అక్షయ పాత్ర…(పూర్తి నవల)
అక్షయ పాత్ర (పూర్తి నవల)
మనిషి జీవితంలో పలు సంఘటనలకు కొన్ని సందర్భాలలో పరిస్థితులే కారణమవుతాయి. కరెక్టా, తప్పా అనేది పరిస్థితులను బట్టే. ఎటువంటి పరిస్థితులలోనూ అనురాగమును హైజాక్ చేయటమనేది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. నాలుగు నెలలుగా ఇంటికే రాని తండ్రిని వెతుక్కుని వెళుతుంది తులసి.
తండ్రి అంటే ఆమెకు ప్రాణం.
ఎంత తీసుకున్నా తరిగిపోని అనురాగమును మాత్రమే ఇచ్చే అక్షయపాత్ర ఆయన. అనురాగము మాత్రమే సర్వరోగనివారిణి అని నమ్మే తండ్రిని ఆమె కలుసుకుందా? ఆమె అక్షయపాత్ర ఆమెకు దొరికిందా? వీటన్నిటికీ జవాబు చెప్పే ‘అక్షయ పాత్రే’ ఈ నవల.
ఈ నవలను చదివి మీ అభిప్రాయాలను పంచుకోండి.
*****************************************************************************************************
PART-1
వీధి చివర
ఆటో ఒకటి
వేగంగా వస్తున్న
శబ్దం విన్న
వెంటనే తులసి
ఉప్పొంగి లేచింది.
“నాన్న
వచ్చేశారమ్మా!” -- వంట
గదిలో పనులలో
ఉన్న అమ్మకు
వినబడేటట్టు అరిచి
చెప్పి వాకిలి
వైపుకు పరిగెత్తింది.
ఆటో ఆమె
ఇల్లును దాటుకుని
నాలుగైదు ఇళ్ళ
తరువాత వెళ్ళి
ఆగింది.
తులసి ముఖం
వాడిపోయింది. “నాన్న
కాదు...ఇంకెవరో” -- చెప్పుకుంటూ
లోపలకు వచ్చింది.
తల్లి ముఖం
కూడా వాడిపోయున్నది.
కన్నీరు వస్తున్న
కళ్ళను చూపించటానికి
ఇష్టంలేక మళ్ళీ
వంట గదిలోకి
దూరింది తల్లి.
ఒంటరిగా ఉండాలనుకుని
మేడపైకి వెళ్ళింది
తులసి. పిట్ట
గోడ మీద
కూర్చున్న రెండు
మైనా పక్షులు
ఆమె వచ్చిన
హడావిడి శబ్దం
విని భయపడి
ఎగురుకుంటూ దగ్గరున్న
వేప చెట్టు
కోమ్మల పైకి
చోటు మార్చుకున్నాయి.
డాబా మీద
హాయిగా వీస్తున్న
చల్లగాలిని అనుభవించ
లేకపోయింది. దూది
ముక్కలలాగా పలు
ఆకారాలలో ఆకాశంలో
తేలుతూ వెళుతున్న
మేఘాల గుంపును
ఆస్వాదించటం కుదరలేదు.
గుంపు గుంపుగా
ఎగురుతున్న తెల్లటి
కొంగలను కళ్ళు
విరిచి చూడలేకపోయింది.
ఎక్కడ చూసినా
తండ్రి మొహమే
కనబడ్డది. ‘ఎందుకు
నాన్న రాలేదు?’ -- ఈ
ప్రశ్నే తులసి
మనసును గుల్ల
చేస్తోంది.
నాన్నను చూసి
నాలుగు నెలలు
అయ్యింది. నెలలోని
రెండో వారంలో
ఎక్కడ ఏ
పని ఉన్నా
వాటిని ముగించకుండా
అలాగే వదిలేసి
ఇక్కడికి పరిగెత్తుకు
వస్తారు. ఆ
వారమంతా ఇల్లు
ఆహ్లాదకరంలో తేలుతుంది.
చూసేవన్నీ మనోరంజకంగా
కనబడుతుంది. గాలీ, నిప్పు, ఆకాశం, నీరు, నేల
అన్నీ రమణీయంగానే
ఉంటుంది. ఆమెకు
ఊహ తెలిసినప్పటి
నుండి ఈ
పద్దెనిమిదేళ్ళల్లో
ఒక్కసారి కూడా
తండ్రి రెండో
వారంలో అక్కడ
లేకుండా పోవటం
జరగలేదు.
వచ్చేటప్పుడు ఖాలీగా
రారు. ఒక
బుట్ట నిండుగా
పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు, సూటు
కేసులో ఆమెకోసం
ఖచ్చితంగా ఒక
కొత్త డ్రస్సు
ఉంటుంది. చిన్న
వయసులో గౌను
అయితే, ఇప్పుడు
చుడీధార్, సాల్వార్
అంటూ అది
కూడా పెరిగింది.
ఆయన వచ్చే
ఆటో ఆ
వీధి చివర్లోకి
వస్తున్నప్పుడే
తులసి జింకలాగా
ఎగురు కుంటూ
పరిగెత్తుతుంది.
బల్లిలాగా ఆయనకు
అతుక్కుని ఆయన్ని
లోపలకు తీసుకు
వస్తుంది.
“ఆ
ఆటోలో వచ్చేది
నేనేనని కరెక్టుగా
నీకెలా తెలుస్తోంది
తులసీ?”
“తెలుస్తుంది...!”
“అదే
ఎలా?”
“వాసన
వస్తుంది...గాలిలో!
అది కాకుండా
వార్త వస్తుంది.
దాని మూలంగా!” ఆమె పైకి
చూస్తూ ఆకాశాన్ని
చూపిస్తుంది. ఆయన
ప్రేమతో ఆమె
తల మీద
చెయ్యి వేసి
వాత్సల్యముతో తల
నిమురుతూ నవ్వుతారు.
ఆ ఒక
వారం రోజులూ
వంట గది
రెండుగా అవుతుంది.
విధ విధమైన
వాసనలతో ఇల్లంతా
నిండిపోతుంది. చాలు
చాలు అని
తండ్రి ప్రాధేయపడేంత
వరకు అమ్మ
భోజనం, టిఫిన్
మార్చి మార్చి
చేసి పెట్టి
ఆయన్ని ఉక్కిరిబిక్కిరి
చేస్తుంది. సాయంత్రాలలో
బీచ్, సినిమా, బేల్
పూరీ, ఐస్
క్రీమ్ అని
సమయం సంతోషంగా
గడుస్తుంది.
తండ్రి వస్తున్నప్పుడు
ఎగురుకుంటే వెళ్ళే
తులసి, ఆయన
వెళ్ళేటప్పుడు
తన గది
వదలి బయటకే
రాదు.
“నువ్వు
వెళ్ళేది నేను
చూడలేను నాన్నా.
ఆటోలో ఎక్కేటప్పుడు
నాకు ఏడుపు
వస్తుంది. దాన్ని
అమ్మ అపశకునం
అంటుంది. అవన్నీ
ఎందుకు? నువ్వు
బయలుదేరేటప్పుడు
నాకు చూడటం
ఇష్టం లేదు!”
ఆయన ఒత్తిడి
చేయరు. రోజులు
గడుస్తున్న కొద్దీ
అది ఆయనకు
అలవాటు అయ్యింది.
నాన్న ముంబైకి
వచ్చి సరిగ్గా
నాలుగు నెలలు
అవుతోంది...లీవు
దొరకలేదా...ఏమిటి
అనేది తెలియలేదు.
