పవిత్ర… (పూర్తి నవల)


                                                                                      పవిత్ర                                                                                                                                                                      (పూర్తి నవల)   

సతీసావిత్రి జీవించిన కాలం నుండి...భర్త ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో జీవించి తిరిగి వచ్చినా, అతని పాదాలు తాకి కళ్ళకద్దుకుని అతనే తన భర్త అని చెప్పే మహిళనే పతివ్రత అంటున్నారు. కన్యాత్వం అనేది మగవాడికీ, ఆడదానికీ సమం కాదా?

పెళ్లైన జీవితం అందరికీ విజయవంతంగా ఉండటం లేదు. నవలలోని హీరోయిన్ పవిత్రకు కూడా అదే జరిగింది. కానీ అందులో ఆమె తప్పేమీ లేదు. పెళ్ళి చూపులకు వచ్చి, పవిత్రను పలుమార్లు చూసి, ప్రశ్నలతో పాటూ కట్నకానుకలు అడిగి పెళ్ళిచేసుకున్న తరువాత, ఆమె బాగుండలేదని, రోజు మహిళలాగా లేదని విడిచిపెట్టాడు పవిత్ర భర్త రామ్మోహన్.

పేరుకు తగినట్టే పవిత్ర పవిత్రమైనది, పరిశుద్దమైనది 'పవిత్ర.ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ పరిశుద్దమైనదే. పనిలోనైనా సరే నిజాయితీగా ఉండాలనుకుంటుంది.

తనకు ఏర్పడిన ఓటమిని విజయవంతంగా చేసుకునేందుకు తనని తాను పక్వ పరుచుకుంది పవిత్ర. మెరుగు దిద్దబడ్డ వజ్రంలాగా  మారిపోయింది. ఆమెకు పక్క బలంగా నిలబడ్డాడు ఆమె తమ్ముడు మనోహర్. కొన్నేళ్ళలో ఆమె 21 శతాబ్ధపు మహిళ లా మారిపోయింది.

అనుకోకుండా ఒక ఆసుపత్రిలో మాజీ భర్త రామ్మోహన్, మొదటి భార్య పవిత్రను చూస్తాడు. ఆమె 21 శతాబ్ధపు మహిళ లా మారిపోయుంది. అతని రెండవ భార్య అతని చేతికి ఒక బిడ్డను ఇచ్చి, మరొకడితో వెళ్ళిపోయింది. చేతి బిడ్డతో అవస్తపడుతున్న రామ్మోహన్ పవిత్ర మనసు గురించి తెలిసుండటంతో, ఆమెనే మళ్ళీ తన జీవితంలోకి తీసుకురావాలని ప్లాన్ వేస్తాడు. ఆమె మళ్ళీ తనజీవితంలోకి వస్తే, జాలి, దయా గుణం కలిగిన పవిత్ర తన బిడ్డను, తనని బాగా చూసుకుంటుందని అతనికి బాగా తెలుసు.  తిరిగి ఆమెతో కలిసి కాపురం చేద్దామని ఆమె వెనుక పడతాడు. అత్తగారిని తన మాటలతో ఒప్పిస్తాడు. అల్లుడితో తిరిగి కలిసిపొమ్మని తల్లి పవిత్ర మీద ఒత్తిడి తెస్తుంది.

తల్లి ఒత్తిడికి తలవొగ్గిందా పవిత్ర? 'కొట్టినా, తిట్టినా భర్తే' అనే పాత వాదనను నిజం చేస్తూ తిరిగి రామ్మోహన్ తో కలిసిపోయిందా? లేక తన జీవితాన్ని విజయవంతం చేసుకొవాలనుకున్నట్టుగా తాను పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుందా?.....వీటన్నిటికీ సమాధానాలు నవల చదివితే దొరుకుతుంది.

                                                               ***********************************

                                                                                            PART-1

ఇళ్ళంతా మగవాళ్ళు, ఆడవాళ్ళు, బంధువులతో నిండిపోయింది. గోడ చివర నేరస్తురాలుగా నిలబెట్ట బడింది పవిత్ర. అందరూ మాట్లాడిన మాటలను, వంచుకున్న తలతో చాలా నిదానంగా వింటున్న పవిత్ర ఓర్పులో భూదేవి, పతివ్రతలలొ సీత, దయ చూపించటంలో తల్లి. అభిమానాన్నీ, గౌరవాన్నీ ఇవ్వటంలో దైవం. మొత్తానికి కుటుంబానికి తగిన వెన్నెల.

ఇన్ని గొప్పతనాలను తనలో ఉంచుకున్న ఆమెను కుటుంబాన్ని నడపటానికి ప్రయోజనమే లేదూ అని వాదాడుతున్నాడు ఆమె భర్త రామ్మోహన్.

అతను చెబుతున్న నేరారోపణలకు అతని బంధువులు తల ఊపగా, ఆందోళనతో కాదని చెబుతున్నారు పవిత్ర యొక్క తల్లి-తండ్రులు. ఆడపిల్లను కన్నవారు కదా!

కార్యం జరగాలంటే గాడిద కాళ్ళు అయినా సరే పట్టుకునే కావాలి అనేలాగా తన అల్లుడు కాళ్ళు పట్టుకోవటానికైనా తయారుగా ఉన్నట్టు చెప్పి బ్రతిమిలాడుతున్నారు.

తండ్రి బ్రతిమలాడటం పవిత్ర కళ్ళల్లో నీళ్ళు తెప్పించినై. ఆమె తోబుట్టువైన మనోహర్ మొహంలో విపరీతమైన కోపాన్ని తెప్పించింది. తండ్రితో ఆవేశంగా మాట్లాడాడు.

నాన్నా...మీరెందుకు నాన్నా మనిషి దగ్గరకు వెళ్ళి బ్రతిమిలాడుతున్నారు?” --  మనోహర్ కోపంగా అడిగినప్పుడు రామ్మోహన్ లబోదిబోమంటూ ఎగిరాడు.

విన్నావయ్యా...విన్నావా. మీ అబ్బాయి ఏం చెబుతున్నాడో విన్నావా? నీ కూతురు లాగానే వీడు కూడా నన్ను గౌరవించటం లేదు

క్షమించండి అల్లుడుగారూ...వాడు చిన్న పిల్లాడు...

ఏమిటీ...చిన్న పిల్లాడా? ఎద్దులాగా పెరిగున్నాడు. వీడు చిన్న పిల్లాడా?”

అదే కదా...ఇంటల్లుడనే మర్యాద కొంచమైనా ఉందా?” -- రామ్మోహన్ తల్లి అడిగినప్పుడు, ఆమె వైపు కోపంగా తిరిగి చూసాడు మనోహర్.

మర్యాదనేది తానుగా దొరకాలి. అడిగి తీసుకోకూడదు

మనో... నువ్వు కాముగా ఉండు

మాట్లాడకండీ నాన్నా. మనిషి అక్కయ్యను ఇష్టమొచ్చినట్టు నీచంగా తిడుతున్నాడు. వాడి పళ్ళు ఊడకొట్టకుండా బ్రతిమిలాడుతూ నిలబడ్డారు?”

వినండయ్యా... అమ్మాయి మంచితనం తెలియకుండా మాట్లాడుతున్నాను అన్నారే! వీడు మాట్లాడేది విన్నారా? వీడే ఇలా మాట్లాడితే...ఇది ఎలా మాట్లుడుతుందో ఊహించుకోండి?”

ఇలా చూడవయ్యా, పవిత్రా గురించి మాకు బాగా తెలుసు. అమ్మాయి ఎవర్నీ ఎదిరించి మాట్లాడదు -- పవిత్ర బాబాయ్ చెప్పటంతో, ఆయన పైన విరుచుకు పడ్డాడు రామ్మోహన్.

అంటే నేను అబద్దం చెబుతున్నానా...?”

అది ఊరికే తెలుసు!

మనో...నువ్వు కాసేపు నిదానంగా ఉండరా

ఎంతసేపు బాబాయ్? దగ్గర దగ్గర ఒక గంట సేపటి నుంచి అక్కయ్య నేరస్తురాలు లాగా నిలబడింది. ఇతను మాట్లాడుతున్నది అందరూ వింటూనే ఉన్నారు కదా?"

ఇతను చెప్పేదాంట్లో ఒక చుక్క అయినా నిజముందా? న్యాయం ఉందా? ఇప్పుడెందుకు ఊర్లో అందరినీ పిలిచి పంచాయితీ పెడుతున్నాడని ఎవరైనా అడిగారా?”

ఎవరూ అడగక్కర్లేదు. నేనే చెబుతాను. ఇంతకు మించి దీనితో నేను కాపురం చేయలేను. మీరే బాంధవ్యాన్ని తెంచేయండి -- భర్త సాదారణంగా చెప్పగా... పవిత్ర శరీరమంతా కంపించింది.

కళ్ళల్లో నీరు ఉబికి వస్తుంటే మెల్లగా తలెత్తి భర్తను చూసింది. భార్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా మాట్లాడుతుంటే...బంధువుల గుంపు స్థంభించిపోయింది. తమ్ముడు మనోహర్ రక్తం ఉడికిపోయింది.

పవిత్ర తండ్రి గోపాల కృష్ణ ఎక్కువగా బెదిరిపోయాడు అల్లుడూ! ఏం మాట చెప్పారు?”

మీ అమ్మాయిని వద్దని చెబుతున్నా. ఇంకా ఏమిటి...అల్లుడూ, గిల్లుడూ అంటూ బంధుత్వం కావలసి ఉంది?”

ఏయ్...మా అక్కయ్య దగ్గర ఏమిటయ్యా అంత పెద్ద కొరత చూశావు? వద్దనటానికి

హు...ఒకటా, రెండా? కొరతలు అని వేటి వేటిని అంటామో, అవన్నీ మీ అక్కయ్య దగ్గర ఉన్నాయే" --- నిర్లక్ష్యంగా చెప్పిన అతని చొక్కా పుచ్చుకున్నాడు మనోహర్.

ఇలా చూడూ...మా అక్కయ్య భర్తవని ఇంత ఓర్పుగా మాట్లాడుతున్నాను. లేదంటే...ఇక్కడే నిన్ను చంపి పాతేస్తాను

అయ్యో...అయ్యో...కుటుంబమేనా ఇది? మా అబ్బాయిని చంపేస్తామని చెబుతున్నారే! సరైన రౌడీ గుంపు దగ్గరకొచ్చి చిక్కుకున్నామే రామూ" -- అతని తల్లి గట్టిగా ఏడవగా, బంధువులొచ్చి ఇద్దర్నీ విడిపించారు.

మనో! ఏమిట్రా ఇది? ఇది మీ అక్కయ్య జీవితం రా. కాస్త నిదానంగా ఉండు -- కొడుకును సమాధానపరిచాడు తండ్రి గోపాల కృష్ణ.

అప్పుడు లోపలకు వచ్చింది పవిత్ర తల్లి స్వరాజ్యం. చేతిలో అర్చన పళ్లెం బుట్ట. వొళ్ళంతా చెమటతో స్నానం చేసినట్టు చెమట...ఆశ్చర్యంగా అందరినీ చూసింది.

అరెరె...రండి...రండి అల్లుడుగారూ...రండి వదిన గారూ -- ఎప్పుడొచ్చారు?”

మేమొచ్చి రెండు గంటలు అవుతోంది

అలాగా...క్షమించండి. రోజు వరలక్ష్మీ వ్రతం కదా. అందుకే గుడికి వెళ్ళాను. అక్కడ బాగా జనం. అందుకే ఆలశ్యం...  మాట్లాడుతూ వచ్చిన ఆమె మొహం మారింది.

కూతురు కళ్ళల్లో నీరు, భర్త మొహంలో శోకం, బంధువుల మొహాలలో కలత...ఇవన్నీ గమనించిన స్వరాజ్యం ఏదో సమస్య  అని గ్రహించింది. తిన్నగా కూతురు పవిత్ర దగ్గరకు వచ్చింది.

పవిత్రా...ఏమ్మా...ఏమైంది?”

ఏమీ లేదమ్మా--సన్నని స్వరంతో చెప్పిన పవిత్ర వైపు కోపంగా చూసాడు రామ్మోహన్.

ఏమిటీ...ఏమీ లేదా? ఏమిటే...నేనొకడ్ని ఇక్కడ ఇంతసేపు కుక్కలాగా అరుస్తుంటే, నువ్వేంటే కూల్ గా ఏమీ లేదంటున్నావు? నన్ను చూస్తే నీకు జోకర్ లాగా కనబడుతున్నానా?”

అల్లుడుగారూ...ఎందుకలా మాట్లాడుతున్నారు?”

మీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాగా...ఇంకెలా మాట్లాడను?”

అల్లుడూ గారూ. ఏదైనా సమస్యా?”

మీ అమ్మాయిని రోజున పెళ్ళి చేసుకున్నానో... రోజు నుంచి నా జీవితమే సమస్య అయిపోయింది  

అల్లుడు గారూ...

చదువుకోని పిల్ల వద్దని తలబాదుకున్నాను. విన్నావా అమ్మా! నీ వలనే నా జీవితం నాశనం అయ్యింది -- తల్లి మీద కోపాన్ని చూపుతున్న అతన్ని భయంతో చూస్తూనే, కూతురి మొహాన్ని పైకెత్తింది స్వరాజ్యం.

పవిత్రా...ఏమిటే ఇది? అల్లుడి గారితో ఏదైనా గొడవ పడ్డావా?”

లేదమ్మా

మరెందుకు అల్లుడుగారు ఇలా మాట్లాడుతున్నారు? ఏమండీ...మీరెందుకు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు? మనో...ఏమిట్రా ఇదంతా?”

స్వరాజ్యం...నాకు ఏమీ అర్ధం కావటం లేదు. అల్లుడు ఏమిటేమిటో చెబుతున్నాడు. చాలా కోపంగా మాట్లాడుతున్నారు

మీ పంచాయతీ తరువాత పెట్టుకోండి. నా పని మిగించి నన్ను పంపండి. నాకు లక్ష పనులున్నాయి

ఏమయ్యా...కొంచం ఓర్పుగా మాట్లాడవయ్యా. గబుక్కున తెంచిపారేయటానికి ఇదేమన్నా ఆటనా? ఆడపిల్ల జీవితం

ఇదిగో పెద్దాయినా, నీ దగ్గర అడ్వైజ్అడగలేదు. నాకు ఈమె వద్దు. రోజుతో అంతా అయిపోవాలి. తెంపేయండి

స్వరాజ్యం ఆందోళన పడింది.

అయ్యో...అల్లుడుగారూ...ఎంత మాట అనేశారు?”

వూరికే అరిచి గోల చేయకండి. దీనితో రెండు సంవత్సరాలు కాపురం చేసిందే పెద్ద విషయం. ఇక మీదట దీనితో ఒక్క నిమిషం కూడా కాపురం చేయ్యలేను

అంత పెద్ద తప్పు నా కూతురు ఏం చేసింది?” 

అమ్మాయిని కని పడేసారు. పచ్చి జఠం. ఒక్క అభిరుచి కూడా లేదు. చదువుదా లేదు కదా కొంచం డీసెంటుగా ఉండొద్దా? సుద్ద మట్టి బుర్ర” 

అల్లుడుగారూ...

నా రంగుకూ, అందానికీ చదువుకూ మీ అమ్మాయి కొంచమైనా సరితూగుతుందా? దాని మొహం చూడండి...ఛఛ..దాన్ని చూస్తేనే నచ్చలేదు --- అంటూ మొహం తిప్పుకున్న అతన్ని చూస్తూ కుమిలి పోయింది పవిత్ర.

కోపంతో అతని దగ్గరకు వెళ్ళాడు మనోహర్.

ఏరా! మేమేమన్నా మా అక్కయ్య మొహాన్ని కప్పి పుచ్చి నీకు కట్టబెట్టామా? పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు నీకు కళ్ళు దొబ్బినయా? నీ అంగీకారంతోనే కదా అంతా జరిగింది

నేనేమీ దీని అందంలో పడిపోయి తల ఊపలేదు. మా అమ్మ గోల భరించలేక సరేనన్నాను

దానికి మాత్రమేనా అంగీకరించావు? మెడ నిండా నగలు...నీకు ఒక మోటార్ సైకిల్, కట్నకానుకలు ఇచ్చామే?”

ఏమిటి పెద్దగా మీరు ఇచ్చి చించింది? చదువుకోని పిల్లకు ఇది కూడా చెయ్యకపోతే ఎలా?”

ఇలా చూడూ మాటి మాటికీ మా అక్కయ్యను చదువుకోలేదని సాధించావో, నీకు మర్యాదగా ఉండదు

అలాగేరా చెబుతాను. జస్ట్ ఎనిమిదో క్లాసు చదువుకున్న దానికి గౌరవం కావాలా? ఛఛ...నా చదువుకూ, ఉద్యోగానికీ ఎలాంటి అమ్మాయి దొరికుండేది?”

నా కలే...చదువుకుని -- ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనే. చదువురాని మొద్దు మొహాన్ని నాకు కట్టబెట్టి నా జీవితాన్నే చీకటిమయం చేసారు

ఎవరురా మొద్దు మొహం? నిన్నూ...

మనో! నువ్వు ఆగరా. ఏం వియ్యపురాలా...మీ అబ్బాయి మాట్లాడేది వింటూ, ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు?”     

నేనేం మాట్లాడను? నేనే మా అబ్బాయి జీవితాన్ని పాడు చేసేను. డబ్బు, నగలూ ఎక్కువగా దొరుకుతుందని వాడ్ని బలిపసువుగా నిలబెట్టాను

ఏమ్మా మీ మాటలన్నీ ఒక మాదిరిగా ఉన్నాయి? ఎలాగైనా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అంటూ చెప్పులు అరిగేలాగా తిరిగింది మర్చిపోయారా?”

ఏమిటి కథలు చెబుతున్నారు? మా అమ్మ, మీ ఇంటి చుట్టూ తిరిగిందా...దేనికి? మొద్దు మొహం కోసమా?”

తమ్ముడూ నువ్వు మాట్లాడేది చాలా తప్పు. పిల్లకు ఏం తక్కువని అలా మాట్లాడుతున్నావు?”

ఊరుకోవయ్యా. విషయం గురించి వెయ్యిసార్లు మాట్లాడానే! దీనితో ఇక నేను జీవించలేను...అంతే

తొందర పడి మాటలు జారకు అబ్బాయ్

ఏమిటయ్యా, అర్ధం లేని న్యాయం మాట్లాడుతున్నారు? ఏమే... పేపర్లలో సంతకం  పెట్టు. నేను వెళ్లాలి" -- తన ముందు జాపబడ్డ కాగితాలను ఆశ్చర్యంతో చూసింది పవిత్ర.

ఏమిటి చూస్తున్నావు? హు...పెట్టు"

ఏమండీ...నేను...

హు...! నీ దగ్గర మాట్లాడటానికి రాలేదు. సంతకం మాత్రం పెట్టు -- చిటపటలాడుతున్న మొహంతో నిలబడ్డ అతన్ని మౌనంగా ఒకసారి చూసి, అతను జాపిన కాగితాలను--పెన్నునూ ఆమె చేతిలోకి తీసుకుంది.

పవిత్ర కుటుంబమంతా ఒక్కసారిగా అధిరిపడింది.

                                                                                            PART-2

భర్త చూపిన పేపర్లను పైపైన ఒకసారి చదివి సంతకం పెట్టబోతున్నప్పుడు మనోహర్ కోపంగా అడ్డుకున్నాడు.

అక్కా! ఏం చేస్తున్నవు నువ్వు?”

ఏరా?”

అతనేమో మూర్ఖుడిలా పేపర్లు జాపితే...నువ్వు ఆలొచించకుండా సంతకం పెడతావా?”

మనో!

ఇది నీ జీవితం అక్కా...తొందరపడకు!

లేదురా...నేను తొందరపడటం లేదు. చాలా ఓర్పుగా ఉన్నాను. రెండు సంవత్సరాలుగా...దగ్గర దగ్గర ఏడువందల రోజులు మనిషి మాట్లాడిన మాటాలు, చేసిన నిర్లక్ష్యాలను సహించుకునే ఉన్నను

...క్కా...

చాలురా. అవమానపడటానికీ, అసహ్యించుకోవటానికీ హద్దు ఉంది. దాన్ని ఎప్పుడో ఆయన దాటాసారు. ఇన్ని రోజులుగా ఇంట్లో జరిగిన అసహ్యాన్ని ఇదిగో రోజు...అందరి ముందు జరిపాడు

అమ్మా... పవిత్రా!

క్షమించండి నాన్నా. నా పెళ్ళికొసం మీరు ఎంతో కష్టపడుంటారు....అప్పులపాలు అయ్యుంటారు అనేది నాకు తెలుసు. మీ కష్టమంతా వృథా అవకూడదనే నాన్నా నేను ఈయన చెప్పినట్టు ఇన్ని రోజులు బురద పాములాగా ఉండిపోయాను.

కానీ...ఇప్పుడు...ఇప్పుడు కుదరటం లేదు నాన్నా. నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేని అతనితో నేను ఎలా నాన్నా కాపురం చేయటం?”

ఏయ్...ఏమిటే వాగుతూనే ఉన్నావు? నిన్ను పెళ్ళి చేసుకోవటం నాకు జరిగిన పెద్ద ఘోరం. అక్కడికి నేనేదో నిన్ను కష్టపెట్టినట్టు సీన్ చూపిస్తున్నావే?” -- నిర్లక్ష్యంగా అడిగిన భర్తను తలెత్తి దీర్ఘంగా చూసింది పవిత్ర.

నువ్వు నన్ను కష్టపెట్ట లేదూ?”

ఏయ్...ఏమిటే మర్యాద లేకుండా వాగుతున్నావు?”

నేనెందుకు నీకు మర్యాద ఇవ్వాలి? నువ్వు నాకు ఎవరు?”

నీ భర్తని

బంధాన్ని తెంపుకోవటానికే కదా ఇంతసేపు డ్రామా ఆడావు? నీ మీదున్న తప్పును కప్పి పుచ్చుకోవటానికి నా మీద బురద జల్లి ఇదిగో విడాకుల వరకు వెళ్ళిన తరువాత నీకెందుకు మర్యాద?”

పవిత్రా...అలాగంతా మాట్లాడకమ్మా. వెయ్యి మాటలన్నా అతను నీ భర్త అన్న తల్లిని చూసి విరక్తిగా నవ్వింది.

హు...ఎన్నిమాటలన్నా అతను నా భర్త. ఈ మాటనే పదే పదే చెప్పే కదా అన్నిటినీ సహించుకుని కష్టాన్ని భరించ మంటున్నావు? మేమూ ఎంతవరకు సహించుకోగలం?”

పవిత్రా!

ఒక్కొక్క వారం ఆయన స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను చూపించి...చదువులేని పిల్లకే నేను జీవితమిచ్చింది అని చెప్పేవారు. అంతేనా? ఎప్పుడు చూడూ నన్ను వెక్కిరిస్తూ, చీదరించుకుంటూ, చీటికీ మాటికీ మాటలంటూ నరకం చూపించారు. ఛామన ఛాయగా ఉండటం నా తప్పా. పెళ్ళి చూపుల్లో నన్ను చూసే కదా చేసుకున్నారు...అయినా కానీ జిడ్డు మొహం జిడ్డు మొహం అని రోజూ నన్ను ఆడిపోసుకునే వారు. నా బాధను నాలోనే దాచుకున్నాను...ఇప్పుడు నేను తిరిగి వచ్చేస్తే మీతో పాటూ నాకు గుప్పెడు అన్నం పెట్టరా?”

