ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(పూర్తి నవల)

 

                                                         ప్రేమ అనే ఇంద్రధనుస్సు                                                                                                                                (పూర్తి నవల)

'ప్రేమనేది గంగ కాదు...గంగ ఈ రోజు పవిత్రం కాదు!

ప్రేమ అనేది అడవి సరస్సు...మెత్తని మనసును పొడిచే డేగ '

 

ప్రామిస్ గా ప్రేమ -- కామమే...చర్మ ఆకలికి ఇలాంటి పవిత్ర పేరా?

ప్రేమను అనురాగము అంటోంది చరిత్ర! అనురాగమనేది అందరికీ ఒకటే కదా?

ఆడపిల్లలను ప్రేమించే వాళ్ళు ఎందుకు కాకులనూ-పిచ్చుకలనూ ప్రేమించటం లేదు!

కన్యలను వసపరుచుకోవటానికి తహతహలాడేవారు కన్యాత్వాన్ని దాటిన వారిని ఎందుకు వసపరుచుకోవటం లేదు?

ప్రేమను నిష్పాక్షికంగా ఉంచండి! అనురాగంగా ఉండే అందరినీ, అన్నిటినీ ప్రేమించండి.

చర్మాన్ని స్నేహించటం ప్రేమ అవదు...ఇప్పుడంతా ప్రామిస్ గా ప్రేమ-కామమే!

 

పై రెండు కవితల మీదే చర్చ, వివాదం.

 

ఒకరు ప్రేమ అంటే కామమే అని వాదించటం, ఒకరు ప్రేమ అంటే కామం కాదు అని వాదించటం.....ఏది నిజం, ఎవరు నిజం?

తెలుసుకోవటానికి ఈ నవల చదవండి...మీ  అభిప్రాయాలు తెలపండి.

***********************************************PART-1***********************************************

ఈరోజు

జయశ్రీ... జయశ్రీ... జయశ్రీ....

మూడుసార్లు ఆ అందమైన పేరును కోర్టు 'బంట్రౌతు' పిలిచి ముగించగానే టేకు చెక్కతో చదురంగా చేసిన బోనులో ఆ పేరుకు సొంతమైన ఆమె ఎక్కి నిలబడింది.

ఇరవై ఐదేళ్ళ దేహం, వంగిన తల, చెదిరిపోయిన జుట్టు మధ్యలో పెద్దగా పెరిగిన జడ, చీర కట్టుకున్న తీరు--ఈ కాలం తీరును అచ్చు గుద్దినట్టు చూపుతోంది.

మీరేనా జయశ్రీ?”

న్యాయమూర్తి ప్రశ్నతో ఆమె తల పైకి లేచింది. చిన్న చూపు--బలమైన తల ఊపు. విజిటర్స్ వరుసలో ఒక చిన్న కలకలం...  

అందులో అతను కనబడ్డాడు.

చిరుతపులిలా కనబడుతోంది అతని మొహం.

మీ పేరేమిటని కోర్టు అడుగుతోంది...తల ఊపితే సరిపోదు...మాట్లాడాలి...చెప్పండి

---ప్రభుత్వ తరఫు లాయర్ ఆమె ఏకాగ్రతను పరీక్షించాడు.

నా పేరా... జయశ్రీ! ఎస్. జయశ్రీ! లేదు...లేదు...జి. జయశ్రీ. మోహన శర్మ గారి కూతుర్ని!

ఆమె చిన్న తడబాటులో ఎన్నో సంగతులు.

అది న్యాయమూర్తి క్షుణ్ణంగా గమనించారు.

మీరు ఎస్. జయశ్రీ యా, లేక...జి. జయశ్రీ యా అనేది వేరే విషయం.  జయశ్రీ యేనా అనేది మొదటి విషయం

అవును

మీ భర్త మిమ్మల్ని చంపబొయేరని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంటుకు ఏదైనా ఆధారం ఉందా?”

పక్కింటి పార్వతమ్మ ఉన్నారు...ఆవిడ్ని అడగండి...

ఆమె యొక్క సమాధానం తరువాత పార్వతమ్మ పిలువబడింది.

పార్వతమ్మ బోనులోకి వచ్చింది.

జయశ్రీని ఆమె భర్త నందకుమార్ మేడ మీద నుండి కిందకు తోసి చంపటానికి ప్రయత్నించాడు. నేను బట్టలు ఆరేయటానికి నా ఇంటి మేడ మీదకు వచ్చినప్పుడు అది చూసేసాను. నన్ను చూసిన వెంటనే, ఆమెను తోసేయటం ఆపి కొట్టటం మొదలు పెట్టాడు....

ఆమె సాక్ష్యాన్ని ఇంపార్టంట్ గా న్యాయమూర్తి నోట్ చేసుకున్నారు.

పార్వతమ్మ అబద్ధం చెబుతోంది. నేను నా భార్యను కొట్టింది నిజం. కానీ చంపాలనుకోలేదు -- మేడ మీద నుండి తొసే ప్రయత్నం చేయలేదు

గుంపులో నుండి హఠాత్తుగా లేచి ఆవేశంగా అరవటం మొదలుపెట్టాడు నందకుమార్ అనే జయశ్రీ భర్త.

కోర్టు హాలులో మళ్ళీ కొంత కలకలం.

మీకు సందర్భం ఇచ్చినప్పుడు బోనులోకి ఎక్కి మాట్లాడితే చాలు. ఇలా అరవకూడదు...

న్యాయమూర్తి హెచ్చరించారు.

అది విని అతను కలవర పడ్డాడు. తన తల జుట్టు వెనుక పొడుగ్గా ఉన్న జుట్టును చేతి వెళ్ళతో కెలుక్కున్నాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. ప్యాంటు, షర్టు, చెవికి పెద్ద కడియం, బంక్ స్టైలుతో తల జుట్టు అలంకారం అంటూ విదేశీయ జిప్సీ లాంటి రూపం.

అతని ముఖాన ఒక విధమైన కృరం. అతని ముక్కునూ, కళ్ళనూ పీకి ఒక పులికి పెడితే తేడానే తెలియదు అనుకునేలాగా ఒక విధమైన మొహం. చూసేవాళ్ళందరికీ అతనిపై ద్వేషం కలుగుతుంది.

ఈ మొహాన్ని ఆ అమ్మాయి ప్రేమించి పెళ్ళి చేసుకుంది అంటే నమ్ముతారా?”

---ఒకరు ఇంకొకరిని అడిగారు. ఆ ఇంకొకరి మొహంలో ఒక దయ్యం దగ్గర దెబ్బతిన్న మార్పు.

---చూసి చూసి చేస్తున్న పెళ్ళిళ్ళే ఈ రోజుల్లో సుఖంగా లేవు. ఇందులో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాగే ఉంటుంది...

అప్పుడే... నందకుమార్ అనే అతను పిలవబడ్డాడు. అతన్ని ఖైదుచేసి, కేసు రిజిస్టర్ చేసిన ఇన్‌స్పెక్టర్ చురుకయ్యాడు.

అతని తరఫున వాదించటానికి వచ్చిన లాయర్ తన నల్లకోటును సరిచేసుకుంటున్నాడు. నందకుమార్ బోనులోకి ఎక్కి నిలబడ్డాడు.

చండాలుడు, వీడు వంద హత్యలు కూడా చేస్తాడు అని ఎవరైనా సులభంగా నమ్మగలిగే వాలకం. న్యాయవాది యొక్క లోతైన మనసులో కూడా అదే ఆలొచన ఉన్నట్టే తెలుస్తోంది.

నేనే నందకుమార్. నేను మాట్లాడబోయేదంతా సత్యం. జయశ్రీ నా భార్య. నా ప్రాణం. మాది ప్రేమ వివాహం. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు అవి పోట్లాటగానూ, చేతులతో కలగజేసుకోవడం గానూ మారుతుంటాయి.

నాకు హత్య చేయాలనే ఆలొచన లేదు. నేనొక జెంటిల్ మ్యాన్. హత్యంతా చేయను. నాకు అదంతా చెయ్యటం చేత కాదు

---అతను మాట్లాడుతుంటే, ఆశ్చర్యంతో అది వింటున్నారు న్యాయమూర్తి.

ఒక రోజు మా ఇంటికి వచ్చిన నా మామగారు, వూరికే ఉండక, మా పోట్లాట చూసి భయపడిపోయి, పోలీసు కేసు పెట్టి, ఇలా నన్ను కోర్టుకు ఈడ్చి అవమాన పరచాలనుకుంటున్నారు. పాపం జయశ్రీ! ఆమెకు ఈ విషయంలో ఖచ్చితంగా ఇష్టం లేదు

నందకుమార్ మాట్లాడిన తరువాత న్యాయమూర్తి చూపులు జయశ్రీ వైపు తిరిగింది.

ఆమె తల వంచుకుని మౌనం సాధించింది.

అతను చెప్పేది నిజమా?’

---అందరూ జయశ్రీ చూసి, ఆ అభిప్రాయాన్ని పెంచుకునే లోపు ఆమె లాయర్ అడ్డుపడ్డాడు.

“’యువర్ ఆనార్’...మిస్టర్ నందకుమార్ చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు అనుకుని మీలో ఉన్న అభిప్రాయాలను, భార్యను కొట్టినట్టు ఈ కోర్టు ముందు ఒప్పుకున్నారు. అతను జయశ్రీని, ఐ మీన్ అతని భార్యను చంపటానికి ప్రయత్నం చేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యం నిరూపించింది. ఇవన్నీ చేసిన తరువాత కూడా తన చేష్టల వలన జయశ్రీ అనే అతని భార్య బాధించ పడలేదు అనేది అబద్దం.

నందకుమార్ ఒక సాడిస్టు. మగ వర్గం యొక్క నీచమైన ప్రతినిధి. మహిళా స్వతంత్రం, మహిళా విడుదల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న -- ఆచరణలో ఉన్న ఈ కాల ఘట్టంలో ఇతనిలాంటి వ్యక్తులు మహిళా వర్గానికే విరోధులు. వీళ్ళను కఠినంగా శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకు అది ఒక పాఠంగా -- హెచ్చరికగా ఉంటుంది. దీనితో పాటూ ఇప్పుడే జయశ్రీకీ, మిస్టర్ నందకుమార్ కూ విడాకుల మంజూరు స్పేషల్ గా ఇవ్వాలని భవ్యంగా అడుగుతున్నాను

లాయర్ వాదనను విన్న న్యాయమూర్తి మొహంలో ఏదో నిర్ణయానికి వచ్చిన రేఖలు. దీర్ఘ ఆలొచన. తరువాత ఆయన లోతైన మాటల ప్రారంభం.

మిస్టర్ నందకుమార్ తన నోటితోనే పోట్లాడుకోవటం, దెబ్బలాడుకోవడం,  కొట్టటం, అభిప్రాయ భేదాలు ఉండటం ఒప్పుకున్నందువలన ఒక పవిత్రమైన దాంపత్యం తమ వరకు పవిత్రంగా లేదనేది ఒప్పుకున్నారు. అతను హత్య చేయటానికి ప్రయత్నించినట్టు నిరూపణ అయ్యింది. నందకుమార్ కఠినంగా శిక్షించబడాలి. ఎంతటి అభిప్రాయ భేదం ఉన్నా అందులో దౌర్జన్యం,హింస తలెత్త కూడదు. అది అనుమతించలేము. 

ప్రేమించి పెళ్ళి చేసుకున్న నందకుమార్ ఇలా నడుచుకున్నందుకు ప్రేమకూ -- పెళ్ళికీ -- పవిత్రమైన ఆడ-మగ బంధుత్వానికీ...అంతెందుకు అన్నిటికీ సిగ్గుచేటు.

అతని నేరాలను విడమరిచి చూసి అతనికి ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను.

చట్ట పూర్వక పద్దతిలో పిటీషను పెట్టుకుని జయశ్రీ విడాకుల కోరికను కోరుకో వచ్చు. ఇక్కడే, ఇప్పుడే ఆమెకు విడాకులు మంజూరు చేయటానికి చట్టంలో చోటులేదు.

జైలు శిక్ష తరువాత అయినా నందకుమార్ మనిషిగా మారి భార్యతో కలిసి ఆనందంగా జీవించాలని, దాన్నే ఈ న్యాయస్థానం నొక్కి  చెబుతోంది

న్యాయమూర్తి తన తీర్పును క్లుప్తంగా చెప్పి ముగించారు.

ఆరు నెలలా...నాకా? చాలా బాగుంది. ఏయ్ న్యాయమూర్తీ, నువ్వు బ్రతికిపోతావు...మహిళలకు ఆదరణగా డప్పు వాయించే నువ్వు బ్రతికిపోతావు...

కాస్త గట్టిగా మాట్లాడి, పోలీసులతో నడిచాడు నందకుమార్. నందకుమార్ మొహమంతా కోపంతో ఎరుపెక్కింది.

తిరిగి తిరిగి చూస్తూ నడిచాడు...శొకంగా నిలబడున్న జయశ్రీని చూసి పళ్ళు కొరుక్కుంటూ చూసాడు.

అతన్ని కన్నీటితో చూసింది జయశ్రీ.

ఇతనికోసం ఎందుకమ్మా ఇంకా ఏడుస్తున్నావు...? మొదట విడాకులకు దరఖాస్తు చేయండి. కరెక్టుగా ఇరవై ఐదు రోజుల్లో ఈ అడవి మనిషిని విడిపించుకుని హాయిగా మిగిలిన పనులు చూసుకోవచ్చు

---పక్కన నిలబడ్డ ఆమె లాయర్ ఆమెను సమాధానపరిచాడు.

జయశ్రీ దగ్గర నుండి సమాధానమే లేదు. మౌనం...మౌనం...ఇదే కదా భారతీయ స్త్రీల యొక్క అర్ధం కాని భాష!

జయశ్రీ యొక్క ఈ మౌనం, శోక మౌనమా...లేక, లాయర్ ఇచ్చిన సలహా అర్ధమయిందని చెప్పే మౌనమా? అర్ధం కాలేదు!

కానీ, ఒకతనికి మాత్రం అది బాగా అర్ధమయ్యింది.

కోర్టుకు బయట ఉన్న రావి చెట్టు నీడలో అరిగిపోయిన సోపు ముక్క లాంటి గడ్డంతో పైజామా—జుబ్బాలో నిలబడున్న అతను మాత్రం జయశ్రీని అర్ధం చేసుకున్నట్టు ఒక చూపు చూసాడు.

ఆమె, అతన్ని దాటి వెడుతుంటే పిలిచాడు.

జయశ్రీ...

నిలబడి అతన్ని చూసిన ఆమెకు కళ్ళళ్ళో ముల్లు గుచ్చుకున్నట్లు ఉన్నది.

అతను గౌతం... గౌతం...’ 

***********************************************PART-2***********************************************

ఆరోజు

                                               'ప్రేమనేది గంగ కాదు...

                                                గంగ ఈ రోజు పవిత్రం కాదు!

                                                ప్రేమ అనేది అడవి సరస్సు

                                                మెత్తని మనసును పొడిచే డేగ '

కాలేజీ వార్షీక జ్ఞాపకార్థ పుస్తకంలో గౌతంరాజ్ అనే ఎం.ఎస్.సి. చివరి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ రాసిన కవిత్వం పైనే జయశ్రీ చూపులు కళ్ళార్పకుండా చూస్తున్నాయి. పక్కన ఆమె స్నేహితురాలు దీపా.

దీపా, ఎవరే ఈ గౌతంరాజ్?”

ఎం.ఎస్.సి కెమిస్ట్రీ స్టూడెంట్. నువ్వు కూడా చూసుంటావే. అమితాబ్ లాగా బాగా ఎత్తుగా ఉంటాడు...

ఈ కాలేజీలో అమితాబ్ లకూ, ధర్మేంద్రాలకూ తక్కువా? సరిగ్గా చెప్పవే...

సరిగ్గా చెప్పాలంటే ఈ అమితాబ్ ఒక సరైన జుబ్బా పిచ్చాడు. మాటి మాటికీ జుబ్బా వేసుకుని కాలేజీకి వచ్చే ఒక వ్యక్తి. సైంటిస్ట్ లాంటి ఒక గడ్డం ఇతనిలో ఉన్న మరో ఇంటరెస్టింగ్ అంశం

ఆ...జ్ఞాపకానికి వచ్చాడు. అవునూ...ఇతనికి ప్రేమంటే గిట్టదే?”

ప్రేమ మాత్రమే కాదే...ప్రేమించే వాళ్ళన్నా గిట్టదు

ఏం కారణమో?”

ఎవరికి తెలుసు. కానీ ఒక వ్యత్యాసమైన రకం. అది మాత్రం తెలుసు?”

ఇలాంటి వ్యక్తులతోనేనే మనం స్నేహంగా ఉండాలి

నీకెందుకే ఈ విపరీత ఆశ?”

విపరీత ఆశ కాదు. ఏ మగాడిని చూడూ, చూపులతోనే మనల్ని మానభంగం చేసేస్తున్నారు. బాగా జీవించిన ముసలోడు కూడా నాలిక బయటకు చూపి నీరు కారుస్తున్నాడు. ఇంత చెడిపోయిన ఈ కాలంలో ఇలాంటి ఒక వ్యక్తి...కచ్చితంగా అతన్ని కలుసుకోవాలి దీపా

అదేలాగానే అతన్ని కలుసుకున్నారు. ఒక గోడను ఆనుకుని పుస్తకం చదువుతున్న సాయం సమయం ఐదు గంటల సమయంలో.

హలో...

జయశ్రీ యొక్క తియ్యటి స్వరంతో గౌతంరాజ్ అనే గౌతం తల ఎత్తాడు.

నేను జయశ్రీ. బి.ఎస్.సి బయాలజీ ఫైనల్ ఇయర్. ఈమె నా స్నేహితురాలు దీపా. ఈమె కూడా నా క్లాసే 

అతను గౌరవంగా దాన్ని అంగీకరించినట్లు మిల్లీ గ్రాములో నవ్వి, ఏమిటి విషయం అన్న ప్రశ్న చూపుతో జయశ్రీని చూసాడు! నిన్ను నాకూ, నా మనసుకూ చాలా రోజులుగా తెలుసే!అన్న భావము కల్పించే అతని కళ్ళ చూపులు చెబుతున్నాయి.

