మృత్యుదూత...(పూర్తి నవల)
మృత్యుదూత (పూర్తి నవల)
దశరథమూర్తి తన పరిశోధనా కేంద్రంలో
పైజమా-బనియన్ తో కూర్చుని తన ముందున్న టేబుల్ పైన వరుసగా ఉంచబడిన పురాతన
చెక్కబద్దలను ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకుని, చేతిలోని
భూతద్దం ద్వారా ఆ చెక్క బద్దలపైన రాసున్న వాక్యాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ చదువుతున్నప్పుడు----
ఆయన దగ్గరున్న ‘వాకీ
టాకీ’
పిలిచింది.
దాన్ని తీసుకుని చెవి దగ్గర
పెట్టుకున్నారు.
అవతల పక్క ఆయన సెక్రెటరీ పల్లవి
మాట్లాడింది.
“సార్...జూపిటర్
టీవీ నుండి బృందం వచ్చింది”
“టీ.వీ
బృందమా....? వాళ్లెందుకు వచ్చారు?”
“ఏమిటి సార్...మర్చిపోయారా? జూపిటర్
టీవీకి మీరు ఈ రోజు ఒక స్పేషల్ ఇంటర్ వ్యూ ఇవ్వవలసిన రోజు”
“అలాగా?”
“ఏమిటి సార్...అలాగా అని సావకాశంగా
అడుగుతున్నారు? ఇది క్రితం నెలే ఫిక్స్ చేసిన విషయం.
ప్రొద్దున కూడా నేను మీకు జ్ఞాపకం చేశేనే?”
“ఓ! సారీ... పల్లవి...మర్చిపోయాను”
“టీ.వీ
బృందం వచ్చి వైట్ చేస్తున్నారు సార్”
“మొత్తం
ఎంత మంది?”
“ఐదుగురు సార్”
“ఎందుకు
పల్లవి ఈ ఇంటర్ వ్యూ లన్నీ? వాళ్లను ఇక్కడికి
రప్పించకుండా చేసుండచ్చే?”
దశరథమూర్తి ‘హుష్’ అంటూ
నిట్టుర్పు విడిచారు.
“ఇక
కుదరదు సార్. తారీఖు ఫిక్స్ చేసి, టైము ఇచ్చేశాము. టీవీ
వాళ్ళు కూడా ఏదో అవుట్ డోర్ షూటింగ్ వచ్చే విధంగా విధవిధమైన వస్తువులతో వచ్చాసారు.
వాళ్ళు మీకొసం కాచుకోనున్నారు”
“ఇంటర్ వ్యూ పూర్తి చేయటానికి ఎంతసేపు
అవుతుంది?”
“ఎలాగూ ఒక గంటసేపైనా పడుతుంది సార్”
“క్రిమినల్
వేస్ట్! వచ్చేనెల ఇటలీ దేశంలో ఐదవ అంతర్జాతీయ మూలికల సదస్సు జరగనుంది...ఆ సదస్సులో
మాట్లాడటానికి కావలసిన ముఖ్యమైన టాపిక్ గురించి ఇంకా ఏ పనీ మొదలుపెట్టలేదు. ఆ
సదస్సులో అత్యంత అరుదైన, ఔషధ గుణాలున్న మూలికల
గురించి నేను మాట్లాడాలి. దానికొసం పురాతన చెక్కబద్దలను చదువుతున్నాను. ఇది పూర్తి
చేయటానికే చాలా సమయం పట్టేట్టు ఉంది...ఇప్పుడు ఈ ఇంటర్ వ్యూ లన్నీ అవసరమా? ఏదైనా
చెప్పి వాళ్ళను ప్యాకప్ చెయ్యటం కుదరదా?”
“సారీ సార్... జూపిటర్ టీవీ ఆర్డినరీ
ఛానల్ కాదు. వాళ్ళకు ప్రపంచమంతా ‘నెట్ వర్క్’ ఉంది...మీతో
స్పేషల్ ఇంటర్ వ్యూ ను ప్రచారం చెయ్యబోతారని పదిహేను రోజులుగా వాళ్ల టీవీ ఛానెల్లో
ప్రకటనలు చేస్తున్నారు...ఇంటర్ వ్యూ చేయడానికి బృందంతో వచ్చిన వాళ్ళను...అందులోనూ
మనం టైము ఇచ్చిన తరువాత, ఇప్పుడు కుదరదు అంటే
బాగుండదు సార్”
“ఒక
గంటసేపు కంటే ఎక్కువ సమయం తీసుకోరుగా?”
“తీసుకోరు సార్...నేను వాళ్ళ దగ్గర టైము
గురించి చెప్పేశాను”
“సరే
నేను ఇంకో పది నిమిషాలలో వస్తాను! వాళ్లకు కాఫీ, టీ
లాంటివి ఏర్పాటు చెయ్యి”
“ఇచ్చేను
సార్...కాఫీ తాగుతున్నారు సార్”
దశరథమూర్తి గారు చూస్తున్న పురాతన
చెక్కబద్దను పక్కన పెట్టి లేచారు.
పరిశోధనా కేంద్రానికి ఆనుకుని ఉన్న
స్నానాల గదిలోకి వెళ్ళారు. స్నానం చేసి ఫ్రేష్ అయ్యి, ప్యాంటు, ఓవర్
కోటు వేసుకుని అద్దం ముందు నిలబడ్డ ఆయన, జుట్టు
లేని బట్ట తలమీద పొడుగ్గా ఉన్న నాలుగు తెల్ల వెంట్రుకులను దువ్వెనతో జాగ్రత్తగా
దువ్వి అనిచి పెట్టుకున్నారు.
కొంచంగా సెంటును ఒంటి మీద జల్లుకుని
బయటకు వచ్చారు. రెండు అంతస్తుల వరాండాను దాటి, గ్రౌండ్
ఫ్లోర్ లో ఉన్న హాలుకు రావటానికి ఐదు నిమిషాలు పట్టింది. హాలులో టీవీ బృందం కెమేరాలతో
కాచుకోనున్నారు.
పల్లవి లేచి నిలబడింది.
“రండి
సార్”
సోఫాలో కూర్చోనున్న టీవీ బృందానికి
చెందిన ఆ ఐదుగురూ లేచి నిలబడి “నమస్తే
సార్” చెప్పారు.
వాళ్ళల్లో ఒకరు మహిళ. అందంగా, సినిమా
హీరోయిన్ లాగా ఉన్నది. అందమైన పళ్ళ వరుసతో నవ్వుకుంటూ దశరథమూర్తి గారి దగ్గరకు
వచ్చింది.
“సార్...నా
పేరు శ్రీలత...జూపిటర్ టీవీలో ప్రెసెంటర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు నేనే
మిమ్మల్ని ఇంటర్ వ్యూ చెయ్యబోతాను. వీళ్ళు ‘కెమేరా
మాన్’ రాజు మరియూ రామూ.
వాళ్ళు లైట్ మ్యాన్స్ గణేష్ అండ్ సాహిద్”
దశరథమూర్తి గారు శ్రీలత ని చూసి నవ్వారు.
“ఒక
సినిమా హీరోయిన్ని ఇంటర్ వ్యూ చేసి టెలికాస్ట్ చేస్తే, అది
చూడటానికి లక్షలమంది చూసేవాళ్ళు ఉంటారు. ఈ అరవై ఏళ్ళ వయసున్న, రిటైర్డ్
పురావస్తు శాఖ పరిశోధనా సైంటిస్ట్ ను ఇంటర్ వ్యూ చేసి టెలికాస్ట్ చేస్తే ఎవరు
చూస్తారు?
టీవీ
తెర మీద నా మొహాన్ని చూసిన వెంటనే రిమోట్ కంట్రోల్ లో ఉన్న బటన్ నొక్కి, వేరే
ఛానల్ కు వెళ్ళిపోతారు”
“యు
ఆర్ రాంగ్ సార్...జూపీటర్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడూ వ్యత్యాసమైన ఇంటర్ వ్యూ లను
ఎంజాయ్ చేసి చూసే రకం. ఇప్పుడంతా నటీనటుల , సెలెబ్రెటీల
ఇంటర్ వ్యూ లను పెద్దగా ఇష్టపడి చూడటం లేదు. మేమూ నటీనటులను, సెలెబ్రెటీలనూ
వదిలేసి వేరు వేరు రంగాలలో ఉండే ముఖ్య వ్యక్తులను ఇంటర్ వ్యూ చేసి ప్రసారం చేస్తూ
వస్తున్నాము. ‘వ్యత్యాసమైన వ్యక్తులు’ అనే పేరుతో ప్రతి
గురువారం సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు ప్రసారం చేస్తూ వస్తున్నాము. మీరు చూడటం లేదా సార్?”
“ఇంట్లో రెండు టీవీలు ఉన్నాయి. ‘టీవీ
ఆంటెనా’
కనెక్షన్
ఉంది. కానీ, టీవీ చూడటానికే టైము లేదు. ప్రొగ్రాం
పేరు ఏం చెప్పావమ్మా...వ్యత్యాసమైన వ్యక్తులా?”
“అవును సార్”
“చాలెంజ్
టీవీలో వస్తున్న 'ప్రముఖ మనుష్యులు’ లాగానా?”
"అదివేరు...ఇదివేరు
సార్"
“సరే...ఇంతవరకు
ఎవరెవర్ని ఇంటర్ వ్యూ చేసి ప్రసారం చేసారు?"
"ఒక చిన్న లిస్టే ఉంది
సార్...పోయిన వారం, మల్టీ మిల్స్ ఓనర్ విశ్వేశ్వర
రావు గారి ఇంటర్ వ్యూ"
"ఒక మిల్ ఓనర్ ఇంటర్ వ్యూ అంటే అది
అత్యంత సాధారణ వ్యక్తి ప్రొగ్రామే కదా...ఇందులో ఏముంది ప్రత్యేకత?"
శ్రీలత నవ్వింది. "మల్టీ మిల్స్
అనేది ఆయన మిల్లు పేరు కాదు. పదిహేను మిల్లులకు ఆయన సింగిల్ ఓనర్. ఆయన దగ్గర అందరి
మిల్లు ఓనర్ల కంటే ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే ఆయన దగ్గర ఇంటర్ వ్యూ తీసుకున్నాం?"
"ఏమిటా ప్రత్యేకత?”
"సార్... విశ్వేశ్వర
రావు గారు తన చిన్న వయసులోనే తల్లి-తండ్రులను ఒక ప్రమాదంలో పోగొట్టుకుని -- సొంత
మనుష్యులచే బహిష్కరించబడ్డారు. వీధిలో అనాధగా నిలబడ్డారు. ఒక పూట కడుపు
నింపుకోవటానికి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి. కానీ, ఆయన
ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు. రోడ్డు రోడ్డూ తిరిగి, చెత్త కాగితాలు ఏరుకుని - పాత సామాన్ల
మార్కెట్టుకు వెళ్ళి అమ్ముకుని -- తన మూడు పూటల ఆకలిని పోగొట్టుకున్నారు.
సుమారు ఏడు సంవత్సరాలు చెత్త కాగితాలను
ఏరి, అమ్ముకుని -- ప్లాట్
ఫారం మీద పడుకుని నిద్రపోయిన ఆయన తన పదిహేనవ ఏట విజయవాడ గవర్నర్ పేట సెంటర్ లో ఒక పాత
పేపర్ల షాపును ప్రారంభించారు. హోల్సేల్ చెత్త పేపర్ల వ్యాపారంలో పలు వ్యక్తులతో
పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని, తాను
సేవింగ్స్ చేసిన డబ్బును, బ్యాంకు అప్పుగా
ఇచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టి, తన
ఇరవై రెండవ ఏట ' విశ్వా పేపర్ కోన్స్’ అనే పేరు మీద
వ్యాపారం మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఏడే సంవత్సరాలలో వ్యాపారం పెద్దగా జరుగుతుంటే, ఐదుకోట్ల
రూపాయల ఖర్చుతో ఒక కొత్త పేపర్ మిల్లు నిర్మించారు. అప్పుడు ఆయనకు వయసు ముప్పైయే. ఆ తరువాత విజయం
పైన విజయం. ఈ రోజు భారతదేశంలో వివిధ నగరాలలో ఆయన పేరు మీద పదిహేను పేపర్ మిల్లులు
ఉన్నాయి. ఈ రోజు భారతదేశంలో ఉన్న వార్తా పత్రికలూ, వార, మాస
పత్రికలు ఆయన మిల్లు పేపర్లనే వాడుతున్నారు. భారత దేశంలో పేపర్ దిగిమతి 70 శాతం
నుండి 20
శాతానికి
పడిపోయింది"
"నిజంగానా?"
“చూసారా
సార్. మీరే ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ప్రముఖ వ్యక్తులను మా ఈ ప్రోగ్రాం ద్వార
ప్రపంచానికి పరిచయం చేయటానికి ఉద్దేశించినదే 'వ్యత్యాసమైన
వ్యక్తులు’ యొక్క
ఉద్దేశ్యం. చెత్త కుప్పల తొట్ల నుండి
చెత్త కాగితాలు ఏరుకున్న విశ్వేశ్వర రావు అనే ఆ ఏడేళ్ళ చిన్న పిల్లాడు, ఈ
రోజు ఇండియాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు -- అనేది
ఎంత ఉన్నతమైనది. ఈ ప్రోగ్రాం చూసే ఉద్యోగం లేని కుర్రకారుకు విశ్వేశ్వర రావు గారి
జీవితం ఒక ఉత్సాహ 'టానిక్' గా
ఉండదా?”
దశరథమూర్తి గారు తన భుజాలు ఎగరేసాడు.
“ఏస్... విశ్వేశ్వర
రావు నిజంగానే ఒక వ్యత్యాసమైన వ్యక్తే. ఆయన్ను ఇంటర్ వ్యూ చేసి ప్రసారం చేయటం కూడా
న్యాయమైనదే. కానీ...నన్ను ఇంటర్ వ్యూ చేయటానికి, నా
దగ్గర వ్యత్యాసంగా ఏముంది? నేను 40 సంవత్సరాలుగా
పురావస్తు శాఖ విభాగంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఒక సాధారణ
ప్రొఫసర్”
శ్రీలత గట్టిగా నవ్వుతూ దశరథమూర్తి
గారిని చూసింది “సార్...మేధావులు
ఏ రోజూ పొగడ్తల కోసమో, ప్రకటనల కోసమో
పనిచేయరు. అది వాళ్లకు ఇష్టం కూడా ఉండదు.
ఈ కట్టుబాటుకు మీరు మినహాయింపుగా ఉండగలరా ఏమిటి? సార్...మీరు
ఒక ఇంగ్లీష్ ప్రొఫసర్ గానో, హిస్టరీ ప్రొఫసర్
గానో పనిచేసి రిటైర్ అయ్యుంటే జూపీటర్ టీవీ ఇంటర్ వ్యూ అంత ఈజీగా వచ్చుండదు.
మీరు ఎంత మేధావులంటే మీ అనుభవం, మీ
సేవ ఇంకా మన ప్రభుత్వం కోరుకుంటోంది. మీరు గొప్ప నిపుణులు. 'హెర్బల్’ అనే మూలికల గురించిన
పరిశోధన కోసం ఈ అరవై ఏళ్ళ వయసులోనూ, రోజులను
ఖర్చుపెడుతూ కష్టపడి పనిచేస్తున్నారు. మీరు పరిశోధిస్తున్న అరుదైన మూలికల గురించి
మామూలు ప్రజలు కూడా తెలుసుకోవాలనే కారణంతోనే మిమ్మల్ని ఇంటర్ వ్యూ చేయాలని
అనుకున్నాము”
దశరథమూర్తి గారు మెల్లగా తలవూపుతూ శ్రీలతని
చూశారు.
“చాలా
సంతోషం...మూలికల గురించి ప్రజలు తెలుసుకోవటానికి టీవీ ఒక మంచి మీడియా. కానీ, ఇంటర్
వ్యూ ను ఒక అరగంట లోపు ముగించుకుంటే మంచిది. నాకు ల్యాబులో చాలా పనుంది. వచ్చే నెల
ఇటాలీ దేశంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరగబోతోంది. దానికి సంబంధించిన పనులు చాలా
ఉన్నాయి”
“ఐ నో
యువర్
వాల్యూబుల్
టైమ్
సార్.
ఈ
ఇంటర్
వ్యూ
మంచి
ఇన్
ఫర్మేషన్
తో
చిన్నదిగా
ఉండాలనేదే
నా
ఇష్టం
కూడాను.
మీ
ఓర్పునూ, టైమును
పరీక్షించే
లాగా
ఏ
ఒక
ప్రశ్నా
ఉండదు.
ఇంటర్
వ్యూ
మొదలు
పెడదామా
సార్?”
“ఊ....”
**********************************************PART-2********************************************
కెమేరా ఆంగిల్స్
మార్చి
పెట్టబడి, రెండు
వేల
వోల్ట్
బల్బులు
వేడితో
వెలుతురు
విరజిమ్ముతున్నాయి.
శ్రీలత తన
చేతిలో
ఉంచుకున్న
‘కాలర్
మైక్’ ను
దశరథమూర్తి
గారి
చొక్కాకు
అమర్చింది.
కెమేరాలు పని
మొదలుపెట్టగానే, శ్రీలత
కెమేరాల
వైపు
నవ్వుతూ
చూస్తూ
తన
మాటలను
మొదలు
పెట్టింది.
“జూపీటర్ టీవీ
ప్రేక్షకులందరికీ
నమస్తే.
స్వాగతం!
‘వ్యత్యాసమైన
వ్యక్తులు’
కార్యక్రమంలో
ఇది
తొమ్మిదో
భాగం.
ఈ
రోజు
మనం
చూడబోయే
వ్యత్యాసమైన
వ్యక్తి
శ్రీ
దశరథమూర్తి
గారు.
ఈయన
బయటి
లోకానికి పెద్దగా
పరిచయంలేని
ఒక
వి.ఐ.పి.
గత నలభై
సంవత్సరాలుగా
‘ఆర్కియాలజీ’ అని
పిలువబడే
పురాతన
వస్తువుల
పరిశోధనా
సంస్థలో
ప్రొఫసర్
గానూ, పరిశోధనా
సైంటిస్టుగానూ
పనిచేస్తూ
మానవ
జాతికి
ఎంతో
ఉపయోగపడే
అరుదైన
‘మూలిక’
లను
పరిశోధించి
చాలా
వ్యాసాలు
రాసి
అంతర్జాతీయ
మూలికా
సదస్సులలో, మహ
శభలలో
సమర్పించారు.
పెద్ద
పెద్ద
పత్రికలలో
మాత్రమే
ఈయన
పేరు
కనబడుతుంది.
సామాన్య
మానవుల
మనసులో
చోటు
పట్టులేకపోవటానికి
కారణం, ఇక్కడున్న
ప్రజలకూ, విదేశీయ
ప్రజలకూ
మూలికల
గురించి
ఎక్కువగా
తెలియదు
కనుక.
ఆ
మూలికల
గురించి
తెలుసుకోవటానికే
ఈ
రోజు
దశరథమూర్తి
గారిని
కలుసుకుని
మాట్లాడబోతున్నాము.
నమస్తే
ప్రొఫసర్
దశరథమూర్తి
గారూ!”
అప్పుడు కెమెరాలు
దశరథమూర్తి
గారి
వైపు తిరిగినై. ఆయన
తన
రెండు
చేతులనూ
జోడించి
‘నమస్తే’ చెప్పారు.
తరువాత
మొదలుపెట్టారు.
“ఇలాంటి ఇంటర్
వ్యూల
మూలం
నా
గురించో, నేను
చేసే
మూలికల
పరిశోధనల
గురించో
నన్ను
ప్రజలకు
చూపించుకోవాలనేదో
నా
ఉద్దేశ్యం
కాదు.
మూలికల
గురించి
ప్రజలు
తెలుసుకోవాలనే
ఒకే
ఒక ఆశతో
జూపీటర్
టీవీ
నా
దగ్గర
ఇంటర్
వ్యూ
చేయడానికి
ముందుకు
వచ్చారు.
ఈ
మంచి
ప్రయత్నానికి
ఆ
టీవీ
నిర్వాహకులకు నా
శుభకాంక్షలను, సంతోషాన్నీ
తెలియపర్చుకుంటున్నాను”
కెమెరాలు శ్రీలత వైపు తిరిగినై.
ఆమె మొదటి ప్రశ్న అడిగింది.
“మూలిక అంటే ఏమిటనేది బహుశ చాలా మందికి
తెలిసిన పదమే. వాటికి ఔషధ శక్తులు ఉంటాయనేది కూడా చాలా మందికి తెలిసుంటుంది. కానీ, ఈ
మూలికల గురించి ముప్పై ఏళ్ళు పరిశోధన, అంతర్జాతీయ
సదస్సులు,
శభలు, ప్రశంగాలు, వ్యాసాలు...దానికొసం
కోట్ల కొద్ది డబ్బు ఖర్చుపెట్టడం---దీని గురించి చెప్పండి సార్”
“చాలా
మంచి ప్రశ్న అడిగావు. నేను దీనికి క్లుప్తంగా జవాబు చెబుతాను. మూలిక అనగానే అదేదో
వాడుకలో భారతదేశానికి మాత్రమే సొంతమైనదని చాలా మంది అనుకుంటారు. అది తప్పు.
మూలికలను ఔషధాలుగా వాడుకునే సంప్రదాయం పలుదేశాలలో వాడుకలో ఉంది. నిజానికి మూలికలు
దేవుడు మనిషికి ఇచ్చిన పృక్రుతి ఔషధం. అయితే రసాయన ఔషధాలు, చికిత్స
శాస్త్రీయ సపోర్ట్ తో ప్రబలమైంది కాబట్టి, ఈ
మూలికా చికిత్స విధానం పూర్తిగా కనుమరుగయ్యింది. కానీ, నిజానికి
మూలికా ఔషధ చికిత్స చాలా గొప్పది. రసాయన ఔషధ చికిత్స కంటే చాలా గొప్పది. అయితే
దీనికి శాస్త్రీయ సపోర్టు లేదు. ఔషధ గుణాలున్న మూలికలకు శాస్త్రీయ సపోర్ట్ జతచేయటం
కోసమే భారత దేశంతో పాటూ మూలికలపై నమ్మకమున్న మరికొన్ని దేశాలు కలిసి ఈ మూలికా
పరిశోధనా ప్రయత్నంలో పెట్టుబడి పెట్టాయి.
మూలిక అనగానే అదేదో భారత దేశానికి
మాత్రమే సొంతం, అవి
మన దేశంలో మాత్రమే దొరుకుతాయి అనుకొవడం కూడా పొరపాటే. ఈ ఔషధ
గుణాలున్న మూలికలు అన్ని ప్రపంచ దేశాలలోనూ ఉన్నాయి. కొన్ని దేశాలు వాటిని ఔషధాలుగా
వాడుతున్నారు. కొన్ని దేశాలు వాటిని పట్టించుకోవటం లేదు. మేము అలా ప్రపంచ దేశాలలో
దొరుకుతున్న మూలికలను గుర్తించి, వాటిపై
పరిశోధన చేసి వాటి ఔషధ గుణాలను శాస్త్రీయంగా నిరూపించి, వాటిని వాడకంలలోకి
తీసుకు రావాలనేదే మా ప్రయత్నం. మా ప్రయత్నంలో మేము కొంతవరకు విజయం సాధించాము.
రసాయన ఔషధాలలో, ఔషధ
గుణాలున్న మూలికలను కలిపి ఔషధాలు తయారు చేస్తున్నారు. కానీ ముఖ్యమైన కొన్ని పెద్ద
వ్యాధులకు చికిత్స అందించగల మూలికలను ఇంకా పూర్తిగా వాడటం లేదు. అలాంటి మూలికలు
చాలా వరకు మా పరిశోధనా కేంద్రంలో ఉన్నాయి. వాటికి శాస్త్రీయ పరిశోధనా నివేదికలను
కూడా అందించాము. అందించింది చాలదు...ఇంకా కావాలని అడుగుతున్నారు. ఆ ప్రయత్నంలోనే
నేను ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాను”
“మూలిక
అంటే నిజానికి ఏమిటి సార్? అది
ఆకులా...కొమ్మలా...వేర్లా?”
దశరథమూర్తి గారు తన కళ్లద్దాలను తీసి, చేతిలో
పెట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టారు.
“మూలిక
అనే పదం చెట్లకు సంబంధించినదే. అది ఆకులు కావచ్చు, కొమ్మలు
కావచ్చు,
మొక్కలు
కావచ్చు,
వేర్లు
కావచ్చు. ఇవన్నీ మూలికల సముదాయంలోనే వస్తాయి. మరో విధంగా చెప్పాలంటే ఔషధ గుణాలున్న
వృక్ష జాతికి చెందినది ఏదైనా కావచ్చు”
“ఆయుర్వేదం
అని చెప్పొచ్చా?”
