మిణుగురు పురుగులు…(పూర్తి నవల)

 

                                                                మిణుగురు పురుగులు                                                                                                                                     (పూర్తి నవల)

మా కథలు చాలా వరకు ప్రేమను మోసేవి. మెత్తని ఆలోచనలు కలిగినవి. అక్షరాలు కూడా ముట్టుకుంటే ఊడిపోయే రోజా పువ్వు లాంటివి. కథలోని ఒక్కొక్క పాత్ర ఇలాగే జీవించాలిఅని చెప్పిచ్చేవే. ఈ 'మిణుగురు పురుగులు ' లో కూడా కామేష్ కథాపాత్ర అలాంటిదే.

ఆడంబరం, అహంకారం, వైఖరి ఇవి ఏవీ, ఏ విధంగానూ సహాయపడవు అనేది ఎత్తి చూపటానికీ, మరియు ఎలా జీవించ కూడదు అని చూపించటానికీ మొట్టమోదటిసారిగా విభిన్న  కథాపాత్రలో మేము శృతికాను చిత్రీకరించాము!  

గర్వం, అహంకారం మనిషిని నాశనం చేస్తుందని తెలుపటానికే! అశ్వినీకుమార్, రమణ కథా పాత్రలు అలాంటివే!

అభిమానం లేని మనసు, ప్రేమ లేని హృదయం, ఒక కుటుంబాన్ని, యంగ్ జనరేషన్ను ఎలా చిందరవందర చేసి, చెడు అలవాట్ల జీవితానికి తీసుకు వెళ్తుంది అనేదే ఈ కథ. ప్రకాశవంతమైన సూర్యుడ్ని చూడకుండా రాత్రిపూట క్షణ సమయం ప్రకాశించి నాశనం  చేసే మిణుగురు పురుగులను నమ్మితే ఏమొస్తుందీనేది శృతికా ద్వారా తెలుసుకోవచ్చు.

మళ్ళీ చెబుతున్నా, ఇంకోసారి చెబుతున్నా. ప్రేమాభిమానాలే జీవితం. ప్రేమకొసమే జీవితం. మనమూ సంతోషంగా ఉండి, మిగిలిన వాళ్ళను సంతోషపరచటమే జీవితం. విడిచిపెట్టటంలోనే జీవితం ఇమిడియున్నది.

సత్యం. అంతా సత్యం. సత్యం తప్ప ఇంకేమీలేదు.

*****************************************************************************************************

“శృతీ...”

జవాబు రాలేదు!

ఏయ్ శృతీ...

దానికీ జవాబు లేదు.

ఇంతకీ శృతీ అనబడే శృతికా, హాలులో నేల మీద కూర్చుని, నడుం వంచి, కిందకు వంగుని రికార్డ్నోట్ పుస్తకంలో ఏదో గీస్తున్నది.

తల్లి పిలిచింది చెవిలో పడినా...కావాలనే మాట్లాడకుండా ఉన్నది! 'అమ్మ దేనికి పిలుస్తుంది...ఏదైనా పనికోసమే అయ్యుంటుందిఅనే నిర్లక్ష్యం ఆమె మౌనంలో కనబడ...కొంచం దూరంగా గోడకు ఆనుకుని కూర్చుని షీ వాండర్డ్ లోన్లీ యాస్ ఏ క్లౌడ్ కంఠస్తం పడుతున్న శివా విసుగ్గ ఆమెను తిరిగి చూసాడు.

ఏయ్ శృతికా...అమ్మ పిలుస్తోందే! వినబడలేదా?”

ఊహూ! అంటూ ఇంకా నిర్లక్ష్యంగా తలను ఎత్తిన శృతికా, “పిలిస్తే నువెళ్ళరా అన్నది.

అమ్మ నన్ను పిలవలేదు. నిన్నే పిలుస్తోంది

ఈ అమ్మకు వేరే పనేలేదు. కాలేజీకిబయలుదేరే వరకు దేనికో ఒక దానికి పిలుస్తూనే ఉంటుంది. నేను డయాగ్రాంగీయాలి. ఇప్పుడు నా వల్ల లేచి వెళ్లటం కుదరదు

అమ్మ పిలవటం కంటే డయాగ్రమేనీకు ముఖ్యమైపోయిందా?”

అంత అక్కర ఉన్నవాడివైతే నువ్వు లేచి వెళ్ళు. అమ్మ చారుకు చింతపండు పిండి ఇవ్వమంటుంది. పిండి ఇవ్వు. లేకపోతే ఏదైనా రుబ్బు రోలులో పచ్చడి రుబ్బి ఇవ్వమంటుంది. రుబ్బి ఇచ్చిరా

నే వెళ్ళి ఇవన్నీ చేసిస్తాను, నువ్వు హాయిగా మహారాణి లాగా వచ్చి కూర్చుని తిను

చాలా థ్యాంక్స్ రా! ప్రొద్దున నుండి ఇంకా కాఫీ కూడా తాగలేదు. చాలా బొమ్మలు గీయ వలసి ఉంది. అందుకనే కూర్చుండిపోయాను. ఇప్పుడు బాగా ఆకలేస్తోంది. అలాగే నా కంచం కూడా కడిగి పెట్టు. ఇదిగో స్నానం చేసి వచ్చేస్తాను

పొగరు, అహంకారం కలిసిన ఆ జవాబుతో శివా అనే శివరామ్ ముఖం ఎర్ర బడటంతో పెద్ద స్వరంతో అరిచాడు.

ఇప్పుడు లేచి వచ్చానంటే రికార్డుపుస్తకమంతా గాలిపటంలాగా ఎగురుతుంది...జాగ్రత్త!

అబ్బో...నీ చేతులు నా రికార్డు పుస్తకాన్ని గాలిపటంలా ఎగరేసేంత వరకు నా చేతులు ఖాలీగా ఉంటాయనుకుంటున్నావా?”

ఖాలీగా ఉంటుందో, బిజీగా ఉంటుందో తెలియదు. ఈ రోజు సాయంత్రం లోపు నీ రికార్డునోట్ పుస్తకం గాలిలో ఎగురుతుందనేది పక్కా నిజం!

నా రికార్డునోట్ పుస్తకాన్ని ముట్టుకో. ఆ తరువాత చెప్తాను

ఏం చేస్తావే?”

ఏదో చేస్తాను. ధైర్యం ఉంటే ముందు నా నోట్ పుస్తకం దగ్గరకు రారా చూద్దాం....

ఏమిటే అక్కడ గొడవ?” అని అడుగుతూ, చేస్తున్న పనిని వదిలిపెట్టి బాలమ్మ ఎమర్జన్సీ అర్జెంటులాగా హాలులోకి రాగా...గబుక్కున ఇద్దరూ నోరు మూసుకున్నారు. శివా మళ్ళీ వెన్ ఆల్ అట్ ఒన్స్ ఐ సా క్రౌడ్అని ప్రారంభించ...తిరిగి శృతికా వైపు చూసింది.

ఏమిటే అరుపులు ఇక్కడ?”

ఏమీ లేదమ్మా! శివా ఏదో డౌట్ అడిగాడు. జవాబు చెప్పాను. అవును...నువ్వెందుకు పిలిచావు?”

ప్రొద్దున్నే లేవటంతోనే ఒక నోటు పుస్తకం, పెన్సిలు పట్టుకుని ఇక్కడకొచ్చి కూర్చుంటావు. నాకు సహాయంగా ఒక్క పని కూడా చెయ్యటం లేదు. కనీసం టైముకు వచ్చి కాఫీ అయినా తాగేసి వెళ్ళ కూడదా?”

ఇదిగో పేర్లు మాత్రం రాసేసి వచ్చేస్తానమ్మా...

అందంగా ఏరో మార్క్ వేసి పేర్లు రాసి నోట్ పుస్తకాన్ని మూసి, గోడకున్న, తలుపు లేని అలమారులో పెట్టేసి జస్ట్ లైక్ దట్ శివరామ్ ను మరిచిపోయిన దానిలాగా వంటింట్లోకి దూరింది.

గచ్చు మీద చివరగానూ, ఒంటరిగానూ నిలబడున్న కాఫీ గ్లాసును చేతిలోకి తీసుకున్న వెంటనే, మొహం కాస్త చిట్లించింది.

కాఫీ ఎందుకమ్మా ఇంత నల్లగా ఉంది. మన కామేష్ మొహం లాగా?”

ఏమిటే...ఏమన్నావు?”-- బాలమ్మ తరుగుతున్న ఆకు కూరను ఆపేసి, తల ఎత్తి కూతుర్ను చూసింది. తల్లి చూపుల్లో చిన్నగా లేచిన వేడిని అర్ధం చేసుకుంది శృతికా.

ఏమీ లేదు...కాఫీ ఎందుకు ఇంత నల్లగా ఉందని అడిగాను!

దానికి ఏదో ఉదాహరణ వచ్చిందే? ఎవరి మొహం లాగానో ఉన్నదని చెప్పినట్లు వినిపించిందే?”

గబుక్కున భయం అనిగిపోయింది శృతికాకు. పాత చిట్లింపు తలెత్త...తల్లిని నేరుగా చూస్తూ చెప్పింది.

కామేష్ మొహంలాగా ఉన్నదని చెప్పాను. అదెందుకు నీలో ఇంత కోపం తెప్పిస్తోంది? నిజం కూడా చెప్పకూడదా?”

ఏం నిజం చెప్పటానికే నువ్విప్పుడు హరిశ్చంద్రుడి అవతారం ఎత్తేవు?”

నీ తమ్ముడి మొహం బొగ్గు రంగు...ముట్టుకుంటే అతుక్కునే నలుపు అనే నిజాన్నే!

ఏమే...ప్రొద్దున లేచిన దగ్గర నుండి ఎవరినైనా గొడవకు లాగటమే నీ గుణమా? నా తమ్ముడి కొడుక్కు బయట కనబడే తోలు మాత్రమే నలుపు. లోపలి మనసు పాల తెలుపు. కొందరు చూడటానికి ఎర్రగా బుర్రగా ఉంటారు. కానీ, వాళ్ళ మనసులో అమావాస్య చీకటి పేరుకు పోయుంటుంది

నువ్వు చెప్పే కొందరుఎవరనేది అర్ధమవుతోంది. ఏమ్మా...కన్న కూతురు కంటే నీకు తమ్ముడి కొడుకే ముఖ్యమైపోయాడు కదా?”

వాడు నాకు తమ్ముడి కొడుకు మాత్రమే అయ్యుంటే వాడికోసం ఇంతగా మాట్లాడను. మీ నాన్న హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినప్పుడు, ఎవరే మన సహాయానికి పరిగెత్తుకు వచ్చింది? ఆ డిపార్ట్ మెంట్ స్టోర్నుఅదేలాగా తెలివితేటలతో నిర్వాహం చేయటానికి ఎవరు ఒప్పుకున్నారు? కామేష్ మాత్రం లేకపోతే ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చుని తినలేము. నువ్వు కాలేజీ గుమ్మం ఎక్కుండవు. శివా అంత మంచి స్కూల్లో చేరే ఉండలేడు.

అవన్నీ ఆలోచించకుండా కృతజ్ఞత లేని దానిలాగా మాట్లాడకు! అంతే కాదు నువ్వు వాడ్ని ఇలా మాట్లాడితే అడిగేందుకు నేను తప్ప ఇంకెవరూ లేరు. జీవితంలో ఒక్క సుఖం కూడా అనుభవించని వ్యక్తే అతను!

ఎప్పుడు చూడూ తాగొచ్చి ఒళ్ళు హూనమయ్యేలాగా కొట్టే తండ్రి. ఆ హింసను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది తల్లి. ఆ అసహ్యాన్నంతా చూసేసి కూడా తల్లి అంత్యక్రియలు ముగించి తిన్నగా నాతో వచ్చాశాడే అతను-- ఈ రోజు వరకు ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. నాతోనే కాదు, ఎవరితోనూ.

నువ్వైనా నన్ను ఎదిరించి ఎన్నో సార్లు నోరు పారేసుకున్నావు. వాడు నీకంటే పదేళ్ళు పెద్ద. కానీ నా మాటకు, ఎదురు మాట రాదు. అలాంటి మంచి మనిషిని పట్టుకుని నోటికి వచ్చినట్టు పిచ్చిగా ఏదీ మాట్లాడకు!

నేను ఎవరినీ ఏమీ అనంటం లేదు! అదేలాగా ఎవరూ నా విషయంలో తల దూర్చక్కర్లేదు. అతను, ‘ఉన్నదే చెప్తాను, చెప్పిందే చేస్తాను, ఇంకేమీ తెలియదు అంటూ నీ దగ్గరకు వచ్చి పాడనీ. నువ్వు విను. ఎవరు ఎలా ఉంటే నాకేంటి? నేను స్నానం చేసి, కాలేజీకి వెళ్లే పని చూసుకుంటాను?”

"ఇదిగో చూడు శృతికా...మర్యాద లేకుండా కామేష్ ను అతను, ఇతను అని  మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది...జాగ్రత్త

అవును...అతను అని చెప్పకుండా నీ తమ్ముడు కొడుకును ఆయన అని  చెబితేనా దగ్గరకు వచ్చి ఇంకా జొల్లు కారుస్తాడు. ఏదో తాళి కట్టిన భార్యను పిలిచేలాగా ఊహించుకుంటాడు...పాపం

గట్టిగా చెప్పే ధైర్యం లేక, మెల్లగా సనుగుతూ దన్నెం మీద మడత పెట్టి వేసున్న లంగా, ఓణీని పొడవైన కర్రతో తోసి, తీసుకున్నప్పడు రోజూ పడుతున్న విసుగు ఆ రోజు కూడా శృతికాను ఆవహించింది!

కొంచంగా వెలిసిపోవటం మొదలుపెట్టిన పూవులు వేసిన లంగాను చూడటం ఆమెకు ఇష్టం లేకపోయింది.

మళ్ళీ మళ్ళీ లంగా, ఓణినే! చీర కట్టుకుంటాను అని అన్నాకూడా అమ్మ వద్దని చెబుతుంది. పద్దెనిమిదేళ్ళ వయసు...చీర కట్టుడులో ఇరవై రెండులాగా చూపించి తల్లిని బయపెడుతుంది.

ఇంకా కొన్ని రోజులు ఇదేలాగ చిన్నపిల్ల లాగానే ఉండుఅంటుంది. సరే...చీర వద్దు. మిగిలిన కాలేజీ స్నేహితులలాగా సాల్వార్ కమీజ్, చుడీధార్, మాక్సీ, మిడి అని ఏదైనా వేసుకోనిస్తుందా? ఒకే ఒక సాల్వార్ కమీజుకు ఆశపడి ఒక వారం అమ్మ దగ్గర బ్రతిమిలాడింది. ఏడ్చి కూడా చూసింది. ఏమీ కుదరలేదు. కామేష్ కూడా రెకమండేషన్ కు వచ్చాడు.

అయినా అతని దగ్గర కూడా బాలమ్మ గట్టిగా...ఖచ్చితమైన స్వరంతో వద్దని చెప్పేసింది.

ఇదిగో చూడు కామేష్...దానికి ఇష్టం వచ్చినట్టు మనం దానికి తలవొగ్గి వెళ్ళటం కుదరదు. తాను ఎర్రగా, బుర్రగా ఉందని...అందంగా ఉన్నామనే గర్వంతో ఏమీ లేనప్పుడే ఎవరినీ గౌరవించటం లేదు. ఆపై ఇవన్నీ అనుమతిస్తే మనల్ని దుమ్ము దులిపినట్లు దులిపేస్తుంది. నా దగ్గర ఉన్నంత వరకు లంగా, ఓణీతో ఉండనీ. ఆ తరువాత పెళ్ళి చేసుకున్న తరువాత దాని ఇష్టం వచ్చినట్లు ఆడనీ. నేను వద్దని చెప్తానా?”

అవును...పెళ్ళి చేసుకున్న తరువాతే సాల్వార్ వేసుకోవాలంటే ఆలోపు నాకు ఆ ఆశే పోతుంది

ఆ ఆశ కూడా పోకూడదు. సాల్వార్ వేసుకోవాలంటే నేనొక దారి చెప్తాను...వింటావా!

ఏమిటది?”

కామేష్ నీ ఇష్టాలన్నిటికీ సరే నంటున్నాడే? అందువల్ల అతన్ని పెళ్ళి చేసుకుంటానని నీ అంగీకారం తెలిపేసి, ఆ తరువాత సాల్వార్ వేసుకో...లేక గౌను వేసుకో

ఒక సాల్వార్ కోసం కామేష్ ని పెళ్ళి చేసుకోవటం కుదరదు అనే కారణం వలన ఆ ఆశను తాత్కాలికంగా వదిలిపెట్టింది.

కానీ, తన జీవితంలో రకరకాలుగా దుస్తులు వేసుకునే కాలం ఒకటి వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా నమ్మింది.

తనకున్న అందం అంతా మామూలు, సాధారణమైన జీవితంతో ముగిసిపోయేది కాదు. ఇప్పుడున్నట్లే ఒక వంట గది, హాలు, ఒక బెడ్ రూమే అని ఉండబోయేది లేదు.

ఆమె వెళ్ళే చోటు వసతులున్న చోటు. పొడవైన పోర్టికోలో రెండు, మూడు కార్లు నిలబడతాయి. ఇల్లు మొత్తం సెంట్రల్ కూలింగ్ సిస్టం వసతితో ఉంటుంది. నేల మీద కాలు పెట్టకుండా రత్న తివాచీలు వేసుంటాయి.

వంటవాడిని పిలవటానికి కూడా ఈమె లేచి వెళ్ళక్కర్లేదు. ఇంటర్ కామ్ లో చెబితే తెల్ల యూనీఫారం వేసుకున్న బట్లర్  వేడిగా గదికి కాఫీ తీసుకు వస్తాడు.

వీటన్నిటికీ మూలం ఈ ఐదడుగుల మూడు అంగులాలు ఎత్తు. మళయాళ మట్టి యొక్క మెరుపులు కలిసిన శరీర రంగు, చుర చురమని చూసే చూపు. చెక్కిన వంపు సొంపులు, మొండి తనాన్ని చూపించే గంభీరమైన ముఖం.

మామూలు అందం కాదు. చూసి చూసి చెక్కిన మిక్కిలి అపురూపమైన శిల్పం లాంటి అందం. తన మొత్త అందం ఒక మధ్య తరగతి కుటుంబంలో ప్రారంభమయ్యింది...తిరిగి మధ్య తరగతి కుటుంబంలోనే కంటిన్యూ అయి దాంట్లోనే ముగిసిపోవటంలో ఆమెకు కొంచం కూడా ఇష్టం లేదు.

తన స్నేహితులను స్టార్ హోటల్ కు తీసుకు వెళ్ళే కాలం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. తన అందానికి ఆశపడి, డబ్బూ, అన్ని లక్షణాలూ ఉన్న యువకుడు ఎక్కడ్నుంచో పృద్వీరాజులాగా గుర్రం మీద వచ్చి ఈ సంయుక్తను ఎత్తుకుని...

ఏయ్...ఇంకానా స్నానం చేస్తున్నావు? త్వరగా బయటకు రావే. శివాకి స్కూలు టైము అవుతోంది చూడు. నువ్వు స్నానాల గదిలోకి వెళ్తేనే గంటసేపు అవుతోంది

ఇదిగో వచ్చాశాను... తన పగటి కలలలో నుండి బయటకు వచ్చి ఒళ్ళు తుడుచుకుని, తొందర తొందరగా దుస్తులు మార్చుకుని బయటకు వచ్చింది. తరువాత నిదానాంగా అద్దం ఎదురుగా నిలబడి అరగంటకు పైనే అలంకరించు కోవటానికి టైము గడిపింది.

ఆ తరువాత, “అమ్మా...టైమైపోయిందమ్మా. త్వరగా భోజనం పెట్టు నాజూకుగా నోరు తుడుచుకుని రెండు, మూడు పుస్తకాలనూ, ప్రొద్దున గీసిన రికార్డు నోట్  పుస్తకాన్నీ ఒక దానిపై ఒకటి పెట్టుకుని గుండెలకు హత్తుకుని, ఎడంచేత్తో అదిమి పట్టుకుని,

అమ్మా...వెళ్ళొస్తాను

గుమ్మం దిగి, వీధి దాటి, మైన్ రోడ్డుకు వచ్చిన తరువాత,

అంతవరకు ఆమె కోసమే రోడ్డు చివరలో తెల్ల కారులో కాచుకోనున్న అతను చెప్పాడు.

నేను చెప్పింది ఈ అమ్మాయినేరా అశ్విన్...

అశ్విన్ అనే అశ్వినీకుమార్ ఆ విదేశీయ కారు యొక్క రివర్స్ అద్దంలోచూస్తూ చెప్పాడు.

చాలా బాగుంది. ఫాలో అవు. కొంచం దగ్గరకు వెళ్ళి చూద్దాం!

కారు చప్పుడు లేకుండా బయలుదేరి మెల్లగా శృతికాను ఫాలో చేసింది.

************************************************PART-2*********************************************

సందడి లేని ఒంటరి చోట నగరానికి కొంచం చివరగా ఉన్నది ఆ కాన్వెంట్. నగరంలోని డబ్బుగల వారి పిల్లలకనే కట్టబడిన స్కూలు. డబ్బు అంటే సాధారణ డబ్బు కాదు!

హాయ్...టుడే ఆల్సో యువార్ కమింగ్ ఇంద సేమ్ కార్?” అంటూ అడిగే వర్గాల కోసం స్థాపించబడింది. ఎల్.కే.జీ క్లాసు లోపల కూర్చునేటప్పుడే రక్తానికి బదులు శరీరంలో పొగరు, సొగసు, సుఖాలూ పారే వర్గం. మొదటి రోజు టయోటా కారు  అయితే, మరుసటి రోజు మెర్సిడీస్ బెంజ్కారులో వచ్చే వర్గం. ఫియట్, అంబాసడర్ లలో వచ్చే వాళ్ళను హేళనగా చూసే జాతి. ఒక్కొక్క సెలవులకూ అమెరికా, లండన్ తీసుకు వెళ్లబడే...మలేషియా, సింగపూర్ లను తమ ఇంటి తోట ఎంట్రన్స్ లాగా అనుకునే అతిపెద్ద వ్యక్తుల పిల్లలు, మనవళ్ళూ చదివే స్కూలు.

రోజూ స్కూలు అయిపోయి, పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళిపోయి స్కూలు కాంపౌండ్ సందడి లేకుండా ఉండగా, ఎనిమిదేళ్ళ అశ్విన్ మాత్రం ఒంటరిగా జారుడు చెక్క ఎక్కుతూ, జారుడు ఆట ఆడుకుంటున్నాడు. వాడికి స్కూలు అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళే అలవాటు లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరూ ఉండరు. అందుకని స్కూలు లోనే చాలాసేపు ఒంటరిగా ఆడుకుని టయర్డ్ అయిన తరువాత ఇంటికి వెళ్లటం వాడికి అలవాటు. ఆ రోజు కూడా అలాగే ఒంటరిగా ఆడుకుంటున్నాడు. కొంచం దూరంలో చెట్టు కింద వాడి అల్యూమిన్యం పుస్తకాల పెట్టె, విదేశీయ వాటర్ బాటిల్ వాడిలాగానే ఒంటరిగా పడున్నాయి. 

తోడు లేనందున అశ్వినీకుమార్ బాధపడలేదు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా అతనికి తోడుగా ఆడటానికి వస్తే చిరాకు పడతాడు. బహుశ దీనికి కారణం అతను పుట్టిన దగ్గర నుండి అతనికి తోడుగా ఎవరూ లేరు. ఒంటరితనం, పనివాళ్ళ సహాయం మాత్రమే తోడు ఉండేవి. అతను ఒంటరి తనానికి అలవాటు పడిపోయాడు.

ఏడోసారిగా మెట్లు ఎక్కి జారి, కింద ఉన్న ఇసుకలోకి వచ్చినప్పుడు...అంతవరకు ఓర్పుగా కాచుకోనున్న రుద్రయ్య అంతకు మించి ఓర్చుకోలేక అతని లేత చేతులను ఎర్ర బడేంతగా లాగి పట్టుకున్నాడు.

రా అశ్విన్...ఇంటికి వెళ్దాం అని కోపంగా చూడా, అశ్విన్ అతని కోపాన్ని కొంచం కూడా లక్ష్యం చేయకుండా చెప్పాడు.

ఊహూ...నేను రాను పో

అమ్మ అవుట్ డోర్ నుండి ఈపాటికి తిరిగి వచ్చుంటారు అశ్విన్. నువ్వు ఇంట్లో లేకపోతే కేకలేస్తారు

అశ్విన్ కళ్ళల్లో పెద్ద మెరుపు కనబడింది. నిజంగానే చెబుతున్నావా? అమ్మ వచ్చుంటుందా?”

వచ్చుంటుంది అశ్విన్

అశ్వినీకుమార్ పది రోజుల తరువాత అమ్మను చూడబోతున్నాను అనే ఆశతో, సంతోషపడుతూ, గంతులు వేస్తూ కారువైపుకు పరిగెత్తాడు. వెళ్తున్నప్పుడే ఆ స్కూలు బాక్సునూ, వాటర్ బాటిల్ ను తీసుకురా రుద్రయ్యాఅంటూ అరిచాడు.

పది రోజులకు ముందు...హాంకాంగులో అవుట్ డోర్ షూటింగ్అంటూ అమ్మ బయలుదేరి వెళ్ళింది జ్ఞాపకానికి వచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా వాడితో మాట్లాడటానికి అమ్మకు సమయం లేదు. చివరి నిమిషం వరకు ఏదో ఒక ముగింపుకు వస్తున్న సినిమాలో యాక్టింగ్ చేసి, ఇంటికి ఫోన్ చేసి మేనేజర్ ను పిలిచి తన సూట్ కేసుతో తిన్నగా విమానాశ్రయం వచ్చేయమని చెప్పింది. మరిచిపోకుండా ఆయాతో పాటూ కొడుకును తీసుకు రమ్మని చెప్పినందు వలన వాడి వల్ల వెళ్ళటం కుదిరింది.

అక్కడ కూడా అమ్మవల్ల కొడుకుతో మామూలుగా మాట్లాడటం  కుదరలేదు. ఆటోగ్రాఫ్ అడుగుతున్న వాళ్ళనూ, నేను మీ ఫ్యాన్ అండీ అనే వాళ్ళను నవ్వుతూ, నమస్కరిస్తూ పంపించి, చివరిగా కొడుకు దగ్గరకు వచ్చి బుగ్గల మీద ఒక ముద్దు.

ఆయా, అశ్విన్ ను జాగ్రత్తగా చూసుకో... సినిమాలో చెయ్యి ఊపుతున్నట్టే, అందంగా చెయ్యి ఊపుతూ లోపలకు వెళ్ళిపోయింది.

అమ్మ ఇప్పుడు తిరిగి వచ్చింది. వాడి కోసం హాంగ్ కాంగ్ నుండి చాలా బొమ్మలు తీసుకువచ్చింటుంది. రమణ దగ్గర ఉన్నట్టు రిమోట్ కంట్రోల్ కారు అడిగుంచాడు. నోటి నుండి రబ్బర్ తీసేస్తే ఏడ్చే బొమ్మ, చిన్న చిన్న బండ్లు, అమ్మ అన్నీ కొనుకొచ్చి ఉంటుంది.

త్వరగా వెళ్ళు రుద్రయ్యా

పదో నిమిషంలో కారు జూబ్లీ హిల్స్  లోని ఆ బ్రహ్మాండమైన బంగళాలోకి వెళ్ళి...పోర్టికో లో ఉన్న తల్లి యొక్క తెల్ల కారు నిలబడుండటం చూసి అశ్విన్ తాను వచ్చిన కారు ఆగేంతవరకు ఉండలేక తొందరపడి కిందకు దిగి మేడపైకి పరిగెత్తాడు.

అమ్మా...

భానూరేఖా యొక్క గది తలుపుపైన కొట్ట...కింద నుండి పరిగెత్తుకుని వచ్చిన ఆయా బెదిరిపోయి అశ్విన్ చేతులు పుచ్చుకుని చెప్పింది.

