చీటింగ్ పోలీస్...(పూర్తి నవల)


                                                                                               చీటింగ్ పోలీస్                                                                                                                                                                                           (పూర్తి నవల)  

హైదరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరం లో ఉన్న పారిశ్రామిక ఎస్టేట్ లో ఎనిమిదంతస్తుల ఎత్తుతో  ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడ్డ మందుల తయారీ కంపెనీ "ఫార్మా రెమిడీస్" రంగు రంగు అలంకరణ దీపాల వెలుగులో కొత్త పెళ్ళి కూతురులా నిలబడుంది.

నాణ్యత కలిగిన మందుల కోసం మనదేశం వీదేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండకూడదని, పలు రాజకీయ నాయకులు, పలు పెట్టుబడిదార్లు ఒకటిగా కలిసి ఆలొచించిన ప్రయత్నమే ఫార్మా రెమిడీస్కంపెనీ.

దీని మూలంగా మనదేశంలో మందుల దిగుమతి పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా, మనదేశం నుండి ఇతర దేశాలకు మందులను ఎగుమతి చేసుకునే విధంగా అత్యధిక ఉత్పత్తి కలిగిన పారిశ్రామిక కంపెనీగా ఉండాలని నిర్మించేరు ఫార్మా రెమిడీస్ని.

కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడ్డ మందుల కంపెనీ మందుల ఉత్పత్తిలో విప్లవం తీసుకురాబోతోందని ప్రపంచంలోని ఫార్మా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చేతులతో ప్రారంభించబడి, మందుల తయారును మొదలపెట్టటానికి రెడీగా ఉన్నది ఫార్మా రెమిడీస్ కంపెనీ. 

సమయం మధ్యరాత్రి రెండు గంటలు కావడంతో ఎప్పుడూ జన సంచారంతో కుతూహలంగా కనబడే పారిశ్రామిక ఎస్టేట్ ప్రదేశం పూర్తి నిశ్శబ్ధంతో నిద్ర పోతున్నట్టు ఉన్నది.

నిశ్శబ్ధానికి బంగం కలుగకుండా, పిల్లి నడకలాగా ఒక మోటర్ సైకిల్ వచ్చి ఆగింది.

ఫార్మా రెమిడీస్ కంపెనీ గేటు ముందు వైపు నలుగురు సెక్యూరిటీ గార్డులు నిలబడున్నారు. వాళ్ళను ఇస్టపడని  మోటార్ సైకిల్, ఫార్మా రెమిడీస్ కంపెనీ వెనుకభాగం వైపుకు వెళ్ళింది. అక్కడ కూడా నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అప్పుడు మోటార్ సైకిల్ ఫార్మా రెమిడీస్ పక్కన ఉన్న పాత రసాయన ఉత్పత్తుల కంపెనీలోకి వెళ్ళి ఒక పక్కగా ఆగింది.  

ప్రమోద్ అనే పేరు కలిగిన అతను ,ఇరవైఏడు సంవత్సరాల వయసులో ఉన్నాడు. సిక్స్ ప్యాక్ శరీరం. కెమికల్ టెక్నాలజీ చదువులో గోల్డ్ మెడల్ పొందినవాడు. కంప్యూటర్ ఆపరేటింగ్ లో ఆరితేరినవాడు. మిడిల్ క్లాస్ ఫ్యామలీకి చెందినవాడు. చాలా మంది లాగానే ఇతను కూడా ఐదు అంకెల జీతం మీద ఆశపడ్డవాడు.

దానికోసం కంపెనీల మెట్లను ఎక్కి దిగిన అలసట అతని కళ్ళల్లో తెలుస్తోంది. ఉద్యోగం లేదనే ఒకే ఒక కారణం కోసం తల్లితండ్రులే అతన్ని వేరు చేసి చూడటంతో...ఎకాకిగా హైదరాబాదుకు మకాం మార్చుకున్నాడు. ఇంతవరకు ఫైలైన ఇంటర్ వ్యూ లను లెక్క కడితే సెంచరీ కొట్టుంటాడు. ఉద్యోగం దొరకలేదు.  దానివలననో ఏమో  అతనికి  ప్రభుత్వం మీద విరక్తి.

అతనిలోని బలహీనతను ఆసరాగా తీసుకుని  ఒక కంపెనీ, జీతంగా అతిపెద్ద మొత్తం-విదేశాలలొ పని రెండింటినీ ఎరగా పెట్టి వల విసరగా...ఖచ్చితంగా వచ్చి వాళ్ళ వలలో చిక్కుకున్నాడు అతను.

చుట్టుపక్కల చూశాడు. అతను అనుకున్నట్లుగానే రసాయన కంపెనీలోని ఒక వైపు నుండి, ఫార్మా రెమిడీస్ కంపనీలోకి వెళ్ళటానికి ఒక చిన్న మార్గం ఉన్నది.

రసాయన కంపెనీలో నుండి వెలువడ్డ వేస్ట్ ద్రవం, బయటకు వెళ్ళే కాలువాలో నుండి ప్రవహిస్తూ, చెడు వాసనతో వాయువును కక్కుతోంది. అంతకు ముందురాత్రి వర్షం పడిందేమో, అక్కడున్న వర్షపు నీరు కూడా జిడ్డుగా, చెడువాసతో నిండుకోనుంది.

బూట్స్ కు అంటుకున్న మట్టిని తుడుచుకుని, మెల్లగా నడుచుకుంటూ ఫార్మా రెమిడీస్ ప్రహరీ గోడను చేరుకున్నాడు.

అతని భుజాల ఎత్తు వరకే కట్టబడున్న ప్రహరీ గోడ అతనికి పెద్దగా ఆటంకం కలిగించలేదు. ఒక్క జంపుతో ఎగిరిదూకాడు.

మెల్లగా ఫార్మా రెమిడీస్ భవనం దగ్గరకు చేరుకుని భవనం వెనకకు వెళ్ళాడు. వెనుకవైపు మూడు షట్టర్స్ ఉన్నాయి. రెండు పెద్దవి. ఒకటి చిన్నది. చిన్న షట్టర్ కు ఒక పెద్ద తాళం వేసుంది. తన దగ్గరున్న రకరకాల తాళంచెవులలో ఒకటి సరిపోయింది. షట్టర్ తెరుచుకుని లోపలకు వెళ్ళాడు.