“అలాగూ చెప్పలేము. ఆయుర్వేదం మూలికల ఔషధ
సముదాయంలో ఒక భాగం. మూలికలు దానికంటే విలువైనవి. ఆయుర్వేదం అనేది నేను ఇందాక
చెప్పిన వన్నిటినీ కలిపి చెప్పవచ్చు. మూలిక అలా కాదు. అందులో ఏదో ఒకటే”
శ్రీలత కురులు పైకెత్తింది.
“ఏమిటి
సార్ చెబుతున్నారు...నాకు అర్ధం కాలేదు”
“ఒకే
ఒక దానికే ఎక్కువ ఔషధ శక్తి ఉన్నదానిని మూలిక అంటాను. చికిత్సకు ఆ ఒక్కటే చాలు....అన్నిటినీ
కలుపనవసరం లేదు”
“నిజమా?”
“అవును...అదే నా పరిశోధనా పని.
ప్రపంచంలోని పలు అడవులలో, పలు చోట్ల అలాంటి
మూలికా చెట్లు ఉన్నాయి. వాటిని కనిబెట్టి ఉపయోగానికి తీసుకు రావాలనేదే నా పరిశోధన.
ప్రతిదేశంలోనూ
నా లాగా పరిశోధన చేసే వ్యక్తులున్నారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలే వాటికి నిధులు
ఇస్తున్నాయి. అలాంటి వారితో కలిసి నేను కనుగొన్న మూలికల గురించి వాళ్ళకూ, వాళ్ళు
కనుగొన్న మూలికల గురించి నాకూ, ఇతర దేశాల నిపుణులకూ
వారి పరిశోధనా ఫలితాలను పంచుకోవటమే మూలికా సదస్సులు”
“మీరు
గానీ,
ఇతర
నిపుణులుగానీ ఇంతవరకు కనుగొన్న మూలికలు ఏ ఏ వ్యాధులకు పనికొస్తాయో మా ప్రేక్షకులు
తెలుసుకోవచ్చా?”
“తప్పకుండా... మేము కనిపెట్టిన మూలికలతో
క్యాన్సర్, డయాబిటీస్, స్థూలకాయం, మతిమరుపు, పక్షవాతం
లాంటి వ్యాధులు అతి తక్కువ రోజులలో గుణం అవుతాయి”
“నిజమా?”
“వందకు వంద శాతం నిజం”
“మీరు
చెప్పేది చూస్తే మెడిసన్ చదవటం మానేసి మూలికల గురించి చదవటం మంచిదనిపిస్తోందే?”
“నన్ను అడిగితే అలా చేయటం మంచిదే అని
చెబుతా. ఇందులో ఎటువంటి మోసమూ లేదు. ఇలాంటి ప్రత్యేక మూలికల గురించి నేను
అంతర్జాతీయ ఆరొగ్య సంస్థకు నివేదిక సమర్పించాను”
“వాళ్ళు
అది ఒప్పుకున్నారా?”
“పూర్తిగా ఒప్పుకోలేదు”
“కారణం?”
“ఇంగ్లీష్ మందులపైన ఉన్న వ్యామోహమే.
దానికంటే వాళ్ళకు ఇంకో భయం కూడా ఉన్నది”
“ఏమిటది?”
“మూలికలతో
వ్యాధులు గుణమైతే, ఇంగ్లీష్ మందులు
తయారుచేసే కంపెనీలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. దాని వలన ఆర్ధీక ఇబ్బందులు
ఏర్పడతాయి. ఇంగ్లీష్ మందులను టన్నులు, టన్నులుగా
తయారు చేసి కోట్లకొలది లాభాలను పొందుతున్న ప్రపంచంలోని పది మందుల కంపెనీలు ప్రపంచ
ఆరొగ్య సంస్థలో ఉన్నవారిని ఇండిపెండెంటుగా గమనిస్తారు. వాళ్లందరూ పరిస్థితుల
మూగవారిగా ఉండిపోయారు. ఈ రోజు కాకపోతే...ఇంకో రోజైనా నోరు విప్పాల్సిందే”
శ్రీలత అడ్డుపడింది.
“మీరు
తప్పుగా అనుకోకపోతే, నేను ఒక అభిప్రాయం
చెప్పొచ్చా సార్?”
“ఖచ్చితంగా”
“ఇప్పుడు
మూలిక ఔషధాలు, మన దేశంలో ఉన్న ఆయుర్వేద, హోమియోపతి, సిద్దా, యునానీ
ఆసుపత్రులలో...వీటిలో ఇప్పటికే మూలికా ఔషధాలను వాడుతున్నారు. మరి వాటి
సంగతేమిటి...అవి పనిచేయవా?”
“అవి పనిచేస్తున్నాయో, లేదో
అవి వాడుతున్న ప్రజల మనోభావల మీద అధారపడి ఉన్నదమ్మా...కానీ, నేను
చెప్పే మూలికల ఔషధ శక్తులకు శాస్త్రీయ పరిశోధనా రిపోర్టులు ఉన్నాయి. అంటే ఈ మూలిక
ఈ మోతాదులో, ఇన్ని డోసులు ఇస్తే వ్యాధి నయం
అవుతుందని ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి. ఈ రుజువులను మన ప్రభుత్వమూ, ప్రపంచ
ఆరొగ్య సంస్థ అంగీకరిస్తే...ఇక మూలికా చికిత్సా ప్రభల మవుతుంది. ప్రజలు మంచి
చికిత్సలు పొందుతారు”
“మీరు
చెప్పే దాంట్లో అన్ని వ్యాధులకూ మూలికలు ఉన్నాయా?”
“చాలా వ్యాధులకు ఉన్నాయి. మిగిలిన
వ్యాధులకు కూడా మూలికలు సేకరించి పరిశోధనలు చేస్తున్నాము. వాటికి కూడా మూలికలు దొరుకుతాయి”
“ఎలా
అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు”
“ఇది
ప్రకృతికి సంబంధించినది. ప్రకృతి మానవులకు అన్నీ రకాల వనరులూ ఇచ్చిందని నేను
నమ్ముతున్నాను”
“మూలికలను
నేను...ఐ మీన్ మా ప్రేక్షకులకు చూపిస్తారా?”
“సారీ! ప్రస్తుతానికి ఆ అరుదైన మూలికలను
బయటవాళ్లకు చూపించటానికి నాకు అనుమతి లేదు. నా పరిశోధనలు పూర్తిగా ముగిసిన తరువాత, ప్రభుత్వాలూ, ప్రపంచ
ఆరొగ్య సంస్థ అంగీకరించిన తరువాత ప్రింట్ మీడియా, టీవీ
ఛానెల్స్ ను పిలిచి నేనే చూపిస్తాను”
శ్రీలత నవ్వింది.
"మిస్టర్ దశరథమూర్తి! మాది చాలా
బిజీ అయిన టీవీ ఛేనల్. మీరు పిలిచినప్పుడంతా మేము కెమేరాలు తీసుకుని రాలేము. ఈ
రోజే మీరు మూలికలను చూపిస్తే పరవాలేదు”
అంతవరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న పల్లవి
కొంచం కోపంగా శ్రీలతను చూసింది.
“మీరు మాట్లాడే మాటలు నాకు నచ్చ లేదు.
మూలికలను ఇప్పుడు చూపించలేను అని చెబితే, అది
ఒప్పుకుని మౌనంగా ఉండటమే సంప్రదాయం. ఇంటర్ వ్యూకి వచ్చేసి బెదిరించినట్టు
మాట్లాడటం సరికాదు”
“ఏయ్!
నేను మాట్లాడుతున్నది దశరథమూర్తి దగ్గర! నీ దగ్గర కాదు. నీ పని చూసుకునిపో...”
శ్రీలత కోపంగా అరవటంతో -- దశరథమూర్తి
గారు ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు. మొహం అంతా కోపతాప సెగ. పెదాలు ఆవేశం చెందాయి.
“గెట్
లాస్ట్ ఎవిరి బడీ...టీవీ మీడియా బృందానికి ఇంత కొవ్వా? మీ
ఏం.డీ. కి ఇప్పుడే ఫోన్ చేస్తాను...”
దశరథమూర్తి గారు చెబుతూ తన జేబులోకి
చెయ్యి పెట్టి సెల్ ఫోన్ తీశారు.
“పల్లవి...!
జూపీటర్ టీవి ఫోన్ నెంబర్ చెప్పు”
పల్లవి సెల్ ఫోన్ నెంబర్ చెప్పటానికి
ప్రయత్నిస్తున్న క్షణం -- శ్రీలత తన చేతితో పాటూ తీసుకు వెళ్ళిన వానిటీ బ్యాగ్
జిప్పును తెరిచి చెయ్యి లోపలకు పెట్టి తీసింది.
రివాల్వర్.
పల్లవి చూపులు భయంతో నిశ్చేష్టమవగా, దశరథమూర్తి
చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆయన వేళ్ళ పట్టులో నుండి జారిపోయింది.
శ్రీలత రివాల్వర్ తో పాటూ లేచి
నిలబడింది.
“మిస్టర్.
దశరథమూర్తి. మీరు అనుకుంటున్నట్టు మేము టీవీ బృందం కాదు. మిమ్మల్ని ఇలాంటి ఒక
సందర్భంలో కలుసుకోవాలని ఆ టీవీ పేరు ఉపయోగించుకున్నాం. మీరూ, మీ
అసిస్టంట్ పల్లవి...ఇద్దరూ ఇంకో గంట సేపు కొంచం కూడా కోపం తెచ్చుకోకుండా మాతో
సహకరించాలి. మేము అడిగే ప్రశ్నలన్నింటికీ నిజమైన సమాధానం చెప్పాలి. అబద్దం చెబితే...అది
ఈ వరస్టు ఫెలోకు నచ్చదు.....ఏమిటి ఇద్దరూ అలా చూస్తున్నారు. వరస్టు ఫెలో అని
చెప్పింది ఈ తుపా కీనే. దాని పేరే వరస్టు
ఫెలో”
చేతిలో తుపాకీతో నిలబడ్డ శ్రీలతని --
ఆమె వెనుక గుండ్రంగా నిలబడ్డ నలుగురిని ఇప్పుడు దశరథమూర్తి గారు భయంతో చూశారు.
“మీ...
మీకు ఏం కావాలి? డబ్బా?”
“డబ్బు ఎవరికి కావాలి?”
“మ.మ...మరేం కావాలి?”
శ్రీలత చేతిలో తుపాకితో దశరథమూర్తి
దగ్గరకు జరిగి తుపాకీతో ఆయన బుగ్గల మీద ఒక గీత
గీసింది.
“మాకు
ఏం కావాలో చెప్పమా?”
“చె...చెప్పు”
“మృత్యుదూత”
**********************************************PART-3********************************************
డా. గోపీనాద్, ఆపరేషన్
ధియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు నర్స్ లిజీ ఆందోళన పడుతూ ఎదురుచూస్తోంది.
సమయం ప్రొద్దున ఏడు గంటలు.
“డాక్టర్!
హీరోయిన్ రంజని మేనేజర్ మిమ్మల్ని అడిగి నాలుగైదు సార్లు ఫోన్ చేసారు. మీరు
ఆపరేషన్ ధియేటర్ లో ఉన్నందువలన, మిమ్మల్ని కాంటాక్ట్
చెయ్యలేకపోయాను”
“విషయం
ఏమిటని అడిగావా?”
“అడిగాను
డాక్టర్...పర్సనల్ అని చెప్పారు. మీ దగ్గరే మాట్లాడాలట”
డా. గోపీనాద్
తన గది వైపు నడుస్తూనే ఆఫ్ చేసి పెట్టిన సెల్ ఫోన్ తీసుకుని ఆన్ చేసి, ఏవో
నెంబర్లు నొక్కారు. అవతల సైడు రింగు వెళ్ళి, రిజీవర్
తీయబడింది.
“హలో...”
అవతల సైడు హీరోయిన్ రంజని మేనేజర్ గొంతు
వినబడింది.
“సారధి!
నేను డాక్టర్ గోపీనాద్”
“డాక్టర్
మీ ఫోను కోసమే నేను కాచుకోనున్నాను”
“ఏమిటి
విషయం చెప్పండి?”
“మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా?”
“ఒక ముఖ్యమైన ఆపరేషన్ ను ఇప్పుడే ముగించి
ధియేటర్ నుండి బయటకు వచ్చాను. ఇక సాయంత్రం ఆరుగంటల వరకు రెస్టే”
“నేను
ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి రావచ్చా డాక్టర్”
“రండి!
బై...ద...బై...ఎనీతింగ్ సీరియస్?”
“అది సీరియస్సా...కాదా, అని
మీరే చెప్పాలి డాక్టర్”
“ఏమిటి
సారధి! మీరు మాట్లాడేది చూస్తుంటే రంజని గారికి ఏదైనా ఒంట్లో బాగుండలేదనుకుంటానే?”
“ఒంట్లో బాగుండలేనిది రంజని గారికి కాదు
డాక్టర్. నాకు. రంజని గారికి ఇప్పుడు ఊటీలో షూటింగ్. ఆవిడ అక్కడున్నారు. హైదరాబాద్ తిరిగి
రావటానికి పదిహేను రోజులు పడుతుంది”
“మీకేమిటి
ప్రాబ్లం?”
“నేను నేరుగా వచ్చి చెబుతాను డాక్టర్”
సారధి రీజీవర్ని పెట్టేయటంతో, డాక్టర్
గోపీనాద్ సెల్ ఫోన్ ఆఫ్ చేసి కోటు జేబులో పడేసుకుని తన గదిలోకి వెళ్ళి తిరిగే
కుర్చీలో కూర్చుని వెనక్కి వాలేరు.
చిన్నగా ఆకలి వేస్తున్నట్టు అనిపించటంతో, బిస్కెట్
ప్యాకెట్ తీసుకుని రెండు బిస్కెట్లు బయటకు తీసి, తిని, ఫ్లాస్కులో
ఉన్న టీ ని గాజు గ్లాసులోకి పోసుకుని తాగారు. జూనియర్ డాక్టర్ ఒకాయనకు ఫోన్ చేసి, మరుసటి
రోజు చెయ్యాల్సిన హార్ట్ సర్జరీ గురించి మాట్లాడేసి రిజీవర్ను పెట్టినప్పుడు తలుపు
తోసుకుని సారధి లోపలకు వచ్చాడు.
సారధి గారికి నలభై ఏళ్ళుంటాయి. కొంచం
స్థూలకాయ శరీరం, చెవి
కిందవరకు గిరదా, మీసాలలో
కొంచం తెల్ల వెంట్రుకలు. బనియన్ వేసుకోని చొక్కాలొపల బంగారు గొలుసు తలతలమని
మెరుస్తోంది. చొక్కా జేబులో ఫారిన్ సిగిరెట్టు పెట్టె ఉంది.
“నమస్తే
డాక్టర్”
“రండి
సారధి గారు”
డాక్టర్ గోపీనాద్ నవ్వుతూ, ఎదురుగా
ఉన్న కుర్చీ చూపించారు. సారధి కూర్చున్న వెంటనే ఆయన అడిగారు.
“చెప్పండి...మీకేమిటి
సమస్య?”
సారధి కొంచం సేపు తటపటాయించి చెప్పటం
మొదలుపెట్టాడు.
“డాక్టర్…రంజని
గారు షూటింగుకు వెళ్ళిపోవటం వలన బంగళాలో నేనొక్కడినే ఉన్నాను. నా రూములో ఫ్యాన్
సరిగ్గా పనిచేయకపోవటంతో, చెమట
కారణంగా నిద్ర పోలేకపోయాను. గాలికోసం హాలులోకి వెళ్ళి పడుకున్నాను. దోమల బాధ
ఎక్కువగా ఉంది.......రెండింటి వరకు దొర్లుతూ,
దొర్లుతూ
పడుకున్నాను. నిద్ర పట్టలేదు. చివరిగా వేరే
దారిలేక రంజని గారి గదిలోకి వెళ్ళి ఏ.సీ. ‘ఆన్’ చేసుకుని నేల మీద
దుప్పటి పరచి పడుకున్నాను. మంచి నిద్ర పట్టింది. హఠాత్తుగా తెల్లవారుజామున నాలుగూ
ఆ ప్రాంతంలో మెలుకువ
వచ్చింది. కళ్ళు తెరిచాను. ముఖమంతా చెమటలు"
డాక్టర్ అడ్దుపడి అడిగారు.
“ఏ.సీ. పనిచేయలేదా?”
“ఏ.సీ.
పనిచేస్తోంది డాక్టర్. గది మొత్తం చల్లగా ఉంది”
“మరి
చెమట ఎందుకు పట్టింది?”
“అదే
నాకూ అర్ధం కాలేదు. గదిలోపల ఉన్న ఒక గుడ్డ తీసుకుని చెమటను తుడిచేసి, ఏ.సీ. ఎక్కువగా
పెట్టుకుని పడుకున్నాను. బాగా
టయర్డ్ గా ఉన్నానేమో వెంటనే నిద్ర పట్టేసింది. ఆరు గంటలకు లేచాను. గది, డిసెంబర్ నెల ఊటీ
లాగా ఏది ముట్టుకున్నా చల్లగా ఉన్నది”
“నేను
లేచి ఏ.సీ. ఆఫ్ చేసి, గదిలోంచి
బయటకు వచ్చేటప్పుడు, నా
మొహానికి పట్టిన చెమటను తుడుచుకున్న గుడ్డ కనబడింది. ఆ గుడ్డను చూసి షాక్ అయ్యాను”
డాక్టర్ కుర్చీలో నిటారుగా
కూర్చున్నారు.
“ఏం...ఏమైంది?”
“ఆ
గుడ్డను మీరే చూడండి డాక్టర్”
----అన్న సారధి తన ప్యాంటు జేబులో నుండి
ఒక ప్లాస్టిక్ కవరులో పెట్టిన ఆ గుడ్డను తీసి చూపించాడు.
డాక్టర్ తటపటాయిస్తూనే అది
తీసుకున్నారు.
అదొక చిన్న 'టర్కీ' టవల్. చుట్టి
పెట్టబడున్న టవల్ ను చూశారు.
డాక్టర్ ముఖమంతా షాక్ అలలు
ప్రవహించింది.
టవల్ పైన దట దట్టంగా రక్తపు మరకలు.
***********************************
దశరథమూర్తి ముఖం అంతా ఆశ్చర్యంతో
నిండింది. దాన్ని తన కళ్ళల్లో వెలిబుచ్చాడు.
“ఏ...ఏ...ఏ...ఏమిటీ...మృత్యుదూతా?”
“అవును” అన్నది శ్రీలత.
“అలాగంటే?”
శ్రీలత మళ్ళీ తన చేతిలో ఉంచుకున్న
తుపాకీతో దశరథమూర్తి గారి ఎడమ వైపు చెంపపైన గట్టిగా నొక్కుతూ ఒక గీత గీసింది.
“ఇలాంటి
అమాయకత్వమైన మాటలూ, చూపులూ, ఒక్క దమ్మిడీకి కూడా
ప్రయోజనం లేదు మిస్టర్. దశరథమూర్తి. మీరూ,
మీ
అసిస్టంట్ పల్లవి ప్రాణాలతో ఉండాలంటే నాకు ఆ మృత్యుదూత మూలిక కావాలి”
దశరథమూర్తి గారు ఇంకా అదే
ఆశ్చర్యంతో చూస్తున్నారు.
“ఇదిగో...చూడూ.
నువ్వు మాట్లాడేది ఏదీ నాకు అర్ధం కావటం లేదు. ఏదైనా మాట్లాడ దలుచుకుంటే తిన్నగా
మాట్లాడు...అదేమిటి మృత్యుదూత మూలిక?”
“నిజంగానే
మీకు తెలియటం లేదా?”
“తెలియదు?”
శ్రీలత తన వెనుక నిలబడున్న ఆ నలుగురు
యువకులు రాజు, రామూ, గణేష్, సాహిద్ ను తిరిగి
చూసింది...వాళ్ళు పల్లవి వైపు నడిచారు. ఆమెను చుట్టు ముట్టారు.
దశరథమూర్తి గారు చూస్తున్నప్పుడే కొంచం
కూడా ఎదురుచూడని ఒక్క క్షణంలో ఆ నలుగురూ పల్లవి భుజం మీద చెయ్యి వేశారు. శ్రీలత
ఇప్పుడు తన చేతిలో ఉన్న తుపాకీని దశరథమూర్తి గారి బట్ట తలపైన పెట్టింది.
“మిస్టర్.
దశరథమూర్తి! తెలుగు పత్రికలను రోజూ చదివే అలవాటు మీకు ఉంటే...ఒక వార్త మీ కంటికి
కనబడకుండా ఉండి ఉండదు. ‘ఒక
అమ్మాయిని నలుగురు కలిసి దారుణంగా మానభంగం చేసి హత్య చేశారు’. ఆ వార్తను ఇప్పుడు
ఈ నలుగురూ కలిసి...మీ ముందే అరంగేట్రం చెయ్యబోతారు. చూడటానికి రెడీగా
ఉండండి...చూడటానికి మీరు రెడీగా ఉన్నారా?”
దశరథమూర్తి గారు పొత్తి కడుపులో నుండి
గట్టిగా అరిచారు.
“నో...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...!”
“మీరు
ఇష్టపడరని నాకు తెలుసు...ఎందుకంటే పల్లవి మీకు కూతురులాంటిది...అవునా?”
“ఆ
అమ్మాయిని ఏం చేయకండి”
“మిస్టర్
దశరథమూర్తి! నేనడిగిన
ఆ మృత్యుదూత మూలికను మీరు తీసి ఇచ్చేస్తే,
మేము
మాట్లాడకుండా, ఏమీ
చెయ్యకుండా వెళ్ళిపోతాము. తీసి ఇస్తారా?”
“ఇలా చూడు...నువ్వు చెప్పే ఆ ‘మృత్యుదూత’ మూలిక ఏదనేదే నాకు
తెలియదు. నా యాభై ఏళ్ళ జీవితంలో నేను అటువంటి మూలిక పేరు విననే లేదు. ఏదైనా సరే
క్లియర్ గా చెబితేనే కదా నాకు తెలిసేది?”
శ్రీలత తలను ఒక పక్కకు వంచి దశరథమూర్తి
ను చూసి నవ్వింది.
“ఓ!
మీకు క్లియర్ గా చెబితేనే అర్ధమవుతుందా? అన్నీ
తెలిసి ఉంచుకుని, ఏమీ తెలియనట్లు
నటించటం ఒక అతిపెద్ద కళ. ఆ కళ మీ దగ్గర పరిపూర్ణంగా ఉంది. ‘మృత్యుదూత’ అంటే ఏమిటనేది మీకు
తెలియాలి. అంతే కదా...?” అన్నది శ్రీలత .
“రామూ” అని కేక వెయ్యంగానే
-- ఆ నలుగురి యువకులలో ఒకడు పల్లవిని వదిలిపెట్టి దశరథమూర్తి దగ్గరకు వచ్చి “ఏమిటి శ్రీ...?” అన్నాడు.
“మిస్టర్
దశరథమూర్తి గారికి వయసు పై బడటం వలన జ్ఞాపక శక్తి తగ్గిపోయి ఉండొచ్చు. ‘మృత్యుదూత’ గురించి కొంచం
చెప్పు”
రామూ ఆయన్నే చూశాడు. ఒక వేళాకోలం
నవ్వుతో మొదలుపెట్టాడు.
**********************************************PART-4********************************************
“ప్రొఫసర్
సార్...ఆఫ్రికా దేశంలో రెండువేల సంవత్సరాలకు ముందు దొరికిన ఒక మూలిక పెరే ‘మృత్యుదూత’. అది ఒక అపూర్వమైన --
అద్భుతమైన మూలిక. ఫ్రెంచ్ రాజు పద్నాలుగో లూయూ దగ్గర కొన్ని రోజులు ఉన్నది. ఆ
తరువాత అమెరికాలోని మెర్లింగ్ మైకల్ అనే కోటీశ్వరుడి దగ్గరకు వెళ్ళింది.
ఆ తరువాత అదెలాగో కొంతమంది చేతులు మారి, మారి
గడచిన ఒక సంవత్సర కాలంగా మీ దగ్గర ఉన్నది...ఆ ‘మృత్యుదూత’ మూలికనే మేము
ఇప్పుడు అడుగుతున్నాం. అది తీసిచ్చేరనుకోండి, మేము
సైలంటుగా వెళ్ళిపోతాం”
దశరథమూర్తి గారి కళ్ళల్లో ఒక భయం, శరీరంలో
సన్నగా వణుకు మొదలై శరీరమంతా పాకింది.