ఒక ఉత్తరమో, సమాచారమో
కూడా లేదు.
ఏమై ఉంటుంది!
ఎప్పుడూ లేనట్లు
మంచి రోజులాగా, ఆయన
చివరగా వచ్చి
వెళుతున్నప్పుడు, తాను
సాగనంపటానికి వెళ్ళింది
తప్పైపోయిందా?
ఆ రోజు
ఎందుకో ఆయన
బయలుదేరుతున్నప్పుడు
ఆమె వాకిటి
వరకు సంచులు
తీసుకు వచ్చి
ఆటోలో పెట్టింది.
తన అభిమతము
మరిచిపోయినట్టు
నవ్వు మొహంతో
వాకిట్లో నిలబడింది.
దాని గురించి
ఏదో అడగటానికి
అమ్మ నోరు
తెరిచినప్పుడు, నాన్న
ఆమెను కళ్ళతోనే
ఆపి, చేతులు
ఊపుతూ కూతుర్ని
చూస్తూ వెళ్ళి
కళ్ళకు దూరమయ్యారు.
నాన్న నవ్వు
చాలా అందంగా
ఉంటుంది. ఆకాశమే
నవ్వుతున్నట్టు
నిర్మలంగా ఉంటుంది.
కల్లాకపటం లేని
నవ్వు. ఆ
నవ్వే ఆయన
జీవంగా ఉంటుంది.
“అందరూ
ఎందుకు నాన్నా
నీలాగా నవ్వరు?” -- ఒకరోజు
తిలసి తండ్రిని
అడిగింది.
“ఏం
ప్రశ్న ఇది?”
“నిజమే
నాన్నా! అందరి
నవ్వులలో ఏవేవో
అర్ధాలు తెలుస్తాయి.
దొంగ నవ్వు, కపట
నవ్వు, వక్ర
నవ్వు, పిచ్చోడి
నవ్వు అంటూ
విధ విధంగా
ఉంటుంది. నీ
నవ్వు మాత్రం
ప్రకాశవంతంగానూ, నిర్మలంగా
ఉండే ఆకాశంలాగా
పువ్వు వికసిస్తున్న
నవ్వు. నువ్వు
మాత్రం ఎలా
పరిశుద్దంగా నవ్వ
గలుగుతున్నావు?”
“కారణం
చెప్పనా?”
“చెప్పు”
“తులసి... తులసి అనే
ఒక దేవతకు
తండ్రిగా ఉన్నాను
కదా? అందుకే
పరిశుద్దంగా నవ్వ
గలుగుతున్నా!”
“అలాగా...అలాగైతే
అమ్మ నవ్వు
ఎందుకు వికారంగా
ఉంటుంది! మొహమంతా
ఏదో కారుతుంది!”
“కొట్టాలే
నిన్ను...!” అమ్మ దొంగ
కోపంతో చేయి
ఎత్తగా, నాన్న
ఇంకా అందంగా
నవ్వుతారు. నవ్వు
మొహంతో వెంటనే
నాన్నని చూడాలని
ఉంది.
నాలుగు నెలలుగా
తొంగి కూడా
చూడలేనంతగా అలా
ఏంటి పని? లేక
ఆరోగ్యం బాగుండలేదా? తులసి
కలత చెందింది.
మామూలుగా కలత
చెందటం నాన్నకు
ఇష్టం లేని
విషయం. ‘తనపైనా, దేవుని
మీద నమ్మకం
ఉన్నవాడు దేనికీ
కలత చెందడు’ అంటారు
మాటి మాటికీ.
“అలాగంటే
అన్నిటినీ దైవం
చూసుకుంటుందని
ఏమీ చేయకుండా
ఉండిపోదామా?”
ఒకరోజు తులసి
అడిగింది.
“బాధ్యతలను
చెయ్యి. ఫలితాన్ని
నా దగ్గర
వదిలేయి. గీతలో
శ్రీకృష్నుడు చెప్పుంటాడు.
ఎదురు చూసే
ఫలితం దొరుకుతుందా
అని కలత
చెందేవాడు బాధ్యతను
ఎలా కరెక్టుగా
చేయగలుగుతాడు? సరిగ్గా
చేయని బాధ్యతకు
ఫలితం ఎలా
లభిస్తుంది?” -- నాన్న
తన జవాబును
ప్రశ్నలాగా చెప్పి
ముగించగా.
దానికి సమాధానం
చెప్పలేక ఆశ్చర్యపడింది
ఆమె. ఆయన
ఎప్పుడూ అంతే.
ఆయనతో మాట్లాడి
గెలవలేము. ఆయనతో
మాట్లాడాలంటే విషయ
జ్ఞాని అయ్యుండాలి.
ఆయనకు తెలియని
విషయమే ఉండదనేంతగా
ఏ విషయం
గురించి అడిగినా
దాని గురించి
బాగా తెలిసినట్లు
మాట్లాడతారు.
“ఎక్కడ్నుంచి
ఇన్ని విషయాలు
నేర్చుకున్నారు?”
“ఎక్కువగా
చదవాలి, ఎక్కువగా
చూడాలి. ఎక్కువ
వినాలి. మన
చుట్టూ ఎంతోమంది
గురువులు ఉన్నారు!”
“ఎవర్ని
చెబుతున్నారు?”
“మంచి
విషయాలు నేర్పించే
అందరూ, అన్నీ
గురువే. చీమ
దగ్గర నుండి
చురుకుదనం, సాలెపురుగు
దగ్గర నుండి
పట్టుదలతో ప్రయత్నం, తేనెటీగల
దగ్గర నుండి
సేవింగ్స్, పిల్లల
దగ్గర నుండి
ఇన్నొ సన్స్, నేచర్
దగ్గర నుండి
నిష్పక్షపాత గుణం, నిప్పు
దగ్గర నుండి
పరిశుద్ధత, ఇలా
చాలా! మన
చుట్టూతా గురువులకు
కరువా ఏమిటి? మాట్లాడే
గురువు, మాట్లాడలేని
గురువు, మౌన
గురువు - అని
ఎంతోమంది”
“మౌన
గురువంటే?”
“పంచ
భూతాలే! భూమి
దగ్గర నుండి
ఓర్పు, గాలి
దగ్గర నుండి
విశాల ఉద్దేశ్యం
,
ఆకాశం దగ్గర
నుండి ధైర్యం, నీళ్ళ
దగ్గర నుండి
కరుణ, నిప్పు
దగ్గర నుండి
దేన్నైనా సేవింగ్
చేసే గుణం, వృక్షాల
దగ్గర నుండి
అనురాగం. ఇంకా
చెప్పుకుంటూ వెళ్లచ్చు”
నాన్న చెబుతున్నప్పుడు
ఒళ్ళు జలదరిస్తుంది.
ఆయన నవ్వుతూ
ఆమె గడ్డం
దగ్గర ఒక
వేలు పెట్టి
ఆమె మొహాన్ని
పైకెత్తాడు.
“సమయం
దొరికినప్పుడంతా
ఆకాశాన్ని చూడు
తులసి. మౌనంగా
అది చాలా
విషయాలు చెబుతుంది.
దాని లాంటి
అద్భుతమైన గురువు
వేరే ఏదీ
లేదు...” అంటారు.
తులసి తల
పైకెత్తి ఆకాశాన్ని
చూసింది. ‘నాన్న
ఎందుకు రాలేదు? నీకు
తెలుసా?’ -- దాన్ని
అడుగుతుంది.
“నువ్వు
ఇక్కడా ఉన్నావు? ‘టిఫిన్’ చల్లారిపోతోందే!