మీ కవితను కాలేజీ వార్షీక పుస్తకంలో చూసాను. డిఫరంట్ గా ఉంది. అందుకనే మీకు అభినందనలు చెప్పి వెళ్దామని వచ్చాను

ఆమె పొగడ్తను చిన్నగా తీసుకుని థ్యాంక్స్ అన్నాడు.

కొంతసేపు ఆమెనే చూసి, మళ్ళీ పుస్తకంలో ముఖం పెట్టి చదవుకోవటం మొదలు పెట్టాడు.

ఏమిటి సార్...నోరు తెరిచి, ఇంకేమీ మాట్లాడరా?”

జయశ్రీ వదిలేటట్టు కనబడలేదు.

మాట్లాడటానికి ఏముంది?”

ఏమీ లేదా? మీరు మంచి కవి. నేను మీ అభిమానిని. ఒకటి అనుభూతి, ఇంకొకటి అభిరుచి. రెండూ చేరితే అదే కదా సరైన మిక్సింగ్’”

మీరు ఏం చెబుతున్నారు?”--- గౌతం కొంచం ఆశ్చర్యపోతూ అడిగాడు.

ఏమీ లేదు...మీరు ఆందోళన చెందకండి. రెండూ చేరితేఅని చెప్పిన వెంటనే నేనూ, మీరూ చేరటం అని అర్ధం కాదు. మన జీవితాల కలయిక, ఐ మీన్ మన ఇద్దరి ఆలొచనా విధానం ఒక కవి- ఒక సాహిత్య అభిమాని చేరిక గురించి చెప్పాను

మన ఆలొచనా వేవ్ లెంగ్తులు ఒకటిగా ఉన్నందున ఎవరికి ఏం జరగుతుంది? పంట పండిపోతుందా?”

గౌతం వేసిన ఆ ప్రశ్న జయశ్రీలో కోపాగ్నిని చెలరేగించింది.

దీపా గొణిగింది.

ఏమే! వీడు మగాడే కాదే... అన్నది చెవి దగ్గరగా వచ్చి.

అది అతని చెవికీ వినిపించింది. చెవులు పెద్దవై, కళ్ళు ఎర్రబడి, ఒళ్ళు వణికేంత కోపంతో ఉరిమేడు అతను.

ఏయ్, నువ్వేం చెప్పావు అని కోపంగా అడిగాడు.

సొరకాయ పప్పులో ఉప్పులేదు, చిట్టెలుకకు తోకలేదు అన్నానుదీపా కూడా గట్టి స్వరంతో సమాధానం ఇచ్చింది.

మీరు మంచి ఆలొచనతో నన్ను చూడటానికి వచ్చినట్లు లేదే

అతను మాట్లాడింది చాలుఅన్నట్టు అక్కడి నుండి నడవటం మొదలు పెట్టాడు.

నిలబడండి సార్...ఎందుకు పారిపోతున్నారు? నేనేం తప్పుగా అడిగాను? ఆడవాళ్ళను చూసి భయపడుతున్నారే...?”

--- జయశ్రీ చేయి అడ్డుపెట్టి అతన్ని ఆపి అడిగింది.

క్షమించాలి...నాకు నీతో మాట్లాడటానికి ఇష్టం లేదు

అదే ఎందుకు?”

పనికిరాని మాటలు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు

ఏది పనికిరాని మాటలు?”

మీరు ఇప్పుడు మాట్లాడారే

మీ కవిత మాత్రం చాలా పనికొస్తుందా?”

అందులో మీకేంటి సందేహం?”

అదేంటి సార్...ప్రేమంటే మీకెందుకంత హేళన?”

కామమే ఇప్పటి ప్రేమ...నా వల్ల కామాన్ని ఇష్టపడటం కుదరదు

కామం ఇష్టపడే విషయం కాదు సార్. అది మనలో వెలుగుతున్న ఒక అగ్ని.  కట్టుబాటులో ఉంచుకోవలసిన విషయం అది...

అగ్ని,గిగ్ని అని కథలు చెప్పకండి. నాకు అలాంటి అగ్ని ఏదీ లేదు

అలాగైతే దీపా చెప్పింది కరెక్టే. మీరు నిజమైన మగాడు కాదు

అలాగే అనుకోండి. మీరు వెళ్ళొచ్చు

అతను మాట్లాడి వెళ్ళిపోయాడు. జయశ్రీ, దీపా తలపైన చేతులు పెట్టుకున్నారు.

దీపా, ఈ మనిషి సరైన మగాడులా లేడు... విసుగ్గా చెప్పింది జయశ్రీ.

అప్పుడు ఎక్కడి నుంచో నలుగురు కలిసి ఒకటిగా నవ్వుతున్న శబ్ధం.

కొంచం దూరం తరువాత డబ్బుగల వారు పెంచిన పన్నీరు వృక్షం. వృక్షం కొమ్మలలో పసుపురంగు పిచ్చుకలు. చెట్టు కింద కాలేజీ యుక్త వయసు గుంపు. అక్కడి నుండే ఆ నవ్వు శబ్ధం.

ఆ గుంపులో నుండి ఒకడు జారి వచ్చి జయశ్రీ ఎదురుగా ధైర్యంగా నిలబడి మాట్లాడాలనుకునే మమ్మల్ని పట్టించుకోరు. ఇలా ఎవడైనా పనికిరాని మగాడు చిక్కితే వాడిని మాటలతోనే ఆట ఆడిస్తారు. మీ ఆలొచనే మాకు అర్ధం కావటం లేదే 

జయశ్రీ అతన్ని కోపంగా చూసింది.

కోపంగా చూడకు జయశ్రీ...నీకు కళ్ళు చిన్నగా ఉంటేనే అందం. వాటిని పెద్దవి చేసుకుని నీ అందాన్ని పోగొట్టుకోకు 

దీపాకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె యద పైకీ కిందకూ ఊగింది....

ఏమ్మా దీపా, గొంతుకు కింద ఇంత కొవ్వు పెట్టుకున్నావే... దానికోసం వేరుగా ఏమైనా తింటున్నావా?” -- అతని పిచ్చి వాగుడు వాళ్ళను తీవ్రంగా గాయపరిచింది.    

అప్పుడు ఎవరో అతని భుజాన్ని తట్టి తిప్పగా, అతని మొహం వెయ్యి వంకర్లు తిరిగింది.

నాయకా, మీరా...సారీ నాయకా! సారీ! వెరి వెరి సారీ... అన్నాడు.

నాకు చెప్పే వెరి సారీ అంతా తరువాత. ముందు వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగు

సరే నాయకా... క్షమించు దీపా... -- చెప్పేసి అతను బెదిరిపోయి పరిగెత్త, మిగిలిన గుంపును ఖండించి తరిమిన వ్యక్తి మొహంలో గెలుపు నవ్వు.

నేను నందకుమార్. ఎం.ఎస్.సి కెమిస్ట్రీ -- అతని సింపుల్ పరిచయంలో జయశ్రీ కరిగిపోయింది.

అతను మాట్లాడటం కంటిన్యూ చేసాడు.

నిజంగానే కాలేజీ విధ్యార్ధులు అందరూ చాలా మంచి వాళ్ళు. సక్రమంగా కాలేజీకి వచ్చి వెళుతున్నవారే. మన రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళూ వీళ్ళని ఇలా మార్చేసారు. ఏ సినిమాలో అయినా స్టూడెంట్స్ ను మంచి వాళ్ళుగా చూపించారా? ప్రేమ, అల్లరి అంటూ తిరిగే వాళ్ళుగా కథలు రాసి, రాసి స్టూడెంట్స్ అది కాపీ కొట్టడం మొదలు పెట్టారు! మీరంతా దీన్ని ఆటగా తీసుకోండి... అన్నాడు మిక్కిలి శాంతంగా.

అతని ఆ పక్వమైన మాటలు, ఇద్దరికీ బాగా నచ్చింది. అతన్ని గౌరవంగా చూసారు.

ఇక నేను బయలుదేరుతాను... అంటూ బయలుదేరాడు.

జయశ్రీ, దీపా ఇద్దరూ ఆశ్చర్యంగా అతన్నే చూసారు.

జయశ్రీ...మన కాలేజీలో కూడా ఇలాంటి మంచి పర్సనాలిటీ మనిషా?”

దీపా నోరెళ్ళ బెట్టింది.

చాలా స్వారస్యమైన మనిషి...అన్నది జయశ్రీ.

----ఇద్దరూ మాట్లాడుకుంటూ నడవటం మొదలుపెట్టారు.

మన కాలేజీ సరైన ఒక జూదీపా. ఇక్కడ ఎన్ని రకాల మృగాలు...వీళ్ళ మధ్య కొంతమంది మనుషులు కూడా ఉన్నారు -- అన్నది ఆశ్చర్యంగా.

అప్పుడు అక్కడ ఎదురొచ్చాడు గౌతంరాజ్. పుస్తకం చదువుతూ మధ్యలో ఒక కోపమైన చూపు చూసాడు.

హలో జెంటిల్ మ్యాన్... అంటూ జయశ్రీ అతన్ని వెక్కిరించి నడవటం మొదలు పెట్టింది. 

పన్నీరు చెట్టు నీడలో కుతూహలంగా ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు నందకుమార్ కూడా చేరాడు.

బలమైన పరిచయ శంకుస్థాపన ముగిసింది మామల్లారా? కరెక్టుగా నలభై ఎనిమిది రోజుల్లో ఆమె కన్యాత్వం పోగొట్టి చూపించకపోతే నేను నందకుమార్ కానే కాను... అన్నాడు అతను.

అదేమిటి నలభై ఎనిమిది రోజులు...?”

వ్రతం ఉండేవాళ్ళు నలభై ఎనిమిది రోజులు కదా ఉంటారు...? నాకు జయశ్రీని అనుభవించాలనే ఆశ ఒక వ్రతం లాగానే

నందకుమార్ ని అందరూ ఈర్ష్యగా చూశారు.

నీకేం బాబూ...నిన్ను అడిగే వాళ్ళు లేరు. జడ ఉన్న మహారాజువి. ఎలాగైనా బుట్టలో వేసుకుంటావు... అన్నాడు ఒకడు.

"నువ్వు కూడా వసపరుచుకో...మనసు పెడితే జరుగుతుంది. అనుభవించటానికే జీవితం...అనుభవించటానికే యుక్త వయసు...అనుభవించటానికే ఆడది...

గట్టిగా మాట్లాడకు నందూ. ఎవరైనా వింటే మన మీద రాళ్ళు ఎగరేస్తారు

గెలీలియోని కూడా రాళ్ళేసి కొట్టారు. అందుకని ఆయన అబద్దమా చెప్పారు?”

అలాగైతే నువ్వు చెప్పేదే జీవిత సిద్దాంతమా?”

ఖచ్చితంగా! అనుభవించాలి. రకరకాలుగా అనుభవించాలి. యుక్త వయసు పోయే లోపల అనిభవించ గలిగినంత అనుభవించాలి. దానికోసం ఏదైనా చెయ్యచ్చు. తప్పు లేదు

----అతని విపరీత కాలుష్యమైన సిద్దాంతానికి పన్నీరు చెట్టు మీద కూర్చున్న కాకి అతన్ని ఖండించే విధంగా అతనిపై రెట్ట వేసింది. కోపంగా పైకి చూసాడు నందూ.

ఏయ్ ఛీ...పో!

***********************************************PART-3***********************************************

ఈ రోజు

గౌతం... గౌతం...

ఆమె వరకు జీవితంలో ఇక జ్ఞాపకం తెచ్చుకో కూడదనుకున్నఒక పేరు...ఉచ్చరించనే కూడదని విదిలించి పారేసిన పేరు...ఇదిగో ఆ పేరుకు సొంతమైన మనిషి ఎదురుగా...

జయశ్రీకి అతన్ని చూసిన వెంటనే మొహంలో ఒక విధమైన అవస్థ, హృదయంలో సరిగ్గాలేని పంపింగ్, మొహాన చుక్కలు చుక్కలుగా చెమటలు.

ప్రేమ అంటేనే ఆముదంలాగా ఫీలయ్యి దూర దూరంగా పారిపోయే అతను. ఒక సంధర్భంలో జయశ్రీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆమె వెనుక పిచ్చివాడిలాగా తిరగటాన్ని ఏమని చెప్పాలి?   

ప్రేమ ఏదైనా చేస్తుందో...?

ఎవరు, దేనిని, ఎప్పుడు, ఎలా చేస్తారు? అనేది మనుషుల వరకు తీర్మానించుకోవటమే శ్రమ!

ఆ రోజు జయశ్రీకి ఐ లవ్ యూచెప్పి, ఐ హేట్ యూఅన్న జవాబును జయశ్రీ దగ్గర నుండి అనిపించుకున్న అతను ఈ రోజు దేనికోసం వచ్చాడు?

నా ప్రేమ జీవితం నరకంగా మారిందని ఇతనికి ఎలా తెలుసు...? చెప్పి ఉంచినట్లు వచ్చాడే? దేనికి...దేనికి?’ -- జయశ్రీకి అర్ధం కాక అయోమయంతో నడిచింది.

గౌతం చాలాసేపు దూరంగా ఉండే ఆమె నడవటం గమనించాడు.

దగ్గర కొచ్చి బాగున్నావాఅని ఒక మాట ఆమె అడుగుంటే ఎంత బాగుండేది?’ -- ఆలొచించి చూసాడు. అపేక్ష వదిలే గాలిలో కాలుతోంది. కళ్ళల్లో పాలితిన్ లాగా కన్నీటి తెర.

జుబ్బా జేబులోకి చెయ్యి పెట్టాడు. ఆ చేతికి తగిలింది ఫిల్టర్ సిగిరెట్టు పెట్టె. బయటకు తీసి, ఒక సిగిరెట్టు తీసి వెలిగించి పొగ బయటకు వదిలాడు. ఏదో ఒకటి ఎక్కడో సుఖం అవుతున్న భావం. మనుషులపై సిగిరెట్టు అధికారం చెలాయించటానికి కారణమే ఈ మర్మమైన సుఖ భావమే నన్న మళ్ళీ ఒక భావం.

చాలా దూరం వెళ్ళిపోయిన జయశ్రీ, ఆటో ఒకటి ఎక్కి కూర్చుంది. ఆమె పక్కనే ఆమె తండ్రి.

తిరిగి చూడకూడదు...తిరిగి చూడకూడదు. చూడనే కూడదు అని మనసులో మంత్రంగా చెప్పుకుంటోంది. ఇలా చెప్పుకుంటే ఎప్పుడూ భావం ఆపోజిట్టుగానే ఉంటుంది?

మెడను మెల్లగా తిప్పింది. ఆటో బయలుదేరి వలయంలా తిరగటంతో బాగానే చూడ గలిగింది.

సిగిరెట్టుతో కనబడుతున్న అతన్ని చూడటానికి ఆశ్చర్యమేసింది. వక్కపొడి కూడా వేసుకోను అన్న వ్యక్తే ఇతను.

---ప్రశ్న తలెత్తటంతో ఆనవసరమైన వేదన.

జ్ఞాపకాలలో మరిచిపోవలసిన అతన్ని -- మరిచిపోయిన అతన్ని మళ్ళీ ఎందుకు తిరిగి జ్ఞాపకం తెచ్చుకుని హక్కుతో వేదన పడటం? మనిషి యొక్క విచిత్రమైన నేచర్ అదేనా?

జీవితంలో చాలా సమయాలలో మనల్ని మనమే తెలుసుకోవటం లేదు.

ఆమె ఆ నిజాన్ని తలచుకుని ఆశ్చర్య పడుతుంటే  తండ్రి అడిగారు:

ఎవరమ్మా ఆ వ్యక్తి?”

జయశ్రీ దగ్గర ఆశ్చర్యం. తండ్రి ఇంత క్షుణ్ణంగా గమనించారే?’

నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు స్నేహితుడు. పేరు గౌతం రాజ్... అన్నది చాలా చిన్నగా.

నీ కేసు విషయం ఇతనికెలా తెలిసింది?”

అదే నాకూ తెలియటం లేదు

వచ్చిన వ్యక్తి దగ్గర నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదేమ్మా?”

అతను అంత మంచి వ్యక్తి కాదు నాన్నా...

అతన్ని చూస్తే అలా కనబడటం లేదే?”

చూస్తే అది తెలియదు నాన్నా. స్నేహం చేస్తే తెలుస్తుంది. హృదయం నిండిపోయే జ్ఞాపకాలతో స్నేహం చేయాలి. అప్పుడే తెలుస్తుంది. కొన్ని సమయాలలో ఈ కాలం మొగవాళ్ళను అప్పుడు కూడా అర్ధం చేసుకోలేము. ఇక్కడ ఎవడు రాముడు, ఎవడు రావణుడు తెలియటం లేదు

చెప్పేటప్పుడే కృంగిపోయింది. కళ్ళల్లో నీటి ప్రవాహం.

అది సరే, ఇక ఏం చెయ్యబోతావు?”

ఏం చెయ్యబోతానా? అంటే?”

వాట్ డూ యూ తింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్? నీ భవిష్యత్తు గురించి ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతున్నా

భవిష్యత్తు అంటే ఏమిటి నానా?”

రేపటి పొద్దమ్మా. ఎందుకని అంత విరక్తిగా మాట్లాడటం మొదలు పెట్టావు...?”

సంతోషంగా మాట్లాడటానికి నేనేమన్నా ఇప్పుడు కుతూహల రాజకుమారినా...? నేను తప్పు చేయకపోయినా పువ్వులూ-బొట్టూ కూడా ఇప్పుడు నేను రేషన్ గానే పెట్టుకోవాలి. లేకపోతే, మొగుడు వదిలేసిన దానికి ఎంత స్టైలో చూడు అని ఎగతాలి చేస్తారు నాన్నా...

దయచేసి నువ్వు నీకొసం జీవించాలి. ఇలా అనవసరంగా ఊరి గురించి బాధపడకూడదు

ఊర్లో ఉంటూ, ఊరిని నమ్ముకుని బ్రతుకుతూ, ఊరి గురించి బాధపడకూడదు అంటే ఏమిటి నాన్నా అర్ధం?”

వితండవాదం చెయ్యకు జయశ్రీ! నీ వయసు అమ్మాయలకు క్లారిటీ చాలదు. కలలు...కలలుఇదే మీరు. ఎప్పుడు చూడు కలలు. ఎందులోనూ యధార్థం లేదు. నిజం లేదు. అందువలన మీకు చిన్న సమస్య కూడా, కొండ విరిగిపోయినట్టు విరక్తి చెందుతున్నారు

భర్త నరకం చూపించటం, మంటలతో కాల్చటం, తాగ మనటం, చంపటానికి ప్రయత్నించటం చిన్న సమస్యా నాన్నా?”

తండ్రి హృదయం గాయపడాలనే ఈ ప్రశ్న అడిగింది జయశ్రీ.

దీనికి ఎవరు కారణం? నువ్వు కారణం...నీ ప్రేమ కారణం. ఎంత చెప్పినా వినకుండా పరిగెత్తుకు వెళ్ళి నందకుమార్ దగ్గర గొంతు చాచటం కారణం. వాడిని పెద్ద మన్మధుడు అని నువ్వు ఊహించుకున్నది కారణం. నీ అజ్ఞానం కారణం...తొందర కారణం. అన్నీ నువ్వు చేసేసి ఇప్పుడు తప్పు నీది కాదనట్టు మాట్లాడుతున్నావు?”

----ఆయన ఆవేశంగా మాట్లాడాడు.

ఆటో డ్రైవర్ కే ఏదోలాగ అయిపోయింది. కావాలనే దగ్గి, ఒక మూడో మనిషిగా తానున్నానంటూ తెలిపాడు....

ఆమె ఏడుస్తునే ఉంది. తండ్రి చెప్పింది నిజమే కదా అన్నట్టు ఏడ్చింది.

యుక్త వయసుకు అందం మాత్రమే ఉంది. లోతైన ఆలొచన లేదుఅనేది బాగా అర్ధమైనదానిలాగా ఏడ్చింది.

ఇదంతా తలరాతా? ఎందుకు విధి ఇలా మత్తులో మైమరచిపోయింది?

ప్రశ్నకు జవాబు దొరకక ఏడ్చింది.

ఏడ్చింది చాలు...ఏడవటం చేతకాని వాళ్ళు తీసుకునే చివరి ఆయుధం. ఏడవటం ఆపు. జీవితం గురించి ఆలొచించి మాట్లాడు...

-----ఆయన ఎత్తి చూపారు.

మీరు చెప్పినట్టు వింటాను అన్నది జయశ్రీ.

అలాగైతే విడాకులకు వెంటనే ఏర్పాటు చేస్తాను. మళ్ళీ పెళ్ళికి నిన్ను నువ్వు తయారు చేసుకో...

నాన్నా... గొంతుకలో ఏదో అడ్డుపడ్డట్టు బెదిరిపోయి ఆయన్ని చూసింది.

నాకు మళ్ళీ పెళ్ళా?”

అవును...అదే నీకు సరైన తీర్పు

వద్దు నాన్నా. నాకూ, పెళ్ళికి రాసి లేదు. ఒకసారి పడ్డ కష్టాలు చాలు...

పిచ్చిదానా...ఇది చెడిపోయున్న కాలం. మగవాడి తోడు లేకుండా జీవించాలనుకోవడం, ఆత్మహత్య చేసుకోవటం ఒకటే

మీరున్నారు కదా నాన్నా...?”

నేను వయసైన వాడిని. ఇంకా  ఎన్ని సంవత్సరాలు ప్రాణాలతో ఉంటానో, ఎవరికి తెలుసు...?”

అన్నయ్య చూసుకోడా?”

"వాడికి కుటుంబం --పెళ్ళాం--తల్లి-తండ్రులు ఉన్నారు. అతను వాళ్ళను చూసుకుంటాడా, లేక నిన్ను గమనిస్తాడా?”

నేనూ వాడి కుటుంబంలో ఒకత్తిగా అయిపోతే?”

కష్టం...చాలా కష్టం. సహజ జీవితానికి సాధ్యం కాని మాట ఇది. నువ్వు చెప్పేది కొన్ని రోజులకే సాధ్యం. జీవితం మొత్తం సాధ్యం కాదు. మనుషుల మనసు గురించి నీకు తెలియదు...

మళ్ళీ పెళ్ళిని నావల్ల అనుకోవటం కుదరటం లేదే!

ఇప్పటి నీ పరిస్థినీ నేను అనుకోవటం కుదరటం లేదే!

------ఇంతలో ఆటో ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆగింది.

ఇల్లు తెరిచి ఉంది. ఇద్దరికీ ఆశ్చర్యం. అంతకంటే ఆశ్చర్యం ఇంటి చుట్టూ విపరీతమైన గుంపు.

మోహన్ శర్మ బెంబేలెత్తిపోయి గుంపులోని ఒకరిని అడిగారు.

ఏమైంది...ఎందుకు ఇంతమంది జనం ఉన్నారు?”

మీకు ఇంకా విషయం తెలియదా సార్? మీ అల్లుడు, పోలీసుల దగ్గర నుండి తప్పించుకున్నాడు. ఇక్కడకొచ్చి తాళం పగలగొట్టి లోపలకు దూరి...దొరికింది తీసుకుని పారిపోయాడు. పోలీసులు చాలా మంది వచ్చి ఇప్పుడే తిరిగి వెళ్తున్నారు

అప్పుడు అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు.

తెరిచి ఉంచబడ్డ ఇంటికి నేనేసార్ కాపలా. ఆరు నెలల శిక్షను కూడా అంగీకరించలేక తప్పించుకు పారిపోయి ఆరు సంవత్సరాలు ఇక జైళ్ళోనే ఉండబోతాడు...మీ ఇల్లుడు. విధి ఎవర్ని వదిలింది? అంతా తలరాత... అంటూ విసుకున్నాడు అతను.

జయశ్రీ వేగంగా లోపలకు వెళ్ళింది. అలమరా తెరిచింది. నగలు కనిపించలేదు. బ్యాంకులో డ్రా చేసుకుని తీసుకు వచ్చిన డబ్బు కూడా కనిపించలేదు.

ఆమెలో ఆందోళన పెరిగింది.

అప్పుడు ఆ కాగితం కళ్ళకు కనిపించింది.

అతనే రాసి పెట్టున్నాడు.

దగ్గరకు వెళ్ళి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుంది.

జయశ్రీ...ఇక నువ్వు ప్రతి రోజూ చచ్చి బ్రతుకుతావు. నన్ను వదిలేసి నీ వల్ల బ్రతకటం కుదరదు. నీకు దానికి కావలసిన ధైర్యం ఆవగింజంత కూడా లేదు. ఈ దేశంలో నా వరకు ఆడవాళ్ళు బానిసలుగానే ఉండాలి. వాళ్ళు మగవారికి అనిగిమనిగి వెళ్ళకపోతే వాళ్ళను ఏమైనా చేయొచ్చు.

నిన్నూ నేను ఏమైనా చేస్తాను. ఎప్పుడైనా వస్తాను

ఇట్లు

నీ ప్రేమ భర్త.

నందూ అలైస్ నందకుమార్.

చదివిన జయశ్రీకి మొదట భయం వచ్చింది...తరువాత మైకం వచ్చింది.

***********************************************PART-4***********************************************

ఆ రోజు

నందకుమార్ యొక్క స్టైలు చూస్తే ఎవరికైనా మత్తు వస్తుంది. జయశ్రీకి రావటంలో ఏమీ ఆశ్చర్యం లేదు!

నందకుమార్ అంత దృఢమైన శరీరంతో ఉన్నాడు. డైరెక్టర్ విశ్వనాధ్ గారి లాంటి వాళ్ళు చూస్తే, అక్కడే అతన్ని కథా నాయకుడిగా ఒప్పందం చేసుకునే వసీకరం, మణిరత్నం కనిపెట్టిన అరవింద్ స్వామికి పోటీ పడే శరీరం అందం.

ఇలాగే కాలేజీలో మాట్లాడుకున్నారు. కొంతమంది అమ్మాయులు, వృద్దులను కూడా ఊరించేంత అందంగా ఉంటారు. యదలోనూ, నడుం లోనూ మనుషుల గుంపును లాగే బలం వాళ్ళకు ఉంది.

ఎలాంటి సన్యాసులకైనా మనసు సంచలనానికి వస్తుంది. అలాంటి అందంతో మగవారూ, ఆడపిల్లలూ కళ్ళకు కనబడటం అనేది ఆ రోజు కాలేజీలో నిరూపణ అవుతున్నది.

స్టైలుగా మోటార్ సైకిలులో వచ్చి దిగిన నందకుమార్ నుదుటి మీద చిన్నగా కుంకుమ గీత.

ఏమిటిది...ఆశ్చర్యంగా నుదుటి మీద కుంకుమ అదీ?”

--- జయశ్రీ అడిగింది.

అందరూ ఆశ్చర్యపడటం కోసం కాదు...అవసరంతోనే, కావాలనే! నేను మన ఊరు రాజగణపతి భక్తుడ్ని. ఆయన ఆశీర్వాదం వలనే జీవితంలో ఇంత దూరం ముందుకు ఎదిగాను...

వింటేనే ఆశ్చర్యంగా ఉంది. మీకు ఇంత దైవ భక్తా?”

నా భక్తి వేషం కాదు జయశ్రీ. ఇది నిజం. అవునూ, ఈ రోజు మీకు క్లాసులు లేవా?”

మా ప్రొఫసర్ ఈ రోజు సెలవు. అందువలన అందరం బయలుదేరాం

ఎక్కడికి...?”

ఇంటికే...

మా ఇంటికి రండి

ఏమిటి విషయం?”

సరదాగా ఒక గెట్ టు గెదర్ జయశ్రీ. మీరందరూ వస్తే ఎంత బాగుంటుందో తెలుసా? అందులోనూ నేను ఇప్పుడు దసరా బొమ్మల కొలువు పెట్టాను

ఏమిటీ...మీరు బొమ్మల కొలువు పెట్టారా?”

అవును జయశ్రీ. బ్రహ్మచారి, బొమ్మలు పెట్టకూడదా ఏం? ఫుట్ బాల్ గ్రౌండ్ అంత ఇల్లు. అమ్మ ఉన్న రోజుళ్ళో ఇల్లు గుడిలాగా ఉండేది. ఎప్పుడూ పూజలూ, పునస్కారాలూ...ఇప్పుడు అవేమీ లేకుండా ఉండటం నాకు నచ్చలా...

ఏం, మీ అమ్మ ఇప్పుడు ఏమైంది?”

ఆమె ప్రశ్నకు, ముందు అతను చాలా సేపు ఒక దొంగ ఏడుపు మౌనం వహించాడు. తరువాత అందులో నుండి కన్నీరనే బొట్లను కళ్ళ నుండి బయటకు పంపాడు. తరువాత నిదానంగా నోరు తెరిచాడు.

అమ్మ ఇప్పుడు లేదు...దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. సడన్ హార్ట్ అటాక్!

మై గాడ్...అప్పుడు ఇల్లు ఎవరు చూసుకుంటున్నారు...?”

నేనే...ఇక నాకు రాబోయే భార్య

బాధపడకండి. మీకు మంచి భార్య దొరుకుతుంది. మీ మనసు పువ్వులాగా మెత్తనిది. మీకు రాబోయే భార్య కూడా పూవు లాంటి మెత్తని మనసు గలదే వస్తుంది

మీ లాంటిదని చెప్పండి జయశ్రీ

జయశ్రీకి అతను అలా చెప్పటంతో, పంచదార పాకంలో బోర్ల పడినట్లు ఒక భ్రమ.

తరువాత మాట్లాడటానికి మాటలు రాలేదు. మనసులో ఎదురు చూడని ట్రాఫిక్ జామ్.

సరే, వస్తారా?”-- నందకుమార్బండి స్టార్ట్ చేస్తూ అడిగాడు.

ఖచ్చితంగా వస్తాను -- జయశ్రీ నుండి వాగ్ధానం.

అయితే బండి ఎక్కండి...

లేదు...లేదు! నేనూ, ధరణీ, పార్వతీ, దీపా అందరం కలిసి వస్తాం

చాలా థ్యాంక్స్. నేను వెళ్ళి మా పక్కింటి ఆంటీ గారితో టిఫిన్ అదీ రెడీ చేస్తాను

... నందకుమార్! అదంతా వద్దు. ప్లీజ్...

లేదు జయశ్రీ...మంచి రోజున నా ఇంటికి దేవతలు రాబోతున్నారు. వాళ్ళను ఉత్త చేతులతో పంపనా?”

మాట్లాడేసి జవాబుకోసం కాచుకోకుండా మోటార్ సైకిల్ను వేగంగా పోనిచ్చాడు.

జయశ్రీలో కొత్త ఉత్సాహం. నందకుమార్ జ్ఞాపకాలు మనసులో నుండి పొంగి బయటకు వస్తున్నాయి. 

నందకుమార్ వెళ్ళిన వైపే చాలాసేపు చూస్తూ ఉన్న జయశ్రీ, యధార్ధంగా వెనక్కి తిరిగినప్పుడు అక్కడ గౌతం రాజ్!

ఆడదంటే దయ్యం అనే నిర్ణయానికే వచ్చేసిన వాడిలాగా ఉన్న అదే గౌతం. జయశ్రీనే గౌతంను చూసింది. కానీ, అతను ఆమెను చూడకుండా పుస్తకంలోనే చూస్తూ ఉన్నాడు.

సరైన అభిరుచిలేని జన్మ అని నోరారా అతన్ని శపించింది జయశ్రీ. 

అది అతనికి వినబడక పోలేదు. అతని గుండెల్లో నొప్పి ఏర్పరచ కుండానూ లేదు.

ఖాలీగా ఉన్న పెద్ద ఇల్లు.

కాంపౌండ్ గోడను పూర్తిగా ఆక్రమించిన చెట్లు. బెంగళూరు లో పూచే పూవులన్నీ తొట్టెల్లో పెరిగి అ ఇంటికి అందాన్ని ఇచ్చాయి. చల్లని వాతావరణం. లోపల విస్తీర్ణమైన హాలులో తొమ్మిది మెట్లతో బొమ్మల కొలువు. బొమ్మల ముందు ఐదు ముఖాల దీపం. హాలు మొత్తం సువాసన. పక్కింటి ఆంటీ వంటగదిలో కేసరి చేస్తోంది.

ఏమయ్యా నందూ...నీకెందుకయ్యా బొమ్మల కొలువు, పూజలూ? ఇవన్నీ  నీ పెళ్ళి తరువాత చేసుకోవచ్చుగా?”

ఆమె స్వరం-హాలును అతుక్కుని ఉన్న గదిలో ఆంటీ గారి ఒకే కూతురు జానకిను కౌగలించుకుని ఉన్న నందకుమార్ చెవిలో పడినప్పుడు అతని దగ్గర నవ్వు.

మీ అమ్మ చెప్పింది విన్నావా?”

అతను జానకిను చూస్తూ అడిగాడు.

ఆమె కామంలో కరిగిపోయి ఉంది. అతని కౌగిలిలో ఆమె యద నలిగి అతన్ని కెలుకుతున్నది.

అతనికి సమాధానం చెప్పటం కంటే, అతన్ని ఇంకా ఎక్కువగా, ఒత్తుగా కౌగలించుకోవటంలో ఆసక్తి చూపింది.

వసతిగా తలుపు గొళ్లెం పెట్టబడి ఉంది.

నందూ...ఎన్ని రోజులు ఇలాగే, త్వరగా పారిపోయి...

అతను వెంటనే ఆమె నోరు నొక్కాడు.

యుక్త వయసులో చిలిపి పనులు చాలా చెయ్యాలి. వయసు దాటిన తరువాత వాటిని ఆలోచించి కూడా చూడలేము. వచ్చే జన్మలో నువ్వు ఇదే జానకిగా, నేను నందూ గా పుట్టే అవకాసమూ లేదు. కాబట్టి, ‘పెళ్ళి అని అదీ ఇదీ చెప్పకుండా అనుభవించాలి, అనుభవిస్తూనే ఉండాలి...

అప్పుడు పెళ్ళి?”

ఆమె హడలిపోయి అడిగింది.

తొందరపడకు...మెల్లగా చేసుకుందాం. పెళ్ళి అంటే ఏమిటి? కామ ఆటలకు సంఘం ఇచ్చే అనుమతే కదా? అనుమతితో ఆడుకునే దాంట్లో త్రిల్ లే లేదు జానకీ...

మీ మాటలు నాకు నచ్చలేదు. ఒక పక్క చూస్తే మీరు వివేకానందుడు. ఇంకో పక్క చూస్తే సరైన మధన కామ రాజు. మిమ్మల్ని అర్ధం చేసుకోవటమే కష్టంగా ఉంది...

అతను అంతకంటే ఆమెను మాట్లాడనివ్వకుండా ఆమె పెదాలను తన పెదాలతో మూసాడు. మరింత గట్టిగా కౌగిలిలో బిగించి మెల్లగా చేతులు ఆమె నడుము దగ్గరకు దింపాడు.

ఆమె నిప్పంటుకున్నట్టు ఫీలైయ్యింది. అతని భుజాలను గట్టిగా నొక్కింది. ఆడవారు ఇలా కొవ్వొత్తి లాంటి కరిగిపోయే స్వభావాన్ని కట్టుదిట్టంతో ఉంచటానికే ఎన్నో కట్టుబాట్లు సంఘం విధించి ఉన్నా, దాన్ని మీరి కరిగిపోతున్న అమ్మాయిని, ఆ గదిలోని ఒక బొమ్మ వేడుక చూసింది. బొమ్మ మొహంలో చెరిగిపోని నవ్వు.

ఇలాంటి పద్దతులు లేకుండా అంటుకునే మంటల వలనే ఎన్నో కన్యాత్వాలు  కరిగిపోతున్నాయి.

ఇద్దరూ నరాల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో మొదట కేసరి యొక్క అద్భుతమైన వాసన మూసున్న తలుపుల సంధుల్లో నుండి దూరి -- వాళ్ళ ఆలోచనలనూ పట్టుకు లాగింది.

తరువాతది వాకిట్లో వచ్చి ఆగిన ఆటో! ఆటోలో నుండి జయశ్రీ, ధరణి, పార్వతి అంటూ ఒక కాలేజీ గుంపే దిగింది. ముసలి ఆటో డ్రైవర్ యుక్త వయసు మానసిక స్థితిలో కిక్కుతో కనబడ్డాడు.

శబ్ధం విని ఇద్దరి బిగింపులూ సడలినై.

జానకీ కదిలిపోయున్న స్టిక్కర్ బొట్టును సరిదిద్దుకుని, జాకెట్టు హూక్స్ తగిలించుకుని -- ఓణీని సరిచేసుకుని తప్పించుకోవటానికి చూసింది.