శ్రీలతని, ఆ
నలుగురు యువకులనూ మారి మారి చూసేసి ఆందోళన పడుతూ మాట్లాడటం మొదలు పెట్టాడు.
“మీరు చెబుతున్న ‘మృత్యుదూత’ మూలిక నాకు కొత్త
వార్తగా ఉంది...నేను నా జీవిత కాలంలో ఎన్నో మూలికల గురించి విన్నాను. ఆ మూలికలను
ఉపయోగించి పరిశోధనలు చేసేను. కానీ ‘మృత్యుదూత’ మూలిక గురించి నేను
విననే లేదు”
“నిజమా...మీరు
వినలేదా?”
“నేనెందుకు అబద్దం చెప్పాలి? తెలిస్తే
తెలుసని చెబుతా. నా పరిశోధనా శాలలో రకరకాలు మూలికలున్నాయి. వాటిలో కొన్నిటికి
పేరుంది. ఇంకొన్నిటికి నెంబర్లు మాత్రమే ఉన్నది! మీకు ఎవరో తప్పైన సమాచారం ఇచ్చారు”
“ఫడేల్”
రామూ యొక్క చెయ్యి కొరడాలాగా తిరిగి దశరథమూర్తి
గారి కుడి చెంప మీద పిడుగులా పడటంతో -- ఆయన పది
అడుగులు దూరంలోకి వెళ్ళి పడ్డాడు.
“ముసలి
నక్కా! తెలియదు అని చెబితే నిన్ను వదిలేస్తామని అనుకుంటున్నావా? ఎంత
కొవ్వు రా ముసలి కుక్కా? మేము గత రెండు
సంవత్సరాలుగా ఎంతో శ్రమ పడి రాత్రనక, పగలనక
తిరిగి ఈ నిజాన్ని కనిపెట్టేమో తెలుసా? ఇదిగో
ఇలా చూడు...ఇలా నటించే పనులన్నీ మా దగ్గర వద్దు.
వొళ్ళు దగ్గర పెట్టుకుని నిజాన్ని
ఒప్పుకుని, ఆ ‘మృత్యుదూత’ మూలికను తీసి
ఇవ్వు...లేదంటే పల్లవిని నీ కళ్లెదుటే నాశనం చేస్తాము. ఆమె శరీరాన్ని ఆసిడ్ పోసి
తగలబెట్టేస్తాము. ఆ తరువాత నిన్ను...”
రామూ చెబుతూనే, లేచి
నిలబడటానికి ప్రయత్నం చేస్తున్న దశరథమూర్తి గారిని ఎగిరి ఒక తన్ను తన్నాడు.
ఆయన దగ్గర దగ్గర ఒక బంతిలాగా ఎగిరి
గోడకు కొట్టుకుని కిందపడ్డారు. నుదుటి మీద చిన్నగా రక్త గాయం ఏర్పడింది.
శ్రీలత కోపంగా పల్లవి వైపు తిరిగింది.
“ఇదిగో చూడు పల్లవి...ఈ ముసలి నక్క నోరు
తెరవలేదనుకో ప్రాణాన్నీ, మానాన్నీ మొదట
వదిలేది నువ్వే. నువ్వైనా నిజం చెప్పు! ‘మృత్యుదూత’ మూలిక ఇక్కడే కదా
ఉన్నది?”
పల్లవి కళ్ళల్లో నీళ్ళు తిరిగినై. గొంతుకలోనే
మాటలు తడబడ్డాయి.
“వచ్చి...వచ్చి...”
శ్రీలత కోపంగా అరిచింది.
“చెప్పు...ఈ
ముసలోడు చేస్తున్న మూలికల పరిశోధనలకు నువ్వే కదా అసిస్టంట్? నీకు
ఈ పరిశోధనా కేంద్రంలో ఉన్న అన్ని విషయాలూ తెలుసు కదా?”
“అ...అ...అన్ని విషయాలూ తెలియదు.
పరిశోధనా కేంద్రంలో ఉన్న కొన్ని మూలికలకు ఏం పేరో కూడా నాకు తెలియదు. నేను ఇక్కడ
ఉద్యోగంలో జేరి ఒక సంవత్సరం కూడా పూర్తవలేదు”
“నువ్వూ
దారికి వచ్చేటట్టు లేవు లాగుందే? ఇద్దరూ చచ్చిపోవాలని
నిర్ణయించుకున్నారనుకుంటా. ఇక మాట్లాడానికి ఏమీ లేదు! రామూ”
“ఏమిటి
శ్రీ”
“నీకు
ఒక్క నిమిషం అవకాశం ఇస్తున్నా. పల్లవి ఒంటి మీద ఒక చిన్న గుడ్డ ముక్క కూడా
ఉండకూడదు...ఊ”
రామూ పల్లవి వైపు కు నడవగా, మిగిలిన
ముగ్గూరూ ఆమెను కదలకుండా పట్టుకున్నారు.
దశరథమూర్తి గారు బలం పుంజుకుని
రెండడుగులు ముందుకు వేశాడు.
శ్రీలత చేతిలో ఉన్న తుపాకీ ఆయన్ని
అడ్డుకుంది.
“ఇప్పుడైనా
నిజం చెప్పు...’మృత్యుదూత’ మూలిక నీ దగ్గరే కదా
ఉంది?”
“ఇదిగో చూడు...నువ్వు చెప్పే ఆ పేరులో
ఎలాంటి మూలికా లేదు...కావాలంటే నా బంగళా లోపల ఉన్న మూలికల గదికి రా. వచ్చి చూడు.
నీకు నచ్చిన మూలికలన్నిటినీ తీసుకో...నువ్వు ఏ మూలిక తీసుకున్నా, నేను
ఏమీ చెప్పను”
“రామూ!
ఈ ముసలాడు మన దారికి రాడు గానీ...నువ్వు పల్లవి బట్టలు ఊడదీయి"
రామూ యొక్క కుడి చెయ్యి వేగంగా పనిచేసి పల్లవి
భుజాలపై నున్న దుప్పటాను లాగిన క్షణం.
టేబుల్ మీదున్న టెలిఫోన్ మోగింది.
శ్రీలత దశరథమూర్తి గారి వైపు చూసింది.
“ఫోనులో
ఎవరు?”
“తెలియదు”
“మామూలుగా
ఈ టైముకు ఎవరు ఫోన్ చేస్తారు?”
“నా స్నేహితుడు బసవప్ప అయ్యుండొచ్చు”
“ఈ
ఫోనుకు ప్యారలల్ లైను ఉన్నదా?”
దశరథమూర్తి గారు సమాధనమే
చెప్పకుండా ఐదు క్షణాలు మౌనం వహిస్తుంటే, శ్రీలత
తన చేతిలో ఉన్న తుపాకీతో ఆయన తొడపై గుచ్చింది.
“నేనడిగింది
వినబడలేదా?”
“ప...పక్క గదిలో కార్డ్ లెస్ ఫోన్ ఉన్నది”
“వెళ్ళి
తీసుకురా”
దశరథమూర్తి గారు తొడను
తుడుచుకుంటూ కుంటు కుంటూ వెళ్ళి, పక్క గదిలో ఉన్న
కార్డ్ లెస్ ఫోనుతో పాటూ వచ్చాడు. దాన్ని అతని చేతిలోంచి లాక్కున్న శ్రీలత, గొంతు
చిన్నది చేసుకుని చెప్పింది.
“ఇప్పుడు
ఫోన్ అటెండ్ చెయ్యి అవతల సైడు మాట్లాడే వారు ఎవరైనా సరే, ఏది
మాట్లాడాలో అది మాత్రం మాట్లాడేసి రీజీవర్ను వెంటనే పెట్టేయాలి...మమ్మల్ని
పట్టించేటట్టు ఏదైనా ఒక్క మాట మాట్లాడినా సరే...తరువాతి క్షణం నువ్వు ప్రాణాలతో
ఉండవు... పల్లవినూ
ఉండదు...ఊ...తీసి మాట్లాడు”
దశరథమూర్తి గారు తడబడుతూ నడిచి
వెళ్ళి,
టెలిఫోన్
ముట్టుకుని రీజీవర్ తీసి మాట్లాడగా, శ్రీలత
తన చేతిలో ఉన్న ‘కార్డ్
లెస్ ఫోన్’
ను చెవి దగ్గర పెట్టుకుంది.
దశరథమూర్తి గారు మాట్లాడటం
మొదలుపెట్టాడు.
“హలో”
అవతల పక్క ఒక మగ గొంతు.
“ఏమిటి
దశరథమూర్తి గారు...టెలిఫోన్
మోగితే రిజీవర్ తీయటానికి ఇంతసేపా?”
“మీరెవరు?”
“సరిపోయింది...ఇంత వరకు నేను ఎన్ని
సార్లు ఫోన్ చేసుంటాను. గొంతు ఎవరిదో వెంటనే కనిపెట్టద్దా? నేను.
బెంగళూర్ నుంచి బసవప్ప మాట్లాడుతున్నాను”
“ఓ... బసవప్పా...మీరా? ఇక్కడ
ఫోన్ కొంచం సరిలేదు. అందుకే మీ వాయిస్ కొంచం వ్యత్యాసంగా వినబడుతోంది. ఏమిటి విషయం
చెప్పండి...”
“సంతోషమైన
విషయమే...! మూలికా ఔషధ గుణాల గురించి పరిశోధనా సదస్సు ఒకటి వచ్చే నెల ఢిల్లీలో
ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సదస్సు బృందంలో మిమ్మల్నీ ఒక స్పీకర్ గా వేశారు.
సదస్సు మొత్తం మూడు రోజులు జరగబోతోంది. ఇందులో మన అంతర్జాతీయ మూలికా పరిశోధనా సంఘం
ప్రెశిడెంట్ పాల్గొంటారు”
“ఓ...ఆలాగా....చాలా
సంతోషం...”
“ఏమిటి
మీ మాటలో ఒక వణుకు...ఒంట్లో బాగుండలేదా?”
“అదంతా ఏమీ లేదు...ఐ యాం ఆల్ రైట్. గదిలో
ఏ.సీ. కొంచం ఎక్కువగా ఉంది”
“తరువాత
దశరథమూర్తి గారు...మీ
మూలికా పరిశోధన ఎలా ఉంది?”
“బాగా పోతోంది”
“వచ్చే
నెల ఢిల్లీలో జరగబోయే ఆ ప్రత్యేక సదస్సు మీకు ఒక వరప్రసాదంగా అమరింది....ఈ
సదస్సులో మీరు మామూలుగా సమర్పించే మీ మూలికా పరిశోధన వ్యాసాలతో పాటు, ముఖ్యంగా
ఆ ‘మృత్యుదూత’ మూలిక గురించిన
పరిశోధనా వ్యాసాన్ని మీరు చదివితే, అది
అతిపెద్ద ‘హైలట్’ గా ఉంటుంది.
మరుసటిరోజు పేపర్లలో, వార్తలలో మీ పేరు, ఫోటో
మారుమోగిపోతుంది”
దశరథమూర్తి గారు నిర్ఘాంతపోయి
చెమటలు కక్కారు.
“మృత్యుదూత’ మూలికా...మీరేం
చెబుతున్నారు”
“మీదగ్గరున్న
ఆ అపూర్వమైన, అరుదైన మూలిక పేరు ‘మృత్యుదూతే’ కదా?”
“అది...వచ్చి”
“ఏమిటా
కంగారు దశరథమూర్తి గారు...ఆ
మూలిక పేరు మరిచిపోయారా?”
“అదంతా ఏమీ లేదు”
“ఈ
రోజు మీరు సరిలేరు. ఏదో గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తోంది....నేను ఎల్లుండి మళ్ళీ
ఫోన్ చేసి మాట్లాడతాను. ఢిల్లీ నుండి ఇంకో రోజులో మీకు మూలికా సదస్సు సంబంధంగా ఒక
లెటర్ వస్తుంది. ఒక సంప్రదాయం కొరకు దాన్ని ఫాక్స్ చేయండి”
“ఊ...ఊ...”
అవతల పక్క బసవప్ప రీజీవర్ పెట్టేయడంతో, దశరథమూర్తి గారు చెమటలు పట్టిన
శరీరంతో రిజీవర్ పెట్టకుండానే భయపడ్డ కళ్లతో శ్రీలతను చూడగా -- ఆమె ‘కార్డ్ లెస్ ఫోన్’ ఆఫ్ చేసి తలను ఒక
పక్కకు వంచి నవ్వింది.
“ముసలి కుక్కా...ఇప్పుడేమంటావ్… ఇప్పుడు కూడా 'మృత్యుదూత’ మూలిక నీకు తెలియదు అంటావా?”
**********************************************PART-5********************************************
టర్కీ టవల్ మీద ముద్ద ముద్దగా కనబడ్డ
రక్తపు మరకలను చూసిన డాక్టర్. గోపీనాద్ ఆశ్చర్యపోతూ
-- ఎదురుగా కూర్చున్న సారధిని తల ఎత్తి
చూశాడు.
“ఏమిటిది?”
“రక్తం డాక్టర్”
“అది
రక్తం అని తెలుస్తోంది...ఎలా టవల్ కు అంటింది అని అడుగుతున్నా?”
“అదే డాక్టర్ తెలియటం లేదు. తెల్లవారు
జామున నాలుగింటికి బాగా నిద్రపోతున్న నాకు బాగా చెమటలు పట్టినై అని చెప్పానుగా. ఆ
చెమటను ఈ టవల్ తోనే తుడుచుకున్నాను. ఆ తరువాత నిద్రపోయాను. ప్రొద్దున నిద్ర లేచి
చూసినప్పుడు ఈ టవల్ మీద రక్తపు మరకలు!”
“ఇది
ఎవరి టవల్?”
“రంజని గారి టవల్...ఒక అవసరానికి తీసి
వాడుకున్నాను”
“మీ
చెమటలను తుడుచుకునే ముందు ఈ టవల్ ను చూశారా...?”
“చూశాను డాక్టర్”
“శుభ్రంగా
ఉన్నదా?”
“ఊ...ఉన్నది...ఉతికి ఇస్త్రీ చేసి
ఉన్నది. మంచి సువాసన కూడా వచ్చింది”
“మీ
సందేహం ఏమిటి?”
“ముఖానికి చెమట పట్టినప్పుడు, నా
శరీరంలో నుండి బయటకు వచ్చింది రక్తమా...లేక చెమటనా?”
“ఖచ్చితంగా రక్తం అయ్యుండదు”
“మరెలా
డాక్టర్ ఈ టవల్ మీద రక్తం మరకలు?”
“ఆ రక్తపు మరకలు ముందుగానే టవల్ మీద
ఉండుంటాయి”
“నో
డాక్టర్. నేను టవల్ ను చూసానే!”
“వెలుతురులో
చూశారా?”
“లేదు”
“తెల్లవారు
జామున నాలుగు గంటలకు ఆ ఏ.సీ రూములో జీరో వోల్ట్ కాంతిలో చూసుంటారు...టవల్ మీదున్న
రక్తపు మరకలు మీకు కనబడి ఉండదు"
“అంటే
ఇది నా రక్తం కాదు అంటున్నారా డాక్టర్?”
“ఖచ్చితంగా”
---చెప్పిన డాక్టర్, రక్తపు
మరకలున్న టవల్ ను తీసి ఒక పాలితిన్ కవరులో వేసారు.
“మీ
బ్లడ్ గ్రూప్ ఏమిటి?”
“బి-నెగటివ్”
“ఈ
టవల్ మీదున్న రక్తపు మరకలు ఏ గ్రూపుకు చెందినదో కొంచం సేపట్లో తెలిసిపోతుంది”
చెబుతూనే ఇంటర్ కాం లో హాస్పిటల్ ల్యాబ్
టెక్నీషియన్ను పిలిచారు.
“రామ
మూర్తీ”
“డాక్టర్”
“ఒక
పది నిమిషాలు వచ్చెళ్ళు...ల్యాబులో ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన -- అవసరమైన పని ఉన్నదా?”
“లేదు డాక్టర్”
"సరే...రా. వచ్చెళ్ళు”
డాక్టర్.గోపీనాద్ రిజీవర్ పెట్టేసి
కాచుకోనున్న - రెండే నిమిషాల్లో ఆ యువకుడు వచ్చాడు.
పాలితిన్ కవర్ను ఆ యువకుడికి అందించారు
డాక్టర్.
“టవల్
మీదున్న రక్తపు మరకలు ఏ గ్రూపుకు చెందినవో తెలుసుకోవాలి. రిజల్ట్స్ వెంటనే కావాలి.
టెస్ట్ చేసి చూసి ఇంటర్ కాం లో పిలు”
“సరే
డాక్టర్”
టవల్ తీసుకుని రామ మూర్తి
వెళ్ళిపోగా....డాక్టరూ, సారధీ
కాచుకోనున్నారు.
సారధి హృదయం వేగంగా కొట్టుకుంటోంది.
'రిపోర్ట్ ఎలా ఉంటుంది?'
డాక్టర్ గోపీనాద్ ఫ్లాస్కులో ఉన్న
కాఫీని గాజు గ్లాసులో పోసి సారధి కి ఇచ్చారు.
“బీ...రిలాక్స్ సారధి గారూ. టవల్ మీదున్నది
మీ నెత్తురు అయ్యుండదు. ఎందుకో తెలుసా? మెడికల్
హిస్టరీలో ఇంతవరకు రక్తం చెమటగా వచ్చినట్లు దాఖాలు లేవు”
సారధి కాఫీ గ్లాసు తీసుకున్న క్షణం, ఇంటర్
కాం మోగింది -- బటన్ నొక్కి డాక్టర్ గోపీనాద్ మాట్లాడాడు.
“ఎస్”
“డాక్టర్...నేను
రామ మూర్తీ మాట్లాడుతున్నాను”
“చెప్పు...'బ్లడ్
గ్రూప్'
ఏమిటీ?”
“డాక్టర్...ఆ టవల్ కు పట్టున్న రక్తపు
మరకను అమ్మోనియంలో కరిగించి బ్లడ్ గ్రూప్ కనుక్కోవటానికి ప్రయత్నించాను. కానీ...”
“కానీ
ఏమిటీ?”
“బ్లడ్ గ్రూప్ ఏమిటనేది కనుక్కోవటం కుదరలేదు”
“ఏం
చెబుతున్నావ్ రామ మూర్తీ...బ్లడ్ గ్రూప్ కనుక్కో లేకపోయావా? అది
మనిషి నెత్తురే కదా?”
“అవును...డాక్టర్! కానీ, గ్రూపు
ఏమిటో తెలుసుకోవటం కుదరటం లేదు. ఏ గ్రూపో కనుక్కోవటానికి కావలసిన బ్లడ్ ఫాక్టర్స్
ఏవీ ఆ రక్తపు మరకలలో లేదు. హీమో గ్లోబిన్ మాత్రం ఉన్నది. అది పెట్టుకుని నెత్తురు
ఏ గ్రూపో తెలుసుకోలేము కదా”
“నువ్వు
ల్యాబు లోనే ఉండు...నేను ఇప్పుడే వస్తాను”
----చెప్పిన డాక్టర్ గోపీనాద్, ఇంటర్
కాం ఆఫ్ చేసి కలతతో సారధిని చూశారు.
“సారధి
గారూ”
“డాక్టర్”
“మీరు
ఇక్కడే వెయిట్ చేయండి...! నేను ఇప్పుడే వస్తాను”
“డాక్టర్
ఏదైనా సమస్యా”
“కొంచం
సమస్యే. టవల్ మీద ఉన్న రక్తపు మరకలు మనిషి రక్తమే. కానీ, రక్తం
ఏ గ్రూపుకు చెందినదో కనుక్కోవటం కుదరలేదట. నేను వెళ్ళి చూసొస్తాను”
“డాక్టర్, నాకు
భయంగా ఉంది”
సారధి ముఖమంతా ఆందోళనతో, గందరగోళంతో
నిండిపోయుండటం గమనించిన డాక్టర్.
గోపీనాద్ సారధి భుజాల మీద చెయ్యి వేశారు.
“భయపడకండి.
కాఫీ తాగేసి, ఆ పత్రిక చదువుతూ ఉండండి...నేను
ల్యాబుకు వెళ్ళి, వెంటనే వచ్చేస్తాను”
డాక్టర్. గోపీనాద్ వేగంగా బయటకు వెళ్ళారు.
దశరథమూర్తి గారికి ఏం మాట్లాడాలో తెలియక
ఆందోళన పడుతూ నిలబడగా, శ్రీలత
ఆయన దగ్గరకు వచ్చి తన చేతిలోని తుపాకీతో ఆయన గుండెల మీద గుచ్చింది.
“నువ్వు
చెప్పేదంతా అబద్దం అని తెలిసిపోయింది చూసావా. ఇంకా పట్టుదల పడితే, దయా దాక్షణ్యం
చూడకుండా నిన్ను కాల్చి చంపాల్సి వస్తుంది...అంతకు ముందు పల్లవిని...”
“వద్దు” అని చెప్పి తన రెండు
చేతులూ పైకెత్తారు దశరథమూర్తి గారు.
“నన్నూ, పల్లవినీ ఏమీ
చేయకండి. నువ్వడిగిన ‘మృత్యుదూత’ మూలిక ఇచ్చేస్తాను”
“అది...ఇప్పుడు
చెప్పేవే...ఇది మంచి మాట! అవును...ఆ బసవప్ప ఎవరు?”
“ఆయన
నాతో కలిసి పని చేశాడు. ఈ మూలికల పరిశోధనలో ఆయనకూ చాలా ఇంటరెస్టు ఉంది. వారానికి
ఒకసారి ఫోన్ చేస్తారు”
దశరథమూర్తి గారి గొంతుకు దగ్గర తుపాకీ
ఉంచింది శ్రీలత.
“ఊ...నడు...ఆ
‘మృత్యుదూత’ మూలిక ఎక్కడుంది?”
“లో...లోపల...మూలికల
గదిలో”
“ముందు
నడు...”
శ్రీలతతో పాటూ రాజు, రామూ, గణేష్, సాహిద్ నలుగురూ
కలిసారు... దశరథమూర్తి గారిని, పల్లవిని
ముందుకు నెట్టారు.
చెమటతో తడిసిపోయున్న చొక్కాతో దశరథమూర్తి
గారు నడిచారు. మూడు గదులు దాటి వెళ్ళిన తరువాత,
‘మూలికా గ్యాలరీ’
అని
ఇత్తడి అక్షరాలు రాసున్న తలుపు వచ్చింది.
“ఇదేనా
ఆ బంగారు సొరంగం?”-- శ్రీలత
సంతోషంతో కళ్ళు పెద్దవైనా, తుపాకీ
చివరితో దశరథమూర్తి గారి మొహాన్ని గుచ్చింది.
“ఊ...త్వరగా...తలుపు
తెరు”
దశరథమూర్తి గారు చేతిలో ఉంచుకున్న తాలం
చెవుల గుత్తిలో వెతికి, అందులో
నుండి ఒక తాళం చెవి తీసి -- తలుపుకు వేసున్న తాళం దగ్గరకు వెళ్లాడు. తాళం చెవి
పెట్టి తాళం తిప్పగా తాళం తెరుచుకుంది.
ఆ బరువైన తలుపును -- శ్రమపడి తొసేరు దశరథమూర్తి
గారు. ఇనుప తలుపు మెల్లగా గర్జించింది. లోపలకు వెళ్ళింది. మూలికల సువాసన బయటవరకు
వచ్చింది.
గదిలోపల చీకటి.
దశరథమూర్తి గారు మాత్రం లోపలకు వెళ్ళి
-- పక్కనున్న స్విచ్ నొక్కగానే -- గదిలో కాంతి ప్రవాహం. గదిలో నాలుగు గోడలకూ గాజు
అలమరాలు ఉన్నాయి. వాటిలో రెడ్ కలర్ 'వెల్వట్' గుడ్డతో చేసిన చిన్న
చిన్న పెట్టెలు ఉన్నాయి.
శ్రీలత ఒక గాజు అలమారు దగ్గరకు వెళ్ళి, దాని తలుపును పక్కకు
తోసి, అందులో ఉన్న ఒక 'వెల్వట్' పెట్టెను తీసింది.
అందులో కొన్ని మూలికలు. పెట్టె పైన డీటైల్స్ అతికించబడ్డ కాగితం ఒకటుంది. అందులో రాసున్న
దానిని చదివింది.
హెవెన్ స్మయల్: బరువు-25 గ్రాములు,
పుట్టిన చోటు: జొహన్నెస్ బర్గ్.
వయసు: 360 సంవత్సరాలు.
ఔషధగుణం: మనసు బాధగా ఉన్నప్పుడు---అంటే:
డిప్రెస్సన్, ఒత్తిడి, మనోవ్యాధి -- ఒక
మిల్లీగ్రాం తీసుకుని వేడి నీటిలో అరగంట నానబెట్టి, ఆ నీళ్ళు తాగితే...కొత్త ఉత్సాహం.
