రూపం తెచ్చిన మార్పు…(పూర్తి నవల)

 

                                                                రూపం తెచ్చిన మార్పు                                                                                                                                   (పూర్తి నవల)


తన చెల్లిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని ప్రామిస్ చేసి, పెళ్ళి చేసుకోకుండా మోసంచేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వాడిని చంపేయాలనే ఆవేశంతో తయారవుతున్న జోసఫ్ ను, అతని స్నేహితుడు ‘ఆవేశంలో విజయం సాధించలేవు, పన్నాగంతో మాత్రమే విజయం సాధించగలవు’ అని సలహా ఇస్తాడు. అది నిజమే నని అర్ధం చేసుకున్న జోసఫ్, ఒక చిన్న పన్నాగంతో తన చెల్లిని మోసం చేసీన వెంకటేష్ దగ్గరే పనికి జేరి, తన అసలు పగను నెరవేర్చుకోవడానికి దగ్గరవుతాడు. కోటీశ్వరుడైన వెంకటేష్ ను హతమార్చటానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.

ఆ అడ్డంకులను తొలగించుకుని జోసఫ్ తన ప్రతీకారాన్ని నెరవేర్చుకున్నాడా? లేక తనే ఆ అడ్డంకులకు లొంగిపోయాడా?.......తెలుసుకోవటానికి ఈ త్రిల్లింగ్ నవలను చదవండి:    

 

                                                           *********************************** 

                                                                                     PART-1

బొర్ల పడుకున్నాడు, జోసఫ్! కళ్ళు మూసుకున్నప్పుడు మళ్ళీ, మళ్ళీ చెల్లి రూపమే వచ్చింది! పకపక నవ్వింది! వెంటనే నవ్వు మారి, ఏడ్చింది!

గదంతా ఆమె కాళ్ళ గొలుసు శబ్ధం వినబడింది!

అన్నయ్యా? నా ఎడబాటు నిన్ను బాధిస్తోంది కదూ? చెల్లీ చెల్లీ అని నువ్వు అన్నప్పుడల్లా నాకు మన అమ్మే గుర్తుకు వచ్చేది. అమ్మలేని లోటును తీర్చిన నిన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ బ్రతికుంటే ఏదో ఒకరోజు, ఎవరికో ఒకరికి నేను తోడుగా వెళ్లాల్ల్సిందే అనేది గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనసు నన్ను వేధించింది. ఇన్ని రోజులు నీ ప్రేమికుడి రూపాన్ని భర్తగా మనసులో పెట్టుకుని కాపురం చేసిన నువ్వు మరొకరికి భార్యగా వెళ్లగలవాఅని నన్ను పదే పదే ప్రశ్నించింది. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా చావుకు నా ప్రేమికుడు కారణం కాదు. ఆయన చాలా మంచి మనిషి. ఏదో ఒక తప్పించుకోలేని నిర్భంధం వలన ఆయన నన్ను వదిలిలేసి ఇంకొకర్ని పెళ్ళి చేసుకోనుంటారు. అందువల్ల కొత్త దంపతులైనా ఆనందంగా బ్రతకనీ...నా మీద ప్రేమతో, పగ పేరుతో ఆయన్ని ఏమీ చేయకు....ప్లీజ్ అన్నయ్యా. ఆయన్ని ఏం చేయకు"

 నో...నో అరుస్తూ లేచి కూర్చున్నాడు జోసఫ్!

అతని వొళ్ళంతా వొణుకుతో ఊగిపోతోంది. చెమటతో స్నానం చేసున్నాడు!

హడావిడి పడుతూ లోపలకు వచ్చాడు, స్నేహితుడు గోపాల్!

ఏమిటి జోసఫ్ మళ్ళీ కలా?” అడిగాడు స్నేహితుడు గోపాల్

జోసఫ్ లేచాడు.

"నేను వెలుతున్నానురా, గోపాల్. మూడు పూట్లా తింటూ, నీ నీడలో జీవించటానికా పుట్టాను. నచ్చలేదురా! తిన్నగా వెళ్ళి, వాడి కథ ముగించి, పోలీసులకు లొంగిపోతాను!"

"తరువాత ఉరి స్తంభం ఎక్క బోతావా?"

"వెలాడిందే! నా చెల్లి మేరీ వేలాడిందే! గొంతు ఎముకలు విరిగి, కళ్ళు బయటకు వచ్చి, నాలుక బయటకు వచ్చి నా అందమైన మేరీ వికారంగా చావాలేదా? అది వాడుకూడా అనుభవించాలి. ఇప్పుడే వెడతాను"

గోపాల్ అడ్డుపడ్డాడు.

"మూర్ఖుడిలా మాట్లాడకు! నువ్వు వెళ్ళిన వెంటనే అతన్ని చంపేయగలవా? మొదట అతని దగ్గరకు చేరుకోగలవా? అతను ఇప్పుడు నగరంలోని కోటీశ్వరులలో ఒకడు. నువ్వు ప్రయత్నం చేస్తేనే పట్టుబడిపోతావు! తరువాత నువ్వు అనుకున్నది జరగదు! హత్యా ప్రయత్నం చేసేవని లోపల పెట్టి నీ నెత్తురు,కండ బయటకు తీసేస్తారు. అతన్ని చంపకుండానే నువ్వు చచ్చిపొతావుఅది కావాలా?”

పరవాలేదు...అవును. నువ్వెందుకు నాకు అడ్డుపడుతున్నావు?”

పిచ్చోడా! అడ్డుపడటం లేదురా! ఒక ఆడపిల్లను, అందులోనూ స్నేహితుడి చెల్లిని ప్రేమించి మోసం చేసినవాడిన వదిలేయమని నీకు నేను అడ్డుపడతానా?  తెలివితేటలతో నడుచుకో. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు అని చెబుతున్నాను.  దానికోసం నేనొక మంచి వార్తతో వచ్చాను

ఏమిటది?”

వెంకటేష్, డ్రైవర్ ఉద్యోగం కోసం మనుషులను తీసుకుంటున్నాడు!

అందుకని?”

