ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల)

 

                                                                     ప్రేమ వ్యవహారం!                                                                                                                                                        (పూర్తి నవల)

పెద్ద నగరాలలో పీ.జీ అని చెప్పబడే డబ్బులిచ్చి స్టే చేసే హాస్టల్స్ ఎక్కువ. ముఖ్యంగా మహిళలకు!

అక్కడ అన్ని వసతులూ ఉంటాయి. టెలివిషన్లు, ఇంటర్ నెట్, బ్రహ్మాండమైన భోజనం అంటూ దగ్గర దగ్గర స్టార్ హోటల్ విడిదిలాగానే. బాగా సంపాదిస్తారు కాబట్టి కొందరు నిర్లక్ష్యంగా నడుచుకుంటారు. ఇంకొందరు అక్కడ కూడా తమ స్వయం మర్యాదను వదిలిపెట్టకుండా ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పోటీ, ఈర్ష్య, సన్నిహిత స్నేహం అని అన్నీ ఉంటాయి. మన జీవితంలో ఒక క్రాస్ కట్ రూపంలాగా ఉంటుంది.

అలాంటి నవీన వసతులతో కూడిన ఒక హాస్టల్లో మాధవి అనే ఒకమ్మాయి కొత్తగా చేరుతుంది. చేరిన రోజు సాయంత్రమే మాధవి హాస్టల్ కు  కొంత దూరంలో  విశ్వం అనే యువకుడితో చాలా సన్నిహితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఆమె రూమ్ మేట్ రేఖా. ఎందుకంటే అతను ఒక మోసగాడు. ఇదివరకే  రేఖా స్నేహితురాలు మథులతను ప్రేమించి మొసం చేసుంటాడు. ఈ విషయం మాధవికి చెప్పి ఆమెను అలెర్ట్ చేద్దామనుకుని మాధవికి విశ్వం గురించి చెప్పాలనుకుంటుంది. కానీ, మాధవి చెప్ప నివ్వదు. కానీ రేఖా ఎలాగైనా విశ్వం గురించి చెప్పి తన రూమ్ మేట్ ను అతని మాయలోనుండి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ రేఖ ప్రయత్నాలు వృధా అవుతాయి.

రేఖా చేసిన ప్రయత్నాలు ఏమిటి? అవెందుకు విజయం కాలేదు? మాధవి, విశ్వం ప్రేమ వ్యవహారం ఎటు పయనించింది? చివరికి ఏం జరిగింది?...మాధవి, విశ్వం దగ్గర నుండి తప్పించుకుందా, లేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఊహించలేని కథా అంశంతో మిమ్మల్ని అలరించే ఈ నవల చదవండి.

*************************************************************************************************

ఎంతైంది?” -- ఆటోలో నుండి దిగిన గిరిధర్ అడిగాడు.

మీటరు నూట ఎనభై రూపాయలు చూపిస్తోంది సార్. దానికిపైన ఇంకో ఇరవై ఇచ్చి పుణ్యం కట్టుకోండి సార్!

నూట ఎనభయ్యే ఎక్కువ. దానికిపైన ఇంకో ఇరవై అడుగుతున్నావా?” అంటూ కరెక్టుగా లెక్కపెట్టి చిల్లరగా ఇచ్చాడు.

అన్నయ్యా, ఇక్కడ కూడా గొడవేనా?”

విసుక్కుంది అతని చెల్లెలు మాధవి.

ఎవరి దగ్గరా మోసపోకూడదమ్మా...

సరి, సరి...త్వరగా డబ్బులిచ్చేసి రా!

అయిందమ్మా--అంటూ తిరిగాడు.

సూట్ కేసు తీసుకుంటూ ఎన్నో మేడకు వెళ్ళాలి?” అని అడిగాడు.

మొదట రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత డబ్బులు కట్టాలి! అంటూ ఇంకో సంచీ తీసుకుంది మాధవి.

ఇద్దరూ లోపలకు వెళ్ళారు.

ఆఫీసు గదిలో ఒక మధ్య వయస్కురాలు కూర్చోనుంది. పేపర్ చదువుతోంది. వీళ్ళను చూసిన వెంటనే పేపర్ను పక్కన పెట్టి, లేచి నిలబడి ఎవరు మీరు...మీకు ఏం కావాలి?” అని సాగదీసింది.

నమస్తే నండి...నా పేరు మాధవి!

గబుక్కున ఆమె మొహం విప్పారింది. అరెరే...రామ్మా అన్నది.

సూట్ కేసు, సంచీ పక్కగా పెట్టు అని చెప్పినావిడ గిరిధర్ ను చూసి ఈయన ఎవరు...మీ అన్నయ్యా?” అని అడిగింది.

అవునండి...మా అన్నాయ్యే!

సరే కూర్చోమ్మా...మీరూ కూర్చోండి సార్

ఇద్దరూ కుర్చీలలో కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తిరగేస్తూ ఆ అమ్మాయి నీ రూము 203” అన్నది.

చాలా థ్యాంక్స్ అండీ...దాని తాళం చెవులు...?”

అదంతా అవసరం లేదమ్మా! అన్ని గదులూ ఎప్పుడూ తెరిచే ఉంటాయి

గిరిధర్ ఆశ్చర్యపోతూ ఏమిటండీ అలా చెబుతున్నారు?” అన్నాడు.

....................”

తాళమూ - తాళం చెవి ఏదీ లేదా?”

అవన్నీ ఉన్నాయండి. కానీ, వాటి అవసరం ఉండదని చెబుతున్నా అని నవ్విన ఆవిడ ఇక్కడ బద్రత చాలా పక్కాగా ఉంటుంది. గదిలో ఉన్న అమ్మాయలు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు గదికి తాళం వేసే అవసరం ఉండదు”---అన్నది.

అటూ, ఇటూ ఉన్నదంతా మంచి చోటే కదా?” అతను అడిగినప్పుడు,

మీరే వెళ్ళి ఒక సారి చూసి రండి. చుట్టు పక్కలంతా చాలా డీసెంట్ ఫ్యామిలీలు ఉన్న చోటు. అందువలనే ఈ చోటును సెలెక్ట్ చేసి హాస్టల్ మొదలు పెట్టాము. ఇన్ని సంవత్సరాలలో ఒక్క సమస్య కూడా రాలేదు అంటూ రసీదు పుస్తకం ఒకటి అతని ముందుకు జాపింది. డబ్బు తీసుకుంది. మళ్ళీ మొదలుపెట్టింది.

మిగితా చిల్లర కరెక్టుగా ఉందేమో లెక్కపెట్టుకోండి అన్న ఆమె మాధవిని చూసి నువ్వెక్కడ పనిచేస్తున్నానని చెప్పావు?”

ప్రసిద్ద కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపనీ పేరు చెప్పింది.

అక్కడ పనిచేసే చాలా మంది లోపల స్టేచేస్తున్నారు. ఆఫీసు బస్సులోనే కదా వెడతావు?”

అవును!

రోజూ వాళ్ళతోనే నువ్వూ బయలుదేరి వెళ్ళొచ్చుఅంటూ గిరిధర్ సంతకంపెట్టిన రసీదు పుస్తకం తీసుకుని, హాస్టల్ రూల్స్ వివరించింది.

ప్రొద్దున ఆరున్నర నుండి టిఫిన్ దొరుకుతుంది. టిఫిన్ చేసేసి కాఫీతాగి, బస్సు పట్టుకోవటానికి నీకు టైము సరిగ్గా సరిపోతుంది అన్నది మాధవితో.

థ్యాంక్స్ అండీ అంటూ సూట్ కేసు తీసుకుని నా రూమ్ మేట్ సహోదరి ఎవరు...అని అడిగింది.

రేఖా అని పేరు. ఆమె కూడా నీలాగానే కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తోంది. చాలా మంచి పిల్ల. నీకు ఖచ్చితంగా ఆమె నచ్చుతుంది

గిరిధర్ లేచి నిలబడి జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు సంప్రదాయంగా.

మీకు ఎటువంటి భయం వద్దు సార్. మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అవును మీరు ఎక్కడుంటారు?”

పక్కనే... అన్నతను, తన ఊరు పేరు చెబుతూ అయితే, దీన్ని ఆ రూములో ఉంచేసి బయలుదేరతాను అని చెప్పి బయలుదేరటానికి లేచాడు.

క్షమించాలి...ఏ కారణానికైనా సరే మగవాళ్ళను లోపలకు అనుమతించం

“.......................”

సూట్ కేసులను నేను పైకి పంపిస్తాను. మీరు మీ చెల్లెలుతో చెప్పి బయలుదేరండి

ఆమె దగ్గర థ్యాంక్స్ చెప్పి, చెల్లి వైపు చూసి అడిగాడు ఇంకేదైనా కావాలా మాధవీ?”

వదన్నయ్యా! నువ్వు బయలుదేరు. ఇప్పుడే బయలుదేరితేనే టైముకు ఇంటికి చేరుకోగలవు. నేను జాగ్రత్తగా ఉంటాను. భయపడొద్దని అమ్మకీ-నాన్నకీ చెప్పు

అది విని, రెసెప్షన్లో ఉన్న ఆమె మాధవిని పిలిచింది.

హాస్టల్లో స్టేచేయటం ఇదే మొదటి సారా?”

లేదండీ...చదువుకునేటప్పుడు స్టేచేశాను. అయినా కానీ కన్నవాళ్ళకు ఎప్పుడూ భయమే. ధైర్యం చెబుతేనే వాళ్ళు కొంచం ప్రశాంతంగా ఉంటారు

అర్ధమవుతోంది...నువ్వు నీ గదికి వెళ్ళు. సూట్ కేసులు -- పరుపు అన్నీ తరువాత పంపుతాను

పాత హాస్టల్ కంటే ఇది కొంచం ఆధునికంగా ఉంది. చూడటానికి కూడా బాగుంది కదా...! గిరిధర్ చెప్పాడు.

ఏది ఆధునికమని చెబుతున్నావో అర్ధమైయ్యింది. సైటు కొట్టకుండా త్వరగా బయలుదేరు. ఉరికి వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యి అన్నది నవ్వుతూ.

అన్నయ్య వెళ్ళిన తరువాత, మెట్లెక్కి రెండో అంతస్తుకు వచ్చింది. తనకు అలాట్ చేసిన రూము దగ్గరకు వచ్చింది. రూము తలుపులు మూసినట్టు దగ్గరకు వేసున్నాయి. మెల్లగా తలుపు మీద కొట్టింది.

ఎవరూ?” అనే స్వరం వినబడింది.

నేను కొత్తగా వచ్చాను

తలుపు తెరిచే ఉంది. రండి ........

లోపలకు వెళ్ళింది. నమస్తే...నా పేరు మాధవి. నాకు ఈ రూము అలాట్ చేశారు

అలాగా...సంతోషం. రండి...రండి... అని నవ్వుతూ స్వాగతించి, “నా పేరు రేఖా. ఇప్పటి నుండి మీ రూమ్ మేట్ను!"

నన్నూ రండి...పొండి అనక్కర్లేదు. మామూలుగా రా...పో...అని పిలవండి. నేనూ మీ వయసు దానినే 

నాకూ చెప్పి మీరు అండీఅనొచ్చా?” అంటూ రేఖా నవ్వింది. మాధవి నాలిక కొరుక్కుంది.

సరి, సరి...మిమ్మల్ని కలుసుకోవటంలో నాకు చాలా సంతోషం అంటూ చెయ్యి జాపింది. ఆమె అది పుచ్చుకుని షేక్ హ్యాండ్ ఇచ్చింది.

పరిచయ కార్యక్రమం ముగిసిన తరువాత మెల్లగా రూమంతా ఒకసారి చూసింది. రెండు వైపులా మంచాలు. వాటికి పైన అలమరాలు. మనిషంత ఎత్తుకు ఒక అద్దం. ఒక ఫ్యానూ, ఇంకో పక్క కిటికీ, గోడమీద ప్రశిద్ద నటుడు మొహమంతా నవ్వుతోనూ, కళ్ళంతా ప్రేమతోనూ ఒక నటిని కౌగలించుకో నున్నాడు.

నిలబడే చూడాలా? కూర్చోండి అంటూ కుర్చీని లాగి ఆమె దగ్గర వేసింది రేఖా.

అప్పుడు మాధవి యొక్క సూట్ కేసు, పరుపు తీసుకు వచ్చి వేశాడు సెక్యూరిటీ గార్డు ఒకతను.

అదే మీ అలమరా...మీ వస్తువులను దాంట్లో పెట్టుకోండి. పెట్టటానికి నేను హెల్ప్ చేయనా?”

వద్దు...నేను తరువాత చూసుకుంటాను. థ్యాంక్స్ అన్నది మాధవి.

మంచం చివరన కూర్చుంటూ రేఖాను చూసింది.

మంచి ఎత్తు, చామన ఛాయ రంగు. వసపరచుకునే అందం. కాటన్ చుఢీదార్, మెడలో సన్నటి గొలుసు ఒకటి. దానికి మ్యాచింగుగా చెవులకు పోగులు. పెదాల మీద ఎప్పుడూ నవ్వు అద్దెకు ఉన్నట్టు అనిపిస్తోందీ

అదే సమయం రేఖా కూడా మాధవిని జాగ్రత్తగా గమనించింది.

తెలుపు రంగు దేహం. దానికి మ్యాచింగ్ చొక్కా- జీన్స్ ప్యాంటు. స్నేహాన్ని కోరే కళ్ళు. బుస బుస మని ఊరిన బుగ్గలు.  బాగా...కుందేలు బొమ్మలాగా అందంగా ఉందీ అని తనలో తానే అనుకుంది.

కొంచం సేపు తరువాత రేఖా బయలుదేరింది.    

ఈ రోజు నాకు డ్రాయింగ్క్లాసు ఉంది. ఏడింటి తరువాతే వస్తాను అని చెప్పింది.

అరే...మీరు ఆర్టిస్టా?”

లేదు...ఇప్పుడే నేర్చుకుంటున్నాను. టైమైంది...మిగిలినవి తిరిగి వచ్చిన తరువాతమాట్లాడు కుందాం -- గబగబ మంటూ నడిచింది.

                                                                          ****************************

డ్రాయింగ్ క్లాసు నుండి రేఖా తిరిగి వచ్చినప్పుడు, బీరువాలో బట్టలు అందంగా సర్ది పెట్టబడున్నాయి. అందానికి మెరిగులు దిద్దే వస్తువులు కొన్ని కొత్తగా వచ్చినై. కానీ మాధవి కనిపించ లేదు!

పక్క రూములో విచారించింది.

కుందేలు బొమ్మను చూశారటే?”

ఎవరే అది?”

అదేనే నా రూముకు కొత్తగా వచ్చిన చిన్న అమ్మాయేనే?"

తెలిసినట్టు కన్ను కొట్టి నవ్వింది ఆమె.

కుందేలు బొమ్మ, చిన్న పిల్ల అని నువ్వు అనుకుంటున్నావు...కానీ అది అక్కడ రోడ్డు మీద ముమ్మరంగా మాట్లాడుతోంది.

అరే... అంటూ ఆశ్చర్యపోయింది రేఖా.

హాస్టల్లో చదివే పిల్లలు కొందరు సాయంత్రం సమయంలో ప్రేమికుడితో తిరగటం, రోడ్డు మీద నిలబడి బాతాకానీ కొట్టటం సహజమే!

కానీ, వచ్చిన మొదటి రోజే ఆమెకు ప్రేమికుడా? ఎలా సాధ్యం? అందులోనూ అమాయకపు మొహంతో నిలబడ్డ ఆ మాధవీ నా?”

ఆమేనే...అనుమానంగా ఉంటే నువ్వే వచ్చి చూడు అంటూ రేఖాని మేడ మీదకు తీసుకు వెళ్ళి రోడ్డు వైపు చూపించింది.

ఇప్పుడంతా అమ్మాయలు ఊర్ల నుండి వచ్చేటప్పుడే జోడీగానే వస్తున్నారు. ఈ అమ్మాయి రెండు సంవత్సరాలుగా ఇదే ఊర్లో ఇంకో హాస్టల్లో ఉండేదట. అక్కడున్నప్పుడు ఏర్పడిన ప్రేమే అనుకుంటా ఇది

వదిలేయ్...ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు.

మరి...నేనేమన్నా పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కొట్టుకుపోతానా ఏమిటి?” --- అని చెప్పేసి ఆమె వెళ్ళిపోవటంతో, రేఖా ఆదుర్దాతో వాళ్లను చూసింది...కుందేలు బొమ్మ యొక్క ప్రేమికుడ్ని కళ్ళతోనే ఫోటో తీయాలనే ఆశతో!

రోడ్డు చివర, చీకట్లో వాళ్ళు సరిగ్గా కనిపించలేదు.

కానీ, అతను...ఆమె భుజం మీద చేయి వేసుండటం కనబడింది. మాట్లాడుతూనే అతను కాంతి వైపు తిరిగాడు. రోడ్డు లైటు వెలుతురులో అతని మొహం కనబడింది...అదిరిపడ్డది రేఖా.

అరే...ఇతనా?’

మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా చూసింది. అతని మొహం అప్పుడు బాగా కనబడింది.

సందేహమే లేదు...అదే చీటింగ్ ఫెలోనే! కుందేలు బొమ్మ మాధవీ...ప్రేమించటానికి నీకు వేరే మగాడే దొరకలేదా?’ పెద్దగా నిట్టూర్పు విడిచింది.

***********************************************PART-2******************************************

రేఖా రాత్రి భోజనం తినేసి వచ్చిన తరువాత కూడా, మాధవి ఇంకా రూముకు రాలేదు.

మళ్ళీ బయటకు వచ్చి తొంగి చూసింది. ఇద్దరూ అదే ఫోజులో నిలబడి  మాట్లాడుకుంటున్నారు. చీకటి వాళ్ళిద్దరి మధ్యా దూరాన్ని తగ్గించినట్లు అనిపిస్తోంది.

రేఖాకి కళ్ళు మూసుకు పోతున్నాయి. కానీ నిద్రపోవటానికి ఇష్టం లేదు! ఎలాగైనా మాధవి తో మాట్లాడాలి. ఆమెను హెచ్చరించాలి -- మనసు అలలలాగా కొడుతోంది.....

సెల్ ఫోన్ తీసుకుని ఏదో గేమ్ ఆడటం మొదలు పెట్టింది రేఖా. మెల్లగా అందులో ఆమె మనసు ఇరుక్కుపోయింది.

కొంచం సేపు తరువాత అనుకోకుండా టైమ్ చూసింది...పదింపావు!

ఇంతసేపా మాట్లాడతారు? ఈ అమ్మాయికి ఆకలే వేయదా?’ అనుకున్నప్పుడు రేఖాకు నవ్వు వచ్చింది. తిండి-నిద్రా ప్రేమికులకు ఎందుకుంటుంది?’

పదిన్నర తరువాత తలుపు కొడుతున్న చప్పుడు.

తెరిచే ఉంది...రండి అన్నది.

క్షమించాలి అంటూ లోపలకు వచ్చింది మాధవి.

..................”

నిద్రపోతున్నారా? ట్రబుల్ చేసేనా?”

అదంతా ఏమీ లేదు. ఇక మీదటే నిద్ర!

అందుకే అడిషనల్ గా నాకూ ఒక తాళం చెవి అడిగాను. కానీ, తాళం--తాళం చెవి అని ఎక్స్ ట్రా ఏమీ ఉండదు అని చెప్పేసారు. ఒకవేల నేను ఇంకా ఆలశ్యంగా వస్తే...తలుపులు ఇలాగే తెరుచుకుని నిద్రపొండి

పరవాలేదండీ...దీంట్లో ఏముంది?” -- అంటూ సెల్ ఫోన్ ను కిందపెట్టింది రేఖా.

సరే...డిన్నర్ చేసారా?”

లేదు...భొజనం అయిపోయింది అని చెప్పారు

అయితే ఏం చెయ్యబోతారు?”

అంతగా ఆకలి లేదు. ప్రొద్దున చూసుకుంటాను. అంటూ నైట్ డ్రస్సుకు మారి, పరుపు మీద కూర్చుంది.

కొంచం సంసయిస్తూ ఒక విషయం అడిగితే తప్పుగా అర్ధం చేసుకోరుగా?” అన్నది.

