దాగుడు మూతలు...(పూర్తి నవల)

 

                                                                   దాగుడు మూతలు                                                                                                                                                      (పూర్తి నవల)

జీవితమే ఒక దాగుడుమూతల ఆట. 'ప్రేమ' కూడా ఆ ఆటలో ఒక భాగమే.

జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనం దాగుడుమూతల ఆట ఆడుంటాముజీవితం యొక్క తరువాతి దశలలో, జీవితం మనతో పలు దాగుడుమూతలాట ఆడుతుంది. జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూతలాట మనకు ఇష్టమున్నా లేకున్నాఆడుతూ పాడుతూ జీవించాల్సిందేమనము ఆటలోని భాగమే.

విద్యార్థి దశలో, ఒక వ్యక్తి కోరిన చోట చదవలేకపోవడం, కోరిన వస్తువులను పొందలేకపోవడం, చెయ్యాలనుకున్న ఉద్యోగం చేయలేకపోవడంజీవితం మనతో ఆడుతున్న దాగుడుమూత.

యవ్వనంలో వున్న వారు కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే తరుణము.. ఒక దాగుడుముత ఆటే .

మధ్య వయస్కుడు తాను ఊహించిన  శైలిలో బ్రతకలేక పోవడం .. జీవితం మనతో ఆడే దాగుడుమూతే.

వయసు మల్లిన కాలములో, తన తరువాతి తరం వారికి అన్ని సమకూర్చాకవారి మధ్య వుంటూమధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడపగలగడం కూడాజీవితం మనతో ఆడుకునే దాగుడుముత ఆటలోని భాగమే.

జీవితంలో దాగుడుమూతలు లేకుండా, అన్ని ఒక పద్దతిగా, ఏదో శాసనములో తెలిపిన విధముగా సాగితే, జీవితం నీరుగారి అంతే నిరుత్సాహంగా తయారవుతుంది. జీవితం మనతొ ఆడే ఆటను ద్వేషించక, ఆటలోని మెలుకువలు మరియు కిటుకులు తెలుసుకొని, పూర్వ అనుభావాల పాఠాలు గుర్తుంచుకొని, పెద్దలు చెప్పే అనుభావాలను చక్కగా అమలుపరిచి ఆడితే.. గెలుపు మనదే…..

'ప్రేమ 'కూడా జీవితంలో ఒక భాగమే. కానీ 'ప్రేమ' మాత్రం జీవితం అడే దాగుడుమూతల ఆటను జయించి, కావలసిన వారిని చేరుకుంటుంది...ఏలా? పూర్తి నవలను చదివితే మీరే ఆశ్చర్యపోతారు.

************************************************PART-1**********************************************

సంవత్సరం: 1955

చోటు: హైదరాబాద్.

ప్రియమైన దేవుడా... మంచి సమయంలో, ఇక్కడున్న అందర్నీ నీ బంగారు చేతులలో పెడుతున్నాను. మీరు మా జీవితంలో ఎంత మంచివారుగా ఉన్నారో, ఎలాగైతే మా పాపాలన్నిటినీ మన్నించారో...అదేలాగా ఇక్కడున్న ఒక్కొక్క వ్యక్తి కుటుంబంలోనూ, జీవితంలోనూ ప్రవేశించి, వాళ్ళ పాపాలను మన్నించి ఆశీర్వదించు. వాళ్ళను శాపాల నుండి, వ్యాధులు-అనారోగ్యం నుండి, మానసిక పోరాటాల నుండి వాళ్ళకు విముక్తి ప్రసాదించి, వాళ్ళకు సుఖాలాను అందించు!”

పాతకాలం నాటి క్రైస్తవ దేవాలయంలో ప్రొద్దుటి పూట ప్రార్ధన జరుగుతున్నది. ప్రార్ధన చేస్తున్న వారు సిస్టర్ అమీలియా. విరామం లేకుండా దైవ కార్యాలలో ఆమె చేస్తున్న సేవల వలన ఆమె మొహంలో ఒక తేజస్సు, ప్రశాంతత కనిపిస్తోంది. చూసేవాళ్ళందరూ చేతులెత్తి నమస్కరించే -- దైవీక మొహం ఆమెది.

ఆమె ఎదురుకుండా ఉన్న కుర్చీలలో, దేవుని దగ్గర పలు కోర్కెలను ముందుంచి, జనం కూర్చోనున్నారు. మతాలు ఏదైనా ప్రశాంతతను వెతుక్కుని తిరుగుతున్న మనసులు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలు!

అక్కడున్న వారినందరినీ వరుసగా చూస్తూ వస్తే చివరి వరుసకు ముందు వరుసలో ఐదవ వ్యక్తిగా కూర్చోనున్నది మన కథా నాయకి ప్రశాంతి.

క్యారట్ రంగులో చిన్న చిన్న పసుపు చుక్కలు పెట్టిన కొత్తగా కొనుక్కున్నచీర, దానికి మ్యాచింగ్ గా పసుపు రంగు బార్డర్ వేసిన జాకెట్టు వేసుకోనున్నది. పొడుగైన జడే అందం అని అనుకుంటున్న వారందరి ఆలొచన ఆమె యొక్క ఒత్తుగానూ, చిన్నదిగానూ ఉన్న జుట్టును చూస్తే మారిపోతుంది. అందంగా కట్ చేయబడ్డ జుట్టుతో, రెండు జడలు వేసుకుని నల్ల రంగు రబ్బర్ బ్యాండును చుట్టుకోనుంది.    

ప్రశాంతి యొక్క ఎత్తు తక్కువని, ఆమె వేసుకున్న హీల్స్ వేసుకున్న చెప్పులే   చెబుతాయి. రేగి పండు రంగుతో, బాణం ఆకారంలో దిద్దుకున్న కురులు, గుండ్రంగా ఉన్న మొహం, ఆహా...అందులో అందమైన తిలకం బొట్టు క్రింద, నుదుటిపైన ఉన్న తల వెంట్రుకల దగ్గర ఉన్న కుంకుమ, ‘ఈమె ఇక్కడ ఏం చేస్తున్నది?’ అనే ప్రశ్నను మిగిలిన వారి మనసులలో ఏర్పరిచింది. ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లో అశాంతి నిండిపోయున్నది.  

అవును! ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అమె మొహం రోజు కొంచం వాడిపోయే ఉంది. చూసిన వెంటనే ఈమె మంచిదా...లేక చెడ్డదా అని లెక్క వేయలేని వ్యత్యాసమైన ముఖ అమరిక.  

కారణం. మన ప్రశాంతి మంచివారికి మంచిది...చెడ్డవారికి చెడ్డది. గంభీరంగానూ, పట్టుదలగానూ, శాంతంగానూ ఉంటూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.  

