నిద్రలేని రాత్రులు…(పూర్తి నవల)


                                                                           నిద్రలేని రాత్రులు                                                                                                                                                        (పూర్తి నవల) 

కష్టాలు శాశ్వతం కావు…క్షణకాలం కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికోసం ఈ నిజ జీవత గాధ ఆదర్శం కాగలదు.

మానవుడు తల్లి-తండ్రుల ధర్మాలకు అణుగుణంగా నడుచుకుంటే అతనిపై ఆ దేవుని యొక్క కృప ఉంటుంది. కానీ ఎప్పుడైతే అతడు ఆ దేవుని యొక్క ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడో అతనికి జీవితం లో కష్టాలు మొదలవుతాయి.

కొన్ని రకాల కష్టాలకు మానవుని యొక్క ప్రవర్తనే కారణంగా ఉంటుంది.. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం బహుశా వారు  దారికి తిరిగి రావచ్చేమోనని కూడా ఈ విధంగా జరిగుండచ్చు.  

మానవుని చర్యలు మరియు అతని బాహ్యప్రపంచానికి మధ్య లోతైన సంబంధం ఉంది. 

 కష్టాలు వస్తున్నాయి అంటే కాలం పరిక్షిస్తోందని అర్థం. ఇంకేదో మంచి జరగబోతోందని అర్ధం. వాటిని ఎదురుకొని.. పరిష్కరించుకోవాలి. అంతేగాని బాధపడుతూ కష్టాలకు కారణాలను వెతక కూడదు. 

ఈ నవలలోని నాయకురాలు సౌందర్య, తన సొంత ప్రవర్తన కారణంగా కష్టాల పాలవుతుంది. ఆ కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్య చేసుకోవటానికి పూనుకుంటుంది. 

ఆ సమయంలో ఈ నవలలోని నాయకుడు అనిల్, ఆమెను కాపాడి వేరే దారిలేక తనతో పాటూ తన గదికి తీసుకు వెడతాడు. ఆ రోజు నుండే వాళ్ళిద్దరికీ నిద్రలేని రాత్రులు మొదలవుతాయి.

..........వాళ్ళిద్దరికీ నిద్రలేని రాత్రులు ఎప్పుడు ముగిసింది? సౌందర్య ఏ ప్రవర్తన వలన కష్టాలకు కుమిలిపోయి ఆత్మహత్యకు పూనుకుంటుంది?

 తనకు ఎటువంటి సంబంధమూ లేని ఒక అమ్మాయిని కాపాడి నిద్రలేని రాత్రులను అనిల్ ఎందుకు కొని తెచ్చుకున్నాడు? వీటన్నిటికీ సమాధానం ఈ నవల మీకు అందిస్తుంది.

***********************************************PART-1*******************************************

మౌలాలి రైలు స్టేషన్.

హడావిడికి, ఆందోళనకూ కరువు లేని చోటు. రోజూ ఎన్నో సిటీ రైల్లు వచ్చి వెడతాయి. మధ్యలో సూపర్ ఫాస్ట్ రైళ్ళు కూడా వెల్తాయి. ఎంతమంది వచ్చి వెళ్ళినా, ఎంత మంది ప్లాట్ ఫారం మీద నిలబడున్నా అక్కడ హడావిడి మాత్రమే కనబడుతుంది తప్ప ఎక్కువ శబ్ధం ఉండదు.

టికెట్టు కౌంటర్ దగ్గర టికెట్టు కొసం ఒక రైలు పొడవంత క్యూఉంటుంది. ప్లాట్ ఫారం మీద కాచుకోనున్న ప్రయాణీకులలో కొందరు రైలులో సీటు దొరకాలనే ఆశతో అటూ, ఇటూ తిరుగుతూ ఉంటారు. రైలు వచ్చిన వెంటనే పెట్టి ఖలీగా కనబడుతుందో అందులో ఎక్కేయాలని.  ప్లాట్ ఫారం మీద వ్యాపారుల కేకలు వినబడతాయి. బిచ్చగాళ్ళ గొంతుకలు అప్పుడప్పుడు వినబడతాయి.

కాలేజీ విధ్యార్ధీ-విధ్యార్ధినులు వస్తే... వాళ్ళ కేరింతలూ, మాటలూ అక్కడున్న వారిని మైమరిపిస్తాయి. ఇప్పుడు అక్కడొక ఆత్మహత్య జరుగబోతోంది.

అదిగో ప్లాట్ ఫారం చివర నేల మీద కూర్చోనుందే...ఆమే, రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకోబోతోంది. ఆమె మాత్రమే కాదు -- ఆమెతో పాటూ ఆమె ఒక వయసు కూతురూ ప్రాణం వదలబోతోంది.

ఆమెను చూసిన వెంటనే...తట్టుకోలేని కష్టాలను అనుభవించి అక్కడికి వచ్చినట్టు ఊహించలేము. ఏడ్చి, ఏడ్చి కన్నీరు ఎండిపోయిన కళ్ళల్లో, ఆమె ఆలొచించి తీసుకున్న ఆ నిర్ణయం కనిపించదు.

బిడ్డకు ఆకలేమో...? ఏడుస్తునే ఉన్నది.

ఇదిగో మన సమస్యలన్నీ ముగియబోతున్నాయిఅన్నట్టు బిడ్డను సమాధాన పరుస్తోంది.

అదిగో... సూపర్ ఫాస్ట్ రైలు వస్తోంది.

ఆమె పడ్డ బాధలన్నిటి నుండి విడుదల...ఇదిగో వేగంగా వస్తున్నది.

బిడ్డతో పాటూ తడబడుతూ లేచి నడిచి ప్లాట్ ఫారం చివరకు వెళ్ళి అంచులో నిలబడింది. బిడ్డను గట్టిగా గుండెలకు హత్తుకుని పుచ్చుకుంది.

ప్రమాదమైన పరిస్థితిలో ఆమె నిలబడుండటం చూసిన రైలు డ్రైవర్, పెద్దగా హారన్ మోగిస్తూ వస్తున్నాడు. ఇంజెన్ కు బయట తల పెట్టి జరిగి వెళ్ళుఅనేలాగా చేతితో సైగ చేస్తున్నాడు.

చోటును దాటుకుంటూ వెడుతున్న ప్రయాణీకులు కొందరు, జరగబోవు విపరీతాన్ని గ్రహించినట్టు...ఆమెను చూసి వెనక్కిరాఅని అరిచారు.

కానీ, ఆమె జరిగేటట్టు లేదు.

వేగంగా వస్తున్న రైలును ఇంతవరకు ఇంత దగ్గరగా చూడని ఆమె మొహంలో మరణ భయం కనబడటం మొదలైయ్యింది.

తనని తాను మరచి కేకలు పెట్టింది. బిడ్డ కూడా భయంతో గట్టిగా ఏడ్చింది.

ఇదిగో కొద్ది క్షణాలలో.

రైలు ముందుకు దూకి అదే చోట ప్రాణం వదల బోతారు. మరణ భయం వణుకు అమెలో వ్యాపిస్తోంది. బిడ్డ ఏడుపు పెద్ద దయ్యింది.

కానీ, ఆమె చోటు నుండి జరిగేటట్టు కనిపించలేదు.

అప్పుడు...

ఒక చేయి ఆమెను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగింది. మరణం యొక్క ఘోరమైన పిడి నుండి తప్పించుకుంది. అతనిపై స్ప్రుహ తప్పి వాలిపోవటం గ్రహించింది.

***********************************************PART-2*******************************************

అనిల్, పేరుకు తగిన అందగాడే. గ్రామంలో పుట్టాడు. ముద్దుగా...కానీ, క్రమశిక్షణతో పెంచబడ్డాడు. చిన్న వయసు నుండే చదువులోనూ, క్రమశిక్షణలోనూ పేరు తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్ చదువును మంచి మార్కులతో పూర్తి చేసాడు.

క్యాంపస్ ఇంటర్వ్యూలో, ప్రపంచమంతా బ్రాంచీలున్న ఒక కంపెనీ అతనికి ఉద్యోగం ఇచ్చింది. వెంటనే హైదరాబాదులో ఉద్యోగంలో జేరాడు. చేతి నిండా జీతం. ఇతని జీతం ఎదురు చూడని అతని తల్లి-తండ్రులు. మౌలాలిలో ఒక ఇంటి మేడమీద ఉన్న ఒక రూమును అద్దెకు తీసుకుని ఉన్నాడు.

శని, ఆదివారాలు, ఇంకా సెలవు రోజుల్లో పబ్బులకూ, పార్టీలకూ వెళ్ళ కుండా...గ్రామానికి వెళ్ళి కన్నవాళ్ళతో సమయం గడపటంలో ఎక్కువ ఇష్టపడతాడు.

గ్రామంలో మేనమామ కూతురు గౌరి మనసంతా నిండిపోయున్నాడు. అతని తల్లి గౌరికి  సపోర్ట్. తండ్రి కూడా అంతే. కానీ, అనిల్ మనసులో ఇంకొక అమ్మాయి చోటు చేసుకుంది.

ఆమే కవిత.

ఎక్కడో కలిసి...ఏక్కడో తమ మనసులు మార్చుకున్నారు.

ప్రతి రోజూ పని ముగించుకున్న తరువాత అమీర్ పేట నుండి మౌలాలి రైలు స్టేషన్ కు వచ్చి, ప్లాట్ ఫారం మీద చివరగా ఉన్న బెంచి మీద కూర్చుంటాడు అనిల్.

ఖైరతాబాద్ లో ఉన్న ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న కవిత పని ముగించుకుని ఖైరతబాద్ రైలు స్టేషన్లో రైలు ఎక్కి, మౌలాలి వచ్చి ప్లాట్ ఫారం చివర ఉన్న బెంచిలో తన కోసమే కూర్చున్న అనిల్ ను కలుస్తుంది.

ఇద్దరూ పైకెగిరే విమానంలాగా, ప్రేమ ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగురుతారు. టైము గడిచేదే తెలియక తిరుగుతుంటారు.

కింద దిగిన తరువాత కవిత, తాత్కాలిక విడిపోవటాన్ని కూడా తట్టుకోలేని  మనోభారంతో సెలవు తీసుకుని రైలెక్కి నాంపల్లి లో తాను ఉంటున్న లేడీస్ హాస్టల్ కు వెడుతుంది. అనిల్ తన గదికి వెళ్ళిపోతాడు. సోమవారం నుండి శుక్రవారం వరకు అలా జరిగినా...వాళ్ళకు రోజూ విసుగు అనేది అనిపించదు. దానికి బదులుగా అదే మొదటిసారి కలుసుకుంట్టునట్టు ఉత్తేజ పడతారు.

రోజు...రైలు మౌలాలి మౌలాలి చేరుకుంటునప్పుడు, తాము రెగులర్ గా కలుసుకునే చోట, చిన్న గుంపు ఆందోళనతో  గుమికూడి ఉండటం, గుంపు మధ్యలో అనిల్ నిలబడి ఉండటం చూసి బెంబేలెత్తిపోయింది కవిత.

రైలు ఆగిన వెంటనే, దిగి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది.

అక్కడ అప్పుడే స్ప్రుహలోకి వచ్చిన ఒక యువతి, చేతిలో పిల్లాడితో కూర్చోనుండటం చూసి...ఏమిటి?’ అనే విధంగా కురులను పైకెత్తి కళ్ళతో అనిల్ ను అడిగింది.

వేడుక చూస్తున్న గుంపు, ఇక చూడటానికి ఏమీ లేదని ఒక్కొక్కరూ ఒక సలహా ఇస్తూ చోటు నుండి జరిగి వెడుతున్నారు.

జరిగింది కవితకు వివరించాడు అనిల్.

ఎదురు చూసిన దానికి మారుగా కవిత ఎందుకు అనవసరమైన పని?’ అనేటట్టు మొహం చిట్లించుకుంటూ చూసింది.

అనిల్ , నీ ప్రాణాన్ని అడ్డువేసి ఈమెను కాపాడటం నీ మూర్ఖత్వం. టైములో నీకేమైనా అయ్యుంటే?”---ఆవేశంగా అడిగింది.

అత్యవసర క్షణంలో అవన్నీ ఆలొచించే అవకాశం దొరకలేదు అనేది వివరించి చెప్పాలనుకున్నాడు. కానీ, వివరణనూ ఓర్పుగా వినే మనో పరిస్థితిలో ఆమె లేదు.

ఇలా అనవసరమైన విపరీతాలను తాను పనిగట్టుకుని తన మీద వేసుకునే ఇతన్ని నమ్మి ఎలా పెళ్ళిచేసుకోను?’ అనే స్వార్ధమైన ఆలొచన ఆమె మదిలో బలంగా నెలకొంది.

ఇంతకు మించి ఆమెకు ఏదీ చెయ్యద్దు. ఈమెను ఇలాగే -- ఇక్కడే వదిలేసి వచ్చేయి. ఆమె దారి ఆమె చూసుకోనీ. లేదంటే పోలీస్ స్టేషన్లోకి తీసుకు వెళ్ళి విడిచిపెట్టు. మిగతాది వాళ్ళు చూసుకుంటారు... -- పేలింది.

రెండూ సరిలేవు. మానవత్వం లేకుండా ఇలాగే సగంలో వదిలేసి వెళ్ళటం తప్పు. పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళి వదిల్తే ఆత్మహత్యకు పూనుకుందని కేసుపెడతారు. అది ఈమెకు మరింత పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఇంకేదైనానే ఆలొచించాలి

ఇంకేం చేయాలని నీ ఉద్దేశం?”--మళ్ళీ చిటపటలాడుతూ అడిగింది.

ఒక్క రాత్రికి మాత్రం నీతో పాటూ ఉంచుకో? రేపు సావకాశంగా విచారించి...ఆమె ఇంటికి తీసుకు వెళ్ళి దింపేద్దాం

ఇలాగే వదిలేసి రమ్మంటుంటే...ఈమెను చూసుకోవలసిన పని కూడా నా దగ్గర ఇస్తున్నావా?”

అనవసరమైన సమస్య వద్దు...అనే హెచ్చరిక భావనే కవిత దగ్గర పొంగి పొర్లుతోంది.

ఆడమనిషి, తన పసిబిడ్డను గట్టిగా పట్టుకుని ఏడుస్తునే ఉన్నది.

ఆమెనే జాలిగా చూస్తూ నిలబడ్డాడు అనిల్. కవితేమో అతని తరువాతి స్టెప్ ఏం చేయబోతాడు అనేది అర్ధంకాక, విషయాన్ని అతని దగ్గరే అడిగింది.

చివరగా ఏం చేయబోతావు?”

కాస్త ఆలొచించాలి కవిత--అతని మాటల్లో ఉత్సాహం తగ్గిపోయింది.

నువ్వు ఆలొచిస్తూ ఉండు. అనవసరంగా బాధ్యతలను మోయాల్సిన ఇంటెరెస్ట్ నాకు లేదు. నాకంటే నీకు ఆమే ముఖ్యమైతే...నేను వెళ్తాను

గబగబా వెళ్ళిపోయింది.

కవిత ఇలాంటి ఒక స్వార్దపరురాలు అనేది ఇప్పుడే అతనికి అర్ధమయ్యింది. ప్రేమించుకునేటప్పుడు ఎవరు తమ నిజ గుణాలను బయటపెట్టి ప్రేమిస్తారు?

ఆమె సిగ్నల్ లైటు దాటి వెలుతుంటే, ఎర్రగా వెలుగుతున్న రెడ్ లైట్, అతను అనవసరమైన చిక్కుల్లో, శ్రమలో చిక్కుకోబోతాడని  హెచ్చరిక చేయటం అతనికి అర్ధంకాలేదు. ఆమె వెళ్ళిపోయి తరువాత కనబడకుండా పోయింది.

కవిత వెనక్కి తిరిగి వస్తుందేమోనని ఎదురు చూసిన అతనికి మనుషుల దగ్గర దయ, జాలి భావాలు తగ్గిపోతూ వస్తోంది అనేది అతనికి గుర్తుచేసింది.

కొంచంసేపు ఆలొచించాడు. తరువాత ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలాగా ఆమె దగ్గరకు వెళ్ళి లేవండి, వెళదాం అన్నాడు.

అది కొంచం కూడా ఎదురు చూడని ఆమె, తలెత్తి అతన్ని చూసింది.

ఆమె మొహం ఆశ్చర్యంతోనూ, షాక్ తోనూ ఉండిపోవటం చూసాడు అనిల్.

***********************************************PART-3*******************************************

సౌందర్య--- పుట్టిన వెంటనే ఆమె మొహంలోని తేజస్సు చూసి కన్నవాళ్ళు ఆమెకు పెట్టిన కారణ పేరు.

తండ్రి పంచాయతీ ప్రెశిడెంట్ కాబట్టి, ఊరికే ముద్దు బిడ్డగా చెలామణి అయ్యింది. ఆమె తోటి వయసున్న ఆడపిల్లలు, ఆమెతో స్నేహంగా ఉండటానికి గర్వపడ్డారు.

గ్రామంలోని కుర్రకారు, ఆమె పెద్దింటి అమ్మాయికావటంతో అనవసరమైన గొడవలు వద్దనుకుని మర్యాదగా నడుచుకుంటారు.

నగర నాగరికత ఎక్కువగా తొంగి చూడని గ్రామం అది. తన తండ్రికి సొంతమైన సినిమా హాలులో సినిమా చూడటం మాత్రమే ఆమె ఆటవిడుపు.

కానీ, అందరి అమ్మాయల లాగానే ఆమె దగ్గర యుక్త వయసు తన పని చేయటం మొదలుపెట్టింది. సినిమాలలో వచ్చే హీరోలలాగానే తనకీ ఒకడు భర్తగా రావాలనే భావన ఆమెలో పుట్టి బలపడింది. తన కలలో, అతని మొహాన్ని వెతకటం మొదలు పెట్టింది.

అప్పుడు మోహన్ వచ్చి నిలబడటంతో, ఈజీగా అతని దగ్గర మనసు పొగొట్టుకుంది.

ఇతను పదో క్లాసు వరకు, ఆమె సహ విద్యార్ధిగానే ఉన్నాడు. అంతకంటే పై చదువులు చదవటానికి అతని దగ్గర వసతి లేకపోవటంతో అక్కడితో చదువు ఆపేశాడు. తన బంధువుల సహాయంతో హైదరాబాద్ వెళ్ళి పనిలో జేరినట్లు సౌందర్య తెలుసుకుంది.

అప్పుడంతా అతను ఎలాంటి బెడదా ఏర్పరచింది లేదు. కానీ, మధ్య మధ్య గ్రామానికి వచ్చి వెళ్ళేటప్పుడే ఆమె ఉనికిలోకి రావడం మొదలుపెట్టాడు.

కళ్ళకు వేసిన కూలింగ్ గ్లాసులు, అతని చుట్టూ పొర్లుతున్న ఒక విధమైన వస పరుచుకునే సెంటు వాసన, అతను వేసుకునే విధ విధమైన రంగుల దుస్తులు, కాళ్ళకు వేసుకునే కొత్త రకం చెప్పులు, షూలు., అంటూ గ్రామానికి తెలియని ఒక్కొక్కటీ అతన్ని ఒక హీరోలాగా ఆమెకు ఎత్తి చూపినై.

అతని మొత్త నడక-డ్రస్సింగ్-స్టయిలూ నగర నాగరికతను ప్రతిఫలింపటంతో...గ్రామమే ఆశ్చర్యంతో తిరిగి చూసింది.

అంతవరకు చదువు మీద శ్రద్దను చూపిన సౌందర్య, తరువాత చదువు వైపు నుండి వాడిపై శ్రద్దను చూపటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే, తన యొక్క కలల కధా నాయకుడు అతనిలాగానే ఉండటంతో, ప్రేమ జ్వాల ఆమెను బలంగా అంటుకుంది.

ప్రేమకు కళ్ళు లేవు అంటారు. అందులోనూ చూసిన వెంటనే ప్రేమ’ (లఫ్ అట్ ఫస్ట్ సైట్) అంటే అడగనే అక్కర్లేదు. కన్నవాళ్ళు, తెలిసినవాళ్ళు, బంధువులు అంటూ ఎవరి గురించి పట్టించుకోదు. జాతి, మతం, కులం, భాష అని దేనినీ చూడదు.

ప్రేమ విజయవంత మవుతుందా, ప్రేమ వెనుక లాజిక్కు, ప్రేమ తరువాత ఉన్న జీవితం గురించి ఆలొచించదు.

సౌందర్య కూడా ఏదీ ఆలొచించలేదు. కలత చెందలేదు. ఆమె దగ్గర గుడ్డితనమైన ప్రేమ మాత్రమే పైకెదిగి నిలబడ్డది.

ప్రేమను మోహన్ దగ్గర చెప్పినప్పుడు అతని వలన అది నమ్మసఖ్యం కాలేదు. ఈమె నన్ను ఆటపట్టించి గొడవకు లాగుతోందిఅనే అనుకున్నాడు. కానీ, ఆమె తన ప్రేమలో ఖచ్చితంగా ఉన్నది అని గ్రహించినప్పుడు తడబడకుండా అంగీకరించాడు.

ఊరే ఆమెను మర్యాదతో చూస్తున్నప్పుడు, ఆమే  తనని ప్రేమిస్తోంది అని తెలుసుకున్నప్పుడు అతని మనసులో కాకరపువొత్తులు, చెరుకును చూసినంతగా నోరు ఊరినప్పుడు, చెరుకే ఇష్టపడి వచ్చి విందు పెడితే చేదుగా ఉంటుందా ఏమిటి?

జాతి, అంతస్తు దాటి ప్రేమ జయిస్తుందా అని అతను కూడా కలత చెందలేదు. మధ్య మాటి మాటికీ గ్రామానికి వచ్చి వెడుతున్నాడు. ఎక్కువ ఉత్సాహంతో కనబడుతున్నాడు.

సౌందర్యతో అతన్ని చాలామంది చాలా చోట్లలో చూసారు. ఎక్కువగా వాళ్ళను సందేహించలేదు. సందేహించిన కొంతమంది మనకెందుకు పెద్దింటి గొడవఅని చూసీ చూడనట్టు ఉండిపోయారు.

ప్లస్ టూ తరువాత కాలేజీ చదువు చదవాలని ఇష్టపడింది సౌందర్య. బయట ఊరంతా  వెళ్ళి పెద్ద చదువులు చదవక్కర్లేదుఅని తండ్రి ఖచ్చితంగా చెప్పాడు.

దేనికి భయపడి ఆయన ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారో, అది ఇప్పుడే, ఇక్కడే, తన గ్రామంలోనే జరుగుతున్నదని పాపం ఆయనకు తెలియదు.

ఇంట్లో ఆమె వివాహం గురించి మాటలు మొదలు పెట్టిన విషయం సౌందర్య తెలుసుకుంది. పరీక్షల తరువాత మోహన్ ను కలుసుకోవటమే కష్టమవుతుందో?’ అని భయపడింది.

తన ప్రేమ గురించి తల్లి-తండ్రి దగ్గర మాట్లాడటానికీ ధైర్యం లేదు. అందులోనూ మోహన్  తో అంటే, జాతిని చూపి ఖచ్చితంగా కుదరనే కుదరదు అంటారు.

ఏం చేయాలి అని ఆలొచిస్తున్నప్పుడు, హైదరబాదుకు పారిపోదామని, కన్నవాళ్ళ కోపం తగ్గిన తరువాత గ్రామానికి రావచ్చని సలహా చెప్పాడు ప్రేమికుడుతాను చేతి నిండుగా సంపాదిస్తున్నట్టు, బాగా చూసుకుంటూ కాపాడతానని వాగ్ధానం చేశాడు. ఇంకో దారి కనిపించకపోవటంతోనూ, ప్రేమ మత్తులోనూ సౌందర్య కూడా దానికి సరేనంది.

ఒక రోజు తెల్లవారు జామున, ప్రేమ పక్షులు రెండూ హైదరాబాద్ వైపుకు ఎగిరిపోయినై అని గ్రామం అర్ధం చేసుకున్నప్పుడు షాక్ తో మునిగిపోయింది.

ఇలాగూ జరుగుతుందా?’ అని ప్రజలు ఆశ్చర్యపోయారు.

కొంచం కొంచంగా ఊరు సౌందర్య ఇంటి ముందు కూడింది. ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది తల్లి. తుండుతో నోటిని మూసుకుని కోపంతోనూ, దుఃఖంతోనూ నీరసంగా కూర్చుండిపోయాడు తండ్రి. ఆయనకు ఏం చెప్పి సమాధాన పరచాలో తెలియక చాలామంది దూరంగానే నిలబడ్డారు.

బంధువులలోని కొంత మంది మహిళలు సౌందర్య తల్లి దగ్గర కూర్చుని సమాధన  పరిచారు. కాలం చెడిపోయిందనిఅందరూ గొణుకున్నారు.

కుటుంబాన్ని ఇష్టపడని వారో, మనసులో ఆనందపడ్డారు. అది తెలియకుండా కృర తృప్తి చెందారు.

కొందరు మోహన్ తల్లి-తండ్రులను కొట్టడానికి తయారైయ్యారు. వాళ్ళను ఊరి నుండే వెలివేయాలని ఆవేశపడ్డారు.

కొందరు సమకాలికులు 'గౌరవ హత్య ' గురించి గుసగుసలాడు కున్నారు.

కొంత సమయం తరువాత సౌందర్య తండ్రి ఒక తీర్మానానికి రావడంతో చెప్పాడు:

ఇది నాకూతురు చేసిన తప్పు. ఆమెను ముద్దు చేసి పెంచి మేము తప్పు చేశాము. దీనికి వేరే ఎవరూ కారణం కాదు. మోహన్ వాళ్ళ తల్లి-తండ్రులను కొట్టటమో, దండిచడమో న్యాయం కాదు. దయచేసి మమ్మల్ని ఏకాంతంగా ఉండనివ్వండి -- అని వణుకుతున్న స్వరంతో అందర్నీ చూసి చెబుతూ నమస్కరించాడు.

విపరీతమైన ఆవేశంలోనూ, పంచాయతీ ప్రెశిడెంటు తీర్పు న్యాయంగా ఉన్నదని అక్కడి ప్రజలు శాంతించి, ఆయన మాటకు కట్టుబడిన వారిలాగా గుంపు గుంపుగా అక్కడ చేరిన వారు అక్కడ్నుంచి కదిలేరు.

వేదన మాత్రం...ఇక నేను ఇక్కడే పర్మనెంటుగా ఉండబోతానుఅంటూ ఇంట్లో చతికిలపడి కూర్చుంది.

***********************************************PART-4*******************************************

బయట ఒకటి, రహస్యంగా ఒకటి అని రెండు జీవితాలు జీవిస్తున్నాడు మోహన్. అతను మంచివాడుఅనే ఒక మోహమే సౌందర్య కు కనబడింది.

నిజమైన మొహాన్ని అతను చాలా జాగ్రత్తగా సౌందర్య కు కనబడకుండా దాచి పెట్టాడు. అదే అతని వ్యాపారం. చట్టానికి విరుద్దమైన వ్యాపారం.

అయినా కానీ, చట్టాన్ని--గౌరవించే వారికి లంచాలుఇస్తూ రావటంతో, అదే అతని వ్యాపారానికి రహస్య కాపలాగా ఉన్నది.

గ్రామం నుండి నగరానికి వచ్చిన వెంటనే ఒక నీడ ప్రపంచ దాదా దగ్గర అతని ఉద్యోగం ఏర్పాటు అయ్యింది. ప్రారంభంలో అది అతనికి నచ్చలేదు. దానికి తోడు భయంగా ఉండేది.

కానీ, చేతిలోకి వస్తున్న డబ్బు, ఎలాంటి బాధ్యతా-కలత లేని జీవితమూ, ఆడవారి సావాసం, అతన్ని జీవితానికి కట్టిపడేసింది.

గత రెండు సంవత్సరాలలో, డబ్బు కోసం ఎలాంటి మహా కిరాతకమైన పనినైనా చేయటం మొదలు పెట్టాడు.

ఇది ఏదీ సౌందర్య కు తెలియదు. కొన్ని సంధర్భాలలో అతని వ్యాపారం గురించి అడిగేది. తెలివిగా ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకునే వాడు.

జీవితం సంతోషంగా గడుస్తూ ఉండటంతో, ఇక ఆమె దేని గురించీ దిగులు పడలేదు. మోహన్ కూడా సౌందర్య కు ఎటువంటి కొరత రాకుండా జాగ్రత్త పడుతూ చూసుకున్నాడు.

వాళ్ళకు బిడ్డ స్వప్నా పుట్టి ఒక సంవత్సరం అయ్యింది.