డ్రైవర్ ఉద్యోగంలో నువ్వు జేరాలిరా! ఉద్యోగం నీకు దొరికితే, అతను ప్రయాణం చేసే ప్రతిసారీ నువ్వు అతనితోనే ఉంటావు! అతని అలవాట్లు, పనులు నీకు తెలుస్తాయి! అప్పుడు నీ పని సులువు అవుతుంది. నీ పగను నువ్వు తీర్చుకోవాలి. కానీ, నువ్వు దొరకకూడదురా! అంతేగానీ,  అలా ఆవేశపడ కూడదురా…. ఆవేశంలో తీసుకునే నిర్ణయానికైనా ఆయువు ఎక్కువ ఉండదు!

జోసఫ్ తల ఎత్తాడు.

ఇలా చూడు! ఒకరి ప్రాణం తీయడానికి కొద్ది నిమిషాలే పడుతుంది. దానికంటే, వాన్ని చిత్రవధ చెయ్యి! నీ చెల్లి మేరీ చనిపోయే ముందు ఎంత చిత్రవధ అనుభవించి ఉంటుందో, అంతే చిత్రవధ చనిపోయే ముందు వెంకటేష్ కూడా అనుభవించాలిరా….దానికోసం ఆలొచించు

నువ్వు చెప్పేది బాగుందే!

అమలు చెయ్యి! నీ మేరీ ఉరేసుకుంది! ఉరేసుకునే ముందు ఆమె  ఎంత మనోవ్యాధితో భాదపడిందో! బాధే కదా ఆమెను ప్రాణం తీసుకోవాలనే నిర్ణయానికి తీసుకు వెళ్ళింది! దానికి కారణమైన వెంకటేష్ ని అంత చిత్రవధకు గురి చెయ్యొద్దా?”

ఖచ్చితంగా చేయాలిరా, గోపాల్!

చెల్లి కలలో కనిపించి చెప్పిన మాటలను స్నేహితుడికి చెప్పలేదు.

దానికి కావలసిన సంధర్భం వచ్చింది! వెళ్ళిరా!”-- అన్నాడు గోపాల్.

చాలా మంది ఉద్యోగం కోసం పోటీ పడతారే! వెంకటేష్ కోటీశ్వరుడు. నాకు ఛాన్స్ దొరుకుతుందా?”

అది నీ చాకచక్యం. అతన్ని అంతంచేయాలనున్న నీలోని పగను ప్లానుగా మార్చు

జోసఫ్ లేచాడు!

సరే గోపాల్! నేను బయలుదేరుతాను!

బెస్ట్ ఆఫ్ లక్! వివేకంతో నడుచుకుని విజయాన్ని కైవసం చేసుకో. నీకు తోడుగా నీ చెల్లి మేరీ ఉంటుంది!

జోసఫ్ ఒక్క క్షణం కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. గబుక్కున తుడుచుకుని, వేగంగా లోనికి  వెళ్ళాడు!

పది నిమిషాలలో స్నానం ముగించుకుని, డ్రస్సు మార్చుకుని, బయటకు వచ్చాడు!

వీధి చివరకు రాగానే, బస్సు రావటంతో, పరిగెత్తుకుని వెళ్ళి దాంట్లో ఎక్కాడు.

ఇరవై నిమిషాల ప్రయాణం తరువాత దిగి నడవసాగాడు.

పది నిమిషాల నడక!

సిటీ అవుటర్ లో, అది డబ్బుగలవారు నివసించే ప్రాంతం. వరుసగా విలాశమైన భవనాలు!

ఖాలీగా ఉన్న రోడ్డు!

వీధి చివర్న మొబైల్ ఇస్త్రీ బండి! కుక్కలతో నడుస్తున్న వృద్దులు.

సర్.సర్ మని వేగంగా వెడుతున్న విదేశీ కార్లు.

ఒక పర్టికులర్ బంగళా దగ్గరకు వచ్చాడు. తల కంటే ఎత్తులో అమర్చ బడ్డ గేటు బంగళాను అడ్డుకుంటోంది!

గేటును మెల్లగా తెరిచాడు.

వెంటనే సెక్యూరిటీ వచ్చాడు.

ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి?”

యజమాని వెంకటేష్ గారిని చూడాలి!

అపాయింట్ మెంట్ ఉందా?”

డ్రైవర్ పనికి మనుషులను తీసుకుంటున్నారట. అందుకనే వచ్చాను!

జోసఫ్ ను ఒకసారి పైకీ కిందకూ చూశాడు సెక్యూరిటీ.

నీకంటే ముందే ముగ్గురు వచ్చున్నారు! అందులోనూ రెకమెండేషన్ లెటర్లతో వచ్చారు! నీకు ఎవరి రెకమండేషన్?”

దేవుడు!

సెక్యూరిటీ నవ్వాడు.

సరే! దేవుడు పేరు చెప్పిన కారణంగా నిన్ను లోపలకు పంపిస్తున్నాను! కానీ, నీకు ఉద్యోగం దొరుకుతుందని నాకు నమ్మకం లేదు! లోపలకు పో!

జోసఫ్ లోపలకు నడిచాడు.

ఇంతకు ముందే ముగ్గురు. అందులోనూ రెకమండేషన్లతో. నాలుగో వాడిగా నేను?’

మొల్లగా నడుస్తున్న జోసఫ్ ఒక అందమైన పూలతోటను దాటాడు.

అక్కడ ఒక పిల్లాడు -- మూడేళ్ళ వయసున్న చిన్నవాడు. బంతితో ఆడుకుంటున్నాడు.  పనిమనిషి ఒకత్తి కొంచం దూరంలో తిరుగుతోంది.

పెద్ద బంతితో పిల్లాడు ఉత్సాహంగా, ఆనందంగా ఆడుకుంటున్నాడు.

పనిమనిషి, సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడుతోంది. అతను కూడా ఆమెతో స్వారస్యముగా మాట్లాడుతున్నాడు.

పిల్లాడు ఎగరేసిన బంతి గేటు దగ్గరకు వెడుతూండటం గమనించాడు జోసఫ్!

దగ్గర దగ్గర గేటుకు దగ్గరగా వెళ్ళింది బంతి! గేటు బయటకు వెళ్ళింది. కానీ సెక్యూరిటీ  అక్కడ లేడు. కాబట్టి పిల్లాడు గేటు తోసుకుని బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది.