ప్రార్ధన ముగియగానే, ఆఫీసుకు వెళ్ళిన ప్రశాంతి సిస్టర్ అమీలియా ను కలుసుకోవాలని సెక్యూరిటీ దగ్గర చెప్పి పంపి కాచుకోనున్నది. ఆమె కాలేజీ మాజీ విధ్యార్ధిని మాత్రమే కాదు...అక్కడ పనిచేస్తున్న వాళ్ళకూ పరిచయస్తురాలు. అందువలన తెలిసిన వారందరూ ఆమెతో మర్యాదగా నడుచుకుంటారు.  

అమ్మగారూ, కొంచం ఆలశ్యం అయ్యేటట్టు తెలుస్తోంది. బయటకు ఎక్కడకైనా వెళ్ళాలంటే వెళ్ళి ఒక గంట తరువాత రండి?” అని ఎంతో వినయంగా చెప్పాడు సెక్యూరిటీ.

ఇంకొంచం వివరంగా రేపు జరపాల్సిన ప్రార్ధన గురించి, లారన్స్ ఫాదర్ తో మాట్లాడుతున్నారమ్మా. ఆయనతో పాటూ చాలా మంది ఉన్నారమ్మా. అందుకనే... అంటూ తల గోక్కున్నాడు.

పరవాలేదు. నేను మన కాలేజీ అంతా ఒక చుట్టు చుట్టొస్తా. టైము సరిపోతుంది. చాలా రోజులైంది అటువైపు వెళ్ళి... అంటూ బయలుదేరింది ప్రశాంతి.

కాలేజీ సెలవులు అనేది తెలిసేటట్టుగా ఖాలీగా ఉన్న ప్లే గ్రౌండ్, కాకుల కచేరీ గుర్తు చేస్తోంది. ఎర్రటి రాలిపోయిన పూవులు పడిన సిమెంటు బెంచ్ మీద కూర్చున్న ఆమె, మెల్ల మెల్లగా తన కాలేజీ జ్ఞాపకాలలో మునిగిపోయింది.

హైదరాబాద్ లో పేరు పొందిన కాలేజీ, అది.కో-ఎడ్యుకేషన్ అయినా, చాలా కఠినమైన నిబంధనల కాలేజీ అని పేరు తెచ్చుకుంది. అందువలన నగరంలోని ఉన్నత సంపాదన గల ప్రజలు పోటా పోటీ వేసుకుంటూ తమ పిల్లల్ని కాలేజీలో చేర్చటానికి ఇష్టపడతారు. బాగా చదువుకునే మధ్య తరగతి సంతతికీ కూడా అక్కడ స్వాగతం ఉంది.

రోజా, రోజు మీ సినిమా హాలులో ఏం సినిమా ఆడుతోందే?”

అనార్కలి. మన వేదాంతం రాఘవయ్య గారి సినిమా. మిస్ చేయకండే. నేనూ, మా అక్కయ్య ఆదివారమే పట్టుదల పట్టి వెళ్ళి చూసొచ్చాము

దానికి తరువాత వెళదాం. ఇప్పుడు శ్రీ 420హిందీ సినిమాకు వెళ్దామే. చెక్కిన శిల్పంలా ఉన్నదట హీరోయిన్ నర్గీస్. పోయిన సారి వచ్చినప్పుడే చూడలేకపోయాము

సినిమాకి టికెట్టు దొరకటం చాలా కష్టమే. మన క్లాసులోని మగ పిల్లలందరూ అక్కడికే దండయాత్ర చేశారు. నర్గీస్ కోసమే పలు సార్లు చూసే రకం వాళ్ళు

ప్లీజ్ జానకీ, రోజే మనకు టైము దొరికింది. టికెట్లకు మీ అన్నయ్య శంకర్ ను పట్టుకో. నన్ను ఎలాగైనా సినిమాకు తీసుకు వెళ్ళు. సినిమా అయిన తరువాత మీ అందరికీ ఐస్ క్రీం కొనిస్తాను

నా వల్ల కాదే! ప్రొద్దున వాడి దగ్గర అడిగి బాగా తిట్లు తిన్నాను

ఇప్పుడు ఏం చేద్దామే?”  

ఆలొచిస్తూ ఒకరి మొహం ఒకరు చూస్తున్న స్నేహితుల బృందం కళ్ళకు తెల్ల రంగు కలిగిన సొగసు కారులో నుండి దిగుతున్న యుక్త వయసు యువతి ప్రశాంతి కళ్ళల్లో పడింది.

మనం అడిగితే మగ పిల్లలు టికెట్లు కొని ఇవ్వరు. అడిగే వాళ్ళు అడిగితే దొరుకుతుంది. ఇప్పుడు చూడు అని చెప్పిన జానకి,

హాయ్ ప్రశాంతి...గుడ్ మార్నింగ్. రోజు క్లాసులు లేవు! నీకు ఫోన్ చేసి చెబుదామనే బయలుదేరుతున్నాం. ఇంతలో నువ్వే వచ్చాశావు

అలాగా...సరే పరవాలేదు. లైబ్రరీ కి వెళ్ళాల్సిన పని ఉంది. పరీక్షలకు తయారవ్వాలి

"ఇలా చూడవే, సినిమాలలో దీని లాంటి డబ్బు గల అమ్మాయలు, కాలేజీ ఎగొట్టి ఊరంతా తిరుగుతారు. మధ్య తరగతి అమ్మాయలు ఉద్యోగాలకు వెళ్ళాలని పడీ పడీ చదువుతారు. ఇక్కడేమిట్రా అంటే...అంతా తలకిందలుగా ఉంది. ప్రశాంతీ, రోజుతో లైబ్రరీ ఏమీ మూసేయటం లేదు. అందుకని రోజు మాతోపాటూ శ్రీ 420సినిమాకు వస్తున్నావు

రామయ్యా వస్తావయ్యా అంటూ అందమైన గొంతుకతో ఆమె పాడగా, ఆమెతో ఉన్న మిగిలిన స్నేహితురాళ్ళు కోరస్ పాడారు.

నా వల్ల కాదు బాబూ. రోజు నాకు గుర్రపు స్వారి ట్రయినింగ్ ఉంది

సరే, రోజు మా అన్నయ్య, తన స్నేహితుడూ మీ బావ శ్రీనివాస్ కలిసి సినిమాకు వెడుతున్నట్టు చెప్పాడు. నీకు వద్దంటే నువ్వు రావద్దు

ప్రశాంతి యొక్క మెరుస్తున్న కళ్ళను చూస్తూనే చెప్పింది జానకి.

లేదే...నా కోసం ప్రత్యేకంగా ఒక స్త్రీ వచ్చి చెప్పిస్తోంది. అందువల్లే క్లాసు ఎగోట్టాలంటే అదొలా ఉంది

కథలు చెప్పకు. కానీ, ఒక విషయం. ఇది ఇప్పుడే వేసిన హఠాత్ ప్లాను. అందువలన డబ్బులు మేమిస్తాము. టికెట్లు మాత్రం నువ్వు కొనివ్వాలి

ప్రశాంతికి డబ్బులు ఒక లెక్క కాదు. ఇది తెలిసే అలా మాట్లాడింది.