నందకుమార్ వెంటనే మామూలు లోకానికి వచ్చాడు. తలుపులు తెరుచుకుని హలోఅంటూనే వాళ్ళని స్వాగతించాడు.

వచ్చిన వాళ్ళు బొమ్మలను చూసి, ఇంటిని చూసి, ఆంటీని చూసారు. ఆంటీ...ఒక ప్లేటులో తీసుకు వచ్చిన కేసరిని తిని, నోరు తెరుచుకుని ' నందకుమార్ మనల్ని ప్రేమించడా?' అనే ఆశ పడి, నిట్టూర్పు వదిలి, మొహాల్లో కాంతి తెచ్చుకున్న సమయం ---

జానకీ చిరు నవ్వుతో గది నుండి బయటకు వచ్చింది. నందకుమార్ యొక్క స్నేహితులను చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది.

ఆంటీకి ఆశ్చర్యం. నువ్వెలా ఇక్కడికి వచ్చావే?”

ఇప్పుడే వచ్చాను...వీళ్ళందరూ రావటం చూసి...

జానకీ దగ్గర ప్రేమ కోసం గజకర్న అబద్దం.

ధరణికి అది ఖచ్చితంగా అబద్దమని అర్ధమయ్యింది. మనం ఇంటికి వచ్చిన మరు క్షణం నుండి ఎవరూ ఇంటి వాకిటి గుండా లోపలకు రాలేదే...?’

ధరణి చూపులు జానకీను అంచనా వేయటం మొదలు పెట్టినై. జానకీ నందకుమార్ వైపు చూస్తూ...వెళ్ళి రానాఅనేటట్టు కళ్ళతోనే అడిగింది.

జానకీ నువ్వు కేశరి తిన్నావా?" -- అతను అడిగాడు.

గదిలో నువ్వు అందించిన తియ్యదనం కంటే కేశరి తియ్యగానా ఉంటుంది ప్రేమికుడా...?’ ఆమె మనసులో ఆనంద జవాబు.

కానీ, పెదాలతో చెప్పే ధైర్యంలేని కొంచంగా మార్పు ఉన్న ముఖ భావం.

వెళ్ళవే...వెళ్ళు. వెళ్ళి చదువుకోవటానికి దారి చూడు. గొప్పగా లెక్కల సబ్జెక్టును ఆశగా తీసుకుంటే చాలా? చదవటం వదిలేసి నీకు ఇక్కడేం పని...?”

ఆంటీ దగ్గర కాఠిన్యము.

నందకుమార్ అడ్డుపడ్డాడు.

ఆంటీ! జానకిని తిట్టకండి. నాకు ఇక్కడ ఒక చెల్లి ఉంటే ఎలాగో, అలాగే జానకీ నూ...

నందకుమార్ మాటలతో జానకిలో పిడుగుపడిన షాక్.

ఆంటీ సంతోష పడింది.

ఒక్కత్తే అమ్మాయి...అబ్బాయే లేడని మాటి మాటికీ రోజుకు ఒకసారైనా చెబుతారు మా వారు. నువ్వు వచ్చావురా బాబూ, పెద్ద కొడుకుగా... అంటూ అతనికి దిష్టి తీసింది.

జయశ్రీ దగ్గర ఆశ్చర్యమో...ఆశ్చర్యం. ఈ నందకుమార్ ఎంతో విచిత్రమైన మానవత్వం ఉన్న మనిషి?’

అబ్బో...నిమిషానికి నిమిషం మనుష్యులను ఆకర్షించటం ఇతని వల్ల ఎలా కుదురుతోందో?’-- జయశ్రీ నందకుమార్ మత్తులోకి దిగింది.

కానీ, జానకి ఒక గుక్క ఆసిడ్ తాగిన ముఖం పెట్టింది. వేగంగా ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది.

ధరణి దగ్గర పెద్ద కన్ ఫ్యూజన్. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏదో మర్మం దాగుంది!

ఒక విధంగా అందరూ మాట్లాడుకుని బయలుదేరటానికి రెడీ అవుతుండగా -- తాంబూలం, పట్టు జాకెట్టు గుడ్డలతో, ఒక స్టైన్ లెస్ స్టీలు డబ్బాతోనూ, అందరికీ కుంకుమ బోట్టు పెట్టి ఆంటీతో ఇప్పించాడు సంతోష్.

పార్వతి గాలిలో తేలడం మొదలుపెట్టింది.

నందకుమార్...మిమ్మల్ని పెళ్ళి చేసుకోబోయే పిల్ల చాలా పెట్టి పుట్టుంటుంది. ఇప్పుడే ఇన్ని కార్యాలు చేస్తున్నారే...! ఇదంతా మా పని

పనులలో మొగవాళ్ళ పని, ఆడవాళ్లపని అని ఉన్నదా ఏమిటి...? నా వరకు అందరూ, అన్ని పనులూ చేయగలరు. చేయాలి...

--- నందకుమార్ యొక్క నిష్పక్షపాతమైన మాటలతో వాళ్ళ మొహాలు కాకరపువ్వొత్తుల్లాగా వెలిగినై. ఆంటీ దూరింది.

నందూ...అయితే నువ్వొక బిడ్డను కనివ్వు చూద్దాం

అందరూ అదివిని నవ్వుతూ సెలవు తీసుకున్నారు.

ఆటో తిరుగు ప్రయాణానికి రెడీ అయ్యింది. నాలుగు రెండ్ల ఎనిమిది అమ్మాయల గాజుల చేతుల టాటాతో ఆటో తిరిగి వెళ్తున్నది చూస్తూ నిలబడ్డాడు నందకుమార్.

ఆంటీ చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ, “నేను ఇక బయలుదేరతాను...పాలు కాచి ఉంచాను. రాత్రి మరిచిపోకుండా తాగేసి పడుకో... అన్నది.

నందకుమార్ ఉత్సాహంగా అది వినితల ఊపాడు. ఆంటీ బయలుదేరింది.

లోపలకు వచి తలుపులు కూడా మూయకుండా ఈల వేసుకుంటూ రెండడుగులు ముందుకు వేసిన నందకుమార్ కు వాకిటి తలుపులు దభేల్మని మూసుకున్న శబ్ధం వినబడింది.

వెనక్కి తిరిగి చూసాడు... జానకి.

ఆమె కళ్ళల్లో నీటి సరస్సు....

ఏయ్...ఏమిటిది, ఇప్పుడే వెళ్ళావు...ఇంతలో?”.........ఈల మోత ఆగి అతని పెదాల మీద ప్రశ్న.

అవును...నేను మీకు చెల్లెలు లాగానా?” -- ప్రారంభమే ఆ ప్రశ్న అడిగింది.

నందకుమార్ దగ్గర చిన్న బెదురు.

ఏయ్! అదొచ్చి, అదొచ్చి...వూరికే ఆటగా చెప్పింది సమర్ధించుకోవటానికి ప్రయత్నించాడు.

చెల్లెలు అంటే అర్ధం ఏమిటో తెలుసా నందకుమార్...?” టపాకాయలాగా పేలింది జానకి.

నిప్పు అంటే నోరు కాలిపోతుందా జానకీ...ఆ టైములో నా నోట్లో అలా వచ్చేసింది

నందకుమార్ దగ్గర నిర్లక్ష్యం.

మూర్ఖుడా. నిప్పు అంటే నోరు కాలదు అని నాకూ తెలుసు. కానీ కొన్ని మాటలు జీవితాన్నే కాల్చేస్తాయి అని నీకు తెలుసా? మీరెలా అలా చెప్పొచ్చు...?”

చుట్టూ అందరూ ఉన్నారు. అందుకనే అలా చెప్పాను

ఎవరుంటే మీకేంటి? మీరు నన్ను ప్రేమిస్తున్నారు. సంధర్భం దొరికినప్పుడు ధైర్యంగా దాన్ని బయటకు చెప్పటానికి మీకెందుకు భయం?”

నువ్వు చదువుకుంటున్న అమ్మాయివి. నేను కాలేజీ స్టూడెంటును. అది మనల్ని బాధిస్తుంది...

స్టూడెంట్ అయితే మనం ప్రేమించేది మాత్రం కరెక్టా?”

అది వేరు జానకీ...యౌవ్వనం యొక్క ఒక భాగం అది?”

అప్పుడు పెళ్ళి?”

అది ఉద్యోగం దొరికిన తరువాత

ఖచ్చితంగా జరుగుతుంది కదా?”

ఖచ్చితంగా...! -- మాట్లాడుతూనే ఆ చేదైన సమయంలో కూడా ఆమెను కౌగలించుకున్నాడు.

ఆమె వదిలించుకోవటం మొదలుపెట్టింది. ఆశను అనుచుకోవటం ప్రారంభించింది.

దేవుడా...దేవుడాఅంటూ లోతైన మనసులో నమ్మకం పాటను పాడుకుంది.

రేపు ఇతను రాక్షసుడుగా మారే అతను అనే కనువిప్పో, లెక్కో ఏదో ఒకటి ఆమె మదిలో మెదిలింది.

ఆడతనం అనే సున్నితానికి ఇలాంటి కనువిప్పు నమ్మకం ఉంటూనే మంచిది!

ఆటోలొ నుండి అందరూ దిగారు. చివరగా జయశ్రీ దిగింది. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏకాంత భావం.

అది చూడంగానే తండ్రి మోహన్ శర్మ దగ్గర ఖచ్చితమైన లెక్క.

ఎక్కడకమ్మా వెళ్ళొస్తున్నావు?”

నా స్నేహితుడి ఇంటికి...

నుదిటి మీద ఇప్పుడే పెట్టినట్టు ఉన్న కుంకుమ...

అవును నాన్నా...బొమ్మలు పెట్టారు, అందుకే!

మంచిది...బాగా సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నావే?”

అవును నాన్నా...కొంతమంది మగవాళ్ళు, అంటే మా కాలేజీలో ఒకతను నన్ను బాగా ఆశ్చర్యపెడుతున్నాడు. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ’...?”

ఏంటమ్మా ఆ గ్రేట్ పర్సనాలిటీ?”

రామాయణంలోని రాముడే నాన్నా...

రాముడా! ఈ, కలియుగ కాలంలో ఎవరూ అలా ఉండలేరమ్మా...

ఏం నాన్నా...మీరు లేరా?”

ఎవరూ ఉండలేరు అంటే నేను కూడా నమ్మా...

ఏమిటి నాన్నా...నెత్తి మీద బాంబు వేస్తున్నారు మీరు...?”

నేను బాంబు వేయటం లేదు. నువ్వే వేస్తున్నావు! ఈ రోజు అబ్బాయలను రాముడూ, కృష్ణుడూ అని నమ్మి మోసపోకు...

ఆయన అన్న మాటలను గోడ గడియారం గంటల మోతతో అవునన్నట్టు తెలిపింది.

***********************************************PART-5***********************************************

ఈ రోజు

శోకమైన ఆ ఇంటి హాలు మధ్యలో నరకబడ్డ చెట్టులాగా పడుంది జయశ్రీ.

పెరిగిన గడ్డాన్ని తడుముకుంటూ ఆమె పక్కనే తండ్రి మోహన్ శర్మ.

గడియారం మాత్రం ఫలితం ఎదురు చూడకుండా తన పనిలో టక్...టక్...టక్మంటూ మూడు గంటలు కొట్టింది. ఆకలి మరచి, దాహం దూరమై, ఎంతసేపు ఇలాగే ఉండటం?

ఏమ్మా...ఇలాగే కూర్చోనుంటే ఎలా?” -- ఆయనే ప్రారంభించాడు.

ఏం చేయమంటావు నాన్నా! మాట్లాడకుండా చచ్చిపోదామా?”

ఆయన దగ్గర ఆశ్చర్యం.

ఏం మనిషివమ్మా నువ్వు...ఇప్పుడు చావటానికి ఏమిటంత ముఖ్యం?”

జీవించటంలో ఏమర్ధముంది నాన్నా? ఈ మనిషి ఇలా జైలుకు వెళ్ళకుండా తప్పించుకుని, మనల్నే బెదిరించటం మొదలు పెట్టేడే...?”

ఓ...అదా నీ బాధ? అతను ఒకసారి బెదిరిస్తే, నువ్వు అతన్ని రెండు రెట్లు బెదిరించు...?”

నాకు అలాంటి బెదిరింపు మాటలు రావు నాన్నా…

రావాలి...ఖచ్చితంగా రావాలి. వస్తేనే జీవితం!

దెబ్బకు దెబ్బ, కత్తికి కత్తి. ఎలా సరి అవుతుంది?”

మనుషులకు సరి అవదు. కానీ, మృగాలకు అదే సరి…

నాకు అలా ఆలొచించటానికే నచ్చలేదు నాన్నా...

అలాగైతే నచ్చేదే ఆలొచించు...

నాకిప్పుడు ఒంటరి తనమే నచ్చింది

లేదు...ఒంటరి తనం నిన్ను కన్ ఫ్యూజ్ చేస్తుంది. నువ్వు ఇప్పుడే గుంపుతో ఉండాలి

ఆమె చాలా సేపు మౌనం వహించింది. తరువాత కొంత బాధపడింది.

ఇలా అయిపోయిందే?’ అని తలుచుకుని, తలుచుకుని ఏడ్చింది.

గంధర్వుడు, సౌందర్యుడు, వసీకరుడు, లక్షణమైనవాడు, మన్మధుడు, అని అనుకుని తననే రాసిచ్చిన ఆమెకు పెళ్ళి అయ్యి ఆరు నెలల వరకు ప్రేమ వర్షం కురిపించినతను, జానకీ విషయంతోనే మొదటిసారిగా బయటపడ్డాడు.

అక్కా...

-- జానకీ యొక్క పిలుపు విన్నప్పుడు, వంటగదిలో వంటలో లీనమై ఉన్నది జయశ్రీ.

రా... జానూ! ఏమిటి విషయం?”

--అడిగి ముగించే లోపు, అక్కడే కడుపులో తిప్పటంతో వాంతి చేసుకుంది జానకీ.

ఏమైంది జానకీ...ఒంట్లో బాగుండలేదా?”

----ఆందోళన చెందింది జయశ్రీ.

ఒంట్లోపల ఒళ్ళు అక్కా! అదే ఈ కష్టం... -- జానకీ దగ్గర కన్నీటి సమాధానం.

ఏమంటున్నావు జానకీ?” -- ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.

అక్కా! నేనిప్పుడు తల్లి స్థానంలో ఉన్నాను

ఏమిటి జానకీ చెబుతున్నావు...?”

నాలో ఇంకో ప్రాణం పెరుగుతోంది!

జయశ్రీ దగ్గర ఆశ్చర్యం. కళ్ళు పెద్దవైనై.

ఏమిటి జానకీ చెబుతున్నావు నువ్వు?”

అవునక్కా! నేనిప్పుడు మూడు నెలలుగా గర్భంగా ఉన్నాను...

ఒసేయ్ పాపి...ఎవరే కారణం?”

అది తెలుసుకుని నువ్వేం చెయ్యబోతావు? నువ్వైనా బాగుండు

ఏమిటే వాగుతున్నావు?”

ఏమీలేదక్కా...నాకు ఎవరి దగ్గరైనా నోరు తెరిచి ఏడవాలనిపించింది...అందుకే వచ్చాను

ఏమిటే...ఏమిటేమిటో వాగుతున్నావు! ఏమైందే నీకు? అది ఎవరో చెప్పు. నేను నీకు పెళ్ళి చేస్తాను

నీవల్ల కాదక్కా...

అంటూనే వాష్ బేసిన్ దగ్గరకు జరిగి మళ్ళీ వాంతీ చేసుకుని చేతులూ, మొహమూ కడుక్కుంది.

ఎందుకు కాదు జానకీ...?”

కాదంటే కాదక్కా...నువ్వు ఆ మాట వదిలేయ్. అవును...నీ భర్త నీతో ఎలా ఉంటున్నారు?”

ఆయనకేం తక్కువ. బాగానే ఉంటున్నారు?”

బాగానే అంటే ఎలా అక్కా?”

ఎందుకు అవన్నీ అడుగుతున్నావు?”

కారణం ఉందక్కా

నాకేమీ లోటు లేదు...

బాగా ఆలొచించి చెప్పక్కా. నాకు నిజం తెలిస్తే అవమానం అనుకుని ఏదీ దాచకు...!

జానకీ, నీ మాటలు పెద్ద పజిల్ లాగా ఉందే. నిజంగా చెబుతున్నా, నందకుమార్ నన్ను సంతోషంగానే పెట్టుకున్నాడు...కానీ, అప్పుడప్పుడు అతనితో కలిసి నన్ను మందు కొట్టు అంటున్నాడు...

ఎప్పుడూ మీరు ఇలాగే ఉండగలరనే నమ్మకం ఉందా?”

జానకీ...తిన్నగా విషయానికి రా...

జయశ్రీ స్వరంలో మెల్లగా ఆందోళన వ్యాపించటం మొదలయ్యింది.

అక్కా...నేను మోసపోయేనక్కా. రాముడు, లక్ష్మణుడు అని నమ్మి, నీ భర్తను నీకు ముందే ప్రేమించి మోసపోయి, ఇప్పుడు గర్భమై నిలబడ్డాను...

జానకీ అలా చెప్పినప్పుడు, జయశ్రీకి కళ్ళల్లో ముల్లు గుచ్చుకున్నట్టు అయ్యింది.

ఇంటర్ ఫైనల్ చదువుకుంటున్నఅమ్మాయి యొక్క మాటలతో హృదయం నూనె బానీలో పడి వేగుతున్నట్టు ఒక ధఢ.

జానకీ! నిజంగానే చెబుతున్నావా...?”

ప్రామిస్ అక్కా! నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇది చెబుతున్నాను. నీ జీవితంలోకి అడ్డు వస్తానేమోనని భయపడకు అక్కా. నేను ఎవరి జీవితంలోనూ అడ్డు రాదలుచుకోలేదు.

సెక్స్చాలా మందిని చావకుండా చంపే విషయమక్కా. ఆ విషయమే నా జీవితంలోనూ ఆడుకుంది. వయసుకు మించిన నా చేష్ట నాకు యముడిగా అయ్యింది.

కొన్ని పుస్తకాలూ, సినిమాలూ, నా లాంటి అమ్మాయల లోపల వెలుగుతున్న కామ దీపానికి మరింత నూనె పోసే రకమక్కా. ఆ మంటలోనే చలి కాచు కోవాలనుకునే వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది...ఎంతమంది?