పిల్లాడు బయటకు వెళ్ళిపోతాడేమో నన్న భయంతో జోసఫ్ గేటు వైపుకు వెళ్ళాడు. పిల్లాడ్ని చేరుకునే లోపు, పిల్లాడు గేటు తోసుకుని బయటకు వచ్చాడు.

నీలో వెంకటేష్ ను చంపాలని ఉన్న పగను, నీ మేధస్సుతో ప్లానుగా మార్చు! వివేకంగా నడుచుకుని విజయాన్ని కైవసం చేసుకో!’ --స్నేహితుడు గోపాల్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

జోసఫ్ ఒక్క క్షణం ఆలొచించాడు. వేగంగా వెళ్ళి బంతిని పట్టుకున్నాడు. కావాలని  బంతిని రోడ్డుకు అవతలవైపుకు విసిరేశాడు!

                                                                                PART-2

పిల్లాడు నవ్వాడు! బంతిని తీసుకురావడానికి రోడ్డు అవతలవైపుకు నడిచాడు పిల్లాడు! పిల్లాడు రోడ్డు క్రాస్ చేస్తూ రోడ్డు మధ్యకు వచ్చాడు. వేగంగా వస్తున్న కారు ఒకటి పిల్లాడి వైపుకు వస్తూ ఉండటంతో, జోసఫ్ ఒక జంపు చేసి వెళ్ళి పిల్లాడిని చేతులతో ఎత్తుకుని రోడ్డుకు అటువైపుకు వెళ్ళి పడ్డాడు!

జోసఫ్, పడిన వేగంలో గాయపడ్డాడు. గాయంతో లేచాడు----

కారులో నుండి దిగిన మహిళ, ఆందోళనతో దగ్గరకు వచ్చింది.

ఏమైంది?”

లేదమ్మా! ఏమీ అవలేదు!చెప్పాడు జోసఫ్.

అంతలో వెంకటేష్ కారు వచ్చింది!

వెంకటేష్ కారు దిగగానే, మహిళ ఆయన దగ్గరకు వచ్చింది.

ఇతను మాత్రం సరైన సమయంలో కాపాడకపోయుంటే, పిల్లాడు నా కారు క్రింద పడుంటాడు!

వెంకటేష్ పిల్లాడ్ని ఎత్తుకున్నాడు.

మీ సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు?”

నేను కనుక్కుంటానుచాలా థ్యాంక్స్ అండీ!

అది మనిషికి చెప్పండి!

ఆమె కారులో ఎక్కి వెళ్ళిపోయింది.

వెంకటేష్, జోసఫ్ దగ్గరకు వచ్చాడు.

పిల్లాడి ప్రాణం కాపాడిన మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పను. లోపలికి రండి!

లోపు సెక్యూరిటీ--పనిమనిషి భయపడుతూ వచ్చారు. వెంకటేష్ ఆవేశంగా వాళ్ళ వైపు తిరిగి, “మీరిద్దరూ పనిచేసే లక్షణం ఇదేనా! ఇప్పుడే మీరు ఇంటికి వెళ్ళచ్చు!

అయ్యగారూ!

నా ముందు నిలబడకండి. పొండి అవతలికి!అంటూ వాళ్ళ మీద విసుక్కుని, జోసఫ్ వైపు తిరిగి మీరు లోపలకు రండి!

పిల్లాడితో పాటూ వెంకటేష్ లోపలకు వెళ్ళాడు. అతని వెనుకే జోసఫ్ కూడా వెళ్ళాడు.

డ్రైవర్ ఉద్యోగానికి  వచ్చిన క్యాండిడేట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు.

మీ పేరేమిటి?”

జోసఫ్!

వీధిలో ఎవరినైనా చూడటానికి వచ్చారా?”

మిమ్మల్ని చూడటానికే వచ్చాను సార్!

నన్ను చూడటానికా? ఎందుకు?”

డ్రైవర్ పనికి మనుషులను తీసుకుంటున్నట్టు విన్నాను. అందుకే

చటుక్కున వెనక్కి తిరిగాడు వెంకటేష్.

ఇద్దరు పనివాళ్ళు అతని దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు.

డ్రైవర్ పనిలో చేరటానికి ఎంతమంది వచ్చారు?”

ముగ్గురు సార్----రెకమండేషన్ లెటర్ తో వచ్చారు!

వాళ్ళను పంపించేయండి! ఈయన మిస్టర్ జోసఫ్ !ఈయన్ని డ్రైవర్ పనిలోకి నేను సెలెక్ట్ చేశాసేను!

జోసఫ్ తల పైకెత్తాడు.

నువ్వు రోజే పనిలోకి చేరొచ్చు, జోసఫ్! పిల్లాడి ప్రాణాన్ని కాపాడిన నీకు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. దానికి కృతజ్ఞతగా నిన్ను ఎప్పుడూ నా పక్కనే  ఉంచుకుంటాను...సరేనా?”

చాలా థ్యాంక్స్ అయ్యగారూ!

పనివాళ్ళందరినీ పిలిచాడు వెంకటేష్.

జోసఫ్ ని లోపలకు తీసుకు వెళ్ళి భోజనం పెట్టండి. సాయంత్రం లోపు జోసఫ్ కు కావలసిన డ్రస్సు, టోపీ అన్నీ తయారవ్వాలి! అడ్వాన్స్ ఏమన్నా కావాలా జోసఫ్?”

వద్దయ్యగారూ! వచ్చిన వెంటనే నాకు పని దొరుకుతుందని నేను ఎదురు చూడలేదు! పిల్లాడి తల్లి బయటకు వెళ్ళేరా?”

తల్లి-తండ్రీ ఇద్దరూ బయటకు వెళ్ళారు!

అంటే, పిల్లాడు మీ అబ్బాయి కాదా?”

లేదు జోసఫ్! అబ్బాయి, మా అక్కయ్య కొడుకు! నాకు పెళ్ళై ఆరు నెలలే అవుతోంది!”  

వెంకటేష్ ముఖంలో ఉన్న నవ్వు చటుక్కున మాయమయ్యింది. ఒక గంభీరం చోటు చేసుకుంది!

వెళ్ళి పని చూడు జోసఫ్!అని చెప్పి వేగంగా లోపలకు వెళ్ళాడు వెంకటేష్.