డబ్బులే కదా. వడ్డీతో కలిపి ఇంకో పది సంవత్సరాల తరువాత తీసుకుంటా అని నవ్వుతూ చెప్పి, అటుపక్కగా నడిచి వెడుతున్న ఒక అబ్బాయిని పిలిచింది.

ప్రభూ...ఇక్కడికి రావా. మేము శ్రీ 420సినిమా చూడటానికి టికెట్లు కొనివ్వగలవా?”

అతను ప్రశాంతి తనని పిలిచి మాట్లాడటాన్ని నమ్మలేకపోయాడు. ఆనందంతో ఖచ్చితంగా ప్రశాంతీ. మేము అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న టికెట్లు ఉన్నాయి. మీరు చూడండి. మేము రేపు చూసుకుంటాం అని దారాల ప్రభువులాగా తన జేబులో ఉన్న టికెట్లను దానం చేశాడు.

టికెట్లు తీసుకుని, దానికి ఇవ్వాల్సిన డబ్బుకు రెట్టింపు డబ్బు అతని చేతిలో పెట్టి, స్నేహితులతో గలగలమని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది.

జరుగుతున్నదంతా గమనిస్తున్న వివేక్, “ప్రభూ నీ స్టేటస్ కు ఎక్కువ ఆశపడకూడదు. ఇంతకు ముందే వేరే ఒకతను, ఆమె పుట్టిన దగ్గర నుండే కాచుకోనున్నాడని విన్నాను

ఛీ...ఛీ...ఎందుకురా నీ బుద్ది ఇంత నీచంగా ఆలొచిస్తోంది? సినిమా టికెట్టు ఇచ్చి ట్రాప్ చేయగలమారా ఆమెను? ప్రశాంతీ అడిగితే, సినిమా హాలునే వాళ్ళ నాన్న కొనేసి, రోజూ, ప్రశాంతీకి నచ్చిన సినిమా వేస్తారు. నా స్టేటస్ కు అందులో ఒక మేనేజర్ ఉద్యోగం, ఆమె రెకమండేషన్ తో దొరికితే చాలు. మా కుటుంబమే బ్రతికేస్తుంది

ఇలా తన తోటి విధ్యార్ధినీ/విధ్యార్ధులు ఎవరికీ దొరకదు అని మాట్లాడబడిన ప్రశాంతీ, సినిమాలో రాజ్ కపూర్ ను చూసి ఆనందించక, చీకటిలో దూరంగా కనబడుతున్న తన బావ శ్రీనివాస్ ను చూసి ఆనందిస్తూ ఉన్నది.

************************************************PART-2**********************************************

కాలేజీ జ్ఞాపకాలు చెదిరిపోయి--ప్రస్థుత కాలానికి వచ్చిన ప్రశాంతి, సమయం ఎక్కువ అయినట్లు గ్రహించి తిరిగి చర్చ్ ఆఫీసుకు వెళ్ళింది. అంతకు ముందే సిస్టర్అమీలియా తో మాట్లాడుతున్న వ్యక్తులు వెళ్ళిపోగా...ఆమె, మరొకరు మాత్రమే ఆఫీసు రూములో ఉన్నారు. అనుమతి తీసుకుని లోపలకు వెళ్ళిన ప్రశాంతిని కూర్చోమన్నట్టు చెప్పింది సిస్టర్అమీలియా. 

ఫాదర్...నేను చెప్పాను చూడండి, రాజా మార్తాండ్ చక్రవర్తి గారి అమ్మాయని, ఆమే ఈమె...పేరు ప్రశాంతి. మన కాలేజీ మాజీ విధ్యార్ధిని. చాలా తెలివిగలది

ప్రశాంతీ, ఈయనే ఫాదర్ లారన్స్. బుధవారం జరుగబోయే ప్రత్యేక ప్రార్ధనకోసం భీమవరం నుండి వచ్చారు -- పరస్పరం ఇద్దరినీ పరిచయం చేసింది.

నమస్తేఅంటూ చేతులు జోడించిన ప్రశాంతితో.

మీ నాన్న గురించి చాలా విన్నాను. భీమవరం లోని మా చర్చుకు కావలసిన స్థలాన్ని కొనడానికి కూడా సహాయపడ్డారు. నిన్ను కలుసుకోవటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. దేవున్ని చేరుకున్న ఆత్మలకోసం బుధవారం జరపబోయే ప్రార్ధనలో నువ్వు పాల్గొంటే నేను ఇంకా సంతోష పడతానుఅన్నారు ఫాదర్ లారన్స్.

తటపటాయిస్తూనే నవ్విన ప్రశాంతి క్షమించండి ఫాధర్’... రోజు రాత్రి నేను ఊరికి బయలుదేరుతున్నా. పిల్లల్ని స్కూల్లో చేర్పించటం గురించి మాట్లాడేసి, తరువాత మా ఇంటిని చూసి రావాలి. ఇంకోసారి తప్పకుండా పాల్గొంటా ఫాధర్ అన్నది.

అవును ఫాదర్’. ప్రశాంతి ముఖ్యమైన పనిమీద ఊరికి వెళ్తోంది. రోజు కూడా నేనడిగేనని ప్రార్ధనలో పాల్గొంది. ఆమెకు కుదిరితే తప్పకుండా వస్తుంది. విషయంలో అచ్చు ఆమె తండ్రిలాగానే నడుచుకుంటుంది... అని ఫాదర్ లారన్స్ తో ప్రశాంతి పరిస్థితిని వివరంగా చెప్పింది. తరువాత ఆవిడ, తన చేతిలో ఉన్న కవర్ను ప్రశాంతికి అందించింది.  

"ఇదిగోమ్మా...నువ్వు అడిగిన లెటర్. మీ నాన్నగారి పేరు చెప్పే నువ్వు సీటు సంపాదించి ఉండవచ్చే! అక్కడున్న రెండు స్కూళ్ళూ, మీ నాన్నగారు దానంగా ఇచ్చిన స్థలంలోనే జరుగుతున్నాయి

ఉండనివ్వండి సిస్టర్. మా నాన్న గారి పేరును ఉపయోగించుకోవటం నాకు ఇష్టం లేదు! నేను ఆయన కూతుర్నని అక్కడ ఉన్న ఎవరికీ తెలియకూడదు. అది, ప్రశాంతతను వెతుక్కుంటూ వెడుతున్న నాకు, మరింత వేదన పెడుతుంది. మీరూ చెప్పకండి...ప్లీజ్...నా కోసం...