ఒక శవం దగ్గర ఒకమ్మాయి నగ్నంగా నిలబడితే చాలు...అది కూడా కామంతో లేచి నిలబడుతుందక్కా. అంత మోసంగా ఉందక్కా ఇప్పుడున్న కాలం!

నందకుమార్ ని అనడం తప్పు అక్కా. అన్నిటికీ కారణం నేనే. నాకు కట్టుబాటు లేదు. నా దగ్గర స్పష్టత లేదు. తప్పు--సరి అర్ధం చేసుకునే తెలివి లేదు. నేను నన్ను పోగొట్టుకున్నాను. నన్ను పోగొట్టుకున్నానక్కా...

-----వెక్కి, వెక్కి ఏడుస్తున్న జానకీని దగ్గరకు తీసుకుంది జయశ్రీ. అదే సమయంలో వాకిటి వైపు మోటార్ సైకిల్ ఆగే శబ్ధం.

నందకుమార్ దిగి వచ్చాడు. లోపలున్న ఇద్దర్నీ చూసి చిన్నగా నవ్వాడు.

జానకీ తలెత్తి అతన్ని చూసేసి, తల దించుకుంది.

జయశ్రీ చూపుల్లో అగ్ని కణాలు...సాక్షాత్తు ఆ రాముడే అనుకున్న అతను ఇప్పుడు కృష్ణలీల గోపాలుడుగా అయిపోయేడే...అంటే ఇంతకాలం మనమీద చూపిన అభిమానం, ప్రేమ అబద్దమా?

ఆవేదన వలన చెవుల వెనుకనుండి చెమట. తల వెంట్రుకలలోని కొన్ని కళ్ళ ముందు పడి చిన్నగా ఆడటం చేస్తుంటే, జానకీ అక్కడి నుండి జారుకోవటం ప్రారంభించింది.

నిన్ను నేను డాక్టర్ను చూడమన్నానే, చూడలేదా?”

---జారుకోవటం ప్రారంభించిన జానకీని చూసి అడిగాడు. అతని స్వరంలో కొంచం కూడా ఆందోళన లేదు.

ఆమె ఆగి అతన్ని కోపంగా చూసింది.

అది విన్న జయశ్రీ దగ్గర షాక్.

జానకీ ఏమీ మాట్లాడకుండా కోపంగా నడవటం మొదలు పెట్టింది.

ఏయ్...త్వరగా వెళ్ళి కడుపును కడుక్కో. లేదంటే నాకేమీ నష్టం లేదు. నాకు ఏమీ తెలియదని ప్రామిస్ చేయడానికి కూడా నేను వెనుకాడను

-----అతని జవాబు... జానకీ చెవిలో పడలేదు.

కానీ, జయశ్రీ చెవిలో బాగానే వినబడింది.

నందూ... అన్నది వణుకుతున్న స్వరంతో --

ఇలా చూడు జయశ్రీ...మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా కలుగజేసుకోకు! ఎప్పుడూ నువ్వే నా భార్యవి. ఇంకెవరినీ నేను భార్యగా చేసుకోను. భయపడకు...

అతని మాటలతో ఆమెలో గ్రద్ద తిరుగుడు.

నందూ. మీరా ఇలా నడుచుకున్నది? మీరా ఇలా మాట్లాడేది?”

ఇలా చూడు జయశ్రీ...ఈ దేశంలో వందకి తొంభై మంది నాలాంటి వాళ్ళే! అంతెందుకు, నీ లాంటి ఆడపిల్లలూ మాత్రం ఏం? వాళ్ళూ మనలాగానే

మనలాగా అంటే?”

జయశ్రీ స్వరంలో అగ్ని జ్వాల.

మనలాగా అంటే...జీవితం జీవించటానికేఅనే రకం

అలాగంటే?”

ఏయ్! ఏమిటి ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు? ఒక మగాడు, ఆడది ఇష్ట పడితే జాలీగా ఉండటంలో తప్పే లేదు జయశ్రీ...

అయితే మొరాలిటీకిఏమిటి అర్ధం నందూ?”

---బొంగురు కంఠంతో అరిచినట్లు అడిగింది.

“‘మోరాలిటీనా? అలా అంటే ఏమిటి జయశ్రీ? నాకు తెలిసి క్లారిటీ, పర్శనాలిటీ, క్వాలిటీ...ఇవన్నీనే ఉన్నాయి

“‘వల్గారిటీఅనేది ఒకటుంది. అది తెలుసా మీకు...

సరే, దానికేమిటిప్పుడు?”

మీ దగ్గర అది ఎక్కువ ఉంది

ఉంటే ఉండనీ...నీకెందుకు కోపం?”

నాకు నా భర్త రాముడిగా ఉండాలి

అది జరగనే జరగదు జయశ్రీ. ఈ రాముడు, కృష్ణుడు కథ అంతా అబద్దం. మనది డార్విన్ సిద్దాంతమే...మృగాలకు పాతివ్రత్యం లేదు. అవన్నీ నీ మాటలు వింటే ఇంతే సంగతులు?

సెక్స్అనేది జీవితంలో ఒక భాగం అమ్మా. ఒంట్లో ఓపిక ఉండే కాలంలో విధవిధంగా -- రకరకాలుగా అనుభవించటంలో తప్పేలేదు

అలాగైతే నేను ఎవరి దగ్గర కావలంటే...?”

అది పెళ్ళికి ముందైతే తప్పులేదు! పెళ్ళి తరువాత అంటే నేను నిన్ను తృప్తి పరచటం లేదు అంటే ఆలొచించుకోవచ్చు. నేను నిన్ను రోజూ తృప్తి...

పాపాత్ముడా! ఎంత వికారంగా మాట్లాడుతున్నావు...నువ్వు బాగుపడతావా?”

ఖచ్చితంగా...నేనే సూపర్గా ఉంటాను

----- నందకుమార్ అలా చెప్పినప్పుడు, పక్కింట్లో పెద్దగా అరుపులు.

ఏమిటిది అనేది పరిగెత్తుకుని వెళ్ళి చూసినప్పుడు, జానకీ ఉరి వేసుకుని వేలాడుతోంది.

మొహం కడుక్కుని, నుదిటి మీద విభూది గీతలు వేసుకుని వచ్చిన మోహన్ శర్మ శిలలాగా కూర్చుని, లోకాన్నే మరిచిపోయున్న జయశ్రీని చూసి బాధపడ్డాడు.

జయశ్రీ ఏమిటిది...? ఎలుక చెత్త కుప్పను పొడుచుకుని దాంట్లోకి దూరినట్టు, నీ మనసును పాత జ్ఞాపకాలతో తిప్పి, తిప్పి...నీరస పోతున్నావే!  నీకు ఏర్పడిన శోకం, ఈ లోకంలోని సమస్యలతో పోల్చి చూస్తే ఆవగింజ అంత. మనసును దృఢం చేసుకుని మంచి జీవితం ఉందిఅని నమ్మి పనులను మొదలుపెట్టు...

--ఆమెను ఉత్సాహ పరిచారు.

జయశ్రీ తల ఎత్తింది.

జానకీ జ్ఞాపకం వచ్చింది నాన్నా... అన్నది.

అది వినగా...ఆయన ముఖంలో ఆసిడ్ పోసినట్టు చేదు.

హు. పాపం ఆ అమ్మాయి... అని పెదాలు గొణిగినై.

ఆమె మాత్రమా నాన్నా...?”

అవునమ్మా...నిన్ను చూసి జాలిపడను. ఆమె లోకం వదిలే వెళ్ళిపోయింది. నువ్వో జీవించబోయేదానివి. నిన్ను చూసి నేను జాలిపడకూడదు. అది నీకు మంచిది కాదు

ఇంకా కొత్తగా చెడు ఏం జరగాలి నాన్నా?”

కొంచం నోరు మూస్తావా? నోరు తెరిస్తే విరక్తి మాటలేనా? ఎండిపోయిన చెట్టు కూడా చిగురించే కాలమమ్మా ఇది. మనోశక్తి గురించి నీకేం తెలుసు...?”

మనసే లేదు...శక్తికి ఎక్కడికి వెళ్లను?”

ఇదిగో చూడు జయశ్రీ, పాత చెత్తను కెలక కూడదు. నువ్వు బాగానే జీవిస్తావు...జీవించబోతావు. నేను చూడబోతాను. నీ మనసును దానికి తయారుచేసుకో

-----అప్పుడు వాకిటి వైపు ఎవరిదో నీడ లాగా కనబడ, మోహన్ శర్మ చూపులు అటువైపు మల్లినై.

వాకిటి వైపు గౌతం!

జయశ్రీ... జయశ్రీ...అంటూ పిచ్చివాడిలా తిరిగి -- జయశ్రీతోనే ఒక తెగిపోయిన చెప్పులా విసిరివేయబడ్డ అదే గౌతం. 

అదొక అన్యాయమైన శోక కథ!

***********************************************PART-6***********************************************

ఆ రోజు

ప్రామిస్ గా ప్రేమ -- కామమే

చర్మ ఆకలికి ఇలాంటి పవిత్ర పేరా?

ప్రేమను అనురాగము అంటోంది చరిత్ర!

అనురాగమనేది అందరికీ ఒకటే కదా?

ఆడపిల్లలను ప్రేమించే వాళ్ళు ఎందుకు కాకులనూ-పిచ్చుకలనూ ప్రేమించటం లేదు!

కన్యలను వసపరుచుకోవటానికి తహతహలాడేవారు కన్యాత్వాన్ని దాటిన వారిని ఎందుకు వసపరుచుకోవటం లేదు?

ప్రేమను నిష్పాక్షికంగా ఉంచండి! అనురాగంగా ఉండే అందరినీ, అన్నిటినీ ప్రేమించండి...

చర్మాన్ని స్నేహించటం ప్రేమ అవదు...ఇప్పుడంతా ప్రామిస్ గా ప్రేమ-కామమే!

గౌతం రాజ్.

కళాశాల కవితల పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న ఆ కవిత, నోటీస్ బోర్డులో ప్రకటనగా ఉండి అందరితోనూ విమర్శించ బడింది.

గౌతం యొక్క కవితను నేను ఆమోదిస్తున్నాను అని మొదలు పెట్టింది ధారణి.

నేను మనిషిని చూసి కవితను తూకం వేయటానికి ఇష్టపడటం లేదు. కవితలో ఉన్న అభిప్రాయాన్ని చూసి చెబుతున్నాను

అలా అంత గొప్ప అభిప్రాయం ఏముంది ఆ కవితలో?”

ఇప్పుడంతా ప్రేమంటే కామమేనే! నాకు ఎటువంటి అనుమానమూ లేదు

అందరూ అలాంటి వాళ్ళు కాదు

లేదు. అందరూ అలాంటి వాళ్ళే!

ఒప్పుకోను! మన కాలేజీలో ఎంతోమంది జెంటిల్ మ్యాన్లు ఉన్నారు. ఉదాహరణకు మన నందకుమార్ ని తీసుకో

ఒకత్తి నందకుమార్ పేరును ఆ చర్చలోకి లాగగా, అక్కడే ఆలొచనలలో మునిగిన జయశ్రీ గబుక్కున తల ఎత్తింది. అప్పుడే అతను ఆమె మనసును ఆక్రమించిన ప్రారంభ ప్రేమ దశ.

నందకుమార్ అయినా సరే, ఈ కవితను రాసిన గౌతం రాజ్ అయినా సరే...ఆడవారి విషయంలో, ‘సెక్స్లో జెంటిల్ మ్యాన్ గా నడుచుకోరు. నడుచుకోలేరు...

ఏం చూసి అలా చెబుతున్నావు?”

ఇప్పటి కాలఘట్టాన్ని బట్టి

ఏ కాల ఘట్టంలో నైనా మంచిదీ ఉంది, చెడ్డదీ ఉంది. సతీ సావిత్రీ జీవించిన కాలంలో కూడా ఈ రెండూ లేవా ఏం?”

నువ్వు సంబంధమే లేకుండా ఎక్కడికో వెడుతున్నావు! ఇప్పుడు ప్రేమంటే కామమే. నా అనుభవంలో నేను చెబుతున్నాను. నన్ను ఒకతను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నువ్వు లేకుండా నేను జీవించలేనుఅన్నాడు. ఏం?’ అని అడిగాను. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నీ ఆలొచన నన్ను చంపుతోంది అన్నాడు.

అదే ఎందుకుఅని అడిగాను. నాకు నీమీద ప్రేమ అన్నాడు’. అలాగంటే ఏమిటని అడిగాను. అభిమానం అన్నాడు. ఈ ప్రపంచంలో అందరూ అందరిపైనా అభిమానం చూపించాలి. చీమా, దోమలపై కూడా ఆప్యాయత, అభిమానం చూపించాలి. అందువల్ల అందులో ఏమీ తప్పు లేదు. కానీ, అలా అభిమానం చూపడానికీ, నన్ను చూడకుండా ఉండలేపోతున్నానూ అనడానికీ సంబంధం లేదే?” అన్నాను.

ఆ అభిమానం వేరు, ఈ అభిమానం వేరుఅన్నాడు.

అభిమానంలో కూడా రెండు వేషాలా?’ అని అడిగాను.

అవును! ఇది యవ్వన అభిమానం, అంటే ప్రేమఅన్నాడు.

అలాగైతే నాలాంటి అందరి అమ్మాయలపైనా ప్రేమేనా?’ అని అడిగాను. లేదు, నాకు ఎవరు అందంగా అనిపిస్తారో వాళ్ళ మీదేఅని చెప్పాడు.

 ‘అందం...శరీరానికి సంబంధించింది కదా?’ అన్నాను. అవును...నువ్వు ఎల్లోరా ఆర్ట్. అజంతా శిల్పంఅన్నాడు. ఆ తరువాత వెన్నల, పువ్వు, కోకిల, ప్రేమ కోతిఅని ఒకటే పిచ్చి వాగుడు! నా పర్శనాలిటీ నాకు తెలిదా? అయినా కానీ, నా  లోపల అతను నన్ను వర్ణించిన తీరు నాలో మత్తు ఎక్కించింది. మా ఇంట్లో నన్ను తెలివి తక్కువ దానా అని తిడతారు.

అతనేమో నన్ను శ్రీదేవీ అన్నాడు. సినిమాకు పిలిచాడు. వెళ్ళేను. మొదట్లో చెయ్యి తాకేడు, భుజాల మీద చెయ్యి వేసాడు. మెల్లగా చెయ్యి నడుము దగ్గరకు తీసుకు వెళ్ళాడు. ఏయ్, ఇదంతా పెళ్ళి తరువాతే అని చెప్పాను’.  ‘పరవాలేదు...ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి నన్ను చాలా బాధలు పెట్టాడు. చాలు చాలూ అనిపించింది. అయ్యా సామీ...నా కడుపు నింపి, విషం తాగేటట్టు చేయకు...! నేను, నువ్వనుకునే రకం కాదుఅని చెప్పాను. ఏమీ అవదు. గర్భం రాకుండా ఎంజాయ్ చేయటానికి ఎన్నో వసతులు వచ్చేసినై...ఎలా ఉంది కథ? ఇదేనే ఈ కాలం ప్రేమ...

ఏయ్, వింటున్నాం కదా అని ఒకేసారి పెద్ద కథ చెప్పకు...ఇది వెతుకుతున్న కరువు ఎద్దు. కావాలంటే అలా నడుచుకోనుండవచ్చు. నేను కూడా ఒకతన్ని ప్రేమిస్తున్నాను. నన్ను అతను ముట్టుకోనే లేదు

తరువాత ఒకేసారి అన్నీ ముగించుకుందామని అనుకుంటున్నాడో, ఏమో?”

పెళ్ళి అయిన తరువాత నువ్వు ఏమైనా చేసుకో అన్నాను. అంతకు ముందు చేస్తేనే కదా తప్పు...?”

దాని కోసం ప్రేమించటం -- పెళ్ళి చేసుకోవటం. అన్నీ తప్పే

అప్పుడైతే పెద్దలు చూసి చేసిన పెళ్ళిళ్ళలో ఇది లేదా? మొదటి రాత్రి అని ఎందుకు పెడుతున్నారు?”

ఇదిగో చూడూ సెక్స్తప్పు కాదు. కామం ఒక అగ్ని. దాన్ని స్టవ్వు వెలిగించుకుని వంట చేసేలాగా అందంగా వాడుకోవటానికే పెళ్ళి. అలా లేదంటే సన్యాసినిగా వెళ్ళి పోవటం మంచిది

బాగా చెప్పావే! ఆ అగ్నిని ని  అందంగా కాల్చాలి. సినిమా హాలూ, పార్కు, పబ్లిక్ ప్లేసు అంటూ దొరికిన చోట్లో కాల్చకూడదు. అలా కాల్చేది జీవితమే కాదు

ఇప్పుడు ముగింపుగా ఏం చెబుతున్నారు? గౌతం రాసిన కవిత్వం కరెక్టా-తప్పా?”

అది ఒక కరెక్ట్ అయిన తప్పు

ఇదేంటి కొత్త రకం విమర్శ?”

అవును...ఆ కవితను తప్పు అని చూస్తే తప్పు. కరెక్ట్ అని చూస్తే కరెక్ట్. యవ్వున ప్రాయంలో ఒక త్రిల్ కోసం అటూ ఇటూగా ఉండటంలో తప్పు లేదు. ఈ కాలంలో సన్యాసం సాధ్యం కాదు.

ఇంట్లోంచి బయటకు బయలుదేరితే కళ్ళల్లో పడే దృశ్యాలన్నీ సెక్స్ను ప్రేరేపించేవిగానే ఉన్నాయి. మనం వేసుకునే సగం సగం దుస్తులు, గోడల మీద అతికిస్తున్న సినిమా పోస్టర్లు, కొన్ని పుస్తకాలలో వచ్చే బ్లో ఆఫ్చిత్రాలు, కథల్లో వచ్చే సంభవాలు, చూసే సినిమాలలోనూ గ్లామర్ సీన్లు మన మనసులను, దాంతో పాటూ మన పట్టుదలను పరీక్షించే కాలం ఇది...! ఇక్కడ మనం తింటున్న భోజనం లోనూ ఉప్పూ-కారం ఎక్కువ. అలాంటప్పుడు శరీరం ఎలా మట్టి తిన్న పాములా చుట్టుకుని ఉండగలదు? అది బుస కొట్టే తీరుతుంది.