లోపలకు వెళ్ళిన అతను...ఒక కంప్యూటర్ను వెతికి గుర్తించి, దానికి శస్త్ర చికిత్స చేశాడు. కంప్యూటర్ లోపల భాగాలను తీశేసి, తాను తీసుకు వచ్చిన డైనమైట్ బాంబును లోపల ఉంచి, టైమర్ను ఆన్ చేసి టైము సెట్ చేశాడు. తాను లోపలకు వచ్చిన ఆనవాలు లేకుండా చూసుకుని, ఎవరి కంటికీ కనబడకుండా బయటకు వచ్చి మోటర్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు. అరగంట తరువాత మనుష్యుల సంచారమే లేని ఒక ప్రదేశంలో ఆగాడు.

తన మోటర్ సైకిల్లో దాచిన 'వయర్ లెస్ఫోన్ తీసి ఆన్ చేశాడు. అది 'బీప్ బీప్' అంటూ శబ్ధం చేసిన తరువాత అవతల పక్క వాళ్ళతో కనక్షన్ దొరికింది.

".........................."

".........................."

ఇరువైపులా కొద్ది క్షణాల మౌనం. తరువాత వాళ్ళు హిందీలో మాట్లాడుకున్నది ఇక్కడ తెలుగులో.

"ప్రమోద్.....వెళ్ళిన పని అయ్యిందా?"

"మీరు చెప్పినట్టే బాంబును అమర్చి, టైమర్ను కూడా ఆన్ చేశేసాను. రేపు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండింటికి బాంబు పేలుతుంది"

"శబాష్....మా సంస్థకు మీలాటి తెలివిగలవారే కావాలి"

"నాకోక సందేహం. నేను తయారుచేసిన డైనమైట్ బాంబులో మందు గుండు అంత ఎక్కువగా లేదు. అంత చిన్న డైనమైట్ ఎలా అంత పెద్ద భవనాన్ని నేలమట్టం చేస్తుంది? దానికి కావలసిన శక్తి బాంబుకు ఉన్నదా?"

అది డైనమైట్ అని నీకు చెప్పింది ఎవరు ...?" …..అవతల పక్క పెద్ద నవ్వు.

"భారత ప్రభుత్వం కళ్ళల్లో మట్టి చిమ్మి రహస్యంగా తీసుకు వచ్చిన బాంబు అతి శక్తివంతమైనది. మధ్య కనిపెట్టిన కొత్త రసాయన మిశ్రమం. బాంబు వంద డైనమట్లతో సమానం.

అది పేలేటప్పుడు దరిదాపుగా ఒక కిలోమీటర్ రేడియస్ దూరానికి నష్టం ఏర్పరుస్తుంది. పరిధిలో ఉన్న భవనాలు నేలకొరిగిపోతాయి. ఇక ప్రాణ నష్టం సంగతి చెప్పక్కర్లేదు. దురదృష్టవంతులు పైసా ఖర్చు లేకుండా పైలోకానికి పంపబడతారు"

"అదిసరే...ఇంతకు ముందు నాకు సగం డబ్బు ఇచ్చారు...మిగిలిన డబ్బులు, విదేశీ ఉద్యోగం నాకు ఎప్పుడు దొరుకుతుంది?" అడిగాడు ప్రమోద్.

బాంబు పేలిన మరుసటి రోజు మిగిలిన డబ్బులు నీ అకౌంటులో పడుతుంది. సింగపూర్ వెళ్ళటానికి రేపటికి టికెట్టు బుక్ చేశాము. అక్కడకెళ్ళి, నేను చెప్పే మనిషిని కలిస్తే...మిగిలిన విషయాలు ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎదురు చూసిన ఉద్యోగం అక్కడ నీకోసం కాచుకోనుంది."

"ధాంక్యూ! మీ వలన నా కల నిజం కాబోతోంది"

వయర్ లెస్ కనక్షన్ కట్ చేశారు. అది డెడ్ మోడ్ కి వచ్చేసింది.

"శభాష్...సులువుగా వచ్చి చిక్కుకున్నావు! నిన్ను పెట్టుకుని దేశానికి నేర్పించాల్సిన పాఠం చాలా ఉంది. అంతవరకు నువ్వు మా గారాల బిడ్డవు. అన్నీ పూర్తి అయిన తరువాత నీ ప్రాణాన్ని మా సంస్థకు సమర్పనం చేస్తాను."

మరకలు పడిన తన ముప్పై రెండు పల్లూ కనబడేటట్టు నవ్వాడు. 'భారతం మా బానిస ' అనే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థకు చెందిన భారతదేశ ఇన్ చార్జ్.

వాళ్ళు వేసిన ప్లాన్ విజయవంత అయ్యిందనే సంతోషంలో నిద్రలోకి జారుకున్నాడు. 

అందరూ నిద్రలో ఉన్నప్పుడు, బాంబు మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు తీయటానికి రక్త దాహంతో , ఎర్రటి కళ్ళు మెరుస్తున్నట్టు బాంబులోని గడియారం టిక్ టిక్ మని ఆడుతోంది.

                                  ****************************************************************   

                                                                                                    PART-2

డి.జి.పి సురేందర్ ఆదేశానికి అనుగునంగా ఐదుగురు పోలీస్ అధికారులు ప్రొద్దున ఆరుగంటలకల్లా ఆయన రూములో హాజారై ఉన్నారు.

ఆయన టేబుల్ ఎదురుగా కుడి చేతివైపున్న రెండు కుర్చీలలో ఇన్స్ పెక్టర్ గణపతి మరియు ఇన్స్ పెక్టర్ అర్జున్. వీళ్ళిద్దరూ డి.జి.పి కి కుడి భుజాలని చెప్పొచ్చు. పోలీసు అధికారులు తీసుకునే లంచాలు, రాజకీయ నాయకులు-గూండాలు చేయబోతున్న పనులు డి.జి.పి చెవికి తీసుకు వెళ్ళటమే వీరిద్దరి ముఖ్య పని.

మధ్యలో అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్. చాలా మంది రౌడీలకు బుల్లెట్లను బహుమతిగా ఇచ్చిన దానకర్ణుడు. అవును...ఎన్ కౌంటర్ స్పేషలిస్ట్. నేరస్తులంటే అసలు గిట్టదు. స్పేషల్ పోలీస్ టీమ్ లో డి.జి.పి తరువాత అధికార పూర్వమైన ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాలు తీసుకునే పవర్ కలిగిన ఆఫీసర్.

ఎడం పక్కన ఉన్న మొదటి కుర్చీలో కూర్చున్న సబ్ ఇన్స్ పెక్టర్ మూర్తి, నగరంలో జరిగే ముఖ్య బహిరంగ శభలు, రోడ్డు రోకోలు లాంటి పోరాటాలను మేనేజ్ చేయటంలో స్పేషలిస్ట్.