అమ్మ నిద్రపోతోంది అశ్విన్. ఇప్పుడే కదా వచ్చింది! అందువల్ల బాగా టయర్డుగా ఉన్నారు. నువ్వు అల్లరి పెట్టకూడదు. స్నానం చేసేసి, డ్రస్సు మార్చుకుని, బుద్దిగా తినేసి, పాలు తాగేసి పైకి రావాలి. అప్పుడే మీ అమ్మ నిన్ను చూడటానికి రెడీగా ఉంటుంది

లేదు ఆయా. నాకు ఇప్పుడే అమ్మను చూడాలని ఉంది. చూసి, ఒక ముద్దు పెట్టేసి, నాకోసం తెచ్చిన బొమ్మలన్నిటినీ తీసుకు వచ్చారా అని అడిగేసి వెళ్ళిపోతాను

చెబితే వినాలి అశ్విన్. మంచి కుర్రాడివి కదా

అశ్విన్ మొండికేసాడు. లేదు...పో. నేను బొమ్మలను చూసేసే వస్తాను.  మమ్మీ...మమ్మీ...

మళ్ళీ మూర్ఖంగా తలుపు కొడుతున్న శబ్ధం వినబడ, గబుక్కున తెరుచుకోగా....సన్నటి నైట్ గౌనుతో నిలబడుంది భానూరేఖా. లోపల మంచం మీద కూర్చోనున్న ఆ ఎవరో ఒకరు, సిగిరెట్టు కాలుస్తూ నుదురు చిట్లించి అశ్విన్ ను చూడ,

వాడు దాన్ని పట్టించుకోక అమ్మను మోకాళ్ల దగ్గర కావలించుకున్నాడు. భానూరేఖా ముఖ భావాలు సరిలేకపోవటం గమనించి తడబడుతూ నిలబడ, ఆమె ఆయాను చూసి కేకలేసింది.

నీకు ఎన్ని సార్లు చెప్పేది...అశ్విన్ ను పైకి పంపొద్దని? ఇదేనా నువ్వు వాడిని చూసుకుంటున్న లక్షణం?”

లేదు మేడం...అదొచ్చి....

నోరు ముయ్యి. అశ్విన్...నువ్వు కిందకు వెళ్ళి స్నానం చేసి తింటూ ఉండు.  నేను తరువాత వస్తాను

లేదు మమ్మీ...బొమ్మ...

బొమ్మలన్నీ తరువాత! మొదట కిందకు వెళ్ళు. ఊ...

తలుపు మళ్ళీ మూసుకోగా...ఆ రోజు అశ్విన్ మనసులో మొదటి దెబ్బ తగిలింది. అమ్మ ఎందుకు నన్ను మాత్రం కిందకు వెళ్లమని తరుముతోంది? లోపలున్న మావయ్యను ఎందుకు తరమటం లేదు? ఎవరతను?’

ఇలాంటి మనుషులతో అమ్మ అప్పుడప్పుడు రావటం, మేడ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోవటం, ఆయా వెంటనే నన్ను తోటలోకి తీసుకు వెళ్ళి ఆడుకోమనడం.

ఆయా...వాళ్ళంతా ఎవరు?”

తెలియదబ్బాయ్!

నన్నెందుకు రూములోకి రావద్దని అమ్మ చెబుతోంది?”

తెలియదబ్బాయ్!

ఆవిడకు నేనంటే ఇష్టం లేదు కదా ఆయా? అందుకనే నాతో మాట్లాడకుండా, ఆ మనిషి దగ్గర మాట్లాడుతోంది కదు ఆయా?”

తెలియదబ్బాయ్...!-- కళ్ళ చివర్లో బొట్టు బొట్టుగా కారుతున్న కన్నీటిని చీర కొంగుతో తుడుచుకుంది.

ఆ రోజు తరువాత ఆ ఆయాను అతను చూడలేదు. ఆమెకు బదులుగా చిన్న వయసు అమ్మాయి వాడ్ని చూసుకుంటోంది.

నన్ను ఆయా అని పిలవకు! పుష్పా అని పిలు అన్నది. నలుపుగా ఉన్నా కళగా ఉంది. అయినా కానీ ఆయా యొక్క ప్రేమ ముందు పుష్పా ఓడిపోయింది.

ఆయా ఎక్కడ పుష్పా?”

పని మానేసింది

ఎందుకని?”

నిన్ను చూస్తే ఆమెకు పాపంగా ఉందట

పాపం అంటే ఏమిటి పుష్పా?”

పాపం అంటే...పాపం అంటే...చేసేటప్పుడు సంతోషంగా తెలుస్తుంది. చేసిన తరువాత మనసును కష్ట పెడుతుంది

ఆలాగంటే?”

తరువాత నువ్వు చేసేటప్పుడు, నువ్వే తెలుసుకుంటావు! ఇప్పుడు మాట్లాడకుండా పడుకో

ఆయా వెళ్ళిపోవటం అశ్విన్ మనసుకు రెండో దెబ్బ అయ్యింది. తరువాతి దెబ్బ పదమూడో వయసులో పడింది.

ఏయ్... అశ్విన్ అమ్మ నటించిన సినిమా నిన్న చూసానురా...ఛీఛీ...సరిగ్గా డ్రస్సు వేసుకోకుండా స్నానం చేసిందిరా?”     

నేను చూసిన సినిమాలో ఇంకా అసహ్యంగా ఎవరో ఒకర్ని గట్టిగా కౌగలించుకుందిరా

ఏరా... అశ్విన్ కు నాన్నా లేరా?”

మనకు ఒక నాన్న అయితే...వాడికి చాలా మంది నాన్నలురా!

నీకెలా తెలుసు?”

మా అమ్మ చెప్పింది...

ఆ మాటలు విన్న అశ్విన్ ఆ రోజంతా భోజనం చేయలేదు. ఎవరికీ తెలియకుండా కళ్ళను అప్పుడప్పుడు తుడుచుకుంటున్నాడు. చివరి క్లాసు అయిపోయిన తరువాత రమణ దగ్గర కూడా చెప్పకుండా వచ్చాశాడు.

ఆ తరువాతే అతను బాగా చెడిపోయాడు. ప్రేమ, చూసుకునే వాళ్ళు లేకపోవటం, చాలా డబ్బుగల పిల్లల లాగా అయిపోయాడు.

వాడిని ఇంకా చెడిపేందుకు అతని పనులు చేయటానికి రాణీని పనిలో అమర్చారు. పుష్పా పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన తరువాత ఈమె వచ్చి చేరింది. పుష్పా లాగా లేకుండా ఈమె వ్యత్యాసంగా ఉంది. అతీతంగా దుస్తులు ధరించింది. కావాలనే ఓణీని పక్కకు తొలగించుకుంటుంది.

ఆమెను దగ్గరగా చూసినప్పుడంతా అశ్విన్ కి ఎదో జరుగుతుంది. ఏమిటనే తెలియని ఎమోషన్ వస్తుంది.

అతని యొక్క పద్నాల్గవ పుట్టిన రోజుకు వచ్చిన రమణ, మరుసటి రోజు స్కూల్లో వాడితో రహస్యంగా అడిగాడు. మీ ఇంట్లో నిన్న ఒక అమ్మాయి ఉన్నదే...ఆమె ఎవర్రా?”

రాణీ...నన్ను చూసుకుంటుంది

ఆమెను చూస్తే అలాగే గట్టిగా కౌగలించుకుందామా అని అనిపిస్తోందిరా!

తనలో ఏర్పడే ఎమోషన్ కూడా అదేనేమో అన్న అనుమానం రాగా, ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే రాణీని వెతికేడు అశ్విన్. హాలు, వంట గది,  ఇంటి వెనుక, పనివాళ్లకు కేటాయించిన క్వార్టర్స్, తన గది...చివరగా వెతుక్కుంటూ తల్లి రూము గది తలుపులును మెల్లగా తోసాడు.

అమ్మ మంచంపైన రాణీనూ, తోటమాలి బాబీ ! వీడు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ...రాణీని వదిలి తొలగి బాబీ లేచినప్పుడు అశ్విన్ శబ్ధం చేయకుండా తలుపు మూసి కిందకు దిగి వచ్చాశాడు. తాను చూసింది ఎవరితోనైనా చెప్పి పంచుకోవాలని తపించాడు.

చివరగా ఆ రోజు రాత్రి భోజనానికి పిలవటానికి తన గదిలోకి వచ్చిన రాణీ దగ్గరే మెల్లగా అడిగాడు.

ఈ రోజు సాయంత్రం అమ్మ గదిలో నువ్వూ, బాబీ ఏం చేస్తున్నారు?”

ఆమె ఒక నిమిషం షాకై నిలబడి అతన్ని చూసింది. అప్పుడు నువ్వు పైకి వచ్చావా?”

అశ్విన్ తల ఊపాడు.

మమ్మల్ని చూసావా?”

దానికీ తల ఊపాడు.

ఎవరి దగ్గరైనా చెప్పావా?”

లేదనే విధంగా తల ఊప, రాణీ అతని దగ్గరకు మరింత జరిగి, బాగా క్లోజుగా వచ్చి గబుక్కున అతని మొహాన్ని తన గుండెలకు చేర్చి గట్టిగా అదుముకుంటూ వ్యత్యాసమైన స్వరంతో చెప్పింది.

ఇక మీదట ఇవన్నీ చూస్తే ఎవరి దగ్గరా చెప్పకూడదు...ఏం?”

హాయిగానూ, మెత్తగానూ ఉన్న ఆ స్పర్శలో ముఖాన్ని ఇంకా అదుముకుంటూ రమణ జ్ఞాపకం రాగా...సన్నటి స్వరంతో అడిగాడు.

ఎందుకు చెప్ప కూడదు?”

రాణీ వాడి తలను ముద్దుగా కెలుకుతూ మాట్లాడింది.

ఎవరి దగ్గరా చెప్పనని వాగ్ధానం చేస్తే చెప్తాను

నిజంగానా?”

ప్రామిస్

అలా అయితే ఎవరి దగ్గర చప్పనే చెప్పను రాణీ!

************************************************PART-3*********************************************

మొదట భయం భయంగానే ఆమెను ముట్టుకున్నాడు అశ్వినీకుమార్. గుండె ధడ ఎక్కువై, శరీరమంతా చమటలు పట్టినై. మాటలు నలిగి నలిగి బయటకు వచ్చింది.

...నాకు భయం...గా...ఉంది రా...ణీ...

ఏమిటి భయం?” -- బుజ్జగింపుగా అడిగింది ఆమె.

ఏమిటో భయంగా ఉంది

రాణీ నవ్వుతూ హేళనగా చూసింది. తరువాత కృరంగా చెప్పింది.

ఆ అమ్మకు పుట్టిన కొడుకువా నువ్వు? ఇలా భయపడి చస్తున్నావు! మీ అమ్మ దేనికైనా భయపడుతోందా చూడు. ఇంట్లో నువ్వు ఉండంగానే ఎంతమందిని  తీసుకు వస్తోందో చూడు?”

అతని శరీరంలో కొత్తగా నెత్తురు పారింది. మృగంలా వెర్రి ఎక్కింది. కళ్ళు ఎరుపెక్కి తలతల మెరవటం మొదలయ్యింది. రాణీ యొక్క విషం కక్కే నవ్వు, చూపులో తొంగి చూసే హేళన, బయటకు వచ్చిన కృరమైన మాటలూ...మీ అమ్మ దేనికైనా భయపడుతోందా చూడు...ఇంట్లో నువ్వు ఉండంగానే ఎంతమందిని పిలుచుకు వస్తోందో...?’

ఆ మాటలు పెద్ద శబ్ధంతో తిరిగి తిరిగి ప్రతిధ్వనిలా వినబడ,

మనసులో ఇతను నిర్ణయించుకున్నాడు. అదేలాగా నేనూ అంతమందిని ఇంటికి పిలుచుకు వస్తాను. బెడ్ రూములో కూర్చోబెడతాను. బయట నుండి తలుపు కొట్టే అమ్మకు...తలుపులు తెరిచి విసుగూ, విరక్తితో చెబుతాను ఏ అయా...అమ్మను నా రూముకు పంపించవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇదేనా నువ్వు చూసుకునే లక్షణమ...?’

లేదు తమ్ముడూ...అదొచ్చి...

నోరు ముయ్యి. మొదట నువ్వు కిందకు దిగి వెళ్లమ్మా

మాట్లాడకు! మొదట కిందకు వెళ్ళు...ఉష్

తలుపును అమ్మ ముందు చెంప మీద కొట్టినట్టు, తన హృదయంలో పడ్డ దెబ్బలు, ఆమె హృదయంలోనూ పడ,

ఊహూ...చాలదు! ఆమెను ఇంకా బలంగా కొట్టాలి, ఆమె నాకు చేసినదానికి గట్టిగా దెబ్బ కొట్టాలి. ఉత్త దెబ్బలు మాత్రం చాలదు. కొరడాతో కొట్టి, ఇనుప కడ్డీ విరక్కొట్టి...ఇంకా...ఇంకా…’

చాలు అశ్విన్...అయ్యో...చాలు...

రాణీ అతని దూకుడు వేగాన్ని ఎదురు చూడలేదు. భయపడిపోయి లేచి అడిగింది.

నీకు హఠాత్తుగా ఏం అయింది అశ్విన్? నీకు నేను ఎమీ తెలియదు అనుకున్నా. నువ్వు చాలా చిన్న పిల్లాడివి అనుకున్నా...ఇలా అల్లరి చేసేశావు?”

ఆ అమ్మకంటే నేనేం తక్కువ వాడిన కాదని నిరూపించ వద్దా?”

రాణీ ఇంకా భయంతోనే అతన్ని చూస్తూ నిలబడ...అతను అన్నాడు. రోజూ నేను ఎప్పుడు పిలుస్తానో అప్పుడు నువ్వు పైకి రావాలి

అయ్యో...వద్దు అశ్విన్. నా వల్ల కాదు. అమ్మకు తెలిస్తే నన్ను పనిలో నుండి తీసేస్తుంది

అమ్మకు తెలియాలి. ఆమె పైకి వచ్చి తలుపు కొట్టాలి. నువ్వు లోపల నా బెడ్ మీద కూర్చో నుండ...నేను తలుపు తెరిచి ఆమెను చూసి కేకలు వెయ్యాలి

అయ్యయ్యో...దానికంతా నేను కరెక్టు మనిషిని కాదు అశ్విన్. నా వల్ల కానే కాదు

కుదరదు అని చెబితే నిన్ను ఎలా దారికి తేవాలో నాకు తెలుసు!

పద్నాలుగు ఏళ్ల వయసు పిల్లడు మాట్లాడే మాటలు లాగా లేదు. ఏదో రౌడీ యొక్క గొంతులాగా -- ఇదే పనిగా పెట్టుకున్న వాడి మాటలు లాగా అనిపించ...మరుసటి రోజు నుండి రాణీ పనికి రావటం మానేసింది.

ఆమె రాకపోవటంతో...వీడికి ఏం చేయాలో తెలియక మనసులో విపరీతంగా కొట్టుకుని, కొన్ని రోజుల తరువాత రహస్యంగా రమణతో విషయాన్ని పంచుకున్నాడు.

రమణ మిక్కిలి ఆత్రుతతో ఉండబట్టలేక ఇంకా తవ్వి, తవ్వి అడిగాడు. చూపులలో రెండు తోడేళ్ళు తొంగి చూడ అడిగాడు.

చూసావా...నా దగ్గర చెప్పకుండా నువ్వు మాత్రం అనుభవించావు! ఇక మీదట ఏదైనా సరే నాతో పంచుకోవాలి

అశ్విన్ సరే అంటూ తల ఊపాడు. కానీ, ఆ రాణీ పనికి రావటం మానేసిందే...?” అన్నాడు మిక్కిలి కలతతో.

ఏమిట్రా దీనికి పోయి మొహం వేలాడాశావు? ఆ రాణీ పోతే ఇంకో ప్రిన్సెస్. నేను ఏర్పాటు చేస్తాను...ఎక్కడ పెట్టుకుందాం? హోటల్లో రూము బుక్ చేసేద్దామా?"

ఊహూ ! మా అమ్మకు తెలిసేంతవరకు మా ఇంట్లోనే. అందులోనూ నా రూములోనే

అమ్మకు తెలిసిపోతుందే...ఏమిట్రా ఇది? ఈ పనులన్నీ ఎవరికీ తెలియకూడదురా!

లేదు...నేను చేసే పనులన్నీ మా అమ్మకు తెలియాలి. ఆ దెబ్బను ఆమె అనుభవించాలి. ప్రతిసారి గిలగిలా కొట్టుకోవాలి. అప్పుడే నేను గిలగిలా కొట్టుకున్న బాధ ఆమెకు తెలుస్తుంది. నా ఆవేదన అర్ధమవుతుంది

అది విని భయపడి పోయాడు రమణ.

నేను ఇలాగంతా నడుచుకోవటానికి మా అమ్మే కారణం రమణ. నా మనసులో మంటలు ఎగిరి ఎగిరి పడుతూండటం నువ్వు అర్ధం చేసుకోలేవు. నేను వెళ్ళే దారిలో వస్తానంటే నువ్వూ రా. లేకపోతే వదిలేయ్

అంత సులభంగా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టగలనా? అలా వదిలిపెట్టటానికా ఒకటో తరగతి నుండి ఒకటిగా చదువుకుంటున్నాము...వదిలిపెట్టకుండా స్నేహంగా ఉంటున్నాము? సరే...ఈ రోజు సాయంత్రమే ఒక ప్రిన్సెస్ తో ఇంటికి వస్తాను. రెడీగా ఉండు. ఏమిటి...?”

అతను తల ఊపాడు.

ఆ రోజు రమణ తీసుకు వచ్చిన ప్రిన్సెస్, తరువాత అదేలాగా చాలా ప్రిన్సెస్ లు.

చాలా రోజుల తరువాతే భానూరేఖాకి విషయం తెలిసింది. ఆమె ఆగ్రహంతో వెళ్ళి, అశ్విన్ గది తలుపు కొట్టినప్పుడు -- అతడు లోపల ఉన్న స్త్రీని మంచం మీద కూర్చోబెట్టి, తలుపు తెరిచి, గది వాకిలిలో రెండు చేతులను నడుం మీద ఉంచుకుని నిలబడి అరిచాడు.

నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆయా? ఇలాంటి సంధర్భాలలో అమ్మను పైకి పంపొద్దని! ఇదేనా నువ్వు చూసుకునే లక్షణం?”

రేయ్ అశ్విన్...ఏమిట్రా ఇది?”

నోరు ముయ్యి! అంటూ తల్లికి అడ్డుపడి తల్లిని అనిచాడు. నువ్వు కిందకు వెళ్ళి మొదట స్నానం చేసి భోజనం చెయ్యి. షూటింగ్ నుండి వచ్చిన వెంటనే ఇలా నన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకు రాకూడదు. పో...నేనే కిందకు వస్తాను. అప్పుడు మాట్లాడదాం

భానూరేఖా షాక్ తో మాటరాక నిలబడ...అతను మరింత కోపంతో అరిచాడు.

పో...మొదట కిందకు పో. నా కంటి ముందు నిలబడకుండా వెళ్ళిపో

అతని కళ్ళల్లో వెర్రితనం, కోపం చూసి భయపడిపోయిన భానూరేఖా, ఆందోళనతో మెట్లు దిగి కిందకు వెళ్ల,

అతను లోపలకు వెళ్ళి, శరీరం వణుకుతుంటే మంచం మీద కూర్చున్న స్త్రీ మెడమీద చెయ్యి వేసి బయటకు తోసి తలుపును విసురుగా మూసి, నేల మీద కూర్చుని బోరుమంటూ ఏడ్చాడు.

అంతవరకు భానూరేఖా కళ్ళల్లో పడకుండా దాక్కోనున్న రమణ బయటకు వచ్చి అశ్వినీకుమార్ దగ్గరకు వెళ్ళి, అతని భుజం మీద చెయ్యివేసి బెదిరిపోయి అడిగాడు.

రేయ్ అశ్విన్...ఏమిట్రా ఇది? ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు?”

వదులు...వదులు...నన్ను ఒంటరిగా వదులు! ఇదంతా నీకు అర్ధం కాదు...అర్ధం చేసుకోలేవు. నిన్ను ప్రేమగా చూసుకునే తల్లి నీకుంది. సినిమాలో నటించని తల్లి...ఇంటికి ఎవరెవెరినో పిలుచుకురాని తల్లి. అలాంటి తల్లి నాకూ ఉండుంటే, నేను ఇలా నడుచుకోను. ఐ విల్ బి ఎ గుడ్ సన్ టు మై మదర్

నువ్వేమనుకుని ఇలా మాట్లాడుతున్నావు అశ్విన్? నా నిజమైన పరిస్థితి నీకు తెలియదురా! నీకేమో మీ అమ్మా అలాగ...నాకు తండ్రి. రోజూ తాగేసి ఒక్కొక్క అమ్మాయినీ ఇంటికి తీసుకు వచ్చి ఆమె ఎదురుగానే మా అమ్మను కొట్టి చిత్రవధ చేస్తాడు...మనసారా నేను మా నాన్నను ద్వేషిస్తున్నా. ఆ ద్వేషం తో ఏదో ఒకరోజు ఆయన్ని హత్య చేసేస్తానేమో నన్న భయం కూడా లోలోపల ఉందిరా. నువ్వు మీ అమ్మమీద పగ తీర్చుకుంటున్నట్టు, నాకూ మా నాన్న మీద పగతీర్చుకోవాలని ఆశగా ఉన్నది. కానీ ధైర్యం లేదు"

"నువ్వు నిజంగానే చెబుతున్నావా రమణ? లేదు నన్ను ఓదార్చటానికి చెబుతున్నావా

నిజమేరా! కావాలంటే మా ఇంటి డ్రైవర్ను అడిగి చూడు. తోటమాలి, గూర్ఖా...ఎవరినైనా అడుగు. మా నాన్న గురించి కథలు కథలుగా చెబుతారు

ఓకే...బాధపడకు! ఇదేలాగా మీ నాన్నను నువ్వు ఒకరోజు అడగాలి. దానికి ధైర్యం రావాలి. అంతే కదా? వస్తుంది...నేను తెప్పిస్తాను. మొదట ఒక పెద్ద స్టార్ హోటల్లో రూము బుక్ చెయ్యి. ఇప్పుడు పిలిచుకు వచ్చినట్లు కాకుండా...ఒక పెద్ద చోటు ఫిగర్ను పిలుచుకురా. నేను ఇంటి దగ్గర నుండి విస్కీ తీసుకు వస్తాను. బాగా తాగు. మనం డిగ్రీ చదివి ముగించేలోపు వందమంది అమ్మాయలను...ఏమిటి?”

కొత్తగా ఏర్పడ్డ బలంతో, అశ్విన్ ఇచ్చిన ధైర్యంతో అతన్ని చూసి బలంగా తల ఊపాడు రమణ!

************************************************PART-4*********************************************

రేయ్ అశ్విన్...నీ లిస్టు ప్రకారం ఇది ఎన్నోది?”

రమణ ప్రశ్నకు అశ్వినీకుమార్ దగ్గర నుండి జవాబు రాలేదు!

దగ్గర దగ్గర ఇది యాభైయవదిగా ఉంటుందా?”

దానికి కూడా జవాబు రాకపోవటంతో తలతిప్పి అశ్విన్ ను చూశాడు రమణ...ఏదో ఆలొచనతో కొద్ది దూరంలో నడుస్తూ వెళ్తున్న శృతికానే చూస్తున్నాడు అశ్వినీకుమార్.

కొద్దిగా వెలిసిపోయున్న, పొట్టిగా ఉన్న లంగాతోనూ, ఓణీతోనూ ఉన్న ఆమె అందం అతన్ని ముగ్దుడ్ని చేసింది. పాల తెలుపు రంగులో ఉన్న పాదాలు నలుపు స్ట్రాప్వేసున్న చెప్పులతో చిన్న చిన్న కుందేళులాగా తుళ్ళినై. తలతలమంటున్న మొహం ఆ వానాకాలపు ఆకాశం యొక్క మసకగా ఉన్న సూర్యుడి వెలుతురుకే మెరిసిపోతుంది. మంచి ఎత్తు. పెద్ద పెద్ద కళ్ళు. మెరుగులు దిద్దుకున్న ముఖం.  ఆమె కొంచం మొండి పట్టుదలగల మనిషే నన్న రూపాన్ని చూపింది.

ఆ మెండి పట్టుదల ఆమెకు అందంగానే ఉంటుంది అని అనుకున్నాడు అతను. ఎర్ర రంగు లంగా, ఓణీలో పెద్దగా పూసిన క్రోటన్ ఒకటి బంగారంతో కాళ్ళూ-చేతులూ మొలచి నడిచి వెళుతున్నట్టు తెలియ...తనని పూర్తిగా మరిచిపోయిన వాడిలాగా కారులోపల కూర్చోనున్నాడు అశ్విన్.

రెండు సార్లు అదే ప్రశ్న అడిగినా సమాధానం రాకపోవటంతో...కారును పక్కగా ఆపి అశ్వినీకుమార్ భుజాలను పట్టుకుని ఊపాడు రమణ. ఏమిట్రా ఆలొచన?” అని నుదుటిని చిట్లించుకుని అడగ, అతను ఇంకా ఆ ఆశ్చర్యంలో నుండి తేరుకోలేని వాడిగా చెప్పాడు. 

ఇలాంటి ఒక అందాన్ని ఇంతవరకు నేను చూసిందే లేదురా"

రమణ నవ్వాడు.

చూడాలనే కదా ఇప్పుడు నిన్ను పిలుచుకు వచ్చింది

ఈ ఎర్రటి డ్రస్సులో ఆమెను చూస్తుంటే ఎప్పుడో చదివిన కవిత జ్ఞాపకానికి వస్తోంది

కవితనా...? అరే...అటువైపు కూడా నువ్వు తిరిగి చూశావా?”

లేదురా! మన రామ సుబ్రమణ్యం ఒక రోజు ఏదో పత్రికను కాలేజీకి తీసుకువచ్చాడు. నేను తీసుకుని పేజీలు తిప్పితే మనకు అర్ధంకాని సాహిత్య వాక్యాలు. అయినా కానీ, అందులో చదివిన ఆ రెండు వాక్యాలు మాత్రం మనసులో లోతుగా పాతుకు పోయింది

ఏమిటా వాక్యాలు?”

ఎత్తుకెళ్ళిపోతానే...నీ మనవరాలుని...”-- అంటూ బుర్ర గోక్కున్నాడు అశ్విన్.

మంచి వాక్యాలు. అందువలనే నీ మనసును విడిచిపోనంటోంది. అవునూ...ఇప్పుడు ఈ ఆపిల్ పండును ఎత్తుకుని వెళ్దామని చెబుతున్నావా...?”

అదే ఆలొచిస్తున్నా. ఈమె వచ్చిన ఇల్లు, వీధి, వెలిసిపోయిన పొట్టి లంగాను చూస్తుంటే బగా మిడిల్ క్లాస్లాగా అనిపిస్తోంది?”

అనిపించటమేమిటి? పక్కా లో మిడిల్ క్లాసే! మామూలు మధ్య తరగతి వర్గం. కుటుంబం. తండ్రి లేడు. తల్లి మాత్రమే. ఒకే ఒక తమ్ముడు. మావయ్య కొడుకో,  అత్తయ్య కొడుకో ఒకడు ఇంట్లో ఈమెకొసం కాచుకోనున్నాడు. పచారీ కొట్టు నడుపుతున్నాడు. మంచి బొగ్గు నలుపు రంగులో ఉన్నా, శోభన్ బాబూలాగా తల దువ్వుకుంటాడు...తెల్ల పంచ, తెల్ల చొక్కాలో ఉంటాడు. నల్లగా ఉన్నా మొహం లక్షణంగా ఉంటుంది.

ఈమెను పెళ్ళి చేసుకోవాలని వాడికి పిచ్చి ఆశ. కానీ, ఈ అమ్మాయికి అందులో ఇష్టం లేనట్టు తెలుస్తోంది. అతనో ఈమెను చుట్టి చుట్టి వస్తూ కాపలా కాస్తాడు. గుడ్డును కొడి కాపాడుకుంటున్నట్టు, వీడూ ఈ అమ్మాయిని చూసుకుంటాడు. ఆ కోడిని మోసం చేసే ఈ గుడ్డును తీసుకురావాలి

అవునూ...ఇన్ని వివరాలు ఎలా సేకరించావు?”

నాకు ఇంకేం పనుంది చెప్పు? ఏ ఇంట్లో అందమైన అమ్మాయి ఉంది, ఎక్కడ చదువుతోంది. ఎవరెవరు ఆమెతో ఉంటున్నారు, పూర్వోత్తరం ఏమిటి...ఇవన్నీ కనిపెట్టే పని తప్ప నాకు వేరే పనేముంది చెప్పు?”

ఇన్ని కనిబెట్టి ఏమిటి లాభం...ఈ అమ్మాయి మనకు లొంగుతుందనే నమ్మకం నాకు లేదు

లొంగుతుందని ఇప్పుడు ఎవరు చెప్పారు? పక్కా మధ్య తరగతి బాబూ. డబ్బులిచ్చి దేన్నీ సాధించలేని పరిస్థితుల్లో ఉన్నందువలన ఇంకా పాప పుణ్యాలకు జంకే జన్మలు. సాయంత్రం ఆరు గంటలకు దీపాలు పెట్టేస్తే బయటకు రాని జీవులు. పాతివ్రత్యము వాళ్ళకు ఇవ్వబడ్డ వజ్రాల నెక్లస్ అనే ఆలొచనలో జాగ్రత్తగా తాళం వేసి కాపాడుకునే ఆత్మలు. అంత సులభంగా లోపలకు దూరి దొంగతనమో...ఎత్తుకుని పోవటమో కుదరదు

అదిసరే...ఆమె పేరు ఏమని చెప్పావు?”

నేనింకా చెప్పలేదే...

చెప్పకపోతే ఇప్పుడు చెప్పి తగలడు

అంత సులభంగా చెప్పేస్తానా? ఏమై ఉంటుందో నువ్వే కొంచం ఆలొచించు

అవును...పెద్ద పజిల్ చూడు. దీనికొసం కూడా ఆలొచించాలా! ఇప్పుడు నువ్వు పేరు చెప్పలేదనుకో...నీ పళ్ళు రాలిపోతాయి

సరే...కోపగించుకోకు! చెప్పేస్తాను...పేరు శృతికా

ఏమిటి... మళ్ళీ చెప్పు?”

శృతికా. పిలిచేది శృతి

ఒక మిడిల్ క్లాస్ ఇంత అందం తట్టుకుంటుందారా?”

తట్టుకోదు...తట్టుకో కూడదనే మన కళ్ళల్లో పడింది

ఇప్పుడు ఆమె మన కళ్ల నుండి తప్పుకుంటోంది. బండి తీయరా -- మెల్లగా ఫాలో చేసుకుంటూ పో. మాట్లాడుకుంటూ వెనుకే వెళదాం

ఎలారా ఈమెను మన దారికి తీసుకువచ్చేది?”

దానికి ఒకే ఒక దారే ఉంది

ఏమిటది?”

ఇలాంటి కట్టుబాట్లతో పెరిగే మిడిల్ క్లాస్ టీన్ ఏజ్అందగత్తెలందరూ ఒక చోట గబుక్కున పడిపోతారు. అదేం చోటు...చెప్పుకో చూద్దాం

నువ్వే చెప్పు

అంతా నేనే చెప్పేస్తే. ఆ తరువాత నువ్వెప్పుడురా ఆలొచించేది?”

ఆలొచన చెప్పటానికీ, దారి చెప్పటానికే కదా శకునిలాగా నిన్ను నాతోనే ఉంచుకున్నాను

సరే ధుర్యోధనా...నాకు తెలిసిన ఒకే ఒక దారి, నువ్వు ఆమెను ప్రేమించటమే

ప్రేమించటమా! -- అధిరిపడ్డ అశ్వినీకుమార్ రమణను చూడ...వాడు నవ్వుతూ మాట్లాడాడు.

అవునురా...ఈ రోజు నుండి నువ్వు ఆమెను ప్రేమించబోతావు!    

రబ్బిష్! అంటూ మొహం చిట్లించాడు. ప్రేమా లేదు...గీమా లేదు! నతింగ్ డూయింగ్. ఐ హేట్ ఉమన్. మీ నాన్నను నువ్వు హేట్ చేస్తున్నట్టే, ఆడ జాతినే నేను హేట్ చేస్తున్నా. నాకు మాత్రం మంత్ర శక్తి ఉంటే, ఈ లోకంలో ఆడ జాతే ఉండకూడదు. మొత్తంగా నాశనమైపోవాలని శపిస్తాను

ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నావు? శాపం ఏదీ ఇవ్వకుండానే నాశనం చేస్తూనే ఉన్నావు కదా? పోతే పోనీ! ప్రేమించటం అంటే నిజంగా ప్రేమించటం కాదురా...జస్ట్  నటన!

ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నావన్న భావం ఏర్పరిస్తేనే వీళ్ళంతా మన వలలో సులభంగా పడతారు. ఈ మిడిల్ క్లాస్అమ్మాయల దగ్గర ఈ సైకాలజీ బాగానే వర్క్ చేస్తుంది. అందులోనూ కాలేజీలో చదువుతున్న అందమైన అమ్మాయల దగ్గర ఇంకా సులభంగా వర్క్ అవుతుంది.

వాళ్ళ అందాలకు ఏదో దేవలోకం నుండి దేవకుమారుడు ఒకడు వచ్చి సం యుక్తను ఎత్తుకెళ్ళిన పృదివీరాజు లాగా తమని ఎత్తుకెళ్ళటానికి ఎవరో వస్తారని అనుకుంటూ ఉంటారు. ఆ కలలోనే జీవిస్తూ ఉంటారు. అందువలన డబ్బుగల యువకుడు, అందమైన వాడు తమ అందం మత్తులో పడి ప్రేమిస్తునట్టు చెప్పిన వెంటనే, అంతే వాళ్ళు మహా కుషీ అయిపోతారు.

అందులోనూ పెళ్ళి అనే ఎరను నువ్వు మాటి మాటికీ చూపిస్తే చాలు. గబుక్కున చిక్కుకుని తననే త్యాగం చేయటానికి కూడా ఖచ్చితంగా రెడీగా ఉంటారు. ఇప్పుడు మనకు కావలసింది ఆ త్యాగమే. అది మాత్రమే. దానికోసం కొంచం నటించవలసి ఉంది. అంత పెద్ద నటి యొక్క కొడుకు నువ్వు -- నీకు నటించటం చెప్పివ్వాలా?”

రేయ్... అంటూ ఆగ్రహంతో చూశాడు అశ్వినీకుమార్. అమ్మను గుర్తు చేయకు...

లేదురా...తప్పు తప్పు. కావాలంటే నేను చెంపల మీద వేసుకుంటా. దానికొసం నువ్విప్పుడు డ్రాకులాలాగా మారిపోకు! అవును...ఆ అమ్మాయిని ఇప్పట్నుంచే ప్రేమించటం మొదలు పెడదామా?”

మొదలు పెడదాం. కానీ, ఆమె నమ్ముతుందా?”

నమ్మేటట్టు నటించటం నీ వంతు. అదెలా చేస్తావో నీ టాలెంట్!

ఒక వేల...ఆ బొగ్గు మనిషి పేరు ఏమని చెప్పావు?”

ఎవర్రా?”

అదేరా! ఆమె మావయ్య కొడుకో, అత్తయ్య కొడుకో ఆమెను కాపాడుతున్నట్టు చెప్పావే?”

అతని పేరా... కామేష్ రా"

అతన్ని ఈమె ప్రేమిస్తున్నట్టయితే...

అతన్నా? ...’నెవర్!అలా ఎమీ అనిగిపోయి మెడవంచి తాళి కట్టించుకునే పిల్ల కాదు. కొంచం పొగరుబోతు ఆడదే

పొగురుబోతు అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం

నాక్కూడా!

రేయ్...

ఎందుకురా కోపగించుకుంటావు? అగ్రీమెంట్ ప్రకారం ష్యార్ ఇవ్వాలి. అలా అయితేనే ఫర్ దర్ గా ప్లాను వేసి ఇస్తాను

సరి...సరి...తరువాత ఏమిటి? అదిగో ఆమె కాలేజీలోకి వెళ్లబోతోంది

అంత సులభంగా వెళ్ళ నిస్తానా? ఇదిగో చూస్తూ ఉండు

కారు వేగాన్ని పెంచి, శృతికాను చేరుకుని, పక్కన నిలబడున్న వర్షం నీటిని దాటుతున్నప్పుడు, వర్షం నీరు, బురద ఆమె మీద చిందాయి. ఆమె డ్రస్సంతా తడిసిపోయింది. బురద పడింది. తలెత్తి కోపంతో చూస్తున్న శృతికా దగ్గరకు రివర్స్ లో వచ్చారు.

రమణ చెప్పిచ్చినట్టే అందంగా నవ్వుతూ ఐయాం సారీ...వెరి వెరి సారీ... -- చెబుతూ కారులో నుండి దిగాడు అశ్వినీకుమార్! 

************************************************PART-5*********************************************

ఆ రోజు శృతికాకు అత్యంత ఇష్టమైన రచయతతో ఓపన్ టాక్ప్రొగ్రాం ఉన్నది. మధ్యాహ్నం రెండు గంటలకు కాలేజీ కల్చరల్ హాలులో ఏర్పాటు చేయబడింది. దానికోసమే బెంగళూరు నుండి ఆయన వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. ఆయన రచనలు చదివే, ఆయన యొక్క అతిపెద్ద ఫ్యాన్ గా మారిన శృతికా ఆయన్ని అడగటానికి చాలా ప్రశ్నలు మనసులోనే రాసుకుని వచ్చింది.

తాను అడిగే ప్రశ్నలతో ఆయన ఆశ్చర్యపడాలి అని అనుకుంది. కానీ, “ప్రశ్న వేసే ఆయన్ని  ఆశ్చర్యపరచాలా?” అనే ఆలొచన కూడా వచ్చింది. లేచి నిలబడితేనే చాలదా? ఎదుటి వాళ్ళు ముగ్ధులవరు? అందులోనూ ఇంత గ్లామర్ గా కథలు రాసే అయన ఖచ్చితంగా అందాన్ని ఎంజాయ్ చేసే రసికత్వం కలిగినవారుగా ఉంటారు. వెయ్యి మంది మధ్యలో ఆయనకు సపరేటుగా కనిపించే తన ముఖం, ప్రియమైన ఆ రచయతను ఆకర్షించ కుండా పోదు!

ఆ నమ్మకంతోనే తన బంగారు రంగును ఇంకా పెంచి చూపించాలని మంచి ఎరుపు రంగులో లంగా, ఓణీ వేసుకుని వచ్చింది. దాని మీద ఇప్పుడు వర్షం నీరు, బురద విసిరివేయబడి ముద్దలాగా తడిసి పోయింది. దానికి కారణమైన ఆ తెల్ల రంగు కారును కోపంగానూ, ఏడుస్తూ తలెత్తి చూసినప్పుడు...అది వెనుకే వచ్చి దగ్గరగా నిలబడ్డది.

ఆమె కోపంతో ఏదో అడుగుదామనుకుని నోరు తెరిచినప్పుడు ఐయాం సారీ...సో వెరి వెరి సారీ’ --  చెబుతూ కారులో నుండి దిగివచ్చిన యువకుడ్ని మౌనంగా చూసింది.

బ్లూ కలర్ ప్యాంటు, పైన...గీతలు గీతలుగా వేసుకున్న విదేశీ టీ షర్ట్. అమితాబచ్చన్ క్రాపు. జీతేంద్రా ముఖం, కురకురా చూస్తున్న ప్రకాశమైన కళ్ళు, మెడలో బంగారు గొలుసు, గోలుసులో ఉన్న డాలర్ ఐ.లవ్.యూ చెప్ప,

ఈమె మళ్ళీ తన కోపాన్ని గుర్తుకు తెచ్చుకుని అడిగింది. ఏమిటి మిస్టర్...కారు పెట్టుకుంటే, పొగరుతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవారందరి మీదా బురదా, నీళ్ళూ ఎత్తి పోస్తారా?”

అశ్వినీకుమార్ నిజంగానే బాధపడుతున్నట్టు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఐ యాం ఎక్స్ ట్రీం లీ సారీ. నేను నడిపుంటే నిదానంగా వచ్చుంటాను. ఇతను నా ఫ్రెండ్. కొత్తగా కారు నడపడం నేర్చుకుని ఆదుర్దాతో ఇలా చేశాడు. అందుకోసం మీ దగ్గర క్షమాపణలు అడుగుతున్నా

క్షమాపణలు అడిగితే సరిపోతుందా? ఇప్పుడు ఈ డ్రస్సుతో నేను ఎలా కాలేజీకి వెళ్లగలను?”

మళ్ళీ మళ్ళీ సారీ అడగటం తప్ప నేనింకేం చేయగలను చెప్పండి...కావాలంటే ఒకటి చేద్దాం

ఏమిటది?”

మీకు ఆక్షేపణ లేకపోతే మాతో కారులో రండి. మీ ఇంట్లో డ్రాప్ చేస్తాం. వేరే డ్రస్సు మార్చుకున్న తరువాత మేమే తిరిగి తీసుకు వచ్చి వదిలిపెడతాం

అతను అంత భవ్యంగా మాట్లాడిన తరువాత తాను కోపగించుకోవటంలో న్యాయం లేదని శృతికా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. అతను షార్ప్ అయిన కళ్లతో తననే చూస్తున్నాడని గమనించింది. మనసులో అత్యంత రహస్యంగా సంతోషపడింది. చాలా గర్వ పడ్డది.

అతని రూపురేఖలను నిదానంగా లెక్కవేసింది. ఆకర్షణ గలవాడే. అందగాడే. డీసెంటుగా డ్రస్సు చేసుకోవటం తెలిసిన వాడే. భవ్యంగా మాట్లాడటం తెలుసున్న వాడు. ముఖమూ, అందులో కనబడే భావమూ చూసేటప్పుడు చాలా మంచివాడిగా ఉంటాడని తెలుస్తోంది.

ఈ కారు, అతని అవతారం చూస్తే డబ్బుగల వాడు అనేది స్పష్టమవుతోంది. అలాంటి అతను తన అందానికి ఆకర్షించబడ్డాడని అర్ధమవటంతో చెప్పలేని సంతోషం ఏర్పడ...అతనితో వెళ్ళి డ్రస్సు మార్చుకుని తిరిగి వస్తే ఏమవుతుంది?’ అని ఆలొచించింది.

ఎలాగూ తన అభిమాన రచయత ముందు ఈ డ్రస్సుతో లేచి నిలబడి ప్రశ్నలడగలేము. పోనీ, నడిచి వెళ్ళి దుస్తులు మార్చుకుని వద్దామంటే బద్దకం అడ్డు వస్తోంది. గాంధీ బొమ్మ సెంటర్ ఎక్కడ...ఎన్.టీ.ఆర్ నగర్ రాజవీధి ఎక్కడా? అంత దూరం నడవటం కంటే, వీళ్ళతో పాటూ కారులో వెళ్ళి...పదే నిమిషాలలో తిరిగి రావచ్చు. నల్ల అద్దాలు, ఏసీ కారుతో బ్రహ్మాండగా ఉన్నాడు.

ఎవరై ఉంటాడు ఇతను? ఎవరో పెద్ద డబ్బుగలవారి కొడుకే! ఒక మీటర్ దూరం అవతల నిలబడ్డప్పుడే సెంటువాసన ముక్కును తాకుతోంది. ఏం సెంటుఅయ్యుంటుంది? ఏదైనా విదేశీ రకమే అయ్యుంటుంది -- వెంటనే కామేష్ కొనుకొచ్చే సెంటుయొక్క వాసన జ్ఞాపకానికొచ్చి ముఖం చిన్నదయ్యింది.

ఆ ముఖ కవలికలను గమనించిన అశ్వినీకుమార్, “ఐయాం సారీ, మాతో పాటూ కారులో రావటానికి మీకు ఇష్టం లేకపోతే వద్దు. దానికెందుకు మొహం చిట్లించుకుంటున్నారు...?” అని చెప్పిన వెంటనే గబుక్కున నవ్వేసింది శృతికా.

మొహం చెప్పలేని సంతోషంలో విచ్చుకోగా అడిగింది మొహం చిట్లించేనా? నేనా?...ఏదో ఆలొచనలో ఉంటే దానికి మొహం చిట్లించుకుంటున్నట్టు అర్ధమా?”

అంతలా ఆలొచించేంతగా నేను మిమ్మల్ని ఏమడిగాను? కారులో మీ ఇంటి వరకు వెళ్ళి డ్రస్సుమార్చుకుని వచ్చేద్దాం అనే చెప్పాను. ఇంత చిన్న విషయానికి అంత ఆలొచన అవసరమా?”

అక్కర్లేదు ! కానీ, ఇది మా అమ్మకు అర్ధమవదే?”

ఓహో...అమ్మకు భయపడే పిల్లవా?”

భయమంతా ఏమీ లేదు! అమ్మ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి నిలబడితే...ఈ రోజంతా నిలబడే ఉండాలే అనే ఆలొచిస్తున్నాను

అయితే ఒకటి చేద్దామా?” -- హఠాత్తుగా జ్ఞాపకానికి వచ్చిన ధోరణితో అతను అడగ... శృతికా ఏమిటి?’ అన్నట్టు చూసింది.

మేము మీ ఇంటి వరకు రాము. వీధి చివరలోనే మిమ్మల్ని దింపేసి కాచుకోనుంటాము. మీరు డ్రస్సు మార్చుకుని వచ్చిన తరువాత బయలుదేరి వచ్చేద్దాం. ఏమంటారు...?”

“.........................”

ఇంకా ఎందుకు అంత దీర్ఘ ఆలొచన?”

లేదు...అనవసరంగా మిమ్మల్నెందుకు ఇబ్బంది పెట్టటం అని చూస్తున్నా

బాగుందే మీరు చెప్పేది! ఇందులో ఇబ్బంది ఏముంది? మీ మీద వర్షం నీళ్ళు, బురద పడేటట్టు కారు నడపటం మా తప్పు. అందువల్ల ఈ తప్పును సరిచేయాల్సిన బాధ్యత మాదే కదా...

అది విని చిన్నగా నవ్విన ఆమె, “కారు నడిపింది ఆయన. కానీ, ఇంతవరకు ఆ మనిషి నోరే తెరవలేదు. మీరేమిట్రా అంటే ఇద్దరికీ కలిపి బాధపడుతున్నారే?”

భలేవారే! వాడు చాలా భయపడి పోయున్నాడు. అందమైన పెద్ద తామర పువ్వు--కళ్ళూ--చేతులూ పెరిగి వీధికి వచ్చినట్టు వస్తున్న మీ మీద బురద నీరు పడిందే నన్న బాధతో మాటలు రాక కొట్టుకుంటున్నాడు

ఓ...అలాగా?” అంటూ ఆమె మళ్ళీ నవ్వగా, అశ్వినీకుమార్ వెళ్దామా?” అన్నాడు.

కారు బయలుదేరి, గాంధీ బొమ్మ ఎదురుగా రౌండు తిరిగి వచ్చిన దారే వెళ్ల సీటులో సర్ధుకుని ఆమెను సులభంగా చూస్తూ, మాట్లాడగలిగే వసతిలో కూర్చుని ఏమీ తెలియనట్లు అడిగాడు.

మీ ఇల్లు ఎక్కడుంది?”

మెహదీపట్నం వైపు వెళ్లాలి

అసీఫ్ నగర్ రోడ్?”

అవును

ఈ కారును నా పుట్టిన రోజు కానుకగా మా అమ్మ ఇచ్చింది. ఈ ఒక సంవత్సరంలో ఈ రోజే దీని జన్మ సాఫల్యం అయింది

ఎలా?”

ఇంత అందమైన అమ్మాయి ఎక్కటానికి పెట్టి పుట్టింది కదా

ఓ...”-అంటూ ముఖం ఎర్రబడ, సిగ్గుతో తల వంచుకుంది శృతికా.

మీరు ఎక్కువగా పోగడుతున్నారు"

పొగడ్త కాదు. ఇది వంద శాతం నిజం మిస్...

ఆమె పేరుకు తడబడ.

శృతికా... అన్నది.

ఏం చదువుతున్నారు?”

బి.ఏ

ఎన్నో సంవత్సరం...?”

రెండు! మీరు...

అదే బి.ఏ. నే! కానీ, మూడో సంవత్సరం

ఏం కాలేజీ...

హూ...

పేరు?”

సారీ...ఇంకా మేము మా పేర్లు చెప్పలేదు కదా? నా పేరు అశ్వినీకుమార్. అందరూ అశ్విన్ అని పిలుస్తారు. వీడు రమణ

ఆమె ఏదో అడగటానికి నోరు తెరుస్తుంటే, రమణ మొదటిసారిగా మాట్లాడాడు. అసీఫ్ నగర్ రోడ్ వచ్చాశాము అశ్విన్...ఇల్లు ఎక్కడో అడుగు

ఆమెకు తెలియకుండా అశ్వినీకుమార్ను చూసి కన్ను గీటాడు. అది గమనించని శృతికా చెప్పింది. "తరువాత వీధిలో తిరిగితే మూడో ఇల్లు. ఇక్కడ కారాపండి. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఇదిగో...ఒక్క నిమిషంలో వచ్చేస్తాను

ఆమె కిందకు దిగిన వెంటనే అశ్విన్ చెప్పాడు.

తొందర లేదు...నిదానంగా రండి...

శృతికా జరిగి వెళ్ళటంతో సిగిరెట్టు ప్యాకెట్టు తీసి రమణ ముందు జాపి, తానూ ఒకటి వెలిగించాడు అశ్వినీకుమార్.

వీధిలో ఎవరైనా తనను చూస్తున్నారా అని చూసిన తరువాత శృతికా వేగంగా  నడవటం మొదలుపెట్టినప్పుడు...అంతవరకు కొంత దూరంలో బడ్డీకొట్టు ముందు సైకిల్ తో నిలబడున్న కామేష్ శృతికాను, ఆ కారును మారి మారి చూసి  మనసు ఆందోళన చెంద, ఆమె వెనుకే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడు!

************************************************PART-6*********************************************

సైకిల్ మీద ఎక్కి కూర్చోటానికి ముందున్న వేగమూ, ఆందోళనా ఆ తరువాత కామేష్ దగ్గర లేవు. ఆ మరు నిమిషమే గబుక్కున నిదానానికి వచ్చి సైకిల్ పై నుండి దిగాడు. పక్కనున్న షాపు పక్కగా సైకిల్ స్టాండ్ వేసి నిలబెట్టి గోడవారిగా వెళ్ళి నిలబడ్డాడు.

దూరంగా కారు, అందులో ఉన్న వాళ్ళూ కంటికి కనబడినప్పుడు అతనిలో మళ్ళీ నొప్పి, వేదన ఏర్పడింది. మనసులోపల చెప్పలేని హింస ఒకటి తొంగి చూసింది.

కామేష్ దగ్గర ఒక దీర్ఘ దర్శనం ఉంది. చూసేటప్పుడే వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అంటూ గుణం వేరు చేసి అనుమానించే మేదస్సు ఉన్నవాడు. ఇంతవరకు అతని అనుమానంలో తప్పు ఏర్పడిందే లేదు. షాపుకు వచ్చేవాళ్ళను అతని మనసులోని ఈ స్వరంతోనే కనిపెట్టేవాడు.

రేయ్ రాఘవా, ఇదిగో ఇప్పుడు వచ్చి వెళుతున్నారే, అదేరా తెల్ల చొక్కా ఒకటి వేసుకుని, ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండు. ఆ మనిషి చూపే బాగుండలేదు... అంటూ షాపులో తన కింద పనిచేస్తున్న కుర్రాడి దగ్గర హెచ్చరిక చేస్తాడు.

అదేలాగానే, ఒక రోజు మధ్యాహ్నం కామేష్ భోజనానికి వెళ్ళినప్పుడు ఆ మనిషి  కత్తి చూపించి కుర్రాడ్ని బెదిరించి, పచారీ సామాన్లు ఎత్తుకుని పారిపోయాడు.

శివా...ఎవర్రా ఇతను? నీతో కలిసి చదువుకుంటున్నాడా?”

శివరామ్ తో ఇంటికి వచ్చిన కుర్రాళ్ళల్లో ఒకడ్ని మాత్రం చెయ్యి చూపించి విచారించాడు.

అవును బావా. ఇతనే మా టీమ్ క్యాప్టన్. డబ్బుగల వాడు. క్రికెట్ బ్యాటు,  స్టంపులు అన్నీ అతనే కొనిచ్చాడు...

అలాగా? నాకెందుకో వాడి మొహం చూస్తేనే నచ్చలేదు. నువ్వు వేరే టీముకు మారి ఆడు శివా...

పొండి బావా. మీకు అందరి మీద అనుమానమే! వీడు మంచి కుర్రాడు

ఆ మంచి కుర్రాడి గురించి తరువాత తెలిసివచ్చింది. స్కూలుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి హోటల్, సినిమా అని తిరుగుతున్నాడు. తల్లీ--తండ్రికి తెలియకుండా బీరువాలో నుండి డబ్బులు తీస్తున్నాడు. ఆ చిన్న వయసులోనే సిగిరెట్టు తాగుతున్నాడు.

ఆ రోజు అనుకోకుండా ఉదయం పదకుండు గంటలకు షాపుకు వచ్చిన రెగులర్ వ్యక్తితో టిఫిన్ తినడానికి వెళ్ళిన కామేష్ కు, చెట్టు కింద ఉన్న బెంచీ మీద శివరామ్ తో అదే కుర్రాడు కూర్చుని సిగిరెట్టు తాగుతున్నాడు. తాను తాగిన  సిగిరెట్టును ఇచ్చి తాగమని శివరామ్ ను బలవంతం చేయ...వాడు వద్దురా...నాకు భయంగా ఉందిరా... అంటూ భయపడుతూనే చేయిజాపే సమయంలో,

అది హోటల్, పబ్లిక్ ప్లేస్ అనేది మరిచి - తనతో వచ్చినాయన్ని కూడా మరచి -- పొత్తి కడుపు మండిపోగా ఒక్క జంపులో శివారామ్ చొక్కా కాలర్ పట్టుకుని తరతరమని లాక్కుని వచ్చి ఆటోలోకి తోసి తానూ ఎక్కి కూర్చున్నాడు.

ఇంటికి వచ్చిన తరువాత తన కోపమూ, ఆవేదన తగ్గేంత వరకు కొట్టాడు. వద్దు బావా. ఇక మీదట చెయ్యను బావా... అని శివరామ్ ఏడుస్తున్నా పట్టించుకోలేదు.  ఆ తరువాత అతన్ని బలంగా కౌగలించుకుని తాను కూడా ఏడ్చాడు.

"ఇలా చెయచ్చా శివా? ఆ కుర్రాడు మంచిగా కనిపించటం లేదు, వాడితో స్నేహం చేయకు అని నేను అప్పుడే చెప్పానే? వాడు డబ్బుగల కుటుంబం పిల్లాడు. బాధలూ, కష్టాలూ తెలియకుండా పెరిగినవాడు. ఎలాగైనా పోతాడు. నువ్వు అలా కాదు శివా. కష్టపడి సంపాదించి కుటుంబాన్ని కాపడవలసిన వాడివి.  నిన్ను నమ్మే అత్తయ్య ఉన్నది. ఆమెకోసమైనా నువ్వు బాగా చదివి పైకి రావద్దా?

మీ చిన్న పచారీ షాపును, పెద్ద డిపార్ట్ మెంట్ షాపుగా మార్చి చూడాలని లేదా? అత్తయ్యను సుఖంగా సోఫాలో కూర్చో పెట్టద్దా? ఈ ఆశలన్నీ లేకుండా, చెడు సావాసాలు పెట్టుకుంటే, దిక్కు తెలియక చెడిపోవా? అలా వెళ్ళొచ్చా చెప్పు...

లేదు బావా. ఇక మీదట ప్రామిస్ గా నేను అలా చేయను. ఆ కుర్రాడితో స్నేహం చేయను...

శివారామ్ తన తప్పును తెలుసుకుని మనసును మార్చుకునేటట్టు చేశాడు. ఆ తరువాత ఎప్పుడూ శివారామ్ మీద నిఘా వేసి ఉంచాడు.

మనుషులకు మాత్రమే కాదు...ఈ చేష్టకు తరువాతి చేష్ట ఏ విధంగా ఉంటుంది అని ఊహించే దూరపు చూపు ఉన్నవాడు. అందువలన బాలమ్మ అతన్ని అడగకుండా ఏదీ చెయ్యదు. ఇంట్లో జరిగే ప్రతి విషయంలోనూ కామేష్ డైరక్షన్ ఉండాలని అనుకుంటుంది.

తమ్ముడూ...ఈ రోజు ఏం వంట చేయమంటావు?”

"చివరింటి రత్తమ్మ ఈ గొలుసును అమ్ముతుందట. కొనుక్కోవచ్చా చూడు కామేష్

ఏం తమ్ముడూ, ఏ శనివారం పూజ చేద్దం చెప్పు...?

పండగ వస్తోందే...ఎటువంటి బట్టలు తీసుకోవాలో వెళ్ళి తీసుకొచ్చేద్దామా?”

ఇలా ప్రతి దానికీ కామేష్ అభిప్రాయం, నిర్ణయం అడిగి నడుచుకోవటానికి కారణం అతను ఏది చేసినా కరెక్టుగా ఉంటుంది అనే నమ్మకం. వెనుక రాబోయే కష్టం గురించి ముందే ఆలొచించగల దీర్ఘ దర్శి. రేపు ఇది జరుగుతుంది అని చూడ గలిగే దూరపు చూపు గలవాడు.

ఆ చూపు అప్పుడు కారులో కూర్చున్న ఇద్దరు యువకులూ మంచి వాళ్ళు కాదని హెచ్చరించింది. వాళ్ళ చూపుల్లో స్పష్టత లేదు. మొహంలో ప్రశాంతత లేదు. అన్నిటికంటే వయసుకు మీరిన వృద్దాప్యం తెలుస్తోంది. డబ్బులున్న పొగరు బయలుదేరుతోంది. అందులోనూ డ్రైవర్ సీటుకు పక్కన కూర్చున్నతను శృతికా ను చూసిన చూపు...పెదాలు చప్పరిస్తున్న నవ్వు.

ప్రామిస్ గా అతను మంచి విధంగా స్నేహం చేయటం లేదు. అతని ఆలొచనలలో మంచి లేదు. ఇది అర్ధంకాక శృతికా ఎందుకు వీళ్ళతో కారులో వచ్చి దిగి, వాళ్ళను కాచుకోనుండమని చెప్పి ఇంటికి పరిగెత్తింది? మనసులో కపటం లేకపోతే ఇంటి వాకిలికే వెళ్ళి దిగుండచ్చే...?

కారు నుండి దిగుతున్నప్పుడు శృతికా మొహంలో కనబడ్డ ఆనందం, కళ్ళల్లోని వెలుగు. పెదవుల మీద మెరిసిన మెరుపు. చెంపలు ఎర్రబడటం...ఏదీ అబద్దం కాదు. భ్రమ కాదు. కల్పన కాదు. ఇలాంటి సంతోషంలో ఇంతవరకు ఆమెను చూసిన జ్ఞాపకం లేదు.

ఈ సంతోషమూ, నవ్వు, వీళ్ళ పరిచయము మంచికి కాదు అని తన మనసు తెలుపుతున్నట్టు, ఆమెతో చెబితే వింటుందా? అలాగే ఒప్పేసుకుంటుందా? హోటల్ నుండి లాకొచ్చి శివారామ్ ను కొట్టినట్టు ఈమెను ఎందుకు కొట్టలేకపోతున్నాను?

వాడు...అబ్బాయి. వయసులో చిన్నవాడు. అన్నిటికంటే ముఖ్యం అతను భయస్తుడు. అహంకారమూ, పొగరూ, నేనూ అనే గర్వమూ లేని వాడు. ఏది చెప్పినా విని అనుకువగా నడుచుకునేవాడు.

కానీ, శృతికా అలాంటిది కాదు. తన వలన ఏదైనా సాధ్యమే నన్న మొండి ధైర్యం, తన అందం మీద విపరీత నమ్మకం కలిగినది. ఎవరై ఉన్నా సరే...ఆ అందానికి తన కాళ్ల కిందకు వచ్చి పడతారు అని అనుకునేది. ఏదో ఒకటి పెద్దదిగా తన కోసం కాచుకోనున్నట్టు, ఆ రాజభవనం తలుపు తెరుచుకునేంత వరకూ ఈ ఇల్లు తాత్కాలికంగా నివసించే గృహంలాగా భ్రమ పెంచుకుని ఉన్న అమ్మాయి.

అదంతా ఉత్త భ్రమేనని ఎవరూ ఆమె దగ్గర సలహా ఇవ్వలేరు. ఒకవేల అదే నిజమనుకున్నా, ఖచ్చితంగా ఇప్పుడు కారులో తీసుకు వచ్చి దింపిన, ఆ జుట్టు చెదిరిపోయున్న యువకులు దానికి కారణ కర్తలుగా ఉండరు. అంటూ తన మనసులో, లోతుగానూ, బంకలాగానూ అతుక్కు పోయిందన్న తన అభిప్రాయాన్ని ఎత్తి చెప్పినా ఆమె వినిపించుకోదు.

అలాంటి మనిషి దగ్గర ఇంకా కూడా తన మనసు పట్టుదలగా చెప్పాలనుకుంటున్నది తలుచుకుని బాధపడ్డాడు.

అత్తయ్యా... శృతికాకు మంచి చోటు చూసి పెళ్ళి చేసేయాలి... అని చెప్పి ఇద్దరు, ముగ్గురు వరుళ్లను చూసి వచ్చినా మనసులో ఎక్కడో ఒక మూలలో ఏదో ఒకరోజు, ఈమె నాకు ఎస్ చెప్పవచ్చు అన్న నమ్మకం అతనిలో మిగిలున్నది. అయినా కానీ, అతను దాన్ని బయటకు చూపకుండా ఆమెకు పెళ్ళి సంబంధాలు వెతుకుతూ వస్తున్నాడు. చూసిన మూడు సంబంధాలూ వసతి గలవే. ఒకబ్బాయి బి.కాం. చదివి, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.

అరె...నేనే బి.ఏచదువుకున్నాను. నాకు బి.కాం చదువుకున్న కుర్రాడేనా?” అంటూ ఆ వరుడ్ని వద్దని చెప్పింది శృతికా.

తరువాత ఒక వకీలు.

అవునూ...ఎటు చూసినా, ప్రతి మూలా కేసు రాదని కాచుకుని ఒక వెయ్యిమంది వకీళ్ళు ఉన్నారు. ఈ లక్షణంలో పెళ్ళికి ఇద్దరు చెల్లెల్లు రెడీగా ఉన్నారు...నేను చేసుకోను...

మూడోది కాలేజీ లెక్చరర్. దాన్ని కూడా వద్దని చెప్పింది. ఫోటోను జాపిన వెంటనే, “ఈ మొహానికి పెళ్ళి ఒకటే బాకీ అని గొడవకు వచ్చింది.

అవును...నేను తెలియక అడుగుతున్నా కామేష్...

శివారామ్ లాగా శృతికా కామేష్ ని బావాఅంటూ పిలవటం లేదు. మొదటి నుంచీ కామేష్! బాలమ్మ కూడా ఆ విషయంగా కూతుర్ని రహస్యంగా ఖండించింది.

"నాకు నిజంగానే మీరు వరుడ్ని చూస్తున్నారా?"

అతను దెబ్బ తిన్నవాడిలాగా ఆమెను తలెత్తి చూసి అడిగాడు. ఎందుకు అలా అడుగుతున్నావు శృతీ?”

వెంటనే ఆమె ముఖం ఎర్రబడింది. మాటలు వేడిగా వస్తాయి.

"ఇదిగో చూడండి... శృతీ, గీతీ అంటూ ముద్దు పేరంతా నాకు వద్దు. నేను మిమ్మల్ని కామేష్ అని పూర్తి పేరు పెట్టి పిలిచేలాగా, మీరూ నన్ను శృతికా అని పూర్తి పెట్టి పిలవండి. ఏమిటి...?"

"సరే..." అంటూ కింద పెదవిని బిగబెట్టుకుంటాడు ఇతను.

ఆమె కంటిన్యూ చేస్తుంది. "నాకెందుకో మీరు కావాలనే ఇటువంటి వరుళ్లను చూస్తూ వస్తున్నట్టు అనిపిస్తోంది. అప్పుడే కదా ఒక్కొక్క వరుడ్నీ కాదనుకుని, చివరికి మనసు విసుగుపుట్టి మిమ్మల్నే పెళ్ళి చేసుకుంటానని అనుకుంటున్నారనుకుంటా"

గబగబా అతని మొహం ఎరుపెక్కింది. చుర్రుమని కోపమూ, అవమానమూ తల ఎత్త...ఉద్రేకంతో మాట్లాడాడు.

ఇదిగో చూడు శృతికా. నాలో అలాంటి ఆశ ఇంతవరకు ఉన్నది నిజమే! కానీ, ఈ నిమిషం నుండి ఆ ఆశ చచ్చిపోయింది. ప్రామిస్ గా చెబుతున్నా...ఇకమీదట నిన్ను పెళ్ళి చేసుకోవాలనే ఆలొచన కూడా నాలో తొంగి చూడదు. నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని కావాలంటే నీకు వాగ్ధానం చేసిస్తాను

ఏదీ చేయండి...

ఆమె చెయ్యి జాపిన వెంటనే ఆ చేతిని తోసేసి, కూతురి చెంప మీద గట్టిగా ఒక దెబ్బ వేసింది బాలమ్మ.

లోపలకు వెళ్లవే...అనుకువ అనేది లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు?”

ఇప్పుడు సంతోషంగా ఉందా? మనసు సంతోష పడుతోందా? ఒకే రాయితో రెండు కాయలు. వాగ్ధానం చేసివ్వకుండా ఉండటమే కాకుండా, అమ్మ చేత దెబ్బ కూడా తినిపించారు...—కామేష్ ను చూసి ఆమె ఓర్పు నశించ అరిచింది శృతికా.

ఏయ్... అంటూ కూతుర్ని కోపంగా చూసిన బాలమ్మను శాంతింప జేశాడు ఇతను. ప్లీజ్...మీరు కొంచం శాంతంగా ఉండండి అత్తయ్యా. ఇదిగో చూడు శృతికా...చేతిలో చెయ్యి వేసి చెబితేనే వాగ్ధానం కాదు. నోటితో చెప్పి, మనసులో అనుకున్నా కూడా వాగ్ధానమే! అయినా కానీ, నేను ఇదిగో అత్తయ్య తలమీద కొట్టి ప్రామిస్ చేస్తున్నా. ఏ సంధర్భంలోనూ, ఏ కారణం చేత నిన్ను పెళ్ళి చేసుకోను...చాలా?”

చాలు! అంటూ ప్రశాంతతో పెద్ద నిట్టూర్పు విడిచింది శృతికా. దేంట్లో నుండో విడుదల చేయబడ్డ స్వాతంత్ర భావంతో లోపలకు వెళ్ల,

దానికి బుద్ది లేదంటే...నీకు కూడానా కామేష్ బుద్ది లేకుండా పోయింది?”

ఈమె తనకు లేదు. నేను పెళ్ళి చేసుకోబోయేది లేదు. అయినా కూడా అతను బాధ పడ్డాడు. అత్తయ్య కుటుంబానికున్న పేరు, ప్రతిష్ట, గౌరవమూ అన్నీ కాపాడబడాలి. అద్భుతమైన అందం, తెలివితేటలూ నిండుగా ఉన్న పడుచుపిల్ల జీవితం పాడవకూడదు. ఈ యువకుల దగ్గర నుండి ఆమెను కాపాడే తీరాలి.

శృతికాను ఆ యువకులు ఇంటి వరకు తీసుకువచ్చి వదిలుంటే సగం అనుమానం తగ్గుంటుంది. కానీ ఆ యువకులు ఇంటి వాకిట్లో దింపలేదు. ఆమె కూడా కారులో నుండి దిగి భయంతోనూ, ఆందోళనతోనూ...తనని ఎవరైనా చూస్తున్నారేమో అని చూసి ఆ తరువాతే నడుస్తోంది.

మామూలుగా కారులో వచ్చి దిగేటట్టు అయితే ఇలాంటి భయమూ, ఆందోళన అవసరం లేదే!

అందులోనూ ఈ సమయంలో కాలేజీలో ఉండాల్సిన ఈమె, ఎందుకని ఇంటికి వచ్చింది? ఈ యువకులు కాచుకోనుండటం చూస్తే ఆమె తిరిగి వస్తు…

అతను అనుకుని ముగించేలేపు ఇంకో లంగా, ఓణీతో తలవంచుకుని గబగబా నడుచుకుంటూ వచ్చిన శృతికా, మళ్ళీ కారు ఎక్కటంతో, కారు బయలుదేరింది.

మరుక్షణం... కామేష్ పరిగెత్తుకు వెళ్ళి సైకిల్ స్టాండు తీసి ఎక్కి తొక్కాడు. అయినా కానీ, కారు వేగానికి దాన్ని వెంబడించడం సాధ్యం అవకుండా పోయింది. వాళ్ళు ఆమె కాలేజీకి వెళ్ళుండచ్చని అనే అనుమానంతో అతను కాలేజీ వాకిలిలో సైకిల్ దిగి తాళం వేసినప్పుడు చొక్కా...చెమటకి తడిసి వీపుకు అతుక్కుని ఉన్నది. ఎండకు మొహం మరింత నల్లబడి వార్నీష్ కొట్టిన కొత్త నల్ల చెక్కలాగా తలతలమంటున్నది.

కాలేజీ కాంపౌండులో ఆ తెల్ల కారో, యువకులో కళ్ళకు కనబడలేదనేది గమనించి కామేష్ ఒక్క క్షణం తడబడి ఆలొచించాడు. తరువాత విచారించుకుంటూ శృతికా క్లాసుకు వెళ్ళి అడిగినప్పుడు,

ఆమె ఈ రోజు కాలేజీకే రాలేదు... అని సమాధానం దొరక,

కామేష్ అలాగే షాకై నిలబడ్డాడు!

************************************************PART-7*********************************************

అరే...వెళ్ళేటప్పుడు ఎరుపులో వెళ్ళి, వచ్చేటప్పుడు ఆకుపచ్చలో వచ్చారే! అలాగంటే సిగ్నల్ ఓకేఅని అర్ధమా?”

తిరిగి వచ్చి కారులో ఎక్కి కూర్చున్న శృతికాను కురకురమని చూస్తూ అడిగాడు అశ్వినీకుమార్. ఆ చూపులోని ఆకర్షణ శక్తిని తట్టుకోలేక తల వంచుకుని అడిగింది ఆమె.

అలాగంటే...?” ఏమీ అర్ధం కానట్లు ప్రశ్న తిరిగి వచ్చినప్పుడు కొంటరిగా నవ్వాడు.

అరే...అంతేనా మీరు? నేనేదో మిమ్మల్ని బాగా తెలివి గల మనిషి అనుకుంటు న్నాను -- కళ్ళను ఆర్పుతూ ఎగతాలి చేస్తున్న స్వరంతో అడగగా అమె కూడ అదే వేగంతో తల ఎత్తింది.

ఒక పెద్ద గీతను దాని మీద చెయ్యి పెట్టకుండా చిన్న గీతగా చేయగలం...?”

ఇది చాలా చాలా పాత పజిల్. అయినా చెప్తాను. ఆ గీతకు పక్కన ఇంకొక గీతను పెద్దదిగా గీస్తే...ఇది చిన్న గీత అయిపోతుంది"

చాలా కరెక్టు. అదేలాగానే నేను తెలివిగల వ్యక్తినే. నా పక్కన ఇంకొక పెద్ద తెలివిగల వ్యక్తి వచ్చి కూర్చుంటే, నా తెలివిగల తనం తక్కువగానే తెలుస్తుంది

ఆహా! -- అంటూ నిజంగానే సంతోషపడి నవ్వాడు అశ్వినీకుమార్.

అమ్మో! ఇది మామూలు నోరులాగా తెలియటం లేదు. ఇంకా ఈ నోటిని కెలికి చూడాలని ఉంది. ఇంకా, ఇంకా...మాట్లాడుతూనే ఉండాలని అనిపిస్తొంది

ఏరా...ఈ రోజు కాలేజీకి సెలవు పెట్టేస్తే ఏం?”

రమణ వెంటనే అతి తీవ్రంగా అపోజ్ చేసేలాగా చెప్పాడు.

నో...నో...ఏం మాట్లాడుతున్నావ్ అశ్విన్. ఇంతవరకు మనం ఏ రోజైనా ఇలా అవసరం లేకుండా సెలవు పెట్టామా? అనవసరంగా ఈ రోజు ఎందుకు సెలవు పెట్టాలి?”

సెలబ్రేట్ చేయాలంటే ఎలా?”

మిస్ శృతికా ఎలా చెబితే అలా...

నేనా?” అంటూ సాగదీసింది ఆమె. ఈ రోజు నేను ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలే?”

ఏమిటంత విషేషమో తెలుసుకోవచ్చా?” కావాలనే భవ్యంగా అడిగాడు అశ్వినీకుమార్.

లేదు...ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు నా అభిమాన రచయత యొక్క ఒన్ టు ఒన్ప్రోగ్రాం. మా కాలేజీ ఇండోర్ స్టేడియంలోనే ఉంది...

అదెవరు మీ అభిమాన రచయత?”

చెప్పింది.

ఓహో...ఇద్దర్ని కథా పాత్రలుగా చేసి రాస్తారే...ఆయనా?”

ఆయనే!

అది విన్న అశ్వినీకుమార్ మొహం వాడిపోయింది. ఆపైన ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే తల ఒంచుకుని మౌనంగా వస్తుంటే...ఆమే మళ్ళీ అడిగింది.

ఏమిటి సడన్ గా మాట్లాడకుండా వస్తున్నారు?”

మీరేమిటండీ?” -- అని తిరిగి ఆమెను సోకంగా చూశాడు. స్వరం లోనూ ఒక వ్యామోహం కనబడింది.

మేము మీ దగ్గర మాట్లాడాలి, స్నేహం చేయాలి అని ఆశగా ఉన్నాం. కాలేజీ కూడా కట్ చేసి రావడానికి తయారుగా కాచుకోనున్నాము. ఇంతవరకు ఇలా ఒక్కరోజు కూడా మేము కాలేజీ కట్చేసింది లేదు. మీకొసం ఇన్నిచేసి ఉత్సాహంగా ఉంటే...మీరు రచయత, ‘ఒన్-టు-ఒన్ప్రొగ్రాం అంటూ సమాధానం చెబుతున్నారు.

అది వింటున్నప్పుడు ఎంతో కష్టంగా ఉంది! మాకంటే మీకు ఆయనే కదా గొప్పగా అనిపిస్తున్నాడు? ఉండనివ్వండి...పరవాలేదు. రేయ్ రమణా...ఇలా కాలేజీ పక్కగా వాకిలిలోనే కారు ఆపరా. ఆమె ఆ ప్రొగ్రాముకు వెళ్ళనీ

రమణ...కాలేజీ ఎంట్రన్స్ పక్కగా కారు ఆప-- శృతికా కిందకు దిగకుండా కూర్చునే ఉంది. అర నిమిషం తరువాత తిరిగి చూసిన అశ్వినీకుమార్ ఏమండీ...దిగటం లేదా...కావాలంటే కాలేజీ లోపలకు వెళ్లమని చెప్పనాలేదు...దిగుతారా?”

వద్దు...నేను వెళ్ళటం లేదు" -- శృతికా దగ్గర నుండి సనుగుతున్నట్టు  సమాధానం రావటంతో అతను ఇంకా కోపంగా మాట్లాడాడు.

వద్దు...ఇలా సగం మనసుతో మాతో రావద్దు. కుదిరితే...మళ్ళీ కలుసుకుంటే ఇంకోసారి చూసుకుందాం

లేదు...ఈ రోజే వెళదాం!

వద్దండీ...తరువాత ఆ ప్రోగ్రాం లో కలుసుకోలేక పోయేమే...ఆయన్ని చూడలేక పోయామే అంటూ రహస్యంగా బాధపడుతూ మనసులో మిమ్మల్ని తిట్టుకుంటారు

ఛీఛీ! అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ చిన్న పిల్లలాగా తల ఊపింది. రహస్యంగా ఏడవటం, మనసులోపల తిట్టుకోవటం నా దగ్గర ఉండదు. ఏదైనా సరే మొహానికి ఎదురుగా చెప్పేస్తాను. ఎప్పుడైనా సరే ఒకటి అటూ, లేకపోతే ఇటు. ఏదో ఒకటి తేల్చేస్తాను.

నేను చాలా ఒపన్ మైండడ్. అందువల్ల వస్తాను అని చెబితే వస్తాను. ఈ ఒన్-టు-ఒన్లేకపోతే ఏం? ఆయనకంటే నాకు మీరే ముఖ్యం. అందువలనే మీతోనే వస్తాను

ఓ...థ్యాంక్యూ శృతికా. థ్యాంక్యూ సో మచ్... -- ఎమోషనల్ అయిపోయి, చటుక్కున ఆమె చెయ్యి పుచ్చుకుని కృతజ్ఞత చెప్పినప్పుడు ఆమెలో నూట నలభై వోల్టుల కరెంటు చురచురమని ఎక్కి ఒళ్ళు జలదరించింది. హృదయంలో గుప్పుమని ఏదో పొంగి లేవ...ఓక్క క్షణం అన్నీ మరిచిపోయింది. అతని చేతులో ఉన్న తన చేతిని విడిపించుకోవాలనే ఆలొచనకూడా లేకుండా తలవంచుకుని కూర్చోగా,

రమణ ను చూసి విజయం సాధించిన నవ్వుతో కన్నుగీటాడు అశ్వినీకుమార్.

నేను అనుకున్నదాని కంటే సులభంగాఈమే పడిపోయింది చూశావా?’

నేను అప్పుడే చెప్పానే...ఈ మిడిల్ క్లాస్ అందాలన్నీ సులభంగా ప్రేమ అనే అస్త్రానికి పడిపోతాయని! నా లెక్క ఎప్పుడూ తప్పు అవదు గురువా...ఊ...తరువాత ఘట్టాన్ని కంటిన్యూ చెయ్యి...

చూపుల్లో రమణ చూపిన పచ్చజెండా అర్ధం అవటంతో...తన చదరంగం ఆటలో తరువాత రాణిని జరపటం ప్రారంభించిన రాజుకు ఎలా చెక్పెట్టాలని ఆలొచించాడు.

ఎక్కడికి వెళ్దామో మీరే చెప్పండి. మీరే ఈ రోజు చీఫ్ గెస్ట’! అందువలన ఈ రోజు మొత్తం మీ ఇష్టానికే జరగాలి...

అయ్యో...నాకు అదంతా తెలియదు. మీరేం చెబుతారో అలా చేద్దాం. మొదట కాలేజీ వాకిలి నుండి కారు తీయండి. ఎవరి కంటికీ కనిపించకూడదు. కనిపిస్తే కష్టం

రమణ కారు స్టార్ట్ చేసి గాంధీ రోడ్డులోనే తిన్నగా...కానీ, మెల్లగా నడుపుతూ అడిగాడు........ఏం అశ్విన్, కారును ఎక్కడ పార్కింగ్ చేయాలి?”

ఊ...ఎక్కడికి వెళదాం? నువ్వు చెప్పరా

సెలెబ్రేషన్ అంటే ఏమిటి అర్ధం? ఎక్కడైనా టిఫిన్ తిని, ఏదైనా సినిమాకు వెళదాం. రిటర్నులో సాయంత్రం ఒక కాఫీ. ఈమెను ఇప్పుడు ఎక్కడ దింపామో, అక్కడే దింపేసి మనం వెళ్దాం...ఏమంటావు?”

ఏమంటావు మిస్. శృతికా?”

ఓకే! కానీ, సాయంత్రం ఎక్కువ ఆలస్యం అవకూడదే?”

అర్ధమయ్యింది. ఆలస్యం అయితే మీ అమ్మ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేవు. అంతే కదా...? ఇప్పుడు టైము పదకుండు అవుతోంది. తిన్నగా ఒక మంచి హోటల్ కు వెళ్ళి తినేసి, ఏదైనా సినిమా, బయటకు వచ్చిన వెంటనే ఒక కాఫీ...నాలుగున్నర, ఐదు గంటలకంతా ఇల్లు. సరేనా...?”

సరి... -- ఆమె తల ఊప,

దట్స్ గుడ్... అని నవ్వాడు అశ్వినీకుమార్. "బండీని యూ టర్న్ చేసి తిన్నగా హోటల్ కు పో రమణా"

ఎస్ బాస్! -- అంటూ అతను తలవంచి వినయంగా చెప్ప... శృతికా నవ్వింది.

ఏమిటి నవ్వుతున్నారు...?” అని కారును నడుపూతూనే వెనక్కి తిరిగాడు రమణ. మొట్ట మొదటి సారిగా ఆమెతో మాటలు మొదలు పెట్టాడు.

నిజంగానే వీడు మాకు బాసే’. వీడెవరో మీకు తెలుసా? పెద్ద కోటీశ్వరిని ఒకడే కొడుకు

ఏయ్... అంటూ అశ్వినీకుమార్ అరవ,

అతను, “లేదప్పా, చెప్పనప్పా అన్నాడు.

ఇలాగేనండి ఒక మాట కూడా గొప్పగా మాట్లాడనివ్వడు. గొప్పలు అక్కర్లేదండి. నిజం కూడానా చెప్పకూడదు? చెప్పనివ్వడే! ఒక్కొక్కడూ వాడికి లేనివి కూడా ఉన్నట్టు చెబుతాడు. వీడేమిట్రా అంటే నిండు కుండ తొనకదు అనేలాగా నడుచుకుంటాడు.

నిజంగా చెబుతున్నానండీ...ఇలాగంతా రానే రాదు. ఒక ఆడపిల్ల దగ్గర తల ఎత్తి మాట్లాడడు. ఎవరినీ తన బండీలో ఎక్కించడు. సినిమా, హోటల్ అంటూ తిరగడు. ఈ రోజు ఎందుకో తెలియదు...మీరు వీడ్ని ఎక్కువ మార్చారు

నేనా?” -- సంతోషం కలిసిన చిన్న షాక్ తో ఆమె చూసినప్పుడు... రమణ చిన్న నవ్వుతో మళ్ళీ అది కన్ ఫార్మం చేశాడు.

మీరే నండీ!

హోటల్లో తినేసి బయటకు వచ్చిన వెంటనే, “ఇప్పుడు ఏం సినిమాకు వెళదాం?” అని శృతికాను చూడ...ఆమె, “ఏదైనా ఓకే... అన్నది.

ఏం సినిమాకు వెళదాం?” అంటూ రమణ ను చూడ...,

అతను, “సినిమానా ముఖ్యం...? ఈమెతో వెళ్తున్నామనేదే ముఖ్యం. అందువల్ల సినిమా ఏదైతే ఏముంది?” అన్నాడు జవాబుగా.

ఏదైనా ఎక్కువ గుంపు ఎక్కువగా లేని నూన్ షోజరిగే సినిమా హాలుకు పో రమణ. అప్పుడే ఈమెతో ఫ్రీగా మాట్లాడొచ్చు

సినిమా హాలు వాకిలిలో కారు ఆపి తాళం వేసి, రమణ వెళ్ళి టికెట్టు కొనుక్కు రాగా...లోపలకు వెళ్ళి కూర్చున్నారు.

రమణ, తరువాత అశ్వినీకుమార్, పక్కన శృతికా అని కూర్చోగా, స్క్రీనుపై సినిమా మొదలయ్యింది. పావుగంట వరకు సినిమాపై ద్రుష్టి పెట్టిన అశ్వినీకుమార్ చటుక్కున తిరిగి శృతికాను చూడ...ఆమె సినిమా చూడటం మానేసి తననే చూస్తున్నది గమనించి నవ్వుతూ దగ్గరగా జారి మెల్లగా చెప్పాడు.

సడన్ గా రెండు షార్ప్ గల కడ్డీలు మీదకొస్తున్నట్టు అనిపించిందా...ఏమిట్రా ఇది అనుకుంటూ భయపడి తిరిగి చూస్తే మీరు నన్నే చూస్తున్నారు

హూ... అంటూ ముద్దుగా అతని కళ్ళలోకి లోతుగా తన చూపులను పోనివ్వ,

ఎమోషన్ అయ్యి ఆమె చేతిని పుచ్చుకుని నొక్కాడు అశ్వినీకుమార్. శృతీ...ఐ లవ్ యూ... అని చెప్ప...ఉక్కిరిబిక్కిరి అయిపోయిన ఆమె తల వంచుకుని శరీరం జలదరించ...చెంపలకూ, మొహానికీ గుప్పుమని రక్తం పార...చాలా చిన్నగా, “నేను కూడా..." అని చెప్పింది నోరు!

************************************************PART-8*********************************************

సినిమా ముగిసి తిరిగి శృతికాను వీధి చివర దింపేసి తిరిగినప్పుడు ఎక్కువగా అలసిపోయున్నాడు అశ్వినీకుమార్. అన్నీ అయిష్టంగానూ, సూన్యంగానూ ఉన్నట్టున్న భావనలో ఉన్నాడు. లోపల ఏర్పడ్డ మరోప్రదేశంలో మునిగి శ్వాస ఆడక కొట్టుకున్నట్టు అనిపించింది.

నువ్వు ఏది చేసినా నా దగ్గర నుండి తప్పించుకోలేవు!అంటూ లోతైన మనసులో నుండి ఏదో నవ్వి, ఎగతాలి చేసి అతన్ని తరుముకుని వస్తున్నట్టు అనిపించింది. అమ్మ రూపంలో...ఆలొచనల రూపంలో...ఇంకా దీర్ఘంగా చూస్తే అతని రూపం కూడా అతన్ని తరుముతోంది.

ఏదీ నన్ను వదిలిపెట్టి తరుము చూస్తాను?’ -- ఛాలెంజ్ గా చెప్పి, ‘ఓహో...హోఅంటూ ఘోరంగా నవ్వి, ఎగిరి గంతులేసి,

ఓ...స్టాప్ ఇట్!

అతను నోరు తెరిచి పెద్దగా అరవటంతో భయపడి పోయి గబుక్కున కారు బ్రేక్వేసి ఆపాడు రమణ. తిరిగి చూసినప్పుడు అశ్విన్ ఎక్కువ చెమటతో తడిసున్నాడు. మొహమంతా ఎర్రబడి కందిపోయుంది. చూపు కత్తి చివర షార్ప్ నేస్ లా మెరిసింది. ఎక్కడో ఇంకో లోకంలో ఉన్న అతన్ని ముట్టుకుని, ఊపి చెయ్యి ఎత్తి, తరువాత వద్దనుకున్న రమణ ఏమైంది అశ్విన్?” అని అడిగాడు.

అప్పుడే నిద్రలో నుండి మేల్కొన్న వాడిలాగా కళ్ళను నలుపుకుంటూ రమణ ను చూసిన అశ్వినీకుమార్ ఏమిటి?” అన్నాడు.

ఎందుకు ఇప్పుడలా అరిచావు?”

అరిచానా...నేనా? నేనెక్కడ అరిచాను?”

ఇంకాస్త భయం ఎక్కువైన రమణ అతన్ని జాలిగా చూశాడు. వాట్స్ రాంగ్ విత్  యూ అశ్విన్?”

నతింగ్!

ఆర్ యు ఆల్ రైట్?”

అఫ్ కోర్స్ ఐయాం ఆల్ రైట్

సరే అంటూ నమ్మకం లేని వాడిలాగా తల ఊపాడు రమణ. ఆ తరువాత భయపడుతూ అడిగాడు.

ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్లనా?”

ఇంటికా?" అన్నప్పుడు అతని నరాలు బిగుసుకున్నాయి. చూపుల్లో కోపం ఎక్కింది. పళ్ళు కొరుక్కున్నాడు.

అతనిలోని మార్పులను గమనించిన రమణ ఈజీ...ఈజీ మ్యాన్... అంటూ తొడ మీద చేయి వేసి అతన్ని శాంత పరుస్తున్న వాడిలాగా మాట్లాడాడు.

ఇంటికి వెళ్ళి నీ బెడ్ రూములో బాల్కనీలో కూర్చుని రెండు పెగ్గులు విస్కీ కొడదామని చూసాను

ఊహూ...ఇప్పుడు నాకున్న గజిబిజి మనసుకు రెండు పెగ్గులు సరిపోవు

అలా ఏమిట్రా నీకు మనోబాధ?”

చెప్పినా నువ్వు అర్ధం చేసుకోలేవు రమణ

రమణ ఒక్క క్షణం ఆలొచించి, తరువాత నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

నిజంగానే నాకు నిన్ను అర్ధం చేసుకునేది కష్టంగానే ఉన్నది అశ్విన్. ఒక్క క్షణం ఉన్నట్టు, మరు క్షణం ఉండవు. మొహాన హద్దులు లేని కోపం తెలుస్తోంది. అది చూస్తుంటే నాకే భయంగా ఉంది.

కాసేపటి ముందు కూడా నీ మొహం అలాగే ఉన్నది. శరీరంలోని నెత్తురంతా మొహానికి చేరుకున్నట్టు మొహమంతా ఎర్రని ఎరుపెక్కింది. నీ చూపులు సాన పట్టిన కత్తిలాగా షార్పుగా ఉన్నది. పొత్తి కడుపులో కెలికినట్లు అయి ఒక భయం ఏర్పడింది. నువ్వెందుకెలా అయిపోతున్నావు అశ్విన్? కారణమేమైనా తెలుస్తోందా నీకు?”

నేను ఎలాగూ అవలేదు! సాధారణంగానే ఉన్నాను. నువ్వుగా ఏదేదో కల్పించుకుని కారణం అడిగితే ఎలా చెప్పగలను...?”

దాని తరువాత రమణ ఏమీ అడగలేదు. అడిగినా అతని దగ్గర నుండి సరైన జవాబు రాదు. చిటపటలాడుతాడు, విసుక్కుంటాడు, కోపగించుకుంటాడు -- లేకపోతే పిచ్చి పట్టిన వాడిలాగా అరుస్తాడు.

కొద్ది రోజులుగానే అశ్వినీకుమార్ ఒకే రకంగా ఉండటం లేదు. వ్యత్యాసంగా నడుచుకుంటున్నాడు. విపరీతంగా కోపం తెచ్చుకుంటున్నాడు. హఠత్తుగా మనో పరిస్తితి బాగలేని వాడిలాగా కనబడుతున్నాడు. ఏర్పాటు చేసి తీసుకు వచ్చే ఎక్కువ ఆడపిల్లలను కూడా ముట్టుకున్నది కూడా లేదు.

కొన్ని సమయాలలో మూర్ఖత్వంగా గొంతు పట్టుకుని బయటకు తోస్తున్నాడు. కొందరి ఆడపిల్లలతో వాళ్ళ కుటుంబాల గురించి విచారించాడు.

నీకు పెళ్ళి అయిందా...?”

ఆ అమ్మాయి మౌనంగా నిలబడుతుంది.

అలాంటప్పుడు నువ్వెందుకు ఈ వృత్తికి వచ్చావు?”

“..........................”

మీ ఆయన ఏం చేస్తున్నాడు?”

నాతోపాటూ లేరండీ! ఎక్కడికో పారిపోయారు

అందుకే ఈ వృత్తికి వచ్చావా?”

“.............................”

ఏం...వేరే పనేమీ దొరకలేదా?”

“....................”

సరి...నీకు పిల్లలు ఉన్నారా?”

ఉన్నారు

ఎంతమంది?”

ఒకే అబ్బాయి

నిజమా! అబ్బాయికి ఎంత వయసు?”

పది

నువ్వు చేస్తున్న వృత్తి గురించి వాడికి తెలుసా?”

తెలియదండీ!

నిజంగానే తెలియదా?”

ప్రామిస్ గా తెలియదండీ. ఇంట్లో ఈ వృత్తి చేయను. ఎవరినీ ఇంటి పక్కకే రానివ్వను

మా అమ్మకంటే నువ్వు బెటరే?”

అతను అన్నది ఆమె చెవులకు వినబడకపోవటంతో, “ఏమిటండీ...?” అన్నది.

ఏమీ లేదు. ఇదిగో డబ్బు. నీ రేటు కంటే పైన రెండు రెట్లు ఇచ్చాను-పెట్టుకో. ఇక ఈ వృత్తి చేయకు. అందులోనూ నీ కొడుక్కు తెలిసేటట్టు ఎప్పుడూ చేయకు...పో. ఇక మీదట ఈ ఇంటి వైపు తల చూపకు అంటాడు.

ఆమె వెళ్ళిన తరువాత రమణ అడిగాడు. ఏరా రేయ్...ఆమె ఈ రోజుతో ఈ వృత్తి వదిలేస్తుందని అనుకుంటున్నావా?”

వదిలిపెడుతుందో, లేదో...ఆమెను ముట్టుకున్న పాపం నాకు వద్దు

ఇందులో పాపం ఎక్కడ్నుంచి వచ్చింది?”

నువ్వు వాగుతావురా! అలాంటి అమ్మకు కొడుకుగా ఉంటే అర్ధమవుతుంది. ఇక మీదట ఇలాంటి అమ్మాయలను తీసుకురాకు. ఆ కొడుక్కి తల్లి నడవడిక గురించి తెలిసినప్పుడు వాడి మనసు చాలా నొప్పి పుడుతుంది. నలిగి పోతుంది. హింస పడుతుంది. అలాంటి ఒక పిల్లాడు హింసపడటానికి నేను కారణంగా ఉండటం నాకు ఇష్టం లేదు!

కొన్ని సమయాలలో తల్లి కాని ఆడపిల్లలను...అంటే ఇరవై ఏళ్ళు దాటని యుక్త వయసు అమ్మాయిని కూడా తన వేలు తగలకుండా, డబ్బులిచ్చి తిరిగి పంపించాడు. "ఏమిట్రా...?" అని అడిగితే జవాబు రాదు.

ఆ తరువాత రమణ కూడా అడగటం ఆపుకున్నాడు. అశ్వినికుమార్ ఇక ఇలాంటి అమ్మాయిలను పిలుచుకురావద్దని రమణ దగ్గర చెప్పాడు. అశ్విన్ కి ఆడపిల్లల మీద వ్యామోహం, బలహీనం లేదు అనేది రమణ అప్పుడు అర్ధం చేసుకున్నాడు.

అశ్వినికుమార్ వేరే దేనికోసమో అలా నడుచుకుంటున్నాడు. దేన్నో వెతుక్కుని  వెళుతున్నాడు. ఖచ్చితంగా ఇది అమ్మాయల పిచ్చి, ఆశ కాదు. అనుభవించాలనే తపన లేదు. పిచ్చి లేదు. వీటి వెనుక ఇంకేదో లోతుగా ఒక కారణం ఉందీ. అదే అతని ఒత్తిడికి కూడా కారణం అని ఊహించుకున్నాడు.

ఆ కారణం ఏమయ్యి ఉంటుంది... దాని వెనుక ఉన్న కథో ఏమిటో తెలుసుకోవటానికి రమణ ఇష్టపడలేదు. అతని ఎమోషన్స్ అర్ధం చేసుకోలేదు.  దీని ద్వారా తన ఆదాయాన్ని మాత్రం చూసుకుంటూ పోవడం వలన అశ్వినికుమార్ మనో వికారంతో ఎక్కువ బాధకు గురి అవుతున్నాడని అర్ధం చేసుకున్నాడు.  ప్రశ్నలు అడగటం మానేసి...అతన్నిఅతని ఇష్టానికి వదిలేశాడు.

 ఇప్పుడు కూడా అతని ఇష్టప్రకారమే జరుగుతున్నది ఆన్నట్టు, “ఎక్కడికి వెళ్ళను...ఇంటికి వెళ్ళిపోనా?” అంటూ మళ్ళీ అడిగాడు. అశ్వినికుమార్ అసరీర వాణిలాగా సరే అంటూ తల ఊప...తరువాతి ఐదు నిమిషాలలో ఇంటి పోర్టికోలో కారు నిలబడ్డది. అశ్వినికుమార్ కిందకు దిగాడు. పోర్టికో తప్ప మిగిలిన ప్రాంతమంతా చీకటిగా ఉండటం గమనించాడు.

ఇతను వచ్చి ఐదు నిమిషాలు అయిన తరువాత కూడా తలుపులు తెరవబడలేదు. పనివాళ్ళందరూ వెనుక వైపు గుమికూడి బాతాకానీ కొడుతున్నారు. వాదనలు చేసుకుంటున్నారు. ఇతను వచ్చిన కారు శబ్ధం  చెవులకు వినిపించకుండా, లైట్లు వేయకుండా, తలుపు కూడా తెరవకుండా మాట్లాడుకుంటున్నారు.

ఇతనిలో గుప్పుమని మంటలు అంటుకున్నాయి. కాలింగ్ బెల్లుపైవేలుపెట్టి నొక్కే ఉంచాడు. ఆ శబ్ధానికి పనివాడు వచ్చి తలుపు తెరిచేలోపు తలుపును ఒక తన్ను తన్నాడు. తలుపు తెరుచుకుంది.

లోపలకు వెళ్ళిన వెంటనే టీపా మీద ఉన్న పూలతొట్టెను తీసి కిందపడేసి విరక్కొట్టాడు. అంతకుపైన అక్కడ నిలబడటం ఇష్టం లేక వేగంగా మెట్లు ఎక్కి తన గదికి వెళ్ళాడు. రమణ లోపలకు వచ్చిన వెంటనే గది తలుపును ధబేలుమని తోసి మూసి, డ్రస్సు మార్చుకుంటున్నప్పుడు, అతను మెల్లగా అడిగాడు.

నీకెందుకిలా కోపం వస్తోంది అశ్విన్?”

వస్తుంది ! ఇల్లు ఎలా ఉందో చూశావా? లైట్లు వేయటానికి మనుషులు లేరు. తలుపులు తెరవటానికి మనుషులు లేరు. తింటావా అని అడగటానికి, తోడు ఉండి భోజనం పెట్టటానికి, ఆరోగ్యం బాగుండకపోతే గమనించుకోవటానికి...దేనికీ మనిషి లేరు. ఇల్లా ఇది? దీంట్లోకి వస్తున్నప్పుడు కోపం రాకుండా వేరే ఇంకేం వస్తుంది?”

సరే...వదులు! ఏం కావాలి? బీరు తాగుతావా...లేక విస్కీనా?”

ఎప్పుడూలాగానే విస్కీనే కలుపు...

మొదటి రెండు పెగ్గులు తాగిన తరువాత...మూడో పెగ్గు ముగిస్తున్నప్పుడు అడిగాడు అశ్వినికుమార్.

ఏరా రమణా...ఇంతవరకు నువ్వు తీసుకువచ్చిన అమ్మాయిలందరూ ఆ వ్యాపారంలో ఉన్నవారేనా?”

ఇంతలొ ఎక్కువ మత్తులో ఉన్న రమణా, "ఏమిట్రా అడిగావు?" అని గొణిగాడు.

"ఇంతవరకు నువ్వు పిలుచుకు వచ్చిన అమ్మాయిలందరూ దీన్నే ప్రొఫెషన్ గా పెట్టుకున్న వారే కదా అని అడిగాను

అవునురా!

ఎవరినీ మనం బలవంతం చేయలేదే

లేదురా!

ఎవరి ఇష్టానికి విరుద్దంగా మనం నడుచుకోలేదే?”

ఊహూ

ఒకర్ని కూడా మోసం చేయలేదే?”

లేనే లేదు

ఇప్పుడు ఈ అమ్మాయిని మోసం చేయాలని అనుకుంటే కష్టంగా ఉందిరా

ఏ అమ్మాయినిరా?”

అదే...ఆ శృతికాను!"

ఛీ...దీనికంతా మనసు కష్టపెట్టుకోవచ్చా?”

పోరా...నీకు దేనికీ కష్టం లేదు. ఈ అమ్మాయిని మోసం చేసి మనం చెయ్య బోయేది రేపింగ్కు సమం రా

దేనికి సమమో...మనం చేస్తున్నాం

వద్దురా...నాకెందుకో ఆ అమ్మాయిని వదిలేయాలని అనిపిస్తోంది

పోరా పిరికివాడా. నువ్వు కావాలంటే వదిలేయ్. నేను వదిలిపెట్టను. ఐ వాంటు ఎంజాయ్ హర్!

--చెప్పుకుంటూ అతను మరో పెగ్గు విస్కీ కలిపినప్పుడు...నుదిటి మీద మడతలు పడ, తీవ్రంగా ఆలోచించటం ప్రారంభించాడు అశ్వినికుమార్!

************************************************PART-9*********************************************

ప్రొద్దున ఏడుగంటలకే కూర్చున్న అతను...రెండు ఇడ్లీలు తిని ఆకును మడతపెట్టి, చేత్తో తీసుకుని లేచాడు కామేష్. అది చూసిన బాలమ్మ, “ఏమిటి కామేష్, ఏమిటి లేచావు?” అని గాబరాపడింది.

చాలు అత్తయ్యా. ఆకలి లేదు... -- అతను ఆకును పారేసి చేతులు కడుక్కుని  వస్తుంటే...వదలకుండా అడిగింది బాలమ్మ.

ఏమిటి ఆకలి లేదు అంటున్నావు? దగ్గర దగ్గర ఒక నెల రోజులు అవుతోంది నువ్వు సరిగ్గా తిని. రాత్రి పూట నిద్రా అంతే! అప్పుడప్పుడు లేచి కూర్చుని మౌనంగా ఏదో ఆలొచిస్తూ ఉన్నావు. ఏరా. ఏమిట్రా నీకు అంత కష్టం? ఏ విషయం నిన్ను పట్టి పీడిస్తోందో నా దగ్గర చెప్పు. కుదిరినంత సహాయం చేస్తా

అయ్యో...మీరొకరు. నాకేముంటుంది కష్టం?”

అతను నవ్వుతూనే చెబుదామనుకున్నాడు. కానీ, నవ్వు రాలేదు. పెదాలు వంకరపోయి, ఏడుపు ఎక్కువగా ఉండటంతో... బాలమ్మ దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి ఇంకా తీవ్రంగా అడిగింది.

"ఏమయ్యింది కామేష్? షాపులో బాగా నష్టం వచ్చిందా?”

నష్టం షాపులో కాదు అత్తయ్యా. షాపులో అయితే సర్దుకోవచ్చు! అని చెప్పటానికి వచ్చి గబుక్కున ఆపాశాడు. దానిపైన తన మనసులోని ఎగిసిపడుతున్న మంటలను మొహాన చూపించ కూడదనే పట్టుదలతో తల ఎత్తి బాలమ్మను చూసి నవ్వాడు. ఏమీ లేదు అత్తయ్యా...తలనొప్పి. అందుకని తినడం నచ్చలేదు అన్నాడు.

ఏం నాయనా...ఒక నెల రోజులుగానా తల నొప్పి ఉంటుంది? లోకజ్ఞానం అనేది నాకు లేకపోయినా ఒక మనిషిలోని మార్పులు తెలియకనా పోతుంది?”

వేదనతో అడిగిన బాలమ్మను చూసి మనసులో అనుకున్నాడు అతను. నిజంగానే మీకు ఏమీ తెలియదు అత్తయ్యా. లోకజ్ఞానం తెలియకపోయినా మనిషిలోని మార్పులు తెలుసుకోలేనా అన్నారే...అది కూడా మీకు తెలియదు  అత్తయ్యా.

అలా మనిషిలో మార్పులు తెలుసుకోగలిగిన వారైతే శృతికాలో వచ్చిన మార్పులను ఎలా గమనించలేకుండా పోయారు? గత ఒక నెల రోజులుగా ఆమె మొహంలో కొత్తగా తెలుస్తున్న నవ్వు, కళ్ళల్లో మెరుపులు, చేసుకుంటున్న అలంకారం...ప్రొద్దున తొమ్మిది గంటలు అయితే ఆమెలో ఏర్పడే ఆందోళన త్వరగా అమ్మా...కాలేజీకి టైమయ్యిందిఅని చేసే హడావిడి...

ఇదిగో ఐదు నిమిషాలు ఉండవే. పులుసు తెల్లుతోంది. తిరగమూత వేసి దింపేస్తాను

అయ్యో...ఐదు నిమిషాలా? కుదరదమ్మా! సరిగ్గా తొమ్మిదిన్నరకి స్పేషల్ క్లాసు ప్రారంభమైపోతుంది. ఇప్పుడు బయలుదేరితేనే నడిచి వెళ్లటానికి సరిగ్గా ఉంటుంది

సరే...ఒక్క నిమిషం ఉండు. తిరగమూత వేయకుండానే నీకు పోస్తాను

వేడి వేడిగా ఎవరు తినేది? ఆ చేసే వంటను ఒక అరగంట ముందు లేచి చేస్తే ఏమిటిట? పిల్లికి పాలు పట్టిన కథలాగా ఉంది. ఎవరికి కావాలి ఈ భోజనం? నువ్వే తిను. లేకపోతే నీ తమ్ముడి కొడుకు వస్తాడుగా. వాడికి పెట్టు. నేను బయలుదేరతాను

భోజనం చేయకుండా ఆమె బయలుదేరటం చూసి బాలమ్మ మనసు ఆందోళన చెందింది. వెనకే బ్రతిమిలాడుకుంటూ వస్తుంది.

కొంచం పెరుగన్నం అయినా తిని వెళ్ళవే. చెప్పేది విను. ఖాలీ కడుపుతో వెళితే చదువు ఎక్కదే

చాలు చాలు! నన్ను వదులు...అదే చాలు

వేగంగా నడిచి వెళుతున్న కూతుర్ని బాధతో చూస్తూ నిలబడింది. మధ్యాహ్నం లంచ్ కు వచ్చే కామేష్ తో చెబుతుంది.

ప్రొద్దున అది తినకుండా వెళ్ళిపోయింది కామేష్

అతను తల ఎత్తి విసుగ్గా చూస్తాడు.

ఎందుకు అత్తయ్యా?”

టైమైపోయిందట! అరుస్తూ వెళ్ళిపోయింది...

టైమైపోయిందా? ‘దేనికి టైమైపోయింది?’ అని అడగకూడదా అత్తయ్యా? నీ దగ్గర అరుపులు అరిచి స్టేడియం కార్నర్ లో పదినిమిషాలకు పైనే కాచుకుని నిలబడి అతని కారులో ఎక్కి వెళ్ళుంటుంది. ఎక్కిడికో తెలుసా? స్టార్ హోటల్లో టిఫిన్ తినడానికి! లంచ్, ఇంకొక హోటల్లో, సాయంత్రం ఇంకో హోటల్.

ఆ తరువాత జన సందడేలేని వీధిలో చెట్టా పట్టాలు...తిరిగి వచ్చేటప్పుడు సమయం ఏడుగంటలు అవుతుందే? నా వల్ల కావటం లేదు. నేనడిగితే కేకలేస్తుంది. అడిగి ఒక రోజు తిట్లు తిన్నాను తెలుసా?”

                                                         +++++++

ఎందుకు శృతికా ఇంత ఆలస్యం అయ్యింది?”

ఏదో మీటింగు పెట్టారు. ఆలస్యం అయ్యింది?”

అతన్ని తిరిగి కూడా చూడకుండా అలమారులో పుస్తకాలను పడేసి తిరిగిన వెంటనే మళ్ళీ అడిగాడు కామేష్.

నిజంగానే మీటింగు పెట్టారా శృతికా?"

నడుం మీద చేతులు పెట్టుకుని చటుక్కున తిరిగింది. మొహంలో కోపం, కసి ఎక్కువగా తేలుతూ నిలబడ...మాటలు నిప్పు కణాలుగా వచ్చినై.

ఇదిగో చూడండి...నిజంగానే మీటింగు పెట్టారా, లేదా అనే ప్రశ్న మీరు అడగాల్సిన అవసరం లేదు. నేను మీకు జవాబు చెప్పాల్సిన అవసరమూ లేదు. మీ పనేమిటో అది మాత్రం చూసుకుని వెళ్లండి. అనవసరంగా నా విషయంలో తల దూరిస్తే...మర్యాద చెడిపోతుంది

చెప్పేసి కాలుతో నేలను ఒక దెబ్బ వేసి వెళ్తోంది. తనకి బదులుగా నేలను తంతున్నట్టు అనిపించింది. అయినాకానీ  అతను వదలలేదు.

తెల్ల కారులో చూసి, కాలేజీ వరకూ వెతుక్కుంటూ వెళ్ళి, ఆమె ఆ రోజు కాలేజీకే రాలేదనే వార్తను సేకరించిన దగ్గర నుండి మాట్లాడకుండా ఉండిపోయాడు.

ఆ రోజు మొదలు పొత్తి కడుపులో ఆమె వెలిగించిన మంటలు కాలుతుండంగా...నిద్రపోవటం లేదు. భోజనం తినాలనిపించటం లేదు. ఆ తెల్ల కారు యొక్క నెంబర్ మనసులో రణంలాగా నిలబడ...తన స్నేహితుడి సహాయంతో అది ఎవరికి సొంతమో అనేది కనిపెట్టాడు.

                                                          +++++

అది నటి భానూరేఖా ఇంటి బండిరా! ఆమెకు ఎందుకూ పనికిరాని కొడుకు ఒకడు ఉన్నాడు. వయసు ఇంకా పద్దెనిమిది అవలేదు. అంతలోనే అన్ని చెడు అలవాట్లూ అలవాటైనై. రోజూ ఒక బాటిల్, అమ్మాయి కావాలి. చాలా చెడ్డవాడు. అవునూ...ఎందుకు అడుగుతున్నావు?”

ఏమీ లేదురా...ఆ కారులో వచ్చిన ఇద్దరు నాతో గొడవపడి వెళ్ళారు

ఓ...అందుకని నువ్వు జవాబుగా వాళ్ళతో గొడవపడటానికి వెళ్తావా? వద్దురా! అన్నిటికీ రెడీగా ఉన్న పిల్లలు. పెద్ద చోటు. మాట్లాడకుండా వదిలేయరా

విచారించిన ప్రతి ఒక్కరూ అదేలాగా చెప్ప...ఆ రోజు రాత్రి శృతికాను మెల్లగా హెచ్చరించాడు.

"నువ్వు అప్పుడప్పుడూ ఏదో తెల్లకారులో వెళ్తున్నావటగా?"

అతను ముగించను కూడాలేదు. మొహమంతా ఎర్రబడ చటుక్కున తిరిగింది.

ఓహో...మనసులో పెద్ద జేమ్స్ బాండ్అని అనుకుంటున్నావా? గూఢాచర్యం చేసి కనిపెట్టేసేవు కదూ. అవును వెళ్తున్నా...దానికేమిటిప్పుడు?”

అరవకు శృతికా? అత్తయ్యకి వినబడుతుందేమో

వినబడనీ...బాగా వినబడనీ! ఏదో ఒక రోజు వినబడాల్సిందే కదా. ఆ రోజు ఈ రోజుగానే ఉండనీ

వద్దు శృతికా! ఆమె ఈ విషయం తట్టుకోలేదు

తట్టుకోలేనంత పెద్ద తప్పు ఏం చేశాను? కారులో వెళ్లటం తప్పా?”

కారులో వెళ్లటం తప్పు లేదు శృతికా. కానీ, కాలేజీ కట్ చేసేసి హోటలూ, సినిమా అంటూ తిరగటం తప్పే కదా? అత్తయ్య దగ్గర స్పేషల్ క్లాస్ అని అబద్దం చెప్పటం తప్పు కాదా?”

ఓహో...నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో అనేది కూడా చూడటానికి నా వెనుకే వచ్చి చూడటం కూడా పూర్తి అయిందా? ఓ.కే...ఇంత తెలుసుకున్న తరువాత అన్నీ తెలుసుకోవటంలో తప్పు లేదు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. మేము పెళ్ళి చేసుకోబోతున్నాము

అతను ఎవరో నేను తెలుసుకోవచ్చా?”

ఏం ఇన్ని విషయాలు తెలుసుకున్న మీరు ఆ విషయం తెలుసుకోలేదా?”

లేదు...కారులో ఇద్దరు వస్తున్నారే. అందుకే అడిగాను. నువ్వు చెప్పేది కారు నడిపే వాడినా...లేక అతని పక్కన కూర్చుని వస్తున్నాడే, వాడా అనేది తెలియలేదు

ఇలా చూడండి వాడు...వీడు అని మర్యాద లేకుండా మాట్లాడకండి. వాళ్ళు మీలాగా ఎమీ లేని వాళ్ళు కాదు. పచారీ షాపులో రెక్కలు విరిగేలాగా పనిచేసేవారు కాదుతెలుసా?"

ఆ అబ్బాయి గురించి ఎవరూ మంచిగా మాట్లాడటం లేదే శృతికా. ఒక రోజుకు ఒక బాటిల్ విస్కీ తాగుతాడట. ఈ రోజు వచ్చిన అమ్మాయి రేపు రాకూడదట

ఒక్క క్షణం కామేష్ ని విసుగుతో, కోపంతో, ఆగ్రహంతో చూసింది శృతికా.

మాట్లాడి ముగించారా? ఇంకా ఏదైనా మిగిలుందా?”

లేదు శృతికా...నేను నిజంగానే చెబుతున్నాను. ఆ కుర్రాళ్ళు మొహం సరిగ్గా లేదు......

నోరు ముయ్యండి! అంటూ పళ్ళు కొరుక్కుంది.

వాళ్ల మొహం సరిలేదు. మీ బొగ్గు మొహమే సరిగ్గా ఉందా? మొహమే నలుపు, ఘోరం అని చూస్తే...మీ మనసు అంతకంటే ఘోరంగా ఉందే? మీ నాలిక ఇంకా ఘోరంగా ఉందే. ఇలాగంతా చెప్పి నేను అశ్విన్ ను పెళ్ళిచేసుకోవటాన్ని ఆపాలని చూస్తున్నారా? కుదరదు! ఈ జన్మలో ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు...ఆయన్నే పెళ్ళి చేసుకుంటాను....తెలుసుకోండి. అందువల్ల మీ నక్క జిత్తుల ఐడియాలను వదిలేసి, పక్కగా మీ పచారీ షాపు చూసుకుంటూ...మీ జీవితం జీవించండి

ఏం శృతికా...వాడు నిన్ను పెళ్ళి చేసుకోవాలనే ఆశతో...

ఆపండి! ఇంకో సారి ఆయన్ని వాడు అని చెబితే నేను మిమ్మల్ని ఏరా అని అంటాను. ఇకమీదట నా మీద గూఢాచర్యం చేయటం, బాధపడటం, కరిగిపోయేటట్టు నటించటం అన్నీ వదిలేసి, మీ పనేదో దాన్ని కరెక్టుగా చేయండి...అదే మంచిది...తెలుసా?”

ఆ రోజు నుండి శృతికా, అతనితో మాట్లాడటం ఆపేసింది. అతను ఇంట్లోకి వస్తే, ఆమె ముందు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. అతని చెవులకు వినబడేలాగా...గాయపరిచే విధంగా కావాలనే సనుగుతుంది.

కామేష్ కూడా శృతికా గురించిన విషయాన్ని తన అత్తయ్య బాలమ్మతో  చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు. తెలిస్తే ఆమె తట్టుకోలేదు. ఎక్కువగా కృంగిపోతుంది. మనసులో కుమిలిపోతుంది. ఆమెను బాధపెట్టకూడదనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. విషయం ఎవరి ద్వారానైనా ఆమె చెవులకు వినిపించే లోపు ఎలాగైనా శృతికా విషయాన్ని సరి చేసేయాలని అనుకున్నాడు.

కానీ, అది ఎలా అనేదే తెలియలేదు. నేను చెబుతే శృతికా వినేటట్టు కనబడటం లేదు. ఒకవేల నిజంగానే ఆ కుర్రాడు శృతికా మీద ఆశ పడతున్నాడా? పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడా?

ఎందుకలా ఉండకూడదు? ఎంతమంది డబ్బుగల కుర్రాళ్ళు అందం ఒక్కటే చూసి పేదింటి అమ్మాయలను పెళ్ళి చేసుకోవటం లేదూ?

శృతికా విషయంలో అలాంటి నిర్ణయమైతే ఇతనికి సంతోషమే! శృతికా ఎక్కడున్నా , ఎవర్ని పెళ్ళి చేసుకున్నా ఆమె సంతోషంగా ఉండాలి అనే అనుకున్నాడు. కానీ, దానికి విరుద్దంగా ఉంటే? నేను ఆ కుర్రాళ్ళ గురించి విన్నదంతా నిజంగా ఉండి...వాళ్ళు ఆమెను మోసం చేస్తే?

దానికి జవాబుగా...ముందు ఆలొచనగా ఏదైనా చెయ్యాలి అనే నిర్ణయానికి రావటంతో సైకిల్ను కిందకు దింపి, “వెళ్ళొస్తాను అత్తయ్యా అని చెప్పి వీధి చివరికి వెళ్ళినప్పుడు ఎదురుగా బాలగోపాల్ రావటం చూశాడు. చేతిలో పుస్తకాలు ఉన్నాయి.

"ఏమిటి శివా...స్కూలు లేదా?”

అతను ఒక్క క్షణం తడబడి, ముఖం వాడిపోయి, చూపులు వెర్రెక్క ఉంది అని తల ఊప...నుదిటి మీద గీతలు పడ శివారాం నే దీర్ఘంగా చూసి అడిగాడు కామేష్.

మరెందుకని అప్పుడే వచ్చాసావు? ఒంట్లో బాగుండలేదా?”

ఒంట్లో బాగానే ఉంది. మనసే సరిలేదు

అతను విరక్తిగా చెప్ప... కామేష్ పెదాల చివర చిన్న నవ్వు విరిసింది.

ఏమిట్రా...ఏదో పెద్ద మనిషిలాగా జవాబు చెబుతున్నావు?”

లేదు బావా...నిజంగానే చెబుతున్నా. నేను మీతో కొంచం మాట్లాడాలి

వస్తావా...షాపు వరకు నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ వెళ్దాం అన్నాడు.

శివారాం తల ఊప...వాడి పుస్తకాలు తీసుకుని సైకిల్ వెనక కారియర్లో పెట్టుకుని,  సైకిల్ను తోసుకుంటూ నడిచిన కామేష్ కొద్ది నిమిషాల మౌనం తరువాత  “ఊ...చెప్పు అంటూ అతన్ని తిరిగి చూడ... శివారాం తడబడుతూ, భయపడుతూ  మాట్లాడటం ప్రారంభించాడు.

శృతికా గురించి నేను చాలా విషయాలు వింటున్నాను బావా. వినను వినను భయంగా ఉంది. కోపమూ, ఏడుపూ కలిసి వస్తోంది

అవునూ...అలా నువ్వేం విన్నావు?”

అదొచ్చి...అదొచ్చి...మా స్కూల్లో పదో తరగతి చదువుతున్న కుర్రాడు ఒకడు. ఆ కుర్రాడు కాస్త వేరేగా ఉంటాడు. రౌడీ అని పేరు తెచ్చుకున్నాడు. వాడే నన్ను పిలిచి చెప్పాడు. శృతికా ఎవరో అశ్విన్ అనే కుర్రాడితో తిరుగుతోందట. కాలేజీకి వెళ్లటం లేదట.

ఆ అశ్విన్ భానూరేఖా అనే నటి యొక్క పిల్లడూ అని చెబుతూ అడిగాడు,   ‘రేయ్...మీ అక్కయ్య వాడితో మాత్రమే వెళ్తుందా? నాతో రాదా? వాడు ఎంత ఇస్తున్నాడో, నేనూ అంత ఇస్తానని చెప్పు అన్నాడు. అది విన్నప్పుడు నా ప్రాణం కొట్టుకుంది. నాకే ఇలా ఉంటే, అమ్మకు తెలిస్తే ఆవిడ ఎలా  కొట్టుకుంటుంది? మిమ్మల్ని ఒంటరిగా పిలిచి చెప్పాలని అనుకుంటూ వచ్చాను. మీరే ఎదురుగా వచ్చారు.

ఎలాగైనా దీన్ని మీరే సరిచేయాలి బావా. శృతికాకు మంచి మాటలు చెప్పి, ఆమెను ఆపాలి. అది కాలేజీకి కూడా వెళ్లక్కర్లేదు. త్వరగా పెళ్ళికి ఏర్పాటు చేయండి. ఈ విషయం అందరికీ తెలిస్తే, ఆ తరువాత మనకు అసహ్యం, అవమానం. ఆక్కను ఎవరూ పెళ్ళి చేసుకోరు. అమ్మను ప్రాణాలతో చూడటం కష్టం...

ఛీఛీ... అంటూ కావాలనే నవ్వుతున్న భావాన్ని ఏర్పరచుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు కామేష్. ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఆవేశపడకూడదు శివా. మొదట ఇది నిజమా అని విచారించాలి. నాకు తెలిసి శృతికా ఇలా చేసే అమ్మాయి కాదు. ఆమె పొగరుగా...గర్వంగా ఉండచ్చు. అదంతా వేరే విషయం. అయితే, ఇలా చెయ్యటానికి ధైర్యం లేదు

లేదు బావా. తన అందంతో ఏదైనా సాధించవచ్చు అనే పిచ్చి ధైర్యం తన దగ్గర ఎక్కువగా ఉంది. డబ్బు, అంతస్తు గల కుర్రాడ్ని చూసి పెళ్ళి చేసుకుని, వసతులతో జీవించాలని ఆశ ఉంది. అందువల్ల ఇవన్నీ చేర్చి చూస్తే మా స్కూలు కుర్రాడు చెప్పింది కరెక్టేమోనని అనిపిస్తోంది

ఇదిగో చూడు శివా. ఈ నిమిషం నుండి నీ ఈ బాధను నా దగ్గర వదులు. ఏం  చేయాలో అది నేను చూసుకుంటాను. ఒక వేల శృతికా అలా చేసుంటే దాన్ని ఆపే బాధ్యత నాది. మంచి సంబంధం చూసి పెళ్ళి చేసే బాధ్యత కూడా నాదే.

అందువల్ల అనవసరంగా ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని బాధపడకు! నువ్వు శృతికా గురించి విన్న విషయాన్ని అత్తయ్య దగ్గరో, ఇంకెవరి దగ్గరో చెప్పకు. ఈ చోటుతో...ఈ నిమిషంతో అది మరిచిపోవాలి. ఏం?”

అతను సరే అని తల ఊప, “ఇప్పుడు నువ్వొక సహాయం చేయాలి. నేను కొంచం బయటకు వెళ్తాను. తిరిగి వచ్చేంత వరకు షాపు చూసుకో

చూసుకుంటా బావా

తాళం వేసున్న సైకిల్ని తెరిచి, మళ్ళీ ఎక్కి కూర్చుని అశ్వినీకుమార్ ఇంటివైపుకు తొక్కాడు కామేష్. మధ్యవర్తి దగ్గర కంటే గొడవపడే వాడి కాళ్ల మీద పడటమే ఉత్తమం అని నిర్ణయించుకుని అతనితో ఓపన్ గా మాట్లాడవలసింది ఆలొచించ సాగాడు!

************************************************PART-10*********************************************

ఎప్పుడురా ఓపనింగ్ సెర్మనీ?”

ఓపెనింగ్ సెర్మీనీనా...ఏమిట్రా  చెబుతున్నావు?”

మరేమిట్రా...? ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటావు? బోరు కొట్టటం లేదూ? ఆమెతో పరిచయమయ్యి, తిరగటం మొదలుపెట్టి దగ్గర దగ్గర యాభై రోజులు అవుతోంది. ఇంకో పదిరోజులైతే రెండు నెలలు నిండుతాయి. ఒక్క రోజు కూడా వదలకుండా స్టార్ హోటల్లో తిన్నందువలన ఐదు కిలోలు బరవు ఎక్కాను. అంతకు తప్ప లాభమేమీ లేదు...! ఇంకా చాలా రోజులు దాటు కుంటూ వెళ్లకూడదు. చాలురా ప్రేమిస్తునట్టు నటించటం. టక్కుమని విషయానికి వచ్చాయి...

అశ్వినీకుమార్ ఆలొచంచాడు. ఇంకా అతని లోతైన మనసు అతనికే నచ్చలేదు.  ఏది కావాలో అన్నది తెలియటం లేదు. దేనికోసం కాచుకున్నాడో అనేది అతనికే అర్ధం కాలేదు. శృతికాను అనిభవించే తీరాలి అనే తీవ్రత, వెర్రి ఇతనికి లేవు.

ఏమిట్రా అలా ఆశ్చర్యంతో చూస్తున్నావు...?” -- మళ్ళీ రమణానే ప్రశ్న అడగగా...ఇతను తల ఊపుకుంటూ ఏమీ లేదు... అన్నాడు.

అయితే రేపే పెట్టుకుందామా?”

రేపా...?”

ఏరా...ఏదైనా అడ్డా?”

"ఊహూ...అదంతా ఏమీ లేదు..."

ఏమీ లేదంటే రేపే ముగించేద్దాం

స...రీ...

ఏమిటి సరీ అంటూ లాగుతున్నావు? ఏమిటి ఆలొచన?”

లేదు. ఈ బలాత్కారం అవసరమా...కావాలా అని ఆలొచిస్తున్నాను

ఈ పిల్ల...అమ్మా రామ్మా అంటే వచ్చే పిల్ల కాదు!

ఒక్క క్షణం మౌనంగా దీర్ఘంగా ఆలొచించిన అశ్వినీకుమార్ విరక్తిగా అడిగాడు.

ఏరా...ఎందుకురా మనం ఇలా ఒక్కొక్క అమ్మాయిని అనుభవిస్తూ వస్తున్నాం...? ఇందులో మనం ఏం సాధించాము...?”

ఏమిట్రా ఇది...?" అంటూ ఆశ్చర్యపోయిన రమణ, “హఠాత్తుగా ఎందుకురా ఇలా వేదాంతం మాట్లాడటం మొదలు పెట్టావు...?”

లేదు రమణా. నాకు రాను రాను దేనిమీదా ఇష్టం లేకుండా పోతోంది. అన్ని విసుగెత్తి పోయినై. ఎవరినీ చూడటానికి నచ్చలా. ఏదీ నచ్చలేదు

అమ్మాయలు కూడా నచ్చలేదా?”

వాళ్లే ముఖ్యంగా నచ్చలేదు

పోరా...నువ్వేదో ఒత్తిడితో మాట్లాడుతున్నావు!

అది నాకు ఎప్పుడూ ఉందిరా

ఎందుకోసం ఆ ఒత్తిడి అని ఆలొచించి చూసావా...?”

అదే తెలియటం లేదు! ఏదో జుస్ట్ ఒత్తిడి కాదు. మనసులో ఏదో ఒక కచ్చె,   ఆక్రోషం ఏర్పడుతోంది. లోపల నుండి ఏదో నన్ను కంట్రోల్ చేస్తోంది. హింసిస్తోంది. రాను రానూ ఆ హింస ఎక్కువవుతోంది. తట్టుకోలేకపోతున్నాను. ఈ హింస తట్టుకోలేక ఏదైనా చేసేస్తానేమోనని భయంగా ఉంది

ఏమీ చెయ్యవురా! మనసును ఇలా ఇష్టం వచ్చినట్టు తిరగనివ్వకు. ఆ తరువాత సైకోఅయిపోతావు. నేను చెప్పినట్టు విను. రేపు ఆ శృతికాను పిలుచుకు వచ్చి...

గబుక్కున మధ్యలో అడ్డుపడి అడిగాడు అశ్వినీకుమార్.

ఎక్కడికి?”

వేరే ఎక్కడికి...ఇక్కడికే! ఈ ఇంట్లోనే...ఇదిగో నీ గదిలోనే

లేదు...ఇక్కడికి వద్దురా. ఈ చోట నేను ఎవర్నీ బలవంతం చేసి, మొసం చేసి సాధించ దలుచుకోలేదు. అది నాకు ఇష్టం లేదు

మరి ఇంకెక్కడ పెట్టుకుందాం?”

ఖచ్చితంగా పెట్టుకోవాలా?”

చాలా ఖచ్చితంగా పెట్టుకోవాలి. నాకు కావాలి. నేను వదిలిపెట్ట దలుచుకోలేదు

రమణ స్వరంలో ఉన్న తీవ్రత అశ్వినీకుమార్ను ఒక్క క్షణం షాకులో ఉంచింది. నేను వద్దన్నా, వాడు శృతికాను వదిలి పెట్టడు అని అనిపించింది...కొంచంసేపు లోతుగా ఆలొచించి చెప్పాడు.

సరే...ఎక్కడైనా రూము బుక్ చెయ్యి...

ఎక్కడైనా అంటే...హోటల్లోనా?”

అశ్వినీకుమార్ నోరు తెరిచి మాట్లాడేలోపు గూర్కా తలుపు తట్టాడు.

ఏమిటన్నట్టు చూసాడు అశ్వినీకుమార్.

జీ...మిమ్మల్ని చూడటానికి ఎవరో ఒకాయన సైకిల్లో వచ్చున్నారు. ఖచ్చితంగా, తప్పక మిమ్మల్ని చూసేకావాలంటున్నారు

పేరు అడిగావా...?”

అడిగాను. కామేష్ అని చెప్పారు"

కామేష్ అనే పేరును తన జ్ఞాపకాలతో వెతికి ఓడిపోయిన అశ్వినీకుమార్, “ఎవర్రా...నీకు తెలుస్తోందా...?” అని రమణ ను అడుగ...అతనూ పెదాలు  విరిచాడు. ఎవరనేది తెలుసుకోవాలనే ఆతురతతో కామేష్ని రమ్మని చెప్ప... కామేష్ గడ్డి నేల మీద నడుస్తూ వస్తున్నది చూసిన రమణ చిన్నటి స్వరంతో చెప్పాడు. 

అశ్విన్...వచ్చేదెవరో తెలుసా? శృతికా అత్తయ్య కొడుకో...మావయ్య కొడుకో ఒకడు ఉన్నాడని చెప్పానే...వాడేరా...

అతను ఎందుకు ఇల్లు వెతుక్కుని వస్తున్నాడు?’ అంటూ అశ్వినీకుమార్ ఆలొచిస్తున్నప్పుడే కామేష్ ఒక బిడియంతో హాలులోకి వచ్చాడు. కొంచం కూడా అర్హత లేని చోట, సంధర్భంలోనూ నిలబడి సిగ్గు పడుతూ ఎమోషన్ తో మెల్లగా తనని పరిచయం చేసుకున్నాడు.

"నా పేరు కామేష్. శృతికా యొక్క బంధువును"

అశ్వినీకుమార్ మౌనంగా కామేష్ నే చూస్తూ ఉంటే... రమణ నిర్లక్ష్యంగా అడిగాడు.

బంధువు అని తలాతోకా లేకుండా చెబితే ఎలా? ఏం బంధుత్వం అని తెలుసుకోవచ్చా...?”

దానికి ముందు మీరెవరో నేను తెలుసుకోవచ్చా...?”

నేను ఎవరైతే నీకేమిటయ్యా...? నా గురించి నువ్వు తెలుసుకోవలసింది అనవసరం

గబుక్కున చెయ్యెత్తిన అతన్ని అడ్డుకుని,

నువ్వు కొంచం మాట్లాడకుండా ఉండు రమణా " అన్నాడు అశ్వినీకుమార్. ఆ తరువాత కామేష్ ను చూసి,“కూర్చోండి... అన్నాడు.

సోఫా చివర్లో అతుకున్నట్టు కూర్చున్న కామేష్ 'చెప్పటానికి వచ్చిన విషయాన్ని ఎక్కడ...ఎలా ప్రారంభించాలి?’ అనేది అర్ధంకాక ఒక క్షణం కన్ ఫ్యూజ్ అయ్యాడు. ఆలొచించుకుంటూ వచ్చినదంతా మర్చిపోయినట్లు అనిపించ...మెల్లగా అశ్వినీకుమార్ ను చూశాడు.

ఆ ఇంకొకని కంటే వీడు మేలు అనే భావనతో, ఇతన్నేశృతికా ప్రేమిస్తున్నట్టు చెప్పింది గుర్తుకురాగా, తృప్తిగా అనిపించినా భయం భయంగా చెప్పాడు.

మీ దగ్గర ఒంటరిగా మాట్లాడాలి

మాట్లాడండి

అతను ఆలోచనతో రమణ ను చూడ, ఆ చూపును అర్ధం చేసుకున్న అశ్వినీకుమార్, “అతను నా స్నేహితుడే! అతనికి తెలియని రహస్యం ఒకటి కూడా లేదు. అందువలన మీరు దారాళంగా చెప్పవచ్చు అన్నాడు.

ఆ తరువాత బిడియంతో, సంకట పడుతూ ప్రారంభించాడు కామేష్.

నేను శృతికా యొక్క మావయ్య కొడుకును. ఆమె తండ్రి చనిపోయినప్పటి నుండి ఆ కుటుంబానికి గార్డియన్లాగా ఉంటూ కాపాడుతూ వస్తున్నా. డిపార్ట్ మెంట్ షాపు చూసుకుంటున్నాను. ఏదో సుమారైన సంపాదన వస్తోంది. అందులోనే పరువు, మర్యాదతో ఇంతవరకు జీవితాన్ని నడుపుతున్నాను.

ఇక మీదట కూడా అలాగే నడపాలనే ఆలొచనతోనూ, ఆ కుటుంబం బాగుండాలనే అక్కర ఉన్నవాడిని...కష్ట నష్టాలలో పాలు పంచుకునే వాడిగా ఇక్కడకు వచ్చాను..."

అతను కొంచం ఆపినప్పుడు మీ మాటలకూ, నాకూ ఏమిటి సంబంధం?’ అన్నట్టు అతన్ని చూశాడు అశ్వినీకుమార్. ఆ చూపులు ఏర్పరచిన వేగంతో మళ్ళీ మొదలుపెట్టాడు కామేష్.

ఏమిటలా చూస్తున్నారు...? మీకు తెలియంది ఏదీ నేను చెప్పటానికి ఇష్టపడటం లేదు. సంబంధం లేని విషయమూ మాట్లాడటానికీ రాలేదు!

నేనేం మాట్లాడబోతానో మీకు కొంత తెలిసే ఉంటుంది. దగ్గర దగ్గర రెండు నెలలుగా శృతికా కాలేజీకి సరిగ్గా వెళ్ళలేదు. సరిగ్గా వెళ్ళలేదు ఏమిటి...వెళ్లనే లేదు. ఆమె మీతోనే తిరుగుతోంది.

పెద్ద పెద్ద హోటల్స్, సినిమా, మాల్స్ అంటూ వెళ్లని చోటు బాకీలేదు. చుట్టు పక్కలున్న వాళ్ళు మాట్లాడేంత విషయంగా ఇది మారిపోయింది. అందరూ నవ్వుకునేంత పరిస్థితికి వచ్చింది. శృతికా తమ్ముడు, పదమూడేళ్ల కుర్రాడు నాతో ఒంటరిగా మాట్లాడాడు. కన్నీరు కార ఏడుస్తున్నాడు.

దీని ఎలాగైనా ఆపండి బావా! అని బ్రతిమిలాడుతున్నాడు. అమ్మ చెవికి వినబడితే ఆత్మహత్య చేసుకుంటుందీ అని చెబుతున్నాడు. ఇది నిజం...ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే నిజంగానే ప్రాణం వదిలేస్తుంది...

మళ్ళీ ఆపి...ఎండిపోయిన పెదాలను నాలికతో తడుపుకుని రాసుకుంటునప్పుడు మధ్యలో అడ్డుపడి కోపమూ, ఆత్రము తో అరిచాడు రమణ.

అవునూ...ఈ కథంతా చెప్పటానికా అక్కడ్నుంచి మమ్మల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకు వచ్చావు...

చటుక్కున తిరిగి అతన్ని చూసిన కామేష్ కళ్ళు విరుచుకున్నాయి. మాటలు వేగంగా వచ్చినై.

ఇదంతా మీకు కథలాగానే అనిపించవచ్చు. కాలక్షేపంగా తెలియవచ్చు. కానీ మాకు అలా కాదు. ఇది మాకు జీవిత సమస్య. గౌరవ సమస్య. పరువు సమస్య. జీవితానికీ, చావుకూ మధ్యలో ఊగుతున్న సమస్య. శృతికాకు ఏదైనా ఒకటి జరిగితే ఆ కుటుంబమే ముక్కలైపోయి నాశనం అయిపోతుంది...?”

దానికి మేము ఏం చేయగలం అనుకుంటున్నారు? మీ అమ్మాయిని ఖండించండి. మాతో తిరగకూడదని అడ్దుపడి ఆపండి...

అది కుదురుతుందంటే నేనెందుకు ఇక్కడదాకా వస్తాను? చెబితే వినే మనిషిగా ఆమె ఉండుంటే...ఎందుకు ఇంత కష్టం? మీరు ఆమెతో మాట్లాడి మట్లాడి ఆమె బుర్రను మరింత మొండిగా చేశారు! మధ్యవర్తుల కాళ్లమీద పడటం కంటే, గొడవపడే వాళ్ల కాళ్ళ మీద పడటం మేలు అనుకునే ఇక్కడికి వచ్చాను...

దానికి మా దగ్గరకు వస్తే మేము ఏం చేయగలం?”

కామేష్ ఇప్పుడు రమణ ను వదిలిపెట్టి తిరిగి అశ్వినీకుమార్ ను చూశాడు. లేదు...ఇంత అయిన తరువాత పెళ్ళి పోస్ట్ పోన్ చేయడం మంచిది కాదు అని చెప్పటానికే వచ్చాను...

"పెళ్ళా?" అంటూ షాకై చూశాడు అశ్వినీకుమార్.

ఎవరికి పెళ్ళి?”

మీకూ, శృతికాకూనే"

అరే...ఛీ! అంటూ విపరీతమైన కోపంతో అరిచాడు అశ్వినీకుమార్.

ఏమిటీ మూర్ఖత్వం! ఎప్పుడైనా నేను పెళ్ళి గురించి మాట్లాడేనా అని మీ ఇంటి అమ్మాయిని అడగండి...

ఆమే...మేము ఒకర్ని ఒకరం మనసారా ప్రేమించుకుంటున్నాము. పెళ్ళి చేసుకోబోతామూ అని చెప్పిందే

అనవసరంగా కలలు కనడం, ఊహించుకోవటం ఆమెగా చేసుకోనుంటే దానికి నేనా బాధ్యుడ్ని?”

అలాగంటే మీరు ఏం చెబుతున్నారు? ఆమెను పెళ్ళి చేసుకోబోయేది లేదు అంటున్నారా?”

ఆమెను మాత్రమే కాదు...వేరే ఏ అమ్మాయినీ నేను పెళ్ళి చేసుకోలేను. కారణం, నేను అమ్మాయలను మనసారా ద్వేషిస్తున్నాను

ఆడపిల్లలను ద్వేషిస్తున్నారంటే ఎందుకు మా ఇంటి అమ్మాయితో స్నేహం చేస్తున్నారు?”

అది....అదొచ్చి... -- అశ్వినీకుమార్ తడబడ -- రమణ అతని సహాయానికి వచ్చాడు.

"నువ్వు శాంతంగా ఉండు అశ్విన్. నేను ఇతన్ని చూసుకుంటాను. ఇలా చూడయ్యా...అమ్మాయలతో తిరగటం మా సరదా, మా ఇష్టం. మాకు అదొక ఆటలాగా! అందరమ్మాయలనూ పిలుచుకు వెళ్ళినట్టే మీ ఇంటి అమ్మాయినీ పిలిచాము. వచ్చింది...తీసుకు వెళ్లాము. అంతే!

ఇన్ని రోజులు ఆమెపై మా వేలిగోరు కూడా పడకుండా నడుచుకున్నాం. కానీ, ఇక మీదట అలా నడుచుకునేది లేదు. రేపే ఆమెను తీసుకు పోయి...మిగిలిన అమ్మాయలను ఎలా వాడుకున్నామో ఈమెనూ అలాగే వాడుకోబోతాము.

ఆ తరువాత మిగిలిన అమ్మాయలకు ఇచ్చినట్టు ఈమెకూ డబ్బులు ఇస్తాము. కావాలంటే ఏదో చెప్పావే...కుటుంబం, గౌరవం...దానికొసం డబ్బులు కొంచం ఎక్కువే ఇస్తాం. తీసుకుని వెళ్లమను. ఇప్పుడే ఆ డబ్బును నీ దగ్గర ఇవ్వాలన్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు

కామేష్ కు ఒళ్లంతా వణక, రక్తం వేగంగా బుర్ర వైపుకు వెళ్ళింది.

రేయ్...ఏమిట్రా చెప్పావు?” అంటూ ఏకవచనంతో అతను ప్రారంభించ,

అరే పోరా... అనే విధంగా జవాబుగా అరిచాడు. పెద్ద న్యాయస్తుడిలాగా మాట్లాడటానికి వచ్చాడు. నువ్వు చాలా మంచి వాడిలాగానూ, మీ ఇంటి అమ్మాయి కన్య లాగా మాట్లాడుతున్నావు...

ఏమిటి...ఏమిటి చెప్పావు?”

నిజం చెబితే కోపం ముంచుకు వస్తోందో? అంత అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే బావ వరస, కుటుంబ గార్డియన్ అని నిన్ను వేరే చెప్పుకుంటున్నావు...ఇన్ని రోజులు ఆమెను వదిలిపెట్టుంటావా?”

ముగించేలోపు అతనే ఎదురు చూడని విధంగా కామేష్ అతని మీద ఎగిరి, అతన్ని కిందకు తోసి మొహం, చెంపలు, ఛాతి అంటూ మార్చి, మార్చి కొట్ట...జవాబుగా రమణ అతనిపై దాడి మొదలుపెట్టాడు.

ఇద్దర్నీ విడదీయటానికి ప్రయత్నించి ఓడిపోయిన అశ్వినీకుమార్...గూర్కానీ, తోటమాలిని సహాయానికి పిలిచి కామేష్ ను బయటకు తోసేయమన్నాడు.

తరువాతి నిమిషం ఇంటి వాకిలిలో ఉన్న గడ్డినేల మీద విసిరివేయబడ్డ కామేష్ లేచి, కట్టుకున్న పంచెను సరిచేసుకుంటూ, ఆగ్రహం, ఏడుపు, ఏమీచేయలేని తనం కలవ,

బాగుపడరురా దుర్మార్గుల్లారా! నాశనం అయిపోతారు... అంటూ శాపం ఇచ్చిన అదే సమయం,

ఇంట్లో నుండి ఉరిమేడు రమణ.

ఇంత జరిగిన తరువాత ఆ అమ్మాయిని వదలకూడదు అశ్విన్. ఇప్పుడే వెళ్ళి రూము బుక్ చేస్తాను. రేపు ప్రొద్దున మొదటి పనిగా ఆమెను తీసుకువెళ్దాం!

************************************************PART-11*********************************************

హఠాత్తుగా నీరసించిపోయాడు అశ్వినీకుమార్ కు కొంచంసేపటికి ముందు జరిగిన సంఘటన వలన ఆయసంగా ఉన్నట్టు అనిపించింది. వేరే దారిలేక కామేష్ ని బయటకు తోశేయమన్నాడే తప్ప...అతని మొహమూ, మాటలూ, కళ్ళల్లో తెలిసిన బాధ మనసులో అతుక్కుని, పోము అని మొండికేస్తున్నాయి.

మళ్ళీ మళ్ళీ అతను శృతికా కోసం బ్రతిమిలాడింది ఇబ్బంది పెడుతోంది. అయ్యో పాపంఅనే భావం కలిగించింది. ప్రారంభం నుండే గౌరవం, మర్యాదతో భవ్యంగానే మాట్లాడాడు అతను. ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడ లేదు.

నిజమైన బాధ్యత గల కుటుంబ గార్డియన్ స్థానంలో నిలబడి బ్రతిమిలాడే దోరణిలొనే అడిగాడు. మధ్యవర్తి కాళ్ళ మీద పడటం కంటే గొడవపడే వాళ్ళ కాళ్ళ మీద పడటం మంచిదని వచ్చాను అని చెప్పాడు.

అలాంటి వ్యక్తికి కోపం తెప్పించింది రమణ! తప్పుగా మాట్లాడింది కూడా వాడే. ఎంత అవమాన పరిచేవిధంగా మాట్లాడగలడో అంత అవమానపరిచే విధంగా మాట్లాడాడు. అసహ్యంగా మాట్లాడాడు. కామేష్ కు బదులుగా రమణ ను  బయటకు తోసేసుండాలి. కానీ, అతని పరిచయం, స్నేహం అడ్డుపడింది.

వీడితో స్నేహం చేయకుండా ఉండుంటే ఇన్ని తప్పులు చేసుండమేమో? అనే ఆలొచన వచ్చింది అశ్వినీకుమార్ కు. ఇంత పిచ్చెక్కి, తిరిగి ఉండే వాళ్లం కాదు. హీనమైన కార్యాలలో దిగి ఉండేవాళ్లమే కాదు,

ఇంత జరిగినా ఇంకా తప్పు చేయాలనే ఆలొచనతో దెబ్బతగిలిన పులిలాగా ఉరుముతూ నిలబడ్డ రమణ ను చూడ, చూడ పొత్తి కడుపులో నుండి విరక్తి, కోపం పుట్టుకొచ్చింది.

ఛీ...ఏం మనిషిరా నువ్వు?’ అనే ప్రశ్న చూపుల్లో బయట పడ,

రమణ కొంచం గాబరాపడుతూ అడిగాడు. ఏమిట్రా అలా చూస్తున్నావు?”

తనలో ఏర్పడ్డ విరక్తి, కోపం, విసుగు అనుచుకుని నిదానంగానే మాట్లాడాడు అశ్వినీకుమార్ నాకు ఈ శృతికా కావాలని అనిపించటం లేదు రమణా...ఆమెను వదిలేద్దాం

అతను బ్రతిమిలాడే స్వరంతో చెప్ప...దానికి విరుద్దంగా రమణ చూపుల్లో మూర్ఖత్వం ఎక్కి, స్వరం బిగుసుకుంది. వదిలిపెట్టటమా? దాన్నా? లేదు! ఆ బొగ్గు మనిషి వచ్చి ఇంత మాట్లాడి వెళ్ళాడు. నువ్వు ప్రశాంతంగా వదిలేద్దామని చెబుతున్నావు. నీకు అక్కర్లేకపోతే వదిలేయి. కానీ, నేను ఆమెను వదిలిపెట్ట దలుచుకోలేదు

ఓ.కే! నీకు నేను అడ్డుపడటం లేదు. కనుక నువెళ్ళి దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. రేప్రొద్దున కరెక్టుగా తొమ్మిదింటికి వచ్చి నిన్ను కలుస్తాను

ఆ జవాబుతో తృప్తి పడ్డ రమణ అడిగాడు నువ్వుగా వస్తాన్నంటావా...? లేక,  ఎప్పటిలాగా నేనే వచ్చేయనా?”

వద్దు...నేనే వస్తాను

శృతికాను తీసుకు వస్తావా?”

లేదు...ఇద్దరం కలిసి తీసుకు వద్దాం

సరే అని బయలుదేరిన రమణ, తలుపు దగ్గరకు వెళ్ళి అనుమానంతో ఆగాడు. తిరిగి చూశాడు.

ఏమిటీ?”

నీకు నామీద కోపమా?”

లేదు!

అయితే రేపు ప్రొద్దున కలుద్దాం

బయట రమణ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి వెళ్తున్న శబ్ధం వినబడటంతో, గది  తలుపును విసురుగా మూసుకున్నాడు అశ్వినీకుమార్ - చొక్కా విప్పి విసిరేశాడు. అతి మూర్ఖుడా!అంటూ మంచం మీద పడ్డాడు.

కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో భారంగా మనసును అదుముతున్నట్టు అనిపించింది. రమణ చెప్పి వెళ్ళిన మాటలు జ్ఞాపకం వచ్చాయి.

నీకు వద్దంటే వదులు. కానీ, నేను ఆమెను వదలను

ఎంత బలంగా చెప్పాడు? ఎంత దృఢంగా, దీర్ఘంగా నిర్ణయించుకున్నాడు? ఈ నిర్ణయానికి కారణం కామేష్ మాట్లాడి వెళ్ళింది మాత్రమే కాదు...వాడికే లోతైన మనసులో శృతికాను అనుభవించాలనే కృరమైన ఆశ...ఆమె మానాన్ని నిలువు దోపిడి చెయ్యాలనే ఘోరమైన కోరిక.

కొంచం ముందు తన యొక్క మనో వికారాలకు రమణే కారణం అని అనుకున్న దానికి మారుగా ఇప్పుడు రమణ యొక్క ఈ కృరమైన ఆశకీ, ఘోరమైన కోరికకూ నేనే కారణం అని అనుకున్నాడు అశ్వినీకుమార్.

ఆ రోజు తన గదిలో కూర్చుని నాకు నీలాగా మా నాన్నపై పగ తీర్చుకోవాలని ఉన్నదిరా. కానీ ధైర్యం రావటం లేదు అంటూ ఏడ్చిన అతనికి ధైర్యం ఇచ్చింది ఎవరు...?

నేను!

చదివి ముగించేలోపు వంద మంది అమ్మాయలనైనా నాశనం చేయాలి...అనే ఆలొచనను పెంచింది...? నేనే కదా!

న్యాయంగా చూస్తే అతన్ని చెడిపింది, బురద గుంటలో కాలు పెట్టమన్నది నేనే కానీ ఇంకెవరూ కారే! రేపు వాడు శృతికాను ఏదైనా చేసేటట్టు అయితే దానికీ కారణం నేనే కదా,

మనసులో నేర భావన ఎక్కువ అవటంతో...తన మీద తనకే విసుగు, కోపమూ పైకెక్కి కూర్చున్నాయి. రెండు చేతులతోనూ తల పట్టుకుని ఆలొచించ ఆలొచించ మెల్లగా ఆవేశం తగ్గింది. వీటన్నిటికీ మూల కారణం అమ్మేఅనే ఆలొచన రాగా, ఆగ్రహం పొంగింది. తప్పు చేసిన భావం ఎక్కువ అయ్యింది!

ఆ కామేష్ లాగా తీర్మానంగా, బాధ్యతగా ఉండలేకపోయేమే అనే ఆలొచనతో విరిగిపోయాడు. వాడ్ని అడిగామే, మీ ఇంటి ఆడపిల్లను అనిచిపెట్టకుండా ఎందుకున్నారు? అని. అదెందుకు నేను చెయ్యలేదు? అమ్మతో నువ్వు నటించింది చాలు!అని ఎందుకు ఆపలేదు? మనింట్లో ఎవడుపడితే వాడు రాకూడదు అని ఎందుకు ఆర్డర్ వెయ్యలేదు?

దానికి బదులు అమ్మపై పగ తీర్చుకుంటున్నాను అని అనుకుని...జవాబుగా నేను చెడిపోయింది ఎంత పిచ్చితనం! ఆమె సంపాదించిన డబ్బుతో తింటూ, ఊరంతా తిరిగితూ, పిచ్చి పిచ్చి అమ్మాయలకూ లెక్క చూడకుండా డబ్బు ఇచ్చి...వేలకు వేలు మందుకు, హోటల్లకూ కర్చుపెడుతూ,

అలాంటి నాకు...అమ్మను అడిగే అర్హత ఎక్కడుంది?'

మరింత క్రుంగిపోయి చీకటిలో కూర్చున్నందువలన బయట చీకటి లోపలకు ప్రవేసించింది. శరీరం చిన్నగా వణకడం మొదలుపెట్టింది. ఇంకేం చేయాలి?’ అన్న ప్రశ్న బూతాకారంలో లేచి బెదిరిస్తోంది.

అతనికి ఏమీ అర్ధం కాలేదు! ఏం చేయాలి...ఎలా చేయాలి?’ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చి జవాబు తెలియని అయోమయంలో అతన్ని చిక్కుకునేటట్టు చేసింది. లేచి మళ్ళీ చొక్కా వేసుకుని బయలుదేరాడు. కిందకు వచ్చి కారు తలుపు తెరిచి ఎక్కి కూర్చోబోతుంటే చటుక్కున జ్ఞానోదయం వచ్చింది. కారు దిగి నడిచే వెళ్ళాడు.

నడిచి వెడుతున్న యజమానిని గూర్కా ఆశ్చర్యంగానూ, కొత్తగానూ చూడ...అతను ఎక్కడెక్కడో తిరిగాడు. బస్సు పుచ్చుకుని ప్రకాశం నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర దిగాడు. అక్కడ నుండి నడుచుకుంటూ గాంధీ బొమ్మ ఉన్న వైపుకు వచ్చాడు. మనసు అలమటించకుండా ప్లాట్ ఫారం పక్కగా మెల్లగా నడుచుకుంటూ, రైల్వే స్టేషన్, జైపూర్ కార్నర్ అంటూ నెహ్రూ బొమ్మ దగ్గరకు వచ్చి అక్కడున్న సినిమా ధియేటర్ లోకి చొరబడ్డాడు.

లైట్లు ఆపి సినిమా మొదలుపెట్టినందు వలన...టార్చ లైటు వేసి ఆ వెళుతురులో అతని సీటు చూపించబడింది. కూర్చున్న వెంటనే...ఒక టాప్ హీరోను గట్టిగా కౌగలించుకున్న భానూరేఖా ప్రేమ మాటలు మాట్లాడ...ఇతను గబుక్కున లేచి బయటకు వచ్చాడు. అతని శరీరంలోనూ, మనసూలోనూ మళ్ళీ మంటలు చెలరేగినై.

ఛీ...ఏం అమ్మ ఇది? వయసు వచ్చిన కొడుకు ఉండగా...ఇలా కూడా సిగ్గు లేకుండా నటించగలదా? నటించాలనిపిస్తుందా? ఇది చూస్తే నా కొడుకు ఏమనుకుంటాడో? భయం రాదా? అవమానంగా ఉండదా? ఇవేవీ లేనిదా నా తల్లి?

ఇంటికి వచ్చినప్పుడు పోర్టికోలో నిలబడున్న విదేశీయ కారు, తల్లి ఇంట్లో ఉండటం తెలియబరచింది. ఇతను తిన్నగా మేడపైకి వెళ్ళి తల్లి గది తలుపును కొట్టటానికి చెయ్యి ఎత్తి తడబడ్డాడు.

అమ్మ ఎవరితోనైనా ఉంటే ఏం చేయను?’ అని అనిపించ ఒక్క క్షణం ఆలొచించాడు. తరువాత...ఎవరు ఉన్నా ఈ రోజు అమ్మతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి అనే ఆలొచనతో మెల్లగా తలుపు కొట్టాడు.

ఒక్క క్షణంలోనే తలుపు తెరిచిన భానూరేఖా, అతను నిలబడటం చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటి అశ్విన్?’ అని అడగాలని నోరు తెరిచి చటుక్కున ఆపుకుంది. ఈ మధ్య కాలంలో అతని పోకడ, చేష్టలూ సరి లేదనేది జ్ఞాపకం వచ్చి మొహం మాడ్చుకుంది. అతనితో మాట్లాడటం ఇష్టం లేదనే దోరణిలో కఠినంగా, “ఏమిటి...?” అన్నది.

అశ్వినీకుమార్ తల్లి మాటలోని దోరణితోగానీ, ఆమె ముఖ భావంతోనూ కొంచం కూడా బాధపడినట్లు లేక అడిగాడు. మీతో కొంచం మాట్లాడాలి!

ఏం మాట్లాడాలి?”

అది ఇలా గది వాకిట్లో నిలబడి చెప్పలేను

అదేం పరవాలేదు...చెప్పు

లేదు. నీ గదిలోకి వచ్చి చెబుతాను

వద్దు. ఇక్కడే చెబుతానంటే చెప్పు. లేదంటే నేను లోపలకు వెళ్ళిపోతాను

ఏం...లోపల ఎవడైనా కూర్చోనున్నాడా...?”

ఆ ప్రశ్న ఆమె శరీరానికి కరెంటు తగిలినట్లు అనిపించ ఏమిట్రా ఏం చెప్పావు... దొంగ రాస్కేల్...?" అని వాడిని కొట్టటానికి వెళ్ళింది భానూరేఖా.

హూ... అంటూ పెద్దగా ఒక ఉరుము ఉరిమి, ఆమె చేతులను మూర్ఖత్వంగా తోసి పక్కకు జరిగి నిలబడ్డాడు అశ్వినీకుమార్!

ఇంతకుపైన నా ఒంటి మీద ఒక దెబ్బ పడినా జరిగేదే వేరుగా ఉంటుంది...జాగ్రత్త!

ఏం చేస్తావురా...తిరిగి కొట్టబోతావా? కొట్టు...బాగా మనసు తృప్తి చెందే వరకు కొట్టు. కొంచం సేపటి క్రితం మాటలతో కొట్టిన దెబ్బ కంటే, ఇదేమంత ఎక్కువ నొప్పి పుట్టదు...నువ్వు మూడు నెలల పసికందుగా ఉన్నప్పుడు, మీ నాన్న ఇంకొకత్తితో పారిపోయినప్పుడు, ఒంటరిగా ఏ తోడూ లేకుండా, ఎవరి సహాయమూ దొరకకుండా ఎన్నో తిప్పలు పడి నిన్ను పెంచి పెద్దచేసి ఈ పరిస్థితికి తీసుకు వచ్చినందుకు...నువ్వెందుకురా మాట్లాడకుండా ఉంటావు...?

అవును...ఇన్ని అడుగుతున్న నువ్వు ఏమన్నా మంచిగా నడుచుకుంటున్నావా. వయసు వచ్చిన పిల్లాడిగా...లక్షణంగా ఏం చేశావు? కాలేజీకి డబ్బు కడుతున్నాను. కరెక్టుగా కాలేజీకి వెళుతున్నావా? ఒక్క సబ్జేక్టు కూడా విడిచిపెట్టకుండా 'ట్యూషన్ ' పెట్టించాను. ఒక్క సబ్జెక్టులోనైనా పాసయ్యావా? అడ్డగాడిదలాగా తోడుగా ఇంకొక అబ్బాయిను చేర్చుకుని ఊరంతా తిరిగొస్తున్నావు...ఏ అమ్మాయి దొరుకుతుందా అని గాలెం వేస్తున్నావే!

నువ్వెక్కడికి వెళుతున్నావు...ఏం చేస్తున్నావు అన్ని విషయాలూ నాకు తెలుసు. వయసు ఇరవై ఒకటి అవుతోందే...ఇంతవరకు స్వయంగా ఒక రూపాయి అయినా సంపాదించావా? నేను సంపాదించే డబ్బును ఖర్చుపెట్టటానికి నేర్చుకుని...ఊరంతా తిరగటం తెలుసుకుని...స్టార్ హోటల్స్ వెతుక్కుని తినడానికి అలవాటు పడ్డావు!

.....................”

ఏరా రేయ్...ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నాను. ఒక్కసారైనా, ‘ఏమ్మా ఇంకా కష్టపడుతున్నావు? ఇకమీదట నువ్వు నటించ అక్కర్లేదమ్మా. నటించింది చాలు అని ఏ రోజైనా చెప్పావా? ఒకే ఒక రోజున అయినా అమ్మా...తిన్నావా?’ అని అడిగావా? ఏ ఊరికి వెళుతున్నానో తెలుసుకోనున్నావా? ఏంత సంపాదిస్తున్నాను...ఎంత ఖర్చు అవుతోంది అని లెక్క చూశావా? త్వరగా చదువు ముగించి, కుటుంబ బాధ్యతను మోద్దామని అనిపించిందా నీకు?

ఇక నేను సంపాదిస్తాను. నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉండమ్మా అని చెప్పావా? అరె...చెప్పను కూడా అక్కర్లేదు. మనసులోనైనా అనుకోనున్నావా? సరే...అదంతా పోనీ. ఇంటికి ఎవడేవడో వస్తున్నాడే...వాళ్ళను బయటకు పొండిరా కుక్కల్లారా...అని మెడ పుచ్చుకుని తోసావా? వయసుకొచ్చిన మగ పిల్లాడు అదే కదా చేయాలి?

కానీ, అవేమీ చెయ్యలేదు! ఇలాంటి బాధ్యతలు కన్నవారికి మాత్రమే కాదు...కొడుకుగా ఉన్నవాడికి కూడా ఉన్నదని ఎప్పుడన్నా అనుకున్నావా. అనుకోలేదు. కారణం...? డబ్బురా...! అదిచ్చే సెక్యూరిటీ, భావం, స్వతంత్రం.

అమ్మని బెదిరించి ఏదైనా అడగబోయి...మనల్ని ఇంట్లో నుండి వెళ్ళిపొమ్మంటే ఏం చేయాలి? అన్న భయం. నీ స్వార్ధం కోసం, సొగసైన ఆడంబర జీవితం కోసం మాట్లాడకుండా ఉండిపొయావు...ఇలా నన్ను అడగటానికి నీకు ఏం అర్హత ఉందని ఆలొచించి మాట్లాడు.

ఒంటరిగా...ప్రశాంతంగా కూర్చుని క్లియర్ అయిన మనసుతో ఆలొచించు. ఆ తరువాత ఏదైనా అర్హత ఉంది అంటే వచ్చి మాట్లాడు. ప్రశ్నలడుగు . జవాబు చెబుతాను. అందువల్ల ఇప్పుడేమీ అడగకు. అడిగినా నేను సమాధానం చెప్పను. అర్ధమయ్యిందా...?”

చెప్పేసి భానూరేఖా ఏడుస్తూ వెళ్ళి తన గది తలుపులు వేసుకోగా, అశ్వినీకుమార్ కొన్ని నిమిషాలు ఆ చోటులోనే కాలు అతుక్కుపోయినట్లు నిలబడ్డాడు. బుద్ది కూడా కొద్దిసేపు పనిచేయలేదు. లాగిపెట్టి చెంప మీద మళ్ళీ మళ్ళీ తల్లి కొట్టినట్టు అనిపించింది.

ఎలా అడిగి వెళ్ళిపోయింది? బాణంతో గుండెల్లో గుచ్చినట్టు ఇంత షార్ప్ అయిన ప్రశ్నలు! కానీ, ఒక్కొక్క మాట సత్యం. అంతా సత్యం. సత్యం తప్ప ఇంకేమీలేదు. ఆ రోజు ప్రొద్దున్నే తాను అడగాల్సినదంతా ఆమె అడిగేసింది. తనకున్న అదే ఆరాటము, నిరాశ ఆమెలో కూడా ఉన్నది. అదే ఎదురుచూపు ఉన్నది. కోపమూ ఉన్నది. వాటన్నిటిలోనూ ఒక న్యాయమూ ఉన్నది.

అలా నేను నడుచుకోవాలని అమ్మ ఎదురుచూసింది. ఏం చేస్తున్నానని అడగాలని ఆశపడింది. అలా అడిగున్న పక్షంలో సాధారణమైన మనిషిగా, ఉత్తమ అమ్మగా మారి ఉండొచ్చు. పాత విషయాలు ఎలా ఉన్నా బాధ్యత గల కుటుంబ హెడ్ గా నిలబడుంటుంది.

బాధ్యతలను నెరవేర్చకపోవటం నా తప్పే! అందువలన ఆమె చెప్పినట్టు ఏ ప్రశ్నా అడిగే అర్హత నాకులేదు. అమ్మ అమ్మలాగా లేదని ఒక స్వీయ జాలి, ఏమీ చేయలేని వాడిలాగా అనుకుని తానూ కొడుకులాగా నడుచుకోలేదు.

ఆ బాధ్యత తీసుకునే స్థానంలో నిలబడటం మర్చిపోయి, కాలుజారి అదః పాతాళంలోకి పడిపోయారు ఇద్దరూ. ఇక ఆ స్థానంలోకి ఎక్కటమో...వదిలేసిన స్థానాన్ని పట్టుకోవటమో తల్లీ-పిల్లాడు ఇద్దరికీ సాధ్యం కాదు. ఒకొర్నొకరు చూసుకోలేక, మాట్లాడుకోలేక విసుగుతో -- వేరే దారిలేక ఒకే ఇంట్లో తిరుగుతూ,  ఓ...ఇది ఇకమీదట కూడా కంటిన్యూ అవ్వాలా? ఇంత జరిగిన తరువాత అది సాధ్యమవుతుందా?

ద్వేషము, వేదన కలిసి గుండెను పిండ...ఏ రోజునా లేని అతీతమైన అలసటతో మెల్లగా నడుచుకుంటూ తన గదికి వచ్చాడు. ఇంకా మౌనంగా ఉండటం ఇష్టం లేక ఆలొచించటం మొదలుపెట్టాడు.

అలా కూర్చుని ఆలొచించ, ఆలొచంచ ఈ సమస్యకు ఒకే ముగింపు కనబడింది. ఎంత ఆలొచించినా మళ్ళీ మళ్ళీ అదొక్కటే దారి అనిపించ...దాన్ని అమలు చేయాలనే దృడమైన మనసుతో లేచి టేబుల్ దగ్గరకు వెళ్ళి లెటర్ రాయటానికి కూర్చున్నాడు!

************************************************PART-12*********************************************

రాత్రంతా ఆలొచించినప్పుడు మరుసటి రోజు ప్రొద్దున ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు అశ్వినీకుమార్. ఎటువంటి ప్రేరణ, అడ్డు ఏర్పడి మనసు మారే లోపల దాన్ని నెరవేర్చాలనే అవసరంతో పనిలోకి దిగాడు. పెందరాలే లేచి, స్నానం చేసి, డ్రస్సు మార్చుకుని, కాఫీ తీసుకు వచ్చిన పనివాడి దగ్గర, “అమ్మ..లేచిందా?” అని విచారించాడు.

ఆ పనివాడు లేదు అని తలఊప, ఒక్క క్షణం సంకోచించి నిలబడి...తరువాత వేగంగా దిగి కిందకు వచ్చాడు. షెడ్డులో ఉన్న కారును తీసుకుని, బయలుదేరి రమణ ఇంటి కాంపౌండ్లో దూరుతున్నప్పుడు గేటు దగ్గర నిలబడున్న గూర్ఖా ఎప్పటిలాగానే సెల్యూట్చేశాడు. ఎప్పుడూ జవాబుగా తిరిగి సెల్యూట్కొట్టకుండా నిర్లక్ష్యంగా ఆ గూర్ఖా ఒక మనిషే కాడు అనే భావంతో తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయే అశ్వినీకుమార్ ఆ రోజు కారును నెమ్మది చేసి, గూర్ఖాకు రిటర్న్ సెల్యూట్కొట్టి, అతన్ని ఆశ్చర్యపరచి లోపలకు వచ్చాడు.

పోర్టికో చుట్టూ కొంచం ముందు ఎర్ర ఎర్రటి పెద్ద పూవులు పూసున్న చెట్ల పక్కన, రమణ యొక్క బెడ్ రూముకి కింద కారు ఆపాడు. కారు నుండి దిగకుండానే గట్టిగా  హారణ్ కొట్టాడు. రెండు మూడు సార్లు కొట్టినా రమణ రాకపోవటంతో కొంత విసుక్కుని, చెట్లకు నీళ్ళు పోస్తున్న పనివాడిని పిలిచి అడిగాడు.

ఎక్కడయ్యా మీ చిన్న యజమాని?”

తోట పనివాడు అతి భవ్యంగా నీళ్ళ పైపును కింద పడేసి పరిగెత్తుకు వచ్చి జవాబు చెప్పాడు.

మేడమీద గదిలో నిద్ర పోతూ ఉండుంటారండి...!

అశ్వినీకుమార్ చేతి గడియారం చూశాడు. టైము ఏడు నలభై. ముందుగానే వచ్చాను. ఎనిమిదిన్నరకు లేచే అలవాటు ఉన్నవాడు రమణ.

ఇతను కూడా తొమ్మిదింటి తరువాతే వస్తానని ముందు రోజు చెప్పిన వాడే. అందువలనే రమణ ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. లేకపోతే క్రితం రాత్రి బాగా తాగుంటాడు. 

ఏదైనా సరే ఇప్పుడు అతన్ని లేపే కావాలి. లేటు చెయ్య కూడదు. లేటు చేసే ఒక్కొక్క క్షణం మనసు మొండికేసి మారిపోవచ్చు. గబుక్కున నేను తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి మనసులో గట్టిగా చెప్పుకుని, తోట పనివాడిని చికాకుతో చూశాను.

వెళ్ళయ్యా...వెళ్ళి నేనొచ్చి కింద కాచుకున్నానని చెప్పి లేపవయ్యా

ఇదిగో లేపుతానండీ

తొటమాలి ఆందోళన పడుతూ వచ్చి లేపటంతో రమణ ఏదీ అర్ధం కాక కళ్ళు నలుపుకుంటూ చూశాడు.

అయ్యా, అశ్వినీకుమార్ అయ్యగారు వచ్చున్నారు. మిమ్మల్ని లేపమన్నారు...

ఎవరు...ఎవరూ...?”

అశ్వినీకుమార్ అయ్యగారు

అశ్విన్...?” -- అతని చూపులు గోడగడియారం వైపుకు వెళ్ల, ‘ఏమిటి ఇప్పుడే వచ్చేశాడు...?' అని గొణుక్కుంటూ, దుప్పటిని విదిలించుకుంటూ లేచి నిలబడి  కొంచంగా తూలాడు. తల కొంచం భారంగా అనిపించ, చెప్పులు వెతుక్కుని, రెండు రెండు మెట్లుగా దిగి పరిగెత్తుకు వచ్చాడు. అశ్వినీకుమార్ కారును చేరుకుని, డ్రైవింగ్ సీటుపక్కకు వంగి గుడ్ మార్నింగ్చెప్పి, “ఏమిట్రా ఇంత త్వరగా వచ్చాశావు...?”

త్వరగానే వచ్చాను! -- అని లోపల ఏర్పడ్డ అశాంతితో కూడిన గుండె దఢను, చికాకును కప్పి పుచ్చుకుని, నవ్వు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ చెప్పాడు అశ్వినీకుమార్.

ఏమిట్రా విశేషం...?” -- అతని ఆందోళనను గమనించకుండా అడిగాడు రమణ.

బయలుదేరు. యాదగిరిగుట్ట లోని మన గెస్ట్ హౌస్ కు వెళ్దాం

యాదగిరిగుట్ట...ఏమిటీ సడన్ ప్రొగ్రాం?”

సడన్ గా అనిపించింది. బ్యలుదేరాను

అవును...మనం మాత్రమే వెళ్తున్నామా...?”

ఇంకెవరు రావాలని ఎదురుచూస్తున్నావు...?”

శృతికా!

అశ్వినీకుమార్ చటుక్కున తన కింద పెదవిని కొరుక్కుంటూ, లోపల ఏర్పడ్డ కొపాన్ని అనిచి, మనసును కట్టుబరచుకుని చెప్పాడు. ఆమె లేకుండానా...? వెళ్ళి ఆమెను కూడా తీసుకునే వెళ్దాం

ఐడియా బాసూ! -- రమణ మొహం ప్రకాశవంతమయ్యింది. పెదాలపై చిరునవ్వు ఏర్పడ అలాగంటే అక్కడ పెట్టుకుందామని చెప్పు...

దేన్ని...?”-- స్టీరింగును పట్టుకున్న అతని చేతిని మరింత బిగించి చూపులతో రమణ ను చూడకుండా చూపులను యక్సిలేటర్ మీద ఉంచి అడిగాడు.

అరంగేట్రం...

ఊ...

ఈ విషయం నువ్వు నిన్న చెప్పుంటే హోటల్లో రూము బుక్ చేసేవాడిని కాదుగా?”

ఉండనీ. వేలు వేస్టు అవుతున్నాయి. అందులో ఇదీ ఒకటి. వెళ్ళి త్వరగా బయలుదేరు

ఇదిగో పదే నిమిషాలలో పళ్ళు తోముకుని, స్నానం చేసి, డ్రస్సు మార్చుకుని బయలుదేరుతాను...

స్నానం చేయక్కర్లేదు-డ్రస్సు మాత్రం మార్చుకునిరా. అక్కడ మన కాటేజీ స్నానాలగది చాలా బ్యూటీఫుల్...అక్కడికెళ్ళి స్నానం చేద్దాం. బ్రష్ మాత్రం చేసుకునిరా...చాలు

అదీ కరెక్టే! నువ్వు లోపలికి రా. ఒక్క నిమిషంలో రెడీ అయి వచ్చేస్తా

నేను కారులోనే కూర్చోనుంటాను...

లేదు...నువ్వూ రారా. ఒక కాఫీ తాగి బయలుదేరదాం

అశ్వినీకుమార్ ఇంకో మాట మాట్లాడకుండా కారులో నుండి దిగి అతనితో పాటు మేడమీదున్న అతని గదికి వెళ్లాడు. రమణ స్నానాల గదిలోకి వెళ్ళి లోపల గొళ్లెం పెట్టుకున్న తరువాత ఇతను చురుకుగా పనిచేశాడు. ల్యాండ్ లైన్ నుండి తల్లి యొక్క ల్యాండ్ లైన్ పర్శనల్ నెంబర్ కు డయల్ చేశాడు.

అమ్మ...ఇంట్లో ఉండాలిఅంటూ వేడుకున్నాడు. అవతలివైపు భానూరేఖా యొక్క స్వరం హలోఅనగా...కొంచం సంకోచించి నేనే మాట్లాడుతున్నానమ్మా... అన్నాడు.

ఆమె దగ్గర నుండి దానికి సమాధానం రాకపోవటంతో అతను స్నానాల గదిలో ఉన్న రమణ కు వినబడకుండా ఉండేందుకు సన్నటి స్వరంతో బ్రతిమిలాడాడు. మాట్లాడవా అమ్మా? పరవలేదు. నేనే క్షమాపణలు అడుగుతున్నా. నేను చేసిన అన్ని తప్పులకూ కలిసి ఒకేసారి క్షమాపణలు అడుగుతున్నాను. నన్ను  క్షమించమ్మా!

కానీ, దీనికంతటికీ ఏది మూల కారణమో నీకు తెలియాలమ్మా? నీకు మాత్రమే కాదు...నీ లాంటి తల్లులందరికీ అర్ధం కావాలి. వీటన్నిటికీ నువ్వే కారణం. నీ ప్రేమ లేక, గమనింపు లేక, ఆదరణ, అభిమానమూ లేని నా చిన్న వయసే కారణం.

అప్పుడు నేను చూసింది, నా మనసులో పదిలమయిన కొన్ని దృష్యాలు కారణం. ఇంటికి నువ్వు పిలుచుకు వచ్చిన మనుషులు కారణం. వీటన్నిటి వల్లనే నాలో ఇలా ఒక వక్ర బుద్ది, వెర్రి ఏర్పడింది.

నేను దారిమళ్ళి తప్పుదోవలో వెళ్ళాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనిద్దరం మారటం...ఒకరినొకరు సరిదిద్దటమో జరగని పరిస్థితుల్లో నాకు ఒకే ఒక దారే కనబడుతోంది. అదొక్కటే దీనికంతా ముగింపు... తీర్పు గా తెలుస్తోంది. అది వెతుక్కునే వెళుతున్నాను.

నేను మాత్రమే కాదు...వీటన్నిటిలోనూ నాకు తోడుగా ఉన్న రమణ ను కూడా నాతోపాటు తీసుకునే వెళ్తున్నా. వెళ్ళొస్తానుఅని చెప్పటం లేదమ్మా...జస్ట్ వెళ్తున్నాను’. గుడ్ బై అమ్మా...

ఎమోషన్ తో పెదాలు వణికి, కనురెప్పలు కొట్టుకోవటం మొదలై, చూపు మందగించ...వణుకుతున్న చేతులతో రిజీవర్ పెట్టినప్పుడు, భానూరేఖా యొక్క గుండె దఢ, ఆందోళన ఎక్కువవటం " అశ్విన్, ఉండు అశ్విన్...ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు.... అశ్వి...

ఇతను రిసీవర్ పెట్టి, టెలిఫోన్ కనెక్షన్ కట్ చేసి, అది పెట్టబడిన చోట్లో ఉన్న ప్లగ్గును ఊడదీసి రమణ కళ్ళల్లో పడకుండా దాచాడు. తాను ఇక్కడి నుండే  మాట్లాడానని కనిబెట్టి...అమ్మ తొందరలో -- ఆందోళనతో ఏ నిమిషాన అయినా అక్కడికి రావచ్చు అనుకుని రమణ ను తొందరపెట్టాడు.

నిదానంగా తల దువ్వుకుని, ‘సెంటుకొట్టు కోవటానికి రెడీ అవుతున్న అతని దగ్గరకు వెళ్ళి ఆ సెంటు బాటిల్ ను లాగి మంచం మీద విసిరేసి, “హూ...బయలుదేరరా అంటే, నిదానంగా పెళ్ళి కొడుకులా సింగారించు కుంటున్నావు...నా అవసరం నీకు అర్ధం కావటం లేదు... అన్నాడు.

ఎందుకురా అంత తొందర...?” అన్నవాడితో రా...చెబుతాను. కారులో వెళ్తూ మాట్లాడుకుందాం... అంటూ అతన్ని వేగంగా లాక్కుని తీసుకుని వెళ్ళి కారులో తోసి, తలుపు మూసి డ్రైవింగ్ సీటులో కూర్చోగా,

రేయ్...కాఫీరా. కాఫీ కూడా తాగలేదురా అని అరిచిన రమణతో దార్లో తాగుదాం అని సమాధాన పరచి, కారును స్టార్ట్ చేసి బయటకు వచ్చి, యాక్సిలేటర్ నొక్కి వేగంగా వెళ్లాడు.

శృతికా ఇంటి ఎదురు వీధిలో నుండి కారు వెళ్ళటం గమనించిన రమణ ఆందోళన చెందాడు.

ఏమిట్రా ఇటు పక్కగా వెళుతున్నావు...ఆమెను పిక్ అప్ చేసుకోవద్దా...?”

ఆలోపు హైవేను చేరుకున్న అశ్వినీకుమార్ ఇంకా వేగాన్ని పెంచి ఎవర్నీ అంటూ నిదానంగా అడిగాడు.

శృతికాను!

చిరునవ్వుతో అతనివైపు చూస్తూ, అంతకుపైన విషయాన్ని దాచుకోలేక మాట్లాడాడు అశ్వినీకుమార్.

ఆమెను మనం పిక్ అప్ చెయ్యటం లేదు! ఆమె మనతో రావటం లేదు

మనతో రావటం లేదా? కొద్ది సేపటి క్రితం...ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కూడా వస్తోందని చెప్పావు?”

అబద్దం చెప్పాను

అశ్విన్ తనని ఈజీగా మోసం చేసేడని గ్రహించి కొపంతో అతని మీద అరిచాడు రమణ.

ఎందుకు అబద్దం చెప్పావు?”

ఆమె దగ్గర నువ్వు నడుచుకునే పద్దతి నాకు నచ్చలేదు

నీకు నచ్చేటట్టు నేను నడుచుకోవాలని అవసరంలేదు

మిగిలిన విషయాలలో అవసరం లేకపోవచ్చు. కానీ, ఈ విషయంలో, నాకు ఇష్టమైనట్టు నడుచుకునే తీరాలి. వేరే దారి లేదు

ఏమిటి భయపెడుతున్నావా? మొదట కారును వెనక్కి తిప్పి తిన్నగా వెళ్ళి శృతికాను తీసుకురా

కుదరదు. ఇక నేను వెళ్ళి పిలవను. పిలిస్తే కూడా ఆమె రాదు

ఎందుకు రాదు?”

అన్ని నిజాలూ చెప్పి. ఆమెకు లెటర్ గా రాసి పంపించాను. ఈ పాటికి ఆ ఉత్తరం ఆమెకు చేరుంటుంది. ఎంత పెద్ద ఆపదలో నుండి తప్పించుకున్నాము అనేది అర్ధం చేసుకోనుంటుంది

మొహమంతా ఎర్ర బడ, ఆగ్రహం శిఖరాన ఉన్న రమణ, “మూర్ఖుడా! కారు తిప్పరా ఇడియట్... అంటూ అశ్వినీకుమార్ మీద పడి స్టీరింగ్ తిప్ప,

అశ్వినీకుమార్, "నా ప్రాణం పోయినా సరే కారు తిప్పను!" అంటూ మొండిగా  అతని చేతిని విదిలించి, స్టీరింగును తానూ పుచ్చుకోవటానికి ప్రయత్నించ,

ఆ పోరాటంలో కసితో యాక్సిలేటర్ను మరింత గట్టిగా నొక్క కారు వంకర్లు టింకర్లుగా తిరుగుతూ వెడుతూంటే, ఎదురుగా అదే రాక్షస వేగంతో చెక్క బద్దలు ఎక్కించుకు వస్తున్న లారీని ఢీకొని, పోలికలు లేకుండా అప్పడంలాగా అనిగిపోయి లారీతోపాటూ కొన్ని గజాలు లాక్కుని వెళ్లబడ, తరువాత తల కిందలైన అదే సమయం,

భానూరేఖానూ, రమణ నాన్నానూ...ఎలాగైనా తమ కొడుకులను కనిబెట్టి ఆపి, తమతో రమ్మని చెప్పి బ్రతిమిలాడారు...తమ ఇంటికి విచారణ కోసం వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర!

************************************************PART-13*********************************************

రోజూలాగా కాకుండా ఆ రోజు పెందరాలే మెలుకువ వచ్చేసింది కామేష్ కు!

అయినా కానీ, కళ్ళు తెరవకుండా చెక్కలాగా పడుకునే ఉన్నాడు. దానిలాగా లేకుండా ఉన్నమే అనుకున్నాడు. జ్ఞాపకాలను మర్చిపోలేక పోతున్నానే అని బాధపడ్డాడు. మళ్ళీ మళ్ళీ అంతకు ముందు రోజు జరిగిన సంఘటనలు అతని కళ్ళ ముందుకు వచ్చి అతన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి.

రమణ తనని, శృతికానూ కలిపి చెడుగా మాట్లాడింది ఏమైనా స్రే ఆమెను అనుభవించ కుండా ఉండను అంటూ శపధం చేసింది. తరువాత అశ్వినీకుమార్ తనని మెడపుచ్చుకుని బయటకు గెంటేయమన్నది,

ఒక్కొక్కటిగా తలుచుకుని తలుచుకుని నిట్టూర్పు విడిచాడు. ఇక ఏదీ తన చేతిలో లేదు. విషయాలు అతని శక్తికీ, ప్రయత్నాలకూ మించి ఉన్నాయి.

అతనూ తనకు కుదిరినంతవరకు ఆపటానికి ప్రయత్నించాడు.  ఇన్ని రోజులు కృతజ్ఞత, బాధ్యత -- రెండింటి కోసం మాత్రమే కాకుండా, లోతైన మనసులో ఎవరికీ తెలియక ఎంతో అందంగా ఉన్న...అతని వలనే విడిపించుకోలేని శృతికాపైన ఉన్న ఆ రహస్యమైన ప్రేమకొసం కలిపే పోరాడి చూసి  ఓడిపోయాడు.

ఇకపైన ఏది జరిగినా అది దేవుని ఇష్టం. లేకపోతే మొదటే నిర్ణయించబడ్డ విధి. అందులో నుండి ఎవరి వల్లా తప్పించుకోవటం కుదరేపని కాదు!

అయినా ఒకే ఒక ఊరడింపు విషయం...చేసే ప్రార్ధనలకు కొంచం బలం ఉంది అనే నమ్మకమే!

కృరమైన ఆపదను తగ్గించి...చిన్నదైన సాధారణ ఆపదగా మార్చగల శక్తి దానికి ఉంది. ఇక ఆ ప్రార్ధన తప్ప వేరే దారే లేదు.

కామేష్ కళ్ళు మూసుకునే కనకదుర్గ అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. జ్ఞాపకాలలోనే ఆమె పాదాలు మీద పడి మొక్కుకుని, కళ్ళకు అద్దుకుని, ప్రార్ధించాడు.

శృతికా మారాలి.  ఆమెకు ఎటువంటి ఆపదా ఏర్పడ కూడదు. మానభంగం జరగకూడదు. హఠాత్తుగా ఏర్పడిన ఈ చెడు సావాసాలు అన్నీ పోయీ, ఆమె మంచి విధంగా ఉండాలి. హాయిగా పెళ్ళి చేసుకుని ప్రశాంతంగా కుటుంబ జీవితం జరుపుకోవాలి.

దీన్నే మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడు, నాలుగు, ఐదు అంటూ పలుసార్లు.

సుమారుగా ఆరున్నర గంటల సమయంలో షాపులో పనిచేసే కుర్రాడు వచ్చి తలుపు కొట్ట...లేచి వెళ్ళి అతనికి షాపు తాళాలు ఇచ్చి,

ఈ రోజు నాకు కొంచం ఆరొగ్యం బాగలేదు. కొద్దిసేపు అయిన తరువాత వస్తాను. అంతవరకు షాపు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పంపేసి, బ్రష్ చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు...స్నానాల గదిలో నుండి శృతికా పాట పాడుతున్నది వినిపించింది. ఆమె స్వరం ఉత్సాహంగా ఉంది. పాత తెలుగు సినిమాలోని ప్రేమ పాట. దాన్ని ఎమోషనల్ గా పాడుతున్నది.

వింటూనే పళ్ళు తోముకుని వచ్చిన అతని దగ్గర నుండి లోతైన పెద్ద నిట్టూర్పు బయటకు వినబడింది. అత్తయ్య ఇచ్చిన కాఫీని తాగేసి పేపర్ చదవటానికి వాకిలివైపుకు వెళ్ళినప్పుడు వరాండా గది తలుపు పక్కన ఎవరో భయపడుతూ నిలబడుంటం చూశాడు.

ఎవరది?” -- విపరీతమైన విసుగుతో అడిగాడు.

నేను భానూరేఖా ఇంటి దగ్గర నుండి వస్తున్నాను"

ఏ భానూరేఖా?”--ఇతను గుర్తుకురాని వాడిలాగా అడగ, వచ్చినతను భయపడుతూ, భయపడుతూ చెప్పాడు.

"నటి భానూరేఖా నండి"

కామేష్ మొహం చిట్లింది. స్వరంలో విరక్తి తొంగి చూసింది.

దేనికీ...?”

ఇదే కదండీ కామేష్ గారి ఇల్లు?”

అవును

అశ్వినీకుమార్ అయ్యగారు ఈ లెటర్ ఇచ్చి పంపించారు

ఎవరికి?”

కామేష్ అనే ఆయనకు

ఏమిటి...ఏమిటీ?” -- నమ్మలేని అతను సంతోషంతోనూ, ఆశ్చర్యంతోనూ అడిగాడు.

అవునండి! ఈ అడ్రస్సులో కామేష్ అని ఒక వ్యక్తి ఉంటారు. ఆయన దగ్గర నేను ఇచ్చినట్టు చెప్పి ఈ ఉత్తరాన్ని ఇచ్చేసిరారా...అని అయ్యగారే పంపించారు

అశ్వినీకుమారా?"

అవునండి

ఉత్తరాన్ని తీసుకున్నాడు కామేష్. అది అతికించబడి ఉంది. అడ్రెస్సు రాసే చోట ఇతని పేరు మాత్రమే రాసుంది. భయం, తడబాటు తో ఉత్తరాని ఓపన్ చేశాడు. అప్పుడు వచ్చినతను అయితే నేను బయలుదేరనా... అని సెలవు తీసుకున్నాడు...ఇతనో తల ఊపి పంపించి కవరులో ఉన్న ఉత్తరం తీసి విప్పాడు. 

దగ్గర దగ్గర నాలుగైదు పేజీల ఉత్తరం. ఎంతో మర్యాదతో 'గౌరవనీయులైన శ్రీ కామేష్ గారికి...అని మొదలు పెట్టబడి ఉంది.

అతను తనలో ఏర్పడ్డ అదుర్దానూ, వేగాన్నీ అనుచుకుని పక్కగా ఉన్న అరుగు మీద కూర్చుని, వెనక్కి ఆనుకుని చదవటం మొదలుపెట్టాడు.

ఈ ఉత్తరం చదవటం అనవసరం అని అనుకోరని అనుకుంటున్నాను. కోపంతో చదవకుండానే నలిపి డస్ట్ బిన్ లో పడేయరని కూడా అనుకుంటున్నాను.

నిన్ను మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు జరిగిన కొన్ని సంఘటనల కోసం నేను చాలా బాధపడుతున్నాను. దానికొసం మాత్రమే బాధపడుతున్నావా?’ అంటూ దయచేసి అడగకండి.

అన్ని విషయాలకోసమూ బాధపడుతున్నాను. నేను చేసిన ప్రతి చేష్టకూ బాధపడుతున్నాను.

నేను చేసిన తప్పులు ఒకటా...రెండా?

ఈ తప్పులన్నీ నేనే ఒంటరిగా చెయ్యలేదు. రమణతో పాటూ కలిసి చేశాను.

నా అన్ని విషయాలలోనూ అతను తోడు వచ్చాడు. వాడికి నేను తోడా...నాకు వాడు తోడా? అనేది అర్ధం కాలేదు!

ఎవరికి ఎవరు తోడున్నా చేసిన తప్పులు అన్నీ క్షమించ దగినవి కావు. అన్నిటికంటే ముఖ్యంగా శృతికాకు చెయ్యాలనుకున్న పెద్ద నేరం.

మంచికాలంగా, అది ఆలొచనతోనే ఆగిపోయింది. అమలు పరచటానికి తీసుకురాకుండా అడ్డుపడిందినిన్న మీరు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మాట్లాడిన మాటలే.

మీరే నా మనసును పూర్తిగా మార్చి నన్ను ఆలొచింప చేశారు. ఆ తీవ్రమైన ఆలోచన ఫలితంగానే నేను ఈ నిర్ణయానికి వచ్చాను.

నిజంగా చెబుతున్నా, మీరు వచ్చి అలా మాట్లాడి ఉండకపోతే శృతికాకు ఆ భయంకరమైన ఆపద జరిగిపోయేది.

కారణం, దానికంతా నాకు అర్హత లేదనేది ఒక పక్కనైతే, ఆడవాళ్ళను నేను ద్వేషిస్తున్నాను...అందరు మహిళలనూ ద్వేషిస్తున్నాను...నా తల్లితో సహా!

ముఖ్యంగా ఈ విరక్తి, పగ తీర్చుకోవాలనే గుణమూ నా తల్లి వలనే ప్రారంభమయ్యింది.

కానీ, ఆమెను మాత్రమే నేను కారణంగా చెప్పటానికి ఇష్టపడటం లేదు. అలా చెబితే అది నేను తప్పించుకోవటానికి చెబుతున్న సాకు.

అమ్మ, తండ్రి యొక్క ఆదరణ లేక -- ప్రేమ దొరకని పిల్లలందరూ ఇలాగా నాకులాగా మారిపోయారా...లేదు.

మంచిగా, బాద్యతలున్న వాడిగా, తన పరిస్థితి తెలుసుకున్న వాడు మర్యాద, గౌరవమూ ఉన్నవాడిగా ఎంతమంది పెరగటం లేదు? ఉదాహరణకు మిమ్మల్నే తీసుకోవచ్చే?

మీరు కూడా కన్నవారి ప్రేమను పొందలేదు అని తెలుసుకున్నాను. అందువలనే ఇక్కడున్న అత్తయ్య ఇంటికి వచ్చారని తెలుసుకున్నాను.

మావయ్య మరణం తరువాత బాధ్యతగా షాపు, కుటుంబాన్నీ నిర్వాహం చేస్తున్నారనేదీ అర్ధం చేసుకున్నాను,

ఇవన్నీ నాకు ఉండి ఉండకూడదా?’ అని బాధపడ్డాను. సమయం దాటి ఏర్పడిన ఈ బాధ ఎవరికీ ఏం ప్రయోజనం చెప్పండి.

నాకైనా సమయందాటి ఏర్పడింది. కాని, రమణ కు ఎప్పటికీ ఏ జ్ఞానమూ ఏర్పడదనే అనిపిస్తోంది.

తొక్కిన బురదను, మురికిని వదిలి వాడు బయటకే రాడు అని నమ్మవలసి వస్తోంది. మాట్లాడి చూసినా మళ్ళీ మళ్ళీ అదే గుంటలో ఉండటానికే ఆశపడుతున్నాడే తప్ప, బయటకు వచ్చే ఆలొచనే లేదు.

అందువలన వాడిని వదిలేసి నేనొక్కడినే వెళ్ళిపోవటంలో ఎటువంటి అర్ధమూ లేదు. ఇన్ని రోజులూ...ఇన్ని విషయాలలోనూ తోడుగా ఉన్న వాడిని ఇప్పుడు ఈ చివరి యాత్రకూ తోడుగా తీసుకు వెళ్తున్నా. ఇకపై తిరిగివచ్చే ఉద్దేశమే లేదు. 

వెళ్ళే ముందు శృతికా దగ్గర ఒకటి చెప్పదలుచుకున్నాను. కళ్ళు చెదిరించే వన్నీ మిణుగురు పురుగులే...నక్షత్రాలు కాదు అనేది తెలియజేయాలనుకున్నా.

ఈ ఉత్తరాన్ని ఆమెకు చూపండి. చదివిన తరువాత ఆమెగానే అర్ధం చేసుకుంటుంది. జీవితానికి కావలసింది నక్షత్రం కాదు అనేది గ్రహించుకుంటుంది. నక్షత్రాలే అక్కర్లేదు అనేటప్పుడు మిణుగురు పురుగుల వెనుక వెళ్ళింది ఎంతపెద్ద తప్పో అనేది అర్ధం చేసుకుంటుంది.

రక్షణ, ప్రకాశమైన వెలుతురూ నిండి ఉండే సూర్యుడే అతి ముఖ్యం అనేది తెలుసుకుంటుంది. సూర్యుడి వెలుతురుకూ, వేడికీ ముందు ఉత్త నక్షత్రాలూ, చంద్రుడూ ఉన్న చోటు తెలియక కనబడకుండా పొయేటప్పుడు ఈ మిణుగురు పురుగులు ఎక్కడ్నుంచి శాశ్వతంగా ఉండగలవు?

సూర్యుడ్ని పక్కన పెట్టుకుని, మిణుగురు పురుగుల కోసం కళ్ల చెదిరింపుకు ఆశపడే అజ్ఞానాన్ని ఏం చెప్పాలి? అది ఉత్త అజ్ఞానం అనేది మీరు తెలుసుకుంటే సరే. మీరే అర్ధం చేసుకోకపోతే ఇంకెవరు అర్ధం చేసుకుంటారు?

ఇట్లు

అశ్వినీకుమార్

చదివి ముగించిన వెంటనే కామేష్ కు మొదటి షాక్ కొట్టింది.

తరువాత మనసు కరిగిపోయి...కళ్ళ నుండి కన్నీరు కారింది. ఒక్క క్షణం ఏం చేయాలో తెలియక నిలబడిపోయాడు.

ఆ తరువాత వేగంగా ఇంట్లోకి వెళ్ళి చొక్కా తొడుక్కుని, ఉత్తరాన్ని మడతపెట్టి జేబులో పెట్టుకుని, ఎవరితోనూ చెప్పకుండా, సైకిల్ తీసుకుని వేగంగా తొక్కుకుంటూ భానూరేఖా ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు గుంపుగా జనం ఉన్నారు. ఇతని కడుపులో భయమనే ఏమోషన్ చోటు చేసుకుంది...వాకిలికి వెళ్ళి గుంపులోని ఒకర్ని అడిగాడు.

ఏంటయ్యా?”

భానూరేఖా గారి కొడుకు లారీ ఢీకొని సుద్ద సుద్దగా అయిపోయాడట

ఎవరు చెప్పారు

గూర్ఖా! లోపల పోలీసులు ఉన్నారు

ఆ అబ్బాయి బాడీ ఇక్కడ పెట్టున్నారా?”

ఊహూ...ఆసుపత్రికి తీసుకు వెళ్ళిపోయారని చెబుతున్నారు

అతనితో పాటూ ఇంకో కుర్రాడు కూడా ఉన్నాడట. కారు అప్పడంలాగా ముక్కలయ్యిందట. రెండు బాడీలనూ పొస్టు మార్టం కోసం తీసుకు వెళ్ళేరట..."

లోతైన నిట్టూర్పుతో కామేష్ శరీరం, మనసు కంపించ సైకిల్ తిప్పుకుని తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు హాలు గోడపై తగిలించున్న అద్దం ముందు నిలబడి అలంకారం చేసుకుంటోంది శృతికా.

అతను ఆమె దగ్గరకు వెళ్ళి మౌనంగా తలవంచుకుని నిలబడ్డాడు. ఆమె కావాలనే అతన్ని గమనించనట్లు 'పౌడర్ 'పూసుకుని, జడను ముడి వేసుకునేంత వరకు ఆగి, తరువాత ఉత్తరం జాపాడు.

ఆమె కోపంగా మొహం పెట్టుకుని ఏమిటీ?” అన్నది.

దీన్ని చదివి చూడు...

ఏమిటిది...?”

లెటర్

ఎవరిది...

అశ్వినీకుమార్ ది

అశ్వినీకుమార్ దా...?” -- కోపంలో నుదురు చిట్ల అతన్ని చూసింది.

నా ఉత్తరాన్ని మీరెలా చదవచ్చు?”

ఇది నాకు వచ్చింది!

ఏమిటీ...?” ఆమె తనకు ఏర్పడిన షాకును దాచుకుని ఉత్తరాన్ని చదివి ముగించేంత వరకు...మౌనంగా నిలబడ్డాడు.

ఆమె ఒకసారి చదివి ముగించి భయం, ఆందోళనతో అతన్ని తలెత్తి చూసి ఇంకొసారి చదివింది.

చదువుతున్నప్పుడు ముఖం వాడిపోయింది. పెదాలు వణికినై. కళ్ల నుండి నీరు వచ్చింది.

చివరి యాత్ర అంటే ఏమిటర్ధం...?” ఆమె స్వరం బొంగురు తనంతో వినబడ, చిన్న బాధతో చెప్పాడు.

అది తెలుసుకోవటానికే కొద్దిసేపటి క్రితం అశ్వినీకుమార్ ఇంటివరకు వెళ్ళొచ్చాను"

..................”

వాకిలి చాలని గుంపు. విచారించినప్పుడు అంతా ముగిసిపోయింది అని తెలుసుకున్నాను. లారీ ఢీ కొని, కారు ముక్కలయ్యిందట. ఇద్దరి బాడీలనూ పోస్ట్ మార్టం కోసం తీసుకు వెళ్లారని చెబుతున్నారు?”

ఆమె ఒక్క క్షణం మౌనంగా నిలబడ...అతనే మళ్ళీ అడిగాడు.

చూడాలని అనిపిస్తోందా...?నేను తీసుకు వెళతాను

లేదు...వద్దు అంటూ ధీర్ఘంగా తల ఊపి కళ్ళు తుడుచుకుంది. దన్నెం మీద ఉన్న తుండు...మడతపెట్టబడి ఉన్న లంగానూ, ఓణీని చేతిలో తీసుకున్నప్పుడు ఏమీ అర్ధం కాని వాడుగా నిలబడ్డాడు.

ఎక్కడికి వెళ్తున్నావు శృతికా?”

తల స్నానం...సుద్ది చేసుకోవటానికి... అనేది జవాబుగా చెప్పేసి, వేసుకున్న జడను విప్పుకుని ఇంటి వెనుక ఉన్న స్నానాల గదివైపు వెళ్ళింది.

పలురకాల ఎమోషన్స్ తాకిడితో...ఆమె వెళ్లటాన్ని చూస్తూ అలాగే కదలకుండా నిలబడ్డాడు కామేష్.

************************************************సమాప్తం*********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)