ప్రేమ కలలు...(పూర్తి నవల)


                                                                              ప్రేమ కలలు                                                                                                                                                              (పూర్తి  నవల) 


 సుధీర్ అనే ఒక అనాధ, జీవితంలో విజయం సాధించటమే కాకుండా సమాజంలో విడిచిపెట్టబడ్డ మహిళలకు ఆదరణగా ఉంటాడు. అతను స్థాపించిన మహిళా హోమ్ లో జీవిస్తున్న మహిళలలో తన తల్లిని చూసుకునే అభిమానం కలిగినవాడు.

అంజలి అనే ఒక యువతి, తన తల్లిని సుధీర్ నడుపుతున్నమహిళా హోమ్ లో చేరుద్దామని వస్తుంది. తనకు ఉద్యోగం దొరికేంత వరకు తానూ తన తల్లితో పాటూ హోమ్ లో ఉండటానికి అనుమతి అడుగుతుంది. మొదట అనుమతించని సుధీర్ తరువాత అంగీకరిస్తాడు.

కొన్ని రోజులలో సుధీర్-అంజలి ఒకరినొకరు ఇష్టపడతారు. కలలు కంటారు. ధైర్యం చేసి సుధీర్ ఒక రోజు తన ప్రేమను అంజలి దగ్గర చెబుతాడు. తన తల్లి 'మన ప్రేమను అంగీకరిస్తేనే తాను పెళ్ళికి ఒప్పుకుంటాను ' అని చెబుతుంది. 

 కానీ అంజలి తల్లికి  'ప్రేమ '  అంటేనే  గిట్టదు. అందువలన వాళ్ళిద్దరి ప్రేమను అంగీకరించదు.

అంజలి అందరిలాగానే ఆశాప్రీతికి కట్టుబడినదే. కానీ ఆమె తల్లి యొక్క ప్రేమ కథ మిక్కిలి అసాధారణమైనది. అందువలన ప్రేమను విపరీతంగా ఎదురిస్తుంది.

ప్రేమంటే అంజలి తల్లికి ఎందుకంత విరక్తి? ఆమె యొక్క అసాధారణమైన  ప్రేమ కథ ఏమిటి? అదెందుకు ప్రేమ మీద విరక్తిగా మారింది?  ప్రేమ మీద ఆమెకేర్పడిన ఆ విరక్తి పోయిందా? అంజలి యొక్క నిజమైన ప్రేమ కల నెరవేరిందా? లేదు తన తల్లి కోసం అంజలి ప్రేమను త్యాగం చేసిందా?.....ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవండి.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్,  ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.....వ్యత్యాసమైన ప్రేమ కథ మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది. 

**********************************************PART-1******************************************

రంగుల కలలు అనే పేరు రాయబడ్డ ఇంటి ముందు పెద్దగా అరుస్తున్నాడు సుధీర్. అందంగా ఉండే అతని ముఖం, విపరీతమైన కొపంతో ఎర్రబడింది. అతను చూపులు లోపలకు రావడంతో అక్కడ పనిచేస్తున్న గోపి , రాజా దాక్కున్నారు.

బాబాయ్...ఎక్కడికెళ్ళారు? చాలా సేపటి నుండి అరుస్తున్నాను. ఇక్కడ నేను వృద్దాశ్రమం నడుపుతున్నానా...లేక హాస్టల్ నడుపుతున్నానా? దీన్ని ఇల్లులాగా చూసుకోవాలని చెప్పాను కదా? ఇప్పుడు మీరు నా ముందుకు వస్తారా లేకపోతే పనిలోంచి తీసేయనా?”

రాజా మెల్లగా తల బయటకు పెట్టాడు.

ఏం తమ్ముడూ...ఎందుకు అరుస్తున్నారు?”

నిదానంగా అడగండి. నన్ను మీకు తెలియదా? రోజు ప్రొద్దుటి టిఫిన్ బాగుండలేదని చెబుతున్నారు. గోపి బాబాయ్ ఎక్కడ?”

ఇదిగో ఇక్కడున్నా తమ్ముడూ--కుంటుకుంటూ నడిచి వచ్చాడు.

ప్రొద్దున ఏం టిఫిన్ పెట్టారు?”

ఉప్మా’. నిన్న కరెంటు కట్. అందువల్ల పిండి రుబ్బలేకపోయాము. రేపు ఇడ్లీ వేస్తాను తమ్ముడూ

అది సరే. ఎందుకు ఉప్మాను ఉడకకుండా పెట్టారు? చూడండి...ఇక్కడున్న కొందరికి పడలేదు. నేను ఎన్నిసార్లు చెప్పాను...ఇక్కడున్న వాళ్ళందరూ వృద్దులు. బాగా ఎనర్జిటిక్ ఫుడ్ పెట్టాలి అని?”

రోజుకు క్షమించు తమ్ముడూ. రేపటి నుండి బాగా చేస్తాను అనటంతో లోపలకు వెళ్ళాడు సుధీర్. అతని తల కనుమరుగయ్యాక మాట్లాడాడు గోపి.

అవును. ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ వి..పి. లు చూడు? భర్త లేని వాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు లాంటి వారే వస్తున్నారు. అలాంటి వాళ్లకు భోజనం సరిపోదా? ‘ఉప్మా ఉడకలేదు అని కంప్లైంట్ చేసారు. కానీ, కానీ... రోజు కాఫీలో ఉప్పు వేసి ఇస్తాను

మాటలు వింటూ నిలబడ్డ నిర్మలా ఆంటీ, తిన్నగా సుధీర్ దగ్గరకు వచ్చింది.

తమ్ముడూ...ఇలా చూడూ. నువ్వేమో ఏదోవిధంగా వృద్దాశ్రమాన్ని మంచిగా జరుపుకుంటూ వస్తున్నావు! కానీ, గోపి మిమ్మల్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వంట చేయటానికి జీతం తీసుకునే వంట మనిషి ఎందుకు?  మేము చేయలేమా?”

లేదు ఆంటీ. మీరు డబ్బులిచ్చి ఇక్కడ చేరుతున్నారు. మిమ్మల్ని ఎలా వంట చేయమని చెప్పగలను? అది బాగుండదు!

అలా అనుకుంటే ఒక స్త్రీని వంట మనిషిగా పెట్టు? నీకు గోపీనే దొరికాడా? నేనొకటి చెబితే వింటావా?”

చెప్పండి

నాకు ఒక చెల్లెలు ఉంది. అది కూడా చాలా కష్టపడుతోంది...తన సొంత కొడుకు ఇంట్లో ఉంటూనే కష్టపడుతోంది. చేతిలో చిల్లి గవ్వ లేదు. అందుకని ఆమెను ఇక్కడకు రమ్మంటాను. ఆమె వంట చేయనీ. నేనూ ఆమెకు తోడుగా హెల్ప్ చేస్తా. ఆమె చేసే పనికి జీతంగా భోజనం పెట్టి, తలదాచుకోవటానికి ఇంత చోటివ్వు. సరేనా...?” 

ఆలొచించాడు.

ఏమిటి ఆలొచిస్తున్నావు? నా చెల్లెలు రుక్మణి బాగా వంట చేస్తుంది. శుభ్రంగానూ ఉంటుంది. ఏమంటావు?”

నిర్ణయం తీసుకున్నాడు.

సరే ఆంటీ. మీరు ఆమెను రమ్మనండి. మనం చేర్చుకుందాం అన్నాడు.

అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళింది ఆంటీ.

అదే సమయం గోపీని వెంటనే పనిలో నుండి తీసేయలేదు. మార్కెట్టుకు వెళ్ళి రావటానికి, ఇతర బయటి పనులు చేయటానికి ఉండనీ అని వదిలేసాడు. వంట పనిలో నుండి విడుదల దొరికేటప్పటికి సంతోష పడ్డాడు గోపీ.

నా కేమన్నా వీళ్ళ మీద పగా? రోజూ పొయ్యి దగ్గర నిలబడలేక పోతున్నాను. పనులన్నిటికి స్త్రీలే సరిపోతారు. ఇంకే పని చెప్పినా చేస్తాను తమ్ముడూ

పెళ్ళిళ్ళకు వంట చేసేది మగవారే కదా గోపీ. అది మర్చిపోకు. రాజానే మర్కెట్టుకు వెళ్ళి కూరలూ అన్నీ పట్టుకొస్తున్నాడు. లెక్క సరి చూసి ప్రతి వారం నాకు అప్పగించాలి. తోటను సరిగ్గా ఉంచుకోవాలి. ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరికైనా ఆరొగ్యం బాగ లేకపోతే...డాక్టర్ను తీసుకురావాలి

ఏం తమ్ముడూ...ఇవన్నీ నువ్వే కదా చూసుకునే వాడివి?”

అవును. నేను సోమవారం నుండి ఉద్యోగానికి వెళ్ళబోతాను. ఆఫీసు  నుండి వచ్చిన తరువాత అన్నిటినీ చూసుకోలేను. అందుకనే శని, ఆదివారాలలో నిన్నడిగి తెలుసుకుంటాను

ఎందుకు హఠాత్తుగా ఉద్యోగాని వెడుతున్నారు?”

చాలా రోజుల నుండి నాకు ఆలొచన ఉన్నది.  ఎంతగా వృద్దాశ్రమం నడుపుతున్నా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే కదా వాళ్ళకు చోటిస్తున్నాను. అంటే, కొంచం వసతి ఉన్న వాళ్ళే కదా రాగలరు. కష్టపడే వాళ్ళు ఏం పాపం చేశారు? అలాంటి వాళ్ళకి ఒకరిద్దరికి చోటు ఇవ్వాలని నాకు ఆశ

మీకు చాలా గొప్ప మనసు తమ్ముడూ

ఊహూ...అలాగంతా ఏమీ లేదు. నేను ఉద్యోగానికి వెడితే దొరికే జీతంతో ఎవరైనా పేదవారిని చేర్చుకోవచ్చు కదా? అందుకనే...అన్నాడు.

అతన్ని మర్యాదతో నమస్కరించింది గోపీ మనసు.

బాగా తిరుగుతున్న చక్రంలాగా బాగానే జరుగుతున్నది వృద్దాశ్రమం. నిర్మలా ఆంటీ చెల్లెలు రుక్మణి యొక్క చేతి వంట రుచి అందరూ పొగిడారు. గోపీ కూడా బాధ్యత తెలుసుకుని నడుచుకోవటం మొదలుపెట్టాడు.

రోజు శుక్రవారం. సాయంత్రం సుధీర్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చినప్పుడు ఒకటే గోలగా ఉంది. ఎవరో అమ్మాయి గొంతు, గోపీ గొంతు గట్టిగా వినబడుతున్నాయి. ఆలోచనతో లోపలకు దూరాడు.

సుమారు 45 ఏళ్ళ వయసున్న ఒక మహిళ, 22 ఏళ్ళుండొచ్చు...ఒక యుక్త వయస్సు అమ్మాయి, పెట్టే బేడతో నిలబడున్నారు. అమ్మాయి అరుస్తున్నది.

సార్. నేను లెటర్ రాసినప్పుడు తీసుకు వచ్చి చేరండి అని జవాబు రాసేసి...ఇప్పుడు కుదరదంటే ఏం సార్ చేస్తాను?”

మేడం! మీరు ఉత్తరంలో ఎటువంటి వివరాలూ రాయలేదు. మేమూ చూడ కుండా అనుమతిస్తున్నాము అని జవాబు రాసేము. ఇప్పుడుఇక్కడ చోటు లేదు. బయటకు నడవండి...అన్నాడు.

గోపీ...ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? బయటవరకు వినబడుతోందిఅన్నాడు సుధీర్ లోపలకు వస్తూ!

అమ్మాయి గబుక్కున తిరిగి చూసింది.

ఆమెను చూసిన క్షణం అతన్ని అతను మరిచాడు సుధీర్. అమ్మాయ్ అంటే ఎలా ఉండాలో తన మనసులో ఊహించుకుని ఉన్నాడో అలాగే ఉన్నది అమ్మాయి. ఛామన ఛాయ. సన్నని శరీరం. రంగుకు తగిన దుస్తులు. డబ్బు వసతి అంతంత మాత్రమే నని ఆమె వేసుకున్న దుస్తులే చెబుతున్నాయి. ఆమె కళ్ళూ అయస్కాంతంలా లాగుతున్నాయి. ఒక్క నిమిషం తనని తాను మరిచి ఆమెనే చూస్తూ నిలబడ్డాడు.

సార్...మీరేనా దీనికి యజమాని? మీరే వినండి సార్ అన్యాయాన్ని! మా అమ్మను ఇక్కడ చేర్చుకుంటామని చెప్పి నాకు ఉత్తరం వచ్చింది. అది నమ్ముకునే శ్రీకాకుళం నుండి బయలుదేరి వచ్చాము. ఇప్పుడు ఈయన చోటు లేదని చెబితే...ఎక్కడికి సార్ పోతాము?” అన్నది బాధపడుతూ.

తనని తాను సర్దుకున్నాడు.

మేడం...మీ పేరేమిటి?”

అంజలి. ఈవిడ మా అమ్మగారు.ఈమెనే చేర్చుకోమని చెబుతున్నారు మీ మనిషిఅంటూ అతని దగ్గరకు వచ్చింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులోకి తెచ్చుకుంటూ గోపీ వైపు కోపంగా చూశాడు.

ఏమిటి గోపీ...వీళ్ళేం చెబుతున్నారు? ఎందుకు అమ్మగారిని చేర్చుకోలేమని చెబుతున్నావు?”

సార్... అమ్మాయి అబద్దం చెబుతోంది సార్. మనకు రాసిన ఉత్తరంలో...మా అమ్మను చేర్చుకో గలరా? దానికెంత డబ్బు కట్టాలో కట్టేస్తాను అని రాసున్నారు. కానీ ఇప్పుడొచ్చి నేనూ ఈమెతోనే ఉంటాను అని చెబుతున్నారుఅన్నాడు.

ఆశ్చర్యపోయాడు సుధీర్.

మిస్ అంజలి. ఇది వృద్దులకొసం నడుపుతున్న ఆశ్రమం. ఇందులో మీరు ఉండటానికి  అనుమతించలేము

మీరు ఎంత డబ్బు అడుగుతారో, అంత డబ్బూ కట్టటానికి రెడీగా ఉన్నాను సార్

ఇక్కడ డబ్బు సమస్య కాదు మిస్. రోజు మిమ్మల్ని ఉండమని చెబితే, రేపు ఇంకో అమ్మాయి తన అమ్మతో వచ్చి నేనూ ఇక్కడే ఉంటాను అంటుంది. తరువాత అలాగే జరిగితే...లేడీస్ హాస్టల్ నే నడపాలి. అదంతా నా వల్ల కాదు. మీరు ఇంకొక చోటు చూసుకోండిఅన్నాడు మనసు రాయి చేసుకుని.

సార్...మా పరిస్థితి కొంచం అర్ధం చేసుకోండి సార్. మాకు ఊర్లో వేరే ఎవరినీ తెలియదు. నాకు ఉద్యోగం దొరికేంత వరకు ఎక్కడ సార్ ఉండను? బద్రత ఉన్న చోటే బెస్టు. కొంచం దయ చూపండి సార్ఆమె బ్రతిమిలాడగానే అతని మనసు జాలిపడింది.

సుధీర్ చుట్టూ అటూ ఇటూ చూసాడు...ఎవరైనా అమ్మాయిని చేర్చుకో అని రెకమండ్ చెయ్యకపోతారా?’ అని మనసులో ఒక చిన్న ఆశ.

అంజలి తల్లి మెల్లగా నడిచి వచ్చింది.

తమ్ముడూ...మీ పరిస్థితి నాకు అర్ధమవుతోంది. నాకు కొంచం ఆరొగ్యం బాగలేదు. మద్య రాత్రి రెండింటికి ఒక మాత్ర వేసుకోవాలి. అదే అంజలికి బాధగా ఉంది. ఒక వారం ఉండటానికి అనుమతిస్తే చాలు. లోపు దానికి ఉద్యోగం దొరికి...మేము వేరే చోటు చూసుకుని వెళ్ళిపోతాంఅన్నది నీరసించిన స్వరంతో.

పని ఇప్పుడే చెయచ్చుగా?” అన్నాడు గోపీ.

వూరికే వుండు గోపీ అన్న సుధీర్, ఆమె వైపు తిరిగాడు. నాకు ఏం చేయాలనేది అర్ధం కావటం లేదు. నేనూ ఆశ్రమాన్ని ఎనిమిది సంవత్సరాలుగా నడుపుతూ వస్తున్నాను. వయసైన వారిని తీసుకు వచ్చి, డబ్బులు కట్టేసి, పరిగెత్తుకుని వెళ్ళే వాళ్లనే చూశాను. కానీ, ఈవిడ మీతోనే ఉంటానని చెబుతోంది. ఇది ఆశ్చర్యంగా ఉన్నా... సమస్య కూడా అదే అన్నాడు.

వీళ్ళ సంభాషణను బయట నిలబడి వింటున్న రుక్మణీ ఆంటీ లోపలకు వచ్చింది.

తమ్ముడూ...నువ్వు చదువుకున్న వాడివి. దేశంలో జరుగుతున్న మంచి, చెడు తెలిసున్నవాడివి. తను పాపం. వయసులో ఉన్న ఆడపిల్ల. తల్లిని తీసుకుని ఎక్కడికి వెడుతుంది? అలాగే వెళ్ళినా వాళ్లను ఎవరైనా మోసం చేస్తే...పాపం కదా?”

నాకూ అర్ధమవుతోంది ఆంటీ. కానీ వేరే దారి ఏదీ దొరకటం లేదే?”

నాకు ఒక దారి తోస్తోంది...చెప్పనా?” అన్నది రుక్మణీ ఆంటీ.

చెప్పండి ఆంటీ...మంచి దారైతే చూద్దాం?”

మన తోటలో ఒక ఇల్లు ఖాలీగానే ఉంది కదా. అక్కడ వీళ్ళను ఉంచు. కావాలంటే అద్దె తీసుకో. ఏమిటి...ఓకే నా?”

అయ్యో ఆంటీ, అక్కడా!...అది చెత్తగా ఉంటుందే. శుభ్రం చేసి రెండు సంవత్సరాలు అవుతోందే?”

పరవాలేదు సార్...దాన్ని మేము శుభ్రం చేసుకుంటాం. ఎంత అద్దె అని మాత్రం చెప్పండి. ఇప్పుడే ఇచ్చేస్తాంఅన్నది అంజలి.

అందులో సుధీర్ కు పూర్తి సమ్మతమే. ఎందుకంటే ఏ సమయంలోనైనా సరే అంజలిని చూస్తూ ఉండొచ్చు.

"సరి సరి...ఇది కూడా మంచి ఆలొచనే.  కానీ, ఒక మనిషి వల్ల శుభ్రం చేయటం కుదరదు. అందరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది. కాబట్టి, ఈ రోజు రాత్రికి మీరు ఇక్కడే ఉండిపొండి. రేపు ప్రొద్దున అందరం కలిసి శుభ్రం చేసి, సాయంత్రం మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఒక రోజులో ఏమీ అయిపోదు" అన్నాడు.

అదేలాగా వాళ్ళు ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు తెల్లవారగానే శుభ్రం చేసే పని మొదలుపెట్టి మధ్యాహ్నానికి ముగించారు.  సుధీర్ కూడా వాళ్ళతోనే ఉండి అన్ని సహాయాలూ చేశాడు. వంటకి కొన్ని గిన్నెలూ, పొయ్యి లాంటివి అవసరమయ్యింది. ఇద్దరూ వెళ్ళి వాటిని కొనుకొచ్చారు. సాయంత్రానికి ఇంటిని అందంగా అమ్ర్చి దిద్దింది అంజలి. 

పాలు పొంగించి అందరికీ ఇచ్చింది. ఆ రోజు సుధీర్ అక్కడే భోజనం చేశాడు. అంజలి వంట సుమారుగా ఉన్నా పొగడి ఆనందపరిచాడు. లోలోపల నవ్వుకుంది నిర్మలా ఆంటీ.

రాత్రి పడుకునే ముందు అంజలి ఉండే దిక్కు వైపు తలపెట్టుకుని పడుకున్నాడు.

'అంజలీ నువ్వు ఎవరు...ఎందుకు ఈ ఉరికి వచ్చవు...? ఏదీ నాకు తెలియదు. ఈ రోజు ఇంట్లోకి మాత్రమే రాలేదు. నా మనసులోకి కూడా వచ్చావు! నా లోపల ప్రకంపనలు ఏర్పరిచినట్లుగా నేను నీ మనసులో ప్రకంపనులు ఏర్పరిచానా? నీకు నేను నచ్చానా?' ఇలా ఎన్నో రకాలుగా ఆలొచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

అక్కడ అంజలి ...'ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుంది. అంతవరకు ఈ డబ్బు సరిపోతుందా? చాలకపోతే ఏం చేయాలి?' అనే కలతతో నిద్రపోలేక మేలుకునే ఉన్నది.

**********************************************PART-2******************************************

మరో రెండు వారాలు గడిచినై. కానీ, అంజలికి ఉద్యోగం దొరకలేదు. మనసు నొచ్చుకుంది. ఆమె తల్లి కూడా బాధపడింది.

అంజలీ...మనం గ్రామానికే వెళ్ళిపోదామా? నీకు ఇక్కడ ఉద్యోగం దొరికేటట్టు లేదే?”

అక్కడికి వెళ్ళి ఏం చేయబోతాము? అక్కడ మాత్రం నాకు ఉద్యోగం దొరుకుతుందా?”

నా వరకు నేను స్కూల్లో టీచర్ గా పనిచేసుకుంటున్నాను. దాన్ని వదిలేయమని చెప్పి...నన్ను ఇక్కడకు పిలుచుకు వచ్చి -- హు...నేను నీకు భారం అయిపోయాను. అది తలచుకుంటేనే బాధగా ఉంది

ప్లీజ్ అమ్మా. ఒంటరిగా నిలబడి పోరాడి నన్ను పెంచావు. అప్పుడు నీకు నేను భారంగా అనిపించానా? చెప్పమ్మా...అనిపించానా?”

లేదు. నువ్వే నాకున్న బలం. నేను ప్రాణాలతో ఉండేదే నీ కోసమే

అలాంటప్పుడు నాకు మాత్రం ప్రేమ ఉండదా? కొన్ని రోజులు కాచుకోమ్మా...అంతా సర్దుకుంటుంది

చేతిలో ఉన్న డబ్బు ఖాలీ అవుతూ వస్తోందే. నీకు పెళ్ళి చేయాలి. ఇవన్నీ ఎప్పుడు జరగబోతాయో తెలియదు...భగవంతుడు నన్ను ఎక్కువ పరీక్షిస్తున్నాడు!

"మనసు పాడు చేసుకోకు. ఈ రోజు ఒక కంప్యూటర్ కంపెనీలో ముఖాముఖి ఇంటర్ వ్యూ ఉన్నది. అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. చూద్దాం"

"ఏమ్మా...ఆ అబ్బాయి సుధీర్ కు ఎవరైనా తెలుసేమో కనుక్కో. అతను పెద్ద ఆఫీసులోనే కదా పనిచేస్తున్నాడు. అక్కడ నీకు ఉద్యోగం ఇప్పించలేడా?"

"ఎందుకమ్మా ఆయనకు ట్రబుల్ ఇవ్వటం? ఏదో కనికరించి మనల్ని తక్కువ అద్దెకు ఈ ఇంట్లో ఉండటానికి వొప్పుకున్నాడు. అది చాలదంటూ ఆయన్నే ఉద్యోగం ఇప్పించమని అడగటం బాగుంటుందా?"

"సరి...సరి...భోజనం చేసి బయలుదేరు. ఈ రోజైనా ఉద్యోగం దొరకనీ" అని చెప్పి అంజలిని పంపించింది తల్లి.

ముఖాముఖి ఇంటర్ వ్యూ ముగించుకుని బస్సు కోసం కాచుకోనున్నది. అప్పుడు సుధీర్ సడన్ గా వచ్చాడు.

ఏం అంజలీ...ఇక్కడ నిలబడ్డావు? ఎక్కడికి వెళ్ళాలి? నేను డ్రాప్ చేస్తాను అన్నాడు.

ఊహూ...ఎక్కడికీ వెళ్ళను...మనసే బాగోలేదు సార్. ఎక్కడైనా కనబడకుండా వెళ్ళిపోదామా అని అనిపిస్తోంది అన్నది విరక్తిగా!

ఆమెను చూడటానికే అయ్యో పాపం అనిపించింది సుధీర్ కు. యుక్త వయసులో చాలా మంది అమ్మాయలు దుప్పటాతో ముఖం మూసుకుని వాళ్ళిష్టం వచ్చినట్టు ఊరంతా తిరిగి వస్తుంటే ఈమె పాపం. అమ్మా...కుటుంబ బాధ్యత అని ఉంటోంది అని అనుకున్నాడు.

ఏమిటి సార్ ఆలొచిస్తున్నారు? వీళ్ళకు ఎందుకురా ఇల్లు ఇచ్చాము అని ఆలొచిస్తున్నారా? భయపడకండి...ఖచ్చితంగా అద్దె ఇచ్చేస్తాము

అంజలీ...మీకు అభ్యంతరం లేకపోతే అదిగో 'కాఫీ షాప్' ఉంది. అక్కడికెళ్ళి మాట్లాడుకుందామా? నా కిప్పుడు కాఫీ తాగకపోతే తల నొప్పి వచ్చేస్తుంది" అన్నాడు.

ఆమె కూడా కాదనకుండా బయలుదేరింది.

షాపులో జనం లేరు. చిన్నగా సంగీతం వినబడుతోంది. అక్కడక్కడ ప్రేమ జంటలు లోకాన్ని మర్చిపోయి కూర్చోనున్నారు. వాళ్ళను చూసిన వెంటనే అంజలికి సిగ్గు కమ్మేసింది.

"ఏమిటి సార్...ఇక్కడంతా ప్రేమికులుగా ఉన్నారు? నాకు ఇబ్బందిగా ఉంది"

"ఓ...మీరు గ్రామం నుండి వచ్చారు కదా? అందుకే ఇదంతా మీకు కొత్తగా ఉంది. ఇక్కడ ఇది సహజం. ఎవరూ ఎవర్నీ పట్టించుకోరు. మీరు కూర్చోండి" అన్నాడు.

"ఒక మూలగా ఇద్దరూ కూర్చున్నారు. ఆ చిరు చీకటి వెలుతురులో అంజలి దేవతలాగా కనిపించింది అతని కళ్ళకు! చెవులకు ప్లాస్టిక్ పోగులు, చేతులకు గాజులు లేవు. మెడలో ఒకే ఒక 'క్రిస్టల్ మాల అంటూ చాలా సింపుల్ గా ఉన్నా గానీ ఆమె యొక్క సహజ అందంతో ముఖం ప్రకాశంగా కనబడుతోంది.

"ఏమిటి...నన్నే చూస్తున్నారు?" అన్న తరువాత మామూలు స్థితికి వచ్చాడు.

"అవును...నేనే అడగాలనుకున్నాను. మీరెందుకు గ్రామం నుండి నగరానికి వచ్చారు? మీ నాన్న ఎక్కడ ఉన్నారు? మీరు వచ్చిన రోజే అడిగేవాడిని. తప్పుగా అనుకుంటారేమోనని అడగలేదు"

"చెబుతాను సార్. మా ఊరు శ్రీకాకుళం. నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను నాన్నను చూడలేదు. కానీ, ఆయన కట్టిన తాలి అమ్మ మెడలో వేలాడుతోంది. ఎప్పుడైనా ఆయన గురించి అడిగినా...ఎక్కువగా కోపం తెచ్చుకుని అరిచి అలాగే స్ప్రుహ తప్పి  పడిపోతుంది"

"అయ్యో పాపం...అంటే మీ నాన్న బ్రతికే ఉన్నారు. అవునా?"

