హీరో...( పూర్తి నవల)
హీరో (పూర్తి నవల)
కథా కాలక్షేపం టీమ్ రాసిన రచనలలో వంద శాతం పరిపూర్ణ సృష్టి ఇది అని చెప్పగలను. ఒకేసారి ఈ నవలను చదివే వాళ్ళూ -- కొంచం సుతిమెత్తని మనసు కలిగినవారుగా ఉంటే -- ఖచ్చితంగా నవల ముగింపులో కన్నీరు కారుస్తారు.
తేట తెల్ల నీరులాగా రచన ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం. ఇందులో అది ఉంటుంది. సినిమా రంగం గురించి నవలలో చెప్పబడుతున్నందున ఆ రంగానికి చెందిన జిగినా పనులు ఇందులో కొంచం చేర్చారు.
నాకు ఎప్పుడూ చురుకుదనం చాలా ముఖ్యం. దాంతో పాటూ ఆలొచింప చేయడం ఎక్కువ ఇష్టమైన విషయం. ఈ నవలలో స్వామీజీ పాత్ర ఒకటి, ఆ ఆలొచనను ఎక్కువ ప్రేరేపిస్తుంది.
ఇదొక కుటుంబ కావ్యం...ప్రేమ కథ...కొంచం సస్పెన్స్.
ఈ మూడు కలయికతో ఇది రాసి ముగించిన పరిస్థితిలో నిజమైన ‘హీరో’ అని పేరు పెట్టారు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నవలలోకి తల దూర్చండి...మా ‘హీరో’ మిమ్మల్ని కరిగించి ఏడిపించటానికి తయారుగా ఉన్నాడు.
*****************************************************************************************************
PART-1
ఆ మనిషిని
చూసినప్పుడు ఒక
బిచ్చగాడి లాగానే
అనిపిస్తోంది. కానీ, బిచ్చగాడి
దగ్గర ఉండవలసిన
చెడువాసనకు బదులుగా
అతని శరీరం
నుండి గంధము, పన్నీరూ
కలిసినట్లుగా ఒక
సువాసన వీస్తోంది.
అశ్విన్ ను
ఆ విషయం
ఆశ్చర్యపరిచింది.
అతను చూస్తున్నప్పుడే
పెద్దాయన ఒకరు
కారులో వచ్చి
దిగి పరిగెత్తుకుని
వెళ్ళి ఆయన
కాళ్ళమీద పడ్డాడు.
ఆయనో నిర్లక్ష్యంగా
మొహం తిప్పుకున్నారు.
“నువ్వు
బాగుపడవురా...కొంచం
కూడా బాగుపడవు...” అని కూడా
తిట్టారు. అదివిని
ఆ పెద్దాయన
మొహంలో ఒకటే
సంతోషం.
అలా ఆయన
తిడితే అది
ఆశీర్వాదమేనట!
మంచి ఉత్సాహమైన
మనసుతో ఉన్నాడు
అశ్విన్. ఈ
రోజు అతనికి
స్క్రీన్ పరీక్ష.
సినిమా డైరెక్టర్
విశ్వనాద్ గారిలాగా
ఒక డైరెక్టర్
అతన్ని ‘హీరో’ గా
పెట్టి ఒక
సినిమా తీయబోతారు.
ఆయన తీయబోయే సినిమాకు
హీరో సెలెక్షన్
కోసం ఎంతోమందిని
చూసారు. ఒకరు
కూడా నచ్చలేదు.
చివరగా సెలెక్ట్
అయ్యింది అశ్విన్
అనే ఈ అశ్విన్
కుమార్.
అశ్విన్ కు
పెద్ద ప్లస్
పాయింట్ అతని
శరీరమే. ఒక
రోజుకు మూడుసార్లు
స్నానం, ఆ
తరువాత వారానికి
రెండు రోజులు
నూనె రాసుకుని
తల స్నానం.
ఇది చాలదని
రోజూ జాగింగ్, జిం
లో వ్యాయామం
అంటూ రెగులర్
గా వెళుతూ
శరీరాన్ని ట్రిమ్ముగా పెట్టుకున్నాడు.
మామూలు జలుబుకు
కూడా వెంటనే
ఒక స్పేషలిస్ట్
దగ్గరకు వెళ్ళిపోతాడు.
శరీర ఆరొగ్యం
అంటే అంత
పిచ్చి. కాలేజీ
చదువుకునే రోజుల్లోనే
అతను ఆరొగ్యంపై
పెట్టుకున్న ప్రేమ
కాలేజీ లోనే అతన్ని చాలా ఫేమస్ చేసింది. మామూలు
ఎండను కూడా
ఎప్పుడూ శరీరానికి
తగలనివ్వడు. కొంతమంది
మహిళా టీచర్లలాగా
ఎప్పుడూ గొడుగు
వేసుకునే బయటకు
వెళతాడు. వర్షానికి
కూడా ఇదే
తంతు. చిన్న
వాన చినుకులతో
తడిసినా జ్వరం
వస్తుందేమోనన్న
భయం. అన్నిటికీ
మించి అతని
ప్రకాశవంతమైన ముఖ
అందం.
మొత్తానికి అతని
శరీరమే అతనికి ప్రపంచం.
దానికి బహుమతిగానే
‘హీరో’ ఛాన్స్
వచ్చింది. అతని
శరీర అందాలు
చూసిన మాత్రానికే
‘నువ్వే
హీరో’ అని
చెప్పాసారు డైరెక్టర్.
చెప్పిన వెంటనే, ఐదు
లక్షలు జీతం
మాట్లాడి, యాభైవేలు
అడ్వాన్స్ కూడా
ఇచ్చారు.
అశ్విన్ కి ఏం
చేయాలో తెలియలేదు.
మొదటి పనిగా
కనదుర్గ గుడికి
వెళ్ళి దన్నం
పెట్టుకుని వచ్చాడు.
ఆ తరువాత
మంగళగిరి పానకాల
స్వామి, తరువాత
లబ్బిపేటలోని వెంకటేశ్వర
స్వామి గుడి
అంటూ సన్నిది, సన్నిదిగా
ఎక్కి దిగుతున్నాడు.
అతను ‘హీరో’ అయిన
విషయం తెలుసుకుని
పరిగెత్తుకు వచ్చింది
సితారా అనే సీతా రామలక్ష్మి.
అందరూ ఆమెను
సితారా అనే
పిలుస్తారు.
సితారా మొదటి పనిగా
అన్ని దేవుళ్ల
ప్రసాద విభూతిని
అతని నుదిటి
మీద పెట్టి
ముగించింది. దగ్గర
దగ్గర దాంట్లోనే
అశ్విన్ సగం
స్వామీజీ అయిపోయాడు.
అలాగే అతనికి
దిష్టితీసిన సితారా
“నా
అశ్విన్ ఇక
ఒక ‘హీరో’...” అన్నది
నవ్వుతూ.
“ఇక
కాదు...నేను
ఎప్పుడూ ‘హీరో’నే...” అన్నాడు అశ్విన్.
“అవును.
పెద్ద ‘హీరో’ ఈయన...ఏది
నాతోకలిసి ఒక
కిలోమీటర్ ఎండలో
నడిచి రండి
చూద్దాం”
“ఎందుకూ...అవసరమే
లేకుండా శరీరాన్ని
నల్ల బరచుకోవాలి
సితారా?”
“ఒక
కిలోమిటర్ నడిచినంత
మాత్రానా నల్లబడి
పోరు సార్...”