సరేమ్మా...అలాగే కానిద్దాం. కానీ, సంవత్సరం నువ్వు చెప్పినట్లే నీ పిల్లలకు  ఇంట్లోనే చదువు చెప్పించు. వచ్చే సంవత్సరం నుండి వాళ్ళను రోజూ స్కూలుకు వెళ్ళనివ్వు. నీ ఇంట్లోనే ఉండి చదువు చెప్పించే నమ్మకమైన ఒక టీచర్ను కోడైకానల్లో ఏర్పాటు చేశాను. ఆమే వంటకు, తోట పనికి, మిగిలిన ఇంటి పనులుకు, చిల్లర పనులకు మనుషులను ఏర్పాటు చేసి ఇస్తుంది. నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు?”

రోజే. నేను మాత్రమే బయలుదేరి వెళ్తున్నాను. స్కూలు పని ముగించుకుని, ఇంటికి  వెళ్ళి, ఇల్లు శుభ్రం చేసుకుని, కొంచంగా వంట సామాను కొనిపడేసి, తరువాత పిల్లల్ని తీసుకుని వెళ్దామనుకుంటున్నా సిస్టర్. అందువల్ల, వచ్చే వారం వాళ్ళను వచ్చి నన్ను ఇంట్లోనే కలుసుకోమని చెబితే వసతిగా ఉంటుంది. కొన్ని రోజులే ఇల్లు......స్కూలు తెరిచిన వెంటనే, స్కూలు పక్కనే ఇల్లు తీసుకుని అక్కడికి నివాసం మార్చుకుందామని అనుకుంటున్నా. పనిలోకి వచ్చే వాళ్ళందరూ మా ఇంట్లోనే స్టే చేస్తే నాకు వసతిగా ఉంటుంది

రాబోవు ఆపద గురించి తెలియకుండా చెప్పింది.

ఖచ్చితంగా చెబుతానమ్మా

గందరగోళంలో ఉన్న ప్రశాంతి ధ్యాంక్స్ చెప్పటం మరిచి పోవటాన్ని గుర్తుకు తెచ్చుకుని, తనని తానే తిట్టుకుని మీ సహాయానికి చాలా థ్యాంక్స్ సిస్టర్అన్నది చిన్నగా.

ఎక్కడైనా బిడ్డ తల్లికి థ్యాంక్స్ చెబుతుందా? నేను చదివిన చదువు మీ నాన్న నాకు పెట్టిన బిక్ష. ఆయన కూతురైన నీకు సహాయపడి ఆయన రుణాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. నీకు ఏం కావాలన్నా నా దగ్గర అడగొచ్చు. సరేనా...?” అని తల్లిలాగా సిస్టర్ చెప్పిన మాటలకు కళ్ళు చెమెర్చినై ప్రశాంతికి

ఆఫీసు గదిలో ఒకచోట తగిలించున్న ఒక ఫోటోలో తన తండ్రి గంభీరంగా నిలబడుంటం ఆమె మనసును మరింత కరిగించింది.

ఊరంతటికీ మంచి వారుగా ఉన్న మీరు, ఎలా మీ అల్లుడికి మాత్రం విల్లన్ లా కనబడుతున్నారు?’ అని మనసులోనే వెయ్యి సార్లు అయినా ప్రశ్నించుకుంది.

ఊహూ...అంటూ గొంతు సవరించుకున్నారు ఫాదర్ లారన్స్.

 ప్రశాంతీ, నువ్విప్పుడు ఊరికి వెళ్ళే కావాలా? ఇక్కడే నీకు కావలసిన సహాయం మేము చేస్తామమ్మా. తప్పుగా తీసుకోకు...చెప్పాలనిపించింది, చెప్పేశాను

చాలా థ్యాంక్స్ ఫాదర్. మీరూ తప్పుగా తీసుకోకండి. నేను ఇక్కడ ఉండలేని పరిస్థితి. అందుకనే పుట్టి, పెరిగిన ఊరిని వదిలేసి, నేను ఎవరనేది తెలియని ఊరికి వెళ్తున్నాను. చూద్దాం, ఇంకా కొన్ని రోజుల్లో పరిస్థితులు సరి అవుతాయి అని నమ్ముతున్నా

బాధపడకమ్మా. భగవంతుడు నీ భర్తను తొందరగా  నీ దగ్గరకు తీసుకు వచ్చి చేరుస్తాడు. నువ్వు ఇదివరకు లాగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండబోతావు చూడు అన్నది అమీలియా.

సరే...నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు. ఇక నిన్ను అడ్డుపడి ఆపడం కష్టం. నా కోసం ఒక సహాయం చేస్తావా? గొలుసును ఎప్పుడూ నీతోనే ఉంచుకుంటావా?" అంటూ తన మెడలో ఉన్న ఒక గొలుసును తీసి ప్రశాంతికి ఇచ్చిన ఫాదర్ లారన్స్ ను ఆశ్చర్యంతో చూసింది అమీలియా.

పునీత శక్తి కలిగిన గొలుసును ఆయన ఎప్పుడూ తన మెడలో నుండి తీసిందే లేదు. ఇప్పుడు గొలుసును ప్రశాంతి దగ్గర ఇస్తున్నారంటే, ఆమెకు గొలుసు యొక్క అవసరం ఎంతో ఉందని గ్రహించింది అమీలియా. సమయంలో అమీలియా మన్సులో ఏదైనా తప్పు జరగబోతోందా?’ అనే ప్రశ్న వచ్చి కూర్చుంది. 

వాళ్ళ మనసులను అర్ధం చేసుకోని ప్రశాంతి ఖచ్చితంగా ఫాదర్...సరి నేనొస్తాను అని చెప్పి బయలుదేరింది.

ఆమె వెళ్ళిపోయిన వెంటనే గొణిగారు ఫాదర్ లారన్స్.

నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాలి...అదే ఇక మీదట నా ముఖ్యమైన ప్రార్ధన

************************************************PART-3**********************************************

హైదరాబాద్ నుండి బయలుదేరిన తెల్ల రంగు కారు, కనీసమైన వేగంతో గుంటూరు దాటి వెళ్తోంది. ముందు రోజు రైల్లో వెళ్దామని రిజర్వేషన్ చేసుకున్న ప్రశాంతిని ఆపి కారులో పంపించింది ఆమె స్నేహితురాలు పద్మ.

స్నేహితురాలి కారులో, తనకు నమ్మకమైన డ్రైవర్ తోడుతో బయలుదేరటం వలన భయం లేకుండా ప్రయాణం చేసింది ప్రశాంతి. దేవుని మీద భక్తి ఎక్కువగా లేకపోయినా, కళ్ళకు కనబడుతున్న గుడిని చూసి దన్నం పెట్టుకుంది. ఆ అలవాటు కూడా ఆమెకు ఆమె తండ్రి దగ్గర నుండి వచ్చిన అలవాటే.  

అప్పుడు ఆమెకు ఒకరోజు తన తండ్రితో దేవుని గురించి జరిగిన చర్చ జ్ఞాపకం వచ్చింది.  

నాన్నా...నీకు దేవుడి మీద నమ్మకం లేదే! మరలాంటప్పుడు ఎందుకు చర్చ్ కు డబ్బులు ఇచ్చారు, గుడి కుంభాభిషేకానికి నాయకత్వం వహించి జరిపారు? మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోతున్నాను నాన్నా?’

నన్ను చెబుతున్నావే, ‘రహీంఅంకుల్ కూడా మన గుడిలో అన్నదానం చేసేటప్పుడు తన వంతుగా డబ్బులు ఇచ్చాడు. తరువాత సిస్టర్ అమీలియా చేసే సేవలు నాకు బాగా నచ్చాయి. మన పూర్వీకులు రాజులుగా ఉన్నప్పుడు చేస్తూ వస్తున్న పేదలకు ఉచితంగా చదువు చెప్పే పనిని ఇప్పుడు ఈమె చేస్తోంది. అందుకోసం సిస్టర్ అమీలియాకు కావలసింది చేశాను. నీ రెండో ప్రశ్నకు సమాధానం, గుడి నిర్వాహాన్ని మన వారసత్వం నిర్వాహం చేస్తూ వస్తోంది. నా ముత్తాత కట్టింది. నా తరువాత కూడా గుడికి కావలసింది మీరు చేయాలి.

మనిషికైనా, దేనిమీదైనా నమ్మకం ఉండాలమ్మా. అతనికి కష్టం వచ్చేటప్పుడు తట్టుకునే మనో ధైర్యాన్ని ఆ నమ్మకమే ఇస్తుంది. దేవుడి మీద నమ్మకం అది ఇస్తుందంటే...మనం ఎందుకు దాన్ని అడ్డుకోవాలి? దేవుడి భయం లేకపోతే, దేశంలో ఇప్పుడు జరుగుతున్న నేరాలు, అవినీతి శాతం ఇప్పుడున్న దానికంటే పదింతలు ఎక్కువగా జరుగుతుంది. తెలుసా?’

తన తండ్రి మాట్లాడేది నోరు తెరుచుకుని వింటూ ఉండేది ప్రశాంతి. ఆమెకు నమ్మకం లేకపోయినా ఆమె భర్త శ్రీనివాస్ కు దేవుడి మీద భక్తి ఎక్కువగా ఉంది. అతను రోజూ కుంకుమ పెట్టుకోకుండా బయటకు రాడు.

ఆమే స్వయంగా గుడికి వెళ్ళటం ప్రారంభించింది. దేవుడ్ని ప్రార్ధించటం మొదలుపెట్టింది...ఇప్పుడు కూడా అతని కోసం, అతని సంతోషం కోసమే తాత్కాలికంగా అతని దగ్గర నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది. అవతలి వారు అడిగినదంతా ఇచ్చే అలవాటున్న ప్రశాంతి -- మొట్ట మొదట ఆశపడింది శ్రీనివాస్ పైనే అనేది జ్ఞాపకానికి వచ్చింది.

అతని దగ్గర తన ఆశను చెప్పి, పెళ్ళి చేసుకోమని అడిగినప్పుడు అతను ఒప్పుకోలేదు. కానీ, అతనిపై ఒత్తిడి తెప్పించి, బలవంతంగా అతన్ని పెళ్ళి చేసుకోవటం తప్పో? లేక రాజ వంశంలో ఉన్న వాళ్ళకు సొంత ఆశలు ఉండకూడదో...? అందువలనే శ్రీనివాస్ ని నా దగ్గర నుండి వేరు చేసి తీసుకు వెళ్ళిందో?’ అనేటటువంటి ఆలొచనలు ప్రశాంతికి ఒక చేదు సంతోషాన్ని ఇచ్చింది. దారి పొడుగునా ఉన్న చెట్లలో నుండి కనబడిన ప్రకృతి దృశ్యాలు ఆమె మనసుకు హాయిగా ఉంది

రాత్రి మధురై చేరుకున్న ఆమె, అక్కడున్న ఒక హోటల్లో, ఇంతకు ముందే రిజర్వేషన్ చేసుకున్న రూములో ఉన్నది. గదిలో ఉన్న టెలిఫోన్ ద్వారా పిల్లలతోనూ, స్నేహితురాలుతోనూ మాట్లాడింది. నిద్రపోవటానికి ప్రయత్నం చేసి, కుదరకపోవటంతో దూరంగా ఉన్న గుడి గోపురమును చూస్తూనే పడుకుంది. నిద్రపోయింది.

ప్రొద్దున్నే లేచి స్నానం చేసిన తరువాత, టిఫిన్ తెప్పించుకుని తిన్నది. మార్కెట్టుకు వెళ్ళి అవసరమైన పచారి సరకులు తీసుకుంది. పాల పౌడర్, ఫ్లాస్కు, టీ-కాఫీ పొడి, చక్కెర, బియ్యం, పప్పు, ఎమర్జన్సీ లైటు, గొడుగు మరియు ఇతర సామానులు కొని, మధ్యాహ్నం భోజనం తొందరగా ముగించుకుని కోడైకానల్ వైపు కారులో బయలుదేరింది.

ప్రశాంతి యొక్క తండ్రి మార్తాండ చక్రవర్తి రాజ వంశానికి చెందినతను. బ్రహ్మచారిగా ప్రపంచమంతా తిరిగి వచ్చిన ఆయన, ఒక రోజు హఠాత్తుగా కుమారి అనే యువతిని వివాహం చేసుకుని వచ్చి నిలబడ్డాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆమెను, మార్తాండ చక్రవర్తి తల్లి-తండ్రులు వాళ్ళను చేర్చుకోనందువలన, ఆస్తిలో  సగం భాగాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చాశారు రాజా మార్తాండ చక్రవర్తి. 

ఇద్దరు మగపిల్లలు పుట్టినా, ఒక ఆడపిల్ల లేదేనన్న మార్తాండ చక్రవర్తి బాధను మరిచిపోయే విధంగా పుట్టిందే ప్రశాంతి. అదేంటో వాళ్ళ వంశానికే ఆడపిల్లలు  అంటేనే అచ్చి రాలేదు. కొన్ని తరాలుగా వంశంలో ఆడపిల్లలు లేరు. అలా కాదని అచ్చి రాని సాంప్రదాయాన్ని మీరి పుట్టిన ఆడపిల్లలూ బ్రతకలేదు.