అమ్మా... పవిత్రా...ఏమిట్రా చెబుతున్నావు?” గోపాల కృష్ణ గొంతు బొంగురు పోగా, పవిత్ర కళ్ళు చెమ్మగిల్లినై.

నేను ఓర్చుకోలేకపోతున్నా? ఇస్టంలేని ఒకడితో ఉంటూ జీవితమంతా కొట్టుకోవటం కంటే... ఇంట్లో ఒక మూల -- మీ కూతురుగానే చివరి వరకు ఉండిపోతాను నాన్నా

అయ్యో...ఇందుకా ఇంత ఖర్చుపెట్టి నా కూతురికి పెళ్ళి జరిపించింది? భగవంతుడా... .

ఆయన్ని ఎందుకు పిలుస్తున్నావు?”

భగవంతుడికి కూడా కళ్ళు లేకుండా పోయిందే!

లేదమ్మా. మనకే కళ్ళు లేనిది. ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకు అని నువ్వే కదా చెప్పావు?”--- మనోహర్ కోపంతో అడగటంతో, స్వరాజ్యం నొరు మూసుకుని కన్నీరు కార్చింది.

తప్పే. ఎక్కువగా చదివితే దానికి తగిన అల్లుడ్ని వెతుక్కుంటూ తిరగాలే అని అనుకున్నాను. నా కంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి వద్దు అని చెప్పటం వలనే కదా మనిషితో మాట్లాడి ఈ  సంబంధం ఖాయం చేసాము

ఇప్పుడు అదంతా పోయిందే...ఇక నా కూతురి జీవితం ఏమవుతుంది? చివరిదాకా ఇది ఒంటరిగా ఉండిపోయేటట్టు అనిపిస్తోందే?”

మీ సనుగుడంతా మేము వెళ్ళిన తరువాత పెట్టుకోండిఅంటూ పవిత్ర వైపు తిరిగి ఏయ్...సంతకం పెట్టవే -- విసుగ్గా చెప్పిన అతని గొంతు పట్టుకున్నాడు మనో.  

రేయ్...మా కన్నీరు, నీకు సనుగుడుగా అనిపిస్తోందా? నిన్ను చంపేస్తానురా. మా అక్కయ్య విధవరాలుగా ఉన్నా పరవాలేదు. ఆమెను వదిలేసి నువ్వు ఇంకొకత్తితో కులుకుదామని చూస్తున్నావా? వదలనురా. నువ్వు ప్రాణాలతోనే ఉండకూడదు కోపంతో అతని గొంతు నొక్కగా అతను ఊపిరి పీల్చుకోవటానికి కష్టపడ్డాడు.  

అంత వరకు మాట్లాడకుండా కూర్చున్న బంధువుల గుంపు లేచి వాలిద్దర్నీ విడదీసిన తరువాత, మాటలు తగ్గి చేతులతో కొట్టుకున్నారు.

ఇంట్లోని శబ్ధం బయటకు వినబడింది. వీధి మొత్తం గుమికూడి వేడుక చూసింది. పవిత్ర బాగా కుంగిపోయింది. ఇంటి గొడవ, వీధి గొడవగా మారింది.

గోపాల కృష్ణ, స్వరాజ్యం కొడుకును ఆపుతున్నారు. పవిత్ర కళ్ళు కింద పడిన విడాకుల కాగితాల పైన పడింది.

ఇన్ని సమస్యలకూ ఇదే కదా కారణం? నా సంతకంతో సమస్య తీరిపోతుందంటే ...నేనెందుకు ఆలొచించాలి? ఎలాగూ వీడితో ఇక కాపురం చేయలేము. అలాంటప్పుడు అతనితో గొడవ పడటం దండగ కదా?’

కళ్ళల్లో పేరుకుని నిలబడ్డ నీళ్ళను గట్టిగా తుడుచుకుంది. కిందకు వొంగి కాగితాలను ఏరుకుని, అందులో గుర్తుపెట్టబడిన చోట్లలో గబ గబ సంతకం పెట్టటం మొదలుపెట్టింది.

                                                                                            PART-3

గుడిలో కర్పూర హారతితో పూజ జరుగుతున్నప్పుడు...విరక్తి చూపులతో అక్కడున్న స్తంభాన్ని ఆనుకుని కూర్చోనుంది స్వరాజ్యం. కంటి చివర్లో నీళ్ళు నిలబడున్నాయి. పాత జ్ఞాపకాలతో గతంలోకి వెళ్ళిన స్వరాజ్యం ను భుజం పట్టుకుని కుదిపింది మీనాక్షి.

స్వరాజ్యం...ఏయ్ స్వరాజ్యం

... -- ఉలిక్కిపడుతూ చూసింది స్వరాజ్యం.

ఏమిటి స్వరాజ్యం... అక్కడ పూజ జరుగుతోంది. నువ్వు ఇక్కడ కూర్చోనున్నావు?"

...పూజ మొదలయ్యిందా?” హడావిడిగా లేస్తున్న ఆమెను కూర్చోబెట్టి తానూ కూర్చుంది మీనాక్షి.

పూజ పూర్తి అయిపొయిందిగానీ. నువ్వు ఇలా కూర్చో. ఎందుకు నీ మొహం అలా వాడిపోయింది?”

ఉండు మీనాక్షి. నేను వెళ్ళి...

అరే ఉండు స్వరాజ్యం! గుడిలో చాలా గుంపు ఉంది. ఏదో పార్టీ వాళ్ళందరూ వచ్చున్నారు. గుంపు తగ్గనీ వెళదాం

అలాగా...?” -- అన్న స్వరాజ్యం మళ్ళీ నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చుండిపోయింది. మీనాక్షి నిదానంగా అడిగింది.

ఏం స్వరాజ్యం...ఎందుకు అలా ఉన్నావు? వొంట్లో బాగోలేదా?”

వొంటికి ఏం ఖర్మ. అది బాగానే ఉన్నది

స్వరాజ్యం

నా మీద భగవంతుడికి ఏం కోపమో...తెలియటం లేదు. నా కుటుంబాన్ని ఇలా కష్టాలకు వదిలేసేడే?” -- తడైన కళ్ళను వొత్తుకుంది.

ఏమిటి నువ్వు... ఇంకానా పాత విషయాలను జ్ఞాపకం ఉంచుకున్నావు?”

ఎలా మర్చిపోను? నా కళ్ళ ముందే నా కూతురు ఒంటరిగా నిలబడుందే! దానీ చూసినప్పుడల్లా కడుపు తరుక్కుపోతోందే?”

బాధపడకు...ఇప్పుడు పవిత్ర ఎలా ఉంది?”

...వున్నది. మనోతో పాటూ పనికి వెడుతోంది...వస్తోంది. ఇంకా ఏవేవో పరీక్షలు రాస్తోంది. ప్రమోషన్ వస్తుందట

నువ్వు నమస్కరిస్తున్న అమ్మవారు నిన్ను వదులుకోలేదు

ఏం చెబుతున్నావ్ మీనాక్షీ?”

జీవితమే పోయిందని నీ కూతురు బాధపడుతూ కూర్చోకుండా బాగానే ఎదిగిపోయిందే! చదువుకుని ఉద్యోగానికి వెళ్లే స్థాయికి ఎదిగిపోయిందే? నీ కొడుకు కూడా ఇరవై నాలుగు క్యారట్ల బంగారమే.

రోజుల్లో మగపిల్లలు మీసాలు రావటం మొదలుపెట్టగానే అమ్మాయల్ని వెతకటం మొదలుపెడతారు. కానీ నీ కొడుకు...అక్కయ్యను ఎలాగైన జీవింపజేయాలని అనుకుంటున్నాడు. తన గురించి ఆలొచించటమే లేదే? ఇలాంటి కొడుకు దొరకటం అదృష్టం. భగవంతుడు నీకు రెండు రత్నాలను ఇచ్చాడు

"నిజమే...ఇద్దరూ రత్నాలే -- వెతికినా దొరకని రత్నాలే

మనో మాత్రం ధైర్యంగా అక్కను పైకెత్తి ఉండకపోతే నా కూతురు కూడా నాలాగా ముడుచుకు పోయుంటుంది. ఏడ్చి ఏడ్చి కరిగిపోయి ఉంటుంది. ప్రాణం కూడా పోగొట్టుకుని ఉండేదేమో? కానీ అలాంటిది ఏదీ జరగనివ్వలేదు తమ్ముడు. కింద పడిపోయిన దానిని లేపి నిలబెట్టాడు

పవిత్ర చదివిన స్కూలుకు వెళ్ళి సర్టిఫికెట్టులు తీసుకుని, మళ్ళీ చదవమన్నాడు. చదువే నీ కొరడా...నీ భవిష్యత్తుకు తోడు అని చెప్పి చెప్పి చదివించాడు.

తమ్ముడి ప్రొత్సాహంతో పవిత్ర కూడా మిగితా విషయాలను పక్కకు తోసేసి చదవటం మొదలుపెట్టింది. తమ్ముడు  చెప్పిందంతా చదివి అన్నిటినీ పాస్ చేసింది.

దొరికిన విజయం ఆమెను మరింత ఉత్సాహ పరచ -- పెద్ద పెద్ద చదువులు చదివి -- రోజు తమ్ముడు పని చేసే కంపెనీలోనే అతని కంటే పెద్ద పదవిలో కూర్చో బెట్టబడింది.

కూతురు ఎదుగుదలను చూసి తండ్రి గోపాల కృష్ణ తనని తాను తేర్చుకున్నాడు. స్వరాజ్యం మాత్రం పాత విషయాలను మరిచిపోలేకపోయింది. కన్న తల్లి కదా...?

పవిత్ర వయసులో ఉన్న అమ్మాయి అయినా సరే...పిల్లా పాపలతో వెళ్ళటం చూస్తే చాలు, స్వరాజ్యం మనసు తపించిపోతుంది. తన కూతురుకీ పిల్లలు పుట్టుంటే తాను అమ్మమ్మను అయ్యుండేదే నని సనుగుడు మొదలుపెట్టేది.

ఏమిటి స్వరాజ్యం...మౌనంగా ఉన్నావు?”

మనసు దేని దేనినో ఆలొచించి తపిస్తోంది మీనాక్షీ. సరే...నేను బయలుదేరనా? పిల్లలు వచ్చే సమయం అయ్యింది అంటూ నిట్టూర్పు విడుస్తూ లేచింది స్వరాజ్యం.

రా...దేవుడ్ని చూసి దన్నం పెట్టుకు వెళదాం -- అంటూ ఇద్దరూ అలంకారం చేసున్న అమ్మవారిని మనసుకరిగేలా వేడుకుని గుడిలో నుండి బయటకు వచ్చారు.

స్వరాజ్యం...నువ్వు నడిచా వచ్చావు?”

అవును...సాయంత్ర పూట నడిస్తే వొంటికి మంచిదని డాక్టర్ చెప్పాడు

సరేరా...మాట్లాడుకుంటూ నడుద్దాం. నిన్ను చూసి ఎన్ని రోజులైంది?" ఇద్దరూ వీధి చివరగా నడవటం మొదలుపెట్టారు.

అవును...నేను నీ గురించి ఏమీ అడగనేలేదే? నువ్వెలా ఉన్నావు?”

హు... ఉన్నాను. ఆయన సంపాదనలో ఉన్నదాంతో సరిపుచ్చుకుని హాయిగా  జీవిస్తున్నాం

నువ్వు అదృష్టవంతు రాలివి

ఏం చెప్పావు?”

పిల్లలు లేకుండా ఉండటంకంటే...కళ్ళ ముందు కన్న కూతురు ఇలా ఒంటరి ఓంటరిగా నిలబడటం చూడటానికి చాలా కష్టంగా ఉంది

ఎందుకు స్వరాజ్యం అలా మాట్లాడుతున్నావు?”

ఇంకేం చేయమంటావు? కూతురు హాయిగా కాపురం చేసుకోవలసిన వయసులో జీవితాన్ని పారేసుకుని నిలబడిందే నని నేను ఒక పక్క కష్టపడుతుంటే... మనో దాని కంటే ఎక్కువ కష్టపెడుతున్నాడు

ఏం...వాడేం చేసాడు?”

వస్తున్న మంచి సంబంధాలన్నిటినీ వద్దని చెబుతున్నాడు

ఎందుకు...?”

ఇంట్లో అక్కయ్య ఇలా ఉంటే నేను పెళ్ళి చేసుకోవటం కుదరదు అంటున్నాడు

వాడు చెప్పేది న్యాయమే కదా?”

కానీ, ఇద్దరూ అలా నిలబడితే...నా వంశం అభివ్రుద్ది కాకుండా పోతుందే? నా ప్రాణం పొయే లోపల ఒక మనవుడినో, మనుమరాలునో ఎత్తుకుని బుజ్జగించాలని నా  మనసు కొట్టుకుంటోంది

నీ ఆశలోనూ న్యాయముంది

ఇది నా పిల్లలు అర్ధంచేసుకోవటం లేదే. నిన్న కూడా మనోకి ఒక మంచి సంబంధం వచ్చింది. పిల్ల తండ్రికి మన మనో బాగా నచ్చాడు. మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. కానీ వీడు పట్టుదలగా వద్దూ అంటున్నాడు. నేనూ, వాడి మనసు మారదా అని ప్రతి గుడికీ వెళ్ళొస్తున్నాను. కానీ, ఒక్క దేవుడూ నా ప్రార్ధనను వినిపించుకోవటం లేదు

నేను ఒకమాటంటే తప్పుగా అర్ధం చేసుకోవుగా?”

చెప్పు

నువ్వెందుకు పవిత్రకి ఇంకొ పెళ్ళి చేయకూడదు? అదీ ఎంత కాలం ఇలా ఒంటరిగానే ఉంటుంది? దానికని ఒక జీవితాన్ని ఏర్పరిచి ఇచ్చేస్తే... మనో తానుగా పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు

మీనాక్షీ! నువ్వు చెప్పేది కరెక్టుగా జరుగుతుందా?”

ఏం...నువ్వు ఇదంతా ఆలొచించనే లేదా?”

అయ్యో...నేనెలా?”

ఏమిటి నువ్వు? కాలం ఎంతో మారిపోయింది. ఇంకా భయపడుతూ కూర్చున్నావే?”

లేదు మీనాక్షీ...ఒకసారి మా ఆడపడుచు మాట ఎత్తినప్పుడు పవిత్ర గట్టిగా ఆవిడ్ని మందలించింది. దాని మనసును ఇంకా గాయ పరచ కూడదని మేము మాట వదిలేసాము

తప్పు స్వరాజ్యం! అది చిన్న పిల్ల...ఇంకా ఎన్ని రోజులు అది ఇలా ఒంటరిగా ఉంటూ కష్టపడుతుంది? ఒక పిల్లాడన్నా ఉంటే అది వేరుగా ఉండేది!

అలా ఉండుంటే నేనెందుకు బాధ పడతాను? దానికీ దారి లేకుండా పోయిందే!

అది కూడా మంచికే జరిగింది

ఎలా?”

అవును! పిల్లాడుండుంటే మళ్ళీ పెళ్ళికొడుకును చూడటంలో కష్టం ఏర్పడుతుంది. పిల్లాడితో ఎవడు ఒప్పుకుంటాడు? ఇప్పుడు అలా లేదే! ఏదో రెండో పెళ్ళివాడైనా పరవాలేదా?”

రెండో పెళ్ళి వాడా?”

అవును! దీనికీ అది రెండో సారే కదా?”

ఇలా చూడూ...నువ్వు దేని గురించీ బెంగపెట్టుకోకు! నాకు తెలిసున్న చోట పవిత్ర గురించి చెప్పుంచుతాను. మంచి అబ్బాయి దొరికితే మాట్లాడి సెటిల్ చేసుకుందాం. ఏమంటావ్...?”

ఎందుకైనా మంచిది నేను ఆయనతో ఒకసారి మాట్లాడతాను"

"మాట్లాడు. అమ్మాయి జీవితం గురించి ఆయన కూడా బాధ పడుతూ ఉంటాడు కదా?  బాగా అర్ధమయ్యేటట్టు చెప్పు. అలగే మీ అబ్బాయి దగ్గర కూడా చెప్పు

మనో దగ్గరా?”

వాడు నాలుగు చోట్లకు వెళ్లే వాడే కదా? ఎవరైనా మంచి వాడు దొరికితే చూడనీ. మంచి జరిగితే చాలు. సరేనా?”

సరే. నువ్వింటికెళ్ళు. నేను కూరగాయలు కొనాలి... వెళ్ళిరానా

సరే

మర్చిపోకుండా ఇంట్లో మాట్లాడు -- మీనాక్షీ చెప్పేసి కుడి వైపున ఉన్న షాపుకు వెళ్ళగా...ఏదో తెలియని భయంతో, ఇంటివైపుకు నడవసాగింది స్వరాజ్యం.

                                                                                  PART-4

ఇంట్లోకి వెళుతున్నప్పుడు, ఇంట్లో నుండి పిల్లల కుతూహలం, భర్త యొక్క ఉత్సాహ మాటలూ గుమ్మం వరకు వినబడ్డాయి. స్వరాజ్యంను చూడగానే సంతోషంగా ఆహ్వానించారు.

స్వరాజ్యం, రా...రా...! పిల్లలు మంచి వార్తతో వచ్చారు చూడు

ఏమిటా వార్త?”

అమ్మా...అక్కయ్య పరీక్షలలోనూ పాసైంది. వెంటనే ప్రమోషన్ అనౌన్స్ చేశారు. స్వీటు తీసుకో -- స్వీట్లు ఉన్న డబ్బాను అందించిన అబ్బాయిని ప్రశాంతంగా చూసింది.

చాలా సంతోషం -- అని చెప్పి జరిగి నిలబడ్డ అమెను ముగ్గురూ అర్ధం కాకుండా చూసారు.

పవిత్ర నిదానంగా అమ్మను చేరుకుంది.

అమ్మా

ఏమిటమ్మా...మేము ఎంత సంతోషమైన వార్తను చెప్పాము. నువ్వు ఎటువంటి రియాక్షనూ చూపకుండా ఏమీ జరగనట్టు వెడుతున్నావు?” -- అన్న కూతుర్ని నిదానంగా పరీక్షించింది స్వరాజ్యం.

పవిత్ర మొహంలో గెలుపు యొక్క కాంతి ప్రకాశిస్తోంది. అది ఆమె మొహానికి ఎక్కువ అందం చేకూర్చిందిరోజంతా ఏసీ గదిలో ఉండి పనిచేయటంతో పవిత్ర రంగు మారింది.

దానికి తోడు చదువుకున్న కళ, స్వయంగా సంపాదిస్తున్నమే అన్న ఆత్మ విశ్వాసం కలిసి ఆమెను యువతిగా మార్చింది. అయినా కానీ నుదురుకు పక్కగా కొన్ని నెరిసిన వెంట్రుకలు కనబడి ఆమె వయసును తెలుప, నిట్టూర్పు విడిచి జరిగింది తల్లి.

అమ్మా! ఏమైందమ్మా? నేను అడుగుతూనే ఉన్నాను. నువ్వు ఏమీ చెప్పటం లేదు?”

ఏమడిగావు...?”

నాకు ప్రమోషన్ రావటం మీకు సంతోషం కలిగించటం లేదా?”

లేదు

----చటుక్కున సమాధానం చెప్పిన తల్లిని చూసి మొహం మారింది కొడుకుకు.

అమ్మా...

అవున్రా. నాకు సంతోషంగా లేదు

ఎందుకని?”    

నిజమైన సంతోషం ఏమిటో తెలుసా?” -- అని మాట్లాడటం మొదలుపెట్టిన తల్లిని చేయెత్తి వద్దు అని ఆపింది పవిత్ర.

వద్దమ్మా...నువ్వు ఏమీ చెప్పొద్దు

ఎందుకే...ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు?”

ఏం...నాకేం తక్కువ? చదువుకున్నాను. స్వయంగా సంపాదిస్తున్నాను. నా నిజాయితీతో ఉద్యోగంలో ప్రమోషన్ తెచ్చుకున్నాను

అది మాత్రం చాలా...?”

ఇంకేం కావాలి?”

నీకని ఒక కుటుంబం...భర్త...పిల్లలూ...

అమ్మా... --- అరిచింది పవిత్ర.

ఎందుకే అరుస్తావు? ఉద్యోగమూ, డబ్బూ మాత్రమే జీవితానికి ముఖ్యం కాదు. ఒక స్త్రీకి వయసుకు ఏది జరగాలో అవన్నీ జరగాలి

నాకు అన్నీ జరిగి ముగిసిపోయింది కదా అమ్మా

లేదు పవిత్రా...అది ఏదో మన బ్యాడ్ టైమ్. అలా జరిగిపోయింది. అందుకని అలాగే ఉండిపోతావా? నీకని సెక్యూర్డ్ లైఫ్ అక్కర్లేదా?”

అమ్మా...దయచేసి దాని గురించి మాట్లాడకు

నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారే?”

అమ్మా, ఇప్పుడెందుకు అక్కయ్యను ట్రబుల్ చేస్తావు?”---కొడుకు క్రాస్ చేసాడు.

నువ్వు నోరు ముయ్యరా. అంతా నీ వల్లే వచ్చింది---సాధించింది.

స్వరాజ్యం... రోజు ఏమైందే నీకు? ఇప్పుడెందుకు గొల చేస్తూ కోపగించుకుంటున్నావు?”

అవును...అంతా వీడు చేసిన నిర్వాకమే కదా! ఇదేదో కోపంలో విడాకుల పత్రాలలో సంతం పెట్టిందే అనుకోండి, వీడేం చేసుండాలి? వాటిని చింపేసి, మనిషి తోటి సమాధానం మాట్లాడుండాలా...కాదా?

అలా చేశాడా వీడు. అక్కను ఆమె భర్తతో కలుపుతాడని ఎదురు చూస్తే...చదివించాడు. ఉద్యోగంలో చేర్చాడు. ఇవా ముఖ్యం?”

అమ్మా...ఏం మాట్లాడుతున్నావో ఆలొచించే మాట్లాడుతున్నావా?”

అవునురా. పిల్లపాపలతో, భర్తతో జీవించాల్సిన దానిని ఇలా ఫైలూ, డైరీ పట్టుకుని తిరిగేటట్టు చేసావే!

అమ్మా, ఇప్పుడెందుకు తమ్ముడ్ని తిడుతున్నావు? వాడి వల్లే నేను మీ ముందర పూర్తిగా నిలబడున్నాను. అది మర్చిపోకండి

నేను మర్చిపోలేదే...నువ్వు పూర్తి జీవితం జీవిస్తున్నావా?”

ఖచ్చితంగా...నేను మనస్పూర్తిగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నాను

అబద్దం చెబుతున్నావు?”