“నన్ను
వదిలేయమ్మా తల్లీ...నేను
చూసి చూసి
నా శరీరాన్ని
ఇలా ఉంచుకోవటం
వలనే డైరెక్టర్
నన్ను ‘హీరో’ గా
చూసారు. ఇది
నువ్వు జ్ఞాపకముంచుకో...” అన్న అతను
హారన్ మోత
విని వాకిటివైపు
చూసాడు.
సినిమా కంపనీ
కారు వచ్చింది.
“కారు
వచ్చేసింది. నేను
బయలుదేరతాను” -- అంటూ
నడిచినతను...తిన్నగా
తల్లి వరలక్ష్మి, తండ్రి
రఘుపతి కాళ్ళమీద
పడి ఆశీర్వాదించమని
అడిగాడు. వాళ్ళూ
ఆశీర్వదించి పంపారు.
స్టయిల్ గా
వెళ్ళి కారులో
కూర్చోగానే...కారు
బయలుదేరింది. సితారా
‘టాటా’ చూపించి
సాగనంపి లోపలకు
వచ్చింది.
“అత్తయ్యా...మావయ్యా...” అంటూనే వరలక్ష్మి, రఘుపతి
దగ్గరకు చేరుకుంది.
“సితారా...ఒక
మంచి కాఫీ
వేసి తీసుకొచ్చి
ఇవ్వవా...” అని చెప్పి
ఆ రోజు
న్యూస్ పేపర్ను
చేతిలోకి తీసుకున్నాడు
రఘుపతి.
వరలక్ష్మి భర్తను
కోపంగా చూసింది.
“చాలు
వరలక్ష్మీ...అలా
కోపంగా చూడకు!
తరువాత కంటిపాప
బయటకు పడిపోయి
‘ఆపరేషన్’ చేసేంతవరకూ
వెళ్ళిపోతుంది.
సితారా ఎప్పుడూ
సూపర్ గా
కాఫీ కలుపుతుంది.
నీలాగా కాఫీలో
నీళ్ళుపోయదు” అంటూ భార్యను
ఎగతాలి చేసాడు.
వరలక్ష్మీ దానికోసం
కోపగించుకోలేదు.
ఆమెకు తెలుసు
-- ఆయన సరదాగా
మాట్లాడుతున్నారన్నది.
సితారా కూడా
ఒక విధమైన
గర్వంతో అత్తయ్య, మావయ్యలకు
కాఫీ కలిపి
తీసుకు వచ్చింది.
“ఏం సితారా...ఈ
రోజు కాలేజీ
లేదా?”
“స్టడీ
హాలిడేస్ అత్తయ్యా!”
“అంటే...ఎక్కువ
చదువుకునే పని
ఉంటుందని చెప్పు...”
“అవును
అత్తయ్యా...బావకు
కంగ్రాట్స్ చెప్పి
వస్తానని నాన్న
దగ్గర చెప్పి
పరిగెత్తుకుని
వచ్చాను”
“కంగ్రాట్స్
చెప్పటం అటుంచు.
రేపు నీ
మెడలో తాళి
కట్టబోయే అతను
ఏదో పెద్ద
సినిమా ‘చాన్స్’ అని
వెళ్ళిపోయాడు. అలాగే
సినిమా వైపునే
వెళ్ళి, ఎవరైనా
నటి వెనుక
వెళ్ళిపోతే ఏం
చేస్తావు”
వరలక్ష్మీ సితారా మనసు యొక్క
లోతు చూసేటట్టు
అలాంటి ఒక
ప్రశ్నను అడగటమే
ఆలస్యం, సితారా
మొహం...ఎండకు
వాడిపోయిన అరిటాకులాగా
అయిపోయింది.
న్యూస్ పేపర్
చదువుతూనే రఘుపతి
భార్య మాటలు
గమనించాడు.
“వరలక్ష్మీ...దాన్ని
ఎందుకలా ఏడిపిస్తావు? నీ
కొడుకు మొదట
‘స్క్రీన్
టెస్ట్’ పాసయ్యి
-- సినిమాలో నటించి, ముగించి, ఆ
సినిమా రిలీజ్
అవనీ. ఆ
తరువాత వాడ్ని
ప్రజలు నటుడిగా
‘ఒకే’ అంటారా
అనేది ఒక
ఘట్టం ఉన్నది.
ఇంతలోపే వాడు
‘హీరో’ అయిపోయినట్టు
కలలు కనకు...”
“ఏమిటి
మీరు...ఇంత
సాధారణంగా చెప్పేసారు!
వాడి జాతకం
ప్రకారం వాడికి
ఇప్పుడు శుక్రదశ
ప్రారంభం. అందులోనూ
మరో ఇరవై
సంవత్సరాలకి మంచి
దశ మొదలుపెట్టగానే, సినిమా
చాన్స్ రావటమూ
కరెక్టుగా ఉంది
చూడండి. సినిమా
కూడా శుక్రదశకు
చెందిందే కదా!
నా కొడుకు
ఖచ్చితంగా గెలుస్తాడు.
మీరు కావాలంటే
చూడండి...” అని తన
అభిప్రాయంతో ఉచ్చస్థితికి
వెళ్ళింది వరలక్ష్మి.
“చూద్దాం,చూద్దాం...నీ
కొడుకు ‘సూపర్
స్టారు’ గా
వస్తాడా లేక
నోట్లో వేలేసుకున్న
స్టార్ గా
వస్తాడా” – రఘుపతి
కొడుకు మీద ఎందుకో
నమ్మకం లేనట్లే
మాట్లాడాడు.
“ఏంటి
మావయ్యా...ఆయన
విజయం సాధిస్తారని
మీకు అనిపించటం
లేదా...?” అని
సితారా అత్తయ్యకు
మద్దత్తు ఇస్తూ
ముందుకు వచ్చింది.
“సితారా...అందరూ
మొదట ‘పాజిటివ్
గా తింక్’ చేసి, చివరకు
‘నెగటివ్’ కు
వస్తారు. నేను
అలా కాదు.
నాకు ఏదైనా
మొదట ‘నెగటివే’
అందులోనూ సినిమా
రంగం గురించి
నేను విన్నది
నీకు చెబుతాను విను...అది
ఐదుతలల నాగుపాము
లాంటింది. దానిపైన
క్రిష్ణుడిగా ఉండగలిగితేనే
దాన్ని ఆడించగలం.
లేకపోతే పడేస్తుంది.
నీ వరకు
నువ్వు గెలిచిన
వాళ్ళను మాత్రమే
చూస్తున్నావు...గెలవని
కొన్ని వందల
మందిని నేను
చూసాను. గుంపులో
సరదాగా ప్రజలలో
ఒకడిగా ఉండాలనుకుంటే
దానికొక దారుంది.
అందులోకి వెళ్ళి
పొరపాటున నిలబడితే...నువ్వు
చచ్చేంత వరకు
ఆ గుంపులోనే
నిలబడి నాశనం
అయిపోవలసిందే. నిన్ను
పొగడి పైకి
తీసుకు రారు.
అదేలాగా నీ
మొదటి సినిమా
‘అవుట్’ అయిందనుకో...జీవితమూ
‘అవుట్’. నిన్ను
ఒక్కరూ పట్టించుకోరు, తిరిగి
చూడరు. దగ్గర
దగ్గర ఇది
ఒక జూదం
ఆట. ఒకరు
గెలవటానికి 999 మంది
ఓడిపోయే కథ...”
రఘుపతి ఒక
వివరణ ఇచ్చి
ముగించాడు. సితారాకి
కూడా ఆయన
మాటల్లో చాలా
నిజం ఉన్నట్టుగానే
అనిపించింది. కానీ, వరలక్ష్మీ
ఆ మాటలను
చెవిన వేసుకోలేదు.
‘నా
కొడుకు ఖచ్చితంగా
పెద్ద ‘హీరో’నే’ అంటూ
కాఫీని జుర్రున
లాగింది.
అది చల్లారిపోయింది.
“సరే
అత్తయ్యా...నేను
బయలుదేరతాను” అన్న సితారా
-- కాఫీ గ్లాసులు
తీసుకు వెళ్ళి
వంటగది వాష్
బేసిన్లో వేసేసి
-- చుడిదార్ దుప్పటా
అంచుతో చేతులు
తుడుచుకుంటూ బయలుదేరింది.
“సితారా...మీ
నాన్నను తరువాత
రమ్మని చెప్పు.
తాంబూలాలకు మంచి
రోజు చూసి, ముహూర్తం
పెట్టుకు రమ్మని
చెప్పాను. త్వరత్వరగా
దాన్ని ముగించే
దారి చూద్దాం...” అని ముందే
మాట్లాడుకున్న
విషయాన్ని మళ్ళీ
గుర్తుచేసేడు.
అశ్విన్, సితారాకి
సొంత అత్త
కొడుకు. చిన్న
వయసులోనే అతనికి
ఆమె -- ఆమెకు
అతను అని
నిర్ణయించబడింది.
ఈ రోజు
వరకూ దాంట్లో
ఎటువంటి రిపేరూ
రాలేదు.
పోయిన నెలలోనే
ఇద్దరికీ త్వరలోనే
పెళ్ళి చేయాలని
ఇరువైపుల నిర్ణయించుకున్నారు.
తాంబూలాలకి ముహూర్తం చూడమని
చెప్పింది వరలక్ష్మీ.
ఆ రోజు
నుంచే సితారా
కలలు కనడం
ప్రారంభించింది.
“మనిద్దరికీ
పెళ్ళి అంటేనే
దాంట్లో ఒక
త్రిల్ లేదు.
పుట్టిన దగ్గర
నుండి నువ్వు
నాకు తెలుసు.
నన్ను నీకు
తెలుసు...చాలా
బోర్...” అని అశ్విన్
కూడా ‘కమెంట్’ చేసాడు.
బయట టూవీలర్
స్టార్ట్ చేస్తున్నప్పుడు
అది జ్ఞాపకానికి
వచ్చింది. సితారా
ఆ మాటలను మామూలుగా తీసుకుంది.
కొంచం కూడా
ఎదురుచూడని అంశం
ఈ ‘హీరో
చాన్స్’!
సితారా వీధిలో
వెళ్ళేటప్పుడు
సినిమా వాల్
పోస్టర్లను చూసుకుంటూ
వెళ్ళింది. ‘అందరూ
కొన్ని సంవత్సరాలుగా
ఆ కలల
పరిశ్రమలో ఉన్న
వాళ్ళు. వీళ్ళను
పక్కకు తోసేసి
అశ్విన్ వలన
ముందుకు రావటం
కుదురుతుందా?’
కొంచం కష్టమే
అనిపించింది. రఘుపతి
మావయ్య చెప్పినట్టు
మొదటి సినిమా
విజయవంతమైతేనే
‘హీరో’, లేకపోతే
‘జీరో’ కదా?
**************************************************PART-2*********************************************
బయటున్న ఒక
అరుగు మీద
ముడుచుకు పడుకోనున్నారు
పెద్దాయన. ఆయన
చుట్టూ ఒక
గుంపు నిలబడున్నది.
అందులో కొందరు
వి.ఐ.పి
లు. అశ్విన్
కూడా కారు
ఆపమన్నాడు. ‘ఆ
పెద్దాయన నన్ను చూసి
చూసి తిడితే
నా ‘హీరో’ ప్రయత్నం
విజయం సాధించినట్లే’ అని అశ్విన్
కి ఒక
చిన్న నమ్మకం
కలిగింది. మొదట్లో
ఆయన్ని ఒక
బిచ్చగాడనే అనుకున్నాడు.
కానీ, అవసరం
అనేది వచ్చినప్పుడు
ధీమా వెనక్కి
వెళ్ళిపోతుంది
కాబట్టి -- ఆశ
ముందరకు వచ్చేస్తుందే!
ఆయనా మెల్లగా
కళ్ళు తెరిచారు.
అందరినీ పక్కకు
జరగమని చెయ్యి
ఊపి చెప్పి, అశ్విన్
ను చూసి
నవ్వుతూ ఆశీర్వాదం
చేసారు.
అశ్విన్ అయోమయంలో
పడిపోయాడు. ఆయన
భక్తుల వరకు ఆయన
తిడితేనే కదా
ఆశీర్వాదం? ఆయనేమో
తిట్టకుండా నవ్వుతూ
ఆశీర్వాదం చేసారు? ‘అంటే
నేను హీరోగా
నెగ్గలేనా? హీరోనే
అవలేనా? అదెలా? నేనే
హీరో అని
చెప్పి అడ్వాన్స్
కూడా ఇచ్చారే!
’
ఆ అయోమయంతోనే
ఆ సినిమా
కంపెనీ ఆఫీసులోకి
అశ్విన్ వెళ్లేడు.
వెళ్ళే ద్వారం
దగ్గరే ప్రొడ్యూసర్
అసిస్టంట్ కాచుకోనున్నాడు.
“రండి
సార్...రండి” -- అంటూ
మర్యాదపూర్వకంగా
అశ్విన్ ని పిలుచుకుని
లోపలకు వెళ్ళాడు.
ఆఫీసు చూసి
కళ్ళు చెదిరింది.
నేల కనబడకుండా
కార్పెట్ పరచబడి
ఉంది. చల్ల
చల్లటి ఏ.సి!
మెత్తని సోఫాలు.
సోఫాకు వేసిన
కవర్లమీద చదుర
ఆకారంలో గాజు
పలకలు.
లోపలకు చొరబడిన
క్షణం -- అశ్విన్, అద్దంలో
అతని ప్రతిబింభాలను
చూసి కొంచం
అవాక్కయ్యాడు.
“కూర్చోండి
సార్...డైరెక్టర్
ఇప్పుడు వచ్చేస్తారు...” అని
చెప్పేసి, ప్రొడ్యూసర్
అసిస్టంట్ కూడా
ఒక అద్దాల
తలుపు తోసుకుని
కనబడకుండా పొయాడు.
ఆతను అలా
వెళ్ళిన తరువాతే
తెలిసింది, అది
అద్దంతో చేయబడిన
తలుపు అనేది.
ఒక అశ్విన్
కి, నలుగురు
అశ్విన్ లు
అక్కడ కూర్చోనున్నారు.
అశ్విన్ మనసులో
చిన్నగా ఒక
ధఢ.
‘హీరోయిన్
గా తనతో
నటించబొయేది ఎవరై
ఉంటారు? పాత
నటియా...లేక
ఆమె కూడా
కొత్త ముఖమా? ఫైట్
సీన్లలో ‘డూప్’ వెయ్యాల్సి
ఉంటుందా? లేక
నిజంగానే ఫైట్
చెయ్యమంటాడా డైరెక్టర్? ’
అలా అశ్విన్
లో పలురకాల
ఆలొచనలు చోటుచేసుకున్నాయి.
