మరవటం మర్చిపోయాను...(పూర్తి నవల)
మరవటం మర్చిపోయాను (పూర్తి నవల)
‘చెవిటి వాడి దగ్గర మాట్లాడుతూ, గుడ్డివాడిని చూసి కన్నుకొట్టటం లాంటి పనికిరాని పనే ప్రేమ’ -- అలా అని అనుకునే అమ్మాయి రోహిణీ.
‘నిలబడే విధంగా నిలబడితే, వికలాగంతో ఉన్న వాళ్ళు కూడా విజయం సాధించవచ్చు’ అనుకునే వాడు శ్యామ్.
ఈ సిద్దాంతంతో ఆమె, ఆ సిద్దాంతంతో అతనూ కలిసి ప్రయాణిస్తే...ఇద్దరి మధ్యా ఉన్నది స్నేహమా--ప్రేమా? ఇద్దరి మనసులూ కలుసుకుంటాయా...లేక వాళ్ళ ప్రేమ కర్పూరంలాగా గాలిలో కలిసిపోతుందా?
ప్రేమ వేరు వాళ్ళ మనసుల్లో కొమ్మలులా వ్యాపించ--
విధి వాళ్ళను ‘ఫుట్ బాల్’ లాగా ఆడుకోగా--
శ్యామ్-- రోహిణీ కలిసారా...విడిపోయారా?
ఎదురు చూడని మలుపులు, నిజమైన హాస్యం, దాంతోపాటూ కొంచం స్వారస్యమైన భవిష్యత్ సైన్స్.
‘మరవటం మర్చిపోయాను’--మాకు మాత్రమే కాదు...మీకూ మరిచిపోలేని ప్రేమ కథగా ఉంటుంది.
ఒక రోజా పువ్వు చెప్పింది:
ప్రేమించటం తెలియని అమ్మాయి జడలో ఉండటం కంటే, ప్రేమించి చనిపోయిన వాడి సమాధిపై ఉండటం మేలు!
***************************************************PART-1********************************************
ఇది ప్రేమ
కథ కాదు!
అయినా కానీ
ఈ కథలో
ప్రేమ తప్ప
ఇంకేదీ లేదు.
ఎందుకంటే, ఈ
ప్రేమ, మెరుపులాగా...ప్రారంభమైన
ఒకే క్షణంలో
ముగిసిపోయింది.
తేనెటీగలాగా చురుక్కున
కుట్టేసి, నొప్పి
అనుభవించే ముందే
ఎగిరిపోయింది.
ఆగ వలసిన
చోటుకు వస్తున్నప్పుడు
కండక్టర్ ‘విజిల్’ ఊది...నిలబడకుండానే
వెళ్ళిపోయిన బస్సులాగా
ఈ ప్రేమ
వెళ్ళిపోయింది.
ఈ ప్రేమను
అర్ధం చేసుకోవాలనుకుంటే, మొదట
శ్యామ్ ను అర్ధం
చేసుకోవటం ముఖ్యం.
అతన్ని అర్ధం
చేసుకున్నా, రోహిణీని
అర్ధం చేసుకోవటం
కష్టం. శ్యామ్
కే రోహిణీని
అర్ధం చేసుకోవటం
కుదరనప్పుడు, మనకిక్కడ...అయినా
కొంచం ప్రయత్నించి
చూద్దాం.
హైదరాబాద్ అమీర్ పేటలో
ఒక గ్రీటింగ్
కార్డులు తయారుచేసే
కంపెనీ, ఒక
బ్రహ్మాండమైన బిల్డింగులోని
నాలగవ అంతస్తులో
ఉన్నది.
ఒక తడిసిన
సెప్టంబర్ నెల
11
వ తారీఖు.
అమెరికాలోని ట్రేడ్
సెంటర్ భవనాలు
పడగొట్టబడ్డ జ్ఞాపకార్థ
రోజు.
ఆ రోజే
ఇక్కడ డిప్యూటీ
మేనేజర్ ఉద్యోగం
చేస్తున్న శ్యామ్
అనే శ్యామ్
కుమార్, రోహిణీ
అనే రోహిణీ
కుమారీని మొట్టమొదటిసారిగా
కలుసుకున్నాడు.
చెప్పాలంటే ఆ
రోజు ప్రొద్దున, శ్యామ్
‘బ్రేక్
ఫాస్ట్’ చెయ్యలేదు.
11 గంటల
సమయంలో ఆఫీసులో
కూర్చున్న తరువాత
ఒక అరటిపండును
వొలిచి, పాలల్లో
ముంచి మెల్లగా
తింటూ, ప్యూనుతో
గొడవ పడుతున్నాడు
శ్యామ్.
“రేయ్.
పాలు 12 రూపాయలు.
పండు ఏడున్నర
రూపాయి. మిగిలిన
అర్ధ రూపాయి
ఎక్కడరా?”
“ఏమిటి
సార్, ఇంత
పిసినారిగా ఉన్నారు?”
“నువ్వేమన్నా
అనుకో! నాకు
డబ్బే ముఖ్యం.
అడ్డదారిలో ఎలా
త్వరగా డబ్బుగల
వాడిని అవ్వాలని
నేను ప్రయత్నం
చేస్తున్నాను. మధ్యలో
నువ్వొచ్చి బ్యాలన్స్
లాక్కెలితే?
అర్ధ రూపాయి
తీసుకురా”
“ఇదిగోండి...”
ప్యూన్ డబ్బును
ఎగరేసి వెళ్ళగా, అది
నేలమీద పడి
దొర్లుతూ పరిగెత్త...దాన్ని
తీసుకోవటానికి
శ్యామ్ కిందకు
వంగ, అంతలో
ఆఫీసు మేనేజర్
‘హాయ్’ రామప్ప
ఒక దేవతతో
అతని గదిలోకి
దూరారు.
“శ్యామ్...ఈమె
నా కొత్త
‘పి.ఏ’. పేరు
రోహిణీ”
ఆమె అందం
చూసి శ్యామ్
చైజార, చేతిలో
ఉన్న అరటిపండు ముక్క జారి
పాలలో పడ--
“మేనేజర్
సార్...”
“ఏమిటి
శ్యామ్?”
“పండు
జారి పాలలో
పడిపోయింది సార్...”
“అది
జారి నీ
నోటిలోకి పడేలోపు
ఒక విషయం
చెబుతాను. ఈమెను
ఒక రెండు
రోజులు నీతోనే
ఉంచుకో”
“వావ్...చాలా
థ్యాంక్స్ సార్...మీరు
దైవం! చెఱకు
ఇస్తూ దాన్ని
తినడానికి కూలీ
కూడా ఇస్తున్నారు”
“ఏయ్
ఏయ్...ఊహల్ని
ఇష్టం వచ్చినట్టు
పరిగెత్తనివ్వకు.
మన కంపెనీ
బిజినెస్ గురించి, రూల్స్
గురించీ, టైమింగ్
అన్నిటిని చెప్పి
ఆమెకు ట్రైనింగ్
ఇవ్వటానికే ఆమెను
రెండు రోజులు
నీతో ఉంచుకో
అని చెప్పటానికి
వచ్చాను”
“ఓ...”
“ఇదిగో
చూడమ్మా, ఇతనే
శ్యామ్. ఈ
కంపెనీ యొక్క
బుర్ర--పునాది
రాయి. అద్భుతమైన
వాక్యాలు రాస్తాడు.
ఇతను లేకుండా
ఇక్కడ ఒక్క
‘గ్రీటింగ్
కార్డు’ కూడా
అమ్ముడవదు. నీకు
అన్ని వ్యాపార
ట్రిక్కులూ నేర్పిస్తాడు.
ఓకేనా?”
“ఓకే
సార్”
“హై...నేను
శ్యామ్...”
“హై...నేను
రోహిణీ. ‘నైస్
టు మీట్
యూ’! ఏమిటి
రాస్తున్నారు?”
“ఒక
ప్రేమ కవిత్వం.
గ్రీటింగ్ కార్డు
కోసం...చదువుతారా?”
“వద్దు...వద్దు!
నాకు ప్రేమంటేనే
అలర్జీ”
“అలాగా...? నాకు
ప్రేమంటే ప్రాణం”
“నేను
ప్రేమను ద్వేషిస్తాను” అన్నది రోహిణీ.
“నేను
ప్రేమను ప్రేమిస్తున్నాను” అన్నాడు శ్యామ్.
“సరే
బాబూ...చాలా
సంతోషం. మీరిద్దరూ
ఇలాగే మాట్లాడుకుంటూ
ఉండండి. నాకో
చిన్న పనుంది.
ఏం.డి
గారి అమ్మాయి
మాధవి అమెరికాలో
చదువుకుని ఇండియా
వస్తోంది. నేను
ఏర్పోర్టుకు వెళ్ళి
తీసుకురావాలి”
“సరే... ‘హాయ్’ సార్” అన్నాడు శ్యామ్.
“ఆయనెందుకు
‘హాయ్’ అని
పేరు పెట్టుకున్నారు?” అడిగింది
రోహిణీ.
“అదొక
పెద్ద శోకమైన
కథ”
“హాయ్ లో
ఏమిటి శోకం?”
“అది
నేను చెప్పాలంటే
నువ్వు ఒక
రాత్రంతా నాతో
ఉండాలి”
“ఏమిటీ!?”
“అంతపెద్ద
కథ...త్వరగానో, షార్టుగానో
చెప్పటం కుదరదు
అని చెప్పటానికి
వచ్చాను”
“శ్యామ్, మీరు
ఈ ఆఫీసులో
ఎన్ని రోజులుగా
పనిచేస్తున్నారు?”
"తెలియదు”
“తెలియదా?”
“అదే
నిజం. నేను
ఈ ఆఫీసులో
చాలా రోజుల
నుండి ఉంటున్నాను.
కానీ, పని
చేస్తున్నానా అని
నాకే తెలియదు.
మేనేజర్నే అడగాలి”
నవ్వేసింది.
“వ్యత్యాసమైన
సమాధానమే. మీ
కింద ఎంతమంది
పని చేస్తున్నారు?”
“రెండు
వేల మంది”
“అబద్దం.
ఇక్కడ ఇరవై
మంది కూడా
లేరు”
“ఈ
ఆఫీసు నాలగవ
అంతస్తులో ఉంది.
నా కింద
మూడు అంతస్తులలో
ప్రభుత్వ ఆఫీసు.
అక్కడ పనిచేసే
వాళ్ళు ఖచ్చితంగా
రెండు వేలమంది
ఉంటారు”
“సుత్తి...చాలా
పెద్దదిగానే ఉంచుకున్నారు”
శ్యామ్, రోహిణీని
పై నుండి
కిందకు దీర్ఘంగా
చూశాడు.
“ఏమిటలా
చూస్తున్నారు?”
“నువ్వు
పెద్ద పెద్దవిగానే
ఉంచుకున్నావు!”
రోహిణీ ముఖమంతా
కోపంతో ఎరుపెక్కింది.
“ఏయ్...” అన్నది
కోపంగా.
“మీ
కళ్ళను, నోటినీ
చెప్పాను”
“మీ
నోరు ముయ్యండి.
మొదట పని
నేర్పించండి”
“విత్
ప్లషర్” అన్నాడు.
అది ‘విత్
ప్లషర్’ కాదు, ‘బ్లడ్
ప్రషర్’ అని
శ్యామ్ కు అప్పుడు
తెలియలేదు!
***************************************************PART-2********************************************
రోహిణీ -- పేరులో
ఉన్న వేడి
ఆమె అందంలో
లేదు. అయినా
కానీ, ఏదో
ఒక అర్ధం
కాని గ్లామర్
ఆమె దగ్గర
చాలా ఎక్కువగా
ఉంది. రక్తాన్ని
వేడెక్కించే ఆమె
చూపులు, పండిపోయున్న
ఆమె ఎర్రటి
లావుపాటి పెదవులు, అనగని
ఆమె పెద్ద
ఛాతి ఆమె
నవ్వును గ్లామర్
చేసి పిచ్చెక్కిస్తున్నాయి.
లేకుంటే రోహిణీ
సాధారణ అందగత్తే!
శ్యామ్ -- చూడగానే
వశీకరణ చేసుకునే
అందగాడు. నల్లటి
జుట్టు, బొద్దు
మీసాలు, మెరుపు
నవ్వు, ప్రేమ
ముఖం, కవిత్వ
హృదయం, ఛాతిలో
రోమాల అడవి.
‘సిక్స్
ప్యాక్’ శరీరం.
ఉట్టిపడే మగతనం.
తరువాత వచ్చిన
రోజులలో శ్యామ్
నోటిలోని జొల్లు
స్రవించు గ్రంధులు
ఎక్కువసేపు పనిచేసి
రోహిణీని చూసి
విపరీతమైన జొల్లును
ఉత్పత్తి చేస్తోంది.
ఏ మగాడి
కళ్ళకు ఏ
ఆడది అందంగా
కనబడుతుంది అనేది, ఆ
మగాడు ఆ
ఆడదాన్ని చూసే
ధోరణిలో ఉంటుంది.
శ్యామ్, రోహిణీని
చాలా దగ్గరగా
చూశాడు. అతని
కంటికి రోహిణీ
ప్రపంచ సుందరి.
మొదటి చూపులోనే
అతను ఆమె
ప్రేమలో పడ్డాడు.
ఆమె తనకోసమే
పుట్టింది అని
ఇనుప కడ్డీలాగా
గట్టి నమ్మకంతో
ఉన్నాడు.
తన సెల్
ఫోన్ రింగ్
టోన్ ను
‘నేను
మాట్లాడతాను ఇంకా, ఇంకా--భూలోకమే
నా కాలు
కింద’ అనే
పాటకు మార్చాడు.
‘అడ్డదారిలోనైనా
సరే డబ్బుగల
వాడిగా అవ్వాలి’ అనే
తన లక్ష్యంలో
నుండి కూడా
మారిపోయాడు.
‘రోహిణీని
ప్రేమించాలి. ఆమెను
ప్రేమలో పడేయాలి.
ఇదే ఇక
నా శాశ్వత
లక్ష్యం. అది
అతి పెద్ద
సవాలుగా ఉండబోతుంది’ అని అనుకున్నాడు.
రోహిణీకి ఇలాంటి
ప్రేమ విషయాలలో
ఆసక్తో, ఆశో
లేదు.
తల్లి-తండ్రీ
చనిపోయిన తరువాత, ఆమె
ఈ ప్రపంచంలో
ఇష్టపడే విషయాలు
రెండే రెండు.
ఒకటి, ఆమె
నల్లని -- పొడవైన
జడను. ఎంత
కత్తిరించినా అది
ఎంత సులభంగా
పెరుగుతోంది? అనే
ఆశ్చర్యం.
రెండోది, వేడి
‘గులాబ్
జామూన్’
ఇప్పుడు, శ్యామ్
చూసిన అపాయకరమైన
ప్రేమ చూపులతో
ఆమె మెదడులో
ఒక హెచ్చరిక
గంట, ఆగకుండా
వినబడుతోంది.
‘ఇక
అతనితో జాగ్రత్తగా
ఉండాల్సిందే. ఇది
పెద్ద సవాలుగా
ఉండబోతుంది’ అని
అనుకున్నది.
లోకంలో రెండే
రకాల మగవాళ్ళు
ఉన్నారు.
ఆడవారిని చూసి
జొల్లు కార్చేవారు.
ఆడవారిని చూసి
ఎక్కువ జొల్లు
కార్చేవారు.
శ్యామ్ తన
ఏడో తెలివిని
కవ్వించి, రెండో
ప్రపంచంలో రోహిణీ
గురించిన మత్తులో
ఉన్నాడు.
‘ఇలాంటి
ఒక అమ్మాయి
తనకు దొరికితే...’--
‘దొరికితే? కాదు...దొరికింది!’
‘నన్ను
ప్రేమించటానికి
భగవంతుడే ఆమెను
పంపించాడు’ అని
అనుకున్నాడు.
'అది
నిజం కాకపోతే, ఆ
నగరంలో ఉన్న
నలభై వేల
ఆఫీసులలో, తొమ్మిది
వేల భవనాలలో, అరకోటి
తెలుగు జనాభాలో
సరిగ్గా ఆమెకు
తన ఆఫీసులో
మాత్రమే ఉద్యోగం
దొరికింది.
ఎలా?’
ఆ అద్భుతాన్ని
ఒకే ఒక
మాటలోనే వివరించటం
కుదురుతుంది.
విధి!
ఆపై వచ్చిన
వారాలలో శ్యామ్
-రోహిణీ ఇద్దరికీ
మధ్య జరిగిన
గొడవ-ప్రేమ
సంఘటనల
సంగ్రహం ఇదిగో!
***************************************************PART-3********************************************
ఆఫీసు ‘లిఫ్టు’!
చెవిలో ఇయర్
ఫోన్ తగిలించుకుని
పాటలు వింటూ
నిలబడున్నది రోహిణీ.
మూసుకుంటున్న లిఫ్ట్
తలుపులను వేగంగా
పరిగెత్తుకు వచ్చి
ఆపి లోపలకు
దూరాడు శ్యామ్.
“హాయ్
రోహిణీ...”
“హాయ్
శ్యామ్...”
‘లిఫ్ట్’ పైకెక్కటం
మొదలయ్యింది.
“ఏం
పాట వింటున్నావు?” అన్నాడు.
గబుక్కున అతనికి
దగ్గరగా వచ్చి
అతన్ని రాసుకుంటూ, తన
చెవిలో ఉన్న
‘ఇయర్
ఫోన్’ ను
అతని చెవికి
మార్చింది.
‘అంతా
రామ మయం’
“ఓ
గాడ్...బ్రహ్మాండం!
అద్భుతం”
“అలాగా? ఈ
పాట నీకూ
నచ్చుతుందా శ్యామ్?”
“లేదు...నువ్వు
నన్ను ఇలా
వచ్చి రాసుకుంటున్నది
చెప్పాను”
చటుక్కున కోపగించుకుని
జరిగింది.
“చూడటానికి
‘మాడర్న్’ గా
ఉన్నావు! బుర్ర
కథ పాటలు
వింటున్నావు?” అని
శ్యామ్ ఎగతాలిగా
నవ్వాడు.
అతన్ని కోపంగా
చూసి వెళ్ళిపోయింది
రోహిణీ.
ప్రసిద్ద హోటల్.
కంపెనీ డీలర్స్
ఇచ్చిన విందులో
కలుసుకుని--కోలాహలంగా
ఉన్నది ఆఫీసు
మొత్తం.
“రోహిణీ...”
“చెప్పు
శ్యామ్”
“నావల్ల
జీర్ణించుకోవటమే
కుదరటం లేదు”
“మరి... ‘ఫ్రీ’ గా
దొరుకుతోంది కదా
అని మూడు
ప్లేట్ల బిరియాని
తింటే?”
“అది
చెప్పటం లేదు”
“మరి?”
“నువ్వు
ఒక ‘అల్
ట్రా మోడ్రన్
గర్ల్’. నువ్వు
పోయి బుర్ర
కథ పాటలను
విని ఆనందిస్తున్నావే...ఏదో
అడ్డు తగులుతోందే!
నేను హైదరాబాద్
అమీర్ పేటలో
మనోతత్వ డాక్టర్
దగ్గర ఒక
‘అప్పాయింట్
మెంట్’ తీసుకోనున్నాను”
“ఎప్పుడు
వెళ్ళబోతావు?”
“నాకు
కాదు...నీకు”
“నేను
బాగానే కదా
ఉన్నాను”
“ఏదీ...నీ
తలను బాగా
ఊపు?”
ఊపి చూపింది.
“ఎందుకు?”
“లోపల
నట్లు ఊడిపోయిన
శబ్ధం వస్తున్నదా
అని చూసాను”
“నేను
బాగానే ఉన్నాను.
నాకేమీ లేదు.
నువ్వేమీ బాధపడక్కర్లేదు.
నీ పని
ఎలా పోతోంది?”
“అలాగే
ఉంది”
“ఏమిటీ?”
“నాలుగు
రోజుల క్రితమే
నువ్వు ఆఫీసుకు
వచ్చావు”
“అందుకని...?”
“ఆ
రోజు నుండి
పనిచేయటం కుదరటం
లేదు”
“అర్ధం
కాలేదు...”
“ఇదిగో
చూడు...ఇది
చాలా చిన్న
కథ. ఎక్కువగా
బంకలాగా లాగలేము.
అందువలన ఇప్పుడే
చెప్పేస్తున్నాను.
ఐ.లవ్.యూ
రోహిణీ”
“రిజెక్టడ్!
నీ అప్లికేషన్ను
నేను తిరస్కరిస్తున్నాను”
“సరే.
అట్నుంచి వస్తాను.
నువ్వెలా ఈ
ఉద్యోగానికి వచ్చావు?”
“బస్సులో”
“నేను
అది అడగలేదు...ఎందుకు
వచ్చావు?”
“పాత
ఉద్యోగం చాలా
విసుగు అనిపించింది.
కొత్తగా ఏదైనా
చేసి చూడాలని
అనిపించింది. నీకు
తెలుసా శ్యామ్...నేను
‘లా’ చదివాను”
“అబ్బో...అలాగా? నువ్వు
పెద్ద న్యాయాధిపతి
అయ్యుండచ్చే?”
“అది
కూడా పెద్ద
విసుగే. ఎదురుకుండా
ఇద్దరు నిలబడి
రోజంతా గోల
గోలగా మాట్లాడుకుంటూ
ఉండేటప్పుడు, వాళ్ళ
ఎదురుగా ఒక
మహిళ కూర్చుని
ఏమీ మాట్లాడకుండా
వేడుక చూస్తూ
ఉండటం లాంటి
ఒక నరకం, లోకంలో
ఇంకేదీ లేదు”
“అర్ధమయ్యింది.
అయితే నీకు
నచ్చిన ఉద్యోగం
ఏది?”
“ఏర్
హోస్టస్!”
“ఎందుకని?”
“అక్కడే
అందరు మగవాళ్ళనూ
బెల్టుతో కట్టిపడేయగలం”
“హా...హా...హా...హా...”
ఆమె ఏది
చెప్పినా నవ్వాలని
ఇంతకు ముందే
తీర్మానం నెరవేర్చుకుని
ఉన్నాడు శ్యామ్.
రోహిణీని ప్రేమ
మాటలతో, ప్రేమ
చూపులతో, సంధర్భం
దొరికినప్పుడు
ప్రేమ సైగలతో, చేష్టలతో
పడేసి సరైన
టైము చూసి
గ్రద్ద చూపులతో
ఎత్తుకెళ్ళిపోదాం
అని కాచుకోనున్నాడు.
ఆఫీసు.
ఉద్యోగం సమయంలో
కవిత్వం రాస్తున్నాడు.
అతని డైరీ
పిచ్చ పిచ్చగా
కవిత్వ వర్షంతో
తడుస్తూ ఉన్నది.
ఒక పేజీలో
‘రోహిణీ
-- ఈమె నా
కోసమే పుట్టింది!
ఆమెను నేను
ప్రేమిస్తున్నాను.
ఆమె చిలిపి
నవ్వును --
ఆమె గుండ్రటి
కళ్ళనూ--
ఆమె పోడవాటి
జడను --
నున్నగా ఉండే
ఆమె కడుపును
--
మెడకు కింద
ఉండే హృదయ
రూప మచ్చనూ
--
మాట్లాడేటప్పుడు
కొరికి లాగే
ఆమె కింది
పెదాలనూ --
ఆమె ఆవలింత
మౌనాన్ని
--
తుమ్ము యొక్క
సంగీతాన్నీ --
నుదుటి మీద
పెట్టుకునే చిన్న
బోట్టును ---
అవును రోహిణీ...నేను
నిన్ను.
పిచ్చివాడిలాగా
ప్రేమిస్తున్నాను’
“ప్రేమించుకో...నాకేమీ
బాధ లేదు” అన్నది రోహిణీ.
“ఏమిటంత
సాధారణంగా చెప్పేసావు? నాకే
రుచీ పచీ
లేదు. చెప్పులు
తీయటం లేదా?”
“ఇదిగో
చూడు శ్యామ్...నన్ను
నువ్వు ప్రేమించటం
నీ ఇష్టం.
నువ్వు మాత్రమే
కాదు...ఈ
ఆఫీసులో తొంబై
శాతం మంది
నన్ను ప్రేమిస్తున్నారని
నాకు బాగా
తెలుసు. ఈ
ఆఫీసులో నన్ను
ప్రేమించని మగాడు
ఒకే ఒకడే”
“ఎవరది?”
“కంపెనీ
ఎం.డి”
“ఆయన
చనిపోయి నలభై
సంవత్సరాలు అవుతోందే!
ఆఫీసులో ఆయన
ఫోటో మాత్రమే
కదా ఉంది”
“అందుకోసమే
ఆయన నన్ను
ప్రేమించటం లేదు”
“ఏయ్
పాపీ”
“నా
ఏరియాలో డెబ్బై
శాతం. రోడ్డులో
వెళ్తున్నప్పుడు
ఎనభై శాతం...నన్ను
చూసినంత మాత్రానే
నూరు శాతం
మగవాళ్ళు నన్నే
ప్రేమిస్తున్నారని
నాకు బాగా
తెలుసు. నేనేమన్నా
కృష్ణ పరమాత్మానా, అందరి
దగ్గర ఒకే
సమయంలో ఉండటానికి!”
“అయినా
కానీ...”
“అయినా
కానీ నీ
ఊహలను నేను
అడ్డుకోలేను. ఎవరి
ఊహలనూ నేను
అడ్డుకోలేను. చాలా
మంది కలలలో...నేను
దుస్తులు లేకుండానే
వస్తున్నట్టు నాకే
బాగా తెలుసు.
నీ కలలో
ఎలా వస్తున్నాను?”
“అది...అది...”
“పరవాలేదు...చెప్పు”
“లంగా
-- షర్టులో!”
“థ్యాంక్స్.
అంత మంచి
వాడివా నువ్వు?”
“అంతలో
అలారం మోగి
నన్ను లేపి
చంపుతోంది...దరిద్రం”
“అరె
ఇడియట్...అదేకదా
చూసాను. సరే...నువ్వు
ఇంత నిజమన్నా
చెబుతున్నావే! ఇలా
చూడు శ్యామ్...నన్ను
నీ కలలలో
నువ్వేం చేసుకోవాలనుకుంటే
అదే చేసుకో!
కానీ, ఎదురుగా
ఉన్నప్పుడు నన్ను
ట్రబుల్ చెయ్యకు!”
మరుసటి రోజు.
“ఏయ్
ఏయ్ ఏయ్... శ్యామ్”
“ఏమిటి...ఏమిటి
రోహిణీ?”
“అదివ్వు...ఇవ్వు
మొదట్లో...”
రోహిణీ వేగంగా
వచ్చి శ్యామ్
చేతిలో ఉన్న
తన పెన్నును
లాక్కుంది.
“ఏమిటీ...ఒక
పెన్ను కొసం...ఇలా...”
“ఇలా
చూడు శ్యామ్...నా
వస్తువులను అవతలి
వారు ఉపయోగించటం
నాకు ఇష్టం
ఉండదు”
“పెన్నునే
కదా తీసేను.
దానికి ఇంత
సీను వెయ్యాలా?”
“పెన్నో...పెన్సిలో...? నా
వస్తువులను ముట్టుకోకు
-- అందులోనూ నా
అనుమతి లేకుండా!