మాట్లాడకుండా అమెరికాలోలాగా ఓపన్ సెక్స్లో మనల్ని వదిలేయొచ్చు. మూసి, మూసి పెట్టి ఎమి సాధించాము? ప్రేమ, కామం ఎక్కువ అయ్యిందే తప్ప

గౌతం యొక్క కవిత పైన బలమైన వివాద చర్చ జరుగుతున్నప్పుడు అతనే అక్కడికి వచ్చాడు. అందరూ అతన్ని అదొలా చూశారు.

హలో గౌతం, మీ కవితే వీళ్ళ నోళ్ళళ్ళో రోలులో పిండి నలుగుతున్నట్టు నలుగుతోంది... అన్నది ధారణి.

కవిత అంటేనే విమర్శలు ఉంటాయి. విమర్శలే కదా మనిషి ప్రతిభను పెంచుతుంది!

--- గౌతం యొక్క ఆ జవాబుతో ఆశ్చర్యపోయింది ధారణి.

కొన్ని విమర్శలు మన ప్రతిభను పెంచదు. నీరస పరిచేస్తుంది గౌతం. అవునూ,  ప్రేమ గురించి ఎప్పుడూ వ్యతిరేకంగానే ఆలొచిస్తున్నారే...ఎందుకని?”

ఎవరు చెప్పారు? నేను ప్రేమ గురించి వ్యతిరేకంగా ఆలొచించటం లేదు! కరెక్టుగా ఆలొచిస్తున్నాను

ప్రేమ అంటే కామం అనేది కరెక్ట్ అయిన ఆలొచనా?”

ఇప్పుడు ఇదే కదా నిజం?”

ఏం, కామం లేని ప్రేమే లేదనేది మీ నిర్ణయమా?”

అక్కడొకటీ -- ఇక్కడొకటీ కరెక్టు కాకపోవచ్చు

అప్పుడు అది మెచ్చుకుని ఎందుకు కవిత రాయకూడదు?”

ఎప్పుడూ ఎక్కువ మందిని బాధించే దాని గురించే రాయాలి

సరే, విషయానికి వస్తాను. మీ వలన కామం కలుపకుండా ప్రేమించటం కుదురుతుందా?”

కుదురుతుంది. నేనూ ప్రేమిస్తూనే ఉన్నాను

గౌతం యొక్క ఆ సమాధానంతో ధారణి అధిరి పడ్డది.

ఈ మొహానికి ప్రేమా? ఈ మనిషి యొక్క హృదయం కూడా ప్రేమించ గలిగేదా?’

---ఆశ్చర్యం, స్వతంత్ర దినం రోజు జెండా పైకి వెళ్ళినట్టు ధారణిలో పైకి వెళ్ళింది.

ఎవరని తెలుసుకోవచ్చా?”

సారీ...అది సస్పెన్స్

అతని సమాధానం పక్కనున్న జయశ్రీని కూడా ఆశ్చర్య పరచింది. ఆమె కూడా అతని వైపు ఎవరన్నట్టు చూసింది.

గౌతం ఆమె చూపులను గమనించాడు. మెల్లగా నవ్వుకున్నాడు. నా ప్రేమికురాలివి నువ్వే కదా?’ అనే లాగా చూసాడు.

కానీ, ఆమె వలన అతని చూపులలోని అర్ధాన్ని అర్ధం చేసుకోలేకపోయింది!

ఏమిటి పెద్ద సస్పెన్స్’? సరదాగా చెప్పండి గౌతం... ధారణి వదిలిపెట్టేట్టట్టు కనబడలేదు.

సారీ...నాది వన్ వే ప్రేమ. నేను మాత్రమే ప్రేమిస్తున్నాను. ఆమె నన్ను ఇంకా ప్రేమించటం లేదు. ఆమె కూడా నన్ను ప్రేమించటం మొదలు పెట్టనివ్వండి. తరువాత చెబుతాను

అవును, ఆమెకు తెలిస్తేనే కదా ఆమె ప్రేమించేది?”

ఆమెకు మాత్రం తెలియ పరుస్తాను

ఆమె కాదంటే...?”

నేనొక మంచి ప్రేమికుడిగా, ఇంకో అమ్మాయిని తలుచుకోవటం, చూడటం చేయకుండా కాచుకోనుంటాను ధారణి

ఎందుకు కాచుకోవాలి...ఆమె నిన్ను ప్రేమించటం లేదే...?”

ఒకవేల తరువాత ప్రేమించ వచ్చు కదా?”

ఎప్పుడు...ముసలితనం వచ్చిన తరువాతా?”

ఏం? అప్పుడు ప్రేమ రాదా ధారణి....?”

యవ్వనం పోయిన తరువాత ప్రేమించటంలో అర్ధమే లేదు గౌతం...

నేను సెక్స్కోసం ప్రేమిస్తే మీరు చెప్పేది కరెక్టే...నేను ప్రేమించేది ఆమె మనసును!

మనసును ప్రేమించటానికి ప్రేమికుడిగా ఉండనవసరం లేదే...! ఒక అన్నయ్యగా అనుకుంటే కూడా అభిమానం చూపించ వచ్చే...?”

ధారణి యొక్క క్లిష్టమైన ప్రశ్నకు ముందు కొంచం తడబడిపోయాడు గౌతం.

వాస్తవమే కదా? శరీర కాంక్ష లేనప్పుడు మనం చూపించే అభిమానం సహోదరత్వంతో కుదిరేదీ పవిత్రమైన ఒకటే కదా? కానీ, ఆ మాటను ఆలొచించి చూడటానికే మనసులో తడబాటు నిండింది.

జయశ్రీ అనే ఆమె నాకు మాత్రమే సొంతమైనదిగా ఉండాలిఅనేలాగా అతన్ని ఆలొచింప చేసింది.

సహోదర అభిమానాన్ని ఎవరైనా చూపించవచ్చు. కానీ, తన అభిమానం దానికంటే వేరుగా ఉంది. అందుకోసం అది కామంతో కూడినదని చెప్పలేము!

ఆలొచనలతో గౌతం సతమవుతుండగా, అతన్ని అలా చిక్కులో చిక్కుకునేలా చేసిన ప్రశ్న అడిగిన ధారణి గర్వ పడింది!

జయశ్రీ కూడా క్షుణ్ణంగా గమనిస్తూనే ఉంది. గౌతం అతని మనసుపై చేస్తున్న పోరాటం చూడ చూడ ఆమెకూ ఆశ్చర్యం. 

ఇతని ప్రేమికురాలు ఎవరై ఉంటారు?’

జయశ్రీ మదిలోని ఈ ప్రశ్న ఊయల కట్టుకుని ఆడుతున్నప్పుడు, నందకుమార్ వచ్చాడు.

హాయ్...ఏమిటి అందరూ సీరియస్ గా ఏదో ఆలొచిస్తున్నట్టు తెలుస్తోంది...?” అతని దగ్గర ప్రశ్న.

రండి నందకుమార్! ఈ రోజు మిస్టర్ గౌతం వలన ప్రేమ గురించి ఒక హీటడ్ ఆర్గ్యూమెంట్... ధారణి చెప్పింది.

గౌతం రాసిన కవిత గురించా?”

ఎలా అంత కరెక్టుగా చెబుతున్నారు?”

అంతా ఒక యూహమే! నాకే అతని కవిత విషయంలో చాలా అభిప్రాయ భేదం. ప్రేమంటేనే కామం అనేది అతని అభిప్రాయం. అతను కావాలంటే ప్రేమను కామం అనుకోనీ. కానీ నేను నా ప్రేమను  కామంతో సంబంధ పరిచి ఆలొచించనే లేదే

నందకుమార్ యొక్క అభిప్రాయంతో జయశ్రీ మొహంలో కాకర పువ్వొత్తులు వెలిగినంత ప్రకాశం. వారే వా...ఇంత స్పష్టత ఉన్న హృదయమా నీకు’! అనే ఆశ్చర్య చూపు.

పక్కన నిలబడ్డ గౌతంకి నందకుమార్ కి సమాధానం చెప్పటంలో ఇష్టం లేనట్టు ఒక చూపు. నందకుమార్ కీ అది అర్ధమయ్యింది. అతని ఆ నిర్లక్ష్యం, చిన్నగా అతన్ని కలత చెందేటట్టు చేసింది

మనుష్యుల మనసులకు పలు సమయాలలో డబ్బు, వసతులు కంటే పట్టించుకోకపోవటం అనేది ఒక జీవిత ఫైల్యూర్ విషయం.

గౌతం యొక్క ఆ నిర్లక్ష్యం, నందకుమార్ లో వేరే విధంగా అతన్ని గుచ్చి తోసింది. దాన్ని మాటలలో ఒలకబోసాడు.

ఎప్పుడు ఇలాగంతా రాస్తున్నారో, వాళ్ళ దగ్గర మాటకూ, చేష్టకూ సంబంధమే ఉండదు. ప్రేమంటే...కామమే నని కలత చెందేవారు, వాళ్ళ ప్రేమ విషయంలో కామం లేకుండా ఉండలేరు

లేదు. నేను నీలాగా కాదు. నా ప్రేమలో కామం లేదు సమాధానంగా గౌతం అరిచాడు.

మొదట నీకు ప్రేమికురాలే లేదు. ఆ తరువాతే కదా నీకు కామం ఉందా...లేదా అనేది చూడగలం...

--- గౌతం అది విని మండిపడ్డాడు.

నేనూ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది! పెళ్ళి చేసుకుంటే ఆమెనే పెళ్ళి చేసుకుంటా. శరీరం నాకు ముఖ్యం కాదు. అలా గనుక ఆమెనే పెళ్ళి చేసుకోలేకపోతే నేను సన్యాసిగా ఉండిపోతాను

ఏయ్, ఈ సినిమా కథంతా మాకు చెప్పకు...! విధి చాలా పెద్దది తమ్ముడూ. నీ ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోతావు...

ఓడిపోను. నా మనో దృఢం నాకు తెలుసు

అలాగైతే నువ్వు ఇక జీవితాంతం సన్యాసివే! నేను దానికి గ్యారంటీ ఇస్తాను

నన్ను ఎవరూ ప్రేమించరనే కదా అలా చెబుతున్నావు...?”

అవును...కావాలంటే చూడు?”

చూద్దాం

---ఇద్దరూ బొటను వేలు ఎత్తి పందెం గుర్రాలు లాగా మారిపోవటాన్ని చుట్టూ నిలబడి చూసిన వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు.

అవసరం లేని పందెం. ఒక కవిత చర్చా వివాదం ఇలా వేడెక్కనవసరం లేదు అని అనుకున్నారు.

జయశ్రీ మాత్రం, ‘సరైన పోటీ!అని మనసులో చెప్పుకుంది.

***********************************************PART-7***********************************************

ఈ రోజు.

రండి సార్...రండి... వాకిటి వైపు నిలబడున్న గౌతంను మోహన శర్మ లోపలకు స్వాగతించారు.

జయశ్రీకేమో అతన్ని చూడటానికే ఇష్టం లేని వేదన.

హఠాత్తుగా వచ్చి నిలబడ్డాడే...!

ప్రేమకు తాత్పర్యం చెప్పినతను -- ప్రేమించిన దానినే పెళ్ళి చేసుకుంటాను...లేకపోతే జీవితాంతం సన్యాసిగానే ఉండిపోతాను అని సవాలు చేసాడు -- మధ్యలోనే ప్రేమ, కామం ఒకటే అనేలాగా చీకట్లో నన్ను కౌగిలించుకుని మానభంగం చేయాలని చూసిన పరమ కిరాతకుడు, చండాలుడు...ఈ రోజు ఎందుకు వచ్చాడు?’

---మనసులో అలల లాగా గుద్దుకుంటున్న భావముతో ఆమె వంచుకున్న తల ఎత్తలేదు.   

లోపలకు వచ్చినతను, మోహన శర్మ ను గౌరవంగా  చూసాడు. ఆయన నోరు తెరిచారు.

మీ గురించి జయశ్రీ చాలా చెప్పింది...?” అన్నారు.

మంచిగానా...చెడుగానా?”

---అతను అలా అడుగుతాడని ఆయన కొంచం కూడా ఎదురు చూడలేదు.

జెనెరల్ గా చెప్పింది. తప్పుగా మాట్లాడటానికి ఏమైనా ఉందా ఏమిటి?”

చాలా ఉంది సార్...

పోనివ్వండి. ప్రొద్దున్నే మిమ్మల్ని కోర్టు వాకిట్లో చూసాను. ఇప్పుడు ఇంటికే వచ్చారు. మీకు ఏం కావాలి?”

జయశ్రీకి సంతోషమైన జీవితం ఏర్పడాలి అనేదే నా ఆశ

చాలా సంతోషం! ఆమె సంతోషంగా ఉండాలని మీరు అనుకోవడానికి కారణం?”

నేను ఆమెను అభిమానించే ఒకడ్ని

ఈమె ఇంకొకరి భార్య సార్...

నేను కాదనటం లేదు. అవతలి మనిషి భార్య బాగుండాలి అనుకోవటం తప్పా సార్?”

అందరూ బాగుండాలని అనుకుంటే అది మంచి ఆలొచన. ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క భార్య బాగుండాలనుకోవడం...

మీరు అడగాలనుకుంటున్నది ఏమిటో నాకు అర్ధమయ్యింది సార్. నేను జయశ్రీని ఒక టైములో మనసారా ప్రేమించినతన్ని. ప్రేమంటే పవిత్రమైనది అనేది నా అభిప్రాయం. కానీ లోకం దానిని కామంగా మారుస్తూ వస్తోంది. నా  అభిప్రాయానికి బలమైన పరీక్ష వచ్చింది. జయశ్రీని నేను అన్యాయంగా పోగొట్టుకున్నాను. దాని గురించి కూడా నాకు ఎక్కువ బాధ లేదు. ఆమె నందకుమార్ అనే నక్క దగ్గర చిక్కు కున్నదే పెద్ద బాధ. అయినా కానీ ఆమె బాగుంటుందని నమ్మాను. కానీ ఆమె జీవితం ఎంత బాధాకరంగా ఉందో నేను మీకు చెప్పక్కర్లేదు

అన్నీ సరే... జయశ్రీ జీవితం ఇలా అయ్యి, ఆమె విషయం కోర్టు వరకు వెళ్ళటం మీకు ఎలా తెలిసింది?”

----మోహన శర్మ యొక్క ఆ ప్రశ్నకు గౌతం ఒక ఉత్తరాన్ని తీసి జాపాడు.

ఉత్తరాన్ని మడతలు విప్పిన ఆయనకు ఆశ్చర్యం కాచుకోనున్నది. ఆ ఉత్తరం రాసింది నందకుమారే.

గౌతంకి!

ఛాలంజ్ లో నా దగ్గర ఓడిపోయిన వాడా...ఎలా ఉన్నావు? నా దగ్గర ఛాలెంజ్ చేసినట్టే సన్యాసిగానే కదా? నువ్వు సన్యాసిగా ఉండటం మాత్రమే కాదు...నువ్వు ఎక్కువ ఆశ పడిన జయశ్రీ నా దగ్గర సంతోషంగా ఉంటే, అది చూసి ఈర్ష్య పడే  సరాసరి మనిషివి కాదు నువ్వు.

జయశ్రీ నా దగ్గర కష్టపడటం నువ్వు చూడాలి. అప్పుడే నీ బాధ ఎక్కువ అవుతుంది. ఆ బాధను తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. అప్పుడే నాకు సంతోషం...రా...రేపు కోర్టుకు వచ్చి చూడు. నేను జయశ్రీని పెట్టిన కష్టాల గురించి కొంచమైనా తెలుసుకోవచ్చు నువ్వు. 

నువ్వు ప్రేమించిన ఆమె ఇక పూటకో గండంఅని వేదన చెందేలా చెయ్యబోతాను. అది మాత్రమే కాదు...ఆమె నాకు విడాకులు ఇవ్వబోతోందట.

నేను నలిపి పారేసిన ఆ పువ్వును ఒక్క మూర్ఖుడు కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోడు. నువ్వూ చేసుకోలేవు. నీ యోగ్యత ఏమిటో ఆమెకు తెలుసే!

మీరిద్దరూ ఒకరినొకరు చూసుకుని కృంగి కృషించి చచ్చిపోవాలి. అదే ఇక నాకు కావలసింది

ఇట్లు,

నందకుమార్.

----ఉత్తరాన్ని చదివి ముగించిన మోహన శర్మ, గౌతంను నీరు నిండిన కళ్ళతో తలెత్తి చూసాడు.

నేను ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. ఆల్మోస్ట్ సన్యాసి లాగానే ఉన్నాననే పెట్టుకోండి. హఠాత్తుగా ఈ ఉత్తరం నిన్న వచ్చి చేరింది. నాకు ఒకటే ఆశ్చర్యం. నందకుమార్, జయశ్రీ...వీళ్ళను ఆల్మోస్ట్ నేను మరిచిపోయున్న సమయంలో ఇలాంటి ఒక ఉత్తరం. నేను రాజమండ్రీలో ఉన్నది తెలుసుకుని, ఎలాగో అడ్రస్సు కనుక్కుని, నందకుమార్ ఈ ఉత్తరం రాసాడు...గాయాన్ని కెలికినట్లు హీనమైన పని ఇది...

----- గౌతం యొక్క వివరణను విన్న జయశ్రీ గబుక్కున తండ్రి చేతిలో ఉన్న ఉత్తరాన్ని లాక్కుని చదివింది.

కొంచంసేపు అలాగే నిలబడిన తరువాత నెత్తి మీద చెయ్యి పెట్టుకుని కొంచం దూరం జరిగి వెళ్ళి కూర్చుండిపోయింది.

నాన్నా, ఎందుకు నాన్నా ఈయన ఇలా నడుచుకుంటున్నారు? నేనేం తప్పు చేసాను? ఈయన ఎంతో మంది అమ్మాయలతో కాంటాక్ట్ పెట్టుకున్నారని తెలిసి, జానకీ ఆత్మహత్య చేసుకున్నా...ఈయన్ని వదలకుండా ప్రేమించేనే, దానికి ఇదేనా నాకు బహుమతి?”

ఆమె కళ్ళల్లో నుండి నీరు జలపాతంలో పడుతోంది.

అతను ఏ రోజూ మంచివాడుగా ఉన్నది లేదు జయశ్రీ. కాలేజీ జీవితంలో అతను ఒక నటుడు. నువ్వు ఆలస్యంగా కూడా అర్ధం చేసుకోలేదు. వాడు మనిషే కాదు

గౌతం దగ్గర నుండి వచ్చిన సమాధానాన్ని ఆమె విసుగుతో విన్నది.