లేదు...చెప్పండి

రోడ్డు మీద నిలబడి మీరు ఎవరితోనో మాట్లాడుతూండటం చూశాను. అతని పేరు విశ్వం కదా?”

అరె...మీకెలా తెలుసు?” మాధవి ఆశ్చర్యంగా చూసింది.

నేరుగా పరిచయం లేదు. కానీ చూసున్నాను. పేరు తెలుసు

నాకు ఆరు నెలలగానే స్నేహం. చాలా మంచి టైపు అంటూ దుప్పటిలోకి దూరి లైటు ఆర్పేయనా?” అన్నది.

మాధవీ. నేను చెప్పాలనుకునే విషయం ఇంకా చెప్పలేదు!

సరే...చెప్పండి

అతను నీకు ఎలా పరిచియం?”

“....................”

బాగా సన్నిహితమైన స్నేహమైతే...నేను నీకొక ముఖ్య విషయం చెప్పాలి

మాధవి గబుక్కున రేఖా వైపు తిరిగి అతనికీ, నాకూ ఏ విధమైన స్నేహమనేది నా పర్సనల్ విషయం. మీరు దాంట్లో తల దూర్చకండి అన్నది కోపంగా.

దయచేసి నేను చెప్పేదేమిటో విని ఆ తరువాత ఆలోచించండి

మీరేదీ చెప్పక్కర్లేదు. వచ్చిన మొదటి రోజే నా పర్సనల్ విషయంలో తల దూర్చే పని పెట్టుకోకండి. మీ పని చూసుకోండి అంటూ లైటు ఆఫ్ చేసింది.

                                                                                               *************

మరుసటి రోజు రేఖా లేచినప్పుడు, మాధవి మంచం ఖాలీగా ఉన్నది. స్నానాల గదిలో లేదు. డైనింగ్ హాలులో కూడా లేదు.

ఆమె త్వరగా స్నానం చేసేసి, ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోయిందా?’ అని తనలో అనుకుంది రేఖా. హాస్టల్ ఆఫీసులో కనుక్కుందామని ఆ గదికి వెళ్ళింది.

మాధవి అక్కడ కూర్చో నుంది. రేఖాను చూసిన వెంటనే ఆమె మొహంలో చిటపటలు.

గుడ్ మార్నింగ్ మాధవీ అని రేఖా చెప్పినా, మాధవి దగ్గర నుండి సమాధానం లేదు.

హాస్టల్ వార్డన్ మాత్రం నవ్వుతూ అడిగింది. మీ ఇద్దరికీ ఏమిటమ్మా గొడవ? వచ్చిన మొదటి రోజే ఈ అమ్మాయి వేరే రూము కావాలి అని అడుగుతోంది

ఏమీ లేదండీ! ఇక మీదట ఎటువంటి గొడవ రాకుండా నేను చూసుకుంటాను అన్నది రేఖా.

అదేమీ వద్దండి. నాకు వేరే రూము ఇవ్వండి

మాధవీ, ఇప్పుడు వేరే రూము ఏదీ ఖాలీగా లేదే!

అయితే వేరే ఎవరినైనా నా రూముకు మార్చి, నాకు ఆ రూము ఇవ్వండి.

అది నేను చెయ్యలేనమ్మా వాళ్ళుగా ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు మిగిలిన వారి దగ్గర అడిగి చూడు! లేకపోతే కొన్ని రోజుల తరువాత ఏదైనా రూము ఖాలీ అయితే మార్చి ఇస్తాను

సరే నండి అంటూ లేచింది. రేఖాతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మాధవి వెళ్ళిన తరువాత వార్డన్ రేఖా దగ్గర అడిగింది: 

ఏమైయ్యింది?”

పెద్దగా ఏమీ జరగలేదు. నేను యదార్ధంగా ఏదో అడగబోయి...దానికి ఆమె కోపగించుకుంది. నేను మాట్లాడి చూస్తాను.  క్షమించాలి...నా వల్ల మీకు శ్రమ

పరవాలేదు రేఖా. ఎక్కువగా బలవంతం చేయకు -- ఓడిపోయినట్టు మాట్లాడకు. ఇష్టం లేకపోతే ఇంకో రూముకు మార్చుకోనీ

హడావిడిగా బయటకు వచ్చిన రేఖా, డైనింగ్ హాలులో మాధవిని వెతికి పట్టుకుని ఆమె ముందు కూర్చుంది.

మాధవీ, దయచేసి కోపగించుకోకండి. నేను అడిగింది మర్చిపొండి. ఏదో మీమీదున్న చిన్న శ్రద్దతో మీకు కోపం వచ్చేటట్టు మాట్లాడాను

అవన్నీ ఇప్పుడెందుకు? నన్ను ప్రశాంతంగా డిన్నర్ తిననివ్వండి అని అరిచింది.

డైనింగ్ హాలులో తింటున్న వాళ్ళందరూ ఆ అరుపుకు ఒక్కసారిగా వీళ్ళ వైపుకు తిరిగి చూశారు.

రేఖా మౌనంగా బయటకు వెళ్ళిపోయింది. మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు వెనుక ఒక స్వరం వినబడింది.

రేఖా...కొంచం ఆగు!

పిలిచింది కుసుమ.  కుసుమ సొంత ఊరు రాజమండ్రి. గవర్నమెంట్ పరీక్షలకు తయారు చేసుకుంటోంది. రేఖా రూముకు పక్క రూములో ఉంటోంది.  

ఏమైందే...కుందేలు బొమ్మ ఎందుకు అంత కోపంగా ఉంది

నిన్న దాని ప్రేమికుడ్ని చూసాము కదా?”

అవును...దానికేమిటి?”

అతని గురించి కొంచం విచారణ చేసేను. కోపం వచ్చేసింది!

సరిపోయింది...దానికే ఇంత రాద్దాంతమా?”

అవును...

నీకు తెలియదా రేఖా? ఇలాంటి ప్రేమ వ్యవహారాలన్నీ వాళ్ళ వాళ్ళ సొంత విషయాలు. దాన్ని వేడుకగా చూడొచ్చు. ప్రశ్నలు అడగ కూడదు! నిజం చెప్పాలంటే... అతను ఆమె ప్రేమికుడా...కాదా అనేదే మనకు తెలియదు!

అదేనే అడిగాను!

అదే అడుగుతున్నా. నీకెందుకు ఇలాంటి అక్కర్లేని పనులు! అతను ఆమె ప్రేమికుడే అయితే కూడా మనకేమిటి?”

కారణం ఉందే. చాలా పెద్ద కారణం. ఒక వేల ఆ విశ్వం ని ఆమె ప్రేమిస్తున్నదంటే, ఎలాగైనా ఆమెను హెచ్చరిక చేయాలి. లేకపోతే పెద్ద సమస్యలో చిక్కు కుంటుంది.  మనకెందుకులే అని నేను వూరుకోలేను. ఎందుకంటే మొదట మాధవి మనలాంటి ఒక అమ్మాయి. రెండు, అనుకోకుండా నా రూమ్ మేట్. హెచ్చరిక చేయకుండా ఎలా ఉండను. హెచ్చరిక చేయకపోతే నా జీవితాంతం నేను నేరం చేసిన దానిలాగా కృంగిపోతానే

ఏమిటే చెబుతున్నావు? నీకు ఆ మనిషిని తెలుసా?”

బాగా తెలుసు. ఇప్పుడు కాదు. నాలుగు సంవత్సరాల ముందే. నేను జే.కే నగర్ హాస్టల్లో ఉన్నప్పుడే తెలుసు. ఇతను ఇంకో అమ్మాయితో సన్నిహితంగా ఉండటం చూశాను” …..652

                                                                    *****************************************

 “నేను హైదరాబాద్ కు వచ్చిన కొత్తల్లో. జే.కే. నగర్లో ఒక హాస్టల్లో ఉన్నాను. అక్కడ ఇప్పుడు మనకున్న వసతులన్నీ లేవు. ఏడెనిమిది గదులు మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోనూ ముగ్గురు లేక నలుగురు స్టేచేసేవాళ్లం.

“.....................”

అక్కడ మథులత అనే ఒకమ్మాయి స్నేహితురాలైయ్యింది. ఇంకొక రూములో ఉండేది. మేము స్నేహం చేయడం మొదలు పెట్టిన కొన్ని రోజులకే ఆమె నా రూముకు షిఫ్ట్ అయిపోయింది.

ఆమెకు సొంత ఊరు విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు. ఇక్కడొక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఒక మోస్తరు జీతమే. ఇంగ్లీష్ మాట్లాడటం బాగా నేర్చుకుంది. జీతం పెరుగుతుందని ఆమె నమ్మకం. అందువలన నాతోటి ఎప్పుడూ ఇంగ్లీష్ లోనే మాట్లాడేది!

ఆ తరువాత ఆమెకు ఇంకొక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం రెండు రెట్లు ఎక్కువ. అంతవరకు శాంతంగా ఉండే మథులత...తరువాత ఆడంబరంగా ఉండటం మొదలుపెట్టింది.

నా దగ్గర బాగానే మాట్లాడుతుంది. కానీ, మిగతా వారితో మాట్లాడేటప్పుడు కొంచం పొగరుగా మాట్లాడేది. వద్దేఅని చెబితే ఇలా లేకపోతే మొసం చేస్తారు అంటూ నవ్వేది. అలాంటి మథులతని ఒకడు మోసం చేశాడు. అతనే ఈ విశ్వం!

అలాగా?”

వాళ్ళు ఎంత స్నేహంగా ఉండేవారో నాకు తెలియదు. కానీ, మాటి మాటికీ ఈమెను చూడటానికి హాస్టలుకు రావడం మొదలుపెట్టాడు. ఇద్దరూ రోడ్డు చివర నిలబడి గంటల కొద్ది మాట్లాడుకుంటూ ఉండేవారు. మేము హాస్టల్ నుండి చూసి గేలి చేసేవాళ్ళం.

ప్రేమించడం అనేది ఒకరి అంతర్గత విషయమని అప్పుడు నాకు అనిపించలేదు. ఒక వేల మాకు ప్రేమికుడు లేడే నన్న ఈర్ష్య అని తెలియదు.  పట్టణంలో మిఠాయి దుకాణంలోకి దూరిన గ్రామం వాళ్ళ లాగా వేడుక చూసే వాళ్లం. ఆమె తిరిగి వచ్చిన తరువాత ఏం మాట్లాడుకున్నారు? ఎక్కడ ముట్టుకున్నాడు...ముద్దు పెట్టాడా?’ --- అని అడుగుతూ గొడవ చేస్తాము.

ఓసి పాపాత్ముల్లారా...!"

మథులతకి అతనంటే పిచ్చి ప్రేమ. మేము గేలి చేసేది పెద్ద విషయంగానే తీసుకోదు. ఎంత ఎగతాలి చేసినా, వారానికి నాలుగు రోజులైనా బయట తిరుగుతారు. త్వరగా పెళ్ళిచేసుకోబోతామని చెబుతూ  ఉండేది.

హూ...తరువాత?”

కానీ, హఠాత్తుగా ఒక రోజు, నేను ఆఫీసులో ఉన్నప్పుడు...నాకు ఒక ఫోన్ వచ్చింది. మథులతని హాస్పిటల్లో చేర్చారని. ఎందుకో...ఏమిటో అనుకుంటూ వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాను.

ఆమె ఎక్కువ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. కారణం ఏమిటో ఎవరికీ తెలియదు!

అయ్యయ్యో...!

మంచికాలం. డాక్టర్లు మథులతని కాపాడారు. కానీ, ఆ తరువాత ఎప్పుడూ చూడూ ఏడుస్తూనే ఉండేది. ఆ విశ్వం ఆమెను చూడటానికే రాలేదు!

అయ్యో పాపం...

జరిగింది పెట్టుకుని ఊహించి నేను కొంచం గట్టిగా విచారించాను. నిజం ఓప్పుకుంది!

ఏ...ఏమిటా నిజం?”

వాడికి ఆడపిల్లల వీక్ నెస్. ఆడవాళ్ళ దాహం. నీచుడు. వాడి దగ్గర మథులత బాగా మోసపోయింది. వాడి ప్రేమకు మోసపోయి తననే అతనికి అర్పించుకుంది. అదే ఆమెకు జీవితం మీద విసుగు తెప్పించింది....ఆత్మహత్యకు ప్రయత్నించింది.

అరెరే...

ఆ తరువాత ఆమె ఆ సమస్య నుండి బయట పడటానికి చాలా నెలలు పట్టింది. ఆ తరువాత నాకు వేరే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ హాస్టల్ కు వచ్చాసా

తరువాత...?”

ఆ విశ్వాన్ని ఇన్ని రోజుల తరువాత ఈ అమ్మాయి మాధవితో చూసిన నాకు పెద్ద షాక్. ఈ విషయాన్నే ఆ అమ్మాయి దగ్గర ఎంక్వయరీ చేద్దామని మొదలు పెట్టాను. వెంటనే నన్ను తప్పుగా అనుకుంది.

తప్పుగా అనుకోకుండా, ముద్దుగా బుజ్జగిస్తారా?” అన్నది కుసుమ.

ఏమిటే చెబుతున్నావు?”

నువ్వు చెప్పేది చాలా పెద్ద విషయం రేఖా. నీకు వంద శాతం ఖచ్చితంగా తెలుసా?”

అంటే...ఆలొచించకుండా చెబుతున్నానా? నాకు బాగా తెలుసు!

అతనేనా ఇతను? లేక చీకట్లో ఎవర్నో చూసి వాగుతున్నావా?”

సందేహమే లేదు...వాడే! ఒకవేల ఒకే రూపంలో ఇద్దరున్నారనుకుందాం...పేరు కూడా అదేనా ఉంటుంది.

కుసుమ కొంచం తడబడుతూ అడిగింది. ఇప్పుడు ఏం చెయ్యబోతావు?”

అదే తెలియటం లేదు. రూము కూడా మార్చుకుంటానని మాధవి గంతులు వేస్తోంది

అది రూము మారిస్తే ప్రయోజనమేమిటే. ప్రేమికుడ్ని మార్చుకోవాలి. దానికి ఏమిటి దారి?”

రేఖా కాసేపు ఆలొచించి ఒక మంచి దారి ఉంది అన్నది.

ఏమిటది?”

***********************************************PART-3******************************************

మథులతనే తిన్నగా వచ్చి మాధవి దగ్గర మాట్లాడితే...అప్పుడు విశ్వం రంగు వెలిసి పోతుంది కదా?”

ఖచ్చితంగా! నీ దగ్గర మథులత ఫోన్ నెంబర్ ఉందా?”

లేదే! ఎక్కడో నోట్ చేసి పెట్టుకున్నాను...ఎక్కడ అనేది గుర్తుకు రావటం లేదు. నా ఫోనులో లేదు. ఎందుకంటే ఆ తరువాత నేను రెండు ఫోనులు మార్చాను

అలాగైతే మథులతని ఎలా కనుక్కునేది?”

పాత హాస్టల్ కు వెళ్ళి విచారిస్తాను

మథులత ఇప్పుడూ అక్కడే ఉంటుందని నమ్ముతున్నావా?”

ఆమె లేకపోయినా ఆమె ఇంటి అడ్రస్సు ఉంటుంది కదా? ఒక వేల ఆమె ఇంకా అదే హాస్టల్లొ ఉండచ్చు కదా

ఊహూ...దానికి ఛాన్స్ తక్కువ. ఈ ఊర్లో ఏ అమ్మాయి ఒకే హాస్టల్లో పలు సంవత్సరాలు ఉండగలదు?”

ఒక ప్రయత్నం చేసి చూద్దాం! నా మీద మాధవికి ఎంత కోపం ఉన్నా కానీ, ఇది నేను చేసే తీరాలి. తెలిసి, తెలిసి ఒక అమాయకురాలి జీవితం పాడవుతోందంటే చూస్తూ ఎలా వూరుకోను. అది న్యాయం కూడా కాదు. నిజం తెలిసిన తరువాత ఆమే నన్ను అర్ధం చేసుకుంటుంది

సరే, ప్రయత్నం చేసి చూడు. బెస్ట్ ఆఫ్ లక్ అని రేఖా భుజాల మీద తట్టి బయలుదేరబోయింది కుసుమ.

ఆగవే...కొంచం ఆలొచిద్దాం

నాకు కొంచం బయట పని ఉందే. అర్జెంటుగా వెళ్ళాలి. వస్తాను

కుసుమ వెళ్ళిన తరువాత... రేఖా ఆలొచనలతో తన రూముకు వెళ్ళినప్పుడు, అక్కడ మాధవి తన సూట్ కేసులో బట్టలు సర్దు కుంటోంది. మొహంలో అదే చిటపట. 

ఏమైంది...రూము మారబోతావా?”

లేదు...హాస్టలే మారుస్తున్నాను. పక్కింట్లో ఏమి జరుగుతోందో కిటికీలో నుండి తొంగి చూసే నాగరీకం లేనివాళ్లతో నేను ఉండలేను స్పీడుగా సూట్ కేసు మూత వేసి మూసింది.

                                                                       *****************************************

ఇన్ని సంవత్సరాలైనా ఆ హాస్టల్ కొంచం కూడా మార లేదు. అలాగే ఉన్నది. తుప్పు పట్టిన అదే నేమ్ బోర్డ్’.  వాకిలి గుమ్మం మీద ఉన్న మసి కూడా మారలేదు అని అనిపించింది రేఖాకు.

వాకిలి దగ్గరున్న 'వాచ్ మ్యాన్ ఈమెను స్నేహంగా చూసి, “హాస్టల్లో చేరటానికి వచ్చారా?” అని అడిగాడు.

లేదు... అని చెప్పటానికి వచ్చిన రేఖా గబుక్కున అది మార్చి అవునండి అన్నది.

సకల మర్యాదలతో ఆమెను లోపలకు తీసుకు వెళ్ళాడు. అలవాటైన ఆఫీసు గది వైపుకు నడుస్తున్న రేఖాకు ఒక సందేహం. ఇప్పుడు కూడా అదే వార్డనే ఉంటుందా? ఒక వేల ఇంకెవరైనా ఉంటే ఏం చెప్పాలి?...ఎలా అడగాలి?’

మంచి కాలం. వార్డన్ మారలేదు. రేఖాను చూసిన వెంటనే లేచి నిలబడి రామ్మా అని స్వాగతించింది.

నమస్తే మ్యాడం...

కూర్చో...ఏం కావాలి?”

నేను జ్ఞాపకం లేనా?” అంటూ నవ్వింది రేఖా.

జ్ఞాపకం లేవే...

కొద్ది రోజుల ముందు వరకు ఈ హాస్టల్లోనే ఉండేదాన్ని. నా పేరు రేఖా

మొహం ముడుచుకుని కళ్లజోడు సరిచేసుకుని ఆమెను చూసింది. అరె...అవును! రేఖా...క్షమించమ్మాయ్...గబుక్కున జ్ఞాపకం రాలేదు. కూర్చో రేఖా. బాగున్నావా?” 

బాగున్నా

ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఎక్కడ పని? పెళ్ళి అయ్యిందా? ఎంతమంది పిల్లలు? అమ్మా-నాన్నలు బాగున్నారా?” అని ఆమె గబగబా మాట్లాడగా రేఖా నవ్వింది.

మీరు మారనే లేదండి! కొంచం నిదానంగా మాట్లాడుకుందాం. ఎందుకంత తొందర?”

అదీ నిజమే అంటూ ఆమె ఒక గంట కొట్టింది...వెనుక రూము నుండి ఒక కుర్రాడు తొంగి చూసాడు. రెండు కాఫీలు అన్నది వాడి దగ్గర.....కొద్ది నిమిషాలలో కాఫీ వచ్చింది.....అది తాగుతూ ఇద్దరూ పాత కథలు చెప్పుకున్నారు.

మీకు మథులత జ్ఞాపకం ఉందా?”

ఎందుకు లేదు...నీకు బాగా సన్నిహిత స్నేహితురాలుగా ఉండేదే! ఆమె ఎలా ఉంది?”

రేఖా కొంచం నిరాశపడింది. నన్ను అడుగుతున్నారేమిటి...ఆమె ఇప్పుడు ఇక్కడ లేదా?” అన్నది.

నువ్వెళ్ళిన కొన్ని రోజులకే ఆమె వెళ్ళిపోయింది

“........................”

అంటే ఎక్కడుందో నీకు తెలియదా?”

ఆమెను వెతుక్కుంటునే వచ్చాను!

అలాగా...ఏమిటి విషయం?”

మా ఆఫీసులో ఒక మంచి ఉద్యోగం ఖాలీగా ఉంది. దానికి తగ్గ మనిషిగా మథులత ఉంటుందని నా నమ్మకం. వెతికి పట్టుకుని స్నేహాన్ని పునరుద్ధరించు కుందామని అనుకున్నాను    

మంచి విషయమే! కానీ, ఆమెను ఎలా కనుక్కోబోతావు?”

ఆమె పాత వివరాలు ఇవ్వండి. ప్రయత్నిస్తాను అన్నది రేఖా.

ఖచ్చితంగా ఇస్తాను అంటూ పక్కనున్న చెక్క అలమరాను తెరిచింది. అందులో ఉన్న ఫైల్లల్లో నుండి వెతికి ఒక ఫైలును తీసింది.

కొద్ది నిమిషాలు ఆ ఫైలును వెతికిన తరువాత మథులత యొక్క పేరు, అడ్రస్సు కనబడింది.

ఆమె గ్రామం అడ్రస్సు, ఫోన్ నెంబరు కూడా ఉంది

ఇవ్వండి. అది చాలా వరకు మారుండే అవకాశమే లేదు!

ఒక చిన్న పేపర్ ముక్కపై మథులత హైదరబాద్ ఫోన్ నెంబర్, సొంత ఊరి అడ్రస్స్ -- ఇంటి ఫోన్ నెంబరూ రాసి ఇచ్చింది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయలుదేరింది రేఖా.

నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటువైపు హాస్టల్ కోసం వెతుకుతుంటే మన హాస్టల్ ను రెకమండ్ చెయ్యి రేఖా. మరిచిపోకు అన్నది వార్డన్. 

ఖచ్చితంగా! నేను బయలుదేరుతాను వార్డన్ దగ్గర సెలవుతీసుకుని బయటకు వచ్చింది.

బస్సు స్టాపింగుకు వచ్చి, అక్కడ నిలబడి మథులత మొబైల్ నెంబర్ కు ఫోను చేసింది.

ఈ నెంబర్ ఉపయోగంలో లేదు అని సమాధానం వచ్చింది.

తరువాత గ్రామం ఇంటి నెంబర్ కు ఫోన్ చేసింది.

హలో...మాధవ్ డిపార్ట్ మెంట్ స్టోర్స్!

రేఖా ఆశ్చర్యపోతూ, “అక్కడ మథులత అని...

మథులతనా? అలాంటి పేరుగల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరే!

నీరసించిపోయింది.

చేతిలో ఉన్న రెండు నెంబర్లూ తప్పు. ఇక ఇంతపెద్ద హైదరాబాద్ నగరంలో ఎక్కడని వెతకను?’

'ఆమె ఇప్పుడు ఇక్కడ ఉంటుందనేది కూడా ఖచ్చితం కాదు. ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్ళి ఉండొచ్చు. పెళ్ళి చేసుకోనుండొచ్చు. బయటి దేశాలకు వెళ్ళుండచ్చు

మథులత లేకుండా మాధవి దగ్గర ఏదీ నిరూపించలేము. ఏం చేయాలి? కుందేలు బొమ్మ మోసపోతే పోనీ అనుకుని వదిలేయటమేనా?’

అలా ఆలొచిస్తున్నప్పుడు రేఖాకు నిరుశ్చాహాంగా ఉంది.

ఆమె ఎంత కోపం చూపించినా, అందులో ఒక న్యాయం ఉంది. ప్రేమ విషయంలో కలుగచేసుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. 'నువ్వు వాడ్ని ప్రేమిస్తున్నావా?' అని అడిగినందుకే కోపగించుకుంది. అలాంటిది 'నీ ప్రేమికుడు ఒక స్త్రీ లోలుడు అని చెబితే ఏం చేస్తుందో?’

ఒకవేల నాకే సక్రమంగా మాట్లాడటం చేతకాలేదా? కొంచం నిదానంగా చెప్పుంటే ఆమె వినేదేమో?’

తరువాత వచ్చిన బస్సులో ఎక్కింది రేఖా గందరగోళంతో ...సీటులోకి వెళ్ళి కూర్చుంది. మథులతకీ, నాకూ ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా...వాళ్ళ దగ్గర ఆమె యొక్క కొత్త ఫోన్ నెంబర్ అడుగుదామా?’ అని ఆలోచించటం మొదలుపెట్టింది.

కొద్ది నిమిషాల తరువాత ఆమెకు ఒక ఫోను వచ్చింది. ఆలొచిస్తూనే ఫోన్ తీసింది.

హలో!

మేము మాధవ్ డిపార్ట్ మెంట్ స్టోర్స్ నుండి మాట్లాడుతున్నాము. కొద్దిసేపటి క్రితం మీరు ఫోన్ చేశేరే?”

అవునండి! అలాంటి పేరుతో ఎవరూ లేరని చెపారే!

ఇక్కడ మథులత అని ఎవరూ పనిచేయటం లేదండి. అందువలనే అలా చెప్పాము. తరువాత జ్ఞాపకం వచ్చింది. ఇక్కడే పక్కింట్లో మథులత అని ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు హైదరాబాదులో ఉంటోంది. అంతకు ముందు వాళ్ళింట్లో ఫోను లేకపోవటం వలన ఈ నెంబర్ను తెలిసిన వాళ్ళకు ఇచ్చారు” 

అదే మథులత యేనండి...సంతోషంలో మాటలు తడబడ్డాయి.  

“........................”

వాళ్ళింటి ఫోన్ నెంబర్ దొరుకుతుందా?”

ఆమె ప్రశ్నను వినకుండా అవతల సైడు అతను మాట్లాడుతూనే ఉన్నాడు.

మీరు మథులత స్నేహితురాలా?”

అవునండి! కొంచం అర్జెంటుగా మాట్లాడాలి. ఆమె నెంబర్ ఇస్తారా?”

ఆ అమ్మాయి ఇప్పుడు హైదరబాదులో లేదు. లీవు పెట్టి ఊరికి వచ్చింది. రేపు ఆ అమ్మాయిని చూసుకోవటానికి పెళ్ళివారు వస్తున్నారు. వాళ్ళు ఏం హడావిడిలో ఉన్నారో ఏమో...మీ నెంబరు, పేరు ఇవ్వండి మేము వాళ్ళింట్లో ఇచ్చి మీతో మాట్లాడమని చెబుతాము"

***********************************************PART-4******************************************

ఆ రోజు రాత్రి ఎనిమిదింటికి మథులతే ఫోన్ చేసింది.

ఏయ్ రేఖా...ఎలా ఉన్నావు?”

నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు...?”

బాగున్నానే. నీతో మాట్లాడి ఎన్ని రోజులయ్యిందే? ఇలా హఠాత్తుగా నీ నెంబరు దొరుకుతుందని నేను కొంచం కూడా ఎదురు చూడలేదు తెలుసా?”

నేనూ ఎదురు చూడలేదు. ఇంకొక విషయం కోసం మన పాత హాస్టల్ వైపు వెళ్ళినప్పుడు నీ జ్ఞాపకం వచ్చింది. అందుకే వాళ్ల దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేసాను

హాస్టల్లో అదే పాత వార్డనేనా?”

ఆమే! నీ గురించి అడిగింది. ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్నామంటే ఆమెకే థ్యాంక్స్ చెప్పాలి

ఖచ్చితంగా! ఇంట్లో అందరూ బాగున్నారా?”

అందరూ బాగున్నారే. మీ ఇంట్లో? నీకు పెళ్ళి చూపులూ అని విన్నాను. కంగ్రాట్స్...

థ్యాంక్స్ రేఖా! ఈ రోజే పెళ్ళి చూపులు పూర్తి అయినై. నచ్చినట్టు చెప్పేశారు. ఇక మీదటే నిశ్చయ తాంబూళాలకు తారీఖు చూడాలి

నీకు అబ్బాయి నచ్చాడా?”

నా అంత అందం లేకపోయినా, ఏదో పరవాలేదు. పోతేపోనీ అని ఒప్పేసుకున్నాను అని నవ్వింది మథులత.

నువ్వెలా ఉన్నావే? ఎక్కడున్నావు? పెళ్ళి అయిందా-లేదు ఇక మీదటేనా?”

అంతా ఫోనులోనే మాట్లాడాలా? నీ గొంతు విన్న దగ్గర నుండి నిన్ను నేరుగా చూడాలని ఆశగా ఉంది. నువ్వెప్పుడు హైదరాబాదుకు వస్తావు?”

రేపు రాత్రికి బయలుదేరుతున్నా అన్నది మథులత. సోమవారం మా ఆఫీసులో కలుసు కుందామా?”

ఖచ్చితంగా! అడ్రెస్సు ఇవ్వు. లీవు పెట్టి వస్తాను

హూ...మేసేజ్ చేస్తాను. రా...ఎక్కడైనా బయటకు వెళ్ళి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం!

                                                                                  **********************************

మథులత వాళ్ల ఆఫీసు సింపుల్ గానూ, అందంగనూ ఉన్నది. రంగులు ఎక్కువగా కనబడని లొపలి గోడలు. ఎటు చూసినా మహిళా ఉద్యోగస్తులే. మగవారిని చూడటమే అపూర్వంగా ఉన్నది.

రిసెప్షన్ ఉద్యోగినిని సమీపించిన రేఖా నేను మథులతని చూడాలి అన్నది.

ఓ.కే మ్యాడం! చూడటానికి అనుమతి తీసుకున్నారా?”

ఈ ప్రశ్నను రేఖా ఎదురు చూడలేదు. ఆమే నన్ను రమ్మంది అన్నది.

రేఖాకు ఆశ్చర్యంగా ఉన్నది.

మథులత. ఇక్కడ ఏం ఉద్యోగంలో ఉంది? అది అడగలేదే! ఆమెను చూడటానికి అనుమతి తీసుకోవాలా? ఒకవేల పెద్ద ప్రమొషన్ తెచ్చుకుని పెద్ద అధికారి పొస్టింగులో ఉన్నదా?’

కొద్ది సేపట్లో ఖాకీ బట్టలు వేసుకుని ఒకతను అక్కడకు వచ్చాడు. ఈమే యజమాని గారిని చూడటానికి వచ్చరట అంటూ రేఖాని అతనికి పరిచయం చేసింది రిసెప్షనిస్ట్.

లోపల గదిలోకి వెళ్ళి తిరిగి వచ్చిన అతను మీరు వెళ్ళొచ్చండి. తిన్నగా వెడితే ఎదురుగా ఒక గది కనబడుతుంది. ఆ గదిపైన సి.ఈ.ఓ అని రాసుంటుంది. ఆ గదే అన్నాడు.

అరే... మథులతనే ఇక్కడ యజమాను రాలు, బాస్, సి.ఈ. ?’

ఆ ఆఫీసు లోపలకు నడిచి వెడుతుంటే రేఖాకి చాలా గర్వం అనిపించింది.

ఇంత పెద్ద సంస్థకు నా స్నేహితురాలు యజమానురాలా?  అదెలా సాధ్యం?’

మథులతని ఒక యజమానురాలుగా ఎప్పుడూ నేను కలలో కూడా అనుకోలేదు. ఆమె కూడా అలా నడుచుకోలేదు. అందరిలాగానే జీతం తీసుకుంటూ దానికి తగిన లెక్క వేసుకుని ఖర్చు చేసే సాధారణ మహిళ! కొద్ది సంవత్సరాలలో ఇంత మార్పా?’

మథులత గదిలోపలకు రేఖా వెళ్లేలోపు ఆమే బయటకు వచ్చింది.

ఏయ్ రేఖా....ఎలా ఉన్నావు?” అంటూ కౌగలించుకుంది.

బాగున్నానే...

నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందే...!

ఇద్దరూ లోపలకు వెళ్ళి కూర్చున్నారు. స్వీటు, హాటూ, కూల్ డ్రింక్స్ అంటూ స్వాగతం గంభీరంగా ఉంది. పక్క నున్న గాజు గ్లాసు అలమరాలో ఎన్నో బిరుదులు ఉన్నాయి.

ఏమిటే...సడన్ గా పెద్ద యజమానురాలుగా మారిపోయావు?” నిజమైన ఆశ్చర్యంతో అడిగింది రేఖా.

అదంతా ఏమీ లేదే! ఇది చాలా చిన్న నిర్వాహం. ఇరవై మంది పనిచేస్తున్నారు...అంతే!

ఇరవై మందైనా సొంత కంపెని కదా! పెట్టుబడి పెట్టి, కంపినీని నిర్వహణ చేస్తూ, అందరికీ జీతాలిస్తూ నడుచుకునేది చాలా పెద్ద విషయం. చాలా గర్వంగా ఉన్నదే మథూ!

చాలా థ్యాంక్స్...

అవును ఇదెలా సాధ్యమయ్యింది?”

"ఇక్కడ నేను ఉద్యోగంలో చేరినప్పుడు నాకేమీ అర్ధం కాలేదు. నీలాంటి వాళ్ళు కొంతమంది సహాయం చేయటం వలన పైకొచ్చాను. లేకపోతే గ్రామానికే తిరిగి వెళ్ళిపోయే దానిని. నా లాగా...ఏదో ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించి కుటుంబానికి సహాయంగా' ఉండాలనుకునే గ్రామ మహిళలకు ఒక దారి చూపే దానిలాగా ఉండాలని అనుకున్నాను. బ్యాంకులో లోను తీసుకుని ఈ కంపెనీని కొత్త రకంగా మొదలు పెట్టాను

“...................”

ఇప్పుడు మేము గ్రామాలకు వెళ్ళి, అక్కడి స్కూల్లల్లో, అక్కడున్న తెలివిగల అమ్మాయలకు ట్రైనింగ్ ఇస్తున్నాము. పెద్ద కంపెనీల గురించి, అక్కడ పనిచేయటానికి అవసరమైన విషయాలను చెప్పిస్తున్నాం. కాలేజీ చదువుకునేటప్పుడే బయట కొద్ది గంటలు పని చేసి సాపాదించుకోవటానికి, ఎక్స్ పీరియన్స్ తెచ్చుకోవటానికీ సహాయ పడతాము. తరువాత మంచి కంపెనీలను తీసుకు వచ్చి ఇంటర్ వ్యూలు నిర్వహించి ఆ కంపెనీకి సూట్ అయ్యేవాళ్లను సెలెక్ట్ చేసి ఉద్యోగమూ ఇప్పిస్తాము

అరె...!

ఇంతవరకు ఏడు వందల మందికి పైన మా సంస్థ మూలంగా గ్రామం నుండి నేరుగా నగరానికి దాటారు... అంటూ నవ్వింది మథులత.

అలాగా...?”

దీన్ని ఇంకా పెంచాలని మా ఆశ

నిజంగానే చాలా పెద్ద విషయమేనే...కంగ్రాట్స్

ఇలాగే అందరూ చెబుతున్నారు. రోజూ పొగడ్తలు విని విని విసుగెత్తుతోంది----మళ్ళీ నవ్వింది మథులత.......

రేఖా తన మనసులో ఇది మారనే లేదు. అదే దర్జా, అదే గొప్ప ధోరణి. అది కాకుండా ఇప్పుడు పెద్ద పొజిషన్ కు వచ్చింది. అలాంటప్పుడు ఆ గొప్ప ధోరణి తగ్గుతుందా?’ అని అనుకుంది.

మరొకసారి ఏమీ చెయ్యని వారే గొప్పలు పోతారు, స్టైల్ కొడతారు. ఈమె, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో సక్రమంగా చేస్తోందే. మహిళలను పెట్టుకుని, కంపెనీ నడుపుతూ, పేదవాళ్ళకు సహాయం చేస్తోందే. అలాంటి ఈమె కొంచం గొప్ప అనుకుంటే తప్పా ఏమిటి?’ అని ఆలొచించింది.

అది సరే...నువ్వెందుకు నన్ను వెతుకుతున్నావు? చాలా అర్జెంటు అని కూడా చెప్పావు?”

రేఖా ఇప్పుడు కొంచం తడబడింది. స్నేహితురాలి అపార ఎదుగుదల గురించి, మంచి మనసు గురించి తెలుసుకున్న తరువాత, ఇప్పుడు ఆమె దగ్గర విశ్వం విషయం మాట్లాడటానికి రేఖా మనసు అంగీకరించలేదు. మౌనంగా ఉన్నది.  

ఏమిటే...ఇలా తటపటాయిస్తున్నావు. ఏదైనా పెద్ద సమస్యా?”

అలాంటిదే మథూ. కానీ నాకు కాదు. నా స్నేహితురాలు ఒకత్తికి

ఎవరది...ఏమిటి సమస్య?”

ఊ...నీకు విశ్వం జ్ఞాపకం ఉన్నాడా?”

గబుక్కున మథులత ముఖం మారింది.

అతన్ని మర్చిపోగలనా?” అన్నది. ఆమె స్వరంలో కోపం పొంగుకు వస్తుంటే మళ్ళీ మాట్లాడింది.

ఈ సమయంలో ఆ పోకిరి వెధవ గురించి ఎందుకు మాటలు?”

కారణం ఉంది మథూ

రేఖా మళ్ళీ మాట్లాడబోతుంటే మథులత అడ్డుపడింది.

నేను ఎంత పెద్ద పొజిషన్ కు వచ్చినా, వాడు నాకు చేసిన మోసాన్ని మర్చిపోలేను రేఖా "

“....................”

నేనప్పుడు ఆత్మహత్యకు పూనుకున్నప్పుడు, నీ దగ్గర కూడా విషయం మొత్తం చెప్పలేదు. మనసు నిండుగా సంతోషం, ఆత్మనమ్మకంతో నా దారిలో నేను వెడుతుంటే, ఆ వెధవ నన్ను కిందకు లాగి తొక్కి పారేశాడు. వాడు మాత్రం నా జీవితంలోకి రాకపోయుంటే, నేను ఎలాగో ఉండేదానిని తెలుసా?”

మథులత లేచి వెళ్ళి, కిటికీ దగ్గర నిలబడింది.

కింద వెడుతున్న వాహనాలను చూసేసి చెప్పింది.

వాడికి నా శరీరం మాత్రమే కావాలనిపించింది. కానీ నేను వాడి మనసును ప్రేమించాను. అందువల్ల అతను అడిగినదంతా నాకు తప్పుగా అనిపించలేదు

“....................”

సరైన సంధర్భం దొరికేంత వరకు ప్రేమిస్తున్నట్టు నటించాడు. నా పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు...నా స్నేహితుని కారు అడిగి తీసుకున్నాను. వాడి ఇల్లు వైజాగ్ లో ఉంది. సరదాగా అక్కడికి వెడదాం. నీ పుట్టిన రోజున జాలీగా జరుపుకుందాం అన్నాడు

“....................”

నేనొక మూర్ఖురాలిని. వొంట్లో బాగుండలేదని, ఇంటికి వెడుతున్నానని హాస్టల్లో చెప్పి, వాడితో వెళ్ళాను. ఊరంతా తిరిగాను. వాడ్ని నమ్మి నన్నే ఇచ్చుకున్నాను

అయ్యయ్యో... షాకైంది రేఖా.

అంతే. ఆ మనిషి అలాగే మారిపోయాడు. వింటే నీకే షాక్ అనిపిస్తుంది. మొదటి రోజు నుండే అదే అతని ఉద్దేశం అనుకుంటా. ఆ తరువాత అతని మాట తీరే మారిపోయింది. నన్ను తప్పించుకోవటం మొదలు పెట్టాడు. ఇంకెవరితోనో తిరుగుతున్నాడని విన్నాను. అడిగితే పొగరుగా మాట్లాడాడు

“..................”

అప్పుడే నాకు ఆ నీచమైన ఆలొచన వచ్చింది. ఇంకా బ్రతకలా?’ అని అనిపించింది. ఆత్మహత్య ప్రయత్నం చెసేను

అరె ఇడియట్...