"అవును...నేనే ఆయన్ని రెండు మూడు సార్లు చూసాను. ఉర్లో అమ్మ ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. నన్నూ చదివించింది. నేను డిగ్రీ చదువు పూర్తి చేసుకుని అక్కడే కొన్ని రోజులు పనిచేశాను. కానీ, అమ్మకు అప్పుడప్పుడు ఒళ్ళు బాగుండకుండా పోతుంది"

"ఏమైంది?"

"బ్లడ్ ప్రషర్. ఈ ఊర్లోనే ఉంటే మీ అమ్మకు బ్లడ్ ప్రషర్ ఎక్కువ య్యే అవకాశం ఉంది. అందుకని ఆమెను వేరే ఊరికి తీసుకు వెళ్ళండి అని డాక్టర్ చెప్పాడు"

"ఎందుకని?"

"మా ఊరు చిన్న గ్రామం. అక్కడున్న అందరూ ఆమెను ఒకలాగా మాట్లాడటం మొదలు పెట్టారు. నేను చిన్న దానిగా ఉన్నప్పుడు ఆమె అన్నిటినీ ఓర్చుకుంది. కానీ, నేను పెద్దవను, పెద్దవను...ఊరి ప్రజల మాటలు విని ఎక్కడ నేను కూడా ఆమెను చీదరించుకుంటానేమోనని భయపడింది"

"అది న్యాయమే కదా?"

"అది మాత్రమే కాదు. ఆమెకున్న చెడ్డపేరు వలన నాకు మంచి సంబంధం దొరకదేమోనని బాధ పడటం మొదలు పెట్టింది. ఒక సారి బ్లడ్ ప్రషర్ ఎక్కువ అయి, కళ్ళు తిరిగి పడిపోయింది. మంచి కాలం కాపాడేశాను. కానీ, 'ఇంకోసారి ఇలా వస్తే ఆమె ప్రాణానికే ముప్పు...లేకపోతే పక్షవాతం వచ్చినా వస్తుంది అని డాక్టర్ చెప్పినందు వలన ఇక్కడికి తీసుకు వచ్చాను

అది విని బాధపడ్డాడు సుధీర్.

"పాపం అంజలి మీరు. ఇంత చిన్న వయసులో ఎంత బాధ్యత?"

నన్ను పొగడటం ఉండనివ్వండి. మీరు మీ గురించి చెప్పండి. మీది ఏ ఊరు? అమ్మా, నాన్నా అందరూ ఎక్కడున్నారు? తోడబుట్టిన వారు ఎంతమంది? అన్ని వివరాలూ చెప్పండి" అన్నది.

కాఫీ తాగుతూ చిన్నగా నవ్వాడు.

"నా గురించి చెప్పటానికి ఏముంది?"

"ఏమిటి అలా చెబుతున్నారు? చిన్న వయసులోనే వృద్దాశ్రమం పెట్టి నడుపుతున్నారంటే సామాన్యమైన పనా...ఇలాంటి సేవా మనోభావం ఎవరికి వస్తుంది?"

"అరే...మీరొకరు. సేవా లేదు...గీవా లేదు. నేను డబ్బులు తీసుకునే కదా వాళ్ళకు చోటిస్తున్నాను...భోజనం పెడుతున్నాను"

"అయినా కానీ, ఎంతమందికి ఈ మనసు ఉంటుంది? మీరు మీ గురించి చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పొద్దు"

"అయ్యయ్యో... అలా ఏమీ లేదండి. నాకు ఇదే ఊరని అనుకుంటా. ఎందుకంటే వివరాలు చెప్పటానికి అమ్మో, నాన్నో లేరు. నాకు రెండేళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఒక ప్రమాదంలో చనిపోయారు"

"అరే భగవంతుడా..."

"మా నాన్న పెద్ద వ్యాపారస్తుడుట. అందువల్ల నాకు కొంచం డబ్బు పెట్టి వెళ్ళారు. ఆ డబ్బు తీసుకుని మామయ్య నన్ను చదివించారు. ఉండటానికి చోటూ, తినటానికి తిండీ దొరికింది. కానీ, ఒక కుటుంబంలో దొరకవలసిన ప్రేమ, అనురాగం దొరకలేదు. మా అత్తయ్య తన పిల్లల్ను బుజ్జగిస్తుంటే అది చూసి చూసి వేధన పడేవాడిని. ఎందుకు నన్ను బుజ్జగించటం లేదు అనేది అర్ధం అయ్యేటప్పటికి పది సంవత్సరాలు పట్టింది"

వింటున్న అంజలికి కళ్ళు నీటితో నిండినై. అదేమీ పట్టించుకోనట్టు చెప్పటం తిరిగి ప్రారంభించాడు.

"నాకు వివరాలు తెలియటం ప్రారంభమైన తరువాత మనసును దృఢ పరచుకున్నాను. ఆ కుటుంబం నుండి బయటకు వెళ్ళిపోవాలని కచ్చెతో చదవటం మొదలుపెట్టాను. సి. ఏ. ముగించిన వెంటనే మామయ్య దగ్గర చెప్పేసి వేరుగా వచ్చాసాను.  ఆయన మా నాన్నగారి డబ్బు అంటూ కొంత డబ్బు ఇచ్చారు. అదిపెట్టుకుని ఈ వృద్దాశ్రమం మొదలుపెట్టేను. అందులో ఒక స్వార్ధం"

"ఏమిటీ?"

"ఇక్కడికొస్తున్న వృద్దులు నన్ను తమ పిల్లాడుగా తలచి ప్రేమ చూపిస్తారు కదా? అమ్మ ప్రేమంటే ఏమిటో తెలియని నాకు అది ఊరట కలిగిస్తుంది కదా అని మహిళలకు మాత్రమే అంటూ మొదలుపెట్టేను" అన్నాను.

కళ్ళల్లో నుండి పొంగి పొర్లుతున్న కన్నీటిని అతను తనకు తెలియకుండానే తుడుచుకున్నాడు. కొంచం సేపు మౌనం చోటు చేసుకుంది.

"అంజలీ...మీరేం చదువుకున్నారు" సడన్ గా అడిగాడు!

అతని మాటలకు సోకంలో మునిగిపోయున్న ఆమె కొంచం హడావిడి పడింది.

"నేను ఎం.ఎస్.సి బయోలజీ చదువుకున్నాను. ఒక స్కూల్లో టీచర్ గా ఒక సంవత్సరం పనిచేశాను. మీకు తెలిసిన చోట ఎక్కడైనా నాకు ఉద్యోగం దొరుకుతుందా? కొంచం చెప్పండి...ప్లీజ్"

"ఓ...మీరు అంతవరకు చదువుకున్నారా?  సరే. మొదట మా ఆఫీసులోనే ఒక క్లర్క్ ఉద్యోగం ఖాలీగా ఉంది. దానికి మిమ్మల్ని దరఖాస్తు చేయండి అని చెబుతామనుకున్నా. కానీ ఇప్పుడు...."

"పరవాలేదు సార్...ఏ ఉద్యోగమైనా చేస్తా"

"ఉండండి...తొందరపడకండి. నిన్ను నేను ఒక దినపత్రికలో ఒక ప్రకటన చూశాను. మన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద స్కూల్లో 'టీచర్లు కావాలి అని వేసుంది. మీరు దానికి దరఖాస్తు చేసుకోండి"

"ఏ స్కూలు? మన వీధి చివర ఉన్నదే అంతర్జాతీయ స్కూలు...అదా?"

"అవును...నాకు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ బాగా తెలుసు. జీతం కూడా బాగా ఇస్తారు. మీరు దానికి ట్రై చేయండి"

ఆమె మొహంలో సంతోషం కనబడింది.

సార్...చాలా 'థ్యాంక్స్. రేపే డైరెక్టుగా వెళ్ళిపోతాను

"కుదిరితే మీరు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వండి. ఎలాగైనా నాకు ఆ ఉద్యోగం దొరికితే సరి" అంటూ లేచింది.

ఇద్దరూ ఒకటిగా బయటకు వచ్చారు. వచ్చేటప్పుడు ఒక జంట ఎదురుగా వస్తే ...కొంచంగా వొదిగింది. అప్పుడు చిన్నగా సుధీర్ ను ఢీ కొన్నప్పుడు భుజాలపైన కరెంటు పాస్ అయినట్టు అనిపించింది అంజలికి.

'ఏమిటిది. ఇంతవరకు కలగని భావం? బస్సులో వెడుతున్నప్పుడు ఎంతో మంది తెలియక, కొంత మంది తెలిసి రాసుకుంటారు. అప్పుడంతా రాని భావన ఇప్పుడెందుకు కలిగింది?'

ఆమె మొహం తామర పువ్వు వికసించటం సూర్యుడికే సొంతం అనే భావంతో ఆశగా చూశాడు సుధీర్.

**********************************************PART-3******************************************

అతను చెప్పిన స్కూల్లో అంజలికి ఉద్యోగం దొరికింది. మంచి జీతం. ఇంటికి దగ్గరగా ఉండడం వలన నడిచే వెళ్ళొచ్చు.  తల్లి రోహినికి అప్పుడే మనశ్శాంతి కలిగింది. అంజలీ స్కూలు నుండి వచ్చే సమయమూ, సుధీర్ ఆఫీసు నుండి వచ్చే సమయమూ వేరు వేరు. అందువలన ఆమెను చూడటమే అరుదుగా అయిపోయింది సుధీర్ కు.

ఆ రోజు ఆదివారం. నూనె రాసుకుని స్నానం చేసి, రిలాక్స్ గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు తల్లీ, కూతుర్లు.

"అమ్మా...ఈ రోజు మా స్కూల్ ప్రిన్సిపాల్ నన్ను పిలిచారు. నాకు విపరీతమైన భయం పట్టుకుంది. వణుకుతూ వెళ్ళాను"

"ఏం చెప్పారు?"

"మీరు పాఠాలు చెప్పే విధం బాగుంది. కానీ, మిమ్మల్ని ఇంటర్ మొదటి సంవత్సరం, ఇంటర్ రెండవ సంవత్సరం తీయమని చెప్పలేకపోతున్నాను...అన్నారు"

"అలా గనుక చెయ్యమంటే. జీతం ఎక్కువ వస్తుంది. ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది కదా? ఎందుకు తీయమనటం లేదు"

"అది కూడా ఆయనే చెప్పారమ్మా. నేను ఎం.ఎస్.సి మాత్రమే చదువుకున్నానట. పెద్ద క్లాసులు తీయాలంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా 'బి.ఎడ్' చదివుండాలి అన్నారు"

"అవును...నేను మర్చిపోయాను. నువ్వు ఇప్పుడు కూడా 'బి.ఎడ్' చదవచ్చే?" అన్నది తల్లి.

అప్పుడు "ఏమిటీ...నేను లోపలకు రావచ్చా? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారా?" అని అడుగుతూ లోపలకు వచ్చాడు సుధీర్. అతన్ని చూసిన వెంటనే పువ్వులాగా వికసించింది అంజలి మొహం.

"రండి సార్... లోపలకు రండి. ఇప్పుడే మిమ్మల్ని తలచుకున్నాను. మీరు వచ్చారు. మీకు వందేళ్ళు" అన్నది.

ఆమె తనని తలుచుకున్నది అని విన్న వెంటనే ఒక బుట్టెడు పూవులు అతనిపైన పోసినట్లు మైమరచి పోయాడు సుధీర్.

"ఏందుకు తలుచుకున్నారు...చెప్పండి"

తల్లి తొందరపడింది. " అంజలి పనిచేస్తున్న స్కూల్లో ఇది పెద్ద క్లాసులకు కూడా వెళ్ళాలంటే 'బి.ఎడ్' ఖచ్చితంగా చదవాలని చెప్పారట. దాని గురించే మాట్లాడుతున్నాం...ఇంతలో మీరే వచ్చారు"

"'బి.ఎడ్' చదవాలా...ఎవరు చెప్పేరు?"

"స్కూల్ ప్రిన్సిపాల్. అది ప్రభుత్వ ఆదేశాలు అన్నారు"

"మీరేం ఆలొచిస్తున్నారు?"

"ఏదైనా ఒక యూనివర్ సిటీలో 'కరెస్పాండన్స్ కోర్సులో చేరి చదవాలని అనుకుంటున్నా. దానికి మీరే సహాయం చేయాలి"

"ఇది కూడా చెయ్యకపోతే ఎలా? నాకు తెలిసిన ప్రొఫసర్ ఒకరున్నారు. ఆయన దగ్గర అడిగి చెబుతాను. ఆయన మంచి దారి చెబుతారు" అన్నాడు.

"అయితే ఇప్పుడే మాట్లాడండి" అని తొందర పెట్టింది అంజలి.

అతనూ "సరే" అని చెప్పి ఫోన్ చేశాడు. లోపల సిగ్నల్ సరిగ్గా రాకపోవటంతో బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు.

అతన్ని ఆదుర్దాగా చూసినై నాలుగు కళ్ళు.

"ఏం చెప్పారు తమ్ముడూ?"

"ఆంటీ...ఇప్పుడు 'బి.ఎడ్ చాలా చోట్ల ఉన్నదట. కానీ మనకి 'కరెస్ పాండన్స్ కావాలి కాబట్టి ఇందిరా గాంధీ ఓపన్ యూనివర్ సిటీ చాలా బాగుంటుందట. అక్కడికి వెళ్ళి కనుక్కో...అన్నారు"

"అది ఎక్కడుంది?"

"ఇక్కడ్నుండి కొంచం దూరంలోనే. ఇక్కడ్నుంచి బస్సు ఉంది. మీరు బస్సులో వెళ్ళి కనుక్కుని రండి. ఈ రోజు వెళ్ళకండి...లీవు. రేపు వెళ్లండి" అన్నాడు.

"తమ్ముడూ అంజలికి ఈ ఊరు కొత్త. మీరూ తోడుగా వెళ్ళి ఎంక్వయరీ చేసి రండి. మీకే  శ్రమ ఇవ్వాల్సి వస్తోంది"

ఆ మాటనే కదా అతను ఎదురు చూసేడు.

"ఇందులో శ్రమేమీ లేదు. మీకు ఎన్నింటికి రేపు స్కూల్ విడిచిపెడతారు"

"సాయంత్రం నాలుగు గంటలు"

"అయితే సరిగ్గా నాలుగింటికి 'పర్మిషన్ వేసి వచ్చేస్తాను. కలిసే విచారిద్దం...సరేనా...?" అన్నాడు. ఆమె కూడా అంగీకరించింది.

మరికొంతసేపు మాట్లాడుకుని బయలుదేరాడు.

సోమవారం సరిగ్గా నాలుగు గంటలకు వచ్చేసింది అంజలి. రెడీగా ఉన్న అతని 'బైకు లో కూర్చుని ప్రయాణించింది. అది ఆమెకు చెప్పలేని భావాలను ఇచ్చింది. తన మనసు మెల్లగా అతని మీద వంగుతుండడం అర్ధం చేసుకుంది.

ముప్పావు గంట ప్రయాణించి యూనివర్ సిటీకి వచ్చి వివరాలు సేకరించింది. అప్లికేషన్ ఒకటి కొనుక్కుని బయటకు వచ్చింది.

"అంజలీ నేను అనుకున్న టైము కంటే ముందే పనిపోయింది. అదిగో కనబడుతోందే ఆ హోటల్లో ఏదైనా తినేసి వెళదామా" అన్నాడు.

కానీ, అతని మనసు వేసిన ప్రణాళిక వేరు. ఈ రోజు వదిలితే మళ్ళీ ఆమెను ఒంటరిగా కలవడం చాలా కష్టం. అందువలన అంజలిని తీసుకు వెళ్ళి తన మనసులోని మాటను చెప్పాలని అనేది అతని ఐడియా.

"వద్దు...నాకు ఆకలిగా లేదు. మీరు తినేసి రండి. నేనిక్కడ కూర్చోనుంటాను" అని చెప్పిన ఆమె చెవులు పట్టుకుని పిండేద్దామా అన్నంత కోపం వచ్చింది సుధీర్ కు.

'కొంచమైనా అర్ధమవుతోందా చూడు. మనిషి ఇక్కడ నరక వేధన అనుభవిస్తున్నాడు. అదేమీ తెలియనట్లు అమాయకంగా ఉంది చూడు అని అనుకున్నాడు.

"నాకు ఆకలిగా ఉంది. రండి...మిమ్మల్ని ఇక్కడ  వదిలిపెట్టి వెళ్ళను. నేను ఆకలితో ఉండటం మీకు ఇష్టమైతే మీరు రావద్దు" అన్నాడు తెలివిగా.

"అయ్యో...అయితే రండి..." అన్న అంజలి లేచి నడిచింది.

అదొక పెద్ద హోటల్. జనం చాలా తక్కువగా ఉన్నారు. మంచి చోటు చూసుకుని ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. మనసేమో ఆమెతో విషయాన్ని ఎలా చెప్పాలి అని ఆలొచిస్తోంది.

"ఏమిటి సుధీర్ సార్...కూర్చునే కలలా? ఏసీ లో కూడా మీకెందుకు చెమటలు పట్టాయి?" అని అడిగింది.

" అంజలీ...మీరు నన్ను సార్ అని పిలిచి నన్ను వేరు మనిషిగా చూస్తున్నారు? సుధీర్ అనే పిలవండి!" అని ఒక రాయి విసిరేడు.

ఆమె ఏమీ మాట్లాడకుండా తలవంచుకుని కూర్చుంది.

'సర్వర్ వచ్చి 'ఆర్డర్ అడిగాడు..."నాకు పైనాపిల్ జ్యూస్. మీకు ఏం కావాలి?" అని అడుగుగా ఆమె పెద్దగా సాగదీయకుండా "నాకూ అదే" అని చెప్పింది.

'సర్వర్ వెళ్ళిపోయాడు.

"అంజలీ...అదొచ్చి...మీరు....వచ్చి..."

"నేను మిమ్మల్ని 'సార్ అని పిలవకూడదంటే మీరు నన్ను 'ఏమండి, రండి, పొండి అని పిలవటం ఆపాలి. సరేనా?" అంటూ నవ్వింది. ఆమెను దీర్ఘంగా చూశాడు.

"చిన్న వయసు నుండి నేను ఒంటరిగా పెరిగాను. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో...ఎలా మాట్లాడ కూడదో ఏదీ నాకు తెలియదు. అందువలన నేను మాట్లాడబోయేది తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి. అరిచి, ఆర్బాటం చేసి నన్ను అవమాన పరచకూడదు?"

"ఏమిటీ...ముందే బాగా ఇరికిస్తున్నారు? ఏమడగాలో అడగండి?"

"హూ...నేరుగానే అడుగుతాను. నిన్ను చూసిన మొదటి రోజు నుండే నువ్వు నా మనసులోకి వచ్చేశావు. ఇదేమీ మీ శరీర అందాన్ని మాత్రం చూసి రాలేదు. మీ బాధ్యతా భావం, మీ అమ్మ మీద మీరు చూపుతున్న శ్రద్ద, పోరాడి అయినా జీవితంలో గెలవాలనే మీ యొక్క పట్టుదల...ఇవన్నీ చూసే మీ మీద ప్రేమ పుట్టింది. నేనింక నిన్ను తప్ప వేరే ఇంకో అమ్మాయిని ఆలొచించి కూడా చూడలేను. నా మనసులో నువ్వున్నావు. నీ మనసులో నేనున్నానా?" అన్నాడు దీర్ఘంగా.

మట్లాడ కుండా కూర్చుంది. ఆమె మనసులో ఆలొచనలు పలు రకాలుగా పరిగెత్తినై. ఆమెకూ సుధీర్ అంటే ఇష్టమే. కానీ, అతను చెప్పినట్టు చూసిన మొదటి చూపులోనే వచ్చిన ప్రేమ కాదు. అతని గుణం, ఆలొచనలు అన్నీ తెలిసి ఏర్పడి వికసించిన  ప్రేమ.

"ఏమిటి మాట్లాడకుండా తల వంచుకున్నావ్! నా మీద కోపమా? నేనేమీ తప్పుగా అడగలేదే?"

'ఇంకా మాట్లాడకుండా కూర్చుంటే బాగుండదు అనుకుని తలెత్తి అతన్ని చూసింది అంజలి.

"సుధీర్...మీలాగా చూసిన వెంటనే 'ప్రేమ అనేది నాకు రాలేదు. నేను ఎందుకు ఇది చెబుతున్నానంటే...నన్ను తప్పుగా అర్ధం చేసుకోకుండా ఉండాటానికి. మీరు బాగా చదువుకున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నారు. అన్నిటికీ మించి అవతలివారికి సహాయంచేయాలనే మనసు ఉంది. మిమ్మలని ఇష్టం లేదని ఏ అమ్మాయి చెబుతుంది"

"ప్లీజ్...అవన్నీ ఎందుకు. మీకు నేను నచ్చానా...లేదా?"

"నచ్చారు. మీలాంటి వారిని భర్తగా పొందటానికి పెట్టి పుట్టుండాలి. కానీ, మా అమ్మ అంగీకరిస్తే మాత్రమే మన పెళ్ళి జరుగుతుంది. సరేనా...?"

"ఇది చాలు. నీకు నేను నచ్చాను అని చెప్పావు చూడు. అది చాలు. ఈ జవాబు కోసమే నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. నువ్వు అనుకునేటట్టు ఊరు తిరగటానికో, నీతో సరదాగా ఉండటానికో నిన్ను ప్రేమించటం లేదు. సరే నని చెబితే రేపే మీ అమ్మ దగ్గరకు వచ్చి నిన్ను పెళ్ళిచేసుకుంటానని చెబుతాను...ఏమంటావు?"

మళ్ళీ నవ్వింది అంజలి.

"చాలా తొందర పడుతున్నారు మీరు. నా 'బి.ఎడ్' చదువు ముగియనివ్వండి. ఆ తరువాత అమ్మ దగ్గర చెబుదాం"

"ఎందుకలా? పెళ్ళి చేసుకుని చదువుకో. నాకు ఇప్పుడు 27 ఏళ్ల వయసు. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటేనే మనం సరదాగా కొన్ని రోజులు తిరిగి, ఆ తరువాత పిల్లల్ను కనొచ్చు. ఇంకా ఆలశ్యం అయితే నేను రిటైర్డ్ అయ్యేటప్పుడు మన పిల్లాడు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉంటాడు" అన్నాడు.

కళ్ళల్లో నీళ్ళు కారుతుంటే నవ్వింది అంజలి.

"అబ్బో మీకు వేగం చాలా ఎక్కువ. ఇంకా పెళ్ళి మాటలే మొదలుపెట్టలేదు. అంతలోనే పిల్లలూ, చదువులు దాకా వెళ్ళిపోయారు?"

"లేదు అంజలీ. నాకు ఇది పలు సంవత్సరాల కల. నాకని ఒక కుటుంబం, నన్ను ప్రేమించే భార్య, అందంగా -- కవితలలాగా ఇద్దరు పిల్లలూ అంటూ జీవించాలని ఆశగా ఉంది. నిన్ను చూసినప్పుడు నాకు అది వెర్రిగా మారిపోయింది. ఇంకా ఆలశ్యం చేయను. ఒక మంచి రోజు చూసుకుని నిర్మలా ఆంటీనీ, రుక్మణీ ఆంటీనీ తీసుకుని మీ ఇంటికి వస్తాను" 

"సరే. మా అమ్మ దీనికి ఎదురు చెప్పరని అనుకుంటున్నాను. ఎందుకంటే...మీరంటే ఆవిడకూ చాలా ఇష్టం" అంటూ బయటకు నడిచింది.

బైకు మీద ఈసారి హక్కుతో ఎక్కింది.

తల్లి రోహిని వాకిట్లోనే నిలబడుంది. వాళ్ళు బైకు నుండి దిగటం... అంజలి చెయ్యి పుచ్చుకుని సుధీర్ కరచాలనం చెయ్యటం, ఎగిరే ముద్దు ఒకటి ఇవ్వటం చూసింది.  

ఆమెలో పలు కన్ ఫ్యూజన్లు పరిగెత్తినై. తల జివ్వున లాగుతూ నుదిటి మీద చెమట పట్టేట్టు చేసింది. కళ్ళను కోపం కప్పేయగా - ఆవేశంతో నిలబడింది. ఇద్దరూ దగ్గరకు వచ్చారు.

"అత్తయ్యా..." అంటూ ఏదో చెప్పాలని అనుకున్న సుధీర్ చెంప చెళ్ళు మన్నది.

"అనాధ కుక్కా...నా కూతురితో నీకేమిటిరా రహస్య మాటలు? ఆమె చెయ్యి పుచ్చుకుంటున్నావు! ఎంత ధైర్యం?" అని అరిచింది. కోపంతో ఆయసపడుతోంది.

'జరిగింది నిజమా లేక కలా?' అనే షాక్ లో చెంపను పట్టుకుని అలాగే నిలబడిపోయాడు  సుధీర్. తాను ఏం తప్పు చేశాడో అనేది అతనికి అర్ధం కాలేదు.

అంజలీనే కోపంగా ముందుకు వచ్చింది.

"అమ్మా...నీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇప్పుడు ఆయన్ని కొట్టావు?" అన్నది.

కొంచం కూడా కోపం తగ్గించుకోలేని ఆవిడ అంజలి చెంప మీద కూడా ఒకటిచ్చింది.

"ఆయనా!? ఏమిటే ఆయన? ఏమిటీ కొత్త వరుస? వాడేవరే నీకు? అతన్ని కొడితే నీకెందుకంత కోపం వస్తోంది?"

రోహిని వేసిన అరుపులకు...ఆశ్రమంలో ఉన్న కొందరు బయటకు వచ్చి, తొంగి చూడటం మొదలు పెట్టారు.  

"అమ్మా...నేను ఆయన్ను ప్రేమిస్తునాను. ఆయన్నే పెళ్ళి చేసుకుంటాను" అని అంజలి చెప్పటంతో కాళ్ళూ -- చేతులూ వణకటం మొదలైయ్యింది రోహినిలో. నోట మాట రాక స్థంభించింది.

మెదడుకు రక్తం వేగంగా వెళ్ళటంతో ఆమె ముక్కు నుండి రక్తం కారటం మొదలైయ్యింది.

చెమట కాలువలాగా ప్రవహించగా...అలాగే సృహ కోల్పోయింది.

**********************************************PART-4******************************************

హాస్పిటల్లో మంచం మీద పడుకోనున్నది రోహిని. పక్కన అంజలి, నిర్మలా ఆంటీ...ఇంకా కొంతమంది మహిళలు . కొంచం దూరంలో సుధీర్ నిలబడున్నాడు. ఒక బాటిల్ నుండి మందు, గ్లూకోస్ కలిపిన నీళ్ళు ఆమె శరీరంలోకి చుక్కలు చుక్కలుగా ఎక్కుతున్నాయి. చేతులలోని నరాల నుండి కొన్ని సూది మందులు వేసింది ఒక నర్స్. 

కన్నీళ్ళు కారుతుంటే వాటినే చూస్తూ నిలబడింది అంజలి.

డాక్టర్ లోపలకు రాగానే -- ఆయన్ని చుట్టుముట్టారు అందరూ.

"ఇప్పుడు మా అమ్మకు ఎలా ఉంది డాక్టర్?"