“హాయ్, యంగ్
మ్యాన్!” అంటూ గాలిలాగా
లోపలకు వచ్చాడు
డైరెక్టర్. అశ్విన్
లేచి నిలబడ్డాడు.
“నో
ఫార్మాలిటీస్. మొదట
కూర్చోండి...”
“..........................”
“సరే...నిలబడు.
నువ్వు చెయ్యబోయే
ఈ సినిమాకూడా
నిలబడాలి...” -- అని, తాను
రాసిన ‘డైలాగు’ లాగానే
మాట్లాడారు.
సమాధానంగా చిన్నాగా
నవాడు అశ్విన్.
అప్పుడు అసిస్టంట్
డైరెక్టర్ లోపలకు
వచ్చాడు. అతని
చెంకలో ఒక
ఫైలు.
“సార్...ధియేటర్
రెడీ” అన్నాడు.
“రా
అశ్విన్...వెళదాం” అంటూ అతన్ని
పిలుచుకుని నడిచాడు
డైరెక్టర్. అసిస్టంట్
డైరెక్టర్ చెప్పిన
‘మేకప్
ధియేటర్’ చల్లటి
ఏ.సి
తో, రాక్చస
అద్దం –
సింహాసనం లాంటి
గుండ్రంగా తిరిగే
కుర్చీతో దర్శనమిచ్చింది.
అశ్విన్ కి ఏదో
ఒక కొత్త
లోకంలోకి ‘వీసా...పాస్
పోర్టు’ లేకుండా
చొరబడ్డట్టు అనిపించింది.
“కూర్చోండి...” అన్నాడు డైరెక్టర్.
అశ్విన్ కూర్చున్నాడు.
మేకప్ వేసే
అతనికి ఏవో
ఆదేశాలు, సూచనలూ
ఇచ్చేసి బయటకు వచ్చాసాడు డైరెక్టర్.
మేకప్ మ్యాన్ తల
ఊపి, అశ్విన్
దగ్గరకు వచ్చి
అతని చెంపలను
చూసాడు. “దేవుడ్ని
ప్రార్ధించుకుందామా?” అంటూ
అడిగిన మేకప్
మ్యాన్ ఒక
కొబ్బరికాయ మీద
కర్పూరం పెట్టి
వెలిగించాడు.
‘మేకప్’ అద్దాన్ని, అశ్విన్
ను కలిపి
దిష్టి తీసి, అలాగే
తన అసిస్టంట్
దగ్గర ఆ
కొబ్బరికాయను ఇచ్చేసి, చేతులు
జోడించి దన్నం
పెట్టుకుని ముగించాడు.
“మొట్టమొదటి
సారిగా మీకు
మేకప్ వేస్తున్నాను.
మీరు బాగా
పైకి రావాలి.
నాకూ బోలెడు
చాన్సులు వచ్చి, నా
వ్యాపారం బ్రహ్మాండంగా
నడవాలి.” అని
మాట్లాడుతూనే మెత్త
మెత్తగా ఉండే
రోస్ పౌడర్
స్పాంజ్ తీసి
అశ్విన్ మొహం
మీద పూయటం
మొదలుపెట్టాడు.
ఒక్కొక్క మగాడికీ, జుట్టు
కత్తిరించుకునేటప్పుడు
అలాగే నిద్రలోకి
జారుకుందామని ఆశగా
ఉంటుంది.
లోకంలో ఎన్నో
సుఖాలు! అందులో
ప్రధానమైన సుఖం
సలూన్ లో
దొరికేదే. పడుపు
వృత్తిలో ఉన్నవారు
ఎంత శ్రమపడినా
కూడా ఇలాంటి
ఒక సుఖాన్ని
ఇవ్వలేరు. అందులోనూ
రెండు చేతులలోని
పదివేళ్ళతో తలను
కడిగి -- అలాగే
జుట్టులోపలకు దూర్చి
విడదీసి -- తరువాత
దువ్వెనతో దాన్ని
అనిచి నిలబెట్టి
పట్టుకుని 'సరక్, సరక్' అంటూ
కత్తెరతో కత్తిరిస్తున్నప్పుడు
అలాగే రోజంతా
ఉందామా అని
అనిపిస్తుంది.
ఇక్కడ కూడా
దగ్గర దగ్గర
అలాగే ఉంది.
సుమారుగా ఒక
గంటసేపు దాకా
పనిచేసి అశ్విన్
యొక్క కురులను, మీసాలను
అన్నిటినీ మార్చి...మొహాన
ఒక కొత్త
వెలుగును సృష్టించి, అద్దంలో
చూసుకోమన్నప్పుడు, అశ్విన్
అతని దగ్గర
అడిగాడు... “ఎవరండి
ఇది?”
మేకప్ మ్యాన్
నవ్వాడు. డైరెక్టర్
కూడా వచ్చాడు.
అశ్విన్ ని నిలబెట్టి
అటూ, ఇటూ
పలు కోణాలలో
నుండి చూసాడు.
చివరగా “సూపర్” అన్నాడు.
మేకప్ మ్యాన్
పెద్ద నిట్టూర్పు
విడిచి,
"సార్...తప్పించుకున్నారు.
మీరే హీరో..."
అన్నాడు.
“మేకప్
వేసుకోవటానికి
ముందే, నేనే
హీరో అని
చెప్పి, యాభైవేలు
అడ్వాన్స్ కూడా
ఇచ్చారు...”
“అదంతా
మామూలే సార్...షూటింగ్
జరుగుతున్నప్పుడే
ఒకతన్ని వెళ్ళిపొమన్నారు.
ఇది...”
“అయ్యయో...
అలాగంతా కూడా
జరుగుతుందా?”
“అవును...మనిషి
అందంగా ఉంటే
సరిపోతుందా? నటించటం
రావాలే. బొమ్మలాగా
నిలబడితే ఎవరు
వచ్చి నటిస్తారు...?”
‘మేకప్
మ్యాన్’ యదార్ధాన్ని
చెప్పి భయపెట్ట, అశ్విన్
కడుపులో కొంచం
తిప్పటం జరిగింది.
‘ఒకవేల
తనకీ అలాంటి
ఒక పరిస్థితి
వచ్చేస్తే...?’ -- భయపడుతూనే, తరువాతి
ఘట్టమైన ‘ఫోటో
సెషన్’ కు
తయారయ్యాడు. అంతకు
ముందు మేకప్
మ్యాన్ సహాయకుడు
ఒకడు వచ్చి
అశ్విన్ ని
పై నుండి
కిందకూ, రెండు
వైపులకు వెళ్ళి
ఒకసారి చూసాడు.
తరువాత కొంచం
పక్కకు వెళ్ళి
ఒక పెట్టిని
తీసుకు వచ్చాడు.
అలా వచ్చేటప్పుడు
సడన్ గా
అశ్విన్ వైపు
ఒక చూపు
చూసాడు. తరువాత
అతని దగ్గరకు
వచ్చి “ఎప్పుడూ
మీసాలను ఇలాగే
ఉంచుకుంటావా?” అని
అడిగాడు.
“అవును...ఎందుకు
అడుగుతున్నావు?”
“లేదు...నీకు
చదుర ముఖం.
