ఇంటింటి వెన్నెలలు...(పూర్తి నవల)


                                                                       ఇంటింటి వెన్నెలలు                                                                                                                                                      (పూర్తి నవల)

పాఠక మహాశయులకు.

ఇంటింటా జరుగుతున్న వేడైన సమస్యే ఈ నవలకు ఆధారం.

యధార్ధమైన ఈ వ్యవహారం చాలా వరకు ప్రతి కుటుంబంలోనూ ఎప్పుడూ కొత్తగా యుక్త వయసులో ఉండే ఎనర్జీలాగానే ఉంటుంది.  తెలివితేటలతో దాన్ని స్వీకరించి, సరి చేసుకునే వారు ఈ వ్యవహారం నుండి తప్పించుకుంటారు.

అలా చెయ్యని వారు చిక్కుకుంటారు...ప్రశాంతత, నెమ్మది, సంతోషం పోగొట్టుకుంటారు.

ప్రేమ చూపటం ముఖ్యమే...కానీ అది వెర్రిగా ఉండకూడదు.

'కన్నవారు కూతుర్లకు నిరంతరం కాదూ అనే నిజాన్ని నొక్కి చెప్పే కథ ఇది!

కథాకాలక్షేపం టీమ్.

బద్దకం, మిగిలిన వాళ్ల వీపు మీద ఎక్కి కూర్చుని జీవితాంతం సవారి చేయాలని ఆశపడే స్వార్ధం, నోటి దురుసు, పోట్లాట పెట్టుకుని మంచి బంధుత్వాలను సైతం గాయపరిచే జంతు గుణం, ముదిరిపోయిన తలబిరుసు తనం...వీటన్నిటినీ మానుకోవాలనే ఆలొచనే చాలా మందికి రా దు. తమని ఆవగింజంత కూడా మార్చుకోవాలని అనిపించలేదు.

ఒక మనిషికి జరిగే ప్రతిదానికీ కారణం ఆ మనిషే. అతనికి ఎవరూ శత్రువులు ఉండరు. అతనికి అతనే శత్రువు!

ఎందుకు పగ? ఎందుకా పోట్లాట--కోపం? అది న్యాయమా? వీటన్నిటి గురించి కూర్చుని ఆలొచించే ఓర్పో--మనసో చాలామందికి లేదు.

పట్టుదల, ఈగో,ముక్కోపం,చటుక్కున మాట్లాడే గుణం...వీటన్నిటినీ ఉడుము పట్టులాగా పట్టుకుంటే ఎవరికీ నచ్చదు. వారికి జీవితంలో విరక్తి మాత్రమే మిగులుతుంది!

గొడవల్లో గెలిచే వారు...జీవితంలో ఓడిపోతున్నారు. ఇది వాళ్ళకు అర్ధమే కావటం లేదు!

***************************************************PART-1*****************************************

"కొత్త సంవత్సరం అద్భుతంగా, సరికొత్తగా ఉండాలి. కుటుంబం అంతా కొత్త ఉత్సాహంతో, ఆయురారొగ్యం, ఐశ్వర్యంతో, ఒక్క కష్టం లేకుండా జీవించాలి. అడిగినదంతా దొరకాలి. అనుకున్నవన్నీ జరగాలి!"

ఆయన చెప్పుకుంటూ వెడుతుంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చుట్టూ కూర్చుండిపోయారు.

అది డిసెంబర్ నెల 31-వ తారీఖు సాయంత్రం 6 గంటలు.

ఇల్లు నిండిపోయింది. మూడు బెడ్ రూముల అపార్ట్ మెంట్. జనం తక్కువగా ఉంటే సర్దుకుపోవచ్చు. ఈ ఇల్లు సంత అంగడి!

ఏ టైమైనా గోలగానే ఉంటుంది!

అది 12 అపార్ట్ మెంటులు కలిగిన నాలుగు అంతస్తుల బిల్డింగ్.

మన మొదటి కథానాయకుడు రఘూ!

ప్రైవేట్ కంపెనీ ఒక దాంట్లో పనిచేస్తున్నాడు. నెలకు ముప్పై వేలు జీతం. వయసు ముప్పై. నాలుగు సంవత్సరాలకు ముందు పెళ్ళి జరిగి, ఇప్పుడు రెండేళ్ల వయసులో ఆడపిల్ల ఉన్నది. భార్య సరోజా. ప్రైవెట్ స్కూల్లో టీచర్. నెలకు పదిహేను వేలు జీతం.

రఘూకి నాన్న ఉన్నారు. ఆయనకు రైల్వే ఉద్యోగం. తల్లి హౌస్ లీడర్. అన్నయ్య, వదిన, వాళ్ళ ఇద్దరి పిల్లలూ, ఆ ఊర్లోనే  చెల్లెలు కూడా ఉంటుంది. పెళ్ళి అయినా నెలకి ఇరవై రోజులు పుట్టింట్లోనే ఉంటుంది. ఆమె భర్త బేవర్స్ కి అలవాటుపడ్డ మనిషి. భోజనానికి హాజరవుతాడు.

వీళ్ళు కాకుండా...మామా, అత్త, పిన్ని అంటూ బంధువుల కుటుంబాలు అప్పుడప్పుడు వస్తారు. వస్తే వెంటనే వెళ్లరు. కనీసం నాలుగు రోజులైనా ఉండే వెళతారు. విధవరాలు, భర్త వదిలేసిన బేరం, భార్యా, కన్నె పిల్లలూ అంటూ సకల మహిళలూ హాజరు.

ఎప్పుడూ భోజనానికి పదిమందికి తగ్గరు.

అత్తగారు శ్రమ పడటానికి వెనుకాడరు. వచ్చిన వాళ్లను అంత సులువుగా వెళ్లనివ్వకుండా పట్టుకుంటారు. ఉమ్మడి కుటుంబాన్నీ దాటి మార్కెట్ రేంజీలో ఒక కుటుంబం.

నాన్న,అన్నయ్య, రఘూ, సరోజా...నలుగురూ సంపాదిస్తున్నా నెలాఖరు వచ్చేటప్పటికి డబ్బుకు ఇరకాటమే.

అన్నయ్య భార్య జ్యోతీ ఇంటి పనులు చేయకుండా తప్పించుకుంటుంది. సరోజా ఉద్యోగానికి వెళ్ళినా...ఇంటికి వచ్చి ఇంటి పనులతో నడుం విరుగుతుంది.

మొదటి రెండు సంవత్సరాలూ తెలియలేదు.

బిడ్డ పుట్టిన తరువాత సరిపుచ్చుకోవటం కుదరలేదు. అన్నిటినీ గమనించాలి.

సరోజా కుటుంబ ఐక్యత మీద శ్రద్ద ఉన్న మహిళ. ఎవరి పైనా విసుక్కోదు.

వేరు కాపురం వెళ్దామనే ఆలొచించే రకం కాదు!

కానీ, తలకుమించిన పనులు వచ్చి పడుతుంటే, ఒక రోజుకు ఇరవై గంటలు పని చేయాల్సిన నిర్బంధం వచ్చినందువలన... సరోజాకు చికాకు రావటం మొదలుపెట్టింది.

ఒళ్ళు అలసిపోయింది.

సరోజాకు పుట్టిల్లు బయట ఊరు! తల్లి లేదు. తండ్రి అక్కయ్య ఇంట్లో.

తోడబుట్టిన ముగ్గురూ ఆడపిల్లలే.

హక్కుతో ఎవరి ఇంటికీ వెళ్ళి ఉండలేదు. వాళ్ళు వాళ్ల సొంతంగా జీవిస్తున్నారు.

రెండేళ్ళ బిడ్డ వేధింపు వేరే.

సరోజా గొణిగింది. ఆమె కోపం పూర్తిగా రఘూ వైపు తిరిగింది.

అతనితో సహజంగా ఉండక విసుగు చూపించటం మొదలుపెట్టింది.

రఘూ కోపమైన మనిషి కాడు! అన్నీటినీ అడ్జస్ట్ చేసుకు వెళ్తాడు.

అన్నయ్య ముక్కోపి. వదిన నాటకమాడి భర్తకు హల్వా ఇస్తుంది. ఇంటి పని చేస్తున్నట్టు అందరి ముందు హడావిడి చేస్తూ మెల్లగా తప్పించుకుంటుంది.

"ఏమండీ...మీ వదిన ఉద్యోగానికీ వెళ్ళటం లేదు. ఇంట్లోనే కదా ఉంటోంది? నేను చేసే పనులలో సగం పనులు కూడా చెయ్యటం లేదు. ఉద్యోగానికీ వెళ్ళి, ఇంట్లోనూ గొడ్డు చాకిరి చేస్తే తట్టుకోగలనా. ఇదంతా మీ అమ్మ అడగదా...చెప్పండి"

వదులు సరోజా...ఎందుకు కోపం? ఈ వయసులో అమ్మ కూడా కష్టపడుతోంది కదా? ఒక్క నిమిషమైనా ఖాలీగా ఉందా చెప్పు...?"

"అది సరే! వదినని కూడా ఇంటి పనులు చెయ్యమని చెప్పద్దా?"

"నిన్ను అమ్మ ఇంటి పనులు చెయ్యమని అడుగుతోందా?"

"లేదు! అందుకని నేను పనిచేయకుండా కూర్చోలేను కదా?"

"అది నీ స్వభావం! ఇలా 'టక్' మని మాట్లాడితే బంధుత్వం చెడిపోతుంది"

"మీ చెల్లెలు, భర్త ఇంటినే మరిచిపోయింది!"

సరే సరోజా...నీ ప్రశ్న న్యాయమైనదే. ఆమెకూ సమస్యలూ. తానుగా అర్ధం చేసుకోవాలి. మా ఇంట్లో పుట్టిన అమ్మాయి. తరిమి కొట్టగలమా?”

"అన్నిటికీ ఏదో ఒక కారణం చెబుతారు?"

"వేరే దారి లేదు సరోజా! అందరి బంధుత్వాలూ నాకు కావాలి అనుకునే వాడిని నేను"

రఘూ చాలా మంచి వాడు…ఏ చెడు అలవాటూ లేదు.

పెళ్ళి నిశ్చయం అయిన రోజు దగ్గర నుండి సరోజాని ప్రేమిస్తున్నాడు. ఈ రోజు వరకు అది తగ్గలేదు. అతని ప్రేమ అందరికీ తెలుసు. అందరూ ఉన్నారనేది తెలిసున్నా సరోజాని బుజ్జగిస్తాడు.

"వదలండి! సిగ్గేస్తోంది. మావయ్యా, అత్తయ్యా అందరూ ఉన్నారు"

"నాన్న బుజ్జగించి, బుజ్జగించే మేము ఐదుగురం...అర్ధమయ్యిందా సరోజా"

తల్లి దానికి కూడా అభ్యంతరం చెప్పదు.

రఘూ యొక్క ప్రేమకోసం...ఈ నిమిషం వరకూ తనమీదున్న అభిమానం కోసం.... సరోజా అన్ని విషయాలనూ ఓర్చుకుంటోంది.

అక్కడ ఎవరికీ చెడ్డ గుణం లేదు. తప్పు చేసే వారూ లేరు.

అయినా కానీ, ఆశపడినట్లు ఒక వస్తువు కొనలేదు. ఇంట్లో కావలసినవన్నీ ఉన్నాయి.

కానీ, సరోజాకి ఒక చిన్న ఆశ ఉంది.

తనకంటూ ఒక ఇల్లు. దాన్ని అందంగా పెట్టుకునే కళా నేర్పు. కోరుకున్నట్టు ప్రణాళిక. ఒక చిన్న కారు. కళ్ళు చెదిరే దుస్తులు అని కొంచం పెద్ద ఆశే అది.

ఆ ఆశంతా అడియాస అయ్యింది!

ఈ ఇల్లు సంత బజారుగా ఉండటం వలన గజిబిజిగా తెలుస్తోంది. సరోజా ప్రారంభ రోజుల్లో అన్నిటినీ సద్దిపెట్టి, ఒక లాగా కళా నైపుణ్యంతో అందంగా ఉంచుకుందాం అనుకుంది.

ఏదీ జరగలేదు.

రైతు బజారు మార్కెట్టులాగానే ఆ ఇల్లు ఉంటోంది.

మొదటి కొడుకుకు ఇద్దరు, చెల్లెలుకు ముగ్గురు పిల్లలూ, సరోజాకి ఒకరు అని రోజులో సగం రోజు పిల్లల గోలతో చెవులు చిల్లులు పడతాయి.

చెత్త కుండీని మురిపిస్తుంది ఇల్లు.

ఏ టైములో చూసినా ఎవరో ఒకరు తింటూ ఉంటారు. ఎంగిలి గిన్నెలు పేరుకుంటాయి. వాషింగ్ మిషన్ రన్ అవుతూనే ఉంటుంది. గ్రయిండర్లో ఎప్పుడూ బియ్యం -- కుక్కర్ విజిల్ వేస్తూనే ఉంటుంది. మిక్సీ యొక్క తాళం సంగీత ఆలాపనే!

నాలుగు జీతాలు ఎలా సరిపోతాయి?

ఎప్పుడు పని లేకుండా ఉంటుంది?

ఉమ్మడి కుటుంబం కోలాహలమే -- సుఖమే. తప్పు లేదు. కానీ అందరూ అన్ని విధాలా సహకరిస్తేనే కుటుంబం తల ఎత్తుకుని నిలబడుతుంది.

రఘూ తన జీతంలో మూడు వేలు ఉంచుకుని, మిగిలిన ఇరవై ఏడు వేలూ అమ్మ దగ్గర ఇచ్చేస్తాడు.

సరోజా తన జీతంలో రెండు వేలు ఉంచుకుని, మిగిలిన పదమూడు వేలు అత్తగారికి చేతికి ఇస్తుంది.

పెద్ద కొడుకుకు ఐ.టీ. కంపెనీలో పని. ఒక విధంగా పెద్ద జీతమే. ఖచ్చితంగా కటింగులు పోనూ చేతికి డెబ్బై వేలు వస్తాయి.

అతను నలభైకు ఎక్కువ ఇంట్లో ఇచ్చింది లేదు!

మిగిలిన డబ్బును డిపాజిట్, నగల చీటీ అని అతని భార్య జ్యోతీ చేర్చి పెడుతుంది...పిల్లల భవిష్యత్తుకు.

నాన్నకు ఇంకా ఒక సంవత్సరం సర్వీసు ఉంది. ఆయన కూడా సులువుగా యాబై సంపాదిస్తాడు.

ఆయన ఎంత సేవింగ్స్ చేస్తున్నాడో అనేది తెలియదు.

ఇల్లు తండ్రి కట్టింది. అందులో ఐదుగురికీ వాటా ఉంది...వాళ్ల తదనంతరం.

ఈ రోజు ఖరీదుకు దగ్గర దగ్గర కోటి రూపాయల విలువ ఉంటుంది. ఇల్లు కట్టేందుకు తీసుకున్న లోను పూర్తి అయ్యింది.

'మాకూ వాటా ఉంది ' అని ముగ్గురు ఆడపడుచులూ మాటి మాటికీ చెబుతారు. అందులో ఒకత్తి ఎప్పుడూ తన బిడ్డతో అక్కడే జీవిస్తూ ఉంటుంది!

మిగిలిన ఇద్దరూ బయట ఊర్లలో! సంవత్సరానికి ఒకసారి వస్తారు.

పెద్ద చెల్లెలి కూతురికి పదేళ్ల వయసు. పెద్ద మనిషి అయిన వార్త కొత్త సంవత్సరం పుట్టిన మరునాడే వచ్చేసింది.

ఆమె బయట ఊరిలో! మరుసటి రోజు ప్రొద్దున భర్త -- ఆ కూతురూ, ఆరేళ్ళ కొడుకుతో ఆమె వచ్చింది.

"అమ్మా...దీనికి పెద్ద మనిషి తలంటి, సంబరం, పేరంటం ఇక్కడే! గ్రాండుగా జరగాలి. అన్నీ నువ్వే. ఇద్దరు మావయ్యలూ సారె ఇవ్వాలి"

పెద్ద కొడుకు నగల చీటీ కడుతున్నందువలన బంగారు కాయిన్స్ కొని చేర్చిపెట్టారు. పెద్ద కోడలు అయిష్టంగానే అందులో నుండి రెండు సవర్లు తీసిచ్చింది.

తాతయ్య ఒక నెక్లస్--రెండు గాజులు, పట్టు లంగా ఓణీ కొనివ్వటమే కాకుండా పేరంటం చేసే రోజు ఇంటికి వచ్చే బంధువులకు బ్రహ్మాండమైన విందు భోజనం ఏర్పాటుకు ఖర్చుపెట్టారు.

"రఘూ...మీకు రెండు జీతాలు. చలపతి కంటే నువ్వు ఎక్కువగా చేయాలి. చిన్న మేనమామ అంటే స్పేషల్!"

అతను ఏదీ చెప్పకుండా నవ్వాడు.

ఆ రోజు భార్యతో కలిసి షాపుకు వచ్చాడు.

"అన్నయ్య చేస్తునట్టే మనం కూడా చెయ్యాలి సరోజా"

"మీ అన్నయ్య సగం జీతమే ఇంటికి ఇస్తున్నాడు. మిగతా డబ్బుతో గోల్డ్ కాయిన్స్ చేర్చేటప్పుడు రెండు సవర్ల బంగారం ఇవ్వటం కష్టమా? దానికే మీ వదిన సనుగుతోంది. మనం జీతం పూర్తిగా ఇంటికే ఇస్తున్నాము. సేవింగ్స్ లేదు. ఆయనకు సరిసమంగా మనం ఎలా చేయగలం?"

"కానీ, మనం చేసే కదా కావాలి. నేనూ మేనమామనే కదా?"

"దారాళంగా చేయండి"

"ఏమిటి సరోజా నువ్వు? ఇలా కోపగించుకుంటే ఎలా? లోను తీసుకుని అయినా చేసే కదా కావాలి

"లోను పెట్టుకోండి...నేనేమీ వద్దనటం లేదు. నెలనెలా ఇంటికి ఇచ్చే డబ్బు తగ్గుతుంది. అది మీ అమ్మకు ఇప్పుడే చెప్పేయండి"

"నేను మేనమామ అని చెప్పుకోవటం దేనికి?"

"ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు?"

"నువ్వో, నేనో లోను పెట్టుకున్నా అది చేతికి రావటానికి నాలుగైదు రోజులు అవుతుంది. రేపు ఇంట్లో విశేషం. ఎలా సరోజా?"

"నాకేం తోచటం లేదు...మీరే చెప్పండి!"

"కోపగించుకోకు! నీ నగలలో ఏదైనా ఒకటి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందామా?"

"నా దగ్గర వంద కాసులు బంగారం ఉంది చూడండి. అందులోంచి తీసుకొవటానికి...తాళిబొట్టుతో సహా కలిపి పదిహేను కాసుల బంగారమే ఉంది. మనకొక ఆడపిల్ల. మీతో కాపురానికి వచ్చిన తరువాత నాకు మీరు ఏమీ కొనివ్వలేదు. నేనూ కొనుక్కోలేకపోయాను. ఉన్నది కూడా పోగొట్టుకోవాలా? మనకి ఎవరు చేస్తారా?"

"సరోజా...నాకు అంతా అర్ధమవుతోంది. ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. దానికి కోపగించుకో గలమా?"

"సరే నండి! మీ వదిన చాలా బంగారం చేర్చి పెట్టింది. అంటే నెలనెలా బంగారం కొంటోంది. సేవింగ్స్ చేస్తోంది. మనకు ఏదీ లేదని పెద్దవాళ్ళకు తెలుసు. మీరూ ఆ ఇంటి కొడుకే కదా? మీకు సపోర్టు చేయటానికి ఒకరైనా ఉన్నారా?"

అతను ఏమీ మాట్లాడలేదు.

"నేను ఎవర్నీ తప్పుగా మాట్లాడటం లేదు! మిగిలిన చెల్లెల్లు ఏం చేయబోతారు?"

"పెళ్ళి చేసిచ్చిన ఆడపిల్లలు చెయ్యాలని ఎవరూ ఎదురు చూడరు. మేనమామ బంధుత్వం అలా కాదే?"

ఆమె మాట్లాడలేదు.

"సరే...వదిలేయి! నువ్వు ఇవ్వక్కర్లేదు. నీ నగలు ఇవ్వమని అడగటం కూడా న్యాయం కాదు. నాకు ఆ హక్కు కూడా లేదు. కానీ, మేనమామగా ఉంటే చేసే తీరాలి. అది నా పరువు సమస్య. ఇంకెవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను"

"ఎందుకు కోపగించుకుంటున్నారు?"

"లేదమ్మా...ఇది కోపం కాదు. పరువు. నీ దగ్గర నేనెందుకు కోపగించుకుంటాను? నీ శక్తికి మించి శ్రమపడుతున్నావు! నిన్ను తక్కువగా మాట్లాడితే అది తప్పు అవుతుంది. వదిలేయి. మనం ఎప్పుడూ ప్రేమగా ఉండాలి. మన మధ్య ఏ చీలికలూ ఉండకూడదు. నువ్వు నాకు చాలా ముఖ్యం. మనకి కుటుంబం ముఖ్యం. వెళ్దాం"

బజారు వీధిలో సరకులు కొనుక్కున్నారు.

రాత్రి ఇంటికి వచ్చిన తరువాత బోలెడు పని. ఆడ పడుచులు కుటుంబ కథలు చెప్పుకుంటూ కబుర్లాడుకుంటుంటే, పెద్దాడపడుచు సత్యా తల నొప్పిగా ఉందని పడుకుండి పోయింది.

సరోజాకి పూర్తిగా వంటింట్లోనే పని.

అందులో బేవర్స్ గిరాకీ సుమతి యొక్క 'జోక్స్ 'వేరే.

దగ్గర దగ్గర నూటనలభై దోసలు వేసినందువలన నీరసించి కళ్ళు తిరగుతున్నట్టు  ఉండటంతో గోడనానుకుంది సరోజా.

అందరూ తిన్న తరువాత, వంట గదిని సద్దిపెట్టి పడుకునేటప్పటికి మధ్యరాత్రి పన్నెండు అయ్యింది.

రఘూ కూడా అప్పుడే వచ్చాడు.

"సారీ సరోజా!"

ఆమె...చేతిలో వేసుకున్న బంగారు గాజులు తీసి అతనికి ఇచ్చింది.

"మొత్తం మూడు కాసులు. తరుగు, వేస్టేజ్ పోను రెండున్నర కాసు అయినా వస్తుంది! పిల్లకు గొలుసు తీసుకోండి"

"తాకట్టుకు ఎందుకు వేస్టేజి సరోజా?"

"వద్దండీ...అమ్మేయండి"

"ఎందుకు?"

"అవునండీ! తాకట్టు పెడితే వడ్డీ కట్టుకోవాలి. అది జీతం నుండి పోతుంది. దానికి ఏదైనా మాటలు వస్తాయి. వద్దే! మేనమామ సారె ఇచ్చేటప్పుడు, ఆ భారాన్ని మనమే మోయాలి"

"వద్దు సరోజా! నీ కోపాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు"

"లేదండీ...ఇది కోపం కాదు. సంతోషంగా ఇస్తున్నాను. మీ పరువులోనూ...కష్టాలలోనూ నాకు భాగం ఉంది. వడ్డీకి అప్పు తీసుకోచ్చి, నేను వేడుక చూస్తుంటే...బ్రతుకుతున్న జీవితానికి అర్ధం లేదు. రేపే అమ్మేద్దాం. చేతికి డబ్బు వచ్చినప్పుడు కొనుక్కుందాం"

"సారీరా...మనసు పీకుతోంది నాకు!"

"దేనికి? నేనే మీకు సొంతమైన తరువాత నగలు, డబ్బూ గొప్పవా? మీరూ సంతోషంగా ఉండాలి. రేపే ఈ పని పూర్తి చేద్దాం. పిల్లకు పట్టులంగా కూడా కొనేద్దాం"

ఆమె దగ్గరకు వచ్చి కావలించుకున్నాడు.

"నాకు సిగ్గుగా ఉంది సరోజా!

"వద్దు! ఈ సిగ్గు వేరేలాగా మారుతుంది. మనకి ఇంకో బిడ్డ  ఇప్పుడొద్దు..."

ఆమెను కూర్చోబెట్టి చేతులు పుచ్చుకున్నాడు.

"సరోజా! నేను నీకు చాలా చెయ్యాలి. అదంతా నీ జీవితంలో జరుగుతుందా?"

"ఇలా చూడండి! అమ్మాయిగా పుడితే...కొన్ని సమయాలలో ఒక సరాసరి మనో పరిస్థితి వచ్చి నిలబడుతుంది. భర్త యొక్క బాధ్యతలూ, ఆమె పడే నొప్పులకంటే కూడా...నగలు, చీరలు పెద్దగా అనిపిస్తుంది. నేనూ ఆడపిల్లనే కదా? దీని నుండి నేను మాత్రం తప్పించుకోగలనా? కోపగించుకున్నందుకు సిగ్గు పడుతున్నాను. కారణం, 'నేనూ...నాది ' అనే స్వభావం తల ఎత్తినందువలనవచ్చిన గందరగోళం. మంచిగా ఆలొచించాలి. దానికొక పక్వం రావాలి. ఆ మనోతత్వం లేదు. పెంచుకోవాలి"

మాట్లాడి మాట్లాడి రాత్రి ఒంటిగంట దాటింది.

"పడుకోమ్మా! నేనూ పడుకుంటాను"

పడుకున్నారు. ఇద్దరికీ నిద్ర రాలేదు. మనసు ఎన్నెన్నో ఆలొచిస్తోంది.