ముఖ్య విషయం: మూలిక అరగంట కంటే ఎక్కువసేపు
నీటిలో ఉండకూడదు.
శ్రీలత ఆ మూలికను అలమరాలోనే పెట్టేసి --
పక్కనున్న ఇంకొక పెట్టెను తీసింది. అందులోనూ ఒక కాగితం.
క్లోరీ మూలిక: బరువు 32 గ్రాములు,
పుట్టిన చోటు: ఇటాలీ.
వయసు: 500 సంవత్సరాలు.
ఔషధగుణం: బ్లడ్ ప్రషర్, కంటి చూపు ప్రాబ్లంస్, నరాల బలహీనత -- ఒక
మిల్లీగ్రాం తీసుకుని గోరువెచ్చని పాలులో అరగంట నానబెట్టి తాగాలి.
ముఖ్య విషయం: పాలు--ఆవుపాలు అయ్యుండాలి, వర్షం పడేటప్పుడు ఈ
మూలికను బయటకు తీయకూడదు.
అప్పుడు శ్రీలత దశరథమూర్తి గారిని
చూసింది.
“మిస్టర్
దశరథమూర్తి ఒక్కొక్క మూలిక గురించి చదువుతుంటే చాలా ఆసక్తిగానూ, స్వారస్యంగానూ
ఉన్నది...ఈ మూలికలుకు ఆయా ఔషధ గుణాలున్నాయని. మొతాదు ఎంత ఇవ్వాలి, పౌడర్ గానా, మూలికగానా, ఎన్ని రోజులు
ఇవ్వలి...ఇవన్నీ మీరు ఎలా కనుకున్నారు”
దశరథమూర్తి గారు కొంచం సేపు మౌనం
వహించారు. వెంటనే శ్రీలత కనుసైగతో ఆమె అసిస్టంట్లు పల్లవిని చుట్టు ముట్టారు.
“చెబుతాను...శ్రీకాకుళం
లోని ఒక ప్రాంతంలో ఒక పురాతన గుడి కోసం మేము తవ్వకాలు ప్రారంభించినప్పుడు అక్కడ
రెండు కుండలు దొరికినై. వాటి నిండుగా ఇదిగో ఈ చెక్క బద్దలు ఉన్నాయి. వాటి మీద ఏవో
రాతలు ఉన్నాయి. అవి తీసుకుని పరిశోధన శాలలో కూర్చుని శ్రమపడి చదివాను. అందులో
ఉన్నదంతా ఈ మూలికల సమాచారమే. గుడికి సంబంధించినవి ఏదీ దొరకలేదు”
“ఓ!...ఆ
టేబుల్ మీదున్న చెక్కబద్దలు అవేనా?”
“అవును”
“అయితే
నాకు ఇక్కడున్న అన్ని మూలికలూ, ఆ
చెక్కబద్దలూ కావాలి”
దశరథమూర్తి గారు రెండు చేతులూ ఊపుతూ
ఆందోళన చెందాడు.
“నో...ఇవన్నీ
నేను చాలా కష్టపడి సంపాదించినవి. నా పిల్లలతో సమానం. నేను ఇవ్వను. నువ్వు మొదట్లో
ఆ ‘మృత్యుదూత’ మూలికను మాత్రమే
అడిగావు. ఇప్పుడు ఇక్కడున్న అన్ని మూలికలూ,
పురాతణ
చెక్క బద్దలు కావాలని అడుగుతున్నావు...వీటిని,
వీటి
డీటైల్స్ ను ప్రభుత్వానికి అందజేసి, సైన్స్ ఒప్పుకునేలా
చేసి, ఈ మూలికల ప్రయోజనాలను
ప్రజలకు అందివ్వటానికే నా జీవితమంతా గడిపేను... నేనివ్వను”
“నేనూ
ఈ మూలిక విషయాల గురించి ఇప్పుడే వింటున్నాను. కాబట్టే నా మాట
మార్చుకున్నాను...నాకు మూలికలూ, చెక్కబద్దలూ
అన్నీ కావాలి”
“నేనివ్వను”
శ్రీలత నవ్వింది.
“ఇవన్నీ
నువ్వు ఇవ్వలేదనుకో, వీటికి
బదులుగా నీ ప్రాణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నీకు తోడుగా పల్లవిని కూడా పంపిస్తాను.
పరవాలేదా...? మీరిద్దరూ
ప్రాణాలతో ఉండాలంటే, అన్ని
మూలికలనూ తీసి ఒక సూట్ కేసులో పెట్టి ఇవ్వండి”
దశరథమూర్తి గారు, పల్లవి ఇద్దరూ ఆవేదనతో
శ్రీలతని చూసారు.
ఆమె నవ్వింది.
“ఏమిటి
చూస్తున్నారు? మీ
ఇద్దర్నీ కాల్చి పారేసి, ఇక్కడున్న
అన్ని మూలికలనూ తీసుకు వెళ్ళటానికి మాకు పది నిమిషాలు చాలు. అనవసరంగా ఇద్దర్నీ
చంపకూడదనే జాలితో అడుగుతున్నా. సరే...ఇప్పుడు ఆ ‘మృత్యుదూత’ మూలికను చూద్దామా?"
దశరథమూర్తి గారు తటపటాయించగా, ఆయన్ని తుపాకి అంచుతో
నొక్కుతూ ముందుకు తోసింది శ్రీలత.
“ఊ...తీసివ్వు”
కొద్ది క్షణాలు మౌనంగా ఉన్న ఆయన మెల్లగా
నడుచుకుంటూ గది చివరకు వెళ్ళి ---- అక్కడున్న నాలుగడుగుల ఎత్తు ఉన్న స్టీల్ లాకర్
ను తెరిచారు.
ఒక పర్పుల్ రంగు గుడ్డలో ఉన్న స్టీల్
పెట్టెను తీసారు.
లోపల.
పాలు తెలుపు రంగులో, వేప పుల్లలాగా
కట్టబడి ఉన్న మూలికల చట్రాన్ని తీసారు.
పక్కకు వచ్చి చూసిన శ్రీలత కళ్ళు ఆశ్చర్యంతో
విరుచుకున్నాయి.
“అరే...ఏమిటీ
అద్భుతం. మూలికలు ఇలా పాల లాంటి తెలుపు రంగులో నేనెప్పుడూ చూడలేదు. మూలిక అంటేనే
నలుపు, బ్రౌన్ రంగుల్లో
ఉంటాయి...కానీ ఇది...అద్భుతం.
**********************************************PART-6********************************************
డాక్టర్. గోపీనాద్, ఆసుపత్రి చివరిలొ
ఉన్న ల్యాబులోకి వెళ్ళినప్పుడు మైక్రోస్కోప్ లో తీవ్రంగా దేనినో పరీక్షగా చూస్తూ
కనిపించాడు ల్యాబ్ టెక్నీషియన్ రామమూర్తి.
చప్పుడు వినిపించి తలెత్తి చూసాడు.
“డాక్టర్”
“ఎక్కడ
ఆ టవల్?”
పాలితిన్ బ్యాగులోపల బద్రపరిచి
పెట్టున్న ఆ రక్తపు మరకల టవల్ ను తీసి గోపీనాద్ దగ్గర ఇవ్వగా, ఆయన తీసుకుని చూసి
అడిగాడు.
“ఇది
మానవ రక్తమే కదా?”
“అవును
డాక్టర్”
“అనుమానం
ఏమీ లేదుగా?”
“అందులో
ఒక్క శాతం కూడా అనుమానం లేదు సార్”
“టవల్
మీదున్నది మానవ రక్తమైతే, గ్రూప్
ఏమిటనేది తెలియాలే?”
“ఎంత
ప్రయత్నం చేసినా కనుక్కోలేకపోతున్నా. రక్తం గ్రూప్ ఫాక్టరూ అందులో లేదు డాక్టర్.”
“మళ్ళీ
ఇంకోసారి ప్రయత్నం చేసి చూద్దాం. టవల్ పైన ఉన్న రక్తాన్ని అమ్మోనియాలో డైల్యూట్
చెయ్యి”
రామమూర్తి వెంటనే ఆ పనిలోకి దిగాడు.
టవల్ మీదున్న రక్తాన్ని అమ్మొనియా
ద్రవంలో కడిగి, గాజు
పలకపై వేసి -- మైక్రోస్కోప్ క్రింద పెట్టగా -- డాక్టర్ కుర్చీలో కూర్చుని
మైక్రోస్కోప్ యొక్క లెన్స్ మీద కళ్ళు పెట్టారు.
రెండు నిమిషాల తీవ్ర పరీక్ష తరువాత --
చెమట పట్టిన నుదిటితో తల ఎత్తేడు.
“ఆశ్చర్యంగా
ఉందే...గ్రూప్ లేకుండా నెత్తురా?”
“సంతింగ్...అబ్
నార్మల్ డాక్టర్”
“అవును
రామమూర్తీ. ఒక కార్యం చెయ్యి”
“చెప్పండి
డాక్టర్”
“ఈ
రక్తాన్ని ‘మాక్సో
డిజిటల్ ల్యాబ’ కు
వెంటనే పంపించి సాయింత్రానికి రిపోర్టు తీసుకో”
“ఏస్...డాక్టర్”
“ప్రస్తుతానికి
దీని గురించిన మాటలు బయటకు వెళ్ళకూడదు”
రామమూర్తి తల ఊపగా, డాక్టర్ గోపీనాద్
చెమట పట్టిన ముఖాన్ని చెతి రుమాలతో ఒత్తుకుంటూ,
‘ల్యాబ్’ నుండి
బయటకు వచ్చి -- తన గదివైపుకు నడిచారు. ఆయన మెదడును
గందరగోళ పరిస్థితి వల వేసి బిగించింది.
‘టవల్
మీదున్న నెత్తురు ఎవరిది? ఎవరిదై
ఉన్నాగానీ గ్రూపు ఏమిటో తెలుసుకోలేకపోయామే!’
‘ఒకవేల
‘మాక్సో డిజిటల్లో
కనిబెట్టేస్తారో’ -- కన్
ఫ్యూజ్డ్ ఆలొచనతో డాక్టర్ గోపీనాద్,
వరాండాలో
గబగబా నడిచి తన గదికి వెళ్లారు.
సారధి కూర్చోనున్న కుర్చీ ఖాలీగా ఉంది.
అది డాక్టర్ గోపీనాద్ ను మరింత ఆశ్చర్య
పరచింది.
“సారధి
ఇంతలొ ఎక్కడికి వెళ్ళారు?”
టేబుల్ మీద గాజు గ్లాసులోని కాఫీ అలాగే ఉంది.
‘చెప్పకుండా
వెళ్ళిపోయే మనిషి కాదే?’
డాక్టర్ గోపీనాద్ తన ఎడం చేతి చూపుడు
వేలును నుదిటి మీద పెట్టి రాసుకుంటూ అటూ,
ఇటూ, చుట్టూ చూశాడు.
ఆయన చూపులు రెస్ట్ రూము వైపు చిన్నగా
తెరిచున్న తలుపు సందు వైపు పడింది.
రెస్ట్ రూము దగ్గరకు వెళ్ళి గది తలుపు
తోశాడు.
షాకయ్యాడు.
సారధి రెస్ట్ రూములో బోర్ల పడి ఉన్నాడు.
అతని చుట్టూ నెత్తురు!
దశరథమూర్తి గారి చేతిలో వెల్వెట్
గుడ్డతో మెరుస్తున్న ఆ చిన్న పెట్టెను ఆయన చేతిలోంచి లాకుంది శ్రీలత -- పెట్టెలో
తెల్ల రంగు కలిగిన పుల్లలు ఆ పెట్టంతా నిండుకోనున్నాయి.
“మృత్యుదూత?” అన్నది దశరథమూర్తి గారిని చూస్తూ.
అవునన్నట్టు తల ఊపాడు.
పెట్టెలోని కాగితం తీసి చదివింది.
మూలిక పేరు: మృత్యుదూత.
బరువు: 41 గ్రాములు.
వయసు: 2000 సంవత్సరాలు.
పుట్టిల్లు: ఆఫ్రికా.
చరిత్ర: ఈ అద్భుత మూలిక, ఫ్రెంచ్ ద 14 వ లూయిస్ దగ్గర 9 సంవత్సరాలు ఉన్నది.
తరువాత మార్లిన్ మైకో అనే కోటీశ్వరుడి దగ్గరకు వెళ్ళింది.
ఔషధ గుణాలు: ఈ మూలికను అన్ని రోజులూ
బయటకు తీయకూడదు. పౌర్ణమి రోజుకు తరువాతి రెండవ రోజున మాత్రమే బయటకు తీయాలి. ఈ
మూలికలో నుండి వచ్చే కిరణాలు మెదడును బాగా పదును చేస్తాయి. మేధా శక్తిని పెంచుతాయి, వాళ్ళు ఏ రంగానికి
చెందిన వారైనా
ఆ రంగంలో అశేషంగా సాధనలు చేస్తారు. అంతే
కాదు, ఎవరైతే ఆ రోజున 2 మిల్లిగ్రాముల ‘మృత్యుదూత’ మూలిక పౌడర్ను
తింటారో వాళ్ళు ఆరోగ్యంగా, యుక్త
వయసు తో కనీసం 125 సంవత్సరాలు
బ్రతుకుతారు.
హెచ్చరిక: 12 సంవత్సరాల లోపు
పిల్లలకు ఈ మూలిక వాడరాదు. ఈ మూలిక పైన ఒక చుక్క నూనె కూడా పడకూడదు. పడితే, ఆ మూలిక శక్తి
తగ్గిపోయి, చివరకు
మామూలు పనికిరాని మూలిక అవుతుంది.
శ్రీలత తన వెనుక నిలబడ్డ యువకుడి వైపు
తిరిగింది.
“మనం
పడ్డ కష్టానికి ఇప్పటికి ఫలితం దక్కింది. ఇక్కడున్న అన్ని మూలికలనూ తీసుకోండి”
ఆ నలుగురు యువకులూ వేగంగా తమ పని
మొదలుపెట్టారు.
దశరథమూర్తి గారు తల మీద పిడుగు పడినట్టు
కూర్చుండిపోయారు. శ్రీలత అతని భుజాల మీద తుపాకితో గుచ్చింది.
“ఈ
మూలికల గురించి ఇక నువ్వు మర్చిపోవాలి. మీ దగ్గర ఉన్న మూలికలన్నిటినీ తీసుకు
వెడుతున్నాము. ఇక మీరు మూలికల
పై
పరిశోధనను వదిలిపెట్టి...పూర్తిగా రెస్ట్ తీసుకోండి. రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్
చేయండి"
దశరథమూర్తి గారు కళ్ళల్లో నీటితో శ్రీలతను
చూసి “నేను ఎంతో కష్టపడి
సేకరించి పెట్టుకున్న మూలికలన్నిటినీ ఇలా తీసుకు వెళ్ళటం, తీసుకు వెళ్ళి నువ్వు
పేరు సంపాదించు కోవలనుకోవడం న్యాయమా?”
అని
నీరసంగా అడిగారు.
“న్యాయం
కాదు? కానీ ఇవన్నీ నాకోసం తీసుకు
వెళ్లటం లేదు. నాకూ, మూలికలకూ
ఏటువంటి సంబంధమూ లేదు. నా పని కిరాయికి దోపిడి చేయటమే. ఒక గొప్ప వ్యక్తి ఈ
మూలికలను మీ దగ్గర నుండి దోపిడి చేసి తీసుకు రమ్మన్నారు. కిరాయికి
ఒప్పుకున్నాను...అవును, ఈ
మూలికలకు విదేశీ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉన్నదటగా. కోట్లలో వ్యాపారం
అవుతుందటగా?”
“నీకు
డబ్బే కదా కావాలి...నేను ఇస్తాను”
“నువ్వెంత
డబ్బు ఇవ్వ గలవు...చెప్పు”
“ప...పది
లక్షలు”
శ్రీలత గలగలా నవ్వింది.
“అదొక
డబ్బా? ‘మృత్యుదూత’ మూలికకు మాత్రం మేము
ఐదు కోట్ల రూపాయలకు బేరం మాట్లాడి ఉంచాము.
మిగిలిన మూలికలకు ఎంత ఖరీదు వేస్తామో లెక్క కట్టుకో. అప్పుడు మా ‘రేంజ్’ ఏమిటో నువ్వే
ఆలొచించు”
దశరథమూర్తి గారు ఆవేశపడ్డాడు.
“రాక్షసీ!
ఈ మూలికల ఔషధ గుణాలను మన దేశ ప్రజలకు
అందించి వారి ఆరోగ్యానికి మంచి చేయాలని నేను చూస్తుంటే, నువ్వు ఆ మూలికల
నాశనానికి నీ తెలివిని ఉపయోగిస్తున్నావే...నిన్ను”
ఆమె మీద కోపంతో ఆమెను పట్టుకోవాలని
ప్రయత్నం చేసిన దశరథమూర్తి గారి తలపై బలంగా
ఒక దెబ్బ వేసాడు రామూ.
“అబ్బా...”
దశరథమూర్తి గారి తల లోపల ప్రళయం వచ్చిన ఫీలింగ్. కళ్ళల్లో
మినుగుడు పురుగులు పుట్టగా -- అలాగే పడిపోయాడు.
పల్లవి ఆయన దగ్గరకు వెళ్ళింది.
శ్రీలత, యువకులలో ఒకడ్ని చూసి కేకేసింది.
“గణేష్”
“మ్యాడం”
“ఆ
మత్తు మందు ‘స్ప్రే’ నీ దగ్గరే కదా ఉంది?”
“అవును
మ్యాడం”
“తీసుకొచ్చి
ఇద్దరి ముఖాల మీదా కొట్టు ఒక ఆరుగంటలు కదలకుండా పడుంటారు”
మత్తుమందు ‘స్ప్రే’ తో వాళ్ల దగ్గరకు
వెళ్లాడు గణేష్.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ను స్వాగతించాడు
డాక్టర్. గోపీనాద్.
“రండి...ఇన్‌స్పెక్టర్”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ టోపీని
తీసి, చెంకల్లో పెట్టుకుని
అడిగాడు.
“చనిపోయింది
ఎవరని చెప్పారు ఫోనులో?”
“పేరు
సారధి. నటి రంజని ‘కాల్
షీట్స్’ వ్యవహారాలన్నీ చూసుకునే
మేనేజర్”
“బాడీ
ఎక్కడుంది?”
రెస్ట్ రూం గదికి తీసుకు వెళ్ళారు
డాక్టర్.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ గదికి బయటే
నిలబడి లోపలకు తొంగి చూసాడు. సారధి,
రక్తపు
మడుగులో బోర్ల పడి ఉన్నాడు. అతని చుట్టూ రక్తం ఉంది. ఆ రక్తం గడ్డకట్టుంది.
“మరణం
ఎలా జరిగుంటుంది?”
“చెక్
చేసి చూశాను...శరీరంలో ఎక్కడా గాయం లేదు”
“మరెలా
ఇంత రక్తం?”
“రక్తం
కక్కుకుని ఉండొచ్చు”
“అంటే
మీ లెక్క ప్రకారం ఇది హత్య కాదు. సహజ మరణం”
“ఎస్?”
“మరైతే
డెత్ సర్టిఫై చేయండి”
“నో
ఇన్‌స్పెక్టర్...నా మనసుకు తోచింది చెప్పాను. ‘పోస్ట్
మార్టం’ రిపోర్టు ఏం
చెబుతుందో తెలియదు”
“ఒక
పక్క సహజ మరణం అంటున్నారు, మరో
పక్క ఇతని మరణంలో డౌట్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు....ఏమిటి మీ డౌట్?”
“రక్తం
చూసారా? ఎంత రక్తమో, ఐ మీన్ రక్తం
కక్కుకున్నా ఇంత రక్తం ఎవరూ కక్కుకోరు. ఇది నాకే కొత్తగా ఉంది. అందుకే మీకు ఫోన్
చేశాను”
“సరే...
సారధి మిమ్మల్ని ఎందుకు చూడటానికి వచ్చాడు?”
డాక్టర్. గోపీనాద్ ఐదు నిమిషాలు వెచ్చించి
వివరాలు చెప్పి ముగించినప్పుడు, ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్ యొక్క పోలీసు కళ్ళల్లొ కూడా ఆశ్చర్యం.
“సారధి
కి నెత్తుటి చెమట ఏర్పడిందా? అది
క్లియర్ చేసుకోవటానికి మీ దగ్గరకు వచ్చాడా. మీరు ల్యాబ్ నుండి తిరిగి వచ్చేలోపు సారధి
ఇలా ఉన్నాడా?”
“ఎస్
ఇన్‌స్పెక్టర్. అలాగే చెప్పేరు. ఆయన ముఖం తుడుచుకున్న టవల్ని చూపించారు.
ఇదిగో...ఇదే ఆ టవల్”
డాక్టర్. గోపీనాద్, టేబుల్ మీదున్న ఆ
పాలితిన్ కవర్ను చూపించారు. ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, టవల్ను తీసి చూసేసి
అర నిమిషం ఆలొచన తరువాత, డాక్టర్ను
అడిగాడు.
“ఈ
రక్తం ఏ గ్రూపుకు చెందిందో తెలుసుకోలేక పోయారా?”
“తెలియలేదే”
“ఏ
గ్రూపుకూ చెందని రక్తం ఒకటుంటుందా?”
“ఉండదు”
“మరి
ఇదెలా సాధ్యం?”
“అర్ధం
కాలేదు ఇన్‌స్పెక్టర్. ఈ రక్తం ‘సాంపిల్’ ను ఇప్పుడు ‘మాక్సొ డిజిటల్ ల్యాబ్’ కు పంపించాను. ఆ
రిజల్ట్స్ వచ్చిన తరువాతే నిజం పూర్తిగా తెలుస్తుంది”
“నటి
రంజనికి మీరు ఫ్యామిలీ డాక్టరా?”
“అవును”
“ఎన్ని
సంవత్సరాలుగా?”
“గత
ఐదు సంవత్సరాలుగా”
“రంజని
ఇప్పుడు ఎక్కడ?”
“ఊటిలో
షూటింగులో ఉన్నది”
“సారధికి
జరిగిన దాని గురించి ఆమెకు తెలియపరిచారా?”
“సెల్
ఫోన్ లో చెప్పాను. ప్రొద్దున్నే కోయంబత్తూర్ వచ్చి విమానం ఎక్కి, మధ్యాహ్నం
పన్నెండింటికల్లా హైదరాబాద్ వచ్చి చేరిపోతాను అని చెప్పారు”
“డాక్టర్!
ఇది, న్యాచురల్ మరణంగా
ఉండదని నా మనసుకు అనిపిస్తోంది”
“ఆ
సందేహం నాకూ ఒక శాతం ఉంది కాబట్టే మీకు ఫోన్ చేసేను”
“ఎవరికైనా
రక్తం చెమటగా రావటం సాధ్యమేనా డాక్టర్?”
“సాధ్యం
కాదు. దట్ ఈజ్ అబ్ నార్మల్"
“అయితే
సారధి చెప్పింది అబద్దమా?”
“సారధి
గురించి నాకు బాగా తెలుసు ఇన్‌స్పెక్టర్. ఆయన అబద్దం చెప్పే మనిషి కాదు”
“ఫ్యాను
సరిగ్గా పనిచేయటం లేదని, ఉక్కగా
ఉన్నదని రంజని గారి ఏ.సీ రూములోకి వెళ్ళి పడుకున్నాడు. ఆ గదిలోపల ఈయనకు ఏమైనా
జరిగుంటుందా?”
“జరిగుండచ్చు”
“రంజని
గారి గదిని చూడాలే డాక్టర్?”
“రండి...వెడదాం”
ఫోరన్ సిక్ టీమ్ కు సారధి బాడీని అప్పగించి...ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ గోపీనాద్ ఇద్దరూ రంజని ఇంటికి బయలుదేరారు.
**********************************************PART-7*******************************************
డాక్టర్ కారులో ఇరవై నిమిషాల ప్రయాణం.
జూబ్లి హిల్స్ గ్రీన్ పార్క్ అవెన్యూలో
అశోక చెట్ల మధ్యలో ఉన్న నటి రంజని ఇంటి ముందు కారాపారు. కాంపౌండ్ వాల్ బయట
నిలబడున్న గూర్కా, డాక్టర్ను
చూసి స్నేహపూర్వకంగా నవ్వి ‘సెల్యూట్’ చేయగా అది
పట్టించుకోకుండా ఆయన లోపలకు వెళ్ళారు.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆయన వెనుకే
నడిచాడు.
పొర్టికో మెట్ల మీద ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి కూర్చుని
మాట్లాడుకుంటుంటే, చెర్రీ
పండు రంగులో ఒక కారు పొర్టికోలో నిలబడింది.