తినడానికి రావటం
లేదా?” అమ్మ
గొంతు వినబడగానే, వెనక్కి
తిరిగింది.
అమ్మ ముఖం
కూడా వాడిపోయి
ఉన్నది.
మనసులో ఏర్పడ్డ
నొప్పి ముఖంలో
తెలిసింది.
“నేను
కావాలంటే ఒకసారి
హైదరాబాదుకు వెళ్ళి...” తులసి ముగించేలోపు
అమ్మ వేగంగా
అడ్డుకుంది.
“వద్దు...అది
మాత్రం వద్దు!”
“ఏమ్మా...”
“వద్దు
తులసీ...” -- అమ్మ
కలవరపడుతూ చెప్పింది.
“సరి...
వెళ్ళను. ‘ఫోన్’ చేసైనా
మాట్లాడనా...’నెంబర్’ మన
దగ్గరుందే?”
“నువ్వు
ఎవరు అని
అడిగితే ఏం
చెబుతావు?”
“అదంతా
నేను చూసుకుంటాను.
నువ్వు ‘టిఫిన్’ తీసి
పెట్టు. నేను
ఇప్పుడు వచ్చేస్తాను”
తులసీ వేగంగా
కిందకు దిగి
వెళ్ళింది. ఫోను
చెయ్యటానికైనా
అమ్మ ఒప్పుకుందే.
అంతవరకు నయం!
కిందకు వచ్చి
పర్స్ తీసుకుని
వీధి చివర
ఉన్న ఎస్.టి.డి
బూతుకు వేగంగా
వెళ్ళింది.
అరగంట తరువాత
తిరిగి వచ్చిన
తులసీ ముఖం
ఇంకా ఎక్కువగా
వాడిపోయున్నది.
“ఏమిటే...ఉన్నారా? మాట్లాడావా?”
“ఊహూ...లైనే
దొరకలేదు. ‘అవుట్
ఆఫ్ ఆర్డర్’ అని
అనుకుంటా”
“నేరుగానూ
రాకుండా, ఉత్తరం
కూడా వెయ్యకుండా
ఇన్ని సంవత్సరాలలో
ఇలా ఎప్పుడూ
జరగలేదే?”
“అందుకే
ఒకసారి నేరుగా
వెళ్ళొస్తాను అంటే, వద్దంటూ
పట్టుదల పడుతున్నావు!”
“దానిక్కాదే...”
“నాకు
తెలుసమ్మా...అక్కడికి
వెళ్ళి ఎలా
నడుచుకోవాలో నాకు
తెలుసు. నువ్వు
భయపడుతున్నట్టు
ఏమీ జరగదు...సరేనా? రేపటికి
‘ట్రావల్స్’ లో
దేనికో ఒకదానికి
ఫోను చేసి ఒక
‘టికెట్టు’కొంటాను
-- నువ్వు వర్రీ
అవకుండా ఉండు.
నేను జాగ్రత్తగా
వెళ్ళోస్తాను”
తులసి తన
నిర్ణాయాన్ని గట్టిగా
చెప్పగా, కూతుర్ని
ఇక అడ్డుకోలేమని
తల్లికి అర్ధమయ్యింది.
రెండే రెండు
చపాతీలు మాత్రం
తిని లేచింది
కూతురు. తండ్రి
యొక్క హైదరబాద్
అడ్రస్సు తీసుకుని
జాగ్రత్తగా సంచీలో
బద్ర పరుచుకుంది.
ఒక జత
బట్టలు మాత్రం
చిన్న ఏర్
బ్యాగులో ఉంచుకుని, పడుకోటానికి
వెళ్ళింది.
రాత్రంతా నిద్ర
పోలేదు. నాన్న
జ్ఞాపకాలే!
“ఏం
నాన్నా, నెలలో
ఐదు రోజులు
మాత్రమే మనం
సంతోషంగా ఒకటిగా
కలిసి ఉండగలమా? నువ్వు
ఇక్కడికే వచ్చి
ఉండటం కుదరదా? లేకపోతే
మమ్మల్ని కూడా
హైదరాబాద్ తీసుకు
వెళ్ళోచ్చు కదా?”
‘స్కూల్
ఫైనల్ ఇయర్’ చదువుతున్నప్పుడు
ఒకసారి తండ్రి
దగ్గర ఇలా
అడిగింది. అమ్మను
చూసాడు ఆయన.
ఆమె మొహం
దించుకుంది. కూతురు
హఠాత్తుగా అలా
అడుగుతుందని ఆమె
ఎదురు చూడలేదు.
తండ్రి ఆలొచనతో
కూతుర్ని చూసారు.
“అది
కుదరదురా చిట్టీ”
“ఏం
నాన్నా...?”
“చెబితే
అర్ధం చేసుకునే
వయసు, బుద్ది
నీకు ఇప్పుడు
ఉన్నది కాబట్టి
అన్నీ చెప్పటమే
మంచిది. నేను
చెప్పేది అర్ధం
చేసుకుంటావా తులసీ?”
‘అలా
ఏం చెప్పబోతారు
నాన్నా?’ అనేలా
చూసింది తులసి.
“నాకు
అక్కడ కూడా
ఒక కుటుంబం
ఉన్నది తులసీ” -- తండ్రి
చెప్పటంతో, షాక్
తో తలెత్తి
చూసింది కూతురు.
“ఏంటి
నాన్నా చెబుతున్నారు” -- తులసి స్వరం
వణికింది.
“నిజాన్నిచెబుతున్నా!
అదే నా
మొదటి కుటుంబం.
మీ అమ్మ
రెండోదే! ఒక
తప్పించుకోలేని, ఇరకాటమైన, ఒత్తిడి
పరిస్థిలో మీ
అమ్మను నేను
పెళ్ళి చేసుకున్నాను”
తులసి శిలలాగా
నిలబడిపోయింది!
**************************************************PART-2*******************************************
ఇరవై సంవత్సరాలకు
ముందు ఉద్యోగ
నిమిత్తం హైదరాబాద్
నుండి బాంబేకు
వచ్చి దిగినప్పుడు
నాగభూషణానికి కళ్ళు
కట్టేసి అడవిలో
విడిచిపెట్టినట్టు
ఉంది. మంచి
జీతం అనే
ఆశతో హైదరాబాదులో
చేస్తూ వచ్చిన
ఉద్యోగాన్ని వద్దని
చెప్పి వచ్చేసాడే
తప్ప, వచ్చిన
తరువాత పలు
కష్టాలు తెలిసినై.
మొదటి కష్టం
భోజనం. ఆంధ్రా
భోజనానికి నాలికి
ఎదురుచూస్తోంది.
వంట చేయటమూ
తెలియదు. చపాతీనూ
తినడం ఇష్టంలేని
పరిస్థితుల్లో
సరిగ్గా తినక
చిక్కిపోయాడు. అతనితో
కలిసి ఉంటున్న
స్నేహితుడు ఒకరోజు
చెప్పాడు.
“మీ
ఊరి వాళ్ళు
ఇక్కడ చాలా
మంది ఉన్నారు
నాగభూషణం. అక్కడ
ఎక్కడకైనా వెళ్ళి
‘పేయింగ్
గెస్ట్’ గా
ఉండచ్చు కదా?”
“నాకు
ఎవరినీ తెలియదు!”
“మా
ఆఫీసులో ఒక
ఆంధ్రా ఆయన
ఉన్నాడు. ఆయన
దగ్గర వివరాలు
అడిగి తీసుకు
వస్తాను”
“ఆ
ఒక్కటీ చెసిపెట్టు.