రేపటి భయం తల ఎత్తుకుని నిలబడింది.

ఎంత సంపాదించినా ఇప్పుడంతా భవిష్యత్తు గురించిన భయం ఈ తరం వాళ్లను ఆట ఆడిస్తోంది.

'బద్రతే లేదే?' అనే భయం ఎవరినీ వదిలి పెట్టటం లేదు!

***************************************************PART-2*****************************************

తన నగలను అమ్మి ఒక బంగారు గొలుసు కొన్నారు. అది కాకుండా పట్టు లంగా, కొంత మేకప్ వస్తువులు అంటూ చూసి చూసి కొన్నది సరోజా.

"నా దగ్గర అలా మాట్లాడి...ఇప్పుడు నువ్వే ఖర్చు ఎక్కువ చేస్తున్నావు"

"సరేలెండి! మనింటి పిల్ల. చెయ్యాలని దిగిపోతే బాగా చెయ్యాలి"

ఇంట్లో మిగిలిన ఏర్పాట్లన్నీ నాన్న చేసేసారు. లోకల్ బంధువులు యాభై మంది ఖచ్చితంగా వస్తారు. కేటరింగ్ ఏర్పాటు చేశారు.

వంట మనిషిని పెట్టి ప్రొద్దున టిఫిన్-కాఫీ, మధ్యాహ్నం భోజనం అని అన్ని ఏర్పాట్లూ చేసారు.

ముందు రోజే అందరూ వచ్చేసినందువలన ఆ రోజు రాత్రి డిన్నరే క్యాటరింగ్ వారిద్వారా ఒక విందులాగా ఏర్పాటు చేశారు.

తండ్రి ఇంట్లో ఫంక్షన్ జరుపుతున్నందువలన, పెద్ద కూతురు సుమతి కూతుర్ని అలంకరిస్తూ ఉంది.

కబుర్లు...ఇంటిని నవ్వులతో నింపింది.

సరోజా తాను కొన్న నగ, పట్టులంగా, ఇతర వస్తువులు రఘూ దగ్గర ఇచ్చి   ఇంట్లోవాళ్ళకు చూపించమంది.

అందరూ గుమి కూడారు.

"గొలుసు ఎన్ని కాసులు?"

"మూడు కాసులు!"

"ఇంతేనా...ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఇంత తక్కువగా చేస్తే ఎలా? నాన్నే ఏడు కాసులకు నగలుకొని, అందరికీ భోజనాలు పెట్టి, పట్టులంగా, డ్రస్సు కొని చేస్తున్నారు"

లోకల్ ఆడపడుచు సత్యా మొదలుపెట్ట.

పెద్దది మధ్యలో వచ్చింది.

"వదులు సత్యా! ఇది నేనేమీ చేయమని అడగలేదు. వాళ్లకి ఏది ఇష్టమో అది చేయనీ"

"అదెలా అక్కా...వాళ్ల ఇష్టమని వదిలేయగలమా? మేనమామకు ఒకబాధ్యత లేదా? రఘూ అన్నయ్యకు పెద్ద మనసే. దానికి మిగితా వాళ్ళు కోపరేట్ చేస్తేనే కదా చెయ్యటం కుదురుతుంది?"

సరోజా గబుక్కున లేచింది.

ఓర్పు నసించిన సమయం అది! మామూలుగానే సత్యాకి నోటి దురుసు ఎక్కువ. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. కావాలనే నోరు పారేస్తుంది. అవతలి వారి మనోభావాలను కొంచం కూడా గౌరవించదు. దీనికొసమే అత్తగారు గిరిజా చాలా సార్లు బాధపడింది.

రఘూ ఒంటరిగా సరోజా దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగాడు.

సరోజా కూడా సహించుకుంటుంది. ఈ సారి ఓర్పు నసించింది.

సరోజా లేచిన వేగం చూసి కుటుంబమే బెదిరిపోయింది.

రఘూ గబుక్కున లోపలకు వచ్చాడు.

సరోజా...నువ్వేమీ మాట్లాడకు. ఇప్పుడు మాట్లాడవలసింది నేనే. పెద్దక్క ఏం చెప్పింది...వాళ్లకు ఏమిష్టమో అది చేయనీ! అని. కరెక్టేనా...? చేయాలనే ఇష్టం ఎక్కువగా ఉంది. కానీ చేతిలో సొమ్ము లేదు"

"ఎందుకు లేదు...ఇద్దరూ సంపాదిస్తున్నారుగా?"

మళ్ళీ సత్యానే మాట్లాడింది.

గిరిజా అడ్డుపడింది.

"సత్యా నువ్వు కొంచం తగ్గవే! అల్లుడున్నాడని చూస్తున్నాను" సన్నని స్వరంతో  కసురుకుంది.

"ఉండమ్మా! దానికి నేను సమాధానం చెబుతాను"

గదిలోకి వేగంగా వెళ్ళిన రఘూ కొద్ది క్షణాలలో బయటకు వచ్చాడు.

"ఇది కట్టింగులు పోను నా జీతం! ఇది జ్యోతీ జీతం. అమ్మ దగ్గర మేము ఇచ్చేది పోను, ఐదు శాతం కూడా చేతులో ఉంచుకోవటం లేదు. మా కంటూ చిల్లి గవ్వ కూడా సేవింగ్స్ లేదు. మాకూ ఒక ఆడపిల్ల ఉంది. మేము బ్యాంకు డిపాజిట్టు, నగల చీటీ పెట్టుకోలేదు. చేతిలో గోల్డ్ కాయిన్స్ లేవు...తీసివ్వటానికి"

"ఏమండీ! మీ తమ్ముడు మిమ్మల్ని ఎత్తి పొడుస్తున్నట్టు ఉంది"

జ్యోతీ ప్రారంభించ,

"పొడవటం లేదు వదినా! ఎదురుగానే చెబుతున్నా. మీరు ఉంచుకున్నట్టు సేవింగ్స్ మా దగ్గర లేదు"

"మీరిద్దరూ కలిసి ఇచ్చే నలభై వేల డబ్బును అత్తయ్య దగ్గర మేము ఒకళ్లమే ఇస్తున్నాము. దాని కంటే ఎక్కువ ఇవ్వగలమా? మాకూ కుటుంబం ఉంది కదా?"

"వదినా...అది నేను కాదనటం లేదు. లోను పెట్టుకుంటే, తగ్గించుకుంటారు. అది వద్దనుకునే సరోజా తన చేతి గాజులు అమ్మే, పిల్లకు గొలుసు కొనింది. తెలుసా?"

తల్లి-తండ్రి షాకుతో చూశారు.

"ఎందుకు సరోజా?"-- అడిగింది గిరిజా.

"లేకపోతే ఎలా అత్తయ్యా! చిన్న మావయ్య ఎక్కువగా చేయాలని దురుసుగా మాట్లాడుతున్నారు. ఆయన పరువుకు భంగం వస్తుంటే నాకు నగలు ముఖ్యమా? అందుకే అమ్మేశాను"

"అమ్మా! అది నగలు అమ్మటం తప్పు కాదు. నాకు పెద్ద మనసు. నన్ను, నా భార్యే ఆపుతోందని నోటి దురుసుగా మాట్లాడటాన్ని సత్యా ఆపనీ"

"నాకు అది తెలుసా?"

నీకు ఏదీ తెలియదు. పిల్లలను తీసుకువచ్చి పుట్టింటో వదిలేసి, ఏదీ పట్టించుకోకుండా, ఫ్రీగా కడుపు నిండా తినటం తెలుసు!"

"ఏమండీ..."-- భర్తను ఆపటానికి సరొజా ప్రయత్నించింది.

"ఉండు సరొజా! బయట, ఇంట్లో ఇలా పనిచేస్తున్నది నువ్వు. నిన్ను విమర్శించటాన్ని వింటూ ఇక నేను ఏమీ మాట్లాడక పోతే నేను మగవాడినే కాదు. ఇక్కడ మేమందరం డబ్బులిచ్చే తింటున్నాము. ఇది దర్మ సత్రం కాదు. వచ్చిన వాళ్ళు నోటి దురుసును...వింటూ ఉండలేము" 

అల్లుడు లేచాడు.

"సత్యా...నేను బయలుదేరతాను"

రఘూ దగ్గరకు వచ్చాడు.

"ఉండండి అల్లుడు గారూ! మీరు మాత్రం వెళ్తే చాలదు. సత్యా మీ భార్య. ఆమెను కాపాడవలసింది మీ బాధ్యత. అది జ్ఞాపకం ఉంచుకోండి"

"కొంచం ఉండండి..."

సత్యా మధ్యలో వచ్చింది.

"ఇదిగో చూడు! మా నాన్న చేతి నిండా సంపాదిస్తున్నారు. ఇది ఆయన కట్టిన ఇల్లు. ఇక్కడ ఉండటానికీ, తినడానికీ...నాకూ, నా భర్తకూ అన్ని రకాల హక్కు ఉంది. నాకు నువ్వేం చేయటం లేదు! అర్ధమయ్యిందా?"

రఘూ బాగా ఆవేశపడ్డాడు.

"ఓ...హక్కుల గురించి మాట్లాడుతున్నావా?"

"మరి? ఆడవాళ్ళకూ సరిసమ హక్కు ఉంది. అడిగే తీరుతాం"

"ఏమండీ ఇలా వస్తారా?”-- పిలిచింది సరొజా.

"ఉండు సరొజా! ఇన్ని మాట్లాడే దీన్ని వూరికే వదలకూడదు"

"ఏం చేస్తావు రా?”

"అయ్యో...ఆపుతారా?" -- పెద్ద కూతురు అరిచింది.

"నాన్నా! రేపు ఈ ఇంట్లో ఏదీ జరగక్కర్లేదు. పుట్టింటికి వచ్చి కన్న కూతురుకి పెద్ద మనిషి పేరంట సంబరం జరపాలని ఆశపడినందుకు ఈ అవమానం నాకు కావల్సిందే"

ఆమె భర్త లేచాడు.

"వదులు! ఈ ప్రోగ్రం ను డ్రాప్ చేసేద్దాం"

"నా కూతురి యొక్క ఫన్ క్షన్ ఇలాగా అవాలి? ఈ ఇంటో పెద్ద కూతురిగా పుట్టి, నేను చేసిన పాపం ఏమిటో?"

ఆమె ఏడవటం మొదలుపెట్టింది.

భర్త సూట్ కేస్ రెడీ చేయటం మొదలుపెట్టాడు.

తల్లీ--తండ్రీ కలత చెందారు.

"సుమతీ...ఏడవకే. అల్లుడు గారూ ఈ సమయంలో ఎక్కడికి వెళతారు? మేము జరుపుతాం ఈ ఫంక్షన్ను! కన్నవారి ఇల్లు ఇది. మీరెందుకు వెళ్ళాలి? రఘూ! వాళ్లను వెళ్లనివ్వకుండా చూడరా! క్షమించమని అడుగు"

"ఎవరి దగ్గరమ్మా? క్షమించమని అడిగేంతటి తప్పు నేనేం చేశాను. ఇక్కడ ఫంక్షన్ జరగ కూడదని చెప్పానా? అక్కయ్యను గానీ -- బావను గానీ ఒక్క మాట తప్పుగా మాట్లాడానా? చేసిన దానిని అవమానిస్తోంది...నీ కూతురు.దీనికంతా కారణం అది! దాన్ని ఖండించటం నీవల్ల కుదరటం లేదు. 'క్షమించమని అడగవే' అని దాని దగ్గర చెప్పలేకపోతున్నావు. అది తప్పుగా మాట్లాడుతోందే నని నీకూ, నాన్నకు అనిపించనే లేదా?"

"రఘూ! అల్లుడు ఉండేటప్పుడు ఆమెను ఎలారా ఖండించ గలం?"

"అలా అయితే కోడలు ఉండేటప్పుడు నన్ను ఖండించ వచ్చా? అల్లుడంటే గొప్ప! కోడలంటే తక్కువా? కష్టపడే సరోజాని ఈ కుటుంబంలో ఎవరూ ఆదరించారు. కానీ, ఎటువంటి ఉపయోగమూ లేని సత్యాకు సపోర్టు చేస్తారు. అక్కయ్య...చెల్లెలు మీద కోపగించుకోదు! కానీ, తమ్ముడి పెళ్లాం మాత్రం కంటికి తప్పుగా కనబడుతుంది! మీలో ఒక్కరికి కూడా న్యాయమే తెలియదా? నీతి చచ్చిపోయిందా ఈ ఇంట్లో?"

రఘూ గొంతు పెద్దగా వినబడింది. గొంతు బొంగురు పోయి కళ్ళల్లో నీరు కారింది.

సరోజా దగ్గరకు వచ్చింది. 

"కొంచం ఇటు రండి...ప్లీజ్!"

"దేనికీ?"

భర్తను బలవంతంగా చెయ్యి పుచ్చుకుని లోపలకి పిలుచుకు వచ్చి గది తలుపులు మూసింది.

బయట నుండి సత్యా అరుస్తోంది. 

"ఇప్పుడు కూడా తలుపు వేస్తోంది చూడు!"

తల్లి గిరిజా సత్యా దగ్గరకు వెళ్ళింది.

లాగి ఒకటిచ్చింది.

"అ...అమ్మా!"

"అలా పిలవకే! నా కడుపున పుట్టిన దానివా నువ్వు? ఇంతసేపు ఓర్చుకున్నాను. అల్లుడికి మర్యాద ఇవ్వాలని మాట్లాడలేదు. వాడు అడిగిన మాటలతో నాకు సగం ప్రాణమే పోయింది! వాడి మొహాన్ని చూడటానికి నాకూ, నాన్నకు ఇక యోగ్యత లేదు. దేనికీ ప్రశ్నలు అడగ కుండా...తన కుటుంబం గురించి ఆలొచించకుండా... రఘూ, సరోజా ఇద్దరూ గొడ్డు చాకిరి చేస్తున్నారు. ఈ విషయం, ఈ ఇంట్లో మనశ్శాక్షి ఉన్న అందరికీ తెలుసు"

పెద్ద కోడలి మొహం మారింది.

"ఏమిటండీ! 'బాణం ' మనవైపు తిరుగుతోంది"

అదే సమయం లోపల....

"సారీ సరోజా...నావల్ల కాలేదు! ఇంత న్యాయం తప్పిన మనుష్యులుగా ఉంటారని నేను ఎదురుచూడలేదు. నన్ను క్షమించు"

ఆమె చేతులు పుచ్చుకుని ఏడ్చేశాడు.

సరోజా బెదిరిపోయింది.

"ఏమిటిది...మీరెందుకు ఏడవాలి? ఏం తప్పు చేశారు? ఇలా చూడండి...నేనెందుకు మిమ్మల్ని లోపలకు పిలుచుకు వచ్చానో తెలుసా?"

"తెలియదు! బయట నేను మాట్లాడాలనుకున్నది పూర్తి కాలేదు. ఇంకా చాలా బాకీ ఉంది సరోజా?"

వద్దు! మీరు మాట్లాడ కూడదనే మిమ్మల్ని పిలుచుకు వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీ అక్కయ్య సుమతి వయసులో పెద్దది. ఆమె కూతురికి రేపు పెద్ద మనిషి పేరంటం. సంబరం. అది మంగళకరంగా జరగాలి. మారుగా మాటలు పెరిగి, తప్పు తప్పుగా అయిపోయింది. ఆవిడ ఏడ్చేంత వరకూ వచ్చేసింది. ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయి ఏడవకూడదండి"

"అలాగయితే ఈ ఇంటికి కాపురానికి వచ్చిన అమ్మాయి అవమానపడొచ్చా?"

వదిలేయండి! ఇప్పుడు అది సమస్య కాదు. మీరు ఏ తప్పూ చేయలేదు. అయినా కానీ 'ఈగో' చూడకుండా, బయటకు వెళ్ళి...రేపు ఫంక్షన్ మంచిగానూ, బాగానూ జరుగుతుందని వాగ్దానం ఇవ్వండి. అమ్మా, నాన్నలను సమాధానపరచండి"

"దేనికీ? ఇవన్నీ చేస్తే...మనం నేరస్తులమైపోతాం"

"ఒక్క రోజు కూడా అవం. మిగిలిన వాళ్ల సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. మీరు మాట్లాడి...జరగవలసిన వేడుక ఆగిపోయిందనే నెపం మీమీద రాకూడదు. నేనూ మీతోనే నిలబడతాను. చెప్పేది వినండి"

"ఈ ఫంక్షన్ అయిన తరువాత నేనూ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సరోజా "

దాని గురించి తరువాత మాట్లాడుకుందాం. ఇప్పుడు రండి...కుటుంబంలో ఒక మంచి జరగాలంటే...పరువు, స్వీయ గౌరవమూ చూడకూడదండి! రక్త సంబంధాలకు మధ్య ఎందుకు 'ఈగో'?

భార్యను గర్వంగా చూశాడు.

"రండి!"

ఇద్దరూ బయటకు రాగా.

అందరి కళ్ళూ వీళ్ళ మీద ఉండగా, అక్కయ్య దగ్గరకు వచ్చాడు.

"అక్కా! రేపు మనింట్లో నీ కూతురి పెద్దమనిషి సంబరం, పేరంటం, వేడుకలు మంచిగా జరగనీ"

"లేదు రఘూ...నాకు చిరాకుగా ఉంది"

"అక్కా...నిన్ను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నా మాటలన్నీ నాకేర్పడిన గాయం వల్ల వచ్చినై. అసలు అది వేరే సమస్య! నీకు సంబంధం లేదు. మీ ఇద్దరి మనసులూ ఏ కారణంగానైనా గాయపడుంటే, అన్నిటికీ కలిపి నేను క్షమాపణ అడుగుతున్నా"

ఆమె కాళ్ల మీద పడ్డాడు.

అక్కయ్య షాకయ్యింది.

"ఏమిట్రా రఘూ ఇది?"

"తప్పులేదు అక్కా! నీ కాళ్ల మీద పడటం నాకు ఏ విధంగానూ బాధగా లేదు. బావా...నువ్వు కూడా నన్ను మన్నించాలి"

తల్లీ--తండ్రీ దగ్గరకు వచ్చాడు.

సారి అమ్మా! నాన్నా...నన్ను క్షమించు. ఇక మీదట ఇలాంటి మాటలు మనింట్లో రావు. దానికి నేను కారణంగా ఉండను. మీ ఇద్దరి మనసులను కష్టపెట్టుంటే నన్ను క్షమించండి "

వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాడు.

"రేయ్ రఘూ...ఏమైంది నీకు? నీ మీద తప్పుందని ఎవరూ చెప్పలేదే...?"

"లేదమ్మా! రేపు జరగబోయే ఫంక్షన్ లో అందరూ సంతోషంగా ఉండాలి. అక్కయ్య, మనందరం కావాలనుకుని దీని కోసమే వచ్చింది. ఫంక్షన్ గ్రాండుగానూ, ఆనందంగానూ జరగాలని ఆశపడుతోంది. అందులో కొంచం కూడా ప్రాబ్లం రాకూడదు. నేను సమాధానమే చెప్పుండకూడదు. చెప్పేశాను...వదిలేయండి"

గిరిజా దగ్గరకు వచ్చింది.

"వదులబ్బాయ్! ఎవరికీ ఎప్పుడూ నీమీద తప్పు అనిపించలేదు"

"సరే...అందరం డిన్నర్ చేద్దామా? భోజనం వచ్చేసింది"

బంధువులందరూ ఉన్నారు.

జరిగినదాన్ని వేడుక చూశారు.

ఒకటిగా కూర్చుని డిన్నర్ చేశారు.

కూడి కూడి మాట్లాడుకున్నారు.

రఘూ  వైపు కొందరూ, సత్యా వైపు కొందరు సపోర్టు చేశారు. సంఘటనను విమర్శించారు.

ప్రొద్దున్నే జరగాల్సిన వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేసి రాత్రి పడుకోవటానికి మధ్య రాత్రి అయ్యింది.

రఘూ యంత్రంలాగా పనిచేశాడు.

కన్నవారు నిద్ర పోదామనుకున్నప్పుడు, సత్యా వాళ్ల దగ్గరకు వచ్చింది.

"అమ్మా...ఆమె బాగా ఎక్కించి ఉంటుంది. నేను అడిగిన వెంటనే రఘూకి పొడుచుకోనుంటుంది. అందుకే బహిరంగంగా క్షమాపణలు అడిగాడు. అది విషం కక్కే పాము. అర్ధమయ్యిందా...?"

తల్లి గబుక్కున తిరిగింది.

ఇదిగో చూడు సత్యా! దీని గురించి ఎవరూ మాట్లాడి, ఫంక్షన్ ఆగిపోకూడదు. సుమతీ మనసు బాధపడకూడదనే రఘూ క్షమాణలు అడిగాడు. నేర్ భావనలో వాడు అడగలేదు. గొడవలకు, బంధుత్వాలు చెడిపోవటానికీ నువ్వు విత్తనాలు జల్లకు"

"నేనేం చేశాను?"

"వద్దు...మాట్లాడకు తరువాత నేను నోరు మూసుకుని కూర్చోను. బద్రకాళి అయిపోతాను. నువ్వు నోరు మూసుకో"

"ఏం నాన్నా...నా దగ్గర ఎందుకు అమ్మ అంత కోపంగా మాట్లాడుతోంది. నేనేం తప్పు చేసాను?"

"ఆపవే ! మీ నాన్న నీకిచ్చిన చనువే నిన్ను ఇలా తయారుచేసింది ! నిన్ను ఆయన సపోర్టు చేసి చేసి, మిగిలిన వాళ్ళను వదులుకోబోతారు...నిన్నూ కలిపి. వదిలేయ్...మాట్లాడకు! నీ మొహాన్ని చూడటానికి కూడా నాకు నచ్చలేదు"

తల్లి గిరిజా వేగంగా లేచి వెళ్ళిపోయింది.

జగన్నాధం అయోమయంగా చూశాడు.

"నాన్నా... రఘూ వైపే అమ్మ మాట్లాడుతుంది. మీరు వదలకండి నాన్నా!"

గిరిజా వేరుగా వచ్చి పడుకుంది. రఘూ మాట్లాడింది, ఆవేశపడింది, తరువాత తగ్గిపోయింది, కాళ్ళ మీద పడ్డది ఆమెను ఎక్కువగా బాధపెట్టింది.

చివరగా అతని మొహంలో కనిపించిన నొప్పి, అవమాన భావన, వేదన అన్నీ కళ్ళలోపల నిలబడిపోయినై.

నిజమే!

తీసుకొస్తున్న జీతాన్ని అలాగే మొత్తంగా ఇస్తున్నారు రఘూ, సరొజా!

ఇంట్లో గోడ్డు చాకిరీ చేస్తున్న సరోజా.

జ్యోతీ చిన్న కాగితం ముక్కను కూడా తీసి పడేయదు.

అదీ, చలపతి నోరు మెదపరు. కానీ, వాళ్ళ పనులతో నిక్కచ్చిగా ఉంటారు.

నెలలో ఒక వారం రోజులు పుట్టింటికి వెళుతుంది జ్యోతీ. తనకు కావలసినదంతా నెరవేర్చుకుంటుంది. ఒక నవ్వు గానీ, సంతోష భావన కానీ ఆమె మొహంలో కనబడదు.

కన్నవాళ్ళకు ఆరొగ్యం బాగా లేకపోయినా...ఆవగింజంత కూడా అక్కర చూపించదు.

అదే సరోజా అయితే ప్రేమ, అభిమానం, అక్కర, మర్యాద, అన్నీ చూపిస్తుంది. కన్న కూతుర్ల దగ్గర ఇవేవీ లేవు.

ఒక్కరోజు కూడా మొహం చింట్లుంచుకోదు.

విసుగు చూపించదు.

జ్యోతీ, పెద్ద కూతురు, సరోజాని గౌరవించరు.

సరోజా అందరినీ కూర్చోబెట్టి చేస్తుంది.

సత్యా యొక్క విష పళ్ళు, సరోజా మెడకు గుచ్చుకున్నాయి. ఇక రఘూ ఓర్చుకోలేడు.

'ఇది ఎంత దూరం తీసుకు వెళుతుందో?'

గిరిజాకి అర్ధం కాలేదు! తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి స్నానం చేసి, సరోజా పనులు మొదలుపెట్టింది.

ఇల్లు కళకళలాడింది.

పిల్లకు జరగాల్సిన సకల సంబరాలు జరిగినై.

నోటి దురుసు ఉన్న సత్యా, మామూలు 'కాటన్ ' లంగా, దుప్పటా, తాంబూలం, అని మొత్తం వెయ్యి రూపాయల్లో పిన్ని సారేను ముగించింది.

కానీ, ఫోజు కొట్టటం మానలేదు!

పిల్లకు అలంకారం చేస్తాను అనే వంకతో తన ఫోజును మళ్ళీ చూపించింది.

అక్కడ కూడా సరోజా చేసిన పనులను తప్పు పట్టి, గొడవుకు లాగి బంధువులు ముందు మాటలు వదిలి అంతకు ముందు రోజు లెక్కను పూర్తి చేసుకుంది.

రఘూకి క్షణ క్షణానికి మొహం ఎర్ర బడింది.

సరోజా చూపులతోనే అనిచిపెట్టుకుంది.

వచ్చిన బంధువులు....'ఎప్పుడు తరువాతి యుద్దం మొదలవుతుంది, దాన్ని వేడుక చూసి విమర్శిద్దాం!'అని కాచుకోనున్నారు.

