ఓడినవాడి తీర్పు...(పూర్తి నవల)


                                                                     ఓడినవాడి తీర్పు                                                                                                                                                        (పూర్తి నవల) 

ప్రియమైన నా భర్తకు - మీ భార్య నమస్కరించి రాయునది! కొద్ది కాలంగా శేఖర్ అనే అతనితో నాకు పరిచయం ఏర్పడి, కొత్త స్నేహం లోతుగా పెరిగింది. శేఖర్ మీ కంటే అందంలోనూ-వసతిలోనూ గొప్పవాడు. మా స్నేహం ప్రేమగా మారింది. పెళ్ళి అనే బంధం మా ప్రేమకు పెద్ద అడ్డుగా నిలబడుతోంది. చాలా ఆలొచించి నిర్ణయానికి వచ్చాను.

రోజు నేనూ, శేఖరూ ఊరు వదిలి బయలుదేరి వెళుతున్నాము...ఒక కొత్త జీవితం కోసం. ఇది తప్పే. చెయ్యకూడని పనే. కానీ, నా వలన శేఖర్ను మరిచిపోవటం కుదరటం లేదు. అందువల్ల మిమ్మల్ని వదిలి వెళుతున్నాను. నన్ను వెతక వద్దు. నన్ను క్షమించండి. మరిచిపొండి.

                                                                                   ******************

ప్రియమైన కొడుకుకు -- తండ్రి ప్రేమతో రాస్తున్నది.

మధ్య వ్యాపారంలో నాకు ఏర్పడిన నష్టం నాకు తగిలిన, తేరుకోలోని ఒక పెద్ద దెబ్బ! పేకమేడలాగా నేను ఒక్కసారిగా వేగంగా పడిపోయాను. ఇంతపెద్ద ఓటమిని నా వల్ల తట్టుకోవటం కుదరటం లేదు. వెళ్ళిన ప్రతి చోటా నన్ను దుఃఖం విచారిస్తున్నారు. పెద్ద అవమానంగా ఉంది.

పారేసుకున్న మనశ్శాంతిని వెతుక్కుంటూ నేను ఇంటిని, ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలనేది నేనే తీర్మానించుకోలేదు. నా మనసు నిలకడగా లేదు. నిలకడ అయినప్పుడు, తిరిగి వస్తాను. రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఎవరూ నన్ను వెతకటానికి ప్రయత్నించ వద్దు. నీకు నా ప్రేమ పూర్వకమైన దీవెనెలు.

ఇట్లు.

                                                                                   ******************

పై రెండు ఉత్తరాలకు ఒక పెద్ద లింకు ఉన్నది. అదేమిటో తెలుసుకోవటానికి సస్పెన్ష్ నవలను చదవండి.

***************************************************PART-1******************************************

                                                                    

పోయిన సంవత్సరం

వర్షం కురిసి ఆగింది.

అందువలన కాశంలో వెలుతురును రాజీనామా చేయమని చెప్పి, చీకటి పదవి ఎక్కింది.

మనుషులు ఇంకా గొడుగులను మడవకుండా నడుస్తున్నారు. కట్టుకున్న మూటలను మళ్ళీ విప్పుదామా, లేకపోతే చిరంజీవి సినిమా చూడటానికి వెళ్ళిపోదామా అని ప్లాట్ ఫారం మీద షాపులు పెట్టుకున్న వాళ్ళు ఆలొచించ, రైన్ కోటు వేసుకున్న రెండు చక్రాల వాహనదారులు రోడ్డు మీద 'వీర్ ' అని ఎగురుతున్నారు. చూసి చూసి అడుగులు వేస్తున్న పాదచారుల దుస్తుల గురించి పట్టించుకోకుండా, బురద నీటిని వాళ్ళ మీద జల్లుతూ వెళ్తున్నాయి బస్సులు.

కంప్యూటర్ క్లాసు ముగించుకుని, రెండు అంతస్తుల మెట్లను జాగ్రత్తగా దిగి, చేయి జాపి చూసి, వర్షం పూర్తిగా తగ్గిందని తెలుసుకుని తన సైకిల్ దగ్గరకు వెళ్ళాడు వెంకట్.

తరంగినీ మొబైల్స్ఎదురువైపు సీరియల్ బల్బులు అలంకరించుకుని మొబైల్ ఫోనులు ఉన్నవాళ్ళను కూడా కొత్త మొబైల్ కొనుక్కుని అప్ డేట్ అవండి అని పిలుస్తున్నది.

సైకిల్ తాళం చెవిని జేబులో వేసుకుని రోడ్డు క్రాస్ చేద్దామనుకున్నప్పుడు ఒక ఆటోవాడి దగ్గర తిట్లు తిని, వెంటనే తుడుచుకున్నాడు.

షాపుకు అద్దాల తలుపులు ఉన్నాయి.

మల్లికా, నల్లరంగు చుడీధార్ వేసుకుని అతనికి వీపు చూపిస్తూ 'ఆల్బం  తిరగేస్తున్నది. ఒకసారి తన జడను అనవసరంగా విప్పి, విదిలించుకుని మళ్ళీ కట్టుకుంది.

తలుపు తోసుకుని ఆమెకు దగ్గరగా వచ్చాడు అతను.

ఆమె చెవి దగ్గర, హాయ్ మల్లికా? అన్నాడు.

హాయ్ అంటూ వెనక్కి తిరిగిన మల్లికా ఆల్బం రెండు కాపీలనూ వేరు వేరు సంచీలలో వేసి ఇవ్వండి అని షాపతనికి చెప్పి, వెనక్కి తిరిగి ఎలా ఉన్నారు వెంకట్? అని అడిగింది.

ఆల్బం సంచులను తీసుకుని, తన దగ్గరున్న మరో పెద్ద సంచిలో పెట్టుకుంది ఆమె.

ఐస్ క్రీమ్ తిందామా వెంకట్?”

వద్దు...వద్దంటే నాకు వద్దు. నీకు కంపెనీ ఇస్తాను

ఇవ్వండి

ఐస్ క్రీమ్ షాపులో గోడకు తగిలించబడి ఉన్నది పెద్ద స్క్రీన్ గల టెలివిషన్. అందులో ఫుట్ బాల్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతోంది. టీవీ లో నుండి ప్రేక్షకుల అరుపులు, ఐస్ క్రీమ్ షాపులో ఆటను టీవీలో చూస్తున్న ప్రజల అరుపులు కలిసి అక్కడ కోలాహల వాతావరణం.

రెండు స్ట్రాబెరీ అని ఆర్డర్ ఇచ్చింది.

నేను వద్దని చెప్పానుగా?” అని సనుగుతున్న అతన్ని చిరుకోపంతో చూసి ఎందుకు వద్దు?” అన్నది.

నాకు బాగా ఆకలిగా ఉంది మల్లికా. ఐస్ క్రీమ్ తింటే ఆకలి చచ్చిపోతుంది. సరిగ్గా లంచ్ చేయలేను

అలాగైతే హోటలకు వెళ్ళి టిఫిన్ తినుండొచ్చే. తిందామా?”

ఊహూ. లంచ్ కు వస్తానని ఇంట్లో చెప్పాను. వదిన ఎదురు చూస్తూ ఉంటుంది

హోటల్లో తిన్నానని చెబితే తల తీసేస్తారా ఏమిటి...?”

తియ్యరు. కానీ, అది మర్యాద కాదే మల్లికా! అన్నయ్య ఇంట్లో ఉంటూ ఉద్యోగం వెతుక్కుంటున్నాను. వాళ్ళకు అనవసరమైన ఇబ్బందులు కలిగించవచ్చా?”

వదిన అంటే మీకు భయమా?”

లేదు. భక్తి. ఆమెలాంటి ఒక మంచి స్వభావం ఎవరి దగ్గరా చూడలేము. కోపమే రాదు. ఎప్పుడూ మొహాన ఒక చిరునవ్వు. అన్ని విషయాలలోనూ త్యాగాన్ని అనుసరించే వెడతారు. మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు

ఐస్ క్రీమ్ వచ్చిన తరువాత  సగం తిని పెట్టేసి, టిష్యూ పేపర్ తీసుకుని నోరు తుడుచుకున్నాడు వెంకట్.

ఆమెకు టాటాచూపించి సైకిల్లో ఇంటికి వచ్చినప్పుడు, మళ్ళీ వర్షం చినుకులతో మొదలయ్యింది.

ఇంటి వాకిట్లో ఉన్న అన్నయ్య స్కూటర్ వెనుక తన సైకిల్ని పెట్టి స్టాండూ, తాళం వేసి, తలుపు కొట్టాడు.

మహతీ తలుపులు తెరిచి తడిసిపోయారా?” అన్నది.

లేదు అన్నాడు.

సోఫాలో ఆనుకుని కూర్చుని టీవీ చూస్తున్న కల్యాన్ వెనక్కి తిరిగి చూసి, “వాడు తడిసిపోయున్నది కనబడటం లేదా. తుడుచుకోవటానికి తుండు తీసివ్వుఅన్నాడు మహతీ భర్త.

మన వీధి చివరికి వచ్చిన తరువాతే మళ్ళీ వర్షం మొదలయ్యింది అన్నయ్యా. పెద్దగా తడవలేదు

సరే. తల తుడుచుకుని డ్రస్సు మార్చుకుని రా వెంకట్. నీతో కొంచం మాట్లాడాలి అన్నాడు కల్యాన్.

వెంకట్ తన గది తలుపు మూసుకుని డ్రస్సు మార్చుకుని హాలులోకి వచ్చి అన్నయ్య పక్కన కూర్చున్నాడు.

ఏంటన్నయ్యా?”

మహతీ కాసేపు టీవీ ఆఫ్ చేయి

మహతీ టీవీ ఆఫ్ చేసింది.

ప్లేటులో వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు తీసుకువచ్చి సోఫా దగ్గరున్న టీపా మీద పెట్టి ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్ లో కూర్చుంది మహతీ.

వెంకట్, వదిన ఏం ఆలొచన చెబుతోందంటే...ఆమె డిగ్రీ పూర్తి చేసి ఖాలీగానే ఇంట్లో కూర్చోనుందట. టైము గడపటం కూడా కష్టంగానే ఉన్నదట. ఉద్యోగానికి వెళ్తానని చెబుతోంది. నాకు అది ఇష్టం లేదు...ఎందుకంటే నాతో పనిచేస్తున్న స్త్రీలు పడే శ్రమ కళ్ళారా చూస్తున్నాను.

తొందర తొందరగా వంట పనులు ముగించుకుని, టెన్షన్ పడుతూ బస్సు పట్టుకోటానికి వచ్చి....చిన్న చిన్నగా చాలా అవస్తలు ఉన్నాయి. అందువలనే నాకు ఆలొచన నచ్చలేదు అన్నాడు కల్యాన్.

లోకంలో నేను ఒక్కదాన్నే కొత్తగా ఉద్యోగానికి వెళ్ళి కష్టపడబోతాను చూడండి!? మనకు పిల్లలు పుట్టిన తరువాత అలా చెప్పినా న్యాయంగా ఉంటుంది. వాళ్ళనూ చూసుకుంటూ, ఉద్యోగానికి వెళ్లటం శ్రమే లాగుతూ అన్నది మహతీ.

కొంచం ఉండండి అన్నాడు వెంకట్. ఇద్దరికీ నచ్చినట్టు నేనొక తీర్పు చెప్పనా?”

చెప్పు

వదిన ఉద్యోగానికి వెళ్ళనివ్వండి...ఒక బిడ్డ పుట్టేంతవరకు

నాకు ఓకేనే -- అంగీకరించింది మహతీ.

నాకెందుకో దీంట్లో ఇష్టం లేదు. కానీ, నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నాకు ఓకే

అదంతా సరే, కంపెనీలో వదినను ఉద్యోగానికి రమ్మంటారు

ఇక మీదటే ప్రయత్నాలు మొదలుపెట్టాలిఅన్నది మహతీ.

సరే. విషయం నా దగ్గర విడిచిపెట్టండి. బాధ్యత నాకివ్వండి. ఇప్పటివరకు నా కోసం మాత్రమే ఉద్యోగ ప్రయత్నం చేసేను. ఇప్పుడు మీకూ కలిపి చేస్తాను.  స్త్రీలకు త్వరగా ఉద్యోగం దొరుకుతుంది

ఎందుకంటే స్త్రీలు కబుర్లు చెప్పుకోకుండా సిన్సియర్ గా పనిచేస్తారు. అదే కారాణం?” అన్నది మహతీ.   

***************************************************PART-2*******************************************

సంవత్సరం

స్నానం చేసేసి నడుముకు తడి తుండు చుట్టుకుని, బట్టలున్న బకెట్టుతో వరాండాలో నడిచి తన ఏడో నెంబర్ రూముకు వచ్చాడు వెంకట్.

సోపు బాక్సులో పెట్టున్న తాళం చెవిని తీసుకుని తాళాన్ని తెరిచి లోపలకు వెళ్ళాడు. తడి బట్టలను విదిలించి, తీగమీద ఆరేసి, గోడకు తగిలించిన అద్దం ముందు నిలబడి తల దువ్వుకుని, పౌడర్ అద్దుకుని, ఇంతకు ముందు ఉతికి, ఇస్త్రీ చేసిపెట్టుకున్న డ్రస్సు వేసుకుని, బెల్టు పెట్టుకుని, చెప్పులు వేసుకున్నాడు.

అలమరాలో ఉన్న ఆర్.ఆర్.కంపెనీ యొక్క ఉద్యోగ అపాయింట్ మెంట్ ఆర్డర్ కవర్ను తీసి మడత పెట్టి, ‘జేబులోపెట్టుకున్నాడు. అప్పుడు మ్యాన్షన్ లో పనిచేస్తున్న కుర్రాడు వచ్చి తలుపు తట్టి, “సార్, మీకు ఫోను అన్నాడు.

గదికి తాళం వేసి మెట్లలో వేగంగా దిగివచ్చి టెలిఫోన్ ఎత్తాడు.

హలో వెంకట్ మాట్లాడుతున్నా

మల్లికా మాట్లాడుతున్నా. కంగ్రాట్స్

బయలుదేరే ముందు నేనే నీకు ఫోను చేయాలనుకున్నా మల్లికా

మీ నాన్న దగ్గర చెప్పి ఉద్యోగం నాకు దొరికేటట్టు చేసింది నువ్వే కదా? మొదటి సారిగా ఉద్యోగానికి వెళ్తునప్పుడు పిలిచి థ్యాంక్స్ చెప్పద్దా?”

చాలా రోజుల తరువాత ఇప్పుడే నువ్వు పాత ఉత్సాహంతో మాట్లాడుతున్నావు. వినడానికే ఆనందంగా ఉంది. మధ్యలో ఎక్కువగా మనసు విరిగిపోయి మౌనంగా ఉండేవాడివి

దానికి కారణం ఏమిటో నీకు తెలుసు కదా మల్లికా

తెలుసు! అదిప్పుడెందుకు? ఇప్పుడెందుకు దాని గురించి గుర్తుకు తెచ్చుకోవటం...” 

సరి ఫోను పెట్టేయనా?”

ఉండండి, మీరుగా అడుగుతారేమో అనుకుంటే, ‘పెట్టేయనా?’ అని కత్తిరించటానికి ప్రయత్నిస్తున్నారే...సరే, పరవాలేదు. అడగకుండానే ఇస్తాను

ఫోనులో ఆమె ముద్దుల శబ్ధం విని, అతను నవ్వుకున్నాడు.

రిసీవర్ పెట్టేసి, అక్కడున్న న్యూస్ పేపర్లను వేగంగా చూసేసి, పక్కనున్న షెడ్డులో నిలబెట్టున్న స్కూటర్ను బయటకు తీసినప్పుడు అతని మనసు బరువెక్కింది.

అది అన్నయ్య కల్యాన్ నడిపిన స్కూటర్.

బండి స్టార్ట్ చేసి బయలుదేరేడు వెంకట్.

***************************************************PART-3*******************************************

పోయిన సంవత్సరం

వాటర్ బెడ్ మీద నిదానంగా కదులుతున్నాడు. రెండు చేతులను రిలాక్స్ గా పెట్టుకుని పడుకోనున్న ఆనంద్, నిక్కర్ మాత్రమే వేసుకోనున్నాడు.

ఇంటర్ కామ్మోగినప్పుడు, శరీరాన్ని తిప్పి--చెయ్యి జాపి రిసీవర్ తీసి, “ఏమిటి బాబాయ్, మీరింకా ఆఫీసుకు వెళ్ళలేదా?” అన్న ఆనంద్ కు చెవి చివర్లలో జుట్టు. ముఖ ద్వారంలో నుండి మొదలైన మీసాలు రెండుగా విడిపోయి పై పెదవికి అనకట్ట కట్టింది. చెస్ట్ పైన ఉన్న రోమాలు రింగులు రింగులుగా ఉన్నాయి. మెడలో ఆరు మడతలలో ఒక మడతలో ఇరుక్కుని కనబడుతున్నది పదికాసుల బంగారు గొలుసు, పసిపిల్లాడిలాగా ఒళ్ళంతా పౌడర్.

రోజు నువ్వు కూడా ఆఫీసుకు వస్తానని చెప్పావుగా ఆనంద్. అందుకే కాచుకోనున్నాను

మొదట అలాగే అనుకున్నాను. సడన్ గా ఫోను వచ్చింది. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన మనిషికోసం కాచుకోనున్నాను

సరే...నేను బయలుదేరుతాను. రేపు వస్తావా? కొన్ని ముఖ్యమైన ఫైల్సును నువ్వు చూడాల్సి ఉంది

అన్నీ మీరు చూస్తే చాలు బాబాయ్. మీరు చూపిన చోట సంతకం పెడతా

ఫోను పెట్టేశాడు బాబాయ్.

రెండు కాళ్ళనూ జాపి, చక్రాలు అమర్చిన టీపాని తన పక్కకు లాగాడు ఆనంద్. టీపా మీదున్న విస్కీ బాటిల్ తీసుకుని ఒక పెగ్గుపోసుకుని తాగి, సిగిరెట్టు వెలిగించినప్పుడు,

సార్...లోపలకు రావచ్చా?”

వచ్చినామె తన కాళ్ళతో తలుపు మూసేసి ఫైల్సును సోఫాలో విసిరేసి, అతనున్న అవతారం చూసి, ఒక చిన్న కులుకుతో పాటూ తన రెండు చేతులతోనూ తన మొహాన్ని మూసుకుని ఛీఛీ! ఇంత అవసరమా?” అన్నది.

రెండు చేతులనూ జాపి జంప్అన్నాడు ఆనంద్.

అతనిపై గెంతింది. సిగిరెట్టు పొగని ఆమె చెవిలోకి ఊది, ఆమె జుట్టును సవరిస్తూ,

విస్కీ తాగుతావా?”

“........................”

రెండు పెగ్గులే

తాగింది.

ఆమె వేసుకున్న దుస్తులలో, మిగిలిపోయిన వాటిని ఊడతీయటానికి వాటికి ఉన్న బొత్తాలను వెతికాడు.

టెలిఫోన్ మోగింది. విసుక్కున్నాడు ఆనంద్.

హలో డాడ్! నేను సుధీర్ మాట్లాడుతున్నా

విసుగును తగ్గించుకుని, “సుధీర్ కన్నా, ఎలా ఉన్నావు?”

బాగున్నా డాడీ...నాకు మీ మీద చాలా కోపం...!

ఎందుకురా...?”

పోయిన వారం మా స్కూల్లో స్కూల్ డే సెలెబ్రేషన్కు వస్తానని ప్రామిస్ చేసేవే. తరువాత ఎందుకు రాలేదు?”

ఇక్కడ కొంచం అర్జెంటు పనులు వచ్చినై సుధీర్

ఏమిటంత అర్జెంటు పని. చిన్న తాతను చూసుకోమని చెప్పి ఉండవచ్చు కదా?”

ఆయనవల్ల కుదరదురా, నేనే చూసుకోవలసిన పని

నా మీద నిజంగానే మీకు ప్రేమ ఉన్నదా?”

ఏమిట్రా అలా అడుగుతున్నావు! నువ్వు నాకు ఒకే కొడుకువు, ఒకే బిడ్డ. అదేదో చెబుతారే......మన వంశొద్ధారకుడివి! నీ మీద నాకు ఎంత ప్రేమో తెలుసా?”

ఫోన్ కట్ చేసి ఆమెను చూసాడు ఆనంద్.

ఎలాంటి ముఖ్యమైన టైములో ఫోను చేస్తున్నాడో చూడు...

మీ అబ్బాయి టైములో ఫోను చేసినా అది మీకు ముఖ్యమైన టైముగానే ఉంటుంది అన్న ఆమెను ముద్దుగా గిల్లాడు.

ఆదివారం నీకు ఇంకేదైనా పనుందా...? లేకపోతే నాతో రా...నా పిల్లాడ్ని చూసి వచ్చేద్దాం

మీ అబ్బాయిని చూడటానికి వెళ్తున్నప్పుడు కూడా ఇది అవసరమా?”

పిల్లాడితో ఒక గంట గడిపేసి బయలుదేరిన తరువాత, ఊటీ చలిలో ఏం చేసేది? అక్కడికెళ్ళి అది వెతుక్కోగలమా...? అందువలనే నిన్ను పిలుస్తున్నా...వస్తావా చెప్పు...?”

ఊహూ. నేను బెంగళూరు వరకు వెళ్ళాల్సి ఉంది

ఐదు రోజులు తప్ప మిగతా అన్ని రోజులూ నువ్వు చాలా బిజీనేగా. అడ్వాన్స్ బుకింగుతో ఉంటావు! సరే...నేను హెలన్ని పిలిచి చూస్తాను అంటూనే ఆమెను హత్తుకున్నాడు.

హెలెన్ ఎవరు?”

మా ఆఫీసులో పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అని చెప్పినా నమ్మలేము

ఆవిడ్నీ కూడా వదిలిపెట్టలేదా?”

ఎవర్నీ?”

ఆఫీసులొ పని చేస్తున్న స్త్రీలనూ!

అందరినీ కాదు. నేనంత చీప్ మనిషిని కాదు. కొంతమంది ఆడవాళ్ళను చూసిన వెంటనే మనసులో డింగ్-డాంగ్ అని కొట్టుకుంటుంది. హెలెన్ మొదట్లో నోఅన్నది. మూడు నెలలు ప్రయత్నం చేసి ఆమెను వసపరచుకున్నాను. తరువాత నా వలనే ఒక అబార్షన్ చేసుకోవలసి వచ్చింది

పాపం కాదా?”

ఏమిటి పాపం?”

మేము దీనికని ఉన్న పనివాళ్ళం...సరి. కుటుంబంలో ఉన్న స్త్రీలను కూడా పాపం చేయిస్తున్నారే?”

ఏమిటి నువ్వు సడన్ గా పాప, పుణ్యాల గురించి మాట్లాడుతున్నావు? ‘త్రిల్అని ఒకటుంది చూడు -- దానికి ముందు పాపమూ, పుణ్యమూ ఏదీ లేదు...? పెళ్ళి అయిన స్త్రీలంటే అదొక వేరు సుఖం. అదేలాగా ఇంకో విషయం చెబుతా. మొదట్లో మొండికేసి, కోపగించుకుని మడి కట్టుకున్న అమ్మాయలను చివరికి ఎంత కష్టపడైనా సరే జయించేస్తా తెలుసా? ఓటమే లేదు

వాడు వాడు ఏవేవో విషయాలలో సాధనలు చేస్తున్నాడు. మీరు విషయాన్ని పెద్ద సాధనగా చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారే?”

ఏమైంది నీకు? మీ ఇంటికి పక్కనే కొత్తగా జ్ఞానోదయం చెట్టు పెరుగుతోందా...?” అన్న అతను -- ఆమెను మూర్ఖంగా హత్తుకుని ముద్దుపెట్టడంతో, ఆమె బెదిరి -- తనని విడిపించుకుంది.

కింద పెదవిని ముట్టుకు చూసినప్పుడు వేలుపై...రక్తం మరక!

మరుసటి రోజు ఆఫీసుకు వచ్చిన ఆనంద్ కి ప్యూన్తో మొదలుపెట్టి ఒక్కొక్కరూ నమస్తే చెబుతూ వస్తుంటే -- అతను మౌనంగా తల ఆడిస్తూ నడిచాడు.

అప్పుడు ఒక స్వీట్ స్త్రీ వాయిస్ విని -- వాయిస్ వినబడ్డ టేబుల్ ముందు ఒక క్షణం నిలబడ్డాడు.

నమస్తే చెప్పిన ఆమెను ఆశతో చూసాడు.

మనసులో డింగ్ -- డాంగ్ అని గంట కొట్టింది.

తన రూముకు వచ్చిన వెంటనే-- స్త్రీని సూచిస్తూ అది ఎవరు బాబాయ్?” అన్నాడు.

కొత్తగా ఉద్యోగంలోకి వచ్చింది ఆనంద్. పేరు మహతీ అన్న బాబాయ్. వద్దురా, ఉద్యోగంలోకి చేరి రెండు వారాలే అవుతోంది. పెళ్ళి అయిన స్త్రీ అన్నారు అతని మొహంలో కనబడ్డ కోరిక నవ్వు చూసి.

అయితే ఏమిటి బాబాయ్. ఆమె ఇంట్లో వాటర్ బెడ్ ఉండదు కదా అన్నాడు ఆనంద్ నవ్వుతూ.

***************************************************PART-4*******************************************

సంవత్సరం

ఆఫీసులో కంప్యూటర్ లెడ్జర్ఓపన్ చేసి చెక్ చేస్తున్నాడు వెంకట్.

అతని టేబుల్ పైన ఉన్న ఇంటర్ కామ్ మోగింది.

ఏం.డి రూముకు రావయ్యా అని కంపెనీ జి.ఎం. మరియూ ఏం.డి యొక్క బాబాయ్ సుబ్బారావ్ గారి స్వరం వినబడింది.

ఇదిగో వస్తున్నా సార్ అని భవ్యంగా చెప్పిన వెంకట్, టేబుల్ మీద పెట్టుకున్న   కొన్ని ప్రింటడ్ లెడ్జర్ కాపీ పేపర్లను తీసుకుని బయలుదేరాడు.

అనుమతి తీసుకుని .సీ. రూములోకి వెళ్ళినప్పుడు, ఏం.డి ఆనంద్ తన చక్రాల కుర్చీలో కూర్చుని అటూ--ఇటూ తిరుగుతున్నాడు.

అతని పెదాలపై సమయంలోనైనా బూడిద చిందించటానికి తయారుగా ఉన్న సిగిరెట్టువేలాడుతున్నది.

పక్కనే మరో కుర్చీలో కూర్చోనున్న ఏం.డి యొక్క బాబాయ్ సుబ్బారావ్, వెంకట్ చేతిలో ఉంచుకున్న పేపర్లను తీసుకుని, “ఏం.డి నిన్ను ఏదో అడగాలి అని చెప్పారు అన్నారు.

ఏమిటి సార్?” అన్నాడు వెంకట్.

పర్చేస్ లెడ్జర్ను చూసాను. అందులో మూడు పేమెంట్లు అండర్ లైన్ చేసి, పక్కన క్వోశ్చన్ మార్క్ గుర్తు వేసుంది. అలా ఎవరు చేసింది అని అడిగాను. పోయిన నెల కొత్తగా ఉద్యోగానికి చేరిన నువ్వూ అని చెప్పారు బాబాయి. అందుకే నిన్ను పిలిచి అడుగుతున్నాను. ఎందుకని అలా అండర్ లైన చేసి, క్వోశ్చన్ మార్క్ గుర్తు వేశావు?” అడిగాడు ఆనంద్.  

దీని గురించి ఇతని దగ్గర నేను ఇంతకు ముందే అడిగేశాను ఆనంద్. కానీ నాతో చెప్పలేదు. నీ దగ్గరే చెబుతానని చెప్పాడు అన్నారు బాబాయి.

నా దగ్గర మాత్రమే చెప్పటానికి అందులో ఏముంది రహస్యం?”

సార్, మన కంపెనీకి రా మెటీరియల్స్ కొనడంలో ఎవరో అవకతవకులు చేస్తున్నారు సార్... అన్నాడు వెంకట్.

ఎలా చెబుతున్నావు?”

ఇనుప రేకులు మనకి భువనేశ్వర్ నుండి నలుగురైదుగురు డీలర్స్ కొన్ని  సంవత్సరాలుగా సప్లై చేస్తూ ఉన్నారు సార్. కానీ, గత రెండు సంవత్సరాలుగా రాయల్ ఇండస్ట్రీలో మాత్రమే కొంటున్నాము. వాళ్ళు పంపిన బిల్లులోనే నేను క్వోశ్చన్ మార్క్ వేసి అండర్ లైన్ చేశాను. అదే తారీఖులలో మిగిలిన ఇండస్ట్రీ డీలర్లు అదే రేకును రేటుకు అమ్మేరో ఫోను చేసి గుర్తుగా రాసుకున్నాను సార్. మార్కెట్ రేటు కంటే మూడు రెట్లు అధికంగా బిల్లు వేశారు. మనమూ ప్రశ్నలు అడగకుండా పేమెంట్పంపించాము. ఇలా అన్యాయ రేటు ఇచ్చి అతని దగ్గరే మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం ఏమిటి సార్?” అన్నాడు చేతులు కట్టుకుని.

నిన్ను ఎవరు అధిక ప్రసంగి తనంగా ఫోను చేసి రేటు వివరాలు విచారించమని చెప్పింది? నేనొకడ్ని ఎందుకు ఉన్నాను? నీ అనుమానాలను నా దగ్గర అడిగుండొచ్చు కదా? ఉద్యోగంలో చేరి ఒక నెల కూడా అవలేదు? నీకు మేనేజ్  మెంట్ గురించి అంత బాగా తెలుసా... అరిచారు బాబాయి సుబ్బారావ్.

ఉండండి బాబాయ్ అంటూ ఆయన్ని ఆపాడు ఆనంద్.

"అతను ఏదీ తప్పుగా చెప్పలేదే బాబాయ్? అతను ఎవర్నీ ఉద్దేశించి కూడా  చెప్పలేదే!  తనకు ఏర్పడిన న్యాయమైన అనుమానాలను అడుగుతున్నాడు. ఆశక్తినీ, తెలివితేటలనూ ప్రశంసించడం వదిలేసి, ఎందుకు అనవసరంగా అరుస్తున్నారు? అతను అడిగిందే నేను అడుగుతున్నాను. మార్కెట్టు రేటుకంటే మూడు రెట్లు ఎక్కువపెట్టి మూర్ఖుడైనా కొంటాడా? కూరగాయలు అమ్మే వాడి దగ్గర కూడా మనం బేరం మాట్లాడుతున్నామా, లేదా? ఒక బిల్లు నాలుగు లక్షలు. మొదటి బిల్లు రేటును చూసి మామూలు కంటే ఇంత ఎక్కువ రేటు ఎందుకు వేశారు అని అనుమానించాలి కదా. కానీ అది వదిలేసి, అదే రేటుకు అలా మూడుసార్లు కొన్నాము. అంటే నాలుగు లక్షల సరకును పన్నెండు లక్షలకు కొన్నాము

అదే నాకూ అర్ధం కావటం లేదు. మార్కెట్ రేటు తారీఖులలో కూడా తక్కువగా ఉండి ఉండచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండి ఉండచ్చు. రాయల్ ఇండస్ట్రీబాగా నమ్మకమైన పార్టీ అనుకున్నాం. మనల్ని మోసం చేశారు  అన్నారు బాబాయి.

సార్ నేనొకటి అడగనా?” అన్నాడు వెంకట్.

అడుగు

మన ఆఫీసులో పర్చేస్ కు ప్రత్యేకంగా బాధ్యతగల మేనేజర్ ఉన్నారే! మొదటి బిల్లు అమౌంట్ చూసి ఏమిటి ఇంత రేటు వేశారు?’ అని ఆరోజు మార్కెట్టు రేటు, ఆరోజు డిమాండు కనుక్కొని మొదటి బిల్లు తో డీలర్ దగ్గర నుండి మన పర్చేస్ ఆపేసి, మిగిలిన డీలర్స్ దగ్గర నుండి కొని ఉండొచ్చు. అలా చేయకుండా, అదే పార్టీకి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ఇచ్చి, బిల్లులపై సంతకాలు పెట్టి డబ్బు పంపవచ్చు అని నోట్ రాసేరు అంటే ఆయనకీ, కంపెనీకీ ఏదో రహస్య ఒప్పందం ఉండొచ్చని అనుకుంటున్నా. రేటు ఎక్కువగా వేయమని చెప్పి డబ్బు పంపించి డిఫెరన్స్ డబ్బును పంచుకుంటూ ఉండొచ్చు

ఒకవేల అలా ఉండొచ్చో?” అన్నారు బాబాయ్.

ఏమిటి బాబాయ్ అలా అడుగుతున్నారు? మిమ్మల్ని నమ్మే కదా ఫ్యాక్టరీ యొక్క పూర్తి బాధ్యతలను మీకు అప్పగించాను. మీరు ఒక్కొక్క బిల్లూ పేమెంటు చేసేటప్పుడు బాధ్యతగా చెక్ చేసి ఉండాలి కదా? మిమ్మల్ని నమ్మే కదా చెక్కు పుస్తకం పూర్తిగా సంతకం పెట్టి మీ భాద్యతలో అప్పగించాను అన్నాడు ఆనంద్.

ఎలా గమనించకుండా వదిలేశాను?” తనలో తనే గొణుగుతుంటే,

మొదట పోలీసులను పిలవండి

పోలీసులంతా వద్దు ఆనంద్...తప్పు చేసిన వాళ్లను పట్టుకుని నేను శిక్షిస్తాను, డిఫరన్స్ డబ్బును వసూలు చేస్తాను

ఆనంద్, వెంకట్ వైపుకు తిరిగాడు. షేక్ హ్యాండ్ ఇవ్వవయ్యా. చాలా బాధ్యతగా నడుచుకున్నావు. చాలా నచ్చింది. కీప్ ఇట్ అప్’! తరువాత...తప్పు చేసిన  వాడిపై బాబాయి వేరే విధంగా నడవడిక తీసుకుంటానంటున్నారు. బాధ్యత ఆయన్నే తీసుకోనివ్వు. విషయం గురించి ఇంకెవరి దగ్గరా చెప్పద్దు. ఎందుకంటే తప్పు చేసినవాడు తప్పించుకునే అపాయం ఉంది. అర్ధమయ్యిందా?” అన్నాడు.

సరే సార్ అని తన టేబులుకు తిరిగి వచ్చాడు వెంకట్.

ఆనంద్ తన బాబాయిని నమ్మి చెక్కు పుస్తకం పూర్తిగా సంతకం పెట్టి ఇచ్చేడనే విషయాన్ని మనసులో పదిలం చేసుకున్నాడు వెంకట్.

***************************************************PART-5*******************************************

పోయిన సంవత్సరం

బస్ స్టాండులో కాచుకోనుంది మహతీ.

పరీక్షించే లాగా అక్కడున్న మిగిలిన వాళ్ళకు వెంట వెంటనే బస్సు వచ్చి, ప్రయాణీకులను తీసుకు వెళ్ళింది. ఈమెకు కావలసిన బస్సు రాలేదు.

చేతులు కట్టుకుని చాలాసేపు కాచుకోనున్నది.

కొద్ది సేపట్లో ఆమె ముందుకు వచ్చి నిలబడింది పడవలాంటి కారు.

దాని చూసిన వెంటనే -- అది తన ఎం.డి ఆనంద్ గారి కారు అనేది  అర్ధమయ్యింది. ఉద్యోగంలో చేరిన మూడు నెలలలో, రెండు సార్లు మాత్రమే ఆమె ఆనంద్ ను చూసింది. ఆమె ఇంతవరకు అతనితో మాట్లాడింది లేదు.

కారు అద్దాలు కిందకు దిగ, కూలింగ్ గ్లాసులు వేసుకోనున్నఆనంద్ తొంగి చూసి నవ్వి హలో మేడం. ఎక్కండి. మీ ఇంటికి తీసుకువెళ్ళి దింపుతాను అన్నాడు.

పరవాలేదు సార్. నాకు బస్సు వస్తుంది

నాకేమీ శ్రమ లేదు. మీ యొక్క నిజాయతీ సేవ గురించి బాబాయ్ చాలా ఎక్కువ చెప్పారు. నా జ్ఞాపకశక్తి సరైతే, మీ పేరు మహతీ. మిస్సస్ మహతీ కల్యాన్. మీకు సహాయపడటానికి చిన్న సంధర్భం...రండి

తన ఎం.డి యొక్క నిజమైన రిక్వెస్టును ఎలా నిరాకరించాలో తెలియక మహతీ చిన్న సంసయంతో కారు వెనుక సీటులో ఎక్కింది.

కారు బయలుదేరిన తరువాత ఆనంద్ వెనుకకు చూసే అద్దాన్ని కొంచంగా సరి చేసాడు. వెనుక కూర్చున్న మహతీని చూడటానికి.

మన ఆఫీసులో చేరిన రెండు నెలలలోనే మీరు చాలా హార్డ్ వర్కర్ అని విన్నాను. మీ సేవ చాలా కాలం మా ఆఫీసుకు అందాలని విష్ చేస్తున్నాను

థ్యాంక్యూ

కల్యాన్ గారు ఏం చేస్తున్నారు?”

ఒక పెద్ద ఎలేక్ట్రికల్ కంపెనీలో సీనియర్ స్టెనోసార్

సీతమ్మపేటలోనే కదా మీ ఇల్లు?”

అవును సార్

దార్లో మిమ్మల్ని చూసింది ఒక విధంగా మంచిదే అయ్యింది మహతీ. నాకోక సహాయం చేస్తారా?”

చెప్పండి సార్?”

నా స్నేహితుడి కూతురికి రేపు పెళ్ళి. ఆమెకు ఒక జత లేటెస్ట్ డిజైన్ బంగారు పోగులు బహుమతిగా ఇద్దమనుకుంటున్నా. కానీ, నాకు ఆడవారి నగలు సెలెక్టు చేయటం తెలియదు. అరగంట ఆలస్యంగా మీరు ఇంటికి వెడితే పరవాలేదా? నాతో పాటూ నగల కొట్టుకు వచ్చి సెలెక్టు చేసి ఇవ్వగలరా?”

సరే సార్

నగకొట్టు ముందు కారును ఆపాడు ఆనంద్.

ఇద్దరూ లోపలకు వెళ్ళారు.

మహతీ, ఖరీదు ఎంతనేది సమస్య కాదు. మీకు నగ నచ్చిందో...దాన్ని సెలెక్టు చేయండి. అదే తీసుకుంటాను

ఒక కుర్చీలో కూర్చుని -- షాపతను ఇచ్చిన కూల్ డ్రింక్ ను తాగుతున్నాడు ఆనంద్. అరగంట సమయం గడిపి, మహతీ ఒక జత పోగులు సెలెక్టు చేసింది.

దానికి డబ్బులు కట్టి ఇద్దరూ బయటకు వచ్చారు.

నేను ఇక్కడి నుండి బస్సు పుచ్చుకుని వెళ్తాను సార్

ఇంత దూరం మిమ్మల్ని తీసుకు వచ్చి, ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యకపోతే మర్యాద కాదు! ప్లీజ్ ఎక్కండి

మళ్ళీ కారులో పయనించింది.

***************************************************PART-6*******************************************

సంవత్సరం

ఏమిటి నాన్నా బాగా నీరసంగా కనబడుతున్నారు?” అన్నాడు అశోక్.

సుబ్బారావ్ గారికి ఒకే కొడుకు.

ఆనంద్ మేలుకుంటాడేమోనని భయంగా ఉంది అశోక్ అన్నారు ఆనంద్ బాబాయ్ సుబ్బారావ్ గారు. పెద్ద నిట్టూర్పుతో సోఫాలో వెనక్కి వాలుతూ.

ఏమైంది నాన్నా?”

ఆఫీసులో వెంకట్అని ఒక కొత్త అకౌంటంట్ వచ్చాడు. మంచి పేరు  తెచ్చుకోవాలి అనే ఆదుర్దాతో వాడు అన్ని ఫైళ్ళనూ తవ్వి తొంగి చూస్తున్నాడు. పర్చేస్ విషయంలో భువనేశ్వర్ పార్టీతో చేరి దగ్గర దగ్గర ఏడు లక్షల వరకు నేను అవకతవక చేసాను. దరిద్రుడు దాని కనిబెట్టేశాడు. దాని గురించి ఆనంద్ కు తెలియపరిచాడు. పర్చేస్ మేనేజర్ తప్పును చేసుంటాడు అని ఒక విధంగా సమాధానపరిచి,  అతని మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి ఆనంద్ ను కామ్ చేసాను. కానీ, ఆనంద్ నా మీద కొంతైనా అనుమానపడి ఉంటాడు అని వర్రీగా ఉంది. వెంకట్ గాడు ఇంకా ఎన్ని కెలుకుతాడో. మరీ పాతవి కెలికితే మన దోపిడి అంతా అతనికి తెలిసి, అది ఆనంద్ కు తెలిసిపోతుంది అనేది  తలుచుకుంటే వర్రీ ఇంకా ఎక్కువ అవుతోంది”  

ఎందుకంత వర్రీ అవుతారు? ఆనంద్ ఒక మూర్ఖుడు నాన్నా. నిన్ను పోయి  అలాగంతా అనుమానపడడు. ఎన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్ముతున్నాడు. మీరు లేకపోతే వాడి ఆటలు సాగవు. మీరు వాడితో ఉండబట్టే వాడు వ్యాపారం గురించి పట్టించుకోకుండా వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు. వాడి ఆటలు సాగాలంటే వాడికి ఖచ్చితంగా మీరు కావాలి. వాడు, వాడి ఆటలకు బానిస అయిపోయాడు. అందుకని మీ జోలికి రాడు. మీరు కంగారుపడకండి

అదంతా సరే అశోక్. కానీ ఆనంద్ మూర్ఖుడు కాదు. మంచి తెలివిగలవాడు.  అతని తెలివితేటలను వ్యాపారంలో ఉపయొగించ నివ్వకుండా మొదటి నుంచే అతని దిక్కును మార్చి ఉంచాను. అతని యొక్క పెద్ద బలహీనం, స్త్రీల మీద ఉండే మోహం! దాని కోసం ఒక బాబాయి చేయకూడని పనులన్నీ నేను చేసున్నాను...అంతా దేనికోసం? అతని చూపంతా వేరే ధ్యాస మీద ఉండేటప్పుడే, అక్కడ్నుంచి కొంచం కొంచంగా డబ్బు దోచుకుందామనే కదా! ఇక మీదట అది కుదరదులాగుందే అశోక్ అన్నారు సుబ్బారావ్ గారు.

***************************************************PART-7*******************************************

పోయిన సంవత్సరం

మహతీ కంప్యూటర్ లో వర్క్ చేస్తోంది.

ప్యూన్ వచ్చి, “మ్యాడమ్, మిమ్మల్ని ఎం.డి గారు పిలుస్తున్నారు అన్నాడు.

మహతీ లేచి నడిచింది.

సార్...లోపలకు రావచ్చా?”

రండి మహతీ. కూర్చోండి అన్నాడు ఆనంద్.

టైములో గదిలో అతను మాత్రమే ఉన్నాడు.

పరవాలేదు సార్ అంటూ నిలబడింది.

మూడు కోట్ల రూపాయల సప్లై అగ్రీమెంట్ ఒకటి మన చేయి జారిపోయింది మహతీ...దాని గురించి మీకు తెలుసా?” అన్నాడు -- టేబుల్ మీదున్న ఫోను రీజీవర్ను ఉత్తినే తిప్పుతూ.

తెలియదు సార్

దానికి కారణం మనం ఇచ్చిన కోట్ కంటే ఇంకొకరు జస్ట్ వంద రూపాయలు తక్కువగా కోట్ ఇవ్వటమే. అంటే, మన ఆఫీసు రహస్యాలు ఎవరో ఒకరు మన శత్రు కంపెనీకి అందిస్తున్నారు.

ఇప్పుడు యాభై కోట్లకు ఒక కొత్త అగ్రీమెంట్ వేసుకునే ఛాన్స్ వచ్చింది. దీనికైన సెల్లింగ్ రేట్ కోట్ ను నేను రహస్యంగా రెడీ చెయ్యబోతాను. నాకూ మీకూ తప్ప, ఇంకెవరికీ ఇది తెలియకూడదు. ఇది పక్కా రహస్య ప్లాను. రహస్యాన్ని  కాపాడతావా...?”

ఖచ్చితంగా సార్

మంచిది! రేపు ప్రొద్దున పదిగంటలకు నేను ఆఫీసుకు రాబోయేది లేదు. హోటల్ పసిఫిక్ లో 408 నెంబర్ గదిలో ఉంటాను. మీరూ ఆఫీసుకు రాకండి. తిన్నగా అక్కడికి వచ్చేయండి. నేను ల్యాప్ టాప్ తో కాచుకోనుంటాను. మధ్యాహ్నము లంచ్ కు ముందే గబగబా కొటేషన్ రెడీ చేసి, అక్కడ్నుంచి పంపించేద్దాం. సరేనా?”

సరే సార్ అన్నది మూర్ఖత్వంగా!

***************************************************PART-8*******************************************

సంవత్సరం.

మేనేజర్ గదిలోకి, చేతిలో ఫైల్స్ తో వెళ్ళాడు వెంకట్.

ఏమిటీ?” అన్నారు సుబ్బారావ్ గారు.

నాలుగు ఫైల్స్ నూ నేను చెక్ చేసాను సార్. మీరు ఒకసారి చూసేస్తే, స్టేట్ మెంట్ తీస్తాను

ఉండండి అని చెప్పి, సుబ్బారావ్ గారు లేచి గదిలో నుండి అటాచ్ చేయబడ్డ స్నానాల గదిలోకి వెళ్ళి -- తలుపుకు గొళ్ళెం పెట్టుకున్నాడు.

అవకాశంతో వెంకట్ రెండు పనులు ముగించాడు.

టేబుల్ మీద ఆయన వదిలిపెట్టి వెళ్ళిన ఆయన టేబుల్ డ్రా తాళం చెవిని తన జేబులో పెట్టుకున్న సోపును తీసి దగ్గరున్న వాష్ బేసిన్ లో నీళ్ళతో తడిపి, దాంట్లో తాళంచెవి ముద్రను తీసుకున్నాడు.

రెండో పనిగా సుబ్బారావ్ గారి చిన్న సూట్ కేసును తీసి, అందులోని ప్లాస్టిక్ భాగంలో ఖచ్చితంగా సరిపొయే ఒక బటన్ సైజు కెమేరా ఫోనును  అతికించించాడు.

తరువాత -- మంచి వ్యక్తిలాగా కూర్చుని -- సుబ్బారావ్ గారి రాకకు కాచుకోనున్నాడు.

***************************************************PART-9*******************************************

పోయిన సంవత్సరం

హోటల్ పసిఫిక్. పది ఎకరాల స్థలాన్ని ఆక్రమించి, రెస్టారంట్, లాడ్జింగ్, మీటింగ్ హాలు, హైర్ కట్టింగ్ సెలూన్, మసాచ్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, వ్యాపార కేంద్రాలు, ఫిట్ నెస్ సెంటర్, బ్యూటీ పార్లర్ అంటూ సకల వసతులూ ఉన్నాయి.

హాలులోని నాలగవ అంతస్తులోని గది బాల్కనీలో నుండి చూస్తే ఒక వైపు హోటల్ ఎంట్రన్స్, మరో పక్క కదలకుండా ఉండలేని సముద్రపు అలలు తెలుస్తున్నాయి.

ఈజీ చైర్ లాంటి కుర్చీలో కూర్చుని -- కొంచం కొంచంగా మందు కొడుతూ వాకిలి వైపు చూస్తూ ఉన్నాడు ఆనంద్. ఆష్ ట్రేగుంటలో ఉంచబడిన సిగిరెట్టు -- కాలిపోతూ ఉండగా, లోపలున్న టేబుల్ మీద సంప్రదాయం కోసం లాప్ టాప్ఉంచబడింది.

టైము పదిన్నర అయినప్పుడు, ఒక ఆటోలో వచ్చి దిగింది మహతీ.

పసుపు రంగు చీరలో ఎర్ర పువ్వులు చిత్రించబడి ఉంది.

బాల్కనీలో నిలబడే ఇంకో యాంగిల్లో ఆమెను చూసిన ఆనందంతో లేచిన ఆనంద్, గబ గబా మందు బాటిల్ను, గాజు గ్లాసును అలమరాలో పెట్టేసి -- నోట్లో మౌత్ రెఫ్రెష్నర్జల్లుకుని -- న్యూస్ పేపర్ను తిరగేస్తున్నాడు. చిన్నగా వినబడ్డ తలుపుమీద కొట్టిన శబ్ధం విని ఎస్...కమిన్ అన్నాడు.

నమస్తే సార్. వచ్చేదారిలో కొంచం ఆలస్యం అయ్యింది అన్నది భవ్యంగా.

పరవాలేదు. కూర్చోండి

కుర్చీలో కూర్చుంది.

మిసస్ మహతీ. నేను ఎక్కువగా మన ఆఫీసుకే రావటం లేదు. అన్నీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఇప్పుడు కొన్ని రోజులుగానే మాటి మాటికీ ఆఫీసుకు వస్తున్నాను. అది ఎందుకో తెలుసా?”

తెలియదు సార్

"అబద్దం చెబుతున్నావు మహతీ. విషయాన్నైనా మగవారి కంటే ఆడవాళ్ళే త్వరగా అర్ధం చేసుకుంటారు. మీ వలన అర్ధం చేసుకోవటం కుదరటం లేదా?”

లేదు అని తల ఊపింది.

కారణం నువ్వే మహతీ

ఇపుడు అతని నవ్వులో వెకిలితనం ఉన్నది.

ఏమిటి సార్ చెబుతున్నారు?”

మీరేమన్నా ఎల్.కే.జి పాపా? ఏబిసిడి -- నుండి ప్రారంభించి చెప్పాలా? ఉండండి...

ఆనంద్ మంచానికి దగ్గరగా పెట్టున్న చిన్న సూట్ కేసు తెరిచి, అందులో ఉన్న చిన్న బాక్స్ తీసి, “ఉంచుకోండి... అన్నాడు.

చిన్న బాక్సును చూసిన వెంటనే -- అది రోజు నగల షాపులో కొన్న పోగులు ఉన్న బాక్స్ అనేది మహతీకి అర్ధమయ్యింది. 

దీన్ని ఎందుకు నన్ను ఉంచుకో అని చెబుతున్నారు? ఇది మీ స్నేహితుడి కూతురికి...

అబద్దం. నేను చెప్పేదంతా అబద్దం. మీకు నచ్చిన డిజైన్లోమీకు బహుమతిగా ఇవ్వటానికే కొన్నాను. తీసుకోండి అన్నాడు.

ఇప్పుడు మహతీకి అతని మాటలు, చూపులు అర్ధమయ్యింది.

అతని చూపులు పడిన చోట్లలో అమెకు తేళ్ళూ, జర్రులు పాకినట్లు అనిపించి గబుక్కున లేచింది.

క్షమించండి సార్. నాకు నగలు కొనివ్వటానికి నా భర్త ఉన్నారు

నవ్వుతూ ఆనంద్ ఆమె భుజంపై చేతులు వేయ, మరుక్షణమే అతని చేతిని తోసేసి, రెండడుగులు వెనక్కి వేసి, “ఛీ, ఛీ... అన్నది.

మహతీ తలుపు దగ్గరకు వెళ్ళి చెప్పులు వేసుకుని తల పైకెత్తగా, తలుపుకు ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి నవ్వాడు ఆనంద్.

మహతీ, ఇప్పుడు నిన్ను బలవంతంగా పట్టుకోవాలని నేను అనుకుంటే, అది  నాకు చాలా సులభం. కానీ, అది నాకు ఇష్టంలేదు. కోపరేషన్ లేకుండా...చప్పగా అయిపోతుంది. నా జాతకంలో దౌర్జన్యం లేదు. ఎవరి దగ్గరా నేను విషయంలో ఓడిపోయిందే లేదు. మొట్టమొదటి సారిగా నీ దగ్గర బ్రతిమిలాడుతున్నాను. ప్లీజ్...రా. ఎవరికీ నష్టం ఉండదు

తూ...

మహతీ ఉమ్మేసిన ఉమ్ము అతని మొహం మీద జారుతుండగా, ఆమె చటుక్కున తలుపు తెరుచుకుని, వేగంగా బయటకు వెళ్ళింది.

ఆనంద్ మొహం బాగా ఎరుపెక్కింది.

మహతీ! నా మొహం మీద ఉమ్మేసి వెళుతున్నావా? గెలిచినట్టు అనుకుని బయటకు వెళ్ళిపోయావా? ఇది నాకు ఓటమే. కానీ తాత్కాలికమైనది! ఓడిపోయిన వాడి తీర్పు ఎప్పుడూ కొంచం కృరంగానే ఉంటుంది. చూస్తావు. త్వరలో నువ్వు దాన్ని చూస్తావు?’ -- మనసులో సపధం చేసుకున్నాడు.

హోటల్ గదిలో నుండి వేగంగా బయటకు వచ్చి, తొందర తొందరగా ఆటో పుచ్చుకుని, తన ఇంటికి వెళ్ళమని చెప్పిన మహతీకి ఇంకా గుండె దడ తగ్గలేదు.

హ్యాండు బాగులో ఉన్న కర్చీఫును తీసుకుని మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంది.

ఎంత ఒక ఆయోగ్యతనం! తన స్నేహితుడి అమ్మాయికి అని చెప్పి, నగ సెలెక్టు చేయమని చెప్పి...ఆఫీసులో రహస్యాలు దొంగలించ బడుతున్నాయని చెప్పి నన్ను నమ్మించి, అనుమానమే రాకుండా హోటలు రూముకు రప్పించుకుని...ఎంత పెద్ద పన్నాగ నాటకం! నన్ను బలవంతం చేయటానికి ప్రయత్నించుంటే, నేను సింగిల్ .సి గదిలో ఏం చేసుండగలను?’

తలచుకుంటేనే ఒళ్ళంతా కంపరం పుట్టింది.

గబుక్కున మళ్ళీ చెమెటలు కార, చిన్నగా తల తిరగటం జరిగింది.

తలతిప్పటం హఠాత్తుగా ఎక్కువై నాలుక పొడిబారి, ఆటో గుండ్రంగా తిరుగుతూ పోతున్నట్టు కనబడ తడబడింది మహతీ.

డ్రైవర్! తల తిప్పుతున్నట్టు ఉంది. పక్కనున్న ఏదైనా ఆసుపత్రికి వెళ్ళండి...త్వరగా అని అరిచి, ఇనుప చువ్వను గట్టిగా పట్టుకుంది.

కళ్ళు తెరిచినప్పుడు తన ఇంట్లో, తన మంచంలో పడుకోనున్నది తెలుసుకోగలిగింది మహతీ.

దగ్గరున్న కుర్చీలో కూర్చోనున్నాడు కల్యాన్.

మందుల కవరుతో లోపలకు వచ్చిన వెంకట్, “ఇందులో ఒక టాబ్లెట్ మాత్రం ఇక్కడ దొరకలేదు. రేపు ఇంకో షాపులో తీసుకు వస్తాను అన్న అతను -- తిరిగి చూసి వదినా మేలుకున్నారా, కంగ్రాట్స్ అన్నాడు.

లేచి కూర్చున్న మహతీ ఎందుకు?” అన్నది ఆర్ధం కాక.

హాస్పిటల్ నుండి డాక్టర్ మా ఆఫీసుకు ఫోను చేసి చెప్పింది. నీ హ్యాండ్ బ్యాగులో ఉన్న నీ మొబైల్ ఫోనులో హబ్బీఅని మా ఆఫీసు ఫోను నెంబర్ ఉంది. నేను తమ్ముడికి ఫోను చేసి, ఇద్దరం ఆసుపత్రికి వచ్చి టాక్సీలో నిన్ను ఇంటికి తీసుకు వచ్చాము. ఇప్పుడు తలతిప్పటం ఎలా ఉంది మహతీ?” అడిగాడు కల్యాన్.

ఇప్పుడు కళ్ళు తిరగటం అంతా లేదు. నార్మల్ అన్న మహతీ అది సరే...ఎందుకు కంగ్రాట్స్ చెప్పారు?” అన్నది వెంకట్ ను చూసి.

వదినకు తెలియదంటే...? అప్పుడు మీరు చెబితేనే మంచిది అంటూ గదిని వదిలి వెళ్ళాడు.

ఏమంటున్నాడు?”

వాడు బాబాయ్ అవుతాడట. అదే చెబుతున్నాడు

కొద్ది క్షణాల తరువాతే ఆమెకు అర్ధమయ్యింది.

ఆటోలో వచ్చేటప్పుడే నువ్వు కళ్ళు తిరిగి వాలిపోయావు. ఆటో డ్రైవర్ నిన్ను హాస్పిటల్లో చేర్చేడు. డాక్టర్ నాకు ఫోను చేసి చెప్పినప్పుడు నేను భయపడిపోయాను. వెంటనే తమ్ముడికి ఫోన్ చేసి ఇద్దరం కలిసి అక్కడికి వచ్చాము. నిన్ను టెస్టు చేసిన డాక్టరమ్మ, నువ్వు గర్భంగా ఉన్నావని చెప్పింది అన్నాడు కల్యాన్.

మహతీ లో కొత్త వరదలాగా -- సంతోషం తరుముతూ దూకింది.

పెళ్ళి చేసుకుని రెండు సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు బాగ్యం దొరకలేదని బంధువులు కలత చెందటం -- మాట్లాడటమూ మొదలై -- కల్యాన్ కూడా ఒక రోజు ఇద్దరం వెళ్ళి చెక్ చేయించుకుందామా?’ అని అడగటం మొదలుపెట్టిన సమయంలో, అందరి ప్రశ్నలకూ, కలతలకూ పులుస్టాప్ పెట్టేలాగా హ్యాపీ న్యూస్!

అవునూ! నువ్వు ఎప్పుడూ బస్సులోనే కదా ఆఫీసుకు వెళతావు? రోజు ఎందుకు ఆటోలో వెళ్ళావు?” అడిగాడు కల్యాన్.

కొత్త సంతోషంలో మరిచిపోయున్న హోటల్ సంఘటన, కల్యాన్ ప్రశ్నతో  జ్ఞాపకం వచ్చింది. పరిస్థితిలో చెబుదామా, వద్దా? చెబితే ఏం జరుగుతుంది? కల్యానైనా సరే, వెంకట్ అయినా సరే...స్వీయ గౌరవం ఎక్కువగా చూస్తారు. ఒకసారి ఎక్జిబిషన్ కు వెళ్ళినప్పుడు ఎవరో ఇద్దరు యువకులు నన్ను చూసి కామెంట్  చేశారని కోపం అనుచుకోలేక, వాళ్ళిద్దరి చొక్కాలు పుచ్చుకుని గొడవపడ్డారు.

ఇంతపెద్ద వ్యవహారం జరిగిందని చెబితే న్యాయం అడుగుతాననిఅనే నెపంతో వెంటనే వెళ్ళి గొడవపడతారు.

అనవసరంగా పోట్లాటలూ, కేసులూ అవసరమేనా?’

వెళ్ళేనండి. ఆఫీసుకు వెళ్ళే దోవలో చిన్నగా కడుపులో తిప్పింది. వాంతి వచ్చేటట్టు అనిపించింది. ఆఫీసుకు వెళ్ళకుండా ఇంటికి వచ్చేద్దామని ఆటో పుచ్చుకున్నాను. దారిలో కళ్ళు తిరగటం జరిగిపోయింది

పరవాలేదు...వదులు. నేను మీ ఆఫీసుకు ఫోను చేసి చెప్పేశాను

ఏమని?”

హెల్త్ బాగుండలేదు. ఈరోజు సెలవు. రేపు వస్తుంది అని చెప్పాను

ఒక పేపరూ, పెన్నూ తీసుకు రండి చెబుతాను

దేనికీ!

తీసుకు రండి

కారణం అర్ధం కాక కల్యాన్ తీసుకు వచ్చాడు. తీసుకుని గబగబా రాసింది.

రాసింది అతనికి చూపించి చదవండి అన్నది.

గౌరవనీయులైన ఏం.డి. గారికి,

నమస్తే.

నా సొంత కారణాల కారణంగా నా ఉద్యోగానికి నేను ఈరోజు నుండి రాజీనామా చేస్తున్నాను.

ఇట్లు,

మహతీ

అతను చదివి ముగించగానే రేపు మా ఆఫీసులో ఇది ఇచ్చేయండి. మీకు సంతోషమే కదా?” అన్నది.

ఎందుకు మహతీ ఇంత హఠాత్తుగా?”

మన ఒప్పందం ప్రకారమే కదా నడుచుకుంటున్నాను?”

మొదటి బిడ్డ పుట్టేంతవరకు ఉద్యోగానికి వెళతానని చెప్పేవే?”

పుట్టిందే...నా కడుపులో. అందుకే!

ఏడో నెల వరకు కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు మహతీ. నాకేం లేదు

లేదండీ. వద్దు. నేను ఉద్యోగానికి వెళ్ళను, దానికో కారణం ఉంది

ఏమిటా కారణం?”

మొదటి సారిగా గర్భం దాల్చాను. అందులోనూ పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తరువాత. మన ఊర్లో బస్సు ఎక్కి, దిగటం ఒక పెద్ద మరణ అవస్త. కడుపులో బిడ్డకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే చెప్పాను

సరి...సరి. నువ్వు చెప్పేది కూడా న్యాయమే అన్నాడు కల్యాన్.

హమ్మయ్య అనుకుంది మహతీ.

***************************************************PART-10******************************************

సంవత్సరం

ఆనంద్ తన మొద్దుబారిన పెదాలతో, సుతిమెత్తని పెదాలను అదుముతున్నాడు. వీపంతా ముగ్గులు వేయటానికి వేయబడిన చుక్కలలాగా చెమట.

మెల్లగా అన్నది ఆమె.

మూడు గాజులు ఇంతవరకు ముక్కలైనై.

అప్పుడు సెల్ ఫోన్ మోగింది.

ముఖ్యమైన సమయంలో అడ్డుపడిన సెల్ ఫోనును కాల్చేటట్టు చూసి, అది ఆపకుండా మోగిస్తున్న పిలుపుతో మండిపడి, కోపంతో సెల్ ఫోన్ తీసుకుని ఆన్ చేసి హలో అన్నాడు ఆనంద్.

నమస్తే సార్. మిస్టర్ ఆనందే కదా మాట్లాడేది?”

అవును...ఇప్పుడేమిటి దానికి?” విసుగుతో గట్టిగా అరిచాడు ఆనంద్.

హలో, హలో...అరవకండి. నా పేరు మీకు అనవసరం. మీ స్నేహితుడ్ని అని పెట్టుకోండి. ఒక స్నేహితుడి బాధ్యతను నేను పూర్తి చేస్తాను

మంచంలో పడుకోనున్న అమ్మాయి, ఆనంద్ ని గట్టిగా పట్టుకోవటంతో...   “ఏయ్...బుద్దిలేనిదానా? కొంచం ఉండవే!

కొంచం ఉండవేనా? ...! చాలా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఫోను చేసానా? సారీ, కానీ మీరు ఇలాగే ఉంటే మీ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీకు మిగలదు. జాగ్రత్త!

ఇడియట్! నువ్వు ఎవర్రా?”

చెప్పాను కదా, నీ స్నేహితుడ్ని!

పిరికి అని పెట్టుకోరా మూర్ఖుడా!

ఏదో మీకు సహాయం చేద్దామని ఫోను చేసాను. నేను చెప్పేది వినకుండా  విసుగుతో ఎదిరించి మాట్లాడితే... తరువాత మీకు సహాయమే చేయను మిస్టర్. ఆనంద్

రేయ్ పిరికోడా! నాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు. నేనే వెయ్యి మందికి సహాయం చేయగలను

దానికి డబ్బు కావాలి కదా? ఇంకో రెండు రోజుల్లో నీకు లక్షల్లో నష్టం రాబోతోంది

మూర్ఖుడా! నువ్వు ఎవరనేది మొదట చెప్పరా...అప్పుడే నమ్ముతాను

చెప్పాను. నమ్మితే నమ్ము. నమ్మకపోతే పో. నాకు ఒక రూపాయి దండగ. నేను నీకు ఫోను చేయటం తప్పే మిస్టర్. ఆనంద్. సెల్ ఫోన్ ఆఫ్ చేసి మీ ఉల్లాసాన్ని గమనించండి

ఎవర్రా వీడు...దరిద్రుడు! అని గొణుగుతూ సెల్ ఫోన్ను పక్కన పడేసాడు ఆనంద్.

ఏమైంది?” అన్నది. తలలో ఉన్న మల్లె పూవులలో ఒకటి పీకి అతని గుండెల మీద విసురుతూ.

ఏమీ లేదు...ఎవడో ఒక పనిలేని మంగలి మాట్లాడాడు. అది సరే...నిన్నెవరు ఇంతలో డ్రస్సు వేసుకోమన్నది?” అన్నాడు.

***************************************************PART-11******************************************

పోయిన సంవత్సరం

ఊగే ఈజీ చైర్లో కూర్చోనున్నాడు ఆనంద్.

చేతిలో పట్టుకోనున్న మందు నిండిని గ్లాసులో వేయబడ్డ ఐసు ముక్కలు పూర్తిగా కరిగినా ఇంకా గుక్కెడు కూడా తాగకుండా, ఎదురుగా కూర్చున్న బాబాయ్ సుబ్బారావ్ ను చూస్తూ ఉన్నాడు.  

విషయాన్ని అంతటితో వదిలేయి ఆనంద్

ఎలా వదలగలను బాబాయ్? అవమానం...ఎంతపెద్ద అవమానం!

అవమానమే! కానీ, జరిగిన విషయం ఎవరికీ తెలియదు కదా ఆనంద్!

అది నిజమే బాబాయ్! కానీ, నా గుండె మండిపోతోందే. చిన్న బిడ్డ నా మీద ఉచ్చ పోస్తే కూడా, బిడ్డను చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఆమె, నా మొహాన ఉమ్మేసింది బాబాయ్! నా దగ్గర చెయ్యి జాపి జీతం తీసుకునే ఒక సాధారణ మనిషి!

సరే, దానికి ఏం చేయమంటావు?”

మీరే బాబాయ్ ఆలొచన చెప్పాలి. నాకు ఆమె కావాలి. ఒకసారి కావాలి. ఖచ్చితంగా కావాలి. మొదట ఆమె మీద ఆశతో ఇష్టపడ్డాను. ఇప్పుడు ఆమె మీద పగ తీర్చుకోవటానికి ఆమె కావాలంటున్నాను

ఆనంద్, నీకోసం నేను ఎవరెవరికో ఫోన్ చేసాను. రహస్యంగా కారులో పిలుచుకు వచ్చాను. కానీ, ఇది వేరు అబ్బాయ్. కుటుంబంలో ఉండే అమ్మాయి. అందులోనూ ఆమె మరునాడే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది

రాజీనామా చేసేస్తే వదిలేయ గలమా బాబాయ్? ఆలొచన చెప్పండి అంటే నీతులు చెబుతున్నారు? మీకు పెద్ద బుర్ర. మీకు ఎప్పుడూ యుక్తులు తడతాయి! అందుకే కదా మిమ్మల్ని నాతోనే ఉంచుకున్నాను. నాకు ఆమె కావాలి. ఎంత ఖర్చు అయినా సరే

సుబ్బారావ్ గారు ఆలొచిస్తునట్టు తన నుదిటి మీద గోక్కున్నాడు.

***************************************************PART-12******************************************

సంవత్సరం

శనివారం రాత్రి పదిన్నరకు గది వదిలి బయలుదేరాడు వెంకట్. షూలేసును గట్టిగా కట్టుకున్నాడు. కిళ్ళీ కోట్లో వక్కపొడి పొట్లం కొనుక్కుని చించి, దాంట్లో నుండి నాలుగు పలుకులు నోట్లో వేసుకుని అటుగా వెడుతున్న ఖాలీ ఆటోను చప్పట్లు కొట్టి పిలిచాడు.

అందులో ఎక్కి కూర్చొని తన ఆఫీసు ఉన్న వీధి చివర్లో దిగాడు.

ప్లాట్ ఫారం చివర బెంచి వేసి, వేడి వేడి ఇడ్లీలు తింటున్న వారి ఆకులకోసం ఎముకలు కనబడుతున్న కుక్క ఒకటి కాచుకోనుంది.

వీధి లైట్ల స్థంభాలలో ఒక స్థంభాన్ని కూడా వదలకుండా, అన్ని స్థంభాలపై సర్కస్ కంపెనీ వాళ్ళు ప్రకటన పత్రాలు అతికించున్నారు. మందమైన వెన్నెల వెళుతురులో పురుగులు ఎగరటం క్లియర్ గా కనబడింది.

చక్రాల బండీలో మిక్షర్ అమ్ముతున్న వృద్దుడు, బండికి నాలుగువైపులా గోనె సంచులు వేసి మూసేసి బయలుదేరుతున్నాడు.

వెంకట్, ఆనంద్ ఆఫీసు వెనుకకు వెళ్లటానికి దగ్గరున్న పంచాయతీ స్కూలు యొక్క గేటులేని కాంపౌండ్ లోపలకు దూరాడు.

స్కూలు వరాండాలో ఏడెనిమిది మంది ఒళ్ళు ముడుచుకుని పడుకుని నిద్ర పోతున్నారు. వెంకట్ కంటే అతని పొడవైన నీడ ముందు నడుస్తున్నది.

పొట్టిగా ఉన్న కాంపౌండ్ గోడపైకి ఒక జంపులో ఎక్కి -- అవతలి పక్కకు గెంతాడు -- కొంతసేపు రెస్టు తీసుకున్నాడు.

కటిక చీకటి! సెక్యూరిటీ, వాకిలివైపు కుర్చీలో కూర్చుని ఎప్పుడూ లాగా రేడియోలో ఒక్కొక్క స్టేషనూ తిప్పుతున్నాడు. ఇండియా స్టేషన్లు జైహింద్చెప్పిన తరువాత విదేశీ స్టేషన్ల కోసం ప్రయత్నిస్తాడు. బద్దకస్తుడు! చాలా బద్దకస్తుడు! తన జేబులోనుంచి డబ్బులు పడినా, దాన్ని ఏరి ఇవ్వటానికి ఇంకో మనిషి కోసం ఎదురు చూస్తాడు.

స్టోర్స్ గది వెనుకగా నిలబడ్డ వెంకట్, గదికున్న తుప్పు పట్టిన ఇనుప  చువ్వలను తీసే ముందు చేతికి గ్లౌజ్ వేసుకున్నాడు.

మరుసటి పదో నిమిషంలో అతను స్టోర్స్ గదిలోకి తన శరీరాన్ని దూర్చి మెల్లగా నేలను తాకిన వెంటనే, రెండు ఎలుకలు భయపడి పరిగెత్తినై.

పాత లెడ్జర్ పుస్తకాలు సర్ది పెట్టబడి ఉన్నాయి.

గది తలుపు గొళ్ళాలు సరిలేకపోవటంతో, దగ్గరకు వేసున్నాయి.

అందువలన సులభంగా రెండు తలుపులనూ తోసి, ఆఫీసు లోని పొడవైన హాలులోకి ప్రవేశించాడు.

ప్యాంటు జేబులోకి చెయ్యి పోనిచ్చి, ప్యాకెట్ టార్చ్ తీసి ఆన్ చేసి, నిదానంగా నడుస్తూ మేనేజర్ గది ముందుకు వచ్చాడు.

దగ్గరున్న బోర్డులో తగిలించి ఉన్న తాళం చెవి తీసుకుని గది తలుపు తెరిచాడు.

లోపలకు వచ్చాడు.

సుబ్బారావ్ గారి టేబుల్ ను సమీపించాడు.

సోపు ముద్దతో అచ్చు తీసుకుని తయారు చేసుకున్న తాళంచెవితో టేబుల్ డ్రాను సులభంగా తెరిచాడు.

సొరుగులోపలకు టార్చ్ వెలుతురు కొట్టాడు.

వేరు చేతితో వెతికి చెక్కుపుస్తకాన్ని బయటకు తీసాడు.

చెక్కు బుక్కు పుస్తకాన్ని వేగంగా తిరగేసాడు. అన్ని చెక్కుల మీదా ఆనంద్ సంతకం పెట్టున్నాడు.

వెంకట్, పైనున్న మొదటి చెక్కును మాత్రం చింపి తీసుకున్నాడు. కంపెనీ పేరు  ప్రింటు చేయబడ్డ కవరులో దాన్ని బద్ర పరిచి, తన చొక్కా లోపల వేసుకున్నాడు.

తరువాత అన్నిటినీ ఇంతకు ముందు ఉన్నట్టే అమర్చి తాళం వేసాడు.

మళ్ళీ స్టోర్స్గది ద్వారా బయటకు వచ్చి, ఊడదీసిన ఇనుప చువ్వలను మునుపటిలాగా అమర్చి, బిగించి, గోడ ఎక్కి గెంతి స్కూలు ద్వారా వీధికి వచ్చాడు.

నడవటం మొదలుపెట్టాడు...నిదానంగా.

***************************************************PART-13******************************************

పోయిన సంవత్సరం

సార్, మీకు ఫోను

కల్యాన్ తన టేబుల్ వదిలి లేచి వెళ్ళి, అకౌంటంట్ టేబుల్ పైన ఉన్న రిజీవర్ను ఎత్తి, “కల్యాన్ మాట్లాడుతున్నాను అన్నాడు.  

నేను వెంకట్ మాట్లాడుతున్నా అన్నయ్యా

ఏమిట్రా?...లాండ్ లైనుకు ఫోను చేసావు?”

ఏమీ లేదన్నయ్యా...నా సెల్ ఫోనులో చార్జ్ అయిపోయింది. అందుకే

సరే. విషయం ఏమిటో చెప్పు?”

బెంగళూరులో ఒక కంపెనీకి ఇంటర్వ్యూ కు వెళ్ళాను కదా? వాళ్ళు మళ్ళీ నన్ను సెకెండ్ ఇంటర్వ్యూ కు రమ్మని -మైల్ పంపించారు. రేపు సాయంత్రం నాలుగింటికి ఇంటర్వ్యూ. నేను ఇప్పుడే బయలుదేరతాను. ఏదైనా బస్సు పుచ్చుకుని వెళతాను. అది చెప్పటానికే ఫోను చేశాను

సరే వెంకట్...ఆల్ బెస్ట్...

థ్యాంక్స్ అన్నయ్యా

బెంగళూరులో ఎక్కడ స్టే చేస్తావు?”

నా స్నేహితుడు ఒకతని ఇంట్లో స్టే చేస్తాను

అక్కడ సీజన్ చాలా బాగుందని, నాతో పని చేసే ఒకాయన చెప్పారు. స్నేహితుడితోనే కదా ఉండబోతావు. ఒక వారం ఉండిరా. ఖర్చులకు వదిన దగ్గర ఐదువేలు తీసుకు వెళ్ళు. చాలా...?”

అంత అవసరం లేదన్నాయ్యా! రెండు వేలు చాలు

పిసినారిలాగా మాట్లాడకు...ఐదువేలు తీసుకు వెళ్ళు

సరే అన్నయ్యా అన్న అతని స్వరం కొంచం బొంగురుపోయింది.

ఇంటర్వ్యూ అయిన తరువాత ఫోను చెయ్యి...సరే పెట్టేయనా?”

కల్యాన్ తన కుర్చీకి వచ్చాడు.

సమయం నాలుగు గంటల పది నిమిషాలు అనేది గడియారం ముల్లులు చూపించినై.

టీ తాగుతూ, మళ్ళీ ఫైళ్ళలోకి తల దూర్చాడు కల్యాన్.

పావు గంట తరువాత మళ్ళీ ఫోను మోగింది.

లేచి వెళ్ళాడు. చెప్పరా?” అన్నాడు మళ్ళీ తమ్ముడే మాట్లాడుతున్నాడనుకుని.

కల్యాన్ గారేనా?”

అవును...మీరెవరు?”

సార్. నమస్తే. నా పేరు డాక్టర్. చక్రవర్తి...కొద్ది సేపటి క్రితం నేను కారులో వెలుతున్నప్పుడు, ఒక స్త్రీ మీద తెలియక ఢీ కొన్నాను. బలమైన దెబ్బ ఏదీ లేదు. నేనొక డాక్టర్ని. అందువలన వెంటనే ఆమెను ఎత్తి నా కారులో పడుకోబెట్టి, నా క్లీనిక్ కు తీసుకు వచ్చి చికిత్స ఇచ్చాను.  

ఇప్పుడు ఆమె బాగానే ఉన్నది. మాట్లాడుతోంది. తన పేరు మహతీ అని చెప్పి, మీ మొబైల్ ఫోను నెంబరూ, ఆఫీసు నెంబరూ ఇచ్చింది. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అందుకే ఆఫీసు నెంబరుకు చేసాను. ఆమె ఇప్పుడు నిద్రపోతోంది. మీరొచ్చి పిలుచుకు వెళతారా సార్?”

మై గాడ్! ఆమెకు ఏమీ లేదుగా?”

ఏమీ లేదు సార్. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మోకాళ్ళ మీద, తల  మీద చిన్న గాయాలు. తప్పు నాదే. క్షమించాలి. నేరుగా మాట్లాడదాం. నేను అడ్రస్సు చెబుతాను, నోట్ చేసుకోండి

క్లీనిక్ పేరు, అడ్రస్సు రాసుకున్నాడు కల్యాన్.

వెంటనే మేనేజర్ గదికి వెళ్ళి, పర్మిషన్ తీసుకుని తన స్కూటర్ పై బయలుదేరాడు.

అరగంట సమయంలో క్లీనిక్ ఉండే ఏరియా చేరుకుని, నోట్ చేసుకున్న అడ్రస్సుకు వచ్చినప్పుడు కన్ ఫ్యూజ్ అయ్యాడు.

క్లీనిక్ తాళం వేసుంది. 

అప్పుడు ఒక మనిషి అతని దగ్గరకు వచ్చి, “మీ భార్యను వెతుక్కునే కదా వచ్చారు?” అన్నాడు.

అవును

అదిగో నిలబడుంది చూడండి వ్యాను. అందులో పడుకోబెట్టారు. హాస్పిటల్లో చేర్చాలట. మిమ్మల్ని వ్యాను దగ్గరకు రమ్మని డాక్టర్ పిలిచాడు

స్కూటర్ను అక్కడే ఓక్ చెట్టు నీడ కింద నిలబెట్టి, తాళం వేసి, వేగంగా వెళ్ళాడు.

నిలబడున్న వ్యానులో ఇంజెన్ రన్ అవుతోంది. వెనుక తలుపు తెరిచి ఇతను లోపలకు ఎక్కీన వెంటనే, అది బయలుదేరింది.

తలుపులు మూసుకున్నాయి.

లోపల మహతీ లేదు. బదులుగా దృఢమైన శరీరంగల నలుగురు ఉన్నారు. నలుగురూ నల్ల గుడ్డలతో ముఖం కప్పుకోనున్నారు.

ఎవరు మీరంతా...నా మహతీ ఎక్కడ?”

టెన్షన్ పడకండి సార్. మీ భార్యకు ఏమీ అవలేదు. సురక్షితంగా మీ ఇంట్లో ఉన్నది. ఆమె నలుపా-తెలుపా అని కూడా మేము చూసింది లేదు. మిమ్మల్ని ఇలా రప్పించి రహస్యంగా కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళటానికే టెలిఫోనులో అబద్దం చెప్పాము అన్నాడు ఒకడు.

కిడ్నాపా...నన్నా? నేనేమన్నా డబ్బుగల ఇంటి మనిషినా, లేక రాజకీయ నాయకుడినా?”

నటించకు కల్యాన్. మా స్నేహితుడు రాజేశ్వరయ్యని దయా దాక్షణ్యాలు  చూడకుండా హత్య చేసేవే! దానికి జవాబు చెప్పక్కర్లేదా?”

ఇబ్బంది కరమైన పరిస్థితుల్లో కూడా కల్యాన్ కు నోరారా నవ్వాలని అనిపించింది.

రాజేశ్వరయ్యా... పేరును నేను వినను కూడా లేదు. మీ స్నేహితుడా? నేను హత్య చేసానా?”

విడి విడిగా అడిగితే లేదని అయిపోతుందా? మేమొక టెర్రరిస్టు గుంపు. దేనికీ భయపడము. రాజేశ్వరయ్యని నువ్వే హత్య చేసావని మాకు కరెక్టు వార్త వచ్చింది. నిన్ను రహస్యంగా కిడ్నాప్ చేసి తీసుకు రమ్మని మా అధికార వర్గం నుండి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ను మేము ఇప్పుడు విజయవంతంగా నెరవేర్చాము. సారును పట్టుకుని కట్టేయండిరా

కల్యాన్ కు భయం వచ్చేసింది.  

చెప్పేది వినండి. నేను అమాయకుడ్ని. నన్ను ఏం చేయకండి ప్రామిస్ గా నేను ఎవర్నీ హత్య చెయ్యలేదు అంటూ అరుస్తూ భయపడి దిగుతున్నప్పుడే తాడుతో కట్టేయబడ్డాడు.

కల్యాన్ నోటి మీద ఒక వెడల్పాటి ప్లాస్టర్అతికించబడింది.

అవతారంలో కల్యాన్ ని వీడియో తీశాడు, గుంపులోని ఒకడు.

***************************************************PART-14******************************************

సంవత్సరం

వెంకట్ అద్దానికి ముందు నిలబడి అతికించుకున్న గడ్డాన్నీ, అతికించుకున్న మీసాన్నీ పెట్టుకుని--అది సరిగ్గా అమరిందా లేదా అని ఒకసారి చూసుకున్నాడు. వెడల్పైన నళ్ళ కళ్ళద్దాలు వేసుకున్నాడు.

అప్పుడు అతనికే అతని మొహం వ్యత్యాసంగా కనబడింది. ఇస్త్రీ చేసి రెడీగా ఉంచుకున్న పచ్చరంగు సఫారీ డ్రస్సును వేసుకుని, షూ వేసుకున్నాడు.

గదికి తాళం వేసి బయలుదేరాడు.

టాక్సీఅని పిలిచి, అందులోకి ఎక్కి కూర్చున్నాడు.

ఎక్కడికి వెళ్ళాలి సార్?”

"మన ముఖ్యమంత్రి గారి ఇంటికి

డ్రైవర్ ఒకసారి వెనక్కి తిరిగి అతని ముఖం చూసి, అంతవరకు ఈలపాట పాడుతున్నది ఆపి నిదానంగా కారు నడిపాడు.

కొద్ది సమయంలో ముఖ్యమంత్రి ఇల్లు.

విచారణ తరువాత లోపలకు అనుమతించబడ్డాడు.

తరువాత రిసెప్షన్ హాలులో ఏడెనిమిది మంది కూర్చోనుండ, ఒక పి. వచ్చి ఎస్ ప్లీజ్?” అన్నాడు.

నేను ఆర్. ఆర్. కంపెనీ యొక్క జి.ఎం. సుబ్బారావ్. రోజు ముఖ్యమంత్రి గారిని చూడటానికి నిన్ననే ఫోనులో అపాయింట్ మెంట్అడిగాను. పదిన్నరకు రమ్మన్నారు అన్నాడు వెంకట్.

సరే...కూర్చోండి

కరెక్టుగా పదిన్నరకు వెంకట్ని లోపలకు పంపారు.

ముఖ్యమంత్రి నవ్వుతూ ఆహ్వానించారు.

సార్, మా కంపెనీ సంవత్సరం గోల్డన్ జూబ్లీ జరుపుకుంటోంది. దాని జ్ఞాపకార్దం ఏదైనా సంఘ సేవ చెయ్యాలని మా ఎం.డి. ఆనంద్ గారు తీర్మానించారు. తిన్నగా మేమే చేయటం కంటే, ప్రభుత్వం ద్వారా, మీ చేతుల మీదగా చెయ్యాలని అనుకున్నారు. చెక్కును మీదగ్గర ఇచ్చేసి రమ్మన్నారు. ముఖ్యమంత్రి సేవా పధకం ఫండ్స్ కింద కోటి రూపాయల చెక్కును వాడుకోమన్నారు. డబ్బును చిల్డ్రన్ వెల్ ఫేర్ కు ఖర్చు పెడితే సంతోషంగా ఉంటుందని చెప్పారు

వెంకట్ భవ్యంగా లేచి నిలబడి, చెక్కు ఉన్న కవర్ను జాప, ముఖ్యమంత్రి తీసుకున్నారు.

ఇంతపెద్ద మొత్తాన్ని దానంగా ఇవ్వటానికి చాలా పెద్ద మనసు కావాలి. మీ ఎం.డి. కి నా థ్యాంక్స్ చెప్పండి

ఆయన ఊర్లో లేరు సార్. అందువలనే నన్ను పంపారు. ఆయన తిరిగి రావటానికి రెండు రోజులు పడుతుంది. వచ్చిన వెంటనే ఫోన్ చేసి మీ అపాయింట్ మెంట్ తీసుకుని మిమ్మల్ని కలుస్తానని చెప్పారు

చాలా సంతోషం అని నమస్తే పెట్టారు.

***************************************************PART-15******************************************

పోయిన సంవత్సరం.

రాత్రి ఏడు గంటలకు వీధి చివర తన కారును ఆపి నడిచివచ్చిన ఆనంద్ వీధిలో ఒక్కొక్క ఇంటినీ దాటుతున్నప్పుడు కంటిన్యూ గా టీ.వీ మాటలు వినబడగలిగాడు.

రోడ్డు చీకటిగా ఉంది. చాలా గుడిసెలు చూపుల్లో పడ్డాయి. ఇళ్ళల్లో నలభై వాట్స్బల్బుల కంటే ఎక్కువ లేకుండా కాంతి వెలుగుతున్నాయి. వెదజల్లుతున్నాయి.

మహతీ ఇంటి ముందు నిలబడ్డాడు.

కాలింగ్ బెల్ నొక్కి కాచుకోనున్నాడు.

సాయంత్రం ఐదున్నరకల్లా ఇంటికి తిరిగొచ్చే భర్త - ఏడు దాటినా ఇంకా రాలేదేమిటా అనే ఆందోళనతో ఉన్న మహతీ కాలింగ్ బెల్లు శబ్ధం విన్న వెంటనే భర్తే అనుకుని నవ్వుతూ తలుపు తెరిచింది.

నవ్వు వెంటనే రద్దు అయ్యి, మొహం వాడిపోయింది.

బాగున్నావా...ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలకు రావచ్చా?”

ఆయన ఇంట్లో లేరు. తరువాత రండి

నేను నీతోనే మాట్లాడాలి

ఆయన ఉన్నప్పుడే మాట్లాడాలి

ఆయన గురించే మాట్లాడాలి

అర్ధంకాక ఆశ్చర్యంతో చూసింది మహతీ.

లోపలకు వచ్చి హక్కుగా చెక్క కుర్చీలో కూర్చుని తాగటానికి మంచి నీళ్ళు తీసుకురామ్మాఅన్నాడు ఆనంద్.

ఇష్టం లేకుండానే చెంబుతో మంచి నీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చింది.

తీసుకుని తాగి, “విషయం ఏమిటంటే మహతీ, క్లుప్తంగా చెప్పాలంటే, నీ భర్త నా కస్టడీలో ఉన్నాడు. అంటే, నేను కళ్ళు ఊపితే, అతని ప్రాణం కూడా కలిపి  ఊగుతుంది...

పిచ్చిదానిలాగా చూసింది మహతీ.

నమ్మవా...తెలుసే! నాకు నీ గురించి బాగా తెలుసు. దీన్ని నువ్వు సులువుగా నమ్మవని. అందుకే, దీన్ని తీసుకు వచ్చాను. దీన్ని చూడు మహతీ అంటూ తన సెల్ ఫోనులోని వీడియో చూపించాడు.

ఆనంద్ చూపించిన వీడియోలో, కాళ్ళూ-చేతులూ కట్టబడ్డ పరిస్థితిలో - నోటిపై ప్లాస్టర్అతికించబడి నేల మీద పడుకోనున్నాడు కల్యాన్. పరిస్థితిలో తన భర్తను చూసిన మాత్రానే చూపుల్లో చీలికలు ఏర్పడ్డాయి.

అయ్యో! ఎందుకు ఇలా చేశారు...ఆయన ఏం తప్పు చేసారు? ఆయన్ని వదిలిపెట్టండి

ఖచ్చితంగా వదిలిపెడతాము...నేను చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే! వెళ్ళి ఒక పేపరూ, పెన్నూ తీసుకురా...హూ...త్వరగా. ఆలస్యం చేయకు. ఎందుకు అని అడుగుతూ టైము వేస్టు చేయకు

మహతీ వెంటనే తీసుకు వచ్చింది.

టేబుల్ మీద పెట్టి రాయి. నేను చెప్పినట్టు రాయి. ...నన్ను అలా చూస్తూ నిలబడితే ఏమీ ప్రయోజనం లేదు. రాయి

బాల్ పాయింట్ పెన్నును తెరిచిన మహతీ ఏం రాయాలీ?” అన్నది.

చెప్తాను.

ప్రియమైన నా భర్తకు - మహతీ నమస్కరించి రాయునది! కొద్ది కాలంగా శేఖర్ అనే అతనితో నాకు పరిచయం ఏర్పడి, కొత్త స్నేహం లోతుగా పెరిగింది. శేఖర్ మీ కంటే అందంలోనూ-వసతిలోనూ గొప్పవాడు. మా స్నేహం ప్రేమగా మారింది. పెళ్ళి అనే బంధం మా ప్రేమకు పెద్ద అడ్డుగా నిలబడుతోంది. చాలా ఆలొచించి నిర్ణయానికి వచ్చాను.

రోజు నేనూ, శేఖరూ ఊరు వదిలి బయలుదేరి వెళుతున్నాము...ఒక కొత్త జీవితం కోసం. ఇది తప్పే. చెయ్యకూడని పనే. కానీ, నా వలన శేఖర్ను మరిచిపోవటం కుదరటం లేదు. అందువల్ల మిమ్మల్ని వదిలి వెళుతున్నాను. నన్ను వెతక వద్దు. నన్ను క్షమించండి. మరిచిపొండి.

ఇట్లు,

మహతీ.

రాసావా? అందంగా సంతకం పెట్టమ్మా

సంసయిస్తూ, తడబడుతూ నిలబడ్డ మహతీకి మధ్యలో వీడియో చూపబడి-బెదిరించ...వణుకుతున్న వేళ్లతో ఉత్తరాన్ని రాసి ముగించింది మహతీ.

ఆనంద్ దాన్ని తీసుకుని, చదివి చూసి, మడతపెట్టి టేబుల్ పై పెట్టి,  ఎగిరిపోకుండా ఉండటానికి దానిపై టేబుల్ క్లాక్ పెట్టాడు.

మహతీ, రామ్మా అన్నాడు.

ఎక్కడికి?”

మీ ఆయన్ని చూడద్దా?”

అతనితో బయలుదేరటం తప్ప మహతీకి వేరే దారి లేదు.

ఇంటికి తాళం వేసి బయలుదేరింది.

వీధి చివరి వరకు ఇద్దరూ మౌనంగా నడుస్తూ వచ్చారు. తన కారులో  ఎక్కించుకున్న ఆనంద్, ఆమెను వెనుక సీటులో కూర్చోమని చెప్పి కారును డ్రైవ్ చేశాడు.

కొద్ది సేపట్లో ఆనంద్ యొక్క బంగళాకు వచ్చారు.

మేడ మీదున్న గదిలోకి వెళ్ళి -- అక్కడ ఎవరూ లేరనేది గ్రహించి వెనక్కి తిరుగుతున్నప్పుడు, తలుపులు మూస్తున్నాడు ఆనంద్.

వద్దు! అన్నది.

లేదు కావాలి అని నవ్వాడు. ఇలా చూడమ్మా మహతీ. నీ భర్త నా పిడిలో  ఉన్నాడు. కానీ, ఇక్కడ లేడు. ఒక ఫోను చేస్తే వాడ్ని వదిలేస్తారు. నేను ఫోను  చెయ్యాలంటే నువ్వు నాతో సహకరించాలి. అరవకూడదు. గది మొత్తం పరిగెత్త కూడదు. నాకు దౌర్జన్యం నచ్చదు

తన చొక్కా విప్పుతూనే ఆమె వైపుకు నడిచి వచ్చాడు.

వద్దు. దగ్గరకు రావద్దు అన్నది. భయంతో స్థంభించిన ఆమె, అప్పుడు గబుక్కున దగ్గరగా తగిలించి ఉన్న అద్దం వేసున్న ఫోటోను ఊడదీసి, నేల మీద పడేసి పగలకొట్టి పొడవుగా ఉన్న కొంచం పెద్ద అద్దం ముక్కను తీసుకుంది.

 రావద్దు. దగ్గరకు రావద్దు!

దీన్ని కూడా ఆలొచించి ఉంచాను మహతీ. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకోవటం వలన ఏమిటి లాభం? నీ చేత్తో రాసిన ఉత్తరంలో ఉన్న విషయం నీ మీద ఎంత పెద్ద అపవాదును మోస్తున్నదో తెలుసా?

నీ భర్తను వదిలేస్తాను. అతను ఉత్తరాన్ని చదివి, నీ గురించి ఏమనుకుంటాడు? చనిపోయేటప్పుడు పరువుపోయినదానిలా చావాలా? వద్దు. దాన్ని కింద పడేయి ఎగతాలిగా చెప్పాడు.

దానికి గట్టిగా సమాధానం చెప్పింది మహతీ. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదానిని కాదురా నేను. అదే సమయం నువ్వు విధంగా బెదిరించినా, నా మానాన్ని పోగొట్టుకోను. నన్ను ఇక్కడ్నుంచి వెళ్ళనివ్వు

లేకపోతే?”

నన్ను నేను కాపాడుకోవటానికి హత్య చెయటానికి కూడా సంసయించను

అలాగా? అది కూడా చూద్దామే!

ఆనంద్ పట్టుదలగా జరగ -- ఆమె, అద్దం ముక్క పుచ్చుకున్న చేతిని అతని వైపుకు ఎత్తింది. ఆవేశంతో అతని శరీరంలో గుచ్చటానికి ప్రయత్నించినప్పుడు, ఆమె  రెండు చేతులనూ బలంగా పట్తుకున్న ఆనంద్ -- ఆమె చేతిని అలాగే ఆమె వీపు వైపుకు తిప్పి, కాలుతో మధ్యలో తన్నాడు

అమ్మా! అని అరుస్తూ, గోడమీద పడింది. తలకి దెబ్బ తగిలి రక్తం చిందుతూ , నేల మీదకు జారి పడిన మహతీ యొక్క ప్రాణం వెంటనే పోయింది.

కానీ, ఆమె కడుపులో ఉన్న నలభై ఐదు రోజుల పిండానికి ఇంకా ప్రాణం ఉన్నది.

***************************************************PART-16******************************************

సంవత్సరం

వాట్ నాన్ సెన్స్! అని న్యూస్ పేపర్లను ఎత్తి తన బాబాయ్ ముందు ఆవేశంగా పడేసాడు ఆనంద్.

చేతులు కట్టుకుని మౌనంగా నిలబడ్డారు బాబాయ్ సుబ్బారావ్.

కోటి రూపాయలు డోనేషన్ చేసినందుకు, పొద్దుటి నుండి మారి మారి ఎవరెవరో  ఫోనులు చేసి అభినందనలు తెలుపుతున్నారు. ఆర్. ఆర్కంపెనీ యొక్క జి.ఏం. సుబ్బారావ్, ముఖ్యమంత్రిని కలిసి తన ఏం.డీ. తరఫున చెక్కును అందించారని క్లియర్ గా రాసున్నారు. కానీ, మీరేమిట్రా అంటే...మీకు ఏమీ తెలియదని సాధిస్తున్నారు.మా బాకీలు తీర్చండి అని అడిగితే, కోట్లలో నష్టం అంటూనే కోటి రూపాయలు ముఖ్యమంత్రి నిధికి విరాళం ఇచ్చారుమా బాకీ వెంటనే సెటిల్ చెయ్యకపోతే మీ మీద పోలీసుల దగ్గర కంప్లైంట్ చేస్తామూ అని డీలర్లు అందరూ బెదిరిస్తున్నారు

ఆనంద్ మళ్ళీ చెబుతున్నాను. నిన్నటి రోజంతా నేను ఇంట్లోనే ఉన్నాను. మన ఆఫీసులోకి దూరి ఎవరో ఒక దొంగ, నా టేబుల్ డ్రా లో పెట్టుకున్న చెక్కు బుక్కులో నుండి ఒక చెక్కును దొంగలించి, నా పేరు చెప్పి అక్కడ ఇచ్చినట్టున్నాడు.

ఇప్పుడు మన దగ్గరున్నది మన డబ్బు కాదు. బ్యాంకు అప్పు. అన్ని ఆస్తులనూ తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బు. డబ్బు కూడా మనకు చాలదు. బ్యాలన్స్ డబ్బులో కోటి రూపాయలు తీసి ప్రభుత్వానికి ఇవ్వటానికి నేనేమన్నా మూర్ఖుడినా? ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతపెద్ద దుర్మార్గానికి పూనుకుంటానా?...నీకూ, నాకూ ఏమిట్రా పగ? నేనెందుకు ఇది చేస్తాను అన్నారు, దుఃఖమైన స్వరంతో.

ఇప్పుడేం చేయాలి బాబాయ్? ఇలా తప్పు జరిగిపోయిందని చెప్పి ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడదామా?”

అన్ని పత్రికలలోనూ వచ్చేసింది ఆనంద్. ఇప్పుడు వెళ్ళి తిరిగి ఇవ్వండి అంటే బాగుంటుందా?”

హఠాత్తుగా కోటి రూపాయలు విరాళం, సమాజ అభివ్రుద్దికి ఇచ్చేంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది బాబాయి? రేపటి ఖర్చులకే మనం అందులో నుండే డబ్బులు తీయాలి

కరక్టే. పళ్ళు బిగించి సరి చేసేద్దాం. వేరే దారి లేదు

ఏమిటి బాబాయ్, అన్నీ తెలిసి అలా సింపుల్ గా చెబుతున్నారు. ఎంత  వ్యాపారం చేస్తే మనకి కోటి రూపాయలు సంపాదన వస్తుంది. దానికి మనం ఎంత వ్యాపారం చెయ్యాలి. ఇప్పుడు మార్కెట్టులో మన బ్రాండుకు డిమాండ్ తగ్గింది. టర్న్ ఓవర్ తగ్గిపోయింది. ఇప్పటికే మన వినియోగస్తులు, డీలర్స్ వాళ్ల బ్యాలన్స్ ఇవ్వలేదని ముడిసరకు ఇవ్వటం మానేసేరని మీరే చెబుతున్నారు. మన వ్యాపారాన్ని బాగు చేయాలని ఎన్ని కొత్త ఐడియాలు, ప్లానులూ వేశాము. టైములో ఇంటి కాయితాలు సెక్యూరిటీ ఇచ్చి కోటిన్నర అప్పు తీసుకుంటే,  అందులో కోటి రూపాయలు విరాళమా...? బాబాయ్ కార్యం ఎవరు చేసేరని నాకు తెలిసే కావాలి. వాడ్ని తీసుకు వచ్చి నా ఎదురుగా నిలబెట్టండి

ఖచ్చితంగా అని చెప్పి తన సూట్ కేసుతో బాబాయ్ వెళ్ళి పోయిన కొద్ది నిమిషాల తరువాత ఆనంద్ సెల్ ఫోన్ మోగింది.

హలో... ఆనంద్ ఉన్నారా?”

నేనే మాట్లాడుతున్నా

నమస్తే. నేను మీ స్నేహితుడ్ని మాట్లాడుతున్నా. ఎంత అందమైన పద్దతితో మీకు కోటి రూపాయలు నష్టం అయ్యిందో చూశారా. నేను ముందే చెప్పాను. మీరు నమ్మలేదు. మీరు పెద్ద మొత్తంతో నష్టపోతారని పర్టికులర్ గా చెప్పానే. మీ మీదున్న శ్రద్ధతో చెప్పాను. నా మాటలకు గౌరవమిచ్చి వినుంటే, నష్టాన్ని అడ్డుకోనుండచ్చే?”

నువ్వు ఎవరయ్యా...నీకెలా విషయం ముందే తెలిసింది?”

మీకెదురుగా ప్లాన్లు వేస్తున్న మీ శత్రువులను మీ తరఫున నేను ఫాలో అవుతూ వస్తున్నాను. అప్పుడు నాకు దొరికిన సమాచారమే నేను మీకు చెప్పాను. మీరు నమ్మలేదు

నమ్ముతాను. నిన్ను నమ్ముతాను. నువ్వు ఎవరైనా సరే నమ్ముతా. చెప్పు... విరాళం పనిని నాకు ఎదురుగా చేసింది ఎవరు?”

కుట్ర చేస్తున్న మనిషిని సరైన సంధర్భంలో నేను ఐడెంటిఫై చేసి చూపిస్తాను

అవతలి వైపు ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో,’రీజీవర్నుపెట్టేసి బయటకు నడిచాడు వెంకట్.  

***************************************************PART-17******************************************

పోయిన సంవత్సరం

బాబాయ్

చెమటతో తడిసిపోయున్న ఆనంద్ చేతులను ఆదరణగా పట్టుకుని మెల్లగా చెప్పారు.

వదులు! ఇది ఆమె విధి! నువ్వు హత్య చేయలేదు. యాక్సిడెంట్! అల్ప  ఆయుష్షు! చచ్చిపోయింది. అన్ని విధాలుగా ఆమెను ఇరికించాలని అలాంటి ఒక ఉత్తరాన్ని -- ఆమెను బెదిరించి రాయిపించమని -- ఆలొచన చెప్పాను. అది ఇప్పుడు మనకు ఉపయోగపడబోతోంది.

శవాన్ని గోవులపాలెం లో కొనిపడేసిన ఖాలీ స్థలంలో రాత్రికి రాత్రి గొయ్యి తవ్వి పూడ్చేయమంటాను. ఈమె భర్త కల్యాన్ ను విడుదల చేసేద్దాం. అతనూ, ఊరూ -- మహతీ తన కొత్త ప్రేమికుడితో లేచిపోయిందని నమ్ముతారు. మనకు సమస్య రాదు. శవాన్ని పూడ్చే పనిని మన తోటమాలి గురువయ్యను చెయ్యమని చెబుతా. వాడికి ఎక్కువ డబ్బులు ఇద్దాం. నువ్వు దేనికీ బాధ పడకు ఆనంద్. నేను ఉన్నాగా...ధైర్యంగా ఉండు

ఆనంద్ వణుకుతున్న వెళ్లతో సిగిరెట్టు తీసి వెలిగించాడు.

చల్లటి నీళ్ళు తన మొహం మీద జల్ల బడగానే, స్పృహ కోల్పోతున్న స్థితిలో ఉన్న కల్యాన్ కళ్ళు తెరిచి చూసాడు.

అదే వ్యాను. చీకటిలో సన్నని వెళుతురు. మొహాలు కనిపించకుండా ముసుగులు వేసుకున్న నలుగురు దుండగులు.

తన శరీరంలో కట్టబడ్డ తాళ్ళు లేవు. నోటిపై ప్లాస్టర్ లేదు.

వ్యాను నిలబడుంది.

సార్, మమ్మల్ని మీరు క్షమించాలి. మా స్నేహితుడు రాజేశ్వరయ్యను హత్య  చేసిన వ్యక్తి పేరూ కల్యాన్. కానీ వేరే కల్యాన్. ఒక అయోమయంలో తప్పుగా మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు అది వేరే కల్యాన్ అని తెలియడంతో మిమ్మల్ని వదిలేయమన్నారు.

మీరు వెళ్ళొచ్చు. వ్యానులో నుండి కిందకు దిగండి. రోడ్డు పక్కగా మీ స్కూటర్ నిలబెట్టాము. తీసుకుని వెళ్ళొచ్చు అన్నాడు ఒకడు.

కల్యాన్ తల ఊపి వ్యానులో నుండి కిందకు దిగిన వెంటనే, వేగంగా వెళ్ళిపోయింది వ్యాను. రోడ్డు పక్కగా నిలబెట్టున్న తన స్కూటర్ను స్టార్ట్ చేసి బయలుదేరి వెళ్లాడు కల్యాన్.

ఇది చోటు... వీధి? ముఖ్యమైన వీధికి వస్తే అర్ధమవుతుంది. ఎంత భయంకరమైన సంఘటన? మంచి కాలం! చివరగా వదిలేసారే! ఎప్పుడూ సాయంత్రం ఐదున్నర కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు టైము పదకుండూ పది. మహతీ చాల భయపడిపోయుంటుంది!

కల్యాన్ తన ఇంటి ముందు స్కూటర్ ఆపినప్పుడు సమయం రాత్రి పన్నెండు.

ఇల్లు తాళం వేసుండటం గమనించాడు.

నేను రాలేదు కాబట్టి ఊర్లో ఉన్న తన మేనమామ ఇంటికి ఎంక్వయరీ చేయటానికి వెళ్ళుంటుంది

ఆకలి వేస్తోంది. ఇంట్లో ఏదైనా ఉంటే తినేసి, తరువాత ఆమె మేనమామ ఇంటికి వెళ్ళి ఆమెను పిలుచుకు వద్దాం

కల్యాన్ తన దగ్గరున్న మరో తాళం చెవితో, తాళం తెరిచి లోపలకు వెళ్ళాడు.

లోపలకు వెళ్ళిన వెంటనే టేబుల్ మీద ఉంచబడిన ఉత్తరం కళ్ళకు కనిపించింది. టేబుల్ గడియారాన్ని జరిపి, ఉత్తరాన్ని తీసి చదవటం మొదలుపెట్టిన అతను తన గుండెను పట్టుకున్నాడు.

చదివి ముగించినప్పుడు ఇల్లు చక్రంలా గుండ్రంగా తిరిగింది.

మహతీనా...నా మహతీనా!

అనుమానమే లేదు. ఆమె చేతిరాతే. ఆమె ఇలాగా?’

గుండ్రంగా తిరగటం ఎక్కువయ్యింది. దబ్ మని నేల మీద పడ్డాడు.

***************************************************PART-18******************************************

సంవత్సరం

వేగంగా వీస్తున్న గాలి అందరి కళ్ళనూ ముడుచుకునేటట్టు చేసింది. చీర కొంగులను లాగి దోపుకోబెట్టింది. ఎగిరిపోతున్న జుట్టును గట్టిగా లాగి  పట్టుకోబెట్టింది.

ఎందుకని చాలాసేపటి నుండి ఏం మాట్లాడటం లేదు అన్నాడు వెంకట్.

కోపం. మీ మీద నాకు విపరీతమైన కోపం అన్నది మల్లికా.

ఎందుకమ్మా కోపం?”

మీ వైపు మీరు ఎవరి దగ్గరా పర్మిషన్అడగక్కర్లేదు. నా వైపు ఇదివరకే మిమ్మల్ని పరిచయం చేసి అనుమతి తీసుకున్నాం. అలాంటప్పుడు పెళ్ళికి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు?”

ఒక తీర్పు రాయవలసి ఉన్నది మల్లికా. ఇప్పుడే రాయడం ప్రారంభించాను. అది ముగించిన వెంటనే పెళ్ళి చేసుకుందాం

అప్పుడప్పుడు హఠాత్తుగా ఏదైనా అర్ధం కాని విషయం మాట్లాడతారు. మీ నడవడికలో చాలా చిక్కుముడి కనబడుతోంది. పలు విషయాలు నాకు అర్ధం అవటంలేదు. ఎందుకని ఒక మర్మమైన మనిషిగా ఉన్నారు? స్వతంత్రంగా ఉండండి వెంకట్

దానికి కొన్ని రోజులు పడుతుంది. తరువాత మామూలుగా అయిపోతాను అన్న అతను, ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలను పక్కకు జరిపి, ఆమె మొహాన్ని తన చేతులతో పుచ్చుకుని ఆమె కళ్ళల్లోకి లోతుగా చూసాడు.

మల్లికా నవ్వును తెప్పించుకుంది.

***************************************************PART-19******************************************

పోయిన సంవత్సరం.

మహతీ యొక్క ఇంటి కాలింగ్ బెల్లును ఆరోసారిగా విసుగుతో కొట్టాడు పాలవాడు. జవాబు లేదు.

దగ్గరున్న కిటికీ ద్వారా తొంగి చూసాడు.

లోపలున్న బెడ్ రూమ్ గది తలుపు చిన్నగా తీసుంది.

తీసున్న తలుపు సందులో పంచ కట్టిన రెండు కాళ్ళు పై నుండి వెళాడు తున్నట్టు చూసిన అతను, పాల గిన్నెను జారవిడిచాడు.

పది నిమిషాలలో పోలీసులు వచ్చి, వాకిటి తలుపును పగుల కొట్టారు.

లోపలకు దూరి నాలిక బయటకు వచ్చి -- కళ్ళు బయటకు వచ్చి, ఉరి తాడుతో  వేళాడుతున్న కల్యాన్ మృతదేహాన్ని కిందకు దించారు.

అతని చొక్కా జేబులో ఉత్తరం ఉన్నది.

నేను బాగా నమ్మిన నా భార్య, నాకు ద్రోహం చేసింది. నేను నమ్మలేకపోయాను. ఆమె చేసిన ద్రోహాన్ని నేను తట్టుకోలేకపోయాను. నా భార్య దగ్గర నుండి ప్రేమను సంపాదించుకోలేక పోయినవాడిగా, అవమానపడి నిలబడ్డ నేను ఇక జీవించటానికి ఇష్టపడటం లేదు. అందువలన ఆత్మహత్య చేసుకుంటున్నాను

***************************************************PART-20******************************************

సంవత్సరం

ఒక వారం రోజులుగా ప్రయత్నించి సమాచారాన్ని తన ఆఫీసు ఫైల్స్ లో నుండి సేకరించాడు వెంకట్.

అదేమిటంటే.

ఆర్. ఆర్. కంపెనీకి ఒక పెద్ద సేకరింపు గొడౌన్ ఉన్నది. ఉత్పత్తికి కావలసిన ముడి సరకును అక్కడ స్టోర్ చేస్తారు. ఉత్పత్తి చేసిన సరకును కూడా అక్కడే స్టోర్ చేస్తారు. సమయంలోనైనా గోడౌన్లో అన్ని సరకులు కలిపి ఎప్పుడూ ఐదు కోట్ల ఖరీదుచేసే సరకు స్టోర్ చేయబడి ఉంటుంది. గోడౌన్లోని మొత్త ఐదు కోట్ల సరకుకూ ఇన్స్యూరన్స్ ఉంది.

దానికి సంవత్సరానికి భీమా ప్రీమియం మొత్తం ఒకేసారి కట్టేసుంది. ఒక్కొక్క సంవత్సరం, ఒక నిర్దిష్ట తారీఖులోపు ప్రీమియం డబ్బును కడితేనే పాలసీ అమలులో ఉంటుంది.

ఇన్స్యూరన్స్ పాలసీకి సంవత్సరానికి ప్రీమియం డబ్బు, ఇంకో నాలుగు రోజులలో కట్టాలి. అందువలన ముందు రోజు వరకే పాత పాలసీ చెల్లుబడి అవుతుంది.

ఇన్స్యూరన్స్ కంపెనీకి కట్టాల్సిన ప్రీమియానికి, చెక్కు రెడీ చేయబడి, కవరింగ్ లెటర్ తో జతచేసి డిస్పాచ్ క్లర్క్నారాయణ టేబుల్ మీద వెయిట్ చేస్తోంది.

అతను చెక్కును ఒక కవరులో ఉంచి, కవర్ను అతికించాడు. రిజిస్టర్ పోస్టులో పంపించాలి.

సమయంలోనే వెంకట్ ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.

ఏమిటి నారాయణ గారూ, రండి క్యాంటీన్వరకు వెళ్ళి ఒక టీ తాగొద్దాం అన్నాడు.

నారాయణ టీ ప్రియుడు. వెంకట్ పిలిచిన వెంటనే కుర్చీని వెనక్కి తోసి లేచాడు

ఎవరైనా పిలవరా అనుకుంటున్నా. రండి

క్యాంటీన్ లో ఇద్దరూ టీ తాగటానికి ముందు అప్పుడే వేసిన వేడి వేడి  బజ్జీలు తిందామనుకుని దానికి టోకన్ తీసుకుని టేబుల్ దగ్గర కూర్చుని, సప్లై కుర్రాడికి టోకన్ ఇచ్చి బజ్జీలను వేడి వేడి గా తీసుకురమ్మని చెప్పారు. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిన వాడిలాగా మేనేజర్ ఒక ముఖ్యమైన ఫైలును తీసుకుని ఆయన రూములో పెట్టమని చెప్పారు. పనిని పూర్తిగా మర్చిపోయి, ఇక్కడకి వచ్చేశాను. మీరు నిదానంగా తింటూ ఉండండి. నేను వెళ్ళి ఫైలు ఆయన రూములో పెట్టేసి వెంటనే వచ్చేస్తాను అని చెప్పిన వెంకట్ పరుగులాంటి వేగంతో నడిచి వెనక్కి వెళ్ళాడు.

తిన్నగా నారాయణ టేబుల్ దగ్గరకు వెళ్లాడు.

ఇన్స్యూరన్స్కంపెనీకి వెళ్ళ వలసిన - కవరులొ ఉన్న చెక్కును, లెటర్నూ తీసుకుని, తన జేబులో వేసుకుని, ఇది వరకే తయారుచేసి పెట్టుకున్న మరో ఉత్తరాన్ని మరో జేబులో నుండి తీసి -- కవరులో పెట్టేసి, వచ్చిన వేగంతోనే మళ్ళీ క్యాంటీన్ కు వెళ్ళి నారాయణ తో కలిసాడు వెంకట్.

కొద్ది సమయం తరువాత ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చారు. నారాయణ టేబుల్ దగ్గరకు వచ్చిన తరువాత ఇద్దరూ విడిపోయి తమ తమ టేబుల్స్ ముందు కూర్చున్నారు.

టేబుల్ మీద పెట్టున్న కవర్లను ఇంతకు ముందే చెక్ చేసిన కారణంగా, కవర్లలో ఉన్న వాటిని మళ్ళీ పరిశీలించి చూడకుండా - అలాగే అతికించి - రిజిస్టర్ పోస్టుకు కావలసిన స్టాంపులు అతికించి -- ఆఫీసు ప్యూన్ దగ్గర ఇచ్చి పంపించాడు నారాయణ.

ఆఫీసు పూర్తి అయిన తరువాత చెక్కునూ, ఉత్తరాన్నీ చించేసి, టాయిలెట్టులో పడేసి, నీళ్ళు కొట్టాడు.

ఆనంద్ మూర్ఖుడా! నీ ఆఫీసులో ఉద్యోగిగా ఉంటూనే ఎంత సాహసంగా నీ మీద పగ తీర్చుకుంటున్నా చూడు!

మన కంపెనీ లెటర్ హెడ్డులో రహస్యంగా టైపు చేసి, రబ్బర్ స్టాంపు ముద్ర వేసి, సుబ్బారావ్ గారి సంతకాన్ని నేనే పెట్టాను. ఉత్తరంలో మాకు ఇన్స్యూరన్స్ అవసరం లేదుఅంటూ దానికి కరెక్టు కారణాన్ని వివరించి రాసాను.

ఇంకో రెండు రోజుల్లో ఇప్పుడున్న ఇన్స్యూరన్స్ కాలం అయిపోతుంది. చివరి రోజు ప్రొద్దున ఏదైనా ప్రమాదం జరిగినా ఇన్స్యూరన్స్ కంపెనీ బాధ్యత తీసుకోదు.

చివరి రోజునే మీ గొడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరగబోతోంది. నేను పక్కగా నిలబడి వేడుక చూడ బోతాను

వెంకట్ పళ్ళు కొరుక్కున్నాడు.  

***************************************************PART-21******************************************

పోయిన సంవత్సరం

గోడకు ఆనుకుని, మోకాళ్ళలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు వెంకట్.

అతని తలను ఓదార్పుగా నిమురుతోంది మల్లికా.

సంఘటన జరిగి రెండు వారాలైనా, మీరు ఇంకా బాధింపు లో నుండి కోలుకోలేదు. బయటకు రాలేకపోతున్నారా?”

కుదరటం లేదు మల్లికా. కుదరటం లేదు! నేను ఏదీ నమ్మలేకపోతున్నాను. ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్ళిన వాడిని, తిరిగి వచ్చేలోపు నా కుటుంబంలో ఇంత పెద్ద ప్రళయం జరుగుతుందని ఎదురు చూడలేదు. అన్నయ్య ఇంత బలహీనమైన ముగింపు తీసుకున్నాడే! వదిన అలాంటి మనిషి కాదు మల్లికా, బంగారం! ఆమె గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, మాట్లాడిన వాళ్ళ నాలిక కుళ్ళిపోతుంది. ఆమెను పోయి ఈయన ఎలా అనుమానపడ్డాడు?”

కొన్నిసార్లు మనం నమ్మలేనివన్నీ జరుగుతాయి!

మల్లికా! ఇంకోసారి ఇలా మాట్లాడితే, నాకు పిచ్చి కోపం వస్తుంది. ఏదో ఒక కుట్ర  జరిగింది. ఇంటి నుండి వెళ్ళిపోయే ఆవిడ, చెప్పులు కూడానా వేసుకోకుండా వెళుతుంది? మరుసటి రోజు టిఫెనుకు పిండి రుబ్బి పెట్టా వెళుతుంది?

కుట్ర...ఏదో కుట్ర! ఏదో ఒక నిర్భంధం వలన ఉత్తరం రాయబడి ఉంటుంది. ఎవరో ఒకరు అలా రాయమని బెదిరించి ఉంటారు. అది కనిబెట్టాలి మల్లికా! ఇలా ఆలొచించకుండా వెంటనే వదిన్ని అనుమానించి, తనని శిక్షించుకున్న అన్నయ్యను తలుచుకుంటే ఒక పక్క కోపంగా ఉంది...మరో వైపు జాలిగా ఉంది. కానీ, కుట్రకు కారణ కర్త ఎవరనేది తెలుసుకోవాలి మల్లికా”  

వెంకట్ ఇల్లు ఖాలీ చేసేసి, నెల అద్దెకు గది తీసుకుని అందులో ఉంటూ -- పోలీసు స్టేషన్ కు తన అనుమాలను తీసుకు వెళుతూ చెప్పులరిగేలా తిరిగేవాడు.

మూడు నెలలు కాళ్ళు అరిగేలాగా తిరిగింది మాత్రమే మిగిలింది.

మేము పూర్తిగా విచారణ చేశాము. మీ వదిన బంధువులు, స్నేహితురాళ్ళు, ఆమె ఉద్యోగం చేసిన కంపెనీలో, మీ ఇంటి చుట్టుపక్కల -- ఇలా అన్ని చోట్లా విచారించాము. అనుమానపడేటట్టు ఎలాంటి వార్త దొరకలేదు. శేఖర్ అనే అతని గురించి కూడా ఏదీ తెలియలేదు. కానీ, మీ వదిన స్వయంగా లెటర్ రాసినందువలన దాన్నే నిజమని తీసుకోవలసి వస్తోంది. ఇంతకంటే కేసులో విచారించటానికి ఏదీ లేదు

జవాబుతో డీలా పడిపోయాడు వెంకట్.

మరో రెండు నెలలు గడిచిన తరువాత--

తన పర్సనల్ పనులలో కాలం గడుపుతున్న వెంకట్ కి డబ్బు అవసరం ఏర్పడింది. అర్జెంటు కోసం చేతి గడియారాన్ని అమ్మ వలసిన పరిస్థితి ఏర్పడింది.

గడియారాలు అమ్మే షాపుకు వెళ్ళాడు.

వాచ్అమ్మాలి. ఎంత డబ్బు ఇస్తారు?”

షాపతను అది తీసుకుని పరిశీలిస్తున్నప్పుడు -- అనుకోకుండా షో కేసులో ఉన్న గడియారాలను చూస్తూ వచ్చాడు. అప్పుడు అందులో ఉన్న ఒక లేడీస్ వాచ్ను చూసాడు.

ఆ చేతి గడియారంలోని తెల్ల డయల్ పై లవ్ యూఅని సన్నగా ఎరుపు రంగు అక్షరాలు ఉన్నాయి.

గత సంవత్సరం పెళ్ళి రోజున వదినకు అన్నయ్య చేతి గడియారాన్నే బహుమతిగా ఇచ్చాడు. షాపులో మామూలు గడియారం కొని, లోపల డయల్ పైన అతనే రాసాడు. ఇది అతని చేతి రాతే. పక్కన చిన్నగా కల్యాన్ అని ఉండాలేఅని అనుకుంటూ ధీర్ఘంగా చూశాడు. ఉన్నది’. కొంచం కూడా అనుమానం లేదు

ఆలొచిస్తూ ఉన్నప్పుడే షాపతను అడ్డుపడి మీరు ఇచ్చిన వాచ్ కు వందరూపాయలు ఇవ్వచ్చు

అదే సరే... వాచ్ తీయండి

ఇది లేడీస్ వాచ్ సార్. పాతది. ఇది కావాలా?”

ఇది మీకు ఎలా దొరికింది?”

ఏం ప్రశ్న సార్ ఇది! ఇప్పుడు మీ వాచ్ ను అమ్మటానికి మీరొచ్చినట్టే ఎంతోమంది అమ్ముతున్నారు. కొంటున్నాము. లాభం పెట్టి అమ్ముతున్నాము

వాచ్ ను మీకు అమ్మిన వాళ్ళు ఎవరు?” అని కొంత పెద్ద స్వరంతో అడుగుతూ ఇది మా వదిన వాచ్ సార్!అన్నాడు.

***************************************************PART-22******************************************

సంవత్సరం.

రోజు రాత్రి పన్నెండు గంటలకు టైము బాంబు కరెక్టుగా పనిచేసింది.

ఆనంద్ యొక్క అతి పెద్ద గోడౌన్ తునాతునకలై, ఎటు చూసినా నిప్పు రవ్వలు నాట్యమాడుతున్నాయి.

ఏం చెబుతున్నారు బాబాయ్?” నమ్మలేక అడిగాడు ఆనంద్.

అవును. ఇది ఎవరో ప్లాను వేసి చేసిన కుట్ర. నిన్నటితో ఇన్స్యూరన్స్ లాస్ట్ డేట్ అయిపోయింది. మనం పంపిన చెక్కు వారికి వెళ్ళి చేరలేదు. నా సంతకం లాగానే పెడుతూ, మన ఆఫీసు లెటర్ హెడ్డుపై ఇన్స్యూరన్స్ రెన్యూ చేయటం మేము ఇష్టపడటం లేదు అంటూ తెలివిగా టైపు చేసి ఎవరో పంపించారు. ఇన్స్యూరన్స్ కంపెనీ వాళ్ళు ఉత్తరాన్ని తీసి చూపిస్తున్నారు. అక్కడ్నుంచే నేను బ్యాంకుకు ఫోను చేసాను. వాళ్ళు కూడా ఇన్స్యూరన్స్ చెక్కు రాలేదని చెప్పారు. మన ఆఫీసులోనే ఎవరో ఒకరు కుట్ర పన్నుతున్నారు

ఎవరతను అనేది తరువాత అలొచిద్దాం...మనకి కాంపన్షేషన్ దొరుకుతుందా...దొరకదా?”

దొరకదు ఆనంద్. కాలిపోయిన సరకు మొత్త వాల్యూ దగ్గర దగ్గర ఐదు కోట్లు. మొత్తం కాలిపోయింది ఆనంద్. బిల్డింగే నాశనం అయిపోయింది!

ఆనంద్ కు గుండె నొప్పి పుట్టింది.

తల మీద చేతులు పెట్టుకుని, తన ఇంట్లో కూర్చోనున్నారు సుబ్బారావ్ గారు.

ఏమిటి నాన్నా. చాలా డీలా పడిపోయున్నారు?” అన్నాడు తండ్రి దగ్గరగా వచ్చిన అశోక్.

గబగబ మని అంతా జరిగిపోయిందిరా. గోడౌన్ లోనిప్పంటుకున్నందువలన ఏర్పడిన నష్టంతో తలెత్తుకోలేక ఇండస్ట్రీని, ఆఫీసునూ మూసి వేయవలసి వచ్చింది. మిషెనరీ మొత్తాన్నీ బ్యాంకు వాళ్ళు జప్తు చేసి తీసుకు వెళ్ళిపోయారు. అక్కడక్కడ కొని పడేసిన స్థలాలూ, ఇళ్ళూ అన్నీ అమ్మి అప్పు తీరుస్తూ వస్తున్నాడు ఆనంద్. ఒకే నెలలో తలరాత మారిపోయింది. అన్నీ తలకిందలైంది రా

ఏమైనా సరే మీకు వాడి మీద ప్రేమ ఎక్కువే...ఎక్కువగా బాధపడుతున్నారే!

మూర్ఖంగా మాట్లాడకు. ఇదంతా మనకే నష్టం. మధ్యలో ఎవడో చిన్న చిన్న అల్లరి  చేసి మన ప్లాను నంతా పేకముక్కల్లలాగా జారిపోయేటట్టు చేశాడు. పోలీసులతో చెప్పినా కూడా, వాళ్ళు వచ్చి ఆఫీసులో ఉన్న అందరినీ విచారించి చూసినా అతన్ని కనిబెట్టలేకపోయారు

పెద్ద పడవను ముంచటానికి చిన్న చిల్లు చాలు అనే సిద్ధాంతమును అర్ధం  చేసుకున్న వాడిలాగా ఉన్నాడు. ఎవరు నాన్నా అతను? ఎందుకు ఆనంద్ పై అంత పగ?”

ఆనంద్ చేసిన పాపాలకు లెక్క లేదు? ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు? కాపురాలు కూల్చేడు? హత్య వరకు కూడా వెళ్ళేడే! ఎవరో బాధపడిన వాళ్ళు ఇలా ఆటలాడుతున్నారు

.........................”

అశోక్! ఆనంద్ కు తోబుట్టువులు ఎవరూ లేరు. అతని ఆస్తులన్నీ అతని పేరు  మీదే ఉన్నాయి. ఒకడే వారసుడు, ఊటీలో చదువుతున్న అతని కొడుకు. హఠాత్తుగా ఆనంద్ చచ్చిపోతాడే అనుకో, ఊటీలో చదువుతున్న సుధీర్ మైనర్కాబట్టి అతను మేజర్అయ్యేంతవరకు ఆస్తులన్నింటికీ నేనే గార్డియన్’  అవుతాను. వాడు మేజర్అయ్యి నన్ను ప్రశ్నించేంత లోపు, ఆనంద్ ఆస్తి మొత్తాన్ని మన వసం చేసుకుందామనుకున్నా

అలాగైతే ఇప్పుడు మనకి ఏమీ రాదు. అంతేకదా?”

ఎవర్రా వీడు...ఉత్త మట్టి బుర్ర... ఇంకా ఆనంద్ దగ్గర కోటి రూపాయల విలువగల ఆస్తి ఉంది

ఏం ప్రయోజనం? మిగిలున్న ఆస్తంతా ఆనంద్ అమ్మినా అతని అప్పు తీరదు. కొడుకుకే ఏమీ ఇవ్వలేని బిచ్చగాడవుతాడు. ఇక మనకొచ్చేదేముంది?”

ఆనంద్ ఇప్పుడే చచ్చిపోతే?”

నీకేమన్నా పిచ్చాఆనంద్ ఇంకా ఆరొగ్యంగానే ఉన్నాడు కదా? వాడిపుడప్పుడే చచ్చిపోడు.

అవున్రా...వాడు ఇప్పుడే చచ్చిపోడు. దానికి మనమే ఏర్పాటు చేయాలి

నాన్నా?”

ఎందుకురా ఆశ్చర్యపోతున్నావు? ఇది ఒక విధంగా తప్పట్లేదు. ఆనంద్ ఆస్తిలో  కనీశం సగం ఆస్తి అయినా మనం చేజిక్కించుకోవచ్చునని ఇన్ని సంవత్సరాలు ఆనంద్ దగ్గర, ఆనంద్ కోసం ఎన్ని నీచమైన పనులు చేసేనో తెలుసా! ఇప్పుడు  ఆనంద్ ఉన్న పరిస్థితికి మనం ఏమీ సంపాదించలేము. ఇన్ని సంవత్సరాలు  అతనితో కుస్తీ పడినందుకు కనీసం కోటి రూపాయలైనా దోచుకోలేదనుకో ఇన్ని రోజులు నేను జీవించిందే వేస్టు. కాబట్టి మనమే అతన్ని లేకుండా చేయాలి. హత్య అనేది బయటకు తెలియకుండా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కూడా పరవాలేదురా. వాడు ఉంటున్న బంగళా, ఇంట్లో ఉంచుకున్న నగలు, డబ్బు అంతా కలిపి కోటిన్నర చేస్తుంది. మంచి ప్లాను వేసి తరువాత చెప్తాను" అన్న సుబ్బారావ్ గారు కళ్ళు మూసుకుని -- ఆలొచనలో ఉండిపోయాడు.

***************************************************PART-23******************************************

పోయిన సంవత్సరం

చెప్పు...మర్యాదగా చెప్పు! నువ్వెవరు? చేతి గడియారం నీకెలా వచ్చింది? చెప్పకపోతే పొడిచేస్తాను అన్నాడు ఆక్రోషంగా వెంకట్.

అతని చేతిలో తలతల మెరుస్తున్నది కత్తి.

షాపతని మెడ చుట్టూ ఉన్న తుండును పట్టుకుని లాగి బిగించి పట్టుకున్నాడు.

ఒక కాలు లేని అతను, వెంకట్ పట్టుకున్న పట్టుకు తడబడి నులకమంచం మీద పడ్డాడు. చెబుతాను. చెయ్యి తియ్యండి. బెదిరించకండి. నేనుగా చెబుతాను. నువ్వెవరు?” అన్నాడు.

వెంకట్, పట్టుకున్న తుండు పిడికిలిని సడలించి, తన గురించి -- తన అన్నయ్య మరణం గురించి -- వదిన మర్మమైన మాయం గురించి క్లుప్తంగా చెప్పాడు.

అలాగా? చెబుతాను... ఆనంద్ ను నేను ఎదుర్కోలేను. బలం లేదు. మనసూ లేదు. నీ వల్ల అవుతుంది. నేను చెబుతాను. జరిగింది చెబుతాను. మీ వదిన ఎవడితోనూ లేచిపోలేదు. చంపబడింది. ఆనంద్, సుబ్బారావ్ చేతిలో చనిపోయింది. మీ వదినను నేనే పూడ్చేను.

పూడ్చే ముందు ఆమె వేసుకున్న నగలూ, చేతి గడియారాన్ని తీసుకున్నాను. వాటిని ఒక్కొక్కటిగా అమ్మాను. చివరగా అమ్మింది చేతి గడియారం. అన్ని వార్తలనూ నేనూ పేపర్లలో చదివాను. అప్పుడు నేను ఆనంద్ ఇంట్లో తోటమాలిగా  ఉన్నాను. రోడ్డు ప్రమాదంలో నా కాలుకు దెబ్బతగిలి, ఆసుపత్రిలో పడున్నాను. పెద్దాపరేషన్ చేసి కాలు అతికించవచ్చు. దానికి లక్షన్నర అవుతుందని చెప్పారు.

నేను ఆనంద్ దగ్గర డబ్బు సహాయం అడిగాను. తనవల్ల కాదని చెప్పాడు. నా  కాలు తీసేయవలసి వచ్చింది. తరువాత షాపు పెట్టుకుని బ్రతుకుతున్నా. పది సంవత్సరాలు అతని దగ్గర పని చేశాను. ఆనంద్ చేసిన ఏన్నో పాప కార్యాలకు తోడుగా ఉన్నాను. కానీ, కార్యం అయిన తరువాత నన్ను కరివేపాకు లాగా విసిరిపారేసాడు. నాకూ అతని మీద కోపమే. కానీ, పగ తీర్చుకునే ధైర్యం లేదు. అతనికి డబ్బూ, పలుకుబడీ ఉన్నది. ఎలాగైనా తప్పించుకుంటాడు.  అవసరమైతే మనల్ని నేరస్తులుగా చిత్రీకరించి జైలుకు పంపగలడు.

నేను అతని నేరాల్లో సహాయపడినందువలన నాలో నేర భావం చోటు చేసుకుని నన్ను చిత్ర వధకు గురిచేస్తోంది. నువ్వు ఏమైనా చెయ్యి తమ్ముడూ, సహాయపడతాను. ఏదైనా అడుగు చెబుతాను అన్నాడు.

నా వదిన ఎందుకు, ఎలా చనిపోయింది?”

మహతీ పైన ఆనంద్ ఆశపడిన దగ్గర నుండి మొదలుపెట్టి, అతని బాబాయ్ పధకం వేసి ఇచ్చింది, బెదిరించి ఉత్తరం రాయించింది, అని ఒక్కటి కూడా వదల కుండా మొత్తం చెప్పాడు అతను.

వెంకట్ క్షణం తీర్మానించుకున్నాడు.

***************************************************PART-24******************************************

సంవత్సరం.

నమస్తే అన్నాడు వెంకట్.

తలెత్తి చూసాడు ఆనంద్.

ఆల్రెడీ మూడు రౌండ్ల మందు లోపలకు వెళ్ళింది.

చోటు: ఆనంద్ బంగళా పచ్చిక బయలు.

సమయం: చంద్రుడు ఆకాశంలో తేలుతున్న రాత్రి ఎనిమిది.

చిన్న టీపా మీదా మందు బాటిల్ సగం వరకే ఉంది.

రావయ్యా. కూర్చో. ఇంకేదన్నా కంపెనీలో ఉద్యోగం దొరికి చేరేవా?”

ఇంకా లేదు సార్

నా విధి! ఎలా ఉన్న వాడిని...ఎలా అయిపోయానో చూసావా?”

ఆనంద్ గడ్డంతో, బుగ్గలు అంటుకుపోయి ఉన్నాడు. చేతిలో ఉన్న గాజు గ్లాసులో మళ్ళీ మందు పోసుకున్నాడు.

మీ విధికి, మీరు ఇలా అయిపోవటానికి మీరే కారణం సార్

నేనా?”

అవును మీరే. మీ బాబాయికి మీరు మీ వ్యాపార బాధ్యత అప్పగించటమే మీ స్థితికి కారణం

చూడు, నీతో కొంచం క్లోసుగా మాట్లాడుతున్నా కదానని నువ్వు అనవసరంగా మా బాబాయ్ మీద నేరం మోపుతున్నావు. మా బాబాయ్ గురించి నీకేం తెలుసు. నా చిన్నప్పటి నుంచి....

ఆపండి సార్. మీ దగ్గర ఇంకా నేను దాచి పెట్ట దలుచుకోలేదు. మీకు మాటి మాటికి ఒకడు ఫోను చేసి...మీ స్నేహితుడని చెప్పి మీకు రాబోయే నష్టాల గురించి మీకు హెచ్చరిక చేసేడే ?”

అవును

అది నేనే

ఏమిటీ?”

అవును సార్. మీ కంపెనీలో చేరిన మొదటి రోజు మీ బాబాయిని కలవటానికి ఆయన గదికి వెళ్లాను. ఆయన ఎవరితోనో ఫోనులో మాట్లాడుతున్నాడు. అందుకని గది బయటే ఆగిపోయాను. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వినవలసి  వచ్చింది. ఆయన ఎవరితోనో ఒక సప్లయర్ దగ్గర మీ గిరించి చెడుగా మాట్లాడటం విన్నాను. తరువాత ఆయన్ని కలిసాను. మరుసటి రోజు మిమ్మల్ని కలిసాను. మిమ్మల్ని చూసిన వెంటనే మీ మీద నాకు తెలియని ప్రేమ, అభిమానం, అక్కర ఏర్పడింది. కంపెనీ లాభ నష్టాల లెక్కల్లో తీవ్రమైన అవకతవకలు ఉన్నది కనుగొన్నాను.

మీరేమో కంపెనీ వ్యవహారలను పట్టించుకోకుండా హాయిగా కాలం గడుపుతున్నారు. ఇరవై లక్షల మోసాన్ని మీ ముందుకు తీసుకు వచ్చాను. అప్పుడైనా మీరు మేల్కోనుండాలి. మీ బాబాయి మిమ్మల్ని బాగా బ్రైన్ వాష్ చేశారని గ్రహించాను. ఆయన చెప్పిందంతా నమ్మారు. మోసం చేసింది పర్చేస్ మేనేజర్ కాదు. మీ బాబాయే

నిజంగానా?” అన్నాడు ఆనంద్.

లోకం తెలియని మనిషిలాగా ఉండిపోయేరే! మీ బాబాయికీ, ఆయన కొడుకు అశోక్ కు దగ్గర దగ్గర ఐదు బ్యాంకులలో అకౌంట్లు ఉన్నాయి. ఇదంతా మీ మీదున్న అక్కరతో ఇన్వస్టిగేట్ చేశాను. ఇప్పుడు చివరిగా దొరికిన ఒక వార్త. వెంటనే ఇక్కడకు తీసుకు వచ్చాను. మిమ్మల్ని హెచ్చరిస్తున్న స్నేహితుడెవరో తెలియపరచాల్సి వచ్చింది అన్నాడు వెంకట్.

ఏమిటా వార్త?” -- నుదురు చిట్లిస్తూ అడిగాడు ఆనంద్.

తన ప్యాంటు జేబులోంచి ఆడియో క్యాసెట్టును బయటకు తీసాడు. ఒక టేప్ రికార్డర్ తీసుకు రమ్మని చెప్పి...అందులో క్యాసెట్టును ఉంచాడు.

వినండి. మీ బాబాయి యొక్క ప్రేమ పూర్వక పధకాన్ని వినండి

టేప్ మెల్లగా కదిలింది.

అశోక్. ఆనంద్ కి  తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. వాడి ఆస్తులన్నీ అతని పేరు మీదే ఉన్నాయి. ఒకే వారసుడు. ఊటీ కాన్వెంటులో చదువుతున్న అతని కొడుకు. సడన్ గా ఆనంద్ చచ్చిపోయాడే అనుకో, అతని కొడుకు మైనర్ కాబట్టి, వాడు మేజర్ అయ్యేంతవరకు వాళ్ళ మొత్త ఆస్తికీ నేనే గార్డియన్ అవుతాను. వాడు పెద్ద వాడయ్యి ప్రశ్నలడిగే స్టేజీకి వచ్చేలోపల ఆస్తి మొత్తం మన వసం చేసుకుందాం అని అనుకున్నా

ఆనంద్ కళ్ళు ఎరుపెక్కేయి, పళ్ళు కొరుక్కోబడ్డాయి.

నా బాబాయా ఇలాగంతా మాట్లాడాడు?”

ఇంకా ఉంది. వినండి సార్

ఆనంద్ లేకపోతేనే కదా నీ ప్లాను విజయవంతం అవుతుంది. ఆనంద్ పూర్తి  ఆరొగ్యంగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే నువ్వనుకున్నది జరగదు. అది జరిగేటప్పటికి నీకు వయసు అయిపోతుంది

ఎవర్రా వీడు...పిచ్చోడిలాగా ఉన్నాడు. అతను ఆరొగ్యగంగానే ఉన్నాడని, ఎక్కువ కాలం ఉంటాడని నాకు తెలియదా? కానీ ఆనంద్ చచ్చిపోవాలి. దానికి మనమే ఏర్పాటు చేయాలి!

నాన్నా!

ఎందుకురా ఆశ్చర్యపోతున్నావు? హత్య అనేది బయటకు తెలియకుండా ఉండేటట్టు ఏర్పాటు చెయ్యాలి. ఇప్పటికీ అతని దగ్గర రెండు కోట్ల విలువకు పైనే ఆస్తి ఉంటుంది. ఆస్తి కూడా కరిగిపోయేలోపు మన ప్లాన్ పక్కాగా నెరవేరాలీ

బాబాయ్!అంటూ గొంతు చించుకునేలా అరిచాడు ఆనంద్.

వేగంగా లేచాడు. సార్...సార్ అన్న వెంకట్ పిలుపును లెక్కచేయకుండా వేగంగా తన గదికి వచ్చి, లైసన్స్ ఉన్న తన తుపాకీని తీసుకుని, దాన్ని నడుం దగ్గర దాచాడు.

వెనక్కి తిరిగినప్పుడు, “శభాష్ అన్నాడు వెంకట్. శత్రువు మిమ్మల్ని చంపేలోపు మీరు అతన్ని చంపుదామనుకుంటున్నారు. మంచి ఆలొచనే! కానీ, అవసరపడితే మీరు దొరికిపోతారు

నా చేత్తో ఇప్పుడే వాడ్ని చంపితేనే నా ఆత్రం చల్లారుతుంది

చెయ్యండి. న్యాయమే! కానీ మీరు చిక్కుకోకుండా తెలివిగా చెయ్యాలి. నేను ఒక ప్లాను చెబుతాను. దాని ప్రకారం చేస్తే మీ బాబాయిని మీరు ఈజీగా చంపేయొచ్చు. మీరూ పట్టుబడరు

ఏమిటా ప్లాను...చెప్పు...త్వరగా అన్నాడు ఆనంద్, ఓర్పు నశించి.

బెంగళూరులో నాకొక ఇల్లు ఉంది. అక్కడ కొన్ని రోజులు తలదాచుకోని ఉండటం మంచిది. హత్యా నేరం మీ మీద పడకుండా తప్పించుకోవటానికి వసతిగా ఉంటుంది

.......................”

ఇప్పుడు మీ బాబాయి ఎక్కడున్నారో తెలుసా?”

ఇంట్లోనే ఉంటాడు

లేదు. మిమ్మల్ని చంపే విషయంలో ఒక మనిషిని రమ్మని చెప్పి, కరీం నగర్ కు ఫోను చేసేసి, అతన్ని కలుసుకోవటానికి హోటల్ దివ్యాలో రూము నెంబర్ 119 లో ఉన్నారు

ఇదంతా నీకెలా తెలిసింది?”

మీ బాబాయిని ట్రాక్ చేయటానికోసం ఆయన ఎప్పుడూ ఉపయోగించే చిన్న సూట్ కేసులో రహస్యంగా ఒక మైక్రోఫోన్ ఉంచి అయన ప్రతి సంభాషణ విన్నాను. క్యాసెట్టును కూడా అలాగే రికార్డు చేశాను. అందువలన వాళ్ల ప్లాను నాకు క్లియర్ గా తెలుసు

సరే, నువ్వూ నాతోరా. నేరుగా హోటలుకు వెళ్ళి అతన్ని ఫినీష్ చేద్దాం. ఫినీష్ చేసేసి బెంగళూరు వెళ్ళిపోదాం. ఏమంటావు...?”

దానికి ముందు ఒక చిన్న కార్యం చేయాలి. ఒక కాగితమూ, పెన్నూ  తీసుకోండి...చెబుతాను. దేనికీ? ఎందుకూ? అంటూ అడుగుతూ నిలబడకండి. కారణం లేకుండా నేను ఏమీ చెయ్యను

సమయంలో అన్ని విషయాలనూ తనకి సపోర్టుగా వివరించి చెప్పి, ఎదురు చేయాల్సిన పధకాలను ప్లాను వేసి చెబుతున్న వెంకట్ ఒక దేవుడిలాగా కనబడ్డాడు -- ఆనంద్ కి.

దాంతో పాటూ తాగిన మత్తు కలవటంతో, వెంకట్ తనకి సపోర్టుగానే పనులు చేస్తున్నాడు అనే నమ్మకం కలగడంతో, అతని మీద అనుమానమే కలగకుండా నమ్మి -- ఒక బానిసలాగా కాగితమూ, పెన్నూ తీసుకు వచ్చాడు.

నేను చెప్పినట్టు రాయండి. వివరణ తరువాత చెబుతాను

సరే, ఏం రాయాలి?” 

ప్రియమైన కొడుకు సుధీరుకు.

తండ్రి ఆనంద్ ప్రేమతో రాస్తున్నది.

మధ్య వ్యాపారంలో నాకు ఏర్పడిన నష్టం నాకు తగిలిన, తేరుకోలోని ఒక పెద్ద దెబ్బ! పేకమేడలాగా నేను ఒక్కసారిగా వేగంగా పడిపోయాను. ఇంతపెద్ద ఓటమిని నా వల్ల తట్టుకోవటం కుదరటం లేదు. వెళ్ళిన ప్రతి చోటా నన్ను దుఃఖం విచారిస్తున్నారు. పెద్ద అవమానంగా ఉంది.

పారేసుకున్న మనశ్శాంతిని వెతుక్కుంటూ నేను ఇంటిని, ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలనేది నేనే తీర్మానించుకోలేదు. నా మనసు నిలకడగా లేదు. నిలకడ అయినప్పుడు, తిరిగి వస్తాను. రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఎవరూ నన్ను వెతకటానికి ప్రయత్నించ వద్దు. నీకు నా ప్రేమ పూర్వకమైన దీవెనెలు.

ఇట్లు.

ఆనంద్.

వెంకట్ చెబుతుంటే అలాగే రాసి సంతకం పెట్టాడు ఆనంద్.

కింద తారీఖు వేయండి నిన్నటి తారీఖు...!

నిన్నటి తారీఖా...దేనికీ...? సరే, వేశాను

ఉత్తరాన్ని మడతపెట్టి, టేబుల్ పైన పెట్టండి. మీరు చంపబోయేది రోజు. కానీ,  నిన్ననే మీరు ఊరు వదిలి వెళ్ళినట్టు ఉత్తరం చెబుతుంది. మీరు బెంగళూరులో నెలలకొద్దీ ఉండండి. హత్య కేసును పోలీసులు విచారించి పూర్తి అయిన తరువాత తిరిగి రావచ్చు

అబ్బో...భయంకరమైన కేడీ ప్లాను ఆలొచన లాగుందే. సరే రా

కొద్ది సమయం తరువాత ఇద్దరూ హోటల్ దివ్యా వాకిలిలో ఆటోలో నుండి దిగారు. అతికించిన గడ్డంతో మారు వేషంలో ఉన్న ఆనంద్ ప్యాంటు జేబులో సైలన్సర్ ఫిక్స్ చేసిన తుపాకీ ఉంది.

గది నెంబర్ 119 కి తిన్నగా వెళ్ళి తలుపు కొట్టండి. తలుపు తెరిచిన వెంటనే లోపలకు దూరి, వెంటనే తుపాకీతో కాల్చండి. నేను ఇక్కడే నిలబడతాను. త్వరగా వచ్చేయండి అన్నాడు వెంకట్.

ఆనంద్ తిన్నగా నడిచాడు.

కాలింగ్ బెల్ నొక్కాడు.

సుబ్బారావ్ గారు తలుపు తీసారు.

నేను లోపలకు రావచ్చా సార్?”

మీరెవరో నాకు తెలియదే...మీరెవరు?”

లోపలకు వచ్చి చెబుతాను ఆనంద్ లోపలకు వెళ్ళి తలుపు మూసి ఏరా బాబాయ్, నన్ను దివాలా ఎత్తించింది కాక, హత్య కూడా చెయ్యాలని ప్లాను వేశావా? నువ్వు ప్రాణాలతో ఉంటేనేగా ప్లాను వేయగలవు? లేకుండా చేస్తాను అన్నాడు.

ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా, తుపాఖీ తీసి సుబ్బారావ్ గారి గుండెల్లో కాల్చాడు.

మళ్ళీ కాల్చేడు.

మళ్ళీ కాల్చేడు.

ఆనంద్ హోటల్ వాకిలికి వచ్చినప్పుడు -- వెంకట్ తన స్కూటర్లో కాచుకోనున్నాడు.

ఆనంద్ అతని స్కూటర్ వెనుక ఎక్కి కూర్చుని అయ్యింది. ఖచ్చితంగా చేసేసేను. మూడు గుళ్ళు ఖాలీ. అది సరే స్కూటర్ ఎక్కడిది?” అన్నాడు.

నాదే. ముందే ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచాను

ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నాం?”

క్రిష్ణారావు పేట

అక్కడికి ఎందుకు?”

అక్కడే నా ఇల్లు ఉంది. బెంగళూరు లోని నా ఇంటి తాళం చెవిని మీకిచ్చి పంపించాలే

తమ్ముడూ వెంకట్, నువ్వు ఎవరో...? నాకోసం ఇంత సహాయపడుతూ  నడుచుకుంటున్నావే. నువ్వు బాగుండాలి. నా బాబాయిని నమ్మి నేనిలా మోసపోతానని నేను కొంచం కూడా ఎదురు చూడ లేదు

వెంకట్ మాట్లాడకుండా బండీ నడిపాడు.

తుపాకీ ఎక్కడ?”

నా జేబులో ఉంది

అది మీ దగ్గర ఉండటం ఆపద. నా దగ్గర ఇచ్చేయండి. నేను దాన్ని డిస్ పోజ్చేసేస్తాను

అది కూడా కరక్టే

తుపాకీని ఒక చేత్తో తీసుకుని, తన బనియన్ లో వేసుకున్నాడు వెంకట్. ఇప్పుడు సమయం పది దాటింది...రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గింది.

క్రిష్ణారావు పేట వచ్చి ఒక పర్టిక్యులర్ క్రాస్ వీధిలో స్కూటర్ను ఆపాడు.

వీధిలో వెలుతురు లేదు. దగ్గరలో ఇళ్ళూ లేవు. వీధి దీపాలూ లేవు.

ఇక్కడ నాకు కూడా ఒక ఖాలీ స్థలం ఉందయ్యా. దారిలోనా వెళ్ళాలి మీ ఇంటికి?”

అవును అన్నాడు అతను. కొద్ది సమయం తరువాత ఒక ఖాలీ స్థలం దగ్గర స్కూటర్ను నిలిపాడు.

అరె...ఇది నా స్థలం. నీకు తెలుసా? ఎందుకు ఇక్కడ ఆపావు?”

దిగండి. ఒక విషయం మాట్లాడాలి

దిగాడు ఆనంద్.

స్థలంలో పిచ్చి చెట్లు గుబురుగా పెరిగినై.

మరింత మబ్బుతో ఆకాశం చంద్రుడ్ని కప్పేసింది. అక్కడ కారు చీకటిగా ఉంది. నల్లటి ఆకారాలలోనే ఒకరినొకరు చూసుకోగలిగారు.

తన టార్చ్ లైటును ఆన్ చేసిన వెంకట్, నేల మీద కొంచం జరిపి వెలుతురు చూపాడు.

అక్కడ ఒక పొద వెనుక లోతైన గుంట త్వ్వబడి ఉంది.

ఏమిటిది, నా స్థలంలో ఎవరో గుంట తవ్వి ఉంచారు?”

ఎవరో కాదు ఆనంద్. నేనే గుంట తవ్వి నీ దగ్గరకు వచ్చాను

ఏమిటి మర్యాద లేకుండా పేరు పెట్టి మాట్లాడుతున్నావు? ఎందుకు గుంట తవ్వావు?”

నిన్ను పూడ్చి పెట్టటానికే ఆ గుంట. నా వదినను పూడ్చిన చోటు దగ్గరే నిన్ను కూడా పూడిస్తేనే కదా పగకి పగ సరైనదిగా ఉంటుంది. అర్ధం కాలేదా...? నీ ఆఫీసులో ఉద్యోగం చేసిన మహతీ నా వదిన రా.

నీ బాబాయి ప్లాను వేసిచ్చి -- నువ్వు తెలివిగా ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసి -- నీ తోట మాలి సహాయంతో పూడ్చిపెట్టమన్నావే... మహతీయేరా. నువ్వూ-- నీ బాబాయి, మీరిద్దరే నా కుటుంబం చెదిరిపోవటానికి కారణం అని నేను తెలుసుకున్న వెంటనే -- మీ ఇద్దరి మీదా పగ తీర్చుకోవాలని కష్టపడి నీ కంపెనీలో ఉద్యోగానికి చేరేను.

మీ బాబాయి చేసాడని చెప్పిన అన్ని కార్యాలూ నేనే చేసేను. నిన్ను నష్టపరిచి, దివాలా తీయించింది నేనే. నిన్ను ప్రేరేపించి నీ చేతులతోనే నీ బాబాయిని హత్య చేయించాను. నాకు దొరికిన సాక్ష్యాలతో నిన్ను పోలీసుల దగ్గర పట్టించగలను. కానీ, దానిలో నాకు తృప్తిలేదు. నీ దగ్గరున్న డబ్బు, నీ కాంటాక్టులతో నువ్వు బయటకు వచ్చేస్తావు. మళ్ళీ నీ ఆట మొదలు పెడతావు. మరికొంతమంది మహిళలు నీకు బలైపోతారు. అందుకే నిన్ను చంపేయాలని తీర్మానించుకున్నాను. నా చేత్తో చంపితేనే నీ మీద పగ తీర్చుకున్నట్టు అవుతుంది. నా వదిన ఆత్మ శాంతిస్తుంది. అందుకే నిన్ను చంపాలని ప్లాను వేసేను.

ఇప్పుడు చూడు...నీ చేత్తోనే ఉత్తరం రాసి ఉంచావు. నువ్వు ఊరు వదిలి పోయినట్లుగా పోలీసులూ, మిగిలిన వాళ్ళూ నమ్ముతారు. నిన్ను ఊరు, ఊరు వెతుకుతారు. కానీ, నువ్వు నీ సొంత స్థలంలోనే సమాధి అయ్యావని ఎవరికీ తెలియదు అన్నాడు వెంకట్.

ఆనంద్ దగ్గర తీసుకున్న తుపాకీని తీసి అతని వైపు గురి పెట్టాడు.

వద్దు. నన్ను కాల్చకు, ప్లీజ్...

బ్రతిమిలాడ, బ్రతిమిలాడా -- మిగిలిన మూడు తోటాలూ అతని గుండెల్లోకి కాల్చి అతన్ని చంపాడు.

కోపంతో ఆనంద్ ను తన కాలితో గుంతలోకి తోసి, మట్టిని వేసి మూసేసి -- చోటును వదిలి బయలుదేరటానికి వెంకట్ కి  మరో అరగంట పట్టింది.   

***************************************************PART-25******************************************

సంవత్సరం.

రంగుల రాట్నంలో దగ్గర దగ్గరగా కూర్చుని వెంకట్, మల్లికా పైకీ కిందకీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూర్చున్న క్యాబిన్ పైకి వెళ్ళినప్పుడంతా వెంకట్ షర్టును స్వారస్యంగా పట్టుకుని లాగింది.

చాలా రోజుల తరువాత రోజే మీరు ఉత్సాహంగా ఉన్నారు వెంకట్ అన్నది మల్లికా అతని భుజాల మీద వాలుతూ.

రెండు కారణాలు మల్లికా. ఒకటి నాకు వేరే ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది. రెండు, నా మనసులో అనుకున్న కొన్ని బాధ్యతలు నెరవేరినై

మీరు ఉద్యోగం చేసిన కంపెనీ యొక్క మేనేజర్ ఒక హోటల్లో హత్య చేయబడి పడున్నట్టు, మీ ఏం. డి. ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారని పత్రికల్లో చదివేనే...?”

పెద్ద చోట్లలో ఏదైనా పె...ద్ద...వ్యవహారం ఉంటుంది మల్లికా. మనకెందుకు అదంతా? రేపు మీ ఇంటికి రమ్మంటావా?”

దేనికీ?”

మీ నాన్నతో మన పెళ్ళి గురించి మాట్లాడి ముహూర్త తారీఖు ఫైనల్ చేయటానికి అన్నాడు నవ్వుతూ.  

***************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)

శతమానం భవతి…(పూర్తి నవల)