"నువ్వు ఆవిడ కూతురివా? చూడటానికి చదువుకున్న దానిలాగా ఉన్నావు? కానీ, ఆమెను ఎలా చూసుకోవాలో తెలియలేదే?"

"ఏమైంది డాక్టర్?"

"ఇంతుకు ముందు ఇలాగే ఒకసారైనా వచ్చుంటుందే?"

"అవును డాక్టర్...రెండు సంవత్సరాలకు ముందు ఆవిడ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఇలాగే సృహ తప్పి పడిపోయింది"

"మీ అమ్మకు బ్లడ్ ప్రషర్ చాలా ఎక్కువగా ఉంది. ఆమె ఎక్కువ ఆవేశపడితే మెదడుకు వెళ్ళే రక్త ప్రవాహం ఎక్కువై, ప్రషర్ తట్టుకోలేక రక్త నాళాలు చిట్లి పోయే పరిస్థితికి తీసుకు వెడుతుంది. ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా?"

"చెప్పండి డాక్టర్..."---వణుకుతున్న స్వరంతో అడిగింది.

"పక్షవాతం రావచ్చు. రక్త నాళాలు చిట్లిపోతే మరణం కూడా సంభవించవచ్చు. మీరు కరెక్టు టైముకు తీసుకు వచ్చారు. లేకపోతే ఏమై ఉండేదో?"

దడ దడ మని కొట్టుకుంటున్న హృదయాన్ని కట్టడి చేసుకుని మౌనంగా చూసింది అంజలి.

"ఎప్పుడు ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు? ఈవిడికి ఎప్పుడు సృహ వస్తుంది?"

"ఇంకాసేపట్లో సృహ వస్తుంది. రెండు రోజుల తరువాత తీసుకు వెళ్ళొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న షాక్ కూడా తట్టుకోలేదు. ఆవేశం చెందేటట్టు ఏమీ చెప్పకండి!"

"సరే డాక్టర్...ఎన్ని రోజులకు మందులు వేయాలి?"

"పదిహేను రోజులకు మందులు రాసిస్తాను. తరువాత ఒక టెస్టుకు రండి -- నార్మల్ అయిపోతే ఏమీ అక్కర్లేదు" అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు.

ఇప్పుడు ఆడవాళ్ళందరూ, అంజలిని చుట్టు ముట్టారు.

"ఏమిటే ఇది? నిన్న ప్రొద్దున మీ అమ్మ నీతో మాట్లాడిందే. అప్పుడు చాలా నిదానంగానే ఉన్నదే? సడన్ గా ఏమైందే? ఎందుకని సృహ తప్పి పడిపోయంది?"

ఏం చెబుతుంది అంజలి? దీనంగా సుధీర్ వైపు చూసింది.

ఇంతలో నిర్మలా ఆంటీ అడ్డుపడి "ఒంటికి ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో  ఎవరికి తెలుసు? ఏమిటో---అనుభవించాల్సిన సమయం వచ్చింది. అంజలి దగ్గర ఏమైందని...ఎందుకు వచ్చిందని అడిగితే అది ఏం చెబుతుంది? పాపం....చిన్న పిల్ల" అన్నది అంజలికి ఆదరణగా.

"ఏడవకు అంజలి. మేమున్నాం. నిన్ను ఇలా వదిలేయం. నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. మీ ఇంటికి వెళ్ళిపో. నేనుండి అన్నీ చూసుకుంటాను. రేపు ఉద్యోగానికి వెళ్ళు. అది చాలా ముఖ్యం" అన్నది రుక్మణీ ఆంటీ.

"సరే...అమ్మకు సృహ వచ్చిన తరువాత ఒకసారి మాట్లాడి వెడతాను" అన్నది.

ఆమెను ఒంటరిగా పిలిచాడు సుధీర్.

"చేతిలో డబ్బులున్నాయా...లేదు కావాలా? ఈ మందులన్నీ కొనమని డాక్టర్ రాసిచ్చాడు. నేవెళ్ళి కొనుక్కొస్తాను. నువ్వు ఆంటీని జాగ్రత్తగా చూసుకో. ఆవిడ కళ్ళు తెరిచేటప్పుడు నేను గనుక ఇక్కడుంటే టెన్షన్ అవుతారు. అందుకని ఇక ఇక్కడికి రాను. సహాయానికి నిర్మలా ఆంటీ, రుక్మణీ ఆంటీ ఉన్నారు కదా...చూసుకుంటారు" అన్నాడు.

'అతన్ని చూడటానికే కష్టం అనిపించింది. అమ్మ అతన్ని ఎందుకు కొట్టింది? మొహం చలనం లేని మనిషిలా అయిపోయింది. అతని కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతోంది అంజలి. 'ఎక్కడ ఏడ్చేస్తానో...?' అనే భావాలను అనిచి పెట్టుకుని తల మాత్రం ఊపింది.

అంతకు మించి అక్కడ పనేమీ లేదని భావించి బయటకు వచ్చాడు సుధీర్.

అతను వెళ్ళిన కొద్దిసేపటికే రోహిని సృహలోకి వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచింది. తన చుట్టూ ఉన్న వాళ్ళను గుర్తు పట్టటానికి కొంత సమయం పెట్టింది.

"అంజలీ...నన్ను క్షమించమ్మా...నిన్ను చాలా భయపెట్టేసేను. ఇప్పుడు నాకు బాగానే ఉంది" అన్నది కూతురు చేతులు పుచ్చుకుని.  

"బాగా చెప్పావు పో...దాన్ని మాత్రమా భయపెట్టావు? మమ్మల్నందరినీ ఒక ఊపు ఊపేవే! ఏమిట్రా ఇది... అంజలీ చిన్న పిల్ల కదా. ఈ కొత్త చోట అది తానుగా అన్నిటినీ సర్దుకోగలదా అనే ఆలొచన ఉండక్కర్లేదా ఒకత్తికి?" అన్నది నిర్మలా ఆంటీ.

"ఆంటీ...దయచేసి మా అమ్మను తిట్టకండి. ఆమె యముడితో పోరాడి ప్రాణం దక్కించుకుని ఇప్పుడే బయటకు వచ్చింది..."

"అందుకే చెబుతున్నా...మనమందరం ఆడువారిగా పుట్టిన వాళ్ళం. మనసులో ధైర్యమూ, స్వీయ నమ్మకమూ చాలా ముఖ్యం. అది వదిలేసి ప్రతిదానికీ ఆవేశపడి ఇలా అరిస్తే ఎవరికి నష్టం చెప్పు?"

నాకు అర్ధమవుతోంది ఆంటీ. నా వల్ల నా ఆవేశాన్ని అనుచుకోలేకపోయానే?”      

"అనుచుకోవాలి రోహినీ...ఖచ్చితంగా అనుచుకోవాలి. నీకొసం కాకపోయినా, పాపం...నిన్నే నమ్ముకునుందే...దీనికోసమైనా మనసును అనుచుకోవాలి. అర్ధం అయ్యిందా?"

"నాకు ఒకటి అనిపిస్తోంది. ఇంతక ముందు తనకు జరిగిన ఏదో ఒక సంఘటనను మనసులో ఉంచుకునే రోహినీ ఇలా అవస్తపడుతోంది అనుకుంటా. అలా ఉంటే నీ  మనసును బాధపెడుతున్న విషయాన్ని, నీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళ దగ్గర చెప్పు.  దాని వలన మనసులోని భారం తగ్గుతుంది. ప్రషరూ తగ్గుతుంది. ఆరొగ్యమూ బాగుపడుతుంది" అన్నది రుక్మణీ ఆంటీ.

అన్నిటినీ వింటూ మౌనంగా పడుకోనుంది రోహిని. ఆమె మనసులో పలు పోరాటాలు.

రోహినిని ఇంటికి తీసుకు వచ్చారు. ఈ మూడు రోజులలో ఒకసారి కూడా సుధీర్ వచ్చి ఆమెను చూడలేదు. అంజలితో మాట్లాడటానికి కూడా ప్రయత్నించలేదు. కానీ, అంజలి అతన్ని చూడ లేకుండా ఉండలేకపోయింది.

"సుధీర్ ఎక్కడమ్మా...కనబడటం లేదు? ఎందుకని మీ అమ్మను చూడటానికి రాలేదు? ఆశ్రమంలో ఎవరికైనా చిన్నగా తలనొప్పి అని చెప్పినా వెంటనే చూడటానికి వస్తాడు. అలాంటిది, మీ అమ్మ హాస్పిటల్లో చేరి వచ్చింది..."

రుక్మణీ ఆంటీ అలా అడగగానే అంజలి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.   

"అదేమీ లేదు ఆంటీ...పని ఉండుంటుంది. అందుకనే చూడటానికి వచ్చుండడు" అని సమాధానపరచింది. ఆంటీ వెళ్ళిపోయింది. 

"ఆమ్మా...నీకిప్పుడు ఒంట్లో ఎలాగుంది?" తల్లిని ప్రేమగా అడిగింది.

"బాగుందిరా తల్లీ...కానీ మనసు మాత్రం సరిలేదు"

"ఎందుకమ్మా? నీ మనసును వేదన పడేటట్టు నేను నడుచుకోనమ్మా. ఇది నా ప్రామిస్. నాకు నువ్వే చాలా ముఖ్యం. నీ మనసును బాధపెట్టి నేను సుఖంగా జీవించాలని అనుకోను"  అన్నది అంజలి, తల్లి చేతులు పుచ్చుకుని.

"నాకు మాత్రం నీ మనసును బాధపెట్టాలని ఆశా? నువ్వు బాగా జీవించాలనేదే నా ఆశ, కల, లక్ష్యం అన్నీ. అది నీకు అర్ధమయితే సరి"

"అనవసరమైన విషయాలు ఆలోచించుకుని నీ మనసును పాడుచేసుకోకు. ఇందా...ఈ మాత్ర వేసుకో. బాగా నిద్రపోయి రెస్టు తీసుకో. అప్పుడు మంచిది" అన్న అంజలి తల్లికి మాత్ర ఇచ్చింది.

కొంచంసేపట్లో తల్లి బాగా నిద్రపోవడం మొదలు పెట్టింది. అది నిర్ధారణ చేసుకుని సుధీర్ ను వెతుక్కుంటూ అతని ఇంటి వైపు నడిచింది.

మల్లె పూల పందిరి పక్కనున్న బెంచ్ మీద ఆలొచనలకు బానిసైన వాడిలాగా కూర్చోనున్నాడు సుధీర్. అంజలిని చూసిన వెంటనే అతని హృదయం కేరింతలు వేసింది. నిజం ఆమెను కాల్చింది.

"రా అంజలీ...మీ అమ్మకు ఇప్పుడు పరవాలేదుగా?"

"హు...పరవాలేదు. ట్యాబ్లెట్ ఇచ్చి వచ్చాను. ఇప్పుడే నిద్రపోతున్నారు"

ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు.

"అంజలీ...ఆ రోజు మీ అమ్మ ఎందుకు అంత ఆవేశపడి అరిచింది? నీకేమైనా తెలుసా?"

"ఏమీ తెలియటం లేదే! నన్ను మా అమ్మ ఆ రోజే మొదటిసారిగా కొట్టింది తెలుసా? చిన్నప్పటి నుండి ఆమె నన్ను బుజ్జగించిందే తప్ప కోప్పడటమో, కొట్టటమో చేయలేదు!"

"ఐమ్ సారీ అంజలి...నువ్వు దెబ్బతినటానికి నేను కారణమయ్యాను. నిన్ను నాతో కలిపి చూడటం వలనే ఆమె ఆవేశపడింది. అందులోనూ నువ్వు మన ప్రేమను చెప్పేటప్పటికి ఆవిడకు బ్లడ్ ప్రషర్ ఎక్కువయ్యింది. కళ్ళు తిరిగి కింద పడిపోయారు"

"అవును. నాకూ అలాగే అనిపించింది. ఆ విషయం మాట్లాడటానికే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను"

"చెప్పు అంజలి...నేనేం చెయ్యాలి?"

"సుధీర్...చిన్న వయసు నుండి తల్లి, తండ్రీ, సహోదరి లాగా ఉండి ఆమె నన్ను పెంచింది. నా మంచిని తప్ప, ఇంకేమీ తెలియదు. ఆమెను వదులుకోవటానికి నాకు మనసు లేదు"

"దానికి నేనేం చేయాలి?"

"మన ప్రేమ ఆవిడకు నచ్చలేదు. అందువల్ల మీరు నన్ను మర్చిపోవాలి. మనం ప్రేమించుకున్నది మరిచిపోవాలి"

"ఒక విధంగా ఇది నేను ఎదురుచూశాను. కానీ, ఇంత ఈజీగా నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు. నువ్వు చెప్పాశావు...నా మనసు ఎంత మదన పడుతుందో నని ఆలొచించావా?"

"ఆలొచించకుండా ఉంటానా. మీరు అనుకుంటునట్ట్లు నేనేమీ చాలా ఈజీగా నిర్ణయం తీసుకోలేదు! నా మనసును రాయి చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చాను"

"వేరే దారే లేదా అంజలీ?" -- దీనంగా అడిగిన సుధీర్ కళ్ళల్లో నీరు పొంగుతుండగా చూసింది.

"మీ పరిస్థితి నాకు అర్ధం అవుతోంది. కానీ, నా పరిస్థితిని మీరు ఆలొచించండి. మా అమ్మకు ఎటువంటి షాక్ ఇవ్వకూడదని డాక్టర్ చెప్పాడు. దాంతో పాటు ఆమె ఆవేశపడకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో మీ గురించి ఆవిడ దగ్గర నేనెలా చెప్పగలను?"

"ఇప్పుడు చెప్పొద్దు...ఆవిడ ఆరొగ్యం పూర్తిగా కోలుకున్నాక చెప్పచ్చు కదా? దానికి రెండు సంవత్సరాలు అయినా నేను కాచుకోనుంటాను"

"మనం కాచుకోనుండచ్చు సుధీర్...కానీ, ఆమె రేపే...'నువ్వు సుధీర్ ను ప్రేమిస్తున్నావా' అని అడిగితే ఏం సమాధానం చెప్పను? ఆమె మనసును కష్టపెట్టనని ప్రామిస్ చేసాను నేను" 

తిరిగి మౌనం వాళ్ళను చుట్టుముట్టింది.

"ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు...'ఇక నీకూ, నాకూ ఏ సంబంధమూ' లేదనా? 'ఈ జన్మలో మన పెళ్ళి జరగదనా'? ఏం చెప్పాలనుకుంటున్నావు అంజలి?"

అతను అడిగిన ప్రశ్నతో క్రుంగిపోయింది అంజలి.

"నాకేమీ అర్ధం కావటం లేదు సుధీర్ గారు. నాకు నా తల్లి కావాలి. అంతే!"

ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె ఊపిరి బిగపెట్టి నిలబడింది.

" అంజలీ...చిన్న వయసు నుండే తల్లి ప్రేమకోసం, అనురాగం కోసం ఎదురు చూసిన వాడిని నేను. నీకు అది దొరక కుండా చేస్తానా? నా వల్ల నిన్ను మర్చిపోవటం కుదరదు. ఇందులో కొంచం కూడా అనుమానం లేదు. ఏ నాటికైనా నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. కానీ, నీ కొసం నీపైన ఉన్న ప్రేమను త్యాగం చేయటానికి తయారుగా ఉన్నాను. ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకోసం నువ్వు నన్ను శత్రువులాగా చూడకు...నేనది తట్టుకోలేను"

మాట్లాడుకుంటూ వెళుతున్న సుధీర్,  స్వరం అడుపడితే కొంచం ఆపాడు. అంజలి ఏదో చెప్పటానికి వచ్చింది...ఆమెను చేతితో అడ్డగించి తిరిగి మాట్లాడాడు.

నేను ఎప్పుడూ నీకు మంచి స్నేహితుడినే. నీకు ఎటువంటి సహాయం కావాలన్న సంశయ పడకుండా నన్ను అడగొచ్చు. సరేనా...?" అన్నాడు.

అతను అడిగినట్లే అతనికి 'సరే' అని సమాధానం చెప్పింది. ఇద్దరూ చెరో దిక్కుకూ నడిచారు.

**********************************************PART-5******************************************

రోజులు చాలా నిదానంగా నడుస్తున్నట్టు అనిపించింది అంజలికి. అంతకు ముందు స్కూలుకు బయలుదేరినప్పుడూ సరి, లీవు రోజులైనా సరి...ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. కానీ, ఇప్పుడు, ఏదో జీవించాలే అనే ఒత్తిడి కోసం జీవిస్తున్న దానిలా అనిపిస్తోంది. రోహినికి ఆరొగ్యం మెల్ల మెల్లగా మామూలు పరిస్థితికి వస్తోంది.

ఇల్లు...ఇల్లు వదిలితే స్కూలూ, తరువాత బి.ఏడ్. కోసం చదువు అంటూ సమయాన్ని కేటాయించింది అంజలి. అందులో సుధీర్ కు చోటు ఇవ్వలేదు. ఎప్పుడైనా అతన్ని  చూసినప్పుడు చిన్న నవ్వు...అంతే.  అతను మాత్రం ఏమిటి? అంతకు ముందు ఆదివారం వస్తే అంజలి ఇల్లే గతి అని ఉండేవాడు. ఇప్పుడు అటువైపు తొంగి కూడా చూడటం లేదు. తానూ, తన పని అంటూ దూరంగానే ఉంటున్నాడు. ప్రేమ గాయం ఒక తగ్గని గాయంలాగా అతని మనసులో ఉండిపోయింది.   

ఒక రోజు స్కూలు వదిలిపెట్టిన తరువాత ఇంటికి వస్తున్న దారిలో ఒక పెద్ద కారు అంజలిని రాసుకుంటూ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఆయన... అంజలి తండ్రి హరికృష్ణ. ఆమె కళ్ళను ఆమే నమ్మలేకపోయింది. ఫోటోలో చూసినట్లే ఉన్నారు. కారు దిగిన ఆయన ఆమె వైపుకు నడిచారు.

"అమ్మా... అంజలీ నేనెవరో తెలుస్తున్నానా?" అన్నారు.

తల ఊపింది.

కారులో ఎక్కమ్మానీతో మాట్లాడవలసింది చాలా ఉంది ఆరగంటలో తీసుకు వచ్చి వదిలిపెడతాను" అంటూ ఆమెను బలవంత పెట్టి కారులో ఎక్కించుకుని, ఒక గుడికి వెళ్ళి ఆపారు. జనమే లేని ఆ గుడిలో ఆమెను కూర్చోబెట్టిన ఆయన వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు.

"ఏమైంది...ఎందుకు ఏడుస్తున్నారు? ప్లీజ్...కారణం చెప్పి ఏడవండి! నాకు భయంగా ఉంది" అన్నది.......కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి ఆమెను  చూసాడు.

"అంజలీ...నన్ను క్షమించమ్మా. తండ్రిగా నేను నా బాధ్యతను నిర్వహించనే లేదు. నిన్నూ, మీ అమ్మనూ అనాధలుగా వదిలేసి పారిపోయాను. అప్పుడు నాకు జీవితంలో పెద్ద డబ్బు గలవాడిగా అవాలనే పిచ్చి ఉండేది. దానికి నువ్వు, నీ తల్లీ అనకట్టలాగా అడ్డుపడతారని చెప్పకుండా పారిపోయాను"

"ఓహో...ఇప్పుడే అది తప్పని జ్ఞానోదయం అయ్యిందో? నన్ను పెంచటానికి అమ్మ ఎంత కష్టపడుంటుంది? ఈ సమాజం ఆమెను ఎన్ని మాటలు అనుంటుంది?”

"ఒప్పుకుంటా. నేను చేసింది తప్పే. లేదని చెప్పటం లేదు. కానీ, ఇప్పుడు మనసు మారి వచ్చాను. ఒక కుటుంబంగా జీవించాలనేది నా ఆశ. నువ్వేదో ఒక స్కూల్లో ఉద్యోగం చేస్తున్నావట. నీకెందుకీ తలరాత? మనింట్లో మహారాణిలాగా ఉండాల్సిన దానివి"

"టీచర్ అనే ఉద్యోగం ఒక గౌరవమైన ఉద్యోగమే. దాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు మీకు ఏం కావాలి"

"ఒకసారి...ఒకే ఒక్క సారి మీ అమ్మను చూడాలి. దానికి గొప్ప మనసు. నన్ను మన్నించి ఏలుకుంటుంది. మీకొసమే పెద్ద ఇల్లు చూసుంచాను. మనందరం అక్కడ ఉండొచ్చు"

ఇలా చూడండి. అమ్మకు ఒళ్ళు బాగుండక సీరియస్ అయిపోయి...ఇప్పుడు సరై నార్మల్ గా ఉన్నది. మీరు పాటికి వచ్చి...మిమ్మల్ని చూసిన షాక్ తో ఆమె తిరిగి పడిపోతే, ఆమెను బ్రతికించటం కష్టం"

"నన్ను ఏం చేయమంటావు? మనం కలిసుండటమే కుదరదా?"

"నాకు మీ మీద ప్రేమ లేదు. అదే సమయం అసహ్యమూ లేదు. కానీ, మీ భార్యను మీరు చూడకూడదని చెప్పే అధికారం నాకు లేదు. ఒకవేల మిమ్మల్ని చూస్తే అమ్మ ఆరొగ్యం పూర్తిగా బాగుపడొచ్చు. అందుకోసమైనా మిమ్మల్ని తీసుకు వెడతాను"

"ఎప్పుడు?"

"తొందరపడకండి. నిదానంగా ఆవిడకు చెప్పి, ఆమె మనసును రెడీ చేసిన తరువాతే మిమ్మల్ని పిలుస్తాను. వెంటనే మేము మీతోటి వచ్చేస్తామని అనుకోకండి. అది అమ్మ మాత్రమే తీర్మానించే విషయం"

"సరేనమ్మా. నాకు రోహినిని చూస్తే చాలు!" అన్న ఆయన మాట్లాడటం ముగించుకుని, కారులో అంజలిని దింపారు. ఆమె కారులో నుండి దిగటం సుధీర్ చూశాడు. అతని కళ్ళల్లో ప్రశ్నార్ధకం, ఆశ్చర్యం రెండూ ఉన్నాయి.

ఇల్లు చేరింది అంజలి. అక్కడ అమ్మతో పాటూ నిర్మలా ఆంటీ కూడా ఉంది.

"ఏమిటే అంజలీ...కారులో వచ్చి దిగుతున్నావు? ఎవరే అది? ఎవరైనా విద్యార్ధిని వాళ్ళ నాన్నా?"

నిర్మలా ఆంటీ గబుక్కున అలా అడిగేటప్పటికి తడబడింది అంజలి. ఏం సమాధానం చెప్పాలి? అమ్మతో చెప్పటానికి రెడీగా లేని సమయంలో ఇలాంటి ఒక ప్రశ్నను అంజలి ఎదురు చూడలేదు.  

"కారులోనా వచ్చావు...ఎవరితో?" ఆశ్చర్యంతోనూ, భయంతోనూ అడిగింది.

"అదొచ్చమ్మా....అదొచ్చి"

"ఏమిటే అమ్మాయి మింగుతున్నావు?"  అన్నది తల్లి, స్వరం పెద్దది చేసి.

"అమ్మా ప్లీజ్...టెన్షన్ అవకండి. మీకు ఆరొగ్యం క్షీణిస్తుంది"

"అయితే ఎవరితో వచ్చావో చెప్పు"

"అమ్మా...వచ్చింది మా నాన్నే. నేను ఈ రోజు స్కూలు వదిలి వస్తుంటే నన్ను దారిలో చూసి, గుడికి తీసుకు వెళ్ళి క్షమించమని అడిగారు. నిన్నూ చూడాలట" అన్నది గబగబ.

రోహిని తల పట్టుకుని వెనక్కి జరిగి గోడను ఆనుకుంది. మొహం పలు రకాల భావాలను ప్రతిబింబించిది.

"ఆ మనిషి ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు? ఇప్పుడే కొంచం ప్రశాంతంగా ఉన్నాను. అది ఆయనకు కష్టంగా ఉందా?" తన లోపల తానే చెప్పుకుంటున్నట్టుగా మెల్లగా సనిగింది.

"అంజలీ...మీ నాన్నా వచ్చింది? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లేరట? ఇప్పుడేమిటి సడన్ గా మీ మీద ప్రేమ?"  అక్కడే ఉన్న నిర్మలా ఆంటీ అడిగింది.

నాకు ఏమీ తెలియదు ఆంటీ...ఆయన్ని చిన్న వయసులో చూసిన జ్ఞాపకం. అమ్మతో పాటూ ఆయన నిలబడి తీసుకున్న ఫోటో ఒకటుంది. అది గుర్తుకు తెచ్చుకునే ఆయన మా నాన్నే నని కనిపెట్టాను"

"ఏం చెప్పారు?"

"నేను చేసిందంతా తప్పు. నిన్నూ, అమ్మనూ వదిలి పారిపోయాను. అప్పుడు డబ్బే నాకు పెద్దగా అనిపించింది. ఇప్పుడు మీ మంచితనం తెలుసుకున్నాను. అందువల్ల నన్ను మన్నించి చేర్చుకో అన్నారు అడిగింది"

"నువ్వేమంటావ్ రోహినీ?"

నోట మాట రాక కూర్చుండిపోయింది రోహిని.

ఏమిటే రోహినీ...ఏమిటే అదోలాగా ఉన్నావు? తిరిగి బ్లడ్ ప్రషర్ ఎక్కువగా ఉన్నదా. అయ్యయ్యో... రోహినీ, రోహినీ " అని అరిచింది.  

"ఊరికే ఉండండి ఆంటీ...నాకు ఏమీ అవలేదు. నేను బాగానే ఉన్నాను. ఆ మనిషి దేనికోసం ఈ ప్లాను వేస్తున్నారో తెలియటం లేదే?"

"ఆయన నిజంగానే మంచివారుగా మారి ఉండొచ్చు కదా?" అన్నది అంజలి.

"నువ్వు అలా అనుకుంటున్నావా? ఎందుకని అలా అంటున్నావు?"

"లేకపోతే ఎందుకమ్మా ఆయన మనల్ని వెతుక్కుంటూ రావాలి? మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా ఏంటి? ఆయన మన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టే వస్తున్నారనుకుంటా".

"నాకు అంజలి చెప్పేది 'కరెక్ట్' అనే అనిపిస్తోంది. ఏం అంజలి...నొవ్వొచ్చింది మీ నాన్న సొంత కారా?"

"తెలియదు ఆంటీ...కానీ, ఆయన ఇప్పుడు పెద్ద బిజినస్ మ్యానట. లక్షల్లో ఆస్తి ఉందట. అమ్మ జ్ఞాపకాల వలనే రెండో పెళ్ళి చేసుకోలేదట. అని ఆయన చెప్పారు"

"చూసావా రోహినీ? అప్పుడేదో బ్యాడ్ టైమ్. నిన్ను, పసిపిల్లగా ఉన్న అంజలిని వదిలేసి  వెళ్ళిపోయారు. అందుకనే ఇప్పుడు తిరిగి వచ్చారు కదా...ఆయన్ని క్షమించి చేర్చుకోవచ్చు కదా?" 