చచ్చి నీ
కడుపున పుడతాను.
ఎక్కువ జీతం
వస్తుంది కదా
అనే ఒకే
కారణంతో ఉరు
కాని ఊరు
వచ్చి ఇరుక్కున్నాను.
ప్రాణం మీదకు
తెచ్చుకున్నాను” -- మరోసారి
స్నేహితుని దగ్గర
ప్రాధేయపడ్డాడు
నాగభూషణం.
ఆ స్నేహితుడు
మరుసటి రోజు
ఒక అడ్రస్సు
తీసుకు వచ్చి
ఇచ్చాడు.
“వీళ్ళు
ఎవరు, ఏమిటీ
అనేది నాకు
తెలియదు. నువెళ్ళి
చూడు. మంచి
భోజనానికి దారి
వెతుక్కో”
ఆ రోజు
సాయంత్రమే నాగభూషణం
మాతుంగాలో ఉన్న
ఆ అడ్రస్సుకు
వెళ్ళాడు. మిడిల్
క్లాస్ ఆంధ్రా
మనుషులు చాలా
మంది మాతుంగాలో
ఉన్నారు. స్నేహితుడు
ఇచ్చిన అడ్రస్సులో
ఉన్న వ్యక్తులు
తల్లీ, కూతురూ
ఇద్దరే.
ఈ మధ్యే
లివర్ క్యాన్సర్
వ్యాధితో భర్తను
పోగొట్టుకుంది
ఆ తల్లి.
సముద్రం మధ్యలో
చిక్కుకున్న నావలాగా, జీవితాన్ని
గడిపే దారి
తెలియక అవస్తపడుతున్నారు.
నాగభూషణం తన
భొజన కష్టాలు
గురించి చెప్పిన
వెంటనే, సముద్రం
మధ్యలో ఒక
చెక్క ముక్క
దొరికినట్టు సంతోషంతో
వెంటనే ఒప్పుకుంది.
“ఇది
చిన్న ఇల్లు.
ఇక్కడ మిమ్మల్ని
ఉంచలేము. ఈ
ఏరియాలో బ్యాచులర్
గదులు చాలా
ఉన్నాయి. అక్కడ
దేంట్లోకైనా వచ్చేస్తే...ఇక్కడికొచ్చి
తినేసి వెళ్ళొచ్చు”
ఆ పై
వారమే గది
దొరికింది. అతను
చోటు మారాడు.
ఏ సమస్యా
లేకుండా ఒక
సంవత్సరం గడిచింది.
పొద్దున కాఫీ
దగ్గర నుండి, రాత్రి
భోజనం వరకు
అతని గదికే
వచ్చేస్తుంది.
దానికోసమని అక్కడొక
కుర్రాడు ఉన్నాడు.
మధ్యాహ్నం లంచ్
ఆఫీసుకే క్యారేజీలో
వచ్చేస్తుంది. కాబట్టి
వాళ్ళ ఇంటికి
వెళ్ళే అవసరమే
లేకుండా పోయింది.
భోజనమూ, టిఫినూ
బాగానే ఉండేది.
ఒక సంవత్సరం
తరువాత ఒక
రోజు డ్యూటీ
పూర్తి చేసుకుని
తిరిగి వచ్చినప్పుడు
ఆ ‘షాక్’ అతనికోసం
కాచుకోనుంది.
ఆ తల్లి
చచ్చిపోయినట్టు
వచ్చిన వార్త
విని అధిరిపడ్డాడు.
“ఎలా...ఎలా...? బాగానే
కదా ఉన్నారు.
మధ్యాహ్నం లంచ్
కూడా వచ్చిందే!”
“మీరేమిటి
సార్ ఇలా
ఉన్నారు. ఆవిడ
జ్వరంతో పది
రోజులు మంచం
ఎక్కారు. వాళ్ళ
అమ్మాయే మీకు
వంటచేసి పంపిస్తున్నది.
నిన్న జ్వరం
ఎక్కువ అవటంతో
ఆసుపత్రిలో చేర్చారు.
బ్రయిన్ ఫీవర్
అని చెప్పారట.
కొద్ది సేపటి
క్రితమే చనిపోయిందని
డాక్టర్లు చెప్పారట.
బాడీ ఇంకా
ఇంటికి రాలేదు.
అందుకోసమే కాచుకోనున్నాము.
పాపం! నోరు
లేని అభాగ్యులు.
ఎవరి గొడవలకు
పోరు. పస్తు
పడుకున్నా ఎవరి
దగ్గరా ఏమీ
అడగరు. అంత
స్వీయ గౌరవం.
‘హు...ఇక
ఈ అమ్మాయి
జీవితమే కష్టం.
ఏం చేస్తుందో?” -- ఆ
ఆడ మనిషి
నిట్టూర్పు విడిచింది.
కొద్ది సమయం
తరువాత బాడీ
వచ్చింది. ఏడవటానికి
కూడా ఎవరూ
లేని అమ్మ
బాడీ పక్కన
వెళ్ళి కూర్చింది
కూతురు.
“డబ్బులున్నాయా?” -- నాగభూషణం
ఆమె దగ్గరకు
వెళ్ళి అడిగాడు.
“వంద
రూపాయలు ఉన్నాయి”
“అది
చాలదే! సరే
వదులు...నేను
చూసుకుంటాను”
తన గదికి
వెళ్ళి బ్యాంకులో
వేద్దామనుకుని
పెట్టుకున్న డబ్బును
తీసుకు వచ్చాడు.
ఆ డబ్బుతో
ఆమె తల్లి
చివరి కార్యాలు
జరిగినై. శవం
కాలి బూడిదైన
వెంటనే చుట్టు
పక్కలున్న వారు
జాలిపడటం ఆగింది.
వాళ్ళ వాళ్ళ
పనులలో మునిగిపోయారు.
“ఇంట్లో
వంట సామాన్లు
ఉన్నాయా...లేదు
కొనాలా?”
ఆమె సమాధానం
చెప్పకుండా ఉండిపోవడంతో
ఇంట్లో ఏమీ
లేదనేది అర్ధమయ్యింది...అతను
వెంటనే వెళ్ళి
పచారీ సామాన్లు
కొనుక్కొచ్చి దింపాడు.
“ఎందుకు
ఇవన్నీ? ఇంతకు
ముందే మీకు
మేము ఇవ్వాల్సిన
అప్పు ఎక్కువ
ఉంది. ఇంతవరకు
పది రూపాయలు
కూడా ఎవరి
దగ్గరా అమ్మ
అప్పు తీసుకోలేదు.
ఉంటే గంజి, లేకపోతే
మంచి నీళ్ళు
అనే ఉన్నాము.
మీరు ఇక్కడ
తినటం మొదలు
పెట్టిన దగ్గర
నుండే మేమూ
రెండు పూట్లా
తృప్తిగా తింటున్నాము.
నాలుగు రూపాయలు
వెనుక వేసుకోలేకపోయినా
ఆకలి లేకుండా
ఉన్నామే అని
కొంచం సంతోషపడ్డాము.
మా ఆ
సంతోషం కూడా
దేవుడు ఓర్చుకోలేక
పొయేడనుకుంటా. అమ్మను
అస్తికలు చేసాడు.
ఆమె చావుకు
మీరు ఖర్చుపెట్టిందే
మా మొదటి
అప్పు. ఆ
అప్పు తీరిస్తేనే
ఆమ్మ ఆత్మకు
శాంతి లభిస్తుంది.