ఇలా మీసం
పెడితే సుమారుగానే
ఉంటుంది. కింద
చిన్నగా ఒక
ఫ్రెంచ్ గడ్డం
పెడితే పెద్ద
నిపుణుడి లుక్కు...ఈ
మొహానికి వచ్చేస్తుంది” అన్నతను పెట్టెను
తీసాడు. లోపల
చాలా మేకప్
వస్తువులు. బోలెడు
బ్రష్ లు, కత్తెరలు, లోషన్లు, రోస్
పౌడర్, చిన్న
మీసాలు, గిరదాలు...
మనిషిని తలకిందలుగా
మార్చే ఒక
లోకమే దాంట్లో
దాగున్నది అప్పుడే
చూసాడు అశ్విన్.
కొంచం తనని
విలేజ్ మనిషిగా
ఫీలయ్యాడు. వచ్చినతను
పని ప్రారంభించాడు.
“చొక్కా
విప్పేసి ఆ
కుర్చీలో కూర్చోండి” అన్నాడు.
“నేను
నటసామ్రాట్ అక్కినేని
నాగేశ్వరరావు గారికే
‘మేకప్’ వేసిన
వాన్ని...!” అంటూనే అశ్విన్
తలమీద చెయ్యి
పెట్టి జుట్టును
చెదర గొట్టేడు.
తరువాత వేళ్లతో
కొలిచి పని
చూపించడం మొదలుపెట్టాడు.
అరగంటలో అశ్విన్
తలకిందలుగా మారిపోయాడు.
అతనికే అతని
ముఖం చూస్తే
ఆశ్చర్యంగా ఉన్నది.
కొత్తగా ఒక
జన్మ ఎత్తినట్టు
కూడా అనిపించింది.
“ఇది
పెద్ద బడ్జెట్
సినిమాట...బయటి
దేశాలకంతా వెళ్ళి
ఖర్చు పెట్టబోతారట.
సినిమా హిట్
అయితే నువ్వు
కూడా ఎక్కువ
డబ్బు సంపాదించవచ్చు.
ఆ తరువాత
ఈ హైదర్
ను జ్ఞాపకం
పెట్టుకుంటారా?”
“మీ
పేరు హైదరా?”
“సరీపోయింది.
సినిమాలు చూసేటప్పుడు
టైటిల్స్ చూసే
అలవాటు లేదా?”
“చూస్తాను.
అందులో వంద
పేర్లు వస్తాయి.
అన్నిటినీ జ్ఞాపకం
ఉంచుకోగలనా...? అందులోను
ఆ టైటిల్స్
ఒక్క క్షణం
కూడా వుంచరు.
చిన్న చిన్న
అక్షరాలతో రాస్తారు”
“అది
కూడా కరెక్టే.
ఇప్పుడు చెబుతాను
వినండి. ఒక
సినిమా తయారవటానికి
కనీసం ఎనభై
ఐదుమంది నుండి
నూటపది మంది
కావాలి. ఇందులో
మొదట పది
పేర్లు మేకప్
మ్యాన్స్. మేము
ముసలి వాళ్ళను, యువకులుగా
మారుస్తాం, యువకులను
ముసలివారుగా మారుస్తాం.
మీకు నటి
జయశ్రీ అంటే
ఇష్టమేనా?”
“ఊ...గ్లామర్
ఆర్టిస్ట్ కదా...ఇష్టం
లేకుండా పోతుందా?”
“ఆమె
గ్లామర్ అంతా
డూపు సార్.
ఆమెకు యద
కూడా లేదు.
అంతా మన
ఏర్పాటే. ఒక
బ్రా ఉంది.
దాని వెల
పదిహేడు వేలు.
అది వేసుకుంటే
ఎవరైనా సరే, ఇరవై
సంవత్సరాలు తగ్గిపోతుంది...”
“అలాగైతే
ఇరవై ఏళ్ళ
అమ్మాయి వేసుకుంటే, పుట్టిన
పిల్ల అయిపోతుందా?” -- అశ్విన్
జోక్ వేసాడు.
హైదర్ అనబడే
అ మేకప్
మ్యాన్ కూడా
నవ్వాడు.......చివరగా
మేకప్ మ్యాన్
ఒక ‘నోట్
బుక్’ ను
తీసి అశ్విన్
ముందు జాపాడు.
“ఏమిటిది?”
“బహుమతి...నాకెంత
టిప్స్ ఇస్తారో
రాయండి...”
“బహుమతా...?”
“అవును...నేను
మేకప్ వేసిన
ఈ ముఖాన్నే
‘ఫోటో’ తీయబోతారు.
ఇదే మొహంతో
మీరు నటించి
గెలిస్తే, దానికి
నేనే కదా
కారణం?”
“గెలిచిన
తరువాత మాట్లాడుకుందామే...”
“అప్పుడు
మాట మారిస్తే...?”
“అదంతా
మార్చను. ఇదేమిటి
కొత్త విధమైన
వసూలు లాగా
ఉంది?” -- అన్నాడు.
తరువాత ఫోటో
తీసే చోటుకు
తీసుకు వచ్చారు.
అక్కడ అతనికి
దుస్తులు మార్చబడ్డాయి.
దగ్గర దగ్గర
ఇరవై ప్యాంట్లూ
-- షర్టులూ తొడిగి
విప్పాడు. కాళ్ళూ, చేతులూ
అలసిపోయినై. తొడిగి
విడిచిపెట్టినవన్నీ
ఒక రెడీమేడ్
షాప్ సరకు.
అది ఇచ్చినతనే
తీసి మడత
పెట్టుకుంటున్నాడు.
చివరగా ఒక
డ్రస్సు ఓ.కే.
అవటంతో “వీటిని
కొట్టుకే తీసుకు
వెళ్ళండి” అన్నాడు ఫోటోలు
తీసే ఫోటోగ్రాఫర్.
“అవన్నీ
ఏం చేస్తారు?” అడిగాడు
అశ్విన్.
“చెత్తలో
పడేయగలమా? బట్టల్లో
బట్టగా కలిపేసి
అమ్మేయటమే...”
“అయ్యో...కొనేవాళ్ళు...”
“మీరు
వచ్చిన పని
చూసుకోండి...” నవ్వుతూ చెప్పాడు
రెడీమేడ్ షాప్
అతను.
అశ్విన్ మొహం
మీద పలు
దిక్కుల నుండి
వెలుతురు వచ్చి
పడింది. వచ్చే
వెలుతురును వడకట్టే
‘ఫిల్టర్లు’ ను
కొంతమంది పట్టుకున్నారు...ఒక్క
ఫోటో తీయడానికి
ఇంత హడావిడి
అవసరమా అని
అనిపించింది.
చివరగా ఫోటో
ఒకటి తీయబడింది
-- దాన్ని కంప్యూటర్
తెరమీద వేసి
చూసినప్పుడు, అశ్విన్
‘హీరో’ గా
కన్ ఫర్మ్
చేయబడ్డాడు. అంతవరకు
అతని కళ్లకు
కనబడని నిర్మాత
గబుక్కున అతని
ముందు ప్రత్యక్షమై
చేయిచ్చి కంగ్రాట్స్
చెప్పాడు.
“తమ్ముడూ...మీకు
మంచి భవిష్యత్తు
ఉంది...ఎక్కువ
శ్రమపడితే తెలుగునాట
మీరు ఇరవై, ఇరవై
ఐదు సంవత్సరాలు
జమాయించవచ్చు. ‘హీరో’ అంటే
ఫాన్స్ కి
పిచ్చి పట్టించాలి.
అలాగే కరెంటు
లాగా నిలబడాలి” అంటూ ఆయనకు
తెలిసినందంతా చెప్పి
కంపెనీ కారులోనే
ఇంటికి పంపించారు.