డాక్టర్నూ, ఇన్‌స్పెక్టర్నీ
చూసిన వెంటనే ఆ మగ మనిషి, ఆడ
మనిషి లేచారు. పనివాళ్ళు అనేది వాళ్ళు వేసుకున్న దుస్తులను చూస్తేనే తెలుస్తోంది.
భవ్యంగా వంగారు.
“అయ్యా!” -- నమస్కరించాడు.
డాక్టర్ గోపీనాద్ అడిగాడు “ఇంట్లో ఎవరైనా
ఉన్నారా?”
“ఎవరూ
లేరయ్యా...అమ్మగారికి ఊటీలో షూటింగు. సారధి అయ్యగారు బయటకు వెళ్ళారు. ఇంకా రాలేదు”
“అమ్మగారి
బెడ్ రూం తెరిచుందా, మూసుందా?”
“తెరిచే
ఉందయ్యా”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ అడ్డుపడి
అడిగాడు.
“ఊటీ
నుండి ఫోన్ ఏమైనా చేసారా?”
“లేదయ్యా”
ఇన్‌స్పెక్టరూ, డాక్టరూ ఇంట్లోకి
వెళ్ళారు. బంగళా అంతా గ్రానైట్ రాళ్లతో కలకలలాడుతోంది. సోఫాలు వెల్వెట్ గుడ్డతో
కుట్టబడి హాలు మధ్యలో ఉన్నాయి.
“రంజని
గారి పడక గది మేడ మీదే కదా ఉంది”
“మేడమీదే
నండి”
మేడ మెట్లు ఎక్కి రంజని గది ముందుకు
వచ్చి నిలబడ్డారు. తలుపు వేసుంది. తలుపుల మీద చెయ్యి పెట్టబోయి -- చట్టుక్కున
వెనక్కి తీసుకున్నారు డాక్టర్.
గోపీనాద్.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ డాక్టర్ను
ఆశ్చర్యంగా చూశాడు.
“ఏమిటి
డాక్టర్?”
గోపీనాద్ స్వరం తగ్గించి మాట్లాడారు.
“లోపల
ఏదో శబ్ధం వినబడుతోంది”
“శబ్ధమా?”
“ఊ...క్షుణ్నంగా
విని చూడండి”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ తలుపు
దగ్గరగా వెళ్ళి నిలబడి చెవులకు పని ఇచ్చాడు.
లోపల శబ్ధం వినబడింది.
ఎవరో నడుస్తున్న శబ్ధం.
ఇన్‌స్పెక్టర్ తన డ్యూటీ స్మృతిలోకి
వచ్చాడు.
తన నడుము దగ్గరకు చేయి పోనిచ్చి
రివాల్వర్ తీసుకున్నాడు. తన ఎడం చెయ్యి చూపుడు వేలుతో తలుపును మెల్లగా తోసాడు.
తలుపు చప్పుడు చేయకుండా లోపలకు
వెళ్ళింది.
“మొత్తం
ఎంత మంది?”
పోలీస్ కమీషనర్ సర్వానంద్ అడిగిన
ప్రశ్నకు, అపస్మారక పిడి నుండి
బయటపడి -- నీరసంగా కుర్చీలో వెనక్కు వాలిపోయున్న దశరథమూర్తి గారు -- సన్నటి
గొంతుతో సనిగారు.
“ఐదుగురు.
ఒకమ్మాయి, నలుగురు మగవాళ్ళూ”
“ఆ
అమ్మాయి పేరు?”
“శ్రీలత...మగవాళ్ళ
పేర్లు రాజు, రామూ, గణేష్, సాహిద్. ఆ అమ్మాయే ఆ
గ్రూపుకు లీడర్. ఆమె మాటలకు ఆ నలుగురు కట్టుబడుతున్నారు”
“ఆ
ఐదుగురు ఎలా ఉన్నారో చెప్పగలరా?”
“ఎంతో
కొంత చెప్పగలం”
“అది
చాలు...మీరు చెప్పే వర్ణనను కంప్యూటర్ కి ఇస్తే, అది బొమ్మను గీసి ఇస్తుంది”
దశరథమూర్తి గారికి పక్కనే వాడిపోయిన
మొహంతో కూర్చోనున్న పల్లవి అడ్డుపడింది.
“సార్...ఆ
శ్రీలతని పక్కవైపు నుండి చూస్తే పాత హిందీ నటి రేఖా లాగా ఉంటుంది. నలుగురి
యువకులలో ఆ గణేష్ కి
కుడి చెవి మడత పడినట్టు ఉంటుంది. రాజు అనే వాడికి మెడ వెనుక ఒక పెద్ద మచ్చ ఉన్నది”
“ఇంత
ధైర్యంగా దోపిడీ చెయ్యగలిగారు అంటే పాత క్రిమినల్స్ అయ్యే ఉంటారు. మీరేమీ కంగారు
పడకండి. వాళ్ళు భారత దేశంలో ఏమూల ఉన్నా సరే -- రెండే రోజుల్లో కనిపెట్టేయచ్చు.
బై...ద...బై... దశరథమూర్తి గారూ! దోపిడి చేయబడ్డ మూలికల మొత్తం విలువ ఎంత ఉంటుంది?”
ఆయన కన్నీటితో కమీష్నర్ను చూశారు.
“అన్ని
మూలికలకూ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కోట్ల విలువ చేస్తుంది. ‘మృత్యుదూత’ మాత్రం పదికోట్లు
విలువ చేస్తుంది”
“వచ్చిన
వాళ్ళు అన్ని మూలికలనూ తీసుకు వెళ్ళిపోయారా?”
“అన్నీ
తీసుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు”
“మీ
దగ్గర ఇలాంటి మూలికల గిడ్డంగి ఉన్నట్టు బయట ఎవరికి తెలుసు?”
“చాలా
మందికి తెలుసు. నా పరిశోధన ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఈ మూలికల గురించి ఆంగ్ల
పత్రికలలో చాలా వ్యాసాలు రాసాను”
“ఈ
మూలికల పరిశోధనలో మీకు పోటీగా ఇంకెవరైనా పరిశోధన చేస్తున్నారా?”
“మన
దేశంలో నేను తప్ప ఎవరూ లేరు సార్”
“బయటి
దేశాలలో ఉన్నారా?”
“అవును”
“ఎవరు
వాళ్ళు?”
“నార్
మాన్ విస్ డం అని ఒకరు. ఆయనకు తొంబై ఏళ్ళ వయసు ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా మూలికల
పరిశోధనలో ఉన్నారు. ఆయన నాకు పోటీగా ఉండొచ్చు. కానీ, ఆయన ఇలాంటి నేరం చేసే పనులు చేసే మనిషి
కాదు”
“లేదు...ఈ
కాలంలో ఎవర్నీ నమ్మలేము. ఒకరి మీద మనకు ఒక్క శాతం అనుమానం వచ్చినా సరే, వాళ్ళను
విచారాల్సిందే మంచిది"
ఫోరన్ సిక్ నిపుణుడు ఒకతను కమీషనర్
పక్కకు వచ్చాడు.
కమీష్నర్ తలెత్తి అతన్ని చూస్తూ—
“ఏమిటి... నరసింహం...ఫింగర్ ప్రింట్స్ దొరికినయా?”
“ఏమీ
దొరకలేదు సార్. వచ్చిన వాళ్ళు చేతులకు గ్లవుజ్ వెసుకుని, జాగ్రత్తగా దేనినీ
ముట్టుకోకుండా, మూలికలను
తీసుకు వెళ్ళారు”
“వేరే
ఏదైనా పనికొచ్చే క్లూ ఏదైనా దొరికిందా?”
“ఒకటే
ఒకటి దొరికింది సార్”
“ఏమిటది?”
ఫోరన్సిక్ నిపుణుడు నరసింహం తన చేతులో
ఉన్న ప్లాస్టిక్ కవరును విప్పి చూపించాడు.
శబ్ధం చేయకుండా తలుపు లోపలకు వెళ్ళిపోవటంతో, రివాల్వర్ ను కుడి
చేతి వేళ్లతో జాగ్రత్తగా పట్టుకుని ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ గదిలోపలకు
వెళ్ళారు.
డాక్టర్ గోపీనాద్ కూడా ఆయన వెనుకే
వెళ్ళాడు.
“గదిలో
ఎవరూ లేరే”
“శబ్ధం
వినబడిందే!”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆశ్చర్యంగా
చూస్తుంటే, డాక్టర్
ఆయన భుజాన్ని చిన్నగా కొట్టాడు.
“ఏమిటి
డాక్టర్?”
“ఆ
కర్టన్ చూడండి”
-- అంటూ సిట్ అవుట్ ను ఆనుకుని ఉన్న నీలి రంగు కర్టెన్ను డాక్టర్ చూపించగా... ఇన్‌స్పెక్టర్
చూశాడు.
అది చిన్నగా ఊగుతోంది.
పరిగెత్తుకు వెళ్ళి ఆ కర్టన్ను పక్కకు
తోసి చూశారు. అటువైపు సిట్ అవుట్, దాని
వెనుక తోట కనబడింది -- తోటలోని అరటి మొక్కల మధ్య ఒకడు వేగంగా పరిగెత్తుతున్నాడు.
“డాక్టర్...ఎవడో
పరిగెత్తుతున్నాడు...”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆందోళన పడుతూ
తన చేతిలో ఉన్న తుపాకీతో, పరిగెత్తుకు
వెడుతున్న అతన్ని గురి చూసాడు.
ట్రిగర్ ను నొక్కే లోపు, అరటి
చెట్ల మధ్య అతను కనబడకుండా పోయాడు.
మళ్ళీ తల కనబడినప్పుడు కాల్చేడు. అతను
ఒకసారిగా వంగుని---కాంపౌండ్ గోడ వైపుకు పరిగెత్తి -- మెరుపు వేగంలో ఎగిరి, కాంపౌండ్ వాల్ ఎక్కి, అవతల వైపుకు జంప్
చేశాడు.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ కాల్చాడు.
రెండో తోటా కూడా వేస్ట్ అయ్యింది.
“డాక్టర్!
మీరు ఇక్కడే ఉండండి”
-- అన్న ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ సిట్ అవుట్ లోకి గెంతి, సిట్ అవుట్ గ్రిల్
పుచ్చుకుని తోట వైపు దిగి -- మట్టి,
బురదగా
ఉన్న అరటి మొక్కల మధ్య పరిగెత్తి -- బండ రాళ్ళతో
కట్టబడున్న కాంపుండ్ గోడ మీదకు ఎగిరి,
ఎక్కి
దాని చివరకు వెళ్ళి అవతలవైపుకు చూశాడు.
మనుష్యుల సంచారమే లేని ఆ రోడ్డులో వంద
మీటర్ల దూరంలో అత్యంత వేగంగా పరిగెత్తుతున్నాడు ఆ యువకుడు.
ఫోరన్ సిక్ అధికారి నరసింహం చూపించిన ఆ
వస్తువును---కమీషనర్ సర్వానంద్, దశరథమూర్తి
గారు, పల్లవి అందరూ చూసారు.
అదొక చేతి రుమాల.
ఆడవాళ్ళు ఉపయోగించే చేతిరుమాల. చిన్న
చిన్న పువ్వుల బొమ్మలు ఉన్నాయి.
“ఇది
ఆ అలమరాకు పక్కన ఉన్నది సార్”
కమీషనర్ అది తీసుకుని చూశాడు.
చేతిరుమాలతో కలిసున్న ఆ సెంటు వాసన --
గాలిలో కలిసి మెల్లగా ఆయన ముక్కు వరకు వచ్చింది.
కమీషనర్ చూపులు పైకి వెళ్ళి పల్లవి వైపు
నిలబడింది.
“ఇది
నీ చేతి రుమాలానేమో చూడు”
“లేదు
సార్...నేను చేతిరుమాల వాడనే వాడను”
“అలాగైతే...ఈ
రుమాల, ఆ శ్రీలతదే
అయ్యుంటుంది. మూలికలను ఎత్తుకు వెళ్ళేటప్పుడు తొందరలో చేతి రుమాలను జారవిడిచి
ఉంటుంది”
దశరథమూర్తి గారు నిట్టూర్పు విడిచారు.
“ఈ
చేతి రుమాలను పెట్టుకుని, ఆ
గుంపును కనిపెట్ట వచ్చా సార్?”
“ఎందుకు
కనిపెట్టలేము మిస్టర్ దశరథమూర్తి ! చిన్న పుల్ల, పళ్ళల్లో ఇరుకున్న వాటిని తీయటానికి
ఉపయోగపడుతుందని మీకు తెలుసు కదా... పోలీసు కుక్కను తీసుకు వచ్చి, దీన్ని వాసన
చూపిస్తే...వాళ్ళు వెళ్ళిన దిక్కు ఏదీ అనేది తెలిసిపోతుంది. కుక్క గనుక మంచి
హుషారు మూడులో ఉంటే, వాళ్ళు
ఉండే చోటుకే మనల్ని తీసుకు వెడుతుంది”
“కమీషనర్
గారూ, మీ పోలీసుల సంప్రదాయం
ఏదీ నాకు తెలియదు. మీరు ఏదైనా చేసి,
దొంగతనం
చేయబడ్డ నా మూలికలను నాకు దొరికేటట్టు చూడండి…అవి
నా యాబై ఏళ్ళ కష్టం"
“బాధ
పడకండి సార్”
-- అని చెప్పిన కమీషనర్, ఫోరన్
సిక్ అధికారి వైపు తిరిగి చూసారు.
“నరసింహం”
“సార్”
“పోలీస్
డాగ్ స్క్వాడ్ లీడర్ డేవిడ్ ఇంటికి ఫోన్ చేసి సీమాతో వెంటనే బయలుదేరి రమ్మని చెప్పండి"
“ఎస్
సార్”
నరసింహం తన దగ్గరున్న సెల్ ఫోన్ నుండి
డేవిడ్ ను కాంటాక్ట్ చేసి మాట్లాడాడు -- ఆ తరువాతి పదిహేను నిమిషాలలో సీమా అనే
పేరున్న కుక్కతో ఆయన వచ్చి చేరాడు.
కమీషనర్ ఆ చేతి రుమాలను డేవిడ్ దగ్గర
చూపించి విషయం చెప్పి, సీమాకు
కమాండ్ ఇచ్చారు.
“సీమా...స్పీక్”
అది అరిచింది.
“సీ...ఆర్టికల్”
చేతి రుమాలను కింద పెట్టాడు డేవిడ్.
సీమా, చేతి రుమాలను క్షుణ్ణంగా చూసింది. “స్మెల్ ఇట్”
సీమా ఒక్క క్షణం ఆలొచించి, ఆ తరువాత గదిలో నుండి వేగంగా బయటకు వచ్చి, బయటకు పరిగెత్తింది.
డేవిడ్ తాడు పట్టుకుని దాని వెనుకే పరిగెత్తేడు.
ఐదు నిమిషాల పరుగు.
వీధి చివర ఉన్న పెట్రోల్ బంక్ లోపలకు
దూరింది. పెట్రోల్ పోసే చోటుకు దగ్గరగా వెళ్ళి కూర్చుండిపోయింది.
డేవిడ్ సెల్ ఫోన్ లో కమీషనర్ను
కాంటాక్ట్ చేశాడు.
“సార్...సీమా
పెట్రోల్ బంకు లోపలకు
వచ్చి పడుకుండిపోయింది”
“అలాగైతే
ఆ గుంపు పెట్రోల్ పోయించుకోవటానికి తమ కారును తీసుకు వెళ్ళుంటుంది”
“ఉండొచ్చు
సార్”
“ఆ
బంకులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఆ దొంగవెధవల్ని చూసుండొచ్చు. వాళ్ల దగ్గర విచారణ
చేస్తూ ఉండండి...ఈలోపు నేనొస్తాను”
“ఎస్.
సార్”
సెల్ ఫోన్ ను ఆఫ్ చేసి జేబులో
పెట్టుకున్న డేవిడ్, సీమా
కుక్కను వేడుకగా చూస్తున్న ఉద్యోగస్తుల వైపుకు వెళ్లాడు.
***********************************
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, కాంపౌండ్ గోడపై నుండి
కిందకు దూకారు.
దూరంగా ఆ యువకుడు మూర్ఖమైన వేగంతో
పరిగెత్తుతున్నాడు.
'కాల్చ
గలమా?' -- ఒక్క క్షణం ఆలొచించి 'కాల్చ లేము’ అని నిర్ణయించుకుని
ఆ యువకుడ్ని చేస్ చేశాడు.
ఒక నిమిష సమయం అతన్ని చేస్ చేసిన ఆయన, ఒక జంక్షన్ దగ్గరకు
వచ్చి ఆగారు. మూడు రోడ్ల కూడలి. చుట్టూ చూశారు. అతను కనబడలేదు. జంక్షన్ లో
ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న ఒక కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ను చూసి 'సెల్యూట్' చేశాడు.
రాజేష్ కుమార్ అడిగాడు.
“ఎవరైనా
ఇటు పక్కగా పరిగెత్తుకు వచ్చారా?”
“అలా
ఎవరూ వచ్చినట్లు నేను చూడలేదు సార్...ట్రాఫిక్ కంట్రోల్లో ఉన్నాను. పెద్దగా
గమనించలేదు”
“ఇటుపక్కకే
వచ్చేడు. నేను ఫాలో చేసుకుంటూ వచ్చాను”
చెమటతో తడిసిపోయున్న చొక్కాను ఒక సారి
సరి చేసుకుని, మళ్ళీ
అటూ ఇటూ చూసి “ఈ
సందు కుండా వెళ్ళుంటాడో?”
“వెళ్ళలేడు
సార్...ఎందుకంటే ఈ సందు ఒక ప్రమాదకరమైన రోడ్డు. ఈ సందులోకి ఎవరు వెళ్ళినా మళ్ళీ
ఇటువైపుకు తిరిగి రావలసిందే. అదీ కాకుండా ఈ సందు దగ్గరే నేను నిలబడి ట్రాఫిక్
కంట్రోల్ చేసేను...ఇటు ఎవరూ రాలేదు సార్”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ గడ్డం
తడుము కుంటూ, ఇంకా
ఆ సందు వైపే చూస్తున్నప్పుడు, ఆయన
చొక్కా జేబులో ఉన్న సెల్ ఫోన్ మోగింది.
“సెల్
ఫోన్ తీసి ‘డిస్
ప్లే’ లో చూశాడు. ‘డెప్యూటీ కమీషనర్’ అనే పేరు మెరిసింది.
చెవి దగ్గర పెట్టుకున్నాడు.
“హలో...గుడ్
మార్నింగ్ సార్”
“ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్! నటి రంజని మేనేజర్ సారధి మరణం గురించిన దర్యాప్తులోనే కదా ఉన్నారు”
“అవును
సార్”
“ఆ
వ్యవహారాన్ని మూటకట్టి ఒక పక్కన పడేసి వెంటనే కమీషనర్ ఆఫీసుకు రండి”
**********************************************PART-8*******************************************
పోలీస్ కమీషనర్ ఆఫీసు.
కమీషనర్ సర్వానంద్ తన
ముందు కూర్చున్న దశరథమూర్తి గారిని,
పల్లవిని
బాధతో చూస్తూ మాట్లాడాడు.
“మిస్టర్.
దశరథమూర్తి...మీకోపం నాకు అర్ధమవుతోంది. శ్రీలత అనే ఒక స్త్రీ, నలుగురు యువకులు
జూపీటర్ టీవీ పేరు చెప్పుకుని మీ ఇంటికి వచ్చి -- మిమ్మల్ని బెదిరించి -- మీరు
చాలా కష్టపడి చేర్చి పెట్టిన అరుదైన మూలికలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. సంఘటన జరిగి
మూడు నెలలు అవుతున్నా ఇంకా నేరస్తులను ఎందుకు కనిపెట్ట లేకపోతున్నారు అని
అడుగుతున్నారు...మీ కోపం న్యాయమైనదే!
అయినా కానీ మీ దగ్గర మేము నిజం
ఒప్పుకోవలసిందే. ఆ శ్రీలతనీ, ఆ
నలుగురు యువకులనూ కనిపెట్టటానికి ఇంతవరకు మేము ఏడు స్పేషల్ బృందాలను ఏర్పాటు
చేశాము. కానీ వాళ్ళను కనిపెట్ట లేకపోయాము. సి.బి.సి.ఐ.డి పోలీసులు, 'క్యూ' బ్రాంచ్ పోలీసులూ
మాకు పక్క బలంగా నిలబడి ఈ విషయంలో మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. అందువలన త్వరలోనే
పట్టుకుంటాము”
దశరథమూర్తి గారు తన రెండు చేతులనూ, టేబుల్ మీద ఆనించి
కోపంతో పెద్దగా మాట్లాడాడు.
“కమీషనర్
సార్...మీరు చెప్పే ఈ సమాధానం విని,
విని
నాకు విసుగెత్తిపోయింది. దొంగతనం చేయబడ్డవి నగలో, డబ్బులో కాదు సార్. విలువ కట్టలేని
అరుదైన మూలికలు. నగలో, డబ్బో
పోయున్నా...అది ఎప్పుడు దొరికితే అప్పుడు దొరకనీ అని వదిలి పెట్టేసి నా పని నేను
చూసుకునే వాడిని. మీరేమో అవి మూలికలే కదా అని అశ్రద్ద చేస్తున్నారు. ఇది అంతర్జాతీయ రంగంలో భారతదేశ పేరును నెంబర్
ఒన్ చేసేది. నాకు రెండు నెలల క్రితం ఒక అంతర్జాతీయ సదస్సు ఉన్నది. ఈ మూలికలు
దొంగతనం చేయడం వలన నేను ఆ సదస్సుకు వెళ్ళలేకపోయాను. కానీ, ఆ మాట చెప్పలేక నా
ఆరొగ్యం బాగోలేదని చెప్పి తప్పించుకున్నాను. వాళ్ళు సదస్సునే రద్దు చేశారు. నేను
చెప్పేది అబద్దం అనుకుంటే
ఈ
ఫైలు చూడండి. మళ్ళీ సదస్సు ఎప్పుడు పెడతారో తెలియదు. ఈ సారి తప్పించుకోలేను” అంటూ ఒక ఫైలు
కమీషనర్ ముందు ఉంచాడు.
“మీ
మనోభావాలను అర్ధం చేసుకున్నాన్ను...ఈ కేసును స్పేషల్ గా గమనించమని ఢిల్లీ నుండి కూడా
మాకు ప్రెషర్ వచ్చింది. మా వల్ల అయిన అన్ని ప్రయత్నాలు చేశాము. చేస్తూనే ఉంటాము”
“కమీషనర్
సార్! మీకు నేనొక ఆలొచన చెప్పనా?”
“ప్లీజ్...చెప్పండి”
“మూలికలను
ఎత్తుకు వెళ్ళిన ఆ గుంపు ఈ పాటికి ఏదో ఒక దేశంలో సెటిల్ అయ్యుంటారు. ‘ఇంటర్ పోల్’ పోలీసుల ద్వారా మీరు
ప్రయత్నం చెయ్యచ్చే?”
“అది
చేయకుండా ఉంటామా? ఇంటర్
పోల్ పోలీసులకు ఈ మూలికల దొంగతనం విషయాన్ని డీటైల్స్ తో సహా రెండు వారాల క్రితమే పంపించాము. ఎలాగైనా మంచి
జవాబే వస్తుంది. కొంచం ఓర్పుగా ఉండండి దశరథమూర్తి గారు”
“జరిగి
మూడు నెలలు అవుతోంది...ఇంతవరకు ఈ కేసులో ఒక చిన్న ప్రోగ్రస్ కూడా లేదు సార్. సంఘటన
రోజు అక్కడ చేతి రుమాల దొరికింది. అంతే...ఆ రుమాలను ‘స్మెల్’ చేసిన పోలీసు కుక్క
పెట్రోల్ బంకులోకి వెళ్ళి పడుకుండిపోయింది. పెట్రోల్ బంకు పనివాళ్ళను
విచారించినప్పుడు ఎటువంటి ఉపయోగపడే సమాచారమూ దొరకలేదు”
కమీషనర్ చేతులు నలుపుకుంటూ.
“ఇలా
చూడండి మిస్టర్ దశరథమూర్తి ...ఇది క్రైం యుగం...నగరంలో ప్రతి ఒక గంటకూ ఒక నేరం
జరుగుతోంది. అది కాకుండా రాజకీయాల ద్వారా పోరాటాలు. రేపు తెల్లారితే ఎలా
తెల్లార్తుంది అని చెప్పలేము. నా కుర్చీలో మీరు కూర్చుంటే నా పరిస్థితి ఏమిటనేది
మీకు అర్ధమవుతుంది”
కమీషనర్ మాట్లాడుతున్నప్పుడే ఆయన
ముందున్న టెలిఫోన్ రింగ్ అయ్యింది.