"ఆంటీ...మీకు ఆయన గురించి తెలియదు. అందుకే అలా మాట్లాడుతున్నారు. అతను  మనిషే కాదు. డబ్బు దయ్యం...డబ్బు...డబ్బు....అదే అతనికి ఎప్పుడూ కల, జీవితం అంతా"

"అది ఆయనే వొప్పుకున్నారే...'అప్పుడు నాకు డబ్బు పిచ్చి ఉన్నదని. అంతా ఒక బ్యాడ్ టైము. ఆ బ్యాడ్ టైము వెళ్ళిపోయేటప్పుడు మంచి ఆలొచనలు వస్తాయి. వసతిగల జీవితాన్ని వద్దు అని చెప్పకు"

"ఈ వసతులన్నీ నా కేమీ కొత్త కాదు ఆంటీ. ఇంతకంటే ఎక్కువ డబ్బు చూసిన దానిని నేను"  

"ఏం చెబుతున్నావు? నువ్వు మాట్లాడేది చూస్తుంటే నువ్వు చాలా పెద్ద  అస్తిపరుల ఇంటి అమ్మాయిలాగా కనబడుతున్నావే? నీ మనసులో ఏదో ఉందని నేను అనుకున్నది కరెక్టే. అదేమిటో బయటకు చెప్పి నీ మనసును తెలిక చేసుకో. అది నీ మనసులోని భారాన్ని కూడా తగ్గిస్తుంది"

"అవునమ్మా..నీమనసులో ఉన్న భారాన్ని బయట పెడితేనే కదా తగ్గుతుంది. దాని వలన బ్లడ్ ప్రషర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని చెప్పాడు డాక్టర్. నిజం చెప్పమ్మా...నువ్వు ఎవరు? నీకూ, నాన్నకూ ఎలా పెళ్ళి జరిగింది? అంతా వివరంగా చెప్పు"

దీర్ఘమైన నిట్టూర్పు ఒకటి వెలువడింది రోహిని దగ్గర నుండి. ఆమె కళ్ళు జరిగిపోయిన కాలాన్ని చూస్తున్నట్టు కదులుతున్నాయి.

"ఆంటీ...మీరు అనుకుంటున్నట్టు నేను మామూలు ఇంటి అమ్మాయిని కాదు. మీకు 'ఆర్.వీ ఇండస్ట్రీస్ గురించి తెలుసా...దాని గురించి విన్నారా?"

"ఏమిటే అలా అడిగావు? మన దేశంలో ఆ పేరు తెలియని వారు ఉంటారా? దగ్గర దగ్గర వంద సంవత్సరాలుగా ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించిన సంస్థ అది. నా చెల్లెలు భర్త చెన్నైలో ఉంటారు. ఆయన ఆ ఆఫిసులోనే మెనేజర్ గా పనిచేశారు"

"ఏమ్మా...వాళ్ళు అతిపెద్ద కోటీశ్వర్లు కదా?"

"అవును...ఆ సంస్థ ఎం.డి, యజమాని బాపిరాజు గారి ఒకే ఒక కూతుర్ని నేను"

రోహిని చెప్పిన ఆ మాటకు అంజలీ, ఆంటీ నూ స్థానువులా అయిపోయారు. ఇద్దరి కళ్ళూ ఆమెనే చూస్తుండగా ...ఆమె తన కథను చెప్పటం మొదలు మొదలుపెట్టింది.

**********************************************PART-6******************************************

ఆమెకు ఇద్దరు అన్నయ్యలు మాత్రమే! ఆ ఇంటికి ఒకే ఒక ఆడ వారసురాలు రోహినియే అయినందువలన, తల్లి కూడా లేనందు వలన రోహినిని చాలా గారాబంగా పెంచారు. ఆమె కొద్దిగా నలుపు. దాంతో పాటూ ఆమె పళ్ళు కూడా కొంచం ఎత్తుగా ఉంటాయి. తాను అందంగా లేనే నన్న నిరాశ ఆమెకు ఎప్పుడూ ఉండేది.

అన్నయ్యలు నరసింహం, జగన్నాదం ఆమెను అరచేతిలో ఉంచి చూసుకుంటారు.

"నాన్నా. చెల్లికి ఒక మంచి వరుడ్ని చూసుంచాను. మన అంతస్తుకు సరితూగకపోయినా మంచి కుటుంబం. వాళ్ళు మూడు 'కెమికల్ ఫ్యాక్టరీ' లు నడుపుతున్నారు. అబ్బాయి ఎం.బి.ఏ చదువుకున్నాడు. ఏమంటారు?"

"అబ్బాయి బాగా చదువుకోనుండాలి. దాని కంటే ముఖ్యం కుటుంబ అంతస్తు. మన అంతస్తుకు కొంచం కూడా తక్కువ ఉండ కూడదు. చెప్పాలంటే మనకంటే కొంచం ఎక్కువ అంతస్తు ఉంటే మంచిది"

ఏమిటి నాన్నా ఇలా చెబుతున్నారు. మన అంతస్తు కంటే ఎక్కువ అంతస్తు కలిగిన వాళ్ళు మన కులంలో చాలా తక్కువ మందే ఉన్నారు"

"అయితే ఏమిటి? ఉన్న కుటుంబాలలోనే చూడు. నా కూతురు కాపురం చేసే చోట మహారాణిలాగా ఉండాలి. అర్ధమయ్యిందా?" అన్నారు.

ఆ తరువాత ఒకరిద్దర్ని చూశారు. కానీ, వాళ్ళెవరికీ రోహిని నచ్చ లేదు. మనసు విరిగి పోయింది రోహినికి.

"నాన్నా...నాకు పెళ్ళే వద్దు...ఇక వరుడ్ని చూడకండి"

"ఎందుకరా బంగారం అంత మాట చెబుతున్నావు?".

"వచ్చిన పెళ్ళికొడుకులందరూ నన్ను చూసేసి 'నల్లగా ఉన్నది. అమ్మాయి బాగుండలేదు అని చెప్పి వెళుతున్నారు. నాకు చాలా అవమానంగా ఉంది. ప్లీజ్...అర్ధం చేసుకోండి" అంటూ ఏడ్చింది.

కొడుకులిద్దరినీ ఒంటరిగా పిలిచారు బాపిరాజు గారు.

"ఇలా చూడండిరా. మన రోహిని మనసు కష్టపడితే నేను తట్టుకోలేను అనేది మీకు తెలుసు. అందుకని నా లక్ష్యాన్ని కొంచం తగ్గించుకుందామని చూస్తున్నాను. మన అంతస్తుకు తక్కువ అంతస్తు వాళ్ళైనా పరవాలేదు. కానీ, బాగా చదువుకున్న వాడిని చూడండి. కావాలంటే అతన్ని మనం ఇంట్లోనే ఇల్లరికపు అల్లుడుగా ఉంచుకుందాం" అన్నారు.

మళ్ళీ వరుడ్ల కోసం వేట మొదలైయ్యింది.

ఆ సమయంలోనే హరికృష్ణ మా ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరేడు. ఆరడుగుల ఎత్తు. మంచి రంగు. అతన్ని చూసిన వెంటనే సున్నితమైన రోహిని మనసు సంచలనం చెందింది. పొద్దు పోవాలని ఎప్పుడైనా ఆఫీసుకు వచ్చే రోహిని, ఇప్పుడు రోజూ ఆఫీసుకు వెళ్ళటం మొదలుపెట్టింది. అతను రోహినిని చూసే విధం వ్యత్యాసంగా ఉండేది.    

హరికృష్ణను తలచుకుని పరితపించింది. 'అతని అందానికి ముందు తాను ఏ మాత్రం?' అనే ఇన్ ఫీరియారిటీ మనోభావం ఆమెను చుట్టేసింది. ఒక రోజు 'ఫ్యాక్టరీ' లో ఉన్న చెట్టు కింద వేసున్న బెంచి మీద కూర్చుని పక్షులను గమనిస్తోంది. ఆమె దగ్గరగా ఆమెకు వినబడనంతటి నెమ్మదిగా వచ్చి నిలబడ్డాడు హరికృష్ణ.

ఏం మ్యాడం...పక్షులను ఆరాధిస్తున్నారా?"

అతను తిన్నగా తనతో మాట్లాడేటప్పటికి ఆమె మొహం సిగ్గుతో ఎర్ర బడింది.

"అయ్యయ్యో...నేను రావటం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను మ్యాడం. దానికోసం మీరు కోపగించుకోకూడదు. అని చెప్పి జరగటానికి రెడీ అయిన అతన్ని ఆమె స్వరం ఆపింది.

"లేదు...నాకు కోపం లేదు. మీరు కూర్చోండి. కావాలంటే నెనే వెళ్ళిపోతాను" 

"భలేవారే మీరు...నేను మీతో మాట్లాడాలనే ఇక్కడికి వచ్చాను. మీరేమిటి...వెళ్ళిపోతామంటున్నారు?"

"నిజంగా నన్ను చూడటానికా వచ్చారు?"

"మరి...? మిమ్మల్ని నాకు బాగా నచ్చుతుంది. అందుకే రెండు మాటలు మాట్లాడి వెడదాం అనుకుని వచ్చాను"

ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది రోహినికి.

"నిజంగానా...నేనంటే మీకు అంత ఇష్టమా? మిమ్మల్ని ఇష్టపడటానికి వెయ్యి మంది వస్తారే? మంచి రంగు, అందం...వాళ్ళతో మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. నా దగ్గర ఏం మాట్లాడబోతారు?"

" రోహినీ గారు...మీరు కొంచం నలుపు...అంతే కదా! అదొక లోటా? మీ అందం నాకు నచ్చింది. అంతకంటే మీ మనసు నాకు బాగా బాగా నచ్చింది"

"ఏం చెబుతున్నారు?"

"మీరు బాగా డబ్బు గల ఇంటికి చెందిన అమ్మాయి అయినా, ఇంత సింపుల్ గా ఉన్నారే...అదొక్కటే చాలే! ఇంకా నా మనసు అర్ధం కాలేదా? లేక తెలుసుకునే నటిస్తున్నారా?"

అతని మాటలు మత్తు ఎక్కించగా...కరిగిపోయింది.

"కృష్ణ గారు...నిజంగా చెబుతున్నారా? మీరు నన్ను...?

"ఎస్... రోహినీ. ఇప్పుడైనా అర్ధం చేసుకున్నావే! 'ఐ.లవ్.యు నీకు నేను నచ్చానా?" అన్నడు చెవి దగ్గరగా.

కళ్ళు తిరిగిన ఆమె అతని చేతులు పుచ్చుకుంది. ఆకాశమే దొరికినట్టు అనిపించింది. 'అందమైన యువకుడు ఆశ పడి నన్ను ప్రేమిస్తున్నాడు అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంది.

వాళ్ళ ప్రేమ రోజు రోజుకూ పెరుగుతోంది.

ఆ రోజు రోహిని అన్నయ్య నరసింహం పెళ్ళి చూపులకు ఏర్పాటు చేశాడు.  అదే తన ప్రేమను చెప్పటానికి మంచి తరుణం అని నిర్ణయించుకుంది రోహిని.

"నాన్నా...ఇకమీదట ఎవర్నీ పెళ్ళి చూపులకు రమ్మని చెప్పకండి"

"ఏమ్మా...వాళ్ళు నీ మనసును నొప్పించరు. నేను చూసుకుంటాను"

"అది కాదు నాన్నా...అదొచ్చి...అదొచ్చి...

"ఏం రోహినీ, నీకు ఎవరైనా నచ్చారా? అలా ఉంటే చెప్పమ్మా" అన్నాడు అన్నయ్య నరసింహం.

"అవునన్నయ్యా...నేను ఒకర్ని మనసారా ఇష్టపడుతున్నాను. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు. కానీ...కానీ..."

"ఏమిటి కానీ...?"

"ఆయన మనంత డబ్బుగలవారు కాదు. అదే నాకు భయంగా ఉన్నది"

ఎవరని చెప్పు...మంచి చోటైతే మేమే సంబంధం ఖాయం చేస్తాం. దైర్యంగా చెప్పు" అన్నాడు ఇంకో అన్నయ్య జగన్నాదం.

అన్నయ్యా అదొచ్చి...మన ఫ్యాక్టరీలో మేనేజర్ గా ఉన్నారే హరికృష్ణ...ఆయన్నే ఇష్టపడుతున్నాను."

తుఫాన దాటిన భూమిలాగా ఆ చోటంతా నిశ్శబ్ధంగా మారింది. నాన్నే మొదట నోరు తెరిచారు.

"మీ ఇద్దరికీ ఎన్ని రోజులుగా పరిచయం?"  

"ఇప్పుడే...ఒక నెల రోజులుగా"

రోహినీ తల్లీ...అతను మంచివాడు కాదు. అతన్ని మర్చిపో.  మన ఆస్తిని గురిగా  పెట్టుకునే అతను నిన్ను ఇష్టపడుతున్నాడు. అర్ధం చేసుకోరా ప్లీజ్" అన్నాడు తండ్రి బుజ్జగింపు దోరణిలో.

అది విన్న వెంటనే కోపం ముంచుకు వచ్చింది రోహినికి.

"ఎందుకలా చెబుతున్నారో నాకు తెలుసు. నేను అందంగా లేను. ఆయన అందంగా ఉన్నారు. 'ఎలారా ఈ నల్లదాన్ని ఇష్టపడుతున్నాడు అని మీకు సందేహం...కరెక్టే కదా? ఆయన ఇష్టపడేది నా మనసునే గానీ మన డబ్బును కాదు"

" రోహినీ...నాన్న చెప్పేది నిజమేనమ్మా. అతనికి ఎక్కువ డబ్బు ఆశ ఉన్నదని అతని మాటలతోనే గ్రహించాను. అతని మీద కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. వాడు పధకం వేసుకునే నీకు చేరువ అయ్యాడు. నువ్వు చాలా ఎక్కువగా చదువుకున్నా నీకు లోక జ్ఞానం చాలదమ్మా. నాన్న చెప్పేది విను. అతన్ని మరిచిపో" అన్నాడు జగన్నాదం.

"కుదరనే కుదరదన్నయ్యా...నేను లేకపోతే ఆయన తల్లడిల్లి పోతారు. అంత లోతుగా నా మీద ఇష్టం పెట్టుకున్నారు"

"అలాగంటే మేము నీమీద ఎక్కువ ఇష్టం పెట్టుకోలేదా? ఇన్ని సంవత్సరాలుగా  నిన్ను పెంచిన వాళ్లం. తల్లి లేని కొరత తెలియకుండా నాన్న నీమీద ప్రేమ కురిపించారే? అలాంటిది నిన్న వచ్చిన అతను మాకంటే ఎక్కువైపోయాడా నీకు?"----అడిగాడు నరసింహం.

"మీది రక్త సంబంధం. అందువలన నా మీద ప్రేమ చూపించారు. ఆయన నాకు కొంచం కూడా సంబంధం లేని వారు. కానీ, నాపైన ప్రాణమే పెట్టుకున్నారే. దాని పేరే కదా ప్రేమ"

మొట్టమొదటి సారిగా నాన్నకు కోపం వచ్చింది.

"ఏమిటే...అన్నయ్యలు చెబుతూ వెళుతున్నారు. వాళ్ళను ఎదిరిస్తూ మాట్లాడుతూనే ఉన్నావు! నీ జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. మాట్లాడకుండా లోపలకు పో. ఇక ఆ హరికృష్ణను చూసేవంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. ప్రేమట ప్రేమ. అంతా వేషం. నేను చూసే వరుడ్నే నువ్వు పెళ్ళి చేసుకోవాలి. అర్ధమయ్యిందా?" అని చెప్పి వెళ్ళిపోయారు.  

కొంచంసేపు మౌనంగా ఉన్న రోహినికి ఒక ఆలొచన వచ్చింది. ఫోను చేసి హరికృష్ణను వెంటనే పార్కుకు రమ్మంది. తరువాతి అరగంటలో అతను అక్కడున్నాడు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చెప్పింది.

చెప్పి ముగించిన తరువాత అతన్ని చూసింది. కళ్ళల్లో నీరు పొంగుకు వచ్చింది.

"మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది కరెక్టే రోహినీ. నాలాంటి పేదవాళ్ళందరూ ప్రేమించకూడదు. ఒకవేల ప్రేమించినా వాళ్ళ అంతస్తుకు తగిన వాళ్ళనే ప్రేమించాలి. ఏం చేయగలం...ప్రేమ ఏమన్నా రంగునూ, డబ్బునూ చూసి వస్తోందా...?"

"మీరు ఏం చెబుతున్నారు?"

"ఏది ఏమైనా నువ్వు డబ్బున్న ఇంటి పిల్లవి. ఏదో టైమ్ పాస్ కోసం నన్ను ప్రేమించావు? నేనే దాన్ని తప్పుగా అర్ధం చేసుకుని కలలు కంటూ గడిపేసేను.  తప్పు నా మీదే రోహినీ. మీ నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్ళిచేసుకో. నాకు గొడవ ఉండదు" అని చెప్పి వెళ్ళబోయిన అతని చేతులను గట్టిగా పుచ్చుకుంది రోహిని.

"ఎందుకండీ...ఇలా మాట్లాడుతున్నారు? నన్ను చూస్తే టైమ్ పాస్ కోసం ప్రేమించే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా? మీరు నన్ను అలాగే అర్ధం చేసుకున్నారా? ఏదైనా దారి చెబుతారని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే...మీరు ఏదేదో మాట్లాడుతున్నారు"

"నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? నాకోసం ఏదైనా చేస్తావా? చెప్పు రోహినీ...చేస్తావా?"

"ఖచ్చితంగా చేస్తాను. ఏం చేయాలి...చెప్పండి..."

"నీ ఆస్తి, అంతస్తూ అన్నీ వదులుకుని రావటానికి రెడియా?"

"కృష్ణా...మీరు...?"

'అవును రోహినీ...మనం పెళ్ళి చేసుకుందాం. పూల మాలతో, పెళ్ళి బట్టలతో వాళ్ళ కాళ్ళ మీద పడదాం. 'ఓకే' అంటే చాలా మంచిది. లేదంటే నువ్వేమీ బాధపడకు. నాకు చదువుంది. ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడే శక్తి నా దగ్గరుంది...చెప్పు...నన్ను పెళ్ళి చేసుకుంటావా?"   

సమాధానం చెప్పకుండా నిలబడింది రోహిని. ఆమె మనసులో పలురకాల ఆలొచనలు.

"చూసావా...ఆలొచిస్తున్నావు. నీకు నా మీద నమ్మకం లేదా? చెప్పు రోహినీ. ఏమిటి ఆలొచిస్తున్నావు?"

"ఆస్తి, డబ్బూ...ఇవన్నీ ఒక విషయమే కాదు. కానీ, నన్ను ముద్దుగా పెంచి పెద్ద చేసిన అన్నయ్యలనూ, నాన్ననూ వదిలేసి రావాలే! అది తలచుకుంటేనే హృదయాన్ని కోస్తున్నట్టు ఉంది. నా కోసమే మా నాన్న రెండో పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయారు"

"బాధపడకు...ఒక సంవత్సరంలో మనవుడినో, మనవరాలినో కని ఇచ్చేసే మంటే వాళ్ళ కోపమంతా కనబడకుండా పోతుంది. నిన్ను ఆదరిస్తారు. ఇది అన్ని చోట్లా జరిగేదే కదా" అన్నాడు.

ఆలొచించింది రోహిని.

'హరికృష్ణను పెళ్ళి చేసుకోవటానికి నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇతన్ని మరిచిపోయి ఇంకొకతనితో జీవించటం నా వల్ల కాదు. ఇప్పుడు పెళ్ళి చేసుకోవటం వలన...డబ్బుకొసమే ఇతను నన్ను ప్రేమించేడనే అని అనుకుంటున్న నాన్నా, అన్నయ్యల ఆలొచన తప్పని నిరూపించవచ్చు. హరికృష్ణ చెప్పినట్టు పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళ మనసు మారితే మంచిదే కదా?' అనే నిర్ణయానికి వచ్చింది.

"సరే నండి...మనం ఎప్పుడు పెళ్ళి పెట్టుకుందాం?" అన్న రోహినిని ఎత్తుకుని గిరగిరా తిప్పాలని ఆమె దగ్గరకు వచ్చాడు. వద్దని వారించింది రోహిని.

ఆ మరుసటి బుధవారం మంచి ముహూర్తంలో శివుడి గుడిలో రోహిని మెడలో తాలి కట్టాడు హరికృష్ణ. కొత్త మంగళసూత్రంతో, పూలమాల వాసన పోయేలోపు ఆమె అతన్ని తన ఇంటికి తీసుకు  వచ్చింది.

**********************************************PART-7******************************************

పూలమాల, మంగళసూత్రంతో తనని చూసిన వెంటనే నాన్న, అన్నయ్యలు మొదట తిడతారు...కోపగించుకుంటారు. కానీ చివరకు తన పెళ్ళిని అంగీకరించి తనని చేర్చుకుంటారు అని నమ్మింది. అదే నమ్మకం హరికృష్ణకూ ఉన్నది. వీళ్ళను వాకిట్లో చూసిన వెంటనే అన్నయ్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు.

"రోహినీ...ఏంటమ్మా...ఇలా చేశావు? ఈ సారి ఎంత మంచి పెళ్ళికొడుకును చూశామో తెలుసా? నీకెందుకంత తొందర...ఎందుకమ్మా ఇలా చేశావు?"

"క్షమించండి అన్నయ్యా... ఇది తప్పితే నాకు వేరే దారి తెలియలేదు? నేను ఈయన్ను ప్రేమిస్తున్నాను. ఈయన్ని మనసులో ఉంచుకుని ఇంకొకరితో కాపురం చేయటం నా వల్ల కాదన్నయ్యా"

"నరసింహం...దాని దగ్గర ఏమిటి మాటలు? ఏ రోజైతే మనల్ని కాదని అది పెళ్ళిచేసుకుందో...అప్పుడే అది మన చెల్లి కాదు. ఇక దీనికీ మనకూ ఎటువంటి సంబంధమూ లేదు అనుకుని తలకి స్నానం చేసిరా"

"ఏమిటి జగన్ చెబుతున్నావు? ఈ నిర్ణయం మనం ఎలా తీసుకోగలం? నాన్న ఏం చెబుతారో?" అని రెండో అన్నయ్య మాట్లాడుతున్నప్పుడే ఆయన లోపలి నుండి వచ్చారు. ఆయన మొహం చలనం లేకుండా ప్రశాంతంగా ఉంది.

"నాన్నా...మీ ముద్దుల కూతురు చేసిన ఘనకార్యం చూశారా?  మీరున్నారు... ఇద్దరు అన్నయ్యలం మేమున్నాము. అందరినీ వదిలేసి...నిన్న వచ్చిన వాడితో భార్యగా వచ్చి నిలబడింది"

"ఊ...నేనూ చూస్తున్నాగా. మీరెందుకు కంగారు పడి ఇలా అరుస్తున్నారు? ఆమె జీవితాన్ని ఆమే నిర్ణయించుకుంది. దీన్నెందుకు పెద్ద విషయంగా తీసుకుంటున్నారు" --- అనేటప్పటికి....షాక్ అయ్యారు అందరూ.

మనసంతా పువ్వులాగా వికసించింది రోహినికి.

"నాన్నా, మీరు నన్ను క్షమించారా! నేను చేసినదాంట్లో మీకేమీ కోపంలేదే? చాలా థ్యాంక్స్ నాన్నా. లోపలకు వెళ్ళి వివరాలు మాట్లాడుకుందాం" అంటూ హరికృష్ణను తీసుకుని లోపలకు వెళ్లటానికి రెడీ అయ్యింది.

"ఉండమ్మా" అన్నది నాన్న స్వరం.

"ఏ హక్కుతో మా ఇంటి లోపలకు వస్తున్నావు? నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నన్నూ, మీ అన్నయ్యలనూ ఎంత బాధకు గురిచేస్తుందో ఆలొచించటానికి కూడా నువ్వు సిద్దంగా లేవు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వే అమర్చుకున్నావో...అప్పుడే నువ్వు ఒంటరిదానివి అయ్యావు. ఇప్పుడు నువ్వు బయట మనిషివి. మావల్ల నీకో...నీ భర్తకో జరగాల్సింది ఏదైనా ఉంటే చెప్పేసి వెళ్ళిపో. మా వల్ల అయినది చేస్తాం" అన్నారు నిదానంగా.

హరికృష్ణ కొంచం ముందుకు వచ్చాడు.

"మీరు మమ్మల్ని క్షమించాలి. ఎక్కడ రోహిని నాకు కాకుండా పోతుందో అన్న భయంతో ఈ నిర్ణయానికి రావలసి వచ్చింది. ఇప్పటికీ ఏమీ పరవాలేదు సార్. రహస్యంగా జరిగిన ఈ పెళ్ళి...ఎవరికీ తెలియదు. ఊరంతా తెలిసేటట్టు ఏర్పాటు చేసి మీరు జరిపే పెళ్ళిలాగా చేసేయండి. అప్పుడు మీకు అవమానంగా ఉండదు"

నవ్వారు బాపిరాజు గారు.

మీ పెళ్ళిని ఊరంతా తెలుసుకునేటట్టు నేనెందుకయ్యా జరపాలి? ఒకమ్మాయి మెడలో ఎన్నిసార్లు తాళి కడతావు? అంతే కాకుండా నాకు అమ్మాయే లేదే. అలాంటప్పుడు పెళ్ళి కొడుకు ఎక్కడ్నుంచి వస్తాడు?"

"సార్...నా వల్ల మీ కుటుంబంలో గొడవలు వద్దు. నేను తప్పు కుంటాను. మీరు మీ అమ్మాయిని పిలుచుకుని లోపలకు వెళ్ళండీ అన్నాడు హరికృష్ణ.

"మీరెందుకండీ వీళ్ళను బ్రతిమిలాడతారు?  మనం ఏమంత చెయ్యకూడని తప్పును చేశేశాము? ప్రేమించి పెళ్ళి చేసుకోవటం అంత పెద్ద నేరమా? వీళ్ళ రక్తమే నా శరీరంలోనూ పారుతోంది. నాకూ అదే వైరాగ్యం ఉంది. రండి...మనం వెళ్దాం" అంటూ వెనక్కి నడిచింది రోహిని.

"ఉండు రోహినీ...నా గురించి బాధ పడకు. నేను ఎలాగైనా బ్రతికేస్తాను. కానీ నువ్వు...వసతిగా జీవించావు. నా వలన నువ్వు కష్టపడకూడదు. మనకి పెళ్ళే జరగలేదు అనుకో. తాళిని విప్పి నాకు ఇచ్చేసి వెళ్ళిపో. అప్పుడు వాళ్ళు నిన్ను మన్నించి చేర్చుకుంటారు"

"కేవలం...డబ్బుకోసం, వసతికోసం నేను తాళిని విప్పేస్తాననుకున్నారా? ఈ రోజు బూజును దులిపినట్లు, నన్ను దులిపేసి వదిలేసేరు కదా! వీళ్ళ ముందు మనం గొప్పగా బ్రతికి చూపిద్దాం. మన దగ్గర శ్రమ ఉంది. దాన్ని నమ్మితే చాలు. రండి..."

"చూడమ్మా...ఈ రోజుతో నీకూ, ఈ ఇంటికీ ఉన్న బంధం ముగిసిపోయింది. ఇక డబ్బో-నగలో అడుగుతూ ఈ గుమ్మం తొక్కకూడదు. అలా చేసే ధైర్యం నీకుందా?"

ఏదో చెప్పటానికి నోరు తెరిచిన హరికృష్ణను మాట్లాడనివ్వకుండా తానే మాట్లాడింది రోహిని.

"ఇలా చూడండి సార్, నేను ఇక ఈ ఇంటికి రానే రాను. ఇక నాకు అన్నీ ఈయనే. మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దు. మీ డబ్బు పెట్టుకుని మీరే ఏడవండి" అన్న రోహిని, హరికృష్ణను పిలుచుకుని వచ్చేసింది.