నాకు నచ్చదు.
నేను అదో
రకం...”
“అదొక
రకం అంటే?”
“అదో
రకం అంటే, దానివలన
ఒక కంపెనీలో
నాకు ఉద్యోగమే
పోయిందని పెట్టుకో”
“అలాగా...అదెలా?”
“నేను
పనిచేస్తున్న కంపెనీలో, ఎం.డి
తో మాట్లాడుతున్నాను.
అప్పుడు నా
చేతిలో ఉన్న
‘పర్సనల్
డైరీ’ కింద
పడిపోయింది. ఎం.డి.
చటుక్కున కిందకు
వంగి అది
తీసి ఇచ్చారు.
వెంటనే నేను
ఉద్యోగానికి రాజీనామా
ఇచ్చేసి వచ్చాశాను”
“ఎందుకలా...ఎందుకు?”
“నా
పర్సనల్ డైరీని
ఆయనెలా ముట్టుకోవచ్చు?”
“ఏయ్.సిల్లీ
గర్ల్...కిందపడిన
డైరీనినే కదా
ఆయన తీసిచ్చాడు?”
“నేను
అంత ‘పొససివ్,సెన్సిటివ్’ అని
చెప్పొచ్చాను. ఇక
మీదట నా
వస్తువులను దేనినీ
ముట్టుకోకు”
“ఓసి
రాక్షసీ. నేను
నిన్ను పాల్కోవా
అనుకున్నాను. నువ్వొక
సైకోనా?”
మద్యాహ్నం లంచ్
టైము.
వేగంగా శ్యామ్
దగ్గరకు వచ్చింది
రోహిణీ.
“నేను
క్యాంటీనుకు వెళుతున్నాను.
నీకేమైనా కావాలా?”
“నాకు
ఏం కావాలో
నీకు బాగా
తెలుసు రోహిణీ” అంటూ రోహిణీని
ఆశగా చూసాడు.
“ఏమిటలా
చూస్తున్నావు?”
మళ్ళీ అదేలాగానే
చూస్తూ నిలబడ్డాడు.
“ఏమిటీ...ఏం
కావాలి? నోరు
తెరిచి చెబితేనే
కదా తెలుస్తుంది?”
శ్యామ్ మెల్లగా, “వేడిగా
కాఫీ” అన్నాడు.
“అంతేనా? నువ్వు
ఇంకేదో చెప్పబోతావని
అనుకున్నా”
“ఏం
చెబుతానని అనుకున్నావు?”
రోహిణీ సర్దుకుని
“టీ
చెబుతావేమోనని
అనుకున్నా”
ఇద్దరూ ఒకర్ని
ఒకరు చూసుకున్నారు.
“రోహిణీ...నేనొకటి
చెప్పనా?”
“ఊ...”
“నేను
నీకు ‘బల్బు’ ఇస్తే, నువ్వు
నాకు ‘ట్యూబు
లైటు’ ఇస్తున్నావు”
రోహిణీ నవ్వుకుంటూ
వెళ్ళిపోయింది.
మేనేజర్ ‘హాయ్’ రామప్ప
గది.
“శ్యామ్...ఈ
ఆదివారం ఏం
చేస్తావు?”
“అది
సోమవారం నాడే
సార్ నాకే
తెలుస్తుంది”
“అలాగంటే...?”
“ఏదో
ఒకటి చేస్తాను
సార్. ఇప్పుడు
తెలియదు. సొమవారం
ఆలోచిస్తేనే ఆదివారం
ఏం చేసానో
నాకే అర్ధమవుతుంది.
ఏం సార్...ఒక
‘బ్యాచులర్’ దగ్గర
ఇలా కఠినమైన
ప్రశ్నలన్నీ అడుగుతున్నారు?”
“ఆదివారం
ఆఫీసు స్టాఫ్
అంతా కలిసి
టూర్ వెళుతున్నాం.
నువ్వు వస్తావా...?”
“ఖర్చు
దండగ. నేను
రాను...”
“ఏం.డి
కూతురు మాధవి
కూడా వస్తోంది.
చూడటానికి ఆమె
సూపర్ గా
-- పాల మీగడ
గడ్డలా తళ
తళమని ఉంటుంది”
“ఛఛ...ఒక
మేనేజర్ మాట్లాడే
మాటలా ఇవి? నేను
రాను సార్”
“ఆఫీసు
మొత్తమూ అని
చెప్పాను”
“నేను
రాను అని
చెప్పాను”
“ఆఫీసు
మొత్తం అంటే
నీకింకా అర్ధం
కాలేదంటే నువ్వు
ఉత్త మట్టి
బుర్రగాడివి. ఇప్పుడు
నువ్వు చేస్తున్న
ఉద్యోగమే ఎలా
చేస్తున్నావో తెలియటం
లేదు. నీకు
అర్ధమయ్యేటట్టు
నేనే చెబుతా...ఆఫీసు
మొత్తం అంటే
రోహిణీని కూడా
కలిపి”
‘సార్...నేనెప్పుడు
రానని చెప్పాను?”
***************************************************PART-4********************************************
ఆదివారం.టూర్!
బస్సే కోలాహలంగా
ఉంది. ఏ
టూరూ బయలుదేరటానికి
ముందు ఏర్పడే
ప్రారంభ కాల
ఉత్సాహం, ఆ
గుంపు దగ్గర
కూడా కనబడింది.
ఒకటే గోల, శబ్ధం, ఈలలూ, చప్పట్లూ, పాట, బస్సుకు
పక్కన ‘డాం.డాం.డాం’ మోత, నవ్వులు, గేలీ
-- ఎగతాలి....
ఎం.డి.
కూతురు మాధవి, అమెరికాలో
చదువుకుని వచ్చింది.
ఆమె, ఈ
గుంపుకు కొత్త.
అందరికీ పరిచయం
చేయబడింది.
శ్యామ్ యొక్క
చేతులను నొక్కి
పట్టుకుని చాలాసేపు
షేక్ హ్యాండ్
ఇచ్చింది. అది
గమనించటం మరిచిపోలేదు
రోహిణీ. ఆమెలో
చిన్నదిగా ఒక
ఈర్ష్య రవ్వపేలింది.
‘అది
ఎందుకు’ అనేది
ఆమెకే అర్ధం
కాలేదు!
శ్యామ్ కి ‘గిటార్’ వాయించటం
తెలుసు అని
ఆరోజే ఆఫీసులో
వాళ్ళందరికీ తెలిసింది.
‘ఉండిపోరాదే..గుండె
నీదేలే’ పాటను
అతను మధురంగా
‘గిటార్’ వాయించ
‘హాయ్’ రామప్ప
లేచి డాన్స్
చేసారు. చప్పట్లు
మారుమోగినై.
తరువాత మాధవి
ఒక ఆంగ్ల
పాట పాడగా, దానికి
తగినట్లుగా ఇంపుగా
‘గిటార్’ వాయించాడు
శ్యామ్. మాధవి
బాగా ఎమోషనల్
అయ్యింది.
“నీకు
ఇంగ్లీష్ పాటలు
నచ్చుతాయా?” అని
అడిగింది.
“అవన్నీ
విన్నది కూడా
లేదు”
“మరెలా
వాయించావు?”
“వాటన్నింటినీ
ఎప్పుడో తెలుగులో
‘కాపీ’ కొట్టేసారుగా!” అనగానే గుంపు
గొల్లుమని
నవ్వింది. మాధవి
కూడా ఆ
నవ్వులతో తన
నవ్వును కలిపింది.
మరి కొంతమంది
కూడా పాడగా, వాళ్ళందరికీ
కూడా ‘గిటార్’ సంగీతం
వాయించాడు శ్యామ్.
అప్పుడప్పుడు ఓర
కంటితో రోహిణీని
చూస్తూ ఉన్నాడు.
రోహిణీనేమో మాధవి
శ్యామ్ ను మింగేసేలాగా
చూస్తూ ఉండటాన్ని
గమనించింది.
మార్నింగ్ బ్రేక్
ఫాస్ట్ కోసం
బీచ్ రోడ్డులోని
ఒక హోటల్
దగ్గర బస్సు
ఆపబడింది. అందరూ
టిఫిన్ సెంటర్
లోకి పరిగెత్తారు.
శ్యామ్ ‘గిటారు’ తో
హోటల్ తోట వైపుకు
నడిచాడు. చాలా
దూరం నడిచిన
తరువాత ఒక పొద
దగ్గరున్న చెట్టు కింద
కూర్చున్నాడు. ఏకాంతంగా
‘గిటార్’ వాయించడం
ప్రారంభించాడు.
సంగీతం ఉత్సాహంగా
ప్రవహించింది. చుట్టుపక్కలను
నింపింది.
మాధవి ఆ
తోట మట్టిలో
వయ్యారంగా నడిచి
వచ్చింది. ఆమె
వేసుకున్న టైటైన
టీ షర్ట్
బొత్తాలు జస్ట్
లైక్ దట్
ఊడిపోయి, ఆమె
యౌవ్వనాన్ని అడ్వర్టైజ్
చేసింది. ఆమె
యొక్క టైటైన
జీన్స్, ఆమెను
మరింత గ్లామర్
గా చూపించి
కిక్ ఎక్కించింది.
సంగీతాన్ని ఎంజాయ్
చేసింది ఆమె.
ఇటువైపు, అటువైపూ
పలు కోణాలలో
నిలబడి తన
మొబైల్ ఫోనులో
ఫోటోలు తీసింది.
కళ్ళు మూసుకుని
ఎంజాయ్ చేస్తూ, గిటార్ను
వాయించి ముగించాడు
శ్యామ్. కళ్ళు
తెరిచినప్పుడు, ఫోటోలు
తీస్తూ ఉన్నది
మాధవి.
“అయ్యో...అయ్యో...ఏం
చేస్తున్నారు?”
“అంత
మర్యాద అక్కర్లేదు.
మాధవి...నువ్వు...రా...పో...అంటూ
చెప్పినా కూడా
చాలు”
“ఏం
చేస్తున్నావు నువ్వు? ఆ
ఫోటోలన్నిటినీ
తిరిగి ఇచ్చేయి.
లేకపోతే డిలేట్
చేసేయి”
“ఎందుకని?”
“ప్లీజ్...సెంటిమెంటల్
గా నాకు
ఫోటోలు తీస్తే
నచ్చదు. డిలేట్
చేసేయి...ప్లీజ్!”
“సరే!
కానీ, ఒక
షరతు”
“ఏమిటి?”
“నాకు
నువ్వు ‘గిటారు’ వాయించడం
నేర్పాలి”
“అది
చాలా సింపుల్.
గి.టా.ర్...గిటార్
అంతే”
“‘గిటర్’ అని
మాట్లాడటం నేర్పించమనలేదు.
గిటారు వాయించడం
నేర్పించమన్నాను”
“నేనే
ట్రైనింగ్ తీసుకుంటున్నాను.
ఎవరైనా పెద్ద
విద్వాంసుడి దగ్గర
నేర్చుకో. బాగా
నేర్పుతారు”
“లేదు
లేదు...నేనేమన్నా
వేదిక ఎక్కి
కచేరీనా చెయ్యబోతాను? సింపుల్
గా పొద్దు
పోవటానికి వాయించటం
నేర్చుకుంటే చాలు”
“నేర్పించవచ్చు...తప్పులేదు.
కానీ...”
“అయితే
ఇప్పుడే నేర్పించు”
“సరే.
ఇదిగో...మొదట
‘గిటారు’ ను
ఇలా పట్టుకోవాలి.
ఇలా వాయించాలి”
శ్యామ్, మాధవి
చుట్టూ పట్టుకుని
‘గిటార్’ ను
పట్టుకోవటం నేర్పించ
-----
దూరంగా, టిఫిన్ తింటూనే
వీళ్ళనే చూస్తున్న
రోహిణీ కోపంగా
కుర్చీలో నుండి
లేచింది.
ప్లేటును అలాగే
పడేసి వాళ్ళ
వైపుకు నడిచింది.
శ్యామ్, తప్పించుకోలేక
మాధవిని కౌగలించుకుని
నేర్పిస్తుంటే, ఆమె
వాసన అతన్ని
ఉక్కిరి బిక్కిరి
చేయ, అతని
చేతులు ఇష్టం
వచ్చినట్టు ఆమె
మీద పడగా--
ఆమేమో దాన్ని
పట్టించుకున్నట్టే
తెలియటం లేదు.
అమెరికా ప్రకృతి.
రోహిణీ వేగంగా
వచ్చి పొదకు
అటుపక్కగా నిలబడి
వాళ్ళను గమనించడం
మొదలుపెట్టింది.
“ఇదిగో
చూడు మాధవి...ఇలా
వాయించాలి” -- అతను
ఆమె చేతులను
అదిమి పట్టుకుని
వాయించి చూప, ఆమె
ఒళ్ళు చెమటపట్టి
వణికింది.
“సడన్
గా ఎందుకింత
చెమటలు పడుతున్నాయి
నీకు?”
“అది...అది...నువ్వు
ముట్టుకున్న వెంటనే...”
“నేను
వాయించటాన్ని గమనించు”
అతని సన్నిహితాన్ని
అనుభవించిన మాధవి
కళ్ళు తడిసినై.
ఏదీ అర్ధం
కాలేదు ఆమెకు.
అయినా కానీ, “ఊ...ఊ” అన్నది.
పొదకి అవతలి
వైపు నిలబడున్న
రోహిణీ, పొద
ఆకులను పీకి, కోపంతో
నమిలి ఉమ్ముతున్నది.
“తరువాత
దీంట్లో ‘కీ
సిగ్నేచర్’ ఉంది, ‘టైం
సిగ్నేచర్’ ఉన్నది”
మాధవి శరీరం జలదరించింది.
“ఇంత
స్పీడుగా నేర్పొద్దు
శ్యామ్. ఏదీ
అర్ధం కావటం
లేదు. ఒకే
రోజులో పూర్తి
చేస్తావా?”
“నువ్వు
సరిగ్గా వాయించేటప్పుడు, నీకు
ఈ శబ్ధం
వినిపించాలి”
శ్యామ్ వాయించి
చూపించాడు.
“శబ్ధం
వినబడుతోందా?”
“వినబడలేదు”
పొదల వెనుకే
ఉన్న రోహిణీ
హఠాత్తుగా అరిచింది.
“ఆ...అయ్యో...అమ్మో...”
“ఇప్పుడు
వినబడుతోంది...” అన్నది మాధవి.
శ్యామ్ అధిరిపడ్డాడు.
“ఏయ్...అది...నేను
కాదు. వేరే
ఎవరో అరుస్తున్నారు”
శ్యామ్ పొద
చుట్టూ పరిగెత్తుకు
వెళ్ళి చూసాడు.
మరోసారి అధిరిపడ్డాడు.
అక్కడ రోహిణీ
తన కాలు
పుచ్చుకుని పడిపోయింది.
“అయ్యో
రోహిణీ...ఏమైంది?”
“పా...పా...పా...”
“పాల
ఐస్ క్రీం
కావాలా?”
“ఊహూ.
పా...పా...పా...”
“పాపం
పసివాడు సినిమానా?”
మాధవి పరిగెత్తుకు
వచ్చింది. “ఓ
గాడ్...
రోహిణీ. ఏం
జరిగింది?”
“పా...పా...పాము...!
అయ్యో నా
కాలు మీద
పొదల్లో ఉన్న
పాము కాటేసి
వెళ్ళిపోయింది...పెద్ద
పాము...నాగు
పాము...”
“పామా!” -- శ్యామ్
బెదిరిపోయి గెంతులు
వేశాడు.
“వెళ్ళిపోయిందా...ఎటు
వెళ్ళింది?” అడిగింది
మాధవి ఆదుర్దాగా.
“ఎటు
వెళ్ళింది అంటే...వెళ్ళేటప్పుడు
అదేమన్నా అడ్రస్సు
ఇచ్చా వెళుతుంది...ఎక్కడికో
వెళ్ళిపోయింది...అదిగో...అటే
వెళ్ళింది”
రోహిణీ ఏదో
ఒక వైపుగా
చై చూపింది.
మాధవి వంగుని
అటువైపుగా పాముని
వెతుక్కుని వెళ్ళింది.
శ్యామ్ తిరిగి
రోహిణీని చూశాడు.
అతను చూస్తూ
ఉన్నప్పుడే, రోహిణీ
యొక్క ముక్కులో
నుండి సన్నగా
నెత్తురు కారటం
ప్రారంభించింది.
అది చూసి
శ్యామ్ భయపడిపోయాడు.
“అయ్యో...
రోహిణీ...ముక్కు
నుండి నెత్తురు.
డాక్టర్...డాక్టర్...” కేకలు వేశాడు.
“శ్యామ్...
శ్యామ్...భయపడకు...భయపడకు”
“డాక్టర్...డాక్టర్”
“ఏయ్...
షెటప్! గోల
చేయకుండా ఇలా
కూర్చో. నేను
చచ్చి పోతానేమోనని
నాకు భయంగా
ఉంది...నా
పక్కన కూర్చో
శ్యామ్. నేను
నీ మీద
కొంచం ఆనుకుంటాను...”
“లేదు...డాక్టర్
దగ్గరకు...”
“డాక్టర్
దగ్గరకు తరువాత
వెళదాం. చెబుతున్నా
కదా...కొంచం
పక్కన కూర్చోరా...ఇడియట్!” --- రోహిణీ
చివాట్లు పెట్టింది.
శ్యామ్ భయపడుతూ
కూర్చున్నాడు.
రోహిణీ అతని
మీద వసతిగా
ఆనుకుంది.
“ఏయ్...ఏం
చేస్తున్నావు...?”
“అయ్యో...కళ్ళు
బైర్లు కమ్ముతున్నాయే!
తలతిరుగుతోందే...నోట్లో
నురుగు వస్తోందే...గుండె
దఢ దఢ
మని కొట్టుకుంటోందే”
పాము కనబడక
మాధవి తిరిగి
వచ్చి అడిగింది.
“ఏయ్...పాము
ఏ చోట
కరిచింది...?”
“కాలు
మీద...” అన్నది రోహిణీ.
“కాలు
చూపించు...”
రోహిణీ కాలు
ఎత్తి చూపింది... మాధవి అనుమానంతో
చూసింది.
“ఏయ్...కాలు
మీద పాము
కరిచిన గాట్లే
ఏమీ లేవే...?”
“అది
నోరు లేని
జీవి...దాని
నోరును వెతికితే
కనబడుతుందా? శ్యామ్...నాకు
గుండె అంతా
పట్టేస్తున్నట్టు
ఉంది. తల
తిరుగుతోంది. నన్ను
వదిలేసి వెళ్ళిపోకు...”
“రోహిణీ...రా!
డాక్టర్ దగ్గరకు
వెళదాం...”
“నావల్ల
నడవటం కుదరదు.
ఇదిగో ఈమెను
వెళ్ళమని చెప్పు.
ఏయ్ మాధవీ...త్వరగా
వెళ్ళు. డాక్టర్ను
పిలుచుకురా...”
“నేనా...నేను
వెళ్ళను”
రోహిణీ ఉమ్మును
నురుగులాగా నోటి
ద్వారా బయటకు
వదిలింది.
శ్యామ్ భయపడి
“అయ్యో...నోట్లోంచి
నురుగు వస్తోంది.
వెళ్ళు మాధవీ...త్వరగా.
డాక్టర్...డాక్టర్...” అని అరిచాడు.
తోట మట్టినేలపై
నడవటానికి తడబడుతున్నా
వేగంగా అడుగులు
వేస్తూ ఆయాసపడుతూ
పరిగెత్తటం మొదలుపెట్టింది
మాధవి.
రోహిణీ గబుక్కున
లేచి కూర్చుని
ఆమె పరిగెత్తటాన్ని
వేడుకు చూస్తూ
నవ్వింది.
శ్యామ్ ఆశ్చర్యపోయి, “ఏయ్...అయితే
పాము కరవలేదా?”
“పాము
ఏమిటీ, నన్ను
కరవట మేమిటీ!
నేను చైనా
హోటల్లోనే పాము
మాంశం తిన్న
దాన్ని”
“మొదట
నెత్తురు వచ్చిందే? నోటి
నుండి నురుగు
వచ్చిందే...?”
“అయ్యో...మాటి
మాటికీ అదే
చెప్పకు! అదంతా
సెటప్”
“అలాగా...
మాధవి పాపం” అని శ్యామ్
జాలిపడ్డాడు.
రోహిణీ కోపంగా
చూస్తూ, “ఏమిటి
పాపం? ఒక
తెల్ల తోలు
వచ్చి ‘గిటార్’ నేర్చుకోవాలి
అన్న వెంటనే
‘టాం
టాం అంటూ’ జొల్లు
కార్చటమేనా? ఏముంది...డబ్బు
గలది కదా!
అలాగే బ్రాకెట్
వేసేద్దామని చూస్తున్నావా? నాకు
తెలుసయ్యా...నీ
లక్ష్యమే అడ్డు
దోవలో డబ్బు
సంపాదించాలి. అంతే
కదా?”
“ఛఛ”
“మరి? దొరికింది
కదానని గట్టిగా
కౌగలించుకుని కరిగి
కరిగి గిటారు
నేర్పిస్తున్నావు...చంపేస్తా!”
“నిన్ను
అర్ధం చేసుకోవటమే
కుదరటం లేదు”
“నన్ను
అర్ధం చేసుకోవటానికి
ఈ జన్మలో
ప్రయత్నించకు”
“ఏం
రోహిణీ?”
"అది
నీవల్ల కాదు.
అటు చూడు...ఆమెను
ఎలా పరిగెత్తించానో”
శ్యామ్ మళ్ళీ
అటు వైపు చూశాడు.
“డాక్టర్...డాక్టర్” అని అరుస్తూ
మాధవి తోట
మట్టినేలపై పరిగెత్తలేక
అవస్తపడుతున్నది
తెలుస్తోంది.
రోహిణీ పడీ
పడీ నవ్వింది.
శ్యామ్ జాలిగా
మాధవి వెళ్తున్నవైపు చూస్తూ, ‘ఈ రోహిణీ
ఒక మర్మ
దేవత’ అని
అనుకున్నాడు.
***************************************************PART-5********************************************
మళ్ళీ బస్సు ప్రయాణం!
‘ఒకరోజు
ఎంజాయ్ చేసాను.
మరుసటి రోజు
ఛీ అన్నాను.
నిన్ను నేను
చంపకుండా చంపి.
పూడ్చెనే...క్షమిస్తావా
క్షమిస్తావా?’
రోహిణీ సన్నటి
స్వరంతో శ్యామ్
ను సూటిగా చూసి
పాడగా అతను
కాగితంగా మారి
కిటికీ ద్వారా
బయటకు చూపులను
పరిగెత్తించి, తిరిగి
మళ్ళీ రోహిణీని
చూసినప్పుడు.
ఆమె మిగిలిన
మగవారిని చూస్తూ
పాడుతున్నది.
షాకయ్యి ‘ఓసి
దుర్మార్గురాలా!’ అనుకున్నాడు.
“శ్యామ్...ఇప్పుడు
నువ్వు పాడు”
“మనసులో
నిన్ను ఉంచుకున్నానూ
అని పాడాలని
అనుకుంటున్నా...దాని
తరువాత తెలియటం
లేదు”
“నీకు
పూర్తిగా ఏది
తెలుసు చెప్పు?”
“సడన్
గా అడిగితే
ఎలా పాడేది?”
“అది
వదులు...నాకు
వేడిగా గులాబ్
జామూన్ కొని
పెడతావా?”
“డబ్బులివ్వు”
“పిసినారీ.
నువ్వే ఇవ్వు”
మాధవి ఇంకా
తన చూపులతో
శ్యామ్ ను తినేలాగా
చూస్తోంది.
మధ్యలో బోటింగ్ సెంటర్ దగ్గర బస్సు ఆగింది.
కరెక్ట్ అయిన
సమయం చూసి
రోహిణీని పక్కకు
తోసాడు శ్యామ్.
“ఎందుకలా
చెప్పావు?” రోహిణీని
అడిగాడు శ్యామ్
“ఏం
చెప్పాను?”
“నాకు
ఏదీ పూర్తిగా
తెలియదని”
“సరదాగా”
“నీకు
బాయ్ ఫ్రెండ్
ఎవరూ లేరా?”
“లేరు”
“నీలాంటి
అందమైన అమ్మాయలకు...”
“బాయ్
ఫ్రెండ్ ఉండటం
తప్పనిసరా?”
“అందరూ
ఒక కోతినైనా
తమకు తోడుగా
ఉంచుకుంటారు”
“నాకు
ఏ కోతీ
వద్దు” అంటూ శ్యామ్
ను దీర్ఘంగా
చూసింది.
“అదెందుకు
నన్ను చూసి
చెబుతున్నావు?”
“ఉత్తినే”
“ఎందుకు
నీకు బాయ్
ఫ్రెండ్ వద్దు? నువ్వు
లెస్బియనా?”
“కాదు”
“మరి?”
“ఎవరికీ
గర్ల్ ఫ్రెండుగా
ఉండటం నాకు
ఇష్టం లేదు”
“ఓ...”
“ఎవరికీ
ఏదీగానూ ఉండటం
నాకు నచ్చదు”
“ఓ...”
“ఏమిటీ
ప్రతిదానికీ ఓ.ఓ
అంటున్నావు?”
“ఓ...”
“ఇదిగో
చూడు...నేను
నేనుగా ఉండటానికి
ఇష్టపడుతున్నాను.
స్వతంత్రంగా ఉండటానికి
ఇష్టపడుతున్నాను.
ఎవరికీ సమాధానం
చెప్పటం నాకు
నచ్చదు”
“ఎవరికైనా
సమాధానం చెప్పటంలో
ఏముంది తప్పు? మన
మీద అక్కర
చూపటానికి ఒక
వ్యక్తి కావద్దా?”
“అలా
ఎవరైనా ఉంటే...ఆ
తరువాత ఏం
జరుగుతుందంటే, ఒక
స్టేజీలో వాళ్ళ
ఫీలింగ్స్ ను
గాయపరచ వలసి
వస్తుంది. తరువాత
నన్నే ఎక్కువగా
గాయపరచుకో వలసి
వస్తుంది”
“కమాన్
రోహిణీ....ప్రేమ
ఒక దేవుడు”
“లేదు...ప్రేమ
ఒక శని”
“హఠాత్తుగా
ఒక రోజు
నువ్వు ప్రేమలో
పడిపోతే ఏం
చేస్తావు?”
“నేను
ప్రేమలో పడటమా...ఛాన్సే
లేదు”
“పడిపోయేవే అనుకో...అప్పుడు
-- తరువాత?”
“పడితే
వెంటనే లేచి
బయటకు వచ్చేస్తాను.
పడిపోయే ఉండను”
“ఇదేం
జవాబు?”
“ఇదే
జవాబు! ఆ
గుంటలో చాలా
మంది పడటం
చూసాను. గుంట
అని తెలిసి
ఎవరైనా పడతారా? లేక...పడినా
లేవకుండా ఉంటారా?”
“ప్రేమ
ఉన్నదే...అదొక
ఉన్నతమైన ఫీలింగ్.
దాన్ని మాటల్లో
వర్ణించలేము”
“సారీ
శ్యామ్. మాటల్లో
వివరించలేనిది
ఏదీ నా
జీవితంలో వద్దు.
