలో దొరికిపోయేనా ఏమిటి?"

ఆయన సమాధానం చెప్పలేదు.

"వెళ్ళమంటే, వెళ్ళి తగలడొచ్చు కదా. మనల్నే బెదిరిస్తే, ఉండవే అని వదిలేయనా? ఎవడయ్యా ఈ పిచ్చిదాన్ని చివరివరకు ఉంచుకుని బాధపడేది. దాన్ని చూస్తేనే ఒళ్ళంతా మంటలు పుడుతోంది. తొందరిపడి తాళి కాట్టేసేనేమో అనిపిస్తోంది. అమ్మ మాత్రం బాగుండుంటే నేనెందుకు ఈ పల్లెటూరు దాన్ని లాక్కుని వస్తాను?"

అతను మాట్లాడుతూ వెళుతుంటే దాక్కుని నిలబడి వింటున్న మహేశ్వరీ తనలో తాను నవ్వుకుంది. ఎంత చెడ్డ మగాడు! భార్యా, పిల్లలూ అంటూ ఎటువంటి బంధుత్వ బాధ్యతలూ వద్దు. ఇల్లు, డబ్బూ ఉంటే చాలు అనుకునే వాడికి ఎందుకు రెండో పెళ్ళి, ఎందుకు చేసుకున్నాడు? ఒకటి ఆస్తికోసం, ఇంకొకటి ఇంటి పనులకోసం అంటూ ప్లాను వేసుకుని ఇద్దరు స్త్రీల జీవితాన్ని నాశనం చేశాడు! ప్రేమ, అభిమానం పంచటం తెలియదు. తీసుకోవటమూ తెలియని బండరాయి లాగా జీవించటం సంతోషం అని అనుకున్నాడు ఈ మూర్ఖుడు! ఏది నిజమైన సుఖం అని తెలియని ఈ మూర్కుడిని ఏం చేస్తే కరెక్టు?’

ఆమె ఆలొచించింది.

ఆ రోజు రాత్రి మాలతీ యొక్క చీరను కట్టుకుని మధ్య రాత్రి జుట్టు విరబోసుకుని అతన్ని లేప, కళ్ళు తెరిచిన అతను భయపడి బెదిరిపోయాడు.

బుధవారం నాడు తల్లిని తీసుకువెళ్ళి ఒక వృద్దాశ్రమంలో డబ్బుకట్టి చేర్చి వచ్చాడు. తలనొప్పి అనుకుంటే భార్య అయినా, తల్లి అయినా ఒకటే! విధిలించుకునే స్వార్ధపరుడు అతను. ఆంబ్యులాన్స్ వచ్చి ఆమెను ఎక్కించినప్పుడు మహేశ్వరీకి కూడా కన్నీరు వచ్చింది.

నచ్చో, నచ్చకనో, నిర్భంధం వలనో ఇన్ని రోజులు ఒక బిడ్డను చూసుకున్నట్టు చూసుకున్నందువలన భయటపడ్డ కన్నీరు అది. తనని అంతం చేయాలనే తల్లిని కూడా దూరంగా ఉంచాడు ఆ మూర్ఖుడు అని అర్ధమవగా, అత్తగారి చేతులను ప్రేమతో పుచ్చుకుని నొక్కింది. ఆ నొక్కటం ఆమె మనో భావాన్ని తెలుప, అత్తగారు చిన్నగా నవ్వి ఆమె కూడా మహేశ్వరీ చేతులను నొక్కింది.

తండ్రీ కొడుకులు తోడుగా ఎక్కగా, బండి బయలుదేరింది. ఇంటి వాకిట్లో నిలబడున్న మహేశ్వరీని చూసి "లోపలకు పో" అన్నాడు నాగరాజు. మాటల్లో  ఉన్న అధికారం అతని కళ్ళల్లో లేదు. మారుగా ఒక విధమైన భయం, కలత కనబడింది. మొన్నరాత్రి ఆమెను ఆ అవతారంలో చూసినప్పటి నుండి వణికిపోయాడు.

మాలతీ చీరతో ఆమెను చూసిన వెంటనే పెద్దగా అరిచాడు అతను. భయంలో శబ్ధం కంటే ఎక్కువగా గాలే వచ్చింది.

"లే..." ఆమె ఆర్డర్ వెయ్య, భయంతో లేచాడు.