ఇక పాత ఉద్యోగం అతనికి ఉండదని తెలిసి, ఇద్దరూ విజయవాడకు దగ్గరలో ఉన్న గ్రామానికి వచ్చారు. అదే బాపిరాజు గారి పూర్వీకుల ఊరు అని రోహిని విని ఉంది. అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాల్సి వచ్చింది. తల మీద చేతులు పెట్టుకుని ఒక మూలగా కూర్చున్నాడు హరికృష్ణ.

"మీరు బాధ పడకండి కృష్ణా --మీకు నేనున్నాను. ఇంకో ఉద్యోగం దొరక కుండానా పోతుంది"  అన్నది ఓదార్పుగా.

ఒక్కసారిగా బుసకొట్టాడు అతను "ఎంకమ్మా...నా ప్లానునే చెడగొట్టేసేవే! నల్ల పిల్లిలాగా ఉన్న నిన్ను ఎందుకు ప్రేమించానో? లేదు...లేదు...ప్రేమిస్తునట్టు నటించానో తెలుసా? నువ్వు బాపిరాజుకి ఒకే కూతురువి. నిన్ను పెళ్ళి చేసుకుంటే వసతిగా -- ఉద్యోగమే చేయకుండా ఇంటల్లుడుగా ఉండి పోదామనుకున్నాను. ఆస్తి బాగా వస్తుందని లెక్క వేసుకున్నాను. శనేశ్వరం...అంతా చెడ దొబ్బేవు కదే!"

మనసు మధ్య భాగంలో గట్టిగా దెబ్బతిన్నది రోహిని. తల తిప్పుతున్నట్టు అనిపించింది. నిలబడలేక కాళ్ళు వణికినై. ఒక్కసారిగా చెమటలు పట్టినై. షాక్ తో నాలిక పొడిబారింది.

అతను మాట్లాడుతూ వెడుతున్నాడు.

"వాళ్ళు మన పెళ్ళిని ఒప్పుకోరని తెలుసుకున్న తరువాత వెంటనే త్యాగం చేసేవాడిలాగా నటించి నిన్ను విడిచి పెట్టి, కనీసమైన డబ్బును గుంజుదామని చూశాను...పెద్ద పతివ్రతలాగా తాళిని విప్పను అని చెప్పి దాన్ని కూడా పాడుచేసావు"

హరికృష్ణ మాట్లాడుతూ పోతుంటే అతని అసలు రూపం ఆమెలో విచ్చు కుంటూ పోతోంది. 'వీడికి మనసే లేదు. వీడుత్త డబ్బు పిశాచి అనేది చాలా ఆలశ్యంగా అర్ధం చేసుకుంది ఆ అమాయకురాలు. హృదయం నొప్పి పుట్టింది. మెడడులో చాలా గందరగోళం.

"సరి...సరి...జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చెయ్య గలిగింది ఒకటే ఒకటి. త్వరగా ఒక బిడ్డను కని, దాన్ని మీ నాన్న కాళ్ళ దగ్గర పడేసి బేరమాడితే, ఒక వేల మనల్ని క్షమించి కొంచమైనా ఆస్తి ఇస్తారు. ఇలా చూడమ్మా...'మనం వీడ్ని పెళ్ళి చేసుకున్నామే, ఇతను ఉద్యోగం చేసి మనల్ని కాపాడతాడు అని మాత్రం కలలు కనకు. ఇంటికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను" అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోయిన తరువాతే కొంచం కొంచంగా స్వీయ భావ వలలోకి  వచ్చింది.

'భగవంతుడా...వీడ్ని నమ్మి ఎంత పెద్ద తప్పు చేశేను? నాన్న ఎంతగా చెప్పారో...ఎందుకు వినలేదు? ప్రేమ మోహం కళ్ళు కప్పేసింది. ఇక నేనేం చేయను?' వేదనతో ఆమె కళ్ళల్లో నీళ్ళు నదిలా ప్రవహించినై.  తన తలరాతను తలుచుకుని ఏడుస్తూనే ఉంది. సముదాయించే వాళ్ళు కూడా లేరు.

రెండు గంటలైనా వెళ్ళిన అతను తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ భయం కూడా ఆమెను చేరుకుంది.

కళ్ళు తుడుచుకుంది. దేవుడి మీద భారం వేసింది. ఎప్పుడో చనిపోయిన తల్లి జ్ఞాపకానికి వచ్చింది. మళ్ళీ కన్నీరు మొదలయ్యింది. 'అమ్మా...నువ్వుంటే నాకు ఇలాగంతా జరిగేదా?' -- ఏడ్చింది.

'ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. నా జీవితం ఇంతే అనేది తెలిసిపోయింది. ఏ కారణం  చేత కూడా పుట్టింటికి మళ్ళీ వెళ్ళకూడదు. అది ఖచ్చితం. వీడ్ని నమ్ముకుని ప్రయోజనమూ లేదు. నా చేతులను నమ్ముకునే నేను బ్రతకాలి. చదువు సహాయం చేస్తుంది తనని తాను సముదాయించుకుంది!

సుమారుగా ఏడున్నర ప్రాంతంలో హరికృష్ణ వచ్చాడు. బాగా తాగున్నాడనేది అతను దగ్గరకు వస్తున్నప్పుడే అర్ధమయ్యింది.

"మీరు తాగుతారా?"

అవును...బాగా తాగుతాను. నీకేమొచ్చింది? నీ డబ్బుతోనా తాగాను? ఏమిటే ఆ చూపు? నేనేమీ భయపడను. ఈ రోజు మనకి 'ఫస్ట్ నైట్' త్వరగా బిడ్డ పుట్టాలని వేడుకో" అన్నాడు.

మరుసటి రోజు తెల్లవారుతుండగానే బయటకు వెళ్ళిపోయాడు.

ఇంట్లో ఒక జీవి ఉందే...భోజనానికి ఏం చేస్తుంది? అనే ఆలొచన కూడా లేకుండా...'నేను రాత్రికే వస్తాను అని వదిలేసి వెళ్ళిపోయాడు.

మళ్ళీ ఏడవటానికి ఓపిక లేదు...మనసూ రాలేదు రోహినికి. జరగవలసిన పనులు మొదలుపెట్టింది.

చేతులకూ, చెవులకూ వేసుకున్న స్వల్ప బంగారాన్ని అమ్మి ఇంటికి కావలసిన వస్తువులు కొన్నది. కొంచం డబ్బుతో రెండు చీరలు, జాకెట్టు గుడ్డలు అని కొనుక్కుంది.

పక్కన ప్రైవేట్ స్కూలు ఒకటుంది. అక్కడికి వెళ్ళి తన చదువు గురించి చెప్పి ఉద్యోగం అడిగింది. ఆమె ఎం.ఎస్.సి.మాత్స్ చేసినందువలన వెంటనే ఉద్యోగం దొరికింది. జీతం నెలకు ఐదువేలు. శనివారం కూడా స్కూలుకు రావాలి. అంటూ అన్ని షరతులకూ ఒప్పుకుంటూ ఉద్యోగంలో చేరింది.

ఆమెకు ఉద్యోగం దొరికిందని తెలుసుకున్న వెంటనే తాను ఉద్యోగం వెతుకుంటున్న పని ఆపాశాడు హరికృష్ణ.

ఎప్పుడు చూడూ భార్యను తిడుతూనే ఉంటాడు. తన పధకం ఓడిపోయింది. ఆస్తి, డబ్బూ దొరకలేదని గొణుగుతూ ఉండేవాడు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగిలినై. రోజులు గడుస్తున్న కొద్ది మూర్ఖత్వం పెరిగిందే తప్ప -- ఆమెపై జాలో-దయో చూపించనే లేదు.

అన్నిటినీ మౌనంగా సహించటం అలవాటు చేసుకుంది రోహిని. లోతైన మనసులో నుండి ఎంత అణుచుకున్నా దాన్ని దాటి తన జరిగిపోయిన కాలం జ్ఞాపకాలను ఆశపడుతుంది. 'ఎలాగో వసతులు -- విలాశవంతంగా ఉండవలసిన ఆమె ఇలా కష్టపడుతున్నామే?' అని ఆవేదన చెందుతుంది. ఆ టైములో మనసును రాయి చేసుకుంటుంది. స్కూల్ పిల్లల  నోటు పుస్తకాలనో, పరీక్ష పేపర్లనో తీసి పెట్టుకుని ఆ పనిలో ఐక్యమైపోతుంది.

ఒక్కొక్క రోజూ నరకంలా గడిచింది. అయినా కానీ పళ్ళు కొరుక్కుంటూ గడిపింది. ఇలాంటి టైములోనే ఆమె గర్భం దాల్చిందని కన్ ఫర్మ్ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే హరికృష్ణ పెద్దగా రియాక్ట్ అవలేదు.

"ఇది పుట్టిన తరువాతైనా మీ నాన్న నిన్ను చేర్చుకుంటాడా అని చూద్దాం?" అన్నాడు.

కానీ, రోహిని తన బిడ్డకొసం చాలా ఆశగా ఎదురుచూసింది. 'ఎండి పోయిన ఎడారిలో వర్షం కురిసినట్టు’… 'నాలిక మీద పడ్డ తేనె బొట్టులాగా '...తన జీవిత ఆనందమే ఈ బిడ్డే  కనుక రాధ చాలా దృఢంగా ఉంది.  బాగా తింటూ ఆరొగ్యాన్ని మెరుగుపరుచుకుంది. మర్చిపోకుండా వాక్సిన్లు వేసుకోవటానికి చాలా గమనికతో ఉండేది.

కాన్పు నొప్పులు వచ్చి చుట్టు పక్కలున్న వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రశవం జరగబోతోంది అన్న పరిస్థితిలోనూ అతను వచ్చి చూడలేదు.

బుధవారం సాయంత్రం అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చి తల్లి అయ్యింది రోహిని. మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉంది. అప్పుడు కూడా అతను రాలేదు. తానే రిక్షా చేసుకుని వచ్చి ఇంట్లో దిగింది.

బిడ్డ పుట్టిన శరీరం నీరసంగా ఉంది. అయినా ఆమె వలన ఒక్క క్షణం కూడా రిలాక్స్ గా కూర్చోలేకపోయింది. ఆమె లేని సమయంలో హరికృష్ణ ఇంటిని అశుభ్రం చేసేశాడు. అది శుభ్రం చేసి -- బిడ్డకు పాలిచ్చి--తనకు పత్యం భోజనం తయారుచేసుకోవటం అనే పనులు చేసి ముగించుకునేటప్పటికి తల తిరుగుతున్నట్టు అనిపించింది.

ఆమె పరిస్థితి చూసి పక్కింటి పనిమనిషి గౌరి, భోజనం చేసి పంపేటట్టు...దానికి తగిన డబ్బు తీసుకునేటట్టు ఒప్పుకుని భోజనం బాధ్యత ఆమె తీసుకుంది. అది రోహినికి చాలా ప్రశాంతతను ఇచ్చింది.

హరికృష్ణ కనిపించనే లేదు. దాని గురించి రోహిని బాధ పడనూ లేదు. ఐదు నెలలు గడిచినై. బిడ్డను గౌరి దగ్గర ఇచ్చేసి స్కూలుకు వెళ్ళటం మొదలుపెట్టింది. జీవితం సాఫీగా గడుస్తోంది.    

సడన్ గా ఒకరోజు వచ్చాడు భర్త.

"అరెరే...ఇదేనా నా బిడ్డ? ఆడపిల్లనా? అరే శనేశ్వరం...మగ బిడ్డగా పుట్టి ఉండకూడదా? నీకు టాలెంట్ చాలదు. అందుకనే ఆడపిల్లను కని తీసుకు వచ్చావు" అన్నాడు కఠినంగా.

మౌనంగా అతనికి కంచం పెట్టి భోజనం వడ్డించింది.

"మగ బిడ్డగా పుట్టుంటే తాతయ్య ఆస్తి, మనవడికే వస్తుందని చెప్పి కోర్టులో దావా వేసుండొచ్చు కదా? అందుకే చెప్పాను. సరి...సరి...ఇప్పుడు కూడా చెడిపోయింది ఏమీలేదు. బిడ్డను తీసుకుని బయలుదేరు"

"ఎక్కడికి?" అన్నది పులుసు పోస్తూ!

"ఇంకెక్కడికి...మీ ఇంటికే. మీ నాన్న కాళ్ళ దగ్గర ఈ బిడ్డని పడేయ్. దీన్ని పెంచటానికి మా వల్ల కావటం లేదు. 'డబ్బులేక అల్లాడిపోతున్నాము అని చెప్పి ఏడు. ఆయన నిన్ను మాత్రం చేర్చుకున్నా పరవాలేదు. నేను నిదానంగా వచ్చి కలిసిపోతాను. అంతవరకు నువ్వు నాకు కొంచం డబ్బులిచ్చి ఆదుకోవా ఏమిటి? "అన్న హరికృష్ణ, భోజనం పూర్తి చేసి లేచాడు.

ఉన్నదాంట్లోనే బాగా చినిగిపోయిన చీరను కట్టుకో. బిడ్డకు కూడా మామూలు గుడ్డలు వేయి. ఇలా పౌడర్ అంతా పూసి అందంగానూ, శుభ్రంగానూ తీసుకువెళ్ళకు. అలా ఉంటేనే నీ మీద జాలి కలుగుతుంది" అన్నాడు.

అంత వరకు మాట్లాడ కుండా ఓర్పుగా ఉన్న రోహిని పిల్లను గుడ్డ ఊయలలో వేసి నిద్ర పోనిచ్చి వచ్చింది. చిన్నగా చెప్పినా ఖచ్చితమైన స్వరంతో మట్లాడింది.

"చూడండి...మీరెంత ఒత్తిడి చేసినా మా నాన్న దగ్గరకు బిచ్చం ఎత్తుకుంటూ వెళ్ళను. ఆయనకున్న కఠిన మనసు, పరువు, రోషమూ నాకూ ఉండదా? నా పిల్లను బిచ్చగత్తెను చెయ్యలేను. మీరు నన్ను కొట్టి చంపినా పరవాలేదు...ఆ ఇంటి గడప తొక్కను..." అన్న  రోహిని ఊయలను ఊపటానికి వెళ్ళింది.

ఆమె చెప్పింది విన్న తరువాత హరికృష్ణ నోటి నుండి వచ్చిన మాటలు చెప్పటానికి పనికిరావు.  అంత అసహ్యంగా మాట్లాడాడు. ఒక సమయంలో చేతులు ఎత్తి కొట్టటానికి వచ్చినప్పుడు ఆపింది.

"నన్ను కొట్టటానికి చెయ్యి ఎత్తేరంటే...ఊరీకే  ఉండను. తిరిగి కొడతాను. ఆ అవమానం మీకు అవసరమా? మాట్లాడ కుండా, గొడవ పడకుండా ఉండేటట్టు అయితే భర్త అనే కారణంతో భోజనం పెడతాను. అది వదిలేసి 'మీ ఇంటికి వెళ్ళు -- డబ్బులు తీసుకురా' -- అలాఇలా అని మెదలుపెట్టేరా... ఊరికే ఉండను. పోలీసులకు చెప్పి లోపల  పెట్టిచేస్తాను. అప్పుడు జీవితాంతం చిప్ప కూడే" అన్నది.

ఆమెను కోపంతో, విసుగుతో చూసేసి, ఏమీ మాట్లాడకుండా కోపంతో తలుపులను గట్టిగా మూసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ శబ్ధానికి పాపకు నిద్రా భంగం కలిగి ఏడుపు మొదలు పెట్టింది.

**********************************************PART-8******************************************

ఆ గదే సైలెంటుగా అయిపోయింది. అంజలి మాత్రం వెక్కి వెక్కి ఏడ్చే శబ్ధం మాత్రం వినబడింది.

"ఛీ...పిచ్చిపిల్లా...ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా జరిగి ముగిసి చాలా సంవత్సరాలు అయ్యింది...ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు?"

"లేదమ్మా. నువ్వు నాకోసం ఎన్ని  కష్టాలు అనుభవించేవు? అది తలుచుకుంటే..." మళ్ళీ కన్నీరు పొంగి పొర్లింది.

"సరే రోహినీ...తరువాత ఏమయ్యింది?".

"ఆ రోజు వెళ్ళినతనే. ఆ తరువాత మేమున్నామా, చచ్చిపోయామా అని తెలుసుకోవటానికి కూడా రాలేదు. ఎలాగో కష్టపడి దీన్ని పెంచి పెద్ద చేశాను. అప్పుడు మనసులోనూ, శరీరంలోనూ ఓపిక ఉండేది. దెబ్బతిని దెబ్బతిని ఉన్న హృదయం ఇప్పుడు ట్రబుల్ ఇస్తోంది"అన్నది.

రోహినీ నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకూడదు. దీనికీ, అంజలి ప్రేమను నువ్వు అంగీకరించక పోవటానికీ ఏమిటి సంబంధం! నాకు అర్ధం కాలేదు"

"అయ్యో ఆంటీ...ఇంకా అర్ధం కాలేదా? సుధీర్, అంజలిని ప్రేమించటం లేదు. నటిస్తున్నాడు. దాన్ని పెళ్ళిచేసుకుని చిత్రవధ పెడతాడు. నాకు జరిగింది దానికి జరగకూడదు కదా? అదైనా బాగా బ్రతకనీ!"

"ఏమిటే... సుధీర్ ఎంత మంచి పిల్లాడో  తెలుసా? అతనికి ఎంత పెద్ద మనసుంటే ఈ వృద్దాశ్రమం జరుపుతాడు? అతనికి డబ్బు ఆశ ఉండుంటే పెద్ద డబ్బుగల అమ్మాయిని చూసుకోనుంటాడు గానీ అంజలిని ఎందుకు చూడటం?”

ఆంటీ...మీరు అతనికి సపోర్టు చేసి మాట్లాడేటట్టైతే ఇక ఇక్కడికి రాకండి. నా కూతురుకు ఎవరు భర్తగా రావాలో నేను తీర్మానం చేసుకుంటాను. పెద్దవాళ్ళు మంచి మనసుతో ఏది చేసినా తప్పుగా అవదు. నేను గనుక మా నాన్న మాట వినుంటే నాకు ఈ గతి పట్టేదా?"

"అమ్మా...నువ్వు నా గురించి ఆలొచించకు. నీ విషయానికి రా. నాన్న ఇప్పుడొచ్చి మనల్ని పిలుస్తున్నారు. మనం వెళ్ళాలా...వద్దా? ఏం నిర్ణయించుకున్నావు?"

"నేను ఇంత చెప్పినా నీకు అర్ధం కాలేదా? వాడికి నా మీద ప్రేమ ఏమీలేదు. ఏదో మనసులో పెట్టుకునే పిలుస్తున్నాడు. ఒకసారి నేను వాడ్ని నమ్మి మోసపోయింది చాలదా? మళ్ళీ మళ్ళీ అవమానపడాలా?"

"అలా అనుకోవటం తప్పు రోహినీ. పలు సంవత్సరాలకు ముందు నువ్వొక తప్పు చేశావు. కానీ, ఈ రోజు వరకు దాన్ని తలచుకుని బాధ పడుతూనే ఉన్నావే? అలాగే అతను కూడా మారి ఉండొచ్చు కదా? ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు"

వాడు ఖచ్చితంగా మారడు ఆంటీ...ఇప్పుడు నాకేంటి తక్కువ? మీరున్నారు... అంజలి ఉంది. ఇంకేం కావాలి? నేను ప్రశాంతంగా ఉండిపోతాను" 

"అమ్మా అంజలీ...వెళ్ళి కొంచం కాఫీ కలుపుకు వస్తావా. నేను మీ అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉంటాను" అన్న వెంటనే అంజలి లేచి లోపలకు వెళ్ళింది. ఆమె వెళ్ళిన  వెంటనే కుర్చీని ఎత్తి మంచం పక్కగా వేసుకుంది ఆంటీ.

"రోహినీ...నేను చెబుతున్నానని తప్పుగా అనుకోకూడదు. నిన్ను నా సొంత చెల్లిగా భావించి చెబుతున్నాను" అంటూ దేనికో పిడి వేసింది.

"ఏమిటి విషయం ఆంటీ? సుధీర్ విషయమైతే నేను వినటానికి రెడీగా లేను"

"లేదు...ఇది వేరు. నేనడిగే ప్రశ్నలకు జవాబు చెబుతావా?"

"అడగండి"

"ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజు అంజలికి పెళ్ళి చెయ్యాలి కదా?"

"అవును...అది 'బి.ఎడ్' చదువు పూర్తి చేసిన వెంటనే, సంబంధాలు చూడటం మొదలుపెడతాను"

"చాలా కరెక్ట్. సంబంధాలు ఎలా వెతుకుతావు? ప్రకటన ఇస్తావా...లేదు టీ.వీ లో ఎక్జిబిషన్ లో నిలబెట్టినట్టు నిలబెడతావా?"

"లేదు...లేదు. నేను మంచి పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకుని అతనితో చెప్పి అంజలికి తగిన వరుడ్ని చూడమంటాను"

అది...ఇప్పుడు నువ్వు 'పాయింట్' కు వచ్చావు. మంచి పెళ్ళిళ్ళ పేరయ్య మూలంగా అయితే మంచి కుటుంబం దొరుకుతుంది. అందులో సందేహమేమీ లేదు. కానీ వరుడి ఇంటి వాళ్ళు...పిల్ల తండ్రి ఎవరు -- ఎక్కడున్నారు అని అడుగుతారే! అప్పుడెలా సమాధానం చెబుతావు? అందరి దగ్గర నువ్వు మోసపోయిన కథ చెబుతావా? వాళ్ళు అది నమ్మాలిగా?"

రోహిని సమాధానం చెప్పలేకపోయింది. ఆంటీ మళ్ళీ మొదలు పెట్టింది.

"నీకు భర్త వద్దు. అంజలికి నాన్న కావాలే? నువ్వు చిన్న వయసులో అన్ని సుఖాలను అనుభవించి, ప్రేమ కోసం అవన్నీ అవతలపారేసి వచ్చావు. కానీ, అంజలి పాపం...పుట్టిన దగ్గర నుండి పేదరికం తప్ప ఇంకేం చూసింది? ఇప్పుడు వాళ్ళ నాన్న బాగా డబ్బుతో ఉన్నప్పుడు అది ఎందుకు కష్టపడాలి?"

ఆలొచించటం మొదలు పెట్టింది రోహిని.

"బాగా ఆలొచించి చూడు. ఈ రోజు నీ దగ్గర పెద్దగా డబ్బులేదు. అలాంటప్పుడు అతను నిన్ను వెతుక్కుంటూ ఎందుకు రావడం? చెప్పు! అతను అనుకోనుంటే ఇంకో పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండి ఉండొచ్చు కదా?"

"ఆంటీ...కావాలంటే ఒక పని చేయనా? అంజలిని మాత్రం వాళ్ళ నాన్నతో పంపుతాను. నేను ఒంటరిగా ఉండిపోతాను?"

"చాలా బాగుందే...నువ్వు చెప్పేది చాలా బాగుంది. దీనికి అంజలి ఒప్పుకుంటుందా? ఎందుకింత స్వార్ధ పరురాలుగా ఉన్నావు రోహినీ?"

"ఎవరు...నేను స్వార్ధంగా ఉన్నానా? అంజలి కోసమే నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నాను. దానికి పెళ్ళి చేస్తేనే నేను హాయిగా కళ్ళు మూస్తాను"

పెద్ద వయసు మీరిన దానిలాగా మాట్లాడొద్దు. అలా నీకేమంత వయసైపోయింది. ఇక మీదట మనవుడు -- మనవరాలునో ఎత్తుకుని ముద్దాడాలి. ఇంతలో ఎందుకంత తొందర?"

ఒక మాటకు అన్నాను ఆంటీ...అంతే"

"ఇలా చూడు రోహినీ...జీవితంలో తప్పు చేయని వారు ఎవరు? అందరం ఏదో ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోలేక కొట్టుకుంటున్నాం. పాపం మీ ఇంటాయన...ఆయన మారి వచ్చారు. ఇప్పుడు అతన్ని క్షమించి అంజలికి మంచి జీవితం ఏర్పాటు చేసివ్వు"

"ఆయన మంచివారు కాదు. ఇదే మా నాన్న చూసిన వరుడైతే నన్ను అనాధగా వదిలేసి వెళ్ళుంటారా? చెప్పండి"

నవ్వింది ఆంటీ.

"మంచి కథ...నీకు లోకజ్ఞానమే తెలియదు. ఏం చదివేవో...ఏం ఉద్యోగం చేశావో పో"

"ఏమిటి ఆంటీ చెబుతున్నారు?"

"చూడు...నా గురించి నీకేం తెలుసు?"

"మీరు నిర్మలా ఆంటీ...మీ ఆయన చనిపోయారు. మీకు పిల్లలు లేకపోవటం వలన ఇక్కడ చేరేరు...అంతే కదా?"

అది లోకానికి నేను చెప్పింది. నీ కథ లాగానే నా కథ కూడా. ఏమిటొక తేడా అంటే...నువ్వు ప్రేమించావు! నేను మా నాన్న చూసిన వరుడ్ని పెళ్ళి చేసుకున్నాను"

"తరువాత ఏమైంది?"

"తరువాత ఏమైందా? అంతా విధి. మొదట నాకు కొడుకు పుట్టాడు. ఆశగా శంకర్ అని పేరు పెట్టి పెంచాము. తరువాత మూడు సంవత్సరాలకు పిల్ల పుట్టింది. అప్పుడే విధి నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టింది"

"మీరేం చెబుతున్నారు?"

"నాకు పుట్టిన ఆడపిల్లకు మెదడు వ్యాప్తి లేదు అని ఆరో నెలే తెలిసిపోయింది. దానికి ఏమీ తెలియదు. పిచ్చిదానిలాగా ఉంటుంది అని డాక్టరమ్మ చెప్పింది. వైద్యం చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు అని చెప్పింది"

"అయ్యో పాపం?"

"పాపమే! కానీ ఏం చేయను...కన్నాను -- నా బిడ్డ అయ్యిందే...వదిలి పెట్టగలనా? ఇంటికి పిలుచుకు వచ్చి దాన్ని కంటికి రెప్పలాగా చూసుకున్నాను. కానీ మా ఆయన భయపడిపోయాడు. ఆయనకు జీతం తక్కువే. ఎక్కడ తన సంపాదనంతా ఆ పిల్ల బాగోగులకే సరిపోతుందేమో నని బాధపడటం మొదలుపెట్టారు. ఆ పిల్లను అనాధ ఆశ్రమంలో వదిలిపెట్టమన్నారు" -- చెప్పటం ఆపి కళ్ళు తుడుచుకుంది ఆంటీ.

"ఛ. ఇంత రాతి మనసు కలిగిన వాళ్ళు కూడా ఉంటారా?"

"ఉన్నారే!  నన్ను బాగా బలవంతం చేశారు...ఏది ఏమైనా సరే నేను నా పిల్లను అనాధ ఆశ్రమంలో విడిచి పెట్టను అని చెప్పాను"

"అదే కరెక్ట్"

"ఏం కరక్టు. నేను నా నిర్ణయం చెప్పిన  తరువాత రెండు రోజులు కూడా ఇంట్లో లేరు. చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంటికే రాలేదు. వివరాలేమీ తెలియనందువలన ఆయన ఆఫీసుకే వెళ్ళాను. ఆయన ఎక్కడో నార్త్ సైడుకు ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్ళారని చెప్పారు. ఇరవై ఏడేళ్ళ వయసులో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎవరి ఆదరణ లేక నిలబడ్డాను"

"మీ అమ్మా--నాన్నా?"