మనిషి పుట్టుకలో ఎన్నో విచిత్రాలు. కొంతమందికి రూపం కృరం... నందకుమార్ లాంటి వాళ్ళకు మనసు కృరం. నన్ను ఏం చెయ్యమంటావమ్మా? మేము ఏదైనా మాట్లాడితే, ఉపదేశం అని చెప్పి తోసేసే నాగరీక మనుషులే మీరు...

అంత దుఃఖం లోనూ మోహన శర్మ తన కూతుర్ని గుచ్చకుండా గుచ్చాడు.

నిజమే నాన్నా...! మా జనరేషన్ కి ఎందులోనూ లోతైన ఆలొచనలేదు. నాకు ఇది చాలదు నాన్నా. ఇంకా పడాలి

-----మొహాన్ని చేతులతో మూసుకుని ఏడవటం మొదలు పెట్టిన ఆమెను నీరసంతో చూసాడు గౌతం.

ఏడవకు జయశ్రీ...జరిగిపోయిన దాని గురించి ఏడవటం కంటే -- జరగబోయే దాని గురించి ఆలొచించటమే ధైర్యమైన యువ వయసుకు అందం...

నేను ఏడుస్తాను...నవ్వుతాను...మీరు దాని గురించి బాధపడకండి మిస్టర్. కాసేపు నన్ను ఒంటరిగా వదలండి అన్నది. అతన్ని చూస్తూ.

మోహన శర్మ ను జయశ్రీ మాటలు ఏదో చేసింది.

జయశ్రీ. ఇలా మొండి పట్టుదల పట్టకు! నీ కోసం బాధపడి రాజమండ్రీ నుండి వచ్చిన వ్యక్తి ఆయన

ఎక్కడ్నుంచి వచ్చినా బాధ లేదు నాన్నా. ఇతను ఒక వేషగాడు

ఉండనీ. అందుకని నువ్వు ఇలా నడుచుకోవచ్చా? ఈ దేశంలో వేషం వేయని వారు ఎవరమ్మా? ఏడుస్తూ, నవ్వుతున్నట్టు వేషం వేస్తున్నాను నేను...కష్టాల్లో ఉన్నా, సుఖంగా ఉన్నట్టు వేషం వేస్తారు కొందరు...ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క వేషం వేయకుండా లేరు జయశ్రీ

నాకు ఏ వివరణ వద్దు. ఈయన్ని బయటకు వెళ్ళమని చెప్పు...

---- జయశ్రీ యొక్క మొండితనం చూసి గౌతమే మెల్లగా వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాడు.

సారీ జయశ్రీ...నేనే వెళ్ళిపోతాను! నేనే వెళ్ళిపోతాను సార్... అంటూ వెనక్కి తిరిగి నడిచాడు.

అతన్ని వెంబడించాడు మోహన శర్మ. వాకిలి దాటి మెట్లు దిగి కాంపౌండ్ గోడ దగ్గరున్న బాదాం చెట్టు నీడను దాటి వీధిని ఎక్కిన అతన్ని వెంబడించి నడిచారు.

మిస్టర్ గౌతం! ఒక్క నిమిషం... అంటూనే అతని భుజం పట్టుకుని ఆపారు.

అతను కలతతో ఆయన్ని చూసాడు.

రండి, నడుస్తూ మాట్లాడుకుందాం. అవునూ, మీ మీద జయశ్రీకి ఎందుకు అంత విరక్తి? మిమ్మల్ని చూస్తే తప్పు చేసే వ్యక్తిలా తెలియటం లేదే. అందుకనే అడుగుతున్నాను

-----నడుచుకుంటూనే ప్రశ్న అడిగిన ఆయన్ని విరక్తిగా చూసి చిన్నగా నవ్వాడు.

పరవాలేదు సార్. మీరైనా నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారే! అన్నాడు.

అదంతా తరువాత. మీ మీద జయశ్రీకి ఎందుకు అంత విరక్తి? కారణం ఏమిటి?”

అది ఆ రోజు జరిగిన దర్మ సంకటమైన సంభవం సార్

అదే. ఏమిటా సంభవం?”

***********************************************PART-8***********************************************

ఆ రోజు.

కాలేజీ ఆవరణ కళకళ లాడుతున్న ప్రొద్దుటి సమయం. టైకట్టుకున్న ప్రొఫసర్ల గర్వమైన నడక. ప్రొద్దుటి బద్దకంతో స్టూడెంట్స్ దేహాల గుంపు. క్లాసు బెంచీల మీద తాళం వేస్తూ కథలు చెప్పుకుంటున్నకొందరు. జయశ్రీ మాత్రం మామూలు కంటే ఎక్కువ మౌనంతో ఉంది.

మనసులో స్లో మోషన్లోరాజకుమారుడి దుస్తుల్లో నందకుమార్ డూయెట్పాట మొదలుపెట్టి – రా జయశ్రీ! కలిసి పాడు...అని పిలుస్తున్నట్టు బ్రమ.

పక్కన కూర్చున్న ధారణి అది అర్ధం చేసుకునట్టు నవ్వింది.

ఇప్పుడంతా కాలేజీలో సర్టిఫికేట్కంటే సులభంగా ప్రేమ దొరుకుతోంది. డిగ్రీకంటే సులభంగా మొగుడు దొరికేస్తున్నాడు... అన్నది, కొంచం వేళాకోళంగా.

ఎవర్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు?”

----పార్వతి దగ్గర నుండి ఎదురు ప్రశ్న.

అంతా మన జయశ్రీని తలుచుకునే. నందకుమార్ ని తలుచుకుని జయశ్రీ మంచు గడ్డలాగా కరిగిపోతోంది అన్నది.

అదెలా నీకు తెలుసు?”

నాకు ఎలా తెలుసు అని అడుగుతున్నావా? నేను పాఠాలు చదవటంలో వీక్ గా ఉండొచ్చు. కానీ, కాలేజీలో ఎవరు, ఎవరిని సైటు కొడుతున్నారు...ఎవరు ఎవరితో సినిమాకు వెడుతున్నారు...కౌగలించుకుని డూయట్ పాడుతున్నారు అనేది లెక్క తీయటంలో ఇక్కడ ఒక నిపుణుల గుంపే ఉంది. నేను దాంట్లో మెంబర్...

అది సరే... నందకుమార్ జయశ్రీ ని లవ్ చేస్తున్నాడా?”

అవును...చీమకు బెల్లం చేదా ఏమిటి?”

మనమందరం కూడా బెల్లమే

ఉండొచ్చు. కానీ, తెల్ల బెల్లానికీ -- నల్ల బెల్లానికీ తేడా ఉందిగా?”

అంటే మనమందరం నల్ల బెల్లమా?”

ఏదో ఒకటి. ఇప్పుడు అమ్మడు అతన్ని చూసి కరగటం మొదలుపెట్టింది. అతను వచ్చే సమయం... అని ధారణి చెప్పి నప్పుడు...

కాలేజీ తారు రోడ్డు మీద నందకుమార్ యొక్క సంతోషమైన వాహన సవారి!

నీలి రంగు చొక్కా, నీలి రంగు ప్యాంటూ, ఆకాశం రంగును చూపిస్తున్నట్టు బైకు నుండి స్టైలుగా దిగిన అతన్ని బోలెడు నలుపు, తెలుపు బెల్లాలు చూస్తున్నాయి.

అతనో తన సైన్యం కబుర్లు చెప్పుకుంటున్న పన్నీర్ చెట్టు నీడ దగ్గరకు వెళ్ళి చేరాడు.

రా మావా రా...ఏమిటీ నీలి రంగు దుస్తుల్లో అదరగొట్టే గ్లామర్ తో వచ్చావు?”

మన లెక్షరర్ రేణుకాకి బ్లూ రంగుఅంటే చాలా ఇష్టం కదా?”

ఓరి వెధవల్లారా! ఆడ స్టూడెంట్స్ ని టీజ్ చేస్తూ, చివరకు పాఠాలు చెప్పే లెక్షరర్ల దాకా వచ్చారా?”

ఏది సూటవుతుందో...దాన్ని దక్కించుకోవాలి మావా…

అవునూ, జయశ్రీకి ఏమైంది? నలభై ఎనిమిది రోజుల వ్రతంలో ఏదైనా పురోగతి ఉన్నదా?”
ఇప్పుడు నన్ను తలుచుకుని డూయెట్ పాడటం మొదలుపెట్టింది. ఒక వారం పోనీ. ఆమెగానే లెటర్ రాసి పంపిస్తుంది చూడు

అదెలా మామా ప్రేమ చరిత్రలో అంత ఖచ్చితంగా నువ్వు లెక్క వేస్తున్నావు?”

అదంతా పూర్వ జన్మ పుణ్యం భక్తా

జయశ్రీతో ప్రేమ మాత్రమేనా...పెళ్ళి కూడానా

మన చరిత్రలో ఎవరినీ పెళ్ళి చేసుకునే ఆలొచనే లేదు. అదీ దాటి పెళ్ళి చేసుకున్నా...సినిమా నటీమణులలో ఎవరినైనా చేసుకుంటే చేసుకోవచ్చు

అవును నాయకా! నువ్వు కనపడలేదని వాళ్ళూ బెంగగా ఉన్నారు...

రేయ్! నాయకుడి పుట్టు మచ్చ గురించి నీకేం తెలుసు? అది రంభా, ఊర్వశీలనే  దక్కించుకునే మచ్చరా. అయినా కానీ జయశ్రీని ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటారని...

మాటకు మాట పెరుగుతూ పోతున్నప్పుడు గౌతం ఆ గుంపులోకి దూరాడు.

అతన్ని చూసిన వెంటనే మాటలన్నీ వేరే టాపిక్ గా మారినై.

మామా...ఈ కవి కూడా ఎవరినో లవ్చేస్తున్నట్టు చెప్పేడే, ఎవరై ఉంటారు?”

ఉత్తుత్త కబుర్లు మామా. వీడి మాసిపోయిన జుబ్బా వాసనకి బిచ్చగత్తే భయపడి పారిపోతుంది. వీడిని ఒకత్తి లవ్చేస్తుంది అనుకుంటున్నావా?”

“‘ఒన్ వేప్రేమ అని చెప్పాసాడే. ఆ తరువాత మన కాలేజీ మహారాణుల గురించి ఎందుకు అనవసరమైన మాటలు? వీడు లవ్చేస్తున్న ఆ దేవతను మీకెవరికైనా తెలుసా? తెలుసుకుని వచ్చినతనికి బహుమతి...ఏం నందకుమార్, కనిపెట్టటం కుదురుతుందా? నువ్వు ఆడపిల్లలను మాత్రమే వంచ గలవు. వీడి లాంటి మనుష్యులను పరిశోధించి విషయం తెలుసుకోవటం కుదురుతుందా? నీకు కుదిరితే వెయ్యి రూపాయలు ఇస్తాను

ఒకడు నందకుమార్ ని పెద్దగా గిల్లాడు. నందకుమార్ ని కాదని ఏ మగాడ్నీ చూసి కుదురుతుందా, సాధ్యమా అని అడగ కూడదు.

కుదరదు అని ముందే తెలిసినా, ప్రయత్నం చేసి చూడటం యవ్వనం యొక్క విచిత్రమైన స్వభావం. నందకుమార్ ను కూడా ఆ స్వభావం ఒక ఊపు ఊపటం మొదలుపెట్టింది.

ఈ గౌతం ఏమైనా పెద్ద వాల్మీకా? ఇతన్ని అర్ధం చేసుకునేదీ, అతని మనసులో ఉన్నది తెలుసుకోవటం పెద్ద విషయమా ఏమిటి?” 

ఇదిగో చూడు, నువ్వు పందెం వేసిన పార్టీ ఏమీ తెలివి తక్కువ వాడు కాదు. మేమేమీ కారణం లేకుండా వెయ్యి రూపాయలు పందెం కట్టలేదు

----ఆ జవాబు విన్న నందకుమార్ వెంటనే గౌతం దగ్గరగా వెళ్ళాడు.

హలో కవిగారూ... అంటూ గౌతం భుజం మీద చేతులు వేసాడు.

గౌతం కి అది నచ్చకపోయినా, నందకుమార్ చేతిని తీసేయకుండా జవాబుగా  నవ్వాడు.

పందెం వేసుకుని ఇద్దరం పోటీలోకి దిగేశాము. ప్రేమ గెలవబోతుందా, లేక...కామం గెలవబోతుందా అని కాలేజీ మొత్తం మాటలే. ప్రిన్సిపాల్ చెవులకు కూడా విషయం వెళ్ళి జేరింది

నందకుమార్ మాటలు విన్న గౌతం దగ్గర ఒక విజయోత్సాహ నవ్వు.

ఎవరి చెవులకు వెళ్ళినా, వెళ్ళకపోయినా, నేనే గెలుస్తాను అన్నాడు గౌతం.

మొదట ప్రేమించాలి...ఆ తరువాత విజయం-ఓటమి గురించి మాట్లాడాలి...?”

అది నా అవస్త, నువ్వెందుకు బాధ పడతావు

ఏయ్, ఇదేంటి పిచ్చి మాటలు? మొదట ఒకత్తికి ధైర్యంగా ఐ లవ్ యూచెప్పి, ఆమె దగ్గర నుండి చెప్పించుకో. నేను ఆ వెంటనే పందెం నుండి తప్పు కుంటాను. నువ్వు గెలిచినట్టు ప్రకటిస్తాను

దానికి సమయం -- కాలం ఉన్నది. ఇప్పుడు మనం చదువుకోవటానికి వచ్చాము. వెళ్ళి చదివే పద్దతి చూడు...

అదే కదా చూసాను...నీ కేమిటి, ప్రేమ రావటమేమిటి? ఏదో భావోద్వేగం వేగంతో పందెం-గ్రంధం అని దిగాసావు! నీకు సరిసమంగా నేనూ పందెంలో దిగాను చూడు...నన్ను అనాలి

ఎగతాలి చేస్తున్నట్టు నందకుమార్ దగ్గర నుండి వచ్చిన మాటలు, గౌతంను రెచ్చగొట్టాయి. లోతైన అతని మనసులో సేకరించబడి ఉన్న ప్రేమ భావాలు, ఇష్టాలూ వెంటనే నాలుక వైపు పరిగెత్తి రావటం మొదలు పెట్టినై.

నీ మనసులో కల్పనలో వెయ్యిమందిని కూడా ప్రేమించవచ్చు. నేను కూడా ఒక నటిని నా కల్పనలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇవన్నీ ప్రేమ అవుతాయా? వాస్తవానికి రా...

పాపం ఆ నటి...! నేను నీలాగా కాదు నందకుమార్.  నా ప్రేమికురాలు అత్యంత తెలివిగల ఒక అమ్మాయి. శరీర అందం మాత్రమే కాదు...మనసు అందం కూడా కలిగినది…

అలాగైతే ఆమె ఎవరో చెప్పు...

నీ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు

పందెం కట్టిన వాడి దగ్గర చెప్పకుండా, ఇంకెవరి దగ్గర చెప్ప బోతావు? నాకే కదా తెలియాలి. మొదట నువ్వు ప్రేమిస్తున్నది ఎవరనేది తెలియాలి. ఆ తరువాత నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నదా అనేది తెలియాలి. ఆ తరువాతే కదా నువ్వు పందెంలో గెలుస్తావా, ఓడిపోతావా అని తెలుస్తుంది

అది విన్న గౌతం చాలాసేపు మాట్లాడలేదు. ఏదో భావోద్వేగంలో నందకుమార్ దగ్గర చిక్కు కున్నట్టు ఒక భావం అతనిలో మెదలింది. 

ప్రేమిస్తున్న అమ్మాయి పేరు వీడి దగ్గర చెప్పటంలో తప్పు లేదు. కానీ, వీడు దాన్ని కాలేజీ అంతా డోలు వాయించి దండోరా వేసి చెబుతాడు. మనల్ని ఇంకా ప్రేమించని ఆ అమ్మాయికీ అది అవమానం అయిపోతుంది. కార్యమూ చెడిపోతుంది!

నిర్ణయాత్మకంగా నోరు మెదపను అనే నిర్ణయానికి వచ్చిన గౌతం, ఏదీ మాట్లాడకుండా అక్కడ్నుంచి నడవటం మొదలుపెట్టాడు. నందకుమార్ కి అతని నడవడిక చిర్రెత్తించింది.

ఏయ్...ఏమిటీ! మాట్లాడుతున్నప్పుడే వెళ్ళిపోతున్నావు...?”

----నేను నిన్ను విడిచి పెట్ట దలుచుకోలేదూ అనే విధంగా అతని ముందు ప్రశ్నతో వెళ్ళి నిలబడ్డాడు.

నువ్వు నాకు నమ్మకమైన మనిషివి కాదు. నీ దగ్గర నా ప్రేమికురాలి పేరు చెప్పలేను. ఆమె కూడా నన్ను ప్రేమించటం ఖచ్చితమవనీ. అప్పుడు ఇద్దరం కలిసి వచ్చి చెబుతాము. ఇప్పుడు నన్ను వెళ్ళనీ...--అన్నాడు గౌతం.

ఆమె ఎప్పుడు నిన్ను ప్రేమించేది...అది ఎప్పుడు నాకు తెలిసేదిఅంతవరకు పందెం ఏమయ్యేది?” -- అన్నాడు నందకుమార్. 

పెద్ద పందెం. కావాలంటే పందాన్ని నేను ఇప్పుడే వాపస్ తీసుకుంటాను. నీ దగ్గర పందెం కట్టిన నా భావొద్వేగానికి నేను చాలా విచారిస్తున్నాను. దానికంటే వాపస్ తీసుకున్నందు వల్ల పెద్ద బాధ ఏర్పడదు. పందెంలో నువ్వే గెలిచినట్టు ఉండనీ. నన్ను వదిలిపెట్టు...

----మాట్లాడేసి వెళ్ళిపోయాడు గౌతం.

నందకుమార్ కి అతని మొదటి ప్రయత్నంలోనే మొదటి ఓటమి. ఆ పులి మొహంలోని కళ్ళల్లో అసాధ్యమైన కసి. చుట్టూ నిలబడ్డ ఫ్రండ్స్ అతన్ని ఎగతాలిగా చూస్తున్నట్టు బ్రమ. కాలేజీ క్యాంపస్ లో అతని గంభీరానికి అవమానం ఏర్పడినట్టు ఫీలింగ్. 