"నీ పెళ్ళాం ను మెంటల్ సెంటర్ లో వదిలేస్తే నేను రాను...నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? వస్తాను...దారాళంగా వస్తాను. నీ శరీరంలోకి దూరి, మళ్ళీ మేడ మీద నుండి దూకుతాను. కావాలంటే ఇప్పుడే నీలోపలకు వచ్చి చూపించనా...చూస్తావా?"

"వ...వద్దు..."

"ఎందుకురా నన్ను చంపావు? ఎందుకు నా మొహాన దిండుపెట్టినొక్కావు?"

ఆమె ఎర్రబడిన కళ్లను గుండ్రంగా తిప్పి చూపటంతో, అది మాలతీ యొక్క  ఆత్మేనని ఖచ్చితంగా నమ్మాడు అతను. లేకపోతే అతను దిండుతో మాలతీ మొహంపై నొక్కిన విషయం ఈ మహేశ్వరీకి ఎలా తెలుసు? ఖచ్చితంగా దానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఇది మాలతీ ఆత్మ చేస్తున్న బెడదే.

ఇలా అనుకున్న వెంటనే అతని మొహం వెలవెల లాడిపోయింది. కళ్ళల్లో ఇంకా భయమూ, ఆందోళనా పెరిగింది.

"చెప్పు...ఎందుకు చంపావు?"

"లేదు...నేను...తెలియక చంపాశాను. నన్ను క్షమించి వదిలిపెట్టు"

"ఈ ఇంటికొసమే కదా నన్ను చంపావు?"

"లేదు...అవును...అవును..."

"ఈ ఇంట్లో ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా...?"

"లేదు..."

"లేవా? అలాంటప్పుడు ఎందుకురా నీకు ఈ ఇల్లు? మర్యాదగా పత్రాలు తీ...ఊ...తీ, లేదా...గొంతు పిసికి చంపేస్తాను"

ఆమె పళ్ళు కొరుకుతూ చేతులను అతని గొంతుపైన ఉంచి గోరుతో నొక్క, అతను బెదిరిపోతూ, ఆమెను జరగమని చెప్పి బీరువా తెరిచి పత్రాన్ని తీసి జాపాడు. ఆమె ఒక తెల్లకాగితం తీసి జాపింది. 'నేను చెప్పినట్టు రాయి 'అన్నది. పెన్ను అతని చేతికి ఇచ్చింది.

"అడ్వకేట్ రవివర్మ గారికి, నా స్వీయ స్ప్రుహతో నాగరాజు అనే నేను రాస్తున్న ఉత్తరం. నా మొదటి భార్య తండ్రి దగ్గర నుండి నేను కట్నంగా తీసుకున్న పైన రాసున్న ఆడ్రస్సులో ఉంటున్న నా ఇల్లు, దాని స్థలం చేర్చి, నా తదనంతరం, నా రెండవ భార్య అయిన మహేశ్వరీకి చేరాలి. నా ఫ్యామిలీ వకీలు అనే హక్కుతో దీనికి కావలసిన సహాయాలు మీరు చేసివ్వాలని అడుగుతున్నాను"

కింద సంతకం పెట్టి ఆమె ముందు జాపాడు. రెండిటినీ ఆమె తీసుకుని, గది తలుపును వేగంగా మూసి బయటకు వెళ్ళ, భ్రమ పట్టినట్టు కూర్చున్న అతను, మరు క్షణం ఎగిరి గంతులు వేస్తూ తలుపులు తెరిచి చూశాడు.

హాలులో స్ప్రుహ కోల్పోయి పడుంది. చేతిలో ఇంటి పత్రాలు, అతను రాసిన ఉత్తరమూ కనబడలేదు. అతను అన్ని చోట్లా వాటిని వెతికాడు. ఎక్కడ పెట్టిందో? రాత్రంతా వెతికినా కనుక్కోలేకపోయాడు. అతను నీరసంతో పడిపోయాడు. రాత్రంతా నిద్రలేదు.

"ఇది భయపడవలసిన విషయం కాదు?" అని తనలో తాను చెప్పుకున్నాడు. ఆవహించబడ్డ స్త్రీ ఆమె. ప్రొద్దున్నే ఆమెకు జరిగిందంతా గుర్తుండదు. తల్లి ఇల్లు వదిలి వెళ్ళిన వెంటనే మొదటిపనిగా ఆమెను తీసుకుని గ్రీన్ హిల్స్ వాటర్ ఫాల్స్ కు తీసుకు వెళ్ళాలి. ఏదైనా ఒక ఫాల్స్ లోయలో తోసేయాలి.