మంచి కాలం...దేవుడు నాకు కొన్ని బాధ్యతలు ఉంచాడు కాబోలు. అందుకే బ్రతికాను. కానీ, వాడి మీద ఉన్న కోపం కొంచం కూడా తగ్గలేదు

క్షమించాలి మథూ. ఈ తరుణంలో నేను ఈ టాపిక్ మాట్లాడి ఉండకూడదు

నేను మరిచిపోవాలనుకుంటున్న విషయాలు ఇవి. ఇన్ని రోజుల తరువాత కలుసుకుంటున్నాం. అవును నువ్వెందుకు ఇదంతా కెలికేవు?”

కారణం ఉంది. నాకు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. దయచేసి నన్ను మన్నించు

పరవాలేదు...చెప్పు

ఇప్పుడు ఆ విశ్వం ఎక్కడున్నాడో తెలుసా?”

వాడి గురించి నా కెందుకు? ఎక్కడున్నాడో...ఎవరితో తిరుగుతున్నాడో....?”

నా స్నేహితురాలు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అన్నది రేఖా.

అలాగా...?”

అవును...దానికోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను!

స్నేహితురాలని చెబుతున్నావు...చూస్తూ వూరుకున్నావే? ఆ వెధవ చొక్కా పుచ్చుకుని నాలుగు తగిలించక పోయావా? ఆ అమ్మాయికి బుద్ది చెప్పొద్దా?”

ప్రయత్నం చేశాను. కానీ, వాడ్ని పూర్తిగా నమ్ముతోంది. నన్ను నమ్మటం లేదు

అర్ధమవుతోంది రేఖా. ఎవరి దగ్గర, ఎప్పుడు, ఎలా మాట్లాడి బోల్తా కొట్టించాలో వాడికి బాగా తెలుసు. ఆమెను బ్రైన్ వాష్ చేసుంటాడు. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఆమెకు తప్పుగానే తెలుస్తుంది

అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను

దీంట్లో నేనేం చేయగలను?”

నువ్వే చెయ్యగలవు. మేము చెప్పటం నమ్మని ఆమె, విశ్వం వలన డైరెక్టుగా నష్టపడ్డ నువ్వు చెబితే నమ్ముతుంది. దయచేసి ఆమె దగ్గర నిజం చెబుతావా?”

ఖచ్చితంగా చెబుతాను. నాకు ఆ అమ్మాయ్ ఫోన్ నెంబర్ ఇవ్వు. మిగతాదంతా నేను చూసుకుంటాను

నేను నీ స్నేహితురాలినని చెప్పకు. అది తెలిస్తే నిన్ను కూడా నమ్మదు!

బాధపడకు రేఖా. మేము తీసుకున్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. అది చూపించి తిన్నగా మాట్లాడుతాను. నీ గురించి మాట్లాడను...సరేనా?”

చాలా థ్యాంక్స్ మథూ

దీనికెందుకే థ్యాంక్స్? ఏడువందల మంది అమ్మాయలకు మంచి చేసున్నాను....ఇంకొక దానికి చెయ్యలేనా?” అంటూ లేచింది.

ఓ.కే

సరే...భోజనానికి వెళదామా? ఇండియా భోజనమా...బయటిదేశం భోజనమా?”

ఈమె ఏలా ఇంత ఈజీగా మనసు మార్చుకోగలుగుతోంది! అని అనుకుంది రేఖా.

నీతో మాట్లాడితేనే కడుపు నిండినట్లు ఉన్నది మథూఅంటూ మాధవి ఫోన్ నెంబర్ నోట్ చేసి ఇచ్చింది.

మర్చిపోకుండా ఆమెతో మాట్లాడు

ఈ రోజే మాట్లాడుతానే. నీ స్నేహితురాలితో మాట్లాడటం ఒక సంతోషం అయితే... విశ్వం మొహాన బురద రాస్తున్నానన్నది ఇంకో సంతోషం! ఒకే రాయితో రెండు పండ్లు

***********************************************PART-5******************************************

ఇంత జరిగిన తరువాత కూడా మాధవీ, విశ్వమూ వొరుసుకుంటూ పయనం చేయటం రేఖా ను ఏదో చేసింది!

మథులతకి మేసేజ్ మాత్రం పంపింది.

దానికి ఎటువంటి సమాధానమూ రాలేదు.

ఆమె డిస్టర్బన్స్ గా అనుకున్నా పరవాలేదు. ఇంకొక గంటు చూసి ఫోన్ చేద్దంఅని నిర్ణయించుకుంది రేఖా.

అరగంట తరువాత, మథులత దగ్గర నుండి సమాధానం వచ్చింది. రెండే మాటలు: ఇంకా మాట్లాడలేదు!’ 

దీనికి ఏమిటి అర్ధం? ఇక మీదటే మాట్లాడుతుందా? లేక మాట్లాడదా?’ --- రేఖాకు అయోమయంగా ఉన్నది.

మోస పడ్డ మనిషి మాట్లాడ నంటోంది, మోస పోబోతున్న మనిషో...నిజం చెబితే నమ్మటానికి ఇష్టపడటం లేదు. మధ్యలో నాకు మాత్రం ఎందుకు ఆసక్తి? ఏదో చేసుకుని పోనీ అని వదిలేద్దామా?’

తన మనసులోని ఆలొచనల నుండి తప్పించుకోవాలని టీ.వీ. చూడటం మొదలుపెట్టింది. దాంట్లోనూ మనసు పెట్టలేకపోయింది. భోజనం చేయాలనిపించలేదు. రూముకు వెళ్ళి పడుకుండి పోయింది.

రాత్రి పదిన్నర తరువాత, కింద బండి వస్తున్న చప్పుడు వినిపించింది.

ఆ తరువాత చాలాసేపైన తరువాత సరక్...సరక్అనే శబ్ధం లేపుతూ మాధవి తన రూమును దాటి వెడుతున్నది తెలిసింది.

రేఖా పక్కకు తిరిగి పడుకుంది. మథులత ఏమనుకున్నా సరే పరవాలేదు. రేపు ఆమెతో మాట్లాడాలీ -- ఖచ్చితంగా నిర్ణయించుకుంది.

                                                                                **************************************

మరుసటి రోజు ప్రొద్దున డైనింగ్ హాలు లోపలకు రేఖా వెళ్ళినప్పుడు... మాధవి ఎవరితోనో ఉత్సాహంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. మాధవి మోహంలో కనిపించిన అమాయకత్వం రేఖాలో ఏదేదో చేసింది.

కుందేలు బొమ్మ...చాలా ముక్కోపి రకమే!

ఆమె చిన్న పిల్లనా? ఆలొచించ గలిగే వ్యక్తేనే? అతను మోసం చేస్తున్నాడని కూడానా తెలుసుకోలేదు? అంత అమాయకురాలా?

మథులతకి అప్పుడు మాధవి వయసే. చెప్పాలంటే మాధవి కంటే ధైర్యం ఎక్కువ ఉన్న అమ్మాయి. ఆమే విశ్వం వలలో మోసపోయి చిక్కుకోలేదా?

ఇలాంటి పోకిరి స్త్రీలోలులు ఆడపిల్లలను ఏం చెప్పి మోసపుచ్చుతారో...మాటల్లో తెనే పూసి, మాయ చేస్తే, ఆడవాల్లను సులభంగా వంచచ్చు అనే భావనో?

వాళ్ళను మాత్రం చెప్పి ఏం లాభం...ఈ ఆడపిల్లలు దానికొసమే కదా వాళ్ళకు బానిసలవుతున్నారు. వాళ్ళను కొంచం పొగడితే చాలు, కరిగిపోతారు. ఆ రోజు మాధవి నన్ను మాట్లాడనివ్వలేదే! మథులత మాట్లాడినా నమ్ముతుందని ఏమిటి ఆశ?

అందుకని, మాట్లాడకుండా ఉండిపోదామా? ఇంకో ప్రయత్నం చెయ్యాల్సిందే!

టిఫిన్ ముగించుకుని హాస్టల్ బయటకు వచ్చిన వెంటనే మథులత నెంబర్ వెతికి ఫోన్ చేసింది. ఫోను మోగిన వెంటనే ఆమె ఎత్తింది.

ఏయ్ రేఖా...ఎలా ఉన్నావు?”

బాగున్నా మథూ. బాగా బిజీ టైములో నిన్ని డిస్టర్బ్ చేస్తున్నా...క్షమించు"

పరవాలేదు...చెప్పు

 నా స్నేహితురాలి గురించి చెప్పేనే...దానితో మాట్లాడావా?”

ఇంకా లేదు. ఈ రోజు మధ్యాహ్నం మాట్లాడతాను. నాకు కొద్దిగా పని ఎక్కువ అయ్యింది...అందుకే...

పరవాలేదు...మాట్లాడితే నాతో చెప్పు

ఖచ్చితంగా

చాలా థ్యాంక్స్ మథూ

సరే...తరువాత మాట్లాడదాం అని పెట్టేసింది.

రేఖా కి కొంచం రిలీఫ్ అనిపించింది.

మథులత మాట్లాడిన తరువాత మాధవికి విశ్వం గురించి కొంచం క్లారిటీ వస్తే మంచిది అని అనుకుంది.

ఆఫీసు లోపలకు వెళ్ళింది. కంప్యూటర్ ఆన్ చేసి, కొద్ది నిమిషాలు కిటికీ నుండి బయటకి వేడుక చూసింది. తిరిగి సీటుకు వచ్చి కూర్చుంటే, 28 ఈ-మైల్స్ వచ్చినట్టు తెలిసింది.

పెద్దగా ఆసక్తి లేకపోయినా వాటిని అన్వేషించింది.

మొదటి ఈ-మైల్ మథులత దగ్గర నుండి.

టైము చూసింది. పది నిమిషాల ముందే వచ్చింది.

ఇప్పుడే కదా మాట్లాడాము? అంతలో ఎందుకు ఈ-మైలు పంపింది?’ తొందరపడుతూ ఆ ఈ-మైలు తెరిచింది. మంచి ఆంగ్ల బాషలో రాసుంది.

ప్రియమైన రేఖాకు,

ఈ విషయాన్ని ఫోనులో చెప్పటానికి మనసు రావటం లేదు. అందువలనే మైలు పంపించాను. తప్పుగా అర్ధం చేసుకోకు!

నీ స్నేహితురాలుని తలచుకుంటే నాకూ అయ్యో...పాపంఅనిపించిన మాట నిజమే. కానీ, అదే సమయం, ఆమెతో మాట్లాడితే సమస్య తీరుతుందో, లేదో నాకు తెలియదు... కానీ, నాకు ఒక సమస్య మొదలవుతుందేమోనన్న భయం పట్టుకుంది.

నాకు పెళ్ళి నిశ్చయ మయిన విషయం నీకు తెలుసు. ఈ సమయంలో దాని గురించి నేనే ఎందుకు ప్రస్తావించాలి? ఏదో ఒక దారిలో ఆ విషయం, నాకు చూసున్న పెళ్ళి కొడుకు ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతే...అది చాలా పెద్ద సమస్య అవుతుంది కదా?........నువ్వు నన్ను స్వార్ధ పరురాలు అని అనుకున్నా పరవాలేదు. ఇప్పుడు ఇలాగే ఆలొచించ గలుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించు.

నా కోసం...చదివిన తరువాత దీన్ని డిలేట్ చేసేయి. థ్యాంక్స్!

ఇట్లు,

మథులత

చదివిన మరు క్షణం రేఖా చేతులు ఆమెకు తెలియకుండానే ఆ ఈ-మైల్ ను డిలేట్ చేసింది. అది డిలేట్ అయ్యింది. దానితో పాటు ఆమె నమ్మకమూ డిలేట్ అయ్యింది!

ఆ రోజు సాయంత్రం రేఖా ఆఫీసులో ఒక విందు. అమెరికా నుండి తిరిగి వచ్చిన కొంత మంది ఉద్యోగస్తులు, అందరికీ మందు పోసి ఇస్తున్నారు.

మామూలుగా రేఖా ఇలాంటి విందులలో పాల్గొనదు. అందులోనూ ఇప్పుడున్న మనోస్థితిలో...ఆమె వలన అబద్దంగా నవ్వటం కూడా కుదరదు.

కానీ విందు ఇచ్చే వాళ్ళు బాగా సన్నిహితులు. అందువలన ఇష్టం ఉన్నా...లేకపోయినా అందులో ఖచ్చితంగా ఆమె పాల్గొనే తీరాలి.

ఆడ, మగా తేడా లేకుండా అందరూ మందులో స్నానం చేస్తూ ఉండగా...చేతిలో కూల్ డ్రింక్ తో కొంతసేపు నిలబడుండాలి?

రేఖాతో సహజంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నిదానం పోగొట్టుకుంటుండగా... ఎనిమిదన్నరకు బయటకు వచ్చేసింది.

హాస్టల్లో అన్ని రూములలోనూ లైట్లు ఆపేసున్నాయి. సెల్ ఫోన్ వెలుతురులో మెట్లు ఎక్కి వెళ్ళింది. దార్లో స్నేహితురాలు కుసుమ రూము తలుపులు తెరిచున్నాయి. ఏదో పుస్తకం చదువుతున్నది.

హాయ్.... రేఖా అన్నది.

హాయ్

డిన్నర్ అయ్యిందా?”

అయ్యింది...నువ్వు?”

అయ్యింది! అంటూ పుస్తకం మూసేసి రూము బయటకు వచ్చింది.

చాలా సేపుగా చదువుతున్నానా...బోరు కొడుతోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. టీ తాగి వద్దాం...వస్తావా?”

ఎక్కడ?’

మన వీరయ్య కొట్లోనే

సమాధానం ఏమీ చెప్పకుండా తటపటాయించింది.

త్వరగా వచ్చేద్దాం...రా. డ్రస్సు మార్చుకుంటాను అని చెప్పి ఇంకో అరగంట చేయకు. ఇలా వచ్చేయి!

సరే అని స్నేహితురాలితో తిరిగి నడిచింది రేఖా.

ఆ రోజు విందులో అనవసరమైన మాటలూ, మథులత ఈ మైలు...ఈమెతో కొంచం సమయం గడిపితే రిలీఫ్ గా ఉంటుంది అనుకుంది.

ఇంతలో స్నేహితురాలే మాటలు మొదలు పెట్టింది.

తరువాత నీ కుందేలు బొమ్మ విషయం ఏమైంది?”

ఆమె ఇప్పుడు నా రూమ్ మేట్ కాదు

అది తెలుసు. దాని ప్రేమికుడి మొహ కవచాన్ని తీసి పారేస్తాను, చించేస్తానూ  అని చెబుతూ ఉన్నావే! తీసేశావా?"

చాలా బలంగా ఉందనుకుంటా! తీసేయలేక పోయాను అని నవ్వింది రేఖా.

అలాగా...?”

నేను చాలా ప్రయత్నం చేసి చూశాను. ఏమీ జరగలేదు. ఓటమే!

ఏం రేఖా...ఏమైంది? నీ పాత స్నేహితురాలును చూడటం కుదరలేదా?”

చూశాను! కానీ....అది...కుందేలు బొమ్మతో మాట్లాడటానికి రెడీగా లేదు

ఎందుకని?”

దాన్ని తప్పు చెప్పలేము. వాళ్ళ వాళ్ళకు, వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉన్నాయే!

ఏమైందే...కొంచం వివరంగా చెప్పు

వీరయ్య టీ కొట్లో ఆ సమయంలో బాగా జనం ఉన్నారు. కొద్ది నిమిషాలలో వేడి వేడి టీ వచ్చింది. అది తాగుతూ జరిగిందంతా చెప్పింది రేఖా.

సరే...ఇప్పుడేం చెయ్యబోతావు?”

ఏం చేయను? ఇక దాని అదృష్టమొ, దురదృష్టమో...ఏం జరగాలనుంటే అది జరగనీ?”

ఏమే ఒక సహ ఆడది, కొంచం సేపు అది నీ రూమ్ మేట్ గా ఉన్నది. అలాంటి అమ్మాయిని అలా వదిలేయగలమా? అలా వదిలిపెట్ట కూడదు. ఏదైనా చెయ్యాలి

ఎలా? మాధవి నా మాట వినటం లేదు.  వాడి వలన ద్రోహానికి గురి కాబడ్డ మథులత ఇప్పుడు సహాయం చేయలేను అని చెప్పేసింది. ఇక ఎవరు మాట్లాడతారు?”

ఎందుకే? తనకు ద్రోహం చేసిన మోసగాడి గురించి చెప్పటానికి నీ స్నేహితురాలు మథులత ఎందుకు అలా చెప్పింది?”

ఆమెకు పెళ్ళి నిశ్చయమయ్యింది. పాత విషయాలన్నీ మరిచిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న ఈ తరుణంలో, పాత విషయాన్ని కెలికి, ఇంతవరకు రహస్యంగా ఉంచబడ్డ ఆ విషయం పెద్దదై తనకు కాబోయే భర్త వాళ్ల ఇంట్లో తెలిసిపోతే, అది తనకీ, తన కుటుంబానికీ పెద్ద అవమానంగా మారిపోతుంది అంటోంది

ఆమె చెప్పేదాంట్లో అర్ధముంది. సరే...అది వదిలేయ్. నేను ఇంకో ఐడియా చెబుతా విను. మాధవినే కదా నీతో మాట్లాడనని చెప్పింది...నువ్వు విశ్వం దగ్గర మాట్లాడ వచ్చు కదా?”

ఏమిటే చెబుతున్నావు?”

మథులత విషయం మాధవికి తెలియదు. కానీ విశ్వంకు తెలుసు కదా? మాధవిని వదిలి వెళ్లక పోతే మథులత విషయాన్ని బయట పెట్టేస్తానని విశ్వం ని బెదిరించొచ్చే!” 

విల్లీ లాగా మాట్లాడుతున్నావు....!

విల్లన్ల దగ్గర విల్లీగా నడుచుకోవటమే తెలివితేటలు. రేపే ఆ విశ్వామూ, మాధవీనూ మాట్లాడుకుంటున్నప్పుడు, నేను ఏదైనా కారణం చెప్పి మాధవిని హాస్టల్లోకి తీసుకు వెడతాను. అప్పుడు నువ్వు వెళ్ళి విశ్వం తో మాట్లాడు!

నిన్ను చూసిన వెంటనే అతను షాక్ అవుతాడు. మథులత విషయం చెప్పి, నువ్వుగా తప్పుకో అని చెప్పు. నీ దగ్గర సాక్ష్యం ఉన్నదని చెప్పు. భయపడే వాడికి ఏమీ అర్ధం కాదు...పారిపోతాడు

నిజమే! కానీ...కొంచం భయంగా ఉందే!

నువ్వు కూడా మథులత లాగా భయపడి పారిపోకు. ధైర్యంగా మాట్లాడు. తప్పు చేసింది అతను. మనం ఎందుకు భయపడాలి?”

కుసుమ మాట్లాడను మాట్లాడను... రేఖాకు కొంచం నమ్మకం వచ్చింది.

ఈ సారి మాధవిని చూడటానికి విశ్వం వచ్చినప్పుడు, ఈ పధకాన్ని నెరవేర్చాలని స్నేహితులిద్దరూ తీర్మానించుకున్నారు.

'టీ' కి డబ్బులిచ్చి, హాస్టలుకు తిరిగి వెడుతున్నప్పుడు రేఖా బాగా సంతోషంగా కనబడింది. అన్ని దార్లూ మూసుకున్నాయి అని అనుకునేటప్పుడు, ఎక్కడ్నుంచో కొత్త గాలి వస్తోంది!

మరుసటి రోజు విశ్వం రాలేదు. ఆ తరువాతి రోజు కూడా నిరాశే.

ఏమైయిందే! మన పధకం తెలుసుకుని జగ్రత్త పడ్డాడా?”--ఆదుర్దా పడుతూ అడిగింది రేఖా.

పిచ్చిగా వాగకు! అది  మనిద్దరికి మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదు. బాధ పడకే...వాడు ఖచ్చితంగా వస్తాడు

ఒకవేల...ఇది వరకే మాధవిని బోల్తా పడేసేడేమోపండ్లు దొరికిన తరువాత నక్కకు అక్కడేం పని?”

కొంచం కామ్ గా ఉండవే! వలలో చిక్కుకున్న ఆమె సంతోషంగా ఉన్నది... వల వేసినతనూ సంతోషంగా ఉన్నాడు. మనమే తీరంలో కూర్చుని ఆందోళన చెందుతున్నాము!