అశ్విన్ కి
అంతా వ్యత్యాసంగానూ
-- కొత్తగాను ఉన్నది.
మేకప్ ను
తుడుచుకోకుండా
అలాగే తల్లి-తండ్రి
ఎదురుగా వెళ్ళి
నిలబడ్డాడు. ఇద్దరూ
బెదిరిపోయారు.
“అశ్విన్...నువ్వారా?”
“సాక్షాత్
నేనే...ఈ
అవతారంలో నా
పేరు క్రిష్ణా...”
“అబ్బో...ఎంత
అందంగా ఉన్నావు
నువ్వు...”
“కారణం...’మేకప్
మ్యాన్’ అనే
బ్రహ్మ”
“నిజమే...ఇప్పుడే
నువ్వు ఇంత
అందంగా ఉన్నావే...నీ
యొక్క సినిమా
గెలిచి, నువ్వు
ప్రభలమైతే ఎంత
జోరుగా ఉంటుంది?”
“నువ్వు
చెప్పేసావు కదమ్మా...ఇక
శుక్రదశే! ఇరవై
సంవత్సరాలు నా
రాజ్యమే...” గర్వంగా కాలరు
పైకిలేపి పైకెత్త
-- ఫోను మోగింది.
వరలక్ష్మి వెళ్ళి
ఫోను ఎత్తింది.
అవతలపక్క సితారా.
“అత్తయ్యా!
ఆయన వచ్చేసారా?”
“ఊ...ఇప్పుడు
నువ్వు వాడ్ని
చూసావంటే...అదిరిపోతావే...”
“అలా
ఏం చేసారు?”
“వాడు
ఇప్పుడు హీరో
మేకప్ లో
ఉన్నాడే. వస్తావా...? వచ్చి
చూడు...”
“ఆయన
దగ్గర ఫోన్
ఇవ్వండి...” ఆమె చెప్పగా, రిసీవర్
ఇప్పుడు అశ్విన్
చెవికి మారింది.
“చెప్పు
సితారా!”
“ఏమిటి
సార్...వేసుకున్న
మేకప్ కడుక్కోవటానికి
మనసు రావటం
లేదా?”
“ఇది
అడగటానికే ఫోన్
చేసావా?”
“లేదు
లేదు… వెళ్ళిన పని
ఏమైందని తెలుసుకోవటానికి...”
“ఇక
నాకు శుక్రదశ
సితారా. విజయం
పైన విజయం.
బయటి దేశాలకు
వెళ్ళబోతాను...”
“అదరగొడుతున్నావే...తరువాత?”
“ఏమిటి
తరువాత, వెంట్రప్రగడ
వాడి దగ్గర...ఇప్పుడు
మాట్లాడినట్టు, అప్పుడంతా
నాతో మాట్లాడలేవు...తెలుసుకో...”
“ఏమిటి...ఇప్పుడే
సినిమా చూపిస్తున్నావా?”
“సరే సితారా...నువ్వు ఎక్కువ సుత్తి వేస్తున్నావు...పెట్టేయ్!” -- ఫోను కట్ చేసాడు. చూస్తూ నిలబడ్డ వరలక్ష్మీ, రఘుపతి కూడా వాడు గర్వ పడుతున్నట్టే అనిపించింది.
**************************************************PART-3*********************************************
ఎప్పుడూ మనం
జీవిస్తున్న తరుణమే
నిజమైనది. ఎలా
జీవిస్తున్నామో
జ్ఞాపకాలలో రిజిస్టర్
అయ్యి...ఉన్న
కాలంగానూ, భవిష్యత్
కాలంగానూ వెడుతుంది.
ఒక్కొక్క క్షణాన్నీ...నిన్న--రేపు
అనే ఆలొచనలు
లేకుండా ఎవరైతే
ఒకరు అనుభవించి
జీవిస్తారో వాళ్ళ
జీవితంలో ముప్పాతిక
భాగం విజయవంతంగానే
ఉంటుంది.
కానీ, అలా
జీవించటానికి జీవితం
వదలదే...?
అశ్విన్ ను చూడటానికి
తన స్కూటర్
మీద బయలుదేరి
వస్తున్న సితారాకి
అడ్డుగా వచ్చి
నిలబడ్డారు ఆ
బిచ్చగాడిలా ఉండే
స్వాములోరు. ఉలిక్కిపడ్డ
సితారా సడన్
గా బ్రేకు
వేసింది. కోపంగా
ఆయన్నే చూసింది.
ఆయన సితారాని
చూసి నవ్వుతూ
“వదలద్దు...వాడ్ని
వదలద్దు...వాడ్ని
అటువైపుకు పోనివ్వకు...” అన్నాడు.
“ఎవర్నీ? ఎటు
పక్కకి...?”
ఆయన నవ్వుతూ
రోడ్డుకు అవతలపక్కకు
వెళ్ళిపోయారు.
ఆమెకు అర్ధం
కాలేదు.
ఆ రోజు
ఆ సినిమా
మొదలవటానికి పూజ.
స్టూడియో స్థలం
చుట్టూ తోరణాలు, అరటి
చెట్లు కట్టి
బ్రహ్మాండమైన అలంకారం
చేసారు. కట్
అవుట్...స్వాగతం
పలికే పువ్వుల
వలయాలుతో ఒకటే
హడావిడిగా ఉంది.
స్టూడియో గేటు
నుండే విపరీతమైన
జనం. అశ్విన్
పూర్తి మేకప్
లో ఒక
కుర్చీలో కూర్చోనుండగా...అతనిపై
కెమేరాల యొక్క
వెలుతురు పడుతూనే
ఉంది.
అతనూ ఏదో
ఒక కొత్త
ప్రపంచంలో దేవ
కుమారుడిలాగా ఫీలవుతూ
కూర్చున్నాడు.
పూజకు అతని
తల్లి-తండ్రీ, సితారా
అంటూ అందరూ
వచ్చి విజిటర్స్
వరుసలో కూర్చున్నారు.
కొద్ది సేపటి
తరువాత ప్రఖ్యాత
గ్లామర్ నటి
ఒకామె వచ్చింది.
పైన రెండు
హ్యాండ్ కర్చీఫ్లతో
జాకెట్టు కుట్టి
వేసుకుంది. గ్రౌండ్
లాగా అలా
ఒక గాలిపడటానికి.
అశ్విన్ ఆమెపై
పెట్టిన చూపులను
మరల్చుకోలేకపోయాడు.
ఆమె దగ్గర
నుండి గుప్పుమని
పెర్ ఫ్యూం
వాసన రావటంతో...నరాలు
జివ్వునలాగినై.
ఆమె ‘హలో’ అన్నది.
అతనూ చెప్పాడు.
ఆమె తల
వెంట్రుకలను జడలాగా
వేసుకోనూ లేదు...ముడీ వేసుకోలేదు.
అలాగే వదిలేసింది.
తల వెంట్రుకలు
గాలికి అప్పుడప్పుడు
ముఖానికి ముందు
పడటం, ఆమె
దాన్ని పక్కకు
తోసి తోసి
వదులుతోంది.
చూడనట్లే చూసాడు
అశ్విన్.
విజిటర్స్ గ్యాలరీ
గుంపులో కూర్చోనున్న
సితారాకి ఆమె
రూపం కళ్ళు
కుట్టింది. వరలక్ష్మికి
నచ్చలేదు.
“సితారా!