లేదమ్మా. మనిషితో జీవించింది ఒక నరక జీవితం. బానిస లాగా జీవించాను. ఇప్పుడే...తమ్ముడి వలన ప్రశాంతమైన మరు జీవితం దొరికిందమ్మా. ఇందులో కన్నీరు...అవమానం...కుమిలిపోవటం ఏదీ లేదు. ప్రశాంతత, తృప్తి, ఆత్మ ధైర్యం...పరిపూర్ణత అన్నీ ఉన్నాయమ్మా. నాకు జీవితమే చాలమ్మా

కానీ నాకు ప్రశాంతత -- పరిపూర్ణత లేదే? నేను కన్న ఇద్దరూ వాళ్ళకోసం ఒక జీవితం అమర్చుకోకుండా ఇలా ఒంటరిగా నిలబడున్నారే?”

పెళ్ళి, కుటుంబం మాత్రమే జీవితం కాదమ్మా. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉందమ్మా. దయచేసి నన్ను నా దారిలో పోనివ్వు

చూడండి...ఏం మాట్లాడుతోందో!

ఏం స్వరాజ్యం...అది చెప్పేదాంట్లో ఏం తప్పుంది?”

ఏమండీ మీరు కూడానా?”

అవును! చదువుకునే వయసులో ఆడపిల్లకు ఎందుకు పెద్ద పెద్ద చదువులు అంటూ ఇంట్లోని వంట గదిలో పడేసావు. మంచివాడా--చెడ్డవాడా అనేది తెలుసుకోకుండానే ఒకడి చేతిలో పెట్టాము. చివరికి ఏమైంది? దానికి చదువు లేదనే ఒక కుంటి సాకు చెప్పి, దీన్ని వదిలేసి ఎవత్తినో తీసుకు వచ్చాడు. మనం ఏం చేయగలిగాం చెప్పు?

కూర్చుని ఏడవడం తప్ప ఇంకేం చేశాము! ఇప్పుడు అది తమ్ముడి సహాయంతో తన కాళ్ళ మీద లేచి -- తలెత్తుకు  నిలబడింది. సమయంలో దాన్ని మళ్ళీ ఎందుకు హింసిస్తావు?”

అంటే నేను మీ అందరినీ హింసిస్తున్నాను?”---- స్వరాజ్యం ఏడుస్తున్న స్వరంతో అడిగినప్పుడు -- గోపాల కృష్ణ హడావిడి పడుతూ -- కాదు అన్నాడు.

అలా కాదు స్వరాజ్యం...మన పిల్లల మనసును...దాని నొప్పిని మనమే తెలుసుకో లేకపోతే ఎలా?”

నా మనసులోని నొప్పిని ఎవరూ తెలుసుకోవటం లేదే? తెల్లారటం దగ్గర నుండి, చీకటి పడేంత వరకూ మనిషికో పక్కకి వెళ్ళిపోతున్నారు. నేను ఒకత్తినే...ఇంట్లో ఒంటరిగా నా మనసుతో పోరాడుతున్నానే.

నా వేదన మీకు అర్ధం కాలేదా? వచ్చే వాళ్ళూ -- వెళ్ళే వాళ్ళూ అందరూ...నీ కూతురు ఇంకా నీ ఇంట్లోనే ఉన్నదా?’ అని అడుగు తున్నప్పుడు నా మనసు గిలగిలా కొట్టుకుంటోందే!

కన్నతల్లి తన పిల్లలు హాయిగా, సంతోషంగా జీవించాలని ఆశపడదా! నేనూ అంతే కదా. ఆశపడుతున్నానుఅది తప్పా? చెప్పండి...నా ఆశ తప్పా?” -- పొంగుకొస్తున్న కన్నీటితో అడిగిన తల్లిని బిడ్డ లిద్దరూ కౌగలించుకున్నారు.

లేదమ్మా...మీ ఆశలో తప్పే లేదు

నాకు వేరే ఆశ ఇంకేముంటుంది చెప్పు? కళ్ళు మూసేలోపు ఒక మనవుడినో, మనవరాలినో వొడిలో ఉంచుకుని బుజ్జగించాలనే కదా ఇంత బ్రతిమిలాడుతున్నాను" అంటున్న తల్లి కన్నీటిని తుడిచింది పవిత్ర.

ఏడవద్దమ్మా. త్వరలోనే నీ ఆశ తీరుతుంది

గబుక్కున తలేత్తింది స్వరాజ్యం.

ఏమిటి...? అలాగైతే...నువ్వు పెళ్ళి చేసుకుంటావా?”

నా జీవితం ప్రారంభించిన వేగంతోనే అస్తమించిది కదా! ఇక పెళ్ళనే మాటకే చోటు లేదు

అంటే...?”

అంటే తమ్ముడున్నాడు కదా! వెంటనే వాడికి ఒక అమ్మాయిని చూడండి

అక్కా... -- అధిరిపడ్డాడు మనో.

ఊరికే ఉండు. నీకూ వయసు అవుతోందే! అమ్మా, వెంటనే తమ్ముడికి మంచి సంబంధం చూడు. వచ్చే ముహూర్తంలోనే పెళ్ళి పెట్టుకుందాం” 

అక్కా...చెబుతే విను. నాకెందుకు ఇప్పుడంత తొందర?”

చూసావా...వీడుకూడా ఇదే సమాధానాన్ని సంవత్సరాల తరబడి చెబుతున్నాడు

అమ్మా...వాడిని పెళ్ళికి ఒప్పించటం నాదే బాధ్యత. మొదట మీరు అమ్మాయిని చూడండి

అమ్మాయి కోసం మనం వెతకక్కర్లేదు.ఇంతకు ముందే ఒక ఆడపెళ్ళివారు వచ్చి అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకు మన మనో బాగా నచ్చాడట. వీడు గట్టిగా అని చెప్పటం లేదు

ఇక మీదట ఒప్పుకుంటుండమ్మా. మీరు మిగతా విషయాలను గురించి మాట్లాడండి.  ఏమ్మా...ఇప్పుడు సంతోషమే కదా?”

పవిత్రా

ఏమిటమ్మా?”

నీకొక తోడు కావద్దా?”

ఏం...ఇప్పుడే నాకు మీరంతా తోడుగా ఉన్నారుగా?”

అది కాదు...నీకొక పెళ్ళి...

అమ్మా, నువ్వు దేనికీ బాధపడకూడదనే కదా తమ్ముడ్ని ఒప్పించాను. పెళ్ళి మాత్రం జరగనీ...వాడు గబగబా పిల్లల్ను కని పారేస్తాడు. నేనూ, మీరూ పెంచుకుందాం. సరేనా? అవును మీకు ఎంతమంది మనవుళ్ళు కావాలి? ఆరు... ఏడూ...చాలా?”

పవిత్ర ఎగతాలిగా అడుగుగా...కన్నీటిని మరచి నవ్వటం మొదలుపెట్టింది స్వరాజ్యం.

తండ్రి కూడా కలిసి నవ్వటంతో...కన్నవారి సంతోషాన్ని మనసారా అనుభవిస్తున్న పవిత్ర  తమ్ముడి వైపు చూసింది. ఎప్పుడులాగా కాకుండా వాడి మొహం వాడిపోయున్నది.

                                                                                  PART-5

పౌర్ణమి చంద్రుడు వెన్నెలను విరజిమ్ముతున్నాడు. మేడపైన అటూ ఇటూ నడుస్తూ ఏదో ఆలొచిస్తున్నాడు మనో. అతని మనసు ఎన్నో రకాల ఆలొచనలతో గందరగోళ పడుతుంటే, ఆలొచిస్తూ తమ్ముడ్ని వెతుక్కుంటూ వచ్చింది పవిత్ర.

మనో

అక్కా...

ఏమిట్రా...టైము పదకుండు అవుతోంది. నువ్వింకా భోజనం చెయ్యకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా?”

ఆకలి లేదక్కా

ఎందుకని

తెలియటం లేదు----నీరసంగా చెప్పి నడిచి వెళ్ళటానికి ప్రయత్నించిన అతని భుజం పట్టుకుని ఆపింది.

మనో

...

ఏమిట్రా...ఎందుకలా మూడ్ -- అవుట్ గా ఉన్నావు?”

...అలాగంతా ఏమీ లేదక్కా ఏమీలేదు

అబద్దం చెప్పకు! నీ మొహం చూసే నీ మనసును కనిపెట్టగలను

అక్కా-- ఆశ్చర్యపోయాడు తమ్ముడు.

చెప్పు...ఏమిటి నీ సమస్య?”

సమస్య అంటూ ఏమీ లేదక్కా...నాకు...నాకు ఇప్పుడు పెళ్ళి అవసరమా?”

ఎందుకురా అలా అడుగుతున్నావు?”

వద్దక్కా. నేను కూడా నీలాగా ఉండిపోతాను బాధ పడుతూ చెప్పిన అతని గడ్డం పుచ్చుకుని తలపైకెత్తింది. అతని కళ్ళల్లో నీళ్ళు. ఆందోళన పడ్డది.

రేయ్...

చేసుకోలేనక్కా...నిన్ను పరిస్థితిలో వదిలేసి నేను ఎలా?”

నువ్వూ అమ్మలాగా మాట్లాడకు. నేను జీవించిన దానిని. నాకోసం నువ్వెందుకు నీ యౌవనాన్ని, జీవితాన్నీ పాడుచేసుకుంటావు?”

లేదక్కా, నేను...

మాట్లాడకు! నిర్ణయం ఎప్పుడో తీసుకోనుండాలి. పాపం...మన వలన అమ్మకు ఎంత మనో కష్టం?”

లేదక్కా. గుడిలో ఎవరో మన గురించి అడిగుంటారు. అందుకే అమ్మ అలా  మాట్లాడుంటుంది. రెండు రోజుల్లో నార్మల్ అయిపోతుంది. అంతలో నువ్వు తొందరపడి మాట ఇచ్చావు?”

లేదురా. ఇది తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదురా. నీకూ వయసు అవుతోంది!  నీకొక పెళ్ళి చేయాలే?  ఇన్ని రోజులు నా కోసమే జీవించావు. ఇక నీ కొసం కూడా జీవించాలి కదా?”

ఏంటక్కా...వేరు చేసి మాట్లాడుతున్నావు?”

లేదు మనో. ఇన్నిరోజులు నేను స్వార్ధంగా ఉండిపోయాను అనిపిస్తోంది

అక్కా

నా గురించి మాత్రమే నేనూ, నువ్వు ఆలొచిస్తూ ఉండి పోయుంటాము. అమ్మ యొక్క ఆవేధన, బాధలూ చూసావా...నీ జీవితం గురించి ఆలొచించనే లేదే?”

అవునక్కా...ఆలొచించకుండానే వదిలేసాము

తప్పు మళ్ళీ చేయకూడదనే నీ పెళ్ళి మాటలు ఎత్తేను. నువ్వు దేని గురించి ఆలొచించకుండా భొజనం చేసి పడుకో. జరగవలసినదంతా బాగానే జరుగుతుంది

లేదు...నేను...

ఏమీ మాట్లాడకు! మొదట వచ్చి భొజనం చెయ్యి

వెళ్ళక్కా...తరువాత తింటాను

రేయ్...ఇప్పుడు టైమెంతో తెలుసా? మధ్యరాత్రా తింటావు? రారా

అక్కా

ఏమిట్రా?”

నువ్వు చివరిదాకా ఇలాగే ఉండబోతావా?”----తడబడుతూ అడిగిన మనో వైపు ఆశ్చర్యంగా చూసింది పవిత్ర.

....................”

అతనే ఇంకొకత్తిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాడు. తప్పూ చేయని నువ్వు ఎందుకక్కా ఒంటరిగా నిలబడాలి? నీకేమైనా వయసైపోయిందా? ఇప్పుడు చెప్పక్కా ' అని ఒక్క మాట. నీకు ఎలాంటి పార్ట్ నర్ ను తీసుకు వచ్చి నిలబెడతానో చూడు అన్న మనోని చూసి వద్దు అని తల ఊపి చెప్పింది.

లేదురా...అది సరి రాదురా

ఎందుకని... ఊరుని చూసి భయపడుతున్నావా?”

ఛఛ...ఊరేమిట్రా పెద్ద ఊరు? బాగా బ్రతికితే మనల్ని చూసి ఈర్ష్య పడుతుంది. కష్టపడితే పరిహాసం చేస్తుంది. ఊరుకోసమో...బంధువులకోసమో నేను రోజూ భయపడింది లేదు

మరి ఇంకేంటక్కా

నీకు తెలుసు. మనం ఎలా పెంచబడ్డమో...ఎలా పెరిగామో?”

...క్కా...

మన ఇల్లు...అమ్మమ్మ ఇల్లు...ఇవి రెండూ లేకపోతే గుడి అంటూ మన ప్రపంచం చాలా చిన్నాదిరా. అలాగే కదా మనం పెరిగాము. రంగు రంగుల బట్టలు వేసుకుని, ఊరంతా తిరిగింది లేదే. నాటకం, సినిమా, పార్టీలు, పబ్బులు అంటూ దేనికీ వెళ్ళింది లేదు. రంగు రంగుల సినిమా పుస్తకం గూడా చూసింది లేదు. మనకు తెలిసిందంతా నాన్న పెట్టుకున్న రామాయణం, మహాభారతం లాంటి పుస్తకాలు చదివే కదా పెరిగాము.

సావిత్రి, నలాయణీ, సీత పతివ్రతలను దేవతలుగా ఆరాధించాము! అలాంటి దారిలో వచ్చిన నేను ఎలారా ఇంకో పెళ్ళి గురించి ఆలొచించను?”-- పవిత్ర నిదానంగా అడగటంతో, విరిగిపోయాడు మనోహర్.

పిల్లలను వెతుక్కుంటూ వచ్చిన తల్లి-తండ్రులు కూడా శిలలాగా నిలబడిపోగా, పవిత్ర నవ్వుతూ మళ్ళీ మాట్లాడింది.

అందుకని ఆడది రెండో పెళ్ళి చేసుకోవటం తప్పు అని నేను చెప్పటం లేదు. అది వారి వారి మనస్థత్వాలకు చెందింది. చేతిలోనో--కడుపులోనో బిడ్డలతో ఎంతో మంది అనాధలుగా, విధవ మహిళలను చూస్తున్నప్పుడు మనసు అల్లాడిపోతోంది. వాళ్ళకు మరు జీవితం ఇచ్చే మగవాళ్లకు చేతులెత్తి దన్నం పెట్టాలని అనిపిస్తోంది. కానీ నేను విధవను కాదే? నా మెడలో తాళి కట్టినవాడు బ్రతికే ఉన్నాడే. అలా ఉన్నప్పుడు ఎలా ఇంకొక తాళి కట్టించుకోను? అది అసహ్యం కాదా?”

అయితే...అతను చేసింది మాత్రం కరక్టా?”

లేదురా. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా శిక్ష అనుభవిస్తారు. అతను కూడా అనుభవిస్తాడు

నాకు నమ్మకం లేదు

దాని గురించి మనం బాధపడక్కర్లేదు. నా పెళ్ళప్పుడు అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను. సంతోషం లోనూ, బాధల్లోనూ మనసును దృఢంగా ఉంచుకుని ఆయనతో కలిసే ఉంటానని . ఇంకొకరికి మనసులో కూడా తావు ఇవ్వను అని.

నేను పతివ్రతను. ఎలాంటి సందర్భాలలొనూ మాట జారిపోనివ్వను. గెలుపో...ఓటమో...నా జీవితంలో పెళ్ళి అనే సంఘటన జరిగి పూర్తి అయ్యింది. ఇక దేని గురించి మాట్లాడొద్దు

......................”

దేవుని యొక్క ప్రతి ఒక్క పనికి ఒక కారణం ఉంటుందని నాన్నగారు చెప్పేరే! అలాంటిదే ఇది అని అనుకుంటాను. మనిషి నన్ను వదిలి వెళ్ళబట్టే కదా ఇంత చదువు చదివి, జీవితంలో పైకెదిగాను? లేకపోతే కన్నీరు, వేదనతో ముడుచుకుపోయుంటానే?

ఇప్పుడు నాకు ఎలాంటి వేదన... బాధా లేదు. చాలా సంతోషంగా ఉన్నాను. ఆత్మ తృప్తితో జీవిస్తున్నాను. నాకు ఇది చాలు. అమ్మలాగానే నువ్వు కూడా మాట్లాడి నన్ను పిరికిదాన్ని చేయకు! నేను ఎప్పుడు తల ఎత్తుకునే నిలబడాలని ఇష్టపడుతున్నాను 

లేదక్కా. ఇక మీదట నీతో ఇలా మాట్లాడను. సారీ అక్కా

ఇప్పుడే నువ్వు నా తమ్ముడివిరా---అతని చేతులు పుచ్చుకుని తనతో తీసుకు వెళ్ళటానికి వెనక్కి తిరిగినప్పుడు, తల్లీ-తండ్రులు అక్కడ నిలబడటం అప్పుడే గమనించారు.

అమ్మా...నాన్నా...మీరింకా నిద్రపోలేదా?”

నా బంగారు తల్లీ...ఎంత మాటలు మాట్లాడావు. నేను కూడా ఇలా లోకజ్ఞానమే తెలుసుకోలేని పిల్లను కన్నానే? అని తలచుకుని బాధపడ్డాను. భర్తను అనుసరించి వెళ్ళటం తెలియలేదే అంటూ నీ దగ్గర కోపగించుకున్నాను.

కానీ నా బిడ్డ...ఎంత పెద్ద మనిషో? ఏమండీ...మన అమ్మాయిని మనం బాగానే పెంచాము. ఇది బంగారం...ప్యూర్ బంగారం

అది నీకు రోజే తెలిసిందనుకుంటా?”---ఓర్పు కలిసిన స్వరంతో గోపాలకృష్ణ అడుగగా, నవ్వింది స్వరాజ్యం.

అవును. నేనే మూర్ఖంగా ఉండిపోయాను. వెధవ కొసం ఎన్ని రోజులు నేను...

అమ్మా, అయిపోయిందాని గురించి మాట్లాడ కూడదు. ఇక మీదట జరగబోయే మంచి విషయాల గురించే మాట్లాడాలి ---ఖచ్చితమైన స్వరంతో పవిత్ర చెప్పగా, నోరు మూసుకున్నారు కన్నవాళ్ళు.

మాట్లాడనమ్మా మాట్లాడను. జరగవలసిన కార్యాలన్నిటినీ తండ్రీ, కొడుకులు చూసుకోండి

"అది మేము చూసుకుంటాం. ముందు మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. నువ్వు రా మనో " -- తమ్ముడితో కిందకు దిగింది.

మనో మొహం ఇంకా ఆందోళనగా ఉండటం చూసిన పవిత్ర బాగా కన్ ఫ్యూజ్ అయ్యింది. ఆమె కన్ ఫ్యూజన్ కు మరునాడే సమాధానం దొరికింది.

                                                                                PART-6

పనిలో మునిగిపోయున్న పవిత్రను టేబుల్ మీదున్న టెలిఫోన్ పిలువగా...తన పని ఆపేసి ఫోన్ ఎత్తింది.

అవునండి...మీరు?”

నా పేరు స్వాతి. జి.ఎస్.ఎన్. బిల్డర్స్ లో పనిచేస్తున్నాను

సరే

మ్యేడం...నేను మిమ్మల్ని కలవాలే!

నన్నా?”

అవునండి...చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను. అవకాశమే దొరకలేదు

సారీ. మీరెవరో నాకు తెలియటం లేదే?”

కానీ, నాకు మిమ్మల్ని బాగా తెలుసు మ్యేడం. మిమ్మల్ని మాత్రమే కాదు...మీ కుటుంబంలో అందర్నీ తెలుసు

మీరు మాకు బంధువులా?”

మీరు మనసు పెడితే ఖచ్చితంగా బంధువు అవటానికి నేను రెడిగా ఉన్నాను---- స్వాతి సమాధానంతో నుదురు చిట్లించుకుంది పవిత్ర.

ఏం చెబుతున్నారు...నాకు అర్ధం కాలేదు

మ్యేడం...నేను మీ కంటే చిన్న దానినే .పేరు పెట్టే పిలవండి

మీరింకా ఏం బంధుత్వమో చెప్పలేదే?”

చెప్పను మ్యేడం. ఫోనులో వద్దు. మిమ్మల్ని నేరుగా కలిసి చెబుతాను

నేనిప్పుడు ఆఫీసులో ఉన్నాను

తెలుసు మ్యేడం. మీ ఆఫీసుకు ముందు నిలబడే మాట్లాడుతున్నాను

ఏమిటీ?”

లంచ్ టైముకు ఇంకా పది నిమిషాలే ఉన్నది. అప్పుడు మనం కలుసుకుందామా?”---ఆమె ఆశగా అడుగగా, తన కుర్చీ వెనుక ఉన్న అద్దాల కిటికీకి ఉన్న కర్టన్ను పక్కకు తోసి తన చూపులను బయటకు పారేసింది.

ఆఫీసు ప్రధాన ద్వారమూ, దాని దగ్గరగా స్కూటీ వాహనం పక్కన నిలబడి చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకోనున్న అమ్మాయిని క్షుణ్ణంగా చూసింది.

రోజా పువ్వు రంగులో చీర. మొహం సరిగ్గా కనబడకపోయినా పిల్ల ఏదో ఆందోళనగా ఉన్నదని అర్ధమయ్యింది పవిత్రకు.

రోడ్డును చూడటం, ఆదుర్దాగా ఆఫీసువైపు చూడటం చేస్తున్న పిల్లను చూసి కొంచం అనుమానం కలిగింది.

అవును...నువ్వెక్కడ పనిచేస్తున్నావు?”

అన్నీ క్లియర్ గా చెబుతాను. మీరు మొదట బయటకు రండి

చాలా అవసరమా?”

అవును మ్యేడం. మనో వచ్చేస్తే కార్యం పాడైపోతుంది

ఏమన్నావు...?”

నన్ను చూస్తే టెన్షన్ అయిపోతాడు. అతని చూపులకు దొరక కూడదనే అవసరపడుతున్నాను

నీకు నా తమ్ముడు తెలుసా?”

...తెలుసు

ఎలా...?”

చాలా సంవత్సరాల నుంచి తెలుసు మ్యేడం. మనో, నేనూ ఒకరినొకరు ఇష్టపడుతున్నాం

ఏం చెబుతున్నావు?” --- మరింత ఆందోళనతో కుర్చీలోంచి లేచింది.

ఇది నా జీవిత సమస్య. మీరు మాత్రమే మమ్మల్ని కలుపగలరు. దీని గురించి మాట్లాడటానికే మీకు ఫోన్ చేశాను. బయటకు రండి. ఫోన్ పెట్టేస్తూన్నా -- అంటూ ఆమె ఫోన్ కట్ చేయటంతో, గందరగోళంతో ఉన్న పవిత్ర రీసీవర్ పెట్టేసింది.

ఎవరీ అమ్మాయి? ఆమె చెప్పేది నిజమా? ఒకవేల నిజంగానే ఉంటుందా? ఈమెను ఇష్టపడుతున్నాడు కాబట్టే...పెళ్ళి చూపులకు వెళదామంటే మొహం మారుతోందో?’

ఆలొచిస్తూ తన టేబుల్ మీదున్న ఫైలును మూస్తున్నప్పుడు ఆమె సెల్ ఫోన్ మ్రోగింది. సెల్ ఫోన్ ఎత్తింది.

అవతల పక్క మనో!

అక్కా...నేనూ, ఎం.డి ముఖ్యమైన మీటింగులో ఉన్నాము. నా కోసం వెయిట్ చెయ్యకుండా నువ్వు లంచ్ చేసేయ్. సరేనా...?”