నువ్వేం చెబుతున్నావే?”

విశ్వం వస్తాడని చెబుతున్నాను. నాకు బాగా అనిపిస్తోంది. కొంచం ఓర్పుగా ఉందాం

ఆమె చెప్పినట్టే మరునాడు విశ్వం వచ్చాడు. అదే చోట నిలబడి మాధవితో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం చాలారెట్లు పెరిగినట్లు అనిపిస్తోంది.

కుసుమ, రేఖా ఇద్దరూ మేడ మీద నిలబడి వాళ్ళను చూశారు. తరువాత ఏమిటి?” అడిగింది రేఖా.

నేను వెళ్ళి మాధవిని ఇక్కడికి పిలుచుకు వస్తాను. మనకి సహాయంగా మాధవి రూమ్ మేట్ ఊరికి వెళ్ళింది. వాళ్ల గదిలో నా పుస్తకం ఒకటుంది. అది వెతకాలని చెప్పి నేను మాధవిని పిలవబోతాను!

ఆమె వస్తుందా?”

అది నా సమస్య. దాని గురించి ఆలొచించకు! మేము ఇటు పక్కకు వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళి విశ్వంను కలిసి మాట్లాడాలి. ఐదే నిమిషాలు. దానికి పైన మాధవిని ఇక్కడ ఉంచుకోవటం శ్రమ!

సరే!

పాడుచేయకే...ఇదే మనకి మంచి చాన్స్!

థ్యాంక్స్ కుసుమా. నువ్వు....నీకు అని చెప్పకుండా మనకు అన్నావు. అది నాకు చాల ఎనర్జీ ఇచ్చింది

ఇక్కడ బాగానే మాట్లాడుతున్నావు! విశ్వం దగ్గరకు వెళ్ళి అనవసరంగా వాగకు"

చేయను! నువ్వు చెప్పింది జ్ఞాపకముంది. నేను చూసుకుంటాను

ఆమెకు బొటను వేలు ఎత్తి చూపించి, మెట్లు దిగింది కుసుమ. రేఖా అక్కడే ఉండి వాళ్లను చూస్తోంది.

కొద్ది నిమిషాల తరువాత కుసుమ, మాధవి ఇద్దరూ హాస్టల్ వైపుకు రావటం మొదలుపెట్టారు. రేఖా ఏమీ తెలియనట్లు వాళ్లని క్రాస్ చేసి నడిచింది. ఎందుకనో మాధవి తనని చూసి నవ్వినట్టు అనిపించింది. 

అదే సమయం ఎవరో మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేస్తున్నచప్పుడు వినిపించింది. రేఖా హడావిడిగా వెనక్కి తిరిగి చూసింది... విశ్వం బైకు మీద కూర్చుని బయలుదేరాడు.

కుసుమ కూడా అది ఎదురు చూడలేదు. షాక్ తో ఆమె కూడా ఆగిపోయింది. 

ఏమైంది?” అడిగింది మాధవి.

నీ స్నేహితుడు...

అతను టికెట్టు కొనడానికి వెళ్ళాడు

టికెట్టా? దేనికి?”

ఎల్లుండి నా పుట్టిన రోజు. అది సెలెబ్రేట్ చేసుకోవటానికి ఇద్దరం వైజాగ్ వెడుతున్నాం. అక్కడ అతని స్నేహితుడికి ఒక ఇల్లు ఉందట!

యధార్ధంగా చెప్పింది మాధవి.

***********************************************PART-6******************************************

ఆ రోజు డిన్నర్ కుసుమ, రేఖా పక్కపక్కన కూర్చుని తిన్నారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.

మాధవి ఇటు వచ్చిన వెంటనే, విశ్వం బయలుదేరి వెల్తాడని ఎదురు చూడక పోవటం ఒక టర్నింగ్ పాయింటు. వాళ్ళిద్దరూ రెండు రోజుల్లో వైజాగ్ వెళ్ళబోతున్నారనేది అంతకంటే పెద్ద టర్నింగ్ పాయింటు.

అదే వైజాగ్. బహుశ అదే ఇల్లు. మాధవికి కూడా మథులత గతేనా?

ఎవరికి ఎరుక? ఇంకో నాలుగైదు సంవత్సరాలలో మాధవి కూడా మథులత లాగా ఒక కంపెనీకి యజమాని అవుతుందేమో. మనసులో విశ్వం మీద కోపంతో మథులతలాగా జీవించ వచ్చు. గుడ్డిలో మెల్ల. చెడులోనూ మంచిది.

కానీ ఇంతలో వీడు ఇంకెంత మందిని మోసగిస్తాడో! వీడ్ని ఎలా ఆపగలం?

పోలీసులకు వెడితే? తెలిసిన విషయాలు చెప్పి ఫిర్యాదు చేస్తే, కనీసం వాళ్ళు విచారిస్తారు. లేకపోతే మాధవితో నైనా మాట్లాడుతారు కదా?  

ఒక స్నేహితురాలి భర్త పోలీస్ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్నాడు.

ఆయనతో మాట్లాడి చూస్తే నష్టమేమిటి? ఏదో కుటుంబ కోర్టు అని చెబుతున్నారే! వాళ్ళు ఇలాంటి ప్రేమ వ్యవహారాల గురించి విచారిస్తారా?’

కానీ, ఎవరి దగ్గర ఫిర్యాదు చేసి ఏం ప్రయోజనం? విశ్వం, నాకు మథులత ఎవరో తెలియదు అని చెప్పేస్తే...ఎవరు నన్ను నమ్ముతారు? మాధవితో మాట్లాడటానికే భయపడుతున్న మథులత కోర్టు మెట్లెక్కి సాక్ష్యం చెబుతుందా?

పోలీసులు, కోర్టు ఇవన్నీ సరికాదు. ఇంకేదన్నా దారిలోనే దీన్ని ఎదుర్కోవాలి. ఆలొచిస్తూనే డిన్నర్ ముగించింది రేఖా.

గదికి తిరిగి వచ్చేలోపు ఆమె మనసులో ఒక పధకం బలం పుంజుకుంది.

                                                                                            ****************************

కుసుమా...నాకోసం ఇంకో సహాయం చేస్తావా?”

ఇంకా ఏం చేయగలం?”

ఇంకొక ప్రయత్నం చేసి చూద్దాం అనిపిస్తోంది?” అని రేఖా తన పధకాన్ని వివరించింది.

అరే!

ఎలా ఉంది నా పధకం?”

పరవలేదు...నువ్వు విల్లీ లాగా ఆలొచించటం ప్రారంభించావేసరే, ఇప్పుడు దాంట్లో నేనేం చేయాలి?”

మాధవి రూమ్ మేట్ తో మాట్లాడి మాధవి అన్నయ్య ఫోన్ నెంబరు తీసుకుని నాకివ్వాలి

ఏం...అది నువ్వే అడగొచ్చుగా?”

నాకూ, మాధవికీ ఉన్న గొడవ వాళ్లకు తెలుసు. సందేహిస్తారు! అందుకనే నిన్ను అడగమంటున్నా

నేను ఏం కారణం చెప్పి అడిగేది?”

మాధవికీ పుట్టిన రోజు వస్తోంది. ఏం గిఫ్ట్ కొనివ్వను అని వాళ్ల అన్నయ్య దగ్గర అడగాలి. ఆమెకు ఇష్టమైన విషయాలు తెలుసుకోవాలి అని చెప్పు

బాగుంది! ఇప్పుడే అడుగుతాను అని చెప్పి బయలుదేరింది కుసుమ.

ఐదు నిమిషాలలో ఫోన్ నెంబర్ తో వచ్చింది.

రేఖా ఆ నెంబర్లు నొక్కింది.

హలో, గిరిధర్ సారేనా?”

అవునండీ! మీరెవరు మాట్లాడుతున్నారు?”

నేను మీ చెల్లెలు మాధవి స్నేహితురాలునిఅన్నది రేఖా పేరు చెప్పకుండా మాట్లాడింది.

మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలే?”

ఏమిటండీ... మాధవికి ఏదైనా ప్రాబ్లమా?”

ఆమె కులాశాగానే ఉంది...భయపడకండి. రేపు తనకు బర్త్ డేకదా...?”

అవునండి...దానికేమిటిప్పుడు?”

నిన్న రాత్రి ఆమె దగ్గర మాట్లాడేను. ఆమె కొంచం ఒంటరిగా ఉన్నట్టు ఫీలవుతోందేమో ననిపించింది

ఏమిటండీ చెబుతున్నారు?”

పుట్టిన రోజుకు మీరెవరైనా పక్కన ఉండాలని అనుకుంటోంది. ఏదో తెలియని తపన...అది మీదగ్గర చెప్పటానికి సంసయిస్తోంది

చాలా సంవత్సరాలుగా హాస్టల్లోనే కదా ఉంటోంది? ఎందుకని సడన్ గా ఇలా?”

అవన్నీ చెప్పిరావు? గబుక్కున ఒకసారి అనిపిస్తుంది. మీరే ఆలోచించి చూడండి...ఇంకో రెండు మూడు సంవత్సరాలలో ఆమెకు పెళ్ళి అవుతుంది. దాని తరువాత పుట్టిన రోజును అనుకున్నా కూడా మీతో గడపగలదా?”

నిజమేనండి...

నేను నేరుగా చూసినందువలన చెబుతున్నా. నా కెందుకో...తన కుటుంబంతో బర్త్ డేచేసుకోవాలని అనుకుంటోందని తెలుస్తోంది. కానీ, ఆమెకు లీవు దొరకలేదనుకుంటా!

ఓ...ఆలాగా?”

అవునండీ! ఆమెకు తెలియకుండా నేను  మాట్లాడుతున్నాను. రేపు ఆమెను చూడటానికి మీరొస్తే బాగుంటుంది. గుడికి తీసుకు వెళ్ళి, ఒకటిగా లంచ్ చేసి, ఏదైనా సినిమా చూసేసి వచ్చేయచ్చు. పుట్టిన రోజు నాడు కుటుంబంతో స్పెండ్ చేయటం సపరేట్ సంతోషం

అవునండి... అంటూ మాట లాగుతూ నాకు లీవు దొరుకుతుందా అని చూడాలి అన్నాడు.

కాస్త సీరియస్ గా ప్రయత్నించండి సార్. మాధవి అలా అనుకోవటం వలనే మిమ్మల్ని ఫోనులో పిలిచేను. లేకపోతే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదాన్ని కాదు అన్నది.

సరే నండి...నేను చూసుకుంటాను

సార్, దయచేసి నేను మీతో మాట్లాడినట్టు మాధవితో చెప్పకండి”  

అర్ధమవుతోందండీ. చాలా థ్యాంక్స్. అవును...మీ పేరు

హైమ అని చెప్పేసి...థ్యాంక్యూ అంటూ ఫోన్ ఆఫ్ చేసింది.

అధరగొట్టేవే అంటూ రేఖా భుజాన్ని తట్టి శభాష్అన్నది కుసుమ.

“..................”

ఎమి మాటలూ...ఎంత భావమూ? నేనే రెండు ఖర్చీఫులు తడిపేసే నంటే చూసుకో"

ఏయ్. నిజంగానా చెబుతున్నావు? అతను నమ్మినట్టు నీకు అనిపిస్తోందా?    వస్తాడంటావా?”

ఖచ్చితంగా వస్తాడు. చెల్లి ప్రేమలో పడని అన్నయ్యే లేడు!

కానీ, మాధవి వైజాగ్ కు బయలుదేరక ముందే రావాలే?”

వచ్చేస్తాడు. నన్నడిగితే నువ్వు మాట్లాడిన మాటలకు ఇప్పుడే బయలుదేరి...చెల్లెల్ని చూడటానికి వస్తూ ఉండొచ్చు అనిపిస్తోంది

గట్టిగా నవ్వింది.

ఈ సారి కూడా కుసుమ చెప్పింది అలాగే జరిగింది. ఆ రోజు సాయంత్రమే హాస్టల్ కు వచ్చేశాడు మాధవి అన్నయ్య గిరిధర్. అతన్ని చూసిన వెంటనే జివ్వున లాగినట్లు అనిపించింది రేఖాకు. 

ఎవరికోసమో కాచుకోనున్న వాడిలాగా అక్కడే నిలబడ్డాడు.

కొద్ది నిమిషాలలో మాధవి వచ్చింది. ఆమె మొహంలో ఆశ్చర్యం, షాక్!

ఏంటన్నయ్యా ఇంత సడన్ గా?”

ఏమీ లేదు మాధవి...పుట్టిన రోజు శుభాకాంక్షలు! అన్నాడు.

“……….............”

ఇక్కడ నాకు కొంచం పని ఉంది. అది ముగించుకుని నిన్ను చూసేసి వెల్దామని వచ్చాను

ఓ...సరే!

రేపు నువ్వు లీవు పెట్టేయి

ఏం...ఎందుకు?”

నీ పుట్టిన రోజు కదా! గుడికి వెల్దాం, సినిమా  చూద్దాం. సాయంత్రం నిన్ను హాస్టల్లో వదిలేసి నేను ఊరికి వెడతాను...సరేనా?”

నీకున్న పని?”

అదే మంత సమస్య కాదు. లీవు పెట్టేశాను. రేపు మొత్తం నీ కోసమే. సరేనా...ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి డిన్నర్ చేసొద్దాం!

రేపు ఒక ముఖ్యమైన పనుందన్నయ్యా. ఆఫీసులో లీవు  ఇవ్వరనుకుంటా

పరవాలేదు...ప్రొద్దున గుడికి వెడదాం. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ కు కలుసుకుందాం

సరేఅన్నది మాధవి.

ఇదంతా దూరంగా నిలబడి చూస్తున్న రేఖా, మాధవిలో ఉన్న కలలు విరిగి ముక్కలైనట్లు ఆమె మొహం చూసినప్పుడు రేఖాకు బాగా క్లియర్ గా  తెలిసింది. తనలోనే నవ్వుకుంది.

మరుసటి రోజు విశ్వం రాలేదు. కానీ, ప్రొద్దున ఆరు గంటలకు మాధవి అన్నయ్య హాస్టల్ కు వచ్చాడు. మాధవి అతనితో బయలుదేరి వెళ్ళింది. రేఖానూ, కుసుమ నూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

కానీ, ఇది పర్మనెంట్ విజయం కాదు రేఖా. మనకు కొంచం అవకాశం దొరికింది.  ఇంకోసారి ఆ విశ్వంను వదలకూడదు

"మొదట్లో నాకూ కొంచం భయంగానే ఉన్నది కుసుమా. ఇప్పుడు కొత్త నమ్మకం వచ్చింది. ఇక మీదట నుండి వాడిని నేను చూసుకుంటా...బాధ పడద్దు!"

ఆ రోజు సాయంత్రం...అన్నా, చెల్లెలు ఒక అద్దె టాక్సీలో వచ్చి దిగారు. మాధవి ముఖంలో ఎటువంటి చిరాకో, మూతి విరుపుడో కనబడలేదు. సంతోషంగానే ఉన్నది.

అప్పుడు రేఖా హాస్టల్లో లేదు. కుసుమ మాత్రమే వాళ్లను చూసింది.

ప్రేమికుడితో ఉరు వెళ్లలేకపోయేమే?’ అంటూ విసుగుతో బయలుదేరి వెళ్ళిన మాధవి ఇప్పుడు ఆనందంగా తిరిగి వచ్చిందేమిటి?  అన్నయ్య, చెల్లిని ప్రేమతో ముంచి, ఆమె మనసును మార్చాడా?

నవ్వుతూ ఆలొచిస్తూ ఉన్నప్పుడు, ఆ టాక్సీ యొక్క ఇంకొక డోర్  తెరుచుకుంది. అందులో నుండి విశ్వం దిగాడు.

గిరిధర్ దయచేసి డబ్బులు తీయకు...ఈసారి నేను ఇస్తాను అన్నాడు నవ్వుతూ!

                                                                                                    ************************

 “బాగా చూసావా?”

చూసాను రేఖా...వాడే

ఇదెలా సాధ్యం? మాధవి తన అన్నయ్య దగ్గర తన ప్రేమ వ్యవహారం చెప్పుంటుందా? చెప్పున్నా...సాయంత్రంలోపే ఒప్పేసుకుని వాడ్ని స్నేహితుడిగా చేసుకున్నాడా?”

ఉండొచ్చు! కానీ, అదీ ఒక విధంగా మంచిదే కదా?”

ఎలా?”

వాళ్ళ అన్నయ్యకు విషయం తెలిస్తే, విశ్వం వల్ల మాధవిని మోసం చేయటం కుదరదుగా?”

అలా చెప్పటానికి వీలు లేదు. మొసం చేయాలనుకునే వాడు ఎలాగైనా మోసం చేస్తాడు!

కుసుమ సమాధానం చెప్పేలోపు హాస్టల్ గది తలుపును ధబేల్ మంటూ తోసుకుని మాధవి లోపలకు రావటం జరిగింది.

రేఖా...నీ దగ్గర కొంచం మాట్లాడాలి

అయుతే నేను వెడతా అని లేచింది కుసుమ.

రేఖా వద్దు  అని చెప్పేలోపు హడావిడిగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది కుసుమ.

మాధవి జాగ్రత్తగా తలుపులు మూసి వచ్చింది. రేఖాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని రేఖాని కల్లార్పకుండా చూసింది.

పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రొద్దున నేను లేచేటప్పటికే నువ్వు ఆఫీసుకు వెళ్ళిపోయావు!

నేను ఈ రోజు ఆఫీసుకు వెళ్ళలేదు

అలాగా...ఎందుకు?”

నీకు తెలియదా?” అని అడిగేసి ఆమెనే దీర్గంగా చూస్తుంటే, గబుక్కున తల దించుకుంది రేఖా.

కొద్ది క్షణాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. తరువాత రేఖానే మాటలు మొదలుపెట్టింది ఏదో మాట్లాడాలని చెప్పావు?” అన్నది.

నేను ఏం మాట్లాడబోతోనో నీకు తెలియదా?”

అదెలా...చెబితేనే కదా తెలుస్తుంది?”

అంత యాక్టింగ్ వద్దు అంటూ ముందుకు వచ్చి, రేఖా చేతిని గట్టిగా పట్టుకుంది మాధవి.

నీకు ఏమిటే సమస్య? ఎందుకే మళ్ళీ మళ్ళీ నా దార్లోకి వస్తున్నావు?”

నువ్వేం చెబుతున్నావో నాకు అర్ధం కావటం లేదు మాధవి

మళ్ళి మళ్ళీ అదే అబద్దం చెప్పకు అంటూ చెప్పి లేచిన మాధవి ఆమె చేతులు విడిచిపెట్టింది.

నిన్న మా అన్నయ్యకు ఫోన్ చేసింది నువ్వే కదా?”

మీ అన్నయ్యతోనా?”

అవును! కానీ, మాట్లాడలేదని చెప్పకు. అతని ఫోన్ తీసి చూసాను. నీ నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఆ తరువాత వాడు నన్ను చూడటానికి వచ్చాడు. దీనికి ఏమిటి అర్ధం?”

మాధవీ నేను...

అదే అడుగుతున్నా. నీకేమిటి సమస్య? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేనూ, విశ్వం వైజాగ్ వెళ్లటం నీకు నచ్చలేదు. దాన్నెందుకు ఇంత ప్లాన్ వేసి పాడు  చేయాలి?”

“......................”

నీకేమన్నా ప్రేమ ఓటమి నా? ఎవరు ప్రేమించుకున్నా నీకు నచ్చదా? నాకు దొరకని జోడి, ఎవరికీ దొరక కూడదని అడ్డు తగిలి ఆపుతున్నావా?”

మాధవీ, ఆ...

విశ్వం ను నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. మా అన్నయ్యా, అతనూ మంచి స్నేహితులు. నువ్వు అనుకునేటట్టు నేనేమీ చిన్న పిల్లను కాను. బాగా ఆలొచించే అతన్ని ప్రేమిస్తున్నాను. అది నీ కెందుకు నొప్పి పుడుతోంది?”

ఆ రోజు లాగానే ఈ రోజు కూడా నువ్వు నన్ను మాట్లాడ నివ్వటం లేదు మాధవీ. దయచేసి ఒక్క నిమిషం....నేను చెప్పేది కొంచం విను

విన్నంత వరకు...నువ్వు మాటాలాడినంత వరకు చాలు! అన్న మాధవి ఆమె కళ్ళళ్ళోకి తిన్నగా చూసింది.