ఇంకా ఇంకా
సహాయం చేసి
నన్ను ఇంకా
ఎక్కువ అప్పు
మనిషిని చేయకండి.
ప్లీజ్”
“నీ
అప్పంతా నా
దగ్గరే కదా.
ఆ అప్పు
మొత్తాన్నీ భోజనం
చేసే తీసుకుంటాను.
దేని గురించీ
నువ్వు బాధపడకు” – అని
చెప్పి నాగభూషణం
బయటకు వచ్చాడు.
తరువాతి నాలుగైదు
నెలలు ఎప్పుడూలాగానే
నాగభూషణానికి టిఫిన్
మరియు భోజనమూ
వచ్చింది. సమస్యలు
ఏమీ లేకుండా
రోజులు గడిచినై.
ఆ తరువాత
ఒక రోజు
భోజనానికి డబ్బులివ్వటానికి
వెళ్ళిన రోజు, ఆమె
ఇంటి నుండి
మధ్య వయసు
వ్యక్తి ఒకాయన
వేగ వేగంగా
బయటకు వచ్చి
మేడపైకి వెళ్ళాడు.
లోపల ఆమె
ఏడుస్తూ ఉంది.
“ఏమైంది
నీరజా? ఏమిటి
సమస్య?”
నాగభూషణం అలా అడిగిన
వెంటనే ఆమె
ఏడుపు ఎక్కువ
అయ్యింది. ఆమె
ఏడుపు కొంచం
తగ్గనీ అని
మౌనంగా ఉన్నాడు
నాగభూషణం.
కొద్ది సేపటి
తరువాత తానుగా
ఏడుపును ఆపి, అతని
ముందు ఏడ్చేమే
అనే సిగ్గుతో
అతన్ని తల
ఎత్తి చూసింది.
“వచ్చి
వెళ్ళారే ఒక
పెద్ద మనిషి, నేను
పుట్టిన దగ్గర
నుండి నన్ను
ఆయనకి తెలుసు.
అమ్మ ఉన్నంత
వరకు ‘మనవరాలా...మనవరాలా...’ అని
ప్రేమగా పిలిచేవాడు.
ఇప్పుడు ఎవరూ
లేకపోవటంతో నేను
నిలబడేది ఆయనకి
వేడిగా ఉందట.
మొదట్లో ముట్టుకుని
ముట్టుకుని మాట్లాడుతున్నప్పుడు
నన్ను ఓదారుస్తున్నారనుకున్నా.
తండ్రి వయసులో
ఉన్నారు కదా
అనుకుని తప్పుగా
కూడా అనుకోలేదు!
కానీ, ఆయనకు
నన్ను కూతురుగానో, మనవరాలిగానో
చూడటం ఇష్టం
లేదని ఇప్పుడే
అర్ధమయ్యింది. ‘ఎందుకిలా
కష్ట పడతావు...నేను
నిన్ను చూసుకుంటాను.
నన్ను సంతోష
పెట్టు చాలు, నువ్వు
మహారాణిలాగా ఉండొచ్చు’ అంటున్నారు.
‘ఛీఛీ...పో
కుక్కా’ అని
కొట్టి తరిమేసాను.
దెబ్బ తగిలిన
కుక్క ఇక
వూరుకుంటుందా? అరుస్తుందా, కరుస్తుందా
అనేది తెలియటం
లేదు! అంతే
కాదు, ఇంకా
ఎన్ని కుక్కలు
ఇలా తోక
ఆడించుకుంటూ వస్తాయో?”
“నీ
కష్టం అర్ధమవుతోంది...ఇలాంటి
సమయాలలో ధైర్యం
చాలా అవసరం.
ధైర్యంగా ఉండు.
ఎన్ని కుక్కలు
వచ్చినా తరిమి
కొట్టే శక్తిని
పెంచుకో. ఇంకేం
చెప్పను...?”
నాగభూషణం ఆమెకు
ధైర్యం చెప్పి
బయలుదేరాడు. అపార్ట్మెంట్
కాంప్లెక్స్ కింద
మెట్టు దగ్గర
ఆ మనిషి
నిలబడున్నాడు. నాగభూషణాన్ని
చూసిన వెంటనే
వేగంగా దగ్గరకు
వచ్చారు.
“మీ
దగ్గర కొంచం
మాట్లాడాలి బ్రదర్”
“ఏం
మాట్లాడాలి?”
“చిన్న
పిల్లగా ఉన్న
దగ్గర నుండి
ఆ అమ్మాయిని నాకు
తెలుసు. నా
కూతుర్ల కంటే
వయసులో చిన్నది.
నేను చూసి
పెరిగిన పిల్ల...ఇప్పుడు
అనాధగా నిలబడుందే
అని జాలిపడి
ఏదైనా సహాయం
కావాలా అని
అడుగుదామని వెళ్ళాను.
అక్కడికి వెళితే
అది కేసు
లాగా నా
దగ్గరకు వచ్చి
ఏదేదో చేసింది.
‘ఐదుకూ
పదికి నా
వల్ల కష్టపడటం
కుదరటంలేదు! నెలకి
ఐదువేలు ఇచ్చేయండి, మీకు
కీప్ గా
ఉండిపోతాను’ అని
పచ్చిగా మాట్లాడింది.
నా వయసుకూ, అందులోనూ
నేను చూసి
పెరిగిన పిల్ల
నా దగ్గరే
అలా మాట్లాడుతుంటే, మీ
దగ్గర ఎలా
మాట్లాడుతుందో? అందుకే
చెబుతున్నా...జాగ్రత్తగా
ఉండండి”
నాగభూషణం ఆయన్ని
లోతుగా చూసాడు.
“అలాగా
సార్...చెప్పినందుకు
చాలా థ్యాంక్స్
సార్. కానీ, ఆ
పిల్ల నా
దగ్గర అలా
నడుచుకోలేదు. కానీ, వేరే
ఇంకొక అమ్మాయి
నా దగ్గరకు
వచ్చి అలా
నడుచుకోవటానికి
చూస్తోంది”
“ఎవరు...?” ఆయన
ఆశ్చర్యంగా అడిగారు.
“మీ
మూడో అమ్మాయే” చెబుతూ నాగభూషణం
నడవగా, ఆయన
ఒక్క క్షణం
అలాగే నిలబడిపోయారు.
తరువాత వేగంగా
వచ్చి నాగభూషణం
చొక్కా పుచ్చుకుని
ఆపారు.
“ఏమిట్రా
చెప్పావు...రాస్కల్!
ఎవర్ని చూసి
చెబుతున్నావు నువ్వు!
నా కులం
ఏమిటో...నా
వంశం ఏమిటో
నీకు తెలుసా?”
చొక్కా మీద
ఆయన పెట్టున్న
చేతిని నాగభూషణం
నెట్టాడు.
“నాకు
తెలుసు సార్.
మీకే అది
తెలియలా! తెలిసుంటే
మీ కూతురు
వయసున్న ఈ
అమ్మాయి దగ్గరకు
వెళ్ళి తప్పుగా
నడుచుకుంటారా? ఈమె
గురించి కొంచం
ముందు మీరు
చెప్పింది అబద్దమైతే, నేను
మీ దగ్గర
చెప్పింది కూడా
అబద్దమే! మీరు
చెప్పింది నిజమైతే
-- నేను చెప్పిందీ
నిజమే. ఇదేలాగా
మీరు ఇంకెవరి
దగ్గర ఈ
అమ్మాయి గురించి
చెప్పకండి. నేనూ
మీ అమ్మాయి
గురించి తప్పుగా
చెప్పను”
నాగభూషణం హెచ్చరికలాగా
చెప్పి వెళ్ళటంతో, అతను
దెబ్బ తిన్న
పులిలాగా గుడ్లు
తిప్పుతూ అతన్నే
చూసారు.