ఈమె ఏమిటి
బాత్ రూములో
నుండి అలాగే
వచ్చేసిందా...లేక
ఆమె ఇంట్లో
రిబ్బన్-హార్
పిన్ లాంటివి
లేవా?” అని
అడిగింది.
ఆమె దగ్గరకే
అందరూ వచ్చి
నవ్వి, నవ్వి
మాట్లాడ, ఆమె
వెకిలి నవ్వులు
నవ్వింది. అప్పుడు
చున్నీ పక్కకు
జరుగ ఫోటోగ్రాఫర్లు
ఆ దృశ్యాన్నే
పదే పదే
ఫోటోలు తీసారు.
సితారాకి లేచి
వెళ్ళి ఆమెపై ఒక
దుప్పటి వేసొస్తే
మంచిది అని
అనిపించింది.
ఇంతలో పూజకు
కావలసిన వస్తువుల
ప్లేట్లు రావటంతో...ఇంకొక
జుట్టు విరబోసుకున్న
ఒక జన్మ
‘జీన్స్
ప్యాంటు, టీ
షర్టు’ లో
మైకును చేత
పుచ్చుకుని ఆంగ్ల
భాషలో పూజ
జరగబోతోందని అనౌన్స్
చేసింది.
అందరూ గబ
గబా సర్దుకున్నారు!
ఆ జీన్స్
మాట్లాడింది.
“ఈ
సినిమా ఒక
బ్రహ్మాండమైన ప్రయత్నం.
చాలా ప్రత్యేకంగా
-- వయసులో ఉన్న, కొత్తగా
ఉన్నఒక యంగ్ మ్యాన్ తో,
కొత్త కథతో...ఇంతవరకు
ఎవరూ తీయని
విధంగా తీసే
ప్రయత్నం. కొత్త
‘హీరో’ అశ్విన్
నటించబోతారు. ఈయన
ఈ సినిమాలో
నటించటాని కోసం
అమెరికా నుండి
ఆంధ్రప్రదేశ్ కు
వచ్చారని నిర్మాత
చెప్పారు. హీరోయిన్
కూడా మీ
ఊరు కాదు...నార్త్
ఇండియా. మొత్తానికి
ఇది ఒక
యువ జాతరగా
ఉండబోతుంది. అందులో
సందేహమే లేదు...” అన్నది.
సితారా నోరు
వెళ్ళబెట్టింది.
వరలక్ష్మిని చూసి, “అత్తయ్యా!
ఏమిటీ భయంకరమైన
అబద్దం. మీ
అబ్బాయి హైదరాబాదులోనే
చాలా చోట్లను
చూడలేదు. ఇందులో
ఈ మనిషి
అమెరికా నుండి వచ్చాడని
వాగి పారేస్తోందే...” అన్నది.
“సినిమా
అంటే కల్పన
అని, అబద్దం
అని విన్నానే.
కానీ ఇంత
భయంకర అబద్దంగా
ఉండటాన్ని ఇప్పుడే
చూస్తున్నా” అన్నది.
రఘుపతి గారు లేచారు.
“ఏమిటండి...”
“నేను
బయలుదేరుతాను వరలక్ష్మీ...”
“ఎక్కడికి...?”
“ఇంటికే...నేను
ఇక్కడుంటే తరువాత
ఏదైనా గొడవ
చేసేస్తాను. వస్తాను...”
ఆయన మౌనంగా
నడిచారు.
వరలక్ష్మీ ఆయన్ని
ఆపలేకపోయింది. సితారాని
చూసింది.
“మావయ్య
వెళ్లటం ఒక
విధంగా మంచిదే” అన్న సితారా
“పూజ
చూడండి...” అన్నది.
శాస్త్రులు ఒకరు
‘క్లాప్’ చెక్క, ఫిల్మ్
కెమేరా, స్క్రిప్ట్
ఫైలు అన్నిటినీ
పెట్టి పూజ
చేయటానికి రెడీగా
ఉన్నారు. పెద్ద
గుమ్మడి కాయ, కొబ్బరి
కాయలూ అంటూ
ఆయన చుట్టూ
అవి పట్టుకుని
నిలబడ్డారు.
ఫోటోగ్రాఫర్ల గుంపు
ఎక్కువ అయ్యింది.
అందరికీ ఆ
నటే గ్లామర్
పాయింటుగా ఉన్నది.
అప్పుడప్పుడు అశ్విన్
తో నవ్వుతూ
మాట్లాడి అతనికి
వేడెక్కించింది.
మధ్యలో కర్పూరం
ప్లేటు వచ్చింది.
కళ్ళకు అద్దుకున్నారు.
పండ్లు వచ్చినై.
ఒక ముక్క
తీసుకుని నోట్లో
వేసుకున్నారు.
భ్రమ పట్టినట్టు
చూస్తూనే ఉన్నాడు
అశ్విన్.
పూజలోని ఒక
అంశంగా, ప్రైవేట్
టీ.వీ
ఛానల్ వారు
అశ్విన్ ముందు
మైకు జాపి, “ఈ
సినిమాలో మీ
రోల్ ఏమిటి?” అని
అడిగారు.
“ఇందులో
‘హీరో’ గా
చేస్తున్నాను. ఇది
ఒక ప్రేమ
కథ. నేను
మొదట్లో ఒక
పేద అమ్మాయిని
లవ్ చేస్తాను.
అప్పుడు నేనూ
పేదవాడినే. సంధర్భం
రావటంతో ఒక
పెద్ద డబ్బుగల
వాడిని అవుతాను.
డబ్బు రావటంతో
నా గుణం
మారిపోతుంది. డబ్బుగల
అమ్మాయిని పెళ్ళి
చేసుకుంటాను. అందువలన
ప్రేమించిన పేద
కుటుంబ అమ్మాయి
మనసు విరిగి
ఆత్మహత్య చేసుకుంటుంది.
ఆమె కళ్ళూ, మిగిలిన
అవయవాలు నేను
పెళ్ళి చేసుకోబోతున్న
అమ్మాయికి తరువాత
అమర్చటంతో నా
భార్య నా
పాత ప్రేమికురాలుగానే
ఉండటమే కథ.
క్లైమాక్స్ ఎవరూ
కొంచం కూడా
ఊహించలేరు...”
అశ్విన్ ఏదో
వంద సినిమాలలో
నటించిన వాడిలాగా
మాట్లాడుతూనే ఉన్నాడు.
సితారా అలాగే
మాయలో ఉండిపోయింది.
ఇల్లు!
వరాండాలోని ఈజీ
చైర్లో పడుకున్నట్టే
కనిపించారు రఘుపతి.
లోపల వరలక్ష్మి
పడుకోనుంది. ‘డైనింగ్
టేబుల్’ మీద
డిన్నర్ తయారుగా
ఉండటంతో...దగ్గర
కూర్చుని ఒక
నవలను చదువుతూ
ఆవలింతలతో అవస్థపడుతోంది
సితారా.
టేబుల్ పైన
ఒక కవరు
ఉంది! దాని
మీద ప్రభుత్వ
ముద్ర. అశ్విన్
పేరు మీద
వచ్చింది. నిశ్శబ్ధంగా
ఉన్న ఆ
ఇంట్లో గోడ
గడియారం పెండులం
శబ్ధం మాత్రం
క్షుణ్ణంగా వినబడుతోంది.