... మనో, ఒక్క నిమిషం

ఏంటక్కా

నువ్వు రావటానికి టైము పడుతుందా?”

పని పూర్తవటానికి ఎలాగైనా రెండు గంటలు పట్టేట్టుంది. ఏంటక్కా

ఏమీ లేదు...జస్ట్ అడిగాను

సరేక్కా. పెట్టెస్తాను -- అంటూ అతను సెల్ ఫోన్ ఆఫ్ చేసిన తరువాత, తాను కూడా తన సెల్ ఫోన్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని, మళ్ళీ ఒకసారి కిటికీ నుండి బయటకు చూసింది. స్వాతి వెయిట్ చేస్తున్నది తెలుస్తోంది.

మధ్యాహ్నం లంచును పక్కకు పెట్టి, టేబుల్ మీదున్న వస్తువులను బద్ర పరచి గది నుండి బయటకు వచ్చి సహ ఉద్యోగులను కలిసి 'ఒక అరగంటలో వస్తాను అని చెప్పి హ్యాండ్ బ్యాగుతో బయటకు వచ్చింది.

పవిత్రను చూసిన వెంటనే...వాకిట్లో ఆందోళనతో ఎదురుచూస్తున్న స్వాతి మొహం వికసించింది. దగ్గరగా చూడటంతో ఆమె అందం పవిత్రను మురిపించింది. చాలా సింపుల్ అలంకరణతో నిలబడున్నా కళ్లనూ, మనసునూ ఆకర్షించింది.

మనోకి కరెక్టుగా సరిపోతుంది అని ఆమె లోపలి మనసు గుద్ది చెబుతున్నా, తనలోని అనుమానాలు ఆమెను అవసర పెట్టలేదు

ఈమె చెప్పింది నిజమేనా...అబద్దం అనిపించటం లేదు. కానీ, చూసిన వెంటనే ఎందుకలా అనిపించింది? చాలా సంవత్సరాలుగా చూసి, పరిచయమైన భావం ఏర్పడుతోందే?’

థాంక్యూ మ్యాడం

దేనికి...?”

నా కోరికను వెంటనే అంగీకరించినందుకు

కోరికనా...అవును నువ్వు ఎవరు?”

చెబుతా మ్యాడం. బండి ఎక్కండి

బండీలోనా?”

అవును! కుటుంబ విషయాన్ని ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడగలామా? పక్కనే ఒక .సీ. రెస్టారంట్ ఉంది. అక్కడకెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుకుందాం. ఎక్కండి  మ్యాడం. నేను బాగానే బండి తోలుతాను---నవ్వుతూ గలగలమని మాట్లాడగా, పవిత్ర ఆశ్చర్యపోయి జవాబు చెప్పకుండా ఆమె స్కూటీ ఎక్కి కూర్చోగా, స్వాతి డ్రైవ్ చేసింది.

మధ్యాహ్నం సమయం కాబట్టి రోడ్డు మీద రవాణా తక్కువగానే ఉన్నది. స్వాతి జాగ్రత్తగా బండి నడుపుతోంది. ఇప్పుడు మాట్లాడకూడదు అనుకుని పవిత్ర మౌనంగా ఉండగా, హై క్లాస్ వెజిటేరియన్ హోటల్ ముందు బండి అపింది.

రండి మ్యాడం

లోపలకు వెళ్ళిన తరువాత స్వాతీనే భోజనం ఆర్డర్ చేయగా ఆమెనే చూస్తూ కూర్చుంది పవిత్ర .

మ్యాడం...నేను ఎలా ఉన్నాను?”

...

లే...దు...చూడటానికి సుమారుగా ఉన్నానా?”

...... --- అంటూ తల ఊపింది.

మొదట నీ గురించి చెప్పు. మిగిలిన విషయాలు తరువాత మాట్లాడు కుందాం

చెప్పేస్తాను. నేను... మనోని మొదటిసారిగా చూసింది మీ పెళ్ళిలోనే... --- కొంచం బిడియపడుతూ చెప్పింది స్వాతి.

పవిత్ర మొహం గబుక్కున మారింది.

...మి...టీ?”

నేను...పెళ్ళి కొడుకు తరపు దూరపు చుట్టం

ఓహో!

పెళ్ళిలో చూసినప్పుడే మనోని నాకూ, నన్ను మనోకి నచ్చింది. మేము ఇష్టపడటం మొదలుపెట్టాము

...తరువాత?”

ఇద్దరం చదువుకుంటున్నాం కాబట్టి, చదువు పూర్తి అయిపోయిన తరువాత ఇంట్లో చెప్పచ్చు అనుకుని వెయిట్ చేశాము

అంతా బాగానే వెడుతున్నది. రామ్మోహన్ అన్నయ్య అలాగంతా చేస్తాడని మేమెవరం ఎదురు చూడలేదు

విషయానికిరా. ఇప్పుడు నేను ఏం చేయాలి?” --- పవిత్ర మొహంలో విసుగు కనిపించింది.

సారీ మ్యాడం. ఎవరో చేసిన తప్పుకు మనో నన్ను శిక్షిస్తున్నాడు

...మి...టీ?”

రామ్మోహన్ నాకేమీ దగ్గరి బంధువు కాదు. మా నాన్నకు దూరపు బంధువు. కానీ, దాని కోసం ఈయన ఎందుకు మ్యాడం నన్ను ఇష్టపడక పొవటం?”

ఇది నువ్వు వాడి దగ్గరే అడగాల్సింది?”

అడిగాను. ఒకసారి కాదు...పలుమార్లు. కానీ...నేను అడిగినప్పుడల్లా చెప్పే ఒకే సమాధానం నా అక్కని బాగు చేయటమే ఇప్పటికి నాకున్న ఒకే పని. నాకు ఇంక దేంట్లోనూ ఇంటరెస్టు లేదు అంటున్నారు

..........................”

బ్రతిమిలాడి చూశాను. ఏడ్చి చూశాను. అయినా కానీ అతని మనసు మారలేదు

విషయాలన్నీ మీ ఇంట్లోవాళ్ళకు తెలుసా?”

చెప్పేశాను మ్యాడం. మా నాన్నకు మీ కుటుంబం అన్నా, మనో అన్నా చాలా ఇష్టం

ఓహో...అప్పుడు మా అమ్మగారి దగ్గర కొచ్చి మాట్లాడమని చెప్పొచ్చే?”

మాట్లాడారు మ్యాడం. మధ్యవర్తి మూలంగా ఏడెనిమిదిసార్లు మీ ఇంటికి వచ్చి మాట్లాడారు. నా ఫోటో చూసే అత్తయ్య ఓకే చెప్పేసిందట.

కానీ, మనో మాత్రం ఒప్పుకోవటం లేదు. అక్కయ్యను ఇలా ఉంచుకుని, నా వల్ల పెళ్ళిచేసుకోవటం కుదరదు--అని చెబుతున్నారు. నన్ను చూడటం లేదు. ఫోన్ చేస్తే మాట్లాడటం లేదు.

అవాయిడ్ చేస్తున్నారు. నా మనసు పడుతున్న వేదనని అర్ధం చేసుకోనంటున్నారు. మనో లేకుండా...నేను జీవించ లేను మ్యాడం --- గొంతులో దుఃఖం అడ్డుపడా మాట్లాడుతున్న స్వాతిని చూసి పవిత్రకు జాలి వేసింది.

ఆయన మనసులో నేను ఉన్నానో లేనో...కానీ, ఆయనంటే నాకు ప్రాణం. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోసం కాచుకోనుంటా.

కానీ...ఇంట్లో నాన్నకు నమ్మకం లేదు. ఇంకో సంబంధం వెతుకుతున్నారు. అందుకే...నా...నా వేదనను మీ దగ్గర కక్కేశాను.

మీరు మాత్రమే మనోని ఒప్పించగలరు. మీరు చెబితే ఆయన వింటారు. నాకు ఆయన  కావాలి. ఆయన్ని తప్ప ఇంకెవరినీ నా వల్ల భర్తగా అనుకోలేను.

మీరే...నాకోసం ఆయన దగ్గర మాట్లాడాలి. మమల్నిద్దర్నీ కలపాలి. మిమ్మల్నే నమ్ముకున్నాను -- పవిత్ర చేతులు పుచ్చుకుని బ్రతిమిలాడుతున్న స్వాతిని కొంచం నవ్వు, కొంచం కన్నీరు తోనూ చూసింది పవిత్ర.

ఏడవకు! నువ్వే మా ఇంటి కోడలు

మ్యా...డం...

వదినా అని చెప్పు -- నవ్వింది.

...ది...నా

వచ్చే ఆదివారం మీ ఇంటికి వస్తున్నాము. నీ అడ్రెస్స్ ఇవ్వు

అది... మనోకి తెలుసు -- అవస్తపడుతూ చెప్పిన స్వాతిని చిలిపి కోపంతో చూసింది పవిత్ర.

...ఇంటి వరకు వస్తున్నాడా వాడు?”

లేదు...లేదు... దారిలో వెడుతుంటే ఇల్లు చూపించాను

అలాగా? సరే. మీ నాన్నతో చెప్పు. ఆదివారం పెళ్ళి చూపులకు వస్తున్నామని

నిజంగానా వదినా?”

ఏం...నా మీద నమ్మకం లేదా?”

అలాకాదు వదినా... మనో ఒప్పుకోవాలే?”

అది నా బాధ్యత. ఇంతక ముందే వాడిని పెళ్ళికి అంగీకరించేట్టు చేశాము

ఏమిటీ?”

పిల్ల గురించి మాట్లాడినప్పుడే వాడి మొహం మారింది. దానికి అర్ధం ఇప్పుడు తెలిసింది. వాడి మనసులో నువ్వు ఉన్నావు! ఇక తల ఊపుతాడు

పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా స్వాతి ఉత్సాహంతో పవిత్రను కౌగలించుకుని ముద్దుపెట్టుకుంది.

చిన్న పిల్లలా ఆమె నడుచుకున్న విధం, కాబోయే వదిన మొహంలో సంతోషాన్ని రప్పించింది.మనసులో అంతులేని ఉత్సాహం చోటుచేసుకుంది

                                                                                         PART-7

ఇంటికి వచ్చిన - తరువాత కూడా స్వాతి ఆలొచనలతో నవ్వు మొహంతో ఉన్న కూతుర్ని ఆశ్చర్యంగా చూసింది స్వరాజ్యం.

పవిత్రా

ఏంటమ్మా?”

తమ్ముడు రాలేదా?”

వాడు ఎం.డి తో బయటకు వెళ్ళాడు. రావటానికి ఆలశ్యమవుతుందని చెప్పాడు

సరే...నువ్వు కాళ్ళూ చేతులూ కడుక్కురా. కాఫీ ఇస్తాను

లేదమ్మా. మనో రానీ -- నవ్వు ముఖంతో చెప్పిన కూతురు దగ్గరకు వచ్చింది స్వరాజ్యం.

పవిత్రా. రోజు ఆఫీసులో ఏదైనా మంచి జరిగిందా?”

అవునమ్మా. మనం అనుకోనివి అన్నీ జరిగింది

అంటే?”

అమ్మా. మనోగాడు మనకు తెలియకుండా ఏం పని చేసాడో తెలుసా?”

మనోనా...ఏం చేసాడు?”

మన దగ్గర పెద్ద ముని లాగా పెళ్ళి వద్దు అని మాట్లాడి, లడ్డూలాంటి ఒకమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు

ఏంటమ్మాయ్ చెబుతున్నావు?”

అవునమ్మా... అమ్మాయి నన్ను చూడటానికి మా ఆఫీసు దగ్గరకు వచ్చింది

స్వరాజ్యం మొహం మారింది. ఎవరది?”

అది సస్పెన్స్. రానీ...వాడి నోటంబడే చెప్పిస్తాను పవిత్ర నవ్వుతూ చెప్పేటప్పుడు కారులో వచ్చి దిగాడు మనోహర్.

ఏమిటి పవిత్రా...కారులో వచ్చి దిగుతున్నాడు మనో?”

ఏం.డి. కారై ఉంటుంది. డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది -- అంటూ తల్లితో కలిసి బయటకు వచ్చిన పవిత్ర...ఆశ్చర్యపోయింది.

బయట గేటును వెడంగా తెరిచి కారును లోపలకు రమ్మని చెబుతున్నాడు మనో.

ఇంకొచ్చు రావచ్చు. చాలు ఆపండి

మనో...ఏమిట్రా? ఎవరి కారురా ఇది?”

ఒక్క నిమిషం అమ్మా. డ్రైవర్ అన్నా...మీరు బయలుదేరండి. ప్రొద్దున ఎనిమిదిన్నర కల్లా వస్తే చాలు

.కే. సార్ -- అంటూ తెల్ల డ్రస్సు వేసుకుని కారు డ్రైవ్ చేసుకోచ్చిన అతను, కారు తాళం చెవులను ఇచ్చి బయటకు వెళ్లగా...గేటును మూసి, గొళ్ళెం పెట్టి, ఉత్సాహంగా వెనుతిరిగాడు మనో.

గందరగోళ చూపులతో చూస్తూ నిలబడ్డ తల్లిని, ప్రేమగా భుజాల మీద చేతులు వేసి రెండుచేతులతో లాక్కుని ఇంట్లోకి వచ్చాడు.

ఏయ్...ఏమిట్రా ఇదంతా?”

చెబుతాను...రండి. అవును...నాన్న ఎక్కడ?”

నాన్న ఒక పెళ్ళికి వెళ్లారు. ఏమిటి విషయం?”

సరే...ఇలా వచ్చి నిలబడండి -- అని పూజ గదిలోకి వచ్చి నిలబడి -- తన చేతిలో ఉన్న తాళంచెవుల గుత్తిని తల్లి చేతికి ఇచ్చాడు.

ఇదిగో నమ్మా

ఏమిట్రా ఇది?”

రేపటి నుండి మీ అమ్మాయి -- గౌరవనీయులైన పవిత్రా గోపాలకృష్ణ, మా అడయార్ బ్రాంచీ ఆఫీసుకు సి...గా జాయిన్ కాబోతోంది

.మి.టీ.?” -- ఇద్దరి మొహాలూ ఆనందంతో వికసించగా, మనోహర్ గర్వంగా నవ్వాడు.

...దానికోసమే మా ఆఫీసు కారు ఇచ్చారు. ఇకపై అక్కయ్య నాతో టూ వీలర్లో రానక్కర్లేదు. దర్జాగా మహారాణిలాగా కారులో వెళొచ్చు

... నో...

అవునక్కా. రోజు ఏం. డి., నేనూ, జె.ఎండి., బోర్డ్ మెంబర్లు, సి.. (ఆపరేషన్స్) అందరూ అడయారు ఆఫీసులోనే ఉన్నాము. నీ ప్రమోషన్ పూర్తిగా కంపెనీ మేనేజ్ మెంట్ తీసుకున్నది. వాళ్ళు నీ పేరు అనౌన్స్ చేసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను

ఏం చెబుతున్నావు? ఆఫీసులో సి.. గా ఉండే గణపతి రావ్ గారు?”

ఆయనకి ఆరొగ్యం బాగో లేనందున వాలింటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారట. ఇంతవరకు పదవికి ఎవర్ని వెయ్యాలో కన్ ఫ్యూజన్లో ఉన్నారట. రెండు రోజుల ముందు ఆర్.ఎస్. కంపెనీతో డీల్ ఫైనల్ చేశావే...ఒక ప్రాజక్ట్. తెలివితేటల్ని చూసి బోర్డ్ నిన్ను సెలెక్ట్ చేసిందట

నేనింకా నమ్మలేకపోతున్నారా. నా కంటే సీనియర్లు ఉన్నారే! వాళ్ళని వదిలేసి...ఎలా?”

అక్కా...ఇది గవర్నమెంట్ కంపెనీ కాదు. ప్రైవేట్ కంపెనీ...ఇందులో సీనియర్-జూనియర్ ముఖ్యం లేదు. ఒక నిర్వాహాన్ని ఎలా విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లగలరో... నిర్వాహ వివేకం ఎవరికి ఉందో, వాళ్లనే కదా పెద్ద పోస్టులో ఉంచగలరు?”

అది సరే...కానీ...

నీ దగ్గర తెలివితేటలు ఉన్నాయక్కా. సాధించాలనే లక్ష్యం ఎక్కువగా ఉంది. నిజాయతీ ఉంది. ఇంకేం కావాలి?”

అవును పవిత్రా...నీ మీద నమ్మకం లేకుండానా ఇంత పెద్ద బాధ్యత నీకిస్తారు? నువ్వు బాగా వస్తావమ్మా. నీకిచ్చిన బాధ్యతను చక్కగా చేస్తావు... తల్లి యొక్క మనస్పూర్తి దీవెనలతో సంతోషంలో మునిగిపోయింది పవిత్ర.

థ్యాంక్స్ అమ్మా

అక్కా...ఇంకో ముఖ్యమైన విషయం

ఏమిటది?”

దగ్గర దగ్గర ఒక నెల రోజులు బ్రాంచీని నిర్వాహం చేసే సరైన వ్యక్తి లేకపోవటంతో...అక్కడ పనులన్నీ అలాగే ఉండి పోయినైట. సగం మంది టైముకు రావటం లేదట. వచ్చినా పనీ సరిగ్గా చేయటం లేదట. ఇలా ఎన్నో ప్రాబ్లంస్ . అన్నిటినీ నువ్వే సరి చేయాలి. ఇది నీకొక ఛాలెంజ్ గా ఉంటుందని అనుకుంటున్నాను...సరిచేస్తావుగా?”

ఖచ్చితంగా... పవిత్ర స్వరంలో కనబడ్డ నమ్మకం చూసి సంతోష పడ్డాడు తమ్ముడు మనో.

నేనూ విషయమే ఏం.డీ దగ్గర చెబుతూ వచ్చేను. అక్కా...ప్రొద్దున ఎనిమిదింటి కల్లా డ్రైవర్ వస్తాడు. నువ్వు వెంటనే బయలుదేరాలి

నువ్వు?”

నేను ఎప్పుడూ లాగానే వెల్తాను.  నా రూటు వేరు. నీ రూటు వేరు. నువ్వు ఇక మీదట ఒంటరిగా నిలబడి సాధించబోతావక్కా

ఖచ్చితంగా సాధిస్తాను. నాకు నమ్మకం ఉంది

ఆమ్మా...సంతోషమైన రోజును మనం పండుగ చేసుకోవద్దా?”

ఖచ్చితంగా చేసుకోవాలిరా

అయితే వెంటనే వంట గదికి వెళ్ళండి. మాకు ఇష్టమైన మైసూర్ పాక్ చేసి తీసుకురండి

సరేరా

అమ్మా...ఒక్క నిమిషం...

ఏమిటి పవిత్రా?”

రోజు ఒక స్వీటు కాదమ్మా...రెండు స్వీట్లు చెయ్యబోతాం--అన్నది తమ్ముడ్ని చూస్తూ.

రెండా!?”

అవును...ఒకటి నా ఉద్యోగ ప్రమోషన్. ఇంకొకటి అమ్మ పదవి పెరిగినందుకు

అమ్మ పదవి పెరిగిందా? ఏంటక్కా  చెబుతున్నావు?”

అవును మనో...అమ్మకు అత్తగారనే పదవి దొరకబోతోంది...అది కూడా అతి త్వరలోనే...

అక్కా...-- మనో మొహం మారింది. పవిత్ర నవ్వింది.

...అమ్మాయిని చూసేసాము. వచ్చే ఆదివారం మనం పెళ్ళి చూపులకు వెడుతున్నాము. నిశ్చయం చేసుకోబోతాము. వచ్చే మూహూర్తంలోనే పెళ్ళీ

అక్కా...ఏమిటి నువ్వు? నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పకుండా...పెళ్ళి దాకా వెళ్ళిపోయావు?”

ఏరా...నీ దగ్గర అడిగిన తరువాతే కదా చేస్తున్నాం?”

అది కాదక్కా...ఇలా రెండు రోజుల్లో...అన్నీ మాట్లాడుకున్నాం అంటే ఏట్లా?”

పాపం రా ఆ అమ్మాయి...ఎన్నో రోజులుగా కాచుకోనుంది. ఇంతకంటే ఎక్కువ రోజులు కాచుకో నివ్వకూడదని

అక్కా...ఎవర్ని చెబుతున్నావు?” -- మనో పడుతున్న ఆందోళనను చూసి ఆనందించింది పవిత్ర.

అదేరా...అమ్మ చూసుంచిదే! అమ్మాయినే చెబుతున్నా

......................”

ఎందుకురా మౌనం అయిపోయావు

నాకు నచ్చలేదు

ఏం నచ్చలేదు

ఏదీ నచ్చలేదు... ---గబుక్కున చెప్పేసి వెళ్ళిపోవాలనుకున్న తమ్ముడి చేయి పుచ్చుకుని ఆపింది.

ఏదీ నచ్చలేదంటే?”

అన్నీనూ... పెళ్ళి చూపులూ...పెళ్ళి

ఎందుకురా?”

అదంతే...నచ్చలేదంటే నచ్చలేదు. అంతే

ఇలా చెబితే ఎలా? నాకు కారణం చెప్పు

అక్కా...సారీ. నన్ను కొంచం ప్రశాంతంగా ఉండనివ్వు" విసుగ్గా చెప్పినతని ముందు చేతులు కట్టుకుని నిలబడి అతన్నే నిదానంగా చూస్తోంది.

నువ్వూ, నేనూ అక్కా-తమ్ముడు కాదు. ఫ్రెండ్స్ అని చెప్పేవే! అదంతా అబద్దమా?”

లేదక్కా...---గబుక్కున తల ఎత్తాడు.

నన్ను నీ స్నేహితురాలిగా అనుకుంటే అన్నీ నా దగ్గర చెప్పేవాడివి కదా?”

“............................”

నా తమ్ముడి మనసులో ఒక అమ్మాయి ఉందని ఎవరో చెప్పి నేను తెలుసుకోవాలా?”--- పవిత్ర ప్రశ్నతో ఆందోళన పడి -- తల్లిని కొంచం భయంతో చూసాడు.

అటువైపు ఏమిట్రా చూస్తావు? నాకు జవాబు చెప్పు

అక్కా...

స్వాతిని నువ్వు ఇష్టపడుతున్నావా...లేదా?”

అది...అప్పుడు...ఇష్టపడ్డాను...

ఇప్పుడు?”

ఇప్పుడు...ఇప్పుడు -- తడబడుతున్న తమ్ముడి మొహాన్ని పైకెత్తింది.

ఎందుకురా తడబడుతున్నావు? ‘అవును...ఇష్టపడుతున్నానూ అని ధైర్యంగా చెప్పు

లేదక్కా...ఆమె......

ఎవరి బంధువైతే ఏమిటి? నీ మీద ప్రాణమే పెట్టుకుందిరా. నీకొసం ఇన్ని రోజులుగా ఓర్పుగా కాచుకోనుందిరా. పాపం కాదా ఆమె?”

...ది...అక్కా...నీకు ఇదంతా ఎలా తెలుసు? ఎవరు చెప్పేరు?”

హు...నా తమ్ముడి కంటే వాడి ప్రేమికురాలు ధైర్యవంతురాలు, తిన్నగా నన్ను కలిసి అన్నీ చెప్పింది

ఏమిటీ... స్వాతి మన ఆఫీసుకు వచ్చిందా? ఎప్పుడు...ఎలా వచ్చింది?” -- అని ఆందోళనపడిన తమ్ముడి బుగ్గను గిల్లిన పవిత్ర...

ఏదీ నచ్చలేదని చెప్పావు! ఇప్పుడెందుకు ఇంత ఆందోళన, హడావిడి? మేము స్వాతికి ఫోన్ చేసి చెప్పేస్తాము

ఏమని...?”

పెళ్ళి కొడుక్కి ఏదీ నచ్చలేదని...

అయ్యో...అలాగంతా చెప్పద్దు అక్కా

ఏం?”

నాకు నచ్చింది... అమ్మాయినీ, ఏర్పాటు చేసిన నిన్నూ, దీనికి ఒకే అంటున్న అమ్మను -- అన్నాడు.

ఉత్సాహంగా తల్లినీ, సహోదరినీ కౌగలించుకున్నాడు.

                                                                                  PART-8

మొట్ట మొదటి సారిగా కొత్త ఆఫీసు లోపలకు అడుగు పెడుతున్నప్పుడు కొంచం భయంగానే ఉన్నది పవిత్రకు! ఇంతకు ముందున్న ఆఫీసుకు తమ్ముడితో కలిసి వెళ్లటం వలన భయమో -- ఆందోళన ఏర్పడలేదు.

మనో యొక్క సహోదరి అనే మర్యాదతో అందరూ సులభంగా స్నేహితులయ్యారు. కానీ ఇక్కడ మనోగానీ -- తెలిసిన ముఖాలుగానీ లేరు. అందులోనూ ఆఫీసులో పనులు సరిగ్గా జరగటం లేదనే ఫిర్యాదు ఉంది.

అందరినీ ఎలా ఫేస్ చెయ్యబోతాం?’ అనే బిడియంతో లోపలకు వెళ్ళిన పవిత్రను -- ఆఫీసు మేనేజర్ గణపతి భవ్యంగా స్వాగతించారు. తనని పరిచయం చేసుకుని పవిత్రను లోపలకు తీసుకు వెళ్ళారు.

పెద్ద ఆఫీసే. మొత్తం నలభై ఎనిమిది మంది పనిచేస్తున్నట్టు ఆయన చెప్పగా, వరసగా కుర్చీలను చూసిన ఆమె నుదురు చిట్లించింది.

ఇరవైకీ తక్కువగానే ఉద్యోగస్తులు వచ్చున్నారు. అందరూ గౌరవ పూర్వకంగా లేచి నిలబడి గుడ్ మార్నింగ్చెప్పారు. ఆమె తిరిగి 'గుడ్ మార్నింగ్' చెప్పి అందరినీ కూర్చోమన్నది.

మేనేజర్

మ్యాడం

మొత్తంగా స్టాఫ్ ఎంత మంది?”

వాచ్ మ్యాన్ తో కలిపి మొత్తం నలభై తొమ్మిది మంది ఉన్నాం మ్యాడం... -- ఆయన తడబడడుతూ చెప్పగా, ఖాలీగా ఉన్న కుర్చీలను ఒకసారి చూసి అడిగింది.

అంటే...మిగిలిన వాళ్ళందరూ లీవు చెప్పేరా?”

లేదు మ్యాడం...వచ్చేస్తారు

ఎప్పుడు

వచ్చే సమయమే...

ఓహో...ఇప్పుడు టైమెంత?” -- నిలబడే పవిత్ర అడగగానే, భయంతో గడియారాన్ని చూశాడు.

తొమ్మిది గంటల ఐదు నిమిషాలు మ్యాడం...

ఆఫీసు ఎన్నింటికి?”

తొమ్మిదింటికి

మీ అందరికీ కలిపే చెబుతున్నా. రేపటి నుండి సరిగ్గా ఎనిమిది యాభై ఐదుకు అందరూ సీటులో ఉండాలి

.కే. మ్యాడం... కోరస్ గా చెప్పారు అందరూ.

పర్మిషన్ తీసుకోకుండానో లీవు చెప్పకుండా ఎవరు లేటుగా వచ్చినా, సగం రోజు జీతం కట్’. మేనేజర్... విషయాన్ని అందరితోటీ చెప్పండి...నోటీస్ బోర్డులో  పెట్టండి

సరే...మ్యాడం

పనికి సంబంధించిన ఫైల్లను తిసుకుని రూముకు రండి. నేను చూడాలి

ఎస్ మ్యాడం

మీరందరూ మీ పనులు చూడండి -- అని చెప్పిన పవిత్ర తన ఏసీ గదిలోకి వెళ్ళింది.

ఉద్యోగస్తులలో సగం మంది మొహాలలో భయం, మిగిలిన వాళ్ళల్లో కొత్త ఉత్సాహం. అందరూ పనులు మొదలుపెట్టారు...పది గంటల తరువాత వచ్చి చేరాడు రామ్మోహన్.

ఎప్పటిలాగా నిర్లక్ష్యంగా టిఫిన్ బాక్స్ ను  తన సీటుపక్కన పెట్టి, ప్యూన్ ను పిలిచాడు.

మూర్తీ...

సార్?”

రిజిస్టర్ తీసుకురా సంతకం పెడతాను

సారీ సార్...అది ఎం.డి మ్యాడం రూముకు వెళ్ళిపోయింది

ఏమిటీ...ఏం.డీ. నా?”

అవును సార్. కొత్తగా ఒక మ్యాడం వచ్చింది. తొమ్మిదింటికి అందరూ సంతకం చేసిన తరువాత రిజిస్టర్ తన టేబుల్ కు వచ్చేయాలి అని చెప్పారు.

అదెవ్వర్రా కొత్త మ్యాడం? వచ్చిన రోజే గొప్పగా రూల్స్ పెట్టింది?” -- రామ్మోహన్ కడుపు మంటతో అడగగా, పక్క కుర్చీలో కూర్చున్న ఒక పెద్దాయన కసురుకున్నారు.

ఉష్...మర్యాదగా మాట్లాడు

ఏం?”

తొమ్మిదింటికే మ్యాడం ఆఫీసులోపలకు వచ్చింది. అంతలోనే రెండుసార్లు రౌండ్స్ కు వచ్చి వెళ్ళింది.

ఎందుకు...?”

అందరూ పక్కాగా పని చేస్తున్నామా లేదా అని గమనించటానికి

ఎవరయ్యా అది? వచ్చిన రోజే ఇంత గొప్పలు పోతోంది?”

రామ్మోహన్ సార్...మీరు వచ్చిన వెంటనే మిమ్మల్ని మ్యాడం రమ్మన్నారుప్యూన్ చెప్పగా...కోపంగా అడిగాడు.

నన్నా...ఎందుకు?”

లేటుగా వచ్చినవారంతా మ్యాడం ను కలిసే వచ్చారు

ఇదేంటయ్యా కొత్తగా ఉందే?” -- సనుగుతూ లేచి ఏం.డి రూము వైపు నడుస్తుంటే, ఎదురుగా సహ ఉద్యోగి నిలబడ్డాడు.

మోహన్...నువ్వూ లేటా?”

మనకు అదేగా అలవాటు

ఇకమీదట లేటుగా వస్తే జీతం కట్అంట

ఏమిటీ?”

మ్యాడం చాలా స్ట్రిక్టుగా మాట్లాడుతోంది. బోలెడు రూల్స్ వేసింది

మన దగ్గరేనా? వదులు...చూసుకుందాం-- నిర్లక్ష్యంగా చెప్పేసి తలుపు దగ్గరకు వచ్చి, మెల్లగా తలుపు మీద కొట్టాడు.

ఎస్...కమిన్ -- కొంచం కోపంగానే ఉంది స్వరం.

గాజు గ్లాసు తలుపులను తెరుచుకుని లోపలకి వెళ్లాడు.

టేబుల్ మీదున్న ఫైల్స్ లో ఉన్న సందేహాలను బ్రాంచీ మేనేజర్ ను అడిగి తెలుసుకుంటున్న పవిత్ర తలెత్తి చూడానే లేదు. చిన్నగా గొంతు సవరించుకున్నాడు.

గుడ్ మార్నింగ్ మ్యాడం...

గుడ్ మార్నింగ్ -- అంటూ తలెత్తి చూసిన ఆమె కళ్ళు విరుచుకున్నై.

రామ్మోహన్ కేమో కాళ్ళ క్రింద భూమి జారుతున్నట్టు అనిపించింది.

ఈమెనా!?...ఈమె ఎలా ఇక్కడ? ఇది నాకు పై అధికారా? ఏడో క్లాసో -- ఎనిమిదో క్లాసో చదువుకున్న ఇది ఎలా ఇంత పెద్ద పదవికి వచ్చింది?’

కడుపుమంట, ఈర్ష్యతో టేబుల్ మీదున్న వాటిని పరీక్షగా చూసాడు.

పవిత్ర గోపాలకృష్ణ అనే పేరుకు పక్కన పొడుగుగా ఆమె పూర్తిచేసిన డిగ్రీలు వరుసగా రాయబడున్నాయి. నమ్మలేక తలెత్తి ఆమెను చూసాడు.

పక్కకు దువ్వుకున్న జట్టు, నుదిటిపైన పెద్ద కుంకుమ బొట్టు, ఎప్పుడూ తలెత్తి చూడని పవిత్రను, ఎప్పుడూ చూసే అలవాటున్న అతనికి, ఇప్పుడు ఆమె ఉన్న అలంకరణలో చూసి ఆశ్చర్యపోయాడు.

పట్టులాగా మెరిసిపోతున్న జుట్టును విరబోసుకుని ముడివేసుకోనుంది. విల్లులాగా వంగున్న కురుల మధ్యలో చిన్న బ్లాక్ కలర్ స్టిక్కర్ బొట్టు. గొంతులో వేలాడుతున్న సన్నని బంగారు గొలుసు. చెవులకు అందమైన పోగులు.

కళ్లను గుచ్చుకోని అద్భుతమైన రంగులో కాస్టిలీ చీర, దాన్ని అందంగా కట్టుకున్న విధం అంటూ అన్నీ మారిపోయున్నాయి.

కాలేజీ స్టూడెంటులాగా కనబడుతున్న ఆమెను ఆశ్చర్యంతనూ -- గందరగోళంతోనూ కళ్లార్పకుండా చూస్తుంటే, పవిత్ర మొహంలో ఎటువంటి మార్పు లేదు.

మిస్టర్ రామ్మోహన్

... వి... త్రా...ను...వ్వా?” పరిస్థితి అర్ధం చేసుకోకుండా అతను పిలవగా, బ్రాంచ్ మేనేజర్ గణపతి భయపడి పోయాడు.

ఏయ్...మ్యాడం ను పేరు పెట్టి పిలుస్తున్నావు! నీ నోటికి మర్యాదే రాదా?”

సా...సారీ...మ్యాడం...

మిస్టర్...రామ్మోహన్...ఇప్పుడు టైమెంత?”

పదిన్నర -- తనని కొంచం కూడా గుర్తు పట్టినట్టు చూపించుకోకుండా, ఎంత పొగరుగా తన పేరు చెప్పి పిలుస్తోంది? అనే కచ్చెతో పళ్ళు కొరుక్కుంటూ అతను సమాధానం చెప్పగా... పవిత్ర వాయిస్ పెరిగింది.

ఇదేనా ఆఫీసుకు వచ్చే లక్షణం?”

సారీ...లేట్అయ్యింది

ఇక మీదట లేట్అయితే లీవు అవుతుంది

.................”

సరిగ్గా తొమ్మిదింటికి ఆఫీసులో ఉండాలి. మటి మాటికీ ఆలశ్యంగా వస్తే జీతంకట్ అవుతుంది

మ్యాడం...మీరేమిటి...?”

పని సరిగ్గా జరగాలి. ఆలశ్యంగా రావటం -- పని టైములో మిగిలిన వారితో మాట్లాడటం నాకు నచ్చదు. మీరు వెళ్ళొచ్చు

ఎస్. మ్యాడం... -- కోపంగా చెప్పేసి వెనక్కి తిరిగిన అతన్ని హలోఅంటూ ఆపింది పవిత్ర.

ఒక్క నిమిషం

ఏమిటి మ్యాడం?”

అవునూ...ఇదేమిటి? నెలకి సగం రోజులకు పైగా లీవు తీసుకోనున్నారు?”

...ది. పర్సనల్

అందుకని...ఇలా లీవు పెడితే పనెలా జరుగుతుంది? మీ టేబుల్ మీదున్న ఫైల్స్ అన్నీ కొన్ని నెలలుగా జరగకుండా ఉండిపోయాయి -- వాటిని ఎప్పుడు క్లియర్ చెయ్యబోతారు?” -- పవిత్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక బిగుసుకుపోయి నిలబడ్డాడు రామ్మోహన్.

మేనేజర్ గణపతి మాట్లాడాడు. ఇంట్లో పసి బిడ్డను పెట్టుకుని ఒంటరిగా కష్టపడుతున్నారు...అందుకే

పవిత్ర మొహం మారింది. ఏం...ఆయనింట్లో వాళ్ళావిడ లేదా?”

లేదు

ఏం...ఆవిడ్నీ పంపించేసారా?” -- వెక్కిరిస్తున్నట్టు మాట్లాడిన పవిత్రను చటుక్కున తలెత్తి చూశాడు రామ్మోహన్

లేదు మ్యాడం... అమ్మాయి కూడా ఇక్కడే మన ఆఫీసులోనే పని చేస్తూ ఉండేది. ఆరు నెలలకు ముందు మన ఆఫీసులోని మాజీ గుమాస్తాను పెళ్ళి చేసుకుని.... గణపతి చిన్న స్వరంతో చెబుతుండగా...అతను కోపంగా అరిచాడు.

మేనేజర్ సార్...నా పర్సనల్ మ్యాటర్ గురించి ఎవరూ మాట్లాడొద్దు

మిస్టర్. రామ్మోహన్...నాకు ఎవరి సొంత విషయాలూ తెలుసుకోవలసిన ఆశ లేదు.  అవసరమూ లేదు. నాకు ఆఫీసు పనులు జరిగితే చాలు. ఇక మీదట ఎటువంటి సాకుబోకులూ చెబుతూ అనవసరంగా 'లీవు పెట్టకూడదు. ఇక ఇప్పుడు కూడా పనిజరగకపోతే ... చోట వేరే మనిషిని పెట్టుకోవలసి వస్తుంది -- అన్న ఏం.డి పవిత్రని విసుగ్గా చూసి కోపంగా వెళ్ళిపోయాడు రామ్మోహన్.

తప్పుగా తీసుకోకండి మ్యాడం. ఈయన ఎప్పుడూ అంతే, ఎవరినీ గౌరవించడు

చూస్తేనే తెలుస్తోంది

ఇలాంటి మనిషితో అమ్మాయి కాపురం చేస్తుంది? అందుకే ఆమె దారి ఆమె వెతుక్కుని వెళ్ళిపోయింది. అమ్మాయి చాల ధైర్యవంతురాలు -- తెలివిగలది. ఇతని వలన పుట్టిన బిడ్డను కూడా ఇతని దగ్గరే వదిలేసి వెళ్ళిపోయింది...

మేనేజర్...మనకెందుకు ఇతరుల ఇంటి సమస్యలు? మనం మన పని చూసుకుందాం -- అంటూ తన పనిలో శ్రద్ద పెట్టినా పవిత్ర మనసు, మొహం తెలియని పసిపాప కోసం పరితపించింది.

                                                                                             PART-9

శివరంజని హాస్పిటల్ -- అని రాసున్న నేం బోర్డు దగ్గర ఉన్న వాకిటి దగ్గరకు వచ్చి ఆగింది ఆటో. ఆటోలో నుండి దిగేరు, స్వరాజ్యం, పవిత్ర.

ఇక్కడే వెయిట్ చేయబ్బాయ్...వచ్చేస్తాము

చాలాసేపు పడుతుందా మ్యాడం

మామూలు చెకప్పే...అరగంటలో వచ్చేస్తాము

సరే మ్యాడం... అని చెప్పి ఆటో తీసుకుని వరుసగా ఆటోలు నిలబడున్న వేప చెట్టు నీడలో ఖాలీ ఉన్న చోట, ఆటో ఆపుకుని రెస్టు తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఆటో డ్రైవర్.

తల్లీ-కూతుర్లు ఇద్దరూ హాస్పిటల్ లోకి వెళ్ళారు.

హాస్పిటల్ సైలెంటుగా ఉంది. రోగులు తిరుగుడు, తెల్ల డ్రస్సు నర్సులు, పిల్లల ఏడుపులూ అంటూ ఎప్పుడూ ఉండే గోల చూసి మొహం చిట్లించుకుంది స్వరాజ్యం.

పవిత్రా

ఏంటమ్మా

నేనిప్పుడు బాగానే ఉన్నా కదా? నాకెందుకు చెక్-అప్?”

ఏమ్మా నీకు ఆటగా ఉందా? బి.పీ-సుగర్ అంతా నార్మల్ గా ఉందా చూసుకోవద్దా?”

అంతా బాగానే ఉంటుందే పవిత్రా...?”

విషయం డాక్టర్ చెప్పనీ

అయ్యో...నర్స్ సూది గుచ్చి రక్తం తీస్తుందే...?” -- చెప్పేటప్పుడే భయపడుతున్న తల్లిని చూసి నవ్వింది.

ఏమ్మా...యాభై మూడేళ్ళ వయసు అయ్యింది. ఇంకా సూది భయం పోలేదా నీకు?”

వయసులో గుచ్చినా నొప్పి పుడుతుంది కదా?”

అది సరే... బెంచిలో కూర్చో. నే వెళ్ళి పేరు ఇచ్చొస్తా

--- గొణుక్కుంటూ కూర్చుంది స్వరాజ్యం. ఏడెనిమిది మంది స్త్రీలు నీరసమైన మొహంతో కూర్చొనున్నారు. డాక్టర్ రూములో నుండి ఒక పసిపాప ఏడుపు వినబడింది.

స్వరాజ్యం వొళ్ళు కంపించింది.ఇంజెక్షన్ వేస్తున్నారో? అందువల్లే పసిబిడ్డ గుక్క పెట్టి ఏడుస్తోందో?’

గుక్క పెట్టి ఏడుస్తున్న పసిబిడ్డను భుజాల మీద వేసుకుని, చిచ్చికొట్టుకుంటూ బయటకు వచ్చాడు రామ్మోహన్.

ఆడపిల్ల. జుట్టు చెదిరిపోయింది. మొహం ఎర్ర బడేంత ఏడుపు ఏడుస్తోంది... పిల్లను సముదాయించలేక కష్టపడుతున్నాడు.

వరుసగా కూర్చోనున్న స్త్రీలలో ఒక స్త్రీ దగ్గరకు వచ్చాడు. అమ్మా... బిడ్డను కొంచం చూసుకుంటారా? మందులు కొనుక్కుని వస్తాను

నేనే జ్వరంతో నిలబడలేక పోతున్నాను...ఇంకెవరి దగ్గరైనా ఇవ్వు

అమ్మా...మీరు...

తరువాత నేనే లోపలకు వెళ్ళాలి -- అంటూ ఆమె కూడా లేచి నిలబడటంతో, స్వరాజ్యం మనసు తట్టుకోలేక లేచి వచ్చింది.

తమ్ముడూ...నా దగ్గర ఇవ్వండి -- వీపు వెనుక వినబడ్డ స్వరం విని వెనక్కి తిరిగిన అతని మొహం వాడిపోయింది. ఆమె ఆందోళనతో వెనక్కు జరిగింది.

పిల్లను తీసుకోవటానికని చాచిన చేతులను వెనక్కి తీసుకుంది. మొహాన్ని తిప్పుకుని వెళ్ళటానికి ప్రయత్నించిన ఆమెను అర్జెంటుగా అడ్డుకున్నాడు.

...ఆత్తయ్యా...ఒక్క నిమిషం...

అత్తయ్యనా...ఎవరికి ఎవరు అత్తయ్య?”-- కోపంగా అరిచింది స్వరాజ్యం.

క్షమించండి. పిల్లకు జ్వరం ఎక్కువగా ఉంది. ఆపకుండా ఏడుస్తునే ఉన్నది. కొంచంసేపు ఉంచుకుంటే నేనెళ్ళి మందులు తీసుకుని...

అమ్మా--కూతురి స్వరంతో ఇద్దరూ భయపడుతూ తిరిగారు.

చేతిలో తల్లి పాత మందుల చీటీతో నిలబడ్డ పవిత్ర... రామ్మోహన్నీ, అతని చేతిలో ఆపకుండా ఏడుస్తూ, జారిపోతున్న బిడ్డను చూసింది.

"లేదమ్మా...లేదమ్మా...ఇప్పుడు...మందులు కొనుక్కుని వచ్చేస్తాను" --అని అతను సముదాయిస్తుంటే, పాప ఇంకా ఎక్కువగా గుక్కపెట్టటంతో పవిత్ర కొంచం కూడా ఆలొచించ కుండా చేయి చాచింది.

పిల్లని ఇలా ఇవ్వండి

... వి... త్రా?” --- అరిచింది స్వరాజ్యం.

నమ్మలేక నిలబడిన అతని చేతుల్లో నుండి పాపను తీసుకుంది పవిత్ర. ఆందోళన చెందింది.

అయ్యో...పాపకు జ్వరం కాలిపోతోందే! డాక్టర్ దగ్గర చూపించారా?”

...ఇన్ జెక్షన్ చేసారు. మందులు రాసిచ్చారు

త్వరగా తీసుకు రండి. మందు పడితేనే జ్వరం తగ్గుతుంది అంటూ భుజాలపైకి పిల్లను ఎత్తుకుని సమాధాన పరిచింది. కొంచం ప్రశాంతమైన మొహంతో మందులు కొనడానికి వెళ్ళాడు రామ్మోహన్.

పిల్ల వీపు మీద చేతితో తడుతూ, భుజాల మీద వేసుకుని నడుస్తున్న ఆమె వెనుకే ఓర్పు నశించిన స్వరాజ్యం కూడా వెళ్ళింది.

పవిత్రా...ఏమిటిది?”

ఏంటమ్మా?”

వాడి పిల్లను ఎందుకు తీసుకున్నావు? వాడూ...వాడి పిల్లా ఎలా పోతే మనకేంటి?”

పాపమమ్మా...పిల్ల చూడు ఎలా ఏడుస్తోందో

అందుకని?”

అమ్మా... సమయంలో మానవత్వంతో నడుచుకుంటేనే మనం మనుష్యులం

అది కాదమ్మా...!

స్వరాజ్యం ఎవరమ్మా?” నర్స్ కేక వినబడటంతో, తల్లిని పిలిచింది.

అమ్మా...వెళ్ళి చెక్-అప్ ముగించుకుని రా

నువ్వు...?”

ఆయన వచ్చిన వెంటనే పిల్లను ఇచ్చేసి వస్తాను

పవిత్రా...

వెళ్ళమ్మా.నర్స్ కేకలేస్తుంది

...రే... సగం మనసుతో స్వరాజ్యం చెప్పగా వేపచెట్టు నీడలో వేసున్న సిమెంటు బెంచి మీద కూర్చుంది పవిత్ర. పిల్లని ఒడిలో పడుకోబెట్టుకుని, తన చీర కొంగుతో దాని ముఖం తుడిచింది. ఒంటికి అంటినట్లు వేసున్న దుస్తులను సరిచేసింది.

ఏరా బంగారం...ఇంజెక్షన్ వేసారా? డాక్టర్ను కొట్టేద్దాం. ఏడవకూడదురా ...మొహం చూడు ఎలా ఎర్ర బడిందో...బంగారం ఏడవకూడదు...నా బుజ్జి తల్లి ఏడవకూడదుజుట్టును సవరిస్తూ ముద్దుగా మాట్లాడగా, పాప తన ఏడుపు ఆపి మాటలు గమనించింది.

ఏరా...మాట్లాడాలా? చిన్న తల్లీ నేను మాట్లాడాలా? ...

......”--చిన్న నోటిని తెరిచి పాప మాట్లాడటం మొదలు పెట్టటంతో పవిత్ర మనసు కుతూహలం చెందింది. మెల్లగా వీచిన గాలి, ఆమె వొడి, ఆమె బుజ్జగింపు తో పాప కాళ్ళూ చేతులూ ఆడిస్తూ ఆడుకుంది.

మందులు కొనుక్కుని వచ్చిన రామ్మోహన్, పాప ఏడుపు ఆపి ఆడుకోవటం చూసి ఆశ్చర్యపోయాడు. కన్న తల్లిలాగా ఇంత ప్రేమతో ఆమె తన పిల్లను ఎత్తుకున్న విధమే అతని మనసును స్థంభింప చేసింది.

... వి... త్రా...

వచ్చారా...మందులన్నీ కొన్నారా?”

కొనుకొచ్చాను. సీసాలోని మందును ఒక మూత ఇప్పుడే ఇమ్మన్నారు ---- అంటూ ఒక బాటిల్ చూపించాడు.

మందులు కరక్టుగా ఇవ్వండిజాం పండూ నాన్న దగ్గరకు వెళతారా?”

పవిత్రా...?”

...మందు కొంచం పోస్తావా?” ----తడబడుతూ అడిగినతన్ని తలెత్తి చూసింది.

లేదు...నేనిస్తే ఉమ్మేస్తోంది. ముక్కులోపలకు వెడుతోంది. అందుకే...---అంటూ అతను సాగదీయగా, మందు బాటిల్ తీసుకుంది.

బాటిల్ లేబుల్ పైన ముద్రించిన సూచనలను ఒకసారి చదివి---బాటిల్ ను బాగా ఊపి, మూత తెరిచి, మూతలో మందుపోసింది. లేత ఎరుపు రంగులో గట్టిగా ఉన్న ద్రవాన్ని పిల్ల నోటి దగ్గరకు తీసుకు వెళ్ళినప్పుడు, పాప తన లేత చేతులతో అడ్దుకుంది.

అరె బంగారం...ఇది మందు అని తెలిసిపోయిందా? మందు వేసుకుంటేనే జ్వరం తగ్గుతుంది. అప్పుడే మీరు బాగా ఆడుకోవచ్చు... బుద్దిగా తాగేయాలి. నా బుజ్జి కదూ? తాగేయ్ నాన్నా -- బ్రతిమిలాడుతున్న దోరణితోటే మందు పోసింది. మొదట మొహం ముడుచుకున్న పాప, మెల్లమెల్లగా మందును చప్పరించి -- మిగల్చకుండా తాగి ముగించగానే పవిత్ర నవ్వింది.

తాగేసారా...తియ్యగా ఉన్నట్టుంది? మంచి పిల్ల...వేడి నీళ్ళు తీసుకు వచ్చారా?” -- అని రామ్మోహన్ వైపు తిరిగి చూడకుండానే అడిగింది.

ఇదిగో... -- పిల్లను, పవిత్రను ఆశ్చర్యంగా చూస్తున్న అతను తన బుజానికి తగిలించుకున్న సంచీలోంచి, మంచి నీళ్ళ బాటిల్ తీసి, తెరిచి జాపాడు.

అది తీసుకుని బాటిల్ మూతలో పోసి, వెళ్ళతో చిలకరించి దాన్ని కూడా పిల్లకు పడుతుంటే, ఆమె చేతులను పుచ్చుకుంటూనే చప్పరిస్తూ తాగింది.

పైన రెండు మూతలు నీళ్ళు ఇచ్చి, నోరు తుడిచింది.

...ఇప్పుడు నాన్న దగ్గరకు వెళతారా...?”

... విత్రా...

""

చాలా థ్యాంక్స్...

దేనికి?”

పిల్లకి...నా పిల్లకి...మొదటిసారిగా ఆదరించే మాటలూ...ప్రేమ ఒడి దొరికింది... గొంతు అడ్డుపడుతుంటే చెప్పగా... పవిత్ర మొహం మారింది.  పిల్లను చిచ్చి కొడుతూ అడిగింది.

ఏమిటి?”

అవును...పుట్టిన దగ్గర నుంచే, దీనికి తల్లి ప్రేమ గానీ -- ఆదరణ గానీ...అంతెందుకు...తల్లిపాలు కూడా దొరకలేదు

ఎందుకని?”

"గౌతమికీ ఎప్పుడూ తన అందం మీదే ధ్యాస. పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుందేమోనని భావించి పిల్లలను కనడాన్నే నాలుగైదు సంవత్సరాలు దాటేసింది. తరువాత నా సనుగుడు భరించలేక రాణిని కన్నది.

దీనికి ఒక్క రోజు కూడా తల్లిపాలు ఇవ్వలేదు. అందం తగ్గి పోతుందట. అందువలన పాపకు వ్యాధి నిరోధక శక్తి దొరకకుండా పోయింది. మాటి మాటికీ జ్వరం, జలుబు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది

...ఇలా కూడా ఒకమ్మాయి ఉంటుందా? పిల్ల యొక్క ఆరొగ్యం కంటే కూడా తన అందం చాలా అవసరమా?”

అదే గౌతమి...ఆమె అందంలో కళ్ళు మూసుకుపోయి నిన్ను వదిలేసి దానితో వెళ్ళాను. అందమే నాకు విషం అయిపోయింది. పిల్లను కన్న పది రోజులకే పనిలోకి వెళ్ళటం మొదలుపెట్టింది

తరువాత

నేనే చూసుకున్నాను. మా అమ్మను కూడా ఇంటి పక్కకు రానివ్వలేదు. రాణికి  తల్లి-తండ్రీ అన్నీ నేనే. కానీ పసిపిల్లను పెంచటం అంత సులభమైన కార్యం కాదే!

అల్లాడిపోయాను. అందులోనూ ఇలా ఆరొగ్యం బాగలేనప్పుడు...ఏడుస్తూనే ఉంటుంది. అది గౌతమికీ ఇష్టం లేదు. ప్రాబ్లం కోసమే పిల్లల్ను కననని చెప్పాను అన్నది. నువ్వే కదా అడిగావు. నువ్వే చూసుకో అని చెప్పి వెళ్ళిపోయేది.

ఇలాగే ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గొడవ. జీవితమే యుద్ధ భూమిగా మారిపోయింది. నేను ఆఫీసుకు సరిగ్గా వెళ్ళలేకపోయాను. మంచి భోజనం...నిద్ర...మనశ్శాంతి ఏదీ లేకుండా పోయింది. నువ్వు చూస్తున్నావుగా. ఏలా ఉండే వాడిని, ఇప్పుడు ఎలా ఉన్నానో"----నిట్టూర్పుతో చెప్పిన అతన్ని నిదానంగా తలెత్తి చూసింది.

మారిపోయున్నాడు. పాపిడి కూడా తెలియనంత దట్టంగా ఉండే జుట్టులో ఇప్పుడు సగం లేదు. మిగిలినది నెరిసిపోయింది. మొహం, వొళ్ళు నీరసంగా ఉన్నది.

మనసూ, శరీరమూ ఓడిపోవటం వలన జ్ఞాణోదయం పుట్టిందా? పెళ్ళి చేసుకుని నీతో రెండు సంవత్సరాలు కాపురం చేసినప్పుడు, నిలబడి నాతో రెండు నిమిషాలు ఎప్పుడైనా మాట్లాడున్నావా? రోజు ఏదీ అడగకుండానే గంటల తరబడి నీ సొంత కథను -- శొఖమైన కథలా మార్చి చెబుతున్నావు.

ఎవరికి కావాలి ఇది? విత్తనం వేసిన నువ్వే కోత కొయాలి. చేసిన పాపానికి జీతం. ఇది నువ్వే కదా అనుభవించాల్సింది. వేరే దారి?’

మొహంలో ఎటువంటి మార్పు చూపించకుండా , తన ఒడిలో పడుకుని నిద్రపోతున్న పాపను అతని దగ్గర ఇచ్చేసి లేచింది.

ఆమె ఇంకా కొంచం సేపు కూర్చుని మాట్లాడు తుందేమోనని ఎదురు చూసిన రామ్మోహన్ కు మొహం వాడిపోయింది.

నీ దగ్గర మాట్లాడటానికి నాకు ఏమీ లేదు అనే విధంగా అతని వైపు తిరిగి కూడా చూడకుండా బయలుదేరింది పవిత్ర.

                                                                                    PART-10

పవిత్ర కొన్ని అడుగులు వేసిన తరువాత ఏమీ చెప్పకుండా వెళుతోందే?’ అనే దఢతో హడావిడిగా పిలిచాడు.

పవిత్రా...

ఏమిటీ?”

బయలుదేరావా?”

అవును...

ఏమీ చెప్పకుండా వెడుతున్నావే...?”

ఏం చెప్పాలి?” --- అర్ధం కాకుండా అడిగిన ఆమెతో అవస్త పడుతూ చేతిలోని పాపను చూపించాడు.

పిల్ల గురించి మాట్లాడామే...?”

మీ ప్రేమ పెళ్ళాం చెప్పిందే నేనూ చెబుతున్నాను. పాప మీరు ఆశపడి కన్న బిడ్డ. పాపను మీరే జాగ్రత్తగా పెంచుకోవాలి

...

మా అమ్మకు చెక్ అప్చేయాలి. నేను బయలుదేరుతాను--మళ్ళీ నడవసాగిన ఆమెను ఆపాడు.

ఒక్క నిమిషం

ఏమిటి?”

అదొచ్చి...నన్ను చూస్తే...నీకు కోపమే రావటం లేదా?”----తడబడుతూ అడిగిన అతని మొహం వైపు చూసింది.

దేనికి?”

లేదు...నేను...నిన్ను...

ఇది మీరే కోరుకున్న జీవితం. ఇందులో కష్టపడతారో -- నష్టపడతారో అది మీ సొంత విషయం. మీ మీద జాలిపడటానికి నేనెవరిని?”

...

ఇప్పుడు మీరు ఇంకొక అమ్మాయి భర్త. అది మర్చిపోకండి

ఆమె వెళ్ళిపోయిందే...?”

దానికి నేనేమీ చెయ్యలేను సార్. ఇది మీ కుటుంబ విషయం

ఏమిటి పవిత్రా అలా మాట్లాడుతున్నావు?”

మీరు నా ఆఫీసులో పనిచేస్తున్న సాధారణ గుమాస్తా...అంతే. హాస్పిటల్లో ఒక పసి పిల్ల అల్లాడుతోందే అని సహాయం చేశా. ఇది మానవత్వం గల వాళ్ళు చేసేదే. అదే నేనూ చేసింది. అంతవరకే.

దీనికి మీ ఇష్టం వచ్చినట్టు రంగు పూయకండి. మీ భార్యకు మంచి భర్తగా నడుచుకోలేదు. పిల్లకు మంచి తండ్రిగా నైనా ఉండండి -- అన్న ఆమె, అంతకు మించి అక్కడ ఉండలేక గబగబ నడిచి వెళ్ళింది.

ఆమె మాటలు అతని లోపలి మనసులో నిద్రపోతున్న అహంకార మృగాన్ని తట్టి లేపినా, దాన్ని అణిచాడు.ఇది కోపగించుకునే సమయం కాదు...ఆలోచించాల్సిన సమయం

ఒకటిగా జీవించిన రోజుల్లో పవిత్ర గురించి బాగా అర్ధంచేసుకోనున్నాడు రామ్మోహన్.

పవిత్ర మెత్తని మనసు కలిగింది. భక్తిలో మునిగిపోతుంది. ఏదీ చెప్పినా తల ఊపే గంగిరెద్దు. లోకం మాటలకు  భయపడే మనిషి. భర్త మాటలను వేద వాక్కులాగా భావించే మనిషి.

ఆలొచనతోనే రోజు ఎదిరింపూ చెప్పకుండా డైవర్స్ పేపర్లలో సంతకం పెట్టి ఇచ్చింది. రోజు వరకు ఆమెకు నా మీద కోపమో - విరక్తో రాలేదు!

అలా ఉండుంటే నా బిడ్డను తీసుకోనుంటుందా? బిజ్జగించి, ఆడించి నిద్ర పుచ్చి ఉంటుందా? రాణి కూడా ఆమె దగ్గర ఎంతగా కలిసిపోయింది?

ఒక పూట మందు ఇవ్వటానికీ -- భొజనం పెట్టటానికీ రోజూ ఎంత కఠినంగా పోరాడుతున్నాను? రోజు ఎంతో ఇష్టంగా పవిత్ర చేతిలోని మందును తాగేసి, ఆమెతో ఆడుకుంది.

పవిత్ర మనసులో ఇంకా తడి ఉంది. దయా గుణం ఎక్కువగా ఉన్నది. వీటిని బాగా ఉపయోగించుకోవలి. ఇంకా పసిపిల్లను పెట్టుకుని ఒంటరి పోరాటం చేయలేను.

నా భారాన్ని దించి పెట్టటానికి ఒక ఒడి దొరికింది. మళ్ళీ ఆమె దగ్గర శరణుకోరటానికి ఇదే సరైన ఆయుధం -- చేతిలో ఉన్న పాపను చూశాడు. తండ్రి యొక్క కుట్ర తెలియక, మంచి నిద్రలో ఉంది పాప.

నువ్వు నా ఆయుధంనువ్వే, నన్నూ - పవిత్రనూ చేర్చే వంతెన అవబోతున్నావు -- నువ్వు పుట్టటంలోనే రోజే నాకు పూర్తి ఆనందం -- అనుకుంటూ ఉత్సాహంతో మొట్టమొదటి సారిగా పాపను గుండెలకు హత్తుకున్నాడు.

తరువాత వచ్చిన రోజులలో, పవిత్ర, పిల్ల గురించి అడగకపోయినా రామ్మోహనే పలు వివరాలు చెప్పేడు. ఆఫీసుకు వస్తే కనీసం పదిసార్లు అయినా ఏదో ఒక కారణం చెప్పుకుంటూ ఆమె ముందు నిలబడేవాడు.

రెండే రోజుల్లో అతని మనసును బాగా అర్ధం చేసుకుంది పవిత్ర. ఆమేమీ పాత పవిత్ర  కాదు. భర్త తన గొంతు పిసికినా, అది తనకు దొరికిన భాగ్యం అనుకునే పాత పవిత్ర కాదు!!

ఎదుటి వారు చూసే చూపులను బట్టే వాళ్ల గురించి అర్ధం చేసుకునే తెలివితేటలు,  చదువు, అనుభవమూ ఆమెకు ఆందించినై. అందువల్ల రామ్మోహన్ ఎందుకలా మాటి మాటికీ తన గదికి వస్తున్నాడో వెంటనే ఆమెకు అర్ధం అయ్యింది.

తమ్ముడు మనో నిశ్చయతార్ధానికి ఒక రోజే ఉంది... పవిత్రను వెతుక్కుంటూ వచ్చిన  స్వాతి, రామ్మోహన్ కళ్ళల్లో పడింది. స్వాతితో బంధుత్వం కలుపుకుని విచారించినప్పుడు, తాంబూలాల ఏర్పాటు గురించి తెలియటంతో అతని మనసు గంతులేసింది.

'ఇదే సాకుగా పెట్టుకుని పిల్లతో వెడితే ఏమవుతుంది? అని వచ్చిన ఆలొచనను వెంటనే అమలులో పెట్టాడు.

ఆదివారం సాయంత్రం దాకా ఓర్పుతో కాచుకున్న అతను -- పెళ్ళి కొడుకు తరపు వాళ్ళందరూ వచ్చేరని తెలుసుకుని పిల్లతో పాటు హాజరయ్యాడు.

పట్టు చీర కట్టుకుని ఉత్సాహంగా తిరుగుతున్న పవిత్ర, అందమైన దేవతలా బంధువుల గుంపుతో నిలబడున్న స్వాతి, పెళ్ళి కొడికు స్టైలులో మెరిసిపోతున్న మనోహర్, కొడుకునూ--కోడల్నీ పొంగిపోయి చూస్తున్న గోపాలకృష్ణ దంపతులు. అందరూ అది చూసి మొహం మాడ్చుకున్నారు. 

కంగ్రాట్స్ స్వాతీ...కంగ్రాట్స్ అల్లుడూ... అంటూ హక్కుగా షేక్ హ్యాండ్ ఇస్తున్న రామ్మోహన్ను చూసి అగ్నిపర్వతం అయ్యాడు మనోహర్.

ఏమిటిది? ఎవరు వీడ్ని పిలిచింది?” -- దగ్గరగా ఉన్న స్వాతిని గట్టిగా అడిగాడు మనో. స్వాతి నిజంగానే బెదిరిపోయింది.

తెలియదు...మేమెవరం పిలవలేదు

పిలవకుండా ఎలా వచ్చాడు?”

ఏమిటల్లుడూ...అంతలా కోపగించుకుంటున్నారు

స్వాతి నాకు చెల్లెలు వరుస. చెల్లెలు తాంబూలాలకు ఎవరైనా పిలిస్తేనే రావాలా?” అన్న రామ్మోహన్ని కొట్టబోయాడు మనో.

ఎవరికి ఎవరురా అల్లుడు? ఏమిటి కొత్తగా బంధుత్వం కలుపుతున్నావు?”

మనో ప్లీజ్...కోపగించుకోకండి... రామ్మోహన్ అన్నయ్యా...మీరెళ్ళి భోజనం చేయండి స్వాతి ఆందోళన పడుతూ చెప్పగా, మనోహర్ కోపం ఇంకా ఎక్కువైయ్యింది.

వాడికెందుకు గౌరవ మర్యాదలు? వీడ్ని బయటకు వెళ్లమని చెప్పు

అది...

వీడు ఇక్కడ నిలబడితే...నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది-- అంటున్న మనోని కోప్పడింది పవిత్ర.

ఏయ్ మనో...ఏమిట్రా మాట్లాడుతున్నావు?”

అక్కా... మనిషి ఎందుకు ఇక్కడికి వచ్చాడు?”

మనో...విశేషం అంటే భందువులు వస్తారు. నువ్వెందుకు అవన్నీ గమనిస్తావు

లేదక్కా...వీడేదో ప్లానుతో వచ్చాడు...కొత్తగా బంధుత్వం కలుపుతున్నాడే...?”

అది ఎప్పుడూ అతకదు...ఎవరైనా మూర్ఖత్వంగా అతికించ దలుచుకుంటే...మొహానికి బురద పూసుకుని వెళ్ళాల్సిందే. పాత చెత్తను గుర్తుకు తెచ్చుకుని ఎందుకు బాధ పడతావు?” రామ్మోహన్ కూ కలిపే పవిత్ర చెప్పటంతో, అతని మొహం వాడిపోయింది.

లేదక్కా

మనో... రోజు నువ్వు పెళ్ళికొడుకువి. నీ కళ్ళూ, మనసు స్వాతి పైనే ఉండాలి.  అర్ధమైందా...?”

...ది...నా... -- స్వాతి స్వరం వణికింది.

ఏంటమ్మా?”

ప్రామిస్ గా మేమెవరం ఈయన్ని పిలవలేదు. మీ తమ్ముడు నన్ను తప్పుగా అర్ధం చేసుకుని కోపగించుకుంటున్నారు -- కళ్ళు తడవటానికి రెడీ అవుతుండగా, స్వాతి బుగ్గలపై ముద్దుగా దెబ్బ వేసింది.

నువ్వెందుకమ్మా బాధపడతావు? దీనికంతా బంధువులు ఖచ్చితంగా వస్తారు

అక్కా

రేయ్...నువ్వు పెళ్ళి కొడుకువి. దేనీకీ టెన్షన్ పడకూడదు. చూడు...నీ వలన తను కూడా భయపడిపోయింది. మొహం నవ్వినట్టు పెట్టుకోరా. ...అలాగే ఉండాలి. నేను వెళ్ళి, వచ్చిన వాళ్లకు మర్యాదలు చూసుకుంటాను -- నవ్వుతూ తిరిగి వెడుతున్న పవిత్ర వెనుకే వెళ్ళాడు రామ్మోహన్.

పవిత్రా...?” కోపంగా వెనక్కి తిరిగిన ఆమె మొహంలో చిటపట తెలుస్తోంది.

ఏమిటి...విడిపోయిన బంధాన్ని పునరుద్ధరించాలని చూస్తున్నావా? అది కలలో కూడా జరగదు. వూరికే ఇలా నా పేరు చెప్పుకుంటూ నా వెనుకే తిరిగేవనుకో నీ మర్యాద చెడిపోతుంది

లే...దు...

చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడే మా ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోంది. దాన్ని చెడపాలని వచ్చారా? మళ్ళీ మనో కంట్లో పడకండి -- కోపంగా చెప్పి వెనుతిరిగిన ఆమెను చూసి భయపడిపోయాడు రామ్మోహన్.

బిడ్డతో ప్రేమగా అతుక్కుపోతుంది. దాన్ని సాకుగా పెట్టుకుని పవిత్ర దగ్గరకు చేరుదాం అనుకుంటే, ఇంత కోపగించుకుంటోందే...! ఈమె మనసులో ఇంకా నా మీద విసుగు ఎక్కువగానే ఉందనుకుంటా?’

ఇక మీదట ఈమెతో ఎలా మాట్లాడేది? బిడ్డను పెట్టుకుని ఒంటరిగా పోరాడలేను. ఖచ్చితంగా బిడ్డకు ఒక తల్లి కావాలి. అది పవిత్ర అయితే చాలా మంచిది

ఆమె ప్రేమ, అభిమానం, ఓర్పు... బిడ్డకు మాత్రమే కాదు, నాకూ కావాలి. ఏం చేద్దాం? ఎలా విషయాన్ని -- ఎవరితో మాట్లాడను?’ గందరగోళంతో నిబడున్న అతనికి స్వరాజ్యం బాధపడుతూ మాట్లాడుతున్న మాటలు అతని చెవులను తాకినై.

ఎన్ని సంవత్సరాలు విచారంగా ఉన్నాను? మనిషికి ఇప్పుడు మనసు మారింది

బాధ పడకు స్వరాజ్యం... పవిత్ర కూడా త్వరగా మనసు మార్చుకుంటుంది --- మీనాక్షీ ఆదరణగా చెప్పగా, చెవులు రిక్కించాడు రామ్మోహన్.

అందులో నాకు నమ్మకం లేదు. నేనూ ఎంతో మాట్లాడి చూసాను

పవిత్రకి ఎప్పుడు 'లీవు?”

ఆదివారం మాత్రమే

అలాగా...సరే. నేను వచ్చే ఆదివారం మీ ఇంటికి వస్తాను

వచ్చి

పవిత్ర దగ్గర మాట్లాడతాను. చెప్పాల్సిన వారు చెబితే రాయి కూడా కరుగుతుంది. నువ్వు కావాలంటే చూడు... పవిత్రానే నీ దగ్గరకు వచ్చి, ‘అమ్మా...నేను పెళ్ళి చేసుకుంటాను అని చెబుతుంది మీనాక్షీ గర్వంగా చెప్పటంతో...ఉలిక్కిపడ్డాడు రామ్మోహన్.

ఏమిటీ... పవిత్రకు పెళ్ళా?”

ఇదంతా జరుగుతుందో లేదో? నువ్వు మాట్లాడేది వింటే మనసుకు సంతోషంగా ఉంది మీనాక్షీ

బాధపడకు స్వరాజ్యం. మా బంధువు ఒకతను ఉన్నాడు. పెళ్ళైన ఆరు నెలలలోనే ఒక యాక్సిడెంట్ లో అతని భార్య చనిపోయింది. నాలుగు సంవత్సరాలుగా వేరే పెళ్ళి చేసుకోకుండా ఉన్నాడు. అతని దగ్గర పవిత్ర గురించి చెప్పుంచాను. అమ్మాయికి ఓకే అయితే, నాకూ ఒకేనేఅన్నాడు. పవిత్రను ఓకే అనిపించటం నా బాధ్యత

మీనాక్షీ...ఇది మాత్రం జరిగితే, నీకు గుడి కట్టి కొలుస్తాను --- ఆవేశపడుతున్న స్వరాజ్యం కళ్ళల్లో నీళ్ళు రాగా, రామ్మోహన్ చెవులలో సీసం పోసినట్లు ఉన్నది.

జరగకూడదు...ఇది జరగకూడదు. జరగ నివ్వను. నా భార్యకు ఇంకొక భర్తా? వదిలిపెట్టను. ఇక టైము వేస్టు చేయకూడదు. వచ్చే వారం దాకా ఎందుకు కాచుకోనుండాలి? రోజే దీనికి ఒక ముగింపు పెట్టేయాలి ----మనసులో గట్టిగా అనుకుని బిడ్డతో సహా వచ్చి స్వరాజ్యం పాదాల మీద పడి కాళ్ళు పట్టుకుని ఏడుపు మొదలుపెట్టాడు.

                                                                                   PART-11

ఎనిమిదేళ్ళ తరువాత మళ్ళీ అదే గుంపు -- బంధువుల గుంపు. ముద్దాయి బోనులో పవిత్ర ను నిలబెట్టి, రోజు వరుస ఆరోపణలు చేసిన రామ్మోహన్ రోజు మంచి పిల్లాడిలాగా తన బిడ్డతో సహా కుర్చీలో కూర్చోనున్నాడు.

అతని తరఫున కూతురితో వాదిస్తోంది తల్లి. బంధువుల గుంపు దానికంతటికీ తల ఊపుతూ ఉన్నారు.

పవిత్ర దేనికీ భయపడకుండా తలెత్తుకునే నిలబడింది. గోడ చివరకు వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి తను చుట్టూ జరుగుతున్న హేళనని విరక్తిగా చూసింది.

అమ్మకు ఏమైంది? ఇదే గుంపు ముందే కదా కూతుర్ని నిలబెట్టి బురద జల్లిన వాడిని కుర్చీలో కూర్చోబెట్టి -- వాడికొసం సపోర్ట్ చేస్తూ వస్తోందే. ఎందుకని...జరిగిందంతా అంత త్వరగా మరిచిపోయిందా? మర్చిపొయే సన్నివేశాలా అవితాను కన్న బిడ్డను -- ఎవడో ఒకడి కోసం -- మిగిలిన వారి ముందు ఎలా నేరస్తురాలిగా చేయగలుగుతోంది? నాటకం కోసరమే మనోని బయటకు పంపిందా? నాన్న మాత్రం వేరు దారిలేక దీన్ని వేడుకగా చూస్తున్నారా? పాపం...ఆయన మాత్రం ఏం చేయగలరు

అమ్మే ఎలాగైనా కూతుర్ని మళ్ళీ అత్తారింటికి పంపించే తీరుతాను  అంటూ పట్టుదలగా నిలబడింది! కానీ పవిత్రా నేమో దీనికీ తలవంచేటట్టు లేదు.

నీ తల్లిని నేను ఇంత దూరం ఎత్తి చెబుతున్నానే? ఎందుకే ఇంకా అంత పట్టుదల పడుతున్నావు? ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయికి పెళ్ళి అయిన తరువాత అత్తగారి ఇల్లే పర్మనెంట్.

ఇంట్లోనే గొడవ లేనిది? అందరూ ఇలా గబుక్కున విడిపించుకుని వెళ్ళిపోతే కుటుంబం ఏమవుతుంది? ఏది జరిగినా దాన్ని సహించుకుంటూ ఓర్పుగా వెళ్ళాలి పవిత్రా. అప్పుడే కుటుంబం చిందరవందర అవకుండా ఉంటుంది.

మనిషి తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు కదా! నిన్న అందరి ముందూ నా కాళ్ళ మీద పడి క్షమించమని అడిగారే? ఎంత బాధపడుతూ ఏడ్చేరో? తాను చేసింది తప్పని మదనపడ్డారే...ఇంకానా నీ మనసు మారలేదు?"

లేదమ్మా--గట్టిగా చెప్పింది పవిత్ర.

పవిత్రా...

మీరు అనుకునేది నిజం కాదు...ఆయన, చేసిన తప్పుకోసమో -- మనసు మారో మీ కాళ్ళ మీద పడలేదు...?”

మరి?”

ఆయనకు ఇప్పుడొక పని జరగాలి. ఆయన ఇంట్లో పనిచేయటానికీ -- టైము టైముకూ రుచిగా వంట చేసి పెట్టటానికీ, ఆయన పిల్లకు పనిమనిషిగా ఉండటానికి ఒక పని మనిషి అవసరం. అందులోనూ జీతం తీసుకోని పనిమనిషి కావాలి. దానికి పవిత్రానే కరెక్టుగా ఉంటుందని నిర్ణయించుకునే నా వెంట బడి, నా చుట్టూ తిరిగారు. నేను పాత అమాయకురాలని కాదని ఇప్పుడు తెలిసుంటుంది. అందుకే మీ కాళ్ళ మీద పడ్డారు-- అన్నది హేళనగా.

నకిలీగానే ఆందోళన పడ్డాడు రామ్మోహన్. అయ్యో...అలాగంతా లేదు పవిత్రా. నేను చేసింది పెద్ద ద్రొహమే. అది తెలుసుకునే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను

ఎప్పుడు...ఎప్పుడు తెలుసుకున్నారు సారు? మీ రెండో పెళ్ళాం ఇంట్లో నుండి లేచిపోయిన తరువాతా? మీ ఆఫీసులో మీకు పై అధికారిగా నేను వచ్చిన తరువాతనా? లేదూ...పసి బిడ్డను పెట్టుకుని అల్లాడిపోతున్నప్పుడా?”

లేదు...

నేను చెప్పనా?”

“.....................”

మా అమ్మ నాకు ఇంకో పెళ్ళి చేస్తుందేమో నన్న భయం వచ్చిన తరువాత నాటకం -- మీ తప్పు తెలుసుకున్నారు. అవునా?”----విసుగ్గా అడిగిన పవిత్రను తల ఎత్తి చూడలేక తడబడ్డాడు.

నాకు తెలుసు. మీరెప్పుడూ మారరు. మా అమ్మను మోసగించవచ్చు. ఆరడుగుల మగవాడు తన కాళ్ళ మీద పడ్డప్పుడు ఆమె క్షమించి ఉండవచ్చు. కానీ, నేను మన్నించనే లేను. మీరు నాకు చేసిన ద్రోహాన్నీ మర్చిపోను. మీతో కలిసి కాపురం చేస్తానని కలలు కనకండి

లేదు...నేను...

భయపడకండి...మా అమ్మ అనుకున్నట్టు ఇంకొకరిని ఎవర్నీ పెళ్ళి చేసుకోను

పవిత్రా...” 

పెళ్ళి చేసుకోవాలనుకొనుంటే ఎప్పుడో ఒప్పుకునే దాన్నే? నా వరకు పెళ్ళి అనే ఒక తంతు ఒక ఆడపిల్లకు ఒకసారే జరగాలి. అది నాకు ఎప్పుడో జరిగిపోయింది

పవిత్రా...నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. భర్తతోటే కదా నిన్ను కలిసి జీవించ మంటున్నాను

భర్తతోనా...ఎవరమ్మా అది?”

స్వరాజ్యం ఆశ్చర్యంతో నిలబడిపోయింది.

నా భర్త ఎప్పుడో చచ్చిపోయారమ్మా

పవిత్రా...

మెడలో ఉన్న తాలిబొట్టును రోజైతే నా దగ్గర నుండి తెంపుకు వెళ్ళారో...ఆరోజే నా భర్త చనిపోయారమ్మా

అయ్యో...ఎందుకలా మాట్లాడుతున్నావు?”

నిజాన్నేనమ్మా మాట్లాడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు విధవరాలుగానే జీవిస్తున్నానమ్మా. నా నుదుట కుంకుమ పెట్టుకుని...తల దువ్వుకుని ఎనిమిది సంవత్సరాలు అవుతోందమ్మా"

పవిత్రా---- గోపాలకృష్ణ ఆందోళన పడ్డాడు.

అవును నాన్నా...ఒకడికి ఒకతి అని జీవించేదాన్ని నేను. అమ్మాయాలకున్న కన్యాత్వం, మగవాళ్ళకూ ఉండాలి. మనిషి దగ్గర నుండి విడిపోయి ఒంటరిగానే కదా జీవించాను...కానీ ఈయన...? ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకుని, సంసారం జరిపి, బిడ్డనూ కని --- ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిందని నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఈయన్ని నేను చేర్చుకోవాలా?”

పవిత్రా... అంటూ ఏదో చెప్పబోయిన తల్లిని చేతితో సైగ చేసి ఆపుతూ.

ఈయన చేసిన తప్పు నేను చేసి తిరిగి వచ్చుంటే, ఈయన నన్ను ఏలుకుంటాడా?”

పవిత్రా... కోపంగా అరిచిన అతన్ని నిర్లక్ష్యంగా చూసింది.

ఏమిటీ... వినటానికే అసహ్యంగా ఉంది కదా? మరి, నేనెలా మిమ్మల్ని ఏలుకోవాలని అనుకుంటున్నారు?”

పవిత్రా...చివరగా ఏం చెప్పదలుచుకున్నావు

నేను చెప్పాల్సింది ఎప్పుడోచెప్పేశాను. మీరు బయలుదేరవచ్చు

అంటే చివరి వరకు ఒంటరిగానే ఉంటావా?”

అవును...! నన్ను కాపాడుకోవటానికి చదువు ఉంది. నేను కష్టపడుతున్నందకు నాకు జీతం వస్తుంది. నన్ను తన నీడలో ఉంచుకుని కాపాడటానికి నాకు కుటుంబం ఉంది ---- తమ్ముడున్నాడు. ఇవన్నీ నాకు చాలు

చూస్తానే. నీ తమ్ముడు నిన్ను ఎన్ని రోజులు ఉంచుకుంటాడో చూస్తాను. రేపు వాడికీ పెళ్ళి జరుగుతుంది కదా?” ---- రామ్మోహన్ ఆవేశంగా చెప్పగా...నవ్వింది పవిత్ర.

నా తమ్ముడు ఎప్పుడూ మారడు

అదీ చూస్తాను

అందుకని నేను వాడ్ని జలగలా అతుక్కోనుండను. నేను ఒంటరిగానూ జీవించగలను

పవిత్రా...అమ్మ చెప్పేది వినరా

వద్దమ్మా. ఇలా అడ్వైజ్ చేసే కదా నన్ను మట్టి బుర్రగానే ఉంచేశారు. మమ్మల్ని కొంచం గౌరవంగా బ్రతకనివ్వమ్మా

పవిత్రా

నాన్నా...ఇన్ని రోజులు ఒంటరిగానే కదా నిలబడ్డాను? దాని వలన నేనేమైనా చెడిపోయానా? చదువుకున్నాను, తెలివితేటలు పెంచుకుని ఇప్పుడు సంపాదించుకుంటున్నాను. ఇదేలాగనే నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను...

పవిత్రా...అదికాదమ్మా...

అసహ్యంగా ఉంది నాన్నా?... మొహాన్ని చూడటానికే నచ్చట్లేదు. నాతో జీవించటం అసలు కుదరదు అని చెప్పిన మనిషితో...మళ్ళీ ఎలా నాన్నా...ఒకే ఇంట్లో...నా వల్ల జీవితం కొనసాగించటం? నాన్నా కుదరదు నాన్నా...

అమ్మాయి చెప్పేదీ కరెక్టే కదా? వెధవ మన అందరి ముందే కదా ఇదే మాట చెప్పాడు

అదే కదా...విడాకుల పత్రాలలో సంతకాలు తీసుకున్న వెంటనే దయా దాక్ష్యణ్నం లేకుండా మెడలో ఉన్న తాళి గొలుసును కూడా లాక్కుని వెళ్ళిపోయాడే...?”

ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వచ్చాడు?”

అతడికి మంచి టైము... మనో రోజు ఇంట్లో లేడు. లేకపోతే వీడు ఇలా నిలకడగా నిలబడేవాడు కాదు...

వీడు పిలిచాడు కదా అని మనమూ పంచాయతీ చేయడానికి వచ్చేమే...? మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. రండయ్యా వెళదాం

ఇదిగో చూడరా. ఇక మీదట పంచాతీ గించాయతీ అంటూ ఇంటి పక్కకు వస్తావేమో! తరువాత మర్యాద చెడిపోతుంది" కూడి ఉన్న బంధువుల గుంపు కొద్ది కొద్దిగా వెళ్ళిపోగా, రామ్మోహన్ యొక్క మొహం అవమానంతో ఎర్రబడింది.

కళ్ళల్లో కోపం ఎర్ర రంగు పూసుకోగ అతను పవిత్రను చూసిన సమయం -- లోపలకు వచ్చాడు మనోహర్.

                                                                                      PART-12

తన ముందు చాచబడ్డ కాగితాన్ని అయోమయంగా చూస్తూ తల ఎత్తేరు ఏం.డి. అర్జున్ రావ్. నవ్వు మొహంతో నిలబడున్న పవిత్రని చూసిన వెంటనే చిన్నగా నవ్వాడు.

రామ్మా...ఏమిటిది?”

నా రాజీనామా లెటర్ సార్

అర్జున్ రావ్ ముఖం మారింది. ఏంటమ్మాయ్ చెబుతున్నావు?”

నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా సార్

ఏమ్మా...రాజీనామా చేసేంత అవసరం ఏమొచ్చింది?”

కొన్ని కుటుంబ చిక్కులు సార్...ఇక నేను ఆఫీసులో కంటిన్యూ గా పనిచేయలేను అనుకుంటా?”

ఏమ్మా... రామ్మోహన్ మళ్ళీ ఏదైనా సమస్య చేస్తున్నాడా?”

లేదు సార్. ఆయన వెలిగించిన నిప్పు, మా ఇంట్లో పొగలాగా అల్లు కుంటోంది. పొగకు తట్టుకోలేక నిర్ణయం తీసుకున్నాను

..................”

మా అమ్మ ఒక పిచ్చిది సార్. పాముకూ, తాడుకూ తెలియదు. ఆమె ఆమాయకత్వాన్ని ఉపయోగించుకుని కార్యం సాధించుకుందామని మనిషి అనుకుంటున్నాడు. అది అమ్మకు అర్ధంకావటం లేదు! నాకు మంచి చేస్తున్నట్టు అనుకుంటూ...ఎప్పుడు చూడు అడుగుతూనే ఉంది. ఆమె సనుగుడుతో మనో కూడా కష్టపడుతున్నాడు. ఆఫీసులో రామ్మోహన్ వేధింపు. ఇలా అన్ని వైపుల నుండి నొక్కేస్తున్నారు సార్” 

పవిత్ర ఆయస పడుతూ చెప్పగా, ఆయన తన కళ్ళజోడు తీసాడు.

ఇప్పుడేం చెయ్యబోతావు?”

సొంత మనుషులనూ, బంధువలనూ వదిలిపెట్టి, చాలా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనిపిస్తోంది సార్

పవిత్రా

అవును సార్...మనకు తెలిసిన వాళ్ళ చూపులే పడనంత దూరం వెళ్ళిపోయి, మిగిలిన జీవితాన్ని ఎవరికన్నా ఉపయోగపడేలా జీవించాలి. అందుకే. రాజీనామా

ఏమ్మా...అలాగైతే వేరే ఏదైనా ఉద్యోగం వెతుకున్నావా?”

ఇంకా లేదు సార్

మరెలాగమ్మా?”

ఉద్యోగం వదిలేసి కొన్ని రోజులు ఏదైనా హాస్టల్లో ఉండి...ఒక ఉద్యోగం వెతుక్కుందామని అనుకుంటున్నా...

అంటే...నీ నిర్ణయంలో నువ్వు పట్టుదలగా ఉన్నావు?”

అవును సార్

రామ్మోహన్ తో మళ్ళీ కలవబోయేది లేదా?”

ప్రామిస్ గా ఆలొచనే లేదు సార్

అలాగా?” -- ఒక్క క్షణం నుదురును రాసుకున్నారు. తన టేబుల్ సొరుగు లాగి అందులోంచి ఒక ఫైలు తీసి ఆమె ముందు జాపారు.

కూర్చోమ్మా...ఇది చదివి చూడు

ఏమిటి సార్ ఇది?”

చదివి చూడు -- అని చెప్పిన ఆయన తన పనిలో లీనమయ్యాడు. అయోమయంతో ఆయన ఎదుటే కుర్చీలో కూర్చుని ఫైలు తెరిచిన ఆమె మొహం మారింది.

అది ఒక సేవా సమితి కేంద్రం గురించినది. కలకత్తాలో ఉన్నట్టు, అందులో రెండు వందల అనాధ పిల్లలు జీవిస్తున్నట్టు  రాసుంది. దాని గురించిన కొన్ని కలర్ ఫోటోలు పిన్ చేసి ఉన్నాయి. వాటిని చూసిన ఆమె హృదయం నొప్పి పుట్టింది.

వికలాంగులు, గుడ్డి వాళ్ళు, బక్క చిక్కిన ఆడపిల్లలూ అంటూ ఒక్కొక్క ఫోటో ఆమె గుండెలను పిండింది.

ఏమిటి సార్ ఇది?”

చూసావామ్మా

ఇది మా అమ్మాయి నడుపుతున్న సేవా కేంద్రం

.......................................”

ఆమె కూడా నీలాగానే చాలా చదువుకుంది. పెళ్ళిచేసుకోవటం ఇష్టం లేక నలుగురికి మంచి చేయాలి, సంఘ సేవ చేయటమే నాన్నా నా లక్ష్యంఅని చెప్పింది.

నేను దాన్ని అంగీకరించలేదు. నాకు ఒకే కూతురు. నా వంశం అభివృద్ది చెందాలి అని ఆమెను బలవంత పెట్టి పెళ్ళికి ఒప్పించా. ఆమె కూడా నా కోసం అంగీకరించింది. పెళ్ళి కూడా జరిగింది. తరువాత అంతా...చెదిరిపోయింది -- అర్జున్ రావ్ నిట్టూర్పు విడిచాడు. పవిత్ర ఆతృతతో అడిగింది.

ఏమైంది సార్?”

ఏదేదో జరిగిపోయిందమ్మా. నాకు  కూతురికి పెళ్ళి చేయాలనే శ్రద్ద ఉన్నదే తప్ప, పెళ్ళి కొడుకును చూడటంలో శ్రద్ద చూపించలేదు. అదే తప్పైపోయింది

సార్

పెళ్ళికొడుకు ఫారిన్ రిటర్న్ అమ్మా. చూడటానికి దర్జాగా, అందంగా ఉంటాడు. వసతులున్న కుటుంబం. ఇలా అన్నిటినీ గమనించిన నేను, అతని గుణం గురించి విచారించలేదు

అయ్యో....అతని గుణం మంచిది కాదా?”

అవునమ్మా...ఇంతకు ముందే బయటి దేశంలో ఒక పెళ్ళి చేసుకుని ఉన్నాడునేనేం పాపం చేసేనో? నిజం, నా కూతురు పెళ్ళి జరిగిన తరువాత తెలిసింది. అంతా అయిపోయింది. ఇరవై రోజులే అతనితో జీవించింది. విదేశీ అమ్మాయికి ఎలాగో విషయం తెలిసిపోయింది. వెతుక్కుంటే ఇక్కడికే వచ్చేసింది.

అది అతిపెద్ద సమస్యగా మారింది. పోలీసులు-కోర్టు-కేసు అంటూ తిరిగి తిరిగి గౌరవ మర్యాదలను పోగొట్టుకున్నాను. ఆమెను రిజిస్టర్ మ్యారేజీ చేసుకోనున్నాడు. అందువలన ఇక్కడ జరిగిన పెళ్ళి చెల్లెదు అని తీర్పు ఇచ్చారు" ----అని చెప్పినప్పుడు అర్జున్ రావ్ కళ్ళల్లో మాత్రమే కాకుండా, పవిత్ర కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినై.

ఒక పెద్ద నిట్టూర్పు తరువాత మళ్ళీ మొదలుపెట్టాడు.

మొదట్లోనే నా కూతురు ఇష్టాన్ని గౌరవించి ఉంటే... ఆశైనా నెరవేరి ఉంటుంది. నా వలనే ఆమె జీవితం నాశనం అయ్యింది. నా మనసు విరిగిపోయింది. నేను బెంగపడిపోయాను. కానీ, నా కూతురు నాలుగు రోజులలోనే మామూలు స్థితికి వచ్చింది. తనకు జరిగినదంతా కలగా అనుకుని, తుడుచుకుని అవతల పారేసింది. చెప్పినట్టే బంధువులు -- సంఘం ఆమెను దేన్నీ మరిచిపోనివ్వలేదుఆదరణ చూపుతున్నామని అనుకుంటూ నా కూతురి గాయం మీద కారం జల్లారు. చిన్న అమ్మాయి కదా...ఓర్చుకోలేక, తట్టుకోలేక చాలా కష్టపడింది.

తరువాతే ఊరు, మనుషులూ వద్దని నిర్ణయించుకుని బయలుదేరింది, వెళ్ళీపోయింది...నీలాగానే! నిన్ను చూసినప్పుడల్లా నాకు నా కూతురు జ్ఞాపకాలే వస్తాయి...ఆమె ఆశపడినట్టే నేను ఆమెను వదిలేసాను. నలుగురుకి మంచి చేస్తే చాలని సేవా కేంద్రం మొదలుపెట్టింది. ఆమె చదువుకున్నదంతా కలకత్తాలోనే.

అక్కడే రోడ్డు చివర్లలో పడున్న పిల్లల్ను తీసుకుని, అనాధలుగా వదిలిపెట్ట బడ్డ కళ్ళు లేని, వికలాంగం ఉన్న పిల్లల్నీ వెతికి పట్టుకుని చేరదీసి, సేవా కేంద్రాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు నా కూతురి దగ్గర రెండువేల ఐదువందల మంది పిల్లలు ఉన్నారు. వాళ్లకోసమే జీవిస్తోంది. నేను నా వంతుకు నా సంపాదన ఇస్తున్నాను. కొంతమంది గొప్ప మనసున్న వాళ్ళు డొనేషన్లు ఇస్తున్నారు

పవిత్ర కళ్ళు చెమర్చినై.

ఇప్పుడు చెప్పేవేమ్మా ఒక మాట, మిగిలి ఉన్న జీవితకాలాన్ని ఎవరికైనా ఉపయోగపడేటట్టు జీవించాలి అని. అందువలనే ఇది చూపించాను. వెళతావా అమ్మా?”

సార్ -- ధన్యవాదాలలో కన్నీటిబోట్లు చిందినై.

ఒక తండ్రిగా నీ మనోవేదనను నేను అర్ధం చేసుకోగలనమ్మా. నువ్వు వెతుకుతున్న ప్రశాంతత, శాంతి నీకు అక్కడ దొరుకుతుందని నమ్ముతున్నాను.

మనల్ని చూసి హేళనగా మాట్లాడుతున్న, బాధపెడుతున్న బంధువులకంటే ఎవరూ లేకుండా నిలబడ్డ ఇలాంటి పిల్లలను మనం పెంచుదామే! ఏమ్మా చెబుతావు?”

ఖచ్చితంగా సార్...నా జీవితంలో ఇలాంటి ఒక సందర్భం దొరుకుతుందని అనుకోలేదు. దొరకటం నా భాగ్యం. చాలా థ్యాంక్స్ సార్

అయితే...వెడతావామ్మా?”

ఖచ్చితంగా సార్...నా జీవితం ఇక మీదటే అర్ధమున్న జీవితంగా మారబోతోంది

మీ ఇంట్లో దీనికి ఒప్పుకుంటారామ్మా?”

వద్దు సార్. వాళ్ళకు తెలియక్కర్లేదు

పవిత్రా...

సేవ చేయాలని నన్ను అర్పించుకున్న తరువాత, బంధుమితృలకు చోటు ఇవ్వకూడదు. వాళ్ళు సేవ చెయ్యనివ్వరు

అది కాదమ్మా...అయినా...

సార్...నేను ఉద్యోగం రాజీనామా చేసింది చేసినట్టే ఉండనివ్వండి. మీ అమ్మాయితో మాట్లాడి నేను అక్కడికి ఎప్పుడు రావాలో కనుక్కుని చెప్పండి

మాట్లాడతానమ్మా. అవును... మనోకి ఎప్పుడు పెళ్ళి?”

ఇంకో పది రోజులు

మొదట వాడి పెళ్ళి జరగనీ. నేను ఇంకో పదిహేను రోజుల్లో కలకత్తా వెడతాను. అప్పుడు నాతో వచ్చేస్తావా అమ్మాయ్?”

వస్తాను సార్

పవిత్రా...తొందరేమీ లేదు. నువ్వు బాగా ఆలొచించి నిదానంగా జవాబు చెబితే చాలు

ఆలొచించటానికి ఇంకేమీ లేదు సార్. ఇలాంటి పిల్లలకు సేవ చేయటం ఒక వరం. అది అందరికీ దొరకటం లేదు. నాకు దొరికిన వరాన్ని వదులుకో దలచుకోలేదు

దీనికి మనో ఒప్పుకుంటాడా పవిత్రా?”

ఖచ్చితంగా ఒప్పుకోడు. కానీ, నేను వాడి దగ్గర కూడా చెప్పబోయేది లేదు.

ఏంటమ్మా నువ్వు? మనో నీ మీద ఎంతో ప్రేమ పెట్టుకున్నాడు? అతని దగ్గర కూడా  చెప్పకుండా వెడితే ఎలా?”

నిజమే సార్...ఇన్ని సంవత్సరాలు నా కోసమే జీవించాడు. ఇక మీదట వాడికోసం జీవించనివ్వండి!

పవిత్రా...

అవును సార్. నేను వాడితో పాటు ఉంటే వాడికి బాధగానే ఉంటుంది. భార్యతో సహజంగా కలిసి జీవించలేడు. నేను విడిపోతేనే వాడు బాగుంటాడు

అయితే...

మనో పెళ్ళి అయిపోయిన వెంటనే మనం బయలుదేరుదాం సార్

సరేమ్మా...

సార్

చెప్పమ్మా...

నేను ఎక్కడికి వెడుతున్నానో నా కుటుంబంలో ఉన్న వాల్లకు మాత్రమే కాదు...ఆఫీసులో ఉన్న వారి కూడా...ముఖ్యంగా...

రామ్మోహన్ కి తెలియనివ్వనమ్మా. నువ్వు దేని గురించి భయపడకుండా ధైర్యంగా రా

చాలా థ్యాంక్స్ సార్ -- అంటూ రెండు చేతులూ జోడించి నమస్కరించిన పవిత్రకు మానవ దైవంగా కనిపించారు అర్జున్ రావ్.

                                                                                              PART-13

ముహూర్త బజంత్రీలు...ముహూర్త బజంత్రీలూ -- పెద్దవారి గొంతుకులు విన్న సన్నాయి మేళం కళాకారులు పెద్ద, స్పీడు ధ్వనితో మేళాలు కొట్టగా... స్వాతి మెడలో తాళి కట్టాడు మనోహర్. పవిత్ర కళ్ళు కాంతులు వెదజల్ల, ఆమె అక్షింతలు వేసింది.

కన్నవారి కాళ్ళమీద పడి నమస్కరిస్తున్న వధూవరులు, తన కాళ్ళ మీద కూడా పడటంతో...బిత్తరపోయింది.

రేయ్...ఏమిట్రా ఇది...నా కాళ్ళ మీద పడి

నువ్వు కూడా నాకు ఒక అమ్మవే అక్కా. ఆశీర్వదించు

అవును వదినా...మీ వలనే మా పెళ్ళి జరిగింది. ఆశీర్వాదం చెయ్యండి -- స్వాతి కూడా చెప్పగా, ఆమె కళ్ళల్లో నీరు పొంగింది.

ఇద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా - సంతోషంగా - గొప్పగా జీవించాలి రెండు చేతులు పైకెత్తి దీవించింది.

ఇంతలో బంధువుల గుంపు బహుమతుల వస్తువలతో వేదిక ఎక్కడం మొదలు పెట్టింది. పవిత్ర మెల్లగా దిగి వేదిక దగ్గర నిలబడింది.

సిగ్గూ, సంతోషంతోనూ నిలబడ్డ భార్యను ఆనుకుని ఫోటోకు నవ్వుతూ నిలబడ్డ తమ్ముడ్ని చూసింది. బహుమతులు ఇచ్చి తిరిగి వస్తున్న వారిని భోజనాలకు తీసుకు వెడుతున్న అమ్మనూ బొంగరంలాగా చుడుతూ ఉన్న నాన్నను అంటూ, అందరినీ నిలబడ్డ చోటు నుండే కావలసినంతగా చూసుకుంది.

ఇక వీళ్ళను ఎప్పుడు చూడబోతానో? రోజు ఉన్న ఇదే ఆనందం చివరి వరకు వాళ్ళళ్ళో నిలిచే ఉండాలి దేవుడా...మనసారా వెడుకుంటున్నప్పుడు రామ్మోహన్ గొంతు వినబడింది.

ఏమిటి పవిత్రా...ఇక్కడే నిలబడ్డావు?”

ఏమిటి విషయం?”

నాతోరా...కొత్త దంపతులతో మనమూ ఒక ఫోటో తీసుకుందాం -- న్యాచురల్ గా అతను పిలవగా, ఆవేశపడకుండా చెప్పింది.

పారిపోయిన భార్యను తీసుకువచ్చి ఫోటో తీసుకోండి

పవిత్రా...

నోరు ముయ్యండి. నా పేరు కూడా ఉచ్చరించే హక్కు మీకు లేదు -- కఠినంగా చెప్పేసి అక్కడ్నుంచి బయలుదేరింది.

పెళ్ళికి వచ్చిన గుంపు భోజనాల బంతికీ, వేదికకూ వెళ్తుండగా... పవిత్ర వెళ్లటం ఎవరి కళ్ళకూ తెలియదు.

మెల్లగా నడుచుకుంటూ మండపం బయటకు వచ్చి, నెమ్మదిగా ఇంటివైపుకు నడిచింది.

తొందరలేని నిదానమైన నడక, ఊరు వదిలి వెళ్ళటానికి ఇంకా పూర్తిగా రెండు గంటలు ఉంది. ఒంటి గంటకు ఆఫీసు గేటు దగ్గరకు వచ్చి నిలబడమని చెప్పారు అర్జున్ రావ్ గారు.

వెళ్ళటానికి కావలసిన అన్ని పనులనూ చేసేసింది. కావలసిన బట్టలు మాత్రం తీసి పెట్టుకుంది. తన పేరు మీద బ్యాంకులో ఉన్న మొత్త డబ్బునూ అంతకు ముందే తండ్రి ఖాతాలోకి మార్చింది.

ఇక...నేను వెళ్ళేది మాత్రం చెబితే చాలు. మొదట్లో కొన్ని రోజులు వెతుకుతారు...ఏడుస్తారు. తరువాత వాళ్ళుగా బయటపడతారు. అన్నిటినీ అలవాటు చేసుకోవాలే!

మనో చాలా కష్టపడతాడు . కొత్త భార్య ధైర్యం చెప్పి సమాధానపరుస్తుంది. రేపు వాళ్ళకు పిల్లలూ...కుటుంబ బాధ్యత అని వచ్చేటప్పుడు పవిత్ర యొక్క జ్ఞాపకం నిదానంగా తగ్గిపోతుంది.

ఇదే ప్రకృతి. ప్రకృతితో కలిసే జీవితం వెడుతుంది. దీనినే 'విధీ అంటారో? నిన్న ఎలా ఉన్నాం? రోజు ఎలా ఉన్నాం? రేపు ఎలా ఉంటాము...?

తనలోనే తాను నవ్వుకుంటూ ఇళ్ళు చేరింది. తన దగ్గరున్న తాళం చెవితో తలుపులు తీసింది. లోపలకు వెళ్ళిన వెంటనే తాను వేసుకున్న నగలను అమ్మ బీరువాలో దాచింది.

పట్టు చీర తీసేసి, కాటన్ చీర కట్టుకుంది. మొహంకడుక్కుని, తుడుచుకుని, అద్దంలో తన ఆకారాన్ని చూసింది. తృప్తిగా అనిపించింది.

సన్యాసిని లాంటి జీవితానికి ఇది చాలు. ఇక శరీరం, ప్రాణం కొందరి కోసమే పనిచేస్తుంది! తనలో చెప్పుకుంటూ మనోహర్ గదిలోకి వెళ్ళింది.

మనసులో ఏదో తెలియని నొప్పి పుట్టింది. గోడ మీద వేలాడ దీసిన తమ్ముడి ఫోటోలను ఒక్కొక్కదాన్నీ చూసింది. కంట తడి పెట్టుకుంది.

చిన్న వయసు నుంచే తన మీద వాడికున్న అపరిమితమైన అభిమానం, మనసులో ఒక సినిమాలా కనబడింది.

అక్కా...ఒంటరిగా బయటకు వెళ్ళకు...నేనూ వస్తాను

నువ్వు షాపులకు వెళ్ళద్దక్కా...నేను వెళ్ళోస్తాను

అక్కా నువ్వు పెద్దమనిషి వయ్యావుట. ఇక మీదట స్కూలుకు నాతోనే వచ్చేయి. నేను నీకు తోడుగా ఉంటాను

అక్కను మాత్రం ఎందుకమ్మా చదువుకోవద్దు అంటున్నావు? నా కంటే అక్కయ్యే కదా బాగా చదువుతోంది

ఏయ్. మా అక్కయ్య గురించి ఏదైనా మాట్లాడావా...నిన్ను చంపేస్తాను

ఎందుకక్కా ఏడుస్తున్నావు? నీకు నేను ఉన్నాగా. నువ్వు చదువుకో అక్కా. నేను చదివిస్తాను

మా ఎం.డి చాలా మంచివారక్కా. నీ గురించి చెప్పిన వెంటనే ఉద్యోగం ఇచ్చేసారు. ఇక మీదట నువ్వు ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చు

నువ్వూ నాకు ఒక అమ్మలాంటి దానివే అక్కా’ -- మనో యొక్క స్వరం చెవిలో మోగ...ఫోటోను గుండెలకు హత్తుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

నువ్వు నా తమ్ముడివి కాదు. నా తండ్రివి. మరో జన్మ అనేది ఉంటే నేను నీకు కూతురుగా పుట్టాలి

కన్నీరు తుడుచుకుంది. నిన్న రాత్రి రాసి పెట్టుకున్న ఉత్తరాన్ని విప్పింది.

నా భవిష్యత్తును ఉపయోగపడేలా మార్చుకోబోతాను. ఎవరూ నన్ను వెతక వద్దు. నా కోసరం ఏడవకండి. అమ్మా...ఇక మీదట స్వాతి నీ కూతురుగా ఉంటుంది. నాన్నా...నీ కూతురు...ఇంకొకళ్ల కోసం జీవించబోతోంది.

తమ్ముడూ తొందరగా పిల్లలను కను. అది చూసి అమ్మ తన బాధలను మర్చిపోనీ. నీ జీవితం సంతోషంగా ఉండాలి.

స్వాతీ...నా తమ్ముడికి నువ్వే అన్నీ. తల్లిగా, సహోదరిగా...భార్యగా, స్నేహితురాలిగా ఉంటూ వాడిని జీవితంలో పైకి తీసుకు వస్తానని పరిపూర్ణంగా నమ్ముతున్నాను

ప్రేమతో.

పవిత్ర.

ఉత్తరాన్ని చదివి తమ్ముడు టేబుల్ మీద పెట్టి దానిపై అతని ఫోటోను ఉంచింది. గడియారం చూసుకుంది. టైము పన్నెండున్నర దాటింది.

ఇక బయలుదేరాలి -- మనసును ప్రశాంతత చేసుకుని, తన పెట్టెను తీసుకుని బయలుదేరటానికి సిద్దమైంది.

కళ్యాణమండపం చాలా వరకు ఖాలీ అయ్యింది. మెడలో వేసున్న పూలమాలను తీయకుండా, చమటతో తడిసి ముద్దైన మనోహర్ అటూ, ఇటూ తిరుగుతూ సహోదరిని వెతుకుతున్నాడు.

పెళ్ళి కొడుకు గారూ...రండి భోజనం చేద్దాం...

ఒక్క నిమిషం...మా అక్కయ్య ఎక్కడ?”

నేనూ ఆమెనే వెతుకుతున్నాను. కనబడలేదు...

బయట ఎక్కడన్నా నిలబడుందేమో---కొంచం చూడండి

అరగంటగా వెతుకుతున్నా నాయనా...గ్రూప్ ఫోటో తీసుకోవలనుకున్నావే?”

అందుకొసమే నమ్మా ఫోటోగ్రాఫర్ను పంపించకుండా నిలబెట్టాను. నాన్న ఎక్కడ...?”

భోజనం చేస్తున్నవారిని గమనించుకుంటున్నారు

సరే...నా ఫోను ఇవ్వండి. అక్కయ్యతో మాట్లాడుదాం

ఆమె అప్పుడే వెళ్ళిపోయింది -- చిరాకుగా చెప్పిన రామ్మోహన్ను గబుక్కున తల ఎత్తి  చూసాడు మనోహర్.

ఏమిటీ?”

ఆమె వెళ్ళి రెండు గంటలు అవుతోంది

ఏమిటి...ఎక్కడికి వెళ్ళింది?”

ఇంకెక్కడికి వెడుతుంది? ఇంటికే...అందులోనూ నడుచు కుంటూనే వెళ్ళింది

ఏయ్...నువ్వేమైనా చెప్పావా?”

ఏరా...మీ కుటుంబానికి ఎవరినీ గౌరవించటం తెలియదా?”

రామ్మోహన్..అడిగిన దానికి మాత్రం కరెక్టుగా జవాబు చెప్పు. ఆమె మనసు కష్టపడేటట్టు ఏదైనా మాట్లాడావా?”

ఇదేమిట్రా బాబూ నాకు చుట్టుకుంది? ఒక ఫోటో తీసుకుందాం...వధూ-వరులతో వెళ్ళి నిలబడదాం అని అడిగాను. దానికి ఎలా తిట్టిందో తెలుసా?”

చదివిస్తాను, ఆమె తెలివితేటలను పెంచుతానూ అంటూ ఆమె గుణాన్నే మార్చావు కదరా. నన్ను ఒక మనిషిగా కూడా గౌరవించటం లేదు

నువ్వు మనిషిగా ఉంటేనే కదా గౌరవించేందుకు...?”

అనవసరంగా మాట్లాడొద్దు మనో. రోజుకైనా మీ ఇంటి అల్లుడ్నే

చెప్పుతో కొడతా. అక్కయ్యే వద్దంది. ఇంకేమిటి అల్లుడూ...గిల్లుడూ అంటూ చుట్టరికం కలుపుతున్నావు?”

రేయ్...మర్యాదగా మాట్లాడరా...

ఎవర్ని చూసి చూపుడు వేలు చూపి మాట్లాడుతున్నావు...?” -- మనోహర్ కోపంగా రామ్మోహన్ చొక్క పుచ్చుకోగా, స్వాతి తల్లి-తండ్రులు ఆందోళన చెందారు. గుంపు చేరింది.

గోపాల కృష్ణ వచ్చి ఇద్దర్నీ విడదీశాడు. రామ్మోహన్ని బయటకు తీసుకు వెళ్ళాడు స్వాతి తండ్రి.

మనో...ఏమిట్రా ఇదంతా?”

నాన్నా...అక్కయ్యకు ఏమయిందో తెలియటం లేదు. రింగ్వెడుతూనే ఉన్నది. ఫోన్ ఎత్తటం లేదు

స్వరాజ్యం ఆందోళన చెందింది. ఏమిటి మనో ఏం చెబుతున్నావు?”

అవునమ్మా...మొదట ఇంటికి వెళ్ళి చూద్దాం రండి

అల్లుడుగారూ...మీరింకా భోజనం చేయలేదే?”

ఇప్పుడు భోజనమా ముఖ్యం -- స్వాతీ రా త్వరగా

అందరినీ తీసుకుని కారులో బయలుదేరి ఇంటి దగ్గర దిగాడు.

ఇళ్ళు తాళం వేసుందే?”

అంటే పవిత్ర ఇక్కడకు రాలేదా?”

వేరే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఉద్యోగమూ మానేసిందే?”

ఏమండీ... రాక్షసుడు ఏదైనా చెప్పుంటుండా? అది విని మనసు విరిగి నా కూతురు ఏదైనా చేసుకుందో?”

నోరు ముయ్యి. నీ నోటి నుంచి మంచి మాటలే రావా?”

లేదండీ నాకు భయంగా ఉంది

ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? కాళ్ళ మీద పడ్డాడని శనిగాడిని తీసుకువచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన రోజు నుంచే ఇంటి మొత్త ప్రశాంతత పోయింది

నాన్నా...మొదట తలుపు తెరవండి -- అంటూ మనోహర్ తన సెల్ ఫోన్ నుండి పవిత్ర ఫోన్ కు ఫోన్ చేశాడు...ఇంట్లో నుండి రింగ్ టోన్ వినబడింది.

నాన్నా...త్వరగా తెరవండి. ఫోన్ ఇక్కడే మోగుతోంది

ఫోన్ పెట్టేసే వచ్చిందా?”

లేదే! మండపంలో ఉన్నప్పుడు దాని దగ్గర ఉన్నదే?”

ఆమ్మా కనకదుర్గ తల్లీ...నా కూతురుకి ఏదీ జరిగి ఉండకూడదు -- స్వరాజ్యం  వేడుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది...ఒక్కొక్కరూ ఒక్కొక్క వైపుకు వెళ్ళారు.

మనోహర్, పవిత్ర రూములోకి వెళ్లాడు. ప్రొద్దున కట్టుకున్న పట్టు చీర...దన్నెం మీద మడత నలగ కుండా ఉంది.

ఎక్కడికి వెళ్ళింది?’

మళ్ళీ ఇంకోసారి ఇల్లంతా చుట్టి వచ్చి నీరసంగా తన గదిలోకి వెళ్లాడు. ఫ్యాన్ వేసి మెడలోని పూలమాలను తీస్తున్నప్పుడు చూసాడు. తన టేబుల్ మీద, తన ఫోటో కింద ఒక కాగితం గాలికి కొట్టుకుంటోంది.

పరిగెత్తుకు వెళ్ళి కాగితాన్ని తీసాడు. అందులో ఉన్న అక్కయ్య చేతి రాతను చూసి తల్లడిల్లిపోయాడు.

చదివిన వెంటనే '' అంటూ అరిచాడు.

కొడుకు అరిచిన శబ్ధం విని హాలులో ఉన్న గోపాల కృష్ణ, పూజ గదిలో ఉన్న స్వాతి, స్వరాజ్యం పరిగెత్తుకు వచ్చారు...తన గదిలో కూర్చుని తల పట్టుకుని ఏడుస్తున్నాడు మనోహర్.

అయ్యో...ఏమండీ ఏమైంది?” -- భార్య కళ్ళు చెమర్చ....

ఏం మనో...ఏంటయ్యా జరిగింది?” -- నాన్న గాబరాగా అడుగగా.....

అయ్యో...నా కొడుకు ఏడుస్తున్నాడే...ఏదో అయిపోయింది! నాన్నా...ఏంటయ్యా జరిగింది? అమ్మకు భయంగా ఉందయ్యా...--కన్నీటితో అన్న తల్లిని కౌగలించుకుని ఏడ్చాడు.

వద్దూ వద్దూ అని ఎన్నోసార్లు చెప్పానే! నా మాట వినకుండా అక్క మనసును చంపేసారే...ఇప్పుడు వెళ్ళిపోయింది. మనమెవరం వద్దని వెళ్ళిపోయింది

... నో...

మన మొహాలకే కనబడనని రాసిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఇక అక్క రాదు...ఏడుస్తున్న అతని చేతిలోంచి ఉత్తరాన్ని తీసుకుంది స్వాతి.

చదివేసి మామగారికి చేతికి అందించింది. ఆయన చదివి శిలలా నిలబడిపోయాడు. స్వరాజ్యం కి ఏమీ అర్ధంకాక పిచ్చిదాని లాగా అందరినీ చూసింది.

ఏమండి...ఏమి రాసింది?”

వెళ్ళిపోయిందే...పరిగెత్తుకుంటూ వెంబడించి వచ్చారే. ఏం చేస్తుంది పిల్ల. అందుకే మొత్తంగా మనందరిని శోఖంలో ముంచేసి వెళ్ళిపోయింది. వెతక కూడదట

... మి...టీ...?”

ఇక రాదే. మన అమ్మాయి మనకు లేదు. అంతా నీ వల్లే, నీ వలనే

అయ్యో...కన్న కూతురు హాయిగా జీవించాలనే కదా ఆశపడ్డాను...అది తప్పా? నా ఆశ తప్పా?” -- ఆమె ఏడుపుతో కుటుంబమంతా గందరగోళంలో ఉంటే, విమానంలో ఎగురుతూ వెడుతోంది పవిత్ర.

రెక్కలు విరుచుకుని ఎగరటం మొదలుపెట్టిన కొత్త ఫీనిక్స్ పక్షికి ఇక ఆకాశమే హద్దు!

**********************************************సమాప్తం******************************************   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)

శతమానం భవతి…(పూర్తి నవల)