వెంకటేష్ మొహంలో ఏర్పడిన మార్పుకు కారణం తెలియక నిలబడ్డాడు జోసఫ్.  

రాత్రి తొమ్మిదింటికి గదికి చేరుకున్నాడు జోసఫ్.

గోపాల్ చిన్న ఆందోళనలో ఉన్నాడు!

ఏమిట్రా ఇంత లేటుగా వచ్చావు? నా ప్రాణం నాలో లేదు! వెంకటేష్ ని  ఆవేశంలో నువ్వు ఏమైనా చేసి దొరికిపోయావేమో నని భయపడిపోయాను!

ఇదిగో! ఇది తిను!

జోసఫ్ తాను కొనుక్కొచ్చిన స్వీట్ ప్యాకెట్ లో నుండి ఒక లడ్డూ తీసి గోపాల్ నోట్లోకి తోశాడు!  

ఎందుకురా?”

జోసఫ్, గోపాల్ను కూర్చోబెట్టి అన్ని విషయాలూ చెప్పాడు.

చూశావా? నువ్వు తెలివిగా నడుచుకున్నందుకు ఇమ్మీడియేట్ రిజల్ట్స్. వెంకటేష్ తోనే నువ్వు ఎప్పుడూ ఉండాల్సిన ఛాన్స్ దొరికింది! ఇక నిదానంగా ఉండు! సమయం కలిసొచ్చినప్పుడు నీ పని ముగించుకో

అవును గోపాల్! అది నాకే అర్ధమవుతోంది! నేను అనుకున్న పని జరగాలంటే ఓర్పుతోనే ఉండాలి!

ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు?”

వెంకటేష్ గారి భార్య సింగపూర్ వెళ్ళిందట. రేపు వస్తుందట. వెంకటేష్ గారి అక్క, బావ ఉన్నారు! పనివాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సిగ్గులేని వెంకటేష్, తన బంధువులను పక్కనే ఉంచుకుని ఇల్లరికపు అల్లుడుగా జీవిస్తున్నాడు!”   

అవునురా! కోట్ల కొలది డబ్బు! సుదర్శనమూర్తి కూతురు భార్యగా దొరకటం మాటాలా?”

మరుసటి రోజు ప్రొద్దున్నే పనికి వెళ్ళిపోయాడు జోసఫ్.

పని వాళ్ళు కాఫీ ఇచ్చారు. కాఫీ తాగి జోసఫ్ కారును తుడవటం మొదలు పెట్టాడు!  

ఏడున్నర కల్లా వెంకటేష్ స్నానం చేసి రెడీ అవటంతో జోసఫ్ కి పిలుపు వచ్చింది!

జోసఫ్ లోపలకు వచ్చి వెంకటేష్ కి నమస్తే చెప్పాడు. వెంకటేష్ తో పాటూ అతని అక్కయ్య, బావ అతనితో వచ్చారు!

నువ్వేనా జోసఫ్? సరైన సమయంలో నా పిల్లాడ్ని కాపాడావు! చాల థ్యాంక్స్ తమ్ముడూ! వెంకటేష్ అక్కయ్య అన్నది.     

దానికేగా నీ తమ్ముడు ఏమీ అడగకుండా అతనికి ఉద్యోగం ఇచ్చాడు!అన్నాడు వెంకటేష్ బావ మోహన్ రావ్.

మాటలు వెంకటేష్ కి నచ్చలేదు.

జోసఫ్! నువ్వు లోపలకు వెళ్ళి టిఫెన్ చేసిరా! మనం బయలుదేరదాం!

వెంకటేష్! పనివాళ్ళకూ, డ్రైవర్ కూ నువ్వు ఎక్కువ చోటు ఇవ్వకు!

ఎవర్ని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు బావా! మీరు మీ పని చూసుకోండి!

జోసఫ్ లోపలకు వెళ్ళాడు. వెంకటేష్ బావ మోహన్ రావ్ జోసఫ్ దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం జోసఫ్! అన్నాడు.   

ఏమిటి?”-- అడిగాడు జోసఫ్.

నా మూడేళ్ళ అబ్బాయి బాగానే మాట్లాడతాడు.రోడ్డుకు ఎలా వచ్చావూ అని  వాడ్ని అడిగాను. బంతి ఆడుకుంటూ వచ్చాను నాన్నా’… అంకుల్ బంతిని తీసుకుని రోడ్డుకు అవతలవైపుకు విసిరేశారు. ఆయ్ జాలీ! అనుకుంటూ నేను దాన్ని తీసుకోవటానికి పరిగెత్తాను అన్నాడు!

జోసఫ్ గుండె గుభేలు మన్నది.

                                                                                   PART-3

ఏమిటి? పిల్లాడ్ని కాపాడినట్టు ఒక నాటకమాడి, పనిలోకి చేరావా?”

జోసఫ్ కి చెమటలు పట్టినై.

వెంకటేష్ బావ గొంతు సవరించుకుని స్వరం తగ్గించి ఇలా చూడు! నేను మంచివాళ్ళకంటే, దొంగల్ని త్వరగా గుర్తించగలను! నువ్వు నా దగ్గర కొంచం జాగ్రత్తగా ఉండు! అర్ధమయ్యిందా?”

ఏమండీ! వస్తారా?” -- మోహన్ రావ్ ని పిలిచింది భార్య.

వస్తున్నా సుందరీ!

వెంకటేష్ బావ వేగంగా నడిచి వెళ్ళాడు. జోసఫ్ కి ఇంకా గుండె దఢ తగ్గలేదు.  

ఇంట్లో మనల్ని గమనించటానికి ఒక శత్రువు ఉన్నాడే! నేను చాలా హెచ్చరికగా ఉండాలి!’-- మనసులోనే అనుకున్నాడు జోసఫ్.

జోసఫ్! టిఫెన్ తినడానికి వెళ్ళలేదా?” వెంకటేష్ గొంతు వినబడింది.

ఇదిగో వెలుతున్నా సార్!

జోసఫ్ లోపలకు నడిచాడు. పది నిమిషాలలో కారు దగ్గరకు వచ్చాడు. వెంకటేష్ పెట్టెతో వచ్చాడు. జోసఫ్ కారు డోర్ తెరిచాడు. ఆయన కూర్చున్న వెంటనే కారు డోర్ మూసి, తను డ్రైవర్ సీటులో కూర్చున్నాడు. 