ఆ రోజు
సాయంత్రం అతను
బయట నుంచి
తిరిగి వస్తున్నప్పుడు
ఆ కాలనీ
వాసులు నాగభూషణాన్ని
చూసిన వెంటనే
గుసగుసలు మాట్లాడుకున్నారు.
ఎప్పుడూ బాగా
నవ్వుతూ మాట్లాడే
కొందరు ముఖం
తిప్పుకుని వెళ్లారు.
కారణం తెలియక
నడిచాడు నాగభూషణం.
“ఏమిటి
‘బ్రదర్’ భోజనం
వచ్చిందా? ఏమిటి
స్పేషల్ ఈ
రోజు?” -- ఆ
ఏరియా పోకిరి
ఒకడు దగ్గరకు
వచ్చి అదోలాంటి
వెకిలి నవ్వుతో
అడిగాడు.
నాగభూషణం జవాబు
చెప్పకుండా నడిచాడు.
ఆ ఏరియాలోని
పిచ్చిది ఒకత్తి
గట్టిగా నవ్వుతూ
వెళ్ళింది.
“పెట్టి
పుట్టిన వాడివయ్యా
నువ్వు. అమ్మ
శవాన్ని తీస్తున్నట్టు
తీసి కూతుర్ని
వలలో వేసుకున్నావే!
నీకున్న టెక్
నిక్ ఎవరికీ
రాదయ్యా...” -- పోకిరి
మళ్ళీ కెలికాడు.
నాగభూషణం చికాకుతో
అతన్ని కోపంగా
చూసాడు. నవ్వుకుంటూ
జరిగాడు. ఆ
రోజు మాత్రమే
కాదు...ఆ
తరువాతి రోజుల్లో
కూడా అతను
వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు
అతన్ని, ఆమెనూ
కలిపి -- మాట్లాడటం, హేళన
చేయడం ఎక్కువయ్యింది.
“ఇలా
చూడు ‘బ్రదర్’, ఒకటి
నువ్వు ఈ
ఏరియాకు వచ్చేసి
ఆమెను ఇక్కడే
నీతో పెట్టుకుని
‘సెటప్’ చేసుకో.
లేకపోతే ఈ
ఏరియా వదిలేసి
వెళ్ళిపో. మేము
ఎవరైనా ఆమెను
చూసుకుంటాం. పాపం...ఆ
అమ్మాయి ఒంటరిగా
ఎన్ని రోజులు
శ్రమ పడుతుంది? ఇంత
మంది మగ
వాళ్ళు ఉన్న
చోట వయసు
అమ్మాయి ఒంటరిగా
కష్ట పడొచ్చా
చెప్పు...”
నాలుగో రోజు
ఒక రౌడి
గట్టిగా అరిచి
నాగభూషణాన్ని అడగటంతో...అందరూ
వేడుక చూసారు.
పిచ్చిది ఏదో
అరుస్తూ అటూ
ఇటూ పరిగెత్తింది.
“ఎందుకు
ఇలా మాట్లాడుతున్నావు? ఒంటరిగా
కష్టపడుతున్న అమ్మాయి
గురించి అలా
మాట్లాడొచ్చా? చుట్టూ
ఉన్న వాళ్లందరూ
అన్నా, తమ్ముళ్ళుగా
ఉండి ఆమెకు
బద్రత ఇవ్వాలి!”
నాగభూషణం బాధతో
అడిగాడు.
“అలాగా? సరే...నువ్వు
ఆశ పడినట్లే
పొద్దున పూట
అన్నా తమ్ముళ్ళుగా
ఉంటాము. రాత్రి
పూట భర్తగా
ఉంటాము. నువ్వు
అలాగే కదా
ఉన్నావు...”
కెకబెక మనే
నవ్వుతో అతను
ఇంకా గట్టిగా
చెప్పటంతో అక్కడ
నవ్వుల అల
విస్తరించ... నాగభూషణం ఎరుపెక్కిన
మొహంతో నడిచాడు.
ఈల శబ్ధాలు, నవ్వుల
శబ్ధాలు అతన్ని
తరిమినై.
గదిలోపలకు దూరిన
నాగభూషణం తలుపును
గట్టి మోతతో
మూసాడు. చీకట్లో
ఎంతసేపు నిద్రపోయేడో? కుర్రాడు
తలుపు కొట్టి
రాత్రి డిన్నర్
లోపల పెట్టేసి
వెళ్లాడు. దాన్ని
అతను ముట్టుకోను
కూడ లేదు.
రాత్రి పిల్లి
ఒకటి ప్లేటును
తోసి పడేయటంతో... శబ్ధం విని
లేచిన అతను
చపాతీలతో కింద
పడున్న నాలుగు
మడతలుగా మడిచున్న
కాగితాన్ని చూసిన
వెంటనే ఆశ్చర్యంతో
దాన్ని తీసి
చూసాడు.
‘నాకు
సహాయం చేయబోయిన
మీకు ఎంత
చెడ్డపేరు! బద్రతే
లేకుండా ఒక
ఆడది ఉండేటప్పుడు
చుట్టూ ఉన్న
వారి మనో
వికారాలు తెలిసొస్తున్నాయి.
దయచేసి మీరు
వేరే ఎక్కడకైనా
వెళ్ళిపొండి. నా
విధి ఎలా
ఉందో అలాగే
జరగనివ్వండి!’
నాలుగైదు వాక్యాలతో
బాధపడి ఉంది.
అలా గనుక
వెళ్ళిపోతే, ఆమె
పరిస్థితి ఇంకా
కష్టమై పోతుంది
అనేది అతనికి
తెలుసు.
ఆమెను రక్షణ
ఉండే చోటుకు
తీసుకు వెళ్ళి
వదిలి పెడితే, ఆ
తరువాత నేను
ధైర్యంగా ఎక్కడికైనా
వెళ్ళొచ్చు. ఏదైనా
అనాధ ఆశ్రమంలో
చేరిపిస్తే, ఆమె
ఇప్పటికంటే బాగుంటుందని
అనిపించింది. ‘రేపు
ఆమెతో దీని
గురించి మాట్లాడి
ఆమెను ఒప్పుకునేటట్టు
చేద్దాం’ అనుకుంటూ
నిద్రలోకి జారుకున్నాడు.
మధ్య రాత్రి
ఎవరో తలుపు
కొట్టే శబ్ధం
విని కంగారు
పడి లేచిన
అతను, తలుపు
తెరిచిన వెంటనే
ఆశ్చర్యపోయాడు.
హడావిడిగా లోపలకు
వచ్చి తలుపులు
మూసి
గొళ్ళెం పెట్టింది
నీరజ. వానలో
తడిసిన కోడిపిల్ల
లాగా తలుపుకు
ఆనుకుని వణుకుతున్నది
ఆమె దేహం.
“ఏమయ్యింది?”
“అంతా
ఆ పెద్ద
మనిషి పని.
ఆయన యొక్క
నీచబుద్ది మీకు
తెలిసినట్లుగా, మిగిలిన
వాళ్ళకు తెలియకుండా
ఉండేందుకు వేరేలాగా
కథ అల్లి
వదిలారు. మనిద్దరినీ
అందరూ తప్పుగా
మాట్లాడుతున్నారు.