ఫంక్షన్ మంచిగా జరిగి ముగిసింది. బంధువుల గుంపు ఆ సాయంత్రానికి చెదిరిపోయింది. కానీ, తోబుట్టువులు ఒక వారం ఉండాలని తీర్మానించబడింది. పగటి పూటతో క్యాటరింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు.

ఇంట్లో ఉన్న పదిహేను మందికి రాత్రి డిన్నర్ రెడీ చేయటానికి... సరోజా వంటింట్లోకి వెళ్ళింది.

అక్క-చెల్లెల్లు కబుర్లలో ఉన్నారు.

వచ్చిన బహుమతులను, చదివింపు డబ్బును విప్పి చూడటంలో ఉత్సాహం చూపించ,

గిరిజా లోపలకు వచ్చింది.

"సరోజా! తెల్లవారు జామున నాలుగింటికి లేచిన నువ్వు ఇంకా కూర్చోను కూడా లేదు. వెళ్లమ్మా...నేను చూసుకుంటాను"

"లేదు అత్తయ్యా! మిమ్మల్ని కష్ట పడనివ్వను. మీరు వెళ్ళండి"

సత్యా లోపలకు వచ్చింది.

"అమ్మా...నువ్వు రా! అక్కయ్య పిలుస్తోంది"

"నాకు ఇక్కడ పనుంది"

"నువ్వెందుకమ్మా కష్టపడాలి? వదిన చెయ్యనీ?"

చటుక్కున వెనక్కి తిరిగింది.

"చెయ్యటానికి వదిన! కూర్చుని తింటానికి మనమందరమా? ఏమే...నీకు సిగ్గూ, పరువు, పౌరుషం లేదా? బేవర్సుగా ఎవరైనా భోజనం పెడితే, వెంటనే కూర్చుండి పోతావా?"

"ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు?"

"అత్తయ్యా! మీరు వెళ్ళండి...నేను చూసుకుంటాను" -- సరోజా చెప్పింది.

"ఏం చేసుకుంటావు? మా అమ్మకు నామీద లేనిపోనివన్నీ చెప్పి రేకెత్తించి,  మంచిదానిలాగా నటిస్తున్నావా?"

ఇదిగో చూడు సత్యా, నేను నీతో మాట్లాడటం లేదు! అత్తయ్య దగ్గర మాట్లాడుతున్నాను"

"ఏ రోజు నువ్వు తిన్నగా మాట్లాడావు? మా అమ్మ దగ్గర, అన్నయ్య దగ్గర నా గురించి చెడ్డగా చెప్పేసి...మంచిదానిలాగా నటించటంలో నువ్వు కిలాడి కదా?"

"సత్యా! నేనింక ఓర్చుకోలేను" -- తల్లి గిరిజా అరిచింది.

"అత్తయ్యా...వద్దు. మీరు ఆవేశపడితే...ఆరొగ్యం దెబ్బ తింటుంది. ఇప్పటికే బీ.పీ ఉంది. ఇవన్నీ ఎప్పుడూ ఉండే సమస్యలే కదా! నేనూ మాట్లాడను...ఆయన్నీ మాట్లాడవద్దని చెప్పాను. మీరు వెళ్ళండి. రెస్టు తీసుకోండి"

"అదేకదా...మా అన్నయ్యను ఎప్పుడు నువ్వు మాట్లాడనిచ్చావు? నీ మెడలో తాళి కట్టిన నాడు అన్నయ్య మూగవాడయ్యాడు. జీవితాంతం మాట్లానివ్వకుండా చేసుంచావే?"

"సరోజా...కాఫీ అడిగానే" -- అడుగుతూ రఘూ లోపలకు వచ్చాడు.

"ఇదిగో రెడీ చేస్తున్నాను...! హాలులో ఉండండి. అందరికీ తీసుకు వస్తాను. మీరూ వెళ్ళండి అత్తయ్యా"

అత్తగారు మౌనంగా జరిగి వెళ్ళింది.

రాత్రి డిన్నర్ పూర్తిగా సరోజానే తయారు చేసింది.

డిన్నర్ ముగిసింది. సరోజా మధ్యలో ఎవరితోనో చాలాసేపు ఫోనులో మాట్లాడింది.  కుటుంబమే అది గమనించింది.

రాత్రి పదకుండు గంటలకు రఘూ లోపలకు రాగా...పిల్లను సరోజా నిద్ర పుచ్చుతోంది.

"సరోజా...కొంచం మాట్లాడాలి"

"ఏమిటో...చెప్పండి...!"

మనం వేరుగా వెళ్తున్నాం. ఒక వారం రోజుల్లో ఇల్లు చూసి ఏర్పాటు చేయాలి. యుద్ద ప్రణాలిక వేగంతో వెతకాలి"

"ఇది...ఖచ్చితమేనా?"

"దీంట్లో నీకెందుకు అనుమానం? ఇక మీదట ఈ ఇంట్లో పౌరుషం ఉన్న మనిషి ఉంటాడా?"

"మీ అమ్మగారు చాలా మంచివారు"

"అందుకని మనం ఎన్ని రోజులు నొప్పిని భరించగలం? ఆ బేవర్స్ గిరాకీ మనిషిని తరిమే శక్తి ఆవిడకు లేదు. సత్యాను సహించుకోవలసిన అవసరం మనకు లేదు. నాన్న ఇల్లు. ఆయన సంపాదన. మనకు మాట్లాడే హక్కు లేదు...వెళ్ళిపోదాం"

"ఇది ఖచ్చితమైన నిర్ణయమా"

"రేపు తెల్లవారిన వెంటనే అందరూ ఉన్నప్పుడు 'డిక్లార్ ' చెయ్యబోతాను.  నేను నిర్ణయం తీసుకుంటే మార్చుకోను"

"అయితే సరి...ఇల్లు చూసేశాను"

"ఏమిటి చెబుతున్నావు?"

నాతో పనిచేస్తున్న నిత్యా టీచర్ ఇంటి మేడమీద ఒక పోర్షన్ ఖాలీగా ఉంది. కొంచం పెద్ద ఇల్లే. మా స్కూలుకు నడిచేంత దూరం...పదివేలు అద్దె. అది అడ్వాన్స్ ఏమీ అడగదు. ఇంట్లో ఏ.సి, ఫర్నిచర్,ఫోను అన్నీ ఉన్నాయి. గ్యాసు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక ఎగస్ట్రా సిలిండర్ ఉంది. కొన్ని గిన్నెలూ, మిక్సీ, కుక్కర్ అని బాగా అవసరమున్నవి కొనుక్కుంటే చాలు"

"మంచిది! సరే...ముఖ్యమైన ఒక ప్రశ్న"

"పిల్ల గురించేగా?"

"అవును! రేండేళ్లే కదా అయ్యింది. మనిద్దరం ఉద్యోగాలకు వెళ్ళి పోయినా, అమ్మ దాన్ని బంగారంలా చూసుకునేది. ఇక ఏం చెయ్యబోతాం? అది చాలా పెద్ద సమస్య సరోజా"

"ఏర్పాటు చెయ్యచ్చు. మా స్కూలును ఆనుకుని 'కిడ్ జీ' అని ఒక 'డే కార్ ' ఉంది. ప్రొద్దున అక్కడ వదిలేసి, సాయంత్రం నేను వచ్చేటప్పుడు తీసుకు వస్తాను"

"పిల్ల ఉంటుందా?"

"వేరే దారి లేదండి...అలవాటు చేసుకోవాలి"

"దానికి ఖర్చు?"

"న్యాయమైన ఫీజే...నెలకు ఐదు వేలు అవుతుంది"

"ఇంటి అద్దె, డే కేర్ రెండింటికీ కలిపి పదిహేను వేలు అవుతుంది. నీ జీతం మొత్తం అలా..."

"పోనివ్వండి! మీ జీతం ముప్పై లో పొదుపుగా జాగ్రత్తగా కాపురం చేసుకుందాం. నేను 'ట్యూషన్లు ' చెబుతాను. మీరు కూడా ఇంకొంచం మంచి ఉద్యోగం వెతకండి...దొరుకుతుంది. బయటకు రావాలని మనం అనుకోలేదు. రావల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత ఉమ్మడిగా ఉండగలమా? నేను అడ్జస్ట్ అవుతా. మీవల్ల కుదురుతుందా?"

"కుదురుతుంది! అది వెళ్లాలి. సత్యా అత్తగారింటికి పర్మనెంటుగా వెళ్ళిపోవాలి"

"అది జరగదు! అది చెప్పే హక్కు మనకు లేదు. ఇది మన చోటు కాదు. మీ అమ్మా--నాన్నల కుటుంబం. అందువల్ల మీ చెల్లెలు గురించి మీరు మాట్లాడకండి"

"అల్లుడని ఒకడు ఉన్నాడే...వాడికి పరువు లేదా?"

లేదండీ...ఆయన పరువు కంటే, డబ్బునే పెద్దగా చూస్తున్నాడు. సంపాదిస్తున్న డబ్బును సేవింగ్స్ చేస్తున్నాడు. మీ అన్నయ్య యొక్క మరో ముఖమే ఈయన. తన తల్లి--తండ్రులు కష్టపడకూడదని మన తలమీద కడుతున్నాడు. మీ అమ్మా--నాన్నలు దీన్ని అర్ధం చేసుకోవటం లేదు. కూతురిపైన ఉన్న పిచ్చి ప్రేమతో కలిసిన అభిమానం వాళ్ళ కళ్ళను మూసేస్తోంది. మనం ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. మనం ఎలాగూ బయటకు వెళ్తున్నాం. ఇక మన విషయాల గురించి మాట్లాడుకుందాం" అంటూ క్యాలండర్ తీసి చూసింది!

"ఎల్లుండి ఆదివారం. మంచి రోజు. ఆ రోజే పాలు కాచి, ఆ రోజే వెళ్ళిపోదాం"

"సరే సరోజా!"

"రేపు అవసరమైన వస్తువులు కొనుక్కుని, ఇల్లు శుభ్రం చేసి, ఏర్పాట్లు చేద్దాం"

"దానికి డబ్బులు కావాలే?"

"నా నెక్లస్ నాలుగు కాసులు. అది అమ్మేస్తే ఎనభైవేలు వస్తుంది. ప్రారంభ ఖర్చులకు అది సరిపోతుంది"

"మళ్ళీ నగ అమ్మబోతావా?"

"వేరే దారి లేదు! మన వేరు కాపురానికి మనమే కదా అన్నీ చేసుకోవాలి? ఇలా చూడండి. నగలు 'లాకర్లో' ఉన్నందువలన ఎవరికి లాభం? ఇంటికి ఉపయోగపడనివ్వండి"

"సరే సరోజా"

అతని మొహంలో కొంచం ఆశ్చర్యం, నీరసం కనబడింది.

దగ్గరకొచ్చి అతని కేశాలను మెల్లగా చెరిపింది.

"వేరుగా వెళ్లటానికి ఇష్టం లేదా?"

ఛఛ...నెనే కదా చెప్పాను. నువ్వు నన్నేమీ బలవంతం చేయలేదే. ఇదిగో చూడు...పుట్టి పెరిగిన కుటుంబం, కన్నవాళ్ళు, తోబుట్టువులు అందరూ చాలా ముఖ్యమే! ఉమ్మడి కుటుంబంలో ఉండే సంతోషం, వేరు కాపురంలో ఉండదు! కానీ, ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు భార్య గౌరవానికి భంగం ఏర్పడే పరిస్థితి ఏర్పడితే...ఒక మంచి భర్త తీసుకోవలసిన న్యాయమైన నిర్ణయమే ఇది. నీ కొసం ఇది కూడా చెయ్యకపోతే...నేను మనిషే కాను సరోజా"

"అత్తయ్యా చాలా మంచివారు! కన్న కూతుర్ని కంట్రోల్ చేయలేరు. అది ఒక తల్లి యొక్క గుణం. మన కూతురు పెద్దదైన తరువాత, నేను ఆమె కంటే ఎక్కువ మెతకగా ఉండొచ్చు. కానీ, అత్తయ్య నన్ను ఒక్కరోజూ కోడలుగా చూడలేదు. ఆమె అత్తగారిలాగా లేకుండా, తల్లిగా ఉన్నది...ఈ రోజు వరకు. ఆమెను వదిలి వెళ్ళాలంటే నాకూ బాధగానే ఉన్నది. పారపక్షం లేని తల్లి! కానీ, వేరే దారిలేని పరిస్థితి ఏర్పడింది. నాకూ ఒంట్లోనూ, మనసులోనూ ఓపిక లేదండి"......ఆమె కళ్ళు చెమర్చ,

"ఎందుకు సరోజా ఏడుపు? నిన్ను ఏ ఒక్కరోజూ నేను తప్పుగా అనుకోను. తెలిసిందా...? బంధుత్వ ప్రేమకు కట్టుబడి, ఉమ్మడి కుటుంబాన్ని చెదరగొట్ట కూడదనే నేనూ ఇన్ని రోజులు ఓర్చుకున్నాను. నిన్నూ కష్టానికి గురి చేశాను. కానీ, ఆ హద్దులు దాటాసాము. ఎవరో ఒకరి మీద పెడుతున్న ప్రేమ కారణంగా,తీవ్ర నష్టానికి గురవకూడదు. తెలిసిందా...? మనం మొదట మనకోసం జీవించాలి. స్వార్ధం నిండిన ఈ చోట త్యాగులుగా జీవించటంలో ఎలాంటి గొప్పతనమూ లేదు. నష్టమే మిగులుతుంది"

ఆమె మాట్లాడలేదు.

"మనం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్! ప్రశాంతంగా నిద్రపో. ప్రొద్దున మాట్లాడుకుందాం"

ఇద్దరూ పడుకున్నారు. కానీ, నిద్రపోలేదు. ప్రొద్దున ఐదింటికే సరోజా లేచి స్నానం చేసి, పాలు కాచి, దీపం వెలిగించి పనులు మొదలుపెట్టింది.

రఘూ కూడా లేచాడు.

"అత్తయ్యా...ఏం టిఫిను చేయమంటారు? ఇడ్లీ, మినపట్టూ చేయనా?"

అప్పుడు...లోపలకు వచ్చిన సత్యా "వేడిగా గారెలు వేయమ్మా...కాఫీ ఇవ్వు"

అన్నిటినీ సరోజా చేసింది. తొమ్మిది గంటలకు అందరూ టిఫిన్లు చేశారు.

బయటకు వెళ్దామని కుటుంబమే ప్లాన్ చేయటం, మధ్యాహ్నం లంచ్ కట్టుకు వెళ్దామని మాటలు వినబడ్డాయి.

సరోజా... రఘూకి కంటితో సైగ చేసింది. 

"అమ్మా-నాన్నా! నేను కొంచం మాట్లాడాలి"

"ఏంటబ్బాయ్?"

"మేము బయటకు రాము. మా ఇద్దరికీ ముఖ్యమైన పని ఉన్నది. పిల్లను తీసుకువెడతాం. రావటానికి బాగా పొద్దుపోతుంది"

"ఏం పని నాయనా?"

"అమ్మా! మేము రేపే వేరే కాపురానికి వెడుతున్నాం"

తండ్రి మొహంలో షాక్! అక్కయ్య...ముందుకు వచ్చింది.

"వేరు కాపురమా! దేనికి? ఉమ్మడి కుటుంబం అంటే గొడవులు, తగాదాలు ఉంటాయి. పోట్లాడుకుంటాం...కలుసుకుంటాం. అభిప్రాయ బేధాలు వస్తాయి. దానికి ఇలాంటి అర్జెంట్ నిర్ణయం తీసుకుంది ఎవరు?"

"ఇంకెవరు...వదినే అయ్యుంటుంది! రఘూకి వేరుగా వెళ్లటం ఇష్టం ఉండదు"

రఘూ ఆవేశంగా తిరిగాడు.

"ఇదిగో చూడు సత్యా! ఇక నువ్వు మాట్లాడితే నిన్ను ఏమీ చెయ్యను. నీ భర్తను కొడతాను"

"ఏమిట్రా ఆ వాగుడు? ఆయన ఈ ఇంటి అల్లుడు"

"నన్ను ఇంకా అసహ్యంగా మాట్లాడనివ్వకు! భార్యను కంట్రోల్ చేయటానికి సత్తాలేని వాడు...అసలు మగాడే కాదు! ఆ తరువాతే అల్లుడు. మాట్లాడకు! ఇది  మా సొంత సమస్య. నేను నా కన్నవారి దగ్గర మాట్లాడుతున్నాను. సరోజా గురించి  ఎవరైనా తప్పుగా మాట్లాడితే...చంపేస్తాను. అర్ధమయ్యిందా...?"

అక్కయ్య దగ్గరకు వచ్చింది.

"సత్యా...నువ్వు మాట్లాడకే! రఘూ...అవసరపడకు! ఏ సమస్య అయినా మాట్లాడి పరిష్కరించుకుందాం. వేరుగా వెళ్లద్దు"

"లేదక్కా! ఇది పరువు సమస్య. వివరణ అడగొద్దు. ఇక్కడ ఎవరు...ఎలా ఉన్నారనేది అందరికీ తెలుసు. కానీ, నిజాన్ని లాగిపెట్టి మూసిపెడుతున్న కారణంగా అన్యాయం జరుగుతోంది. ఆ విమర్శనం అవసరం లేదు.అన్ని ఇళ్ళల్లోనూ అక్క-చెల్లెల్లు ఒకటిగా కలిసిపోతారు. అన్నా-తమ్ముల్లకు ఆ కూటమిలో చోటు లేదు"

"దానికి కారణం...వాళ్ళ భార్యలే"

జ్యోతీ గబుక్కున లేచింది.

"సత్యా...నువ్వు నన్నూ కలిపి అంటున్నావు! తరువాత నేను గనుక మాట్లాడితే తట్టుకోలేవు! మేమంతా డబ్బులు ఇస్తున్నందు వలనే ఈ కుటుంబం నడుస్తోంది. నువ్వు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా...వూరికినే పంచాయతీ చెయ్యటం ఇకమీదట ఓర్చుకోము. ఒళ్ళు వంచకుండా పుట్టింటో ఎన్ని రోజులు ఇలా పండుగ చేసుకుంటావు?"

"ఏం...మీరేం చేస్తున్నారు...ఉద్యోగానికి వెడుతున్నారా? మా అన్నయ్య మాత్రమే కదా సంపాదిస్తున్నాడు!"

"ఆయన నా భర్త! నన్ను పుట్టింట్లో ఎమీ దింపలేదు. మగాడు! పెళ్ళి అయినా కూడా మొగుడు వదిలేసిన దానిలాగా పుట్టిల్లే గతి అని నేను ఇక్కడ లేను. నాలిక కోసి పారేస్తాను. నీ ఆటలు వేరే చోట చూపించు. నా దగ్గర ఆడితే కాళ్ళు తెగనరుకుతాను"

"శభాష్" --రఘూ చప్పట్లు కొట్టాడు.

"ఇప్పుడు అర్ధమవుతోందా? ఒక్క మాటను కూడా వదిన తట్టుకోలేకపోతోంది. అందరూ సరోజా లాగా ఉంటారా?"

"వదలరా రఘూ...నువ్వు వేరుగా వెళ్లకు"

"లేదక్కా...ఇల్లు చూశాము. రేపు పాలు పొంగిస్తున్నాము. ఇంటికి కావలసిన వస్తువులను ఈ రోజే మేమిద్దరం వెళ్ళి కొనుక్కు రాబోతాం. ఇక్కడ్నుంచి ఏమీ తీసుకు వెళ్ళటం లేదు. ఇది నాన్న ఇల్లు. సరోజా యొక్క నెక్లస్ అమ్మి కాపురానికి కావలసిన ఏర్పాటు చెయ్యబోతాం" 

"ఉండరా...మాట్లాడి తీర్చుకుందాం"

"అక్కా...లెక్క తీరిపోయింది! ఇక మాట్లాడటానికి ఏమీ లేదు"

అక్కయ్య తిరిగింది.

"అమ్మా...నువ్వు ఏమీ మాట్లాడ లేదేం?"

"కొడుకును తల్లి దగ్గర నుండి వేరు చేసి అది పిలుచుకు వెడుతోంది. అమ్మ ఎలా తట్టుకుంటుంది? ఎన్ని సమస్యలు వచ్చినా ఆడపిల్లలే కన్నవారికి ఆదరణ. అది అర్ధం చేసుకుంటే చాలు"

తల్లి ఎమీ మాట్లాడకుండా తండ్రి దగ్గరకు వచ్చింది.

"వాడు వేరు కాపురం వెళ్లటం మీకు కరక్టే అనిపిస్తోందా?"

"నేను వెళ్లమనలేదు. ఇది వాడు తీసుకున్న నిర్ణయం. నేను ఆపినా...వాడు వింటాడా?"

"వాడిని వెళ్ళకుండా ఉండేందకు మీరు ఏమీ చెయ్యరా?"

"ఏం చెయ్యమంటావు?"  

"వాడు ఎందుకు వెళుతున్నాడు? ఏది వాళ్ళిద్దర్నీ వెళ్ళేటట్టు చేసింది? ఎలాంటి గొడవ చేయకుండా, అన్నిటినీ సహించుకుని వెళ్ళే ఇద్దరు, కుటుంబం విడిపోకూడదని అనుకునే ఇద్దరు, ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? వాళ్ళు వెళ్ళకుండా ఉండాలంటే...మనం ఎటువంటి చర్య తీసుకోవాలి? ఇదంతా మీ బుర్రకు తట్టలేదా?"

"ఏమిటే...నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు?"

"ఈ ఇంట్లో జరుగుతున్నదేదీ మీకు తెలియదా? అంతా న్యాయమని చెప్పండి చూద్దాం..."

ఆయన మాట్లాడలేదు.

"ఒక కుటుంబం ఉంది. ఐదుగురు పిల్లల్ని కన్నాము. కన్నవారికి అందరూ సమమే కదా?"

"సమమే!"

ఈ ఇంట్లో అలా జరగటంలేదే! మనం న్యాయంగా లేమో! వాడి బాధలను పోగొట్టి, వాడి గౌరవానికి భంగం రాకుండా మనం అడ్డుకుంటే, కరెక్టు న్యాయం చెబితే , ఖచ్చితంగా మన అబ్బాయి వెళ్లడు"

ఆయన అప్పుడు కూడా మాట్లాడలేదు.

"వదలండి! మీకు అంతా తెలుసు. కానీ, మీరు మాట్లాడరు. కానీ, నేను మాట్లాడాల్సిన బలవంతానికి వచ్చాను

"ఏమిటే చెబుతున్నావు?"

"రఘూ! క్యాలండర్ తీసివ్వు..."

తీసిచ్చాడు.

"రేపు ప్రొద్దున ఏడున్నర నుండి ఎనిమిదింటి వరకు మంచి సమయం. అప్పుడు పాలు పొంగిద్దాం"

"సరేనమ్మా"

"మీ కాపురంలో నాకు చోటుందా...నేనూ మీతో రావచ్చా?"

"అమ్మా! ఎందుకలా అడుగుతున్నావు? నేను జీవించే ఇల్లు ఎప్పుడూ నీ ఇల్లే. నువ్వు ఎప్పుడైనా సరే రావచ్చు"

"లేదబ్బాయ్! వచ్చి వెళ్ళేందుకు నేను అడగలేదు. రేపు నేను మీతోనే వస్తాను. మీతోనే చివరి వరకు ఉంటాను. ఇక మీదట నా కాపురం అక్కడే. అనుమతిస్తావా?"

సత్యా ఎగిసిపడింది.

"నీకేమన్నా పిచ్చి పట్టిందా! ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వే లీడర్. నాన్నను వదిలేసి, ఎవరింటికో వెళ్లాల్సిన అవసరం ఏముంది?"

"ఆపవే...నువ్వు మాట్లాడకు! ఇది మా సమస్య. వెళ్లేది ఎవరింటికో కాదు. నా కొడుకు ఇంటికి. నా కొడుకును నా దగ్గర నుండి వేరు చేసింది నువ్వు. అది తెలిసే మీ నాన్న మౌనం వహిస్తున్నారు. అలాంటి ఆయన దగ్గర నుండి నేను వేరైతే తప్పు లేదు"

"సరే...నాన్న ఏం చేయాలని అంటున్నావు?"

"బాధలకూ, కలతలకు, ఈ కుటుంబం విడిపోవటానికీ కారణమైన నిన్ను...ఈ ఇంటి నుంచి తరమాలి. ఆయన నోట ఆ మాట వస్తోందా?"

"దేనికి? మా నాన్న ఇంట్లో నుండి నన్ను వెళ్ళగొట్టటం ఎందుకు? నాన్న ఏ రోజూ ఆ పనిచేయరు"

"మీ నాన్నకు నువ్వు ముఖ్యమైతే, నాకు నా కొడుకు ముఖ్యం. నీతి-నిజాయితీ లేని ఈ ఇంట్లో...కూతురికి, కోడలికి వేరు వేరు న్యాయాలని మాట్లాడే ఈ ఇంట్లో నేను జీవించలేను. అది నాకు నచ్చలేదు"

అక్కయ్య దగ్గరకు వచ్చింది.

"అమ్మా...నువ్వు అవసరపడుతున్నావు"

"లేదే! నేను ఒక్క దానినైనా ఈ ఇంట్లో న్యాయంగా లేకపోతే...నా కొడుకు ఇన్ని రోజులు జీవించిన జీవితానికి అర్ధం లేదు. కట్టబెట్టిన కూతుర్లు పుట్టింటికి రావచ్చు. రోజులకొద్దీ ఉండొచ్చు. ఒక అనారోగ్యం, పురుడు, చావు లాంటప్పుడు నెలల తరబడి ఉండొచ్చు. దానికీ ఒక హద్దు ఉంది. పర్మనెంటుగా ఇక్కడ ఉండిపోయి, దాన్నీ న్యాయం చేసి మాట్లాడి మనింటికి వచ్చిన అమ్మాయి మనసును బాధపెట్టి, చీలిక పడేటట్టు చేసి, అప్పుడూ కన్న కూతుర్లే గొప్ప అని కన్నవారు మాట్లాడితే...చివరి రోజుల్లో గంజి కూడా దొరకదు. ఆ పాపాన్ని చేయటానికి నేను తయారుగా లేను"

"నాన్న చేతి నిండుగా సంపాదిస్తున్నారు. ఇది నీ ఇల్లు, ఇక్కడ నువ్వే లీడరు. ఇది వదిలేసి కోడలి కాళ్ళ దగ్గర కూర్చుని...ఆమెకు బానిసగా జీవించటం గొప్పా?"

"సంపాదిస్తున్న జీతం డబ్బును పూర్తిగా ఇచ్చేసి, అది ఇంత కాలం బానిసగా ఇక్కడ జీవించిందే...దాని కంటే నేను చేసేది తప్పేమీ లేదు"

రఘూ దగ్గరకు వచ్చాడు.

"నాన్న నిన్ను పంపిస్తారా అమ్మా?"

నాన్నకు నేను కావాలంటే, ఈ ఇంట్లో ఒక న్యాయమైన నిర్ణయాన్ని తీసుకోవాలి"   

"ఏమిటది?"

"జ్యోతీ, సరోజా...ఈ ఇద్దరే ఇక్కడ పర్మనెంట్. మిగతా వాళ్ళు ఎవరూ నిరంతరంగా ఇక్కడ ఉండకూడదు"

"నువ్వు నన్నే తరమాలని చూస్తున్నావు?అది నాన్న చెప్పనీ. నా బిడ్డను వదిలేసి నాన్న ఉండలేరు"

" రఘూకీ బిడ్డ ఉన్నది. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను. నాన్నకు మనవడు ముఖ్యమైతే...నాకు మనవరాలు ముఖ్యం"

ఆయన అప్పుడు కూడా మాట్లాడలేదు.

కొద్దిక్షణాలు మౌనంలో కరగగా.

"రఘూ...ఆయన నన్ను అడ్డుకోలేదు! నేనూ నీతో వస్తాను. ఇప్పుడు షాపుకు వెళ్ళి...ఫ్యామిలీ నడపటానికి కావలసినవన్నీ కొందాం. నేనూ వస్తాను. సరోజా తన నెక్లస్ ను అమ్మక్కర్లేదు. నా రెండు పేటల గొలుసు ఆరు కాసులు. అది అమ్మేసుకోరా రఘూ"

"నీ నగలలో మాకూ భాగముంది" -- సత్యా అరిచింది.

"ఇది మీ నాన్న ఇచ్చిన నగ కాదు. మా నాన్న నాకు వేసింది. నా నగలను ఎవరికైనా ఇస్తాను. అమ్మ కంటే కూడా నగలే ముఖ్య మనుకునే నువ్వంతా మనిషేనా? నిన్ను కన్నందుకు సిగ్గు పడుతున్నాను. సరోజా బయలుదేరమ్మా...వెళ్దాం"

ఆమె బయలు దేరటానికి రెడీ అవగా...కుటుంబమే బెదిరి పోయింది!

***************************************************PART-3*****************************************

తిన్నగా బ్యాంకుకు వచ్చారు.

"అమ్మా...నీ నగ వద్దు. మేము ఏర్పాటు చేసుకుంటాము"

లేదు రఘూ! నేను సరదాకి మాట్లాడాలేదు. నువ్వు నా కొడుకువు. నీ కష్ట నష్టాలలో నాకూ భాగం ఉంది. నన్ను ఆపకు! ఏ.టి.ఏం. లో డబ్బులు తీసుకో. పక్కనున్న నగల కొట్టు మనకు తెలిసిందే. నగ అమ్మితే డబ్బులు ఇస్తాడు. ఈ వయసులో నగ పెట్టుకుని నేనేం చేస్తాను? రామ్మా"

"అత్తయ్యా! అందులో అందరికీ భాగం ఉందని సత్యా గొడవ మొదలుపెట్టింది"

తల్లి చెప్పినట్టు నగలను అమ్మి, అవసరమైన 'బడ్జెట్టు' ను అక్కడే లెక్క కట్టి, మిగిలిన డబ్బుతో ఒక జత గాజులు కొని... సరోజాకి వేయగా,

ఆమె అదిరిపడ్డది.

"ఇది ఎందుకు అత్తయ్యా?"

"నా మనవరాలికి! జ్యోతీ సేవింగ్స్ చేసి తన పిల్ల భవిష్యత్తు ప్లాను వేసుకుంటోంది. నా కూతుర్లు స్వార్ద పరులుగా కూర్చుని తింటున్నారు. నువ్వూ, రఘూ మీ చేతిలో ఏమీ ఉంచుకోకుండా...ఇరవై నాలుగు గంటలూ పనులు చేస్తూ,  ఇప్పుడు అందరి మాటలకూ గురి అవుతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను.  నేను చాలా లెక్క పత్రాలు మాట్లాడవలసి ఉంది. అవసరమైన వస్తువులు కొని, కాపురానికి ఏర్పాట్లు చేద్దాం. మిగిలినవన్నీ తరువాత!"

ఇంటికి కావలసిన అన్ని వస్తువలనూ లిస్టు రాసి, ఒకే షాపులో కొన్నారు.

కొత్త ఇంటి అడ్రస్సు ఇచ్చి హోం డెలివరీ చెయ్యమన్నారు.

తల్లి తుఫాను వేగంతో పనిచేసింది.

కొత్త ఇంటికి రాగానే, స్నేహితురాలు నిత్యా కాచుకోనున్నది.

"లోపలకు రా సరోజా!"

బిడ్డతో పాటూ ముగ్గురూ వచ్చి చుట్టి చూడ...ఇల్లు పెద్దదిగా, గాలి, వెళుతురు వాటంతో ప్రకాశంగా ఉన్నది. ఇంటికి పక్క వీధిలోనే సరోజాకి స్కూలు. పక్కనే చాలా షాపులు, బ్యాంకు, హాస్పిటల్, హోటల్, ఇంటి వాకిట్లోనే బస్ స్టాండ్, షేర్ ఆటో అంటూ అద్భుతమైన చోటు.

"అత్తయ్య కూడా మాతోటే ఉండబోతోంది. మనవరాలిని వదిలి అక్కడ ఉండలేదు"

"నువ్వు అదృష్టవంతు రాలివి"

"లేదమ్మాయ్! మాకు సరోజా దొరకటం వలన మేమే అదృష్టవంతులం" – గిరిజా చెప్పగా.

రఘూ వంకర్లు తిరిగాడు.

ఇల్లు బాగా కట్టారు. గంటలో కొన్ని వస్తువులు వచ్చి దిగినై...వాటిని సర్దాల్సిన చోటు చూసి ఇద్దరూ సర్దటం మొదలుపెట్ట,

కొనుకొచ్చిన దేవుడి ఫోటోలు పూజ భాగంలో ఉంచ,

ఇంటికి ఒక కళ వచ్చింది.

"రేప్రొద్దున ఏడు గంటలకు పాలుకాచి, పూజ చేసేసి కాపురం మొదలు పెడదాం"

"అమ్మా! మనింట్లో పద్దెనిమిది మంది ఉన్నారే. టిఫిను, భోజనం హోటల్లో చెప్పేద్దాం"

"వద్దు. నేనూ, సరోజా చేసేస్తాం. అందరినీ పిలుస్తావా?"

"ఖచ్చితంగా! మనం గొడవపడి రాలేదుగామ్మా...మంచిగానే కదా రాబోతున్నాము"

"అత్తయ్యా...మావయ్య దీన్ని ఇష్టపడతారా?"

"దేన్నమ్మా?"

"మీరు మాతో రావటాన్ని..."

"దీన్ని ఆపాలంటే ఆయన న్యాయంగా నడుచుకోవాలి. పోతే పోనీ అని నేనూ ఓర్చుకుని ఇన్ని రోజులు ఉన్నాను. సత్యా దగ్గర చాలాసార్లు చెప్పేను. ఇది నీ ఇల్లు కాదు...ఇది పద్దతి కాదు అని చెప్పాను. అది వినడం లేదు. అందరూ దానివైపు నిలబడ్డారు. చలపతి, జ్యోతీ...డబ్బులు విసేరేసి ఏమీ పట్టనట్టు జీవిస్తున్నారు. చెత్త కాగితం ముక్కను కూడా కింద నుండి తీసి ఏరి పారేయలేరు.  మీ మామగారు ఉద్యోగం చేస్తున్న కారణంగా, దగ్గర దగ్గర నలుగురు పిల్లలను పెంచుతూ...ఇంటి పనులూ చేయటానికి నా దగ్గర ఓపిక లేదు. నువ్వొక్కదానివే కదా గొడ్డులాగా పనిచేశావు.

ఇవన్నీ ఒక ముగింపు రావాలి. కన్న తల్లిని కాబట్టి, అన్నిటినీ సహించుకున్నాను. ఇక సత్యా యొక్క ఆటలు జ్యోతీ దగ్గర చెల్లుబడి కావు. మీ మామగారూ, చలపతి...ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. జ్యోతీ ఏ పనీ చేయకుండా జీవించగలదు.  రంగు తేలిపోతుంది. నువ్వూ, నేనూ ఉన్నంత వరకు బద్దకస్తులకు స్వర్గంగా ఉన్న ఆ ఇల్లు, ఇక అడ్రస్సు మార్చుకుంటుంది. న్యాయాన్ని వాళ్ళు ఫీలవాలి సరోజా లేకపోతే మీ మావయ్యకే తిండి దొరకదు" 

"పాపం అత్తయ్యా...అలా మాట్లాడకండీ"

"లేదమ్మా! అన్యాయానికి తోడుగా ఉండే వాళ్ళందరినీ దేవుడే శిక్షిస్తాడని మనం ఏమీ చేయకుండా కూర్చుంటే అది మూర్ఖత్వం. కొన్ని సంధర్భాలలో తీర్పులను మనం రాసుకోవచ్చు. అందులో తప్పులేదు"

తల్లి దీర్ఘంగా మాట్లాడ,

రఘూ ఆశ్చర్యపోయాడు.

అమ్మ దగ్గర పారపక్ష్యం లేదు! కుట్ర లేదు. న్యాయమైన మహిళ అనేది రఘూ, సరోజా ఇద్దరికీ తెలుసు. అందువలనే అమ్మకోసం అన్నిటినీ సహించుకో  గలిగాడు.

ఆ తల్లే ఇప్పుడు ఉద్యమకారినిలాగా లేచిందే!   

అదే సమయం అక్కడ ఇంట్లో పెద్దక్క సుమతి, రెండో అక్క కమల తో మీటింగు పెట్టింది సత్యా.

కమల దేంట్లోనూ కలగజేసుకోదు. ఎవరినీ సపోర్ట్ చేసి మాట్లాడదు. పెద్దక్క సుమతి, సత్యాకు సపోర్టు చేస్తుంది.

"అమ్మకు పిచ్చెక్కింది. లేకపోతే వాళ్ళతో ఎందుకు వెళ్లటం?"

"చెబితే వినటంలేదక్కా. ఆ సరోజా అమ్మకు చేతబడి చేసుంటుంది. మనం మాట్లాడి లాభం లేదు.

"వేరే ఎవరు మాట్లాడతారు?"

"అమ్మను వెళ్ళకూడదని నాన్న ఆర్డర్ వేస్తే?"

"వేస్తారా?"

"వేయించాలి...భర్త మాటను కాదని వెళ్ళగలదా...అమ్మకు అది గౌరవమా?"

"నాన్నను పిలు!"

సత్యా ఆయన్ని లాక్కొచ్చింది.

అమ్మ ఎందుకు వెళ్ళాలి...ఎందుకు అనుమతించారు? నిషేదించండి. వెళ్ళకూడదని అడ్డుపడి ఆపండి"

ఆయన మాట్లాడలేదు.

"తెల్లవారు జామున ఐదు గంటలకు మీరు లేచిన వెంటనే 'బెడ్ కాఫీతో' మొదలై, రాత్రి నిద్రపోయే ముందు గ్లాసుడు పాల వరకు మీ 'రొటీన్ ' అమ్మకు మాత్రమే తెలుసు. తాగిన కాఫీ గ్లాసును వంగి కిందపెట్టని మనిషి! వంట గదివైపు వెళ్ళిందే లేదు. మీ డ్రస్సు, మనీపర్స్, సెల్ ఫోన్, ఐ.డీ కార్డు ఎక్కడున్నాయో మీకు తెలుసా? అమ్మ లేకుండా ఒక్కరోజు మీరు ఉండగలరా?"

అప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు.

"మీకు చెయ్యాల్సిన బాధ్యత అమ్మకు ఉంది. వెళ్ళకుండా అడ్డుపడి ఆపండి. దేనికీ మీరు సమాధానం చెప్పకపోతే ఎలా?"

"రానీ...మాట్లాడదాం!"

అన్నీ పనులూ ముగించుకుని సాయంత్రం ఆరు గంటలకు అమ్మ, రఘూ, సరోజా వచ్చారు.....తమ బట్టలు, వస్తువులూ ప్యాక్ చేశారు.

"నాన్నా...రేపు ప్రొద్దున ఏడు గంటలకు పాలు కాస్తున్నాం. బండి ఏర్పాటు చేసాను. ఆరు గంటలకు అందరూ స్నానాలు ముగించుకుని రెడీగా ఉండండి"

"అమ్మ కూడానా?" -- సత్యా అడగ,

రఘూ సమాధానం ఇవ్వలేదు.

సత్యా, తల్లి దగ్గరకు వచ్చింది.

"నువ్వు నాన్నను వదిలి వెళ్ళటం పద్దతి కాదు!"

"ఇది సొంత నిర్ణయం! దాని గురించి మాట్లాడటానికి నీకు ఎటువంటి హక్కూ లేదు"

"నాన్న కోసరమే మాట్లాడుతున్నాను"

"మీ నాన్న ఏమైనా మూగవారా?"

జగన్నాధం దగ్గరకు వచ్చారు.

"శారదా! నువ్వు వెళ్ళద్దు"

"లేదండీ...నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. నా మనవరాలితోనే ఉంటాను"

"ఇక్కడ నీకు ఇద్దరు మనవుళ్ళు, ఒక మనవరాలూ ఉంది" -- అన్నది సత్యా

"నేను నాన్నతో మాట్లాడ తున్నాను"

"నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది గిరిజా...? అలా నీకు ఇక్కడేం తక్కువ?"

"నేను పనులు చేయలేను. నాకు రెస్టు కావాలి. నన్ను కూర్చోబెట్టి చేసేది సరోజా మాత్రమే! మిగిలిన వాళ్ళెవరూ చేయ్యరు. నా సమస్యలూ, భావాలూ అర్ధం చేసుకున్నది అదొక్కతే. నా వసతి కోసం నేను వెడుతున్నాను"

"అయితే...నాన్న యొక్క వసతులు?"

ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆయనకు పనిచేశాను. అందరికీ సేవలు చేసేను. అయినా నాన్నను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళటం లేదే! ఒక కొడుకూ -- కూతురూ ఇక్కడున్నారే. వాళ్ళు ఆయన్ని చూసుకుంటారు"

"అదెలా?"

"ఇప్పుడు అర్ధమవుతోందా! ఇవతలి గ్లాసు అవతల పెట్టని వాళ్ల మధ్య జీవిస్తేనే...శ్రమ పడుతున్న వారి గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ఇంట్లో ఎవరెవరు ఉండాలి...ఎవరెవరు వెళ్లాలి అనే నిర్ణయం తీసుకోవటానికి నాన్న వలన కుదరకపోతే, ఆయన కష్టపడే కావాలి. నేను వెళ్ళటాన్ని ఆపే హక్కు ఆయనకు కూడా లేదు. నేను బాగా అలసిపోయాను. నేను పడుకుంటున్నా రఘూ "

"అత్తయ్యా...మీరు డిన్నర్ చేయలేదు"

"కాస్త మజ్జిగ మాత్రం ఇవ్వు సరోజా"

సత్యా కోపగించుకుని, “ఏమిటి నాన్నా...ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నారు?" అన్నది.

"వెళ్ళాలని ఆమె తీర్మానించుకుంది. ఎవరి స్వతంత్రం వాళ్లకు ఉంటుంది. దాన్ని గౌరవించే వాడిని నేను. ఆపటానికి నాకు హక్కులేదు"

ఆయన లోపలకు వెళ్ళారు.

సరోజా మజ్జిగ తీసుకువచ్చింది.

ఆమెతో పాటూ రఘూ కూడా వచ్చాడు.

"అత్తయ్యా! మావయ్యకు కుడి భుజంగా ఉన్నారు. మీరు లేకుండా ఆయన ఉండగలరా? వదిలేసి రావటం న్యాయమేనా"

"కష్టమే సరోజా! కానీ, అరాచకం ఒక ముగింపుకు రావాలంటే...ఇది చేసే కావాలి"

"నాన్న ఎందుకు మౌనంగానే ఉన్నారు?"

దానికి కారణం నాకు తెలుసు. మీ నాన్న మూర్ఖులు కాదు రఘూ! మిగితావారి కంటే తెలివిగలవారు. ఎక్కువ మాట్లాడరు. మిత భాషి. కానీ, మనసులో ఒక లెక్కపోతూ ఉంటుంది! అది ఇప్పుడు నేను చెప్పను. ఈ 'ఆపరేషన్ ' ఖచ్చితంగా విజయవంత మవుతుంది. వెళ్ళి పడుకోండి. తెల్లవారు జామున నాలుగింటికి అలారం పెట్టి, నన్ను లేపు సరోజా"

"సరే అత్తయ్యా!"

ఇద్దరూ బయటకు రాగా, వరాండాలో కూర్చుని చలపతి -- జ్యోతీ ఇద్దరూ చిన్న స్వరంతో తీవ్రంగా మాట్లాడుకుంటాన్నారు.

"నా వల్ల ఖచ్చితంగా కుదరదు. నా దగ్గర తోకాడించారో...తోకను నరికి పారేస్తాను"

జ్యోతీ స్వరం కొంచం గట్టిగా వినబడింది.

ఆమె ఎవరి గురించి చెబుతోందో అనేది సరోజాకి బాగా అర్ధమయ్యింది.

ఇద్దరూ లోపలకు రావటంతో,

"అత్తయ్య మనతో రావటం మన అదృష్టం. జీవితంలో మనకి ఇక అంతా మంచే జరుగుతుంది!"

***************************************************PART-4*****************************************

తెల్లవారు జామున నాలుగింటికే లేచి స్నానం చేసి, అత్తయ్యను- రఘూని లేపి రెడీ చేసింది సరోజా.

నాలుగున్నరకు మామగారికి కాఫీ ఇచ్చింది.

మిగిలిన వాళ్ళు తయారవుతూ ఉండగా, పావు తక్కువ ఆరు గంటల వరకు సత్యా -ఆమె భర్త, పిల్లా రెడీ అవలేదు. ఆరు గంటలకు కారు వచ్చింది.

"నేను బయలుదేరటానికి ఆరున్నర అవుతుందమ్మా!"

"రఘూ! ఆరు గంటలకు ఎవరంతా రెడీగా ఉంటారో...వాళ్ళందరూ కార్లో ఎక్కనీ"

"నేను రావటం లేదు..." --చెప్పింది సత్యా.

"సంతోషం! నువ్వొస్తే  ఇల్లు బాగు పడదు. రాకూడదనే ఆశపడ్డాను" – గిరిజా చెప్పింది.

సుమతీ ఆవేశంగా లేచింది.

"కన్న కూతుర్నే ఆ మాట అంటున్నావు! అది రాకపోతే మేమంతా రాము"

"చాలామంచిది! మీకందరికీ సహోదరుడిగా ఉండి చాలా చేశాడు రఘూ. సరోజా వాడికి తోడుగా నిలబడింది. ఈ రోజు వాళ్ళిద్దరూ వేరు కాపురం వెళ్ళేటప్పుడు...మీ బుద్దులు చూపకండి? మీరు బాగుపడతారా?"

"అత్తయ్యా...టెన్షన్ వద్దు. ఇష్టం ఉండే వాళ్లను రానివ్వండి"

నాన్నా... చలపతి-జ్యోతీ, పిల్లతో ఒక కారులో ఎక్కగా, వీళ్ళ నలుగురూ బయలుదేరారు.

సహొదరినిలు బాయ్ కాట్ చేయ, కారు బయలుదేరింది.

కొత్తింటికి వచ్చి చేరేరు.

"పాలు కాచి, పూజను అత్తయే చెయ్యనీ" అన్నది సరోజా.

"నువ్వే చెయమ్మా!"

"లేదత్తయ్యా...మీ చేయి హస్త వాసి ఉన్న చెయ్యి! మీరే చెయ్యండి"

అలాగే జరిగింది.

టిఫిన్లు సరోజా తయారు చేసింది.

అందరూ తిన్నారు.

చలపతి, జ్యోతీ, పిల్లలూ బయలుదేరారు.

"నాన్నా! మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా?"

"వద్దబ్బాయ్! నేనే వెళ్తాను"

వాళ్ళు బయలుదేరి వెళ్లారు.

తండ్రి మాత్రం వీళ్లతోనే ఉండిపోయారు.

రఘూ తండ్రి దగ్గరకు వచ్చాడు.

"సారీ నాన్నా! అమ్మను మేము బలవంతం చేయలేదు. ఆమెగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఆమెను మీ దగ్గర నుండి వేరు చేయాలనే ఉద్దేశం మాకు లేదు"

"రఘూ! నువ్వెందుకు ఆయనకి వివరణ ఇస్తున్నావు?”

"లేదమ్మా! అది నా బాధ్యత కదా? నాన్న మమ్మల్ని తప్పుగా అనుకోకూడదు కదా?"

"లేదురా! మీ ఇద్దరి మీద నాకు ఎలాంటి కోపమూ లేదురా"

చేతిలో ఉంచుకున్న బ్యాగును తెరిచి, ఇరవై వేల రూపాయలు తీసి ఇచ్చారు.

"గిరిజా...ఇది ఉంచుకో"

"దేనికీ?"

"నీ ఖర్చుకు! నెలనెలా ఇస్తాను"

"నాన్నా! అమ్మకు మేము చెయ్యమా? మమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నారా?"

"లేదురా...ఇది నా బాధ్యత. నువ్వు చేస్తావు. మీ ఇద్దరికీ కలిపి నెలకు నలభైఐదు వేలు వస్తోంది. అందులో పదివేలు అద్దెకు పోతుంది. కరెంటు బిల్లు, ట్రాన్స్ పోర్టు, పచారి, పాలు, కూరగాయలూ అని చాలా ఉన్నాయి. దారాళంగా ఖర్చుపెట్టలేరు. అమ్మ కూడా సహాయం చేయనీ...తప్పు లేదు"

"వద్దు మావయ్యా"

"వద్దనకు సరోజా. ఆయన ఇవ్వనీ, మీకు చెయ్యాల్సిన బాధ్యత ఆయనకు ఉంది"

"మావయ్యా...నేనొకటి చెబితే తప్పుగా తీసుకోరుగా?"

"తీసుకోను. చెప్పమ్మా"

"అత్తయ్య మిమ్మల్ని వదిలి పెట్టటానికి ఇష్టపడటం లేదు. అది మా అదృష్టం. మీరూ ఇక్కడికే ఎందుకు రాకూడదు? ఇది నేను డబ్బుకోసం చెప్పటం లేదు. అత్తయ్యను వదిలి మీరు ఉంటారా?"

"ఇది మంచి ఆలొచన సరోజా!"

రఘూ ఉత్సాహంగా చెప్పాడు.

"లేదబ్బాయ్! నాన్నే వస్తానన్నా...నేను ఒప్పుకోను"

సరోజా అదిరిపడ్డది.

"ఎందుకు అత్తయ్యా?"

"నేను ఎదురు చూసే కొన్ని విషయాలు జరగాలి! దానికి ఆయన అక్కడ ఉండాలి. ఉమ్మడి కుటుంబం బాగా నడవాలనుకుంటే అందరూ సపోర్టు చేయాలి. స్వార్ధం ఉండకూడదు. ఎవరికి వారు, వాళ్ళ గురించి మాత్రమే ఆలొచిస్తే, దాని వలన నష్టపోయేది కొందరే. వదలండి"

"మావయ్య కష్టపడతారు అత్తయ్యా"

"ప్రియమైన కూతురు...నాన్నను చూసుకోనీ"

రఘూ మాట్లాడలేదు. చూపుల్లో కోపం ఉంది.

"ఏమండీ...కొంచం లోపలకు రండి. నేను మీ దగ్గర ఒంటరిగా మాట్లాడాలి. డైరీ చేతిలో ఉందా?"

"ఉంది గిరిజా!"

ఇద్దరూ లోపలకు వెళ్ళి  తలుపులు మూసుకున్నారు.

సరోజా తలెత్తి భర్తను చూసింది.

"నాన్న 'డైరీ' లోనే 'బడ్జెట్', కుటుంబ నిర్వహణ అన్నీ! అది ఎప్పుడూ అమ్మ చేతిలోనే ఉంటుంది..."

"ఇప్పుడెందుకు?"

"ఏదో జరుగుతోంది సరోజా! ఇద్దరూ మెతక మనుషులు కాదు. ఐదుగురు పిల్లలను కని,పెంచి, ఇల్లు కట్టి, అందరినీ జీవితంలో సెటిల్ చేయటం సాధారణ సంగతి కాదు. వెయిట్ చేసి చూడు. ప్లాన్ చేసుకుని ఏదో చేస్తున్నారు"

"వాళ్ళిద్దరూ మంచిది మాత్రమే ఆలొచించే వాళ్ళు.మంచి 'పేరెంట్స్ ' దొరకటం, వాళ్ళతో కలిసి జీవించటం కుదరకపోయినా వాళ్ళు దొరికిందే వరం"

సరోజా మాటల్లో గౌరవం పొంగుకు వచ్చింది!

***************************************************PART-5*****************************************

ఆ రోజు రాత్రి అమ్మ, సరోజా, రఘూ, పిల్లా లేకుండా ఆ ఇల్లు బోసి పోయింది.

పెద్దది సుమతి, తరువాతది కమలా కలిసి రాత్రి డిన్నర్ తయారు చేశారు.

మరుసటి రోజు ప్రొద్దున ఆరు గంటలకు సుమతి కుటుంబానికి విమానం. కమలాకు ప్రొద్దున తొమ్మిదింటికి రైలు. ఇద్దరూ తమ వస్తువులను ప్యాక్ చేయటంలో తీవ్రంగా ఉన్నారు.

భర్త, పిల్లలను రెడీ చేస్తున్నాడు.

"కమలా! నువ్వు రైలుకు ఏదైనా కట్టుకు వెళతావా?"

సుమతి అడిగింది.

"కట్టివ్వటానికి ఎవరున్నారు అక్కా? అమ్మా, సరోజా ఇద్దరిలో ఒకరైనా ఉంటే...అడగకుండానే వచ్చేది. జ్యోతీ వదిన దగ్గర ఎదురుచూడగలమా?"

"రైల్లో మంచి భోజనం దొరుకుతుందే!" -- సత్యా చెప్పింది.

కమలా వెనక్కి తిరిగి చూసింది.

"నాన్నను చూస్తేనే బాధగా ఉంది నాకు!"

"ఎందుకు?"

"వదినకు అక్కర లేదు. ఇది కూడా చెయ్యదు. నాన్న ఏం చేస్తారు?"

సత్యాకి బాగా కోపం వచ్చింది.

"వదిన ఉద్యోగానికా వెళుతోంది? చలపతి అన్నయ్యకు, పిల్లలకూ చేసే కావాలి కదా. అందులో మిగిలిన వాళ్లం తినలేమా ఏమిటీ?"

"నువ్వెందుకే ఉన్నావు?  ఏమీ చెయ్యవా? నువ్వేమన్నా ఉద్యోగానికి వెడుతున్నావా? ఇంట్లోనే కదా ఉంటున్నావు? ఈ కుటుంబం విడిపోవటానికి కారణం నువ్వే"

కమలా ఎత్తి పొడిచింది.

"దాన్ని ఎందుకే అంటావు?"

"అక్కా...దాన్ని చెడిపిందే నువ్వు. నువ్వు బయట దేశానికి వెళ్ళిపోతావు. నేను ముంబైకి! ఒక సంవత్సరం తరువాత వస్తాం. ఇక్కడ కుటుంబం విరిగిపోయిందే! అందరం కలిసి, మాట్లాడి మంచి చెయ్యకుండా వదిలేశాము"

"నువ్వూ అమ్మాయే కదా? అమ్మనెందుకు ఆపలేదు! అమ్మ ఉండుంటే...అంతా పాత విధంగా జరిగేది. రఘూ, సరోజా వేరుగా వెళ్ళినందు వలన ఎవరికీ నష్టం లేదు"

"తప్పు సత్యా. నీ అరాచకం అనగలేదు"

"నువ్వూ వాళ్ళ వైపేనా?"

"నేను ఏవైపూ లేను. ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయలం, ఈ కుటుంబానికి మంచి చేయలేకపోయినా, పుట్టినందుకు భారంగా ఉండకూడదు. సరోజా ఖచ్చితంగా మంచిదే. ఆమె ఇక్కడ్నుంచి వెళ్లటం మహాలక్ష్మినే వెళ్ళినట్లు. నాన్న తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండవు"

ప్రొద్దున్నే మొదట సుమతి కుటుంబం, తరువాత కమలా కుటుంబం బయలుదేరి వెళ్ళిన తరువాత, వాళ్లను పంపిన తరువాత తండ్రి అలాగే 'ఆఫీసుకు ' వెళ్తానని వెళ్ళిపోయారు.

చలపతి తయారయ్యాడు.

"ఏమండీ...ఈ రోజు ఒక రోజు కాంటీన్లో తినండి"

"సరే జ్యోతీ!"

పిల్లలకు స్నాక్స్ ఇచ్చి, మధ్యాహ్నం లంచుకు 'బ్రెడ్ టోస్ట్' పెట్టి, వాళ్లను వ్యానులో ఎక్కించింది జ్యోతీ.

ఆమె స్నానం చేసి ముగించి, మూడు ముక్కలు బ్రెడ్ తిని, కాఫీ తాగి బయలుదేరింది.

"వదినా...వంట చేయలేదా?" -- సత్యా అడిగింది.

ఎవరికి? ఆయన్నీ, పిల్లల్నూ పంపించేశాను. మామయ్య తిన్నగా ఆఫీసుకు వెళ్ళారు. నాకు బ్రెడ్ చాలు. పిల్లలు వచ్చేటప్పుడే నేను వస్తాను. బయట పనుంది"

ఆమె వెళ్ళిపోయింది.

సత్యా భర్త కూడా బయలుదేరాడు.

అతను...భార్యా--పిల్లలను ఇక్కడ వదిలేసి, వారానికి ఒక రోజు వస్తాడు. బేవర్సుగా తింటాడు.   

ఇప్పుడు ఏమీ లేదు.

"తింటానికి ఏమీ లేదా...ఆకలేస్తోంది"

సత్యాకి కోపం వచ్చింది.

"పిల్లలతో పాటూ నేనూ వస్తాను. హోటల్లో తిందాం"

"నాకు టైం అయ్యింది! నేను బయట చూసుకుంటాను. అత్తయ్యా, సరోజా ఉండుంటే...ఆకలంటే ఏమిటో తెలిసేది కాదు. నేను బయలుదేరతాను. ఒక గూడునే చెదరగొట్టారు"

"ఎవర్ని చెబుతున్నారు?"

ఇదిగో చూడు! నీతో గొడవ పెట్టుకునే మనో పరిస్థితిలో నేను లేను.వస్తాను

"చేతిలో డబ్బులేదు...ఇవ్వండి"

"ఉన్నది నాకే చాలదు"

"ఏం చించుతున్నారు...మీరు జీతం తీసుకుంటున్నా, మా నాన్న ఇంట్లోనే కదా మన ఖర్చులన్నీ జరుగుతున్నాయి. డబ్బంతా ఎక్కడ పోతోంది? మీ అమ్మ మింగేస్తొందా?"

"మా అమ్మ గురించి మాట్లాడావా...నీకు పళ్ళు ఉండవు"

"ఎందుకంత ఆవేశం? ఆవిడ నా పిల్లను బాగా చూసుకోనుంటే...నేను ఇక్కడ ఉంటానా?”

"ఆపవే ! నీకు మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. కారణం...ఇంట్లో పనులు చేయటానికి నీకు ఒళ్ళు వంగదు. ఇక్కడ బేవర్స్ గా తినేసి, నిద్రపోతావు! పిల్లాడ్ని  మీ అమ్మ చూసుకుంటుంది. ఇప్పుడు అన్నిటికీ కలిపి... రఘూ పెట్టాడుగా ఒక చెక్. ఇక నీకు కష్ట కాలం మొదలు. అనుభవించు"

"ఇలాంటి మాటలను వింటుంటే మీకు సిగ్గుగా లేదా? రేపు మిమ్మల్నీ, మీ అమ్మనూ ఈ ఊరు తిట్టదూ. భార్యా--పిల్లాడినీ వాళ్ళ పుట్టింట్లోనే వదిలేసి వచ్చేశాడు...పనికిరాని వాడు అని మొహాన ఉమ్మేస్తారు" -- భర్తను కసురుకుంది సత్యా.

"ఏయ్! కోపం తెప్పించకు...నేను పిలిస్తే వెంటనే వచ్చేస్తావుటే నువ్వు? ఇక్కడేమన్నా సరిగ్గా ఉన్నావా? మా ఇంట్లో మా అమ్మను కష్టపెడుతున్నావు? ఇక్కడ అన్నయ్య, వదినలను టార్చర్ పెట్టి వాళ్ళను ఇక్కడ్నుంచి తరిమేశావు. మీ అమ్మ కూడా వాళ్లతో వెళ్ళిందే అదే నీకు శిక్ష. నీకు బ్యాడ్ టైము మొదలయ్యింది"

వేగంగా బయటకు వెళ్ళిపోయాడు.

సత్యాకు ఒళ్ళు మంట బాగా పెరిగింది.

ఆమె చేసే తప్పు ఆమె అర్ధం చేసుకోలేదు.

అందరి మీద కోపం ఎక్కువ అయ్యింది.

ఇంటి నిండా సరకులు ఉన్నాయి. వంట చేసుకుని తినచ్చు. కానీ, శరీరంతో పాటూ అతుక్కున్న బద్దకం జరగనివ్వలేదు.

ఇన్ని రోజులు ఇంకొకరి శ్రమలో చలి కాచుకుంది. జీవితం కొనసాగించింది. ఆ అలవాటు శరీరంలో ఊరిపోయింది.

తెలిసో...తెలియకో తల్లీ-తండ్రీ దాన్ని ఎంకరేజ్ చేశారు.

కనీసం  సరోజా చేస్తున్న ఉద్యోగం లాంటీ ఉద్యోగం కూడా లేదు.

ఉద్యోగం, ఇంటిపనులు, వీలున్నంతవరకు పిల్లను చూసుకోవటం అంటూ సకల భారాలనూ మూతి ముడుచుకోకుండా చేసేది సరోజా.

వేరే దారి లేదు!

ఈ రోజున్న అర్ధీక పరిస్థితుల్లో మధ్య తరగతి కుటుంబాలలో ఆడవారు ఉద్యోగానికి వెళ్ళే తీరాలి అనే నిర్భంధం ఏర్పడింది.

ప్రొద్దున వెళితే తిరిగి రావటానికి రాత్రి అయిపోతుంది.

ఇంటి పెద్దలను, మనవళ్లనూ చూసుకోవలసిన నిర్భంధం. రెస్టు తీసుకోవలసిన వయసులో, తరువాత ఘట్టం ఆటకు తయారు కావలసిన నిర్భంధం....కొందరు దాన్ని నిర్ధాక్ష్యంగా నిరాకారిస్తారు.

'భోజనం పెట్టటం...స్నానం చేయించటం...పిల్లలతో కుస్తీ పడటం మావల్ల కాదు!' అని సనుగుతారు.

అందరూ ఓపిక ఉండే చేస్తున్నారా?

నీ కొడుకు నిన్ను ఉంచుకుని మంచిగా పరామరిస్తూ ఉన్నప్పుడు, అతనికి నువ్వు సహాయం చేసే కావాలి.

యంగ్ జనరేషన్ కి మాత్రమే బాధ్యత ఉండాలి అనేదే కాదు జీవితం, పెద్దవాళ్లకూ అది ఉండాలి అనేదే జీవితం.

ఇక్కడ ఏదీ నిర్భంధం కాదు.

చెయ్యను అని విధిలించికొడితే, ఎవరూ భుజాలు ఎక్కి కూర్చోరు.

కానీ, కుటుంబం నలిగిపోతుంది.

రక్త సంబంధమైనా పరస్పర అనుకరణ, సహాయాలు --  ఇవే బంధుత్వాన్ని మోయగల స్థంబాలు.

దీన్ని ఇరు వర్గాలు, అంటే రెండు జనరేషన్లూ అర్ధం చేకుంటే మంచిది.

లేక పోతే బంధుత్వం తెగిపోతుంది.

సత్యా యొక్క పిల్ల ఏడ్చి, గోల చేయటం మొదలుపెట్ట...

పిల్లకు ఆహారం తయారు చేయటానికి వంటింట్లోకి వచ్చింది.

వంటింట్లోకి ఆమె వచ్చి చాలా నెలలు అయ్యింది.

తల్లీనూ, సరోజానూ అన్నీ చేతికి అందించేవారు.

పిల్లను చూసుకోవటం కూడా చేసేరు.

స్నానం చేసి, తినేసి, మెగా సీరియల్స్ చూసి...గొడవకు మాట్లాడి, ఉంటున్న వాళ్ళ తలలను దొర్లించి జీవించేసింది.

ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలయ్యింది.

వంట గదిలో ఏది ఎక్కడున్నదో కూడా తెలియటం లేదు.

వెతికి కనుక్కుని...అన్నం, పప్పు, చారు రెడీ చేసి పిల్లకు నోట్లో పెడితే...పిల్ల ఉమ్మేసింది.

చారులో ఉప్పు, పులుపు ఏదీ లేదు.

అన్నం సరిగ్గా ఉడకలేదు.

పిల్ల ఆకలితో ఏడవటం మొదలుపెట్టింది.

సత్యాకి కోపమూ, ఏడుపూ వచ్చింది. చేతిలో డబ్బు లేదు. వేగంగా వెళ్ళి బీరువా తెరిచి వెతికింది.

ఏమీ లేదు.

ఇల్లంతా పచారి సరకులు, కాయగూరలు, పాలుతో నిండి పోయింది.

ఆహారం రెడీ చేసేంత ఓర్పూ లేదు. చేతివాటమూ లేదు.

పిల్లకు పాలు కాచి ఇచ్చింది. ఆపిల్ పండును ముక్కలు చేసి ఇచ్చింది. బిస్కెట్ ఇచ్చింది.

పిల్ల అవి తినేసి నిద్రపోయింది.

ఆమెకే ఆకలి వేసింది. పెట్టిన చారును కొంచం సరిచేసి, ఉడకని అన్నంతో తిన్నది.

సరోజా వంట బాగా చేస్తేనే అందులో తప్పులు కనిబెడుతుంది.

'ఒక్కొక్క ఇంట్లోనూ వంట ఎలా ఉంటుందో తెలుసా? మనింట్లో వంట రుచే ఉండదు. నోట్లో పెట్టుకోలేకపోతున్నా'

"బాగానే కదవే ఉంది?"

"అమ్మా నీకు తలరాత...ఆమె వంటను తినే జీవించాలని రాసుంది. నా వల్ల కుదరటం లేదు. నాన్నా డబ్బులివ్వండి. నేను హోటలుకు వెళ్ళి తింటాను"

"అమ్మ దగ్గర తీసుకో..."

"అమ్మా...ఐదు వందలు ఇవ్వు"

"దేనికే?"

"ఇవ్వు గిరిజా...అడుగుతోంది కదా" -- తండ్రి యొక్క సపోర్ట్.

అమ్మ తీసిస్తుంది.

ఆమె భర్త కూడా బయలుదేరటంతో,

"పిల్లను చూడమ్మా! మేమిద్దరం వెళ్ళొస్తాం"

ఇలాంటి రోజులు!

ఇంట్లో చివరి కూతిరిగా పుట్టి పెరిగిన కారణం చేత కుటుంబం మొత్తం కలిసి ఆమెకు చనువు ఇచ్చి, పూర్తిగా చెడిపి ఉంచారు.

ఈ రోజు ఈ విడిపోవటానికి ఆమెను మాత్రమే తప్పు పట్టుకూడదు.

మొక్కగా ఉన్నప్పుడే తీసిపారేసుంటే.

అది చెట్టుగా అయిపోయినందువలన, కుదరకుండా పోయింది.

తాను అడిగింది దొరకటం, అనుకున్నది జరగటం ఉండటం కారణంగా...జీవితం ఆమె చేతుల్లోనే ఉండిపోయింది. ఆమె చూసింది అందులోని ఎదుగుదల మాత్రమే...దిగిపోవటం చూడలేదు.

ఇదిగో ఆమె దాన్ని కలుసుకోవటం మొదలుపెట్టింది.

అదేమో ప్రారంభమే!

***************************************************PART-6*****************************************

ఒకే రోజులో గిరిజానూ, సరోజానూ ఇంటిని అందంగా చేసేశారు.

రాత్రి డిన్నర్ తయారైంది. ముగ్గురూ తిని, పిల్లను నిద్ర పుచ్చింది  సరోజా.

"అత్తయ్యా! ఇన్ని రోజులు మీరు కష్టపడింది చాలు. ఇక నేను చూసుకుంటాను. పిల్లను చూసుకోవటానికి మీరొచ్చాశారు. నాకు అదే చాలు"

"లేదమ్మా...ఇప్పుడు నేను ఉత్సాహంగానే ఉన్నాను. ఇద్దరం కలిసి చేద్దాం. రఘూ ఇదిగో...నాన్న ఇచ్చిన డబ్బులు. ఉంచుకో"

"వద్దమ్మా!"

"లేదురా...ఫ్యామిలీ ఖర్చుకు ఎంతొచ్చినా చాలదు. ఇది ఉంచు"

"ఏమండీ...మామూలుగా మనిద్దరం జీతాన్ని అక్కడ అత్తయ్య దగ్గర ఇచ్చేలాగానే, ఇక్కడ కూడా అత్తయ్య దగ్గరే ఇద్దాం. ఆమే ఫ్యామిలీని రన్ చేయనీ. ఇల్లు మాత్రమే మారింది తప్ప...మిగత వాటిల్లో మార్పు వద్దు"

"లేదమ్మా...ఇక ఈ ఇంటి నిర్వహణ నువ్వు తీసుకో. ఇది నీ ఇల్లు"

"లేదు అత్తయ్యా! ఇది మన ఇల్లు. ఈ కుటుంబానికి ఎప్పుడూ మీరే హెడ్. అందులో మార్పు లేదు"

గిరిజా ఆశ్చర్యపోయింది.

"ఉద్యోగంలో లాగా ఇంట్లోనూ ఆడ వాళ్లకు 'రిటైర్మెంట్' ఇవ్వాలి సరోజా. హెడ్ స్థానాన్ని వదిలి పెట్టను అంటూ మొండితనం చెయ్యకూడదు"

"అత్తయ్యా! మీరు ఇంటి పనులు చేస్తున్నారు. రోజు మొత్తం పిల్లను చూసుకుంటారు. దానికి రెస్టు ఇస్తున్నారా? ఇప్పుడంతా చిన్న వాళ్ళు తమ అవసరాలకు పెద్ద వాళ్లను ఉపయోగించు కుంటున్నారు. అది మాత్రం న్యాయమా? మీరు కుటుంబాన్ని బాగా నడుపుతారు! మేము అందులో తృప్తిగా జీవించిన వాళ్లం. ఓపిక లేక పోతే...బాధ్యతలను చేయి మార్చుకుందాం. సరేనా...? మీరే నడపాలి"

"సరేనని చెప్పమ్మా..."

"సరేనయ్యా...మీ అభిమానాన్ని కాదనలేను"

"అత్తయ్యా! మావయ్యకు రేపటి నుండి కరెక్టుగా వంట చేసి ఇస్తారా?"

"దానికి అవసరం లేదమ్మా...మన వీధి చివర పంతులు మెస్ ఉంది కదా...?"

"అవును! మీ చేతి రుచి అక్కడ ఉంటుంది"

"అక్కడ నేను మాట్లాడి ఏర్పాటు చేసాను. అక్కడ ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఆయన్ని గమనించకపోతే, మావయ్య అక్కడ తింటారు. ఏ సమస్యా లేదు. ఆయనకు కావలసిన రుచికి తగినట్లు ఉప్పు, కారం వేసి గ్రాండుగా వంట చేస్తారు. క్లియర్ గా చెప్పుంచాను"

"అమ్మా...నువ్వు చాలా గొప్ప దానివమ్మా!"

"మీ నాన్నను నేను చిక్కిపోనివ్వను. వేరు బడటం వలన పలువురి ముఖాలు బయటకు వస్తాయి. వెయిట్ చేసి చూడండి. రేపు మీరిద్దరూ పనికి వెళ్తున్నారా?"

"నువ్వు సెటిల్ అయ్యేంత వరకు లీవు పెట్టాలమ్మా?"

"ఎందుకబ్బాయ్! నేను 'సెటిల్ ' అయిపోయాను. లీవులను వేస్టు చేయొద్దు. రెగులర్ జీవితానికి వచ్చేయండి"

"పిల్లను తీసుకుంటాం"

"అది ఈ రోజు నాతోనే నిద్రపోనీ! కొత్త ఇల్లు -- కొత్త కాపురం. అన్నీ జరగనీ...వెళ్లండి"

ఇద్దరూ సిగ్గుతో నవ్వారు.

"కోడలు ఎప్పుడూ మంచిగా జీవించాలని అనుకునే అత్తగారు మీరే అత్తయ్య"

"నువ్వు నాకు కోడలు పిల్లవి కావు. స్నేహితురాలివి. మనిద్దరి మధ్యా రహస్యం లేదు సరోజా. నా కొడుకును సంతోషంగా ఉంచుకునే శక్తి నీకు మాత్రమే ఉంది. ఇద్దరూ వెళ్లండి"

గిరిజా తన గది లోపలకు వెళ్ళింది.

సెల్ ఫోన్ తీసుకుని నెంబర్లు నొక్కింది.

భర్త తీశారు.

"పడుకున్నారా?"

"ఊహూ! నిద్ర రావటం లేదు గిరిజా. నువ్వు లేకుండా..."

"కొన్ని రోజులు ఓర్పుగా ఉండండి. రంగు అంతా అతి త్వరలోనే వెలిసిపోతుంది. మీరు దేనికీ ఆందోళన పడరు. అది నాకు తెలుసు. తినకుండా ఉండరు. అన్నీ మాట్లాడి ఉంచాము. వాళ్ళు ఏం చేస్తారనేది చూసుకుని నిర్ణయం తీసుకోండి"

"జ్యోతీ ఏదీ చెయ్యదు. సత్యా కథ తెలిసిందే? వదులు...నువ్వు నిద్రపో. పిల్ల జాగ్రత్త"

ఆయనా పడుకున్నారు.

ఎప్పటిలాగానే తెల్లవారు జామున ఐదు గంటలకే లేచి, మొహం కడుక్కుని రెడీ అయిపోయారు.

అదే సమయానికి సరోజా కాఫీ గ్లాసుతో ఎదురుగా ఉండేది.

ఆ చోటు ఇప్పుడు ఖాలీగా ఉంది.

కొన్ని రోజులు గిరిజా తీసుకు వచ్చేది. అది కూడా మిస్సింగ్!

ఆయన 'జాగింగ్' డ్రస్సుతో బయటకు వచ్చారు.

ఒక రౌండు ముగించుకుని పంతులు మెస్ కు వచ్చారు. వేడి వేడి కాఫీ చేతులు మారింది.

"బ్రహ్మాండం!"

"డికాషన్ చిక్కగా, చక్కర తక్కువగా వెయ్యండని సరోజమ్మఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఎనిమిదింటికి వస్తారా...ఇడ్లీ,ఉప్మా,అట్టు రెడీగా ఉంటుంది?"

"ఏడున్నరకి ఫోను చేసిన తరువాత రెడీ చెయ్యి"

"సరేనండి!"

ఆయన ఆరున్నరకు ఇంటికి వెళ్లగా, ఇల్లు అదే చీకటిలో ఉంది. ఎవరూ లేచినట్టు లేరు.

యోగా చేసి ముగించారు. పది నిమిషాల గ్యాప్ తరువాత స్నానం చేశారు. దన్నం పెట్టుకున్నారు. టైము ఏడున్నర.

చలపతి లేచి రెడీ అయ్యాడు.

"బయలుదేరావా చలపతి?"

"అవును నాన్నా...రెండు పూట్లా భోజనం క్యాంటీన్లోనే. వస్తాను"

"మీరు కాఫీ తాగారా...టిఫినుకు ఏం చేస్తారు?" ఇలా ఎలాంటి ప్రశ్న అతడి నుండి రాలేదు.

ఆయన డ్రస్సు మార్చుకున్నారు.

సత్యా లేచి వచ్చింది.

"అమ్మా...కాఫీ ఇవ్వు"

ఆయన మాట్లాడకుండా నిలబడ్డారు.

"అమ్మా...నీ చెవిలో పడలేదా?"

నిద్ర మత్తులో సత్యా.

ఆయన మాట్లాడకుండా ఫోను తీసారు.

అమ్మ లేని విషయం సత్యాకి అప్పుడే అర్ధమైయ్యింది.

జ్యోతీ లేచి వచ్చింది.

"వదినా! కాఫీ పెట్టివ్వండి. టిఫిన్ రెడీ చేయండి" సత్యాను చూసి చెప్పింది.

"దేనికి... నువ్వేం వెలగబెడుతున్నావు...నువ్వే చెయ్యి"

"నాన్న 'ఆఫీసు 'కు బయలుదేరుతున్నారు. ఆయన ఏమీ తినకుండా వెళుతున్నారు"

"అలాగా! ఆ అక్కరనీకు లేదా? ఆయన కన్న కూతిరివే కదా నువ్వు! ఆయన ఏ టైముకు ఆఫీసుకు బయలుదేరతారనేది నీకు తెలియదా? లేచి చేసివ్వు"

"మీరే కదా ఈ ఇంటి కోడలు. మీరే చెయ్యాలి"

"నువ్వు ఏ ఇంటికీ కోడలు కావా?"

"మా ఇంట్లో నేనే చేస్తాను"

"చించావు! నువ్వు మీ ఇంటికి వెళితేనే చేస్తావా? ఇక్కడేమో బంక వేసుకుని అతుక్కుని కూర్చున్నావు? తరువాత రూల్స్ మాట్లాడుతున్నావా? ఇది మా నాన్న ఇల్లు. నన్ను తరమటానికి ఎవరికీ హక్కు లేదు"

"ఎవరు తరిమింది...దారాళంగా ఇక్కడే ఉండు. నీకు కావలసింది వండుకు తిను. ఎవరు అడ్డుపడుతున్నారు? నీకూ చేతులున్నాయి కదా? నీకు వంట చేసి పెట్టటానికి నేనేమీ వంట మనిషిని కాదు. అర్ధమయ్యిందా...? నా భర్త క్యాంటీన్లో తింటున్నారు. దానికే నేను బాధపడలేదు. నువ్వు ఎవరు నాకు?"

సత్యా స్టన్ అయ్యింది.

"నీ ఆటలన్నీ సరోజా దగ్గర చూపించు. నా దగ్గర వద్దు"

తండ్రి చూస్తూ ఉండిపోయారు.

సత్యా తండ్రి దగ్గరకు వచ్చింది.

"చూడండి నాన్నా...వదిన ఇలా మాట్లాడటం సరేనా?"

ఆయన సమాధానం చెప్పలేదు.

బయటకు వచ్చారు. డయల్ చేసారు.

"టిఫిన్ చేయండమ్మా. నేను వస్తూ ఉన్నాను"

వాకిలి దిగి నడుచుకుంటూ వెళ్ళారు.

'మెస్ ' లో పొగలు కక్కుతున్న టిఫిన్ రుచిగా-రెడీగా ఉంది.

"తిన్నారా? ఆయనకు నచ్చిందా? ఫోను ఆయనకివ్వు!" మెస్ యజమానికి ఫోను వచ్చింది.

ఫోన్ చేతులు మారింది.

"బాగుంది గిరిజా "

"రోజూ ప్రొద్దున్నే రకరకాలుగా మీకు నచ్చినవి చెయ్యమని మెస్ యజమానికి చెప్పాను. మధ్యాహ్నం నేను 'క్యారేజీ' పంపుతాను. రాత్రికి ఇక్కడికి వచ్చి తినేసి వెళతారా?"

"అన్ని రోజులూ కుదరదు గిరిజా!"

"వారానికి మూడు రోజులు రండి. మిగిలిన నాలుగు రోజులూ మెస్ లో చపాతీలు వేయమంటాను"

"సరే గిరిజా!"

"ఈ రోజు డిన్నర్ కు వచ్చేయండి"

"ఖచ్చితంగా!" -- మాట్లాడి ముగించి ఆయన బయలుదేరారు.

ఇంట్లో జ్యోతీ స్నానం చేసి, దేవుడ్ని ప్రార్ధించుకుని, పిల్లలకు స్నానం చేయించి, వాళ్ళకు ప్రొద్దున--మధ్యాహ్నం ఆహారం తయారు చేసింది.

"నా పిల్లకు?" -- అడిగింది సత్యా.

"నువ్వూ అమ్మే కదా! చేసుకో...

పిల్లలను పంపించి వచ్చింది.

ఆమెకు మాత్రం కొంచంగా ఉప్మా చేసుకుని, సాంబార్ పెట్టుకుంది. తిన్నది. మిగిలిన సాంబారును ఫ్రిడ్జ్ లో పెట్టేసింది.

"ఇదిగో చూడూ. ఇది నా లంచ్ కు. నువ్వు సిగ్గులేకుండా అది పోసుకుని తినకు! తెలిసిందా?"

సత్యాకి కోపం ఎక్కువైయ్యింది.

పిల్ల 'ఆకలి 'అని ఏడుస్తుంటే, ఆమె స్నానం కూడా చెయ్య లేదు.

తల్లి ఉన్నంతవరకు--అన్నీ చేతికి వచ్చేవి. ఇప్పుడు అదంతా లేదు.

పిల్లకీ, తనకీ ఇడ్లీలు వేసుకుందామని అనుకుంటే పిండి లేదు. వాడికి ఉప్మా నచ్చదు. ఇంకేం చేయాలి?

ఏడుపూ,కోపం ఎక్కువ అయ్యింది.

అమ్మకు శాపం ఇచ్చింది.

ఆవేశంగా 'ఫోన్ ' చేసింది.

గిరిజా ఎత్తింది.

"ప్రొద్దున నుండే నేను పస్తు! జ్యోతీ వదిన తనకు మాత్రమే చేసుకుంటోంది. నాన్న తినకుండా వెళ్ళిపోయారు. ఇంట్లో ఏది ఎక్కడుందో తెలియటం లేదు! మా ఆయన లేడు. చేతిలో డబ్బూ లేదు. నువ్వంతా ఒక తల్లివా? ఇలా తపించి పోయేలాగా వదిలేసి వెళ్ళిపోయావే...బాగుంటావా నువ్వు?"

"నీకెందుకే పెళ్ళి చేశాము...ఇక్కడకొచ్చి మిగిలిన వారి ప్రాణాలు తీయడానికా? ఆ ఇంటికీ, నాకూ సంబంధం లేదు. నేను నా కొడుకు ఇంటికి వచ్చాశాను. ఇకమీదట నీ ఫోను వస్తే ఎత్తను. పెట్టేయి"

సత్యా కృంగిపోయింది.

ఇప్పుడు కూడా తాను తన అత్తగారి ఇంట్లో ఉండకుండా, పుట్టింట్లో ఉంటూ తప్పు చేస్తున్నది, బద్దకం, మిగిలిన వాళ్ల వీపు మీద ఎక్కి కూర్చుని జీవితాంతం సవారి చేయాలని ఆశపడే స్వార్ధం, నోటి దురుసు, పోట్లాట పెట్టుకుని మంచి బంధుత్వాలను సైతం గాయపరిచే జంతు గుణం, ముదిరిపోయిన తలబిరుసు తనం...వీటన్నిటినీ మానుకోవాలనే ఆలొచనే రాలేదు. తనని ఆవగింజంత కూడా మార్చుకోవాలని అనిపించలేదు.

ఒక మనిషికి జరిగే ప్రతిదానికీ కారణం ఆ మనిషే. అతనికి ఎవరూ శత్రువులు ఉండరు. అతనికి అతనే శత్రువు!

ఎందుకు పగ? ఎందుకా పోట్లాట--కోపం? అది న్యాయమా? వీటన్నిటి గురించి కూర్చుని ఆలొచించే ఓర్పో--మనసో చాలామందికి లేదు.

పట్టుదల, ఈగో,ముక్కోపం,చటుక్కున మాట్లాడే గుణం...వీటన్నిటినీ ఉడుము పట్టులాగా పట్టుకుంటే ఎవరికీ నచ్చదు. వారికి జీవితంలో విరక్తి మాత్రమే మిగులుతుంది!

ఇప్పుడంతా చాలామంది గొడవలు పడటానికి ఇష్టపడటం లేదు.

మాటకు మాట అని పోటీ పడటం లేదు.

గొడవల్లో గెలిచే వారు...జీవితంలో ఓడిపోతున్నారు. ఇది వాళ్ళకు అర్ధమే కావటం లేదు!

సత్యాకు కూడా ఇది అర్ధం కాలేదు.

భర్తకు ఫోను చేసింది.

"నేనింకా టిఫిన్ కూడా చెయ్యలేదు. ఖాలీ కడుపు. కడుపులో మంట! నా కష్టం అర్ధమవుతోందా? సాయంత్రం రండి...మాట్లాడాలి. అర్జెంటుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి"

"లేదు సత్యా ! నేను రాలేను. అమ్మకు పంటి నొప్పి. కష్టపడుతోంది. ఆ నొప్పితోనే ఇంటి పనులు కూడా చూడటం వలన కళ్ళు తిరుగుతున్నాయట. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి"

"నేను మీ భార్యను"

"అయితే మనింటికిరా. బాధ్యతలు తీసుకో...ఎందుకు అక్కడే కూర్చోనున్నావు?"

"నేను మాట్లాడితే తట్టుకోలేరు"

"ఛీఛీ...ఫోను పెట్టేయ్!"

అతనికి కోపం ఎక్కువై ఫోనును స్విచ్ ఆఫ్ చేసేశాడు.

ఆకలి తట్టుకోలేక సత్యా బియ్యం కడిగి, కుక్కర్లో పెట్టింది.

కొద్ది నిమిషాలలో అన్నం రెడీ అయ్యింది.

ఇంట్లో కందిపొడి, ఊరగాయ, చిప్స్,  పెరుగు అన్నీ ఉన్నాయి. వేసుకుని తిన్నది.

ఆలస్యంగా స్నానం చేసింది.

పనిమనిషి రానే లేదు.

ఉతకవలసిన బట్టలు చాలా ఉన్నాయి.

ఇల్లు ఊడ్చి, తుడవలేదు.

కడుక్కో వలసిన వంటగిన్నెలు అలాగే ఉన్నాయి.

పిల్ల మళ్ళీ ఏడ్చింది.

పనిమనిషి ఫోన్ నెంబరూ తెలియదు. అమ్మకు ఫోను చేసింది.

ఆవిడ ఫోను ఎత్తలేదు.

బయటకు వెళ్ళిన జ్యోతీ--ఇంకా రాలేదు.

పిచ్చి పట్టేటట్టు ఉన్నది.

అమ్మ-- సరోజా ఉన్నంత వరకు ఇల్లు శుభ్రంగా కనబడేది. ఏ పని కూడా మిగిలి ఉండదు.

ఏ సమయంలోనైనా ఆహారం దొరుకుతుంది.

ఆకలి అనే మాటకు ఆ ఇంట్లో ఎవరికీ అర్ధం తెలియదు.

కనుక...ఒకలాగా, ఆవేదనగా ఉంది.

***************************************************PART-7*****************************************

రాత్రి ఏడు గంటలకు సరోజా వచ్చింది. పిల్ల ఆడుకుంటున్నది. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నది.

"అత్తయ్యా...రేపట్నుంచి పనికి పనిమనిషి వస్తుంది"

"ఎందుకు సరోజా? వాషింగ్ మిషన్ ఉంది. బట్టలు ఉతికేయచ్చు. అంట్లు తోమి,ఇల్లు ఊడ్చి, తుడుచుకోవటం ఒక కష్టమా?"

"మీరు కష్టపడుతున్నారే...?"

"ఇదంతా ఒక కష్టమా? గ్రైండర్ వేసి పిండి రుబ్బాను. పచారి సరకులు వచ్చాయి. కూరగాయలు కొనుకొచ్చాను"

"పిల్లను ఎత్తుకున్నారా...?"

"అందులో కష్టం ఏముంది"

రఘూ లోపలకు వచ్చాడు.

"అమ్మా! నువ్వు ఎక్కువ శ్రమ తీసుకోకు!"

"లేదబ్బాయ్! ఇది శ్రమే కాదు!"

"రాత్రి డిన్నర్ కు ఏం చేద్దాం అత్తయ్యా!"

"చపాతీ చేసి హాట్ ప్యాక్ లో పెట్టాను. పాలల్లో పంచదార వేసుకుని, చపాతీ ముక్కలను నానబెట్టుకుని తింటాడు రఘూ. మనకి కుర్మా రెడీ"

"నేనొచ్చి చేస్తానుగా అత్తయ్యా?"

"స్కూల్లో పిల్లలతో అరిచి అరిచి అలసిపోయి వస్తావు. ఆ ఇంట్లో నువ్వు పడ్డ కష్టం చాలు. ఇక్కడ నీ పని భారాన్ని నేను తగ్గిస్తాను"

'కాలింగ్ బెల్ ' మోగటంతో...తలుపు తెరవగా...తండ్రి నిలబడున్నారు.

"రండి మావయ్యా!" అన్న సరోజా వెంటనే కాఫీ తెచ్చింది.

"అక్కడ ఏం జరుగుతోంది?"

"నా గురించి ఎవరూ పట్టించుకోలేదు. చలపతి బయలుదేరి వెళ్ళిపోయాడు. జ్యోతీ- సత్యా మధ్య పెద్ద గొడవ. జ్యోతీ, తన పనులను మాత్రం చూసుకుంది. సత్యా దాని దగ్గర నోరు పారేసుకుని మాటలు పడ్డది. అందరూ సరోజా లాగా ఓర్చుకుంటారా?"

తల ఎత్తి చూశారు.

లేచి సరోజా దగ్గరకు వచ్చారు.

"అమ్మా సరోజా! మీతో పాటూ అత్తయ్య బయలుదేరి వస్తున్నప్పుడు నేను మౌనంగా ఉన్నప్పుడు -- నేను సత్యాకి 'సపోర్ట్ ' చేస్తున్నానని నువ్వు తప్పుగా అనుకోనుంటావు!"

"లేదు మావయ్యా! మీ గురించి నాకు తెలుసు"

"అత్తయ్యను మీతో వెళ్లమని చెప్పింది నేనే"

"ఏమిటి నాన్నా చెబుతున్నారు?"

"అవును రఘూ! లేకపోతే మీ అమ్మ నన్ను విడిచిపెట్టి వస్తుందా? ఇంట్లో జరుగుతున్న విషయాలు సరి లేవు, అని మేమే ఈ ప్లాను వేశాము. నువ్వు ఆవేశపడి, వేరుగా రావటానికి ప్లాను వేసినప్పుడు...ఆలొచించటం మొదలు పెట్టాము. ఎక్కువగా చర్చించుకున్నాము. ఐడియా వచ్చింది"

"నాన్నా...మీరు మామూలు వారు కాదు. సరి...కుటుంబ హెడ్ కదా మీరు! అందరినీ పిలిచి తిన్నగా మాట్లాడుండచ్చే"

"లేదబ్బాయ్...అది సరిగ్గా రాదు. సత్యా, మిగిలిన వారి వెన్ను మీద సవారి చేసే స్వార్ధ పరురాలు. జ్యోతీ ఇంకో విధం. తన భర్త--పిల్లల గురించి మాత్రమే ఆలొచిస్తుంది"

అమ్మ లోపలకు వచ్చింది.

"అందమైన ఉమ్మడి కుటుంబం. అందులో స్వార్ధం నిండిన బంధువులు. నేను తల్లిని...వదిలేయి! కానీ, సరోజా ఒక్కత్తే అక్కడ మంచిది. పోయిన సంవత్సరమే మేము ఆలొచించాము. మీ ఇద్దరినీ వేరేగా పెట్టేద్దామని...

అలా చేస్తే మీకే తప్పుగా అనిపించవచ్చు. విడిపించుకుంటున్నారు అనుకుని కోపం తెచ్చుకోవచ్చు. అదే సమయం మీకే విసుగు అనిపించి, ఆ నిర్ణయాన్ని మీరిద్దరూ తీసుకోవాలని మేము కాచుకోనున్నాము. ఇది ఇప్పుడే జరిగింది

"అమ్మ ఆ ఇంట్లో ఉంటే...అన్నీ వేరుగా జరుగుతాయి. మీ గొప్పతనం ఎవరికీ తెలియదు. అందుకే ఈ ఆలొచన"

"నాన్నా...మీ గురించి ఆ ఇంట్లో ఎవరూ పట్టించుకోరు. ఆ తరువాత ఆ ఇంట్లో మీరెందుకు ఉండటం?"

"చూడు రఘూ, ఇప్పుడు నేను అక్కడుంటున్నది, అక్కడున్న మనుషులకోసం కాదు. ఆ ఇంటి కోసం! నేను అక్కడ లేకపోతే ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోకుండా, చెత్త కుండీలా చేస్తారు"

"ఎందుకు మావయ్యా...ఒక ఆలయం, చెత్త కుండీ అవాలి?"

"అవకూడదు సరోజా! చెత్త కుండీగా అయితేనే కదా...దాన్ని ఆలయంగా ఉంచుకున్నవారి గొప్పతనం తెలుస్తుంది"

"వదిన్ని అంచనా వేయలేకపోతున్నాం నాన్నా...కానీ, సత్యా ఖచ్చితంగా మారదు"

"అది మారాలని మేమూ ఎదురు చూడటం లేదురా. కానీ, జీవితంలో దెబ్బ తినాలి, అవమానపడాలి. ప్రేమగా, మంచి మాటలతో అమ్మ దానికి ఎన్నో సలహాలు ఇచ్చింది. ఒక స్టేజుకు పైన పుట్టింట్లో సుఖం చూసేస్తే...అత్తగారింటికి వెళ్ళి జీవించాలనే అనిపించదు. అది చాలా అపాయం...అవమానం...అసహ్యం అని చెప్పి చూశాము. ఇంటి పనులు చేసే అలవాటు అది వదిలేసింది. కన్నవారు ఉన్నంతవరకు కుటుంబ నిర్వాహం గురించి దానికి బాధలేదు. 'నేనే మహారాణీ'ని అని అనుకుంటోంది. మేమేమన్నా వందేళ్లా బ్రతుకుతాము? ఆ తరువాత దాని గతి?"

గిరిజా ముఖంలో అవేదన కనబడింది.

"కన్ను కొడుకు మీద తండ్రికి తపన లేదు. తండ్రికీ, కొడుకుకూ బంధం లేదు. పిల్లాడితో ఉంటేనే కదా బంధం బలపడుతుంది. పిల్లాడు తండ్రి దగ్గరకు వెళ్ళేది? ఆయన ఇక్కడికి వచ్చి ఉండగలడా? ఇదేమో జీవితాన్ని కొంచం కొంచంగా పోగొట్టుకుని వెళ్తోంది. కారణం, పిల్లాడ్ని చూసుకోవటం కోసం అని వాడి మీద నెపం వేస్తోంది. ఇరువైపుల పెద్దవాళ్ళూ లేకుండా ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ను పెంచుకోవటం లేదా?"

"నాన్నా...కోపగించుకోకండి! తప్పు మన మీద కూడా ఉంది. కరెక్టుగా చెప్పాలంటే తప్పంతా కన్నవాళ్ళ ఇద్దరిపైనా ఉంది. ఇదివరకే నేను చెప్పాను...మీరు వినలేదు. అన్నా--తమ్ముళ్ళు ఎత్తి చూపినా...తోబుట్టువులను తరుముతున్నామని మా మీద కోపం వస్తుంది. మా భార్యల మీద నెపం వస్తుంది. ఆడపిల్లలను నాశనం చేసేదే వాళ్ళను కన్నవారే!"

"మేము దాన్ని తరమగలమా?"

"అలా కాదు నాన్నా! ఉద్యోగానికి వెళ్ళని మగాడు, పుట్టింటి సుఖాన్ని అనుభవిస్తున్న ఆడవాళ్ళూ బాగుపడినట్ట చరిత్రే లేదు. నష్టమూ, అనుమానమూ వచ్చి గొంతును నొక్కుతున్నప్పుడు...కన్నవారు కూడా ఒకరోజు వదిలేస్తారు. అల్లుడు దాని మీద నేరం మోపుతాడు. వాళ్ళ దాంపత్యం తెగుతుంది"

"నువ్వు చెప్పేదంతా న్యాయం! కన్న కూతుర్ని తరమటం మా వల్ల అవలేదు. అందుకే...నేను నీతో వచ్చేశాను"

"ఇలా చేయటం వల్ల అది మారుతుందా?"

"రఘూ! దాని దగ్గర నుండి పనులు చేయించుకోలేము. ఆకలై వేస్తోందని చెబితే భోజనం లేదని చెప్పలేను. కన్న బిడ్డను మేము పట్టించుకోకుండా ఉండలేము. కారణం...అది మా ఇల్లు. కానీ అది ఇక్కడ అదే హక్కుతో రాలేదు. ఎందుకంటే ఇది నీ ఇల్లు. నేను నీ దయలో ఉన్నాను"

"అమ్మా ఎందుకలా మాట్లాడతావు?”

ఉండరా! ఆ ఇల్లు నాన్న ఇల్లు అని అది ఉండచ్చు. కానీ, జ్యోతీ, సత్యాకు చుక్కలు చూపిస్తుంది. ఆకలి, దాహం, తపన, పిల్ల సమస్య ఏదీ జ్యోతీ పట్టించుకోదు. అదే సత్యాకు ట్రీట్మెంట్!"

"అవునండీ...మావయ్య, అత్తయ్యా చెప్పేది కరెక్టే"

"లేదు సరోజా! వీళ్ళ ప్లాన్ చాలా గొప్పది. కానీ, సత్యా మామూలు మనిషి కాదు. తన కార్యాన్ని సాధించుకోవటానికి ఎంత దూరమైనా వెడుతుంది"

"అలా ఆలోచించకురా!"

"అల్లుడు ఒకడే సంపాదిస్తున్నాడు. మంచి జీతమే. అందులోనే సేవింగ్స్ చేస్తున్నారు. సత్యాని, పిల్లను ఇక్కడ వదిలేసి...నెపాన్నిసత్యా మీద తోసేసి తప్పించుకుంటున్నాడు. ఇందులో నిర్ణయం తీసుకోవలసింది ఆయనే! ఆయనకు సిగ్గూ. సెరమూ లేదు. బాధ్యతలను మోయటం ఇష్టం లేదు.

ఇలాంటి వ్యక్తులు అవతలి వారి వీపు మీద ఎక్కి సవారి చేస్తూ కాలం గడిపేస్తారు. 'నేను కావాలనుకుంటే బయలుదేరి రా' అని ఆయన చెప్పలేరా? మేము వేరుగా వచ్చినట్టు వాళ్ళూ వేరుగా వెళితే జీవించ లేరా? సంసారం చెయ్యలేరా?"

"వదిలేయమ్మా...మనం వేరుగా వచ్చేశాము. ఇక సత్యా గురించి మాటలు ఎందుకుఅని తల్లికి చెప్పి, తండ్రివైపు తిరిగి,"నాన్నా...మీరు కష్టపడకూడదు. పర్మనెంటుగా ఇక్కడకు వచ్చేయండి" --అన్నాడు రఘూ

"వస్తానబ్బాయ్! దానికీ ఇంకా 'టైము' ఉంది” --అని చెప్పిన తండ్రి జగన్నాధం,భార్య వైపు తిరిగి, గిరిజా... మనింటి దగ్గర వంట సామాన్ల పరిస్థితి ఎలా ఉంది?" అని అడిగారు.

"ఇంకో రెండు రోజులకు వస్తాయి. కూరగాయలు ఒక రోజుకే వస్తాయి. మూడు రోజుల్లో ఒకటో తారీఖు వస్తోంది కదా?"

"రెండో తారీఖు -- నెలకు కావలసిన వంట సామాన్లు కొని నేను ఇక్కడ నింపేస్తాను. ..అక్కడ ఇక వాళ్ళు చూసుకోనీ"

"పనిమనిషి ఆండాల్?"

"ఆమెకు రెండు నెలలు సెలవు ఇచ్చాను...జీతంతో"

"అప్పుడు అక్కడ ఇంటి పనులు?"

"జ్యోతీనో, సత్యానో చేయనీ"

"చేస్తారా అత్తయ్యా?"

"సత్యాకి ఏమీ తెలియదు. జ్యోతీ ఖచ్చితంగా చెయ్యదు. ఇల్లు గబ్బు కొడుతుంది "

"అలా వదలగలమా?"

"వేరే దారి లేదు! వ్యాధి ముదిరితేనే కదా 'ఆపరేషన్' అవసరమవుతుంది సరోజా. మూడు 'బెడ్ రూము 'లు ఉన్నాయి. రోజంతా ఏసీ రన్ అవుతుంది. కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది. నీళ్ళను పొదుపుగా వాడుకోరు. ఎప్పుడూ లైటు వెలుగుతూనే ఉంటుంది. నాన్న, రఘూ కావాలనుకుంటేనే ఏసీ వేసుకుంటారు. అందువలన నాన్న దగ్గర పలు ఆర్డర్లు వేశాను. ఇక ఆ ఇంటి సంగతి ఆయన చూసుకుంటారు"

రఘూ కళ్ళు పెద్దవి చేసాడు.

"మావయ్య ఓపన్ గా మాట్లాడతారా? కుటుంబాన్ని ఇంత వరకు నడిపింది మీరే కదా అత్తయ్యా"

"మాట్లాడ వలసినంత వరకు ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు"

"సరే! ఆకలేస్తోంది గిరిజా...తినేసి నేను బయలుదేరతాను"

సరోజా వడ్డించింది.

జగన్నాధం వంటను ఎంజాయ్ చేస్తూ తిన్నారు.

"మధ్యాహ్నం నాన్నకు భోజనం పంపించాను రఘూ!"

"సరేనమ్మా! ఎప్పుడూ అలాగే చెయ్యి"

"మిగిలిన వాళ్ళను మార్చటానికి మనం ఇలా నాటకం ఆడలా?"

"ఇదంతా కావాలి సరోజా! స్వార్ధంతో జీవించే వారు...తమని మార్చుకోనే మార్చుకోరు. దెబ్బ తింటేనే బుద్ది వస్తుంది అంటే, ఆ దెబ్బ ఎవరో ఒకరు ఇచ్చే కదా కావాలి?"

అవును సరోజా! అమ్మ యొక్క హఠాత్త్ ఆపరేషన్ కరెక్టుగానే ఉంటుంది. అడ్డుపడకు"

నాన్న బయలుదేరారు.

"మావయ్యా! పదిమంది పిల్లలకు ట్యూషన్ తీద్దామనుకుంటున్నాను"

"టైము ఉందనా...డబ్బులు చాలటం లేదనా?"

"లేదు మావయ్యా! ఇంకా కొంచం సంపాదిస్తే, పిల్ల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా?"

"ఖచ్చితంగా! ట్యూషన్స్ తీయమ్మా. నేనూ నా మనవరాలికి నాకు కుదిరినంత వరకు సహాయం చేస్తామ్మా"

"అది నాకు తెలుసు మావయ్యా"

ఆయన బయలుదేరారు.

సరోజా – రఘూ ఇద్దరి మనసులలోనూ నమ్మకం అనే వెళుతురు ఎక్కువ పడింది!

***************************************************PART-8*****************************************

జ్యోతీ, పిల్లలతో కలిసి సాయంత్రం బయలుదేరింది. తిన్నగా గాంధీ పార్కుకు వచ్చింది.

చలపతి పది నిమిషాలలో వచ్చి చేరాడు.

పిల్లల చేతికి చాక్లెట్ ఇచ్చి ఆడుకోవటానికి పంపించి, ఇద్దరూ కూర్చున్నారు.

"ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు?"

"చాలా మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడలేను. కొన్ని నిర్ణయాలు తీసుకొవాలి"

"చెప్పు..."

"మీ నాన్న...మూడు పూట్ల బయట తింటున్నారు. ఇంట్లో మంచి నీళ్ళు కూడా తాగటం లేదు"

"ఇది సరిలేదు జ్యోతీ! అలా వదల కూడదు. ఆయనేం చేశారు...పాపం?”

నేను ఎనిమిదింటికి గానీ లేవలేను"

"అమ్మా, సరోజా ప్రొద్దున్నే నాలుగు గంటలకంతా లేచి టిఫినూ చేసి, చేతికి 'లంచ్' కట్టిస్తారు"

"నా వల్ల కాదు. అది వదలండి"

"సరే! నీకూ, పిల్లలకూ...?"

"నేను చూసుకుంటాను

"అప్పుడు సత్యా పిల్లకు?"

"దాని పేరే చెప్పకండి...బేవర్స్ గిరాకీ! చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా మనింట్లో పంచాయితీ చేస్తోంది. ఇది మీ నాన్న ఇల్లు. అంతే కాకుండా ఆయన, ఆయన జీతం మొత్తాన్ని ఈ ఇంటి ఖర్చులకు ఇస్తున్నారు. -- అందుకే ,అడిగే హక్కు నాకు లేదని వదిలేశాను. ప్రొద్దున నాతో పోట్లాడుతోంది. ఇది దాని ఇల్లా? ఏం చేస్తోంది? సిగ్గు లేదు దానికి? చేసుకుని తిన నివ్వండి. నేను దానికి పనిమనిషినా? పనిమనిషి రెండు నెలలు లీవు. ఇల్లే యుద్దభూమిగా ఉంది. సరి...నేను మాట్లాడాలనుకున్నది వేరు"

"చెప్పు"

మనం నలుగురం. నాన్నా, అమ్మా, సరోజా, రఘూ, పిల్లా, ఆ బేవర్స్ గిరాకీ, ఆ సిగ్గులేని అల్లుడు ఇలా పన్నెండుమంది ఉండేవాళ్ళం. వీరంతా కాకుండా వారానికి ఒకరు మీ పిన్నీ--మీ పెద్దమ్మ అంటూ మీ ఇల్లు ఒక హోటలు. ఇది ఇల్లా...ధర్మ సత్రమా? వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్లరు. నాలుగు రోజులు బస! అందులో బిరియానీ, నార్త్ ఇండియన్ భోజనం, ఛాట్ అంటూ మెనూ. మీ పెద్దమ్మ కూతురికి చేతితో అన్నం పిసికి వెన్నల భోజనం వేరే. అన్నిటికీ తల ఊపే సరోజా. ఈ కుటుంబం నాశనమవడానికి ఆమె లాంటి బానిసలే కారణం"

"ఎందుకు అంత కోపం?"

"విషయానికి వస్తాను! మీ అమ్మ రఘూతో వెళ్ళిపోయిన కారణంగా...మీ బంధువుల గుంపు ఇక్కడికి రాదు. రఘూ, పిల్లలతో కలిసి నాలుగు టికెట్లు మైనస్! మీ నాన్న కూడా ఇక్కడ తినటం లేదు. ఇక ఇక్కడ ఇప్పుడు మన కుటుంబం. ఆ పెంకి సత్యా, ఆమె సిగ్గులేని భర్తా, పిల్లా..."

"అల్లుడు రోజూ రావటం లేదే?"

"గారెలు వేసే రోజు వస్తాడు. ఆకలి వేసే రోజు వస్తాడు. ఆకలి తట్టుకోలేకపోతున్నానని గోల చేస్తాడు. ఊల్లో హోటలే లేనట్టు"

"సరే...చెప్పాలనుకున్నది చెప్పు"

"ఇంతవరకు మనం నలభై వేలు ఇచ్చాము. రఘూ కూడా ఇచ్చాడు. ఇక దానికి అవసరముండదు. ఆ సిగ్గులేని దానికి మనమెందుకు తిండి పెట్టాలి?"

"అది నా చెల్లెలే!"

"భర్త చనిపోయాడా? లేక...దాన్ని తన్ని తరిమేశాడా?"

"చాలు జ్యోతీ...అనవసరంగా మాట్లాడుతున్నావు?"

"తోడబుట్టిన అభిమానం పొంగుకు వస్తోందా? పరువు అంటే ఏమిటో ఆమెకు ఎవరూ నేర్పించలేదా? జీవించటానికి వచ్చిన అమ్మాయల గురించి మీ ఇంట్లో ఎవరూ బాధ పడరా?"

అతను మాట్లాడలేదు.

"మన ముగ్గురికి పాతికవేలు ఇవ్వండి...చాలు!"

"మిగిలింది?"

"మీ నాన్న వేసుకుంటారు. వనజాకు తిండి పెట్టే అవసరం ఆయనకే! మిగిలిన పదిహేను వేలు బ్యాంకులో డిపాజిట్ చెయ్యబోతాను"

"సరే! అమ్మే కదా అన్నీ చూసుకునేది. ఆమె ఇప్పుడు లేదే? నాన్నకు సమయం ఉందా? ఆయన చూసుకోగలరా...తెలుసా?"

"ఆయనే చూసుకోవాలి"

"అది కష్టం జ్యోతీ

"అప్పుడు నిర్వాహం మన చేతికి రానీ. నేను నడుపుతాను. బాధ్యతను ఇస్తారా?"

"నేను అడగ గలనా?"

"వదిలేయండి! ఆయన్నే చూసుకోనివ్వండి. పాతిక వేలు ఇచ్చేద్దాం"

"సరేనమ్మా! వంట, ఇంటి పనుల నిర్వహణ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు?"

"మనకి నేనే వంట చేస్తాను. మీ నాన్న తింటానంటే ఆయనకీ చేస్తాను. ఆ బేవర్స్ గిరాకీకి వండి పెట్టటం కుదరదు. ఆమె ఇన్ని రోజులు చేసిన పంచాయతీ చాలు!"

"సరే! పనిమనిషి లేదు. ఇంటి పనులు ఎవరు చేస్తారు...?"

"వేరే మనిషిని పెట్టుకోవాలి. నేను మాట్లాడుతాను. పని మనిషికి జీతం మీ నాన్నే ఇవ్వాలి. చెప్పేయండి"

"ఇల్లంటే, కేవలం వంట సామాన్లు, పాలు, కూరగాయలు మాత్రమే కాదు జ్యోతీ. చాలా ఖర్చులు ఉంటాయి. ఇల్లు శుభ్రంగానూ ఉండాలి"

ఇదిగో చూడండి...ఇప్పుడు కూడా పిల్లల ఖర్చులు, మిగతా ఖర్చులూ మనమే చూసుకుంటున్నాం. ఇంటి ఖర్చులకు మన వంతుగా ఇవ్వాలనుకుంటున్న పాతిక వేలే చాలా ఎక్కువ"

అతను మాట్లాడలేదు.

"ఏమిటి మాట్లాడకుండా ఉన్నారు?"

"ఇలా ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడ గలమా? అందులోనూ నాన్న దగ్గర...! ఒక పని చేద్దామా?"

"చెప్పండి..."

"మనం కూడా వేరు కాపురం వెళ్ళిపోదామా?"

"మీకేమన్నా పిచ్చి పట్టిందా?"

"ఒకే ఇంట్లో వేరు వేరుగా గడపటం దేనికి? మనసులు అతకవు. భాందవ్యం నచ్చలేదు. మనం మాత్రం జీవిద్దామనే స్వార్ధం తలెత్తింది. దీని తరువాత కూడా కలిసి ఉండాలని అనుకోవడంలో అర్ధం ఏముంది జ్యోతీ?"

"ఆలొచించరా?"

"దేని గురించి?"

"వేరుగా వెళితే...అద్దె పదిహేనువేలు ఇవ్వాలి. పది నెలలు అడ్వాన్స్. ఇంటికి కావలసిన వస్తువులన్నీ కొనడానికి మూడు లక్షలు. కుటుంబ నిర్వాహం మొత్తం గమనించుకోవాలి. వేరుగా ఒక పనిమనిషి. ఇదే నలభై దాటుతుంది. సొంత ఇల్లు ఉంచుకుని, ఎందుకు అనవసరంగా అద్దెకి...ఇక్కడ ఇరవై ఐదు వేలు విసిరేస్తే చాలు. ఉమ్మడి కుటుంబాన్ని మనం విడగొట్టామనే పేరు ఉండదు. ఇదంతా మీ బుర్రకు ఎక్కుతోందా?"

"కుటుంబం అని వచ్చేస్తే...ఎలాగా?"

"ఏడ్చినట్టుంది! నయాపైసా ఇవ్వకుండా ఒకత్తి రాజభోగం అనుభవిస్తోంది. ఆమెను తరమటానికి ధైర్యంలేదు. మనం వెళ్ళిపోతే, మీ నాన్న యొక్క మొత్త సంపాదనను తీసుకుని మింగేసి, ఆ మహారాణి ఇంటిని కూడా తనపేరుకు మార్చేసుకుంటుంది. పర్మనెంటుగా బంక రాసుకుని కూర్చుంటుంది. వదిలేస్తే దొరకదు. మనమూ జీవించాలి. దాన్నీ తరమాలి. తరిమి తరిమి వెళ్లగొట్టాలి"

"అది కష్టం! ఇది మా నాన్న ఇల్లు"

"మీకూ హక్కు ఉంది"

"రఘూకీ, సరోజాకీ కూడా ఉంది. వాళ్ళు వెళ్ళ లేదా?"

"నేను వెళ్ళమన్నానా? వాళ్ళకు రోషం ఎక్కువ అయితే...దానికి మనమా బాధ్యులం? ఆమె కూడా తెలివైనదే! మీ అమ్మగారిని తనతో తీసుకు వెళ్ళింది. మీ నాన్న డబ్బు బాగా ఇస్తారు?”

"సరోజా స్వార్ధపరురాలు కాదు!"

అది మీ నమ్మకం! ఆమె తెలివిగలది. మంచి యాక్టర్. వదిల్తే మొత్తాన్ని తీసుకుపోతుంది. మాట్లాడకండి"

"సరే...వదులు! నువ్వు త్యాగి...ఒప్పుకుంటున్నా"

"ఎగతాలి వద్దు. నేనెప్పుడూ మీకు కావాలి"

"అది నా తలరాత!"

"ఏం చెప్పారు?"

"వదులమ్మాయ్! నీతో యుద్దం చేయటానికి నా దగ్గర శక్తి లేదు"

"రేపు జీతం వస్తుంది. నేను చెప్పినట్టు చేయండి"

"ఊ...డైలాగులు రాసి ఇచ్చేయి. ఒక మాట కూడా మరిచి పోకుండా మాట్లాడతాను. సరేనా...?"

"ఇప్పుడు హోటల్లో తినేసి ఇంటికి వెళ్దాం. నేనొచ్చి వంట చేస్తానని ఆ బేవర్స్ గిరాకీ కాచుకోనుంటుంది. ఆమెకు ఒక పాఠం నేర్పించకుండా వదిలిపెట్టను"

వాళ్ళు తిని ముగించి ఇంటికి వెళ్ళినప్పుడు టైము పది.

జగన్నాధం కూడా అదే సమయానికే ఇంట్లోకి వచ్చారు.

"నాన్నా! మీరు డిన్నర్ చేశారా?" -- చలపతి అడిగాడు.

"లేదని చెబితే...ఎవరైనా చేసి పెడతారా చలపతి?"

అతని మొహం వాడిపోయింది.

సత్యా న్యూడుల్స్ చేసుకుని, ఆమె తిని, పిల్లకూ పెట్టింది.

"నాన్నా! పనిమనిషి మంగమ్మ రెండు నెలలు రానని చెప్పింది. ఇంటి పనులకు వేరే పనిమనుషిని వెంటనే ఏర్పాటు చేయాలి. నేను ఇద్దర్ని మాట్లాడి ఉంచాను. రేపే వస్తారు"

"ఎంత జీతం సత్యా?"

ఇంటి పనులకు మూడు వేలు, ఇల్లు ఉడ్చి, తుడిచి, అంట్లు తోమి, మూడు పూట్లా వంట చేయటానికి తొమ్మిది వేలు. మొత్తం పన్నెండు వేలు. రఘూతో కలుపుకుని ముగ్గురు మనుషులు తక్కువ అయ్యారే...ఆ ఖర్చు మిగిలినట్లేగా?"

"వాళ్ళ జీతం మన చేతికి రాదే?"

"మీ జీతం, అన్నయ్య జీతం ఉందే?"

జ్యోతీ లోపలకు వచ్చింది.

"మీ నాన్న జీతం గురించి మాత్రం మాట్లాడు. మీ అన్నయ్య జీతంతో నువ్వు 'బడ్జెట్' వెయ్యకు! నీ భర్త ఏం చేస్తున్నాడు?"

"వదినా...తప్పుగా మాట్లాడకండి"

"దీనికంటే ఘోరంగా మాట్లాడతాను"

"ఆయన సహాయం అవసరం లేదు! మాకూ కలిపి మా నాన్న ఇస్తారు. మీరు నోరు ముయ్యండి" అంటూ వదిన మీద అరిచి తండ్రి వైపు తిరిగింది సత్యా "నాన్నా రేపు ఇద్దరు పనిమనుషులు పనిపనిలోకి వస్తారు"

"లేదమ్మా...నా దగ్గర డబ్బులేదు. నీ భర్త ఇస్తానంటే ఇద్దరి పనివాళ్ళనూ, పనుల్లో పెట్టుకో...నాకు అభ్యంతరం లేదు"

"నాన్నా..."

"నేను ఇంట్లో తినబోయేదే లేదు. అందువలన వంట మనిషి అవసరం నాకు లేదు. నేను ఇంట్లో చెత్త ఏదీ పడేయను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. అందుకని నా పనులకు పనివాళ్ళు అవసరం లేదు. నేనెందుకు డబ్బు లివ్వాలి?"

"శభాష్!" -- జ్యోతీ చప్పట్లు కొట్టింది.

"నాన్నా...మీరూనా? నా సంగతెంటి? నేనూ, నా పిల్లా తినద్దా?"

"వంట చేసుకుని తినమ్మా...ఎవరు కాదంటారు?"

"మావయ్యా! ఇంతవరకు అత్తయ్య, సరోజా చేసి పెట్టటం వలన పొట్ట పెరిగింది. ఇప్పుడు అది జరగదుగా...?"

"మీరేం చెయ్యలేదుగా...?"

"నేనెందుకు నీకు వంట చేసి పెట్టాలి? నువ్వేమన్నా మంచాన పడున్నావా? నీ వల్ల కాకపోతే, నువ్వు చంద్రగిరి మహారాణిగా ఉంటే, కాళ్ళూ--చేతులూ పట్టించుకోవటానికి పనివాళ్లను పెట్టుకో. లేకపోతే నీ భర్తను వంటచేయమని చెప్పు"

"ఆయన మగవారు"

"అలాగా? విన్నారా చలపతి గారూ...దీని భర్త మగ వాడట" -- చెప్పి గట్టిగా నవ్వింది జ్యోతీ.

ఆవేశపడిన సత్యా, వెర్రితో దగ్గరకు వచ్చింది.

"ఏఒ మాట్లాడుతున్నావు? వదినా అని కూడా చూడను"

"రావే పిల్లా! నిన్నూ, పిల్లనూ ఇక్కడ వదిలేసి...వారానికి నాలుగు రోజులు వచ్చి రుచి,రుచిగా నాలుగు రకాల వంటలతో తినేసి, పది రూపాయలు కూడా ఖర్చు పెట్టని నీ మొగుడు మగాడిని చెబితే, ఆ మాటకే అసహ్యం. నోరు ముయ్యి!"

"నాన్నా! ఈమె నన్ను అవమానపరుస్తోంది...చూస్తూ నిలబడ్డారా?  నన్ను కన్నది నన్ను మురికి గుంటలోకి తోసేసి వెళ్ళిపోయింది..."

తండ్రికి కోపం వచ్చింది.

"ఆపు సత్యా! మీ గొడవలకు మధ్యలో నేను రాను. కానీ, మీ అమ్మ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే...నేను మనిషిగా ఉండను. ఆమె పని చేసి చేసి పనిమనిషిలా అయిపోయి, తట్టుకోలేక వెళ్ళిపోయింది. డబ్బును విసిరిపారేసి 'హాస్టల్లో' లాగా ఈ ఇంటి ఆడవారు జీవిస్తున్నారు. మీ అమ్మ గురించి గానీ, సరోజా గురించి గానీ మాట్లాడటానికి ఎవరికైనా అర్హత ఉందా? చిల్లిగవ్వ కూడా సంపాదించకుండా ఇంట్లో పంచాయతీ పెడుతూ, ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తుకు వస్తున్న ఆడవాళ్లను విమర్శించే ఆడవాళ్ళ నాలుకలను కోసిపారేయాలి"

జ్యోతీ ముఖం వాడిపోయింది.

"నేను నా భర్త సంపాదించిన డబ్బుతోనే తింటున్నా. పరువు మర్యాద లేకుండా మీ నాన్నపెడుతున్న తిండిని తినటం లేదు"

"జ్యోతీ...చాలు!"అరిచాడు చలపతి.

"ఏమిటండీ చాలు! అది ఇష్టం వచ్చినట్టు వాగుతోంది...నాన్న ఇల్లు కాబట్టి ఇక్కడ తనకే ఎక్కువ హక్కున్నదట? ఆమెకు వంట చేసి పెట్టటానికి మనిషి కావాలా? పుట్టిల్లే కదా! గోడలను గోక్కుని తిననివ్వండి. తలుపులు విరగొట్టి తినమనండి. నేనేం అడగను. పనులకు మనుషులట...సిగ్గులేకపోతే సరి?"

జ్యోతీ లోపలకు వెళ్ళిపోయింది.

చలపతి ఒక విధంగా కలవరపడ్డాడు. తండ్రి యొక్క దీర్ఘమైన చూపులు తనపైనే ఉన్నట్టు గ్రహించాడు...ఒళ్ళు జలదరించింది. ఆయన్ని తలెత్తి చూసే ధైర్యం లేకపోయింది.

తలను కొంచంగా వంచుకుని జరిగి వెళ్ళాడు.

సత్యా, తండ్రి దగ్గరకు వచ్చింది.

"నేను మాట్లాడాలి..."

"ఇంకానా? సారీ! రేపు నాకు 'ఆఫీసు' లో ఎక్కువ పనుంది. నేను నిద్రపోవాలి"

లోపలకు వెళ్ళి తలుపులు వేసుకున్నారు.

సత్యా మొహం...వాడిపోయింది.

***************************************************PART-9*****************************************

స్కూల్లో సరోజాకి చాలా మంచి పేరు. తెలివిగల 'టీచర్'. ఎప్పుడూ ఒక స్టూడెంట్ గుంపు ఆమె చుట్టూ ఉంటుంది.

హెడ్ మాస్టర్ కు కుడి భుజం.

ట్యూషన్ తీయటానికి రెడీ అన్న వెంటనే, పదిహేను మంది స్టూడెంట్స్ పేర్లు ఇచ్చారు.

లెక్కల్లో వీక్ గా ఉన్నవారు పదిమంది. మిగిలిన సబ్జెక్టులకు ఐదుగురు. వారానికి నాలుగు రోజులు క్లాసు. రోజూ ప్రొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట. ఒక స్టూడెంటుకు నెలకు వెయ్యి రూపాయలు.

ఇంటికి వచ్చిన సరోజా, అత్తగారి దగ్గర అనుమతి అడిగింది.

"దారాళంగా చెప్పుకో! ప్రొద్దున ఆరు-ఏడు అని పెట్టు. అప్పుడే పిల్లలు ట్యూషన్ ముగించుకుని, ఇంటికి వెళ్ళి తయారై, స్కూలుకు రాగలరు. సాయంత్రమూ అదే ఆరు-ఏడు"

"ప్రొద్దున  పూట నేను ఇంటి పనులు చెయ్యలేనే అత్తయ్యా!"

"దేనికీ...? ఉన్న నలుగురికి చేయటానికి ఏం పనుంటుంది? నెలకు పదిహేను వేలు ఎక్కువగా వస్తే మంచిదే కదా? నువ్వు ఒప్పేసుకో"

రఘూ వచ్చిన వెంటనే చెప్పింది.

నాకూ వచ్చే నెల జీతం పెరుగుతుంది సరోజా! ఐదువేలు ఇంక్రీమెంట్ వేశారు.

"కొత్తింటికి వచ్చిన వెళా విశేషం. అందులోనూ అత్తయ్య మనతో రావటం చాలా అదృష్టం"

"నేనా...నా భాగ్యం ఏమిటో తెలుసా? మీరే! మెట్టింట్లో ఒక ఆడది జీవించేటప్పుడు, అత్తగారి సపోర్టు దొరికేది వందమందిలో ఐదుగురికే. ఆ ఆడవారే రాబోవు కాలంలో ధైర్యంగా తలెత్తుకోగలరు. లేకపోతే పోరాటమే. నా బలం మీరే"

మావగారు లోపలకు వచ్చారు.

"సరోజా! నాకు తెలిసిన కాలేజీలో ఒక లెక్చరర్ పోస్టు ఖాలీగా ఉంది. నువ్వు అప్లై చెయ్యి. ఆన్ లైన్లో చూడు. దొరికితే బ్రహ్మాండం. మంచి జీతం"

ఖచ్చితంగా చేస్తా మావయ్యా.

ఆయన ఆమె దగ్గర కూర్చుని, దానికోసం ఆలొచనలు చెబుతుంటే, గిరిజా రాత్రి డిన్నర్ తయారు చేసింది.

నలుగురూ తిన్నారు.

"ఏమండీ...రేపు జీతం వస్తుంది! నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంచుకోండి"

"ఇప్పుడే గొడవ మొదలయ్యింది..."

జరిందంతా చెప్పారు.

"చూశారా? పనులకూ, వంటకు మనుషులను వేసి అది నిద్రపోతోంది...మీరు కష్టపడాలి? ఎలాగండీ మనకి ఇలాంటి అమ్మాయి పుట్టింది? సిగ్గుగా ఉంది"

"వదులమ్మా..."

" గిరిజా! జ్యోతీ కూడా ఏదో ప్లాను చేస్తోంది!"

"జ్యోతీ డబ్బులు తగ్గించి ఇస్తానని చెప్పుంటుంది. కారణం...మనుషులు ఎక్కువ లేరని చెబుతుంది. చలపతి మూగ వాడయ్యి ఏడు సంవత్సరాలు అవుతోంది. ఇవన్నీ గ్రహించే మీ దగ్గర నేను చెప్పాను"

"నువ్వేంటమ్మా చెబుతున్నావు...?”

"రేపు మనింట్లో పెద్ద పంచాయతీ జరగబోతోంది రఘూ. అది అయిన తరువాత మీ నాన్న మాట్లాడతారు. ఇప్పుడే ఏదీ చెప్పలేము"

"నీకు తెలుసు కదమ్మా"

"కొంత తెలుసు. కానీ జ్యోతీను, సత్యానూ ఎవరు? ఒకత్తి మూగి...రెండోది శకుని"

"రామాయణం, మహాభారతం మనింట్లో జరుగుతోందా అమ్మా?"

"ఇవి రెండూ లేని ఇళ్ళే లేవురా! ఆ మహా కావ్యాలలో ఉన్న కథా పాత్రలు ప్రతి ఇంట్లోనూ జీవిస్తున్నాయి. సినిమా, టీవీ, పత్రిక, రాజకీయం ఇలా ఏది తీసుకున్నా ఇవి రెండూ ఉంటాయి. ఏమిటొక కష్టమంటే...అందులో ఉండే మంచి వారు ఇక్కడ తక్కువ. సూర్పనఖలు మాత్రమే ఎక్కువ. ఇది విల్లీల కాలం. వాళ్ళు లేకుండా ఏదీ లేదు"

"ఇది న్యాయమా అత్తయ్యా?"

"లేదమ్మా! విల్లీలను పోషిస్తున్నామని అందరి మీద నేరారోపణ ఉంది. విల్లీలను ఎవరూ పోషించక్కర్లేదు. వాళ్ళు తయారవుతున్నారు.

స్వార్ధం, అత్యాశ, ఈగో, కుళ్ళు, అహంకారం...ఇవన్నీ అందరికీ ఉంది. వాటిని అనిచి జీవిస్తున్న వారు, జీవితంలో గెలుస్తున్నారు. వాటిని పెద్దవి చేసుకుని జీవిస్తున్న వారు, చెడ్డ శక్తులుగా మారుతున్నారు. ఆడతనం అనేది, మాతృత్వం  యొక్క రూపం.

కానీ, పిల్లలను చంపే తల్లులనూ చూస్తున్నాము. భర్తలను నాశనం చేయటం, తోబుట్టువులకు ద్రోహం చేయటం, కన్నవారిని తొసి పుచ్చటం లాంటివి చేస్తూ, ఆడవాళ్ళు తప్పు దోవలో వెడుతున్నారు. డబ్బు మీద ఆశ, ఆస్తుల మీద ఆశ, నగల పిచ్చి, ఆడంబర జీవితం అని దిక్కు తెలియక మారుతున్నారు.  ఆడవాళ్ళే భూమికి గర్వం అనుకున్న కాలం పోయి..."అయ్యయ్యో, ఆడవాళ్ళూ?" అని భయపడే పరిస్థితికి వచ్చాము. సరి...వదలండి. మనకెందుకు ఈ అన్వేషణ"

"అమ్మా! మన ఇంట్లోనూ ఇద్దరు విల్లీలు ఉన్నారే...?"

"రేపు వాళ్ళు విశ్వరూపం ఎత్తే రోజు"

"నాన్న వల్ల మేనేజ్ చేయటం కుదురుతుందా?"

"కుదురుతుంది! నాన్నను నేను రెడీ చేశాను!"

"ఓ...యుద్దం భయమా? అయితే నువ్వు కూడా విల్లీనే!"

"ఏం మాట్లాడుతున్నారు?"

"అందులో తప్పేమీ లేదమ్మా? శత్రువులపై విజయం సాధించటానికి మనం కూడా రంగంలోకి దిగే కదా కావాలి?"   

***************************************************PART-10***************************************

మరుసటి రోజు గడిచిపోయింది. రాత్రి ఏడు గంటలకు నాన్నా, చలపతి ఇద్దరూ వచ్చారు.

మొహం కడుక్కుని, డ్రస్సు మార్చుకుని వచ్చిన వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చింది జ్యోతీ.

టిఫిన్ తయారు చేసింది సత్యా.

బజ్జీ అనే పేరుతో, విపరీతమైన నూనెతో ఒక 'వంటకం ' ఉన్నది.

దాన్ని నోట్లో పెట్టుకోలేకపోయారు.

ఇద్దరూ చాలా సంకటపడ్డారు.

"కొంచం లోపలకు రండి" - జ్యోతీ పిలవగా - చలపతి లేచి వెళ్ళాడు.

నేను చెప్పినట్లు ఐరవై ఐదువేలు మాత్రం తీయండి. అదే ఎక్కువ. మీ నాన్న దగ్గర ఇచ్చేయండి. ఆయన ఈ ఫ్యామలీని రన్ చేయనివ్వండి. అంతకు మించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదు. మనకూ, ఆయనకూ వంట చేస్తాను. సత్యాకీ, ఆ సిగ్గులేని అల్లుడికీ నేను ఏదీ చెయ్యను. అది కూడా చెప్పేయండి"

"సరే...రా!"

చలపతి బయటకు వచ్చాడు.

"ఇదిగోండి! నా జీతం డబ్బులు..."

"ఉండరా! దానికి ముందు నేను మాట్లాడేస్తాను. మీ అమ్మే ఇన్ని రోజులు కుటుంబాన్ని నడిపింది. ఇప్పుడు ఆమె ఇక్కడ లేదు. నా వల్ల ఏ బాధ్యతా తీసుకోవటం కుదరదు. దానికి కావలసిన వయసు నాకు లేదు. పచారీ సరకులు, పాలు, కరెంటు బిల్లు, ఇంటి నిర్వాహం ఏదీ చూడటానికి నాకు సమయం లేదు. భోజనం కూడా ఇక్కడ వద్దు! మూడుపూట్లా బయటే చూసుకుంటాను"

"ఏమిటి నాన్నా?"

జ్యోతీ... సత్యా! ఎవరూ కష్టపడక్కర్లేదు. నేను ప్రొద్దున ఏడింటికి వెళితే, రాత్రి ఎనిమిదింటికే వస్తాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. నేను చెత్తను వేయను. నాకు గిన్నెలతో అవసరం లేదు. నేను ఏ.సీ. వేసుకోవటం లేదు. కాబట్టీ - నా ఒక్కడికోసం ఈ ఇంట్లో రాత్రి మటుకు ఫ్యాను తిరుగుతుంది! అంతే!

దానికయ్యే బిల్ మహా అయితే ఎంత అవుతుంది? స్నానాకి సోపు ఇవన్నీ కలిపితే ఐదువందలు అవుతుంది! ఈ ఇంటి టాక్స్ కడతాను. నా పెట్రోల్ ఖర్చులూ చూసుకుంటాను -- ఏ ఖర్చూ లేని నేను నెలకి ఐదువేలు ఇస్తాను. కుటుంబాన్ని నువ్వూ-- జ్యోతీ నడపండి. ఇందా తీసుకో!"

డబ్బును జాపారు.

చలపతి -- జ్యోతీ దీనిని కొంచం కూడా ఎదురు చూడలేదు. ఒక్క క్షణం స్థానువు అయ్యారు. ఆయన్ని ఎదిరించలేకపోయారు.

ఆయన చెప్పేదీ న్యాయమే!

ఏ ఖర్చూ లేని ఆయన, ఐదువేలు ఇవ్వటమే చాలా ఎక్కువ.

"ఇది నా ఇల్లు! నీ దగ్గర అద్దె అడగలేదు. న్యాయంగా చూస్తే ఐదువేలు నేను ఇవ్వకూడదు. పరవాలేదు...ఉంచు"

సత్యా బలంగా దెబ్బ తిన్నది.

నిర్వాహం నువ్వు తీసుకో! పనిమనిషిని పెట్టుకుంటావో, మీరే వంట చేస్తారో...చెయ్యరో, ఏ.సీ. వేసుకుని నెలకి కరెంటు బిల్లు ఎంత కడతారో నాకు తెలియదు. లాండ్ లైను ఫోనును కూడా నేను ఉపయోగించను. ఇదే నా నిర్ణయం"

"మావయ్యా! ఇది మీ ఇల్లు. మీరు ఇక్కడ తినకుండా ఎందుకు బయట తినాలి?"

"వద్దమ్మా! ప్రొద్దున ఐదుగంటలకు నాకు కాఫీ కావాలి. మీరు లేవటానికి కనీసం ఏడున్నర అవుతుంది. ఎందుకు వెయిట్ చేయాలి? సమస్యే లేదు. ఎవరి మీదా నాకు కోపం లేదు. ఈ ఇంట్లో ఏదైనా రిపేర్ ఖర్చులు వస్తే ఇచ్చేస్తాను. కారణం...ఈ ఇల్లు నాది! సరేనా?"

సత్యా దగ్గరకు వచ్చింది.

"నాన్నా...నువ్వు చేసేది కరెక్టు కాదు. మీకు అన్నీ నేను చేసి పెడతాను"

"నువ్వు ఎవరు...ఈ ఇంట్లో నీకు ఏమిటి హక్కు?"

"నాన్నా...నేను మీ కూతుర్ని"

"నీకు పెళ్ళి చేశాను. నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళచ్చు. అదే పద్దతి! చెబితే వినవు! నువ్వు నా కూతురువి. నిన్ను కొట్టి తరమలేను. దారాళంగా ఇక్కడ ఉండు. కానీ, ఇక ఇంటి నిర్వాహం చలపతి -- జ్యోతీ దగ్గర! వాళ్ళు భోజనం పెడితేనే నువ్వు తినగలవు. నన్నేమీ అడగకు. రాత్రి పడుకోవటానికి మాత్రం ఇది నాకొక చోటు. అంతే! నేనే అతుక్కోకుండా జీవిస్తున్నప్పుడు, నిన్ను నేను ఎలా భరించగలను?"

"నాన్నా! డబ్బు నా చేతికివ్వండి. కుటుంబాన్ని నేను నడుపుతాను"

"మెట్టింటికి వెళ్ళి నిర్వాహం చెయ్యి. నేనెందుకు నీకు డబ్బు ఇవ్వాలి? నీ భర్త ఎందుకు ఖలీగా కూర్చున్నాడు? అతన్ని అడుగు. నా పక్కకే రాకు! నేనొక కాఫీ తాగినా కూడా దానికి డబ్బులిచ్చేస్తాను"

"మావయ్యా...మీరు ఐదువేలు ఇస్తామంటున్నారు. ఆ తరువాత ఇంకా ఎందుకు మీరు డబ్బులు ఇవ్వాలి? సత్యా ఇవ్వాలి. ఇకమీదట ఇక్కడ ఎవరికీ ఉచిత తిండి లేదు"

"ఇది మా నాన్న ఇల్లు"

"ఆయనే ఇక్కడ తినబోయేది లేదు. ఆయన ఇంట్లో ఆయన ఉండటానికి ఐదువేలు ఇస్తున్నారు. నీకు నేను వంటచేసి పెట్టలేను"

"అవసరం లేదు...నేను వంట చేసుకుంటాను"

"అదెలా? నాకూ, ఈయనకీ, ఇద్దరు పిల్లలకూ కావలసిన సరకులు, పాలు, కాయగూరలూ మాత్రమే కొంటాను. వాటిని కూడా మా రూములో పెట్టి తాళం వేసుకుంటా. అందులో ఒక బియ్యం గింజ కూడా నువ్వు ముట్టుకోలేవు. నీకూ, నీ భర్తకూ మేమెందుకు చేయాలి? మీ అమ్మతోనే అవన్నీ పోయినై...అర్ధమయ్యిందా?"

"నాన్నా...నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు"

"లేదబ్బాయ్...నాకూ ఆత్మ గౌరవం ఉంది"

"ఇది విన్న తరువాత కూడా కొంతమంది ఇంకా ప్రాణంతో ఉన్నారే?"

డబ్బును అతనికి ఇచ్చారు.

"సరే...రాత్రికి ఏం వంట జ్యోతీ?"

"ఇప్పుడు ఇంట్లో ఉన్న సరకులు రెండు రోజులకు మాత్రమే వస్తాయి. మనకీ...మావయ్యకూ మాత్రమే నేను వంట చేస్తాను"

"ఉన్న సరకులలో మీ చెల్లెలు ఆమెకు వంట చేసుకోవచ్చు. రెండు రోజుల తరువాత అంతా మారుతుంది. అందువలన ఆమె సరకులు కొనుక్కుని వంట చేసుకుంటే, గ్యాసు సిలిండర్ కు సగం డబ్బులు ఇవ్వాలి. చెప్పుంచండి. మైక్రో వేవ్ ఉపయోగించినా, ఫ్రిడ్జ్, ఏసీ వేస్తే...కరెంటు బిల్లుకూ సగం డబ్బులు ఇవ్వాలి"

"ఇవ్వకపోతే ఏం చేస్తారు?"

"ఈ ఇంట్లో నువ్వు ఉండలేవు"

"అది చెప్పే హక్కు మీకు లేదు. ఇది మా నాన్న ఇల్లు"

"నిర్వాహ ఖర్చులు మా చేతికి కంటే ఎక్కువైతే ఇవ్వగలవా? నీ భర్త సంపాదించటం లేదు. రానీ ఆ మనిషిని. ఉరి వేసుకునేలాగా అడుగుతాను"

"అడిగేస్తారా...ఆయన అల్లుడు"

"ఎవరికే? మీ అమ్మా-నాన్నలకు! అందులో మీ అమ్మ ఇక్కడ లేదు. తండ్రి వదిలించుకున్నాడు. ఈ ఇంట్లో నీకే హక్కు లేదు. ఎవరికి ఎవరే అల్లుడు? సిగ్గు లేకుండా మాట్లాడుతోంది చూడు... మీరు లోపలకు రండి"

"అన్నయ్యా! నేను నీ చెల్లెల్ని"

"బయట నిలబడి వాగు. మీరు ఇప్పుడు లోపలకు రండి"

చలపతిని లాక్కుని వెళ్ళి జ్యోతీ తలుపులు వేయ,

సత్యా విరిగిపోయింది.

"నాన్నా...ఎలా మాట్లాడుతోందో చూసారా! ఇది మీ ఇల్లు. నేను మీ కూతుర్ని. నేనిలా అవమానపడటాన్ని చూస్తూ ఎలా మాట్లాడ కుండా ఉన్నారు?"

"సత్యా! నువ్వు, నీ అక్కయ్య, అందరూ కలిసి సరోజాని అనరాని మాటలు అన్నప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను! ఎలా కష్టపడి పని చేసింది ఆ పిల్ల! మంచితనం నిండిన ఆమెను మీరు ఎంత క్షోభ పెట్టారు. అన్నిటినీ తట్టుకుందే...! అప్పుడు మీలో ఎవరికీ ఆమె మీద జాలి వేయలేదే?

తన కూతురికి ఒక వస్తువు కొంటే, అందరికీ సమానంగా చేస్తాడు రఘూ. మీరెవరైనా వాడి బిడ్డకు ఏదైనా చేశారా? సేవింగ్స్ కూడా లేకుండా తన డబ్బులు, సరోజా డబ్బులు అన్నిటినీ కుటుంబంలో వేసేడే. అప్పుడు అతనికోసం మాట్లాడలేదే? అప్పుడు మాట్లాడని నేను ఇప్పుడెలా మాట్లాడతాను సత్యా"

"ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి?"

"చలపతి అన్నయ్యను అడుగు! ఇక ఈ కుటుంబానికి హెడ్ జ్యోతీనే"

"వదిలిపెట్టను"

ఇంత చెప్పినా నువ్వు తగ్గవు, అనగవు, మారవు. మిగిలిపోయిన అవమానాలను జ్యోతీ చూపిస్తుంది...అనుభవించు"

ఆయన లోపలకు వెళ్ళి తలుపులు వేసుకున్నారు.

అర గంటలో హోటల్ నుండి వేడి వేడి టిఫిన్ వచ్చింది.

జ్యోతీ  వచ్చి తీసుకుని లోపలకు వెళ్ళి తలుపులు మూసుకుంది.

మనసు బయటకు వచ్చింది.

సత్యా పూర్తిగా విరిగిపోయింది.

పలు రోజులు అందరికీ చేతులు నొప్పి పుడుతున్నా దోసెలు వేసిచ్చేది సరోజా. తృప్తిగా తినేసి కుటుంబమే తేపుతారు. కొన్నిసార్లు సరోజాకి ఏమీ మిగలదు.

గిరిజా మాత్రం కాచుకోనుంటుంది.

"పరవలేదు! అడ్జెస్టు చేసుకుంటా అత్తయ్యా!!"

పనులు ముగిసి నిద్ర పోవటానికి పన్నెండు గంటలు అయిపోతుంది. తెల్లవారు జామున నాలుగు గంటలకు 'అలారం'!

ఇంటి పనులు...దాంతో పాటూ స్కూలుకు వెళ్ళే హడావిడి.

అన్నిటిని తట్టుకుని ఇరవై గంటలు పనిచేసే సరోజా దగ్గర చిన్న విసుగు కూడా ఉండదు. కోపం రాదు. చిటపటమని ఒక పలుకు పడదు. ఎప్పుడూ నవ్వు ముఖం.

సత్యాకి అంతా అర్ధమయ్యింది ఇప్పుడు.

'నేను ఎప్పుడూ మహారాణిలాగా గడపాలి' అని మనసులోనే కోట కట్టుకుంది.

అది ఇంత త్వరగా మట్టి కోటలాగా పడిపోతుందని ఆమె ఎదురు చూడలేదు.

ఫోను చేసినా భర్త రాలేదు.

ఇక తండ్రి మనని పట్టించుకోరు.

వీళ్ళ దగ్గర ఇక మన ఆటలు సాగవు. జ్యోతీ కిరాతకి. రాయిలో నుండి నార ఊడిపడొచ్చు. ఈమె దగ్గర ఏమీ జరగదు.

సత్యాకి ఏడుపు వస్తోంది.

అదే సమయం లోపల పెద్ద నిట్టూర్పు విడిచింది జ్యోతీ.

"ఏమండి...ఇరవై ఐదు వేలతో కుటుంబం నడుపగలమా?"

"నాన్నఐదు వేలు ఇస్తున్నారే?"

"సరే నండీ! బడ్జెట్ వేస్తే...ముప్పైతో ఆగటం లేదు. అది దాటుతుంది. ఇది కాకుండా ఇంటి పనులను కూడా నేనే చేయాలి. నా వల్ల కాదు. మనిషిని పెట్టుకోవాలి"

"పెట్టుకో"

"ఈజీగా చెబుతున్నారు...ఉమ్మడి కుటుంబంగా ఉండి నలభై ఇచ్చినా కూడా ఇంటి బాధ్యత మనకి ఉండేది కాదు. టైము టైముకు కావలసింది రుచిరుచిగా నోటికి వచ్చేది"

"నువ్వు కిందపడిన కాగితం ముక్కను కూడా తీసి వెయ్యవు?"

"ఏమిటి ఎత్తి చూపుతున్నారా?"

"లేదమ్మా...నిజం! నిర్వాహం నీ చేతికి వచ్చింది. నువ్వే కదా చేసుకోవాలి?"

మన వాటాలో ఐదువేలు ఎక్కువ ఇచ్చినా పరవాలేదు. కానీ ఇప్పుడు మొత్త నిర్వాహం నా నెత్తి మీద!"

"అది నా తప్పు కాదే?"

"మొదట సత్యాని తరమండి. ఆమె వలన ఖర్చు ఎక్కువ అవుతుంది"

"ఇది నాన్న ఇల్లు! ఆమెను వెళ్ళిపొమ్మని మనం చెప్పలేము. ఒకటి చెయొచ్చు. మనం వేరు కాపురం పెట్టేద్దాం"

"పిచ్చా మీకు. అద్దె, మైంటనన్స్ అని ఇరవై వేలు దానికే పక్కన పెట్టాలి. నలభై...అరవై అవుతుంది. సేవింగ్స్ దెబ్బ తింటుంది. దానికే నేను బాధపడుతున్నా...మీరు వేరే!"

"ఆమెను నేను తరమలేను. నువ్వు త్రిమితే నేను అడ్డుపడను. ఇప్పుడు నిద్ర వస్తోంది. రేపు మాట్లాడుకుందాం"

ఆ రోజు రాత్రి ఎవరికీ ప్రశాంతంగా గడవలేదు.

తలరాత! తండ్రీ, కొడుకులు బయలుదేరి వెళ్ళిపోయారు.

జ్యోతీ...ఆమెకు, తన పిల్లలకు మాత్రం వంట వండుకుంది.

ఆలస్యంగా లేచి వచ్చిన సత్యా, పిల్లకు పాలు కాచాలని ఫ్రిడ్జ్ తెరిచింది...పాలు లేవు.

"పాలు ఎక్కడ?"

"ఉన్నది రెండు ప్యాకెట్లు! ఆయనకు కాఫీ ఇచ్చి, నేను తాగి, మిగిలిన పాలు పిల్లలకు ఇచ్చేశాను"

"ఏందుకు ఆ పాల ప్యాకెట్లు తీశారు...?"

"అసలు ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్లు లేవు. ఆయన వెళ్ళి కొనుకొచ్చారు. ఆ రెండు ప్యాకెట్లు నావి. నీకు కావాలంటే వేరుగా కొనుక్కో"

"ఇది అరాచకం! నా పిల్లకు ఆకలి. నువ్వూ ఒక తల్లివే కదా?"

"నీకే ఆ తెలివి ఉండాలి ! ప్రొద్దున లేస్తే పిల్లకు ఆకలేస్తుంది. దానికి ఏం ఏర్పాట్లు చేయాలి, పాలు ఉన్నయ్యా, లేవా రాత్రే చూసుండాలి. నువ్వు బాగా నిద్ర పోయోచ్చి పంచాయతీ పెడితే...ఇక్కడ మీ అమ్మ లేదు. నువ్వు అమ్మగా ఉండి ఆలొచించు! నా పిల్లలకోసం ఏరోజైనా బాధపడ్డావా? నీ పిల్ల కోసం నేనెందుకు ఆలొచించాలి?"

"నువ్వు రాక్షసివి! సరోజా ఎంతో మంచిది..."

"నేను చెడ్డ దానినే! నువ్వు మంచిదానివా? సరోజా కోసం ఇప్పుడు కరిగిపోతున్నావు! ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఆమెను కొంచంగానా కష్టపెట్టావు? నేను ఏ పనీ చేయను. నిజమే! కానీ, సరోజాని ఏ రోజూ అవమానపరచింది లేదు. ఆమెకు ఎప్పుడూ టార్చర్ ఇచ్చింది లేదు. నిన్ను నీ కన్న తల్లే...కోడలే గొప్పదని నిన్ను వదిలి ఆమెతో వెళ్ళిపోయింది. మీ నాన్న కూడా తప్పుకున్నారు. ఇప్పుడు పాలకు కూడా దారిలేక నిలబడ్డావే! డబ్బు అప్పుగా ఇస్తాను. వెళ్ళి పాలు కొనుక్కో. మీ ఆయన వచ్చిన తరువాత తిరిగి ఇవ్వు. సిగ్గు లేని అల్లుడు...ఆకలి,ఆకలి అని పరిగెత్తుకు వస్తే, కడుపు మీద వాత పెట్టు"

డబ్బు తీసుకు వచ్చింది.

సత్యా ఆ డబ్బును తీసుకుని విసిరిపారేసింది. 

"నీ దగ్గర డబ్బులు తీసుకునేంతగా నేను సిగ్గు కోల్పోలేదు. అది అవసరం లేదు"

"అరే...నీకు పరువు, మర్యాద, రోషం కూడా ఉందా? ఆశ్చర్యంగా ఉందే?"

"చాలు...ఆపు ! మా అమ్మ ఇంకా చావలేదు"

"కానీ, నువ్వు చచ్చి చాలా రోజులయ్యిందే! నాకు నీ దగ్గర మాట్లాడే సమయం లేదు. పిల్లలను స్కూలుకు పంపాలి"

లోపలకు వెళ్ళింది.

సత్యా తట్టుకోలేక, డ్రస్సు కూడా మార్చుకోకుండా పిల్లాడితో బయటకు వచ్చింది.

ఇద్దరూ స్నానం చెయ్యలేదు!

తినలేదు.

రోడ్లో వెడుతున్న ఆటోను పిలిచింది. రఘూ ఇంటి అడ్రెస్సు చెప్పి ఎక్కింది.

ఆటో బయలుదేరింది.

సత్యా ఒళ్లంతా ఒక ఆందోళన.

అదే సమయం గిరిజా దగ్గర అన్ని విషయాలూ చెప్పి ముగించాడు తండ్రి.

రఘూ, సరోజా ఉన్నారు. ఆ ఒక్క రోజు అందరూ లీవు పెట్టారు.

జరిగిందంతా చెప్పి ముగించ.

గిరిజా ! అక్కడ ఐదువేలు ఇచ్చాను. కటింగ్స్ పోను చేతికొచ్చిన అరవై వేలలో ఆ ఐదు పోతే, నా చేతిలో ఖర్చులకు ఐదు ఉంచుకున్నాను. మిగిలిన యాభై వేలు ఉన్నాయి. ఇదిగో...తీసుకో"

"ఎందుకు నా దగ్గర ఇస్తున్నారు?"

"ఇన్ని రోజులూ నలుగురి జీతమూ నీ దగ్గరే కదా వచ్చేది? నువ్వే కదా కుటుంబాన్ని నడిపావు? ఇప్పుడు నడపటానికి ఏమిటి కష్టం?...పట్టు..."

"నాన్నా...నేనొకటి చెప్పనా?"

"చెప్పు రఘూ"

మా ఇద్దరి జీతమూ నలభై వేలు. ఇప్పుడు నాకు జీతం పెరుగుతుంది. సరోజా ట్యూషన్స్ చెప్పి సంపాదించే డబ్బు కలిపితే ఇంకో ఇరవై ఎక్కువవుతాయి. అది చాలు...మేము చూసుకుంటాము. ఈ డబ్బు మొత్తాన్నీ డిపాజిట్ చేయండి. రెండేళ్ళల్లో మీకు 'రిటైర్మెంట్'! పన్నెండు లక్షలు జేరతాయి. మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి. ఇన్ని రోజులు పనిచేసి మమ్మల్ని కాపాడారు. ఇక మీదట సేవింగ్స్-రెస్టు-ప్రశాంతత అన్నీ మీకు కావాలి నాన్నా"

"అవును మావయ్యా! మేము మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాలి. అదే పద్దతి"

"ఈ అక్కర అక్కడ ఎవరికీ లేదమ్మా? మీ ఇద్దరూ మీ పిల్లతో హ్యాపీగా జీవించటానికి దారి చూడండి"

"మావయ్యా! మిగిలిన వాళ్ళలాగా మేమూ ఉండాల్సిన అవసరం లేదు. మీరంతా అలా అనుకోనుంటే...మేము అలా లేము"

ఆయన ఆనందంతో సరోజాని చూడ,

వాకిట్లో ఆటో వచ్చి నిలబడింది. అందులో నుండి పిచ్చి ఆకారంతో దూకి సత్యా పరిగెత్తుకు వచ్చింది.

"రఘూ! ఆటోకి డబ్బు లివ్వురా"

రఘూ వెళ్ళాడు. సత్యా తిరిగి చూసింది.

"నాన్నా...మీరూ ఇక్కడే ఉన్నారా? ఎవరూ ఉద్యోగానికి వెళ్ళలేదా? రహస్య మీటింగు జరుగుత&