"అమ్మ చనిపోయింది. నాన్న అన్నయ్యతో ఉన్నారు. ఎక్కడ నేను భారంగా అయిపోతానేమోనని మా వదిన నన్ను దగ్గరకే చేర్చలేదు. ఇంకెవరున్నారు? ఏం చేయను నేను? అమ్మవారి మీద భారం మోపి వంట పనులకు వెళ్ళటం మొదలుపెట్టాను. ఈ మధ్యలో ఆ పిల్లకు ఫిట్స్ వచ్చి పదో ఏట చనిపోయింది. మనసు రాయి చేసుకుని క్యాంటీన్ మొదలుపెట్టాను. అందులో వచ్చిన సంపాదనతోనే కొడుకును సి. ఏ వరకు చదివించాను

"అబ్బో...మీ అబ్బాయి సి.ఏ. చదివాడా?"

అవును...చదివించటంలో నేను ఏమీ తక్కువ చేయకపోయినా...వాడే నా మీద ప్రేమను తక్కువ చేసుకున్నాడు"

"ఏమిటి ఆంటీ అలా చెబుతున్నారు"

"వాడికి మంచి సంబంధం కుదిరింది. వాడి చదువు చూసే ఒక గొప్ప ఆస్తిపరుడు అమ్మాయిని ఇచ్చాడు. నేనూ సంతోషంగా పెళ్ళి చేశాను. తరువాతే తెలిసింది. వచ్చింది నాకు కోడలు కాదు...యముడు అని"

"ఆమె మిమ్మల్ని చాలా బాధ పెట్టిందా?"

"అంతా ఇంతా కాదు? నన్ను చూస్తేనే దానికి ఇష్టముండదు. వంట మనిషి అని దానికి నిర్లక్ష్యం. నన్ను గౌరవించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 

"ఒకరోజు మా కోడలు బంధువులు ఎవరో వచ్చారు. నేను వాళ్ళింటికి వంట చేయటానికి వెళ్ళున్నాను. అది ఆయన జ్ఞాపకముంచుకుని నన్ను విచారించారు. అంతే ఏదో పరువే పోయినట్టు అరిచింది నా కోడలు"

"దేనికి?"

ఆమె భర్త పెద్ద ఉద్యోగంలో ఉన్నాడట. అది కూడా గొప్ప కుటుంబంలో చేరిందట. ఆమె బంధువు దగ్గర నేనే కావాలని వెళ్ళి ఆమెను అవమాన పరిచేనని, ఇంకా ఏదేదో చెప్పింది..."

"మీరు ఏం సమాధానం చెప్పారు?"

"నేనేం చెబుతాను రోహినీ. పెద్దవాళ్ళ మాటలు నిచ్చన ఎక్కుతుందా? కొన్ని రోజులు గొణుగుతూ గడిపిన ఆమె...ఏం చెప్పిందో, ఎంత చెప్పిందో తెలియదు...వాడు. అదే నా కొడుకు నన్ను ఈ వృద్దాశ్రమంలో చేర్చేస్తాను. నెల నెల డబ్బులు కడతాను. నువ్వు వసతిగా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చి చేర్చి వెళ్ళిపోయాడు. ఇదంతా బయటకు తెలిస్తే అవమానం అనుకుని...భర్త చనిపోయాడు...పిల్లలు లేరు అని అబద్ధం చెప్పి ఉంచాను"

చాలాసేపు మౌనంగానే సాగింది.

"నాకు జరిగింది పెద్దలు చేసిన పెళ్లే,  ఏం జీవించాను గొప్పగా? కన్న కొడుకే నన్ను ఇక్కడ చేర్చేసి వెళ్ళిపోయాడు. దీన్నే విధి అంటారు"

"పాపం ఆంటీ మీరు. ఇంత సోకాన్ని మనసులో పెట్టుకుని తాళం వేసుకుని నవ్వి నవ్వి మాట్లాడుతున్నారు? మీ మనసు ఎవరికీ రాదు"

"నువ్వు నన్ను పొగడాలని నేను నా విషయం నీకు చెప్పలేదు. జీవితంలో కష్టాలూ, సుఖాలూ సహజం. ఇలా ఉండుంటే కష్టాలే వచ్చేవే కావని చెప్పలేము. అంతా భగవంతుడి చేతిలో ఉంది. నీ దుఃఖమే పెద్దది అని అనుకుంటున్నావు. కొంచం మిగతావారిని చూడు. ఈ ఆశ్రమంలో ఒక్కొక్కరి దగ్గర దుఃఖ కథలు చాలా ఉంటాయి. నువ్వు జరిగిపోయిన కాలం గురించి ఆలొచించి -- జరుగుతున్న కాలాన్ని వృధా చేసుకోకు" అన్నది ఆంటీ.

రోహిని ఆలొచించింది.

'ఆంటీ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. తప్పు చేయని వాళ్ళు ఎవరు? కానీ, నా వల్ల హరికృష్ణను క్షమించటం కుదరదు

క్షమించకపోయినా పరవాలేదు. కూతురికోసం ఆయన్ని చేర్చుకోవాలి. ఆంటీ చెప్పినట్టు రేపు అంజలి నాన్న గారి మాట వచ్చినప్పుడు ఆమె వెడుక్కి తలవంచ కూడదు. తల ఎత్తుకుని నిలబడి 'ఈయనే నా తండ్రి అని చెప్పాలి. దానికి హరికృష్ణను నేను చేర్చుకోవాలి.

ఒక నిర్ణయానికి వచ్చింది రోహిని.

"ఆంటీ...మీరు చెప్పింది ఆలొచించి చూశాను. మీరు చెప్పేదే కరెక్ట్.  అంజలి కోసం నేను ఆయన్ని చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంజలీ...నువ్వెళ్ళి మీ నాన్నను పిలుచుకు రామ్మా" అన్నది.

ఆనందంతో తల్లిని  కౌగలించుకుంది కూతురు.

**********************************************PART-9******************************************

అంజలీనూ, తల్లి రోహినినూ ఇల్లు ఖాలీ చేసి హరికృష్ణతో వెల్తున్నారనే వార్త సుధీర్ కు చేరింది. అతని మనసులో పలురకాల ఆలొచనా అలలు. తన ప్రేమ గెలుస్తుందని కొంచంగా నమ్మకం తలెత్తింది. 

'ఒకవేల అంజలి వాళ్ళ నాన్నకు నేను నచ్చితే, ఆమె నాకు దొరికే ఛాన్స్ ఉంది కదా?' అని అతని మనసు లెక్క వేసింది. ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకోవాలనే తహతహతో ఎలాగైనా ఆమెను ఒకసారి కలిసి మాట్లాడలేమా అని అల్లాడిపొయాడు. మర్యాద నిమిత్తం రోహినిని ఇంటికి వెళ్ళి చూశాడు.

ఆమె నుదురు చిట్లింది.

"ఏమిటయ్యా...ఏంటిలా వచ్చావు? అంజలి నిన్ను చూడదు" మొహం మీద కొట్టినట్టు చెప్పింది.

"లేదు ఆంటీ...నేను అంజలి కోసం రాలేదు. ఇల్లు ఖాలీ చెయ్యబోతున్నారని నిర్మలా ఆంటీ చెప్పింది. కానీ మీరు నా దగ్గర ఏమీ చెప్పలేదు. అందుకే ఏమిటి వివరం అని అడిగి తెలుసుకుందామని వచ్చాను..."

రోహిని గొంతు, మాట ఒక్కసారిగా మారిపోయింది "అవును బాబూ...నువ్వు మాకు కరెక్టు సమయంలో ఈ ఇల్లు ఇచ్చావు! లేకపోతే మాగతి ఏమయ్యేదో? నువ్వు సాధారణ మనిషిగా ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. కానీ, అంజలి పేరు చెప్పుకుంటూ వస్తే అనుమతించను. ఆమె కూడా నన్ను కాదని ఏమీ చెయ్యదు"   

నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు కూడా మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగి వెళ్ళటానికి వచ్చాను. మీరు ఎప్పుడు ఖాలీ చేస్తున్నారు?

"రేపు...వాళ్ళ నాన్న వచ్చి మమ్మల్ని ఆయనతో తీసుకు వెడతానని చెప్పారు"

"అలాగా...చాలా సంతోషం. మీరు ఖాలీ చేసిన తరువాత ఇల్లు తాళం వేసి, తాళం చెవి నిర్మలా ఆంటీ దగ్గర ఇచ్చేయండి...నేను తీసుకుంటాను. ఏదైనా సహాయం కావాలనుకుంటే సందేహించకుండా అడగండి" అని చెప్పి వచ్చాశాడు. గుండె వేగంగా కొట్టుకుంది.

'నేనేం అంత పెద్ద తప్పు చేశాను? ఎందుకిలా కుక్కను తరిమినట్టు తరమాలి? ఇన్ని రోజుల పరిచయానికైనా అంజలి నాన్నను నాకు పరిచయం చేయచ్చు కదా? కృతజ్ఞతా భావం లేని జన్మలు! నేనేమైనా అంజలిని ఎత్తుకునా వెళ్ళబోతాను? ఆమె మాత్రం తక్కువా ఏమిటి? 'మేము ఖాలీ చెయ్యబోతాము. ఏదైనా మాట్లాడాలా...ఇదే నా నెంబర్ అని చెప్పి ఇచ్చిందా? నువ్వు మాత్రమే ఆమెను తలుచుకుని కరిగిపోతున్నావు. ఆమెకు నీ జ్ఞాపకమే లేదు

ఏవేవో ఆలొచించుకుంటూ చెట్టు కింద నిలబడున్నాడు.

"ఏమయ్యా సుధీర్...నీ అంజలి ఇల్లు ఖలీ చేస్తున్నట్టుందే?"

గొంతు విని తల తిప్పి చూశాడు. నిర్మలా ఆంటీ. చేతిలో కూరగాయల సంచీతో నిలబడుంది.

"ఆంటీ..."  

"ఏమిటి తమ్ముడూ ఆలొచిస్తున్నావు. నువ్వూ, అంజలీనూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలుసే" అన్నది నొక్కి చెబుతూ.

ముఖం వాడిపోయినట్టు మౌనంగా నిలబడ్డాడు.

"చాలా సంవత్సరాల తరువాత రోహిని యొక్క భర్త వచ్చారు. అంజలి, వాళ్ళ అమ్మా ఆయనతో ఉండటమే న్యాయం. నువ్వేమనుకుంటున్నావు?"

"నేనేమనుకుంటా ఆంటీ? ఇన్ని రోజులు లేని నాన్న...ఇప్పుడు సడన్ గా ఎక్కడ్నుంచి  మొలకెత్తారు? అంజలి నన్ను ఇష్టపడుతోందని  మీరు మాత్రమే చెబుతున్నారు. కానీ  ఆమె నాతో ఒక్క ముక్క గూడా దీని గురించి చెప్పలేదే? ఇప్పుడు కూడా నేను వాళ్ళింటికి వెళ్ళాను. అంజలి వాళ్ళ అమ్మ, నన్ను కొట్టి తరిమినట్టు తరిమింది. ఎందుకిలా  చేస్తున్నావని వాళ్ళ అమ్మను అంజలి అడగనే లేదే? అంతెందుకు...బయటకే రాలేదు"  

"ఇప్పుడు అంజలి ఇంట్లో లేదబ్బాయ్...స్కూలుకు వెళ్ళింది...ఉద్యోగానికి రాజీనామా చేయటానికే"

"దానికేమన్నా పిచ్చా? మంచి ఉద్యోగాన్ని ఎందుకు విడిచి పెట్టాలి?"

"నీకు విషయమే తెలియదా? ఆమె తండ్రి పెద్ద ఆస్తిపరుడుగా తిరిగి వచ్చాడు. రోహినికీ, అంజలికీ మంచి కాలం వచ్చినట్టే అనుకో"

సంతోష పడనివ్వకుండా ఏదో ఒకటి అడ్డుకుంది అతన్ని.

"ఓ...అందుకేనా అంజలి వాళ్ళ అమ్మ కళ్లకు నేను కనిపించలేదు. ఇక పెద్ద డబ్బుగల అల్లుడ్ని చూస్తారు. ఈ పేద సుధీర్ జ్ఞాపకం ఎవరికి ఉండబోతుంది?" 

"అలా చెప్పకు నాయనా. అంజలి నిన్ను మరిచిపోలేదు. పాపం...ఆమె రెండు తలకాయలు ఉన్న చీమ లాగా కొట్టుకుంటోంది. ఒక పక్క నువ్వు...ఇంకో పక్క వాళ్ల అమ్మ... అంజలి ఏం చేస్తుంది చెప్పు?"

"ఏం ఆంటీ...నాకేం తక్కువ? నేను అనాధనే...ఒప్పుకుంటాను. పెద్ద ఆస్తిపరుడ్ని కాదు. కానీ, నా దగ్గర శ్రమ ఉందే. చదువుకోనున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి?"

"తమ్ముడూ...నిన్ను ఎవరయ్యా తక్కువ చేసి చెప్పగలరు? నాలాంటి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన వాడివే నువ్వు!  నిన్ను వద్దని చెప్పగలదా?"

"చెప్పేశేరే! నన్ను దూరంగా విసిరేసి అంజలి వెళ్ళిపోతోందే ఆంటీ.....నేనేం చేయగలిగాను? ఆమెను ఆపగలిగానా?"

"నీతో చెప్పకూడదనే అనుకున్నాను. చెప్పే తీరాలి కాబోలు. సుధీర్, రోహిని నిన్ను వద్దని చెప్పటానికి కారణం నువ్వు ఇష్టం లేక కాదు. ఇంకా చెప్పాలంటే...ఆమె నీ మీద చాలా మర్యాద పెట్టుకుంది. కానీ, ఆమెకు ఏర్పడ్డ చేదు అనుభవాల వలన తప్పుగా నిర్ణయం తీసుకుంది"

"నాకు అర్ధం కాలేదు"

చెబుతాను" అన్న ఆమె, రోహిని యొక్క పూర్తి కథ చెప్పింది.

అందువల్లనే ఆమెకు ఎవరైనా 'ప్రేమ అని చెబితే అనుమాన పడుతోంది. తన జీవితం లాగానే తన కూతురు జీవితమూ నాశనమై పోకూడదని అనుకుంటోంది. అది తప్పా...చెప్పు బాబూ?"

"లేదు ఆంటీ...నేనే వాళ్ళను తప్పుగా అర్ధం చేసుకున్నాను. ఏది ఏమైనా సరే అంజలి  బాగుంటే చాలు"

"నీకు చాలా గొప్ప మనసు బాబూ. నేను పలు విషయాలు గురించి ఆలొచించే వాళ్ళను హరికృష్ణతో వెళ్ళమన్నాను. ఆ మనిషి వీళ్ళను బాగా చూసుకుంటే రోజులవుతున్న కొద్ది రోహిని మనసులో 'ప్రేమ మీదున్న చెడు అభిప్రాయం కొంచం కొంచం తగ్గవచ్చు కదా?  ఆ సమయం చూసి మనం వెళ్ళి అంజలిని అడుగుదాం. అప్పుడు కాదనే ఛాన్సే లేదు"

"లేదు ఆంటీ. మీరు ఆ మాట వదిలేయండి. ఇక మీదట అంజలి నాకు లేదు...వెళ్ళండి  ఆంటీ. మీ చెల్లెలు కూరల కోసం కాచుకోనుంటుంది. నా వలన మీ భొజనాలు ఆలశ్యం అవటం నాకు ఇష్టం లేదు" అని చెప్పి నడవసాగాడు. 

ఆంటీ కాయగూరల సంచీని రుక్మణీ దగ్గర ఇచ్చేసి, కరివేపాకు కోయడానికి వెళుతుండగా -- స్కూల్ నుండి వస్తోంది అంజలి.

"ఏమ్మాయ్...కొంచం ఆగు" అన్నది.

"ఏమిటి ఆంటీ?"

"నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? డబ్బు వచ్చిన తరువాత పాత ప్రేమను మర్చిపోయావా? ఎందుకు సుధీర్ను చూడలేదు?"

కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరుగుతుంటే ఆంటీని చూసింది అంజలి.

"ఏమిటి ఆంటీ...మాతో ఉంటూ అన్నీ చూసిన మీరు నన్ను అలా అడగటం న్యాయమేనా? నేను అతన్ని చూస్తే కృంగిపోతాను. అన్నిటినీ అవతలపారేసి అతనితో వెళ్ళిపోతాను. కష్టపడి మనసును అనిచి పెట్టుకున్నాను తెలుసా?"

"సరి...సరి...ఏడవకు! నేను తెలియక అడిగాను. ఇంతక ముందే చూశాను. పాపం...చాలా బాధ పడ్డాడు. నువ్వు అతన్ని చూడలేదని బాగా ఫీలయ్యాడు. మీ నాన్న దగ్గరకు వెళ్ళిపోయావు కదా. ఇక ఇక్కడికి వస్తావా? ఒకసారి అతన్ని కలిసి మాట్లాడమ్మా. కొంచం రిలాక్స్ గా ఉంటాడు...ఏమంటావ్?" అన్న ఆంటీ దగ్గర సరే నన్నట్టు తల ఊపింది.

"నువ్విక్కడే నిలబడు. నేను అతన్ని రమ్మంటాను" అన్న మామీ కరివేపాకుతో వెళ్ళిపోయింది. రెండు నిమిషాలలో సుధీర్  తో తిరిగి వచ్చింది. అంజలిని చూసిన వెంటనే అతని కాళ్ళు ఆగిపోయినై.

చిన్న పిల్లలు ఏదో మాట్లాడుకుంటారు. మధ్యలో నేనెందుకు అడ్డుగా?'అనుకున్న ఆంటీ లోపలకు వెళ్ళింది. సుధీర్, అంజలి దగ్గరకు వచ్చాడు.

"చాలా సంతోషం అంజలి. మీ నాన్న వచ్చాసేరటగా? ఇక నీకు మంచి రోజులే"

"సుధీర్...మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. ప్రస్తుతం నా పరిస్థితి అలా ఉంది! మా అమ్మ కొసమే మిమ్మల్ని వదిలి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాను. నేను మా అమ్మకు ప్రామిస్ చేసాను. నన్ను క్షమించండి... ప్లీజ్"

"అన్నీ తెలుసు. ఆంటీ చెప్పింది. పాపం మీ అమ్మ. ఆమెకు జీవితంలో ఉన్న ఒకే ఒక పట్టు నువ్వు మాత్రమే. నువ్వు ఆమెను మోసం చేస్తే ఆమె తట్టుకోలేదు. ఇప్పటికే ఆమె చాలా బలహీనంగా ఉంది. పరవాలేదు...అన్ని ప్రేమలు విజయవంతం  అవుతున్నాయా?"

"సుధీర్, మిమ్మల్ని పెళ్ళి చేసుకునే అదృష్టం నాకు లేకుండా పోయిందే! మీరు బాగుంటారు" అన్నది అంజలి ఏడుపు స్వరంతో. 

"నేను అందుకోసం పిలవలేదు. నువ్వు ఉద్యోగం వదిలేసేవుటగా?"

"మీకు ఎవరు చెప్పేరు? నాన్న చెప్పారు ఉద్యోగం మానేయమని. ఆయనకు వ్యాపారం బాగా లాభకరంగా పోతోందట. 'ఇంకా పనిచేసి కష్ట పడకు అని చెప్పారు"

"ఉండనీ. నేను వద్దని చెప్పటం లేదు. అందుకని నువ్వు చదువుకున్న చదువును వేస్టు చెయ్యబోతావా? బి.ఎడ్. చదువు వదిలేసి వెళ్ళబోతావా?"

"లేదు. అది కంటిన్యూ చెయ్యబోతాను. మొదట అమ్మ ఆరొగ్యం బాగా మెరుగు పడాలి. మిగతావన్నీ తరువాతే"

"ఎక్కడికి వెడుతున్నారు?"

మౌలాలీలో ఇల్లు. కానీ మమ్మల్ని పిలుచుకుని ఊటీ టూర్ వెళ్ళబోతున్నారు. అక్కడ పదిహేను రోజులు ఉండబోతాము. ఆ తరువాతే తిరిగి వస్తాము. వచ్చే సోమవారం ఊటీకి బయలుదేరాలని చెప్పారు"

"చాలా మంచిది అంజలి... ఏమిట్రా ఇతను ఇలా చెబుతున్నాడే అనుకోకు. మీ నాన్నను ఒక్కసారిగా నమ్మకండి. అమ్మని ఎప్పుడూ నీ చూపులోనే ఉంచుకో. మీ నాన్న ఏదైనా టెన్షన్ పడేలాంటి విషయాన్ని అమ్మకు చెప్పి, ఆ తరువాత అమ్మకు బి.పీ ఎక్కువైతే ఆ తరువాత ఆమెను కాపాడటమే కష్టమవుతుందని డాక్టర్ చెప్పింది జ్ఞాపకముందిగా?"

"అవును. నేను జాగ్రత్తగా చూసుకుంటాను"

"సరి. నువ్వు తొందరపడి ఉద్యోగం మానేసి ఉండకూడదని అనిపిస్తోంది"

"లేదు సుధీర్. నేను ఉద్యోగాన్ని వదలలేదు. నాకూ, తొందరపడకూడదని అనిపించింది. అందువలన ఆరు నెలలు సెలవు తీసుకున్నాను. ఏదైనా దాని తరువాత నిర్ణయం తీసుకోవచ్చు అనుకున్నాను"

మంచి నిర్ణయం అంజలి. ఎక్కడికి వెళ్ళినా నీకొక స్నేహితుడున్నాడని గుర్తుంచుకో. ఏ సహాయం కావాలన్నా సంసయించుకుండా నా దగ్గర అడుగు" అన్న అతను ఆమెకు వీడ్కోలు చెప్పాడు.

అంజలి నాన్న వచ్చారు. చాలా సరదా మనిషిలాగా ఉన్నారు. అందరితోనూ కలగలపుగా మాట్లాడారు. సామాన్లన్నీ బండిలోకి ఎక్కించారు. తాళం చెవి తీసుకునేటప్పుడు కళ్ళంబడ నీళ్ళు పెట్టుకుంది నిర్మలా ఆంటీ.

"మమ్మల్ని మరిచిపోకు రోహినీ. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు" అంటూ వీడ్కోలు చెప్పింది.

అంజలి కళ్ళూ, సుధీర్ కళ్ళూ కలుసుకుని బయటపడ్డాయి. చాలా మాట్లాడాలి అనుకుంది. కానీ, ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. బరువెక్కిన మనసులో నుండి మాటలు రాలేదు.

కారు బయలుదేరింది. అనిచి పెట్టుకున్న కన్నీరు...బయటకు వెళ్ళిపోతాను అని భయపెడుతోంది. పెదవులను గట్టిగా అదిమి పట్టుకుని వూరికేనే తల ఆడించి బయలుదేరింది. రోహిని ఏమీ మాట్లాడలేదు.

కారు బయటి గేటును దాటేటప్పుడు ప్రాణం తనను వదిలి వెళ్ళి పోతోందని మనసు భావించగా...ఆవేదనతో నిలబడున్నాడు సుధీర్.

*********************************************PART-10******************************************

ఊటీకి వచ్చి ఐదు రోజులు గడిచినై. వాళ్ళు బస చేసింది అందమైన హోటల్. అందులో గడ్డి నేల మీద వేసున్న బెంచి మీద కూర్చుని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసింది అంజలి. సూది ఆకుల చెట్లు, తడుముకు వెడుతున్న మేఘాలు అంటూ ప్రతీదీ కవిత్వంలా ఉన్నది. కానీ, మనసులోనే ఇంతకు ముందున్న ఉత్సాహం లేదు. దేనినో పోగొట్టుకున్నట్టు అనిపించింది.

అంజలి అలా సుధీర్ జ్ఞాపకాలతో ఉన్నదనుకుంటే, తల్లి రోహిని కూడా అలాగే ఉన్నట్టు అనిపించింది. ఏ కారణం చేతనో 'నాన్నా' అని పిలిచి ఆయనతో ప్రేమగా ఉండలేకపోయింది. ఊటీలో చాలా చోట్లకు తీసుకు వెళ్ళారు. సరస్సులో పడవ ప్రయాణం చేసేటప్పుడు కానీ, సూది ఆకుల చెట్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు గానీ...ఎందుకనో ఒక కుటుంబంగా వచ్చినట్టు ఆమెకు అనిపించలేదు.

అమ్మ వచ్చి పక్కన కూర్చుంది.

" అంజలీ ఇక్కడ ఎక్కువ చలి వేస్తోంది కదా?"

"అవును"

"ఎందుకలా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా అలా మొహం పెట్టుకుని కూర్చున్నావు?"

"నా మొహమే అంతేనమ్మా"

"అంజలీ...ఏమిటి అదొలా మాట్లాడుతున్నావు? నీకు ఏమైంది?"

"ఏమీలేదమ్మా...మీరు ఉత్సాహంగా ఉన్నారు కదా? నాకు అది చాలు"

మౌనం వహించింది రోహిని. ముందులాగా ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోలేక పోతున్నారు. కళ్ళకు కనబడని తెర, మధ్యలో అడ్డుపడ్డట్టు అనిపించింది. రోజులు గడచిన కొద్దీ సరిపోతుందిలే అనుకుంది.

మరుసటి రోజు ప్రొద్దున్న హడావడి పడుతూ వచ్చిన నాన్న "మనం ఇప్పుడే ఊరికి తిరిగి వెడుతున్నాం" అని చెప్పి తొందర తొందరగా హోటల్ ఖాలీ చేసి బయలుదేరాము. ఆయన మొహం కొంచం 'సీరియస్ గా ఉన్నది. ఏమిటి విషయం అని వీళ్ళూ అడగలేదు...ఆయనా చెప్పలేదు.

ఇంటికి వచ్చేశారు.

" రోహినీ...నువ్వు షాకయ్యే విషయం ఒకటి చెప్పబోతాను. మనసును దృఢపరుచుకో" అన్నారు.

అంజలి అదిరి పడ్డది."ఏం బాంబు వేయబోతారో తెలియటం లేదే?" తనలోనే అనుకున్న అంజలి, తండ్రి దగ్గరగా వెళ్ళి నిలబడి--

"అమ్మ ఏ విధమైన షాకునూ భరించలేదు. ఇది మీకు ఇదివరకే చెప్పేశాను. అలాంటప్పుడు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు?" అన్నది కోపంగా.

నువ్వు చెప్పింది న్యాయమేనమ్మా. కానీ, నేను ఈ విషయాన్ని ఆమెతో చెప్పలేదనుకో...అది చాలా పెద్ద తప్పు అవుతుందే? అప్పుడు నా మీదే కదా ఆ తప్పు కూడా పడుతుంది. అందువలన చెప్పేస్తాను. నువ్వు మీ అమ్మ పక్కనే ఉండు"

వినటానికి రెడీ అయ్యింది.

" రోహినీ...మీ నాన్న బాపిరాజు చనిపోయారట. ఆయన సీరియస్ గా ఉన్నారని నాకు సమాచారం వచ్చింది. అందుకనే వెంటనే మిమ్మల్ని తీసుకుని వచ్చాశాను. ఈ రోజు ప్రొద్దున్నే ఆయన చనిపోయారట" అన్నారు.

"మా నాన్న...మా నాన్న చనిపోయారా? ఎలా? ఏం జరిగింది? మీకు ఎవరు చెప్పారు"

"మీ నాన్నగారి ఆఫీసులో పనిచేస్తున్న ఒకడు నాకు తెలుసు. అతనే ఫోన్ చేసి చెప్పాడు. ఆయనకూ వయసైంది కదా?"