అది మాత్రమే
కాదు...ఆ
రౌడీ మరో
ఇద్దరితో కలిసి
తాగి, నా
ఇంటి ముందు
నిలబడి ఒకటే
రభస. వెనకున్న
బాల్కనీ ద్వారా
ఎమర్జన్సీ మెట్లపైకి
దూకి పరిగెత్తుకు
వచ్చాను. దయచేసి
నన్ను బయటకు
పంపొద్దు”
“నువ్వు
రా నీరజా.
ఇలా భయపడితే
వాళ్ల గోల
ఇంకా ఎక్కువ
అవుతుంది. నేనున్నాగా
రా వెళదాం”
“ప్లీజ్...నేను
రాను. నాకు
భయంగా ఉంది”
ఆమె కన్నీరు
పెట్టుకుంటూ బ్రతిమిలాడింది.
“నువ్వు
ఇక్కడుంటే ఇంకా
తప్పుగా మాట్లాడతారు
నీరజా. అబద్దం
నిజమైపోతుంది”
“అవనివ్వండి!
ఏదైనా మాట్లాడి
వెళ్ళనీ. నాకూ, మీకూ
మధ్య ఏమీ
లేదని మన
ఇద్దరికీ తెలుసు.
పైనున్న దేవుడికీ
తెలుసు కదా!
అది చాలు.
పేరు చెడిపోయి
ఆపదతో ఒంటరిగా
బ్రతకటం కంటే
ఆ చెడ్డ
పేరుతో బద్రతగా
ఇక్కడ జీవించటం
మేలు. దయచేసి
సహాయం చేయండి”
నాగభూషణం ఒక్క
క్షణం ఆలొచించాడు.
మదిలో బరువులేని
వాడు ఎందుకు
సహ మనుషులకు
భయపడాలి? నాగభూషణం
నిర్ణయానికి వచ్చాడు!
**************************************************PART-3*******************************************
“నువ్వు
ఇక్కడే ఉండొచ్చు
నీరజా. నాకు
అభ్యంతరం లేదు!
గుణం చెడిపోయిన
మనుషుల మాటలకు
నేను బాధపడను.
కానీ, ఎన్ని
రోజులు నువ్వు
ఇక్కడ ఉండగలవు? రేపు
నిన్ను ఎవరైనా
పెళ్ళి చేసుకోవద్దా? నువ్వు
సంతోషంగా జీవించ
వద్దా?”
“ఈ
అనాధను పెళ్ళి
చేసుకోవటానికి
ఎవడు తయారుగా
ఉంటాడు?”
“అలా
చెప్పకు! లోకంలో
మంచి వాళ్ళూ
ఉంటారు”
“అలా
ఒక మంచి
వాడు ఒకడు ముందుకు
వచ్చినా కూడా
వీళ్ళందరూ కలిసి
అతని మనసులో
విషం కలిపేస్తారు. ఇక
నాకు మంచి
పేరు దొరుకుతుందని
నమ్మకం లేదు.
చేతిలో డబ్బో
-- బంగారమో ఏదీ
లేదు. నాలాంటి
అనాధలందరూ ఉండవలసిన
చోటు రెడ్
లైట్ ఏరియాలోనే
అనే చాలామంది
ఆశ.
నేను ఒకడికి
భార్యగా ఉండటం
కంటే, ఊరికే
భార్యగా ఉంటేనే
వీళ్ళు తృప్తి
పడతారు. అలా
ఉండటం కంటే
మీ ఒక్కరికీ
ఉంపుడుగత్తెగా
గౌరవంగా ఉండి
బ్రతకటం మేలని
నాకు అనిపిస్తోంది.
వాళ్ళూ ఎలాగైనా
అనుకోనివ్వండి.
మన ఇద్దరి
వరకు మనం
పరిశుద్దంగా ఉండిపోదాం.
ఈ జీవితం
నాకు చాలు.
నేనేమీ పెళ్ళికి
ఆశ పడటం
లేదు. ఆశ
పడటానికి నాకు
అంతస్తూ లేదు”
ఆమె గొంతు
బొంగురుపోయి ఆగింది...అతను
బాధతోనూ, జాలితోనూ
ఆమెను చూసాడు.
“ఇదే
నీ నిర్ణయమా?”
“ఈ
నిర్ణయం మీకు
నచ్చలేదు అంటే
చెప్పండి. నేను
వెళ్ళిపోతాను. కానీ, ప్రాణాలతో
ఉండను. ప్రతి
కుక్కా పొడిచి
పీక్కోవటానికి
ముందే ఈ
ప్రాణాన్ని కాలం
దగ్గర అప్పగించేస్తాను!”
“ఏం
మాట్లాడుతున్నావు
నువ్వు? దేనికో
భయపడి దేనినో
తగలబెట్టుకున్నట్టు...!”
అప్పుడు ఎవరో
తలుపు కొట్టారు.
ఆమె బెదిరిపోయి
అతని వీపు
వెనుకకు వెళ్ళి
దాక్కుని నిలబడింది.
అతను ధైర్యంగా
తలుపు తీసాడు.
బయట బాగా
వయసున్న ముసలమ్మ
ఒకావిడ నిలబడింది.
“లోపల
మీరు మాట్లాడుతున్నదంతా
విన్నాను. ఆ
అమ్మాయి పాపం
తమ్ముడూ. ఆమెను
వదిలేయకండి. వీలైతే
ఆమె మెడలో
మూడు ముళ్ళు
కట్టి ఆమెకు
జీవితం ఇవ్వండి.
వీళ్ళు ఈమెను
వూరికే వదలరు.
ఈమె దొరికేంతవరకూ
రౌండు కొడుతూనే
ఉంటారు. ఈమెను
పిలుచుకుని ఎక్కడికైనా
వెళ్ళిపొండి.
ఈ అమ్మాయి
దగ్గర ఆస్తి
పాస్తులు లేవు
తమ్ముడూ. కానీ, దానికంతా
కలిపి మంచి
గుణం నిండి
ఉంది. చివరిదాకా
నీ కాళ్ళ
దగ్గర విశ్వాశంగా
పడి ఉంటుంది.
తల్లీ కూతుర్లు
ఆత్మగౌరవంతో ఉన్నారు.
అప్పుడు ఒక్క
నాలిక తప్పుగా
చెప్పేదా? ఇప్పుడు
కష్టకాలం. తల్లిని
పోగొట్టుకుని తపిస్తొంది.
దీన్ని వదిలేయకు
తమ్ముడూ...నీకు
పుణ్యం దక్కుతుంది”
ఆ ముసలమ్మ
బ్రతిమిలాడ...అతను
ఆశ్చర్యంగా చూసాడు.
“నువ్వు...నువ్వు
అక్కడ తిరుగుతున్న
పిచ్చిదానివి కదూ?”
“పిచ్చిదాన్ని
కాదు తమ్ముడూ.
పిచ్చిదానిలాగా
నడుచుకుంటున్న
ఒక అబలను.
ఈ అమ్మాయి
వయసులోనే ఉన్నాను...అనాధగా!
అప్పుడు నీలాంటి
మంచి మనుషులు
దొరకలేదు. ఒక
దరిద్రుడు నన్ను
మానభంగం చేసి
వెళ్ళిపోయాడు. ఆ
తరువాత చాలామంది.
పిచ్చి పట్టినట్టు
తిరిగాను. ఆ
తరువాత ఎవరూ
నా దగ్గరకు
రాలేదు. ఆ
తరువాత అదే
నాకు బద్రత
అయ్యింది. ఈ
రోజు వరకు
అందరి కళ్ళకూ
పిచ్చిదాన్నే. నాకూ
అలవాటైపోయింది.