ఒక ‘ఎక్స్
క్యూజ్ మీ’
చెప్పేసి, రిసీవర్ ఎత్తేరు.
అవతల సైడు డిప్యూటీ కమీషనర్ మాట్లాడాడు.
“సార్...ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్ మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు”
“నటి
రంజని యొక్క మేనేజర్ సారధి ఎలా చచ్చిపోయాడో అనే సమాచారం, పోస్ట్ మార్టంలో
తెలిసిందా?”
“ఫారిన్
స్పేషలిస్టులు కూడా వచ్చారు. రక్తం కక్కుకోవటం వలనే చావు సంబంధించిందని ఖచ్చితంగా చెబుతున్నారు
సార్”
“అలాగైతే
అది సహజ మరణమే కదా?”
“డాక్టర్లు
అది సరిగ్గా చెప్పటం లేదు సార్. సారధి గారికి రక్తం కక్కునేంత రోగమేమీ లేదని
చెబుతున్నారు. సారధి చావులో ప్రకృతికి విరుద్దంగా ఏవో విషయాలున్నాయని
చెబుతున్నారు...రాత పూర్వకంగా ఏమీ ఇవ్వలేమని చెబుతున్నారు. ఇస్తే కేసు క్లోస్
చేసేయవచ్చు”
“సారధి
గారికి రక్త చెమట పట్టిందనేది నిజమా...కాదా?
దాని
గురించి ఏం చెప్పారు?”
“నిజం
కాదు అనేది డాక్టర్ల ఒపీనియన్ సార్”
“అది
అబద్దమైతే...ముఖం తుడుచుకున్న టవల్ మీద రక్తం ఎలా వచ్చింది?”
“సార్...ఈ
కేసులో చాలా గందరగోళం ఉన్నది. ఏది నిజం,
ఏది
అబద్దం తెలియటం లేదు. అందుకే కదా సార్ మనం ఈ కేసులో ముందుకు వెళ్ళలేకపోతున్నాం.
లేకపోతే ఇలా ఏ కేసు ఇన్ని రోజులైనా మనం ముగించలేకపోతున్నాం?”
“సరే, కాసేపు ఈ కేసును
కాసేపు పక్కన పెట్టండి. తొందరపడి ‘రక్తపు
చెమట’ వార్తను ఎవరికీ
చెప్పవద్దని చెప్పండి. లేకపోతే దానికి ఎవరైనా బూతాకారం తొడిగి ప్రజలలో భయం
కల్పిస్తారు”
“ఎస్...సార్”
“ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్ ఎన్నింటికి ఇక్కడకు వస్తారు?”
“నేను
ఇన్ ఫార్మ్ చేసేశాను సార్...బహుశ దారిలో ఉంటారు”
“ఆయన
రానీ...నేను మాట్లాడుకుంటాను”
కమీషనర్ సర్వానంద్ రీజీవర్ను పెడుతూండగా
ఎదురుగా కూర్చున్న దశరథమూర్తి గారు ఆందోళనగా మాట్లాడారు.
“ఒక్క
నిమిషం కమీషనర్ సార్...ఎవరికో రక్తపు చెమటలు పట్టిందని చెప్పేరే...అది ఎవరికి?”
కమీషనర్ చిన్నగా నవ్వాడు.
“మిస్టర్
దశరథమూర్తి! ఇది మీకు అక్కర్లేని విషయం. ఈ విషయాన్ని ఈ గదిలోనే మరిచిపొండి. బయటకు
వెళ్ళి ఎవరి దగ్గర చెప్పకండి. ప్రజల సంక్షేమం మనసులో పెట్టుకునే ఈ విషయాన్ని మేము
క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాము”
“నో...ఓ...ఓ...ఓ...ఓ...!”
టేబుల్ ను గట్టిగా గుద్దారు దశరథమూర్తి
గారు. కోపంగా మాట్లాడారు.
“కమీషనర్
సార్...మూలికలు కనిపించకుండా పోయిన వ్యవహారంలో గత మూడు నెలల కాలంలో ఎటువంటి ‘క్లూ’ దొరకలేదని
చెప్పారు...ఈ రక్త చెమటే ఆ వ్యవహారంలో ముఖ్యమైన ‘క్లూ"
కమీషనర్ సర్వానంద్ ముఖంలో వేడిసెగ
తగిలినట్లు నిటారుగా కూర్చున్నాడు.
“ఏం
చెబుతున్నారు దశరథమూర్తి గారు?”
“నిజాన్ని
చెబుతున్నాను. ఒకరికి చెమట రక్తంగా వస్తోందంటే,
అది
ఒక మూలిక యొక్క పనే...కమీషనర్ సార్”
“ఏ...ఏ...ఏమిటీ...మూలిక
యొక్క పనా?”
“అవును!
మూలికలలో అత్యంత శక్తి కలిగింది ‘మృత్యుదూత’ అనే మూలిక. దాన్ని
ప్రత్యేకంగా ఒక రోజు మాత్రం --- అంటే పౌర్ణమి రోజుకు తరువాతి రెండవ రోజున మాత్రమే బయటకు
తీయాలి. ఆ
రోజు మాత్రం ఆ మూలికకు అమితమైన దైవ శక్తి వస్తుంది. ఆ రోజు ఆ మూలికను చూసిన వారికీ, ఆ మూలిక యొక్క దైవ
శక్తి తరంగాలు తాకిన మనుషులు మేధావులవుతారు. ఆ రోజు ఆ మూలిక యొక్క చిన్న ముక్కను
తిన్న వారు వారి జీవితాంతం ఆరొగ్యంగానూ,
యుక్త
వయసు శక్తితోనూ ఉంటారు. మిగిలిన రోజులలో
దాన్ని బయటకు తీస్తే అది విపరీతాలకు దారి తీస్తుంది.
నిన్న అమావాస్య రాత్రి. అమావాస్య రాత్రి
పూట ఆ మూలికకు చెడు శక్తి ఎక్కువ. అమావాస్య రోజు చంద్ర
కిరణాలు ఉండవు కాబట్టి ఆ మూలికకు ఆ శక్తి ఎక్కువై, ఆ మూలికలో నుండి బయటకు వచ్చే ఆ తీవ్రమైన
చెడు శక్తి యొక్క అలల తరంగాలు ఏ మనిషినైనా తాకితే, ఆ మనిషి లోపలకు చొచ్చుకుపోతాయి. వెంటనే
ఆ మనిషిలో ఆ మూలిక యొక్క చెడు శక్తి వలన,
ఆ
మనిషిలో వేడి ఎక్కువ అవుతుంది. చెమట పడుతుంది. అలా చెమట పట్టినప్పుడు రక్తం చెమటగా
బయటకు వస్తుంది. రక్తపు చెమట బయట పడిన కొన్ని గంటల తరువాత ఆ మనిషి రక్తం కక్కుకుని
చచ్చిపోతాడు...ఇది ఆ మూలిక యొక్క శక్తి...ఇది పచ్చి నిజం”
కమీషనర్ సర్వానంద్ అది
విని శిలలాగా అయిపోయాడు.
దశరథమూర్తి గారు కొనసాగించారు.
“కమీషనర్
గారూ! రక్తపు చెమటలు పట్టిన మనిషి ఎవరు?
ఆ
మనిషి ఇప్పుడు బ్రతికే ఉన్నాడా...లేడా?”
“ఆయన
పేరు సారధి. నటి రంజని యొక్క మేనేజర్. రక్త చెమట పట్టిన వెంటనే దాన్ని ఒక టవల్ తో
తుడుచుకుని, ఆ
టవల్ను తీసుకుని డాక్టర్ గోపీనాద్ ను చూడటానికి వెళ్ళారు. అక్కడున్న రెస్ట్ రూములో
రక్తం కక్కుకుని చనిపోయాడు”
“సారధి
ఎక్కడ పడుకుని నిద్రపోయారు?”
“అతని
రూములో ఫ్యాను పనిచేయలేదని, నటి
రంజని షూటింగ్ కోసం ఊటీ వెళ్ళటం వలన ఇతగాడు రంజని గారి ఏ.సీ రూములోకి వెళ్ళి
పడుకున్నాడు. ఆ గదిలోనే ఈ విపరీతం జరిగింది”
“అలాగైతే
రంజని గారి
ఏసీ గదిలోనే ఆ ‘మృత్యుదూత’ మూలిక ఉండుండాలి”
కమీషనర్ సర్వానంద్ తన తల మీదున్న టోపీని
తీసేసి, తన ఎడం చేతి వెళ్లతో
బుర్ర గోక్కుంటూ ఆలొచించాడు.
“రంజని గారి రూములో ఆ ‘మృత్యుదూత’ మూలిక ఉండుంటుంది
అని చెబుతున్నారా?”
“ఖచ్చితంగా”
“ఆ
మూలిక రంజని గారికి
ఎలా దొరికుంటుంది?”
“ఆమెను
పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి, పద్దతిగా
ఒక విచారణ చేస్తే అన్ని నిజాలూ బయటకు వస్తాయి కమీషనర్ సార్! ఈ మూలికల దొంగతనంలో రంజనికి
భాగం ఉండి ఉండొచ్చు. ఆమెను లాకప్ కు తీసుకు వచ్చి గట్టిగా రెండు తగిలిస్తే...”
“మిస్టర్. దశరథమూర్తి, మీరు అనుకునేటట్టు రంజని
గారిని పోలీస్ స్టేషన్ కు పిలుచుకు వచ్చి విచారణ జరపలేము. ఆమె గొప్ప నటి కాకపోయినా, ఆమె ప్రభలమైన వ్యక్తి
కాకపోయినా, రాజకీయాలలో
చాలా పెద్ద పేరున్న వ్యక్తి. ఎక్కడ ఏ కార్యం జరగాలన్నా రంజనిని చూసి ‘చదివింపులు’ ఇచ్చేసి వెళ్ళిపోతే
కార్యం ఖచ్చితంగా జరుగుతుంది.
రాజకీయ
రంగంలో ఆమెను 'ఆటం
బాంబు’ అని పిలుస్తారు.
ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి విచారణ చేయలేము”
“కమీషనర్
సార్! చట్టానికి ముందు అందరూ ఒకటేనని మీకు తెలియదా? అరుదైన మూలిక దొంగతనం కూడా పెద్ద నేరమే.
కోట్లు విలువ చేసే మూలికలు దొంగతనం చేయబడ్డాయి. గత మూడు నెలలుగా ఈ కేసు బావిలో
వేసిన రాయిలాగా ఉండిపోయింది. ఈ రోజే ఈ కేసులో మొదటిసారిగా ఒక నిజం బయటకు వచ్చింది.
ఈ నిజాన్ని గట్టిగా పుచ్చుకుని, మూలికలు
దొంగతనం చేయబడటానికి కారణమైన వాళ్ళను కనిబెట్టి అరెస్టు చెయ్యద్దా?”
కమీషనర్ సర్వానంద్ ఏదో
మాట్లాడుదామనుకునే లోపు, గది
తలుపు తట్ట బడింది.
**********************************************PART-9*******************************************
“ఎస్...కమిన్” అన్నారు కమీషనర్
సర్వానంద్.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ తలుపు
తెరుచుకుని లోపల గెస్టులు ఉండటంతో కొంచం తడబడ్డాడు.
“పరవాలేదు
రండి” అన్నాడు కమిషనర్.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ లోపలకు
వచ్చి ‘సెల్యూట్’ చేసి నిలబడ్డాడు.
కమీషనర్ సర్వానంద్. అడిగాడు.
“సారధి
మర్మ చావులో విచారణ ఎంతవరకు వచ్చింది?”
“సార్...ఈ
విచారణ కొంచం చిక్కుగానే ఉన్నది. సారధి ఎలా చనిపోయ్యుంటాడో నన్న వివరణలోనే
డాక్టర్లలోనే విభేదాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వటానికి ఏ డాక్టరూ
ముందుకు రావటం లేదు. సారధి తనకు రక్త చెమటలు ఏర్పడినట్టు డాక్టర్ గోపీనాద్ దగ్గర
చెప్పారు. డాక్టర్ మొదట్లో అది నమ్మలేదు. సారధి రక్తం కక్కుకుని చనిపోయిన తరువాత
ఆయనకు నమ్మకం వచ్చింది. రంజని గారి ఏసీ రూములో
పడుకుని నిద్రపోయినప్పుడే సారధి గారికి రక్తపు చెమట వచ్చింది. కనుక, అక్కడేదన్నా ‘క్లూ’ దొరుకుతుందేమోనని ఆ
గదిని పరిశోధించడానికి నేనూ, డాక్టర్
గోపీనాద్ నిర్ణయించుకుని, జూబ్లీ హిల్స్ గ్రీన్
పార్క్ అవెన్యూలో ఉన్న రంజని గారి ఇంటికి వెళ్ళాము.
ఇంట్లో పనివాళ్ళు మాత్రమే ఉన్నారు. మేడ మీదున్న రంజని గారి గదికి వెళ్ళాము.
గది మామూలుగా మూసుంది. లోపల ఏదో శబ్ధం...జాగ్రత్తగా గదిలోకి వెళ్ళాను. నేను రావటం
గ్రహించిన లోపల ఉన్న ఆ మనిషి, కళ్ళు
మూసి తెరిచేలోపు 'సిట్
అవుట్' లోకి దూకి -- తోటలోకి
దిగి పరిగెత్తేడు. అతన్ని ఫాలో చేసి వెళ్ళాను. పట్టుకోలేకపోయాను"
“ఎవరతను?”
“తెలియదు
సార్”
“పనివాళ్ల
దగ్గర విచారించారా?"
“విచారించాను
సార్...తెలియదని చెప్పారు. పని వాళ్లకే తెలియకుండా వెనుక పక్కగా వచ్చిన ఒకతను, రంజని గారి గదిలో దేనికోసమో
వెతుకుతున్నాడనుకుంటా”
దశరథమూర్తి గారు అడ్డుపడి చెప్పాడు “అతను మూలికను
వెతుక్కుంటూ వచ్చుంటాడు”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, “మూలికా?” అంటూ ఆశ్చర్యపోగా, కమీషనర్ చెప్పాడు.
"ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్! ఈయన
మిస్టర్. దశరథమూర్తి. మూలికల పరిశోధనా శాస్త్రవేత్త. మూడు నెలల ముందు ఈయన
దగ్గరున్న, కోట్లు
విలువచేసే అరుదైన మూలికలను ఐదుగురు కలిగిన ఒక బృందం దొంగలించుకుని పోయారు. ఆ
బృందానికి శ్రీలత అనే ఒక స్త్రీ లీడర్.
మూలికలకు ఔషధ గుణాలు ఉన్నట్టే, విపరీతమైన కృర గుణాలూ
ఉన్నాయని దశరథమూర్తి గారు చెబుతున్నారు. మూలికలలోనే అత్యంత శక్తి కలిగిన ‘మృత్యుదూత’ మూలికే సారధి కి
రక్త చెమట ఏర్పడటానికి కారణమని చెబుతున్నారు. అది మాత్రమే కాదు...మూలికల దొంగతనంలో
నటి రంజని గారికి
భాగం ఉంటుందని దశరథమూర్తి గారు అనుమాన పడుతున్నారు”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ చెప్పాడు.
“ఉండొచ్చు
సార్. రంజని అంత మంచి ఆడది కాదు. కొందరు పెద్ద రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర
పడుంటుంది కాబట్టి, రాజకీయ
రంగంలో ఆమె జెండాలాగా ఎగురుతోంది...డబ్బుకొసం
ఏదైనా చేస్తుంది. మీరు గనుక అనుమతిస్తే,
ఆమెను
విచారించే పద్దతిలో విచారిస్తే నిజాలు బయటపడుతాయి”
“సరే...విచారణ
చెయ్యండి. పత్రికలకు న్యూస్ వెళ్ళకుండా చూసుకోండి. రంజని గారిని విచారణ
చేస్తున్నప్పుడు ఎటువంటి హడావిడి వద్దు”
“ఎస్...సార్”
************************************
రంజని -- విమానంలో హైదరాబాద్ వచ్చి
చేరిన తరువాత, గవర్నమెంట్
హాస్పిటల్ మార్చురీలో ఉంచబడ్డ చనిపోయిన సారధి యొక్క మృతదేహాన్ని చూసేసి, శోకమైన ముఖంతో బయటకు
వచ్చింది. కూలింగ్ గ్లాసు పెట్టుకుంది.
హాస్పిటల్ సిబ్బంది వేడుకగా చూస్తూండగా, కార్ పార్కింగ్ వైపు
నడుస్తున్న ఆమెను -- ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ అడ్డుపడి ఆపాడు.
“ఎక్స్
క్యూజ్ మీ మ్యాడం”
“ఏమిటీ?”
“సారధి గారి మరణం గురించి మీ
దగ్గర ఒక చిన్న విచారణ”
రంజని ఆగకుండా నడుస్తూనే అడిగింది.
“ఈ
విచారణ అవసరమా?”
“చాలా
అవసరం మ్యాడం”
“సరే...అడగండి”
“సారధి గారి మరణం గురించి
మీరు ఏమనుకుంటున్నారు?”
“ఇందులో
ఏమనుకుంటాం...అతని ఆయుష్షు ముగిసింది...వెళ్ళిపోయాడు”
“ఆయన
మరణంలో సందేహం ఉంది మ్యాడం”
“ఏమిటా
సందేహం?”
“ఆయన
హత్య చేయబడి ఉండొచ్చు”
“ఆయన
ఎందుకోసం హత్యచేయబడాలి...హత్యచేయటానికి కావలసిన కారణం ఉందా?”
“కారణం
తెలియటం లేదు”
“కారణం
తెలియకుండా ఎలా హత్య అంటున్నారు?”
“ఒక
ఊహే. సారధి గారి
మరణం ఒక వ్యత్యాసంగా జరిగింది. ఉక్కపోతను తట్టుకోలేక మీ రూములోకి వెళ్ళి పడుకున్నారు.
ఏసీ వేసుకున్న ఆయనకి చెమట పట్టింది. తుడుచుకుని చూస్తే అది రక్తం. చెమట రూపంలో
రక్తం రావటం చూసి భయపడి, మరుసటి రోజు
ప్రొద్దున డాక్టర్ను కలిశారు. డాక్టర్ ఆ రక్తాన్ని ల్యాబులో టెస్ట్
చేస్తున్నప్పుడే సారధి గారు
రక్తం కక్కుకుని చనిపోయారు. ఇది ఒక అసాధారణ మరణం అని మీ మనసుకు అనిపించటం
లేదా?”
కారు వైపుకు నడుస్తున్న రంజని ఆగింది.
స్వరంలో కొంచం కోపం కనబడింది.
“ఇప్పుడు
నేను ఏం చెప్పాలని ఎదురు చూస్తున్నారు?”
“నిజం”
“ఏం
నిజం?”
“సారధి గారి మరణానికి కారణం ‘మృత్యుదూత’ అనే ఒక మూలిక. అది మీ
గదిలో ఉన్నది. అదెలా? ఆ
మూలికను మీకు ఇచ్చింది ఎవరు?”
రంజని తన రెండు చేతులను కట్టుకుంది.
“ఇన్‌స్పెక్టర్...మీరు
చెప్పే విషయాలన్నీ నాకు కొత్తగా ఉంది. మూలిక ఒక మనిషిని చంపగలదా!?. అలాగే అనుకున్నా ఆ ‘మృత్యుదూత’ మూలిక గురించి నాకు
ఏమీ తెలియదు. నేను నిజం చెప్పటానికి ఏ రోజూ భయపడింది లేదు. ఇప్పుడు మీకు
ఆశ్చర్యపరిచే ఒక విషయం చెప్పనా?”
“ఏమిటీ?” అన్నట్టు ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్ ఆశ్చర్యపోయి చూస్తుండగా రంజని శాంతమైన స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టింది.
“సారధి
చనిపోయాడు. ఒకవేల అతను చనిపోకుండా ఈ రోజున బ్రతికే ఉండుంటే, వచ్చేవారం ఆదివారం
రోజున సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చనిపోయుండేవాడు”
“మే...మేడం...మీరు
ఏం చెబు..చెబుతున్నారు?”
“నిజం
చెబుతున్నాను ఇన్‌స్పెక్టర్. సారధిని చంపటానికి నేనే ఒక పధకం వేసున్నాను. దానికొసం
కిరాయి గూండా గుంపుకు రెండు లక్షల రూపాయలు ఇచ్చున్నాను. వచ్చే ఆదివారం సాయంత్రం
నాలుగు గంటలకు అతన్ని హతమార్చటానికి ఏర్పాటు చేశాను”
“మే...మేడం”
“మీకు
షాకింగ్ గా ఉంటుందని నాకు తెలుసు. నేను నిజం మాట్లాడటానికి ఏ రోజూ భయపడింది లేదు. సారధిని
నేను ఎందుకు చంపాలనుకున్నానో చెప్పాల్సిన అవసరం నాకుంది. నేను ఈ సినిమా
ప్రపంచానికి వచ్చిన కొత్తల్లో ఒకడు నన్ను మోసం చేసి కూల్ డ్రింకులో మత్తు మందు
కలిపి ఇచ్చి ‘బ్లూ
ఫిల్మ్’ తీసాడు. ఆ క్యాసట్ సారధి
చేతికి ఎలాగో దొరికింది. అది పెట్టుకుని నన్ను బ్లాక్ మైల్ చేసే నా దగ్గర మేనేజర్
ఉద్యోగానికి చేరాడు. ఉద్యోగం చేస్తూ అతనికి అవసరం వచ్చినప్పుడల్లా నన్ను బెదిరించి
డబ్బు తీసుకునే వాడు.
రాజకీయ రంగంలో నాకు కాస్తంత పలుకుబడి
దొరికిన వెంటనే వాడ్ని ఈ లోకం నుండి పంపించేయాలని
నిర్ణయించుకున్నా. దానికొసం వచ్చే ఆదివారం సాయంత్రానికి ముహూర్తం పెట్టి, డబ్బులిచ్చి ఉంచాను.
ఇంతలో సారధికి ఇలా ఒక ముగింపు వస్తుందని నేను ఎదురు చూడలేదు”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ కొన్ని
క్షణాలు మౌనంగా ఉండి “అలాగైతే
ఆ మూలిక
గురించి మీకు ఏమీ తెలియదు?”
“తెలియదు.
దాన్ని నేను చూసింది కూడా లేదు”
“మీ
గదిలోపల ఆ ‘మృత్యుదూత’ మూలిక ఉండబట్టే కదా సారధికి
ఆ విధంగా చావు ఏర్పడింది”
“నేను
నమ్మలేక పోతున్నాను”
“దేనిని?”
“రక్త
చెమటలు పుట్టించి, మనిషిని
చంప గలిగేంత శక్తి
గల మూలిక ఉంటుందా?”
“ఉందని
చెబుతున్నారు మూలికల నిపుణులు ప్రొఫెసర్ దశరథమూర్తి గారు. అది పక్కన పెట్టండి.
మీకు శ్రీలత, రామూ, రాజు, గణేష్, సాహిద్ -- ఈ పేర్లలో
ఎవరినైనా తెలుసా?”
రంజని కాసేపు ఆలొచించి తల ఊపింది.
“తెలియదు!
ఎందుకు అడుగుతున్నారు?”
“ప్రొఫసర్
దశరథమూర్తి గారి పరిశోధనా కేంద్రం నుండి కోట్లు విలువ చేసే మూలికలను
కొట్టుకెళ్ళింది ఆ గుంపే”
“సారధి
మరణం చూసి, మూలికల
దోపిడిలో నాకూ భాగం ఉన్నదని దశరథమూర్తి గారు అనుమానిస్తున్నారో?"
“అవును...అనుమానిస్తున్నారు”
“మీరు
దానికి ఏం సమాధానం చెప్పారు?”
“ఊటీ
నుండి రంజని గారు రానివ్వండి. విచారణ చేసి చూద్దామని చెప్పాను...”--- ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్ చెబుతున్నప్పుడే రంజని బ్యాగులో నుండి సెల్ ఫోన్ రింగ్ టోన్
వినబడ్డది.
అది తీసి ఎవరు ఫోన్ చేసారో అని చూసింది.
కొత్త నెంబర్.
ఎవరనేది తెలుసుకోవటానికి ఫోన్ ఆన్ చేసి
చెవి దగ్గర పెట్టుకుంది.
“హలో”....అవతల సైడు ఒక
మహిళ వాయిస్ వినబడింది.
“మాట్లాడేది
ఎవరు... రంజని నేనా?”
“అవును...నువ్వు
ఎవరు?”
“నేను
శ్రీలత”
ఒక్క క్షణం షాకయ్యింది రంజని.
“పే…పేరు
ఏం చెప్పావు... శ్రీలత నా?”