ఎడం పక్కన ఉన్న రెండో కుర్చీలో లేడీ ఇన్స్ పెక్టర్ సుధా. మధ్య సిటీలో జరిగిన కఠినమైన దొంగతనాలను చాకచక్యంతో కనిపెట్టిన కారణంగా ఆమెకు ప్రమోషన్ ఇవ్వటంతో ఆమెకు స్పేషల్ గ్రూపులో చోటు దొరికింది.      

ఐదు గురిని డి.జి.పి తన బలం అనుకుంటాడు.

డి.జి.పిలో ఎప్పుడూ కనబడే ఉత్సాహం రోజు కనబడలేదు. ఏదో చిక్కుముడి విప్పాల్సిన సమస్యలాగా ఉన్నదని అక్కడున్న అందరూ అనుకున్నారు.

తన జేబులో నుంచి ఒక క్యాసెట్ ను తీసి టెప్ రికార్డర్లో ఉంచాడు డి.జి.పి....అది మాట్లాడడం మొదలు పెట్టింది.

.పి.సి. 507 ఎం.ఎస్. సంస్థ...రేపు రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాదులో”...అంటూ ఒక గొంతు పలికిన తరువాత ఢాం అని తుపాకీ శబ్ధం వినిపించింది. తరువాత కొద్ది క్షణాల నిశ్శబ్ధం...కొంచం సేపు మౌనం తరువాత మళ్ళీ అదే  గొంతు వినబడింది.

"ఏమిటీ...తుపాకీ శబ్ధం వినబడిందా? ఏమీలేదు, మీ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒకడ్ని కాల్చేశాం. ఇకపోతే అసలు విషయానికి వస్తాను. రేపు రాత్రి హైదరాబాదులో ఒక బాంబు పేలబోతోంది. మీవల్ల కుదిరితే ఆపుకోండి. ఇప్పుడు మా చేత చంపబడిన పోలీసోడి శవం, ప్రొద్దున మూసీ కాలువలో తేలుతుంది. తీసుకువెళ్ళి చేయవలసిన మర్యాదలు చేసుకోండి"...క్యాసెట్ లోని గొంతు ఆగిపోయింది.

డి.జి.పి మొదలుపెట్టాడు.

 “ టెర్రరిస్ట్ సంస్థ గురించి అందరూ వినే ఉంటారు 'భారతదేశం మా బానిసఅనేదే సంస్థ నినాదం. ఇంతవరకు పలు చోట్ల జరిగిన బాంబు పేలుల్లలో వీరి హస్తం ఉన్నది.

భారతదేశం, మానవ శక్తిలో అతిపెద్ద దేశంగా ఉంటోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆర్ధీకంగా అభివ్రుద్దిపొంది, డబ్బుగల ఇతర దేశాలను కూడా భయపడేట్టు చేస్తోంది. ఇదే వేగమైన అభివ్రుద్దితో మనదేశం ముందుకుపోతే...మరో పది సంవత్సరాలలో అంతర్జాతీయంగా ఆర్ధీకంగానూ అర్ధీకరంగంలొనూమొదటి స్థానంలో ఉంటుంది.

దీన్ని ఆడ్డుకోవటమే సంస్థ యొక్క ముఖ్యమైన లక్ష్యం. మన దేశ అభివ్రుద్దిని చూసి వోర్వలేని కొన్ని దేశాలు వేస్తున్న డబ్బు బిక్షకు వీళ్ళు చిందులు వేస్తున్నారు. మనకింకా పద్దెనిమిది గంటలే ఉన్నది. ఈలోపు మనం బాంబు పేలడాన్ని అడ్డుకోవాలి" ఆందోళన పడుతూ చెప్పాడు.

"సార్. క్యాసెట్టులో వినబడిన శబ్ధం ఆధారంగా వాళ్ళు ఉండే చోటును మనం కనుక్కునే ప్రయత్నం చెయ్యచ్చే ?"

రోజు వరకు అలా కనుక్కోలేకపోయాము. మన ఇంటలిజన్స్ విభాగం ఇంకొక టెర్రరిస్ట్  సంస్థ  గురించి తెలుసుకోవటానికి వెళ్ళినప్పుడు, అక్కడ సంస్థ గురించి తెలుసుకుని వెంటనే మనకు సమాచారం పంపారు. అలా సమాచారం  పంపుతున్నప్పుడే వాళ్ళ దగ్గర దొరికిపోయిన ఒక అధికారి ఇందాకా ప్రాణం వదిలాడు

"బాంబు ఎక్కడపెట్టారో...ఎవరు పెట్టారో మనకు తెలియదు బాంబును ఎలా పేలకుండా చెయాలో తెలియదు. ఇంత తక్కువ సమయంలోపు మనం వాటిని కనుక్కొవటం సులభమా?" ఇన్స్ పెక్టర్ గణపతి తన ప్రశ్నను ముందుంచాడు.

"కష్టమే! కానీ మూడిటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకుని బాంబును పేలకుండా చేయాలి"

సార్. బాంబు స్క్వాడ్ కు ఫోన్ చేసి, నగరంలోని ముఖమైన ప్రదేశాలలో తనికీ చేయమని చెబుదాం. తరువాత...ప్రజలు ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని చోట్లా తనికీలు చేయమందాం"

"ఇది మామూలుగా జరిగే పనే. పని దానిపాటికి అది జరుగుతుంది. అదే సమయం...బాంబు ఎక్కడున్నదీ సరిగ్గా కనిపెట్టాలి. దానికి ఏం చేయాలో చెప్పండి"

గది అంతటా కొద్ది నిమిషాలు మౌనం.      

సుధా మెల్లగా తన చేతిని పైకెత్తింది.

"చెప్పండి...ఏదైనా ఐడియా ఉందా?"  ఇన్స్ పెక్టర్ సుధాను అడిగాడు డి.జి.పి.

"ఎస్ సార్నా భర్త ప్రతాప్ ను పిలిస్తే...ఆయన ఏదైనా క్లూ ఇస్తారు"

"అలాగా...?"

"అవును సార్. మీకు వాళ్ళాయిన గురించి తెలియదు. కొన్ని దొంగతనాల కేసుల్లో నేనే అయ్యన్ని పట్టుకుని జైలుకు పంపాను"....అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ చెప్పాడు.

"అయితే పె.ము-పె. తరువాత ఆయన పైన కేసులు ఏమైనా పెండింగులో ఉన్నాయా?"

"అదేంటి పె.ము-పె. తరువాత అంటే?" డి.జి.పి అడిగాడు.