"నేను ఆయన్ని చూడాలి. ఇన్ని సంవత్సరాలు చూడకుండానే ఉండిపోయాను. ఆయన నన్ను క్షమించలేదు. చచ్చిపోయిన తరువాతైనా ఆయన శరీరాన్ని చివరిగా ఒక సారి చూసేస్తానే? నన్ను పిలుచుకు వెళ్ళండి"

అమ్మా అక్కడికంతా నువ్వు వెళ్ళొద్దు. అక్కడ మిమ్మల్ని అవమాన పరుస్తారు. అది చూస్తూ నేను మౌనంగా ఉండలేను" అన్నది అంజలి.

మీ ఇంట్లోనే ఉంచారట. పెద్ద వ్యాపారవేత్త కదా? అందువల్ల 'టీవీ ఛానల్స్ నుండి మనుషులు వచ్చుంటారు"

"అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళకూడదు!" అన్నది అంజలి గట్టిగా.

"నువ్వు కాముగా ఉండమ్మాయ్. లోకం తెలియని పిల్లవి. పాపం మీ అమ్మ...చూడాలని ఆశపడుతోంది. నేనే ఆవిడ్ని తీసుకు వెడదాం అనుకుంటున్నా. బయలుదేరండి వెళ్ళి వచ్చేద్దాం"

"అంజలి ఎందుకండి? మనల్నే లోపలకు పంపుతారో...పంపరో?"

"వాళ్ళ తాతయ్యను అంజలి కూడా చూడనీ...మనల్ని ఎలా లోపలకు పంపరో చూస్తాను. నీకూ హక్కు ఉంది. అది వాళ్ళు కాదనలేరు" అన్నతను, వాళ్ళను బయలుదేరమని బలవంతం చేశాడు.

అమ్మ చూడాలని ఇష్ట పడటానికి ఆశపడుతున్నా, ఆమె ఆత్మ గౌరవం ఆమెను వద్దు అని చెప్పటాన్ని అర్ధం చేసుకుంది. కానీ నాన్న వదల లేదు. ముగ్గురూ చిన్న కారులో వెళ్ళి  దిగారు.

దగ్గర దగ్గర 25 సంవత్సరాల తరువాత తన పుట్టింటిలోకి అడుగు పెట్టింది రోహిని. వార్త ఇంకా బయటకు పూర్తిగా వెళ్ళకపోవటం వలనో ఏమో పెద్దగా జనం లేరు. ఒకాయన మాత్రమే వచ్చారు.

దఢ దఢ మని కొట్టుకుంటున్న గుండెను నొక్కి పట్టుకుని ఇంటిలోపలకు వెళ్ళింది. ఎందులోనూ మార్పు లేదు. హాలులో నాన్న గారి దేహం ను ఒక గాజు పెట్టెలో ఉంచారు. కాళ్ళ దగ్గర కొన్ని పూలమాలలూ, పూల వలయాలు ఉన్నాయి.

మొహం చూసిన వెంటనే ఏడుపు పొంగుకు వచ్చింది.

"నాన్నా...నేను రోహినిని వచ్చాను నాన్నా. చివరి వరకు నన్ను చూడకుండానే ఉండిపోయారే? నా జ్ఞాపకం మీకు రానే లేదా? మీరు నన్ను క్షమించనే లేదా?" అంటూ భోరున ఏడ్చింది.

అంజలి సైలెంటుగా పక్కన నిలబడింది. 'అమ్మ ఏడుస్తూ తన దుఃఖాన్ని చల్లార్చుకోనీ' అని మాట్లాడుకుండా చూస్తూ ఉండిపోయింది. హరికృష్ణ...రాని కన్నీటిని తుడుచుకుంటూ నటించాడు.

గొంతు విని ఇద్దరు సహోదరలూ లోపల నుండి వచ్చారు. వాళ్ళను చూసింది రోహిని.

"జగనన్నయ్యా... నరసు అన్నయ్యా...నన్ను గుర్తు పట్టారా? నేను మీ చెల్లెలు రోహినిని" అన్నది వణుకుతున్న కఠంతో.

"రోహినీ...నువ్వా? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఇదెవరు?" అన్నాడు జగన్నాధం, అంజలిని చూపిస్తూ.

"ఏంటన్నయ్యా అలా అడిగావు? ఇది నా కూతురు అంజలి. అంజలిదేవి అని మన అమ్మ పేరు పెట్టాను"

పెద్దన్నయ్య దగ్గరకు వచ్చి అంజలి తలమీద చేతులు వేసి తన ప్రేమను చూపించాడు.  ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు.

"అన్నయ్యా...నాన్నకు ఏమైంది?"

"ఏమీ లేదమ్మా...వయసు 82 దాటింది కదా? నిద్రలోనే పోయారు"

"అదొచ్చి అన్నయ్యా...నాన్న ఎప్పుడైనా నా గురించి అడిగారా?"

ఇద్దరన్నయ్యలూ లేదని తల ఊపారు.

"లేదు రోహినీ...చివరి వరకు ఆయన వైరాగ్యంగానే బ్రతికారు. కానీ, ఆయన మనసులో నీ జ్ఞాపకాలు ఎప్పుడూ ఉండేవి. మాకు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడూ సరి, పిల్లలు పుట్టినప్పుడూ సరి...అందరితో సంతోషంగా మాట్లాడతారు. కాసేపైన తరువాత ఒంటరిగా వెళ్ళి నిలబడే వారు. ఆయన కళ్ళు తడిసుంటాయి. పాపం...ఆయన వేదన పడని రోజు లేదు

నేరం చేసిన కారణంగా సిగ్గుతో తల వంచుకుంది రోహిని.

"అన్నయ్యా...మీ పిల్లలను ఒకసారి పిలవండి...ఒకసారి చూసి వెళ్ళిపోతాను" అన్నది.

"మనం ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో నీకూ హక్కు ఉంది. కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండ వచ్చు" అంటూ దగ్గరకు వచ్చాడు హరికృష్ణ.

అన్నదమ్ములిద్దరి మొహాలూ మారినై.

"ఓహో...గొడవ పెట్టుకోవటానికే వచ్చారా? నువ్వు మారనే లేదా హరికృష్ణా? ఇప్పుడు నీకేం కావాలి?"

ఇదిగో ఇక్కడున్నదే ఇది మీ చెల్లెలు. మీ నాన్నకు న్యాయంగా పుట్టిన బిడ్డ. ఇప్పుడు చట్టంలో...'కూతుర్లకూ ఆస్తిలో సరిసమం వాటా ఉంది అనే చట్టం ఉంది. అందువలన ఆమె భాగం ఇవ్వండి. అది అడగటానికే వచ్చాము"

అంజలికి 'ఛీ' అనిపించింది 'దీనికోసమే పిలుచుకు వచ్చారా? డబ్బు పిచ్చి పట్టిన మనిషి అని అనుకుంది.

"రోహినీ...నువ్వు చెప్పి నీ భర్త ఇలా మాట్లాడుతున్నారా?లేక తానుగా మాట్లాడుతున్నాడా  అనేది తెలియటం లేదు. ఏది ఏమైనా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది" అన్న జగన్నాధం, తమ్ముడు వైపు తిరిగి----

"నరసూ...ఆ కాగితం తీసుకురా" అన్నాడు. నరసింహం లోపలకు వెళ్ళాడు. 

"రోహినీ...నువ్వు తొందరపడి పెళ్ళి చేసుకున్నావు. కానీ నాన్న దాన్ని మరిచిపోలేదు. నీ భర్త వలన మాకు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వస్తుందని నాన్నకు అప్పుడే అనిపించింది. అందువలన ఇరవై సంవత్సరాలకు ముందే నిన్ను తన కూతురు కాదని రాసేసి, దాన్ని రిజిస్టర్ కూడా చేయించి ఉంచారు. ఆ రిలీజ్ పత్రాన్నే తెమ్మని చెప్పాను" అని చెప్పగానే పత్రంతో వచ్చాడు నరసింహం.

"ఇదిగో...ఇది చదివి చూడు" అని ఇచ్చారు.

దాన్ని రోహిని తీసుకునే లోపు తానే తీసుకుని అందరికీ వినబడేటట్టు గట్టిగా చదివాడు హరికృష్ణ. దాని సారాంశం ఇదే! 

నా కూతురు రోహినిని నా అన్ని ఆస్తులూ, నగలూ, డబ్బూ వీటన్నిటి నుండి తొలగించి ఉంచుతున్నాను. నేను చనిపోయిన తరువాత కూడా ఆమెకు దేని మీదా హక్కులేదు. ఆస్తులలో నా ఇద్దరి కొడుకులకే హక్కు ఉంది. వాళ్ళుగా  ఇష్టపడి రోహినికి ఏదైనా ఇస్తే దాన్ని నేను అడ్డుకోవటం లేదు. ఇది నా పూర్తి మనసుతోనూ, పూర్తి తెలివితోనూ, పూర్తి జ్ఞానముతోనూ రాస్తున్నాను"

కొంతసేపు మౌనం చోటు చేసుకుంది.

"ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను మన్నించలేదు. ఇప్పుడైనా నన్ను మన్నించు నాన్నా" అని వెక్కి వెక్కి ఏడ్చింది రోహిని.

"అమ్మా...వెళదాం రా. చాలా మంది రావటం మొదలుపెట్టారు. అందరూ మనల్నే వేడుక చూస్తున్నారు. కష్టంగా ఉంది. రామ్మా...వెళదాం" అంటూ తల్లి చెయ్యి పుచ్చుకుంది అంజలి. రోహిని కూడా బయలుదేరింది.

"ఉండు రోహినీ...నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు"

"ఏమిటది?"

"మీ నాన్న రాసిన రిలీజ్ పత్రంలో మీ అన్నయ్యలు ఇష్టపడి నీకు ఏదైనా ఇస్తే అది నేను అడ్డుకోనూ అని ఉన్నదే? మీ నాన్నకు ఊరి బయట ఈశాన్య వైపు దగ్గర దగ్గర నాలుగు ఎకరాల స్థలం ఉండేది. దాన్ని అడుగు. వాళ్ళు ఇవ్వనంటారా ఏమిటి?" అన్నాడు హరికృష్ణ.

అంతసేపు కట్టుబాటులో ఉంచుకున్న కోపం బయటకు వచ్చింది రోహినికి.

మీకు గౌరవ మర్యాదలే లేవా? నాన్న నా దగ్గరున్న కూతురనే హక్కునే తీశేశారు. ఆ తరువాత వాళ్ళకు ఏదుంటే నాకేం. నేనేమన్నా బిచ్చగత్తెని అని అనుకున్నారా? నేను మా అన్నయ్యల దగ్గర చేయి జాపను. నాకూ ఏ ఆస్తీ వద్దూ, ఏమీ వద్దు"

"సార్ ఆమె ఏదో దుఃఖంలో మాట్లాడుతోంది. అది పెద్దగా తీసుకోకండి. మీరు, దీనికి ఏమివ్వాలని ఆశపడుతున్నారో అది ఇవ్వండి" అన్నాడు,  ఇకిలించుకుంటూ.

"ఓహో...దీనికొసమే వచ్చారా? ఇప్పుడు అర్ధమవుతోంది మీ ఉద్దేశ్యం! చావు ఇంట్లో కూడా డబ్బూ, ఆస్తి అని అడుగుతున్నారు...మీరు మనుష్యులేనా? మిమ్మల్నందరినీ మార్చలేము? వెళ్ళండి బయటకు" అని అరిచాడు నరసింహం.

అంతకంటే ఓర్చుకోలేక రోహిని, అంజలి ఇద్దరూ గబగబా బయటకు వచ్చారు -- 'ఇంకాసేపు ఇక్కడుంటే మెడ పట్టుకుని బయటకు గెంటినా గెంటుతారు అని అనిపించి హరికృష్ణ కూడా వేరే దారిలేక వచ్చి ఎక్కిన తరువాత...కారు బయలుదేరింది.

*********************************************PART-11******************************************

ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ నాన్నపై అరవటం మొదలుపెట్టింది.

"నన్ను ఎందుకు అక్కడికి పిలుచుకు వెళ్ళి అవమానపరిచారు? నేను అడిగానా? నాకు ఆస్తి కావాలని నేను ఏ రోజైనా మీ దగ్గర చెప్పానా? ఇప్పుడే కొంచం తలనొప్పి లేకుండా జీవించటం ప్రారంభించాను. అది మీకు నచ్చలేదా?" అని ఏడ్చింది.

అంజలికి కూడా తండ్రి మీద కొపమే! గట్టిగా నాలుగు చివాట్లు పెట్టాలని అనుకుంది. నాలికను అణిచివేసింది. కానీ, ఆమె మాట్లాడకుండా ఉండలేకపోయింది.

"నేను మొదటే చెప్పానే? అమ్మకు ఎటువంటి టెన్షనూ ఇవ్వకూడదని. మీరెందుకు సడన్ గా ఆస్తి గురించి మాట్లాడారు? అందువలనే అమ్మకు అవమానం" అన్నది తల్లివైపు తిరిగింది.

"అమ్మా...నువ్వేమీ బాధపడకమ్మా. వాళ్ళ బంధుత్వమూ వద్దు...వాళ్ళ ఆస్తీ వద్దు. ఉన్నది పెట్టుకుని మనం సంతోషంగా ఉందాం" అన్నది.

"వాళ్ళ బంధుత్వమే వద్దు అన్నావు సరే...కానీ, ఆస్తి ఎందుకు వద్దని చెబుతున్నావు? పావు భాగం దొరికినా కూడా కొన్ని కోట్లు వస్తుంది. దాన్ని పూర్తిగా వదిలేయగలమా?" అన్నాడు హరికృష్ణ.

చూడండి...తిరిగి తిరిగి దాని గురించి మాట్లాడటం వలన ఏ ఉపయోగమూ ఉండదు. మా నాన్న నేను కూతుర్నే కాదని రాసుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎలా ఆస్తికి హక్కురాలు అవుతాను?"

హరికృష్ణ మొహంలో కాంతి. రోహిని దగ్గరకు వచ్చాడు. ఒక కుర్చీలో కూర్చున్నాడు. అంజలినీ కూర్చోమన్నాడు.

" రోహినీ...నేనే నీ దగ్గర మాట్లాడదామనుకున్నాను. మీ నాన్న నిన్ను కూతురు కాదని ఎంత మంది సాక్షులను పెట్టుకుని పత్రం రాసినా అది డూప్లికేటు అని చెప్పొచ్చు...ఆయన తన స్వీయ ఆలొచనతో అది రాయలేదని చెప్పి వాదాడవచ్చు"

"అలాగంటే...నాకు అర్ధం కాలేదు"

"మీ అన్నయ్యల మీద కేసు పెట్టవచ్చు. నువ్వేమీ బాధపడకు. నువ్వు అడుగుతున్నది ఆస్తిలోని నీ వాటాని మాత్రమే. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు సంతకం మాత్రం పెట్టు చాలు. నాకు  తెలిసిన అడ్వకేట్ ఒకరున్నారు. ఆయన్ని రమ్మని చెప్పనా?"

"ఉండండి...ఉండండి. తొందరపడకండి! నేను ఎందుకు వాళ్ళ మీద 'కేసు పెట్టాలి?"

"అర్ధం కాలేదా? కూతుర్లకూ పుట్టింటి ఆస్తిపైన హక్కు ఉందని ఇప్పుడు చట్టం తీసుకు వచ్చారు. ఆ పాయింటును పట్టుకుని మన అడ్వకేట్ కేసును వాదాడితే మనమే తప్పక గెలుస్తాం"

మౌనంగా కూర్చోనుంది రోహిని. ఆమె మనసు ఏదేదో ఆలొచించింది.

"ఏమిటి...ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? సరే అని చెప్పు రోహినీ" అన్నాడు హరికృష్ణ.

"లేదండి. నాకు ఇందులో ఇష్టం లేదు. నన్ను అల్లారు ముద్దుగా పెంచిన మా అన్నయ్యలపైన నేను కేసు పెట్టలేను. వాళ్ళకు అక్కర్లేని దానిగా నేను అయ్యుండచ్చు. ఎందుకంటే నేను చేసిన కార్యం అలాంటిది. కానీ, నాకు వాళ్ళు కావాలి. ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి. నేను దావా వేయలేను" అన్నది ఖచ్చితంగా.

అతని మొహం మారింది. ఏం జరగబోతుందో నన్న భయం అంజలిని దహించి వేస్తోంది. కష్టపడి మొహాన్ని మామూలుగా ఉంచుకుంది.

"నీకు అర్ధం కావటం లేదు రోహినీ. మనమేమీ వాళ్ళ భాగాంలోని ఆస్తిని అడగటం లేదు.  మనకు చట్టపూర్వకంగా రావాల్సిన భాగాన్నే అడగబోతున్నాం. ఎందుకంటే వాళ్ళుగా నీకు రావలసిన భాగాన్ని ఇవ్వనంటున్నారు. అందుకే కోర్టు ద్వారా అడుగుదాం అంటున్నాను. కోర్టులో కేసు పెడదాం. అది కోర్టులో హియరింగ్ కు తీసుకునే లోపు...మీ ఇంట్లోంచి సమాధానం మాట్లాడటానికి వస్తారు. ఎందుకంటే...వాళ్ళు ఆస్తిపాస్తులు లెక్కలన్నీ ఇవ్వాల్సి వస్తుందే? అది వాళ్ళు ఇష్టపడరు. అలా వాళ్ళు మనతో సమాధానం చేసుకోవటానికి వచ్చినప్పుడు పెద్ద మొత్తం అడిగి తీసుకుందాం. వాళ్ళకూ మంచిది. మనకీ లాభం. ఏమంటావు?"

"క్రిమినల్ గా చెప్పాలంటే...కేసు వేస్తామని చెప్పి, వాళ్లను బెదిరించి డబ్బు పీక్కోవాలి అంటారు. అంతే కదా? దానికి పేరు 'బ్లాక్ మైల్. నన్ను రౌడీతనం చేయమంటారా? నా వల్ల కాదు"

"నువ్విలా వాళ్ల మీద గౌరవం చూపిస్తున్నావు, కానీ వాళ్ళు నీకివ్వాల్సిన చెల్లి అనే బంధుత్వాన్ని కూడ ఇవ్వటం లేదే? తండ్రి నిన్ను కూతురు కాదన్నాడు. మనమైనా చెల్లికి కొంత ఇద్దామని అన్నయ్యలకైనా అనిపించిందా? నువ్వే అన్నయ్యా...అన్నయ్యా అని ప్రేమ కురిపిస్తున్నావు. వాళ్లకు లేదు"

"నేను ఉన్న చోట ఉండుంటే... నన్ను బంగారు పళ్లెంలో పెట్టి చూసుకోనుండే వారు. అది నేను చెడుపుకున్నానే? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళను?"

"ఏమిటే ఎప్పుడూ అదే మాట్లాడుతున్నావు? ఏదో జరిగిపోయింది...అది వదిలేయ్. పాతవాటి గురించి మాట్లాడి ఏమిటి లాభం? నువ్వు ఇంకోసారి వెళ్ళి, ఇలా ఆయన మీ మీద కేసు పెట్టమంటున్నారు. అలా చేస్తే మీ పరువే పోతుంది. అందు వల్ల ఆస్తిలో నా భాగం నాకిచ్చేయండి అని అడిగి చూడు"

అది విన్న వెంటనే అమ్మ లేచింది.

"ఏమండీ...మీకు ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కదా? నేను మంచి కుటుంబంలో పుట్టిన దానిని. నాకు పరువు, పౌరుషం ఉంది. ఇంకొసారి మా ఇంటికి వెళ్లటమో...ఆస్తి అడగడమో జరగనే జరగదు. నన్ను బలవంత పెట్టకండి" అని చెప్పి లోపలకు వెళ్ళిపోయింది.

హరికృష్ణ చూపులు ఇప్పుడు అంజలి మీద పడ్డాయి. మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు.

"అమ్మా అంజలీ. నేను చెప్పేది నువ్వైనా అర్ధం చేసుకో. ఎంత వద్దన్నా పది కోట్లు వస్తుంది. అది ఎవరైనా వద్దని చెబుతారా? నువ్వు ఒక స్కూల్లో ఉద్యోగం చేశేవే? అలాంటి స్కూలు నువ్వే మొదలు పెట్టి నడపవచ్చు. కొంచం అమ్మ దగ్గర అర్ధం అయ్యేటట్టు చెప్పమ్మా" అన్నాడు.

"ఇలా చూడండి నాన్నా. ఈ విషయంలో నేను అమ్మను బలవంతం చేయను. అది వాళ్ళ ఇల్లు...వాళ్ళ ఇష్టం. వాళ్ళను బలవంతం చేయటానికి మనకు హక్కు లేదు"

మొహమాటంతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు.

ఇంకో రెండు రోజులు గడిచినై. ఎప్పుడూ చూడూ కేసు పెట్టు కేసు పెట్టు అని సనుగుతూ ఉండేవాడు హరికృష్ణ. అది రోహినికి చిత్రవధా లాగా అనిపించింది. కోపంగా అరిచింది.

"ఎందుకలా ఎప్పుడూ ఆస్తి, ఆస్తి అంటూ ప్రాణం తీస్తున్నారు? చివరగా చెబుతున్నాను...నా వల్ల వాళ్ళ మీద కేసు వేయటం జరగదు. మీ వల్ల ఏం చేయగలరో అది చేసుకోండి"

"ఏమిటే...మాటలు కోటలు దాటుతున్నాయి. ఇన్ని రోజులు నువ్వు ఉన్నావా...చచ్చావా అని కూడా చూడలేదు. అటువంటి వాళ్ళపైన ప్రేమ పొంగుకు వస్తోంది"

"ఎం...ఇన్ని రోజులు మేము ఉన్నామా, చచ్చామా అని మీరు కూడా చూడలేదు. కనీసం కనుక్కోలేదు. దానికోసం మీ మీద కూడా కేసు వెయ్యనా? పిలిచిన వెంటనే మిమ్మల్ని మన్నించి మీతో రాలేదా?"

"నువ్వు నన్ను మన్నించావా? బాగుంది నీ న్యాయం! నువ్వే నన్ను మోసం చేసింది. నమ్మించి మోసం చేసి పైగా మాటలు కూడానా?"

ఆ పరిస్థితిలోనూ నవ్వు వచ్చింది రోహినికి.

"ఏమిటీ...నేను మిమ్మల్ని మోసం చేశానా? నమ్మించి గొంతు కోశానా? బయటకు చెప్పకండి. నవ్వి పోతారు"

"బయట చెబితే ఏం? ప్రేమించేటప్పుడు 'మా ఇంట్లో నా మీద ప్రాణం పెట్టుకున్నారు అని నువ్వు చెప్పలేదూ? నాకోసం ఏదైనా చేస్తారు అన్నావే? అది నమ్మే కదా నిన్ను పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. పెళ్ళి తరువాత ఏమీ ఇవ్వలేదే? అది గొంతుకోయటం కాదా?"

"నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు ఒక మాట చెప్పుంటే...అప్పుడే మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయే దాన్నే? మీరూ మోసపోయి ఉండక్కర్లేదు, నేనూ దర్జాగా జీవించే దాన్ని. ఎందుకు అది చేయలేదు?"

కోపంతో ఎరుపెక్కినై హరికృష్ణ కళ్ళు.

"ఊరకుక్కా! ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నీ పొగరు తగ్గలేదే? మీకు డబ్బు ఆశలేదు...మరి నేను పిలిచిన వెంటనే దేనికి అమ్మా కూతుర్లు నాతో వచ్చారు? బాగా తిందాం! మంచి వసతులతో జీవిద్దాం అనేగా"

ఆ మాట తల్లి కూతుర్లు ఇద్దరికీ విపరీతమైన కోపం తెప్పించింది.

"మమ్మల్ని బ్రతిమిలాడి, బుజ్జగించి రమ్మని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? మా మీద ప్రేమ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేము మిమ్మల్ని వెతకనే లేదే? ఇలాంటి మాటలన్నీ ఇక్కడ వద్దు"

"ఎందుకు పిలిచానా? మీ తాతయ్య...అదే బాపిరాజు చాలా సీరియస్ గా ఉన్నారని నాకు తెలిసింది. అప్పుడు మీరు గుర్తుకు వచ్చారు. చావాబోతున్న ముసలాడి ముందు మిమ్మల్ని తీసుకువెళ్ళి నిలబెడితే...ఆయన మీ పేరుకు ఏదైనా ఆస్తి రాసిస్తాడని లెక్క వేసేను. అందుకోసమే వచ్చి మిమ్మల్ని పిలిచాను"

ఆశ్చర్యంతో తల్లి కూతుర్లు ఇద్దరూ నోరు వెళ్లబెట్టారు.

"వెంటనే మిమ్మల్ని తీసుకు వెడితే...మీరు అనుమాన పడతారని కొన్ని రోజులు ఊటీకీ తీసుకు వెళ్ళి వచ్చేలోపే ఆ ముసలాడు ప్రాణం వదిలేడు. ఛీ...నా ప్లానంతా పాడైపోయింది. డబ్బులు ఖర్చు అయినై అంతే"

రోహిని తమాయించుకుని మెల్లగా "అయితే మీరు మా కొసం -- మా మీద ప్రేమతో రాలేదు. అంతేనా?" అని అడిగింది.

"అవును... ప్రేమ వస్తుంది...ఇది ఎలిజిబత్ మహారాణి, డబ్బులు విసిరి పారేస్తుంది. నీ మొహం కోసం ఎవరు వచ్చారు? డబ్బూ, కుటుంబం దొరుకుతాయని లెక్కవేసుకున్నాను. ఇన్ని సంవత్సరాలలో నీలో మార్పు వచ్చి ఉంటుంది అనుకున్నాను. కానీ నువ్వు మారనే  లేదు"

"అమ్మ మాత్రమా మారలేదు. మీరు కూడా కొంచం కూడా మారనే లేదు. మా అమ్మను ఆ రోజు ఎలా మోసం చేశారో...ఈ రోజు కూడా ఆమెను అలాగే మొసం చేశారు? మీకు మనశ్శాక్షి అనేదే లేదా?"

హరికృష్ణ ఏదో మాట్లాడదామని నోరు తెరుస్తున్నప్పుడు....

"చూడండి. ఒక్క రోజు కూడా మీ మీద 'నాన్న అనే ప్రేమే వచ్చిందే లేదు. అమ్మ సంతోషంగా ఉంటుంది కదా అనుకుని మీతో రావటానికి అంగీకరించాను. ఇప్పుడు మీరు మా అమ్మను గౌరవించటం లేదే...అప్పుడు మాకూ ఈ ఇంట్లో పనిలేకుండా పోయింది. మేము ఇప్పుడే వెడతం" అన్నది కోపంగా.

ఓ...దారాళంగా వెళ్ళిపొండి. ఎప్పుడైతే ఆ నల్ల మొహం ఆస్తి తీసుకోను అని చెప్పిందో...అప్పుడే మీ ఇద్దర్నీ తరిమేసుండాలి. కానీ, నాకు కొంచం జాలి గుణం ఉంది. అందువలనే మిమ్మల్ని కూర్చోబెట్టి ఫ్రీ భోజనం పెట్టాను. ఇప్పటికీ ఏమీ పాడైపోలేదు. కేసు వేయటానికి మీ అమ్మను ఒప్పించు. మీరు ఇక్కడే ఉండొచ్చు. బాగా తినొచ్చు, రాజ భోగం అనుభవించ వచ్చు. ఏమిటి ఏమంటావ్...?".