ఎవరి ఇంట్లోనైనా
భోజనం దొరుకుతుంది.
ఏదో ఒక
మూలలో ప్రశాంతంగా
నిద్రపోతా. ఇదిగో
ఈమె ఇంట్లో
కూడా చాలా
రోజులు భోజనం
చేసాను.
ఆమెకు భోజనం లేకపోయినా
నామొహం చూసి
జాలిపడి నాకు భోజనం
పెట్టేది వీళ్ళ
అమ్మ.
ఆ కృతజ్ఞతా
భావంతోనే తమ్ముడూ
చెబుతున్నాను. ఈ
అమ్మాయిని విడిచిపెట్టకు.
చేయి గట్టిగా
పుచ్చుకో...” -- ఆమె
చేతిని తీసుకుని
ఇతని చేతిలో
పెట్టింది.
తన చీర
కొంగులో ముడి
వేసుకున్న పదిరూపాయలు
తీసి జాపింది.
“దీంతో
పసుపుతాడూ, పసుపుకొమ్మూ
కొని తాలిగా
కట్టేసి సంతోషంగా
ఉండు తమ్ముడూ!”
నీరజ ఆమె
కాళ్ళ మీద
పడి కన్నీరు
కారుస్తూ నమస్కరించింది.
ముసలమ్మ చీకట్లో
కనుమరుగు అయ్యింది.
కొంచం సేపు
మౌనంగా గడిచింది.
“ఆమె
ఏదో చెప్పి
వెళ్తోంది. ముందూ
వెనుకా తెలియని
ఒక అనాధను
ఎవరైనా పెళ్ళి
చేసుకుంటారా ఏమిటి? మీ
తల్లి-తండ్రులకు
ఎన్నో కలలు
ఉంటాయి. అవన్నీ
మీరు చెరిపేయ
కూడదు. మీరు
నన్ను ఒక
పనిమనిషిగా చూసుకుంటే
చాలు”
“నా
సమస్య నా
కన్నవాళ్ళు కాదు
నీరజా?”
ఆమె ‘వేరే
ఏమిటి?’ అనేటట్టు
చూసింది.
“నీ
మెడలో తాలి
కట్టటానికి ఆలొచిస్తున్నది
నువ్వు అనాధ
అనో, ఏమీలేనిదానివనో
అనేది కారణం
కాదు. నేను
పెళ్ళి అయిన
వాడిని. అదే
కారణం”
ఆమె ఆశ్చర్యపోతూ
అతని చూసింది.
“ఇంతవరకు
మీ గురించి
నాకేమీ తెలియదు!”
“ఎవరూ
ఏదీ అడిగింది
లేదు. నేను
చెప్పిందీ లేదు.
నాకు నాలుగు
సంవత్సరాల వయసులో
అబ్బాయి ఉన్నాడు.
నా భార్యకు
ఆంధ్రా ప్రభుత్వంలో
ఉద్యోగం. అధికారిగా
ఉంది. అందువలనే
ఆమె నాతో
పాటూ వచ్చి
ఉండలేకపోయింది.
ఇంకా కొన్ని
రోజుల్లో నన్ను
హైదరాబాదుకే మారుస్తారు.
నిన్ను పెళ్ళి
చేసుకోకపోవటానికి
కారణం ఇదే.
నేనూ వెళ్ళిపోతే
నువ్వు ఏం
చేస్తావనేదే నా
భయం”
“మీ
ఇంట్లో పని
మనిషిగా ఉంటాను.
నన్నూ పిలుచుకు
వెళ్ళండి. ఈ
ఊర్లో నాకు
మాత్రం ఏముంది?”
“చూద్దాం.
నువ్వు ఎవరికీ
భయపడకు. తెల్లవారిన
వెంటనే వేరే
ఎక్కడికైనా వెళ్ళిపోదాం.
నీకు ఏదైనా
ఒకదారి చూపే
నేను వెళతాను.
బాధ పడకు!”
చెప్పినట్టే మరుసటి
రోజు తెల్లవారు
జామున తమ
దగ్గరున్న ఒకటి
రెండు సామాన్లు
తీసుకుని వాళ్ళు
బయలుదేరారు. అందరూ
నోరెళ్ళబెట్టి
వాళ్ళు వెళ్ళటాన్ని
చూసారు. వాళ్ళిద్దరినీ
కలిపి చెడుగా
మాట్లాడినందు వలనే
వాళ్ళిద్దరూ కలిసి
వెళుతున్నా చూస్తూ
నిలబడ్డారు.
ఆఫీసుకు దగ్గరలోనే
ఒక పాత
బిల్డింగులో ఒక
గది అద్దెకు
దొరికింది. వాళ్ళిద్దరినీ
భార్యా, భర్తలనే
అక్కడి వాళ్ళందరూ
అనుకున్నారు. ఆమె, అనవసరంగా
బయటకే రాదు.
ఒక పనిమనిషిగా
మాత్రమే అక్కడుంది.
రాత్రిపూట గాలికోసం
అతను వరాండాలో
పడుకోగా ఆమె
లోపల నిద్రపోయేది.
వర్షాకాలం మొదలైన
తరువాత పడుకోవటం
సమస్య అయిపోయింది.
అతనూ లోపలే
పడుకోవలసిన నిర్భంధం.
అలాంటి ఒక
వర్షం రోజున
అన్నిటినీ జయించింది
శరీరం.
అతను కృంగి
కృషించిపోయేడు.
‘నేనా
ఇలా నడుచుకున్నాను’ అని
నమ్మలేక ఆశ్చర్యపడ్డాడు.
ఆమె మొహాన్ని
చూడలేకపోయాడు. ఆ
బాధతో అలాగే
కూర్చుండిపోయిన
అతన్ని ఆమె
సమాధానపరచింది.
“పరవలేదు...వదలండి.
గొప్ప గొప్ప
మూనీశ్వరులే ఇందులోనుండి
తప్పించుకోలేకపోయారు.
మనం సాదారణ
మనుష్యులమే కదా!
నేను దీన్ని
పెద్ద భాగ్యంగా
అనుకుంటున్నాను.
దేవుడికి నైవేద్యం
పెట్టినట్టు ఒక
సంతోషం. దీన్ని
పెద్ద తప్పుగా
తలుచుకుని బాధపడకండి.
మీరు ఎప్పుడు
పిలిచినా ఈ
కుక్క పరిగెత్తుకు
వస్తుంది”
“ప్లీజ్
నీరజా. నన్ను
పురుగును చేసి, నువ్వు
విశ్వరూపం తీయకు!
నేను తట్టుకోలేను.
ఇది తప్పే!
ఈ తప్పును
సరిచేస్తేనే నా
మనసు చాల్లారుతుంది.
రేపు తెల్లారిన
వెంటనే గుడికి
వెళ్ళి నిన్ను
పెళ్ళి చేసుకున్న
తరువాతే నా
తప్పు సరి
అవుతుంది”
“అదికూడా
తప్పేకదా! మొదటి
భార్య ఉండగా...నేనెలా
మిమ్మల్ని...? వద్దండీ!
ఆ అంతస్తు, హక్కు
నాకు వద్దు.
మీరు మంచివారు.
బాగుండాలి. నావలన
మీ కుటుంబంలో
బీట్లు రాకూడదు.
మీ యొక్క
కుటుంబ సంతోషమే
నా బద్రత
కంటే మీకు
ముఖ్యం.
మీ <