కారు తీశాడు.

నేరుగా తాజ్ హోటల్ కు పో జోసఫ్!

సరే సార్!

జోసఫ్! మా బావ ఒక రకమైన మనిషి! పనివాళ్ళను కసురు కుంటూనే ఉంటాడు. ఎవర్నీ సంతోషంగా ఉండనివ్వడు. నువ్వు ఆయన్ని పట్టించుకోవద్దు! అర్ధమైందా?” 

నేను అందరి దగ్గరా మర్యాదగానే ఉంటాను సార్

అదే కరెక్ట్ జోసఫ్! అది సరే జోసఫ్, నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు?”

ఫ్రేండు రూములో!

మన బంగళాకు వెనుక గదులు ఉన్నాయి! అక్కడ నువ్వు ఉండొచ్చు!

కష్టాలలో ఆదరించిన స్నేహితుడ్ని వదిలేసి ఎలా రాగలను సార్? క్షమించాలి! నేను అతనితోనే ఉండనా?”

నీకు మానవత్వం ఎక్కువ లాగుందే! సరే! మీ ఫ్రెండ్ షిప్ నా వల్ల చెడిపోకూడదు. అక్కడే ఉండు!

స్టార్ హోటల్ రావటంతో, కారు ఆపాడు, జోసఫ్!

జోసఫ్...ఇక్కడ ఒక్క గంటే పని. తరువాత ఏర్ పోర్టుకు వెళ్ళాలి!!

సరే సార్!

కారును పార్కింగ్ లో ఉంచి, జోసఫ్ సీటులో జారి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ చెల్లి మేరీ రూపం కళ్ళ ముందుకు వచ్చింది. ఆ రూపం అతని మనసును కెలికింది.

భార్యా, మామగారూ వస్తున్నారా?’

నా మేరీ ఉండవలసిన చోట ఒక కోటీశ్వరియా?’

జోసఫ్ కి కోపం వచ్చింది! రక్తం వేడెక్కింది!

నువ్వు వాళ్ళ మీద కోపం తెచ్చుకుని ఏమిటి లాభం జోసఫ్? ద్రోహి వెంకటేష్!  మేరీని మోసం చేసింది వెంకటేష్.   విషయం వాళ్ళకు  తెలుసో తెలియదో?’

ప్రశ్న జోసఫ్ మనసులో తలెత్తగానే కొంచంగా వణికాడు.

అలాగూ ఉండొచ్చో?’

మేరీని మోసం చేసినట్లే, డబ్బున్న కుటుంబంలోకి చొరబడటానికి ఏమేమి నాటకాలు, వేషాలూ వేశాడో వెంకటేష్?’

విషయం కూడా కనిపెట్టాలి! అన్నిటినీ బయటపెట్టి, అతన్ని రోడ్డు మీద మీదకు తీసుకు వచ్చి నిలబెట్టి అప్పుడు చంపాలి!

ఇది జరుగుతుందా?’

ఎందుకు జరగదు? బూజ్ లో ఏర్పడిన భూకంపంలో ఒకే రాత్రితో ఒక కోటీశ్వరడు అన్నీ పోగొట్టుకుని బిచ్చగాడు అవలేదా? ఎవరికీ ఏదీ శాశ్వతం కాదు! ఒక్క క్షణంలో అన్నీ మారోచ్చు! మార్చాలి!

తొందరపడకు జోసఫ్! నిదానంగా నడుచుకో! ఇక మీదటే నీకు 'ఓర్పు అవసరం! గోపాల్ గొంతు చెవిలో మారుమోగింది!’

నీ అడ్వైజ్ ప్రకారమే నడుచుకుంటా! నా లక్ష్యం నెరవేరాలి!

విమానాశ్రయానికి వచ్చాడు. పది నిమిషాలలో విమానం దిగింది. పరిశోధనలన్నీ ముగించుకుని అమల, సుదర్శనమూర్తి  బయటకు వచ్చారు!

వెంకటేష్ పరిగెత్తుకు రాగా, అది విమానాశ్రయం అనేది మర్చిపోయి, వెంకటేష్ ని కౌగలించుకుంది, అమల.

జోసఫ్ కి వొళ్ళు మండింది!

కొత్త డ్రైవర్ అని జోసఫ్ ని పరిచయం చేశాడు వెంకటేష్. ఇద్దరికీ వందనం తెలిపాడు జోసఫ్!

పెట్టెలను డిక్కీలో పెట్టి, అందరూ కారు ఎక్కగానే-- జోసఫ్ పురాణాన్నే చెబుతూ వచ్చాడు వెంకటేష్.

అమల ఆశ్చర్యపోయింది.

మనకి ఇలాంటి మానవత్వం, దయ, జాలి గుణం కలిగిన వాళ్ళే కావాలి!

పళ్ళు కొరుక్కున్నాడు జోసఫ్!

అది నీ భర్తకు కొంచం కూడా లేకపోవటంతోనే కదా, నా మేరీ ప్రాణాలు వదిలింది! అతనిపై పగ తీర్చుకోవటానికే కదా నేనొచ్చింది!

ఇల్లు వచ్చేసింది!

జోసఫ్ పెట్టెలు తీసుకు వచ్చి లోపల పెట్టాడు.

వెంకటేష్ యొక్క అక్కయ్య, బావ వీళ్ళను స్వాగింతించటానికి పరిగెత్తుకు రావటంతో -- జోసఫ్ గదిలో ఒక చివరగా నిలబడ్డాడు. 

నేను భోజనం చేసి అమలతో కాసేపు మాట్లాడేసి వస్తాను జోసఫ్! నువ్వు బయట ఉండు!

జోసఫ్ కారు దగ్గరకు వచ్చాడు!

సెక్యూరిటీ జోసఫ్ దగ్గరకు వచ్చాడు!

నువ్వు భోజనం చేశావా జోసఫ్?”

అయ్యిందన్నా!

పరవాలేదే! యజమానుల మనసులో పెద్ద చోటు పట్టావు! నిన్ను నాకూ బాగా నచ్చుతుంది!

థ్యాంక్స్ అన్నా!

జోసఫ్, మన యజమాని అక్కయ్య భర్త ఉన్నాడే, అతని దగ్గర మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి!

ఎందుకు?”

ఎవరినీ ఇక్కడ చొరవగా ఉండనివ్వరు

ఏదో ఒక నెపం వేసి తరుముతాడు! అతనితో పోట్లాట పెట్టుకోలేము! పెద్ద సిగ్గు చేటు ఏమిటో తెలుసా? మనం తీసుకునే జీతంలో పది శాతం అతనికి కమీషన్ గా ఇవ్వాలి!

అంత దరిద్రుడా?”

లేకపోతే, ఉద్యోగంలోనే ఉండలేము! నీ దగ్గరకూ వస్తాడు! చూడు!

అతను ఎందుకు వీళ్ళతో ఇక్కడే ఉంటున్నాడు?”

అతనికి ఒక్క పనీ లేదు! పెద్దాయన వీళ్ళను ఎందుకు ఇంట్లోనే పెట్టుకుంటున్నాడో ఎవరికీ తెలియదు. అల్లుడు మీద మర్యాద ఉండాల్సిందే. అందుకోసం ఆయన కుటుంబాన్నే భరించాలా?….సరేన్నా! మనం మాట్లాడుకునేది చూసి ఎవరూ సందేహ పడకూడదు!

జోసఫ్ అక్కడ్నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాడు.

ఎదురుగా మోహన్ రావ్!

జోసఫ్ నమస్తే చెప్పాడు.

సెక్యూరిటీతో ఏమిటి రహస్య ఆలొచన పెట్టావు. ఎవర్ని మోసం చేద్దామని ప్లాన్ వేస్తున్నావు? నా పిల్లాడ్ని పెట్టుకుని మోసం చేసి లోపలకు వచ్చావు.  అది నాకు తెలియదనుకున్నావా? విషయం అందరితో చెప్పకుండా నిన్ను వదలను!”  

జోసఫ్ నవ్వాడు.

ఎందుకు నవ్వుతున్నావు?”

జోసఫ్ అతని దగ్గరగా వచ్చాడు.

మా యజమాని ఇంటి అల్లుడు! ఇంటల్లుడుగా ఉండటం అవమానం...పోతేపోనీ! విషయం వదిలేద్దాం. ఆయన బావవు నువ్వు...పనీ పాటూ లేని సోమరివి. ఉచిత భోజనం చేసే వాడివి. కష్ట పడి పని చేస్తున్న మమ్మల్ని తరమటానికి నీకు యోగ్యత ఉందా?”

మోహన్ రావ్ బిగుసుకుపోయాడు. అతనికి కోపం నడి నెత్తికి ఎక్కింది!

రేయ్! మర్యాద లేకుండా నాతో ఎగతాలిగా మాట్లాడతావా? నా పవర్ ఏమిటో తెలుసా? ఎవర్ని చూసి ఉచిత భోజనం గాడివి అని చెప్పావు? ఇంకో పది నిమిషాలలో నిన్ను మెడ పుచ్చుకుని గెంటకపోతే...నా పేరు మోహన్ రావే కాదు?”

వణుకుతున్న గొంతుతో, ఆందోళనతో మోహన్ రావ్ లోపలకు వెళ్ళాడు.

సెక్యూరిటీ జోసఫ్ దగ్గరకు వచ్చాడు. అన్నీ విన్నాను! తొందరపడ్డావే జోసఫ్! ఇప్పుడే నీ ఉద్యోగం ఊడిపోతుంది అన్నాడు.

                                                                                         PART-4

వేగంగా లోపలకు వచ్చిన మోహన్ రావ్ సుందరీ! వెంటనే….బయలుదేరు! ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు అరిచాడు.

సుందరీ, వెంకటేష్, అమల, సుదర్శనమూర్తి పరిగెత్తుకు వచ్చారు.

ఏమైందండీ?”

కొత్తగా వచ్చిన డ్రైవర్ నన్ను మర్యాద లేకుండా మాట్లాడాడు...ఇష్టం వచ్చినట్టు కూసాడు

ఎందుకు? ఎందుకలా మాట్లాడాడు?”…అడిగింది సుందరి.

నేను ఇంట్లో ఒక పనికిమాలిన వేధవనట. పనిపాటా లేకుండా ఉచిత భోజనం తింటున్నానట. ఒక పనివాడు మాట్లాడాల్సిన మాటలా ఇవి?”

సుందరి, వెంకటేష్ దగ్గరకు వచ్చింది.

ఏమిట్రా తమ్ముడూ ఇది?”

అక్కా! అతను చాలా మంచివాడు. నీ పిల్లాడి ప్రాణం కాపాడిన వాడు. పనిలో నేను అతన్ని చేర్చుకోవడానికి అదే కారణం

అలాగైతే నేను చెప్పేది అబద్దమా?”-- అడిగాడు మోహన్ రావ్.

సుదర్శనమూర్తి, వెంకటేష్ దగ్గరకు వచ్చాడు.

అల్లుడూ ఎందుకు ఈ వివాదం? వాడ్ని పిలిచి అడగండి! సరైన జవాబు రాకపోతే వాడ్ని పనిలోంచి తీసేయండి!

వెంకటేష్ బయటకు వచ్చాడు.

జోసఫ్! ఇటురా!

జోసఫ్ బవ్యంగా వచ్చి నిలబడి నమస్తే చెప్పాడు.

నువ్వు సార్ దగ్గర అమర్యాదగా మాట్లాడావా?”

లేదండి!

అబద్దం చెబుతున్నాడు!”—అరిచాడు మోహన్ రావ్.

అయ్యగారూ! నేనెందుకు ఈయనతో గొడవ పెట్టుకుంటాను. ఒక పక్కగా నిలబడున్న నా దగ్గరకు ఆయనే వచ్చారు!

దేనికి?”

నువ్వు జీతం తీసుకున్న వెంటనే అందులో పది శాతం కమీషన్ నాకు ఇచ్చేయలని అడిగారు! నేను బెదిరిపోయి సెక్యూరిటీ దగ్గర ఏమిటిది?” అని అడిగాను. ఇదే ఇక్కడి అలవాటు. ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగంలో ఉండలేవు! మారు మాట్లాడకుండా ఇచ్చేయి అన్నాడు

అందరూ షాక్ అయ్యారు.

వెంకటేష్ కి కొంచం కొంచం విషయంపై అవగాహన ఉంది. సుందరికు కూడా భర్త యుక్క నీచమైన బుద్ది బాగా తెలుసు. జోసఫ్ అది అందరి ముందూ చెప్తాడని ఎవరూ ఊహించలేదు!

ఏమండీ! లోపలకి రండి!

...ఎందుకు?”

రండి అంటే రండి!

భర్తను లోపలకు లాకెళ్ళింది సుందరి.

సుందరీ! ఇతని దగ్గర నేను నిజంగా కమీషన్ అడగలేదు!

ఇలా చూడండి!  మీ నీచమైన గుణం నాకూ, నా తమ్ముడికీ తెలుసు. పెద్దాయన ముందు నా పరువే పోయింది! ఇక ఇంట్లో నేను ఎలా తలెత్తుకు తిరగగలను?” 

సుందరీ -- అదొచ్చి....?”

చాలు ఆపండి! పెట్టేది తినేసి ఒక మూల కూర్చోండి! లేకపోతే భర్త అని కూడా చూడకుండా తరిమి పారేస్తాను అర్ధమయ్యిందా?”

మోహన్ రావ్ మాట్లాడలేదు!

వెంకటేష్ బయటకు వచ్చాడు. తిన్నగా జోసఫ్ దగ్గరకు వెళ్ళాడు.

అయ్యగారూ! నేను ఉద్యోగం మానుకుంటానండి!

నిన్ను నేను ఉద్యోగంలోంచి తీశేశానా?”

లేదండి! బంధుత్వంలో పగుల్లు పడటానికి నేను కారణం కాకూడదు కదా?”

అలా ఎప్పుడూ జరగదు! మా బావ నీచమైన మనిషి అని నాకూ, నా అక్కయకీ, చూచాయగా మా మామగారికీ కూడా తెలుసు ఇది తెలుసు. శభలో నువ్వు మా బావ తోలు వొలిచిన ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. మనిషి ఇక నువ్వున్న వైపుకే రాడు. వెళ్ళి పనిచూడు!

జోసఫ్ చేతులు జోడించాడు.

లోపలకు వెళ్ళిన వెంకటేష్ నేరుగా సుదర్శనమూర్తి దగ్గరకు వెళ్ళాడు. మామయ్యా! సారీ! అన్నాడు.

ఎందుకు అల్లుడూ?”

నేను మీ ముందు తల వంచుకుని నిలబడున్నానే...అందుకు!

మీరు అలా మాట్లాడనే కూడదు! మీరు చేసిన త్యాగానికి ముందు మేమంతా ఎందుకూ పనికిరాము! మీ కొసం మేము దేనినైనా సహిస్తాం అల్లుడూ

దేనికైనా ఒక హద్దు ఉంటుందిగా మామయ్యా! మా బావకు ఉద్యోగం ఇప్పించారు! అక్కడ డబ్బులు కాజేశాడని ఉద్యోగంలో నుంచి తరిమేశారు! మీ పరువే పోయింది! ఇప్పుడు నా పరువు పోతోంది!

వదిలేయండి... మాటలను వదిలేయండి! కానీ డ్రైవర్ ధైర్యవంతుడుగానూ, నిజాయతీ పరుడుగానూ ఉన్నాడు! నాకు అతను నచ్చాడు! ఇలాంటి వ్యక్తులను మనం వదులుకోకూడదు!

అవును మామయ్యా!

సరే టిఫిన్ చేద్దాం రండి!

అమల, సుందరిని పిలవటానికి లోపలకు వచ్చింది!

వదినా...టిఫెన్ కు రండి

వద్దమ్మా! నాకు మనసే బాగుండలేదు!

వదినా! నేను గానీ, నాన్న గానీ ఒక్క మాటైనా అన్నామా? దాని గురించి ఆలొచించకండి! కుటుంబం అంటే అన్నీనూ! దీనికొసం మనసు పాడుచేసుకోవచ్చా? కడుపు మీద కోపం తెచ్చుకుంటే, ఆరొగ్యం పాడైపోతుంది! అన్నయ్య గారూ మీరూ రండి!

సిగ్గు అనేది లేకుండా మోహన్ రావ్ డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చున్నాడు. ఒక పట్టు పట్టాడు.

వెంకటేష్ కే అసహ్యం వేసింది!

మోహన్ రావ్ వక్కపొడి వేసుకుని బయటకు వచ్చాడు. కారు డోర్ తెరిచున్నది. సీటులో జోసఫ్ నిద్రపోతున్నాడు.

మోహన్ రావ్ శబ్ధం చేసాడు. జోసఫ్ లేచాడు. కానీ పట్టించుకోలేదు!

పొగరురా నీకు? నీ దగ్గర ఎప్పుడురా నేను కమీషన్ అడిగాను?”

సరే పోరా!

ఏమిటి...'రా' నా?”

నీకు మర్యాదే ఎక్కువ! నన్ను ఏమీ చేయలేవు! అతి త్వరలో నిన్ను ఇంటి నుంచే తరిమేస్తాను చూడు!

మోహన్ రావ్ ఆశ్చర్యపడ్డాడు.

చూడరా మోహన్ రావ్! నువ్వు చెప్పింది కరక్టే! పిల్లాడ్ని పెట్టుకుని నాటకం ఆడే నేను లోపలకు వచ్చాను.  నా నాటకం ఇంకా పూర్తి కాలేదు! నీలాంటి పనిపాటూ లేని వాళ్ళను తరిమితేనే నేను అనుకున్నది జరుగుతుంది!"

అరి వెధవా! పెద్ద నాటకంతోనే ఇంట్లోకి వచ్చావా?”

అవును! సుదర్శనమూర్తి గారి ఆస్తులను చేజిక్కుంచుకోవటం కోసమే వచ్చాను!

మోహన్ రావ్ కి తల తిరిగింది.