సమాధానం ఏమీ చెప్పకుండా తల్లివైపు తిరిగింది.

"ఏమ్మా... ఇంకా ఇక్కడెందుకు నిలబడ్డవు? మనం తిండికి అలమటించా పోతున్నాము? మన దగ్గర ఏమన్నా చదువులేదా? లేక పొవటానికి వేరే చోటే లేదా? రామ్మా... వెళదాం. ఇక ఎవరు వచ్చి పిలిచినా వెళ్ళకు. ఇతనొక మనిషి అని నమ్మి వచ్చావు చూడు...నిన్ను అనాలి" అన్నది..

రోహిని విరక్తితో చూసింది. కన్నీరు లేదు...గొణుగుడూ లేదు. ఒక బొమ్మలాగా ఎక్కడో చూస్తున్నట్టు కూర్చుంది.

'అమ్మ దుఃఖం రోజులు పోతేనే గాని తగ్గదూ అని అనుకున్న అంజలి, తమ దుస్తులను, వస్తువులను తీసుకుంది.

మొదట ఫోన్ చేసింది.

"సుధీర్...ఇంకా మీ అవుట్ హౌస్ ఇల్లు అద్దెకు ఇవ్వకుండా ఉంటే, అది ఎవరికీ ఇవ్వద్దు. నేనూ, మా అమ్మా ఇంకా కొద్దిసేపట్లో అక్కడ ఉంటాము. వివరాలేమీ అడగకండి. అక్కడికి వచ్చిన తరువాత డైరెక్టుగా చెబుతాను" అన్న ఆమె ఒక చేతిలో సూట్ కేసు,  మరో చేత్తో అమ్మను పుచ్చుకుని బయటకు వచ్చింది.

"అంజలీ...బాగా ఆలొచించుకో. ఇప్పుడు వెళితే మొత్తంగా వెళ్ళినట్లే. నేను తిరిగి కూడా చూడను. నువ్వు ఎవరైనా మామూలు జీతగాడ్ని పెళ్ళి చేసుకుని డబ్బుకు వెతుక్కోవలసిందే! కానీ, మీ అమ్మ కేసు వేస్తే...మనకు చాలా ఎక్కువ డబ్బు దొరుకుతుంది. నిన్ను విదేశీ వరుడికి ఇచ్చి పెళ్ళి చేస్తాను. బోలేడు నగలు వేస్తాను. ఏమంటావ్?"

సమాధానం ఏమీ చెప్పకుండా 'తూత్ అని అతని మొహం మీద ఉమ్మేసి, అమ్మను పిలుచుకుని బయటకు నడిచింది. రోహిని పరిస్థితి చాలా పాపంగా ఉంది. జరిగిందేదీ ఆమె జీర్ణించుకోలేకపోయింది. హరికృష్ణ పిలిచింది, తండ్రి మరణం, తిరిగి భర్త యొక్క కుట్ర అంటూ అన్నీ కలిసి ఆమె హృదయాన్ని కెలికినై. మెదడు నరాలు వణికినై. నడవలేక కళ్ళు తూలుతున్నాయి.

"అమ్మా...ఏమ్మా చేస్తోంది? ఎందుకని అదోలాగా ఉన్నావు?" అన్న కూతురు ప్రశ్న పాతాళం నుండి వినిపిస్తున్నట్టు అనిపించింది. తల పగిలిపోతుందేమోనన్నంత నొప్పి పుడుతోంది...కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించటంతో అంజలి భుజాల మీద వాలింది...ఆమెను పట్టుకుంది అంజలి.

అమ్మా...నన్ను చూడమ్మా. ఇంకా కొంచం సేపు వోర్చుకో. నిన్ను హాస్పిటల్ కు తీసుకు వెడతాను" అన్న అంజలి ఆంబ్యులాన్స్ కు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చేలోపు ఏమవుతుందో నన్న భయంతో సుధీర్ కు కూడా ఫోను చేసి విషయం చెప్పింది.

రోహిని మాట్లాడలేకపోయింది. తలనొప్పి క్షణ క్షణానికీ పెరుగుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముక్కు నుండీ, నోటి నుండీ రక్తం వచ్చింది.

*********************************************PART-12******************************************

తల్లి పరిస్థితి చూసి భయపడిపోయింది అంజలి. ఆమెకు 'అమ్మ బ్రతుకుతుందా?' అనే భయం పట్టుకుంది. 'ఎలాగైనా ఆసుపత్రికి తీసుకువెళ్ళి జేరిస్తే వాళ్ళు అమ్మను  చూసుకుంటారుఅని ఆమె నమ్మింది. మంచి సమయంలో నిర్మలా ఆంటీ, సుధీర్ 'బైకు మీద వచ్చారు. రోహిని పరిస్థితి చూసి వాళ్ళు టాక్సీ ఏర్పాటు చేస్తున్నప్పుడే ఆంబ్యులాన్స్ వచ్చింది.

హడావిడిగా అందులోకి రోహినిని ఎక్కించి, ఆమెతో పాటూ నిర్మలా ఆంటీ, అంజలి కూడా ఎక్కారు. బైకులో సుధీర్ ఆంబ్యులాన్స్ వెనుకే వెళ్లాడు. ఆంబ్యులాన్స్ హాస్పిటల్ కు వచ్చి ఆగింది. డాక్టర్లు, నర్సులు పరిగెత్తుకుని వచ్చారు. చెక్ చేసి ఎమర్జన్సీ లోకి తీసుకు వెళ్ళారు. ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు.

ఒక కుర్చీలో నిర్మలా ఆంటీ, మరో కుర్చీలో సుధీర్ కూర్చోనుండగా, అంజలి మాత్రం ఆందోళన పడుతూ అటూ, ఇటూ నడుస్తోంది. ఆంటీ గానీ, సుధీర్ గానీ 'ఎక్కడ మీ  నాన్న? ఎందుకు బయటకు వచ్చారు?' అని వాళ్ళు అడగకపోవటం అంజలికి కొంత హాయిని ఇచ్చింది.

సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో డాక్టర్ వచ్చాడు.

"ఇలా చూడమ్మా...మీ అమ్మగారి టెస్ట్ 'రిజల్స్ వచ్చినై.  దాని ప్రకారం చూస్తే ఆవిడ మెదడులో ఎక్కువ రక్త ప్రసారం అయినందు వలన మెదడులోని కొన్ని రక్త నాళాలు డ్యామేజ్ అయినై.  వాటిని సరిచేసే కావాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇదేలాగా అవుతుంది. అలా మళ్ళీ వస్తే ఆవిడ బ్రతకటం కష్టం!"

"అయ్యయ్యో...ఆలాగైతే"

"భయపడకండి...ఇప్పుడు కండిషన్ సీరియస్ గానే ఉంది. కానీ సరిచేసేయొచ్చు. ఒక ఆపరేషన్ చేయాలి. రేపే ఆ ఆపరేషన్ పెట్టుకుంటే మంచిది. మంచికాలం ఆపరేషన్ను తట్టుకునే శక్తి ఆమెకు ఉంది. ఏమంటారు?"

"దానికెంత ఖర్చు అవుతుంది డాక్టర్?"

ఆపరేషన్ విదేశీ డాక్టర్ చేస్తాడు. ఆయన ఫీజు మూడు లక్షలు. అదిపోను హాస్పిటల్ స్టే, మందులు ఇవన్నీ కలిపి ఆరు నుండి ఏడు లక్షల దాకా అవుతుంది"

షాక్ తిన్నది అంజలి. ఆమెకు నోట మాట రాలేదు.

"ఆ ఆపరేషన్ చేస్తే ఆమె ఖచ్చితంగా బ్రతుకుతుందా?" అడిగాడు సుధీర్.

"చెయ్యకపోయినా బ్రతుకుతుంది. కానీ ఇంకోసారి ఇదేలాగా వస్తే మాత్రం ఆమె బ్రతకటం కష్టమైపోతుంది. ఈ ఆపరేషన్ చేయించారనుకోండి, మీ అమ్మగారు బ్రతకటమే కాదు...ఆ తరువాత ఆమెకు ఇప్పుడున్న ప్రాబ్లం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యం దొరుకుతుంది. ఇంకోక విషయం. ఈ ఆపరేషన్ చెయ్యబోయే విదేశీ డాక్టర్ లక్కీగా ఇండియాలానే ఉన్నారు.  అది మన అదృష్టం. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్ చేసే డాక్టర్లలో ఈయనే నెంబర్ వన్. అందుకే నేను తొందర పెడుతున్నాను"

"సరే డాక్టర్...మేము కలిసి చర్చించుకుని చెబుతాము " అన్నాడు సుధీర్.

డాక్టర్ వెళ్ళిపోయాడు. సుధీర్, ఆంటీ, అంజలి మొహం వైపే చూసారు.

"వేరే దారిలేదు సుధీర్...మా అమ్మను ధర్మాసుపత్రికి మార్చ వలసిందే. అంత డబ్బుకు నేనేం చేసేది?" అన్నది. ఆమె కళ్ళల్లో నీరు ధారగా కారుతోంది.

నువ్వు వూరికే వుండు" అన్న ఆంటీ, సుధీర్ పక్కకు తిరిగి "తమ్ముడూ...నా దగ్గర లక్ష  రూపాయలు ఉన్నాయి. అది తీసుకుందాం" అన్నది.

ఆంటీ మీ దగ్గర నుండి అంత డబ్బు నేను తీసుకోలేను...మీకెలా తిరిగివ్వ గలను" అన్నది అంజలి.   

"ఇప్పుడు ప్రశ్న నువ్వెలా డబ్బులు తిరిగి ఇస్తావని కాదు. ఇంకా ఐదు లక్షల వరకు అవసరముందే! దానికి ఏం చేయాలన్నదే ఇప్పుడు ఆలోచన" అన్నాడు సుధీర్. 

" అంజలీ...మీ నాన్న ఇప్పుడు బాగా సంపాదించి ఉన్నారే? ఆయన దగ్గర అడిగితే ఏమవుతుంది? పెళ్ళాం కోసం ఐదు లక్షలు ఇవ్వరా?"

లేదు మామీ...మీరు అనుకుంటున్నట్టు ఆయన మంచివారు కాదు. అమ్మ ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఆయనే. ఆయన దగ్గర డబ్బు ఎదురు చూడటం మూర్ఖత్వం" అన్న అంజలి జరిగిందంతా చెప్పింది.  

ఆంటీ చాలా పాపం...చాలా బాధపడింది. కన్నీరు పెట్టుకుంది.

"ఇలాగూ ఒకడు ఉంటాడా? మారిపోయాడు అనుకునే కదా మిమ్మల్ని ఆయనతో పంపించాను? రోహినికి ఇలా జరగడానికి కారణం అయ్యాడే? నేను మీకు మంచి  జరుగుతుందని అనుకునే చేశాను. అది ఇలా అయ్యిందే? ఇప్పుడు మీ అమ్మ ఇలా అవడానికి నేనూ ఒక కారణం అయ్యానే?" 

"బాధ పడకండి ఆంటీ...దీనికి మీరు కారణం కాదు. ఇప్పుడు అది తలచుకుని బాధ పడితే అంతా సరైపోతుందా? వదిలేయండి. నాకు ఒక ఆలొచన వచ్చింది. నేను బయటకు వెళ్ళి కాసేపట్లో వచ్చేస్తాను" అన్న సుధీర్ వేగంగా బయటకు వెళ్లాడు. 

"చెప్పినట్టు ఒక గంటలోనే వచ్చేశాడు. డబ్బులు రెడీ చేశాడు. 'ఎక్కడిదీ డబ్బు?' అని అడిగినప్పుడు చెప్పకుండా మాట మారుస్తున్నాడు. ఆంటీకి తెలుసు. కానీ ఆమె కూడా  చెప్పలేదు. ఇంకా వాళ్ళను బలవంతం చేయటం అంజలికి ఇష్టం లేదు. 'ఎలాగో డబ్బు దొరికితే చాలు ...తిరిగి ఇవ్వటం గురించి తరువాత ఆలొచించవచ్చు" అనే మనోభావనలో ఉన్నది అంజలి.

ఆపరేషన్ మంచిగా జరిగింది. అమ్మ ఆరొగ్యం బాగానే కోలుకుంది. ఒక వారం రోజుల్లో మామూలు వార్డుకు మార్చారు. భోజనం విషయంలో చాలా కఠినంగా ఉన్నారు డాక్టర్లు. హాస్పిటల్ పెట్టే ఆహారమే తినాలి. ఎక్కువ ఇంజక్ష్ న్లు   -- మందులు అంటూ డబ్బు నీళ్ళలాగా కరిగిపోతోంది.

అంజలి కూడా 'అమ్మకు బాగా నయం కాని...ఖర్చు సంగతి తరువాత అడిగి తెలుసుకుందాం. సుధీర్ కు నెలనెలా వాయిదాలా పద్దతిలో డబ్బులిచ్చేద్దాం అనుకుని కాముగా ఉండిపోయింది.  

రోహిని ఆరొగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. ఆవిడ్ని చూడటానికి రోజూ నిర్మలా ఆంటీ వస్తొంది. కానీ, రోహిని స్పృహలోకి వచ్చినప్పటి నుండి ఎందుకనో సుధీర్ రానే లేదు. 'ఇంకో రెండు రోజుల్లో అమ్మను ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పాడు. నిర్మలా ఆంటీని అమ్మ దగ్గర ఉంచి పాత ఇంటికి వెళ్ళి, ఇల్లు శుభ్రం చేసి, కొంచంగా సరకులు కొని ఉంచింది అంజలి.

అమ్మ ఇంటికి వచ్చింది. ఆ తరువాతే ఇల్లు ప్రకాశవంతంగా ఉన్నట్టు అనిపించింది అంజలికి. 'పాలు మాత్రమే తాగాలి. చల్లగా ఏదీ తినకూడదు. రోజూ భోజనంలోకి ఒక స్పూన్ నూనె కలుపుకో వచ్చు...అది కూడా మంచి నూనె మాత్రమే! అని డాక్టర్లు చాలా నిబంధనలతోనే పంపించారు.

ప్రొద్దున రెండి ఇడ్లీలు, కారం లేకుండా టమోటో చట్నీ. మధ్యాహ్నం ఒక ప్లేటు భోజనం, ఒక కప్పు ఉడకబెట్టిన కూర గాయలు, చారు, సాంబార్, మజ్జిగ. రాత్రికి చపాతీ, పప్పు. ఇదే అమ్మ యొక్క భోజనం.తన కోసం కూడా అదే చేసుకుంది అంజలి.

నిర్మలా ఆంటీనే, అమ్మకు తోడుగా ఉంది. అంజలి మళ్ళీ ఉద్యోగానికి వెళ్లటం మొదలు పెట్టింది.

"ఏం ఆంటీ...మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ నన్ను వచ్చి చూశారు! కానీ సుధీర్  రాలేదే? అతనికి విషయమే తెలియదా?"

"ఎందుకు తెలియదు? నిన్ను ఆసుపత్రిలో చేర్చిందే ఆ అబ్బాయే! అంజలి పాపం చిన్న పిల్ల...అల్లడిపోయింది. అప్పుడు పక్క బలంగా ఉండి అన్ని పనులూ చూసింది ఆ సుధీరే?" 

"అలాగా? మంచి అబ్బాయి లాగున్నాడే?"

"ఇప్పుడైనా అర్ధం చేసుకున్నావే! ఇకనైనా అతన్ని నీ అల్లుడుగా ఎంచుకో"

"అదెలా ఆంటీ కుదురుతుంది? మిగతావారికి సహాయం చేసే గుణం కలవాడే! అందుకని డబ్బు ఆశలేని వాడు అని చెప్పలేము కదా? నా కూతుర్ని బాధలకు గురి చెయ్యడని ఏమిటి నిశ్చయం?" అన్నది రోహిని.

"ఎవర్ని చూసి డబ్బు పిచ్చి పట్టిన వాడని చెబుతున్నావు... సుధీర్ నా? నీ ప్రాణన్ని కాపాడిందే అతను అనేది నీకు తెలుసా? అతను మాత్రం ఆ రోజు లేకపోతే ఈ పాటికి నువ్వు చనిపోయుండే దానివి. నీ కూతురు అనాధగా నిలబడుంటుంది! ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం నీకు అలవాటు అయిపోయింది" అన్నది ఆంటీ కోపంగా.  

"మీరు ఏం చెబుతున్నారు ఆంటీ? సుధీర్ నన్నెలా కాపాడాడు?”

"నీ ట్రీట్ మెంటుకు డబ్బులిచ్చింది అతనే. అందులోనూ ఒకటో...రెండో కాదు...ఆరు లక్షలు"

ఆశ్చర్యపోతూ ఆంటీని చూసింది రోహిని.

"ఎమిటలా అయోమయంగా చూస్తున్నావు? నీకు ఆరొగ్యం సీరియస్ గా ఉంది...వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పాడు. ఆ ఆపరేషన్ కు ఆరు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంజలి ఎక్కడ్నుంచి తేగలదు అంత డబ్బును. ఏం చేయాలో తెలియక శిలలా కూర్చుండిపోయింది. అప్పుడు ఒక్క క్షణం కూడా దేని గురించి ఆలొచించ కుండా సుధీరే డబ్బులు తీసుకువచ్చి ఇచ్చి ఆపరేషన్ చెయ్యమన్నాడు"

"అతనికి ఎక్కడిది అంత డబ్బు?"

"అలా అడుగు...అతని దగ్గర వాళ్ళ అమ్మ ఇచ్చిన కొన్ని నగలు ఉన్నాయి. దాన్ని వాళ్ళ అమ్మ గుర్తుగా ఉంచుకున్నాడు. మా అమ్మ జ్ఞాపకార్ధంగా ఉన్నది ఇదొక్కటే ఆంటీ. ఇవి నా భార్యకు ఇవ్వాలని మా అమ్మ ఆశపడేది అంటూ మాటి మాటికీ చెప్పేవాడు. ఆ నగలు తాకట్టు పెట్టే డబ్బు తెచ్చాడు. అంజలి తనకు దొరకదని తెలిసినా మీకు సహాయం చేశాడు. వాడ్ని చూసి చెబుతున్నావు 'డబ్బు పిచ్చి పట్టిన వాడనీ! ఇది  న్యాయమా?"

శరీరమంతా కంపిస్తుంటే అలాగే కూర్చుండిపోయింది రోహిని.

"ఇంతవరకు ఈ విషయం అంజలికి కూడా తెలియదు. నన్ను కూడా ఎవరికీ చెప్పకూడదని చెప్పాడు. నువ్వు ఈ డబ్బును ఎప్పుడు తిరిగి ఇవ్వబోతావు...ఎలా ఇవ్వబోతావు అని ఇంతవరకు అంజలిని అతను అడగలేదు తెలుసా? లేదు అంజలి వలన ఇంత డబ్బు తిరిగి ఇవ్వటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ఆలొచించ లేదు? ‘అంజలికి అమ్మ అయితే...నాకూ అమ్మలాగానే కదా ఆంటీ' అన్నాడు. సుధీర్  లాంటి అల్లుడు దొరకాలంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుండాలి. అది నీకు అర్ధం కావటం లేదు. ఎవడో ఒక వెధవ పోరంబోకు నిన్ను మోసం చేసాడని సుధీర్ ని కూడా అలాంటివాడేనని అనుకుంటున్నావే అది న్యాయమా?" ఆపకుండా మాట్లాడింది నిర్మలా ఆంటీ.

రోహిని ఏదో చెప్పటానికి నోరు తెరిచింది. కరెక్టుగా అదే సమయంలో సుధీర్ ఇద్దరు మగ వారిని పిలుచుకుని లోపలకు వచ్చాడు.

ఆంటీ...వీళ్ళు మీ అన్నయ్యలని చెప్పారు. మిమ్మల్ని చూడాలట. అందుకని తీసుకు వచ్చాను"

నరసింహం, జగన్నాధం లోపలకు వచ్చారు. వాళ్ళను చూడగానే ప్రేమ పొంగుకు రావటంతో...అన్నయ్యా!" అని అరుస్తూ లేవటానికి ప్రయత్నం చేస్తున్న రోహినిని నొక్కి పట్టుకుంది నిర్మలా ఆంటీ.

రోహినీ...ఏంటమ్మా! నీకు ఆరొగ్యం బాగా సీరియస్ అయ్యిందట? ప్రాణాపాయ స్థితిలో ఉన్నావట? మాకు ఒక్క మాటైనా చెప్పి పంపించి ఉండొచ్చు కదా?" అన్నాడు నరసింహం.

"లేదన్నయ్యా...ఏదేదో జరిగిపోయింది! చెప్పి పంపితే మీరేమనుకుంటారో తెలియదు. అందుకే...అది సరే అన్నయ్యా నాకు ఆరొగ్యం బాగలేదని మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు?”

"ఎవరూ చెప్పలేదు చెల్లెమ్మా... మేమే తెలుసుకున్నాము. ఎలాగంటావా. ఆ రోజు, అదే నాన్న చనిపోయిన రోజు మీ ఆయన మాట్లాడిన తీరు, నువ్వూ, అంజలి మాట్లాడిన తీరు చూసిన మాకు మీ ఆయనే ఏదో కుట్ర చేస్తున్నాడని మాకు అర్ధమయ్యింది. వెంటనే ఒక మనిషిని అరేంజ్ చేసి మిమ్మల్ని వెంబడించి విషయాలు తెలుసుకుని చెప్పమన్నాము. అతను అన్ని విషయాలు చెప్పాడు. నువ్వూ, నీ కూతురు అంజలి చాలా మంచి వాళ్ళు, మొసపోయారు అంటూ అన్ని విషయాలు చెప్పాడు. మేమనుకున్నది నిజమయ్యింది. తప్పంతా మీ ఆయనదే, ఆయనే ఇంకా మారలేదు అని అర్ధమయ్యింది"

వాడ్ని....ఆయన, మా ఆయన అని చెప్పకు అన్నయ్యా. ఇరవై మూడేళ్ల తరువాత మారేనని చెబుతూ మా వెంట పడితే, ఒక్క క్షణం నిజమనుకున్నాము...ఆ తప్పుకు నాకు తగిన శిక్ష వేశాడు దేవుడు. ఆ రోజు నాన్నను సరిగ్గా చూడలేకపోయాను..." మాట బొంగురుపోయింది రోహినికి.

"వద్దమ్మా...ఇంక వాడి గురించి మాట్లాడం. నువ్వు కూడా మాట్లాడకు...అవును నువ్వేంటి అలా చిక్కిపోయావు. ఇప్పుడే బయలుదేరు. మనింటికి వెడదాం"

వద్దన్నయ్యా...మీరిద్దరూ నా మీద ఇంకా ప్రేమ చూపిస్తున్నారు. అది నాకు చాలు. మేము వేరుగానే ఉంటాము. మేము అక్కడికి వస్తే వాడు కూడా అక్కడికి వచ్చి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాడు"

"సరేనమ్మా...నాన్న మాత్రమే నీకు రిలీజ్ పత్రం రాశారు. మేము రాయలేదు. మమ్మల్ని కూడా రాయమని నాన్న చిన్న బలవంతం కూడా చేయలేదు. మాకు నువ్వు ఇప్పటికీ ముద్దుల చెల్లివే. ఆస్తిలో నా భాగం నీకు ఇచ్చి వెలదామని వచ్చాము!" అన్నాడు జగన్నాధం.

నన్ను క్షమించడన్నయ్యా. నాకు ఏదీ వద్దు. నాకు డబ్బులు వచ్చినై అని తెలిస్తే ఆ మనిషి...నన్నే చుట్టి చుట్టి వస్తాడు. నా ప్రశాంతతే పోతుంది. దానికోసం మీ బంధుత్వమే వద్దని చెప్పను. మీ చెల్లెలుగా మీ ఇంటికి వచ్చి వెడుతూ ఉంటాను. అది చాలు నాకు" .........ముగ్గురూ కళ్ల వెంట నీరు కార్చారు.

"సరేనమ్మా...పుట్టింటి సారేగా ఏదైనా తీసుకో చెల్లెమ్మా. అప్పుడే మా మనసులోని భారం తగ్గుతుంది" అన్నాడు నరసింహం.

"అన్నయ్యా...మీరు కరెక్టు టైముకే వచ్చారు. వచ్చే వారం నా కూతురికి పెళ్ళి పెట్టుకున్నాను"---ఆమె చెబుతూండగా...లోపలకు వచ్చిన అంజలి, అమ్మ చెప్పింది అర్ధం చేసుకోవటంతో. ఆమె ముఖం ప్రకాశవంతమయ్యింది. సుధీర్ ను చూసింది. అతను బయటకు వెళ్లటానికి రెడీ అయ్యాడు.

ఉండు సుధీర్ తమ్ముడూ... అంజలికి ఎప్పుడు పెళ్ళి...ఎవరు పెళ్ళి కొడుకు? అదంతా తెలుసుకో కుండా వెడుతున్నావే?" అన్నది రోహిని. అతనూ నిలబడ్డాడు.

"ఇదిగో నిబడ్డాడే... సుధీర్!ఇతనే అల్లుడు. వచ్చే శుక్రవారం ముహూర్తం. మీరు తప్పకుండా వచ్చేయండన్నయ్యా" అన్నది రోహిని.

పరిగెత్తుకు వచ్చి అమ్మ మెడను చుట్టేసింది అంజలి. మాటలు రాక ఆశ్చర్యంలో మునిగిపోయాడు సుధీర్. అతను అతని చెవులనే నమ్మలేకపోయాడు.  

"చాలా సంతోషం చెల్లెమ్మా...నీకు నీ పెళ్ళి సారె ఇవ్వలేదు. నీ కూతురుకైనా ఇస్తాము" అన్నారు ఇద్దరు అన్నదమ్ములూ.

"ఇలా చూడండి...ఈమె చెప్పటానికి సిగ్గుపడుతోంది.కొన్ని సమయల్లో చెప్పనే చెప్పదు. అందుకని నేనే చెబుతాను. ఇదిగో ఇక్కడ నిలబడ్డాడే ఈ అబ్బాయి...అదే మీ చెల్లికి కాబోయే అల్లుడు...అతను తన తల్లి నగలను తాకట్టు పెట్టి మీ చెల్లెల్ని కాపాడాడు. వాటిని విడిపించి అతనికి ఇచ్చేయండి. అదే మీరు అంజలికి ఇచ్చే మేనమామ సారె.  ఆ నగలను అది తన పెళ్ళికి వేసుకుంటుంది" అన్నది నిర్మలా ఆంటీ.

'సరే' నని తల ఊపిన అన్నదమ్ములిద్దరూ "ఇదిగో ఈ పత్రాలు కూడా మేనమామల సారెగా ఇస్తున్నాము" తీసుకోండి.

నిర్మలా ఆంటీనే తీసుకుంది.

లోకాన్నే మరిచిపోయిన పరిస్థితిలో సుధీర్, అంజలి ఒకరికొకరు చూపులతో చూసుకుంటూ నిలబడ్డారు. అక్కడ ఇంకా అంతమంది ఉన్నారనే తలపు లేకుండా.

"సుధీర్ బాబూ చూసింది చాలు...ఇక్కడ మేమంతా ఉన్నాము. దాని మెడలో తాలి కట్టు. తరువాత చూస్తూనే ఉండు. ఎవరూ ఏమీ చెప్పరు" అన్న వెంటనే అక్కడున్న వాళ్లందరూ నవ్వారు.

చెట్లు వాళ్ల మీద పువ్వులు వేసి ఆశీర్వదించగా...దూరంగా గుడి గంట మోత మంగల వాయిద్యాలుగా మోగింది.

**********************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)