కోడైకానల్ లో తన ఆంగ్లేయ స్నేహితుడితో గోల్ఫ్ఆడటానికి వచ్చాడు మార్తాండ చక్రవర్తి. మైదానం నుండి కొంచం దూరం జరిగి 'వెల్లకాని ' గ్రామానికి అవతల, కొండజాతి వారు జీవించే చోటునూ దాటి కనిపించిన ఒక అందమైన లోయలో ఒక రాజ భవనం ఇంగ్లాండ్ మోడల్లో కట్టించారు జమీందారు ఒకరు. ఆయన దగ్గర నుండి భవనాన్ని మార్తాండ చక్రవర్తి యొక్క ఆంగ్లేయ స్నేహితుడు కొన్నాడు.   

ఇటికిరాయి రంగుతో పెద్ద పెద్ద కిటికీలతో ఉన్న ఇంట్లో స్నేహితుడితో కలిసి  రాజ భోగ జీవితం అనుభవిస్తూ వచ్చాడు మార్తాండ చక్రవర్తి. అక్కడే కుమారి, ఫిక్స్ చేసిన తారీఖుకు ముందే ప్రసవ నొప్పులతో గిలగిల లాడుతుంటే, తన స్నేహితుడి భవనంలోనే, అక్కడున్న నర్సమ్మ సహాయంతో ప్రసవం జరిగింది. బంగారు శిలలాగా, తెల్ల తెలుపు రంగుతో పుట్టిన ఆడపిల్లకు ' ప్రశాంతి ' అని పేరు పెట్టి ఆనందపడ్డారు మార్తాండ చక్రవర్తి.

తరువాత కొన్ని రోజులలో మార్తాండ చక్రవర్తి యొక్క ఆంగ్లేయ స్నేహితుడు తన సొంత దేశమైన ఇంగ్లాండుకు వెళ్ళ వలసి వచ్చింది. అప్పుడు రాజ భవనాన్ని  మార్తాండ చక్రవర్తి యే కొనుక్కుని, తన కూతురుకు బహుమతిగా ఇచ్చాడు. భవనం చుట్టూ ప్రశాంతత నిండి ఉండటంతో భవనం ' ప్రశాంతి నిలయం' గా మారిపోయింది.  

రాత్రి మధురైలో స్టే చేసిన ప్రశాంతి, ప్రొద్దున త్వరగానే బయలుదేరింది. ముందే చెప్పి ఉంచటం వలన, వెళ్ళే దారిలో జీపులో వచ్చి కాచుకోనున్నాడు జనకరాజ్. నాన్నకు బాగా తెలిసినతను. అతన్ని కలుసుకుని, అతన్ని, అతనితో పాటూ వచ్చిన పని మనుషులనూ తన వెంట తీసుకుని -- ప్రశాంతి నిలయం కు బయలుదేరింది ప్రశాంతి.  

గ్రామానికి చాలాదూరంలో ఉన్నది ఇంద్ర భవనం. ఆమె జీవితంలాగానే ఈ ప్రశాంతి నిలయం కూడా ఆదరణ లేకపోవటంతో పాడుబడిపోయి ఉన్నది. వాహనాలు రాలేనంతగా పొదలు పెరిగి ఉండటంతో, అందరూ దిగి నడవడం మొదలుపెట్టారు.

జనకరాజ్ అన్నయ్యా...నేను ఇంకో పది రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాను. కారు వచ్చి వెళ్ళేలాగా బాటను సరిచేయాలి. మొదటి పనిగా -- నడవటానికి ఉన్న బాటను సరిచేయమనండి. మా పిల్లలకు డస్ట్ పడదు. అలర్జీ. ఇల్లు మొత్తం బూజు దులిపి, నేలంతా క్లీన్ చేయించి కడిగిపెట్టాలి. చలిని తట్టుకునేటట్టు, అన్ని కిటికీలకూ కర్టన్లు తగిలించండి. నేను మధురై నుండే రెడీమేడ్ గా అన్నీ కొనుకొచ్చాశాను. మనుషుల్ను పెట్టి తగిలించండి.

రెండో పనిగా -- రెండోది కాదు, ఇది-కూడా మొదటి పనే. కరెంటుకూ, ఫోను కూ మనుషులను పట్టుకుని ఎలాగైనా ఒక వారం రోజుల్లో వాటిని ఏర్పాటు చేయండి. వంటకి నాకు కిరోసిన్ కావాలి. కట్టెలు కూడా చెప్పండి. మన పక్క గ్రామం వాళ్ళ దగ్గర పాలు, కూరగాయలూ రోజూ తీసుకు వచ్చి ఇమ్మనండి

రాజ గంభీరంతో, సుడిగాలిలా ఆమె వేసిన ఆర్డర్లను ఒప్పుకుని నడవటం మొదలుపెట్టారు అందరూ.

పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బయిటి ఊరి నుండి వచ్చిన మనుషులు, విసుగు, అలసట అనేది చూపించకుండా పనులు చేసి ముగించారు. అప్పుడు ఇంటి వెనుకకు వెళ్ళిన ఒకతను పెద్దగా అరిచాడు.

అన్నా...ఇక్కడకు పరిగెత్తుకు రండి

ఏమిటో, ఏదో అనుకుని పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళందరూ అతను చూపించిన దిక్కు వైపు చూసి నిర్ఘాంతపోయి నిలబడ్డారు.

************************************************PART-4**********************************************

అక్కడ ప్రశాంతి నిలయం నుండి సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో తల విరుచుకుని ఉన్న ఆకారంలో నిలబడున్నది ఒక పెద్ద చింత చెట్టు. వేడి ప్రదేశాలలో మాత్రమే బాగా పెరిగి కాయలు కాచే తత్వం ఉన్న చెట్లు, కొంచం చల్లటి ప్రదేశాలలో తెలియక పెరిగినా కూడా, కాయలు కాయడం కష్టం. కానీ ఇక్కడ వొణుకు పుట్టించే చలిలో అందంగా కొమ్మలు విరిసి ఉండగా, చెట్టు నిండా కాయలు----అడిగే మనిషి లేక, కింద పడిపోయున్న కాయలు, రాక్షసుడి లాగా నిలబడి అందరినీ బెదిరిస్తున్నది చెట్టు. దాని చుట్టూ దట్టమైన పొదలు గుంపుగా ఉన్నాయి.

గబుక్కున తేరుకున్న జనక రాజ్ వీళ్ళను ఇక్కడే నిలబెడితే, మాటలు కోటలు దాటుతాయి!అనుకుని,

వెళ్ళండ్రా...వెళ్ళి పనులు చూసుకోండి. ఏదో చూడ కూడనది చూసినట్టు ఇక్కడే ఏమిట్రా గుంపు? మీరు కంబకరై నుండి వచ్చేటప్పుడు ఎన్ని చెట్లు చూసుంటారు?” అని కసురుకుని అందరినీ పనులకు పంపాడు.

లేదన్నా! చలి ప్రదేశంలో, మన ఊరి పక్కన లాగా ఒక చింత చెట్టును చూసిన వెంటనే భయం వేసింది. ఇలాంటి గుజ్జు ఎక్కువున్న కాయలు ఇక్కడ కాయవు. రకం చెట్లకు గుజ్జు ఎక్కువ లేని కాయలే ఉంటాయి. ఇక్కడ చూడండి...అడిగే వాడే లేని చోట, క్రింద పడున్న కాయలు పది మూటల వరకు ఉంటుంది! దీన్ని ఎలా   చుట్టు పక్కలున్న వాళ్ళు వదిలిపెట్టారు?” అంటూ ఆశ్చర్యంతోనే అందరూ తమ తమ పనులలోకి వెళ్ళారు.

ముందు భాగంలో ఉన్న స్నానాల గదిలోనూ, దానికి నేరుగా మేడ మీద ఉన్న రెండు స్నానాల గదులలోనూ ఎలాగో వైరింగ్ చేసి, అక్కడి కరెంటు వస్తువులను పనిచేసేటట్టు చేశాడు ఎలక్ట్రీషియన్.

ఇంట్లో ఉన్న మిగిలిన చోట్లలో వయరింగ్అంతా ఊడిపోయి వేలాడుతోంది. పూర్తిగా మార్చాలమ్మా. చాలా టైము పడుతుంది. మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే చెప్పండమ్మా చేసేద్దాం. వర్షాకాలం వస్తే ఇక్కడ కరెంటురోజుల తరబడి  పోతుంది. అందువలన కొవ్వొత్తులు ఎక్కువ కొని అట్టే పెట్టుకోండి

సాయంత్రానికి ఒక విధంగా ఇల్లు శుభ్రం అవగా, కొనుకొచ్చిన సామాన్లను పని వాళ్ళ సహాయంతో వంట గదిలో ఉంచారు. మిగిలిన పనులు ఏం ఏం చేయాలో చెప్పేసి, తిరిగి సొంత ఊరికి బయలుదేరింది ప్రశాంతి.

హైదరాబాద్ కు వెళ్ళిన వెంటనే తన పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దాడి ఆనందపడింది. అదే మొదటి సారివాళ్ళను వదిలి అన్ని రోజులు బయట ఊరులో ఉన్నది.

అమ్మా, గిరిజ నాకు భయంకరమైన కథ చెప్పింది

లేదమ్మా! వాడే దయ్యం ఎలా ఉంటుంది?’ అని అడిగాడు. అందుకే తల మీద తెల్ల తుండు వేసుకుని నటించి చూపించా

గిరిజా! చిన్న పిల్లాడ్ని ఇక మీదట అలా భయపెట్టకు. దయ్యాలు, భూతాలూ అన్నీ లేనే లేవు. అని గిరిజకు చెప్పి కొడుకు వైపు తిరిగి ఇక మీదట గిరిజ భయపెట్టినా, భయపడకు రాఘవ్అన్నది.

సరేనమ్మాఅని చెప్పి అమ్మ కొనుకొచ్చిన బొమ్మలను తీసుకున్నాడు.

తాను కొనుకొచ్చిన బొమ్మలను పెట్టుకుని -- ఆడుకుంటున్న గిరిజ, రాఘవ్ తో మెల్లగా తాము కోడైకానల్ వెళ్ళాల్సిన అవసరాన్ని చెప్పింది.

ఏమ్మా, నాన్న మళ్ళీ మిమ్మల్ని తిట్టేసి ఆంటీఇంటికి వెళ్ళిపోయారా? మనం ఎందుకమ్మా నాన్నకు నచ్చలేదు?”

వివరం తెలిసీ తెలియక మాట్లాడిన రాఘవ్ ను కన్నీటితో హత్తుకుంది. లేదురా! మనం అంటే మీ నాన్నకు చాలా ఇష్టం రా. అమ్మ తప్పు చేసింది కదా, అందుకనే తిట్టారు. త్వరలోనే మనల్ని వెతుక్కుంటూ వస్తారు చూడు

తరువాత ఐదు సంవత్సరాల వయసున్న రాఘవ్ కు కథలు చెప్పి నిద్ర పుచ్చింది...పది సంవత్సరాల గిరిజ అడిగిన ప్రశ్నలకు వీలున్నంత వరకు జవాబు చెప్పింది.

అమ్మా, మాకు మందులు కావాలి కదా...అక్కడకెళ్ళిన తరువాత ఆయాసం వస్తే?”

లేదమ్మా! అక్కడి వాతావరణానికి ఆయాసం రాదని చెబుతున్నారు. అదొక్కటే కాదు, అక్కడున్న శుభ్రమైన పరిస్థితులకు అంతగా ఆయాసం రాదు. అదీ కాకుండా, ఇప్పుడు కొన్ని రోజులుగా మన ఇంట్లో జరుగుతున్న సంఘటనల వలనే మీకు మనసు కష్టం ఏర్పడి -- ఆయాసం వస్తోందని డాక్టర్.పద్మ చెప్పింది. ఎందుకైన మంచిది, అక్కడికి వెళ్ళిన తరువాత బయటకు వెళ్ళి ఆడుకోకండి. అది చాలా వరకు మీకు మంచి చేస్తుంది. అయినా, అక్కడికి మందులు కొంచంగా తీసుకు వెళ్తున్నాం.  ఇంకా ఎక్కువ అవసరం అయితే తెప్పించుకుందాం...సరేనా?”

సరేనమ్మా అని చెప్పి దుప్పటి కప్పుకుంది గిరిజ.

గుడ్ నైట్ చెప్పి, ఇద్దరికీ నుదుటి మీద ముద్దు పెట్టి, తనగదికి వెళ్ళింది. తలనొప్పి మొదలవటంతో...ఒక మాత్ర వేసుకుని పడుకుంది.  

భీమవరం లో తన రెగులర్ పనులలో లీనమైపోయున్న ఫాదర్ లారన్స్ కు హైదరాబాద్ లో ఉన్న సిస్టర్అమీలియా దగ్గర నుండి ఫోన్ వచ్చింది.

ఫాదర్. ప్రశాంతి జాగ్రత్తగా హైదరాబాద్ వచ్చేసింది. నాకు ఫోన్ చేసి పిల్లల చదువు గురించి మాట్లాడింది. స్వరం అదీ బాగానే ఉన్నది

దేవుడికి కృతజ్ఞతలు అని చెబుతూ ఏసుక్రీస్తు చిహ్నం వేసుకున్నాడు.

అమీలియా కంటిన్యూ చేసింది ఏం ఫాదర్ ప్రశాంతికి ఏమిటి? మీరు ఏసుక్రీస్తు డాలర్ కలిగిన గొలుసును మీ మెడలో నుండి తీసేసి ఆమె దగ్గర ఇచ్చినప్పుడే అడగాలనుకున్నా. మనవలన ఆమెకు ఏదైనా సహాయం చేయటం కుదురుతుందా?”

