తీరం ముగ్గులు...(పూర్తి నవల)

 

                                                                                తీరం ముగ్గులు                                                                                                                                                          (పూర్తి నవల)

నీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?”

ఎక్కువ సంపాదించాలి!

బ్రహ్మాండం!

ఉండండి! నేను ఎక్కువ సంపాదించాలని చెప్పింది డబ్బు మాత్రమే కాదు! అభిమానం సంపాదించాలి! మంచి బంధుత్వాలను సంపాదించాలి! మెప్పులు సంపాదించాలి! అన్నిటినీ కలిపితే మనుషులను సంపాదించాలి!

అందుకు నువ్వు కష్టపడనే అక్కర్లేదు. నీ దగ్గర మంచి మనసుంటే, అన్నీ వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి!

లేదు. దాన్ని నేను నమ్మను! సరైన పక్క బలం లేకపోతే డబ్బు కూడా కొన్ని సంధర్భాలలో నా లాగా వికలాంగమైపోతుంది

కోపగించుకోకండి! ఒక సినిమాలో చెబుతారు! మీరు కూడా చూసుంటారు. రక్త సంబంధంతో వచ్చేదంతా లాభమే! ఏదీ కుడా అప్పు కాదు! అలా కాదు అప్పు అని చెబితే తల్లి పాలకు మీరు చెల్లించాల్సిన జరిమానా ఎంత? దాన్ని తీర్చాలనుకుంటే నా తాళి చాల్తుందా? ”

మనకు పెళ్ళి అయిన వెంటనే వేరు కాపురం వెళ్ళిపోదాం. ఇల్లు చూడమని చెప్పబోతా!”

ఇలాంటి ఒక ఉద్దేశం ఉంటే, మనకి పెళ్ళే వద్దు ప్రదీప్. ఆపేయండి!”

నువ్వెందుకు దీన్ని ఎదిరిస్తున్నావు? ప్రతి అమ్మాయి ఇష్టపడి ఎంజాయ్ చేసే నిర్ణయం ఇది!”

నేను అందరి అమ్మాయలలాగా సరాసరి అమ్మాయిని కాను.నాకు మనసులో స్వీయ విశ్వాసం ఉన్నా కూడా, శరీర పరంగా ఒంటరిగా పనులు చేసుకోవటం కష్టం. నన్ను అర్ధం చేసుకో కలిగిన వారి సహాయం నాకు కావాలి! నా పుట్టింటి నుండి నేను రాబోతున్నాను. మీరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు! ఒంటరిగా నేను కష్ట పడనా?”

అందుకని

మీ ఇంట్లోనే జీవిస్తే, మీ వాళ్ళు నాకు దొరుకుతారు! ఇది మీకు నచ్చలేదంటే, మా ఇంటల్లుడిగా ఇల్లరికం వచ్చేయండి! ఏది సులభం?”

పెళ్ళి తరువాత తాను భర్త ఇంట్లోనే ఉంటాను, లేదు వేరు కాపురమే పెట్టాలనుకుంటే భర్తను ఇల్లరికం రమ్మని ఆమె ఎందుకు చెప్పింది? భర్త ఏం చేశాడు? వీళ్ళ సమస్య ఎలా తీరింది? తెలుసుకోవటానికి కథ చదవండి.

*****************************************************************************************************

ప్రదీప్ యొక్క అతి బలహీనం అతని గుణమే. అతను పనిని సరిగ్గా పూర్తి చేయలేడు! తనకంటే గొప్పగా నిలబడ్డ మిగిలిన వాళ్ళను చూసి ఈర్ష్యతో కాలిపోతాడు.

ఈర్ష్యా నిప్పే అతన్ని పైకి రానివ్వకుండా మొదటి నుండే అతన్ని అణిచివేస్తోంది!

రోజూ, నిన్నా కాదు! పుట్టిన దగ్గర నుండి అతనితో పాటూ పెరుగుతూ వచ్చిన స్వభావం ఇది!

ఆ కుటుంబంలో పెద్ద కొడుకు ప్రదీప్.

అతనికంటే నాలుగు సంవత్సరాల చిన్నవాడు అతని తమ్ముడు దిలీప్! అందంలోనూ, చదువులోనూ, తెలివితేటలలోనూ దిలీప్ ప్రకాశవంతంగా కనబడతాడు!

స్నేహంగా  ఉన్నప్పుడు నవ్వుతో, స్వారస్యమైన మాటలతో మిగతావారిని తన పక్కకు లాక్కుంటాడు.

అందువల్ల కన్నవారికే దిలీప్ అంటే ఎక్కువ ఇష్టం. దిలీప్ పుట్టిన మూడు సంవత్సరాల తరువాత పుట్టింది మహతి! ఒకత్తే ఆడపిల్ల కావటంతో ఆమంటే అందరికీ ముద్దే.

ఇది కూడా ప్రదీప్ కు నచ్చదు!

చదువుకునే వయసులో ఇంట్లో వాళ్ళను చూసి ఈర్ష్య. స్కూల్లో తోటి విధ్యార్ధులను చూస్తే ఈర్ష్య...ఇలా ఈర్ష్యా మనోభావంతో ప్రదీప్ పెరగటం వలన, అతని ఎదుగుదలలో అడ్డంకులు రావటం మొదలయ్యింది.

స్కూల్ ఫైనల్ పరీక్షలలో అతి తక్కువ మార్కులతో పాసవటం వలన, అతన్ని కాలేజీలో చేర్చటానికి అతని తండ్రికి నాలిక తడారిపోయింది.

అక్కడ కూడా తోటి విధ్యార్ధులూ, విధ్యార్ధినిలూ సహజంగా సన్నిహితంగా ఉండటం చూసి ప్రదీప్ కడుపు మండిపోయేది!  

ఆడపిల్లలు ఎవరూ  ఇతన్ని వెతుక్కుంటూ రారు...వాళ్ళను వసపరచుకునే ఎటువంటి నాజూకూ, వినయమూ అతనికి లేదు!

జిడ్డు మొహంఅని మిగిలినవారు పేరు పెట్టటంతో వాళ్ళు ఇతని పక్కకే రారు!

స్నేహితులు లేరు!

ఒకరు మాత్రం బాగా సన్నిహితంగా, స్నేహంగా ఉండేవారు. అతన్ని కూడా ఏదో ఒక సంధర్భంలో కోపంగా మాట్లాడటంతో, అతను కూడా దూరంగా వెళ్ళిపోయాడు.

అతను మూడో సంవత్సరం బి.కామ్ చదివేటప్పుడు, తమ్ముడు దిలీప్ రాష్ట్రంలోనే ఎక్కువ మార్కులు తెచ్చుకోవటంతో మెడిసన్ లో సీటు దొరికింది!

కుటుంబమే ఒక డాక్టర్ ఉద్భవించబోతాడని కుతూహలంతో పండగ చేసుకుంది.

ప్రదీప్ మాత్రం అది జీర్ణించుకోలేకపోయాడు! కుంగిపోయాడు. తమ్ముడితో మొహం చూపించి మాట్లాడలేకపోయాడు.

ఈర్ష్య మంట అతన్ని లోలోపల దహించింది. బి.కామ్ పరీక్షలలో ఫైలయ్యాడు. అది అతన్ని ఇంకా అవమానపరిచింది.

తరువాత ప్రైవేటుగా పరీక్ష రాసి పాసయ్యాడు. తరువాతది ఉద్యోగ సమస్య!

చాలా ముఖాముఖి ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు.

ఎలా మాట్లాడాలి? ఎలా అప్రోచ్ అవాలిఅనే విషయాలను నేర్చుకోకపోవటం వలన, ఉద్యోగం దొరకటం కష్టమై పోయింది.

కోపాన్ని తమ్ముడు, చెల్లి మీద చూపించటంతో తండ్రి ఆగ్రహంచాడు.

ఇలా చూడు ప్రదీప్! వాళ్ళిద్దరూ జీవితంలో ఎలా ముందుకు రావాలి అని వాళ్ళ గురించి మాత్రమే ఆలొచించారు! అందువలన పైకి ఎదుగుతున్నారు! నువ్వు, మిగిలిన వాళ్ళను తక్కువగా మాట్లాడటం, కోపగించుకోవటం, ఈర్ష్యతో కాలిపోతున్న కారణంగా నువ్వు లోకాన్నే అర్ధం చేసుకోలేకపోతున్నావు!

..........................”

అవతల వారి మీద పగ తీర్చుకోవాలని నీలో నువ్వే కొట్టుకునే సమయాన్ని నీ పెరుగుదలకు వెళ్ళాల్సిన దారి గురించి వెచ్చిస్తే! నువు ఎదుగుతావు. అవతలివారిలో తప్పులు కనిబెట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు!

ఇలా పలుసార్లు తండ్రి, ఎవర్నో ఉద్దేశించి మాట్లాడుతూ అతనికి చూచాయగా చెప్పేవాడు.

ఇప్పుడు ఓర్చుకోలేక తిన్నగా అతనితోనే చెప్పేసాడు.

నన్ను మీరు అవమాన పరుస్తున్నారు! ఒక డాక్టర్ ఇంట్లో ఉద్భవిస్తున్నాడన్న కారణంగా, నేను మీకు హేలన అయిపోయాను. కన్నవారు కూడా కాలంలో డబ్బులు తీసుకువచ్చే పిల్లలంటేనే ఇష్టపడుతున్నారు!

ఆపరా! ఏం వాగుతున్నావురా నువ్వు? వాడికి ఇంకా చదువే అవలేదు! నాకు వాడు లక్షల లక్షలుగానా డబ్బులు ఇచ్చాడు?”

రేపు ఇస్తాడు కదా?”

ఇవ్వనీ! తీసుకుంటాను. నా కొడుకును పెద్దవాడ్ని చేసినందుకు నాకు హక్కు ఉంది! నువ్వు అన్నయ్యే కదా? వాడిస్తే నువ్వు కూడా తీసుకో!

నాకెవరూ బిచ్చం వేయక్కర్లేదు!

సరి వదిలేయ్!

నేను ఇంట్లో ఇక ఉండను!

ధారాళంగా వెళ్ళిపో! భుజాల వరకు ఎదిగిన కొడుకు స్నేహితుడు. వెళ్ళొద్దని చెప్పటానికి నేను రెడీగా లేను!

తల్లి కలవరపడింది.

ఏం మాట్లాడుతున్నారు మీరు?”

ఆపవే! కన్న తండ్రి దగ్గర మాట్లాడుతున్నట్టా మాట్లాడుతున్నాడు? బెదిరిస్తున్నాడా వాడు? దారాళంగా వెళ్ళనీయవే! వీడి ఈర్ష్య, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్గురించి తెలిసి మనం ఎంత సర్దుకుపోతున్నాం? అరే, కన్నవారిని మనల్ని వదిలేయ్! వీడి తరువాత పుట్టిన ఇద్దరుపిల్లలూ వీడి వలన అనుభవిస్తున్న మనోవేదన అంతా ఇంతా కాదు! ఎన్ని రోజులు వీడిని అనుసరించుకుని ఉండగలం? చెప్పవే!

అమ్మా! నేనంటే ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు. నేను వెళ్తాను!

ఎందుకు ఇష్టపడటం లేదో ఆలొచించావా! మన దగ్గరున్న తప్పొపులు ఏమిటని ఆలొచించి చూడటం ఒక మనిషికి తెలిసుండాలి! సరే, ఇంట్లో మేమందరం విరోధులమే. బయట ఒక్క మనిషి కూడా స్నేహితుడిగా లేడే! ఎందుకని?”

ఏమిటండీ!

ఉండవే! ఒకడు తనని తాను అర్ధం చేసుకోలేకపోతే మిగిలిన వాళ్ళు వాడు అర్ధం చేసుకునేటట్టు చేయాలి. అవతలి వాళ్ళు ఒకర్ని అభినందించాలంటే అది తానుగా వెతుక్కుంటూ రాదు! దానికోసం వాళ్ళు వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు రక్త సంబంధం కొసం వాడికి తలవొగ్గి పోవచ్చు. బయటవాళ్ళు అలా చేస్తారా? చెప్పవే! చదివి ముగించాడు! ఉద్యోగం లేదు! ఎక్కడికి పోతాడు? ధైర్యం ఉంటే చేయనీ! నేను అడ్డుకోను 

ఆయన బయటకు వెళ్ళిపోయారు.

అమ్మ దగ్గరకు వచ్చింది.

ఇదిగో చూడు ప్రదీప్! కోపంతోనూ, ఈర్ష్యతోనూ లోకంలో ఏదీ సాధించటం కుదరదు!

ఆపమ్మా! నువ్వూ వాళ్ళ వైపే!

ఏమిట్రా మాట్లాడుతున్నావు నువ్వు?”

ఎవరితోనూ మాట్లాడటం ఇష్టంగా లేదు...నాకు! -- అరిచేసి లోపలకు వెళ్ళిపోయాడు. తల్లి ఒక నిట్టూర్పు విడిచింది.

బయట ఒక కుక్క కూడా తనని గౌరవించదని ప్రదీప్ కు బాగా తెలుసు. ఇంటి నుండి వెళ్ళలేదు!

చదువు ముగించి ఒక సంవత్సరం అయినా ఉద్యోగం దొరకక పోవటంతో కుంగిపోయిన ప్రదీప్ -- ఇంట్లో ప్రతి రోజూ దేనికో ఒకదానికి గొడవ తీసుకువచ్చి కుటుంబాన్ని గందరగోళంలో పడేసాడు -- తండ్రి ఎలాగో ఒకలాగా రెకమండేషన్ పట్టుకుని, ఒక ప్రైవేట్ కంపెనీలో పన్నెండు వేల రూపాయల జీతాంతో ఉద్యోగం ఇప్పించారు.

ఇలా చూడు ప్రదీప్! నీ కొసం, ఉద్యోగాన్ని పట్టుకోవటం కోసం నేను చెప్పులు అరిగేలాగా తిరిగాను. ఉద్యోగాన్ని జాగ్రత్తగా ఉంచుకోకపోతే నీ వ్యవహారంలో ఇక మీదట నేను తలదూర్చను!

ప్రదీప్, ఉద్యోగంలో చేరాడు.

పుట్టుకతో వచ్చిన ఈర్ష్యా గుణం పోతుందా?’

కొత్తగా చేరిన చోట మొదట ఎవరితోనూ మాట్లాడలేదు! కొంతమంది తాముగా ముందుకు వచ్చి ఇతనితో స్నేహం చేయటం మొదలుపెట్టారు! పనులను ఎలా చేయాలో అతనికి నేర్పించారు.

అతనికి మెదడు కూడా కర్పూరంలాగా పనిచేయదు! నేర్చుకోవటంలో ఆలస్యం. దానివలన ఏర్పడిన చికాకుతో ఎప్పుడూ విసుగుతో కనబడేవాడు!

ఎలాగో ఒక నెల రోజులు గడిపి మొదటి నెల జీతాన్ని పూర్తిగా తీసుకు వచ్చాడు. తన ఖర్చులకు రెండువేల రూపాయలు ఉంచుకుని మిగతాది తల్లికి ఇచ్చాడు.

వాడు బాగుంటే చాలని అతన్ని ఏమీ అడగకుండా వదిలేయటంతో -- తమ్ముడు, చెల్లి మీద అన్ని రోజులు అణిచిపెట్టుకున్న ఉక్రోషం బయటపడటంతో, నేను సంపాదిస్తున్నాను అనే గర్వాన్ని చూపించడం ప్రారంభించాడు!

ఇద్దరూ వాడి గుణం తెలిసిన ఇద్దరూ, వాడితో గొడవ పెట్టుకోకుండా, చాలా సహనంతో ఉంటారు.

కానీ, ఒక రోజు చేయి జారి దిలీప్ తన కళ్లజోడు విరకొట్టుకున్నాడు.

ప్రదీప్ నోటికొచ్చినట్టు వాగాడు.

సారీ అన్నయ్యా! నేను కావాలని చేయలేదు అంటూ క్షమాపణలు కూడా అడిగాడు దిలీప్.  

అయినా కానీ ప్రదీప్ కఠినంగా మాట్లాడటంతో దిలీప్ ఓర్చుకోలేక, సహనం కోల్పోయి ప్రదీప్ కు సమాధానం చెప్ప, ప్రదీప్ దిలీప్ ని కొట్టడానికి చేతులెత్త, దిలీప్ గబుక్కున అన్నయ్య చేతిని అడ్డుకున్నాడు.

తమ్ముడుగా ఉన్నా కూడా నోటి మాటలతో ఆపుకో! చెయ్యి ఎత్తేవా నీ మర్యాద  చెడిపోతుంది. నన్ను నాన్న చదివిస్తున్నారు. నీ డబ్బుల్లో చిల్లి గవ్వ కూడా నేను ఖర్చు పెట్టటంలేదు! అయినా కూడా అన్నయ్య అనే గౌరవంతో, తప్పు నా దగ్గర లేకపోయినా నీకు సారీ చెప్పాను. మమ్మల్ని నువ్వు టార్చర్చేయటానికీ ఒక హద్దు ఉంది!

మహతి, దిలీప్ తో కలిసింది.

తల్లి, తండ్రి సమాధాన పరచటానికి ప్రయత్నిస్తుంటే, ప్రదీప్ ఇంకా ఎక్కువగా మాట్లాడాడు.

తండ్రికి కోపం ఎక్కువయ్యింది.

ఇలా చూడు ప్రదీప్! నిన్ను చదివించి, నీకొక ఉద్యోగం ఇప్పించేసాను! ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు! రోజు నువ్వు వెళ్తున్నప్పుడే నేను నిన్ను ఆపలేదు! కానీ, నువ్వు వెళ్ళలేదు! ఇప్పుడు నేనే చెబుతున్నాను. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో!

ఏమండీ!

ఏమిటే? నీకు వీడే కావాలంటే, నువ్వు వాడితో కలిసి వెళ్ళిపో! నా చిన్న పిల్లలిద్దరూ ప్రశాంతంగా జీవించాలి! సహనం యొక్క సరిహద్దు ఇదే. అర్ధమవుతోందా?”

నేను వెళ్ళదా బోతాను! అన్నాడు ప్రదీప్.

తరువాత నాలుగైదు రోజులలో తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పి ఒక మ్యాన్షన్లో అద్దెకు ఒక గది పట్టుకున్నాడు.

తన పెట్టెలు తీసుకున్నాడు.

ఇంటికి పెద్దవాడిని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాను. దీని కొసం కుటుంబమంతా కలిసి బాధ పడబోతారు!

నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పడ్డ బాధ కంటే, ఇకమీదట ఇంకా ఎక్కువగానా బాధ పడబోతాము! ఖచ్చితంగా అసలు బాధే పడము! పోరా!

ప్రదీప్ ఆవేశంగా మెట్లు దిగాడు.

**************************************************PART-2********************************************

మ్యాన్షన్ లో వేరుగా ఒక గది దొరకలేదు! పవన్ అనే యువకుడితో ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి!!

రెండు మంచాలు వేయబడ్డ పెద్ద గది, అది!

పక్కన ఒక మెస్. అక్కడ భోజనం సుమారుగా ఉంది. ప్రొద్దున, మధ్యాహ్నము ఆఫీసు క్యాంటీన్ లో భోజనం. రాత్రి మాత్రం మెస్ లో భోజనం అని ఏర్పాటు చేసుకున్నాడు ప్రదీప్.

త్వరగా నిద్రలేచి బట్టలు ఉతికి, స్నానం చేసి బయలుదేరాలి. రాత్రి వచ్చిన తరువాత తన పనులు తానే చేసుకోవాలి!

ఇంట్లో ఒక్క పని కూడా చేసేవాడు కాదు.

ప్రతీదీ తల్లి చేతికి అందించేది. ఇక్కడ అది లేదు.

తల్లి చేసే విధ విధమైన, సువాసన గొలిపే వంటకాలు తిని ఉండటంతో, మెస్ భోజనం గొంతు దిగడం లేదు.

రూమ్ మేట్ స్నేహితుడు పవన్ సినిమా రంగంలో అసిస్టంట్ డైరెక్టర్ గా ఉండటంతో, గదికి తిరిగి రావడానికి రోజూ మధ్యరాత్రి దాటుతుంది.

అతనికోసం తలుపు తెరవాలి!

పలు రోజులు పవన్ తాగిన మత్తులో వస్తాడు.

ప్రదీప్ మంచి కుటుంబంలో పుట్టటం వలన అలవాట్లు అబ్బలేదు. ఈర్ష్యా గుణం ఉన్నా, ఎక్కువ స్నేహితులు లేకపోవటం వలన అతని గుణం చెడిపోలేదు.

నెల రోజులలోనే ప్రదీప్ కు విసుగు మొదలయ్యింది.

వేరే చోట గది దొరుకు తుందేమోనని ప్రయత్నించాడు. దొరకనే లేదు!

ఒక రోజు పవన్ దగ్గర ప్రదీప్ కొంచం ఎక్కువగా మాట్లాడటంతో అతనికి ఒళ్ళు మండింది.

అతను రోజు రాత్రి కొంచం ఎక్కువగా మందుతాగి కావాలనే మత్తులో ప్రదీప్ ను తిట్టిపోసాడు!

మరుసటి రోజు ఒక అమ్మాయి వ్యవహారంలో పవన్ కూ, అతని స్నేహితులకూ మధ్య గొడవ జరగటంతో, అది పోలీసుల వరకు వెళ్ళింది. విచారణకు పోలీసు బృందం మ్యాన్షన్ కే వచ్చాశారు!

ప్రదీప్ అదే గదిలో ఉంటున్నాడు కాబట్టి, అతన్ని ఎక్కువ ప్రశ్నలతో ఎంక్వయరీ  చేశారు!

ప్రశ్నలతో గుచ్చిన పోలీసులు దానితో ఆగక, ప్రదీప్ ను కూడా స్టేషన్ కు రమ్మన్నారు. ప్రదీప్ వణికిపోయాడు.

పోలీస్టేషన్ కు వచ్చి తన ఆవేశ స్వభావంతో నాకు ఇందులో సంబంధం లేదు అని చెబితే వినరేంటి అని కోపంగా అరిచాడు.

అతని అరుపుతో పోలీసులకు కోపం వచ్చింది!

తప్పు చేసిన వాళ్ళను వదిలేసి, మంచి వాళ్లను లాక్ అప్ లో తోస్తారు! ఇదేనా మీ లక్షణం?” అని అడగటంతో...

ప్రదీప్ ని లాకప్ లోకి తొశారు, పోలీసులు.  

నోటి కొవ్వా? కొడకా! నువ్వు ఎలా బయటకు వెడతావో నేనూ చూస్తాను ఇన్స్పెక్టర్ అరిచాడు.

ప్రదీప్ మరింత వణికిపోయాడు.

అయ్యో...ఇక్కడ్నుంచి ఎలా బయటకు వెళ్ళేది?’

సమస్యకు కారకుడైన పవన్ పోలీసులకు దొరక కుండా పలుకుబడి ఉపయోగించి తప్పించుకోగా, తన నోటి దురుసుతో ప్రదీప్ ఇరుక్కున్నాడు. తనని ఎదిరించిన ప్రదీప్ పై పవన్ పగతీర్చుకున్నాడు! 

వ్యవహారం ఎవరిమూలంగానో దిలీప్ దగ్గరకు చేర, దిలీప్ కలవరపడుతూ వెళ్ళి తండ్రి దగ్గర చెప్పాడు. తల్లి ఏడవగా, ఒక లాయర్ స్నేహితున్ని వెంటనే పట్టుకుని, ఆలొచన అడగగా...

లాయర్ వేగంగా పనిచేయటంతో, లాయర్ తో కలిసి తండ్రి స్టేషన్ కు వెళ్ళి, మాట్లాడి హామీ ఇచ్చి, కేసును వాపస్ తీసుకునేటట్టు చేసి, ప్రదీప్ ని బయటకు తీసుకు వచ్చేలోపు చాలురా  బాబూఅనే విధంగా అయిపోయింది!

ప్రదీప్ బయటకు వచ్చాడు.

ఇప్పుడు ఎక్కడకు వెళ్ళబోతావు?” -- అడిగాడు తండ్రి.

ఎందుకలా అడిగారు? ఇంటికి రమ్మని పిలవరా?”

ఇంత అవమానపడినా, పిలిస్తే గానీ ఇంటికి రావా? ఇంకా నీ పొగరు అనగలేదురా? ఇష్టముంటే రా!

తండ్రి నడవగా.

లాయర్, ప్రదీప్ దగ్గరకు వచ్చి --

తప్పు తమ్ముడూ! నీకొసం ఆయన ఎంత కష్ట పడుంటారు? ఇప్పుడు కూడా నువ్వు ఆయన్ని అర్ధం చేసుకోపోతే ఎలా? ఎటువంటి స్వీయ గౌరవమూ చూడకుండా మీ ఇంటికి వెళ్ళు!

ప్రదీప్ మౌనంగా తండ్రి వెంట నడిచాడు.

ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళగా, తల్లి భోరున ఏడ్చింది.

ప్రదీప్! నీకు ఎలాంటి ఆపద లేదుగా? మనకి పోలీసులు, లాకప్పులు ఇవన్నీ అలవాటు లేదురా! ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇది నీ ఇల్లు! ఇక్కడే ఉండరా! కుటుంబం అంటే అన్నీ ఉంటాయి! బయట వాళ్ళు ఏం చేసారో తెలుసుకున్నావు కదా! కాపాడటానికి నాన్నే కదా అవసరమొచ్చింది?”

ఎత్తి పొడుస్తున్నావా? ఇల్లు వెతుక్కుంటూ నేను వచ్చిన వెంటనే, మిమ్మల్ని వదిల్తే నాకు గతి లేదని నువ్వు నన్ను ఎత్తిపొడుస్తున్నావా అమ్మా?”

అయ్యో -- నిజంగా అలా కాదురా అబ్బాయ్!

తండ్రి భార్య దగ్గరకు వచ్చాడు.

ఇదిగో చూడవే! నువ్వు కన్నీరు చింది, అభిమానాన్ని నదిలా ప్రవహింప చేసినా, వీడు నిన్ను అర్ధం చేసుకోడు. ప్రేమను వేస్టు చేయకుండా, మిగిలిన పిల్లల దగ్గర చూపించు. ఫలితమన్నా లభిస్తుంది!

లోపలకు వెళ్ళిపోయారు.

ప్రదీప్ ఏదో మాట్లాడటానికి నోరు తెరిచి, ఆపేసుకున్నాడు.

లోలోపల స్వార్ధం మొత్త రూపం ప్రదీప్ గా మారింది.

ప్రస్తుతానికి వీళ్ళని విడిచిపెడితే మనకి వేరే గతిలేదు...కాబట్టి నోరు మూసుకుని ఇక్కడే ఉండటం మంచిది

దిలీప్, మహతి--ప్రదీప్ ని పట్టించుకోనే లేదు! అతనిపై వాళ్ళకు ఉండే గౌరవం పూర్తిగా తగ్గిపోయింది!

ప్రదీప్ ఎవరితోనూ మాట్లాడటం లేదు! ప్రొద్దున్నే లేచి, స్నానం చేసి, తల్లి పెట్టింది తిని బయలుదేరి వెళ్ళిపోతాడు.

మిగతావారితో కలిసి భోజనం చేయడు. నాకూ, ఇంటికి సంబంధమే లేదు అనేటట్టు ఎవరితోనూ కలవక ఉండిపోతాడు.

మరుసటి నెల జీతం వచ్చింది!

అమ్మ దగ్గరకు తీసుకు వచ్చి ఇచ్చాడు!

అది తీసుకోకు కళ్యాణీ! రేపు దానికీ కలిపి మాటలంటాడు!

క్షమించాలి! ముందులాగా నేను పదివేలు మీకిచ్చి, రెండువేలు నేను ఉంచుకోను. రెండువేలు మీకిచ్చి, పదివేలు నేను ఉంచుకుంటాను. తేరగా నేను ఎవరింట్లోనూ తినడానికి తయారుగా లేను! నా ఖర్చులకు రెండువేలు ఇచ్చేస్తాను

తీసుకో కళ్యాణీ! నేనూ ఎవరికీ ఉచితంగా భోజనం పెట్టటానికి రెడీగా లేను! డబ్బు ఇచ్చేను కదా, ఇది లాడ్జి అనుకుని అధికార పెత్తనం చెలాయిస్తే, పెట్టే బేడా బయటకు ఎగురుతాయి. చెప్పేసేయి!

తల్లి, భర్త దగ్గరకు వచ్చింది.

మీరు వాడికంటే ఘోరంగా నడుచుకుంటున్నారు! ఎందుకు? ఎంత అనుకున్నా వాడు మన పెద్ద కొడుకు!

అలా మనం మాత్రం అనుకుంటే సరిపోదు! అక్కడా ఉండాలి!

వాడి స్వభావాన్ని మార్చలేముగా!

నేనూ అంతే!

ఆయన లోపలకు వెళ్ళిపోయారు. రాత్రి దిలీప్, మహతి ని పెట్టుకుని తన గోడు చెప్పుకుంది.

మీ నాన్న కూడా ఇప్పుడు పోనీలే అని విడిచి పెట్టటం లేదు దిలీప్!

ఎందుకమ్మా విడిచిపెట్టాలి? ‘లాకప్లో నుండి అన్నయ్యను బయటకు తీసుకురావటానికి నాన్న ఎంత అవస్తపడ్డారు! సారీ నాన్నా! నాకు  తెలియకుండానే తప్పు జరిగిపోయింది! ఇక మీదట సమస్యా రాకుండా, మన కుటుంబంతో కలిసిపోయి ఉంటాను అని చెబితే పళ్ళు ఏమన్నా పడిపోతాయా?”

వాడు చెప్పడే?”

వాడు బయట ఉన్నప్పుడు, కుటుంబమంతా ప్రశాంతంగా ఉన్నది! ఇప్పుడు అదీ పోయింది! మహతి అన్నది.

తప్పమ్మా! అలాంటి ఆలొచనలను నువ్వు పెంచుకోకూడదు

తరువాత వచ్చిన రోజులలో ప్రదీప్ కొంచం కూడా తన గుణం మార్చుకోకుండా -- ఇంట్లో వాళ్ళని ఏదో ఒక విధంగా కష్టపెడుతూనే ఉన్నాడు.

ఇంతలో అతని ఆఫీసులో ఏదో సమస్య ఏర్పడి, అది పై అధికారిదాకా వెళ్ళి, ఆయన ప్రదీప్ ను పిలిచి ఖండించి, హెచ్చరిక ఇచ్చేంత వరకు వచ్చింది!

ఇంకోసారి అలా నోరు పారేసుకున్నావా, ఉద్యోగం ఊడిపోతుంది!అనే వార్త తల్లి-తండ్రుల దాకా వచ్చింది.

రోజు రాత్రి తండ్రి బాగా టయర్డ్ అయిపోయున్నారు.

కళ్యాణీ! వీడు ఇదే ఇంట్లో ఉంటే, నాకు హార్ట్ అటాక్ వస్తుంది. తట్టుకోలేకపోతున్నా

ఇలా చూడండి! నాకు ఒకటి అనిపిస్తోంది!

చెప్పు

వాడికి పెళ్ళి చేస్తే సరిపోతుందనుకుంటా. వాడి ఆలొచనలూ మారతాయి. పెళ్ళాం, బిడ్డలూ, కుటుంబం ఉంటే బాధ్యత వస్తుంది. గుణం మారుతుంది. ఏమంటారు?”

వాడికి జీతం కేవలం పదిహేను వేలు. ఎవరు పిల్లను ఇస్తారు?”

సరేనండి! జీతం పేరగదా?”

వీడికి ఖచ్చితంగా పెంచరు! వీడి నోటి దురుసుకు ప్రతి సంవత్సరం జీతం  తగ్గుతూ వచ్చినా నేను ఆశ్చర్యపడను!

అమ్మాయి దొరకదని చెబుతున్నారా?”

పెద్ద కుటుంబం, బాగా చదువుకున్న అమ్మాయి -- ఇలాగంతా దొరకటం కష్టం. మొదట నీ కొడుకును అడుగు. పెళ్ళి చేసుకుంటాడా అని! వాడి వ్యవహారంలో మనంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేము! అర్ధమయ్యిందా?”

నేను మాట్లాడతాను!

మరుసటి రోజు ఆదివారం! అందరూ నిద్రపోతున్నప్పుడు, ప్రదీప్ లేచి మార్నింగ్ వాక్ వెళ్ళటానికి తనని రెడీ చేసుకుంటుండగా,

తల్లి వచ్చింది.

ప్రదీప్. కొంచం మాట్లాడాలి!

చెప్పమ్మా!

చదువైపోయి, నీకని ఒక ఉద్యోగం దొరికింది! తరువాత పెళ్ళే కదా!

అతను తల పైకెత్తాడు.

ఇంటికి నువ్వు పెద్దవాడివి. ఒక కోడలు రావలి. మనవళ్ళు రావాలి. ఇంటి పోలికలే మారిపోవాలిరా ప్రదీప్!

ఇప్పుడు పెళ్ళికి ఏమిటంత అవసరం?”

అలా కాదు నాయనా! మాకు ఓపికలు ఉన్నప్పుడే జరిగితే మంచిది కదా?”

ఉన్నవాళ్ళు చాలరని కొత్తగా ఒకత్తి రావాలా? ఆమె దగ్గర నేను ఎంత పోరాడాలో?”

తల్లికి ఒళ్ళు మండింది.

పిల్ల నీతో కష్టపడకుండా ఉంటే చాలు!మనసులోనే అనుకుంది.

ఆలొచించుకోవటానికి నాకు టైమివ్వు!

త్వరగా నీ ఉద్దేశం చెప్పరా! నేను పెళ్ళిళ్ళ పేరయ్యను రమ్మని చెప్పాలి!

ప్రదీప్ ఆలొచించాడు.

అవును అదీ కరెక్టే. పెళ్ళి అని ఒకటి జరిగితే, వేరు కాపురం, రాకపోకలతో సరిపోతుంది. వీళ్ళతో మాటలు పడక్కర్లేదు!

వెంటనే సమాధానం చెబితే, నేను పెళ్ళికి తొందరపడుతునట్టు అవుతుంది.  కొంచం బెట్టు చేసి జవాబు చెబుదాం!

కాలఘట్టంలోనే ఆఫీసులో ప్రకాష్ అనే స్నేహితుడితో మాత్రం సన్నిహితంగా ఉంటున్నాడు ప్రదీప్.

ప్రదీప్ గుణాలను దాటి అతనితో సన్నిహితంగా ఉన్నది ప్రకాష్ మాత్రమే! అతనితో లంచ్ టైములో తన పెళ్ళి గురించి మాట్లాడాడు ప్రదీప్.   

మీ అమ్మగారు చెప్పేదీ మంచిదే. నీకూ అని ఒక కుటుంబం ఏర్పడితే, జీవితంలో ఒక పట్టు వస్తుంది! ఉద్యోగం చేసే అమ్మాయిని చూసుకో! డబ్బు సహాయమూ దొరుకుతుంది!

అలా అంటావా?”

అవున్రా! లేకపోతే నీకొచ్చే జీతం పెట్టుకుని కుటుంబం జరపటం కష్టం. పెళ్ళి అనేదీ అయిన తరువాత, మీ నాన్నా, తమ్ముడూ అంటూ వాళ్ళ దగ్గర చెయ్యి జాపలేవు కదా ప్రదీప్?”

అది కుదరదు!

నీ భార్య కూడా సంపాదిస్తే, ఎవరి దయ అక్కర్లేకుండా నువ్వు జీవించవచ్చు కదా?”

సరే! సంపాదిస్తున్నాం అనే పొగరుతో ఆమె నన్ను గౌరవించకపోతే?”

తప్పు ప్రదీప్. అన్నిటికీ నువ్విలా అనుమానపడటం మొదలుపెడితే నీ జీవితమే గడవదు! మనిషి జీవితంలో ఎవరినైనా కొంత మందిని నమ్మే తీరాలి. అందరినీ అనుమానిస్తే ప్రశాంతత పోతుంది. ప్రదీప్! నీ చుట్టూ కాకీ, ఈగ కూడా ఉండదు! ఒంటరితనమే పిచ్చివాడ్ని చేస్తుంది. జాగ్రత్తగా ఉండు! 

ప్రదీప్ బయటకు ఓకే అంటూ తల ఊపాడు. లోపల భయపడిపోయాడు!

ఒకటి చెయ్యి ప్రదీప్. నీ కంటే కనీసం వందరూపాయలు తక్కువగా జీతం తీసుకుంటున్న అమ్మాయిని చూసుకో. నీకు మనోభారం ఉండదు కదా?”

ఇది మంచి ఆలొచన!

మీ అమ్మ దగ్గర నీకెలాంటి పిల్ల కావాలో చెప్పేయి! చూసి ఫైనల్ చేయడం ఆమె పని!

సరేరా ప్రకాష్! కానీ, నువ్వూ చూడరా! నన్ను అర్ధం చేసుకుని, ఎప్పుడూ నా కోసం మాట్లాడేవాడివి నువ్వు ఒక్కడివే! నువ్వు సెలెక్ట్ చేస్తే కరెక్టుగా ఉంటుంది!

సరి! నేనూ ప్రయత్నిస్తాను!

ప్రదీప్ ఆఫీసు పనులలో శ్రద్ద పెట్టాడు.

పెళ్ళి అనేటప్పటికి ఒక ఉత్సాహం వచ్చేసింది! ముఖానికి ఒక చివరగా నవ్వు అతుక్కుంది! దాన్ని ప్రకాష్ కూడా గమనించాడు!

**************************************************PART-3********************************************

రోజు రాత్రి తనకు రాబోయే భార్య ఎలా ఉండాలో ప్రదీప్ ఒక ఒక లిస్టు వేసేడు! లిస్టును తల్లి దగ్గర చెప్పాడు.

గొప్ప అందగత్తెగా ఉండక్కర్లేదు. డబ్బు, ఆస్తి గల అమ్మాయి అవసరం లేదు. పెద్ద చదువూ అవసరంలేదు

ఇవన్నీ నువ్వు కోరుకున్నా దొరకవు!మనసులోనే అనుకున్నాడు దిలీప్.

ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిగా ఉండాలి. కానీ నా కంటే చదువు, జీతం తక్కువ ఉండాలి! విషయంలోనూ నాకంటే అమ్మాయి ఎక్కువగా ఉండకూడదు!

గుణంలో నీ కంటే తక్కువగల అమ్మాయి లోకంలోనే ఎవరూ ఉండలేరే!తండ్రి బుర్రలో పయనించిన ఆలొచన ఇది.

సరే! నేను పెళ్ళిళ్ళ పేరయ్యను రప్పించి ఇవన్నీ చెప్పి చూడమని చెబుతాను! తల్లి చెప్పగా --

కట్నం, కానుకలు అని ఏదన్నా తీసుకోబోతావా?” -- తల్లిని అడిగాడు ప్రదీప్.

తండ్రి అడ్డు మాట్లాడాడు.

నువ్వు చెప్పిన కండిషన్ తో పిల్ల దొరకటమే గొప్ప.  ఇందులో కట్నం, కానుకలు! నీ విషయాలేవీ మాకు వద్దు. ఇలా చూడు! పెళ్ళి అయిన మరుసటి రోజే వేరే కాపురం. నీ భార్యతో వెళ్ళి పోవాలి! నిన్ను ఇన్ని రోజులు ఇంట్లో ఉంచుకొన్నదే ఎక్కువ! చాలురా స్వామీ!

ఎందుకు నాన్నా ఇలా మాట్లాడుతున్నారు?”

ఇంకెలా మాట్లాడను!

నాకు పెద్దలుగా ఉండి పిల్లను చూసి పెళ్ళి చేయడానికి మీకు ఇష్టం లేకపోతే చెప్పండి.  స్నేహితుల సహాయంతో చేసుకుంటాను!

తండ్రి ప్రదీప్ దగ్గరకు వచ్చాడు.

మొదట అది చెయ్యి! పెళ్ళి పత్రిక ఇస్తే కన్నవాళ్ళుగా వచ్చి ఆశీర్వదించి వెడతాం. మమ్మల్ని వదిలేయి!

ఆయన లోపలకు వెళ్ళిపోయారు.

దిలీప్, మహతి ఆయన వెనుకే వెళ్ళగా, తల్లి మాత్రం ఉండిపోయింది.

ఏమిటమ్మా ఇది? ఎవరూ కలుగ జేసుకోవటానికి ఇష్టం లేనప్పుడు, నాకు పెళ్ళి జరగాలా?”

ఇలా చూడు ప్రదీప్! నువ్వు కోపగించుకోకు! నేనూ ఎవరికి సపోర్ట్ చేయటం లేదు! మొదటి నుండి నువ్వు నడుచుకున్న విధం అలాంటిది! అదే ఇలా అందరి మనసుల్లోనూ విరక్తిని ప్రేరేపిస్తోంది. నీ పెళ్ళి దాన్ని మార్చాలి. దానికి నువ్వు ఉదాహరణగా ఉండాలి. నువ్వే మమ్మల్నందరినీ విరోధిగా చూస్తే, వచ్చే అమ్మాయి మమ్మల్ని గౌరవించదు!

అమ్మ కూడా లోపలకు వెళ్ళిపోయింది.

ప్రదీప్ కు కోపం వచ్చింది. నిజం కాల్చింది! తీవ్రంగా కాల్చింది!

అది అర్ధం చేసుకుని, మనసు మార్చుకోవాలనే గుణం అతని దగ్గర కొంచం కూడా లేదు!

ఇప్పుడు కుటుంబంలోని వారందరి మీద కోపం ఎక్కువ అయ్యింది! వాళ్ళను ఇంకా ఎక్కువగా ఎదిరించాలనే వేగం, కసి ఎక్కువ అయ్యింది.

ప్రదీప్ చెప్పిన అన్ని నిబంధనలనూ పెళ్ళి బ్రోకర్ కు చెప్పి, అది చాలదని రాత పూర్వకంగా కూడా ఇచ్చింది తల్లి.

పెళ్ళిళ్ళ బ్రోకర్ తన ప్రయత్నం మొదలుపెట్టాడు.

నెల రోజులకుపైన అయినా సంబంధమూ రాకపోవటంతో ఏమైందే?”  భార్యను అడిగాడు.

జాతకం కలవటం లేదట! ప్రదీప్ ది దోష జాతకమట! పెళ్ళిళ్ళ బ్రోకర్ చెప్పాడు

బుద్దిలో మాత్రమే దోషం ఉన్నదనుకున్నా, జాతకమూ దోషమా?”  అని తండ్రి అడుగగా --

తల్లి ఆయన నోరును మూసింది.

దగ్గర దగ్గర రెండు నెలల వెతికిన తరువాత ఒక జాతకం కలిసింది! కానీ, అమ్మాయి ఎక్కువ చదువుకుంది.

అమ్మాయి చదువుకు సరిపోయే ఇంకో వరుడ్ని వెతుకుతున్నామని కబురు వచ్చింది.

ఒక సంవత్సరం గడిచిపోగా, బ్రోకర్ మెల్లగా వెనక్కి తగ్గాడు.

అబ్బాయి అదృష్టం అసలు బాగుండలేదు! ఇతనికి అమ్మాయిని చూడటం మొదలు పెట్టిన దగ్గర్నుంచి నా బిజినెస్ దెబ్బ తిన్నది!

బ్రోకర్ అలా ఒక మాట బయట చెప్పటంతో -- అది ఊరంతా పాకి -- ప్రదీప్ ఇంటికి కూడా వచ్చి -- ప్రదీప్ దోష జాతకానికి మాత్రమే సొంతవాడు కాదు! అదృష్టం కూడా లేని వాడని బాగా పొక్కిపోయింది!  

కుటుంబమే కలత చెందింది!

ప్రదీప్ ఆవేశ పడ్డాడు!

ఇలా చూడరా! మేమెవరమూ నీ గురించి తప్పుగా మాట్లాడలేదు! నువ్వు మన కుటుంబంలోని వారిపై ఆవేశపడి ప్రయోజనం లేదు! -- తల్లి చెప్పింది.

అది అతని పెళ్ళి మార్కెట్టును దెబ్బతీయగా, సంబంధమూ రాకుండా ఆగిపోవటంతో ఇక జాతకాన్ని అవతల పారేశారు! మనసులు కలిసినయా అనేది చూసి నిర్ణయం తీసుకోవాలి అని తీర్మానించుకున్నారు!

దీని వలన ప్రదీప్ గుణం ఇంకొంచం చెడ్డదయ్యింది!

ఆఫీసులో ప్రకాష్ దగ్గర సనగటం మొదలుపెట్టాడు!

నువ్వు నా కోసం సంబంధాలేవీ చూడటం లేదారా!

నువ్వు అడిగినట్టు దొరకటం లేదురా ప్రకాష్! కొంచం ఓపికపట్టు అవే వస్తాయి

ప్రకాష్, అయ్యప్ప స్వామికి మాల వేసుకోనున్నాడు. అందువల్ల ప్రదీప్ ఇంకేమీ మాట్లాడలేదు.

ప్రకాష్ ఆ వారం చివర వాడింట్లో ఇరుమడి కట్టే పూజ పెట్టుకున్నాడు! ప్రదీప్ ని రమ్మని ఆహ్వానించాడు!

రోజు ఆదివారం అవటంతో ప్రదీప్ పొద్దున్నే స్నానం చేసేసి, త్వరగా బయలుదారాడు!

ప్రకాష్, తనింట్లో పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ప్రదీప్ అక్కడకు  వచ్చాడు.

సుజాతా! ప్రదీప్ కు కాఫీ తీసుకువచ్చి ఇవ్వు! ప్రకాష్ అరచి చెప్పగా,

ఒకమ్మాయి చేతిలో కాఫీగ్లాసుతో కనబడింది.

పోలియో వలన ఏర్పడిన బాధింపు వలన సుజాతా ఎడమ కాలుమీద చేయి పెట్టుకుని కుంటుకుంటూ నడుస్తోంది. కాఫీను తీసుకు వచ్చి ప్రదీప్ దగ్గర ఇచ్చింది. ఆమె మొహం గుండ్రంగా, అందంగా ఉన్నది! ఒకంత రంగుగా ఉన్నది. కానీ, వికలాంగ అమ్మాయి! 

ఆమె లోపలకు వెళ్ళిపోయింది.

ఇలాంటి చెల్లెలు ఉన్నదని నువెప్పుడూ నా దగ్గర చెప్పలేదే ప్రకాష్?”

నా సమస్యలనూ, కష్టాలనూ వీలైనంతవరకు ఎవరితోనూ నేను చెప్పింది లేదు ప్రదీప్!

ఇలాంటి అమ్మాయికి పెళ్ళి జరగటం చాలా కష్టమైన పనే!

దాని గురించి మాట ఎత్తితేనే సుజాతా నన్ను మాట్లాడనివ్వదు! అన్నీ బాగున్న అమ్మాయలకే పెళ్ళిళ్ళు జరగటం కష్టంగా ఉంది! నాకెలా అన్నయ్యా అని అడుగుతుంది

చదువుకున్నదా?”

...డిస్టన్స్ ఎడ్యుకేషన్ లో ఎం.కాం. పూర్తి చేసింది! ఇప్పుడు సీ.. కి రెడీ అవుతోంది!

అబ్బో!

అది మాత్రం కాదు! దగ్గర దగ్గర ఒక యాభై మందికి ట్యూషన్తీస్తోంది! నెలకి పాతికవేలు సంపాదిస్తోంది! అప్పడాలూ, చిప్స్, ఊరగాయ, పచళ్ళు తయారు చేస్తుంది! మనుషులు ఇంటికి వచ్చే తీసుకు వెడుతున్నారు. అందులో నెలకు పదివేల వరకు లాభం వస్తోంది! ఆమె ఒక్కతే ముప్పై ఐదు వేలకు పైన సంపాదిస్తోంది! నా ఒక్కడి సంపాదనతో మా ఇల్లు ఇంత సంతోషంగా ఉండగలదా? ఇంటికి కావలసిన నవీన వస్తువులన్నీ కొనిపెట్టింది అదే!

అలాగా?”

ఆమె ఇంటికి మహాలక్ష్మి! అదృష్ట దేవత!

ప్రదీప్ ఆశ్చర్యపోయాడు.

అన్నీ ఇచ్చిన దేవుడు బలమైన ఒక వికలాంగమూ ఇచ్చాడే!

కొద్దిసేపట్లో అయప్ప భక్తులు వచ్చేశారు.

పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ సుజాతే గమనించింది! వికలాంగాన్ని మరిచిపోయి పనులు చేసింది.

పూజ ముగియగానే భోజనాలు పెట్టారు.

విధ విధమైన వంటకాలు.

అన్ని వంటలూ చేసింది సుజాతే! అద్భుతంగా ఉంది!

ఏం తక్కువ అమ్మాయి దగ్గర?’

అన్నీ ముగిసిన తరువాత ఇంటికి బయలుదేరాడు ప్రదీప్.

రోజు రాత్రి అతనికి నిద్రే రాలేదు!

సుజాతా అందంగా ఉంది. అయితే చదువు, సంపాదన నాకంటే ఎక్కువే! ఉండనీ!

వికలాంగ అమ్మాయి కదా! అందువలన ఇవన్నీ మైనస్ గా కనబడతాయి!

ప్రదీప్ లో వక్ర బుద్ది తలెత్తింది!

ఈమెను పెళ్ళిచేసుకుంటే డబ్బుకు కొదవ ఉండదు! వేరే కాపురమే పెట్టేయవచ్చు. ఒక వికలాంగ స్త్రీకి జీవితం ఇచ్చిన త్యాగి అనే ప్రశంసా పత్రం దొరుకుతుంది!

పలు విధాలగా దీన్ని ఆలొచించాడు.

నాకు దోష జాతకం. అదృష్టము సరిలేదని ఒక పుకారు ఉరంతా పాకి, జీవితాన్నే బాధిస్తోంది!

సుజాతాకు వికలాంగం ఉంది!

ఇదే కరెక్టు! సుజాతా కంటే ఒక మంచి అమ్మాయి దొరకదు!

మొదట్లో ఇంట్లో మాట్లాడదామా? లేక... ప్రకాష్ దగ్గర మాట్లాడదామా?’

ప్రకాష్ కి ఇందులో ఇష్టముందో, లేదో తెలియాలి. కాబట్టి వాడి దగ్గరే మొదటగా మాట్లాడాలి! మనింట్లో  ఏముంది...బోడి ఇల్లు! వొప్పుకోక పోవటానికి వాళ్ళెవరు? ఇది నా జీవితం!

నిర్ణయమే తీసేసుకున్నాడు.

మరుసటిరోజు పొద్దున -- ఆఫీసుకు వచ్చాడు. ప్రకాష్ శబరిమలైకి వెళ్లటం గుర్తుకు రావటంతో అరెరే! ఇంకా నాలుగు రోజులు కాచుకోవాలా? సరే! కాచుకోనుందాం!

రోజు సాయంత్రం అమ్మను మాత్రం పిలిచి వివరాలు చెప్పాడు!

తల్లి వెంటనే తండ్రి దగ్గర చెప్పింది.

వద్దనే వద్దు!

ఎందుకలా చెబుతున్నారు? వికలాంగురాలని నిరాకరిస్తున్నారా?”

లేనే లేదు! శరీర వికాలాంగాన్నిపెద్దది చేయక కష్టపడి పైకెదిగి నిలబడ్డ అమ్మాయి ఇప్పుడు సంతోషంగా ఉంది! వీడు భర్తగా వెడితే, ఆమె ప్రశాంతతే పోతుంది!

అలా చెప్పకండి! ప్రదీప్ మన కొడుకు. ఎంత ఆస్తి ఉన్నా, వికలాంగురాలైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవటానికి మగాడూ అంగీకరించడు!

నీ కొడుకు త్యాగం చేస్తున్నాడని గొప్పలు పోకు! అది స్వార్ధం!

వదిలేయండి. వాడికి నచ్చింది! అమ్మాయి అంగీకరిస్తే, ఆమె అన్నయ్య ఒప్పుకుంటే, జరిగే అదృష్టముంటే, జరగనివ్వండి. మనమెందుకు  ఆపాలి

నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు కళ్యాణీ! నేను కాదనటమూ లేదు! నీ ఇష్టం! నీ కొడుకు ఇష్టం! నీదారికే వదిలేస్తాను

నాలుగు రోజులు వెళ్ళిపోయినై. ప్రకాష్ తిరిగి వచ్చాడు. ఆఫీసుకూ వచ్చాడు.

ప్రసాదం ఇచ్చాడు.

ప్రకాష్! అయ్యప్ప ప్రసాదం చేతిలో తీసుకున్న సమయంలో ఒక మంచి వార్త చెప్పాలనుకుంటున్నా!

ఏమిటా వార్త?”

నువ్వు అంగీకరిస్తే, నీ చెల్లెలు సుజాతాను పెళ్ళి చేసుకోవటానికి నేను తయారుగా ఉన్నాను

ప్రకాష్ గబుక్కున తలెత్తాడు!

రోజు పూజలో చూసాను. మంచి చైపక్వం. చురుకుదనం, నవ్వు మొహం -- ఇవి నా మనసులో అతుక్కుపోయాయిరా ప్రకాష్!

ప్రకాష్ సమాధానం చెప్పలేకపోయాడు.

మా అమ్మతో కూడా చెప్పాను! నువ్వు నీ చెల్లి దగ్గర మాట్లాడు! తరువాత దేవుడి కృప ఉంటే, ఇది జరగనీ!

ప్రకాష్ ఎటువంటి సమాధానమూ చెప్పకుండా, తన పనిలో నిమగ్నమయ్యాడు.

రోజు రాత్రి ప్రకాష్ భోజనానికి కూర్చున్నాడు! సుజాతా దగ్గర కూర్చోని వడ్డిస్తోంది. వాళ్ళ అమ్మ అక్కడే ఉంది.

అన్నయ్యా! రోజు నేనూ, అమ్మా ఒక ఆటో పుచ్చుకుని ఇల్లు కొనే విషయంగా నాలుగు అపార్ట్మెంట్స్ చూసొచ్చాము. పక్క రోడ్డులో కొత్తగా ఇల్లు కడుతున్నారు! రోజు శంకుస్థాపన చేశారు! మూడు బెడ్ రూముల ఇల్లు. అన్ని వసతులూ ఉన్నాయి! ఇరవై లక్షలు అవుతుంది! మన సేవింగ్స్ లో ఆరు లక్షలు ఉన్నాయి! మిగతాది బ్యాంకు లోను వేసి తీసుకుందాం. రిజిస్టర్ చేసుకుందామా? ఏం చెబుతావు?”

లోను తీసుకుంటే కట్టగలమా?”

నెలకి పన్నెండు వేలు కట్టాల్సింది వస్తుంది. సంపాదన ఉందిగా! ఈజీగా కట్టొచ్చే!

నువ్వు సంపాదిస్తున్నది కుటుంబానికే ఖర్చు పెడుతూ ఎంత కాలం మాతోనే ఉండబోతావమ్మా? నీకొక పెళ్ళి, జీవితం వద్దా?”

ఎవరన్నయ్యా నన్ను పెళ్ళి చేసుకోవటానికి ముందుకు వస్తారు?”

ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడు. నా స్నేహితుడు ప్రదీపే? రోజు పూజకు వచ్చేడే అతను. నిన్ను చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళమ్మ దగ్గర మాట్లాడేడట! రెడీగా ఉన్నారు!

తల్లి సంతోషపడింది.

ఇలా చూడు సుజాతా! ఇల్లు, స్థలం అన్నీ తరువాత! మొదట నీ జీవితమే!

ఉండమ్మా! తొందరపడకు! అన్నయ్యా! ప్రదీప్ నన్ను పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడేది నా కోసమా? లేక, నేను సంపాదిస్తున్న డబ్బుకోసమా?”

చటుక్కున అడిగేసింది.

సుజాతా! నిజం చేదుగా ఉంటుంది. కానీ, మాట్లాడే తీరాలి!

మాట్లాడు అన్నయ్యా!

ఏమీ లేకుండా వికలాంగంతో నువ్వు ఇంట్లోనే ఉండిపోతే నిన్ను ఎవరూ పట్టించుకోరు. నీ డబ్బు, ఉత్సాహం, మేధస్సు -- ఇవే నీ గురించి ఆలొచింప చేస్తున్నాయి!

అలాంటి ఒక పెళ్ళి అవసరమా అన్నయ్యా?”

సుజాతా! ప్రకాష్ కు కూడా ఒక పెళ్ళి జరగాలి!

జరుపమ్మా!

మనింటికి వచ్చే అమ్మాయి కూడా, నీకంటే నీ డబ్బునే చాలా వరకు ఇష్టపడుతుంది! నీకూ అని ఒక బంధువు, పట్టు, ఎదురు చూపు లేకుండా పోతుంది!

అమ్మా

వచ్చే అతను స్వార్ధ పరుడుగానే ఉండనీ! నీతో జీవించటం మొదలు పెట్టిన తరువాత, మారనీ! ఒక ఆడదాని వల్ల, అందులోనూ ఒక మంచి భార్య వలన సాధించలేనిది ఏముంటుంది?”

అవును, సుజాతా! అమ్మ చెప్పేది కరెక్టు. ప్రదీప్ కొంచం కోపం, చిరాకూ ఉన్న వ్యక్తే. కానీ, వాడి కుటుంబం అద్భుతమైనది. వాళ్ళతో నువ్వు మాట్లాడి చూడు! తరువాత నీకొక అభిప్రాయం వస్తుంది. తరువాత పెళ్ళి కావాలా, వద్దా అనేది నిర్ణయం చెయ్యి!

ఇది బాగుందే అన్నయ్యా!

వాళ్ళు ఎవరూ డబ్బుకు ఆశపడరు! అతని తండ్రి ఇప్పటికీ చేతి నిండుగా సంపాదిస్తున్నారు. తమ్ముడు దిలీప్ డాక్టర్ కు చదువుతున్నాడు. చెల్లెలు కాలేజీలో చదువుతోంది. తల్లి చాలా  మంచిది

అలాగా?”

ఒక సారి కలుసుకోవటానికి ఏర్పాటు చేస్తాను! అందులో ప్రదీప్ వద్దు. కుటుంబీకులతో మనసు విప్పి మాటాడు! తరువాత నువ్వు నిర్ణయం తీసుకో! సరేనా?”

సరే అన్నయ్యా!

మరుసటి రోజు ప్రొద్దున ప్రకాష్ త్వరగా బయలుదేరి తిన్నగా ప్రదీప్ ఇంటికే వెళ్ళేడు.  

ప్రదీప్ కు ఆశ్చర్యం!

ప్రకాష్ ప్రదీప్ తో వివరాలు చెప్పి నా చెల్లెలు మీ కుటుంబీకులను కలిసి మనసు విప్పి మాట్లాడటానికి ఇష్టపడుతోంది ప్రదీప్! అందులో నువ్వు ఉండొద్దు 

మమ్మల్ని కలుసుకుని మాట్లాడి ఏమిటి ప్రయోజనం?” -- అడిగాడు ప్రదీప్ తండ్రి ఆశ్చర్యంగా.

పెళ్ళి చేసుకోబోయే భర్త కంటే, జీవించబోయే అతని కుటుంబం ముఖ్యమని చెబుతోంది!

ప్రదీప్ తండ్రి మెల్లగా భార్యను చూసారు.

సరే! అమ్మాయిని కష్టపెట్టొద్దు. మేమే మీ ఇంటికి వస్తాం!” -- అన్నది ప్రదీప్ తల్లి.

వద్దు! వికలాంగం ఆమెకు కష్టం కాదు! వికలాంగురాలు అని ఎవరైనా ఆమెను అంటే ఆమెకు నచ్చదు! ఆమెను నేను ఇక్కడికే తీసుకు వస్తాను

సరే... రేపే రండి తమ్ముడూ!” అన్నది ప్రదీప్ తల్లి.

ప్రదీప్ కు అది నచ్చలేదనేది అతని మొహమే చూపిస్తోంది!

**************************************************PART-4********************************************

మరుసటి రోజు పొద్దున వాకిట్లోకి ఆటో వచ్చి ఆగింది! ప్రకాష్ దిగాడు. అతని వెనుకే సుజాతా దిగింది!

ప్రదీప్ తల్లి వాకిటికి వెళ్ళింది.

రామ్మా నవ్వుతో స్వాగతించింది.

మనసులోపల కుడి కాలు ముందు పెట్టి రామ్మాఅని ఒక స్వరం వినబడగా, ఆమె కుడి కాలు మడతపడి, చిన్నదిగా ఉండటం చూసి మనస్సు చివుక్కుమన్నది.

కుంటు కుంటూ సుజాతా లోపలకు వచ్చింది.

కూర్చోమ్మా!

ప్రదీప్ కూడా ఉన్నాడు. ఆమెను చూసి నవ్వాడు.

సరే! నేను బయలుదేరతాను, సుజాతా! రెండు గంటల తరువాత వస్తాను!

వద్దన్నయ్యా! ఒక ఆటో పట్టుకుని నేనే వెళ్ళిపోతాను. వీళ్ళు ఎవరైనా ఎక్కిస్తారు!

అయితే సరే”-- అన్న ప్రకాష్ ప్రదీప్ వైపు తిరిగి, “ప్రదీప్! వెళ్దామా?” అన్నాడు.

ప్రదీప్ కు వెళ్ళటం ఇష్టం లేదు.

నన్ను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఆమె! నేను లేకుండా ఆమెతో మాటలా?’

ఆలొచన వచ్చిన వెంటనే ప్రదీప్ కు కోపం వచ్చింది.

లేదు ప్రకాష్! నేను ఇక్కడే ఉంటాను! కావాలంటే నువ్వు వెళ్ళు

ప్రదీప్ తండ్రి కోపంతో తలెత్తి చూసారు.

సుజాతా ప్రకాష్ ను చూసింది!

సరేనమ్మా! నేను బయలుదేరతాను!

అన్నయ్యా! నువ్వు కూడా పర్మిషన్ అడుగు. నాతోపాటూ నువ్వు కూడా ఉంటే, మాట్లాడి ముగించి, ఇద్దరం వెళ్ళిపోదాం!అన్నది సుజాత.

అవును తమ్ముడూ! -- ప్రదీప్ తల్లి వంతు పాడింది.

తరువాత, లోపలకు వెళ్ళి అందరికీ కాఫీ తీసుకు వచ్చింది.

ప్రకాష్ మాట్లాడటం మొదలుపెట్టాడు.

ప్రదీప్! సుజాతను పెళ్ళి చేసుకోవటానికి తన ఇష్టాన్ని తెలిపాడు. సుజాతకు తను జీవించబోయే కుటుంబం గురించి తెలుసుకోవటం ముఖ్యం. తను మాట్లాడాలి అని చెప్పింది! ఏం మాట్లాడాలో మాట్లాడు సుజాతా

ప్రదీప్ తండ్రి ముందుకు వచ్చారు.

ఇలా చూడమ్మా! ఓపెన్ గా మాట్లాడటానికి వచ్చిన తరువాత మేము ఏదీ నీ దగ్గర దాచిపెట్టకూడదు. ఎందుకంటే నువ్వు మూడో మనిషిగా ఇక్కడికి రాలేదు. మా ఇంట్లో ఒక మనిషిగా ఉందామనుకుని వచ్చావు.  నీ దగ్గర నేను అన్ని విషయాలు చెప్పలేదే అనే ప్రశ్న నాలో తలెత్తకూడదు!

మీరు చెప్పాలనుకున్నది చెప్పండి!

నీ దగ్గర సంపాదన, జీవించగలమనే నమ్మకం, ధైర్యమూ ఉన్న కారణం చేతనే ప్రదీప్ నిన్ను ఇప్పుడు సెలెక్టు చేసాడు. ఇది అతను చేసే త్యాగమని అనుకుని నువ్వు మోసపోవద్దు!

ప్రదీప్ కు చటుక్కున కోపం వచ్చింది.

నన్ను అవమాన పరుస్తున్నారా?”

ఖచ్చితంగా లేదు! నిజం చెబుతున్నా. చెప్పే తీరాలి కదా!

కన్న తండ్రే ఇలా మాట్లాడితే, అమ్మాయికి నామీద ఏం మర్యాద ఉంటుంది? నా జీవితాన్ని చెడపాలని చూస్తున్నారా?”

ప్రదీప్ అరవటం మొదలుపెట్టాడు.

ఏమండీ! మీరైనా మాట్లాడకుండా ఉండండి!-- తల్లి అడ్డుకుంది.

కళ్యాణీ నన్ను ఎందుకు అడ్డుకుంటావు? వీడితో కలిసి పోయామని రేపు మన మీద మాట రాకూడదు చూడు!” -- భార్యకు బుద్ది చెప్పాడు.

దిలీప్, మహతి సంసయంతో వంకర్లు తిరిగారు.

ప్రకాష్ -- సుజాతాను చూసాడు.

ప్రదీప్ -- సుజాతా దగ్గరకు వచ్చాడు.

ఇదిగో చూడు సుజాతా! నిన్ను నేను బాగా లైక్ చేసాను! పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను. నా కుటుంబీకులకు నేనంటే నచ్చదు. నువ్వు జీవితం గడపబోయేది నాతో! వీళ్ళ ఇష్టా ఇష్టాలు మనకు ముఖ్యం కాదు! అర్ధమయ్యిందా?”

తండ్రి నవ్వుతూ చెప్పాడు.

ప్రకాష్! ఒక వేళ పెళ్ళి జరిగితే, నువ్వు వెంటనే ఒక ఇల్లు చూసి నీ చెల్లిని వేరు కాపురం పెట్టించేయి! అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు! పోరాటం అవసరం లేదు!

ఖచ్చితంగా! తరువాత ఇంట్లో జీవించటానికి నాకేమైనా పిచ్చా?” కోపంగా అరిచాడు ప్రదీప్.

శభాష్! నువ్వు లాకప్ లో ఉన్నప్పుడు, లాయర్ను వెతికి పట్టుకుని, నిన్ను బయటకు తీసుకురావటానికి నానా కష్టాలు పడిన వాడిని నేను. ఒంటరిగా మ్యాన్ షన్ కు వెళ్ళి రూము తీసుకుని ఉండి, పేరు పాడు చేసుకుని ఎందుకు ఇక్కడకు వచ్చావు? అప్పుడే నువ్వు వేరే ఇల్లు తీసుకుని వెళ్ళుండచ్చుగా? ఇప్పుడు భార్య ద్వారా వచ్చే డబ్బు, వసతులు కళ్ళకు కనబడుతున్నప్పుడు, ఇంట్లో జీవించటానికి నాకేమైనా పిచ్చా అని అడుగుతున్నావు?”

దిలీప్, మహతి లోపలకు వెళ్ళిపోయారు.

సుజాతా! బయలుదేరు! పరిస్థితులు సరిగ్గా లేవు! ఇంకో సమయం వచ్చి చూద్దాం. వాళ్ళ కుటుంబ గొడవల మధ్య మనం ఉండటం అనాగరీకం!

సరే అన్నయ్యా!

సుజాతా లేచింది.

మేము వస్తాం!

ప్రదీప్ ముఖం వాడిపోయింది.

చాలా! వచ్చిన వాళ్ళను అవమానపరిచి, పెళ్ళి మాటలు తుంచి పారేసారు! ఇప్పుడు సంతోషమేనా?” -- మళ్ళీ అరిచాడు ప్రదీప్.

నోరు ముయ్యరా

తండ్రి అరవగా -- ప్రకాష్, సుజాతా మెట్లు దిగారు.

ఆటో వచ్చింది! ఇద్దరూ ఎక్కారు -- ఆటో బయలుదేరింది.

ఖచ్చితంగా సుజాతా ఇక పెళ్ళికి అంగీకరించదు

తల్లి మాట్లాడలేదు.

ఈయనకి నేనేం ద్రొహం చేసానమ్మా. వికలాంగురాలైన ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. దాన్నీ ఈయన చెడిపేసేరే అమ్మా

ఎవరూ చెడపలేదే! ఒక వికలాంగురాలిని మోసం చేయటం నా మనసు ఒప్పుకోవటం లేదు!

దానికేమిటి అర్ధం? ఆమెను మోసం చేయటమంటే నేను మోసగాడిననేగా అర్ధం? అడుగమ్మా!

ఇద్దరూ కొంచం ఆపుతారా? ఒక మూడో మనిషి ఎదురుకుండా ఇద్దరూ కలిసి మన కుటుంబాన్ని తేలిక చేసేరు

ఇక మీదట నేను ఇంట్లో ఉండను!

అవును! వారానికి ఒక సారి మాట చెబితే చాలా? బయటకు వెళ్ళి జీవించి చూపించాలి! దానికి ధైర్యం లేదు!

చెప్పుకుంటూ తండ్రి మాట్లాడుతుండగానే, ప్రదీప్ పది నిమిషాలలోనే బయలుదేరి వెళ్ళిపోయాడు.

తండ్రి లోపలకు వెళ్ళి కూర్చున్నారు. తల్లి వచ్చింది.

వాడికి వివేకం లేదు, బుద్ది లేదు సరే! మీకేమైంది! మీరు ఎందుకలా నడుచుకున్నారు?”

వాడు మాట్లాడుతుంటేనే నాకు ఆగ్రహం వస్తోంది!

దిలీప్ దగ్గరకు వచ్చాడు.

వద్దు నాన్నా! అన్నయ్య జీవితాన్ని మీరు చెడుపుతున్నారనే చెడ్డ పేరు మీకెందుకు నాన్నా? ఇక మీరు అన్నయ్య పెళ్ళి విషయంలో కలుగ జేసుకోకండి!

లేదురా! అమ్మాయి మామూలు అమ్మాయిగా ఉండుంటే మాట్లాడేవాడినే కాదు.  వికలాంగంతో ఉందే! వీడ్నిపెళ్ళి చేసుకుని జీవితాంతం అమ్మాయి ఇంకా బాధ పడకూడదు చూడు!

సరే నాన్నా! అదే విధి అయితే, ఎవరు మార్చగలరు?”

నింద మనం మోయాలిరా?”

సరే వదలండి! ఇక మీదట ప్రదీప్ పెళ్ళి వ్యవహారంలో మనం తల దూర్చొద్దు. పిలిస్తే, నాలుగు అక్షింతలు వేసి, ఆశీర్వదించి వచ్చేద్దాం. సరేనా?”

దిలీప్! నా వల్ల కావట్లేదురా! నువ్వు త్వరగా డాక్టర్ అయి, కుటుంబ భాద్యత తీసుకో! నేను టయర్డ్ అయిపోయాను!

బాధ పడకండి నాన్నా! అన్నీ సర్ధుకుంటాయి!

అదే సమయంలో అక్కడ ప్రదీప్ ఇంట్లో జరిగిన సంఘటన వివరాలు తల్లికి చెబుతున్నాడు ప్రకాష్.

మూడో వ్యక్తులను పెట్టుకుని గొడవపడుతున్నారు? చదువుకున్న కుటుంబంలో ఇలాగా?”

అమ్మా! వాళ్ళు గమ్యమైన వాళ్ళు! నాగరీకం తెలిసిన వాళ్ళు! వీడు మాత్రం కుటుంబంతో మొదటి నుండే కలిసేవాడు కాదు! కారణం వీడి స్వభావం అలాంటిది! వాళ్ళ నాన్నకు అందులో చాలా బాధ! అది రోజు పేలింది!

మీరేం మాట్లాడకుండా వచ్చేసేరన్నమాట?”

వేరే దారి? గొడవలప్పుడు అక్కడ ఉండటానికే సంకోచంగా ఉంది!

ఏం చెయ్యబోతావు?”

వేరే సంబంధం చూద్దాం. సుజాతాకు ప్రదీప్ వద్దు

నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు! వచ్చిందగ్గర నుండి నీ చెల్లెలు మాట్లాడనే లేదే?”

సుజాతా తల ఎత్తింది.  

నేను నిర్ణయం తీసుకున్నా నమ్మా!

వద్దనేగా?” ప్రకాష్ మధ్యలో అడొచ్చాడు.

లేదన్నయ్యా! కుటుంబానికే నేను కోడలు అవబోతాను!

ఏమిటే వాగుతున్నావు?”

వాగటం లేదు! నిజం చెబుతున్నా. తండ్రీ--కొడుకులు గొడవపడుతున్నప్పుడే, పలు విషయాలు క్షుణ్ణంగా గమనించాసాను!

అర్ధం కాలేదు!

తల్లి చాలా నెమ్మదస్తురాలు! గొడవలు ఇష్టపడని వారు! తట్టుకోలేకపోతోంది! స్వీయ గౌరవానికి భయపడుతున్నారు! ఆమె తట్టుకోలేకపోవటం నేను గమనించాను. ఈమె కంటే -- ఒక మంచి అత్తగారు నాకు దొరుతారనే నమ్మకం నాకు లేదు!

సుజాతా తల్లి కురులు పైకెత్తింది.

తమ్ముడు దిలీప్, చెల్లి మహతి ఇద్దరూ తప్పుకుని నిలబడ్డారు! ఒక ఘట్టంలో లోపలకు వెళ్ళిపోయారు! సమస్యను ఊది పెద్దది చేసేదే ఆడపడుచు. వ్యవహారంలో నేను లేనుఅని పిల్ల తప్పుకుంది చూడండి -- ఆమె కంటే ఒక మర్యాదస్తురాలైన ఆడపడుచు దొరకదు!

ప్రకాష్ ఆశ్చర్యపోయాడు.

ఇక తండ్రీ--కొడుకులే! తండ్రి గొడవపడటానికి కారణం తెలిసిపోయింది! వికలాంగురాలైన ఒక అమ్మాయి, సమస్యల మధ్యలో జీవించటానికి రాకూడదు! ఆమె ప్రశాంతత చెదిరిపోకూడదు! ఇదే ఆయన లోతైన మనసులో ఉన్న పోరాటం. ఇంతకు ముందే కొడుకు మీద విసుగు! రెండూ కలిసి పెద్ద యుద్దంగా మారింది!

ఏమ్మా! ఒక చూపులోనే ఇంత బాగా కుటుంబాన్ని తూకం వేసేవే!

అన్నయ్యా! మనుష్యులను చదవగలిగితేనే, జీవితంలో కన్ ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉండగలం!

తల్లి దగ్గరకు వచ్చింది.

సరి సుజాతా! మిగిలిన వాళ్ళను తూకం వేయటం అటుంచు! నువ్వు  జీవించబోయే ప్రదీప్ సరిలేడే! అతను నీకు నచ్చాలే. అతని గురించి నీ అభిప్రాయం చెప్పలేదేం?”

అమ్మా! ప్రదీప్ స్వార్ధ పరుడు. తన గురించి మాత్రమే ఆలొచించే మనిషి! ఇంట్లో జీవించటానికి నాకేమైనా పిచ్చా అని బహిరంగంగా అడిగాడు! అన్నయ్య చెప్పినట్లు, నాకు కనీస సంపాదన లేకపోతే, ప్రదీప్ వికలాంగ సుజాతాను తిరిగి కూడా చూడడు?” 

అలాగైతే, అలాంటి ఒకర్ని నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకోవాలి సుజాతా?”

అమ్మా!

మనిషి నీతో పూర్తి సంతోషంతో జీవించటం కుదురుతుందా?”

కుదురుతుందమ్మా! అతనికేమో అతని కుటుంబం నచ్చలేదు! దీనితో వేరు కాపురం పెడితే సంతోషంగా ఉంటాడు! విషయాన్ని అతను బహిరంగంగానే చెప్పేసాడు

సుజాతా! నువ్వేం చెప్పబోతావు?”

నేను ప్రదీప్ నే పెళ్ళి చేసుకోబోతున్నాను. ఎందుకో తెలుసా? ప్రదీప్ కోసం కాదు! గణ్యమైన మంచి కుటుంబం కొసం!

అర్ధం కాలేదు

వేరు కాపురం మాటే లేదు! అందరూ కలిసే జీవించాలి. దానికి విరుద్దంగా నిలబడ్డ ఒక కొడుకు మనసులో కుటుంబం మీద ప్రేమ తెప్పించి, అతన్ని కుటుంబంతో కలపాలి!

ఇది అవసరమా నీకు? నీ వల్ల అవుతుందా?

అమ్మా! ఇదే కావాలి! ఒక్కొక్క అమ్మాయికీ ఇదే కావలసింది! ఒక మగాడితో జీవించి, పిల్లలను కని, డబ్బు సంపాదించి, ఇల్లు కట్టుకుని...ఇదంతా సరాసరి జీవితం! స్వార్ధం రూపు రేఖలు. ఒక ఆడపిల్ల మెట్టినింటిని ప్రేమించాలి. అందరూ ఇక నా మనషులే నన్న భావం మనసులో చొరబడాలి. ప్రేమ, అభిమానం చూపించాలి. మనం ఏది చూపిస్తామో, అదే కదమ్మా మనకి తిరిగి దొరుకుతుంది

సుజాతా!

అవునమ్మా బ్రతికే బ్రతుక్కు ఒక అర్ధం కావాలి కదా. నేను దాన్ని ఎదురుచూస్తున్నాను. ప్రదీప్ మొండి పట్టుదల గల గుణం కలవాడే! ఇన్ని రోజులు కుటుంబంతో కలవని అతనికి, అవసరానికి మాత్రమే కుటుంబం కావాలని అనుకుని జీవిస్తున్న అతన్ని, అతని మనసును మార్చాలి!

అంత సులభం కాదు సుజాతా! నువ్వు పోరాడాలి! ప్రదీప్ నాతో పాటే ఉండే కారణంగా, అతన్ని నాకు బాగా తెలుసు! మనుషులంటేనే గిట్టని ఒకతను, తనకు ఇష్టం లేకపోతే, ఎవరినైనా సరే తీసి అవతల పారేస్తాడు! చెప్పాడు అన్నయ్య ప్రకాష్.

ఎంత కాలం పోరాడాలి?” 

తెలియదు!

అన్నయ్యా! నేను ఊరిని బాగు చెయ్యాలని వెళ్ళటం లేదు! దానికి నాకు సమయమూ లేదు! కానీ ఒక మంచి కుటుంబానికి కోడలై, అక్కడున్న చిక్కులను తీరిస్తే, తృప్తి పడే జీవితం దొరుకుతుంది కదా?”

వింటానికి బాగానే ఉంది!

వింటానికి మాత్రమే కాదు! నీ చెల్లెలు జీవించే జీవితం చూసి నువ్వు ఆనందిస్తావు! రేపు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళబోతాను -- ప్రదీప్ లేని సమయంలో. సరేనా!?”

నువ్వు తెలివిగల దానివి. నిర్ణయం తీసుకున్నా దానికో అర్ధం ఉంటుంది! దానికొక న్యాయమూ ఉంటుంది! నేను అడ్డుకోదలుచుకోలేదు! నువ్వు అనుకున్నట్టే చెయ్యి!

థ్యాంక్స్ అన్నయ్యా!

అతను లోపలకు వెళ్లగానే.

ప్రకాష్, ఇది తన ప్రశాంతతను తానే చెడుపుకోబోతోందిరా?”

లేదమ్మా! సుజాతా ఓడిపోదు!

**************************************************PART-5********************************************

ప్రదీప్ పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

మిగిలిన వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు! సుమారు పదిగంటల సమయంలో వాకిట్లో ఆటో వచ్చి నిలబడ, సుజాతా దిగింది.

మహతీనే మొదటగా చూసింది.

అమ్మా! సుజాతా వస్తోంది!

మాట విన్న అందరూ హాలులోకి జేర, సుజాతా కుంటు కుంటూ మెల్లగా మెట్లు  ఎక్క, దిలీప్ పరిగెత్తుకుని వచ్చి పట్టుకున్నాడు!

థ్యాంక్యూ డాక్టర్!

నేనింకా డాక్టర్ని అవలేదు!

అవాల్సిన రోజు చాలా దూరంలో ఏమీ లేదే? ఇంట్లో ఒక డాక్టర్ ఉండటం కారణంగా, మేము ధైర్యంగా రోగాలను రప్పించుకోవచ్చు!

గలగలమని మాట్లాడుతూ సుజాతా లోపలకు వచ్చింది.

రామ్మా! తల్లి స్వాగతించింది.

తండ్రి దగ్గరకు వచ్చాడు.

చూడాలని ఒక కబురు పెట్టుంటే, మేమే వచ్చుంటామమ్మా!

సుజాతా తల ఎత్తింది.

రావలసిన దానిని నేనే కదా! అందుకే నేనే వచ్చాను! ఆమె మాటలలోని అర్ధాన్ని అందరూ గ్రహించారు.

తాగటానికి ఏదైనా తీసుకురానా సుజాతా?”

ఉత్త కాఫీ ఇచ్చి తరిమేద్దాం అని చూస్తున్నారా? రోజు నేను ఇక్కడే భోజనం చేసి వెళ్ళబోతాను

తల్లి మొహం వికసించింది.

నాన్న మరింత దగ్గరకు వచ్చాడు.

నన్ను మన్నించు సుజాతా!

దేనికీ?”

రోజు నువ్వు వచ్చినప్పుడు నా కొడుకుతో వాదన చేసి, నేను కూడా అనాగరీకంగా నడుచుకున్నాను

నేను దాన్ని తప్పుగానే తీసుకోనేలేదే. వీధిలోనా మీ వాదన జరిగింది? ఇంటి లోపల తండ్రి-కొడుకులు వాదించుకోవటం సహజం. అది యధార్ధం! తప్పేముంది!

మహతీ దగ్గరకు వచ్చింది.

అన్నిటినీ పాజిటివ్ గా తీసుకుంటున్నారే! ఎలా?”

ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్ -పాసిటివ్!

దిలీప్ హాయిగా నవ్వాడు. తల్లి-తండ్రుల మొహంలోనూ నవ్వు. క్షణంలో ఇల్లే కోలాహాలంగా మారింది.

సరే! నేను ఎందుకొచ్చానో చెప్పేస్తాను. మీ అబ్బాయి ప్రదీప్ మనసులో ఏమున్నదో నాకు తెలియదు. కానీ, నేను ఆయన్ని పెళ్ళి చేసుకుని, ఇంటికి కోడలుగా రావాలనుకుంటున్నాను!

ఇంత జరిగిన తరువాత కూడానా?”

ఏం జరిగింది?”

అమ్మా సుజాతా! నా కొడుకు జీవితాన్ని నేనే పాడుచేస్తున్నట్టు అనుకోవద్దు!

అనుకోను?”

నువ్వు పెళ్ళికి రెడీ అని కుండబద్దలు కొట్టినట్టు బహిరంగంగా చెబుతున్నావు! కానీ, వాడు స్వార్ధ పరుడు, జిడ్డు మొహం, ఈర్ష్యా గుణం కలిగినవాడు. వాడి దగ్గర మంచి గుణం ఏదీ లేదమ్మా! సారీ అమ్మా! నీకు శరీరంతో ఉన్న వికలాంగం తెలుస్తుంది. స్వీయ నమ్మకంతో జీవితం గెలుచుకుంటూ వస్తున్నావు! సమయంలో జీవితం వికలాంగం అయిపోకూడదుగా? నీకొక నాన్న ఉండుంటే, నీ మీద శ్రద్దతో చెప్పరా?”

నాన్నా! నేను మీ అభిప్రాయాలను తప్పు అని చెప్పలేదే?”

నాన్నా అనా పిలిచావు?”

ఇక మీదట మీ ఇద్దరినీ నాన్నా--అమ్మా అనే పిలువబోతాను!

ఇద్దరి ఒళ్ళూ జలదరించగా సుజాతాను చూసారు.

ఏమిటలా చూస్తున్నారు? కొన్ని కుటుంబాలలో మెట్టింటి కొచ్చిన కోడలు, భర్త యొక్క తల్లి-తండ్రులను నాన్నా--అమ్మా అనే పిలుస్తుంది!

నువ్వు నిర్ణయమే తీసుకున్నావా సుజాతా?”

అవును! ఆయన గురించి మీరంతా చెప్పారు! మా అన్నయ్య కూడా చెప్పాడు.  మీరందరూ చెప్పిన కారణాల మూలంగానే నాకు మీ అబ్బాయి నచ్చాడు! దీనిని ఒక ఛాలెంజుగానే తీసుకుంటున్నాను!

నీకిది అవసరమా?”

ఇదిగో చూడండి. ఆడపిల్లలు అందరూ కట్టుకోబొయే భర్తనే మొదట తూకం వేస్తారు! నేను వ్యత్యాస పడుతున్నాను. నేను కుటుంబాన్ని తూకం వేసాను! మంచి అభిమానమున్న అమ్మా-నాన్నలు! వినయమైన తమ్ముడు, చెల్లెలు! నేను ప్రదీప్ ను సెలెక్టు చేయటానికి ఆయన కారణం కాదు! కుటుంబమే కారణం!

పెళ్ళి అయిన వెంటనే వాడు వేరు కాపురం పెడదామని చెబుతాడమ్మా?”

దానికి ఛాన్స్ లేదు నాన్నా! నెను కుటుంబంతో కలిసి జీవించటానికే ఆయన్ని చేసుకుంటున్నాను. కొంచం కొంచంగా ఆయన్ని మార్చి, ప్రేమగల కొడుకుగా చేయాలి. నా ప్రయత్నానికి మీరందరూ నాకు తోడుగా ఉండరా?”

తల్లి ఏడ్చేసింది.

అది గనుక నువ్వు చేసేస్తే, మా జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడుంటాం, సుజాతా!

నాన్న అన్నారు.

అమ్మా సుజాతా! నాకు ఏం మాట్లాడాలో తెలియటం లేదు. వాడిని తలుచుకునే ఇన్ని సంవత్సరాలు ఏడ్చాము. ఇప్పుడు నీ కొసం ఆనంద కన్నీరు కారుస్తున్నాము! మళ్ళీ అడుగుతున్నాను. వాడు కట్టే తాళి నీ మెడలో ఎక్కిన తరువాత, ఏమిట్రా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాను అని నువ్వు బాధ పడకూడదు కదా?”

దిలీప్ దగ్గరకు వచ్చాడు.

వదిన అలాంటి అమ్మాయి కాదు నాన్నా!

సుజాతా చటుక్కున తిరిగింది.

అవును! మీరే మాకు వదిన అని నేనూ, నా చెల్లి నిర్ణయం తీసుకున్నాం

మహతీ దగ్గరకొచ్చి సుజాతా చెయ్యి పుచ్చుకుంది.

మీరు నాకు బాగా నచ్చారు వదినా!

థ్యాంక్స్

మీ అన్నయ్యనూ, అమ్మనూ కలిసి సంప్రదాయంగా మేము మాట్లాడతామమ్మా!

సరే! రోజు వంట ఏమిటి?”

ఇక మీదటే వంట మొదలు పెట్టాలి! నీకు ఏమిష్టం? చెప్పు

నేనే వంట చేస్తాను అమ్మా!

నువ్వా

ఏం? మా ఇంట్లో నేనే వంట చేస్తాను! నాకు ఇంటి పనులు చేయాలంటే చాలా ఇష్టం! సుమారుగా వండుతాను! భోజనం చేసి చెప్పండి!

లేచింది.

అమ్మతో పాటూ వంట గదిలోకి వచ్చింది.

మీ అందరికీ నచ్చిన వంటలు చెప్పండి!

మహతీ ఒక లిస్టే చెప్పింది.

అమ్మా! మీరు సహాయం మాత్రం చేయండి! రోజు ఛీఫ్ కుక్ ని నేనే!

ఒక గంటలో వింధు భోజనమే రెడీ అయిపోయింది!

డైనింగ్ టేబుల్ మీద తీసుకు వచ్చి పెట్టింది.

సుజాతానే, అందరినీ కూర్చోబెట్టి వడ్డించింది.

అందరూ భోజనం చేసి ముగించారు.

అమ్మా! వచ్చే మూహూర్తం చూసేయి! ఎందుకంటే నువ్వు వంట చేయటం ఆపాలి! ఇంత రుచిగా నువ్వు ఒక్క రోజు కూడా వండిందే లేదు!

అయ్యయ్యో -- అమ్మ బాధపడుతుంది!

బాధ పడదు వదినా! సమాధానం కూడా చెప్పకుండా దాక్కుంది చూడండి! -- మహతీ!

నాన్న హాయిగా నవ్వారు.

నువ్వు ఇంటికి వచ్చిన తరువాత వంట గదివైపుకే రాను! -- అమ్మ!

వదిన వచ్చేంతవరకు కాచుకోవాలే!

సనిగాడు దిలీప్.

కుటుంబం ఇంత సరదాగా ఉండటం మేమెవరమూ చూసిందే లేదు. సుజాతా! పొగడ్త అంతా నీకేనమ్మా! త్వరగా వచ్చేయమ్మా? మీ అమ్మ దగ్గర మాట్లాడి చటుక్కున ముహూర్తం పెట్టేస్తాం!

అమ్మ తల ఎత్తింది.

సుజాతా! రోజు నువ్వు ఇక్కడికి వచ్చి, వంట చేసి, ఇంత సంతోషంగా మనమందరం గడిపింది, ప్రదీప్ కు తెలియకూడదు!

ఏమిటే? తెలిస్తే తప్పేమిటి? తలకాయలు నరికేస్తాడా?”

లేదండీ! మీరు అర్ధం చేసుకోకుండా ఆగ్రహిస్తున్నారు!

వాడికి ఇప్పుడే, దీనికే భయపడితే, సుజాతా ఇంట్లో ఏదీ సాధించలేదు!

నాన్నా! కొంచం ఉండండి! అమ్మ చెప్పేదాంట్లో ఒక అర్ధం ఉంది!

ఏంటమ్మా చెబుతున్నావు?”

మీకందరికీ నేను చాలా సపోర్టుగా ఉన్నానని ఆయనకు తెలిస్తే, ఒక వేళ పెళ్ళే వద్దని చెప్పచ్చు. ఇదే కదమ్మా మీరు అనుకున్నది!?”

 సుజాతా! నా మనసులో ఉన్నది అలాగే చెప్పాసావు!” -- అమ్మ ఏడ్చేసింది.

నాన్నా! నేను ఇక్కడకు వచ్చేస్తే, కథే వేరు! రాకుండా అడ్డుకుంటే కష్టమే కదా?”

న్యాయమే!

అది మాత్రమే కాదు సుజాతా! వాడికి ప్రారంభంలోనే మనసులో ఒక విసుగు  ఏర్పడితే, దాన్ని మార్చలేము! దాన్నే తలుచుకుంటూ మృగంలాగా నడుచుకుంటాడు! అది అందరినీ బాధిస్తుంది. భార్యగా వచ్చిన వాళ్ళకు బాధింపు ఎక్కువగా ఉంటుంది!    

సరేనమ్మా! దీన్ని ఎవరూ చెప్పొద్దు. పెద్దలు మాట్లాడి సహజంగా వచ్చినట్టు రానీ!

నువ్వు చెప్పి, ప్రకాష్ ద్వారా ప్రదీప్ కు వార్త రానీ. మేము దూరంగానే ఉంటాము. గొప్పలన్నిటినీ నా కొడుకే వీపున మోసుకోనీ. నువ్వు ఇంట్లోకి రావటానికి ఎటువంటి ఆటంకమూ ఉండకూడదు!

అవును నాన్నా!

మాట్లాడి మాట్లాడి సాయంత్రం నాలుగు గంటలు అయిపోయింది!

మహతీ! టీ పెట్టు! వదినా! మా మహతీ టీస్పేషలిస్టు! ఉప్పు వేసి టీ ఇస్తుంది చూడండి!

పో అన్నయ్యా

మహతీ టీతయారుచేసుకుని వచ్చింది.

బ్రహ్మాండంగా ఉంది! ఇంటికి వచ్చిన వెంటనే వంటలో నాకు సహాయం చేసేది నువ్వే. నిన్ను నేను తయారు చేస్తాను!

వదినా! అది వంట చేయక పోయినా తప్పులేదు. చదువులో బాగా తయారుచేయండి!

అన్నీ జరుగుతాయి డాక్టర్! అయితే నేనిక బయలుదేరనా?”

వదినా! మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళి దింపుతా!

దిలీప్ రెడీ అయ్యాడు.

వద్దు దిలీప్! ఒక ఆటో పట్టివ్వు! నేను వెళ్ళిపోతాను. మీ కొడుకు ద్వారా సంబంధం వచ్చేటప్పుడు సహజంగా ఉండండి! ఎవరూ ఎక్కువ సంతోషాన్ని చూపకండి!

సరే సుజాతా!

ఆటో వచ్చింది! సుజాతాను ఎక్కించటానికి కుటుంబమే వాకిలికి వచ్చింది!

త్వరాగా వచ్చేయి సుజాతా!

అందరికీ ఆమె చెయ్యి ఊపగా, ఆటో బయలుదేరి వెళ్ళింది!

కుటుంబం మొత్తం తృప్తిగా ఉన్నది.

**************************************************PART-6********************************************

మరుసటి రోజు ప్రకాష్ ఆఫీసుకు వచ్చిన వెంటనే, ప్రదీప్ దగ్గరకు వెళ్ళాడు.

సుజాతా నిన్ను పెళ్ళి చేసుకోవటానికి అంగీకారం తెలిపింది ప్రదీప్!

ను...నువ్వు ఏం చెబుతున్నావు ప్రకాష్? ఇంత జరిగాక కూడానా?”

దాన్ని సుజాతా పెద్దగా తీసుకోలేదు! మేము దీని గురించి మాట్లాడినప్పుడు, తండ్రీ- -కొడుకులకు నాలుగు గోడల మధ్య వెయ్యి తగాదాలుంటాయి! అందులో తల దూర్చటానికి మనమెవరం? ఇది మనకు జరిగిన అవమానం అని ఎందుకు అనుకోవాలి? నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు! పెళ్ళికి నేను రెడీ! మిగిలిన విషయాలు మీరు మాట్లాడవచ్చు అని చెప్పేసింది!

ప్రదీప్ మొహంలో ఉత్సాహం పొంగి పొర్లింది.

నీకు ఓకేనా ప్రదీప్?”

ఏమిటి ప్రకాష్ ఇలా అడుగుతున్నావు? నాకూ ఎటువంటి ఆక్షేపణా లేదు! నేనూ  రెడీ. మనస్పూర్తిగా అంగీకరిస్తున్నా! పరవాలేదే! మా గొడవ వల్ల ఎటువంటి బాధ పడకుండా నీ చెల్లెలు క్లియర్గా ఉన్నదే!

దీంట్లో మాత్రమే కాదు ప్రదీప్...అన్ని విషయాలలోనూ ఆమెకు క్లారిటీ ఎక్కువ. లేకపోతే కాళ్ళు వికలాంగమైనాయేనని కృంగి పోకుండా, ఎంత స్వీయ నమ్మకంతో జీవిస్తోంది చూడు!

నిజమే!

తరువాత స్టేజీకి వెళ్దాం. నేను మా అమ్మను పిలుచుకుని మీ ఇంటికి వస్తాను. పెద్దలు కలిసి మాట్లాడుకుని, మంచి రోజును ఎంచుకోనీ!

మా నాన్న వాగుతారే!

తప్పు ప్రదీప్. పెద్దలు మాట్లాడవలసిన విషయాలను, వాళ్ళే మాట్లాడాలి. అదే  మర్యాద! నిన్ను కన్న వాళ్ళు నువ్వు సంతోషంగా జీవించాలని అనుకోరా?”

లేదురా! నీకు వాళ్ళ గురించి తెలియదు! వాళ్ళతోనే ఉంటున్న నాకే తెలుసు!

సరే వదులు! అది నీ సమస్య!

ప్రకాష్, పెళ్ళి ముగిసిన వెంటనే, అదే వేగంతో మాకు ఒక ఇల్లు చూడు! మేము వేరు కాపురం వెళ్ళిపోతాం!

ఎందుకురా ప్రదీప్?”

వాళ్ళతో కలిసి జీవించటం ఎవరి వల్ల కుదురుతుంది?”

ఇందులో నన్ను లాగకురా బాబూ! ఆడపిల్లను ఇచ్చిన వాడిని, కుటుంబాన్ని విడదీసాడే అనే అపవాదు వస్తుంది. అది నువ్వే చూసుకో!

అది కూడా న్యాయమే!

నేను మిగతా పనులను చూసుకోవాలి!

నేనూ సుజాతాతో కొంచం ఒంటరిగా మాట్లాడాలి. దానికి సంధర్భం ఏర్పాటు చేసివ్వగలవా?”

నువ్వు మా ఇంటికి రా! మనసు విప్పి మాట్లాడచ్చు. మిమ్మల్ని వదిలేసి నేనూ, అమ్మా బయటకు వెళ్ళిపోతాం!

సరే!

మొదట పెద్దవాళ్ళు మాట్లాడి ముగించనీ! తరువాత మీరిద్దరూ మాట్లాడుకోవచ్చు...సరేనా?”

ప్రదీప్ నవ్వుతూ తల ఊపాడు!

**************************************************PART-7********************************************

ప్రదీప్ ఇంటి టెలిఫోన్ నెంబర్ తీసుకున్నాడు ప్రకాష్!

రేపు నేనూ అమ్మా రావచ్చా? రేపు మంచి రోజుగా ఉంది! అందుకని అడిగాను!

పెద్దవాళ్ళు వెంటనే అంగీకరించినందు వలన, మరుసటి రోజు ప్రొద్దున తొమ్మిదింటికి తల్లితో పాటూ ప్రకాష్ కూడా ప్రదీప్ వాళ్ళింటికి వెళ్ళాడు!

ప్రదీప్ ఇంట్లోనే ఉన్నాడు. పెద్దవాళ్ళూ మనస్పూర్తిగా స్వాగతించారు. ఇంతకు ముందే సుజాతా అన్నీ చెప్పిన కారణంగా, సమస్యా రాలేదు!

మీ కుటుంబం మాకు బాగా నచ్చింది! మిగతా విషయాలు మాట్లాడి ముహూర్తం పెట్టుకుందాం! నేను ఏం చేయాలి?”-- సుజాతా తల్లి అడిగింది!

అక్కడ తల్లీ-తండ్రీ మాట్లాడేలోపు ప్రదీప్ అందుకున్నాడు.

ఏమీ వద్దు! కట్టుకున్న చీరతో పంపండి! నాకు ఆశ లేదు! వికలాంగురాలైన ఒక అమ్మాయికి జీవితం ఇవ్వబోతాను అనే మనో తృప్తితో ఇది నేను చెబుతున్నాను!

అది అతను చెప్పినప్పుడు ప్రకాష్, అతని తల్లి ఇరువరి మొహాలూ చిన్నబోయింది.

ప్రదీప్ తండ్రి ఆవేశంగా ఏదో చెప్పటానికి రాబోతుంటే, దిలీప్ గబుక్కున ఆయన చేతిని పట్టుకున్నాడు.

ఆయన తిరిగి చూడగానే, దిలీప్ తన చూపులతో ఏమీ మాట్లాడకండిఅన్నట్టు సైగ చేసాడు.

తండ్రి వెనక్కి తగ్గాడు.

ప్రదీప్ తన మాటలను కంటిన్యూ చేస్తున్నాడు. కన్నవాళ్ళను మాట్లాడనివ్వలేదు!

అన్నీ మాట్లాడి ముగించిన తరువాత, “మంచి ముహూర్తం చూసిన తరువాత మళ్ళీ వచ్చి చూస్తాము అన్నాడు ప్రకాష్!

ఇద్దరూ ఆటో ఎక్కి వెళ్ళిపోయారు.

తల్లి దగ్గరకు వచ్చింది.

ఏరా? వాళ్లెందుకు ఇక్కడికి వచ్చారు?”

ఇదేం ప్రశ్న? సంబంధం మాట్లాడటానికి వచ్చారు!

నువ్వు వాళ్ళను బయటే ఎక్కడన్నా కలుసుకుని మాట్లాడి ఉండచ్చే! అన్నాడు తండ్రి.

ఏం మాట్లాడుతున్నారు?”

అవున్రా! మమ్మల్ని నువ్వు మాట్లాడ నివ్వలేదు కదరా! కన్నవాళ్లం మేమెందుకు ఉన్నాం?” తల్లి అన్నది.

మాట్లాడనిస్తే, నీ భర్త ఇష్టం వచ్చినట్టు వాగుతారు. వచ్చిన వాళ్ళు పరుగుపెడతారు!

దిలీప్ దగ్గరకు వచ్చాడు.

అన్నయ్యా! ఎందుకలా మాట్లాడతావు? నీ భర్త అంటూ నాన్నను వేరు చేసి మాట్లాడుతున్నావే! ఈయన లేకపోతే నువ్వే లేవు అన్నయ్యా!

ఆపరా! నువ్వేమిటి ఆయనకు పక్క వాద్యమా?”

కన్నవారికి, పిల్లలు పక్క వాయిద్యంగా ఉంటే, అది గొప్పే అవుతుంది!”… చెప్పాడు దిలీప్.

చాలురా! నిన్ను ఆయన ప్రేమగా చూస్తున్నారు. నువ్వు ప్రేమలో పొంగి  పొర్లుతున్నావు! నా పరిస్థితుల్లో నువ్వుంటే, ఈయన మొహాన్ని చూడటానికి కూడా ఇష్టపడవు!

ఆ మాటతో తల్లి ఆవేశపడిపోయింది.

అంత తప్పుగా ఎప్పుడురా నడుచుకున్నారు?”

ఎప్పుడు తప్పుగా నడుచుకోలేదు?”

పాపాత్ముడా! నీ లాంటి నమ్మక ద్రోహిని చూడలేదురా! అన్నిటికీ ఒక హద్దు ఉంది! మమ్మల్ని ఇంతగా అవమానించిన తరువాత మేము ఏమీ మాట్లాడుకుండా ఉంటే మా ఒంట్లో చీమూ, నెత్తురూ ప్రవహించటం లేదని అర్ధం!” -- తల్లి అరిచింది.

తండ్రి లేచి వచ్చాడు.

భార్యను చూసి  నువ్వు లోపలకు వెళ్ళు!అన్నాడు.

లేదండీ! మీరందరూ వీడ్ని చీదరించుకున్నా ఇన్ని రోజులు నేను వీడిని ఆదరించాను! రోజు నా వల్లే ఆదరించటం కుదరట్లా!

సరే, నువ్వు లోపలికి వెళ్ళు!

కట్టుకున్న మొగుడ్నే అవమానపరచిన తరువాత, వీడ్ని కన్న కొడుకు అని చెప్పుకోవటం వేస్టు!” -- కళ్ళు నీటితో నిండగా ఎర్రబడ్డ కళ్ళతో చెప్పింది.      

నిన్ను లోపలకు వెళ్ళమన్నానా?!

ఆయన స్వరం పెంచగా, తల్లి హడలిపోయింది. ఆమె మొహం మరింత ఎర్ర బడింది!

తల్లి ఏడుస్తూ లోపలకు వెళ్ళిపోయింది. దిలీప్, మహతీ ఇద్దరూ శిలలాగా నిలబడ్డారు!

లోపలకు వెళ్ళమని చెప్పింది మిమ్మల్ని కూడా! నేను చెబితే మీరంతా వింటారని గర్వ పడి నిలబడ్డాను! వెళ్ళండి!

ఇద్దరూ లోపలకు వెళ్ళిపోయారు.

ప్రదీప్ దగ్గరకు వచ్చారు తండ్రి! మొహమంతా విరక్తి చూపుతూ, వాడ్ని ఒకసారి పై నుండి కిందకు చూసారు!

అంతలో చెప్పులు తగిలించుకుని బయటకు వెళ్ళి పోయాడు ప్రదీప్.

తండ్రి లోపలకు వెళ్ళాడు.

నువ్వు ఏడవకమ్మా, ప్లీజ్!

మీ నాన్నా కూడా నన్ను అర్ధం చేసుకోలేదురా దిలీప్! మీ నాన్నను అవమానపరిచినప్పుడు, తట్టుకోలేకనే కదా వాడ్ని నేను మాటలన్నాను. అలాంటి నన్ను అర్ధం చేసుకోలేదు మీ నాన్న!

అప్పుడు ఆయన దగ్గరకొచ్చారు.

నువ్వేనే నన్ను అర్ధం చేసుకోలేదు!

తల్లి తల పైకెత్తింది.

నువ్వూ మాట్లాడి, నేనూ మాట్లాడి, అందరం మాట్లాడితే వాడు ఇంకా పెద్ద మృగంగా మారిపోతాడు

పెళ్ళి ఆగిపోతుందా?”

అలా ఆగిపోతే నేను సంతోషపడతానే! సుజాతా తప్పించుకుంటుంది కదా? అది కూడా జరగదు! పెళ్ళి చేసుకుని, వేరుగా వెళ్ళిపోదామని వీడు చెబితే?”

సుజాతా వెళ్ళే కావాలి!

ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ధర్మ సంకటానికి ఆమెను నిలబెట్టాలా? ఆమె లక్ష్యం ఏమిటే? మన అందరితోనూ కలిసి జీవించి, వాడ్ని కూడా మార్చి మనతో ప్రేమగా ఉండేటట్టు చేయాలనే కదా?”

అది జరుగుతుందని అనిపిస్తోందా మీకు? పాపం సుజాతా ఓడిపోబోతోంది!

సరేనే! ఆమె ఓటమి చెందటానికి మనమే శంకుస్థాపన చేయాలా?”

ఏం చెబుతున్నారు?”

నాకేమన్నా మాట్లాడటం చేతకాదా? నేను నోరు మూసుకుని ఉండటానికి కారణం ఏమిటి? అమ్మాయి ఎటువంటి ఆటంకమూ లేకుండా లోపలకు వచ్చేయని. తరువాత ఆమె ఛాతుర్యం, తెలివితేటలతో గెలుస్తుందా అని చూద్దాం!

అమ్మ దగ్గరకు వచ్చింది.

అది నాకు అనిపించలేదండీ! నన్ను క్షమించండి!

నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుని, నెమ్మదిగా బాధపడతావు! నీ గాలే ప్రదీప్ పైనా వీచింది!

దిలీప్ నవ్వాడు.

ఏమిట్రా నవ్వుతున్నావు?”

ఇంటికి కోడలు వస్తే పోరాటమే అని చెబుతారు! కోడలు ఇక్కడ రావటానికి ముందే పోరాటమా?”

అవున్రా! మీ వదిన యుద్ద భూమికి రాబోతోంది? యుద్దంలో ఆమె గెలవటానికి, మనమందరమూ పక్కబలంగా ఉందాం!

మహతీ జరిగి వచ్చింది.

వదిన చోట నేను ఉన్నట్టు అయితే ఏం చేస్తానో తెలుసా?”

ఏం చేస్తావే?”

భర్తకు విడాకులు ఇచ్చేసి, అత్తగారింట్లోనే జీవిస్తాను!

అమ్మా! ఇది కొత్తగా లేదు? అమ్మాయీ చెప్పని ఒక ఆలొచన!

అవునన్నయ్యా! అభిమానంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఏమిటి? గౌరవించాలి. పొగరు బట్టిన వాళ్ళను తొక్కేయాలి!

నాన్నా! కుందేలు పిల్లలాగా ఉన్న నా చెల్లెలికి ఇంత ఆవేశం ఎలా వచ్చింది?”

నలుగురూ నవ్వారు.

సుజాతా ఇంటికి వచ్చిన తరువాత, ఎప్పుడూ నవ్వే కంటిన్యూ అవ్వాలి!

వదిన దగ్గర అందరినీ సంతోషంగా ఉంచుకోగలిగే నైపుణ్యం ఉంది. నాకు నమ్మకం ఉంది నాన్నా -- దిలీప్.

ప్రదీప్ రాత్రి ఎనిమిదిన్నరకు తిరిగి వచ్చాడు.

భోజనానికి వస్తావా?” తల్లి అడిగింది.

వద్దు. నేను బయట తిన్నాను!

నీకొసం నేనూ భోజనం చేయకుండా కాచుకోనున్నానురా!

ప్రదీప్ తిరిగి చూసాడు.

ఎందుకు నువ్వు నన్ను సమాధాన పరుస్తావు? మొదట బురద తీసి జల్లి, అదే చేత్తో భోజనం వడ్డించడం మీ వల్ల ఎలా కుదురుతోంది?”

కారణం, నేను అమ్మను రా! నా ప్రాణం అడ్డుపెట్టి నిన్నుకన్నాను చూడు...! ప్రేమ అవమానపడినా ప్రేమ చూపించే ఒకే జీవి లోకంలో తల్లి మాత్రమేరా! ఉన్నప్పుడు ఏదీ తియ్యగా ఉండదురా! లేకుండా పోయినప్పుడు తెలుస్తుంది!

గొంతు ఎండిపోయేటట్టు చెప్పేసి వెళ్లగా, ప్రదీప్ లేచి భోజనానికి వెళ్ళాడు.

**************************************************PART-8********************************************

సాయంత్రం వేళ హోటల్లో గుంపు ఎక్కువగా లేదు! ఎవరూ లేని చోటు చూసి వెతుకున్నాడు! ఎదురుగా వచ్చి శ్రమపడి కూర్చుంది సుజాతా!

టిఫిన్ తిన్నారు.

సారీ సుజాతా! మీ ఇంటికి రావాలనే అనుకున్నాను! పరిస్థితి ఎలా ఉంటుందో అనే సిగ్గుతో నిన్ను ఇక్కడకు పిలుచుకు వచ్చాను! కష్టపెట్టానా?”

ఏం కష్టం?”

అందరూ నిన్ను జాలిగా చూస్తారు! అది ఇబ్బందే కదా?”

సుజాతా నవ్వింది.

ఎందుకు నవ్వుతున్నావు?”

మిగతావారి చూపులు, ఆలొచనల గురించి నాకు కొంచం కూడా బాధలేదు! జాలి చూపడం నన్ను ఒక్కరోజు కూడా గాయపరచదు ప్రదీప్!

మంచిది!

నాకని కొన్ని స్వీయ నిర్ణయాలు, స్పష్టత ఉంది. అన్నీ ఉన్న వాళ్ళకే తమని తామే తక్కువ అంచనా వేసుకునే స్థితి, నేర భావన ఎక్కువ. నాలాంటి శరీర వికలాంగులకు అది ఉండదు!

ప్రదీప్ మొహం కొంచంగా మారింది!

వదలండీ! ఏం మాట్లాడాలి?”

ఏమిటి సుజాతా ఇలా అడుగుతున్నావు? కొత్తగా పెళ్ళి చేసుకోబొయేవారికి ఎన్నో  కలలు ఉంటాయి?”

అందమైన భార్య దొరికితే, కలలకు అర్ధం ఉంటుంది! నా దగ్గర కూడానా?”

అతను సమాధానం చెప్పలేదు!

వదలండి! చెప్పాలనుకున్నది చెప్పండి!

మనకు పెళ్ళి అయిన వెంటనే వేరు కాపురం వెళ్ళిపోదాం. ఇల్లు చూడమని చెప్పబోతా!

ఆమె మాట్లాడలేదు!

ఏం మాటలే లేవు?”

ఇలాంటి ఒక ఉద్దేశం ఉంటే, మనకి పెళ్ళే వద్దు ప్రదీప్. ఆపేయండి!

ప్రదీప్ ఆశ్చర్యపోయాడు.

ఎందుకలా చెబుతున్నావు?”

వద్దు. వదిలేయండి!

తెలుసు. నీ మనసును నాకే తెలియకుండా, మా ఇంట్లో ఎవరో ప్రభావం చేసారు!

సుజాతా నవ్వింది.

ఎందుకు నవ్వుతున్నావు?”

మీరు వేరు కాపురం వెళ్లబోతామని ఇంట్లో ఇదివరకే చెప్పేసారా?”

డైరెక్టుగా చెప్పలేదు?”

అయితే ఎలా వాళ్ళకు తెలుస్తుంది

మీ అన్నయ్య ప్రకాష్ చెప్పు...?”

అన్నయ్య ఎందుకు చెబుతాడు?”

సరి వదిలేయ్! నువ్వెందుకు దీన్ని ఎదిరిస్తున్నావు? ప్రతి అమ్మాయి ఇష్టపడి ఎంజాయ్ చేసే నిర్ణయం ఇది!

నేను అందరి అమ్మాయలలాగా సరాసరి అమ్మాయిని కాను ప్రదీప్!

అలా అంటే?”

నాకు మనసులో స్వీయ విశ్వాసం ఉన్నా కూడా, శరీర పరంగా ఒంటరిగా కొన్ని పనులు చేసుకోవటం కష్టం. నన్ను అర్ధం చేసుకో కలిగిన వారి సహాయం కావాలి!

సరే

నా పుట్టింటి నుండి నేను రాబోతున్నాను. మీరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు! ఒంటరిగా నేను కష్ట పడనా?”

అందుకని

మీ ఇంట్లోనే జీవిస్తే, మీ వాళ్ళు నాకు దొరుకుతారు! ఇది మీకు నచ్చలేదంటే, మా ఇంటల్లుడిగా ఇల్లరికం వచ్చేయండి! ఏది సులభం?”

అయోమయంలో కూరుకుపోయాడు ప్రదీప్.

మీ ఇంట్లోని పెద్దలతో మీరు గొడవ పడేది నేను చూసాను. అందువల్ల, వాళ్ళను వదిలించుకుని సంతోషంగా మీరు వచ్చేయచ్చు!

ఇదేం మూర్ఖత్వం సుజాతా!

ఎందుకు కోపగించుకుంటారు. రెండింటింటిలో ఒక దాన్ని మీరే నిర్ణయించాలి!

మీ ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా రావటానికి నాకు గౌరవం కాదు!

అలాగైతే మీ ఇంట్లోనే ఉండిపోదాం! వేరే దారి లేదు!

ప్రదీప్ తడబడ్డాడు! ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.

ఇది న్యాయమే కదా?’

అతన్నే చూసింది!

ఇదిగో చూడండి! మీ తల్లి-తండ్రులతో మీకు అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. దాని గురించి విమర్శించడానికి నాకు హక్కు లేదు! మనం కలిసి జీవించబోతాం! అది సంతోషంగా మొదలవ్వాలి. దీన్ని జ్ఞాపకముంచుకోండి

ప్రదీప్ మాట్లాడలేదు!

లోకంలో నిరంతరమైన స్నేహం అని ఏదీ లేదు! నిరంతరమైన పగా లేదు! పరిస్థితులకూ, అవసరాలకూ తగినట్టు అన్నీ మారుతాయి! మనమూ మనల్ని మార్చు కోవలసిందే!

ప్రదీప్ తల ఊపాడు.

లేకపోతే నేను నెలకు ఇరవై వేల రూపాయలు కంటే ఎక్కువే సంపాదిస్తున్నాను. మన అవసరాలకు సంపాదన చాలు అనుకుంటే, మీరు ఉద్యోగం మానేసి నాకు సహాయంగా ఉండండి!

అది నాకు పరువు తక్కువ!

వద్దు! ఒకటిగా ఉందాం. అందులోనూ మీ ఇంట్లో ఉంటే, అందరికీ పరువు, మర్యాదలు దొరుకుతాయి!

సరే వదిలేయ్! నీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?”

ఎక్కువ సంపాదించాలి!

బ్రహ్మాండం!

ఉండండి! నేను ఎక్కువ సంపాదించాలని చెప్పింది డబ్బు మాత్రమే కాదు! అభిమానం సంపాదించాలి! మంచి బంధుత్వాలను సంపాదించాలి! మెప్పులు పొందాలి! అన్నిటినీ కలిపితే మనుషులను సంపాదించాలి!

అందుకు నువ్వు కష్టపడనే అక్కర్లేదు. నీ దగ్గర మంచి మనసుంటే, అన్నీ వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి!

లేదు ప్రదీప్! దాన్ని నేను నమ్మను! సరైన పక్క బలం లేకపోతే డబ్బు కూడా కొన్ని సంధర్భాలలో నా లాగా వికలాంగమైపోతుంది

వెళ్దామా?”

లేచింది సుజాతా!

**************************************************PART-9********************************************

ఏం చెబుతున్నాడు? ప్రదీప్?”

ప్రకాష్ ఆత్రుతతో చెల్లెల్ని అడిగాడు!

నువ్వు చెప్పింది వందకు వందశాతం కరెక్టు అన్నయ్యా!

అలాగంటే?”

చాలా స్వార్ధం, డబ్బు ఆశ, అభిమానానికి కొంచం కూడా మర్యాద ఇవ్వని మనసు... మనిషిని మార్చటానికి నేను చాలా కష్టపడాలనుకుంటా!

కష్టపడటం ఓకే సుజాతా! దానికి ఫలితం దొరుకుతుందా?”

తెలియదు!

తల్లి దగ్గరకు వచ్చింది.

సుజాతా! నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇది సరిగ్గా ఉంటుందా? పెళ్ళి నీకు సంతోషం ఇస్తుందా లేక భారంగా ఉండబోతుందా?”

లేదమ్మా! నేను అలా అనుకోలేదు! ఖచ్చితంగా మొదటి రోజు నుండే పోరాటమే! అది నాకు తెలుసు. కానీ, కుటుంబం అద్భుతమైన కుటుంబం అమ్మా! నాలాంటి వికలాంగు రాలికి ఖచ్చితంగా భర్త ఆదరణ మాత్రం సరిపోదు! దాన్నీ దాటి, కుటుంబం అభిమానంగా ఉండాలి. అది కుటుంబం మాత్రమే చూపించగలదు!

సరేనే! ప్రదీప్ తన కుటుంబాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడే!

అమ్మా! చివరగా, కొంచం ఓపన్ గా ఒక ప్రశ్న అడుగుతాను. ప్రదీప్ దేనికోసం నన్ను పెళ్ళి చేసుకుంటున్నాడు?”

నువ్వే చెప్పమ్మా!

నేను సంపాదిస్తున్న కనీసమైన వేల రూపాయల కోసం! ఖచ్చితంగా వికలాంగురాలైన సుజాతా దగ్గర ప్రదీప్ మాత్రమే కాదు...ఎవరికైనా సరే నన్ను ఇష్టపడటానికి కారణం నేను సంపాదిస్తున్న డబ్బే అవుతుంది!

సరి!

అందువల్ల నా మీద కోపం తెచ్చుకోలేరు! నన్ను మరీ అవమానపరచలేరు!

సరేనమ్మా! డబ్బుతో వేసే మూడుముళ్ళూ కలకాలం నిలబడతాయా?”

తెలియదు! అది పెట్టే కదా నేను పాచికలు దొర్లించబోతాను!

ప్రకాష్ అడ్డు వచ్చాడు.

అమ్మా వదిలేయ్! దానికి ధైర్యమూ, నమ్మకమూ ఉంది. కుటుంబం పక్కబలంగా ఉంటుంది! ఇంకా ఏం కావాలి? నువ్వు బాధపడకు!

సరే నాయనా!

సుజాతా! నీకు మెట్టినిల్లూ, పుట్టినిల్లూ రెండూ ఆదరణగా ఉంటాయి! రెండు వైపులా చేతులు కలిపి పోరాటాన్ని మొదలుపెట్టు. నువ్వు గెలుస్తావు!

నాకూ నమ్మకం ఉందన్నయ్యా!

**************************************************PART-10*******************************************

మంచి ముహూర్తం ఫిక్స్ చేసి, వేగవేగంగా పెళ్ళి పనులు మొదలయ్యాయి!

రెండిళ్ళూ హడావిడిగా ఉన్నాయి.

ఆమె సంపాదించిన సంపాదనే చాలా ఉంది. ప్రకాష్ కూడా చెల్లి పెళ్ళికోసం చేర్చిపెట్టున్నాడు!

మంచి కళ్యాణ మండపం తీసుకున్నాడు ప్రకాష్! తల్లి నగలు కూడా కనీసంగా ఉన్నాయి!

మంచి వంట సర్వీసు వాళ్ళనూ, వీడియో వాళ్ళనూ, ఫోటో తీసే వాళ్ళనూ, బాజాబజంత్రీలు -- అంటూ దేనికీ తక్కువ చేయలేదు!

అన్నయ్యా! ఇంత ఖర్చు పెట్టాలా?”

తప్పు లేదమ్మా! ఇంటి అమ్మాయివి నువ్వు! నీకొసం ఖర్చు చేయటంలో ఒక తృప్తి ఉంది!

పెళ్ళిరోజు దగ్గర పడింది!

బంధువులూ, స్నేహితులూ బ్రహ్మాండమైన అరేంజ్ మెంట్స్ ను చూసి ముక్కు మీద వెలేసుకున్నారు.

అందరి నోళ్ళల్లోనూ ఒకమాట నలుగుతోంది.

అబ్బాయిని అభినందించాలి. వికలాంగురాలైన ఒక అమ్మాయికి జీవితం ఇస్తున్నాడే!

కొన్ని త్యాగాలకు వెనుక ఖచ్చితమైన స్వార్ధం దాగుంటుందని ఎవరికీ తెలియటం లేదు!

ప్రదీప్ కుటుంబమంతా ఉత్సాహంగా ఉంది!

వాళ్ళ వలన ఒక సమస్య కూడా లేదు! సహజంగా ఉన్నారు.

అందరికీ జరిగినట్టే మొదటి రోజు పెళ్ళికి స్వాగతం ఫంక్షన్ జరిగింది! మరుసటి రోజు తెల్లవారు జామున ఐదు ఇరవై నాలుగుకు జీలకర్ర-బెల్లం వధూవరుల నెత్తి మీద పెట్టుకున్నారు. తరువాత మాంగల్య ధారణ జరిగింది. సుజాతా మెడలో తాళి ఎక్కింది!

తరువాత జరగాల్సిన తంతు అంతా జరిగింది.

ఫస్ట్ నైట్ ఎక్కడ జరపాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఖచ్చితంగా మెట్టినింట్లోనే అని సుజాతా చెప్పింది.

ఇక నా కుటుంబం అదే. నా వంశం వృద్ది చెందేది అక్కడే! అక్కడే జరగాలి!

సాయంత్రం నాలుగింటికి మండపాన్ని కాలీచేసేసి, ఇంటికి వచ్చాశారు.

గృహప్రవేశ కార్యక్రమం అయిన తరువాత వీళ్ళకైన గదిని దిలీప్, మహతీ అలంకరించటం మొదలపెట్టారు.

రాత్రికి విందు భోజనం రెడీ చేయాలి!" తల్లి చెప్పింది.

అత్తయ్యా! నేను వంట చేస్తాను!

ఇప్పుడే కదా ఇంటికి వచ్చావు! ఇంతలోనే పనా?”

అవును సుజాతా! వాళ్ళు చూసుకుంటారు! నువ్వు కష్టపడకు ప్రదీప్ చెప్పిన వెంటనే, కోపం వచ్చింది తల్లికి!

ఏమిటి కష్టం? అత్తయ్య పెద్దావిడ! ఆమే విసుక్కోకుండా చేస్తోంది! నేను ఇంటి కోడల్ని. నేనే చేయాలి! అది నా బాధ్యత!”

మొదటి రోజే ఆమె ఇంతగా మాట్లాడటం ప్రదీప్ కు నచ్చలేదు.

మౌనంగా ఉండిపోయాడు.

వంట గదిలోకి అత్తా, కోడలూ ఇద్దరూ రాగా,

నువ్వు ఇంతగా మాట్లాడింది వాడికి నచ్చలేదు సుజాతా!  జాగ్రతమ్మా!

అత్తయ్యా! దాని గురించంతా మీరు ఆలోచించకండి! మాట్లాడాల్సింది మాట్లాడే తీరాలి!

ఏడు గంటలకంతా రుచికరమైన వంటకాలు రెడీ అయినై.

అన్నీ డైనింగ్ టేబుల్ కు వచ్చినై!

జోడీగా కూర్చోండి! నేను వడ్డిస్తాను!

సుజాతా వెనక్కి తిరిగింది, “దిలీప్! మహతీ, ఇద్దరూ వెంటనే రండి!

ఇద్దరూ వచ్చారు.

మీ ఇద్దరూ మాకు పక్కగా కూర్చోండి!

వదినా!

మా ఇద్దరికీ మొదటి ఇద్దరు పిల్లలూ మీరే. రేపు బిడ్డ పుడితే, అది మూడో బిడ్డే, కూర్చోండి!

తల్లి-తండ్రులకు కళ్ళు చెమ్మగిల్లినై.

దిలీప్ వంకర్లు పోతూ వదినా! మొదటి రోజే మరిదిని, ఆడపడుచును తన పిల్లలు అని చెప్పిన మొదటి వదిన ప్రపంచంలోనే మీరే అయ్యుంటారు!

గొంతు బొంగురుపోయింది.

మహతీ, సుజాతాను గట్టిగా కావలించుకుంది.

ప్రదీప్ కు ఒళ్ళు మండింది! దాన్ని బయటకు చూపించటానికి దారి లేదు!

తల్లి వడ్డించగా,

అత్తయ్యా! రోజు మీరు చెప్పిన దానికి కట్టుబడతాను. రేపట్నుంచి మిమ్మల్ని కూర్చోబెట్టి నేనే వంటచేస్తాను!

సరేనమ్మా!

వంటలను, వాటి రుచిని చవిచూసిన దిలీప్, మహతీ పొగడ్తలతో నింపారు.

ఫస్ట్ నైట్ కు కావలసిన ఏర్పాట్లను తల్లి చేసింది. నాన్నా- అమ్మ దగ్గర ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు.

అమ్మ, సుజాతాను పక్కకు తీసుకు వెళ్ళింది!

నీకు కాలు మాత్రమే వికలాంగం! మిగతావి తల్లికి కావలసిన సకల లక్షణాలూ నీలో ఉన్నాయి! వాడి మనసుకు తగినట్టు నడుచుకో! మొదటి రాత్రి...మాటల్లో ఎటువంటి చిరాకుకూ చోటివ్వకుండా సంతోషంగా ఉండాలి! చూసుకో!

సరే అత్తయ్యా!

నీ వల్ల కుటుంబం వృద్ది చెందాలి!

మీ ఆశ నెరవేరుతుందమ్మా!

లోపలకు వచ్చింది సుజాతా! ప్రదీప్ కాచుకోనున్నాడు. లేచి వచ్చి ఆమెను పట్టుకున్నాడు.

తలుపు మూసాడు.

అమ్మకూ--నీకూ మధ్య ఏమిటి రహస్యం?”

అంతరంగ జీవితాన్ని మొదలుపెట్టబోతున్న అమ్మాయికి అనుభవమున్న తల్లి ఇచ్చే ఆలోచన

ఏదైనా సరే, నా దగ్గర చెప్పే కదా తీరాలి? నీ అంతరంగ జీవితానికి నేనే కదా సొంతవాడిని?”

ఛీ! ఇది ఆడవారి వ్యవహారం! నేను చెప్పను?”

ఆమెను కూర్చోబెట్టి మెల్లగా హత్తుకున్నాడు!

సుజాతా! మనం సంతోషంగా జీవించాలి. మనకోసం బ్రతకాలి! అర్ధమయ్యిందా?”

దీనికి ఏమిటి అర్ధం?”

నా కుటుంబీకులతో ఎక్కువగా కలవకు! అది నాకు ఇష్టం లేదు!

ఫస్ట్ నైట్ రోజున ఇలా చెప్పే మగాడు నాకు తెలిసి మీరు మాత్రమే ఉంటారు!

ఏమిటి వాగుతున్నావు?”

తన కుటుంబ గొప్పతనాన్ని భర్త మాట్లాడి, భార్య ఆవలిస్తూ వింటున్న కథల గురించే ఫస్ట్ నైట్లలో జరిగినట్లు విన్నాను. ఇక్కడ వేరే విధంగా ఉంది

నాకు ఏర్పడిన చేదు, అది!

చేదనేది ఏదీ లేదండీ! మనం ఏర్పరుచుకునేదే చేదు!అర్ధమయ్యిందా?”

లేదు, సుజాతా! నీకు తెలియదు!

వదిలేయండి! మన ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది? నేనొకటి చెప్పనా? పుట్టింటిని వదిలి, భర్త ఇంట్లోకి వచ్చే భార్య కొత్తగా పుడుతోంది! అదేలాగా మీరు కూడా కొత్తగా పుట్టినట్టు అనుకోండి! రేపట్నుంచి వేరేలాగా ఉండండి!

వేరేలాగా అంటే?”

అమ్మా, నాన్నా, దిలీప్, మహతీ -- వీళ్ళ దగ్గర ప్రేమగా ఉండండి! మీరు ఇచ్చి వాళ్ళు సరిగ్గా తీసుకోలేదంటే, నేను అడుగుతాను! వదిలిపెట్టను!

ప్రదీప్ లేచాడు.

సారీ సుజాతా! అలాగంతా ఉండటం నా వల్ల కాదు! నేను అలా ఉండలేను! నీకూ వాళ్ళ స్వభావం అతి త్వరలోనే తెలుస్తుంది! అప్పుడు నలిగిపోయి బయటకు వెళ్లటం కంటే, ఇప్పుడే వేరు కాపురం వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. నువ్వు అర్ధం చేసుకోనూ అంటే నేనేం చేయను?”

ఆమె మాట్లాడలేదు!

నా తమ్ముడ్ని, చెల్లెల్ని మన పిల్లలు అని నువ్వు చెప్పటం నాకు నచ్చలేదు

అదేనండీ నిజం!

లేదు సుజాతా! మనది మాత్రమే మనకు సొంతం!

అలాగైతే మిమ్మల్ని కన్న మీ అమ్మ నాన్నాలకు మీరు సొంతం కాదా? ఎక్కడ్నుంచో వచ్చిన నేను, ఒక రోజులోనే -- వాళ్ళకంటే ఎక్కువ దగ్గర అయ్యానా?”

అదే నిజం!

లేదండి! నాకు మీ అభిప్రాయంతో ఏకీభావం లేదు!

సుజాతా! ఒక భార్య, భర్త అభిప్రాయంతో ఏకీభవించాలి!

అలా అవసరం లేదండీ! భర్త అభిప్రాయం ఇష్టం లేకపోతే భార్య తల ఊపనవసరం లేదు! నా మనసుకు నచ్చనది దేన్నీ నేను అంగీకరించను!

ప్రదీప్ ఆశ్చర్యపోయాడు.

సుజాతా! మొదటి రోజే మనిద్దరికీ ఇలా అభిప్రాయ భేదం రావచ్చా?”

రాకుండా చూసుకునే బాధ్యత నాకు మాత్రమే కాదు, మీకూ ఉంది!

నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు?”

అతని స్వరంలో స్నేహం చెదిరిపోయింది. ఒక విధమైన మంట వచ్చి అతుక్కుంది!

ఏం చెప్పదలుచుకోలేదు! మిమ్మల్ని మీరు మార్చుకోండి. మార్చటానికి నేను ప్రయత్నం కూడా చేయను. మీరు, మీకులాగానే ఉండండి!

మంచిది! ఇదే నేను నీ దగ్గర నుండి ఎదురుచూసాను సుజాతా! నువ్వే చెప్పేసావు!

అదేలాగా నన్ను నేను మార్చుకోను. మార్చటానికి మీరు ప్రయత్నించ కూడదు! నేను నేనుగానే ఉంటాను! అర్ధమయ్యిందా!”

ప్రదీప్ కు ముఖం మారింది.

ఇద్దరం భార్యా - భర్తలుగా ఉంటున్నా, రెండు స్వతంత్ర మనుషులం! ఇక రాబోవు కాలం ఇదే. భర్త -- భార్యా ఒకరికొకరు కట్టుబడాలి అని ఎవరూ ఎదురుచూడకూడదు! అర్ధీక స్వాతంత్రమూ పూర్తిగా ఉంది! సరేనా?”

అంటే?”

ఎవరూ, ఎవరినీ ప్రశ్నలడిగి విసిగించకూడదు. అర్ధం చేసుకుని ముందుకు వెడదాం. ఒక భార్యగా ఉండి అన్ని విషయాలలోనూ నేను మిమ్మల్ని సంతోషపెడతాను! ఇందులో కొంచం కూడా అనుమానం అవసరం లేదు! కానీ, నాకున్న స్వతంత్రాన్ని ఎవరికోసమూ నేను వదులుకోను! ఇది మీరు కూడా అర్ధం చేసుకోవాలి!

ప్రదీప్ మాట్లాడలేదు!

ఇకమీదట! మన గురించి మాట్లాడుకుందామా?”

నవ్వుతూ చటుక్కున అతని దగ్గరకు జరిగి బ్రతిమిలాడింది.

ప్రదీప్ మొదట తాను ఇంతక ముందున్న మనో పరిస్థితి నుండి విడుపడలేక ఒకటి రెండు నిమిషాలు తడబడ్డాడు. ఆమె స్పర్ష తగిలిన వెంటనే మగతనం కళ్ళు తెరుచుకోగా, వేరు లోకంలోకి అడుగు పెట్టాడు!

కొద్ది సేపట్లోనే ఆశ్చర్యంలో పడిపోయాడు.

ఈమెలో ఇన్ని బ్రహ్మాండాలా?’

ఒక సరాసరి భార్య కంటే, ఎక్కువగానే అతనికి సరిసమంగా పోటీ పడ్డది. సుజాతా!

ప్రదీప్ జీవితంలోని ముఖ్యమైన ఎనిమిదిని దొర్లించడం మొదలుపెట్టాడు.

సుజాతా పూర్తి సంతృప్తి పొందింది!

ఎప్పటిలాగానే పొద్దున నాలుగున్నర కల్లా లేచి, స్నానం చేసి, పూజ గదికి వచ్చి దీపం వెలిగించి నమస్కరించుకుంది.

పాలు కాయటానికి స్టవ్వు వెలిగించింది!

తులసి చెట్టుకు నీళ్ళు పోసింది.

అత్త లేచి వచ్చేటప్పటికి ఆవిరి కక్కుతున్న కాఫీ తయారుగా ఉన్నది!

అత్తయ్యా! కాఫీ!

ఏంటమ్మా? నువ్వు త్వరగా లేచేసావా?”

మా ఇంట్లో తెల్లారి నాలుగు తరువాత నేను నిద్ర పోయిందే లేదత్తా!

ఇలా చూడు! ఇంటి పనులను ఎప్పుడులాగానే నేను చూసుకుంటాను!

ఇద్దరం కలిసి చేద్దాం! ఎప్పుడూ ఇంటికి మీరే కదా నాయకురాలు! మేమందరం మీ కార్యకర్తలం!

అత్త దగ్గరకు వచ్చింది.

ఎంత అందంగా మాట్లాడుతున్నావు? సంతోషంగా ఉందమ్మా. ఇంటికే ఒక కొత్త వెలుగు వచ్చినట్లు ఉంది!

చిన్నగా నవ్వింది సుజాతా!

అత్త సుజాతా దగ్గరకు వచ్చి రహస్య స్వరంతో, “నా కొడుకు సంతోషంగా ఉన్నాడా?”

సుజాతా సిగ్గుతో మొహం మూసుకుంది.

అత్తయ్యకు ఆనందంతో కన్నీరు పొంగుకు వచ్చింది!

నువ్వు వచ్చిన వేళ మంచి అంతా ఇంటికి రావాలి! చాలా మార్పులు జరగాలి. అందులో నా కొడుకు యొక్క గుణం మారటం ఒకటి!

లోపల గదిలో లైటు వెలిగింది!

దిలీప్ చదువుకుంటున్నాడా?”

అవును! ఎప్పుడు చూడూ చదువుతూనే ఉంటాడు. ఒక మంచి డాక్టర్ అవ్వాలనేది వాడి లక్ష్యం! దానికొసం కష్టపడతాడు!

సుజాతా ఇంకో కాఫీ తీసుకుని లోపలికి వెళ్ళింది.

దిలీప్! వేడి కాఫీ! ఇది తాగేసి చదువు!

దిలీప్ తిరిగి చూసాడు.

వదినా? మీరా? అచ్చు అమ్మలాగానే మాట్లాడారు...మీరెందుకు వదినా కాఫీ తేవటం. పిలిస్తే నేనే వచ్చి తాగేవాడ్నిగా?”

అమ్మలాగా మాట్లాడేనని చెప్పావు? వదిన, అమ్మతో సమానం! అర్ధం అయ్యిందా?”

బాగా అర్ధమయ్యింది వదినా!

చూడు దిలీప్! నీకు ఏం కావాలన్నా బిడియపడకుండా నన్ను అడుగు. మీరందరూ ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అప్పుడే నేను ఇంటికి వచ్చినందుకు ఒక అర్ధం ఉంటుంది!

సంతోషంగా ఉంది వదినా! ఇంటి ఛాయలే మారిపోతుంది! మార్పులు కావాలి, వదినా! అదే అభివృద్ది

సరే! నువ్వు చదువుకో! నేను వెళ్ళి మహతీని లేపొస్తాను!

ఒక గంటలో ఇల్లు కళాకాంతులతో నిండిపోయింది!

లేటుగా లేచిన ప్రదీప్ తిన్నగా వంటగదిలోకి వచ్చాడు, వంట గదిలో సుజాతా హడావిడిగా పనిచేస్తుండగా ---  ఆమె చుట్టూ, మొహమంతా నవ్వుతో కుటుంబమే ఉండటాన్ని చూశాడు.

ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అడుగుతుండగా సుజాతా అన్నిటికీ విసుక్కోకుండా సమాధానం చెబుతుండగా ఆనందం జెండాలాగా ఎగురుతోంది!

మిగిలిన వారు ఆనందపడితే ప్రదీప్ మనసు ఓర్చుకోదు! అతనిలో ఉన్న ఈర్ష్య మంట గబుక్కున అంటుకోగా, విశ్వరూపం ఎత్తుతాడు!  

ఇప్పుడూ అదే జరిగింది.

నన్ను వదిలేసి కుటుంబంతో ఇంత ఆనందమా?’

అతనిలో మంటలు ఎగిసినై.

సుజాతా! స్వరంలో వేడి వ్యాపించింది.

గబుక్కున అందరూ తిరిగారు.

నేను నీ భర్త అనేదే రెండో రోజే మర్చిపోయావా?”

తండ్రి ముఖం జివ్వున వేడేక్కగా,

సుజాతా నవ్వింది.

సరిగ్గా చెప్పారు! మిమ్మల్ని నేను పూర్తిగా మర్చిపోయాను

అందరూ ఒక్క నిమిషం స్తంభించిపోయారు. ప్రదీప్ కు ఆవేశం ఇంకా ఎక్కువ అయ్యింది.

ఏమిటి వాగుతున్నావు?”

మీ నాన్న, మీ అమ్మ, మీ తోడబుట్టిన వారు -- వీళ్ళందరి దగ్గర నేను మిమ్మల్నే చూస్తున్నాను.  తరువాత మిమ్మల్ని ఎలా వేరు చేసి ఒంటరిగా జ్ఞాపకం పెట్టుకోగలను?”

ఏమిటీ? తెలివిగా మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నావా?”

ఖచ్చితంగా! తాళి కట్టించుకుని మెట్టినింటికి జీవించటానికి వచ్చే ఒక్కొక్క అమ్మాయికీ తెలివితేటలు మాత్రం లేకపోతే, జీవితానికే అర్ధం లేదు!

ప్రదీప్ తడబడ్డాడు!

వెళ్ళి పళ్ళు తోముకు రండి! కాఫీ రెడీ, తాగేసి స్నానానికి వెడితే, మీరు తిరిగి వచ్చేటప్పటికి వేడి వేడి రవ్వా ఉప్మా రెడీగా ఉంటుంది! మీకు చాలా ఇష్టమని మీ అమ్మ చెప్పింది! మీకిష్టమైనదేమిటో ముందుగా మీ అమ్మకే కదా తెలుసు? అడిగి తెలుసుకునే భాధ్యత నాకు లేదా?”

సరే! ఆపు! నీ ప్రసంగం విని చెవ్వు చెముడవుతోంది!

లోపలకు వెళ్ళిపోయాడు!

అందరూ ఆశ్చర్యపోయారు.

బ్రహ్మాండం సుజాతా! ఎంత సులువుగా వాడిని సమాధాన పరుస్తున్నావు?”

వేరే దారి లేదు మావయ్యా! కాపురానికి ఇంటికి వచ్చాసాను! అందరూ ముఖ్యమే! ఈయన కోపగించుకుంటారే నని మీ ఎవరి దగ్గర మాట్లాడకుండా వేరుగా నిలబడితే ఎవరికి నష్టం?”

సుజాతా! వాడికి ఇప్పుడు నీమీద కోపం! దాన్ని వేరే విధంగా బయటపెడతాడు

పెట్టనివ్వండి! దానికి భయపడగలనా మావయ్యా? మీరందరూ సహజంగా ఉండండి! మావయ్యా -- మీ అందరి ముందు ఆయన నన్ను అవమానించినా కూడా, ఎవరూ ఆవేశపడకండి! ఆయనకు హక్కు ఉంది! ఒక మొరటు గుర్రాన్ని  మన దారికి తెచ్చుకోవాలంటే, కష్టపడే తీరాలి! అందులో కొన్ని గాయాలను ఎదుర్కోవలసిందే! ఒక్కొక్క మంచి మార్పు రావటానికి ముందు, కొన్ని నష్టాలు ఉండకుండా పోవు! అవన్నీ నేను చూసుకుంటాను! మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి!

ప్రదీప్ స్నానం చేసాడు. తిన్నాడు. ఎవరి దగ్గర మాట్లాడలేదు! మొహాన నవ్వులేదు!

సుజాతా! బయటకు వెళ్ళాలి...బయలుదేరు!

ఎక్కడికి?”

చెబితేనే వస్తావా?”

అలా నేను చెప్పలేదే! ఎక్కడికి అని భార్య సహజంగా అడగటం తప్పు అని నేను అనుకోలేదు!

సరి, సరి! వెంటనే న్యాయం మాట్లాడటం ప్రారంభించకు! బయలుదేరు!

సుజాతా వెళ్ళి డ్రస్సు మార్చుకు వచ్చింది! పదే నిమిషాలలో తయారయ్యింది!

ఆటో పిలిపించాడు.

అమ్మా--నాన్నా! నేను వెళ్ళొస్తాను!

ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నాడు! జాగ్రతమ్మా! కుటుంబ మనుషుల వలన నీ జీవితం చెడ కూడదు!

ధైర్యంగా ఉండండి!

ఆమెను పట్టుకుని ఆటోలో ఎక్కించాడు ప్రదీప్. ఆటో బయలుదేరింది.

అమ్మాయిని తలుచుకుంటే, నాకు బాధగా ఉందండి!

అమ్మా! వదిన ఏదైనా సాధిస్తుంది! ఆవేశ పడకుండా, అదే సమయం భయపడకుండా సమస్యలను పరిష్కరించే చాతుర్యం ఎక్కువగానే ఉంది

దిలీప్ గర్వ పడ్డాడు!

పలు సంవత్సరాలుగా అనగని పొగురుబోతు గుర్రాన్ని ఒక్క రోజులో అనచలేము దిలీప్!

టైము తీసుకుని పగ్గాలను పట్టుకునే విధంగా పట్టుకుంటే గుర్రం దారికి రావలసిందే!

వాళ్ళు మాట్లాడుతున్న సమయం -- గాంధీ పార్కు వాకిట్లో దిగాడు ప్రదీప్.

ఆమెను లోపలకు తీసుకు వచ్చాడు.

ఎందుకు ఇక్కడికి వచ్చాము?”

పొద్దున, నన్ను ఒక లాగా చేశేశావు సుజాతా!

ఎలా?”

నీకే తెలుసు. నేను కుటుంబీకులకు దూరంగా ఉంటున్నానని. వాళ్ళతో నువ్వు సరదాగా కబుర్లు చెబుతున్నావు! నేను వచ్చిన వెంటనే దాన్ని అర్ధం చేసుకుని నడుచుకోకుండా, వాళ్ళ ఎదుట ప్రసంగం ఇస్తున్నావు! వాళ్ళ అందరి చూపుల్లో ఎంత ఎగతాలి తెలుసా సుజాతా! నేను కృంగిపోయాను! కొత్త పెళ్ళాంవి నువ్వు! నిన్ను గాయపరచకూడదని అనుచుకున్నాను!

సుజాతా నవ్వింది.

ఎందుకు నవ్వుతున్నావు?”

నేను పెట్టి పుట్టాను!

ఏం చెబుతున్నావు?”

కొత్త పెళ్ళాన్ని గాయపరచకూడదని ఒక భర్త అనుకుంటే, ఆయన కంటే ఒక గంభీరమైన భర్త ఉండలేడు?”

ఎగతాలి చేస్తున్నావా?”

లేదండీ! నిజంగానే గర్వపడుతున్నాను...మిమ్మల్ని తలుచుకుని

ప్రామిస్!

నేను అబద్దమే చెప్పను!

నిన్ను నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను! కుటుంబీకులతోనూ ప్రేమగా ఉంటున్నావు! నన్ను గంభీరమైన భర్త అంటున్నావు. ఎలా?”

రెండూ నిజం!

నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు

మీతో జీవించటం మొదలుపెట్టి పూర్తిగా రెండు రోజులు కూడా కాలేదు! అంతలోపే నన్ను గాయపరచకూడదని, నా మనోభావాలను గౌరవించాలని అనుకుంటున్నారే...?”

అవును! అందులో తప్పు లేదుగా?”

రెండు రోజులు చూసినందుకు ఇంత మర్యాద ఇస్తున్నారు. పది నెలల బంధాన్ని, పలు సంవత్సరాల సొంతాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయటం? ఎందుకు వాళ్ళను ఛీదరించుకోవటం? మీరా ఇది చేస్తున్నారు? నమ్మలేకపోతున్నాను?”

ప్రదీప్ ఒక్క నిమిషం తడబడ్డాడు.

సుజాతా! దానికి వెయ్యి కారణాలు ఉన్నాయి

ఉండనివ్వండి! న్యాయం మీ పక్కనే ఉండనివ్వండి! దాన్ని మీరెందుకు మార్చుకోకూడదు?”

ఎందుకు మార్చుకోవాలి?”

నేనొక ప్రశ్న అడుగుతాను! మీ కోపతాపాలను మీ కుటుంబం ఎందుకు ఓర్చుకోవాలి? మీరు సంపాదించుకు తీసుకువస్తేనే వాళ్ళందరూ బ్రతకగలరా? చెప్పండి!

ఖచ్చితంగా లేదు!

ఇలా చూడండి! చాలా మంది, చాలా విషయాలను ఓర్చుకుని జీవించటానికి కారణం డబ్బే! డబ్బుకోసం ఎటువంటి ఒడంబడికకైనా రెడీగా ఉంటారు!

ప్రదీప్ కు చివుక్కుమంది.

డబ్బు కోసం ఈమె వికలాంగాన్ని నేను పట్టించుకోలేదని ఎత్తి చూపుతున్నదా?’

ఇది నువ్వెందుకు చెబుతున్నావు?”

నేను ఎవరినీ ఎత్తి పొడవటం లేదు! మీ కుటుంబం మీమీద పెట్టుకున్న ప్రేమ కోసం సమాధాన పడుతూ జీవిస్తున్నారని నేను అర్ధం చేసుకున్నాను. అది మీరు కూడా అర్ధం చేసుకుంటే మీ మధ్య ఉన్న ఎడబాటు ఒక్క క్షణంలో మాయమైపోతుంది! బంధుత్వం అతుక్కుంటుంది!

క్షమించాలి! నీ మనసును నా కుటుంబం పాడు చేసింది!

దేనికి?”

నిన్ను-నా దగ్గర నుండి విడదీయటానికి -- ఉన్నవీ, లేనివీ చెప్పి నిన్ను వాళ్ళ మాయలో పడేసుకున్నారు!

అందులో వాళ్లకు ఏమిటి లాభం ప్రదీప్?”

నువ్వు బాగా సంపాదిస్తున్నావు! నిన్ను వాళ్ళ పక్కకు లాక్కోవటానికి తహతహలాడుతున్నారు!

సుజాతా వెనక్కు తిరిగింది.

అవును ప్రదీప్! అలా చెయ్యాలనుకుంటున్నది వాళ్ళు కాదు!

ఇంకెవరు నేనా?”

చటుక్కున అతను అడగటంతో, సుజాతా అతన్ని దీర్ఘంగా చూసింది.

అలా నేను చెప్పానా? ఎందుకు అవసరపడతారు?”

ప్రశ్నతో -- ప్రదీప్ తడబడ్డాడు.

కోపంలో నన్ను నేను మరిచిపోయి, నోరు పారేసుకుంటున్నానో

నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నానా?’

! ఏమిటి ఇది?’

సరే వదలండి! బయలుదేరదామా?”

సుజాతా!

వదలండి! మాటకూ వేరే అర్ధం కల్పించటం నాకు అలవాటు లేదు! ఒకే రోజులో పరిష్కరించే సమస్య కాదు ఇది! రక్త బంధం. రండి!

సుజాతా లేచింది.

ప్రదీప్ దగ్గర నేర భావన ముళ్ళులాగా గుచ్చుకుంది!

**************************************************PART-11*******************************************

సెలవులు అయిపోయి, ప్రదీప్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు!

సుజాతా తన పనులను మొదలుపెట్టింది. తాను ట్యూషన్తీసే పిల్లలకు కొత్త అడ్రస్సు చెప్పి, వాళ్ళను ఇక్కడికి రమ్మంది. ఆమె పచ్చళ్ళు, చిప్స్, వడియాల వ్యాపారం ఇక్కడికి మార్చింది.

ప్రొద్దున నాలుగు గంటలకు లేచి, ఇంటి పనులు మొదలుపెడితే, మిగిలిన పనులను కలిపి ముగించటానికి రాత్రి పదుకుండు గంటలు అవుతోంది!

బొంగరంలాగా గిర్రున తిరుగుతోంది.

కఠినమైన శ్రమ! మొహాన కొంచం కూడా విసుగు లేదు.

వికలాంగం లేని ఒక ఆడది కూడా ఇంత తీవ్రంగా పని చేయలేదు! వికలాంగురాలైన ఆడది కఠిన శ్రమ పడటం చూసి ప్రదీప్ కుటుంబీకులు ఆశ్చర్యపడ్డారు!

ఇదికాక పైచదువుకూ సమయం కేటాయించింది.

పదే రోజులలో ఆమె దగ్గర ట్యూషన్ చదువుతున్న విద్యార్థి -విద్యార్థినులు నలుగురికి దిలీప్, మహతీ ట్యూషన్ చెప్పే బాధ్యతలు తీసుకున్నారు.

పచ్చళ్ళు, చిప్స్ తయారుచేయటంలో అత్తగారు సరిసమం శ్రమ పడుతున్నారు. వాటిని బయటకు తీసుకు వెళ్ళి చేర్చే పనికి, ఇంకా ఏడెనిమిది మందిని మామగారు తీసుకు వచ్చారు.

నెలాఖరు లోపల, ఇంకో ఇరవై మంది పిల్లలు ట్యూషన్ కి చేరారు.

బిజినస్ కు చాలా ఆర్డర్లు వచ్చాయి!

సుజాతానే ఆశ్చర్యపోయింది. ఆమె పుట్టినింట అన్నయ్య ప్రకాష్, అమ్మ కొంత సహాయం చేసేవారు.

కానీ, ఇక్కడ మీరు అందిస్తున్న సహయానికి పోల్చుకుంటే అది చాలా తక్కువే

ఇక్కడ ప్రదీప్ తప్ప, మిగిలిన వాళ్ళందరూ మెట్టింటి వారే.

తమని తాము పూర్తిగా తయారుచేసుకుని, ఆమె కోసం కష్టపడటం మొదలు పెట్టారు.

ఇదంతా ప్రదీప్ కూడా గమనిస్తున్నాడు.

నెల చివర్లో సంపాదన లెక్కవేస్తే, ఒక్క నెలలో యాభై శాతం పెరిగింది.

సుజాతా ఆశ్చర్యపోయింది.

రోజు ఒకటో తారీఖు. ప్రదీప్ కు జీతం ఇచ్చిన రోజు. అతను జీతంలో ఖర్చులకని కొంత మొత్తాన్ని ఇస్తూ వచ్చాడు.

రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత సుజాతాను లోపలకు పిలిచాడు.

ఇదిగో చూడూ! నేను నా జీతంలో నుంచి నెలనెలా పదిహేను వందల రూపాయలు ఖర్చులకు ఇస్తాను. అదేలాగా నీ సంపాదన నుండి నువ్వూ ఇచ్చేయి

సరే నండి

బయటకు వచ్చారు.

ప్రదీప్ అదేలాగా డబ్బును ఇచ్చాడు.

సుజాతా తన సంపాదననంతా అత్తగారి చేతికి ఇవ్వటంతో,

ఏమిటి సుజాతా ఇది?”

ఇంటికి మీరు యజమానురాలు! మీ దగ్గరే బాధ్యతంతా ఉండాలి! నాకు ఖర్చులకు కావాలంటే మిమ్మల్ని అడిగి తీసుకుంటాను!

ప్రదీప్ కోపగించుకున్నాడు!

సుజాతా! ఒక నిమిషం లోపలకు రాగలవా?”

ఇదిగో వస్తున్నా!

సుజాతా లోపలకు వచ్చింది!

ఏమిటండీ?”

అమ్మ చేతికి ఎంత ఇచ్చావు?”

ఇరవై ఎనిమిది వేలు!

ఎందుకు అంత ఇచ్చావు! నీ ఒక్కదానికి అంత డబ్బా?”

లేదండీ! నేను మామూలుగా సంపాదించేది ఇరవై వేలే. మిగతా ఎనిమిది వేలు మామయ్య కష్టపడి సంపాదించింది. అందులో నేను హక్కుగా ఏమడుగ గలను. కుటుంబంలో మీరు తప్ప మిగిలిన నలుగురూ నాతోపాటూ కష్టపడుతున్నారు! దానికి జీతంగా వెయ్యి రూపాయలు ఇచ్చినా నాలుగు వేలు అవుతుంది! అది కాకుండా చోటుకు అద్దె! మూడు వేలే వేసాను! కాబట్టీ నాలుగూ, మూడూ ఏడైంది! నా ఖర్చులకు రెండు వేల రూపాయలనే వేసుకోండి! తొమ్మిది! ఇరవైలో తొమ్మిది పోతే పదకుండు లెక్క వేసుకుంటాను. అవసరమైనప్పుడు అడిగి తీసుకుంటాను

గట్టిగానే మాట్లాడింది. గది బయట ఉన్న వాళ్ళకు వాళ్ళ మాటలు వినిపించినై.

జీతమూ, చోటుకూ అద్దా? ఇది మన ఇల్లు! వ్యాపారం చేసుకోవటానికి అద్దెకు తీసుకోలేదు

అర్ధమవుతోందండీ! జీతం తీసుకు వచ్చి మీరు మొత్తంగా ఇస్తే ఇది మన చోటు. దీనికి పేరు కుటుంబం! మీరు మీ ఖర్చులకు మాత్రం ఇస్తుంటే, మీ పేరు -- కొడుకు కాదు! డబ్బులిచ్చే బంధువు. అలా చూస్తే, హాస్టల్లో ఉండేటట్టు ఉంటే, ఇంటిని మన ఇల్లు అని చెప్పలేరు కదా? అందుకే చోటుకు అద్దె!

ప్రదీప్ నోట మాట రాలేదు.

బయట మామయ్య సంతోషంతో ఊగిపోతూ ఊగిపోతూ, భార్యను చూసాడు.

నేను మీ మాటను జవదాటలేదు! కుటుంబ మనిషిగా మీరు ఉండమని చెబితే, నేను అలా ఉంటాను. మూడో మనిషిగా నడుచుకో అంటే అలాగే నడుచుకుంటాను. వేరు కాపురం పెట్టుంటే, సహాయానికి ఎవరూ లేకపోతే, నేనెలా ఇంత సంపాదించగలను?”

ప్రదీప్ వల్ల మాట్లాడటం కుదరలేదు!

సరే వదిలేయండి! పదకుండు వేల రూపాయల డబ్బంటే వూరికే వచ్చిందా? ఏమిటి? డబ్బును మాత్రం అత్తయ్యను అడిగి తీసేసుకోనా?”

నన్ను ఓవర్ టేక్ చేసినట్లు అనుకుంటున్నావా?”

దగ్గరకు వచ్చింది.

ప్రదీప్! కోపగించుకోకండి! ఒక సినిమాలో చెబుతారు! మీరు కూడా చూసుంటారు. రక్త సంబంధంతో వచ్చేదంతా లాభమే! ఏదీ కుడా అప్పు కాదు! అలా కాదు అప్పు అని చెబితే తల్లి పాలకు మీరు చెల్లించాల్సిన జరిమానా ఎంత? దాన్ని తీర్చాలనుకుంటే నా తాళి చాల్తుందా?

బయట అత్తగారు కన్నీరు పెట్టుకుంది. మామగారు కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు! దిలీప్, మహతీ భావోద్వేగానికి గురి అయ్యారు.

ప్రదీప్ చేతులను సుజాతా పట్టుకుంది.

ఇలా చూడండి! మీరు మంచివారే! కానీ, మీ మనసులో దూరిన స్వార్ధం, ఈర్ష్య మిమ్మల్ని దారి మార్చి తీసుకు వెళ్ళినై!

నేరం మోపుతున్నావా?”

లేదు! అర్ధం అయ్యేటట్టు చెబుతున్నా. తాళి కట్టుకుని వచ్చి, రాత్రి మిమ్మల్ని సంతోషపెట్టటం మాత్రమే జీవితం కాదు! శరీర సుఖం కొన్ని నిమిషాల సంతోషమే. కానీ, మనసుకు ఒక సుఖం ఉంది ప్రదీప్! అది జీవితాంతం సంతోషం ఇస్తుంది! అనుభవించి చూస్తే అర్ధమవుతుంది!

అతను మాట్లాడలేదు!

నేను ఏం చెబుతున్నానంటే మిమ్మల్ని మీరు మార్చుకోనూ కూడా అక్కర్లేదు. అన్ని కోపాలను విధిలించుకుని మనసులో ఎటువంటి మురికి, అనుమానాలూ లేకుండా ఇంటి కొడుకుగా, పెద్ద కొడుకుగా, ప్రేమతో ఒక పదిహేను రోజులు ఉండి చూడండి!

ప్రదీప్ తల పైకెత్తాడు.

అది మీ మనసుకు నచ్చకపోతే, కంటిన్యూ చెయ్యద్దు. ఇంకా బాగా చెప్పాలంటే,  ప్రేమగా ఉన్నట్టు పదిహేను రోజులు నటించండి! అనుభవం ఎలా ఉందో చెప్పండి

నన్ను కించ పరుస్తున్నావా?”

లేదు ప్రదీప్! చాలా మంది ప్రపంచంలో అనాధలే! తల్లి,తండ్రీ ఎవరూ  లేకుండా తహతహ లాడుతున్నారు! మీకు అందరూ ఉన్నారు! అన్నీ ఉన్నాయి! ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఆలొచించి చూస్తే, వాళ్ళు మీకు ఏం ద్రోహం చేశారు, ఇంటి మనుషులు...మీకు?”

“.....................”

ఆలోచించండి! మిమ్మల్ని నేను దేనికీ ఒత్తిడి చేయటం లేదు! చాలా?”

తల్లి లోపలకు వచ్చింది.

సుజాతా! నువ్వు మాట్లాడేదంతా మాకు వినబడింది! మేము వీడికి ఎటువంటి కీడూ చేయలేదు! అలా వాడు అనుకుంటే నేనూ, వాడి నాన్నా వాడి దగ్గర క్షమాపణలు అడగటానికి కూడా రెడీగా ఉన్నాము!

అవునమ్మా! ఇంత అద్భుతమైన ఒక దేవత కోడలుగా దొరికినందుకు, మేము దేనికైనా వదిలిపెట్టటానికి రెడీగా ఉన్నాము. మాకు ప్రేమే బహుమతి! మామగారు చెప్పగా సుజాతా సిగ్గుతో తల వంచుకుంది.

ప్రదీప్ మమ్మల్ని క్షమించరా! మాకు నువ్వు కావాలి. నువ్వే కుటుంబ యజమానిగా ఉండు! అన్ని బాధ్యతలూ తీసుకో! సుజాతాను మా దగ్గర నుండి వేరు చేయకు!

ఏడ్చేశేరు.

ప్రదీప్ కృంగిపోయాడు !

మూడే రోజులలో ఈమె విజయం సాధించింది. వీళ్ళను తన పక్కకు లాగేసుకుందే

ప్రదీప్ వేగంగా బయటకు వెళ్ళాడు.

**************************************************PART-12*******************************************

ప్రదీప్ సముద్ర తీరానికి వచ్చాడు! ఒక చివర్లో కూర్చున్నాడు!

సుజాతా మాట్లాడింది మళ్ళీ మళ్ళీ అతని చెవులకు వినబడుతోంది!

ప్రేమగా ఉన్నట్టు పదిహేను రోజులు నటించండి! ఆనుభవం ఎలా ఉంటుందో చూడండి

ఆలొచించి చూస్తే, వాళ్ళు ఏమిటంత పెద్ద ద్రోహం చేశారు, ఇంటి మనుషులు

ప్రదీప్ లేచాడు. మెళ్లగా నడవటం మొదలుపెట్టాడు.

నేనూ, నాన్నా వాడి దగ్గర క్షమాపణలు అడగటానికి రెడీగా ఉన్నాం!

ప్రదీప్! మమ్మల్ని క్షమించు నాయనా! మాకు నువ్వు కావాలి! నువ్వే కుటుంబ నాయకుడివిగా ఉండు! అన్ని బాధ్యతలూ తీసుకో! సుజాతాను మా దగ్గర నుంచి వేరు చేయకు!

వాళ్ళ బ్రతిమిలాట ప్రదీప్ మనసును ఒక విధంగా కదిలించింది!  

చిన్నగా వాన చినుకులు తల మీద, ముఖం మీద, భుజాల మీద పడ్డాయి! కానీ అవి అతన్ని బాధించలేదు!

మనసు లోపల పెద్ద బండరాయి వచ్చి నొక్కుతున్నది! హృదయం నొప్పి పుడుతోంది!

ఏడుపు గొంతుక దగ్గర అడ్డుపడుతోంది!

కానీ, ఏడవలేకపోయాడు.

నిన్న వచ్చిన సుజాతా ప్రేమంతా ఒలకబోసి వాళ్ళ దగ్గర సులభంగా విజయం  సాధించింది!

నా వలన ఎందుకు కావటం లేదు?’

వాన చినుకులు పెద్దవైనై!

సుజాతా పనిచేస్తున్నప్పుడు, ఆమెతో పోటీ పడుతూ పనిచేసి సంపాదనను అధికం చేశారు. దాని కోసం నా కుటుంబమే యుద్దంలోకి దిగింది. ఎటువంటి ప్రతిఫలమూ ఎదురు చూడకుండా!

నేను ఒంటరి మనిషిని అయిపోయానా?’

ప్రేమగా ఉన్నట్టు పదిహేను రోజులు నటించండి!

అది చురుక్కు, చురుక్కున గుచ్చుకుంది!

సుజాతాను నేను పెళ్ళి చేసుకున్నదే స్వార్ధం తోనే! ఆమె సంపాదిస్తున్న డబ్బు కోసమే. ఇదే నిజం. ఇంట్లోనే ఉంటున్న ఒక సహజమైన వికలాంగం ఉన్న ఆడపిల్లగా ఉండుంటే, నేను పెళ్ళి చేసుకుంటానా?’

నా వలన నిజమైన ప్రేమను చూపించలేను అనే నిర్ణయానికే వచ్చేసింది సుజాతా. అందుకే ప్రేమగా ఉన్నట్టు నటించ మంటోందా?’

వర్షం పెద్దది అయ్యి -- ప్రదీప్ తడిసి పోతున్నాడు. అందరూ నిలబడకుండా పరిగెత్తుతుంటే, ఇతను మాత్రం అతి నెమ్మదిగా కుండపోత వర్షంలో నిదానంగా నడుస్తుంటే, ‘పిచ్చోడోఅని మిగిలిన వాళ్ళు అనుకునే పరిస్థితి!

అదే సమయం ఇంట్లో అందరూ ఒకటిగా కూడారు.

నువ్వు ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు గబగబా అడిగాసావు! దీని వలన వాడి మనసు మారుతుందా సుజాతా?”

తెలియదు మామయ్యా! ప్రేమగా ఉన్నట్టు నటించండి అని చెప్పాను. ఇంతకంటే ఎవరూ గుచ్చలేరు! ఒక మంచి మనిషికి ఇది చాలు! ఇప్పుడే మారిపోవాలి!

మేమేం చేయాలో నువ్వే చెప్పమ్మా. మేము నలుగురం కట్టుబడతాం! మమ్మల్ని వదిలి నువ్వు వేరు అవకూడదు

చావు తప్ప మనల్ని ఏదీ వేరు చేయలేదు? సరేనా?”

సమయం రాత్రి తొమ్మిది అవుతోంది!

ప్రదీప్ ఇంకా రాలేదు! తల్లి కలత చెందటం మొదలు పెట్టింది!

నువ్వు మాట్లాడింది ఇష్టం లేక కోపగించుకుని, ఇంటికి రాకుండా ఉన్నాడా సుజాతా?”

అదంతా ఏమీ లేదు అత్తయ్యా! వర్షం కురుస్తోంది కదా! ఎక్కడైనా ఆగుంటారు. వస్తారు. మగాయనే కదా?”

అన్నిటికీ నువ్వు ధైర్యంగా ఉంటున్నావు సుజాతా, మా వల్ల కావటం లేదు

అత్తయ్యా! జరగాల్సింది జరిగే తీరుతుంది! మనం ఎవరు అడ్డుకున్నా ఆగదు! ఎటువంటి అనుభవాన్ని అయినా స్వీకరించటానికి రెడీగా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండగలమా? చెప్పండి!

ఎవరూ మాట్లాడలేదు!

ఆమెను -- ఆమె మాటలనూ, ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

సరే! అందరూ వచ్చి భోజనం చేయండి! ఆయన వచ్చిన తరువాత నేను భోజనం చేస్తాను!

ఎవరూ కదలలేదు!

మహతీ! నువ్వు ఆకలిని ఆపుకోలేవు! దిలీప్ నువ్వు కూడా! రండి!

సమయం తొమ్మిద్దన్నర!

ప్రదీప్ మెట్లు ఎక్కి వస్తున్నాడు.

బాగా తడిసిపోయున్నాడు. తల్లి ఆందోళన చెందింది.

ఏమిట్రా ఇది? వర్షం పడుతునప్పుడు ఎక్కడన్నా ఆగి రావచ్చు కదా? ఇలాగా ముద్దగా తడిసి వస్తావు?”

పరిగెత్తుకు వెళ్ళి టవల్ తీసుకుని వచ్చి అతని  తలను తుడవటం ప్రారంభించింది.

వదులు! వాడు వెళ్ళి బట్టలు మార్చుకోని, తడి బట్టలతో నిలబడితే ఎలా?”

పది నిమిషాలు తల్లీ-తండ్రీ బొంగరంలాగా తిరగటం వలన బట్టలు మార్చుకుని, తల తుడుచుకుని, సాంబ్రానీ వేసి -- అన్నిటినీ సుజాతా దూరంగా నిలబడి చూసి ఆనందించింది.

రా అబ్బాయ్! వచ్చి భోజనం చెయ్యి!

నాకు ఆకలిగా లేదు! నిద్ర వస్తోంది!

సుజాతా! కొంచం పాలు తీసుకురామ్మా!

సుజాతా గ్లాసుతో పాలు తీసుకురాగా, తల్లి పక్కనుండి తాగించింది.

మామూలుగా ఇలా బలవంతం చేస్తే ప్రదీప్ కు కోపం వస్తుంది!

ఎందుకిలా ప్రాణం తీస్తావు?’ అంటూ అరుస్తాడు!

ఇప్పుడు సైలెంటుగా తాగాడు. జలుబు రాకుండా ఉండటానికి ఒక తైలం రాసింది!

అతన్ని పడుకోబెట్టి, దుప్పటి కప్పింది!

బయటకు వచ్చింది. తండ్రి ముఖంలో ఒక తృప్తి.

సుజాతా! నన్ను మన్నించమ్మా!

ఎందుకు అత్తయ్యా?”

భార్య నువ్వు ఉన్నప్పుడు. నేను ఎక్కువ హక్కు తీసుకున్నాను!

ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా? ఆయనకు మొదట మీరే, తరువాతే నేను!

నీ మాటలకు ఫలితం ఉంది సుజాతా! ఇంత ప్రశాంతంగా వాడు అన్నిటిని అంగీకరించాడు. మొహాన ఉద్రేకమూ, కోపమూ తగ్గి వాడిలో ఒక ప్రశాంతత వచ్చింది. ఒంటరిగా ఆలొచించి ఉంటాడు! నీ గెలుపు చాలా పక్కనే ఉన్నది!

మంచి జరిగితే చాలు మామయ్యా!

మనసుకు తృప్తిగా ఉందమ్మా! ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తోంది! భోజనం వడ్డించు!

కుటుంబమే ఉత్సాహంలో ఉంది.

అందరూ భోజనం చేసి ముగించిన తరువాత, సుజాతా లోపలకు వచ్చినప్పుడు ప్రదీప్ నిద్రపోతున్నాడు.

సుజాతా లైటు ఆపి పడుకున్నది.

ఇంత త్వరగా -- నా ప్రయత్నానికి జయం దొరికిందా?’

కుటుంబమే నన్ను పొగడ్తోంది!

భగవంతుడా! ఇది ఇలాగే కొనసాగాలి!

మధ్యరాత్రి సుజాతాకు ఏదో మూలుగుడు శబ్ధం వినబడటంతో చటుక్కున కళ్ళు తెరిచింది.

ప్రదీప్ దగ్గర నుండి వస్తోంది మూలుగుడు.

సుజాతా లేచి, లైటు వేసి, అతన్ని ముట్టుకు చూస్తే, ఒళ్ళు కాలిపోతోంది!

వెంటనే వెళ్ళి అత్తగారిని లేపింది. కుటుంబమే గుమికూడింది. డాక్టర్ చదువుతున్న దిలీప్ ఏవో కొన్ని మాత్రలు, మందులూ ఇచ్చాడు.

అయినా జ్వరం తగ్గలేదు!

తెల్లవారు జామున జ్వరం తీవ్రంగా ఉండటంతో, ఇంతకు మించి తనిచ్చే మందులు పనిచేయవని గ్రహించి, ఒక ఆటో పిలుచుకు రావటానికి పరిగెత్తాడు.

తల్లి ఏడవటం మొదలు పెట్టింది.

ఇల్లే దుఃఖంలో మునిగింది. మరో అరగంటలో ప్రదీప్ ఆసుపత్రిలో అనుమతించబడ్డాడు.

దిలీప్, సుజాతా ఆటోలో ఆసుపత్రికి వచ్చారు.

డాక్టర్లు పరీక్షించి, వెంటనే ఎమర్జన్సీ వార్డులో చేర్చారు.

జ్వరం దగ్గర దగ్గర నూటనాలుగు ఉంది!

అర్జెంటు మందులు ఇచ్చి, డాక్టర్లు బయటకు వచ్చారు.

దిలీప్ విచారించగా పరిస్థితి బాగోలేదు! ఇది బ్రైన్ ఫీవర్ గా మారే అవకాశం ఉంది! ఇప్పుడేమీ చెప్పలేము అన్నారు డాక్టర్లు.

సుజాతా ఏడ్చింది.

వదినా! మీరు చాలా ధైర్యస్తులు! మీరే ఏడిస్తే ఎలా? అన్నయ్య గుణమయిపోతాడు. బాధపడకండి!

తెల్ల వారిన తరువాత ఇంకొక ఆటో పట్టుకుని తల్లి, తండ్రి, మహతీ వచ్చేశారు!

రోజు సాయంత్రం వరకు స్ప్రుహ రాలేదు! కుటుంబమే ఆందోళనలో ఉంది! ఖచ్చితంగా అది బ్రైన్ ఫీవర్ అన్నారు. డాక్టర్లు దగ్గర దగ్గర అతని ఆయిస్సుకు గడువే పెట్టటంతో, కుటుంబమే కృంగిపోయింది!

మరుసటి రోజు ప్రొద్దున -- డాక్టర్ బయటకు వచ్చాడు.

ప్రాణానికి ఆపదలేదు! అవుట్ ఆఫ్ డేంజర్. స్ప్రుహ వచ్చిన తరువాత మాట్లాడండి!

సరే డాక్టర్!

తల్లి ఏడ్చేసింది.

నేను వేడుకోని దైవం లేదు! ఎంత మంచి భార్య! ఈమెతో జీవించటానికి వాడికి అదృష్టం లేదేమోనని భయపడిపోయాను!

రోజు తొమ్మిదింటికి ప్రదీప్ కు స్ప్రుహ వచ్చింది! అరగంట అయిన తరువాత డాక్టర్ చెప్పాడు.

ఆయన భార్య మాత్రం రండి!

సుజాతా లోపలకు వచ్చింది. ప్రదీప్ కళ్ళు తెరుచుకునే ఉన్నాడు.

ఏమండీ! ఇప్పుడెలా ఉంది!

ఆమెను ప్రదీప్ వింతగా చూసాడు.

మిమ్మల్నే!

డాక్టర్ దగ్గరకు వచ్చాడు.

ఎవరు వచ్చారో చూడండి!

డాక్టర్! ఈమె ఎవరు?” -- ప్రదీప్ అడగగా,

సుజాతాకు షాక్ తగిలినట్లు అయ్యింది.

ఈమె ఎవరనేది నాకు తెలియటం లేదే డాక్టర్

సుజాతా ఏడుపు మొదలుపెట్టగా, డాక్టర్ బయటకు వెళ్ళి ప్రదీప్ కుటుంబాన్నే పిలుచుకు వచ్చాడు.

తల్లి దగ్గరకు జరిగి అతని భుజం మీద చేతులు పెట్టి రాస్తూ ప్రదీప్! ఇప్పుడెలా ఉన్నావు?” అడగ --

డాక్టర్ ఈమె ఎవరు?”

తరువాత పది నిమిషాలు కుటుంబమే వణికిపోయింది.

అందరూ బయట ఉండండి! నేను వస్తాను!

అందరూ బయటకు వెళ్ళారు.

చెప్పినట్టు డాక్టర్ వచ్చాడు.

అందరూ ఒక్కసారిగా ఆయన చుట్టూ గుమి కూడారు.

ఏం డాక్టర్, వాడు ఎవర్నీ గుర్తు పట్టటం లేదు?”

నాకూ అతను స్ప్రుహలోకి వచ్చిన వెంటనే అనిపించిందమ్మా. బ్రైన్ ఫీవర్ వస్తే దాని తాకిడి, దాని డ్యామేజ్ కొంతమందిలో అన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది!

అయ్యో! భగవంతుడా!

అతనికి తననే తెలియలేదు! తన పేరే మరిచిపొయాడు! నేను ఎవరు అని అడిగి ఏడుస్తున్నాడు

తల్లి ఏడ్చేసింది.

నా కొడుక్కి ఇలాంటి ఒక పరిస్థితి రావాలా? మేము ఏం పాపం చేసాము?”

అందరూ ఆశ్చర్యంతో మనసు విరిగిపోయున్నారు.

ఇది గుణమవుతుందా? అవదా డాక్టర్?”

సుజాతా అడిగింది.

తెలియటం లేదు! చటుక్కున ఏదో ఒక తరుణంలో పాత జ్ఞాపకాలు రావచ్చు. రాకపోవనూ వచ్చు. మెడికల్ కండిషన్ ను అతను దాటేసాడు! ఇక మానసికంగా అతన్ని మనలోకి తీసుకురావటం భగవంతుడి చేతిలో ఉంది. రెండు రోజులు ఇక్కడ ఉంచి, శరీరానికి ఓపిక వచ్చిన తరువాత ఇంటికి తీసుకు వెళ్ళచ్చు

డాక్టర్ వెళ్ళిపోయాడు!

ఇతనితో మాట్లాడుతూ ఇతని జ్ఞాపకాలను బయటకు తీసుకురావటానికి ప్రయత్నించవచ్చా?”

తల్లి అడిగింది.

దిలీప్ అడ్డుపడ్డాడు.

ఇప్పుడు అవసరపడకమ్మా! అన్నయ్యే షాక్ లో ఉన్నాడు. తనని తానే ఎవరు అని తెలుసుకోలేని షాక్, పెద్ద షాక్! అతని శరీరం, మనసు చాలా బలహీన పడుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడితే అది ఇంకా పెద్ద బాధింపులో ముగియొచ్చు. ఎవరూ దగ్గరకు వెళ్ళొద్దు. ఇంటికి తీసుకు వచ్చిన తరువాత పరిస్థితి చూసి దానికి తగినట్టు నడుచుకుందాం!

రెండు రోజులు గడిచిన తరువాత, ప్రదీప్ ను డాక్టర్ పరీక్ష చేసి ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు.

నాకు ఇల్లు అని ఒకటుందా?”

పెద్ద డాక్టర్ చాలా భవ్యంగా ఇలా చూడండీ! మీ పేరు ప్రదీప్! అమ్మ, నాన్న, భార్య, తమ్ముడు, చెల్లి అంటూ మిమ్మల్ని ప్రేమించే ఒక కుటుంబమే ఉంది. అందరూ మీమీద ప్రాణం పెట్టుకున్నారు? జ్వరం వచ్చినందువలన మీ జ్ఞాపకాలు మాయమైనాయి!

పాత పరిస్థితికి నేను ఎప్పుడు వస్తాను?”

ఖచ్చితంగా వస్తారు

ఎవరనే తెలియని వాళ్ళింటికి నేనెలా వెడతాను డాక్టర్?”

బాధపడకండి! మీ ఇంటికే మీరు వెళ్ళండి! కొత్తగా పుట్టిన బిడ్డకు ఏం తెలుసు? పరిస్థితిలోనే ఇప్పుడు మీరున్నారు? వెళ్ళండి! వీళ్ళంతా కొత్త బంధుత్వాలు అని నమ్మి వెళ్ళండి! మిమ్మల్ని బాగా చూసుకుంటారు! వేరే దారి లేదు!

డాక్టర్ వివరాలు చెప్పి, కుటుంబాన్ని లోపలకు పిలుచుకు రాగా,

అతని తండ్రీ, తల్లీ అతని దగ్గరకు వెళ్ళారు.

చూడు నాన్నా! నువ్వు నీ ఇంటికే రాబోతున్నావు! ఆలొచించనే అవసరం లేదు! కొత్తగా జీవితం ప్రారంభిస్తునట్టు నమ్ము! ఖచ్చితంగా సంతోషంగా ఉండొచ్చు

కుదురుతుందా?”

కుదురుతుందిరా ప్రదీప్!

అందరూ వెళ్ళగా, ప్రదీప్ వాళ్ళతో బయలుదేరాడు.

అరగంటలో ఇంటికి వచ్చేశారు. అమ్మ హారతీ తీసి లోపలకు తీసుకు వెళ్ళింది.

వాడ్ని కూర్చోబెట్టింది.

పూజ గదికి వెళ్ళి దీపం వెలిగించి, కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ, విభూధి తీసుకు వచ్చి ప్రదీప్ నుదుట రాసింది.

వివరం తెలుసుకుని అంతకు ముందే సుజాతా యొక్క అమ్మా, అన్నయ్య ఇద్దరూ వచ్చున్నారు.

ఇప్పుడు ఆవేదన చెందారు.

సుజాతా! నీ పరిస్థితి ఇలా అయ్యిందేమ్మా!

ఎలాగూ అవలేదు! గుడి లాంటి ఒక కుటుంబంలోనే ఉన్నాను. ఒక కొరత లేదు! అంతా సరై పోతుంది!

వాళ్ళను పంపించేసింది.

ఒక్క రోజు పూర్తిగా ముగిసింది! ప్రదీప్ కు ఏమీ అర్ధం కాకపోవటంతో అందరికీ దూరంగా ఉన్నాడు.

తండ్రి అడిగాడు.

అన్నీ మర్చిపోవటంతో, వీడు ఉద్యోగానికి వెళ్లగలడా?”

కుదరదు మామయ్యా! ఎలా చేర్చుకుంటారు!

ఇంకేం చేయాలండీ?”

అత్తయ్యా! బాధ పడకండి! మన బిజినస్ కంటిన్యూ అవుతుంది! నాకు మీరందరూ బ్రహ్మాండంగా సహాయపడుతున్నారు! మంచి సంపాదన వస్తోంది! ఆయన ఇష్టపడితే, అందులోకి తెచ్చుకుందాం! ఆయన్ని ఎవరూ ఏమీ ప్రశ్నించద్దు! చాలా?”

అవును వదినా--అదే మంచిది!

నాలుగైదు రోజుల తరువాత కుటుంబం యదార్ధ పరిస్థితికి వచ్చింది! ప్రదీప్ కూడా అలా అయిపోయినందు వలన అందరూ సుజాతాకు పూర్తి సహకారం ఇస్తున్నారు.

అదే సమయం పోటీ పడుతూ ప్రదీప్ ను ప్రేమగా చూసుకుంటున్నారు కుటుంబీకులు.

మొదట్లో వాళ్ళకు దూరంగా ఉన్న ప్రదీప్ , ఇదే ఇక నా జీవితం అని అర్ధం చేసుకున్న తరువాత, మెల్లగా వాళ్ళతో కలవటం మొదలు పెట్టాడు.

కానీ రాత్రి పూట మాత్రం సుజాతాకు దూరంగానే ఉంటున్నాడు.

మీరు నా భర్త! ఎందుకు దూరంగా ఉంటున్నారు?”

లేదండీ! వద్దండీ! మానసిక బంధుత్వానికి ఒక మనిషి సులభంగా తయారైపోతాడు. శరీర బంధానికి సాధ్యమైనంత దూరంగా ఉంటాడు!

సరే! మీ ఇష్టం

అత్తగారు గుచ్చి గుచ్చి అడిగినప్పుడు విషయాన్ని సుజాతా చెప్పకుండా ఉండలేకపోయింది.

అత్తగారు బాధ పడుతూ భర్తతో చెప్పింది.

పాపమే పిల్ల! వీడు ఇలా అయిపోయిన కారణంగా, దాంపత్యమే ప్రశ్నార్ధకంగా అయిపోయింది! శిక్ష ఆమెకు! నేను ప్రదీప్ దగ్గర మాట్లాడతాను

తండ్రి కొడుకును వేరుగా పిలుచుకు వెళ్ళారు.

నాజూకుగా అడిగారు.

మనసు ఒప్పుకోవటం లేదు! తప్పు చేస్తున్న ఒక ఫీలింగ్!

లేదబ్బాయ్! తన భర్తను కాకుండా మరొకడ్ని ఆమె అనుమతిస్తుందా? ప్రదీప్! భార్యా--భర్తల మధ్య శరీర రీతిగా ఏర్పడే సంతోషం అశ్లీలత కాదు! చాలా సమయాలలో అది వ్యాధులను పోగొట్టే మందు! నీ శరీరం, మనసు సంగమంలో పూర్తిగా నువ్వు ఈడుపడితే, ఒక వేల అదే నీ పాత జ్ఞాపకాలను నీకు తిరిగి తీసుకురావచ్చు!

అలాగా?”

ఇలా చూడబ్బాయ్! నీకు పాతవన్నీ జ్ఞాపకంలేదు!

తల్లి దగ్గరకు వచ్చింది.

ఇరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నీకు తలకు నూనె రాసి స్నానం చేయించేది నీ తల్లి! నీ మీద మేమిద్దరం ప్రాణమే పెట్టుకున్నాము రా!

కంట తడి పెట్టుకున్నారు.

నువ్వు మా దగ్గర ప్రేమే చూపించకుండా, దూరంగా ఉండి మమ్మల్ని పురుగుల్లా చూశావు

ఏమండీ!

ఉండవమ్మా! పాత విషయాలు మాట్లాడితే, ఫలితం దక్కుతుందేమో చూస్తున్నా!

ప్రదీప్ ఆయన్ను చూసాడు.

నీకు మా మీద ఎప్పుడు ప్రేమ వస్తుందోనని పరితపించాము. సుజాతా వచ్చిన తరువాతే కుటుంబంలో ఆనందం వచ్చింది! ఇదిగో చూడు ప్రదీప్! వికలాంగురాలిగా ఉన్న అమ్మాయిని డబ్బుకోసం పెళ్ళి చేసుకున్నావు నువ్వు! కానీ, ఆమె మా దగ్గర ప్రేమగా ఉంటోంది. రోజు ఆమె సంపాదన వలనే కుటుంబమే గడుస్తోంది. ఇప్పుడు కూడా ఆమె ప్రేమగానే ఉంటోంది. అందర్నీ అభిమానిస్తోంది. డబ్బుకంటే ప్రేమేతోనే అన్నిటినీ సాధిస్తొంది!

.....................”

నువ్వు గుణమవ్వాలి. ఒకవేల అది జరగకపోయినా, మేము నీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలలో ఆవగింజంత కూడా తగ్గదు! నువ్వు నమ్మచ్చు!

తల్లి అతని కేశాలను నిమురుతోంది.

ఒక విధంగా పాత ప్రదీప్ మాకు వద్దు! మేము చాలా గాయపడి ఉన్నాం. కొత్త ప్రదీప్ మాకు బాగా నచ్చాడు! నువ్వు ఉద్యోగానికి వెళ్లనవసరం లేదు. సుజాతాతో కలిసి అందరం శ్రమ పడదాం. బాగా సంపాదించవచ్చు. బాగా ఉండవచ్చు!

నాన్నా! 

ఆసుపత్రి నుండి అతను వచ్చిన తరువాత నాన్న అని పిలవడం ఇప్పుడే!

ఆయన పొంగిపోయాడు.

నాన్నా అనా పిలిచావు?”

బాగా మాట్లాడుతున్నారు నాన్నా! నాకు మిమ్మల్నీ, అమ్మనీ, కుటుంబాన్నీ బాగా నచ్చింది!

వింటానికే చాలా సంతోషంగా ఉందిరా ప్రదీప్!

రోజు సాయంత్రం తండ్రి అందరినీ పిలిచాడు. ప్రదీప్ చెప్పింది చెప్పారు.

దిలీప్, మహతీ చాలా సంతోషపడ్డారు.

చూడు ప్రదీప్! సుజాతానే నువ్వు తాళికట్టిన భార్య. ఆమె దగ్గర ఎటువంటి సంకోచమూ లేకుండా, అన్ని హక్కులూ నువ్వు తీసుకోవచ్చు! కొత్తగా ఒక జీవితం మొదలుపెట్టు!

సరే నాన్నా

అన్నయ్యా! రేపట్నుంచి వదిన చేసే వృత్తిలో ఆమెకు సహాయంగా నువ్వు ఉండు!

సరే తమ్ముడూ!

రాత్రి అందరూ ఒకటిగా కూర్చుని, ఉత్సాహంగా డిన్నర్ ముగించారు.

వేరే గదికి ఇద్దరూ వచ్చారు.

నాన్న చెప్పే పంపారు.

మనిషి జీవితంలో సంగమం జవాబు తెలియని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది! అది ఉత్త సంతోషమే కాదు, దైవీకం!

సరే నాన్నా!

లోపలకు వచ్చి తలుపులు మూసి సుజాతాను దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.

నాన్న అంతా మాట్లాడారు! నేను పలు సంవత్సరాలుగా కుటుంబంలో ఉండే అందరినీ ఎంత విసిగించేనో, ఆవేదనకు గురిచేసానో వివరించారు? ఒక ఘట్టంలో నేను చచ్చిపోతే మేలు అనుకునేంత బాధకు వాళ్ళను కష్టపెట్టేనట

అవన్నీ ఇప్పుడెందుకు?”

నువ్వు నాలాంటి స్వార్ధ పరుడుకి భార్యగా వచ్చి, కుటుంబాన్నీ ప్రేమించి, ఎంత కష్టపడ్డావో? నీకు శరీరంలో మాత్రమే వికలాంగం. నాకు ఒక కాలంలో మనసే చీకటిగా ఉన్నదే!

.....................”

నేను పెట్టిన కష్టాలకు! ఇప్పుడు బుద్ది చెలించిన నన్ను కుటుంబమే అవతలకు తోసేసి ఉండాలి. కానీ చెయ్యలేదే? ముందుకంటే ప్రేమగా నడుచుకుంటున్నారే! ఇది నేను చేసిన పుణ్యమా? లేక అది నాకు ఇవ్వబడిన శిక్షా?”

సుజాతా అతని చేతులను పుచ్చుకుంది.

అలా అనుకోకండి! పాతవి తలుచుకుని మీరు కన్ ఫ్యూజ్ అవద్దు -- కొత్తగా పుట్టినట్టు నమ్మండి! జీవితం కొత్త బాటలో పయనించటానికి తయారవనివ్వండి! సరేనా?”

నువ్వెలా ఇంత నమ్మకంగా ఉన్నావు?”

దానికంటే ఎక్కువ బలం ఏమిటో చెప్పండి చూద్దాం?”

సుజాతా! నాకు ఇప్పుడు ఉద్యోగం లేదు! పాత జ్ఞాపకాలు నా దగ్గర బాకీ లేవు! ఒక విధంగా నేను అందరికీ భారమే కదా?”

ఖచ్చితంగా భారం కారు! ఆహారం తయారింపు, ఏజెన్సీ, పిల్లలకు ట్యూషన్ అని నాతో, కుటుంబంతో పూర్తిగా మిమ్మల్ని ఐక్యం చేసుకోండి! ఆనందం తానుగా వస్తుంది! ఇది మన కుటుంబం. మన కోసం శ్రమ పడుతున్నాం. చాలు?”

మెల్లగా ఆమె చేతులను పట్టుకున్నాడు.

శరీరం, మనసూ పూర్తిగా సంగమంలో ఐక్యమవుతున్నప్పుడు ఒక వేళ అదే నీ పాత జ్ఞాపకాలను నీకు పూర్తిగా తీసుకురావచ్చు

తండ్రి చెప్పింది మళ్ళీ మళ్ళీ వినిపించింది.

మనసు తేలికపడి ప్రశాంతంగా ఉన్నది!

శరీరం దాంపత్యానికి తయారుగా ఉంది! మెట్టు మెట్టుగా అతను సుజాతాను ఆక్రమించాడు.

అది ఇద్దరికీ సంతృప్తికరమైన తియ్యటి రాత్రిగా ఉన్నది!

ప్రొద్దున ఎప్పుడూలాగా సుజాతా లేచి స్నానం చేయ, తల్లి రావటంతో, కుటుంబమే ఉత్సాహంలో మునిగింది.

ప్రొద్దున ఎనిమిదింటికి ప్రదీప్ నిద్ర లేచాడు. లేచి కూర్చున్నాడు! పళ్ళు తోముకోవటానికి వచ్చాడు. తల్లీ-- సుజాతా హడావిడిగా ఉన్నది చూసాడు.

ప్రదీప్ కు పాత జ్ఞాపకాలు వచ్చినై.

అదే సమయం -- మధ్య కాలంలో పాత జ్ఞాపకాలు మర్చిపోయిన విషయం కూడా గుర్తుకు వచ్చింది.

ప్రదీప్ స్నానం చేసాడు. దేవుడికి దన్నం పెట్టుకున్నాడు.

అతన్ని టిఫిన్ కు పిలిచింది. అమ్మ, నాన్నా, తమ్ముడూ, చెల్లీ కూడా ఉన్నారు.

సుజాతా అందరికీ టిఫిన్ పెట్టింది.

నాకు పాత జ్ఞాపకాలు తిరిగి వచ్చాయని చెప్పాలా? కుటుంబం సంతోషిస్తుందా! లేదు, నాలో పాత ప్రదీప్ యొక్క గుణాలు తలెత్తుతాయని భయపడతారా?’

రోజైనా నేను విషయం చెబితే, పాత భయాలు వాళ్ళను వణికిస్తుంది

దాని వల్ల వాళ్ళ ప్రశాంతత పోతుంది!

దేనికి?’

పాత జ్ఞాపకాలు తిరిగి వచ్చినై అని చెబితే, ఏం లాభం దొరుకుతుంది?’

వద్దు!

కొత్త ప్రదీప్ గా మారిన స్వల్ప కాలంలో, కుటుంబంలోని వాళ్ళు చూపించిన ప్రేమను అర్ధం చేసుకున్నాను!

ఇది నాకు సుఖంగా ఉంది

స్వార్ధపరుడైన ప్రదీప్ కథ ముగిసింది! ఇప్పుడున్నది కొత్త ప్రదీప్. ఇది కొత్త జీవితం!

ఏం నాయనా? తినడం లేదు?”

! వేరే ఏదో ఆలొచనలో ఉన్నా నాన్నా!

భోజనం చేసేటప్పుడు అది తప్ప వేరే ఆలొచనే రాకూడదు

మహతీని చూడండి! దానికి ఇరవై నాలుగు గంటలూ తిండి గురించే ఆలొచన!

పో వదినా! సుజాతా యొక్క ఎగతాలికి మహతీ సిగ్గు పడగా అందరూ నవ్వారు.

కుటుంబమే కుతూహలంగా ఉండటం చూసిన ప్రదీప్ కూడా గబుక్కున అందులో కలుసుకున్నాడు.

కుటుంబానికి కొత్త జీవితం మొదలైయ్యింది! అది కంటిన్యూ అవనీ! తియ్యగా ఉండనీ!!

**************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

శతమానం భవతి…(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)