“............................”

నాకు విశ్వం నచ్చాడు. అతనికి నేను నచ్చాను...అంతే. పద్దతిగా మా ఇంట్లో చెప్పి పెళ్ళి చేసుకుంటాను. మేము సంతోషంగా జీవిస్తాం. నువ్వు తలుచుకున్నా దీన్ని ఆపే ఛాన్సే లేదు

నీ సంతోషాన్ని నేనెందుకు పాడు చేస్తాను?”

అదే నేనూ అడుగుతున్నా. ఎందుకు నువ్వు మా అన్నయ్యతో మాట్లాడావు? సినిమాలలో లాగా నువ్వు మమ్మల్నిద్దరినీ వేరు చేద్దం అనుకుంటున్నావా? అది జరగదు

నీ మంచికే చెబుతున్నా...దయచేసి నన్ను కాసేపు మాట్లాడనివ్వు

ఈ డైలాగులన్నీ ఇంకెవరి దగ్గరన్నా పెట్టుకో. నేను యధార్ధంగా ఆలొచించే అమ్మాయిని. నీ మొహమే చూడకూడదని వేరే హాస్టల్ కోసం వెతికేను. ఈ సమయంలో మంచి హాస్టల్ దొరకలేదు. ఇంకో రెండు మూడు రోజులే. దాని తరువాత నీ కళ్ళకు మా ప్రేమ దురద పెట్టదు సరేనా?”

సరే...ఇకమీదట నీకు నావలన ఎలాంటి డిస్టర్బన్స్ ఉండదు

చాలా మంచిది. నేను వస్తాను

ఒక్క నిమిషం మాధవీ

ఏమిటది?”

ఏదో ఒకరోజు నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోయేమే నని బాధ పడతావు. అప్పుడు చాలా కృంగిపోతావు!

ఇలా భయపెట్టే పనులన్నీ నా దగ్గర వద్దు. నీ పనేమిటో దాన్ని సరిగ్గా చేసుకో. లేదంటే...ఇలా వెతుక్కుంటూ వచ్చి గదిలో మాట్లాడను. అందరి ముందు నిన్ను నిలబెట్టి అవమాన పరుస్తాను. ఇదే నీకు చివరి హెచ్చరిక వస్తాను

రేఖా అలాగే చూస్తూ ఉండిపోయింది.

***********************************************PART-7******************************************

"రేఖా మ్యాడం, మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు"

మనకోసం ఎవరు వచ్చుంటారు?’ అని మనసులో అనుకుంటూ ఎవరు?” అని అడిగింది.

తెలియదు...ముందు గదిలో ఉన్నారు

రేఖా ఆ గది దగ్గరకు వెళ్ళింది.

లోపల ఉన్నది ఎవరనేది తెలియలేదు. తలుపు తెరిచినప్పుడు అక్కడ పుస్తకం తిరగేస్తున్నాడు విశ్వం. లేచి నిలబడి, “రేఖా... అన్నాడు.

నేనే అన్నది.

ఇతనెలా ఇక్కడికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు?’

నా పేరు విశ్వంఅంటూ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చెయ్యి జాపాడు. అతని మొహంలో కొంచం కూడా కోపం లేదు.

కూర్చోండి! నన్ను చూడటానికా వచ్చారు?”

అవును...

ఏమిటి విషయం?”

మీరు మాధవి యొక్క రూమ్ మేటే కదా?”

ఇప్పుడు కాదు. ఒకే ఒక రోజు ఆమెకు రూమ్ స్నేహితురాలిగా ఉన్నాను. ఎందుకు అడుగుతున్నారు?”

విశ్వం కొంచం తటపటాయిస్తూ నిన్న రాత్రి మాధవి మీ గురించి చెప్పింది. మీకు నా మీద ఏదైనా కోపమా?”

ఎందుకు అలా అడుగుతున్నారు?”

మేము ప్రేమించుకోవటం మీకు ఇష్టం లేదు. మమ్మల్ని వేరు చేయటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది  నిజమా?”

సమాధానం చెప్పటానికి రేఖా ఆలొచించింది. ఆ తరువాత ఒక ధైర్యం వచ్చింది.

తప్పు చేసిన ఇతని ముందు నేనేందుకు భయపడాలి? నిజం చెబితే ఏం జరుగుతుంది?’ కొంచం నిదానంగా ఆలొచించి, మాటలు కూడ్చుకుని మిస్టర్ . విశ్వం అవీ ఇవీ మాట్లాడ కుండా తిన్నగా విషయానికి వస్తాను. మీకు మథులత జ్ఞాపకం ఉందా?” అన్నది.

అలా అడిగిన వెంటనే అతను ఆశ్చర్యపోతాడని ఎదురు చూసింది. అతనో చాలా కూల్ గా జ్ఞాపకం ఉంది అని చెప్పి అమెను ఏ రోజూ నేను మరిచిపోలేను. మీకెలా మథులత తెలుసు?” అడిగాడు.

ఏమండీ ఆమెను మర్చిపోలేనూ అని చెబుతూనే మాధవిని ప్రేమిస్తున్నారా? ఇలా చెప్పటానికి మీకు సిగ్గుగా లేదూ?”

ఛఛ. నేను మర్చిపోలేనని చెప్పింది ఆ అర్ధంతో కాదు! అర్జెంటు పడుతూ నిరాకరించాడు.

అయితే దానికి అర్ధమేమిటి?”

మథులతని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మాట నిజమే! కానీ, ఇప్పుడు ఆమె నా మనసులో లేదు. మాధవి మాత్రమే ఉంది

అదే ఎందుకు అని అడుగుతున్నా? మథులతని వదిలేసింది ఎందుకు?”

తప్పుగా చెబుతున్నారు! వదిలేసింది నేను కాదు...ఆమే

ఇదేమిటి కొత్త నాటకం?”

మీకు మథులతని పర్సనల్ గా తెలియదు అని నేను అనుకుంటున్నాను. ఒక వేల తెలిసుంటే కూడా, ఆమె యొక్క ఒక మొహాన్నే మీరు చూసుంటారు. ఆమెకు రెండు మొహాలున్నాయి.

బయటకు కనబడే మొహం చూసే నేను ఆమెను ఇష్టపడ్డాను. కొంచం సన్నిహితంగా స్నేహం చేసినప్పుడే ఆమెకున్న రెండో మొహం కనబడింది. అదే వెర్రి తనం

వెర్రి తనమా?”

ఆమె మామూలు ఆడదే కాదండి. తనని సన్నిహితంగా స్నేహం చేసే వారిని తన కాలు కింద నొక్కిపెట్టుకుని శాసించాలనే రకం అన్నాడు విశ్వం.

“……………”

ఆమెకు...తాను అనుకున్నట్టు ప్రపంచం జరగాలి. కాదంటే విపరీతమైన కోపం వస్తుంది. పిచ్చి పిచ్చిగా తిడుతుంది. కొడుతుంది. చాలా దెబ్బలు తిన్నాను ఆమె దగ్గర...అందులోనూ పలువురి ముందు!

రేఖా నమ్మలేక చూస్తూ ఉండిపోయింది! ఇతను చెప్పేది నిజమా? లేక గుట్టు బయట పడిపోయిందే నన్న భావనతో ఏదేదో చెబుతున్నాడా?’

మథులత యొక్క ఆ రెండో ముఖాన్ని నేనూ ఒక విధంగా ఆరాధించాను. ఆమె కోసం నన్ను నేను మార్చుకుందామని చూశాను. ధైర్యంగా చెప్పాలంటే భార్యా బానిసుడిగా, ప్రేమ దాసుడిగా తిరిగాను

“……………….”

ఎందుకనో, అది కూడా మథులతకి చాలలేదు. ఆమె నన్ను ఒక ఆడుకునే బొమ్మలాగా, బాక్సింగ్ వీరులు మట్టి మూటలు గుద్దుతారే, ఆ మట్టి మూటలాగానే నన్ను ఉపయోగించుకుంది. మళ్ళీ మళ్ళీ పలు రకాలుగా అవమానపరచింది. అన్నిటినీ ఓర్చుకున్నాను. కానీ ఒక రోజు ఇక మీదట నన్ను చూడటానికి రాకు అని చెప్పింది. అది కూడా ఏ కారణమూ లేకుండా!

“………………..”

మొదట సరాదాకోసం చెప్పిందెమో ననుకున్నా. కానీ, మరుసటి రోజే ఆత్మహత్యకు పూనుకున్నదని తెలిసింది. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తేను. ఆమెను చూడలేకపోయాను. మంచి కాలం చావు తప్పించుకుందని తెలుసుకుని సంతోషపడ్డాను

అదే నేను ఆమెను చివరిసారిగా చూసింది. ఆ తరువాత చాలాసార్లు ఆమె ఆఫీసుకూ, హాస్టల్ కూ వెళ్ళాను. నన్ను చూడనని, చూడటం ఇష్టం లేదని చెప్పేసింది!

రేఖా నిటారుగా కూర్చుంది.

మిస్టర్. విశ్వం మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. ఏ కారణమూ లేకుండా అన్ని రోజుల తరువాత మథులత మిమ్మల్ని నిరాకరించిందని చెబుతున్నారా?”

అవునండీ...అదే నిజం. దాని వలనే నేనూ నిరాశపడ్డాను. ఏదైనా కారణం ఉండుంటే, నేను చేసిన తప్పుకు శిక్ష అనుకోవచ్చు. కారణమే లేకుండా ఇలా చేస్తే ఏమిటి అర్ధం?”

అలాంటప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది?”

తెలియదండీ! ఒకవేల అలా చేసి నాకు పెద్ద శిక్ష  వేయాలని అనుకుందేమో? ఎవరైనా డిటెక్టివ్ నిపుణుడిని అపాయింట్ చేసి తెలుసుకుంటేనే తెలుస్తుంది

అలాగైతే.... మథులతకి పిచ్చి -- పిచ్చి పట్టిన మనసు అంటున్నారా?”

ఛఛ...అలా కాదండీ.  అధికారభావం, అహంభావం అయ్యుండొచ్చు. దానికి ఆత్మహత్య చేసుకోవాలా? కానీ, ఎందుకు అలా చేసింది అనేది నాకు తెలియదు అని ఇందాకే చెప్పాను. ఆ వయసులో నేనూ చిన్న పిల్లాడ్నే కదా? ఈ వినోదమైన ప్రేమ ఓటమి నన్ను బాగా కృంగదీసింది. నేను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను. కానీ, దానికి ధైర్యం చాల లేదు

ఆత్మహత్యకు ధైర్యం కావాలని చెప్పకండి. అది చేతకాని తనం అన్న రేఖా, "ఇప్పుడు మీరు మథులత గురించి ఇలా చెబుతున్నది నాకు ఆశ్చర్యంగానూ, షాక్ గానూ ఉన్నది. ఆమె మీ గురించి వేరే విధంగా చెప్పిందే!

మథులత మీ ఫ్రెండా?”

బాగా డియరెస్ట్ ఫ్రెండ్. ఆమె ఆత్మహత్యకు పాల్పడినప్పుడు నేను ఆమెకు ఫ్రెండుగానే ఉన్నాను. నా సన్నిహిత స్నేహంతో ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డావు. చెప్పు అని గట్టిగా అడిగాను.  నువ్వు మోసం చేసేవని, అంతకంటే తనని ఏమీ అడగవద్దని చెప్పింది. అదే నేను కూడా ఆమెను చివరగా చూసింది. నాకు వేరే ఉద్యోగం రావటంతో నేను ఆ హాస్టల్ విడిచి వేరే చోటుకు వెళ్లాను. ఆ తరువాత ఆమెను కలిసింది పది రోజుల క్రితమే. అది కూడా మీ గురించే. అప్పుడు చెప్పింది మిమ్మల్ని ఆమె వదిలేయటానికి కారణం"

నా గురించి ఏం చెప్పింది ఆత్రుతతో అడిగాడు విశ్వం.

రేఖా కొంచం తటపటాయించి మీరు ఆమెను  వాడుకుని...వదిలేసేరని చెప్పింది

పచ్చి అబద్దం గట్టిగా అరిచి చెప్పిన అతను షాకై మళ్ళీ చెబుతున్నాను...వదిలేసింది నేను కాదు. ఆమే!

నేను ఇది నమ్మలేకపోతున్నాను

మీరు ఆమె పుట్టిన రోజును వైజాగ్ లోని మీ స్నేహితుని ఇంట్లో జరుపుకుందామని ఆమెను వైజాగ్ తీసుకువెళ్లారా?”

నా పుట్టిన రోజును వెరైటీగా జరుపుకోవాలని మథులత నా దగ్గర చెప్పినప్పుడు, వైజాగ్ బీచ్ లో జరుపుకుందాం. వైజాగ్ లో నాకొక స్నేహితుడున్నాడు అతను మనకు కావలసిన సహాయం చేస్తాడు అని చెప్పాను...కానీ మేము ఏ రోజూ వైజాగ్ వెళ్లలేదు. ఆమె పుట్టిన రోజుకు ముందే ఆమె నన్ను వదిలంచుకుందే

మీరు చెప్పేది ఇంకా నేను నమ్మలేకపోతున్నాను

అది మీ ఇష్టం"అంటూ లేచి నిలబడ్డ విశ్వం మథులతని విడిపోయిన తరువాత, ఇక ఆడపిల్లలనే నమ్మకూడదని నిశ్చయించుకున్నాను. కొన్ని సంవత్సరాల తరువాత మాధవితో పరిచయం ఏర్పడింది. స్నేహితుడిగానే నడుచుకున్నాను. కానీ, మాధవినే నాపై తన ప్రేమను తెలిపింది. నేను అవుననటానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఆ ఆలశ్యమే మాధవికి నామీద ఎనలేని నమ్మకాన్ని కలిగించింది.

ప్రేమించుకోవటం మొదలుపెట్టాము. ఇదే నిజం. నేను ఎవరినీ మోసం చేయలేదు! ఒకసారి ప్రేమించి ఓడిపోయిన వాడికి మళ్ళీ ప్రేమ పుట్టకూడదా? అదేమైనా పెద్ద తప్పా?” అన్నాడు.

మిస్టర్. విశ్వం నేను ఓపెన్ గానే చెబుతున్నాను. ఒక వేల మీరు చెప్పింది నిజమే అయినా, దాని వల్ల ఇప్పుడు ఏదీ మారబోయేది లేదు. నేను మాధవి దగ్గర మీ గురించి, మథులత గురించి చెప్పటానికి ప్రయత్నించాను. ఆమె వినలేదు...ఇక మీదట వినదు కూడా

అందుకని

ఇక ఇది మీ జీవితం. నా ట్రబుల్ మీకు ఉండదు. మీరు మంచి వారుగా ఉంటే మాధవినే పెళ్ళి చేసుకుని సంతోషంగా జీవించండి. అబద్దమైన మనిషిగా ఉంటే...నా మాటలు వినని తప్పుకు మాధవి శిక్ష అనుభవిస్తుందిఅని చెప్పి గాజు తలుపును తోసి ఇక మీరు బయలుదేర వచ్చు అన్నది.

చాలా థ్యాంక్స్

మీరు థ్యాంక్స్ చెప్పేటంత పని నేనేమీ చెయ్యలేదు. ఇంకా మథులతనే నమ్ముతున్నాను

పరవాలేదండీ...మీరు చెప్పేటట్టు, ఏ రోజుకైనా నిజం తెలియకండా ఉంటుందా? నేను వస్తాను

అదే సమయం, వాళ్ళను దాటి వెడుతున్న ఒక అమ్మాయి, తటపటాయిస్తూ నిలబడింది.  విశ్వం ను చూసి ఆగింది. ఇతను మన మాధవి యొక్క ప్రేమికుడు కదా?’ అని తనలో తాను గొణుక్కుంటోంది. ఎందుకు ఇక్కడ రేఖాతో మాట్లాడుతున్నాడు?’

ఆమె దానితో ఆపుండచ్చు. మనసులో ఏదో సంచలనం. వాళ్ళిద్దరూ వెడుతుంటే తన మొబైల్లో ఫోటో తీసింది. ఆ ఫోటోను మాధవికి పంపించింది. ఏయ్, నీ ప్రేమికుడు వచ్చి మా ఆఫీసులో ఏం చేస్తున్నాడు?’ అనే మెసేజీతో!

***********************************************PART-8******************************************

ఆ తరువాత ఐదో నిమిషానికి రేఖా మొబైల్ మోగింది.

మాధవి అన్న పేరు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఈ టైములో ఈమె ఎందుకు ఫోన్ చేస్తోంది?’

ఆలొచనతో ఫోన్ ఆన్ చేసింది.

ఆ రోజు నేను చెప్పలేదు...కానీ, నిన్న రాత్రి అంత బలవంతం చేసి అడిగేనే! అప్పుడైనా నిజం చెప్పుండచ్చు కదా?”

ఏం నిజం మాధవీ?”

మీరిద్దరూ….అదే నువ్వూ, విశ్వం కలిసి తిరగటానికే కదా నన్ను వదిలించుకోవటానికి ప్రయత్నం చేశారు? అది డైరెక్టుగా నాతో చెప్పుంటే  నేనే తప్పుకునే  దానినే!

ఛఛ... పిచ్చిగా మాట్లాడకు. మీ దారికే రానని నేను నిన్నే మిస్టర్. విశ్వం దగ్గర చెప్పాను కదా?”

నువ్వెందుకు నా దారికి రావటం? ఇప్పుడే కదా మీ దారి ఏమిటో నాకు తెలిసింది! బాగా అనుభవించండి

ఏం చెబుతున్నావు?”

నువ్వూ, విశ్వం ఇక నన్ను చూసి భయపడక్కర్లేదు. కష్టపడి నన్ను బయటకు తోయక్కర్లేదు. బహిరంగంగానే ప్రేమించుకోవచ్చు

నేనూ... విశ్వం నా? పిచ్చిగా మట్లాడకు!

ఇంతవరకు నేను పిచ్చిగానే ఉన్నాను. ఇప్పుడంతా క్లియర్ అయ్యింది. నిన్ను కూడా నేను క్షమిస్తాను...ఇన్ని సంవత్సరాలు నాతో తిరిగి ఇప్పుడు మోసం చేస్తున్నాడే...వాడిని ఏ రోజూ మన్నించను అని ఫోను పెట్టేసింది.

అప్పుడే రేఖాకు అంతా అర్ధమయ్యింది. విశ్వం, తనూ కలిసి మాట్లాడుతూ ఉండటాన్ని, ప్రేమించుకుంటున్నట్టు అనుకుంది. అందుకే వాళ్ళ ప్రేమను నేను విడగొడుతున్నానని తీర్మానించుకుంది.

కానీ, మేము కలుసుకున్నది మాధవికి ఎలా తెలుసు? ఇప్పుడు అదా ముఖ్యం? ఈ విషయాన్ని విశ్వం కు ఎలా చెప్పాలి? నా దగ్గర అతని ఫోన్ నెంబర్ కూడా లేదే!

రేఖాకు తల నొప్పి మొదలయ్యింది. చాలా స్పీడుగా అది ఎక్కువ అయ్యింది. ఆఫీసుకు హాఫ్ డే లీవు పెట్టి బయలుదేరింది.

హాస్టల్ చేరుకున్నప్పుడు, బయటే నిలబడుంది వార్డన్. రేఖా మాట్లాడేలోపు ఏమ్మా, ఆ మాధవితో మళ్ళీ గొడవపడ్డావా?” అన్నది.

లేదే...ఏం, ఏమైంది?”

హాస్టల్ ఖాలీ చేసేసి వెళ్ళిపోయింది. ఏం కారణమో చెప్పలేదు. అలా ఏమిటో అర్జెంటు?”

ఏక్కడికి వెల్తోందో చెప్పిందా?”

ఊహూ...నీతో లాగా ఇప్పుడు ఎవరితో గొడవపడిందో తెలియటం లేదు. ఇలాంటి అమ్మాయిలకు హాస్టల్ కంటే ఇల్లే మేలు!

రేఖాకు తలనొప్పి విపరీతంగా పెరిగింది.

అవును...నువ్వెందుకు త్వరగా వచ్చేసావు?”

ఒంట్లో బాగుండలేదు

అయ్యయ్యో...ఫీవరా?” అంటూ రేఖా నుదుటి మీద చెయ్యిపెట్టి చూసింది.

లేదు! తల నొప్పిగా ఉంది. కాసేపు నిద్రపోతే తగ్గిపోతుంది" అని చెప్పేసి తన రూముకు వచ్చింది. బట్టలు మార్చుకోవాలనే ధ్యాస కూడా లేకుండా మంచం మీద వాలిపోయింది

చాలాసేపైనా నిద్ర పట్టలేదు. విధవిధమైన దృశ్యాలు మెదడు లోపలకు వచ్చి వెడుతున్నాయి.

ఆ విశ్వం చెప్పింది కరెక్టుగానే ఉంటుందా? మథులత అలాంటి అమ్మాయా? కొంచం గర్వంగా మాట్లాడుతుంది. అలాగే కొంచం అహం కూడా ఉంది...తెలుసు. దాని కోసం ఒకడ్ని బాధ పెట్టటానికి ఒకత్తి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటుందా?’

ఒకవేల అతను చెప్పేది అబద్ధం అయితే, మాధవి ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి నేను సంతోష పడాలి. ఏదో ఒక కారణం చేత మాధవి , విశ్వం ను విడిచిపెట్టటం మంచిదే! నాతో మాట్లాడకపోయినా  పరవాలేదు

కానీ అతను చెప్పేది నిజమైతే! తప్పు చేయకుండా రెండోసారి శిక్ష. ఇది అతను తట్టుకుంటాడా? పోయిన సారి 'ఆత్మహత్య చేసుకుందామా' అని ఆలొచించిన అతను, ఈ సారి నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే? దానికి నేనూ ఒక కారణం  అయిపోతానే!

ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది.

ఎంత అబద్దం ఇది? మాధవినూ, విశ్వం నూ విడిపోవాలని ప్రయత్నం చేసిన నేను...వాళ్ళు నిజంగానే విడిపోయారు అని  సంతోషపడటం కూడా పడలేక పోతున్నానే!

అతను మంచివాడా...చెడ్డవాడా? ఇది ఎలా తెలుసుకోవటం? ఈ సమస్యలో నేను తల దూర్చి ఉండకూడదనుకుంటా!

రేఖా తల పటుకుని మళ్ళీ మంచం మీద వాలిపోయింది. ఎప్పుడు నిద్రపోయిందో...ఆమెకే తెలియదు!

                                                                                       ***********************************

మూడో రోజు ప్రొద్దున విశ్వం దగ్గర నుండి పిలుపు.

మాధవి ఎక్కడ...మీకు తెలుసా?”

నాకు తెలియదు విశ్వం! నన్ను ఎందుకు అడుగుతున్నారు?” విసుగ్గా అడిగినప్పుడు కూడా, అది తెలుసుకోవాలనే ఆత్రుత ఆమెలో ఉన్నది.

క్షమించండి! హాస్టల్లో లేదని చెబుతున్నారు. ఆఫీసుకు వెళ్ళి అడిగాను...నన్ను చూడను అని చెప్పి పంపించేసింది

దేనికి?”

తెలియటం లేదే! ఒక రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఆమె వచ్చేంత వరకు వైట్ చేసి చూడాలని ఉన్నాను. కానీ, వేరే బస్సులో ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని తరుముకుంటూ వెళ్ళినా లాభం లేకపోయింది

రేఖాకు జాలి వేసింది.

నిజం చెప్పేద్దామా?’

ఒక వేల ఆమె ఎక్కడుందో తెలిస్తే ఈ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడండి...అన్న అతను కొంచం తటపటాయిస్తూ మథులత లాగానే మాధవి కూడా మారిపోయిందో నని భయంగా ఉంది. నా దగ్గర ఆమెకు ఏం సమస్యో తెలియటంలేదు. అందరూ నామీద ఎక్కి సవారీ చేసి నన్ను హింసిస్తున్నారు! అని బాధపడ్డాడు.

అలాగంతా ఏమీ ఉండదండీ...మీరు బాధపడకండి అన్నది రేఖా.

“………………”

నేను కొంచం విచారించి చూస్తాను. మాధవి గురించి ఏదైనా వివరం దొరికితే మీకు చెబుతాను. ధైర్యంగా ఉండండి!

                                                                                 ************************************

 “బాగా తెలుసా రేఖా?”

మళ్ళీ మళ్ళీ అదే అడిగితే ఏమిటి అర్ధం?”---విసుగ్గా వెనక్కి తిరిగింది.

ఇక్కడికొచ్చిన దగ్గర నుండి ప్రతి శుక్రవారం ఈ గుడికి వస్తానని ఒకసారి మాట్లాడుతున్నప్పుడు జానకీతో మాధవి చెప్పిందట. అది మాత్రమే నాకు తెలుసు

కానీ, ఇప్పుడున్న మనో భావనకు గుడికి రావాలనిపిస్తుందా ఆమెకు?”

కుసుమా, నీకు తెలియదా? మనసు కష్టంగా ఉన్నప్పుడే గుడికి వెళ్లాలి అనిపిస్తుంది

తను వస్తుందా అని అడుగుతున్నా?”

ఖచ్చితంగా! కాసేపు నీ వాగుడు ఆపి కాఫీ తాగు

వాళ్ళు కూర్చున్న టీ కొట్టు నుండి చూస్తే గుడి వాకిలి బాగా తెలుస్తోంది. మాధవి రావటం  గమనించాలి గనుక తన కళ్ళను తధేకంగా అటువైపే ఉంచి చూస్తోంది రేఖా.

శుక్రవారం కనుక గుడిలో జనం ఎక్కువగా ఉన్నారు. అందులోనూ ఎక్కువ మంది ఆడవారే. వాళ్ల మధ్యలో మాధవిని ఎలా వెతకటం. 

కుసుమకు వచ్చిన అదే సందేహం రేఖాకూ వచ్చింది. ఒక వేల ఆమె రాలేదంటే?’

శ్రమ పడి ఆ ఆలొచనను తరిమి కొట్టారు. రెండు రోజులుగా మాధవిని వెతకని చోటు లేదు!

ఈ లోపు విశ్వం ఇరవై సార్లు మొబైల్ ఫోనులో పిలిచాడు. అతనూ ఇంకో పక్క వెతుకుతూనే ఉన్నాడు. ప్రయోజనం లేదు.

ఏదో కోటలోకి వెళ్ళేటట్టు, ఆఫీసులోకి వెళ్ళి దాక్కుంటోంది. అక్కడ నుండి ఎప్పుడు బయటకు వస్తోంది...ఎలా బయటకు వస్తోంది...ఎవరితో వస్తోంది...ఎక్కడికి వెడుతోంది, ఏదీ తెలియటం లేదూ అని గొణుక్కుంది.

టైము ఏడు దాటింది. కాంతి  తక్కువగా ఉన్న లైట్ల వెళుతురులో...వచ్చే ఆడవారి గుర్తులు చూడటం కష్టంగానే ఉంది.

మాధవి వచ్చిన వెంటనే ఆమె దగ్గర ఏం మాట్లాడబోతావు?” అన్నది కుసుమ.

నేను కాదు...నువ్వే మాట్లాడబోతావు!

నేనా?”

మరి...నిన్ను వేడుక చూడటానికి తీసుకు వచ్చాను అనుకుంటున్నావా? నువ్వే దాని దగ్గర మాట్లాడాలి!

నేనెందుకు రేఖా? నాకు అది సన్నిహిత స్నేహితురాలు కాదే!

నాకు కూడా ఆమె సన్నిహిత స్నేహితురాలు కాదు. కానీ ఇప్పుడు అది ఉన్న మనో భావనలో నన్ను చూస్తేనే కేకలు మొదలుపెడుతుంది. నీతో కొంచం సహజంగా మాట్లాడే అవకాసం ఉంటుంది

నువ్వు చెప్పినా వినని ఆమె, నేను చెబితే వింటుందా?”

నిజమే...కానీ, ఒక ప్రయత్నం చేయాలి. ఆ రోజు నా రూములో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లేవే, దానికి ప్రాయిశ్చిత్తంగా ఈ సహాయం చేసి పెట్టు

నీతో పెద్ద కష్టం అయిపోయిందే అంటూ తన తల వెంట్రుకలను సరి చేసుకున్న కుసుమ మొదట్లో వాళ్ళిద్దర్నీ విడదీయాలని చూశావు! ఇప్పుడు నువ్వే వాళ్ళిద్దర్నీ కలపాలని చూస్తున్నావు

కలపాలని అనుకోవటం లేదు! వాళ్ళిద్దరి మధ్యా నా వల్ల ఏర్పడిన గందరగోళాన్ని సరిచేయబోతాను. అంతే...?”  

ఒకవేల నువ్వు మొదట్లో అనుకున్నది నిజమయ్యి... అదే ఆ విశ్వం చెడ్డవాడుగా ఉంటే?”

దానికీ అవకాశం ఉంది. దాని కోసం నన్ను ద్రోహిగా చేసి మాధవి, విశ్వం దగ్గర నుండి  విడిపోకూడదు. వాడు మథులతకి చేసిన ద్రోహాన్ని తెలుసుకుని, వాడు మంచి వాడు కాదని గ్రహించి విడిపోవాలి. అందుకోసమే కదా ప్రయత్నించాను? కానీ నేనూ, విశ్వం ప్రేమించుకుంటున్నా మని తప్పుగా అర్ధం చేసుకుని విడిపోకూడదు

కుసుమ సమాధానం చెప్పకుండా గుడివైపు తిరిగింది. అక్కడ్నుంచి వస్తున్న ఆడవాళ్ళందరూ మాధవి లాగానే కనబడుతున్నారు. కానీ, మాధవి వస్తున్న సూచనలు కనబడలేదు.

ఇంకో కాఫీ తాగుదామా?”

ఆకలిగా ఉందా ఏమిటి?”

లేదే, ఇక్కడే నిలబడుంటే చూసేవాళ్లకు అనుమానం వస్తుంది

గుడిలోకి వెళ్ళి కూర్చుందామా?”

సరే! కానీ, కొంచం గుడి ఎంట్రన్స్ దగ్గరగా కూర్చోవాలి. ఇది పెద్ద గుడి. ఎంట్రన్స్ లోనే ఆమెను  గమనించలేకపోతే...ఆ తరువాత పట్టుకోవటమే కష్టం

ఇద్దరూ గుడిలోకి వెళ్ళి కూర్చున్నారు. దానికోసమే కాచుకోనున్నట్టు మాధవి లోపలకు వచ్చింది.

ఆమె మొహంలో ఒక నిదానం కనబడింది. కోపంలో ఉన్నట్టు అనిపించలేదు. రెగులర్ గా ఆధునిక డ్రస్సులో ఉండే మాధవి ఆ రోజు చీర కట్టుకుని ఉంది.

రేఖా గబుక్కున లేచింది. నేను ఆ మండపంలో ఉంటా కుసుమా. నువ్వు మాధవి దగ్గరకు వెళ్ళు. మామూలుగా మాటలు ప్రారంభించు. విషయాన్ని క్లియర్ గా చెప్పు. నా స్నేహితురాలిగా మాట్లాడకు....అవకాశాన్ని పాడు చెయ్యకు!

చకచక మని రేఖాఎక్కడికో వెళ్ళిపోవటంతో, కుసుమ లేచి నిలబడింది.  మాధవిని చూడలేదన్నట్టు ఆమె నడిచే దొవలో నడవటం మొదలు పెట్టింది.

దర్శనం చేసుకుని మాధవి బయటకు వస్తున్నప్పుడు, అనుకోకుండా అటువైపు వస్తున్నట్టు ఎదురుగా వచ్చింది కుసుమ.

అరే. మీరు ఇక్కడ ఎలా?”

రండి అన్నది మాధవి. ఆమె కళ్ళు...పక్కన ఎవరినో వెతుకుతున్నట్టు అనిపించింది కుసుమకు.

ప్రతి శుక్రవారం ఈ గుడికి వస్తారా?”

అవును! మీరు?”

ఎప్పుడైనా వస్తాను అంటూ ఆమెతో పాటు నడిచింది కుసుమ.

హూ...'హాస్టల్ ఖాలీ చేశారా?”

“……………”

ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?”

వేరే ఇంకో చోటఅని సహజంగా చెప్పేసి నేను బయలుదేరుతాను అన్నది మాధవి.

ఇప్పుడేగా వచ్చింది...ఇంతలోనే బయలుదేరుతున్నారే?”

నేను ఎప్పుడు వచ్చానో మీకెలా తెలుసు?”  అనుమానంతో అడిగిన మాధవి, “ఇద్దరూ నా మీద గూఢచారిగా పని చేస్తున్నారా?” అంటూ ముఖంలో మార్పు తెచ్చుకుంది.

ఎవరిద్దరూ? నేను మామూలుగానే అడిగాను

ఆమె చిన్నగా నవ్వింది. నాకు తెలుసు కుసుమా. ఇంకా ఆ రేఖాకి పూర్తి తృప్తి కలగలేదనుకుంటా. నేను నిజంగా అవస్త పడుతున్నానా, లేదా అని చూడటానికేగా మిమ్మల్ని పంపించింది

ఛఛ. అదేమీ లేదండీ ఎందుకలా అడుగుతున్నారు?”

మాధవి మళ్ళీ నవ్వింది. మీరు అనుకున్నట్టు నేనేమీ బాధ పడటం లేదు...కష్ట పడటమూ లేదు! సంతోషంగానే ఉన్నాను

కానీ...

నా ఉద్యోగం కూడా రాజీనామా చేసేసాను

అయ్యయ్యో...ఎందుకు?”

మీ స్నేహితురాలు లాంటి వాళ్ళు ఉన్న ఊర్లో జీవించటం కూడా తప్పండి. ఇక ఇక్కడ ఉండకూడదని తీర్మానించుకున్నాను

కుసుమ షాక్ అయ్యింది.

నిజంగానా చెబుతున్నారు? ఎందుకండీ మీకు అంతకోపం? వేరే ఊరు వెళ్తున్నారా?”.

అవును కలకత్తా వెళుతున్నా. నాకు చూసిన వరుడు అక్కడే ఉన్నారు. వచ్చేవారం నిశ్చయతార్ధం. మీ అడ్రస్స్ ఇవ్వండి. పత్రిక పంపిస్తాను

***********************************************PART-9******************************************

ఆ రోజు రాత్రి విశ్వం మళ్ళీ ఫోనులో మాట్లాడాడు. రేఖా అతనితో ఏమీ చెప్పలేదు.

ఎప్పుడూలాగానే అతను మాట్లాడుతూనే ఉన్నాడు.

మాధవి వాళ్ళ అన్నయ్యను పిలిచి విచారిద్దాం అనిపిస్తోంది. అతను నాకు మంచి స్నేహితుడు. కానీ, ఈ టైములో ఏది మాట్లాడినా తప్పు అయిపోతుందేమోనని ఆలొచిస్తున్నా

నేనే గిరిధర్ గారితో మాట్లాడతాను అన్నది రేఖా.

మీకు ఆయన్ని తెలుసా?”

ఒకసారి ఆయనతో మాట్లాడాను. విచారించి చెబుతాను అని ఫోను పెట్టేసింది.

అప్పుడు ఆమెకు ఒక విషయం ఆలొచనకు వచ్చింది. ఇంతవరకు విశ్వమే ఆమెను పిలుస్తున్నాడు. ఆమెగా ఒక్క రోజు కూడా అతన్ని పిలిచి మాట్లాడింది లేదు.

మాట్లాడ కూడదు అని కాదు! ఈ విషయంలో ఖచ్చితంగా ఆమె ఏమీ చెయ్యలేని పరిస్థితి, అతనితో మాట్లాడటానికి సంకోచం-నేర భావన.

రోజు రోజుకూ విశ్వం స్వరంలో బాధ, ఆవేదన ఎక్కువ అవటం గ్రహించింది. ఇతను చెడ్డ వాడు కాదు అని అనిపించింది.

అందువలన రేఖాకు మాధవి మీద కోపం ఎక్కువ అయ్యింది.

ఏం ఆడది అది? ఎవరు మాట్లాడినా వినకూడదని పట్టుదల పడితే ఏమిటి అర్ధం? తానుగా ఏదైనా తీర్మానించుకోవటం...తరువాత అదే నిజమంటూ ఒంటి కాలు మీద నిలబడటం! దీని వలన నష్టం ఎవరికీ?’

ఆమె ఇప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతుందనేదే ఎదురు చూడలేదు. అర్జెంటు పెళ్ళికి ఒప్పుకోవటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది!

గిరిధర్ గారితో మాట్లాడి ఆ వరుడి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఏం? మాధవితో ఆయన మాట్లాడితే ఒక వేల ఆమె మనసు మారుతుందేమో?’

రేఖా తల పట్టుకుని కూర్చుండిపోయింది. కొంచం నిదానం తెచ్చుకుని సెల్ ఫోన్ తీసుకుంది. గిరిధర్ గారి నెంబర్ వెతికి పట్టుకుంది. ఫోన్ చేసింది.

నమస్తే

మీరు... హైమా కదూ? బాగున్నారా?”

మొదట ఆశ్చర్యపోయిన ఆమె తిరిగి మామూలు స్థితికి వచ్చింది అవునండి, బాగున్నాను అన్నది.

బాగున్నాను...మా మాధవి బాగుందా?” తిరిగి అడిగాడు గిరిధర్.

సరిపోయింది! ఆమె హాస్టల్ మారింది కూడా అన్నయ్యతో చెప్పలేదా?’ ఆశ్చర్యపోతూ ఏదో ఆలొచిస్తూ ఉన్నది.

ఏమిటండీ ఏదీ మాట్లాడటం లేదు?” అడిగాడు గిరిధర్. 

మాధవి బాగుందండిఅన్న రేఖా వచ్చేవారం ఊరికి వెడుతున్నానని చెప్పింది

అవునండీ...ఆమెకు పెళ్ళి నిశ్చయం అయ్యింది. మీ దగ్గర చెప్పుంటుందే?”

చెప్పిందండీ...ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా?”

తాంబూళాల ఫంక్షన్ చాలా సింపుల్ గా ఉండాలని అనుకున్నాము. అలాగే చేస్తున్నాము. పెళ్ళి పత్రిక పంపిస్తాను, తప్పక రావాలి

ఖచ్చితంగా వస్తాను! మాధవి ఎప్పుడు అక్కడికి వస్తోంది?”

ఏదో పనుందట. అదంతా పూర్తిచేసుకుని రేపు మధ్యాహ్నం రైలులో బయలుదేరి వస్తానని చెప్పింది

సరే నండి...మీరు హడావిడిగా ఉండుంటారు. తరువాత మాట్లాడతాను అని ఫోను పెట్టేసింది.

కనుక. మాధవి ఏదో మాటవరసకు చెప్పలేదు. నిజంగానే ఆమెకు నిశ్చయతార్ధం జరగబోతోంది. ఇది విశ్వంతో తో చెప్పేయటమే మంచిందీ

గిరిధర్ కు, విశ్వం సన్నిహిత స్నేహితుడు అని మాధవి చెప్పిందే... మాధవి నిశ్చయతార్ధానికి విశ్వం ను గిరిధర్ పిలవడా?’

అతను పిలవాలనుకున్నా...ఆమె అంగీకరించాలే

రేఖా కొన్ని నిమిషాలు ఆలొచించింది. విశ్వం ను పిలిచి మాట్లాడటానికి మనసు రాలేదు. కానీ, అతనితో విషయం చెప్పాలే.

ఆ తరువాతి అరగంట ఒకే విషయాన్ని పలురకాలుగా రాసి రాసి చూసుకుంది రేఖా. దాన్ని విశ్వం తో పక్వంగా చెప్పటం ఎలా అని ఆమెకు తెలియదు. అలాగే  నిద్రపోయింది.

                                                                                 **********************************  

విశ్వం, రేఖా ఆఫీసుకే వచ్చేసాడు.

అదే  గది. కానీ ఆ రోజు గందరగోళంలో ఉన్నట్టు కనిపించిన అతను ఈ రోజు దుఃఖం లో ఉన్నాడు. మాధవికి పెళ్ళి నిశ్చయ మయ్యిందట. వాళ్ళ అన్నయ్య చెప్పాడు అన్నాడు .

ఓ! అన్నది రేఖా. అంతకు మించి ఆమె వల్ల నటించటం కుదరలేదు. నేనూ నిన్ననే  విన్నాను అన్నది.

నేను ఈ రోజు విన్నాను అన్నాడు విశ్వం. ఇప్పుడు ఏం చేయాలండీ? నా మీద  ఎందుకు కోపం వచ్చిందో కూడా చెప్పకుండా ఇలా సడన్ గా ఇంక్కొకర్ని పెళ్ళి చేసుకోవాలనుకోవడంలో ఏమిటండీ అర్ధం? అమ్మాయలకని వెరే న్యాయమా?”

విశ్వం, ఆమె ఇలా చేయటానికి ఆమె వైపు ఏదో ఒక న్యాయం ఉండొచ్చు కదా?” అంటూ "మీరు ఆవేశపడకండి. తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం

ఇంక చేయటానికి ఏముంది?”

మాధవి ఈ రోజు మధ్యాహ్నం ఊరికి బయలుదేరుతోంది! రైల్వే స్టేషన్లో  ఆమెను కలిసి మాట్లాడి చూడండి. ఒక వేల ఆమె మనసు మారొచ్చు

నాకు ఆ నమ్మకం లేదండి. అయినా కానీ ప్రయత్నిస్తానుఅన్నాడు. తరువాత విరక్తిగా నవ్వి నేరుగా మాట్లాడటం మంచిదే! ఆమె ఒప్పుకుంటే అదే రైలులో ఊరికి వెళ్ళొచ్చు. లేదంటే చావటానికి రైలు పట్టాలు ఉన్నాయి అన్నాడు.

ఆమె షాక్ అవటం చూసి వూరకనే చెప్పేనండీ. నేను అంత ధైర్యం ఉన్నవాడినీ కాదు. అంత పిరికివాడ్ని కాదు అన్నాడు.

                                                                                       **********************************

విశ్వం ఒక్కొక్క రైలు పెట్టె ఎక్కి దిగితున్నాడు. మాధవి కనబడలేదు.

ఆమె ఇంకా రాలేదా? లేక బస్సులో ఊరికి వెళ్ళిపోయిందా? ఈ ప్రయత్నమూ ఫైల్ అవుతుందా?’

ఒక వేల ఆమె రాకపోతే ఏం చేయాలి? నిశ్చయతార్ధ మండపానికి వెళ్ళి కేకలు పెట్టాలా? ఆమెకు నా మీద ఎందుకింత కోపం అనేది తెలిస్తేనా కదా అది తీర్చగలను?’

నీరసంతో ఒక సీటులో కూర్చున్నాడు. మాధవి, రేఖా, గిరిధర్ అందరూ తనని మోసం చేశారని కుమిలిపోయాడు.

అదే సమయం మాధవి ఆ రైల్వే స్టేషన్ లోపలకు వచ్చింది. ఏవో స్నాక్స్ కొనుక్కుని రైలు పెట్టెను చూసుకుంటూ నడిచింది.

ఆమె తన పెట్టె దగ్గరకు వచ్చి చేరడం, విశ్వం అదే పెట్టెలో నుంచి దిగటం సరిగ్గా అమరింది. ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరికొకరు చూసుకున్నారు.

మొదట నిగ్రహించుకున్నది మాధవీనే. గబుక్కున పెట్టెలోకి ఎక్కి కిటికీ దగ్గర కూర్చుంది. విశ్వం అక్కడున్నాడనే విషయమే గ్రహించనట్లు ఉన్నది ఆమె నడవడిక.

ఆ కిటికీ దగ్గరకు జరిగాడు విశ్వం. నిన్ను చూసి ఒక వారం అవుతోంది మాధవీ” 

ఆమె సమాధానం చెప్పలేదు. అక్కడ్నుంచి లేచి వేరే సీటులో కూడా కూర్చోలేదు. అలాగే ఉన్నది.

నీకు నాతో ఏమిటి సమస్య మాధవీ? ఎందుకంత సడన్ గా నన్ను వదలి దూరంగా వెడుతున్నావుమాట్లాడటానికి సంధర్భం కూడా ఇవ్వనంటున్నావు...నేనేం చేయను

అతన్ని నేరుగా చూసి అమాయకుడిలా నటించకు!అన్నది.

మళ్ళీ పజిల్ వేస్తే ఏమిటి అర్ధం మాధవీ? నా మీద ఎందుకంత కోపమో బహిరంగంగానే చెప్పు

నన్నెందుకు అడుగుతున్నావ్?  ఆమెను  అడుగు

ఎవర్ని?”

నీ కొత్త ప్రేమికురాలుని?"

కొత్త ప్రేమికురాలా? ఏం చెబుతున్నావు? ఎవరది?”

ఏం? ఆమె పేరు నా నోటితో వినాలని ఆశ పడుతున్నావా?” అన్న మాధవి ఇలా చూడు విశ్వం, నీ కొత్త ప్రేమకు నేను అడ్డురాను. నన్ను ప్రశాంతంగా జీవించ నివ్వు. నీ దగ్గర అవస్థ పడింది చాలు

దయచేసి విషయాన్ని పగులకొట్టి చెప్పు. సమస్య ఏమిటో తెలియక నీతో వాదించటం నాకు టయర్డ్ గా ఉంది

నేనే నీకు విసిగెత్తిపోయాను. ఇక నా మాటలు నిన్ను విసిగించవా ఏమిటి?”

మార్చి మార్చి అక్షర ఆట ఆడబోతామా?”

నేనా మొదలుపెట్టాను? నువ్వే కదా నన్ను వెతుక్కుంటూ వచ్చింది?”

అంటే, నువ్వు నాకు ఒక చాన్స్ కూడా ఇవ్వ దలుచుకోలేదా?”

నేనెందుకు ఇవ్వాలి? రేఖా దగ్గర ఇంకా పెద్ద చాన్సులు దొరుకుతాయి  కదా?”

రేఖానా?”

ఏం? విషయం నాకు తెలిసిపోయిందని షాక్ అయ్యావా?”--నవ్వూతూ అడిగిన మాధవి ఎక్కడ ఆ రేఖా, ఎక్కడో దాక్కుని నిన్ను పంపించిందా?”

మూర్ఖంగా మాట్లాడకు మాధవి. ఇందులో రేఖా ఎలా  వస్తుంది?”

అబ్బో, ఆమె మీద అంత మర్యాదనా? న్యాయమే!

మాధవీ నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కావటంలేదు

గబుక్కున సెల్ ఫోన్  తీసి, గబగబా వెతికి, ఆ ఫోటోను చూపించింది. ఈ ఫోటోలో ఉన్నది నువ్వూ, ఆమే కదా?”

అవును...దానికేమిటిప్పుడు?”

నువ్వూ, నేనూ స్నేహంగా ఉండకూడదని ఆమె ఒంటి కాలు మీద నిలబడ్డప్పుడు, ఆమెను నువ్వు ఒంటరిగా కలుసుకోవటానికి అర్ధం?”

మాధవీ...నేను...

నువ్వేమీ మాట్లాడొద్దు. నాకు అంతా అర్ధమయ్యింది. ఆమె, నువ్వూ ఇష్టపడినట్లే నేనూ దూరంగానే నిలుచున్నా కదా. ఆ తరువాత ఇద్దరూ ఎందుకు నన్ను మారి మారి ట్రబుల్ చేస్తున్నారు?”

దీనికీ, రేఖాకీ ఎటువంటి సంబంధమూ లేదు. నువ్వు తప్పుగా...

ఇప్పుడే నేను సరిగ్గా అర్ధం చేసుకున్నాను. దయచేసి ఇంకా డైలాగులు మాట్లాడుతూ ఇక్కడ నిలబడకు. నువ్వూ, తనూ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. ఇక నేను మీ వైపుకే తిరగను...సరేనా...?”

అతను ఆశ్చర్యపోతూ నా మీద నువ్వు నమ్మకం పెట్టింది ఇంతేనా?” అన్నాడు.

నిన్ను పూర్తిగా నమ్మేననటం నిజం. అందుకే నువ్వు చేసిన ద్రోహం నొప్పి పుట్టింది.   క్షమించాలి...కొన్ని రోజులు నొప్పి పుట్టించిందని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ నొప్పి లేదు. పూర్తిగా పోయింది.  ఎలాగంటే నిన్నుపూర్తిగా మర్చిపోయాను. దయచేసి మళ్ళీ నువ్వు నన్ను కలిసి కెలకకు?”

నన్ను నువ్వు తుచ్చంగా భావించవచ్చు. కానీ నాకు అన్నీ నువ్వే. అందువలనే ఒక వారం రోజులుగా నిన్ను చూడాలని పిచ్చిగా తిరిగాను. నువ్వు నన్ను ప్లాను వేసి తరిమినా, ఎలాగైనా నీతో మాట్లాడితే అన్ని అపోహలూ తొలగిపోతాయి అనుకున్నా.

నిన్ను చూడటానికి ముందు నేను చాలా వేదన చెందాను. జీవితంలోని చిట్ట చివరి ఘటన అంటారే...అక్కడ ఉన్నాను. కానీ, నువ్వు కనిపించిన తరువాత అన్ని సరైపోతాయి అనే నమ్మకం వచ్చింది. ఇప్పుడు  నువ్వే ఆ నమ్మకాన్ని తీసి అవతల పారేసినందువలన, మునుపటి కంటే ఇంకా చివరి ఘట్టానికి వెళ్ళిపోతాను

ఈ డైలాగులన్నీ బద్రంగా దాచుకో. రేఖాకి ద్రొహం చేసి ఇంకొక దాని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఉపయోగపడుతుంది. నేను ఓపెన్ గానే చెప్పాను. ఇకమీదట మనిద్దరి మధ్య ఏమీలేదు. బయలుదేరు

మొహం తిప్పుకుంది.

రైలు జరగటం మొదలైయ్యింది.

విశ్వం, కిటికీ చివరిగా కూర్చోనున్న మాధవిని చూస్తూ అక్కడే నిలబడ్డాడు.

మాధవి అతన్ని తిరిగి కూడా చూడలేదు.

కొద్ది నిమిషాల తరువాత ఒకమ్మాయి... మాధవి ఎదురుగా వచ్చి కూర్చుంది.

నమస్తే అని, “నేను మీ దగ్గర కొంచం మాట్లాడాలే!

చెప్పండి. ఏమిటి విషయం?”---కొంచం విసుగ్గా అన్నది.

నా పేరు మథులత... విశ్వం యొక్క మాజీ ప్రేమికురాలుని

***********************************************PART-10*****************************************

ఏమిటండీ అలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నారా? నిజంగానే చెబుతున్నా అంటూ నవ్వింది మథులత. కొన్ని సంవత్సరాల ముందు నేనూ, విశ్వం లోతుగా ప్రేమించుకున్నాం

మాధవి ఆమెనే గందరగోళంతో చూస్తూ ఉండిపోగా అలాగా అని ఒక మాట ఆడిగారనుకోండి నేను నా మాటలను కంటిన్యూ చేస్తాను  అన్నది.

ఇది...

మీకు ఇది అనవసరం. అనవసరమైన పని అనదలుచుకున్నారు. కరెక్టేనా?”

అవును. మీ పని చూసుకుని వెళ్ళండి. ఇది మా పర్సనల్ విషయం. సగం సగం మాటలు విని మీ ఇష్టమొచ్చినట్టు వాగకండి!

ఇలా చెప్పే కదా రేఖాని తరిమేరు? ఒక చేంజ్ కోసం...నా దగ్గరైనా ఓపిగా మాట్లాడొచ్చు కదా? ఎందుకంత అర్జెంటు?”

రేఖాని మీకు...

బాగా తెలుసు. ఆమె నా ప్రాణ స్నేహితురాలు

నేను రేఖాని అవమానపరిచిన విషయం మీకెలా తెలుసు?”

ఆమే నా దగ్గర చెప్పింది అంటూ కంటి అద్దాలు తీసి చేతిలో పెట్టుకున్నది మథులత. మీ ప్రేమ విషయం పూర్తిగా నాకు తెలుసు. మిమ్మల్నీ, విశ్వం ను వేరు చేయాలనే రేఖా నా దగ్గరకు వచ్చింది

“……………….”

దానికి కారణం మీరనుకుంటున్నది కాదు. రేఖా అనుకునేదినూ కాదు. కానీ, నిజంగానే మీ మీద ఆమెకున్న అక్కర కోసం అలా నడుచుకుంది. అది మీరెప్పుడూ అర్ధం  చేసుకోలేదు. ఆమెను గౌరవించలేదు  

“………………...”

మిమ్మల్ని విశ్వం దగ్గర నుండి వేరు చేయటానికి రేఖా నా దగ్గరకు ఎందుకు వచ్చుంటుంది అని ఆలొచిస్తే...మీకు అంతా అర్ధమవుతుంది. విశ్వం నా మాజీ ప్రేమికుడు. అది రేఖాకు  తెలుసు

“………………...”

కానీ రేఖా అనుకున్నట్టు విశ్వం నిజంగా చెడ్డవాడు కాదు.  నన్ను మోసం చేసి నీ దగ్గరకు  రాలేదు. నేనే అతన్నీ, మిగిలిన వాళ్ళందరినీ మోసం చూసేను. నేను ఆ వయసులో పొగరెక్కి తిరిగాను. మంచి మగాడిని నీచమైన అపవాదుతో తరిమి కొట్టాను. ఆ తరువాత అతని దగ్గరకు వెళ్ళటానికి మనసు రాలేదు. ఒక వేల నేను తిరిగి వెళ్ళున్నా విశ్వం నన్ను చేర్చుకునే వాడు. ఎందుకంటే అతను అంత మంచివాడు, అంతకంటే అమాయకుడు. కానీ, నా పొగరు నన్ను అనుమతించలేదు. ఈ విషయాన్ని మనసులోనూ దాచుకోలేకపోయాను...స్నేహితుల దగ్గర చెప్పటానికి మనసు ఒప్పుకోలేదు...విషం తాగి నాటకం ఆడాను...నేను విషం తాగటానికి ఏమిటి కారణం అని ఎందరు అడిగినా పర్సనల్ సమస్యలు అని చెప్పాను. కానీ, నా ప్రాణ స్నేహితురాలు రేఖా గుచ్చి గుచ్చి అడగటంతో... విశ్వం నన్ను వాడుకుని వదిలేశాడు అని అబద్దం చెప్పను.  పిచ్చిది, నేను చెప్పింది నిజం అనుకుంది”  

“…………………”

అందువల్ల, విశ్వం ఒక మోసగాడు అనే ఆలొచనే రేఖా మనసులో స్థిరపడింది. అందుకనే మిమ్మల్ని అతనితో చూసిన వెంటనే షాక్ అయ్యింది” 

దాని గురించి ఆమె మీతో మాట్లాడటానికి ప్రయత్నించింది. మీరు వినే లోకంలో లేరు. నన్ను వెతికి పట్టుకుని మీతో మాట్లాడి మిమ్మల్ని ఆ మోసగాడి దగ్గర నుండి కాపాడమని అడిగింది...లేదు లేదు ప్రాధేయపడింది

ఈ విషయంలో విశ్వం ఏ తప్పూ చేయలేదు. అయినా కానీ ఎందుకో అతని మీద నాకు కోపం తగ్గలేదు. ఇదిగో ఈ క్షణం కూడా చికాకు వేస్తోంది. అది ఎందుకని నాకే తెలియటం లేదు

అందువలన ప్రారంభంలో విశ్వం గురించి తప్పుగా చెప్పి మీ ప్రేమను చెడపాలనే అనిపించింది. ఆ తరువాత నిదానంగా ఆలొచించి ఆ ఆలొచనను మార్చుకున్నాను. రేఖా దగ్గర ఇంకేదో సమాధనం చెప్పాను” 

ఆ తరువాత నేను ఆమెను చూడలేదు. మీ ప్రేమ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ రోజు రైలు పెట్టెలోకి ఎక్కుతున్నప్పుడు కిటికీకి దగ్గరగా నిలబడున్న విశ్వం ను చూశాను. అప్పుడు నాకు ప్రేమ, గీమా జ్ఞాపకం రాలేదు. ఫడేలు మని చెంపమీద ఒకటిద్దామని అనిపించింది

మీ దగ్గర అతను ప్రాధేయ పడుతూ ఉండటం చూడంగానే...'ఏమిటి విషయం?' అనే ఒక ఆత్రుత. అందుకే చివరగా కూర్చుని, మీరు మాట్లాడుతున్నది విన్నాను. క్షమించండి"

మీరు చెప్పేదంతా నిజమా?”

వంద శాతం నిజంఅన్న మథులత అనుమానంగా ఉంటే మా ఆఫీసుకు ఒక రోజు రండి. మేము ఇద్దరం జోడిగా కలిసి తీయుంచుకున్న ఫోటోలను ఆల్బంగా పెట్టుకున్నాను

అయితే మీరెందుకు, ఐ మీన్ మీరూ -- విశ్వం విడిపోయరు?”

అది తెలిస్తే నేనెందుకండీ ఇలా ఉంటాను?”---విరక్తిగా నవ్వుతూ "అదేంటో ఒకసారి నా మనసు అతను వద్దని చెప్పింది...వదిలేసేను. ఆ తరువాత చాలాసార్లు నా మనసు నన్ను తిట్టింది. దానిని ఆలొచించి వేదన పడ్డాను. కొన్ని సార్లు గర్వ పడ్డాను

మాధవి ఆశ్చర్యంతో చూసింది.

మాధవి చూపులను అర్ధం చేసుకున్న దానిలాగా నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించకండి మాధవి. అది చాలా కష్టం. ఎందుకంటే నన్ను నేనే అర్ధం చేసుకోలేకపోతున్నాను అన్న మథులత  తరువాత ఇంకొక ప్రశ్న అడగాలే...నేను ఇప్పుడు ఎందుకు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నానో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది... కదా?”

"అవును!"

"విశ్వం పైన నాకు విరక్తి ఉన్నది నిజమే. అందువలన వాడు బాగుండ కూడదూ అని అనుకోను. ఒకవేల అనుకున్నా, దాన్ని మనసులోనే పెట్టుకుంటాను, బహిరంగంగా ఒక విల్లీ లాగా బయటకు చూపించుకోను" 

“………………..”

ఇంకో వైపు, ఇందులో నా స్నేహితురాలు రేఖా యొక్క ప్రశాంతత ఉంది. ఆమెను మీరు అనుమానిస్తున్నది ఆమె ఖచ్చితంగా తట్టుకోలేదు. ఆమె చాలా మంచిది. ఆమెకున్న ఒకే ఒక బలహీనత అవతల వారి సమస్యల్లో గబుక్కున తలదూర్చి ముక్కు పగులకొట్టుకుంటుంది

“………………”

అందువలన, ఇప్పుడు మీరు విశ్వం ను ఫోనులో పిలుస్తారో లేదో... రేఖాని పిలిచి మాట్లాడండి రేఖా నువ్వేమీ తప్పు చేయలేదని తెలుసుకున్నాను అని చెప్పండీ, అది చాలు. సంతోషంగా ఇంకెవరికైనా సహాయం చేయటానికి రెడీ అవుతుంది

మాధవి తీవ్రంగా ఆలొచించింది. ఈమెను నమ్మనా, వద్దా?’

మథులత కొంచం సేపు అక్కడ కూర్చుంది. తరువాత ఏమీ మాట్లాడకుండా తన పెట్టెకు వెళ్ళిపోయింది.

కొద్ది నిమిషాల తరువాత, సెల్ ఫోన్ తీసి నెంబర్లు నొక్కింది మాధవి.

"రేఖా...ఒక చిన్న సహాయం కావాలే!"

"ఏ...ఏమిటది మాధవి?"

ఏదో వేగంలో విశ్వం ను నేను వద్దన్నాను...అతన్ని కొంచం పంపిస్తావా?” 

ఖచ్చితంగా...కానీ...

థాంక్యూ! నీ మీద నాకు ఏ కోపమూ లేదు రేఖా " అని చెప్పి ఫోను పెట్టేసింది మాధవి. ఆ క్షణం నుంచి విశ్వం ఫోను కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది మాధవి!

***********************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

నిద్రలేని రాత్రులు…(పూర్తి నవల)

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)