"పె.ము అంటే పెళ్ళికి ముందు, పె. అంటే పెళ్ళి తరువాత అని అర్ధం. ఆయన జమీందారి వంశం నుండి వచ్చారు. మధ్యలో కొంత కాలం దొంగతనాలు చేసేరన్నది నిజం. కానీ, ఇప్పుడు గౌరవంగా 'డిటెక్టివ్ ఏజన్సీ' నడుపుతున్నారు. చాలా నేరాలలో మన డిపార్ట్మెంటుకూ, నాకూ క్లూ ఇచ్చి నేరస్తులను పట్టుకోవడంలో సహాయపడ్డారు. అలా నా భర్త సలహా తీసుకుని అవార్డులు కొట్టేసిన ఒక ఆఫీసర్ ఇక్కడ ఒకాయన ఉన్నారు. కావాలంటే ఆయన్ని అడగండి" చెప్పింది ఇన్స్ పెక్టర్ సుధా.

ఒక క్రిమినల్ యొక్క బుద్ది ఇంకో క్రిమినల్ కే కదా తెలుస్తుంది"

క్రిమినల్స్ కు బుద్ది ఉంటే ఉంది. మనకు బుద్ది లేనప్పుడు వాళ్ళను బుద్ది సహాయం ఇవ్వమని అడగటంలో తప్పులేదు "

"ఎవరికి బుద్ది లేదని చెబుతున్నారు?" అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ ఉద్రేకంగా అడిగాడు.

"ఆపుతారా మీ పోట్లాటను..." డి.జి.పి అరిచాడు.

"సారీ సార్. ఆయన నా భర్తను అవమానపరచి మాట్లాడుతున్నారు. ఇప్పుడెళ్ళి ఆయన ఆఫీసును చూడమనండి"

"మిసర్స్ సుధా...మొదట్లో మనం ప్రయత్నిద్దాం.మన వల్ల కాదు అనుకున్నపుడు మిగిలిన ఐడియాల గురించి ఆలొచిద్దాం"

"సారీ...డి.జి.పి గారు. .సి గారినే బాగా ఆలొచించమందాం. ఆయనకొక్కడికే 'పోలీస్ మైండ్' ఎక్కువ. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. అలా క్లూ ఏమీ దొరకలేదంటే చెప్పండి. నా భర్తతో మాట్లాడతాను. నేను చెబితే ఆయన ఎంత పెద్ద కష్టమైన పనినైనా కాదనరుకోపంగా మాట్లాడి కూర్చుంది ఇన్స్ పెక్టర్ సుధా.

డి.జి.పి తో సహా మిగిలిన పోలీసు అధికారులు తమ బుర్రలను కెలుక్కున్నారు, గోక్కున్నారు. గోడగడియారంలో ముల్లు పరిగెత్తుతోందేకాని వాళ్ళకు ఎటువంటి ఐడియాగానీ, క్లూగానీ దొరకలేదు. సమయం పదిగంటలు దాటింది.

డి.జి.పి ఫోన్ మోగటంతో...తీశారు. అవతలి పక్క మాటలను వింటుంటే ఆయన ముఖం ఎర్రగా మారిపోయింది.

పోలీసతని బాడీని మూసి కాలువలో నుండి అరగంట ముందు తీశారట. తుపాకీ గుండు చొచ్చుకుపోయి చనిపోయున్నా కూడా, వదలకుండా బాడీని ముక్కలు ముక్కలుగా చేసి పారేశారు. దీని తరువాత కూడా మనం నిదానంగా ఆలొచిస్తూ కూర్చుంటే ప్రయోజనమే లేదు" అని డి.జి.పి నిర్ణయాకి వచ్చారు.

అది విన్న వెంటనే అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్  తప్ప మిగిలినవారందరూ ఇన్స్ పెక్టర్ సుధా భర్త ప్రతాప్ సహాయం పొందటానికి తమ ఆమోదం తెలిపారు.

"సార్...నాకు ఇది అక్కర్లేని పనిగా అనిపిస్తోంది" చెప్పాడు అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్.

"మిస్టర్ రత్న కుమార్.... ప్రతాప్ గురించి, ఆయన యొక్క డిటెక్టివ్ ఏజన్సీ గురించి నేనూ విన్నాను. ఆయన దగ్గర అడుగుదాం. 'క్లూ' దొరికితే మంచిది. మీరూ  ఆలొచించండి...మీకు ఏదైనా 'క్లూ' దొరికితే, దారిలోనూ మనం ప్రయత్నించి చూద్దాం.  ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో 'ఈగో'కు చోటిస్తే మనకు పనిజరగదు. ఇన్స్ పెక్టర్  సుధా...మీ ఆయనకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి" ముగించాడు డి.జి.పి.

గర్వంగా ఫీలౌతూ తన సెల్ తీసి భర్త ఫోన్ నెంబర్లను నొక్కింది ఇన్స్ పెక్టర్ సుధా.

"హలో...ఒక అవసరం. డి.జి.పి మీతో ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట. వెంటనే బయలుదేరి మా ఆఫీసుకు రండి."

"లేదు డార్లింగ్. నేను ఇప్పుడే..."

"ఏదైనా సరే తరువాత చూసుకుందాం. వెంటనే బయలుదేరి రండి"

నువ్వు ఆర్డర్ వేయటం, నేను చేయకపోవటమా. ఇదిగో ఇప్పుడే వస్తున్నా"...అవతల వైపు ఫోన్ పెట్టేసిన చప్పుడు.

పది నిమిషాల తరువాత డి.జి.పి కి  ఆఫీస్ ఎంట్రన్స్ సెక్యూరిటీ దగ్గర నుండి ఫోన్."మీరు రమ్మని చెప్పారని ప్రతాప్ అనే ఒకాయన వచ్చారు"

డిటెక్టివ్ ప్రతాపేనా...? పంపించు"

"చూస్తే డిటెక్టివ్ లాగా కనిపించటం లేదు సార్. నాకెందుకో సందేహంగా ఉంది సార్

"నీకెందుకయ్య అక్కర్లేని సందేహం. ఆయనకోసమే మేమందరం కాచుకోనున్నాం. వెంటనే నా గదికి పంపు"

సుధా తన తలను పక్కకు తిప్పి, ఎడం చేతిని చెంపల క్రింద ఉంచుకుని గది ద్వారం వైపే భర్త రాకకై చూస్తోంది. ఆమె మాత్రమే కాదు.... బృందంలోని అందరూ గది ద్వారం వైపే చూస్తున్నారు...గది తలుపులు తెరుచుకున్నాయి.

కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని, నలిగిపోయిన లుంగీ, మాసిపోయిన బనీను వేసుకుని ద్వారం దగ్గర నిలబడ్డాడు ప్రతాప్.

భార్యను చూశాడు. "హాయ్ బ్యూటీ" అంటూ చేయి ఊపాడు...అది చూసిన ఇన్స్ పెక్టర్ సుధాకు తల తిరిగినట్లనిపించింది.
                                 **************************************************************** 
                                                                                                        PART-3

తలుపులు తడుతున్న శబ్ధం మోత వినబడటంతో...నిద్రలో నుండి కష్టపడి తనని విడిపించుకుని, ఆవలించుకుంటూ వెళ్ళి తలుపులు తెరిచాడు ప్రమోద్.

క్రింది పోర్షన్లో ఉంటున్న ఇంటి యజమాని వాళ్ళబ్బాయి నిలబడున్నాడు.

"అన్నా....మీకు ఫోన్ వచ్చింది. నాన్నగారు చెప్పి రమ్మన్నారు."

ఎవరు, ఎక్కడ్నుంచి ఫోన్ చేశారో చెప్పకుండా తండ్రి చెప్పింది వొప్పచెప్పి వెళ్ళిపోయాడు.

"ఎవరై ఉంటారు?" అనే కన్ ఫ్యూజన్ తో, మొహం కడుక్కుని క్రిందకు వెళ్ళాడు ప్రమోద్.

"తమ్ముడూ, ఎవరో అంజలి ఫోన్ చేసింది. తిరిగి పది నిమిషాల తరువాత మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది. అంతవరకు అలా కూర్చోండి" చెప్పాడు ఇంటి యజమాని.

సోఫాలో కూర్చున్నాడు. అంజలి దగ్గర నుండి టైములో ఫోన్ వస్తుందని అతను ఎదురు చూడలేదు.

"తమ్ముడూ టీ...కాఫీ ఏమన్నా తీసుకుంటావా...?" భవ్యంగా అడిగాడు ఇంటి యజమాని.

"క్షమించాలి...నాకేమీ వద్దు. కాసేపట్లో బయటకు వెళ్ళిపోతాను. అప్పుడు చూసుకుంటాను"

'నిన్నటి వరకు ప్రమోద్ ని తిట్టిన ఇంటి యజమాని నోరు, పదినెలల అద్దె బాకీతో పాటూ, రాబోయే రెండు నెలల అద్దె డబ్బును ప్రమోద్ ముందే ఇవ్వటంతో రోజు పళ్ళు ఇకలిస్తూ నవ్వు మొహంతో మాట్లాడుతున్నాడు.

"డబ్బుకు ఎంత విలువో?"...మనసులోనే నవ్వుకున్నాడు ప్రమోద్.

టెలిఫోన్ రింగ్ అయ్యింది...సోఫాలో నుండి లేచి ఒక్క నిమిషం ఇంటి యజమాని వైపు చూశాడు. ఆయన తల ఊపటంతో, రిజీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతలివైపు అంజలి గొంతు.

"హలో..."

"నేను ప్రమోద్ నే...చెప్పు"

"నిన్ను వెంటనే చూడాలి. రాగలవా?"

"ఇంత ప్రొద్దున్నే ఎక్కడకి"

"ఇప్పుడు కాదు...ఎనిమిదింటికి. ఎప్పుడూ ట్యాంక్ బండ్ దగ్గర కలుసుకుంటామే! చోటికి వచ్చాయి. మిగితాది నేరుగా చెబుతాను"

"సరే"- ఫోన్ పెట్టాశాడు. ఇంటి యజమానిని చూసి ఒక చిరునవ్వు నవ్వేసి, ఎదురుకుండా ఉన్న టీ కొట్టుకు వెళ్ళి అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నాడు. ప్రమోద్ ను అడగకుండానే "సారుకు ఒక స్పేషల్ టీ ఇవ్వు" అని కేక వేశాడు టీ కొట్టు యజమాని.

మరు నిమిషం టీ అతనిదగ్గరకు వచ్చింది.

టీ కొట్లో కూడా అదే కథ! నిన్నటి వరకు సింగిల్ టీ చెప్పి, అరగంట కాచుకోవాలి. రోజు అడగ కుండానే టీ అతనిదగ్గరకు వచ్చింది. అదే డబ్బు మహాత్యం.

అతను...టీ త్రాగుతూ అంజలితో తన ప్రేమ వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.

ఆమె తల్లితండ్రులు ఆమెకు కరెక్టు పేరే పెట్టారు. ఆమెను చూసే ప్రతి ఒక్కరూ కొద్ది క్షణాలైనా తమ స్పృహలో ఉండరు. అంత అందంగా ఉంటుంది అంజలి. ఇతనూ  అమెను చూసిన వెంటనే మనసు పోగొట్టుకున్నాడు. 

ఏన్నోరోజులు అద్దం ముందు నిలబడి, 'నన్నెందుకు అందంగా పుట్టించలేదుఅంటూ దెముడ్ని ప్రశ్నించేవాడు .నన్ను అందంగా పుట్టించుంటే ఆమె దగ్గరకు వెళ్ళి ధైర్యంగా నా ప్రేమను చెప్పేవాడిని...!' అని వాపోయేవాడు.

అలా అతను వాపోతున్నప్పుడు అంజలి కళ్ళు ఇతన్నే రహస్యంగా చూస్తూండటం గమనించాడు. ఇతను చూసిన వెంటనే తన చూపును చటుక్కున వేరు చోటుకు తిప్పుకునేది. ఇక ఇతన్ని పట్టుకోగలమా? రోజే తన ప్రేమను అమె దగ్గర కక్కేశాడు. ఆమె 'నో' చెప్పిన రోజు నుండి, ఇతన్ని చూసినవెంటనే పరిగెత్తి వెళ్ళిపోయేది.

ఆమెను మరిచిపోవడానికి ఎంతో ప్రయత్నించాడు...కుదరలేదు. ఒకసారి పదిమంది ముందు ...ఆవేశంగా తన ప్రేమను చెప్పాడు, దెబ్బలూ తిన్నాడు. సంఘటన తరువాత ఆమె మెల్ల మెల్లగా భయాన్ని వదిలేసి, అతనికి దగ్గరవడం మొదలుపెట్టింది.

మిగిలిన ప్రేమికులలాగా గంటల తరబడి ఫోన్ మాటలు లేవు. వారానికి రెండు రోజులు మాత్రమే ఒక గంటసేపే కలుసుకుంటారు. కాలేజీలో ఒక సంవత్సరం, తరువాత నాలుగు సంవత్సరాలు. వీళ్ళు ప్రేమించుకోవటం మొదలుపెట్టి రోజుతో ఐదు సంవత్సరాలు అయ్యింది.

ఉద్యోగం దొరక్క ఎన్నోసార్లు డీలా పడిన ప్రమోద్ ని తన చేతులతోనూ, మాట్లతోనూ ఉత్సాహపరిచేది అంజలి.  

                                                            ******************************** 

హైదరాబాద్ ట్యాంక్ బండ్. డబ్బుగలవారికి, లేనివారికి సరిసమానంగా బగవంతుడు ఇచ్చిన వరం. పెందలకడ వచ్చిన కొందరు మార్నింగ్ వాక్ ముగించుకుని తిరిగి వెడుతున్నారు.

వాళ్ళు మామూలుగా కలుసుకునే చోటుకు ప్రమోద్ వచ్చినప్పుడు టైము ఎనిమిది ఐదు. 'అప్పుడే వచ్చుంటుందా?' అనే అతని అపోహను తొలగిస్తున్నట్టు అప్పటికే ఆమె అక్కడకొచ్చి కూర్చోనుంది. తనని గిల్లి చూసుకున్నాడు.

ఆమె ముఖాన్ని తిప్పి చూసింది.

ఏడుస్తున్నది.

ఏమీ అర్ధంకానివాడిలా ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

"ఎందుకేడుస్తున్నావు?...ఏమైంది?"

ఆమె సమాధానం చెప్పలేదు. అతని చొక్కా పుచ్చుకుని అతన్ని దగ్గరకు లాక్కుని అతని గుండెలపై తన ముఖాన్ని పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మొదట ఆమెను సమాధాన పరుద్దామనుకున్నాడు. అతనివల్ల అది కుదరలేదు. 'కాసేపు ఏడవని అనుకుంటూ నిదానంగా ఉన్నాడు.

ఐదు నిమిషాల తరువాత ఆమె ఆమెను కంట్రోల్ చేసుకుని మాట్లాడటం మొదలుపెట్టింది.

"ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. నిన్న నాకు తెలియకుండానే, నా ఇష్టం కనుక్కోకుండానే పెళ్ళి చూపులకు ఏర్పాటు చేశారు. పెళ్ళి మూహూర్తాలు, తారీఖులూ నిశ్చయంచేసుకున్నారు. ఈరోజు ప్రొద్దున నాన్న దగ్గర మన ప్రేమ విషయం చెప్పాను. లాగి ఒకటిచ్చారు.

నాకు లోకం తెలియదుట. ఆయన చూసిన పెళ్ళికొడుకునే నేను చేసుకోవలట. 'లేకపోతే ఎక్కడకన్నా వెళ్ళిపో, నువ్వు చచ్చిపోయావని అనుకుంటా' అని చెప్పారు"...చెబుతూ కొంచం ఆయశపడింది.

అతను మౌనం వహించాడు.

"నాకేంచేయాలో తెలియలేదు. కోపంగా ఇంట్లోనుండి వచ్చాశాను"

ప్రమోద్ నవ్వాడు.

ఆశ్చర్యంతో అతన్నే చూసింది అంజలి.

"ఎందుకు నవ్వుతున్నావ్?"

నువ్వు ఏడవటం చూసి ఏమిటో ఏదో అనుకున్నా. ఇది మనం ఎదురుచూసిందే కదా. దీనికొసం ఏడుస్తున్నావా?"

"కాదు..." అంటూ మాట్లాడబోయిన ఆమె నొటిని మూశాడు.

"నాకు సింగపూర్ లో మంచి ఉద్యోగం దొరికింది. నిన్ననే ఫ్లైట్ టికెట్టు కూడా బుక్ చేశేశాను. తీసుకొచ్చి నీకు చూపిద్దాం అనుకునాన్ను. అంతలో ఇవన్నీ జరిగిపోయినై. పరవాలేదు....ఈరోజే టూరిస్ట్ వీసా తో నీకూ టికెట్టు బుక్ చేస్తాను. నాతో వచ్చేసై. విదేశంలో మన జీవితాన్ని ప్రారంభిద్దాం. అక్కడకెళ్ళి వీసాను రెండేళ్ళకు ఎక్స్ టెండ్ చేయించుకుందాం. అలా కాదంటే ఇక్కడే లేడీస్ హాస్టల్లో ఉండు. రెండు సంవత్సారాలు బాగా సంపాదించుకుని వస్తాను. వచ్చిన వెంటనే పెళ్ళిచేసుకుందాం"

"నాకు డబ్బులొద్దు. నువ్వుంటే చాలు. నీతోపాటూ సింగపూర్ వచేస్తాను

"సరే...నిన్ను మీ ఇంటిదగ్గర నేనే స్వయంగా దింపుతాను. నువ్వుగా ఇంట్లోనుండి పారిపోయి వచ్చినట్టు ఉండొద్దు. మీ నాన్న దగ్గర మాట్లాడతాను. కాదూ కూడదు అంటే...నాతో తిరిగి వచ్చేయి. మిగితా విషయాలు తరువాత చూసుకుందాం"

అంజలి భయంతో అతని చేతిని పుచ్చుకుంది.

చదువుకునేటప్పుడు ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పినప్పుడు...పెద్దగా పట్టించుకోనట్టు మాట్లాడాను. నిన్ను తిట్టాను...ఒకసారి కొట్టాను. అవన్నీ వయసులో ప్రేమ మీద నాకున్న భయంతో చేసినవి. నిజానికి, నిన్ను చూసిన మొదటిరోజే ప్రేమలో పడిపోయానన్నదే వాస్తవం. నన్ను క్షమించు. లేదు నన్ను దండించాలనిపిస్తే...నన్ను తిట్టు, కొట్టు. నీతోనే ఉంచుకుని నన్ను చిత్రవధలు పెట్టుకో.......అవన్నీ హాయిగా అనుభవించటానికి నేను రెడీ. కానీ నన్ను వదిలేయకు. నువ్వులేకుండా నేను బ్రతకలేను. అంత గాఢంగా నిన్ను ప్రేమిస్తున్నాను"

ఆమె మాటలు అతనికి సూదుల్లా గుచ్చుకున్నాయి.

"నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో మాటలతో చెప్పేశావు! నిన్ను మహారాణిలాగా ఉంచుకోవాలనే ఒకే కోరికతో, దేశ ద్రోహం అని తెలిసికూడా పనిచేశాను. ఒకవేల నిన్ను ప్రేమించకుండా ఉండుంటే...'జైహింద్చెప్పి కష్టాలను సంతోషంగా స్వాగతించేవాడిని

మనసులోనే అనుకున్నాడు...బయటకు చెప్పలేదు. అతని చేతులు మాత్రం ఆమె కన్నీటిని తుడిచాయి.

నిమిషం అతనికి తెలియదు...తనవలన అంజలి ఎన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందో!

                                  ****************************************************************

                                                                                                        PART-4 

ఇన్స్ పెక్టర్ సుధాకు కోపం తలవరకు ఎక్కటంతో...లేచి అగ్నిపర్వతంలా భర్త ప్రతాప్ దగ్గరకు వచ్చింది.

ఏమిటీ అవతారం? ఎందుకిలా పరువుతీస్తున్నారు...?---కోపంగా అరిచింది.

"నువ్వేకదా చెప్పావు...' పనిలో ఉన్నా సరే అలా పడేసి వెంటనే బయలుదేరిరా' అన్నావు. నిన్న 'లేట్ నైట్' వచ్చాను. ప్రొద్దున పది గంటలకు లేచి స్నానం చేశాను. అంతలోనే నన్ను వెంటనే రమ్మని ఫోన్ కాల్. నీ మాటలను కాదనగలనా...? అందుకనే అన్నిటినీ వదిలేసి అలాగే వచ్చాశాను"

"అందుకని ఇలాగా? నల్ల కళ్ళద్దాలు వేసుకునే 'బాత్ రూమ్' కి వెళ్ళారా?"

"చీచీ...ఇదిలేకపోతే నీ మామ ఇమేజ్ ఏంగాను? అందుకనే  అంత అవసరంలోనూ దీన్ని వెతికి పెట్టుకుని వచ్చాను"

సుధాకి ఇంకా కోపం తగ్గలేదు!

"నేను నిన్ను ఇరకాటంలో పెట్టాననుకుంటా. నన్ను క్షమించు సుధా. నా మనసంతా నిండిపోయున్న నా ప్రేయసీ...నన్ను మన్నిస్తావుగా..." అంటూ తల ఊపుకుంటూ సుధాను చూస్తూ ముందుకు వచ్చాడు ప్రతాప్.

అతని చూపులతో సుధా కోపం పూర్తిగా తగ్గిపోయింది. ఇద్దరూ అక్కడున్న కుర్చీలలో కూర్చున్నారు.

పక్కన కూర్చున్న సబ్ ఇన్స్ పెక్టర్ మూర్తి, పలుసార్లు ముక్కులెగరేశాడు.

"ఏమిటిసార్...వాసన చూస్తున్నారు...?  'బాత్ రూమ్' నుండి అలాగే వచ్చాశేనని చూస్తున్నారా?"

ఆయన అవునన్నట్టు తల ఊపాడు.

"చీచీ..నేనేమి అంత లేజీ వాడ్ని కాదునాకు పని చాలా టైట్ గా ఉన్నది. అందువలన స్నానం చేసి రెండు రోజులైంది….అంతే" అన్నాడు ప్రైవేట్ డిటెక్టివ్ ప్రతాప్.  

"డార్లింగ్...మామకు స్పేషల్ సెంటు ఇవ్వరా బుజ్జి".....సుధాని అడిగాడు ప్రతాప్.

సుధా తనని తానే మళ్ళీ తలమీద కొట్టుకుని 'జేబులో ఉన్న స్పేషల్ సెంటు బాటిల్ను ఎగరేయగా, ప్రతాప్ దానిని పట్టుకుని తనపైన జల్లుకున్నాడు.

పక్కనున్న మూర్తిని చూసి "సార్...ఇప్పుడు వాసన చూడండి. గొప్పగా ఉంటుంది" అని చెప్పాడు ప్రతాప్.

మూర్తి కళ్ళు ప్రతాప్ ను కోపంగా చూసినై.

"డార్లింగ్...నువ్వు చెప్పరా! వాసన బాగుందికదా" నవ్వుతూ అడిగాడు.

అందరూ తననే చూస్తున్నారని తెలుసుకుని డి.జి.పి వైపుకు తిరిగాడు ప్రతాప్.

"చెప్పండి డి.జి.పి గారు. ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలన్నారే?"

"ఇప్పుడైనా జ్ఞాపకమొచ్చిందే...?”...అంటూ ప్రశాంతంగా క్యాసెట్టును మళ్ళీ ప్లే చేశాడు డి.జి.పి.....రెండు నిమిషాల తరువాత్ క్యాసెట్ ఆగింది.

"ఇదే ఇప్పుడున్న పరిస్థితి "...షార్టుగా చెప్పాడు డి.జి.పి.

"ఇంకా మనకి పద్నాలుగు గంటల సమయమే మిగిలి ఉన్నది. అంతలోపు కనిపెట్టాలి. మీవల్ల అవుతుందా?"  ప్రతాప్ ను అడిగాడు డి.జి.పి.

బాంబు పెట్టింది ఎం.ఎస్. తీవ్రవాద సంస్థ. ఇంతపెద్ద ముఖ్యమైన క్లూ మన దగ్గర ఉన్నది కాబట్టి ఈజీగా కనిపెట్టేయచ్చు దానికి సమయం కూడా ఉన్నది"

"ప్రతాప్ గారూ....జోక్ వేస్తున్నారా?"

"లేదు సార్. ఇంతకు ముందే సంస్థకు పలు బాంబు సంఘటనలతో కనక్షన్ ఉన్నది. అందులో రెండు ప్రదేశలలో నేరస్తులను పట్టుకుని జైల్లో పెట్టారు. కరెక్టే కదా?"

"అవును"

"పోయిన రెండుసార్లూ బాంబులను ఎలా పేలేటట్టు చేసారో...అదేలాగానే ఈసారి కూడా చేస్తారు. రెండు నేరలలోనూ నేరస్తులను పట్టేశారు...! దానికీ, దీనికీ ఒకటే తేడా. అప్పుడు బాంబు పేలిన తరువాత నేరస్తులను పట్టుకున్నారు. ఇప్పుడు ముందుగానే నేరస్తులను పట్టుకోవాలి"   

అందరి ముఖాలవైపూ ఒకసారి చూశాడు. అందరిలోనూ నమ్మకమనే వెలుగు కనబడుతోంది

డి.జి.పి కొంచం నవ్వు మొహంతో కనిపించాడు. సుధా గురించి చెప్పక్కర్లేదు.