“అవును!
శ్రీలత నే...నీ పక్క నున్న ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, నా గురించి
చెప్పుంటారే?”
“హూ...చెప్పారు”
“రంజనీ...‘మృత్యుదూత’ మూలికకు నిజానికి నువ్వు బలై ఉండాలి.
నువ్వు హఠాత్తుగా ఊటీ షూటింగ్ కు బయలుదేరి వెళ్లటంతో నీ గదిలో పడుకుని నిద్రపోయిన సారధి
రక్త చెమట, రక్తం
కక్కుకుని చచ్చిపోయాడు. సారధికి ఏర్పడిన గతి త్వరలో నీకూ జరగబోతుంది. రెడీగా
ఉండు"
రంజని చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆందోళనలోనూ, భయంలోనూ ఆమె చేతి
వేళ్ల నుండి జారి కింద పడిపోయింది.
**********************************************PART-10******************************************
దశరథమూర్తి గారి బంగళా.
సమయం రాత్రి తొమ్మిది.
దశరథమూర్తి గారు కలతతో మౌనంగా
కూర్చోనుండగా -- ఎదురుగా కమీషనర్ సర్వానంద్, ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్, నటి
రంజని కూర్చోనున్నారు.
రంజని ముఖం భయంతో వాడిపోయింది.
“మిస్టర్
దశరథమూర్తి! నాకు ఇంకా నమ్మకం రావటం లేదు. చెట్ల వేర్లు లాగా ఉండే ఒక మూలికకు ఇంత
శక్తి ఉందా? దాన్ని
పెట్టుకుని ఒకరి ప్రాణం తీయటం కుదురుతుందా?”
“మానవ
జాతిలో మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ
ఉన్నట్లే...మూలికలలోనూ మంచివి - చెడ్డవి ఉన్నాయి. మామూలుగా చాలా మూలికలకు ఔషధ
గుణాలు మాత్రమే ఉన్నాయి. ‘మృత్యుదూత’ మూలిక, అరవై శాతం ఔషధగుణం, నలబై శాతం చెడు గుణం
కలిగి ఉంది. ఆ మూలికను తీసుకు వెళ్ళిన శ్రీలత దాన్ని మంచి పనులకు
ఉపయోగించకుండా...చెడ్డ పనులకు వాడటం మొదలు పెట్టింది. దీన్ని ప్రారంభంలోనే
తుంచేయాలి. గత మూడు నెలలుగా పోలీసు డిపార్ట్మెంట్ నిద్రపోతున్నది చాలు. ఇకనైనా
వెతికే వేట మొదలుపెట్టి -- ఆ శ్రీలత ని, ఆమెతో
ఉన్న ఆ నలుగురు యువకులనూ కనిపెట్టి -- ఆ మూలికలన్నిటినీ చేజిక్కించుకోవాలి. లేకపోతే
విపరీతాలు జరగటం ఆపలేము”
కమీషనర్ సర్వానంద్ అడ్డుపడ్డారు.
“మిస్టర్
దశరథమూర్తి... శ్రీలత, ఆమెతో
ఉన్న ఆ నలుగురు కుర్రాళ్ళూ ప్రస్తుతం మన రాష్ట్రంలోనే ఉన్నారు, అందులోనూ మన హైదరబాద్
లోనే ఉన్నట్టు మనకు ఇప్పుడు రంజనిని హెచ్చరించటం వలన మనకు తెలుస్తోంది. కానీ, ఫోన్ కాల్ ట్రాక్
చేసి చూస్తే ఆ కాల్ తమిళనాడులోని
ఆంధ్రా బార్డర్లో ఉన్న ఉలవానూర్ అనే గ్రామంలో నుండి చేసింది. కాబట్టి వాళ్ళు అక్కడ
ఎవరింట్లోనో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రా పోలీస్ స్పేషల్ బ్రాంచ్ పోలీసులు, ఆ ఊరికి మధ్యాహ్నమ్మే
బయలుదేరి వెళ్లారు...త్వరలోనే వాళ్లను పట్టుకుంటాము”
“ఈ
చురుకుదనాన్ని మీరు ముందే చూపుండచ్చు కదా. రంజని గారి ప్రాణానికి ఆపద
అని తెలిసిన వెంటనే, ఇంత
వేగంగా ట్రై చేస్తున్నారు”
“దశరథమూర్తి
గారూ, ఈ కేసులో ఇప్పుడే
మొదటి ‘క్లూ’ దొరికింది. ఇది
చాలు. వాళ్లను పట్టుకోవటానికి ఇది చాలు”
“అంటే
రంజని గారి ప్రాణానికి, మీరు
వేగంగా పనిచేయటానికీ సంబంధం లేదా?”
“ఏం
చెయ్యం... దశరథమూర్తి గారూ? అంతా
రాజకీయమే. రంజని మీద ఒక చిన్న గోరు గీత కూడా పడకూడదని ఇద్దరు వి.ఐ.పి లు ‘గెజట్’ లో వేసేంత తీవ్రంగా
ఆర్డర్ వేశారు...అలా మేము చేయలేదనుకోండి మమ్మల్ని ఎక్కడైన దూరంగా విసిరి
పారేస్తారు”
దశరథమూర్తి గారు చిన్నగా నవ్వుతూ, తలెత్తి రంజనిని
చూశారు.
“ఏమ్మా...నేను
నీ దగ్గర ఒక ప్రశ్న అడగొచ్చా?”
“అడగండి
సార్”
“నిన్ను
హత్య చేయాలనుకునేంత కోపం శ్రీలతకి ఎందుకు ఏర్పడింది?”
“అదే
నాకూ అర్ధం కావటం లేదు సార్! ఆ శ్రీలత నలుపా, ఎరుపా
అని కూడా నాకు తెలియదు. ఆమె ఎందుకు నన్ను హత్య చేయాలనుకుంటోందో తెలియటం లేదు. నేను
రాజకీయ రంగంలో పలుకుబడి సంపాదించి ఉంచుకోవటం ఆమెకు నచ్చలేదో,ఏమో?”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, దశరథమూర్తి గారి వైపు తిరిగాడు.
“సార్! రంజని గారిని ఆ ‘మృత్యుదూత’ మూలిక నుండి
కాపాడటానికి ఏదైనా దారి ఉందా?”
“ఓకే
ఒక దారి ఉంది”
“చెప్పండి
సార్”
“గది
పూర్తిగా ఎర్ర వెలుతురు/ కాంతి ఉండేలాగా ఇరవైనాలుగు గంటలూ నలభై వాట్స్ లైటు
వెలుగుతూ ఉండాలి. ఎర్ర కాంతిలో
ఏ మూలిక శక్తి కిరణాలు చొచ్చుకు పోలేవు. మూలిక భయం లేకుండా నిద్రపోవచ్చు. ఎర్రని
కాంతిలో మూలికలు చంద్ర కాంతిలో కలిసి ట్రావల్ చెయ్యలేవు”
శ్రీలత థ్యాంక్స్
చెబుతున్నప్పుడే...కమీషనర్ సర్వానంద్ యొక్క సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. తీసి చెవి
దగ్గర పెట్టుకున్నారు. అవతలవైపు డెప్యూటీ కమీషనర్.
“సార్...నేను
దీపక్ శర్మ”
“చెప్పండి”
“ఒక
విపరీతం సార్”
“ఏమిటది?”
“జడ్జ్
జవహర్ గారు...హత్య
చేయబడ్డారు సార్”
“ఎవరు...తీవ్ర
వాదులను విచారణ చేస్తున్న విషేశ కోర్టు జడ్జ్ జవహర్ గారి
గురించా మీరు చెబుతున్నారు”
“అవును
సార్”
“చావు
ఎలా? హంతకుడ్ని పట్టుకున్నారా”
“సార్... జవహర్ గారి మరణం, సారధి గారి మరణం
లాగానే జరిగింది సార్”
“అంటే
రక్తం చెమట...రక్తం కక్కు?”
“అవును
సార్”
“ఏ
ఆసుపత్రి?”
చెప్పాడు.
“నేను
వెంటనే బయలుదేరి వస్తాను”---సెల్
ఫోన్ ను ఆఫ్ చేసి జేబులో పెట్టుకుంటూ కమీషనర్ సర్వానంద్ రెండు చేతులతోనూ మొహానికి
పట్టిన చెమటను తుడుచుకుంటూ దశరథమూర్తి గారిని చూసాడు.
“మృత్యుదూత’ మూలిక, జస్టీస్ జవహర్ గారిని కూడా
బలితీసుకుంది. సారధి గారికి లాగానే రక్తం చెమటలు, రక్తం కక్కు ఏర్పడి మరణం”
దశరథమూర్తి గారు నీరసపడిపోయి, అలాగే కుర్చీలో
వాలిపోయారు.
కమీషనర్ సర్వానంద్, ఇన్‌స్పెక్టర్ రాజేష్
కుమార్ ను
చూశారు.
“మీరు
రంజని గారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆమె ఇంట్లో దిగబెట్టి, హాస్పిటల్ కు
వచ్చేయండి”
కమీషనర్ అందరి దగ్గర సెలవు తీసుకుని
పోర్టికోలో నిలబడున్న జీపులోకి ఎక్కారు.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, రంజని వైపు తిరిగాడు.
“మ్యాడం...మనం
వెలదాం?”
రంజని తల ఊపుతూ, తడబడతూ లేచి నిలబడ్డ
క్షణం, ఇన్‌స్పెక్టర్ రాజేష్
కుమార్ సెల్ ఫోన్ ప్రాణం తెచ్చుకుని పిలిచింది.
తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు.
“హలో”
“ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్?”
“ఎస్”
“ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్! నేను డాక్టర్ గోపీనాద్”
“చెప్పండి
డాక్టర్”
“మీరు
వెంటనే బయలుదేరి నా హాస్పిటల్ కు రాగలరా?”
“ఏమిటి
విషయం డాక్టర్?”
“సారధి కేసు లాగానే ఒక కేసు.
రక్తం చెమట పడుతోందని చెప్పి ఇక్కడ ఒకరు ‘అడ్మిట్’ అయ్యున్నారు”
“ఏవరు...ఎవరు...ఆయన...?”
“పేరు
సత్యమూర్తి...పెద్ద కోటీశ్వరడు. కడప,
కర్నూల్
వైపు ఆయనకు ఏడెనిమిది గ్రానైట్ క్వారీలూ,
రెండు
సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మీరు వెంటనే బయలుదేరి రండి?”
“ఓ.కే” --- వేగంగా బయలుదేరాడు ఇన్‌స్పెక్టర్ రాజేష్
కుమార్.
ఇన్‌స్పెక్టర్ రాజేష్
కుమార్, దశరథమూర్తి గారిని
తీసుకుని, రంజని కారులో
బయలుదేరి డాక్టర్. గోపీనాద్ హాస్పిటల్ కు వెళ్ళి చేరినప్పుడు ఐ.సి. వార్డుకు ముందు ఒక పెద్ద గుంపు
ఉన్నది. గుంపు మధ్యలో నిలబడున్న డాక్టర్. గోపీనాద్ అక్కడ జేరిన గుంపుతో మాట్లాడుతున్నారు.
“ఇలా
మీరు గుంపుగా చేరినందువలన ఏమీ ప్రయోజనం లేదు. మిస్టర్ సత్యమూర్తి గారికి చికిత్స
జరుగుతోంది. కొంచం సేపు వెయిట్ చేయండి”
ఆయనకు ముందు నిలబడ్డ ఒక యువకుడు, ఏడుస్తున్న గొంతుకతో
అడిగాడు.
“నాన్న
గారి ప్రాణానికి ఏమీ ఆపద లేదుగా డాక్టర్?”
“ఇప్పుడే
నేనేమీ చెప్పలేను. వచ్చిన రోగం అరుదైన రోగం. ఇలాంటి వ్యాధికి మేము ఇంతవరకు చికిత్స
ఏమీ ఇవ్వలేదు. ఆయన శరీరంలో ఉన్న రక్తం,
ఏదో ఒక విషంతో చెడిపోయింది. ఆ చెడిపోయిన రక్తాన్ని తీసేస్తూ, ఆయనకు కొత్త నెత్తురు
ఎక్కిస్తున్నాం. దాని రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది రెండు గంటలు గడిచిన తరువాతే
చెప్పగలం. ఇక్కడ గుంపుగా నిలబడున్న
వాళ్లందరూ ఎవరు?
మీ బంధువులా?”
“అవును
డాక్టర్”
“మొదట
వీళ్లందరినీ బయటకు వెళ్లమని చెప్పండి. మిస్టర్ సత్యమూర్తి గారికి మీరొక్కల్లే
కొడుకా?”
“అవును
డాక్టర్”
“అరున్
కుమార్”
“ధైర్యంగా
ఉండండి... మనం చేయగలిగింది రక్త మార్పిడి ఒక్కటే. అది పూర్తి అయిన రెండుగంటల వరకు
ఏమీ చెప్పలేము. చేయగలినంతవరకు చేస్తున్నాం. సిటీలో ఉన్న పెద్ద
డాక్టర్లందరికీ ఫోన్ చేశాను. వాళ్ళూ వస్తున్నారు”
డాక్టర్. గోపీనాద్, అరున్ కుమార్ దగ్గర
నుండి కదిలి ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ వైపుకు వచ్చారు. పక్కన నిలబడున్న దశరథమూర్తి
గారినీ, నటి రంజనిని ఒక చూపు
చూసి అడిగారు.
“వీళ్ళు?”
“ఈయన
మిస్టర్ దశరథమూర్తి...మూలిక నిపుణులు. ఈమె నటి రంజని. మీకు తెలుసు”
“పత్రికలలో
చూశాను...”
-- అంటూ దశరథమూర్తి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి,
రంజనికి
నమస్తే పెట్టి “రండి...నా
గదికి వెళ్ళిపోదాం”
అందరూ డాక్టర్.
గోపీనాద్ గదికి వెళ్ళారు.
డాక్టర్. గోపీనాద్ తన కుర్చీలో వెనక్కి
వాలిపోతూ ముగ్గురికీ ఎదురుగా ఉన్న కుర్చీలు చూపించారు. వాళ్ళు కూర్చున్న వెంటనే
చెప్పారు.
“ఈ
రోజు ఇది రెండో సంఘటన”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆందోళన
పడుతూ అడ్డుపడ్డాడు.
“మూడోది
అని చెప్పండి డాక్టర్”
డాక్టర్. గోపీనాద్ కళ్ళు ఆశ్చర్యంతో
చూసాయి.
“మూడవదా?”
“అవును...మీరు
నాకు ఫోన్ చేయటానికి మునుపు కమీషనర్ గారికి ఒక ఫోన్ వచ్చింది. డెప్యూటీ కమీషనర్ దీపక్
శర్మ గారు చేసారు. తీవ్రవాదులను విచారించటానికని ఏర్పాటు చేసిన స్పేషల్ కోర్టు
జడ్జ్ జస్టీస్ జవహర్ గారు ఆసుపత్రిలో చేర్చుకోబడి మరణించారు. మరణానికి కారణం రక్తం
చెమటలు, రక్తం కక్కు. కమీషనర్
నన్ను కూడా ఆ హాస్పిటల్ కు రమ్మని చెప్పి వెళ్ళారు. నేను అక్కడికి బయలుదేరి
వెళ్లబోతున్న సమయంలో మీ ఫోన్ వచ్చింది. వెంటనే మేము ముగ్గురం బయలుదేరి ఇటొచ్చాము "
“పోలీస్
కమీషనర్ కు ఈ మూడో సంఘటన గురించి చెప్పారా?”
“కార్లో
వచ్చేటప్పుడే ‘ఇన్
ఫార్మ్’ చేశేశాను”
“హాస్పిటల్లో
జస్టీస్ జవహర్ గారికి ఎక్కువసేపు చికిత్స జరిగిందా?”
“లేదు...హాస్పిటల్
కు తీసుకు వెళ్ళిన వెంటనే మరణం సంభవించిందట”
రంజని అడ్డుపడింది. “'మృత్యుదూత’ను నిజానికి నాకు
గురి పెట్టారు. అద్రుష్టవసాత్తూ,
హఠాత్తుగా బయట ఊరిలో షూటింగ్ పెట్టటంతో,
నేను
అటు వెళ్ళిపోయా, తప్పించుకున్నాను.
సారధి చిక్కుకున్నాడు”
దశరథమూర్తి గారు కళ్ళు నిజంగానే అగ్ని
కణంలాగా ఏర్రబడ్డాయి.
“మూలికలను
ఉపయోగించి ఇలాంటి చావులు ఏర్పరచటం వలన ఆ శ్రీలత కి, ఆమె బృందానికి ఏమిటి లాభమో తెలియటం లేదే? మూలిక అనేది ఔషధ గుణం
కలిగిన ఒక చెట్టు కొమ్మ, వేరు.
ఆ మూలికలు దేవుని శక్తి కలిగినవి కూడా. అవి ప్రకృతి మనకు అందించినవి. దాన్ని
ఇలాంటి చెడ్డ పనులకు ఉపయోగించటం పెద్ద పాపం”
దశరథమూర్తి గారు కోపంగా మాట్లాడి
ముగించిన క్షణం -- తుఫాను గాలి వేగంతో లోపలకు వచ్చాడు అరున్ కుమార్.
చేతిలో ఒక బ్రీఫ్ కేస్.
డాక్టర్. గోపీనాద్ నిటారుగా
కూర్చున్నారు.
“ఏమిటిది
అరున్ కుమార్?”
అతను సమాధానం ఏదీ చెప్పకుండా, బ్రీఫ్ కేసును టేబుల్
మీద పెట్టాడు.
“డాక్టర్
దీన్ని కొంచం తెరిచి చూడండి”
“ఇందులో
ఏముంది?”
“కొంచం
తీసి చూడండి”
డాక్టర్. గోపీనాద్ కొన్ని నిమిషాలు
తటపటాయించి, ఆ
బ్రీఫ్ కేసును తెరిచాడు.
లోపల ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు.
డాక్టర్. గోపీనాద్ ‘కన్ ఫ్యూజన్’ తో అరున్ కూమార్ను
చూసాడు.
“ఏమిటిది?”
“డబ్బులు
డాక్టర్”
“డాక్టర్
ఇందులో పది లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బు మీ ఫీజు. మా నాన్నను ఎలాగైనా కాపాడండి”
“సారీ
అరున్ కుమార్...ఇంత పెద్ద మొత్తం నాకు అవసరం లేదు. మీ నాన్న బ్రతికి బయటపడితే
న్యాయంగా నాకు ఇవ్వవలసిన డబ్బు నేనే అడిగి తీసుకుంటాను. ఈ డబ్బును తీసుకుని
వెళ్ళిపో. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే,
ప్రార్ధన
చెయ్యి...ఈ పది లక్షల కంటే, ఆ
ప్రార్ధనకే ఎక్కువ విలువ”
“డాక్టర్!
మా నాన్నను ఎలాగైనా బ్రతికించండి. ఆస్తుల విషయంలో కొన్ని ముఖ్య కాగితాల్లో సంతకాలు
పెట్టాల్సి ఉంది. ఆయన సంతకాలు చేయకపోతే...ఏవీ చెల్లుబడికావు”
“ఇలా
చూడు అరున్ కుమార్...సీరియస్ కండిషన్ లో ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు
పేదవాళ్ళైనా, డబ్బుగలవాళ్ళు
అయినా సరే...వాళ్ల ప్రాణాలను కాపాడటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తాము. ఇలాటి వాటికి
ఫలితం ఇచ్చేది ఆ పైవాడే...దయచేసి డబ్బు తీసుకుని వెళ్ళిపొండి"
“డాక్టర్”
“ప్లీజ్”
----బ్రీఫ్ కేస్ తీసి అతని చేతికి
ఇచ్చాడు డాక్టర్. గోపీనాద్.
**********************************************PART-11******************************************
హోటల్ సిల్వర్ ఇంటర్నేషనల్ ఏడవ అంతస్తు.
సమయం రాత్రి ఏడు గంటలు. గదిలో టీవీ
చూస్తున్న రంజని చిన్నగా ఆవలించంది. ‘ఇక
నిద్రపోదామా?’ అని
ఆలొచించిన మరు క్షణం బెడ్ మీదున్న సెల్ ఫోన్ రింగ్ అయ్యింది.
అది తీసి ‘డిస్ ప్లే’ లో చూసింది. పేరు
మోసిన రాజకీయ నాయకుని పేరు. వికసించిన మొహంతో మాట్లాడింది.
“సార్”
“ఏం
రంజని...నిద్రపోయావా?”
“లేదు
సార్. టీవీ చూస్తున్నాను?”
“హోటల్
వసతిగా ఉందా...నువ్వు అడిగినట్లు లైటింగ్ అరేంజ్ మెంట్ చేసారా?”
“ఏదో
స్వర్గ లోకంలో గది వేసినట్టు ఉంది సార్...లైటింగ్ నేను అడిగినట్లే చేసుంచారు”
“ఆ
శ్రీలత గురించి భయపడకుండా ఒక నాలుగైదు రోజులు అక్కడే ఉండు. ఈ లోపల ఆమెను
కనిపెట్టేద్దాం”
“నాకు
ఆమె గురించిన భయమంతా లేదు సార్. నేను ధైర్యంగానే ఉన్నాను”
“అలాంటి
మొండి ధైర్యమే ఉండకూడదు అంటున్నాను. ఇద్దరు రక్తం చెమట పట్టి
చచ్చిపోయున్నారు...మూడో వ్యక్తి ప్రాణానికి పోరాడుతున్నాడు. ఆ శ్రీలత సామాన్యమైన
మనిషి కాదు. నువ్వుండాల్సిన జాగ్రత్తలో నువ్వు ఉండాలి.
నీ గదికి ముందు ఇద్దర్ని రహస్యంగా కాపలా
పెట్టాను. అనవసరంగా నిన్ను చూడటానికో,
నీ
పక్కన నిలబడటానికో సాధ్యం కాదు. నువ్వు టైముకు తిను, బాగా నిద్రపోయి రెస్టు తీసుకో. నీకు ఏది
కావాలన్నా సరే నాకు ఫోను చెయ్యి. మరో గంటలో అది అక్కడికి వస్తుంది”
“నాకు
తెలియదా ఏమిటి?”
“నేను
మళ్ళీ రేప్రొద్దున ఫోన్ చేస్తాను”
-- అవతలసైడు సెల్ ఆఫ్ చేయడంతో, తన
సెల్ ఫోన్ ను దిండు కిందకు తీసుకు వెళ్ళి పెట్టింది.
గది తలుపు సరిగ్గా వేసి, గొళ్లేం పెట్టేమా
లేదా ‘కన్ ఫర్మ్’ చేసుకున్న తరువాత, పరుపు మీద వాలింది.
ఏ.సీ. చలికి రగ్గులాంటి దుప్పటి కప్పుకుంది. మెల్లగా కళ్ళు
మూసుకుంది. మనసులో ఆలొచనలు పరిగెత్తినై.
‘ఏవరీ
శ్రీలత?’
‘నన్ను
చంపటం వలన ఆమెకు ఏమిటి లాభం? నేను
రాజకీయ పలుకుబడితో ఉన్నాను కాబట్టి,
అది
ఇష్టం లేని వాళ్ళు, శ్రీలత
ద్వారా నన్ను చంపాలనుకుంటున్నారా?’
రంజని ఆలొచిస్తున్నప్పుడే, దిండు కింద పెట్టుకున్న
ఫోన్ మోగింది.
పడుకునే సెల్ ఫోన్ తీసింది మాట్లాడింది.
“హలో”
“ఏమిటి
రంజని...టైము ఇప్పుడు పదకుండు. ఇంకా నిద్ర పోలేదా? సెల్ ఫోన్ రింగైన వెంటనే తీసావు?” -- ఒక ఆడ గొంతు.
“నువ్వు...నువ్వు...ఎవరు?” -- రంజని లేచి కూర్చుంటూ
విసుగ్గా అడిగింది.
“శ్రీలతను”
రంజనికి ఆ ఏ.సీ. రూములో కూడా చెమెటలు
పట్టినై.
శ్రీలత తన మాటలు కొనసాగించింది.
రంజని గుండె వేగంగా కొట్టుకుంటోంది. “ఇదిగో...చూడు!
నువ్వెవరు? నీకూ, నాకూ ఏమిటి పగ, ఎందుకు నన్ను
చంపాలనుకుంటున్నావు?”
“ఈ
ప్రశ్నలన్నింటికీ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఇచ్చిన పనిని
నేను పూర్తిచేయాలి. అంతే. ఒక హోటల్ ఏడో అంతస్తుకు పోయి కూర్చుంటే...నిన్ను నేను
వదిలిపెడతానా ఏమిటి? నువ్వు
కిందకు దిగి రావా ఏమిటి?”