ఆ తరువాత నిదానంగా అగ్రీమెంట్ కాయితాలను వెతుక్కో వచ్చు, ఈ ఇంట్లో నుండి అవి ఎక్కడికి పోతాయి? ఆ తరువాత మంచి ధరకు ఈ ఇంటిని అమ్మేసి, ఇంకెక్కడైనా ఇల్లు కొనుక్కుని వెళ్ళి ప్రశాంతంగా, ఎటువంటి పీకుడులూ లేకుండా జీవించాలి.

చాలురా బాబూ...ఇద్దరు స్త్రీలతో పడిన పాట్లు. ఒకవేల ఒరిజినల్ పత్రం దొరక్కపోయినా, అది పోయిందని రాసిచ్చి, మాలతీ చావు తరువాత అది తన పేరుకు మార్చబడ్డ పత్రం యొక్క కాపీ రిజిస్టార్ ఆఫీసులో నుండి తీసుకోవచ్చు.

అంతకు తప్ప రాసిచ్చిన ఉత్తరం గురించి బాధపడటం అనవసరం. ఆమె ప్రాణాలతో ఉంటేనే కదా. ఒకవేల ప్రాణాలతో తిరిగి వస్తే, అతను చనిపోయిన తరువాతే, ఆమె ఈ ఇంటిని తనకి సొంతం చేసుకోగలదు. ఇంతలో తానే ఈ ఇంటిని అమ్మేస్తే? అలా లెక్కలు వేస్తున్న అతను తెల్లవారు జామున కళ్ళు మూసుకోగా, నిద్రపోయాడు.

*************************************************PART-9******************************************

 తల్లిని దించేసి తండ్రీ-కొడుకులు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు టైము మూడు గంటలు అయ్యింది. ఇంటికి వచ్చిన అతను మహేశ్వరీని పిలిచాడు.

మీ వదినకు ఆరొగ్యం బాగోలేదని మీ అన్నయ్య మా ఆఫీసుకు ఫోను చేసేడట. ఆఫీసు నుంచి కబురు చేశారు. వెంటనే బయలుదేరు

"నేను రాను. మీరు నన్ను అన్నయ్య ఇంట్లోనే వదిలేయటానికే తీసుకు వెళ్తున్నారు"

"లేదు. నిజంగానే చెబుతున్నా. నీమీద ప్రామిస్ గా నిన్ను తిరిగి తీసుకు వచ్చేస్తాను. చాలా. కావాలంటే అన్నయ్యకి ఫోను చేసి మాట్లాడతావా?"

"వద్దు. నేను మిమ్మల్ని నమ్ముతాను!" ఆమె రెండు జతల బట్టలతో అతనితో బయలుదేరింది.

తిన్నగా బస్సు స్టేషన్ కు వచ్చి గ్రీన్ హిల్స్ వాటర్ ఫాల్స్ బస్సులో ఎక్కాడు.

"ఎందుకు ఇందులో ఎక్కుతున్నారు?"

"ఇందులోనే టికెట్టు దొరికింది. అక్కడకు వెళ్ళి బస్సు మారుదాం. ఎక్కు" ఆమె మూర్ఖురాలు అనుకుని అతను అబద్దం చెప్ప, ఆమె కూడా మరోమాట చెప్పకుండా ఆ బస్సు ఎక్కింది.

రుతుపవనాల వర్షం కారణంగా గ్రీన్ హిల్స్ ఫాల్సులో సముద్రంలాగా పొంగి ఎగిసి పడుతున్నది ఫాల్స్. బస్సులో కనబడిన ప్రకృతి దృశ్యాలు మనసుకు ఆనందం కలిగించింది. దూరంగా కనబడిన ఫాల్స్ మనసును దోచుకున్నాయి.

"ఏ ఫాల్స్! మా ఇద్దరిలో ఎవరి ప్రాణం నీకు కావాలి? నేనా? ఇతనా?" మనసులోనే ప్రశ్నించుకుంది ఆమె.

"దిగు" బస్సు ఆగిన వెంటనే చెప్పి, ఆమె బ్యాగును తీసి ఇచ్చాడు.

"ఏమండీ...కొండ ఎక్కి చూద్దామా?"

పండు జారి పాలల్లో పడినట్టు ఉంది అతనికి.