నిన్న పనిలో జేరిన డ్రైవర్ వలన ఇలా మాట్లాడటం కుదురుతుందా? ఇది నేను చెబితే...ఎవరూ నమ్మరే. నేను అలా చెప్పనే లేదు అని వీడు భయంలేకుండా ప్రామిస్ చేస్తాడే! ఇంట్లో నాకంటే వీడికే ఎక్కువ మర్యాద! నా పరిస్థితి ఇంత దిగజారిపోయిందే!

మోహన్ రావ్ కి ఏడుపు ముంచుకు వచ్చింది.

తలెత్తి కోపంగా జోసఫ్ ని చూసాడు.

ఏమిటి చూస్తున్నావు? పళ్ళు కొరకటం నా దగ్గర పెట్టుకోకు! నీ కళ్ళు పీకేస్తాను. పో!

మోహన్ రావ్ బెదిరిపోయి లోపలకు వెళ్ళాడు.

జోసఫ్ పగలబడి నవ్వాడు.

బయలుదేరి ఇంటికి వెళ్ళాడు జోసఫ్. గోపాల్ తో విషయాలన్నీ చెప్పాడు.

గోపాల్ ఆశ్చర్యపడ్డాడు.

పరవాలేదే? ఇంత తెలివిగా పనిచేసేవు! వెరిగుడ్!

జోసఫ్ లేచి నడిచాడు.

వెంకటేష్ ఆ ఇంటి అల్లుడు. ఇల్లరికపు అల్లుడు. అంతవరకు ఓకే. కానీ అల్లుడి అక్కయ్యనూ, ఆమె భర్తనూ సుదర్శన్ కుటుంబం భరిస్తోంది!  ఎందుకు? సరే విషయం మనకెందుకు.  వెంకటేష్ అక్కయ్యనూ, బావనూ తీసి బయట పడేస్తే, తరువాత ఘట్టానికి వెళ్ళోచ్చు!

జోసఫ్! తొందరపడకు! మోహన్ రావ్ సగం పిచ్చోడని తెలిసి, ఒక ఆట ఆడాశావు! కానీ, అక్కయ్య విషయంలో అది ఫలించదు! అక్కయ్యను నువ్వు కెలికినా, వెంకటేష్ వూరికే ఉండడు. నీ వేగాన్ని ఇక్కడ తగ్గించుకోవాలి?”

జోసఫ్ నవ్వాడు.

గోపాల్! ఒకే ఆటను అన్ని చోట్ల ఆడలేము! మార్చి ఆడాలని నాకు తెలుసు!” 

సరే! వీళ్ళను తరిమి నువ్వు ఏం సాధించ దలచుకున్నావు?”

కర్ణుడి యొక్క కవచ కుండలాలను తీసింది దేనికి? అతన్ని పడగొట్టటానికే కదా? ఇక్కడ వెంకటేష్ యొక్క పక్క బలాలను అన్నిటినీ తీసేసి, అతన్ని నిరాయుధుడిగా నిలబెట్టే కదా నేను నా కార్యాన్ని సాధించగలను?”  

చెయ్యి! కానీ, ఇక్కడ నీ లెక్క తప్పు!

ఎలా?”

వెంకటేష్ యొక్క బలం అతని అక్కయ్యో, బావో కాదు! మామగారు కోటీశ్వరడు సుదర్శనమూర్తి మరియు అతని కూతురు అమల. వీళ్ళిద్దరే వెంకటేష్ కి కవచాలుగా ఉంటారు!

జోసఫ్ మాట్లాడలేదు.

కంచె దాటి నువ్వు సులభంగా లోపలకు వెళ్ళలేవు జోసఫ్! నీ ఉద్దేశం వాళ్ళకు ఆవగింజంత తెలిసినా నీకు ప్రమాదం వస్తుంది!

అవును గోపాల్!

నిదానంగా ప్రవర్తించు! ఒకే ఒక ప్రశ్న! మేరీను మోసం చేసి, కోటీశ్వరురాలి మెడలో వెంకటేష్ తాలి కట్టాడు. సరే! కానీ, ఏమీలేని వెంకటేష్ ని కోటీశ్వరుడైన సుదర్శనమూర్తి ఎలా అల్లుడిగా ఒప్పుకున్నాడు? ఆయన అంతస్తుకు సరితూగే ఒక పెళ్ళి కొడుకు దరకడా? మళ్ళీ అతనితో  పాటూ అతని అక్కయ్యనూ, బావనూ కూడా ఉంచుకున్నాడు. ఇందులో ఏదో ఒక రహస్యం దాగుంది. అదేమిటో తెలుసుకుంటే నీ పని ఇంకా సులువుగా ముగిసిపోతుంది

జోసఫ్ గబుక్కున వెనక్కి తిరిగాడు.

గోపాల్! ఇది చాలా మంచి ప్రశ్న! ప్రశ్నకు మాత్రం సమాధానం తెలుసుకుంటే, నా పని సులభం అవుతుంది!

జోసఫ్! ఇలా చూడు...

చెప్పు గోపాల్!

నేను చెబుతున్నానని కోపగించుకోకు! చనిపోయిన మేరీ ఇక తిరిగి రాదు కదా? దానికోసం పగ తీర్చుకుని, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావా?”

జోసఫ్ ముఖం కోపంతో ఎర్ర బడింది!

గోపాల్! మేరీ నా ప్రాణం అని నీకు తెలుసు! నేను జీవించిందే ఆమె కోసమే! ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేటట్టు చేశాడు వెంకటేష్! నేను కళ్ళు మూసుకుంటే చాలు నా మేరీ నా కళ్ల ముందుకొచ్చి నన్ను వేధిస్తోంది.  ఆ ద్రోహి వెంకటేష్ లెక్కను పూర్తి చేయటమే నేను మేరీకి ఇచ్చే కానుక! నా నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదు!”  

గోపాల్ మౌనం వహించాడు.

                                                                                        PART-5

ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళూ వెంకటేష్ బంగళా వాకిటికి వచ్చారు!

ఎవరండీ మీరు?” అడిగాడు సెక్యూరిటీ.

మోహన్ రావ్ అనే ఆయన ఇంట్లోనే కదా ఉన్నారు?”

అవును!

మా నలుగురి దగ్గర చీటీ పెడుతున్నానని చెప్పి గడిచిన ఒక సంవత్సరం నుండి దగ్గర దగ్గర లక్ష రూపాయలు