“ఇదిగో
చూడు శ్రీలతా! నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను...నన్ను చంపటానికి ఇంకెవరో ఇచ్చిన
డబ్బు కంటే రెండు రెట్లు ఎక్కువ ఇస్తాను”
“నువ్వు
పదిరెట్లు డబ్బులిచ్చినా నాకు అవసరం లేదు. నాకు కావలసినదంతా నీ ప్రాణమే. ఏదో ఒక
రోజు ‘మృత్యుదూత’ మూలికకు చిక్కి
రక్తం చెమట చిందించాల్సిందే...స్పేషల్ కోర్టు జడ్జ్ జస్టీస్ జవహర్ ఇప్పుడు
ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో అనాధలాగా పడుకోనున్నాడు.
పారిశ్రామకవేత్త సత్యమూర్తి ని ‘అడ్మిట్’ చేసుకుని డాక్టర్.
గోపీనాద్ ఆయన్ను బ్రతికించటానికి
ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన కాపాడలేడు. తెల్లవారు జామున ఆరుగంటలకల్లా సత్యమూర్తి
కూడా శవాల గిడ్డింగికి వెళ్ళిపోతారు. నీకు ఒక తారీఖును ఖరారు చేసేస్తే, నా పని ఒక ముగింపుకు
వస్తుంది.”
“నా
బలం ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావు”
“నీ
బలం ఏమిటో నాకు మాత్రమే కాదు...తెలుగు వారందరికీ తెలుసే! ఇద్దరు మంత్రులకు నువ్వే
కదా సెకండ్ సెటప్. చాలా ఫైళ్ళు నీ చూపుల్లో పడిన తరువాతే కదా వెడతాయి”
“ఏయ్!”
“చూశావా...కోపం
వస్తోంది. ఈ కోపమే నాకు బలం. ఓకే రంజని...చాలా లేటయ్యింది...వెళ్ళి పడుకో. ఇది
తాత్కలిక నిద్రే. నువ్వు పర్మనెంటుగా నిద్రపోవటానికి, త్వరలోనే ఏర్పాటు
చేస్తాను. గుడ్ నైట్”
అవతలసైడు నవ్వుకుంటూ చటుక్కున రిజీవర్
పెట్టేసిన తరువాత -- రంజనికి చెమటలు నీరులాగా కారింది.
*******************************
మరుసటి రోజు ప్రొద్దున ఏడు గంటలు.
‘వాకింగ్’ వెళ్ళొచ్చి తన ఇంటి
ముందున్న గడ్డి నేల మీద కూర్చుని టీ తాగుతూ,
న్యూస్
పేపర్ తిరగేస్తూ ఉన్న దశరథమూర్తి గారికి,
కాంపౌండ్
గేటు దగ్గరకు వచ్చి నిలబడ్డ కారును చూసిన వెంటనే లేచి నిలబడ్డారు.
జీపులో నుండి దిగిన కమీషనర్ సర్వానంద్ ‘జాగింగ్’ దుస్తులలో ఉన్నారు. “గుడ్ మార్నింగ్
మిస్టర్ దశరథమూర్తి”
“గుడ్
మార్నింగ్ కమీషనర్...ఏమిటి...వాకింగ్ వెళ్ళి వస్తున్నారా...లేక ఇకమీదటే
వెళ్లబోతారా?”
“అరగంట
‘వాకింగ్’, అరగంట ‘జాగింగ్’. రెండూ పూర్తి
అయినై. ఇంటికి వెళ్ళే దోవలో రెండు మంచి వార్తలు మీ దగ్గర చెప్పి వెల్దామని కారు
ఆపాను”
దశరథమూర్తి గారి ముఖం
వికసించింది.
“ప్రొద్దున్నే
రెండు మంచి వార్తలా? చెప్పండి...చెప్పండి!” తాగుతున్న టీ
కప్పును అలాగే కిందపెట్టేసారు దశరథమూర్తి గారు.
కమీషనర్ గడ్డి నేల మీద నడుచుకుంటూ అక్కడున్న
బుట్ట కుర్చీలో కూర్చుంటూ చెప్పేరు.
“మొదటి
మంచి వార్త! ఐ.సి యూనిట్ లో అడ్మిట్ అయ్యి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సత్యమూర్తి ప్రాణంతో బయట పడ్డారు”
“నిజంగానా?”
“ఎస్...రక్తాన్ని
మూడుసార్లు మార్చటం వలన శరీరంలో ఉన్న విషం అంతా తగ్గిపోయి, మెల్లగా స్పృహలోకి
వచ్చారు. సాయంత్రం లోపల లేచి కూర్చుంటారు అని డాక్టర్ చెప్పారు”
“వెరీ
గుడ్...వినటానికే సంతోషంగా ఉంది
కమీషనర్”
“రెండో
వార్తను వింటే ఇంకా పొంగిపోతారు. మీ దగ్గర మూలికలను దొంగతనం చేసిన ఐదు గురిలో ఒకడు
దొరికాడు. చెన్నై దగ్గరున్న ఆ ఊర్లోనే అనుమానంతో ఒక ఇంటి మీద దాడి చేసినప్పుడు
దొరికిపోయాడు.
విచారణలో ఒక్కొక్క పోలీసు అధికారి
అడిగినప్పుడు ఒక్కొక్క పేరు చెప్పాడు. వాడిని,
వాడి
వస్తువులనూ పరిశోధన చేసినప్పుడు మూలిక పొదిగి ఉన్న ఉంగరం ఒకటి దొరికింది. అది
పెట్టుకుని ఆలొచించి నప్పుడు శ్రీలతతో వచ్చిన నలుగురు యువకులలో ఒకడై ఉంటాడని
మనసులో సందేహం. మీరు వచ్చి చూసి వాడిని గుర్తుపడితే మంచిది”
“ఆ
యువకుడిని తమిళనాడు నుండి తీసుకు వచ్చారా?”
“నిన్న
రాత్రే తీసుకు వచ్చాము. పోలీస్ స్టేషన్ లాక్ అప్ లో ఉంచాము. మీరు శ్రమ అనుకోకుండా
ఒకసారి వచ్చి ఆ యువకుడ్ని చూస్తే మంచింది...ఆ నలుగురినీ మీకు బాగా గుర్తుంది కదా?”
“గుర్తుందా
అని అడుగుతారేమిటి...ఆ శ్రీలతని, ఆ
నలుగురు వెధవల్ని,నా
మనసు లోపలా, నా
అసిస్టంట్ పల్లవి యొక్క మనసులోపలా ఫోటోలాగా ప్రింట్ అయిపోయారు. చూసిన వెంటనే
చెప్పేస్తాము”
“అలాగైతే
పల్లవిని తీసుకుని ‘టూ
టౌన్’ పోలీస్ స్టేషన్ కు
వచ్చేయండి. పది గంటల సమయంలో వచ్చేస్తారా?
నేను
మీకొసం అక్కడ కాచుకోనుంటాను”
“పది
గంటలకు వస్తే చాలా కమీషనర్ సార్?”
“చాలు...మనిషిని
గుర్తించి చెబితే చాలు. మీరు వచ్చేయచ్చు. నిజాలన్నిటినీ కక్కించ వలసింది మా
డ్యూటీ. నిన్న రాత్రి ఆ శ్రీలత, హోటల్లో
స్టే చేస్తున్న రంజనికి ఫోన్ చేసింది. ‘నువ్వు
ఎంత ఎత్తులో కూర్చోనున్నా నా దగ్గర నుండి తప్పించుకోలేవు. రక్తం చెమటలు చిందించే
కావాలీ అని చెప్పిందట.
మధ్య రాత్రి రాజకీయ నాయకుల దగ్గర నుండి
నాకు ఫోన్లు. వెళ్ళి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసొచ్చాను. ఏం చేయను...కాకీ డ్రస్సు
తొడుక్కుంటే కొన్ని సమయాలలో గూర్కా కంటే ఎక్కువగా పనిచేయాలి. ఎలాగో శ్రీలతని, ఆ నలుగురు యువకులనూ
ఖైదు చేసి లోపల పడేస్తే ఈ కేసుకు ఒక గుడ్బై చెప్పేయచ్చు….అయితే పల్లవిని
తీసుకుని పది గంటల కల్లా స్టేషన్ కు వచ్చేస్తారుగా?”
“వచ్చేస్తాను”
**********************************************PART-12******************************************
టూ టౌన్ పోలీస్ స్టేషన్.
దశరథమూర్తి గారు స్టేషన్ దగ్గరగా
కారాపేసి, పల్లవితో కారు
దిగినప్పుడు సరిగ్గా సమయం పది గంటలు. కమీషనర్ సర్వానంద్, డెప్యూటీ కమీషనర్ దీపక్
శర్మ లోపల కూర్చుని ఒక ఫైలును తిరగేస్తూ మాట్లాడుకుంటున్నారు. వీళ్లను చూసిన
వెంటనే లేచారు.
“రండి
మిస్టర్ దశరథమూర్తి! సరిగ్గా చెప్పిన టైముకు వచ్చాసేరే”
“ఎప్పుడూ
టైమును వేస్టు చేయకుండా కరెక్టుగా ఉండాలని డిసిప్లేన్ పెట్టుకున్నాను”
“మంచిది!
రండి లాకప్ కు వెళ్ళి ఆ యువకుడ్ని చూసేద్దాం. ఈ రోజు మీరు చెప్పబోయే సమాధానాన్ని
ఫాలో అయ్యి మా విచారణ మొదలు పెట్టాలి”
స్టేషన్ లోపల వెనుకవైపున ఉన్న ఒక లాకప్
వైపుకు నడిచారు. పాత గది ఒకటి లాకప్ గా మార్చబడుంది. లావాంటి ఇనుపగేటు ఒకటి తాలం
వేసుంది. సెంట్రీకీ నిలబడున్న కాపలా కానిస్టేబుల్ తాళం తెరిచాడు. లోపలకు వెళ్లారు.
ఎత్తైన గోడకున్న కిటికిలో నుండి సూర్య కిరణాలు,
గదిని
వెలుతురుతో నింపింది.
లోపల సిమెంటు బెంచ్ మీద యువకుడు ఒకడు
అండర్ వేర్ మాత్రం వేసుకున్న శరీరంతో పడుకోనున్నాడు. నోటి దగ్గర, ముక్కు దగ్గర
నెత్తురు గడ్డ కట్టుంది. పోలీసు లాఠీలు కొంచం హద్దు మీరి అతని మీద ఆడుకోవటం వలన
రక్తం గడ్డకట్టి, గీతలు
గీతలుగా తెలుస్తున్నది. కళ్ళు మూసుకోనున్నాడు.
నలుగురూ అతని చుట్టూ నిలబడ్డారు. “మిస్టర్ దశరథమూర్తి...పోలీస్
దెబ్బలతో నొప్పి భరించలేక మత్తుగా పడుకోనున్న ఈ యువకుడ్ని చూడండి. మూలికలను
దొంగలించుకు పోవటానికి
వచ్చిన ఆ నలుగురి యువకులలో వీడూ ఒకడేనా చూడండి”
దశరథమూర్తి గారు వంగుని అతని
మొహం చూసాడు. నాలుగు వైపుల నుండి బాగా లోతుగా చూశాడు. ఒక్క నిమిషం తరువాత తల
ఎత్తారు.
“ఎస్...ఆ రోజు వచ్చిన
ఆ నలుగురు యువకులలో ఇతనూ ఒకడు. కానీ వీడి పేరేమిటో నాకు జ్ఞాపకం లేదు”
“పల్లవీ...మీరూ
చూడండి”
పల్లవి కూడా వంగుని నాలుగు విధాలుగా
అతని ముఖం చూసింది. “అనుమానమే
లేదు సార్. మూలికలను ఎత్తుకు వెళ్ళటానికి వచ్చిన ఆ నలుగురి యువకులలో వీడూ ఒకడు”
“ఖచ్చితంగా?”
“వందకు
వంద శాతం సార్. ఆ మొహాలను మేము ఎన్నటికీ మరిచిపోలేము”
“ఇది
చాలు మాకు! ఇక మీదట అతని నోటి వెంట నిజాలను ఎలా రాబట్టాలో అలా రాబడతాము. రండి...ముందు
గదికి వెళదాం”
స్టేషన్ లోని ముందు గదికి వెళ్లారు.
అక్కడున్న చెక్క కుర్చీలో కూర్చున్నారు.
ఒక కానిస్టేబుల్ కాఫీ గ్లాసులతో
వచ్చాడు. అందరికీ కాఫీ ఇచ్చాడు. అందరూ తీసుకున్న తరువాత ఒకే ఒక గ్లాసు కాఫీ మాత్రం
ట్రే లో ఉండిపోయింది--కమీషనర్ ఆ కానిస్టేబుల్ దగ్గర చెప్పారు.
“ఆ
కాఫీని ఇక్కడ పెట్టేసి వెళ్ళి దేవానంద్ ను పిలుచుకురా”
కానిస్టేబుల్ తల ఊపి వెళ్ళి ‘లాకప్’ లోకి వెళ్ళి సిమెంటు
బెంచి మీద పడుకోనున్న అతన్ని లేపి తీసుకు వచ్చాడు.
కమీషనర్ స్వాగతం పలికాడు “రండి దేవానంద్...ప్లీజ్
కూర్చోండి”.
అని చెప్పి తన పక్కనున్న కుర్చీ చూపించగా,
అతను
కూర్చున్నాడు. కాఫీ గ్లాసును చేతిలోకి తీసుకున్నాడు.
దశరథమూర్తి గారు, పల్లవి ఇద్దరూ ఆశ్చర్యంతో
కమీషనర్ ను చూసారు.
“ఏమిటిసార్
ఇది? ఒక నేరస్తుడ్ని పక్కన
కూర్చో బెట్టుకుని, కాఫీ
ఇచ్చారు?”
కమీషనర్ సర్వానంద్ నవ్వారు.
“ఈయన
నేరస్తుడు కాదు మిస్టర్ దశరథమూర్తి. ఈయన పేరు దేవానంద్. సి.బి.సి.ఐ.డి. అధికారి.
ఆయన్ను లాకప్ లో నేరస్తుడిగా నటించమని చెప్పింది మేమే. ఆ పెదాలు చిట్లటం, రక్తం కారడం అంతా ‘మేకప్’.
దశరథమూర్తి, పల్లవి….ఇద్దరి ముఖాలూ మాడిపోయినై.
కమీషనర్ నవ్వారు.
“ఇప్పుడు
చెప్పండి దశరథమూర్తి. ఆ రోజు మూలికలను దొంగతనం చేయడానికి వచ్చిన నలుగురు యువకులలొ
ఈయన ఉన్నాడా?”
“...........”
“మీ
ఇద్దరికీ మాత్రమే ఆ నలుగురి యువకుల మొహాలు ముద్రించినట్టు మీ మనసులో పదిలమైందని
చెప్పేరే! ఆ నలుగురిలో దేవానంద్ ఉన్నాడా?”
“...............”
“ఖచ్చితంగా
ఉండి ఉండరు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఒక ట్రైనింగ్ కోసం చంఢీగర్ వెళ్లారు--రెండు
రోజుల ముందే వచ్చారు.
“....................”
“కాబట్టి
మీరు అబద్దం చెప్పారు. ఎందుకు అబద్దం చెప్పారు?”
“మేము
అబద్దం చెప్పలేదు సార్...మోహాలు ఒకేలాగా ఉన్నందువలన...”
“ఇలాంటి
ఒక సమాధానం చెబుతారనే మేము ఒక ఏర్పటు చేసి ఉంచాము. మిస్టర్ దీపక్ శర్మా...అది తీసి
ఆపరేట్ చెయ్యండి”
డెప్యూటీ కమీషనర్ దీపక్ శర్మ --
పక్కనున్న టేబుల్ డ్రా తెరిచి అందులో నుండి ‘వాయిస్
మైల్ రికార్డు బాక్స్’
తీసి పైన పెట్టారు.
కమీషనర్ చెప్పాడు. “మిస్టర్ దశరథమూర్తి ఈ
రోజు ప్రొద్దున సుమారుగా ఏడుంబావ్ ప్రాంతంలో -- అంటే నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళిన
తరువాత--మీరు పల్లవికి ఫోన్ చేసారు. అలా మీరు మాట్లాడిన మీ సంభాషణను రికార్డు చేసి
ఇమ్మని చెప్పి మీరు వాడుతున్న 'సెల్
ఫోన్’ కంపెనీ దగ్గర చెప్పుంచాను.
వాళ్ళూ రికార్డు చేసి ఉంచారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇంకొకసారి రికార్డు వేసి
విని తెలుసుకుందామా?...మిస్టర్
దీపక్ శర్మా మళ్ళీ ఆపరేట చెయ్యండి”
ఆయన దాన్ని ఆన్ చేసాడు.
దశరథమూర్తి స్వరమూ, పల్లవి స్వరమూ
క్లియర్ గా వినబడింది.
“పల్లవీ...”
“చెప్పండి
సార్”
“ఏం
చేస్తున్నావు?”
“రాత్రి
లేటుగా పడుకోవటం వలన, ఇప్పుడే
నిద్ర లేచాను. స్నానం చేయడానికి వెడుతున్నాను”
“సరే...పది
గంటల కంతా నువ్వు, నేనూ
పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి”
“ఎందుకు?”
“పది
నిమిషాల ముందు పోలీస్ కమీషనర్ సర్వానంద్ ఇక్కడికి వచ్చారు. తమిళనాడు బార్డర్
అరక్కోణం దగ్గరున్న ఒక గ్రామంలో మూలికల దొంగతనం విషయంలో ఒకడ్ని పట్టుకున్నారట. టూ
టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి ఉంచారట. వాడు ఏదో మూలిక ఉంగరం ధరించి
ఉన్నాడట. అందువల్ల పోలీసులకు వాడి మీద
అనుమానం”
“అయ్యో
పాపం!”
“పాపంగానే
ఉన్నది...ఏం చేయగలం? కానీ, ఇది మనకి దొరికిన
మంచి సందర్భం. పది గంటలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి --- పోలీసులు ఎవరిని
చూపించినా సరే, మూలికలను దోపిడి
చేయటానికి వచ్చిన ఆ నలుగురి యువకులలో వీడూ ఒకడు అని చెప్పేసి వచ్చేద్దం”
“అందువలన
మనకేమిటి సార్ లాభం?”
“ఏమిటి
పల్లవీ...ఏమీ తెలియనట్లు అడుగుతున్నావు?
మూడు
నెలలకు ముందు మూలికలను ఎత్తుకు పోవటానికి శ్రీలతా అనే అమ్మాయి, నలుగురు యువకులూ
వచ్చారు. మనల్ని బంధించి, బెదిరించి
మూలికలను దోపిడీ చేసుకుని వెళ్ళే సమయానికి,
అలమారులో
నేను దాచి ఉంచిన తుపాకీతో నలుగురినీ కాల్చి చంపేను.
ఆ తరువాత ఆ నలుగురి శవాలనూ బయటకు తీసుకు
వెళ్ళి -- మనుష్యులు సంచారమే లేని ముళ్ళపొదల మధ్య గొయ్యి తవ్వి పాతేసి వచ్చాము.
వాళ్ళ వ్యానును కూడా ఒక కొండపై నుండి అద:పాతాలానికి తొసేసేమే. ప్రభుత్వానికి
సొంతమైన కోట్లకొలది విలువ కలిగిన మూలికలను డబ్బు చేసుకుందామని వాటిని ఇప్పుడు మనం
తీసుకున్నామే, గుర్తులేదా?”
“గుర్తుంది...కానీ, దానికీ, దీనికీ లింక్ ఏమిటి?”
“ఈ
నిజాలన్నీ బయటకు రాకుండా ఉండాలంటే శ్రీలత నూ,
ఆ
నలుగురు యువకలనూ, ప్రాణాలతోనే
బ్రతికున్నారని 'బిల్డ్-అప్' చెయ్యాల్సిన
అవసరముంది. చేశాము. ఇది కాకుండా శ్రీలత పేరు ఉపయోగించి రంజనీని, జస్టీస్ జవహర్ నూ, కోటీశ్వరడు
సత్యమూర్తిని ‘మృత్యుదూత’ మూలిక ద్వారా హత్య
చేయటానికి ప్లాను వేశేమే. దానికొసం ఆ హత్యలకు,
వారిని
హత్య చేయమని అడిగినావారి దగ్గర నుండి పెద్ద మొత్తం లో
డబ్బు తీసుకున్నామే. మీ తమ్ముడు దిలీపుకు భాగం ఇచ్చాం. ఇక మీదట మనం ప్రొఫషనల్ గా
ఎవరినీ హత్య చేయకూడదనీ, ఉన్న
డబ్బు పెట్టుకుని సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నామే.
దానికి తగిన రీతిగా ఇప్పుడొక సందర్భం
వచ్చింది. మూలిక ఉంగరం వేసుకున్న ఒకడెవడో పోలీసుల దగ్గర బాగా చిక్కు కున్నాడు. శ్రీలతతో
పాటు వచ్చిన ఆ నలుగురి యువకులనూ నువ్వూ,
నేనూ
తప్ప వేరే ఎవరూ చూసింది లేదు. అందువలన పోలీసులు చూపించిన యువకుడు ఎవరైనా సరే, శ్రీలతతో వచ్చిన
యువకుడే నని చెప్పేస్తే పోలీసు చూపులు పూర్తిగా వాడి వైపుకు వెళ్ళిపోతాయి. మనకి
బద్రత అయిపోతుంది”
“దీని
వలన మనకి ఏలాటి సమస్యా రాదుగా సార్?”
“ఒక్క
సమస్య కూడా రాదు”
రంజనీనూ, సత్యమూర్తీనూ ‘మృత్యుదూత’ మూలిక దగ్గర నుండి
తప్పించుకున్నారు కదా...మళ్ళీ ప్రయత్నించాలా,
అక్కర్లేదా?”
“వద్దు!
హత్య చేయమన్న పార్టీ దగ్గర డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం. మనకు ఇక మిగిలిన మూలికలు
చాలు. వాటికి మంచి ధర వచ్చినప్పుడు ఒక్కొక్కదాన్ని అమ్మ్మేద్దాం”
“అయితే
ఇక రంజనీకీ శ్రీలతలాగా నేను ఫోను చేయక్కర్లేదా?”
“అక్కర్లేదు...అన్ని
నేరాలకూ, నేరాలు చేయటానికీ
టాటా చెప్పేసి హాయిగా ఉందాం. పోలీసులు శ్రీలతని వెతకనీ. మనం వాళ్లను వేడుకగా
చూద్దాం. నువ్వు తొమ్మిదిన్నరకు తయారుగా ఉండు....కారులో వస్తాను. టూ టౌన్ పోలీస్
స్టేషన్ కు వెళ్ళి వచ్చేద్దాం”
“సరే
సార్”
మాటలు ఆగినై. ‘వాయిస్ మైల్
రికార్డర్ బాక్స్’
మౌనం వహించింది.
దశరథమూర్తి, పల్లవి షాకైయ్యి మొహం
వాడిపోయి నిలబడగా -- పోలీస్ కమీషనర్ సర్వానంద్,
సన్నటి
స్వరంతో చెప్పారు.
“దశరథమూర్తి!
నాకు మీ మీదా , పల్లవి
మీదా చిన్నగా ఒక అనుమానం వచ్చింది. అనుమానానికి మొదటి
కారణం: శ్రీలత, నలుగురు
యువకులూ కోట్ల కొద్ది విలువ కలిగిన మూలికలను దోపిడీ చేసుకుని వెళ్లారు. కానీ, మీ ప్రాణానికీ
ఎటువంటి హానీ జరగలేదు. జెనెరల్ గా ఒక పెద్ద దోపిడీ చేసే వాళ్ళు, తరువాత సమస్య
వస్తుందనే కారణంతో ఎవరినీ సింపుల్ గా ప్రాణాలతో విడిచిపెట్టరు.
నా రెండో అనుమానం: మీ గ్యాలరీలో ఉన్న
మూలికలలో సగ భాగం ప్రభుత్వానికి, అంటే
పురావస్తు శాఖ కు సొంతమైనవి. కాబట్టి ఈ మూలికలను మీరే ఎందుకు అపహరించి ఉండకూడదు
అనే కోణం లో నుంచి ఆలొచించి చూశాను.
మీరు
నిజంగానే నేరస్తులా, కాదా
అని తెలుసుకోవటం కొసమే సి.బి.సి.ఐ.డి. పోలీసు అధికారిని పెట్టుకుని మీకు పరీక్ష
పెట్టాను.
ఆ పరీక్షలో మీరు ఫైలు-- మేము పాస్
మేము అంటే చట్టం, న్యాయం అని అర్ధం
అదిగో మీకు తోడుగా దిలీప్ వస్తున్నాడు”
************************************************సమాప్తం*****************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి