అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు…(పూర్తి నవల)

 

                                                 అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు                                                                                                                        (పూర్తి నవల)

'అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు ' అనే ఈ నవల ఒక ఆధ్యాత్మిక క్రైమ్ థ్రిల్లర్. మామూలుగా స్వామీజీలలో రెండు రకాలు ఉన్నారు. నిజంగానే ఆధ్యాత్మికం గురించి తెలిసిన స్వామీజీలు ఒక రకం. ఆధ్యాత్మికం అనే పేరుతో సగం తెలుసుకుని, సగం తెలియక ఏదో ఒకటి చెప్పుకుంటూ సాధారణ ప్రజలను మోసం చేసే దొంగ స్వామీజీలు ఇంకొక రకం.

ఈ నవలలోనూ ఒక స్వామీజీ వస్తున్నారు. ఒక కోణం నుండి చూస్తే ఆయన నిజమైన స్వామీజీ. ఇంకొక కోణం నుండి చూస్తే దొంగ స్వామీజీ.

నిజంగా ఆయన ఏ రకానికి చెందిన స్వామీజీ అనేది కనిపెట్టటానికి...నవలను పూర్తిగా చదవండి. ఆధ్యాత్మికంలో క్రైమ్ కలిస్తే అది ఎలాంటి విషమ పరిస్థితులను ప్రేరేపిస్తుంది అనేది ఈ నవలను చదవటం ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ పరిచయ శీర్షికలో నేను చెప్పిందంతా,

నిజం...నిజం తప్ప ఇంకేమీ లేదు...!

***************************************************PART-1******************************************

 గుడ్ మార్నింగ్ సార్...!

వెరి వెరి గుడ్ మార్నింగ్! రండి వెంకటేష్...

మీరు అర్జెంటుగా పిలిచారని ఆద్విక్ గారు చెప్పారు

అవును...ఒక అర్జెంటైన విషయమే! మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నదా?”

లేదు సార్! ప్రస్తుతానికి మీరు నన్ను పిలిచిందే ముఖ్యమైన పని. ఏమిటి సార్ విషయం?”

మొదట కూర్చోండి! ఒక ఐదు నిమిషాలు రిలాక్సగా మీ దగ్గర మాట్లాడిన తరువాత విషయానికి వస్తాను. అవును...ఎలా ఉన్నారు?”

ఫైన్ సార్...

ఈ మధ్య మీరు మీ ఊరికి వెళ్ళినట్టున్నారు?”

అవును సార్! అమ్మకు కొంచం ఆరొగ్యం బాగోలేదని సమాచారం వచ్చింది. వెళ్ళి చూసొచ్చాను

ఆవిడకు ఏమిటి ప్రాబ్లం?”

ఆస్తమా సమస్య సార్! ఎండా కాలం ఏం చేయదు. చలి కాలం వస్తే శ్రమే సార్! నౌ షీ ఈజ్ ఓకే సార్!

నాన్నగారు ఎలా ఉన్నారు?”

ఆయన రిటైర్డ్’! ఆయన ఆరొగ్యంలో ఎటువంటి ప్రాబ్లమూ లేదు. మానవ హక్కుల సంఘంలో గౌరవ సలహాదారుగా ఉన్నారు. పొద్దు పోతూ ఉంది

ఆహా...ఆయన రిటైర్డ్ లైఫ్బాగా ఎంజాయ్ చేస్తున్నారు

ఎస్...సార్!

మీ భార్య వర్షిణి...ఏదైనా ఉద్యోగం చేస్తోందా?”

లేదు...ఇంట్లోనే ఉంటోంది సార్!

మీకు ఇద్దరు వారసులు. మొదటి బిడ్డ...రెండో క్లాసు చదువుతోంది, రెండో బిడ్డ...ఎల్.కే.జీ!...కరక్టేనా?”

కరక్టే సార్

అలాగంటే మీ మ్యారీడ్ లైఫ్ సంతోషంగా గడుస్తోంది?”

చాలా చాలా సంతోషంగా పోతోంది సార్

ఆ సంతోషానికి ఆటంబాంబు పెట్టినట్టు, ఇప్పుడు మీకొక విషయం చెబితే ఎలా ఉంటుంది?”

సా...సార్!?”

ఇదిగోండి...మీ ఆర్డర్’! ఆరు నెలలు మిమ్మల్ని పనిలోంచి సస్పెండ్ చేసారు

ఏమిటీ? నాకు సస్పెన్షన్ ఆర్డరా’? నేనేం తప్పు చేశాను...?”

అదేమిటో మీకు తెలియదా?”

తెలియదు సార్!

అలాగైతే ఆ సస్పెన్షన్ ఆర్డర్ను తీసి చదవండి...తెలుస్తుంది

పోలీస్ కమీషనర్ పరమత్మా జాపిన ఆ బ్రౌన్ రంగు కవర్ను వణుకుతున్న చేతులతో తీసుకున్నారు అడిషనల్ కమీషనర్ వెంకటేష్.

గదిలో కొద్ది క్షణాలు భయంకరమైన నిశ్శబ్ధం. వెంకటేష్ లెటర్ను చదవకుండానే అలాగే పెట్టుకున్నారు. కమీషనర్ పరమత్మా జాలిపడుతున్న మొహంతో తన  నెరిసిన మీసాలను తిప్పుకుంటూ వెంకటేష్ ను చూసారు.

ఊ...లేటర్ను చదవండి. అప్పుడే కదా మిమ్మల్ని డిపార్ట్ మెంట్ నుండి ఎందుకు సస్పెండ్ చేసారో మీకు తెలుస్తుంది!

వెంకటేష్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే "సా..సార్! నేను ఎటువంటి తప్పు చేయనప్పుడు, నాకు ఎందుకోసం సస్పెన్షన్ఆర్డర్?”

ఏ ఒక నేరస్తుడూ...తాను చేసిన నేరాన్ని ఒప్పుకోడు. మీరూ దానికి అతీతులు కాదు కదా? మొదట లెటర్ను చదవండి...

వెంకటేష్ కవర్ను చింపారు.

హృదయం వేగంగా కొట్టుకుంటోంది.

కవరు లోపల పెట్టున్న డిపార్ట్ మెంటుకే సొంతమైన ఆ బూడిద రంగు ఉత్తరాన్ని తీసారు. మడతలకు విడుదల ఇచ్చారు. లెటర్లో టైపుచేయబడ్డ ఆంగ్ల రాతలు ఏడెనిమిది లైన్లలో ఉన్నాయి.

వెంకటేష్ చదివారు.

శ్రీ ఆర్ వెంకటేష్,

అడిషనల్ కమీషనర్,

పోలీస్ డిపార్ట్ మెంట్.

ఈ మధ్య జరిగిన రెండు హత్య సంఘటనలను తెలివిగా దర్యాప్తు చేసి, ఇరవై నాలుగు గంటలలో, నేరస్తులను ఖైదు చేసిన మీ పనిని పోలీసు డిపార్ట్ మెంట్ సంతోషంతో మెచ్చుకుంటోంది. ఆ సంతోషాన్ని వ్యక్తం చేసే గుర్తుగా మీకు ప్రమోషన్ ఇస్తున్నాము.

దానికి కావలసిన ప్రభుత్వ ఆర్డర్ త్వరలో మీకు దొరుకుతుంది - మీరు ఉద్యోగంలో ఇంకా పైకి ఎదగాలని పోలీసు డిపార్ట్ మెంట్ తరఫున శుభాకాంక్షలు!

చదివేసి ఆశ్చర్యంతో తల ఎత్త...కమీషనర్ పరమత్మా పెద్ద నవ్వుతో ఆయన్ని చూశారు.

ఏం వెంకటేష్...సస్పెన్షన్ ఆర్డర్ ను చదివారా?”

సా...సార్...సార్!

చెప్పండి...

ఈ ప్రమోషన్ నేను ఎదురు చూడలేదు సార్. ఈ మధ్య హైదరాబాద్ సిటీలో జరిగిన రెండు హత్యలలోనూ పక్కగా దర్యాప్తు చేసి, నేరస్తులను కనిపెట్టినందుకు కారణం నేనొక్కడినే కాదు...టీమ్ వర్క! ఇన్‌స్పెక్టర్ గోపీనాద్, సబ్-ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ నజరుద్దీన్...వీళ్ళిద్దరూ చాలా సహాయం చేశారు సార్

వాళ్ళు సహాయపడింది నిజమే! అయినా కానీ, నేరస్తులను కనిబెట్టటానికి మీరు తీసుకున్న ఇండిపెండంట్ ప్రయత్నాలు ఏమిటనేవి నాకు తెలుసు. డిపార్టు మెంటుకూ తెలుసు. అందువలనే ఈ పదవీ ప్రమోషన్"

చాలా థ్యాంక్స్ సార్!

థ్యాంక్స్ మాత్రమేనా? ట్రీట్ ఏమీ లేదా?”

రేపే ఏర్పాటు చేస్తాను

రేపు వద్దు. ఒక వారం పోనివ్వండి. మొదట ఈ సంతోషమైన విషయాన్ని...మీ తల్లి-తండ్రులకూ, భార్యకూ తెలియపరచండి. మిగతా విషయాలు తరువాత మాట్లాడుకుందాం

కమీషనర్ లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇవ్వ... వెంకటేష్ కూడా చేతులు జాపి కరచాలనం చేసి బయటకు వచ్చారు. తన గదికి వెళ్లటానికి వరాండాలో నడుస్తున్నప్పుడే సెల్ ఫోన్'తీసుకుని, ఇంటి టెలిఫోన్ నెంబర్లు నొక్కాడు.

రింగు వెళ్ళి...భార్య స్వరం వినబడింది.

హలో!

వర్షినీ...నేనే!

ఎంత ఆశ్చర్యం చూసారా? మీ దగ్గర మాట్లాడాలనే టెలిఫోన్ పక్కకు వచ్చాను. ఇంతలో మీరే చేశారు

ఎందుకు ఫోన్ చెయ్యాలని అనుకున్నావు?”

మీరు ఎందుకు చేసేరో మొదట చెప్పండి...

నువ్వే మొదట చెప్పు వర్షినీ

ఊహూ! మొదట ఫోన్ చేసింది మీరే! మీరే చెప్పండి

సరే...సరే! పోలీసు డిపార్టు మెంటులో ఇప్పుడు మీ ఆయనకు ఏం పని?”

అడిషనల్ కమీషనర్

ఇక మీదట డెప్యూటీ కమీషనర్

అరె...ఇది ఎప్పట్నుంచి?”

అధికార పూర్వకంగా లేటర్ ఇచ్చాసారు. ఈ వారంలోపే గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది!

ఎలాగండీ...హఠాత్తుగా పదవీ ప్రమోషన్? నేను నమ్మలేకపోతున్నాను

ఈ మధ్య జరిగిన రెండు హత్య కేసులలో చురుకుగా విచారణ చేసి...నేరస్తులను పట్టినందుకు...

సంతోషంలో నాకు ఏం చేయాలో తోచటం లేదు...

ప్రస్తుతానికి ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వు

పక్కన ఎవరైనా ఉంటే...మీరు మాట్లాడేది వినేస్తారు...

"ఈ పొడవైన వరండాలో ప్రస్తుతానికి నేనొక్కడినే నడుస్తున్నాను. సరి...సరి...నువ్వెందుకు నాకు ఫోన్ చేయాలనుకున్నావు?”

మీ పేరుకు ఒక పార్సల్ వచ్చింది

పార్సలా?”

అవును...

ఏమిటనేది తెలుస్తోందా?”

తెలియటం లేదు...చిన్నదే! అర కిలో బరువు ఉంటుంది

కొరియరా...లేక పోస్టా?”

కొరియరే!

ఫ్రమ్ అడ్రస్సు చూశావా?”

చూసాను...జననీ అనే పేరు రాసుంది

"జననీనా?"

అవును...

అడ్రస్సు?”

"నెంబర్ 99, వీరయ్య వీధి, సమాధాన నగర్, గచ్చిబౌలి, హైదరబాద్

చాలు. అడ్రస్సు పూర్తిగా ఉందే!

అందుకనే నేనూ బాగా ఆలొచించి చూసి...మీకు ఫోను చేద్దామని వచ్చాను

సరే! ఆ పార్సల్ విప్పకు...నేను ఇప్పుడే వస్తాను

ఏమండీ! నాకు భయంగా ఉంది. దాన్ని ఇంట్లో పెట్టుకోనా? లేక...బయటకు తీసుకువెళ్ళి పెట్టనా?”

ఒక పని చెయ్యి

ఏమిటో...చెప్పండి...

మన ఇంటి వెనుక తోటలోకి తీసుకువెళ్ళి పెట్టేయి. నేను వచ్చిన తరువాత చూసుకుందాం!

ఎప్పుడు వస్తారు?”

ఇంకో ఇరవై నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు -- సెల్ ఫోనును ఆఫ్ చేశారు వెంకటేష్. పదవి ప్రమోషన్ వచ్చిందనే సంతోషం ఆయన మనసులో కనబడకుండా పోయింది!

అది ఏం పార్సలో?’

ఎవరా జననీ?’

విశ్వరూపం ఎత్తిన ఆ రెండు ప్రశ్నలతో, వేగంగా ఆ వరండాను దాటి, బయట నిలబడున్న తన యుక్క మోటర్ సైకిల్ను తీశారు!

***************************************************PART-2******************************************

మాదాపూర్ సత్యమూర్తి రామకృష్ణ పరమహంస హాలులో భక్తుల గుంపు కిక్కిరిసిగా ఉంది. పోటా పోటీలు పడుతున్నారు. గుండు కొట్టించుకుని, ప్రకాశవంతమైన తెల్ల రంగు పంచెను కట్టి, సాలువాను కప్పుకుని ఆరడుగుల ఎత్తులో మైకు ముందు నిలబడున్న జయశ్రీ సర్వానందా స్వామిజీ, తనకు ముందుగా తరలి వచ్చిన జన సమూహాన్ని చూసి సన్నని స్వరంతో మాట్లాడుతున్నారు.

భూమి ఎప్పుడూ స్వర్గం లాగానే చూడబడుతోంది. మనుషులందరూ స్వతహ మంచి వాళ్ళుగానే ఉన్నారు. మీరు కోపం తెచ్చుకుంటే లోకమే తప్పు చేస్తున్నట్టు అనుకుంటారు. మీరు విజయం చెందేటప్పుడు సంతోషంగానూ...తృప్తిగానూ ఉన్నప్పుడు ఆహా ఎంత మంచి లోకం? ఎంత మంచి బంధువులు? ఎంత అద్భుతమైన మనుషులు?’ అంటూ ఆనందపడుతున్నారు.

నిజాన్ని అర్ధం చేసుకోండి. చుట్టూ ఉన్నవాళ్ళ దగ్గరున్న తప్పులను కనిబెడుతున్నారే, అవి మీ తప్పులే! ఏం మనుషులు...కొంచం కూడా అర్ధం చేసుకునే స్వభావం లేకుండా ఉన్నారే!అని మీరు చెప్పే పుకారు అంతా మీ మనసు యొక్క స్వరాలు.

అదేలాగా మిగతావారిని 'ఆహా...వీళ్ళు ఎంత మంచివారో? ఎంత ప్రేమగా ఉంటున్నారు? ఇలా కదా ఉందాలి...' అని మీరు అనుకునేది కూడా మీ మనసు యొక్క పనే! నిజానికి అందరూ సహజమైన వారు...మంచి వారు. మీరు ప్రపంచాన్ని చూసే విధంలోనే ప్రపంచం మారుపడుతుంది.

ఈ లోకం అద్భుతమైనది. దాన్ని అనుభవించటానికి ప్రారంభించండి. మనం ఎప్పుడూ ప్రతిబింబించే అద్దంలాగానే ఉంటున్నాము. మనం మర్యాద ఇస్తే...మర్యాద తిరిగి దొరుకుతుంది. చీదరించుకుంటే చీదరించుకోబడతాం. ప్రేమ చూపిస్తే ప్రేమ దొరుకుతుంది. మనం కోపగించుకుంటే కోపమే బహుమతిగా లభిస్తుంది. దీన్ని వివరించ ఒక చిన్న కథ.

వీధిలో తిరుగుతుండే ఒక కుక్క, దారి తప్పి రాజభవనంలోకి దూరిపోయింది. వందల లెక్కలో అద్దాలు అమర్చబడిన గది అది. ఆ గదిలోకి దూరిన కుక్కకు షాక్, విపరీతమైన కోపం ఏర్పడింది. ఎందుకంటే దానికి దగ్గర దగ్గర వంద కుక్కలు కనబడ్డాయి. వెంటనే ఆగ్రహించి ఉర్-ఉర్...అన్నది. అద్దంలో కనబడ్డ కుక్కలూ వేరు వేరు కోణాలలో ఉర్...ఉర్ అన్నాయి.

కుక్క కొంచం భయపడ్డది. అయినా కోపం తట్టుకోలేక లొల్లు...లొల్లు అని అరవటం ప్రారంభించింది. అవును...అన్ని కుక్కలూ అరవటం మొదలుపెట్టినై. కుక్క అరవడం మానేయడంతో, అన్ని కుక్కలూ అరవటం మానేసినై. మళ్ళీ ఈ కుక్క అరిచినందువలన, అన్ని కుక్కలూ అరిచినై. అప్పుడు కుక్కకు తాను మాత్రమే నిజమని, అద్దంలో కనబడే మిగిలిన అన్ని కుక్కలూ తన యొక్క ప్రతిభింబాలే అన్న విషయం తెలిసింది.

అది అర్ధం చేసుకునేది కొంచం కఠినమే! కుక్క తాను అరవటం ఆపిన మరుక్షణం, అన్ని కుక్కలూ అరవటం ఆపటాన్ని కొంచం క్షుణ్నంగా గమనించి ఉంటే నిజం అర్ధమయ్యేది. మాయ అంటే ఏమిటో అనేది తెలుసుకునేది!

జయశ్రీ సర్వానందా స్వామిజీ మాటలను ఆపి, తన రెండు చేతులనూ పైకెత్తి...జన సమూహాన్ని ఆశీర్వదిస్తున్నట్టు చేసారు. వెంటనే అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టారు. "జై జై జయశ్రీ...హర హర జయశ్రీ!" అంటూ పాడుతూ ఊగటం ప్రారంభించారు.

స్వామిజీ స్టేజీ నలుమూలలకూ వెళ్ళి జన సమూహాన్ని అభినందించి కిందకు దిగారు. ఆయన అసిస్టంట్ పక్కకు వచ్చారు.

స్వామీ!

ఏమిటి పతాంజలీ...వి.ఐ.పి లు ఎవరైనా నన్ను చూడటానికి వచ్చారా?”

అవును స్వామీ. మిమ్మల్ని చూసి మాట్లాడటానికి డి.జి.పి పద్మనాభం గారు వచ్చి వెయిట్ చేస్తున్నారు

వచ్చి చాలా సేపయిందా?”

లేదు స్వామీ! పది నిమిషాలే అయ్యింది

నా గదిలోనే కదా కూర్చోబెట్టావు?”

అవును స్వామీ...

సరే...నేను ఆయన్ని చూసుకుంటాను. నువెళ్ళి పూజకు ఏర్పాట్లు చెయ్యి

ఓ.కే... అంటూ జరగబోయిన అసిస్టంటుతో ఒక్క నిమిషం! అని పతాంజలీని ఆపారు జయశ్రీ సర్వానందా స్వామి.

చెప్పండి స్వామీ!

ఈ రోజు జనం ఎక్కువగా ఉన్నారు. దానికి తగినట్టు ప్రసాదం ఏర్పాటు చేయండి. తినకుండా, ఖాలీ కడుపుతో ఎవరూ తిరిగి వెళ్లకూడదు

జనానికి తగినట్టే ప్రసాదం ఏర్పాటు చేశాను స్వామీ. ఎంతమంది ఉన్నా కడుపు నిండా భోజనం తినవచ్చు!

మెడికల్ హెల్ప్ అడిగి ఈ రోజు ఎంతమంది వచ్చారు పతాంజలీ?”

ఇరవై మంది ఉంటారు స్వామీ! అందర్నీ గైడ్ చేసి మెడికల్ సెక్షన్ కు పంపించాను

పోయిన వారం గౌరీఅనే ఒకావిడ హార్ట్ఆపరేషన్ విషయంగా సహాయం అడిగి వచ్చిందే? ఆమెకు కావలసిన సహాయం చేశారా?”

చేశాము స్వామీ! డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఆమెకు ఆపరేషన్ చేసేటట్టు సెడ్యూల్ వేసుంది

సరే! నేను డి.జి.పి ను చూసి, మాట్లాడి గది నుండి బయటకు వచ్చేంతవరకు...అక్కడికి ఎవరినీ అనుమతించకండి. ఫోన్ కాల్ వస్తే మాత్రం విషయం ఏమిటో కనుక్కుని ఉంచండి...చాలు

అసిస్టంట్ తల ఊప...స్వామీజీ రెండు పక్కల రాజ కుండీలు వరుసగా నిలబెట్టున్న ఆ పొడవైన నడక బాటలో నడిచి...చివరగా ఉన్న తన గదిలోకి వెళ్లారు.

గది గోడ చివరగా వేసున్న ఫ్రేమ్ కుర్చీలో కూర్చోనున్న డి.జి.పి పద్మనాభం గారు లేచి నిలబడి నమస్కరించారు. ఆరడుగుల ఎత్తు. పొట్ట పెద్దగా లేని శరీరం.

నమసే స్వామీ!

నమస్తే...రండి! మన జ్ఞాన మండపానికి ఇప్పుడే కదా మొదటిసారిగా వచ్చారు?”

అవును స్వామీజీ! డిపార్ట్ మెంటులో కొంచం పని ఎక్కువ. దేశంలో దేవుడి భక్తి ఎక్కువ అవుతోంది. నేరాలూ పెరుగుతున్నాయి. మాలాంటి పోలీసు అధికారులు, కంచం ముందు కూర్చుని ప్రశాంతంగా ఒక ముద్ద భోజనం కూడా తినలేకపోతున్నాం. ఒక గంటసేపు కూడా ప్రశాంతంగా నిద్ర పోలేకపోతున్నాము!

డి.ఐ.జీపద్మనాభం గారు చెప్పింది విని స్వామీజీ పెదాలు విప్పకుండా నవ్వారు.

కరెంటులో పాసిటివ్’—‘నెగటివ్ఉన్నట్టే మనుషుల దగ్గరా ఆ డిఫెరెన్స్ ఉంది. ఒక దుర్యోధనుడు, శకుని ఉండబట్టే కదా మహా భారత కావ్యం మనం చదవగలుగుతున్నాము. అదేలాగా...రావణుడు లేకుండా రామాయణంరాయబడుంటే అందులో ఎటువంటి స్వారస్యము ఉండదు

జవాబుగా పద్మనాభం గారు నవ్వారు. స్వామీజీ తో మాట్లాడి గెలవ గలనా? మీరూ  ప్రజలకు నీతి కథలు, వేద వాక్కులూ చెప్పి గంటల తరబడి ఉపదేశం చేస్తున్నారు. దాన్ని వినడంతో సరి. చాలామంది దాన్ని వాళ్ళ మనసులోకి తీసుకు వెళ్లటం లేదు. అందువలనే దేశంలో ఇన్ని నేరాలు -- ఆయన చెప్పింది స్వామీజీ అమోదించి, తన చోటుకు వెళ్ళి కూర్చున్నారు. ఎదురుగా ఉన్న పద్మనాభం గారిని చూశారు.

మీ గురించి నేను చాలా విన్నాను. పోయిన సంవత్సరం కూడా మీకు బెస్ట్ పోలీసు ఆఫీసర్ పురష్కార్ బిరుదు ఇచ్చారు...అవునా?”

స్వామీజీ బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు. అది నాకు ఎక్కువ సంతోషం ఇస్తొంది

చెప్పండి...ఏమిటి విషయం? నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం కోసం గొప్ప గొప్ప బిజినస్ పీపుల్, ప్రభుత్వ అధికారులూ, రాజకీయ నాయకులూ రావటం అలవాటు. మొదటిసారిగా ఒక పోలీసు అధికారి వచ్చారు! ఏమిటి విషయం...చెప్పండి

స్వామీజీ! నేను మీతో కొంచం మాట్లాడాలి. ఇప్పుడు...ఈ గదిలోకి ఎవరూ రారు  కదా?"

స్వామీజీ తన పెదాలు విప్పి. చిన్నగా నవ్వారు. నా అనుమతి లేకుండా ఎవరూ లోపలకు రారు. మీరు ఏది మాట్లాడ దలచుకున్నా...ఎంతసేపు మాట్లాడ దలచుకున్నా మాట్లాడొచ్చు

చాలా థ్యాంక్! మామూలుగా ఆద్యాత్మిక ప్రజల మధ్యా సరే...సాధారణ మానవుల మధ్యా సరే...మీకు మంచి మర్యాద ఉన్నది. మిగిలిన దొంగ స్వామీజీల మీద ఉన్న విరక్తో...అతృప్తో మీ పేరు మీద కొంచం కూడా లేదు. మీ ట్రస్టు మూలంగా కాలేజీలూ, హాస్పిటల్స్ కట్టబడి...అర్ధీకంగా వెనుకబడి ఉన్న ప్రజలకు అవి పెద్ద ఎత్తున సహాయంగా ఉన్నది నాకు తెలుసు. అయినా...

పద్మనాభం గారు మాటలు ఆపటంతో...స్వామీజీ కనుబొమ్మలు ఎత్తారు.

అయినా ఏమిటి? చెప్పండి...

మీ మీద ఎవరో కొందరు అసంతృప్తిగా ఉన్నారు. మీ మాటలూ, చేష్టలూ...వాళ్ళకు నచ్చలేదు

స్వామీజీ నవ్వారు.

దానికి నేనేం చేయగలను? ఈ రోజుల్లో పుట్టిన బిడ్డకు కూడా విరోధులు ఉంటున్నారు

మీకున్న విరోధుల గురించి మీరు ఏమనుకుంటున్నారు?”

స్వామీజీ గట్టిగా నవ్వారు.

ఆ విరోధులు ఎవరనేదే తెలియదు. తెలిస్తేనే కదా వాళ్ళు గురించి నేనేమనుకుంటున్నానో చెప్పగలను? అదీ కాకుండా...ఎవరు నన్ను విరోధిగా అనుకుంటున్నా, వాళ్ళను నా భక్తులుగానే చూస్తున్నాను

క్షమించాలి స్వామీజీ! ఇలాంటి సంస్కారమైన మాటలూ, అహింసా దారీ మీకు కావాలంటే సరిగ్గా ఉండొచ్చు. కానీ, మాలాంటి పోలీసు మనుషులకుసరి రాదు. మొదట ఈ లెటర్ చదవండి... చెప్పిన పద్మనాభం గారు తన చేతిలో ఉంచుకున్న కాగితాన్ని తీసి జాపాడు.

ఇది ఏం ఉత్తరం?”

ఈ రోజు ప్రొద్దున నా ఇంటి పర్సనల్ పోస్ట్ బాక్స్లో వెయ్యబడిన ఉత్తరం ఇది. గత రెండు నెలలో ఇది మూడో ఉత్తరం

స్వామీజీ ఆ ఉత్తరాన్ని విప్పి...చూపులను అందులో ఉంచారు.

పోలీసు డిపార్ట్ మెంట్ గౌరవంఅని పొగడబడే డి.ఐ.జి పద్మనాభం గారికి,

నమస్కారములు!

ఇది ఊరు, పేరు రాయని అనామకుడు రాసిన ఉత్తరమే కదా?’ అని అనుకుని చదవకుండా డస్ట్ బిన్లో పడేయకండి. ఇంతకు ముందు ఇదే రీతిలో మీకు పంపిన రెండు ఉత్తరాలకూ ఎలాంటి రియాక్షన్లేకుండా పోవటంతో...ఈ మూడో ఉత్తరాన్ని మీకు పంపటం అవసరమయ్యింది! 

అదే పాత విషయానికే వస్తున్నాను. తెల్ల రంగు దుస్తులు ధరించి మృదువుగా మాట్లాడుతూ ఆధ్యాత్మికం అనే ముసుగుతో మోసం చేస్తున్న జయశ్రీ సర్వానందా, డబ్బున్న ఇంటి మహిళల నగలను టార్గెట్ చేయటమే కాకుండా, వాళ్ళ పవిత్రతను దోచుకుంటున్నారు.

రాజకీయ నాయకుల ఆశీర్వాదంతో పలు రకాల చట్ట విరుద్ద కార్యాలను చేస్తున్న ఈయన, కొల్లగొట్టిన డబ్బు మొత్తాన్నీ విదేశీ బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్నారు. ఇలా చెప్పే నేరారోపణలకు ఆధారం ఉన్నదా?’ అని మీరు అడగొచ్చు. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఆధారం దొరుకుతుంది.

సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సర్వానందా యొక్క జ్ఞాన మండపం చోటును హఠాత్తుగా వంద పోలీసుల సహాయంతో రైడ్ చేసి సోధన చేస్తే, కావలసిన ఆధారాలు దొరుకుతాయి. దీన్ని వెంటనే అమలు పరచండి.

మీరు ఈ ఉత్తరాన్ని నిర్లక్ష్యం చేసి, సర్వానందా మీద ఎటువంటి చర్యా తీసుకోకపోతే...నేనూ, సమాజం మంచి కోరే కొంతమంది ప్రజలు సర్వానందాను చట్టం ముందు నిలబెట్టకుండా, మా మనస్సాక్షి ముందు నిలబెట్టి మరణదండన ఇవ్వబోతాం. ఆ దండనను మీ పోలీసు డిపార్ట్ మెంట్ ఆపనే లేదు!

ఇట్లు.

జయశ్రీ సర్వానందా స్వామిజీ ఆ ఉత్తరాన్ని చదివేసి, చిన్నగా నవ్వుతూ పద్మనాభం గారిని చుశారు.

అదేమిటి...ఇట్లు అని రాసి దానికి కింద ఎర్ర రంగులో ఏదో ఎండిపోయిన మరక తెలుస్తోంది?”

అది...రక్తం మరక

ఉత్తరం రాసిన వాడి రక్తమా అది?”

ఉండొచ్చు! ఎండిపోయిన రక్తపు మరకను అలాగే అమ్మోనియా రసాయన ద్రవంలో డైల్యూట్ చేసి, పరిశోధించాము. అది పాజిటివ్ రక్తం. ఆ గ్రూపు రక్తం చాలా మందికి, అంటే వందమందిలో ఎనబై శాతం మందికి ఉంటుంది

జయశ్రీ సర్వానందా స్వామిజీ ఉత్తరాన్ని పద్మనాభం దగ్గర తిరిగి ఇస్తూ అడిగారు. 

మీరు ఇప్పుడు ఏం చెయ్యబోతారు? ఉత్తరంలో అతను చెప్పినట్టు ఈ జ్ఞాన మండపం పూర్తిగా శోధన చెయ్యబోతారా?”

పద్మనాభం గారు నవ్వారు.

అలా శోధన చెయ్యాలని అనుకుంటే...నేను మాత్రం ఒంటరిగా వస్తానా?”

సరే...మరి మీరు ఇప్పుడెందుకు ఒంటరిగా వచ్చారు? ఈ ఉత్తరాన్ని చూపించి హెచ్చరిక చెయ్యటానికా?”

అదీ ఒక కారణమే! రెండో కారణం కూడా ఉంది

చెప్పండి

మీ గురించి నాకు బాగా తెలుసు. ప్రజల మధ్య మీకు చాలా మంచి పేరు ఉంది. అన్నిటి కంటే మా సీక్రెట్ సర్వీస్ డివిజన్ మీ మీద చేసిన ఇండైరెక్ట్ సర్వేచేసి పోలీసు డిపార్ట్ మెంటుకు ఇచ్చిన రిపోర్టులో అంతా మంచిగానే చెప్పబడింది. ఇలా అన్ని వైపుల నుండి మీ గురించి వస్తున్న రిపోర్టులు మీ గురించి మంచిగా చెబుతుంటే మీ మీద ఎవరికి, ఏం కోపం?”

పద్మనాభం గారు అలా అడిగిన వెంటనే జయశ్రీ సర్వానందా స్వామిజీ, రెండు చేతులూ జాపి...భుజాలను ఊపారు.

నా శత్రువులు ఎవరు అని నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు నన్ను అసహ్యహించుకుంటున్నారో అనేదీ అర్ధం కావటం లేదు. వాళ్ళ గురించి నేను బాధ పడటమూ లేదు

మీకు ఆ బాధ లేకుండా ఉండొచ్చు. నేను, అంటే మా పోలీసు డిపార్ట్ మెంట్ అలా ఉండలేదు స్వామీ

సరే...ఈ విషయంలో మీరు ఏం చెయ్యబోతారు?”

మీ శత్రువులు ఎవరనేది కనిబెట్టబోతాము

ఎలా ?”

దానికొక దారుంది

ఏం దారి?”

పద్మనాభం గారు స్వరం తగ్గించి, చిన్న స్వరంతో అది చెప్పటం ప్రారంభించారు!

***************************************************PART-3******************************************

అడిషనల్ కమీషనర్ వెంకటేష్ బైకులో పయనించి ఇంటికి వెళ్ళి చేరుకున్నప్పుడు ఆయన భార్య వర్షిణీ కలవరపాటుతో వాకిలిలోనే నిలబడింది.

బైకు ను ఆపిన వెంటనే...దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది.

ఏమండీ...ఎవరు ఆ జననీ?”

తెలియటం లేదే! పార్సిల్ ఎక్కడ?”

మీరు చెప్పినట్టే తోటలోకి తీసుకు వెళ్ళి పెట్టేసి వచ్చాను

సరే...పార్సిల్ వచ్చింది ఇంట్లో ఉన్న పనివాళ్ళకు ఎవరికైనా తెలుసా?”

ఎవరికీ తెలియదు!

సరే...రా! వెళ్ళి చూద్దాం”--బండీకి ఉన్న సైడ్ బాక్స్ లో నుంచి మెటల్ డిటెక్టర్ చేతిలోకి తీసుకున్నాడు.

ఇద్దరూ ఇంటి వెనుక ఉన్న తోటవైపుకు వెళ్ళారు. పంపు సెట్టు పక్కన ఒక గోనె సంచీకి కింద బయటకు కనబడకుండా ఉంచిన పార్సిల్ ను చూపించింది.

అదే నండీ...!

వెంకటేష్ ఆ గోనె సంచీని మెటల్ డిటెక్టర్ తో టెస్ట్ చేసి, అందులో పేలుడు పధార్ధం ఏదీ లేదని తెలుసుకుని, గోనె సంచీని పక్కకు తోసి, పార్శిల్ ను తీశారు. అంతగా బరువుగా లేదు. చేతితో నొక్కి చూశారు. కఠినంగా ఏదీ ఉన్నట్టు అనిపించలేదు.

పార్సిల్ కు మరో పక్క ఉన్న అడ్రస్సును చూశారు. రెండు సార్లు చదివి, ‘ఎవరై ఉంటారు?’ అని ఆలొచించారు.

వర్షిణీ! ఈ జననీ అనే పేరుతో నాకు ఎవర్నీ తెలియదే...

మొదట పార్సిల్ విప్పండి...లోపల ఏదైనా ఉత్తరం ఉండొచ్చు

వెంకటేష్ చేతిలో ఉన్న పార్సిల్ ను కొన్ని క్షణాల దాకా బిడియంతో చూస్తూ ఉండి, మెల్లగా తెరిచారు. అందులో ఒక చిన్న అట్టపెట్ట కళ్లకు కనబడింది. దాన్ని కూడా విప్పారు.

ఆ అట్టపెట్టలో ఒక పాలీతీన్ సంచీ. అందులో బూడిద రంగులో ఏదో మట్టిలాంటి పొడి.

వెంకటేష్ ఆ పాలితీన్ బ్యాగును తీసి...అదేమిటో నని చూస్తూ ఉన్నప్పుడే, అట్టపెట్టె లోని ఒక మూలలో నాలుగు మడతలుగా మడత పెట్టబడి ఉన్న కాగితం కనబడ్డది.

ఒళ్ళంతా పాకిన ఆందోళనతో దాన్ని బయటకు తీశారు.

అదొక లెటర్. బాల్ పాయింట్పెన్నుతో త్వరగా రాసిన చేతిరాతతో రాయబడున్న లెటర్ వాక్యాలను చదవటం మొదలుపెట్టారు.

అడిషనల్ కమీషనర్ వెంకటేష్ గారూ....

ఆ చిన్న పార్సిల్లోఉన్న పోలితీన్ సంచీని, అందులో ఉన్న మట్టిలాంటి పౌడర్ను చూసి అది ఏమై ఉంటుంది అని ఆలొచించి కన్ ఫ్యూజ్ అవకండి. మీ కన్ ఫ్యూజన్ను పోగొట్టాల్సిన బాధ్యత నాది. ఆ పాలితీన్ కవురులో ఉన్నది మట్టి కాదు...బూడిద.

బొగ్గును కాలుస్తేనో...కట్టెలు కాలుస్తేనో వచ్చిన బూడిద కాదు. మానవ శరీరం యొక్క బూడిద. అది ఎవరనేది నాకు మాత్రమే తెలుసు. ఆ మనిషిని హత్య చేసింది నేనే. ఇప్పుడు మీకు ఒక పోటీ పెట్టబోతున్నాను.

ఆ పోటీలో మీరు గెలిస్తే మీరు నిజంగానే తెలివిగల పోలీసు అధికారి. లేకపోతే అనవసరంగా జీతం తీసుకునే ఎంతోమంది ప్రభుత్వ అధికారులలో మీరూ ఒక్కరు.

మీకు కరెక్టుగా ఒక నెల రోజులు అవకాశం ఇస్తున్నాను. అంతలో...ఆ బూడిదకు సంబంధించిన వ్యక్తి ఎవరనేది మీరు కనిబెట్టాలి. నా వలన హత్య చేయబడి, నా చేత తగలబెట్టించుకున్న ఆ వ్యక్తి మగా లేక ఆడ? యువకుడా లేదు యువతా? లేకపోతే వయసైన వృద్ద వ్యక్తా?...అనేలాంటి ప్రశ్నలకు జవాబు కనుక్కోవాలి.

అది సరిగ్గా ఉంటే, మీ తెలివితేటలను మెచ్చుకుని, మీ ముందుకు వచ్చి లొంగిపోతాను. ఒక వేళ మీ వలన కనిబెట్టలేకపోతే...నేనిచ్చిన అవకాశం పూర్తి అయిన మరుసటి రోజు...మీరు పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓడిపోయినందుకు గుర్తుగా గుండు కొట్టించుకోవాలి.

పోటీకి రెడీనా? ‘ఇదొక పిచ్చోడి ఉత్తరం!అని అనుకుని నిర్లక్ష్యం చేయకండి. ఈ చాలెంజును ఆమోదించి మీ సమాధానం ఓకే అయితే, ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు బిర్లా మందిరం పక్కనున్న హోటల్ స్వాగత్ కు రండి. తెల్ల రంగు చొక్కా వేసుకుని రండి.

వాక్యాలు ముగిసిపోయినై. వెంకటేష్ ఆ ఉత్తరాన్ని తన భార్య వర్షిణీ చేతికి ఇచ్చారు. ఆ ఉత్తరం తీసుకుని చదివిన ఆమె ఆశ్చర్యపోయింది. నుదుటి మీద చెమట పట్టింది...స్వరంలో వణుకు.

ఏమండీ...ఎవరో ఆటలాడుతున్నారు...

ఇది ఆటకాదు వర్షిణీ...ఇది విపరీతం!

ఈ లెటర్ను నమ్ముతున్నారా?"

ఇందులో రాసున్న వాక్యాలలో ఎగతాలి, వెక్కిరింత ఉన్నా...ఒక విధమైన విపరీత ధోరిణి కూడా ఉన్నది. అందువలన దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు

ఏం చెయ్యబోతారు?”

పోటీలో పాల్గొనబోతాను. ఈ బూడిద ఎవరిదనేది కనిబెట్టబోతాను. కొంచం రిస్క అయిన పనే. కానీ వేరే దారి లేదు

వర్షిణీ కలవరంతో చూసింది!

పోలీసు డిపార్టు మెంటుకు తెలిసా...తెలియకుండానా?”

తెలియకుండానే! వాళ్ళకు తెలిస్తే పత్రికలకు వెళ్ళిపోతుంది. ఆ తరువాత హంతకుడు అలర్ట్ అవుతాడు!

ఏమండీ! ఎందుకైనా మంచిది. ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి ఈ వ్యవహారంలో దిగటం మంచిదని నా మనసుకు అనిపిస్తోంది. కొరియర్లో పార్సిల్ వచ్చింది. పంపిన వారి పేరు జననీ అని రాసి పూర్తి అడ్రస్సు రాసుంది

నేను బైకులో వచ్చేటప్పుడు దాన్ని కూడా విచారించి చూశాను. గచ్చిబౌలిలో అలాంటి అడ్రస్సు ఏదీ లేదట. కొరియర్ సర్వీస్ వాళ్ళు, ఫ్రం అడ్రస్సు రాయకపోతే లెటర్నో, పార్సిల్నో బుక్ చేసుకోరు. అందువలన హంతకుడు అలాంటి ఒక అడ్రస్సు రాసుంటాడు

సరే నండీ...కొరియర్ ఆఫీసులో బుక్ చేసి రసీదు ఇచ్చిన ఉద్యోగి ఆ హంతకుడ్ని చూసుండచ్చే?"

"ఉండచ్చు వర్షిణీ! అదేం కొరియరో పేరు చూడు?"

పర్​ఫెక్ట్ కొరియర్ సర్వీస్!

***************************************************PART-4******************************************

డి.ఐ.జి. పద్మనాభం గారు స్వరం బాగా తగ్గించి మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు.

స్వామీజీ...ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని అనేలాగా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనేలాగా కొన్ని విషయాలలో మనం అలా నడుచుకుంటేనే సమస్యలలో క్లారిటీ దొరుకుతుంది. మీ శత్రువులు ఎవరనేది మీకే తెలియకపోతే...నాకెలా తెలుస్తుంది? ఆ శత్రువులను కనిబెట్టటానికి నా దగ్గర ఒక అడ్డుదోవ ఉంది. అది అమలు పరిచితేనే...కంటికి తెలియని ఆ శత్రువులు బయటకు వస్తారు

అడ్డుదోవ?”... సర్వానందా స్వామీజీ ఆశ్చర్యంతో అడగ... పద్మనాభం గారు నవ్వారు.

అడ్డుదోవ అని నేను చెప్పిన వెంటనే అదేదో తప్పు దారి అని అనుకోవద్దు స్వామీజీ! మీ యొక్క విరోధులను కనిబెట్టటానికి కొంచం తెలివిగా నడుచుకోవాలి. అంతే!

ఎలాగో చెప్పండి...

ఆ దోవ ఏమిటో నేను చెప్పటానికి ముందు...ఈ జ్ఞానమండపం గురించి నాకు కొన్ని వివరాలు కావాలి

సరే అడగండి!

నా మొదటి ప్రశ్న...ఈ జ్ఞానమండపం స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయ్యుంటుంది?”

సుమారు ఇరవై సంవత్సరాలు

దీన్ని స్థాపించిన వారు ఎవరు?”

జగద్గురు ఆనందానంద స్వామీజీ. ఆయన తరువాత ఈ జ్ఞానమండపం బాధ్యత నేను తీసుకున్నాను

మీరు ఈ బాధ్యత తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతోంది?”

ఏడు సంవత్సరాలు

ఈ మండపంలో ఎంత మంది ఉన్నారో చెప్పగలరా?”

సర్వానందా స్వామీజీ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఆలోచించి, తరువాత కళ్ళు తెరిచారు.

ఇక్కడ పర్మనెంటుగా బస చేసే వాళ్ళు 669 మంది ఉంటారు. అందులో సగానికి పైగా విదేశాలకు చెందిన వాళ్ళు. చాలా మంది అమెరికా నుండి వచ్చిన వారే. కోటీశ్వర్లు. జీవితంలో అన్ని ఆశలనూ అనుభవించి...తరువాత దాంట్లో ఏమీలేదు అని తెలుసుకుని విరక్తి, విసుగు ఏర్పడి...మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపటానికి ఇక్కడకు వచ్చేశారు.

ఈ జ్ఞానమండపం ఇంత బ్రహ్మాండంగా అభివ్రుద్ది చెందటానికి కారణం అదే విదేశీయులే! వాళ్ళు తీసుకు వచ్చి పోసిన డబ్బుతోనే...ఒకప్పుడు అడవిలాగా ఉన్న ఈ చోటు...ఈ రోజు జ్ఞానమండపంగా రూపం పొందింది.

ఇరవై సంవత్సరాలకు ముందు...ఈ ప్రదేశంలో ప్రజా కదలికే ఉండేది కాదు. వ్యవసాయానికి కూడా ఉపయోగ పడని ఈ మట్టిలో ముళ్ళ చెట్లు, పిచ్చి చెట్లు పెరిగి పొదలాగా ఉండేది

పద్మనాభం గారు అడ్డుపడ్డారు. మీరు చెప్పేది చూస్తే...విదేశీయ భక్తులు రాకుండా పోయుంటే ఈ జ్ఞానమండపం వెలిసుండేది కాదేమో?"

కరెక్టుగా చెప్పారు! ఈ రోజుకీ వాళ్ళు డాలర్లు...డాలర్లుగా తీసుకువచ్చి పోస్తున్న డబ్బుతోనే పెద్ద హాస్పిటల్ కట్టి పేద ప్రజలకు ఉచిత వైద్యం చూస్తున్నాం. ఆరు ఇంజనీరింగ్ కళాశాలలూ, రెండు మెడికల్ కాలేజీలూ కట్టి పేద విధ్యార్ధులను చదివిస్తున్నాము. అనాధలైన మహిళలకు ఉద్యోగాలు ఏర్పరచి ఇస్తున్నాం

విదేశీయులు మిమ్మల్ని వెతుక్కుని ఇక్కడికి రావటానికి ఏమిటి కారణం?”

హిందూ మత సిద్దాంతాలు వాళ్లకు నచ్చినై. ఆ సిద్దాంతాల అర్ధాలు వాళ్ళను తన వసం చేసుకుంది. భగవద్గీతలో చెప్పబడిన ఒక్కొక్క తత్వాన్నీ వాళ్ళు అనుభవించి...దానికి తగినట్టు ఆశపడుతున్నారు. దాని ప్రతి ఫలమే...వాళ్ళు ఇక్కడకొచ్చి పర్మనెంటుగా ఉండిపోతున్నారు

సగానికి పైన విదేశీయులు. సరే! మిగిలిన మనుషులు ఎవరు?”

ఇండియాలో ఉండే పలు ప్రాంతాలకు చెందిన వారు. వీళ్ళలోనూ డబ్బుగల వారూ ఉన్నారు

రోజుకు ఎంత మంది భక్తులు ఇక్కడికి వస్తారు?”

రెండువేల మంది...

ఇంతమంది ప్రజలలో మీరు వద్దు అనుకునే వారు కూడా ఉంటారు కదూ?”

ఖచ్చితంగా!

ఆ మనుషుల వల్ల మీకు ఆపద ఏర్పడవచ్చే?”

అవును! దానికి మీరేం చెయ్యబోతారు?”

విరోధులను మోసం చేయటానికి ఒక డ్రామా వెయ్యబోతాము

ఎలా?”

వచ్చే పదకుండో తారీఖు సరూర్నగర్ వెళ్ళి, అక్కడ జరిగే ఆధ్యాత్మిక ప్రచారంలో మీరు పాల్గొనబోతారు కదా స్వామీజీ?”

అవును..."

"మీరు సరూర్నగర్ వెళ్లే దోవలో, కొండ ప్రాంత బాటలో మిమ్మల్ని అడ్డగించి మీరు కిడ్నాప్ చేయబడతారు. మిమ్మల్ని కిడ్నాప్ చేయబోయేది ఇంకెవరో కాదు పోలీసులే స్వామీజీ"

పద్మనాభం గారు చెప్ప...స్వామీజీ నుదురు పైకి ఎక్కింది.

మీ ప్లాను నాకు అర్ధం కాలేదే?”

స్వామీజీ! ఇలాంటి కిడ్నాప్ డ్రామా జరిపితేనే...మీ శత్రువులకు అది షాక్ గా ఉంటుంది. మీరు సరూర్నగర్ లోనే ఒక బంగళాలో  పోలీసులు బద్రతతో  జాగ్రత్తగా ఉంటారు. కానీ, బయట ప్రపంచం గందరగోళంతోనూ, అయోమయంతోనూ కాలిపోతూ ఉంటుంది. టీవీ, పేపర్ అంటూ అన్ని

మీడియాలలోనూ మీరే మాట్లాడే విషయంగా మారిపోతారు.

మీ ప్రాణానికి ఏమయ్యిందో?’ అని మీ భక్తులు కలవరపడుతూ ఉంటారు. అదే సమయంలో ఒక పోలీస్ టీమ్ మఫ్టీలో మీ భక్తులతో భక్తులుగా కలిసిపోయి...ఆ  జ్ఞానమండపం ప్రహారంలో నిఘా వేసి చూస్తూ ఉంటారు. మీరు కిడ్నాప్ చెయబడిన దాని గురించి ఎవరెవరు ఏం ఏం మాట్లాడుకుంటున్నారో...? అని అబ్జర్వ్ చేస్తారు. ఈ మాటలలో ఏదైనా క్లూదొరకొచ్చు.

అదేలాగా ఇక్కడ పర్మనెంటుగా పనిచేసే ఉద్యోగులు, వాలింటీర్లు పోలీస్ నిఘాలోనే ఉంటారు. ఆ నిఘాలో...మీరు కిడ్నాప్ చేయబడిన దాని గురించి ఎవరు నిజంగా బాధపడుతున్నారు, ఎవరు సంతోషపడుతున్నారో తీర్మానానికి రావచ్చు.  పోలీసులకు చిన్నదిగా ఒక విషయం దొరికినా చాలు. అది పెట్టుకుని...నేరస్తుల పక్కకే వెళ్ళిపోతారు

పద్మనాభం గారు చెప్పింది విని సర్వానందా స్వామీజీ మౌనంగా ఉన్నారు.

ఏం స్వామీజీ...నేను చెప్పిన ఈ ప్లాను మీకు నచ్చలేదా?”

ఈ కిడ్నాప్ డ్రామాతో నా శత్రువులు దొరికిపోతారని అనుకుంటున్నారా?”

ఇది ఒక ప్రయత్నమే? మీరు సహకరిస్తే...విరోధులను పోలీసులు పట్టుకోగలరు

ఇలాంటి ఒక నాటకం అవసరమా అని నా మనసుకు అనిపిస్తోంది!

అవసరమే స్వామీజీ! దీనికి మీరు ఎటువంటి అభ్యంతరమూ చెప్పకండి. వచ్చే పదకుండో తారీఖు మీరు...పోలీసుల ద్వారా కిడ్నాప్ చేయబడతారు. సరూర్నగర్ దగ్గరలో ఉన్న ఒక గెస్ట్ హౌస్లో బద్రతగా ఉంచబడతారు. ఒక వారం రోజులు అక్కడ ఉంటే చాలు. అంతలో మీ శత్రువులు ఎవరనేది మేము వాసనపట్టేస్తాము

సర్వానందా స్వామీజీ చిరునవ్వుతో తల ఊపారు. మీరు ఇంత దూరం చెబుతున్నప్పుడు...నా వల్ల దేన్నీ నిరాకరించడం కుదరటం లేదు! మీ ప్లాను ప్రకారమే చేయండి

చాలా థ్యాంక్స్ స్వామీజీ!

***************************************************PART-5******************************************

పర్​ఫెక్ట్ కొరియర్ సర్వీస్లక్డికపూల్ లోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నది.

వెంకటేష్ మఫ్టీ డ్రస్సులో వెళ్ళి చూసినప్పుడు...సెల్ ఫోనులో ఎవరి దగ్గరో కోపంగా మాట్లాడుతున్నాడు దాని మేనేజర్.

సార్...తప్పు మీ మీద ఉన్నప్పుడు, మీరు మిమ్మల్ని తప్పు పట్టటం ఏ విధంగా న్యాయమో చెప్పండి? కొరియర్ లో డబ్బులు పంపించ కూడదని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన బోర్డ్ కౌంటర్ పైనే వేలాడుతూ ఉంటుందే?”

“.........................”

మీరు చూడలేదు అంటే దానికి మేమెలా సార్ బాధ్యత వహిస్తాము?”

“..........................”

మీరు దారాళంగా కన్స్యూమర్ కోర్టులో కేసు పెట్టుకోండి...దాని కంటే ఇంకేదైనా పలుకుబడి చేయగలరేమో చూడండి...మీ డబ్బు మాత్రం మేము తిరిగి ఇవ్వలేము

కోపంగా మాట్లాడి సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఎదురుగా నిలబడున్న వెంకటేష్ ను తల ఎత్తి చూశాడు.

ఏం కావాలి సార్

చిన్న ఎంక్వయరీ

ఏమిటీ...ఎంక్వయరీనా?”

కళ్ళు చిన్నవి చేసిన మేనేజర్ మొహానికి ముందు తన ఐడి కార్డు జాపారు వెంకటేష్. మేనేజర్ భయపడిపోయి లేచారు. ఎదురుగా ఉన్న ఖాలీ కూర్చుని వినయంగా చూపించారు.

కూర్చోండి సార్...

వెంకటేష్ కూర్చున్నారు.

చెప్పండి సార్...మీకు ఎలాంటి సమాచారం కావాలి?”

ఈ రోజు ప్రొద్దున మీ కొరియర్ సర్వీస్ నుండి నాకు ఒక చిన్న పార్సిల్ వచ్చింది. దాని నెంబర్: 97800326102. మీ హెడ్ ఆఫీసుకు ఫోను చేసి అడిగినప్పుడు....ఆ పార్సిల్ దిల్ సుఖ్ నగర్ బ్రాంచీ లో రిజిస్టర్ చేసినట్టు చెప్పారు. అందులో ఇష్టపడని ఒక వస్తువు ఒకటి ఉన్నది

అది ఏం వస్తువు సార్?”

ఆ వివరం మీకు అవసరంలేదు. పార్సిల్ కవర్నూ తీసుకు వచ్చాను. పంపింది జననీ అని పేరు రాయబడి, గచ్చిబౌలి అడ్రస్సు రాసుంది. మా విచారణలో అది ఫేక్ అడ్రస్సు అని తెలిసింది. నాకు ఈ విషయంలో తెలియవలసిందంతా...పార్సిల్ను పంపిన వ్యక్తి దాన్ని బుకింగ్ చేస్తున్నప్పుడు...ఆ వ్యక్తిని మీ బుకింగ్ స్టాఫ్ చూసుండొచ్చు కదా?”

ఉండొచ్చు సార్! ఎంతోమంది బుకింగ్ చేయటానికి వచ్చినా...కొందరి మొహాలు మనసులో నిలబడతాయి!

ఈ పార్సిల్ నిన్న ఇక్కడ నుండి పంపించబడింది. దాన్ని బుకింగ్ చేసిన వ్యక్తి ఎవరనేది చెప్పగలరా?”

ష్యూర్ సార్! అన్న అయన...పార్సిల్ పైన ఉన్న నెంబర్లు చూసి, ఇంటర్ కాం రిజీవర్ ఎత్తి ఒక బటన్ నొక్కారు. తరువాత మాట్లాడారు.

రోజా! రెండు నిమిషాలు నా గదికి వచ్చెళ్ళు

రిజీవర్ను పెట్టేసి, వెంకటేష్ ని చూశారు. సార్! ఈ ఆఫీసులో మొత్తం ముగ్గురు ఆడపిల్లలు బుకింగ్ క్లర్కులుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ పార్సిల్ నెంబర్ను చూస్తున్నప్పుడు రోజానే డ్యూటీలో ఉండుండాలి. ఆ అమ్మాయిని అడిగితే...ఇది బుక్ చేయటానికి వచ్చింది ఎవరనేది చెప్తుంది సార్

వెయిట్ చేశారు.

రెండు నిమిషాల్లో రోజా వచ్చింది. వయసు ఇరవై ఐదు లోపే ఉంటుంది. కళ్లజోడు పెట్టుకున్న మొహం కళగానే ఉంది. మెరూన్ కలర్ చుడిదార్, నుదిటి మీద అదే రంగులో స్టికర్ బొట్టు. మేనేజర్ ముందు వచ్చి నిలబడింది.

చెప్పండి సార్...

రోజా! ఈయన పోలీసు డిపార్ట్ మెంట్ అధికారి. విచారణ కోసం వచ్చారు. నిన్న సాయంత్రం ఈ పార్సిల్ ను బుకింగ్ చేయటానికి ఒకరు వచ్చారు. నువ్వే రసీదు రాసి ఇచ్చావు! అందులో ఏదో డేంజరస్ వస్తువు ఉన్నట్టు సార్ చెబుతున్నారు

డేంజరస్ వస్తువా?” – రోజా యొక్క మొహంలో భయం కనబడింది.

వెంకటేష్ అడ్డుపడ్డారు.

ఇలా చూడమ్మా! ఈ పార్సిల్లో ఉన్న వస్తువు ఏమిటనేది ఇప్పుడు చెప్పము. నాకు కావలసినదంతా...దాన్ని బుకింగ్ చేయటానికి వచ్చినతన్ని నీకు జ్ఞాపకముందా?”

నాకు గబుక్కున జ్ఞాపకం రావటం లేదు సార్!

అర్జెంట్ ఏమీ లేదు. కాస్త టైము తీసుకో. నిదానంగా ఆలోచించి చెప్పమ్మా

ఆలోచించటానికి కొన్ని క్షణాలే తీసుకున్న రోజా, ఖచ్చితమైన స్వరంతో చెప్పింది.

సార్...ఈ పార్సిల్ బుకింగ్ చేయటానికి వచ్చింది ఒక అమ్మాయి

అమ్మాయా?”

అవును సార్...నాకు బాగా జ్ఞాపకం ఉంది. పార్సిల్ను నా దగ్గర ఇచ్చిన వెంటనే, ‘దాంట్లో ఏముంది?’ అని అడిగాను. దానికి ఆ అమ్మాయి ఇందులో ఆయుర్వేద మందులు అని చెప్పింది...

చూడటానికి ఎలా ఉంది?”

యంగ్ అమ్మాయే సార్. వయసు ముప్పై లోపలే ఉంటుంది. గొప్ప అందం అని చెప్పలేము. పొట్టి

మరోసారి ఆ అమ్మాయిని చూస్తే నువ్వు గుర్తు పట్టగలవా?”

పడతాను సార్! కానీ...నిన్న చీర--జాకెట్టుతో వచ్చింది. అదేలాంటి గెటప్ లో వస్తేనే నేను గుర్తుపట్టగలను. అలా కాకుండా చుడిదార్, సాల్వార్ కమీజ్ లాంటి డ్రస్సు లో వస్తే గుర్తుపట్టటం కష్టం సార్

ఆమెతో ఇంకెవరైనా వచ్చారా?”

నేను సరిగ్గా గమనించలేదు సార్. ఆ టైములో కస్టమర్స్ గుంపు ఎక్కువగా ఉంది సార్

వచ్చింది అమ్మాయేనని చెప్పావు...అందులో నీకేమీ డౌట్ లేదే?”

లేదు సార్...వచ్చింది అమ్మాయే! అందులో ఏ సందేహమూ వద్దు. బై ద బై...ఆ పార్సిల్లో ఏదో విపరీతమైన వస్తువు ఉన్నట్టు చెప్పారు. అదేమిటి సార్?”

ప్రస్తుతానికి అదేమిటో చెప్పలేమమ్మా. ఆ అమ్మాయి దొరికినప్పుడే అన్ని నిజాలూ బయటకు వస్తాయి. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఆ అమ్మాయిని బయట ఎక్కడ చూసినా...వెంటనే నాకు సమాచారం ఇవ్వు. నా సెల్ నెంబర్ రాసుకో

ఒక చిన్న తెల్ల కాగితం మీద తన సెల్ నెంబర్ రాసిచ్చి, బయటకు వచ్చారు వెంకటేష్.

లక్షల మంది ఉన్న హైదరాబాదులో ఆ అమ్మాయి మళ్ళీ చూడటానికి దొరుకుతుందా?’

ఆలోచిస్తూనే బైకు దగ్గరకు వచ్చారు. స్టాండులో నుండి బైకు తీసిన క్షణం...ఆయన చూపులు, బైకు యొక్క బ్యాక్ వ్యూ అద్దంలోకి వెళ్లగా, చిన్నగా ఆశ్చర్యపోయారు.

దానిపై స్టికర్లాంటి తెల్ల ముక్క అతికించబడి, స్కెచ్ పెన్నుతో రాసిన వాక్యం కనబడింది. ఆందోళనతో చదివారు.

పరవాలేదే...ఏ.సీ.సార్!

కరెక్టు చోటు నుండే.

విచారణ మొదలు పెట్టారు

కంగ్రాట్స్’.

***************************************************PART-6******************************************

డి.ఐ.జి పద్మనాభం గారు తన ప్రత్యేక వయర్ లెస్ గదిలో కూర్చుని చెవులకు హెడ్ ఫోను తగిలించుకుని ఆందోళనతో మాట్లాడుతున్నారు.

సూర్యనారాయణ...మీరు ఇప్పుడు ఎక్కడున్నారు?”

సార్! సరూర్నగర్ చెక్ పోస్టు కు పక్కన ఒక చెట్టు కింద బైకుతో కాచుకోనున్నాను

మీరు అసిస్టంట్ పోలీస్ కమీషనర్ అని ఎవరూ గుర్తు పట్టకూడదు

తెలియదు సార్! నేను స్టోన్ వాష్ ప్యాంటు--చొక్కతో కాలేజీ స్టూడెంట్ లాగా ఉన్నాను. నన్నెవరూ గుర్తుపట్టటానికి చాన్స్ లేదు. అదేలాగా...మన టీములో ఉన్న మిగిలిన పోలీసు అఫీసర్లు ముగ్గురూ వేరువేరు గెటప్పులో ఉన్నారు...ఎవరూ సందేహ పడేటట్టు కనబడరు. మీరు వేసిచ్చిన ప్లాను ప్రకారం, కిడ్నాప్ నాటకాన్ని విజయవంతంగా జరిపి ముగిస్తాం

నెరవేర్చడంలో ఎటువంటి తప్పూ జరగదే?”

సర్టన్లీ నో సార్! వాళ్ళు నలుగురూ శిక్షణపొందిన ఆఫీసర్లు సార్!

ఆయన్ని కిడ్నాప్ చేసి సరూర్నగర్ లోని ఏ గెస్ట్ హౌస్ కు తీసుకు వెళుతున్నారు?"

ఆపిల్ తోటకు వెళ్ళే దారిలో సిల్వర్ స్ట్రీమ్అనే గెస్ట్ హౌస్ ఉన్నది. అక్కడికి తీసుకు వెళుతున్నాం"

ఆ గెస్ట్ హౌస్ ఎవరిది?”

సార్...నా స్నేహితుడు విజయకుమార్ ది. ఆయన ఇప్పుడు ఫ్యామిలీతో పాటూ విదేశాల్లో ఉంటున్నారు. ఆ గెస్ట్ హౌస్ ఆరు నెలలుగా మూసే ఉంది సార్. ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు తాళచెవి నా దగ్గర ఇచ్చి వెళ్ళారు

సెక్యూర్డ్ గెస్ట్ హౌసే కదా?”

అలా లేకపోతే దాన్ని సెలెక్ట్ చేస్తానా సార్?”

అంతా మీ బాధ్యత...జాగ్రత్తగా చూసుకోండి

వర్రీ అవకండి సార్! అన్నీ ప్లాను ప్రకారమే జరుగుతుంది. స్వామీజీ శతృవులు ఎవరనేది రెండు, మూడు రోజుల్లో తెలిసిపోతుంది

మీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది. ప్లాన్ సక్సస్ అయిన వెంటనే నాకు ఫోను చేసి చెప్పండి

ఖచ్చితంగా సార్! -- దృఢమైన స్వరంతో చెప్పి సెల్ ఫోనును ఆఫ్ చేశారు పద్మనాభం గారు. మనసులో మాత్రం ఒక భయం కుంటుతోంది. ఈ కిడ్నాప్ డ్రామా సరిగ్గా జరుగుతుందా?’

***************************************************PART-7******************************************

హలో మిస్టర్ వెంకటేష్!...ఏమిటీ ఆశ్చర్యం. ఈ రోజు, ఈ సాయంత్ర సమయంలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్వైపుకు వచ్చారు. ఏదైనా అర్జెంట్ ఎంక్వయరీనా?” --ఫోరెన్సిక్ అధికారి గిరిధర్ తాను కూర్చున్న కుర్చీలో నుండి లేచి స్వాగతించారు.

వెంకటేష్ చిన్నగా ఒక చిరు నవ్వు నవ్వి అడిగారు మీరు ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారా గిరిధర్?"

ఫ్రీగానే ఉన్నాను. ఇంటికి బయలుదేరదామని రెడీ అవుతున్నాను. ఇంతలో మీరు వచ్చారు...ఏమిటి విషయం? చెప్పండి...

ప్రస్తుతానికి ఎవరైనా ఇటువైపుకు వచ్చే అవకాశం ఉందా?”

లేదు...ఎవరూ రారు. సగానికి పైన ఇంటికి వెళ్ళిపోయారు వెంకటేష్. మీరేదో  టెన్షన్లో ఉన్నారని అనుకుంటున్నా. చెప్పండి...ఏదైనా ప్రాబ్లమా?”

అవును! దీన్ని కాస్త చూడండి... -- చెప్పిన వెంకటేష్, తాను తీసుకు వచ్చిన కారీ బ్యాగులో ఉన్న ఆ చిన్న పాలితిన్ కవర్ను తీసి ఇచ్చారు.

గిరిధర్ దాన్ని తీసుకుని చూసేసి కళ్ళు పెద్దవి చేసివెంకటేష్...ఏమిటిది?"

దీన్ని చూస్తే మీకు ఎలా కనబడుతోంది?”

ఏదో బూడిదలాగా ఉన్నది?”

అదేమిటో మీరే కనిబెట్టి చెప్పాలి

ఏమిటి వెంకటేష్. పజిల్ లాగా వేస్తున్నారు. బూడిదను తీసుకు వచ్చింది మీరు. జవాబు మీ దగ్గర నుండే కదా రావాలి?”

గిరిధర్! ఇది నాకు కొరియర్లో వచ్చింది. పంపింది ఎవరో తెలియటం లేదు. దీనితో పాటూ వచ్చిన ఉత్తరాన్ని చదవండి...మీకే అన్నీ అర్ధమవుతాయి

గిరిధర్...కళ్ళద్దాలను సరిచేసుకుని ఆ ఉత్తరాన్ని చదవటం ప్రారంభించి, దాన్ని చదివి ముగించినప్పుడు ఆశ్చర్యంతో తల ఎత్తేడు.

మై గాడ్...ఏమిటిది? ఇలానా ఒక చాలెంజ్?”

దీన్ని ఒక ఆటలాగానూ తీసుకోలేకపోతున్నా...సీరియస్ గానూ తీసుకోలేకపోతున్నా!

సరే...కొరియర్ ఆఫీసులో విచారించారా?”

విచారించాను. ఒక అమ్మాయి ఈ పార్సిల్ ఇచ్చి బుక్ చేసి వెళ్ళిందట

అమ్మాయా?”

అవును! యుక్త వయసు అమ్మాయి...ఆ అమ్మాయిని కొరియర్ సర్వీస్ లో పనిచేస్తున్న రోజా అనే అమ్మాయి చూసింది. మళ్ళీ చూస్తే గుర్తు పట్టగలను అని చెబుతున్నది

వెంకటేష్... ఈ సమస్య మీరు డిపార్టు మెంటుకు తెలియజేయకుండా వ్యక్తిగతంగా డీల్ చెయ్యబోతారా?”

అవును! అందువలనే నా డ్యూటీ టైము ముగిసిన తరువాత...మిమ్మల్ని చూడటానికి వచ్చాను. మీరు సహాయం చేయగలిగితే సంతోషపడతాను. లేకపోతే ఇంకొకరి సహాయం అయినా వెతుక్కుని వెళ్లాలి

గిరిధర్ నవ్వారు. ఎటువంటి సమస్య లేదు! నేను మీకు సహాయపడతాను

థ్యాంక్స్! కానీ,ఈ విషయం బయటకు...

ఎవరికీ తెలియకూడదు...అంతే కదా? వర్రీ అవకండి. మీరు పర్మిషన్ ఇచ్చేంతవరకు ఎవరికీ చెప్పాను

మరోసారి థ్యాంక్స్ చెప్పిన వెంకటేష్ " గిరిధర్...ఈ బూడిదను పంపిన మనిషి చెప్పినట్టు ఇది మనిషి యొక్క బూడిదా అనేది ఫోరెన్సిక్ తో తెలుసుకోవచ్చా?” అడిగారు.

ఖచ్చితంగా తెలుసుకోవచ్చు! కొంచం కష్టపడాలి. అన్నిటికీ మూలం డి.ఎన్.ఏ. నే! ఈ బూడిద పొడిలో గుండుసూదంత సైజుకు ఎముక దొరికినా చాలు...దాన్ని పరిశోధిస్తే అన్ని నిజాలూ బయట పడతాయి. ఈ బూడిద మనిషిదేనా? జంతువుదా? లేక ఏవైనా కట్టెలు కాల్చినందువల్ల వచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది

వెంకటేష్ అడ్డుపడ్డారు. ఇది ఒక మగ మనిషి బూడిదా...లేక స్త్రీ యొక్క బూడిదా అని కూడా తెలుసుకోగలమా?”

తెలుసుకోవచ్చు!

దాన్ని ఎలా నిర్ణయిస్తారు?”

బూడిదలో దొరికే ఎముక ముక్కలను డి.ఎన్.ఏ పరిశోధన చేస్తున్నప్పుడే దాన్ని తీర్మానించవచ్చు. మనుషుల కణాలలో ఇరవై మూడు క్రోమోజోములు ఉంటాయి. ఇందులో 22 జతలలో ఆడవారికీ, మగవారికీ తేడా ఏమీ ఉండదు. 23 వ జత...ఒక మగ మనిషా, ఆడ మనిషా అని తీర్మానిస్తుంది. ఈ క్రోమోజోములో రెండు ఎక్సులు ఉంటే స్త్రీ, ఒకటి ఉంటే మగ

సరే! ఆ మగాడికో...ఆడదానికో ఎంత వయసు ఉండచ్చు అనేది కూడా తీర్మానం చేయొచ్చా?”

చెయోచ్చు! బూడిద నుండి తీయబడే ఎముకలలో ఎంత కాల్షియం డిపాజిట్ అయ్యిందో చూసి...చనిపోయిన మగాడికో, స్త్రీకో, ఎంత వయసు ఉంటుందనేది తొంబై శాతం వరకు చెప్పొచ్చు. ఇంకొక మెట్టు పైకెళ్ళి...సిట్రేట్అనే పరిశోధనను చేస్తే పక్కా రిజల్స్ దొరుకుతుంది

వెంకటేష్ మొహం వికసించింది!

గిరిధర్...ఈ సాంపిల్ యొక్క పరిసోధనా రిపోర్టు ఎప్పుడు దొరుకుతుంది?”

గిరిధర్ నవ్వుతూ ఆయన చెయ్యి నొక్కారు.

మిస్టర్ వెంకటేష్...వెయిట్! మొదట ఒక విషయాన్ని ఖాయపరచు కుందాం. ఈ సాంపిల్ లో నుండి ఏదైనా గుండు సూదంత ఎముక ముక్క దొరకాలి. అంతా భస్మం అయిపోయుంటే మనం ఏమీ చెయ్యలేము. మీరు రేపు ఇదే టైముకు రండి. ఈ సాంపిల్ మన పరిశోధనకు సహాయపడుతుందా...పడదా అనేది చెబుతాను. బై ద బై...ఈ విషయం గురించి నా సొంత అభిప్రాయం చెప్పొచ్చా?”

ప్లీజ్...!

దీన్ని మీరు సీరియస్ గా తీసుకోకండి. మిమ్మల్ని ఎవరో ఆట పట్టిస్తున్నారు!

ఎందుకు ఆట పట్టించాలి?”

మీరు ఇప్పుడు ఇంకేదైనా కేసు విచారణ చేస్తున్నారా?”

వెంకటేష్ కొన్ని క్షణాలు ఆలొచించిన తరువాత చిన్నగా తల ఊపారు. అవును! మాజీ మంత్రి చలపతి రావ్ ఎదురుగా భూ కబ్జా కేసు ఉన్నది. అది విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలి. దానికి సంబంధించి, పోయిన వారం కొంతమందిని ఎంక్వయరీ చేశాను

గిరిధర్ నవ్వారు. ఆయనకు ఎదురుగా మీరు పూర్తి వేగంతో విచారణ చెయ్యకూడదనే, మీ ద్రుష్టిని మార్చటానికి...సంబంధించిన వాళ్ళు ఎందుకు ఇలాంటి ఒక కార్యం చేసుండ కూడదు?”

నేను అలా అనుకోవటం లేదు?”

ఎందుకని?”

ఆయన మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మీద అపొజిషన్ పార్టీలు ఏదో నేరారోపణ చేసి మాట్లాడారనే ఒకే కారణంతో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. చీఫ్ మినిస్టర్ ఎంత చెప్పినా, ఎంత కన్విన్స్ చేసినా...పదవి వద్దని చెప్పారు.

'నేను తప్పు చేయలేదని ఎప్పుడు తీర్పు వస్తుందో...ఆ రోజు మంత్రి పదవి అంగీకరిస్తాను ' అంటూ తీర్మానంగా ఉన్నారు. అలాంటి మనిషి నన్ను టీజ్ చేయటానికి ఇలాంటి పనా చేస్తారు?”

రాజకీయ నాయకులను నమ్మలేం వెంకటేష్

సారీ...మిస్టర్ గిరిధర్! మీరనుకునేంత చెడ్డ రాజకీయ వ్యక్తి కాదు ఆయన. ఖచ్చితంగా ఇలాంటి నీచమైన పనిని చేసుండరు

సరే! మీకు ఆయన పేరు మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నేను చెప్పటానికి ఏమీ లేదు. మొదట ఈ బూడిద దేనికి సంబంధించిదో చూద్దాం. రేపు ఇదే సమయానికి రండి వెంకటేష్

సరే...సాయంత్రం ఆరున్నరకు వస్తాను... -- గిరిధర్ చేతులు పుచ్చుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చారు వెంకటేష్. టూ వీలర్ పార్కింగులో నిలబడున్న తన బైకును స్టార్ట్ చేస్తున్నప్పుడు వందే మాతరం’...అనే రింగ్ టోన్ వినబడింది. సెల్ ఫోను తీసి చూశారు.

కొత్త నెంబర్.

ఎవరై ఉంటారు?’ అని ఆలొచిస్తూనే గొంతు కలిపారు.

ఎస్...

వెరిగుడ్ ఏ.సీ. సార్! నన్ను కనిపెట్టటానికి కరెక్టు దిశగానే ప్రయాణం చేస్తున్నారు. మిమ్మల్ని అభినందించటానికి నాకు వయసు లేదు. రెండు చేతులూ ఎత్తి దన్నం పెడుతున్నా -- ఒక మగ మనిషి గొంతు చెప్పి నవ్వింది!

***************************************************PART-8******************************************

బీప్...బీప్అంటూ వయర్లెస్మోత ఇవ్వటంతో...డి.ఐ.జి. పద్మనాభం గారు తన ప్రత్యేక గదిలోకి వెళ్ళి కుర్చీలో వెనక్కి వాలి, హెడ్ ఫోను తీసుకుని తగిలించుకున్నారు. మౌత్ పీస్లో మాట్లాడారు.

చెప్పండి సూర్యనారాయణ!

మనం వేసుకున్న ప్లాను ప్రకారం అన్నీ మంచిగానే జరిగినై

అలాగా... సర్వానందా స్వామీజీని కిడ్నాప్ చేసేశారా?”

కిడ్నాప్ చేసేశాము! ఆయన్ని ఇప్పుడు వేరే కారుకు మార్చి, మీరు చెప్పినట్టు ఆపిల్ తోటకు వెళ్ళే దొవలో ఉన్న గెస్ట్ హౌస్కు తీసుకుని వెళ్తున్నాం

వెరీ గుడ్! ఎవరికీ ఎటువంటి అవమానమూ రాలేదుగా?”

రాలేదు...స్వామీజీకి సెక్యూరిటీగా ముందు వెళుతున్న కారును వేరే దోవకు డైవర్ట్చేశాము. ఆయనకు నిజం తెలిసేటప్పుడు...మేము గెస్ట్ హౌస్కు వెళ్ళి జేరిపోతాము

యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్...కన్వే మై విషస్ టు అదర్ త్రీ!

ఎస్...సార్!

పక్కన స్వామీజీ ఉన్నారా?”

ఉన్నారు!

ఆయన దగ్గర ఫోను ఇవ్వండి...

ఇదిగో ఇస్తున్నా! సార్ స్వామీజీ గారే మీ దగ్గర మాట్లాడాలని చెప్పారు

పద్మనాభం గారు వెయిట్ చేయగా...తరువాత కొద్ది క్షణాలలో సర్వానందా స్వామీజీ స్వరం వినబడింది.

నమస్తే!

నమస్తే స్వామీజీ! మీకు ఇబ్బంది కలిగిస్తున్నామని మీరు అనుకోకూడదు. రెండు రోజులు మాకు సహకరిస్తే చాలు. మీ విరోధులు ఎవరనేది ట్రెస్చేసి కనిపెట్టేస్తాము

స్వామీజీ నవ్వారు. నా సెక్యూరిటీ గురించి మీరు తీసుకున్నముఖ్యత్వానికి థ్యాంక్స్. అయినా కానీ నేను ఒకటే ఒకటి చెప్ప దలుచుకున్నాను. నాకు తెలిసినంతవరకూ నాకు విరోధులు లేరు

స్వామీజీ! రోజా మొక్కల్లో ముళ్ళూ ఉంటాయి. పువ్వులూ ఉంటాయి. కానీ, మొక్కలో ఉన్న ఆ పువ్వును చూసేటప్పుడు....చాలా మందికి పువ్వుకు పక్కనున్న ముళ్ళు గుర్తుకురావు. మీలాంటి మహాత్ములకు ఎవర్ని చూసినా మంచి వారుగానే కనబడతారు. లేకపోతే మహాత్మా గాంధీని ఒక గోడ్సే ఆయనకు పక్కగా వచ్చి తుపాకీతో కాల్చి ఉండగలడా?”

స్వామీజీ గట్టిగా నవ్వారు. నన్ను మహాత్మా అంత ఎత్తుకు చేసి మాట్లాడకండి. నేను సాధారణమైన వాడిని. ఏదో నాకు తెలిసిన మంచి మాటలు, పద్దతులు,  ప్రజలకు చెబుతున్నాను...అంతే! మీ యొక్క బాధ్యతకు అడ్డురావటం నాకు ఇష్టం లేదు. నేను కిడ్నాప్ చెయబడ్డాననే వార్త్ బయటకు పొక్కినప్పుడు నా భక్తుల మధ్య కోపతాపాలు చెలరేగుతాయి. దాన్ని కంట్రోల్ చేయడం మీకు కష్టంగా ఉంటుంది

అదంతా మేము చూసుకుంటాం. మీరు రెండు రోజులు గెస్ట్ హౌస్ లో రెస్టు తీసుకోండి. నేను ఇంకో గంటలో ఇక్కడ్నుంచి సరూర్నగర్ కు బయలుదేరతాను. సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాను

చాలా మంచిది!

***************************************************PART-9******************************************

మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు!

ఫోరెన్సిక్ అధికారి గిరిధర్ ముందుగా వెంకటేష్ కూర్చోనుండ...ఆయన దగ్గర కంప్యూటర్ ప్రింట్ చేసిన కాగితం ఒకటి చోటు చేసుకుంది. చిన్న స్వరంతో ఆయన చెప్పటం మొదలు పెట్టారు.

వెంకటేష్! మీరు ఇచ్చిన బూడిద సాంపిల్లో గుండు సూది అంత సైజులో కొన్ని ఎముక ముక్కలు దొరికినై. వాటిని పరిశోధించి చూసినప్పుడు...అది మానవ శరీరం బూడిదేనని తెలిసింది. అందులోనూ మగ మనిషి శరీరం. వయసు 60-70 లోపు ఉండొచ్చు. ఒక పెద్ద ఎముక ముక్క దొరికున్నా వయసును ఇంకా ఖచ్చితంగా కనుక్కోనుండ వచ్చు

వెంకటేష్ అడ్డుపడి అంటే...మీరు చెప్పిన సమాచారం బట్టి చూస్తే బూడిదైన వ్యక్తి వయసైన మనిషి

అవును...

అందులో మీకు ఎటువంటి సందేహమూ లేదే?”

లేదు...

సరే! ఈ మనిషి ఎలా హత్య చేయబడుంటాడు అనేది ఈ బూడిద పెట్టి చెప్పగలరా?”

అది కుదరదు! కానీ...ఒకవేల విషం ఇచ్చి హత్య చేయబడుంటే కనిపెట్టచ్చు. ఆ వసతి ఇక్కడ లేదు. ముంబైలో ఉన్న నేషనల్ ఫోరెన్సిక్ లేబోరేటరీకి వెళ్లాలి. మీరు ఇప్పుడు ఈ కేసును ఇండిపెండంట్ గా డీల్ చేయటం వలన అది కూడా చెయ్యలేము. మిస్టర్ వెంకటేష్...నేనొక సలహా ఇస్తే వింటారా?”

చెప్పండి...

ఈ కేసును మీరు పర్సనల్ గా డీల్ చేయకుండా, డిపార్ట్ మెంటుకు తీసుకు వెళ్లండి. పర్సనల్ గా డీల్ చేస్తే మీ వల్ల పూర్తి వివరాలు సేకరించటం కుదరదు. ప్రస్తుతానికి ఈ బూడిద నుండి కనిపెట్టిన ఒకటే నిజం...ఆ బూడిద ఒక వయసైన వ్యక్తిది అనేదే! అంతకు మించి ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఎలా హత్య చేయబడి ఉంటారు? ఏ ఊరికి చెందిన వాడు? అనే ప్రశ్నలకు జవాబు దొరకటం కష్టం. ఈ కేసును డిపార్టు మెంటుకే తీసుకు వెళ్ళినా ఫర్దర్ విచారణ జరపటం శ్రమం

గిరిధర్ చెప్పింది విన్న వెంకటేష్ చిన్నగా నవ్వారు.

ఇదంతా శ్రమ అని నాకు తెలియదా గిరిధర్. ఈ విషయంలో నా ప్లానే వేరు

ఏం ప్లాను?”

ఈ బూడిదకు సంబంధించిన వ్యక్తి ఎవరనేది కనిబెట్టటం కంటే, అది పంపిన మనిషి ఎవరూ అనేది కనిబెట్టటమే ఇప్పటికి నా ప్లాను. నిన్నటి రోజున మీ దగ్గర మాట్లాడి నేను బయటకు వెళ్ళి నా బైకును స్టార్ట్ చేసేటప్పుడు నా సెల్ ఫోనుకు ఒక ఫోను వచ్చింది. తీసి చూశాను. అదొక కొత్త నెంబర్. అయినా మాట్లాడాను. మగ గొంతు! అతను ఏం మాట్లాడాడో తెలుసా?”

చెప్పండి

వెరీ గుడ్ ఏసీ సార్! నన్ను కనిబెట్టటానికి సరైన దోవలోనే పయణం చేస్తున్నారు. మిమ్మల్ని అభినందించటానికి నాకు వయసు లేదు. చేతులు ఎత్తి దన్నం పెడుతున్నా!

ఎంత ఎగతాలీ కమెంటో! మీరు దానికి ఏం సమాధానం చెప్పారు

నేను సమాధానం చెప్పేలోపు లైను కట్ చేశాడు

సరే నెంబర్ నోట్ చేసుకున్నారా?”

ఊ...నోట్ చేసుకుని టెలిఫోన్స్ లో ఎంక్వయరీ చేశాను.  అది పబ్లిక్ బూత్ నెంబర్. మియాపూర్ లో ఉంది

ఈ బూడిద సాంపిల్ పంపింది ఒక మహిళ. కానీ, ఫోనులో మాట్లాడింది మగ. అది కో-రిలేట్ చేస్తే...ఈ వ్యవహారంలో మగ, ఆడ ఈడుపడి ఉన్నారు అనేది  తెలుస్తోంది. ఇండిపెండెంటుగా ఇలాంటి ఒక బూడిద పార్సిల్ మీకు పంపి టార్ర్చర్ చేయటంలో వాళ్ళకు లాభం ఏమిటో?”

ఏదో ఒక ఆదాయం ఉండబట్టే ఇలాగంతా చేస్తున్నారు. ఇది పెద్ద విషయంగా తీసుకోలేకపోతున్నాను. ఆటపట్టిస్తున్నట్టు అనిపిస్తోంది వెంకటేష్ చెబుతున్నప్పుడే గిరిధర్ టేబుల్ మీదున్న టెలిఫోన్ మోగింది.

రిజీవర్తీసి ఎస్... అన్న అతని మొహం చటుక్కున మారింది.

అవతలవైపు పోలీస్ కమీషనర్ స్వరం.

హలో...!

ఎస్. సార్. గుడ్ ఈవెనింగ్ సార్!

గుడ్ ఈవెనింగ్ గిరిధర్! ఎలా ఉన్నారు!

ఫైన్ సార్!

ఫోరెన్సిక్ పని ఎలా వెళుతోంది?”

వెల్ గోయింగ్ సార్!

సాయంత్రం ఆరున్నర అయినా ఇంకా ఆఫీసులోనే ఉన్నారు! ఆర్ యూ ఎంగేజిడ్ విత్ ఎనీ అదర్ ఇంపార్టంట్ వర్క్?”

లేదు సార్

ఆఫీసులో మీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా?”

నో సార్!

అవతలవైపు కమీషనర్ నవ్వారు. ఇంతకు పైన మీరు అబద్దం మాట్లాడటం నేను ఇష్టపడటం లేదు! మీ ఎదురుగా కూర్చోనున్న అడిషనల్ కమీషనర్ దగ్గర ఫోన్ రిజీవర్ ఇవ్వండి!

సా...సార్!

ఆయన లేరని మూడో అబద్దం చెప్పకండి. ఇవ్వండి

గిరిధర్ నుదిటి మీద పట్టిన చెమటతో రీజీవర్నువెంకటేష్ కు ఇచ్చి...అతిమెల్లగా కమీషనర్ అన్నాడు.

వెంకటేష్ కూడా చిరు ఆశ్చర్యంతో రిజీవర్ను తీసుకుని సన్నగా మాట్లాడారు.

గుడ్ ఈవెనింగ్ సార్!

వాట్ మిస్టర్ వెంకటేష్...ఈ టైములో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంటులో ఉన్నారు?"

సార్...అదొచ్చి...

బూడిద రిపోర్టు ఏం చెబుతోంది?”

సా...సార్!

మీరూ, గిరిధర్ ఇద్దరూ ఆ రిపోర్టు తీసుకుని వెంటనే వచ్చి నన్ను కలవండి. ఆ బూడిదకు వెనుక సీరియస్మ్యాటర్ ఉంది!

***************************************************PART-10*****************************************

సరూర్నగర్.

ఆపిల్ తోటలకు వెళ్లే దోవలో మంచు మేఘాలు చుట్టుకున్న కొండ ప్రదేశం. 'సిల్వర్ స్ట్రీం గెస్ట్ హౌస్ ' దేవనాగు చెట్లకు మధ్యలో కనబడంది.

డి.ఐ.జి. పద్మనాభం గారు, హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి రెండు గంటల అలసటతో జీపు లో నుండి దిగారు.

డెప్యూటీ కమీషనర్ సూర్యనారాయణ, ఆయనతో ఉన్న మిగిలిన పోలీసు అధికారులూ ఎదురుగా వచ్చి సెల్యూట్ చేశారు. పద్మనాభం గారు అడిగారు.

స్వామీజీ ఎలా ఉన్నారు?”

ఫైన్ సార్! మంచిగా కోపరెట్ చేస్తున్నారు

లంచ్ చేశారా?”

చేశారు! సర్వానందా స్వామీజీ కిడ్నాప్ చేయబడ్డారు అనే వార్త ఆయన భక్తులు మధ్య పెద్ద అవేశం ఏర్పరిచిందనే వార్తను విన్న వెంటనే కొంతసేపు కలత చెందారు.  

అ తరువాత మేము సమాధన పరచిన తరువాత నార్మల్ కు వచ్చారు

స్వామీజీ ఇప్పుడు లోపల ఏం చేస్తున్నారు?”

పుస్తకం చదువుతున్నారు

ఓ.కే...నేను చూసుకుంటాను! -- చెప్పిన పద్మనాభం గారు, గెస్ట్ హౌస్ వాకిలి తెరుచుకుని లోపలకు వెళ్లారు. రిషెప్షన్ గది దాటిన తరువాత ఆ చిన్న హాలు కనబడ...అక్కడ సోఫాలో కూర్చోనున్న సర్వానందా స్వామీజీ పుస్తకం చదువుతున్నారు.   

పక్కనే ఉన్న టీపా మీదా పెట్టబడి ఉన్న టేప్ రికర్డర్లో నుండి గాయత్రీ మంత్రాలు ఉన్న క్యాసెట్స్లోకాలను స్వీట్ వాయిస్తో వినిపిస్తున్నది. హాలులో సన్నటి సాంబ్రానీ వాసన.

స్వామీజీ! -- పిలుస్తూనే సర్వానందా స్వామీజీ ముందు వెళ్ళి నిలబడ్డారు పద్మనాభం గారు.

నమస్తే స్వామీజీ!

ఆయన దగ్గర నుండి ఎటువంటి సమాధానమూ రాకపోయేటప్పటికి...కలతతో ఆయన మొహం చూశారు.

సర్వానందా స్వామిజీ చేతిలో పుస్తకం ఉన్నా, దాన్ని ఆయన చూడటం లేదు. చూపులు నిలకడగా ఉన్నాయి. వేసుకున్న కళ్ళద్దాలు వూడి ఒడిలో పడుంది...ఆయన నోటి చివరలో నుండి రక్త గీత కారి ఎండిపోయున్నది.

పద్మనాభం గారు షాక్ తిన్నట్టు అయిపోయి, దగ్గరకు జరిగి, ఆయన ముక్కు దగ్గర  వేలు పెట్టి చూశారు.

శ్వాస లేదు...మరణించి ఉన్నారు!

***************************************************PART-11*****************************************

పొలీస్ కమీషనర్ గదిలో ఏ.సీ. మిషన్ చిన్నగా ఉరుముతూ, చల్ల గాలిని బయటకు తోస్తున్నా, అడిషనల్ కమీషనర్ వెంకటేష్, ఫోరెన్సిక్ అధికారి గిరిధర్ చెమటతో తడిసున్నారు. ఎదురుగా కూర్చోనున్న కమీషనర్,చిన్న నవ్వుతో మాట్లాడుతున్నారు.

వెంకటేష్! ఈ బూడిద మ్యాటర్ నాకు ఎలా తెలిసిందని మీరు  ఆశ్చర్యపడవచ్చు. ఇందులో ఆశ్చర్య పడటానికి ఏమీలేదు! ఎందుకంటే...ఆ ఫోరెన్సిక్ విభాగంలో మీకు గిరిధర్ విశ్వాసంగా ఉన్నట్టు నాకూ ఒక విశ్వాసి అదే డిపార్టుమెంటులో ఉండకూడదా ఏమిటి? అక్కడ నూట ఇరవై తొమ్మిది మంది పనిచేస్తున్నారు. అందులో ఒకరొచ్చి చెప్పారు

సారీ సార్....ఈ విషయాన్ని డిపార్టుమెంటుకు తెలియ పరచకపోవటం పెద్ద తప్పే! రియల్లీ ఐయాం సారీ

లేదు...నా వరకు మీరు చేసింది తప్పే కాదు. పార్సిల్ పంపినతను మీకు ఛాలెంజ్ విసిరేడు. మీరు ఆ ఛాలెంజును సపరేటుగా డీల్ చేసి జయించి చూపాలని అనుకున్నారు. కానీ, ఆ బూడిదకు వెనుక ఒక విపరీతమైన మ్యాటర్ ఉన్నది. దాన్ని మీరు తెలుసుకుని పని జరిపితే ఇంకా బాగుంటుంది. అందుకే నేను పిలిచాను

అంత విపరీతమైన మ్యాటర్ ఏమిటి సార్?”

కమీషనర్ తన టేబుల్ డ్రా తెరిచి లోపలున్న ఒక వార్తా పత్రిక కటింగును తీసి వెంకటేష్ చేతికి అందించారు.

ఇందులోని వార్తను చదవండి...

ఆ పేపర్ కటింగును తీసుకుని చదవటం మొదలు పెట్టారు. మూడు సంవత్సరాల కిందటి న్యూస్ ప్యాపర్ అది!

మోటార్ సైకిల్ టయర్ పేలి పోలీసు అధికారి బలి. అతి వేగంగా బండి నడపడం వల్ల ఏర్పడిన యాక్సిడెంట్!

దాని గురించిన వివరాలు:

విశ్వనాద్. వయసు 38, పోలీసు కమాండో విభాగంలో అధికారిగా పనిచేస్తూ వచ్చారు. నిన్నటి మధ్యాహ్నం ఆయన తన పని నిమిత్తం ఔటర్ రింగు రోడ్డులో బైకులో వేగంగా వెళ్తున్నారు. అప్పుడు ఎదురు చూడని విధంగా టయర్ పేలింది.

అందువలన...వేగంగా వెళుతున్న బైకు తడబడిపోయి రోడ్డు చివరగా ఉన్న చెట్టు మీద పెద్ద శబ్ధంతో భయంకరంగా గుద్దుకుంది. ఢీ కొట్టిన్ వేగం వలన బైకు అప్పడంలాగా ముక్కలయ్యింది. అందులో పోలీసు అధికారి అయిన విశ్వనాద్ అక్కడికక్కడే చనిపోయారు.

ఆయనకు ఇంకా పెళ్ళి కాలేదు. ఆయన గొప్ప సేవ కోసం ఎన్.టీ.ఆర్ బిరుదు తీసుకున్నారు. ఇంకా...

వెంకటేష్ ఆ పత్రికలోని వార్తను చదవటం ఆపి కమీషనర్ ను చూశారు.

సా...సార్...

ఏమిటి?”

సార్...ఈ వార్త నాకు ఇదివరకే తెలుసు సార్. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను చెన్నైలోనే ఉన్నాను. విశ్వనాద్ గారి బాడీకి మర్యాద చూపటానికి నేనూ ఆయన ఇంటికి వెళ్ళాను

సరే! ఆ యాక్సిడెంట్ జరిగి...ఈ రోజుకు ఎన్ని సంవత్సరాలు అవుతోంది?”

మూడు సంవత్సరాలు సార్!

ఓకే! ఇప్పుడు ఈ మేటర్ చదవండి... చెప్పిన కమీషనర్ టేబుల్ డ్రా తెరిచి ఇంకొక పేపర్ కటింగ్ తీసి వెంకటేష్ దగ్గర జాపాడు. ఆయన ఆది తీసుకుని ఒక చూపు చూశాడు. రెండేళ్ల క్రితం వచ్చిన పేపర్ అది!

చదివారు.

విపరీతంగా తాగటం వలన.

మత్తు తలకెక్కి పోలీసు అదికారి మరణం.

దాని గురించిన వివరాలు.

పోలీసు గూఢాచార విభాగంలో పని చేస్తున్న ఆయన పేరు కాంతారావ్. వయసు 36. తాగుడు అలవాటు కలిగిన ఈయన నిన్న రాత్రి మెహదీపట్నం ఉన్న ఒక బారులో ఎక్కువ మోతాదులో తాగేసి బయటకు వచ్చారు. బండి తీయటానికి వెళ్ళినప్పుడు మత్తు ఎక్కువై పడిపోయారు. పక్కనున్న పెద్ద రాయి తలకు తగలటంతో ఆయన స్ప్రుహ కోల్పోయారు. హోటల్ యాజమన్యం వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిట లు తీసుకు వెళ్ళి వైద్యం కోసం చేర్పించారు.

వైద్యులు ఎన్నో పద్దతులతో ప్రయత్నం చేసినా ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. చికిత్స చేసిన డాక్టర్ ఒకరు చెప్పేటప్పుడు కాంతారావ్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న కారణంగా...చిన్న మెడదు దెబ్బతిని రక్త నాళాలు చిట్లిపోయి మరణం సంభవించింది. ఆయనకు ఇంతకు ముందే బ్లడ్ ప్రషర్ ఉన్నది అన్నారు.

చనిపోయిన కాంతారావ్ పెళ్ళి అయిన వ్యక్తి. భార్యపేరు గీతా. స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. కాంతారావ్ మరణవార్త విని పోలీసు కమీషనర్ రాఘావాచార్యా గారు...

చదువుతున్న న్యూస్ ను సగంలోనే ఆపి కమీషనర్ను తల్ ఎత్తి చూశారు.

సా...సార్!

చెప్పండి వెంకటేష్...

ఈ వార్త కూడా నాకు తెలుసు. కాంతారావ్ గారి మరణానికి కూడా చివరి మర్యాద ఇచ్చాను

ఓకే! ఈ రెండు సంభవాల గురించి మీరెమనుకుంటున్నారు?”

ఘోరమైన సంభవాలు సార్! విశ్వనాద్ వేగంగా బైకులో వెళ్లటం వలన మరణం. కాంతారావ్ లిమిట్ లేకుండా తాగినందువలన మరణం

అంటే...మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే రెండూ విపత్తులు

ఎస్...సార్!

సారీ వెంకటేష్...మీరు అనుకున్నట్టు ఆ రెండు మరణాలూ విపత్తులు కావు... ప్లాన్ వేసుకుని చేసిన మర్డర్!"

***************************************************PART-12*****************************************

పద్మనాభం గారు విరిగిపోయారు.

తొందర తొందరగా రప్పించబడ్డ డాక్టర్ ఒకరు సర్వానందా స్వామీజీని పరిశోధించి పెదాలు విరిచాడు. పద్మనాభం గారిని చూశారు. నిట్టూర్పుతో సడన్ డెత్ అని చెప్పి కలతను లేపాడు.

ఎలా డాక్టర్? ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు హెల్తీగానే కదా ఉన్నారు?” -- పద్మనాభం గారు ఆందోళనగా అడిగారు.

ఊండచ్చు! ఎంత హెల్తిగా ఉన్నా లక్షల్లో ఒకరికి ఇలాంటి డెత్రావచ్చు. ఈ మరణానికి మెడికల్ టెర్మ్ సి.వి.ఏ. అని చెబుతారు. అంటే కార్డియో వాస్కులర్ యాక్సిడెంట్అని అర్ధం. బాగా హెల్తీగా ఉన్న ఒకరికి హఠాత్తుగా  తట్టుకోలేని మనో ఇబ్బంది ఏర్పడుతుంది.

అలాంటి ఒక ఇబ్బంది ఏర్పడినప్పుడు ఒక సమయంలో బుర్ర, హృదయం, శ్వాసకోస సంబంధించిన రక్త నాళాలు కృషించి...రక్త ప్రసారాన్ని నిషేదించినప్పుడు ఇలాంటి మరణాలు ఏర్పడతాయి. మరణం ఏర్పడబోతోందన్న ఎటువంటి సూచన మరణించిన వారికి కొంచం కూడా కనబడదు. మెడికల్ వరల్డులో ఎవరూ దీనిని డిసీస్ అని చెప్పారు. యాక్సిడెంట్ అనే మాటనే వాడతారు.

ఈయనకు ఏదైనా షాక్ ట్రీట్ మెంట్ ఇస్తే బ్రతికే అవకాశముందా?”

ఒక్క శాతం కూడా అవకాశం లేదు! మీరు వెంటనే ఈయన మరణాన్ని బయట ప్రపంచానికి తెలియజేయటం మంచిది -- డాక్టర్ ఖచ్చితంగా చెప్ప,

పద్మనాభం గారు తల పుచ్చుకుని అలాగే కూర్చుండిపోయారు.

డెప్యూటీ కమీషనర్ సూర్యనారాయణ భయపడుతూ పక్కకు వచ్చి నిలబడ్డారు.

సార్! ఇక ఇప్పుడేం చెయదలుచుకున్నారు?”

పత్రికవాళ్ళను పిలిచి...మనం వేసిన ప్లానును, దాని తరువాత జరిగిన నిజాలనూ చెప్పటమే!

నమ్ముతారా సార్?”

ఎందుకు నమ్మరు? మనం ఈ ప్లానును, ఐ.జీ. గారి అంగీకారంతోనే కదా చేశాము

సార్! ఎందుకైనా మంచిది. ఐ.జి. గారిని ఒక మాట అడిగి ఆ తరువాత పత్రికవాళ్ళను పిలుద్దాం?”

సరే...ఐ.జీ. కి ఫోన్ చేసి ఇవ్వండి!

***************************************************PART-13*****************************************

వెంకటేష్ నిర్ఘాంతపోయారు.

సార్...మీరేం చెబుతున్నారు? పోలీసు అధికారులు విశ్వనాద్, కాంతారావ్ చనిపోయింది యాక్సిడెంట్ కాదా? ప్లాను వేసి చేసిన హత్యలా?"

ఎదురుగా కూర్చున్న కమీషనర్ వాడిపోయిన మొహంతో తల ఊపారు.

ఎస్! మొదట్లో రెండూ యాక్సిడెంటల్ డెత్స్ అనే నిర్ణయానికి వచ్చాము. ఫైల్స్ క్లోజ్ చేశాము. కానీ, నా మనసులో మాత్రం అనుమానం ఉంటూనే ఉన్నది. ఒక రహస్య గూఢాచార విచారణ చేసినప్పుడు వాళ్ళిద్దరి మరణాలు ప్లాన్ చేసిన హత్యలనే నిజం బయటకు వచ్చింది!

ఆ హత్యలు చేసిన నేరస్తులు ఎవరు సార్?”

తెలియదు!

సార్...మీరు ఇప్పుడు చెబుతున్న విశ్వనాద్, కాంతారావ్ హత్యలకూ...నాకు  పార్సిల్లో వచ్చిన బూడిద వ్యవహారానికీ ఏమిటి సంబంధం?”

దగ్గర సంబంధం ఉంది! మూడు సంవత్సరాలకు ముందు మీరు ఏ ఊర్లో...ఏ పోస్టింగులో ఉన్నారు?”

మధురైలో ఇన్స్పెక్టర్ గా ఉన్నాను

ఆ సమయంలో డెప్యూటీ కమీషనర్ గా ఉన్న సూర్యనారాయణ మిమ్మల్ని ఒక 'స్క్వాడులో' చేర్చి ఒక పెద్ద పోలీస్ ఆపరేషన్ చేశారు. అదేమిటో మీకు జ్ఞాపకం ఉందా?”

బాగా జ్ఞాపకం ఉంది సార్! అది డి.ఐ.జీ. పద్మనాభం గారి నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ సార్. సర్వానందా స్వామీజీ గారికి ఎవరో శతృవులు ఉన్నారని, వాళ్ళు  ఎవరనేది తెలుసుకోవటానికి స్వామీజీని కిడ్నాప్ చేసేలాగా ఒక ప్లాను వేశారు.

ప్లాను ప్రకారం ఆయన్ని కిడ్నాప్ చేసి సరూర్నగర్ లో ఉన్న సిల్వర్ స్ట్రీం గెస్ట్ హౌసుకు తీసుకు వెళ్లారు. కానీ, అనుకోకుండా స్వామీజీ సి.వి.ఏ. అనబడే మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అది ఒక పెద్ద సమస్యగా పేలింది. పోలీసులే స్వామీజీని ఏదో చేశారని ఒక ప్రచారం జరిగింది.

దానికోసం ప్రత్యేక విచారణా కమీషన్ వేసి, పోలీసులకు అనుకూలంగా అది తీర్పు ఇచ్చిన తరువాతే ఆ వ్యవహారం సద్దుమనిగింది. ఆయన కానీ పద్మనాభం గారు సస్పెండ్ చేయబడ్డారు. అది నచ్చక ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు

వెంకటేష్ చెప్పింది కరెక్టేనని ఆమోదించి తల ఊపిన కమీషనర్, “జరిగిన సంఘటనలను బాగానే గుర్తుంచుకున్నారే...గుడ్! ఆ ఆపరేషన్ స్క్వాడులో మొత్తం ఎంతమంది ఉన్నారని మీకు తెలుసా?”

డి.ఐ.జి. పద్మనాభం గారి కింద ఏడుగురు సార్. ఒకరు డిప్యూటీ కమీషనర్ సూర్యనారాయణ, తరువాత నేను... విశ్వనాద్, కాంతారావ్. మేము కాకుండా జీపు డ్రైవర్ ముకుంద్, ఇద్దరు కానిస్టేబుల్స్!

ఈ ఏడుగురిలో విశ్వనాద్, కాంతారావ్ ఇప్పుడు లేరు. అంటే వాళ్ళు ప్రాణాలతో ఉండటం ఎవరికో ఇష్టం లేదు

అంతవరకూ ఏమీ మాట్లాడకుండా ఉన్న ఫోరెన్సిక్ గిరిధర్ భయంతో మాట్లాడటం మొదలుపెట్టాడు.

సార్...మీరు చెప్పేది చూస్తే విశ్వనాద్, కాంతారావ్ కి జరిగిన పరిస్థితే వెంకటేష్  గారికీ జరగొచ్చని అనుమానిస్తున్నారని అనిపిస్తోంది?”

ఇది అనుమానం కాదు గిరిధర్...ఖచ్చితం! ష్యూర్! సర్వానందా స్వామిజీ మరణానికి పోలీసులే కారణమని తప్పుగా అనుకుని ఎవరో హంతకుడుగా మారి ఉండాలి. ఆ మనిషి మగవాడుగా ఉండవచ్చు...ఆడదిగా ఉండవచ్చు. స్వామీజీ మీద వెర్రితనంగా భక్తి పెట్టుకున్న వ్యక్తే ఈ హత్యలు చేస్తూ ఉండాలి!

కమీషనర్ చెప్ప, చెప్ప... వెంకటేష్ మొహానికి చెమటలు పట్టినై. ఆ బూడిద పార్సిల్ దేనికి?”

మిమ్మల్ని ఊరంతా తిప్పించి టార్చర్ పెట్టటానికే! ఆ తరువాత సమయం చూసి ఏదో ఒక విధంగా మీ ప్రాణానికి ఆపద తెప్పించటానికి

సార్....నేరస్తుడికి అలాంటి ఒక ఆలొచన ఉండుంటే...ఆ మనిషి గురి పెట్టాల్సిన మొదటి వ్యక్తి డి.ఐ.జి. పద్మనాభం గారు. ఆయనవైపుకు పోలేదే?”

దానికి కారణం, ఆ సంఘటన తరువాత ఇంట్లోంచి ఆయన బయటకు రావటం లేదే. అంతే కాకుండా ఇంట్లో ఆయన తన ఖర్చుతో ప్రైవెట్ సెక్యూరిటీ ఏర్పరుచుకున్నారు. అప్పుడప్పుడు విదేశాలకు వెళ్తున్నారు. అందువలన హంతకుని చూపు ఇంకా ఆయన మీద సీరియస్ గా పడలేదు. బహుశ స్క్వాడులో ఉన్న మిగిలిన వ్యక్తుల మీద తిరుగుతోంది

సారీ సార్!...మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నను 

ఎందుకు నమ్మకం లేదు?”

సర్వానందా స్వామీజీ మరణించి మూడు సంవత్సరాలు అయ్యింది. పగ తీర్చుకోవాలనే మనిషి ఇంత ఆలస్యంగా ఎందుకు పూనుకుంటాడు?”

కమీషనర్ నవ్వారు. అదే ఆ హంతకుడి ముసుగు తెలివితేటలుగా ఎందుకు ఉండకూడదు? సర్వానందా స్వాజీ మరణానికి ఒక సంవత్సరం తరువాత ఎవరికీ అనుమానం రాని పరిస్థితిలో విశ్వనాద్ మరణం...యాక్సిడెంట్ రూపంలో జరిగింది. బైకును వేగంగా నడిపినందువలన టైరు పేలి యాక్సిడెంట్ జరిగినట్టు బయటిలోకం అనుకుంటోంది. కానీ, ఆ యాక్సిడెంట్ అలా జరగలేదు

మరి యాక్సిడెంట్ ఎలా జరిగింది?”

యాక్సిడెంట్ జరిగింది రాత్రి ఏడు -- ఎనిమిది మధ్య! బైకు వెళ్ళేటప్పుడు రోడ్డు చివర్లో ఉన్న చెట్టు చాటున దాక్కుని టైర్ని తుపాకితో కాల్చేడు. ఈ నిజం మొదట్లో తెలియలేదు! యాక్సిడెంట్ అయన మోటార్ సైకిల్ను సీన్ ఆఫ్ క్రైం స్పేషలిస్టులు తీవ్ర పరిశోధన చేసినప్పుడు నిజం బయట పడింది.

విశ్వనాద్ మరణమప్పుడు సర్వానందా స్వామీజి జ్ఞాపకం రాలేదు. కానీ, కాంతారావ్ చనిపోయినప్పుడు అనుమానం తలెత్తింది. నిజానికి కాంతారావ్  ...ఎల్లువగా తాగలేదు. ఎప్పుడూ లాగానే కొంచంగా తాగి బయటకు వచ్చారు.

కానీ, ఆయన తాగిన బ్రాందీలో ఎల్.ఎస్.డి. మత్తు టాబ్లెట్ కలిపినట్లు పోస్టు మార్టం రిపోర్టులో తెలియవచ్చింది. కాంతారావ్ తాగుతున్నప్పుడు హంతకుడు అక్కడికి వచ్చుండాలి. మత్తుమందును బ్రాందీలో కలిపుంటాడు! కాబట్టి...ఇది కూడా ప్లాన్ చేసిన హత్యే. రెండు హత్యలూ వెంట వెంటనే జరగకుండా ఒక సంవత్సరం విరామం ఇచ్చి జరిపాడు. ఇదే ఆ హంతకుడి తెలివితేటలు!

వెంకటేష్ కు చెమట్లు ఎక్కువైనై.

సార్...మీరు చెప్పేది చూస్తే, హంతకుడి తరువాతి టార్గెట్ నేనుగా ఉండచ్చొనే భయం నాకు వస్తోంది

ఖచ్చితంగా మీకు ఆ భయం రావాలి. దీన్ని మీరు ఈజీగానో...నిర్లక్ష్యంగానో తీసుకోకూడదు. ఆ బూడిద మ్యాటర్ దేనికోసం?’ అని మీరు ఆడగొచ్చు. రేపు మీకేదైన్నా ఆపద ఏర్పడితే...దానికైన కారణం ఆ బూడిదేనని పోలీసులు అనుకుని, దాని చుట్టూ నేర విచారణ చేస్తూ ఉంటారు. సర్వానందా స్వామీజీ జ్ఞాపకమో...ఆయన్ మరణమో జ్ఞాపకం రాదు

వెంకటేష్ భయంతో ఉమ్మి మింగారు. ఆయన స్వరం తగ్గి సన్నగా, వణుకుతో  వచ్చింది.

సార్...ఇకమీదట నేను ఎలా నడుచుకోవాలి?”

ఆ హంతకుడిని పట్టుకునేంత వరకు జాగ్రత్తగా, హెచ్చరికతో ఉండాలి. ఒంటరిగా బయటకు వెళ్ళటం, రావటం వద్దు. ఒక వేల బయటకు వెళ్ళాల్సి వస్తే సెంట్రీ పోలీసును తీసుకు వెళ్లండి. అదే సేఫ్!

ఎస్ సార్... -- వెంకటేష్ తల ఊప, కమీషనర్ను చూశాడు గిరిధర్.

సార్! ఆ బూడిదను పరిశోధన చేసినప్పుడు...తగలబెట్టబడిన వయసైన మగ వ్యక్తి శరీరం నుండి తీసింది అని తెలిసింది. అది ఎవరనేది కనిపెట్టద్దా? ఒకవేల మిస్టర్. వెంకటేష్ టీములో వర్క్ చేసిన మనిషిదై కూడా ఉండొచ్చు కదా?”

"లేదు...అది నేను చెక్ చేసేశాను. వాళ్ళ టీములో అంత వయసైన వ్యక్తి ఎవరూ లేరు. అది శ్మశానం నుండి కలెక్టు చేసిన ఎవరిదో బూడిద. వెంకటేష్ ఆలొచనలను డైవర్ట్ చేయటానికి పంపించారు.  అంతే కాదు డి.ఐ.జీ పద్మనాభం గారు, డెప్యూటి కమీషనర్ సూర్యనారయణ గారు, జీపు డ్రైవర్ మరియూ ఇద్దరు కానిస్టేబుల్స్ -- అందరూ బద్రంగా ఉన్నారు. హంతకుడి చూపంతా ఇప్పుడు వెంకటేష్ మీదే! ఆయన చేయవలసింది...ఆ హంతకుడు నమ్మే విధంగా బూడిదకు సంబంధించిన మనిషిని కనుకుటున్నట్టు యాక్టింగ్ చేయాలి. ఆ  అవకాశంలో పోలీసుల ఇంకో టీము హంతకుడు ఎవరనేది కనిబెట్టాలి!

సార్...బూడిదను పార్సిల్ గా పంపింది మహిళ. కానీ నాతో ఫోనులో మాట్లాడింది మగ మనిషి. కాబట్టి ఈ వ్యవహారంలో ఒక మగ, ఒక ఆడది ఈ కుట్ర వెనుక ఉన్నారు. ఆ ఇద్దరూ బహుశ సర్వానందా స్వామీజీ సిద్దాంతాలచే ఆకర్షించబడ్డ భక్త కోటిలో వాళ్ళు అయ్యుంటారు. లేదంటే స్వామీజీ తపోవన మండపంలో పనిచేస్తున్న వాళ్ళుగా ఉండవచ్చు" -- వెంకటేష్ చెబుతున్నప్పుడే ఆయన సెల్ ఫోన్ మోగింది.

సెల్ ఫోన్ తీసి ఎవరై ఉంటారొ చూశాడు. కమీషనర్ అతన్ని చూశారు.

సార్...ఇది కొత్త నెంబర్. ల్యాండ్ లైన్ నెంబర్. బహుశ పబ్లిక్ టెలిఫోన్ బూత్ గా ఉండవచ్చు. మాట్లాడిన వ్యక్తి, ఇదివరకే నీతో మాట్లాడిన వ్యక్తిగా ఉండచ్చు

మాట్లాడండి వెంకటేష్...అతను ఏం చెప్తాడో చూద్దాం!"

వెంకటేష్ ఆన్ బటన్ నొక్కి చిన్న స్వరంతో మాట్లాడాడు.

ఎస్...

ఏమిటి ఏ.సీ. సార్! హఠాత్తుగా కమీషనర్ ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోయారు? ‘కేసును ఒంటరిగా డీల్చెయ్యటం కుదరలేదా? కుదరకపోతే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేసి, వేరే ఏదైనా పని చూసుకోవచ్చే?”

నువ్వెవ్వరు?”

కనిపెట్టండి...!

అవతలివైపు రీజీవర్ను వేగంగా పెట్టిన శబ్ధం వినబడింది.

***************************************************PART-14*****************************************

రెండు రోజుల తరువాత...

ఆ ప్రొద్దుటి సమయంలో వెంకటేష్ తన ఇంటి తోటలోనే వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు ఇంటి ముందు ఒక కారు  వచ్చి ఆగింది. ఆ శబ్ధం విన్న వెంకటేష్ ఎవరై ఉంటారా అని చూశారు. కాంపౌండ్ గేటును తెరుచుకుని లోపలకు వస్తున్నారు.

గుడ్ మార్నింగ్ మిస్టర్ వెంకటేష్!

ఓ... గిరిధర్! రండి. వెరి వెరి గుడ్ మర్నింగ్! ఏమిటి ఇంత ప్రొద్దున్నే?”

మీతో కొంచం మాట్లాడాలే?”

"దారాళంగా మాట్లాడండి. భార్య ఇప్పుడు కిచెన్ లో ఉంది. పనివాడు కూరగాయలు కొంటానికి గిరిధర్ వెళ్లాడు. చెప్పండి...ఏమిటి విషయం?” -- అడుగుతూ పచ్చిగడ్డి నేల మీద వేసున్న వెదురు కుర్చీ చూపించారు వాసుదేవన్.

కూర్చోండి గిరిధర్

కూర్చున్నారు.

కాఫీ తెమ్మని చెప్పనా?”

అదంతా వద్దు సార్! నేను  ఎందుకొచ్చానో చెప్పేస్తాను

చెప్పండి...

బూడిద విషయంలో ఒక చిన్న కన్ ఫ్యూజన్

ఏమిటది?”

ఆ బూడిదలోని మరో ఎముక ముక్కను తీసి డి.ఎన్.ఏ. ను టెస్ట్ చేశాము. దాని రిపోర్టు వేరుగా వచ్చింది

వేరేలాగా అంటే?”

బూడిదలో ఉన్న ఎముక ముక్కలను రెండు రోజులకు ముందు తీసి టెస్ట్ చేసి  చూసినప్పుడు, అరవై ఏళ్ళకు పైబడిన మగ మనిషి శరీరంలోనిదై ఉంటుందని రిపోర్టు వచ్చింది. నిన్న తీసి చూసినప్పుడు...వయసైన ఆడదాని ఎముక అని వచ్చింది"

అదెలా?”

అర్ధం కావటం లేదు! టెస్ట్ చేసిన పద్దతి తప్పుగా ఉండే అవకాశమే లేదు

కమీషనర్ కు ఈ విషయం తెలియపరిచారా?”

లేదు...మీ దగ్గర మాట్లాడి, దాని తరువాత చెబుతామని బయలుదేరి వచ్చాను

ఈ బూడిద మ్యాటర్ డీల్ చేయడానికి క్యూ బ్రాంచ్ లో ఉన్న సుదర్సన్ అనే అధికారిని నియమించారు కమీషనర్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలను ఆయన దగ్గర కూడా చెప్పటం మంచిది. అంతకు ముందు కమీషనర్ను కలిసి మాట్లాడండి...

ష్యూర్... -- గిరిధర్ చెబుతునప్పుడే వెంకటేష్ గారి సెల్ ఫోన్ మోగింది. తీసి, ‘ఎస్అన్నారు. అవతలివైపు ఒక అమ్మాయి గొంతు వినబడింది.

ఎస్...మాట్లాడేది అడిషనల్ కమీషనర్ వెంకటేష్ గారా?”

అవును...

సార్...నేను రోజా మాట్లాడుతున్నాను"

రోజా నా...?”

పర్ ఫెక్ట్ కొరియర్ సర్వీస్ లో వర్క్ చేస్తున్న రోజా సార్. మీరు కూడా కొద్ది రోజులకు ముందు ఒక పార్సిల్ గురించి అడగటానికి వచ్చేరే?”

ఓ నువ్వా...చెప్పమ్మా...ఏమిటి విషయం?”

సార్...ఆ పార్సిల్ మీకు బుక్ చేసిన ఆ అమ్మాయి ఇప్పుడు పక్కనున్న డిపార్ట్ మెంట్ స్టోర్ లో ఏదో పార్సిల్ చేస్తూ ఉన్నది. మీరు వెంటనే బయలుదేరి వస్తే ఆమెను పట్టుకోవచ్చు

ఇప్పుడు నువ్వెక్కడ్నుంచి మాట్లాడుతున్నావు?”

లక్డికపూల్, మహావీర్ అవెన్యూలో ఉన్న స్టోర్ ముందు విజయా పాల బూత్ ఉంది సార్. పాలు కొనడానికి అక్కడికి వచ్చాను. అప్పుడే గుడ్డ సంచీ తీసుకుని ఆమె లోపలకు వెళ్ళింది. ఇంకా బయటకు రాలేదు. నేను బూత్ కు ముందర నిలబడున్నాను. నా చూపు నుండి తప్పించుకుని ఆమె బయటకు వెళ్ళలేదు

రోజా...నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి

చెప్పండి సార్...

నేను ఇంట్లో నుండి బయలుదేరి అక్కడికి వచ్చే సరికి దగ్గర దగ్గర నలభై నిమిషాలు పడుతుంది. అందువలన లక్డికపూల్ పోలీసు ఇన్స్పెక్టరుగా ఉంటున్న చక్రవర్తి గారి నెంబర్ ఇస్తాను. ఆయన దగ్గర మాట్లాడతాను. మీరు కూడా ఆయనకు విషయం చెప్పండి"

సరే...నెంబర్ ఇవ్వండి

ఆ పోలీసు ఇన్స్పెక్టర్ సెల్ ఫోను నెంబర్ను చెప్పటం మొదలుపెట్టాడు వెంకటేష్.

***************************************************PART-15*****************************************

విషయం తెలుసుకున్న లక్డికపూల్  పోలీసు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి, నలుగురైదుగురు పోలీసులతో అక్కడకు వెళ్ళి చేరుకున్నప్పుడు...పాల బూత్ ముందు నిలబడ్డ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది.

సార్...నేనే రోజా ను"

జీపులో నుండి దిగుతూ అడిగారు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి. ఇంకా ఆ అమ్మాయి లోపలే ఉందా?”

అవును సార్! నేను చూస్తూనే ఉన్నాను. ఇంకా బయటకు రాలేదు

ఆ అమ్మాయి ఎలా ఉంటుంది?”

వయసు ఇరవై ఐదు ఉండొచ్చు సార్! లైట్ బ్లూ కలర్ చుడిదార్ వేసుకోనుంది"

ఆమెతో ఇంకెవరైనా?”

ఆమె మాత్రమే సార్!

ఇంకా ఆ అమ్మాయి షాపు లోపలే ఉన్నది కదా?”

అవును సార్!

నువ్వూ లోపలకు రామ్మా...చూసేద్దాం -- ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి, రోజాను తీసుకుని ఆ షాపు లోపలకు వెళ్ళారు.

ప్రొద్దున ఆ సమయానికే అక్కడ జనం బాగా ఉన్నారు.

చక్రవర్తి, రోజా ఇద్దరూ డిపార్ట్ మెంట్ స్టోర్ అంతా వెతికారు...లైట్ బ్లూ రంగులో చుడిదార్ వేసుకున్న అమ్మాయి కోసం వెతికారు.

పలు రంగుల్లో చీరలూ, చుడిదార్లు, సాల్వార్ కమీజులు చూపులకు దొరికినై గానీ, 'లైట్ బ్లూ' చుడిదార్ మాత్రం కనబడలేదు.

సార్...ఆమె వెజిటబుల్ సెక్చన్లో ఉండొచ్చు. అక్కడకు వెళ్ళి వెతికితే కనబడొచ్చు

వేగంగా వెళ్లారు.

వెజిటబుల్ సెక్చన్లో జనం తక్కువగానే ఉన్నారు. నలబై ఏళ్ళ ఒక మహిళా సేల్స్ ఉమన్ దగ్గర....'పోయిన వారం కొన్న బీన్స్, క్యారట్ బాగుండలేదు 'అని వాదిస్తోంది.

రోజాఆ సేల్స్ ఉమెన్ను చేరుకుంది.

ఎక్స్ క్యూజ్ మి...!

ఆమె తిరిగింది. రోజా అడిగింది. "ఇక్కడికి ఎవరైనా ఒక అమ్మాయి లైట్ బ్లూ చుడిదార్ వేసుకుని పర్చేస్ కి వచ్చిందా?”

బ్లూ కలర్ చుడిదారా?"

ఎస్...

నేను చూడలేదే!

చక్రవర్తి, కానిస్టేబుల్స్ వైపు ఒకసారి చూశాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్క పక్కకు వెళ్ళి వెతకండి. ఏదో ఒక సెక్షన్లొ ఉండొచ్చు. బ్లూ కలరులో ఎవరు, ఏ డ్రస్సు వేసుకున్నా వాళ్లను పక్కగా ఆపి ఉంచండి

ఎస్సార్...!

కానిస్టేబుల్స్ చెరో వైపుకూ వెళ్లారు. పది నిమిషాల తరువాత తిరిగి వచ్చారు.

సార్...మీరు చెప్పేటట్టు ఏ అమ్మాయీ మా చూపులకు కనబడలేదు! ఈ స్టోర్స్ కి వెనుక ఒక దారి ఉంది. ఆ దారిలో నుంచి ఆమె వెళ్ళిపోయుండాలి!

మనం వచ్చేది ఆమెకు తెలియదే?”

పోలీసు జీపును చూసి హెచ్చరికగా, వెనుక దారి నుండి వెళ్ళి పోయుండచ్చే సార్?”

రోజా అడ్డుపడింది. సార్! ఆ అమ్మాయి ఈ ఏరియాలో ఉన్నట్టు కన్ ఫర్మ్అయిపోయింది. మరోసారి నా కళ్ళకు కనబడకుండా పోతుందా! చూస్తే నేనే ఆమెను ఆపుతాను

ఆ స్టోర్ మేనేజర్ పొట్ట ఆడించుకుంటూ, గాలిలో ఎగురుతున్న టైతో వచ్చాడు.

సార్...ఏదైనా సమస్యా?”

ఒక కేసులో వెతుకుతున్న ఒక నేరస్తురాలు ఒకామె మీ షాపులోకి వచ్చినట్టు మాకు సమాచారం వచ్చింది. అదే వెతుకుతున్నాము

దొరికిందా?”

లేదు...మేమొచ్చింది ఎలాగో తెలుసుకుని తప్పించుకుని పారిపోయింది!

సార్! ప్లీజ్...నాతో రండి. ఆ అమ్మాయి గురించిన వివరాలు ఇవ్వండి. నేను నోట్ చేసుకుంటాను. మరోసారి వచ్చిందంటే మీకు తెలియపరుస్తాను

వెళ్ళిపోయారు!

***************************************************PART-17*****************************************

రెండు రోజుల తరువాత...రాత్రి తొమ్మిదింటికి.

పర్ ఫెక్ట్ కొరియర్ సర్వీస్ చివరి క్షణం బుక్కింగ్ హడావిడిలో ఉంది రోజా,మరొక అమ్మాయి ఉత్తరాలనూ...పార్సిల్స్ నూ తీసుకుని బరువు చూసి బుకింగ్ చేస్తున్నారు.

మేనేజర్ పక్క రూములో నుండి కేక వేశాడు.

రోజా...

సార్!

వ్యాన్ వచ్చేస్తుంది...టైము తొమ్మిదవుతోంది. బుకింగ్ చేసింది చాలు

సార్...అయిపోయింది! లైన్లో ఇంకో ఐదుగురే ఉన్నారు! ఎంట్రన్స్ గేటు మూసాశాము

సరే...

రోజా వేగంగా పనిచేసింది. రెండు ఉత్తరాలను బుక్ చేసి వాళ్ళకు రసీదు ఇచ్చి పంపించిన తరువాత, మూడో వ్యక్తిగా ఆ యువకుడు వచ్చాడు. చేతిలో చిన్నగా ఒక పార్సిల్!

రోజా దాని బరువు వేసి చూసింది. పావు కిలో ఉన్నది.

లోపల ఏముంది సార్?”

ఆయుర్వేదం మందు

ఇంకేవీ వాల్యుబుల్ తింగ్స్ లేవుగా?”

లేవు

ఇప్పుడు లేదని చెప్పి...తరువాత అది కనబడ లేదు, ఇది లేదు అని చెప్పకూడదు

లేదు...లోపలున్నది ఆయుర్వేదం మందే!

అయితే సరి... -- చెప్పిన ఆమె, రసీదులో పేరు రాయటానికి అడ్రస్స్ చూసింది.

వెంకటేష్,

అడిషనల్ పోలీస్ కమీషనర్.

రోజా లోలోపల ఆందోళన చెందినా...దాన్ని బయటపడ నివ్వకండా, ఫ్రం అడ్రస్ రాసుకుంది.

జి. శేషగిరి,

7-బజారు వీధి,

లేక్ ఏరియా,

లక్డికపూల్,

రోజా చిన్న నవ్వుతో ఆ మనిషిని చూసింది.

నువ్వు శేషగిరేనా?”

అవును

లోపలున్నది మందే కదా?”

అందులో ఉన్నది ఆయుర్వేదం మందేనని ఎన్నిసార్లు చెప్పేది? మీరు ఓకే అనుకుంటేనే బుక్ చేయండి. లేకపోతే నేను వేరే ఇంకొక కొరియర్ చూసుకుంటాను

ప్లీజ్...కోపగించుకోకండి! మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అందుకే అన్నిసార్లు అడిగాను. ఈ పార్సిల్ పైన మెడిసన్ ఓన్లీఅనే లేబుల్ అతికించవచ్చా?”

దారాళంగా అతికించండి!

ఒక్క నిమిషం! -- రోజా ఆ పార్సిల్ ను తీసుకుని పక్క గదిలోకి వెళ్ళింది. తలుపును మెల్లగా మూసి సెల్ ఫోన్ తీసుకుని నెంబర్లు నొక్కింది.

సార్...పర్ఫెక్ట్ కొరియర్ సర్వీస్ నుండి రోజా మాట్లాడుతున్నాను

ఆమె సెల్ ఫోనులో మాట్లాడి, తలుపు తీసుకుని బయటకు వచ్చింది.

కొరియర్ సర్వీస్ మేనేజర్ ఎదురొచ్చారు. ఏమిటి రోజా...కస్టమర్ దగ్గర ఏమిటి సమస్య?”

ఆయన పంపుతున్న పార్సిల్లో మందులున్నాయని చెబుతున్నారు. అందువల్ల దానిపై మెడిసన్ ఓన్లీలేబుల్ అతికించాను

త్వరగా పని ముగించమ్మా...వ్యాను వచ్చే టైము అయ్యింది. ఇంతకు ముందే మనం పిక్-అప్ ప్రాసస్ లో ఆలస్యం చేస్తున్నామని డ్రైవర్ హెడ్ ఆఫీసుకు కంప్లయింటు ఇచ్చాడు

ఇదిగో అయిపోయింది సార్...ఇంకో ఇద్దరు కస్టమర్లే చెప్పుకుంటూ రోజా తన గదిలోకి వచ్చింది.

ఏం మ్యాడం...లేబుల్ అతికించారా?”

రోజా రసీదు జాప...ఆ శేషగిరి కోపంతో దాన్ని తీసుకుని నడిచాడు.

బయటకు వచ్చాడు.

వాకిట్లో వైట్ చేస్తున్న బైకును స్టార్ట్ చేస్తున్నప్పుడు సెల్ ఫోను మోగింది. తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు.

నేనే సార్...

ఏం శేషగిరి...పార్సిల్ బుక్ చేశారా?"

ఇప్పుడే బుక్ చేసి బయటకు వచ్చాను

ఎవరికీ ఎటువంటి అనుమానమూ కలగలేదుగా?”

చిన్నగా అనుమానం వచ్చి -- లోపల ఏముంది? అని అడిగారు. నేను మెడిసన్ అని చెప్పాను. మెడిసిన్ ఓన్లీఅనే లేబుల్ అతికించి బుక్ చేసుకున్నారు

సరే! ఇప్పుడు నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళు. దార్లో ఎవరినీ కలవకు!

సరే సార్! -- సెల్ ఫోన్ ఆఫ్ చేసి, బైకు ఎక్కి వెళ్ళిపోయాడు.

***************************************************PART-17*****************************************

ఐ.జీ. ఆఫీసు!

ఐ.జీ. ముందు డి.ఐ.జి. పద్మనాభం, కమీషనర్, అడిషనల్ కమీషనర్ వెంకటేష్, ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్ గిరిధర్.

వివాదం జరుగుతోంది.

ఐ.జీ. మాట్లాడుతూ ఉన్నారు.

సర్వానందా స్వామీజీ న్యాచురల్ గానే మరణించినా, ఆ మరణానికి కారణం పోలీసులే అనే కోపం ఎవరినో రెచ్చ గొట్టటం వలనే....మన డిపార్ట్ మెంటుకు చెందిన విశ్వనాద్, కాంతారావు అనే ఇద్దరూ యాక్సిడెంట్ అనే ముసుగులో పగతీర్చుకోబడ్డారు.

ఆ కోపం ఇప్పుడు వెంకటేష్ మీదకు తిరిగింది. ఈ పగ తీర్చుకునే గుంపుకు వెనుక ఒక మగ, ఒక మహిళ వర్క్ చేస్తున్నారని రఫ్ స్కెచ్ తెలుపుతోంది. వెంకటేష్ కి పంపబడిన బూడిదను పరిశోధించి చూసిన మిస్టర్ గిరిధర్ రెండు డిఫెరెంట్ రిపోర్టులు ఇస్తున్నారు. ఇది కొంచం కంఫ్యూజన్ గానే ఉన్నది

సార్...అందులో కన్ ఫ్యూజన్ లేదు. గత వారం రోజులుగా ఆ బూడిదను పరిశోధన చేసి చూసినప్పుడు నాకు ఒక విషయం కన్ ఫర్మ్ అయ్యింది. అది ఒక మనిషిని తగలబెట్టిన బూడిద కాదు. పలు శరీరాలను కాల్చిన చోటు నుండి తీసిన బూడిద. తప్పకుండా అది శ్మశానంలో తీసిన బూడిదే. ఎందుకంటే...అందులో ఉన్న సరిగ్గా కాలని ఎముకల ముక్కలు, వేరు వేరు వయసు ఉన్న వ్యక్తులవి. బూడిద నాకు వచ్చిన మొదట రోజు...ఒక ఎముక ముక్క తీసి పరిశోధించినప్పుడు, అది బాగా వయసైన మగ వ్యక్తి ఎముక అని తెలిసింది.

ఆ మరుసటి రోజే అదే బూడిదలోని ఇంకో ఎముక ముక్కను పరిశోధించినప్పుడు అది వయసైన మహిళ యొక్క ఎముక అని తెలిసింది. ఆ మరుసటి రోజు ఇంకో కొన్ని ఎముక ముక్కలను పరిశోధించి చూసినప్పుడు...అవన్నీ వేరు వేరు వయసు తేడా ఉన్న ఆడ, మగ వ్యక్తులదని తెలిసింది.

ఆ బూడిద ఖచ్చితంగా శ్మశానంలో నుండి సేకరించబడినదిగానే ఉండాలి. అడిషనల్ కమీషనర్ను కన్ ఫ్యూజ్ చేయటానికి, భయపెట్టటానికి బూడిదను పంపించి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. పోలీసులను ఎలాగైనా టార్చర్ చెయ్యాలనేదే ఆ ఇద్దరి ఆలొచన అయ్యుంటుంది

మేబీ! మిస్టర్ గిరిధర్ చెప్పేది కరెక్టే నని నా మనసుకు కూడా అనిపిస్తోంది సార్ -- అన్న వెంకటేష్ సార్...ఆ ఇద్దర్నీ పట్టుకునేందుకు నేను చిన్నదిగా ఒక ప్లాన్ వేశాను. అది నెరవేర్చే భాద్యతను ఇన్స్పెక్టర్ చక్రవర్తి దగ్గర అప్పగించాను. ఏ నిమిషానైనా మనకు రిజల్ట్స్ దొరకొచ్చు!

ఐ.జీ నూ, మిగిలినవారూ ఉత్సాహపడ్డారు.

అదేం ప్లాను ?”

అతను చెప్పటం మొదలుపెట్టాడు.

***************************************************PART-18*****************************************

రోజా ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు రాత్రి పది అయింది!

హిమాయిత్ నగర్ లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని, అక్కడ ఉంటున్న ఆమెకు చెప్పుకోవటానికి పెద్దగా ఎవరూ లేరు. ఒక తమ్ముడు తప్ప. అతనూ బెంగళూరులోని ఐ.టీ కంపెనీలో పనిచేస్తూ ఒక అమ్మాయిని ప్రేమించాడు.

ఇల్లు తెరుచుకుని లోపలికి వెళ్ళి ట్యూబ్ లైటు ప్రాణం ఇచ్చిన క్షణం,

గుమ్మం దగ్గర ఎవరో నడిచిన శబ్ధం వినబడింది.

తిరిగి చూసింది.

గుమ్మం మెట్లు ఎక్కుతున్న ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఆమె మొహం వికసించింది. రండి... రమణా సార్! చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారా?”

లేదు...నేను ఇప్పుడే వచ్చాను

రమణా లోపలకు వచ్చి గోడ చివరగా వేసున్న కుర్చీలో వాలాడు. రోజా కూడా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోంది.

సార్...మీరు వెళ్ళిన పని ఏమయ్యింది?”

రమణా అనే అతను, చాలాసేపు తన బోడి గుండు తలను రుద్దుకుంటూ రోజాను చూశాడు.

రోజా...నువ్వు కొరియర్ ఆఫీసు నుండి నాకు ఫోను చేస్తున్నప్పుడు, మీ ఆఫీసు ఎదురుగా ఉన్న టీ షాపులో నేనున్నది మంచిదయ్యింది. నువ్వు చెప్పినట్టు శేషగిరి అనే ఆ వ్యక్తిని బైకులో ఫాలో అయి వెళ్లాను. అతను పార్సిల్ ఇచ్చిన ఫ్రం అడ్రస్సు కరక్టే.

నెంబర్-7, ప్రకాశం వీధిలోనే అతని యొక్క ఇల్లు. భార్యా, పిల్లలూ అంటూ ఒక కుటుంబంగానే ఉంటున్నాడు. అతని ఇంటికి కొంచం దాటి...మొబైల్ లాండ్రీ మనిషి దగ్గర అనుమానం రాకుండా విచారణ చేశాను. శేషగిరి తన ఇంట్లో మెస్ జరుపుతున్నాడట"

సరే...అతనెందుకు అసిస్టంట్ కమీషనర్ వెంకటేష్ కి ఆయుర్వేద మందులు కొరియర్ చేయాలి?”

అదే అర్ధం కావటం లేదు! అది మందేనా...లేక మనం పంపినట్టు శ్మశాన బూడిదా?”

మనం బూడిద పంపిన విషయం మన ఇద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదే సార్?”

ఇదిగో చూడు రోజా...కాకి కూర్చుంటేనే పడిపోయే తాటి చెట్టులాగా, ఆ శేషగిరి వెంకటేష్ కి నిజంగానే ఆయుర్వేద మందులు పంపుండొచ్చు కదా?”

ఉండవచ్చు!

అలాంటప్పుడు ఎందుకు మనసులో అంత కన్ ఫ్యూజ్ అవుతావు? ఆ శేషగిరిని మరిచిపోయి, వచ్చేవారం వాల్టేరులో జరుగబోయే మన సర్వానందా స్వామీజీకి జరగబోయే గురుపూజ గురించి మాట్లాడుదాం

సార్... సర్వానందా స్వామిజీ గురుపూజకు ముందు వెంకటేష్ ని  ఈ లోకం నుండి పంపించేయాలని మనం శపధం చేసున్నామే

నాకు అది జ్ఞాపకం లేదనుకుంటున్నావా రోజా? రెండు రోజులకు ముందు ప్రొద్దున ఆ వెంకటేష్ ను డిపార్ట్ మెంట్ స్టోర్స్ కు రమ్మన్నాను! అతను  రాకుండా...ఇంకొక ఇన్‌స్పెక్టర్ వచ్చాడు. వెంకటేష్ వచ్చుంటే దారిలోనే వాడి  పని ముగించి ఉంటాను. ఇప్పుడేమీ చెయ్యి దాటిపోలేదు. స్వామీజీ యొక్క గురుపూజకు ఇంకా ఒక వారం ఉన్నది. ఆ ఏ.సి. ఏదో ఒకవైపు దొరక్కుండానా పోతాడు?”

రోజా నవ్వింది. నేను కల్పితంగా చెప్పిన ఆ లైట్ బ్లూ కలర్ చుడిదార్ అమ్మాయిని పోలీసులు ఆ ఏరియాలో ఇంకా వెతుకుతూనే ఉన్నారు సార్

రమణా కూడా నవ్వాడు.

వెతుకుతూనే ఉండనీ! అంతలో మనం స్వామిజీ యొక్క హత్యకు కారణమైన పోలీసులను ముగించుకుంటూ వెళదాం

అంతవరకు పోలీసుల యొక్క చేతులు పువ్వులు కోస్తూ, మాలగా కడుతూ ఉంటారా ఏమిటి?” -- కిటికీ పక్క నుండి వినబడ్డ ఆ స్వరం ఎవరిదా అని వీళ్ళు ఆశ్చర్యపోయి చూశారు.

కిటికీ చువ్వలకు అవతలి వైపు శేషగిరి యొక్క నవ్వుతున్న మొహం కనబడింది!

***************************************************PART-19*****************************************

ఇద్దరూ ఆశ్చర్యంలో నుండి తేరుకోక ముందే... శేషగిరి నవ్వు పెద్దదయ్యింది!

ఏమిటీ...ఇద్దరూ అలా చూస్తున్నారు? నా పేరు శేషగిరి! రాఘవయ్య వీధిలోనే ఇల్లు. మెస్ ఒకటి జరుపుతున్నాను. ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి మూడు పూటలా ఇక్కడే తింటారు. ఆయన చెప్పిచ్చినట్టు కొరియర్ ఆఫీసుకు వచ్చి అడిషనల్ కమీషనర్ కు ఆయుర్వేద మందు అనే పార్సిల్ బుక్ చేశాను... -- అతను మాట్లాడుతున్నప్పుడే  రమణా లేచి వాకిలి వైపు పరిగెత్త ప్రయత్నించ... శేషగిరి నవ్వాడు.

ప్రయోజనం లేదు రమణా...ఇన్స్పెక్టర్ చక్రవర్తి, పోలీసు జీపులో ఒక పోలీసు బృందంతో వీధి చివర వెయిట్ చేస్తున్నారు. నా చేతిలో ఉన్న సెల్ ఫోన్, ఆయన చేతిలో ఉన్న సెల్ ఫను ఇంతవరకు ఆన్ లోనే ఉన్నాయి. అదిగో...నేను చెప్ప, చెప్ప ఇంటి వాకిటికే పోలీసు జీపు వచ్చింది!"

కలవరపాటుతో రోజా మరియు రమణా వాకిలి వైపు చూడ...హెడ్ లైట్లను ఆపుతూ, ఆ పోలీసు జీపు మెల్లగా వచ్చి ఆగింది. కానిస్టేబుల్స్ ను అందులోనే ఉండమని చెప్పి, చక్రవర్తి మాత్రం కిందకు దిగి మెట్లు ఎక్కి లోపలకు వెళ్ళారు. కుర్చీ లాక్కుని కూర్చున్నారు. శేషగిరి కూడా లోపలకు వచ్చారు. చక్రవర్తి రోజాను చూశారు.

ఏమిటి రోజా! కొరియర్ ఆఫీసులో ఉద్యోగాన్ని రెగులర్ గా చేసుకుంటూ...పార్ట్ టైములో హత్యలు చేసుకుంటూ వస్తున్నట్టున్నావు? ఈ మనిషే నీ యొక్క పార్టనరా?”

స్వరంలో కోపం కనబడ... రమణా ఆందోళనలో పడ్డాడు.

ఇన్‌స్పెక్టర్ మేము చేసింది హత్యలు కాదు. ప్రాయశ్చిత్తం. సర్వానందా స్వామీజీని మేము దేవుడి కంటే ఎక్కువగా చూశాము. ఆయనకు ఏదో ఆపద ఉన్నట్టు అబద్దం చెప్పి, తీసుకువెళ్ళి ఏదేదో ఇచ్చి మీ పోలీసు డిపార్ట్ మెంట్ ఆయన ప్రాణాలు తీసింది.

ఊరి ప్రజలనూ, ఆయన భక్త కోటిని మొసం చేయటానికి ఆయనకి హార్ట్ అటాక్అని అబద్దం చెప్పటం, నిజం చెప్పటానికి ముందుకు వచ్చిన మీడియావాళ్ళ నోటికి తాళాలు వేయటం అంటూ ఎవరినైనా పోలీసులు మోసం చెయ్యచ్చు. కానీ, స్వామీజీ యొక్క అత్యంత విశ్వాసులైన భక్తులను మొసం చేయలేరు.

ఆయన యొక్క ప్రాణం పోవటానికి కారణమైన పోలీసు అధికారుల లిస్టు రాసుకుని ఒక్కొక్కరినీ విరామం ఇస్తూ ముగిస్తూ వస్తున్నాము. ఇది పగ తీర్చుకునే గుంపు కాదు. స్వామిజీకి చేయబడుతున్న ప్రాయశ్చిత్తం

చక్రవర్తి చిన్నగా నవ్వి భుజాలు ఎగరేశారు.

ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం కాదు.  అబద్ధం...అబద్ధం తప్ప ఇంకేమీ లేదు. స్వామీజీకి, పోలీసు డిపార్ట్ మెంటుకూ ఎటువంటి పగా ఉండే న్యాయం లేనప్పుడు...ఆయన ప్రాణం పోవటానికి పోలీసులు ఎలా కారణమవగలరు? ఆయన యొక్క శత్రువులను కనిబెట్టటానికి పోలీసు డిపార్ట్ మెంటు ఒక కిడ్నాప్ డ్రామా జరిపింది. స్వామీజీ కూడా మాతో బాగా కోపరెట్ చేశారు. కానీ, ఎదురు చూడని విధంగా న్యాచురల్ గా వచ్చిన మరణం ఆయన్ని తాకినప్పుడు మా డిపార్ట్ మెంట్ షాకుకు లోనైంది

ఈ అబద్దాన్ని మేము నమ్మ బోయేది లేదు  

దాని గురించి మాకు బాధ లేదు!

చక్రవర్తి చెబుతున్నప్పుడే శేషగిరి ఇంట్లో ఉన్న అలమారులనూ, బీరువానూ చెకింగ్ చేసి రెండు పుస్తకాలను తీసుకు వచ్చాడు.

సార్!చూశారా...అన్నీ ఆద్యాత్మికం సంబంధించిన పుస్తకాలు. జ్ఞాన దీపం, మోక్షానికి దారి ఎలా?’ సర్వానందా తత్వం--ధ్యానం-- రకాలు...ఇన్ని పుస్తకాలు చదివిన తరువాత కూడా వీళ్ళిద్దరికీ హత్య పిచ్చి ఎలా వచ్చిందో అర్ధం కాలేదు!

చక్రవర్తి నవ్వారు. ఇన్ని ఆద్యాత్మిక పుస్తకాలను చదివిన వారికి ఒక విషయం అర్ధం కాకపోవటమే నాకు ఆశ్చర్యంగా ఉంది

శేషగిరి అడిగాడు. ఏం విషయం సార్?”

చట్టానికి విరుద్దంగా ఎవరు నడుచుకున్నా, నిజం వాళ్ళను శిక్చించ కూడా వదలదు అనే విషయాన్నే -- చెప్పిన ఆయన రోజా వైపు తిరిగారు.

రోజా! నువ్వు కొరియర్ సర్వీసులో ఉన్నావు కాబట్టి నువ్వు సులభంగా బూడిద పార్సిల్ నువెంకటేష్ గారికి పంపించటం...ఆ...నేరాన్ని -- లేని ఒక అమ్మాయి మీద వేయటం చేయగలిగావు. డిపార్ట్ మెంట్ స్టోర్కు నన్ను రప్పించి లైట్ బ్లూ కలర్చుడిదార్ వేసుకున్న అమ్మాయి కోసం పిచ్చివాడిగా వెతికేటట్టు చేయగలిగావు.

స్టోర్ మేనేజర్ నిన్నూ, నన్నూ ఆయన గదికి తీసుకు వెళ్ళి కూర్చోబెట్టి ఒక గంటసేపు అక్కడ అమర్చబడియున్న సి.సి.టీ.వీ కెమేరాలు ప్రొద్దున నుండి తీసిన మహిళా కస్టమర్లను టీ.వీ. స్క్రీన్ పై వేసి చూపి ఈ అమ్మాయా...ఆ అమ్మాయా?’ అని అడగ,

నువ్వు అమాయకురాలిగా మొహం పెట్టుకుని లేదు...లేదుఅని చెబుతూ మమ్మల్ని ఫూల్స్ చెయ్యగలిగావు. ఆ సమయానికి నీ వల్ల మమ్మల్ని గెలవగలిగావు. కానీ, ఆ తరువాత...నీ యొక్క ఓటమి ప్రారంభమయ్యింది. నువ్వు వెళ్ళిన తరువాత అక్కడున్న క్యాషియర్బాధ్యతలో ఉన్న లక్ష్మీ అనే అమ్మాయి నన్ను ఒంటరిగా కలుసుకుని నిన్ను గురించిన ఆశ్చర్యపరిచే విషయాన్ని చెప్పింది

రోజా ఏమిటిఅన్నట్టు కలవరంగా చూడ... చక్రవర్తి కంటిన్యూ చేశారు. నువ్వు ఆ స్టోర్స్ ఎదురుగా ఉన్న పాల బూత్ లో నిలబడున్నప్పుడు ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినట్టు, అతని చూపులో దొంగతనం ఉన్నదని, ఇద్దరూ ఒంటరిగా వెళ్ళి మాట్లాడినట్లు చెప్పింది.

అప్పుడు నాలో నీ మీద నాకు అనుమానం విత్తనం నా మనసులో పడింది...అది ప్రాణం పోసుకుని వృక్షంలాగా పెరగటం ప్రారంభించింది. నీ దగ్గర ఏదో తప్పు ఉన్నట్టు మనసుకు అనిపించింది. నిన్ను ఎర వేసి పట్టుకోవాలని శేషగిరి దగ్గర పార్సిల్ఇచ్చి....దాన్ని బుకింగ్ చేయటానికి నీ దగ్గరకు పంపించాను. అందులో అడిషనల్ కమీషనర్ వెంకటేష్ పేరు చూసిన వెంటనే నువ్వు పోలీసులకు సమాచారం అందిస్తే నీ దగ్గర తప్పు ఏమీ ఉండదు.

అలా కాకుండా వేరే ఎవరికైనా సమాచరం అందిస్తే...నీ దగ్గర తప్పు ఉన్నదని అర్ధం. ఈ రెండు రకాలలో నువ్వు ఏ రకమో అర్ధమయ్యింది. నేను ఎదురు చూసినట్టే కొరియర్ ఆఫీసులో నుండి శేషగిరి బయటకు వచ్చిన వెంటనే నీ మనిషి ఒకడు అతన్ని ఫాలో చేయటం మొదలుపెట్టాడు. అతనే రమణా.

శేషగిరిని రమణా ఫాలో చెయ్య... రమణాని మా పోలీసు గూఢచారి ఫాలో చేశారు. ఆ నిమిషాన్నే నిన్నూ, రమణాని నేను ఖైదు చేసుండొచ్చు.

అయినా కానీ, మీ ఇద్దరినీ మాట్లాడనిచ్చి...దాన్ని రికార్డు చేసిన తరువాత ఖైదు నడవడికను పెట్టుకుందామని నిర్ణయించుకున్నాను.

శేషగిరిని మాత్రమే ఇక్కడికి పంపాను. ఈ ఇంట్లో కొద్దిసేపటి ముందు మీరిద్దరూ  మాట్లాడుకున్న మాటలన్నీ ఇప్పుడు శేషగిరి దగ్గరున్న మైక్రో వీడియో, ఆడియో  రికార్డులో రికార్డు అయున్నాయి"

చక్రవర్తి చెప్పి ముగించ... రమణా పెద్ద నిట్టూర్పు విడిచి చెప్పాడు.

సర్వానందా స్వామీజీ ఆశీర్వాదంతో అందరి మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాను. కుదరలేదు!

దానికి కారణం అదే స్వామీజీ ఆశీర్వాదం మాకూ ఉండొచ్చు కదా...! -- చెప్పి నవ్వుతూ హంతకులిద్దరికీ సంకెళ్ళు వేశారు.

***************************************************సమాప్తం****************************************** 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)