పక్కింటి ఏడుకొండలు అన్నయ్య, సరస్వతి వదిన వాళ్లకు ఆదరణగా ఉన్నారు. మిగతా వారు కూడా వాళ్ళ దగ్గర ప్రేమగానే నడుచుకున్నారు. అలాంటి సమయంలోనే సౌందర్య జీవితంలో ఎదురుచూడని పిడుగు పడింది.

మోహన్ యజమాని, ఎదురు చూడని పరిస్థితులలో సౌందర్య ను చూశేశాడు. ఆమె అందానికి ముగ్దుడయ్యాడు. మోహన్ దగ్గర తన ఇష్టాన్ని బహిరంగంగానే చెప్పాడు.

మోహన్ కూడా దానిని చాలా సింపుల్ గా తీసుకున్నాడు. అతని చరిత్రలో ప్రాతివత్యం, నిజాయతీ లాంటి మాటలకు చోటు లేదు. అంతే కాకుండా, యజమాని గోవర్ధన్ తో మరింత సన్నిహితంగా ఉండటానికి ఇదొక సంధర్భం అనుకున్నాడు.

సౌందర్య మాత్రం కొంచం సహకరిస్తే, వ్యాపారంలో తన పొజిషన్ చాలా పెద్దదిగా పెరుగుతుంది అని ప్లాను వేశాడు. నేను తప్ప ఆమెకు ఇంకెవరూ లేరు కాబట్టి ఆమె నేను చెప్పేది వినే తీరాలి అని అనుకున్నాడు.

ఒక రోజు మోహన్ ఇంట్లో యజమాని గోవర్ధన్ కు స్పేషల్ మధ్యాహ్న విందు ఏర్పాటు చేయబడింది. సరస్వతి వదిన వచ్చి సౌందర్య కు సహాయం చేయటంతో...వంట పనులు చేసి ముగించారు. వెళ్ళేటప్పుడు సరస్వతి సౌందర్య దగ్గర ఇంటికొచ్చే గెస్టును మంచిగా చూసుకోఅని చూచాయగా చెప్పేసి వెళ్ళింది. సరస్వతి వదిన చెప్పిన దాంట్లోని లోపలి అర్ధం అప్పుడు సౌందర్య అర్ధం చేసుకోలేదు.  

యజమాని గోవర్ధన్ వచ్చిన వెంటనే విందు ఏర్పాటుకు ముఖ్యమైన కారణం ఏమిటో చెప్పిన తరువాత ఆమె అల్లాడిపోయింది.

పిచ్చి ఎక్కిన మృగం ఒకటి తన మీద దూకటానికి తయారుగా ఉండటాన్ని గ్రహించింది. పరిస్థితి విషమించే లోపే ఇల్లు వదిలి తప్పించుకోవాలిఅని నిర్ణయించుకుంది.

ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం అనేది సౌందర్య కే తెలియలేదు. ఊయలలో పడుకోనున్న బిడ్డ స్వప్నాను ఎత్తుకుని పిచ్చి పట్టిన దానిలాగా బయటకు పరిగెత్తింది.

సౌందర్య అలా చేస్తుందని కొంచం కూడా ఎదురు చూడని మోహన్, గోవర్ధన్ అదిరిపడ్డారు.

సౌందర్య వేగంగా పరిగెత్తుకు వెళ్ళిన చోటు....

పోలీస్ స్టేషన్!

అక్కడున్న అధికారి దగ్గర తన పరిస్థితి వివరించింది. అధికారి ఒక కానిస్టేబుల్ ను పిలిచాడు. ఆమెతో వెళ్ళి ఆమె భర్తను లాక్కురమ్మన్నాడు.

కానిస్టేబుల్ తో కలిసి ఇంటికి వచ్చింది సౌందర్య. అప్పుడు ఇంట్లో నుండి ఎవడో ఒకడు బయటకు వచ్చాడు.

అతన్ని చూసిన వెంటనే కానిస్టేబుల్ అడిగాడు ఏమిటి తుకారాం, ఎలా ఉన్నావు?”

నేను బాగున్నానయ్యా అన్నాడు అతను చేతులు కట్టుకుని.

మరు క్షణం ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఈమే నా భార్య అయ్యా అన్నాడు తుకారాం. సౌందర్య కి తల తిరిగింది.

కొద్ది సేపటి ముందు వరకు భర్తతో తాను కాపురం ఉన్న ఇంట్లో, ఇప్పుడు ఎవరెవరో ఉన్నారు. భర్త అక్కడ లేడు!

అయ్యా...ఇది నేనూ, నా భర్త రెండు సంవత్సరాలుగా కాపురం ఉంటున్న ఇల్లయ్యా ఆవేశంగా చెప్పింది.

కానిస్టేబుల్ కు ఇప్పుడు విషయం అర్ధమయ్యింది.

అయినా కానీ కఠినత్వం చూపించాడు. ఇది మీ ఇల్లు అనడానికి ఏదైనా ఆధారం ఉందా?”

సౌందర్య ఆలొచించింది.

మోహన్ తో కలిసి ఒక ఫోటో కూడా తీయించుకోలేదు. ఆమె ఆశపడినప్పుడు మోహన్ ఏవో మాటలు చెప్పి వద్దన్నాడు.

అతను కట్టిన తాళికి ఇప్పుడు అర్ధం లేకుండా పోయింది.

తమ పెళ్ళిన రిజిస్టర్ చేసుకోవాలనే హెచ్చరిక భావం ఆమెలో ఎప్పుడూ ఏర్పడింది లేదు.

మోహన్ మీద ఆమెకు అంత నమ్మకం. తనకు సపోర్టుగా ఏదీ లేదని ఆమె గ్రహించినప్పుడు భయపడింది. ఏం చేయాలనేది తెలియక ఆందోళనతో నిలబడున్నప్పుడు...

పక్కింట్లోంచి ఏడుకొండలు అన్నయ్యా, సరస్వతి వదినా బయటకు వచ్చారు. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది సౌందర్య కు. హడావిడిగా వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది.

అన్నయ్యా! ఎవరేవరో నా ఇంట్లో ఉండి, ఇది వాళ్ళ ఇల్లు అని చెబుతున్నారు. మోహన్ కూడా కనబడటం లేదు. మీరైనా పోలీసుల దగ్గర నిజం చెప్పండి -- బ్రతిమిలాడింది.  

ఎవరమ్మా నువ్వు? తుకారామూ, అతని భార్య ఐదారు సంవత్సరాలుగా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు  సౌందర్య ఉలిక్కిపడేలాగా  ఒక్కసారిగా అబద్దం చెప్పాడు ఏడుకొండలు.

ఇంతకు ముందు మేము నిన్ను చూసిందే లేదే...ఎవరమ్మా మోహన్? అలాంటి వారు మాకు ఎవరూ తెలియదే! వంతు పాడింది సరస్వతి.

కొంత సేపటికి ముందు వరకు తనతో కలిసి నవ్వుతూ మాట్లాడి, వంట చేసిన సరస్వతేనా ఇలా మాట్లాడుతోంది? ఎందుకు వాళ్ళు ఇలా తలకిందలుగా మారిపోయి మాట్లాడుతున్నారు?’

ప్రపంచమే చీకటైపోయినట్టు అనిపించింది...చుట్టూ గుమికూడిన వాళ్ళు వేడుక చూశారు గానీ, ఎవరూ ఆమె సహాయానికి రాలేదు.

కానిస్టేబుల్ చెప్పాడుఅమ్మా...నువ్వేదో మనసు గందరగోళంలో ఉన్నావు. ఇక్కడున్న వారందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. నా దగ్గర అబద్దం చెప్పరు. నువ్వే బాగా ఆలొచించి మీ ఇల్లు ఎక్కడుందో గుర్తుకు తెచ్చుకుని మీ ఇంటికి వెళ్ళు చేరు

ఆమెను అక్కడే వదిలిపెట్టి అతను అక్కడ్నుంచి బయలుదేరాడు.

ఆమె తపించిపోయింది.

***********************************************PART-5*******************************************

ఇక్కడున్న వాళ్ళందరికీ పిచ్చి పట్టిందా? లేక నేను పిచ్చిదాన్ని అయిపోయానా?’ అనే గందరగోళంలో పడ్డది సౌందర్య.

ప్రేమ గల నాన్న, అభిమానం చూపే అమ్మ, బద్రత నిండిన ఇల్లు, ఆందోళన పడకుండా చుట్టి తిరిగే గ్రామం, గౌరవించి మర్యాద చూపే ప్రజలు...వీటన్నిటినీ వదిలేసి, మోహన్ గురించిన వివరమూ తెలుసుకోకుండా వాడితో లేచి వచ్చేసి ఇలా అవస్త పడుతున్నామే?’ అని తన మూర్ఖత్వానికి నొచ్చుకుంది.

అదే సమయం చోట ఉన్న ప్రతి క్షణమూ, తనకి ఆపద అని హెచ్చరిక భావం ఆమె మెదడులో వెలిగింది.

మోహన్ చాలా చెడ్డవాడు. ఇక్కడున్న వాళ్ళందరూ వాడితో చేతులు కలిపిన గుంపే అనే భావం ఏర్పడిన వెంటనే ఆమె ఒళ్ళు భయంతో వణికింది.

పరిగెత్తుకుని వెళ్ళి కానిస్టేబుల్ ను చేరుకుంది. అతని వెనుకే వెళ్ళింది.

మళ్ళీ పోలీస్ స్టేషన్...

సౌందర్య ని మాటి మాటికీ చూస్తూ అధికారి దగ్గర భవ్యంగా ఏదేదో చెబుతున్నాడు కానిస్టేబుల్. అర్ధమయినట్టు తల ఊపాడు అధికారి.

ఇంతలో ఫోన్ మోగింది. అధికారి తీసి మాట్లాడాడు. సరే నండి...సరే నండి అని చెప్పి...చివర్లో నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేశాడు.

సౌందర్య దగ్గరకు కానిస్టేబుల్ తో కలిసి ఆ అధికారి వచ్చాడు. నువ్వేదో మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లు ఉన్నావు. కూర్చుని బాగా ఆలొచించు. మీ ఇంటికి వెళ్ళి చేరటానికి ప్రయత్నించు. లేకపోతే పిచ్చాస్పత్రిలో తీసుకు వెళ్ళి చేర్చాల్సి ఉంటుంది. నీకు ఇంకా ఒక గంటే టైముంది. ఆరు గంటల తరువాత ఒక మహిళను మేము స్టేషన్లో ఉంచుకోకూడదు అని హెచ్చరించాడు అధికారి.

ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలసట కారణంగా కూర్చుండిపోయింది. స్వప్నా ఆకలితో ఏడవటం మొదలు పెట్టింది.

అధికారి ముందు కూర్చోనున్న ఒకరు , అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్నారు. ఆయన్ని చూస్తేనే ఒక డబ్బుగల రాజకీయ వ్యక్తి అనేది అర్ధమయ్యింది. సౌందర్య ను చూపించి వ్యక్తి పోలీసు అధికారి దగ్గర ఏదో చెప్పాడు. రాజకీయవేత్త మాటలను కాదనలేని పరిస్థితిలో అధికారి ఉన్నట్టు తెలుస్తోంది.

మళ్ళీ ఇంకెవరితోనో ఫోనులో మాట్లాడాడు. సరి...సరి అని చెప్పి ముగించి, అధికారి, వ్యక్తితో సౌందర్య దగ్గరకు వచ్చాడు.

ఇలా చూడమ్మా, ఈయన పెద్ద వ్యాపరవేత్త. ప్రబలమైన రాజకీయవేత్త. ఈయన ఇంటికి వెంటనే ఒక పనిమనిషి కావాలట. ఈయనకు భార్యా, పిల్లలూ ఉన్నారు. నువ్వు ఈయనతో వెడితే నీకూ, బిడ్డకూ కావలసినవన్నీ దొరుకుతాయి. ఏమంటావ్?”

దానికి ఓకే చెప్పటం తప్ప, ఆమెకు వేరే ఏమీ తోచలేదు.

మోహన్ కు, పోలీస్ స్టేషన్ కు మంచి కాంటాక్ట్ ఉన్నదని అధికారి మాటల్లో నుండి అర్ధమయ్యింది. ఇక్కడుంటే మళ్ళీ అతని దగ్గరే అప్ప చెబుతారు లేక శరణాలయానికి పంపొచ్చు. రెండూ భయానకమైనవే.

కాబట్టి, తాత్కాలికంగా బద్రత దొరికే చోటికి వెళ్ళిపోవాలీ అని నిర్ణయించుకుంది.

ఈయన ఇంటికి మోహన్ రాలేడని, అధికారి ఆయన దగ్గర చూపిన మర్యాద నుండే అర్ధమయ్యింది. పనిమనిషిగా వెళ్లటానికి అంగీకరించింది. ఆయన తన కారులోనే తీసుకు వెళ్ళాడు.

ఆమె పరిస్థితిని భార్యకు వివరించాడు. ఆవిడ కూడా అభిమానంగానే నడుచుకుంది. తినటానికి తిండి, మార్చుకోవటానికి దుస్తులు, ఉంటానికి చోటూ ఇచ్చింది.

ఒక పెద్ద బురద గుంటలో నుండి తప్పించుకు వచ్చిన భావంతో కొత్త ఇల్లు ఆమెకు కావలసిన బద్రత ఇచ్చినట్టు అనిపించింది.

తన కన్న వాళ్ళను గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా...వాళ్లకు తాను చేసిన నమ్మక ద్రోహానికి తనకు శిక్ష అవసరమేనని తనని తాను తిట్టుకుంది. బిడ్డ స్వప్న కోసం తనని పూర్తి సమయం పనిమనిషిగానే మార్చుకుంది.

కానీ, ఆమెను తరమటం మొదలు పెట్టిన విధి, ఆమెను మళ్ళీ మళ్ళీ తరుముతూనే ఉంది.

ఒక రోజు పెళ్ళి రిసెప్షన్ కి అందరూ కారులో బయలుదేరుతుండగా, వ్యాపారవేత్త కొడుకు మాత్రం...తల నొప్పిగా ఉంది. నేను రావటం లేదుఅని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాడు. అతనికి కావలసినవి చేసి పెట్టమని సౌందర్య దగ్గర చెప్పేసి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు.

అలాంటి ఒక సందర్భం కోసమే ఎదురు చూస్తున్న అతను, తనకు కావలసిందిఅడిగాడు.

ఎంతో నిదానంగా అతనికి అది తప్పని చెప్పింది. అతను వినేటట్టు లేడు. అందులోనేతీవ్రంగా ఉన్నాడు. చివరికి బలాత్కారం చేయటానికి పూనుకున్నాడు.

ఏంతో బ్రతిమిలాడింది. అతనో సంధర్భాన్ని జారవిడుచుకోవటానికి సిద్దంగా లేడు.

సౌందర్య తప్పించుకుంది. బిడ్డ స్వప్నతో దగ్గరున్న గదిలోకి పరిగెత్తి గొళ్లెం వేసుకుంది.

అదృష్ట వసాత్తూ రూములో టెలిఫోన్ ఉన్నది.

వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మని చెప్పింది.

ఎందుకు?” అని ఆయన అడిగేలోపు ఫోన్ కట్ చేసింది.

అతను గది తలుపును మూర్ఖత్వంగా కొడుతున్నాడు.

మీ నాన్నా-అమ్మకు ఫోన్ చేశాను. వాళ్ళు తిరిగి వస్తున్నారు అని ఎదిరించి అరిచింది.

అతను భయపడుంటాడు. మౌనంగా ఉండిపోయాడు.

బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేంతవరకు తలుపులు తెరవకూడదుఅని అనుకుని, బిడ్డను హత్తుకుని ఒక చివరగా కూర్చుని ఏడవటం మొదలు పెట్టింది.

ఒక్కొక్క క్షణమూ అవస్తతో గడిచింది. హాలులో శబ్ధం వచ్చినప్పుడు...వ్యాపార వేత్త కుటుంబీకులు తిరిగి వచ్చేసిన భావం కలిగింది.

వాళ్ళ దగ్గర ఏదేదో చెప్పాడు కొడుకు. అందరూ వచ్చి తలుపు తట్టారు. తలుపులు తీసుకుని బయటకు వచ్చిన సౌందర్య, జరిగింది చెప్పింది.

అతనో ఆమె చెప్పిన దానికి బిన్నంగా చెప్పి, సౌందర్య పైన తప్పును వేశాడు.

అక్కడ జరిగిందేమిటో కన్నవారు ఊహించారు. అయినా కానీ కొడుకును నమ్ముతున్నట్టు చూపించుకోవటం తప్ప వాళ్ళకు వేరే దారి లేదు. సౌందర్య పై నేరం మోపి మాట్లాడారు.

చివరకు తన బిడ్డను తీసుకుని మళ్ళీ వీధికి వచ్చింది. తుఫానలో చిక్కుకున్న చెక్క పడవ దారితెలియక సముద్రంలో కొట్టుకుంటునట్టు అయ్యింది ఆమె పరిస్థితి.

కళ్లకు అందినంత దూరంలో తీరం కనబడని పరిస్థితిలో చెక్క పడవలో ఉన్న వాళ్ళు చావా,....బ్రతుకా? అనే సందిగ్ధంలో పడ్డట్టుంది ఆమె పరిస్థితి.

కాళ్ళు వెళ్ళిన వైపుకు నడిచింది. అలసటగా ఉన్నట్టు అనిపించినప్పుడు, చెట్టు నీడలో కూర్చుంది. ఆదరణకు ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియటం లేదు.

వేరే ఎవరి దగ్గరా పని అడగటానికి భయపడ్డది. చూసిన మగవాళ్ళందరూ తనని బలత్కారం చేయాలని ఆలొచిస్తునారని వణికిపోయింది.

తల్లి-తండ్రుల అవసరం పూర్తిగా అర్ధమైయ్యింది. నుదుటి మీద కొట్టుకుంటూ ఏడ్చింది.

ఆకలి కడుపును గిల్లుతోంది. బిడ్డ కూడా ఏడుస్తోంది.

మరుసటి పూట భోజనానికి ఏం చేయాలి?’----ఏం చేయాలో తెలియక అలమటించింది.

అడుక్కుంటేనే గాని దొరకదు. కానీ దానికి మనసు చోటు ఇవ్వటం లేదు. పంచాయతీ ప్రెశిడెంటు కూతురు, కోట్ల ఆస్తికి ఒకే వారసురాలు, హైదరాబాద్ రోడ్లలో అడుక్కొవటమా?

ఎంత మంది పేద ప్రజలకు పండుగ రోజులలో తన చేతుల మీదగా ఆహారం-తిండి గింజలు, పంచె- చీరలు ఇచ్చుంది.

రోజు ఒక పూట ఆహారానికి దారిలేదు. మార్చుకోవటానికి దుస్తులు లేవు.

చిన్న వయసులో చూసిన ఒక సినిమా కథలో లాగా తన జీవితం అయిపోయిందే అని కుమిలిపోయింది.

సమయంలో ఆమెకు ఒక ఐడియా తట్టింది.

అవును, సినిమా కథలో హీరోయిన్ తీసుకున్న నిర్ణయమే తనకు కూడా సరిపోతుందని నిర్ణయించుకుంది. తనూ అలాగే ఆత్మహత్య చేసుకోవటమే సమస్యకు పరిష్కారం అని తీర్మానం చేసుకుంది.

ఎలా చచ్చిపోవాలి?’--- సౌందర్య ఆలొచిస్తున్నప్పుడు దగ్గరగా రైలు వెడుతున్నశబ్ధం  వినబడింది.

అటువైపుకు నడిచింది.

చోటే మౌలాలి రైల్వే  స్టేషన్.

***********************************************PART-6*******************************************

జరిగే ప్రతిదానికీ భగవంతుడే కారణంఅని అనుకునే వాడు అనిల్.

మధ్యకాలం వరకు సౌందర్య కి కూడా దేవుడి మీద అపరిమితమైన నమ్మకం ఉండేది.

కానీ తనకు విధి సరిలేదు. అందుకనే కష్టానికి పైన కష్టం వస్తోందని నమ్ముతోంది. దేవుడి మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది. దేవుడో లేక విధియో...ఇక జరుగబోయేవన్నీ కష్టాలుగానే ఉంటాయని అప్పుడు వాళ్ళు అనుకోలేదు.

లేచిరా వెళదాం అని అనిల్ చెప్పిన వెంటనే ఎక్కడికీ?’ అనేలాగ చూసింది సౌందర్య.

దఢ-ఆశ్చర్యం-భయం కలిసిన భావ కలియుక ఆమె ముఖంలో కనబడింది. అతను తనని అక్కడే, అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనే ఎదురు చూసింది. లేచిరా, వెళదాంఅనగానే షాక్ తో చూసింది.

ఇతను ఎవరు? ఇతన్ని నమ్మి, ఇతనితో వెళ్దామా?

లేకపోతే ఇంకెక్కడికి వెళ్లేది?

ఆత్మహత్య చేసుకుందామా?’

ఇప్పుడు అది కూడా ఆమె వల్ల కాదు. మరణం యొక్క వాకిటి వరకు వెళ్ళి తిరిగి వచ్చిన ఆమెకు మరణ భయం అతుక్కుపోయింది. మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నించే ధైర్యం లేదు.

అనిల్ చెప్పాడు. నన్ను నమ్మండి. నా వల్ల మీకు కష్టమూ ఏర్పడదు

తన ఆలొచన పరుగును అతను సరిగ్గా అర్ధం చేసుకోవటాన్ని గ్రహించిన ఆమె, “క్షమించండి. నా పరిస్థితి పలు రకాలుగా ఆలొచింప చేస్తోంది. నన్ను అలాగే వదిలేసుంటే... పాటికి సమస్య ముగిసేది. నేనింకా ఏమేమి కష్టాలను కలుసుకోవాలొ?” -- అని చెప్పి ఏడ్చింది.

దాని గురించి తరువాత మాట్లాడుకుందాం. మొదట లేవండి వెళదాం

ఎక్కడికి?” అన్నది కన్ ఫ్యూజన్ తీరకపోవటంతో!

మొదట మనం చోటును విడిచి వెళ్దాం. అందరూ మనల్ని వేడుక చూస్తున్నారు

మెల్లగా లేచి తడబడుతున్న నడకతో అతన్ని ఫాలో చేసింది.

రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన వెంటనే హోటల్లో ఆమెకు భోజనం కొనిచ్చాడు. బిడ్డకు కావలసినవి కొనిచ్చాడు.

మౌనంగానే ఉన్న ఆమె దగ్గర అడిగాడు, “మీ గురించిన వివరాలు చెబితే, తరువాత ఏం చేయాలనేది నిర్ణయించటానికి వసతిగా ఉంటుంది

సంశయించి, సంశయించి -- తాను ఇంతవరకు జీవించిన జీవితం గురించి చెప్పింది. ఊరు పేరు, తల్లి-తండ్రుల పేర్లను చెప్పకుండా దాచింది.

అనిల్ అడిగాడు, “మోహన్ దగ్గరకు ఇక వెళ్ళొద్దు. కానీ, కన్న వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళోచ్చు కదా?”

హడావిడిగానూ, ఖచ్చితంగానూ వెళ్ళనన్నది.

అలా వెళ్ళాలనుకొనుంటే పోలీస్ స్టేషన్ నుండే మా ఊరికి తిన్నగా వెళ్ళుండేదాన్ని. తల్లి-తండ్రీ నన్ను అల్లారు ముద్దుగా పెంచారు. పరిస్థితిలో వాళ్ళ దగ్గరకు వెళ్ళి చేరటానికి నాకు ఇష్టం లేదు. అలా వెడితే వాళ్లకు పైపైన కష్టాలనూ, అవమానం నూ ఇస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నా విధి నాతోనే ముగియనివ్వండి -- ఖచ్చితంగా చెప్పింది.

ఈమెను ఏం చేయాలి?” --- ఆందోళన పడ్డాడు.

రాత్రి సమయం ఎనిమిది. సమయంలో ఎక్కడ ఉంచాలి అనే కన్ ఫ్యూజన్ అతన్ని బాధపెడుతోంది.

రకరకాలుగా ఆలొచించి, చివరగా చెప్పాడు, “రండి. నా గదికి వెళదాం

మీ గదికా?” ఆశ్చర్యంగా అడిగింది.

ఏం?...భయంగా ఉందా? నా మీద మీకు నమ్మకం రాలేదా?”

ఇప్పుడు మీ పైన భయమూ లేదు. నన్ను చావనివ్వకుండా అడ్డుకున్న విధి, ఇంకా నాకు ఎన్ని కష్టాలను ఇవ్వబోతోందో తెలియదుకానీ, మీ గదికి నన్ను తీసుకు వెడితే మీకు అనవసరమైన సమస్య ఏదీ రాదా?”

రావచ్చు...ఆది సమస్యగా ఉంటుందో ఆలొచించే సమయం ఇది కాదు. ఇప్పుడు మీ బద్రతే ముఖ్యం. మొదట నా గదికి వెడదాం. తరువాత వచ్చే సమస్యల గురించి ఆలొచిద్దాం

ఇద్దరూ నడిచారు. రూము దగ్గరకు వెళ్ళేలొపు పలు కళ్ళు వాళ్ళను అనుమానంతో చూసినై. మొదటి సమస్య ఇంటి యజమాని దగ్గర నుండే వచ్చింది.

గేటు తెరిచి లోపలకు వెళ్లంగానే, ‘ఆమె ఎవరు?’ అనేది తెలుసుకోవటానికి అతన్ని అడ్డగించాడు.

నా బంధువుల అమ్మాయి. ఇంట్లో కోపగించుకుని వచ్చేసింది. రేప్రొద్దున సమాధానపరిచి పంపించేయాలి

ఇంత వరకు ఇంత ఈజీగా అనిల్ అబద్దం చెప్పింది లేదు.

నమ్మాలా...నమ్మకూడదా?’ అనే అనుమానంతో వాళ్ళకు దారి వదిలేడు ఇంటి ఓనర్.

గదిలోకి వచ్చినందువలన...ఇక రాబోవు సమస్యలు రేపే వస్తాయిఅని కొంచం ప్రశాంతత చెందాడు అనిల్.

డ్రస్సు మార్చుకున్న అతను, చాపా/ పరుపు తీసుకుని సౌందర్య దగ్గరకు వచ్చాడు.

గది తలుపులు గొళ్లెం పెట్టుకుని...మంచం మీద పడుకుని హాయిగా నిద్రపొండితరువాత ఏం చేయాలనేదాని గురించి రేప్రొద్దున ఆలొచిద్దాం

గది బయట మేడ మీద పరుపు పరుచుకుని పడుకున్నాడు.

రోజు జరిగిన వాటిని మనసు కదిలించినప్పుడు బ్రమలాగా ఉన్నది. తన జీవితంలో ఇలా ఒక హఠాత్తు పరిణామం జరుగుతుందని రోజూ అతను కలలో కూడా ఊహించలేదు.

బిడ్డను హత్తుకుని పడుకోనున్న సౌందర్య కూడా నిద్ర పోలేదు. జరిగినవన్నీ గుర్తుచేసుకున్నప్పుడు భయంతో వొళ్ళు కంపించింది.

కళ్ళు మూసుకుంటే, భయపెట్టే దృశ్యాలు వచ్చి భయపెడుతున్నాయి.

అనిల్ కూడా నిద్ర పోలేకపోయాడు.రేపు ఏం చెయ్యబోతాం?’ అనే ప్రశ్న అతన్ని చిత్రవధకు గురిచేస్తోంది.

భర్త దగ్గరకూ వెళ్ళలేదు. కన్నవాళ్ళ దగ్గరకూ వెళ్ళలేదు. తానూ తన గదిలో ఉంచుకునే అవకాశమే లేదు. అలాగైతే ఈమెకు విధంగా బద్రత కలిపించేది?’

బద్రత ఇవ్వటాని కూడా దారి లేదు. బయటకు పంపటానికీ మనసు రావటం లేదు.

కళ్ళు కట్టేసి అడవిలో వదిలి పెట్టినట్టు ఉన్నదే? ఎవరి దగ్గరకు వెళ్ళి ఏం సహాయం అడగుదాం?’ అని ఎంత ఆలొచించినా దోవా కనబడలేదు.

భగవంతుడా! నేనేం చేయను?’ -- మనసులోనే గింజుకున్నాడు.

అప్పుడు అనిల్ సెల్ ఫోన్ మోగింది. తీసి చూశాడు...వరున్అనే పేరు స్క్రీన్ మీద వచ్చింది.

తాను కొల&#