"చూద్దాం" అతను తన సంతోషాన్ని దాచుకుంటూ చెప్పాడు.

"ఎన్నింటికి మా ఊరి బస్సు?"

"రాత్రికి ఒక బండి ఉంది.అది వదిల్తే తెల్లారిన తరువాతే"

"ఆకలేస్తోందండి"

అతనొక హోటల్లోకి వెళ్ళాడు.

"బాగా తిను. తరువాత ఇలా ఎప్పుడు తినగలవు?" అతను కపట నవ్వుతో చెప్ప, ఆమె జవాబుగా నవ్వింది.

ఆమె అడిగినవన్నీ తెప్పించాడు.

తిన్న తరువాత జల్లులో తడుస్తూనే నడిచారు. పెద్ద ఫాల్స్ దగ్గర జనం గుంపుగా ఉన్నారు. అందరూ ఉత్సాహంగా స్నానం చేస్తున్నారు. "కొండ ఎక్కి వెళితే ఈ ఫాల్స్ ఒక పెద్ద గుంటలో పడి, లోయలోకి పడుతున్నది చూడ చూడ అందంగా ఉంటుంది. పొంగే సముద్రపు అలలు అని విని ఉన్నావా నువ్వు"

"ఊహూ"

"రా..." అతను కొండ బాటలో ఆమెను పిలుచుకుని నడిచాడు. జల్లుతో కూడిన గాలి చల్లగా ఉంది. ఆమె చీరను నిండుగా కప్పుకుని అతన్ని చూసి నవ్వింది.

ఎవరికీ అతని మీద అనుమానం రాకుండా ఉండాలని అతను ఆమెతో నవ్వుతూ మాట్లాడాడు. ఆమె భుజాల మీద చేతులు వేసి నడిచాడు.

"సిగ్గుగా ఉంది...చేతులు తీయండి"

"మనం భార్యా-భర్తలమే కదా! తరువాత ఎందుకు సిగ్గు?"

"అయితే నా మీద మీకు ప్రేమ ఉన్నదని చెప్పండి. మరెందుకు నన్ను వెళ్ళిపో, వెళ్ళిపో అంటున్నారు?"

జవాబు చెప్పలేని ప్రశ్నతో అతను సతమత అయ్యాడు. దొంగ నవ్వు నవ్వాడు.

సరి, వెళ్ళమని చెప్పనులే. మనం కలిసి ఉందాం. సరేనా?"

మాట్లాడుకుంటూనే వాటర్ ఫాల్స్ పై ఎత్తుకు వచ్చారు. అక్కడ నుండి కిందకు చూస్తే తల తిరుగుతున్నట్టు అనిపించింది. వాటర్ ఫాల్స్ సముద్రంలాగా ఆ గుంటలో నుండి, లోయలోకి పడుతున్నది.

"ఇంకా దగ్గరకు వెళ్ళి చూస్తే అందంగా ఉంటుంది. వస్తావా?"

కాలు జారితే మరణం తప్పదు. శరీరం కూడా దొరుకుతుందా అనేది అనుమానమే.

"భయంగా ఉందండి. నేను రాను" అన్నది మహేశ్వరీ.

"నేను ఉన్నాను కదా. ఎందుకు భయం? నా చేతులు పుచ్చుకో" అతని కళ్ళల్లో అభిమానాన్ని చూపి ప్రేమతో పిలిచాడు.

ఆమె అతని చేతులు పుచ్చుకుని రెండడుగులు ముందుకు కాళ్ళు పెట్టింది. శరీరం సన్నగా వణికింది.

"రా!" - అతను ఇంకా ముందుకు పిలిచాడు. ఆమె కొంచం ముందు ఉంటేనే తోసేయటానికి వసతిగా ఉంటుంది అని అనుకున్నాడు.

ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. దేవుడి దగ్గర క్షమాపణలు కోరుకుంది. తరువాతి క్షణం తన బలమంతా ఉపయోగించి అతని చేతిని విధిలించుకున్నప్పుడు అతను స్థిరత్వం కోల్పోయి కిందపడిపోయి అర క్షణంలో జారిపోతూ ఫాల్స్ లోయలోకి పడిపోయి కనబడకుండా పోయాడు. లోయలోతు అతన్ని మింగేసింది. అతని అరుపులు జలపాతం శబ్ధంలో అనిగిపోయింది.

"అయ్యో...నా భర్త...నా భర్త" ఆమె పైకెక్కి గోలచేసింది. జనం గుమికూడి విచారించారు. ఎవరికీ అనుమానం రాలేదు. "అయ్యో పాపం" అంటూ జాలి పడ్డారు. ఒక స్త్రీ ఆమెను చేతులతో పట్టుకుని పిలుచుకుని కిందకు వచ్చింది.

"వెళ్ళద్దండీ...జారుతుంది అని చెబుతున్నా, అందంగా ఉంటుందే, చూసి వచ్చేస్తానని దిగారు. ఒక నిమిషంలో జారింది. భగవంతుడా! నేనేం చేయను...నా దైవాన్ని తీసుకు వెళ్ళిపోయావే..." ఆమె ఏడస్తూ చెప్పింది.

మరుసటి రోజునే శరీరం దొరికింది. గుర్తుపట్టలేనంతగా చెదిరిపోయింది.

*************************************************PART-10*****************************************

"నా కోడలుకి మాటి మాటికీ దయ్యం పడుతుంది. ఆమె నా కొడుకుని తోసుంటుంది"

మామగారు మోపిన నేరం చెల్లుబడి కాలేదు. ఆమెవైపు మాట్లాడటానికి చాలామంది ఆమె వెనుకున్నారు. ఒక రాక్షసుడ్ని వధం చేసినట్టే అనిపించింది ఆమెకు.

ఇటికలతో కట్టబడ్డ ఒక ఇంటికోసం, కట్టుకున్న పెళ్ళాంనే చంపినోడు అతను. ఈమెనూ చంపటానికి చూశాడు. అతని చనిపోవటం వలన ఈ భూమికేమీ నష్టం లేదు.

హడావిడంతా తగ్గిన తరువాత, ఆమె అతని దగ్గర నుండి తీసుకున్న డాక్యూమెంట్స్ నూ, ఉత్తరాన్నీ తీసుకుని మాలతీ తండ్రి ఇంటికి వెళ్ళింది. దాంతో పాటూ మరో ఉత్తరమూ తీసుకుంది.

"నా భర్త అతని తదనంతరం నాకు చేరాలని రాసిపెట్టున్న ఇల్లు నాకు అక్కర్లేదు. నా భర్త యొక్క మొదటి భార్య, మాలతీ యొక్క తండ్రి తన స్వీయ సంపాదనతో  కట్టిన ఇల్లు అది. తన కూతురికొసం సారెగా ఆయన ఇచ్చిన ఇల్లు న్యాయంగా ఆయనకే చెందాలి. దాన్ని తీసుకునేందుకు నాకు ఎటువంటి బాధ్యత లేదు. కనుక ఆ ఇల్లు ఆయనకే చెందాలని పూర్తి మనసుతో అంగీకరిస్తున్నాను"

పైన చెప్పినట్టు రాసిన ఉత్తరాన్ని, ఇంటి పత్రాలనూ ఆయన దగ్గర ఇచ్చింది.

"వద్దమ్మా. నువ్వూ నా కూతురు లాంటి దానివే. ఆ ఇంటిని నువ్వే తీసుకో"

వద్దండయ్యా. నేను అక్కడ సంతోషంగా ఉండలేను" ఆమె తిరస్కరించింది.

"నేను కూడా సంతోషంగా ఉండలేనమ్మా. ఎందుకంటే దుఃఖాలను మాత్రమే ఆ ఇల్లు నాకు ఇస్తుంది. ఏం చేయాలో నువ్వే చెప్పు"

"నాకేంటయ్యా తెలుసు. నేను చదువుకోని మొద్దును"

"కానీ, నీకేనమ్మా, అభిమానం, జ్ఞానమూ ఎక్కువ. ఒకటి చేస్తాను. ఆ ఇంటిని పిల్లల ఆశ్రమంగా మార్చేద్దామా? నువ్వు బాధ్యత తీసుకుంటావా? అక్కడ పెరిగే పిల్లలందరినీ మంచి వారిగా నువ్వే పెంచి ఇస్తావని అనిపిస్తోంది. నాగరాజు లాంటి మనుషులు తయారవకుండా చూడాలి. అదే ముఖ్యం, ఏం చెబుతావు?"

మీరు ఏం చెప్పినా కరెక్టుగానే ఉంటుంది! చాలా రోజుల తరువాత ఆమె క్లియర్ గా నవ్వింది.

*************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

ప్రేమ కలలు...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)