ఆమె వెడతానని తీర్మానించుకున్న ప్రదేశంలో ఆమెకు చెడు శక్తుల వలన ఏదో ఆపద వస్తుందని నాకు అనిపించింది. దానికి కారణం, ఆ రోజు ప్రశాంతి నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను జరిగి నిలబడి మీ సంభాషణ వింటున్నాను. అప్పుడు ఆమె గురించి నాకేమీ తెలియదు. మీతో మాట్లాడుతూ ఒక బంగళా పేరు చెప్పిందే, ‘ప్రశాంతి నిలయం అనుకుంటా -- పేరు మాత్రం ఒక బొంగురు ధ్వని కలిగిన మగ స్వరంతో నా చెవులకు వినబడింది.  

మొదటిసారి ఏదో భ్రమ అయ్యుంటుందని అనుకుని, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నది క్షుణ్ణంగా విన్నాను. కానీ, ప్రతిసారీ పేరు నాకు అలాగే వినిపించింది. అప్పుడు ప్రదేశంలో ఏదో ఒక అమానుషం ఉన్నట్టు నాకు అనిపించింది. ఆపద నుండి అమ్మాయిని కాపాడటానికే నేను వేసుకున్న ఏసుక్రీస్తు డాలర్ ఉన్న గొలుసును నా మెడలో నుంచి తీసి ఆమెకు ఇచ్చాను. అది ఆమె దగ్గర ఉన్నంత వరకు, చెడు శక్తి ఆమెను ఏమీ చెయ్యలేదు

ఫాదర్ లారన్స్ ప్రశాంతత కోల్పోయి శ్రమ పడుతున్న ఆత్మలకు ప్రత్యేక ప్రార్ధనలను చాలా చేసి -- ఆత్మలు ప్రశాంతత పొందటానికి దారి చూపారు. ఆయన చెప్పేది నిర్లక్ష్యం చేయకూడదు’, ఆలొచనలలో చెప్పుకుంది అమీలియా.

ఫాదర్, అర్జెంట్ పని మీద నేను ఇప్పుడు బెంగళూరు బయలుదేరుతున్నా.నేను వచ్చిన వెంటనే ప్రశాంతితో మాట్లాడి, ఎలాగైనా ఆమెను బంగళాకు వెళ్ళకుండా అడ్డుకొవటానికి ప్రయత్నిస్తాను

మరికొన్ని విషయాలు గురించి మాట్లాడిన తరువాత ఇద్దరూ ఫోన్ లను కట్ చేసారు.

బెంగళూరు వెళ్ళి వచ్చిన తరువాత ఖచ్చితంగా ప్రశాంతిని కలవాలి, ఆమెను ప్రశాంతి నిలయం కు వెళ్ళకుండా ఆపాలిఅని తన డైరీలో గుర్తుగా రాసుకుంది అమీలియా.

కానీ, అమీలియా ఊరి నుండి తిరిగి వచ్చినప్పుడు కార్యం చెయ్యి దాటిపోయింది

************************************************PART-5**********************************************

రెండు రోజులు కాస్త ప్రశాంతతగా ఉన్నట్టు అనిపించింది ప్రశాంతికి. రోజు ప్రొద్దున రాఘవ్, ఫాదర్ లారన్స్ ఇచ్చిన గొలుసును పెట్టుకుని ఆడుకుంటూ తెంపాశాడు. దాన్ని టేబుల్ సొరుగులో పడేసింది. మనసే సరి లేదు. తాను చేసేది కరెక్టా...తప్పా అనే అయోమయం ఆమెను చుట్టు ముట్టుంది. అయోమయం విసుగ్గా మారింది.  

విసుగును మరింత పెంచే విధంగా ఎవరో ఫోన్ చేసి మేడం! మీరు విడాకులు ఇవ్వకపోయినా, మీ భర్త శ్రీనివాస్ తోనే జీవిస్తానని స్వప్ణ సుందరి స్నేహలత చెప్పిందే...దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి?” -- అని అడుగ....

అలాగా? అయితే అలాగే జీవించమని చెప్పండి

అంటే మీరు విడాకులు ఇవ్వటానికి ఇష్టపడటం లేదా?”

నేను అలా చెప్పలేదే!

మీరు చెప్పిన దానికి అదేగా అర్ధం మేడం. అలాగైతే మీరు విడాకులు ఇవ్వటానికి తయారుగా ఉన్నారా?”

నేను అలాగనీ చెప్పలేదే! వాళ్ళు చెప్పిన దానికి నేను అభిప్రాయం చెప్పదలచుకోలేదు. సారీ అని చెప్పింది. కానీ, ఆమె కోపం కొంచం కూడా తగ్గలేదు.

సాయంత్రం న్యూసులో, ‘భర్తకు విడాకులు ఇవ్వటానికి యువరాణి ప్రశాంతి ఒప్పుకోలేదు. కావాలంటే పెళ్ళి చేసుకోకుండానే జీవించ వచ్చు అని ఇద్దరూ చేరటానికి పరోక్షంగా సమ్మతం తెలిపిందిఅని వచ్చిన న్యూస్ ను చూసి మరింత నొచ్చుకుంది. ఎంత తొందరగా కుదురుతుందో, అంత తొందరగా ఊరు వెళ్ళటానికి ఏర్పాట్లు చేయటం మొదలు పెట్టింది. ఆమె ఎక్కడికి వెడుతున్నదీ ఎవరికీ చెప్పలేదు!

స్నేహలత విడాకుల పత్రంలో సంతకం తీసుకోవటానికి ప్రశాంతిని ఏదైనా చెయ్యటానికి రెడీగా ఉంది. కుదరదు, నా శ్రీనివాస్ ను వదిలి నేను పర్మనెంట్ గా విడిపోయి ఉండలేను. దానికి టెంపరరీ విడిపోవటం పరవాలేదు’ -- అని  అనుకుంటూనే ట్రావల్స్ కు ఫోన్ చేసి వాళ్ళు రేపు బయలుదేరుతున్నట్టు చెప్పి, ప్రయాణాన్ని ఖాయపరచింది ప్రశాంతి.

ప్రశాంతతను వెతుక్కుని ప్రశాంతి నిలయానికి వెళ్ళాలనుకుంటున్న ఆమెకు అక్కడ ప్రశాంతత దొరుకుతుందా? లేక...కాస్తో,గీస్తో ఉన్న ప్రశాంతతను కోల్పోతుందా?’ అనేది తెలియటం లేదు.

ఎందుకంటే, ఆమె హైదరాబాద్ కు తిరిగివచ్చిన నాలుగు రోజుల్లో, ‘ప్రశాంతి నిలయం బంగళా వెనుకవైపు కొంచం దూరంలో