నిశ్శబ్ధాన్ని
డిస్టర్బ్ చేసింది
కారు హారన్
శబ్ధం. దిగింది
అశ్విన్! ‘ప్రొడక్షన్
మేనేజర్’ కొంచంగా
అతని చెయ్యి
పుచ్చుకుని ఇంటి
గుమ్మం దాకా
వచ్చి విడిచిపెట్టి
వెళ్ళాడు. ఆ
తరువాత ఉగిపోకుండా
-- తూలిపోకుండా నడవటానికి
ప్రయత్నించి తడబడ్డాడు
అశ్విన్.
రఘుపతి చూడగా, సితారానూ
అతన్ని గమనించింది.
అశ్విన్ తాగున్నాడు!
అడిగితే...’పార్టీలో
బలవంతంగా తాగించారు’ అంటాడు.
అందుకని సితారా
ఏమీ అడగలేదు.
రఘుపతి గారు మాత్రం
బాధతో అరిచారు.
“ఏమిట్రా
ఈ తూలుడు...మందు
కొట్టావా?”
“అదొచ్చి
నాన్నా...”
“తెలుసురా...తెలుసు.
నువ్వేం చెప్పబోతావో
బాగానే తెలుసు.
సినిమా అంటే
తాగాలనే బలవంతం
ఏమీ లేదురా.
మా కాలంలో
ఎన్.టి.ఆర్
దాన్ని చేత్తోనే
ముట్టుకోలేదు...”
“సారీ
డాడ్...”
“నీ
బొంద. నీ
ప్రారంభమే సరిలేదురా...”
-- భయంకరంగా
అరిచారు రఘుపతి
గారు. పరిగెత్తుకు
వెళ్ళి ఆయన
నోరు మూసింది
సితారా.
“మావయ్యా!
వదలండి...అంతా
సరైపోతుంది...”
“ఏమిటి
సరిపోయేది? వీడ్ని
ఈ గవర్నమెంట్
ఉద్యోగానికి వెళ్ళమని
చెప్పు. ఆ
సినిమానూ వద్దు, వాడి
బొందా వద్దు...”
“ఏ
గవర్నమెంటు ఉద్యోగం?”
అతని నాలిక
తడబడింది. డైనింగ్
టేబుల్ మీద
ఉన్న కవర్ను
తీసుకు వచ్చింది
సితారా. మౌనంగా
కవర్ను ఓపన్
చేసి అందులోని
కాగితాన్ని అతని
ముందు జాపింది.
“ఆయిల్
అండ్ న్యాచురల్
గ్యాస్ కంపెనీలో
ఆఫీసర్ ఉద్యోగం...” అన్నది చిన్న
స్వరంతో.
“జీతం?”
“నలభై
వేలు...”
“నువ్వూరుకో
సితారా...నేను
ఈ సినిమాను
ముగించి ఇది
వంద రోజులు
ఆడితే నా
ఒకరోజు జీతం
ఇది...”
“సరే...పొద్దున్నే
మాట్లాడుకోవచ్చు.
డిన్నర్ కు
రండి...”
“నొవ్వొక
దానివి...పార్టీలో
బాగా తినేసి
వచ్చాను. ఇప్పుడు
నేను పడుకోవాలి.
తరువాత...రేపట్నుంచే
షూటింగ్. ఇక్కడ
ఒకరోజే. ఆ
తరువాత ఒకనెల
రోజులు అమెరికా
లోనట...” అశ్విన్ చెబుతూనే
తూలేడు.
సితారాకి మనసు
కొంచం చివుక్కుమంది.
వరలక్ష్మీ కూడా
లేచొచ్చి అశ్విన్
తూలుతూ నడవడాన్ని
చూసింది.
ఆమె కళ్ళు
చెమర్చినై.
తన కొడుకు
సినిమా హీరో
అవబోతున్నాడని
కొందరి దగ్గర
గొప్పగా చెప్పుకున్నప్పుడు
వాళ్ళు ఒకలాగా
చూసారు. దాని
అర్ధం ఇప్పుడు
తెలిసింది.
“ఎక్కడైనా
మనం నడుచుకునే
విధం అని
ఒకటుంది. నా
కొడుకు అతనిలాగా ఒక
నటుడు ఉండడని
పేరు తెచ్చుకుంటాడు.
మీరు కావాలంటే
చూడండి. ఎందుకంటే
నేను వాడ్ని
అలా పెంచాను...” అని చెప్పిందంతా
ఆమె ముందు, చేతిలో
ఒక సీసాతో
వచ్చి నిలబడినట్లు
అనిపించింది.
సితారా తెలివిగలది!
ఎక్కువసేపు అశ్విన్
ని డైనింగ్
టేబుల్ దగ్గర
కూర్చోబెట్టకుండా, బెడ్
రూముకు లాక్కెళ్ళింది.
హక్కుతో చొక్కా
విప్పడం మొదలుపెట్టింది.
అదే హక్కుతో
ప్యాంటు బటన్ల
మీద చైపెట్టింది.
అతను కొంచం
సిగ్గు పడ్డాడు.
“పరవాలేదే.
మత్తులో ఉన్నా
సిగ్గుపడటం మరిచిపోలేదే” అంటూ అతన్ని
పరుపు మీదకు
తోసి, ప్యాంటును
లాగింది. తరువాత
పక్కనున్న అలమరాలో
నుండి లుంగీ
ఒకటి తీసి
పడేసింది. అతనే
శ్రమపడి అది
కట్టుకున్నాడు.
“టాంక్యూ
సిటారా...చాలా
టాంక్స్. స్వీట్
కిస్సస్ టు
యు. సెట్టులో
ఉన్న అందరు
నటీమణులూ ఈ
రోజు నాకు
ముద్దులు పెట్టారు.
అందులో బాలమనోహరి
యొక్క ముద్దులో
ఒక జలదరింపు...పెదాలకు
ఆమె ‘మెంతాల్
లిప్స్ టిక్’ పూసుకుందట...” అన్న అతను
అలాగే దొర్లి
అటు తిరిగి
పడుకున్నాడు.
మొదటి రోజే
ముద్దుల కథ
గురించి చెప్పాసాడు.
రేపు మళ్ళీ
ఏదో చురక.
ఇతను చివరి వరకు ఆగుతాడా?
**************************************************PART-4*********************************************
అన్నీ ఇదివరకే
తీర్మానించబడ్డాయి.
ఒక చిన్న
పనిలో కూడా
నీ తీర్మానం
లేదు. భూమి
మీద కురిసే
వర్షం నీరు
ఎలా పడినచోటుకు
తగినట్లు దొర్లి, పొరలి
మురికిపట్టి పరిగెత్తి
వెళుతుందో...అలాగే
మన జీవితం
కూడా సాగుతుంది.
అందులో ఎలా ఒక
శాస్త్రీయ శక్తి
ఉన్నదో...అదే
శక్తి మన
జీవిత ప్రయాణాలలోనూ
ఉంటుంది. ఎంతగా
మనసులో అనుకుని
దానికి తగినట్టు
నడుచుకోవటానికి
ప్రయత్నించినా
దానికి ముందే
ఒక ప్లాను
ప్రకారమే పనిచేస్తూ
ఉంటాము అనేదే
నిజం.
మన ఆలొచన, ఇంతకు
ముందే ఉన్న,
వేసుకున్న ప్లాను
రెండూ కలిసే
నడుచుకోవలసిన పద్దతి.
ఆ పద్దతి
మనం ఆలొచించినట్లే
జరిగి ముగియవచ్చు...లేక
వేరుగానూ జరగవచ్చు.
ఎప్పుడూ మనం