"డి.జి.పి గారూ.ఇంకో ఐదు నిమిషాలలో సంస్థకు సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ కేసు ఫైలు మొత్తం నా దగ్గర ఉండాలి" చెప్పాడు ప్రతాప్

"ఏర్పటు చేస్తాను"

"అంతకు ముందు..."

మళ్ళీ ఒకసారి అందరినీ చూశాడు

"నాకొక టూత్ పేస్టు, బ్రష్ కావాలి. నా నోటి దుర్వాసనను నేనే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్..." అని అడిగాడు.

"అవి ముఖ్యంగా ఏర్పాటు చేస్తాను. మేము కూడా తట్టుకోలేకపోతున్నాను...మీ భర్తను తీసుకువెళ్ళి ...బ్రష్ చేయించి, స్నానం చేయించి 'రెడీ' చేయండి. ఇంటికి ఫోన్ చేసి మంచి డ్రెస్స్ తీసుకురమ్మని చెప్పండి" సుధాకి చెప్పాడు డి.జి.పి

కొంచంసేపు తరువాత ప్రతాప్ ఫ్రెష్ అయ్యి, కొత్త ఉత్సాహంతో వచ్చాడు. ఇంటిదగ్గర నుండి దుస్తులు రాకపోవటం వలన...ఇంకా మాసిపోయిన బనీను, లుంగీ తోనే ఉన్నాడు.

అక్కడ కొత్తగా ఒక కుర్చీ, టేబుల్ వేయబడింది. టెబుల్ మీద ఒక ఫైలు ఉన్నది.

ఫైలులోని ఒక్కొక్క పేజీనీ చూసుకుంటూ వెళ్ళాడు ప్రైవేట్ డిటెక్టివ్ ప్రతాప్. ఐదు నిమిషాల తరువాత తలెత్తి అందరినీ ఒకసారి చూశాడు.

ఈజీగా కనిపెట్టేయచ్చు"

"ఎలా" డి.జి.పి ఆసక్తిగా అడిగాడు. అందరి ముఖాలలోనూ అదే ఆసక్తి కనిపించింది.

"ఇంకో అరగంటలో చెప్తాను. దానికి ముందు ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని విచారణ చేయాలి"

అప్పుడు డి.జి.పి ఇన్స్ పెక్టర్ అర్జున్ వైపు చూశాడు.

"సార్ ఇందులో దిలీప్ ఇండిపెండంట్ వ్యక్తి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు."

"ఇంతకుముందు మేము ఇతన్ని చాలాసార్లు విచారణ చేశాము. టెర్రరిస్ట్ సంస్థ గురించి అతనికి ఏమీ తెలియదు. ఒక కిరాయి మనిషిలాగానే వాళ్ళకు పనిచేశాడు"

"అది నాకు తెలుసు మిస్టర్ అర్జున్. అతనిదగ్గర వేరే విషయం గురించి విచారణ చేయాలి. దానికి నేను చెప్పింది మీరు చెయ్యాలి" ఆర్డర్ వేశాడు ప్రతాప్.

ప్రతాప్ అలా ఆర్డర్ వేయటంతో కమీషనర్ కి కొపం వచ్చింది.

"ఒకరోజు నా ఎదురుగా గంటసేపు నీ మోకాళ్ళపై కూర్చుని నన్ను వదిలిపెట్టండి అని బ్రతిమిలాడావు. నేరస్తుడైన నువ్వు చెప్పింది మేము చెయ్యాలా? కాకీ చొక్కా నీలాంటి ఒకడి క్రింద పనిచేయదు" కమీషనర్ గట్టిగా అరిచాడు.

"సార్... ఎప్పుడో ఐదేళ్ళ క్రిందట జరిగిన విషయం చెప్పి నా భర్తను చాలా అవమానిస్తున్నారు. ఆయన వచ్చింది మనకు సహాయపడటానికి. మొదట ఆయన్ను క్షమాపణ చెప్పమనండి " చెప్పింది ఇన్స్ పెక్టర్ సుధా.

"..........................."

"ఇంతకు ముందు కూడా ఆయన్ని అవమానపరిచారు. వాళ్ళ కళ్ళకు ఆయన అంత చులకన అయిపోయారా?"

'' అంటూ ఏడవటం మొదలెట్టింది.

డి.జి.పి కి ఏంచేయాలో తోచలేదు!

"ఏడవకండి"

"ఆయన్ని క్షమాపణ చెప్పమనండి సార్"

కమీషనర్ లేచి నిలబడ్డాడు... ప్రతాప్ కూడా ఏడవడం మొదలుపెట్టాడు.

వాళ్ళిద్దరి ఏడుపూ అక్కడున్న వారికి చిరాకు తెప్పించింది.

వేరే దారిలేక ప్రతాప్ దగ్గర క్షమాపణ  అడిగాడు కమీషనర్.

"ఇప్పుడు ఓకేనా? మీతోపాటు ఇన్స్ పెక్టర్ గణపతిని పంపిస్తాను . ఆయన మీకు సహాయం చేస్తాడు"

"వద్దు సార్...ఆయన కూడా నన్ను క్రిమినల్ గానే చూస్తారు. అందువల్ల నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతాను. విషయాన్ని మీరే పరిష్కరించుకోండికళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు ప్రతాప్.

కమీషనర్ క్షమాపణ చెప్పిన తరువాత కూడా మీరు మొరాయించటం బాగోలేదు మిస్టర్ ప్రతాప్కోపంగా చెప్పాడు డి.జి.పి.

“……………….”ప్రతాప్ మౌనంగా ఉన్నాడు.

"ఇక్కడ జరిగింది మరిచిపొండి. మేము ఏంచేయాలో చెప్పండి...చేస్తాం. మాకు కేసులో సహాయం చేయండి" మళ్ళీ డి.జి.పి నే మాట్లాడాడు.

"దాని ఒకే ఒక దారుంది"

"ఏమిటది...చెప్పండి! చేస్తాం..."

"నన్ను ఒకరోజు డి.జి.పి గా అపాయింట్ చేయండి."

డి.జి.పి స్థంభించిపోయాడు. కొంచం సర్ధుకుని "దానికి పర్మిషన్ లేదు. కావాలంటే వేరే ఏదైనా అడగండి"

"అరె...'ఒకేఒక్కడుసినిమా లాగా బృందం వరకు నేను ఒక్క రోజు డి.జి.పి ని! .కే.నా?"

".........................." తలవూపాడు డి.జి.పి.

"అలాగే మీ యూనీఫారం ను ఒకరోజుకు అద్దెకు ఇవ్వండి"

"నా యూనీఫారం నా? ...అప్పుడు నేనేం చేశేద&#