అది నాకు
సెట్ అవదు.
అది ఉపయోగం
లేదు. నేను
చాలా ప్రాక్టికల్
రకం. ఒక
వస్తువును ఏ
గ్యారంటీ లేకుండా
కొనేది వేస్టు.
అది ప్రేమగా
ఉన్నా సరే!”
“ప్రేమ, దేవుడు
సృష్టించింది”
“అలాంటప్పుడు
ఎందుకు కోర్టు
గుమ్మాల దగ్గర
అంతమంది విడాకుల
కోసం నిలబడుతున్నారు?”
“ఎందుకంటే
విడాకులు మనిషి
సృష్టించింది”
“మూర్కత్వపు
వాదన”
“లేదు
రోహిణీ. మా
తల్లి-తండ్రులు
కూడా విడాకుల
దంపతులే. అందువలన
నాకేమైనా ప్రేమ
మీద నమ్మకం
పోయిందా? లేదే!”
“సరే...ప్రేమంటే
ఏమిటి?”
“అదే
చెప్పానే...దాన్ని
వ్యాసంలాగా రాయలేము.
చేసి చూపించటానికి
అదేమన్నా వంట
కార్యమా -- బలవంతం
చేయటానికి హింసాత్మకం
కాదు. ఎవరూ
దాన్ని కళ్ళతో
చూడలేరు. అదో
అద్భుతం. ఎప్పుడైనా
నీలో ఆ
ఫీలింగ్ వచ్చే
తీరుతుంది”
“అలా
వస్తే, తప్పు
అడ్రస్సుకు వచ్చిందని
అనుకుని అదే
తిరిగి వెళ్ళిపోతుంది”
“రోహిణీ, ప్రేమనేది...”
“నాకు
తల నొప్పిగా
ఉంది”
“ఒకే
ఒక మాట
చివరిగా మాట్లాడేస్తాను”
“సరే, త్వరగా
చెప్పు. నాకు
తలనొప్పి ఎక్కువగా
ఉంది”
“ప్రేమ
అనేది...తలనొప్పి
కలిగించేది కాదు.
ప్రేమ అనేది
మనసును నొప్పి
కలిగించేది”
ఆమె అర్ధంకాక
చూసింది!
***************************************************PART-6********************************************
ఆ క్లినికల్
రీసెర్చ్ ఇన్స్-టిట్యూట్
సంస్థ జీడిమెట్లలో
ఉంది. ఎక్కువ
హడావిడి లేని
ప్రశాంతమైన ఆ
భవనంలో, ఈ
ప్రపంచాన్నే తలకిందలు
చేయగల ఒక
పరిశోధన జరుగుతున్నదని
బయటున్న బడ్డీకొట్టు
పెట్టుకున్న సామాన్య
మానవుడు నుండి
పార్లమెంటులో ఉంటున్న
ఎం.పి.
లతో సహా
ఎవరికీ తెలియదు.
పెద్ద డబ్బుగల
సంస్థ అనేది
ఆ భవనంలో
అడుగడుగునా వేసిన
మార్బుల్ రాళ్ళతోనూ, అక్కడ
కనబడే నిశ్శబ్దం
వాతావరణం వలన
అర్ధమవుతోంది.
లోపల డాక్టర్
గదిలో.
నలభై సంవత్సరాల
మధ్య వయసున్న
కళ్ళద్దాలు పెట్టుకున్న
ఒక వ్యక్తి
ఆందోళనతో కూర్చోనున్నాడు. ఆయన
పక్కన ఇరవై
ఐదు ఏళ్ళ
వయసున్న యువకుడు
ఒకడు నిద్రకు
అవస్తపడుతున్నట్టు కూర్చోనున్నాడు. ఎదురుగా... ‘డాక్టర్.
నాగార్జున్, న్యూరో
సైంటిస్ట్’ అనే
ఇత్తడి నేమ్
బోర్డ్ ప్రకాశవంతంగా
ఉన్నది.
డాక్టర్ నలభై
ఐదేళ్ళ యువకుడిలాగా, ఫ్రీజర్
లో ఉన్న
ఆపిల్ పండులాగా
తలతలమని మెరిసిపోతున్నారు.
“జగదీష్
ఎవరు?”
“ఇతనే”
“ఏమిటి
సమస్య?”
“గత
మూడు సంవత్సరాలుగా
మనోవ్యాధితో బాధ
పడుతున్నాడు. ఎన్నో
చికిత్సలు తీసుకున్నాడు.
గుణమవలేదు. చివరగా...మీ
దగ్గరకు తీసుకు
వెళ్ళమని డాక్టర్.
శివరామ్ గారు చెప్పారు”
“ఆయన
ఎందుకు అలా
చెప్పారో మీకు
తెలుసా?”
“తెలియదు
డాక్టర్. ‘అక్కడికి
వెళ్ళండి, తెలుసుకుంటారు’ అని చెప్పారు.
“ఇది
ఎలాంటి ఇన్స్-టిట్యూటో, ఇక్కడ
ఏం జరుగుతున్నదో
అనేది మీకేమైనా
తెలుసా?”
“తెలియదు”
“తెలిసుంటే
వచ్చుండేవారు కాదు” అన్నాడు డాక్టర్. నాగార్జున్ చాలా
సింపుల్ గా.
“డాక్టర్...”
“ఇదొక
పరిశోధనా ఇన్స్-టిట్యూట్.
ఇక్కడ పలురకాల
సైన్స్ పరిశోధనలు
జరుగుతున్నాయి.
ఒక్కొక పరిశోధనా,
మనిషి యొక్క
జీవిత సైలిని
పూర్తిగా మార్చి
పెట్ట గలిగినది.
ఈ ప్రపంచాన్నే
తలకిందలు చేయగల
విప్లవాత్మక--ప్రమాదకరమైన
పరిశోధనలు ఇక్కడ జరుగుతున్నాయి”
కళ్ళద్దాల మనిషిలో
ఏదో ఒక
భయం ఏర్పడింది.
చేతులు చిన్నగా
వణికినై.
“మేము
ఇప్పుడు ఒక
ముఖ్యమైన పరిశోధన
యొక్క చివరి
దశకు చేరుకున్నాము.
సైన్స్ ప్రకారం
నేనే మీకు
దాన్ని వివరించగలను.
కానీ మీకు
అర్ధం కాదు
మిస్టర్...మిస్టర్...సారీ...మీపేరు?”
“రామప్ప.
హాయ్ రామప్ప”
“ఇతను
మీ అబ్బాయా?”
“లేదు.
నా బావమరిది.
నా భార్య
తమ్ముడు. పేరు
జగదీష్”
“ఓహో...సరి...సరి...నేను
ఏం చెబుతున్నాను...”
“ఒక
ముఖ్యమైన పరిశోధన...ప్రమాదకరమైన
పరిశోధన”
“అవును.
ఎలుకలను పెట్టుకుని
ఆ పరిశోధనను
విజయవంతంగా ముగించాము.
ఇప్పుడు మా
పరిశోధనను పరిశోధించ
చూడటానికి ఒక
మనిషి కావాలి.
దాని కోసమే
మీరు ఇప్పుడు
జగదీష్ ను
తీసుకు వచ్చారు”
“డాక్టర్!
ఇది నాకు
ముందే ఎందుకు
చెప్పలేదు. దీనికి
నేను ఒప్పుకోను” షాకయ్యాడు
హాయ్.
“తెలుసు.
దీనికి మీరు
ఒప్పుకుంటే, అది
నాకే పెద్ద
ఆశ్చర్యంగా ఉంటుంది”
హాయ్ అయోమయంలో
పడ్డారు.
“ఏమిటి
డాక్టర్ చెబుతున్నారు.
నాకు అంతా
కన్-ఫ్యూజన్
గా ఉంది?”
“ఇది
అలాంటి పరిశోధన.
దీన్ని సాధారణ
మనుష్యుల మీద
పరీక్ష చెయ్యటం
కంటే, జగదీష్
లాంటి పరిస్థితిలో
ఉన్న,
ఐ మీన్ మనోవ్యాధితో
బాధపడుతున్న మనిషి
మీద చెయ్యటం
మంచి ఫలితం
ఇస్తుంది. కానీ
పరిశోధన ఫైలు
అయితే, ప్రాణానికే
ముప్పు ఏర్పడ
వచ్చు. మేము
దేనికీ బాధ్యత
తీసుకోము”
“డాక్టర్!”
“పరిశోధన
సక్సస్ అయితే, జగదీష్
పూర్తిగా గుణమయిపోతాడు”
“డాక్టర్!”
“మీకు
ఏది కావాలి? జగదీష్
ఇలాగే మనోవ్యాధితో
బాధపడుతూ చివరి
వరకూ ఉండాలా? లేక
ఒక ‘రిస్క్’ తీసుకుని
పరిశోధనకు ఒప్పుకుని, గుణమయ్యి, జీవితాంతం
మామూలు మనిషిగా, మన
అందరిలాగా జీవించాలా? ఏది
మీకు ఇష్టం? మీరే
నిర్ణయించుకోవాలి.
నిర్ణయం తీసుకుని
తరువాత రండి.
ఇప్పుడు మీరు
వెళ్ళొచ్చు”
హాయ్ పూర్తిగా
చెమటతో తడిసి ఉన్నారు.
“ఒక
రోజు అవకాశం
తీసుకోండి. ఓ.కే.
అనుకుంటే రండి.
లేకపోతే ఫోనులోనే
చెప్పేయండి. ఇప్పుడు
మీరు వెళ్ళొచ్చు”
హాయ్ తడబడుతూ
లేచారు. జగదీష్
ను తీసుకుని
గది గుమ్మం
వరకు వెళ్ళినాయన, సంసయంతో
నిలబడ్డారు. వెనక్కి
తిరిగారు.
“డాక్టర్...”
“ఇంతలోనే
నిర్ణయించేసుకున్నారా?”
“లేదు.
కానీ, నిర్ణయించుకునే
ముందు ఒకే
ఒక అనుమానం?”
“అడగండి”
“ఇదొచ్చి...ఎలాంటి
పరిశోధన?”
డాక్టర్ కాసేపు
హాయ్ గారినే
చూశారు.
తరువాత మెల్లగా
చెప్పారు.
“మనిషి
మెదడులో నుండి
అక్కర్లేని,
ట్రబుల్ చేసే జ్ఞాపకాలను
తుడిచే పరిశోధన”
హాయ్ గారు తీవ్ర
షాకుకు గురి
అయ్యారు.
జగదీష్ యొక్క
చెయ్యి పుచ్చుకుని
వేగంగా బయటకు
వెళ్ళిపోయారు.
***************************************************PART-7********************************************
మరుసటి రోజు.
రోహిణీ చెప్పింది.
“శ్యామ్, రాత్రంతా
నువ్వు చెప్పింది
ఆలోచించి చూసాను.
నువ్వు నాకు
బాగా నచ్చావు”
“అయితే...‘ఐ.లవ్.యూ’ చెపొచ్చు”
‘నో...'ఐ.లైక్.యూ’
“రెండిటికీ
తేడా ఏమిటి
రోహిణీ?”
“నచ్చటానికీ, ప్రేమించటానికీ
ఆరు తేడాలు
కాదు...ఆరువేల
తేడాలు ఉన్నాయి.
నువ్వు నాకు
నచ్చావు. కానీ, నువ్వు
అనుకుంటున్న ‘ఆ
నచ్చావు’ కాదు”
“అప్పుడు?”
“మనం
కావాలంటే స్నేహుతులుగా
ఉందాం”
“సినిమా డైలాగు
లాగా మాట్లాడకు...”
“సరే...వదులు”
“ఇది కూడా
సినిమా డైలాగే”
“నచ్చలేదంటే
వదిలేయ్ శ్యామ్.
చాలా సులభం”
“సరి...సరి, కోపగించుకోకు
రోహిణీ. స్నేహంగా, అంటే
ఫ్రెండ్స్ గా
ఉందాం. నాకు
ఓ.కే.
నే”
ఇద్దరూ షేక్
హ్యాండ్ ఇచ్చుకున్నాక, అతను
నవ్వాడు.
“శ్యామ్...ఇప్పుడెందుకు
నవ్వావు?”
“ఇలాగే
మొదలవుతుంది”
“బాధ
పడకు! కలలు
కనకు!! చివరికి
ఇలాగే ముగియబోతుంది”
సాయంకాలం. ఆఫీసు
వాహనాల పార్కింగ్
చోట.
“రోహిణీ...నువ్వు
ఇప్పుడు ‘ఫ్రీనా’?”
“ఎందుకు?”
“సినిమాకు
వెళదామా?”
“నేను
రాను”
“ప్లీజ్
రావా”
“ధియేటర్లో...ఆ
చీకటిలో నువ్వేం
చేస్తావో నాకు
తెలుసు”
“ఖచ్చితంగా
ఏమీ చేయను”
“పైన
చెయ్యి వేస్తావా?”
“వెయ్యను”
“నీ
కాలితో నా
కాలును ముట్టుకుంటావా?”
“ఛీఛీ”
“నడుం
ముట్టుకుంటావా?”
“ముట్టుకోను”
“ఛాతి
మీద చెయ్యి
పెడతావా?”
“పెట్టనే
పెట్టను”
“గబుక్కున
ముఖాన్ని తిప్పుకుని
ముద్దు పెడతావా?”
“లేదు...లేదు”
“ఇవి
ఏవీ చెయ్యవు!”
“చెయ్యను”
“చేతులు
కట్టుకుని సినిమా
చూస్తావు”
“అవును”
“నిజమా?”
“నిజమే”
“ప్రామిస్?”
“ప్రామిస్”
“అలాగైతే
నన్నెందుకు పిలుస్తావు? సినిమా
చూడటానికి మీ
అమ్మను తీసుకు
వెళ్ళు”
శ్యామ్ షాకయ్యాడు...ఇంతలో
రోహిణీ వెళ్ళిపోయింది.
***************************************************PART-8********************************************
అదే క్లినికల్
రీసెర్చ్ ఇన్స్-టిట్యూట్
సంస్థ.
డాక్టర్ నాగార్జున్
ఎదురుగా ‘హాయ్’ రామప్ప, జగదీష్
మరియు శ్యామ్
-ముగ్గురూ కూర్చోనున్నారు.
ఈ సారి
తనకొక సపోర్ట్
కోసం శ్యామ్
ను కూడా
వెంట పిలుచుకు
వచ్చారు ‘హాయ్’.
“ఇతను
మా కంపెనీలో
పనిచేస్తున్నాడు.
పేరు శ్యామ్.
కుటుంబ సన్నిహితుడని
పెట్టుకోండి”
“ఓహో...ఏం
నిర్ణయం తీసుకున్నారు?” -- కొంచం
కూడా జాలి
అనేది లేకుండా
ఉన్నది డాక్టర్
స్వరం.
“డాక్టర్...అది
నిర్ణయించుకోవటానికి
ముందు మాకు
కొన్ని అనుమానాలు” అన్నాడు శ్యామ్.
“అడగండి”
“జ్ఞాపక
శక్తిని మన
ఇష్టం వచ్చినట్టు
మనిషి మెదడులో
నుండి చెరిపేయటం
సాధ్యమని మీరు
అనుకుంటున్నారా?”
“అవును!
అదే కదా ఈ
పరిశోధన! ఈ
అక్కర్లేని, మనిషిని
కష్టపెట్టే జ్ఞాపకశక్తిని
చెరిపే పద్దతి...ముఖ్యంగా
అమెరికా ట్రేడ్
సెంటర్ ట్విన్
గోపురాలను టెర్ర
రిస్టులు పడగొట్టిన
తరువాత ఎక్కువగా
ఉపయోగంలోకి వచ్చింది.
ఆ రెండు
గోపురాలను పడగొట్టిన
సమయంలో ఆ
దాడి నుండి
ప్రాణాలతో తప్పించుకున్న
గోపురాలలోని కొందరు, ఆ
గోపురాలను విమానాలు
పడగొట్టేటప్పుడు
ఆ సంఘటనను
టీ.వీ
లో వీక్షించిన
ప్రజలు కొందరూ
-- సుమారు రెండువేల
మంది షాకుకు
గురి అయ్యారు.
ఆ రెండువేల
మందిలో 75 శాతం
ప్రజలు ఆ
దారుణమైన సంఘటనను
మరిచిపోలేక అల్లల్లాడిపోయారు.
అందులో చాలామంది
మనో ఒత్తిడికి
లోనైయ్యారు. వాళ్ళందరికీ
ఎన్ని చికిత్సలు
చేసినా వాళ్ళు
కోలుకోలేకపోయారు.
అప్పుడు ఈ జ్ఞాపకశక్తిని
చెరిపే చికిత్సకు
కొత్త ఉత్సాహం
దొరికింది. ఇదే
చికిత్సను
వియత్నాం యుద్దంలో
సూపర్ పవర్
సైనికులపై ప్రయోగించింది.
ఇది నిజానికి
ఒక విజయవంతమైన
చికిత్సా విధానమే.
అయితే ఈ
చికిత్సను దుర్వినియోగ
పరచవచ్చు అని
ఆ చికిత్సా
విధాన టెక్నాలజీను
ఇంకెవరికీ ఇవ్వలేదు.
ఎందుకైనా మంచిదని
ఈ చికిత్సా
విధానాన్ని చాలా
దేశాలు బాన్
చేశాయి. మేము
ఆ చికిత్సా
విధానాన్ని మంచి
విషయాలకు, షాక్
కు గురి
అయిన పేషెంట్లకు
ఉపయోగించుకోవచ్చని
ప్రభుత్వ పర్మిషన్
తో ఈ
పరిశోధనా ఇన్స్-టిట్యూట్
ను మొదలుపెట్టాము.
ఇందులో మేము
చాలా వరకు
విజయం సాధించామనే
చెప్పాలి. డైరెక్టుగా
ఒక షాకుతోనూ, ట్రౌమాతోనూ
బాధపడుతున్న ఎవరికైనా
ఈ చికిత్స
అందించి అటు
పేషెంటుకు, ఇటు
మాకూ గెలుపు
దొరకాలి”
హాయ్ మరియు శ్యామ్
కళ్ళల్లో ఒక
చిన్న నమ్మకం
గీత ప్రకాశించింది.
ఇద్దరూ వేగంగా
ఒకర్ని ఒకరు
చూసుకున్నారు.
డాక్టర్ కొనసాగించారు.
“మెదడు
ఒక సముద్రం
లాంటిది. దానికి, లోతులలోకి
వెళ్ళి కూర్చోగలిగే
జ్ఞాపకాలను ఆపగలిగే
శక్తి తక్కువ.
అన్ని విషయాలనూ, సంభవాలనూ, జ్ఞాపకాలను
రికార్డు చేసే
'ఆడియో--వీడియో' రికార్డర్
లాగా పనిచేస్తుంది.
దానికి, షాకుల
వలన ఏర్పడిన
జ్ఞాపకాలు, కష్టపెట్టే
జ్ఞాపకాలు అని
వేరు చేసే
తెలివి లేదు.
చాలా జ్ఞాపకాలు
కాలసమయంతో శక్తిని
కోల్పోయి, జ్ఞాపకాల
కుండి నుండి
వెళ్ళిపోతాయి. కానీ
కొన్ని ఇష్టపడని
జ్ఞాపకాలు,
ఘోరమైన సంఘటనల జ్ఞాపకాలు త్వరగా
వెళ్ళవు. అలాంటి
జ్ఞాపకాలు మన
మెదడులోని ‘సబ్
కాన్షియస్’ చోటైన
‘అమిగడలా’ లోకి
వెళ్ళి కూర్చుండిపోయి
అప్పుడప్పుడు తొంగి
చూస్తాయి. మనుషులను
బాధ పెడతాయి”
ఈ రీసెర్చ్
సెంటర్ పేరు
‘అమిగడలా’ అని
అప్పుడు జ్ఞాపకం
వచ్చింది శ్యామ్
కు.
“కరెక్టుగా
చెప్పాలంటే, ఈ
బాధలు కల్పించే
జ్ఞాపకాలు కొంచం
కొంచంగా జరిగిపోయిన
కాలం నుండి
జరుగుతున్న కాలానికి
జారుతున్నట్టు
నలుగుతూనే ఉంటుంది.
అలాగే విస్తరించి
జరుగుతున్న కాలంలోని
సంతోషాలను నాశనం
చేసి, మనిషి
భవిష్యత్తును పూర్తిగా
నాశనం చేస్తుంది”
శ్యామ్, హాయ్
కళ్ళల్లో ఆశ్చర్యం.
“కొంతమంది
ఒక దారుణమైన--అపాయకరమైన
సంఘటనను చూసిన
షాక్ లో, అలాగే
స్థంభించి -- కరిగిపోతారు.
ఆ సంఘటన
వారి మనసులో
పెద్ద భారంగా
ఉంటూ వాళ్ళను
ఒత్తిడి కి
గురిచేస్తుంది. దాని
గురించి మాట్లాడటానికి
కూడా వాళ్ళు
ఇష్టపడరు. అలా
వాళ్ళు మాట్లాడని
విషయాలు పోను
పోను, కాలం
గడవను గడవనూ
పెద్ద ఒత్తిడి
ఏర్పరచి మనోవ్యాధికి
తొసేస్తుంది”
“జగదీష్
లాగానా?”
“అవును.
కొంతమందికి మాట్లాడటం
ప్రారంభిస్తేనే
భారం తగ్గుతుంది.
మనసు తేలిక
పడుతుంది. అలాగూ
మనో ఒత్తిడి
గుణం కాని
వాళ్ళకు మేము
తరువాత చికిత్సగా, అలాంటి
జ్ఞాపకాలు వాళ్ళ
మనసు స్క్రీనును
వదిలి అంటే
మెదడు భాగంలో
నుండి చెరిపేసే
కార్యక్రమాన్ని
చెయ్యబోతాం”
డాక్టర్ ఒక
పెన్సిల్ తీసుకుని
చెక్కటం మొదలు
పెట్టాడు.
“ఒకసారి
ఒక జ్ఞాపకం
మన మెదడులో
రిజిస్టర్ అయిపోతే, అది
చివరి వరకు
అలాగే ఉండిపోయిందని
మనం నమ్ముతున్నాం.
అందువలనే పాత
జ్ఞాపకాలను మనం
ఎంతో గొప్పగా
పొగడతాం. ‘ఆటోగ్రాఫ్’ లాంటి
సినిమాలు కూడా
ఇందువలనే బాగా
ఆడాయి. ‘నాకూ
అలాగే పాత
జీవితం నా
కళ్ళ ముందు
వచ్చేసిందీ అని
పలువురు అనుకుంటున్నాం”
“ఖచ్చితంగా!”
“మెదడు
కొన్ని రసాయనాలను
ఉత్పత్తి చేసి
జ్ఞాపకశక్తిని
ఏర్పరుస్తుంది.
అదేలాగానే, కొన్ని
జ్ఞాపకాలను చెరిపేయటానికి
కూడా మెదడు
వేరు కొన్ని
రసాయనాలను యాక్టు
చేయనిస్తుంది. అది
ఏ రసాయన
మనేది ఇప్పుడు
శాస్త్రవేత్తలు
కనిబెట్టేశారు”
శ్యామ్, హాయ్
డాక్టర్ను ఆశ్చర్యంగా
చూస్తూ ఉండిపోయారు.
“ఇంకా
కొన్ని సంవత్సరాల
తరువాత, మనిషి
తనకు కావాలనే
జ్ఞాపకాలను ఉంచుకోవటం, వద్దనుకునే
జ్ఞాపకాలను వెంటనే
చెరిపేయటమూ మనుషులకు
తలనొప్పి మాత్ర
తినేలాగా, బ్యూటీ
చికిత్స చేసే
లాగా చాలా
సులభమైన విషయంగా
మారిపోతుంది”
“దీని
వలన ఎలాంటి
సైడ్ ఎఫెక్ట్స్
ఏర్పడతాయి? మెదడు
భాగం ఏదైనా
దెబ్బతింటుందా
డాక్టర్?”
“మెదడులో
ఉన్న జ్ఞాపకాలను
చెరపడమే ఒక
దెబ్బే కదా?”
శ్యామ్, హాయ్
ఇద్దరూ స్థంభించిపోయి
కూర్చోనుండ, ఇద్దరు
నర్సులు వచ్చి
-- నిద్రపోతున్న
జగదీష్ ను
ఒక స్టెక్చర్లో
పడొకోబెట్టి పరిశోధన
కోసం లోపలకు
తీసుకు వెళ్ళారు.
పరిశోధనకు ఒప్పుకుంటున్నట్టు, అగ్రీమెంటులో
సంతకం పెట్టటం
మొదలుపెట్టారు హాయ్.
***************************************************PART-9********************************************
తరువాతి వారం.
ఆదివారం నాడు.
శ్యామ్ ఇంట్లోకి
హఠాత్తుగా ప్రవేశించింది
రోహిణీ.
“హాయ్
శ్యామ్...ఎలా
ఉన్నారు?”
మాసిపోయిన లుంగీ
కట్టుకుని, చేతిలో
బీరు బాటిల్
-- నోట్లో సిగిరెట్టుతో
ఉన్నాడు శ్యామ్.
తిరిగి చూసి
ఆశ్చర్యపోయాడు.
కుడి చేతిలో
ఉంచుకున్న పోస్టర్
జారిపోయింది. ఎడం
చేతిలో ఉన్న
బీరు బాటిలు, పెదాలపై
ఉన్న సిగిరెట్టు
కూడా జారినై.
నడుముకు కట్టుకున్న
లుంగీ జారిపోక
ముందే జాగ్రత్త
పడి పట్టుకున్నాడు.
“నువ్వు...నువ్వు...ఎలా
ఇక్కడికి?”
“నేను...నేను...అలాగే
సరదాగా వచ్చాను
ఇక్కడికి...”
నవ్వింది.
మాసిన లుంగీ, సిగిరెట్టు, బీరు
బాటిల్స్, న్యూడ్
ఫోటోలను దాచటానికి
చాలా శ్రమపడ్డాడు.
“శ్యామ్, ఎంతో
శ్రమపడి బీరు
బాటిల్స్ దాచారు.
బీరు తాగి, తాగి
కడుపుతో ఉన్న
గర్భిణీ స్త్రీలాగా
ముందుకు వచ్చిన
పొట్టను ఎలా
దాస్తారు?”
“నువ్వు
మాత్రం ‘ఐ.లవ్.యూ’ చెప్పు.
బీరు, బ్రాందీ, విస్కీ, ఈ
సగం ‘న్యూడ్
పోస్టర్’ అన్నిటినీ
వదిలేస్తాను”
“అలాగంటే
చివరిదాకా బీరు
తాగాలనే నిర్ణయించుకున్నావా...”
“అలాగంటే
నువ్వు చివరి
వరకు ఐ.లవ్.యూ.
చెప్పబోయేది లేదా?”
“నేను
ఎప్పుడో చెప్పాను
కదా...ఈ
స్నేహం చివరిదాకా
స్నేహంగానే ఉండబోతోంది
అని”
“మాట
మాటలాగానే ఉండాలి
అని ఏదో
సినిమా డైలాగు
లాగానే చెబుతున్నావే
రోహిణీ?”
“అవును”
“అదికూడా
చూస్తాను. గ్రీటింగ్
కార్డులకు ఎన్ని
ప్రేమ మాటలు
రాస్తున్నాను. నాకెలా
ప్రేమ ‘సెట్’ అవకుండా
పోతుంది?”