గోళ్ళను పళ్ళతో కొరకటం మొదలు పెట్టాడు.

చాలా సేపు. ఎక్కువ సేపు...దగ్గరగా జరుగుతున్న కెమిస్ట్రీ క్లాసులో ఆమ్లలాల గురించి వివరిస్తున్న వివరణ మెల్లగా చెవిలో వినిపించింది.

దూరంగా ఉన్న క్యాంటీన్ నుండి వస్తున్న ఉల్లిపాయ, కొత్తి మీరతో చేస్తున్న వంటకం యొక్క వాసన గాలిలో ఎగురుతూ వచ్చింది.

భుజాలపైన కొందరి స్నేహితుల చేతులు పడ్డాయి.

ఏమైంది మామా... గౌతం నీ దగ్గర చిక్కాడా, లేదు నువ్వు గౌతం దగ్గర చిక్కావా?”

అతను శొకంగా ఉండటం చూస్తే వెయ్యి రూపాయలు మనకు మిగిలేటట్టు ఉంది. నేను అప్పుడే చెప్పానే! నీ ట్రిక్కులన్నీ ఆడవాళ్ళ దగ్గర మాత్రమే, వాడి దగ్గర చెల్లుబడి అవదని

స్నేహితులు మాట్లాడుతుంటే -- నందకుమార్ లో మొదటి సారిగా ఓటమి జ్వరం పొగరెక్కి -- రక్తంలో వేగంగా వెడుతూ నెత్తుటి కణాలను కాల్చివేస్తున్నట్టు ఒక ఫీలింగ్. 

అరిగిపోయిన చేతి వెళ్ళ గొరు ముక్కలను పళ్ళతో వెతకటం మొదలు పెట్టాడు.

ఓడిపోవడం అనేది నా చరిత్రలోనే లేదు అన్నాడు కటోరంగా.

అతని కటోరాన్ని చెరిపే లాగా జయశ్రీ వస్తూ ఉన్నది.

అందమైన జడ అలంకారంతో -- అందమైన చీరలో అందాల పోటీ వేదికపై వయ్యారంగా నడుస్తున్న విధంగా ఆమె రావటాన్ని చూసిన తరువాత నందకుమార్ లోపల జ్వరమూ, బ్రమ మెల్లగా కిందకు జారటం మొదలుపెట్టినై.

సరి, సరి! జరుగుదాం. జయశ్రీ వస్తున్నది... అంటూ స్నేహితులు వెనక్కి  తిరిగారు

దగ్గరగా వచ్చింది జయశ్రీ. హలో చెప్పి,“ఎందుకు అదొలా ఉన్నారు?” అని మొదలు పెట్టింది.

అతనికి ఆమె స్నేహం వెంటనే కావల్సి వచ్చింది. ఒక వారం, పది రోజులు తరువాత ఆమె దగ్గరకు చేరుదాం అనే అతనిలో అంతకు ముందు ఏర్పడిన అభిప్రాయాన్ని తీసి చెత్త కుండీలో విసిరేసి అప్పుడే ఆమె దరకి చేరటం ప్రారంభించాడు.

మనసే బాగుండలేదు... అన్నాడు.

ఏం? ఏమైంది?”

ఆ గౌతం దగ్గర పందెం కట్టటాన్ని తలుచుకునే...

పందెంలో మీరే గెలుస్తారు. అందులో మీకు సందేహమేంటీ?”

నేను గెలవకూడదు జయశ్రీ. పాపం... గౌతం! మనసు విరిగి పోతాడు...

నందకుమార్ యొక్క ఆ కొత్త వ్యూహం ఉచ్చులో ఇరుక్కున్న జయశ్రీ ఆశ్చర్యపోయింది.  

మీరు ఒక జెంటిల్ మ్యాన్ అన్నది.

పొగడ్త ఎందుకు జయశ్రీ? వాడి దగ్గర పందెం ఏమీ వద్దూ అని చెబుదామనుకుంటున్నా. నా నోటితో అది చెప్పాలంటే నా స్వీయ గౌరవం అడ్డుపడుతోంది...

కావాలంటే నేను వెళ్ళి చెప్పనా?”

నిజంగానా...? అలాగే గౌతం ఎవర్ని ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటే వసతిగా ఉంటుంది

అది మనకెందుకు?”

అలా కాదు జయశ్రీ. ఏది ఏమైనా వాడు మన గ్రూపులోని ఒకడు. ఒన్ సైడు ప్రేమతోనలిగిపోకూడదు. వాడు ప్రేమించే అమ్మాయి ఎవరనేది తెలిస్తే మనమే ఆ అమ్మాయిని చూసి, గౌతం గురించి మంచి విధంగా చెప్పి, అతని ప్రేమను ఎంకరేజ్చేయచ్చు కదా?” 

---- నందకుమార్ మాట్లాడుతుంటే జయశ్రీ యొక్కపెద్ద కళ్ళు పొంగి పొర్లి ఆ తరువాత మామూలై, “నందకుమార్! మీ క్యారక్టర్ నన్ను ఆశ్చర్య పరుస్తోంది... అని చెప్పింది.

నన్ను చూసి ఆశ్చర్య పడటానికి ఏముంది జయశ్రీ. అందరూ ప్రేమించుకుంటున్న ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించటానికే ఎవరూ లేరు అన్నాడు చాలా నీరసంగా.  

జయశ్రీకి అతని మాటలు చురుక్కున గుచ్చుకున్నాయి.

నేనున్నాను నందకుమార్... అన్నది అతి వేగంగా.

నిజంగానా జయశ్రీ?”

దేవుని సాక్షిగా

జయశ్రీ...నేను చాలా అదృష్టవంతుడ్ని...

నేను కూడా!

అప్పుడు గౌతం విషయాన్ని కొంచం త్వరగా ముగించు. మన ప్రేమ సంతోషాన్ని మనం మన కాలేజీ ఆడిటోరియం సినిమాహాలులో ఉంచి ఎంజాయ్ చేద్దాం...

ఖచ్చితంగా…

----అతన్ని చూసి నవ్వుతూ మాట్లాడిన జయశ్రీ, గౌతంను వెతుక్కుంటూ వెళ్ళింది.

***********************************************PART-9***********************************************

గౌతం, కళాశాల ఆవరణలోని లైబ్రరీ బయట అశోక చెట్టు క్రింద ఉన్న సిమెంటు బెంచి ఒక దానిపై కూర్చోని ఉన్నాడు.

హలో... -- కోయిల లాంటి స్వర పిలుపుతో దగ్గరకు వెళ్ళింది జయశ్రీ.

గౌతంకి మంచు పొదలో చిక్కుకున్నట్టు ఒక ఆశ్చర్యం. ఆమెను నవ్వుతూ చూసాడు.

ఏమిటి విషయం జయశ్రీ?” అన్నాడు.   

మీరు నందకుమార్ దగ్గర పందెం కట్టింది నాకెందుకో సరి అనిపించటం లేదు! అతను కూడా దాన్ని ఇష్టపడటం లేదు. మాటలు పెంచకుండా దాన్ని డ్రాప్చేసేయండి...

నేను చేసేసేనే!

గౌతం నుండి చటుక్కున వచ్చింది జవాబు. 

ఎప్పుడు?”

ఇప్పుడే. అవునూ, నువ్వెందుకు జయశ్రీ అది అడిగుతున్నావు?”

ఏమైనా మనం అందరం ఒక గ్రూప్ కదా! మనలోనే పందెం -- గొడవలూ బాగుండవు...అందుకే

అందుకనే నేను దాన్ని పెద్దగా తీసుకోకుండా వాపస్ తీసుకున్నాను

అలాగైతే చాలా సంతోషం. అవును, మీరు నిజంగానే ఎవరినైనా లవ్చేస్తున్నారా?”

--- జయశ్రీ వేసిన ఆ ప్రశ్నకు అతను చాలా సేపు మౌనంగా ఉన్నాడు.

నా ప్రేమికురాలివి నువ్వే కదా జయశ్రీ? నువ్వా ఇలా అడిగేది? ఇలా అడగటం కూడా మంచికే! ఒంటరిగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూఅని చెప్పే అవసరం నువ్వే ఇప్పుడే ఇక్కడే కలిగించావే...!

----ఆలోచించి చూసిన అతను అవును జయశ్రీ. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు చాలా నెమ్మదిగా.

ఎవరా అదృష్టవంతురాలు?”

చెబితే కోపగించుకోవుగా?”

లేదు...లేదు. మీకు సహాయం చేయటానికే నేను వచ్చాను

"నా ప్రేమికురాలే నాకు సహాయం చేయటానికి వచ్చిందీ అంటే నేను అదృష్టం చేసుకోనుండాలి".......

---అది విన్న వెంటనే ఆకాశం అప్పడం లాగా విరిగి నేల మీద పడినట్టు అదిరిపడింది.

గౌతం, ఏం చెబుతున్నారు?”

“‘ఐ లవ్ యూజయశ్రీ. నేను ప్రేమించేది నిన్నే నని చెబుతున్నా

కానీ, నేను నిన్ను ప్రేమించటం లేదే!

జయశ్రీ సమాధానంతో గౌతంకి అతిపెద్ద షాక్. చాలా సేపు ఆ షాక్ యొక్క తరంగాల విస్తరింపు. దగ్గరున్న లైబ్రరీ లోకి వెళ్తున్నవారు - వస్తున్నవారు నడుస్తున్న శబ్ధం కూడా వినబడని నిశ్శబ్దం. 

అశోక చెట్టు మీద తోక ఆడించే పిచ్చుక ఒకటి వచ్చి కూర్చుని కింద నిలబడ్డ ఇద్దరినీ చూస్తోంది.

అది పరవాలేదు జయశ్రీ. కానీ, నేను నిన్ను ప్రేమిస్తున్నది నిజం. ఇప్పుడు మాత్రమే కాదు. ఎప్పుడూ...

----ఒక విధంగా శక్తిని కూడదీసుకుని పుస్తకాన్ని తిరగాసాడు గౌతం.

తప్పైన నిర్ణయం గౌతం. నేను నిన్ను ప్రేమించటం లేదు. నందకుమార్ ని ప్రేమిస్తున్నాను. అతని లాంటి ఒక జెంటిల్ మ్యాన్ను చూడలేము. దయచేసి మీ ఆలొచననీ, నిర్ణయాన్నీ మార్చుకోండి. ప్రేమంటేనే కామం అనే పార్టీలో చేరిన వాళ్ళని నా వల్ల ఏ రోజూ ప్రేమించటం కుదరదు గౌతం

గబ గబా మాట్లాడిన జయశ్రీ నడవటం మొదలు పెట్టింది

వెళ్ళే అవసరంలో జయశ్రీ చేతిలో తీసుకు వచ్చిన పుస్తకాన్ని ఆ సిమెంటు బెంచీ మీదే పెట్టేసి మరచిపోయి వెళ్ళిపోయిందని తరువాతే చూసాడు గౌతం.

ఆ పుస్తకాన్ని చేతుల్లో తీసుకున్నాడు. జయశ్రీఅన్న ఆమె పేరు తెలుగులో రాయబడి ఉంది. వాటి మీద గౌతం కళ్ళళ్ళోంచి రెండు బొట్లు నీరు పడి  అక్షరాలను చెరిపింది. అప్పుడు అతని మనసు ఆమె ప్రేమకి అభినందనలను తెలిపే పక్వతని, నాగరీకాన్నీ జ్ఞాపకానికి తీసుకు వచ్చింది. చేతిలో పుస్తకంతో జయశ్రీను వెతుక్కుంటూ నడవటం మొదలు పెట్టాడు.   

వెళ్ళిన వేగంతో వెనక్కి తిరిగిన జయశ్రీని ఆదుర్దాగా స్వాగతించాడు నందకుమార్.

జయశ్రీ, వెళ్ళిన పని విజయవంతమే కదా? గౌతం ప్రేమికురాలు ఎవరు...?” -- అతని ఆదుర్దాకు వేగంగా జయశ్రీ దగ్గర నుండి జవాబు రాలేదు. మారుగా ఆమె మొహంలో వేడి తగిలి ఆగినట్లు ఒక శోకం.  

అమె మౌనం నందకుమార్ దగ్గర చిరాకు ఏర్పరచింది.

అడుగుతున్నాను కదా... నందకుమార్ దగ్గర చిరాకు.

సారీ నందకుమార్. నేను ఎందుకు వెళ్ళానా అని అనిపించింది. ఆ పిచ్చిమాలోకం నన్నే లవ్చేస్తున్నాడు...

---- జయశ్రీ అలా చెప్పటంతో అధిరిపడ్డాడు నందకుమార్. కొంచం సేపటికి ముందు ఏర్పడిన ఆందొళన, జ్వరం అలాగే వెర్రిగా రూపం మారి – గౌతం ఉన్న దిక్కు వైపుకు తిరుగుతున్నట్టు ఒక సంతోషం.

నీ ప్రేమికురాలేనా నా ప్రేమికురాలు?’

ఎగతాలి లాంటి ప్రశ్న లోలోపల.

ఇక నా ప్రేమికురాలుని పెట్టుకునే నీకు పాఠం నేర్పిస్తాను...దెబ్బ కొడతాను...! నీ ప్రేమ శపధాన్ని పిప్పి చేస్తాను...! మనసులో లెక్కకు పైన లెక్క వేయటం మొదలు పెట్టాడు నందకుమార్.

ఏమిటి నందకుమార్! షాకయ్యారా. జయశ్రీ నువ్వు గౌతంనే లవ్ చేయి అని గొప్ప మనసుతో చెప్పి నన్ను ఏడిపించకండి...

ఆమె మాటలు నందకుమార్ ని నవ్వించాయి.

తన అప్రోచ్ చే ఈమెను ఎంతగానో మొసగించింది! రేయ్ నందకుమార్! నువ్వు గొప్ప నటుడివిరాఅని తనకు తానే ప్రసంసించు కున్నాడు.

మనసులో ఒక ఉత్సాహం. దానికి తోడు జయశ్రీ తళతళమని మెరుస్తున్న చీరలో నందకుమార్ ని ఆకర్షిస్తోంది. ఆమె, ఆమె నడుము అందాన్ని బొడ్డుతో పాటూ చూపించి అతనిలోని ఆశను రేకెత్తించింది. 

ఆమె ఎద వేగమైన ఉచ్వాశ నిశ్వాసలతో ఊగుతున్నది. నందకుమార్ లో కామ ఊయల ఊగటం మొదలు పెట్టింది.

జయశ్రీ! మనం కొంచం సేపు మనసు విప్పి మాట్లాడుకుందామా?” అంటూ ఆమెను చూసాడు.

మనం ఇండోర్ స్టేడియంలోకి వెళ్దామా?”

జయశ్రీనే అలా అడగటం నందకుమార్ కొంచం కూడా ఎదురు చూడలేదు. ఆ కాలేజీ ఇండోర్ ఆడిటోరియంప్రేమికులకు కరక్ట్ అయిన దాక్కునే చోటు. లైట్లు లేకపోతే ఎవరూ ఎవరినీ చూసుకోలేని కారు చీకటికి సొంతమైన చోటు.

పాఠాలకు సంబంధించిన చదువు గురించిన చిత్రాలు, స్లైడ్లు, కొన్ని సమయాలలో మామూలు సినిమాలు అని పలు విషయాలకు ఉపయోగపడుతుంది.

చాలా వరకు ఆడిటోరియం మూసే ఉంటుంది. సెక్యూరిటీ ఉంటాడు. పది రూపాయలు ఇస్తే ఆ ఆడిటోరియాన్నే రాసిచ్చేస్తాడు.

పది రూపాయలకు బదులు యాభై ఇస్తే లోపల ఫస్ట్ నైటే జరుపుకోనిస్తాడు. అంత సులభమైన వ్యక్తి.

అందులోకి నందకుమార్, జయశ్రీ ఇద్దరూ దూరారు. తలకు పైన చిన్న కాంతితో వెలుగుతున్న లైట్ల కాంతికి కింద ఉన్న కుషన్ కుర్చీలోకి జారారు.

మాటల్లో తమని తామే మరిచిపోయారు.

బయట గౌతం సెక్యూరిటీ గార్డును బ్రతిమిలాడుతూ అడిగాడు. జయశ్రీ, నందకుమార్ ఇటు పక్కగా వచ్చినట్టు చెప్పారు. లోపల ఉన్నారా?”  

ఏం...వాళ్ళు ఆనందంగా ఉండటాన్ని చూడటానికి నీకు ఆశగా ఉందా?” అన్నాడు వెక్కిరింతగా.

ఏయ్. మాటలు తిన్నగా రానీ. ఈ పుస్తకం ఆమెది. ఇచ్చి వెళ్దామని వచ్చాను

బయటకు వచ్చిన తరువాత ఇవ్వు. లోపలకు ఎవరినీ పంపవద్దు అని నందకుమార్ చెప్పాడు. పాపం ఆ అమ్మాయి...

సెక్యూరిటీ గార్డు చెప్పిన జవాబుతో గౌతం మొహంలో ఆసిడ్ పోసిన మంట. మనసులో ఆందోళన. జయశ్రీ ఇంత త్వరగా ఇలా నడుచుకోవటం ప్రారంభించేవే...!బాధతో తల మీద కొట్టుకున్నాడు. 

సెక్యూరిటీ గార్డును తొసేసి లోపలకు దూరినప్పుడు, చిరు కాంతిలో ఇద్దరూ కనబడ్డారు. అనుకోకుండా వెనక్కి తిరిగిన నందకుమార్ కు... గౌతం రావటం కనబడింది.

-- మనసులో కోపంతో లేచి నిలబడ్డాడు.

జయశ్రీ! గౌతం వస్తున్నాడు?” అని జయశ్రీతో చెప్పాడు. అది విన్న జయశ్రీలో చిన్న ఆందోళన.

క్లియర్ గా చెప్పినా కూడా నన్ను వదలనంటున్నాడు...! రానీ, వాడ్ని నాలుగు వాయిస్తాను అని జయశ్రీ కూడా లేచింది.

సరే...నువ్వు మాట్లాడేటప్పుడు, నేను పక్కన ఉండటం మంచిది కాదు. నేను బయటకు వెడతాను. వాడితో మాట్లాడి పంపించేయి అని జయశ్రీతో చెప్పి బయటకు వెళ్ళటం మొదలు పెట్టాడు.