“సరే...అభినందనలు.
తరువాత, నేను
వచ్చినందుకు కారణం...”
గబుక్కున అతనికి
దగ్గరగా వచ్చి
బాగా క్లోజుగా
నిలబడింది. ఒక
రోజా పువ్వుల
తోటలాగా పరిశుభ్రంగా
ఉంది.
అతని చేతికి
ఒక కవరు
ఇచ్చింది.
‘ప్చ్!’
బుగ్గలపై ముద్దు
పెట్టింది.
“రోహిణీ!”
“హ్యాపీ
బర్త్ డే
శ్యామ్!”
షాకయ్యాడు. గబుక్కున
తిరిగి ‘క్యాలండర్’ చూశాడు.
అరె, అవును...ఈరోజు
అతని పుట్టిన
రోజు!
అతనే తాను
పుట్టిన రోజును
మరిచిపోయినప్పుడు...ఈమెకు
ఎలా...?
శ్యామ్....ఎమోషనల్
అయ్యి -- కళ్ళు, నీళ్ళతో
నిండిపోగా ఎదురుగా
ఉన్నవన్నీ ఒక్కసారి
కనుమరుగై, మళ్ళీ
క్లియర్ అవగా, ఆమె
పక్కకు తిరిగినప్పుడు.
రోహిణీ వెళ్ళిపోయున్నది.
ఆమె ఇచ్చిన
కవరును చింపాడు.
సాయంత్రం ‘ఈవెనింగ్
షో’ సినిమాకు
రెండు టికెట్లు.
ధియేటర్ కాంప్లెక్స్.
ఇద్దరూ ‘బాల్కనీ’ లో
ఒకే సోఫాలో
కూర్చోనున్నారు.
‘పాప్
కార్న్’ తింటూ
సినిమా చూసారు.
ఒకటిన్నర కిలోమీటర్
పొడవు టైటిల్
ఉన్న ఏదో
హిందీ సినిమా.
ఒక్క అక్షరం
కూడా అసలు
అర్ధం కాలేదు!
కానీ, హిందీ
అర్ధం కావటమా
ముఖ్యం? పక్కన
రోహిణీ. ఆమెను
పూర్తిగా అర్ధం
చేసుకుంటేనే జన్మ
సార్ధకం అవుతుంది.
ఆమె సడన్
గా అతని
చేతులను గట్టిగా
పుచ్చుకుంది.
ఇప్పుడు షాక్
తిన్నది అతను.
“ఇక
మనం కలుసుకోవటం
ఆపేయాలి శ్యామ్”
ఈసారి అతిపెద్ద
షాక్. ఆ
షాక్ వలన
తింటున్న పాప్
కార్న్ గొంతుకు
అడ్డుపడటంతో పొలమారి
దగ్గులాగా వచ్చింది.
“ఏ.ఏ.
ఎందుకు?”
“నాకు
అలా అనిపిస్తోంది!
మనం ఇక
కలుసుకోవటాన్ని
ఆపేయాలి”
“సడన్
గానా...ఇలాగేనా?”
“సడన్
గానే...ఇలాగే”
“ఎందుకు?”
“మనం
ఏం...ఏం
చేస్తూ ఉన్నాం?”
“పాప్
కార్న్ తింటూ
ధియేటర్లో సినిమా
చూస్తున్నాం?”
“ఇది
చెప్పలేదు. ఇలా
మాటి మాటికీ
కలుసుకోవటం -- చూసుకోవటం
-- మాట్లాడుకోవటం.
ఇది యధార్ధమా
శ్యామ్?”
“యధార్ధమే”
“అలా
అనిపించటం లేదు”
“నాకు
సంతోషంగా ఉంది
రోహిణీ. నీకు
లేదా...?”
“లేదు”
ఆశ్చర్యంతో--పక్కకు
తిరిగి...ఆమెను
చూశాడు.
“భయంగా
ఉన్నది శ్యామ్”
“భయమా!
పొద్దున్నే కదా
బుగ్గల మీద
ముద్దు పెట్టావు.
ఇప్పుడు ‘ఇక
మీదట చూసుకోకూడదు’అని
చెప్పి, అదే
బుగ్గమీద ‘టపీ’ మని
కొడుతున్నావే. నిన్ను
అర్ధం
చేసుకోవటమే కుదరటం
లేదే? ‘బెర్మూడా
ట్రయాంగిల్’ సముద్రం
లాగా ఇంత
మిస్టరీగా ఉన్నావే? నన్నెందుకు
ఇలా అయోమయంలో
ఉంచుతున్నావు?”
“నువ్వు
సరిగ్గా ఉంటే
ఎందుకు కన్
ఫ్యూజన్? చూడద్దు
అని నేను
చెబితే, ‘సరే’ అని
నువ్వూ చెప్పేయి.
మనమేమీ ప్రేమికులము
కాదే? ఎప్పుడూ
ఫ్రెండ్సే కదా?”
“అది...అది...నాకు
రెండు మనసులుగా
ఉన్నది రోహిణీ”
“అది
తప్పు”
“ఏది
తప్పూ?”
“మగవారికి
రెండు మనసులు
ఉండటం”
“అలాగా?”
“అవును!
అందుకే ఇంత
కష్టపడుతున్నావు.
ఆడవాళ్ళకు మాత్రమే
ఎన్ని మనసులైనా
ఉండొచ్చు. మగవాళ్ళకు
ఒక మనసు
ఉండటమే చాలా
ఎక్కువ”
శ్యామ్ ఆశ్చర్యంగా
చూసాడు.
“ఏమిటి
చూస్తున్నావు?”
“మనిద్దరి
రిలేషన్ కు
ఏమిటి పేరు
రోహిణీ?”
“మనం
అర్ధం చేసుకోగలిగే
వయసుకు వచ్చాసాము.
‘బాయ్
ఫ్రెండ్’, ‘గర్ల్
ఫ్రెండ్’...అని
అన్ని బంధుత్వాలకూ
నేను ‘లేబుల్’ అతికించటం
నాకు ఇష్టంలేదు.
అదంతా స్కూలుతో
పోయింది”
“రోహిణీ, దీని
పేరే లవ్.
ఇంకానా నీకు
అర్ధం కాలేదు?”
“లేదు”
“ఇంకా
ఎందుకు మొండితనం? మాట్లాడకుండా
‘ఐ.లవ్.యూ’ అని
చెప్పి తగలడు.
ఎందుకిలా నా
చిన్న మెదడు
వరకు భయం
ఏర్పరుస్తున్నావు?”
“లవ్వా? ఖచ్చితంగా
లేదు?”
“అపజయాన్ని
ఒప్పుకో రోహిణీ.
ఐ.లవ్.యూ
చెప్పేయి”
“ఎందుకు
ఇప్పుడు అది
చెప్పటం? వందకిలోమీటర్ల
వేగంతో వెడుతున్న
బైకుకు,
రోడ్డు మధ్యలో
కుక్కను వదలాలా? ఢీ
కొడితే యాక్సిడెంట్
అయి పడిపోవటానికా? వద్దు...ఈ
‘ఐ.లవ్.యూ’ అంతా
వద్దు. అది
లేకుండానే నేను
బాగా సంతోషంగా
ఉన్నాను. నన్ను
వదిలేయి. మనం
కలుసుకునేది ఈ
రోజుతో ఆపేద్దాం.
ఇదే నా
నిర్ణయం”
సినిమా క్లయ్
మాక్స్ రాకుండానే
శ్యామ్ కళ్ళల్లో
నుండి నీళ్ళు
కారింది.
***************************************************PART-10*******************************************
ప్రసిద్ద హోటల్.
శ్యామ్, రోహిణీ
తింటున్నారు.
“సినిమా
బాగుంది కదా
శ్యామ్?”
“నాకు
నచ్చలేదు. ఎలా
నీటేస్టు ఇంత
గలీజుగా ఉంది?”
“ఏయ్...నిన్ను
‘బాయ్
ఫ్రెండు’ గా
సెలెక్టు చేయలేదని
నన్నుతక్కువ అంచనా
వేయకు”
ఎదురుగా ఉన్న
టేబుల్ దగ్గర
కోటు-సూటూ
వేసుకుని కూర్చున్న ఒకతను
రోహిణీని చూస్తూ
బీరు తాగుతున్నాడు.
బీరు మత్తులో
తూలుతూ ఆమె
దగ్గరకు వచ్చాడు.
“హాయ్
బేబీ. ఐ
యాం సివా”
“హాయ్...” అన్నది రోహిణీ.
శ్యామ్ తడబడ్డాడు.“నీకు
తెలిసినతనా రోహిణీ?”
“తెలియదు!
అతను ‘హాయ్’ అన్నాడు.
జవాబుగా నేనూ
‘హాయ్’ అన్నాను.
“డ్రింక్స్
బేబీ?” అన్నాడు
కోటూ-సూటూ.
“నో...థ్యాంక్స్”
“నువ్వు
ఈ ఏరియాకి
కొత్తా బేబీ?”
“లేదే...!
అప్పుడప్పుడు వస్తాను
బేబీ” అన్నది రోహిణీ.
“నువ్వు
చాలా అందంగా
ఉన్నావు బేబీ”
“రేయ్...
పనికిరానివాడా...!
డబ్బులు ఎక్కువగా
ఉన్నాయారా? ఉంటే, వెళ్ళి
ఏ అనాధ
ఆశ్రమానికి ఇవ్వు.
దీనిపైన ఖర్చుపెట్టకు.
నీకు నష్టమే
మిగుల్తుంది” అన్నాడు శ్యామ్
కోపమొచ్చి.
“నువ్వు
ఎవర్రా మధ్యలో?”
“ఏయ్...అది
నా మనిషి.
ట్రబుల్ చేయకు”
“ఇది
స్వతంత్ర లోకమురా.
ఎవరు ఎవరినైనా
తోలుకు వెళ్ళొచ్చు”
“ఆమె
‘అలాంటిది’ కాదు...తోలుకు
వెళ్ళడానికి. నేనూ, ఆమె
ప్రేమికులం!”
రోహిణీ అతిపెద్ద
షాక్ తిన్నది.
“శ్యామ్!”
కోటు-సూటూ
మనిషి ఎగతాలిగా
చూసాడు.
“ఏయ్...నో.
నువ్వు చెప్పేది
అబద్దం రా.
ఆమె చూడు
ఎలా ‘షాక్’ ఇచ్చిందో.
దీంతో నీ
అధ్యాయాన్ని ముగించుకో.
నువ్వు ‘సైన్
అవుట్’ చేసుకో, నేను
‘సైన్
ఇన్’ చేసుకోవాలి”
“నీతో
మాట్లాడడం వేస్టు
మిస్టర్”
“ఏం
చేస్తావు రా...?”
“ఐ
యాం సారీ...వేరే
దారిలేదు” అంటూ శ్యామ్
లేచి అతని
మొహం మీద
ఒక గుద్దు
గుద్దాడు. అతను
కింద పడ్డాడు.
“ఆ...”
కింద పడిన
అదే వేగంతో
పైకిలేచిన అతను
శ్యామ్ మొహం
మీద గట్టిగా
ఒక దెబ్బ
వేసాడు. అది
ఎదురు చూడని
శ్యామ్, నోటి
నుండి రక్తం
చింద, శ్యామ్
స్టడీ అయ్యి
మళ్ళీ
అతన్ని ఒక
గుద్దు గుద్దాడు.
ఇద్దరూ ఒకరి
మీద ఒకరు
పడి పొర్ల
ఆ చోటు
రంగస్థలం అయ్యింది.
రోడ్డు.
ఇద్దరూ ఆటోకోసం
నిలబడున్నారు.
“ఏమిటి
శ్యామ్ ఇలా
చేసావు?”
“వాడు
నోరు జారింది
చాలా ఎక్కువ”
“వాడు
తాగున్నాడు. వాడ్ని
నువ్వు కొట్టొచ్చా?”
“కొట్టాలనుకోలేదు.
చేయి ఎత్తేను.
ఆ తరువాత
మరిచిపోయాను. అతని
జ్ఞాపకం పోయింది.
ఎలా...ఎక్కడ
కొట్టానో నాకే
జ్ఞాపకం లేదు.
అంతా స్పీడుగా
జరిగిపోయింది”
“నీ
దగ్గర ఇది
నేను ఎదురు
చూడలేదు”
“నిన్ను
‘కేసు’ అంటున్నాడు.
తోసుకు వెళ్తాను
అన్నాడు. నేనేం
చేయను...నేనేం
చేయను?”
“హీరోలాగా అరిస్తే
నేను భయపడిపోతానా? నడి
రోడ్డులో నిలబడి
ఇలా అరవకు.
నువ్వు అతన్ని
కొట్టింది తప్పు”
“అతను
కూడా నన్ను
కొట్టాడు. నేనూ, అతనూ
ఏమన్నా బావా-బావమరుదులమా? నీకొసమే
కదా పోట్లాడుకున్నాం.
పెద్ద పెద్దమనిషి
లాగా మాట్లాడుతున్నావు?”
“నా
కోసమా...నాకోసమా
గొడవ పడ్డావు?”
“కాదా
మరి? నీకొసమేనే...”
“అలాగైతే
ఇకమీదట గొడవ
పడకు. నాకోసం
నువ్వు ఏదీ
చెయ్యనవసరం లేదు”
“రోహిణీ...”
“నీ
దయ నాకు
అక్కర్లేదు”
“అలాగంటే
దానికి అర్ధమేమిటి?”
“నువ్వూ, నేనూ
ప్రేమికులమని ఎందుకు
చెప్పావు?”
“ఓ...ఇప్పుడు
నీ కోపానికి
అదే కారణమా?”
“అది
కూడా!”
“మన
మధ్య ఇంకేం
బంధుత్వం ఉంది?”
“మనం
స్నేహితులం!”
“లిఫ్టులో
రాసుకోవటం, సినిమాహాలులో
చీకట్లో చేతులు
పట్టుకోవటం, గదికి
వచ్చి బుగ్గమీద
గట్టిగా ముద్దు
పెట్టుకోవటం...దీనికి
పేరు ‘స్నేహమా’? మనం
ప్రేమికులమే! అది
నీ మట్టి
బుర్రకు ఇంకా
అర్ధం కాలేదా?”
“శ్యామ్...మనిద్దరి
మధ్యా ఎటువంటి
బంధుత్వమూ ఉండ
కూడదని అనుకుంటున్నాను.
తరువాత అది
చాలా నొప్పి
కలిగిస్తుంది”
“అది
లేనట్లు నటించినా
నొప్పి పుడుతోంది”
“నే...నే...నే...”
“ఏం...జవాబు
చెప్పటం కుదరటం
లేదా?”
“ఆటో
వస్తోంది...”
“ప్రేమ
గురించి మాట్లాడితేనే
ఒకటి ఆటో
వస్తుంది...లేకపోతే
తలనొప్పి వస్తుంది...నీకు”
“నాకు
ఈ రిలేషన్
వద్దు. గుడ్
బై”
“ఏమిటీ
ఓవరుగా సీను
వేస్తున్నావు? సరే
పోవే...ఇక
నాకు కనిపించకు.
నీ మొహం
చూపించకు”
ఆటో వచ్చింది.
నిజంగానే ఎక్కి
వెళ్ళిపోయింది.
***************************************************PART-11*******************************************
‘అమిగడలా’ మెడికల్
రీసెర్చ్ సెంటర్.
ఒక అందమైన
సోఫాలో జగదీష్
ను కూర్చోబెట్టి
ఉన్నారు. అతనికి
ఇవ్వబడిన మాత్రలు
అతన్ని ఒక
విధమైన నిద్రా
కాని...మెలుకువా
కాని పరిస్తితిలో
మార్చి ఉంచింది.
దాదాపు పరిశోధన
యొక్క చివరి
దశకు వాళ్ళు
చేరుకున్నారు.
జగదీష్ శరీరీంపై
పలురకాల ‘వయర్లు’ కనెక్ట్
చేయబడి -- అవన్నీ
హృదయాన్నీ, శరీర
పనితీరును మానీటర్
చేసే పరికరాలకు
జాయింట్ అయి
ఉన్నాయి.
జగదీష్ యొక్క
తలపైన హెల్మెట్
లాంటి ఒక
ఉపకరణం బోర్లించి
ఉన్నది. దానిపైన
సీరియల్ లైట్లు
లాగా పలు
రంగులలో బల్బులు
వెలుగుతూ ఉన్నాయి.
చూడటానికి కొంచం
కామెడీగా ఉన్నది.
కానీ, అవన్నీ
అతని మెదడు
ఇచ్చే కామాండ్స్
గురించి--శరీరంపై
వాటి తాకిడి
గురించి పరిశోధనా
‘సెన్సార్స్’ అనేది
చాలా ముఖ్యమైన
విషయం.
హాయ్, ఆవలిస్తూ
డాక్టర్ ఎదురుగా
కూర్చుని -- కలతతో
జగదీష్ ను
చూస్తూ ఉన్నారు.
ఒకవైపు ఆయనకు
బాధ, మరోవైపు
సంతోషం. దగ్గర
దగ్గర మూడేళ్ళు, ఒక
ప్రమాదంలో జగదీష్
తన జీవితం
యొక్క యవ్వన
దశను పోగొట్టుకుని
ఒక ప్రాణమున్న
శవం అయిపోయాడు.
తన పనులు
తానుగా చేసుకోలేని
పరిస్థితి.
కానీ, దానికి
ఇప్పుడు విముక్తి
దొరుకుతుందా?
డాక్టర్--- జగదీష్ మెదడు
భాగాలలో ఏర్పడుతున్న
మార్పులను చూపిస్తున్న
కంప్యూటర్ చూసి
పరీక్షిస్తున్నాడు.
“ఏదైనా
డెవెలప్ మెంట్
కనబడుతోందా డాక్టర్?” ఆశగా
అడిగాడు.
డాక్టర్ నిదానంగా
ఆలొచిస్తూ తల
ఊపారు. ఆయన
‘అవును’ అంటున్నారా, ‘లేదు’ అంటున్నారా...? అనేది
గ్రహించటమే కుదరలేదు
హాయ్ కి.
“మెదడు
కమాండ్స్ ను
ఎలా చదువుతున్నారు?”
డాక్టర్ వెంటనే
ఉత్సాహమయ్యారు.
“మంచి
ప్రశ్న, ఎమోషనల్
జ్ఞాపకాలుమీ మెదదులో
రెండు భాగాలలో
ఒకే సమయం
రిజిస్టర్ అవుతాయి.
అంటే ‘హిపొకాంపస్’ అనే
సాధారణ భాగంలోనూ, ‘అమిగడాలా’ అనే
మెదడులోని సూక్ష్మమైన
భాగంలోనూ. ‘హిపొకాంపస్’ లో
ఉన్న జ్ఞాపకాలు
చెరిగిపోయినా, అమిగడాలాలో
ఆ సంఘటన
లోతుగా కూరుకుపోయుంటింది
-- గజినీ సినిమా
చూసారా”
“ఆ...చూసాను” అన్నారు ఆశ్చర్యంగా.
డాక్టర్, సినిమాలు
కూడా చూస్తారు
అనే వార్త
స్వారస్యంగా ఉన్నది.
“ఆ
గజినీ సినిమాలోని
హీరోకి ‘హిపొకాంపస్’ భాగంలో
ఉన్నటువంటి జ్ఞాపకం
చెరిగిపోవటం వలనే
విల్లన్ ఎవరనేది
తెలియకుండా పోతుంది.
కానీ, విల్లన్లు
హీరోయిన్ అసిన్
ను హత్యచేసిన
ఆ ఘోరమైన
సంఘటన జ్ఞాపకాలు
‘అమిగడాలా’ లో
రిజిస్టర్ అయ్యి
ఉంటుంది. అందువలనే
విల్లన్లను చూసిన
వెంటనే ఒక
విధమైన అసూయ, కన్
ఫ్యూజన్, ఎమోషన్
కలుగుతుంది...కానీ
ఆకారాన్ని మరిచిపోయినట్టు
చూపిస్తారు”
“అర్ధమయ్యింది
డాక్టర్. గజినీ
సినిమా తీసిన
డైరెక్టర్ ఇలాంటి
ఒక మనో
పరిస్థితిని ప్లాట్
గా పెట్టుకుని
ఆ సినిమా
తీసుంటారు”
డాక్టర్ దాన్ని
ఒక పొగడ్తగా
తీసుకున్నట్టు
నవ్వారు.
“మెదడులోని
రెండు న్యూరాన్లకు
మధ్య ఒక
కనెక్షన్ ఏర్పరచడానికి, ‘ప్రోటీన్
సింతసిస్’ అనేది
ఒకటి జరగటం
అనేది చాలా
అవసరం. ఈ
‘ప్రోటీన్
సింతసిస్’ అనేది
మెదడులో ఉన్న
రెండు న్యూరాన్లను
కలిపే దారంలాంటిది.
ఈ దారం
తెగిపోయినప్పుడు, సంఘటనలు...జ్ఞాపకాలుగా
మారతాయి. ఈ
‘ప్రోటీన్
సింతసిస్’ ను
మనం అడ్డుకుంటే
లేక ఆపేస్తే
జ్ఞాపకం చెరిగిపోతుంది.
జగదీష్ మెదడులోని
బాధాకరమైన జ్ఞాపకాలు
అలాగే చెరపబడుతూ
వస్తోంది”
“అలాగా...ఆశ్చర్యంగా
ఉంది డాక్టర్”
“”ఆశ్చర్యమే.
కానీ నిజం”
గబుక్కున చెమట
పట్టింది రామప్పకి
. చివరికి ఆయన
ఎదురు చూసిన
వార్త ఆయనకు
దొరికింది. జగదీష్
లోని బాధాకరమైన
జ్ఞాపకాలు చెరపబడుతూ
వస్తున్నాయి అంటే...ఆ
మెడికల్ రీసెర్చ్
విజయవంతమైనట్లే
కదా అర్ధం!
అలాగంటే, అతి
త్వరలో జగదీష్
బాధాకరమైన ఆ జ్ఞాపకాలలో
నుండి పూర్తిగా
కోలుకుంటాడు.
డాక్టర్ నాగార్జున్
కు గుడి
కట్టాలని అనిపించింది
రామప్పకి.
కళ్ళళ్ళోని చివర్లలో
ఎమోషన్ వలన
తడి ఏర్పడింది.
***************************************************PART-12*******************************************
శ్యామ్ చాలా
శోకంగా ఉన్నాడు.
ఈ రోజు
వరకు అతను
అంత ఎక్కువగా
తాగింది లేదు.
గది స్నేహితుడు
తన చెల్లి
పెళ్ళికొసం ఊరికి
వెళ్ళిపోవటం చాలా
మంచిదయ్యింది. ఎటువంటి
ట్రబుల్ లేని
మౌనం.
ఆ మరుసటి
రెండు రోజులు
అతను ఉద్యోగానికి
వెళ్ళలేదు.
మేనేజర్ దగ్గర
నుండి, ఆఫీసు
నుండి పలు
ఎస్.ఎం.ఎస్.
లు, ఫోన్లు.
ఏదీ చూడలేదు.
సమాధానం చెప్పలేదు.
బయట కనెక్షన్
పూర్తిగా కట్
చేసాడు. ఒక
గ్లాసు లోనే నివాసమున్నాడు.
మధ్యం గిన్నె
ఒడిలో మత్తు
ఎక్కే వరకు
పడి శోకాలుపెట్టాడు.
నాలగవ రోజు.
ఆ రోజైనా
ఉద్యోగానికి వెళ్దామని
స్నానం చేసి, డ్రస్సు
మార్చుకుని బయలుదేరే
ముందు, తలుపులు
తడుతున్న శబ్ధం.
తెరిచాడు.
రోహిణీ నిలబడుంది.
పట్టుచీర, తల
స్నానం పూర్తిచేసిన
తడి తల, గుడికి
వెళ్ళి వచ్చిన
దాని వేషాధారణలో
కనిపించింది.
“సారీ
శ్యామ్”
“ఏం
కావాలి?”
“నేను
అలా చేసుండకూడదు”
“ఎలా?”
“నీ
దగ్గర కోపంగా
ఉండి ఉండకూడదు.
సారీ”
నాలుగు రోజులుగా
ఆమె మీద
ఉన్న కోపం
ఆ ఒకే
మాటతో తీరిపోయింది.
“పరవాలేదు...వదులు”
“రియల్లీ...సారీ”
“ప్రేమికులు
సారీ అడగక్కర్లేదు
రోహిణీ”
హోటల్లో పోట్లాడి
దెబ్బతిన్న చోట
ఇంకా ఎర్రగానే
ఉంది. రోహిణీ
ఆ చోటును
ముట్టుకుని చూసింది.
“బాగా
నొప్పిగా ఉందా?”
“ఇప్పుడు
లేదు”
“ఖచ్చితంగా?”
“నీకొసం
నేను కష్టపడి
పోట్లాడి దెబ్బ
తీసుకున్నది. అందువలన
నొప్పి పుట్టదు”
“నాకోసం
తిన్నది ఉండనీ.
ఇదిగో చూడు.
నీకొసం నేను
తీసుకున్నది”
ఒక నగ
పెట్టెను తెరిచింది.
జత డైమండ్
ఉంగరాలను చూపించింది.
షాకైయ్యాడు.
“ఎంత?”
“నలబై
వేలు”
“ఎందుకింత
కాస్ట్ లీ?”
“నా
క్షమాపణ ఎప్పుడూ
కాస్ట్ లీ
నే...”
శ్యామ్ యొక్క
వేలుకు ఉంగరం
తొడిగింది.
జవాబుగా శ్యామ్, రోహిణీ
యొక్క వేలుకి
ఉంగరం తొడిగాడు.
ఆ వెంటనే
అతని ఛాతి
మీద వాలిపోయింది.
“ఇక
మీదట నువ్వూ, నేనూ
భార్యా-భర్తలం”
అంత సాన్నిహిత్యం
అతను ఎదురు
చూడలేదు!
“అవును
శ్యామ్, తాలి
అవసరం లేదు.
నువ్వే నా
సరి సగం”
ఇద్దరూ మొహానికి
మొహం రాసుకుని...ప్రాణ
శ్వాస పంచుకుని...గట్టిగా
కౌగలించుకుని... ఒకటిగా కలిసి---
ఫిలిం సెన్సార్
బోర్డు సభ్యులు
విసుగు విసుగ్గా
కట్ చేయాల్సిన
దృశ్యాలు అక్కడ
చోటు చేసుకున్నాయి.
చివరిలో ఇద్దరూ
కలిసి స్వర్గం
యొక్క తలుపులను
తెరిచారు.
అన్నీ పూర్తి
అయిన తరువాత
ఆయసపడుతూ అడిగాడు
శ్యామ్.
“ఎలా
రోహిణీ ఈ
మార్పు? ఇప్పుడు
మనిద్దరి మధ్యా
ప్రేమ వర్క్
అవుట్ అయిపోయిందా?”
“జీవితంలో
జరిగే కొన్ని
విషయాలకు కారణం
ఏమిటో చెబితే
చాలా చప్పగా
ఉంటుంది. కాబట్టి
ఇలాంటివి అడగొద్దు
శ్యామ్”
“మాటి
మాటికీ నీకు
తలనొప్పి వస్తోందే...ఎందుకు
రోహిణీ? ఇప్పుడు
ఎలా ఉంది?”
చటుక్కున ఒక్క
క్షణం రోహిణీ
మొహం మారి
తరువాత సర్ధుకుని
నవ్వింది.
“దీనికంటే
నువ్వు ముందు
అడిగిన ప్రశ్న
బెటర్”
“సరే.
అయితే నేను
అదే అడుగుతాను.
ఇప్పుడు మనిద్దరిలో
ప్రేమ వర్క్
అవుట్ అయింది
కదా?”
“దీనికి
సమాధానం రేపు
నీకు ఆఫీసులో
తెలుస్తుంది” అంటూ మళ్ళీ
అతన్ని గట్టిగా
కౌగలించుకుంది.
***************************************************PART-13*******************************************
‘అమిగడాలా’
మెడికల్ రీసెర్చ్
సెంటర్.
చాలా ఆనందంగా
ఉన్నారు హాయ్.
జగదీష్ కొంచం
కొంచంగా తన
పాత జ్ఞాపకాలకు
తిరిగి వచ్చాడు.
హాయ్ ని గుర్తు
పట్టాడు. యాక్సిడెంటులో
జరిగిన సంఘటనలను
భయపడకుండా క్లియర్
గా వివరించ
గలిగేంత శక్తి
వచ్చింది. అతని
శరీరానికి, మనో
పరిస్థితికి ఇంత
తక్కువ కాలంలో
తగిన మార్పులు
ఏర్పడినై.
డాక్టర్ రీసెర్చ్
లో ఆ
రోజు చివరి
భాగం. పరిశోధన
యొక్క చివరి
రోజు.
జగదీష్ తలమీద
ఒక మెడికల్
పరికరం బోర్లించ
బడి ఉన్నది
కదా? అది
చూడటానికి
సలూన్ షాపులో
ఉండే, తల
వెంట్రుకలను అనిచివేసే
తలమీద బోర్లించే
‘హేర్
డ్రయర్’ లాగానే
ఉన్నది. కానీ, ఆ
పరికరం ద్వారా
ఒక ఎం.ఆర్.ఐ.
స్కాన్ ఇచ్చేలాంటి
రిజల్ట్స్ తీసుకుని
పధిలంగా సేకరిస్తోంది.
దాన్ని డాక్టర్
లోతుగా చదువుతున్నారు.
అతనికి ఎరుపు, పసుపు
కలిసిన మాత్ర
ఒకదాన్ని ‘లాకర్’ లో
నుండి జాగ్రత్తగా
తీసి ఇచ్చారు.
దాన్ని ఆయన
భయ భక్తితో
ఇచ్చిన విధంలోనే
అది చాలా
శక్తిగల మాత్ర, అదే
ఈ పరిశోధన
యొక్క చివరి
ఘట్టం యొక్క
తలరాతను నిర్ణయించే
మందు అనేది
హాయ్ కి అర్ధమయ్యింది.
ఆయన హృదయం
భయంభయంగా కొట్టుకుంటోంది.
వీధి చివర
వినాయకుడి దగ్గర
నుండి, ఊర్లో
ఉన కులదేవత
వరకు అన్ని
దేవుళ్ళకూ వేడుకున్నాడు.
జగదీష్ అప్పుడు
మాత్ర మింగాడు.
అతని మొహంలో
వివరించలేని మార్పు
తెలిసింది. హఠాత్తుగా
సృహ కోల్పోయి
అలాగే సోఫాలో
వాలిపోయాడు.
అది చాలా
శక్తిగల మాత్ర
అనేది స్పష్టంగా
అర్ధమయ్యింది. కొంచంసేపట్లో
అతనికి చెమట
కారింది. కాళ్ళూ--చేతులను
వణుకుతో కదిలించాడు.
ఏమిటేమిటో కలవరింతలు
మొదలుపెట్టాడు.
కొంచంసేపట్లో స్వరం
మామూలు దోరణికి
మారింది. ఒక
విధమైన మత్తులో
యాక్సిడెంట్ గురించి
అతని మెదడులో
రిజిస్టర్ అయిన
విషయాలను ఇప్పుడు
మళ్ళీ మాట్లాడటం
మొదలుపెట్టాడు.
మాత్ర యొక్క
శక్తి వలన
అతని జ్ఞాపకాలు
మళ్ళీ ప్రాణం
పోసుకున్నాయి. డాక్టర్
యొక్క కంప్యూటర్
తెరమీద ‘రీ
కన్సాలిడేషన్’ అనే
పద్దతిలో ఆ
జ్ఞాపకాలు మళ్ళీ
ప్రాణం వచ్చి
కొత్తగా రాయబడుతున్నాయి.
ఆ కొత్త
జ్ఞాపక గీతలు
ఒక్కొక్కటీ కంప్యూటర్
తెరమీద కనబడుతూ, సి.డి.లో
రిజిస్టర్ చేయబడుతున్నట్టు
ఒక పక్క
నుండి బయలుదేరి
అవతల పక్కకు
వెళ్తున్నట్టు
వస్తుండగా, వచ్చే
దారిలోనే ‘ఢాం... ఢాం’ అని
పేలి చెల్లాచెదురుగా
పడుతున్నాయి. జగదీష్
యొక్క మెదడులో
రిజిస్టర్ అయ్యున్న
అవసరంలేని జ్ఞాపకాలు
ఒక్కొక్కటిగా విజయవంతంగా
చెరిపివేస్తూ వస్తున్నది
అనేది డాక్టర్
యొక్క చిరు
నవ్వు ద్వారా హాయ్
బాగానే తెలుసుకున్నారు.
అరగంట తరువాత, చెమటపట్టిన
డాక్టర్ లేచారు.
“ఆపరేషన్
సక్సస్. జగదీష్
మెదడులోని కూరుకుపోయిన, భాదకలిగించే జ్ఞాపకాలను
చెరిపేసాము. అతను
ఇక షాకింగ్
జ్ఞాపకాలను మరిచిపోయిన
కొత్త మనిషి” అన్నారు.
హాయ్ చేతులెత్తి
నమస్కరిస్తూ, డాక్టర్
కాళ్ళమీద పడి
ఒక పసిపిల్లాడిలాగా
వెక్కి వెక్కి
ఏడ్చాడు.
***************************************************PART-14*******************************************
మరుసటిరోజు.
శ్యామ్, ఉద్యోగానికి
వెళ్ళినప్పుడు
రెండు పెద్ద
షాకింగ్ వార్తలు
కాచుకోనున్నాయి.
హాయ్ గదిలో
జగదీష్ నవ్వుతూ
కూర్చోనున్నాడు.
అది శ్యామ్ కు
అతిపెద్ద సంతోషకరమైన
షాక్ గా
ఉన్నది.
“జగదీష్...ఎలా
ఉన్నావు?” అన్నాడు.
“శ్యామ్
అన్నయ్యా...నేను
పూర్తిగా గుణమయ్యాను.
ఇప్పుడు బాగున్నాను.
మావయ్య, నాకు
జరిగిన ట్రీట్
మెంట్ గురించి
అన్నీ చెప్పారు.
ఒక మూడు
నెలలుగా నేను
‘మామూలు
మనిషిగా’ లేకుండా
మిమ్మల్నందరినీ
కష్టపెట్టాను అని
అనుకుంటున్నప్పుడు...నాకు
అదోలాగా ఉన్నది”
“నో...నో...
నువ్వు గుణమై
తిరిగి మామూలు
మనిషిగా మారటం
మాకు ఎంత
సంతోషంగా ఉందో
తెలుసా? మనకు
మనకి అక్కర్లేని, మనల్ని
బాధపెట్టే జ్ఞాపకాలను
ఇలా చెరిపేసుకోవచ్చు
అని అనుకుంటున్నప్పుడు, ఆశ్చర్యంగానూ
-- హ్యాపీ షాకుగానూ
ఉంది. సైన్స్
మనుషులను భగవంతుడికి
సరిసమంగా చేసేసింది.
దాన్ని సెలెబ్రేట్
చేయటానికి నా
ఖర్చులతో ఒక
పార్టీ పెట్టే
తీరాలి”
“హమ్మయ్య...నేను
తప్పించుకున్నాను” అన్నారు, అప్పుడే
లోపలకు వచ్చిన
హాయ్.
“ఈ
ట్రీట్ మెంటుకు
ఎన్ని రోజులయ్యింది?” అడిగాడు
శ్యామ్ ఆశ్చర్యంగా.
“మామూలుగా
సగం రోజులో
-- మనకు అక్కర్లేని
జ్ఞాపకాలను మెదడులో
నుండి చెరిపేస్తారట.
నేను మొదటి
కేసు, అందులోనూ
పరిశోధనా పేషెంటు
కాబట్టి దగ్గర
దగ్గర ఒక
నెలరోజులు తీసుకున్నారు”
“సగం
రోజులో అక్కర్లేని
జ్ఞాపకాలను తుడిచేయడం
కుదురుతుందా? అద్భుతం!” అన్నాడు శ్యామ్.
కానీ అతని
మొహంలో అపనమ్మకం
తొంగి చూసింది.
“సరే
శ్యామ్, ఈ
నాలుగు రోజులూ
నివ్వెక్కడికి
వెళ్ళావు...అందులోనూ
ఆఫీసులో చెప్పకుండా”
మేనేజర్ హాయ్
ఎప్పటిలాగే విసుక్కున్నారు.
“లేదు
సార్...ఊర్లో
ఒక సమస్య”
“చెప్పి
వెళ్లటానికి ఏం?”
“అదే
ఇప్పుడు వచ్చేసానుగా...వదలండి
సార్. ఇంకేమన్నా
విషయం ఉందా...చెప్పండి?”
“ఏం.డీ.
కూతురు మాధవి...”
“అవును...ఆవిడకేమిటి?”
“ఆవిడే
ఇప్పుడు ‘ఆఫీస్
ఇన్ చార్జ్’. ఆమెతో
పాటూ నువ్వు
ఉండి, కంపెనీ
వర్కింగ్ విధానాన్ని
ఆమెకు నేర్పించాలి.
నువ్వెక్కడ, ఎక్కడ
అని అడుగుతూ
నన్ను నాలుగురోజులుగా
హింసపెడుతోంది”
“నేనేమన్నా
ఆమెకు ‘పి.ఏ’ నా?”
“అవును.
ఇకమీదట అంతే”
“పొండిసార్...వేరే
పనిలేదా?”
“లేదే!”
“నన్ను
వదలండి సార్.
మీ 'పి.ఏ' రోహిణీని
ఆమెకు ‘పి.ఏ’ చేయండి”
“ఆమె
ఉద్యోగానికి రాజీనామా
చేసి వెళ్ళిపోయింది”
“ఏమిటి? రాజీనామానా?...ఊరుకోండి
సార్. నాతో
ఆటలెందుకు సార్
మీకు”
“శ్యామ్
ఇది ఆటకాదు--ఫాక్టు.
నిజంగానే రోహిణీ
పని వదిలేసి
వెళ్ళిపోయిందయ్యా”
“ఎప్పుడు?”
“రెండు
రోజులయ్యింది”
ఈసారి మరో అతిపెద్ద
షాకుకు గురి
అయ్యాడు శ్యామ్.
“రెండు
రోజులయ్యిందా? నా
దగ్గర చెప్పనే
లేదే?”
“నా
దగ్గరే ఆమె
సరిగ్గా చెప్పలేదు”
“ఎందుకు
రాజీనామా చేసింది?”
“ఆమె ఒక
‘క్రాక్’. మొదట
రాజీనామా లెటర్
మాత్రం ఇచ్చింది.
ఎందుకు రాజీనామో
చేస్తున్నావో కారణం
చెబితేనే నిర్ణయం
తీసుకోగలను అన్నాను.
వెంటనే కోపంతో
‘నాకు
శ్యామ్ యొక్క
ట్రబుల్ ఎక్కువగా
ఉంది. తట్టుకోలేకపోతున్నాను.
అందువలన రాజీనామా
చేస్తున్నాను. ఆ
లెటర్ ఇటివ్వండి...కారణాన్ని
దాంట్లో కూడా
రాసిస్తాను’ అన్నది”
“ఏమిటీ...నేను
ఆమెను ట్రబుల్
చేస్తున్నానా? ఆ
ట్రబుల్ తట్టుకోలేక
రాజీనామా ఇస్తున్నట్టు
చెప్పిందా?”
“అవునయ్యా.
కానీ, నేను
వదుల్తానా? ‘శ్యామ్
యొక్క ట్రబుల్
ఎక్కువగా ఉందంటే, అతన్ని
డిస్మిస్ చేస్తాను.
నువ్వు ఉద్యోగం
వదిలి వెళ్ళకు.
నిజం చెప్పు’ అని
అడిగాను”
“ఏమిటి
సార్! ప్రతి
ఒక్కరూ నన్ను
ఇలా డ్యామేజ్
చేస్తున్నారు? మీకు
నాకంటే ఆమె
ఎక్కువ అయిపోయిందా?”
“ఉండవయ్యా
బాబూ -- ఊరికే
అలా ఒక ఎర వేసి
చూసాను. వెంటనే
రాసిన దానిని
కోపంగా చెరిపేసి, దానిపైనే...‘నాకు
మెదడులో గడ్డ
ఉంది. అందువల్ల
ఉద్యోగానికి రాజీనామా
చేస్తున్నాను’ అని
రాసిచ్చింది. నేను
అడిగినదానికి ‘ఉద్యోగం
రాజీనామా చేయటానికి
మీకు ఏదో
ఒక పిచ్చి
కారణం కావాలి...అంతే
కదా సార్.
ఆ కారణం
ఏదైతే మీకేంటి?’ అని
అంటూ నిర్లక్ష్యంగా
చెప్పేసి వెళ్ళిపోయింది”
“ఆమె
ఒక ఇడియట్.
ఆమెకు బుర్రే
లేదు. ఆ
తరువాత దాంట్లో
గడ్డ ఎందుకు
వస్తుంది?”
“ఆమెకు
ఏముంది...ఏం
లేదు అనేది
నీకే బాగా
తెలుసు?”
“ఎగతాళా? ఏం
సార్...ఆమె
ఏ కారణం
రాసిచ్చినా, మీరు
దాన్నీ ఒప్పేసుకుంటారా?”
“ఒప్పుకోలేదయ్యా!
నేను వదుల్తానా? దానికి
రుజువు ఏమిటి? ‘డాక్టర్
సర్టిఫికేట్’ కావాలి...అన్నాను.
అది ఆమె
ఎదురు చూడలేదు.
‘సరే, తీసుకు
వస్తాను’ అని
చెప్పి జీతం
తీసుకుని వెళ్ళిన
మనిషి. రెండు
రోజులుగా మనిషి
కనబడలేదు. ఎవరైనా
ఇలా చేస్తారా
శ్యామ్?”
“సార్...ఆమె
ఎప్పుడు, ఏం
మాట్లాడుతుందో
ఎవరికీ తెలియదు.
పొద్దున బుగ్గల
మీద ముద్దుపెడుతుంది.
సాయంత్రం...మనం
విడిపోదాం –
అంటుంది”
“ఓ...అంత
జరిగిందా?”
“ఒక
ఉదాహరణకి చెప్పాను
సార్”
“ఇంత
పరిపూర్ణ ఉదాహరణను
నేను ఇప్పుడే
వింటున్నాను”
“ఆమె
ఇలా అప్పుడప్పుడు
‘మూడ్
అవుట్’ అవటానికి
మెడిసన్ లో...”
“ఏం
పేరు?”
“అది...ఏదో
పేరు. గుర్తుకురావటం
లేదు...వదలండి”
“ఏం
శ్యామ్...ఆమె
నిజంగానే నీ
బుగ్గలమీద ముద్దు
పెట్టిందా?”
“ఇప్పుడు
ఆ విషయం
అంత ముఖ్యమా
సార్?”
“చాలా
ముఖ్యమయ్యా”
“అవును
సార్. ఇచ్చింది.
చాలా...? ఇప్పుడు
రోహిణీ ఎక్కడ?”
“ఎవరికి
తెలుసు? ఆమె
మన కంపెనీలో
జాయిన్ అయ్యేటప్పుడు
అడ్రస్ రాసిచ్చింది. ఆ
అడ్రస్సు ఎవరికీ
తెలియదు”
శ్యామ్ అయోమయంలో
పడి నిలబడిపోయాడు.
మాధవి అందంగానే
ఉంది. ఆమె
తలుకులలోనూ, ధోరణిలోనూ, శరీరంలోనూ
డబ్బూ, అంతస్తూ
ఊరిపోయి ఉంది.
“శ్యామ్...నువ్వు
రాసిన గ్రీటింగ్
కార్డు వాక్యాలన్నిటినీ
నేను చదివాను.
ఐ జస్ట్
లవ్ ఇట్”
“థ్యాంక్యూ”
“తర్వాతి
మ్యూజిక్ క్లాసు
ఎప్పుడు? నీ
దగ్గర గిటారు
నేర్చుకోవాలని
నాకు చాలా
ఆశగా ఉంది”
అతని దగ్గరగా
వచ్చి, అతన్ని
రాసుకుంటూ నిలబడి
అడిగింది. ఆమె
అందచందాలను అతను
ఫీలవగలిగేంత దగ్గర.
“చెబుతాను
మ్యాడమ్”
“ఎమిటీ...మ్యాడమా? నీకు
నేను మాధవి
మాత్రమే”
“అది
బాగుండదు మ్యాడమ్.
ఇది ఆఫీసు.
ఇక్కడ నేను
నీ పేరు
చెప్పి పిలిస్తే, అవతలివారికి
మిమ్మల్ని గౌరవించాలని
అనిపించదు”
“సరే!
కానీ, ఆఫీసు
టైము ముగిసిన
తరువాత ఖచ్చితంగా
మాధవీనే”
రక్తం తాగే
జలగ లాగా
అతన్ని అతుక్కునే
ఉన్నది మాధవి.
సాయంత్రం దాకా
ఆమె నీడలాగా
ఉండవలసి వచ్చింది.
ఒక్కొక్క క్షణమూ
‘శ్యామ్... శ్యామ్’ అంటూ
సెకెండ్ల ముల్లు
లాగా కొట్టుకుంది.
అతని మాటలనూ--చూపులనూ--చూసి
ఆనందించింది. చిన్న
చిన్న విషయాలలో
పరవశించింది. ఆమెతో
మాట్లాడి మాట్లాడి
రోహిణీని ఆ రోజు
మరిచాడు శ్యామ్.
సాయంత్రం ఇంటికి
వచ్చినప్పుడు మాధవి
మీద వేసిన
వాసన...
శ్యామ్ పైనా వచ్చింది.
కానీ ఆఫీసు
నుండి ఇంటికి
వచ్చిన శ్యామ్
కు మాటి
మాటికీ రోహిణీనే
గుర్తుకు వచ్చింది.
ఆ రోజు
రాత్రంతా అతను
నిద్రపోలేదు. రోహిణీ
జ్ఞాపకాలు అతన్ని
వెంటాడినై.
***************************************************PART-15*******************************************
తరువాతి వారం
రోజులూ, ఆఫీసే
నరకంగా కనిపించింది
శ్యామ్ కు.
రోహిణీ కనబడకుండా
పోయిన షాక్
అతనిలో ఇంకా
వ్యాపించి ఉన్నది.
‘ఎందుకు
నా గదికి
వచ్చింది? తరువాత
ఎందుకు హఠాత్తుగా
కనబడకుండా పోయింది? తనని
తానే పూర్తిగా
నాకు అందించి
ఎక్కడికి వెళ్ళింది
నా దేవత?’
ఆమె సెల్
ఫోన్ నెంబర్, మౌనం
పాటించింది. ఆమె
అద్దెకున్న అడ్రస్సుకు
వెళ్ళి చూసినప్పుడు
అక్కడ ‘అద్దెకు
ఇవ్వబడును’ అనే
బోర్డు కనబడింది.
మాధవీ యొక్క
తోడు శ్యామ్
ను మరింత
కష్టపెట్టింది.
ఒకటి రెండు
వారాలలో గడ్డం
పెరిగింది. ఇరవై
నాలుగు గంటలూ
ఆలొచనలు రోహిణీ
పైనే ఉంటున్నాయి.
దేని మీద
శ్రద్ద లేదు.
ఉత్సాహం లేదు.
కలుపుగోలు లేదు.
చిన్న దేవదాసు
అయ్యాడు.
వేలంటైన్స్ డే
దగ్గర పడుతున్నది.
గ్రీటింగ్ కార్డుల
కోసం ఒక్క
వాక్యం కూడా
రాసి ముగించలేదు.
కల్పన పరిగెత్తలేదు.
భోజనం నచ్చలేదు.
రెస్టారెంటులో
కాఫీ, సిగిరెట్టూ
అంటూ గడిపాడు.
అతని మీద
చూపించలేని కోపాన్ని
మాధవి ----ఆ
కోపాన్ని హాయ్
మీద, తన
పని మీద, ఆఫీసు
అంతా చూపించింది.
ప్యూన్ వచ్చాడు..
“సార్...మేనేజర్
మిమ్మల్ని పిలుస్తున్నారు”
వెళ్ళాడు.
“కూర్చో
శ్యామ్...” కోపంగా చెప్పారు
హాయ్.
కూర్చున్నాడు.
“ఏమైందయ్యా
నీకు? కొన్ని
రోజులుగా నువ్వు
నువ్వుగా లేవు? ఒంట్లో
బాగుండలేదా? ఇంట్లో
ఏదైనా సమస్యా? ఏమిటా
గడ్డం?” కసురుకున్నారు.
“ఏమీ
లేదు సార్...”
“అప్పుడెందుకు...ఆ
గడ్డం. ఈ
పనులన్నీ ఒక
నెల రోజులుగా
చెత్త కాగితాలులాగా
పడేశావు? జీతం
తీసుకుంటున్నావుగా?”
“సార్...”
“రోహిణీ
ఉద్యోగం మానేసి
వెళ్ళిపోయిందని
బెంగగా ఉందా?”
“లేదు
సార్”
“నటించకు!
నువ్వూ, ఆమె
ప్రేమించుకోవటం...ఖాలీగా
ఉన్న ఈ
అలమరా నుండి, కంపెనీ
‘ఎం.డీ’ వరకు
తెలుసు”
“సార్...నన్ను
ఉద్యోగం నుండి
తీసేస్తారా?”
“ఛఛ...ఇప్పటి
వరకు అలాంటి
‘ఐడియా’ లేదు”
“లేదు
సార్...కావాలంటే
నేను ఉద్యోగం
మానేస్తాను”
“నా
దగ్గర నువ్వు
తీసుకున్న ఈరవై
ఐదువేల రూపాయల
అప్పును అలాగే
ఎగగొడదామని చూస్తున్నావా? ఇడియట్...నిన్ను
వదలను”
“అలాగంటే
ఏది జరిగినా
నన్ను ఉద్యోగం
నుండి తీసేయరు?”
“నేను
అలా చేసినా, ఆ
మాధవి విడిచిపెట్టదు.
అదేంటో తెలియదు...ఆమెకు
నువ్వు బాగా
నచ్చావు. నిన్నే
చుట్టి చుట్టి
వస్తున్నదే. ఆమెను
ఏం చేశావు?”
“నేనేం
చేయలేదు సార్”
“నువ్వు
ఏమీ చెయ్యకపోతే
నిన్ను ఇంకా
ఎందుకు ఇంకా
ఉద్యోగంలో ఉంచుకుంది.
నువ్వు తాజాగా
గ్రీటింగ్ కార్డులకు
కవిత్వ వాక్యాలు
రాయకపోయినా...ఐదేళ్ల
కిందట నువ్వు
రాసిన వాటిని
ఏరి, అందులో
కొన్నిటిని ప్రింటు
చేయిస్తోంది”
“అయ్యో...నేనేం
చేయలేదని చెబుతున్నాగా.
నన్ను నమ్మరా?”
“ఏం
చెయ్యకపోవటం కూడా
కొంతమంది ఆడవారికి
నచ్చుతుంది అనుకుంటా”
“సార్...నాకు
ఇక్కడుంటం నచ్చలేదు
సార్. నన్ను
ఉద్యోగం నుండి
తీసేయండి”
“చెయ్యను...వెళ్ళి
జాగ్రత్తగా పని
చూడు”
“సార్... రోహిణీ లేని
జీవితం...”
“ఇదిగో
చూడు...లేని
వాళ్ళకోసం పాకులాడటం
ఆరొగ్యానికీ, ఇంటికీ, దేశానికీ
చెడ్డది!”
“ఇలాగంతా
మాట్లాడితే ప్రామిస్
గా రేపట్నుంచి
రాను”
“శోకంగా
ఉన్నదా?”
“అవును”
“విరక్తిగా
ఉన్నదా?”
“అవును”
“బాధలో
ఉన్నావా?”
“ఊ”
“మంచిది.
నీ శోకాన్ని
వడగట్టేయి...వాక్యాలతో!
విడిపోయిన ప్రేమికులకు
అని మనం
ఇంతవరకు ‘గ్రీటింగ్
కార్డ్’ వేసింది
లేదు. మనమే
కాదు...ఇండియాలో
ఎవరూ వెయ్యలేదు.
ఇప్పుడు వేద్దాం.
కొత్త ట్రెండును
ఏర్పరుచుదాం”
కోపంతో చూసాడు
శ్యామ్.
ఆ రోజు
రాత్రి. శ్యామ్
యొక్క డైరీ
కన్నీటితో తడిసి
అలమటించింది.
‘నేను
రోహిణీని హేట్
చేస్తున్నాను. నన్ను
పిచ్చివాడిని చేసిన
రోహిణీని నేను
పూర్తిగా హేట్
చేస్తున్నాను. నువ్వు
ఇష్టపడే అన్నిటినీ
మొత్తంగా నేను
హేట్ చేస్తున్నాను’
***************************************************PART-16*******************************************
మైసూరు వెళ్ళే
శతాబ్ధీ రైలు.
వ్యాపార విషయంగా
బెంగళూరు వెళ్తున్నాడు
శ్యామ్.
ఆ రైలులో
నిజంగా అతను
రోహిణీని ఎదురుచూడలేదు!
అతను తన
సీటులో కూర్చో
నుండ, రోహిణీ
అతన్ని దాటుకుని
వెళ్ల--
“రోహిణీ!”
“అరె...
శ్యామ్!”
“బెంగళూరు
వెళ్తున్నాను. నువ్వెక్కడిదాకా?”
“నేను...వచ్చి...ఒక
పెళ్ళికి మైసూరు
వెళ్తున్నాను”
“ఎందుకు
ఉద్యోగానికి అంత
హఠాత్తుగా రాజీనామా
ఇచ్చావు? ఒక
ఇన్ ఫర్మేషన్
లేదు...ఫోను
లేదు. ఎక్కడికి
వెళ్ళావో తెలియలేదు.
పిచ్చి పిచ్చి
కారణాలు చెప్పి
ఆ హాయ్
రామప్ప మూడును చెడిపావు!
ఏంటి రోహిణీ
ఇదంతా? నీకు
నామీద ఏమిటి
కోపం?”
“ఆ
మాధవి దెయ్యం
నిన్ను ‘లవ్’ చేస్తున్నట్టు
అనిపించింది. సరే, మధ్యలో
మనమెందుకు అనుకుని
జారుకున్నాను”
“ఆమేకదా
నన్ను లవ్
చేస్తోంది.నేను
చెయ్యలేదే?”
“ఎవరికి
తెలుసు? నువ్వు
మొదటి నుంచి
అడ్డ దారిలో
డబ్బుగల వాడివి
అవ్వాలని లక్ష్యం
పెట్టుకుని తిరుగుతూ
ఉన్నావు. ఆస్తి, అంతస్తూ
ఉన్న ఆమెని
పట్టుకున్నావేమోనని
అనుకున్నాను”
“అప్పుడు
మనం చివరిగా
ఒకటిగా ఉన్నది, నువ్వు
నాకు ఉంగరం
తొడిగింది...నేను
నిన్ను...నిన్ను”
“అంతా
ఒక ‘ఆటోగ్రాఫ్’ లాగానే”
“రోహిణీ
నీకు నేను
నచ్చలేదా?”
“బాగా
నచ్చావు… నచ్చకపోతే నన్ను నేను నీకెందుకు
అర్పించుకుంటాను”
“మరి ఇంకేమిటి నీ ప్రాబ్లం?”
“జీవితంలో
కొన్ని సమయాల్లో...కొన్ని
కారణాలు పిచ్చిగా
ఉంటాయి. కానీ, అదే
చాలావరకు నిజం”
“ఇదెందుకు
మాటి మాటికీ
చెబుతావు? ఎవరు
ఇది చెప్పింది? అరిస్టాటిలా...రజినీషా...సాక్రటీసా?”
“నేనే
చెప్పాను. నిజాన్ని
ఎవరు చెబితే
ఏం?”
“ఉరికే
నన్ను అల్లరిపెట్టకు
రోహిణీ”
“తెలుసు.
నీకు నిజమే
నచ్చదు. నువ్వు
దాన్ని జీర్ణించుకోలేవు.
ఎందుకంటే, నువ్వెప్పుడూ
నిజం చెప్పే
మనిషివి కావు.
నీ ఉద్యోగం
అలాంటిది”
“నా
ఉద్యోగానికి ఏం
తక్కువ?”
“ఎప్పుడూ
ఒక కల్పనలో
ఉండటమే నీ
ఉద్యోగం. రంగు
వేసిన ప్రపంచాన్ని
చూపించటం -- రైన్
బో, సూర్యుడూ, పువ్వు, జలపాతం...ఇలా
ప్రక్రుతిని ఏదైనా
చూపించటమే కదా!
గ్రీటింగ్ కార్డులో, ఏ
రోజైనా మురుగు
నీటి కాలువను
చూపించావా నువ్వు? మూసీ
నదినీ -- గుడిసె
ఇల్లును చూపించావా...? గుడిసెలో
ఉండే కూలీ
వాడు, మూటలు
ఎత్తే వాడు, రిక్షాలాగే
వాడు...కష్టపడే
వాళ్లను ఎవరినైనా
ఇలా ముద్రించావా...? యధార్ధాన్ని, జీవితంలోని
చేదును, నిజం
యొక్క నిదర్సనాన్ని
ఎప్పుడైనా చూపించావా?”
ఈ హఠాత్
గొరిల్లా అటాక్
ను రోహిణీ
దగ్గర నుండి
ఎదురుచూడలేదు అతను.
“ఇప్పుడేంటి...దానికి?”
“అలాంటిదే
నీ ప్రేమ
కూడా! ప్రేమ...అనేది
ఒకటుందా? లేదు...అది
కవులు కనిబెట్టిన
అబద్ధం. కల్పితవాదులు
కనిపెట్టిన అబద్దం.
సంధర్భవాదులు కనిబెట్టిన
అబద్దం. కార్యం
సాధించుకోవాలనుకునే
మగవాళ్ళు కనిపెట్టిన
అబద్దం. ఆడపిల్లలను
మొసం చేసి, వాళ్ళని
తల నుండి
కాలువరకు అనిభవించటానికి
మగవాళ్ళు కనిబెట్టిన
పచ్చి అబద్దమే
ప్రేమా గీమా
దోమా అన్నీ”
“నేను
నిన్ను మొసం
చేసేనా?”
“నువ్వంటే
నువ్వు కాదు...నీలాంటి
వాళ్ళు”
“రోహిణీ...ఏమిటి
సడన్ గా
పెద్ద పెద్ద
డైలాగులు అన్నీ
మాట్లాడుతున్నావు”
“ఈ
రోజు ఈ
లోకం ఇంత
నీచంగా, కపటంగా, మోసంగా
ఉంది అంటే, దానికి
మీలాంటి కల్పనా
వాదులూ, ఆలొచనావాదులూ, మగవాళ్ళూ, అబద్దమైన
మగవారు...మీరందరూనే
కారణం. ప్రేమ
అనే ఒక
కథను చెప్పి
ఆడపిల్లలందరినీ
ఎప్పుడూ మత్తులో
ఉంచి పెట్టుకుంటున్నారు.
ప్రేమ, అభిమానం, మాతృత్వం, అనురాగం
అని అన్నిటినీ
ఒక పెద్ద
మోపు చేసి
చూపి, తలలోకి
ఎక్కించి, మమ్మల్ని
ఎక్కడికీ స్వతంత్రంగా
వెళ్ళనివ్వక ఒక
మూల కూర్చోబెట్టేశారు.
కాళ్ళకు సంకెళ్ళు
వేసి కట్టి
పడేశారు”
“రోహిణీ....”
“ఏ
ఆడదీ పనికట్టుకుని
ప్రేమ వెనుక
పిచ్చిదానిలాగా
పరిగెత్తదు. ఆడవాళ్ళకు
యధార్ధం అంటే
నచ్చుతుంది. కానీ, మా
జీవితాన్ని మేము
ప్రశాంతంగా జీవించ టానికి...మగవాళ్ళు
మీరు విడిచిపెట్టటం
లేదు. మేము
ఎలా జీవించాలో
నన్న ఉద్దేశంతో
మా లోకాన్ని మీరు
‘డిజైన్’ చేస్తున్నారు.
మేము మాట్లాడవలసిన
మాటలను మీరు
డైలాగులుగా రాసిస్తున్నారు.
మా జీవితానికి
మీరు స్క్రీన్
ప్లే ఫిక్స్
చేస్తున్నారు. ఆడవాళ్ళను, బొమ్మలుగా
చేసేసారు. ఎదిరించి
నిలబడితే, ఆ
ఆడదానికి ‘పొగరెక్కినదీ’ అని బిరుదు
ఇస్తారు”
రోహిణీ ఆవేశపడుతూ
మాట్లాడుతూండగా, సడన్
గా ఆమె
ఒక ముక్కు
పక్క నుండి
రక్తం దారంలాగా
దిగింది.
ఏదో జ్ఞాపకం
రాగా చటుక్కున
వెనక్కి తిరిగి, రక్తాన్ని
ముట్టుకుని చూసి
రుమాలతో తుడుచుకుంది.
“అయ్యో
రోహిణీ...ముక్కులో
నుండి రక్తం”
“ఎక్స్
క్యూజ్ మీ...” -- వేగంగా
లేచి నడిచింది.
“రోహిణీ...
రోహిణీ! ఎక్కడికి
వెళ్తున్నావు?”
“రెస్టు
రూముకు వెళ్తున్నాను.
దీనికి కూడా
హక్కులేకుండా చేసేసారు.
ఇదే నీ
ప్రేమ. కట్టిపడేసేది...జైలులో
ఉంచేది. నా
స్వతంత్రాన్ని
లాక్కొవటం. ఎక్కడికెల్తున్నావని
అడగటం. ఎక్కడికీ
మమ్మల్ని వెళ్ళనివ్వకుండా
చేయటం. ఇప్పుడు
అర్ధమవుతోందా? అందుకోసమే
నిన్ను వదిలి
వెళ్లాను. కుక్కలాగా
ఇక నన్ను
తరమకు!”
రోహిణీ కోపంగా
వెళ్ళిపోగా ----
శ్యామ్ షాకై
కూర్చున్నాడు.
వెళ్ళిన ఆమె
రానేలేదు.
తరువాతి స్టేషన్లో
దిగి వెళ్ళిపోయింది.
***************************************************PART-17*******************************************
గాంధీ రోడ్డు…
ప్రసిద్ద హోటల్
ఎంట్రన్స్.
శ్యామ్ యొక్క
జీవితాన్ని తలకిందలు
చేసిన ఆ
చివరి మీటింగు
అక్కడే జరిగింది.
రైలులో జరిగిన
సంఘటననే జీర్ణించుకోలేకపొయిన
పరిస్థితిలో అతను
ఉండగా, పదిహేను
రోజుల తరువాత
మళ్ళీ అతనికి షాకింగ్
మీట్ ఏర్పడింది
రోహిణీతో.
శ్యామ్ లోపలకు
వెళ్ళటానికి ప్రయత్నించ, రోహిణీ
బయటకు రావటానికి
ప్రయత్నించ...వాకిలి
గుమ్మంలో ఇద్దరూ
ఢాష్ కొట్టుకున్నారు.
“హాయ్
రోహిణీ....”
“హాయ్...
శ్యామ్. ఏమిటీ
ఆశ్చర్యం?”
“ఎలా
ఉన్నావు?”
“నేను
ఓ.కే!
నువ్వు?”
“ఫైన్”
“ఎక్కడ
ఉన్నావు? నీ
అడ్రస్ ఏమిటి? ఎక్కడ
పని చేస్తున్నావు? ఎందుకు
నా దగ్గర
ఏదీ చెప్పకుండా
నన్ను బాధపెడుతున్నావు
రోహిణీ?”
ఆమె మందహాసంగా
ఒక నవ్వు
మాత్రం తన
హృదయం యొక్క
లోతు నుండి
తీసి అతనికి
కొంచం ముక్క
చేసి ఇచ్చింది.
అది తప్ప
మిగితాదంతా మౌనమే.
శ్యామ్, రోహిణీని
లోతుగా చూశాడు.
ఒక ఎర్ర
రంగు చుడీధార్, గొంతు
చుట్టూ దుప్పటా.
చలిగా ఉన్నదని
వేసుకున్నట్లుంది.
దేవతలాగా కనిపించింది...ఇంకా.
నిట్టూర్పు విడిచాడు.
వర్షం వచ్చేలాగా
చల్లటి గాలి
వీచింది. లేక
రోహిణీ దగ్గరగా
ఉండటం వలన
ఏర్పడిన
చల్లదనమా? అనేది
అతనికి అర్ధం
కాలేదు!
“నేను
వెళ్తున్నా శ్యామ్.
కాస్త పని
ఉంది”
“ఉండు
ఉండు....ఆ
రోజులాగా ఎక్కడికీ
తప్పించుకు వెళ్ళాలని
చూస్తున్నావు? నేనూ నీతో
వస్తాను”
రోహిణీ నడవ, పక్కనే
ఆమెతో శ్యామ్.
“ఉద్యోగమంతా
ఎలా ఉంది?”
“నేను
ఆ గ్రీటింగు
కార్డు కంపనీని
వదిలేయబోతున్నాను”
“ఎందుకని?”
“నువ్వు
నా ఉద్యోగం
గురించి అంతపెద్ద
పాఠం తీసిన
తరువాత...నన్ను
అబద్దం అని
చెప్పిన తరువాత
ఆలొచించి చూసాను.
నువ్వు చెప్పిన
దాంట్లో కొంత
నిజం అతుక్కోనున్నది
గ్రహించాను”
“జీవితంలో
నువ్వోక మంచి
నిర్ణయం తీసుకోవటం
గురించి నువ్వు
సంతోషపడవచ్చు”
పెద్ద పెద్ద
చినుకులతో మొదలైంది
వాన. వేగంగా
ఇద్దరూ దగ్గరున్న
ఆసుపత్రి పక్కగా
తలదాచుకున్నారు.
రోహిణీ తన
మెడలో ఉన్న
దుప్పటాను తీసి
తలమీద వేసుకుంది.
అదిచూసిన అతను
మరుక్షణం, మెరుపు
తాకినట్టు ఉలిక్కిపడ్డాడు.
“ఏయ్...ఇదేంటి
మెడలో తాలి?”
రోహిణీ యొక్క
మెడలో లావుపాటి
కొత్త పసుపుతాడు
వేలాడింది.
“ఏమిటీ...’చంటి’ సినిమా
వెంకటేష్ లాగా
అడుగుతున్నావు? తాలి
తాడును నువ్వు
చూసిందేలేదా?”
“చూసాను.
అది నీ
మెడలో ఏం
చేస్తున్నది?”
“నేను
పెళ్ళి చేసుకున్నాను
శ్యామ్”
“వాట్...?”
“పెళ్ళి
చేసుకున్నాను అని
చెప్పాను!”
“ఎవర్ని?”
“ఒక
మైసూరు అబ్బాయిని”
“ఎప్పుడు?”
“ఏమిటి
శ్యామ్ తెలియనట్లు
అడుగుతున్నావు? నేను
నీకు ఆరోజే
చెప్పాను కదా!”
“ఎప్పుడు
చెప్పావు? ఎక్కడ
చెప్పావు?”
“ఆరోజు
మనం మైసూరు
వెళ్ళే శతాబ్ధీ
ఎక్స్ ప్రెస్స్
రైలులో కలుసు
కున్నామే...అప్పుడు
చెప్పాను?”
“ఏం
చెప్పావు?”
“నువ్వొక
డీలర్ను చూడటానికి
బెంగళూరు వెళ్తున్నానని
చెప్పావు”
“అది
నేను చెప్పింది...నువ్వేం
చెప్పావు?”
“అప్పుడే
చెప్పాను...నేను
ఒక పెళ్ళికి
మైసూరు వెళ్తున్నానని
చెప్పాను!”
“అవును.
ఒక పెళ్ళికి
వెళ్తున్నట్టు
చెప్పావు?”
“అది
నా పెళ్ళే”
ఎవరో చెంప
మీద ‘ఫడేల్’ మని
కొట్టినట్టు చూసాడు
శ్యామ్.
అప్పుడు అతి
భయంకరమైన శబ్ధంతో
ఒక పిడుగు
పడింది.
ఆ మరుక్షణం, శ్యామ్
షాకుతో -- నరికిన
చెట్టులాగా రోడ్డుమీద
పడిపోయాడు.
హాస్పిటల్.
శ్యామ్ కళ్ళు
తెరవగా...పరుపు
మీద ఉన్నాడు.
‘డ్రిప్స్’ ఎక్కుతున్నాయి.
పక్కన కలతతో
రోహిణీ.
“రోహిణీ...”
“ఏమీ
మాట్లాడకూడదని
డాక్టర్ చెప్పాడు”
“వాళ్ళు
అలాగే చెబుతారు.
నీకేమైంది సడన్
గా?”
“నీకేమైంది?”
“షాక్
ను తట్టుకోలేకపోయాను.
నిజంగానే నువ్వు
పెళ్ళి చేసుకున్నావా?”
“అవును.
ఏం...? దాంట్లో
ఏముంది షాకవడానికి?”
“ఎలా?”
“ఎలాగంటే...అర్ధంకాలేదు
శ్యామ్?”
“హఠాత్తుగా
ఎలా నువ్వు
ఈ నిర్ణయానికి
వచ్చావు?”
“సడన్
గా ఒకడొచ్చి
అడిగాడు. ‘నన్ను
పెళ్ళిచేసుకుంటావా?’ అని!
సరి అని
చెప్పాను”
“ఏయ్
ద్రోహీ. నేను
అడిగినప్పుడు, నువ్వు
వద్దని చెప్పావు?”
“నువ్వెఫ్ఫుడు
అడిగావు?”
“ఐ.లవ్.యూ’ అని
ఎన్నిసార్లు చెప్పాను?”
“ఐ.లవ్.యూ
అనేకదా చెప్పావు!
‘పెళ్ళి
చేసుకుంటావా’? అని
ఎప్పుడు అడిగావు?”
శ్యామ్ కు ఏం
మాట్లాడాలో అనేది
తెలియలేదు! నోటమాట
రాక చూస్తూ
ఉండిపోయాడు.
‘ఆటలాడుతున్నదా? సీరియస్
గా మాట్లాడుతున్నదా? ఈమె
పిచ్చిదా? సాడిస్టా? లేక...ఇదే
రోహిణీనా?’
శ్యామ్ ఆమెను
బాధతో చూస్తూ
అడిగాడు.
“ఏమిటి
రోహిణీ చెబుతున్నావు? రెండు
ఒకటే కదా?”
“అదెలా
రెండూ ఒకటవుతుంది?”
“మరి?”
“ఇదివేరు...అదివేరు”
“అలాగైతే
అది...ఇది
కాదా?”
“అదెలా
శ్యామ్ ఇదవుతుంది? అది...ఇది
కాదు”
“ఏమిటి
వాగుతున్నావు? ఇదే
కదా అది?”
“లేదయ్యా
బాబూ. ఇది...అది
కాదు. అది
వేరు...ఇది
వేరు”
“నువ్వు
నాశనమైపోవాలి. నరకానికి
వెళ్లాలి. నీకు
మంచి చావే
రాకూడదు”
“శ్యామ్...”
“ఏమిటే...కుక్కలాగా
నీ వెనుకే
తిరిగాను. నేను
‘ఐ.లవ్.యూ’ చెప్పినప్పుడు
కూడా ‘వద్దని’ చెప్పావు!
కానీ, ఇప్పుడు
ఒకడ్ని పెళ్ళిచేసుకుని
వచ్చి నిలబడ్డావు”
“ఎందుకు
అంత టెన్షన్
అవుతున్నావు?”
“ద్రోహీ!
పాపీ! ఇంతకు
మించి ఎలా
తిట్టాలో నాకు
తెలియటం లేదు.
నిన్ను ప్రేమించినందుకు
నా కడుపు
మండిపోతోందే”
“ఏయ్...నీ
కడుపు ద్వారానా
నన్ను ప్రేమించావు?”
“నోరుముయ్యి.
నీ పిచ్చి
జోకులూ, సాడిస్టు
జోకులూ ఆపు.
నాకు ప్రేమికురాలుగా
ఉండనని చెప్పి...ఎవడో
ఒకడికి భార్య
అయి వచ్చి
నిలబడ్డావే! ఇప్పుడు
ఎలా ఉందో
తెలుసా? రక్తం
ఉడికిపోతోంది. నాకు
ఎక్కిస్తున్న ఈ
డ్రిప్స్ మీద
ప్రామిస్ చేసి
చెబుతున్నా. నువ్వు
బాగుండవు. ఎందుకే
ఇలా చేసావు?”
శ్యామ్ తాను
ఒక మగాడినని
కూడా మర్చిపోయి
వెక్కి, వెక్కి
బోరున ఏడ్చేడు.
“నాకే
తెలియదు. నేను
చేసింది నాకే
పెద్ద ఆశ్చర్యంగా
ఉంది”
“ఏమిటది?”
“ఒకరోజు
పొద్దున హఠాత్తుగా
కళ్ళు తెరిచి
లేచినప్పుడు, నువ్వు
మాటి మాటికీ
చెప్పింది
నిజం అనిపించింది.
పెళ్ళి చేసుకుంటే
ఏమవుతుంది అని
అనిపించింది. ఒక
‘కమిట్మెంట్’ ఉంటే
తప్పు ఏముంది
అనిపించింది. నాకు
వయసైపోతే నన్ను
ఎవరు చూసుకుంటారు
అని ఆలొచించాను.
సరిగ్గా ఆరోజున
‘వేలంటైన్
డే’ వచ్చింది.
నాతో పని
చేస్తున్న ఒకతను, నన్ను
బాగా ఆకర్షించిన
ఒకతను, నన్ను
ఇష్టపడ్డాడు. పెళ్ళిచేసుకుంటావా? అని
అడిగాడు. సరి
అని చెప్పాను.
సింపుల్. అంతా
చటుక్కున ముగిసిపోయింది”
“అదంతా
సరేనే ద్రోహీ.
అప్పుడు తిన్నగా
నా దగ్గరకు
వచ్చి నన్ను
పెళ్ళి చేసుకోనుండొచ్చు
కదా? ఎందుకు
నన్ను వదిలేసి
ఇంకెవడ్నో...ఎందుకు? ఎందుకు
రోహిణీ?”
“తెలియదు
శ్యామ్. జీవితంలో
జరిగే కొన్ని
విషయాలకు కారణం
చెబితే చాలా
చప్పగా కనబడుతుంది...”
ఆ నిమిషం.
ఆ క్షణం.
ఆ ‘మైక్రో’ సెకెండులోనే...
శ్యామ్ తన
జీవితంలో రెండు
పెద్ద నిర్ణయాలు
తీసుకున్నాడు.
ఒకటి...‘
రోహిణీని ఇకమీదట
పూర్తిగా మరిచిపోవాలి!’
రెండు...‘ఆమె
జ్ఞాపకాలను పూర్తిగా
మరిచిపోవాలి!’
***************************************************PART-18*******************************************
గ్రీటింగ్ కార్డు
కంపెనీ.
హాయ్ రామప్ప తన
చేతిలో ఉన్నవాటిని
చూసి చూసి
సంతోషించాడు.
అది, ఆ
సంవత్సర లాభ
నష్టాల లెక్క!
78
కోట్ల రూపాయల
వ్యాపారంలో, 12 కోట్లు
లాభం చూపించింది
కంపెనీ!
‘ఆహా...అంతా
నా కష్టంతో
వచ్చింది. అది
తెలియని యజమాని, తన
కూతుర్ను పెట్టుకుని
తన పదవిని
లాక్కుంటున్నాడు.
ఇడియట్!’
వేగంగా తలుపుతోసుకుని
లోపలకు వచ్చాడు
ప్యూన్.
“మూర్కుడా.
నేను పిలవకుండా
ఎందుకురా లోపలకు
వచ్చావు? నిన్ను
లేకుండా చేస్తాను!” -- హాయ్
కోపగించుకున్నారు.
“అవును...ప్రతి
విషయానికీ నన్నే
తిట్టండి. అక్కడ
ఒకరు తాగేసి
ఆఫీసుకు వచ్చారు”
“ఏమిట్రా?”
ప్యూన్ విషయం
చెప్పిన తరువాత
,
హాయ్ కలవరపడ్డారు.
వేగంగా లేచి
బయటకు వెళ్లారు.
శ్యామ్ యొక్క
గదిలోకి దూరారు.
గుప్పుమని దుర్వాసన
వచ్చింది. షాకైయ్యారు.
“శ్యామ్!”
టేబుల్ డ్రాలో
నుండి దేనినో
వంగి అర్జెంటుగా
వెతుకుతున్న అతను, మెల్లగా
తిరిగాడు.
“తాగున్నావా?”
“ఈ
ఒక్క రోజుకు
నన్ను క్షమించండి.
మనసు వేదనను
తట్టుకోలేక పోతున్నాను”
“శ్యామ్
మొదట బయటకుపో...పనిచేసే
చోటు ఒక
గుడిరా. తాగేసి
రావటానికి నీకు
ఎంత ధైర్యం? పో...బయటకు!”
తన జీవితకాలంలో
హాయ్ ఎవరిమీద
ఇంతగా కోపగించుకున్నది
లేదు.
శ్యామ్ కోపంగా
లేచి నిలబడి
అరిచాడు.
“అవును...అందరూ
నన్ను ఒకేసారి
బయటకు తోసేయండి.
మీరు నన్ను
ఆఫీసు నుండి
బయటకు తోసేయండి...ఆ
రోహిణీ...ఆమె
జీవితం నుంచే
నన్ను బయటకు
తోసేసింది”
“రోహిణీని ను
కలిసావా? ఎక్కడ? ఎప్పుడు?”
“పెళ్ళి
చేసుకుంది సార్...ఎవడో
ఒక వెధవను”
“అలాగా?”
“అవును”
“ఎక్కడ...ఎక్కడ
చూసావు ఆమెను...?”
“గాంధీ
రోడ్డులో”
“ఎక్కడుంటోంది? ఆమె
అడ్రస్సు ఉందా...?”
“ఒక
కర్మా తెలియదు.
తెలుసుకోవటం ఇష్టంలేదు”
“సరేరా.
తాగితే నీ
గదిలోనే ఉండి
తగలడొచ్చుగా? ఇక్కడికి
ఎందుకు వచ్చి
ఆఫీసును కంపు
చేస్తున్నావు?”
“రోహిణీకి
సంబంధించిన అన్ని
వస్తువులనూ తీసుకువెళ్లటానికి
వచ్చాను”
అతను ఒక
ప్లాస్టిక్ సంచీలో
ఏవేవో వస్తువులను
పెడుతూ లేచాడు.
“గుడ్
బై. నేను
వస్తాను. ఇకపై
నన్ను ‘గెట్
అవుట్’ చెప్పే
పని మీకుండదు”
“శ్యామ్... శ్యామ్...”
అతను వెళ్ళిపోయాడు...అర్ధంకాక
నిలబడ్డారు హాయ్.
‘ఇతను
ఎందుకు రోహిణీ
వస్తువులను సేకరించి
తీసుకు వెళ్తున్నాడు?’ ఆయనకు
అర్ధంకాలేదు!
తీవ్ర ఆలొచన
తరువాత ఒక
నిర్ణయానికి వచ్చారు.
‘రోహిణీని
కనిబెట్టటం చాలా
సులభం’ అని
అనుకుంటూ అర్జెంటుగా
బయలుదేరారు.
***************************************************PART-19*******************************************
ఒక ‘అడ్వర్
టైజ్మెంట్’ కంపెనీ.
రోహిణీ ఎదురుగా
హాయ్ కూర్చోనున్నారు.
“నన్ను
ఎలా కనుకున్నారు” ఆశ్చర్యపడుతూ
అడిగింది రోహిణీ.
ఆమె మెడలో
తాలి వేలాడుతోంది.
“మనమే
చాలా తెలివిగల
వాళ్ళమని అనుకోకూడదు.
మా బుర్రలో
మసాలా లేకుండానే
కంపెనీకి పలుకోట్ల
రూపాయలు లాభం
సంపాదించి ఇచ్చుంటామా”
“ఒప్పుకుంటాను.
మీరు తెలివిగలవారేనని!
నన్ను ఎలా
కనుక్కున్నారు?”
“మధ్యాహ్నం లంచ్
టైములో ఒక
హోటల్లో అందమైన
యంగ్ లేడీ
ఉంది అంటే, ఆ
అమ్మాయికి పక్కనే
ఎక్కడోనే ఒక
‘అడ్వర్
టైజ్మెంట్’ కంపెనీయో, డీలరో
దగ్గర్లో ఉండి, ఆమె
అక్కడ పనిచేస్తోందని
అర్ధం. వెతికాను.
కనిబెట్టాను”
“గ్రేట్”
“ఏంటమ్మా
ఇది...ఇంకెవరినో
నువ్వు పెళ్ళిచేసుకుని? శ్యామ్
పాపమమ్మా?”
“నా
ప్రైవెట్ జీవితంలో
తల దూర్చటానికి
మీరెవరు సార్?”
“నీకు
అమ్మా--నాన్న
ఉన్నారా?”
“లేరు”
“అయితే
ఆ స్థానంలో
నన్ను ఊహించుకో.
ఎందుకు ఈ
సడన్ పెళ్ళి? మనసు
మార్పు? నువ్వు
పెళ్ళిచేసుకున్న
అబ్బాయి పేరేమిటి?”
“సెరిబ్రెల్
త్రాంబోసిస్. దీని
గురించి ఎప్పుడన్నా
వినున్నారా?”
“ఇదా
ఆ అబ్బాయి
పేరు?”
“మెదడు
రక్తనాళంలో గడ్డ”
షాకైయ్యాడు.
“ఏంటమ్మా
చెబుతున్నావు?”
“నాకు
ఆయుష్షు తక్కువ.
రోజులను లెక్క
వేస్తున్నాను. ఈ
పరిస్థితుల్లో
శ్యామ్ ను ఎలా
పెళ్ళి చేసుకోమంటారు?”
“ఇంకొకడ్ని
పెళ్ళి చేసుకోవటం
ఓకేనా?”
“అతనూ
బ్లడ్ క్యాన్సర్
వాధితో రోజులు
లెక్కపెడుతున్న
నా లాంటి
ఒక మనిషి.
వెతికి పట్టుకుని
పెళ్ళి చేసుకున్నాను.
ఇప్పుడు ఓకేనా?”
రామప్ప విరిగిపోయాడు.
ఇది ఆయన
ఎదురుచూడలేదు.
“జీవితంలో
అన్నీ ఒక
‘కాంప్రమైజే’ కదా
సార్” అన్నప్పుడు రోహిణీ
స్వరంలో గంభీరం
తగ్గి నీరసంగా
వినబడింది.
“క్షమించమ్మా...నీకు
అప్పుడప్పుడు తలనొప్పి
వస్తుంది. ముక్కులో
నుండి రక్తం
కారుతుందనేది నాకు
తెలుసు. దానికి
ఇదేనా కారణం?”
“అవును”
“దీన్ని
నయం చేయలేరా?”
“ఒక
మందు ఉంది.
అది మెదడులోని
గడ్డను కరిగించి
రక్తాన్ని వేరు
చేస్తుంది. కానీ, చాలా
ఖరీదు. పర్మనెంట్
సల్యూషన్ కూడా
కాదు”
“మెదడులోని
గడ్డను ఆపరేషన్
చేసి తీసేయచ్చు
కదమ్మా?”
“ఒక
గడ్డ తీస్తే
ఇంకో గడ్డ
వస్తుంది. కన్ను--చెవ్వు--అని
ఏదో ఒక
అవయవం పోతుంది.
దేనికీ అలా? చచ్చిపోయేంతవరకు
కొంచం సంతోషంగా
ఉండి చచ్చిపోతానే?”
“బగవంతుడా?”
“ఆషాడ
మాసం డిస్కౌంట్
లాగా వినటానికి
బాగుంది కదా?”
రామప్ప సడన్
గా నిర్ణయం
తీసుకుని లేచారు.
రోహిణీ చేతులు
పుచ్చుకుని లాగారు.
“రా
నాతో”
“ఎక్కడికి?”
“బజారు రోడ్డులో నాకు
తెలిసిన ఒక
డాక్టర్ ఉన్నారు.
ఆయన దగ్గర
సలహా అడుగుదాం.
స్కాన్ తీద్దాం”
బజారు రోడ్డు హాస్పిటల్.
ఏం.ఆర్.ఐ.
స్కాన్ తీశారు.
రిజల్స్ కోసం
కాచుకోనున్నారు
హాయ్, రోహిణీ.
“ఇంత
చిన్న వయసులో
నీకు ఇలా
కావాలా?”
“సార్.
ఈ పశ్చాత్తాపమే
నేను ఇష్టపడనిది.
విసుక్కునేది”
“ఏదైనా
ఆశ్చర్యం జరుగవచమ్మా.
నా బావమరిది
తెలుసుకదా... జగదీష్. వాడు
పూర్తిగా గుణమయ్యాడు”
“అరె...అలాగా? ఎలా?”
“అదొక
కథ”
“మీ
జీవితంలో కూడా
ఏదో ఒక
కథ ఉందని
చెప్పారు”
“నా
భార్య రేవతీ, బావమరిది
జగదీష్ కారులో
వెళ్తున్నప్పుడు, ఘోరమైన
యాక్సిడెంట్ జరిగి
నా భార్య
అక్కడికక్కడే చనిపోయింది.
దాన్ని చూసిన
నా బావమరిది, షాక్
తో పిచివాడు
అయ్యాడు”
“అరెరె”
“దగ్గర
దగ్గర ఒక
నడిచే శవంగా
జీవించాడు. ఎవరితోనూ
మాట్లాడేవాడు కాదు.
ఇంట్లోంచి బయటకు
వెళ్ళేవాడు కాదు.
గదిలోనే ఉండేవాడు.
ఈ మూడు
సంవత్సరాలూ వాడిని
ఒక పసిపిల్లాడిని
చూసుకున్నట్టు
నేను వాడ్ని
చూసుకోవలసి వచ్చింది.
ఇంటిదగ్గర వాడ్ని
గొలుసుతో కట్టేసి
నేను ఆఫీసుకు
వచ్చేవాడిని”
“జగదీష్
పాపం సార్”
“ఈ
మధ్యే ఒక
‘న్యూరో
సైంటిస్ట్’ ద్వారా
వాడి మెదడులో
రిజిస్టర్ అయున్న
ఆ ఘొరమైన
యాక్సిడెంట్ జ్ఞాపకలను
తుడిచేసేము. వాడు
నార్మల్ అయ్యాడు”
“నిజమా...అలా
మన మెదడులో
ఉన్న జ్ఞాపకలను
చెరిపేయటం సాధ్యమేనా
సార్?”
“ఇప్పుడు
సాధ్యమవుతూ వస్తోంది.
మతిమరపు వ్యాధి
అనేది ప్రకృతి
సహజంగా జరిగే
ఒక విషయం.
ప్రకృతి సహజంగా
ఒక విషయం
ఉంది అంటే, దాన్ని
వెంటనే కాపీకొట్టి
‘డూప్లికేట్’ వేసి
ఒక కృతిమ
విషయాన్ని తయారుచేయటమే
మన శాస్త్రవేత్తలకు
పాల్కోవా తిన్నంత
ఈజీకదా! అందువల్ల
ప్రకృతిగా మెదడులో
ఉన్న, మనిషిని
కష్టపెట్టే సంఘటలను
చెరిపేయగలం అంటే, అదెందుకు
కృతిమ పద్దతిలో
చెయ్యలేము అని
వాళ్ళు ఒక
లెక్క వేశారు.
అందులోనూ, చెరిపేయటంలో
కూడా మనం
దేన్ని చెరిపేయాలి, దేన్ని
ఉంచుకోవాలి--అని
ఒక ఛాయస్
ఉంటే, ఎంత
బాగుంటుంది అనుకున్నారు.
దాన్ని ఇప్పుడు
అమలుపరుస్తూ వస్తున్నారు.
జగదీష్ను ఆ
విధంగానే నయం
చేయగలిగారు. కానీ, ఈ
చికిత్స చాలా
డేంజరస్. అన్ని
కేసులలోనూ ఇది
కరెక్టుగా జరగదు. అది
ఆ పేషెంట్
అదృష్టంపై ఆధారపడుంటుంది...అది...”
హెడ్ నర్స్
వేగంగా వాళ్ల
దగ్గరకు వచ్చింది.
“హాయ్
సార్...ఏం.ఆర్.ఐ.
స్కాన్, రిజల్ట్స్
వచ్చేసింది. మిమ్మల్నీ, పేషెంటునూ
డాక్టర్ రమ్మంటున్నారు”
హాయ్, రోహిణీ
ఇద్దరూ డాక్టర్
క్యాబిన్ లోకి
వెళ్ళారు.
డాక్టర్ ఏం
చెబుతారో నన్న
భయంతో రోహిణీ
హృదయం వేగంగా
కొట్టుకుంటోంది.
డాక్టర్ ముకుంద్
రాసిగల డాక్టర్.
కట్ అండ్
రైటుగా తిన్నగా
విషయం చెప్పేస్తాడు.
స్కానును, రోహిణీని
మార్చి మార్చి చూసాడు.
“నీకు
ఒక ప్రాబ్లమూ
లేదు. ఏ
తలకాయి లేని
డాక్టర్, వాడ్ని
డాక్టర్ అనకూడదు, ఏ
తలకాయి లేని
వాడు నువ్వు
చచ్చిపోతావని చెప్పాడు”
షాకయ్యింది రోహిణీ.
“సార్!
మౌలాలీలో ఒక
డాక్టర్…”
“వాడేవడో
డబ్బులు గుంజే
డూప్లికేట్ డాక్టర్.
నువ్వు కనీసం
ఇంకో యాబై
సంవత్సరాలు ప్రాణాలతో
ఉండి, నీ
అందంతో పలువురి
మగవాళ్ల ప్రాణాలు
తీస్తావే తప్ప, నీ
ప్రాణానికి ఏమీ
అవదు. బయలుదేరు”
రోహిణీ, హాయ్
ఒకర్నొకరు షాకుతో
చూసుకున్నారు.
***************************************************PART-20*******************************************
మౌలాలీలోని క్లీనిక్.
అతి అదునూతన రెండంతస్తుల
భవనం. ఎంట్రన్స్
లో పార్కింగ్
చేయటానికి కూడా
వీలులేనంతగా పేషెంట్ల
గుంపు. లోపల
వరాండాలో వరుసుగా
కలతతో కూడిన
మొహాలు.
‘ఎవరెవరికి
-- ఏం చెప్పుంచారో
ఈ డాక్టర్?’
ఒక ఇత్తడి
ప్లేట్ నేమ్
బోర్డు. ఒక
పెద్ద వరుసలో
వైద్య చికిత్స
ఫోటోలు.
రోహిణీ పిచ్చిదానిలాగా
లోపలకు దూర, వెనుకే
హాయ్ ఆవేశంగా
వచ్చాడు.
డాక్టర్ గదిలో
ఒక పేషెంట్
ఏడుస్తూ కూర్చోనున్నాడు.
అతని ఎదురుగా
డాక్టర్. చేతిలో
ఒక ‘ఎక్స్
రే’ పెట్టుకుని
మాట్లాడుతున్నారు.
“గడ్డలలో
రెండు రకాలు
ఉన్నాయి మిస్టర్.
రంగరాజన్. ఇది
అపాయకరమైనది. తలలో
అటూ, ఇటూ
తిరుగుతూనే ఉన్నది.
మెదడు నరాలు
‘టైం
బాంబు’ లాగా
ఎప్పుడైనా పేలుతాయి.
ముంబై వెళ్ళి
ఒక ‘టెస్ట్’ తీయండి.
అదే మంచిది.
ఒక మందు
రాసిస్తాను. ఆపరేషన్
కు నాలుగు
లక్షలు ఖర్చు
అవుతుంది...”
రోహిణీ, రామప్ప
వేగంగా గదిలోకి
వచ్చారు.
వచ్చిన వేగంతో
తన ‘హై
హీల్స్’ చెప్పులను
విడిచింది. ఒక
దాన్ని తీసుకుని
టపీటపీ మని
డాక్టర్ బట్టతల
మీద కొట్టటం
మొదలుపెట్టింది.
“ఏయ్...ఏయ్...ఏం
చేస్తున్నావు? నువ్వు...ఆ...ఆ...నర్స్...వార్డ్
బాయ్...సెక్యూరిటీ...”
అరుస్తూనే తన
టేబుల్ చుట్టూ
పరిగెత్తాడు డాక్టర్.
“దొంగ...నా...!
ఎంతమంది దగ్గర
డబ్బుకోసం అబద్దాలు
చెప్పావు. నా
జీవితమే పోయింది
కదరా...ఈ
నోరే కదా
అబద్దం చెప్పింది”
రోహిణీ, టపీటపీ మని
నకిలీ డాక్టర్
మొహం మీద
చెప్పుతో కొట్టింది.
పెదాలు చిట్లి
రక్తం
చిందింది.
నొప్పి తట్టుకోలేక
కేకలు వేసాడు
డాక్టర్.
“నేను
పోలీసులను పిలుస్తాను”
“రేయ్
కుక్కా...ఫ్రాడ్
వెధవా! నువ్వెంట్రా
పిలిచేది? నేనే
పోలీసులతో వచ్చాను...నువ్వు
నకిలీ డాక్టర్
అని కంప్లైంట్
ఇచ్చాను...పోలీస్!...పోలీస్!...”
రోహిణీ, అరవగా -- పోలీసులు
గదిలోకి వచ్చారు.
నకిలీ డాక్టర్ను
ఖైదు చేసారు.
***************************************************PART-21*******************************************
దిల్ షుక్ నగర్.
ఎనిమిదంతస్తుల
భవనంలోని మూడో
అంతస్తులో ఉన్న
‘అపార్ట్
మెంట్’ లో
ఉన్నది రోహిణీ
యొక్క అపార్ట్
మెంట్.
లోపల: రోహిణీ, ఆమె
ఎదురుగా హాయ్.
చెరో కుర్చీలో
కూర్చోనున్నారు.
హాయ్ ఆందోళనతో
అడిగాడు.
“ఏమ్మాయ్...నీ
భర్త...”
“ఇంకా
మీకు అర్ధం
కాలేదా సార్? శ్యామే
నా భర్త”
“వాట్?”
“అవును
సార్. శ్యామ్
నే నా
భర్త”
“ఇది
శ్యామ్ కట్టిన
మంగళసూత్రమా?”
“లేదు.
అతన్ని మనసులో
తలుచుకుని...నేనే
కట్టుకున్న తాలి”
“ఏంటమ్మా
ఈ ఆటలు?”
“ఇప్పుడు
మీకు ఆటలాగా
అనిపిస్తోంది. కానీ, చచ్చిపోతామనే
ఆలొచనతో నేను
తాలి కట్టుకోవటానికి
నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ
రోజు అది
నాకు చాలా
ఎమోషనల్ గా
ఉన్నది సార్”
“అర్ధమయ్యిందమ్మా”
“రెండు
సంవత్సరాలకు ముందు
నేనొక రోజు
స్ప్రుహ తప్పి
పడిపోయాను. ఇదిగో
ఈ నకిలీ
డాక్టర్ దగ్గరకు
వచ్చాను. ఆయన
నెత్తురు పరిశోధనలన్నీ
చేసి, తలను
ఒక ఎక్స్
రే తీసి, స్కాన్
చేసి మెదడులో
గడ్డ ఉన్నది.
ఎక్కువ రోజులు
బ్రతకవు అని
చెప్పారు. అంతే
అప్పుడే మనసారా
చచ్చిపోయాను”
రామప్ప టీ
తీసుకుని తాగారు.
“మీ
ఆఫీసుకు ఉద్యోగానికి
వచ్చినప్పుడే, ‘నా
జీవితం ఇక
కొన్ని రోజులే’ -- అలాగనే
నిర్ణయంతోనే వచ్చాను.
వచ్చిన చోట
శ్యామ్ ను చూసాను.
ఆయనకు మొదటి
చూపులోనే నేనెలా
నచ్చానో, అదేలాగానే
ఆయన్నీ నేను
మొదటి చూపులోనే
ఇష్టపడ్డాను”
“లక్కీ
ఇడియట్ అమ్మా
వాడు!”
“కానీ, నేను
ఇంకో కొద్ది
రోజుల్లో చచ్చిపోతాను
అనే ఆలొచన, నా
ఆశకు అనకట్టవేసింది.
అందువల్ల ‘నాకు
ప్రేమంటేనే ఇష్టంలేదు.
ప్రేమను ద్వేషిస్తున్నా’ అని
నాటకం ఆడవలసి
వచ్చింది. కానీ, శ్యామ్
కు దూరంగా
ఉండలేకపోయాను.
మనం స్నేహితులుగా
ఉందామని ఒప్పుకున్నాను.
అలాగైనా మనసుకు
నచ్చిన వాడితో
కొన్ని రోజులు
జీవిద్దాం అనే
చిన్న ఆశతో”
“నువ్వు
ఉద్యోగం వదిలేసిన
తరువాత, శ్యామ్
గదికి వెళ్లేవేమ్మా?”
“అవును
సార్. వెళ్ళాను.
శ్యామ్ నా
మీద పెట్టుకున్న
ప్రేమను ఆపలేకపోయాను.
నేను ఆపను, ఆపను
ఆ ప్రేమ
తీవ్రమవుతూ పెరిగింది.
శ్యామ్ ను ఒక
మోసపూరిత విధంగా
వదిలేయటానికి నాకు
మనసు రాలేదు.
పెళ్ళి చేసుకుని
చివరి వరకు
అతనితో జీవితం
పంచుకోలేకపోయినా, అతనికి
చివరిగా నావల్ల
ఇవ్వగలిగిన సంతోషాన్ని
ఇవ్వాలని నిర్ణయం
తీసుకున్నాను. అందులో
నా స్వార్ధం
కూడా ఉంది.
చనిపోవటానికి ముందు
నేనూ... ‘ఆ’ సంతోషాన్ని
అనుభవించటానికి
ఆశపడ్డాను. అందులో
తప్పేమీ లేదన్నట్టు
నాకు అనిపించింది.
అందువలనే శ్యామ్
రూముకు వెళ్ళాను”
“నాకు
అర్ధమవుతోంది. కానీ, మనం
అనుకున్నదంతా జరిగిపోతే
దైవానికి పనేలేకుండా
పోతుందేమ్మా?”
“ఇంకా
కొన్ని రోజుల్లో
చచ్చిపోతాను కదా
అనే శ్యామ్
జీవితంలో క్రాస్
చేయలేదు. అతన్ని
భర్తగా అనుకుని
నాకు నేనే
తాలికట్టుకున్నాను.
ఆ సంతోషం, చచ్చిపోయేదాకా
దొరికితే చాలు
అనుకున్నా. చావును
కలుసుకోబోతున్నానని
అనుకున్న దానిని, తిరిగి
శ్యామ్ ను కలుసుకుంటానని
ఎదురుచూడలేదు”
హాయ్ కాఫీగ్లాసు
టేబుల్ మీద
పెట్టారు.
“అదిమాత్రం
కాదుసార్...కంపెనీ
ఎం.డి.
గారి కూతురు
మాధవి,
శ్యామ్ పై విపరీతమైన
ప్రేమలో ఉన్నది.
శ్యామ్ కు వసతులతో
కూడిన జీవితం
దొరుకుతుంది. దాన్ని
చెడపడం తప్పు
కదా? స్వార్ధం
కాదా? అందువల్ల
దూరంగా జరిగాను”
“అతను
మాధవిని కాదు...నిన్నే
ప్రేమిస్తున్నాడు...నువ్వు
శ్యామ్ ను ప్రేమిస్తున్నావు
కదా?”
“అవును”
“అతన్ని
పెళ్ళి చేసుకోవాలని
ఆశపడుతున్నావు
కదా?”
“ఖచ్చితంగా
సార్”
“గుడ్!
ఇప్పుడే కరెక్టుగా
నిర్ణయం తీసుకున్నావు!
ఈ నీ
నిర్ణయాన్ని నువ్వే
నీ నోటితో
శ్యామ్ కు చెప్పు”
“ఇప్పుడు
ఎక్కడ ఉంటారు?”
“ఆఫీసులోనే”
హాయ్, సెల్
ఫోన్ తీసి
నెంబర్లు నొక్కారు.
రిసెప్షన్లో షీలా
తీసింది.
“షీలా...వెంటనే
శ్యామ్ కి కనేక్షన్
ఇవ్వు. అతనికి
ఒక తియ్యటి
షాక్ ఇవ్వాలి.
ఫోన్ చేసింది
నేనని చెప్పకు”
“సార్...ఇక్కడొక
పెద్ద సమస్య
అయిపోయింది”
“ఏమిటది?”
“శ్యామ్
సార్ ఉద్యోగానికి
రాజీనామా చేసారు.
అది మాధవి
మేడం తట్టుకోలేకపోయింది.
శ్యామ్ ను భయంకరంగా
తిట్టి 'నా
కంటి ముందు
నిలబడకు పో' అని
అరిచి పంపించేసింది”
“భగవంతుడా...ఎందుకు
తొందరపడ్డాడు? ఇప్పుడు
అతను ఎక్కడ?”
“డాక్టర్ను
చూడటానికి వెళ్ళారు
సార్”
“అతని
ఆరోగ్యానికి ఏమయ్యింది?”
“తెలియదు”
“ఏ
డాక్టర్?”
“డాక్టర్.
నాగార్జున్...”
“వాట్!
అదెలా నీకు
తెలుసు?”
“నేనే
సార్ ఫోన్
చేసి అపాయింట్
మెంట్ తీసిచ్చాను.
ఆయన చాలా
విరక్తిగా వెళ్తున్నట్టు
ఉన్నారు. ‘ఏమైంది
సార్?’ అని
అడిగాను. నేను
ఇక ఆఫీసుకు
రాను. మీ
అందరికీ గుడ్
బై" అని
చెప్పి వెళ్ళిపోయారు”
“ఎప్పుడు
వెళ్లాడు?”
“పొద్దున్నే
వెళ్ళిపోయారు సార్”
షాకైన హాయ్
ఫోను కట్
చేసి, రోహిణీను
చూసారు.
“ఏమిటి
సార్ అలా
చూస్తున్నారు?”
“రోహిణీ...నువ్వు
చెప్పింది ఏదీ
ఇక జరుగబోయేది
లేదమ్మా. నీ
ప్రేమ గెలువబోయేదీ
లేదు”
“సార్!
ఎందుకు అలా
చెబుతున్నారు?”
“శ్యామ్...ఆ
‘మెడికల్
రీసెర్చ్ సెంటర్’ లో
ట్రీట్మెంటులో
ఉన్నాడు”
“ఏం
ట్రీట్మెంట్”
“నీ
జ్ఞాపకాలను తన
మెదడులో నుండి
చెరిపేసుకోవటానికి
వెళ్ళాడు”
“సార్!”
“జగదీష్
కోసం మేము
చికిత్సకు వెళ్ళామే...ఆ
చికిత్సకు వెళ్ళాడు.
చికిత్స మొదలయ్యి
చాలాసేపు అయ్యుంటుంది
అనుకుంటా. ఇప్పుడు
ఆ చికిత్స ఏ
స్టేజీలో ఉన్నదో
తెలియదు. దాన్ని ఎలాగైనా
ఆపి...”
అప్పుడు తలుపు
తెరుచుకుని వేగంగా
బయటకు వచ్చింది
ఆమె. హాయ్
ఆమె వెనుకే
పరిగెత్త, మూడవ
అంతస్తులో పిచ్చిదానిలా
వేగంగా పరిగెత్తిన
ఆమె, ‘లిఫ్ట్’ బటన్‌ను
పిచ్చి పిచ్చిగా
నొక్కింది...’లిఫ్ట్’ వచ్చేంతవరకు
ఆగలేక, మేడమెట్ల
మీద నుండి
వేగంగా దిగి
పరిగెత్త, రెండవ
అంతస్తులో ఆమె
కుడి కాలు
చెప్పు, ఆ
మొసైక్ నేలమీద
సడన్ గా
జార...
“శ్యామ్...”
అరుస్తూ అలాగే
తలకిందలుగా మెట్ల
మీద పడిపోవటం
ప్రారంభమవ...
“రోహిణీ...”
హాయ్ షాకుతో బిగుసుకుపోయి
కేకలు వెయ్య...
అంతలో ‘డమాల్...డమాల్...డమాల్...’
నాలుగైద చోట్ల
ఆ మొసైక్
మెట్లమీద వేగంగా
కొట్టుకోవటంతో, రోహిణీ
తలకు దెబ్బ
తగిలి...నెత్తుటి
వరదలో అటూ
ఇటూ కదులుతూ
కిందకు వెళ్ళి
పడింది.
“రోహిణీ! అయ్యో...భగవంతుడా...”
కేకలు వేస్తూనే
హాయ్ పరుగునవెళ్ళి
ఆమెను ఎత్తుతున్నప్పుడు...తల
పగిలి నెత్తుటి
వరదలో స్ప్రుహ
కోల్పోయి పడున్నది
రోహిణీ.
***************************************************PART-22*******************************************
ప్రైవేట్ హాస్పిటల్.
రోహిణీకి తలపై
బలమైన గాయం.
ఎడం చేతి
మనికట్టు దగ్గర
ఒక ఫ్రాక్చర్.
మోకాలు దగ్గర
చిన్న దెబ్బ.
దైవాదీనంగా శరీరంలో
అక్కడక్కడా చిన్న
చిన్న గాయాలు.
ఆమె కళ్ళు
తెరవటానికి పదిహేను
రోజులు పట్టింది.
ఆరొగ్యం పూర్తిగా
కోలుకోవటానికి
మూడు నెలలు
పట్టింది. అంతవరకు
ఎమర్జన్సీ లోనే
ఉంచారు.
ఈ మధ్య
టైములో హాయ్, శ్యామ్
ను వెతికారు.
ఆ రోజు
నాగార్జున్ క్లీనిక్కుకు
వెళ్ళిన శ్యామ్, ఆ
తరువాత కనబడకుండా
పోయాడు. అతను
తన గదిని
ముందురోజే ఖాలీ
చేసాడు. అతని
ఆఫీసు టేబుల్
పైన ఖర్చు
లెక్కలు సరిగ్గా
రాసుంచి, మిగిలిన
డబ్బు టేబుల్ పైన
పెట్టబడి ఉంది.
హాయ్ టేబుల్
మీద అతని
రాజీనామా లెటర్, ఆయనకు
ఇవ్వ వలసిన
ఇరవై ఐదువేల
డబ్బుకు ఒక
చెక్కూ ఉన్నది.
అన్నీ ప్లాన్
వేసుకుని చేసి
ముగించి వెళ్ళాడు
శ్యామ్.
డాక్టర్ నాగార్జున్
ను కలిసారు
హాయ్.
శ్యామ్ జ్ఞాపకాలలో
నుండి రోహిణీ
విజయవంతంగా చెరిపివేయబడినట్టు
డాక్టర్ నాగార్జున్
నవ్వు మొహంతో
చెప్పారు.
ఆయన మొహాన్ని
లాగి ఒక
గుద్దు గుద్దుదామని
అనిపించింది. తన
బావమరిదిని గుణపరిచిన
కారణంగా, ఆ
కృతజ్ఞత కోసం
మాట్లాడకుండా వచ్చాసారు
హాయ్.
“రోహిణీ
జ్ఞాపకాలు శ్యామ్
యొక్క మెదడులో
నుండి పూర్తిగా
విజయవంతంగా తుడిచివేయబడ్డది.
దాంతో కనెక్ట్
అయున్న మరికొన్ని
జ్ఞాపకాలు కూడా
తుడిచివేయబడి ఉండొచ్చు.
అందువలనే శ్యామ్
మిమ్మల్ని కలుసుకోనుండడు.
ఒకవేల ఒక
చెయిన్ రియాక్షన్
వలన మిమ్మల్నీ, మీ
ఆఫీసు గురించిన
జ్ఞాపకాలను కూడా
పోగొట్టుకోనుండచ్చు.
అతను మళ్ళీ
వస్తేనే వీటి
గురించి తెలుస్తుంది” అని డాక్టర్
నాగార్జున్ చెప్పారు.
ఈ చికిత్సా
విధానం ఆటలు
మానవ కులానికి
ఎంత ప్రమాదకరమైందో
హాయ్ కి అర్ధమయ్యింది. ఏమీ
చెయ్యలేని మనిషిగా
బయటకు వచ్చాడు
హాయ్ రామప్ప.
హాయ్ రామప్ప జీవితంలోనూ
కొన్ని టర్నింగ్
పాయింట్ సంఘటనలు
జరిగినై. వాళ్ళ
గ్రీటింగ్ కార్డు
కంపెనీ బ్రాంచీ
ఒకటి ముంబైలో
తెరవబడి, అది
పూర్తిగా హాయ్
గారి బాధ్యతలో
అప్పగించబడింది.
మేనేజర్ గా
ఉన్న హాయ్
రామప్ప, ముంబై
బ్రాంచీకి ‘వర్కింగ్
పార్ట్నర్’ అయ్యాడు.
ముంబై బ్రాంచీ
ఓపనింగ్ వేడుక
మూడు నెలల
కాలం వరకు
ఆయన్ని ముంబై
నుండి కదలనివ్వలేదు.
ఉద్యోగ బాధ్యతతో
ముంబైలోనే కూరుకుపోయారు
హాయ్. ఆ
మూడు నెలలూ
రోజుకు రెండుసార్లు
హైదరాబాదులో రోహిణీ
ఉన్న హాస్పిటల్
కు ఫోను
చేస్తూ, రోహిణీ
ఆరొగ్య విషయాలు
తెలుసుకుంటూనే
ఉన్నారు. డాక్టర్
రోహిణీని పిలుచుకు
వెళ్ళొచ్చు అని
చెప్పిన వెంటనే
ఆయన హైదరాబాద్
కు బయలుదేరారు.
***************************************************PART-23*******************************************
మూడు నెలల
తరువాత హైదరాబాద్
వచ్చారు హాయ్.
పూర్తిగా గుణమైన
రోహిణీని చూడటానికి
సంతోషంగా ఆసుపత్రికి
వెళ్లారు.
హాస్పిటల్ తోటలో
కొంతమంది పిల్లలతో
ఆడుకుంటోంది ఆమె.
దూరం నుండే
చేతులు ఊపి
నవ్వారు హాయ్.
ఆమె కూడా
చేతులు ఊపి
నవ్వింది. కానీ, వెంటనే
ఆయన దగ్గరకు
రాలేదు. ఒక
పిల్లాడికి ఊయలను
ఊపుతున్నది.
ఒక ‘సిమెంట్
బెంచ్’ మీద
కూర్చుని ఆమెను
గమనిస్తూ ఉన్నారు
రామప్ప.
రోహిణీ పూర్తిగా
కోలుకోవటం ఆయనకు
సంతోషాన్ని ఇచ్చింది.
శ్యామ్ ఇప్పుడు
అక్కడ ఉండుంటే
ఎంత సంతోష
పడుంటాడు అని
అనిపించింది ఆయనకు.
'శ్యామ్
ఎక్కడున్నావురా
నువ్వు?' అని
మనసులో కేక
వేసారు.
రోహిణీకి ట్రీట్
మెంట్ చేసిన
డాక్టర్ రాజ్
కుమార్ వచ్చి
హాయ్ పక్కన
కూర్చున్నారు. “ఏమిటి
హాయ్ గారూ, మూడు
నెలలుగా మనిషే
కనబడలేదు?”
“సారీ
డాక్టర్...నవంబర్, డిసెంబర్, జనవరి
వచ్చిందంటేనే గ్రీటింగ్
కార్డు కంపెనీలకు
విపరీతమైన పని
ఉంటుంది. నేనే
'ఆల్
ఇండియా టూర్
వెళ్ళాను. వ్యాపారం
బాగా ఉండటం
వలన, ముంబైలో
ఒక బ్రాంచ్
ఓపెన్ చేయాలని
ఒక ప్లాన్.
అక్కడకు వెళ్ళి, చోటు
చూసి, అగ్రీమెంట్
వేసుకుని, దానికోసం
ఏర్పాట్లన్నీ పూర్తి
చేసుకుని వచ్చాను.
వచ్చే నెల, నేనూ
ముంబైకి వెళ్ళి
'సెటిల్
'అయ్యి
వ్యాపారాన్ని చూసుకోబోతాను.
నేను ఇప్పుడు
కంపెనీ పార్ట్నర్"
“మంచిది.
అప్పుడు రోహిణీ...” అన్నారు డాక్టర్.
“ఆమె
జీవితాన్ని ఇక
ఆమే డిసైడ్
చేయాలి. మీ
దగ్గర వదిలిపెట్టి
నందువలన, ఈ
మూడు నెలలూ
నేనూ రోహిణీ
గురించి పూర్తిగా
ఏ బాధా
లేకుండా ఉన్నాను.
ఇప్పుడు రోహిణీ
పూర్తిగా గుణమయ్యింది.
ఆమెకు ఎవరూ
లేరు. నేనే
చూసుకోవాలి. నాతో
పాటూ ముంబై
తీసుకు వెళ్తాను.
ఇప్పుడు ఆమె, చూడటానికి
ఇంతకు ముందు
కంటే అందంగానూ, నాజూకుగానూ, బ్రహ్మాండంగా
నయం అయ్యిందే...మీకే
థ్యాంక్స్ చెప్పాలి"
హాయ్ గారు నవ్వారు.
డాక్టర్ నవ్వలేదు.
రోహిణీ, పిల్లవాడిని
ఊయలలో నుండి
ఎత్తుకుని తన
నడుంపై ఉంచుకుని
హాయ్ గారిని దాటుకుని
వెళ్ళిపోతూ ఉన్నది.
రోహిణీని పిలవటానికి
హాయ్ చై
ఎత్తగా, డాక్టర్
అడ్డుపడ్డాడు.
“ఆమెను
పిలవకండి. ఆమెను
వెళ్ళనివ్వండి”
“ఏం
డాక్టర్...నేనిక్కడ
కూర్చోనున్నాను.
నా దగ్గర
ఒకమాట కూడా
మాట్లాడకుండా వెళ్ళిపోతోంది.
అక్కడ్నుంచి చెయ్యి
ఊపింది...ఇప్పుడు
హఠాత్తుగా నన్ను
చూడనట్టు వెళుతోంది.
మీకు ఫోను చేసినప్పుడు నేను ఆమెతో మాట్లాడనందు
వలన నామీద
కోపమా?”
“అది
కోపం కాదు
రామప్ప గారు”
“మరి...?”
“అమినీషియా”
“అంటే...”
“మేడ
మెట్ల మీద
నుండి పడి
తల మీద
బలంగా దెబ్బ
తగిలినందువలన, ఆమె
జ్ఞాపకాలు పూర్తిగా
చెరిగిపోయినై. ఆమె
ఇప్పుడొక అమినీషియా
పేషెంట్. ఆమెకు
మిమ్మల్ని మాత్రమే
కాదు...ఆమెనే
ఆమెకు పూర్తిగా
జ్ఞాపకం లేదు!"
"డాక్టర్..."
షాక్ తో
అరిచారు హాయ్.
"అవును... రోహిణీ తన
జీవితాన్ని మళ్ళీ
మొదలుపెట్టాలి.
ఇకమీదట మీరొక్కరే
ఆమె ఒకే
బంధువు"
డాక్టర్ చెప్పేది
పూర్తిగా నమ్మలేని
వాడిగా శిలలాగా
కూర్చున్నారు హాయ్.
***************************************************PART-24*******************************************
ఆరునెలల తరువాత...ముంబై.
జన సందడి
ఎక్కువగా ఉన్న
'చర్చ్
గేట్ స్టేషన్
'
ఎదురు రోడ్డులో
ఒక భవనంలోని
రెండవ అంతస్తులో
ఉన్నది, ఆ
గ్రీటింగ్ కార్డుల
కంపనీ. విపరీతంగా
డబ్బు ఖర్చుపెట్టి
లోపల అలంకారం
చేసున్నారు. ఏదో
స్వర్గంలోకి దూరుతున్నట్టు
ఒక భ్రమ.
హాయ్ చాలా
'బిజీ' గా
ఉన్నారు. గత
ఆరునెలలలో కొంతవరకు
హిందీ, మరాఠీ
నేర్చుకున్నారు.
తన అనుభవం
వలన విజిటర్స్
ను ఆకట్టుకున్నారు.
షాపు రోజు
రోజు విజిటర్స్
పెరుగుతున్నారు.
"ఏ
క్యా హై?"
-- ఒక అందమైన
అమ్మాయి టైట్
'టీషర్ట్'-- జీన్స్
తో హాయ్
దగ్గరకు వచ్చింది. పద్దెనిమిదేళ్ళ
వయసున్న పంజాబీ
దేవత, రాసి
రాయి ఉంగరాన్ని
చూపించి అడిగింది.
"ఏ...ఏ...జోడియాక్
ఉంగరం హై"
-- తనకు తెలిసిన
హిందీ భాషలో
మేనేజ్ చెయ్యటానికి
ట్రై చేసారు
హాయ్.
"మత్లబ్?"
అంతకంటే ఆయన
వల్ల మేనేజ్
చేయటం కుదరలేదు!
" రోహిణీ...ఇక్కడికి
రామ్మా..."
అంటూ ఆపద
సైరన్ స్వరం
వదిలారు.
'క్యాష్
కౌంటర్లో' కూర్చుని
కంప్యూటర్లో వచ్చిన
రిక్వస్ట్ 'ఈ-మైల్స్
'
ను చూసి
ఆనందపడింది రోహిణీ.
'ఉద్యోగానికి
మనుషులు కావాలి
'
అని వాళ్ళు
పేపర్లో ఇచ్చిన
ప్రకటనకు వందల
లెక్కలో దరఖాస్తులు
వచ్చినై.
"వస్తున్నా
సార్..."
"ఈ
అమ్మాయి ఏదో
అడుగుతోంది చూడమ్మా.
నా వల్ల
కావటంలేదు"
రోహిణీ ఆ
పంజాబీ అమ్మాయిని
తీసుకు వెళ్ళింది.
హాయ్ ఆమెను
చూసి పెద్ద
నిట్టూర్పు విడిచారు.
హాస్పిటల్లో రోహిణీకి
'అమినీషియా' అని
డాక్టర్ చెప్పినప్పుడు
ఆయన షాకయ్యారు.
రోహిణీకి పాత
జ్ఞాపకాలు ఏవీ
లేవు. హాయ్
ని కూడా
ఆమెకు జ్ఞాపకం
లేదు. ఆమెకు
డాక్టరే ఆయన్ని
పరిచయం చేయవలసి
వచ్చింది.
"మీ దూరపు
బంధువమ్మా" అని
ఒకే వాక్యంలో
ముగించారు.
రోహిణీని ఆ
పరిస్థితిలో ఉంచుకుని
ఏం చేయాలో
హాయ్ కి తెలియలేదు!
ఆయన యొక్క
ముంబై గ్రీటింగ్
కార్డు షాపును
ప్రారంభించాల్సి
ఉంది. ఆయనకు
తోడుగా ఎవరైనా
కావలసి ఉంది.
సరి అని
చెప్పి ఆయనతో
వెళ్ళింది.
ముంబై కొలాబాలో
మంచి వసతులతో
కూడిన ఇల్లు.
వెళ్ళి రావటానికి
కారు.
ఇద్దరికీ గాయాలు
ఆరటానికీ, కొత్త
గాలి పీల్చుకోవటానికి
కొత్త చోటు, అవకాశమూ
అవసరమయ్యింది.
ఇంతలో రోహిణీ
--తాను ఎవరు...ఎక్కడ
ఉన్నాం? అనే
మనో పీకుడు, దానికైన
వేటలో దిగిపోయింది.
ఆమెను సమాధానపరచటం
పెద్ద ప్రాబ్లం
గా ఉన్నది
హాయ్ కి.
వాళ్ళిద్దరి మధ్యా
ఏమిటి బంధుత్వం
అనేది ఇద్దరికీ
అర్ధం కాలేదు!
కానీ, గత
ఆరునెలలుగా ఒకటిగా
కలిసి ఉన్నందువలన, రోహిణీ
- హాయ్ ల
మధ్య ఒక
సన్నిహతం ఏర్పడింది.
హాయ్ మెల్లగా
తన వసం
పోగొట్టుకుని, హాయ్
వసం వెళ్తున్నట్టు
ఆయనకే అర్ధమయ్యింది.
ఇద్దరికీ మధ్య
పదిహేను సంవత్సరాల
వయసు తేడా.
అది తలుచుకుని
తన మనో
భావాలను అనుచుకోవటానికి
ప్రయత్నించారు.
చెవి వైపు
కొంత తెల్ల
జుట్టు, కొంచం
బ్లడ్ ప్రషర్.
వయసు నలభై
దాటుతోంది. ఈ
సమాచారాలు ఆయన
ఇంకొక పెళ్ళి
ఆశను ఆపినై.
కానీ, రోహిణీ
చూపంతా ఆయన
వైపే ఉన్నది.
ఎవరూ లేని
అనాధ అయిన
తనకి సపోర్టుగా
ఉంటున్నారు హాయ్
అనే ఆయన
అనేది రోహిణీకి
అర్ధమయ్యింది.
తన పాత
జ్ఞాపకాలనో, జీవితాన్నో
ఆమె ఎక్కువగా
తవ్వుకోవటానికి
ఇష్టపడలేదు. హాయ్
గారు కూడా
చెప్పలేదు. చెప్పి
ఆమె బుర్రను
పాడుచేసి ఇప్పుడు
ఆమె సంతోషంగా
ఉండటాన్ని నాశనం
చేయదలుచుకోలేదు.
భవిష్యత్తు గురించిన
కలలతో, జరుగుతున్న
కాలాన్ని జీవించాలని
ఆశపడింది. ఇప్పుడంతా
ఆమె చూపులు
పూర్తిగా హాయ్
వైపు తిరిగి
ఉన్నాయి.
“సరిగ్గా
షూ వేసుకోవాలి, రోజుకో
సాక్స్ మార్చుకోవాలి.
నెయ్యి తినకూడదు.
జాగింగ్ వెళ్ళాలి.
షర్టును లోపలకు
వేసుకోవాలి. నెరిసిన
జుట్టుకు డై
కొట్టుకోవాలి. మీసాలు
దట్టంగా ఉండాలి.
పొట్ట తగ్గించాలి”
రోహిణీ యొక్క
పూర్తి శ్రద్ధతో
హాయ్ గారు
కొత్తగా పాలీష్
చేయబడ్డ మొసైక్
నేలలాగా మెరిసిపోయారు.
రోజూ ఆఫీసుకు
వెళ్ళే ముందు, దగ్గరకు
వచ్చి 'టై' కడుతుంది.
‘రోహిణీనే
పెళ్ళి చేసుకుంటే
ఏం?’ అన్న
భావం ఆయనలో
తలెత్తింది.
అయినా కానీ, ఎందుకనో
చెప్పలేకపోయాడు.
దాని గురించిన
మంచి-చెడులు
ఆలొచించటం మొదలుపెట్టాడు.
ఆయన ఆలొచన
ఇదే ‘రోహిణీ
ఇప్పుడు షాపులో
బిజీగా ఉన్నది.
ఆమెకు మొదటగా
రెస్టు ఇవ్వాలి.
షాపులో పనిచేస్తున్న
అమ్మాయిలాగా కాకుండా, పూర్తి
ఇల్లాలుగా మారిస్తే, ఆమెకు
కుటుంబం గురించిన
ఆలొచనలు వస్తాయి.
ఆ సమయం
చూసి, తన
మనసులో ఉన్నది
చెప్పి...ఆమె
దగ్గర అనుమతి
తీసుకుని, పెళ్ళిచేసుకుని, ఆ
తరువాత సంతోషమే’
ఆ ఆలొచనవలనే
‘షాపులో
పనిచేయటానికి మనుషులు
కావాలి’ అన్న
ప్రకటన ఇచ్చారు.
ప్రస్తుతం ఆ
ప్రకటనకు వచ్చిన
దరఖాస్తులనే కంప్యూటర్లో
పరిశీలిస్తున్నారు.
ఈలోపు, ఒక
విధంగా పంజాబీ
అమ్మాయికి రాసి
ఫలం రాయి
పొదిగిన ఉంగరం
అమ్మి ఆమెను
పంపించింది రోహిణీ.
ఆరోజు చాలా
అందంగానూ, ఉత్సాహంగానూ
కనబడింది. ఆమె
మంచి మనో
పరిస్థితిలో ఉండటం
గ్రహించారు హాయ్.
పెళ్ళి గురించి
మాట్లాడటానికి
ఇదే మంచి
తరుణం అని
నిర్ణయించుకున్నారు.
అయినా కానీ, నోటి
మాటకు, హృదయానికి
మధ్య ఒక
అవస్త బంతి
దొర్లుతున్నది.
‘ఎలా
చెప్పటం?’ అని
కన్ ఫ్యూజ్
అయ్యారు.
“రోహిణీ...నీ
దగ్గర ఒక
ముఖ్యమైన విషయం...” -- తడబడ్డారు.
తరువాత మాట
మార్చారు. “నువ్వు
మొదట తిను.
తరువాత చెబుతాను”
“మంచి
విషయాన్ని చెప్పటానికి
సంధర్భం దొరికితే
జార విడుచుకోకూడదు.
మళ్ళీ దానికి
సమయం రాకుండానే
పోతుంది హాయ్”
ఆయన నవ్వారు.
“చాలా
సమయం ఉంది.
నా కథలో
విల్లనే లేడు.
నువ్వు తిను.
తరువాత చెబుతాను”
రోహిణీ భోజనం
చేయటం మొదలుపెట్టింది.
మెల్లగా తన
చొక్కా జేబులోంచి
లెటర్ తీసారు.
అది, తెల్లవారు
జామున రాసిన
లవ్ లెటర్.
రోహిణీ భోజనం
ముగించి చేతులు
కడుగ...బాగా
ధైర్యమయ్యారు.
ఆమెను పిలిచి
చెప్పటానికి నోరు
తెరిచారు.
ఇంతలో “ఎక్స్
క్యూజ్ మీ” అని ఇంకో
గొంతు వినబడింది.
హాయ్ తిరిగి
చూసారు.
షాకయ్యారు.
శ్యామ్ నిలబడున్నాడు.
అవును... శ్యామే!
"నువ్వు...నువ్వు...నువ్వు..."
తడబడ్డారు హాయ్.
"ఓ...మీరు
తెలుగా? ఎంత
ఆశ్చర్యం? మీ
పేరు సార్!"
"రా...
రా... రామప్ప!
హాయ్ రామప్ప
"
శ్యామ్ సంతోషంతో
ఆయన చేతులు
పట్టుకుని షేక్
హ్యాండ్ ఇచ్చాడు.
"
హాయ్ రామప్ప...నైస్
నేమ్. నా
పేరు శ్యామ్
కుమార్. మిమ్మల్ని
కలుసుకున్నందుకు
చాలా సంతోషం"
హాయ్ నోటమాట
రాక అతన్ని
చూస్తూ ఉండిపోయారు.
"నేను
ముంబైలో ఒక
అడ్వర్టైజ్ మెంట్
కంపెనీలో పనిచేస్తున్నాను.
ఇక్కడకొచ్చి ఆరునెలలే
అయ్యింది. మీ
ఆడ్ చూసాను"
శ్యామ్ ను పూర్తిగా
పై నుంచి
కిందవరకు ఒకసారి
చూసారు ఆయన.
ఇంతకముందు
కంటే మనిషి
తలతలమని మెరుస్తూ
హుందాగా ఉన్నాడు.
చూడటానికి హిందీ
సినిమా హీరో
లాగా ఉన్నాడు.
శ్యామ్ కు ఆయన్ని
ఖచ్చితంగా గుర్తు
లేదు అన్నట్టు
మాట్లాడుతున్నాడు.
“ఏమిటో
తెలియటం లేదు
సార్...ఈ
కంపెనీ పేరు
చాలా బాగా
తెలిసినట్లు -- ఎక్కడో
విన్నట్టు అనిపిస్తోంది.
అదెందుకో మనసులో
అలా అనిపిస్తోంది.
అందుకనే అలా
ఒకసారి వచ్చి
చూసి వెళ్దామని
వచ్చాను. నేను
చాలా ఆడ్
కంపనీలలోనూ, గ్రీటింగ్
కార్డ్ కంపనీలోనూ
పనిచేసాను. ఇది
నా ‘బయో
డాటా’. మీ
కంపెనీలో నాకు
ఉద్యోగం దొరికితే...”
“ఆల్రెడీ
నిన్ను సెలెక్ట్
చేశేశాను” అన్నారు హాయ్, ఆయనకు
తెలియకుండానే!
“వాట్?”
“నువ్వు
ఆ గుమ్మం
ద్వారా లోపలకు
వచ్చినప్పుడే ‘సెలెక్ట్’ అయిపోయావు
శ్యామ్ కుమార్
"
“ఎ...ఎ...ఎలా...”
“అది...అదొచ్చి...ఒక
తెలుగతనికి ఇంకొక
తెలుగువాడే సహాయం
చేయకపోతే ఎలా?” -- మేనేజ్
చేశారు.
“నేను
తెలుగువాడినని
మీకు ముందే
ఎలా తెలిసింది?”
“నీ
మొహం చూసిన
వెంటనే ఎందుకో
నాకు అలా
అనిపించింది”
“చాలా
థ్యాంక్స్”
రోహిణీ గదిలోంచి
అప్పుడు బయటకు
వచ్చింది.
ఇద్దరూ ఒకరినొకరు
చూసుకుని సంప్రదాయంగా
నవ్వుకున్నారు.
‘ఇది
ఎటువంటి జీవిత
పద్దతి?’ అని
ఆశ్చర్య పడ్డారు
హాయ్.
ఒకరి నొకరు
మనసారా ఇష్టపడ్డారు...ఇప్పుడు
ఇద్దరూ ఒకరినొకరు
గుర్తు పట్టలేకపోయారు!
రోహిణీకి...‘అమినీషియా’. అతని
గురించిన జ్ఞాపకాలే
ఆమకు లేవు.
ఇద్దరూ మళ్ళీ
కలుసుకుంటున్నారు...కొత్తగా.
ఇది విధి
ఆడే ఆటలో
ఏ రకం?
“ఎవరు
హాయ్ ఈయన?” -- రోహిణీ
మామూలుగా అడిగింది.
“ఈయన...ఈయన...ఈయన
పేరు శ్యామ్
కుమార్. ఈయనే
మన ఆడ్
డివిషన్ ఉద్యోగానికి
‘సెలెక్ట్’ అయిన
ఆయన”
“అలాగా? ఇంకా
‘ఇంటర్
వ్యూ’ లే
జరగలేదే?”
“అక్కర్లేదు...అతను
‘సెలెక్ట్’ అయిపోయాడు”
“ఓ...అయితే
ఇతను చాలా
అదృష్టవంతుడు”
“అవును
రోహిణీ. ఇతనికి
మనం ఉద్యోగం
ఇచ్చే తీరాలి.
వేరే దారే
లేదు"
“అలాగా....?”
“ఈమె
ఎవరు సార్?” అడిగాడు
శ్యామ్.
“పేరు
రోహిణీ. ఈ
కంపెనీ యొక్క
మెదడు,
పునాది రాయి.
ఈమె లేకుండా
ఇక్కడ ఒక
కార్డు కూడా
అమ్ముడవదు. నీకు
అన్నీ ఉద్యోగ
నైపుణ్యాలనూ ఈమే
నేర్పించబోతుంది.
ఓ.కే?”
“ఓ.కే.సార్”
శ్యామ్, రోహిణీ
స్నేహంగా నవ్వుకున్నారు.
"హాయ్...ఐ
యాం రోహిణీ..."
"హాయ్...నేను
శ్యామ్. నైస్
టు మీట్
యూ"
ఆమె చేతులో
ఉన్న కాగితాన్ని
శ్యామ్ చూసాడు.
"ఏం
రాస్తున్నారు?"
"ఒక
ప్రేమ కవిత్వం...గ్రీటింగ్
కార్డు కోసం.
చదివి చూస్తారా?"
అంటూ కాగితాన్ని
జాపింది రోహిణీ.
లేదు...లేదు.
నాకు ప్రేమ
అంటేనే 'అలర్జీ"
అన్నాడు శ్యామ్.
“అలాగా? నేను
ప్రేమను ప్రేమిస్తున్నాను” అన్నది రోహిణీ.
"సరేనయ్యా...మీరిద్దరూ
మాట్లాడుతూ ఉండండి.
నాకు చిన్న
పని ఉన్నది.
నేను వెళ్ళి
వచ్చేస్తాను"
మేనేజర్ హాయ్
రామప్ప అర్జెంటుగా
బయటకు వెళ్లారు.
బయటకు వెళ్ళి
నిలబడ్డారు. తన
చేతిలో ఉన్న
లెటర్ను చూసారు.
చిన్నగా నవ్వి, ఒకసారి
ఆకాశం వైపు
చూసి ఆ
లెటర్ను ముక్కలు
ముక్కలుగా చింపి
చెత్త కుండీలో
పడేశారు.
‘ఎలాంటి
ఒక మూర్ఖమైన
కార్యాన్ని చెయ్యబోయేను? ఆ
భగవంతుడు నా
కళ్ళు తెరిపించాడు’ అంటూ
అక్కడున్న తన
కారులోకి ఎక్కి
రిలాక్స్ అయ్యారు.
ఈ ప్రేమ
ఓటమి ఆయనకు
నొప్పి కలిగించలేదు.
ఈ ఓటమి
సంతోషాన్నీ, సుధీర్ఘ
ప్రశాంతతనూ ఇచ్చింది.
చెప్పాలంటే ఇది
ప్రేమే కాదు.
చెప్పకుండా పోయినందువలనే
ఇది ప్రేమ!
కొద్దిసేపటి క్రితం
రోహిణీ మాట్లాడింది, దానికి
ఆయన చెప్పిన
సమాధానం అప్పుడు
జ్ఞాపకం వచ్చింది.
‘మంచి
విషయాన్ని చెప్పటానికి
సంధర్భం దొరికితే
‘మిస్’ చేయనే
కూడదు. ఎందుకంటే
దానికొసం మరో
మంచి సంధర్భం
రాకుండానే పోతుంది
హాయ్’
‘చాలా
సంధర్భాలు వస్తాయి.
నా కథలో
విల్లన్ లేడు.
నువ్వు తిను.
నేను తరువాత
చెప్తాను’
‘నా
కథకు నేనే
విల్లన్’ అని
ఆలొచిస్తూ, వెనుక
వైపు నుండి
లోపలకు చూసారు.
రోహిణీ, శ్యామ్
ఇద్దరూ అంతలోనే
సన్నిహితం అయిపోయారు.
ఒకరికొకరు ఏదో
ఆశక్తిగా మాట్లాడుకుంటున్నారు.
ఉత్సాహంగా ఉన్నారు.
నిజమైన ప్రేమ...అదిగో
అక్కడ విజయం
సాధిస్తూ ఉన్నది.
ఇంతవరకు ఇది
ప్రేమ కథ
కాదు.
ఇకమీదటే ఒక
ప్రేమ కథ
మొదలవబోతోంది.
శ్యామ్ -- రోహిణీ
ప్రేమ!
హాయ్ రామప్ప
శ్వాశను గట్టిగా
లోపలకు పీల్చుకుని, చల్లటి
గాలిని ఊపిరితిత్తులలో
నింపుకుని, సముద్రతీరం
వైపు సంతోషంగా
నడవటం ప్రారంభించారు.
వాళ్ళూ, వాళ్ళ
ప్రేమ.
వాళ్ళకూ, వాళ్ళ
ప్రేమకు జై.
***************************************************సమాప్తం******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి